బెంగళూరుపై ఓ మహిళ అనుచిత పోస్టులు
భగ్గుమన్న ప్రజానీకం
బొమ్మనహళ్లి: బెంగళూరులో కొంతమంది చిల్లర ప్రవర్తన ఆ వర్గాలకు చెందిన అందరికీ చెడ్డ పేరు తెచ్చేలా ఉంటోంది. పైగా వారు చదువుకుని ఉన్నత వర్గాలకు చెందినవారు కావడం గమనార్హం. ఇక్కడ ఉపాధి, ఉద్యోగాలు పొంది జీవితంలో ముందుకు సాగుతూ, పైగా రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారి వల్ల సమాజంలో కలతలు వస్తున్నాయి.
మేం వెళ్లిపోతే బెంగళూరు ఖాళీ అని..
ఉత్తర భారత ప్రాంతాలకు చెందిన తాము బెంగళూరుకు రాకపోతే బెంగళూరు మొత్తం ఖాళీ గా ఉంటుంది. ఇక్కడి నుంచి తాము వెళ్లిపోవాలని అంటూ ఉంటారు. మేం వెళ్లిపోతే ఇక్కడ ఏమీ ఉండదు. మీకు ఆదాయం రాదు. పీజీ హాస్టళ్లు, పబ్‌లు వెలవెలబోతాయి అని సుగంధ శర్మ అనే మహిళ రెచ్చగొట్టే పోస్టులు పెట్టింది. బెంగళూరుకు వలస వచ్చిన సుగంధ శర్మ.. బెంగళూరు గురించి, ఇక్కడి ప్రజల గురించి ఇన్‌స్టాలో చులకనగా వీడియోలు, రీల్స్ చేసింది, దానిని చూసిన కన్నడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక కార్యకర్తలు, రచయితలు వంటివారు ఆమె చేష్టలను ఖండించారు. మొదట మీరు మా బెంగళూరును వదిలి వెళ్ళండి, నగరం ఎలా ఖాళీ అవుతుందో చూస్తాము అని అనేకమంది ఆమెకు ఘాటుగా సమాధానాలిచ్చారు.
ఆమెపై తీవ్ర ఆగ్రహం
కన్నడ పోరాట సంఘం నాయకుడు రూపేష్ రాజన్న, ఆప్ నాయకులు ఆమె ప్రవర్తనపై మండిపడ్డారు. ఆమె పనిచేసే కంపెనీకి ఫిర్యాదు చేశారు. విద్వేషాలను రెచ్చగొడుతోందని కోరమంగళ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. వేలాది మంది నుంచి తీవ్ర నిరసనలు రావడంతో సుగంధ శర్మ దిగివచ్చింది. ఐ లవ్ బెంగళూరు అని మరో వీడియో పోస్టు పెట్టి ప్రజల కోపాన్ని చల్లబరిచే యత్నం చేశారు. కంపెనీ, పోలీసులు ఆమెపై కఠిన చర్యలు తీసుకుని ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలని నెటిజన్లు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment