lover
-
బాయ్‌ఫ్రెండ్‌ను చంపిన గ్రీష్మకు ఉరిశిక్ష.. కోర్టు సంచలన తీర్పు!
తిరువనంతపురం : ప్రియుడిని చంపిన కేసులో కేరళ కేరళ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. షరోన్ రాజ్ ప్రేయసి గ్రీష్మకు ఉరిశిక్ష విధించింది. తీర్పును వెలువరించే సమయంలో ‘ఈ కేసు అరుదైన కేసుల్లోనే అరుదైన కేసు. కాబట్టి ఈ కేసులో వయస్సును పరిగణలోకి తీసుకోకుండా నిందితురాలు గ్రీష్మకు ఉరిశిక్ష విధిస్తున్నాం’ అంటూ కేరళ సెషన్స్ కోర్టు తీర్పిచ్చింది. కేరళ పరసాలలో మూడేళ్ల కిందట(2022లో) సంచలనం సృష్టించిన షరోన్ రాజ్ హత్య కేసులో తిరువనంతపురం జిల్లా అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి శుక్రవారం(జనవరి 17న) షరోన్ ప్రేయసి గ్రీష్మను, ఆమె మేనమామ నిర్మలాకుమారన్ నెయ్యట్టింకర అదనపు సెషన్స్ కోర్టు దోషులుగా ప్రకటించారు. సోమవారం (జనవరి 20న) ప్రేయసి గ్రీష్మకు మరణశిక్షను విధిస్తూ తీర్పును వెల్లడించారు. షరోన్‌ను హత్య చేసేలా గ్రీష్మకు సహకరించడంతో పాటు కేసులో కీలక ఆధారాల్ని ధ్వంసం చేసినందుకు ఆమె మేనమామ నిర్మలా కుమారన్ నెయ్యట్టింకరకు మూడేళ్ల జైలు శిక్షను విధించారు. నెయ్యట్టింకర అదనపు సెషన్స్ కోర్టు షరోన్ రాజ్ హత్య కేసును అరుదైన కేసుల్లో అరుదైనదని,అందువల్ల నిందితురాలు గ్రీష్మకు ఉరిశిక్షే సరైందని భావిస్తున్నట్లు తెలిపింది.కాబట్టే వయస్సును పరిగణలోకి తీసుకోలేదని స్పష్టం చేసింది.సెషన్స్ కోర్టు తుదితీర్పు వెలువరించక ముందు గ్రీష్మ తరుఫులు న్యాయవాదులు కోర్టుకు తమ వాదనల్ని వినిపించారు. తన వాదనలలో గ్రీష్మ ఉన్నత విద్యావంతురాలు. చిన్న వయస్సు. తాను మారేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. కానీ కోర్టు డిఫెన్స్ లాయర్ వాదనల్ని తోసిపుచ్చారు. గ్రీష్మ తీరు దారుణంతీర్పు వెలువరించే సమయంలో అదనపు సెషన్స్ కోర్టు గ్రీష్మ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. లైంగిక సాన్నిహిత్యాన్ని సాకుగా చూపి షరోన్‌ను గ్రీష్మను ఆహ్వానించింది. ఆ తర్వాత విషం కలిపిన కషాయాన్ని షరోన్ రాజ్‌కు తాపించి, ఆపై దారుణానికి ఒడిగట్టిన గ్రీష్మా చర్యను విస్మరించలేమని పేర్కొంది.అంతేకాదు, షరోన్ కలిసేందుకు వచ్చిన గ్రీష్మా వెంటన విషం కలిపిన కషాయాన్ని తెచ్చుకుంది. ఆ కషాయంపై షరోన్ అనుమానం వ్యక్తం చేస్తూ వీడియో రికార్డ్ చేయడం, వద్దని గ్రీష్మ వద్దని వారించడం వంటి ఆధారాలు ఉన్నాయి. గ్రీష్మ ఇచ్చిన కషాయం తాగిన షరోన్ 11 రోజుల పాటు చుక్క నీరు కూడా తాగకుండా ప్రాణాలతో పోరాడాడు ’ అని కోర్టును ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. గ్రీష్మపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదుభారతీయ శిక్షాస్మృతి (IPC) కింద గ్రీష్మపై ఐపీసీ సెక్షన్లు 302 (హత్య), 364 (హత్య చేయాలనే ఉద్దేశ్యంతో అపహరణ), 328 (ప్రాణానికి హాని కలిగించే ఉద్దేశ్యంతో విషం ప్రయోగించడం), 203 (తప్పుడు సమాచారం అందించడం ద్వారా న్యాయాన్ని అడ్డుకోవడం) కింద కేసులు నమోదయ్యాయి. అసలేం జరిగిందంటే..పరసాలా ప్రాంతానికి చెందిన షరోన్ రాజ్(23), గ్రీష్మలు కొన్నాళ్లు ప్రేమించుకున్నారు. అయితే ఆమెకు మరో వ్యక్తితో వివాహాం నిశ్చయమైంది. ఆ తర్వాత షరోన్-గ్రీష్మల మధ్య దూరం పెరిగింది. వృత్తి రిత్యా వేరే ఊర్లో ఉంటున్న షరోన్.. అక్టోబర్ 10న షరోన్ పరసాలాకు వచ్చాడు. అక్టోబర్ 14న ఉదయం షరోన్‌కు ఫోన్ చేసింది. కలవాలని ఉందని.. బయటకు వెళ్దామని చెప్పింది. దీంతో తన స్నేహితుడితో కలిసి రామవర్మంచిరై(కన్యాకుమారి, తమిళనాడు)లో గ్రీష్మ ఇంటికి వెళ్లాడు షరోన్.స్నేహితుడు బయటే ఎదురుచూస్తుండగా.. ఒక్కడే ఇంట్లోకి వెళ్లాడు. అయితే.. కాసేపటికే పొట్టచేత పట్టుకుని వాంతులు చేసుకుంటూ బయటకు వచ్చాడు షరోన్. దీంతో కంగారుపడ్డ స్నేహితుడు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆ దారిలోనూ ఇద్దరూ చాట్ చేసుకున్నారు. ‘‘కషాయంలో ఏం కలిపావు?’’ అని షరోన్ గ్రీష్మను నిలదీశాడు. అయితే తానేం కలపలేదని.. బహుశా వికటించిందేమో అని సమాధానం ఇచ్చిందామె. అక్కడితో వాళ్లిద్దరి ఛాటింగ్ ఆగిపోయింది.నీలిరంగులో వాంతులు చేసుకున్న షరోన్‌ను పరసాలా ప్రభుత్వాసుపత్రిలో చేర్చాడు స్నేహితుడు. ఆపై మెరుగైన వైద్యం కోసం తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అయితే.. అక్కడ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు నార్మల్ రావడంతో.. ఇంటికి పంపించేశారు. రెండు రోజుల తర్వాత షరోన్ పరిస్థితి విషమించింది. దీంతో తిరిగి తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్సలో షరోన్‌కు లంగ్స్, కిడ్నీ ఒక్కొక్కటిగా దెబ్బ తింటూ వచ్చాయి. ఈలోపు షరోన్ నుంచి మెజిస్ట్రేట్ సమక్షంలో వాంగ్మూలం సేకరించారు పోలీసులు. మరోవైపు వైద్యులు.. అతను తాగిన డ్రింక్‌లో పురుగుల మందు కలిసిందని నిర్ధారించుకున్నారు. అవయవాలన్నీ పాడైపోయి అక్టోబర్ 25వ తేదీన గుండెపోటుతో షరోన్ ప్రాణం విడిచాడు.ఎస్కేప్.. అరెస్ట్..తమ బిడ్డ చావుకు గ్రీష్మ కుటుంబం కారణమంటూ షరోన్ పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న ఆ కుటుంబం కోసం గాలించారు. చివరకు.. అదే ఏడాది నవంబర్ 22న గ్రీష్మ కుటుంబాన్ని అరెస్ట్ చేశారు. అయితే పీఎస్‌లో ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించడం నాటకీయ పరిణామాలకు దారి తీసింది.వాదనలు ఇలా.. ఇది అత్యంత అరుదైన కేసు అని ప్రాసిక్యూషన్ వాదించారు. ఆమె కేవలం ఓ యువకుడ్ని మాత్రమే చంపలేదు. ప్రేమ అనే భావోద్వేగాన్ని ప్రదర్శించి ఓ ప్రాణం బలి తీసుకుంది. అనుకున్న ప్రకారమే.. ఆమె ప్రేమను అడ్డుపెట్టి మరీ అతన్ని తన ఇంటికి రప్పించి ఘోరానికి తెగబడింది. అతని చంపడానికి ఆమె అన్నివిధాల ప్రయత్నించింది. ఆస్పత్రిలో చికిత్స పేరిట 11 రోజులపాటు అతను నరకం అనుభవించాడు. ఇదేదో హఠాత్తుగా జరిగింది కాదు. షరోన్ కూడా ఎన్నో కలలు కన్నాడు. కానీ, గ్రీష్మ వాటిని చెరిపేసింది. కాబట్టి, ఆమెపై కనికరం చూపించాల్సిన అవసరం లేదు. ఆమెకు ఉరే సరి అని వాదించారు.మరోవైపు.. గ్రీష్మ తరఫున వాదనలు వినిపించిన లాయర్ అజిత్ కుమార్.. కేసులో వాస్తవ ఆధారాలు(Circumstantial Evidence) లేనప్పుడు మరణశిక్ష విధించడం కుదరని వాదించారు. ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలో గ్రీష్మ ఆత్మహత్యకు ప్రయత్నించింది. వాస్తవానికి ఆమె షరోన్ నుంచి బయటపడేందుకు ప్రయత్నించింది. కానీ, ఆ యువకుడు ఆమెను వదల్లేదు. వ్యక్తిగత చిత్రాలు చూపించి బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. బెడ్రూం వీడియోలు బయటపెడతానని బెదిరించాడు. మానసికంగా ఆమెను ఎంతో వేధించాడు. అలాంటప్పుడు ఏ మహిళ అయినా ఎందుకు ఊరుకుంటుంది. ఆమె మెరిట్ విద్యార్థిని. శిక్ష విషయంలో కనికరం చూపించాల్సిందే’’ అని వాదించారు.దాదాపు రెండేళ్లపాటు ఈ కేసు విచారణ జరిగింది. చివరకు.. జనవరి 17వ తేదీన గ్రీష్మను, ఆమె మేనమామ నిర్మలాకుమారన్‌ను దోషులుగా నిర్ధారించింది. అదే సమయంలో గ్రీష్మ తల్లి సింధును నిర్దోషిగా ప్రకటించి విడుదల చేసింది. మూఢనమ్మక కోణం!మూఢనమ్మకంతో గ్రీష్మ కుటుంబం తమ బిడ్డ ప్రాణం తీసిందని షరోన్ కుటుంబం ఆరోపించింది. ఆమెకు ఎంగ్మేజ్మెంట్ అయ్యాక మనసు విరిగిన షరోన్.. తన పనిలో తాను ఉన్నాడని, గ్రీష్మానే ఫోన్ చేసి అతన్ని పరసాలాకు రప్పించిందన్నారు. ‘‘గ్రీష్మ కుటుంబానికి షరోన్ రాజ్ నచ్చలేదు. అందుకే మరో వ్యక్తితో ఆమెకు పెళ్లి ఫిక్స్ చేసి.. ఎంగేజ్మెంట్ కూడా కానిచ్చేశారు. ఆపై పెళ్లిని అర్ధాంతరంగా వాయిదా వేశారు. అయితే.. గ్రీష్మకు పెళ్లైన వెంటనే భర్త మరణించే గండం ఉంది. ఆ దోషం పొగొట్టేందుకు షరోన్‌ను బలి పశువును చేశారు. బలవంతంగా ఆమె నుదుట కుంకుమ పెట్టించారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన షరోన్ నుదుటిపై కూడా కుంకుమ ఉందని, ఆ విషయాన్ని వెంట ఉన్న స్నేహితుడు సైతం నిర్ధారించాడని అంటోంది. పక్కా ప్లాన్‌తో ఆమెతో బలవంతపు వివాహం జరిపించి.. ఆపై పురుగుల మందు తాగించి షరోన్ మరణానికి కారణమయ్యారని ఆరోపిస్తూ వచ్చింది. అయితే పోలీసులు ఈ వాదనను తోసిపుచ్చారు. -
AP: ప్రేమోన్మాది ఘాతుకం.. దాడిలో ఇంటర్ విద్యార్థిని మృతి
సాక్షి, నంద్యాల: ఏపీలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించలేదనే కారణంగా యువతిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఈ ప్రమాదంలో బాధితురాలు మృతిచెందింది. అనంతరం తాను నిప్పంటించుకొని అతడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. నంద్యాల జిల్లా నందికొట్కూరు బైరెడ్డి నగర్‌కు చెందిన ఇంటర్ విద్యార్థిని తాను ప్రేమిస్తున్నానంటూ రాఘవేంద్ర వేధింపులకు గురిచేశాడు . అయితే యువతి అతని ప్రేమను అంగీకరించకపోవడంతో.. లహరిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. అనంతరం తాను నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలు కాగా.. పరిస్థితి విషమంగా మారింది. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా యువతి పూర్తిగా కాలిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. లహరి మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. -
నాన్‌వెజ్ తినొద్దని వేధించి..
ఎయిరిండియా పైలట్ అనుమానాస్పద కలకలం రేపింది. దీనికి ఆమె బాయ్ ఫ్రెండే కారణమని బంధువులు ఆరోపించారు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు..ఎయిరిండియాలో పైలట్‌గా పనిచేస్తున్న 25ఏళ్ల సృష్టి తులి ఈనెల 25న ముంబైలోని అంధేరీ ఈస్ట్‌లోని ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆదిత్య పండిట్ తరచూ ఆమెను వేధించేవాడని, ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించేవాడని సృష్టి కుటుంబం ఆరోపించింది. నాన్ వెజ్ తినవద్దు అంటూ కట్టడి చేసేవాడని తెలిపింది. అతనే హత్య చేసి ఉంటాడని ఫిర్యాదు చేశారు. దీంతో నవంబర్ 26న కేసు నమోదు చేసిన పోలీసులు పండిట్‌ను అరెస్టు చేశారు. కోర్టు అతడిని నవంబర్ 29 వరకు పోలీసు కస్టడీకి పంపింది. పోలీసుల సమాచారం ప్రకారం ఆమె మృతదేహానికి సమీపంలో లేదా ఆమె ఫ్లాట్‌లో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. సృష్టి కమర్షియల్ పైలట్. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆమె గత ఏడాది జూన్ నుంచి ఉద్యోగ నిమిత్తం ముంబైలో నివసిస్తోంది. రెండేళ్ల క్రితం కమర్షియల్ పైలట్ లైసెన్స్ కోసం శిక్షణ పొందుతున్న సమయంలో సృష్టి, పండిట్లు ఢిల్లీలో కలిశారు. ఆ పరిచయం ప్రేమగా మారింది. అయితే ఈ ట్రైనింగ్‌లో ఆదిత్య పండిట్ పైలట్‌గా ఎంపిక కాలేదు.ఘటనకు ముందు దాదాపు ఐదు నుంచి ఆరు రోజుల పాటు పండిట్ సృష్టితో కలిసి అంధేరి ఫ్లాట్‌లో ఉన్నాడు. సోమవారం (నవంబర్ 25) అర్ధరాత్రి దాటిన తర్వాత అతను కారులో ఢిల్లీకి బయలుదేరాడు. ఈ సమయంలో సృష్టి అతనికి ఫోన్ చేసి, ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. అతడు ముంబైకి తిరిగి వచ్చేసరికి డోర్ లాక్ చేసి ఉంది. ఎంత పిలిచినా తీయకపోవడంతో ఆమె స్నేహితురాలు ఉర్వి పంచల్‌ను సంప్రదించి, కీమేకర్ సాయంతో తలుపు తెరిచారు. కానీ అప్పటికే కేబుల్ వైర్‌తో ఉరి వేసుకుంది. అంధేరీ ఈస్ట్‌లోని సెవెన్ హిల్స్ ఆసుపత్రికి తరలించగా, ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.సృష్టి మామ ఆరోపణలు'పండిట్‌ను సృష్టి చాలా గాఢంగా ప్రేమించింది. కానీ అతడు ఆమెను బాగా వేధించేవాడు. బహిరంగంగా దుర్భాషలాడేవాడు. మాంసాహారం తినడం మానేయాలని కూడా ఒత్తిడి చేశాడు. ఆమె పట్ల పండిట్ అసభ్యంగా ప్రవర్తించడం ఇతర బంధువులు కూడా చూశారు. అలాగే ఒక పార్టీలో మాంసాహారం తిన్నందుకు అందరిముందూ అరిచాడు. ఆమె కారును పాడు చేసి, రోడ్డుపై ఒంటరిగా వదిలేసివెళ్లిపోయాడు. ఇటీవల పండిట్ సోదరి నిశ్చితార్థం ఫంక్షన్‌కు సృష్టి వెళ్లలేకపోవడంతో దాదాపు 10 రోజుల పాటు మాట్లాడలేదు. దీంతో సృష్టి మానసికంగా కృంగి పోయింద'ని సృష్టి మామ ఆరోపించారు. -
ప్రియురాలిని హత్య చేసి.. రాత్రంతా మృతదేహంతోనే గడిపి..
బనశంకరి: అపార్టుమెంట్లో అసోం యువతి హత్యకు గురైంది. ఈ ఘటన బెంగళూరు ఇందిరానగర పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. యువతి మాయ గోగాయ్ (26) హెచ్ఎస్ఆర్ లేఔట్లో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ అదే ప్రాంతంలో నివసిస్తోంది. ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం మాయ, ప్రియుడు ఆరవ్ అర్ని ఇందిరానగరలో ఓ సర్వీసు అపార్టుమెంటులో ఫ్లాటు బుక్ చేసుకుని వెళ్లినట్లు సీసీ కెమెరాలో నమోదైంది. 24న ఆదివారం మాయ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. హత్య తర్వాత హంతకుడు సిగరెట్ తాగుతూ సోమవారమంతా మృతదేహంతోనే కాలం గడిపాడు. మంగళవారం ఉదయం క్యాబ్‌బుక్ చేసుకుని ఉడాయించాడు. తరువాత అపార్టుమెంటు సిబ్బంది శవాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ముక్కలు చేసి తరలించాలని ప్లాన్ చేసి ఉంటాడని, చివరకు ఆ ప్రయత్నం విరమించుకున్నాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. యువతిని ఆరవ్ ఆర్నీ ఊపిరాడకుండా చేసి చాకుతో పొడిచి హత్యచేశాడు. చేతులను కూడా కసితీరా పొడిచాడు. పోలీసులు మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆరవ్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. -
లవ్ ఈజ్ ఇన్‌ద ఎయర్ : లవ్ ప్రపోజల్ వీడియో వైరల్
తాజ్‌మహల్ ముందే లవ్ ప్రపోజ్ చేయాలా ఏంటి? ఈఫిల్ టవర్ముందు నిలబడే ఐ లవ్ యూ చెప్పాలా? మంచి ఘడియ ముంచుకు రావాలే గానీ ఎక్కడైనా మనసులోని ప్రేమను వ్యక్తం చేయొచ్చు. అందుకే ఇండిగో విమానంలో తన ప్రియుడికి ప్రపోజ్ చేసిందో ప్రేయసి. లవ్ ఈజ్ ఇన్ ది ఎయిర్ అన్నట్టున్న ఈ వీడియో నెట్టింట సందడి చేస్తోంది. "నేను గాలిలో ప్రపోజ్ చేశాను" అంటూ ప్రియురాలు ఐశ్వర్య బన్సల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ అందమైన ఈ వీడియో ప్రేమికుల మనసు దోచుకుంటోంది.బన్సల్, ప్రియుడు అమూల్య గోయల్ ఫ్లైట్ ఎక్కడంతో వీడియో ప్రారంభమవుతుంది. కొన్ని సెకన్ల తర్వాత, బన్సల్ తన బాయ్‌ఫ్రెండ్ వైపు నడుచుకుంటూ వెళ్లి మోకాళ్లపై నిలబడి తన ప్రియుడికి ప్రపోజ్ చేసింది. దీంతో ప్రియుడు ఫుల్ ఖుష్ ఆగి ఆ క్షణంలోనే ఓకే చెప్పేసాడు. అంతే క్షణం ఆలస్యంగా తన బెటర్ హాఫ్ వేలికి ఉంగరాన్ని తొడిగింది. అంతేకాదు దీన్ని ఇండిగో కూడా సెలబ్రేట్ చేసింది. ఫ్లైట్ అటెండెంట్ మైక్రోఫోన్ తీసుకుని, ఇతర ప్రయాణీకుల దృష్టిని ఆకర్షిస్తూ ఈ పెళ్లి ప్రపోజ్ ప్రకటన చేయడం విశేషం. తన జీవితంలో ఎంతో అందమైన ఈ క్షణాలు చాలా ప్రత్యేకంగా ఉండాలని భావించాను. కానీ ఊహించిన దాని కంటే మించి ఇంత అందంగా ఉంటుందని అనుకోలేదు. సిబ్బంది ఒప్పుకుంటారో లేదో అని భయపడ్డా.. అన్నీ అనుకున్నట్టుగాజరిగాయంటూ అంతులేని సంతోషాన్ని వ్యక్తం చేసింది బన్సల్. ఈ ప్రణయ పక్షుల వీడియోను మీరు కూడా చూసేయండి మరి! View this post on Instagram A post shared by Aishwarya Bansal (@aishwaryabansal_) -
లవ్‌బర్డ్స్ కొత్త ప్రయాణం: సిగ్గులమొగ్గైన కొత్త పెళ్లికూతురు అమీ
నటి, మోడల్ అమీ జాక్సన్ ఎట్టకేలకు తన ప్రియుడిని పెళ్లాడింది. తాజాగా (ఆగస్ట్ 25, 2024న), నటుడు మ్యూజీషియన్ ఎడ్వర్డ్ వెస్ట్ విక్‌ను వివాహం చేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా ఈ లవ్‌బర్డ్స్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. సరికొత్త ప్రయాణం మొదలైంది అంటూ తమ సంతోషాన్ని వెల్లడించారు. ఇటలీలో జరిగిన ఈ వివాహ వేడుకలో ఎడ్ వెస్ట్విక్ అమీని ఎత్తుకొని ముద్దుపెట్టుకోవడంతో అమీ జాక్సన్ సిగ్గుల మొగ్గయింది. ఈ ఫోటోలు ఇంటర్నెట్లో సందడి చేస్తున్నాయి.అంతకుముందు బ్రిటిస్ వ్యాపారవేత్త ఆండ్రియాస్ పనాయోటౌతో కొన్నిరోజులు సహజీవనం చేసింది. ఈ క్రమంలోనే వీరికి ఒక మగబిడ్డకూడా పుట్టాడు.కానీ ఆ తరువాత విభేదాల కారణంగా ఇద్దరూ విడిపోయారు. పనాయోటౌతో తన బంధం ముగిసినట్లు స్వయంగా అమీ జాక్సన్ 2021లో ప్రకటించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Ed Westwick (@edwestwick) -
పెళ్లిలో ప్రియురాలి హల్చల్.. పెళ్లికొడుకుపై దాడికి యత్నం
అన్నమయ్య: తనకు తెలియకుండా మరో అమ్మాయితో వివాహం చేసుకుంటున్నాడని ఓ ప్రియురాలు పెళ్లిలో హల్చల్ చేసింది. ఆగ్రహంతో పెళ్లి కొడుకుపై దాడికి దిగింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లా నందలూరు మండలం అరవపల్లిలో చోటుచేసుకుంది. దీంతో పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది. నందలూరుకు చెందిన యువతితో రైల్వే కోడూరుకు చెందిన సయ్యద్ భాషాతో ఈ రోజు వివాహం జరగుతున్న సమయంలో ప్రియురాలు రంగంలోకి దిగింది. సయ్యద్ భాషా.. తిరుపతికి చెందిన వివాహిత జయతో వివాహేతర సంబంధం కొనసాగించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సయ్యద్ భాషా తనను కాదని వేరే అమ్మాయినీ వివాహం చేసుకోవడానికి సిద్దపడడంతో జయ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. షాదిఖానాలో పెండ్లి కొడుకు సయ్యద్ బాషాపై కత్తి, యాసిడ్‌తో దాడి యత్నించింది. ఈ క్రమంలో చోటుచేసుకున్న తోపులాటలో యాసిడ్ పడి ఒక్క మహిళలకు తీవ్రంగా, మరో మహిళలు స్వల్పంగా గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రియురాలు జయను అదుపులోకి తీసుకొని నందలూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివాహం ఆగిపోవడంతో పెళ్లి కుమార్తె బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. -
మాల్యా ఇంట పెళ్లి సందడి : లవర్‌తో సిద్ధూ వెడ్లాక్ (ఫొటోలు)
-
‘నాకీ ఉద్యోగం కావాలి సర్.. లేదంటే నా లవర్‌ను పెళ్లి చేసుకోలేను’ వైరల్ స్టోరీ
చదువు పూర్తయిన తరువాత ఉద్యోగాల వేటలో పడటం, ఉద్యోగాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగడం ఇదంతా తెలిసిందే. ఎలాగోలా కష్టపడి ఉద్యోగం సంపాదించడానికి రక రకాల ప్రయత్నాలు చేయడమూ కొత్తేమీ కాదు. కానీ ఒక యువకుడు ఉద్యోగం కోసం వెరైటీగా దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో ఇది వార్తల్లో నిలిచింది.hiring can be fun too 🥲 pic.twitter.com/6RnKnOWhIM— Dipalie (@dipalie_) June 13, 2024విషయం ఏమిటంటే.. ఉద్యోగ యత్నాల్లో భాగంగా రెజ్యూమేను శ్రద్ధగా తయారు చేసుకుంటాం. ఇందులో మనకు సంబంధించిన అన్ని నైపుణ్యాలను పొందు పరుస్తాం. అలా ఉద్యోగం ఇచ్చే వ్యక్తులను, సంస్థలను ఇంప్రెస్ చేయడానికి చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తాం. కానీ ఈ స్టోరీలోని వ్యక్తి మాత్రం రెజ్యూమ్‌లో తాను సంబంధిత ఉద్యోగానికి ఎలా అర్హుడినో చెబుతూనే... తన ప్రేమ సంగతిని కూడా చెప్పుకొచ్చాడు. తనకీ ఉద్యోగం రాకపోతే తన చిన్నప్పటిని స్నేహితురాల్ని పెళ్లి చేసుకోలేను అంటూ మొరపెట్టుకున్నాడు. ఈ ఉద్యోగానికి మీరు అర్హులు అని ఎందుకు అనుకుంటున్నారు? అనే ప్రశ్నకు సమాధానంగా ‘‘నాకు ఈ పొజిషన్‌కి కావాల్సిన అన్ని నైపుణ్యలు నాకు ఉన్నాయి. నేను దీనికి 100 శాతం పర్ఫెక్ట్ అని అనిపిస్తోంది’’ అని రాశాడు. అలాగే ‘‘ఈ ఉద్యోగం నాకు రాకపోతే నేను నా చిన్ననాటి స్నేహితురాలని పెళ్లి చేసుకోలేను. ఎందుకంటే వాళ్ల నాన్న నాకు ఉద్యోగం లేకపోతే తన కూతురిని ఇచ్చి పెళ్లి చేయను అంటున్నాడు’’ అని రాసుకొచ్చాడు. అర్వా హెల్త్ ఫౌండర్, సీఈవో డిపాలీ బజాజ్ ఇటీవల ఒక అభ్యర్థి ఉద్యోగ దరఖాస్తు స్క్రీన్‌షాట్‌ను ఎక్స్‌లో షేర్ చేశారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. ‘ఫైరింగ్ కెన్ మీ ఫన్ టూ’ అనే క్యాప్షన్‌తో ఆమె దీన్ని ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు కొంతమంది అతని పట్ల సానుకూలంగా స్పందించడం విశేషం. ‘వారిద్దరి జీవితాలు ఈ జాబ్‌పైనే ఆధారపడి ఉన్నాయి’ అని ఒకరు ఫన్నీగా కామెంట్ చేశారు. అతని నిజాయితీని గర్తించైనా అతనికి ఉద్యోగం ఇవ్వాలంటూ మరొకరు కమెంట్ చేశారు. -
ఏలూరు జిల్లాలో దారుణం.. ప్రేమ పేరుతో యువతి గొంతు కోసి..
సాక్షి, ఏలూరు: ఏలూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో ఓ ఉన్మాది ఘాతుకానికి తెగబడ్డాడు. తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో యువతిపై కత్తితో దాడి చేసి ఆమెను హత్య చేశాడు. అనంతరం తానుకూడా ఆత్మహత్యాయత్నం చేశాడు.వివరాలు.. ఏలూరు మండలం సత్రంపాడు ఎమ్మార్సీ కాలనీకి చెందిని జక్కుల రత్న గ్రేసి(22) ప్రైవేటు పాఠశాలలో ఫ్యాకల్టీగా పనిచేస్తోంది. కొంతకాలంగా యువతిని ప్రేమిస్తున్నానంటూ తొట్టిబోయిన ఏసురత్నం(23) అనే యువకుడు వెంటబడుతున్నాడు. ఈ క్రమంలో ఈనె 26న మరో యువకుడితో గ్రేసికి కుటుంబ సభ్యులు నిశ్చితార్దం జరిపించారు.విషయం తెలుసుకున్న ఏసురత్నం.. కోపంతో యువతిని కలవాలని ఆమె ఇంటి పక్కకు పిలిచి.. తన వెంట తెచ్చుకున్న కత్తితో పలుమార్లు మెడపై దాడిచేశాడు. తీవ్ర రక్తస్రావంతో యువతీ అక్కడికక్కడే మృత్యవాతపడింది. అనంతరం ఏసురత్నం కూడా పీక కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అతడి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న త్రీటౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియుడి కోసం వేలకోట్ల సంపదను వదిలేసిన బిజినెస్ టైకూన్ కూతురు
నిజమైన ప్రేమ ఎంతటి కష్టాన్నైనా ఎదురిస్తుంది. స్వచ్ఛమైన ప్రేమ ప్రేమించిన మనిషికోసం ఎంతటి త్యాగానికైనా సాహసానికైనా పూను కుంటుంది. ఇవి సినిమాడైలాగుల్లా, డ్రమటిగ్గా అనిపిస్తున్నాయా? కానీ ఈ మాటల్ని అక్షరాలా నిజం చేసింది ఓ మహిళ . ఆమె ఎవరో తెలుసుకుందాం రండి..! కుటుంబాన్ని, వేలకోట్ల సంపదను వదులుకుని మరీ తన ప్రియుడు కోసం తృణప్రాయంగా త్యజించింది. మలేషియాకు చెందిన కోటీశ్వర కుటుంబానికి చెందిన ఏంజెలిన్ ఫ్రాన్సిస్. ఆమె మలేషియా బిజినెస్ టైకూన్ కూ కే పెంగ్ కుమార్తె. ఈయన కోరస్ హోటల్స్ డైరెక్టర్. మలేషియాలో 44వ ధనవంతుడు. అంతేకాదు మాజీ మిస్ మలేషియా పౌలిన్ సాయ్ కుమార్తె. ధనిక కుటుంబానికి చెందిన ఏంజిలిన్ ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలో చదువుతున్నప్పుడు, మిత్రుడు జెడిడియాతో ప్రేమలో పడింది. అతణ్ణే పెళ్లాడనుకుంది. భయపడుతూనే తల్లిదండ్రులను సంప్రదించింది. కానీ ఏంజెలిన్ తల్లిదండ్రులు వీరి ప్రేమను అంగీకరించ లేదు. భిన్న ఆర్థిక నేపథ్యాలను ఏంజెలిన్ తండ్రి వీరి పెళ్లికి ససేమిరా అన్నాడు. బాయ్‌ఫ్రెండ్ కావాలో లేక వేల కోట్ల వారసత్వ ఆస్థి కావాలో తేల్చుకో మన్నాడు. చివరికి ఏంజెలిన్ జెడిడియా ఫ్రాన్సిస్‌ను వివాహం చేసుకోవడానికే నిర్ణయించుకుంది. ఈ పెళ్లి చేసుకోవడం ద్వారా వారసత్వంగా దాదాపు రూ. 25వేల కోట్లు (300 మిలియన్ల డాలర్లు)ను వదిలేసుకుంది. విలాసవంతమైన జీవితం కన్నా ప్రేమించినవాడితో జీవితం చాలునుకుంది. అలా 2008లో ఏంజెలిన్, జెడిడియా వివాహం చేసుకున్నారు. అయితే సాధారణమైన ప్రియుడి కోసం వేల కోట్ల సంపదను కుటుంబాలను వదులుకున్న ఉదంతం మరొకటి కూడా ఉంది. జపాన్ యువరాణి మాకో ప్రేమకోసం అపారమైన సంపదను, రాయల్ బిరుదును కూడా వదులుకుంది. 2021లో మాకో, కీ కొమురోవాను వివాహం చేసుకుంది. పాకిస్థాన్‌కు చెందిన ఓ మహిళ ఆన్లైన్లో గేమ్ ఆడుతూ భారత్‌కు చెందిన వ్యక్తితో ప్రేమలో పడి, ఇండియాకు వచ్చేసిన సంగతి తెలిసిందే. -
ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న 'లవర్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మరో రియలస్టిక్ ప్రేమకథా సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ అప్పుడూ ఇప్పుడూ అంటూ ఊరిస్తూ వచ్చారు. కానీ ఫైనల్‌గా అధికారిక ప్రకటన వచ్చేసింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. అయితే ఈ సినిమా ఒకేసారి మూడు ఓటీటీల్లో రిలీజ్ కానుండటం విశేషం. ప్రేమకథలకు సినిమాల్లో ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. అలా ప్రస్తుత సమాజంలో మనం చూస్తున్న ఓ పాయింట్ ఆధారంగా తీసిన సినిమానే 'లవర్'. దీన్ని తెలుగులో 'ట్రూ లవర్' పేరుతో ఫిబ్రవరి 10న థియేటర్లలో విడుదల చేశారు. తమిళంలో మోస్తరు వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. తెలుగులో మాత్రం రూ.2 కోట్ల వరకే కలెక్షన్ అందుకుంది. కంటెంట్ బాగున్నా సరే రవితేజ 'ఈగల్', రజినీకాంత్ 'లాల్ సలామ్' మూవీస్.. అదే టైంలో రిలీజ్ కావడంతో దీనికి దెబ్బపడింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) 'లవర్' సినిమా మార్చి తొలివారంలోనే ఓటీటీలోకి వచ్చేస్తుందని హడావుడి చేశారు కానీ ఇప్పుడు అధికారిక ప్రకటన రావడంతో అదంతా ఉత్తిదే అని తేలిపోయింది. మార్చి 27 నుంచి హాట్‌స్టార్, సింప్లీ సౌత్, టెంట్ కొట్టా అనే మూడు ఓటీటీల్లో ఇది స్ట్రీమింగ్ కానుంది. 'లవర్' కథ విషయానికొస్తే.. అరుణ్ (మణికందన్), దివ్య (శ్రీ గౌరిప్రియ).. ఇంజినీరింగ్ చేస్తున్నప్పుడే ప్రేమలో పడతారు. దివ్య సెటిల్ అయిపోగా, అరుణ్ మాత్రం అలానే ఉండిపోతాడు. ప్రతి విషయంలో దివ్యని అనుమానిస్తుంటాడు. మరొకరితో మాట్లాడినా సహించలేడు. అరుణ్ ప్రవర్తనతో విసిగిపోయిన దివ్య.. బ్రేకప్ చెప్పాలనుకుంటుంది. కానీ అరుణ్ సారీ చెప్పగానే కరిగిపోతుంది. అలాంటి వీళ్లిద్దరి జీవితాల్లో ఓ టూర్ కలకలం రేపుతోంది. చివరకు ఏమైంది? అనేదే మూవీ. (ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన రెండు తెలుగు సినిమాలు) Love is Battle, Love is War, Love is Growing up! 🫶🏻 'LOVER' Arrives on March 27 on #DisneyplusHotstar @Vyaaaas @RSeanRoldan @Manikabali87 @srigouripriya @iamkannaravi @MillionOffl @Yuvrajganesan @mrp_entertain pic.twitter.com/1yuI8whZRf — Disney+ Hotstar Tamil (@disneyplusHSTam) March 12, 2024 -
చంపడానికొచ్చి.. హతమయ్యాడు
మల్యాల(చొప్పదండి): ప్రేమ పేరుతో మూడేళ్లుగా వేధిస్తున్న యువకుడు.. నేరుగా ఆ యువతి ఇంటికే వెళ్లి కుటుంబ సభ్యులపై కత్తితో దాడికి తెగబడ్డాడు. యువతి కుటుంబ సభ్యులు ఆత్మరక్షణ కోసం ఆ యువకుడిపై దాడి చేయగా.. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కళ్లపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన బోగ మహేశ్ తన దూరపు బంధువైన తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ మూడేళ్లుగా ఫోన్లో వేధిస్తున్నాడు. భరించలేని ఆ యువతి ఈనెల 2న మల్యాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కక్ష పెంచుకున్న మహేశ్ ఆ యువతిని చంపేందుకు కత్తితో సోమవారం మధ్యాహ్నం 2.20 గంటలకు తక్కళ్లపల్లిలోని యువతి ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయానికి మొదట యువతి తల్లి కనపడగా. ఆమెపై కత్తితో దాడికి యత్నించాడు. తప్పించుకునే క్రమంలో కత్తి ఆమె కాలికి తగిలింది. అనంతరం అక్కడే మంచంలో పడుకున్న యువతి తాతపైనా దాడి చేసి కత్తితో పొడవగా ఆయనకూ గాయాలయ్యాయి. ఈ క్రమంలో యువతి తల్లి అక్కడే ఉన్న తన తమ్ముడు నర్సయ్యతో కలిసి మహేశ్‌ని ఆపే ప్రయత్నం చేస్తుండగానే మరోసారి దాడికి యత్నించాడు. ఈ క్రమంలో ముగ్గురి మధ్య జరిగిన ఘర్షణలో మహేశ్ కింద పడిపోయాడు. అక్కడే ఉన్న బండరాయితో మహేశ్‌పై యువతి తల్లి దాడి చేయగా.. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. దాడిలో గాయపడిన నర్సయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్‌కు తరలించారు. పంచాయితీ పెట్టించినా మారని తీరు యువతికి దూరపు బంధువు కావటంతో పరిచయం పెంచుకున్న మహేశ్.. ఆమె ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ప్రేమించాలంటూ మూడేళ్లుగా వెంటపడి వేధిస్తున్నాడు. విషయాన్ని యువతి తన తల్లిదండ్రులకు చెప్పడంతో రెండేళ్ల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి కొంతకాలం యువతికి ఫోన్ చేయకుండా దూరంగా ఉన్న మ హేశ్.. ఇటీవల కొద్దిరోజులుగా ఫోన్లో వేధిస్తున్నాడు. ఈ క్రమంలో పలుమార్లు పంచాయితీ పెట్టించారు. పెద్దలతో నూ హెచ్చరించారు. అయినా అతడిలో మాత్రం మార్పు రాలేదు. యువతి జన్మదినాన్ని డెత్ డేగా మారుస్తానంటూ పోస్టులు యువతి జన్మదినం ఈనెల 6న ఉండగా.. డెత్‌డేగా మా రుస్తానంటూ మహేశ్ పోస్టులు పెడుతున్నాడు. దీంతో ఈనెల 2న పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశా మని సదరు యువతి తెలిపింది. కాగా, మహేశ్ కుటుంబసభ్యుల ఫిర్యాదుతో యువతితోపాటు తల్లి, అన్న, వది న, అమ్మమ్మ, తాతయ్యపై కేసు నమోదు చేసినట్లు మల్యా ల ఎస్సై అబ్దుల్ రహీం తెలిపారు. సంఘటన స్థలాన్ని డీ ఎస్పీ రఘుచందర్ స్థానిక పోలీసులతో కలిసి పరిశీలించా రు. యువతి ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశా రు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
నటిని పెళ్లాడిన టైగర్ నాగేశ్వరరావు విలన్.. వీడియో వైరల్!
ప్రస్తుతం ఎక్కడా చూసినా పెళ్లిళ్ల సందడే కనిపిస్తోంది. సమ్మర్ సీజన్ మొదలు కానున్న నేపథ్యంలో వచ్చే మూడు నెలలు పెళ్లిళ్లు జరగనున్నాయి. సినీ ఇండస్ట్రీలోనూ పెళ్లి కళ మొదలైంది. తాజాగా మరో నటుడు ఓ ఇంటివాడయ్యారు. ప్రముఖ మలయాళ నటుడు సుదేవ్ నాయర్ వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియురాలు, నటి అమర్దీప్ కౌర్‌ను పెళ్లాడారు. గత కొంత కాలంగా డేటింగ్లో ఉన్న వీరిద్దరు.. తాజాగా కేరళ సంప్రదాయం ప్రకారం ఈ జంట ఏడడుగులు వేశారు. వీరి పెళ్లికి బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లి అనంతరం స్థానిక గురువాయూర్ ఆలయంలో ఈ జంట పూజలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు నూతన దంపతులకు అభినందనలు చెబుతున్నారు. కాగా..సుదేవ్ నాయర్ 2014లో గులాబ్ గ్యాంగ్ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాతా దక్షిణాదిలో దాదాపు 30కి పైగా సినిమాల్లో నటించారు. తెలుగులో రవితేజ టైగర్ నాగేశ్వరరావు, నితన్ ఎక్స్‌ట్రార్డీనరీ మ్యాన్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. View this post on Instagram A post shared by Neelakkuyil Entertainments (@neelakkuyil_entertainments) -
ఐదేళ్ల క్రితం అనుకున్న కథ.. ఇన్నాళ్లకు సినిమాగా రిలీజ్
గతేడాది అంచనాల్లేకుండా రిలీజై సూపర్ హిట్ అయిన సినిమా 'గుడ్‌నైట్'. ఆ చిత్ర నిర్మాతలు అదే హీరోగా తీసిన కొత్త మూవీ 'లవర్'. మణికందన్ హీరో కాగా గౌరిప్రియ హీరోయిన్గా నటించింది. ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహించాడు. సీన్ రోల్డర్ సంగీతమందించాడు. తమిళంలో ఈనెల 9న థియేటర్లలో రిలీజ్ కానుండగా.. తెలుగులో ఫిబ్రవరి 10న 'ట్రూ లవర్' అనే పేరుతో విడుదల కానుంది. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ ప్రియాంకతో సహజీవనం, పెళ్లి.. బాయ్‌ఫ్రెండ్ సమాధానమిదే) తాజాగా ఈ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. హీరో మణికందన్ ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు. ''గుడ్‌నైట్' తర్వాత 'లవర్' చేయడం చాలా సంతోషంగా ఉంది. దర్శకుడు ఈ కథని నాకు 2019లోనే చెప్పాడు. అప్పుడు నేను చిన్న చిన్న పాత్రల్లో నటిస్తుండటం వల్ల వేరే నటుడితో ఈ సినిమా చేస్తే బాగుంటుందని చెప్పాను. ఎలాగైనా లవర్ కథని సినిమా తీస్తే బాగుంటుందని అనుకున్నాను. ఎందుకంటే అంతగా నన్ను ఇంప్రెస్ చేసింది. ఈ చిత్రాన్ని అందరం ఇష్టంతో కష్టపడి చేశారు' అని ఇతడు చెప్పుకొచ్చాడు. తెలుగు, తమిళ భాషల్లో ఒక్క రోజు తేడాతో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. తెలుగుకి వచ్చేసరికి 'బేబి' నిర్మాత ఎస్కేఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా విడుదల చేస్తున్నారు. వాలంటైన్స్ వీక్ కాబట్టి మన దగ్గర ఈ సినిమాకు ఏమైనా కలిసొస్తుందేమో చూడాలి. (ఇదీ చదవండి: పెళ్లి అయిపోయిందిగా సినిమాలు మానేస్తారా? క్లారిటీ ఇచ్చిన మెగా కోడలు) -
పుణె హోటల్లో దారుణం.. సాఫ్ట్వేర్ యువతిని కాల్చిచంపిన ప్రియుడు
మహారాష్ట్రలో ఘోరం జరిగింది. ప్రియుడి చేతితో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. ప్రియురాలి క్యారెక్టర్‌పై అనుమానం పెంచుకున్న ప్రియుడు.. ఆమెను పుణెలోని హోటల్‌కు తీసుకెళ్లి తుపాకీతో కాల్చిచంపాడు. ఈ ఘటన పింప్రి చించ్వాడ్లోని హింజవాడిలో ఓయో టౌన్ హౌజ్‌లో ఆదివారం వెలుగుచూసింది. నిందితుడిని రిషబ్ నిగమ్‌గా గుర్తించిన పోలీసులు ముంబైలో అతడిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుణెకు చెందిన వందన ద్వివేది అనే యువతి హింజావడిలోని ప్రముఖ ఐటీసంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని పనిచేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన రిషబ్ నిగమ్‌కు.. వందనకు పదేళ్లుగా పరిచయం ఉంది. ఇద్దరు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల వందనను కలిసేందుకు రిషబ్ పుణె వచ్చాడు. ఇద్దరు కలిసి హింజవడిలో హోటల్లో గదితీసుకొని జనవరి 25 నుంచి అక్కడే ఉంటున్నారు. అయితే శనివారం రాత్రి వందనను తుపాకీ కాల్చి చంపిన రిషబ్.. అనంతరం హోటల్ నుంచి పరారయ్యాడు. ఆదివారం హోటల్ సిబ్బందికి గదిలో వందన మృతదేహం కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వందనపై అనుమానం పెంచుకుని, ఆమెను చంపేయాలన్న ఆలోచనతోనే పుణె వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వందనను కాల్చి చంపిన తరువాత శనివారం రాత్రి 10 గంటలకు ఒక్కడే గది నుంచి బయటకు రావడం సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. హత్య అనంతరం నిందితుడు ముంబైకు పారిపోవడంతో అక్కడే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. నిందితుడికి గన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇతర విషయాలపై దర్యాప్తు జరుపుతున్నారు. చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. అయిదుగురి మృతి -
ప్రేయసి కోసం పరీక్ష.. చిక్కుల్లో ప్రియుడు!
ప్రేమ ఎంత గొప్పదో అని తెగ ఫీలైపోయే ప్రేమికులు.. కొన్నిసార్లు అంతే తిప్పల్ని ఎదుర్కొక తప్పదు కూడా. ఓ యువకుడు ప్రేయసి కోసం ఎవరూ చేయలేని సాహసమే చేసి.. చిక్కుల్ని కొని తెచ్చుకున్నాడు. పంజాబ్‌లో జనవరి 7వ తేదీన బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆరోగ్య సిబ్బంది నియామకాల కోసం పరీక్ష నిర్వహించింది. ఫజిల్కా ప్రాంతానికి చెందిన అంగ్రేజ్ సింగ్ అనే యువకుడు.. తన ప్రేయసి పరంజిత్ కౌర్ బదులు ఆ పరీక్ష రాయాలకున్నాడు. అమ్మాయిల వస్త్రధారణతో పరీక్ష హాల్‌కు వెళ్లాడు. ఫ్రూఫ్ల కింద.. వెంట పరంజిత్ కౌర్ పేరుతో సృష్టించిన ఫేక్ వోటర్ ఐడీ, ఆధార్ కార్డు కూడా తెచ్చుకున్నాడు. కానీ, విధి అతన్ని తప్పించుకోనివ్వలేదు. బయోమెట్రిక్ డివైస్ దగ్గర అడ్డంగా దొరికిపోయాడు. దీంతో ఆ యువతి దరఖాస్తు ఫారమ్‌ను తిరస్కరించిన అధికారులు ఆమెను అనర్హులిగా ప్రకటించిన అంగ్రేజ్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు అక్కడితో ఆగకుండా అతనిపై చట్టపరమైన చర్యలకు యూనివర్సిటీ అధికారులు సిద్ధమవుతున్నారు. -
పీకల్లోతు ప్రేమలో టాలీవుడ్ హీరోయిన్.. ఈ ఏడాదిలోనే!
హీరోయిన్ శ్రద్ధాదాస్ టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అల్లు అర్జున్ నటించిన ఆర్య-2 చిత్రంలో మెరిసింది. ఆ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న శ్రద్ధాదాస్.. రెబల్ స్టార్ నటించిన డార్లింగ్ మూవీలో నటించి అభిమానులను అలరించింది. తెలుగులో స్టార్ హీరోల సరసన మెప్పించిన ముంబై ముద్దుగుమ్మ.. ప్రస్తుతం పెద్ద సినిమాల్లో కనిపించడం లేదు. అయితే తాజాగా తాను సింగర్ అవతారమెత్తింది. త్వరలోనే లండన్‌లో జరగనున్న మ్యూజిక్ కన్సార్ట్‌లో సింగర్‌గా సినీ ప్రియులను అలరించనుంది. (ఇది చదవండి: ఓటీటీకి రూ.300 కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) సినిమాలకు కాస్తా దూరమైనప్పటికీ.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లోనే ఉంటోంది. ఇటీవల కేరళలో చిల్ అవుతూ ఫోటోలు, వీడియోలను పంచుకుంది. వయసు మూడు పదులు దాటినా.. తన అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గడం లేదు డార్లింగ్ హీరోయిన్. ఫుల్‌గా చిల్ అవుతూ నెట్టింట హల్చల్ చేస్తోంది. అయితే తాజాగా ఈ డార్లింగ్ భామ పెళ్లికి రెడీ అయినట్లు నెట్టింట టాక్ వినిపిస్తోంది. ఓ బిజినెస్‌మెన్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. అంతే కాదు కొత్త ఏడాదిలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు రూమర్స్ పెద్దఎత్తున వైరలవుతున్నాయి. అంతే కాదు.. ఈ ఏడాది సమ్మర్లోనే వివాహం కూడా జరగనుందని సమాచారం. అయితే ఈ విషయంపై శ్రద్దాదాస్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) -
పెళ్లి పీటలెక్కనున్న సీనియర్ హీరోయిన్ కుమారుడు.. వధువు ఎవరంటే?
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే పలువురు తారలు వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా మరో నటుడు పెళ్లికి రెడీ అయిపోయారు. ప్రముఖ సినీయర్ నటి, హీరోయిన్ రతీ అగ్నిహోత్రి కుమారుడు తనూజ్ విర్వానీ ఓ ఇంటివాడు కానున్నారు. ఈనెల 25న తన ప్రియురాలు తాన్యా జాకబ్‌ను పెళ్లాడనున్నారు. వీరి వివాహం ముంబయి-పుణె హైవేలోని లోనావాలాలో జరగనుంది. ఈ ఏడాది నవంబర్లోనే సింగపూర్‌లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. మరో రెండు రోజుల్లో పెళ్లి పీటలెక్కనున్న హీరో తనూజ్ ఓ ఇంటర్వ్యూరు హాజరయ్యారు. తన పెళ్లి గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నట్లు వెల్లడించారు. తాన్యతో ప్రేమ గురించి తనూజ్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తనూజ్ మాట్లాడుతూ.. "మేమిద్దరం చాలా కాలంగా తెలుసు. పదేళ్ల క్రితం తనను ముంబైలో కలిశా. మా కుటుంబాలకు కూడా తాన్య బాగా తెలుసు. తాన్యా సింగపూర్‌కు మారినప్పుడు కూడా మేము క్లోజ్‌గానే ఉన్నామని' తెలిపారు. పెళ్లి చేసుకోవడానికి ఇదే సరైన సమయమని తనూజ్ వెల్లడించారు. కాగా.. తనూజ్ మదర్ రతి అగ్నిహోత్రి తెలుగు, తమిళంతో పాటు హిందీ, మలయాళం చిత్రాల్లోనూ నటించారు. ఆమె చివరిసారిగా బాలకృష్ణ నటించిన డిక్టేటర్ చిత్రంలో కనిపించారు. పెళ్లి గురించి తనూజ్ మాట్లాడుతూ.. 'ఆ రోజు కోసం నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నా. నా జీవితంలో సరైన వ్యక్తినే ఎంపిక చేసుకున్నానని నాకు తెలుసు. ప్రస్తుతం నా కుటుంబం ఎంతో ఆనందంగా ఉంది. మా వివాహా వేడుకకు అందరూ కలిసి రావడం చాలా ఆనందంగా ఉంది. మా పెళ్లిరోజు డిసెంబర్ 25 పవిత్రమైన తేదీలోనే వచ్చింది. లోనావాలాలోని ఫామ్‌హౌస్ నా హృదయానికి చాలా దగ్గరగా ఉంటుంది. నా చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నా. నా జీవితంలో ఇ ది మధురమైన క్షణం' అంటూ సంతోషం వ్యక్తం చేశారు. కాగా.. తనూజ్ అమెజాన్ వెబ్ సిరీస్ ఇన్సైడ్ ఎడ్జ్‌లో వాయు రాఘవన్ పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జీ5లో స్ట్రీమింగ్ అవుతోన్న పాయిజన్ వెబ్ సిరీస్‌లోనూ కీలక పాత్ర పోషించారు. View this post on Instagram A post shared by Tanuj Virwani (@tanujvirwani) -
గుడ్‌నైట్ టీమ్ కాంబినేషన్లో లవర్.. ఫస్ట్ లుక్ రిలీజ్
గుడ్‌నైట్ చిత్ర యూనిట్ రూపొందిస్తున్న చిత్రం లవర్. మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్పీ ఎంటర్టెయిన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా లివ్ ఇన్ యూట్యూబ్ సీరీస్ ఫేమ్ ప్రభురామ్ వియాస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గుడ్‌నైట్ మణికంఠన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను గురువారం విడుదల చేశారు. మోడరన్ లవ్ చిత్రం ఫేమ్ శ్రీగౌరిప్రియ హీరోయిన్గా నటిస్తున్న ఇందులో నటుడు కన్నారవి ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. శ్యాన్ రోల్డన్ సంగీతాన్ని, శ్రేయాస్ కృష్ణ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ.. ప్రపంచంలో తొలి అనుభూతి ప్రేమ అయినప్పటికీ, స్త్రీ, పురుషుల మధ్య సంబంధం అనేది సమస్యలతో కూడినదిగానే ఉంటోందన్నారు. అలా ఈతరం యువత ప్రపంచం, రిలేషన్‌షిప్‌లలో వారు ఎదుర్కొనే సమస్యలు, ప్రేమ అంశాలను ఆవిష్కరించే కథా చిత్రంగా లవర్ ఉంటుందన్నారు. మొత్తం మీద ఇది ఒక రొమాంటిక్ ప్రేమకథా చిత్రంగా ఉంటుందని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా లవర్ చిత్రాన్ని కమర్షియల్ ఎంటర్టెయినర్ కథా చిత్రంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పారు. కాగా చిత్ర టీజర్, ట్రైలర్ విడుదల కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. చదవండి: ఓటీటీని షేక్ చేసిన టాప్ 10 సిరీస్‌లు అవే.. డిసెంబర్లో కొత్తగా 37 సిరీస్‌లు రిలీజ్ -
పాక్ నుంచి భారత్ తిరిగొచ్చిన అంజూ ఎక్కడుంది?
ప్రియుడి కోసం పాకిస్థాన్ వెళ్లిన మహిళ అంజూ.. మరోసారి వార్తల్లో నిలించింది. ఫేస్బుక్ ప్రేమికుడు నస్రుల్లాను పెళ్లాండేందుకు.. ఇండియాలోని భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి పాక్‌కు వెళ్లిపోయిన ఆమె.. ఇటీవల మళ్లీ తిరిగి భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అంజూ ఇండియాలో ఎక్కడుందో ఎవరికి తెలియరాలేదు. ఈ వారమే అంజూ పాక్‌నుంచి ఢిల్లీ తిరిగి రాగా.. ఆమె రాజస్థాన్‌లోని భివాడికి వెళ్లలేదు. తన పిల్లలను కలవలేదు. అంజూ ఆచూకీని అధికారులు రహస్యంగా ఉంచుతున్నారు. అయితే భివాడిలోని ఆమె అంతకముందు నివసించే రెసిడెన్షియల్ సొసైటీ వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్ని వాహనాలను, అపరిచిత వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోనికి అనుమతిస్తున్నారు. ఇంటలిజెన్స్ బ్యూరోకి చెందిన బృందం అంజు పిల్లలను ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా రెసిడెన్షియల్ సొసైటీలో ఉంటున్న ఆమె పిల్లల కూడా తమ తల్లిని కలవబోమని చెబుతున్నారు. కాగా మధ్యప్రదేశ్‌కు చెందిన అంజూకి ఇదివరకే పెళ్లైంది. ఆమెకు 15ఏళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. 2019లో ఫేస్బుక్ ద్వారా నస్రుల్లా అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అనంతరం ఇద్దరు ప్రేమించుకున్నారు. జైపూర్‌లోని బంధువుల ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి.. గత జులైలో ప్రియుని కోసం పాకిస్థాన్ వెళ్లింది. అక్కడ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వివాహం తరువాత తన పేరును ఫాతిమాగా మార్చుకుంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సు అప్పర్ దిర్ జిల్లాలోని ఓ గ్రామంలో వారు నివసిస్తున్నారు. ఈ జంటకు పాక్‌కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ యాజమాని మోహసీన్ ఖాన్ అబ్బాసీ కొంత భూమి, నగదును బహుమతిగా అందించారు. నాలుగు నెలల తర్వాత తాజాగా ఆమె మళ్లీ భారత్‌కు తిరిగి వచ్చింది. పాకిస్తాన్, పంజాబ్ సరిహద్దులోని వాఘా బోర్డర్ ద్వారా భారత్‌లోకి ఆమె బుధవారం రాత్రి ప్రవేశించింది. తన పిల్లలను తీసుకెళ్లేందుకే ఇండియా వచ్చానని ఆమె చెప్పింది. ఈ వ్యవహారానికి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో తెగ వైరల్‌గా మారాయి. -
పెళ్లికూతురు మిస్సింగ్, తండ్రి ఆత్మహత్య
మైసూరు: బంధువులతో ఇల్లంతా సందడిగా ఉంది. కొన్ని గంటలు గడిస్తే తలంబ్రాల వేడుక. కానీ అంతలోనే పిడుగులాంటి వార్త వధువు తండ్రి చెవిన పడింది. పెళ్లికూతురు ప్రియునితో వెళ్లిపోయింది, ఇది తట్టుకోలేక ఆవేదనతో ఆమె తండ్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన చామరాజనగర జిల్లాలోని గుండ్లుపేటె తాలూకాలోని హొరదహళ్లి గ్రామంలో జరిగింది. ఏం జరిగిందంటే.. వివరాలు.. పుట్టేగౌడ (55) కుమార్తె అయిన సుచిత్రకు ఈ నెల 18, 19వ తేదీన గుండ్లుపేటెలోని రామమందిరంలో పెళ్లి నిశ్చయించారు. కానీ ఈ నెల 17వ తేదీన సుచిత్ర తన ప్రియునితో వెళ్లిపోయింది. ఫలితంగా పెళ్లి ఆగిపోయింది. ఈ అవమానభారాన్ని పుట్టేగౌడ తట్టుకోలేకపోయాడు. శనివారం పొలానికి వెళ్లి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు గాలించగా చెట్టుకు వేలాడుతూ మృతదేహం కనిపించింది. తరకనాంబి పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. పెళ్లి సందడితో కళకళలాడాల్సిన ఇల్లు వరుస విషాదాలతో కన్నీటి సంద్రమైంది. -
Video: ఐదేళ్ల తర్వాత ప్రియుడిని కలిసిన యువతి.. ఎయిర్‌పోర్టులో సర్ప్రైజ్
ప్రేమ ఒక అద్భుతమైన భావోద్వేగం, ప్రేమించడం మాటల్లో చెప్పలేని ఒక ప్రత్యేక అనుభూతి. ప్రేమను మాటల్లోనే కాదు.. మన భావాలు, పనుల ద్వారా గొప్పగా చెప్పవచ్చు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్లో ప్రేమ భిన్నంగా ఉంటుంది. ప్రేమించిన వారు దూరంగా ఉన్న వారి మనసులు మాత్రం దగ్గరగా ఉంటాయి. పక్కన లేకపోయినా, రోజూ కలవకపోయినా ఆప్రేమ అలాగే ఉంటుంది. ఇప్పుడిదంతా ఎందుకంటే అయిదు సంవత్సరాల తరువాత కలవబోతున్న తన ప్రియుడికి ఓ యూవతి వినూత్నంగా స్వాగతం చెప్పాలనుకుంది. ఎంతో కాలంగా దూరంగా ఉన్న ప్రియుడి కోసం ఆలోచించి వినూత్నంగా వెల్కమ్ చెప్పింది. ఎయిర్‌పోర్టులో అతడి ముందు ఎంతో అందంగా డ్యాన్స్ చేసి తన ప్రేమను వ్యక్త పరిచింది. ఈ దృశ్య కావ్యానికి ఈ కెనడాలోని ఎయిర్‌పోర్టు వేదికగా మారింది. ఓ యువకుడు లగేజ్‌తో ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవగానే కొంతమంది అతనికి గులాబి పువ్వులు ఇచ్చి స్వాగతం పలుకుతారు. కానీ అతడు మాత్రం తన ప్రేయసి ఎక్కడుందంటూ వెతుకుతూ ఉంటాడు. ఇంతలోనే యువతి ఎదురుపడి ఎవరూ ఊహించని విధంగా ప్రియుడికి వెల్కమ్ చెప్పింది. బాలీవుడ్ మూవీ షేర్షాలోని ‘రతన్ లంబియాన్’ పాటకు ఎంతో డ్యాన్స్ చేసింది. ప్రేమికుడిని దగ్గరగా చూస్తూ అయిదు సంవత్సరాలు తన కోసం వేచి ఉన్న నిరీక్షణను సాంగ్, డ్యాన్స్ రూపంలో అతడికి తెలియజేసింది. క్యూట్ స్టెప్పులతో ఆహా అనిపించింది. ప్రియురాలి సర్ప్రైజ్కు ఉబ్బితబ్బైన వ్యక్తి.. ఆమె మరో పాటకు డ్యాన్స్ చేయాల్సి ఉండగానే దగ్గరకొచ్చి గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఈ వీడియోను నిక్కి షా అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు 3 మిలియన్లకు పైగా వ్యూస్వచ్చాయి. ఒకటిన్నర లక్ష మంది లైక్ చేశారు. View this post on Instagram A post shared by Niki | Toronto Content Creator (@_nikishah) -
ప్రియుడు ఖరీదైన గిఫ్ట్ ఇస్తే బ్రేకప్ చెప్పింది.. ట్విస్ట్ ఇదే!
తాజాగా ఇంటర్నెట్లో ఒక విచిత్ర ఉదంతం వైరల్‌గా మారింది. ఇటువంటి విషయాన్ని ఎవరూ ఎప్పుడూ వినివుండరు. ఒక యువకుడు తన ప్రియురాలికి ఆమె పుట్టినరోజు సందర్భంగా అత్యంత ఖరీదైన క్రూయిజ్ టికెట్ ఇచ్చాడు. అయితే ఆ అమ్మాయి ఆనందంతో ఎగిరి గంతులేసేందుకు బదులు, ఆగ్రహంతో అతనికి బ్రేకప్ చెప్పింది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన పోస్టు చూసిన నెటిజన్లు ఆమె నిర్ణయాన్ని మెచ్చుకుంటున్నారు. ఇంతకీ ఆ ప్రేమికుల మధ్య ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక యువతి ఇటీవల తాను తన ప్రియుడి నుంచి విడిపోయానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఆ యువతి పోస్ట్‌లో ఇలా రాసింది.. ‘సముద్రాన్ని చూసినప్పుడు నాకు అనారోగ్యం వస్తుందని తెలిసి కూడా ఎందుకు నా కోసం క్రూయిజ్ టిక్కెట్ కొన్నావని నేను అతనిని అడిగాను. నేను కొన్ని నెలలుగా రెయిన్ఫేర్ ఫెస్టివల్ కోసం సిద్ధమవుతున్నానని కూడా అతనికి తెలుసు. తనకు క్రూయిజ్ ప్రయాణం ఇష్టమని నాతో చెప్పాడు. నాకు క్రూయిజ్ టిక్కెట్ కొన్నాడని తెలిశాక అతను ఎంత నీచమైనవాడో నేను గ్రహించాను. నా పుట్టినరోజున నేను ఎంత అనారోగ్యానికి గురైనా అతనికి అవసరం లేదు. అతనికి క్రూయిజ్ ప్రయాణం ఇష్టమని నేను కూడా అతనితో రావాలని అతను కోరుకున్నాడు. ఇది నాకు నచ్చక అతని నుంచి విడిపోయాను. అయితే నేను చెప్పిన బ్రేకప్ను అతను అంగీకరించడం లేదు. కొద్ది రోజుల్లో విబేధాలు సమసిపోతాయి’ అని ఆమె పేర్కొంది. ఆ యువతి రెడ్డిట్‌లో u/Helpful-Minimum8496 అనే ఖాతాతో ఈ పోస్ట్‌ను షేర్ చేశారు. ఇది వేగంగా వైరల్‌గా మారింది. ఈ పోస్ట్ చూసిన చాలా మంది ఆ యువతి అభిప్రాయానికి మద్దతుగా నిలిచారు. అలాగే తమ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేశారు. ఒక యూజర్ ఇలా రాశాడు..‘ఆ యువకుడు ఆమె ఆరోగ్యాన్ని గుర్తించి ఉంటే ఇలా జరిగేదికాదు. ఆ కుర్రాడి తీరు నీచమనిపిస్తోంది’ అని రాశారు. మరొక యూజర్ ఇలా రాశారు.. ‘అతను మీ అభిరుచులను పట్టించుకోకుండా, తన కోరికలకే ప్రాధాన్యత ఇస్తున్నాడు. అందుకే మీరు అతనిని వదిలివేయడం ఉత్తమం’ అని రాశారు. ఇది కూడా చదవండి: ‘గ్రాప్- 3’ అంటే ఏమిటి? ప్రభుత్వం ఎందుకు అమలు చేస్తోంది? -
అమలాపాల్ రెండో పెళ్లి.. కాబోయే భర్త ఏం చేస్తాడో తెలుసా?
స్టార్ హీరోయిన్ అమలాపాల్‌కు రెండో పెళ్లికి సిద్ధమైంది. అయితే ఇప్పటికే డైరెక్టర్ విజయ్ను పెళ్లాడిన మలయాళీ భామ మరోసారి పెళ్లి పీటలెక్కడానికి రెడీ అవుతోంది. తన ప్రియుడు జగత్ దేశాయ్‌తో వివాహబంధంలోకి అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఓ వీడియోను షేర్ చేస్తూ అఫీషియల్‌గా ప్రకటించింది. అయికే ఆమెను చేసుకోబోతున్న జగత్ ఎవరనే దానిపై నెటిజన్స్‌తో పాటు ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. మీకు కూడా అతను ఎవరు? ఏం చేస్తాడో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదివేయండి. (ఇది చదవండి: అశ్వినిని తోసిపడేసిన అర్జున్.. తన పీక పట్టుకున్నాడన్న సందీప్) జగత్ దేశాయ్ ఎవరు? అమలాపాల్ పెళ్లాడబోతున్న జగత్ దేశాయ్ ఎవరనే విషయంపై ఆమె ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. దీంతో అతను ఏం చేస్తాడా? అని తెగ ఆరా తీస్తున్నారు. జగత్ దేశాయ్ గోవాలోని ఓ విల్లా గ్రూప్‌లో సేల్స్ హెడ్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. అయితే గతంలో అమలాపాల్ సైతం గోవా బీచ్‌లో ఉన్న ఫోటోలు తన ఇన్‌స్టాలో పంచుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూన్ నుంచే అమలాపాల్ అతనితో డేటింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరు డేటింగ్ను అత్యంత రహస్యంగా ఉంచినట్లు సమాచారం. జగత్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లు చూస్తే అమలాపాల్ లైక్ కొట్టడం, కామెంట్స్ చేయడం కనిపించింది.. ఇప్పటి వరకు ఎక్కడా కూడా తన రిలేషన్ గురించి బయటికి చెప్పలేదు. తాజాగా తన బర్త్‌డే రోజున అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఇది చూసిన అభిమానులు అమలాపాల్‌కు అభినందనలు చెబుతున్నారు. కాగా.. బ్లెస్సీ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్ జంటగా ఆడుజీవితంలో అమలాపాల్ కనిపించనుంది. ఆ తర్వాత ద్విజ అనే మరో మలయాళ చిత్రంలో నటిస్తోంది. (ఇది చదవండి: మహిళలు కేవలం దాని కోసమే కాదు: కంగనా రనౌత్ గట్టి కౌంటర్) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Jagat Desai (@j_desaii)