'ఆటా' ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో RO ప్లాంట్ ప్రారంభం | RO Plant Was Inaugurated At Zphs School By Aata | Sakshi
Sakshi News home page

'ఆటా' ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో RO ప్లాంట్ ప్రారంభం

Published Tue, Dec 19 2023 10:24 AM | Last Updated on Tue, Dec 19 2023 10:33 AM

RO Plant Was Inaugurated At Zphs School By Aata - Sakshi

ఆటా వేడుకల్లో భాగంగా సిద్దిపేట జిల్లా ఇందుర్తి జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో ఆర్వో(RO)ప్లాంట్‌ను ప్రారంభించారు.ఆటా సహకారంతో సుమారు 3 లక్షల రూపాయల నిధులతో స్కూల్ వేదికకు రేకుల షెడ్డు, పిల్లల కోసం తాగడానికి RO వాటర్ ప్లాంట్ నిర్మాణం, కంప్యూటర్, స్పోర్ట్స్ కిట్స్, స్కూల్ బ్యాగ్స్ అందించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ కాశీ కొత్త మాట్లాడుతూ..తనను ఈ స్థాయిలో నిలబెట్టిన భారతదేశానికి ఎంత చేసినా తక్కువేనని అన్నారు. ఇక ఈ ​కార్యక్రమంలో ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ కాశీ కొత్త కుటుంబసభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, జడ్పీహెచ్‌ఎస్‌ ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement