extra marital affair
-
కానిస్టేబుల్‌తో ఎస్ఐ వివాహేతర సంబంధం.. భార్య ఫిర్యాదు
సాక్షి, నల్లగొండ: ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా కుటుంబాలు రోడ్డున పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఇక, తాజాగా ఓ పోలీసు అధికారి.. వివాహిత అయిన కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భార్య.. పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించింది. ఈ ఘటన పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారినట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాలో మహేందర్ అనే వ్యక్తి టాస్క్ ఫోర్స్‌లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే మహేందర్ కొన్నేళ్లుగా ఎక్సైజ్ కానిస్టేబుల్ వసంతతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఉన్నాడు. విషయం తెలుసుకున్న భార్య జ్యోతి.. మహేందర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. భర్త విషయంలో కానిస్టేబుల్ వసంతను వారించే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ వీరిద్దరూ తమ తీరు మార్చుకోలేదు. ఇక, తాజాగా వీరిద్దరి కాల్ రికార్డింగ్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. మరోవైపు భర్తపై బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.ఈ సందర్భంగా మహేందర్ భార్య జ్యోతి మాట్లాడుతూ.. ఐదారేళ్లుగా వసంతతో నా భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అప్పటి నుంచి నన్ను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. సర్వీస్ రివాల్వర్‌తో నన్ను చంపుతానని బెదిరిస్తున్నాడు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదు. మహేందర్‌ను శాశ్వతంగా సర్వీస్ నుంచి తొలగించాలి. నాకు, నా పిల్లలకు న్యాయం చేయాలి. లేకపోతే మాకు మెర్సీ కిల్లింగ్‌కు అవకాశం కల్పించాలి. వసంతకు ఇప్పటికే పెళ్లి అయిపోయింది. ఆమె భర్తకు ఈ విషయం చెప్పినా పట్టించుకోవడం లేదు. వసంత కూడా నాపై దాడి చేసింది. నన్ను కొట్టి ఇంట్లో ఉన్న బంగారం నగదు ఎత్తుకెళ్లింది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
గజపతినగరం : వివాహేతర సంబంధం ఇద్దరిని ఆత్మహత్యకు పురిగొల్పింది. ఇందులో ప్రియుడు ప్రాణం కొల్పోగా... ప్రియురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. గజపతినగరం మండలం మరుపల్లి గ్రామానికి చెందిన శీర పైడిరాజు(31)కు కొత్తవలస మండలానికి చెందిన బొబ్బిలి ఆదిలక్ష్మితో మూడేళ్ల కిందట వివాహమైంది. వీరి దాంపత్య జీవితంలో సంతానం కలగలేదు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన వివాహిత సబుకు రామలక్ష్మితో పైడిరాజుకు ఎనిమిది నెలల కిందట పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. పైడిరాజు పురిటిపెంట సమీపంలో ఆటోను నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం పురిటిపెంట రైల్వే గేటు వద్ద వీరిద్దరూ కలిసి మాట్లాడుకున్నారు. ఏం జరిగిందో తెలియదుగాని ఇద్దరి మధ్య మాటమాట పెరిగి పురుగుల మందు సేవించి అక్కడి పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరినీ విజయనగరం మహారాజ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి పైడిరాజు శనివారం మృతి చెందినట్టు తెలిపారు. రామలక్ష్మి వైద్య సేవలు పొందుతున్నట్టు చెప్పారు. మృతుడి తండ్రి శీర అప్పలనాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ కె.లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రామలక్ష్మికి కూడా ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
60 ఏళ్ల వృద్ధుడితో యువతి వివాహేతర సంబంధం..చివరికి..!
అన్నానగర్: వేలచ్చేరిలోని ఓ హాస్టల్లో వృద్ధుడితో కలిసి ఉన్న యువతి అనుమానాస్పద స్థితిలో మరణించింది. వివరాలు.. చెన్నైలోని వేలాచ్చేరి తరమణి 100 అడుగుల రోడ్డులోని ఓ ప్రైవేట్ హాస్టల్లో 60 ఏళ్ల వృద్ధుడితో కలిసి ఉంటున్న 27 ఏళ్ల యువతి ఛాతీ నొప్పితో మృతి చెందినట్లు వేలచ్చేరి పోలీసులకు సోమవారం సమాచారం అందింది. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మహిళ మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం రాయ పేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విచారణలో వృద్ధుడు చిందాద్రిపేటకు చెందిన జ్యోతి (60) అని తేలింది. ఇతడికి విల్లివాకానికి చెందిన శశికళ(50)తో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల క్రితం ఆమె చనిపోయింది. శశికళ రెండో కూతురు రమ్య(27). భర్త నుంచి విడిపోయి తల్లి ఇంట్లో ఉంటోంది. ఈమెకు జ్యోతితో అక్రమ సంబంధం ఏర్పడింది. ఆదివారం సాయంత్రం ఇద్దరూ హోటల్‌కి వచ్చి రూమ్ తీసుకున్నారు. రమ్యకు మద్యం సేవించే అలవాటు ఉందని తెలుస్తోంది. హోటల్ కు చేరుకోగానే 6 సీసాల బీరు కొన్నారు. రమ్య రాత్రి 4 బీర్లు తాగింది. అనంతరం ఇద్దరూ నిద్రపోయారు.సోమవారం ఉదయం మళ్లీ రమ్య 2 సీసాల బీరు తాగిన తర్వాత ఛాతీ నొప్పి వచ్చింది. ఆస్పత్రికి తరలిస్తుండగా రమ్య మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న వేలాచ్చేరి పోలీసులు రమ్య మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం నివేదిక తర్వాత హత్య చేశారా? లేక అధిక మోతాదులో మద్యం తాగడం వల్ల చనిపోయిందా? మరేదైనా కారణమా? అనేది తేలుతుందని పోలీసులు తెలిపారు. -
మేనకోడలితో సంబంధం.. మరో వ్యక్తితో పెళ్లికి సిద్దమైందని
యూపీలో ఘోరం వెలుగుచూసింది. మేనకోడలుతో సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి.. ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. యువతి మరో యువకుడిని పెళ్లి చేసుకునేందుకు సిద్దపడటంతో.. తట్టుకోలేక ఆ వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది.ఈ ఘటన హర్దోయ్ జిల్లాలోచోటుచేసుకుంది.పోలీసుల వివరాల ప్రకారం.. మాన్సీపాండే అనే 22 ఏళ్ల యువతి వరుసకు మామయ్య అయ్యే వ్యక్తి మణికాంత్ ద్వివేదితో గత రెండేళ్లుగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. కానీ యువతికి మరో వ్యక్తితో కుటుంబ సభ్యులు నవంబర్ 27న పెళ్లి కుదిర్చారు. ఈ క్రమంలో సోమవారం రక్షాబంధర్ సందర్భంగా ఆమె మణికాంత్ ఇంటికి వెళ్లింది. తనకు మరో వ్యక్తితో పెళ్లి కుదిరిందనే విషయాన్ని అతడికి. అయితే అందుకు అతడు ఒప్పుకోలేదు. ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని, చేసుకోవద్దని యువతిని బలవంతం చేశాడు.ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైన మణికాంత్ మాన్సీని గొంతు నులిమి చంపేసి నిర్మాణంలో ఉన్న భవనంలో పడేశాడు. ఎవరికి అనుమానం రాకుండా, పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ఆమె మొబైల్‌ను బస్సులో విసిరేశాడు. అయితే కూతురు ఇంటికి తిరిగి చేరుకోకపోవడంతో అనుమానం వచ్చిన తండ్రి రాంసాగర్ పాండే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మణికాంతే తన కుమార్తెను తీసుకెళ్లి ఉంటాడని ఆరోపించాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. నిందితుడు చేసిన నేరాన్ని అంగీకరించాడు.బాధితురాలి తండ్రి రాంసాగర్ పాండే మాట్లాడుతూ.. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మణికాంత్ ఇంటి వద్ద మాన్సీని దింపినట్లు తెలిపారు. ‘మేము స్వగ్రామానికి వెళ్ళాము, తరువాత నేను లక్నో వెళ్ళాను. బుధవారం మణికాంత్ నాకు ఫోన్ చేసి, మాన్సీ కనిపించడంలేదని, ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని చెప్పాడు. మాన్సీ పారిపోయిందని అతను నాకు చెప్పాడు. కానీ నాకు అతనిపై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాను’ అని తెలిపారు -
వివాహేతర సంబంధం.. ముందే వార్నింగ్.. ప్రియుడు ఇంట్లోకి రాగానే..
హోసూరు: మహిళ ఇంట్లో ప్రియుడు హత్యకు గురైన సంఘటన బేరికె పోలీస్‌స్టేన్ పరిధిలో చోటు చేసుకొంది. వివరాలు.. బేరికె సమీపంలోని కొళదాసపురం గ్రామానికి చెందిన జ్యోతి (39), ఈమె భర్త కేశవమూర్తి పదేళ్ల క్రితం మృతి చెందాడు. జ్యోతి అంగన్వాడీ ఉద్యోగిగా పనిచేస్తూ వచ్చింది. బేరికె సమీపంలోని మహాదేవపురం గ్రామానికి చెందిన వెంకటేష్ (40)తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధం ఏర్పడింది. వెంకటేష్ తరచూ జ్యోతి ఇంటికి వెళ్లి వస్తుండేవాడు. ఇది తెలిసి జ్యోతి సోదరి కొడుకు హరీష్ (23) మీ వల్ల పరువు పోతోందని వారిద్దరినీ మందలించాడు. దీంతో ఆమె ప్రియున్ని ఇంటికి రావద్దని చెప్పింది. అయినప్పటికీ మంగళవారం వెంకటేష్ జ్యోతి ఇంటికి రాగా తలుపు వేసి జ్యోతి, హరీష్ కలిసి కట్టెలతో అతనిపై దాడి చేశారు. తీవ్ర గాయాలేర్పడిన ఇతన్ని స్థానికులు చికిత్స కోసం హోసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చనిపోయాడు. బేరికె పోలీసులు కేసు నమోదు చేసుకొని జ్యోతి, హరీష్‌ను అరెస్ట్ చేశారు. చదవండి: 15 రోజులకు ఒకసారి ఇంటికి.. భార్య ప్రవర్తనపై అనుమానం.. ఓ రోజు -
15 రోజులకు ఒకసారి ఇంటికి.. భార్య ప్రవర్తనపై అనుమానం.. ఓ రోజు
మండ్య(బెంగళూరు): అనుమానంతో భార్యను కడతేర్చిన ఉదంతం మండ్య జిల్లా నాగమంగల పట్టణంలో జరిగింది. ఇక్కడి టీబీ లేఔట్‌లోని ముళకట్టె రోడ్డులో నివాసం ఉంటున్న పుట్ట స్వామి, గిరిజ దంపతుల కుమార్తె మధుశ్రీ(25)కి నాగమంగళ తాలూకా కరడహళ్లికి చెందిన గంగాధర్ కుమారుడు మంజునాథ్‌తో వివాహమైంది. వీరికి నాలుగు సంవత్సరాల వయసున్న కుమారుడు ఉన్నాడు. మంజునాథ్ బెంగళూరులో ఉంటూ 15 రోజులకు ఒక పర్యాయం వచ్చి వెళ్తుండేవాడు. అయితే మధుశ్రీ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు అనుమానం పెంచుకొని తరచూ గొడవపడేవాడు. మంగళవారం కూడా దంపతులు గొడవ పడ్డారు. ఓ దశలో భార్య కడుపులో కత్తితో దాడి చేసి కుమారుడితో కలిసి ఉడాయించాడు. బుధవారం ఉదయం ఎంతసేపైనా మధుశ్రీ బయటకు రాకపోవడంతో స్థానికులు వెళ్లి చూడగా హత్యోదంతం వెలుగు చూసింది. నాగమంగల పోలీసులు వచ్చి మృతదేహాన్ని పరిశీలించి ఆస్పత్రికి తరలించి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. -
ప్రాణం తీసిన రీల్స్ వ్యసనం.. చంపి నదిలో పడేశాడు
బెంగళూరు: నిత్యం మొబైల్లో మునిగిపోవడం, కుటుంబాన్ని పట్టించుకోకపోవడం వెరసి భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను హత్య చేసి శవాన్ని నదిలో పడేసిన ఘటన మండ్య జిల్లా శ్రీరంగ పట్టణం తాలూకా మండ్యకొప్పళు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూజ, శ్రీనాథ్ భార్యభర్తలు. వీరిద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, పూజా గంటల తరబడి మొబైల్ వాడేది. టిక్‌టాక్ చేసే పూజా అది లేకపోవడంతో రీల్స్ చేయడం మొదలుపెట్టింది. ఇదే సమయంలో ఆమె ఇతరులతో చాటింగ్ చేయడాన్ని భర్త గుర్తించాడు. సహించలేక మరో వ్యక్తితో కలిసి చంపేసి శవాన్ని నదిలో పడేశాడు. ఈ విషయం మూడు రోజుల తరువాత బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చదవండి: అబద్దాలతో పెళ్లి చేసుకుంటే.. ఇకపై పదేళ్ల జైలు శిక్ష.. కొత్త చట్టాల్లో ఏముందంటే..? -
అధ్యాపకురాలి దారుణహత్య.. కళ్లలో కారం కొట్టి, కింద పడేసి
మదనపల్లె: ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న యువతి దారుణ హత్యకు గురికావడంతో అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. బండమీదకమ్మపల్లె వైఎస్సార్ కాలనీకి చెందిన రుక్సానా (35) ఎంఏ (ఇంగ్లిష్), బీఈడీ పూర్తిచేసి ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంగ్లిష్ అధ్యాపకురాలిగా పనిచేస్తోంది. తను డిగ్రీ చదువుతున్న సమయంలోనే వివాహం చేసుకుంది. ఒక బిడ్డ పుట్టిన తర్వాత అతడితో విడాకులు తీసుకుని తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. ప్రస్తుతం పాప పదో తరగతి చదువుతున్నది. ఈ క్రమంలో ఏపీఎస్పీడీసీఎల్లో డ్యూటీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఎస్కే ఖదీర్ అహ్మద్‌తో 2017 ఆగస్టులో మరో వివాహం జరిగింది. కొంతకాలం అనంతరం తన తల్లి వెన్నెముక నొప్పి కిత్స నిమిత్తం రుక్సానా కూడా బెంగళూరుకు వెళ్లింది. ఈ క్రమంలో భర్త ఖదీర్‌అహ్మద్ పట్టణంలోని అవంతి థియేటర్ వద్ద ఉంటున్న ఆయిషాను గుట్టుచప్పుడు కాకుండా రెండో వివాహం చేసుకున్నాడు. ఆరోగ్య సమస్యలతో ఆమెకు పిల్లలు పుట్టలేదు. ఈలోపు రుక్సానాకు మరో ఆడపిల్ల జన్మింంది. పిల్లలు పుట్టని కారణంగా భర్త ఖదీర్‌అహ్మద్ తనకు దూరమవుతాడనే భయంతో ఆయిషా పోలీస్‌స్టేషన్‌లో తనను మోసం చేసి పెళ్లిచేసుకున్నాడంటూ ఖదీర్ అహ్మద్‌తో పాటు రుక్సానాపై టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో అయిషా తమ్ముళ్ల వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ రుక్సానా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఓ ఇద్దరు యువకులు కళాశాల పనివేళలు ముగిశాక స్కటీపై ఇంటికి వెళుతున్న రుక్సానా కళ్లలో కారం కొట్టి కిందపడేలా చేశారు. మంటతో కళ్లు నులుముకుంటున్న ఆమెను అత్యంత కిరాతకంగా గొంతుకోసి, ఛాతిపై పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడిన ఆమె ఘటనాస్థలంలోనే ప్రాణాలు విడిచింది. డీఎస్పీ కేశప్ప ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆయిషా తమ్ముళ్లు తమ కుమార్తె రుక్సానాను దారుణంగా చంపేశారని ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. భర్త ఖదీర్‌అహ్మద్ మాట్లాడుతూ.. ఆయిషా తమ్ముళ్లపై రౌడీషీటర్ కేసులు నమోదై ఉన్నాయని, వారు తాము చెప్పినట్లు వినకపోతే ఇద్దరినీ చంపేస్తామని బెదిరింనట్లు చెప్పాడు. ఈ విషయమై కోర్టులో కేసు నడుస్తున్నదని తెలిపారు. తమకు ప్రాణహాని తలపెడతారేమోనని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని వాపోయాడు. అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు జిల్లా ఆస్పత్రికి చేరుకుని రుక్సానా మృతదేహాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. -
కానిస్టేబుల్ భార్య పైశాచికం.. ప్రియుడి మోజులో పడి, ఇంటికి పిలిచి..
ఎంవీపీకాలనీ (విశాఖపట్నం): వన్‌టౌన్ పోలీసు స్టేషన్ కానిస్టేబుల్ మృతి కేసు కొత్త మలుపు తిరిగింది. ప్రియుడితో కలిసి భార్యే అతన్ని హత్య చేసినట్లు తెలిసింది. 2009 బ్యాచ్‌కు చెందిన బర్రి రమేష్ (35) ఆదర్శనగర్‌లో ఉంటూ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే బుధవారం ఉదయం అతను చనిపోయినట్లు ఎంవీపీ పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బెడ్‌పై విగతజీవిగా ఉన్న రమేష్‌ను పరిశీలించారు. అనంతరం భౌతికకాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. రాత్రి మద్యం సేవించి పడుకున్నాడని, తెల్లవారి లేచి చూసేసరికి చనిపోయి ఉన్నాడని అతని భార్య బుధవారం పోలీసులకు తెలిపింది. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కాగా.. రమేష్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ.. అతని అన్నయ్య బర్రి అప్పలరాజు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆ దిశగా ప్రారంభమైన పోలీసుల విచారణలో అవాక్కయ్యే వాస్తవాలు వెలుగుచూసినట్లు సమాచారం. ప్రియుడిపై మోజుతో కానిస్టేబుల్ రమేష్ భార్య శివజ్యోతి అలియాస్ శివాని.. భర్త హత్యకు ప్లాన్ చేసినట్లు తెలిసింది. టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్న రామారావు అనే వ్యక్తితో ఆమెకు కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో రమేష్‌ను అడ్డు తొలగించుకునే క్రమంలో హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు భావిస్తున్నారు. మంగళవారం రాత్రి రమేష్ మద్యం తాగి పడుకున్న సమయంలో హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ప్రియుడితో కలిసి తలగడతో నొక్కి ఊపిరాడకుండా చేసి చంపినట్లు ప్రచారం జరుగుతోంది. భర్త బెడ్‌పై గిలగిల కొట్టుకుంటుప్పుడు భార్య శివాని సెల్ఫోన్లో తీసిన వీడియో పోలీసులకు చిక్కినట్లు తెలిసింది. అయితే ఆ వీడియో ఎందుకు తీసింది? హత్యకు దారి తీసిన పరిణామాలు ఏంటి? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఆమె వద్ద లభించిన వీడియోలో దృశ్యాలు నేపథ్యంలో అతనిని తలగడతో నొక్కి చంపి ఉంటారా? లేదా విష ప్రయోగం చేశారా అనే కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం ఆమె ప్రియుడు రామారావును, గురువారం ఆమెను ఎంవీపీ పోలీసులు పూర్తిస్థాయిలో విచారించినట్లు సమాచారం. అయితే ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు పోలీసులు అందుబాటులోకి రాలేదు. దర్యాప్తు పట్ల పూర్తి గోప్యత పాటిస్తున్నారు. వీరు వెల్లడించిన వివరాలతో పాటు పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు మరింత లోతైన విచారణ చేపట్టి.. అనంతరం ఈ కేసు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. -
వివాహితతో పరిచయం.. భర్త ఉండగానే ప్రియుడిని ఇంటికి పిలిచి
క్రిష్ణగిరి(బెంగళూరు): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య ప్రియుడితో కలిసి భర్తపై దాడి చేసిన కేసులో నిందితులను సింగారపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు... సింగారపేట సమీపంలోని కోనార్కొటాయ్ గ్రామానికి చెందిన కార్మికుడు ఇళంసూర్యన్ (47), ఇతడి భార్య పరిమళ (43). ఈమెకు అదే ప్రాంతానికి చెందిన లక్ష్మీకాంత్ (42)తో వివాహేతర సంబంధం ఉంది. విషయం తెలుసుకొన్న భర్త ఇళంసూర్యన్ భార్యను మానుకోవాలని హెచ్చరించాడు. దీంతో ఆవేశానికి గురైన పరిమళ ప్రియుడు లక్ష్మీకాంత్‌ను ఇంటికి రప్పించుకొని ఇళంసూర్యన్పై వేటకొడవలితో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితున్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సింగారపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని భార్య పరిమళ, లక్ష్మీకాంతంలను అరెస్ట్ చేశారు. చదవండి ఇలాంటి వారితో జాగ్రత్త.. బైక్ బుక్ చేసుకున్న మహిళకు చేదు అనుభవం -
అప్పు చేసి నా భార్యను చదివించా.. జాబ్‌లో చేరగానే అసలు కథ మొదలు
లక్నో: ప్రభుత్వం ఉద్యోగం చేయాలనే కొందరు కలల కంటారు. ఈ జాబితాలో ఆడపిల్లలు ఉండగా.. వాళ్లకు పెళ్లి కాగానే వారి కలలు కలలుగానే మిగిలిపోతుంటాయి. అయితే ఇటీవల ట్రెండ్ మారుతోంది. భర్తలు భార్యలను అర్థం చేసుకుంటూ వాళ్ల లక్ష్యాలను చేరుకోవడంలో సహాయం చేస్తున్నారు. అయితే... కొందరు దీన్ని పూర్తిగా మిస్ యూస్ చేస్తున్నారు. ఉద్యోగంలో చేరగానే.. తమ కలల కోసం కష్టపడిన భర్తలకు షాక్కిస్తూ ఇతరులతో వివాహతర సంబంధం పెట్టుకుంటున్నారు. ఇటీవల ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా, యూపీలోని ఉన్నావ్ లో కూడా ఇలాంటి ఘటన వెలుగులోనికి వచ్చింది. వివరాల్లోకి వెళితే... ఎస్డీఎం జ్యోతి మౌర్య స్టోరీ గుర్తుందా. సరిగ్గా అలాంటి ఉదంతం ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్‌లో ఒకటి వెలుగు చూసింది. భౌనిఖేడా గ్రామానికి చెందిన విజయపాల్ సింగ్, బెల్సి గ్రామానికి చెందిన ఛాయా సింగ్‌ను 2010లో వివాహం చేసుకున్నాడు. అయితే ఛాయా సింగ్ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలు కనేది. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త భర్త విజయపాల్ సింగ్ ముందుకు వచ్చాడు. తన కుటుంబం నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ, అతను తన భార్య కలను తనదిగా భావించాడు. ఉన్నావ్ నగరంలో మంచి కోచింగ్ సెంటర్లో కూడా చేర్పించాడు. మధ్య తరగతి కుటుంబం కావడంతో అతను కష్టపడి ప్రతి పైసా కూడబెట్టి ఆమెను చదివించాడు. చివరకు ఉత్తరప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్షకు హాజరుకగా.. ఆమె 2016లో మహిళా కానిస్టేబుల్‌గా నియమితులైంది. శిక్షణ సమయంలో ఎలాంటి ఇబ్బంది రాకూడదని భర్త రూ.50 వేలు అప్పు తీసుకుని భార్యకు ఇచ్చాడు. చివరికి బారాబంకి జిల్లాలో కానిస్టేబుల్‌గా విధుల్లో కూడా చేరింది. ఇక్కడి నుంచి అసలు కథ మొదలైంది. జాబ్‌లో చేరగానే ఆమె మరొకడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం ఇంట్లో తెలిసేసరికి ప్రియుడితో పెళ్లి సిద్ధమైంది. ఆమె భర్త తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 16న ప్రియుడితో తన భార్య నిశ్చితార్థం కూడా చేసుకున్నట్లు వాపోయాడు. తనకు న్యాయం చేయాలని..తన భార్యపై చర్యలు తీసుకోవాలని బాధితుడు విజయ్‌పాల్ ఎస్పీ ఉన్నావ్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై దృష్టి సారించిన ఎస్పీ విచారణకు ఆదేశించారు. చదవండి ఉచితంగా టమాటాలు.. ఆటోవాలా సరికొత్త ఆఫర్.. కానీ.. -
వివాహితతో పరిచయం.. ఉదయం ఇంట్లో ఎవరూ లేని టైం చూసి
చెన్నై: వివాహేతర సంబంధం విషయంలో మహిళకు నిప్పు అంటించి హత్య చేయడానికి ప్రయత్నించిన ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన చెంగల్పట్టులో సంచలనం కలిగింది. వివరాల్లోకి వెళితే.. చెంగల్పట్టు జిల్లా పాలరు భగత్ సింగ్ నగర్‌కు చెందిన ప్రతాప్ అనే కుళ్లన్ (33) పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి వివాహమైంది. అయితే పిల్లలు లేరు. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన అరుణ్ ప్రకాష్ భార్య ప్రియ (27)తో పరిచయం ఏర్పడి వీరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. వివాహేతర వ్యవహారం ప్రతాప్ భార్యకు తెలిసింది. దీంతో ప్రతాప్‌ను వారించింది. కానీ ఈ మాటలు పట్టించు కోకుకుండా ప్రియురాలతో ఇష్టారాజ్యంగా తిరుగుతున్నట్లు తెలిసింది. దీంతో ఆగ్రహించిన ప్రతాప్ బావ అతని పై దాడి చేశాడు. దీంతో ప్రతాప్ ప్రియతో మాట్లాడడం ఆపేశాడు. అయితే తనతో సంబంధం కొనసాగించాలని ప్రియ ఒత్తిడి చేసింది. ఈ క్రమంలో గురువారం పాలరు రోడ్డులో ప్రతాప్, ప్రియ గొడవ పడ్డారు. అనంతరం శనివారం ఉదయం ప్రియ ఇంట్లో ఎవరూ లేని సమయంలో చూసి వెళ్లిన ప్రతాప్.. ఆమె పై కిరోసిన్, పెయింట్ కొట్టడానికి ఉపయోగించు టర్బెంట్ ఆయిల్‌ను రెండు కలిపి పోసి నిప్పంటించాడు. పాలరు సహాయ ఇన్స్పెక్టర్ కోదండన్ ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు తీవ్ర గాయాలైన ప్రియను చికిత్స కోసం చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. కాగా ప్రియ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. చదవండి భార్య మిస్సింగ్ అంటూ 12 మంది భర్తల ఫిర్యాదు.. ఫోటో చూడగానే పోలీసులకు దిమ్మ తిరిగింది! -
భర్తకు బిర్యానీలో నిద్రమాత్రలు.. ప్లాన్ ప్రకారం ప్రియుడు రాక.. అక్కడే ట్విస్ట్!
విజయనగరం క్రైమ్: వివాహేతర సంబంధం మోజులో ఉన్న భార్య కట్టుకున్న భర్తనే కడతేర్చాలని ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో భర్తకు బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి పెట్టింది. దీంతో భర్త నిద్రలోకి వెళ్లిన తర్వాత వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని పిలిపించి నైలాన్‌తాడు మెడకు బిగించి హత్య చేసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో భర్తకు తెలివివచ్చి కేకలు వేయడంతో అందరూ పారిపోయారు. బాధితుడు తేరుకుని టూటౌన్ పోలీసులకు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు టూటౌన్ సీఐ సీహెచ్.లక్ష్మణరావు గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక కుమ్మరివీధికి చెందిన కోటరాజు, భార్య శ్రీదేవి, పిల్లలు బుధవారం రాత్రి ఇంట్లో నిద్రకు ఉపక్రమించారు. శ్రీదేవికి చిన గోకవీధికి చెందిన గంధవరపు రఘుతో కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. ఈ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తప్పించాలనే ఉద్దేశంతో మట్టుబెట్టాలని ప్రణాళిక వేసింది. తన భర్తను చంపేయమని రఘుకు చెప్పింది. వెంటనే రఘు ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర నుంచి నిద్రమాత్రలు కొని శ్రీదేవికి ఇచ్చాడు. అవి తీసుకుని శ్రీదేవి భర్త రాజుకు బుధవారం రాత్రి మటన్ బిర్యానీలో కలిపి తినిపించింది. వివరాలు వెల్లడిస్తున్న టూటౌన్ సీఐ సీహెచ్.లక్ష్మణరావు (వెనుక ముసుగులో నిందితులు) రాజు నిద్రలోకి జారుకున్న తర్వాత రఘుకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలవగా వరుసకు బావమరిది అయిన బొగ్గులదిబ్బకు చెందిన కేత శ్రీను సహాయం కోరి రూ. 20వేలకు ఒప్పందం కుదుర్చుకుని ఇద్దరూ వచ్చారు. వారు తెచ్చుకున్న నైలాన్ తాడును రాజు మెడకు బిగించి హత్య చేసేందుకు ప్రయత్నించగా మెలకువ వచ్చిన రాజు పెద్దగా కేకలు వేయడంతో అక్కడి నుంచి ఇద్దరూ పారిపోయా రు. ఈ మేరకు విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించడంతో రఘు, శ్రీను, శ్రీదేవిలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఎస్సై షేక్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
వివాహేతర సంబంధం: ప్రియుడితో కలిసి స్కెచ్, మరో మహిళతో ఫోన్ చేయించి
సాక్షి, నంద్యాల: హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. పగిడ్యాల మండలం ప్రాతకోట గ్రామానికి చెందిన వెంకటన్న (42)ను సొంత భార్యనే పొట్టన పెట్టుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలసి హత్యకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. రూరల్ సీఐ సుధాకర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. పగిడ్యాల మండలం ప్రాతకోట గ్రామానికి చెందిన రాము అలియాస్ వెంకటన్నకు భార్య శ్యామల, కొడుకు శరత్చంద్ర(9) ఉన్నారు. భార్య ఇంటివద్ద చీరల వ్యాపారం చేస్తుండగా.. వెంకటన్న మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. ఈనెల 19న వెంకటన్న హత్యకు గురయ్యాడు. కాగా భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా భార్యనే నిందితురాలని తేలింది. బేతంచెర్లకు చెందిన కుమారస్వామితో శ్యామలకు వివాహేతర సంబంధం ఉంది. భార్య ప్రవర్తనపై అనుమానం రావడంతో వెంకటన్న వేధింపులకు గురి చేసేవాడు. ఈ క్రమంలో భర్తను అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడు కుమార్‌స్వామి, అతని స్నేహితులు ఐదుగురితో కలిసి శ్యామల హత్యకు కుట్ర పన్నింది. ఈ మేరకు బేతంచెర్లకు చెందిన దేవమణి అనే మహిళను రంగంలోకి దింపారు. ఆమె ఫోన్లో వెంకటన్నను పరిచయం చేసుకుని వల పన్నింది. ఈనెల 19న ఫోన్ చేసి జూపాడుబంగ్లా మండలంలోని భాస్కరాపురం గ్రామ సమీపంలోని కేసీ కెనాల్ గట్టు వద్దకు రావాలని చెప్పడంతో వెంకటన్న బైక్‌పై వెళ్లాడు. కాగా అప్పటికే అక్కడ మాటు వేసిన కుమారస్వామి, అతని స్నేహితులు నలుగురితో కలిసి వెంకటన్న గొంతుకు బైక్ తీగ బిగించి చంపేశారు. ఆ తర్వాత ముఖం గుర్తు పట్టకుండా రాళ్లతో మోదారు. కాగా పోలీసులు శ్యామల ప్రవర్తనపై అనుమానం రావడంతో ఆ మేరకు కేసు దర్యాప్తు చేపట్టి ఛేదించినట్లు సీఐ తెలిపారు. హత్యకు పాల్పడిన శ్యామల, ఆమె ప్రియుడు కుమారస్వామి, అతని స్నేహితులు శ్రీనివాసులు, లక్ష్మన్న, హుసేన్ నాయుడు, రంగనాయకులు, దేవమణిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు పేర్కొన్నారు. చదవండి: స్నేహితులను భార్యపైకి లైంగికదాడికి ఉసిగొల్పే భర్త... -
ప్రియుడి సహకారంతో భర్త హత్య.. బైక్ రిపేరీ అని పిలిపించి..
సాక్షి, కృష్ణరాజపురం, కర్ణాటక: ప్రియుడి సహకారంతో భర్తను హత్య చేసిన ఘటన నగరంలోని మహాదేవపుర కాడుగోడి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు... ఉదయ్ కుమార్ (40), ప్రియా భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదిలా ఉంటే వీరు ఉంటున్న ఇంటి పక్కనే అన్వర్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఉదయ్ నిత్యం తాగి వచ్చి భార్యను వేధిస్తుండేవాడు. తన బాధలు అన్ని ప్రియా అన్వర్‌కు చెప్పుకునేది. ఈ క్రమంలో తాను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని అన్వర్ ఆమైపె ఒత్తిడి తెచ్చేవాడు. ఆమె ససేమిరా అనేది. బైక్ రిపేరీ అని పిలిపించి హత్య బైక్ మెకానిక్ అయిన ఉదయ్ కుమార్ గురువారం రాత్రి కూడా తాగి ఇంటికి వచ్చాడు. భార్యతో గొడవకు దిగాడు. దీంతో భార్య, పక్కింటి అన్వర్‌కు ఈ విషయాన్ని చెప్పింది. దీంతో అతని అడ్డు తొల గించుకోవడానికి అన్వర్ పథకం వేశాడు. బెక్ రిపేరీ ఉందని ఉదయ్‌కు అన్వర్ ఫోన్ చేశాడు. కాడుగోడి శివాలయం వద్ద ఉన్నట్లు మెసేజ్ చేశాడు. దీంతో ఉదయ్ రాత్రి సమయమైన అక్కడికి చేరుకున్నాడు. ఉదయ్ అక్కడికి రాగానే అన్వర్.. భార్యను ఎందుకు వేధిస్తున్నావంటూ నిలదీశాడు. సంబంధం లేని విషయంలో నీ జోక్యం ఎందుకు అంటూ ఉదయ్ గట్టిగా ప్రశ్నించాడు. దీంతో అన్వర్ తన వద్ద ఉన్న కత్తితో ఉదయ్‌ను పొడిచి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి అన్వర్‌ను అరెస్ట్ చేసి ఉదయ్‌కుమార్ భార్యను కూడా విచారణ చేస్తున్నారు. -
3 నెలలే మొగుడు పెళ్లాలుగా.. మరో వ్యక్తితో పరిచయం.. జోరువానలో..
అన్నానగర్ (తమిళనాడు): కళ్లకురిచ్చి సమీపంలోని మొవన్నంజూర్ గ్రామానికి చెందిన విజయా (20)కి పల్లక్కచేరి గ్రామానికి చెందిన మురుగన్ (25)తో మూడేళ్ల క్రితం వివాహమైంది. తర్వాత కేవలం 3 నెలలు మాత్రమే వీరిద్దరూ భార్యాభర్తలుగా జీవించారు. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో విజయా తన తల్లి ఇంట్లోనే ఉంటోంది. అయితే మురుగన్ తన ఇంటికి రావాలంటూ విజయాను చాలాసార్లు పిలిచాడు. అయితే అందుకు ఆమె నిరాకరించింది. ఇదే సమయంలో కడలూరు జిల్లా సిరుపాక్కం గ్రామానికి చెందిన మురుగన్ బంధువు మాయవన్‌తో విజయాకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ నిత్యం కలుస్తుండడంతో కోపొద్రిక్తుడైన మురుగన్ బుధవారం సాయంత్రం విజయ కల్లకురిచ్చి బస్ స్టేషన్ నుంచి ప్రైవేట్ మినీ బస్సులో ప్రయాణిస్తున్న భార్య విజయాను వెంబడించాడు. బస్సు దిగి విజయ వెళ్తుండగా జోరు వానలో ఒక్కసారిగా ఆమైపె కత్తితో దాడి చేశాడు. రక్తపుమడుగులో విజయ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు మురుగన్‌పై దాడి చేయడంతో కళ్లకురిచ్చి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. -
బీమా డబ్బులు కోసం ప్రియుడితో కలిసి ప్లాన్.. భర్త ఇంట్లోకి రాగానే
రాంచీ: పెళ్లి మండపంలో వధూవరులు జీవితాంతం ఒకరికొకరు తోడు ఉంటామని ప్రమాణం చేస్తారు. అయితే కొంత కాలం ప్రయాణం తర్వాత కొన్ని జంటల మధ్య ఏం జరుగుతుందో ఏమో గానీ ఈ ప్రమాణాలను గాలికి వదిలేసి వారి దాంపత్య జీవితానికి ఫుల్స్టాప్ పెడుతున్నారు. ఇంకొందరు మరో అడుగు మందుకేసి తమ భాగస్వాములను హతమారుస్తున్నారు. ఇటీవల ఈ తరహా ఘటనలు చూస్తునే ఉన్నాం. తాజాగా బీమా సొమ్ము కోసం ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిందో భార్య. ఇక్కడ మరో విషాదం ఏంటంటే.. ఈ దంపతులకు ఆరుగురు పిల్లలు. తండ్రి మరణం, తల్లికి జైలు శిక్ష.. ఇప్పుడికి ఆ పిల్లలు పరిస్థితి దయనీయంగా మారింది. ఈ ఘటన జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. మరియం సురిన్ అనే మహిళ ఇటీవల ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో తన భర్త నుంచి విడిపోయి తన ప్రియడితో కలిసి జీవించాలని అనుకుంది. అయితే వారిద్దరికీ బతకడానికి డబ్బుకు లోటు ఉండకూడదని భావించింది. ఈ క్రమంలో ఆ మహిళ తన ప్రియుడితో కలిసి దారుణమైన కుట్ర పన్నింది. భర్త వాసిల్ సూరిన్ మరణిస్తే అతని పేరు మీద బీమా సొమ్ము రూ.20 లక్షలు తనకే దక్కుతుందని భావించింది. ప్లాన్ ప్రకారం తన భార్త ఇంట్లోకి రాగానే తలుపులు అన్నీ మూసేసింది. తనకీ ఏమాత్రం అనుమానం రాకుండా వినయం నటిస్తూ అతన్ని మాటల్లోకి దింపింది. ఈ క్రమంలో రాడ్‌తో భర్తని కొట్టి చంపింది. ఈ హత్యను ప్రమాదవశాత్తు జరిగిందని ఆ మహిళ నమ్మించాలని ప్రయత్నించింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులకు నుంచి మరియం సురిన్ చెప్పే మాటలపై అనుమానం వచ్చింది. చివరికి ఈ ఘటన జరిగిన 72 గంటల్లోనే నిందితులు ఇద్దరినీ అరెస్టు చేశారు. -
‘అయేషా వస్తేనే నీ కొడుకు క్షేమంగా ఉంటాడు.. లేదంటే!’
ముంబై: వివాహేతర సంబంధం కోసం మహిళ కొడుకును అపహరించిన సంఘటన థానే జిల్లాలోని శాంతినగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల సమాచారం ప్రకారం.. పట్టణంలోని మహ్మద్ అలీ ఫకీర్, అయేషా బీబీ దంపతులు టెమ్‌ఘర్ మురికివాడలో ఉంటున్నారు. రిపోన్ వ్యాపారి అనే వ్యక్తితో అయేషాకు వివాహేతర సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. తనతోపాటు వచ్చేయాలని అయేషాపై ఒత్తిడి పెంచాడు. ఆమె అందుకు అంగీకరించకపోవడంతో ఏప్రిల్ 3న సాయంత్రం ఇంటిముందు ఆడుకుంటున్న ఆమె కుమారుడు ఆషిక్ (4)ను కిడ్నాప్ చేశాడు. ఇంటి బయట ఆడుకుంటున్న పిల్లాడు కనిపించకపోవడంతో చుట్టుపక్కల గాలించిన అలీ, అయేషా స్థానిక శాంతినగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తిరిగి ఇంటికి వచిన వారికి రిపోన్ వ్యాపారి ఫోన్ చేసి ‘మీ కుమారుడు నావద్దనే ఉన్నాడు. అయేషా వస్తేనే సురక్షితంగా ఉంటాడు. లేదంటే హతమారుస్తాను’ అని బెదిరించాడు. ఈ విషయాన్ని వెంటనే శాంతినగర్ పోలీసులకు తెలిపారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా నాసిక్ రైల్వే స్టేషన్లో ఉన్నట్లు గ్రహించిన సీనియర్ ఇన్స్పెక్టర్ శంకర్ తన బృందంతో 24 గంటల్లో నిందితుని పట్టుకొన్నారు. బాబును తల్లిదండ్రులకు అప్పగించారు. -
3 రోజులు అక్కడ.. 3 రోజులు ఇక్కడ.. ఒక భర్త, ఇద్దరు భార్యల మధ్య ఒప్పందం!
ఒక్కోసారి కోర్టులో తీరని సమస్యలు కూడా కూర్చొని మాట్లాడుకుంటే తీరుతాయంటారు. అదే చేశారు ఓ భర్త ఇద్దరు భార్యలు. అసలు విషయం ఏంటంటే.. ఓ వ్యక్తి తన ఇద్దరి భార్యలతో సమస్య రాగా కోర్టుకు వెళ్లారు. చివరికి కూర్చుని మాట్లాడుకుని ఓ ఒప్పందం చేసుకుని సమస్యను పరిష్కరించుకున్నారు. భర్తకు దూరంగా.. అసలు విషయం తెలిసి షాక్ హర్యానాలోని గురుగ్రామ్‌లో పనిచేస్తున్న ఒక ఇంజనీర్ 2018లో 28 ఏళ్ల సీమాను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. రెండేళ్లపాటు సాఫీగా సాగిన వీరి సంసారం కరోనా రాకతో చెక్ పడింది. లాక్డౌన్ కారణంగా సీమ భర్త కుటుంబానికి దూరంగా తాను పని చేస్తున్న చోటు ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలో తన సహోద్యోగులలో ఒకరితో అతనికి పరిచయం ఏర్పడింది. కొన్ని రోజులకు వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీయడంతో చివరికి వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె కూడా జన్మించింది. ఇదిలా ఉండగా తన భర్తలో మార్పు రావడం, తనకి దూరంగా ఉండడాన్ని గమనించిన సీమకు భర్తపై అనుమానం వచ్చింది. అసలువిషయం తెలుసుకునేందకు సీమ గురుగ్రామ్‌కు పయనం కాగా అక్కడ తన భర్త మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడని తెలిసి ఆగ్రహానికి గురైంది. వారాన్ని ఇలా పంచుకున్నారు సీమ తన భర్త పెళ్లి చేసుకున్న యువతితో గొడవపడింది. ఫలితం లేకపోయే సరికి తన కుమారుడి పోషణకు తగిన భరణం డిమాండ్ చేస్తూ కోర్టులో కేసు వేసింది. అనంతరం కోర్టు ఇరువర్గాలను పిలిచి కౌన్సెలింగ్ నిర్వహించింది. చివరికి వారి ముగ్గురి మధ్య ఏకాభిప్రాయం కుదరి ఒక ఒప్పందానికి వచ్చారు. దాని ప్రకారం.. ఆ వ్యక్తి ఒక వారాన్ని ఇద్దరు భార్యలతో షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే వారంలో ఒక భార్యతో మూడు రోజులు, మరో భార్యతో మరో మూడు రోజలు గడపాల్సి ఉంటుంది. మిగిలిన ఒక్క రోజు తనకు నచ్చిన చోటు ఉండేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రస్తుతం గురుగ్రామ్‌లో ఆ ఇద్దరి మహిళలకు రెండు వేర్వేరు అపార్ట్మెంట్లు ఉంచి సంసారం సాగిస్తున్నాడు. చదవండి: లగేజీ రుసుము వివాదం.. వదిలేసి విమానం ఎక్కిన విద్యార్థి.. ట్విస్ట్ ఏంటంటే! -
వివాహేతర సంబంధం : ప్రియుడిని దారుణంగా హత్య చేసి..
హాలియా : త్రిపురారం మండలంలోని అంజనపల్లి గ్రామానికి చెందిన నగేష్(27) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం కారణంగానే నగేష్ దారుణ హత్యకు గురయ్యాడని తేల్చారు. ఘాతుకానికి ఒడిగట్టిన దంపతులను అరెస్టు చేశారు. హాలియా పోలీస్ సర్కిల్ కార్యాలయంలో శనివారం నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి మిర్యాలగూడ డీఎస్పీ పనకంటి వెంకటగిరి కేసు వివరాలు వెల్లడించారు. త్రిపురారం మండలంలోని అంజనపల్లి గ్రామానికి చెందిన నగేష్(27) గొర్రెలు కాసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 5వ తేదీన రాత్రి సతీష్ అతని తమ్ముడు ఎర్రగొర్ల నగేష్ ఇద్దరూ భోజనం చేసిన తరువాత ఒకే చోట పడుకున్నారు. అదే రోజు రాత్రి సుమారు 11 సమయంలో ఎర్రగొర్ల నగేష్ సెల్‌ఫోన్‌కి కాల్ వచ్చింది. ఆ తరువాత ఉదయం ఎర్రగొర్ల సతీష్ చూడగా నగేష్ కనిపించలేదు. ఈనెల 6వ తేదీ నుంచి నగేష్ కనబడలేదు. కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో నగేష్ సోదరుడు ఎర్రగొర్ల సతీష్ త్రిపురారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ నెల 7న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని.. నగేష్, కంచుగంట్ల శ్రీనివాస్ ఇద్దరూ ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో ఒకరింటికి ఒకరు వచ్చిపోతుండేవారు. శ్రీనివాస్ లేని సమయంలో కూడా నగేష్ ఇంటికి వచ్చి వెళ్తూ అతని భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. నగేష్ తన భార్యతో చనువుగా ఉంటూ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని శ్రీనివాస్ అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయంలో పలుమార్లు నగేష్‌ని హెచ్చరించినా తీరు మార్చు కోలేదు. నగేష్‌తో స్నేహంగా ఉంటూనే అతనిపై శ్రీనివాస్ కక్ష పెంచుకున్నాడు. అదును చూసి హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. భార్యతో ఫోన్ చేయించి.. పథకం ప్రకారం ఈనెల 5వ తేదీ రాత్రి శ్రీనివాస్ తన భార్య మీనాక్షితో నగేష్‌కి ఫోన్ చేయించి తన ఇంటికి వచ్చేవిధంగా పథకం పన్నాడు. అదే రోజు రాత్రి సమయంలో ఇంటికి వచ్చిన నగేష్‌ను శ్రీనివాస్ కత్తితో మెడపై నరికాడు. నగేష్‌కి బలమైన గాయాలు అయి మంచంపై పడిపోగా శ్రీనివాస్ భార్య మీనాక్షి ఇంట్లో ఉన్న కర్రతో నగేష్ తనపై బలంగా మోదింది. దీంతో మరో మారు కత్తితో శ్రీనివాస్ నగేష్‌ని పొడిచాడు. అతని ప్రాణం ఇంకా పోలేదని భావించిన శ్రీనివాస్, అతని భార్య మీనాక్షి ఇద్దరూ కలిసి నైలానుతాడుతో నరేష్ మెడకు రెండు సార్లు చుట్టి హత్య చేశారు. అనంతరం పశువుల కొట్టం వద్ద ఉన్న సెప్టిక్ ట్యాంక్ మూత పగలగొట్టి నగేష్ మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్‌లో పడవేశారు. దీంతో పాటు నగేష్ చెప్పులు, సెల్‌ఫోన్‌తో పాటు రక్త మరకలు అంటిన తమ దుస్తులను సెఫ్టిక్ ట్యాంకులో వేశారు. హత్యకు ఉపయోగించిన కత్తిని తన ఇంట్లోని వడ్ల బస్తాల వెనుక దాచిపెట్టినట్లు పోలీసులు సమక్షంలో కంచుగంట్ల శ్రీనివాస్, భార్య మీనాక్షి ఒప్పుకున్నారు. అనుమానంతో అదుపులోకి తీసుకుని.. ఇటీవల నగేష్ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు త్రిపురారం పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా కంచిగట్ల శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా తన భార్యతో కలిసి నగేష్‌ను హత్య చేసి తన ఇంట్లో ఉన్న సెప్టిక్ ట్యాంకులో మృతదేహాన్ని పడవేసినట్లు నేరం అంగీకరించాడు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకుని కేసులో నిందితులైన శ్రీనివాస్‌తో పాటు అతని భార్య కంచిగట్ల మీనాక్షిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెంకటగిరి వివరించారు. కేసును ఛేదించిన హాలియా సీఐ గాంధీనాయక్, త్రిపురారం ఎస్ఐ శోభన్‌బాబు, సిబ్బంది రవి, శ్రావన్‌కుమార్, శ్రీని వాస్, రాము, శ్రీనును అభినందించినట్లు డీఎప్పీ తెలిపారు. కార్యక్రమంలో హాలియా ఎస్ఐ క్రాంతికుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. -
పెళ్లికి ముందే ప్రేమ.. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే కడతేర్చింది
సాక్షి, చెన్నై: ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే కడతేర్చిందో ఇల్లాలు. భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు కట్టుకథ అల్లినా మామ ఫిర్యాదుతో అసలు విషయం బయటపడింది. వివరాలు..తిరువళ్లూరు జిల్లా ఆర్కే పేట మండలం చంద్రవిలాసపురం సమీపంలోని సుందర్రాజుపురానికి చెందిన ఆరుముగం కుమారుడు యువరాజ్ (29) ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నా డు. అదే గ్రామానికి చెందిన మేనమామ కూతురు గాయత్రి(25)తో ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. దంపతులకు రెండేళ్ల కుమార్తె ఉంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇంట్లో యువరాజ్ ఆత్మహత్య చేసుకున్నట్లు గాయత్రి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. అయితే మృతిపై అనుమానంతో యువరా జ్ తండ్రి ఆరుముగం ఆర్కేపేట పోలీసులకు ఫిర్యా దు చేశారు. సీఐ అన్నాదురై విచారణ చేపట్టారు. గాయత్రి పొంతనలేని సమాధానం చెప్పడంతో లోతుగా దర్యాప్తు చేయగా అసలు నిజం వెలుగు చూసింది. అడ్డు తొలగించుకునేందుకే.. గాయత్రి చెన్నైలోని ప్రైవేటు కళాశాలలో డిప్లమా నర్సింగ్ చదువుతుండగా అదే కళాశాలలో పనిచేస్తున్న తిరుత్తణి ఆగూరుకు చెందిన శ్రీనివాసన్ (28)తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అయితే కళాశాల చదువు పూర్తికావడంతో గాయత్రికి యువరాజ్‌తో వివాహం చేశారు. అయితే ఏడాది కిందట తిరుత్తణిలోని ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా చేరిన గాయత్రికి అక్కడ విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసన్ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. భార్య ప్రవర్తనపై అనుమానం రావడంతో ఉద్యోగానికి సైతం నిలిపివేశారు. దీంతో ఎలాగైనా భర్తను అడ్డుతొలగించుకోవాలని భావించింది. ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న యువరాజ్‌ను గాయత్రి, ఆమె ప్రియుడు శ్రీనివాసన్, అతని స్నేహితులు మణిగండన్(26), హేమంత్ అలియాస్ జిల్లు(23) గొంతు నులుమి హత్య చేసినట్లు విచారణలో తేలింది. పరారీలో ఉన్న నిందితులను డీఎస్పీ విఘ్నేష్ ఆధ్వర్యంలో బృందం అదుపులోకి తీసుకుంది. వారిని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. -
వివాహేతర సంబంధం: రాత్రి వేర్వేరు గదుల్లో నిద్రిస్తుండగా
తిరుత్తణి(చెన్నై): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన ఆర్కేపేట ప్రాంతంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. చంద్రవిలాసపురం పంచాయతీలోని సుందర్రాజుపురానికి చెందిన యువరాజ్ (29) శ్రీపెరంబదూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసేవాడు. అతనికి అదే గ్రామానికి చెందిన మేనమామ కుతూరు గాయత్రి (22)తో ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. ఈ దంపతులకు రెండేళ్ల కూతురు ఉంది. ఈ క్రమంలో గాయతి తిరుత్తణిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న సమయంలో తిరుత్తణికి చెందిన యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడినట్లు తెలుస్తుంది. భర్త అనుమానంతో పనులకు నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇంట్లో రెండు గదుల్లో వేర్వేరుగా భార్యభర్త నిద్రిస్తుండగా రాత్రి 11 గంటల సమయంలో గాయత్రి గదిలో మరో యువకుడి ఉండడాన్ని గుర్తించిన యువరాజ్ వారిని నిలదీశాడు. ఈ క్రమంలో గాయత్రి ప్రియుడితో కలిసి భర్తను గొంతు నులిమి హత్య చేసి అక్కడు నుంచి పరారైనట్లు తెలుస్తోంది. యువరాజ్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు.. ఆర్కేపేట పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుత్తణి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు గాయత్రిని అదుపులోకి తీసుకుని పరారైన ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు. -
పిన్ని కుమారుడితో సంబంధం.. భర్త హత్యకు రూ. 5 లక్షల సుపారీ!
బెంగళూరు: జీవితాంతం తోడునీడగా ఉంటానని పెళ్లిలో ప్రమాణం చేసిన భార్య దారి తప్పి కట్టుకున్నోడిని కడతేర్చింది. పిన్ని కుమారుడితో అక్రమ సంబంధం పెట్టుకుని భర్తను హత్య చేయడానికి రౌడషీటర్లకు భార్య రూ. 5 లక్షల సుపారీ ఇచ్చి పరలోకానికి పంపించిన వైనమిది. కర్ణాటక రాష్ట్రం తుమకురు జిల్లాలోణి కుణిగల్ తాలూకాలోని సీనప్పనహళ్ళి గ్రామానికి చెందిన మంజునాథ్ హత్యకు అతని భార్య హర్షిత (20) కిరాయి ఇచ్చింది. ఈ కేసులో ఆమెను, ఆమె పిన్ని కుమారుడు రఘు, ఇతని మిత్రుడు రవికిరణ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం మంజునాథ్ ఫిబ్రవరి 3వ తేదీన కుణిగల్ పట్టణంలో స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని మళ్లీ సీనప్పనహళ్ళి గ్రామంలోని సొంత ఇంటికి వచ్చి నిద్రపోయాడు. అర్ధరాత్రి బయటకు పిలిచి హత్య.. అతనికి అర్ధరాత్రి ఫోన్ రావడంతో మాట్లాడుతూ బయటికి వెళ్లిపోయాడు. ఆపై మళ్లీ ఇంటికి రాలేదు. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కిత్న మంగళ చెరువులో మంజునాథ్ శవమై తేలాడు. దీంతో మంజునాథ్ కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసి భార్య హర్షితను అరెస్టు చేశారు. ఆమె చెప్పిన వివరాలతో మిగతా ఇద్దరిని పట్టుకున్నారు. భార్యే ఈ హత్య చేయించిందని గ్రామస్తులు కూడా ఆరోపించారు. రఘు, రవికిరణ్‌లు మంజునాథ్‌కు ఫోన్ చేయించి చెరువు వద్దకు పిలిపించారు. అక్కడ అతన్ని హత్య చేసి చెరువులో పడేసి వెళ్లినట్లు ఒప్పుకున్నారు. కేసు విచారణలో ఉంది. -
కన్నతల్లితో మరో వ్యక్తి సహజీవనం.. సన్నిహితంగా నటించి
సాక్షి, హైదరాబాద్: వివాహేతర సంబంధం ఓ వ్యక్తి దారుణ హత్యకు దారితీసిన ఘటన మేడ్చల్ జిల్లాలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ గోవర్ధనగిరి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కృష్ణా జిల్లా తెలప్రోలు గ్రామానికి చెందిన వివాహితకు, కోల వెంకటరమణమూర్తి (47) అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో అక్కడి నుంచి 14 ఏళ్ల క్రితం సదరు మహిళ కుటుంబ సభ్యులను వదిలి నగరాని వచ్చింది. పీర్జాదిగూడ బీబీసాహెబ్ మక్తా అమృత కాలనీలోని వృద్ధాశ్రమంలో వెంకటరమణమూర్తి కేర్ టేకర్‌గా పనిచేస్తూ ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ ద్వారా తన తల్లి చిరునామా తెలుసుకున్న ఆమె కుమారుడు నగరానికి వచ్చాడు. వెంకటరమణమూర్తికి నచ్చజెప్పి ఆమెను ఊరికి తీసుకువెళ్లాడు. వెంకటరమణమూర్తి కొన్ని రోజులుగా ఆమెకు ఫోన్ చేస్తూ నగరానికి రావాలంటూ పట్టుబడుతున్నాడు. ఎన్నో ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చిన తన తల్లి మళ్లీ దూరమవుతుందనే ఆలోచన అతడిలో మొదలైంది. దీంతో నెల రోజుల క్రితం నగరానికి వచ్చి వెంకటరమణమూర్తితో సన్నిహితంగా ఉంటున్నట్లు నటించాడు. ప్రణాళిక ప్రకారం ఆదివారం మధ్యాహ్నం వెంటకరమణమూర్తి వద్దకు వచ్చాడు. ఇద్దరు కలిసి మద్యం తాగుతూ మాట్లాడుకున్నారు. అక్కడే ఉన్న 5 కేజీల గ్యాస్ సిలిండర్‌తో వెంకటరమణమూర్తి తల, పక్కటెముకలపై దాడి చేయడంతో పాటు తన వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచాడు. అదే సమయంలో సిలిండర్ కింద విసిరేసినట్లు శబ్దం రావడంతో ఇంటి యజమాని కొడుకు పైకి వెళ్లి చూశాడు. అప్పటికే వెంకటరమణమూర్తి రక్తపు మడుగులో ఉన్నాడు. నిందితుడిని గది లోపలే ఉంచి తాళం వేసి మేడిపల్లి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం.. భార్యను టార్గెట్ చేసి..
కాజులూరు, తూర్పు గోదావరి: తనపై భర్త, అతడి ప్రియురాలు హత్యాయత్నానికి పాల్పడ్డారని.. దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా పోలీసులు నెల రోజులుగా స్టేషన్ చుట్టూ తిప్పుకుంటున్నారని.. ఇకనైనా న్యాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ మహిళ వీడియో స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేయడం కలకలం రేపింది. మీడియాకు ఆమె మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. కాజులూరు శివారు చాకిరేవు మెరకకు చెందిన అనసూరి లోవలక్ష్మికి పదేళ్ల కిందట కె.గంగవరం మండలం శివల గ్రామానికి చెందిన ఒక వ్యక్తితో వివాహమైంది. అయితే అతడు గ్రామంలోని మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీనిపై లోవలక్ష్మి నిలదీసింది. ఈ నేపథ్యంలో ఒక రోజు అర్ధరాత్రి భర్త, అతడి ప్రియురాలు కలిసి లోవలక్షి్మపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకున్న లోవలక్ష్మి కాజులూరులోని పుట్టింటికి వచ్చేసింది. తనపై హత్యాయత్నం జరిగిందని, తనకు న్యాయం చేయాలని గొల్లపాలెం పోలీస్ స్ట్షేన్‌లో ఫిర్యాదు చేసింది. వారు పట్టించుకోకపోవడంతో కాకినాడ జిల్లా ఎస్పీ రవీద్రనాథ్‌బాబును కలిసి పరిస్థితి వివరించింది. ఎస్పీ ఆదేశాల మేరకు గొల్లపాలెం పోలీసులు లోవలక్ష్మి నుంచి ఫిర్యాదు స్వీకరించారు. అయితే ఎటువంటి కేసూ నమోదు చేయలేదు. ఈ నేపథ్యంలో తనను నెల రోజులుగా అర్ధరాత్రి వరకూ ముద్దాయి మాదిరిగా పోలీస్ స్ట్షేన్ చుట్టూ తిప్పుతున్నారని, ఇకనైనా తనకు న్యాయం చేయకపోతే గొల్లపాలెం పోలీస్ స్ట్షేన్ ఎదుట ఆత్మహత్య చేసుకోవటం తప్ప మరో దారి లేదని లోవలక్ష్మి పేర్కొంది. ఆమె ఈవిధంగా మాట్లాడుతున్న వీడియోపై పోలీసులు మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కౌన్సెలింగ్ వల్లనే జాప్యం ఇది భార్యాభర్తలకు సంబంధించిన కేసు. ఇద్దరికీ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. అందువల్లనే కేసు నమోదు ఆలస్యమైంది. రెండుసార్లు కౌన్సెలింగ్ చేసినా వారు అంగీకరించలేదు. దీంతో మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. – ఎం.తులసీరామ్, ఎస్సై, గొల్లపాలెం -
వివాహేతర సంబంధం.. మా ఇంటికి ఎందుకొచ్చావ్.. ఇంతలోనే షాకింగ్ ఘటన..
తొండూరు(వైఎస్సార్ జిల్లా): మండలంలోని ఊడవగండ్ల గ్రామంలో శుక్రవారం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన రామిరెడ్డి సహదేవరెడ్డి(66)ని మచ్చుకొడవలితో అతి కిరాతకంగా నరికారు. రూరల్ సీఐ బాలమద్దిలేటి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తొండూరు మండలం ఊడవగండ్ల గ్రామానికి చెందిన రామిరెడ్డి సహదేవరెడ్డికి అదే గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి గంగిరెడ్డి భార్యతో వివాహేతర సంబంధం ఉన్నట్లు అనుమానం కలగడంతో.. మా ఇంటి వద్దకు ఎందుకు వచ్చావని గంగిరెడ్డి మందలించారు. దీంతో సహదేవరెడ్డికి, గంగిరెడ్డికి మాటకుమాట పెరిగి వాగ్వాదం జరుగుతుండగా.. గంగిరెడ్డి అన్న కుమారుడు ప్రహ్లాదారెడ్డి మచ్చుకొడవలితో సహదేవరెడ్డిపై దాడి చేశారు. గతంలో సహదేవరెడ్డి, గంగిరెడ్డి మధ్య పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరిగినట్లు స్థానికులు తెలిపారు. అయినప్పటికీ సహదేవరెడ్డి తీరు మారకపోవడంతో గంగిరెడ్డి ఇంటి సమీపంలో అరుగు మీద కూర్చొన్న సహదేవరెడ్డిని చూసి కోపోద్రిక్తులై సంఘటన జరిగినట్లు తెలిపారు. సహదేవరెడ్డి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుండగా.. కుటుంబ సభ్యులు 108 వాహనంలో పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ హనుమంతు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఫొటోగ్రాఫర్ హత్య వెనుక ‘టీడీపీ’ నేత హస్తం? -
భార్యతో గొడవలు.. మరో మహిళతో వివాహేతర సంబంధం.. చివరికి..
అన్నానగర్(తమిళనాడు): ఊటీ బొటానికల్ గార్డెన్లో ఆత్మహత్యకు యత్నించిన వివాహేతర జంట చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందారు. నీలగిరి జిల్లా ఓల్డ్ ఊటీకి చెందిన జైశంకర్ (36) పెయింటర్. అదే ప్రాంతానికి చెందిన మహిళతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఉద్యోగరీత్యా తరచూ బయటి ఊరుకి వెళ్లేవాడు. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. కొంత కాలంగా వీరు విడిగా ఉంటున్నారు. పెయింటర్ పనులకు వెళ్లే క్రమంలో జైశంకర్‌కు మేట్టుపాళయానికి చెందిన వివాహిత రాధతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత రాధను రెండో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం మేట్టుపాళయం నుంచి రాధను ఊటీలోని తన ఇంటికి తీసుకొచ్చాడు. దీంతో జైశంకర్ కుమారులు తండ్రితో మాట్లాడలేదు. దీంతో జైశంకర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. గత వారం రాధతో కలిసి ఊటీ బొటానికల్ గార్డెన్‌ను చూడటానికి వెళ్లాడు. జైశంకర్, రాధ అక్కడే విషం తాగి స్ఫృహ తప్పి పడిపోయారు. దీంతో పర్యాటకులు ఇద్దరిని చికిత్స నిమిత్తం ఊటీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఇద్దరూ మృతి చెందారు. ఊటీ సెంట్రల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పరిశోధకుడు కాదు.. కామాంధుడు.. ప్రేమ పేరుతో లోబర్చుకుని.. -
వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని.. ప్రియుడితో కలిసి
గద్వాల క్రైం (జోగులాంబ గద్వాల): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసిన సంఘటన శుక్రవారం గద్వాలలో కలకలం రేపింది. సీఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. పెబ్బేరు మండలం బూడిదపాడు గ్రామానికి చెందిన ఎండీ అబ్దుల్ (35) గద్వాల పట్టణానికి చెందిన మహబూబ్‌బీని 12 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరు గద్వాల పట్టణంలోని నల్లకుంట కాలనీలో అద్దె ఇంట్లో ఉంటూ కూరగాయాల వ్యాపారం చేస్తున్నారు. దంపతులకు తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే భార్య అదే కాలనీకి చెందిన రఫీతో కొన్ని రోజులుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఈ విషయంపై వారం రోజుల క్రితం భార్యతో గొడవపడ్డాడు. అయితే తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి గురువారం ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ప్రియుడితో కలసి చున్నీతో గొంతుకు బిగించి ఊపిరాడకుండా హత్య చేశారు. ఇక భర్త తరఫు బంధువులకు భార్య ఫోన్ చేసి ఫిట్స్ వచ్చి మృతి చెందాడని చెప్పింది. విషయం తెలుసుకున్న బంధువులు మృతదేహాన్ని పరిశీలించి మహబూబ్‌బీపై అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పట్టణ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా.. హత్య చేసినట్లు అంగీకరించారు. మృతుడి సోదరుడు మహ్మద్ హాజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు. భార్యను అదుపులోకి తీసుకున్నామని, ప్రియుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. -
ఇద్దరిని బలిగొన్న.. వివాహేతర సంబంధం
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట): వివాహేతర సంబంధాన్ని వదులుకోలేక ఓ వివాహిత, యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలంలో చోటుచేసుకుంది. తుమ్మలపెన్‌పహాడ్ గ్రామానికి చెందిన ఉప్పునూతల గంగరాజుకు పదేళ్ల క్రితం మోతె మండలం సిరికొండ గ్రామానికి చెందిన లావణ్య(28)తో పెళ్లి జరిగింది. వీరికి ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, లావణ్యకు అదే గ్రామానికి చెందిన చింతపల్లి మహేశ్‌తో మూడేళ్ల క్రితం ఏర్పడిన పరిచయం.. వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిసి.. వారు మందలించడంతో మహేశ్, లావణ్య ఆదివారం తమ ఇళ్లను విడిచి వెళ్లపోయారు. లావణ్య భర్త ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు ఫోన్ లోకేషన్ ద్వారా గ్రామంలో కౌలు రైతు సోమిరెడ్డి మాధవరెడ్డి వ్యవ సాయ భూమి వద్ద మహేశ్ ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి చేరుకోగా అప్పటికే ఇరువురూ మృతిచెంది ఉన్నారు. పక్కన పురుగుల మందు డబ్బాలు ఉండటంతో ఆత్యహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. చదవండి: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య.. సూసైడ్ నోట్ రాసి.. -
వివాహేతర సంబంధానికి భర్త అడ్డు..గ్రామంలో జాతర ఉందని చెప్పి!
సాక్షి, మహబూబ్‌నగర్: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన సంఘటన పది రోజుల తర్వాత వెలుగు చూసింది. స్థానిక సీఐ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ రాంలాల్ వివరాలను వెల్లడించారు. మండలంలోని పెద్దచింతకుంట గ్రామానికి చెందిన మరాఠి శ్రీనివాసులు(39) వృత్తి రీత్యా ఆటోడ్రైవర్, భార్య సుజాత వీరికి కుమారుడు, కుతూరు ఉన్నారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన కరుణాకర్‌రెడ్డితో నాలుగేళ్ల క్రితం సుజాతతో పరిచయం ఏర్పడింది. ఈ విషయంపై అనుమానం వచ్చిన భర్త పలుమార్లు భార్యను నిలదీశాడు. పెద్దల సమక్షంలో పంచాయితీలు పెట్టారు. అయినా గుట్టు చప్పుడుగా వీరు తమ సంబంధాన్ని కొనసాగిస్తుండడంతో, పద్ధతి మార్చుకోవాలని భార్యతో తరచుగా గొడవ పడేవాడు. భర్త గొడవ పడుతున్న విషయాన్ని సుజాత ప్రియుడికి తెలిపింది. ఇరువురు కలిసి శ్రీనివాసులు హత్యకు పథకం వేశారు. ఈ నెల 6న గ్రామంలో జాతర ఉందని ఇంటిని శుద్ధి చేసి భర్తను నమ్మించి ముగ్గురు కలిసి ఆ రోజు రాత్రి మద్యం సేవించారు. శ్రీనివాసులు మద్యం మత్తులోకి జారుకోగా, రాత్రి 12 గంటల సమయంలో భార్య తన భర్త ముఖంపై ఊపిరి ఆడకుండా గట్టిగా దిండు పెట్టగా, ప్రియుడు కరుణాకర్‌రెడ్డి కాళ్లు, చేతులు గట్టిగా పట్టుకొని హత్య చేసినట్లు విచారణలో ఒప్పుకున్నారు. భార్యపై అనుమానంతో మృతుడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణలో నిజాలు తేలాయని సీఐ తెలిపారు. నిందితులు ఇద్దరిని గ్రామంలోనే అరెస్ట్ చేసి నారాయణపేట కోర్టులో హాజరుపరిచారు. చదవండి: ఆర్య సమాజ్‌లో ప్రేమ పెళ్లి.. మియాపూర్‌లో కాపురం.. చివరికి భర్త షాకింగ్ ట్విస్ట్ -
మహిళతో వివాహేతర సంబంధం.. ఆమె కుమార్తెపైనా కన్నేయడంతో...!
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: ఓ మహిళకు ఒకతనితో వివాహేతర సంబంధం ఉంది. అతను ఆమె కుమార్తెను లైంగికంగా వేధింపులకు గురిచేయసాగాడు. ఈ విషయంపై మహిళ అతడిని పలుమార్లు హెచ్చరించింది. అయినా తీరు మారకపోవడంతో భరించలేకపోయిన తల్లి కర్ర, రాళ్లతో అతడిపై దాడి చేయగా తీవ్రగాయమై అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనపై వెంకటాచలం పోలీసులు ఈ ఏడాది జూన్ 8వ తేదీన హత్య కేసును నమోదు చేశారు. ఎట్టకేలకు హత్య కేసును ఛేదించారు. వెంకటాచలం పోలీస్‌స్టేషన్‌లో గురువారం సాయంత్రం నెల్లూరు రూరల్ డీఎస్పీ వీరాంజనేయరెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కసుమూరు కొండపై నివాసం ఉంటున్న కూరపాటి వెంకయ్య (74)కు, అక్కడే నివాసముంటున్న మోతే నారాయణమ్మతో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే నారాయణమ్మ కుమార్తెను కూడా వెంకయ్య లైంగిక వేధింపులకు గురి చేసేవాడు. ఈ విషయం తెలుసుకున్న నారాయణమ్మ పలు సందర్భాల్లో వెంకయ్యను మందలించింది. జూన్ 8న తెల్లవారుజామున నారాయణమ్మ కుమార్తె బహిర్భూమికి వెళ్లగా, వెంకయ్య వెంబడించి పట్టుకోవడంతో పెద్దగా కేకలు వేసింది. నారాయణమ్మ అక్కడికి చేరుకుని కర్రతో వెంకయ్యపై దాడి చేసింది. అక్కడి నుంచి కుమార్తెను తీసుకుని వెళ్లిపోతుండగా, వెంకయ్య మళ్లీ వెంబడించడంతో అక్కడే ఉన్న రాళ్లతో కొట్టి వెళ్లిపోయింది. అయితే వెంకయ్య మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడంతో వాస్తవాలు వెలుగు చూశాయి. నారాయణమ్మను కోర్టుకు హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ గంగాధర్‌రావు, ఎస్సై అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. -
పనిమనిషితో వివాహేతర సంబంధం.. బెడ్‌పై గుండెపోటుతో మృతి
బెంగళూరు: కర్ణాటక బెంగళూరులో కొద్ది రోజుల క్రితం ప్లాస్టిక్ బ్యాగ్‌లో ఓ శవం లభించిన విషయం కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఈ 67 ఏళ్ల వ్యాపారవేత్తకు తన ఇంట్లో పనిచేసే 35 ఏళ్ల మహిళతో వివాహేతర సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. నవంబర్ 16న ఆమె ఇంటికి వెళ్లి శృంగారం చేస్తూ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడని వెల్లడించారు. తన యజమానితో వివాహేతర సంబంధం ఉందని అందరికీ తెలిస్తే పరువు పోతుందని మహిళ భావించింది. దీంతో అతడు చనిపోయిన విషయాన్ని భర్తతో పాటు సోదరుడికి ఫోన్ చేసి చెప్పింది. ఆ తర్వాత వాళ్లు వచ్చాక ముగ్గురు కలిసి శవాన్ని ఓ ప్లాస్టిక్ బ్యాగ్‌లో ప్యాక్ చేశారు. అనంతరం తీసుకెళ్లి రోడ్డు పక్కన పడేశారు. అని పోలీసులు వివరించారు. చనిపోయిన వ్యక్తి పేరు బాల సుబ్రహ్మణ్యం. జేపీ నగర్లో నివసించేవాడు. నవంబర్ 16 సాయంత్ర 4:55 గంటలకు తన మనవడ్ని బ్యాడ్మింటన్ కోర్టులో డ్రాప్ చేసేందుకు వెళ్లాడు. ఆ తర్వాత తనకు వ్యక్తిగత పని ఉందని, ఆలస్యంగా వస్తానని కోడలుకు ఫోన్ చేసి చెప్పాడు. కానీ ఆ తర్వాత బాల సుబ్రహ్మణ్యం ఇంటికి తిరిగివెళ్లలేదు. దీంతో ఆయన కుమారుడు మరుసటి రోజే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మిస్సింగ్ కేసు పెట్టాడు. ఆ మరునాడే పోలీసులకు ఓ ప్లాస్టిక్ బ్యాగ్‌లో బెడ్ షీట్లు చుట్టి ఉన్న ఓ శవం కన్పించింది. అతడ్ని బాలసుబ్రహ్మణ్యంగా గుర్తించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు పనిమనిషి అసలు విషయం చెప్పింది. ఆయనతో చాలా కాలంగా వివాహేతర సంబంధం ఉందని తెలిపింది. అతను శృంగారం చేస్తూ బెడ్‌పైనే చనిపోయాడని చెప్పింది. తామే శవాన్ని బ్యాగులో చుట్టి రోడ్డు పక్కన పడేశామని అంగీకరించింది. చదవండి: యువతి అదృశ్యం.. అర్ధరాత్రి మెలకువ రావడంతో.. -
పెళ్లైన 5 నెలలకే ఘోరం.. నర్సుతో లవ్ ఎఫైర్.. భార్యకు ఇంజెక్షన్లు ఇచ్చి..
ముంబై: ఆ జంటకు పెళ్లై అయిదు నెలలు. భవిష్యత్తుపై ఎన్నో ఊహలు, ఆశలతో వైవాహిక బంధంలోకి అడ్డుగుపెట్టిన ఆ ఇల్లాలి సంతోషం ఎంతో కాలం నిలవలేదు. పెళ్లై ఏడాది గడవకముందే భర్త పరాయి స్త్రీ మోజులో పడ్డాడు. జీవితంలో తోడూ నీడై తనకు అండగా ఉండాల్సిన వ్యక్తే ఆమె పాలిట యముడయ్యాడు. వాహేతర సంబంధానికి అడ్డొస్తుందనే కారణంతో కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. ఆపై ఆమె ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరించేందుకు ఓ పెద్ద కథను కూడా అల్లాడు. కానీ అదికాస్తా బెడిసి కొట్టడంతో చివరకు తప్పను ఒప్పుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. స్వప్నిల్ సావంత్(23) అనే యువకుడు పుణెలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్నాడు. అయిదు నెలల క్రితం ప్రింయాంక క్షేత్రేని వివాహం చేసుకొని అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. కొంతకాలంగా అక్కడే నర్సుగా చేస్తున్న సహోద్యోగితో సావంత్ ఎఫైర్ నడుపుతున్నాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో పెళ్లికి తన భార్య అడ్డుగా ఉందని భావించి ఆమెను అంతమొందించాలనుకున్నాడు. నవంబర్ 14న భార్యకు ప్రాణాంతక ఇంజెక్షన్లు ఇచ్చి చనిపోయేలా చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వివాహితను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారు. భార్య హత్యను ఆత్మహత్యగా నమ్మించేందుకు కుట్ర పన్నాడు. ప్రియాంక రాసినట్లు ఓ సుసైడ్ లేఖ కూడా రాశాడు. అయితే పోలీసులకు భర్త ప్రవర్తనపై అనుమానం రావడంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. దర్యాప్తులో చేసిన నేరాన్ని అంగీకరించాడు. పనిచేస్తున్న ఆసుపత్రి నుంచి వెకురోనియం బ్రోమైడ్, నైట్రోగ్లిజరిన్ ఇంజెక్షన్లు,లోక్స్ 2% సహా కొన్ని మందులు ఇంజెక్షన్లను దొంగిలించాడని తేలింది. వాటిని భార్యకు ఇచ్చి హత్య చేసిన్టలు ఒప్పుకున్నాడు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని.. పూర్తి దర్యాప్తు జరుగుతోందని ఇన్స్పెక్టర్ మనోజ్ యాదవ్ వెల్లడించారు. చదవండి: కోవిడ్‌లోనూ రెచ్చిపోయిన నాగేంద్ర బాబు.. వలలో ఎందరో సినీ ప్రముఖులు -
ప్రియుడితో కలిసి భర్తను చంపి.. అదే ఇంట్లో గోతి తీసి.. నాలుగేళ్ల తర్వాత
లక్నో: నాలుగేళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసును ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్ పోలీసులు తాజాగా చేధించారు. ఈ కేసులో మృతుడి భార్య, పొరుగింటిలో నివాసముండే అరుణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇద్దరి మధ్య ఉన్న వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు. మహిళ తన ప్రియుడు అరుణ్‌తో కలిసి భర్తను కాల్చి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. హత్య చేసిన అనంతరం ప్రియుడు ఇంట్లోనే ఆరు అడుగుల గోతి తీసి అందులో మృతదేహాన్ని పూడ్చి పెట్టినట్లు తేలింది. గొయ్యిపై నుంచి సిమెంట్ ఫ్లోరింగ్ చేసిన తరువాత అరుణ్ అదే ఇంట్లో ఉంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో నిందితుడి ఇంట్లో నుంచి కుళ్లిపోయిన మృతదేహాన్ని, అస్థిపంజరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే హత్య చేసేందుకు ఉపయోగించిన పిస్టల్, గొడ్డలిని కనుగొన్నారు. భర్తను చంపకముందే గొయ్యి తీసి సిద్ధంగా ఉంచినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతదేహం దుర్వాసన రాకుండా లోతుగా తవ్వినట్లు తెలిపారు. చదవండి: Girlfriend Murder In Delhi: యువతితో సహజీవనం, హత్య, ముక్కలుగా నరికి.. ఢిల్లీ అంతటా 18 రోజుల్లో.. అసలేం జరిగిందంటే తన భర్త చంద్రవీర్ సింగ్ కనిపించకుండాపోయాడని సవిత అనే మహిళ 2018లో ఘజియాబాద్‌లోని సిహానీ గేట్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. భార్య ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్నారు. భర్త అదృశ్యం వెనక అతని తమ్ముడి హస్తం ఉన్నట్లు భార్య తన ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేసింది. అయితే ఈ కేసులో సరైన సాక్క్క్ష్యాధారాలు లేకపోవడంతో మూసివేశారు. నాలుగు సంవత్సరాల తరువాత ఇటీవల ఈ కేసులోఘజియాబాద్ క్రైం బ్రాంచ్ పోలీసులకు కొన్ని ఆధారాలు లభ్యమవ్వడంతో మళ్లీ విచారణ ప్రారంభించినట్లు ఎస్పీ దిక్ష శర్మ తెలిపారు. ఈ క్రమంలోనే మృతుడి భార్య సవిత, ప్రియుడు అరుణ్ అలియాస్ అనిల్ కుమార్ కలిసి చంద్రవీర్‌ను హత్య చేసినట్లు వెల్లడైంది. ఇద్దరిని అరెస్ట్ చేసి విచారించగా తమ నేరాన్ని అంగీకరించారు. 2017 నుంచి తమ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని నిందితులు పోలీసులకు వెల్లడించారు. ఈ విషయం భర్తకు తెలియడంతో తరుచూ గొడవలు జరిగేవని భార్య సవిత తెలిపింది. మరోసారి ఇలా జరగవద్దని పలుమార్లు హెచ్చరించాడని పేర్కొంది. #SSP_GZB @IPSMUNIRAJ के निर्देशन में क्राइम ब्रांच व थाना नन्दग्राम द्वारा 04 वर्षाें से लापता चल रहे चंद्रवीर उर्फ पप्पू नामक व्यक्ति की हत्या का खुलासा, पत्नी सहित प्रेमी गिरफ्तार, अभियुक्तगण ने हत्या कर शव को घर में दफना दिया था। मृतक का शव व घटना में प्रयुक्त आलाकत्ल बरामद। pic.twitter.com/NrGvHBEs1Y — GHAZIABAD POLICE (@ghaziabadpolice) November 14, 2022 దీంతో చంద్రవీర్ తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి అతడిని హత్య చేసేందుకు సవిత, అరుణ్ పథకం వేశారు. సెప్టెంబర్ 28, 2018న చంద్రవీర్ అర్థరాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చి తన గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. వెంటనే సవిత అరుణ్‌ను ఇంట్లోకి పిలిపించడంతో.. చంద్రవీర్ గదిలోకి వెళ్లి అతని తలపై కాల్చి చంపాడు. అనంతరం అతని మృతదేహాన్ని ఎత్తుకుని అతని ఇంటికి తీసుకెళ్లాడు. అరుణ్ ఇంటి వద్ద సవిత సాయంతో ఆరడుగుల గొయ్యి తవ్వి అందులో చంద్రవీర్ మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ఇక ఈ కేసులో నిందితులైన సవిత, అరుణ్‌ను కోర్టులో హజరుపర్చనున్నట్లు పోలీసులు తెలిపారు. -
మహాలక్ష్మికి నా భర్తతో అఫైర్.. అందుకే ఆమె భర్త వదిలేశాడు : నటి
ప్రముఖ తమిళ నిర్మాత రవీందర్ బుల్లితెర నటి వీజే మహాలక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. చూడచక్కని రూపంతో అందంగా ఉన్న మహాలక్ష్మీ.. భారీకాయుడైన రవీందర్‌ను పెళ్లాడటంతో ఈ జంట హాట్‌టాపిక్‌గా నిలిచింది. వీరి పెళ్లి గురించి తమిళనాటే కాకుండా సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ మధ్యకాలంలో వీళ్లపై వచ్చినన్ని ట్రోల్స్ ఎవరి మీద వచ్చి ఉండవు. వీరిద్దరికి ఇది రెండో పెళ్లి. తాజాగా మహాలక్ష్మి గురించి నటి జయశ్రీ సంచలన ఆరోపణలు చేసింది. మహాలక్ష్మికి తన భర్తతో అఫైర్ ఉందని, అందుకే మొదటి భర్త ఆమెను వదిలేశాడంటూ పేర్కొంది. తన ముందే ఆమెతో వీడియో కాల్స్ చేసి మాట్లాడేవాడని, అంతేకాకుండా మహాలక్ష్మి కొడుకు తన భర్తను నాన్న అని పిలుస్తున్నాడంటూ గతంలో జయశ్రీ ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఆ వార్తలను కొట్టిపారేసిన మహాలక్ష్మి జయశ్రీ కావాలనే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తుందని, ఇందులో నిజం లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా తన వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో రవీందర్ తనకు అండగా నిలబడ్డాడని, అందుకే అతనితో కొత్త జీవితం ప్రారంభించానని తెలిపింది. -
ప్రియుడితో కలిసి కొడుకును హత్య చేసిన తల్లి
సాక్షి, మహబూబ్‌నగర్: తమ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. ప్రియుడితో కలిసి ఓ తల్లి కన్న కొడుకును హత్య చేసింది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలంలో జరిగింది. హన్వాడ ఎస్ఐ రవి కథనం ప్రకారం.. టంకర గ్రామానికి చెందిన వెంకటే‹Ù(26) బుడగ జంగం వృత్తి చేస్తూ ఉండేవాడు. అతని తండ్రి పాపయ్య ఆరేళ్ల కిందట మృతి చెందాడు. వెంకటేష్ తల్లి దాయమ్మ అదే గ్రామానికి చెందిన శ్రీను అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో శ్రీను పలుమార్లు ఇంటికి వచ్చేవాడు. ‘మా ఇంటికి ఎందుకు వస్తున్నావ’ని శ్రీనుతో వెంకటేష్ గొడవపడ్డాడు. బుధవారం తెల్లవారుజామున శ్రీను, అతని అన్న అల్లుడు నర్సింహతో కలిసి దాయమ్మ కోసం వాళ్ల ఇంటికి వచ్చారు. మరోసారి వెంకటేష్ వారితో గొడవపడ్డాడు. దీంతో శ్రీను, నర్సింహ, దాయమ్మలు కలిసి వెంకటేష్‌ను తీవ్రంగా కొట్టి హత్య చేశారు. ఆ తర్వాత కాళ్లు, చేతులు కట్టేసి గ్రామ సమీపంలో ఉన్న చెరువులో పడేశారు. ఉదయం స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు మృతదేహన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. చదవండి: భర్త అల్లిన కట్టుకథ.. మహిళ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్ -
నిర్మాత నిర్వాకం.. మరో మహిళతో షికారు.. భార్య రెడ్ హ్యండెడ్‌గా పట్టుకోవడంతో..
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కమల్ కిశోర్ మిశ్రాపై కేసు నమోదైంది. మరో మహిళతో సన్నిహితంగా ఉండగా రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్న తన భార్యను కారుతో తొక్కించాడనే ఆరోపణలతో ఈ కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. అక్టోబర్ 10న ఈ ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగావెలుగులోకి వచ్చింది. భర్త తనని చంపాలని చూశాడని కిశోర్ మిశ్రా భార్య అంబోలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. చదవండి: Samantha Shocking Look: సామ్ సర్జరీ చేసుకుందా? ఇలా మారిపోయిందేంటి! వివరాలు.. బాలీవుడ్ నిర్మాత అయిన కిశోర్ మిశ్రా మరో మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో అంధేరిలోని ఓ ఇంటి పార్కింగ్ స్థలంలో సదరు మహిళతో సన్నిహితంగా ఉండటం ఆయన భార్య కంటపడింది. ఇక ఈ విషయమై ఆయనను నిలదీసేందుకు ఆమె కారు దగ్గరికి వెళ్లింది. కారు దిగమని చెబుతున్న ఆయన డోరు తీయకపోవడంతో ఆమె గట్టిగా అరవడం మొదలు పెట్టింది. దీంతో కంగారు పడ్డ కిశోర్ మిశ్రా వెంటనే కారు స్టార్ట్ చేశాడు. ఈ క్రమంలో కారు ఆమెను ఢీకోట్టడంతో ఆమె కిందపడిపోయింది. చదవండి: పెళ్లి కానుకగా పూర్ణకు ఆమె భర్త ఇచ్చిన బంగారం ఎంతో తెలుసా? అయినా కిశోర్ మిశ్రా కారు ఆపకుండ భార్య కాళ్లపై నుంచి ముందుకు పోనిచ్చాడు. అయితే ఆమె అరవడంతో స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి పరుగెత్తుకు వచ్చి ఆమె కాపాడాడు. అయితే ఈ ఘటనలో ఆమె తలకు, కాళ్లకు, చేతులకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. భర్త తనను చంపాలని ప్రయత్నించాడని కిశోర్ మిశ్రా భార్య అంబోలి పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కిశోర్ మిశ్రాపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. Mumbai: FIR registered against filmmaker Kamal Kishor Mishra for allegedly ramming his car into his wife after she spotted him with another woman in the vehicle, say police pic.twitter.com/DeUa1YP1Xu — AH Siddiqui (@anwar0262) October 26, 2022 -
భర్త కంటే 16 ఏళ్లు చిన్న.. వివాహేతర సంబంధం మోజుతో
సాక్షి, బెంగళూరు: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ యువతి తాళికట్టిన భర్తనే ప్రియునితో కలిసి హత్య చేయించింది. ఈ ఘటన బెంగళూరు యలహంక పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. శుక్రవారం రాత్రి యలహంకలోని కొండప్ప లేఔట్లో ఓ మేడపై చంద్రశేఖర్ (35) అనే నేత కార్మికుడు తల, మర్మావయవాలపై తీవ్ర గాయాలతో హత్యకు గురయ్యాడు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేపట్టగా భార్య ప్రమేయముందని వెల్లడైంది. దీంతో భార్య శ్వేత (19), ఆమె ప్రియుడు సురేశ్ (22)ని బుధవారం అరెస్ట్ చేశారు. నాలుగేళ్ల కిందట అక్క కూతురితో పెళ్లి వివరాలు.. శ్వేత, చంద్రశేఖర్‌కు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరిది పుట్టపర్తి జిల్లాలోని హిందూపురం స్వస్థలం కాగా, అక్కడే నేత పని చేసేవారు. చంద్రశేఖర్ కంటే శ్వేత 16 ఏళ్ల చిన్నది. కానీ అక్క కుమార్తె అనే కారణంతో కుటుంబసభ్యులు ఇద్దరికీ బలవంతంగా వివాహం చేశారు. పెళ్లయిన తరువాత శ్వేత చదువుకోవడానికి హిందూపురంలో కాలేజీకి వెళ్లింది. అక్కడ స్నేహితులతో కలిసి షికార్లకు వెళ్లేదని భర్త తరచూ గొడవపడేవాడు. హిందూపురం నుంచి యలహంకకు దీంతో కుటుంబసభ్యులు 4 నెలల కిందటే దంపతుల మధ్య రాజీ చేసి హిందూపురం నుంచి యలహంక కొండప్పలేఔట్ లో ఉండాలని ఇక్కడకు పంపించారు. శ్వేత హిందూపురానికి చెందిన ప్రియుడు సురేశ్‌తో సంబంధం కొనసాగిస్తోంది. సురేశ్ అప్పుడప్పుడు శ్వేత ఇంటికి వచ్చివెళ్లేవాడు. ఆమె భర్తకు తెలియకుండా ఈ తతంగం సాగుతోంది. చివరికి ఈ విషయం భర్తకు తెలియడంతో మళ్లీ ఘర్షణ పడ్డారు. హత్యకు కుట్ర శ్వేత, సురేశ్ కలిసి తమకు అడ్డుగా ఉన్న చంద్రశేఖర్‌ను తొలగించుకోవాలనుకున్నారు. సురేశ్ 22వ తేదీన బెంగళూరుకు వచ్చాడు. చంద్రశేఖర్ ఇంట్లోనే ఉన్నాడని, ఇదే సరైన సమయమని శ్వేత ఫోన్ చేసింది. సురేశ్ వచ్చి చంద్రశేఖర్‌ను కలిశాడు, మీతో మాట్లాడాలంటూ మేడపైకి తీసుకెళ్లి గొడవపడ్డాడు. సురేశ్ పక్కనే ఉన్న ఇటుక తీసుకుని చంద్రశేఖర్ తలపై దాడిచేశాడు. చంద్రశేఖర్ రక్తస్రావంతో కిందపడిపోయాడు. ఇదే సమయంలో మర్మావయవాలపై పొడిచి చంపి అక్కడి నుంచి ఉడాయించాడు. విచారణలో అసలు నిజం సమాచారం అందిన వెంటనే యలహంక పోలీసులు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఎవరు హత్య చేశారు అని భార్యను ప్రశ్నించగా తనకు తెలియదని, ఎవరో ముగ్గురు వ్యక్తులు వచ్చి వెళ్లారని పొంతన లేకుండా చెప్పింది. ఆమెపై అనుమానంతో పోలీస్‌స్టేషన్ కు తీసుకెళ్లి తమదైన శైలిలో విచారించగా ప్రియుడు సురేశ్‌తో కలిసి హత్య చేసినట్లు నోరువిప్పింది. పోలీసులు ముమ్మర గాలింపు జరిపి పరారీలో ఉన్న సురేశ్‌ను కూడా అరెస్ట్ చేసి కేసు విచారణ చేపట్టారు. -
అన్నదమ్ములతో మహిళ వివాహేతర సంబంధం.. రెండుసార్లు పారిపోయి..
సాక్షి, చెన్నై: వివాహేతర సంబంధంలో ప్రియుడు తన తండ్రితో కలసి ప్రియురాలిని హత్య చేశాడు. ఈ కేసులో నిందితుడితోతోపాటు అతడి తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. అరియలూరు జిల్లా తాపలూ ర్కు చెందిన శక్తివేల్ కూలి పనిచేసి, జీవిస్తున్నా డు. ఇతనికి భార్య సత్య (30), ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా మేల్కుడికాడు గ్రామానికి చెందిన అమృతరాజ్ (24)తో సత్య కు వివాహేత సంబంధం ఏర్పడింది. అతనితో కలిసి వెల్లకోయిల్కు వెళ్లింది. అయితే శక్తివేల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు సత్యను గుర్తించి, ఆమెను మందలించి భర్తతో కలిసి జీవించమని పంపించారు. అయితే ఆ తర్వాత సత్యకు అమృతరాజ్ తమ్ముడు దేవాతో వివాహేతర సంబంధం ఏర్పడి, అతనితో సత్య పారిపోయింది. దీంతో విసిగిపోయిన శక్తివేల్ తన ఇద్దరు పిల్లలను తల్లిదండ్రుల వద్ద వదలిపెట్టి పని కోసం మలేషియా వెళ్లాడు. ఈ క్రమంలో మామ ఇంట్లో ఉన్న సత్యకు అమృతరాజ్‌కు మధ్య డబ్బు వ్యవహారంలో గొడవ ఏర్పడింది. దీంతో అమృతరాజ్ అతని తండ్రి దేవేంద్రన్ కలసి సత్యపై కత్తితో దాడి చేసి, హతమార్చారు. ఈ విషయమై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, అమృతరాజ్ అతని తండ్రి దేవేంద్రన్ (57)ను అరెస్టు చేసి, విచారణ జరపుతున్నారు. చదవండి: విషాదం.. ప్రాణాలు కాపాడే అంబులెన్సే మృత్యుపాశమైంది..! -
నిత్యం తాగొచ్చి వేధింపులు.. అత్తకు వివాహేతర సంబంధంపై రచ్చ.. పక్కా ప్లాన్‌తో!
ఖమ్మంఅర్బన్: మద్యం సేవించి నిత్యం వేధిస్తున్నాడని భావించి.. తన భర్త కాళ్లు, చేతులను కట్టి సాగర్ కాల్వలో పడేసిన భార్య ఉదంతమిది. శనివారం భార్య ఖమ్మంఅర్బన్ పోలీసుల వద్ద లొంగిపోగా మరికొందరిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన వివరాలను ఆదివారం ఖమ్మం నగర ఏసీపీ ఆంజనేయులు, ఖమ్మం అర్బన్ సీఐ రామకృష్ణ వెల్లడించారు. ఖమ్మం నగరం యూపీహెచ్ కాలనీలో నివాసముంటున్న ఎస్కే అన్వర్ (33) కొంతకాలంగా కనిపించడం లేదని అతడి తల్లి ఎస్కే రహమత్ ఈ ఏడాది జూలైలో ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. సీఐ రామకృష్ణ నేతృత్వంలో అన్వర్ ఆచూకీ కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. కేసు విచారణలో భాగంగా అనుమానితులైన భార్య సల్మా, అత్త సాధుఖాన్, బాలాజీపై నిఘా పెట్టి వారి కదలికలను గమనిస్తున్నారు. భార్య సల్మా సొంతగ్రామమైన మహబూబాబాద్‌లో ఉంటోందని తెలిసి అక్కడి పోలీసుల సాయంతో పట్టుకోవడం కోసం తిరిగినా ఫలితం లభించలేదు. తర్వాత ఐడీ పార్టీ పోలీసుల ద్వారా నిఘా పెంచారు. ఈ క్రమంలో పోలీసులు ఎలాగైనా పట్టుకుంటారని భయపడి, తప్పించుకునే పరిస్థితి లేదని గ్రహించి ఖమ్మం నగరంలో వారికి తెలిసిన పెద్దమనుషుల సహకారంతో శనివారం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన నిందితులు అన్వర్ భార్య సల్మా, అత్త సాదుఖాన్, బావమరిది యాకూబ్, బాలాజీ, వెంకన్న లొంగిపోయారు. వారిని విచారించగా అన్వర్‌ను తామే హత్య చేశామని అంగీకరించారని ఏసీపీ వెల్లడించారు. ఇదీ హత్యోదంతం.. అన్వర్ వివాహం అయిన నాటి నుంచి చికెన్ దుకాణంలో పనిచేస్తుండేవాడు. మద్యానికి బానిస కావడంతో పాటు గంజాయికి అలవాటు పడి భార్యను అనుమానిస్తున్నాడు. భార్య, ఇద్దరు ఆడపిల్లలను పట్టించుకోకుండా అప్పుడప్పుడూ ఇంట్లో నుంచి వెళ్లి రెండు, మూడు నెలల తర్వాత తనంతట తానుగా ఇంటికి వచ్చేవాడు. భార్యను చిత్రహింసలకు గురి చేసి కొట్టేవాడు. ఇదిలా ఉండగా అన్వర్ అత్త సాదుఖాన్ కూడా వీరి వద్దనే ఉంటూ సుతారి పనులకు వెళ్తోంది. ఆమెకు కొంతకాలంగా చింతకాని మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన బాలాజీతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది నచ్చని అన్వర్ గతేడాది యూపీహెచ్‌కాలనీలో బాలాజీ బైక్‌ను తగలబెట్టడంతోపాటు బాలాజీని కత్తితో బెదిరించాడు. దీనిపై ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. దీంతో అన్వర్‌ను చంపాలని భార్య సల్మా, అత్త కలిసి నిర్ణయించారు. గతేడాది సెప్టెంబర్ 30వ తేదీన రాత్రి అన్వర్ చేతులు, కాళ్లు కట్టి అన్వర్ బావమరిది యాకూబ్ ఆటోలో బాలాజీ, చిర్రా వెంకన్న కలిసి తీసుకెళ్లి గోపాలపురం సమీపంలోని సాగర్ కాల్వలో పడేశారు. అప్పటి నుంచి వారంతా వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేయడంతో వారంతా భయపడి పోలీసుల ఎదుట లొంగిపోయారు. అన్వర్ భార్య సల్మా, అత్త సాదుఖాన్, యాకూబ్, బాలాజీ, చిర్రా వెంకన్నను రిమాండ్‌కు తరలించామని ఏసీపీ వివరించారు. అన్వర్ మృతదేహం ఆచూకీ కనుగొంటామని ఆయన పేర్కొన్నారు. -
వివాహేతర సంబంధం: ప్లీజ్.. ఆలోచించండి ఓ అమ్మానాన్న!
కట్టుబాట్లను దాటిన ఇష్టాలు, బంధాలను బలి కోరే సంబంధాలు, నైతికం కాని స్నేహాలు జీవితాలను ఛిద్రం చేస్తున్నాయి. దారి తప్పుతున్న దంపతులు పిల్లల బతుకులను చేతులారా ధ్వంసం చేస్తున్నారు. వివాహేతర సంబంధాలతో వినాశనాన్ని కోరి తెచ్చుకుంటున్నారు. జిల్లాలోనూ ఈ పెడధోరణి పెచ్చుమీరుతోంది. ఆదర్శ దాంపత్యాలు అడుగడుగునా కనిపిస్తున్నా.. ఎక్కడో ఓ చోట ఈ విషపు గుళికలా ఇలాంటి అక్రమ సంబంధాలూ తారస పడుతున్నాయి. ఒక్కసారి కట్టు తప్పితే ఆ తప్పులకు మూల్యంగా ప్రాణాలే పోతున్నాయి. టెక్కలి: హిరమండలానికి చెందిన ఓ వివాహిత ప్రియుడి మోజులో పడి భర్తను దారుణంగా చంపేసి పెట్రోల్ పోసి తగలబెట్టేసింది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆరా తీస్తే గానీ వివాహిత మోసం బయటపడలేదు. రణస్థలం మండలం దన్నానపేట గ్రామంలో వివాహేతర సంబంధంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకోగా మరో వ్యక్తి ఉరి వేసుకుని ప్రాణాలు విడిచాడు. మహిళ భర్త గతంలో చనిపోగా కూరగాయలు అమ్ముకుంటూ ఒకే ఒక్క కుమారుడిని పోషిస్తోంది. మృతి చెందిన మరో వ్యక్తికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. వివాహేతర సంబంధంతో ఒకే సారి ఇరువురూ మృతి చెందడంతో, మహిళకు చెందిన కుమారుడు అనాథగా మారగా, మరో వ్యక్తి కుటుంబం చిన్నాభిన్నమైంది. ఇలాంటి సంఘటనలు జిల్లాలో తరచూ చోటు చేసుకుంటున్నాయి. దాదాపు గ్రామీణ నేపథ్యం గల మన జిల్లాలో ఇలాంటి ఘటనలు జరగడం ఆశ్చర్యకరమే. జీవితాంతం కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడూనీడగా ఉండి సాఫీగా సాగాల్సిన సంసారాలను వివాహేతర సంబంధాలు విచ్ఛిన్నం చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని అభం శుభం తెలియని పిల్లల్ని అత్యంత పాశవికంగా చంపేస్తున్నారు. పెద్దలు కుదిర్చిన వివాహాలతో పాటు ప్రేమ వివాహాల్లో కూడా వివాహేతర సంబంధాలు కనిపిస్తున్నాయి. పాపం పసివారు.. అక్రమ సంబంధాలు భార్యాభర్తల గొడవలతో ముగిసిపోవు. వాటి ప్రభావం పిల్లలపై అధికంగా పడుతోంది. ఎదిగే వయసులో తల్లిదండ్రులు గొడవ పడడం చూసిన పిల్లల మనసులు తీవ్రంగా గాయపడతాయి. మరీ ముఖ్యంగా తల్లిదండ్రుల్లో ఒకరు ఆత్మహత్య చేసుకోవడం, మరొకరు ఆ కారణంతో జైలు పాలవడం వంటి ఘటనలతో చిన్నారుల బాల్యంపై మరక పడుతోంది. అది జీవితకాలం వెంటాడుతుంది. తల్లిదండ్రుల సంరక్షణలో చక్కగా నవ్వుతూ బతకాల్సిన పిల్లలు ఇలా ఏడుస్తూ రోజులు లెక్కపెట్టాల్సి వస్తోంది. వివాహేతర సంబంధాలకు కొన్ని కారణాలు.. ►సంపాదనే ధ్యేయంగా సంసారాన్ని నిర్లక్ష్యం చేయడం. ►దంపతుల మధ్య చిన్నపాటి గొడవలను పెద్దవి చేసుకోవడం. ►భార్యాభర్తల విషయాల్లో కుటుంబ సభ్యుల మితిమీరిన జోక్యం. ►మితిమీరిన ఆన్లైన్ స్నేహాలు. ►చెడు వ్యసనాలకు బానిస కావడం. ►బలహీన మనస్తత్వాలు ఇవి తప్పనిసరిగా పాటించాలి ►దాంపత్యంలోని మాధుర్యాన్ని గ్రహించాలి. ►ఒకరికొకరు అర్థం చేసుకోవాలి. ఒకరి ►అభిప్రాయాలను ఒకరు గౌరవించాలి. ► ఆకర్షణలు తాత్కాలికమే గానీ శాశ్వతం కావనే నిజాన్ని తెలుసుకోవాలి. ►నైతిక విలువలు, సంబంధాలు, కుటుంబ విలువలకు గౌరవం ఇవ్వాలి. ►దాంపత్య జీవితంలో భాగస్వామికి అన్ని విషయాల్లో తప్పకుండా ప్రాధాన్యం ఇవ్వాలి. నేరాలకు పాల్పడకూడదు దంపతుల మధ్య సమస్య ఉంటే చట్టాన్ని ఆశ్రయించి పరిష్కరించుకోవాలే తప్ప నేరాలకు పాల్పడకూడదు. కౌన్సెలింగ్ ద్వారా చాలా జంటలు మళ్లీ ఒక్కటై సంతోషంగా ఉన్నాయి. ఆకర్షణలకు లోనై జీవితాలను నాశనం చేసుకోకూడదు. – బెండి గౌరీపతి, సీనియర్ న్యాయవాది, టెక్కలి. పిల్లలపై తీవ్ర ప్రభావం వివాహేతర సంబంధాల వల్ల పిల్లలపైనే ఎక్కువ ప్రభావం పడుతుంది. పెద్దలు చేస్తున్న తప్పిదాలను గమనిస్తూ చిన్నారులు మానసిక క్షోభకు గురవుతారు. దీని వల్ల భవిష్యత్‌లో ఎన్నో ఇబ్బందులు పడతారు. – నిర్మల్ అలెగ్జాండర్, మానసిక వైద్య నిపుణుడు, జిల్లా ఆసుపత్రి, టెక్కలి. జీవితాలను నాశనం చేసుకోవద్దు మానవ సంబంధాల్లో అత్యంత ప్రమాదకరమైనది ఈ వివాహేతర సంబంధం. దీని వల్ల రెండు కుటుంబాల్లో విషాదాలు చోటు చేసుకునే ప్రమాదాలు ఉన్నాయి. వ్యామోహం, సరదాతో ప్రారంభమై చివరకు జీవితాలు అర్ధంతరంగా ముగిసిపోతాయి. మా దగ్గరకు వచ్చే భార్య భర్తల తగాదాల్లో అత్యధిక శాతం ఇలాంటి కేసులే వస్తుంటాయి. ఇప్పటికే ఎంతో మందికి కౌన్సిలింగ్ చేసి వారి జీవితాలను నిలబెట్టాం. – ఎస్.వాసుదేవ్, డీఎస్పీ, దిశ పోలీస్‌స్టేషన్ -
డీజే ప్రవీణ్‌తో సుజాత వివాహేతర సంబంధం.. భర్తను కడతేర్చిన భార్య
నల్గొండ (భువనగిరి) : వివాహేతర సంబంధం బయటపడుతుందని ఓ వివాహిత ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా కడతేర్చింది. ఆపై ఇద్దరూ కలిసి మృతదేహాన్ని బ్రిడ్జి పైనుంచి కిందపడేసి ప్రమాదంగా చిత్రీకించారు. పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగుచూడడంతో ఇద్దరు నిందితులు కటకటాలపాలయ్యారు. మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో నిందితులను మీడియా ఎదుట ప్రవేటశపెట్టి డీసీపీ నారాయణరెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. జనగాం జిల్లా నర్మెట మండలం హన్మంత్‌పూర్ గ్రామానికి చెందిన లకావత్ కొంరెల్లి తన భార్య లకావత్ భారతి అలియాస్ సుజాతతో కలిసి జీహెచ్ఎంసీలో పనిచేస్తూ సికింద్రాబాద్‌లోని నామలగుండు ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. వివాహ వేడుకలో పరిచయమై.. రెండేళ్ల క్రితం ఓ వివాహ వేడుకలో డీజే ప్లే చేసే జనగాం జిల్లా అడవి కేశవపురం గ్రామానికి చెందిన దరావత్ ప్రవీణ్‌తో సుజాతకు పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన కొంరెల్లి ఈ నెల 18న సొంతూరికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటికి వెళ్లాడు. ఆ వెంటనే సుజాత ప్రియుడు ప్రవీణ్‌కు ఫోన్ చేసి ఇంటికి రప్పించుకుంది. ఇంటికి చేరుకుని దారుణం చూసి.. అయితే, కొంరెల్లి అందరూ నిద్రపోయాయక అదే రోజు రాత్రి ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయంలో సుజాతతో ప్రవీణ్ సఖ్యతగా మెలుగుతుండడాన్ని చేసి హతాశుడయ్యాడు. ఇదేమిటని భార్యతో గొడవపడ్డాడు. ఎక్కడ తమ బండారం బయటపడుతుందోనని సుజాత, తన ప్రియుడు ప్రవీణ్‌తో కలిసి కొంరెల్లి మెడకు చున్నీతో ఉరి బిగించి దారుణంగా హత్య చేశారు. అనంతరం అదే రోజు రాత్రి కొంరెల్లి మృతదేహాన్ని బైక్‌పై వేసుకుని వరంగల్ ప్రధాన రహదారి మార్గంలో బయలుదేరారు. మార్గమధ్యలో భువనగిరి మండలం అనంతారం గ్రామ సమీపంలోని బ్రిడ్జి పై నుంచి మృతదేహాన్ని కింద పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో.. కాగా, కొంరెల్లి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు భువనగిరి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు అనుమానంతో సుజాతను అదుపులోకి తీసుకుని విచారించగా ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘాతుకాన్ని అంగీకరించింది. అనంతరం ప్రవీణ్‌ను కూడా అరెస్ట్ చేసినట్లు డీసీపీ వివరించారు. వారి వద్ద బైక్, చున్నీని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏసీపీ వెంకట్‌రెడ్డి, సీఐ వెంకటయ్య, ఎస్సై రాఘవేందర్‌గౌడ్‌లు పాల్గొన్నారు. -
మరో మహిళతో సంబంధం.. భర్త కొట్టడంతో మనస్తాపం చెంది
సాక్షి, సిద్దిపేట: భర్త వేధింపులు తాళలేక భార్య ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం జిల్లాలోని చిన్నకోడూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేటకు చెందిన దాసరి రాజ్యలక్ష్మి (24)ని 2015లో చిన్నకోడూరుకు చెందిన శ్రీశైలంతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా శ్రీశైలం మూడేళ్లుగా అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇరువురికి నచ్చజెప్పి సముదాయించారు. ఆదివారం రాజ్యలక్ష్మిని భర్త కొట్టడంతో మనస్తాపం చెంది రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అల్లుడు వేధింపుల వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి దేవవ్వ ఆరోపించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: దసరాకి కొత్త దుస్తులు నాన్నా.. ఈ రోజే తెద్దాంలే కన్నా’.. అంతలోనే -
బతుకమ్మ పండగ వేళ విషాదం.. మరొకరితో సహజీవనం చేస్తోందని..
సాక్షి, సిద్దిపేట: బతుకమ్మ పండగ వేళ మండలంలోని వీరాపూర్‌లో విషాదం నెలకొంది. ఆదివారం రాత్రి బతుకమ్మ ఆడుతుండగా మామిడి స్వప్న(45)ను ఆమె భర్త ఎల్లారెడ్డి రాడ్డుతో తలపై మోదడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు వివరాలు ఇలా ఉన్నాయి. బెజ్జంకి వీరాపూర్ గ్రామానికి చెందిన మామిడి ఎల్లమ్మ, గోపాల్‌రెడ్డి దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు మంగ, స్వప్న ఉన్నారు. అదే గ్రామంలోని యాల్ల ఎల్లారెడ్డితో పెద్ద కూతురు మంగ వివాహం 20 ఏళ్ల క్రితం జరిగింది. పెళ్లి జరిగిన నెలకే మంగ ఆత్మహత్య చేసుకుంది. తరువాత రెండో కూతురు స్వప్నను ఎల్లారెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. ఆరేళ్ల వరకు వారు అనోన్యంగానే ఉన్నారు. వారికి కుమార్తె సుశ్మిత, కుమారుడు శ్రీజన్ ఉన్నారు. భార్యాభర్త తరుచు గొడవ పడేవారు. కాగా 14 ఏళ్ల నుంచి అదేగ్రామానికి చెందిన ఓ వ్యక్తితో స్వప్న సహజవనం చేస్తోంది. తనను వదిలి మరో వ్యక్తితో ఉంటోందని మనుసులో పెట్టుకున్న ఎల్లారెడ్డి బతుకమ్మ ఆడుతున్న స్వప్నను రాడ్‌తో తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కూతురును హత్య చేసిన ఎల్లారెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తల్లి ఎల్లమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ ఆవుల తిరుపతి తెలిపారు. చదవండి: లోయలో పడ్డ టెంపో ట్రావెలర్.. ఏడుగురు దుర్మరణం -
వివాహేతర సంబంధం: ప్రియుడితో కలిసి ఇంట్లో..
తిరువొత్తియూరు(చెన్నై): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని యువకుడిని హత్య చేసిన వివాహిత, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై సాలిగ్రామం శారదాంబాల్ వీధికి చెందిన సౌందర్య కోడంబాక్కం మండలం 132 వార్డులో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తోంది. భర్త నుంచి విడిపోయి ఇద్దరు కుమారులతో నివాసముంటోంది. వీరితో ఆమె అక్క కుమారుడు కూడా ఉంటున్నాడు. ఇటీవల సౌందర్యకు ఆమె మాజీ భర్త స్నేహితుడు విజయ్ (27)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. కొద్ది నెలలుగా వారిద్దరూ సహజీవనం చేస్తున్నారు. శుక్రవారం రాత్రి సౌందర్య ఇంట్లో విజయ్ హత్యకు గురయ్యాడు. కేసు నమోదు చేసుకున్న విరుగంబాక్కం పోలీసులు విచారణ చేపట్టారు. అందులో.. సౌందర్యకు అదే ప్రాంతానికి చెందిన ప్రభు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. సౌందర్య తన ప్రియుడు ప్రభుతో కలిసి ఇంట్లో ఉన్న విజయ్ అడ్డు తొలగించుకోవడం కోసం హత్య చేసినట్లు అంగీకరించిందని పోలీసులు తెలిపారు. చదవండి: రిసెప్షనిస్ట్ హత్య కేసులో షాకింగ్ నిజాలు.. -
తప్పటడుగు వేస్తున్న బంధం.. ప్రాణం తీసేందుకు వెనుకాడని వ్యామోహం
సాక్షి, ఖమ్మం: కష్టసుఖాల్లో కడదాకా కలిసి ఉంటామని అగ్నిసాక్షిగా చేసే ప్రమాణం బీటలు వారుతోంది. జీవితకాలం ఒకరికి ఒకరు తోడు ఉంటామని మొదలుపెట్టే ప్రయాణం మధ్యలో నే ఆగిపోతోంది. వేదమంత్రాలు, బంధుమిత్రుల నడుమ ఒక్కటవుతున్న కొందరు తప్పటడుగులు వేస్తూ కటకటాల పాలవుతున్నారు. ఎంతో పవిత్రమైనదిగా భావించే వివాహబంధం.. తాత్కాలిక సుఖాల కోసం పక్కదారి పడుతోంది. అక్రమ సంబంధాల పేరిట అప్పటివరకు కష్ట్టసుఖాల్లో భర్తకు తోడుగా నిలుస్తున్న కొందరు మహిళలే హత్యకు వెనుకాడకపోవడం గమనార్హం. అయితే, ఇటీవల కాలంలో జిల్లాలో ఇలాంటి ఘటనలు వరుసగా చోటు చేసుకుంటుండడం ఆందోళన కలిగిస్తోంది. ఉసురు తీస్తున్న వివాహేతర సంబంధాలు కలిసిమెలిసి పిల్లాపాపలతో సంతోషంగా జీవించే భార్యాభర్తల నడుమ అక్రమ సంబంధాలు చిచ్చుపెడుతున్నాయి. పచ్చగా సాగుతున్న కాపురాల్లోకి ప్రవేశిస్తున్న కొందరు మాయమాటలు చెప్పో.. తాత్కాలిక వ్యామోహం ఎర చూపో లోబర్చుకుంటున్నారు. నిజం ఎన్నాళ్లో దాగదన్నట్లుగా భార్య వ్యవహారం భర్తకు తెలియగానే ప్రియుడితో కలిసి హత్యకు సిద్ధమవుతున్నారు. లేనిపోని ఆకర్షణలకు లోనై, అర్థం లేని కోరికలు, ఆడంబరాలకు పోయి కొత్త పరిచయాలకు ఆకర్షితులవుతుండగా, చివరకు హత్య చేసేందుకు కూడా వెనుకాడడం లేదు. ఫలితంగా అటు కుటుంబీకులకు దూరమై ఇటు సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితి ఎదురవుతోంది. బతికి ఉన్నంత కాలం మచ్చే అక్రమ సంబంధాల కారణంగా హత్యలు చేయించేవారు, చేసే వారు తాము ఏదో ఘనకా ర్యానికి పాల్పడినట్లు భావిస్తుంటారని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. ఒకసారి తమ సంబంధానికి అడ్డుగా ఉన్న వ్యక్తిని హత్య చేయించగలిగితే ఆతర్వాత తమ వ్యవహారానికి అడ్డెవరూ ఉండరని నమ్ముతారని పేర్కొంటున్నారు. కానీ పోలీసుల దర్యాప్తులో ఏదో ఓ రోజు విషయం బయటపడుతుందని, తాము కటకటాల పాలు కాక తప్పదని హత్యకు పాల్ప డే వారు మొదట గుర్తించడం లేదు. భర్తను భార్య హత్య చేయించినా, భార్యను భర్త హత్య చేసినా, చేయించినా శిక్ష అనుభవించక తప్పదు. ఇలాంటి కేసులు బయటపడి, కేసుల పాలైతే శిక్ష అనుభవించి బయటకు వచ్చినా సమాజంలో తలెత్తుకుని జీవించే పరిస్థితి ఉండదు. సమాజంతో మాకేం పని అనుకున్నా కుటుంబం అక్కున చేర్చుకునే అవకాశం ఉండదు. ఇక దంపతులకు పిల్లలు ఉంటే ఒకరు చనిపోయి, ఒకరు జైలుకు వెళ్తే ఆ పిల్లలను ఎవరు పోషించాలి, సమాజం నుంచి వారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారో ఓసారి ఆలోచించగలిగితే... అనైతిక బంధాలూ ఉండవు.. ఆపై హత్యలకు తావుండదు. ►గత నెలలో జిల్లాలోని ఆరెంపులకు చెందిన ఓ యువకుడు ప్రేమ వివా హం చేసుకున్నాడు. చికెన్ వ్యర్థాలు తరలించే వాహనం డ్రైవర్‌గా పనిచేస్తుండగా ఆయన భార్యకు మరో డ్రైవర్‌తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విష యం యువకుడికి తెలియడంతో భార్యను మందలించగా, తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించి కృష్ణా జిల్లాలో మృతదేహాన్ని వేయించింది. ఇప్పటికీ సదరు యువకుడి మృతదేహం లభించలేదు. ►ఈనెల మొదట్లో ఖమ్మం రమణగుట్ట ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని ఆయన భార్య హత్య చేయించింది. సాగర్ కాల్వలో నెట్టి వేసి హత్యకు పాల్పడగా ఈయన మృతదేహమూ లభించలేదు. ఈ ఘటనకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు గుర్తించారు. ►ఇప్పుడు చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన తాపీమేస్త్రీ షేక్ జమాల్ సాహెబ్(48)ను ఆయన భార్య తాను సంబంధం సాగిస్తున్న ఆటోడ్రైవర్‌తో కలిసి పక్కా పథకం ప్రకారం హత్య చేయించింది. -
ఈశ్వరమ్మతో ‘నాకు వివాహేతర బంధం’ ఉంది.. గట్టిగా కేకలు వేయడంతో
సాక్షి, విశాఖపట్నం: జింక్ ఫ్యాక్టరీ సమీపంలోని పొదల్లో జూలై 25న లభించిన టీఏఎస్ ఇంజినీరింగ్ కంపెనీ సూపర్వైజర్ సిద్ధార్థ శంకర్ పట్నాయక్ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు నిర్థారించారు. ఈ హత్యతో సంబంధం ఉన్న తల్లి, కుమారుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో కుమారుడిని జువైనల్ హోమ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించి క్రైం డీసీపీ నాగన్న తెలిపిన వివరాల ప్రకారం... టీఏఎస్ ఇంజినీరింగ్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్న సిద్ధార్థ శంకర్ పట్నాయక్ మింది గ్రామం ఎస్సీ కాలనీలో నివసించేవాడు. ఈ క్రమంలో అదే ప్రాంతంలో నివసిస్తున్న యడ్ల ఈశ్వరమ్మతో పరిచయం వివాహేతర బంధానికి దారి తీసింది. ఈ క్రమంలో ఈశ్వరమ్మ దగ్గర శంకర్ రూ.5 లక్షల అప్పు తీసుకున్నాడు. మొత్తంగా చీటీలకు చెల్లించాల్సిన సొమ్ముతో కలిపి రూ.7లక్షల వరకు బాకీ పడ్డాడు. అయితే ఈశ్వరమ్మతో వివాహేతర సంబంధం కారణంగా బాకీ తీర్చకుండా జాప్యం చేశాడు. విషయం తెలుసుకున్న ఈశ్వరమ్మ పెద్ద కుమారుడు యడ్ల గౌరీ శంకర్, చిన్న కుమారుడు (బాలుడు) డబ్బులు ఇవ్వాలని గట్టిగా అడగడంతో... ఇవ్వను అని శంకర్ చెప్పేశాడు. అక్కడితో ఆగకుండా ఈశ్వరమ్మతో తనకు వివాహేతర బంధం ఉందని కించపరుస్తూ గట్టిగా కేకలు వేస్తూ తిట్టడంతో ఆమె కుమారులు తట్టుకోలేకపోయారు. శంకర్‌ను హతమార్చాలని నిర్ణయించుకుని ప్రణాళిక ప్రకారం మాట్లాడాలని జూలై 25న తమ ఇంటికి పిలిచారు. తాగిన మైకంలో ఉన్న శంకర్ గొంతు, చేతి మణికట్టుపై కోసి ఈశ్వరమ్మ, గౌరీ శంకర్, అతని తమ్ముడు కడతేర్చారు. అనంతరం మృతదేహాన్ని అర్ధరాత్రి బైక్ మీద తీసుకెళ్లి జింక్ ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న పొదల్లో పడేశారు. అర్ధరాత్రి ఇల్లు కడగడంతో దొరికేశారు... జింక్ ప్యాక్టరీ సమీపంలోని పొదల్లో శంకర్ మృతదేహం జూలై 26న కనిపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అదే రోజు అతని సహచర ఉద్యోగి, మల్కాపురం గాంధీజీ వీధికి చెందిన పాండా జితేంద్ర మల్కాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తమ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేసే సిద్ధార్థ శంకర్ పట్నాయక్ జూలై 25న విధులకు హాజరుకాలేదని, మరుసటి రోజు జింక్ ప్యాక్టరీ సమీపంలోని పొదల్లో చనిపోయి కనిపించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో క్రైం ఏడీసీపీ డి.గంగాధరం పర్యవేక్షణలో గాజువాక సీఐ భాస్కరరావు, ఎస్ఐ కె.సతీష్ బృందం దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో మింది గ్రామంలోని ఎస్సీ కాలనీ వాసులను విచారించగా... యడ్ల ఈశ్వరమ్మ కుటుంబ సభ్యులతో శంకర్ గొడవపడ్డాడని తెలిపారు. దీంతో పరిసర ప్రాంతాల వారితో మాట్లాడగా జూలై 25న అర్ధరాత్రి ఈశ్వరమ్మ ఇల్లు కడిగిందని స్థానికులు చెప్పారు. ఆ విషయం ఆధారంగా విచారించగా తామే శంకర్‌ను హతమార్చామని, రక్తపు మరకలను కడిగేశామని నిందితులు అంగీకరించారు. సమావేశంలో క్రైం ఏడీసీపీ గంగాధరం, శ్రావణ్‌కుమార్, సీఐ ఎల్.భాస్కర్‌రావు, ఎస్ఐ కె.సతీష్ తదితరులు పాల్గొన్నారు. వివాహేతర బంధంతో హత్యాయత్నం తన భార్యతో వివాహేతర బంధం కొనసాగిస్తున్న వ్యక్తిని హతమార్చాలని దాడి చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గంట్యాడ సమీప యారాడ గ్రామానికి చెందిన మొల్లి శ్రీను కూలి పనులు చేసుకుంటూ నివసించేవాడు. 2007లో మేనమామ కూతురుతో వివాహం జరిగింది. ఈ క్రమంలో తన భార్యకు, ఎస్బీసీ డాలి్ఫన్ హిల్స్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే మొల్లి తాతారావుకు వివాహేతర బంధం ఏర్పడడాన్ని జీరి్ణంచుకోలేకపోయాడు. తాతారావును హతమార్చాలని శ్రీను నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 17న రాత్రి బీ షిప్ట్ ముగించుకుని తన సూపర్వైజర్ ఎస్.ప్రవీణ్‌తో కలిసి తాతారావు ఇంటికి బయలుదేరాడు. ఆ రోజు రాత్రి 8.40 గంటలకు వారు డాలి్ఫన్ హిల్స్ గేటు ఎదురుగా రాగానే మొల్లి తాతారావుపై శ్రీను కారం చల్లి, ఇనుపరాడ్డు, కత్తితో దాడి చేసి గాయపరిచాడు. గాయాలపాలైన తాతారావు ఈ నెల 18న మల్కాపురం పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. సీఐ లూథర్‌బాబు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. విచారణలో శ్రీను దాడి చేసినట్లు తేలడంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చాకు, ఇనుపరాడ్డు స్వా«దీనం చేసుకున్నారు. -
ఫేస్బుక్లో యువకుడితో పరిచయం.. ఇంట్లో పిల్లలు నిద్రపోతుంటే
తిరువొత్తియూరు(చెన్నై): ఫేస్బుక్లో పరిచయమైన యువకుడితో తన తల్లి పరారైనట్లు కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తంజావూరు జిల్లా ఒరత్తనాడు సమీపంలోని కవరపట్టు గ్రామానికి చెందిన అయ్యప్పన్, లలిత (41) దంపతులకు 21, 19 ఏళ్ల ఇద్దరు కుమారులు ఉన్నారు. అయ్యప్పన్ సింగపూర్‌లో పని చేస్తున్నాడు. దీంతో కుమారులతో లలిత ఒరత్తనాడులో అద్దె ఇంట్లో ఉంటోంది. గురువారం రాత్రి పిల్లలు నిద్రిస్తుండగా ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు తీసుకుని లలిత హఠాత్తుగా అదృశ్యమైంది. పెద్ద కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అందులో.. తన తల్లికి ఫేస్బుక్ ద్వారా రెండేళ్ల క్రితం ఓ యువకుడి (22)తో పరిచయం ఏర్పడిందని పేర్కొన్నాడు. నగలు, నగదుతో ఆ యువకుడితో పరారైనట్లు తెలిపాడు. ఒరత్తనాడు పోలీసులు కేసు నమోదు చేసి లలిత, ఆ యువకుడి కోసం గాలిస్తున్నారు. చదవండి: కూతురుపైనే 32 ఏళ్లుగా తండ్రి అఘాయిత్యం.. పెళ్లైన తర్వాత కూడా.. -
ప్రేమ పెళ్లి, ఆరునెలలకే మరొకరితో..
తిరువొత్తియూరు: ప్రేమించి వివాహం చేసుకున్న భార్య మరొకరితో పారిపోవడంతో మనస్తాపం చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నామక్కల్ జిల్లా ఎరుమపట్టి, బోడినాయకన్‌పట్టి తూర్పు వీధికి చెందిన షణ్ముగం కుమారుడు విమల్‌కుమార్ (20) నామక్కల్ బీకాం తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. అదే కళాశాలలో చదువుతున్న ధర్మపురికి చెందిన విద్యార్థినిని ప్రేమించి ఆరునెలల క్రితం ఎవరికీ తెలియకుండా వివాహం చేసుకున్నాడు. నామక్కల్‌లోని అతని తాత ఇంట్లో కాపురం పెట్టాడు. ఈ క్రమంలో మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య అతనితో కలిసి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెందిన విమల్‌కుమార్ ఇంట్లో శుక్రవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చదవండి: వీడియో తీయొద్దు అన్నందుకు.... డ్యూటీలో ఉన్న పోలీస్‌ని గట్టిగా కరిచి పరార్.. -
ఎస్సై వివాహేతర సంబంధం.. ప్రియురాలి కుమార్తెపై కన్నుపడటంతో..
సాక్షి, చెన్నై: చెన్నై విల్లివాక్కంలో యువతి పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్న సబ్ ఇన్స్పెక్టర్ను పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. చెన్నై సమీపంలోని అలందూర్ పోలీసు క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న పాండ్యరాజన్ (50) చెన్నై కార్పొరేషన్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బాంబు పేలుడు విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నాడు. ఇతనికి విల్లివాక్కంకు చెందిన ఒక మహిళతో గత పదేళ్లుగా వివాహేతర సంబంధం నెరుపుతున్నాడు. ఆ మహిళకు ఒక కుమార్తె ఉంది. ప్రియురాలిని కలవడానికి వెళ్లిన సమయంలో ఇంటిలో ఉన్న ప్రియురాలు కుమార్తె (13)పై సబ్ ఇన్స్పెక్టర్ కన్నుపడింది. దీంతో పాండ్యరాజన్ తన ప్రియురాలి ఇంట్లో లేని సమయంలో 13 ఏళ్ల బాలికను బెదిరించి లైంగిక వేధింపులు ఇస్తున్నాడు. సుమారు ఏడేళ్లుగా బాలికకు ఈ లైంగిక వేధింపులు జరిగినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆ బాలికకు 20 ఏళ్లు అయింది. ఆమెకు మరొకరితో వివాహమైంది. కానీ తన తల్లి ఇంటికి వస్తున్న సమయంలో యువతికి తిరిగి సబ్ ఇన్స్పెక్టర్ పాండ్యరాజన్ లైంగిక వేధింపులు ఇస్తున్నాడు. అతని వేధింపులను సహించలేక ప్రియురాలు, తన కుమార్తెతో కలిసి చెన్నై విల్లివాక్కం మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణలో బాలికను 13 ఏళ్ల నుంచి బెదిరింపులు లైంగికంగా వేధించినట్లు, ప్రస్తుతం వేరొకరితో వివాహం అయినప్పటికీ లైంగిక వేధింపులకు పాల్పతుండడంతో సబ్ ఇన్స్పెక్టర్ను పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. చదవండి: ఎస్కార్ట్ సర్వీస్ పేరుతో నీచాలు.. అశ్లీల వ్యాఖ్యలతో ఫోటోలు ఆప్‌లోడ్ చేస్తూ.. -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
సాక్షి, నిజామాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో భర్తను హత్య చేయించిందో భార్య.. రుద్రూర్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. రుద్రూర్ గ్రామానికి చెందిన కుమ్మరి పోశెట్టి (40)కి ధర్మాబాద్ బాలాపూర్‌కు చెందిన సావిత్రితో 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. దంపతులు ఇద్దరు కూలీ పనులు చేసుకుంటూ జీవించేవారు. ఈ క్రమంలో గృహ నిర్మాణ పనులు చేసే జెఎస్సీ కాలనీకి చెందిన బట్టు శ్రీనివాస్‌తో సావిత్రికి పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం ఇటీవల సావిత్రి భర్త పోశెట్టికి తెలియడంతో భార్యతో ఘర్షణ పడ్డాడు. చెడు అలవాటు మానుకోవాలని హితవు చెప్పాడు. సావిత్రి బుద్ధి మార్చుకోనందున తరుచు గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో సావిత్రి తల్లి చంద్రభాగ ఇటీవల రుద్రూర్ వచ్చింది. కూతురుతో తరుచూ గొడవ పడుతున్న పోశెట్టిని తప్పించాలని తల్లికూతుళ్లు శ్రీనివాస్‌ను ప్రేరేపించారు. దీంతో ఈ నెల 2న పోశెట్టిని ఇంటి నుంచి శ్రీనివాస్ బైక్‌పై తీసుకుని వెళ్లాడు. కల్లు దుకాణంలో కల్లు తాగించాడు. అనంతరం మద్యం షాపులో మందు తీసుకొని నక్కల ఒర్రెకు వెళ్లారు. అక్కడ పోశెట్టికి పూటుగా మద్యం తాగించి చెరువు బ్యాక్ వాటర్ ఒర్రెలోకి తోసేశాడు. చనిపోయాడని నిర్దారించుకుని ఇంటికి వెళ్లి సావిత్రికి ఫోన్ ద్వారా తెలియజేశాడు. అనంతరం సావిత్రి ఏమి తెలియనట్లు నటించింది. రెండు రోజులుగా పోశెట్టి కనిపించడం లేదని ఇరుగు పొరుగు వారు ప్రశ్నిస్తే సమాధానం దాట వేసింది. చివరకు సోమవారం పోలీస్స్టేష్న్లో తనభర్త కన్పించడం లేదని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ఎస్సై రవీందర్ దర్యాప్తు చేయగా శ్రీనివాస్‌తో సావిత్రికి ఉన్న సంబంధం బయటపడింది. శ్రీనివాస్‌ను విచారించగా నేరాన్ని అంగీకరించాడు. ఘటన స్థలికి మంగళవారం రుద్రూర్ సీఐ జాన్‌రెడ్డి, ఎస్సై రవీందర్ వెళ్లి మృతదేహాన్ని చెరువులో నుంచి వెలికి తీయించారు. మృతుడి భార్య సావిత్రి, అత్త చంద్రబాగ, శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
వివాహేతర సంబంధం: ఆఫీస్‌లో పరిచయం.. భార్యకి తరచూ ఫోన్ చేస్తున్నాడని..
తిరువొత్తియూరు: కోవైలోని ఓ వివాహితతో సెల్ఫోన్లో తరచూ మాట్లాడుతున్నాడనే ఆగ్రహంతో ఓ ఫైనాన్స్ సంస్థ మేనేజర్‌ను ఆమె భర్త, అతడి స్నేహితులు కిడ్నాప్ చేసి దాడి చేశారు. కత్తితో పొడిచిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. మదురై అలంగానల్లూర్‌కు చెందిన సోన ముత్తు (37). ఇతనికి వివాహమై భార్య, ఓ కుమారుడు ఉన్నాడు. సోనముత్తు కోవై అవినాశి రోడ్డులోని ఓ ప్రైవేటు బ్యాంకులో పని చేస్తున్నాడు. ఆ సమయంలో అదే బ్యాంకులో సేల్స్ విభాగంలో పని చేస్తున్న యువతితో పరిచయం ఏర్పడింది. తర్వాత సోనముత్తు రామనాథపురం నంజుండాపురం శ్రీపతినగర్‌లో ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో పని చేస్తున్నాడు. ఈక్రమంలో ఆ యువతికి వివాహమైంది. అయినప్పటికీ సోనముత్తు ఆ యువతికి తరచూ ఫోన్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో సోనముత్తును కారులో కిడ్నాప్ చేసిన ఆ యువతి భర్త సాల్మన్ పారిస్ (23), అతని మిత్రులు అక్బర్ సాధిక్ (24), ముహ్మద్ అన్సర్ (24) తర్వాత కత్తితో పొడిచారు. దీంతో సోనముత్తును స్థానికులు చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించి రేస్‌కోర్స్ పోలీసులు కేసు నమోదు చేసి సాల్మన్ పారిస్, అక్బర్ సాధిక్, మహమ్మద్ అన్సర్‌ను అరెస్టు చేశారు. చదవండి: ఎంత పనైపాయే.. స్కెచ్ ఒకరికి.. మర్డర్ మరొకరిని.. -
ప్రేమించి పెళ్లి.. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని
సాక్షి, చెన్నై: ప్రేమించి పెళ్లి చేసుకొని సంసార జీవితాన్ని కొనసాగిస్తూ ముగ్గురు పిల్లలకు తండ్రిగా తన బాధ్యతను నెరవేరుస్తున్న ఒక భర్త పాలిట భార్యే మృత్యుపాశంగా మారింది. ప్రియుడు, అతని సన్నిహితులతో కలిసి కిరాతకంగా భర్తను మట్టుబెట్టింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా, నగరి మునిసిపాలిటీ రామాపురం వద్ద వెలుగుచూసింది. రామాపురం వద్ద ఉన్న స్టోన్‌క్రషర్ కొలనులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విజయ్‌కుమార్ (32) మృతికి గల కారణాలను పోలీసులు అత్యంత వేగంగా కనుగొన్నారు. తీగలాగితే డొంక బయటపడినట్టు, మృతికి గల కారణాలు వెలుగు చూశాయి. నిందితులను అరెస్ట్ చూపుతున్న సీఐ శ్రీనివాసంతి సీఐ శ్రీనివాసంతి తెలిపిన వివరాలు.. నగరిలో సెల్ ఫోన్ షాపు నడుపుకునే విజయకుమార్‌కు 14 ఏళ్లక్రితం వనిత (30)ను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. విజయకుమార్‌కు వ్యాపారరీత్యా టీఆర్ కండ్రిగకు చెందిన తమిళరసు (21)తో పరిచయం ఏర్పడింది. దీంతో తమిళరసు విజయకుమార్ ఇంటికి తరచూ వెళ్లేవాడు. ఈ క్రమంలో తమిళరసుకు వనితతో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే కుమార్తెతో అతి చనువుగా తమిళరసు మాట్లాడుతుండడంతో విజయకుమార్ తమిళరసును తన ఇంటికి రావద్దని ఆపేశాడు. 15 రోజుల పాటు తమిళరసు, వనిత కలుసుకోవడానికి విజయకుమార్ అడ్డుపడుతూ రావడంతో అతన్ని చంపడానికి వీరు మాస్టర్ ప్లాన్ వేశారు. తమిళరసు ఈ ప్లాన్‌లో తనకు మద్యం మిత్రులైన టీఆర్ కండ్రిగకు చెందిన తమిళరసు, కాకవేడు దళితవాడకు చెందిన నాగరాజు కొల్లాపురి (20), సంతోష్‌కుమార్ (15) కలిశారు. పక్కాగా పథక రచన చేశారు. గత ఆదివారం రాత్రి క్వారీ వద్దకు తమిళరసు, కొల్లాపురి, సంతోష్‌కుమార్ ముందుగా చేరుకున్నారు. ఫుల్‌గా మద్యం తాగి, విజయకుమార్‌కు ఫోన్‌చేసి బైక్‌లో పెట్రోల్ అయిపోయిందని.. తాము క్వారీ వద్ద ఉన్నామని పెట్రోల్ తీసుకురావాలని కోరాడు. మిత్రుని కోసం పెట్రోల్ తీసుకువెళ్లాలని బయలుదేరిన విజయకుమార్ వెంట తానూ వస్తానని వనిత బయలు దేరింది. ఇద్దరూ పెట్రోల్ తీసుకొని క్వారీ వద్దకు వెళ్లారు. పెట్రోల్‌ను బండిలో పోసే సమయంలో ఈతరాని విజయకుమార్‌ను వెనకనుంచి తమిళరసు తోసివేయగా కొల్లాపురి అతనిపై దూకి నీళ్లలో ముంచే ప్రయత్నం చేశాడు. క్వారీ పై నుంచి వనిత, సంతోష్ అతని తలపై రాళ్లువేయడంతో తీవ్రగాయాలపాలైన విజయకుమార్ నీటమునిగి మృతిచెందాడు. చదవండి: అదృశ్యమైన కారు డ్రైవర్ హత్య.. ప్రియుడితో కలిసి భార్య సుపారీ ఒకసారి బెడిసికొట్టిన ప్లాన్ గత ఆదివారానికి ముందు చంపడానికి వీరు ప్లాన్ వేసి కత్తిని కూడా సిద్ధం చేసుకున్నారు. ఇదేవిధంగా విజయకుమార్‌కు ఫోన్ చేసి పెట్రోల్ అయిపోయిందని చెప్పడంతో అతను వెళ్లాడు. అయితే ఆ సమయానికి అక్కడ జన సంచారం ఉండడంతో ప్లాన్ మిస్సయింది. అత్యంత వేగంగా విచారణ విజయకుమార్ అనుమానాస్పద మృతి కేసులో విచారణ వేగంగా జరిగింది. విచారణలో తాను దొరుకుతానని తెలుసుకున్న వనిత ముందస్తుగా వీఆర్వో వద్ద సరెండర్ కావడంతో, మిగిలిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం మైనర్‌ను జువైనల్ హోంకు పంపగా మిగిలిన వారిని రిమాండ్‌కు తరలించారు. -
అదృశ్యమైన కారు డ్రైవర్ హత్య.. ప్రియుడితో కలిసి భార్య సుపారీ
సాక్షి, నల్గొండ/హైదరాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని సమీప బంధువు ఘాతుకానికి తెగబడ్డాడు. వరుసకు తమ్ముడైన వ్యక్తిని సుపారీ కిల్లర్స్‌తో హత్య చేయించి నాగార్జునసాగర్ వెనుక జలాల్లో మృతదేహాన్ని పడేశారు. ఈ ఘటన నేరేడుగొమ్ము మండలంలో ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, హతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం తుంగపాడు గ్రామానికి చెందిన లావుడ్య రాగ్య(30)కు పెద్దవూర మండలం ఊరబావితండాకు చెందిన రోజాతో 12సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కాగా, రాగ్య హైదరాబాద్‌లోని మణికొండలో కారు డ్రైవర్‌గా పని చేస్తూ అక్కడే కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో రోజాకు బావ వరుస అయిన ఇబ్రహింపట్నంలోని ఎల్లాపూర్‌తండాకు చెందిన లక్పతితో వివాహేతర సంబంధం ఏర్పడింది. హత్యకు రూ.20లక్షల సుపారీ తమ సఖ్యతకు రాగ్య అడ్డుగా ఉన్నాడని లక్పతి, రోజా భావించారు. దీంతో అతడి అడ్డుతొలగించుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో లక్పతి నేరెడుగొమ్ము మండలం బుగ్గతండాకు చెందిన మాన్సింగ్, బాలోజీతో సుపారీ కుదుర్చుకున్నాడు. రాగ్యను హత్య చేస్తే రూ.20లక్షలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ఫోన్ నంబర్ తీసుకుని.. పరిచయం పెంచుకుని.. సుపారీ కుదుర్చుకున్న మాన్సింగ్, బాలోజి వైజాక్ కాలనీలో చేపల బేరం చేస్తారు. వీరు బేరం నిమిత్తం తరచూ హైదరాబాద్‌కు వెళ్లే వారు. ఈ క్రమంలో లక్పతి వద్ద రాగ్య ఫోన్ నంబర్ తీసుకుని అతడితో పరిచయం పెంచుకున్నారు. అనంతరం ప్రథకం ప్రకారం ఆగస్టు 19న రాగ్యను హత్య చేసి మృతదేహానికి ఇనుప కడ్డీలు కట్టి కాచరాజుపల్లి సమీపంలో సాగర్ వెనుక జలాల్లో పడవేశారు. చదవండి: బోర్కర్..మామూలోడు కాదు!.. పెద్ద బ్యాగ్రౌండే ఉంది విషాదంలో రాగ్య తల్లిదండ్రులు, పక్కన రాగ్య (ఫైల్) హైదరాబాద్‌లో కేసు నమోదు.. సెల్‌ఫోన్ ఆధారంగా.. రాగ్య రెండు రోజులుగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆగస్టు 21న హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రాగ్య తరచూ ఫోన్లో మాన్సింగ్, బాలోజీతో సంభాషించినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే వారిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్యోందంత వెలుగులోకి వచ్చింది. దీంతో హైదరాబాద్ పోలీసులు మాన్సింగ్, బాలోజీలను తీసుకుని కాచరాజుపల్లికి తీసుకువచ్చారు. కృష్ణా వెనుక జలాల్లో మృతదేహం కోసం గాలించగా సాయంత్రం వరకు లభ్యం కాలేదు. ఈ క్రమంలో నిందితులను తమకు అప్పగించాలని అక్కడికి చేరుకున్న రాగ్య కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం రాళ్లు రువ్వడంతో రాగ్య బంధువులకు స్వల్పగాయాలయ్యాయి. పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు సోమవారం రాగ్య మృతదేహాన్ని వెలికి తీసేందుకు గాలింపు చర్యలు చేపడతామని అక్కడినుంచి వెళ్లిపోయారు. కాగా, రాగ్యను ఎక్కడ ఎలా హత్య చేశారు. హత్యోదంతంలో ఎంత మంది పాత్రధారులు? ఇందులో రాగ్య భార్య రోజా పాత్ర ఏ మేరకు ఉంది.? తదితర విషయాలు దర్యాప్తులో తేలుతాయని నేరేడుగొమ్ము పోలీసులు పేర్కొంటున్నారు. -
ప్రియుడి స్నేహితుడి వేధింపులు.. వివాహిత ఆత్మహత్య
సాక్షి, చెన్నై: భర్త, ఇద్దరు పిల్లలను వదిలి ప్రియుడితో పరారైన మహిళ అనుమానాస్పద రీతిలో మృతి చెందిన సంఘటన కీలక మలుపు తిరిగింది. ప్రియుడి స్నేహితుడు లైంగిక వేధింపులకు గురి చేయడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించిన పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలు.. ఈ నెల 29వ తేదీ తిరువళ్లూరు జిల్లా పెద్దకుప్పం కంబర్ వీధిలోని ఓ ఇంట్లో కుళ్లిన స్థితిలో మహిళ మృతదేహం లభించడం కలకలం సృష్టించింది. మృతిపై తిరువళ్లూరు టౌన్ ఇన్స్పెక్టర్ పద్మశ్రీ బబ్బి విచారణ చేపట్టారు. పోలీసుల ప్రాథమిక విచారణలో మృతి చెందిన మహిళ చోళవరం సమీపంలోని ఎరుమై వెట్టిపాళయం గ్రామానికి చెందిన బాబు భార్య అముదగా గుర్తించారు. బాబు పాఠశాల వ్యాన్ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. వీరికి జయశ్రీ, కిషోర్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రియుడితో పరార్ కొంత కాలం పాటు సజావుగా సాగిన బాబు కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. అముద అదే ప్రాంతానికి చెందిన జ్యోతీశ్వరన్తో వివాహేతర సంబంధం ఏర్పడింది. అనంతరం భర్త పిల్లలను వదిలి అతనితో పరారైంది. రెండేళ్లు ప్రియుడితో సహజీవనం చేసిన తరువాత పెద్దలు పంచాయతీ చేసి అముదను భర్త చెంతకు చేర్చారు. కొంత కాలం భర్తతోనే ఉన్న అముద మళ్లీ ప్రియుడితో పరారై అనుమానస్పద రీతిలో మృతి చెందింది. చదవండి: బైక్‌పై డ్రాప్ చేస్తామని తీసుకెళ్లి.. యువతిపై లైంగిక దాడి ప్రియుడి స్నేహితుడు వేధింపులు భరించలేక అముదతో సహజీవనం చేస్తున్న జ్యోతీశ్వరన్కు అంతకు ముందే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనంతరం మనస్సు మార్చుకుని భార్య పిల్లల వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయంపై అముద జ్యోతిశ్వరన్తో వాగ్వాదానికి దిగింది. నిన్ను నమ్మి భర్త పిల్లలను వదిలి వచ్చానని, ఇప్పుడు తనను నడిరోడ్డుపై వదిలేస్తే ఎక్కడికి వెళ్లాలని నిలదీసింది. జ్యోతీశ్వరన్ అముదను తిరువళ్లూరులోని ఇంట్లో వదిలిపెట్టి భార్య పిల్లల వద్దకు వెళ్లిపోయాడు. వారం రోజులుగా ఒంటరిగా ఉంటున్న అముదను జ్యోతీశ్వరన్ స్నేహితుడు శివప్రకాష్ లైంగిక వేధింపులకు గురి చేసినట్లు గుర్తించారు. తనతో సహజీవనం చేయాలని ఒత్తిడి పెంచడంతోనే ఆమె మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఆత్మహత్యకు కారణమైన జ్యోతీశ్వరన్, శివప్రకాష్‌లను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. -
ప్రియుడితో కలిసి.. కన్న కూతురిని కడతేర్చిన తల్లి
సాక్షి, నిజామాబాద్: అభంశుభం తెలియని బాలికను ప్రియుడితో కలిసి హత్యచేసిందో తల్లి.. వివరాల్లోకి వెళ్తే.. మక్లూర్ మండలంలోని చిన్నాపూర్ గండి అడవి ప్రాంతంలో పూర్తిగా కుళ్లిపోయిన ఆరేళ్ల బాలిక మృతదేహాన్ని మంగళవారం పోలీసులు గుర్తించారు. చిన్నారి మృతదేహం పూర్తిగా కుళ్లిపోగా వైద్యులు అక్కడే పోస్టుమార్టం చేశారు. నార్త్ రూరల్ సీఐ నరహరి కథనం మేరకు విజయవాడలోని భవానీపురానికి చెందిన కాపర్తి దుర్గా భవాని, గురునాథం భార్య భర్తలు గతంలో రెండేళ్లపాటు నిర్మల్‌లో మేస్త్రి పనిచేస్తూ జీవనం సాగించారు. వీరికి నాగలక్ష్మి (6), గీతమాధవి (14 మాసాలు) అనే ఇద్దరు కూతుర్లున్నారు. అయితే నిర్మల్ నుంచి ఐదేళ్ల క్రితం విజయవాడలోని భవానీపురానికి వెళ్లిపోయారు. గతనెల 14న బంధువుల ఇంటికి వెళ్లివస్తానని ఇంటినుంచి వెళ్లి తిరిగి రాలేదు. పోలీసులు భవానీపురంలో మిస్సింగ్ కేసు నమో దు చేశారు. నిజామాబాద్‌లో ఆమె ఉందన్న సమాచారం మేరకు ఆమె భర్త గురునాథం జిల్లాకు వచ్చి ఎంక్వైరీ చేయగా నగరంలోని రైల్వేస్టేషన్లో ఆమె ప్రియుడైన బాన్సువాడ కొల్లూరుకు చెందిన దుండగుల శ్రీనుతో ఉండగా గుర్తించాడు. చిన్నకూతురు గీతమాధురి ఆమె వెంట ఉండగా పెద్ద కుమార్తె ఎక్కడని ప్రశ్నించగా ఆమెను గొంతును లిమి చంపి అడవిలో పారేశామని సమాధానమిచ్చారు. దీంతో భర్త గురునాథం పోలీసులను ఆ శ్రయించగా భార్య దుర్గాభవాని, ప్రియుడు శ్రీనును అదుపులోకి తీసుకుని విచారించారు. చిన్నారిని నగరంలోని లలితామహల్ రైల్వే కమాన్ వద్ద హత్య చేసి మాక్లూర్ చిన్నాపూర్ గండిలో పడవేసినట్లు తెలిపారు. పోలీసులు విచారణ చేస్తున్నారు. చదవండి: అల్లరి చేస్తున్నారని.. విద్యార్థులను చితకబాదిన హెచ్ఎం -
వివాహేతర సంబంధం: ప్రియుడితో కలిసి మూడేళ్ల కొడుకుని హతమార్చిన తల్లి
సాక్షి, హైదరాబాద్: సమాజంలో మానవత్వం నానాటికీ కానరాకుండా పోతుంది. మానవ సంబంధాలు సన్నగిల్లుతున్నాయి. తాజాగా ఓమహిళ తొమ్మిది నెలల పేగు బంధాన్ని తెంచుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని మూడు సంవత్సరాల కొడుకొని తల్లి హతమార్చింది. ఈ దారుణ ఘటన ముషీరాబాద్‌లో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలని పార్మిగుట్టలో నివసాముంటున్న ఓ మహిళ.. నెల రోజుల క్రితం కుర్చీమీద నుంచి కిందపడి తన కుమారుడు చనిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముషీరాబాద్ పోలీసులుకేసు నమోదు చేశారు. అయితే తల్లి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తమ విచారణలో వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి తల్లే హత్య చేయించినట్లు తేలింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చదవండి: పెళ్లయి రెండేళ్లు.. వివాహిత షాకింగ్ నిర్ణయం.. -
ఒకరేమో ఏడు ముక్కలు చేయిస్తే.. మరొకరు ప్రియుడి చేతికి తుపాకీ అందించి..
2021 నవంబర్.. ప్రియుడి మోజులో పడి అగ్నిసాక్షిగా తాళి కట్టించుకున్న భర్తను ఏడు ముక్కలు చేయించింది జ్యోతినగర్ ప్రాంతానికి చెందిన హేమలత. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని అక్కసుతో అతిగా మద్యం తాగించి ఆపరేషన్ చేసే సీజర్‌తో ప్రియుడితో ఏడు ముక్కలు చేయించి పలు ప్రాంతాల్లో పడేయించింది. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇష్టపడి సొంత మేన మరదలిని పెళ్లి చేసుకున్నాడు సింగరేణి కార్మికుడు కోరుకొప్పుల రాజేందర్. ఇద్దరు పిల్లలు సంతానం. అయినా ప్రేమికుడి మోజులో పడిన ఆయన భార్య రవళి.. తాళికట్టిన రాజేందర్‌ను ఈనెల 20న పిస్తోల్‌తో కాల్పులు జరిపించి చంపించింది. ఈ సంఘటన ఈ ప్రాంతంలో సంచలనం రేపింది. గోదావరిఖని(పెద్దపల్లి): అర్థేచ.. కార్యేచ.. నాతి చరామి అంటూ చేతిలోచేయి వేసి జీవితాంతం తోడుంటామని బాస చేసిన కొందరు కట్టుకున్న భర్తను మట్టుబెట్టుతున్నారు. వివాహేతర సంబంధం మోజులో పడి తాళి కట్టిన వారిని కడతేర్చుతున్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఇలాంటి సంఘటనల రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వివాహేతర సంబంధాల ముందు తాళికట్టిన బంధాలు పలుచనైపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచమంతా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు గౌరవం ఇస్తుంటే ఇక్కడ మాత్రం పాశ్చాత్య సంస్కృతివైపు పయనం పెరిగి పోతోంది. సింగరేణి కార్మిక క్షేత్రంలో ఇలాంటి సంఘటనలు ఏదో మూల జరుగుతూనే ఉన్నాయి. శనివారం హత్యకు గురైన కోరకొప్పుల రాజేందర్‌ను పెళ్లిచేసుకున్న రవళి ఇద్దరు పిల్లలకు తల్లి. భర్త, పిల్లలతో కలిసి హాయిగా కాపురం చేయాల్సిన సమయంలో పెళ్లికి ముందునుంచే ప్రేమికుడితో చెట్టపట్టాలేసుకుని తిరిగి పచ్చని కాపురంలో చిచ్చుపెట్టుకుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేరే ప్రాంతం నుంచి వచ్చిన ప్రేమికుడితో కలిసి తన భర్తను చంపించేందుకు సహకరించిందని అంటున్నారు. తాళి కట్టించుకుని ఏడడుగులు నడిచిన భార్య ప్రియుడితో కలిసి పెళ్లి చేసుకున్న ఏడేళ్లకు చంపించడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. గతేడాది నవంబర్లోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. ఎన్టీపీసీ టీటీఎస్‌లో అగ్నిసాక్షిగా తాళికట్టించుకున్న భర్తను ప్రియుడితో కలిసి ఏడుముక్కలు చేయించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎవరికీ అనుమానం రాకుండా భర్తను చంపించిన భార్య.. అతడి శరీరభాగాలను ఏడు వేర్వేరు ప్రాంతాల్లో పడవేయించింది. ఇలాంటి ఘటనలతో స్థానికులు భయపడుతున్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు విలువనిస్తూ అగ్నిసాక్షిగా తాళికట్టిన బంధాలను బలోపేతం చేసేలా స మాజం నడుం బిగించాలంటున్నారు. పోలీసుశాఖ కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
రెండుసార్లు హత్యాయత్నం.. ప్రాణం తీసిన వివాహేతర సంబంధం!
సాక్షి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సింగరేణి కార్మికుడిని ఇద్దరు వ్యక్తులు పిస్తోల్‌తో కాల్చిచంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. శుక్రవారం అర్థరాత్రి జరిగిన ఘటన వివరాలు పోలీసుల కథనం మేరకు ఇలా ఉన్నాయి. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతానికి చెందిన కోరుకొప్పుల మొండయ్య అమృత దంపతుల కుమారుడు రాజేందర్‌కు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట్ గ్రామానికి చెందిన రవళితో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఆదిత్య (7), కార్తికేయ (4) సంతానం. రాజేందర్ శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే–7లో జనరల్ మజ్దూర్‌గా పనిచేస్తున్నాడు. ప్రతిరోజూ ద్విచక్రవాహనంపై విధులకు వెళ్లి వస్తున్నాడు. అయితే రాజేందర్ శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా.. సుమారు 1.30 గంటల నుంచి రెండు గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై హెల్మెట్ పెట్టుకుని వచ్చి ఇంట్లోకి ప్రవేశించారు. అప్పటికే నిద్రిస్తున్న రాజేందర్‌పై వెంట తెచ్చుకున్న పిస్తోల్‌తో కుడివైపు కణతపై రెండు రౌండ్లు కాల్పులు జరపడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఉదయం ఐదు గంటలవరకూ నిందితులు రాజేందర్ ఇంటిముందున్న గద్దెపైనే కూర్చున్నట్లు స్థానికులు చెబుతున్నారు. హత్య సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడ్నుంచి రెండు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: ముంబైలో రూ.5 కోట్ల కొకైన్ పట్టివేత వివాహేతర సంబంధమే కారణమా? రవళికి పెళ్లికి ముందే తన మేనబావ, కిష్టంపేట్‌కు చెందిన బందం రాజుతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ఎలాగైనా చంపించాలని భావించింది. కొన్నాళ్ల క్రితం విధులు ముగించుకుని ఇంటికి ద్విచక్రవాహనంపై వస్తున్న రాజేందర్‌ను కారుతో ఢీకొట్టి చంపించేందుకు ప్రయత్నించగా.. త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ప్రమాదంగా భావించి పెద్దగా పట్టించుకోలేదు. మరోసారి ఇంటిముందు గేట్‌కు కరెంట్ పెట్టి చంపాలని ప్రయత్నించగా..దాన్ని కూడా ప్రమాదంగానే రాజేందర్ భావించాడు. అయితే తాజా ఘటనతో అవి ప్రమాదంగా పరిగణించలేమని స్థానికులు చెబుతున్నారు. హత్య సమయంలో రవళి బాత్రూమ్లోకి వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. బందం రాజు, అతని మిత్రుడు సయ్యద్, కోడలు రవళి కలిసి తమ కొడుకును తుపాకీతో కాల్చి చంపినట్లు మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలతో నిందితుల గుర్తింపు సాంకేతిక ఆధారాలతో నిందితులను మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన బందం రాజు, అతని మిత్రుడు సయ్యద్గా పోలీసులు గుర్తించారు. మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నామని, ఫోరెన్సిక్ నిపుణులు, డాగ్‌స్క్వాడ్ బృందాన్ని రప్పించి తనిఖీలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. షార్ట్‌వెపన్‌తో కాల్చారు.. షార్ట్‌వెపన్‌తో కాల్చినట్లు భావిస్తున్నాం. నిందితులను పట్టుకోవడానికి రెండు బృందాలను ఏర్పాటు చేశాం. హత్యకు వాడింది లైసెన్స్డ్ వెపనా..? లేక దేశీ కట్టా వెపనా..? తేలాల్సి ఉంది. హత్యకు సంబంధించిన ఏమైనా వివరాలు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలి. –రూపేష్, పెద్దపల్లి డీసీపీ -
వివాహేతర సంబంధం ఉందనే అనుమానం.. ఫోన్లో మాట్లాడుతుంటే చూసి..
రాయచూరు(బెంగళూరు): వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి కడతేర్చిన భర్త పోలీసులకు లొంగిపోయాడు. ఈఘటన లింగసూగురు తాలాకా గుడదనాళలో బుధవారం జరిగింది. డీఎస్పీ వెంకటప్పనాయక్ కథనం మేరకు... గ్రామానికి చెందిన బెట్టప్పకు ఏడేళ్ల క్రితం కలబుర్గి జిల్లా యడ్రామికి చెందిన రేణుక(28)తో వివాహమైంది. వీరికి విరాట్, రాహుల్ అనే కుమారులున్నారు. అయితే రేణుకకు మల్లప్ప అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని బెట్టప్ప అనుమానించేవాడు. మంగళవారం సాయంత్రం మల్లప్పతో భార్య ఫోన్లో మాట్లాడుతుండటాన్ని గమనించాడు. బుధవారం పుట్టింటికి వెళ్లి వస్తానని భార్య అడగడంతో మల్లప్ప కోసమే వెళ్తున్నావంటూ గొడవపడి గొడ్డలతో నరికి చంపి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి రేణుక మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: సివిల్స్ కోచింగ్‌కు వెళ్లి.. యువకునితో వివాహేతర సంబంధం.. అందుకే.. -
ఇంటి యజమానితో భార్య వివాహేతర బంధం..
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. వేరే వ్యక్తితో ఉండడాన్ని కళ్లారా చూసి జీర్ణించుకోలేకపోయాడు. మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కమీషన్ విషయంలో రియల్టర్లు మోసం చేయడంతో తట్టుకోలేకపోయాడు. అప్పటి నుంచి అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. భార్య, పిల్లలు దూరం కావడంతో మహిళలపై ద్వేషం పెంచుకుని సైకోలా మారాడు. వారం రోజుల వ్యవధిలో ముగ్గురిని కడతేర్చాడు. నగర శివారు పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపిన వరుస హత్యలకు సంబంధించిన వివరాలను పోలీస్ కమిషనరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం సాయంత్రం పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ వెల్లడించారు. భార్య వివాహేతర బంధంతో కుమిలిపోయి... చందక రాంబాబు అలియాస్ సందక రాంబాబు (49) కోటవురట్ల మండలం ధర్మసాగరం గ్రామ నివాసి. 2006లో జీవనోపాధి కోసం హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పనిచేస్తూ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అనంతరం 2013లో ఒంటిరిగా విశాఖపట్నం వచ్చి విమాననగర్‌లో ఉండేవాడు. భార్య, పిల్లలు ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తూ, హైదరాబాద్‌లోని భరత్‌నగర్‌లో నివసించేవారు. 2015లో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో పనికి చేరిన రాంబాబు అప్పుడప్పుడూ హైదరాబాద్ వెళ్లి భార్య, పిల్లలను చూసేవాడు. ఈ క్రమంలో అతని భార్య హైదరాబాద్‌లో వారు నివసిస్తున్న ఇంటి యజమానితో వివాహేతర బంధం ఏర్పరచుకోవడంతో కుమిలిపోయాడు. భార్యతో గొడవ పడి 2018 మే 21న భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. అప్పటి నుంచి కుమారుడు, కుమార్తె కూడా రాంబాబును విడిచి పెట్టేసి తల్లి వద్దే ఉంటున్నారు. ఒంటరితనం... స్త్రీలపై పగతో... భార్య, పిల్లలకు దూరమైన రాంబాబు ఒంటరిగా మారాడు. 2021 అక్టోబర్‌లో పెందుర్తి సమీప ప్రశాంతినగర్‌లో అద్దెకు ఇల్లు తీసుకుని నివసించేవాడు. అయితే ఏ పనికీ వెళ్లకపోవడంతో అద్దె చెల్లించలేక ఇల్లు విడిచి బస్టాప్‌లో ఆశ్రయం పొందాడు. సమీపంలోని ఫంక్షన్ హాల్స్, దేవాలయాల వద్ద భోజనం చేస్తుండేవాడు. ఈ నేపథ్యంలో భార్య ప్రవర్తన కారణంగా రాంబాబు స్త్రీలపై పగ, ద్వేషం పెంచుకున్నాడు. మహిళలను కొట్టి, దారుణంగా చంపి వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఒక స్క్రాప్ దుకాణం నుంచి ఇనుప రాడ్డు దొంగలించాడు. ముందుగా గత నెల 9న పెందుర్తి బృందావన్ గార్డెన్స్‌లో నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్లో పనిచేస్తున్న 50 ఏళ్ల తోట నల్లమ్మ, ఆమె కుమారుడు నిద్రపోతుండగా దాడి చేసి గాయపరిచాడు. అనంతరం ఈ నెల 6న రాత్రి పెందుర్తి చినముషిడివాడ సప్తగిరినగర్‌లో నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న సుతారి అప్పారావు, సుతారి లక్షి్మపై ఇనుప రాడ్డుతో దారుణంగా దాడి చేసి హత్య చేశాడు. తర్వాత ఈ నెల 14న రాత్రి పెందుర్తి సుజాతనగర్ నాగమల్లి లే అవుట్, లాలం రెసిడెన్సీ సెల్లార్లో అపార్టుమెంట్ వాచ్‌మెన్‌గా ఉంటున్న అప్పికొండ లక్ష్మిని దారుణంగా హత్య చేశాడు. నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్ల వద్దే... రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పనిచేసినప్పుడు కమీషన్ విషయంలో బిల్డర్లు తనను మోసం చేయడంతో నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్ల వద్దే దాడులు, హత్యలకు పాల్పడాలని చందక రాంబాబు నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే జన సంచారం తక్కువగా ఉండడం, సరైన భద్రత లేని అపార్టుమెంట్ల వద్దకు రాత్రి వేళల్లో వెళ్లి హత్యాంకాండకు పాల్పడ్డాడు. దీంతో వరుస హత్యలపై పోలీసులు అప్రమత్తమై దర్యాప్తు కోసం పలు బృందాలు ఏర్పాటు చేశారు. సీసీటీవీ పుటేజ్, సాంకేతిక ఆధారాలు క్షుణంగా పరిశీలించారు. అన్ని కోణాల నుంచి ఆధారాలు సేకరించి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు అంగీకరించాడు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
వివాహేతర సంబంధం: మహిళ సోదరుడికి తెలియడంతో..
రాయచూరు రూరల్(బెంగళూరు): జిల్లాలోని మాన్వి తాలూకా చిక్కకొట్నేకల్లో శుక్రవారం సాయంత్రం వివాహేతర సంబంధం కలిగిన ఆరోపణపై ఓ యువకుడు హత్యకు గురైన ఘటన జరిగింది. మాన్వి పోలీసుల వివరాలు.. వీరేష్(25) అనే యువకుడిని హనుమేష్ అనే వ్యక్తి హత్య చేశాడు. హనుమేష్ సోదరితో వీరేష్ గత కొంత కాలంగా వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడు. ఇది గమనించిని హనుమేష్ అతని తీరు మార్చుకోవాలని పలు మార్లు హెచ్చరించాడు. అయితే ఆ మాటలను వీరేష్ పట్టించుకోలేదు. దీంతో పథకం ప్రకారం ఆ యువకుడిని హత్య చేశాడు హనుమేష్. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ వెంకటప్ప నాయక్ తెలిపారు. చదవండి: 19 ఏళ్ల యువకుడిని ట్రాప్ చేసిన మహిళ.. హెచ్ఆర్సీని ఆశ్రయించిన తండ్రి -
వివాహేతర సంబంధానికి కూతురు అడ్డొస్తుందని.. సొంత అన్నతో కలిసి
సాక్షి, వరంగల్: సభ్యసమాజం తలదించుకునేలా చేసింది ఓ కసాయి తల్లి. తన సొంత అన్నతో వివాహేతర సంబంధం సాగిస్తూ అడ్డొస్తుందని సోదరుడితో కలిసి ఆరేళ్ల కన్న కూతురి గొంతు నులిమి కడతేర్చింది. పోలీసులు నిందితులిద్దరిని మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మహబూబాబాద్ రూరల్ సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉమ్మడి పెనుగొండ గ్రామ శివారు నర్సింహులగూడెంకు చెందిన పూనెం శిరీషకు.. ఏడేళ్ల క్రితం పెనుగొండ గ్రామ శివారు కట్టుగుడెంకు చెందిన అశోక్‌తో వివాహం జరిగింది. వీరికి కూతురు అనూశ్రీ(6) ఉంది. శిరీష తన సొంత అన్న పూనెం కుమారస్వామితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భర్త ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అన్నాచెల్లె కలిసి ఐదేళ్ల క్రితం అనూశ్రీని తీసుకుని భువనగిరిలోని మర్రిగుడెంకు వెళ్లారు. అక్కడే పౌల్ట్రీఫాంలో పనిచేస్తూ సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి ఇద్దరు కుమారులు జన్మించారు. అనూశ్రీ తరచూ అనారోగ్యంతో బాధపడుతుండేది. ఆస్పత్రులకు తీసుకెళ్లే స్థోమత లేకపోవడం, పెరిగి పెద్దదైతే ఖర్చులు భరించాల్సి వస్తుంది. పైగా వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని వారు భావించారు. ఈ క్రమంలో గత నెల 24న అనూశ్రీ చాతిపై తల్లి కూర్చోని గట్టిగా పట్టుకోగా కుమారస్వామి గొంతు నులిమి హత్య చేశాడు. మరుసటి రోజు మృతదేహన్ని స్వగ్రామమైన నర్సింహులగూడెం తీసుకెళ్లి కడుపునొప్పితో చనిపోయినట్లు నమ్మించి అంత్యక్రియలు చేసే ప్రయత్నం చేశారు. గ్రామస్తులకు అనుమానం రావడంతో డయల్ 100కు సమాచారం అందించారు. చదవండి: ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రేమించలేదని యువతిని కారుతో ఢీకొట్టి.. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టంలో బాలిక గొంతు నులిమి హతమార్చినట్లు తేలింది. దీంతో పోలీసులు శిరీష, కుమారస్వామిని అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరం ఒప్పుకున్నారు. మర్రిగుడెంలో ఉన్న ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. కేసును యాదగిరి టౌన్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేయనున్నట్లు పేర్కొన్నారు. -
ఒకేసారి ఇద్దరితో వివాహిత వివాహేతర సంబంధం.. ఐటీ ఉద్యోగి దారుణహత్య
తోట్లవల్లూరు (కృష్ణా జిల్లా) : వివాహేతర సంబంధం కారణంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణ హత్యకు గురైన ఘటన తోట్లవల్లూరు మండలంలోని చాగంటిపాడు శివారు ఆళ్లవారిపాలెంలో జరిగింది. చిమ్మచీకట్లో తెల్లవారుజామున జరిగిన ఈ ఘాతుకంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనలో యాకమూరుకు చెందిన గాడికొయ్య శ్రీనివాసరెడ్డి(38) దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. యాకమూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ శ్రీనివాసరెడ్డి భద్రిరాజుపాలెంకు చెందిన ఆళ్ల శ్రీకాంత్‌రెడ్డి స్నేహితులు. ఇరువురూ బాగా చనువుగా ఉండటంతో పాటు ఒకరింటికి ఒకరు పరస్పరం వచ్చి వెళుతుంటారు. వర్క్ ఫ్రం హోంలో భాగంగా శ్రీనివాసరెడ్డి యాకమూరులోని ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నాడు. శ్రీకాంత్‌రెడ్డి గ్రామంలోనే వ్యవసాయం చేస్తుంటాడు. చాగంటిపాడు శివారు ఆళ్లవారిపాలెంకు చెందిన ఆళ్ల మిధున అలియాస్ జ్యోతితో గత కొన్నేళ్లుగా శ్రీకాంత్‌రెడ్డి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. జ్యోతి భర్త అమాయకంగా ఉంటాడు. దానిని ఆసరాగా తీసుకుని ఆమె శ్రీకాంత్‌రెడ్డితోనే కాకుండా కొంతకాలంగా శ్రీనివాసరెడ్డితో కూడా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి యాకమూరులోని ఇంటి నుంచి ల్యాప్‌టాప్ తీసుకుని పునాదిపాడు స్నేహితుల ఇంటికి వెళుతున్నానని చెప్పి బయటకు వచ్చిన శ్రీనివాసరెడ్డి ఆళ్లవారిపాలెంలోని మిధున ఇంటి వరండాలో దారుణ హత్యకు గురయ్యాడు. హత్య జరిగిన ప్రదేశంలో గొడ్డలి, కత్తి లభ్యమయ్యాయి. రక్తపుమడుగులో పడి ఉన్న శ్రీనివాసరెడ్డి మృతదేహాన్ని చూసి గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న గుడివాడ డీఎస్పీ సత్యానందం, పమిడిముక్కల సీఐ ముక్తేశ్వరరావు, ఎస్ఐ అర్జున్ ఘటనా ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు. హత్యకు కారకులుగా భావిస్తున్న ఆళ్ల శ్రీకాంతరెడ్డి, ఆళ్ల మిధున, ఆమె పదినెలల పాపతో కలిసి పరారయ్యారు. డాగ్‌స్కా్వడ్, క్లూస్ టీంలను రంగంలోకి దింపి పోలీసులు వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పరారీలో ఉన్న నిందితుల కోసం నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు ఎస్ఐ అర్జున్ తెలియజేశారు. -
ఏందీ రచ్చ! ఆమెతో ఎఫైర్.. ఎలాన్ మస్క్ స్పందన ఇదే!
ఎలాన్ మస్క్, ఎలాన్ మస్క్, ఎలాన్ మస్క్ ప్రస్తుతం నెట్టింట మారుమోగుతోంది ఈ పేరు. అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా అన్నీ విషయాల్లోనూ తళుక్కున మెరుస్తున్నాడు ఈ టెస్లా అధినేత. మొన్న జానీ డెప్ వ్యవహారంలో, నిన్న ట్విటర్, ప్రస్తుతం ప్రాణ స్నేహితుడి భార్యతో ఎఫైర్ ఇలా విషయాలు వేరైనా కామన్‌గా వినిపించే పేరు మాత్రం ఎలాన్ మస్క్. అసలు కథేంటి గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ భార్యతో ఎలాన్ మస్క్‌కు ఎఫైర్ ఉందని సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై టెస్లా బాస్ స్పందిస్తూ తనపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని వాటిని ఖండించారు. ఈ విషయంపై ట్వీట్ కూడా చేశారు. అందులో.. " ఇది పూర్తిగా అబద్దం. సెర్జీ, నేను స్నేహితులం. గత రాత్రే మేమిద్దరం పార్టీలో కలిశాం. నేను అతని భార్య నికోల్‌ను మూడు సంవత్సరాలలో కేవలం రెండుసార్లు మాత్రమే చూశాను, అది కూడా గుంపుగా ఉన్నప్పుడు. ఈ వ్యవహారంలో మరో రకంగా అనుకోవడానికి ఏమి లేద’’ని ట్వీట్ చేశారు. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. గూగుల్ సహ వ్యవస్థాపకుడు సర్జీ బ్రిన్.. తన దగ్గరి స్నేహితుడు . ఎలాన్ మస్క్ , సెర్జీ బ్రిన్ గతంలో మంచి స్నేహితులు. ఎంతలా అంటే ఎలాన్ మస్క్‌ను ఆర్థిక కష్టాల నుంచి 2008లో బయటపడేసేంత సాన్నిహిత్యం ఉంది. అలాంటిది సర్జీ, మస్క్‌కు వ్యతిరేకంగా ఎలన్ మస్క్ కంపెనీల్లోని వాటాలన్నీ అమ్మేసుకున్నాడని, వీటితో పాటు తన సలహాదారులకు కూడా మస్క్ కంపెనీల్లో ఉన్న వాళ్ల వాళ్ల వాటాలను అమ్మేసుకోవాలని పిలుపు ఇచ్చాడని తెలిపింది. దీనికి ప్రధాన కారణంగా.. సర్జీ బ్రిన్ భార్య నికోల్ షన్హన్తో ఎలన్ మస్క్ వివాహేతర సంబంధం నడిపాడని, ఈ వ్యవహారం వల్లే సర్జీ-నికోల్ మధ్య విబేధాలు ముదిరాయని, అలాగే సర్జీ-మస్క్ మధ్య స్నేహం చెడిందంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం ప్రచురించింది. స్నేహితుడి భార్యతోనే మస్క్ ఎఫైర్ నడిపాడని, గత డిసెంబర్లో ఈ వ్యవహారానికి సంబంధించి మస్క్, నికోల్‌కు క్షమాపణలు కూడా తెలియజేశాడన్నది ఆ కథనం సారాంశం. -
వివాహేతర సంబంధం గుట్టురట్టు.. లాడ్జిలో గది అద్దెకు తీసుకుని..
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): వివాహితతో అక్రమ సంబంధం గుట్టురట్టు కావడం, ఆమె భర్త బెదిరించడంతో భయపడ్డ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నెలమంగల పట్టణంలో చోటుచేసుకుంది. బెంగళూరు కురుబరహళ్లి నివాసి అరుణ్ (33) నెలమంగల పట్టణంలోని ఒక లాడ్జిలో గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రైవేటు కంపెనీలో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న అరుణ్ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం కాస్త ఆమె భర్తకు తెలియడంతో బెదిరించాడు. అంతేకాకుండా భార్యతో ఫోన్ చేయించి మన ఇద్దరి పేర్లు రాసి ఆయన ఆత్మహత్య చేసుకుంటానని చెప్పించాడు. దీంతో భయపడిపోయిన అరుణ్ నెలమంగలకు వచ్చి లాడ్జిలో గది అద్దెకు తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబానికి అరుణ్ ఒక్కడే జీవనాధారం కావడంతో కుటంబ సభ్యులు కన్నరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: ఏడాదిన్నర కిందట పెళ్లి.. 9 నెలల బాబు.. చిన్న గొడవకే -
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం: భార్య తలను నరికి చేతిలో పట్టుకుని 12 కి.మి..
భువనేశ్వర్: భార్య తలను నరికి చేతిలో పట్టుకొని 12 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు ఒక పైశాచిక భర్త. ఒళ్లు గగుర్పొడిచే ఈ సంఘటన ఢెంకనాల్ జిల్లాలో శుక్రవారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. చంద్రశేఖరపూర్ గ్రామానికి చెందిన నక్కొఫొడి మాఝి అక్రమ సంబంధం అనుమానంతో తన భార్య సుచల మాఝిని పైశాచికంగా హత్య చేశాడు. అనంతరం ఆమె తలను చేతిలో పట్టుకొని పోలీసులకు లొంగిపోవడానికి కాలి నడకన బయల్దేరాడు. జొంఖిరా గ్రామం ప్రధాన రహదారిపై నిందితుడిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అతడిని విచారించగా తన భార్యకు అక్రమ సంబంధం ఉండడంతో పలుమార్లు హెచ్చరించినట్లు తెలియజేశాడు. కానీ ఆమె పట్టించుకోకపోవడంతో శుక్రవారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో కత్తితో పీకకోసి చంపేసినట్లు చెప్పాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, కానీ.. నా భర్తపై చర్యలు తీసుకోండి -
ప్రియుడితో గొడవ.. మందు తాగించి, చీరతో గొంతు బిగించి..
సాక్షి, చెన్నై: నామక్కల్ జిల్లాలో వివాహేతర ప్రియుడిని చీరతో గొంతు బిగించి హత్య చేసిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. నామక్కల్ జిల్లా పరమత్తి వేలూరు సమీపంలో తిడుమల్ ఆవారాంగాడు ప్రాంతానికి చెందిన సెల్వరాజు (50), అతని భార్య కళామణి. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. సెల్వరాజ్ తన రెండు కార్లను అద్దెకు నడుపుతుండేవాడు. ఈ క్రమంలో సెల్వరాజు పరమత వేలూరు సమీపంలోని పాలక్కరై ప్రాంతంలో ఉన్న సుధ (45) ఇంటిలో మృతి చెందినట్లు కళామణికి సమాచారం అందింది. బంధువులతో కలిసి ఘటన స్థలానికి వెళ్లి చూడగా సెల్వరాజు అనుమానాస్పదస్థితిలో మృతి చెంది ఉన్నాడు. దీనిపై కలామణి నల్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు సెల్వరాజు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవ పరీక్ష కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సెల్వరాజ్, సుధ మద్య ఐదేళ్లుగా వివాహేతర సంబంధం నడుస్తోంది. ఇటీవల సుధకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడినట్లు తెలయడంతో సెల్వరాజ్ ఆమెను నిలదీశాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సెల్వరాజును హత్య చేయడానికి సుధ నిర్ణయించుకుంది. గురువారం రాత్రి తన ఇంటికి వచ్చిన సెల్వరాజుకు ఎక్కువగా మద్యం తాగించి, చీరతో గొంతు బిగించి హత్య చేసింది. పోలీసులు నిందితురాలని అరెస్ట్ చేసి పరమట్టి కోర్టులో హాజరుపరచి సేలం మహిళా జైలుకు తరలించారు. -
రెండున్నరేళ్ల నుంచి వివాహేతర బంధం.. రాత్రి నిద్రపోతుంటే..
సాక్షి,కేసముద్రం(మహబూబాబాద్): వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామశివారు చెరువు కొమ్ముతండాలో ప్రియుడు, అతడి స్నేహితులతో కలిసి భర్తను చంపిదో మహిళ. ఈమేరకు హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను సోమవారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మహబూబాబాద్ రూరల్ సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చెరువుకొమ్ముతండాకు చెందిన బానోత్ వీరన్న 15 ఏళ్ల క్రితం భద్రాద్రికొత్తగూడెం జిల్లా గుండాల మండలం కాంచనపల్లి శివారు జగ్గుతండాకు చెందిన వినోదను పెళ్లి చేసుకున్నాడు. వీరికి సంతానం కలుగలేదు. భర్త అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి.. రెండున్నరేళ్ల నుంచి ఇదే తండాకు చెందిన అజ్మీర నరేశ్‌తో వినోద వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయమై గతంలో తండా పెద్ద మనుషుల మధ్య వీరన్న పంచాయితీ కూడా పెట్టాడు. అనంతరం వీరన్న, వినోద, నరేశ్ మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఏడాదిన్నర క్రితం వినోద పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను ఇంటికి రావాలని వీరన్న పలుమార్లు ప్రాధేయపడ్డాడు. అయినా వినోద రాకుండా.. ఆళ్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో భర్త, అతడి కుటుంబ సభ్యులపై కేసు పెట్టింది. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. అయినప్పటికీ భర్తతో ఉండలేనని, అతడిని ఎలాగైనా చంపాలని వినోద తన ప్రియుడు నరేశ్‌పై ఒత్తిడి తెచ్చింది. దీంతో వీరన్నను చంపేందుకు తన స్నేహితులైన కురవి మండలం కంచర్లడూడెం తండాకు చెందిన బానోత్ సుమన్, నారాయణపురం శివారు చెరువుకొమ్ముతండాకు చెందిన దారావత్ రాంబాబు, దేవాతో నరేశ్ చేయి కలిపాడు. వీరంతా కలిసి ఈనెల 21న అర్ధరాత్రి నిద్రిస్తున్న వీరన్న మెడ చుట్టూ తాడు బిగించి చంపేశారు. పోలీసులు అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లుగా కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తులో వీరన్నను నరేశ్, అతడి ముగ్గురు స్నేహితులతో కలిసి వినోద హత్య చేయించినట్లు పోలీసులు తేల్చారు. దీంతో సోమవారం హత్యకు పాల్పడిన నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. మృతుడి భార్య వినోద పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో ఎస్సైలు రమేశ్‌బాబు, తిరుపతి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: కుల పంచాయితీలో మహిళపై దాడి.. నిండు ప్రాణం తీసిన వాట్సాప్ ప్రచారం -
వివాహిత మహిళను లోబరుచుకుని.. అడవిలోకి తీసుకువెళ్లి..
మైసూరు(బెంగళూరు): ఇద్దరు పిల్లల తల్లి అయిన మహిళను ఆమె కంటే చిన్నవాడైన అర్చకుడు మభ్యపెట్టి తీసుకెళ్లాడు, చివరకు ఆమె అడవిలో ఒంటరిగా ఉండడం చూసి జనం పోలీసులకు సమాచారమిచ్చారు. వివరాలు.. నంజనగూడు తాలూకాలోని కోల్లుపుర గ్రామంలో చోటు చేసుకుంది. బాధిత మహిళ (35) సమస్యలు తొలగిపోవాలని ఆలయానికి వెళ్లేది. అక్కడి పూజారి సంతోష్ (28) ఆమెను ప్రేమపేరుతో లోబరుచుకున్నాడు. ఇద్దరూ షికార్లకు వెళ్లేవారు. ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదామని చెప్పి సంతోష్ ఆ మహిళను తీసుకెళ్లి అడవిలో వదిలేసి పారిపోయాడు. స్థానికులు ఆమెను చూసి హుల్లహళ్ళి పోలీసులకు చెప్పగా, వారు ఆమెను రక్షించారు. కేసు నమోదు చేశారు. చదవండి: తల లేదు.. మొండెం మాత్రమే: క్లూ చెప్పండి, రూ.లక్షలు గెలవండి -
యువకుడితో సహజీవనం.. పెళ్లికి నో చెప్పిందని వివాహిత కుమారుడిని
సాక్షి, బంజారాహిల్స్: పెళ్లి చేసుకోవడానికి అంగీకరించడం లేదని ఓ వివాహిత కుమారుడిని కిడ్నాప్ చేసిన యువకుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి చిన్నారి కోసం గాలింపు చేపట్టారు. పోలీసులు తెలిపిన మేరకు.. బబ్బుగూడలో నివసించే షేక్ తబస్సుమ్(24) భర్తతో విడిపోయి ఈవెంట్ ఆర్గనైజర్‌గా రహ్మత్‌నగర్‌లో పని చేస్తోంది. ఈమెకు ఇద్దరు కుమారులు. తన ఇంటి సమీపంలోనే నివసించే శంకర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త గత మూడు నెలలుగా సహజీవనానికి దారి తీసింది. ఇద్దరూ బబ్బుగూడలో సహజీవనం చేస్తున్నారు. ఈ నెల 14వ తేదీన పెళ్లి చేసుకోవాలంటూ శంకర్ ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చాడు. ఇందుకు ఆమె అంగీకరించలేదు. దొంగతనాలు చేస్తూ పోలీసులకు కూడా పట్టుబడ్డట్లు శంకర్‌పై అభియోగాలు ఉండటంతో పెళ్లికి నిరాకరించింది. కక్ష పెంచుకున్న శంకర్ బాధితురాలు రహ్మత్‌నగర్‌లో ఓ కార్యక్రమంలో ఉండగా తనతో పాటు వచ్చిన రెండేళ్ల కుమారుడిని ఎత్తికెళ్లినట్లు ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులు శంకర్‌పై కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. నాందేడ్‌లో ఉన్నట్లుగా ఫోన్ కాల్‌డేటా ఆధారంగా గుర్తించారు. నాందేడ్‌కు ఒక పోలీస్ బృందం గురువారం వెళ్లింది. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Hyderabad: వైద్యుల నిర్లక్ష్యం.. నిండు గర్భిణి మృతి -
భార్య వివాహేతర సంబంధం.. కువైట్ నుంచి వచ్చిన భర్తకు తెలియడంతో
సాక్షి, నిజామాబాద్: వివాహేతర సంబంధంతో ఓ మహిళ కట్టుకున్న భర్తను చంపి, తర్వాత ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం చేసినట్లు సీపీ నాగరాజు వెల్లడించారు. బుధవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మీడియా సమావేశంలో సీపీ మాట్లాడుతూ ఆర్మూర్ మండలం మంథని గ్రామానికి చెందిన మైలారమ్ సదానంద్‌కు కవితతో 2007లో వివాహం కాగా వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. సదానంద్ బతుకు దెరువుకు కోసం కువైట్‌కు వెళ్లేవారన్నారు. 2008లో కవితకు అదే గ్రామానికి చెందిన మైలారం శేఖర్‌తో పరిచయమై తర్వాత వివాహేతర సంబంధానికి దారి తీసింది. మే 5న కువైట్ నుంచి వచ్చిన సదానంద్‌కు భార్య మధ్య డబ్బుల విషయంలో తగాదా రావడంతో పాటు భార్య వివాహేతర సంబంధం గురించి తెలిసింది. దీంతో వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో కవిత పుట్టింటికి వెళ్లిపోయింది. సదానంద్‌కు నవీపేట్ మండలం నాడాపూర్ గ్రామానికి చెందిన తోకల విజయతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో సదానంద్‌ను చంపేందుకు విజయతో కలిసి కవిత పథకం రచించింది. పథకం ప్రకారం సదానందంను విజయ నిర్మా నుష్య ప్రదేశానికి తీసుకెళ్లి మత్తులోకి వెళ్లేవరకు మద్యం తాగించింది. అనంతరం కవితకు ఫోన్ చేసింది. కవితతో పాటు శేఖర్, మరో వ్యక్తి రాజశేఖర్ వచ్చారు. తర్వాత అందరూ కలిసి సందానందం గొంతుకు స్కార్ఫ్ బిగించి చంపివేశారని సీపీ వివ రించారు. హత్యను నిందితులు ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానంతో కేసును చేధించి కవిత, వి జయ, శేఖర్, రాజశేఖర్ లను అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించినట్లు సీపీ తెలిపారు. వారి వద్ద నుంచి ద్విచక్ర వాహనంతో పాటు నాలుగు సెల్ఫోన్లు, బంగారు చైన్ తదితర వాటిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. స మావేశంలో అదనపు డీసీపీ నరేందర్, సీఐ జగడం నరేష్, ఎస్సై రాజారెడ్డి పాల్గొన్నారు. -
వివాహేతర సంబంధం: ప్రియుడితో కలిసి..
తిరువొత్తియూరు(చెన్నై): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని మద్యం, ఆహారంలో విషం కలిపి భర్తను హత్య చేసిన భార్యను, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. సేలం జిల్లా కొళత్తూరు సమీపంలోని కారైకాడు వీరభద్ర న్ కొట్టాయంకి చెందిన శక్తివేల్ (37) కార్మికుడు. ఇతను మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతని తమ్ముడు ముత్తుస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొళత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో శక్తివేలు భార్య పుగలరసి (37)కు అదే ప్రాంతానికి చెందిన ముత్తుకుమార్తో వివాహేతర సంబంధం ఉందని తేలింది. ఈ సంగతి తెలుసుకున్న శక్తివేల్ భార్యను మందలించాడు. దీంతో అతని అడ్డు తొలగించుకోవడానికి సోమవారం రాత్రి ఆహారంలో విషం కలిపి ఇచ్చి భర్తను పుగలరసి హత్య చేసినట్లు తెలిసింది. దీంతో పుగలరసి, ముత్తుకుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చదవండి: 'నా పిల్లలకు తల్లిని లేకుండా చేశావ్.. నిన్ను చంపి నా భార్యను తీసుకెళ్తా' -
ప్రేయసితో ఏకాంతంలో దొరికాడు.. అలా నగ్నంగానే ఊరేగించిన భార్య
అప్పటికే పెళ్లయిన ఓ వ్యక్తి.. ప్రియురాలితో కలిసి ఏకాంతంగా గడుపుతున్న టైంలో రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు. ఆ వివాహేతర సంబంధాన్ని రచ్చకీడ్చే ఉద్దేశంతో.. వాళ్లిద్దరినీ అలా నగ్నంగానే బయటకు ఇడ్చుకొచ్చింది అతని భార్య. ఆపై ఊరంతా తిప్పి.. వాళ్లను ఘోరంగా అవమానించింది. ఛత్తీస్‌గఢ్ కొండాగావ్కు చెందిన ఓ వ్యక్తి(25).. స్థానికంగా మరో యువతి(19)తో వివాహేతర సంబంధం నడుపుతున్నాడు. ఈ క్రమంలో గత శనివారం భార్య(23) ఊరెళ్లిందనుకుని.. ఇంట్లోనే దుకాణం పెట్టాడు ఆ వ్యక్తి. సరిగ్గా అదే సమయంలో ఆమె తిరిగి వచ్చింది. వాళ్లిద్దరి భాగోతాన్ని చూసి షాక్ తింది. అంతటితో ఆగకుండా వాళ్లకు దుస్తులు వేసుకునే టైం కూడా ఇవ్వలేదు. చుట్టుపక్కల వాళ్ల సాయంతో అలాగే నగ్నంగా బయటకు ఈడ్చుకొచ్చింది. ఆపై గ్రామ పెద్దల సహకారంతో ఆ భర్తను, అతని ప్రేయసిని చేతులు వెనక్కి కట్టేయించి నగ్నంగా ఊరేగించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. జూన్ 11వ తేదీన ఈ ఘటన జరగ్గా.. ఉరిందాబెద పోలీసులు రంగంలోకి దిగారు. పోలీస్ టీంను ఆ గ్రామానికి పంపించి.. ఘటనకు సంబంధించి వివరాలు సేకరించారు. బాధితుల స్టేట్మెంట్ల ప్రకారం.. ఫిర్యాదు నమోదు చేసుకున్నారు. ఆపై సదరు వ్యక్తి భార్యతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. -
భర్తతో విడాకులు.. మరొకరితో ప్రేమ.. విధులకు వెళ్తుండగా..
బనశంకరి(బెంగళూరు): సుంకదకట్టెలో యువతిపై యాసిడ్ దాడి ఘటన కళ్లముందు మెదులుతుండగానే అలాంటి ఘోరం నగరంలో పునరావృతమైంది. పెళ్లికి నిరాకరించిందని ఓ వివాహితపై ఓ వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఉదంతం కుమారస్వామి లేఔట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. డీసీపీ హరీశ్‌పాండే కథనం మేరకు... యాసిడ్ దాడికి గురైన మహిళ కుమారస్వామి లేఔట్ పరిధిలోని కర్ణాటక అగరబత్తి పరిశ్రమలో పనిచేస్తోంది. ఆమెకు వివాహమై ముగ్గురు పిల్లలు ఉండగా భర్తతో విడాకులు తీసుకుంది. ఇదే పరిశ్రమలో పనిచేస్తూ భార్యకు దూరంగా ఉన్న అహ్మద్‌కు, ఆమెకు మధ్య పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. వివాహం చేసుకుందామని అహ్మద్ కోరగా తన కుమారుడు పెద్దవాడయ్యాడనే కారణంతో ఆ మహిళ అంగీకరించలేదు. ఇదేవిషయంపై ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. శుక్రవారం ఉదయం ఆ మహిళ విధులకు వెళ్తుండగా సారక్కి వద్ద అహ్మద్ గొడవపడి యాసిడ్ చల్లి ఉడాయించాడు. కుమారస్వామి లేఔట్ పోలీసులు బాధితురాలిని వాసన్ ఐకేర్ ఆసుపత్రికి తరలించారు. కుడి కంటికి తీవ్ర గాయం కావడంతో సంజయ్‌గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. కుమారస్వామి లేఔట్ పోలీసులు అహ్మద్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. చదవండి: పబ్ దగ్గర దింపేస్తామని తీసుకెళ్లి.. -
మహిళను లోబర్చుకుని.. రాత్రి తలుపులు పగులకొట్టి..
సాక్షి,బీబీపేట(కామారెడ్డి): మహిళను లోబర్చుకున్నాడని ఓ వృద్ధుడిని మంత్రాల నెపంతో హత్య చేశారు. బీబీపేటలో శనివారం అర్ధరాత్రి జరి గిన ఈరోల్ల మల్లయ్య(62) హత్య కేసును పోలీసులు ఒక రోజు లోనే ఛేదించి నిందితులను రిమాండ్‌కు తరలించారు. మల్ల య్య హత్య కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం ప్రత్యేక నిఘా ఉంచగా బీబీపేట బస్టాండ్ వద్ద దొరికారు. నిందితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. సోమవారం భిక్కనూర్ సీఐ తిరుపయ్య వివరాలు వెల్లడించారు. మృతుడు మల్లయ్య ఇంటి పక్కన ఉండే మహిళను లోబర్చుకుని వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో మహిళ బంధువులు కొంగరి పోచయ్య, రాజ్‌కుమార్ నిందితుడిపై కక్ష పెంచుకున్నారు. పలుమార్లు మల్లయ్య ను హెచ్చరించారు. అయినా తీరు మారకపోవడంతో మల్లయ్యను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి మల్లయ్య, మహిళను తన ఇంట్లోకి తీసుకెళ్లి తలుపు వేసుకున్నాడు. దీంతో కొంగరి పోచయ్య, రాజ్ కుమార్‌లు గడ్డపారతో తలుపులు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి బ యటకు లాక్కొచ్చారు. మల్లయ్య తలపై బండరాయితో మోది, ద్విచక్ర వాహనంలో నుంచి పెట్రోల్ తీసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడ్డ మల్లయ్య అక్కడికకక్కడే మృతి చెందాడు. కాగా మృతుడు మల్లయ్యకు మంత్రాలు వస్తాయని, దీంతో మ హిళను లోబర్చుకున్నట్లు నిందితులు పోలీసులతో పేర్కొన్నా రు. పోలీసులు, నిందితులను మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చ గా నిజామాబాద్ జైలుకు తరలించారు. చదవండి: Extra Marital Affair: వివాహేతర సంబంధం.. పెళ్లి చేసుకోవాలని కోరడంతో.. -
వివాహేతర సంబంధం.. పెళ్లి చేసుకోవాలని కోరడంతో..
సాక్షి, రంగారెడ్డి: వివాహేతర సంబంధమే మహిళ హత్యకు దారితీసింది. మే 27న షాబాద్ పహిల్వాన్ చెరువులో పడి మృతి చెందిన ఓ మహిళ కేసును పోలీసులు మొదట అనుమానాస్పద ఆత్మహత్యగా భావించి కేసు నమోదు చేసి విచారణ చేయగా ఇది హత్యగా తేలింది. సదరు మహిళతో అక్రమ సంబంధం కలిగిన వ్యక్తే హత్యచేసినట్లు విచారణలో రుజువైంది. దీంతో షాబాద్ పోలీసులు సోమవారం ఈ హత్యతో సంబంధం ఉన్న ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. షాబాద్ సీఐ అశోక్ తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని పహిల్వాన్ చెరువులో మే 27న బైండ్ల భారతమ్మ(30) మృతదేహం లభించిన విషయం విదితమే. అయితే పోలీసులు అమె మృతికి సంబంధించిన విషయాలు తెలియకపోవటంతో అనుమానాస్పద ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు. ఈ కేసులో మృతురాలి ఫోన్ నెంబర్ ఆధారంగా విచారణ చేయగా ఈ కేసులో ఆమెతో అక్రమసంబంధం పెట్టుకున్న షాబాద్‌కు చెందిన మహమ్మద్ అబ్దుల్ గపూర్, అతనికి సహకరించిన కమ్మరి లక్ష్మీబాయి, స్నేహితుడు సయ్యద్ సాదుల్లా హుస్సేన్‌లను పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా వారు నేరాన్ని అంగీకరించారు. దీంతో ఈ ముగ్గురు నిందితులను పోలీసులు సోమవారం రిమాండ్‌కు తరలించారు. పెళ్లి చేసుకోవాలని కోరడంతో.. షాబాద్‌కు చెందిన మహమ్మద్ అబ్దుల్ గపూర్ 15ఏళ్లుగా చికెన్షాపు నడుపుకుంటూ జీవిస్తున్నాడు. ఇతనికి నాలుగేళ్ల కిత్రం వివాహమైంది. కానీ ఇతనికి పెళ్లికి ముందు నుంచే మృతురాలు బైండ్ల భారతమ్మతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆమె ఇటీవల తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయటంతో ఈ విషయం నలుగురికి తెలిసి పరువు పోతుందనే భయంతో ఆమెను ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో గత నెల 22న ఆమె గపూర్‌కు పోన్ చేయటంతో ఆమెను షాబాద్‌కు రమ్మనాడు. షాబాద్‌లో అతనికి తెలిసిన కుమ్మరి లక్ష్మీబాయి ఇంటికి పిలిపించాడు. చదవండి: మసాజ్ పేరుతో దారుణం.. భారత్ పరువు తీస్తున్నారు కదరా అయ్యా.. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం అక్కడే ఆమె ముక్కు, నోరు మూసి హత్య చేశాడు. మృతురాలి ఒంటిపై ఉన్న 3 గ్రాముల పుస్తెను సహకరించినందుకు లక్ష్మీబాయి తీసుకుంది. మృతదేహాన్ని తన స్నేహితుడైన సయ్యద్ సాదుల్లా హుస్సేన్ సహాకారంతో గోనే సంచిలో పెట్టుకొని స్కూటర్‌పై తీసుకెళ్లి షాబాద్ పహిల్వాన్ చెరువులో పడేశాడు. కానీ పోలీసులు మృతురాలి ఫోన్‌కాల్ డాటా ఆధారంగా ఆరోజు ఆమె చేసిన ఫోన్ నెంబర్ల ఆధారంగా కేసు విచారించారు. దీంతో చివరిగా చేసిన ఫోన్ గపూర్ది కావటంతో అతన్ని పట్టుకొని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. దీంతో ఆయనతో పాటు హత్యకు సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. -
బంధువుతో వివాహేతర సంబంధం.. దీని గురించి మాట్లాడేందుకు భర్త వెళ్లి..
మైసూరు(బెంగళూరు): తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న బంధువును భర్త హత్య చేశాడు. వివరాల ప్రకారం.. నంజనగూడు తాలూకా మాడ్రళ్లిలో శివణ్ణ (59) భార్యతో సిద్ధశెట్టి (47)కి వివాహేతరంసంబంధం ఏర్పడింది. దీనిపై ఇద్దరి భార్యాభర్తలకి మధ్య పలుసార్లు గొడవ జరిగింది. ఎన్ని సార్లు చెప్పినా శివణ్ణ భార్య సిద్ధశెట్టి తన సంబంధాన్ని కొనసాగిస్తూ భర్త మాట పట్టించుకోలేదు. ఆదివారం కూడా దీని గురించి మాట్లాడేందుకు వెళ్లి వారి గొడవ జరగ్గా శివణ్ణ కత్తితో సిద్ధశెట్టిని పొడిచాడు. తీవ్ర గాయాలతో అతడు మరణించాడు. శివణ్ణ పరారు అయ్యాడు. మరో ఘటనలో.. క్యాంటర్, బైక్ ఢీ.. ఒకరు మృతి దొడ్డబళ్లాపురం: క్యాంటర్– బైక్ ముఖాముఖి ఢీకొన్న ప్రమాదంలో బైక్ చోదకుడు మృతి చెందిన సంఘటన దొడ్డ గ్రామీణ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దొడ్డ తాలూకా మరళేనహళ్లి గ్రామానికి చెందిన హనుమంతరాయప్ప (48) మృతి చెందాడు. సోమవారం ఉదయం హనుమంతరాయప్ప మరళేనహళ్లి నుండి దొడ్డబెళవంగల వైపు బైక్‌పై వెళ్తుండగా క్యాంటర్‌ను ఎదురుగా ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. దొడ్డ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
మూడు నెలల క్రితం భర్త మృతి.. మరో వ్యక్తితో సంబంధం, విషయం తెలియడంతో..
తిరువొత్తియూరు(చెన్నై): తిరుపూర్ జిల్లా తారాపురం ప్రాంతంలో బుధవారం రాత్రి వివాహేతర ప్రేమజంట విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. తారాపురంలోని పూవాడిపాలెంకు చెందిన కార్మికుడు మణికంఠన్‌కు భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. అదే ప్రాంతానికి చెందిన నటరాజన్ భార్య మారి యమ్మాల్ (40) దంపతులకు కూతురు, కొడుకు ఉన్నారు. గత మూడు నెలల క్రితం నటరాజ్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ క్రమంలో మారి యమ్మాల్‌కు మణికంఠన్‌కు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ సంగతి తెలుసుకున్న బంధువులు వారిని మందలించారు. రెండు రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిన వారిద్దరు అదృశ్యమయ్యారు. దీంతో బంధువులు వారి కోసం గాలించారు. ఈ క్రమంలో బొమ్మనాయకన్ పట్టి, పవన విద్యుత్ కేంద్రం ప్రాంతంలో ఒక జంట మృతి చెందినట్లు బుధవారం రాత్రి పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు పరిశీలించగా చనిపోయిన వారు మారియమ్మాల్, మణికంఠన్‌గా గుర్తించారు. వీరు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. చదవండి: అతనికి అప్పటికే రెండు పెళ్లిళ్లు...ప్రేమ పేరుతో బాలికతో మరో పెళ్లి -
ప్రియునితో సహజీవనం.. వారిమధ్య ఏం జరిగిందో గానీ..
మైసూరు(బెంగళూరు): ప్రియునితో కలసి సహజీవనం చేస్తున్న శోభ (40) అనే మహిళ అనుమానాస్పద రీతిలో మరణించింది. ఈ ఘటన హెచ్డీ కోటలో జరిగింది. కొన్నేళ్లుగా భర్త నుంచి విడిపోయిన శోభ ఒంటరిగా ఉంటోంది. ఈ సమయంలోనే మంజునాథ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి ఇద్దరూ సహజీవనం చేయసాగారు. మంజునాథ్ మద్యానికి బానిసై తరచూ శోభతో గొడవ పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం చూడగా శోభ ఉరివేసుకుని ఉన్న స్థితిలో శవమైంది. ఇది తెలిసి ప్రియుడు పరారయ్యాడు. శోభ కుమార్తె పూజా మంజునాథ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో ఘటనలో.. టెన్త్ బాలిక ఆత్మహత్య హోసూరు: హోసూరు పారిశ్రామికవాడ జూజువాడికి చెందిన సైందవి (15) అదే ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. ఆదివారం ఇంటి నుంచి బయటకెళ్లి తిరిగి వచ్చింది. బయటకెళ్లరాదని తల్లిదండ్రులు మందలించడంతో సైందవి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. సిఫ్‌కాట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. -
వివాహేతర సంబంధం: అన్న మెడకు టవల్ చుట్టి..
సాక్షి, హైదరాబాద్: వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో అన్నను తమ్ముడు మట్టుబెట్టినట్లు నిర్ధారణ అయ్యిందని, నిందితుడుని అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు ఏఎస్పీ రషీద్, పరిగి డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. శనివారం కొడంగల్‌లోని హైవే పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఉన్న సీఐ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. బొంరాస్‌పేట మండలం ఏర్పుమల్ల గ్రామంలో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో సొంత అన్నను తమ్ముడు హత్య చేశాడని తెలిపారు. హత్యకు పాల్పడిన నిందితుడిని శనివారం రిమాండ్‌కు తరలించారు. తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏర్పుమల్ల గ్రామానికి చెందిన పూజారి గోపాల్, పూజారి శ్రీను అన్నదమ్ములు. పూజారి శ్రీను భార్యతో తన అన్నకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు. దీంతో గత ఏడాది నవంబర్ 15న గోపాల్ గొంతును టవాల్‌తో బిగించి చంపాడు. ఇతరులకు అనుమానం రాకుండా మృతదేహాన్ని ఊరు చివర ఉన్న దోసలకుంట (నీటి కుంట)లో పడేశాడు. రెండు రోజుల తర్వాత శవం పైకి తేలడంతో మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. అన్ని కోణాల్లో విచారించిన పోలీసులు పూజారి శ్రీను నిందితుడిగా గుర్తించారు. శనివారం రోజు రిమాండ్‌కు తరలించారు. అనంతరం ఏఎస్పీ రషీద్ మాట్లాడుతూ సమాజంలో వివాహేతర సంబంధాలే హత్యలకు దారి తీస్తున్నాయని అన్నారు. అవి మంచివి కావన్నారు. ఏదో ఒకరోజు విషయం తెలిసి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుందన్నారు. ప్రాణాలు తీసిన వ్యక్తి జైలుకు వెళ్లక తప్పదన్నారు. దీని వల్ల రెండు కుటుంబాల వారు ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. నేరాల నియంత్రణకు ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో కొడంగల్ సీఐ ఇప్తికార్ అహ్మద్, కొడంగల్ ఎస్ఐ రవి పాల్గొన్నారు. చదవండి: Tequila Pub: పబ్‌పై రైడ్స్.. పోలీసుల అదుపులో డ్యాన్సింగ్ గర్ల్స్, కస్టమర్లు -
11 నెలలుగా నా ఇంట్లో నా భార్యతో ఉంటున్నాడు: నటుడు
Karan Mehra Accuses Wife Nisha Rawal Have Extramarital Affair: టీవీ నటి నిషా రావల్, నటుడు కరణ్ మెహ్రా విడిపోయి ఒక సవంత్సరం అవుతుంది. వీరి విడాకుల వ్యవహారం ఇంకా కొనసాగుతూనే ఉంది. గృహ హింస కేసు కింద నిషా ఫిర్యాదు చేయడంతో కరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ వివాదం మరింత తీవ్రమైంది. అయితే జూన్ 1న బెయిల్‌పై విడుదలైన కరణ్.. నిషాపై పలు ఆరోపణలు చేశాడు. తనను తానే హింసించుకుని అతడిపై తప్పుడు ఆరోపణలు చేస్తుందన్నాడు. భారీగా భరణం పొందేందుకే ఇలా చేస్తోందని పేర్కొన్నాడు. నిషా వివాహేతర సంబంధం పెట్టకుందని మీడియా ఎదుట ఆరోపించాడు. అంతేకాకుండా నిషా తనను మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. 'ఇప్పటికీ నా ఇంట్లో ఒక వ్యక్తి నివసిస్తున్నాడు. గత 11 నెలలుగా ఆ వ్యక్తి నా ఇంట్లో నా భార్యతో (నిషాతో) ఉంటున్నాడు. అతను తన భార్యాపిల్లలను విడిచి పెట్టి నా భార్యతో కలిసి జీవిస్తున్నాడు. అంతేకాకుండా నా ఆస్తులు, కార్లు, వ్యాపారాలు లాక్కున్నారు. నిషాకు సన్నిహితులైన రోహిత్ వర్మ, మునీషా ఖట్వా ఇప్పుడు తనతో ఎందుకు లేరు.' అని కరణ్ మెహ్రా మీడియాతో తెలిపాడు. చదవండి: 👇 అతడిని ముద్దు పెట్టుకున్నా.. భర్తకు చెప్పిన సీరియల్ నటి ఇదిలా ఉంటే గతేడాది కరణ్ ఆరోపణలపై నిషా స్పందిస్తూ 'నాకు ఎలాంటి భరణం అక్కర్లేదు. నాతో కలిసి సంపాదించుకుంది నాకే ఎలా తిరిగి ఇస్తాడు. మేము కలిసి ప్రతిదీ నిర్మించాం. నేను నా చిన్నవయసు నుంచే సంపాదించడం ప్రారంభించాను. యే రిష్తా సీరియల్లో భాగం కాకముందు నుంచే నేను అతనికి సపోర్ట్‌గా నిలిచాను. నేను చాలా పని చేశాను. నేను ఎవరితో కలిసి పనిచేసిన కూడా వాణిజ్య ప్రకటనలకు కరణ్ బాధ్యత వహిస్తాడని హామీ ఇస్తున్నాను.' అని పేర్కొంది. చదవండి: 👇 నా భార్యే తలను గోడకేసి కొట్టుకుంది: టీవీ నటుడు -
వివాహిత మహిళతో యువకుడి సహజీవనం.. కన్న కొడుకుని తీసుకెళ్లి..
మైసూరు(బెంగళూరు): ఇటీవల రాయచూరు బస్టాండులో ఒక యువకుని చేతికి ఒక మహిళ చిన్నారి కొడుకును ఇచ్చి, ఇప్పుడే వస్తానని చెప్పి ఎటో వెళ్లిపోయింది. దీంతో ఆ యువకుడు సొంతూరు మైసూరుకు వచ్చి ఆ బిడ్డను పోలీసులకు ఇచ్చేసి వెళ్లిపోయాడు. ఇదేమిటని మైసూరులోని లష్కర్– రాయచూరు పోలీసులు దర్యాప్తు జరిపితే క్రైం స్టోరీ బయటపడింది. ఆ బిడ్డను అప్పజెప్పిన యువకుడు, ఆ మహిళ ఇందులో సూత్రధారులని అని తేలింది. ఇన్‌స్టా పరిచయంతో వివరాలు.. మైసూరు జిల్లా హెచ్డి కోటెకు చెందిన రఘు అనే యువకునికి రాయచూరుకు చెందిన వివాహితతో ఇన్‌స్టా గ్రాంలో పరిచయమైంది. ఆమెకు చిన్నారి కొడుకు, భర్త ఉన్నారు. అయినప్పటికీ ఏడాదిన్నరగా రఘు– ఆమె సహజీవనం చేస్తున్నారు. వీరి అక్రమ సంబంధం మహిళ భర్త యేసురాజుకు తెలిసి ఆమె నుంచి దూరంగా ఉంటున్నాడు. బిడ్డను వదిలించుకుంటే ఇంక ఏ సమస్యా ఉండదని రఘు, ఆమె భావించారు. ఇందుకోసం పై విధంగా నాటకం ఆడారు. రాయచూరు నుంచి బిడ్డను తీసుకొచ్చి ఎవరో మహిళ ఇచ్చి వెళ్లిందని పోలీసులకు అప్పజెప్పి వెళ్లిపోయాడు. పోలీసులు బాలున్ని శిశుగృహకు తరలించి దర్యాప్తు చేపట్టారు. మహిళ భర్తను పిలిచి విచారించగా విషయం బయపడింది. ఆ జంటపై కేసు నమోదు చేశారు. చదవండి: ఒంటరిగా ఉన్న యువతి ఇంట్లోకి వెళ్లి.. పిస్తోల్‌తో బెదిరించి.. -
వివాహేతర సంబంధం: రాత్రికి ఇంటికి వెళ్లాడు.. ఉదయం లేచి చూస్తే..
సాక్షి,నెల్లూరు(క్రైమ్): వివాహిత తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన రామచంద్రాపురంలో శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం మేరకు.. బాలాజీనగర్‌లోని చీపురుకట్ట సంఘానికి చెందిన సంపూర్ణ (28) సుమారు 11 ఏళ్ల క్రితం అదే ప్రాంతంలో టీ మాస్టర్‌గా పనిచేస్తున్న వేణును ప్రేమ వివాహం చేసుకున్నారు. నవాబుపేట రామచంద్రాపురంలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరికి సంజన, జయశ్రీ కుమార్తెలు. పొదలకూరురోడ్డులోని ఓ పెట్రోల్ బంక్‌లో సేల్స్‌గర్ల్‌గా ఆమె పనిచేస్తున్నారు. మనస్పర్థల నేపథ్యంతో సంపూర్ణ, వేణు మూడేళ్ల క్రితం విడిపోయారు. అప్పటి నుంచి ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్ నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ సన్నిహితంగా ఉండసాగారు. ఆటోడ్రైవర్ ఆమె ఇంటికి శుక్రవారం రాత్రి వచ్చివెళ్లారు. శనివారం ఉదయం ఎంతసేపటికీ సంపూర్ణ నిద్ర లేవలేదు. దీంతో కుమార్తెలు అమ్మమ్మ జయమ్మకు సమాచారం అందించారు. ఆమె హుటాహుటిన ఇంటి వద్దకు చేరుకొని కుమార్తెను నగరంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందారని నిర్ధారించారు. మృతురాలి మెడపై చిన్నపాటి గాయం ఉంది. ఈ క్రమంలో అనుమానాస్పద మృతిగా కేసును పోలీసులు నమోదు చేశారు. ఈ మేరకు నవాబుపేట ఎస్సై వీరనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Elderly Couple In Tirupati: ఎంగిలిపేట్లు కడిగాం.. ఆస్తులన్నీ రాసిచ్చాం.. బతకడానికి దారి చూపండయ్యా -
పరాయి వ్యక్తితో భార్య సహజీవనం
-
పరాయి వ్యక్తితో భార్య సహజీవనం.. గదికి బయట నుంచి తాళం వేసి
సాక్షి, హైదరాబాద్: భార్య పరాయి పురుషుడితో గదిలో ఉండగా బయటి నుంచి తాళం వేసిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త తన భార్యతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా అప్పగించి తనకు న్యాయం చేయాలంటూ ఫిర్యాదు చేశాడు. వివరాలివీ... జూబ్లీహిల్స్ రహ్మత్‌నగర్‌లోని యాదగిరినగర్‌లో నివసిస్తున్న మహిళ(35)కు ఇద్దరు పిల్లలు. భర్త సరిహద్దుల్లో పని చేస్తుంటాడు. గురువారం ఉదయం యాదగిరినగర్‌లో తన భార్య జ్ఞానేశ్వర్ అనే వ్యక్తితో కలిసి సహజీవనం చేస్తున్నట్లుగా తెలుసుకొని అక్కడికి వెళ్లి బయటి నుంచి తాళం వేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని తాళం తీసి విచారణ చేపట్టారు. ఈ ఇంటిని ఆమె అద్దెకు తీసుకునే ముందు జ్ఞానేశ్వర్ తన భర్త అంటూ ఓనర్‌ను నమ్మించి కొంత కాలంగా ఉంటున్నట్లుగా విచారణలో తేలింది. జూబ్లీహిల్స్ పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహేతర సంబంధం: తల్లికి తెలియకుండా ఇంట్లోనే..
యలహంక(బెంగళూరు): ప్రియుని కోసం సొంత ఇంట్లోనే చోరీచేసిన కూతురిని తల్లి పోలీసులకు పట్టించింది. ఈ విచిత్ర సంఘటన అమృతహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జక్కూరు లేఔట్లో దీప్తి (24) తల్లితో కలిసి జీవిస్తోంది. దీప్తి గతంలో భర్త నుంచి విడిపోయింది. ఆమె డ్రైవింగ్ నేర్చుకోవాలని వెళ్లి డ్రైవింగ్ స్కూల్లో మాస్టర్‌గా పనిచేస్తున్న మదన్ (27)తో వివాహేత సంబంధం ఏర్పడి షికార్లు చేయసాగారు. విలాసాల కోసం దీప్తి తన తల్లికి చెందిన బంగారు నగలు ఒక్కటొక్కటిగా ప్రియునికి ఇచ్చింది. సుమారు కేజీ బంగారు నగలను తరలించింది. తల్లికి అనుమానం రాకుండా నకిలీ నగలను బీరువాలో పెట్టింది. నగలు తేడాగా కనపడడంతో తల్లి కూతురిని నిలదీసింది. చివరకు కూతురి మీద అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దీప్తిని గట్టిగా విచారించగా మదన్‌కు ఇచ్చినట్లు ఒప్పుకుంది. పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసి నగలను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. చదవండి: ఇంట్లో చెత్త తోస్తుండగా.. వివాహితపై యజమాని లైంగిక దాడికి యత్నం -
పెళ్లైన 4 నెలలకే.. మరొకరితో సఖ్యతగా మెలుగుతూ పరువు తీసిందని..
సాక్షి, నల్లగొండ క్రైం: వివాహేతర సంబంధం పెట్టుకొని తన పరువు తీసిందనే కోపంతో భార్యను ఉరేసి హత్య చేసిన భర్తను నల్లగొండ టూటౌన్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి సోమవారం తన కార్యాలయంలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లాలోని శౌకత్‌పల్లి గ్రామానికి చెందిన మాడవత్ శంకర్ మునుగోడు మండలం కొరటికల్ సమీపంలో రోడ్డు పనిలో కూలీగా చేస్తున్నాడు. శంకర్, మెదక్ జిల్లా ఎస్ కొండాపురం గ్రామానికి చెందిన రాతుల సరిత అలియాస్ శిరీష(21) ఏడేళ్లుగా ప్రేమించుకొని ఇరువురి తల్లిదండ్రులను ఒప్పించి నాలుగు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు రెండు నెలలపాటు మంచిగానే కలిసి ఉన్నారు. ఉగాది పండుగకు ఏప్రిల్ 1న తల్లిగారింటికి వెళ్లిన సరిత అదే గ్రామానికి చెందిన గుగులోతు సురేష్‌తో వివాహేతర సంబంధం ఉండడంతో అతనితో వెళ్లిపోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు మెదక్ జిల్లాలోని శంకరంపేట పోలీస్ స్టేషన్లో సరిత కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఏప్రిల్ 18న సరిత, సురేష్‌ను పట్టుకొని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఇరువర్గాల పెద్ద మనుషుల సమాక్షంలో కౌన్సెలింగ్ చేశారు. అయినప్పటికీ శిరీష సురేష్‌తోనే వెళ్లిపోయింది. కొన్నిరోజుల తర్వాత సరిత తన ప్రియుడు సురేష్ ఫోన్ నుంచి భర్త శంకర్‌కు కాల్ చేసి ‘నీతో పాటు వస్తాను నన్ను తీసుకెళ్లు’ అని చెప్పింది. ఆ తర్వాత తన తల్లిగారింటికి చేరకున్న సరిత ఈ నెల 10న మరోసారి తండ్రి పూలసింగ్ ఫోన్ నుంచి భర్త శంకర్‌కు కాల్ చేసి తనను తీసుకెళ్లమని కోరడంతో సరే అన్నాడు. పూలసింగ్ తన పెద్ద అల్లుడు ముడావత్ బాబుకు విషయం చెప్పగా.. అతడు హైదరాబాద్‌లో శంకర్‌కు సరిత అప్పగించి వెళ్లిపోయాడు. సంబంధిత వార్త: వివాహమైన మూడు నెలలకే భార్యపై అనుమానం.. లాడ్జీకి పిలిపించి.. పరువు తీసిందనే కోపంతో.. తనను మోసం చేసి మరొకరితో లేచిపోయి తన పరువు తీసిందని మనసులో పెట్టుకున్న మాడవత్ శంకర్ ఎలాగైనా సరితను హత్య చేయాలని భావించాడు. ఈ నెల 13న తనతో పాటు సరితను నల్లగొండకు తీసుకొచ్చిన శంకర్ బస్టాండ్ ఎదురుగా ఉన్న పున్నమి లాడ్జిలో దిగారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపంతో రగిలిపోతున్న శంకర్ భార్య సరిత మెడకు చున్నీతో చుట్టి అదే గదిలో ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. సరిత చనిపోయిందని నిర్దారించుకున్న తర్వాతనే శంకర్ లాడ్జి నుంచి బస్టాండ్‌కు వచ్చి తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో శంకర్ సోమవారం నల్లగొండకు వచ్చి మునుగోడు బస్సు ఎక్కేందుకు ఎదురు చూస్తుండగా పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు. ఈ మేరకు నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. -
వివాహేతర సంబంధం.. ప్రైవేటు ఫోటోలు, వీడియోలను అడ్డం పెట్టుకుని..
యశవంతపుర(బెంగళూరు): బెంగళూరు హేరోహళ్లి వార్డు బీజేపీ నాయకుడు అనంతరాజు (46) ఈ నెల 12న ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. అనారోగ్యం వల్ల ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు అనుకున్నారు. అయితే డెత్‌నోట్ సోమవారం దొరకడంతో హనీ ట్రాప్ అని బయటపడింది. ఓ మహిళ అక్రమ సంబంధం కారణంగా ఆమె తమ ప్రైవేటు ఫోటోలు, వీడియోలతో బెదిరింపులకు పాల్పడిందని, దీనివల్ల ఆత్మహత్య చేసుకొంటున్నట్లు అనంతరాజు అందులో రాశాడు. ఆమె వలలో చిక్కుకొని మోసం చేశానంటూ భార్యకు క్షమాపణలు చెప్పాడు. కేఆర్ పురకు చెందిన రేఖా అనే మహిళతో ఫేస్బుక్ ద్వారా అనంతరాజుకు పరిచయమైంది. తరువాత ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. తాము సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలను చూపి ఆమె అనంతరాజును బ్లాక్మెయిల్ చేయసాగింది. అప్పుడప్పుడు అడిగినంత డబ్బును ఆమెకు ఇచ్చాడు. రోజురోజుకూ ఆమె నుంచి ఒత్తిళ్లు పెరగడంతో ఇంట్లో చెప్పుకోలేక తీవ్రంగా మథనపడ్డాడు. ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. బ్యాడరహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. చదవండి: 22 లక్షలతో పారిపోయి.. కోర్టులో లొంగిపోయి -
వివాహేతర సంబంధం: తెల్లవారుజామున తలుపులు తెరవగానే..
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): వివాహితను ఇంట్లో హత్య చేసిన సంఘటన దొడ్డ తాలూకా వడగెరె గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామం నివాసి చన్నబసవయ్య భార్య భాగ్యశ్రీ (35)కి ఇదే గ్రామానికి చెందిన రియాజ్ (27)అనే వ్యక్తితో ఆర్థిక లావాదేవీలతో పాటు వివాహేతర సంబంధం ఉండేది. కొన్నాళ్ల కిందట గొడవలు మొదలై దూరంగా ఉంటున్నారు. ఆదివారం తెల్లవారుజామున భాగ్యశ్రీ ఇంటికి వెళ్లిన ఒక వ్యక్తి తలుపులు తట్టాడు. తలుపులు తెరవగానే ఆమెను బయటకు లాగి కత్తితో పొడిచి హత్య చేసి పరారయ్యాడు. ఆ సమయంలో భాగ్యశ్రీ పిల్లలు ఇద్దరూ అక్కడే ఉన్నారు. భర్త బంధువుల ఇంట్లో వేడుక ఉందని పొరుగూరికి వెళ్లాడు. భర్త ఫోన్ స్విచాఫ్‌లో ఉంది, మరోవైపు రియాజ్ కూడా పరారీలో ఉన్నాడు. దీంతో పోలీసులు ఇద్దరి మీదా అనుమానం వ్యక్తం చేశారు. దొడ్డ బెళవంగల పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: మంత్రి కొడుకు అరాచకం.. మహిళపై అత్యాచారం చేసి ఫొటోలు, వీడియోలు తీసి.. -
ఏకాంతంగా గడపాలనుకున్న సమయంలో మరో వ్యక్తి అక్కడికి రావడంతో
సాక్షి, మెదక్: వివాహేతర సంబంధం మహిళ హత్యకు దారి తీసిన సంఘటన చిన్నశంకరంపేట మండలం ఏడిప్పల్ అటవీప్రాంతంలో చోటుచేసుకుంది. హంతకుడే మెదక్ పోలీసులకు సమాచారం అందించి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకోవడంతో పాపన్నపేట మండలం ఏడుపాయల అటవీప్రాంతంలో పోలీసులు జల్లెడ పట్టినప్పటికి ఫలితం లేకపోయింది. ఎట్టకేలకు హంతకుడి ఫోన్ ట్రేస్ చేసిన పోలీసులు చిన్నశంకరంపేట మండలం ఏడిప్పల్ అటవీ ప్రాంతంలో బుధవారం రాత్రి మహిళ మృతదేహాన్ని గుర్తించారు. మెదక్ మండలం ముగ్దూంపూర్ గ్రామానికి చెందిన కుర్మ సాయవ్వ అదే గ్రామానికి చెందిన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి ఎల్లోల్ల కిషన్ వివాహేతర సంబంధం నెరుపుతున్నారు. బైక్‌పై మెదక్ నుంచి చిన్నశంకరంపేట వైపు వచ్చారు. మెదక్–చేగుంట రహదారిపై పక్కన ఎస్.కొండాపూర్ గ్రామ శివారులోని ఏడిప్పల్ అటవీప్రాంతంలో బైక్‌ను అడవిలోకి మళ్లించారు. వీరు అక్కడ ఉండగానే సాయవ్వకు పరిచయం ఉన్న మరో వ్యక్తి అక్కడికి రావడంతో మాటమాట పెరగడంతో సాయవ్వను చాకుతో హత్య చేసినట్లు ఎల్లోల్ల కిషన్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులకు సమాచారం..ఆపై ఫోన్ స్విచ్ఛాఫ్ మెదక్ నుంచి బైక్‌పై చిన్నశంకరంపేట వైపు బయలుదేరిన సాయవ్వ, కిషన్ ఏడిప్పల్ అటవీప్రాంతంలోని నడక దారివైపు లోపలికి వెళ్లారు. వీరు అక్కడ ఏకాంతంగా గడపాలనుకున్న సమయంలోనే సాయవ్వకు పరిచయం ఉన్న మరో వక్తి అక్కడికి రావడంతో మాటమాట పెరిగింది. ఈ క్రమంలో చాకుతో మహిళను హత్య చేసిన నిందితుడు కిషన్ మెదక్ పోలీస్‌లకు ఏడిప్పల్ అటవీప్రాంతంలో మహిళను హత్య చేసినట్లు చెప్పి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు. పోలీసులు పాపన్నపేట మండలం ఏడుపాయల అటవీ ప్రాంతంలో మెదక్ రూరల్ సీఐ విజయ్ కుమార్, పాపన్నపేట ఎస్ఐ విజయ్ సిబ్బందితో గాలింపు చేపట్టారు. నిందితుడు ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకోవడంతో సరైన సమాచారం లభించకపోవడంతో అతడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎట్టకేలకు నిందితుడి ఫోన్ ట్రెస్ చేసి వివరాలు సేకరించారు. ఏడిప్పల్ అటవీప్రాంతంలో మృతదేహాన్ని గుర్తించారు. చిన్నశంకరంపేట ఎస్ఐ సుభాష్‌గౌడ్, రామాయంపేట సీఐ చంద్రశేఖర్ సంఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: ఇబ్రహీంపట్నంలో దారుణం..బాలికకు తెలియకుండా అబార్షన్ -
వివాహేతర సంబంధం.. మహిళతో న్యూడ్ కాల్స్.. వాటిని రికార్డ్స్ చేసి!
సాక్షి, హైదరాబాద్: ఫేస్బుక్ పరిచయం అక్రమ సంబంధానికి దారితీసి చివరకు హత్యచేయించింది. మీర్‌పేటలో ఫోటోగ్రాఫర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు ప్రధాన నిందితురాలైన ఓ మహిళతో పాటు సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. మీర్‌పేట సీఐ మహేందర్‌రెడ్డి ప్రకారం... నగరంలోని భాగ్ అంబర్‌పేటకు చెందిన మల్కాపురం యష్మాకుమార్ (32) వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్. ఈయనకు 2018లో మీర్‌పేట నందిహిల్స్‌కు చెందిన వివాహిత బుచ్చమ్మగారి శ్వేతారెడ్డి (32)తో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరి మధ్య తరచూ ఫోన్ సంభాషణలు కొనసాగడంతో సన్నిహిత్యం పెరిగి అక్రమ సంబంధానికి దారితీసింది. కాగా యష్మాకుమార్ శ్వేతారెడ్డికి ఫోన్ చేసి న్యూడ్ కాల్స్ చేయమన్నాడు. వాటిని రికార్డ్ చేసుకున్న యష్మాకుమార్ నెల రోజుల నుంచి తనను పెళ్లి చేసుకోవాలని శ్వేతారెడ్డిపై ఒత్తిడి పెంచాడు. లేదంటే న్యూడ్ ఫొటోలు, వీడియో కాల్స్‌ను బంధువులకు పంపుతానని బెదిరించసాగాడు. ఆందోళనకు గురైన శ్వేతారెడ్డి యష్మాకుమార్ను హతమార్చాలని నిర్ణయించుకుంది. ఇందుకు కృష్ణాజిల్లా తిరువూరు మండలం ఎరుకోపాడు గ్రామానికి చెందిన ఓ ప్రైవేటు కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్‌గా పనిచేసిన కొంగల అశోక్ (28), ఎలక్ట్రీషియన్ కొత్తపల్లి కార్తీక్(30) సాయం కోరింది. పథకం ప్రకారం శ్వేతారెడ్డి ఈ నెల 3న యష్మాకుమార్కు ఫోన్ చేసి ఇంటికి రావాలని కోరింది. దీంతో అతను అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ప్రశాంతిహిల్స్ వద్దకు చేరుకోగానే అప్పటికే అక్కడ మాటువేసిన అశోక్, కార్తీక్ సుత్తితో యష్మాకుమార్ తలపై బలంగా దాడి చేశారు. దీంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. హత్య చేసిన తరువాత యష్మాకుమార్వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను తీసుకుని రావాలని శ్వేతారెడ్డి తెలుపగా సెల్‌ఫోన్ కనిపంచకపోవడంతో అక్కడి నుంచి వారు పారిపోయారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన యష్మాకుమార్ ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 6న మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న మీర్‌పేట పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టి హత్య కేసులో ప్రధాన నిందితురాలైన శ్వేతారెడ్డి ఆమెకు సహకరించి హత్య చేసిన అశోక్, కార్తీక్‌లను బుధవారం రిమాండ్‌కు తరలించారు. చదవండి: ప్రేమించి పెళ్లి.. సంతానం కలగకపోవడంతో.. సోదరుల సమాధుల వద్ద -
వివాహేతర సంబంధం: అర్ధరాత్రి బైక్‌పై వస్తుంటే అడ్డగించి..
తుమకూరు(బెంగళూరు): గుబ్బి తాలూకా కరిశెట్టిహళ్లిలో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం వల్ల మామే అల్లుణ్ని హత్య చేశాడు. చౌకెనహళ్లి మూడ్లయ్య(40) ఆరేళ్ల క్రితం జయణ్ణ కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వేరే మహిళతో మూడ్లయ్య సంబంధం పెట్టుకున్నాడు. ఇది తగదని మూడ్లయ్యకు అతని మామ నచ్చజెప్పినా వినలేదు. సోమవారం అర్ధరాత్రి బైక్‌పై వస్తున్న మూడ్లయ్యను అడ్డగించి కొట్టి చంపేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు జయణ్ణ, అతని కొడుకుతో పాటు నలుగురిని అరెస్టు చేశారు. మరో ఘటనలో.. తండ్రీ కొడుకు మృత్యువాత మైసూరు: బైక్– కారు ప్రమాదంలో తండ్రీకొడుకులు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన చామరాజనగర జిల్లా గుండ్లుపేట తాలూకా హిరికాటి గేట్లో జరిగింది. మైసూరు జిల్లా నంజనగూడుకు చెందిన శశికుమార్ (35), కుమారుడు దర్శన్ (6) మరణించారు. శశికుమార్ భార్య చైత్ర, గగన్ అనే మరో కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం ఈ నలుగురు బైక్‌లో వెళుతుండగా మైసూరు నుంచి గుండ్లుపేట వైపుగా వెళుతున్న కారు పెట్రోల్ బంక్‌లోకి హఠాత్తుగా టర్న్ తీసుకుంది. కారు వెనుకనే వస్తున్న శశికుమార్ బైక్‌ను అదుపుచేయలేక కారును ఢీకొట్టాడు. కారు డ్రైవర్‌ను బేగూరు పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: ఇంట్లో భోజనం చేస్తుండగా బైకుపై వచ్చి.. భార్య కళ్లముందే.. -
అదే ఊరి వ్యక్తితో సంబంధం.. ఎంత చెప్పిన భార్య తీరు మార్చుకోకపోవడంతో
సాక్షి, నిజామాబాద్: తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని హత్య చేశాడు ఓ భర్త. ఈ ఘటన శనివారం సాయంత్రం పెద్దకొడప్గల్ మండలంలోని కాస్లాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కస్తూరి అంజయ్య భార్య అదే గ్రామానికి చెందిన కేతావత్ రాజు(37)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయంలో గతంలో పలుమార్లు గొడవలు జరిగాయి. అయినా వారు తీరు మార్చుకోలేదు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం అంజయ్య పొలం నుంచి తిరిగి వచ్చే సరికి ఇంట్లో తన భార్య, ప్రియుడితో కలిసి ఉంది. దీంతో ఆగ్రహానికి గురైన అంజయ్య రాజును హత్య చేశాడు. మెడపై కాలుతో తొక్కి, వైర్ తాడుతో ఉరి వేసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని బాత్రూంలో పెట్టి వెళ్లిపోయాడు. నిందితుడు ఆదివారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు ఎస్సై విజయ్ కొండ తెలిపారు. బాన్సువాడ డీఎస్పీ జైపాల్‌రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. సీఐ కృష్ణ, మద్నూర్ ఎస్సై శివకుమార్, పిట్లం ఎస్సై రంజిత్, పెద్దకొడప్గల్ ఎస్సై విజయ్ కొండ పాల్గొన్నారు. చదవండి: పాపం రమాదేవి.. భర్త ప్రాణాలు కాపాడబోయి.. -
వివాహేతర సంబంధం.. భర్తకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుందని..
సాక్షి, వేములవాడ: ప్రియురాలి భర్తపై హత్యాయత్నం చేసిన ఘటనలో ఇద్దరిని పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వేములవాడటౌన్ సీఐ వెంకటేశ్ తెలిపిన వివరాలు.. వేములవాడకు చెందిన మహిళకు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిప్పాయపల్లెకు చెందిన విష్ణుతో 2011లో వివాహమైంది. విష్ణు ఉపాధి కోసం దుబాయి వెళ్లి వస్తుండగా అతని భార్య వేములవాడకు చెందిన సాయికుమార్‌తో వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంది. గత మూడేళ్లుగా భర్తకు దూరంగా ఉంటుంది. ఇటీవల మళ్లీ భర్త విష్ణుకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుందన్న అనుమానం సాయికుమార్‌కు కలిగింది. బుధవారం రాత్రి విష్ణు వేములవాడ మీదుగా కరీంనగర్ వెళ్తున్నట్లు తెలుసుకొని తన స్నేహితుడు దేవేందర్‌తో కలిసి హత్యకు ప్రయత్నించాడు. ఎలాగోలా తప్పించుకున్న విష్ణు వేములవాడటౌన్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశాడు. సాయికుమార్, దేవేందర్లను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. -
24 ఏళ్ల క్రితం పెళ్లి.. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం.. భర్త అడ్డొస్తున్నాడని
సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: వివాహేతర సంబంధానికి అడ్డు తగిలిన భర్తను తానే హతమార్చినట్లు నిందితురాలు పోలీసుల ఎదుట అంగీకరించింది. వివరాలను బుధవారం ధర్మవరం అర్బన్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రమాకాంత్ వెల్లడించారు. ధర్మవరంలోని దుర్గానగర్‌కు చెందిన పల్లపు గంగాధర్‌కు 24 సంవత్సరాల క్రితం లక్ష్మీదేవితో వివాహమైంది. బేల్దారి పనులతో కుటుంబాన్ని పోషించేవాడు. ఈ క్రమంలోనే స్థానిక ఎరికల ముత్యాలు, ఎరికల పుల్లక్క, ఎరికల నగేష్, మరికొందరితో దాదాపు రూ.8 లక్షల వరకు అధిక వడ్డీకి గంగాధర్ అప్పులు చేసి భార్య చీరల వ్యాపారానికి సమకూర్చాడు. కొన్నేళ్లుగా లక్ష్మీదేవి తారకరామాపురానికి చెందిన నారా భాస్కరరెడ్డితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లుగా తెలుసుకున్న గంగాధర్ ఆమెను పలుమార్లు హెచ్చరించాడు. ఆమెలో మార్పు రాకపోవడంతో మద్యానికి బానిసయ్యాడు. తన వివాహేతర సంబంధానికి అడ్డు తగులుతుండడంతో ఎలాగైనా భర్తను అంతమొందించాలని లక్ష్మీదేవి నిర్ణయించుకుంది. తన అన్న వెంకటేష్, ఆమె అల్లుడు సుధాకర్‌కు డబ్బు ఆశ చూపి వారి సాయంతో ఏప్రిల్ 8న అర్ధరాత్రి 1.30గంటల సమయంలో ఎల్పీ సర్కిల్లోని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద మద్యం మత్తులో పడి ఉన్న గంగాధర్‌పై బండరాయి, ఇనుప పైపులు వేసి, గొంతు నులిమి హతమార్చింది. చదవండి: తిరుమల బాలుడి కిడ్నాప్ కేసు సుఖాంతం.. కిడ్నాపర్ ఎవరంటే..? మరుసటి రోజు అప్పులు ఇచ్చిన వారే తన భర్తను హత్య చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో లక్ష్మీదేవి ప్రవర్తనపై అనుమానాలు రేకెత్తడంతో విషయం తెలుసుకున్న ఆమె, మిగిలిన ఇద్దరు పరారయ్యారు. బుధవారం ఉదయం వీఆర్వో ద్వారా పోలీసులకు లొంగిపోయారు. హత్యకు దారి తీసిన పరిణామాలను ఈ సందర్భంగా పోలీసులకు నిందితులు వివరించారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. -
వివాహేతర సంబంధం.. వ్యక్తికి ఘోరమైన శిక్ష
గుంటూరు: వివాహేతర సంబంధం నేపథ్యంలో కూలి పనులు చేసుకునే వ్యక్తి మర్మాంగాన్ని కోసిన ఘటన తెనాలిలో చోటు చేసుకుంది. టూ టౌన్ సీఐ బి. కోటేశ్వరరావు కథనం ప్రకారం.. చెరుకుపల్లి మండలం తుమ్మలపాలెంకు చెందిన రామచంద్రారెడ్డి తెనాలిలో మడత మంచాలు అద్దెకు ఇచ్చే లాడ్జీలో ఉంటూ కూలి పనులకు వెళుతుంటాడు. ఇతనికి ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. అప్పుడప్పుడు ఆమె ఇంటికి వెళ్లి ఇద్దరూ మద్యం సేవిస్తూ ఉంటారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఆమె ఇంటికి వెళ్లగా, ఇద్దరూ కలసి పూటుగా మద్యం సేవించారు. మేడపైన రామచంద్రారెడ్డి పడుకోగా, ఆమె కింద ఇంట్లోకి వెళ్లింది. అదే సమయంలో ఆమె కూతురు, మరో వ్యక్తి ఇంటికి వచ్చారు. మేడ పైకి వెళ్లి నిద్రిస్తున్న రామచంద్రారెడ్డి మర్మాంగాన్ని (బీర్జాలను) బ్లేడుతో కోశారు. అతన్ని స్థానికులు తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. విషయం తెలుసుకున్న సీఐ వైద్యశాలకు వెళ్లి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
భార్య రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త ఏం చేశాడంటే..?
సాక్షి, ములుగు జిల్లా: ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఉద్యోగం రీత్యా వేర్వేరుగా ఉంటున్నారు. ఆ ఎడబాటు కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. భార్యపై అనుమానంతో పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. అనుమానం కాదు, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని నిరూపించాలని భార్య, ఆమె తల్లితో పాటు పెద్ద మనుషులు సూచించారు. దీంతో భర్త నిఘా పెట్టి భార్య బండారాన్ని బయట పెట్టాడు. చదవండి: హాస్టల్ సమీపంలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం ములుగు జిల్లాలోని దొడ్ల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న చీమల సుమలత, చర్ల కార్యదర్శిగా పనిచేసే పాయం పురుషోత్తం ప్రేమించుకున్నారు. గత 8 ఏళ్ల క్రితం పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఉద్యోగాల రిత్యా సుమలత చిన్నబోయినపల్లిలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటుండగా.. పురుషోత్తం చర్లలో ఉంటున్నాడు. అయితే.. ఇటీవల భార్య-భర్తల మధ్య ఏర్పడిన అనుమానం.. గొడవలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో తన ఇంటర్ క్లాస్మెంట్ లింగరాజుతో సుమలత సన్నిహితం పెంచుకుంది. దీంతో భర్త పురుషోత్తం అనుమానం మరింత పెరిగింది. ప్రవర్తన మార్చుకోవాలని.. పలు మార్లు భార్యను హెచ్చరించాడు.. భర్త పురుషోత్తం. అయినా ఆమె తీరులో మార్పు రాలేదు. దీంతో పెద్ద మనుషుల సమక్షంలోనే పంచాయితీ పెట్టించాడు. ఆ సమయంలో సుమలత తల్లి సూటిపోటి మాటలతో పురుషోత్తంని నిందించి, అనుమానం కాదు అవసరమైతే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని నిరూపించాలని సూచించింది. పురుషొత్తం భార్యపై నిఘా పెట్టి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నర్సాపూర్‌లోని ఓ ఇంట్లో సుమలత, లింగరాజుతో కలిసి ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఆ తర్వాత గ్రామ పెద్దలు, సుమలత కుటుంబ సభ్యుల సమక్షంలోనే వారిని పోలీసులకు అప్పగించిన్నట్లు భర్త పురుషోత్తం తెలిపారు. -
వివాహేతర సంబంధం: అద్దెకు ఉంటున్న యువకుడితో...
శంషాబాద్ రూరల్: ఓ మహిళతో వివాహేతర సంబంధం కారణంగా ఓ యువకుడిని హత్య చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలియడంతో అతను నేరుగా కోర్టులో లొంగిపోయాడు. నిందితుడిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ఆదివారం సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. సీఐ శ్రీధర్‌కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. సాతంరాయి ప్రాంతానికి చెందిన ఓ మహిళ భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటోంది. ఆమె ఇంట్లో బీహార్‌కు చెందిన రాహుల్ అద్దెకు ఉండేవాడు. ఈ క్రమంలో వారి మధ్య పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు సదరు మహిళ ఇంటిని ఖాళీ చేసి తొండుపల్లికి మకాం మార్చింది. ఈ సందర్భంగా ఆమెకు బీహార్‌కు చెందిన రేణు అలియాస్ రాను అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే సాతంరాయిలో ఉంటున్న రాహుల్ తరచూ తొండుపల్లి వచ్చి సదరు మహిళను కలవడంతో పాటు ఫోన్లో మాట్లాడేవాడు. దీనిని గమనించిన రేణు తొండుపల్లి వచ్చిన అతడితో గొడవపడ్డాడు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు జోక్యం చేసుకుని ఇద్దరిని హెచ్చరించి పంపించారు. గత ఏడాది డిసెంబర్ తొండుపల్లికి వచ్చిన రాహుల్ సమీపంలోని రైల్వే ట్రాక్ వెంట నడుచుకుంటూ వెళ్తున్నాడు. దీనిని గుర్తించిన రేణు అతడిని వెంబడించి వెనక నుంచి రాయితో తలపై గట్టిగా కొట్టడంతో ట్రాక్ మధ్యలో బోర్ల పడిపోయాడు. రాహుల్ చనిపోయినట్లు గుర్తించిన రేణు బీహార్‌కు పారిపోయాడు. కేసు మార్పిడితో.. అప్పట్లో రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.గత నెల ఈ కేసును రైల్వే పోలీసులు శంషాబాద్ పీఎస్‌కు బదిలీ చేయడంతో దర్యాప్తు చేపట్టారు. నిందితుడు రేణు కోసం బీహార్ వెళ్లగా అతను అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ క్రమంలో పోలీసులు తనను అరెస్టు చేస్తారని భావించిన రేణు ఏప్రిల్ 25న రాజేంద్రనగర్ కోర్టులో లొంగిపోయాడు. కోర్టు అనుమతితో రేణును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అతడిని విచారించారు. ఆదివారం సంఘటనా స్థలం వద్ద సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. తానే హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపరిచారు. -
కాలాంతకురాలు: భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్.. కానీ..
సాక్షి,విజయనగరం క్రైమ్: వివాహేతర సంబంధం విషయం భర్తకు తెలిసిపోయిందనే ఉద్దేశంతో ఎలాగైనా భర్తను కడతేర్చాలని ప్రియుడితో కలిసి ఆ కాలాంతకురాలు పథకం పన్నింది. పథకంలో భాగంగా మరో ఇద్దరి సాయం తీసుకుని, భర్త ఎముకలు విరగ్గొట్టించి, రైలు పట్టాలపై పడేసేలా చేసింది. అనుమానాస్పద మృతి కేసు నమోదుచేసిన రైల్వే పోలీసులు, పోస్టుమార్టం అనంతరం రూరల్ పోలీసులకు బదలాయించారు. దీంతో విచారణ చేపట్టిన రూరల్ పోలీసులు అన్నికోణాల్లోనూ దర్యాప్తు చేసి కట్టుకున్న భార్యే భర్తను కడతేర్చినట్లు నిర్ధారించి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో రూరల్ సీఐ టీఎస్.మంగవేణి ఆదివారం వెల్లడించిన ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. మిమ్స్ వైద్యకళాశాలలో క్లర్క్‌గా పనిచేస్తున్న అట్టాడ చంద్రశేఖర్ కుటుంబం నెల్లిమర్ల డైట్ కళాశాల సమీపంలో అద్దెకు ఉంటోంది. గతంలో నెల్లిమర్ల పట్టణంలోని గొల్లవీధిలో కిలాని సూరి ఇంట్లో అద్దెకు ఉండేవారు. ఆ సమయంలో సూరి రెండో కుమారుడు రాంబాబుతో మృతుడు చంద్రశేఖర్ భార్య అరుణజ్యోతికి పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం చంద్రశేఖర్‌కు తెలియడంతో పలుమార్లు భార్యను మందలించాడు. దీంతో భర్తను ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని ప్రియుడితో కలిసి పథకం పన్ని అమలు చేసేందుకు ప్రియుడి స్నేహితుడు అదిలాబాద్ జిల్లాకు చెందిన, నెల్లిమర్లలో స్ధిరపడిన ఎర్రంశెట్టి సతీష్‌తో రూ.40 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. భర్తను చంపేందుకు డబ్బులు అవసరమని తల్లి సత్యవతిని మృతుడి భార్య జ్యోతి అడగ్గా తన వంతుగా రూ.20వేలు ఇచ్చింది. డైట్ కళాశాల శివారుకు తీసుకువెళ్లి.. చంద్రశేఖర్‌ను గత నెల 24న రాత్రి డైట్ కళాశాల శివారు ప్రాంతానికి జ్యోతి ప్రియుడు రాంబాబు, ఎర్రంశెట్టి సతీష్‌లు తీసుకువెళ్లి మద్యం తాగారు. అనంతరం పథకం ప్రకారం ఐరన్ రాడ్లతో పక్కటెముకలు, తలపై బలంగా కొట్టి కత్తిపోట్లు పొడిచి, ఎవరికీ అనుమానం రాకుండా రైల్వే ట్రాక్‌పై మృతదేహాన్ని పడేసి, సమీపంలో మృతుడి ఐడీకార్డులు విసిరేసి పరారయ్యారు. మరుసటిరోజు ఉదయం స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి వెళ్లిన రైల్వే పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేశారు. పోస్టుమార్టం అనంతరం రూరల్ పోలీసులకు కేసు అప్పగించారు. రూరల్ పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ చేయడంతో నిందితులు నేరం అంగీకరించారు. దీంతో మృతుడి భార్య అరుణ జ్యోతి, ఆమె తల్లి సత్యవతి, ప్రియుడు రాంబాబు, ఎర్రంశెట్టి సతీష్‌లను అదుపులోకి తీసుకున్నారు. కేసులో క్రియాశీలక పాత్ర పోషించిన నెల్లిమర్ల ఎస్సై పి.నారాయణరావు, ఏఎస్సై ఎ.త్రినాథరావు, హెచ్‌సీలు వి.శ్యామ్‌బాబు, ఆర్.రామారావు, కానిస్టేబుల్ షేక్‌షఫీలను సీఐ మంగవేణి అభినందించారు. చదవండి: తల్లితో సహజీవనం.. ఏడాది కాలంగా కుమార్తెపై అత్యాచారం.. -
వివాహేతర సంబంధం: ప్రియుడితో కలిసి..
విజయనగరం క్రైమ్: వివాహేతర సంబంధం కారణంగా నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. కట్టుకున్న భర్తను ప్రియుడితే చంపించి దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించింది ఓ ఇల్లాలు. అయితే భర్త మృతి విషయమై పదే పదే ఆరా తీస్తుండడంతో పోలీసులకు ఆమెపైనే అనుమానం వచ్చింది. తీరా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. ఆమెతో వివాహేతర సంబంధం కొనిసాగిస్తున్న వ్యక్తే హంతకుడిగా పోలీసులు నిర్ధారించారు. నిందితుడితో పాటు అతనికి సహకరించిన వ్యక్తిని, మృతుడి భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయనగరం సబ్ డివిజన్ల్ కార్యాలయంలో హత్యకు సంబంధించిన వివరాలను ఏఎస్పీ అనిల్‌కుమార్ శనివారం వెల్లడించారు. పూసపాటిరేగ పోలీస్ స్టేషన్ పరి«ధిలో ఏప్రిల్ 2న చంపావతి నదిపై ఉన్న బ్రిడ్జి వద్ద ఆటో తిరగబడి డెంకాడ మండలం దొడ్డిబాడువ గ్రామానికి చెందిన డోల రామకృష్ణ (51) అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ విషయమై అతని కుమార్తె డోల కృష్ణలత ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు విషయమై మృతుడి భార్య డోల లక్ష్మి పోలీసు స్టేషన్‌కి రావడం, ఆరా తీయడం మొదలు పెట్టింది. దీంతో ఆమెపై అనుమానం వచ్చిన పోలీసులు కేసు దర్యాప్తును మరింత లోతుగా చేపట్టారు. బయటపడిన వివాహేతర సంబంధం.. మృతుడు డోల రామకృష్ణకి 27 ఏళ్ల కిందట లక్ష్మితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రామకృష్ణ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మద్యం వ్యసనానికి బానిస కావడంతో డబ్బుల్లేనప్పుడు భార్యను వేధించేవాడు. ఈ క్రమంలో కుటుంబ పోషణకు ఆమె సమీపంలో ఉన్న ఫార్మా కంపెనీలో 11 ఏళ్ల కిందట హెల్పర్‌గా చేరింది. అక్కడ సూపర్వైజర్గా పనిచేస్తున్న బొక్కా దశకంఠేశ్వరరావుతో ఆమెకు ఏర్పడిన పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. దశకంఠేశ్వరరావు లక్ష్మి కుటుంబ సభ్యులతో కూడా సన్నిహితంగా మెలిగి, వారి అవసరాలకు డబ్బు సాయం చేస్తుండేవాడు. దశకంఠేశ్వరరావుతో తన భార్యకు వివాహేతర సంబంధం ఉన్నట్లు ఏడాది కిందట మృతుడు గుర్తించాడు. దీంతో భార్యతో ఎప్పటికప్పుడు గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో తన వివాహేతర సంబంధానికి అడ్డంగా ఉన్నాడని భావించి తన భర్తను చంపేయాలని లక్ష్మి, ఆమె ప్రియుడు నిర్ణయించుకున్నారు. గతంలో ఒకసారి హత్య చేయాలని నిర్ణయించకున్నా కుదరలేదు. రెండోసారి పక్కాగా స్కెచ్ వేసి రంగంలోకి దిగారు. దశకంఠేశ్వరరావు, శంకరరావు అనే వ్యక్తి సాయంతో పేరాపురం వద్ద ఆటో వేస్తున్న రామకృష్ణను ఏప్రిల్ రెండో తేదీన కలిశారు. దగ్గర్లో ఉన్న పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోయించారు. దారిలో మద్యం కొనుగోలు చేసి రాత్రి 8 గంటల ప్రాంతంలో పిట్టపేట గ్రామం కొండ వద్దకు ఆటోలో వెళ్లారు. అక్కడే శంకరరావు ఉద్దేశపూర్వకంగా రామకృష్ణతో గొడవపడి ఆటో నుంచి బయటకు తోసేశాడు. తర్వాత రామకృష్ణ తలపై రాయితో గట్టిగా మోది చంపేశారు. అనంతరం ఆటోలో మృతదేహాన్ని ఎక్కించి నాతవలస బ్రిడ్జి వద్ద ఆటోను కిందకు తోసేసి, సెల్ఫ్ యాక్సిడెంట్ జరిగినట్లు చిత్రీకరించారు. అయితే మృతుడి భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. దశకంఠేశ్వరరావు, శంకరరావుతో పాటు లక్ష్మిని అరెస్ట్ చేశారు. కేసులో క్రియాశీలకంగా వ్యవహరించిన ఎస్సై ఆర్. జయంతి , కానిస్టేబుల్ దామోదరరావు, పోలీసు సిబ్బందిని అదనపు ఎస్పీ అభినందించారు. -
వనపర్తిలో మరో ‘సర్ప్రైజ్’ ఘటన.. ఈసారి భర్త ‘బలి’
వనపర్తి క్రైం: పెళ్లి ఇష్టం లేని యువతి ‘సర్ప్రైజ్.. కళ్లుమూసుకో..’ అంటూ కాబోయేవాడి గొంతు కోసేసింది. ఇది సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తుండగానే.. ఓ మహిళ తన భర్తను ఇలాగే ‘సర్ప్రైజ్’ చేసింది. ఇంట్లో ఏమీ బాగోలేదు.. గ్రామదేవతకు కోడి పుంజును బలి ఇద్దామని భర్తకు చెప్పింది. అదీ అర్ధర్రాతి బలిస్తే మంచిదని నమ్మిం చి ఒక్కడినే పంపించింది. అప్పటికే అక్కడ తన ప్రియుడిని, సుపారీ గ్యాంగ్‌ను సిద్ధంగా ఉంచింది. భర్తను చంపి పాతి పెట్టించింది. పొలం అమ్మితే వచ్చిన రూ.30 లక్షలు తీసుకుని ప్రియుడితో వెళ్లి పోయింది. 3 నెలలైంది.. ఇంట్లో ఆయన, ఆమె లేరు. ఏమైందో ఎవరికీ తెలియదు.. వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగిన ఈ మిస్టరీ తాజాగా బయ టపడింది. స్థానిక సీఐ ప్రవీణ్‌కుమార్ ఈ వివరాలు వెల్లడించారు. (చదవండి: హాస్టల్లో విద్యార్థుల బీర్ల విందు! వాట్సాప్ గ్రూపుల్లో ఫొటోలు వైరల్) వివాహేతర సంబంధంతో.. వనపర్తిలోని గాంధీనగర్‌కు చెందిన మేస్త్రీ బాలస్వామి (39)కి లావణ్యతో పదేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఓ కుమారుడు, కూతురు ఉన్నా రు. మదనాపురం మండలం దంతనూర్‌కు చెందిన నవీన్ అనే యువకుడికి లావణ్యతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. దీనిపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగాయి. 5 నెలల క్రితం బాలస్వామి పొలం అమ్మడంతో రూ.30 లక్షలు వచ్చాయి. ఆ డబ్బు తీసుకుని ప్రియుడు నవీన్‌తో వెళ్లిపోవాలని నిశ్చ యించుకుంది. కానీ భర్త మళ్లీ ఎక్కడ అడ్డువస్తాడోనని చంపేయాలని ప్లాన్ చేసుకుంది. కోడిపుంజు పేరుతో.. వనపర్తి శివారులోని జేరిపోతుల మైసమ్మ గుడి వద్ద అర్ధరాత్రి కోడిపుంజును బలిస్తే మంచి జరుగుతుందని, ఇంట్లో గొడవలు తగ్గుతాయని భర్తను లావణ్య నమ్మించింది. ఈ ఏడాది జనవరి 21న అర్ధరాత్రి ఒక్కడినే మైసమ్మ ఆలయానికి పంపింది. అప్పటికే వేచి ఉన్న నవీన్, సుపారీగ్యాంగ్ కురు మూర్తి, గణేశ్ కలిసి బాలస్వామి గొంతు నులిమి చంపేశారు. కందూరు శివార్లలోని బ్రిడ్జి వద్ద అతడి సెల్‌ఫోన్‌ను పడేశారు. బంగారి అనే వ్యక్తి సాయం తో మృతదేహాన్ని హైదరాబాద్‌లోని బాలాపూర్ శివారుకు తీసుకెళ్లి పాతిపెట్టారు. హత్య బయటపడిందిలా? బాలస్వామి కనిపించకపోవడం, ఫోన్ లిఫ్ట్ చెయ్య కపోవడంతో అతడి తమ్ముడు రాజు.. జనవరి 22న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ మర్నాటి నుంచి లావణ్య కూడా కనిపించకుండా పోయింది. దీంతో లావణ్య, నవీన్‌లను పోలీసులు బుధవారం అదుపు లోకి తీసుకుని ప్రశ్నించడంతో హత్య విషయం బయట పడింది. కురుమూర్తి, గణేశ్, బంగారిలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలాపూర్ శివారులో పూడ్చిపెట్టిన బాలస్వామి మృతదేహాన్ని బయటికి తీయించి పోస్టుమార్టం చేయించారు. హత్యకు సుపారీ గ్యాంగ్ రూ.2 లక్షలు తీసుకున్నట్టు విచారణలో తేలింది. (చదవండి: ఏం చేస్తున్నావంటూ భార్యకు వాయిస్ మెసేజ్ పెట్టాడని..) -
దృశ్యం’ సినిమా చూసి.. భార్య, అత్త, ప్రియుడితో కలిసి కుట్ర
సాక్షి, జడ్చర్ల (మహబూబ్‌నగర్): వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను భార్య, అత్తతో పాటు ప్రియుడు, మరో స్నేహితుడు కలిసి తుదముట్టించారు. ఓ సినిమాను చూసి అందులో జరిగిన విధంగా పథకం పన్నారు. ఈ కేసును ఎనిమిది రోజుల్లోనే పోలీసులు ఛేదించారు. శుక్రవారం జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో ఈ కేసు వివరాలను డీఎస్పీ కిషన్ వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం బూర్గుపల్లిలోని శ్రీశైలం (29)కు అదే గ్రామానికి చెందిన గీతతో 2013 డిసెంబర్లో వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. భర్త కారు డ్రైవర్‌గా, కూలీగా పనిచేసేవాడు. ఆరేళ్లక్రితం బతుకుదెరువు కోసం భార్యాపిల్లలతో కలిసి హైదరాబాద్ వెళ్లి రత్నానగర్‌లో కిరాయి ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఆ ఇంటి ఎదురుగా ఉండే విక్రంతో పరిచయం ఏర్పడింది. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవటంతో అతని వద్ద గీత రూ.50వేలు అప్పుగా తీసుకుంది. ఈ క్రమంలోనే వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలుసుకున్న భర్త వారిద్దరినీ మందలించినా ఎలాంటి మార్పు రాలేదు. కేసు వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ కిషన్ దృశ్యం సినిమా చూసి.. అతని అడ్డు తొలగించుకునేందుకు గీత, ఆమె తల్లి వెంకటమ్మ, ప్రియుడు విక్రం దృశ్యం సినిమా చూసి అందులో ఉన్నట్టుగానే పథకం పన్నారు. విక్రం స్నేహితుడు రాజును శ్రీశైలంతో చనువుగా ఉండాలని పురమాయించారు. ఈ క్రమంలోనే గత నెల 31న శ్రీశైలం బూర్గుపల్లికి వచ్చాడు. అప్పటికే విక్రం ప్రత్యేక రాడ్ తయారు చేసుకున్నాడు. ఒక్కో వస్తువును ఒక్కోచోట కొనుగోలు చేసి ఏమాత్రం అనుమానం రాకుండా ఉండేలా జాగ్రత్త పడ్డాడు. సనత్‌నగర్‌లో దుస్తులు, రోడ్డుపై హెల్మెట్ కొన్నారు. నంబర్ ప్లేట్ సరిగ్గాలేని బైక్‌ను తీసుకుని రాజుతో కలసి జడ్చర్లలో మద్యం కొనుగోలు చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు విక్రం, రాజు తమ సెల్ఫోన్లను హైదరాబాద్‌లోనే ఉంచి తరచూ ఇతరులతో ఆ ఫోన్లకు కాల్ చేసి వారిద్దరు అక్కడే ఉన్నట్టుగా నమ్మబలికారు. కిష్టంపల్లికి చేరుకుని అక్కడ ఎవరూ గుర్తు పట్టకుండా హెల్మెట్, మాస్క్‌లు ధరించి ఓ దుకాణంలో వాటర్‌బాటిల్ కొని వారి వద్ద తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని అత్యవసరంగా ఫోన్ చేసుకోవాలని దుకాణం మహిళ వద్ద తీసుకుని శ్రీశైలంకు రాజు ఫోన్ చేసి మాట్లాడాడు. ఆటో కొనేందుకు వచ్చానని వెంటనే హనుమాన్ దేవాలయం వద్దకు రావాలని కోరాడు. అక్కడికి వచ్చిన అతడిని బైక్‌పై ఎక్కించుకుని సమీపంలోని పొలంలోకి వెళ్లి అదేరోజు అర్ధరాత్రి మద్యం తాగారు. చదవండి: దృశ్యం’ సినిమా చూసి.. భార్య, అత్త, ప్రియుడితో కలిసి కుట్ర నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లు, ఇనుపరాడ్ అంతలోనే విక్రం వెనుక నుంచి వచ్చి ఇనుపరాడ్‌తో శ్రీశైలం తలపై కొట్టగా, కళ్లల్లో రాజు కారం కొట్టి చంపేసి హైదరాబాద్ వెళ్లిపోయారు. మరుసటి రోజు చుట్టుపక్కలవారు గమనించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. అక్కడ లభించిన ఆధారాలను బట్టి ఎట్టకేలకు నలుగురు నిందితులను శుక్రవారం ఉదయం గొల్లపల్లి సమీపంలో అరెస్ట్ చేసి అనంతరం కోర్టులో హాజరు పరిచారు. నిందితుల నుంచి ఐదు సెల్ఫోన్లు, ఇనుపరాడ్ స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో సీఐలు రమేష్‌బాబు, జములప్ప, ఎస్ఐలు రాజేందర్, జయప్రకాష్ పాల్గొన్నారు. -
వివాహేతర సంబంధం: తెల్లవారుజామున ఇళ్ల నుంచి బయటకు వచ్చి..
సాక్షి,దుమ్ముగూడెం(ఖమ్మం): మండలంలోని గంగోలు డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రాంగణంలో ఇద్దరు పురుగుల మందు తాగగా.. ఒకరు మృతి చెందారు. వివాహేతర సంబంధంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ధర్మవరం గ్రామానికి చెందిన తెల్లం గోపాలరావు భార్య సీతమ్మ, ఇద్దరు కుమారులతో కలిసి గంగోలులోని డబల్ బెడ్ రూం ఇంట్లో నివాసముంటున్నాడు. అదే సముదాయంతో తెల్లం నరేష్ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో సీతమ్మ – నాగరాజు నడుమ వివాహేతర ఏర్పడగా, పలుమార్లు గొడవలు జరిగినట్లు సమాచారం. దీంతో ఇక కలిసి ఉండలేమని భావించిన వారు బుధవారం తెల్లవారుజామున 3గంటలకు ఇళ్ల నుంచి బయటకు వచ్చి పురుగుల మందు తాగారు. ఆ వెంటనే సీతమ్మ మృతి చెందగా ప్రాణా పాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న నాగరాజును భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి భర్త గోపాలరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ దోమల రమేష్ తెలిపారు. చదవండి: మొదటి సారి దొంగతనం, అంతా అనుకున్నట్లే జరిగింది.. కానీ చివరిలో.. -
Extra Marital Affair: స్నేహితుడి ప్రియురాలితో సానిహిత్యం.. ఏడాది తర్వాత!
సాక్షి, చిత్తూరు : వివాహేతర సంబంధం కారణంగా స్నేహితుడినే హత్య చేసి చెరువులో పాతి పెట్టాడు. ఈ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఏడాది తరువాత ఛేదించి, నిందితుడిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లా వి.కోట సీఐ ప్రసాద్‌బాబు కథనం మేరకు పట్టణ పరిధిలోని ముదిమడుగుకు చెందిన షరీఫ్ కుమారుడు ఇస్మాయిల్(23) ఎలక్ట్రీషియన్. ఇతనికి వి.కోట పట్టణంలోని నారాయణనగర్‌కు చెందిన నరేష్ స్నేహితుడు. ఇలా వీరి స్నేహం మొదలైన ఏడాదిన్నర తరువాత ఇస్మాయిల్ బెంగుళూరుకెళ్లి, బంధువుల ఇంటిలో ఉంటూ అక్కడే పనిచేసుకుంటున్నాడు. ఈ క్రమంలో నరేష్ అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో నరేష్ ఇంటి వాళ్లు గొడవ చేయగా ఆ మహిళతోనే ఉండిపోయాడు. ఈ సమయంలో అప్పుడప్పుడు స్నేహితుడి వద్దకు వచ్చిపోతున్న ఇస్మాయిల్, నరేష్ ప్రియురాలితో సన్నిహితంగా మెలిగేవాడు. నరేష్ లేని సమయంలో ఆమె ఇంటికి వచ్చి వెళుతుండేవాడు. దీన్ని గమనించిన నరేష్ ఇస్మాయిల్‌ను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. సరిగ్గా ఇదే సమయంలో తన వద్ద అప్పుగా తీసుకున్న డబ్బు చెల్లించాలని 05–01–2021న ఇస్మాయిల్, నరేష్‌ను అడిగాడు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు వి.కోటకు వచ్చిన ఇస్మాయిల్, నరేష్‌కు ఫోన్ చేశాడు. రాత్రి 8 గంటల సమయంలో వీరిద్దరూ కలిసి మద్యం బాటిల్ తీసుకుని వి.కోట చెరువులోకి వెళ్లారు. అక్కడ మహిళ విషయంలో వీరి మధ్య వాదులాట జరిగింది. ఇదే అదనుగా నరేష్ మందు తాగుతున్నట్లు నటించి ఇస్మాయిల్ మందు తాగే సమయంలో మందు బాటిల్‌తో తలపై బలంగా కొట్టి చంపేశాడు. ఇస్మాయిల్ చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత అక్కడే ఇసుక కోసం తవ్విన గుంతల్లో ఇస్మాయిల్ మృతదేహాన్ని చేతులతో మట్టిని కప్పి వెళ్లిపోయాడు. చదవండి: చెట్టుకింద గొయ్యిలో ఏదో పూడ్చిపెట్టినట్లు కనపడడంతో.. పశువుల కాపర్లు.. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఇస్మాయిల్ స్నేహితులను విచారించడంతో, నరేష్ సోమవారం తన నేరాన్ని పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. ఇస్మాయిల్‌ను పాతిపెట్టిన ప్రదేశానికి మండల రెవెన్యూ సిబ్బంది, పోలీసులు చేరుకు న్నారు. అయితే చెరువులో నీరు ఎక్కువగా ఉండడంతో మృతదేహాన్ని వెలికి తీయడం సాధ్యం కాలేదని సీఐ , తహసీల్దార్ పుల్లారావు తెలిపారు. ఇస్మాయిల్ మొబైల్‌ఫోన్ ఆధారంగా హత్య కేసు మిస్టరీని ఛేదించిన అభినందనలు అందుకున్నారు. -
భార్యపై అనుమానం.. మిత్రుడితో ఒప్పందం కుదుర్చుకుని..
సాక్షి,సనత్‌నగర్(హైదరాబాద్): అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన ఆగంతకుడు మహిళను హత్య చేసేందుకు యత్నించిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో బాధితురాలి భర్తే ప్రధాన సూత్రధారని తేలింది. సీఐ ముత్తుయాదవ్ వివరాల ప్రకారం.. మహేశ్వరీనగర్కు చెందిన స్పందన (26), వేణుగోపాల్ భార్యాభర్తలు. వీరికి ఏడాదిన్నర కుమార్తె ఉంది. గత నెల 30న అర్ధరాత్రి మాస్క్ ధరించిన ఓ ఆగంతకుడు ఇంట్లోకి చొరబడి కత్తితో స్పందన గొంతుకోసి హత్య చేసేందుకు యత్నించిన సంగతి విదితమే. భర్త తన కుమార్తెను వరండాలోకి తీసుకెళ్లిన సమయంలోనే ఆగంతకుడు ఇంట్లోకి చొరబడి హత్యాయత్నానికి పాల్పడడం పలు అనుమానాలు వ్యక్తం కావడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి విచారణ చేపట్టగా అసలు నిజం బయటపడింది. భార్యపై అనుమానంతోనే.. భార్య తరచూ సెల్ఫోన్లో మాట్లాడటం గమనించిన వేణుగోపాల్ ఆమెపై అనుమానం పెంచుకుని హత్యకు పథకం పన్నాడు. యూసుఫ్‌గూడకు చెందిన మిత్రుడు, జూనియర్ ఆర్టిస్టు తిరుపతికి హత్యకు చేస్తే రూ.7 లక్షలు ఇస్తానని కొంత అడ్వాన్స్ ఇచ్చాడు. గతేడాది కూడా వేణుగోపాల్ స్వగ్రామమైన చేగుంటలో స్పందనను హత్య చేసేందుకు యత్నించి విఫలమయ్యాడు. ఈసారి ఎలాగైనా చంపాలని నిర్ణయించుకుని తాను ఇంట్లో ఉండగానే హత్య జరిగితే అనుమానం రాదని గ్రహించి గతనెల 30న హత్య చేసేందుకు పూనుకున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ, గత హత్యాయత్నం సమయంలో వినియోగించిన బైక్ నంబరు ఆధారాలతో హత్యాయత్నానికి పాల్పడిన తిరుపతిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, హత్యకు పురమాయించింది వేణుగోపాలే అని చెప్పడంతో సోమవారం రిమాండ్‌కు తరలించారు. చదవండి: వివాహితుడితో ప్రేమ.. సరిగ్గా ఎంగేజ్మెంట్కు ముందు! -
వివాహేతర సంబంధం: ప్రియుడితో కలిసి ఉండాలని..
సాక్షి,తిరుమలాయపాలెం(ఖమ్మం): తమ వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి భర్త తాగే మద్యంలో విషం (కుక్కలను సంహరించే మందు) కలిపి హతమార్చిన భార్యను పోలీసులు అరెస్టు చేశారు. ఇదే కేసులో ఆమెకు సహకరించిన ప్రియుడిని సైతం అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సుబ్లేడు గ్రామానికి చెందిన దావా కనకరాజు (37)కు భార్య విజయతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమెకు గ్రామానికే చెందిన పంచాయతీ వాటర్‌మెన్ ఓర పాపయ్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. కొన్నాళ్లకు విషయం బయటపడటంతో దంపతుల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో విజయ పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి పాపయ్యతో ఫోన్లో సంప్రదింపులు జరుపుతోంది. ఈ క్రమంలో భర్తను అడ్డు తొలగించుకోవాలని ఇద్దరు కలిసి నిర్ణయించారు. సూర్యాపేట జిల్లా మోతె మండలం తుమ్మగూడెంలో కృష్ణ అనే వ్యక్తి వద్ద కుక్కల మందు కొనుగోలు చేసి గతనెల 30న రాత్రి సమయంలో షేక్ మస్తాన్ ద్వారా ఓ మద్యం బాటిల్లో కలిపి కనకరాజుకి ఇవ్వాలని చెప్పి పంపించారు. ఆ మందు తాగిన కనకరాజు ఇంటికి వెళ్లాక కాళ్లు, చేతులు లాగుతున్నాయని చెప్పడంతో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. తన కుమారుడి మృతిపై అనుమానం ఉందని, మద్యంలో విషం కలిపి ఉంటారని తల్లి భద్రమ్మ ఫిర్యాదు చేసింది. ప్రియుడితో కలిసి ఉండేందుకు తన భర్త అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతోనే విజయ ఈ ఘాతుకానికి ఒడిగట్టిందని పోలీసుల వి చారణలో తేలింది. దీంతో ఓర పాపయ్య, దావా విజయను సోమవారం అరెస్టుచేసి రిమాండ్‌కు త రలించినట్లు కూసుమంచి సీఐ సతీశ్ తెలిపారు. చదవండి: ప్రియుడితో షికార్లు.. గర్భం దాల్చడంతో వైద్యం కోసం యూట్యూబ్ చూసి.. ఆ తర్వాత -
భార్యతో విడాకులు.. ఆమె ఫ్రెండ్‌తో సాన్నిహిత్యం.. రవికిరణ్ అదృశ్యం.. కారణం అదేనా?
సాక్షి, తెనాలి(గుంటూరు): వేమూరు నియోజకవర్గంలోని అమృతలూరు మండలం మూల్పూరుకు చెందిన నూతక్కి రవికిరణ్ అనే యువకుడి అదృశ్యం ఇప్పుడు మిస్టరీగా మారింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు, అతడు హత్యకు గురైనట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారని సమాచారం. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని, తెనాలిలోని ఓ రౌడీషీటరు, అతడి సహచరులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. మూల్పూరుకు చెందిన నూతక్కి రవికిరణ్ తెనాలిలోని ఓ ప్రైవేటు నెట్‌వర్క్‌లో టెక్నీషియన్‌గా చేస్తున్నాడు. గత నెల 20న అతడు అదృశ్యమయ్యాడు. అప్పట్నుంచి తల్లిదండ్రులు రవికిరణ్ ఆచూకీ కోసం వెతికారు. ఫలితం లేకపోవడంతో గతనెల 26న అమృతలూరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మార్పీఎస్ నాయకులు రంగంలోకి దిగి విచారణ మొదలుపెట్టారు. రవికిరణ్ తెనాలిలో హత్యకు గురయ్యాడని వాళ్లు అనుమానించారు. అమృతలూరు పోలీసుల విచారణపైనా వారు సందేహాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు రవికిరణ్ తల్లి సువార్తమ్మ నుంచి స్టేట్మెంట్ను తీసుకుని హత్య కోణంలో దర్యాప్తుచేయసాగారు. రవికిరణ్ వివాహితుడు. తెనాలిలోని ఓ ప్రైవేటు నర్సింగ్‌హోమ్‌లో నర్సుగా పనిచేస్తున్న భార్యతో అతడికి విభేదాలొచ్చాయి. ఇద్దరూ విడిపోయారు. అదే నర్సింగ్‌హోమ్‌లో నర్సుగా చేస్తున్న భార్య స్నేహితురాలైన మరో యువతితో రవికిరణ్‌కు సాన్నిహిత్యం పెరిగింది. తెనాలికి చెందిన ఓ రౌడీషీటర్ ఆ యువతి ద్వారానే గతనెల 20న రవికిరణ్‌కు ఫోన్ చేయించి పిలిపించారని, ఆ తర్వాతే అతడు అదృశ్యమయ్యాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. చదవండి: తాగిన మత్తులో నోరు జారాడు.. మైకం నుంచి తేరుకునే లోపే.. తెనాలి యువతితో సంబంధమున్న రౌడీషీటర్ రవికిరణ్‌ను కొట్టటంతో అతడు చనిపోయాడని, శవాన్ని మాయం చేశారని చెబుతున్నారు. పోలీసులతోనూ ఇదే విషయం చెప్పారు. దీనిపై పోలీసులు రౌడీషీటరును, ఆ యువతిని, వారికి సహకరించిన మరికొందరినీ విచారిస్తున్నట్టు సమాచారం. ఫోన్ కాల్స్, వారు సంచరించిన ప్రదేశాలు దాదాపుగా ట్రేస్ అయ్యాయని, ఇక భౌతిక సాక్ష్యాల కోసం పోలీసులు అన్వేషిస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. ఇదే విషయమై చుండూరు సీఐ కళ్యాణ్‌రాజ్ వివరణ కోరగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
మరో వ్యక్తితో భార్య చనువు, వివాహేతర సంబంధం.. భర్త హెచ్చరించినా..
సాక్షి, పశ్చిమగోదావరి: భార్య మరో వ్యక్తితో చనువుగా ఉంటూ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుండడం భరించలేని భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన ఏలూరు టూటౌన్ సీఐ డీవీ రమణ నిందితుల్ని అరెస్టు చేశారు. సీఐ వివరాలు వెల్లడిస్తూ.. ఏలూరు నగరంలోని చాణక్యపురి కాలనీ 1వ రోడ్డు ప్రాంతానికి చెందిన పెరుమాళ్ళ సంతోష్(30)కు రామకుమారితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. సంతోష్ కూలి పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే రామకుమారి పీ.రూపగోవింద్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించేది. ఈ విషయం తెలుసుకున్న భర్త సంతోష్ భార్యను అనేకసార్లు హెచ్చరించాడు. అయినా ప్రవర్తన మార్చుకోకుండా భర్త ఇంట్లో ఉండగానే గోవింద్‌తో చనువుగా ఉండేది. ఈ క్రమంలో గత నెల మార్చి 29న భర్త బయటకు వెళ్ళి ఇంటికి వచ్చే సరికి రామకుమారి గోవిందుతో ఏకాంతంగా ఉండటాన్ని గుర్తించాడు. నిందితుల్ని అరెస్టు చేసిన టూటౌన్ సీఐ రమణ దీంతో తీవ్ర మనోవేదనకు గురైన సంతోష్.. తన మరణానికి భార్య, ప్రియుడు గోవిందు కారణమని తల్లిదండ్రులకు చెప్పి, అదేరోజు సాయంత్రం ఇంటివద్ద ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టూటౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రామకుమారి, గోవింద్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా 14 రోజులు రిమాండ్ విధించారు. చదవండి: యువకుడితో భార్య టిక్‌టాక్.. సహించలేకపోయిన భర్త.. చివరికి.. -
మహిళతో వివాహేతర సంబంధం.. భార్యకు తెలిసిపోయిందని..
సాక్షి, ఘట్కేసర్: వివాహేతర సంబంధం కారణంగా ఘట్కేసర్ పీఎస్ పరిధిలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని బాలాజీనగర్‌లో నివాసముండే ఆమర్లపూడి సాయికుమార్(35), సునీతకు 12 ఏళ్ల కిందట ప్రేమ వివాహం జరిగింది. నవనీత అనే మహిళతో సాయికుమార్ అక్రమ సంబంధం పెట్టుకొని తరచు ఫోన్లో మాట్లాడుతుండేవాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య పద్ధతి మార్చుకోవాలని భర్తను హెచ్చరించింది. దీంతో తన వివాహేతర సంబంధం గురించి ఇంట్లో తెలిసిపోయిందని.. ఈనెల 30న సునిత ఉద్యోగానికి వెళ్లగా కుమారుడిని అత్తగారింటికి పంపించి ఇంట్లో చున్నీతో ఉరి పెట్టుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న సునీత స్థానికుల సాయంతో కల్కి ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన అక్కడి వైద్యులు అప్పటికే మరణించాడని తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. చదవండి: యువతి పట్ల అసభ్యకర ప్రవర్తన.. బస్ దిగే లోపు పోలీసుల ఎంట్రీ -
మహిళతో వివాహేతర సంబంధం.. ఆమె కూతురిని ఏడాదిగా..
తిరువొత్తియూరు(బెంగళూరు): చెన్నై అంబత్తూరు పూంబుహార్ నగర్‌కు చెందిన ఓ యువతి భర్తను వదిలి 13 సంవత్సరాల కుమార్తెతో నివాసం ఉంటోంది. ఈమె కూతురు అంబత్తూరులోని ఓ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో బాలిక తల్లికి అంబత్తూరు అంబేడ్కర్ వీధికి చెందిన బిస్వజిత్తు(30)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో బిస్వజిత్తు ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఏడాదిగా కాలంగా ఆమె తల్లి లేని సమయం చూసి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు అంబత్తూరు మహిళా పోలీసులు కేసు నమోదు చేసి బిస్వజిత్తును ఫోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు. మరో ఘటనలో.. సామూహిక లైంగిక దాడి కేసులో నిందితుల అరెస్టు తిరువొత్తియూరు: కడలూరు జిల్లాలో సోమవారం రాత్రి ప్రియుడి ముందే ప్రియురాలిపై సామూహిక లైంగిక దాడి చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. కడలూరు సెంమండలం బస్ నిలయంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా నిలబడి ఓ యువతి ఏడుస్తుండడంతో ఇన్చార్జ్ డీఎస్పీ ఆరోగ్యరాజు చూసి ప్రశ్నించారు. విచారణలో కమ్మియం పేటకు చెందిన ఆమె తన ప్రియుడితో అదే ప్రాంతంలో మాట్లాడుతున్న సమయంలో అక్కడికి వచ్చిన ముగ్గురు యువకులు ప్రియుడిని కొట్టి.. తనపై సామూహిక లైంగిక దాడి చేశారని ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులైన కడలూరుకుప్పం పేటకు చెందిన సతీష్ (19), కిషోర్ (19), పుదుపాలయంకు చెందిన ఆరిఫ్ (18)ను ఫోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. -
వివాహేతర సంబంధం: పక్కింటి మహిళ ఇంట్లోకి రావడంతో..
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): ఈనెల 23న దొడ్డ తాలూకా జక్కసంద్ర గ్రామంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భార్యే భర్తను కడతేర్చినట్లు తెలిసింది. హనుమయ్య తన ఇంట్లోనే ఈనెల 23న హత్యకు గురయ్యాడు. తలపై బండరాయితో బాది హత్య చేశారు. హతుడి భార్య భాగ్య (30) మొదట తన భర్తను ఎవరో హత్య చేసారని నాటకమాడింది. భర్తను హత్య చేసిన భాగ్య 24 గంటలపాటు శవంతోనే ఇంట్లో గడిపింది. పక్కింటి మహిళ ఇంట్లోకి రావడంతో హత్య సంగతి వెలుగు చూసింది. హనుమయ్య, భాగ్యకు 14 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. హొసకోట అట్టూరు గ్రామానికి చెందిన భాగ్య స్థానికంగా ఉన్న నాగేశ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న హనుమయ్య భార్యతో గొడవపడ్డాడు. అయితే ఇరువైపుల పెద్దలు పంచాయతీ చేసి రాజీ కుదిర్చారు. అయినా భార్యభర్తలు నిత్యం గొడవపడేవారు. ఈ క్రమంలో భాగ్య, నాగేశ్, ఇతడి స్నేహితుడు నారాయణస్వామితో కలిసి హనుమయ్యను హత్య చేసింది. కేసుకు సంబంధించి దొడ్డ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసారు. చదవండి: 45 వెడ్స్ 25.. నాడు వైరల్‌గా మారింది.. నేడు విషాదంతో ముగిసింది -
భర్త కంటే ప్రియుడే ఎక్కువయ్యాడా?
హైదరాబాద్: ప్రియుడితో ఓ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుని.. ఏకంగా అడ్డుగా ఉన్న భర్తను చంపేందుకు పన్నాగం పన్నింది. ఈ సంఘటన హైదరాబాద్ చింతలకుంటలో జరిగింది. చింతలకుంటలో నివాసం ఉండే హరిత, భాస్కర్ పదేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు పుట్టాక దారి తప్పి.. వెంకటేష్ అనే పక్కింటి వ్యకితో ప్రేమాయణం సాగించింది. అప్పటి నుంచి భర్త అడ్డు తొలగించే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 17 నుంచి హరిత కనిపించకుండా పోయింది. హరిత కనిపించకపోవడంతో భర్త భాస్కర్ పొలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నెల 17న వెంకటేష్‌తో కలిసి తిరుపతికి పారిపోయిన హరిత.. నెల 16న హరిత మజ్జిగలో నిద్రమాత్రలు కలిపి భర్తకు ఇచ్చింది. అతడు నిద్రలోకి జారిపోయాక వాట్సాప్ లో మెసేజ్ పెట్టి ప్రియుడితో కలిసి తిరుపతికి పారిపోయింది. భార్య కనిపించకపోవడంతో భాస్కర్ ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అందులో వెంకటేష్ మీద అనుమానం వ్యక్తం చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో ఇరువురిని తిరుపతిలో గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని నగరానికి తరలించారు. విచారణ నేపథ్యంలో వీరి మధ్య ఉన్న వివాహేతర సంబంధం, భాస్కర్ హత్యకు కుట్ర తదితరాలు వెలుగులోకి వచ్చాయి.ఈ విషయంపై స్పందించిన వెంకటేష్ భార్య.. మీడియాతో మాట్లాడుతూ తన భర్తను కావాలనే ఈ కేసులో ఇరికించారని చెప్పారు. హరిత డబ్బుకోసమే ఈ పని చేసిందని, ఆమె భర్తకు ఈ విషయం తెలుసని చెప్పారు. -
సంతానం కలగలేదు.. భర్త మరో మహిళతో సన్నిహితంగా ఉన్నాడని..
మైసూరు(బెంగళూరు): కుటుంబ కలహాలతో తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మైసూరు జిల్లా నంజనగూడులోని మహదేవనగరకు చెందిన సోమణ్ణకు గుండ్లుపేటెకు చెందిన భాగ్య (29)తో పదేళ్ల క్రితం పెళ్లయింది. సంతానం కలగకపోవడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. సోమణ్ణ మరో మహిళతో సన్నిహితంగా ఉన్నాడని భాగ్య అనుమానించేది. ఈ క్రమంలో ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణం చెందింది. హుల్లహళ్లి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మరో ఘటనలో.. విద్యార్థిని ఆత్మహత్య మైసూరు: సీఏ (చార్టెడ్ అకౌంటెంట్) పరీక్షకు సన్నద్ధమ వుతున్న మైసూరు తాలూకా దాసనకొప్పలు గ్రామానికి చెందిన చందన (23) ఆత్మహత్య చేసుకుంది. ఈ యువతి ఇటీవల ఎంకామ్ పూర్తి చేసింది. ఆమె తండ్రి కేఎస్ఆర్టీసీ ఉద్యోగి. తల్లి కెనరా బ్యాంకులో పని చేస్తోంది. తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్న చందన తాను నివసిస్తున్న క్వార్టర్స్‌లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. జయపుర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
వివాహేతర సంబంధం: ప్రియుడు దూరం పెట్టడంతో ఏకంగా ఇంటి ముందే..
సాక్షి, చెన్నై: వివాహేతర సంబంధాన్ని మధ్యలో వదిలి వేయడంతో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆత్మాహుతికి పాల్పడింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా చెన్నై శివారు ప్రాంతం మీంజూరు సమీపం వాయిలూర్ ప్రాంతానికి చెందిన మురుగన్. ఇతని భార్య వసంతి. మురుగన్ కోయంబేడులోని గ్యాస్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఆ సమయంలో అక్కడున్న టీ దుకాణంలో పనిచేస్తున్న రామనాథపురానికి చెందిన కామాక్షి(27)తో పరిచయం ఏర్పడి ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో మురుగన్, కామాక్షి ఇంటి నుంచి పరారయ్యారు. దీంతో వసంతి కాటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పారిపోయిన వివాహేతర జంట పాండిచ్చేరిలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లి వారిని సముదాయించి కామాక్షిని ఆమె ఇంటికి, మురుగన్‌ను అతని ఇంటికి పంపించారు. మురుగన్ ప్రస్తుతం తన భార్యతో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో తీవ్ర ఆవేదన చెందిన కామాక్షి గత రెండు రోజులకు ముందు మురుగన్ ఇంటి వద్దకు చేరుకుని తనతో రమ్మని కోరింది. చదవండి: వనస్థలిపురంలో కలకలం.. ముళ్లపొదల్లో మృతశిశువు తల లభ్యం తాను ప్రస్తుతం గర్భిణిగా ఉన్నట్లు వాపోయింది. తిరస్కరించిన మురుగన్ ఆమెను అక్కడి నుంచి వెళ్లిపొమ్మని సూచించాడు. దీంతో ఆవేదనతో ఆమె వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. దీంతో తీవ్ర గాయాలైన ఆమెను చికిత్స కోసం పొన్నేరి ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చారు. అక్కడ శనివారం రాత్రి కామాక్షి మృతి చెందింది. కాటూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఫస్ట్ టైం క్రిమినల్స్: సినిమాలు, యూట్యూబ్ చూసి నేర్చుకుంటున్నారు -
వివాహేతర సంబంధం: ప్రియుడు బలవంతం పెట్టడంతో..
జైపూర్ : వివాహేతర సంబంధం కారణంగా ఓ యువకుడిని మహిళ గొంతు నులిమ హత్య చేసింది. ఈ ఘటన జైపూర్‌లో వెలుగుచూసింది. మృతుడిని సుభాష్ కుమావత్‌గా పోలీసులు గుర్తించారు. మృతుడి ఫోన్‌ను పరిశీలించడంతో పాటు అక్కడున్న ఆధారాలను బట్టి మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుమావత్ పొరుగున ఉండే మహిళకు సంబంధించిన పలు వీడియోలు బాధితుడి ఫోన్లో ఉండటంతో ఆమెను గట్టిగా ప్రశ్నించగా ఈ బండారం బయటపడింది. వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం మహిళ భర్త పనికి వెళ్లినప్పుడు కుమావత్ తన ఇంటికి వెళ్లినట్లు నిందితురాలు పోలీసులకు తెలిపింది. కుమావత్ తనతో సన్నిహితంగా మెలగడానికి ప్రయత్నించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, అతడిని అడ్డుకునే ప్రయత్నంలో గొంతు నులిమి హత్య చేసినట్లు ఆమె తెలిపింది. అనంతరం ఆ మృతదేహాన్ని కిటికీ దగ్గరకు లాక్కెళ్లి ఏదో పని నిమిత్తం తాను ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలిపింది. కుమావత్‌తో గత రెండేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు ఆ మహిళ చెప్పింది. ఈ విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలియడంతో సదరు మహిళ ఆ వ్యక్తిని వదిలించుకోవాలని ఈ హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. -
వివాహేతర సంబంధం: గుంటూరులో చంపి.. మృతదేహం మార్టూరులో వేసి..
సాక్షి, ఒంగోలు: జిల్లాలోని మార్టూరు వద్ద మూడు రోజుల క్రితం వెలుగుచూసిన హత్యోందంతంలో కిరాయి హంతకుల పాత్ర ఉందని గుర్తించి వారిని అరెస్టు చేసినట్లు ఎస్పీ మలికాగర్గ్ తెలిపారు. మంగళవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. ఎస్పీ కథనం ప్రకారం.. ఈ నెల 4వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో మార్టూరు మండలం కోనంకికి చెందిన ఓ రైతు పొలంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఘటన వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని పరిశీలించి అది హత్యగా పోలీసులు నిర్ధారించారు. అయితే మృతుడు ఎవరనేది తెలియరాలేదు. కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని 72 గంటల్లోనే ఛేదించి నిందితులను కటకటాల వెనక్కు నెట్టారు. కేసు వివరాలు మీడియాకు వెల్లడిస్తున్న ఎస్పీ మలికాగర్గ్, పక్కన ఇతర పోలీసు అధికారులు ఇదీ..కథ మృతుడు గుంటూరు కొత్తపేట మంగళదాస్‌నగర్‌కు చెందిన గోగులపాటి బెన్నీ(41)గా గుర్తించారు. ఆయన సతీమణి బుజ్జికి అన్నం సుబ్బరామయ్య అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ వ్యవహారంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. చంపుతానంటూ పలుమార్లు భార్యను బెన్నీ హెచ్చరించేవాడు. 2021 సెప్టెంబర్ 1న భార్యతో గొడవపడి ఆమెను చంపేందుకు యత్నించాడు. కత్తిపోటు పక్కింటి వ్యక్తికి తగిలి అతను మృతి చెందాడు. ఈ కేసులో అతడు జైలుకు వెళ్లి ఇటీవల బెయిల్‌పై తిరిగి వచ్చాడు. సుబ్బరామయ్యకు చెందిన అట్టల పరిశ్రమలో రూ.5 లక్షల విలువైన అట్టలు, ఆటోను తగలబెట్టాడు. ఎప్పటికైనా సుబ్బరామయ్యను చంపుతానని భార్యను అతడు బెదిరించాడు. ఈ విషయాన్ని ఆమె అన్నం సుబ్బరామయ్యకు చెప్పింది. ఇద్దరికీ ప్రాణహాని ఉందని సుబ్బరామయ్య భావించి బెన్నీని అడ్డు తొలగించుకునేందుకు పథక రచన చేశాడు. గుంటూరు వెంకటప్పయ్య కాలనీకి చెందిన చల్లా గోపీతో లక్ష రూపాయలకు బెన్నీని హత్య చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. సుబ్బరామయ్య, గోపీ, గుంటూరు సంగడిగుంటకు చెందిన దొడ్డి వెంకట ప్రసాద్, సాయిబాబా కాలనీకి చెందిన ఇక్కుర్తి ఓంకార్, మంగళదాస్ నగర్‌కు చెందిన గోగులపాటి బుజ్జి, నల్లచెరువుకు చెందిన దుగ్గిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మరో మైనర్ బాలుడు కలిసి ముందుగా ఒక కారును అద్దెకు తీసుకున్నారు. కారులో బెన్నీ ఇంటికి వెళ్లి కత్తితో పొడిచి, ఇనుప రాడ్‌తో విచక్షణారహితంగా కొట్టి ముఖంపై దిండు ఉంచి ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని కారులో వేసుకుని కోలలపూడి రోడ్లో కోనంకి సమీపంలో పడేసి వెళ్లిపోయారు. ముఠాగా ఏర్పడిన నిందులు పోలీసులు అరెస్టు చేసిన వారిలో దొడ్డి వెంకట ప్రసాద్ అలియాస్ ప్రసాద్ గతంలో దొంగతనాలు, దోపిడీ, హత్యలు, కిడ్నాప్ కేసుల్లో నిందితుడు. లాలాపేట పోలీసుస్టేషన్ పరిధిలో హిస్టరీ షీట్ కూడా ఉంది. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి కిరాయి హత్యకు పాల్పడ్డారు. హత్యకు ఉపయోగించిన టవేరా కారు, ఇరన్రాడ్, కత్తి, పది ఫోన్లు, రూ.21 వేల నగదును పోలీసులు సీజ్ చేశారు. కేసును ఛేదించడంలో కృషి చేసిన చీరాల డీఎస్పీ శ్రీకాంత్, ఇంకొల్లు సీఐ సుబ్బారావు, మార్టూరు, ఇంకొల్లు, జె.పంగులూరు ఎస్ఐలు ఎస్వీ రవీంద్రారెడ్డి, ఎన్సీ ప్రసాద్, పున్నారావు, ఫింగర్ ప్రింట్స్ బ్యూరో ఎస్ఐ పి.శరత్‌బాబు, హెడ్ కానిస్టేబుళ్లు కోటేశ్వరరావు, జి.సుధాకరరావు, జి.పాపారావు, కానిస్టేబుళ్లు కె.శ్రీను, కె.అనీల్‌కుమార్, సీహెచ్ రత్నరాజు, బీవీ రమణ, బి.అవినాష్, ఎస్కే మొహ్మద్ రఫీ, హోంగార్డులు ఎం.ప్రభాకర్, టి.నాగరాజులను ప్రశంసపత్రాలు, రివార్డులతో ఎస్పీ మలికాగర్గ్ అభినందించారు. -
ఆమెతో నా భర్త వివాహేతర సంబంధం, విడాకులు: నటి భావోద్వేగం
Nisha Rawal Opens Up On Karan Mehra's Extra-Marital Affair: టీవీ నటి నిషా రావల్ తన మాజీ భర్త, నటుడు కరణ్ మెహ్రాతో విడాకులపై మరోసారి స్పందించింది. కంగనా రనౌత్ హోస్ట్‌గా వస్తున్న లాక్అప్ రియాలిటీ షోలో నిషా పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె గతేడాది తన జీవితంలో చోటు చేసుకున్న చేదు అనుభావాన్ని గర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాయల్ రోహత్గీతో వివాహేతర సంబంధం బహిర్గతం అనంతరం తనని ఒంటిరిగా వదిలేసి తమ కుమారుడు కవిష్ను తీసుకుని ముంబై వెళ్లిపోయాడంటూ ఆమె కన్నీరు పెట్టుకుంది. చదవండి: ఆ హీరో నన్ను ఏకాంతంగా కలవాలి అన్నాడు: ‘చంద్రలేఖ’ హీరోయిన్ అలాగే ‘‘పాయల్ రాస్తోంగి కరణ్ సీక్రెట్‌గా మాట్లాడం చూసి నాకు అనుమానం వచ్చింది. దీంతో కరణ్‌ను నిలదీశాను. దీనికి అతడు ‘అవును నేను మరోకరితో ప్రేమలో ఉన్నాను. 5, 6 నెలలగా నేను, పాయల్ సీక్రెట్ రిలేషన్లో ఉన్నాం. నేను తనను ప్రేమిస్తున్నాను. అలాగే నిన్ను కూడా ఇష్టపడుతున్నా’ అని నాతో చెప్పాడు. అతడి మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి. ఇక కరణ్‌ను మరోసారి నమ్మి మోసపోవాలనుకోలేదు. అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నా’ అని చెప్పింది. అంతేకాదు ‘కరణ్-పాయల్ల వివాహేతర సంబంధం బయట పెట్టాక మా మధ్య తరచూ గొడవలు అయ్యేవి. చదవండి: ఆగిపోయిన ‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ లైవ్ స్ట్రీమింగ్, అసలేమైందంటే.. ఈ క్రమంలో కరణ్ నన్ను మానసికంగా, భౌతికంగా గాయపరిచాడు. అవే గాయాలతో మీడియా ముందుకు వచ్చిన నన్ను దారుణంగా ట్రోల్ చేశారు. కెచప్ రాసుకుని నాటకాలు ఆడుతుందంటూ ఈ సమాజం నన్ను నిందించింది’ అంటూ నిషా రావల్ కన్నీటి పర్యంతమైంది. కాగా గతేడాది నిషా రావల్, కరణ్‌ల విడాకుల వ్యవహరంగా బి-టౌన్లో హాట్‌టాపిక్‌గా మారింది. భర్త తనని వేధిస్తున్నాడని, భౌతికంగా గాయపరిచాడంటూ ఆమె పోలీసులను, మీడియాను ఆశ్రయించడంతో ఈ విషయం ఒక్కసారిగా పరిశ్రమలో గుప్పుమంది. ఈ కేసులో నటుడు కరణ్ మెహ్రా అరెస్టై జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల అతడు బెయిల్‌పై బయటకు కూడా వచ్చాడు. -
వివాహేతర సంబంధం: భార్య ఇంకొకరితో కలిసి ఉండగా..
సాక్షి,కరీంనగర్‌క్రైం: కరీంనగర్ వన్‌టౌన్ పరిధిలోని ఒక ఇంట్లో భర్త తన భార్యకు ఇతర వ్యక్తితో ఉన్న వివాహేతర సంబంధం గురించి పోలీసులకు సమాచారమందించాడు. ప్రభుత్వ ఉద్యోగిని అయిన మహిళ తాను పనిచేస్తున్న శాఖలోని మరో వ్యక్తితో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తుంది. ఈ విషయం తెలిసిన భర్త మూడు నెలల నుంచి తన భార్యను తప్పని హెచ్చరిస్తున్నాడు. అయినా వినకుండా అదే పనిచేయడంతో శుక్రవారం వారు కలిసి ఉన్న సమయంలో పోలీసులకు సమాచారమందించాడు. పోలీసులు వచ్చి వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. -
భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం.. వేధింపులతో
సాక్షి, హుస్నాబాద్(మెదక్): అదనపు వరకట్నం వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన అక్కన్నపేట మండలం కేశనాయక్‌తండా గ్రామపంచాయతీ పరిధి గొల్లపల్లిలో జరిగింది. శుక్రవారం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బెజ్జంకి మండలానికి చెందిన ధనూజకు అక్కన్నపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన బండి సంజీవ్‌తో ఏడాది క్రితం వివాహం జరిగింది. వివాహ సమయంలో వధువు తల్లిదండ్రులు సంజీవ్‌కు రూ.12 లక్షల కట్నం, బంగారు ఆభరణాలు ఇచ్చారు. కొన్ని నెలలు వీరి సంసారం ససజావుగా సాగింది. ఇటీవల భర్త సంజీవ్, అతడి తల్లిదండ్రులు అదనపు కట్నం తీసుకోరావాలని ధనూజను వేధిస్తున్నారు. అంతేకాకుండా సంజీవ్‌కు గ్రామంలోని మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో తరచూ భార్యను వేధించేవాడు. ఈ విషయంపై పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగినట్లు స్థానికులు తెలిపారు. మృతురాలి తల్లి కల్లూరి అయిలవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవి తెలిపారు. చదవండి: మహిళపై కన్నేసిన హెడ్ కానిస్టేబుల్.. కంప్లైట్ ఇచ్చేందుకు వస్తే లోబర్చుకొని -
ప్రేమ పెళ్లి.. కడుపులో పెరుగుతున్న బిడ్డ తనది కాదని అనడంతో..
సాక్షి,జడ్చర్ల: కట్టుకున్న భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డ తనది కాదని భర్త అనుమానించ సాగాడు. దీంతో మానసిక వేదనకు గురై ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని ఆల్వాన్పల్లికి చెందిన కృష్ణమ్మ (28), కృష్ణయ్య సుమారు ఆరేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా, ప్రస్తుతం భార్య నాలుగు నెలల గర్భిణి. ( చదవండి: వివాహేతర సంబంధం అనుమానం.. పలుసార్లు ఇల్లు కూడా మార్చాడు.. చివరికి ) అయితే కడుపులో పెరుగుతున్న బిడ్డపై అనుమానం పెంచుకున్న భర్త కొన్ని రోజులుగా తాగొచ్చి ఆమెను కొడుతుండేవాడు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి మద్యం మత్తులో మరోసారి గొడవపడ్డాడు. దీంతో ఆమె మనస్తాపానికి గురై ఇంట్లోనే పురుగుమందు తాగింది. ఇది గమనించిన భర్త వెంటనే బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. మంగళవారం మృతురాలి సోదరుడు మల్లన్న ఫిర్యాదు మేరకు ఎస్ఐ రాజేందర్ కేసు దర్యాప్తు జరుపుతున్నారు. -
వివాహేతర సంబంధం.. పలుసార్లు ఇల్లు కూడా మార్చాడు.. చివరికి
యశవంతపుర: అక్రమ సంబంధం అనుమానంతో భార్యతో పాటు అత్తను కూడా హత్య చేశాడో భర్త. బెంగళూరు గోవిందరాజనగర పోలీసుస్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. వివరాలు.. శివమొగ్గ జిల్లా తీర్థహళ్లికి చెందిన రవికుమార్ భార్య సావిత్రి, అత్త సరోజమ్మలతో కలిసి మూడలపాళ్యలో బాడుగ ఇంటిలో ఉంటున్నారు. బెంగళూరుకు 20 ఏళ్లు క్రితం వలస వచ్చారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. భార్యకు మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని భర్త అనుమానించసాగాడు. దీనిపై అనేకసార్లు దంపతులు గొడవపడ్డారు. పలుసార్లు ఇల్లు కూడా మార్చాడు. మంగళవారం ఉదయం పిల్లలను స్కూల్ వద్ద వదిలి భార్యతో మళ్లీ ఘర్షణ పడ్డాడు. కోపం పట్టలేక కొబ్బరికాయలను కొట్టే కత్తిని తీసుకుని భార్య సావిత్రి, ఆమె తల్లి సరోజమ్మను నరికిచంపాడు. తరువాత స్కూటర్‌పై గోవిందరాజనగర పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. మృతదేహాలకు విక్టోరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. -
15 ఏళ్ల క్రితం వివాహం.. భార్యకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందని
సాక్షి, మంత్రాలయం రూరల్(కర్నూల్): అనుమానం పెనుభూతంగా మారి భార్యను ఓ భర్త హతమార్చాడు. ఈ ఘటన మాధవరం తండా గ్రామంలో వెలుగు చూసింది. స్థానికులు, మాధవరం పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన గోవిందనాయక్ వంట మాస్టారుగా పనిచేస్తున్నాడు. ఈయనకు విజయాబాయితో 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. అయితే ఆమె మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానం పెంచుకున్నాడు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత విజయాబాయిని(35) గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం అనుమానం రాకుండా ఉండేందుకు ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, గోవిందునాయక్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. చదవండి: టీడీపీ కార్యకర్తల వీరంగం.. పెట్రోల్ బంక్‌పై దాడి -
మహిళతో వివాహేతర సంబంధం.. చిన్నారిపై పైశాచికం..
సాక్షి, విజయనగరం క్రైమ్: ఓ యువకుడు రెండు సంత్సరాల నాలుగునెలల పాపపై పైశాచికత్వం ప్రదర్శించాడు. బుగ్గలు, తొడల భాగంలో గోళ్లతో రక్కేశాడు. చిన్నారి ఏడుస్తున్నా విడిచిపెట్టకుండా పైశాచిక అనందం పొందాడు. దిశ పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదుచేశారు. దిశ డీఎస్పీ టి.త్రినాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. భర్తను వదిలేసి చంటి బిడ్డతో ఉన్న మహిళతో నెల్లిమర్లలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న త్రినాథ్ (చిన్న)కు ఏడు నెలల కిందట పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆ మహిళతో కలిసి కొత్తపేట సాలివీధిలో ఓ అద్దె ఇంటిలో కాపురం పెట్టాడు. బుధవారం రాత్రి చిన్నారిని త్రినాథ్‌వద్ద విడిచిపెట్టి ఆమె ఓ శుభకార్యానికి వెళ్లింది. ఆ సమయంలో చిన్నారి శరీరంపై గోళ్లతో రక్కి పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. ఇంటికి వచ్చిన తల్లి బిడ్డను చూసి నివ్వెర పోయింది. దిశ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందజేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అప్పటికే పరారైన నిందితుడిని గాలించి పట్టుకున్నారు. చిన్నారిని వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. చదవండి: స్నేహను ప్రేమిస్తున్నానని చెప్పి.. తర్వాత మరో అమ్మాయితో పెళ్లన్నాడు.. చివరికి! -
వివాహేతర సంబంధం.. ఇద్దరిని ఓకే ఇంట్లో చూడటంతో..
సాక్షి, పటాన్చెరు టౌన్: వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ఏకంగా భర్తనే హత్య చేయించింది. ఈ ఘటనలో భార్య పద్మతో పాటు మరో ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు. పటాన్చెరు పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో అమీన్పూర్ సీఐ శ్రీనివాసులు రెడ్డితో కలసి హత్యకు సంబంధించిన వివరాలను డీఎస్పీ భీంరెడ్డి వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలోని చక్రపురి కాలనీలో ఈ నెల 10వ తేదీన అనుమానాస్పద స్థితిలో తీవ్రగాయాలతో ఓ మృతదేహం లభ్యమైంది. దీంతో అమీన్పూర్ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా మృతుడి భార్య భర్త కనిపించడం లేదని చందానగర్ పోలీసు స్టేషన్లో మిస్సింగ్ కేసు ఇవ్వడాన్ని అమీన్పూర్ పోలీసులు గుర్తించారు. వికారాబాద్ జిల్లా భాసీరాబాద్ మండలం జీవంగి గ్రామానికి చెందిన ఎరుకుల వెంకటప్ప(39) కూలి పని చేసుకుంటూ చందానగర్‌లో భార్య పద్మతో నివాసం ఉంటున్నాడు. బీహెచ్ఈఎల్ చౌరస్తా వద్ద అడ్డపై కూలి పనికి వెంకటప్ప వెళ్తుండగా, భార్య ఇళ్లలో పనులు చేసుకుంటూ ఉండేది. ఈ క్రమంలో పక్కనే నివాసం ఉండే సెంట్రింగ్ పని చేసుకునే అబ్దుల్ రహమాన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. అప్పుడప్పుడు వెంకటప్పను రహమాన్ తనతో పనికి తీసుకెళ్లేవాడు. చదవండి: ప్రేమ పేరుతో కూతురు పరువు తీస్తోందని... ప్రియుడితో కలిసి తల్లి.. పక్కా ప్రణాళిక ప్రకారమే.. ఒక రోజు ఇంట్లో పద్మ, రహమాన్ ఇద్దరిని చూసిన వెంకటప్ప భార్య పద్మతో గొడవపడ్డాడు. దీంతో పద్మ భర్త అడ్డు తొలగించాలని రెహమాన్‌కు తెలపింది. దీంతో రెహమాన్ అతడితో పనిచేసే సుభాష్‌తో కలసి వెంకటప్ప అడ్డు తొలగించుకునేందుకు ప్లాస్ వేసుకున్నారు. ప్రణాళికలో భాగంగా ఈ నెల 8వ తేదీన వెంకటప్పను కొల్లూరు దగ్గర పని ఉందని చెప్పి రెహమాన్, సుభాష్‌లు వెంకటప్పను స్కూటీపై ఎక్కించుకొని వెళ్లారు. అక్కడికి వెళ్లాక పని ఈ రోజు లేదని చెప్పి మద్యం సేవించడానికి ఆలూర్ వెళ్లి బాగా తాగారు. తిరిగి అక్కడి నుంచి లింగంపల్లి వచ్చి అక్కడ వెంకటప్పకు మరో సారి మద్యం తాగించారు. మద్యం మత్తులో ఉన్న వెంకటప్పను అమీన్పూర్ పరిధిలోని చక్రపూరి కాలనీలో ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి పెద్దబండ రాయితో వెంకటప్ప తల, మొఖంపై కొట్టి చంపినట్లు దర్యాప్తులో తేలింది. ఈ మేరకు అమీన్పూర్ పోలీసులు మృతుడి భార్య పద్మ, అబ్దుల్ రెహమాన్, సుభాష్‌లను రిమాండ్‌కు తరలించారు. వారు వాడిన స్కూటీని సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐలు వేణుగోపాల్ రెడ్డి, శ్రీనివాసులు, ఎస్ఐ సోమేశ్వరి, అమీన్పూర్ కానిస్టేబుళ్లు రాములు, మహేందర్‌ను డీఎస్పీ భీంరెడ్డి అభినందించారు. చదవండి: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. ఆరుగురి అరెస్ట్ -
వివాహేతర సంబంధం; పక్కా ప్లాన్.. గుంత తవ్వించి, అందులోనే పూడ్చి..
సాక్షి, మద్నూర్(నిజామాబాద్): వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని హత్య చేసి హతుడు తవ్విన గుంతలోనే పూడ్చి పెట్టారు. మండలంలోని పెద్ద ఎక్లారలో ఫిరంగి సాయిలు(35) అనే వ్యక్తిని డిసెంబర్లో అంతమొందించిన విషయం తెలిసిందే. డీఎస్పీ జైపాల్‌రెడ్డి, ఎస్సై శివకుమార్ మృతదేహాన్ని పూడ్చి పెట్టిన స్థలాన్ని సోమవారం పరిశీలించారు. కూలీలతో మృతదేహాన్ని వెలికి తీశారు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. బిచ్కుంద మండలం కందర్‌పల్లికి చెందిన సాయిలుకు, పెద్ద ఎక్లారకు చెందిన రుక్మిణితో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. రుక్మిణి తల్లి, తండ్రి మృతి చెందడంతో సాయిలు తన భార్యతో కలిసి అత్తగారి ఇంటి వద్దే ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నాడు. అయితే రుక్మిణికి అదే గ్రామానికి చెందిన మొగులాజీ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని సాయిలు హత్య చేయాలని రుక్మిణి, మొగులాజీ భావించారు. గుంత తవ్వాలని కూలీకి పిలిచి.. సాయిలు హత్యకు పథకం వేసిన మొగులాజీ తన పొలంలో గుంత తవ్వాలని డిసెంబర్ 25న కూలీకి పిలిచాడు. పొలానికి వచ్చేటప్పుడు దొడ్డు ఉప్పు సంచులు తేవాలని చెప్పాడు. దీంతో సాయిలు ఉప్పు సంచులు తీసుకొని వెళ్లాడు. పొలంలో కరెంట్ స్తంభం కోసం అని చెప్పి సాయిలు చేత గుంత తవ్వించారు. గుంత తవ్విన అనంతరం సాయిలు మొగులాజీ, అదే గ్రామానికి చెందిన విఠల్ కలిసి అక్కడే మద్యం తాగారు. అనంతరం విఠల్, మొగులాజీ సాయిలును హత్య చేసి ఆ గుంతలో పాతిపెట్టారు. మృతదేహం వాసన రాకుండా సాయిలు తెచ్చిన ఉప్పును శవంపై చల్లి పూడ్చిపెట్టారు. ఎవరికి అనుమానం రాకుండా ఎవరి ఇంటికి వారు వెళ్లి పోయారు. చదవండి: జీడిమెట్లలో బాలిక అనుమానాస్పద మృతి ఇలా బయట పడింది.. సాయిలు గ్రామంలో ఎవరికి ఎక్కువగా పరిచయం లేకపోవడంతో సాయిలు గురించి ఆరా తీయలేదు. దీంతో ఆయన చనిపోయిన విషయం బయట పడలేదు. అయితే నిందితులు మొగులాజీ, విఠల్ మధ్య నాలుగు రోజుల క్రితం గొడవ జరిగింది. విఠల్ మద్యం తాగడానికి మొగులాజీని డబ్బులు అడగ్గా.. ఇవ్వలేదు. దీంతో ఆవేశంలో విఠల్ హత్య విషయం బయట పెట్టాడు. కాగా నిందితుల్లో ఒకరైన విఠల్ వరుసకు రుక్మిణికి తమ్ముడు అవుతాడు. సాయిలు ను ఎలా చంపారో పోస్టుమార్టం అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని ఎస్సై పేర్కొన్నారు. రుక్మిణి, మొగులాజీ, విఠల్పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామన్నారు. -
పిల్లలు పెద్దయ్యారు.. సఖ్యతగా మెలగడం కుదరదని చెప్పినా..
సాక్షి, నల్గొండ: దివ్యాంగుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన డిండి మండల పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. డిండి మండల పరిధిలోని పడమటితండాకు చెందిన జర్పుల చీన్యా(45) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 25ఏళ్ల క్రితం విద్యుదాఘాతం చోటు చేసుకోవడంతో రెండు చేతులు కోల్పోయాడు. చీన్యాకు అదే తండాకు చెందిన మహిళతో వివాహం జరిగింది. వారికి కుమారుడు శివ జన్మించాడు. దంపతుల మధ్య మనస్పర్థల కారణంగా చీన్యా భార్య కుమారుడిని వదిలి ఇంటినుంచి వెళ్లిపోయింది. అప్పటినుంచి చీన్యా కుమారుడితో కలిసి జీవనం సాగిస్తున్నాడు. కాగా, చీన్యా అదే తండాకు చెందిన రాత్లావత్ మహిళ (పండు)తో సఖ్యతగా మెలుగుతున్నాడు. ఈ విషయం పెద్ద మనుషుల వద్దకు వెళ్లినా తీరు మార్చుకోలేదు. 20ఏళ్లుగా సఖ్యతగానే ఉంటున్నారు. చదవండి: మరణించిన టీచర్ పేరుతో రూ.33 లక్షలు డ్రా... కొడుక్కి విషయం తెలియడంతో.. పిల్లలు పెద్దయ్యారని.. చీన్యా కుమారుడు శివకు 20 ఏళ్లుగా కాగా, పండు కుమారుడికి వివాహం జరిగింది. ఇకపై ఇద్దరం కలుసుకోవడం కుదరదని పండు ప్రియుడు చీన్యాకు చెప్పింది. అయినా చీన్యా వినకుండా ఆమెపై ఒత్తిడి చేస్తున్నాడు. దీంతో అతడిని అంతమొందించాలని నిర్ణయించుకుంది. ఈ విషయం తన కుమారుడు సురేష్‌కు తెలిపి పథకం రచించింది. అనుకున్న విధంగానే చీన్యా ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత భర్త లేని సమయంలో పండు ఇంటికి వెళ్లాడు. అప్పటికే మాటు వేసి ఉన్న పండు, ఆమె కుమారుడు సురేష్ చీన్యాపై గొడ్డలితో దాడి చేశారు. దీంతో చీన్యా అక్కడినుంచి పారిపోతుండగా పట్టుకుని ఇంటి వద్దకు లాకెళ్లి నరికి దారుణంగా మట్టుబెట్టారు. సమాచారం తెలుసుకున్న చీన్యా కుమారుడు శివ అతడి కుంటుంబ సభ్యులు, బంధువులు ఘటన స్థలానికి చేరుకునే సరికి అతడు రక్తపు మడుగులో విగతజీవుడిగా పడి ఉన్నాడు. చదవండి: ఎక్కువరోజులు ఉండలేను.. హైదరాబాద్ వచ్చేస్తా.. సీన్ కట్ చేస్తే.. సర్పంచ్‌కు ఫోన్ చేసి.. చీన్యాను హత్య చేసిన విషయాన్ని పండు స్థానిక సర్పంచ్ పాండుకు ఫోన్ చేసి చెప్పింది. పిల్లలు పెద్దయ్యారని సఖ్యతగా మెలగడం కుదరదని, గతంలో చేసినా పొరపాటు మళ్లీ చేయవద్దని కోరినా ఒత్తిడి చేయడంతో మట్టుబెట్టగా తప్పలేదని వివరించింది. వెంటనే సర్పంచ్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలాన్ని సీఐ బీసన్న, డిండి ఎస్ఐ సురేష్, చందంపేట ఎస్ఐ యాదయ్య పరిశీలించారు. చీన్యాను తానే గొడ్డలితో నరికి చంపానని పండు పోలీసుల వద్ద లొంగిపోవడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె కుమారుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహానికి దేవరకొండ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం చేయించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి కుమారుడు శివ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ.సురేష్ తెలిపారు. -
భార్య వివాహేతర సంబంధం.. భర్త అడ్డుగా ఉన్నాడని..
సాక్షి, మద్నూర్(నిజామాబాద్): వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను హత్య చేయించిన ఘటన మండలంలోని పెద్ద ఎక్లారలో చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్సై శివకుమార్, గ్రామస్తులు శనివారం తెలిపిన వివరాలు.. బిచ్కుంద మండలం కందర్‌పల్లికి చెందిన ఫిరంగి సాయిలు(35)కు 16 ఏళ్ల క్రితం మండలంలోని పెద్ద ఎక్లారకు చెందిన రుక్మిణితో వివాహం జరిగింది. డిసెంబర్లో రుక్మిణి తల్లి మరణించింది. అప్పటి నుంచి సాయిలు తన భార్యతో కలిసి అత్తగారింటి వద్దే ఉంటున్నాడు. అయితే రుక్మిణి గ్రామానికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తన బంధానికి అడ్డుగా వస్తున్నాడని భర్తను చంపించింది. ఈ ఘటన డిసెంబర్లో చోటు చేసుకుంది. సాయిలు మృతదేహాన్ని వ్యవసాయ భూమిలో పాతిపెట్టారు. తన కొడుకు కనబడకపోవడంతో సాయిలు తల్లి బషవ్వ తెలిసిన వారి వద్ద గాలించినా ఆచూకీ లభించలేదు. అయితే సాయిలును హత్య చేసిన వారిలో ఓ నిందితుడు మద్యం తాగి శనివారం హత్య గురించి చెప్పినట్లు తెలిసింది. దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న బాన్సువాడ డీఎస్పీ జైపాల్‌రెడ్డి, ఇన్చార్జీ సీఐ మురళీ పెద్ద ఎక్లారలో విచారణ చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని మృతదేహాన్ని పాతిపెట్టిన స్థలాన్ని గుర్తించారు. ఆదివారం మృతదేహాన్ని వెలికి తీయనున్నట్లు తెలిసింది. -
భర్త వివాహేతర సంబంధం.. మహిళా డాక్టర్ ఏం చేసిందంటే..?
సాక్షి, పాట్నా: వివాహేతర సంబంధాలు ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. ఇలాంటి సంబంధాల కారణంగా మహిళలపై దాడులు, హత్యలు కూడా జరుగుతున్నాయి. తాజాగా వివాహేతర సంబంధం కారణంగా ఓ మహిళా డాక్టర్ రోడ్డు మీదకు వచ్చి నిరసనకు దిగింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. దర్భంగా మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న డాక్టర్ రేణు ప్రభకు, కతిహర్ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న డాక్టర్ సంతోష్‌తో అయిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఓ పాప కూడా ఉంది. అయితే సంతోష్ కొంత కాలంగా రేణు ప్రభను పట్టించుకోకపోవడంతో ఆమె అతడిపై నిఘా వేసింది. ఈ క్రమంలో తన భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న తెలుసుకొని షాక్‌కు గురైంది. దీంతో అతడిని నిలదీసింది. కానీ, అతడి ప్రవర్తనలో మార్పు రాకపోగా వారిద్దరిని సంతోష్ పట్టించుకోవడమే మానేశాడు. దీంతో, రేణు..తనకు న్యాయం చేయాలని కోల్‌కత్తాకు చెందిన ఎన్జీవో మహిళా వికాస్ మంచ్‌ను ఆశ్రయించింది. దీంతో సదరు ఎన్జీవో కార్యకర్తలు సంతోష్‌ను కలిసి మాట్లాడే ప్రయత్నం చేయగా అతను నిరాకరించాడు. మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం పెట్టుకొని తనపట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నాడని బీహార్‌లోని కతిహార్ వీధుల్లో నిరసనకు దిగింది. అంతేగాక భర్త విషయంలో న్యాయం కోసం కోర్టును ఆశ్రయించనున్నట్టు ఆమె పేర్కొంది. ఈ క్రమంలో కతిహర్ మెడికల్ కాలేజీలో ఈ దంపతుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. -
మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం: సెల్ఫీ వీడియోతో
సాక్షి, ప్రకాశం: భర్తతోపాటు అతను వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ, ఆమె కుటుంబ సభ్యులు ఏడుగురు వేధిస్తున్నారంటూ ఓ వివాహిత ఉరేసుకుని అర్ధంతరంగా తనువు చాలించింది. మరణించే ముందు సెల్ఫీ వీడియోలో కన్నీటి పర్యంతమవుతూ తన ఆవేదనను వెలిబుచ్చింది. ఈ ఘటన మంగళవారం కంభం పట్టణంలోని కందులాపురం కాలనీలో చోటుచేసుకుంది. పోలీసులు, మృతురాలి సోదరుల కథనం మేరకు.. అర్ధవీడు మండలం గన్నేపల్లి గ్రామానికి చెందిన దూదేకుల భాను(29)కు పదేళ్ల క్రితం కంభం పట్టణానికి చెందిన నాగూర్‌వలితో వివాహమైంది. వారికి ముగ్గురు కుమారులు. అయితే నాగూర్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ వివాదం జరుగుతోంది. తరుచూ హింసిస్తుండటంతో భాను పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా నాగూర్వలి ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో మనస్తాపం చెందిన భాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సంఘటన స్థలాన్ని ఎస్ఐ నాగమల్లేశ్వరరావు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కాగా, తమ సోదరి చావుకు కారణమైన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి సోదరులు కోరారు. చదవండి: వివాహేతర సంబంధం: భార్య తల నరికిన భర్త.. ఆ తర్వాత రోడ్డుపైకి వచ్చి.. -
వివాహేతర సంబంధం: భార్య తల నరికిన భర్త.. ఆ తర్వాత రోడ్డుపైకి వచ్చి..
టెహ్రాన్: ఇరాన్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య మీద అనుమానంతో ఆమె తల నరికి చంపాడో భర్త. అంతేగాక నరికిన తలతో భర్త వీధుల్లోకి రావడం తీవ్ర కలకలం రేపింది. గత శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇరాన్‌లోని అహ్వాజ్లో ఓ వ్యక్తి తన భార్య(17) మోనా హీదారీతో కలిసి నివాసముంటున్నాడు. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. పెళ్లైన కొన్నాళ్లపాటు వీరి వివాహ బంధం సజావుగానే సాగింది. అయితే భార్య మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని భర్త గ్రహించాడు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య కలహాలు తలెత్తాయి. భర్తకు విషయం తెలియడంతో మహిళ దేశం విడిచి టర్కీకి పారిపోయింది. అయినప్పటికీ వివాహితను వెతికి పట్టుకున్న తండ్రి, ఆమె భర్త తిరిగి ఇరాన్‌కు తీసుకువచ్చారు. అయితే భార్య ఇంటి నుంచి పారిపోవడంతో తన పరువు పోయిందని భావించిన భర్త.. తమ్ముడితో కలిసి మహిళను అతి కిరాతకంగా హత్య చేశాడు. చదవండి: అమ్మాయిలను తీసుకొచ్చి గుట్టుగా వ్యభిచారం.. పోలీసుల అదుపులో మహిళ, విటుడు అంతటితో ఆగకుండా ఓ చేతిలో కత్తి, మరో చేతిలో భార్య తల పట్టుకొని రోడ్డు మీదకు నవ్వుతూ వచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులైన భర్తతోపాటు అతని సోదరుడిని సోమవారం అరెస్ట్ చేశారు. అయితే వారి పేర్లను పోలీసులు బయటపెట్టలేదు. మరోవైపు ఈ ఊదంతంపై ఇరాన్ దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన ఇరాన్ దేశ ప్రజలందరూ షాక్‌కు గురయ్యారని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన మహిళా వ్యవహారాల వైస్ ప్రెసిడెంట్ ఎన్సీ ఖాజాలీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆ దేశ పార్లమెంట్‌ను కోరింది. కాగా ఇరాన్లో బాలికల వివాహ వయసు 13 ఏళ్లుగా నిర్ణయించారు. అంతేగాక బాధితురాలికి పెళ్లి అయినప్పుడు ఆమె వయసు 12 ఏళ్లు కావడం గమనార్హం. -
భర్తతో విడాకులు.. మరో వ్యక్తితో సహజీవనం.. చిన్నారి పాలకోసం ఏడుస్తోందని..
Enraged Man Kills Girlfriends Two-year Old Daughter: ఇటీవలకాలంలో చాలా రకాల నేరాలు గురించి విని ఉన్నాం. ఆస్తుల కోసం లేక వివాహేతర సంబంధాల కారణంగా జరుగుతున్న నేరాలు గురించి విన్నాం. కానీ పసిపాప అని కూడ కనికరం లేకుండా పాల కోసం ఏడుస్తోందని కోపంతో అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన ముంబైలోని భయందార్ పోలీస్ స్టేషన్లో పరిధిలో జరిగింది. విషయంలోకెళ్తే.. .22 ఏళ్ల పూజా వాఘ్ అనే వివాహిత తన భర్త నుంచి విడాకులు తీసుకుని స్నేహితుడు ఆదిల్ మునావర్ ఖాన్‌తో కలిసి సహజీవనం చేస్తోంది. అయితే ఆమెకు ఇద్దరూ కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె తన తండ్రి వద్ద ఉంటుంది. పైగా ఆమె తన భర్తతో విడాకులు తీసుకునేటప్పటికీ మూడు నెలల గర్భవతి. ఈ మేరకు ఆమె జనవరి 2020లో సోనాలి అనే పాపకు జన్మనిచ్చింది. అయితే పూజా క్యాటరింగ్ కంపెనీలో పనిచేస్తోంది. ఒకరోజు ఆమె ఉద్యోగానికి వెళ్లే నిమిత్తం ఆమె ప్రియుడు ఖాన్ వద్ద చిన్నారి సోనాలిని ఉంచి వెళ్లింది. అయితే ఖాన్ ఆ చిన్నారి పాల కోసం ఏడుస్తోందని కోపంతో కొట్టాడు. ఆ తర్వాత ఖాన్ వాఘ్కి ఫోన్ చేసి తాను ఫోన్లో గేమ్ ఆడుతుండగా పాప కింద పడిపోయిందని చెప్పాడు. అంతేగాక టెంబే ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని తెలిపాడు. దీంతో పూజా హడావిడిగా ఆస్పత్రికి చేరుకోగానే పాప అప్పటికే చనిపోయిందని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. అయితే పోస్ట్‌మార్టంలో పాప మృతి అసహజమైనదని, ఊపిరాడక చనిపోయినట్లు ధృవీకరించారు. దీంతో భయందార్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని ఖాన్ని అరెస్టు చేశారు. (చదవండి: నకిలీ పురాతన వస్తువుల పేరుతో దాదాపు రూ.9 కోట్లు కొట్టేశారు!) -
మూడేళ్ల క్రితమే పెళ్లి.. వరుసకు బావతో వివాహేతర సంబంధం ఉందని..
సాక్షి, మంచిర్యాల: భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిర్యాలలోని సున్నంబట్టివాడలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై అంజన్న, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వేమనపల్లి మండలం కాటేపెల్లి గ్రామానికి చెందిన బంధరికంటి సతీష్(29)కు కుమురంభీం జిల్లా పెంచికల్పేటకు చెందిన కవితతో 2018 మే 8న వివాహం జరిగింది. వీరికి కూతురు క్షేత్రియా(2) ఉంది. సతీష్ నాలుగేళ్ల క్రితం భార్య కవితతో మంచిర్యాలకు వలస వచ్చి కూలీ పని చేస్తుండేవాడు. చదవండి: పిల్లను ఇవ్వడని మామపై కత్తితో దాడి.. ఆ కోపంలో మరదలిపైనా.. కవితకు బంధువు వరుసకు బావ అయిన వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని సతీష్ అనుమానించేవాడు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడి పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగాయి. పుట్టింటికి వెళ్లిపోయిన కవిత నెల రోజుల క్రితం మంచిర్యాలకు వచ్చింది. ఈ నెల 2న మళ్లీ గొడవలు జరగడంతో వెళ్లిపోయింది. దీంతో మనస్తాపంతో మద్యంమత్తులో ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకున్నాడు. చదవడి: కారం చల్లి, గొడ్డలితో సాఫ్ట్వేర్ ఉద్యోగిపై దాడి.. ఆయుధాన్ని బీరువా కింద దాచి.. -
వివాహేతర సంబంధం: 16 ఏళ్ల క్రితం పెళ్లి, భర్త అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి..
సాక్షి, నల్లగొండ: వివాహేతర సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడనే ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది ఓ భార్య. ఈ ఘటనలో భార్యతో పాటు ఆమె ప్రియుడు, సహకరించిన మరో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు పట్టణ టూటౌన్ పోలీసులు. ఈ కేసు వివరాలను బుధవారం పట్టణంలోని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. పానగల్‌కు చెందిన ఇరగదిండ్ల వెంకన్న(41) వ్యవసాయ బావుల తవ్వకం పనులు చేస్తూ, భార్య సుజాత కూలి మెస్త్రిగా చేస్తూ జీవనం సాగిస్తున్నారు. భార్య సుజాత కూలి పనులకు వెళ్లిన క్రమంలో నార్కెట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టుకు చెందిన కప్ప లింగస్వామితో అక్రమ సంబంధం ఏర్పడింది. చదవండి: స్కూల్ భవనం వెనక్కి తీసుకెళ్లి.. విద్యార్థినిపై ఆరుగురు టీనేజర్ల లైంగిక దాడి వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి ఈ బంధం కాస్త బలపడడంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి పథకం రచించింది. ఇందులో భాగంగా సుజాత జనవరి 29న రాత్రి ప్రియుడు లింగస్వామికి ఫోన్ చేసి తన భర్త మద్యం తాగి నిద్రపోయాడని హత్యకు ఇదే సరైన సమయమని ప్రియుడికి తెలిపింది. దీంతో లింగస్వామి అతడి స్నేహితుడైన నార్కెట్‌పల్లి మండలంలోని గుమ్మళ్లబావికి చెందిన చెన్నకేశవరెడ్డి, చెర్వుగట్టుకు చెందిన శ్రీకాంత్‌తో బైక్‌పై పట్టణానికి వచ్చారు. శ్రీకాంత్ లింగస్వామిని దించి వెళ్లిపోయాడు. చెన్నకేశవరెడ్డి, లింగస్వామి ఓ మెడికల్ షాపులో చేతిగ్లౌజ్‌లు కొనుగోలు చేసి రాత్రి పానగల్ కట్టపై వేచి ఉన్నారు. దీంతో సుజాత అర్థరాత్రి తర్వాత ప్రియుడు లింగస్వామికి వాట్సాప్ కాల్ చేసి రమ్మని చెప్పింది. ఇంటికి వెళ్లిన ప్రియుడు లింగస్వామి వెంకన్న మొఖంపై దిండ్డుతో, గొంతుపై అదిమి పట్టగా భార్య కాళ్లను పట్టుకుని హత్య చేశారు. చదవండి: Viral Video: పట్టపగలే భారీ దొంగతనం.. తుపాకీతో బెదిరించి.. వెంట వచ్చిన చెన్నకేశవరెడ్డి ఇంటికి సమీపంలో ఉన్నాడు. సాధారణ మరణంగా చిత్రీకరించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తండ్రి భిక్షమయ్య ఫిర్యాదుతో పోలీస్‌లు సుజాతను తనదైన శైలిలో విచారించగా అసలు నిజం ఒప్పుకుంది. మృతుడు వెంకన్నకు గుండాల మండలంలోని సీతారాంపురం గ్రామానికి చెందిన సుజాతతో 16ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. హత్యకు సహకరించిన వారిని, ప్రియుడు, భార్య సుజాతను గతంలో హత్య చేయాలని ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. -
వివాహేతర సంబంధం: సుపారీ ఇచ్చి ప్రియుడి కిడ్నాప్, పెళ్లి.. సినీ ఫక్కీలో ఘటన
సాక్షి, వరంగల్: మూడ్రోజుల క్రితం నర్సంపేట పట్టణంలోని కమలాపురంకు చెందిన ఫైనాన్స్ వ్యాపారి శ్రీనివాస్ కిడ్నాప్ అయిన విషయం పాఠకులకు విదితమే. ఈ కేసును నర్సంపేట పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకున్నారు. విచారణను మమ్మురం చేశారు. సినీ ఫక్కీలో జరిగిన కిడ్నాప్‌ను శుక్రవారం పోలీసులు ఓ కొలిక్కి తీసుకువచ్చారు. నర్సంపేట మున్సిపాలిటి పరిధి 2వ వార్డు కమలాపురం గ్రామానికి చెందిన ముత్యం శ్రీనివాస్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. దీంతో పాటు మద్యం షాపు నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ వివాహితకు పైనాన్స్ (రోజువారీ చిట్టి) ఇచ్చాడు. రోజూ ఆమె ఇంటికి వెళ్తూ చిట్టీ డబ్బులు వసూలు చేస్తున్నాడు. చదవండి: వాట్సప్ చివరి స్టేటస్.. ఊరి నుంచి తెచ్చుకున్న అమ్మ చీరతోనే ఉరేసుకుని.. ఈ క్రమంలో వారిద్దరూ వివాహేతర సంబంధం ఏర్పర్చుకున్నారు. కొద్ది రోజులకు ఈ విషయం బయటకు పొక్కడంతో గతేడాది పెద్దమనుషులు పంచాయితీ నిర్వహించారు. ఇచ్చిన అప్పు పోను కొంత నగదు ఆమెకు చెల్లించాలని తీర్మానం చేశారు. నాలుగు నెలల క్రితం ఈ విషయం బయటకు రావడంతో భార్యభర్తల మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలో ఆమెను భర్త వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఆ మహిళా శ్రీనివాస్‌ను పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకుంది. వెంటనే సుపారీ గ్యాంగ్‌ను కలిసి కొంత నగదును అడ్వాన్స్‌గా అప్పగించింది. చదవండి: పెగాసస్‌పై న్యూయార్క్ సంచలన నివేదిక.. మరోసారి దుమారం దీంతో సుపారీ గ్యాంగ్ ఈనెల 26న శ్రీనివాస్‌ను కిడ్నాప్ చేసింది. శ్రీనివాస్‌ను కొట్టి ఆమెతో దండలు మార్పించినట్లు సమాచారం. శ్రీనివాస్ కుమారుడు భరత్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మొబైల్ ట్రాక్ చేసి నర్సంపేట సీఐ పులి రమేశ్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీం అక్కడికి చేరుకున్నారు. పోలీసులను చూసిన సుపారి గ్యాంగ్ పరారయ్యింది. పోలీసులు శ్రీనివాస్ ను, మహిళను అదుపులోకి తీసుకుని విచారణ ముమ్మరం చేశారు. దీనిపై స్థానిక సీఐ పులి రమేశ్‌ను వివరణ కోరగా.. ముత్యం శ్రీనివాస్ కొడుకు భరత్ ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితులు దొరికిన వెంటనే అరెస్టు చూపిస్తామని తెలిపారు. చదవండి: సీఎం దృష్టికి వెళ్లకుండా చూస్తాం.. రూ.25లక్షలు ఇవ్వు.. డీఎంకే ఎమ్మెల్యేలకు బెదిరింపులు -
పెద్దాయన భార్యతో వివాహేతర బంధం. ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం.. 9 నెలలకు
సాక్షి, ఆరిలోవ (విశాఖ తూర్పు): వయసుతో సంబంధం లేకుండా ఓ పెద్దాయనతో యువకుడికి యాదృచ్ఛికంగా పరిచయం... ఆ పరిచయం స్నేహంగా మారిన తర్వాత యువకుడు దారి తప్పడం... నైతిక విలువలకు తిలోదకాలిచ్చి పెద్దాయన భార్యతో వివాహేతర బంధం... ఆ బంధానికి అడ్డుగా ఉన్న ఆమె భర్తను హతమార్చడం... అనంతరం ఆ మహిళతో కలిసి పరార్... మొత్తం ఓ సినీ స్టోరీని తలపించే కథలో ఇంకా ఏం కాదులే అని ధీమాగా ఉన్న సమయంలో ఆ నయవంచకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమానాస్పద మృతి కేసును ఛేదించి హంతకుడిని రిమాండ్‌కు తరలించారు. ఆరిలోవ సీఐ ఇమాన్యుయేల్‌రాజు తెలిపిన వివరాల ప్రకారం... ఓ ఫర్నిచర్ షాపులో వాచ్‌మెన్‌గా పనిచేసే ముత్యు శ్రీనివాసరావు (43) భార్య, ఇద్దరు కుమారులతో కలిసి ఎండాడలో నివసించేవాడు. పెద్ద కుమారుడికి వివాహం జరిగింది. ఈ క్రమంలో 2019లో శ్రీనివాసరావుకు ఓ కళ్లు పాక వద్ద ఒన్‌టౌన్ ప్రాంతం చాకలిపేటకు చెందిన సూరాడ లక్ష్మణ్ (26)తో పరిచయమయింది. కొన్నాళ్లకు ఆ పరిచయం స్నేహంగా మారింది. దీంతో ఓ రోజు రుషికొండ ప్రాంతంలో వారిద్దరూ కళ్లు తాగిన తర్వాత లక్ష్మణ్‌ను భోజనం కోసం ఎండాడలోని తన ఇంటికి శ్రీనివాసరావు తీసుకెళ్లాడు. చదవండి: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. లగ్జరీ గెస్ట్ హౌస్‌లో యజమానికి తెలియకుండా.. అప్పటి నుంచి తరచూ ఆ ఇంటికి వెళ్లిన లక్ష్మణ్... శ్రీనివాసరావు భార్యతో పరిచయం పెంచుకొన్నాడు. కొన్నాళ్లకు ఆ పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం తెలుసుకొన్న శ్రీనివాసరావు లక్ష్మణ్‌తో గొడవపడి తన భార్య చిన్నీని మందలించాడు. అయినప్పటికీ వారిద్దరి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల తర్వాత శ్రీనివాసరావు భార్యను తీసుకెళ్లిపోయిన లక్ష్మణ్ ఆమెతో కలిసి నగరంలోని రైల్వే న్యూ కాలనీ వద్ద ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టాడు. ఓ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలో లక్ష్మణ్ పనిచేస్తూ ఆమెతో గడుపుతున్నాడు. నమ్మించి బీచ్‌కు తీసుకెళ్లి... ఈ క్రమంలో వీరిద్దరూ రైల్వే న్యూకాలనీలో ఉన్నట్లు తెలుసుకొన్న శ్రీనివాసరావు 2021 ఏప్రిల్ 11న వారిని కలిశాడు. మద్యం మత్తులో అక్కడ అల్లరి చేశాడు. దీంతో మంచి మాటలతో శ్రీనివాసరావును లక్ష్మణ్ తన బైక్‌పై ఎక్కించుకుని ఎండాడ తీసుకెళ్లాడు. అక్కడి నుంచి సాగర్‌నగర్ మీదుగా గుడ్లవానిపాలెం అమ్మవారి గుడి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ బైక్ ఆపి బీచ్‌లోకి తీసుకెళ్లి అందుబాటులో ఉన్న ఇటుకతో శ్రీనివాసరావు తలపై లక్ష్మణ్ బలంగా బాదాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. కొన ఊపిరితో పడి ఉన్న శ్రీనివాసరావును స్థానికులు 108లో కేజీహెచ్‌కు తరలించారు. అక్కడకు చేరేసరికే మృతి చెందాడు. దీంతో శరీరంపై గాయాలుండడంతో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి అని ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: ‘రైస్‌మిల్ వద్దకు కాపలాకు వెళ్తున్న.. పొద్దున్నే వస్తా’ అని ఇంట్లో చెప్పి.. 9 నెలల తర్వాత చిక్కిన హంతకుడు కేసు నమోదు చేసిన ఆరిలోవ పోలీసులు కొద్ది రోజులకు మృతుడు శ్రీనివాసరావు అని, ఎండాడ నివాసి అని గుర్తించారు. విచారణలో మృతుని భార్యతో లక్ష్మణ్‌కు ఉన్న వివాహేతర బంధం వెలుగులోకి రావడంతో వారి కోసం వెతికినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. శ్రీనివాసరావును హతమార్చిన రోజునే లక్ష్మణ్, చిన్నీ విజయవాడ వెళ్లిపోయారని పోలీసులు గుర్తించారు. ఏదో ఒక రోజు వస్తారని నిఘా పెట్టారు. ఈ క్రమంలో విజయవాడలో చిన్నీతో కలిసి అద్దె ఇంటిలో ఉంటున్న లక్ష్మణ్... సుమారు 9 నెలలు గడిచిపోవడంతో ఎలాంటి కేసూ ఉండదని భావించి ఆమెను తీసుకొని నగరంలోని రైల్వే న్యూకాలనీలోని అద్దె ఇంటిలో సామగ్రి కోసం శుక్రవారం వచ్చాడు. ఈ విషయం తెలుసుకొన్న ఆరిలోవ పోలీస్ స్టేషన్ కానిస్టేబుళ్లు హుస్సేన్, ప్రకాష్ వెళ్లి వారిద్దరినీ అదుపులోకి తీసుకొన్నారు. విచారణలో శ్రీనివాసరావును హత్య చేసినట్లు లక్ష్మణ్ అంగీకరించాడు. దీంతో అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా మార్చిన పోలీసులు లక్ష్మణ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన కానిస్టేబుళ్లు హుస్సేన్, ప్రకాష్‌లను సీఐ ఇమాన్యుయేల్‌రాజు అభినందించారు. నిందితుడు లక్ష్మణ్‌కు కూడా గతంలో వివాహం జరిగిందని, భార్యకు దూరంగా ఉంటున్నాడని సీఐ తెలిపారు. -
మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం.. రెడ్ హ్యండెడ్‌గా పట్టుకొని నిలదీయడంతో..
సాక్షి, రాజేంద్రనగర్: విడాకులు ఇచ్చిన భర్త వేధింపులు రోజురోజుకూ ఎక్కువ అవుతుండటం, కుమారుడిని తీసుకువెళ్లి పంపకపోవడంతో మనస్తాపం చెందిన ఓ మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం హుడా కాలనీకి చెందిన షహజాబేగం(25), ఎంఎం పహాడీకి చెందిన షేక్ ఇమ్రాన్(29)తో నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. షేక్ ఇమ్రాన్ స్థానికంగా హార్డ్‌వేర్ దుకాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఇతడికి బంధువుల మహిళతో అక్రమ సంబంధం ఉంది. సంవత్సరం క్రితం షహజాబేగం రెడ్‌హ్యాండ్‌గా పట్టుకొని నిలదీసింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆరు నెలల క్రితం షేక్ ఇమ్రాన్ పాలల్లో గుర్తు తెలిని క్రిమి సంహారక మందు కలిపి షహజాబేగంతో తాగించాడు. దీంతో అస్వస్తతకు గురైన షహజాబేగంను ఆసుపత్రికి తరలించగా వారం రోజుల పాటు చికిత్స పొంది డిశ్చార్జ్ అయింది. ఈ సమయంలో భర్తపై రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసింది. వీరికి ఇద్దరు సంతానం. స్థానిక పెద్దల జోక్యంతో కేసు విత్‌డ్రా చేసుకున్న షహజాబేగం అమ్మగారి ఇంటి వద్దే ఉంటోంది. మూడు నెలల క్రితం విడాకులు తీసుకుంది. చదవండి: సెల్ఫీ కోసం రైలు బోగీ పైకి.. హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలడంతో కాగా పది రోజుల క్రితం షేక్ ఇమ్రాన్ కుమారుడిని చూస్తానని ఇంటికి తీసుకువెళ్లాడు. తిరిగి షాజాహబేగంకు అప్పగించలేదు. తరచూ స్థానికులతో అసత్య ప్రచారాన్ని చేపడుతున్నాడు. దీంతో మనస్తాపం చెందిన షాహజాబేగం ఇంట్లో ఉరి వేసుకొని మృతి చెందింది. తల్లిదండ్రులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. బుధవారం రాత్రి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: రూ.579 కోట్ల కాంట్రాక్టులంటూ..రూ.3 కోట్లు స్వాహా -
33 ఏళ్ల క్రితం పెళ్లి.. ఇద్దరు పిల్లలు.. కట్ చేస్తే మరో మహిళతో..
సాక్షి, నిజామాబాద్: భార్య, ఇద్దరు కుమారులు ఉండి మరొక మహిళను వివాహం చేసుకున్న భర్తపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత మహిళ మంగళవారం పోలీస్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. ఇందల్వాయికి చెందిన చింత పద్మకు జక్రాన్‌పల్లి మండలం మనోహరబాద్‌కు చెందిన పులి రాజేంధర్‌గౌడ్‌తో 33 సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. 1995 నుంచి ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో పనిచేసే జంబుకరాజమణితో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెను వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలను కన్నడని తెలిపింది. దీనిపై తాను ప్రశ్నిస్తే రాజమణితో ఎస్సీఎస్టీ కేసు పెట్టిస్తానంటూ బెదిరించారని వాపోయింది. తాను ఆర్మూర్ కోర్టులో మెయింటెనెన్స్ ఫైల్ చేయగా, ఈ కేసును విత్‌డ్రా చేసుకోవాలని బెదిరించాడని తెలిపింది. ఈ కేసులో తన భర్త కౌంటర్ కేసు వేసి రెండో భార్య గురించి రాయకుండా కోర్టును తప్పుదోవ పట్టించాడని తెలిపింది. ఎస్సీ,ఎస్టీ కేసులకు భయపడి తన తరపున ఎవరూ సపోర్టు చేయటం లేదని ఫిర్యాదులో పేర్కొంది. రాజమణితో తన భర్తకు దగ్గర ఉండి వివాహం చేసిన మరిది పులి రామాగౌడ్, అతని భార్య పులి బాలమణిలపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సీపీకు ఫిర్యాదు చేసింది. -
వివాహేతర సంబంధం: ప్రియుడి మోజులో పడి ఇంట్లోనే..
సాక్షి, మేడ్చల్ రూరల్: వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ ప్రియుడి మోజులో పడి తమ ఇంటిలోనే వివాహేతర బంధం కొనసాగించి భర్తకు పట్టుపడింది. తమ గుట్టురట్టయ్యిందని భావించి తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడితో కలిసి కడతేర్చి కటకటాలపాలైన భార్య, ప్రియుడికి మేడ్చల్ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ సోమవారం తీర్పు ఇచ్చింది. మేడ్చల్ మండలంలోని అక్బర్జాపేట్ గ్రామానికి చెందిన మహంకాళి లక్ష్మి, మహంకాళి కృష్ణ దంపతులు. అదే గ్రామానికి చెందిన గుంటి బాలరాజ్ 2014లో మహంకాళి కృష్ణ ఆటో కొనుగోలు చేయడం అప్పటి నుంచి వీరి మధ్య స్నేహం ఏర్పడింది. స్నేహాన్ని అడ్డుపెట్టుకుని తరచూ కృష్ణ ఇంటికి వెళ్లిన గుంటి బాలరాజు అతడి భార్య లక్ష్మితో పరిచయం ఏర్పరచుకున్నారు. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. చదవండి: హైదరాబాద్‌లో దారుణం.. కన్న తల్లిని కడతేర్చిన సైకో కొడుకు.. భర్తకు విషయం తెలియడంతో అడ్డు తొలగించుకోవాలని.. ► వీరి విషయం తెలియడంతో మహంకాళి కృష్ణ తన భార్యను మందలించాడు. భర్త అడ్డు తొలగించుకోవాలని మహంకాళి లక్ష్మి, ప్రియుడు గుంటి బాలరాజ్‌తో కలిసి పథకం వేసుకున్నారు. అందులో భాగంగా పలుమార్లు మహంకాళి కృష్ణకు కల్లులో నిద్రమాత్రలు కలిపి తాగించినా మృతుడికి ఏమీ కాలేదు. తీగను మెడకు చుట్టి.. 2020 ఏప్రిల్ 8న రాత్రి సమయంలో మహంకాళి లక్ష్మి భర్త నిద్రపోయిన తర్వాత ప్రియుడు గుంటి బాలరాజ్‌కు ఫోన్ చేసి ఇంటికి పిలుచుకుని తమ అక్రమ బంధం కొనసాగిస్తుండగా వీరి శబ్ధం విని నిద్రలేచిన కృష్ణ వారిని పట్టుకున్నాడు. దీంతో ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం కృష్ణను తీగలతో మెడను బిగించి హతమార్చారు. హత్య విషయం బయట పడకుండా కరోనా సమయంలో కల్లు (మద్యం) దొరకకపోవడంతో మనస్తాపంతో మరణించినట్లు కట్టుకథ అల్లింది. చదవండి: వివాహేతర సంబంధం: సాంబార్లో విషం కలిపి.. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో బయటపడిన విషయం.. మృతుడి సోదరుడు మహంకాళి సురేశ్ మృతుడి దేహంపై గాయాలు చూసి అనుమానం వ్యక్తం చేస్తూ మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు హత్యగా గుర్తించి మహంకాళి లక్ష్మి,గుంటి బాలరాజ్లను రిమాండ్‌కు తరలించారు. కాగా మేడ్చల్ 11 ఏడీజే కోర్టులో సోమవారం కేసు విచారణ రావడంతో న్యాయమూర్తి జయంతి కేసు విచారణ జరిపారు. ఇద్దరకి జీవిత కాలం కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.3వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. -
వివాహేతర సంబంధం: సాంబార్లో విషం కలిపి..
చెన్నై: నాగై జిల్లా వేదారణ్యం సమీపం కడయన్ కాడు ప్రాంతానికి చెందిన దేవేంద్రన్ (47). కీలయూర్ యూనియన్ డీఎంకే కౌన్సిలర్ అయిన ఈయన పచ్చకామర్లు, కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో తిరుచ్చిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొంది ఇటీవల ఇంటికి తిరిగి వచ్చారు. ఈ క్రమంలో ఈనెల 4వ తేదీ తిరిగి అతనికి అస్వస్థత ఏర్పడడంతో అతన్ని ఆస్పత్రిలో చేర్చారు. 6 తేదీన మృతి చెందాడు. దేవేంద్రన్ మృతి తరువాత అతని భార్య సూర్య (26) ఎవరితోనో ఫోన్లో తరచూ మాట్లాడుతుండడంతో సందేహించిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేయగా దేవేంద్రన్ భార్య సూర్యాకు అదే ప్రాంతానికి చెందిన ఇంజినీరు చంద్రశేఖర్ (32)కు వివాహేతర సంబంధం ఉందని, ఈ క్రమంలో తమకు అడ్డుగా ఉన్న దేవేంద్రన్‌కు సాంబార్లో విషం కలిపి తినిపించి హత్య చేసినట్లు తెలిసింది. పోలీసులు ఈమేరకు కేసు నమోదు చేసి సూర్య, చంద్రశేఖర్‌ను ఆదివారం అరెస్టు చేశారు. -
వివాహేతర సంబంధం: చెల్లెలితో ఫోన్ చేయించి..
సాక్షి, హుబ్లీ(కర్ణాటక): వివాహేతర సంబంధం హత్యకు దారితీసిన ఘటన జిల్లాలోని కలఘటికి తాలూకా కురివినకొప్ప గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు గ్రామానికి చెందిన వివాహిత మహిళ ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తోంది. పక్క గ్రామానికి చెందిన ఆటో నిర్వాహకుడు మంజునాథ్ మరప్పనవర్ ఆటోలో ఆమె ప్రయాణించేది. ఈక్రమంలో ఇద్దరికి పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. అనైతిక సంబంధాలు తగదని ఆ మహిళ అన్న బసవరాజ కురడికేరి మంజునాథ్‌కు పలుసార్లు హెచ్చరికలు జారి చేశారు. అయినా పట్టించుకోలేదు. దీంతో బసవరాజ్ తన చెల్లెలితోనే ఫోన్ చేయించి మంజునాథ్‌ను పిలిపించి ఈ నెల 18న రాళ్లు, మారణాయుధాలతో కొట్టి చంపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశార -
వివాహేతర సంబంధం: కళ్లలో కారంపొడి చల్లి, ఇనుపరాడ్డు, కర్రతో దాడి
సాక్షి, మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నందినగర్ కాలనీ శివారు చెరువుకట్ట సమీపంలో గురువారం ఓ గిరిజన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఆ యువకుడి కళ్లలో కారంపొడి చల్లి ఇనుపరాడ్డు, కర్రతో తలపై బలంగా దాడి చేసి గాయపరచడంతో అతడు అక్కడికక్కడే రక్తం మడుగులో పడి మృతిచెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేశారు. టౌన్ ఎస్హెచ్ఓ జూపల్లి వెంకటరత్నం తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామశివారు సున్నపు రాళ్ల తండాకు చెందిన బానోత్ లక్పతి(35)కి భార్య నీల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. లక్పతి మానుకోటలోని మిల్ట్రీకాలనీలో నివాసం ఉంటూ గొర్రెల వ్యాపారం చేస్తుంటాడు. రోజు మాదిరిగానే గురువారం ఉదయం 9గంటల సమయంలో అతడికి ఒకరు ఫోన్ చేయగానే ఇంట్లో నుంచి తన ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. నందినగర్ కాలనీ శివారులో గల చెరువుకట్ట సమీపంలోకి చేరుకున్నాక కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతడితో వాగ్వాదానికి దిగారు. అదేక్రమంలో లక్పతి కళ్లలో కారంపొడి చల్లి, ఇనుప రాడ్డుతో, కర్రతో తలపై, శరీరంపై బలంగా గాయపరిచారు. కొంత పెనుగులాట జరిగిన అనంతరం యువకుడు మృతి చెందినట్లు గుర్తించి ఆ వ్యక్తులు అతడి ముఖంపై దుప్పటి కప్పి అక్కడి నుంచి పరారయ్యారు. చదవండి: ప్రేమ వివాహం.. వేధింపులు.. ఇక భర్తతో కలిసి ఉండలేనని.. ద్విచక్రవాహనం సంఘటనా స్థలంలో పడిపోయి ఉంది. కొంత దూరంలో ఇనుపరాడ్డు, కారంపొడి డబ్బా, కర్ర, మాస్కు, మృతుడి కాలిబూటు పడిఉన్నాయి. సంఘటనా స్థలాన్ని సబ్ డివిజినల్ పోలీసు అధికారి పి.సదయ్య సందర్శించారు. టౌన్ ఎస్సైలు క్రాంతికిరణ్, ఎస్సై రవి, దీపిక, రమాదేవి, హెడ్‌కానిస్టేబుల్ వెంకటరమణ, పీసీలు శ్రీకాంత్, రమేష్ వివరాలు సేకరించారు. చదవండి: మిస్టరీగా సాఫ్ట్వేర్ ఇంజినీర్ తనూజ కేసు: విజయవాడ ఎందుకు వచ్చింది.. లక్పతి(ఫైల్) కాగా, బానోత్ లక్పతి హత్యకు గల కారణం అతడు తండాకు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉందనే కారణంతోనే ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అంతేకాకుండా గతంలోనూ ఇదేవిధంగా లక్పతిపై దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. అదే విషయంలో పలుమార్లు పంచాయతీలు కూడా నిర్వహించినట్లు తెలిసింది. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్ బృందాలతో పోలీసులు తనిఖీ చేయిస్తున్నారు. మృతుడి తండ్రి రాజ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ ఎస్హెచ్ఓ వెంకటరత్నం తెలిపారు. -
ఏడాదిన్నర క్రితమే పెళ్లి.. మరో వ్యక్తితో పరిచయం.. ప్రియుడితో కలిసి..
Wanaparthy: ఐదు రోజుల్లోనే అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది. వివాహేత సంబంధం కారణంగానే భర్తను భార్యే ప్రియుడితో కలిసి చంపించింది. చివరకు నిందితులిద్దరూ కటకటాలపాలయ్యారు. ఈ కేసు వివరాలను మంగళవారం సాయంత్రం వనపర్తి సీఐ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. వనపర్తి మండలం రాజపేట–పెద్దతండా శివారులోని బనిగానితండా చెరువులో ఈనెల 13న తండాకు చెందిన కురుమయ్య అలియాస్ కుమార్ (24) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతని భార్య అంజలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపిన పోలీసులు విచారణలో హత్యగా తేల్చారు. బనిగానితండాకు చెందిన కురుమయ్య, అంజలికి ఏడాదిన్నర క్రితమే వివాహమైంది. అనంతరం జీవనోపాధి కోసం వారు హైదరాబాద్‌కు వెళ్లారు. భర్త ఆటో నడుపుకొంటూ ఉండగా.. భార్య ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోంది. అలాగే కురుమయ్యకు వరుసకు తమ్ముడైన హరీష్ సైతం అక్కడే ఉంటూ ఆటో నడుపుతున్నాడు. రూంలో ఒక్కడే ఉండటంతో అతడిని కురుమయ్య ఇంటికి అప్పుడప్పుడూ రమ్మని పిలిచేవాడు. ఈ క్రమంలోనే హరీష్‌తో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఎలాగైనా భర్త అడ్డును తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి పథకం పన్నింది. అప్పుడే భర్త కురుమయ్యకు డబ్బులు అవసరం ఉండటంతో హరీష్‌ను అడిగాడు. చదవండి: రాంగ్ నంబర్ ఫోన్‌కాల్‌తో పరిచయం.. ఘట్కేసర్లో సహజీవనం.. ఇస్తానులే అని అతను చెప్పడంతో సంక్రాంతి పండుగకు కురుమయ్య, భార్య అంజలి తండాకు వచ్చారు. ఈనెల 13న హైదరాబాద్ నుంచి కొత్తకోటకు వచ్చిన హరీష్, తన బామ్మర్దితో కలిసి మద్యంబాటిళ్లు తీసుకుని పెద్దతండా శివారులోని బండ్లచెరువు వద్దకు రమ్మని కురుమయ్యకు ఫోన్ చేశారు. వచ్చిన తర్వాత ముగ్గురూ మద్యం తాగారు. హరీష్ కర్రతో కురుమయ్య తలపై కొట్టగా బామ్మర్దితో కలిసి గొంతునులిమి చంపారు. అనంతరం వలలో అతడి మృతదేహాన్ని చుట్టి చేపల కోసం వెళితే చనిపోయినట్టు చిత్రీకరించారు. ఇదేమీ ఏమీ తెలియనట్టు 14న హరీశ్ బనిగానితండాకు వచ్చాడు. తన భర్త చెరువులో అనుమానాస్పదంగా చనిపోయినట్టు మరుసటి రోజు భార్య అంజలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు పోస్టుమార్టం నిర్వహించగా అసలు విషయం బయటపడింది. అందులో హత్యగా తేలడంతో మంగళవారం అంజలి, ప్రియుడు హరీష్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. చదవండి: మసాజ్ సెంటర్ల పేరుతో చీకటి కార్యకలాపాలు.. కళ్లు బైర్లుకమ్మే అంశాలు -
ప్రియుని మోజులో భర్త హత్య.. నిజం చెప్పిన కొడుకు
సాకక్షి, బెంగళూరు: ప్రియుని మోజులో పడిన మహిళ భర్తనే కడతేర్చిన సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని దొడ్డ పట్టణంలో వెలుగు చూసింది. 10 రోజుల తరువాత ఆమె కొడుకు ఈ దారుణాన్ని బయటపెట్టాడు. పట్టణ పరిధిలోని కరేనహళ్లిలో నివసిస్తున్న నేత కార్మికుడు రాఘవేంద్ర హతుడు కాగా, ఇతని భార్య శైలజ, ప్రియుడు హనుమంతు ముఖ్య నిందితులు. ఈ ఘోరానికి శైలజ తల్లి లక్ష్మిదేవి సహకరించడం గమనార్హం. డిసెంబర్ 27న రాఘవేంద్రను ఇంట్లోనే ఊపిరాడకుండా చేసి చంపారు. మూర్ఛతో మృతిచెందాడని శైలజ అందరికీచెప్పి అంత్యక్రియలు చేసి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇంతలో అసలు విషయమేమిటో ఆ దంపతుల కొడుకు బంధువులకు చెప్పడంతో గుట్టు రట్టయింది. గార్మెంట్స్ ఫ్యాక్టరీకి వెళ్తున్న శైలజకు అదే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న హనుమంతు అనే కూలీలో సంబంధం ఏర్పడింది. ఇది తెలిసి రాఘవేంద్ర భార్యతో గొడవ పడ్డాడు. మరోవైపు హనుమంతు భార్య కూడా శైలజతో గొడవపడి కొట్టింది. దీంతో అడ్డు తొలగించుకోవాలని నిద్రపోతున్న భర్తను ప్రియుడు, తల్లి సహకారంతో హత్య చేసింది. దొడ్డ గ్రామీణ పోలీసులు శైలజ, హనుమంతు, లక్ష్మిదేవిలను అరెస్టు చేశారు. చదవండి: దివ్యాంగ బాలికపై లైంగిక దాడి.. ఫ్లైఓవర్ పై తీసుకెళ్ళి.. -
HYD: భర్తతో గొడవలు.. మరో వ్యక్తితో పరిచయం.. ఇద్దరు పిల్లలతో కలిసి
సాక్షి, మీర్‌పేట: భర్తతో గొడవపడిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కనిపించకుండా పోయింది. ఈ సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా పదర గ్రామానికి చెందిన కుమార్, రాధ (30) భార్యాభర్తలు. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. ఏడేళ్ల క్రితం దంపతుల మధ్య గొడవ జరగడంతో రాధ భర్తను వదిలేసి జిల్లెలగూడ అంబేడ్కర్‌నగర్‌కు వచ్చి ఓ అపార్ట్మెంట్లో వాచ్‌ఉమన్‌గా పనిచేస్తూ ఇక్కడే ఉంటోంది. తరచూ భర్త వచ్చి వెళ్తుండేవాడు. రాధ కూలీ పనులకు కూడా వెళ్తుండేది. ఈ క్రమంలో గుంటూరుకు చెందిన దుర్గాప్రసాద్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడడంతో రెండు నెలలుగా ఇద్దరు కలిసి ఉంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న భర్త కుమార్ గత నెల 4న కుటుంబసభ్యులతో కలిసి అంబేడ్కర్‌నగర్‌కు వచ్చి రాధను మందలించగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో అర్ధరాత్రి అందరూ నిద్రించిన తర్వాత రాధ తన ఇద్దరు కుమారులు రవి (10), గణేష్ (12)ను తీసుకుని దుర్గాప్రసాద్‌తో కలిసి వెళ్లి తిరిగి రాలేదు. వారి ఆచూకీ కోసం వెతికినా ప్రయోజనం లేకపోవడంతో సోమవారం కుమార్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: గాంధీ, ఉస్మానియాలో కరోనా కలకలం.. 94 మంది వైద్యులు, సిబ్బందికి పాజిటివ్ -
వివాహేతర సంబంధం: ఫోన్‌కాల్ ద్వారా పరిచయం.. అర్థరాత్రి సమయంలో
సాక్షి, జగ్గయ్యపేట/వరంగల్: ప్రేయసి గొంతు కోసి, ప్రియుడు కూడా ఆత్మ హయత్యా యత్నానికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలంలోని సుబ్బాయిగూడెం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఎన్.ఏసురాజుకు కొంత కాలంనుంచి ఒంటరిగా జీవిస్తున్నాడు. ఈ క్రమంలో ఫోన్‌కాల్ ద్వారా వరంగల్‌కు చెందిన కృష్ణవేణితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరూ తరుచూ కలిస్తుండేవారు. ఈ క్రమంలో ఏసురాజు కృష్ణవేణికి ఫోన్ చేసి ఆదివారం సుబ్బాయి గూడెం రప్పించాడు. చదవండి: ప్రేయసి ఫోన్ లిఫ్ట్ చేయలేదని.. ఎంత పనిచేశావ్ తరుణ్.. అర్ధరాత్రి సమయంలో వారిద్దరి మధ్య ఘర్షణ తలెత్తటంతో ఏసురాజు బ్లేడ్‌తో కృష్ణవేణి గొంతుపై గాయం చేసి, తాను చేతిపై కోసుకున్నాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న ఎస్ఐ హరిప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. 108 వాహనంలో వారిద్దరినీ పెనుంచిప్రోలులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయాలు స్వల్పంగా కావటంతో ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని ఎస్ఐ తెలిపారు.అయితే ప్రియుడిపై ఫిర్యాదు చేసేందుకు ప్రియురాలు ముందుకురాకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. చదవండి: విషాదం: సుగుణ తలుపులు తీయ్.. కిటికీలో నుంచి చూడగా.. -
భార్య స్నేహితురాలితో వివాహేతర బంధం.. 6 నెలల కిందట కనిపించకుండాపోయి..
సాక్షి,పరవాడ (విశాఖపట్నం): వివాహితతో అదృశ్యమైన ఓ యువకుడు హతమయ్యాడు. సుమారు 6 నెలల కిందట కనిపించకుండా వెళ్లిపోయిన పరవాడ మండలం నాయుడుపాలెం శివారు వెంకటపతిపాలెం గ్రామానికి చెందిన వియ్యపు అఖిలేష్ (23) గత ఏడాది జూలై 13న హత్యకు గురయ్యాడని పోలీసులు నిర్ధారించారు. నడుపూరు సమీప రామచంద్రానగర్ గ్రామానికి చెందిన సనా వాసు(28), అదే గ్రామానికి చెందిన పుచ్చా వంశీ(20), కొవురు సందీప్‌రెడ్డి(20) హత్య చేశారని తేలడంతో అనకాపల్లి కోర్టులో గురువారం హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పరవాడ సీఐ పెదిరెడ్ల ఈశ్వరరావు మీడియాకు వెల్లడించారు. (చదవండి: ఫోన్లో పరిచయం.. తరచూ మాట్లాడుతూ మరింత దగ్గరయ్యి.. ) భార్య స్నేహితురాలితో వివాహేతర బంధం వెంకటపతిపాలెం గ్రామానికి చెందిన అఖిలేష్ ఆటో డ్రైవర్‌గా పనిచేసేవాడు. రెండేళ్ల కిందట స్వాతి అనే వివాహితను తీసుకొచ్చేసి గాజువాక పరిధి నడుపూరు సమీప రామచంద్రానగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని నివసించేవాడు. అదే గ్రామంలో ఇద్దరు పిల్లలు, భర్తతో నివసిస్తున్న సంతోషి లక్ష్మి, స్వాతి డ్వాక్రా గ్రూపులో సభ్యులు కావడంతో వారి మధ్య స్నేహం పెరిగింది. ఈ క్రమంలో భార్య స్వాతి స్నేహితురాలు సంతోషి లక్ష్మిని అఖిలేష్ పరిచయం చేసుకుని దగ్గరయ్యాడు. అనంతరం గత ఏడాది మార్చిలో ఆమెను తీసుకుని అనకాపల్లి వెళ్లిపోయాడు. అక్కడి నుంచి పద్మనాభం వెళ్లిపోయి అక్కడ ఇల్లు అద్దెకు తీసుకుని ఆమెతో కాపురం పెట్టాడు. ఈ నేపథ్యంలో సంతోషి లక్ష్మి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టి ఇద్దరినీ అదుపులోకి తీసుకుని మల్కాపురంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ క్రమంలో సంతోషి బావ రామచంద్రానగర్ గ్రామానికి చెందిన సనా వాసు(28), అదే గ్రామానికి చెందిన అతని స్నేహితులు పుచ్చా వంశీ (20), కొవురు సందీప్‌రెడ్డి (20) కలిసి అఖిలేష్‌ను పద్ధతి మార్చుకోమని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన స్వాతి తన పుట్టింటికి వెళ్లిపోయింది. తండ్రి ఫిర్యాదుతో వెలుగులోకి వివాహితను తీసుకుని వెళ్లిపోయిన కుమారుడి ఆచూకీ నెలలు గడుస్తున్నా తెలియకపోవడంతో అనుమానించిన అఖిలేష్ తండ్రి వియ్యపు ముత్యాలునాయుడు గత ఏడాది నవంబరు 19న పరవాడ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గతంలో జరిగిన సంఘటనల ఆధారంగా సంతోషి లక్ష్మి బంధువులపై నిఘా ఉంచి కాల్ డేటా పరిశీలించగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. సనా వాసు, పుచ్చా వంశీ, సందీప్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించారు. వారిని హత్యా స్థలికి తీసుకెళ్లగా... అక్కడ మృతుని ప్యాంటు, పుర్రె, ఎముకలు లభించాయి. వాటి ఆధారంగా మృతుని గుర్తించడంతో నిందితులను రిమాండ్‌కు తరలించారు. సుమారు ఐదున్నర నెలల తర్వాత కేసును సీఐ ఈశ్వరరావు, ఎస్ఐ పి.రమేష్ ఛేదించారు. తీరు మారకపోవడంతో హత్య పోలీసులు కౌన్సెలింగ్ చేసినా, బంధువులు హెచ్చరించినా అఖిలేష్ తీరులో మార్పు రాలేదు. మళ్లీ గత ఏడాది జూన్‌లో సంతోషి లక్ష్మిని తీసుకొని ఎక్కడికో వెళ్లిపోయాడు. కొద్ది రోజుల తర్వాత 2021 జూలై 13న తాను గతంలో కాపురం పెట్టిన పద్మనాభం వచ్చాడు. అక్కడి అద్దె ఇంటిలోని సామగ్రి తీసుకెళ్లేందుకు యత్నిస్తుండగా... విషయం తెలుసుకున్న సంతోషి లక్ష్మి బావ సనా వాసు, అతని స్నేహితులు పుచ్చా వంశీ, సందీప్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. సంతోషి లక్ష్మి ఎక్కడ ఉందని వాకబు చేశారు. తనకు తెలియదని అఖిలేష్ చెప్పి తప్పించుకునేందుకు ప్రయత్నించగా... బయట మాట్లాడుకుందామని చెప్పి అదే రోజు సాయంత్రం 5.30 గంటల సమయంలో అఖిలేష్‌ను వాసు తన ద్విచక్ర వాహనంపై తీసుకుని బయలుదేరాడు. మరో ద్విచక్ర వాహనంపై వంశీ, సందీప్‌రెడ్డి బయలుదేరి... ముందుగా వేసుకొన్న ప్రణాళిక ప్రకారం ఆనందపురం మండలంలోని నీళ్ల కుండీలు కూడలి సమీప నిర్మాణుష్య ప్రదేశానికి అఖిలేష్‌ను తీసుకెళ్లి హతమార్చారు. బండరాయితో ముఖం గుర్తు పట్టలేని విధంగా మోదారు. అనంతరం రక్తం వాసనను పోలీసులు, పరిసర ప్రాంతీయులు గుర్తించకుండా ఉండేందుకు వీలుగా కారం, అల్లం వెల్లుల్లి పేస్టును హతుడి శరీరంపై పూసి తుప్పల్లో పడేసి వెళ్లిపోయారు. -
వివాహేతర సంబంధం: మాట్లాడాలని పిలిపించి లోపలికి రాగానే..
సాక్షి,జగద్గిరిగుట్ట(హైదరాబాద్): వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వ్యక్తి కత్తిపోట్లకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలోని రిక్షాపుల్లర్స్ కాలనీలో నివాసముండే అనీల్‌కుమార్ (28) గతంలో కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో శానిటరీ విభాగంలో పనిచేశాడు. అదే విభాగంలో పనిచేసే ఓ మహిళా కార్మికురాలితో పరిచయం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆమెతో తరచూ అనిల్‌కుమార్ ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఇది గమనించిన ఆమె కుమారుడు శ్రీరామ్ ఈ విషయమై తల్లిని నిలదీశాడు. తల్లితో అనిల్‌కుమార్‌కు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో అతన్ని ఎలాగైనా అంతమొందించాలని పథకం పన్నాడు. ఈ నేపధ్యంలో శ్రీరామ్ గురువారం మాట్లాడుకుందామని అనీల్‌కుమార్‌ను సోమయ్యనగర్‌లోని ఎంకె ఫంక్షన్ హాలు వద్దకు పిలిచాడు. అతను అక్కడికి రాగానే కర్రలతో దాడి చేసి కత్తితో ఉదరభాగంతో పొడిచాడు. ఈ దాడి నుండి తప్పించుకున్న అనిల్‌కుమార్ స్థానికుల సహాయంతో కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు దాడికి పాల్పడిన శ్రీరామ్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అక్రమ సంబంధం నేపధ్యంలోనే దాడికి పాల్పడినట్లు శ్రీరామ్ విచారణలో అంగీకరించినట్లు సమాచారం. -
స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం.. విషయం తెలియడంతో
సాక్షి, రాజమహేంద్రవరం: వివాహేతర సంబంధం హత్యకు దారి తీసింది. హతుడు నగరంలో చాలామందికి సుపరిచితుడు కావడంతో ఈ హత్య సంచలనంగా మారింది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీనివాస్‌నగర్‌కు చెందిన సీహెచ్ సునీల్ కాళేశ్వరి ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్‌లో డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. అతడి భార్య స్థానిక ఒక కార్పొరేట్ స్కూలులో ప్రిన్సిపాల్‌గా పని చేస్తోంది. అందరితో కలివిడిగా, స్నేహపూర్వకంగా ఉండటంతో నగరంలోని ప్రముఖులతో సునీల్‌కు పరిచయాలున్నాయి. సునీల్ కుటుంబానికి బొమ్మూరుకు చెందిన డెన్మర్ అనే వ్యక్తి కుటుంబానికి చాలాకాలంగా స్నేహం ఉంది. ఉద్యోగ రీత్యా డెన్మర్ అబుదాబీలో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో సునీల్‌కు, డెన్మర్ భార్యకు మధ్య కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలియడంతో డెన్మర్ ఈ వ్యవహారంపై ఆరా తీశాడు. ఈ నేపథ్యంలో అతడు వారం రోజుల క్రితం రాజమహేంద్రవరంలోని బొమ్మూరు ప్రాంతంలోని తన ఇంటికి వచ్చాడు. అప్పటి నుంచీ భార్యకు, డెన్మర్కు, సునీల్‌కు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా మంగళవారం ఉదయం సునీల్ భార్య యథావిధిగా డ్యూటీకి వెళ్లిపోయింది. ఇంట్లో సునీల్ ఒంటరిగా ఉన్నాడు. కొంతసేపటికి ఆ ఇంటికి డెన్మర్, అతడి భార్య చేరుకున్నారు. అక్కడ ముగ్గురి మధ్య గంట పైగా వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. వారు తిరిగి వెళ్లిన కొద్దిసేపటికి సునీల్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. చదవండి: కూకట్‌పల్లిలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్.. మహిళను ఫాలో అవుతూ.. ఇంట్లో కేకలు వినిపించడంతో అక్కడకు వెళ్లిన స్థానికులు సునీల్ పరిస్థితిని గమనించి అతడి భార్యకు సమాచారం అందించారు. ఆమె హుటాహుటిన స్థానిక ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడు. దీనిపై సమాచారం అందుకున్న ప్రకాశ్ నగర్ పోలీసులు సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. హత్యపై స్థానికులను ఆరా తీశారు. హతుడి దేహంపై మెడకు ఇరువైపులా, ఛాతి పైనా కత్తిపోట్లు ఉన్నాయి. హత్యకు ఉపయోగించిన కత్తిని హంతకులు అక్కడే పడేయడంతో దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: వికటించిన ఆర్ఎంపీ వైద్యం.. 20 రోజుల నరకయాతన.. చివరికి సునీల్ హత్య కేసులో నిందితులుగా భావిస్తున్న డెన్మర్, అతడి భార్యను బొమ్మూరులోని ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. డెన్మర్ భార్య చేతిపై కూడా కత్తి గాయాలున్నాయని చెబుతున్నారు. బహుశా సునీల్‌ను హతమార్చేందుకు డెన్మర్ ప్రయత్నించినప్పుడు అతడి భార్య అడ్డుకొనేందుకు ప్రయత్నించి ఉంటుందని, ఆ క్రమంలోనే ఆమెకు కూడా కత్తి గాయాలయ్యాయని అనుమానిస్తున్నారు. -
భార్యతో వివాహేతర సంబంధం.. భర్త, మరో ముగ్గురు కలిసి..
సాక్షి, జోగిపేట(మెదక్): పాతకక్షలు, వివాహేతర సంబంధంతో హత్య చేసినట్లు.. ఒక గ్రామంలో హత్య చేసి అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని మరో ఊరుకు తీసుకెళ్లి అక్కడ ఒక ఇంటికి మృతదేహాన్ని వేలాడదీసినట్లు విచారణలో తేలిందని పోతులబొగుడ హత్య గురించి పోలీసులు వివరించారు. ఆదివారం జోగిపేట సీఐ కార్యాలయంలో సీఐ శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. 28 డిసెంబర్, 2021న వట్పల్లి మండలం గొర్రెకల్ గ్రామానికి చెందిన మల్కగోని అశోక్(26) హత్యకు గురయ్యాడు. కాగా అశోక్ అదే గ్రామానికి చెందిన బోడ అంబయ్య స్నేహితులు. ఈ నేపథ్యంలో అశోక్.. అంబయ్య భార్యతో వివాహేతర సంబంధం ఏర్పర్చుకున్నాడు. అదే గ్రామానికి చెందిన బోడ రాజు, ఉసిరికపల్లి రమేశ్, ఆత్కూరి నాగరాజులకు గొర్రెల వ్యాపారంలో అశోక్‌తో గొడవలు ఉన్నాయి. గణేశ్ నిమజ్జనం, బీరప్ప జాతర సమయంలో కూడా వీరి మధ్య గొడవలు జరిగాయి. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ చేసి రాజీ కుదిర్చారు. తన భార్యతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడని బోడ అంబయ్య... ప్రతి విషయంలో గొడవ పడుతున్నాడని రాజు, రమేశ్, నాగరాజు పగ పెంచుకున్నారు. నలుగురు కలిసి ఎలాగైనా అశోక్‌ను అంతం చేయాలని ప్లాన్ చేశారు. డిసెంబర్ 28వ తేదీన రాత్రి అశోక్ తన రేకుల షెడ్డులో మద్యం సేవిస్తుండగా నలుగురు అక్కడికి వెళ్లారు. అక్కడ గొడవపడి అశోక్ గొంతును టవల్‌తో బోడ అంబయ్య గట్టిగా బిగించగా, మిగిలిన వారు కదలకుండా కాళ్లు పట్టుకున్నారు. కొద్దిసేపటికి ఊపిరాడక అశోక్ మృతి చెందాడు. నేరం నుంచి బయటపడేందుకు.. హత్య చేసిన తర్వాత నేరం నుంచి బయటపడేందుకు బోడ అంబయ్య తన భార్య సొంతూరైన పోతులబొగుడ గ్రామానికి రెండు బైక్‌లపై అశోక్ మృతదేహాన్ని తరలించారు. ఎవరికీ అనుమానం రాకుండా అంబయ్య అత్తగారి ఇంటి గోడకు మృతదేహాన్ని వేలాడదీశారు. అక్కడి నుంచి ఎవరికంట పడకుండా ఎవరింటికి వారు వెళ్లిపోయారు. సోదరుడి హత్యపై మల్కగోని మల్లేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. సీసీ ఫుటేజీల ఆధారంగా, నమ్మదగిన సమాచారం మేరకు నిందితులను గొర్రెకల్ గ్రామంలో అదుపులోకి తీసుకొని విచారించడంతో వారు నేరాన్ని ఒప్పుకున్నారు. దీంతో వారిని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం జోగిపేట కోర్టుకు పంపుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో వట్పల్లి ఎస్ఐ దశరథ్, పుల్కల్ ఎస్ఐ నాగలక్ష్మి, పోలీస్ సిబ్బంది ఉన్నారు.