SIDDIPET District
-
అన్నదాత మెచ్చిన రైతుబిడ్డ
పొలాలే బడులుగా రైతులకు సరికొత్త వ్యవసాయ పాఠాలు చెబుతుంది సిద్దిపేట జిల్లా అక్కన్నపేట (Akkannapet) మండలంలోని రామవరం క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారిణి (ఏఈవో) కరంటోతు శ్రీలత. ఆమె పాఠాలు వృథా పోలేదు. సేంద్రియ ఎరువుల ప్రాధాన్యత నుంచి మల్చింగ్ (mulching) పద్ధతిలో కూరగాయల సాగు వరకు ఎన్నో విషయాలను అవగాహన చేసుకొని కొత్తదారిలో ప్రయాణిస్తున్నారు అన్నదాతలు...అక్కన్నపేట మండలం పంతులు తండాకు చెందిన శ్రీలతకు ఏఈవో ఉద్యోగం వచ్చినప్పుడు ‘నాకు ఉద్యోగం వచ్చింది’ అనే సంతోషం కంటే ‘ఈ ఉద్యోగం వల్ల ఎంతోమంది రైతులకు సహాయంగా నిలబడవచ్చు’ అనే సంతోషమే ఎక్కువ. రైతు కుటుంబంలో పుట్టిన శ్రీలతకు రైతుల కష్టాలు, నష్టాలు తెలియనివేమీ కాదు. సాగులో మెలకువలు పాటించకపోవడం వల్ల పంట దిగుబడి రాక రైతులు నష్టపోతున్నారు. అయితే మెలకువలు పాటించకపోవడం నిర్లక్ష్యం వల్ల కాదు... అవగాహన లేకపోవడం వల్లే జరుగుతోందని గ్రహించిన శ్రీలత రంగంలోకి దిగింది.ఆమె పొలం దగ్గరికి వస్తే ఎక్కడి నుంచో అగ్రికల్చరల్ ఆఫీసర్ (Agriculture Officer) వచ్చినట్లు ఉండదు. తెలిసిన వ్యక్తో, చుట్టాలమ్మాయో వచ్చినట్లుగా ఉంటుంది. ఎలాంటి బేషజాలు లేకుండా అందరితో కలిసిపోయి వారి సమస్యలు తెలుసుకుంటుంది. పొలం దగ్గరికి వచ్చినప్పుడు శ్రీలత కూడా రైతుగా మారిపోతుంది. తానే స్వయంగా ట్రాక్టర్‌తో వరి పొలం దున్నుతుంది. వరిలో కాలిబాటల ప్రయోజనాల గురించి చెబుతుంది. ఎరువులు ఎంత మోతాదులో చల్లాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రత్యక్షంగా చేసి చూపిస్తోంది. వ్యవసాయ శాస్త్రవేత్తలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ నూతన సాగు పద్ధతులను తెలుసుకుంటూ, వాటిని తన క్లస్టర్ పరిధిలోని రామవరం, గండిపల్లి, కుందన్‌వానిపల్లి, మైసమ్మవాగు తండా రైతులకు చెబుతుంటుంది. రసాయనిక మందుల వినియోగం లేకుండా సేంద్రియ పద్దతిలో సాగు చేసే విధంగా రైతులనుప్రోత్సహిస్తోంది. గిరిజన గ్రామాల్లో సైతం మల్చింగ్ పద్ధతిలో కూరగాయలు ఎక్కువగా సాగు చేసేలా చేస్తోంది. చదవండి: చేనేతను ఫ్యాషైన్ చేద్దాం!పంటల్లో అధిక దిగుబడులు సాధించడానికి రసాయన ఎరువులు మోతాదుకు మించి వాడటం వల్ల భూసారం దెబ్బతింటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సేంద్రియ ఎరువులప్రాధాన్యత గురించి ఒకటికి పదిసార్లు చెప్పడమే కాదు సేంద్రియ ఎరువులను ఎలా తయారు చేసుకోవాలని అనే అంశంపై ప్రత్యేక వీడియోను తయారు చేసింది. జీవ ఎరువుల వినియోగంపై కూడా ప్రత్యేక వీడియోను తయారు చేసి రైతులకు అవగాహన కలిగిస్తోంది.క్షేత్రస్థాయిలోకి...రైతు అంటే నా దృష్టిలో ఒక పొలానికి యజమాని మాత్రమే కాదు... మన ఇంటి వ్యక్తి. మనకు అన్నం పెట్టే అన్నదాత. రైతుకు మంచి జరిగితే లోకానికి మంచి జరిగనట్లే. నా ఉద్యోగం ద్వారా రైతులకు ఏదో రకంగా మేలు చేసే సలహాలు, సూచనలు ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. – శ్రీలత – గజవెల్లి షణ్ముఖరాజు, సాక్షి, సిద్దిపేట– మాలోతు శ్రీనివాస్, సాక్షి, అక్కన్నపేట -
బాలభీముడు!
హుస్నాబాద్: పట్టణంలోని కేబీ కాలనీకి చెందిన ఎస్.కె ముంతాజ్ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం అధిక బరువుతో ఉన్న మగ బిడ్డకు జన్మనిచ్చింది. శిశువు 4 కిలోల 300 గ్రాముల బరువుతో ఉన్నాడు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని ఆస్పత్రి సూపరింటెండెంట్ రమేష్ రెడ్డి తెలిపారు. ముంతాజ్ కు ఇదివరకు ముగ్గురు ఆడపిల్లలు కాగా, నాల్గ వ సంతానంగా మగబిడ్డ జని్మంచడంపట్ల వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. -
ఇంట్లో ఆమె.. డ్యూటీలో ఆయన బాస్
గజ్వేల్: స్పౌజ్ ఆప్షన్ వల్ల ఒకే చోట ఉద్యోగాలు చేసే అరుదైన అవకాశాన్ని పలువురు దంపతులు దక్కించుకున్నారు. ఒకే కార్యాలయంలో భర్త బాస్‌గా ఉంటే, భార్య కిందిస్థాయి ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి కోవలోనే ములుగు ఏడీఏ (అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్(Assistant Director of Agriculture)(గా అనిల్ పనిచేస్తుండగా, భార్య ప్రగతి(Pragathi) ఆయన కిందిస్థాయి ఉద్యోగిగా ఏఓ(అగ్రికల్చర్ ఆఫీసర్)గా పనిచేస్తున్నారు. 2005లో ఏఓగా ఉద్యోగం పొందిన అనిల్(anil) ఆ తర్వాతికాలంలో ఏడీఏగా ప్రమోషన్ పొందారు. 2007లో ప్రగతిని పెళ్లి చేసుకున్నారు. ఆమెకు సైతం 2009లో ఏఓగా ఉద్యోగం వచ్చింది. కొండపాక, సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాల్లో పనిచేసిన అనిల్ 2021లో ములుగుకు ఏడీఏగా వెళ్లారు. సంగారెడ్డి, సిద్దిపేట భూసార కేంద్రాల్లో పనిచేసిన ప్రగతి 2018 నుంచి ములుగులో ఏఓగా కొనసాగుతున్నారు. ఇదే సమయంలో స్పౌజ్ ఆప్షన్లో తన భర్త ఏడీఏ రావడంతో ఆమెకు కలిసి వచి్చంది. ఇంట్లో ఆమె బాస్ అయితే ఉద్యోగంలో మాత్రం భర్త బాస్‌గా వ్యవహరిస్తున్నారు.ఆయన హెచ్ఎం.. ఆమె టీచర్ గజ్వేల్ మండలం కొడకండ్లకు చెందిన శ్రీశైలం, సరిత దంపతులు. 2008లోనే టీచర్లుగా ఉద్యోగం సాధించారు. ఇరువురు వివిధ ప్రాంతాల్లో పనిచేసి ప్రస్తుతం జగదేవ్‌పూర్ మండలం తిమ్మాపూర్ ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం ఒకే చోట పనిచేస్తున్నారు. ఈ పాఠశాలలో శ్రీశైలం హెచ్ఎంగా వ్యవహరిస్తుండగా, సరిత తన భర్త కిందిస్థాయి ఉద్యోగిగా టీచర్ విధులను నిర్వహిస్తున్నారు. -
ఊపిరి తీసిన ‘ఉపాధి’
సాక్షి, హైదరాబాద్/హుస్నాబాద్: సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉపాధి హామీ పనులు చేస్తుండగా బండరాళ్లు పడటంతో తల్లీకూతురు మృత్యువాతపడ్డారు. గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామానికి చెందిన కందారపు సారవ్వ (50), అన్నాజీ మమత (32) తల్లీకూతుళ్లు. ఉపాధి హామీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరు గ్రామ శివారులోని సంజీవరాయిని గుట్ట వద్ద మట్టి తవ్వకాల పనులకు వెళ్లారు. మట్టి బలంగా ఉండటంతో తవ్వడానికి సులువుగా ఉంటుందని పనిచేసే ప్రదేశంలో రాత్రి వేళ నీళ్లను పట్టారు. రోజు మాదిరిగానే పనులు చేస్తుండగా ఒక్కసారిగా దాదాపు 10 బండరాళ్లు నేలకూలాయి. అక్కడే పనిచేస్తున్న సారవ్వ, మమతపై బరువైన బండరాళ్లతో పాటు మట్టి పెళ్లలు పడి భూమిలో కూరుకుపోయారు. ఈ ప్రమాదంలో వారిద్దరూ అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విచారణకు మంత్రుల ఆదేశం.. బండరాళ్లు పడి ఇద్దరు మహిళలు మృతి చెందిన ఘటనపై మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ వేర్వేరుగా తీవ్ర ది్రగ్బాంతిని వ్యక్తం చేశారు. తక్షణం సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ మనుచౌదరితో ఫోన్లో మాట్లాడారు. అలాగే ఘటనపై విచారణకు ఆదేశించారు. ప్రమాదం జరిగే అవకాశం ఉన్న ఆ ప్రాంతంలో పనులు చేయొద్దని వారం రోజుల క్రితమే జిల్లా అధికారులు హెచ్చరించినా.. పనులు కొనసాగడం పట్ల మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేసారు. -
‘అన్న’లు నిర్మించిన పాఠశాల
సాక్షి, సిద్దిపేట: ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు మృతి అన్న వార్తలు విన్నప్పుడల్లా ఆ ఊరి ప్రజలు ఉలిక్కిపడతారు. 30 ఏళ్ల కిందట బాలకార్మికులుగా మగ్గిపోతున్న తమ బిడ్డల కోసం బడి కట్టించిన ఆ అన్నలను తలుచుకుని కలవరపడుతుంటారు. తెలంగాణలో నక్సల్స్ ప్రభావం తీవ్రంగా ఉన్న రోజుల్లో నక్సల్స్ సిద్దిపే ట జిల్లా దుబ్బాక మండలం దుంపలపల్లిలో పేద పిల్లల కోసం పాఠశాలను నిర్మించారు. ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాల అదే.గ్రామస్తుల విజ్ఞప్తితో.. 1991 వరకు ఈ గ్రామంలో పాఠశాల పూరి గుడిసెలో కొనసాగింది. ఆ సమయంలో దుంపలపల్లికి వచ్చిన పీపుల్స్‌వార్ నాగన్న దళానికి పాఠశాల భవనం నిర్మించాలని గ్రామస్తులు విన్నవించారు. దీంతో మూడు గదులను నిర్మించాలని నక్సల్స్ నేతలు నాగన్న, నగేష్, రామన్న, జనార్దన్‌లు నిర్ణయించారు. 1991లో పనులు ప్రారంభించి, 1995 నాటికి పూర్తిచేసి అందుబాటులోకి తెచ్చారు. అప్పట్లో ఈ బడి నిర్మాణానికి సుమారు రూ.5 లక్షల వరకు వెచ్చించినట్లు తెలిసింది. బడి నిర్మాణానికి గ్రామస్తులంతా శ్రమదానం చేశారు. కూల్చివేతను అడ్డుకున్న స్థానికులునక్సలైట్లు నిర్మించిన పాఠశాల శిథిలావస్థకు చేరటంతో వాటి స్థానంలో కొత్త భవనం నిర్మించాలని విద్యాశాఖ నిర్ణయించింది. మన ఊరు–మన బడి పథకంలో భాగంగా జీ ప్లస్ 1లో నాలుగు గదుల నిర్మాణానికి ఏడాదిన్నర క్రితం రూ.51 లక్షలు మంజూరు చేశారు. దీంతో పాత గదులను కూల్చివేసేందుకు అధికారులు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. ఈ గదులు నక్సల్స్‌కు గుర్తుగా ఉండాలని వాదించినట్లు తెలిసింది. దీంతో వెనక్కు తగ్గిన అధికారులు.. పాత బడి ఎదురుగా కొత్త పాఠశాల నిర్మాణం ఇటీవల ప్రారంభమైంది. ఈ పాఠశాలలో ప్రస్తుతం 1 నుంచి 5వ తరగతి వరకు బోధన సాగుతోంది. ఈ స్కూళ్లో ఇప్పటివరకు 943 మంది చదువుకున్నారు. ప్రస్తుతం 64 మంది (బాలురు 36, బాలికలు 28) విద్యార్థులు ఉన్నారు.కూల్చవద్దు అంటున్న స్థానికులుపాత భవనం కూల్చివేసి వాటి స్థానంలో నాలుగు తరగతి గదులు నిర్మించాలని మన ఊరు–మన బడి పథకంలో నిర్ణయించారు. పనులు ప్రారంభించే సమయంలో పాత గదులు కూల్చవద్దని స్థానికులు అడ్డుకున్నారు. ఎందుకని అడిగితే అప్పట్లో నక్సలైట్లు ఆ గదులను నిర్మించారని చెప్పారు. – నాగేశ్వర్ రావు, ప్రధానోపాధ్యాయుడు -
డబ్బాలు, బొట్టు పెట్టెలు, అట్టపెట్టెలు
సాక్షి, సిద్దిపేట: తరతరాల నుంచి సంక్రాంతి నోములు నోచుకునే కుటుంబాలూ ఉన్నాయి. సిద్దిపేట, హైదరాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, హనుమకొండ, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో పండుగ వేళ.. లలితాదేవి పుస్తకం, శ్రీచక్రం, మంగళగౌరి, పీటమీద పిల్లెన్లు, అరుగు మీద అద్దాలు, లాలి గౌరవమ్మ, డబ్బాలు, బొట్టు పెట్టెలు, అట్ట పెట్టెలు, పల్లకి, బతుకమ్మ, కుంకుమ భరణి, క్యారంబోర్డు, గాలిపటాలు, చరఖాలు ఇలా వందల రకాల వస్తువుల్లో ఏదో ఒకదానితో నోముకుంటారు. గౌరమ్మను పెట్టి పసుపు, కుంకుమ వేసి, ఏవైనా ఒకే రకమైన 13 వస్తువులను పెట్టి బంధువులు, స్నేహితుల ఇంటికెళ్లి వాయనం ఇచ్చి వస్తారు. బాలింతలు, చిన్న పిల్లలు ఉన్నవారు ఉగ్గు గిన్నె, నూనె పావు నోములు నోస్తారు. ఆరునెలల ముందే నోము సామగ్రి తెప్పిస్తాంపండుగకు ఆరు నెలల ముందే నోము సామగ్రి తెప్పిస్తాం. స్టీల్ అయితే మచిలీపట్నం, ఇత్తడి సామాను చెన్నై, ప్లాస్టిక్ వస్తువు లను ఢిల్లీ నుంచి తెప్పిస్తాం. మా షాప్‌నకు వివిధ జిల్లాలవారు వచ్చి కొనుగోలు చేస్తుంటారు. కొందరు ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తారు. – నార్ల నాగరాజు, నోముల సామగ్రి షాప్ యజమాని, సిద్దిపేట -
కొండపొచమ్మ సాగర్ డ్యామ్‌లో పడి ఐదుగురు మృతి
సాక్షి, సిద్ధిపేట జిల్లా: సిద్ధిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సెల్ఫీ సరదా యువకుల ప్రాణాలు తీసింది. మర్కూక్ మండలంలోని కొండపోచమ్మ సాగర్ డ్యామ్‌లో యువకులు గల్లంతయ్యారు. ఐదుగురు మృతి చెందగా, మరో ఇద్దరు యువకులు క్షేమంగా బయటపడ్డారు.మృతులను హైదరాబాద్ ముషీరాబాద్ వాసులు ధనుష్(20), లోహిత్(17), దినేశ్వర్(17), సాహిల్(19), జతిన్(17)గా గుర్తించారు. యువకులంతా 20 ఏళ్ల లోపు వారే. మృగాంక్(17), ఇబ్రహీం(20) ప్రాణాలతో బయటపడ్డారు. మృతి చెందిన ధనుష్, లోహిత్ ఇద్దరూ సొంత అన్నదమ్ములు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతిఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐదుగురు విద్యార్థుల గల్లంతుపై సీఎం ఆరా తీశారు. ఘటనా స్థలానికి వెళ్లాలని అధికారులను ఆదేశించారు. గజ ఈతగాళ్లను రంగంలోకి దించాలన్నారు.మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి: హరీష్రావుకొండపోచమ్మ సాగర్ ఘటనపై మాజీ మంత్రి హరీష్‌రావు దిగ్భ్రాంతి చెందారు. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇదీ చదవండి: సంక్రాంతికి వస్తానని.. తిరిగిరాని లోకాలకు -
పెట్టుబడులకు స్వర్గధామం తెలంగాణ
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ రాష్ట్రం ప్రపంచ పారిశ్రామిక పెట్టుబడులకు స్వర్గధామంగా నిలుస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. వ్యాపార వృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండ తిమ్మాపూర్‌లో హిందూస్థాన్ కోకాకోలా బెవరేజెస్ (హెచ్‌సీసీబీ) అత్యాధునిక గ్రీన్ ఫీల్డ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ సోమవారం ప్రారంభించారు. పరిశ్రమలో కలియతిరిగి పరిశీలించారు. అనంతరం మాట్లాడారు. పరిశ్రమ ద్వారా వచ్చే ఉద్యోగాలతోపాటు పరోక్ష ఉపాధితో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. పారిశ్రామిక వృద్ధి దిశగా చర్యలుహెచ్సీసీబీ పెట్టుబడులు ఈ ప్రాంతంలో పారిశ్రామిక వృద్ధి, పర్యావరణ పరిరక్షణ కలిసి సాగుతాయనే దానికి ఉదాహరణ అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధి కల్పన ద్వారా రాష్ట్రంలో అన్ని వర్గాల సమ్మిళిత వృద్ధికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. పర్యావరణ అనుకూల పారిశ్రామిక వృద్ధికి ఈ గ్రీన్ ఫీల్డ్ ఫ్యాక్టరీ ఉదాహరణ అని చెప్పారు. కగా.. హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ సీఈవో జువాన్ పాబ్లో రోడ్రిగ్జ్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని నీటి పైప్‌లైన్‌ను త్వరగా పూర్తి చేసిందని, తెలంగాణ పట్ల తమ నిబద్ధతను చాటుకుంటామని చెప్పారు. హెచ్‌సీసీబీ తెలంగాణలో రూ.3,798 కోట్ల పెట్టుబడితో వెయ్యి మందికిపైగా ఉపాధి అవకాశాలను కల్పించిందని పేర్కొన్నారు. -
27 ఏళ్ల దాకా అమ్మాయే..ఇపుడు అబ్బాయి!
దుబ్బాక: ఆ దంపతులకు తొలి సంతానంగా పండంటి ఆడబిడ్డ పుట్టింది. సాక్షాత్తూ లక్ష్మీదేవే ఇంటికి వచ్చిందని ఆ జంట మురిసిపోయింది. కావ్యశ్రీ అని చక్కని పేరుపెట్టి అల్లారు ముద్దుగా పెంచుకొన్నారు. కూతురిని పాఠశాలకు, కళాశాలకు పంపి చక్కగా చదివించారు. కానీ, కావ్యశ్రీ వయసు పెరుగుతున్నాకొద్ది ఆమె శరీరంలో మార్పులు రావటం మొదలైంది. యుక్త వయసు వచ్చేసరికి అబ్బాయిలా గడ్డం, మీసాలు వచ్చాయి. మొదట పెద్దగా పట్టించుకోలేదు. కానీ, 26 ఏళ్ల వయసు వచ్చేనాటికి ఆమె.. అతడిలా మారటం స్పష్టంగా తెలిసిపోయింది. ఆరోగ్య పరంగా కూడా కావ్యశ్రీ ఇబ్బందులు ఎదుర్కొన్నది. కంగారుపడిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించగా, కావ్యశ్రీ ఆడపిల్ల కాదని.. మగపిల్లాడని డాక్టర్లు తేల్చారు. దీంతో 27 ఏళ్ల వయసులో కావ్యశ్రీ కాస్తా.. కార్తికేయగా మారాడు. సిద్దిపేట జిల్లాలో ఈ అరుదైన ఘటన జరిగింది. అనారోగ్యంతో బయటపడిన నిజం.. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేటకు చెందిన దొంతగౌని రమేశ్, మంజుల మొదటి సంతానం కావ్యశ్రీ 1996 అక్టోబర్ 30న జన్మించింది. కావ్యశ్రీకి 2018 నుంచి శరీరంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. మగవారిలాగా గడ్డం, మీసాలు పెరగడం ప్రారంభమైంది. విపరీతమైన కడుపు నొప్పి, ఆరోగ్యపరమైన సమస్యలు రావడంతో తల్లిదండ్రులు రెండు నెలల క్రితం హైదరాబాద్‌లో వైద్యులను సంప్రదించారు. వారు ప్రత్యేక వైద్య నిపుణులను కలవాలని సూచించటంతో రెండు నెలల క్రితం బెంగళూరుకు చెందిన డాక్టర్లను కలిశారు. అక్కడి వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో నమ్మ లేని నిజాలు బయట పడ్డాయి. కావ్యశ్రీకి కడుపు కింది భాగంలో పురుషుల మాదిరిగా వృషణాలు ముడుచుకుని ఉండడంతోపాటు, 2.5 ఇంచుల అంగం బయటకు రావడం గమనించారు. ముడుచుకున్న వృషణాలను శస్త్ర చికిత్స చేసి సరి చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. ఛాతీ భాగం సైతం అబ్బాయిదేనని, అధిక కొవ్వు కారణంగా ఎత్తుగా కనపడిందని తేల్చారు. ఇలా ఛాతీ ఎత్తుగా పెరగడాన్ని గైనాకో మాస్టియో అంటారని వైద్యులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు కావ్యశ్రీ అని పిలుచుకున్న తమ సంతానానికి కార్తికేయ అని పేరు మార్చామని తల్లిదండ్రులు తెలిపారు. మూడు వారాల క్రితం ఆధార్ కార్డులో సైతం కార్తికేయగా పేరు మారి్పంచారు. కావ్యశ్రీ విద్యార్హతల సర్టిఫికేట్లలో సైతం పేరు మార్చాల్సి ఉంది. 2014 నుంచే కార్తికేయ బైక్, కారు సైతం నడుపుతున్నాడు. ప్రస్తుతం కార్తికేయ ఫ్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌గా, సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు.అబ్బాయిగా జీవించటం ఆనందంగా ఉంది నాకు టీనేజ్ వచ్చేసరికి అబ్బాయిలాగా గడ్డం, మీసాలు రావడం మొదలైంది. డాక్టర్లను సంప్రదించగా అసంకల్పిత రోమాలు అని చెప్పారు. కడుపు నొప్పి తరచుగా వస్తుండడంతో హైదరాబాద్‌లో నిపుణులను కలిశాం. దీంతో నాకు అసలు విషయం తెలిసింది. ఇప్పుడు అబ్బాయిగా జీవించడం నాకెంతో ఆనందంగా ఉంది. –దొంతగౌని కార్తికేయజన్యు లోపాల వల్లే.. కార్తికేయ విషయంలో క్రోమోజోమ్‌ల లోపంతో ఇలా జరిగింది. కొన్ని క్రోమోజోమ్‌లు ఎక్కువగా డామినేట్ చేయడం వల్ల వృషణాలు చిన్నగా పెరిగాయి. వృషణాలు కొంత భాగం కడుపులో ముడుచుకొని ఉండటాన్ని గుర్తించాం. తదుపరి వైద్య పరీక్షలకు నిపుణులను సంప్రదించాలని సూచించాం. అతడు అమ్మాయి కాదు అబ్బాయే. టెస్టిక్యులర్ ఫెమినైజేషన్ సిండ్రోమ్ కారణంగా బయటకు అమ్మాయిలా కనిపించినా అంతర్గతంగా మొత్తం పురుష లక్షణాలే ఉన్నాయి. ఇది చాలా అరుదైన లక్షణం. –డాక్టర్ హేమారాజ్ సింగ్, సర్జన్, దుబ్బాక ఆస్పత్రి సూపరింటెండెంట్కార్తికేయను అబ్బాయిలాగే గుర్తించండి నా కొడుకులో జన్యు మార్పుల వల్ల మేము ఇన్నాళ్లు అమ్మాయిగా భ్రమపడ్డాం. యుక్త వయస్సు వచ్చేసరికి వాడికి గడ్డం, మీసాలు రావడం గమనించాం. ఈ క్రమంలో కడుపు నొప్పి రావడంతో వైద్యులను సంప్రదించాం. అమ్మాయి కాదని అబ్బాయి అని నిర్థారించారు. సమాజం తప్పుగా అర్థం చేసుకోవద్దు. మా అబ్బాయిని అబ్బాయిలాగే గుర్తించండి. –మంజుల–రమేష్ గౌడ్, కార్తికేయ తల్లిదండ్రులు -
ఎంత పనిచేశావ్ నాన్న.. భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో
సిద్దిపేట : భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో ఓ భర్త తన ఇద్దరు పిల్లలతో చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట టూ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రింటింగ్ ప్రెస్ నిర్వహించే తేలు సత్యం ముదిరాజ్ (48) తేలు శిరీష (26) భార్యభర్తలు. వాళ్లిద్దరికి అశ్వన్ నందన్(7), త్రివర్ణ (5) ఇద్దరు పిల్లలు. కానీ విధికి ఆ చింతలేని కుటుంబాన్ని చూసి కన్నుకుట్టింది. హాయిగా సాగిపోతున్న సంసారంలో మనస్పర్ధలు చిచ్చు పెట్టాయి. దీంతో రెండో భార్య తేలు శిరీష కొన్నినెలల క్రితం భర్త సత్యంను వదిలి పుట్టింటికి వెళ్లింది.పలు మార్లు కాపురానికి రావాలని కోరినా.. శిరీష కనికరించలేదు. దీంతో మనోవేధనకు గురైన సత్యం ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. తాను ప్రాణాలు తీసుకుంటే పిల్లలు అనాధలవుతారని భావించిన సత్యం.. తన పిల్లలు (రెండో భార్య పిల్లలు) అశ్వన్ నందన్, త్రివర్ణలతో కలిసి సిద్దిపేట చింతల చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.తండ్రి పిల్లలు కలిసి చింతల చెరువులో దూకడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చింతల చెరువులో దూకి బాధితుల్ని కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ముగ్గురి ప్రాణాలు అనంతలోకాల్లో కలిసిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న సిద్ధిపేట టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
డాక్టర్ చదువుకు డబ్బుల్లేక..కూలి పనులకు..
హుస్నాబాద్ రూరల్: వైద్యురాలు కావాలన్నది ఆ అడవి బిడ్డ తపన.. అందుకోసం కూలి పనులు చేస్తూనే కష్టపడి చదివింది. నీట్లో 447 మార్కులు సాధించింది. ప్రైవేటు కాలేజీలో సీటు రావడంతో ఫీజులకు డబ్బుల్లేక.. ఎప్పట్లాగే తల్లిదండ్రులతో పాటు కూలి పనులకు వెళ్తోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం భల్లునాయక్ తండాకు చెందిన లావుడ్య లక్ష్మి, రమేశ్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. దంపతులు కూలిపని చేస్తూ కూతుళ్లను చదివిస్తున్నారు. పెద్ద కూతురు బీ–ఫార్మసీ చేస్తోంది. చిన్న కూతురు దేవిని కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డి గురుకులంలో చేరి్పంచి చదివించారు.పదో తరగతి, ఇంటర్మిడియెట్‌లో మంచి మార్కులు సాధించిన దేవి.. డాక్టర్ కావాలన్న లక్ష్యంతో ఏడాదిగా తల్లిదండ్రులతో పాటు కూలి పనులకు వెళ్తూనే నీట్‌కు సిద్ధమైంది. నీట్లో 447 (2లక్షల 80 వేల ర్యాంకు) మార్కులు సాధించడంతో తల్లిదండ్రులు సంతోషపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు వస్తుందని అశించిన లావుడ్య దేవికి.. సిద్దిపేట సురభి మెడికల్ కాలేజీలో సీటు వచి్చంది. ప్రైవేటు మెడికల్ కాలేజీలో చదువుకు ఏటా రూ.3.5 లక్షల వరకు ఖర్చవుతుంది. అంత స్థోమత తల్లిదండ్రులకు లేకపోవడంతో.. చేసేదిలేక దేవి కూలి పనులకు వెళ్తోంది. ఆస్తులు అమ్మి ఫీజు కడదామంటే అడవిలో పెంకుటిల్లు ఒకటే దిక్కు. దానిని కొనేవారు కూడా ఎవరూ లేరు. దాతలు ముందుకొచ్చి ఆర్థిక సహాయం చేస్తే తమ బిడ్డ ఆశయం నెరవేరుతుందని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. -
సిద్ధిపేట: 106 మంది ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్
సాక్షి, సిద్ధిపేట: జిల్లాలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన 106 మంది ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్‌కు గురయ్యారు. రెండురోజుల క్రితం మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలిసి సమావేశంలో పాల్గొన్న 106 మంది ప్రభుత్వ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ సభలో పాల్గొనడంపై ఎన్నికల కమిషన్, సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారికి ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. -
ఈదురు గాలులకు ఊయలతో సహా ఎగిరిపడి..
గజ్వేల్ రూరల్/ కౌడిపల్లి (నర్సాపూర్): రాష్ట్రంలో గాలి వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు మెదక్ జిల్లాలో ఊయలలో ఆడుకుంటున్న చిన్నారి ఎగిరి పక్కింటి డాబాపై పడి మృతిచెందగా, సిద్దిపేట జిల్లాలో చెట్టు కూలిన ఘటనలో ఓ టెన్త్ విద్యార్థి కన్నుమూశాడు. వడగళ్ల వాన ధాటికి సిద్దిపేట జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం కలిగింది. వివరాలు.. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని రాజిపేట జాజితండాకు చెందిన మాలోత్ మాన్సింగ్, మంజుల దంపతులకు ఒక కుమా రుడు, కవలలు సీత, గీత ఉన్నారు. దంపతులు కూలిపనులకు వెళ్లగా పిల్లలు, నానమ్మ ఇంటివద్ద ఉన్నారు. మంగళవారం గాలి వాన ధాటికి ఇంటి పైకప్పు ఒక్కసారిగా లేచిపోయింది. ఇంట్లో చీర ఉయ్యాలలో ఆడుకుంటున్న సీత (5) కూడా రేకులతో పాటు ఎగిరి సుమారు 20 మీటర్ల దూరంలో ఉన్న మరో డాబా ఇంటిపై పడింది. దీంతో చిన్నారి తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు చికిత్స కోసం నర్సాపూర్ ప్రైవేట్ ఆసుపత్రికి, అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో ఘటనలో.. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూరు గ్రామానికి చెందిన మన్నె సత్తయ్య–రేణుక దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు అనిల్ గజ్వేల్‌లో ఐటీఐ చదువుతుండగా, రెండో కుమారుడు వెంకటేశ్ (15) పదో తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం పరీక్షలు రాస్తున్నాడు. రోజుమాదిరిగానే పొలం వద్ద ఉన్న పశువులను సాయంత్రం వేళ ఇంటికి తోలుకొని వస్తున్నాడు. ఈ క్రమంలో ఈదురు గాలుల ధాటికి రోడ్డుపక్కనున్న చెట్టుకొమ్మ విరిగి వెంకటేశ్‌పై పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో దెబ్బతిన్న పంటలు ప్రశాంత్‌నగర్ (సిద్దిపేట): సిద్దిపేట జిల్లాలో మంగళవారం సాయంత్రం వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో కురిసిన వర్షం పంటలను దారుణంగా దెబ్బతీసింది. పట్టణంలో అత్యధికంగా 17 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, జిల్లా వ్యాప్తంగా 90.6 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, వరి, మామిడి, కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. గాలి దుమరానికి చెట్లు విరిగి ఇళ్లపై, వాహనాలపై పడి తీవ్ర ఆస్తి నష్టాన్ని కలిగించాయి. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే హరీశ్‌రావులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. -
చైన్ స్నాచింగ్‌కు మహిళ బలి
గజ్వేల్‌రూరల్: మహిళ మెడపై ఉన్న బంగారు ఆభరణాలను ఓ ఆగంతకుడు చోరీకి యత్నించాడు. ప్రతిఘటించేక్రమంలో ఆమెకు గాయాలై అపస్మారక స్థితిలో వెళ్లింది. ఆపై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూరులో చోటు చేసుకుంది. అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావు వెల్లడించిన వివరాల ప్రకారం..కొల్గూరుకు చెందిన చెన్న శ్రీనివాస్– శ్యామలత(55) దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. అందరికీ వివాహాలు జరగ్గా, కొడుకు హైదరాబాద్‌లో జాబ్ చేస్తూ అక్కడే ఉంటున్నాడు. దంపతులిద్దరూ స్థానికంగా ఉంటూ కిరాణ దుకాణం నడుపుతున్నారు. రోజు మాదిరిగానే శుక్రవారం తెల్లవారుజామున 5:30 గంటలకు నిద్రలేచిన శ్యామలత ఇంటి వెనుక భాగంలో ఉన్న డోర్ తీసి బాత్రూమ్కు వెళ్లింది. ఇదే సమయంలో ఓ ఆగంతకుడు ఇంటి వెనుక నుంచి లోపలికి ప్రవేశించాడు. శ్యామలత భర్త శ్రీనివాస్ బెడ్రూమ్లో నిద్రిస్తుండగా, ఆగంతకుడు తలుపు లకు గొళ్లెం పెట్టాడు. బాత్ రూమ్ నుంచి శ్యామలత ఇంట్లోకి వస్తున్న సమ యంలో ఆమె మెడలో ఉన్న 3 తులాల బంగారు గొ లుసు, చెవికి ఉన్న అరతులం కమ్మలను దొంగిలించేందుకు ప్రయత్నించాడు. శ్యామలత ప్రతిఘటిండంతో ఆమె ముఖంపై దిండు(మెత్త)ను అదిమి పట్టి ఆభరణాలను దొంగిలించాడు. ఈ క్రమంలోనే ఆమె చెవికి గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. భారతమ్మ పాలు పోసేందుకు వస్తుండగా, మంకీ క్యాప్ పెట్టుకున్న ఆగంతకుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్లడాన్ని గమనించింది. ఇంట్లోకి వెళ్లి బెడ్రూమ్ గొళ్లెం తీయగా భర్త శ్రీనివాస్ బయటకు వచ్చాడు. శ్యామలతను వెంటనే గజ్వేల్‌లోని ప్రైవే టు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యుడు మెరుగైన చికిత్స అవసరమని చెప్పడంతో గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ శ్యామలత మృతి చెందింది. -
వైభవంగా కొమురవెల్లి మల్లన్న కళ్యాణం
కొమురవెల్లి(సిద్దిపేట): సిద్దిపేట జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొమురవెల్లిలో మల్లికార్జున స్వామి కళ్యాణం ఆదివారం అంగరంగా వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణ వేడుకలను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కళ్యాణ వేదికతో పాటు పరిసర ప్రాంతాలు మల్లన్న నామస్మరణతో మారుమోగాయి. వీరశైవ ఆగమ శాస్త్ర ప్రకారం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని పీఠాధిపతి సిద్ధలింగ రాజదేశికేంద్ర శివాచార్యమహాస్వామి ఆధ్వర్యంలో కళ్యాణం జరిగింది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జనగామ శాసన సభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ గర్భగుడిలోని స్వామి వారి మూల విరాట్టును దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ స్వామి వారి కృపతో తమ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అములు చేస్తుందన్నారు. గత ప్రభుత్వం తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిందని అన్నారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ వచ్చే సంవత్సరం జరిగే కళ్యాణం నాటికి మేడలమ్మ, కేతమ్మ అమ్మవార్లకు బంగారు కిరీటాలు చేయించాలని ఆలయ ఈవోను ఆదేశించినట్లు తెలిపారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, మంత్రి సురేఖ కుటుంబ సమేతంగా ‘పట్నం’వేసి కొమురవెల్లి మల్లికార్జున స్వామి మొక్కును తీర్చుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. -
'ఆటా' ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో RO ప్లాంట్ ప్రారంభం
ఆటా వేడుకల్లో భాగంగా సిద్దిపేట జిల్లా ఇందుర్తి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఆర్వో(RO)ప్లాంట్‌ను ప్రారంభించారు.ఆటా సహకారంతో సుమారు 3 లక్షల రూపాయల నిధులతో స్కూల్ వేదికకు రేకుల షెడ్డు, పిల్లల కోసం తాగడానికి RO వాటర్ ప్లాంట్ నిర్మాణం, కంప్యూటర్, స్పోర్ట్స్ కిట్స్, స్కూల్ బ్యాగ్స్ అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ కాశీ కొత్త మాట్లాడుతూ..తనను ఈ స్థాయిలో నిలబెట్టిన భారతదేశానికి ఎంత చేసినా తక్కువేనని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ కాశీ కొత్త కుటుంబసభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. -
నట్టేట ముంచిన గూగుల్ మ్యాప్
అక్కన్నపేట (హుస్నాబాద్): ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్తున్నామా?.. జస్ట్ గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయడం, అందులో సూచించిన దారిని అనుసరిస్తూ ముందుకు వెళ్లిపోవడం మామూలైపోయింది. కానీ అన్నిసార్లు గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మి ముందుకెళ్తే నట్టేట మునగడం ఖాయం. తాజాగా ఓ డీసీఎం వ్యాన్ డ్రైవర్ గూగుల్ మ్యాప్ చూసుకుంటూ వాహనం నడిపి ఏకంగా ప్రాజెక్టులోకి వెళ్లిపోయాడు. సిద్దిపేట అక్కన్నపేట మండలం గుడాటిపల్లి గ్రామంలో నిర్మించిన గౌరవెల్లి ప్రాజెక్టు వద్ద ఈ ఘటన జరిగింది. పాల ప్యాకెట్లు తీసుకెళ్తూ.. హైదరాబాద్‌కు చెందిన ఓ డీసీఎం డ్రైవర్ శనివారం రాత్రి హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో వృధా అయిన పాల ప్యాకెట్లను వ్యాన్‌లో లోడ్ చేసుకున్నారు. తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరి హుస్నాబాద్ మీదుగా రామవరం వైపు ప్రయాణిస్తున్నారు. డ్రైవర్‌కు రోడ్డుపై సరైన అవగాహన లేక గూగుల్ మ్యాప్స్ చూసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో బంగారు లొద్దితండా దాటాక రామవరం వైపు వెళ్లాల్సిన ఉన్నా.. గుడాటిపల్లి వైపు మళ్లారు. మ్యాప్‌లో చూపించినట్టుగా ముందుకువెళ్లారు. కొంతదూరం వెళ్లాక నీరు ఎక్కువగా కనిపించింది. వాన వల్ల నీళ్లు నిలిచాయేమో అనుకుని ముందుకెళ్లాడు. క్యాబిన్ వరకూ నీళ్లు వచ్చాయి. డీసీఎం ఆగిపోయింది. దీంతో డ్రైవర్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఈదుకుంటూ బయటకు వచ్చాడు. చుట్టుపక్కల ఉన్న వారి వద్దకు వెళ్లి ఈ విషయం చెప్పాడు. ఆదివారం ఉదయం స్థానికులు జేసీబీ సాయంతో డీసీఎంను బయటకు లాగారు. రోడ్డుకు అడ్డుగా గోడ నిర్మించాలి నందారం స్టేజీ దాటాక రోడ్డుకు అవతలి వైపు గౌరవెల్లి ప్రాజెక్టు కట్టడంతో వెళ్లడానికి దారి లేదని స్థానికులు తెలిపారు. దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ మేర నీరు నిలిచి ఉంటుందని వివరించారు. రోడ్డుకు అడ్డుగా పెద్ద గోడ నిర్మించాలని.. లేకుంటే గూగుల్ మ్యాప్ నుంచి ఈ రోడ్డును తొలగించాలని సూచించారు. ఇంతకుముందు సెప్టెంబర్ 7న ఓ లారీ డ్రైవర్ ఇలాగే గూగుల్ మ్యాప్ చూస్తూ.. ప్రాజెక్టులోకి దూసుకెళ్లారని.. ఇప్పుడు డీసీఎం వ్యాన్ వెళ్లిందని తెలిపారు. -
రేవంత్ మాటమార్చి బుకాయిస్తున్నడు: మంత్రి హరీష్‌రావు
సాక్షి, సిద్ధిపేట జిల్లా: డీకేలు వచ్చినా, పీకేలు వచ్చినా మా ఏకే 47.. కేసీఆర్‌ను ఏం చేయలేరు అంటూ వ్యాఖ్యానించారు మంత్రి హరీష్‌రావు. సీఎం కేసీఆర్ గురువారం గజ్వేల్, కామారెడ్డిలో నామినేషన్లు వేయనున్నారు. తొలుత గజ్వేల్‌లో నామినేషన్ వేసి.. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో కామారెడ్డి చేరుకుంటారు. అక్కడా నామినేషన్ వేసి భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఐఓసీ మైదానం వద్ద హెలి ప్యాడ్ ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. అనంతరం హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘‘ఎన్నికల ప్రచారం ముగింపు సభ సీఎంతో గజ్వేల్ లో ఈనెల 28వ తేదీన నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. 2014, 2018లో కూడా ముగింపు సభ గజ్వేల్‌లో నిర్వహించాం. రాష్ట్రంలో అద్భుతమైన విజయం సాధించాం. అప్పుడు నుంచి ఇదే ఆనవాయితీ కొనసాగించబోతున్నాము. కేసీఆర్‌కు ఓటు వేసి రుణం తీర్చుకునేందుకు గజ్వేల్ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇచ్చిన హామీలే కాదు ప్రజలు కోరని పనులను కూడా గజ్వేల్‌లో సీఎం పూర్తి చేశారు. కరవు పీడిత ప్రాంతమైన గజ్వేల్ నేడు కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలమయ్యింది’’ అని మంత్రి పేర్కొన్నారు. గతుకుల గజ్వేల్‌ను బతుకుల గజ్వేల్గా కేసీఆర్ మార్చారు. విద్యాలయాలకు, రిజర్వాయర్లకు నిలయంగా మారింది. దేశ విదేశ ప్రతినిధులు గజ్వేల్‌కు వచ్చి ఇక్కడ అభివృద్ధిని మెచ్చుకుంటున్నారు. కోకాకోలా, ఫుడ్ ప్రాసెసింగ్ హబ్స్ రావడం వల్ల ఎంతో మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. గజ్వేల్ చరిత్రలో రానటువంటి రికార్డు మెజారిటీ ఈసారి కేసీఆర్‌కి రాబోతున్నది. లక్షలకు పైగా మెజారిటీతో గజ్వేల్‌లో గెలిచి తీరుతాం’’ అని మంత్రి హరీష్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ‘‘కొందరు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పెద్దవాళ్లపై పోటీ చేస్తే పెద్దవాళ్లం అవుతామని అనుకుంటున్నారు. కేసీఆర్‌కు సరితూగే నాయకుడు ఈ రాష్ట్రంలో మరెవరూ లేరు. జీవితాన్ని ఫణంగా పెట్టీ తెలంగాణ సాధించారు. ఇంకెవరు పోటీ వచ్చినా అది నామ మాత్రమే. కేసీఆర్ మా ముఖ్యమంత్రి అని గజ్వేల్ ప్రజలు గొప్పగా చెప్పుకుంటున్నారు. వేరే వాళ్లు ఉంటే ఆ గౌరవం గజ్వేల్‌కు ఉంటుందా? పక్క జిల్లాలు, నియోజకవర్గాల నుంచి కిరాయి మనుషులను తెచ్చుకొని షో చేయాల్సిన అవసరం మాకు లేదు. ఎక్కడినుండి నిన్న జనం వచ్చారో ప్రజలందరికీ తెలుసు. మా పార్టీ కుటుంబ సభ్యులే 25 వేల మంది దాకా ఉంటారు. నీళ్లు పట్టుకునే మంచినీళ్ల బిందెలో, పండిన ప్రతి గింజలో కేసీఆర్ కనిపిస్తున్నాడని ప్రజలు చెబుతున్నారు’’ అని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ద్రోహులంతా రాష్ట్రంలో ఏకమవుతున్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీకి, పవన్ కల్యాణ్ బీజేపీ పార్టీకి మద్దతు పలుకుతున్నారు. ఆనాడు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన శక్తులు నేడు కాంగ్రెస్, బీజేపీ రూపంలో తెలంగాణపై దాడి చేసేందుకు కుట్ర చేస్తున్నాయి. తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాళ్ళ చేతుల్లో పెడితే ఆగం అవుతాం. దయ్యాల పాలు చేసినట్లు అవుతుంది. రిస్క్ లేకుండా నీళ్లు, సాగు నీళ్లు, రైతు బంధు, రైతు బీమా, పింఛన్లు వస్తున్నాయి. మరి రిస్క్ తీసుకొని వేరే ప్రభుత్వానికి ఓటు వేయడం ఎందుకు? అంటూ హరీష్‌రావు ప్రశ్నించారు. ‘‘పండిన పంట ఏ తంటా లేకుండా ఊరూరా కాంట పెట్టీ కొనుగోలు చేస్తున్నారు. కర్ణాటక సీఎం ధన్యవాదాలు చెప్పాలి. కర్ణాటకలో 5 గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నట్లు ఒప్పుకున్నారు. రేవంత్ రెడ్డి 3 గంటల కరెంట్ చాలు అని చెప్పి ఇప్పుడు మాట మార్చాడు. నేను అనలేదు అని బుకాయిస్తున్నడు. అన్న మాట, వీడియో అందరూ చూశారు. ఖుల్లం ఖుల్లా అన్నవు. గూగుల్ చేసి చూడు రేవంత్ రెడ్డి. 5 గంటలు కావాలి అనేవాళ్లు కాంగ్రెస్‌కు, 24 గంటల కరెంట్ కావాలనుకునేవాళ్లు బీఆర్ఎస్కు ఓటు వేస్తరు. పుట్టిన బిడ్డ తల్లి చేతిలో ఉంటే మేలు ఎలా జరుగుతుందో, కెసీఆర్ చేతిలో తెలంగాణ ఉంటే అలా మేలు జరుగుతుంది. సురక్షితంగా ఉంటుంది’’ అని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. -
నేడు కోనాయిపల్లికి కేసీఆర్
సాక్షి, సిద్దిపేట/నంగునూరు: ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లిలోని వేంకటేశ్వర స్వామి ఆలయం చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే ఈ ఆలయం బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు సెంటిమెంట్. ఆయన ఏ పని చేపట్టినా మొదట ఇక్కడి వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి, ఆశీస్సులు తీసుకున్నాకే మొదలుపెడతారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గజ్వేల్, కామారెడ్డిల నుంచి పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్, సిద్దిపేట నుంచి పోటీ చేస్తున్న హరీశ్‌రావు ఇద్దరూ తమ నామినేషన్ పత్రాలతో శనివారం ఈ ఆలయానికి వస్తున్నారు. వేంకటేశ్వరస్వామి వద్ద ఆ పత్రాలను ఉంచి పూజలు చేశాక వాటిపై సంతకాలు చేయనున్నారు. వారు ఈ నెల 9న ఆలయానికి రానున్నట్టు ప్రకటించినా ముందుగానే వస్తున్నారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్‌లో చేపట్టిన రాజశ్యామల సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం శుక్రవారంతో ముగిసింది. దీంతో ముందుగానే కోనాయిపల్లి వెళ్లి ప్రత్యేక పూజలు చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈ నెల 9న కేసీఆర్ తన నామినేషన్లను దాఖలు చేయనున్నారు. వెంకన్న ఆశీస్సులతోనే ఉద్యమంలోకి.. 2001లో డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కేసీఆర్ టీడీపీతోపాటు అన్ని పదవులకు రాజీనామా చేసి, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోకి దిగారు. ఆ సమయంలోనూ కోనాయిపల్లి ఆలయంలో పూజలు చేశారు. హైదరాబాద్‌లోని జలదృశ్యంలో టీఆర్ఎస్ని స్థాపిస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రం ఏర్పడేదాకా పార్టీ చేపట్టే కార్యక్రమాలను ఇక్కడి నుంచీ ప్రారంభించారు. 1985 నుంచీ సంప్రదాయంగా.. కేసీఆర్ 1985 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే సమయంలో కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశా రు. ఆ ఎన్నికల్లో గెలవడంతో కోనాయిపల్లి ఆల యం ఆయనకు సెంటిమెంట్‌గా మారింది. 1989, 1994, 1999, 2004, 2009, 2014, 2018.. ఇలా ప్రతి ఎన్నికలో ఆయన ఈ ఆలయంలో పూజలు చేశాకే నామినేషన్ వేస్తూ వచ్చారు. మంత్రి టి.హరీశ్‌రావు నామినేషన్‌కు ముందు కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు చేశాకే నామినేషన్ వేస్తున్నారు. -
కేసీఆర్ పాలనలో రాష్ట్రం పురోగతి
ప్రశాంత్‌నగర్ (సిద్దిపేట): ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతిపథంలో ముందుకు సాగుతోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో మంత్రి హరీశ్‌రావు దంపతులు సద్దుల బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు. కోమటి చెరువువద్ద మంత్రితో మహిళలు, యువతులు సెల్పిలు, ఫొటోలు దిగడానికి పోటీపడ్డారు. మహిళలు తీసుకువచ్చిన ఫలహారాలు తింటూ మంత్రి వారితో ముచ్చటించారు. అనంతరం మాట్లాడుతూ ఎండాకాలాన్ని వానా కాలంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, కుంటలు కాళేశ్వరం జలాలతో నిండు కుండల్లా మారాయన్నారు. సమైక్య రాష్ట్రంలో కరెంటు లేక ఇబ్బందులు పడ్డామని, నేడు నీరు, విద్యుత్ సరఫరా నిరంతరం జరుగుతోందని అన్నారు. మహిళల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ప్రజలందరూ బతుకమ్మ పండుగ చేసుకున్న విధంగానే దసరాను కూడా వైభవంగా నిర్వహించుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు ఆయన దసరా శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు బీఆర్ఎస్ యువజన నాయకుడు జువ్వన కనకరాజు ఆధ్వర్యంలో తయారు చేసిన భారీ బతుకమ్మను మంత్రి హరీశ్‌రావు తిలకించారు. -
సిద్దిపేట నుంచి..మరో టీఆర్ఎస్
సాక్షి, సిద్దిపేట: రాష్ట్రంలో టీఆర్ఎస్ (తెలంగాణ రాజ్య సమితి) పేరుతో మరో కొత్త రాజకీయ పార్టీ అవతరించింది. సిద్దిపేట జిల్లాకు చెందిన సీఎం కేసీఆర్ గతంలో టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి, ఇటీవల దానిని బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి)గా మార్చిన విషయం తెలిసిందే. తాజాగా అదే సిద్దిపేట జిల్లా పొన్నాల గ్రామానికి చెందిన ఉపాధి హామీ రాష్ట్ర కౌన్సిల్ మాజీ సభ్యుడు తుపాకుల బాలరంగం పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ రాజ్య సమితి రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిబ్రవరి 13న దరఖాస్తు చేశారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆ పార్టీని రిజిస్టర్ చేసింది. దీనిని టీఆర్ఎస్ అని సంక్షిప్తంగా పేర్కొంటున్నారు. బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం ఈ పార్టీకి గ్యాస్ సిలిండర్ గుర్తు కేటాయించింది. బహుజనులకు రాజ్యాధికారం కోసమే..: రాష్ట్ర జనాభాలో 75 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలున్నా రాజ్యాధికారం దక్కడంలేదు. ముదిరాజ్‌లు 14 శాతం, పద్మశాలీలు 8 శాతం, యాదవ్‌లు 12 శాతం, గౌడలు 10 శాతం జనాభా ఉన్నా, ఐదుశాతం లోపు జనాభా ఉన్నవారికే ప్రస్తుతం పదవులు దక్కుతున్నాయి. రాబోయే కాలంలో బహుజనులకు రాజ్యాధికారం కోసమే పార్టీని స్థాపించాం. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 50 శాతం సీట్లలో పోటీ చేస్తాం. – బాలరంగం -
బతుకమ్మ వేడుకల్లో విషాదం.. ముగ్గురు కార్మికులు గల్లంతు
సాక్షి, సిద్దిపేట జిల్లా: జగదేవ్‌పూర్ మండలం తీగుల్ గ్రామంలో బతుకమ్మ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. బతుకమ్మ పండుగ కోసం చెరువులో చెత్తను తొలగిస్తుండగా ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు గల్లంతయ్యారు. గల్లంతయిన కార్మికులు గిరిపల్లి బాబు, గిరిపల్లి భారతి, యాదమ్మల కోసం స్థానికులు గాలిస్తున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. చదవండి: కూతురు ప్రేమ వ్యవహారం.. ఉన్మాదిగా మారిన తండ్రి ఏం చేశాడంటే -
100 సీట్లతో బీఆర్ఎస్ ప్రభంజనం
దుబ్బాక టౌన్/రామాయంపేట: ‘తెలంగాణలో జాకీలు పెట్టి లేపినా బీజేపీ లేవదు.. కాంగ్రెస్ గెలిచేది లేదు సచ్చేది లేదు’అని ఆరి్ధక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. సోమవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి విగ్రహావిష్కరణ, ఐఓసీ భవన సముదాయాన్ని ప్రారంభించారు. అలాగే.. మెదక్ జిల్లా రామాయంపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. ఈసారి 100కు పైగా సీట్లతో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టిస్తుందని, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మోదీ, అమిత్ షాలే కాదు ఎవరొచ్చినా బీఆర్ఎస్కు ప్రజలు అండగా ఉంటారన్నారు. కాంగ్రెస్‌లో ఏం జరుగుతుందో.. ఆ పారీ్టలో రేవంత్‌రెడ్డి పాత్ర ఏమిటో అందరికీ తెలిసిందేనన్నారు. ఎమ్మెల్యే రఘునందన్‌రావు దుబ్బాకకు నయాపైసా నిధులు తీసుకురాలేదని, బీజేపీ గెలిస్తే ఏమవుతుందో ఇట్టే తెలుస్తుందని విమర్శించారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కుటుంబానికి రాజకీయంగా సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మెదక్‌లో జనబలం.. ధనబలానికి మధ్య పోటీ మెదక్‌లో జనబలం.. ధనబలం, న్యాయం.. అన్యాయం మధ్య పోటీ జరగబోతోందని మంత్రి హరీశ్‌రావు ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి రోహిత్నుద్దేశించి వ్యాఖ్యానించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో డబ్బుల సంచులతో కొందరు బయలుదేరారని, అలాంటివాళ్లు కావాలా.. ఎల్లవేళలా మీ కష్టాల్లో పాలుపంచుకునే వాళ్లు కావాలా? అని ప్రజలే ఆలోచించుకోవాలని కోరారు. -
చదువు మాని.. చపాతీల తయారీ.. గురుకులంలో విద్యార్థుల వంటావార్పు
చేర్యాల(సిద్దిపేట): వసతి గృహంలో హాయిగా చదువుకోవలసిన విద్యార్థులు వంట పనివారిగా మారి చపాతీలు తయారు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాలలోని గురుకుల పాఠశాలలో ఆదివారం జరిగిన ఈ సంఘటన వివరాలివి. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆదివారం ఉదయం అల్పాహారంలో చపాతీలు అందించాల్సి ఉంటుంది. కానీ వాటి తయారీకి సరిపడా మనుషులు లేకపోవడంతో విద్యార్థులతో చేయించారు. ప్రిన్సిపాల్ సహకారంతోనే కాంట్రాక్టర్ ఇలా పనులు చేయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని గురుకుల ప్రిన్సిపాల్ అశోక్‌బాబు వద్ద ప్రస్తావించగా.. తమకు ఉన్నతాధికారుల నుంచి అనుమతి ఉందని స్పష్టం చేశారు. అందువల్లే విద్యార్థులతో వంట పని చేయిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. -
తెలంగాణ పల్లెకు పట్టం
సాక్షి, న్యూఢిల్లీ/చిన్నకోడూరు(సిద్దిపేట): రెండు తెలంగాణ గ్రామాలను ఉత్తమ పర్యాటక గ్రామాలుగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. కాకతీయుల కాలం నుంచీ హస్తకళలకు ప్రసిద్ధి చెందిన జనగామ జిల్లా పెంబర్తితోపాటు సిద్దిపేట జిల్లా చంద్లాపూర్ గ్రామం ఈ అవార్డులను దక్కించుకున్నాయి. ఈ నెల 27న ఢిల్లీలో జరగనున్న అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాలను అందించనున్నారు. చంద్లాపూర్ జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల మంత్రి హరీశ్‌రావు గ్రామ ప్రజలకు అభినందనలు తెలిపారు. హరీశ్‌రావు అందించిన తోడ్పాటుకు ఈ గుర్తింపు అని జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ అన్నారు. పెంబర్తి... చేతివృత్తుల నైపుణ్యానికి ప్రతీక ఇత్తడి, కంచు లోహాలతో పెంబర్తి గ్రామంలో చేసే కళాకృతులకు ఉన్న డిమాండ్ దృష్ట్యా వీటిని పెద్దమొత్తంలో అమెరికా, జర్మనీ, బెల్జియం, జపాన్ తదితర దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. సంస్కృతీ సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే కళాకృతులు, దేవతల విగ్రహాలు, కళాఖండాలు, గృహాలంకరణ వస్తువులెన్నో ఇక్కడి కళాకారుల చేతివృత్తుల నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తాయి. దీనికితోడు ఏటా 25 వేల మంది పర్యాటకులు ఈ గ్రామాన్ని సందర్శిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణ సంస్కృతిని ప్రోత్సహించే విషయంలో ఇక్కడి కార్మికులు చేస్తున్న కృషి ద్వారా జరుగుతున్న ఆర్థిక కార్యకలాపాలు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని.. పెంబర్తిని ఉత్తమ పర్యాటక గ్రామంగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. పెంబర్తి ఉత్పత్తులకు జీఐ (జియోగ్రాఫికల్ ఇండికేషన్) ట్యాగ్ గుర్తింపు విషయంలోనూ కేంద్రం చొరవతీసుకుంది. చంద్లాపూర్.. కళాత్మకత, చేనేతల కలబోత రంగనాయక స్వామి ఆలయం, రంగనాయక కొండలు, ఇక్కడి ప్రకృతి.. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తే.. ఈ ప్రాంతంలో నేసే ‘గొల్లభామ’ చీరలు తెలంగాణ కళాసంస్కృతికి ప్రతిబింబాలుగా నిలుస్తున్నాయి. గొల్లభా మ చీర.. తెలంగాణ నేతన్నల కళా నైపుణ్యా నికి నిలువుటద్దం. కళాత్మకత, చేనేతల కలబో తకు నిదర్శనం. నెత్తిన చల్లకుండ, చేతిలో పె రుగు గురిగి, కాళ్లకు గజ్జెలు, నెత్తిన కొప్పుతో కళకళలాడే యాదవ మహిళల వైభవం ఈ చీర ల్లో ఇమిడిపోయి కనిపిస్తుంది. రంగనాయక స్వామి ఆలయం, పరిసర ప్రాంతాలు గ్రామీ ణ పర్యాటకానికి ప్రసిద్ధి చెందిన నేపథ్యంతో పాటు గొల్లభామల చీరలకున్న ప్రత్యేకత కార ణంగా ఈ ప్రాంతాన్ని ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుల చొరవతో చంద్లాపూర్ లోని రంగనాయకసాగర్ రిజర్వాయర్ గొప్ప పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతోంది. -
కోకాకోలా రూ.647 కోట్ల అదనపు పెట్టుబడి
సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట జిల్లాలో కోకాకోలా సంస్థ నిర్మిస్తున్న కొత్త బాట్లింగ్ ప్లాంట్‌లో మరో రూ.647 కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నామని సంస్థ ఉపాధ్యక్షుడు జేమ్స్ మేక్‌గ్రివి ప్రకటించారు. రూ.1000 కోట్ల పెట్టుబడితో ఈ యూనిట్ నిర్మాణం కోసం గత ఏప్రిల్ 22న రాష్ట్ర ప్రభుత్వంతో కోకాకోలా సంస్థ ఎంఓయూ చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారం, ప్లాంట్ నిర్మాణంలో వేగం, ఈ ప్రాంతంలో వ్యా పార వృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు జేమ్స్ వెల్లడించారు. ఈ ప్లాంట్ డిసెంబర్ 24 నాటికి పూర్తి కానుందని తెలిపారు. తమకు ప్రపంచంలో మూడో అతిపెద్ద మార్కెట్ భారతదేశం అని, ఇక్కడ తమ కార్యకలాపాల విస్తరణపై దృష్టి పెట్టామని చెప్పారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావుతో శనివారం న్యూయార్క్‌లో సమా వేశమై ఈ మేరకు విస్తరణ ప్రణాళికలను తెలియజేశారు. తెలంగాణలో కోకాకోలా పెట్టుబడులు రెట్టింపు: రాష్ట్రంలో తమ పెట్టుబడులను రెట్టింపు చేయనున్నామని జేమ్స్ మేక్‌గ్రివి ఈ సందర్భంగా వెల్లడించారు. అమీన్‌పూర్‌లోని తమ బాట్లింగ్ ప్లాంట్ విస్తరణకు గతంలో రూ.100 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో రెండో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సంసిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. కరీంనగర్, వరంగల్ ప్రాంతంలో ఈ తయారీ కేంద్రం వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రతిపాదిత నూతన ప్లాంట్‌నూ పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రంలో రూ.2500 కోట్లకు పైగా పెట్టుబడులను పెట్టినట్లు అవుతుందని తెలియజేశారు. ఇటీవల కాలంలో అత్యంత తక్కువ సమయంలో వేగంగా విస్తరించిన ప్రాంతంగా తెలంగాణ నిలుస్తుందన్నారు. భారీ పెట్టుబడులకు ఇదే సాక్ష్యం: రాష్ట్రానికి అన్ని రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తు న్నాయనడానికి తాజాగా కోకాకోలా సంస్థ చేసిన ప్రకటనే సాక్ష్యంగా నిలుస్తుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఐటీ, అనుబంధ రంగాలు, ఫార్మా, లైఫ్ సైన్సెస్/ అనుబంధ రంగాలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్ వంటి రంగా ల్లో భారీగా పెట్టుబడులను తెలంగాణ ఆకర్షించిందన్నారు. కోకాకోలా రాష్ట్రంలో పెట్టుబడులను రెట్టింపు చేసేందుకు ని ర్ణయం తీసుకోవడం పట్ల సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. సంస్థ ప్రతిపాదించిన రెండో తయారీ కేంద్రానికి అన్ని రకాల సహాయ, సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. పలువురు సీఈవోలు, ప్రతినిధులు, విద్యావేత్తలతో కేటీఆర్ భేటీ అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు శనివారం షికాగోలో వేర్వేరు భేటీల్లో పాల్గొన్నారు. వివిధ అంతర్జాతీయ కంపెనీలు, విద్యావేత్త లు, ప్రభుత్వ ప్రతినిధులతో చర్చించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. ఈ భేటీల్లో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, భాగస్వామ్యాల అన్వేషణపై మాట్లా డారు. వైద్య ఉపకరణాలు, కృత్రిమ మేధస్సులో అగ్రగామిగా ఉన్న అలైవ్ కోర్ బృందంతో కేటీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణలో మెడ్ టెక్ రంగంలో కలిసి పని చేసేందుకు అలైవ్ కోర్ కు చెందిన ఈసీజీ టెక్ ఆసక్తి వ్యక్తం చేసింది. అట్లాంటాకు చెందిన హెల్త్ టెక్ కంపెనీ సీఈఓ క్యారలోన్, అధ్యక్షుడు రజత్ పూరీ కేటీఆర్‌ను కలిశారు. రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి పట్టణాల్లో ఐటీ కార్యకలాపాలను విస్తరించాల్సిందిగా క్యారలోన్ను కోరారు. ఏడీఎం విస్తరిస్తే సహకరిస్తాం: కేటీఆర్ వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ రంగంలో పేరొందిన ఆర్చర్ డేనియల్స్ మిడ్ లాండ్ (ఏడీఎం) సీఈవో విక్రం లూథర్ కేటీఆర్‌ను కలిశారు. తెలంగాణలో ఏడీఎం కార్యకలాపాలు విస్తరిస్తే తాము సహకరిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇల్లినాయిస్ స్టేట్ ఫస్ట్ అసిస్టెంట్ డిప్యూ టీ గవర్నర్ క్రిష్టి జార్జ్, కామర్స్ సెక్రెటరీ క్రిస్టిన్ రిచర్డ్స్ కేటీఆర్‌తో భేటీ అయ్యారు. క్లీన్ టెక్, సుస్థిర మొబిలిటీ, లైఫ్ సైన్సెస్, వైమానిక, వ్యవసాయ రంగాల్లో భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలపై చర్చించారు. చికాగో బూత్ స్కూల్ డీన్ ప్రొఫెసర్ మాధవ రంజన్ కూడా కేటీఆర్‌ను కలిశారు. హైదరాబాదులో పరిశోధన, ఐఎస్బీ తరహా విద్యాసంస్థల ఏర్పాటు ఉన్న అవకాశాలను పరిశీలించేందుకు రావలసిందిగా ప్రొఫెసర్ మాధవ్ రంజన్‌ను ఆ హ్వానించారు. షికాగోలో భారత్ కాన్సుల్ జనరల్ సోమ నాథ్ ఘోష్, రాష్ట్ర ఐటీ పరిశ్రమల కార్యదర్శి జయేశ్ రంజన్, ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, డిజిటల్ మీడియా వింగ్ డైరెక్టర్ కొణతం దిలీప్ పాల్గొన్నారు. -
తీవ్ర విషాదం.. మైనర్ ప్రేమజంట ఆత్మహత్య
సాక్షి, సిద్దిపేట: జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేటలో మైనర్ ప్రేమజంట ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. లచ్చపేటకు చెందిన కూరపాటి భగీరథ(17), అదే గ్రామానికి చెందిన తోట్ల నేహా(16) దుబ్బాకలో ఇంటర్మీడియట్ చదువుకుంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఒకరినొకరు ఇష్టపడుతూ ప్రేమాయణం కొనసాగించారు. ఇంట్లో వారికి తెలిస్తే విడదీస్తారనే భయంతో భగీరథ ఇంట్లోనే గత రాత్రి ఎవరూ లేని సమయంలో ఇద్దరు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. చదవండి: ‘బతకాలని ఉన్నవారు వెళ్లిపోండి.. ఇక నుంచి ఇలాంటివే జరుగుతాయి’ అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు ఉరి వేసుకుని విగత జీవులుగా మారడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. క్షణికావేశంలో మైనర్ ప్రేమికులు తీసుకున్న నిర్ణయం రెండు కుటుంబాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన దుబ్బాక పోలీసులు.. మృత దేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
నీకు వందకు వంద మార్కులు సార్..
సిద్దిపేట రూరల్/సిద్దిపేట: నారాయణరావుపేట మండలం మాటిండ్ల గ్రామంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి హరీశ్‌రావు మధ్యాహ్నం సమయంలో స్థానికులతో కలిసి భోజనం చేశారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన కిషన్‌తో కొద్దిసేపు మాట్లాడారు. మంత్రి హరీశ్‌రావు: కిషన్ అన్న.. అభివృద్ధి అనే పరీక్ష రాసిన. ఎన్ని మార్కులు ఏస్తవ్.. ఇంకా ఊరిలో ఏమైనా నేను చేసే పనులు ఉన్నాయా? కిషన్: ఏం లేవు సార్.. అన్ని పనులు అయ్యాయి మంత్రి: నా అభివృద్ధి పనికి ఎన్ని మార్కులు ఏస్తవ్? కిషన్: నీకు వందకు వంద మార్కులు ఏస్తం సార్.. మంత్రి: మాటిండ్లలో నాకు ఎంతమంది వంద మార్కులు ఏస్తరంటవు కిషన్: మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని పనులు చేశారు. ఎవరికి ఓటు పోదు. మొత్తం ఓట్లు మీకే సార్. అన్ని పనులు చేశావ్. చేసేవి ఏమీ లేవు.. అంటూ అన్నం ముద్ద నోట్లో పెడుతూ నవ్వుతూ మంత్రికి చెప్పారు. యూపీలో ఆయిల్ ఇంజన్ సర్కారే ఉత్తరప్రదేశ్‌లో ఉన్నది డబుల్ ఇంజన్ సర్కా రు కాదు.. ఆయిల్ ఇంజన్ సర్కారని.. ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. ఆయన గురువారం సిద్దిపేట, నారాయణరావుపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆగస్టు 15లోపు సిద్దిపేటకు రైలు ట్రయల్ రన్ ఉంటుందని తెలిపారు. సిద్దిపేట–సిరిసిల్ల రైల్వే లైన్ నిర్మాణ పనులకు రూ.500 కోట్లు కేటాయించామని, టెండర్ల ప్రక్రియ పూర్తయ్యిందని, వారం రోజుల్లో పనులు ప్రారంభమవుతాయని మంత్రి హరీశ్ వెల్లడించారు. -
మంత్రి హరీష్‌రావు జిల్లాలో అధ్వాన్నంగా రోడ్లు
-
23 రోజుల పాపకు సీపీఆర్.. ప్రాణం కాపాడిన 108 సిబ్బంది
చిన్నకోడూరు(సిద్దిపేట): పాపకు స్నానం చేయిస్తుండగా వేడి నీళ్లు మింగడంతో శ్వాస ఆగిపోయింది. 108 సిబ్బంది సీపీఆర్ చేసి పాప ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లాలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ శివారులోని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో బీహార్‌కు చెందిన ప్రేమ్‌నాథ్ యాదవ్, కవిత దంపతులు పనిచేస్తున్నారు. వీరికి 23 రోజుల వయసున్న బేబీ సుబ్బలక్ష్మి ఉంది. అయితే, ఆ పాపకు స్నానం చేయిస్తుండగా వేడి నీళ్లు మింగింది. దీంతో శ్వాస ఆగిపోయింది. వెంటనే గ్రామానికి చెందిన ఏఎన్ఎం తిరుమల, ఆశావర్కర్ సుగుణ 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది అశోక్, వెంకట్ అక్కడకు చేరుకుని పరీక్షించి.. బేబీ గుండె, నాడీ కొట్టుకోవడం లేదని గమనించారు. వెంటనే ఈఆర్సీపీ డాక్టర్ చక్రవర్తికి విషయం చెప్పి, ఆయన సూచనల ప్రకారం ప్రథమ చికిత్స (సీపీఆర్) చేస్తూ సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బేబీ ప్రాణాలు కాపాడిన 108 సిబ్బందిని బంధువులు, హాస్పిటల్ సిబ్బంది అభినందించారు. ఈ ఘటనపై మంత్రి హరీష్ రావు స్పందించారు. బిడ్డ ప్రాణాలు కాపాడిన 108 సిబ్బందికి అభినందనలు తెలిపారు. అత్యవసర సమయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించి చేసిన మీ సేవలు అమూల్యం అంటూ ట్విట్టర్లో కామెంట్స్ చేశారు. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలంలో 23 రోజుల బిడ్డకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన 108 సిబ్బందికి అభినందనలు 💐 అత్యవసర సమయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించి చేసిన మీ సేవలు అమూల్యం🙏🏻 CPR Saves Lives. pic.twitter.com/tItoUzi1Vj — Harish Rao Thanneeru (@BRSHarish) April 5, 2023 -
కేసీఆర్‌కు బైబై చెప్పండి
సాక్షి, సిద్దిపేట/హుస్నాబాద్: బాన్సువాడ పర్యటనలో ‘నేను ముసలోణ్ణి అయ్యా. వయస్సు మీద పడింది..’అని చెప్పిన సీఎం కేసీఆర్ వెంటనే రాజకీయాల నుంచి విరమించుకుని ఫాంహౌస్‌లో ప్రశాంతంగా శేష జీవితం గడపాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సూచించారు. ప్రజలు కూడా కేసీఆర్‌కు బైబై చెప్పి కాంగ్రెస్‌కు స్వాగతం పలకాలని అన్నారు. రేవంత్ హాథ్ సే హాథ్ జోడో యాత్ర గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో కొనసాగింది. తొలుత గండిపెల్లి రిజర్వాయర్‌ను సందర్శించారు. అనంతరం గౌరవెల్లి రిజర్వాయర్‌లో పరిహారం దక్కని ఆడబిడ్డలతో సమావేశం అయ్యారు. అనంతరం పాద యాత్రగా హుస్నాబాద్ చేరుకున్నారు. డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్నర్ సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నేరవేర్చలేదని విమర్శించారు. ప్రజలకు పూర్వ వైభవం రావాలంటే, పేదల బతుకులు మారాలంటే కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలని అన్నారు. పార్టీ నేతలు జీవన్‌రెడ్డి, జానారెడ్డి, బలరాం నాయక్, సుదర్శన్‌రెడ్డి, రాజయ్య, ప్రవీణ్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ప్రజలకు ఆనందబాష్పాలు.. ప్రతిపక్షాలకు కన్నీటిబాష్పాలు
సాక్షి, సిద్దిపేట: కంటి వెలుగు కార్యక్రమంతో ప్రజలకు ఆనంద బాష్పాలు.. ప్రతిపక్షాలకు కన్నీటి బాష్పాలు వస్తున్నాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. గురువారం ఆయన సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కంటి వెలుగు కేంద్రాన్ని సందర్శించారు. ఇప్పటిదాకా 50 లక్షల మందికి కంటి పరీక్షలు పూర్తయిన నేపథ్యంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అంధత్వరహిత తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు. 25 పని దినాల్లో 50 లక్షల మందికి కంటి పరీక్షలు చేశామన్నారు. గతంలో 827 బృందాలు పనిచేస్తే, ఈసారి 1500కు పెంచామని హరీశ్‌రావు తెలిపారు. 50 లక్షల మందికి పరీక్షలు చేస్తే 16 లక్షల మందికి దృష్టి లోపం ఉన్నట్టు తేలిందన్నారు. ఇప్పటివరకు 1,68,062 మందికి కంటి పరీక్షలు నిర్వహించి రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో ఉందని కొనియాడారు. దక్షిణ భారత దేశ ధాన్యాగారంగా తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్చిదిద్దారని హరీశ్‌రావు చెప్పారు. దేశంలో వ్యవసాయం వృద్ధి రేటు 4% శాతం ఉంటే, రాష్ట్రంలో 7.8% శాతం ఉందన్నారు. -
ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతు చేస్తూ విద్యుత్ షాక్‌తో రైతు మృతి
గజ్వేల్‌రూరల్: ట్రాన్స్ఫార్మర్పై మరమ్మతులు చేస్తుండగా, ఓ యువరైతు విద్యుత్ సరఫరా జరిగి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం సింగాటం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుంట రాజు(32)కు భార్య కృష్ణవేణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పాడైంది. దానికి మరమ్మతు చేయించి బిగించేందుకు రైతులు సబ్‌స్టేషన్ నుంచి ఎల్సీ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ఎక్కి రాజు మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావడంతో షాక్‌కు గురై మృతి చెందాడు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే రాజు మృతి చెందాడని ఆరోపిస్తూ న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తరలించేదిలేదని బాధిత కుటుంబీకులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు అక్కడికి చేరుకొని ప్రమాదఘటనపై విచారణ చేపట్టి మృతుని కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాగా రాజును ట్రాన్స్ఫార్మర్ పైకి ఎవరు ఎక్కమన్నారు? ఎల్సీ తీసుకున్న తర్వాత మరమ్మతు పనులు పూర్తికాకముందే ఎలా విద్యుత్ సరఫరా చేశారనే విషయాలు తెలియాల్సి ఉంది. -
‘మనఊరు–మనబడి’ స్కూళ్ల ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: మన ఊరు–మన బడి పథకం కింద పనులు పూర్తి చేసిన స్కూళ్లను రాష్ట్రవ్యాప్తంగా బుధవారం మంత్రులు, ఎమ్మెల్యేలు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కె.తారకరామారావు రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలోని గంభీరావుపేట పాఠశాలలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. సంబంధిత నియోజకవర్గాల మంత్రులు, ఎమ్మెల్యేలు మొదటి విడతలో పూర్తయిన పాఠశాలలను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలని ప్రభుత్వం ప్రజా ప్రతి నిధులను కోరింది. రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మన ఊరు–మనబడి పథకాన్ని 3 దశల్లో చేపట్టాలని నిర్ణయించింది. పాఠశాలల్లో 12 రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేయడం, కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా తీర్చిదిద్దడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ పథకానికి మొత్తంగా రూ.7,289 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశా రు. రాష్ట్రంలోని 26,055 స్కూళ్ల లో తొలి విడతలో 9,123 స్కూళ్లను ఎంపిక చేశారు. రూ.3,497.62 కోట్లను మొదటి విడతలో ఖర్చు చేయాలని నిర్ణయించారు. అయితే, ఇప్పటి వరకు 1,200 స్కూళ్లలో మాత్రమే పనులు పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. పాఠశాలల్లో భవనాలకు మరమ్మతులు చేపట్టడం, రంగులు వేయడం, కాంపౌండ్ వాల్స్ నిర్మించడం, విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం ఫర్నిచర్ అమర్చడం, డిజిటల్ తరగతులు, సోలార్ ప్యానెల్స్, అధునా తన వసతుల పాఠశాలలుగా తీర్చిదిద్దడానికి ప్రభు త్వం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేశారు. ఈ పథకం కింద పాఠశాలల్లో పరిశుభ్రమైన తాగునీరు, టాయిలెట్ల నిర్మాణం, అదనపు తరగతి గదులు, మంచి లైటింగ్ సదుపాయం, భోజనవసతి, గ్రీన్ బోర్డులు, డిజిటల్ తరగతులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. -
9 అడుగుల ద్వారపాలకుడి విగ్రహం గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలంలోని మల్యాల గ్రామ శివారు పొలాల్లో తాజాగా పరిశోధకులు తెలంగాణలోనే అతిపెద్దదైన, దాదాపు 9 అడుగుల ఎత్తున్న ద్వారపాలకుడు విజయుడి విగ్రహాన్ని గుర్తించారు. విశ్రాంత పురావస్తు అధికారి, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు కరుణాకర్, మహ్మద్ నసీరుద్దీన్లు ఈ విగ్రహాన్ని ఆదివారం పరిశీలించారు. దాదాపు వెయ్యేళ్ల క్రితం చెక్కిన ఈ గ్రానైట్ శిల్పం కుడి చేతిలో గద, ఎడమ చేయిన సూచీ ముద్రగానూ, పైరెండు చేతుల్లో శంఖుచక్రాలను, తలపై కిరీటం, ఆభరణాలు, నడుము దిగువన వస్త్రాన్ని చెక్కి ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతిమ లక్షణాల ఆధారంగా ఈ శిల్పాన్ని రాష్ట్ర కూటుల అనంతరం కల్యాణ చాళుక్య కాలానికి అంటే 10వ శతాబ్దానికి చెందిందిగా గుర్తించినట్లు శివనాగిరెడ్డి తెలిపారు. దీన్ని సంరక్షించి భావి తరానికి అందించాల్సిన అవసరం ఉందని, ఈ విగ్రహ నేపథ్యాన్ని గుర్తించేందుకు పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. -
సింగరాయ జాతరకు పోటెత్తిన భక్తులు
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని ప్రతాపరుద్ర సింగరాయ లక్ష్మీనరసింహస్వామి జాతరకు శనివారం భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. గోవింద నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. భక్తులు తొలుత మోయతుమ్మెద వాగులో స్నానం చేసి స్వామిని దర్శించుకున్నారు. అనంతరం వాగు పక్కన చెలమను తోడి అందులో నుంచి తీసిన నీటితో వంకాయ కూర, చింతపండు చారు చేసుకొని అక్కడే భోజనాలు చేశారు. మరికొందరు వంకాయ, చిక్కుడు, టమాటాలను కలిపి కూర చేసుకోవడం గమనార్హం. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు జాతర సాగింది. జాతరకోసం ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. -
వంకాయ కూర..చింతపండు చారు!
సాక్షి, సిద్దిపేట: జాతర్లకు వెళ్లడం, పూజలు నిర్వహించడంతో పాటు అక్కడే వంటలు చేసుకుని తినడం సర్వసాధారణం. కొన్నిచోట్ల మాంసాహారంతో పాటు శాకాహారం వండుతారు. కొన్నిచోట్ల శాకాహారానికే పరిమితమవుతారు. కానీ శాకాహారం..అందులోనూ ‘ఆహా..ఏమి రుచి..అనరా మైమరచి..’ అంటూ ఓ సినీ కవి అభివర్ణించిన వంకాయ కూరతో పాటు చింతపండు చారు మాత్రమే చేసుకుని అన్నంతో కలిపి ఆరగించడం శ్రీ సింగరాయ లక్ష్మీనరసింహస్వామి జాతర స్పెషల్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సమీపంలోని కోహెడ మండలం కూరెల్ల–తంగళ్లపల్లి గ్రామాల సరిహద్దుల్లో ఈ శ్రీ సింగరాయ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. దీని వెనకో కథ కూడా ఉంది. కాకతీయుల కాలంలో ప్రారంభం కాకతీయుల కాలంలో రాజులు అనువైన చోటల్లా చెరువులు తవ్వించారు. అందులో భాగంగా కాకతీయ చివరిరాజు ప్రతాపరుద్రుడు కూరెల్ల–తంగళ్లపల్లి గ్రామాల వద్ద చెరువు తవ్వే విషయం పరిశీలించాల్సిందిగా సంబంధిత నిపుణుడైన సింగరాయుడుతో పాటు మరికొందర్ని పంపించాడు. వారంతా కొద్దిరోజులు అక్కడే మకాం వేసి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్న క్రమంలో బృందంలో కొందరు అనారోగ్యంతో మరణించారు. దీంతో సింగరాయ మినహా మిగిలిన వారంతా తమ పని మధ్యలోనే వదిలేసి ఓరుగల్లుకు తిరిగివెళ్లిపోయారు. సింగరాయ అక్కడే అడవిలో తిరుగుతున్న క్రమంలో ఓ చోట సొరంగంలో లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం కనిపించింది. ఆ విగ్రహానికి ఆయన భక్తి శ్రద్ధలలో పూజలు చేస్తూ వచ్చాడు. కొద్దిరోజుల తర్వాత సింగరాయుడు కూడా వెళ్లిపోయాడు. ఆ తర్వాత సమీప గ్రామాల ప్రజలు లక్ష్మీనరసింహ స్వామికి పూజలు చేయడం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే అక్కడ శ్రీ సింగరాయ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఏర్పడింది. ఏటా పుష్య అమావాస్య రోజున పెద్ద సంఖ్యలో భక్తులు సింగరాయ జాతర నిర్వహించడం ఆనవాయితీగా మారింది. శనివారం అమావాస్య పురస్కరించుకుని జాతర నిర్వహణకు రెవెన్యూ, పోలీసు అధికారుల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. చెలిమ నీటిలో ఔషధ గుణాలు! కూరెల్ల–తంగళ్లపల్లి గ్రామాలను ఆనుకుని మోయతుమ్మెద వాగు తూర్పు నుంచి పడమటకు దట్టమైన వన మూలికల చెట్ల మధ్య నుంచి ప్రవహిస్తుంది. దీంతో ఆ నీటిలో ఔషధ గుణాలు ఉంటాయనేది భక్తుల నమ్మకం. దీంతో ఈ వాగులో స్నానం చేసిన తర్వాత భక్తులు సింగరాయ నరసింహస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తారు. వాగు చెలిమల (నీటి గుంటలు) నుంచి తీసిన నీటితో వంకాయ కూర, చింతపండు చారు సిద్ధం చేస్తారు. అల్లం, వెల్లుల్లి, జిలకర లాంటి వేమీ ఉపయోగించరు. స్వామికి నైవేద్యంగా సమర్పించాక సహపంక్తి భోజనం చేస్తారు. మోయతుమ్మెద వాగు చెలిమ నీటితో చేసిన వంటలు రుచిగా ఉండటమే కాకుండా దివ్య ఔషధంలా పని చేస్తాయని భక్తులు విశ్వసిస్తారు. ఆరోగ్యానికి మంచిదనే స్థానికులు ఈ నీటిని వినియోగిస్తుంటారు. -
దుబ్బాక లినెన్ చీరకు జాతీయస్థాయి గుర్తింపు
దుబ్బాకటౌన్: సిద్దిపేట జిల్లా దుబ్బాక నేతన్న ప్రతిభకు గుర్తింపు లభించింది. దుబ్బాక చేనేత కార్మికులు మగ్గంపై నేసిన లినెన్ కాటన్ చీర జాతీయస్థాయిలో మెరిసింది. స్వాతంత్య్ర వజ్రోత్సవ వేళ దేశంలోని వారసత్వ సంపదలను కాపాడాలనే ఉద్దేశంతో కేంద్ర టెక్స్టైల్స్ శాఖ విరాసత్ పేరిట ఢిల్లీలో నేటి నుంచి ఈ నెల 17 వరకు చేనేత చీరల ప్రదర్శన చేపట్టింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో చేనేత కార్మికులు నేసిన 75 రకాల చీరలను ఈ ప్రదర్శనకు ఎంపిక చేయగా, ఇందులో దుబ్బాక చీరకు స్థానం దక్కింది. చేనేత సహకార సంఘం మాజీ చైర్మన్, చేనేత రంగంలో అద్భుతాలు సృష్టించేందుకు కృషిచేస్తున్న బోడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో హ్యాండ్లూమ్ ప్రొడ్యూసర్ కంపెనీలో కార్మికులు ఈ లినెన్ కాటన్ చీరను నేయడం విశేషం. దేశంలోనే గుర్తింపు పొందిన దుబ్బాక చేనేత పరిశ్రమపై క్రమేణా నిర్లక్ష్యం అలుముకుంటోంది. ఈ క్రమంలో విరాసత్ చీరల ప్రదర్శనకు ఎంపిక కావడంతో మళ్లీ దేశవ్యాప్తంగా దుబ్బాకకు గుర్తింపు లభించింది. జాతీయస్థాయిలో దుబ్బాక చేనేతలకు గుర్తింపు దక్కడం పట్ల ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘విరాసత్ ప్రదర్శనకు దుబ్బాక లినెన్ కాటన్ చీర ఎంపిక కావడం చాలసంతోషంగా ఉంది. టై అండ్ డై విధానంతో ఇక్కత్ చీరలను తయారు చేయడం ఎక్కడ సాధ్యపడలేదని, కేవలం దుబ్బాకలోనే తయారు కావడం ఆనందంగా ఉంది’అని బోడ శ్రీనివాస్ అన్నారు. -
సిద్ధిపేట: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
సాక్షి, సిద్ధిపేట: జగదేవ్‌పూర్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మునిగడపలో అదుపుతప్పిన కారు గుంతలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బోనగిరి యాదాద్రి జిల్లా బీబీనగర్ గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు దైవదర్శనం నిమిత్తం వేములవాడకు వెళ్లి తిరుగు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మునిగడప గ్రామం వద్ద కెనాల్ కాలువలో కారు పడింది. మృతులను సత్తమ్మ, స్రవంతి, లోకేష్, భవ్య శ్రీ, రాజమణిగా గుర్తించారు. వెంకటేష్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. -
దుబ్బాకలో ఉద్రిక్తతకు దారితీసిన బస్టాండ్ ప్రారంభం
-
సిద్దిపేట జిల్లా గుర్జకుంటలో ఉద్రిక్తత
-
సిద్ధిపేట జిల్లాలో జెడ్పీటీసీ మల్లేశం దారుణ హత్య
-
సిద్ధిపేట జిల్లాలో జెడ్పీటీసీ శెట్టె మల్లేశంపై గుర్తు తెలియని దుండగులు హత్యాయత్నం
-
వాకింగ్‌కు వెళ్లిన చేర్యాల జెడ్పీటీసీ దారుణ హత్య
చేర్యాల (సిద్దిపేట): అధికార బీఆర్ఎస్కు చెందిన సిద్దిపేట జిల్లా చేర్యాల జెడ్పీటీసీ సభ్యు డు శెట్టె మల్లేశం (43) దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. చేర్యాల మండలంలోని స్వగ్రామమైన గుర్జకుంటలో మల్లేశం సోమవారం ఉదయం 6 గంటలకు రోజు మాదిరిగా మార్నింగ్ వాకింగ్‌కు బయలుదేరారు. గుర్జకుంట క్రాస్ రోడ్డు వైపునకు వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయగా, తలకు తీవ్ర గాయాలై కింద పడిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్సులో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన వైద్యులు తదుపరి చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని చెప్పగా, సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగా మల్లేశం మృతి చెందారు. ఆయనకు ఏదైనా ప్రమాదంలో గాయాలయ్యాయా? లేదా ఎవరైనా దాడి చేశారా? అన్న అనుమానాలు తొలుత వ్యక్తమయ్యాయి. తర్వాత పోలీసులు హత్యగా నిర్ధారించారు. మల్లేశంపై దాడికి కారణమైన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దాడి విషయం తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేర్యాల పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఘటనపై ఆరా తీశారు. మృతదేహాన్ని త్వరగా గ్రామానికి తెచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత.. అడిషనల్ డీసీపీ మహేందర్, హుస్నాబాద్ ఏసీపీ సతీశ్, చేర్యాల సీఐ శ్రీనివాస్, ఎస్ఐ భాస్కర్‌రెడ్డితో కలిసి ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించామని 24 గంటల్లోపు నిందితులను పట్టుకుని హత్యకు గల కారణాలను వెల్లడిస్తామని చెప్పారు. మల్లేశానికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మంత్రి, ఎమ్మెల్యే దిగ్భ్రాంతి ప్రజాసేవ కోసం పరితపించే శెట్టె మల్లేశం మృతి చాలా బాధాకరమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి వ్యక్తం చేశారు. మృతికి కారణ మైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గజ్వేల్ ఆస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. -
63 ఏళ్ల వయసులో 6,000 కిలో మీటర్ల సైక్లింగ్
ఆయన వయసు 63 సంవత్సరాలు. జెట్ స్పీడ్‌తో సైకిల్ తొక్కుతూ రయ్ రయ్ అంటూ దూసుకెళ్తున్నారు. తొక్కుతున్న సైకిల్ స్పీడ్ చూస్తే 25 ఏళ్ల వయసు ఉన్న యువకుడు అనుకుంటారు. తన ఫేస్‌కు ఉన్న మాస్క్ తీస్తే కానీ తెలియదు ఆయన 60 ఏళ్ళకి పైబడిన వ్యక్తి అని. ఆయనే హైదరాబాద్‌కు చెందిన మేజర్ జనరల్ డాక్టర్ ఆలపాటి వెంకటకృష్ణ (ఏవీకే) మోహన్. సోమవారం హైదరాబాద్ నుంచి సిద్దిపేటలోని రంగనాయకసాగర్‌కు సైక్లింగ్ చేసుకుంటూ వచ్చారు. ఈ సందర్భంగా సాక్షి పలకరించింది. వివరాలు ఆయన మాటల్లోనే... సాక్షి, సిద్దిపేట: మా నాన్న దేవాదాయ శాఖలో విధులు నిర్వర్తించేవారు. కాకినాడలో ఎంబీబీఎస్ పూర్తి చేశాను. 1984లో సికింద్రాబాద్‌లోని మిలటరీ హాస్పిటల్లో డాక్టర్‌గా జాబ్ వచ్చింది. 37 ఏళ్ల పాటు ఆర్మీలో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించి ఆర్మీ సదరన్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ పుణేలో మెడికల్ హెడ్‌గా మేజర్ జనరల్‌గా ఉద్యోగ విరమణ తీసుకున్నాను. ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని కౌకూర్‌లో నివాసం ఉంటున్నాను. నా కూతురు ప్రసన్న డెంటల్ స్పెషలిస్ట్ గౌహతిలో ప్రాక్టీస్ చేస్తోంది. పర్వతారోహణ...బైకింగ్: 1991లో ఇటాలియన్లతో కలిసి మౌంట్ సతోపంత్‌కు పర్వతారోహణ యాత్ర చేశా. 2000 సంవత్సరం ప్రారంభంలో కాంగోలోని మౌంట్ నైరాగాంగోలో ప్రత్యక్ష అగ్నిపర్వతం అధిరోహించిన ఆర్మీ బ్రిగేడ్‌లో మొదటి వ్యక్తి నేనే. ఈశాన్యంలోని మొత్తం ఎనిమిది రాష్ట్రాలల్లో బైకింగ్ చేసుకుంటూ తిరిగి వచ్చాను. 2019లో దే«శంలోని మూడు కార్నర్లు తూర్పు, పడమర దక్షణంలో 11,500 కిలో మీటర్లు మోటార్ బైకింగ్ చేశాను. సైక్లింగ్ అంటే ఇష్టంతో: నాకు చిన్నప్పటి నుంచి సైక్లింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. డిసెంబర్ 2014లో చెన్నైకి బదిలీపై వచ్చాను. అప్పటికే చెన్నై నగరంలో ప్రసిద్ధ సైక్లింగ్ గ్రూప్ అయిన చెన్నై జాయ్ రైడర్జ్ ఉంది. అందులో చేరాను. చెన్నై నుంచి విజయవాడ , 2015లో కర్ణాటక, కేరళ , తమిళనాడులో 900 కి.మీ, టూర్ ఆఫ్ నీలగిరీస్ సైక్లింగ్ పర్యటన చేశాను. 2016లో స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైక్లింగ్ చేశాను. జలశక్తి మిషన్ కింద 2019లో కచ్(గుజరాత్) నుంచి గౌహతి(అస్సాం) వరకు 3,200 కిలోమీటర్లు సైక్లింగ్ చేశాను. ఈ నెల 20 నుంచి నెల రోజుల పాటు గోల్డెన్ క్వాడ్రీలెట్రల్ ఈ నెల 20వ తేదీ నుంచి నెల రోజుల పాటు గోల్డెన్ క్వాడ్రీలెట్రల్ సైక్లింగ్ చేయనున్నాను. 6 వేల కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. ఔరంగాబాద్‌లో ప్రారంభమై జార్ఖండ్, వెస్ట్‌బెంగాల్, కోల్‌కతా, చెన్నై, ముంబై, ఢిల్లీ మీదుగా మళ్లీ ఔరంగాబాద్‌కు చేరుకుంటాను. ఇలా నెల రోజుల పాటు సైక్లింగ్ చేస్తాను. ఫిట్నెస్ ఔత్సాహికులకు సలహాలు, మెరుగైన జీవనం వైపు అడుగులు వేసేందుకు ఇతరులకు ఆదర్శంగా ఉండాలనేదే ఆలోచన. (చదవండి: గిన్నిస్ రికార్డు...ఒక్క నిమిషంలో 1,140!) -
గన్ పార్క్ వద్ద గల్ఫ్ కార్మికుని మృతదేహానికి నివాళి
సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ధర్మాజీపేట గ్రామానికి చెందిన జనగామ నర్సయ్య ఇటీవల బహ్రెయిన్‌లో మరణించారు. శనివారం బహ్రెయిన్ నుంచి హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న మృతదేహాన్ని గల్ఫ్ జేఏసీ నాయకులు, మృతుని కుటుంబ సభ్యులు కలిసి హైదరాబాద్‌లోని అమరవీరుల స్తూపం, గన్ పార్క్ వద్ద ఉంచి నివాళులు అర్పించారు. గల్ఫ్ అమరులకు నివాళులు అర్పిస్తూ అరుణోదయ సాంస్కృతిక బృందం పాటలు పాడారు. గల్ఫ్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు గుగ్గిల్ల రవిగౌడ్, తెలంగాణ బీజేపీ గల్ఫ్ మిడిల్ ఈస్ట్ కన్వీనర్ నరేంద్ర పన్నీరు, తెలంగాణ గల్ఫ్ కాంగ్రెస్ అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, గల్ఫ్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగుల మురళీధర్ రెడ్డి, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల, సీఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చెన్నమనేని శ్రీనివాస రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన గల్ఫ్ జేఏసీ నాయకులు రూ.500 కోట్ల వార్షిక బడ్జెట్‌తో గల్ఫ్ బోర్డుతో కూడిన సమగ్ర ప్రవాసీ విధానం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి గత ఎనిమిది ఏళ్లలో 1,600 మంది తెలంగాణ కార్మికులు గల్ఫ్ దేశాలలో మృతి చెందారని, కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి గల్ఫ్ మృతుని కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు -
అభాగ్యులకు అండగా..
సిద్దిపేటజోన్: అందరూ ఉండి ఏకాకులుగా మారిన వారు కొందరైతే.. విధి వక్రించి ఒంటరి జీవనం గడిపే వారు మరి కొందరు. వృద్ధాప్యంలో తోడూనీడా లేకుండా ఒక భరోసా కోసం ఎదురుచూసే వారికి, అభాగ్యులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం సిద్దిపేట జిల్లా కేంద్రంలో వృద్ధాశ్రమం ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. మంత్రి హరీశ్‌రావు చొరవతో సుమారు రూ.కోటి నిధులతో రాష్ట్రంలో ఒక మోడల్‌గా ఈ వృద్ధాశ్రమ ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సిద్దిపేట పరిధి మిట్టపల్లి గ్రామ శివార్లలో ఎకరం స్థలంలో దీన్ని నిర్మించేందుకు పరిశీలన పూర్తి చేశారు. త్వర లో మంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నారు. మహిళా శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు కుటుంబ సభ్యుల ఆదరణ కరువైన వృద్ధులకు అండగా ఉండాలన్న ప్రభుత్వ ఆలోచన మేరకు హరీశ్‌రావు ఈ వృద్ధాశ్రమం ఏర్పాటుకు అంకురార్పణ చేశారు. దీని నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేసి రూ.కోటి నిధులను మంజూరు చేయించారు. మహిళా శిశుసంక్షేమ శాఖ ఆధ్వ ర్యంలో ఈ ఓల్డ్ ఏజ్ హోంను ఏర్పాటు చేస్తున్నారు. సుమారు వంద మందికి ఆశ్రయం ఇచ్చేలా వసతులతో భవనాన్ని నిర్మించనున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ఓల్డ్ ఏజ్ హోం చుట్టూ అందమైన పార్క్ ఏర్పాటు చేయనున్నారు. అభాగ్యులకు ఎంత సేవ చేసినా తక్కువే వృద్ధాప్యంలో ఉన్న అభాగ్యులకు ఒక నీడ ఇవ్వాలనే ఆలోచనకు ప్రతిరూపం ఇది. అనాథ వృద్ధులు, పిల్లలు ఉండీ వారు అందుబాటులో లేక అభాగ్యులైన వారికి ఎంత సేవ చేసినా తక్కువే. వారి బాధలను, ఒంటరిగా ఉన్నామనే ఆలోచనను దూరం చేసేలా ఆనంద నిలయంగా ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేస్తాం. –హరీశ్‌రావు, ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి -
అదుపుతప్పి బావిలో పడిన కారు
కొండపాక (గజ్వేల్): కారు అదుపు తప్పి పాడుబడిన వ్యవసాయ బావిలో పడిన దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం జప్తినాచారం గ్రామ శివారులో ఈ ఘటన జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. దౌల్తాబాద్ మండలం సూరంపల్లికి చెందిన కెమ్మసారం యాదగిరి (40), సిద్దిపేట పట్టణానికి చెందిన కెమ్మసారం కనకయ్య (55) తోడల్లుళ్లు. వారిద్దరూ ఆదివారం కొండపాక మండలం సిర్సనగండ్ల గ్రామంలోని అత్తగారింటికి కారులో వచ్చారు. వారి అత్తమ్మ దేవరాయ పోశవ్వ అనారోగ్యంతో బాధపడుతుండగా ఆమెను పరామర్శించారు. అనంతరం అక్కడినుంచి బావమరిది దేవరాయ వెంకటస్వామి (38)తో కలసి కారులో దుద్దెడకు బయల్దేరారు. మార్గమధ్యలో జప్తినాచారం గ్రామ శివారులో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పాడుబడిన వ్యవసాయ బావిలో పడింది. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో సమీపంలోని రాజంపల్లి గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకొని విషయాన్ని కుకునూరుపల్లి పోలీసులకు, రెవెన్యూ అధికారులకు తెలియజేశారు. వెంటనే తహసీల్దార్ రామేశ్వర్, కుకునూరుపల్లి ఎస్ఐ పుష్పరాజ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు.స్థానికుల సహాయంతో బావిలోకి తాడును పంపి కనకయ్య, వెంకటస్వామిని బయటకు తీశారు. కాగా డ్రైవింగ్ సీట్లో ఉన్న యాదగిరి కారులోనే ఇరుక్కుపోయి బావిలోని నీటిలో మునిగి మృతి చెందారు. బయటకు తీసిన ఇద్దరిని 108 అంబులెన్సులో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడిని బయటకు తీయడానికి అధికారులు బావిలోని నీరును తోడేందుకు చర్యలు చేపట్టారు. అయితే రాత్రి 8 గంటల వరకు బావిలో నీరు తగ్గకపోవడంతో యాదగిరి మృతదేహాన్ని బయటకు తీయలేకపోయారు. కాగా యాదగిరి (40) ఎద్దుమైలారంలోని ఓడీఎఫ్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఈ విషయం తెలిసి వచ్చిన మృతుని కుటుంబీకులు, బంధువులు సంఘటనా స్థలంలో కన్నీరుమున్నీరుగా విలపించారు. డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, సిర్సనగండ్ల సర్పంచ్ గూడెపు లక్ష్మారెడ్డి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. -
అంత్యక్రియలకు సిద్ధం.. అంతలోనే అనుమానాస్పదం..!
జగదేవ్‌పూర్(గజ్వేల్)/సిద్ధిపేట జిల్లా: సిద్దిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతిచెందింది. నల్లగొండ జిల్లా వెంకటాపూర్‌కు చెందిన పావని అలియాస్ కాత్యాయినికి, సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం మునిగడపకు చెందిన నాగరాజుతో రెండేండ్ల క్రితం పెళ్లి అయింది. సజావుగా సాగుతున్న వీరి కాపురంలో ఉన్నట్టుండి అలజడిరేగింది. చదవండి: మస్కట్‌లో ఏం జరిగింది..? మహిళ సెల్ఫీ వీడియో కలకలం.. ఏమైందో తెలియదు కానీ, మంగళవారం రాత్రి పావని జ్వరంతో చనిపోయిందని నాగరాజు ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. కూతురు మరణించిందనే బాధతో ఆమె పుట్టింటివారు, బంధువులు హుటాహుటిన మునిగడపకు చేరుకున్నారు. పావని రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతోందని, ఉన్నట్టుండి చనిపోయిందని నాగరాజు చెప్పడంతో అందరూ అదే నిజమనుకున్నారు. అయితే పావని అంత్యక్రియలకు బుధవారం ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా ఆమెకు స్నానం చేయిస్తుండగా ఒంటిపై గాయాలు గమనించారు. వెంటనే పావని తల్లి పూర్తిగా పరిశీలించగా.. పావని శరీరం మొత్తం గాయాలతో హూనమైపోయింది. ఆగ్రహంతో నాగరాజును నిలదీయగా.. వెంటనే కుటుంబసభ్యులతో సహా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. పావని కుటుంబసభ్యులు సమాచారమివ్వడంతో.. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. తమ కూతురును కొట్టి చంపి.. జ్వరంతో చనిపోయిందని అంటున్నారని వాపోయారు. తమ కూతురు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి.. నిజమేంటో తేల్చాలని కోరుతున్నారు. పావని కుటుంబసభ్యుల ఫిర్యాదుతో మృతదేహాన్ని పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
నకిలీ విత్తు.. నమ్మితే చిత్తు.. విత్తనాల కొనుగోలుకు ముందు ఇలా చేయండి..
దుబ్బాక(సిద్ధిపేట జిల్లా): తొలకరి చినుకులు పలుకరించాయి. అన్నదాతలు వానాకాలం సాగుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆరుగాలం శ్రమకు ఫలితం దక్కాలంటే ఆది నుంచి వేసే పంట విషయంలో అప్రమత్తంగా ఉండటం తప్పనిసరి. దుక్కి దున్నింది మొదలుకొని పంట చేతికొచ్చే వరకు జాగ్రత్తలు పాటిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్ అంటున్నారు. ముఖ్యంగా విత్తనాలు, ఎరువుల కొనుగోలులో జాగ్రత్తలు పాటించడం అవసరం. చదవండి: సికింద్రాబాద్ అల్లర్లు: ‘సాక్షి’ చేతిలో రిమాండ్ రిపోర్ట్.. కీలక అంశాలు వెలుగులోకి.. కొందరు డీలర్లు నకిలీ విత్తనాలను విక్రయిస్తూ ఏటా అన్నదాతలను నట్టేట ముంచుతున్నారు. వానాకాలం సాగుకు సిద్ధమవుతున్న రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. విత్తనాల ఎంపిక నుంచి పంట దిగుబడి వరకు శాస్త్రీయ సాగు పద్ధతులను అవలంభించడంతో పాటు శాస్త్రవేత్తల సలహాలు, సూచనలతో ముందుకు సాగాలంటున్నారు. జిల్లాలో అధికారులు నకిలీ విత్తన విక్రయాలపై నిఘా పెంచారు. ప్రభుత్వం సైతం నకిలీ విత్తలనాలను విక్రయిస్తున్న వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఆదేశించింది. అయినా రైతుల అమాయకత్వాన్ని కొంతమంది సొమ్ము చేసుకుంటున్నారు. విత్తనాల కొనుగోలుకు ముందు.. ♦వ్యవసాయ శాఖ లైసెన్స్ పొందిన డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేయాలి. ♦విత్తన ప్యాకెట్లు, బస్తాలపై పేరు, గడువు తేదీ వివరాలు తప్పకుండా గమనించాలి. ♦సరిగా సీల్ చేసి ఉన్న బస్తాలు, ధ్రువీకరణ పత్రం ఉన్న విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలి. రశీదు తీసుకోవాలి ♦రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన తర్వాత రశీదు తప్పకుండా తీసుకోవాలి. రశీదుపై విత్తన రకం, గడువు తేదీ, డీలర్ సంతకం తీసుకోవాలి. రైతు సంతకం కూడా ఉండేలా చూసుకోవాలి. ♦విత్తనాలను కొనుగోలు చేసేముందు వ్యవసాయ శాఖ అధికారి, శాస్త్ర వేత్తల సూచనలు తీసుకోవడం మంచిది. ♦రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ధ్రువీకరించిన విత్తనాలు విక్రయిస్తాయి. వీటిని కొనుగోలు చేసే సమయంలో బస్తా పై నీలి వర్ణం ట్యాగ్ ఉందో లేదో గమనించాలి. ♦లేబుల్ విత్తనాలు కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. జిల్లాలో ఈ రకం విత్తనాలు అధికంగా కొనుగోలు చేస్తున్నారు. వీటి కొనుగోలు చేసే ముందు విత్తన సంచిపై ఆకుపచ్చ ♦ట్యాగ్ కట్టి ఉంటుంది. దీనిపై విత్తన ప్రమాణాలు ముద్రించి విక్రయిస్తారు. ఈ విత్త్తనాలను రైతులు కేవలం ఆయా కంపెనీల నమ్మకంపై మాత్రమే కొనుగోలు చేయాలి. పూర్తి వివరాలు తీసుకుని డీలర్ల నుంచి సరైన బిల్లు తీసుకోవాలి ♦బ్రిడిల్ విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు విత్తన సంచికి పసుపు రంగు ట్యాగ్ ఉందో లేదో గమనించాలి ♦ఎలాంటి విత్తనాలు కొనుగోలు చేసిన పంట సాగు వరకు రశీదులను రైతులు జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. ఎరువుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పంటల అధిక దిగుబడికి ఎరువులు ఎంతో మేలు చేస్తాయి. కానీ కొందరు దళారుల, వ్యాపారుల నాసి రకం ఎరువులు విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్నారు. ఫలితంగా అమాయక రైతులు నష్టపోతున్నారు. ఈ మేరకు కొన్ని మెలకువలు పాటిస్తే నకిలీలను నివారించే అవకాశం ఉంది. ♦లైసెన్స్ ఉన్న దుకాణాల్లో మాత్రమే ఎరువులను కొనుగోలు చేయాలి. ♦కొనుగోలు చేసిన ఎరువులకు సరైన బిల్లును తీసుకోవాలి. వాటిని జాగ్రత్తగా దాచుకోవాలి. ♦డీలర్ బుక్‌లో రైతులు తప్పకుండా సంతకం చేయాలి. కఠిన చర్యలు తీసుకుంటాం జిల్లాలో ఎవరైన నకిలీ విత్తనాలను విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారి లైసెన్స్ రద్దు చేస్తాం. ఎక్కడైన నకిలీ విత్తనాలను విక్రయిస్తే రైతులు వెంటనే దగ్గరలో వ్యవసాయాధికారికి ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు చేసిన రైతుల వివరాలు గోప్యంగా ఉంచుతాం. – శివప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి -
సిద్దిపేట: హుస్నాబాద్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు
-
సిద్ధిపేట జిల్లాలో కేఏ పాల్‌పై టీఆర్ఎస్ నేతల దాడి
సాక్షి, సిద్ధిపేట జిల్లా: జక్కాపూర్‌లో కేఏ పాల్‌పై దాడి జరిగింది. వర్షాలతో నష్టపోయిన రైతుల్ని పరామర్శించడానికి సిరిసిల్ల జిల్లా వెళ్తున్న పాల్‌ను టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. డీఎస్పీ ముందే కేఏ పాల్‌పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. పాల్ వస్తున్నారనే సమాచారంతో సిరిసిల్లా జిల్లా సరిహద్దులకు చేరుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు.. ఆయనను అడ్డుకుని బూతులు తిడుతూ దాడికి దిగారు. పోలీసుల తీరుపై కేఏ పాల్ ఆగ్రహం టీఆర్ఎస్ నేతలు గూండాలలా వ్యవహరించారని, పోలీసుల సమక్షంలోనే తనపై దాడి జరిగిందని.. దీనికి పోలీసులే బాధ్యత వహించాలంటూ కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
తల్లిపై పెట్రోల్ పోసి.. తండ్రిని కర్రతో బాది..
దౌల్తాబాద్(దుబ్బాక): కన్నకొడుకే కాలయముడయ్యాడు. డబ్బులు ఇవ్వడం లేదని అక్కసు పెంచుకుని కన్నతల్లికి నిప్పంటించాడు ఓ ప్రబుద్ధుడు. అడ్డు వచ్చిన తండ్రిపై కర్రతో విచక్షణారహితంగా దాడిచేశాడు. ఈ విషాద సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్లాబాద్ మండలం గోవిందాపూర్‌లో చోటుచేసుకుంది. గోవిందాపూర్‌కి చెందిన మైసయ్య(65), పోశవ్వ(60) దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. గతంలోనే చిన్న కుమా రుడు ఓ ప్రమాదంలో చనిపోయాడు. వీరందరికీ వివాహాలయ్యాయి. పెద్దకొడుకు బాలమల్లు తల్లిదండ్రులతో కాకుండా విడిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో మైసయ్య తనకున్న 3 గుంటల భూమిని అమ్మగా, రెండు లక్షల రూపాయలు వచ్చాయి. ఈ డబ్బులో బాలమల్లుకు రూ.లక్ష ఇచ్చి తన వద్ద రూ.లక్ష ఉంచుకున్నాడు. ఆ డబ్బు కూడా ఇవ్వాలంటూ బాలమల్లు తల్లిదండ్రులతో శనివారం గొడవపడ్డాడు. ఆరోగ్యం బాగాలేదని, ఆస్పత్రి ఖర్చులకు డబ్బు అవసరముందని మైసయ్య ఎంత చెప్పినా కొడుకు వినిపించుకోలేదు. ఆదివారం ఉదయం ఇంటికి వచ్చి తల్లిని తీవ్రంగా చితకబాది ఆమె దగ్గర ఉన్న డబ్బుల సంచిని లాక్కున్నాడు. అనంతరం బైక్‌లోంచి పెట్రోల్ తీసి తల్లిపై చల్లి నిప్పంటించాడు. తీవ్ర గాయాలకు గురైన పోశవ్వ కేకలు వేయడంతో మైసయ్య ఇంట్లో నుంచి పరుగున వచ్చి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించాడు. బాలమల్లు కర్రతో తండ్రిపై కూడా దాడిచేసి గాయపరిచాడు. గ్రామస్తులు 108లో వారిని గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోశవ్వ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మైసయ్య ఫిర్యాదుతో పోలీసులు బాలమల్లుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నూకలు తినాలన్న వాళ్లకు నూకలు చెల్లేలా బుద్ధి చెప్పాలి
గజ్వేల్: ‘ఎండాకాలంలో పండే ధాన్యం నూకలైతది. అది మేం కొనలేం.. అవి మీ ప్రజలే తినేవిధంగా అలవాటు చెయ్యండి’అని గోయల్ హేళనగా మాట్లాడటం తగదని, ఇది తెలంగాణ ప్రజలను అవమానించడమేనని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. నూకలు తినాలని చెబుతున్న కేంద్రానికి నూకలు చెల్లేలా బుద్ధిచెప్పాల్సిన అవసరముందన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజాశర్మతో కలసి హరీశ్‌రావు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రం తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వడ్లను కొనుగోలు చేయాల్సిన కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పుకుంటోందన్నారు. మెడికల్ కళాశాలలు అడిగినా, ప్రాజెక్టులకు జాతీయ హోదా అడిగినా ఇవ్వలేదని మండిపడ్డారు. కనీసం వడ్లు కొనడం కూడా కేంద్రానికి చేతకాదా? అని ప్రశ్నించారు. మరోపక్క గ్యాస్, పెట్రో, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెంచు తూ సామాన్యులపై భారం మోపుతున్నారని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు మానుకొని చేతనైతే ధరలు తగ్గించేలా కేంద్రాన్ని ఒప్పించాలన్నారు. ప్రభుత్వరంగ ఆస్పత్రుల్లో సింగిల్ యూస్ డయాలసిస్ సిస్టమ్ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు రాష్ట్రంలో మూడు డయాలసిస్ కేంద్రాలు ఉండగా.. వాటిని నేడు 102కు పెంచబోతున్నామన్నారు. -
‘బీజేపీ నేతలు అడ్డంపొడుగు మాట్లాడుతూ నవ్వుల పాలవుతున్నారు’
గజ్వేల్: కాళేశ్వరం ద్వారా కొత్తగా ఒక ఎకరాకైనా నీరు పారిందా? అని కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శలు చేయడం సిగ్గుచేటని, కళ్లముందు పచ్చటి పంటపొలాలు కనిపిస్తున్నా...కళ్లుండీ చూడలేని కబోదుల్లా మాట్లాడుతున్నారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్లలోని కొండపోచమ్మసాగర్ కాల్వ ద్వారా కూడవెల్లి వాగు, యాదాద్రి భువనగిరి జిల్లాలోని గండిచెరువుకు గోదావరి జలాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో తాగునీటికి కూడా కటకట ఉండేదన్నారు. ఇప్పడు సీఎం కేసీఆర్ సమృద్ధిగా తాగు, సాగు నీరు ఇస్తుంటే విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు. మండుటెండల్లోనూ వాగులను పారిస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. నీళ్లు రావడం ఇష్టం లేక.. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్ట్ పనుల్లో అవినీతి జరిగిందని కొత్త పల్లవి అందుకున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతలు సైతం అడ్డంపొడుగు మాట్లాడుతూ ప్రజల్లో నవ్వుల పాలవుతున్నారని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత కరెంట్, పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి పథకాలున్నాయా..? అంటూ ప్రశ్నించారు. రైతులకు సాగునీటితోపాటు ఎరువులు, కరెంట్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బీజేపీ ప్రజలకు చేసిన ఒక్క మంచి పనేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎరువుల బస్తాలకోసం చెప్పుల లైన్లు... కాంగ్రెస్ పాలనలో ఎరువుల బస్తాల కోసం చెప్పులతో లైన్ కట్టాల్సిన పరిస్థితులను ప్రజలు మరచిపోతారా? అని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. నేడు రిజర్వాయర్లకు దేవుళ్ల పేరు పెట్టుకుంటే కూడా తట్టుకోలేకపోతున్నారన్నారు. రైతులు ఆయిల్‌పామ్ సాగువైపు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం 30 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగుకు సహకారాన్ని అందించడానికి ప్రభుత్వం వద్ద ప్రణాళిక సిద్ధంగా ఉన్నదన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీలు డాక్టర్ యాదవరెడ్డి, రఘోత్తంరెడ్డి, జెడ్పీచైర్‌పర్సన్ రోజాశర్మ, నీటిపారుదల శాఖ ఈఎన్సీ హరిరామ్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ పాల్గొన్నారు. హుటాహుటిన ఫామ్‌హౌస్‌కు ఇదిలా ఉండగా మంత్రి హరీశ్‌రావు కొడకండ్ల కార్యక్రమంలో పాల్గొనే ముందే ఫామ్‌హౌస్‌లో నిర్వహించనున్న అత్యవసరభేటీకి హాజరుకావాలని సీఎం నుంచి పిలుపురావడంతో ఇక్కడ త్వరగా ముగించుకొని ఆయన హుటాహుటిన వెళ్లిపోయారు. వర్గల్లో హల్దీవాగులోకి నీటి విడుదల, సిద్దిపేటలో నిర్వహించాలనుకున్న కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. -
మల్లన్న నీళ్లకళ..
దుబ్బాక టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొమురవెల్లి మల్లన్నసాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. 9 జిల్లాల వర ప్రదాయిని, 15 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు తాగునీరు అందించనున్న ఈ రిజర్వాయర్‌ను ఈ నెల 23న సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేయనున్నారు. 2018లో మొదలు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట మండలంలో 2018లో రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్–4లో భాగంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును తొలుత టీఎంసీ నీటి సామర్థ్యంతో నిర్మించాలనుకున్నా రీ డిజైన్ చేసి 50 టీఎంసీలకు పెంచారు. రూ.6,805 కోట్ల బడ్జెట్‌తో మూడున్నర ఏళ్లలోనే పూర్తి చేశారు. ప్రాజెక్టు కోసం 17,781 ఎకరాల భూమిని సేకరించారు. 8 పంచాయతీలతోపాటు మొత్తం 14 నివాస ప్రాంతాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. 10.5 కిలోమీటర్ల పొడవున్న గుట్టలను ఇరువైపులా కలుపుతూ 22.6 కిలోమీటర్ల కట్టను నిర్మించారు. 10 టీఎంసీలకు ఒక అంచె చొప్పున 5 అంచెల్లో 557 మీటర్ల ఎత్తు వరకు కట్టారు. 143 మీటర్ల పొడవున మత్తడి ఏర్పాటు చేశారు. తుక్కాపూర్ వద్ద సొరంగ మార్గంలో భూగర్భంలో ఏర్పాటు చేసిన పంపుహౌజ్ నుంచి బాహుబలి మోటార్ల ద్వారా మల్లన్నసాగర్‌లోకి నీటిని వదులుతారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌ల కోసం 30 టీఎంసీలు మల్లన్నసాగర్‌తో సిద్దిపేట జిల్లాతో పాటు మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, జనగామ, మేడ్చల్ జిల్లాల్లో కాళేశ్వరం 12 నుంచి 19 ప్యాకేజీల ద్వారా సుమారు 8.33 లక్షల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. మరో 7,37,250 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. ఎస్సారెస్పీ–స్టేజీ 1, నిజాంసాగర్, సింగూరు ప్రాజెక్టుల కింద కొత్త, పాత ఆయకట్టు కలుపుకొని 15 లక్షల 71 వేల ఎకరాలు ఈ రిజర్వాయర్ కిందకు రానున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల తాగునీటి అవసరాల కోసం 30 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాల కోసం 16 టీఎంసీలు ఈ రిజర్వాయర్ నుంచి ఏడాది పొడవునా అందిస్తారు. ప్రస్తుతం 10 టీఎంసీలు నిల్వ అతిపెద్ద ఎత్తిపోతల పథకం కావడంతో రిజర్వాయర్‌ను ఒకేసారి పూర్తిస్థాయిలో నింపకుండా విడతల వారీగా ఒక్కోస్థాయి వరకు నింపుతున్నారు. ప్రస్తుతం డ్యాంలో 10 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 60 మీటర్ల ఎత్తైన మట్టికట్ట ఏ మేరకు పనిచేస్తుందో నీటిరంగ నిపుణులు ఎప్పటికప్పుడు పరిశీలించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. -
లంచమడుగుతున్రు.. ఏం జేయాలె సచ్చిపోతున్న: మల్లన్న సాగర్ నిర్వాసితుడు
గజ్వేల్/గజ్వేల్ రూరల్: ‘న్యాయంగా దక్కాల్సిన ఓపెన్ ప్లాట్ ఇవ్వాలని అడిగితే లంచమడుగుతున్నరు. అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోయిన. ఇక సచ్చిపోతున్న’ అంటూ తల్లికి ఫోన్లో చెప్పి మల్లన్నసాగర్ ముంపు బాధితుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో శనివారం ఈ విషాద సంఘటన జరిగింది. రావాల్సిన ఓపెన్ ప్లాట్ కోసం నెలల తరబడి తిరిగి.. తొగుట మండలం పల్లెపహాడ్ గ్రామానికి చెందిన గొడుగు కిష్టయ్యకు ముగ్గురు కుమారులు రాజబాబు, దేవదాసు, రాజు ఉన్నారు. గ్రామంలో తండ్రితో పాటు ముగ్గురికి సంబంధించిన 1.18 ఎకరాల భూమి, ఇతర ఆస్తులను మల్లన్నసాగర్ కింద కోల్పోయారు. పరిహారం కింద అందరికీ కలిపి రూ.48.74 లక్షలు అందాయి. గ్రామం ఖాళీ అయ్యాక తండ్రి కిష్టయ్యకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాగా ఆయన ఆర్అండ్ఆర్ కాలనీలో ఉంటున్నాడు. ముగ్గురిలో రాజబాబు రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. రెండో కుమారుడు దేవదాసు.. ఇటీవల అప్పు చేసి పట్టణంలో సుమారు 60 గజాల స్థలంలో చిన్నపాటి ఇల్లు నిర్మించుకొని అక్కడే ఉంటున్నాడు. తనకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఓపెన్ ప్లాట్ కోసం నెలల తరబడి సిద్దిపేట ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగాడు. శుక్రవారమూ ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి వచ్చాడు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన కొందరు దళారులు రూ.3 లక్షలు లంచమిస్తే పనవుతుందని.. లేదంటే ప్లాట్ రాకుండా చేస్తామని బెదిరించారు. దీంతో ప్లాట్ రాదేమోనని మనస్తాపం చెందాడు. ఇప్పుడే వస్తానని భార్యకు చెప్పి.. వెంటనే వస్తానని భార్య స్వప్నకు చెప్పి శుక్రవారం రాత్రి దేవదాసు బయటకు వెళ్లాడు. రాత్రి 11 దాటినా ఇంటికి రాకపోవడంతో ఆందోళనతో స్వప్న కుటుంబీకులకు చెప్పింది. ఆ సమయంలో దేవదాసు తన తల్లికి ఫోన్ చేసి ‘ప్లాట్ కోసం ఎంత తిరుగుతున్నా వస్తలేదు.. బ్రోకర్లు లంచమడుగుతున్రు. ఇగ నేను సచ్చిపోతా’నని ఫోన్ పెట్టేశాడు. కుటుంబ సభ్యులు రాత్రంతా వెతికినా ఆచూకీ లభించలేదు. తెల్లవారుజామున రాజిరెడ్డిపల్లి మార్గంలో ఓ చెట్టుకు ఉరేసుకొని శవమై కనిపించాడు. స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దేవదాసు ఆత్మహత్యకు దళారులే కారణమంటూ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్, ఆర్డీవో వచ్చే వరకు కదిలేది లేదని కుటుంబీకులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారంపై సిద్దిపేట ఆర్డీవో అనంతరెడ్డిని వివరణ కోరగా దేవదాసుకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ రూ.7.5 లక్షలు, ఇల్లుకు సంబంధించిన రూ. 5. 04 లక్షలు అందించామని, ఓపెన్ ప్లాటు వ్యవహారం పెండింగ్‌లో ఉందని తెలిపారు. దేవదాసు చాలా కాలంగా స్థానికంగా ఉండకపోవడం వల్లే ప్లాటు పెండింగ్‌లో పడిందన్నారు. -
‘ద్రాక్ష’కు పూర్వ వైభవమే లక్ష్యం
గజ్వేల్: రాష్ట్రంలో ద్రాక్ష సాగుకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఉద్యానవనశాఖ సిద్ధమవుతోంది. ఒకప్పుడు ద్రాక్షకు హబ్‌గా ఉన్న ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాలతోపాటు సాగుకు అనుకూలంగా ఉన్న మహబూబ్‌నగర్, నల్లగొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో రైతులను ప్రోత్సహించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇందులో సిద్దిపేట జిల్లా ములుగు కొండాలక్ష్మణ్ బాపూజీ ఉద్యానవర్సిటీ కీలకంగా వ్యవహరించనుంది. రాజేంద్రనగర్‌లోని ఉద్యాన కళాశాలలో శనివారం నిర్వహించిన సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో 50వేల ఎకరాల్లో సాగు.. రాష్ట్రంలో ద్రాక్ష సాగుకు ఒకప్పుడు ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాలే ఆధారం. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనూ కొంత సాగయ్యేది. ఏటా 50వేల ఎకరాలకుపైగా తోటల్లో పండేది. ద్రాక్ష గజ్వేల్ సాగులో సింహభాగాన్ని ఆక్రమించేది. సీడ్లెస్ థామ్సన్, తాజ్గణేష్ రకాలను ప్రధానంగా సాగుచేసేవారు. విదేశాలతోపాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి అయ్యేది. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో ద్రాక్ష రైతులు కోట్లలో నష్టపోయారు. దీంతో అక్కడ సాగు కనుమరుగైంది. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా కొండపాక మండలం కుకునూర్‌పల్లిలో రవీందర్‌రెడ్డి అనే రైతు, విశ్వనాథపల్లిలో ధర్మారెడ్డితోపాటు జిల్లాలోని మరో 10మంది రైతులు కలిసి 88ఎకరాల్లో సాగు చేస్తున్నారు. రాష్ట్ర అవసరాలకు ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి ద్రాక్ష దిగుమతి అవుతోంది. సాగు పెంపునకు ఏం చేద్ధాం? రాజేంద్రనగర్‌లోని ఉద్యానవన కళాశాలలో జరిగిన మేధోమథన సదస్సులో వర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ నీరజాప్రభాకర్, ఉద్యాన శాఖ కమిషనర్ వెంకట్రామ్రెడ్డి, వైఎస్సార్‌హెచ్‌యూ మాజీ చాన్స్‌లర్ డాక్టర్ శిఖామణి, జాతీయ ద్రాక్ష పరిశోధనా సంస్థ డైరెక్టర్ సోమ్‌కుమార్ పాల్గొన్నారు. ఏటా వెయ్యి ఎకరాల్లో ద్రాక్ష సాగు, అధిక దిగుబడి రకాలు, కొత్త వంగడాలపై రైతులకు అవగాహన తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. పుణేలోని జాతీయ ద్రాక్ష పరిశోధనా సంస్థ సహకారంతో లాభసాటి రకాల వృద్ధి, సాగు విస్తీర్ణం పెంపు లక్ష్యంగా ప్రణాళిక చేశారు. ఇది కొద్ది రోజుల్లోనే కార్యరూపం దాల్చనుందని ములుగు వర్సిటీ రిజిస్ట్రార్ భగవాన్ ‘సాక్షి’కి చెప్పారు. -
డబుల్ బెడ్రూం లాక్కుంటాం అన్నారని..
మర్కూక్ (గజ్వేల్): తనకు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇల్లు తీసు కుంటామని కొంత మంది గ్రామ నాయకులు బెదిరించడంతో మనస్తాపం చెందిన ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్ప డింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలో ఎర్రవల్లిలో చోటు చేసు కుంది. ఎర్రవల్లి గ్రామానికి చెందిన కుంట నర్సమ్మ (45) గతంలో ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్రూం ఇంట్లో కుటుంబంతో కలి సి ఉంటోంది. ఇంటి ఆవరణలో ఉన్న ఖాళీ స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించుకు నేందుకు సిద్ధపడగా గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రహరీ నిర్మించు కుంటే ఇల్లు తిరిగి తీసుకుంటా మని బెదిరింపులకు పాల్పడటంతో పాటు అసభ్యంగా మాట్లాడారు. మ నస్తాపం చెందిన నర్సమ్మ శనివా రం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గజ్వేల్ ప్రభుత్వా స్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి భర్త ఫి ర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
తెగుళ్ల నష్టం.. అప్పుల కష్టం
మహబూబాబాద్ రూరల్/దౌల్తాబాద్ (దుబ్బాక): అప్పులు తీర్చేమార్గం కానరాక మహబూబాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా మానుకోట మండలం ఆమనగల్‌కు చెందిన దేవిరెడ్డి వెంకట్‌రెడ్డి(40) మూడెకరాల్లో వరి, ఎకరం పత్తి, రెండు ఎకరాల్లో మిర్చి సాగుచేశాడు. పత్తి అంతంత మాత్రంగానే పండగా, మిర్చికి తెగుళ్లు ఆశించడంతో తీరని నష్టం వాటిల్లింది. పంటలసాగుకు చేసిన అప్పు, బ్యాంకు రుణాలు మొత్తం రూ.10 లక్షలకు చేరాయి. అప్పులు తీర్చే మార్గం కానరాక తన వ్యవసాయ బావి వద్ద సోమవారం సాయంత్రం పురుగులమందు తాగాడు. సమీప రైతులు గమనించి 108లో మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ఉప్పరపల్లికి చెందిన జంగపల్లి బాల్‌రాజు(28) హైదరాబాద్‌లోని ఓ హోటల్లో మాస్టర్. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి స్వగ్రామానికి వచ్చి తనకున్న ఎకరం భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నాడు. ముగ్గురు అక్కలపెళ్లిళ్లకు చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక మనోవేదనకు గురయ్యాడు. మంగళవారం ఉదయం గ్రామం సమీపంలోని సింగచెరువు వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. -
ఊరిని కొని దానమిచ్చిన పాలకుడు
సాక్షి, హైదరాబాద్: అదో ఊరు.. వాగు ఒడ్డున ఉంది. స్థానిక పాలకుడు దానికి సరిపడా పైకం ఇచ్చి కొనుగోలు చేసి దాన్ని అగ్రహారంగా దానమిచ్చాడు. ఇలా ఊరిని కొని దానమివ్వటం కొంత విచిత్రంగా అనిపించే వ్యవహారమే అయినా.. తాజాగా వెలుగు చూసిన ఓ శాసనం ఇదే విషయాన్ని చెబుతోంది. ప్రస్తుత సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణానికి సమీపంలో ఉన్న దొమ్మాట గ్రామం కథ ఇది. అది 14వ శతాబ్దం. స్థానిక పాలకుడు పైడిమర్రి నాగా నాయనిగారనే స్థానిక పాలకుడు ఈ గ్రామాన్ని తగు పైకం చెల్లించి కొనుగోలు చేశాడు. తర్వాత దాన్ని అగ్రహారంగా బ్రాహ్మణ కుటుంబాలకు దానం చేశాడు. అప్పటి నుంచి దొమ్మాట అగ్రహారంగా ఆ ఊరు కొనసాగింది. ఆ తర్వాత ఓసారి గ్రామానికి సమీపంలోనే ఉన్న కృష్ణమ్మ చెరువు, గురుజకుంట వాగు పొంగి గ్రామం మునిగిపోయింది. దీంతో వ్యవసాయ పొలాల ఆధారంగా కొందరు వాగుకు ఆవల, కొందరు వాగుకు ఈవల ఇళ్లు కట్టుకోవటంతో క్రమంగా రెండు ఊళ్లుగా అవి ఎదిగాయి. కొందరు ఆ దొమ్మాట ఊళ్లోని గుళ్ల శిల్పాలు, వీరగళ్లులు, శాసనాన్ని తెచ్చి పెట్టుకున్నారు. ఆ శాసనం పొలాల మధ్య పడి ఉండగా తాజాగా కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ దాన్ని గుర్తించారు. ఇది దొమ్మాట గ్రామ శాసనమేనని, అందులో.. ‘పాహిడిమరి నాగాన్నాయనిగారు ధారణశేశి ఇచ్చిన అగ్రహారం దొమ్మాటకుంను ఆ బుని..దేయాన్న జొమా..న.. అన్న పంక్తులు (కొన్ని అక్షరాలు మలిగిపోయాయి) ఉన్నాయని శాసనాన్ని గుర్తించిన చరిత్ర పరిశోధకుడు శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. శాసనంపైన సూర్యచంద్రుల గుర్తులున్నాయి. కానీ అది ఏ చక్రవర్తి/రాజు హయాంలో చోటుచేసుకుందో శాసనంలో ప్రస్తావించలేదు. -
రాయితీలు.. ఇంకా రాలే..
►సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు గోమతి కాటన్ ఇండస్ట్రీస్ ఆరేళ్ల క్రితం కార్యకలాపాలు ప్రారంభించింది. పెట్టుబడి రాయితీ ఇవ్వాలని దరఖాస్తు చేసుకోగా రూ.10 కోట్లు విడుదల చేయాలని రాష్ట్రస్థాయి కమిటీ సిఫారసు చేసింది. అయినా నేటికీ నయాపైసా విడుదల కాలేదు. ►కామారెడ్డి జిల్లా లింగంపేటకు చెందిన మన్నె జానకి 2017లో ఉపాధి కోసం జేసీబీ యంత్రాన్ని కొనుగోలు చేశారు. ఎస్సీ, ఎస్టీల రాయితీలకు ఉద్దేశించిన ‘టీ ప్రైడ్’కింద రూ.6.91 లక్షలు సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సబ్సిడీ ఇవ్వాలని 2018 అక్టోబర్‌లో కమిటీ సిఫారసు చేసింది. అయినా డబ్బులు బ్యాంకు ఖాతాలో జమకాలేదు. సబ్సిడీ అందకపోవడంతో అప్పులపై వడ్డీ భారం పెరుగుతోందని ఆమె ఆవేదన చెందుతున్నారు. ►సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన రేండ్లపల్లి కాంతమ్మ వాహనం కొనుగోలు కోసం దరఖాస్తు చేసుకోగా 2018లో యూనిట్ మంజూరైంది. రుణం కోసం బ్యాంకును ఆశ్రయించగా, పరిశ్రమల శాఖ నుంచి పెట్టుబడి సబ్సిడీ విడుదలైతేనే రుణం మంజూరు చేస్తామని షరతు విధించింది. అటు బ్యాంకు, ఇటు పరిశ్రమల శాఖ తీరుతో తనకు ఉపాధి లేకుండా పోయిందని కాంతమ్మ వాపోతున్నారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబ డులతో వచ్చే వారికి ప్రభుత్వం ప్రకటించిన రాయితీలు, ప్రోత్సాహకాలు అందడం లేదు. ఏళ్ల తరబడి వేచిచూస్తున్నా.. పరిశ్రమల యాజమాన్యాలు దరఖాస్తులు చేసుకుంటున్నా విడుదల కావడం లేదు. గత నవంబర్ వరకు రాష్ట్రంలో 43 వేలకుపైగా యూనిట్లకు రూ.3,389.95 కోట్లు రాయితీలు పెండింగ్‌లో ఉన్నాయి. దీనిపై రాష్ట్రస్థాయి కమిటీ ఇప్పటివరకు 72 పర్యాయాలు ప్రభుత్వానికి తీర్మానాలు చేసి పంపినా ఫలితం శూన్యమే. నవంబర్ 30న జరిగిన 72వ రాష్ట్రస్థాయి కమిటీ సమావేశం 369 యూనిట్లకు సంబంధించి మరో రూ.47.67 కోట్లు విడుదల చేయాలని ప్రతిపాదించింది. జనరల్ కేటగిరీలో 2016–17 నుంచి, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో 2018–19 నుంచి రాయితీలు పెండిం గులో ఉన్నాయి. కరోనాతో కార్యకలాపాలు దెబ్బతినడంతో ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఊరటనిస్తాయ ని పారిశ్రామికవర్గాలు భావించాయి. దీనికితోడు బ్యాంకు రుణాలపై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మారటోరియం కూడా అమలుకాకపోవడంతో ఇటు రుణాలపై వడ్డీ, అటు ప్రోత్సాహకాలు అందక యాజమాన్యాలు సతమతమవుతున్నాయి. ఊరటనివ్వని ‘టీ ఐడియా’, ‘టీ ప్రైడ్’ పరిశ్రమల శాఖ లెక్కల ప్రకారం 2014–15 నుంచి ఇప్పటివరకు రూ.26.46 లక్షల కోట్ల పెట్టుబడులతో 18వేలకు పైగా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారు. వీటి ద్వారా 21 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని లెక్కలుగట్టారు. పెట్టుబడులతో వచ్చే వారికి ప్రోత్సాహకాలిచ్చేందుకు ప్రభుత్వం 2014లో ‘టీ ఐడియా’, ‘టీప్రైడ్’పేరిట మార్గదర్శకాలు రూపొందించింది. జనరల్ కేటగిరీకి టీ ఐడియా ద్వారా, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు ‘టీ ప్రైడ్’ద్వారా ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించింది. వీటికింద రాయితీ, స్టాంప్ డ్యూటీ, సేల్స్ టాక్స్, భూమి ధర, విద్యుత్ బిల్లులు, పావలావడ్డీ తదిరాలకు సంబంధించి రాయితీలు, ప్రోత్సాహకాలు అందాల్సి ఉంది. ఇదిలాఉంటే సీనియారిటీ ప్రకారం బకాయిలు విడుదల కావాల్సి ఉండగా, సిఫారసు లేఖలు తెచ్చిన 24 మెగా కంపెనీలకు గత నవంబర్‌లో రూ.250 కోట్లు విడుదలైనట్లు సమాచారం. బడ్జెట్లో కేటాయించినా..! రాష్ట్రంలో వివిధ కేటగిరీల్లోని వేలాది మంది పారిశ్రామికవేత్తలకు రూ.3,389 కోట్ల రాయితీలు, ప్రోత్సాహకాలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం వార్షిక బడ్జెట్ 2021–22లో పారిశ్రామిక రంగానికి రూ.3,077 కోట్లను ప్రతిపాదించి, అందులో రూ.2,500 కోట్లు రాయితీలు, ప్రోత్సాహకాలకే కేటాయించినప్పటికీ నిధులు మాత్రం విడుదల చేయలేదు. అంతకుముందు బడ్జెట్లో రాయితీల బకాయిలు చెల్లించేందుకు 1,500 కోట్లు కేటాయించినా అరకొర చెల్లింపులే జరిగాయి. ఇప్పటివరకు రూ.100 కోట్లు మాత్రమే విడుదలైనట్లు పరిశ్రమల శాఖ వర్గాలు చెప్తున్నాయి. దీంతో ఆశలు ఆవిరై చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉసూరుమంటున్నాయి. -
అన్నతోనే ‘సంబంధం’ అని పంచాయితీ.. భార్యపై చేయిచేసుకోవడంతో..
సాక్షి, కొండపాక(గజ్వేల్., సిద్దిపేట): కుటుంబ కలహాలతో రెండేళ్ల కుమారుడికి నిప్పంటించి తల్లి కూడా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని సిర్సనగండ్ల గ్రామంలో చోటు చేసుకుంది. సిర్సనగండ్లకు చెందిన గవ్వల అయ్యల్లం, బీరవ్వల రెండో కుమారుడు స్వామికి చేర్యాల మం డలం వేచరేణికి చెందిన పోశయ్య, మల్లవ్వల చిన్న కుమార్తె నవితను ఇచ్చి పదేళ్ల క్రితం వివాహం చేశారు. స్వామి వ్యవసాయ పనులతో పాటు కూలీ పను లు చేసుకుంటూ భార్య నవిత (25), కుమారుడు మణిదీప్ (2)ను పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో స్వామి అన్న భాస్కర్‌కు నవితకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయంలో వారం రోజుల క్రితం కులపెద్దలు సముదాయించి స్వామికి నచ్చజెప్పారు. ఈ క్రమంలో శనివారం స్వామి వ్యవసాయ బావి వద్ద పత్తి ఏరేందుకు భార్యను రమ్మని చెప్పగా.. ఆమె రానని అనడంతో ఇద్దరికి గొడవ జరిగింది. దీంతో స్వామి భార్య పై చేయి చేసుకొని వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన నవిత మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కుమారుడు మణిదీప్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించి తాను కూడా నిప్పంటించుకుంది. చదవండి: ఇంతమంది చనిపోతుంటే ఎన్ఫోర్స్మెంట్ ఏం చేస్తోంది? ఇంట్లో నుంచి వస్తున్న పొగను గమనించిన చుట్టుపక్కల వారు తలుపులు పగుల గొట్టి చూడగా ఇద్దరూ విగత జీవులై కనిపించా రు. తమ కూతురు నవితపై లేనిపోని అభాండాలు వేసి, వేధించి చంపారని మృతురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కూతురు మృతికి కారణమయ్యారని అత్త బీరవ్వ, బావ భాస్కర్, భర్త స్వామిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. త్రీటౌన్ సీఐ ప్రవీణ్‌కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. చదవండి: బాత్రూంలో ఉరివేసుకొని బాలింత ఆత్మహత్య -
విమానం ఎక్కాక ఫోన్.. తర్వాత చేస్తే స్విచ్ ఆఫ్.. జాడ లేని ఆర్మీ జవాన్
చేర్యాల(సిద్దిపేట): సిద్దిపేట జిల్లా చేర్యాల మండలానికి చెందిన ఓ ఆర్మీ జవాన్ ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పోతిరెడ్డిపల్లికి చెందిన బోకూరి సాయికిరణ్‌రెడ్డి పంజాబ్‌లో ఆర్మీ జవాన్ (గన్నర్)గా విధులు నిర్వహిస్తున్నాడు. మూడు వారాల క్రితం సెలవుపై వచ్చిన ఆయన తిరిగి విధుల్లో చేరేందుకు ఈ నెల 5న ఇంటి నుంచి బయలుదేరాడు. కాగా, శంషాబాద్ విమానాశ్రయంలో ఢిల్లీ విమానం ఎక్కిన తర్వాత అతను కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడాడు. అనంతరం అతని గురించి ఎలాంటి సమాచారం లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. వారం రోజులుగా వారు సాయికిరణ్ ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయమై పంజాబ్‌లోని ఆర్మీ అధికారులకు ఫోన్ చేయగా అతను విధుల్లో చేరలేదని చెప్పినట్లు కిరణ్ తల్లిదండ్రులు తెలిపారు. తమ బిడ్డ ఆచూకీ తెలుసుకోవడం కోసం సహకరించాలని వారు పలువురు ప్రజాప్రతినిధులను కలిశారు. సాయికిరణ్ కనిపించకుండా పోవడంపై గ్రామానికి చెందిన ఓయూ విద్యార్థి, మంత్రి కేటీఆర్‌కి ట్విట్టర్లో సమాచారం ఇచ్చాడు. దీంతో పాటు సాయికిరణ్ తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్సై నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ సాయికిరణ్ కనిపించకుండా పోయిన సంఘటన ఇక్కడ జరగలేదు కాబట్టి జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఢిల్లీ విమానాశ్రయ పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. అక్కడే కేసు నమోదైనట్లు వివరించారు. -
డబ్బులివ్వలేదని గుడిసెకు నిప్పు
మిరుదొడ్డి(దుబ్బాక): భార్య డబ్బులివ్వలేదన్న కోపంతో నివసిస్తున్న గుడిసెకే నిప్పు పెట్టాడో భర్త. ఈ ఘటనలో గుడిసెలో దాచుకున్న రూ.1.73 లక్షల నగదుతో పాటు విలువైన వస్తువులు కాలిబూడిదయ్యాయి. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల పరిధిలోని లక్ష్మీనగర్‌లో శనివారం చోటు చేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. గుండవేణి మమత, బాలయ్య భార్యాభర్తలు. మూడు నెలల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు గూడెం నుంచి బతుకుదెరువు కోసం లక్ష్మీనగర్‌కు వలస వచ్చారు. గ్రామంలో ఒక గుడిసె వేసుకుని నివసిస్తున్నారు. మద్యానికి బానిసైన బాలయ్య తరచుగా భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో భూమికి సంబంధించిన రూ.1.73 లక్షల నగదు రావడంతో మమత బీరువాలో దాచింది. ఆ డబ్బును తనకివ్వాలని భార్యతో బాలయ్య శుక్రవారం రాత్రి గొడవ పడ్డాడు. డబ్బులివ్వకుంటే గుడిసెకు నిప్పు పెడతానని బెదిరించగా..భార్య ఇవ్వనని చెప్పి అదేరాత్రి భయంతో పొరుగునే ఉన్న బంధువుల ఇంటికి వెళ్లింది. దీంతో డబ్బులివ్వలేదని కోపంతో శనివారం తెల్లవారు జామున బాలయ్య గుడిసెకు నిప్పు అంటించి పరారయ్యాడు. ఈ ఘటనలో బీరువాలో ఉంచిన నగదుతో పాటు విలువైన సామగ్రి, దుస్తులు కాలిపోయాయి. బాధితురాలిని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు పరామర్శించి రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. బాధితురాలిని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. మమత ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
‘గురువు’ పరువు పాయే
దుబ్బాకరూరల్: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు విచక్షణ మరిచాడు. తాగొచ్చి మద్యం మత్తులో విద్యార్థులను చితకబాదాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని పద్మనాభుని పల్లిలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. వి ద్యార్థులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకా రం.. గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న అమ్మన సంజీవరెడ్డి ఫుల్‌గా మద్యం సేవించి పాఠశాలకు వచ్చాడు. ఆ మత్తు లో 2, 3, 4, 5 తరగతులకు చెందిన 12 మంది విద్యార్థులను బెత్తంతో చితక బాదాడు. అంతేకా దు చెంపలు, తొడలపై రక్తం కారేటట్లు గోటి వేళ్లతో గీరాడు. తరువాత విద్యార్థుల అరుపులు బయ టకు వినపడకుంగా తరగతి గదికి తలుపులు వేసి బంధించాడు. పాఠశాల సమయం ముగిసిన తరువాత విద్యార్థులను వదిలేశాడు. ఇంటికి వెళ్లిన విద్యార్థులకు తల్లిదండ్రులకు చెప్పడంతో, ఆగ్ర హించిన వారు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న మండల విద్యాధి కారి ప్రభుదాస్ పాఠశాలకు చేరుకున్నారు. గాయ పడిన విద్యార్థులకు ఎంఈఓ ప్రభుదాస్, సర్పంచ్ పర్శరాములు ఆధ్వర్యంలో తిమ్మాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయించారు. బాధిత విద్యార్థులు మనోజ్, వర్షిత, సుషాంత్, హరీశ్, ప్రసాద్, రాకేష్, రిత్విక్, హర్షిత్, లోకేష్, నిష్విత, స్పందన, రవళిలనుంచి సమాచారం సేకరించారు. గతంలోనూ మద్యం సేవించి పాఠశాలకు వస్తే ఉపాధ్యాయుడిని మందలించామని తల్లిదండ్రులు విద్యాధికారికి తెలిపారు. ఉపాధ్యాయుడు సంజీవ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని గ్రామస్తులంతా ఎంఈఓ ఆధ్వర్యంలో తీర్మానం చేశారు. -
భార్యపై అనుమానం: నేనేం చేశాను నాన్నా!
కళ్లల్లో పెట్టుకుని చూసుకోవలసిన బంగారు తల్లిని.. గుండెల్లో పదిలంగా దాచుకోవలసిన చిట్టి తల్లిని.. ముద్దులు మూటగడుతున్న పసికందుని ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలియక అమాయకంగా చిరునవ్వులు పూయిస్తున్న సిరిమల్లిని..చిదిమేశాడు.. కరెంటు పెట్టి కర్కశంగా కన్నతండ్రే చంపేశాడు. భార్యపై అనుమానంతో బిడ్డ పాలిట కాలయముడయ్యాడు. అనంతరం పురుగు మందు తాగి ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేటలో శుక్రవారం జరిగిన ఈ ఘటనపై గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలివి. కరెంటు షాక్‌తో చిన్నారి రెండు కాళ్లు కాలిపోయిన దృశ్యం దుబ్బాక టౌన్/తొగుట: వెంకట్రావుపేటకు చెందిన మిరుదొడ్డి రాజశేఖర్ (32)కు రెండేళ్ల క్రితం దౌల్తాబాద్‌కు చెందిన సునీతతో వివాహమైంది. తొమ్మిది నెలల క్రితం పాప ప్రిన్సీ జన్మించింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆరు నెలల క్రితం పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి సర్ది చెప్పినా రాజశేఖర్ ప్రవర్తనలో మార్పు రాలేదు. భర్త ప్రవర్తనతో విసిగిన సునీత పుట్టింటికి వెళ్లి పోయింది. దీంతో నెల రోజుల క్రితం భార్యకు సర్దిచెప్పి మళ్లీ వెంకట్రావుపేటకు తీసుకొచ్చాడు. కిరాతక తండ్రి చేతిలో బలైన చిన్నారి ప్రిన్సీ రెండు కాళ్లకు విద్యుత్ తీగ చుట్టి.. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం పాపను బయటికి తీసుకెళ్తున్నానంటూ ఇంట్లో చెప్పి వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ పాప రెండు కాళ్లకు విద్యుత్ తీగ చుట్టి షాక్ ఇచ్చి చంపేశాడు. అనంతరం మిరపతోటకు వినియోగించే పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన సమీపంలోని రైతులు తొగుట పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్ఐ రాంరెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పాప మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అపస్మారక స్థితిలో ఉన్న రాజశేఖర్‌ను గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ ప్రాథమిక చికిత్స చేసి.. పరిస్థితి విషమించడంతో ములుగు ఆర్వీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నితల్లీ.. నువ్వు లేకుండా నేనెట్టా బతికేది ‘అయ్యో నా చిన్ని తల్లి.. నువ్వు లేకుండా నేనెట్లా బతికేది’.. అంటూ కూతురి మృతదేహాన్ని పట్టుకొని కన్నతల్లి గుండెలవిసేలా రోదించడం స్థానికులను కలచివేసింది. ‘ఆడించడానికి బయటికి తీసుకపోతున్నాడనుకున్నా.. గింత దారుణానికి పాల్పడతాడని కలలో కూడా ఊహించలేదు.. నా బిడ్డ లేకుండా నేను ఎట్లా బతకాలి?’అంటూ ఆ తల్లి గుండెలు బాదుకుంటూ కన్నీరుమున్నీరయ్యింది. -
కుప్ప‘కూలి’న ప్రాణం
నంగునూరు (సిద్దిపేట): వడ్లు ఆరబెడుతున్న క్రమంలో ఓ వ్యక్తి గుండెపోటుకు గురికాగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ ఘటన గురువారం సిద్దిపేట జిల్లా నంగుననూరు మండలం బద్దిపడగలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మడ్లూరి రాములు (42)కు భార్య, నలుగురు కూతుళ్లు ఉన్నారు. గ్రామానికి చెందిన దండ్ల ఎల్లయ్య తన చేనులో వరిపంట కోసే సమయం నుంచి అమ్మేంత వరకు కూలికి రావాలని రాములుకు చెప్పాడు. దీంతో వరి కోత అనంతరం కొనుగోలు కేంద్రం సమీపంలో రాములు వడ్లను ఆరబెడుతున్నాడు. గురువారం సాయంత్రం భార్యతో కలసి వడ్లు కుప్ప పోస్తున్న రాములు ఛాతిలో నొప్పి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలాడు. తోటి రైతులు అంబులెన్స్‌లో సిద్దిపేటకు తరలిస్తుండగానే మృతి చెందాడు. -
అంగన్వాడి కేంద్రంలో చిన్నారి మృతి!
గజ్వేల్ రూరల్: అంగన్వాడి కేంద్రానికి వెళ్లిన నాలుగేళ్ల చిన్నారి మృతిచెందింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బయ్యారంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కామల్ల రాజు–సంతోష దంపతులకు కొడుకు, కూతురు నిత్య (4) ఉన్నారు. రోజు మాదిరిగానే గురువారం ఉదయం నిత్య అంగన్వాడీ కేంద్రానికి వెళ్లింది. మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో నిత్య ఎడమ కాలుకు రక్తం కారుతుండడాన్ని గమనించిన ఆయా పసుపుతో కట్టుకట్టి గదిలోకి తీసుకువెళ్లి పడుకోబెట్టింది. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలంతా భోజనం చేసిన తర్వాత 2గంటల ప్రాంతంలో నిత్యను నిద్రనుంచి లేపేందుకు ప్రయత్నించగా, లేవకపోవడంతో తల్లి సంతోషకు సమాచారం అందించారు. వారు వెంటనే వచ్చి అపస్మారక స్థితిలో ఉన్న నిత్యను గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే నిత్య మృతి చెందినట్టు తెలిపారు. నిత్య ఎడమకాలు పాదం భాగంలో పాముకాటు గుర్తులున్నాయని, తమ కూతురి మృతిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఎస్ఐ అశోక్‌కు ఇచ్చిన ఫిర్యాదులో నిత్య తల్లిదండ్రులు పేర్కొన్నారు. నిత్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అబ్బుర పరిచిన ఆదిమానవుని ఆనవాళ్లు..
సాక్షి, నంగునూరు: ఆదిమానవుల ఆనవాళ్లు, అతిపురాతన వస్తువులు.. అబ్బుర పరిచే అవశేషాలు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట, పాలమాకుల, మగ్దుంపూర్ గ్రామాల్లో బయటపడ్డాయి. ఆదిమానవుని సమాధి, వారు వాడుకున్న సామాగ్రీ వెలుగు చూశాయి. ఇవి సుమారు 3000 వేల సంవత్సరాల క్రితం ఆదిమానవులు వినియోగించినట్లు పురావస్తుశాఖ అధికారులు పేర్కొన్నారు. 2017 ఫిబ్రవరి నుంచి మూడు నెలల పాటు నంగునూరు మండలంలోని నర్మెట, పాలమాకుల, మగ్దుంపూర్ గ్రామాల్లో పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు చేపట్టగా అతి పురాతన వస్తువులు, ఆదిమానవుని ఆనవాళ్లు బయటపడ్డాయి. ఈ అవశేషాలను హైదరాబాద్‌లోని పురావస్తుశాలకు తరలించి భద్రపరిచారు. (చదవండి: హైదరాబాద్‌లో 6 రకాల బిర్యానీలు.. కచ్చీ, పక్కీ బిర్యానీ అంటే తెలుసా?) 1.క్యాప్‌స్టోన్‌గా అతిపెద్ద బండరాయి.. ఈ చిత్రంలో కనిపిస్తున్నపెద్ద బండరాయి ఆదిమానవుల సమాధిపై ఉన్న క్యాప్‌స్టోన్. ఇది సుమారుగా 3 వేల సంవత్సరాల కిందటిదిగా పురావస్తుశాఖ అధికారులు భావిస్తున్నారు. సమాధిపై కప్పిఉన్న బండరాయి (క్యాప్‌స్టోన్) 6.70 మీటర్ల పొడవు, 4 మీటర్లు వెడల్పు, 65 సెంటీమీటర్లు మందంతో 43 టన్నుల బరువు ఉంది. దీన్ని క్రేన్ సహాయంతో లేపేందుకు ప్రయత్నించగా దాని సామర్థ్యం సరిపోలేదు. దీంతో 80 టన్నుల బరువును లేపే సామర్థ్యం ఉన్న క్రేన్ సహాయంతో 2 గంటల పాటు కష్టపడి బండను తొలగించారు. 2. సుద్ద ముక్కలు కావు శంఖాలు (కౌంచ్) సుద్దరాళ్లుగా కనిపిస్తున్న ఈ వస్తువులు తవ్వకాల్లో బయటపడ్డ శంఖాలు. ప్రాచీన మానవుడు ప్రార్థన చేసేందుకు, వ్యక్తి చనిపోయిన తరువాత అంత్యక్రియల సమయంలో గౌరవ సూచకంగా వీటిని వాడేవారని పురావస్తుశాఖ అధికారులు తెలిపారు. నాటి నుంచి నేటి వరకు కొన్ని తెగల్లో ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. ఆనాటి కాలంలో కూడా ఇలాంటి ఆచారాలు ఉన్నాయా అని స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. 3. కుండలు పెట్టుకునే రింగ్‌స్టాండ్ ఆదిమానవులు వంట పాత్రలను పెట్టుకునే స్టాండ్ ఇది. వంటలు చేయగానే కుండలు పడిపోకుండా, క్రిమికీటకాలు కుండల్లోకి పోకుండా ఇలాంటి ఎరుపు రంగు కల్గిన కుదర్లు (రింగ్‌స్టాండ్) వాడేవారు. చూడడానికి ఢమరుకం లాగ కనబడుతున్నా వాస్తవానికి మట్టికుండలు పెట్టుకునే ఉపయోగించే రింగ్‌స్టాండ్ ఇది. 4. నక్షత్ర సమూహాలను గుర్తించే కఫ్‌మాక్స్ నక్షత్ర సమూహాలు గుర్తించేందుకు ప్రాచీన మానవుడు బండరాళ్లపై కఫ్‌మాక్స్ లను చెక్కేవారు. ప్రస్తుతం నడుస్తున్న కాలం, తర్వాత వచ్చే సీజన్, ఋతువులను తెలుసుకునేందుకు ఇలాంటి గుర్తులను వారు నివసిస్తున్న ప్రాంతంలో రాతి బండ లపై చెక్కేవారు. (పురావస్తుశాఖ అధికారులు గుంతల్లో ఉప్పు పోయడంతో స్పష్టంగా కనిపిస్తున్నాయి). 5. తవ్వకాల్లో బయటపడుతున్న మృణ్మయ పాత్రలు ఎరుపు, నలుపుతోపాటు రెండు రకాల రంగులు కల్గిన మిశ్రమ మృణ్మయ బయటపడ్డాయి. రెండు సమాదుల్లో తవ్వకాలు జరుపగా ప్రాచీన మానవులు వాడిన అనేక పాత్రలు, ఎంతో కీలకమై సమాచారం లభించింది. 6. అద్భుతమైన మట్టికుండ ప్రాచీన మానవుడు వాడిన ఎరుపు రంగు మట్టికుండ నర్మెటలో జరిపిన తవ్వకాల్లో బయటపడింది. వేల సంవత్సరాల కిందట తయారు చేసిన మట్టి కుండకు చుట్టు అలంకారంగా సర్కిళ్లు చెక్కగా ఇప్పటికి చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. ఇంత పెద్దకుండను తాగునీటి కోసం ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు. (చదవండి: జొన్నలకు పులి కాపలా!) 7 ఫైర్‌స్టాండ్, మృణ్మయ పాత్రలు ధాన్యం, విలువైన వస్తువులు మట్టికుండల్లో దాచేవారు. చనిపోయిన వ్యక్తికి ఇష్టమైన పదార్థాలను కుండల్లో పెట్టి సమాధి చేసేవారు. అలాగే ఫైర్‌స్టాండ్ (కుంపటి) పై ఆహార పదార్థాలు వేడి చేసుకోవడమే కాకుండా ధూపం వేసుకునేందుకు వీటిని వాడినట్లు తెలుస్తోంది. 8. రాళ్లుకావు ప్రాచీన మానవుని సమాధి పాలమాకులలో పురావస్తుశాఖ అధికారులు తవ్వకాలు చేపట్టగా అందంగా పేర్చినట్లు కనబడుతున్న బండ రాళ్లు తవ్వకాల్లో బయటపడ్డాయి. సుమారుగా 3 వేల సంవత్సరాల కిందట ఈప్రాంతంలో ఆదిమానవులు జీవించినట్లు తెలుస్తోంది. చనిపోయిన వారిని సమాధి చేసి నాలుగు వైపుల బండలను (సిస్ట్) స్విస్తిక్ ఆకారంలో ఏర్పాటు చేసేవారు. దాని చట్టూ రెండు వరుసలుగా వృత్తాకారంలో బండరాళ్లను పేర్చారు. 9. గుంతలు కావు గ్రూవ్స్ మగ్దుంపూర్‌లో ఓరైతు వ్యవసాయ బావి వద్ద ప్రాచీన మానవుడు ఏర్పాటు చేసుకున్న 12 గ్రూవ్స్ గుర్తించారు. జంతువులను వేటాడేందుకు ఉపయోగించే రాతి ఆయుధాలను పదును పెట్టేందుకు వీటిని ఉపయోగించేవారు. 10. గిన్నెల తయారీ అద్భుతం ప్రాచీన మానవులు ఆహారాన్ని నిల్వ చేసుకునేందుకు ఎరుపు, నలుపు రంగు మట్టి గిన్నెలను ఉపయోగించేవారు. ఇవి ఇతర మట్టిపాత్రలకు భిన్నంగా రెండు రంగులు కల్గి ఉండగా ఇప్పటికి చెక్కుచెదరలేదు. మెన్హీర్ సమీపంలో ఉన్న రెండవ సమాధిలో ఇవి బయటపడ్డాయి. 11. చెక్కు చెదరని దంతాలు మెన్హీర్ వద్ద ఉన్న పెద్ద సమాధిలో జరుపుతున్న తవ్వకాల్లో తెగలోని పెద్ద మహిళదిగా బావిస్తున్న 60 సెంటీమీటర్ల కాలు ఎముక లభించింది. అలాగే 20 సెంటీమీటర్ల దంతంతో కూడిన దవడ భాగం బయటపడింది. దానికి ఉన్న దంతాలు ఇప్పటికి చెక్కుచెదరలేదు. సీసీఎంబీ శాస్త్రవేత్తలు జరపనున్న పరిశోధనల్లో ఈ రెండు భాగాలు కీలకంగా మారనున్నాయి. 12. ఎముక ఆభరణాలు ఆదిమానవులు ఎముకలతో తయారు చేసిన అభరణాలు వాడినట్లు తెలుస్తోంది. సుమారుగా 20 వరకు డైమండ్ ఆకారంలో ఉన్న ఎముకతో తయారు చేసిన పూసలు మెన్హీర్ వద్ద పెద్ద సమాధిలో జరిపిన తవ్వకాల్లో బయపడ్డాయి. ఇలాంటి ఆకృతి మొదటిసారిగా ఈప్రాంతంలోనే బయట పడ్డట్లు అధికారులు తెలిపారు. (చదవండి: మంత్రి తలసాని కుమారుడిపై కేసు నమోదు) -
పత్తి ధర పైపైకి.. క్వింటాలుకు రూ.8,421
గజ్వేల్: రాష్ట్రంలో పత్తికి మంచి ధర లభిస్తోంది. శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ యార్డులో క్వింటాలుకు గరిష్టంగా రూ.8,421 పలికింది. ఈ–నామ్ (నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్) ద్వారా 109 క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరగ్గా.. ఇందులో గరిష్టంగా రూ.8,421, మోడల్ ధరగా రూ.8,263, కనిష్టంగా రూ.8,200 పలికిందని మార్కెట్ కమిటీ కార్యదర్శి జాన్‌వెస్లీ, సూపర్వైజర్ మహిపాల్ తెలిపారు. అతివృష్టి కారణంగా దిగుబడులు పడిపోయి తీవ్రమైన నష్టాల్లో ఉన్న రైతులకు ఈ పరిణామం కొంత ఊరటనిస్తోందని వారు అన్నారు. -
ఇంకా ఎదురుచూపులే!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం అవుతుందనుకున్నా.. మొదలు కాలేదు. దీంతో రైతులకు ఇంకా ఎదురుచూపులు తప్పడం లేదు. వరికోతలు ప్రారంభమై పదిరోజులు కావడంతో కొను గోళ్లు ప్రారంభించేందుకు ప్రభుత్వం ఇటీవలే ఆ మోదం తెలిపింది. కొనుగోళ్ల ప్రక్రియను వెంటనే మొదలుపెట్టాలని, రైతులకు ఇబ్బందులు కలగ కుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లు, పౌర సరఫరాలశాఖ అధికారులను ఆదేశించింది. అయితే ప్రభుత్వం నుంచి ఆమోదం లభించి మూడు రోజులు అవుతున్నా జిల్లాల్లో కొనుగోళ్లకు సం బంధించిన ఏర్పాట్లపై అధికారులు కసరత్తు చేస్తూ నే ఉన్నారు. సోమవారమే సమీక్షలు ప్రారంభించిన నేపథ్యంలో కొనుగోళ్లు ప్రారంభించేందుకు మరో ఐదారు రోజుల సమయం పట్టేలా ఉంది. 4 జిల్లాల నుంచే 40% కంటే ఎక్కువ దిగుబడి నల్లగొండ, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో వరి కోతలు ప్రారంభమై కల్లాలకు ధాన్యం పది రోజుల నుంచే వస్తుండటంతో, ఆయా జిల్లాల్లో సోమవారం నుంచి కొనుగోళ్లు ప్రారంభించేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. కానీ యంత్రాంగం అందుకు పూర్తిస్థాయిలో సిద్ధం కాకపోవడంతో ధాన్యం సేకరణ ప్రక్రియ ప్రారంభించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్లో 1.35 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. అందులో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 6,500కు పైగా కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో ఒక్క ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే 26 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం దిగుబడి రానుంది. నిజామాబాద్‌లో 9,63,652 మెట్రిక్ టన్నులు, కామారెడ్డిలో 6.5 లక్షల మెట్రిక్ టన్నులు, ఉమ్మడి మెదక్ జిల్లాలో మరో 11 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం దిగుబడి రానుంది. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే ధాన్యంలో 40 శాతం కంటే ఎక్కువ దిగుబడి ఈ నాలుగు జిల్లాల నుంచే రానుంది. పరిస్థితులు, ఏర్పాట్లను బట్టి సేకరణ జిల్లాల్లో పరిస్థితులు, ఏర్పాట్లను బట్టి ఒక్కో జిల్లాలో ఒక్కో రోజు ధాన్యం సేకరణ ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ వారం చివరలో సేకరణను ప్రారంభించి వచ్చే నెల మొదటి వారం వరకు అన్ని జిల్లాల్లో ధాన్యం సేకరణను ప్రారంభించనున్నారు. సోమవారం నల్లగొండ, నిజామాబాద్, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో ధాన్యం సేకరణపై అ«ధికారులు సమీక్షలు నిర్వహించారు. నల్లగొండ జిల్లాలో ఈ నెల 25వ తేదీ నుంచి ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. నిజామాబాద్ జిల్లాలో ఈ వారం చివరలో, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో నెలాఖరులో ధాన్యం కొనుగోలు ప్రారంభించే అవకాశం ఉంది. 6,545 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు గతేడాది తరహాలోనే ఈ వర్షాకాలంలో పండిన ధాన్యాన్ని సేకరిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ధాన్యం సేకరణపై సీఎం సోమవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. గత సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 6,545 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారని, ఈ ఏడాది కూడా ఈ కేంద్రాలన్నింటి ద్వారా యధావిధిగా ధాన్యం సేకరణ జరపాలని పౌర సరఫరాల శాఖాధికారులను సీఎం ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. ధాన్యాన్ని శుభ్రపరచుకుని తేమ లేకుండా ఎండపోసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. మద్దతు ధర ప్రకారం ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సీఎస్ సోమేశ్‌కుమార్, సీఎంఓ అధి కారులు నర్సింగ్ రావు, భూపాల్ రెడ్డి, ప్రియాంక వర్గీస్, పౌరసరఫరాలశాఖ కమిషనర్ అనిల్‌కుమార్ పాల్గొన్నారు. -
కేసీఆర్ బీజేపీకి అనుకూలమా, వ్యతిరేకమా?: చాడ
హుస్నాబాద్: ఢిల్లీకి వెళ్లినప్పుడు బీజేపీకి అనుకూలంగా, తెలంగాణకు వస్తే ప్రతికూలంగా మాట్లాడుతున్న సీఎం కేసీఆర్ బీజేపీకి అనుకూలమో, వ్యతిరేకమో స్పష్టం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నా బాద్ లో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మోదీ అధికారంలోకి వచ్చాక అన్నివర్గాలపై ఆర్థికంగా, చట్టపరంగా దాడులు కొనసాగుతున్నాయని విమర్శించారు. రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నింటినీ కేంద్రం పరిధిలోకి తీసుకుంటే, ఇక రాష్ట్రాలకు చెరువులు, కుంటలు తప్ప ఏమీ ఉండవన్నారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాలపై దృష్టి సారిస్తూనే, 25 నియోజకవర్గాల్లో పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్టు చాడ వివరించారు. -
అన్నీ కేసీఆర్ కుటుంబానికే..
సాక్షి, సిద్దిపేట: ‘నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా తెలంగాణ ఏర్పడింది. రాష్ట్రం ఏర్పాటైనా ప్రజలు నీళ్ల కోసం పోరాడుతూనే ఉన్నారు.. నిధులన్నీ కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది.. నియామకాలూ సీఎం కుటుంబానికే పరిమితమయ్యా యి’ అని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి స్మృతిఇరానీ మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర శనివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ముగిసింది. ఈ సందర్భంగా హుస్నాబాద్‌లో రోడ్‌షో నిర్వహించారు. అనంతరం సభలో స్మృతిఇరానీ మాట్లాడారు. ‘రాష్ట్రంలో అవినీతి, నియంత పాలనకు చరమగీతం పాడేందుకే ఈ యాత్ర చేపట్టారు. మోదీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి, సంక్షేమానికి అనేక నిధులిస్తోంది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించింది. 12 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించిన ఈ ఫ్యాక్టరీని ప్రధాని త్వరలో పున: ప్రారంభిస్తారు. దేశం లోని 18 కోట్ల మంది పేదలకు 14 నెలలుగా ఉచితంగా రేషన్ బియ్యాన్ని కేంద్రం అందిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ 20 నెలలైనా అమలు కావడం లేదు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని హామీ ఇచ్చి అమలు చేయని వ్యక్తి కేసీఆర్. ఎందుకంటే ఆయన ఎంఐఎంను చూసి భయపడుతున్నారు. టీఆర్ఎస్కు కారున్నా.. దాని స్టీరింగ్ మాత్రం ఎంఐఎం చేతిలో ఉంది’అని కేంద్ర మంత్రి విమర్శించారు. సంజయ్ చేపట్టిన తొలిదశ యాత్ర దిగ్విజయవంతమైందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బండిని అభినందించారని స్మృతిఇరానీ వివరించారు. ఉచితవిద్య, వైద్యంపైనే తొలి సంతకం.. పాదయాత్రలో ప్రజల సమస్యలు, కష్టాలు చెబుతుంటే కళ్లలో నీళ్లు వచ్చాయని.. ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో తెలిసిందని.. 2023లో బీజేపీ అధికారంలోకి రాగానే సీఎం ఎవరైనా ఉచితవిద్య, వైద్యంపైనే తొలి సంతకం పెడతారని బండి సంజయ్ అన్నారు. ‘రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నాం. టీఆర్ఎస్ గడీల పాలనను బద్ధలుకొట్టేందుకు ఇదే చివరి పోరాటం కావాలి. ధరణి పోర్టల్ టీఆర్ఎస్కు భరణిగా.. పేదలకు దయ్యంలా మారింది. పాదయాత్రలో ఎక్కడికి వెళ్లినా ప్రజల కష్టాలు, కన్నీళ్లే కనిపించాయి. మాట్లాడితే కేసీఆర్ ధనిక రాష్ట్రమని అంటున్నారు.. మరి ఉద్యోగులకు జీతాలు సక్రమంగా ఎందుకు ఇవ్వడం లేదు. రైతులకు నష్టపరిహారం ఎందుకు ఇవ్వడం లేదు. పోడు భూముల సమస్యతో గిరిజనులు అల్లాడుతున్నారు. టీఆర్ఎస్ పాలనలో హిందువులు గణేష్ ఉత్సవాలను కూడా చేసుకోలేని దుస్థితిలో ఉన్నారు. బీజేపీ ఏరోజు సభ పెడితే.. కాంగ్రెస్ అదే రోజు మీటింగ్ పెడుతోంది. దాని కథేందో వారికే తెలియాలి. యాత్రలో 15వేలకు పైగా వినతిపత్రాలు వచ్చాయి. వాళ్లందరి తరఫున పోరాటానికి నేను బ్రాండ్ అంబాసిడర్‌ను. ఈటల రాజేందర్ గెలుపు తరువాత మళ్లీ మలిదశ పాదయాత్ర ప్రారంభిస్తా’అని బండి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ప్రజా సంగ్రామయాత్ర తొలివిడత పాదయాత్రను విజయవంతంగా ముగించిన బండి సంజయ్ ఆదివారం భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని మొక్కు తీర్చుకోనున్నారు. దళితుల అభ్యున్నతికి కేంద్రం రూ.25 వేల కోట్ల నిధులను వెచ్చించింది. స్టాండప్ ఇండియా స్కీం పేరుతో దళితులను పారిశ్రామికవేత్తలను చేశాం. దేశవ్యాప్తంగా 14 కోట్ల మంది రైతులకు భూసార కార్డులిచ్చాం. కేంద్రం.. ఫసల్ బీమా యోజన పథకం అమలు చేస్తుంటే, కేసీఆర్ మాత్రం ఇక్కడి రైతులకు ఆ పథకాన్ని అమలు చేయడం లేదు. ఆయుష్మాన్ భారత్ పేరుతో కేంద్రం కార్పొరేట్ ఆస్పత్రుల్లో రూ.5 లక్షల వరకు పేదలకు ఉచిత వైద్యం అందిస్తుంటే.. రాష్ట్రంలో దాన్ని అమలు చేయకుండా పేదల ఆరోగ్యాన్ని గాలికొదిలేశారు. సొంత ఇంటి కోసం కేసీఆర్ ప్రగతిభవన్ నిర్మించుకున్నారు. కొత్త సెక్రటేరియట్ నిర్మిస్తున్నారు. పేదలకు మాత్రం ఉండటానికి సొంత ఇళ్లు మాత్రం నిర్మించి ఇవ్వరు. – స్మృతి ఇరానీ హుజూరాబాద్‌లో ఐదు నెలలుగా అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అమలుకావడం లేదని, కేసీఆర్ రాజ్యాంగమే అమలవుతోందని మాజీ మం త్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆరోపించారు. ‘మద్యం ఏరులై పారుతోంది. మనుషులకు విలు వ కట్టి ప్రలోభాలకు గురిచేస్తున్నారు. నేను గెలవొద్దని కేసీఆర్ ఆదేశిస్తే.. ఆయన బానిసలు అమలు చేస్తున్నారు. అక్టోబర్ 30న హుజూరాబాద్‌లో కురక్షేత్ర యుద్ధం జరగబోతోంది. కేసీ ఆర్ అహంకారానికి, ప్రజల ఆత్మగౌరవానికి జరి గే యుద్ధం ఇది. టీఆర్ఎస్ ఎన్ని సర్వేలు చేసినా.. 75 శాతం ఓట్లు బీజేపీకే వస్తున్నయ్. ఎన్ని కుట్ర లు చేసినా వాళ్ల ఆటలు సాగడం లేదు’అని అన్నా రు. కేంద్రం నుంచి నిధులు రాకుంటే తెలంగాణ అభివృద్ధి ఎలా జరుగుతోందని బీజేపీ శాసన సభ పక్షనేత రాజాసింగ్ ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు ‘బంధు’పథకం అమలు చేయా లని బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేవారు. ఒక పక్క ధనిక రాష్ట్రం అని చెబుతూ.. మరోపక్క ప్రభుత్వ భూములు అమ్ముతున్నారని విమర్శించారు. ఈ యాత్ర ట్రైలర్ మాత్రమే అని.. అసలు సినిమా ముందుందని బీజేపీ ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ హెచ్చరించారు. -
హుస్నాబాద్ సభకు స్మృతి ఇరానీ
-
హుస్నాబాద్ సభకు స్మృతి ఇరానీ
సాక్షి, సిద్దిపేట: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన తొలిదశ ప్రజా సంగ్రామ పాదయాత్ర అక్టోబర్ 2న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ముగియనున్న నేపథ్యంలో పట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వ హించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ సందర్భంగా గురువారం వివిధ జిల్లాల బీజేపీ అధ్యక్షులు, రాష్ట్ర నాయకులతో బండి సంజయ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దుగ్యాల ప్రదీప్‌కుమార్, బంగారు శ్రుతి, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాక: గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న ఉదయం కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో కలసి బండి సంజయ్ హుస్నాబాద్‌లోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి పట్టణమంతా రోడ్‌షో నిర్వహించి మధ్యా హ్నం 12 గంటలకు అంబేడ్కర్ సెంటర్లో బహిరంగ సభలో పాల్గొంటారు. కాగా, సంజయ్ చేపట్టిన పాదయాత్ర సిద్దిపేట జిల్లా కోహెడ, హుస్నాబాద్‌లలో కొనసాగింది. -
కేసీఆర్‌ను గద్దె దించేదాకా భాష మార్చుకోను: బండి
సాక్షి, సిద్దిపేట: ‘సీఎం కేసీఆర్ ఢిల్లీకి పోయి చేసేదేమీ లేదు. ప్రధాని మోదీ వద్ద వంగివంగి దండాలు పెడుతడు. బయటకొచ్చి ఫోజులు కొడుతుండు. కేసీఆర్‌ను గద్దె దించే దాక నా భాష మార్చుకోను’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర 32వ రోజు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లెపల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా రైతులను పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బెజ్జంకి సభలో సంజయ్ మాట్లాడుతూ ధాన్యం కొనబోమని కేంద్రం, మోదీ ఏమైనా ఫోన్ చేసి చెప్పారా.. అని ప్రశ్నించారు. పండించిన ప్రతి గింజనూ కొంటామన్న కేసీఆర్ ఇప్పుడు నేపాన్ని కేంద్రంపై నెడుతున్నారని మండిపడ్డారు. రైతులు ఎవరూ భయపడొద్దని, ప్రతి గింజనూ కేసీఆర్ చేత కొనిపిస్తామని భరోసా ఇచ్చారు. ‘ప్రభుత్వానికి బండి సంజయ్ అంబాసిడర్ అని కేటీఆర్ అంటున్నడు, అయితే, ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు బ్రాండ్ అంబాసిడర్‌ను నేనే’అని అన్నారు. బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ రాజ్‌కుమార్ చౌహాన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇక్కడ బీజేపీ, కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, ఢిల్లీకి వెళ్లి వంగి వంగి కేసీఆర్ దండాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, నేతలు తుల ఉమ, దూది శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. కాగా, హుజూ రాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో.. బండి సంజయ్ ప్రజా సంగ్రామయాత్రను హుస్నాబాద్‌లో ముగించాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయించింది. అక్టోబర్ 2న హుస్నాబాద్‌లో భారీ బహిరంగసభ నిర్వహిస్తారు. దీనికి కేంద్రమంత్రి స్మృతీఇరాని, ఇతర ముఖ్యనేతలు హాజరుకానున్నారు. -
మావోయిస్టు నేత దుబాసి శంకర్ అరెస్ట్
-
మావోయిస్టు నేత దుబాసి శంకర్ అరెస్ట్
చర్ల/దుబ్బాకటౌన్: మావోయిస్టు పార్టీ కీలకనేత, మిలటరీ కమిషన్ మెంబర్, కేంద్ర కమిటీ సభ్యుడు దుబాసి శంకర్ అలియాస్ రమేశ్‌ను ఒడిశా పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఒడిశాలోని కోరాపూట్ జిల్లా ఎస్పీ గుంటుపల్లి వరుణ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రా– ఒడిశా సరిహద్దులో ఉన్న బోయిపారాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పెటగూడ, నోయిరా గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు డీవీఎఫ్, ఎస్‌వోజీ, బీఎస్ఎఫ్ బలగాలు కూంబింగ్ చేపట్టాయి. అనుమానాస్పదంగా కనిపించిన దుబాసి శంకర్‌ను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా అతడి వద్ద ఒక రైఫిల్, 10 రౌండ్ల తూటాలు, మొబైల్, రేడియో, రూ.35 వేల నగదు లభించాయి. 35 ఏళ్లుగా అజ్ఞాతవాసం: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చెట్లనర్సంపల్లికి చెందిన శంకర్ 1987 నుంచి మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ అజ్ఞాతజీవితం గడుపుతున్నారు. 2004లో ఆంధ్రా– ఒడిశా స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్‌గా, ఆ తర్వాత స్టేట్ మిలటరీ కమీషన్ మెంబర్‌గా పదోన్నతి పొందారు. ఆయన పలు ఎదురుకాల్పుల్లోంచి తప్పించుకున్నారు. మొత్తం 25 మంది జవాన్లను హతమార్చిన ఘటనల్లో పాల్గొన్నారని, ఆయనపై 3 రాష్ట్రాల్లో 72 కేసులు ఉన్నాయని ఎస్పీ తెలిపారు. తిరుపతిలోని అలిపిరి వద్ద అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై జరిపిన మందుపాతర దాడి ఘటనలో శంకర్ పాత్ర ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. శంకర్ భార్య భారతక్క నాలుగేళ్ల క్రితం ఎన్కౌంటర్లో చనిపోయింది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. -
దళిత, గిరిజనులకు చేసిందేమిటి?
గజ్వేల్: అధికారంలోకి వచ్చిన ఏడున్నరేళ్లల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం మోసాలతో కాలం గడపడం తప్ప దళిత, గిరిజనులకు ఒరగబెట్టిందేమీ లేదని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 17న సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’ఏర్పాట్లను గురువారం డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డితో కలసి ఆయన పరిశీలించారు. అంతకుముందు నర్సారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉన్నదన్నారు. మరోపక్క ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం ప్రకారం 2014 నుంచి 2021 వరకు దళితుల అభ్యున్నతికి రూ.1.25 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా.. 60వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి మిగతా నిధులను దారి మళ్లించారన్నారు. అధికార పార్టీ మోసాలను ఎండగట్టగడానికే రాష్ట్రవ్యాప్తంగా ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి బెల్లయ్యనాయక్, కిసాన్‌సెల్ అధ్యక్షుడు అన్వేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.