Girl
-
ఇక్కడి అమ్మాయి.. అక్కడి అబ్బాయి (ఫొటోలు)
మైసూరు: ప్రేమ ఎల్లలు దాటింది. మైసూరుకు చెందిన యువతి, నెదర్లాండ్‌కు చెందిన యువకుడి మధ్య చిగురించిన ప్రేమ ఫలించింది. దీంతో పెద్దల సమక్షంలో హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. నగరంలోని హూటగళ్లికి చెందిన విద్య, నెదర్లాండ్‌కు చెందిన యువకుడు రుటైర్ పరస్పరం ప్రేమించుకున్నారు. ఈ విషయాన్ని ఇరు కుటుంబాల పెద్దలకు తెలియపరచగా వారి పెళ్లికి అంగీకరించారు. దీంతో నగరంలోని కల్యాణ మండపంలో చెన్నగిరి తాలూకాలోని పాండోమట్టి విరక్త మఠం డాక్టర్ గురుబసవ స్వామీజీ నేతృత్వంలో విద్యా మెడలో రుటైర్ తాళి కట్టాడు. అనంతరం పెళ్లికి వచ్చిన అతిథులు వారిని ఆశీర్వదించి శుభాశీస్సులు పలికి విందు భోజనం ఆరగించారు. -
బాబుకే షాకిచ్చిన స్టూడెంటు
-
అమెరికా అమ్మాయి.. నల్గొండ అబ్బాయి.. ధూంధాంగా పెళ్లి!
మోత్కూర్, నల్గొండ జిల్లా: అమెరికాకు చెందిన యువతితో మోత్కూర్ మండలం దాచారం గ్రామానికి చెందిన యువకుడికి వివాహం(Marriage) జరిగింది. దాచారం గ్రామానికి చెందిన జినుకల లలిత, ధర్మయ్య దంపతుల ప్రథమ కుమారుడు సందీప్‌కుమార్(Sandeep Kumar) ఉన్నత చదువుల కోసం పదేళ్ల క్రితం అమెరికాకు(America) వెళ్లాడు. అక్కడ కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ పూర్తిచేసి టెక్సాస్ రాష్ట్రంలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా(Software Engineer) పనిచేస్తున్నాడు. అమెరికా దేశానికి చెందిన మరీయా డిలారోసా, అర్మాండో హెర్నాండేజ్ దంపతుల కుమార్తె అవని ఏలేనా ఎంబీఏ పూర్తిచేసి సందీప్‌కుమార్ పనిచేసే కంపెనీలోనే మేనేజర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో సందీప్‌కుమార్, ఏలేనా మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఇరు కుటుంబాల అంగీకారంతో హిందూ సాంప్రదాయం ప్రకారం మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్లోని రాక్ ఎన్క్లేవ్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం వివాహ బంధంతో వారిద్దరు ఒక్కటయ్యారు. -
కోటిన్నర బంగారం కేవలం రూ.680కే అమ్మిన టీనేజర్!
ఓ బాలికకు తన స్నేహితుల్లో ధరించిన పోగులు,ముక్క పుడకలు నచ్చాయి. వెంటనే వాటిని కొనుగోలు చేయాలని అనుకుంది. కానీ చేతిలో డబ్బులు లేవు. ఇంట్లో వాళ్లను అడిగితే కోప్పడతారు. అందుకే ఏదో ఒకటి చేసి గిల్ట్ నగల్ని కొనుగోలు చేయాలని అనుకుంది. ఇందుకోసం తన తల్లి ధరించే రూ.1.16 కోట్ల బంగారాన్ని కేవలం రూ.680కే అమ్మేసింది. ఆ తర్వాత ఏమైందంటే? సౌత్ చౌనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. చైనాలోని షాంఘైకు చెందిన బాలిక లిప్ స్టడ్లు, చెవిపోగులు కొనుగోలు చేసేందుకు మిలియన్ యువాన్ (రూ.1.16 కోట్లు) విలువైన తన తల్లి ఆభరణాలను దొంగిలించింది. వాటిని కేవలం 60 యువాన్లకు (రూ.680) విక్రయించింది.కుమార్తె చేసిన నిర్వాకం తెలియని తల్లి వాంగ్ వెంటనే పుటువో పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరోలోని వాన్లీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన ఇంట్లో దొంగతనం జరిగిందని, కోట్లు విలువ చేసే బంగారం నగలు మాయమైనట్లు ఆ ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో వాంగ్ ధరించే జేడ్ బ్రాస్లెట్లు, నెక్లెస్‌లు, డైమండ్లు పొదిగిన ముక్కపుడకల్ని ఆమె కుమార్తె అమ్మినట్లు గుర్తించారు. వాస్తవానికి ఆ బాలిక సైతం తాను అమ్మింది గిల్ట్ నగలనే అనుకుంది. ఇదే విషయంపై తల్లిని ఆరా తీయగా.. తన కుమార్తె లిప్ స్టడ్స్ కోసమే బంగారాన్ని అమ్మినట్లు చెప్పింది. ‘ఆ రోజు నా కుమార్తె నన్ను డబ్బులు అడిగింది. ఎంత అని అడగ్గా 60యువాన్లు అని చెప్పింది. ఎందుకు అని అడగ్గా..తన స్నేహితులు లిప్ స్టడ్స్ ధరించారని, అవి తనకు బాగా నచ్చాయని .. తాను కూడా ధరించాలని తన కోరికను చెప్పింది.లిప్ స్టడ్ ఖరీదు 30 యువాన్లు (రూ.340), మరియు ఆమె 30 యువాన్ల ధరతో మరో జత చెవిపోగులు కావాలని వివరించింది. వాటి మొత్తం ఖరీదు 60 యువాన్లు అని తెలిపింది. కానీ తాను ఆ డబ్బులు ఇవ్వలేదని చెప్పింది. తల్లి,కుమార్తెల మధ్య జరిగిన సంభాషణ విన్న పోలీసులు.. తల్లి డబ్బులు ఇవ్వలేదు కాబట్టి.. ఇంట్లో ఉన్న బంగారాన్ని గిల్ట్ నగలు అనుకుని బంగారాన్ని అమ్మినట్లు ఓ నిర్ధారణకు వచ్చారు. అనంతరం, బాలిక బంగారాన్ని ఎక్కడ అమ్మింది? ఎవరికి అమ్మింది? ఎంతకు అమ్మింది? అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. బాలిక తిరిగిన ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. చివరికి బాలిక బంగారం ఎవరికి విక్రయించిందో గుర్తించారు. ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకుని బాధితురాలికి అందించారు. దీంతో కథ సుఖాంతం అయ్యింది. -
తెలంగాణ అబ్బాయి.. మాంచెస్టర్ అమ్మాయి
(నల్గొండ జిల్లా) చిట్యాల: మండలంలోని పెద్దకాపర్తి గ్రామానికి చెందిన రామన్నపేట సమితి మాజీ ప్రెసిడెంట్ కందిమళ్ల జగ్గారెడ్డి మనుమడు రాజీవ్‌రెడ్డికి యూకేలోని మాంచెస్టర్‌కు చెందిన యువతితో శనివారం వివాహం జరిగింది. రాజీవ్‌రెడ్డి మాంచెస్టర్‌లో హోటల్ మేనేజమెంట్ కోర్సు పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడే పోలీస్‌శాఖలో పనిచేస్తున్న లారెన్ ఫిషర్‌తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్‌లో ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో హిందూ సంప్రదాయ పద్ధతిలో శనివారం మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. తమ కుమార్తె తెలంగాణ ఇంటి కోడలు కావటం ఎంతో ఆనందంగా ఉందని వధువు తల్లిదండ్రులు కే.ఫిషర్ డేవ్ ఫిషర్ ఆనందం వ్యక్తం చేశారు. పెళ్లి కుమారుడి తల్లిదండ్రులు మహేందర్‌రెడ్డి–ప్రేమలత ఇరుకుటుంబాలకు చెందిన పెద్దలతో పాటు పెద్దకాపర్తి గ్రామ మాజీ సర్పంచ్ కందిమళ్ల శిశుపాల్‌రెడ్డి–రేణుక, కందిమళ్ల జైపాల్‌రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు. -
సవతి కూతురిని చంపి..
బక్సర్ (బిహార్): ఎనిమిదేళ్ల సవతి కూతురిని అత్యంత కిరాతకంగా హత్య చేసింది బిహార్‌కు చెందిన ఓ మహిళ. శనివారం రాత్రి మృతురాలి అవశేషాలను గుర్తించిన పోలీసులు మహిళను అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బక్సర్ జిల్లాలోని డుమ్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నయా భోజ్‌పూర్ ప్రాంతంలో ఓ మహళకు సవతి కూతురు ఎనిమిదేళ్ల ఆంచల్ కుమారి ఉంది. ఆమె తండ్రి ఢిల్లీలో ఉంటున్నారు. మహిల సవతి కూతురుతోపాటు భోజ్‌పూర్‌లో ఉంటోంది. కూతురిని గొంతు నులిమి చంపింది. ఆ తరువాత మృతదేహానికి నిప్పంటించింది. కాలిపోయిన మృతదేహాన్ని గోనె సంచిలో నింపి చెక్కపెట్టెలో దాచి పెట్టింది. ఆంచల్ కనిపించకపోవడంతో ఇతర కుటుంబ సభ్యులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు ఇంటిని తనిఖీ చేయగా.. గోనె సంచిలో పెట్టిన చెక్కపెట్టెలో దాచిన మృతదేహం బయటపడింది. నేరం చేసినట్లు సవతి తల్లి అంగీకరించింది. సంఘటనా స్థలం నుంచి సేకరించిన సాక్ష్యాల ఆధారంగా పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఈ దారుణానికి ఒడిగట్టడానికి గల కారణాలు మాత్రం ఆమె పోలీసులకు వెల్లడించలేదు. -
గుండ్రాంపల్లి అబ్బాయి.. ఇండోనేషియా అమ్మాయి
చిట్యాల (నల్గొండ): చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన యువకుడు నాగరాజు ఇండోనేషియా అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం శుక్రవారం గుండ్రాంపల్లి గ్రామంలో జరిగింది. సీమ సాలయ్య–యాదమ్మ ప్రథమ కుమారుడు నాగరాజు హైదరాబాద్‌లో ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. నాగరాజు పనిచేస్తున్న కంపెనీలోనే ఇండోనేషియాలో రిజ్కి నన్డా సఫిట్రి అనే యువతి కూడా పనిచేస్తోంది. వీరిద్దరికి ఫోన్లో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఇరువురు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెద్దల అంగీకారంతో హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని రిజ్కి నన్డా సఫిట్రిని నాగరాజుకు ఇండియాకు పిలిపించాడు. నాగరాజు స్వగ్రామం గుండ్రాంపల్లిలో శుక్రవారం వేద మంత్రాల సాక్షిగా ఇద్దరూ ఒక్కటయ్యారు. ఈ వివాహానికి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. -
బాలికపై టీడీపీ నేత లైంగిక వేధింపులు
సాక్షి టాస్క్‌ఫోర్స్: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ నాయకుల ఆగడాలు రోజురోజుకూ పెచ్చుమీపోతున్నాయి. తామేమి చేసినా చెల్లుబాటు అవుతుందనే అహంకారంతో ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారు. తాజాగా.. ‘పచ్చ’నేత ఒకరు ఓ బాలికను మానసికంగా, లైంగికంగా వేధించాడు. తీవ్ర మనోవేదనకు గురైన ఆమె హెచ్చెల్సీ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకుంది. ఇంతలో తల్లిదండ్రులు అప్రమత్తమై తమ కుమార్తెను కాపాడుకున్నారు. ఈ ఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ పరిధిలోని కణేకల్లు మండలం యర్రగుంట గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. యర్రగుంటలో నిరుపేద కుటుంబానికి చెందిన బాలిక స్థానిక జెడ్పీ హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ముక్కన్న సదరు బాలికపై కన్నేశాడు. వివాహితుడైనప్పటికీ ఉచ్ఛనీచాలు మరిచి నాలుగు నెలలుగా ఆమెను వేధించసాగాడు.ఇంటి నుంచి కిలోమీటరు దూరంలోని స్కూల్‌కు నడుచుకుంటూ వెళ్తుండగా తరచూ బాలిక వెంటబడేవాడు. ‘ఇలాంటివన్నీ నాకు నచ్చవు. నా వెంట పడొద్దు’ అని ఆ బాలిక చాలాసార్లు చెప్పినా వినలేదు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం బాలిక స్కూల్‌కు వెళ్తుండగా.. ‘నా వెంట రావడానికి నీకెంత కావాలి? చెప్పు.. డబ్బులు పడేస్తా’ అంటూ నీచంగా మాట్లాడాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. స్కూల్‌కెళ్లకుండా హెచ్చెల్సీ కాలువ వైపు వెళ్లింది. ఇది గమనించిన స్థానికులు తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. వారు వెంటనే అప్రమత్తమై అక్కడికి చేరుకున్నారు. స్కూల్‌కెళ్లకుండా ఇక్కడికెందుకు వచ్చావని ఆరా తీయగా.. జరిగిందంతా చెప్పి బోరున విలపించింది. నాలుగు నెలల నుంచి అతను వేధిస్తున్నాడని, స్కూల్ ఎక్కడ మాన్పిస్తారోనన్న భయంతో చెప్పలేకపోయానని, ఇప్పుడతని మాటలతో చచ్చిపోదామనుకున్నానని కన్నీరు పెట్టుకుంది. దీంతో తల్లిదండ్రులు జెడ్పీ హైస్కూల్ సమీపంలో ఉన్న ముక్కన్నను పట్టుకుని చితకబాదారు. అనంతరం గ్రామస్తులు అతన్ని ఊళ్లోకి తీసుకొచ్చి చెట్టుకు కట్టేసి కొట్టి పోలీసులకు అప్పగించారు.కామాంధుడికి పోలీసుల వత్తాసు?మరోవైపు.. కామాంధుడు టీడీపీ నాయకుడు కావడంతో అతన్ని ఎలాగైనా కాపాడాలని పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. టీడీపీ ముఖ్య నాయకుల ఒత్తిళ్లతో నిందితుని నుంచి కూడా కౌంటర్ ఫిర్యాదు తీసుకుని అతనిని రక్షించాలని చూస్తున్నట్లు తెలిసింది. -
ఆడపిల్ల పుడుతుందని భార్యను పుట్టింటికి పంపిన భర్త
అత్తాపూర్: ఆడపిల్ల పుడుతుందని గర్భవతిగా ఉన్న భార్యను పుట్టింటికి పంపించిన ఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..హసన్‌నగర్‌కు చెందిన అక్బర్ఖాన్కు ఐదేళ్ల క్రితం హుమేరా బేగంతో వివాహం జరిగింది. మొదటి సంవత్సరం ఒక ఆడపిల్లకు జన్మనిచి్చనప్పుడే ఆడపిల్లను కన్నావంటూ ఆమెపై దాడి చేశారు. ఆ సమయంలో బాధితురాలు రెయిన్‌బజార్ పోలీస్‌స్టేషన్‌లో అక్బర్ఖాన్తో పాటు అత్తమామలపై ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆమె గర్భం దాల్చడంతో ఆడపిల్ల పుడుతుందేమోనన్న భయంతో హుమేరా బేగంను ఇంటి నుంచి వెళ్లగొట్టారు. దీనిపై బాధితురాలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. -
ఆకతాయిల వేధింపులు.. వీడియో వైరల్
చెన్నై: తమిళనాడుకు చెందిన ఓ ప్రాంతంలో జనవరి 26న సాయంత్రం సమయంలో ఓ యువతి తన స్నేహితులతో కలిసి కారులో తన ఇంటికి వెళుతోంది. సరిగ్గా యువతి కారు ఈస్ట్ కోస్ట్ రోడ్డు ముట్టుకాడు ఫ్లైఓవర్ మీదగా వెళుతోంది. ఆ సమయంలో ఓ ఎస్‌యూవీలో ప్రయాణిస్తున్న ఆకతాయులు యువతి కారును వెంబడించారు. యువతిని, ఆమె స్నేహితుల్ని వేధించేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన బాధితురాలు తన కారును వెనక్కి తిప్పించేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో ఆకతాయిలో మరో కారును అడ్డుగా యువతి కారుకు అడ్డుగా పెట్టారు. ఈ ఘటన జరిగే సమయంలో కారులో ప్రయాణిస్తున్న యువతి స్నేహితురాలు వీడియో తీసింది. ఆ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆకతాయిల నుంచి తప్పించుకొని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీడియోల్ని సైతం అందించింది. ఆకతాయిలు ప్రయాణిస్తున్న ఎస్యూవీ వాహనంపై అధికార డీఎంకే పార్టీ జెండా ఉండడం ఆగ్నికి ఆజ్యం పోసినట్లైంది. ఆ వీడియో క్లిప్‌లో డీఎంకే జెండా ఉన్న ఎస్యూవీ కారుకు మార్గానికి అడ్డుగా ఉండడం, ఓ వ్యక్తి యువతి వాహనం వైపు పరుగెత్తడం వంటి దృశ్యాల్ని మనం చూడొచ్చు. .Safety of women in TN has become a luxury many can’t afford . DMK flag is the icing on the cake . #ShameOnYouStalin pic.twitter.com/SYGC4aCMPp— karthik gopinath (@karthikgnath) January 29, 2025బాధితురాలు తన ఫిర్యాదులో.. తాను, తన స్నేహితులతో కలిసి కానత్తూరులోని తన ఇంటికి వెళుతుండగా రెండు కార్లు వెంబడించాయని, కార్లలో ఉన్న యువకులు తమతో వేధించేందుకు ప్రయత్నించడంతో పాటు గొడవపడ్డారని పేర్కొంది. ఇక ఘటన జరిగే సమయంలో తీసిన వీడియోపై ప్రతిపక్ష నేత పళనిస్వామి ప్రభుత్వంపై మండిపడ్డారు. డీఎంకే ప్రభుత్వ హయాంలో మహిళలు రాత్రిపూట తిరిగే హక్కును కోల్పోయారా? అని ప్రశ్నించారు. మహిళలపై నేరాలకు పాల్పడేందుకు అధికార పార్టీ జెండాకు లైసెన్స్ ఉందా? వెంటనే కేసు నమోదు చేయాలని కోరారు.మోటార్ సైకిళ్లతో సహా పెట్రోలింగ్ వాహనాల సంఖ్యను పెంచాలని, రాత్రి వేళల్లో గస్తీని పెంచాలని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు, కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆకతాయిల్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. -
‘మమ్మీ బాయ్..’
ఫిలింనగర్: ‘మమ్మీ బాయ్..’ అంటూ తండ్రితో కలిసి ద్విచక్ర వాహనంపై స్కూలుకు బయలుదేరిన చిన్నారిని అక్రమంగా నగరంలోకి ప్రవేశించిన లారీ బలితీసుకుంది. తన కళ్లెదుటే కుమార్తె లారీ చక్రాల కిందపడి ఛిద్రం కావడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆ తండ్రి తల్లడిల్లిపోయాడు. ఈ హృదయవిదారకమైన ఘటన ఫిల్మ్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని షేక్‌పేట ప్రధాన రహదారిలో మంగళవారం చోటు చేసుకుంది. షేక్‌పేట మై హోం రెయిన్ బో రెసిడెన్స్‌లో నివసించే గడ్డం హేమ సుందర్‌రెడ్డి కుమార్తె అథర్వి (10) మణికొండలోని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఐదో తరగతి చదువుతోంది. ఎప్పటిలాగే మంగళవారం ఉదయం 8.00 గంటల సమయంలో హేమ సుందర్‌రెడ్డి తన కుమార్తెను స్కూల్లో దింపడానికి యాక్టీవా వాహనంపై బయలుదేరారు. వీరి వాహనం 8.10 గంటలకు షేక్‌పేటలోని ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకుంది. అదే సమయంలో వెనుక వైపు నుంచి చక్కెర లోడ్‌తో వచి్చన లారీ హేమ సుందర్‌రెడ్డి నడుపుతున్న బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ధాటికి తండ్రీకుమార్తె వాహనం పైనుంచి ఇద్దరు కిందపడ్డారు. అథర్వి లారీ వెళ్తున్న వైపు పడటంతో దాని వెనుక చక్రాలు ఆమె పైనుంచి వెళ్లాయి. దీంతో శరీరం ఛిద్రమై అక్కడికక్కడే చనిపోయింది. హేమ సుందర్‌రెడ్డికి ఎలాంటి గాయాలు కాలేదు. ఆ ప్రాంతంలోని రోడ్డంతా రక్తసిక్తమైంది. మరికొద్దిసేపట్లో కూతుర్ని స్కూల్ దగ్గర దింపాల్సి ఉండగా కళ్లెదుటే ఆమె రక్తపు మడుగులో పడి ఉండటాన్ని ఆయన జీరి్ణంచుకోలేకపోయారు. ఈ ప్రమాద విషయం తెలుసుకున్న అథర్వి కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. ఫిల్మ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనుమతి లేని వేళల్లో అక్రమంగా సిటీలోకి లారీతో ప్రవేశించి, చిన్నారి మృతికి కారణమైన లారీ డ్రైవర్ యాసిన్ ఖురేషిని అరెస్ట్ చేశారు. -
Mahakumbh 2025 : డస్కీ బ్యూటీ, ‘ఏంజలీనా జోలీ’ వైరల్ వీడియో
ప్రయాగ్‌రాజ్‌లో అత్యంత వైభవోపేతంగా సాగుతు మహాకుంభమేళా సాగుతోంది, పవిత్ర త్రివేణిసంగమానికి కోట్లదిమంది భక్తులు తరలివస్తున్నారు. భక్తజన సందోహం భక్తి పారవశ్యంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను సంతరించు కుంటోంది. ఈ మేళాలో ఇప్పటికే దేశానికి చెందిన సాధువులతో పాటు, విదేశాలకుచెందిన సాధువులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. తాజాగా పూసల దండలు అమ్ముకునే అమ్మాయి ఇంటర్నెట్ను ఆకర్షిస్తోంది.ఇండోర్ నుండి మహాకుంభమేళాకు వచ్చిన యువతి నెట్టింట సంచలనంగా మారింది. ఆమె తేనె రంగు కళ్లతో డస్కీ బ్యూటీ వెలిగిపోతోంది. కోటేరు ముక్కు, చంద్రబింబం లాంటి మోము, తేజస్సుతో వెలిగిపోతున్న కళ్లు ‘మోనాలిసా’ ను తలపిస్తోంది. ఆమె ప్రశాంతమైన చిరునవ్వుతో, పొడవాటి, సిల్కీ, జడ జుట్టు అద్బుతమైన ఆమె సౌందర్యానికి మరింత వన్నెతీసుకొచ్చింది.దీంతో మేళాకు హాజరయ్యే ఫోటోగ్రాఫర్లు, వ్లాగర్లు, ఆమెతో సెల్ఫీలు , వీడియోల కోసం ఎగబడుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెటిజన్లను మంత్ర ముగ్దుల్ని చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘మోనాలిసా ఆఫ్ మహాకుంభ్’, ‘ఏంజలీనా జోలీ’, ‘‘ఎంత అందమైన కళ్లు’’, ‘చాలా అందంగా ఉంది’ అంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు ‘‘ఎందుకలా ఆమె వెంటపడుతున్నారు.. సిగ్గుచేటు" అంటూ మరికొంతమంది కమెంట్ చేశారు. (Maha Kumbh Mela 2025: ‘కండల బాబా’ స్పెషల్ ఎట్రాక్షన్, ఎవరీ బాహుబలి)కాగా ఈ ఏడాది మహాకుంభమేళాలో ఐఐటీ బాబా, విదేశీ బాబా,అందమైన సాధ్వి, కండల బాబా ఇలా చాలామంది విశేషంగా నిలుస్తున్నారు. ఏరోస్పేస్ ఇంజనీర్, ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి హర్యానాకు చెందిన అభయ్ సింగ్ సన్యాసి జీవితాన్ని స్వీకరించారు. అలాగే రష్యాకు చెందిన బాబా కండలు దీరిన దేహంతో మహాకుంభమేళాలో ఆకట్టుకున్నసంగతి తెలిసిందే.एक गरीब लड़की इंदौर(MP) से महाकुंभ आती है, मालाएं बेचती है और दिन के 2 से ढाई हजार कमा लेती है।ये मेले हमारी सांस्कृतिक पहचान ही नहीं बल्कि आर्थिक समृद्धि के भी प्रतीक हैं। pic.twitter.com/BGhwuFbm0D— 𝙼𝚛 𝚃𝚢𝚊𝚐𝚒 (@mktyaggi) January 17, 2025 పన్నెండేళ్లకు ఒకసారి జరిగే కుంభమేళా ఈ ఏడాది జనవరి 13 సోమవారం ప్రారంభమై ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. మొత్తం 45 రోజులపాటు సాగే ఈ ఆధ్యాత్మిక వేడుకలో పవిత్రమైన త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాదిమంది తరలి వస్తున్నారు. इनसे मिलिए ये हैं महाकुंभ मेला में माला बेचने वाली वायरल गर्ल मोनालिसा.. इनकी आंखे बहुत सुंदर है.. इसको कहते हैं किस्मत बदलते देर नहीं लगती.. #महाकुम्भ_अमृत_स्नान #महाकुंभ2025 #MahaKumbhMela2025 pic.twitter.com/Et87nnpRql— 🌿🕊️RACHNA MEENA 🌿❤️ (@RACHNAMEENA34) January 18, 2025 -
మాయదారి గుండెపోటు : చిన్నారి ‘గుండెల్ని’ పిండేస్తున్న వీడియో
చిన్నారుల నుంచి పెద్దల దాకా గుండెపోటుతో సంభవిస్తున్న హఠాన్మరణాలు ఆందోళన రేపుతున్నాయి. ముఖ్యంగా ఇటీవలి కారణంలో చిన్నారుల గుండె సంబంధిత సమస్యలతో మరణిస్తుండటం కలచివేస్తోంది. తాజాగా మరో విషాద ఘటన చోటు చేసుకుంది. ఈసారి 8 ఏళ్ల బాలిక (School Girl) ప్రాణాలు కోల్పోవడం దిగ్భ్రాంతికి గురి చేసింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని (Ahmedabad) థల్తేజ్ ప్రాంతంలో శుక్రవారం ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో నమోదయ్యాయి.అహ్మదాబాద్‌లోని గార్గి రాణపరా(Gargi Ranapara) జేబార్ స్కూల్ ఫర్ చిల్డ్రన్‌లో గార్గి మూడో తరగతి చదువుతోంది. పాఠశాలకు వచ్చిన కొద్దిసేపటికే ఛాతీ నొప్పికి గురైంది. క్లాస్ రూమ్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా నొప్పి రావడంతో కాసేపు అక్కడే నిలబడింది. నొప్పితో బాధపడుతూనే అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంది. అంతే కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఇది గమనించిన టీచర్లు ఆమెకు సపర్యలు చేశారు. బాలికను కాపాడేందుకు టీచర్లు సీపీఆర్ చేశారు. అయినా బాలికలో ఎలాంటి చలనం లేదు. వెంటనే దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించే సమయానికే బాలిక పరిస్థితి విషమించింది. వైద్యులు ఆమెను బతికించేందుకు తీవ్రంగా శ్రమించారు. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. గార్గి గుండెపోటుతో మరణించిందని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పాఠశాల ప్రిన్సిపల్ శర్మిష్ఠ సిన్హా వెల్లడించారు.గార్గి పాఠశాల ఆవరణలో కొంచెం అనారోగ్యంగా కనిపించిందని, కొద్దిసేపు కూర్చున్న వెంటనే కుప్పకూలిపోయిందని చెప్పారు. వెంటనే అప్రమత్తమైన టీచర్లు, విద్యార్థులు వెంటనే ఆమెకు సహాయం చేయడానికి ప్రయత్నించినా, ఆమెనుకాపాడలేకపోయామని విచారం వ్యక్తం చేశారు.మరోవైపు దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక గుండెపోటుకు గల కారణాలలపై అన్ని కోణల్లో దర్యాప్తు చేస్తున్నామని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నీరజ్ బడ్గుజర్ ప్రకటించారు.🚨HEART BREAKING A 8 year old girl , all of a sudden fell down and died in school. Video from Krnavati (Ahmedabad) , Gujarat.What is happening to kids and youngsters ?? Almost every week we see or hear such cases . Instead of blaming Covid vaccines , we need to get into the… pic.twitter.com/R66mcrOIK9— Amitabh Chaudhary (@MithilaWaala) January 10, 2025 > కాగా ముంబైకి చెందిన గార్గి, తన బంధువుల ఇంటిలో ఉంటూ అహ్మదాబాద్‌లో చదువుకుంటోంది. గతంలో పెద్దగా ఆరోగ్య సమస్యలు లేవని సమాచారం. ఇటీవల బెంగళూరులో కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఎనిమిదేళ్ల బాలిక తేజస్విని పాఠశాల కారిడార్‌లో గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే.గుండెపోటు లక్షణాలుఛాతీ నొప్పి,ఊపిరి ఆడకపోవడంవికారం, చెమటలు పట్టడం చేతులు, వీపు లేదా దవడలో నొప్పి వంటివి సాధారణ లక్షణాలునోట్: గుండెలోని రక్త నాళాల్లో రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడటం, రక్తనాళాలు పూడుకుపోవడం, రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేకపోవడం తదితర కారణాల వల్ల గుండె పోటు వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. అయితే, గుండె పోటు వెనుక చాలా కారణాలు ఉండొచ్చు. అందుకే ఏ చిన్న అనారోగ్యం వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. మరీ ముఖ్యంగా జిమ్ చేస్తున్నాం కదా, ఆరోగ్యంగానే ఉన్నాం కదా అని అస్సలు అనుకోకూడదు. ఇటీవలి కేసులను దృష్టిలో ఉంచుకుని చిన్నపిల్లల్లో అయినా అనుమానిత లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి కారణాలను రూల్ అవుట్ చేసుకోవడం చాలా అవసరం. -
ఎప్పటినుంచో ఐఏఎస్ కల..కానీ 13 ఏళ్లకే అనూహ్య నిర్ణయం
జీవితం ఎపుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. జీవితం పట్ల దృక్పథం మారి ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. దీన్నివిధి లిఖితం అంటారేమో. ఆగ్రాకు చెందిన 13 ఏళ్ల రాఖీ సింగ్ కథ వింటే ఎవరికైనా ఇలానే అనిపించకమానదు.ఆగ్రాకు చెందిన రాఖీ సింగ్ అనే బాలిక కేవలం 13 ఏళ్ల వయసులోనే ప్రాపంచిక ప్రపంచానికి దూరంగా బతకాలని నిర్ణయించుకుంది. దైవ మార్గంలో నడిచేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈమె చిన్నప్పటినుంచీ ఐఏఎస్ అధికారి కావాలని కలలు కనేది. ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభ్ శిబిరాన్ని ఆమె సందర్శించిన తరువాత ఆమె ఆలోచన మారిపోయింది. సాధ్విగా మారాలని నిశ్చయించుకుంది. ఆమె నిర్ణయానికి తల్లిదండ్రులు కూడా మద్దతుగా నిలిచారు. ఆమెను హృదయపూర్వకంగా సమర్థిస్తున్నామనీ, ఆశ్రమానికి తమ కుమార్తెను ఇష్టపూర్వకంగా ఇస్తున్నామని ప్రముఖ మహంత్ (మత నాయకుడు)తో తెలిపారు. ఈ కుంభమేళా తర్వాత మహంత్ కౌశల్ గిరి ఆశ్రమంలో భాగం అవుతుంది రాఖీ.ఎవరీ రాఖీ సింగ్ఆగ్రా జిల్లా దౌకి పట్టణానికి చెందిన వ్యాపారవేత్త సందీప్ సింగ్ ధాకార పెద్ద కుమార్తె రాఖీ. అఖారా సంప్రదాయం ప్రకారం ఆమె గౌరి అని పేరు పెట్టారు. జనవరి 19న 'పిండాన్' ఆచారాన్ని నిర్వహిస్తారు. ఆ తరువాత రాఖీ కుటుంబంలో ఇక భాగంగా ఉండదు. అఖారాలో సభ్యురాలిగా సాధ్విగా ఉంటుంది. ఆగ్రాలో నివసిస్తున్న ఆమె కుటుంబం, ప్రముఖ హిందూ సన్యాసులలో ఒకటైన జునా అఖారాకు చెందిన మహంత్ కౌశల్ గిరి మహారాజ్‌తో కనెక్ట్ అయినప్పుడు రాఖీ ప్రయాణం ప్రారంభమైంది.గత మూడేళ్లుగా,తమ గ్రామంలో మహంత్ కౌశల్ గిరి భగవత్ కథా సెషన్లు నిర్వహించారు. ఈ సమయంలో రాఖీ, ఆమె కుటుంబంతో సహా, అతని బోధనల ద్వారా తీవ్రంగా ప్రభావితమైంది. ఈ సెషన్లలో ఒకదానిలో రాఖీ తన గురు దీక్ష లేదా దీక్షను తీసుకుందట. అంతేకాదు ఆమె ఆధ్యాత్మిక మార్గానికి నాంది పలికింది ఆమె తల్లి రీమా సింగ్ . ఫలితంగా గౌరీ గిరిగా పిలువబడే రాఖీ పవిత్ర పరిత్యాగ ప్రక్రియ తరువాత కొత్త ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించనుంది.కాగా 12 ఏళ్ల తర్వాత మహాకుంభ మేళా జనవరి 13 నుంచి మహా కుంభ మేళా జరగబోతోంది. ఈ మేళాకి ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మహా కుంభ మేళా.. ఫిబ్రవరి 26 వరకూ జరుగుతుంది. దేశవ్యాప్తంగా వేర్వేరు అఖారాల నుంచి అఘోరాలు, స్వాములు, రుషులు వస్తూన్నారు. ముఖ్యంగా కొన్ని అఖారాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. అటల్ అఖారా, మహానిర్వాణి అఖారా, నిరంజని అఖారా, అశ్వాన్ అఖారా, జునా అఖారా ఇవన్నీ అలాంటివే. ఇవన్నీ మహా కుంభమేళాలో తమ క్యాంపులను ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. -
బాలిక ప్రాణం తీసిన సెంట్రింగ్ కట్టె
దొడ్డబళ్లాపురం: నిర్మాణదారుల నిర్లక్ష్యం తల్లిదండ్రుల కంటి దీపాన్ని బలిగొంది. పాఠశాల నుండి ఇంటికి తిరిగి వెళ్తున్న బాలిక తలపై సెంట్రింగ్‌కు వాడిన వెదురు కట్టె పడి చనిపోయిన బెంగళూరు వీవీ పురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాలిక తేజస్విని (15) రోజు మాదిరిగానే శనివారం సాయంత్రం ఇంటికి తిగిరి వెళ్తుండగా రోడ్డుపక్కన కొత్తగా నిర్మిస్తున్న కట్టడంపై నుండి సెంట్రింగ్ కట్టె తలమీద పడడంతో తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రిలో చేర్పించగా సోమవారం మరణించింది. బాలిక తండ్రి సుధాకర్ రావ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీవీ పురం పోలీసులు భవన ఇంజినీర్‌ను అరెస్టు చేసారు. కట్టడం యజమాని, అనుమతులు ఇచ్చిన బీబీఎంపీ అధికారులు, కాంట్రాక్టర్లపై కూడా కేసు నమోదు చేశారు. -
8వ తరగతి బాలికపై నలుగురు అత్యాచారం
కోనేరుసెంటర్(కృష్ణా జిల్లా) : రాష్ట్రంలో బాలికలపై లైంగిక దాడులకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. చిన్నారులు, వృద్ధులని కూడా చూడకుండా కామాంధులు చెలరేగిపోతున్నారు. తాజాగా మచిలీపట్నంలో శుక్రవారం రాత్రి ఎనిమిదో తరగతి విద్యార్థిపై నలుగురు యువకులు గ్యాంగ్ రేప్‌నకు పాల్పడిన ఘటనతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. కృష్ణా జిల్లా మచిలీపట్నం కాసానిగూడేనికి చెందిన బాలిక సమీపంలోని ఓ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో బాలిక.. బయటకు వెళ్లిన తన తండ్రి వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా రాజుపేటకు చెందిన తలాహ్, అతని స్నేహితుడు కలిసి బాలికను బెదిరించి బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ మరో ఇద్దరు యువకులున్నారు. నలుగురు కలిసి బాలికను తీవ్రంగా హింసించి.. లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలిక వారి నుంచి తప్పించుకుని పెద్దగా కేకలు వేయడంతో నలుగురు యువకులు అక్కడి నుంచి పారిపోయారు. తండ్రి వద్దకు వెళ్లిన బాలిక ఇంటికి రాకపోవటంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలిస్తుండగా.. బాలిక ఏడుస్తూ వారికి ఎదురొచ్చింది. బాలిక తల్లి ఇనగుదురుపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నలుగురు యువకులపై పోక్సో కేసు నమోదు చేశారు. కాగా, పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు జిల్లా ఎస్పీ గంగాధరరావు వెల్లడించారు. మైనర్‌పై పాస్టర్ లైంగిక దాడి కొండపల్లి(ఇబ్రహీంపట్నం) : బాలికపై పాస్టర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లికి చెందిన బాలికకు తెలంగాణకు చెందిన పాస్టర్ వేముల కిరణ్ వరసకు మేనమామ అవుతాడు. కొండపల్లి వచ్చి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పలుమార్లు కిరణ్ ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇటీవల కాలంలో బాలిక అనారోగ్యానికి గురవడంతో తల్లిదండ్రులు బాలికను ఆరాతీశారు. బాలిక అసలు విషయం చెప్పడంతో తల్లిదండ్రులు ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో పాస్టర్‌పై ఫిర్యాదు చేశారు. పోలీసులు చికిత్స నిమిత్తం బాలికను విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలిక అదృశ్యం గంగవరం: చిత్తూరు జిల్లా గంగవరం మండలం మల్లేరు గ్రామంలో కూలి పనులకు వెళ్లిన పెద్ద పంజాణి మండలం పెద్దారికుంట గ్రామానికి చెందిన ఓ బాలిక అదృశ్యమైన ఘటన శనివారం ఆలస్యంగా వెలుగు చూసింది. బాలిక తండ్రి తెలిపిన వివరాల మేరకు పెద్దపంజాణి మండలం పెద్దారికుంట గ్రామానికి చెందిన బాలిక (16) గతేడాది పదో తరగతితో చదువు నిలిపివేసింది. అప్పటి నుంచి తల్లితో కలిసి కూలి పనులకు వెళ్లేది. ఈ క్రమంలో గత గురువారం తల్లితో కలిసి ఇంటినుంచి గంగవరం మండలంలోని మల్లేరు వద్ద కూలి పనులకు వెళ్లింది. అలా పక్కకు వెళ్లొస్తానని తల్లితో చెప్పి వెళ్లిన బాలిక ఎంత సేపటికీ రాలేదు. ఆ విషయాన్ని బాలిక తల్లి తన భర్తతో చెప్పగా మల్లేరు గ్రామంలో విచారించారు. అయితే ఇదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు తమ కుమార్తెను ఎక్కడికో తీసుకెళ్లారని గ్రామస్తుల ద్వారా తెలుసుకున్నారు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో తమ కుమార్తె కిడ్నాప్‌నకు గురైందని ఫిర్యాదు చేశారు. దీనిపై మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఘోరం.. చిరుత దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి
ముంబై : పూణే జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చిరుత దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. చిన్నారి మృతిని జిల్లా అటవీ శాఖ అధికారులు అధికారంగా ధ్రువీకరించారుపూణేలోని షిరూర్ తాలూకా పింపల్సుతి గ్రామానికి చెందిన రక్ష నిఖమ్ (4) ఇంట్లో ఆడుకుంటుంది. ఆ సమయంలో అకస్మాత్తుగా వచ్చిన చిరుత చిన్నారిని నోట కరుచుకుని స్థానిక చెరుకు తోటల్లోకి తీసుకెళ్లింది. చిరుత పులి రాకను గమనించిన తల్లి కాపాడండి అంటూ కేకలు వేసింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది రక్ష కోసం గాలింపు చర్యలు చేపట్టారు.రెండు గంటల పాటు గాలింపు చర్యల అనంతరం చెరుకు తోటలో చిన్నారి జాడ దొరికింది. చిన్నారిపై చిరుత తీవ్రంగా దాడి చేసింది. ఈ దాడితో బాలిక తల,మొండెం వేర్వేరుగా కనిపించాయని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా జున్నార్ ఫారెస్ట్ డివిజన్ అధికారి మితా రాజ్‌హన్స్ మాట్లాడుతూ బాలికపై దాడి చేసిన చిరుతను పట్టుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు. -
ఆమె నెగ్గింది.. అమ్మ గెలిచింది
‘మా అమ్మాయి దీక్ష అస్సాం సివిల్ సర్వీసెస్‌కు సెలెక్ట్ అయింది తెలుసా!’ అంటూ ఎంతోమందికి సంతోషంగా చెప్పుకుంటోంది బేబీ సర్కార్. దీక్ష పసిగుడ్డుగా ఉన్నప్పుడు బేబీ సర్కార్‌ను అత్త నిర్దాక్ష్యిణ్యంగా ఇంటి నుంచి వెళ్లగొట్టింది. అత్త దృష్టిలో బేబీ సర్కార్ చేసిన నేరం... ఆడపిల్లను కనడం!‘ఆడపిల్ల పుట్టింది’ అనే మాట చెవిన పడగానే ఆ అత్త అగ్గి మీద గుగ్గిలం అయ్యింది. కోడలు బేబీ సర్కార్‌ను తిట్టడం మొదలుపెట్టింది. ఆ అత్త నలుగురు కొడుకులకూ ఆడపిల్లలు జన్మించారు. ‘ఎవరైతే ఏమిటి!’ అనుకోలేదు ఆమె. చిన్న కొడుకుకు ఎలాగైనా మగబిడ్డ పుడుతుందని ఆశించింది. అంతేనా...‘నువ్వు కూడా ఆడపిల్లనే కంటే ఇంటి నుంచి గెంటేస్తాను’ అని కోడలిని హెచ్చరించింది. అయితే ఆమె కోరుకున్నట్లు జరగలేదు. బేబీ సర్కార్ కూడా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కోపం తట్టుకోలేని అత్త కోడలిని ఇంటి నుంచి గెంటేసింది. ఇంత జరిగినా....‘అలా మాట్లాడడం తప్పమ్మా...ఇలా చేయడం తప్పమ్మా’ అంటూ బేబీ సర్కార్ భర్త నుంచి చిన్న పదం కూడా బయటికి రాలేదు.‘‘నా భర్త మా అత్తను వ్యతిరేకించలేదు. ‘మా అమ్మ ఏం చెప్పిందో అదే చేసింది. అమె చేసినదాంట్లో తప్పేం ఉంది’ అన్నట్లుగా మాట్లాడేవాడు’’ అని భర్త గురించి చెప్పింది అస్సాంలోని శ్రీభూమి జిల్లాకు చెందిన బేబీ సర్కార్. అత్త ఇంటి నుంచి గెంటేయడంతో తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. కొంత కాలం తరువాత భర్త చనిపోయాడు. ఆ తరువాత అత్త చనిపోయింది. మరోవైపు చూస్తే తల్లిదండ్రుల ఇంట్లో ఉండడం కష్టంగా అనిపించింది. వారికే పూటగడవడం కష్టంగా ఉంది. దీంతో కూతురు దీక్షతో కలిసి అక్క బీజోయ ఇంట్లో ఉండేది. బీజోయ ఎల్ఐసీలో ఉద్యోగం చేసేది.అక్క డిప్రెషన్‌తో బాధ పడుతుండడంతో ఆమె కుటుంబాన్ని కూడా తానే చూసుకునేది. దీక్ష పదవతరగతి పూర్తి చేసేవరకు అక్క ఇంట్లోనే ఉంది. ఆ తరువాత తల్లీకూతుళ్లు ఒక అద్దె ఇంట్లోకి మారారు. కుమార్తె చదువు కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టింది బేబీ సర్కార్. దీక్ష చదువు కోసం సర్కార్ అప్పు కూడా చేయాల్సి వచ్చేది. తల్లీకూతుళ్లు ఆచితూచి ఖర్చు చేస్తుండేవారు. ఒకవైపు సివిల్స్‌కు ప్రిపేర్ అవుతూనే మరోవైపు యూట్యూబ్ చానల్ మొదలుపెట్టింది దీక్ష. ఈ చానల్ ద్వారా వచ్చే ఆదాయం ఖర్చులకు ఉపయోగపడేది. అస్సాం సివిల్ సర్వీసెస్ పరీక్షలో దీక్ష విజయం సాధించడంతో తల్లీకూతుళ్ల కష్టాలకు తెరపడ్డట్లయింది.‘విజయాలు సాధించడం అనేది అబ్బాయిలకు మాత్రమే పరిమితం కాదని నా కుమార్తె విజయం నిరూపించింది’ అంటుంది బేబీ సర్కార్. ‘మా అమ్మ, పెద్దమ్మ కష్టాలు, త్యాగాల పునాదిపై సాధించిన విజయం ఇది. అమ్మ నా కోసం చాలా కష్టపడింది. ఎప్పుడూ నాతోనే ఉంటుంది. ఆమెకు ఎలాంటి కష్టాలు లేకుండా చూసుకుంటాను’ అంటుంది ట్రైనీ ఏసీఎస్ (అస్సాం సివిల్ సర్వీస్) ఆఫీసర్ అయిన దీక్ష. -
రేప్ చేసి, జననాంగంలో ఇనుప రాడ్ జొప్పించి...
వడోదర: గుజరాత్లో 11 ఏళ్ల బాలికపై ఒక 36 ఏళ్ల వలస కార్మికుడు దారుణ అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేగాక జననాంగంలో ఇనుప కడ్డీ చొప్పించాడు! భరూచ్ జిల్లాలోని ఝగాడియా పారిశ్రామికవాడలో ఆదివారం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ఆమె కుటుంబం జార్ఖండ్ నుంచి వలసవచ్చింది. నిందితుడు విజయ్ పాశ్వాన్ బాలిక తండ్రితోపాటు పనిచేస్తున్నాడు. సమీప గుడిసెలో ఉంటూ బాలికను కిడ్నాప్‌చేసి ఘోరానికి పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు. పొదల్లోకి తీసుకెళ్లి రేప్‌చేసి పారిపోయాడు. రక్తమోడుతూ బాలిక ఏడుస్తుండటంతో తల్లి చూసి ఆస్పత్రకి తరలించింది. నిందితుడిని సోమవారం అరెస్ట్ చేశారు. పోక్సో సెక్షన్ల కింది కేసు నమోదు చేశారు. బాలికను అతను గత నెలలోనూ రేప్ చేశాడని ప్రాథమిక విచారణలో తేలింది. -
బాలికపై సామూహిక లైంగిక దాడి
కొల్లూరు: ఓ బాలికను మభ్యపెట్టి సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక కొల్లూరులోని ఓ దుస్తుల దుకాణంలో పని చేస్తుంది. గత నెల 26న రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో తన గ్రామానికి వెళ్లడానికి ఆటో కోసం వేచి ఉండగా, ఆవులవారిపాలెం శివారు క్రీస్తులంకకు చెందిన యువకుడు విప్పర్ల ప్రేమ్‌కుమార్ తన ద్విచక్ర వాహనంపై ఇంటి వద్ద దింపుతానని నమ్మించి ఎక్కించుకున్నాడు.కొల్లూరు కరకట్ట నుంచి దారి మళ్లించి దిగువున ఉన్న ఇటుక బట్టీల్లోకి తీసుకెళ్లి బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డాడు. అంతేకాక తన స్నేహితులకు ఫోన్ చేసి పిలవడంతో బెజ్జం శ్యామ్‌కుమార్‌తో పాటు మరో యువకుడు అక్కడకు వచ్చారు. శ్యామ్‌కుమార్ బాలికను తన ద్విచక్ర వాహనంపై దింపుతానని మభ్యపెట్టి వేరే ఇటుక బట్టీలోకి తీసుకువెళ్లి అతను కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరో యువకుడు వెంటనే వెళ్లిపోయాడు.అనంతరం బాలికను ఇటుక బట్టీలలోనే వదిలి వెళ్లడంతో రాత్రి సమయంలో కాలినడకన ఇంటికి చేరుకుంది. తల్లి లేని ఆ బాలిక జరిగిన అఘాయిత్యాన్ని తండ్రికి చెప్పుకునేందుకు భయపడింది. కొద్ది రోజులుగా బాలిక అనారోగ్యంతో ఉండడాన్ని గమనించిన తండ్రి తమ బంధువులకు చెప్పడంతో విషయం బయటపడింది. అనంతరం తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం రేపల్లె డీఎస్పీ ఎ. శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. నిందితులు విప్పర్ల ప్రేమ్‌కుమార్, బెజ్జం శ్యామ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఘటన ప్రాంతాన్ని వేమూరు సీఐ రామాంజనేయులు, కొల్లూరు ఎస్ఐ జి. ఏడుకొండలు పరిశీలించారు. -
అలా ఎలా బ్రో..!
-
గాల్లో బాలిక ప్రాణాలు
లఖింపూర్‌ఖేరీ (యూపీ): ఆ 14 ఏళ్ల బాలిక జాతరకు వెళ్లింది. సరదాగా జెయింట్ వీల్ ఎక్కింది. అది కాస్తా పూర్తిగా పైకి వెళ్లాక 150 అడుగుల ఎత్తులో ఉండగా బాలిక ఉన్నట్టుండి అదుపు కోల్పోయింది. తన కేబిన్ నుంచి విసురుగా బయటికొచ్చింది. అయినా వీల్ ఆడకుండా తిరుగుతూనే ఉంది. దాంతో కిందనుంచి చూస్తున్న వాళ్లంతా హాహాకారాలు చేశారు. అంతటి విపత్కర పరిస్థితిలోనూ పాప చురుగ్గా స్పందించింది. క్యాబిన్ కిందివైపున్న మెటల్బార్ను గట్టిగా పట్టుకుంది. దాన్ని కరుచుకుని కదలకుండా ఉండిపోయింది. ఆపరేటర్లు హుటాహుటిన జెయింట్ వీల్‌ను ఆపేశారు. అది నెమ్మదిగా తిరుగుతుండగా బాలికను కిందకు వచ్చింది. వెంటనే తనను అందుకుని దించి కాపాడారు. 30 సెకన్లకు పైగా బాలిక మెటల్బార్ను పట్టుకుని గాల్లోనే వేలాడింది. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ సమీపంలో జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. భద్రతా ప్రమాణాలు పాటించలేదంటూ అధికారులు జెయింట్ వీల్‌ను సీల్ చేశారు. -
వెరీగుడ్
-
రీలు చేసింది, క్షమాపణ చెప్పింది
-
బాలికపై సవతి తండ్రి లైంగికదాడి
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడసెంట్రల్): పదోతరగతి చదువుతున్న ఓ బాలికపై కన్నేసిన సవతి తండ్రి పలుమార్లు లైంగికదాడికి పాల్పడడంతో.. ఆ బాలిక రెండు వారాల క్రితం ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చిన అమానవీయ ఘటన ఎన్టీఆర్ జిల్లా, విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. నగరంలోని 59వ డివిజన్ లూనాసెంటర్కు చెందిన మహిళ తన భర్తతో విభేదాలు రావడంతో పన్నెండేళ్ల కిత్రం అతనితో విడిపోయి కుమార్తెతో కలిసి విడిగా నివసిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన అనంత శంకర్‌దాస్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి మహిళ, ఆమె కుమార్తె, శంకర్‌దాస్ కలిసి నివసిస్తున్నారు. శంకర్‌దాస్ పెయింటింగ్ పనులు చేస్తుండగా.. ఆ మహిళ హౌస్‌కీపింగ్ పనులకు వెళ్తోంది. ప్రస్తుతం బాలిక (16) సింగ్‌నగర్‌లోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. బాలిక తల్లి హౌస్‌కీపింగ్ పనులకు ఇతర ఊర్లకు వెళ్లి అక్కడే పది, పదిహేను రోజులుండేది. నాలుగు నెలల క్రితం బాలిక తనకు కడుపులో బాగా నొప్పి వస్తోందని, వాంతులవుతున్నాయని తల్లికి చెప్పింది. దీంతో ఆమె బాలికకు వైద్య పరీక్షలు చేయించగా ఆమె గర్భవతి అని వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం ఆరో నెల వచ్చిందని చెప్పడంతో ఆమె తన కుమార్తెను అప్పటి నుంచి స్కూల్‌కు పంపకుండా ఖమ్మంలోని తన బంధువుల ఇంటివద్దే ఉంచి వైద్య పరీక్షలు చేయిస్తోంది. బాలికను నిలదీయగా అమ్మా.. నువ్వు ఊరు వెళ్లినప్పుడల్లా శంకర్ దాస్ తనను బెదిరించి లైంగికదాడికి పాల్పడేవాడని చెప్పింది. దీంతో శంకర్దాస్ను నిలదీయగా అతడు అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. నవంబర్ 18న బాలిక ఆడ శిశువుకు జన్మనివ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న శంకర్‌దాస్ కోసం గాలిస్తున్నారు. -
బాలికపై ఇంటర్ విద్యార్థి లైంగిక దాడి
తిరుపతి క్రైమ్: ఎనిమిదేళ్ల బాలికపై ఇంటర్ విద్యార్థి లైంగిక దాడికి పాల్పడిన ఘటన తిరుపతిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతిలోని ఎంఆర్‌పల్లికి చెందిన ఇంటర్ విద్యార్థి బాలాజీ నగర్‌లోని కాలేజీలో చదువుకుంటూ అక్కడికి దగ్గర్లో ఉన్న అమ్మమ్మ ఇంట్లో ఉండేవాడు. వీరి ఇంటికి సమీపంలోనే బాలిక కుటుంబం నివసిస్తోంది. పదో తరగతి చదువుతున్న బాలిక అన్నతో సన్నిహితంగా ఉంటూ వారింటికి వచ్చిపోతూ ఉండేవాడు. పది రోజుల కిందట బాలికకు చాక్లెట్లు కొనిస్తానని చెప్పి అమ్మమ్మ ఇంటికి తీసుకువెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బాలిక నోట్లో గుడ్డలు కుక్కి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెబితే మీ అమ్మానాన్నల్ని చంపేస్తానని బెదిరించడంతో బాలిక ఎవరికీ చెప్పలేదు. అలా బెదిరిస్తూ నాలుగుసార్లు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇటీవల బాలికకు జ్వరం, కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. లైంగికదాడి జరిగినట్లు వైద్యులు గుర్తించడంతో తల్లిదండ్రులు బాలికను ప్రశ్నించగా విషయం చెప్పింది.దీంతో తల్లిదండ్రులు ఎస్వీ యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్టు చేసి పోక్సో కేసు నమోదుచేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా నగరంలో నివసించే రిటైర్డ్ డీఎస్పీ ఇంట్లో నిందితుడి అమ్మమ్మ పనిచేస్తుండటంతో అతను పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి మధ్యవర్తిత్వం చేయడానికి ప్రయత్నించారు. బాలిక బంధువులు, కుటుంబీకులు దాడిచేసేందుకు ప్రయత్నించడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. -
AP: బాలికపై గ్యాంగ్ రేప్
సాక్షి టాస్క్‌ఫోర్స్: వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గ పరిధిలో చింతకొమ్మదిన్నె మండలం సుగాలిబిడికి ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్‌నకు గురైంది. బాలిక ఇంటికి సమీపంలో ఓ యువకుడితో ఒంటరిగా మాట్లాడుతుండగా నిందితుల్లో ఒకరు సెల్ఫోన్లో చిత్రీకరించాడు. ఆ వీడియో బాలికకు చూపి ఉదయ్‌కిరణ్, మరో ఇద్దరు మైనర్లు కలిసి బాలికను లొంగదీసుకుని అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన జరిగి దాదాపు నెల రోజులవుతోంది. నిందితులంతా కమలాపురం టీడీపీ ఎమ్మెల్యే అనుచరుల పిల్లలు కావడంతో ఈ దారుణం వెలుగులోకి రాకుండా తొక్కిపెట్టేశారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్లి మొదట బేరసారాలు మొదలెట్టారు. ఆ తర్వాత వారిని భయపెట్టే యత్నం చేశారు. ఎట్టకేలకు గురువారం బాధితురాలి తండ్రి కడపలోని ‘దిశ’ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు, దిశ పోలీస్‌స్టేషన్ డీఎస్పీ రమాకాంత్లు సిబ్బందితో కలిసి విచారణ చేపట్టారు. వెంటనే నిందితులు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. నిందితులపై చింతకొమ్మదిన్నె సీఐ శంకర్‌నాయక్ పొక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారని సమాచారం రావడంతో ఆఘమేఘాల మీద టీడీపీ నేతలు, కార్యకర్తలు పోలీసు అధికారులతో మాట్లాడేందుకు, నిందితుల తరఫున బాధితులతో రాజీ కుదిర్చేందుకు రోజంతా విఫలయత్నం చేశారు.మహిళపై హత్యాచారం» తల నుజ్జునుజ్జు » వైఎస్సార్ జిల్లా, కాశినాయన మండలంలో దారుణం » చెన్నవరం–పాపిరెడ్డిపల్లె మధ్య ఘటన » కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులుకాశినాయన (కలసపాడు): ఓ మహిళపై హత్యాచారం ఘటన వైఎస్సార్ జిల్లా, కాశినాయన మండలం, కత్తెరగండ్ల గ్రామ సమీపంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. చాపాడు మండలం, ఖాదర్‌పల్లెకు చెందిన కరీమున్నీసా(32)–నజీర్ దంపతులు. కరీమున్నీసా ఎర్రచందనం వ్యవహారాల్లో సెటిల్మెంట్లు చేస్తుంటుంది. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ తిరుగుతూ ఉంటుంది. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. నజీర్ ఎర్రచందనం కేసులో జైలులో ఉన్నాడు. బుధవారం రాత్రి కరీమున్నీసా చెన్నవరం–పాపిరెడ్డిపల్లె మధ్య అనూహ్యంగా దారుణహత్యకు గురైంది. ఆమెను గుర్తు పట్టకుండా ఎవరో ముఖంపై బండరాళ్లతో దారుణంగా మోది హత్య చేశారు. మహిళ మృతదేహం ఉన్నట్లు మేకలకాపరులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఆమెపై సామూహిక లైంగికదాడి జరిగినట్టు గుర్తించారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు, మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్, పోరుమామిళ్ల సీఐ శ్రీనివాసులు, కాశినాయన, పోరుమామిళ్ల ఎస్ఐలు హనుమంతు, కొండారెడ్డి, క్లూస్‌టీం అధికారులు గురువారం ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ కేసు దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను త్వరలో పట్టుకుంటామని చెప్పారు. మహిళ తన స్వగ్రామం నుంచి ఫోన్ కాంటాక్ట్ ద్వారా ఘటనా స్థలానికి వచి్చనట్లు తెలిసిందని, ఈ దాషీ్టకాన్ని ఒకరు చేశారా లేక మరికొందరు కలిసి చేశారా అనేది విచారణలో తేలాల్సి ఉందని పేర్కొన్నారు. -
చిన్నారి ప్రాణాలు కాపాడిన వీధి కుక్కలు
భోపాల్: వీధి కుక్కలు చిన్నారుల ప్రాణాలను తీస్తున్నాయనే వార్తల మధ్య వీటికి భిన్నమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బెత్మాలో జరిగింది.కిడ్నాప్‌కు గురైన పదేళ్ల బాలికను వీధికుక్కలు కాపాడాయి. ఒక చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు ఇద్దరు వ్యక్తులు బెత్మాలోని కాళీ బిలౌడ్ గ్రామానికి వచ్చారు. అయితే వీధి కుక్కలు ఆ చిన్నారిని రక్షించి, కిడ్నాపర్లు అక్కడి నుంచి పారిపోయేలా చేశాయి. ఘటన గురించి బాధిత బాలిక మేనమామ మాట్లాడుతూ తమ పదేళ్ల మేనకోడలు ఇంటిలో ఒంటరిగా ఉండగా, ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ఆ చిన్నారిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారన్నారు.అయితే దీనిని గమనించిన తమ వీధిలోని కుక్కలు ఆ ఇద్దరు వ్యక్తులపై దాడికి దిగాయన్నారు. దీంతో ఆ ఇద్దరు ఆగంతకులు అక్కడి నుంచి పారిపోయారన్నారు. అప్పడు ఆ చిన్నారి సమీపంలోని ఆలయంలోకి వెళ్లి దాక్కున్నదన్నారు. ఈ విషయమై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇది కూడా చదవండి: బతికుంటే కోర్టుకెళతా: సాధ్వి ప్రజ్ఞ -
ట్రంప్ మా నాన్న.. తెరపైకి పాక్ యువతి
ఇస్లామాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో విజయం సాధించిన దరిమిలా పాకిస్తాన్ నుంచి ఓ ఆసక్తికర వార్త వైరల్‌గా మారింది. ఒక పాకిస్తానీ యువతి తాను ట్రంప్ కుమార్తెనంటూ మీడియాకు తెలిపింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.ఆ వీడియోలో ఆ యువతి తాను ముస్లింనని చెబుతూ, తానే డొనాల్డ్ ట్రంప్ నిజమైన కుమార్తెనని పేర్కొంది. అయితే ఈ వీడియో ప్రామాణికతో పాటు ఆ యువతి మానసిక స్థితి గురించి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం వెలుగులోకి రాలేదు. కాగా మీడియాతో మాట్లాడిన ఆ యువతి ఇంగ్లీషువాళ్లు ఇక్కడికి వచ్చినప్పుడు తనను చూసి ఆశ్చర్యపోతుంటారని తెలిపింది. తన కూతురిని బాగా చూసుకోలేకపోతున్నానని ట్రంప్ తన తల్లితో ఎప్పుడూ అంటుంటారని ఆమె పేర్కొంది. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో @pakistan_untold ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 75 వేలకు పైగా వీక్షణలు దక్కాయి. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌ను ఓడించి, డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. Does @realDonaldTrump know he has children in Pakistan who speak Urdu & English in Punjabi? pic.twitter.com/anhRKbiLGo— Pakistan Untold (@pakistan_untold) November 6, 2024ఇది కూడా చదవండి: ‘డాన్ తిరిగొచ్చాడు’.. ప్రపంచ వార్తా పత్రికల్లో.. -
యువతిపై ప్రేమోన్మాది దాడి.. కత్తితో చేయి కోసి పరార్
సాక్షి,మెదక్‌జిల్లా: మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద దారుణం జరిగింది. సోమవారం(నవంబర్ 4) ఉదయం దివ్యవాణి అనే యువతిపై ప్రేమోన్మాది దాడి చేశాడు. కత్తితో చేయి కోసి పరారయ్యాడు. ఓపెన్ డిగ్రీ పరీక్షలకు కాలేజీకి వస్తుండగా ఘటన జరిగింది.యువతిపై దాడి చేసింది బెంగుళూరుకు చెందిన చేతన్ అనే యువకుడిగా గుర్తించారు. ప్రస్తుతం యువకుడు పరారీలో ఉన్నాడు.యువతిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి రిఫర్ చేసినట్లు సమాచారం. ఇదీ చదవండి: హాస్టల్లో ఉండడం ఇష్టం లేక ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య -
తిరుపతి: స్నాప్ చాట్‌లో పరిచయం.. బాలికపై లైంగిక దాడి
సాక్షి, తిరుపతి: నగరంలో దారుణం జరిగింది. ఓ ప్రైవేటు లాడ్జిలో బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. తిరుపతిలోని ఓ విద్యాలయంలో 9వ తరగతి చదువుతున్న బాలికపై ఓ యువకుడు లైంగిక దాడి చేశాడు.చెన్నై ఓ హోటల్లో పని చేస్తున్న ఓ యువకుడు ఆన్లైన్ స్నాప్ షాట్ ద్వారా బాలిక పరిచయమైంది.బాలిక ప్రవర్తనను గమనించిన తల్లిదండ్రులు విషయం ఆరా తీయగా విషయం బయటపడింది. యువకుడిని పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం, మలకపల్లి గ్రామానికి చెందిన సతీష్ (22)గా గుర్తించారు. జరిగిన ఘటనపై బాలిక తల్లిదండ్రులు అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై ఫోక్సోకేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. -
బాలిక హత్యకేసులో ఐటీ దంపతుల అరెస్టు
సేలం: బాలికను కొట్టి చంపి, సూట్ కేస్‌లో పెట్టి సేలం జిల్లా సంగగిరిలో పడవేసిన ఐటీ దంపతులను పోలీసులు మంగళవారం భువనేశ్వర్‌లో అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. సేలం జిల్లా సంగగిరి సమీపంలోని వైకుందం ప్రాంతంలో రోడ్డు పక్కన గత సెప్టెంబర్ 30వ తేదీ అనుమానాస్పదస్థితిలో ఒక సూట్‌కేసు కనిపించింది. సంగగిరి పోలీసులు తనిఖీ చేయగా అందులో 15 ఏళ్ల బాలిక మృతదేహం కనిపించింది. పోలీసులు పంచనామా నిర్వహించారు. సంగగిరి పోలీసులు కేసు నమోదు చేసి టోల్ గేట్ మార్గంలో వెళ్లిన కార్లను తనిఖీ చేశారు. అప్పుడు బెంగళూరులోని ఐటీ సంస్థలో పని చేస్తున్న దంపతులకు చెందిన కారుపై వారికి అనుమానం కలిగింది. ఆ కారు నంబర్ ఆధారంగా విచారణ జరిపారు. అందులో ఆ కారు ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌కు చెందిన అభినేష్ సాహు, అతని భార్య అశ్విన్పట్టిల్కు చెందినదని తెలిసింది. దీంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ఆ కారు అభినేష్ సాహు, అశ్విన్పట్టిల్ దంపతులు బెంగళూరు ఐటీ సంస్థలో పని చేస్తున్నట్లు గుర్తించారు. వారికి ఐదేళ్ల కుమార్తె ఉండడంతో ఆ పాపను చూసు కోవడం పని మనిషి అవసరమైంది. దీంతో రాజస్థాన్ రాష్ట్రం, జైపూర్, ముండమన్ ప్రాంతానికి చెందిన సుమైనా (15) బాలిక ఒడిశాలో ఉన్న అనాథ ఆశ్రమంలో పెరుగుతూ వచ్చింది. ఆ ఆశ్రమాన్ని అభిషేక్ సాహు తండ్రి నడుపుతున్నారు. దీంతో సుమైనాను ఇంటి పని కోసం అభిషేక్ సాహు బెంగళూరుకు తీసుకువచ్చినట్టు తెలిసింది. ఆ బాలిక సరిగ్గా పని చేయలేదని, చిన్నారికి పెట్టే ఆహారం తింటున్నట్టు ఆరోపిస్తూ బాలికను వేధింపులకు గురిచేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో ఒక రోజు వేడి నీళ్లు తీసుకురమ్మన్ని కోరగా, ఆ బాలిక వేడినీళ్లు ఇచ్చిన సమయంలో అశ్విన్పట్టిల్పై పడిందని, దీంతో తీవ్ర ఆవేశానికి గురై ఆ బాలికపై దాడి చేయడంతో ఆమె మృతి చెందినట్టు తెలిసింది. దీంతో ఆ బాలిక మృతదేహాన్ని సూట్ కేస్‌లో పెట్టి సేలం జిల్లా సంగగిరి ప్రాంతంలో వారు పడవేసి వెళ్లినట్టు తేలింది. దీంతో పోలీసులు అభినేష్ సాహును గత 26వ తేదీ అరెస్టు చేసిన పోలీసులు మంగళవారం అశ్విన్పట్టిల్ను అరెస్టు చేసినట్టు బుధవారం వెల్లడించారు. -
బాలికపై లైంగిక వేధింపులు.. మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత
చురాచంద్పూర్: మణిపూర్‌లో మరోమారు ఉద్రిక్తత నెలకొంది. చురాచంద్పూర్ జిల్లాలోని టుయుబాంగ్ సబ్ డివిజన్లో 11 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపుల ఘటన చోటుచేసుకున్న దరిమిలా ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి.ఈ ఘటనకు నిరసనగా బుధవారం బంద్ నిర్వహించారు. పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉన్నందున, ఇండియన్ సివిల్ డిఫెన్స్ కోడ్ 2023లోని సెక్షన్ 163 ప్రకారం సబ్ డివిజన్లో నిషేధాజ్ఞలు విధించినట్లు అధికారులు తెలిపారు. దీని ప్రకారం ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడంపై నిషేధం విధించారు.కుకీ-జోమి గ్రామ వాలంటీర్లు పిలుపునిచ్చిన బంద్ కారణంగా మార్కెట్లు, దుకాణాలు, పాఠశాలలు మూతపడ్డాయని, ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు బంద్ చేపట్టారు. బంద్ మద్దతుదారులు ట్యూబాంగ్ మార్కెట్ వద్ద రోడ్డు మధ్యలో పాత టైర్లతో సహా వ్యర్థ పదార్థాల కుప్పను తగులబెట్టారు. బాలిక కుటుంబ సభ్యులు అక్టోబర్ 21న ఫిర్యాదు చేయడంతో, నిందితుడైన దుకాణం యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలిక ఏవో వస్తువులు కొనుగోలు చేసేందుకు నిందితుని దుకాణానికి వెళ్లిన సందర్భంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న స్థానికులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. నిందితులు ఆ దుకాణ యజమాని ఇంట్లో ఆశ్రయం పొందారని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఇది కూడా చదవండి: ఈ ఐదు నగరాల్లో.. మిన్నంటే దీపావళి సంబరాలు -
బాబూ నీ పాలన ఇలానే ఉంటే ఇక తిరుగుబాటే
-
పెళ్లి చేస్తారా? చస్తారా : 13ఏళ్ల బాలిక గలాటా
బషీరాబాద్: పదహారేళ్ల బాలిక తాను ప్రేమించిన యువకుడితో వివాహం చేయాలని తల్లితో గొడవకు దిగింది. ఇప్పుడే పెళ్లి ఏంటని తల్లి మందలించడంతో.. నేరుగా తాను ఇష్టపడ్డ యువకుడి ఇంటికి వెళ్లింది. వివరాలు ఇలా ఉన్నాయి.. బషీరాబాద్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఎనిమిదో తరగతి చదివి, ప్రస్తుతం టైలరింగ్ చేస్తోంది. ఇదే ఊరికి చెందిన ప్రశాంత్(21) అనే యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని సదరు బాలిక గత మంగళవారం తల్లి లక్ష్మికి తెలియజేసింది. దీంతో ‘తండ్రిలేని బిడ్డవు.. ఇంకా నీకు పెళ్లి వయసు రాలేదు.. కొంత కాలం ఆగు బిడ్డా’ అని సముదాయించింది. ఇది నచ్చని బాలిక తల్లితో వాగ్వాదానికి దిగింది. నువ్వు చేయకపోతే నేనే చేసుకుంటా అని చెప్పి ప్రశాంత్ ఇంటికి వెళ్లింది. ఈ ఘటనతో అబ్బాయి కుటుంబ సభ్యులు సైతం నిర్ఘాంతపోయారు. బాలిక తల్లి చైల్డ్‌లైన్ 1098కు కాల్ చేసి జరిగిన విషయం చెప్పింది. బుధవారం ఉధయం బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన కూతురు పెళ్లిని అడ్డుకోవాలని కోరింది. తన బిడ్డను మందలిస్తే ప్రశాంత్ తనను బెదిరించాడని ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై జిల్లా బాలల హక్కుల పరిరక్షణ విభాగం లీగల్ అధికారి నరేష్, ఎస్ఐ గఫార్ సిబ్బందితో యువకుడి ఇంటికి వెళ్లి విచారణ జరిపారు. అనంతరం పోలీసులు ప్రశాంత్‌ను పీఎస్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు. బాల్య వివాహం చెల్లదని, చట్టప్రకారం శిక్షార్హులవుతారని హెచ్చరించారు. పద్దెనిమిదేళ్లు ఏళ్లు నిండిన తర్వాత అదే యువకుడితో పెళ్లి చేస్తామని బాలికకు భరోసా ఇచ్చారు. అప్పటి వరకు చదువుకోవాలని వికారాబాద్‌లోని సఖి కేంద్రానికి తరలించారు. -
బాధిత బాలికకు న్యాయం జరిగేనా?
పిఠాపురం/సాక్షి, అమరావతి: పిఠాపురంలో సంచలనం రేపిన బాలిక అత్యాచార ఉదంతంలో కూటమి నేతలు తమ పార్టీ నేతను కాపాడే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్యాచారానికి పాల్పడినట్లు కేసు నమోదైన పిఠాపురానికి చెందిన టీడీపీ నేత, ఆ పార్టీ పిఠాపురం పట్టణ అధ్యక్షురాలు దుర్గాడ విజయలక్ష్మి భర్త డి.జాన్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వర్మ మంగళవారం ప్రకటించారు. నైతిక బాధ్యత వహించాల్సిన నిందితుడి భార్యపై మాత్రం పార్టీ తరఫున ఏ చర్యలూ తీసుకోకుండా ఆమెకు అండగా ఉంటామన్నట్లు వ్యవహరించడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం కంటితుడుపు చర్య మాత్రమేనని, జనాలను నమ్మించడానికి వేసిన ఎత్తుగడగా పలువురు పేర్కొంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలో తమ కూటమిలో పార్టీకి చెందిన నేత అరాచకానికి పాల్పడితే బాధితురాలికి న్యాయం చేస్తాం అంటూ ఒక ప్రకటన ఇచ్చి చేతులు దులుపేసుకున్నారు. తన ప్రకటనలో ఎక్కడా టీడీపీకి చెందిన నేతగా పేర్కొనకపోగా చట్టం తనపని తాను చేసుకుపోతుంది అన్న ధోరణిలో అధికారులను ఆదేశించాం అంటూ పేర్కొనడంపై ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. నిందితుడిని పట్టుకున్నాం: ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిఠాపురంలో ఒక బాలికపై టీడీపీ నేత అత్యాచారం చేసిన కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఆయన మంగళవారం పిఠాపురం పట్టణ పోలీసు స్టేషన్‌ను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు తమ అదుపులో ఉన్నట్లు చెప్పారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు: పవన్ కళ్యాణ్పిఠాపురం పట్టణానికి చెందిన మైనర్ బాలికపై మాధవపురం చెత్త డంపింగ్ వద్ద అఘాయిత్యం జరిగిందని తెలిసి చాలా బాధ కలిగిందని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని మంగళవారం ప్రకటన విడుదల చేశారు. -
పిఠాపురంలో బాలికపై టీడీపీ నేత అత్యాచారం
పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురంలో 16 ఏళ్ల బాలికపై తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమవారం అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను ఆటోలో ఊరి శివారుకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాలిక బంధువు ఫిర్యాదుపై పిఠాపురం పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. పిఠాపురానికి చెందిన దుర్గాడ జాన్ టీడీపీ నేత. ఆయన భార్య దుర్గాడ విజయలక్ష్మి మాజీ కౌన్సిలర్, ప్రస్తుతం టీడీపీ పట్టణ అధ్యక్షురాలు.ఆటో డ్రైవర్ జాన్ మరో మహిళతో కలిసి సోమవారం సాయంత్రం పట్టణంలోని స్టేట్ బ్యాంకు వద్ద ఉన్న ఓ బాలికను మాయమాటలు చెప్పి ఆటో ఎక్కించుకున్నారు. పిఠాపురం శివారు మాధవపురం సమీపంలోని డంపింగ్ యార్డు వద్దకు తీసుకెళ్లి అక్కడ మహిళను కాపలాగా పెట్టి, బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.బాలిక అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆమెను తిరిగి ఆటోలో ఎక్కిస్తుండగా డంపింగ్ యార్డులో ప్లాస్టిక్ బాటిళ్లు ఏరుకునే వారు జాన్‌ను, మహిళను పట్టుకున్నారు. వారిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు బాధితురాలిని పిఠాపురం ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. జాన్‌ను కేసు నుంచి తప్పించాలంటూ టీడీపీ నేతలు పోలీసులపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అయితే బాధితురాలి బంధువులు ఆందోళనకు సిద్ధపడడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాగితాలకు ఉన్న విలువ ప్రాణాలకు లేదా?
సాక్షి, అమరావతి / పుంగనూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబబునాయుడు కాగితాలకు ఇచ్చిన విలువ రాష్ట్రంలో ప్రజల భద్రతపట్ల.. మరీ ముఖ్యంగా మహిళలు, బాలికల రక్షణకు ఇవ్వడంలేదనడానికి పుంగనూరులో ఏడేళ్ల ముస్లిం బాలిక హత్యోదంతం మరో నిదర్శనం. అగ్నిప్రమాదంలో నాలుగు ఫైళ్లు తగలబడితే తీవ్రంగా స్పంచించిన చంద్రబాబు.. రాష్ట్రంలో బాలికలు, మహిళలను అపహరించుకుని పోయి అత్యాచారాలు చేస్తున్నా, హత్యలకు తెగబడుతున్నా పట్టించుకోవడంలేదు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారిక హోదాతో కూడిన బాధ్యతతోనే కాదు.. కనీసం మానవతా దృక్పథంతో కూడా స్పందించకపోవడంపట్ల సర్వత్రా ఆగ్రహం వెల్లువెత్తుతోంది. రాజకీయ కక్షలు, వేధింపులకు ఇస్తున్న ప్రాధాన్యం, ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు దు్రష్పచారాలకు కేటాయిస్తున్న సమయంలో పదో వంతు కూడా బాలికలు, మహిళల రక్షణకు ఉపయోగించడం లేదని చిత్తూరు జిల్లా పుంగనూరులో ముస్లిం బాలిక అశ్వియ అంజుమ్ విషాదాంతం రుజువు చేస్తోంది. రెండు నెలల క్రితం ముచ్చుమర్రిలో వాసంతి తప్పిపోయిందన్నా బాబు సర్కారు పట్టించుకోలేదు. చివరకు మృతదేహాన్ని కూడా అప్పచించలేక వాసంతి చనిపోయిందని ఓ మాట తల్లిదండ్రులకు చెప్పేసి ప్రభుత్వం తప్పించుకొంది. తమ కుమార్తె కనిపించడంలేదంటూ పుంగనూరుకు చెందిన ముస్లిం కుటుంబం మూడు రోజులు వేనోళ్ల వేడుకొన్నా బాబు ప్రభుత్వంలో కదలిక లేదు. మూడు రోజుల తర్వాత బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పజెప్పి అయిందనిపించేసుకుంది. రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతున్నా సీఎం చంద్రబాబు కనీసం పట్టించుకోవడంలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస స్పందన లేని చంద్రబాబు చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ముస్లిం బాలిక అశ్వియ అంజుమ్‌ను అపహరించి హత్య చేసినా ఆయన కనీసం స్పందించకపోవడం ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది. చిన్నారి విషాదాంతంపై ఆయన ఇప్పటి వరకు స్పందించనే లేదు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రమాదవశాత్తూ అగ్ని ప్రమాదం సంభవించి కొన్ని కాగితాలు కాలిపోతే చంద్రబాబు చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. ఆ ఉదంతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకునేందుకు వైఎస్సార్సీపీపై దు్రష్పచారం చేశారు. అంతేకాదు డీజీపీ ద్వారకా తిరుమల రావు, సీఐడీ అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ను వెంటనే ప్రత్యేక హెలికాప్టర్లో మదనపల్లి పంపించారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియానూ అక్కడికి పంపారు. ఎలాగైనా వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించాలని ఒత్తిడి చేశారు. కానీ పుంగనూరులో ఏడేళ్ల బాలిక అంజుమ్‌ను ఆగంతకులు అపహరించుపోతే ముఖ్యమంత్రిగా కనీసం స్పందించలేదు. డీజీపీతో మాట్లాడలేదు. సత్వరం స్పందించి బాలికను సురక్షితంగా తీసుకురావాలని జిల్లా ఎస్పీకీ చెప్పలేదు. అసలు ఆ విషయాన్నే పట్టించుకోలేదని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తిరుపతిలోనే ఉన్నా.. స్పందించని పవన్ ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 34 వేలమంది బాలికలను అపహరించారని దు్రష్పచారం చేసి, మహిళల రక్షణ పట్ల పెద్ద పెద్ద ఉపన్యాసాలిచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. గత మూడు నెలలుగా రాష్ట్రంలో యథేచ్ఛగా బాలికలు, మహిళల అపహరణ, అత్యాచారాలపై మౌనవత్రం పాటిస్తున్నారు. కళ్లెదుట జరుగుతున్న ఘోరాలపై స్పందించడమే లేదు. నంద్యాల జిల్లా ముచ్చిమర్రులో వాసంతి కిడ్నాప్, హత్య ఉదంతంపై పవన్ పోలీసు శాఖను ప్రశ్నించలేదు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ముస్లిం బాలిక అంజుమ్ అపహరణ, హత్యకు బాధ్యత తీసుకోవడంలేదు. బుధ, గురువారాల్లో తిరుపతిలోనే ఉన్న ఆయన.. సమీపంలోని పుంగనూరులో జరిగిన దారుణాన్ని పట్టించుకోలేదని ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చిన్నారి అంజుమ్ హత్యపై ముస్లింల ఆగ్రహం చిన్నారి అశ్వియ అంజుమ్(7) కిడ్నాప్, హత్యపై ముస్లింలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరు రోజులు గడుస్తున్నా నిందితుల ఆచూకి కనుగొనలేకపోయారని మండిపడ్డారు. శుక్రవారం నమాజ్ అనంతరం అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో వేలాది ముస్లింలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. జాతీయ పతాకాన్ని పట్టుకుని అశ్వియ ఫోటోలను ప్రదర్శిస్తూ ఎంబిటి రోడ్డులోని మదీన మసీదు నుంచి తూర్పు మొగసాల, సుబేదారు వీధి, పోస్టాఫీసు వీధి, నాగపాళెం, ఇందిరా సర్కిల్, పోలీస్‌స్టేషన్ మీదుగా గోకుల్ సర్కిల్ చేరుకున్నారు. అక్కడ సమావేశమై చిన్నారి హత్య కేసులో నిందితులను వెంటనే పట్టుకొని, ఉరితీయాలని డిమాండ్ చేశారు. చిన్నారి కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. ముస్లింల నినాదాలతో పట్టణం దద్దరిల్లింది. ముస్లింల ప్రదర్శనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. -
Kolkata: విమానం ప్రయాణంలో విషాదం
ఇరాక్ నుంచి చైనా వెళ్తున్న విమానంలో విషాదం చోటు చేసుకుంది. ఓ టీనేజీ ప్రయాణికురాలు అస్వస్థతకు గురై సీటులోనే కుప్పకూలిపోగా.. విమానాన్ని కోల్‌కతాలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే.. ఆస్పత్రికి తరలించేలోపు ఆ బాలిక కన్నుమూసింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధి వెల్లడించిన వివరాల ప్రకారం.. మృతురాలు బాగ్దాద్ సర్ చినార్ ప్రాంతానికి చెందిన డెరన్ సమీర్ అహ్మద్(16). మరో ఇద్దరు కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ఏఐ 473 విమానంలో చైనా గువాంగ్జౌకు వెళ్తోంది. అయితే బుధవారం అర్ధరాత్రి దాటాక.. హఠాత్తుగా ఆమె అస్వస్థతకు గురైంది.దీంతో విమానాన్ని దారి మళ్లించి అరగంటకు కోల్‌కతా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎయిర్‌పోర్ట్‌లో దించారు. ఎయిర్పోర్ట్ నుంచి ఆమెను ఏఏఐ ఆంబులెన్స్‌లో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన తర్వాత గురువారం అర్ధరాత్రి మిగతా ప్రయాణికులతో విమానం తిరిగి బయల్దేరింది. ఈ ఘటనపై అసహజ మరణంగా కోల్‌కతా బాగౌతి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం పూర్తి అయ్యాక.. మృతదేహాన్ని ఆమె బంధువులకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు. -
నీడనిచ్చే చెట్టుకే తిట్లు
బొమ్మనహళ్లి: బెంగళూరులో కొంతమంది చిల్లర ప్రవర్తన ఆ వర్గాలకు చెందిన అందరికీ చెడ్డ పేరు తెచ్చేలా ఉంటోంది. పైగా వారు చదువుకుని ఉన్నత వర్గాలకు చెందినవారు కావడం గమనార్హం. ఇక్కడ ఉపాధి, ఉద్యోగాలు పొంది జీవితంలో ముందుకు సాగుతూ, పైగా రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారి వల్ల సమాజంలో కలతలు వస్తున్నాయి. మేం వెళ్లిపోతే బెంగళూరు ఖాళీ అని.. ఉత్తర భారత ప్రాంతాలకు చెందిన తాము బెంగళూరుకు రాకపోతే బెంగళూరు మొత్తం ఖాళీ గా ఉంటుంది. ఇక్కడి నుంచి తాము వెళ్లిపోవాలని అంటూ ఉంటారు. మేం వెళ్లిపోతే ఇక్కడ ఏమీ ఉండదు. మీకు ఆదాయం రాదు. పీజీ హాస్టళ్లు, పబ్‌లు వెలవెలబోతాయి అని సుగంధ శర్మ అనే మహిళ రెచ్చగొట్టే పోస్టులు పెట్టింది. బెంగళూరుకు వలస వచ్చిన సుగంధ శర్మ.. బెంగళూరు గురించి, ఇక్కడి ప్రజల గురించి ఇన్‌స్టాలో చులకనగా వీడియోలు, రీల్స్ చేసింది, దానిని చూసిన కన్నడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక కార్యకర్తలు, రచయితలు వంటివారు ఆమె చేష్టలను ఖండించారు. మొదట మీరు మా బెంగళూరును వదిలి వెళ్ళండి, నగరం ఎలా ఖాళీ అవుతుందో చూస్తాము అని అనేకమంది ఆమెకు ఘాటుగా సమాధానాలిచ్చారు. ఆమెపై తీవ్ర ఆగ్రహం కన్నడ పోరాట సంఘం నాయకుడు రూపేష్ రాజన్న, ఆప్ నాయకులు ఆమె ప్రవర్తనపై మండిపడ్డారు. ఆమె పనిచేసే కంపెనీకి ఫిర్యాదు చేశారు. విద్వేషాలను రెచ్చగొడుతోందని కోరమంగళ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. వేలాది మంది నుంచి తీవ్ర నిరసనలు రావడంతో సుగంధ శర్మ దిగివచ్చింది. ఐ లవ్ బెంగళూరు అని మరో వీడియో పోస్టు పెట్టి ప్రజల కోపాన్ని చల్లబరిచే యత్నం చేశారు. కంపెనీ, పోలీసులు ఆమెపై కఠిన చర్యలు తీసుకుని ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. -
లైంగిక దాడి కేసులో బతికున్నంతకాలం జైలు
ఏలూరు (టూటౌన్): కుమార్తె వరుస అవుతున్న ఇద్దరు బాలికలపై లైంగికదాడికి పాల్పడిన మారుతండ్రికి బతికున్నంతకాలం యావజ్జీవ కా రాగార శిక్ష విధిస్తూ ఏలూరు పోక్సో కోర్టు జడ్జి ఎస్.ఉమాసునంద సోమవారం తీర్పు చెప్పారు. నిందితుడికి సహకరించిన బాలికల తల్లికి కూడా బతికున్నంతకాలం యావజ్జీవ కారాగార శిక్ష వి ధించారు. పెదపాడు మండలం వట్లూరు గ్రామానికి చెందిన పుట్ట విజయలక్ష్మి ఫణిరూప (38)కు ఇద్దరు కుమార్తెలున్నారు.విజయలక్ష్మి ఫణిరూప అదే గ్రామానికి చెందిన పుట్ట సతీష్ పవన్‌కుమా ర్ (42)ను రెండో పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలో విజయలక్ష్మి ఫణిరూప ఇద్దరు కుమార్తెలపై సతీష్ పవన్‌కుమార్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇందుకు ఆమె కూడా సహకరించింది. ఇద్దరు బాధితుల్లో ఒక బాలిక 2023 జూలై 12న ఇచి్చన ఫిర్యాదు మేరకు ఏలూరు మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ ఇంద్ర శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. నిందితులు పుట్ట సతీష్ పవన్‌కుమార్, పుట్ట విజయలక్ష్మి ఫణిరూపను జూలై 14న అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.విచారణలో పుట్ట సతీష్ పవన్‌కుమార్, పుట్ట విజయలక్ష్మి ఫణిరూపలపై నేరం రుజువు కావడంతో వారు బతికున్నంతకాలం జీవిత ఖైదు శిక్షతోపాటు రూ.18 వేలు జరిమానా విధిస్తూ ఏలూరు పోక్సో కోర్టు జడ్జి తీర్పు చెప్పారు. ప్రధాన నిందితుడికి సహకరించిన షేక్ సత్తార్, బీఎస్కే నాగూర్ హుస్సేన్ వలీ, దూబచర్ల వీణకు రెండేళ్లు జైలు శిక్ష విధించారు. బాధితులకు ఒక్కొక్కరికీ రూ.10 లక్షలు పరిహారం అందజేయాలని ఆదేశాలు ఇచ్చారు. -
నిద్రలో నడుస్తూ అడవిలోకి...!
అమెరికాలో లూసియానా రాష్ట్రంలోని వెబ్‌స్టర్ పారిస్‌కు చెందిన ఓ పాపకు నిద్రలో నడిచే అలవాటుంది. శనివారం రాత్రి ఇంట్లో పడుకున్న బాలిక మరునాడు ఉదయం ఇంట్లో కనిపించలేదు. నిద్రలో నడుస్తూ కాస్త దూరం ఎటైనా వెళ్లిందేమోనని తల్లిదండ్రులు చుట్టుపక్కలంతా వెదికారు. ఎక్కడా కనిపించకపోవడంతో మర్నాడు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇంటి చుక్కపక్కల సీసీటీవీ కెమెరాలన్నింటినీ జల్లెడ పట్టారు. కనీసం బూట్లు లేకుండా బాలిక సమీపంలోని అడవుల్లోకి నడిచి వెళ్తూ ఓ కెమెరాకు చిక్కింది. వెంటనే గాలింపు చేపట్టారు. చిన్నారి నడిచి వెళ్లిన ప్రాంతమంతా జల్లెడ పట్టారు. ట్రాకింగ్ డాగ్స్, డ్రోన్లతో పాటు చివరికి హెలికాప్టర్‌ను కూడా రంగంలోకి దించారు. విషయం తెలిసి వందలాది మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి వెదుకులాటకు దిగారు. పోలీసులు, ప్రభుత్వ ఏజెన్సీలతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. చివరకు రాత్రి 11 గంటల వేళ రోడ్డుకు సమీపంలో అడవిలో చిన్నారిని ఓ డ్రోన్ థర్మల్ ఇమేజింగ్ ద్వారా కనిపెట్టింది. అప్పటికి ఒక రోజు గడిచినా చిన్నారి ఇంకా గాఢనిద్రలోనే ఉండటం విశేషం! పోలీసులు, తల్లిదండ్రుల పిలుపులతో ఉలిక్కిపడి లేచింది. నెమ్మదిగా ఏడుపందుకుంది. తల్లిదండ్రులు ఊరడించడంతో మెల్లిగా తేరుకుంది. ఈ దృశ్యాలు అందరినీ కదిలించాయి. ‘అడవిలో, వణికించే చలిలో ఆ చిన్న పాప ప్రశాంతంగా నిద్రపోతూ దొరికిన క్షణాలు హృదయాలను కదిలించాయి. సాంకేతిక పరిజ్ఞానం ఇలా సామాజిక ప్రయోజనానికి ఉపయోగపడటం నిజంగా బాగుంది’ అంటూ నెటిజన్లు సంబరపడుతున్నారు. -
విదేశీయుల్లా ఉన్నారంటూ బాలికలకు వేధింపులు
ఘాజీపూర్: ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోరం చోటుచేసుకుంది. ఘాజీపూర్ జిల్లాలోని ఒక కాన్వెంట్ స్కూల్ మేనేజర్ ఏడవ తరగతి విద్యార్థినిని వేధించిన ఉదంతం మరువకముందే మరో ఘటన చోటుచేసుకుంది.ఘాజీపూర్ జిల్లాలోని మహమ్మదాబాద్ గోహ్నా ప్రాంతంలోని ఒక ఇంటర్ కాలేజీ మేనేజర్‌పై అదే కాలేజీలో చదువుకుంటున్న బాలికల తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధిత బాలికలు 10వ తరగతి చదువుతున్నారు. ఆ విద్యార్థినులిద్దరినీ ఒక్కొక్కరిగా పిలిచిన మేనేజర్ మీరు భారతీయులుగా కనిపించడం లేదని, విదేశీయులుగా ఉన్నారంటూ కామెంట్ చేశాడని సమాచారం. ఆ తర్వాత వారిని వేధింపులకు గురిచేశాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.తన మైనర్ కుమార్తెతో పాటు తమ గ్రామానికి చెందిన మరో వ్యక్తి మైనర్ కుమార్తె బర్జాలాలోని తిజియా దేవి ఇంటర్ కాలేజీలో 10వ తరగతి చదువుతున్నారని, సెప్టెంబర్ 13న వీరిద్దరినీ కాలేజీ మేనేజర్ వినోద్ యాదవ్ తన ఛాంబర్లోకి పిలిచి వేధించాడని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ మేనేజర్ వీరిద్దరినీ ఒక్కొక్కరిగా పిలిచి, చేతులు పట్టుకుని ఆటపట్టిస్తూ నువ్వు భారతీయురాలిలా కాకుండా విదేశీయురాలిలా కనిపిస్తున్నావంటూ కామెంట్ చేశాడన్నారు. అయితే ఆ విద్యార్థినులు నిరసన తెలపడంతో మేనేజర్ వారిని కులం పేరుతో దుర్భాషలాడాడని బాధిత బాలిక తండ్రి ఆరోపించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: HYD: నర్సింగ్ విద్యార్థినిపై హత్యాచారం? -
దివ్యాంగ బాలికపై లైంగిక దాడి.. ఆపై ఆత్మహత్య
ఎన్పీకుంట: దివ్యాంగ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి.. ఆపై తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీసత్యసాయి జిల్లా ఎన్పీకుంట మండలం సారగుండ్లపల్లిలో జరిగింది. కదిరి డీఎస్పీ శ్రీలత, రూరల్ సీఐ నాగేంద్ర కథనం ప్రకారం... సారగుండ్లపల్లికి చెందిన పి.జనార్దన (36) తన భార్యను పుట్టినిల్లు అయిన తనకల్లు మండలం కొక్కంటిక్రాస్లో వదిలి ఆదివారం రాత్రి స్వగ్రామానికి బైక్‌పై తిరుగు పయనమయ్యాడు. మార్గమధ్యంలోని కొత్తమిద్ది గ్రామంలో వినాయక మండపం వద్ద రాత్రి 8 గంటల సమయంలో ఆడుకుంటున్న దివ్యాంగురాలైన 17 ఏళ్ల బాలికను కంపచెట్లలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న చిన్న పిల్లలు కేకలు వేయడంతో పారిపోయాడు. బాధితురాలి తండ్రి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో జనార్దనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అతని ఆచూకీ కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే..జనార్దన తన స్వగ్రామంలో నిర్మాణంలో ఉన్న తన ఇంట్లోని వంట గదిలో ఉరి వేసుకుని మృతి చెంది ఉండటాన్ని సోమవారం ఉదయం తల్లి గమనించింది. కుమారుడి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఎన్పీకుంట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. విచారణలో భాగంగా పోలీసులు మృతుడిని పరిశీలించగా చేతికి, వేలుకు ఇంకు అంటి ఉండటాన్ని గమనించి ఘటన స్థలంలో వెతకగా సూసైడ్‌నోట్ లభించింది. తన మృతికి ఎవరూ కారణం కాదని అందులో రాసి ఉన్నట్లు ధ్రువీకరించారు. ఇరువురి ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
‘ఇన్‌స్టా’ స్నేహితుడు.. 20 రోజులు నిర్బంధించాడు!
సాక్షి, హైదరాబాద్: సోషల్‌మీడియా ద్వారా పరిచయమైన ఓ యువకుడు నిర్మల్ జిల్లా, భైంసాకు చెందిన బాలికను ట్రాప్ చేశాడు. 20 రోజుల క్రితం నగరానికి రప్పించి ఓ హోటలో నిర్బంధించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎట్టకేలకు ధైర్యం చేసిన బాధితురాలు తన కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆదివారం నగరానికి చేరుకున్నారు. హైదరాబాద్ షీ–టీమ్స్‌ను ఆశ్రయించడంతో బాలికను రక్షించారు. నిందితుడిపై నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెలితే..భైంసాకు చెందిన బాలికకు నగరానికి చెందిన యువకుడితో ఇన్స్టాగ్రామ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లు స్నేహం నటించిన అతగాడు ఆమెను పూర్తిగా నమ్మించాడు. చివరకు తన అసలు రూపం బయటపెట్టి సదరు యువకుడు 20 రోజుల క్రితం బాలికను బెదిరించాడు. దీంతో భయపడిన బాలిక తల్లిదండ్రులకు చెప్పకుండా నగరానికి వచ్చేసింది. ఆమెను కలుసుకున్న అతను నారాయణగూడలోని ఓ లాడ్జికి తీసుకువెళ్లి గదిలో నిర్భంధించాడు. బాలికపై పదేపదే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అతడి బెదిరింపులకు భయపడిన ఆమె మిన్నకుండిపోయింది. చివరకు ఆదివారం ధైర్యం చేసిన బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి తన పరిస్థితిని వివరించింది. వాట్సాప్ ద్వారా కరెంట్ లోకేషన్ షేర్ చేసింది. హుటాహుటిన నగరానికి వచి్చన బాలిక తల్లిదండ్రులు షీ–టీమ్స్‌ను ఆశ్రయించారు. తక్షణం రంగంలోకి దిగిన షీ–టీమ్స్ నారాయణగూడలోని లాడ్జిపై దాడి చేసి బాలికను రెస్క్యూ చేశారు. తల్లిదండ్రులను చూసిన బాలిక ఉద్వేగానికి గురైంది. సదరు యువకుడిపై బాలిక తల్లిదండ్రులు నారాయణగూడ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థినికి ఆన్లైన్లో వేధింపులు..మరో కేసులో ఓ విద్యార్థినిని ఆన్లైన్లో వేధిస్తున్న సహ విద్యార్థులకు షీ–టీమ్స్ చెక్ చెప్పింది. బాధిత యువతి పంజగుట్ట పరిధిలోని ఓ ప్రముఖ అకాడమీలో విద్యనభ్యసిస్తున్నారు. అదే అకాడమీకి చెందిన కొందరు పోకిరీలు ఆన్లైన్లో, సోషల్‌మీడియా ద్వారా యువతిని రకరకాలుగా వేధించారు. దీనిపై ఆమె వాట్సాప్ ద్వారా షీ–టీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన అధికారులు వారిని గుర్తించడంతో పాటు పంజగుట్ట ఠాణాలో కేసు నమోదు చేయించారు. ఈ పోకిరీలతో పాటు అకాడమీ నిర్వాహకులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. విద్యనభ్యసిస్తున్న యువతుల భద్రత కోసం మరిన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా నిర్వాహకులకు స్పష్టం చేశారు. -
బంగ్లాదేశ్ నుంచి తల్లీకూతుర్ల చొరబాటు.. బీఎస్ఎఫ్ కాల్పులు.. బాలిక మృతి
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తరువాత అక్కడి హిందువులతో సహా ఇతర మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయి. దీంతో అక్కడి మైనారిటీలు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా త్రిపురలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద బంగ్లాదేశ్‌కు చెందిన 13 ఏళ్ల హిందూ బాలికతో పాటు ఆమె తల్లి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో వారిని అడ్డుకునేందుకు బీఎస్ఎఫ్ జవానులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆ బాలిక మృతిచెందింది.ఢాకా ట్రిబ్యూన్ తెలిపిన వివరాల ప్రకారం సంఘటన జరిగిన 45 గంటల తర్వాత బీఎస్ఎఫ్ ఆ బాలిక మృతదేహాన్ని బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ)కి అప్పగించింది. ఆమెను 13 ఏళ్ల స్వర్ణ దాస్‌గా గుర్తించారు. కాగా చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసిన తర్వాత మృతదేహాన్ని బాలిక కుటుంబానికి అప్పగించామని కులౌరా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ బినయ్ భూషణ్ రాయ్ తెలిపారు.త్రిపురలో ఉంటున్న తమ సోదరుడిని కలిసేందుకు స్వర్ణ, ఆమె తల్లి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వీరికి స్థానిక బ్రోకర్లు సహకారం అందించారు. వారు భారత సరిహద్దుకు చేరుకున్నప్పుడు వారిని వారిస్తూ బీఎస్ఎఫ్ సిబ్బంది కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో స్వర్ణ అక్కడికక్కడే మృతిచెందగా ఆమె తల్లి ప్రమదం నుంచి తృటిలో తప్పించుకుంది. ఈ విషాద ఘటనపై సరిహద్దు ప్రాంతంలోని ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. -
Bihar: కలుషిత నీరు తాగి బాలిక మృతి.. 9 మంది విద్యార్థులు అస్వస్థత
నలంద: బీహార్‌లోని నలంద జిల్లాలోగల కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో కలుషిత నీరు తాగి ఒక బాలిక మృతి చెందగా, 9 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. మృతిచెందిన బాలిక పాఠశాల విద్యార్థిని కాదని, పాఠశాలలోని తన స్నేహితురాలిని కలిసేందుకు వచ్చిందని నలంద జిల్లా అధికారులు చెబుతున్నారు. కలుషిత నీరు తాగి అనారోగ్యం బారినపడిన మరో 9 మంది బాలికలను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా నీటి నమూనాను అధికారులు పరీక్షల నిమిత్తం పంపారు.నలంద జిల్లా మేజిస్ట్రేట్ శశాంక్ శుభాంకర్ మంగళవారం మాట్లాడుతూ పాఠశాల ఆవరణలోని ఆర్ఓ సిస్టమ్ దగ్గర నీటిని తాగిన కొంతమంది బాలికలు వాంతులు, కడుపునొప్పితో బాధపడ్డారన్నారు. వెంటనే వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించామమన్నారు. అయితే చికిత్స పొందుతూ ఓ బాలిక మృతి చెందిందని తెలిపారు. అస్వస్థతకు గురైన తొమ్మిది మంది విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందన్నారు. పాఠశాలలోని ఆర్ఓ వ్యవస్థను సక్రమంగా నిర్వహించడం లేదని తమ దృష్టికి వచ్చిందని, దానిలోని నీటి నమూనాలను టెస్టింగ్ కోసం పంపించామన్నారు. పాఠశాల వార్డెన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు అతన్నిఅధికారులు సస్పెండ్ చేశారు. -
Gujarat: మూడేళ్ల బాలికపై అత్యాచారం.. నిరసనకారుల విధ్వంసం
గుజరాత్లో మరో అత్యాచార ఘటన చోటుచేసుకుంది. వల్సాద్ జిల్లా ఉమర్గావ్లో మూడేళ్ల బాలికపై లైంగిక దాడి జరిగింది. ఈ ఘటన గురించి తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వెంటనే నిందితుని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ విధ్వంసం సృష్టించారు.రంగంలోకి దిగిన పోలీసులు మహారాష్ట్రలోని పాల్ఘర్కు చెందిన నిందితుడు గులాం ముస్తఫాను అరెస్టు చేశారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో నిరసనకారులు పలు వాహనాలకు నిప్పుపెట్లారు. మరికొన్ని వాహనాలను ధ్వంసం చేశారు. అయితే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.వల్సాద్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) డాక్టర్ కరణ్‌రాజ్ వాఘేలా ఉమర్గావ్ పోలీస్ స్టేషన్ వెలుపల ఆందోళకు దిగినవారిని శాంతింపజేశారు. కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారించాలని హోంమంత్రి ఆదేశించారని ఎస్పీ తెలిపారు. కాగా ఈ ఘటన గురించి తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో రాత్రిపూట పోలీసు స్టేషన్‌ను చుట్టుముట్టి, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అక్కడున్న వాహనాలను ధ్వంసం చేశారు. -
బాలికపై అత్యాచారం.. కాల్పుల్లో నిందితునికి గాయాలు
ఉత్తరప్రదేశ్‌లో మరో అత్యాచార ఉదంతం వెలుగు చూసింది. డియోరియా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 41 ఏళ్ల వ్యక్తి ఏడేళ్ల బాలికపై అత్యాచార నేరానికి పాల్పడ్డాడు. బాధిత బాలిక పాల ప్యాకెట్ కొనేందుకు ఇంటికి సమీపంలోని దుకాణానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగిందని అదనపు పోలీసు సూపరింటెండెంట్ దీపేంద్ర నాథ్ చౌదరి తెలిపారు. నిందితుడు దుకాణదారునికి తెలిసినవాడేనని పోలీసులు తెలిపారు. బాధిత బాలిక ఆర్తనాదాలు విన్న స్థానికులు ఆ చిన్నారిని కాపాడి, ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు.ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ సంకల్ప్ శర్మ తెలిపారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే శలభ్ మణి త్రిపాఠి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. కాగా అత్యాచార నిందితుడు సైఫుల్లాను పోలీసులు అరెస్టు చేసేందుకు వెళ్లగా, అతడు తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేశాడు. వెంటనే పోలీసులు అప్రమత్తమై, ఎన్కౌంటర్ జరిపారు. పోలీసులు నిందితుని కాలిపై కాల్పులు జరిపారు. తరువాత నిందితుని నుంచి పిస్టల్, కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘అమ్మాయిపై చెయ్యేస్తే నపుంసకుడిని చెయ్యాలి’
దేశంలో అత్యాచార ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఇటువంటి ఉదంతాలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమంటూ పలువురు విమర్శిస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని బద్లాపూర్ మరో అత్యాచారం ఉదంతం వెలుగు చూసింది.ఈ ఘటనకు కారకులైన వారిపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడపిల్లలపై చేయివేసే వారిని నపుంసకులుగా మార్చాలని ఆయన అన్నారు. ఇలాంటి పనులు చేసేవారికి చట్టం ఉన్నదనే భయాన్ని కల్పించాలని, అప్పుడు ఎవరూ తప్పుడు పనులకు పాల్పడరని అజిత్ పవార్ అన్నారు.యావత్మాల్లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బద్లాపూర్ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై నేరాలకు పాల్పడే ఏ ఒక్కరినీ తమ ప్రభుత్వం వదిలిపెట్టబోదన్నారు. ఇటువంటి నేరాలకు కఠిన శిక్షలు విధించాలని కోరుతూ రూపొందించిన బిల్లును మోదీ ప్రభుత్వం రాష్ట్రపతి ముర్ముకు పంపిందన్నారు. ఇది చట్టరూపం దాల్చి, అమలులోకి వస్తే మహిళలకు మరింత న్యాయం జరుగుతుందన్నారు. -
ఆగని అఘాయిత్యాలు.. ట్యూషన్ నుంచి వస్తుండగా బాలికను అడ్డగించి
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో వైద్యురాలిపై జరిగిన హత్యాచారానికి నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు రోజురోజుకీ ఉధృతమవుతున్నాయి. ఈ ఉదంతంపై ఆగ్రహాజ్వాలలు రగులుతున్న నేపథ్యంలో దేశంలో ఎక్కడో ఒక్క చోట చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు వెలుగుచూస్తుండటం ఆందోళన రేపుతోంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో లైంగిక వేధింపుల ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిని మరువకముందే తాజాగా అస్సాంలో మరో విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది.అస్సాంలో 14ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. నాగావ్ జిల్లాలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. బాలిక ట్యూషన్ అనంతరం సైకిల్‌పై ఇంటికి బయల్దేరింది. దారిలో ముగ్గురు వ్యక్తులు ఆమెను అడ్డగించి సమీపంలోని చెరువు వద్దకు లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను రోడ్డు వద్ద వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు. రోడ్డుపై వివస్త్రగా పడి ఉన్న బాలికను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సగం అపస్మారక స్థితిలో ఉన్న బాలికను రక్షించి జిల్లాలోని డింగ్ మెడికల్ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ముగ్గురు వ్యక్తులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు మైనర్ పోలీసులకు తెలపడంతో కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ ఘటనకు నిరసనగా నేడు విద్యార్ధి సంఘాలు స్థానిక ప్రాంతంలో బంద్‌కు పిలుపునిచ్చాయి. నిందితులను గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఈ అమ్మాయి జీనియస్.. 16 ఏళ్లకే రూ.100 కోట్ల కంపెనీ
సాధారణంగా 16 ఏళ్ల వయస్సులో పిల్లలు పదో తరగతి పూర్తి చేసి తర్వాత ఏం చదవాలో నిర్ణయించుకునే పరిస్థితిల ఉంటారు. కానీ ఈ అమ్మాయి అలా కాదు.. అప్పటికే కోట్లాది రూపాయల కంపెనీని స్థాపించింది. చిన్న వయసులోనూ అద్భుత విజయాలు సాధించవచ్చిన నిరూపించింది. స్ఫూర్తిదాయకమైన ఆ జీనియస్ అమ్మాయి విజయగాథ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..ప్రాంజలి అవస్తీ అమెరికాలో ఉంటుంది. ఆమె 11 సంవత్సరాల వయస్సులో భారత్ నుంచి ఫ్లోరిడాకు వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అత్యంత పరిజ్ఙానాన్ని, నైపుణ్యాన్ని సంపాదించిన ఆమె 16 సంవత్సరాల వయస్సులోనే 2022లో తన ఏఐ స్టార్టప్, డెల్వ్ డాట్ ఏఐ (Delv.AI)ని స్థాపించింది. ఆమె వినూత్న ఆలోచనలు, అంకితభావం తన స్టార్టప్‌ను అతి తక్కువ సమయంలోనే అస్థిరమైన ఎత్తులకు చేర్చాయి. ప్రస్తుత దీని విలువ రూ. 100 కోట్లు.రెండేళ్లు కంప్యూటర్ సైన్స్, గణితాన్ని అభ్యసించిన తరువాత, అవస్తి 13 సంవత్సరాల వయస్సులో ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ రీసెర్చ్ ల్యాబ్స్‌లో ఇంటర్న్‌షిప్ చేసింది. ఈ సమయంలోనే ఆమె మనసులో డెల్వ్ డాట్ ఏఐ ఆలోచన మొలకెత్తింది. మెషీన్ లెర్నింగ్ ప్రాజెక్ట్‌లలో పనిచేసిన ప్రాంజలి డేటాపై విస్తృతమైన పరిశోధన చేసింది. అనేక సమస్యలను పరిష్కరించడానికి ఏఐ కీలకమని గ్రహించింది.డెల్వ్ డాట్ ఏఐ సంస్థ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో డేటా ఎక్స్ట్రాక్షన్ మెరుగుపరచడం, డేటా సిలోస్‌ను తొలగించడం చేస్తుంది. ఆన్లైన్ కంటెంట్ పెరుగుదలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారాన్ని యాక్సెస్ చేయడంలో రీసెర్చర్లకు సహాయం చేస్తుంది. గతేడాది ప్రాంజలి స్టార్టప్‌కు రూ.3.7 కోట్ల నిధులు వచ్చాయి. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ రూ.100 కోట్లకు పైగా ఉంది. 10 మంది ఉద్యోగులు దాకా ఇక్కడ పనిచేస్తున్నారు. -
అయోధ్యలో బాలికపై గ్యాంగ్‌రేప్..నిందితుడి దుకాణాల కూల్చివేత
అయోధ్య: అయోధ్యలో 12 ఏళ్ల బాలికపై గ్యాంగ్‌రేప్‌నకు పాల్పడి నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొయీద్ ఖాన్ అనే వ్యక్తి దుకాణ సముదాయాన్ని జిల్లా అధికా రులు గురువారం కూల్చి వేశారు. పురాకలంధర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భదర్సానగర్‌లో మొయీద్ ఖాన్ బేకరీ నడుపుతున్నాడు. మొయీద్‌తోపాటు అతడి పనిమనిషి రాజు ఖాన్ ఓ బాలికపై రెండునెలల క్రితం అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దురాగతాన్ని వారు వీడియో తీశారు.బాలిక గర్భం దాల్చినట్లు తేలడంతో జూలై 30న పోలీసులు మొయీద్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు. ఆగస్ట్ 3న అతడు నడిపే బేకరీని నేలమట్టం చేశారు. చెరువు స్థలం కబ్జా చేసి దానిని నిర్మించినట్లు అధికారులు అంటున్నారు. తాజాగా, గురువారం మొయీద్ ఖాన్‌కు చెందిన దుకాణ సముదాయాన్ని కూల్చి వేశారు. దానిని ప్రభుత్వ స్థలంలో నిర్మించాడన్నారు. ఆ సమయంలో భవనం ఖాళీగానే ఉందని చెప్పారు. కూల్చివేత సందర్భంగా ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. మొయీద్ ఖాన్ సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు, ఫైజాబాద్ ఎంపీ అవధేశ్ ప్రసాద్ అనుచరుడని బీజేపీ నేతలతోపాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపిస్తున్నారు. -
ప్రేమ పేరుతో వంచన
హిందూపురం అర్బన్: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం గోళ్లాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఓ బాలిక (16)ను ప్రేమ పేరుతో లొంగదీసుకుని గర్భవతిని చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గోళ్లాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రాజేష్ ఇటీవల జరిగిన అదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త సతీష్ హత్య కేసులో ప్రధాన నిందితుడు. అతను ఈ కేసులో ప్రస్తుతం జైల్లో రిమాండ్‌లో ఉన్నాడు. రాజేష్ రిమాండ్‌కు వెళ్లకముందు గ్రామానికి చెందిన ఓ బాలికను ప్రేమ పేరుతో నమ్మించాడు. శారీరకంగా లొంగదీసుకొని గర్భవతిని చేశాడు.రెండు రోజుల క్రితం బాలిక కడుపునొప్పిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పడంతో కర్ణాటక రాష్ట్రం గౌరీబిదనూరు ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించారు. వైద్యులు పరీక్షించి ఆమె గర్భవతి అని తేలి్చ.. అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు బాలికను అక్కడి ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. చిక్‌బళ్లాపుర ఎస్పీ కార్యాలయం నుంచి కేసును సోమవారం హిందూపురం అప్‌గ్రేడ్ పోలీస్‌స్టేషన్‌కు బదలాయించారు. దీంతో అప్‌గ్రేడ్ సీఐ ఆంజనేయులు బాధిత బాలికను గౌరీబిదనూరు నుంచి హిందూపురం తీసుకువచ్చి స్థానిక ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఆమె గర్భిణి అని నిర్ధారణ కావడంతో రాజే‹Ùపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. -
చాక్లెట్లు కొనుక్కొని ఇంటికి వెళ్తుండగా..
సైదాబాద్: షాపులో చాక్లెట్లు కొనుక్కొని ఇంటికి వెళుతున్న మైనర్ బాలికను ఓ కామాంధుడు ఇంట్లోకి పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డాడు. వివరాలు... సైదాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఒక కాలనీలో నివసించే ఓ కుటుంబానికి చెందిన బాలిక(10) ఈ నెల 11న కిరాణషాపులో చాక్లెట్లు కొనుక్కొని ఇంటికి వెళుతోంది. బాలిక ఇంటికి సమీపంలో నివసించే ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి(58) ఆమెను ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు. దాంతో భయపడిన బాలిక తప్పించుకొని ఏడుస్తూ ఇంటికి చేరుకుంది. ఏం జరిగిందని తల్లి అడగటంతో విషయం బయట పడింది. నెల రోజుల క్రితం కూడా ఇంటి వద్ద తాను ఆడుకుంటుండగా అతడు ఇంట్లోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడని తల్లికి చెప్పింది. వెంటనే బాలిక తల్లి అతని ఇంటికి వెళ్లి నిలదీయగా ఎదురుదాడి చేశాడు. ఈ ఘటనపై అదే రోజు సైదాబాద్ పోలీసులను బాలిక తల్లి ఆశ్రయించగా నిందితుడితో రాజీ చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. రెండురోజులపాటు పోలీసుస్టేషన్ చుట్టూ తిరిగినా కేసు నమోదు కాలేదు. బాధితురాలి తండ్రి ఒక పోలీస్ ఉన్నతాధికారి వద్ద వంటమనిషిగా పనిచేస్తున్నాడు. ఆయనకు విషయం చెప్పగా సైదాబాద్ పోలీసులకు ఫోన్ చేసినట్లు సమాచారం. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు ఈ నెల 13న నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. అయితే నిందితుడి భార్య, కూతురు తమను తిట్టారని, ఎక్కడికి వెళ్లి ఫిర్యాదు చేసుకుంటారో చేసుకోండని బెదిరించారని బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొంది. -
బాలికపై టీచర్ అత్యాచారం.. చికిత్స పొందుతూ మృతి
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో వైద్యురాలిపై జరిగిన హత్యాచారానికి నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు రోజురోజుకీ ఉధృతమవుతున్నాయి. ఈ ఉదంతంపై ఆగ్రహాజ్వాలలు రగులుతున్న నేపథ్యంలో మరికొన్ని చోట్ల సైతం చిన్నారులు, మహిళలపై అత్యాచార ఘటనలు వెలుగుచూస్తుండటం ఆందోళన రేపుతోంది.తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ కామాంధుడి దాహానికి బాలిక బలైపోయింది. 14 ఏళ్ల మైనర్‌పై ఓ కీచక టీచర్ అత్యాచారానికి ఒడిగట్టాడు. అయితే బాధితురాలు 20 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తాజాగా ప్రాణాలు విడిచింది. రాష్ట్రంలోని సోన్‌భద్ర జిల్లాలోని దుద్ది గ్రామంలో ఈ ఘటన జరిగింది. నిందితుడు విశాంబర్ ఇంకా పరారీలో ఉండటం గమనార్హం.బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు పాఠశాలలో స్పోర్ట్స్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్నాడు. గతేడాది డిసెంబర్ 30న ఓ స్పోర్ట్స్ ఈవెంట్లో పాల్గొనేందుకు బాలికను పిలిచాడు. అనంతరం ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే బాలిక భయపడి ఎవరికీ ఈ విషయం చెప్పలేదు. ఘటన తర్వాత ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణించింది.ఆమెను ఛత్తీస్‌గఢ్‌లోని బంధువుల వద్దకు పంపగా.. అక్కడ ఆమెకు చికిత్స అందించినప్పటికీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. దీంతో బాధితురాలు మౌనం వీడి తనకు జరిగిన విషయాన్ని అత్తకు చెప్పడంతో ఆమె ఆస్పత్రిలో చేర్చింది. అనంతరం కుటుంబ సభ్యులు నిందితుడిని నిలదీయగా.. అతడు వారికి రూ. 30 వేలు ఇచ్చి ఈ విషయం ఎవరికి చెప్పవద్దని బెదిరించాడు.దీంతో కుటుంబ సభ్యులు భయపడి ఘటనపై అధికారులకు ఫిర్యాదు చేయలేదు. అయితే బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమె తండ్రి జూలై 10న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాకు చెందిన విశాంబర్‌పై కేసు నమోదు చేశారు. బాలికను వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్శిటీ ఆసుపత్రిలో చేర్చి వైద్యం అందిస్తున్నారు. అయితే చికిత్స పొందుతూ మంగళవారం అర్థరాత్రి మరణించింది.మరోవైపు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేశారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.ఇదిలా ఉండగా కోల్‌కతాలో వైద్యురాలి హత్యాచార ఘటనకు నిరసనగా నేడు దేశ వ్యాప్తంగా వైద్యులు, వైద్య సిబ్బంది, వైద్య విద్యార్ధులు ఆందోళనలు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కోల్‌కతా, ఢిల్లీ, హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో వైద్యులు నిరసనకు దిగారు. ఆదివారం ఉదయం 6 గంటల వరకు వైద్యుల నిరసన కొనసాగనుంది. డాక్టర్ల ఆందోళనలతో ఓపీ సేవలు నిలిచిపోయాయి. -
పాప సేఫ్ ... అబిడ్స్ కిడ్నాప్ కథ సుఖాంతం
-
అబిడ్స్ లో చిన్నారి కిడ్నాప్ కలకలం
-
అనకాపల్లిలో 20 ఏళ్ల యువతి కిడ్నాప్, రేప్
-
అయ్యయ్యో! బార్బీకి ఏమైంది?!
కంగారు పడకండి. బార్బీకి ఏం కాలేదు. బార్బీ స్ట్రాంగ్ గర్ల్. ఈసారి ఇంకో స్ట్రాంగ్ గర్ల్ రూపంలో అవతరించిందంతే. ఆ రూపమే.. ‘‘బ్లైండ్ డాల్’’! చూపు లేని బొమ్మ!! ఆ..! చూపు లేక΄ోవటం శక్తి అవుతుందా? ఎందుక్కాదూ? చూపు లేక΄ోవటం, చూడలేక΄ోవటం వేర్వేరు కదా. చూపు ఉండీ పక్క మనిషి నిస్సహాయతను పట్టించుకోని వాళ్లకు ఏం శక్తి ఉన్నట్లు? చూపు లేకున్నా సాటి మనిషి హృదయాన్ని అర్థం చేసుకోగలిగిన వాళ్లకు ఏం శక్తి లేనట్లు? బార్బీ.. అమ్మాయిల మనసెరిగిన బొమ్మ. డాక్టర్ బార్బీకి.. మెడిసిన్ చదవాలని కలలు కనే అమ్మాయిల మనసు తెలుసు. ఆస్ట్రోనాట్ బార్బీకి.. అంతరిక్షంలో పరిశోధనలు చేయాలని ఉవ్విళ్లూరే అమ్మాయిల ఆశలకు ఎన్ని రెక్కలు ఉంటాయో తెలుసు. నల్లజాతి బార్బీకి.. రంగు కారణంగా నల్ల జాతి మహిళలు ఎదుర్కొంటున్న తీవ్ర వివక్ష ఎలా ఉంటుందో తెలుసు. ఇంకా.. మిస్ యూనివర్శ్ బార్బీ, ప్రెసిడెంట్ బార్బీ, పైలట్ బార్బీ, వీల్ చెయిర్ బార్బీ, ప్రోస్థెటిక్ లెగ్ బార్బీలన్నీ వివిధ వృత్తులు, ప్రవృత్తులు, స్థితి గతులకు ప్రతీకగా ఉండి, ఆడపిల్లలకు స్ఫూర్తిని, సహానుభూతిని అందిస్తున్నవే. 1959తో తొలి బార్బీ మార్కెట్లోకి వచ్చింది మొదలు ఇప్పటి వరకు 1000 రకాలకు పైగానే బార్బీ డాల్స్ అమ్మాయిలకు ఆత్మ బంధువులయ్యాయి. ఆ క్రమంలో తాజాగా ఆవిర్భవించిన కారణజన్మురాలే.. ‘‘బ్లైండ్ డాల్’’. కారణ జన్మురాలా! అవును. కారణ జన్మురాలే. బాలికల్ని మానసికంగా శక్తివంతుల్ని చేయాలన్నదే ఆ కారణం. మాటెల్ కంపెనీ తన ‘స్ఫూర్తిదాయకమైన మహిళలు’ సిరీస్‌లో భాగంగా 2021లో ‘హెలెన్ కెల్లర్’ రూపంలో బార్బీని తయారు చేసినప్పటికీ, ఫ్యాషనబుల్‌గా తెచ్చిన తొలి బ్లైండ్ బార్బీ మాత్రం ఇదే. అంధులైన వారిని కూడా కలుపుకుని ΄ోయేలా ఈ ‘బ్లైండ్ బార్బీ’ రూపోందింది. ఇందుకోసం బార్బీ బొమ్మల కంపెనీ ‘మాటెల్’.. ‘అమెరికన్ ఫౌండేషన్ ఫర్ బ్లైండ్’తో చేతులు కలిపింది. ఈ కొత్త బార్బీ డాల్ పింక్ శాటిన్ టీ షర్టు, పర్పుల్ ట్యూల్ స్కర్టు ధరించి ఉంటుంది. చేతిలో తెలుపు, ఎరుపు రంగుల స్టిక్ ఉంటుంది. పిల్లల్లో స్వీయ వ్యక్తీకరణను, ఆత్మదృఢత్వాన్ని పెంపొందించేందుకు బ్లైండ్ బార్బీని తెచ్చామని మాటెల్ కంపెనీ చెబుతోంది. అంతే కాదు, ఈ కొత్త బార్బీ ΄్యాకింగ్ కూడా విలక్షణంగా ఉంది. బాక్సు మీద బార్బీ అనే అక్షరాలను బ్రెయిలీ లిపిలో ముద్రించారు. బ్రిటన్ యువతి లూసీ ఎడ్వర్డ్స్ ఈ బొమ్మకు ప్రచారకర్త. ఆమె తన 11 ఏళ్ల వయసులో కుడి కంటి చూపు కోల్పోయారు. 17 ఏళ్ల వయసులో రెండో కంటి చూపు కూడా క్షీణించింది. ‘‘ఈ బొమ్మ నా సర్వస్వం. ఇది నా దగ్గర ఉంటే నేను ఒంటరినన్న భావనే నాలో కలగదు..’’ అంటున్నారు లూసీ తన చేతిలోని బ్లైండ్ బార్బీని హృదయానికి హత్తుకుంటూ. ఇంకోమాట.. ‘‘అయ్యయ్యో’’ అనిపించుకోవటంస్ట్రాంగ్ గర్ల్‌కి అస్సలు ఇష్టం ఉండదట. లూసీ అంటారు. -
13 రోజులకు పరామర్శకు వస్తారా?
పగిడ్యాల: మైనర్ బాలిక కుటుంబాన్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల చెక్‌ను అందజేయడానికి శుక్రవారం ముచ్చుమర్రికి వ చ్చిన మంత్రులకు భంగపాటు తప్పలేదు. ఘటన జరిగి 13 రోజులైన పరామర్శించడానికి మనస్సు రాలేదా? అంటూ సీపీఎం నేతలు, స్థానికులు మంత్రులను ప్రశ్నించారు. కేసును సీబీఐకి అప్పగించాలని, పోలీసుల వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ హోం మంత్రి రాజీనామా చేయాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు.. మంత్రి ఫరూక్‌ను కోరారు. దీంతో మంత్రి ఆగ్రహిస్తూ మాకు తెలుసంటూ చులకన భావంతో మాట్లాడారు. దీంతో సీపీఎం నాయకుల్లో ఒక్కసారిగా ఆవేశం కట్టలు తెంచుకుంది. ఘటన జరిగి 13 రోజులవుతున్నా ఇప్పటి వరకు మృతదేహాన్ని బాధిత తల్లిదండ్రులకు అప్పగించలేకపోయారని నిలదీశారు. దీంతో కమ్యూనిస్టులకు, మంత్రులకు మధ్య మాటామాటా పెరిగింది. ఇది గమనించిన పోలీసు ఉన్నతాధికారులు, రోప్ పార్టీ సిబ్బంది కమ్యూనిస్టులను కట్టడి చేసేందుకు యత్నించారు. సమాధానం చెప్పాలని, లేదంటే వాహనాలను కదలనిచ్చేది లేదని కమ్యూనిస్టులు స్వరం పెంచడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది.వెంటనే స్పందించిన రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సీపీఎం నాయకులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. సీపీఎం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా కాకుండా రూ.25 లక్షలు చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం, ఐదెకరాల భూమి ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
అంతా అధికార పార్టీ నేత అనుచరుడి పనే!
సాక్షి ప్రతినిధి కర్నూలు: ముచ్చుమర్రికి చెందిన బాలికపై అత్యాచారం, హత్య ఘటనకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకొస్తున్నాయి. హత్యాచారానికి పాల్పడ్డ ముగ్గురు బాలురులో ఓ బాలుడి తాత.. ఆ నియోజకవర్గంలో అధికార పారీ్టకి చెందిన ఓ నాయకుడి కుటుంబం వద్ద నాలుగు దశాబ్దాలుగా పనిచేసేవాడని తెలుస్తోంది. 1994 ప్రాంతంలో ఆ నాయకుడికి ఫ్యాక్షన్‌లో అడ్డొచ్చిన కొందరిని ముక్కలు ముక్కలుగా చేసి అక్కడి చేపలకు, నీటి కుక్కలకు ఆహారంగా వేసేవాడని స్థానికులు చర్చించుకుంటున్నారు. అప్పట్లో మిస్సయిన వ్యక్తుల ఆచూకీ నేటికీ తెలియలేదని, అదే తరహాలోనే ఇప్పుడు బాలిక శవాన్ని కూడా ముక్కలు చేశారని స్థానికుల్లో ప్రచారం జరుగుతోంది.అయితే పోలీసు వర్గాలు మాత్రం శవాన్ని సంచిలో పడేసి రాయి కట్టడంతోనే దొరకలేదని చెబుతున్నారు. నిజానికి బాలిక పొట్ట కోయకుండా రాయి కట్టి పడేసినా శవం బయటకొస్తుందని కొందరంటున్నారు. బ్యాక్ వాటర్‌లో పడేయడంతో మొసళ్లు ఆహారంగా తీసుకుని ఉంటాయని కొందరు పోలీసులు భావిస్తున్నారు. అయితే అక్కడ మొసళ్లే లేవని గ్రామస్తులు చెబుతున్నారు. అందుకే మృతదేహం ఇక దొరకదు! ఈనెల 7న పాత ముచ్చుమర్రిలో ఐదో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల బాలికపై ఆరో తరగతి బాలుడు, పదో తరగతి చదివే ఇద్దరు బాలురు అత్యాచారం చేశారు. ఆపై పాప ఎవరికైనా చెబుతుందేమోనని భయపడి వెంటనే పాప గొంతు నులిమి చంపేశారు. వీరిలో ఒకడు విషయాన్ని తండ్రికి చెప్పాడు. ఆయన మిగిలిన తల్లిదండ్రులతో కలిసి.. ఆ చిట్టితల్లిని గోనె సంచిలో వేసి, దానికి రాయి కట్టి కృష్ణానది బ్యాక్ వాటర్‌లో పడేశారు. పోలీసుల విచారణలో ఆ ముగ్గురి పిల్లల తండ్రులు చెప్పిన విషయం ఇది. అయితే చిన్నారిపై అత్యాచారం చేసింది నిజం.. చంపింది నిజమేగానీ, శవాన్ని మాయం చేసిన విధానంపై చెబుతోంది మాత్రం అబద్ధం. ఈ రెండు ఊర్లే కాదు. ఈ 12 రోజుల్లో ఆ నోటా, ఈ నోటా చర్చ జరిగి ఇప్పుడు కర్నూలు, నంద్యాల రెండు జిల్లాల్లో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. పాపను చంపి ముచ్చుమర్రి–హంద్రీ నది అప్రోచ్ చానల్లో పడేశారని మొదట చెప్పారు. ఆ తర్వాత ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ వద్ద వేశామన్నారు. శవాన్ని తీసుకెళ్లి సంగమేశ్వరంలో వేశామని మరోసారి చెప్పారు. లేదు.. కొణి§ð ల శ్మశాన వాటికలో పూడ్చామన్నారు.. అయితే వీటిలో ఏదీ వాస్తవం కాదని కొత్త విషయం వెలుగు చూస్తోంది. ముగ్గురి బాలురలో ఒక బాలుడి తాత ఆధ్వర్యంలో బిడ్డను ముక్కలుగా నరికినట్లు తెలుస్తోంది. ముక్కలను బ్యాక్ వాటర్‌లో అక్కడక్కడా పడేసి ఉంటారని, నీటి కుక్కలు, చేపలు ఈ ముక్కలను తినేసి ఉంటాయని, అందుకే శవం దొరకడం లేదని.. మరో నెలైనా దొరకదని గ్రామస్తులు చెబుతున్నారు.ఎక్స్‌గ్రేషియా ఏది? సాక్షి, నంద్యాల: ముచ్చుమర్రిలో బాలిక హత్యాచారానికి సంబంధించి ఘటనలో బాలిక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల సాయం అందజేస్తామని హోం మంత్రి అనిత ప్రకటించారు. గురువారంతో మూడు రోజులవుతున్నా ఇంత వరకూ బాధిత కుటుంబానికి సాయం అందలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బాధితులకు పరిహారం ప్రకటిస్తే గంటల వ్యవధిలోనే జిల్లా అధికారులు ఆ సాయాన్ని అందించేవారు. సంబంధిత మంత్రులు లేదా జిల్లా కలెక్టర్ బాధితులను కలిసి భరోసా కల్పించేవారు. కానీ కూటమి ప్రభుత్వం స్పందిస్తున్న తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.పవన్, చంద్రబాబునోరు మెదపరేం? కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతిపై తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో కొందరు అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటనపై మొన్నటి ఎన్నికల ప్రచారం వరకూ పవన్ కళ్యాణ్ ఆవేశంతో ఊగిపోయేవారు. ఇప్పుడు టీడీపీతో పాటు తమ భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వంలో పదేళ్ల బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసి.. 12 రోజులుగా శవాన్ని కనపడకుండా చేస్తే ఆ ఘటనపై నోరెత్తలేదు. ముఖ్యమంత్రీ స్పందించలేదు. హోంమంత్రి ఇక్కడ పర్యటించనే లేదు. దీనికి కారణం బాలిక హత్యతో ముడిపడి ఉన్న కుటుంబానికి చెందిన వారు అధికార పార్టీకి చెందిన నేతల అనుచరులు కావడమేనని చెప్పుకొంటున్నారు. ఈ కేసులో చాలా సెక్షన్ల కింద బాలురు, వారి తండ్రులపై కేసులు నమోదు కావాల్సి ఉంటుందని.. అందువల్లే ఘటనను తేలిగ్గా తీసిపారేస్తున్నారని తెలుస్తోంది. -
ఆంధ్రా అబ్బాయి.. ఫిలిప్పీన్స్ అమ్మాయి
జి.కొండూరు (మైలవరం): ఆంధ్రా అబ్బాయి, ఫిలిప్పీన్స్ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ వివాహం ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో జరిగింది. ఆదివారం జి.కొండూరు మండలం కుంటముక్కలలో రిసెప్షన్ నిర్వహించారు. గ్రామానికి చెందిన మైలవరపు కైలాసరావు కుమారుడు సతీష్‌కుమార్ ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తిచేసి పీహెచ్డీ నిమిత్తం బెల్జియం వెళ్లారు.అతడికి ఫిలిప్పీన్స్ నుంచి వచ్చి బెల్జియంలో ఎమ్మెస్సీ చదువుతున్న డోనా క్యూనో పరిచయమైంది. పరిచయం స్నేహంగా.. ప్రేమగా మూడేళ్లు సాగింది. పెద్దల అంగీకారంతో వారిద్దరు మైలవరంలోని కోదండ రామాలయంలో కుటుంబసభ్యుల సమక్షంలో హిందూ సంప్రదాయం ప్రకారం వేదమంత్రాల నడుమ వివాహం చేసుకున్నారు. ఆదివారం కుంటముక్కలలో బంధుమిత్రులు, స్నేహితులు, గ్రామస్తుల సమక్షంలో రిసెప్షన్ నిర్వహించారు. -
ముచ్చుమర్రిలో బాలిక అదృశ్యంపై వీడని మిస్టరీ
సాక్షి, నంద్యాల: నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో తొమిదేళ్ల మైనర్ బాలిక ఆచూకీపై మిస్టరీ వీడలేదు. చిన్నారి అదృశ్యమై ఎనిమిది రోజులు గడుస్తున్నా కేసులో పురోగతి కనిపించడం లేదు. బాలిక ఆచూకీలో ప్రభుత్వం వైఫల్యంపై వాల్మీకి, ప్రజాసంఘాలు,మహిళా సంఘాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి.అత్యాచారం చేసి, చంపేశామని అనుమానిత ఇద్దరు పది, ఒకరు ఆరో తరగతి విద్యార్థులు చెబుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ ఘటనపై కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు నోరు మెదపకపోవడం పట్ల స్థానికులు మండిపడుతున్నారు. మహిళా హోంమంత్రి సైతం ఈ విషయంలో చొరవ చూపకపోవడం పట్ల గ్రామస్తులు నిప్పులు చెరుగుతున్నారు.మరోవైపు బాలిక మిస్సింగ్‌పై పోలీసులు సంఘమేశ్వరం, మల్లాల తదితర ప్రాంతాల్లో గాలింపు చేపడుతున్నారు. ముచ్చమర్రిలో కేసును దర్యాప్తు చేసేందుకు భారీ మొత్తంలో పోలీసులు మొహరించారు. -
ప్రేమోన్మాది ఆత్మహత్య
రాంబిల్లి (అచ్యుతాపురం): తన ప్రేమను నిరాకరించి, జైలుకు పంపిందనే పగతో 14 ఏళ్ల బాలికను ఐదురోజుల క్రితం హతమార్చిన ప్రేమోన్మాది చివరకు శవమై కనిపించాడు. అతని మృతదేహం బాలిక ఇంటి సమీపంలోని గడ్డిదుబ్బుల్లో లభ్యమైంది. అనకాపల్లి జిల్లా, రాంబిల్లి మండలం, కొప్పుగొండుపాలెంలో బద్ది దర్శిని(14) అనే బాలికను ఈనెల 6వ తేదీ రాత్రి కశింకోట మండలానికి చెందిన సురేశ్ గొంతు కోసి హతమార్చాడు. ప్రేమ పేరుతో వేధిస్తున్న అతనిపై దర్శిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు పెట్టి అరెస్టు చేశారు. బాలికను రాంబిల్లి మండలంలో అమ్మమ్మ ఇంట చదివిస్తున్నారు. బెయిల్‌పై వచ్చిన సురేశ్, తనను జైలుకు పంపిందన్న కక్షతో దర్శినిని హతమార్చాడు. ఘటనా స్థలంలో వదిలి వెళ్లిన లేఖలో ‘ఇద్దరం కలిసి ఉండాలి.. లేదా ఇద్దరం చనిపోవాలి’ అని పేర్కొన్నాడు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్దికాలానికి జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు 12 బృందాలను ఏర్పాటు చేశారు. ఈక్రమంలో గురువారం బాలిక ఇంటికి సుమారు రెండు వందల మీటర్ల దూరంలో కొండలాంటి ప్రాంతంలో గడ్డిదుబ్బుల మాటున సురేశ్ శవమై కనిపించాడు. బుధవారం సాయంత్రం అక్కడికి సమీపంలోని రైతులకు దుర్వాసన వచ్చింది. అప్పటికే చీకటి పడటంతో మరుసటిరోజు ఉదయం పరిశీలించగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఓ యువకుని మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పరవాడ డీఎస్పీ సత్యనారాయణ, సీఐ నర్సింగరావు నేతృత్వంలోని బృందం శవాన్ని పరిశీలించి లభించిన ఆధారం మేరకు సురేశ్‌గా నిర్థారించారు. ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. సురేశ్ జేబులో కొంత నగదు, రాసిన లేఖ జిరాక్స్ కాపీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలిస్తున్న సమయంలో ఆ వాహనాన్ని దర్శిని కుటుంబీకులు అడ్డుకున్నారు. తమ కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే... బెయిల్‌పై బయటకు వచ్చిన వ్యక్తికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించి, బాలిక కుటుంబాన్ని అప్రమత్తం చేస్తే ఇటువంటి దురాగతం జరిగేది కాదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిందితుడు మళ్లీ బాలిక వెంట పడుతున్నట్టు ఆమె కుటుంబ సభ్యులు రాంబిల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసిందని, దీనిపై వారు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఘటన జరిగిన మర్నాడు అనకాపల్లిలో హోంమంత్రి అనితను విలేకరులు ప్రశ్నించగా, అలాంటిది జరిగినట్టు తన దృష్టికి రాలేదని, అదే నిజమైతే సంబంధిత పోలీస్ సిబ్బందిపై చర్యలు చేపడతామని చెప్పారు. చివరకు రాంబిల్లి ఎస్ఐ ముకుందరావును బుధవారం వీఆర్‌పై పంపారు. ఇంత జరిగినా బాలిక కుటుంబాన్ని హోం మంత్రి పరామర్శించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
నల్గొండలో యువతి దారుణం
-
దుమ్మురేపిన అమ్మాయి.. ఆనంద్ మహీంద్ర ప్రశంసలు
‘అమెరికాస్ గాట్ టాలెంట్’ షోలో పాల్గొన్న భారతీయ సంతతి అమ్మాయిని ప్రశంసిస్తూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. రియాలిటీ షోలో ఫ్లోరిడాకు చెందిన ప్రనిస్కా మిశ్రా తన అద్భుతమైన తన గాప్రతిభతో న్యాయ నిర్ణేతలను ఆకట్టుకుంటోంది. దీంతో "అవును, అమెరికాకు నిజంగానే టాలెంట్ ఉంది. కానీ అది చాలా వరకు భారతదేశం నుండే వస్తోంది అంటూ ఆనంద్ మహీంద్రా 'అమెరికాస్ గాట్ టాలెంట్'లో పాల్గొన్న ప్రనిస్కాను పొగడ్తలతో ముంచెత్తారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. టీనా ఐకానిక్ సాంగ్ 'రివర్ డీప్ మౌంటైన్ హై' పాటతో అక్కడున్న వారినందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది మన భారతీయ బాలిక. దీంతో సూపర్ మోడల్ హెడీ క్లమ్ నుండి గోల్డెన్ బజర్‌ను కూడా అందుకోవడం విశేషం. అంతేకాదు ఆమె స్టేజ్‌మీదకు వచ్చి ప్రనిస్కాను ఆత్మీయంగా హగ్ చేసుకుంది. ఆ తరువాత ఆమె తండ్రి ఇలా కాసేపు ఉద్విగ్న క్షణాలతో నిండిపోయింది వేదిక. ఇంతలో వీడియో కాల్ ద్వారా ప్రనిస్కా అమ్మమ్మ లైన్లోకి రావడంతో అక్కడి వాతావరణం అటు ఆనందం, ఇటు భావోద్వేగంతో నిండిపోయింది.What on earth is going on??For the second time, within the past two weeks, a young—VERY young—woman of Indian origin has rocked the stage at @AGT with raw talent that is simply astonishing. With skills acquired in indigenous American genres of music. Rock & Gospel. Pranysqa… pic.twitter.com/2plEj8EXVs— anand mahindra (@anandmahindra) July 8, 2024 భూమిపై ఏమి జరుగుతోంది? రెండు వారాల్లో ఇది రెండోసారి. భారతీయ సంతతికి చెందిన చిన్నఅమ్మాయి తన టేలంట్‌తో షేక్ చేసింది అంటూ ఆనంద్ మహీంద్ర స్పందించారు. అలాగే అమ్మమ్మ వీడియో కాల్ చూడగానే కన్నీళ్లు వచ్చాయంటా ఆయన రాసుకొచ్చారు. -
ప్రేమోన్మాది ఘాతుకం
రాంబిల్లి: ఒక మృగాడి పైశాచికానికి బాలిక బలైంది. పోలీస్ యంత్రాంగం బెయిల్‌పై బయటకు వచ్చిన వ్యక్తికి సంబంధించిన వివరాలను వెల్లడించి బాలిక కుటుంబీకుల్ని అప్రమత్తం చేస్తే ఇటువంటి దురాగతం జరిగి ఉండేది కాదు. దీనికి సంబంధించిన వివరాలు.. కశింకోట మండలానికి చెందిన జె.సురేశ్ అదే ప్రాంతానికి చెందిన బద్ది దర్శిని(14)ని వేధించేవాడని బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు ఇవ్వడంతో పోక్సో కేసు నమోదు చేసి జైలుకి పంపారు. బాలికను వాళ్ల అమ్మమ్మ ఇంటి వద్దకు పంపించి చదివిస్తున్నారు. రాంబిల్లి మండలం కొప్పిగొండుపాలెంలో ఉంటూ రాంబిల్లి ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న దర్శిని శనివారం యధావిధిగా పాఠశాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి చేరుకుంది. బెయిల్‌పై వచ్చి అప్పటికే మాటు వేసి ఉన్న సురేశ్ వేట కొడవలితో బాలిక మెడ నరికి హతమార్చాడు. తనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందని కక్ష పెంచుకున్న సురేశ్ ఈ దురాగతానికి పాల్పడ్డాడని భావిస్తున్నా రు. డీఎస్పీ సత్యనారాయణ, సీఐ నర్సింగరావు, ఎస్ఐ మన్మధరావులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారు కావడంతో అతని కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనతో రాంబిల్లి మండలంతోపాటు ఉమ్మడి విశాఖ జిల్లా ఉలిక్కిపడింది. -
స్వయం ప్రకటిత బౌద్ధ గురువు బమ్జాన్కు పదేళ్ల జైలు
బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నేపాల్‌కు చెందిన స్వయం ప్రకటిత బౌద్ధ గురువు రామ్ బహదూర్ బమ్జాన్కు కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో తీర్పునిచ్చిన సర్లాహి జిల్లా కోర్టు న్యాయమూర్తి జీవన్ కుమార్ భండారీ నిందితునికి జైలు శిక్షతో పాటు రూ. 5 లక్షల జరిమానా కూడా విధించారు.వివరాల్లోకి వెళితే బాలికను లైంగిక వేధింపులకు గురిచేసిన ఈ కేసులో బమ్జాన్ సహచరులు జీత్ బహదూర్ తమాంగ్, జ్ఞాన్ బహదూర్ బమ్జాన్లు నిర్దోషులుగా విడుదలయ్యారు. బమ్జాన్ ప్రస్తుతం జలేశ్వర్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. 2024, జనవరి 9న ఖాట్మండులోని బుధ్ నీటకంఠలో నేపాల్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో బృందం బమ్జాన్ను అరెస్టు చేసింది.2020 ఫిబ్రవరి 6న సర్లాహి జిల్లా కోర్టు అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆ తర్వాత బమ్జాన్ పరారయ్యాడు. 2016, ఆగస్టు 4న అతని ఆశ్రమంలో అనీ (నన్)గా ఉంటున్న 15 ఏళ్ల బాలిక.. బమ్జాన్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. 2020 ఫిబ్రవరి 23న బాధితురాలు తనకు మైనారిటీ వచ్చిన వచ్చిన తరువాత బమ్జాన్పై పోలిసులకు ఫిర్యాదు చేసింది. ఇదేవిధంగా మరికొందరు బమ్జాన్పై హత్య, కిడ్నాప్, లైంగిక వేధిపుల ఆరోపణలు చేశారు. 2005లో ఆహారం, నీరు, నిద్ర లేకుండా ధ్యానం చేసిన కారణంగా బమ్జాన్ వెలుగులోకి వచ్చాడు. ఈ నేపధ్యంలోనే అతనికి బుద్ధ బాయ్ అనే పేరు వచ్చింది. -
నేరేడ్మెట్లో బాలికపై గ్యాంగ్ రేప్.. 10 మంది అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: నేరేడ్మెట్లో తీవ్ర సంచలనం సృష్టించిన బాలిక గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో కీలక సూత్రధారులైన నరేష్, విజయ్‌లతో పాటు మరో 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు.ఈ నెల 22న కాచిగూడ నుంచి 12 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన నిందితులు.. కూల్‌డ్రింక్‌లో గంజాయి కలిపి తాగించారు. బాలిక మత్తులోకి వెళ్లిన తర్వాత నిర్మానుష్యప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు. -
మద్యం మత్తులో యువతి.. వీడియో షేర్ చేసిన బీజేపీ నేత
దేశంలోని కొందరు యువతీయువకులు మత్తుకు బానిసలుగా మారి తమ కెరియర్ను నాశనం చేసుకోవడమే కాకుండా, తల్లిదండ్రులను కష్టాలపాలు చేస్తున్నారు. మత్తుపదార్థాల తీసుకోవడం వలన జరిగే హాని గురించి అటు ప్రభుత్వం, ఇటు స్వచ్ఛంద సంస్థలు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా ఆశించినంత ఫలితం కనిపించడంలేదు. తాజాగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో మద్యం మత్తులో రాత్రివేళ రోడ్డుపై జోగుతున్న ఓ యువతికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో అమృత్‌సర్‌లోని మోహక్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని జీటీ రోడ్డులో చిత్రీకరించారు. ఈ వీడియో వైరల్ అయిన నేపధ్యంలో మత్తుమందులను అరికట్టడంలో విఫలమైన ప్రభుత్వంపై విమర్శలు చెలరేగుతున్నాయి.ఈ వీడియోను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంజీందర్ సింగ్ సిర్సా తన ‘ఎక్స్’ హ్యాండిల్లో షేర్ చేశారు. పంజాబ్‌లో డ్రగ్స్ సమస్యను నివారించడంలో ఆప్ ప్రభుత్వం విఫలమయ్యిందని ఆరోపించారు. మంజీందర్ సింగ్ షేర్ చేసిన వీడియోలో రాత్రివేళ రోడ్డుపై ఒక యువతి మద్యం మత్తులో ఊగిపోతూ కనిపిస్తుంది. ఆమె సరిగా నిలబడలేక పోవడాన్ని కూడా వీడియోలో చూడవచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో రాష్ట్రాన్ని మత్తుమందుల నుంచి విముక్తి చేస్తామని ప్రకటించిందని, ఇప్పుడు ఆ మాటనే విస్మరించిందని సుజీందర్ సింగ్ ఆరోపించారు. This late night video of Amritsar of a young girl high under Drugs shows the failure of @AAPPunjab Govt! What have you done to Punjab, CM @bhagwantmann Ji?You came to power promising elimination of drugs in 3 months but now your own party people are involved in this!Drug… pic.twitter.com/QdIADuRsZS— Manjinder Singh Sirsa (@mssirsa) June 24, 2024 -
బాలికపై లైంగిక దాడి కేసులో పదేళ్ల జైలు
విజయవాడస్పోర్ట్స్: ఐదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ విజయవాడ పోక్సో కోర్టు ఇన్చార్జ్ న్యాయమూర్తి తిరుమల వెంకటేశ్వర్లు సోమవారం తీర్పు చెప్పారు. వివరాలిలా ఉన్నాయి. ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన మహిళకు, నున్న గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. భర్తతో మనస్పర్థల కారణంగా ఆమె పిల్లలను తీసుకుని ఇబ్రహీంపట్నంలోని పుట్టింట్లో ఉండేది.కొన్నాళ్ల తరువాత భర్త వచ్చి తన ఐదేళ్ల పెద్ద కుమార్తెను నున్నలోని తన ఇంటికి తీసుకెళ్లాడు. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో వాంబేకాలనీకి చెందిన 20 ఏళ్ల కుంచాల దుర్గారావు అలియాస్ తమ్మిశెట్టి దుర్గారావు అలియాస్ దుర్గా ఆ పాపను డాబాపైకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరుసటి రోజు పాపకు స్నానం చేయిస్తుండగా మర్మాంగాల వద్ద ఇన్ఫెక్షన్ రావడాన్ని గమనించిన తల్లి ఆరా తీయగా దుర్గారావు చేసిన అత్యాచారం బయటపడింది.వెంటనే పాపను చికిత్స నిమిత్తం విజయవాడలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పాపపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధారించడంతో పాప తల్లి ఇచి్చన ఫిర్యాదు మేరకు 2019 ఏప్రిల్ ఆరో తేదీన నున్న పోలీసులు కేసు నమోదు చేసి 2020 ఆగస్టు 12వ తేదీన నిందితుడు దుర్గారావును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. నేరం రుజువు కావడంతో నిందితుడు దుర్గారావుకు కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. -
మియాపూర్: వీడిన బాలిక హత్య కేసు మిస్టరీ
సాక్షి,హైదరాబాద్: మియాపూర్‌లో సంచలనం రేపిన బాలిక హత్య కేసును పోలీసులు చేదించారు. బాలిక మర్డర్ కేసులో ఆమె తండ్రే హంతకుడని పోలీసులు తేల్చారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఈ కేసును విచారించారు. బాలిక మిస్సింగ్ మిస్టరీ వారం రోజుల తర్వాత వీడింది. తండ్రిపై అనుమానంతో తమదైన తీరులో పోలీసులు దర్యాప్తు చేశారు. బాలిక తండ్రి బానోతు నరేష్ పోర్న్ వీడియోలు చూస్తూ చెడు అలవాట్లకు బానిసయ్యాడు.తన కోరిక తీర్చాలంటూ బాలికపై తండ్రి ఒత్తిడి తెచ్చాడు. అమ్మకు చెప్తానని బాలిక గట్టిగా అరవడంతో కోపంతో కన్న కూతురిని హతమార్చాడు. నడిగడ్డ తండా సమీపంలోని పొదల్లోకి తీసుకువెళ్లి జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టి హత్య చేశాడు. బాలిక చనిపోయిందా లేదా అని చూసేందుకు హత్య జరిగిన ప్రదేశానికి నిందితుడు తిరిగి వెళ్లినట్లు గుర్తించారు. -
Fathers Day 2024: కన్నా... నేనున్నా
తల్లి ఎదురుగా ఉంటే ఎంతమంది ఉంటే మాత్రం ఏమిటి? సంప్రదాయ నృత్య దుస్తులు ధరించిన అమ్మాయి భయం భయంగా స్టేజీ ఎక్కింది. ఎదురుగా ఎంతోమంది జనం. తన వైపే చూస్తున్నారు. ‘భయపడవద్దు’ అన్నట్లుగా సైగ చేసింది తల్లి. అంతేకాదు...మ్యూజిక్ స్టార్ట్ కాగానే డ్యాన్స్ స్టెప్స్‌ను ఆటిస్టిక్ కుమార్తెకు చూపెట్టడం మొదలుపెట్టింది. స్టేజీ ముందు ఉన్న తన తల్లిని నిశితంగా గమనిస్తూ అందంగా, అద్భుతంగా డ్యాన్స్ చేసింది ఆ అమ్మాయి. ‘స్పెషల్–నీడ్స్ చిల్డ్రన్ ఆలనా పాలనకు ఎంతో ఓపిక, అంకితభావం కావాలి. అవి ఈ తల్లిలో కనిపిస్తున్నాయి’ అని నెటిజనులు స్పందించారు. అపర్ణ అనే యూజర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. -
చైతన్య పథం
ఐక్యరాజ్య సమితి ‘గర్ల్ అప్’ మూవ్‌మెంట్‌కు ఇండియా కంట్రీ మేనేజర్ అయిన అదితి అరోరా ఆ సంస్థ ద్వారా మహిళల మానసిక ఆరోగ్యం నుంచి ఉపాధి అవకాశాల వరకు ఎన్నో అంశాలపై పని చేస్తోంది. ‘స్టోరీ టెల్లింగ్’లో శిక్షణ ఇస్తోంది. మహిళలపై జరిగే హింసకు వ్యతిరేకంగా ΄పోరాడుతోంది. ‘పీరియడ్ ΄పావర్టీ’ని దృష్టిలో పెట్టుకొని అవగాహన కార్యమ్రాలు నిర్వహిస్తోంది. మహిళా సాధికారత, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన అంశాలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న అమెరికాకు చెందిన ‘జస్ట్ ఏ గర్ల్ ఇంక్’ స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తోంది....ప్రపంచవ్యాప్తంగా 130 దేశాలలో ఎంతోమంది మహిళలను నాయకులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పొషించింది ‘గర్ల్ అప్’.‘ప్రపంచాన్ని మార్చే అద్భుత శక్తి అమ్మాయిలకు ఉంది’ అంటున్న అదితి అరోరా వారి హక్కుల గురించి అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపోందిస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కొత్త అవకాశాల ప్రపంచంలోకి తీసుకు వెళుతోంది.‘గర్ల్ అప్ ఇండియా’ ద్వారా దేశవ్యాప్తంగా లింగ సమానత్వం, సామాజిక మార్పుపై ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది అదితి.యువతలో ఎంతోమందిని చేంజ్‌మేకర్స్‌గా తీర్చిదిద్దింది.పాలిటికల్ సైన్స్ చదువుకున్న అదితి కాలేజీ రోజుల నుంచి మహిళా హక్కులు, స్త్రీ సాధికారతకు సంబంధించిన అంశాలపై పని చేస్తోంది. జెనీవాలో చదువుతున్నప్పుడు ‘జెండర్ అండ్ మైన్ యాక్షన్’ పోగ్రాంలో భాగంగా మందు పాతర బాధిత దేశాలలో మహిళల భద్రత కోసం పనిచేసింది.‘గర్ల్ అప్’ పనితీరు విషయానికి వస్తే సంస్థలో సిబ్బంది, కన్సల్టెంట్ల సంఖ్య చాలా తక్కువగా ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా వేగంగా విస్తరించడానికి అదేమీ అడ్డంకి కాలేదు. ‘ఓపెన్ టు ఎవ్రీ వన్’ అంటున్న ‘గర్ల్ అప్’ దేశంలోని వివిధ పాంతాలలోని వాలంటీర్లతో కలిసి పనిచేస్తోంది.తమలోని శక్తిని అమ్మాయిలు గుర్తించేలా కార్యక్రమాలు రూపోందిస్తోంది.విధాన నిర్ణయాలలో వారి అభిప్రాయాలకు అధికరపాధాన్యత ఇస్తోంది.‘లింగ సమానత్వం’ విషయంలో క్రియాశీలంగా పనిచేస్తోంది గర్ల్ అప్.‘అబ్బాయిలను ఒకరకంగా, అమ్మాయిలను ఒకరకంగా చూసే విధానంలో మార్పు రావాలి. లింగ సమానత్వానికి ఇదే తొలిమెట్టు. అమ్మాయిలు చదువులో తమ ప్రతిభను నిరూపించుకొని శక్తిమంతులు కావాలి. ఎవరికీ తీసిపోము అని నిరూపించాలి. లింగ సమానత్వం విషయంలో ΄పార సమాజం, విధాన నిర్ణేతలు, విద్యావేత్తల పాత్ర కీలకం’ అంటుంది అదితి.మనకు తెలియకుండానే పురుషాధిపత్య భావజాలం మనలో లీనమై ఉంటుంది. రకరకాల సందర్భాలలో అది వ్యక్తం అవుతుంటుంది. ‘ఇలాంటివి నివారించాలంటే ఏం చేయాలి?’ అనేదానిపై కూడా తన అభిప్రాయాలను ప్రకటించింది అదితి.‘శరీరం నుంచి దుస్తుల ఎంపిక వరకు మహిళలు ఏదో ఒక సందర్భంలో కామెంట్స్ రూపంలో హింసను ఎదుర్కొంటున్నారు’ అంటున్న అదితి తాను కూడా అలాంటి హింస బాధితురాలే. ‘కామెంట్స్ విని బాధపడడం కాకుండా అలాంటి కామెంట్స్ మళ్లీ వినిపించకుండా చేయాలి’ అంటుంది అదితి.‘మార్పు సాధ్యపడదు’ అనేది నిరాశావాదం.‘తప్పకుండా సాధ్యపడుతుంది’ అనేది శాస్త్రీయ ప్రాతిపదికపై ఏర్పడిన ఆశావాదం.మార్పు రావడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయం త్వరగా రావడానికి ‘గర్ల్ అప్’లాంటి సంస్థలు, అదితిలాంటి వ్యక్తులు క్షేత్రస్థాయిలో చేస్తున్న కార్యక్రమాలు కీలకం అవుతాయి.‘నిన్న నువ్వు ఏమిటో తెలుసుకొనే జ్ఞాపకం నీలో ఉన్నట్లే రేపు నువ్వు ఏమిటో నిరూపించుకునే జ్ఞానం, శక్తి నీలో ఉన్నాయి’ అంటుంది అదితి అరోరా.దిశానిర్దేశంలింగ సమానత్వం, స్త్రీవాదం గురించి మాట్లాడడానికి స్కూల్స్, కాలేజీలకు వెళుతుంటుంది అదితి అరోరా. విద్యార్థుల మనసుల్లో దాగున్న ఎన్నో సందేహాలు ఆ సమయంలో బయటికి వస్తాయి. వాటికి సమాధానం ఇవ్వడమే కాదు దిశానిర్దేశం కూడా చేస్తుంది అదితి అరోరా. ఎన్నో బడులు, కాలేజీలలో గర్ల్ అప్ క్లబ్‌లను ఏర్పాటు చేసింది. ప్రతి క్లబ్లో అయిదుగురు సభ్యులతో పాటు ప్రెసిడెంట్, వైస్–ప్రెసిడెంట్, సెక్రెటరీలు ఉంటారు. నిర్దిష్టమైన అంశాలపై ఈ క్లబ్‌ల కోసం వర్క్‌షాప్‌లు కూడా నిర్వహించింది. అయితే కొన్ని విద్యాసంస్థలు మాత్రం ‘ఇలాంటి విషయాలు అమ్మాయిలకు ఎందుకు’ అన్నట్లుగానే వ్యవహరించాయి. వారి ధోరణితో ఎప్పుడూ నిరాశపడలేదు అదితి. -
తొమ్మిదేళ్ల బాలికతో దేవదేవుని వివాహం
రాయదుర్గంటౌన్: అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో శ్రీప్రసన్న వేంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీవారి కల్యాణం తొమ్మిదేళ్ల బాలికతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. దాదాపు ఆరు దశాబ్దాల నుంచి ఇక్కడ కొనసాగుతున్న విశిష్ట సంప్రదాయంలో భాగంగా అరవ తెగకు చెందిన బాలికతో దేవదేవుని కల్యాణం జరిపించారు. స్వామి వారిని వివాహమాడిన ఆ బాలికకు సుగుణ æసంపన్నుడైన భర్త లభిస్తాడని భక్తుల నమ్మకం. ఏటా బ్రహ్మోత్సవాల్లో భాగంగా పద్మశాలి వంశం అరవ తెగకు చెందిన బాలికతో శ్రీవారికి పెళ్లి చేసే సంప్రదాయం ఇక్కడ కొనసాగుతోంది.ఈ ఏడాది రాయదుర్గం పట్టణానికి చెందిన అరవ రమే‹Ù, జయమ్మ దంపతుల కుమార్తె మౌనికతో శ్రీవారి వివాహం జరిపించారు. పెళ్లి పెద్దలుగా శ్రీవారి తరఫున బ్రాహ్మణులు, ఆలయ పాలక కమిటీ సభ్యులు, పుర ప్రముఖులు వ్యవహరించారు. శనివారం ఉదయం మేళతాళాలతో పెళ్లి కూతురు అయిన పద్మావతి (మౌనిక)ని ఊరేగింపుగా మార్కండేయస్వామి ఆలయానికి తీసుకొచ్చారు. అక్కడ పెళ్లికూతురిని అలంకరించి కోటలోని శ్రీవారి సన్నిధి వరకు ఊరేగింపుగా తెచ్చారు. అనంతరం శ్రీవారి ఉత్సవ విగ్రహం ముందు కూర్చోబెట్టారు.వేద మంత్రోచ్ఛారణ మధ్య వివాహం జరిపించారు. అభిజిత్ లగ్న శుభపుష్కరాంశమునందు పురోహితులు మంగళసూత్రాన్ని బాలిక మెడకు తాకించి శ్రీవారి పక్కనే ఉన్న పద్మావతి ఉత్సవ విగ్రహానికి కట్టారు. పసుపు కొమ్ముతో ఉన్న మంగళసూత్రాన్ని బాలిక మెడలో తల్లి కట్టడంతో పెళ్లితంతు ముగిసింది. -
ప్రేమ పేరుతో యువకుడిని మోసం చేసిన యువతి
-
దీన్నే పిచ్చి అంటారు..మారండి ప్లీజ్! వైరల్ వీడియో
లేని పోని ప్రయోగాలకు పోతూ ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం. తాజాగా వేగంగా కదులుతున్న ట్రైన్లోంచి ఒక బాలిక దూకేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. విపరీత పోకడలతో సాహసాలు చేయొద్దని ఎంత చెప్పినా ప్రయోజనం ఉండటంలేదు అనడానికి ఈ ఘటనే ఉదాహరణ. ఒక బాలిక చాలా వేగంగా కదులుతున్న రైలు ద్వారం దగ్గర నిలబడి ఉంటుంది.. మెల్లిగా మెట్లు దిగుతూ సడెన్‌గా పట్టాలపైకి దూకేసింది. అయితే ఆమెను నివారించాల్సిన వారు వీడియో తీయడం విమర్శలకు తావిచ్చింది. ఇది కావాలనే చేశారా? లేదా ఆమె ఆత్మహత్యకు యత్నించిందా? ఎక్కడ జరిగింది? అనే ప్రశ్నలకు సమాధానం లేదు. అయితే ఆమె తీవ్ర గాయాలతో బతికే ఉందని మాత్రం కొంత మంది కమెంట్ చేశారు. Girl jumps from a running train expecting to get off like in Bollywood 🤦♂️🤦♂️🤦♂️ pic.twitter.com/5ktDKMus6o — Pagan 🚩 (@paganhindu) April 12, 2024 -
వారెవ్వా..నిఖిత : కోతులకు చుక్కలు చూపించింది.. దెబ్బకు!
పిల్లలు గాడ్జెట్స్ వాడకంలో భలే ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మనం వాళ్లకి సరైన పద్ధతిలో నేర్పించా లేగానీ, టెక్నాలజీని చాలా తొందరగా నేర్చుకుంటారు. సమయానికి వాడుతారు కూడా. యూపీలో జరిగిన ఒక సంఘటన చూస్తే మీరూ నిజం అంటారు. ప్రమాదకర పరిస్థితిలో ఏమాత్రం భయపడకుండా ఓ అమ్మాయి స్మార్ట్‌గా వ్యవహరించింది. తనను తాను కాపాడుకోవడమే కాదు , నెలల వయస్సున్న చెల్లెల్ని కూడా రక్షించు కుంది. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో నివసించే 13 ఏళ్ల నిఖిత కోతుల దాడినుంచి తన చెల్లాయిని కాపాడుకున్న తీరు విశేషంగా నిలిచింది. అసలు ఏం జరిగిందంటే... కుటుంబ సభ్యులు అంతా ఎవరి పనుల్లో వారు సందడిగా ఉన్నారు. ఇంతలో నిఖిత తన చెల్లిలితో ఆడుకుంటున్న సమయంలో ఇంట్లోకి కోతులు చొరబడ్డాయి. వంటగదిలోకి వెళ్లి, వంట సామాన్లు చిందరవందర చేసాయి. కొన్నింటిని విసిరి పారేసాయి. ఇది చాలదన్నట్టు చిన్నారిపై దాడికి ప్రయత్నించాయి. కుటుంబ సభ్యులంతా పై అంతస్థులో వేరే గదిలో ఉన్నారు. అయినా నిఖిత తల్లిని పిలవడానికి ప్రయత్నించింది. కానీ అవి మరింత రెచ్చిపోయాయి. ఇక్కడే నిఖిత తెలివిగా ఆలోచించింది. కోతిని భయపెట్టేలా కుక్కలా గట్టిగా మొరగాలని అలెక్సాను ఆదేశించింది. అంతే అమెజాన్ వాయిస్ అసిస్టెంట్ అలెక్సా పెద్దగా మొరిగే శబ్దాలు చేసింది. దీంతో కోతిని భయపడి పారిపోయింది. #WATCH | Uttar Pradesh: A girl named Nikita in Basti district saved her younger sister and herself by using the voice of the Alexa device when monkeys entered their home. Nikita says, "A few guests visited our home and they left the gate open. Monkeys entered the kitchen and… pic.twitter.com/hldLA0wvZS — ANI UP/Uttarakhand (@ANINewsUP) April 6, 2024 #WATCH | Nikita's mother says, "We were sitting in the room, the gate was open when the girl called me. When I came and saw that monkeys were in the kitchen and scaring her I called Nikita, and she used her mind and asked Alexa to play the sound of a dog. Because of that barking… pic.twitter.com/gzBGr3P004 — ANI UP/Uttarakhand (@ANINewsUP) April 6, 2024 “కొంతమంది అతిథులు మా ఇంటికి వచ్చారు, వారు గేటు తెరిచారు. దీంతో కోతులు వంటగదిలోకి ప్రవేశించి వస్తువులను విసిరి పారేశాయి. ఇద్దరమూ భయపడ్డాం. అప్పుడు కుక్క మొరిగే శబ్దాలను ప్లే చేయమని అలెక్సాను అడిగాను. అలెక్సా చేసిన శబ్దాలకు కోతులు భయపడి పారిపోయాయి” అని నిఖితా జరిగిన సంఘటనను ఏఎన్ఐతో వివరించింది. ఈ గలాటా అంతా వినబడి తానూ వచ్చాననీ, అలెక్సా చేసిన శబ్దాలకు కోతులు భయపడి పారిపోయాని నిఖిత తల్లి చెప్పింది. -
బాలికలు, మహిళలను వేధించే వారిని వదలం
మధురవాడ(భీమిలి): బాలికలు, మహిళలను ఇబ్బందులకు గురిచేసినా, వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించినా అలాంటి వారిని వదిలే ప్రసక్తే లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి హెచ్చరించారు. విశాఖ కొమ్మాది చైతన్య కళాశాలలో ఫ్యాకల్టీ లైంగిక వేధింపులకు విద్యార్థిని రూపశ్రీ మృతి చెందిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో విచారణ కమిటీ సభ్యులు, ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావుతో కలిసి బుధవారం ఆమె కళాశాలను సందర్శించారు. తరగతి గదులు, ల్యాబ్‌లు, హాస్టల్ భవనం, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. తర్వాత అక్కడి ఇంజనీరింగ్, డిప్లమా ఫ్యాకల్టీ, సిబ్బందితో వేర్వేరుగా సమావేశమయ్యారు. మీ పిల్లలు ఈ పరిస్థితిలో ఉంటే ఇలానే వదిలేస్తారా? ఇక్కడ ల్యాబ్‌లో ఓ వ్యక్తి ఆడబిడ్డల పట్ల అంత దారుణంగా వ్యవహరిస్తున్నాడంటే వాడు మనిషా, పశువా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల గుర్తింపు రద్దుకు సిఫార్సు అనంతరం వెంకటలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ పిల్లలను తీర్చిదిద్దాల్సిన ఫ్యాకల్టీయే విద్యార్థులతో సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించడం దారుణమన్నారు. విద్యా సంస్థకు ఉండాల్సిన కనీస నిబంధనలను ఈ కళాశాల పాటించడం లేదని తెలిపారు. చాలా చోట్ల సీసీ కెమెరాల్లేవని, ల్యాబ్‌లో మానిటరింగ్ సిస్టమ్ లేదన్నారు. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్, రికార్డులు, ఐసీసీ కమిటీలు, యాంటీ ర్యాగింగ్ సిస్టం.. కనీసం కంప్లయింట్ బాక్స్ కూడా లేదన్నారు. కళాశాల గుర్తింపు రద్దుకు సిఫార్సు చేస్తున్నామన్నారు. హాస్టల్లో విద్యార్థులకు కల్పించే వసతులు, భోజనం వంటి విషయాల్లోనూ వివక్ష ఉందని, ప్రభుత్వం నుంచి ఫీజు వచ్చేవారికి నాణ్యమైన భోజనం లేదని, కనీసం మంచాలు కూడా లేవన్నారు. ప్రైవేటు ఫీజులు చెల్లించే వారికి అన్ని సౌకర్యాలూ కల్పించారని చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు అరెస్ట్ అయ్యారని, ఇంకా విచారణ కొనసాగుతోందన్నారు. కాగా, రూపశ్రీ మృతిపై వెంకటలక్ష్మి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. నాలుగో అంతస్తుపై నుంచి పడి మృతి చెందిన బాలిక శరీరంపై ఏ రకమైన దెబ్బలూ లేకపోవడం, ఒక బాలిక ఉదయం నుంచి రాత్రి వరకు కనిపించకున్నా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం వంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయన్నారు. అనంతరం ఆందోళన శిబిరంలో ఉన్న రూపశ్రీ తల్లిదండ్రులను పరామర్శించి.. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కమిషన్ సభ్యురాలు గెడ్డం ఉమ, ఏపీఎస్‌సీపీసీ డైరెక్టర్ టి.ఆదిలక్ష్మి, మహిళా కమిషన్ డైరెక్టర్ ఆర్.సుజి, ఏయూ లా కాలేజి ప్రొఫెసర్ విజయలక్ష్మి, మహిళా కమిషన్ లీగల్ కౌన్సిలర్ పూజితయాదవ్ తదితరులు పాల్గొన్నారు. పూర్తి నివేదిక ఇవ్వండిసీఎస్, డీజీపీలకు ఎన్హెచ్ఆర్సీ ఆదేశం సాక్షి, న్యూఢిల్లీ: ఫ్యాకల్టీయే లైంగికంగా వేధిస్తే ఇంకెవరికి చెప్పను నాన్న.. అంటూ తండ్రికి మెసేజ్ చేసి ఆత్మహత్యకు పాల్పడిన బాలిక ఘటనపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) స్పందించింది. బాలిక ఆత్మహత్య ఘటనపై పూర్తి నివేదికను అందించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులిచి్చంది. మార్చి 28న విశాఖపట్నం కొమ్మాదిలోని ‘చైతన్య ఇంజనీరింగ్’ కళాశాలలో డిపొ్లమా మొదటి సంవత్సరం చదువుతున్న రూపశ్రీ(16) లైంగిక వేధింపుల కారణంగా హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తన ఫ్యాకల్టీయే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరిస్తున్నాడని తండ్రికి మెసేజ్‌లో తెలిపింది. ఈ ఘటనపై వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఎన్హెచ్ఆర్సీ సుమోటాగా కేసు నమోదు చేసింది. నాలుగు వారాల్లో బాలిక ఆత్మహత్యకు గల కారణాలతో తమకు నివేదిక అందించాలంటూ సీఎస్, డీజీపీలను ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. నివేదికతో పాటు రాష్ట్ర పోలీసు శాఖ జరిపిన ఇన్వెస్టిగేషన్‌ను కూడా తెలపాలంటూ సూచించింది. కాగా, బాలిక ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనను పరిశీలిస్తే కొమ్మాదిలోని “చైతన్య ఇంజనీరింగ్’ కళాశాల యాజమాన్యమే కారణం అనే విషయం తెలుస్తోందంటూ ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది. కాలేజీలో ఇంకెంతమంది విద్యార్థినిలు ఫ్యాకల్టీల లైంగిక వేధింపులకు గురవుతున్నారనే విషయాన్ని రాష్ట్ర పోలీసు శాఖ క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని సూచనలు చేసింది. విద్యార్థినులను వేధిస్తున్న వారిపై కేసులను సైతం నమోదు చేయాలని ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది.