సాక్షి, సిద్దిపేట: తరతరాల నుంచి సంక్రాంతి నోములు నోచుకునే కుటుంబాలూ ఉన్నాయి. సిద్దిపేట, హైదరాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, హనుమకొండ, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో పండుగ వేళ.. లలితాదేవి పుస్తకం, శ్రీచక్రం, మంగళగౌరి, పీటమీద పిల్లెన్లు, అరుగు మీద అద్దాలు, లాలి గౌరవమ్మ, డబ్బాలు, బొట్టు పెట్టెలు, అట్ట పెట్టెలు, పల్లకి, బతుకమ్మ, కుంకుమ భరణి, క్యారంబోర్డు, గాలిపటాలు, చరఖాలు ఇలా వందల రకాల వస్తువుల్లో ఏదో ఒకదానితో నోముకుంటారు. గౌరమ్మను పెట్టి పసుపు, కుంకుమ వేసి, ఏవైనా ఒకే రకమైన 13 వస్తువులను పెట్టి బంధువులు, స్నేహితుల ఇంటికెళ్లి వాయనం ఇచ్చి వస్తారు. బాలింతలు, చిన్న పిల్లలు ఉన్నవారు ఉగ్గు గిన్నె, నూనె పావు నోములు నోస్తారు.
ఆరునెలల ముందే
నోము సామగ్రి తెప్పిస్తాం
పండుగకు ఆరు నెలల ముందే నోము సామగ్రి తెప్పిస్తాం. స్టీల్ అయితే మచిలీపట్నం, ఇత్తడి సామాను చెన్నై, ప్లాస్టిక్ వస్తువు లను ఢిల్లీ నుంచి తెప్పిస్తాం. మా షాప్‌నకు వివిధ జిల్లాలవారు వచ్చి కొనుగోలు చేస్తుంటారు. కొందరు ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇస్తారు.
– నార్ల నాగరాజు, నోముల సామగ్రి షాప్ యజమాని, సిద్దిపేట
Comments
Please login to add a commentAdd a comment