ప్రేమ ఎంత గొప్పదో అని తెగ ఫీలైపోయే ప్రేమికులు.. కొన్నిసార్లు అంతే తిప్పల్ని ఎదుర్కొక తప్పదు కూడా. ఓ యువకుడు ప్రేయసి కోసం ఎవరూ చేయలేని సాహసమే చేసి.. చిక్కుల్ని కొని తెచ్చుకున్నాడు.
పంజాబ్‌లో జనవరి 7వ తేదీన బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆరోగ్య సిబ్బంది నియామకాల కోసం పరీక్ష నిర్వహించింది. ఫజిల్కా ప్రాంతానికి చెందిన అంగ్రేజ్ సింగ్ అనే యువకుడు.. తన ప్రేయసి పరంజిత్ కౌర్ బదులు ఆ పరీక్ష రాయాలకున్నాడు. అమ్మాయిల వస్త్రధారణతో పరీక్ష హాల్‌కు వెళ్లాడు.
ఫ్రూఫ్‌ల కింద.. వెంట పరంజిత్ కౌర్ పేరుతో సృష్టించిన ఫేక్ వోటర్ ఐడీ, ఆధార్ కార్డు కూడా తెచ్చుకున్నాడు. కానీ, విధి అతన్ని తప్పించుకోనివ్వలేదు. బయోమెట్రిక్ డివైస్ దగ్గర అడ్డంగా దొరికిపోయాడు. దీంతో ఆ యువతి దరఖాస్తు ఫారమ్‌ను తిరస్కరించిన అధికారులు ఆమెను అనర్హులిగా ప్రకటించిన అంగ్రేజ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు అక్కడితో ఆగకుండా అతనిపై చట్టపరమైన చర్యలకు యూనివర్సిటీ అధికారులు సిద్ధమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment