ప్రతీకాత్మక చిత్రం
బనశంకరి(బెంగళూరు): పెళ్లి విషయంలో చోటుచేసుకున్న గొడవలో ప్రియురాలిపై ప్రియుడు పెట్రోల్ పోసి నిప్పుపెట్టి హత్య చేశాడు. ఈ ఘటనపై మృతురాలి సోదరి తేజస్విని, శివకుమార్‌పై ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు... బీజాపుర జిల్లాకు చెందిన దానేశ్వరి (23), బాదామికి చెందిన శివకుమార్ ఇద్దరు ఇంజనీరింగ్ పట్టభద్రులు. ఒకే కాలేజీలో చదువుతూ ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఇద్దరు బెంగళూరులో లివింగ్ టూ గెదర్‌లో ఉన్నారు. (చదవండి: నెల రోజుల్లో పెళ్లి.. అంతలో మరొకరు ఫోన్ చేసి.. )
ఇటీవల ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వివాహాన్ని తన కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తున్నారని శివకుమార్ దానేశ్వరి దృష్టికి తెచ్చాడు. దీంతో ఆమె గురువారం శివకుమార్ పనిచేస్తున్న కంపెనీ వద్దకు వచ్చింది. అక్కడే ఇద్దరు గొడవపడ్డారు. దీంతో శివకుమార్ పెట్రోల్ తెచ్చి దానేశ్వరిపై చల్లి నిప్పు పెట్టాడని సోదరి వాపోయింది. శుక్రవారం తెల్లవారుజామున తన సోదిరి మృతి చెందిందని ఆ ఫిర్యాదులో పేర్కొంది. కేసు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment