అన్నతోనే ‘సంబంధం’ అని పంచాయితీ.. భార్యపై చేయిచేసుకోవడంతో.. | Siddipet: Woman Sets Herself On Fire With 2 years Kid In Gajwel | Sakshi
Sakshi News home page

అన్నతోనే ‘సంబంధం’ అని పంచాయితీ.. భార్యపై చేయిచేసుకోవడంతో..

Dec 26 2021 12:42 PM | Updated on Dec 26 2021 1:43 PM

Siddipet: Woman Sets Herself On Fire With 2 years Kid In Gajwel - Sakshi

తల్లి, కొడుకు (ఫైల్‌)

స్వామి అన్న భాస్కర్‌కు నవితకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయంలో వారం రోజుల క్రితం కులపెద్దలు సముదాయించి స్వామికి నచ్చజెప్పారు. ఈ క్రమంలో శనివారం స్వామి వ్యవసాయ బావి వద్ద పత్తి ఏరేందుకు...

సాక్షి, కొండపాక(గజ్వేల్‌., సిద్దిపేట): కుటుంబ కలహాలతో రెండేళ్ల కుమారుడికి నిప్పంటించి తల్లి కూడా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని సిర్సనగండ్ల గ్రామంలో చోటు చేసుకుంది. సిర్సనగండ్లకు చెందిన గవ్వల అయ్యల్లం, బీరవ్వల రెండో కుమారుడు స్వామికి చేర్యాల మం డలం వేచరేణికి చెందిన పోశయ్య, మల్లవ్వల చిన్న కుమార్తె నవితను ఇచ్చి పదేళ్ల క్రితం వివాహం చేశారు. స్వామి వ్యవసాయ పనులతో పాటు కూలీ పను లు చేసుకుంటూ భార్య నవిత (25), కుమారుడు మణిదీప్‌ (2)ను పోషించుకుంటున్నాడు.

ఈ క్రమంలో స్వామి అన్న భాస్కర్‌కు నవితకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయంలో వారం రోజుల క్రితం కులపెద్దలు సముదాయించి స్వామికి నచ్చజెప్పారు. ఈ క్రమంలో శనివారం స్వామి వ్యవసాయ బావి వద్ద పత్తి ఏరేందుకు భార్యను రమ్మని చెప్పగా.. ఆమె రానని అనడంతో ఇద్దరికి గొడవ జరిగింది. దీంతో స్వామి భార్య పై చేయి చేసుకొని వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన నవిత మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కుమారుడు మణిదీప్‌పై పెట్రోల్‌ పోసి నిప్పంటించి తాను కూడా నిప్పంటించుకుంది.
చదవండి: ఇంతమంది చనిపోతుంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏం చేస్తోంది?

ఇంట్లో నుంచి వస్తున్న పొగను గమనించిన చుట్టుపక్కల వారు తలుపులు పగుల గొట్టి చూడగా ఇద్దరూ విగత జీవులై కనిపించా రు. తమ కూతురు నవితపై లేనిపోని అభాండాలు వేసి, వేధించి చంపారని మృతురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కూతురు మృతికి కారణమయ్యారని అత్త బీరవ్వ, బావ భాస్కర్, భర్త స్వామిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. త్రీటౌన్‌ సీఐ ప్రవీణ్‌కుమార్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. 
చదవండి: బాత్‌రూంలో ఉరివేసుకొని బాలింత ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement