
క్రిష్ణగిరి(బెంగళూరు): ఇటీవల ప్రేమ వ్యవహారాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే వీటిలో కొందరు మాత్రం పెద్దలను ఒప్పించి పెళ్లి పీటల వరకు వెళ్లి దంపతులుగా మారుతున్నారు. చాలా మంది వారి ప్రేమకు మధ్యలోనే బ్రేకప్ చెప్పడమో లేదా మోసం చేయడమో వంటి ఘటనలే ఎక్కువ జరుగుతున్నాయి.
అయితే కొందరు ఈ బాధను ఎలాగోఒకలా బయటపడుతుండగా.. మరికొందరు క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తాజాగా ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య చేసుకొన్న ఘటన సూళగిరి వద్ద జరిగింది. వివరాలు.. సూళగిరి తాలూకా ముదుగురికి సమీపంలోని బి. సింగిరిపల్లి గ్రామానికి చెందిన యల్లప్ప కూతురు యశోద (19), కడతూరు గ్రామానికి చెందిన ప్రదీప్‌లు గత రెండేళ్లుగా ప్రేమించుకొన్నారు.
ఈ విషయం రెండు కుటుంబాలకు తెలిసి ఇద్దరికీ పెళ్లి చేయాలని తీర్మానించారు. ఇంతలో ప్రియుడు ప్రదీప్ ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని చెప్పడంతో యువతి కుటుంబీకులు ఆందోళనకు గురయ్యారు. మోసపోయానని విరక్తి చెందిన యశోద మంగళవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. సూళగిరి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment