
బండి ధనూజ (ఫైల్)
సాక్షి, హుస్నాబాద్(మెదక్): అదనపు వరకట్నం వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన అక్కన్నపేట మండలం కేశనాయక్‌తండా గ్రామపంచాయతీ పరిధి గొల్లపల్లిలో జరిగింది. శుక్రవారం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బెజ్జంకి మండలానికి చెందిన ధనూజకు అక్కన్నపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన బండి సంజీవ్‌తో ఏడాది క్రితం వివాహం జరిగింది. వివాహ సమయంలో వధువు తల్లిదండ్రులు సంజీవ్‌కు రూ.12 లక్షల కట్నం, బంగారు ఆభరణాలు ఇచ్చారు.
కొన్ని నెలలు వీరి సంసారం ససజావుగా సాగింది. ఇటీవల భర్త సంజీవ్, అతడి తల్లిదండ్రులు అదనపు కట్నం తీసుకోరావాలని ధనూజను వేధిస్తున్నారు. అంతేకాకుండా సంజీవ్‌కు గ్రామంలోని మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో తరచూ భార్యను వేధించేవాడు. ఈ విషయంపై పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగినట్లు స్థానికులు తెలిపారు. మృతురాలి తల్లి కల్లూరి అయిలవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవి తెలిపారు.
చదవండి: మహిళపై కన్నేసిన హెడ్ కానిస్టేబుల్.. కంప్లైట్ ఇచ్చేందుకు వస్తే లోబర్చుకొని
Comments
Please login to add a commentAdd a comment