ప్రతీకాత్మక చిత్రం
క్రిష్ణగిరి(బెంగళూరు): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య ప్రియుడితో కలిసి భర్తపై దాడి చేసిన కేసులో నిందితులను సింగారపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు... సింగారపేట సమీపంలోని కోనార్‌కొటాయ్ గ్రామానికి చెందిన కార్మికుడు ఇళంసూర్యన్ (47), ఇతడి భార్య పరిమళ (43). ఈమెకు అదే ప్రాంతానికి చెందిన లక్ష్మీకాంత్ (42)తో వివాహేతర సంబంధం ఉంది.
విషయం తెలుసుకొన్న భర్త ఇళంసూర్యన్ భార్యను మానుకోవాలని హెచ్చరించాడు. దీంతో ఆవేశానికి గురైన పరిమళ ప్రియుడు లక్ష్మీకాంత్‌ను ఇంటికి రప్పించుకొని ఇళంసూర్యన్‌పై వేటకొడవలితో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితున్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సింగారపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని భార్య పరిమళ, లక్ష్మీకాంతంలను అరెస్ట్ చేశారు.
చదవండి ఇలాంటి వారితో జాగ్రత్త.. బైక్ బుక్ చేసుకున్న మహిళకు చేదు అనుభవం
Comments
Please login to add a commentAdd a comment