government schools
-
ఏపీలో బాబు సర్కార్ వచ్చాక మొక్కుబడి తతంగంగా మారిన విద్యాహక్కు చట్టం
-
Andhra Pradesh: సర్కారు బడికి తాళం!
రాష్ట్రంలో సర్కారు బడికి తాళం పడుతోంది. గ్రామాల్లో 60 మంది కంటే తక్కువ విద్యార్థులున్న స్కూళ్ల మూసివేతకు రంగం సిద్ధం కావడంతో వేలాదిగా పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదం నెలకొంది. మిగిలిన వాటి పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. ఇకపై విద్యార్థులు 1 నుంచి 5వ తరగతి చదవాలంటే 5 కి.మీ. వెళ్లాల్సిన పరిస్థితి ఉత్పన్నం కానుంది. భారీగా స్కూళ్ల సంఖ్యను తగ్గించేందుకు రంగం సిద్ధం చేసిన ప్రభుత్వం మండల విద్యాధికారుల ద్వారా ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిళ్లు తెస్తోంది. పాఠశాలల కమిటీలను ఒప్పించాల్సిన బాధ్యత టీచర్లపైనే మోపింది. లేదంటే ఎంఈవోలు ప్రత్యక్షంగా కలెక్టర్లకు వివరణ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇప్పటికే గత ప్రభుత్వం తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలను నీరుగార్చి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన కూటమి సర్కారు నిర్వాకాలకు ఇది పరాకాష్టగా నిలుస్తోంది. పేదింటి తలరాతలను మార్చే శక్తి చదువులకు మాత్రమే ఉందని దృఢంగా విశ్వసించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ఐదేళ్లూ ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ ఏకంగా రూ.72 వేల కోట్లకుపైగా వెచ్చించి ఉత్తమ ఫలితాలను రాబట్టారు. దీంతో మన స్కూళ్ల ప్రతిభ ఐరాస వరకు వినిపించింది. అమ్మ ఒడి, విద్యాకానుక, గోరుముద్ద, బైలింగ్వల్ పాఠ్య పుస్తకాలు, బైజూస్ కంటెంట్‌తో పిల్లలకు ట్యాబ్‌లు, డిజిటల్ తరగతులతో ఏ ఒక్కరూ ఊహించని రీతిలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో పెను మార్పులకు శ్రీకారం చుట్టారు. నాడు– నేడు ద్వారా కార్పొరేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అన్ని సదుపాయాలతో తీర్చిదిద్దటంతోపాటు ఇంగ్లీషు మీడియం చదువులు, సీబీఎస్ఈ నుంచి టోఫెల్, ఐబీ దాకా సర్కారు స్కూళ్ల ప్రయాణం మొదలైంది. ఇప్పుడు వీటన్నిటినీ నీరుగార్చిన టీడీపీ కూటమి సర్కారు స్కూళ్ల మూసివేత దిశగా తీసుకుంటున్న నిర్ణయాలు విద్యార్థులకు పిడుగుపాటులా పరిణమించాయి. సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అక్కసుతో విద్యా సంస్కరణలను నిర్వీర్యం చేస్తున్న కూటమి సర్కారు తొలి టార్గెట్‌గా ప్రభుత్వ విద్యారంగాన్ని ఎంచుకుంది! గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల విలీనమే లక్ష్యంగా ప్రణాళికలను అమలు చేస్తోంది. ప్రాథమికోన్నత పాఠశాలలను పూర్తిగా ఎత్తివేయడంతో పాటు పల్లెల్లో ప్రాథమిక పాఠశాలల మూసివేత దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. 5 కి.మీ పరిధిలోని స్కూళ్లను మాత్రమే విలీనం చేస్తామని చెప్పిన సర్కారు తరువాత ఎంఈవోల ద్వారా మౌఖికంగా 7 కి.మీ. పరిధికి పెంచి ఒత్తిడి పెంచుతోంది. అంటే ఆ పరిధిలోని ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు ఇక చదువుకునేందుకు దూరంలోని మోడల్ ప్రైమరీ స్కూల్‌కి వెళ్లాల్సిందే! లేదంటే ప్రైవేట్ స్కూళ్లే దిక్కు!! మోడల్ స్కూల్ అంటే ఏదో కొత్తది నిర్మిస్తున్నారనుకుంటే పొరబడినట్లే! మోడల్ ముసుగులో స్కూళ్లను భారీగా ఎత్తివేసేందుకు రంగం సిద్ధం చేసింది. 32 వేలకు పైగా పాఠశాలలపై తీవ్ర ప్రభావంఉపాధ్యాయ సమావేశాల్లో ఇచ్చిన హామీకి భిన్నంగా స్కూళ్ల విలీనానికి రంగం సిద్ధం చేసి మోడల్ స్కూళ్ల పేరుతో ఉన్న పాఠశాలల ప్రాణం తీసేస్తున్నారని టీచర్లు వాపోతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో మోడల్ ప్రైమరీ పాఠశాలకు మ్యాపింగ్ చేయాలంటూ ఎంఈవోలపై ఒత్తిడి తెస్తున్నారు. విలీనానికి అంగీకరించాల్సిందేని ఒత్తిడి పెంచుతున్నారు. ఈమేరకు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల నుంచి అంగీకార పత్రాలను తెప్పించాల్సిన బాధ్యత టీచర్లు, ఎంఈవోలకు కేటాయించారు. అలా చేయని వారు కలెక్టర్ ఎదుట ప్రత్యక్షంగా హాజరు కావాలని ఆదేశించారు. విలీనమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకెళుతుండటంతో రాష్ట్రంలో వేలాదిగా స్కూళ్లు మూతపడే ప్రమాదం ఉందని ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో 1 – 5 తరగతులు కొనసాగుతున్న 32,596 ప్రాథమిక పాఠశాలల్లో కేవలం 17 శాతం స్కూళ్లల్లోనే 60 మందికి మించి ఎన్రోల్మెంట్ ఉంది. మిగిలిన 83 శాతం స్కూళ్లల్లో విద్యార్థులు 60 మంది కంటే తక్కువ ఉన్నారు. అంటే ఈ 83 శాతం స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులపై విలీనం ప్రభావం పడనున్నట్లు స్పష్టమవుతోంది. విద్యార్థుల ఎన్రోల్మెంట్ లేదనే సాకుతో 2014–19 మధ్య 1,785 స్కూళ్లను రద్దు చేసిన టీడీపీ సర్కారు.. తాజాగా అస్తవ్యస్థ విధానాలతో పేద విద్యార్థులను ప్రభుత్వ విద్యకు దూరం చేస్తోంది. దీంతో గ్రామాల్లో వేలాది ప్రాథమిక పాఠశాలలు మూతపడే ప్రమాదం నెలకొంది. ఒక్కో పంచాయతీలో సుమారు మూడు నుంచి నాలుగు ప్రాథమిక పాఠశాలలున్నాయి. పట్టణాల్లో పరిధిని బట్టి 30 వరకు స్కూళ్లున్నాయి. ఏ పాఠశాలలోనైనా 60 కంటే తక్కువ మంది ఉంటే ఐదు కి.మీ దూరంలోని స్కూళ్లకు వెళ్లి చదువుకోవాల్సిందే. 60 మంది కంటే తక్కువ విద్యార్థులుంటే ఆ పంచాయతీలో ఉన్న స్కూల్‌కి మోడల్ స్కూల్‌గా నామకరణం చేసి అక్కడకు తరలిస్తారు. మోడల్ స్కూల్లో విద్యార్థుల సంఖ్య 100కి చేరుకోకుంటే పరిధిని ఏడు కి.మీ.కి పెంచి అమలు చేయాలని అనధికారికంగా ఆదేశాలిచ్చినట్లు సమాచారం. విలీనాన్ని గ్రామస్తులతో పాటు తల్లిదండ్రుల కమిటీలు వ్యతిరేకిస్తుండడంతో ఒప్పించే బాధ్యతను టీచర్లకు అప్పగించారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో పాఠశాలలను విలీనం చేయవద్దంటూ నిరసన తెలుపుతున్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు (ఫైల్) విలీన ఒత్తిడితో టీచర్ల బెంబేలు ఈ నిర్ణయంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. స్కూళ్ల కమిటీలను ఒప్పించలేక అటు ఉన్నతాధికారులకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు. ప్రతి పాఠశాల స్కూల్ మేనేజ్మెంట్ కమిటీతో ‘ఎస్’ అని ఆమోదం తెలుపుతూ తీర్మానం ఇవ్వాలని కలెక్టర్లు ఆదేశిస్తున్నట్టు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోడల్ స్కూళ్లను కొత్తగా ఏర్పాటు చేస్తామంటే ఉపాధ్యాయులు వ్యతిరేకించడం లేదు. ఒక పాఠశాలను కేంద్రంగా చేసి చుట్టూ ఉన్న పాఠశాలలను విలీనం చేయడం, ఎంపిక చేసిన పాఠశాలలో తరగతులు కలపటాన్ని ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు. పైగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సిన బాధ్యతను ఆదే ఉపాధ్యాయులకు అప్పగించడం, కాదన్న వారిని ఉన్నతాధికారుల బెదిరించటాన్ని తట్టుకోలేక పోతున్నామని వాపోతున్నారు. గతంలో ప్రతి పాఠశాలను మనబడి నాడు–నేడు పథకం కింద రూ.లక్షలు ఖర్చు చేసి అన్ని సదుపాయాలు కల్పిస్తే ఇప్పుడు వాటిని వినియోగించుకోకుండా విలీనం ఏమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వం పెట్టిన ఖర్చు వృథా అవుతుందని, ఈ ప్రక్రియ మొత్తం ప్రైవేట్ స్కూళ్లను ప్రోత్సహించేందుకేనని మండిపడుతున్నారు. -
వంట మనిషి ఇంట్లోనే బడి
కేసముద్రం: విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండిపెట్టే వంట మనిషి ఇల్లే ప్రభుత్వ పాఠశాలగా మారింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పరిధిలోని బ్రహ్మంగారి తండాలో 2001లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. సొంత భవ నం లేక నాటి నుంచి తండాలోని పలువురి ఇళ్లను అద్దెకు తీసుకుంటూ ఉపాధ్యా యులు బడి నడిపిస్తూ వచ్చారు. మొదట్లో స్కూల్లో 60 మంది విద్యార్థులు ఉండగా.. అద్దె ఇళ్లలో కనీస సౌకర్యాలు లేక సంఖ్య తగ్గుతూ 18 మందికి చేరింది.ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వర్తి స్తున్నారు. గత ఏడాది బడి నడిపించడానికి తండాలో అద్దెకు ఇల్లు దొరకలేదు. దీంతో పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని మానవతా దృక్పథంతో మధ్యాహ్నం భోజ నం వండిపెట్టే వంటమనిషి వినోద తన ఇంట్లో పాఠశాల నడిపించడానికి అంగీకరించింది. ఇంటి ఆవరణలోని రేకుల షెడ్డుకు చుట్టూరా పరదా కట్టి పిల్లలకు విద్యా బోధన చేస్తున్నారు. ఎండతీవ్రతకు రేకుల షెడ్డు కింద కూర్చున్న పిల్లలు అల్లాడి పోతున్నారు. టాయిలెట్లు కూడా లేకపోవ డంతో ఇబ్బందులు పడుతు న్నారు. ఇదిలా ఉండగా ‘మన ఊరు– మన బడి’ కింద పాఠశాలకు భవనం మంజూరైనా పిల్లర్ల వరకే నిర్మాణం జరిగింది. -
బడిని బాగు చేసేదెలా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోతుండటం, విద్యార్థుల ప్రవేశాలు తగ్గిపోతుండటంపై ప్రభుత్వం దృష్టి సారించింది. పరిస్థితిని మెరుగుపర్చేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ముందుగా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని అధ్యయనం చేయాలని సూచించింది. ముఖ్యంగా చేరికలు తగ్గడంపై సర్వే చేయాలని చెప్పింది.దీంతో తొలిసారిగా తెలంగాణ విద్యా పరిశోధన మండలి (ఎస్సీఈఆర్టీ) రంగంలోకి దిగింది. ప్రభుత్వ స్కూళ్లల్లో విద్యా ప్రమాణాలు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 10వ తేదీ నుంచి ప్రత్యేక బృందాలు జిల్లాలకు వెళ్లనున్నాయి. ఇందుకోసం తొలుత ఈ నెల 3, 4 తేదీల్లో మాస్టర్ రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇచ్చారు. వీరి ద్వారా క్షేత్రస్థాయి అధ్యయనానికి వెళ్లే బృందాలకు 6, 7 తేదీల్లో శిక్షణ ఇచ్చారు.ఒక్కో జిల్లాలో 100 స్కూళ్ల పరిశీలనజిల్లాకు దాదాపు 100 చొప్పున స్కూళ్లను ఈ బృందాలు పరిశీలిస్తాయి. మొత్తం ఆరు అంశాలపై ప్రత్యేక దృష్టి పెడతాయి. స్కూళ్లలో అమలు చేస్తున్న యాక్షన్ ప్లాన్, సిలబస్ పూర్తి, ల్యాబొరేటరీ నిర్వహణ, అంతర్గత మూల్యాంకన విధానంపై అధ్యయనం చేస్తాయి. సర్వేలో భాగంగా దాదాపు 9 వేల పాఠశాలల్లోని విద్యార్థులకు సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారు. బృందాలు ఇచ్చే నివేదికలపై ముందుగా విద్యాశాఖ, ఆ తర్వాత ప్రభుత్వం లోతుగా సమీక్షించి చేపట్టవలసిన కార్యాచరణ సిద్ధం చేయనున్నాయి. ప్రమాణాలు పడిపోతున్నాయన్న ‘ఆసర్’రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోతున్నాయని వార్షిక విద్యా స్థాయి నివేదిక (ఆసర్) ఇటీవల వెల్లడించింది. గత ఏడాది ఆసర్ అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా అధ్యయనం చేసింది. ఇటీవల ఈ నివేదికను అందజేసింది. రాష్ట్రంలోని 270 గ్రామాల్లో 5,306 ఇళ్లకు వెళ్లిన ఆసర్ బృందాలు 3 నుంచి 16 ఏళ్ల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, 14–16 ఏళ్ల వయసు విద్యార్థుల్లో డిజిటల్ అక్షరాస్యతపై సర్వే నిర్వహించాయి. ఈ క్రమంలో పలు ఆందోళన కల్గించే అంశాలు వెలుగుచూశాయి. స్కూళ్లకూ ఫోన్లు.. ఆలోచనా శక్తే లేదు!చిన్నపాటి కూడికలు, తీసివేతల్లో కూడా పాఠశాల విద్యార్థులు వెనుకబడి ఉన్నారు. 96 శాతం విద్యార్థుల్లో ఆలోచన శక్తి, క్రియేటివిటీ పూర్తిగా లోపించింది. అంతా స్మార్ట్ ఫోన్లపైనే ఆధారపడుతున్నారు. పాఠశాలలకూ వీళ్లు ఫోన్లు తెస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లల్లో హాజరు శాతం 2022లో 75.50 శాతం ఉంటే, ప్రస్తుతం 73 శాతానికి పడిపోయింది. 62 శాతం పాఠశాలల్లో ఒకటో తరగతి పిల్లలను ఇతర తరగతులతో కలిపి కూర్చోబెట్టడం వల్ల విద్యాభ్యాసం ఏమాత్రం సాగడం లేదు. రానురాను 60 మంది కన్నా తక్కువ ఉన్న స్కూళ్ల సంఖ్య పెరుగుతోంది. 2010లో ఇలాంటి పాఠశాలలు 17.20 శాతం ఉంటే 2024లో 45.20 శాతానికి చేరుకోవడం ఆందోళన కల్గించే అంశం. వచ్చే ఏడాదికల్లా విశ్వాసం కల్పించేలా..గత పదేళ్లలో ప్రభు త్వ స్కూళ్లల్లో చేరికలు 32 శాతం తగ్గిపోయాయి. 2014–15లో 24.85 లక్షల మంది సర్కారీ స్కూళ్లల్లో చేరితే, 2024–25లో ఈ సంఖ్య 16.68 లక్షలుగా ఉంది. విద్యా ర్థులు ప్రైవేటు స్కూళ్లలో చేరుతుండటమే ఇందుకు కారణం. కాగా టీచర్ల సంఖ్య పెంచినా, మౌలిక వసతులు కల్పించినా, ఎందుకు ఈ పరిస్థితి ఉందనే దానిపై ప్రభుత్వం నివేదిక కోరింది. ప్రైవేటు స్కూళ్లలో 2014–15లో 31.17 లక్షల మంది విద్యార్థులు ఉంటే, 2024–25లో ఈ సంఖ్య 36.73 లక్షలకు పెరిగింది. వీటన్నింటినీ అధ్యయనం చేసి, వచ్చే ఏడాదికి ప్రభుత్వ స్కూళ్లపై విశ్వాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.ఈ సర్వే చాలా కీలకంరాష్ట్ర విద్యా రంగంలో తీసుకురావా ల్సిన మార్పులపై సరైన ఫీడ్‌బ్యాక్ కోసం తొలిసారిగా సర్వే చేపడుతున్నాం. క్షేత్రస్థా యిలో పరిస్థితి ఎలా ఉందనేది పరిశీలిస్తాం. దాని ఆధారంగా అవసరమైన మార్పులు, సంస్కరణలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తాం. అందుకే ఈ సర్వే చాలా కీలకమైంది. – ఈవీ నర్సింహారెడ్డి, పాఠశాల విద్యా డైరెక్టర్ఎక్కడ ఏం చేయాలో తెలుస్తుందిక్షేత్రస్థాయి సర్వేతో ఎక్కడ, ఎలాంటి మార్పులు తేవాలనేది వెల్లడవుతుంది. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టడం ద్వారా ప్రభుత్వ స్కూళ్లపై ప్రజల్లో నమ్మకం పెంచడానికి వీలవుతుంది. అధ్యయనాలతో సరిపెట్టకుండా స్కూళ్లకు అవసరమైన మేర నిధులు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేయాలి. మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు పోటీ కోణంలో విద్యా విధానం ఉంటే ప్రభుత్వ స్కూళ్లల్లోనూ ప్రవేశాలు పెరుగుతాయి. – పింగిలి శ్రీపాల్‌రెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీ, పీఆర్టీయూటీఎస్ నేత -
పాఠాలు చెబుదామన్నా.. పిల్లలు లేరు..
గార్ల: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని మూడు ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు రాక పోవడంతో ఉపాధ్యాయులు విధులకు హాజరై ఖాళీగా కూర్చొని వెళ్లిపోతున్నారు.వెంకటాపురం తండా, సర్వన్ తండా, కేళోత్ తండాలోని ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలలను గురువారం ‘సాక్షి’ సందర్శించింది. మూడింటి లోనూ ఒక్క విద్యార్థి కూడా పాఠశాలకు రాలేదు. తండాల్లోని ఇంటింటికీ తిరిగి తమ పిల్ల లను పంపాలని కోరు తున్నా.. తల్లిదండ్రులు మాత్రం గార్లలోని ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారని ఉపా ధ్యాయులు పేర్కొన్నారు. -
బడి బయటే బాల్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతోపాటు గురుకులాలు, ఇతర హాస్టల్ వసతి ఉన్న స్కూళ్లు కావాల్సినన్ని ఉన్నా.. బడి మధ్యలోనే మానేస్తున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రాథమిక స్థాయిలో కొంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఉన్నత పాఠశాల స్థాయికి వచ్చేసరికి చాలామంది విద్యార్థులు బడి మానేస్తున్నారు. ప్రాథమికోన్నత స్థాయిలో 0.34 శాతం, ఉన్నత పాఠశాలల్లో 11.92 శాతం డ్రాపౌట్స్ నమోదయ్యాయి.ప్రాథమిక స్థాయిలో ఇది మైనస్ 2.23 శాతంగా ఉంది. ప్రధానంగా పల్లెల్లోనే డ్రాపౌట్లు ఎక్కువగా ఉన్నాయి. సోమవారం రాష్ట్ర ప్రణాళికా విభాగం విడుదల చేసిన ‘తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్–2024’లో ఈ వివరాలను పొందుపర్చింది. హనుమకొండ, కరీంనగర్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి, హైదరాబాద్ జిల్లాల్లో డ్రాపౌట్లు తక్కువగా ఉన్నాయి.నివేదికలోని ప్రధానాంశాలు⇒ రాష్ట్రంలో 40,975 స్కూళ్లున్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 20,539, ప్రాథమికోన్నత పాఠశాలలు 7,482, ఉన్నత పాఠశాలలు 11,561, హయ్యర్ సెకండరీ 1,393 స్కూళ్లు ఉన్నాయి. వీటిల్లో మొత్తం 65,41,085 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒక్కో పాఠశాలకు సగటున 160 మంది విద్యార్థులు ఉన్నారు. అతి తక్కువగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 533 స్కూళ్లు ఉండగా.. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 2,907 ఉన్నాయి.⇒ హైస్కూల్ పరిధిలో 39,92,429 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో 8,98,588, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 9,16,869, హయ్యర్ సెకండరీలో 7,33,199 మంది పిల్లలున్నారు. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 9,02,674 మంది విద్యార్థులుండగా.. అతి తక్కువగా ములుగు జిల్లాలో 41,061 మంది మాత్రమే ఉన్నారు.⇒ 6 నుంచి 10 ఏళ్లలోపు చిన్నారులు రాష్ట్రంలో 26,62,200 మంది ఉండగా, పాఠ శాలల్లో నమోదైనవారు 29,28,678 ఉన్నా రు. ప్రాథమిక పాఠశాలల్లో గ్రాస్ ఎన్రో ల్మెంట్ రేషియో(స్థూల నమోదు నిష్పత్తి) 110 శాతంగా ఉంది. ఇది అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 175 శాతం ఉండగా, అతి తక్కువగా జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో 70 శాతం ఉంది.⇒ ప్రాథమికోన్నత పాఠశాలల్లో జీఈఆర్ 107 శాతం ఉంది. రాష్ట్రంలో 11 నుంచి 13 సంవత్సరాల వయసున్న పిల్లలు 16,53,800 మంది ఉండగా, ఆరోతరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు స్కూళ్లలో నమోదైన పిల్లలు 17,73,298 (కుటుంబాల వలస ఇతరత్రా కారణాల వల్ల) ఉన్నారు. అతి తక్కువగా జయశంకర్ భూపా లపల్లి జిల్లాలో 59 శాతం ఉండగా, ఎక్కువగా రంగారెడ్డి జిల్లాలో 173 శాతంగా ఉంది.⇒ ఉన్నత పాఠశాలల్లో జీఈఆర్ 95 శాతంగా ఉంది. రాష్ట్రంలో 14 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలు 11,44,600 మంది ఉండగా, ఉన్నత పాఠశాలల్లో నమోదైన పిల్లలు 10,82,551 మంది మాత్రమే. అతి తక్కువగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 55 శాతం, అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 149 శాతం నమోదైంది.⇒ రాష్ట్రంలో సగటున 19 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు. ప్రాథమిక స్థాయిలో 18 మందికి, ప్రాథమికోన్నత స్థాయిలో 14 మందికి, ఉన్నత పాఠశాల స్థాయిలో 20 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు. హయ్యర్ సెకండరీ స్థాయిలో 17 మందికి ఒక టీచర్ ఉన్నారు. టీచర్–స్టూడెంట్ నిష్పత్తి 22 జిల్లాల్లో రాష్ట్ర సగటు కంటే తక్కువగా ఉంది. ప్రాథమికోన్నత స్థాయిలో 21 జిల్లాల్లో, ఉన్నత స్థాయిలో 23 జిల్లాలు, హయ్యర్ సెకండరీ స్థాయిలో 13 జిల్లాల్లో ఇది రాష్ట్ర సగటు కంటే తక్కువగా ఉంది. మెదక్, రంగారెడ్డి, మేడ్చల్– మల్కాజిగిరి, హైదరాబాద్, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో టీచర్–స్టూడెంట్ నిష్పత్తి రాష్ట్ర సగటు కంటే ఎక్కువగా ఉంది.⇒ రాష్ట్రంలో లింగనిష్పత్తి 988గా ఉంది. ప్రతి వెయ్యి మంది పురుషులకు 988 మహిళలు ఉన్నారు. అత్యంత తక్కువ లింగనిష్పత్తి ఉన్న జిల్లా రంగారెడ్డి. ఆ తర్వాత స్థానాల్లో హైదరాబాద్, మేడ్చల్– మల్కాజిగిరి, వనపర్తి జిల్లాలున్నాయి. పురుషుల కంటే మహిళలు ఎక్కువ ఉన్న జిల్లాలు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి. -
డమ్మీగా క్లస్టర్ కాంప్లెక్స్‌లు!
సాక్షి, అమరావతి: విద్యా రంగంలో మార్పుల పేరిట కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు వ్యతిరేక ఫలితాలనిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల(government schools) విలీనంపై తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత రాగా.. తాజాగా క్లస్టర్ కాంప్లెక్స్‌ల నిర్వహణ తీరుపై ఉపాధ్యాయులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. పాఠ్యాంశాలపై చర్చలు లేకుండా కేవలం ఆన్ౖలెన్ లింక్ ద్వారా టీచర్లు పాఠ్యాంశాలు వినేందుకే పరిమితం చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,809 కాంప్లెక్స్ క్లస్టర్లలో శనివారం మధ్యాహ్నం నుంచి కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించారు.ఇవి గతానికి భిన్నంగా కొనసాగడంపై ఉపాధ్యాయ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా, సాయంత్రం 5 గంటల వరకే సమావేశాలు జరగాల్సి ఉంది. కానీ 6 గంటల వరకు నిర్వహించారు. అటెండెన్స్ మాత్రం 5 గంటలకే క్లోజ్ చేశారని, ఆ తర్వాత ముఖ ఆధారిత హాజరు పనిచేయలేదని, ఇది టీచర్లను వేధించడమేనని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలోని పాఠశాల విద్యా శాఖలో కీలకమైన స్కూల్ కాంప్లెక్స్‌ల స్థానంలో క్లస్టర్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. 4,034 కాంప్లెక్స్‌లను 2,809కి తగ్గించి క్లస్టర్ కాంప్లెక్స్‌లుగా మార్చారు. వీటిలోనే ఉపాధ్యాయ సమావేశాలకు అనుమతించారు. మరో 1,225 కాంప్లెక్స్‌లను డమ్మీలుగా మాత్రమే ఉంచారు.ప్రతి క్లస్టర్‌కి గ్రామీణ ప్రాంతాల్లో 10 నుంచి 15 కిలోమీటర్ల పరిధిలోని 10 నుండి 15 పాఠశాలలు, పట్టణ ప్రాంతాల్లో 5 నుంచి 10 కి.మీ పరిధిలోని 8 నుంచి 10 పాఠశాలలు అనుసంధానం చేశారు. ప్రతి క్లస్టర్లో 40 నుంచి 50 మంది ఉపాధ్యాయులతో కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించారు.ఇందులో ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ, పాఠశాలల మధ్య విద్య అనుసంధానం, విద్యా వనరుల సామగ్రి తయారీ, తనిఖీలు, విద్యా వ్యవస్థ పర్యవేక్షణ తదితర కార్యక్రమాలు ప్రత్యక్షంగా నిర్వహించాల్సి ఉంది. కానీ తొలి సమావేశం కేవలం ఉపాధ్యాయులు ఆన్లైన్లో పాఠాలు వినేందుకే పరిమితం చేశారు. గతంలో ఓ సబ్జెక్టుపై ఉపాధ్యాయుల మధ్య లోతైన చర్చ జరిగి, విద్యార్థులకు సరికొత్త బోధన విధానాలను అందించేవారు. నేడు అదే ఉపాధ్యాయ వర్గాన్ని కేవలం కొందరు చెబితే వినేందుకే పరిమితం చేశారు. ఉపాధ్యాయులపై ఒత్తిడిప్రతి నెలా మూడో శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 5 గంటల వరకు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించాలని, ప్రతి ఉపాధ్యాయుడు హాజరుకావాలని పాఠశాల విద్య డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో శనివారం మధ్యాహ్నం 2,809 కస్లర్లలో మధ్యాహ్నం ఒంటి పూట స్కూల్ కాంప్లెక్స్ విధానం అమలుల్లోకి వచ్చింది.ప్రాథమిక, సెకండరీ ఉపాధ్యాయులకు వేర్వేరు అజెండా విడుదల చేశారు. అయితే, శనివారమే 10వ తరగతి ప్రీఫైనల్ గణిత పరీక్ష ఉండటం, ఉదయంపూట మధ్యాహ్న భోజనం విధులు ఉండటంతో ఉపాధ్యాయులపై ఒత్తిడి పెరిగింది. ఉదయం 8.45 నుంచి 12 వరకు పాఠశాలల్లో పనిచేసిన టీచర్లు మధ్యాహ్నం 15 కిలోమీటర్ల దూరంలోని క్లస్టర్‌కు పరుగులు పెట్టాల్సి వచ్చింది.నీరుగారిన లక్ష్యంప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, ఉన్నత పాఠశాలల స్కూల్ అసిస్టెంట్లకు కలిపి కొద్దిసేపు, వేర్వేరుగా మరికొద్దిసేపు సమావేశం నిర్వహించడంతో అసలు లక్ష్యం నీరుగారింది. ఒకటి, రెండు తరగతుల టీచర్లకు ప్రత్యేక సమావేశం పెట్టారు. 3, 4, 5 తరగతుల టీచర్లకు వేరొక గదిలో, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు మరొక గదిలో సమావేశాలు ఏర్పాటు చేసి ఉన్న సమయం ఊపిరి తీశారు. చర్చలకంటే లింకులతోనే సమావేశం మొత్తం పూర్తి చేశారు. గతంలో సబ్జెక్టు టీచర్లకు నియోజకవర్గం స్థాయిలో ఒక్కో సబ్జెక్టుకు ఒక స్కూల్లో సమావేశం జరిగేది. 40 మందికి పైగా స్కూల్ అసిస్టెంట్లు వీటికి హాజరై సబ్జెక్టుపై లోతైన చర్చ చేసేవారు.ప్రస్తుత సమావేశాలకు సబ్జెక్టు టీచర్లు నలుగురికి మించకపోవడంతో చర్చలకు ఆస్కారమే లేకుండా పోయింది. పైగా నాలుగు గంటల సమావేశంలో ఉన్నతాధికారుల సందేశాలకు గంట ఇచ్చారు. ఉపాధ్యాయుల బోధనాంశాలపై 30 నుంచి 45 నిమిషాలే కేటాయించారు. బోధనాంశాలపై ఐఎఫ్‌పీలపై క్లిప్పింగ్‌లు చూపించారేగాని, విషయ పరిజ్ఞానంపై లోతైన చర్చకు అవకాశం ఇవ్వలేదు. కొన్ని చోట్ల నెట్ పనిచేయక ఫోన్లలో చూడాల్సిన పరిస్థితి. మోడల్ లెసన్ ప్లాన్స్, టీఎల్ఎం, కొత్త పద్ధతులపై చర్చలే లేవు. ఇలా స్కూల్ కాంప్లెక్స్‌లకు నిర్దేశించిన ఆరు సెషన్లు మొక్కుబడిగా ముగిసినట్టు సమాచారం.ఇంత నిర్బంధమా?స్కూల్ కాంప్లెక్స్‌లు అంటే ఉపాధ్యాయులు నిర్బంధ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోంది. పెళ్లిళ్లు, వివిధ కార్యక్రమాలకు వెళ్లాల్సి ఉన్నా విద్యా శాఖ సెలవు ఇవ్వకపోవడం దుర్మార్గం. ఉపాధ్యాయులు అంటే ఇంత అలుసా? ఉత్తర్వుల ప్రకారం సాయంత్రం 5 గంటలకు ముగించాల్సిన సమావేశాలు 6 గంటల వరకు కూడా కొనసాగించారు.టీచర్లు హాజరు వేసుకునేందుకు మాత్రం 5 గంటల వరకే అవకాశం కల్పించారు, ఇదేం విధానం? మధ్యాహ్నం వరకు పాఠశాలలో ఉండి వెంటనే క్లస్టర్ స్కూల్స్ కాంప్లెక్స్‌కు వెళ్లాల్సిరావడంతో టీచర్లు తీవ్రమైన ఒత్తిడికి గురయ్యారు. ఇది ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేయడమే. – లెక్కల జమాల్‌రెడ్డి, ప్రగతిశీల ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇవేం కాంప్లెక్స్ సమావేశాలు?మధ్యాహ్నం వరకు పాఠశాలలో పనిచేసి, మధ్యాహ్న భోజనం తర్వాత సమావేశాలకు హాజరు కావడం ఇబ్బందిగా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరగాల్సిన సమావేశాలను రోజులో సగమే నిర్వహించడం ఏమిటి? క్లస్టర్ పరిధిలో ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉండే ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల సబ్జెక్టు టీచర్లకు ఏవిధంగా ఉపయోగకరమో అధికారులు చెప్పాలి. ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేసే ఇలాంటి చర్యలను వ్యతిరేకిస్తున్నాం. – కె.శ్రీనివాసులు, టి.చందనరావు స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టొద్దు క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాల క్లోజింగ్ టైమ్ సాయంత్రం 5 గంటలకే అన్నా 6 గంటల వరకు నిర్వహించారు. అయినా అటెండెన్స్ పడకుండా టీచర్లను ఇబ్బందులకు గురి చేయడం సరికాదు. ఉదయం 8.45 నుంచి సాయంత్రం 6 వరకు దాదావు 10 గంటల పాటు విరామం లేకుండా షెడ్యూల్ ఇచ్చి, పాఠశాలలు, క్లస్టర్ సమావేశాలు నిర్వహించాలనడం దారుణం. రవాణా సౌకర్యం లేని ప్రాంతాల్లో ఎంతో ఇబ్బంది తలెత్తింది. – మన్నం శ్రీనివాస్, రామిశెట్టి వెంకటేశ్వర్లు, టీఎన్‌యూఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు -
పురుగులే పరమాన్నం..! ఘోర.. ముద్ద!
తమ పాఠశాలలో మధ్యాహ్న భోజనం సరిగా లేదని కొద్ది నెలలుగా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోకపోవడంతో విశాఖ జిల్లా చిన్నగదిలి మండలం వాడపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట తల్లిదండ్రులతో కలసి ధర్నాకు దిగారు.. భోజనంలో వచ్చిన పురుగును చూపిస్తున్న ఓ విద్యార్థి.సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో(Government school) డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని తినలేక పిల్లలు ఆకలి డొక్కలతో నకనకలాడుతున్నారు. డొక్కా సీతమ్మ ఎందరో అన్నార్తులు, బాటసారుల క్షుద్బాధను తీర్చి కడుపు నింపితే.. టీడీపీ కూటమి సర్కారు ఆ మహనీయురాలి పేరుతో నిర్వహిస్తున్న పథకంలో పిల్లలకు పురుగులు పట్టిన ఆహారాన్ని పంపిణీ చేస్తోంది. మధ్యాహ్న భోజనం పేరు మార్చటంపై ప్రదర్శించిన ఉత్సాహాన్ని పథకం అమలు చేయటంపై మాత్రం చూపడం లేదు. రాష్ట్రంలో విద్యార్థులకు పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత కొరవడి అత్యంత దారుణంగా తయారైంది.పిల్లలకు రుచిగా వండి పెట్టే ఏజెన్సీలు, ఆయాలను బలవంతంగా తొలగించి స్థానిక కూటమి నేతలకు ఇష్టమైన వారిని నియమించడంతో వ్యవస్థ గాడి తప్పింది. భోజనంలో నాణ్యత రోజురోజుకూ క్షీణిస్తోంది. భోజనం అనంతరం పిల్లల అభిప్రాయాలను తెలుసుకోవడంతోపాటు ఉపాధ్యాయులు నాణ్యతను పరిశీలించే విధానాన్ని నిలిపివేశారు. వంటవారు వండి పెట్టిందే పరమాన్నంగా భావించాలని బలవంతం చేయడంతో ఏ పాఠశాలలోనూ సగం మంది కూడా భోజనం చేసే పరిస్థితి లేదు. కంచంలో వడ్డించిన పురుగుల అన్నం సహించక చెత్తబుట్టలో వేస్తున్న ఘటనలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి.రాష్ట్రంలోని 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో సగం మందికి పైగా విద్యార్థులు ఇంటి నుంచే అన్నం బాక్సులు తెచ్చుకునే పరిస్థితిని టీడీపీ కూటమి ప్రభుత్వం కల్పించింది. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా పిల్లలకు 16 రకాల వంటకాలతో రోజుకో మెనూ చొప్పున వారంలో ఆరు రోజులు రుచికరమైన పౌష్టికాహారాన్ని ‘జగనన్న గోరుముద్ద’ ద్వారా అందిస్తే.. ఈ పథకానికి ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం’గా పేరు మార్చిన కూటమి ప్రభుత్వం నాణ్యతను గాలికి వదిలేసింది. వండిన అన్నాన్ని పిల్లలు పారేస్తుండడంతో ఎలాగైనా తినిపించాలని పాఠశాలల సిబ్బందిపై ఒత్తిడి తెస్తోంది. ఉపాధ్యాయులతో ‘వెరీగుడ్’ అని యాప్‌లో అప్లోడ్ చేయిస్తోంది. కొన్ని చోట్ల వంట సరుకులు దారి మళ్లుతున్నాయి. 40 నుంచి 50 శాతం శాతం సరుకులు పక్కదారి పడుతున్నట్టు సమాచారం. వండేవారు, తినేవారు.. సగం మంది ఔట్!పాఠశాలల్లో మధ్యాహ్నం వంట చేసేందుకు దాదాపు 80 వేల మంది స్థానిక స్వయం సహాయక సంఘాల మహిళలు నియమితులయ్యారు. వీరిలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్న వారు కూడా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎక్కడైనా వంట ఏజెన్సీల ఖాళీలు ఏర్పడితే స్వయం సహాయక సంఘాల మహిళలు.. ముఖ్యంగా తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చదివించే తల్లులకు వంట బాధ్యతలు అప్పగించారు. దీంతో వంటలో నాణ్యత పెరిగింది. ఉదయం 9 గంటలకు హాజరు తీసుకునే సమయంలోనే ఎంత మంది గోరుముద్ద భోజనం తీసుకుంటారో విద్యార్థులను అడిగి తెలుసుకునేవారు.ఆ మేరకు రేషన్ సరుకులు అందించి వంట సిద్ధం చేయించడం వల్ల సరుకుల గోల్‌మాల్‌కు అవకాశం ఉండేది కాదు. ఈ వివరాలు పాఠశాల విద్య కమిషనరేట్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు చేరేవి. వంట పూర్తయ్యాక ప్రతి పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు భోజనాన్ని స్వయంగా రుచి చూసిన అనంతరం విద్యార్థులకు అందించేవారు. తర్వాత టీచర్ల అభిప్రాయాలను యాప్‌లో అప్లోడ్ చేసేవారు. భోజనం ముగిశాక పై తరగతుల విద్యార్థులు ఇద్దరు లేదా నలుగురి నుంచి అభిప్రాయాలను సేకరించేవారు. ఆ రోజు భోజనం ఎలా ఉంది..? నాణ్యతలో ఇంకా ఏమైనా మార్పులు చేయాలా..? అనే అంశాలను పొందుపరిచి, ఆ వివరాలను ఫొటోలతో సహా ఉన్నతాధికారులకు పంపించేవారు.కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కూటమి అధికారంలోకి రాగానే స్థానిక నాయకులు ఎక్కడికక్కడ వంట ఏజెన్సీలో 40 వేల మందికి పైగా తొలగించి తమకు నచ్చినవారికి అప్పగించారు. మధ్యాహ్న భోజనంపై విద్యార్థుల అభిప్రాయాల సేకరణను ప్రభుత్వం నిలిపివేసింది. ఎంత మంది ఆహారం తీసుకుంటారనే లెక్కలు లేవు. తిన్న తర్వాత నాణ్యత వివరాలు నమోదు కావడం లేదు. దీంతో స్కూళ్లలో అన్నం తినే విద్యార్థుల సంఖ్య 50 శాతానికి పైగా పడిపోయింది. 2014–19 మధ్య కూడా మధ్యాహ్న భోజనం తీసుకునే విద్యార్థుల సంఖ్య గరిష్టంగా 52 శాతం దాటలేదు. ఇప్పుడూ అదే పరిస్థితి నెలకొనడం గమనార్హం.మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్‌లో నిలదీసినా..టీడీపీ కూటమి ప్రభుత్వం గత డిసెంబర్లో నిర్వహించిన మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్‌లో మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసిన తల్లిదండ్రులు పలుచోట్ల టీచర్లను నిలదీశారు. పిల్లలకు రోజూ ఇలాగే పెడుతున్నారా..? అని మండిపడ్డారు. ఈ నెల ఏడో తేదీన కృష్ణా జిల్లా పురిటిగడ్డ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పూర్తిగా మాడిపోవడంతో పిల్లలు తినలేకపోయారు. దీంతో మధ్యాహ్నం 3 గంటలకు మరోసారి వంట చేశారు. ఇక్కడ తరచూ నాసికరం భోజనంపై ఫిర్యాదు చేసినా పట్టించుకున్న నాథుడు లేడని తల్లిదండ్రులు చెబుతున్నారు.ఇదే జిల్లా ఘంటశాల హైస్కూల్లో 380 మంది విద్యార్థుల్లో సగం మంది ఇంటి నుంచే అన్నం తెచ్చుకుంటున్నారు. మోపిదేవి హైస్కూల్లో సుమారు 400 మంది విద్యార్థులుండగా హాస్టల్ పిల్లలు మినహా డే స్కాలర్స్ ఎవరూ ముద్ద ముట్టుకోవడం లేదు. ఇక పిల్లల్లో రక్తహీనతను నివారించేందుకు గత ప్రభుత్వం పాఠశాలలకు సరఫరా చేసిన ఫోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యాన్ని సైతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిలిపివేసింది.పెంచిన వంట చార్జీలు చెల్లించకుండా..పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న పీఎం పోషణ్ మధ్యాహ్న భోజనం వంట చార్జీలను కేంద్ర ప్రభుత్వం గతేడాది నవంబర్‌లో పెంచింది. బాలవాటిక, ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థికి ప్రస్తుతం రూ.5.45 చొప్పున ఇస్తుండగా ఈ మొత్తాన్ని రూ.6.19కి పెంచింది. ప్రాథమికోన్నత పాఠశాలల్లో (8వ తరగతి వరకు) విద్యార్థికి రూ.8.17 చొప్పున ఇస్తుండగా దాన్ని రూ.9.29కి పెంచింది. ఈ పెంపు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి వర్తిస్తుందని ప్రకటించింది. పీఎం పోషణ్ నిధుల్లో కేంద్రం, రాష్ట్రం 60:40 నిష్పత్తిలో భరించాలి. 9, 10, ఇంటర్ విద్యార్థులకు భోజనం ఖర్చు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. కానీ రెండు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం పెంచిన చార్జీలను వంట ఏజెన్సీలకు చెల్లించలేదు. దీంతో వంట చేసేవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మధ్యాహ్న భోజనానికి ఏటా ఎంత ఖర్చు?టీడీపీ హయాంలో రూ.450 కోట్లువైఎస్సార్ సీపీ హయాంలో రూ.1,400 కోట్లుజగన్ హయాంలో గోరుముద్దకు రూ.7,245 కోట్లుప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలనే సంకల్పంతో 2020 జనవరి 1న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ‘జగనన్న గోరుముద్ద’ పథకానికి శ్రీకారం చుట్టింది. గతంలో టీడీపీ హయాంలో రోజూ సాంబారు, అన్నంతో మధ్యాహ్న భోజనాన్ని సరిపెట్టగా.. వైఎస్ జగన్ రోజుకో మెనూ చొప్పున వారానికి 16 రకాల పదార్థాలతో పాటు ఫోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యంతో రుచి, శుచితో పోషకాహారాన్ని పిల్లలకు అందచేశారు. ఎదిగే పిల్లల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ ఐదేళ్లలో రూ.7,244.60 కోట్లు వ్యయం చేయడం గమనార్హం.పిల్లల్లో రక్తహీనతను అరికట్టడానికి వారంలో మూడు రోజుల పాటు బెల్లంతో చేసిన రాగి జావ, చిక్కీ, వారంలో ఐదు రోజులు ఉడికించిన కోడిగుడ్డును తప్పనిసరి చేశారు. రాష్ట్రంలో 45 వేల పాఠశాలల్లో విద్యార్థుల అభిప్రాయాలను సేకరించి వంటలో మార్పులు చేశారు. రాష్ట్రంలో 1–10 తరగతుల విద్యార్థులు 40.50 లక్షల మంది ఉండగా నిత్యం సగటున 93 శాతం మంది గోరుముద్దను ఇష్టంగా తీసుకునేవారు. మిగిలిన 7 శాతం మందిలో బాలికలు ‘ప్రత్యేక’ పరిస్థితుల్లో ఇంటి నుంచి అన్నం తెచ్చుకుని కూరలు బడిలోనే తీసుకునేవారు.ఆ వివరాలను ఉపాధ్యాయులు ‘ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ సిస్టం ఫర్ మిడ్ డే మీల్స్ అండ్ శానిటేషన్’ (ఐఎంఎంఎస్) యాప్‌లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసేలా గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇక ప్రతి నెలా స్థానిక ఆస్పత్రి వైద్య సిబ్బందితో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి రక్తహీనత ఉన్న వారికి ఫోలిక్ యాసిడ్ (ఐరన్) మాత్రలు, టానిక్‌లు ఇచ్చేవారు. దీంతో పిల్లల ఆరోగ్యం మెరుగుపడింది. విద్యార్థుల్లో రక్తహీనత తగ్గింది. కానీ ఇప్పుడు పరిస్థితి దయనీయంగా ఉంది. పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. బెల్లం చిక్కీలో నాణ్యత తగ్గిపోయినా కారణాలపై ఆరా తీసిన పాపాన పోలేదు. భోజనం నాణ్యతపై విద్యార్థుల అభిప్రాయాలు అడిగే నాధుడు లేరు.నాడు రోజుకో మెనూతో రుచికరంగా..⇒ జగనన్న గోరుముద్ద ద్వారా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కోసం 16 రకాల పదార్థాలతో రోజుకో రుచికరమైన మెనూతో పౌష్టికాహారం. ఉపాధ్యాయులు, విద్యార్థుల భాగస్వామ్యంతో వంటపై మూడంచెల పర్యవేక్షణసోమవారం: హాట్ పొంగల్, ఉడికించిన గుడ్డు లేదా వెజిటబుల్ పలావు, గుడ్డు కూర, చిక్కీ మంగళవారం: ఉదయం 10.20కి రాగిజావ, మధ్యాహ్నం 12.20కి చింతపండు పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన గుడ్డుబుధవారం: వెజిటబుల్ అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీగురువారం : ఉదయం రాగిజావ, మధ్యాహ్నం సాంబార్ బాత్/నిమ్మకాయ పులిహోర, టమాటో పచ్చడి, ఉడికించిన గుడ్డుశుక్రవారం : అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీశనివారం : ఉదయం రాగిజావ, మధ్యాహ్నం ఆకుకూరతో చేసిన అన్నం, పప్పుచారు, స్వీట్ పొంగల్ -
ఏపీలో వేలాది పాఠశాలలను మూసివేసేలా ప్రభుత్వం ప్రతిపాదనలు
-
బడి పిల్లల గొంతు తడిచేదెలా!
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో 450 ప్రభుత్వ స్కూళ్లకు తాగునీటి సరఫరా లేదు. 1,000కి పైగా స్కూళ్లలో స్థానికులు అరకొరగా కుండల్లో, క్యాన్లలో నీళ్లు అందిస్తున్నారు. మొదటి గంటలోనే ఇవి ఖాళీ. మధ్యాహ్నం వేళ విద్యార్థులు మంచినీటి కోసం అల్లాడే పరిస్థితి ఉంది.సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో(Government school) ఇతర సౌకర్యాల మాట అటుంచితే వందలాది స్కూళ్లలో కనీసం తాగునీటి(Drinking water) వసతి లేకపోవడంతో విద్యార్థులు(Students) ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఎండలు పెరుగుతుండటంతో సమస్య మరింత తీవ్రంగా మారుతోంది. దాహం తీర్చుకునేందుకు పిల్లలు దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇటీవల విద్యాశాఖ జరిపిన సమీక్షలో దాదాపుగా అన్ని జిల్లాల డీఈవోలు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు.మధ్యాహ్న భోజన సమయంలోనూ తాగునీరు అందుబాటులో లేని పరిస్థితి ఉంటోందని ఎంఈవోలు వివరిస్తున్నారు. స్కూళ్ళలో నీటి ట్యాంకుల నిర్వహణ సరిగా లేకపోవడం, గత ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ భగీరథ మంచినీటి సరఫరా లేకపోవడం, అనేకచోట్ల విద్యుత్ కోతల కారణంగా ఓవర్ హెడ్ ట్యాంకులు నిండకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంటోంది.రాష్ట్రవ్యాప్తంగా 26 వేల ప్రభుత్వ స్కూళ్లుండగా.. ప్రభుత్వానికి అందిన వివరాల ప్రకారం దాదాపు 6 వేల స్కూళ్ళకు భగీరథ నీరు సరఫరా అవ్వడం లేదు. 10 వేల స్కూళ్ళల్లో విద్యార్థులు ఇంటి నుంచి తెచ్చుకున్న నీళ్ళే తాగుతున్నారు. దాదాపు 4500 స్కూళ్ళల్లో నీళ్ళ ట్యాంకులు మరమ్మతుకు నోచుకోకపోవడం లేదా, నిర్వహణ లోపం వల్ల విద్యార్థులకు మంచి నీటి కొరత ఉంది.దాదాపు అన్నిచోట్లా అదే దుస్థితి⇒ ఆదిలాబాద్ జిల్లాలోని పలు స్కూళ్ళలో విద్యార్థులకు మంచినీటి సౌకర్యం లేదు. మధ్యాహ్న భోజనం చేసేటప్పుడు నీటి కోసం విద్యార్థులు ఎగబడే పరిస్థితి ఉంది. అంతమంది విద్యార్థులకు వాటర్ క్యాన్లలో నీళ్లు తేవడం సాధ్యం కావడం లేదని అక్కడి డీఈవో ఉన్నతాధికారులకు తెలిపారు. ⇒ కరీంనగర్ జిల్లాలోని 600 స్కూళ్ళకు మిషన్ భగీరథ నీటి సరఫరా లేదు. తాగునీటి కోసం ప్రధానోపాధ్యాయులు.. స్థానిక నేతలను ఆశ్రయిస్తున్నారు. కొన్నిచోట్ల స్థానికులు నీళ్ళు అందిస్తున్నారు. 800 ప్రభుత్వ స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత చేతులు కడుక్కునే నీళ్ళు కూడా పొదుపుగా వాడాల్సిన పరిస్థితి ఉంది. ⇒ నిజామాబాద్‌లో పలు హాస్టళ్ళు, స్కూళ్ళల్లో నీటి నిల్వకు అవసరమైన వాటర్ ట్యాంకులు లేవు. దీంతో అప్పటికప్పుడు క్యాన్లలో నీళ్ళు తెప్పిస్తున్నారు. ఇవి మొదటి గంటలోనే అయిపోతున్నాయి. ⇒ వరంగల్ జిల్లాలో 1500 స్కూళ్ళలో విద్యార్థులు ఇళ్ళ నుంచే నీళ్ళు తెచ్చుకుంటున్నారు. తెచ్చుకోని తోటి విద్యార్థులు దాహం అవుతోందని అన్నా.. సందేహిస్తూనే ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటోంది. పలువురు హెచ్ఎంలు ఈ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళారు. ⇒ ఉమ్మడి ఖమ్మం జిల్లా మారుమూల పల్లెల్లోని 820 పాఠశాలల్లో తాగునీటి సరఫరా అరకొరగా ఉంది. దీంతో విద్యార్థులు మధ్యలోనే స్కూళ్ళ నుంచి ఇంటికెళ్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 600 స్కూళ్ళలో నీటి ట్యాంకుల నిర్వహణ సరిగా లేకపోవడంతో విద్యార్థులు దాహార్తితో అల్లాడుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిపెరుగుతున్న ఎండలతో పాటు స్కూళ్లలో మంచినీటి సమస్య తీవ్రమవుతుండటంతో విద్యాశాఖ అప్రమత్తమైంది. పాఠశాలల నుంచి సమగ్ర వివరాలు తెప్పించుకునే పనిలో ఉంది. టెన్త్ పరీక్షలు దగ్గర పడుతున్న దృష్ట్యా విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తుండటంతో నీటి కొరత వేధిస్తోందని విద్యాశాఖ అధికారులు గుర్తించారు.తక్షణ చర్యలు తీసుకునేందుకు వీలుగా ప్రత్యేక బడ్జెట్ విడుదల కోసం ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించారు. ఈలోగా స్థానిక ప్రజాప్రతినిధులు, అలా వీలు కాకపోతే హెచ్ఎంలు అవసరమైన తాగు నీటిని తెప్పించాలని, ఇందుకు సంబంధించిన బిల్లులను చెల్లిస్తామని డీఈవోలకు తెలిపారు. ఎంఈవోలు స్కూళ్ళలో నీటి సమస్యపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. -
విలీనం కిరికిరి.. బడులకు ఉరే మరి!
ఇది కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం రామానగరం ఏడో వార్డులోని ప్రాథమిక పాఠశాల. విద్యార్థుల సౌకర్యం కోసం గత ప్రభుత్వంలో జగనన్న నాడు–నేడు పథకం కింద ఆధునికీకరించి సదుపాయాలు కల్పించారు. ఇక్కడ 1–5 తరగతుల వరకు పది మంది విద్యార్థులు చదువుతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పాఠశాల మూతబడనుంది. ఇదొక్కటే కాదు చల్లపల్లి మండలంలోని 32 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 15 పాఠశాలలు మూత పడనున్నాయి. ఇందులో నాడు–నేడు కింద పనులు జరిగినవి నాలుగు స్కూళ్లున్నాయి.ఇదే జిల్లాలోని మోపిదేవి మండలంలో 28 ప్రాథమిక పాఠశాలలు ఉండగా, వాటిలో 17 బడులను ఇతర బడుల్లో విలీనం చేసేలా ప్రతిపాదనలు పంపారు. ఈ విధంగా రాష్ట్రంలో వేలాది ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను మూసి వేసేలా ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇలా ఈ ఒక్క జిల్లాలోనే 136 స్కూళ్లను పూర్తిగా మూసి వేస్తుండగా, మరో 314 పాఠశాలలను ఇతర స్కూళ్లలో విలీనం చేయనున్నారు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వేలాది ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను మూసివేసేలా ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రస్తుతం ఉన్న విధానాల కంటే మెరుగైన విద్యను అందించడమే తమ లక్ష్యంగా చెప్పుకుంటున్న కూటమి సర్కారు.. బడుల మూసివేత, విలీనం దిశగా అడుగులు వేస్తోంది. విద్యా హక్కు(Right to education) చట్టాన్ని కాలరాస్తూ విద్యార్థులను ఊరికి దూరంగా ఉండే బడులకు పంపించే ఏర్పాట్లు చేస్తోంది. తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వచ్చిన చోట వారిని ఒప్పించే బాధ్యతను డీఈవోలు, ఎంఈవోలు, ఎమ్మెల్యేలు, ముఖ్య రాజకీయ నేతలకు అప్పగించింది. ముఖ్యంగా 25 లోపు విద్యార్థులున్న పాఠశాలలను సమీపంలోని మరో పాఠశాలలో విలీనం చేసేలా మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. ఇలాంటి పాఠశాలలు(Schools) రాష్ట్రంలో దాదాపు 12 వేలకు పైగానే ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వ చర్యలతో ఆ పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకం కానుంది. జీవో 117 ప్రకారం 3–5 తరగతుల విద్యార్థులకు సబ్జెక్టు టీచర్ బోధన అందించేందుకు గత ప్రభుత్వం ఈ తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసింది. అదీ కేవలం కి.మీ లోపు పరిధిలోని 4,731 స్కూళ్లలోని 3–5 తరగతుల విద్యార్థులను 3,348 యూపీ, హైస్కూళ్లలో పెట్టారు. మిగిలిన ఒకటి రెండు తరగతులు అవే స్కూళ్లల్లో కొనసాగాయి. కానీ, కూటమి సర్కారు అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ స్కూళ్లు మూతబడేలా చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1–5 తరగతులు కొనసాగుతున్న స్కూళ్లు 32,596 ఉండగా, వాటిలో కేవలం 17 శాతం స్కూళ్లల్లోనే 60 మంది ఎన్రోల్ ఉందని, మిగిలిన 83 శాతం స్కూళ్లల్లో విద్యార్థులు తక్కువ మంది ఉన్నందున మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రారంభించలేమని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఇప్పుడు తాజాగా మోడల్ ప్రయిమరీ స్కూల్ ఏర్పాటుకు అనువుగా ఇతర స్కూళ్లను విలీనం చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ విలీన ప్రక్రియలో 2014–18 మధ్య మూతబడి, వైఎస్ జగన్ ప్రభుత్వంలో పునఃప్రారంభమైనవి, నాడు–నేడు పథకంలో అభివృద్ధి చెందిన స్కూళ్లు కూడా ఉండడం గమనార్హం. పైగా ఉన్నత లక్ష్యంగా కి.మీ పరిధిలోని 3–5 తరగతులను మాత్రమే ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తే, నాడు తీవ్రంగా వ్యతిరేకించిన కూటమి నేతలు.. ఇప్పుడు వేలాదిగా స్కూళ్లను మూసివేసే పరిస్థితి తీసుకొచ్చినా ఎవరూ ప్రశ్నించకపోవడం గమనార్హం.మార్గదర్శకాలకు భిన్నంగా జీవో 117 ఉపసంహరణ గత ప్రభుత్వం ఇచ్చిన జీవో 117 ప్రకారం ప్రస్తుతం 4,731 ప్రాథమిక పాఠశాలల్లోని 3–5 తరగతులను కి.మీ.లోపు ఉన్న హైస్కూల్, యూపీ స్కూళ్లలో విలీనం చేసి, వారికి స్కూల్ అసిస్టెంట్లతో బోధన అందిస్తున్నారు. మిగిలిన 1, 2 తరగతుల్లో 10 మంది, అంత కంటే తక్కువ విద్యార్థులున్నా ఎస్జీటీలతో చదువు చెబుతున్నారు. కానీ ఉప సంహరణ మార్గదర్శకాల్లో 3–5 తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలల్లోకి తెస్తామని పేర్కొన్నారు. అనంతరం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ‘మోడల్ ప్రైమరీ స్కూల్’ను ఏర్పాటు చేసి, ఇతర పాఠశాలల్లోని 3–5 తరగతులను వాటిలో కొనసాగిస్తామని ప్రకటించారు.కానీ, ఇప్పుడు మోడల్ ప్రైమరీ స్కూళ్ల ఏర్పాటులో భాగంగా నాలుగు లేదా ఐదు ప్రాథమిక పాఠశాలలను విలీనం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులు 5 కి.మీ పైగా దూరం వెళ్లే పరిస్థితి తలెత్తుతుండటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యా హక్కు చట్టం ప్రకారం కి.మీ దూరంలో ప్రాథమిక పాఠశాల, 3 కి.మీ లోపు ప్రాథమికోన్నత పాఠశాల, 5 కి.మీ దూరంలోపు ఉన్నత పాఠశాల ఉండాలి. కానీ, మోడల్ ప్రైమరీ స్కూళ్ల ఏర్పాటులో భాగంగా ‘ప్రాథమిక’ విద్యార్థులను 3 కి.మీ దూరానికి మించి విలీనం చేయడం గమనార్హం. తొలుత 3–5 తరగతులను ప్రాథమిక పాఠశాలల్లో కొనసాగిస్తామని ప్రకటించి, తర్వాత ఆ తరగతులను మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో చేర్చాలంటూ అధికారులను ఆదేశించిన ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా తక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలలను మరో ఎంపీపీ స్కూల్లో విలీనం చేసేందుకు నివేదిక సిద్ధం చేయడం విస్మయానికి గురిచేస్తోంది. విద్యార్థులు తక్కువగా ఉన్నారని 2014–18 మధ్య దాదాపు 1,785 స్కూళ్లను నాటి టీడీపీ సర్కారు రద్దు చేసింది. తాజా విలీన ప్రక్రియతో మండలానికి కనీసం 10–16 స్కూళ్లు రద్దవుతాయని, రాష్ట్ర వ్యాప్తంగా 12 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు(Public schools) మూత బడతాయని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.విలీన విద్యార్థులకు రవాణా చార్జీలు!» తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌తో పాటు కొన్ని జిల్లాల్లో ఒక కి.మీ లోపు ఉన్న ప్రాథమిక పాఠశాలలు మాత్రమే విలీనం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయగా, కృష్ణా జిల్లాతో పాటు మరికొన్ని జిల్లాల్లో అందుకు విరుద్ధంగా ప్రక్రియ చేపట్టినట్టు తెలుస్తోంది. » విలీన పాఠశాల విద్యార్థులకు ఏడాదికి రూ.6 వేల చొప్పున చెల్లిస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అంతేగాక, ప్రభుత్వం ఈ డబ్బులు ఇచ్చే వరకు ఆయా స్కూళ్లల్లో ఉపాధ్యాయులే ఆ మొత్తం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పినట్టు తెలిసింది. ఇదే విషయం చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులతో ఒప్పించాలని ఆదేశాలు జారీ చేసినట్టు విశ్వసనీయ సమాచారం.» ఉపాధ్యాయ సంఘాల సమావేశాల్లో విలీనం ఉండదని చెప్పి, ఇప్పుడు అదే ప్రక్రియను అనుసరిస్తే వ్యతిరేకత వస్తుందని తాము చెబుతుంటే, ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఉన్నత స్థాయి నుంచి ఒత్తిడులు వస్తున్నాయని కింది స్థాయి అధికారులు వాపోతున్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో కొన్ని స్కూళ్ల విలీనంతో విద్యార్థులు 10 కి.మీ దూరం వెళ్లే పరిస్థితి తలెత్తుతుందని, తద్వారా ప్రభుత్వ విద్యకు తీవ్ర నష్టం జరుగుతుందని చెబుతున్నారు. »మరోపక్క స్కూళ్ల విలీనంపై పేరెంట్స్ కమిటీల అనుమతి తీసుకోవాలని, అంగీకారం తెలిపిన ప్రాంతాల్లోనే విలీనం చేయాలని చెబుతున్నా.. ఇప్పటికే విలీన ప్రక్రియకు చేయాల్సిన అన్ని ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఇచ్చిన జీవో 117 ద్వారా ఒక్క పాఠశాల కూడా మూత పడలేదని, కానీ కూటమి సర్కారు నిర్ణయాలతో భారీగా పాఠశాలలు మూతబడే పరిస్థితి తలెత్తుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది.» పాఠశాలల్లో టీచర్ పోస్టులను కాపాడేందుకు ఎంఈవోలు తప్పుడు వివరాలు అందిస్తున్నాంటూ ఆరోపణలు చేసిన పాఠశాల విద్యాశాఖ.. అసలు లెక్కలు తేల్చాలంటూ రెవెన్యూ శాఖ అధికారులకు బాధ్యతలు అప్పగించడంపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు.ఏకపక్ష తరలింపుపై తీవ్ర నిరసన» జీవో 117 రద్దు అనంతరం ప్రతిపాదిత పాఠశాలల ఏర్పాటుపై ఇచ్చిన మెమోకు భిన్నంగా, విద్యా హక్కు చట్టానికి విరుద్దంగా ప్రభుత్వం వెళ్లడాన్ని ఉపాధ్యాయ సంఘాలు ఖండిస్తున్నాయి. ఉపాధ్యాయ సంఘాలతో చర్చించిన దానికి భిన్నంగా తరగతులను తరలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు తగ్గిపోతుందని చెబుతున్నారు. » జనవరి 9న ఇచ్చిన ప్రతిపాదనల్లో ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు పెరుగుదల, డ్రాప్ అవుట్ల తగ్గింపు వంటి లక్ష్యాలతో నూతన పాఠశాలల విధానాన్ని ప్రతిపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి పంచాయతీలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఆమోదంతో ఒక కి.మీ. పరిధిలోని 3–5 తరగతులను ప్రతిపాదిత మోడల్ ప్రైమరీ స్కూల్లో విలీనం చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు 2 కి.మీ. పైనున్న పాఠశాలల నుంచి కూడా తరగతులను విలీనం చేస్తున్నట్టు తెలుస్తోంది.» కొన్ని జిల్లాల్లో పూర్తిగా స్కూళ్లనే తరలించడాన్ని అంగీకరించడం లేదు. అయినప్పటికీ విద్యాశాఖ ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేసేందుకే నిర్ణయించినట్టు తెలుస్తోంది. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రాథమిక పాఠశాలకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాలి. కానీ ప్రభుత్వం ప్రకటించిన ఫౌండేషన్ పాఠశాలలో 30 మంది విద్యార్థుల వరకు ఒక టీచర్నే నియమిస్తామని పేర్కొంది. ఈ ప్రక్రియ అంతా ఉపాధ్యాయులను మిగులుగా చూపడమే లక్ష్యంగా సాగుతోందని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. » కాగా, ఇటీవల గుడ్లవల్లేరు మండలం అంబేద్కర్‌నగర్ పాథమిక పాఠశాలను 2 కి.మీ దూరంలోని నీలకంఠేశ్వరపురం పాఠశాలలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. దీన్ని అంగీకరించమని, విద్యార్థులతో కలిసి స్థానికులు ఆందోళనకు దిగారు. -
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ఆధారిత బోధన. వచ్చే ఏడాది నుంచి 5 వేల స్కూళ్లలో షురూ!
-
ప్రభుత్వ స్కూళ్లలో ఏఐ ఆధారిత బోధన
సాక్షి,హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో సరికొత్త తరహాలో బోధనకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో వర్చువల్ రియాలిటీ విధానంలో పాఠాలు చెప్పేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఎక్‌స్టెప్ ఫౌండేషన్ సహకారం తీసుకోనుంది. ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఫౌండేషన్‌కు వెళ్లి అక్కడ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. ఏ తరహా మౌలిక వసతులు, ఏఐ ఆధారిత టూల్స్ కావాలో తెలుసుకున్నారు. ప్రయోగాత్మకంగా రాష్ట్రంలో కొన్ని స్కూళ్ళను ఎంపిక చేసి..వచ్చే విద్యా సంంవత్సరం నుంచే దీనిని అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రూపొందించిన ఓ నివేదికను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి త్వరలో ప్రభుత్వానికి సమరి్పంచనున్నారు. సరి చేసుకునే వరకు సూచనలు! రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ స్కూళ్ళున్నాయి. ఇందులో తొలి విడతగా 5 వేల స్కూళ్ళను ఎంపిక చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే కంప్యూటర్లు, ఇంటర్నెట్ అనుసంధానం ఉన్న స్కూళ్ళ జాబితాను పరిశీలిస్తున్నారు. 5వ తరగతి మొదలు కొని 10వ తరగతి వరకూ ఏఐ ఆధారిత బోధన ఉంటుందని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ఉన్న సిలబస్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రోగ్రామ్స్ రూపొందిస్తారు. ప్రధాన సర్వర్ల నుంచి ఆయా స్కూళ్ళకు వీటిని అనుసంధానం చేస్తారు. టీచర్ ఒక పాఠం చెప్పిన తర్వాత ఏఐ ఆధారిత ప్రశ్నలు గూగుల్ క్రోం ద్వారా విద్యార్థులకు పంపుతారు. వీటికి ఆన్లైన్లోనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. తప్పులుంటే సరి చేసుకునే వరకూ ఏఐ టెక్నాలజీ విద్యారి్థకి సూచనలు చేస్తుంది. వర్చువల్ రియాలిటీ విధానంలో.. ఏఐ సాంకేతికత అందుబాటులోకి వస్తే విద్యార్థి స్వయం అనుభవం మాదిరి పాఠం నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు విత్తనం మొలకెత్తడం, వృద్ధి చెందడానికి సంబంధించి థియరీ మాత్రమే పుస్తకాల్లో ఉంటుంది. వర్చువల్ విధానంలో విద్యారి్థకి కెమెరా లెన్స్ పరికరం ఇస్తారు. దీన్ని ధరించిన తర్వాత విత్తనం తానే నాటి, అది దశల వారీగా ఎలా ఎదుగుతుందో పరిశీలిస్తున్న అనుభూతి పొందుతాడు. అదే విధంగా ఎర్రకోట గురించి పాఠం చెప్పేప్పుడు, టిప్పు సుల్తాన్ యుద్ధంపై బోధన చేసేప్పుడు అక్కడే ఉండి చూస్తున్నట్టుగా చేయడం ఏఐ టెక్నాలజీతో సాధ్యమవుతుందని చెబుతున్నారు. దీనివల్ల విద్యార్థుల్లో పఠనాసక్తి పెరగడంతో పాటు, జ్ఞాపక శక్తి మెరుగయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మౌలిక సదుపాయాలే కీలకం డిజిటల్ బోధన కోసం గతంలో 3 వేల పాఠశాలల్లో లే»ొరేటరీలు ఏర్పాటు చేశారు. 10 వేల స్కూళ్ళకు కంప్యూటర్లు ఇచ్చారు. 8 వేల స్కూళ్ళకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించారు. కానీ ఏఐ ఆధారిత బోధనకు మరింత అత్యాధునిక మౌలిక వసతులు అవసరం. ఇప్పుడున్న నెట్ స్పీడ్ పది రెట్లు పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. సర్వర్ల నుంచి వేగంగా ప్రోగ్రామింగ్ అందుకోగల మాడ్యూల్స్‌ను రూపొందించాల్సి ఉంటుంది. దీనికి తోడు ప్రభుత్వ స్కూళ్ళల్లో టీచర్లకు ఏఐపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సి ఉంది. గతంలో ఇచ్చిన కంప్యూటర్లు చాలా స్కూళ్లలో వాడకుండా పక్కన పడేశారు. తాజాగా ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామాల్లో ఉండే యువతను ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం చేయాలని భావిస్తున్నారు. ఏఐతో మెరుగైన బోధన ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు స్కూళ్ల కంటే మెరుగైన విద్యా ప్రమాణాలు నెలకొల్పేందుకు ప్రయతి్నస్తున్నాం. ఇందులో భాగంగానే ఏఐ టెక్నాలజీతో విద్యా బోధన అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనిపై త్వరలోనే కార్యాచరణ చేపట్టాలని భావిస్తున్నాం. – ఈవీ నర్సింహారెడ్డి (పాఠశాల విద్య డైరెక్టర్) మంచి ఫలితాలకు అవకాశం ఉంది అమెరికాలో గూగుల్ క్రోం ద్వారానే అసైన్మెంట్స్ ఇస్తున్నారు. మూల్యాంకనం చేపడుతున్నారు. ఏఐ వాడకంలో అక్కడి స్కూళ్ళు ముందంజలో ఉన్నాయి. మన విద్యార్థులు గణితంలో అక్కడివారి కంటే మెరుగ్గా ఉంటారు. కాబట్టి ఏఐ టెక్నాలజీతో మంచి ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంది. – సంక్రాంతి రవికుమార్ (అమెరికాలో ఏఐ బోధన పరిశీలించిన టీచర్) అడ్మిషన్లు పెరుగుతాయి ఏఐ టెక్నాలజీని ముందుకు తీసుకెళ్తే ప్రభుత్వ స్కూళ్ళల్లో అడ్మిషన్లు పెరుగుతాయి. పోటీ ప్రపంచాన్ని తట్టుకునేందుకు ఇది మంచి మార్గం. దీనిపై టీచర్లకు సరైన శిక్షణ ఇవ్వాలి. – పింగిలి శ్రీపాల్‌రెడ్డి (టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు) -
సర్కారు బడులపై కర్ర పెత్తనం!
సాక్షి, అమరావతి: విద్యార్థులకు అందించాల్సిన సంక్షేమ పథకాలకు ఎగనామం పెట్టేందుకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం నెలకో కొత్త నాటకం ఆడుతోంది. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ తల్లికి వందనం కింద రూ.15 వేలు సహా పలు హామీలిచ్చిన కూటమి పెద్దలు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటినా ఒక్క పథకం అమలు చేయకుండా కుంటి సాకులు వెదుకుతోంది. తాజాగా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య వాస్తవంకంటే అధికంగా ఉందని, తప్పుడు ఎన్రోల్మెంట్పై చర్యలు తీసుకుంటామని ఉపాధ్యాయులను హెచ్చరిస్తోంది. అంతేగాక, విద్యార్థుల సంఖ్యపై లెక్కలంటూ ప్రభుత్వ పాఠశాలలపై రెవెన్యూ శాఖకు పెత్తనం అప్పగించింది. విద్యార్థుల లెక్క తీసేందుకు ఎమ్మార్వో, ఎండీవో, ఇతర రెవెన్యూ సిబ్బందిని ప్రభుత్వ స్కూళ్లకు పంపిస్తోంది. వాస్తవానికి ఆధార్ నంబర్ ఆధారంగా విద్యార్థులను బడుల్లో చేర్చుకున్నారు. ఆ వివరాలు ఇప్పుడు యూడైస్‌తో సరిపోవడంలేదని, డ్రాప్ బాక్స్‌లో కనిపిస్తున్న 2,02,791 మంది విద్యార్థులు వాస్తవానికి లేకున్నా అదనంగా నమోదు చేశారని చెబుతోంది. వారందరినీ తొలగించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని అధికారవర్గాలు చెబుతున్నాయి. గత ప్రభుత్వంలో బడి బయట పిల్లలను స్థానికంగా గ్రామ/వార్డు వలంటీర్లు, సచివాలయ విద్యా కార్యదర్శులు కలిసి గుర్తించేవారు. వారిని తిరిగి పాఠశాలల్లో చేరి్పంచే బాధ్యత తీసుకునేవారు. దీంతో డ్రాప్‌బాక్స్ ఖాళీగా ఉండేది. ప్రస్తుతం వలంటీర్లు, సచివాలయ కార్యదర్శులను కూటమి ప్రభుత్వం పక్కన పెట్టడంతో బడిబయటి పిల్లలు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. డ్రాప్ బాక్స్ లెక్కలు బోగస్ అంటూ.. పాఠశాల విద్యా శాఖ లెక్కల ప్రకారం ప్రస్తుతం 1 నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 37 లక్షల మంది చదువుతున్నారు. విద్యార్థుల చేరికలు, వారి ఆధార్ వివరాలను యూడైస్‌తో అనుసంధానం చేశారు. దీంతో అందరి పిల్లల వివరాలు చిరునామాలతో సహా ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ఓ విద్యార్థి వరుసగా 30 రోజులు బడికి హాజరు కాకపోతే ఆ వివరాలు పాఠశాల విద్య డేటా బేస్‌లోని ‘డ్రాప్‌బాక్స్’లోకి వెళ్లిపోతాయి. అంటే వారు డ్రాప్ అవుట్స్‌గా లెక్కించాలి. ఇలా ప్రతి పాఠశాలకు నెల రోజులకు మించి హాజరు కాని వారు 10 నుంచి 50 మంది వరకు ఉంటారని అంచనా.దాని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా డ్రాప్ బాక్స్‌లో నమోదైన విద్యార్థుల సంఖ్య గతేడాది అక్టోబర్ నాటికి 2,02,791 మందికి చేరింది. ఇప్పుడు ఈ వివరాలను బోగస్ ఎన్‌రోల్‌మెంట్‌గా గుర్తించనుంది. ఇలా బోగస్ ఎన్రోల్మెంట్ చేసినందుకు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని ఇటీవల ఒంగోలులో జరిగిన సమావేశంలో పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్ రామరాజు తీవ్రంగా హెచ్చరించారు. టీచర్ పోస్టులు పోకుండా కాపాడుకునేందుకు నకిలీ ఎన్రోల్మెంట్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్ఎంలను హెచ్చరించారు. బోగన్ హాజరు వేసే హెచ్‌ఎంలపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామన్నారు. బోగస్ హాజరును నిగ్గు తేల్చేందుకు రెవెన్యూ అధికారుల బృందాలు ప్రతి పాఠశాలను తనిఖీ చేసేలా ఆదేశాలిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలపై తప్పుడు ముద్ర గత ప్రభుత్వంలో సర్కారు బడుల్లో విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందేది. అలాగే, ఏటా అమ్మ ఒడి కింద రూ.15 వేల చొప్పున నగదు తల్లుల ఖాతాల్లో జమయ్యేది. దీంతో నిరుపేదలు సైతం తమ పిల్లలను బడులకు పంపేవారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల డ్రాప్ అవుట్స్ దాదాపు తగ్గిపోయాయి. ఒకవేళ ఎక్కడైనా డ్రాపవుట్స్ ఉంటే వలంటర్లు, సచివాలయ సిబ్బంది వారిని తిరిగి బడుల్లో చేర్చించేవారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక బడి బయట పిల్లలను గుర్తించే బాధ్యతను ఉపాధ్యాయులకే అప్పగించింది. పైగా తల్లికి వందనం కింద ఇస్తామన్న రూ.15 వేలు ఇవ్వనేలేదు.దీంతో చాలామంది నిరుపేదలు, కూలీలు పిల్లలను తీసుకుని ఉపాధి కోసం వలసపోయారు. పిల్లలు కూడా బాల కార్మికులుగా మారుతున్నారు. దీంతో బడుల్లో చేరిన విద్యార్థుల డ్రాప్ అవుట్స్ పెరిగాయి. 2024 అక్టోబర్ నాటికి 2,02,791 మంది విద్యార్థులు డ్రాప్ బాక్స్‌లోకి చేరగా, ఈ మూడు నెలల్లో మరో 50 వేల మందికి పైగా పెరిగి ఉండవచ్చని అంచనా. కానీ, ఈ లెక్కలను బోగస్ అంటూ రెవెన్యూ అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు లెక్క సరిపోవాలని, లేకుంటే కఠిచర్యలు తప్పవంటూ విద్యా శాఖ హెచ్చరించడంపై టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని విషయాలు ప్రభుత్వానికి తెలిసినప్పటికీ, తాము తప్పు చేశామని అనడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
మధ్యాహ్నం.. అధ్వానం!
మధ్యాహ్న భోజనం ఖర్చులో కేంద్రం 60శాతం, రాష్ట్రం 40శాతం భరిస్తున్నాయి. గురుకులాలు, ప్రభుత్వ హాస్టళ్లలో మెస్ చార్జీలు పెంచారు. కానీ, ప్రభుత్వ స్కూళ్లలో ఇప్పటికీ 1 నుంచి ఐదో తరగతి (ప్రైమరీ) వరకు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.4.97 చొప్పున.. 6 నుంచి 8 తరగతులవారికి రూ.7.45 చొప్పున, 9, 10 తరగతులవారికి రూ.9.45 చొప్పున ఇస్తున్నారు. ఈ కేటాయింపులు పెంచాలి. 1–5 తరగతులకు 55 శాతం, 6–8 తరగతులకు 58 శాతం, 9–10 తరగతుల వారికి 60 శాతం చొప్పున నిధులు పెంచాలి. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం అమలు అస్తవ్యస్తంగా ఉందని విద్యా కమిషన్ అభిప్రాయపడింది. చాలీచాలని నిధులతో ఈ పథకాన్ని సక్రమంగా నిర్వహించడం అసాధ్యమని పేర్కొంది. విద్యార్థులకు పోషకాహారం అందేది ఎలాగని ఆందోళన వ్యక్తం చేసింది. వంట ఖర్చులనూ సక్రమంగా చెల్లించని పరిస్థితిని ఎత్తిచూపింది. అప్పులు చేసి వండి పెడుతున్నా, ప్రభుత్వం బకాయిలు చెల్లించడం లేదని మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తేల్చి చెప్పింది. వీటన్నింటినీ పరిశీలిస్తే మధ్యాహ్న భోజనంలో నాణ్యత, పరిశుభ్రత ఆశించడం కష్టమనేనని పేర్కొంది. గత కొన్ని నెలలుగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఆహారం తిన్న విద్యార్థులు అస్వస్థత పాలవ్వడం, పలుచోట్ల తీవ్ర అనారోగ్యానికి గురవడం వంటి ఘటనల నేపథ్యంలో ఈ అంశంపై రాష్ట్ర విద్యా కమి షన్ పరిశీలన జరిపింది. మధ్యాహ్న భోజన పథకం పరిస్థితి, చేపట్టాల్సిన చర్యలపై కొన్ని సిఫార్సులతో ప్రభుత్వానికి సోమవారం నివేదిక సమర్పించింది. వందలాది స్కూళ్లను పరిశీలించి... రాష్ట్రవ్యాప్తంగా వందలాది ప్రభుత్వ స్కూళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, ప్రభుత్వ హాస్టళ్లు, కేజీబీవీలు, అంగన్ వాడీ కేంద్రాలను విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, సభ్యులు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, డాక్టర్ చారకొండ వెంకటేశ్, జోత్స్న శివారెడ్డి సందర్శించారు. మధ్యాహ్న భోజనం నాణ్యత, మౌలిక సదుపాయాలు, పారిశుధ్యానికి సంబంధించిన లోటుపాట్లను క్షుణ్నంగా పరిశీలించింది. దీనికి సంబంధించి ప్రభుత్వానికి ‘మధ్యాహ్న భోజన పథకం–ప్రభుత్వ విద్య సంస్థల్లో ఆహార నాణ్యత, భద్రత’ పేరుతో నివేదిక అందజేసింది. అందులో అనేక అంశాలను ప్రస్తావించింది. ఇలాగైతే పౌష్టికాహారం అందడం కష్టం రాష్ట్రంలో 26,519 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో సుమారు 20.36 లక్షల మందికి రోజూ మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. నిబంధనల ప్రకారం వారికి వారానికి 3 కోడిగుడ్లు ఇవ్వాలి. ఒక్కో గుడ్డు కోసం ప్రభుత్వం ఇస్తున్నది రూ.5 మాత్రమే. మార్కెట్లో గుడ్డు ధర రూ.7 వరకు ఉంది. దీనితో స్కూళ్లలో చాలా చోట్ల వారానికి ఒకటి, రెండు గుడ్లనే అందిస్తున్నారు. దీనివల్ల విద్యార్థులకు పౌష్టికాహారం అందడం కష్టమని కమిషన్ అభిప్రాయపడింది. భోజనం వండి, వడ్డించే మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం ఇప్పటికీ రూ.116 కోట్లు బకాయి ఉంది. తాము అప్పుచేసి వండి పెడుతుంటే బిల్లులు ఆలస్యంగా వస్తున్నాయని.. తాము వడ్డీ భారం మోయాల్సి వస్తోందని అనేక చోట్ల స్వయం సంఘాల మహిళలు వాపోతున్నారు. ఇక చాలీచాలని నిధులతో నాణ్యమైన కూరగాయలు తీసుకురాలేక పోవడం, నిల్వ చేసేందుకు తగిన మౌలిక వసతులు లేకపోవడం వల్ల ఇబ్బంది ఎదురవుతోందని విద్యా కమిషన్ పేర్కొంది. దీనితో ఆహారం కల్తీ అవడం, నాణ్యత లేకపోవడం వల్ల విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారని స్పష్టం చేసింది. తక్షణమే ఈ చర్యలు చేపట్టాలి.. మధ్యాహ్న భోజన పథకం అమలుపై విద్యా కమిషన్ ప్రభుత్వానికి పలు సిఫార్సులు చేసింది. వీటిని తక్షణమే అమలు చేయాలని కోరింది. అలా చేస్తేనే భోజనం నాణ్యత పెరుగుతుందని, విద్యార్థులు అనారోగ్యం పాలయ్యే పరిస్థితి దూరమవుతుందని తెలిపింది. – మహిళా సంఘాలకు ఎప్పుడు బిల్లులు వస్తాయో తెలియని పరిస్థితి ఉంది. విధి లేని పరిస్థితుల్లో అప్పులు తెచ్చి వండి పెడుతున్నామనేది మహిళా సంఘాల ఆందోళన. ఈ పరిస్థితిని మార్చాలి. గ్రీన్ చానల్ ద్వారా వారం వారం బిల్లులు చెల్లించాలి. – గురుకులాల్లో అన్నిరకాల పోషకాలు అందిస్తున్నారు. అక్కడ నిధులు పెంచారు. కానీ ప్రభుత్వ స్కూళ్లలో ఇస్తున్న మెనూ విద్యార్థులు తినేలా లేదని అనేక మంది ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థలన్నింటికీ ఒకే తరహా మెనూ అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలి. ఇంటర్ విద్యార్థులకూ మధ్యాహ్న భోజనం అందించాలి. – మధ్యాహ్న భోజనం అమలుకు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఉండాలి. నిత్యావసరాలు, కూరగాయలు సేకరించడం, వాటిని నిల్వ చేయడం, శుభ్రం చేయడం, వండటం, వృధాను పారేసేందుకు ప్రత్యేక నిబంధనలు ఉండాలి. దీని అమలుకు యంత్రాంగం చర్యలు చేపట్టాలి. – రాష్ట్రంలో నిత్యావసరాలు, కూరగాయలు, ఇతర సామగ్రి సేకరించడంలో ఐదు సంస్థలు మాత్రమే పనిచేస్తున్నాయి. దీనికి అనేక రకాల నిబంధనలు అడ్డంకిగా ఉన్నాయి. టెండర్లు వేయడం, వాటిని ఖరారు చేయడానికి ఉన్నతాధికారుల అనుమతుల వల్ల ఆలస్యమవుతోంది. ఈ బాధ్యతను ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు అప్పగించాలి. దీనివల్ల ఒకే సంస్థ ఈ బాధ్యతను తీసుకుని, నాణ్యత పెంచుతుంది. ప్రభుత్వం దృష్టిపెడుతుందని ఆశిస్తున్నాం.. రాష్ట్రంలోని వందల స్కూళ్లలో మధ్యాహ్న భోజన పరిస్థితిని పరిశీలించాం. అన్ని వర్గాలవారితో మాట్లాడాం. అందరి అభిప్రాయాలు తీసుకున్నాం. నాణ్యమైన భోజనం అందించే దిశగా ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేశాం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి నివేదిక అందజేశాం. ప్రభుత్వం దీనిపై దృష్టి పెడుతుందని ఆశిస్తున్నాం. – ఆకునూరు మురళి, రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ -
చిన్నారులపై టీడీపీ నేత దాష్టీకం
కంభం: ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న తన కుమార్తె పుస్తకంలోని పేజీలు చింపారంటూ ఓ టీడీపీ నేత తమ పిల్లలను తీవ్రంగా కొట్టాడంటూ పలువురు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా కంభం మండలం ఎల్కోట పంచాయతీకి టీడీపీ నేత గని చిన్నవెంకటేశ్వర్లు కుమార్తె ఎల్కోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతోంది. శనివారం తన కూతురి పుస్తంలోని కొన్ని పేజీలను ఎవరో చించారు.అదే తరగతిలో చదువుకుంటున్న పిల్లలే చించారన్న అనుమానంతో శనివారం సాయంత్రం మరో ఇద్దరితో పాఠశాలలోకి వచ్చి తమ పిల్లలను తీవ్రంగా కొట్టారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఎమ్మార్పీఎస్ నేత జయరాజ్, ఓ బాధిత విద్యార్థి తండ్రి దుగ్గెపోగు బాబురావు మీడియాతో మాట్లాడారు. ఘటనపై హెచ్ఎం, ఎంఈవోకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ఈ విషయమై కంభం సీఐ మల్లికార్జునను వివరణ కోరగా ఘటనపై విచారణ జరుపుతున్నట్టు చెప్పారు. -
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో విద్యార్థులకు శాపంగా లోకేశ్ బర్త్‌డే
-
బడికి ఉరి!.. ముంచుకొస్తున్న ప్రమాదం
ప్రతి గ్రామంలో రెండు, మూడు వరకు ఉన్న ప్రాథమిక పాఠశాలలు, పంచాయతీ పరిధిలోని ప్రాథమికోన్నత పాఠశాలలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి కనిపించకపోవచ్చు. పేదింటి పిల్లలు స్థానికంగా చదువుకునే అవకాశం లేకపోవచ్చు. వారు చదువుకోవాలంటే దూరంగా ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసే ప్రైమరీ మోడల్ స్కూల్ లేదా స్థానికంగా ఉన్న ప్రైవేటు స్కూళ్లలో చేరాలి. ఎందుకంటే.. జీవో–117కు ప్రత్యామ్నాయంగా విడుదలైన విద్యా శాఖ కొత్త మార్గదర్శకాలు ప్రాథమిక పాఠశాలలను పూర్తిగా నిర్వీర్యం చేసేలా ఉన్నాయి.సాక్షి, అమరావతి: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అక్కసుతో గత ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యా సంస్కరణలను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తున్న కూటమి సర్కారు తొలి లక్ష్యంగా ప్రభుత్వ విద్యారంగాన్ని ఎంచుకుంది. సీబీఎస్ఈ, టోఫెల్, ఐబీ విద్యను అటకెక్కించిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా 3–5 తరగతుల విద్యార్థులకు బోధిస్తున్న సబ్జెక్టు టీచర్లను రద్దు చేస్తోంది. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లను ఇప్పటికే తొలగించిన సంగతి తెలిసిందే. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 3–5 తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలల్లో కలిపేస్తున్నట్టు తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. జీవో–117కు ప్రత్యామ్నాయంగా విడుదలైన విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలు ప్రాథమిక పాఠశాలలను పూర్తిగా నిర్వీర్యం చేసేలా మారబోతున్నాయి. సాధారణంగా ప్రభుత్వం ఓ వ్యవస్థలో మార్పులు తీసుకొస్తే.. తెచ్చిన మార్పు ఓ ఐదేళ్లపాటు కొనసాగాలి, తర్వాత దానిలోని లోటుపాట్లను అధ్యయనం చేసి కొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలి. కానీ.. ఇక్కడ జీవో117 ద్వారా 2022 జూన్‌లో తెచ్చిన విధానాలను కేవలం రెండేళ్లలోనే కూటమి ప్రభుత్వం ఎలాంటి అధ్యయనం లేకుండా రద్దు చేస్తోంది. ప్రభుత్వ నిర్ణయాలు పాత విధానం కంటే మెరుగ్గా ఉంటే ప్రజలు హర్షిస్తారు. కానీ.. జీవో–117లో ఉన్న మంచి పోయి.. కొత్త విధానంతో ప్రభుత్వ పాఠశాల విద్యను నిర్వీర్యం చేసి, ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లకు లబ్ధి చేకూర్చేలా ఉంది.కొత్త విధానంతో 10 వేల సబ్జెక్టు టీచర్ల మిగులుజీవో–117 రద్దు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం.. అందులోని ఉత్తర్వులను పూర్తిగా రద్దుచేసి, ఈ జీవోకు ముందున్న పరిస్థితులను పునరుద్ధరించాలి. లేదా 117 జీవోలో ఉన్న లోపాలను సరిచేసి కొనసాగించాలి. లేదంటే పూర్తిగా కొత్త విధానాన్ని తీసురావాలి. కానీ.. ఈ మూడు విధానాలకు విరుద్ధంగా రూపొందించిన మార్గదర్శకాలు ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఉదాహరణకు.. ఏలూరు జిల్లాలోని ఓ ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం ఐదో తరగతిలో 27 మంది విద్యార్థుల ఎన్రోల్మెంట్ నమోదైంది. ఆరో తరగతిలో 19 మంది, 7వ తరగతిలో 17 మంది, 8వ తరగతిలో 14 మంది విద్యార్థులు ఉన్నారు. ఉన్నత తరగతులు ఉన్నందున ఇక్కడ ఆరుగురు స్కూల్ అసిస్టెంట్లు బోధన అందిస్తున్నారు. అయితే, 6, 7, 8 తరగతుల్లో మొత్తం 50 మంది విద్యార్థులే ఉన్నందున కొత్త మార్గదర్శకాల ప్రకారం వచ్చే విద్యా సంవత్సరం ఇక్కడ యూపీ స్కూల్‌ను రద్దు చేస్తారు. ప్రస్తుతం ఐదో తరగతిలో ఉన్న విద్యార్థులు 27 మంది 2025–26 విద్యా సంవత్సరంలో అదే పాఠశాలలో కొనసాగితే అప్పుడు 6, 7, 8 తరగతుల్లో 63 మంది, 9వ తరగతిలో 14 మంది మొత్తం 77 మంది ఉన్నందున ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ చేస్తారు. కానీ.. అక్కడ బోధనకు స్కూల్ అసిస్టెంట్ల పోస్టులను రద్దు చేసి, ఎస్జీటీలను మాత్రమే ఇస్తుంది. అంటే హైస్కూల్‌గా మారినా పరిస్థితి మెరుగుపడకపోగా.. ఉన్న పోస్టులు సైతం వెళ్లిపోయి అప్‌గ్రేడ్‌కు బదులు డౌన్‌గ్రేడ్ అయ్యే ప్రమాదముంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 3,760 ప్రాథమికోన్నత పాఠశాలల పరిస్థితి ఇలాగే మారే ప్రమాదముంది. ప్రకాశం జిల్లాలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జీవో–117 ప్రకారం ప్రాథమిక పాఠశాలలోని 3–5 తరగతులను విలీనం చేశారు. దీంతో ఇక్కడ 3 నుంచి 10వ తరగతి వరకు 8 సెక్షన్లు కొనసాగుతున్నాయి. 180 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతి సబ్జెక్టుకు ఒక్కొక్కరు చొప్పున.. గణితం, ఇంగ్లిష్‌కు ఇద్దరు చొప్పున 12 మంది స్కూల్ అసిస్టెంట్లను ప్రభుత్వం నియమించింది. 3, 4, 5 తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలలకు పంపిస్తే ఉన్నత తరగతుల్లో 140 మంది విద్యార్థులతో 5 సెక్షన్లే మిగులుతాయి. దీంతో ఒక గణితం, ఒక ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్లు, మరో రెండు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మొత్తం నాలుగు పోస్టులు తగ్గిపోతాయి. ఇలానే జీవో–117 ద్వారా 3–5 తరగతులు విలీనమైన 3,348 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ప్రస్తుతమున్న స్కూల్ అసిస్టెంట్ పోస్టులు సగటున మూడు చొప్పున 10 వేల పోస్టులు తగ్గిపోతున్నట్టు తెలుస్తోంది. అంటే రాష్ట్రంలో 10 వేల స్కూల్ అసిస్టెంట్లు మిగులుగా ఉంటాయి. ఇంత భారీగా మిగులుతున్న స్కూల్ అసిస్టెంట్లను ఎక్కడ సర్దుబాటు చేస్తారో మార్గదర్శకాల్లో ఎక్కడా పేర్కొనలేదు.34 వేల ప్రాథమిక పాఠశాలలపై తీవ్ర ప్రభావంప్రస్తుతం జీవో–117 ప్రకారం ఉన్నత, యూపీ స్కూళ్లకు కి.మీ. పరిధిలో ఉన్న 4,731 ప్రాథమిక పాఠశాలలోని 3–5 తరగతులను విలీనం చేశారు. వీరికి సబ్జెక్టు టీచర్లు బోధిస్తున్నారు. అలాగే, 1, 2 తరగతుల్లో 10 లేదా అంతకంటే తక్కువ మంది విద్యార్థులున్నా ఒకరిద్దరు ఉపాధ్యాయులతో బోధన అందిస్తున్నారు. తాజా ఉత్తర్వుల ప్రకారం 117 జీవోను రద్దు చేసి, 3–5 తరగతులను తిరిగి వెనక్కి తెస్తామని పేర్కొన్నారు. దీంతో పాటు మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు చేసి, ఇతర పాఠశాలల్లో చదువుతున్న 3, 4, 5 తరగతులను వాటిలో కొనసాగిస్తామని పేర్కొన్నారు. అంతేగాక, 3–5 తరగతులను ప్రాథమిక పాఠశాలల్లో కొనసాగించకుండా మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో చేర్చాలంటూ ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 34 వేల ప్రాథమిక పాఠశాలలు ఉండగా, వాటిలో కేవలం కి.మీ. పరిధిలో 4,731 ప్రాథమిక పాఠశాలల్లోని 3–5 తరగతులనే విలీనం చేయగా, తాజా ఉత్తర్వుల ప్రకారం 34 వేల ప్రాథమిక పాఠశాలల్లోని 3–5 తరగతులను మోడల్ ప్రైమరీ స్కూళ్లల్లో విలీనం చేస్తారు. దీని ప్రకారం మూడో తరగతి చదవాలంటే విద్యార్థులు కనీసం 5 కి.మీ. దూరం దాటి వెళ్లాలి. లేదంటే స్థానికంగా ఉండే ప్రైవేటు స్కూళ్లలో చేరాలి. ఇక 1, 2 తరగతుల్లో విద్యార్థులు తక్కువ ఉన్నారన్న నెపంతో 2014–19 మధ్య 1,785 స్కూళ్లను రద్దు చేసిన అప్పటి టీడీపీ సర్కారు.. తాజాగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన కొత్త మార్గదర్శకాలతో వేలాది ప్రాథమిక పాఠశాలలు మూతపడే ప్రమాదం ఏర్పడింది. ఇది ఒక ఎత్తయితే ప్రస్తుతం మారుమూల గ్రామాలు, పంచాయతీ పరిధిలోని శివారు గ్రామాల్లో (హేమ్లెట్స్) దాదాపు 12 వేల ఏకోపాధ్యాయ పాఠశాలలు కొనసాగుతున్నాయి. వీటిలో 1–5 తరగతులు చదివే విద్యార్థులు తరగతికి నలుగురు లేదా ఐదుగురు మాత్రమే ఉన్నారు. కూటమి కొత్త మోడల్ ప్రకారం ఇకపై వీటిలో 3 నుంచి 5 తరగతులు చదివే వారు ఇకపై గ్రామం దాటిపోవాల్సిందే.ఆ హైస్కూళ్లకు హెచ్ఎం పోస్టు ఉండదుప్రస్తుతం రాష్ట్రంలో 6,700 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 75 మంది కంటే తక్కువ మంది విద్యార్థులున్న స్కూళ్లు దాదాపు 2 వేల వరకు ఉన్నాయి. కూటమి సర్కారు కొత్త మార్గదర్శకాల ప్రకారం ఉన్నత పాఠశాలల్లో 75 మంది కంటే తక్కువ విద్యార్థులుంటే అక్కడ ప్రధానోపాధ్యాయ, పీఈటీ పోస్టులను రద్దు చేస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. అంటే దాదాపు రెండు వేల హైస్కూళ్లకు హెచ్ఎం, పీఈటీలు ఇకపై ఉండరు. కాగా.. 297 ఉన్నత పాఠశాలల్లో 75 కంటే తక్కువ విద్యార్థులు ఉన్నారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం 297 స్కూళ్లలో ప్రధానోపాధ్యాయుల పోస్టులకు స్వస్తి పలకనున్నారు. అదేవిధంగా విద్యార్థుల సెక్షన్ల ప్రకారం ఉపాధ్యాయుల కేటాయింపులోనూ ప్రభుత్వం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. గత ప్రభుత్వంలో వర్క్ అడ్జస్ట్మెంట్ కింద ఉపాధ్యాయులను బదిలీ చేసింది. విద్యార్థుల సంఖ్యను బట్టి సెక్షన్లు లెక్కించి ఆమేరకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. దాని ప్రకారం 6, 7, 8 తరగతుల్లో ఎన్రోల్మెంట్ మొదటి 53 మంది వరకు ఒక సెక్షన్, 54 నుంచి 88 వరకు రెండో సెక్షన్, 89 నుంచి 123 వరకు మూడో సెక్షన్‌గా గుర్తించి టీచర్లను ఇచ్చారు. తాజా మార్గదర్శకాల ప్రకారం 54 మంది విద్యార్థుల వరకు ఒక సెక్షన్, 55 నుంచి 94 వరకు రెండో సెక్షన్, 95 మంది నుంచి 3వ సెక్షన్‌గా నిర్ణయించారు. కొత్త దానికంటే పాత విధానంలోనే ఐదుగురు విద్యార్థులు తక్కువకే మూడో సెక్షన్ మంజూరు చేశారు. ఇలా విద్యార్థుల సంఖ్య పెంచడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల మందికి పైగా ఉపాధ్యాయుల మిగులు ఏర్పడుతుందని, ఇది ఉన్నత పాఠశాలలకు శాపంగా మారుతుందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఉపాధ్యాయుల మిగులతో డీఎస్సీపై ప్రభావం కూటమి ప్రభుత్వం రాగానే 16,347 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించింది. 7 నెలలు దాటినా ఇప్పటివరకు నోటిఫికేషన్ జాడ లేదు. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు కలిపి దాదాపు 15 వేలకు పైగా పోస్టులు మిగులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తారా లేదా అన్న దానిపై నిరుద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ప్రతి ఉన్నత పాఠశాల నుంచి కనీసం ఒక్క పోస్టు మిగులు ప్రకటించే కసరత్తు ప్రారంభమైనట్టు సమాచారం. దీంతో స్కూల్ అసిస్టెంట్లే దాదాపు 5 వేలకు పైగా, ఎస్జీటీలు మరో 10 వేలు మిగిలే అవకాశం ఉంది. దీంతో డీఎస్సీలో ఖాళీలను ఎక్కడ నుంచి చూపిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.స్కూల్ అసిస్టెంట్లకు న్యాయం చేయాలి: ఏపీటీఎఫ్ అమరావతిఉన్నత పాఠశాలల్లోని స్కూల్ అసిస్టెంట్లకు న్యాయం చేయాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ డిమాండ్ చేశారు. జీవో–117 రద్దు చేస్తున్నందున అంతకు ముందున్న వ్యవస్థను పునరుద్ధరించి తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. యూపీ స్కూళ్లల్లో స్కూల్ అసిస్టెంట్లను కొనసాగించాలని డిమాండ్ చేశారు. వారానికి 10 పీరియడ్లు గణితానికి కేటాయించాలని, 3, 4, 5 తరగతులకు సబ్జెక్టు టీచర్లను కొనసాగించాలన్నారు. తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టని పక్షంలో జీవో–117 రద్దు వల్ల హైస్కూల్ టీచర్లకు అన్యాయం జరుగుతుందన్నారు. ఉన్నత పాఠశాల విద్య నిర్వీర్యం కాకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
విద్యార్థుల ఓటు ఇంగ్లిష్ మీడియానికే
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంపై కక్షగట్టిన కూటమి సర్కారుకు విద్యార్థులు షాకిచ్చారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు తెలుగులోనూ రాసేందుకు అవకాశం కల్పించినా విద్యార్థులు ససేమిరా అన్నారు. కొన్నిచోట్ల సర్కారు ఒత్తిడితో కేవలం 7 శాతం మంది మాత్రమే తెలుగులో పరీక్షలు రాసేందుకు ముందుకొచ్చారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలను తెలుగు మీడియంలోకి మార్చేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు పదో తరగతి విద్యార్థులు తగిన గుణపాఠం చెప్పినట్టయింది.సాక్షి, అమరావతి: పదో తరగతి విద్యార్థులు ఇంగ్లిష్ మీడియానికే జై కొట్టారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలను 93 శాతం మంది ఇంగ్లిష్ మీడియంలోనే రాస్తామని తేల్చి చెప్పారు. 2024–25 విద్యా సంవత్సరం పదో తరగతిలో మొత్తం 6,64,527 మంది విద్యార్థులు ఉండగా.. ప్రభుత్వ పాఠశాలల్లో 3,77,054 మంది చదువుతున్నారు. వీరంతా మార్చి 17 నుంచి జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరు కానున్నారు. ఈ క్రమంలో పాఠశాల విద్యా శాఖ నామినల్ రోల్స్ పంపాల్సిందిగా పాఠశాలలను ఆదేశించింది. ఈ ప్రక్రియ మొదలైన అనంతరం తెలుగులోనూ పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించామని, తెలుగు మీడియంలో పరీక్షలు రాసేందుకు కూడా దరఖాస్తు చేసుకోవాలని కోరింది. అయితే, ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల్లోని అన్ని పాఠశాలల నుంచి కేవలం 51,037 మంది మాత్రమే తెలుగు మీడియంకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ప్రభుత్వ విద్యార్థుల సంఖ్య 25 వేలకు మించి ఉండదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన విద్యా సంస్కరణలతో 2023–24 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఇంగ్లిష్ మీడియం లేకున్నా సరే 4 లక్షల మంది విద్యార్థుల్లో 2.25 లక్షల మంది స్వచ్ఛందంగా ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాశారు. చట్టప్రకారం ఈ విద్యా సంవత్సరం పదో తరగతి ఇంగ్లిష్ మీడియంలోకి మారింది. అయినప్పటికీ కూటమి సర్కారు ఇంగ్లిష్ మీడియం రద్దుకు కంకణం కట్టుకుని పదో తరగతి విద్యార్థులను తెలుగు మీడియం వైపు తిప్పేందుకు శతవిధాలా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఇంగ్లిష్ మీడియం విద్యకే ఓటు రాష్ట్రంలో 2019కి ముందు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం మాత్రమే అందుబాటులో ఉండేది. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంగ్లిష్ మీడియం విద్యను కోరుకోవడం, అది ప్రభుత్వ బడుల్లో లేకపోవడంతో ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తగ్గిపోవడం.. ప్రైవేటు పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెరగడం పరిపాటిగా మారింది. దీంతో దాదాపు 1,785 ప్రభుత్వ పాఠశాలలను గత టీడీపీ ప్రభుత్వం మూసేసింది. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితులపై వైఎస్ జగన్ ప్రభుత్వం అధ్యయనం చేసి తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకుంది. తద్వారా రాష్ట్రంలో సామాన్య, మధ్యతరగతి తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు ఇంగ్లిష్ మీడియం విద్యను కోరుకుంటున్నామని 95 శాతం మంది తెలిపారు. ఇంగ్లిష్ కోసమే ఫీజులు భారమైనా తమ బిడ్డలను ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్నట్టు వివరించారు. దీంతో వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. పేదింటి పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీ పడేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం 2020–21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను అమల్లోకి తెచ్చింది. ఆ సంవత్సరం ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టగా, 2021–22లో ఏడో తరగతి, 2022–23లో ఎనిమిదో తరగతి, 2023–24లో తొమ్మిదో తరగతికి అందుబాటులోకి తెచ్చింది. ఇదే క్రమంలో 2024–25 విద్యా సంత్సరంలో పదో తరగతి కూడా ఇంగ్లిష్ మీడియం అమల్లోకి వచ్చింది. కుట్రను తిప్పికొట్టి మరీ..ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో చదవలేకపోతున్నారని, మాతృభాషలో బోధన అందిస్తామని ప్రకటించింది. కానీ.. విద్యార్థులు అందుకు అంగీకరించలేదు. 2023–24 విద్యా సంవత్సరంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం చదువుతున్న పదో తరగతి విద్యార్థుల్లో 2.20 లక్షల మంది స్వచ్ఛందంగా ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాశారు. వారిలో 1.94 లక్షల మంది ఉత్తర్ణీత సాధించడం ద్వారా పిల్లలు ఇంగ్లిష్ మీడియంను ఎంత బలంగా కోరుకుంటున్నారో రుజువు చేశారు. ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ బడుల్లో 25 వేల మందే తెలుగు మీడియం పరీక్షలకు అంగీకరించి.. తెలుగు మీడియం సంఖ్యను మరింత తగ్గించారు. గత ప్రభుత్వం తెచ్చిన విద్యా సంస్కరణలతో ప్రజల్లో సర్కారు బడులపై నమ్మకం పెరిగింది. దాంతో 2023–24 విద్యా సంవత్సరంలో అంతకు ముందుకంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు 1,50,005 మంది విద్యార్థులు అధికంగా చేరికలు నమోదయ్యాయి. గత విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 43 లక్షల మంది విద్యార్థులు ఉండగా, వారిలో 38.50 లక్షల మంది ఇంగ్లిష్ మీడియంలోనే పరీక్షలు రాశారు. ప్రభుత్వం బైలింగ్యువల్ పుస్తకాలను అందించడంతో విద్యార్థుల్లో ఇంగ్లిష్ మీడియం అంటే భయం పోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న అత్యధిక మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో చదివేందుకే ఇష్టపడుతున్నారు. గతేడాది ముగిసిన పరీక్షల్లో 91.33 శాతం మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలోనే పరీక్షలు రాయడం ఇందుకు నిదర్శనం. ఇందులో 3 నుంచి 5 తరగతుల్లో 86 శాతం, 6 నుంచి 9వ తరగతి వరకు 94 శాతం మంది ఇంగ్లిష్ మీడియంలో పరీక్ష రాయగా, మొత్తం అన్ని తరగతుల్లోను పరీక్షలు 93 శాతం ఇంగ్లిష్ మీడియంలోనే పూర్తి చేశారు. 2023–24 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు టాప్ మార్కులు సాధించి ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లకు సవాల్ విసిరారు. అదీ ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాసి 590కి పైగా మార్కులు సొంతం చేసుకోవడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ఎందుకని ఆక్షేపించిన వారికి గట్టి జవాబు ఇచ్చారు. -
ఈ భోజనం ఎవరు తింటారు బాబు !
-
ఇంగ్లిష్ మీడియంపై అక్కసు ఎందుకు?
ఇంగ్లిష్ భాషా మాధ్యమం ఒక ఉపాధి విప్లవం. ఇంగ్లిష్ విద్య ఇప్పటి కచ్చిత అవసరం. అందుకే గత వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలోని పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుండి ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టిన విధానం ఎంతోమంది దళిత బడుగు వర్గాల విద్యార్థుల్లో విద్యాసక్తిని పెంచింది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఇంగ్లిష్‌లో మాట్లాడుతుంటే ఎంతో ఆనందానికి గురయ్యారు. కానీ దళిత బహుజనులు ఆంగ్లం నేర్చుకుంటుంటే, తెలుగు భాషోద్ధరణ పేరుతో వారికి ఆ అవకాశం లేకుండా చేయడం న్యాయం కాదు. తెలుగును అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ప్రధాన మాధ్యమంగా ప్రవేశపెట్టాలన్న ప్రపంచ తెలుగు రచయితల మహాసభల తీర్మానం సామాజిక న్యాయానికి విరుద్ధమైనది, నిజాయితీ లోపించినది.తెలుగు నేలలో ఈ నాలుగు దశాబ్దాల్లో అనేక సామాజిక, సాంస్కృతిక, విద్యా, భాషా పరిణామాలు చోటు చేసుకొన్నాయి. కొన్ని సామాజిక వర్గాలు హరిత విప్లవం తరువాత సంపన్న వర్గాలుగా మారాయి. ఒకనాడు జమీందారీ విధానం మీద పోరాడిన ఈ వర్గాలు ఆ తరువాత అవకాశ వాదంగా బ్రాహ్మణవాద కులాధిపత్యాన్ని స్వీకరించాయి. భూమి పంపకాన్ని నిరాకరిస్తూ భూస్వామ్య గుత్తాధిపత్యంతో రాజ్యాధి కారాన్ని చేపట్టాయి. అంతకుముందు వీళ్లు తెలుగు భాషకు పట్టం గట్టారు. కానీ తెలుగు విద్య వల్ల తమ పిల్లలకు ఉద్యోగ వసతి రాదనీ, అమెరికా వంటి సామ్రాజ్యవాద దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు సంపా దించాలంటే ఇంగ్లిష్ విద్య అవసరమనీ ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు నెలకొల్పారు. ప్రభుత్వ విద్యను దెబ్బతీశారు. ఎవరైతే తమ పిల్లలకు, మనవళ్ళకు బుద్ధిపూర్వకంగా తెలుగు రాకుండా చేసి వారి దేశీయత మీద గొడ్డలివేటు వేశారో, వారే మొన్నటి ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో తెలుగును అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ప్రధాన మాధ్యమంగా ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. కానీ దీన్ని తెలుగు మీద ప్రేమ అనలేము. ‘భూస్వామ్య ఆధిపత్యానికి కూలీలు ఎవరు దొరుకుతా’రనే భావనతోనే బడుగులకు తెలివిగా ఆంగ్ల మాధ్యమ నిరాకరణ జరుగుతోంది.నిజానికి మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, అంబేడ్కర్ లాంటివాళ్లు భారత స్వాతంత్య్రోద్యమంలో ప్రధాన భూమిక వహించడానికి వారి ఇంగ్లిష్ విద్యే కారణం. అంబేడ్కర్. భారత రాజ్యాంగంతో పాటు, వేలాది పేజీలు వివిధ అంశాలపై రాయడం ఆయన ఆంగ్ల భాషా అధ్యయనం వల్లే జరిగింది. ఆంగ్ల భాషాధ్యయనం వల్లే రాజా రామ్మోహన్ రాయ్ సతీసహగమన దురాచారానికి ఎదురు తిరగగలిగారు. రవీంద్రనాథ్ టాగూర్ శాంతినికేతనం స్థాపించి, నోబెల్ బహుమతి గ్రహీత కాగలిగారు. దీని వెనుక ఇంగ్లిష్ పునరుజ్జీవన ఉద్యమ అధ్యయనం ఉంది. ఇంగ్లిష్ విద్య ఇప్పటి కచ్చిత అవసరమనే విషయం అందరూ తెలుసుకోవాలి. దాన్ని అందిపుచ్చుకుంటూ దళిత బహుజనులు కూడా ఆంగ్లం నేర్చుకుంటుంటే, తెలుగు భాషోద్ధరణ పేరుతో వారికి ఆ అవకాశం లేకుండా చేస్తున్నారు. నిజానికి పోయిన ఐదేళ్ళలో ఆంధ్ర రాష్ట్రంలోని స్కూళ్ళల్లో ప్రాథమిక స్థాయి నుండి ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టిన విధానం ఎంతోమంది దళిత బడుగువర్గాల విద్యార్థుల్లో విద్యాసక్తిని పెంచింది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఇంగ్లిష్‌లో మాట్లాడుతుంటే, చదువుతుంటే ఎంతో ఆనందానికి గురయ్యారు. ఒక సబ్జెక్టుగా తెలుగు అన్ని పాఠశాలల్లో ఉంది. తెలుగును ఆ సబ్జెక్టు నుండి అభివృద్ధి చేయవచ్చును. ప్రతి విద్యార్థికి నూరు పద్యాలు కంఠతా వస్తేనే ఆ విద్యార్థికి పదో తరగతి సర్టిఫికెట్ ఇవ్వండి అని ‘దళిత మహాసభ’ సలహా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు భాషోద్ధరణకు సభలు పెట్టినవాళ్ళే ప్రైవేట్ స్కూళ్ళను, కార్పొరేట్ స్కూళ్ళను నెలకొల్పారు. అందులో రెండవ భాషగా సంస్కృతాన్ని పెట్టి అసలు పిల్లలకు తెలుగే రాకుండా చేశారు. తెలుగు పరిశోధన మీద గొడ్డలి వేటు వేసిన ఈ పాలకులే తెలుగు భాషోద్ధరణకు పూనుకుంటున్నామనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దళిత బహుజన వర్గాలు ఆంగ్ల విద్య నేర్చుకుని వారు కూడా ప్రపంచ దేశాలకు వెళ్ళే అర్హతను సంపా దిస్తారేమో అనే భయం వీరిని వెంటాడుతున్నట్టుంది.ఒకనాటి చంద్రబాబు ప్రభుత్వంలోనే 56 సంస్కృత కళాశాల లను రద్దుచేసి ఆ కళాశాలల్లోని తెలుగు పండితుల పొట్ట కొట్టారు. అన్ని విశ్వవిద్యాలయాల్లో తెలుగు శాఖలను నిర్వీర్యం చేసి తెలుగు భాషా సాహితీ కవితా పరిశోధనల వెన్ను విరిచారు. ఆధిపత్య కులాలు ఏ సబ్జెక్టును చదవడం లేదో గుర్తించి వాటన్నింటినీ నిర్వీర్యం చేశారు. ఒక్క తెలుగునే కాకుండా వృక్షశాస్త్రాన్ని, జంతుశాస్త్రాన్ని, భౌగోళిక శాస్త్రాన్ని, భౌతికశాస్త్రాన్ని, రసాయన శాస్త్రాలను దెబ్బ తీసి ఐటీ సెక్టారుకు ఉపయోగపడే బీటెక్, ఎంటెక్లకే ప్రాధాన్యం ఇచ్చారు. మానవ వ్యక్తిత్వంలోని జీవశక్తిని దెబ్బతీశారు. కుటుంబ సంబంధాలన్నీ నాశనం అయినాయి. తమ సామాజిక వ్యవస్థలను గుర్తించ కుండా దేశం అంతా నాశనం అయిపోయిందని గగ్గోలు పెడు తున్నారు. నిజానికి ఇది స్వీయ వ్యక్తిత్వ దహనం నుండి వస్తున్న ఆక్రోశం. దళిత బహుజనుల వికాసంపైన ద్వేషానలం. ఈ హిపో క్రసీని అర్థం చేసుకోలేనంత అవిద్యలో దళిత బహుజనులు లేరు. ఏ పోరాటానికైనా నిజాయితీ ఉండాలి. అన్ని వర్గాల అభివృద్ధిని, సామాజిక న్యాయాన్ని కాంక్షించాలి. రాజ్యాంగ స్ఫూర్తిని కలిగి ఉండాలి. తమ కులాలే పైకి రావాలి అనేవారు సామాజిక సంస్కర్తలు కాలేరు. ఎంత అత్యున్నతమైన స్థాయికి వెళ్ళినా ఆలో చనల్లో విస్తృతి, సామాజిక విప్లవ భావన లేకపోతే వేదికలు మాత్రమే పెద్దవిగా ఉంటాయి; ఆలోచనలు సంకు చితంగానే కనబడతాయి. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతికి అందరూ సంతాపం తెలపడమే కాక ఆయన తీసుకొచ్చిన ‘సరళీకరణ’ దేశాభివృద్ధిని పొగిడారు. ఈ సరళీ కరణలో దేశ ప్రజలు భాగస్వాములు కావాలంటే ‘ఇంగ్లిష్ విద్య అందరికీ రావాలి’ అనే భావన అందులో దాగివున్న విషయం మరచిపోయారా? కొన్ని సామాజిక వర్గాల్లో సంస్కర్తలు, సామాజిక విప్లవకారులు తగ్గుతున్నారు. కారణం అట్టడుగు వర్గాల జీవన వ్యవస్థల అభివృద్ధే దేశాభి వృద్ధి అని తెలుసుకోలేక పోతున్నారు. మానవ పరిణామశాస్త్రం అన్ని జీవుల్లో మానవజాతే గొప్పదని నిగ్గుతేల్చింది. మౌఖిక జీవన వ్యవస్థలన్నీ లిఖిత జీవన వ్యవస్థలుగా పరిణామం చెందుతున్న దశ ఇది. ప్రపంచమంతా ఒక కుగ్రామంగా మారిపోతోంది. విద్య అనేది జ్ఞానం, సంస్కృతి, నాగరికత, చరిత్ర, ఉత్పత్తి, ఉత్పిత్తి పరికరాలను సృష్టించుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు విస్తరించి ఉన్నారు. ఆయా వృత్తుల్లో ఆ యా జీవన వ్యవస్థల్లో, ఆ యా దేశ పాలనల్లో వీరు భాగస్వాములౌతున్నారు. దానికి ఆంగ్ల విద్య ఎంతో తోడ్పడిందనేది చారిత్రక సత్యం. అందుకే దేశంలో మెజారిటీగా ఉన్న దళిత, బడుగు వర్గాలకు ఆంగ్ల విద్యను నేర్పడం అవసరం. దీనివల్ల వారిలో కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతుంది. అంతిమంగా దేశానికే మేలు కలుగుతుంది. జీడీపీ పెరుగుతుంది. ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుంది. దేశీయ ఎగు మతులు పెరుగుతాయి. ఏ ప్రభుత్వానికైనా పోయిన ప్రభుత్వాల విధానాలనన్నింటినీ రద్దు చేయాలనే భావన మంచిది కాదు. పాలకులు మారుతూఉంటారు. కానీ మంచి విధానాలను ముందుకు తీసుకువెళ్లాలి. ప్రజల్లో ఎంతో చైతన్యం ఉన్న కాలం ఇది. ఇంగ్లిష్ మీడియంపై ప్రభుత్వం చర్య తీసుకొనే పక్షంలో, అన్ని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ళను ఒకే విధానంలోకి తేగలరా? ఒకసారి సామాజిక న్యాయ కోణంలో, దళిత, బహుజనుల మేలును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. ఇంగ్లిష్ భాషా మాధ్యమం ఒక ఉపాధి విప్లవం. తెలుగు భాషాభివృద్ధి ఒక జీవన సంస్కృతి. ఈ రెండింటిని కలిపి తీసుకెళ్ళడమే దళిత బహుజన సామాజిక తాత్విక ఆలోచన క్రమం. ఇది ఫూలే, అంబేడ్కర్ బాట. ఆ బాటలో నడుద్దాం.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 -
ఆంగ్లానికే పట్టం!
సాక్షి, అమరావతి: తెలుగు భాషను గుండెల నిండా నింపుకొని.. ఆంగ్ల మాధ్యమంలో విద్యను అభ్యసిస్తేనే అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత స్థానంలో నిలవగలం. ఈ విషయాన్ని గుర్తించి.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ దిశగా అడుగులు ముందుకు వేయించారు. తెలుగు విద్యార్థులు రానున్న రోజుల్లో ఏ దేశానికి వెళ్లినా అక్కడి వారితో పోటీపడి అవకాశాలను అందిపుచ్చుకోవాలనే సదుద్దేశంతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు.పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి చదువులను అందుబాటులోకి తెచ్చారు. కానీ అదేదో తప్పన్నట్లుగా, ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటే తెలుగు భాషను అవమానించినట్లుగా తప్పుడు వాదనలను తెరపైకి తెచ్చి.. పేద, ధనిక విద్యార్థులనే సామాజిక అంతరాలను తీసుకురావాలని ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకు కొందరు తెలుగు భాషోద్దారకులమనే ముసుగు వేసుకున్న అభివృద్ధి నిరోధకుల సాయం తీసుకుంటోంది.రెండు శతాబ్దాల పోరాటం⇒ మన దేశంలో ఆంగ్ల విద్యకు 205 సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రస్తుతం ఇతర దేశాలతో పాటు మనదేశంలోనూ ఇంగ్లిష్ చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చిన వారికే కార్పొరేట్ సంస్థల ఉద్యోగాల్లో ప్రాధాన్యం లభిస్తోంది. దీనిని ముందే గుర్తించిన విలియం కారీ, రాజా రామ్మోహన్ రాయ్ 1817లో కోల్‌కతాలో (అప్పటి కలకత్తా) మొదటి ఇంగ్లిష్ మీడియం పాఠశాలను ప్రారంభించారు. ⇒ గవర్నర్ జనరల్ విలియం పిట్‌కి రామ్మోహన్ రాయ్ 1823లో రాసిన లేఖలో దేశంలో ఆంగ్ల మాధ్యమంతో ఆధునిక విద్య కోసం తీవ్రంగా వాదించారు. టీబీ మెకాలే 1835లో ఆంగ్ల విద్యా చట్టం ద్వారా ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు. దానిని అప్పటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా విలియం బెంటింక్ ఆమోదించారు. ప్రస్తుతం ఏపీ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలు ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనకు ప్రాధాన్యత ఇస్తున్నాయి.⇒ 1983లో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లిష్‌ను తీసేయడం వల్ల పశ్చిమ బెంగాల్లో యువత ఉద్యోగావకాశాలు దెబ్బతిన్నాయి. ఆ తప్పును ఇప్పుడు సరిదిద్దుతున్నారు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ప్రాథమిక స్థాయి నుంచి అన్ని ప్రాథమిక పాఠశాలల్లో బోధనా మాధ్యమంగా ఆంగ్లాన్ని ప్రవేశపెట్టాయి. పంజాబ్, జమ్మూ, కాశ్మీర్ వంటి రాష్ట్రాలు ఇప్పటికే ప్రాథమిక స్థాయి నుండి ఇంగ్లిష్‌ను బోధనా మాధ్యమంగా అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ ఈ రాష్ట్రాలన్నీ తమ ప్రాంతీయ భాషకు సమాన ప్రాముఖ్యతను ఇస్తున్నాయి.గ్లోబల్ ఎక్స్‌పర్ట్‌గా రాణించాలంటే తప్పదు⇒ ‘ది ఇన్సైట్ పార్ట్నర్స్’ ప్రత్యేక నివేదిక ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 1.75 బిలియన్ల మంది ప్రస్తుతం స్థానిక భాషగా లేదా రెండవ భాషగా ఇంగ్లిష్ మాట్లాడుతున్నారు. మాండరిన్ చైనీస్ మాట్లాడే 1.1 బిలియన్ల కంటే ఇది ఎక్కువ. హిందీ, స్పానిష్ భాషలు మూడు, నాల్గవ స్థానంలో ఉన్నాయి. దీనిని బట్టి ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే అగ్ర భాష ఆంగ్లం అని స్పష్టం అవుతోంది.⇒ యునైటెడ్ కింగ్డమ్లో ఎక్కువ మంది విదేశీ విద్యార్థులు ఇంగ్లిష్‌ను విదేశీ భాషగా నేర్చుకుంటున్నారు. వీరి సంఖ్య గతేడాది దాదాపు 4,19,000. ఆస్ట్రేలియాలో దాదాపు 1,69,000 మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు. అమెరికాలో 1,44,000 మంది విదేశీ విద్యార్థులు ఆంగ్లాన్ని విదేశీ భాషగా చదువుకుంటున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ కమ్యూనికేషన్, బహుళజాతి సంస్థలలో ఉపాధిని పెంచడం, విదేశాల్లో పనిని పొందడం, గ్లోబల్ ఎక్స్‌పర్ట్‌గా వివిధ రంగాలలో నైపుణ్యం పొందడం కోసం యువతకు ఇంగ్లిష్ నేర్చుకోవడం చాలా అవసరం.⇒ రెండు దశాబ్దాలుగా ద్విభాషా, బహుభాషా నైపుణ్యాల అవసరం గణనీయంగా పెరిగింది. ఎయిర్‌బస్, డైమ్లర్–క్రిస్లర్, ఫాస్ట్ రీటైలింగ్, నోకియా, రెనాల్ట్, శామ్సంగ్, శాప్, టెక్నికలర్, బీజింగ్‌లోని మైక్రోసాఫ్ట్ వంటి బహుళజాతి సంస్థలు ‘ఇంగ్లిష్నైజేషన్’ పేరుతో సాధారణ కార్పొరేట్ భాషగా ఆంగ్లాన్ని తప్పనిసరి చేశాయి. దీంతో ప్రపంచ భాషా సేవల పరిశ్రమ మార్కెట్ దాదాపు 55 బిలియన్ డాలర్ల ఆదాయాలనార్జిస్తోందని అంచనా. డిజిటల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ లెర్నింగ్ మార్కెట్ విలువ 2030 నాటికి 15.03 బిలియన్లకు చేరుతుందని భావిస్తున్నారు.వ్యాపార రంగంలో..⇒ వ్యాపారానికి సంబంధించిన ప్రపంచ భాష ఇంగ్లిష్. ప్రపంచంలోనే నంబర్ వన్ ఇంటర్నెట్ సేవల సంస్థగా అవతరించాలనే లక్ష్యంతో జపాన్‌లోని అతిపెద్ద ఆన్లైన్ మార్కెట్ కంపెనీ రకుటెన్ 2010లోనే కంపెనీ వ్యాపార అధికారిక భాషగా ఇంగ్లిష్‌ను మార్చింది. సంస్థలోని జపనీయులంతా ఆంగ్లం నేర్చుకోకుంటే ఉద్యోగాలు వదిలేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. గ్లోబల్ ఎకానమీలో మనుగడకు ఆంగ్లం అవసరమని చెప్పడానికి ఇదో ఉదాహరణ.⇒ ఆస్ట్రేలియాలో దాదాపు 385 మిలియన్ల మంది ఇంగ్లిష్ మాట్లాడుతుంటే, మన దేశంలో ఒక బిలియన్ మంది ఇంగ్లిష్ బాగా తెలిసిన వారున్నారు. ఇంటర్నెట్లో 565 మిలియన్ల మంది ఇంగ్లిష్‌నే ఉపయోగిస్తున్నారనేది మరో అంచనా. \⇒ 1998లో జర్మనీకి చెందిన హోచ్స్ట్, ఫ్రాన్స్‌కు చెందిన రోన్–పౌలెంక్ అతిపెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీ అవెంటిస్ను ప్రారంభించినప్పుడు ఇంగ్లిష్‌నే ఆపరేటింగ్ లాంగ్వేజ్‌గా ఎంచుకున్నాయి. 1990వ దశకంలో ఇటాలియన్ ఉపకరణాల తయారీదారు మెర్లోని, దాని అంతర్జాతీయ ఇమేజ్ను మరింత పెంచుకోవడానికి ఇంగ్లిష్ భాషనే అనుసరించింది. ⇒ కాగా, మన రాష్ట్రంలో కొన్ని శక్తులు పేద, ధనిక వర్గాల మధ్య మరింత అంతరం పెంచి, రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఈ వాస్తవాలన్నింటికీ ముసుగు వేస్తుండటం ఆందోళనకరం. -
Telangana: 'స్మార్ట్'గా సర్కారీ స్కూల్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్నెట్ సదుపాయం, ఆధునిక కంప్యూటర్ వ్యవస్థ, డిజిటల్ లైబ్రరీ, అన్నిటికీ మించి డిజిటల్ విద్యాబోధనకు అనుగుణంగా డిజిటల్ స్క్రీన్లు..తదితర ఏర్పాట్లతో రాష్ట్రంలోని స్కూళ్లను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని విద్యా కమిషన్ భావిస్తోంది. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పెరగాలంటే పెద్ద స్కూళ్ళ ఏర్పాటే మార్గమని స్పష్టం చేస్తోంది. ఈ విధానంతో ప్రైవేటు స్కూళ్ళకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థలను ముందుకు తీసుకెళ్ళొచ్చని అభిప్రాయపడుతోంది. విద్యార్థుల సంఖ్యను బట్టి మండలానికి 2 లేదా 3 స్కూళ్ళు ఉంటే సరిపోతుందని సూచిస్తోంది. విద్యా రంగం సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ వంద రోజులు స్కూళ్ళ నాణ్యతపై అధ్యయనం చేసింది. ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు, స్థానిక ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకుంది. తక్షణమే తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్యలకు సంబంధించిన కొన్ని సిఫారసులతో త్వరలోనే నివేదిక సమర్పించనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు నివేదికలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. స్మార్ట్ విద్యా విధానంతో నాణ్యత: పాఠశాలల్లో ప్రతి సబ్జెక్టుకు సరిపడా టీచర్లు, ప్రయోగశాలలు, విశాలమైన తరగతులు, స్మార్ట్ కిచెన్, మౌలిక వసతులు, ఆట స్థలం ఉండేలా చూడాలి. విద్యార్థులు ప్రత్యక్షంగా చూసి వివిధ అంశాలు నేర్చుకునేందుకు వీలుగా స్టడీ టూర్లు నిర్వహించాలి. తొలిదశలో 3,673 పాఠశాలల్లోని 7,346 తరగతుల్లో తక్షణమే డిజిటల్ స్క్రీన్ ద్వారా బోధన జరగాలి. స్మార్ట్ విద్యా విధానం నాణ్యతను పెంచుతుంది. ఇందుకు కనీసం రూ.300 కోట్లు ఖర్చవుతుంది. ఒక్కో స్కూల్లో 100కు పైగా విద్యార్థులుండాలి పెద్ద స్కూళ్ల నిర్ణయం తీసుకునే ముందు ముఖ్యమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 41,628 ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లున్నాయి. ఇందులో 59 లక్షల మంది చదువుతున్నారు. ప్రభుత్వ స్కూళ్ళు 26,337 ఉంటే, వాటిల్లో 22.63 లక్షల మంది విద్యార్థులున్నారు. 11 వేల ప్రైవేటు స్కూళ్ళల్లో 34 లక్షల మందికి పైగా ఉన్నారు. ప్రైవేటు స్కూళ్ళు కూడా ఊరూరా లేవు. మండలంలోనూ ఒకటికి మించి ఉండటం లేదు. వీటిల్లో కనిష్టంగా 500, గరిష్టంగా 4 వేల మంది విద్యార్థులుంటున్నారు. కానీ రాష్ట్రంలోని 1,800 ప్రభుత్వ స్కూళ్ళల్లో అసలు అడ్మిషన్లే లేవు. 8,782 స్కూళ్ళల్లో 30కి మించి విద్యార్థులు లేరు. ఇందులో ప్రాథమిక పాఠశాలలే 8 వేలకుపైగా ఉన్నాయి. 10 వేల స్కూళ్ళల్లో 100 మందికి మించి లేరు. 5,800 స్కూళ్ళల్లో ఒకే ఉపాధ్యాయుడు ఐదు తరగతులకు బోధించే పరిస్థితి ఉంది. నిబంధనల ప్రకారం ప్రతి 30 మందికి ఒక టీచర్ ఉండాలి. కానీ ఇటీవల బదిలీలు, పదోన్నతుల నేపథ్యంలో 20 మందికి ఒక టీచర్ ఉండాలనే నిబంధన తెచ్చారు. అయినప్పటికీ గత ఏడాది కన్నా ఈ సంవత్సరం 1.62 లక్షల ప్రవేశాలు తగ్గాయి. ఈ నేపథ్యంలో ఒక్కో స్కూల్లో కనీసం వందకు పైగా విద్యార్థులు ఉండేలా చూడాలనేది మెజారిటీ అభిప్రాయంగా ఉంది. దీనిని పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రంలో పది వేల స్కూళ్ళను ఆయా మండలాల పరిధిలో విలీనం చేయవచ్చు. ఉచిత రవాణా వ్యవస్థ అవసరం గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులను ప్రైవేటు యాజమాన్యాలు సులభంగా దూరంలో ఉన్న తమ స్కూళ్ళకు తీసుకెళ్తున్నాయి. ఇందుకోసం బస్సులు, ఆటోలు, వ్యాన్లు ఉపయోగిస్తున్నాయి. ఇదే తరహాలో ప్రభుత్వ స్కూళ్ళకు ఉచిత రవాణా వ్యవస్థ ఉండాలి. సూదూర ప్రాంతాలకు విద్యార్థులను పంపేందుకు 92 శాతం గ్రామీణ ప్రాంతాల తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నట్టు మా అభిప్రాయ సేకరణలో తేలింది. అయితే రవాణా సౌకర్యం కోసం ఖర్చు పెట్టేందుకు వాళ్ళు సిద్ధంగా లేరు. అందువల్ల ప్రభుత్వం ఉచితంగా ఈ సౌకర్యం కల్పిస్తే ప్రభుత్వ స్కూళ్ళ వైపే మొగ్గు చూపుతారు. -
ఇంగ్లిష్‌పై ‘తీర్పు’ వివక్షాపూరితం!
విజయవాడలో జరిగిన మొన్నటి ప్రపంచ తెలుగు రచయితల మహాసభలలో జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో గత ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించడమే కాక, తత్సంబంధ జీవో నం.85ను రద్దు చేయాలని కూడా ప్రస్తుత ప్రభుత్వాన్ని కోరడం ఏ కోణం నుండి చూసినా సమంజసనీయమైనది కాదు. గౌరవ నీయ సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయ మూర్తిగా ఆయనకిది ఏమాత్రం తగినట్లుగా లేదు. అందుకే ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. మోదీ ప్రభుత్వం తెచ్చిన నూతన విద్యా విధానంలో 8వ తరగతి వరకు మాతృభాషా మాధ్యమాలలోనే విద్య నేర్పాలని సూచించారు. అయితే నేటి పోటీ ప్రపంచంలో దీని అమలు అసాధ్యమని తెలిసినప్పటికీ, జస్టిస్ రమణ దీనిని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని ఎక్కడా కోరలేదు. కానీ స్వరాష్ట్రానికి వచ్చేటప్పటికి తెలుగు మాధ్యమానికి మాత్రమే, అందునా ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే తెలుగు మాధ్యమానికి తావివ్వాలని మాట్లాడుతున్నారు!ప్రైవేట్ స్కూళ్లలో కూడా తెలుగు మీడియం ప్రవేశపెట్టాలని నామమాత్రంగానైనా ఆయన ఎందుకు అడగటం లేదు? అంటే సంపన్నుల పిల్లలకు ఒక న్యాయం, పేద దళిత గ్రామీణ పిల్లలకు మరొక న్యాయం! ఇదేనా ఎవరైనా ఇవ్వవలసిన ‘తీర్పు’? ఇంగ్లిష్ మీడియంతో ప్రైవేట్ విద్యారంగం కళకళలాడాలనీ, కేవలం తెలుగు మీడియంతో నడిచే ప్రభుత్వ పాఠశాలలు వెలవెల పోవాలనీ; ‘ప్రభుత్వం వేస్ట్.. ప్రైవేట్ రంగం బెస్ట్’ అనీ... ఆయన, ఆయన వెనుక ఉన్న రాజకీయ నేతల ఉద్దేశంలా కనిపిస్తోంది.మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేస్తూ తెలుగు భాషపై ప్రేమ వెలిబుచ్చుతూ ఉంటారు. వీరి పిల్లలందరూ ఇంగ్లిష్ మీడియంలోనే చదవాలి! విదేశాలకు వెళ్లి వచ్చి, గొప్పగా సంపాదించుకోవాలి. కానీ పేదవాళ్లకు మాత్రం ఆ అవకాశం ఇవ్వకూడదు, వాళ్లు రాష్ట్రం దాటి వెళ్లకూడదు.జగన్ సంస్కరణలు చరిత్రాత్మకం గత ఐదేళ్లలో జగన్ దేశంలోకెల్లా అత్యధికంగా పాలనలో, పలు రంగాలలో, ముఖ్యంగా విద్యారంగంలో అద్భుతమైన సంస్కరణలు తెచ్చి చరిత్రకెక్కారు. రాజకీయంగా జగన్ మోహన్‌రెడ్డితో విభేదిస్తే, రాజకీయంగానే ఎదుర్కోవాలి తప్ప, ఆయన మీది ద్వేషంతో ఆయన ప్రవేశపెట్టిన అన్ని పథకాలను రద్దు చేస్తూ పోవడం ఏమాత్రం సమంజసం కాకపోగా విపరిణామాలకు దారి తీస్తుంది.ద్విభాషా పాఠ్యపుస్తకాలను, ఇంగ్లిష్–తెలుగు నిఘంటువులను ఇచ్చినప్పటికీ, ఏ మీడియంలోనైనా చదువుకునే, పరీక్ష రాసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ, 90 శాతం తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంగ్లిష్ మీడియంనే కోరుకున్నప్పటికీ, లక్షలాదిగా ఉన్న వారి అభీష్టానికి, హక్కుకు వ్యతిరేకంగా ఈ న్యాయమూర్తి ఇలా మాట్లాడటం సరైనది కాదు. ఆయన మాట విని, ఆంగ్ల మాధ్యమంలో 9వ తరగతి వరకు వచ్చిన విద్యార్థులను నట్టేట ముంచి, తిరోగమన దిశలోకి మరల్చడం చంద్రబాబు చారిత్రక తప్పిదంగా నిలిచిపోతుంది.దీనికి బదులు, తెలుగు భాషపై తెలుగు మాధ్యమంపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే, ఆంగ్ల మాధ్యమాన్ని కొనసా గిస్తూనే, కేజీ టు పీజీ తెలుగు మాధ్యమ బోధనా విద్యాసంస్థలను సమాంతరంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున ప్రత్యే కంగా ఏర్పాటు చేసి, వారికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధులలో రిజర్వేషన్ కల్పించాలని కోరడం సముచితంగా ఉంటుంది. స్థానిక ప్రభుత్వాలు స్థానిక ప్రజల భాష లోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలని, న్యాయస్థానాలు ప్రజల భాషలోనే తీర్పులు ఇవ్వాలని ఆదేశిస్తే, నిర్దేశిత రాజ్యాంగ ఆశయాలు కూడా తద్వారా నెరవేరుతాయి.ఇలాంటి విశాల దృక్పథంతో ఆంగ్ల లేక తెలుగు మాధ్యమ అంశాలను పరిశీలించినప్పుడే ఆమోదయోగ్యమైన పరిష్కారం దొరుకుతుంది. అలా కాని పక్షంలో ఎన్నో వేల ఏళ్లుగా వివక్షకు గురైన అట్టడుగు పేద బడుగు వర్గాల నుండి ప్రతిఘటనను, ఇంగ్లిష్ మీడియం పరి రక్షణ ఉద్యమాలను కూటమి పాలకులు ఎదుర్కోవలసి వస్తుంది. ఈదర గోపీచంద్ వ్యాసకర్త సామాజిక ఉద్యమ కార్యకర్తమొబైల్: 94403 45494 -
1000 CBSE ప్రభుత్వ స్కూళ్లు రద్దు.. అవి ధనవంతులకు మాత్రమే..
-
ఇంగ్లీష్ మీడియం మన పిల్లలకే..'పేద బిడ్డలకు తెలుగే'
సాక్షి, అమరావతి: కాలానుగుణంగా చదువుల తీరు తెన్నులు మారిపోతున్నాయి! పోటీ ప్రపంచంలో మెరుగ్గా రాణించేందుకు రాష్ట్రంలో 95 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్యనే బలంగా కోరుకుంటున్నారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షిస్తున్నారు. ఆర్ధికంగా భారమైనప్పటికీ ప్రైవేట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంలో చదివించేందుకు సిద్ధపడుతున్నారు. పేదింటి తల్లిదండ్రుల ఆరాటం, పిల్లల ప్రతిభను గుర్తించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ విద్యా రంగాన్ని సమున్నతంగా మార్చాలని తపన పడ్డారు. మునుపెన్నడూ చూడని విద్యా సంస్కరణలు తెచ్చారు. విద్యా బోధనలో ఆధునిక పోకడలను అందిపుచ్చుకోకుండా మూస విధానాలతో వ్యవహరిస్తే భవిష్యత్తు తరాలకు అంతులేని నష్టం జరుగుతుందని గుర్తించారు. పేద కుటుంబాల్లో మరో తరం అణగారిపోకుండా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే పేద విద్యార్థులు ఎక్కువగా చదివే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం బోధనను ప్రవేశపెట్టారు. ఓ మేనమామలా అడుగడుగునా వారి చదువులకు అండగా నిలిచారు. ఐరాస వేదికపై మన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటేలా వెన్నుతట్టి ప్రోత్సహించారు. విద్యారంగ సంస్కరణల కోసం ఐదేళ్లలో ఏకంగా రూ.72,919 కోట్లు వెచ్చించారు. కానీ విద్యా సంస్కరణలను నిర్వీర్యం చేసి నీరుగారుస్తున్న కూటమి సర్కారు ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం బోధనను నీరుగారుస్తూ పేదింటి పిల్లలపై పగ సాధిస్తోంది. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు, భాషా వికాసం, మేధావుల ముసుగులో పేద విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమాన్ని దూరం చేసే కుట్రలు మరోసారి తెరపైకి వచ్చాయి. మరి ఈ ప్రముఖులు వారి పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లను ఏ మీడియంలో ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తున్నారు? ఏ ఒక్కరైనా తెలుగు మాధ్యమంలో చదివిస్తున్నారా? పిల్లల్లో బలమైన ఆసక్తి.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో అత్యధిక శాతం ఇంగ్లీష్ మీడియంలోనే చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు. పరీక్షలు సైతం ఆంగ్లంలోనే రాస్తూ తమ నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఆరాట పడుతున్నారు. గతేడాది 9వ తరగతి వరకు నిర్వహించిన అన్ని పరీక్షలను ఇంగ్లీష్ మీడియంలోనే పూర్తి చేశారు. మూడు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థుల్లో 91.33 శాతం మంది పరీక్షలను ఇంగ్లీష్ మీడియంలోనే పూర్తి చేయడం ఒక ఎత్తయితే, ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం చదివే విద్యార్థుల్లో దాదాపు 2.20 లక్షల మంది ఇంగ్లీష్ మీడియంలోనే పరీక్షలు రాయడం.. 1.94 లక్షల మంది ఉత్తీర్ణత సాధించడం మరో ఎత్తు. తద్వారా పిల్లలు ఇంగ్లీష్ మీడియంను ఎంత బలంగా కోరుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. ఏటా ఒక్కో తరగతి చొప్పున పెంచుకుంటూ.. ‘దేశంలో పేదరికం పోవాలంటే విద్యతోనే సాధ్యం. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంటే అది చదువొక్కటే. పేదింటి బిడ్డలకు నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వం బాధ్యత. పిల్లలు అంతర్జాతీయ అవకాశాలను అందుకోవాలంటే అది ఇంగ్లీష్ చదువులతోనే సాధ్యమవుతుంది..’ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పలు సందర్భాల్లో చెప్పిన మాటలివీ! అందుకు అనుగుణంగానే ఆయన 2020–21లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం సిలబస్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఏటా ఒక్కో తరగతి చొప్పున పెంచుకుంటూ 2024–25 నాటికి టెన్త్ని కూడా ఇంగ్లీష్ మీడియంలోకి మార్చేలా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో దేశంలోనే తొలిసారిగా విద్యార్థులకు బైలింగ్వుల్ పాఠ్యపుస్తకాలు (మిర్రర్ ఇమేజ్), ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పిక్టోరియల్ డిక్షనరీ, ఉన్నత తరగతులకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీని అందించి ప్రోత్సహించారు. దీంతో ప్రభుత్వ రంగంలో దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో విద్యనందించే రాష్ట్రంగా, దక్షిణాదిలో ఇంగ్లీష్ మీడియం అమలు టాప్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవడం గమనార్హం. 38.50 లక్షల మంది ఇంగ్లీష్ మీడియంలోనేవైఎస్సార్ సీపీ ప్రభుత్వం తెచ్చిన విద్యా సంస్కరణలతో 2023 – 24లో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థుల చేరికలు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 1,50,005 అధికంగా నమోదయ్యాయి. గత విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 43 లక్షల మంది విద్యార్థులు ఉండగా వారిలో 38.50 లక్షల మంది ఇంగ్లీష్ మీడియంలోనే పరీక్షలు రాశారు. 2023–24 పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు టాప్ మార్కులు సాధించి ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకు సవాల్ విసిరారు. ఇంగ్లీష్ మీడియంలో పరీక్షలు రాసి 590కి పైగా మార్కులు సొంతం చేసుకున్నారు. గతేడాది పదో తరగతి పరీక్ష ఫలితాలకు సంబంధించి టాప్ 28 మంది విద్యార్థుల్లో 26 మంది ప్రభుత్వ స్కూళ్లలో చదివి బైలింగ్వుల్ పాఠ్య పుస్తకాల సహాయంతో ఇంగ్లీష్ మీడియంలో పరీక్షలు రాసి 590 నుంచి 594 వరకు మార్కులు సాధించడం గమనార్హం. జగనన్న ఆణిముత్యాలు పేరుతో ప్రతిభావంతులైన విద్యార్థులను గత ప్రభుత్వం సత్కరించి ప్రోత్సహించింది. ఇంగ్లీష్ మీడియంలో కేరళను దాటిన ఏపీ నేషనల్ అచీవ్మెంట్ సర్వే (ఎన్ఏఎస్) 2023లో ఇంగ్లీష్ మీడియం అమలులో ఆంధ్రప్రదేశ్ దక్షిణాది రాష్ట్రాల్లో టాప్‌లో నిలిచింది. ఈమేరకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియం అమలు తీరుపై కేంద్ర ప్రభుత్వం సర్వే నిర్వహించింది. ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న 3, 6, 9 తరగతుల విద్యార్థులను పరీక్షించి సర్వే చేపట్టారు. సర్వేలో జాతీయ సగటు 37.03 శాతంగా ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో 84.11 శాతంగా నమోదు కావడం గమనార్హం. కేరళ, కర్ణాటక, తమిళనాడు కంటే ఏపీ మెరుగైన స్థానంలో నిలిచింది. ప్రైవేట్ స్కూళ్లకు 2 లక్షల మంది విద్యార్థులు వైఎస్ జగన్‌పై కోపంతో ఆయన తెచ్చిన విద్యా సంస్కరణలను సీఎం చంద్రబాబు ఒకొక్కటిగా నిర్వీర్యం చేస్తున్నారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే టోఫెల్‌ను రద్దు చేశారు. అనంతరం విద్యార్థుల్లో ప్రమాణాలు లేవంటూ 1,000 సీబీఎస్ఈ స్కూళ్లను రద్దు చేశారు. సబ్జెక్టు టీచర్లను తొలగించారు. వచ్చే జూన్ నుంచి అమల్లోకి రావాల్సిన ఐబీ విద్యను కూడా రద్దు చేశారు. పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియం చదువులను నీరుగార్చారు. 2024–25 విద్యా సంవత్సరంలో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లిపోవడం రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఎలా నీరుగారుతోందో చెప్పేందుకు నిదర్శనం. 95% తల్లిదండ్రుల కోరిక ఇంగ్లీష్ మీడియంరాష్ట్రంలో 2019కి ముందు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం మాత్రమే అందుబాటులో ఉంది. అయితే తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్యను బలంగా కోరుకున్నారు. అది ప్రభుత్వ స్కూళ్లలో లేకపోవడంతో ఏటా విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి ప్రైవేట్ బాట పట్టారు. దీంతో దాదాపు 1,785 ప్రభుత్వ పాఠశాలలు వివిధ దశల్లో మూతబడ్డాయి. ఈ నేపథ్యంలోప్రభుత్వ పాఠశాలల పరిస్థితులపై అధ్యయనం నిర్వహించిన జగన్ ప్రభుత్వం తల్లిదండ్రుల అభిప్రాయాలను సైతం సేకరించింది. రాష్ట్రంలో 95 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్యను కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఫీజులు ఆర్ధికంగా భారమైనా పిల్లల భవిష్యత్ దృష్ట్యా ప్రైవేట్ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంలో చదివిస్తున్నట్లు చెప్పారు. సర్కారు స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం లేకపోవడంతో మరో దారి కానరాక ప్రైవేట్‌లో చేర్చినట్లు వాపోయారు. ఈ క్రమంలో పిల్లలు, తల్లిదండ్రుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ రేపటి పౌరుల ఉజ్వల భవిష్యత్తు దిశగా జగన్ ప్రభుత్వం విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టింది. పేదింటి పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీ పడేందుకు వీలుగా 2020–21లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను అమల్లోకి తెచ్చింది. తొలుత ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టగా 2021–22లో ఏడో తరగతి, 2022–23లో ఎనిమిదో తరగతి, 2023–24లో తొమ్మిదో తరగతికి అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వ స్కూళ్లపై పెరిగిన నమ్మకం మనబడి నాడు–నేడు ద్వారా 45 వేల ప్రభుత్వ పాఠశాలలను అన్ని సదుపాయాలతో సదుపాయాలతో సమూలంగా తీర్చిదిద్దే బృహత్తర పథకాన్ని వైఎస్ జగన్ చేపట్టారు. 2019–20లో 15,713 పాఠశాలల్లో రూ.3,669 కోట్లతో కార్పొరేట్‌కు దీటుగా అన్ని సదుపాయాలను కల్పించారు. రెండో విడతలో రూ.8 వేల కోట్లతో 22,344 పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. డ్రాపౌట్స్‌ను అరికట్టడం, పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదనే లక్ష్యంతో 42.62 లక్షల మంది తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15 వేల చొప్పున జగనన్న అమ్మఒడి కింద నేరుగా నగదు జమ చేశారు. ఒక్క అమ్మ ఒడి ద్వారానే రూ.26 వేల కోట్లకుపైగా అందించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థపై తల్లిదండ్రులకు నమ్మకాన్ని కలిగించారు. ఇక విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో 2020 జనవరి 1న జగనన్న గోరుముద్ద పథకానికి శ్రీకారం చుట్టారు. రోజుకో రుచికరమైన మెనూతో 16 రకాల పదార్థాలు, ఫోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యంతో ఆహారాన్ని అందచేశారు. గోరుముద్దపై పర్యవేక్షణకు ప్రత్యేకంగా యాప్‌ని అందుబాటులోకి తెచ్చారు. గతంలో టీడీపీ హయాంలో మధ్యాహ్న భోజనం కోసం ఏటా రూ.450 కోట్లు ఖర్చు చేయగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏటా రూ.1,400 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.6,995.34 కోట్లు వెచ్చించింది.మేధావుల్లారా ఆలోచించండి రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం రద్దు చేయాలని తెలుగు రచయితల మహాసభల్లో వక్తలు, మేధావులు డిమాండ్ చేశారు. కానీ రాష్ట్రంలోని 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో బడుగు బలహీన వర్గాలకు చెందిన దాదాపు 40 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. ప్రభుత్వానికి తెలుగు భాషపై నిజంగా ప్రేమ ఉంటే ప్రతి గ్రామం, పట్టణంలో ఒకేచోట తెలుగు, ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు ఏర్పాటు చేయాలి. ఎవరికి ఏ మీడియం కావాలంటే అందులో చేరుతారు. కార్పొరేట్ విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని రద్దు చేసి పేద విద్యార్థులకు అన్యాయం తలపెట్టవద్దు. – ఎస్.రామకృష్ణ, పురపాలక టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడుమీ పిల్లలు ఎక్కడ చదివారు?.. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో పాల్గొన్న న్యాయ కోవిదులు, రాజకీయ నాయకులు, రచయితలు మూకుమ్మడిగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేసే జీవో 85ను రద్దు చేయాలని కోరడం అత్యంత దుర్మార్గం. వారిలో ఏమాత్రం మానవత్వం ఉన్నా ఇంగ్లీష్‌తోపాటు తెలుగు మాధ్యమాన్ని కూడా కొనసాగించాలని పాలకులపై ఒత్తిడి తేవాలి. మహాసభలో పాల్గొన్న న్యాయ కోవిదుల పిల్లలు, రాజకీయ నేతల పిల్లలు, తెలుగు భాషా రచయితల పిల్లలు ఏ మాధ్యమంలో చదివారో.. ప్రస్తుతం ఏ దేశాల్లో ఉంటున్నారో ప్రజలకు తెలియజేస్తే బాగుంటుంది. – బి.మనోజ్‌కుమార్, రమేష్, బహుజన టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులుఏపీలో విద్యా విప్లవాన్ని మళ్లీ వెనక్కి తీప్పాలనే..⇒ తెలుగు మీడియంలో చదివి కష్టపడి న్యాయవాద డిగ్రీ సంపాదించిన యువ లాయర్లు ఇప్పుడు కోర్టుల్లో చాలామంది ఉన్నారు. వారికి చట్టాలపై ఎంత పట్టు ఉన్నా ఇంగ్లీష్‌లో సమర్థంగా వాదించే నైపుణ్యం లేక ఎంత డిప్రెషన్‌కు గురవుతున్నారో నేను చూశా. ⇒ ‘ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్’ అంటున్న తెలుగు భాషకు సివిల్ సర్వీస్‌లో ప్రశ్నాపత్రం లేని గతి ఎందుకున్నది? తెలుగు భాషలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ పరీక్ష రాసిన బీద విద్యార్థులు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? ⇒ కర్ణాటకలో ప్రైవేట్ స్కూళ్లను కన్నడలో బోధించాలని జీవో ఇచ్చినప్పుడు తమ పిల్లల్ని ఏ భాషలో చదివించాలో నిర్ణయించే హక్కు తల్లిదండ్రుల ఫండమెంటల్ రైట్ అని సుప్రీం కోర్టే చెప్పింది కదా! ⇒ చంద్రబాబు ప్రభుత్వం.. ప్రభుత్వ స్కూళ్లను పూర్తిగా తెలుగు మీడియంలోకి మార్చమంటోంది. ఆయన మనవడు ఏ భాష స్కూలులో చదివి ఇప్పుడు అంతర్జాతీయ చెస్ ఛాంపియన్ కాబోతున్నాడు? ⇒ మేధావులకు తెలుగుపట్ల ప్రేమ ఉంటే ప్రపంచ భాషల్లోకి అనువదించి నోబెల్ ప్రైజ్ పొందే పుస్తకాలు రాయాలిగానీ దిక్కులేని ప్రజల జీవితాల్లో మట్టి పొయ్యడానికి సిద్ధాంతాలు అల్లకూడదు కదా! ⇒ ప్రపంచ రచయితల మహాసభల్లో తెలుగులో ప్రపంచ గుర్తింపు పొందగల పుస్తకాలను ఎలా రాయాలో లేదా రచించాలో చర్చించాలి గానీ ప్రభుత్వ స్కూళ్లను తెలుగు మీడియంలోకి మార్చే అంశాన్ని కాదు గదా! ⇒ ఆంధ్రప్రదేశ్‌లో మొదలైన విద్యా విప్లవాన్ని మళ్ళీ వెనక్కి తిప్పాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది కేవలం జస్టిస్ రమణ అభిప్రాయం మాత్రమే అనుకోవడానికి లేదు. చంద్రబాబు ఆలోచనకు ఆయన ఒక ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ ప్రారంభించాడు. ⇒ ఇప్పటికే ఈ ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని ఆపేసింది. స్కూళ్ల అభివృద్ధి కోసం చేసుకున్న అంతర్జాతీయ అగ్రిమెంట్లన్నీ నిలిపివేశారు. ⇒ ఇంగ్లీష్ విద్యను ప్రభుత్వ స్కూళ్లలో కాపాడుకునే ఉద్యమాలు గ్రామీణ స్థాయిలో మొదలైతే గానీ అది బతకదు. పోరాటం చేస్తేగానీ ఈ తిరోగమన రథ చక్రం ఆగదు. – ప్రొఫెసర్ కంచ ఐలయ్య, సామాజిక విశ్లేషకుడు, ప్రముఖ రచయిత -
కూటమి పాలనలో చెదిరిన చదువులు
ఐక్యరాజ్య సమితి వరకు వినిపించిన ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రగతి ఆర్నెల్లలోనే గాడి తప్పింది! గత ఐదేళ్లూ మహోన్నతంగా విలసిల్లిన సర్కారు స్కూళ్లు మళ్లీ అద్వానంగా మారాయి. పిల్లల మధ్యాహ్నం భోజనం నాణ్యతను పరీక్షించే నాథుడే లేరు. సదుపాయాలు, ప్రమాణాలు దిగజారి దయనీయంగా కనిపిస్తున్నాయి. ‘మెగా పేరెంట్స్ డే’ పేరుతో కూటమి ప్రభుత్వం ఈ నెల 7వ తేదీన ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులతో ఓ సమావేశాన్ని నిర్వహించి ఒక్క రోజు హడావుడి చేసింది. ఈ కార్యక్రమం ‘గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు’లో లిఖించదగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మరి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో నిజంగా బోధన ఎలా ఉంది? ఎలాంటి సదుపాయాలున్నాయి? మన విద్యా వ్యవస్థ నాడు – నేడు ఎలా ఉంది? విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు ‘సాక్షి’ ప్రతినిధుల బృందం రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ప్రభుత్వ స్కూళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించింది.మొగిలి రవివర్మ – సాక్షి ప్రతినిధి కర్నూలుకూటమి అధికారంలోకి వచి్చన తర్వాత కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అధ్వానంగా మారింది.⇒ కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం ముడుమాల జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులు చెట్ల కిందే కూర్చుని పాఠాలువింటున్నారు. కొంత మంది అసంపూర్తిగా నిలిచిపోయిన గదుల్లో ఇసుక, మట్టిపై కూర్చుని కనిపించారు. బ్లాక్ బోర్డును ఇటుకలపై అమర్చి బోధిస్తున్నారు. 12 తరగతి గదుల నిర్మాణాన్ని మధ్యలో నిలిపేశారు. రూ.46.99 లక్షలు నిధులున్నా, వాటిని పూర్తి చేసే వారు లేరు. సంగాల ఉన్నత పాఠశాల భవనాలను మధ్యలోనే నిలిపేశారు. నాగులదిన్నె, నందవరంతో పాటు జడ్పీ హైస్కూలు భవనాల నిర్మాణం ఆగిపోయింది. ప్రభుత్వం మారడంతో పనులు నిలిపివేసింది.⇒ నందవరం మండలం నాగులదిన్నె స్కూలులో తాగేందుకు మంచినీరు లేక ట్యాంకుల్లో నింపిన నీటినే పిల్లలు తాగుతున్నారు.⇒ కర్నూలులో స్టాంటన్‌పురం నుంచి ఎమ్మిగనూరు వరకు ఏ స్కూల్లో చూసినా మరుగుదొడ్లలో దుర్గంధమే.⇒ చాలా స్కూళ్లలో మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉంది. చాలా మంది పిల్లలకు బూట్లు లేవు. చెప్పులు, ఒట్టి కాళ్లతో బడికి వచ్చారు.⇒ కర్నూలు రూరల్ మండలం కోడుమూరు నియోజకవర్గం సుంకేసుల ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాల భవనాలు, ప్రహరీ, కిచెన్ నిర్మాణాలను మధ్యలోనే నిలిపివేశారు. కాలనీలో నిరుపేద మహిళలను పలుకరించగా.. ‘సార్! మాలాంటోళ్లకు అమ్మ ఒడితో ఎంతో మేలు జరిగింది. ఇప్పుడు ‘తల్లికి వందనం’ అంటూ ఎంతమంది ఉంటే అంతమందికి రూ.15 వేలు ఇస్తామన్నారు. మరి ఎక్కడిచ్చారు?’ అంటూ మహిళలు శిరోమణి, స్వరూప, మహేశ్వరి నిర్వేదం వ్యక్తం చేశారు.అమ్మ ఒడి లేదు.. నీడనిచ్చే హాస్టళ్లూ లేవు..!కర్నూలు జిల్లా కోసిగి మండలం పల్లెపాడు హైస్కూలులో 608 మంది విద్యార్థులు చదువుతుండగా 160 మంది మాత్రమే బడికి వస్తున్నారు. మిగిలిన వారంతా తల్లిదండ్రులతో కలసి ఉపాధి కోసం వలస వెళ్లారు. గతంలో తల్లిదండ్రులు వలస వెళ్లినా పిల్లలు సీజనల్ హాస్టళ్లలో ఉంటూ చదువుకునేవారు. ఇప్పుడు డిసెంబర్ వచ్చినా సీజనల్ హాస్టళ్లు ఏర్పాటు చేయకపోవడంతో తల్లిదండ్రులతో కలసి పనుల కోసం పిల్లలు ఊరు విడిచి వెళ్లారు. అమ్మ ఒడి కూడా అందకపోవడంతో కష్టజీవులు తమ పిల్లలను చదివించుకునే పరిస్థితి లేకుండా పోయింది.బడి వదిలి.. పొలం బాట .. సి.బెళగల్ మండలం ఈర్లదిన్నెలో శేఖర్ అనే విద్యార్థి స్కూలుకు వెళ్లకుండా తండ్రి ఈశ్వర్‌తో కలిసి పొలంలో గడ్డివామి వేస్తున్నాడు. అదే గ్రామంలో సందేశ్, జీవన్ అనే మరో ఇద్దరు చిన్నారులు కూడా తల్లి ప్రవీణతో కలసి మొక్కజొన్నకు మందు పిచికారీ చేస్తున్నారు. ‘అమ్మ ఒడి డబ్బులు వస్తే పిల్లల ఖర్చులకు ఉపయోగప డేవి. ఇప్పుడు ఇవ్వట్లేదు కదా సార్! ఏదో వీళ్లు పనికి వస్తే కూలీ డబ్బులైనా మిగులుతాయి’ అని తల్లిదండ్రులు చెబుతున్నారు.అమ్మ ఒడి లేక డ్రాపౌట్స్!బిజివేముల రమణారెడ్డి – సాక్షి ప్రతినిధి, బాపట్లబాపట్ల జిల్లాలోని తీర ప్రాంతంలో ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందక పేద పిల్లలు పాఠశాలలకు దూరమవుతున్నారు. డ్రాపౌట్స్ పెరిగిపోతున్నారు. ఈ ఏడాది ఇంకా చాలా మందికి యూనిఫాం, బూట్లు, ఇతర వస్తువులు అందలేదు... అని చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలం అక్కాయిపాలెం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చెప్పారు. అమ్మ ఒడి అందకపోవడంతో ఈ పాఠశాలలో 23 మంది విద్యార్థులు తగ్గిపోయినట్లు ఓ ఉపాధ్యాయుడు తెలిపారు. ⇒ చంద్రబాబు ప్రభుత్వం అమ్మ ఒడి ఇవ్వక పోవడంతో ఇద్దరు పిల్లలను చదివించడం భారంగా ఉందని సముద్ర తీర ప్రాంతం వాడరేవుకు చెందిన మత్స్యకారుడు శ్రీను ఆవేదన వ్యక్తం చేశాడు. అమ్మ ఒడి రాక తమ పిల్లలను బడి మానిపించినట్లు మహిళలు సురేఖ, కుమారి తెలిపారు. అమ్మ ఒడి, ఇంగ్లీష్ మీడియం చదువులు లేనప్పుడు ఇక పిల్లలను బడికి పంపడం ఎందుకు సారూ.. అని మత్స్యకార మహిళ అక్ష ప్రశ్నించింది. ఓడరేవు ఉన్నత పాఠశాలలో గత ప్రభుత్వ హయాంలో మొదలైన భవన నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోవడంతో విద్యార్థులు ఆరు బయట ఇసుకలో చదువుకుంటూ కనిపించారు. ⇒ చినగంజాం మండలం అడవి వీధిపాలెం ఉన్నత పాఠశాలను పరిశీలించేందుకు ఉపాధ్యాయులు అనుమతి నిరాకరించి గేటుకు తాళం వేశారు. నాసిరకం బియ్యం, టమాటా చారుతో పెడుతున్న మధ్యాహ్న భోజనాన్ని పిల్లలు తినడం లేదని, చాలామంది ఇంటి నుంచే భోజనం తెచ్చుకుంటున్నారని అనూష అనే మహిళ తెలిపింది. తాగడానికి మంచినీళ్లు కూడా అందుబాటులో లేవని, మరుగుదొడ్లు శుభ్రంగా లేవని విద్యార్థులు చెప్పారు. జిల్లాలో సుమారు రూ.350 కోట్ల విలువైన నాడు–నేడు పనులు మధ్యలోనే ఆగిపోవడంతో నిర్మాణాలు నిలిచిపోయాయి.తడికెల బడి.. కర్నూలులోని స్టాంటన్‌పురం జడ్పీ హైస్కూల్లో అంగన్వాడీ నుంచి పదో తరగతి వరకూ ఒకటే బడి. ‘నాడు–నేడు’ కింద మంజూరైన నిధులున్నా భవన నిర్మాణ పనులు ఆగిపోయాయి. దీంతో టీచర్లు చందాలు వేసుకుని తడికెలు సమకూర్చుకుని అందులోనే పిల్లలకు చదువు చెబుతున్నారు. ఆర్నెల్లలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఏ స్థాయికి దిగజారిపోయిందో చెప్పేందుకు ఇవి సరిపోవా?శ్రీకాకుళం జిల్లా ఆనందపురం యూపీ స్కూల్లో నిరూపయోగంగా మారిన వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్ నిర్వహణ అస్తవ్యస్తంకందుల శివశంకర్ – సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం, శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మూత్రశాలలు, మరుగుదొడ్లకు రన్నింగ్ వాటర్ లేక విద్యార్థులు అవస్థ పడుతున్నారు. రణస్థలం మండలం పైడి భీమవరం హైస్కూల్లో వాష్బేసిన్లు, మూత్రశాలలు నీటి సదుపాయం లేక వెక్కిరిస్తున్నాయి. టెక్కలి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక చాలా చోట్ల పాఠశాలల భవనాలు ప్రారంభించేందుకు సిద్ధమైనా వాటిని పట్టించుకునే నాధుడు లేరు. భవనాల్లో అమర్చాల్సిన తలుపులు, కిటికీలు, ఇతర సామగ్రిని పాఠశాలల్లోని స్టోర్ రూమ్‌లో పడేశారు. ఈ పనుల కోసం ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నామని రణస్థలం మండలానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.⇒ పాఠశాలల్లో తాగునీటి ఆర్వో ప్లాంట్లు నిర్వహణ లోపంతో పని చేయడం లేదు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం పెట్టడం లేదు. చాలా చోట్ల ఆరు బయట అపరిశుభ్ర వాతావరణంలో వండటం కనిపించింది. రణస్థలం మండలం పాతర్లపల్లి హైస్కూల్లో విద్యార్థులకు సిద్ధం చేసిన వంటల్లో పక్షుల విసర్జితాలు నేరుగా పడుతున్న దుస్థితి ‘సాక్షి’ పరిశీలనలో కంటబడింది. పక్కా భవనం లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని ఉపాధ్యాయులు, వంట కార్మికులు చెబుతున్నారు.నాడు–నేడు కింద చేపట్టిన భవనాల పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయని, అవి పూర్తయితే వంటగదిని కేటాయించవచ్చని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. నాడు–నేడుతో తమ పాఠశాల రూపురేఖలు మారాయని, చుట్టూ రక్షణ గోడ నిర్మించడంతోఎన్నో ఏళ్లుగా వేధించిన వరద నీటి ముంపు సమస్య తొలగిందని శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం ఆనందపురం యూపీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు ఏ.ఆదినారాయణ చెప్పారు.కలలో కూడా అనుకోలేదు..‘ఎప్పుడు ఏది కూలుతుందో తెలియని దుస్థితి నుంచి కార్పొరేట్ పాఠశాలలను తలదన్నే రీతిలో మా స్కూళ్లు మారతాయని ఎన్నడూ ఊహించలేదు. నా సర్వీస్‌లో ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు..’ – డిజిటల్ బోర్డు వైపు చూస్తూ శ్రీకాకుళం జిల్లా దేశవానిపేట యూపీ స్కూల్ టీచర్ ఉత్తముడి మాట!ఈ మార్పులు ఎవరి చలువ?‘ఇటీవల పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ కోసం పాఠశాలకు వెళ్లాం. అక్కడ ఉన్నవన్నీ ఎవరు ఏర్పాటు చేసిన వసతులు? ఎవరి హయాంలో వచ్చిన మార్పులు అవి? వైఎస్ జగన్మోహన్రెడ్డి అనే వ్యక్తి లేకపోతే మా ఊరి బడి పరిస్థితి మారేదా..?’ – శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో 8వ తరగతి విద్యార్థి తండ్రి ఎస్.రామారావు మనోగతం!జగన్ మా బాధలు తీర్చారు..‘పాఠశాలకు వచ్చినప్పటి నుంచి వెళ్లే వరకు ఒకటే టెన్షన్. చుట్టూ మురుగునీరు.. తీవ్ర దుర్గంధం! చినుకు పడితే పాముల బెడద. ఎప్పుడూ జలమయంగా ఉండే పాఠశాల ప్రాంగణం.. జగన్ నాడు–నేడులో భాగంగా చేపట్టిన ప్రహరీ నిర్మాణంతో మా బాధలు తీరాయి’ – డోల చంద్రుడు, విద్యార్థి ఆనందపురం, శ్రీకాకుళం జిల్లాఆర్నెల్లుగా జీతాలులేకున్నా..‘పిల్లల బాగోగులే మాకు కావాలి బాబూ..! జగన్ బాబు ఉన్నప్పుడు ప్రతి నెలా జీతం వచ్చేది. ఇప్పుడు జీతం ముఖం చూసి ఆరు నెలలైంది. అయినా సరే పని చేస్తున్నాం. పిల్లల ఆరోగ్యమే మా జీవితం. మా ఆకలి బాధలు తీరకున్నా మరుగుదొడ్లు నిత్యం పరిశుభ్రంగానే ఉంచుతున్నాం. మాకు చేతనైంది ఇదే పని బాబూ.. జీతాలిప్పించండి..’ అంటూ పాతర్లపల్లి, పైడి భీమవరంలో ఆయా రాములమ్మతో పాటు మరికొందరు వేడుకున్నారు. -
ప్రభుత్వ విద్య మిథ్యే!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. సర్కారు పాఠశాలలు, ఇంటర్ కళాశాలల్లో ప్రమాణాలు క్షీణించేలా చేసి.. వాటిలో చదువుతున్న పిల్లలను ప్రైవేట్ బాట పట్టించడమే ధ్యేయంగా ప్రణాళిక రూపొందించి అమలు చేస్తోంది. ప్రభుత్వ కళాశాలలు ఏర్పాటు చేయా ల్సింది పోయి అక్కడ ప్రైవేట్‌కు అవకాశం ఇస్తోంది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కొత్తగా దాదాపు 80 ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల ఏర్పాటుకు అనుమతులిచ్చింది. అంతేగాక విద్యను కార్పొరేట్ వ్యాపారం చేసిన నారాయణ విద్యా సంస్థల ప్రతినిధికి తాజాగా ఇంటర్మీడియట్ బోర్డులో స్థానం కల్పించింది. గత ప్రభుత్వంలో మండలానికి రెండు ప్రభుత్వ కాలేజీలు.. వాటిలో ఒకటి బాలికలకు తప్పనిసరి చేస్తూ ఏర్పాటు చేసిన 502 హైస్కూల్ ప్లస్‌లను సైతం రద్దు చేసేందుకు కంకణం కట్టుకుంది. పిల్లల సంఖ్య అధికంగా ఉన్న చోట ప్రభుత్వమే పాఠశాలలు, జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేయాలి. కానీ అందుకు భిన్నంగా 37 మండలాలు, రెండు మున్సిపాలిటీల్లో ప్రైవేటు కాలేజీలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ఏకంగా జీవో ఇస్తూ.. ఉచితంగా అందాల్సిన విద్యను వ్యాపారులకు అప్పగించింది. ‘ప్రభుత్వ విద్య వద్దు.. ప్రైవేటు చదువులే ముద్దు’ అని గత టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు బహిరంగంగానే ప్రకటించారు. విద్య ప్రభుత్వ బాధ్యత కాదని, ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో సదుపాయాలు ఉండవని, ప్రైవేటు స్కూళ్లల్లో చదువుకోవాలని సెలవిచ్చిన ఆయన.. ఇప్పుడూ సీఎంగా అదే పంధాను కొనసాగిస్తున్నారు. మొత్తంగా విద్య రంగం అంతటినీ ప్రయివేట్ చేతుల్లో పెట్టే కుట్రకు ఈ సర్కారు తెర లేపింది. ఇందులో భాగంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ అమలు చేసిన పలు పథకాలు, కార్యక్రమాలను అటకెక్కిస్తుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. అన్ని దశల్లో ప్రైవేటుకే ప్రాధాన్యం ⇒ దేశంలో ఎక్కడైనా ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యం ఇస్తాయి. కేరళ, ఢిల్లీలో అక్కడి ప్రభుత్వాలు అద్భుతమైన ప్రభుత్వ విద్యను అందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2019 నుంచి 2024 మే వరకు గత ప్రభుత్వ పాలనలో సర్కారు విద్యకే ప్రాధాన్యం ఇచ్చి పాఠశాల, జూనియర్ విద్యను పటిష్టం చేసింది. ⇒ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ప్రభుత్వ విద్యలో తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలను ఒకొక్కటిగా నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ విద్యకు ప్రాధాన్యం ఇస్తోంది. ఇటీవల నిర్వహిచిన కలెక్టర్ల సదస్సులోనూ సీఎం చంద్రబాబు.. ప్రైవేటు విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని, విద్యలో ప్రైవేటు భాగస్వామ్యం ఉండాలని ప్రకటించారు. ⇒ ఇది జరిగిన నాలుగు రోజుల్లోనే నారాయణ జూనియర్ కాలేజీకి చెందిన ప్రిన్సిపల్‌ను ఇంటర్ బోర్డులో సభ్యుడిగా నియమించారు. వాస్తవానికి ఈ స్థానాన్ని లాభాపేక్ష లేని ట్రస్ట్ బోర్డు యాజమాన్యాలకు లేదా చిన్న ప్రైవేటు కాలేజీలకు కల్పించాలి. అందుకు విరుద్దంగా విద్యను వ్యాపారంగా మార్చిన కార్పొరేట్ సంస్థకు అప్పగించారు. ⇒ ఆరు నెలల కూటమి ప్రభుత్వ పాలనలో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్తగా దాదాపు 80 ప్రైవేటు జూనియర్ కాలేజీలకు అనుమతులిచ్చారు. 2025–26 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 37 మండలాల్లో 47, రెండు మున్సిపాలిటీల్లో 6 జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేసుకోవచ్చని ప్రభుత్వమే ప్రైవేటు యాజమాన్యాలకు అవకాశం కల్పించింది. ఇందుకోసం ఇటీవల జీవో 496ను సైతం విడుదల చేసింది. ⇒ ఈ 53 ప్రాంతాల్లో విద్యార్థులున్నారన్న విషయం ప్రభుత్వానికి తెలుసు కాబట్టి, ఆ మేరకు ఇంటర్ కాలేజీలను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. కానీ అక్కడ ప్రైవేటు కాలేజీలు ఏర్పాటు చేయాలని ఉత్తర్వులివ్వడం విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రులను విస్తుపోయేలా చేసింది. కాగా, రాష్ట్రంలో ప్రభుత్వ యాజమాన్యంలో సుమారు 800 జూనియర్ కాలేజీలు ఉంటే.. 2,200 వరకు ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో అధికంగా నారాయణ, చైతన్యవే కావడం గమనార్హం. ప్రభుత్వ లెక్చరర్లకు బోధన సామర్థ్యం లేదట! ⇒ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గత విద్యా సంవత్సరం అప్పటి ప్రభుత్వం ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఐఐటీ, నీట్ శిక్షణను పైలట్‌గా ప్రారంభించింది. ఎంపిక చేసిన కాలేజీల్లో ఆసక్తి ఉన్న సీనియర్ లెక్చరర్లతో ప్రత్యేక తరగతులు నిర్వహించింది. అయితే, ఈ విధానాన్ని మరింత మెరుగ్గా కొనసాగించాల్సిన ప్రస్తుత ప్రభుత్వం.. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఐఐటీ, నీట్ శిక్షణ ఇచ్చే సామర్థ్యం ప్రభుత్వ లెక్చరర్లకు లేదని చెప్పి.. నారాయణ విద్యా సంస్థల సిబ్బందితో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. ⇒ తొలి దశలో కర్నూలు, నెల్లూరు, గుంటూరు, విశాఖపట్నం నగరాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఆ నగరాల్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ఆయా నగరాలకు ఐదు నుంచి పది కి.మీ పరిధిలోని ప్రభుత్వ కాలేజీల ఎంపీసీ, బైపీసీ విద్యార్థులను అక్కడకు చేర్చారు. వారికి ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించి, శిక్షణ ఇస్తున్నారు. ⇒ ఒక్కో నగరం పరిధిలో నాలుగు నుంచి 10 కళాశాలల వరకు ఉండగా, అన్ని కళాశాలల్లోనూ ఇంటర్ మొదటి ఏడాది విద్యార్థులకు కామన్ ఎంట్రన్స్ నిర్వహించి ఒక్కో (ఎంపీసీ, బైపీసీ) గ్రూప్ నుంచి 25 నుంచి 40 మందిని ఎంపిక చేశారు. అంటే ప్రతిభ గల ప్రభుత్వ విద్యార్థులకు మాత్రమే నారాయణ సిబ్బంది శిక్షణ ఇస్తారు. వారు విజయం సాధిస్తే అది నారాయణ విజయంగా జమకట్టి.. మిగిలిన ప్రభుత్వ కాలేజీలను కార్పొరేట్ యాజమాన్యాలకే కట్టబెట్టేందుకు ఇప్పటి నుంచే ప్రణాళిక వేశారు. గత టీడీపీ ప్రభుత్వంలోనూ ఇదే పంధాను అనుసరించారు. ⇒ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు బోధనా సామర్థ్యాలు తక్కువగా ఉన్నాయని చెప్పి, వారికి నారాయణ స్కూళ్ల సిబ్బంది శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. నాడు ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత వచ్చినా నిర్బంధంగా అమలు చేశారు. ఇప్పుడు జూనియర్ కాలేజీల్లో లెక్చరర్లను పక్కనబెట్టి.. అదే విధానంలో విద్యార్థులను టార్గెట్ చేయడం గమనార్హం. అధికారంలోకి రాగానే మొదలు.. ⇒ రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చింది మొదలు విద్య రంగంపై శీతకన్ను వేసింది. గత సర్కారు ప్రారంభించిన పథకాలు, కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా కొనసాగించాల్సిందిపోయి.. వాటి పునాదులు పెకిలిస్తూ నీరుగారుస్తోంది. తొలుత ‘అమ్మ ఒడి’ పథకంపై కక్ష కట్టింది. ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ ‘అమ్మకు వందనం’ కింద ఏటా రూ.15 వేల చొప్పున ఇస్తామని ఎన్నికల ముందు చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు చేతులెత్తేశారు. ఫలితంగా 45 లక్షల మంది తల్లులు, 84 లక్షల మంది పిల్లలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ⇒ స్కూళ్ల రూపురేఖలు మార్చేసిన నాడు–నేడు పనులను మధ్యలో నిలిపేశారు. పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనం.. జగనన్న గోరుముద్ద పేరును డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంగా మార్చి ఏజెన్సీలను రాజకీయ కక్షతో తొలగించారు. గతంలో దాదాపు 95 శాతం మంది పిల్లలు గోరుముద్దను తీసుకోగా ఇప్పుడు నాణ్యత కొరవడటంతో 50 శాతం మంది కూడా తినడం లేదు. రోజుకో మెనూ గాలికి పోయింది. నీళ్ల పప్పు రోజులను మళ్లీ తీసుకొచ్చింది. ⇒ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చదువుల్లో మెరుగ్గా రాణించేందుకు గత ప్రభుత్వం బైజూస్ కంటెంట్‌తో ఉచితంగా ట్యాబ్‌లు అందించింది. రూ.1,305.74 కోట్లతో 9,52,925 ట్యాబ్‌లను పంపిణీ చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ట్యాబ్‌ల మాటే ఎత్తడం లేదు. ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియం బోధనను నీరుగారుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చదవలేకపోతున్నారంటూ ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను తెలుగు మీడియంలో రాసేలా నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ బోధనను రద్దు చేసింది. ఆంగ్ల భాషా నైపుణ్యాల కోసం మూడో తరగతి నుంచే ప్రారంభమైన ‘టోఫెల్’ శిక్షణను కూడా రద్దు చేసింది. ⇒ పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా ఎదగాలన్న వైఎస్ జగన్ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశపెట్టిన ‘ఇంటర్నేషనల్ బాకలారియేట్(ఐబీ) బోధనపై కూడా చంద్రబాబు ప్రభుత్వం కక్ష కట్టింది. విద్యార్థుల్లో బోధనా ప్రమాణాలు పెంచేందుకు 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ బోధనను సైతం పక్కనపెట్టింది. టెన్త్, ఇంటర్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించే కార్యక్రమానికీ తిలోదకాలిచ్చింది. యూనిఫాంతో కూడిన కిట్లు కూడా సరిగా పంపిణీ చేయలేకపోయింది. ⇒ ఐఎఫ్‌పీలు, స్మార్ట్ టీవీలతో డిజిటల్ బోధన.. ఇలా ఒక్కోదాన్ని అటకెక్కిస్తూ వస్తోంది. నిర్వహణపై చేతులెత్తేసి తాగునీరు, మరుగుదొడ్ల సమస్యను గతానికి తీసుకెళ్లింది. విద్య దీవెన, వసతి దీవెన ఇవ్వకుండా పిల్లలను ఉన్నత చదువులకు దూరం చేస్తోంది. ఈ పరిణామాలన్నీ రాష్ట్రంలో విద్యా వేత్తలను, తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇది విద్యా రంగాన్ని ప్రమాదంలోకి నెట్టడమే రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యా మండలి పునర్వ్యవస్థీకరణలో భాగంగా విచిత్రమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఆశ్చర్యకరంగా కార్పొరేట్ విద్యా సంస్థ అయిన నారాయణ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌ను మండలిలో నామినేటెడ్ సభ్యుడిగా నియమించింది. ప్రభుత్వమే విద్య వ్యాపారీకరణను ప్రోత్సహిస్తుందనేందుకు ఇంతకంటే మంచి ఉదాహరణ మరొకటి అవసరం లేదు. నారాయణ, చైతన్య వంటి కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు తల్లిదండ్రుల నుంచి కోట్ల రూపాయల ఫీజులను వసూలు చేస్తూ ఇంటర్ విద్యను భ్రష్టు పట్టించాయి. ఈ సంస్థలు ఏ విషయంలోనూ ప్రభుత్వ నిబంధనలు అమలు చేసింది లేదు. తమ వ్యాపారం కోసం విద్యార్థుల మధ్య మార్కులు, ర్యాంకుల పోటీ పెట్టి మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఈ కాలేజీల్లో చదువులు కేవలం మెడికల్, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల కసరత్తుగా తయారయ్యాయి. దీంతో ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటి విద్యా సంస్థలతో సలహాలు తీసుకొని ప్రభుత్వ ఇంటర్ కాలేజీలలో విద్యా బోధనను మెరుగు పరుస్తామని ప్రభుత్వం చెప్పడం విద్యా వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టడమే అవుతుంది. ఇది విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా కాకుండా, కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయం అని స్పష్టమవుతోంది. - ఇ.మహేష్, ఆలిండియా డెమొక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర కార్యదర్శి -
YS Jagan: ఓ తరం.. అంతరం
‘మన పిల్లలు.. గ్లోబల్ స్టూడెంట్స్’ అని గర్వంగా చెప్పుకొనే స్థాయికి ప్రభుత్వ విద్యను తీసుకెళ్లారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. నర్సరీ నుంచి డిగ్రీ, పీజీ వరకూ అత్యుత్తమ విద్యా ప్రమాణాలకు నాంది పలుకుతూ.. విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. తీసుకున్న ప్రతి నిర్ణయం పేదోడికి మేలు చేకూర్చింది. ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ, డిజిటల్ క్లాస్ రూమ్స్, ఐబీ సిలబస్, టోఫెల్ ఇలా ఒకటేమిటి అధికారంలో ఉన్నన్నాళ్లూ సంస్కరణల పథాన ముందుకు సాగారు. అయితే ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో నాటి నవశకం కాస్త.. నేడు అదోరకం అన్నట్లుగా తయారైంది. ఫలితంగా పేద విద్యార్థుల జీవితాలు అంధకారమయమవుతున్నాయి.వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఎనిమిదో తరగతి విద్యార్థులకు డిసెంబర్ 21వ తేదీ చాలా ప్రత్యేకమైన రోజు. దీని కోసం విద్యార్థులు ఎంతో ఆతృతగా ఎదురుచూసేవారు. ఎందుకంటే గడిచిన రెండేళ్లలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ట్యాబ్‌లను పంపిణీ చేసి విద్యార్థులకు సమకాలీన ఆధునిక వసతులతో కూడిన విద్యారంగం వైపు అడుగులు వేయించింది. కానీ ప్రస్తుతం కూటమి సర్కార్ ఆ పథకానికి ఎగనామం పెట్టి విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లింది. అంతేకాక విద్యారంగంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన విద్యావిప్లవానికి తూట్లు పొడిచేలా నిర్ణయాలు తీసుకుంటూ ఓ తరాన్ని బలి తీసుకుంటోందని పలువురు విద్యారంగ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అమ్మ ఒడితో ఆనందాలు.. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను పనుల్లో పెట్టి ఆ వచ్చే డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆ కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. రోజూ తమ పిల్లలను బడికి పంపించే కుటుంబానికి ఏడాదికి రూ.15 వేల చొప్పున అమ్మ ఒడి పథకం ద్వారా సాయమందించారు. కృష్ణాజిల్లాలో 1,35,434 మంది విద్యార్థులకు రూ.203 కోట్లు, ఎనీ్టఆర్ జిల్లాలో 1,80,254 మంది విద్యార్థులకు రూ.266 కోట్లు చొప్పున ఉమ్మడి కృష్ణాజిల్లాలో రూ.469 కోట్లు ఏటా ఆయా కుటుంబాలకు అందించిన ఘనత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానిది. విద్యా, వసతి దీవెనలతో అండదండలు.. గత ప్రభుత్వ హయాంలో ఏటా ఇంజినీరింగ్, డిగ్రీ చదివే విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పేర్లతో కోట్లాది రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ చేసేది. ప్రధానంగా జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాలలకు సంబంధించి రూ.43 వేల నుంచి లక్షన్నర వరకూ ఫీజులుండగా వాటిని విడతల వారీగా అందించింది. ఎనీ్టఆర్ జిల్లాలో గత సర్కార్ సుమారు 40 వేల మంది విద్యార్థులకు ఏటా విద్యాదీవెన పథకం ద్వారా రూ.406.56 కోట్లు, వసతి దీవెన ద్వారా రూ.152.49 కోట్లు అందించింది. అలాగే కృష్ణా జిల్లాలోను 35 వేల మంది విద్యార్థులకు సుమారుగా రూ.350 కోట్ల మేర సాయమందించింది.‘నాడు–నేడు’ అద్భుతం..గత ప్రభుత్వ పాలనలో జిల్లాలో పాఠశాలల రూపురేఖలు సైతం మార్పు చేసేందుకు నాడు–నేడు పథకం ద్వారా విశేష కృషి జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలోనే తొలి విడతగా 341 పాఠశాలలకు రూ.96.32 కోట్లు, రెండో విడతగా 596 పాఠశాలలకు రూ.240 55 కోట్లు కేటాయించారు. రెండో విడత పనుల ముగింపు దశలో ఉండగా కూటమి సర్కార్ వాటిని పూర్తిగా నిలిపివేసింది. కృష్ణాజిల్లాలోనూ రెండో విడత పనులను సైతం పూర్తిగా ఆపేసింది.ఆధునికతకు అందలం.. గత ప్రభుత్వం కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ఆయా పాఠశాలలను తీర్చిదిద్దింది. అందులో భాగంగా ఏటా ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్‌లను అందించింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొదటి ఏడాది 26,334 మంది విద్యార్థులకు రెండో ఏడాది సైతం అదే రీతిలో కొనసాగించింది. ప్రతి పాఠశాలకు స్మార్ట్ టీవీలతో పాటుగా ప్రాథమిక పాఠశాలలో ఇంటర్నల్ ప్యానల్స్‌ను అందించింది.ఆరోగ్యానికి ప్రాధాన్యం.. జగనన్న గోరుముద్దతో పాఠశాలకు వచ్చే విద్యార్థులకు పరిపూర్ణమైన పౌష్టికాహారాన్ని అందించే ఏర్పాట్లు గత ప్రభుత్వం ప్రారంభించింది. రోజుకొక మెనూతో విద్యార్థులను ఆకట్టుకునే రీతిలో మధ్యాహ్న భోజనాన్ని అందించింది. అంతేకాకుండా విద్యార్థులకు కోడిగుడ్డు, చెక్కీలు, రాగిజావ వంటి కొత్త ఆహారాలను సైతం పరిచయం చేసి విద్యార్థులకు పరిపూర్ణమైన ఆహారాన్ని జగన్ అందించారు.ఆంగ్ల బోధనతో కొత్త చరిత్ర.. సమకాలీన సమాజంలో మాతృభాషతో పాటుగా ఆంగ్ల భాషలో బోధన జరిగినప్పుడు విద్యార్థులకు మేలు జరుగుతుందని గత జగన్ ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా ప్రతి పాఠశాలల్లో ఆంగ్ల బోధనను ప్రారంభించింది. విద్యార్థులు ఇబ్బంది పడకుండా తెలుగు– ఆంగ్ల భాషల్లో ముద్రించిన పుస్తకాలను అందించి వారికి పాఠ్యాంశాలు చక్కగా అర్థమయ్యేందుకు గత ప్రభుత్వం సహకరించింది. పథకాలు అమలు చేయాలి విద్యారంగంలో గత ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి పథకాలన్నీ కూటమి సర్కార్ అమలు చేయాలి. అవి పేద విద్యార్థులకు మేలు చేశాయి. అమ్మ ఒడి వంటి పథకాలను ఇంకా విస్తృతంగా అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి నేడు దాని ప్రస్తావన ఈ కూటమి ప్రభుత్వం తీసుకురావటం లేదు. నాడు–నేడు సైతం నిలిపివేసింది. – సీహెచ్ వెంకటేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అద్భుతమైన ప్రగతి.. మాజీ సీఎం వైఎస్ జగన్ పాలనలో విద్యారంగం అద్భుతమైన ప్రగతిని సాధించింది. దేశంలోనే మొదటి సారిగా బైలింగ్వల్ టెక్ట్స్ బుక్స్, ఒకటి నుంచి 5వ తరగతికి బొమ్మలతో కూడిన డిక్షనరీని, ఇంట్రాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్, ట్యాబ్‌లు ఇలా ఒకటేమిటి ప్రతిఅంశంలో కొత్తదనాన్ని తీసుకొచ్చారు. విద్యార్థులకు మేనమామగా ఆయన చేసిన పనులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. – టి. కల్పలత, ఎమ్మెల్సీవిద్యాకానుకకు జాతీయ గుర్తింపు.. గతంలో టీడీపీ సర్కార్ పాఠశాలలు ప్రారంభమైన ఆరు మాసాలైనా విద్యార్థులకు పుస్తకాలు ఇచ్చే పరిస్థితి కనపడేది కాదు. కానీ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠశాలలు తెరిచిన రోజునే అందరికీ జగనన్న విద్యాకానుక పేరుతో పాఠ్యపుస్తకాలతో పాటుగా అత్యధిక నాణ్యత కలిగిన నోటు పుస్తకాలు, బూట్లు, బ్యాగ్, డిక్షనరీలు ఇలా ఎనిమిది రకాల వస్తువులను అందించేవారు. జగన్ ప్రభుత్వం అందిస్తున్న విద్యాకానుకకు జాతీయ స్థాయిలో ప్రశంసలు అభించాయి. కూటమి సర్కార్ తూట్లు..కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత విద్యారంగానికి సంబంధించి అనేక పథకాలకు తూట్లు పొడిచిందని నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా అమ్మ ఒడి, నాడు–నేడు, ట్యాబ్‌ల పంపిణీతో పాటుగా పలు కార్యక్రమాలను నిలిపివేయటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే జగనన్న గురుముద్ద పేరుతో ప్రారంభించిన మధ్యాహ్న భోజనాన్ని సైతం ఇష్టారాజ్యంగా మార్చేసి, పరిశుభ్రత లేకుండా చేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాలల్లో పని చేసే ఆయాలకు జీతాలు ఇవ్వకపోవటంతో విద్యాసంస్థల్లో విద్యార్థులు ఇబ్బందులెదుర్కొంటున్నారు. -
టార్చ్ బేరర్
ప్రభుత్వ విద్యావ్యవస్థ బాగు కోసం ఐదేళ్లపాటు జగన్ అహర్నిశలు కృషి చేశారు. పిల్లల్ని గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దేందుకు శ్రమించారు.‘ప్రతి 30 సంవత్సరాలకు బతుకు తాలూకా ఆలోచన మారుతుంది. సినిమా వాళ్లు దాన్ని ట్రెండ్ అంటారు. వ్యాపారవేత్తలు ఫ్యాషన్ అంటారు. రాజకీయ నాయకులు తరం అంటారు. మామూలు జనం జనరేషన్ అంటారు. కానీ ప్రతి జనరేషన్లో ఆ కొత్త థాట్‌ను ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాడినే టార్చ్ బేరర్ అంటారు.’ ఇది ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాలోని ఓ డైలాగ్. నిజ జీవితంలో ఇలాంటివారు అరుదుగా ఉంటారు. 2019 – 24 మధ్య ఏపీలో జరిగిన పాలనను చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్చ్ బేరర్‌గా చెప్పొచ్చు. ఆ ఐదేళ్లలో ఆయన చేసిన సంస్కరణలు అలాంటివి.ఎంపీగా మొదలైన జగన్ ప్రస్థానం ఏపీ రాజకీయాలను కొత్త దారిలో నడిపించే స్థాయికి చేరుకుంది. ప్రజలకు మంచి చేసిన నాయ కుడిగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉంటుంది. జగన్ మొదటి నుంచీ ప్రజల్లోనే ఉన్నారు. ఆయన పాదయాత్ర చేస్తే పల్లె, పట్టణం అనే తేడా లేకుండా కాలు కదిపాయి. కోట్ల మంది ఓన్ చేసుకున్న లీడర్!జగన్ దేశంలో ఏ నాయకుడూ సాహసం చేయని పనులకు శ్రీకారం చుట్టారు. వైఎస్సార్సీపీ హయాంలో సంక్షేమం, అభివృద్ధి కాగితాలకు పరిమితం కాలేదు. క్షేత్రస్థాయిలో కనిపించింది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అక్క చెల్లెమ్మలకు డీబీటీ, నాన్ డీబీటీ కింద రూ. 2,83,866 కోట్లు అందించారు. ఆయన పాలనే విప్లవాత్మక నిర్ణయాలతో మొదలైంది. సీఎం అయిన ఆరు నెలల్లోనే గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి 1.34 లక్షల ఉద్యోగాలిచ్చారు. 58 వేలమంది ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు. 2.60 లక్షల మంది వలంటీర్లను నియమించి రాజకీయ పార్టీలు, కులమతాలకు అతీతంగా పథకాలను అందించారు.చంద్రబాబు అధికారంలో ఉన్నంత కాలం ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేశారు. కార్పొరేట్‌ను పెంచి పోషించారు. కానీ విద్యావ్యవస్థ బాగు కోసం ఐదేళ్లపాటు జగన్ అహర్నిశలు కృషి చేశారు. పిల్లల్ని గ్లోబల్ సిటిజన్లుగా మార్చేందుకు కష్టపడ్డారు. ఏపీలోని పల్లెల బిడ్డలు ఐక్యరాజ్యసమితిలో మాట్లాడతారని ఏనాడైనా అనుకున్నామా? ‘నాడు – నేడు’తో బడికి కొత్త కళ వచ్చింది. ఏపీలో విద్యారంగ సంస్కరణల కోసం గత ప్రభుత్వం చేసిన ఖర్చు అక్షరాలా రూ. 73 వేల కోట్లు. అభివృద్ధి, సంక్షేమాన్ని చంద్రబాబు గ్రాఫిక్స్‌లో చూపిస్తే జగన్ క్షేత్ర స్థాయిలో కనిపించేలా చేశారు. 17 మెడికల్ కాలేజీలు, నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, పేదలందరికీ ఇళ్ల నిర్మాణం... ఇలా ఆయన చేపట్టినవి ఎన్నో!దేశ చరిత్రలో ఏ నాయకుడిపై జరగనంత వ్యక్తిత్వ హననం జగన్‌పై జరుగుతోంది. జగన్ వీటిని చిరునవ్వుతోనే ఎదుర్కొంటున్నారు తప్ప ఎక్కడా మాట తూలలేదు. చంద్రబాబు పెంచి పోషిస్తున్న సోషల్ మీడియా సైకోలు జగన్‌పై నిత్యం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్‌లలో దుష్ప్రచారం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. జగన్ కూర్చొన్నా, మాట్లాడినా, నవ్వినా, చూసినా పిచ్చిపిచ్చి రాతలతో పోస్టులు, రీల్స్ పెడుతున్న వారి కుటుంబాల్లో ఎంతోమంది గత ప్రభుత్వంలో లబ్ధి పొంది ఉంటారు!జగన్‌కు పడటం కొత్త కాదు. ఎంతో ఆత్మవిశ్వాసంతో ముందు కెళ్లే వ్యక్తికి ఎలా లేచి నిలబడాలో బాగా తెలుసు. ఏదో మేజిక్ వల్ల గెలిచిన కూటమి పెద్దలు ఆయన పని అయిపోయిందని ఇప్పుడు సంబర పడుతూ ఉండొచ్చు. ఏపీలో అధికా రంలోకి వచ్చిన కొన్ని నెలలకే చంద్రబాబు అంతులేని వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ఒకప్పటిలా సంక్షేమం అందకపోవడంతో జనం నిరాశలో కూరుకుపోతున్నారు. ప్రజల బాగు కోసం పనిచేసే నాయకుడు ఎప్పటికీ ఫెయిల్ కాడు. ఎందుకంటే వారి సంకల్ప బలం చాలా గొప్పది. నిజమైన జననేతకు జన్మదిన శుభాకాంక్షలు!– వెంకట్ -
ట్యాబ్ ఏది బాబూ?
సాక్షి, అమరావతి: డిసెంబర్ 21 వచ్చిందంటే చేతుల్లో ట్యాబ్‌లతో లక్షల మంది పిల్లల మొహాల్లో సంతోషం తొణికిసలాడేది! అంతులేని సందేహాలను వాటి ద్వారా నివృత్తి చేసుకుంటూ పోటీ ప్రపంచంలో రాణించాలనే ఉత్సాహంతో ఉరకలు వేసేవారు! డిజిటల్ తరగతులు, సాంకేతిక బోధన, సకల సదుపాయాలతో సర్కారు స్కూళ్లు కళకళలాడేవి!! మరి ఈ ఏడాది ట్యాబ్‌లు ఎక్కడ? మాపై ఎందుకంత కక్ష? అని లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సీఎం చంద్రబాబును అడుగుతున్నారు. 9.52 లక్షల మందికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం బైజూస్ కంటెంట్‌తో ఉచితంగా అందించిన ట్యాబ్స్ పంపిణీని కూటమి సర్కారు ఈ ఏడాది నిలిపివేసింది. అదే జగన్ మామయ్య ప్రభుత్వం ఉంటే ఈ పాటికి ట్యాబ్‌లు వచ్చేవని 8వ తరగతి పిల్లలు గుర్తు చేసుకుంటున్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చిన జగన్ మామను ప్రతి విద్యార్థీ తలచుకుంటున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఉండి ఉంటే తమకు ఠంఛన్‌గా అమ్మ ఒడి వచ్చేదని తల్లులు గుర్తు చేసుకోని రోజు ఉండదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. పేద కుటుంబాల తలరాతలను మార్చేవి చదువులేనని గట్టిగా నమ్మి గత ఐదేళ్లూ ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం దిశగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వడివడిగా అడుగులు వేశారు. ఏటా జూన్‌లో అమ్మ ఒడితో తల్లులకు రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించి పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కాకుండా భరోసా కల్పించారు. నాడు నేడుతో కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా తీర్చిదిద్దిన సర్కారు స్కూళ్ల ప్రయాణం ఇంగ్లీష్ మీడియం చదువుల నుంచి టోఫెల్ శిక్షణ, సీబీఎస్ఈ, ఐబీ సిలబస్ స్థాయికి చేరుకుంది. మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లు, డిజిటల్ క్లాస్ రూమ్‌ల బోధన లాంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. రోజుకో రుచికరమైన మెనూతో పౌష్టిక విలువలతో గోరుముద్ద అందించి పిల్లల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. యూనిఫామ్ నుంచి పుస్తకాల దాకా అన్నీ ఉచితంగా అందిస్తూ ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్యా బోధన కోసం ఐదేళ్లలో ఏకంగా దాదాపు రూ.73 వేల కోట్లు వ్యయం చేశారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను క్రమం తప్పకుండా అమలు చేసి పిల్లల చదువులకు తోడ్పాటు అందించారు. ప్రభుత్వ విద్యా రంగానికి బలమైన పునాది వేశారు. ఇప్పుడు వాటిని సమూలంగా పెకిలించే దిశగా టీడీపీ కూటమి సర్కారు నిర్ణయాలు తీసుకుంటోంది. పేద విద్యార్థులు అధికంగా చదివే ప్రభుత్వ స్కూళ్లపై పగబట్టినట్లు వ్యవహరిస్తోంది. విద్యా రంగ పథకాలను ఇంకా అద్భుతంగా అమలు చేస్తామని నమ్మబలికి అధికారంలోకి రాగానే అన్నింటినీ నిలిపివేసింది. ఆర్నెల్ల పాలనలో ఒక్కటైనా కొత్త పథకాన్ని అందించకపోగా గత సర్కారు అమలు చేసిన వాటిని కక్షపూరితంగా ఆపేసింది. ఇందుకు నాడు నేడు నుంచి ఎన్నో నిదర్శనాలున్నాయి. ఏఐ టెక్నాలజీ యాప్‌తో ట్యాబ్స్.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చదువుల్లో మెరుగ్గా రాణించేందుకు గత ప్రభుత్వం బైజూస్ కంటెంట్‌తో ఉచితంగా ట్యాబ్‌లు అందించింది. రూ.1,305.74 కోట్లతో 9,52,925 ట్యాబ్‌లను పంపిణీ చేసింది. తద్వారా విద్యార్థులు ప్రతి పాఠ్యాంశాన్ని విశ్లేషణాత్మకంగా, ఇంటి వద్ద కూడా చదువుకునే అవకాశం దక్కింది. విద్యార్థులు విదేశీ భాషలు నేర్చుకునేందుకు వీలుగా ట్యాబ్స్‌లో ‘డ్యులింగో’ యాప్ అప్లోడ్ చేశారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు ‘ఏఐ’ టెక్నాలజీతో పనిచేసే ‘డౌట్ క్లియరెన్స్ బాట్’ యాప్‌ను రూపొందించారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్, టోఫెల్ శిక్షణలో ఎదురయ్యే క్లిష్టమైన సందేహాలను ఇది సునాయాసంగా నివృత్తి చేస్తుంది.సీబీఎస్ఈ, ఐబీ, టోఫెల్ రద్దువైఎస్ జగన్ దేశమంతా ప్రశంసించే విద్యా సంస్కరణలను ప్రవేశపెట్టారు. తల్లిదండ్రులు కోరుకున్న విధంగా ఒకటో తరగతి నుంచే ఇంగ్లీష్ మీడియం బోధనను అంచెలంచెలుగా అమలు చేశారు. అయితే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం చదవలేకపోతున్నారంటూ ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను తెలుగు మీడియంలో రాసేలా కూటమి సర్కారు నిర్ణయం తీసుకుంది. 2023–24లో ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధనను గత ప్రభుత్వం అందుబాటులోకి తెస్తే కూటమి సర్కారు ఈ ఏడాది రద్దు చేసింది. విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంపొందించి అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు 2023–24 విద్యా సంవత్సరంలో మూడో తరగతి నుంచే ప్రారంభమైన ‘టోఫెల్’ శిక్షణను కూడా ఈ ఏడాది కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. గతేడాది రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు ఈ సదుపాయం లభించగా ఈ ఏడాది ఒక్కరికీ అవకాశం లేకుండా చేసింది. గతేడాది 16 లక్షల మంది టోఫెల్ పరీక్ష రాయగా కనీసం ఆ ఫలితాలను కూడా ప్రకటించలేదు. పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా ఎదగాలన్న వైఎస్ జగన్ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశపెట్టిన ‘ఇంటర్నేషనల్ బాకలారియేట్(ఐబీ) బోధనను కూడా చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. కార్పొరేట్ స్కూళ్లలో సంపన్నుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉండే ఐబీ బోధన 2025 జూన్ నుంచి రాష్ట్రంలోని 38 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించేందుకు గత ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తే దాన్ని రద్దు చేసి కక్షపూరితంగా వ్యవహరించింది.‘వందనం’ లేదు.. వంటా లేదు..!ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ‘అమ్మకు వందనం’ కింద ఏటా రూ.15 వేల చొప్పున ఇస్తామని ఎన్నికల ముందు చెప్పిన కూటమి నేతలు చేతులెత్తేశారు. విద్యా సంవత్సరం ముగిసిపోతున్నా సీఎం చంద్రబాబు ఆ ఊసే ఎత్తకపోవడంతో 45 లక్షల మంది తల్లులు, 84 లక్షల మంది పిల్లలు తీవ్ర నిస్పృహ చెందుతున్నారు. ఇక నాడు–నేడు పనులను మధ్యలో నిలిపి వేశారు. పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనం జగనన్న గోరుముద్ద పేరును డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంగా మార్చి ఏజెన్సీలను రాజకీయ కక్షతో తొలగించారు. గతంలో దాదాపు 95 శాతం మంది పిల్లలు గోరుముద్దను తీసుకోగా ఇప్పుడు నాణ్యత కొరవడటంతో 50 శాతం మంది కూడా తినడం లేదు. ఇటీవల ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించిన మెగా పీటీఎంలో తల్లిదండ్రులకు ఇదే భోజనాన్ని పెట్టడంతో అధికారులు, నాయకులను పలుచోట్ల నిలదీశారు. టీడీపీ హయాంలో గతంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో రోజూ సాంబారు, అన్నంతో సరిపెట్టగా వైఎస్ జగన్ నాణ్యమైన పౌష్టికాహారాన్ని పిల్లలకు అందించాలనే సంకల్పంతో 2020 జనవరి 1న ‘జగనన్న గోరుముద్ద’ పథకానికి శ్రీకారం చుట్టారు. రోజుకో మెనూ చొప్పున వారానికి 16 రకాల పదార్థాలతో పాటు ఫోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యంతో మధ్యాహ్నం రుచి, శుచితో పోషకాహారాన్ని అందించారు. పిల్లల్లో రక్తహీనతను అరికట్టడానికి వారంలో మూడు రోజులు బెల్లంతో చేసిన రాగి జావ, మూడు రోజులు చిక్కీ, వారంలో ఐదు రోజులు ఉడికించిన కోడిగుడ్డును తప్పనిసరి చేశారు. పాఠశాలల్లో విద్యార్థుల అభిప్రాయాలు తీసుకుని వంటలో మార్పుచేర్పులు చేశారు. టీడీపీ హయాంలో మధ్యాహ్న భోజనం కోసం ఏటా రూ.450 కోట్లు ఖర్చు చేయగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఏటా రూ.1,400 కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.7,244.6 కోట్లు ఖర్చు చేసింది. అటకెక్కిన సబ్జెక్టు టీచర్ల బోధనవిద్యార్థుల్లో బోధనా ప్రమాణాలు పెంచేందుకు 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ బోధనను వైఎస్ జగన్ అమల్లోకి తెస్తే ఈ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా రద్దు చేసింది. గత ప్రభుత్వం దాదాపు 6 వేల మంది ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించి, 3–5 తరగతులను హైస్కూళ్లకు మార్చి నాణ్యమైన బోధన అందిస్తే ఈ విద్యా సంవత్సరంలో కూటమి సర్కారు సబ్జెక్టు టీచర్లను కేవలం ఉన్నత తరగతులకే పరిమితం చేసి విద్యార్థులకు నాణ్యమైన చదువులు అందకుండా చేసింది.మండలానికి రెండు కాలేజీలు రద్దురాష్ట్రంలోని ప్రతి మండలంలో రెండు ప్రభుత్వ జూనియర్ కాలేజీల ఏర్పాటుతో పాటు వాటిలో ఒకటి బాలికల కోసం కేటాయించిన గత ప్రభుత్వం 292 ఉన్నత పాఠశాలలను బాలికల కోసం హైస్కూల్ ప్లస్‌గా అప్‌గ్రేడ్ చేసింది. 352 కేజీబీవీల్లో ఇంటర్మీడియట్ విద్యను ప్రవేశపెట్టారు. 2022–23 నుంచి 14 కో–ఎడ్ జూనియర్ కళాశాలలను బాలికల జూనియర్ కళాశాలలుగా మార్చారు. దీంతో మొత్తం 679 మండలాల్లో రెండు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఏర్పాటై బాలికల కోసం ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల అందుబాటులోకి వచ్చింది. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని 504 హైస్కూల్ ప్లస్‌లను రద్దు చేసే దిశగా చర్యలు తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం ఇవి ఉండవని ఇటీవలే ప్రకటించింది.‘ఆణిముత్యాల’ ఆశలు ఆవిరి..వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా 2022–23లో టెన్త్, ఇంటర్లో ఉత్తమ మార్కులు సాధించిన 22,768 మంది విద్యార్థులను సత్కరించి ప్రోత్సహించింది. ‘జగనన్న ఆణిముత్యాలు–స్టేట్ బ్రిలియన్స్’ అవార్డులతో వెన్నుతట్టి అభినందించింది. గత విద్యా సంవత్సరంలో రాష్ట్ర స్థాయి అవార్డులు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివిన వారికే దక్కాయి. ప్రభుత్వ మేనేజ్మెంట్ పాఠశాలల్లో చదివి ఉత్తమంగా రాణించిన 10 మంది నిరుపేద విద్యార్థులను గత ప్రభుత్వం అమెరికా పర్యటనకు పంపించింది. 2023–24లో కూడా ఇదే విధానం కొనసాగుతుందనే ఉత్సాహంతో ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో చదివిన దాదాపు 32 వేల మంది విద్యార్థులు కార్పొరేట్ విద్యా సంస్థలను మించి ఫలితాలు సాధించారు. అయితే జూన్‌లో నిర్వహించాల్సిన సత్కారాన్ని కూటమి సర్కారు నిలిపివేసి ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల పట్ల అన్యాయంగా వ్యవహరించింది. వైఎస్ జగన్ అమలు చేసిన విద్యా సంస్కరణలను రద్దు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కూటమి సర్కారు ఆరు నెలల్లో ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసింది.విద్యా సంస్కరణలువైఎస్ జగన్ చేపట్టిన చదువుల యజ్ఞంతో సర్కారు బడులు సమున్నతంగా మారాయి. 2019 నుంచి వివిధ విద్యా, సంక్షేమ పథకాలను అమలు చేశారు. స్కూళ్లు తెరిచిన మొదటి రోజే జగనన్న విద్యాకానుక ఇవ్వడంతో తల్లిదండ్రులకు పుస్తకాలు, యూనిఫారం భారం లేకుండా పోయింది. బడికి దూరమవుతున్న పిల్లలను తిరిగి స్కూళ్లలో చేర్పించడం, పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదనే లక్ష్యంతో ఏటా సగటున 44,48,865 మంది తల్లుల ఖాతాల్లో ప్రతి సంవత్సరం రూ.15 వేల చొప్పున జగనన్న అమ్మఒడి కింద నేరుగా నగదు జమ చేసింది. పేదింటి పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీ పడేందుకు 2020–21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనను ప్రవేశపెట్టారు. ‘మన బడి నాడు–నేడు’ పథకంతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు సమున్నతంగా మారాయి. కొత్త భవనాలు, డబుల్ డెస్క్ బెంచీల నుంచి కాంపౌండ్ వాల్ వరకు దాదాపు 11 రకాల సదుపాయాలు సమకూరాయి. నాడు – నేడు పనులు పూర్తయిన హైస్కూళ్లకు 62 వేల ఐఎఫ్‌పీలు, ఎలిమెంటరీ స్కూళ్లకు 45 వేల స్మార్ట్ టీవీలు అందించి డిజిటల్ బోధన ప్రవేశపెట్టారు. మధ్యాహ్న భోజనంలో జగనన్న గోరుముద్ద కింద వారానికి 16 రకాల వంటకాలతో నాణ్యమైన పోషకాల భోజనం అందించారు. దేశంలో ఈ తరహా భోజనాన్ని పిల్లలకు అందించిన రాష్ట్రం మరొకటి లేదని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ప్రశంసించింది. ఇక 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేసి బైలింగ్వుల్ పాఠ్యపుస్తకాలు ఇవ్వడం దేశంలోనే తొలిసారి. ప్రాథమిక పాఠశాలల్లో స్మార్ట్ టీవీలు, ఉన్నత పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లతో డిజిటల్ బోధన అందించడంతో విద్యార్థుల్లో సామర్థ్యాలు పెరిగాయి. ఇంగ్లిష్ మీడియం బోధనతో 2022–23 విద్యా సంవత్సరంలో 84 శాతం మంది విద్యార్థులు ఆంగ్లంలో పరీక్షలు రాసి ఉత్తీర్ణులు కాగా 2023–24లో అది ఏకంగా 93 శాతానికి పెరిగింది. 2024 మార్చి పదో తరగతి పరీక్షల్లో 4.50 లక్షల మంది ప్రభుత్వ విద్యార్థుల్లో 2.25 లక్షల మంది ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాయగా 1.96 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలకే పరిమితమైన ‘స్టేట్ టాపర్స్’ గత రెండు విద్యా సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల నుంచి రావడం గమనార్హం. టాపర్స్‌గా నిలిచిన 10 మంది విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించి ఏపీలో విద్యా సంస్కరణల గురించి ప్రపంచానికి చాటి æచెప్పారు. ఇప్పుడు ఆ పథకాలు, సదుపాయాలు, ప్రోత్సాహం లేకపోవడంతో ప్రస్తుత విద్యా సంవత్సరంలో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ విద్యా సంస్థలకు తరలిపోయారు. -
భావి తరాలపై పెట్టుబడే: సీఎం రేవంత్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘దేశ భవిష్యత్తే కాదు ప్రపంచానికే విజ్ఞానాన్ని అందించే శక్తి మన విద్యార్థులకు ఉంది. పిల్లలకు సరైన వసతి కల్పించకపోతే, నాణ్యమైన విద్యను అందించకపోతే మనం సమాజానికి ద్రోహం చేసినట్లు కాదా? సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్లు. వీటిపై పెడుతున్న వ్యయాన్ని భవిష్యత్ తరాలపై పెట్టుబడిగా చూడాలి కానీ.. ఇతర ఖర్చులా భావించొద్దు. డైట్, కాస్మెటిక్ చార్జీలు, విద్యార్థులకు మౌలిక సదుపాయాలపై పెడుతున్న ఖర్చులను భవిష్యత్తు పెట్టుబడిగా చూడాలి. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో మన విద్యార్థులు 60% ఉంటారు. మల్టీ టాలెంటెట్ స్టూడెంట్స్‌ను ప్రోత్సహించడంలో మనమెందుకు వెనుకబడుతున్నాం? వివిధ హోదాల్లో పని చేస్తున్న అధికారులు, బోధన, బోధనేతర సిబ్బంది ఈ విషయంలో ఆత్మవిమర్శ చేసుకోవాలి’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. సీఎం శనివారం రంగారెడ్డి జిల్లా చిలుకూరులోని సాంఘిక, సంక్షేమ గురుకుల పాఠశాలల్లో కామన్ డైట్ మెనూ పథకాన్ని ప్రారంభించి అనంతరం మాట్లాడారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...ఆ అపోహను తొలగించాలి..సాధారణంగా ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదువుకునే విద్యార్థుల్లో తక్కువ టాలెంట్ ఉంటుందని, వెనుకబడిన వారు మాత్రమే వీటిలో చదువుకుంటారనే అపోహ ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. దాన్ని తొలగించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే మల్టీ టాలెంటెండ్ హబ్‌గా నిరూపించాలి. పీవీ నరసింహారావు సీఎంగా ఉన్నప్పుడే సర్వేల్ గురుకులాన్ని ప్రారంభించారు. ప్రస్తుత పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ బుర్ర వెంకటేశం సహా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి కూడా ఇక్కడే చదువుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు విశ్వాసం కల్పించాలనే ఉద్దేశంతో డిప్యూటీ సీఎం భట్టితో ఓ కమిటీ ఏర్పాటు చేశాం. సామాజిక బాధ్యతగా విద్యా ప్రమాణాలు పెంచాలని, నాణ్యమైన వసతులు కల్పించాలనే దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ఇందులోభాగంగా డైట్ చార్జీలను 40 శాతం పెంచాం. కాస్మొటిక్ చార్జీలను ఏకంగా 200 శాతం పెంచాం’ అని రేవంత్ చెప్పారు.ప్రైవేట్ టీచర్లకు మీకన్నా ఎక్కువ జీతాలున్నాయా?ప్రభుత్వ ఉపాధ్యాయులను సూటిగా అడుగుతున్నా. ప్రైవేటు స్కూళ్లలో చదువు చెబుతున్న వాళ్లు మీకన్నా ఎక్కువ విద్యా ప్రమాణాలు ఉన్నవాళ్లా? వాళ్లకేమైనా మీకన్నా ఎక్కువ జీతభత్యాలున్నాయా? మరెందుకు 11 వేల ప్రైవేటు స్కూళ్లలో 33 లక్షల మంది పిల్లలు చదువుతుంటే.. 26 వేల ప్రభుత్వ స్కూళ్లలో 23 లక్షల మంది చదువుతున్నారు? పేదలు కూలికిపోయి కూడబెట్టిన డబ్బులతో పిల్లలను ప్రైవేటు బడులకు పంపి, ఇంగ్లిష్ మీడియం చదివించేందుకు తాపత్రయపడుతున్నారు. సామాజిక బాధ్యతగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడం ద్వారా వారిలో విశ్వాసం కల్పించాలి. ఈ మధ్య హాస్టల్లో ఫుడ్ పాయిజనై ఓ అమ్మాయి చనిపోయింది. ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగాలేక వాళ్ల పిల్లలను హాస్టళ్లలో పెడుతున్నారే కానీ, ప్రేమ లేక కాదు. ప్రభుత్వాన్ని నమ్మి పిల్లలను ఈ గురుకులాల్లో చేర్పిస్తే.. వారి సంక్షేమం, యోగక్షేమాలు చూడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే..ఆ బాధ్యతను ఎవరు తీసుకోవాలి? ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులు, ప్రభుత్వంపై ఉంది.ప్రతి నెలా 10న ఖాతాల్లోకి పైసలుసకాలంలో బిల్లులు రావడం లేదని, అప్పు చేసి, హాస్టళ్లలో విద్యార్థులకు భోజనం వడ్డించాల్సి వస్తోంది. నాణ్యతలో రాజీ పడాల్సి వస్తోందనే ప్రచారం లేకపోలేదు. ఇకపై ప్రతి నెలా 10వ తేదీలోగా గ్రీన్ చానల్ ద్వారా డైట్, కాస్మొటిక్, ఇతర అన్ని నిధులు వారి ఖాతాల్లో జమ చేస్తాం. దీన్ని నేనే స్వయంగా పర్యవేక్షిస్తా. అధికారులు, ప్రజాప్రతినిధులు విధిగా హాస్టళ్లను తనిఖీ చేసి, వారితో పాటు కూర్చొని భోజనం చేయాలని ఆదేశాలు జారీ చేశాం. మెస్ మేనేజ్మెంట్ కమిటీల్లోనూ విద్యార్థుల భాగస్వామ్యం చేయనున్నాం.మట్టిలో మాణిక్యాలను గుర్తించాలిఏటా 1.10 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు పట్టాలు తీసుకుని బయటికి వస్తే.. కేవలం పది వేల మందికే ఉద్యోగాలు దొరుకుతున్నాయి. వృత్తి నైపుణ్యం లేకపోవడం వల్లే ఉద్యోగాలు దొరకడం లేదు. టాటా గ్రూపు సహకారంతో 75 ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీ)గా మార్చాం. ఇది పోటీ ప్రపంచానికి దీటుగా విద్యార్థులను తీర్చిదిద్దుతుంది. ఐటీఐలో చేరిన వారికి వందశాతం ఉద్యోగం వస్తుంది. కనీసం నెలకు రూ.30 వేలు సంపాదించే అవకాశం ఉంది. ఇంజనీరింగ్ కోర్సులను కూడా అప్‌గ్రేడ్ చేయాలని సూచించాం. ఒలింపిక్స్‌లో భారత్ ఒక్క బంగారుపతకం కూడా గెలవలేక పోయింది. ప్రపంచ దేశాల ముందు మన దేశానికి అవమానం కాదా? కోటి జనాభా ఉన్న దక్షిణ కొరియా 32 మెడల్స్ సాధిస్తే.. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం మాత్రం గుడ్లప్పగించి చూస్తోంది. 2028 ఒలింపిక్స్‌లో తెలంగాణ క్రీడాకారులు సాధించాలని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్ బాక్సింగ్ చాంపియన్‌గా రాణిస్తే డీఎస్పీగా.. క్రికెట్లో రాణించిన సిరాజ్‌కు ఎడ్యుకేషన్ లేకపోయినా డీఎస్పీగా నియమించాం. చదువే కాదు.. క్రీడల్లోనూ రాణించాలి. విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, వారికి శిక్షణ ఇద్దాం. మట్టిలో మాణిక్యాలను వెలికితీద్దాం.పిల్లలతో కలిసి భోజనం చేసిన సీఎంఅనంతరం సీఎం రేవంత్‌రెడ్డి ఐఐటీ, మెడిసిన్ పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన సాయిరాం, అమన్, శ్రుతి, హేమంత్, సిద్దార్థ్, దీక్షితలకు ల్యాప్‌టాప్‌లను అందించారు. పిల్లలతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, కలెక్టర్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కూటమి కొత్త స్టంట్స్
సాక్షి, అమరావతి : సహజంగా ప్రతి స్కూల్లో జరిగే పేరెంట్స్ కమిటీ సమావేశాల పేరు మార్చి, ఆ సమావేశాలేవో ఇప్పుడే జరుగుతున్నట్టుగా, వాటిని ప్రచార వేదికలుగా మార్చుకుని చంద్రబాబు కూటమి ప్రభుత్వం చేస్తున్న స్టంట్స్ చూస్తుంటే ఆశ్చర్యమేస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో కష్టపడి తీర్చిదిద్దిన ప్రభుత్వ స్కూళ్లను, విద్యా రంగాన్ని ఒకవైపు నాశనం చేస్తూ.. అమ్మకు వందనం పేరిట తల్లిదండ్రులకు సున్నం రాసి, వారిని దగాచేసి, మళ్లీ ఇప్పుడు రొటీన్‌గా జరిగే పేరెంట్స్ సమావేశాలపై పబ్లిసిటీ చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ఈ ప్రపంచంలో ఒక్క చంద్రబాబు మాత్రమే ఇలాంటి మోసాలు చేయగలరన్నారు. ఇంతటి నటనా కౌశల్యం చంద్రబాబుకే సొంతం అంటూ వ్యంగోక్తులు విసిరారు. ఈ మేరకు ఆదివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..టీచర్లు–విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు కొత్తేమీ కాదు. క్రమం తప్పకుండా గతంలో నుంచీ జరుగుతున్నవే. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ విద్యా రంగానికి పూర్తి జవసత్వాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ప్రతి విప్లవాత్మక మార్పులోనూ, అమలు చేసిన ప్రతి సంస్కరణలోనూ పిల్లల తల్లిదండ్రుల ఆలోచనలు, వారి భాగస్వామ్యాన్ని తీసుకున్నాం. 15,715 పాఠశాలల్లో మొదటి విడత, 22,344 పాఠశాలల్లో మలివిడత నాడు–నేడు పనులన్నీ తల్లిదండ్రుల కమిటీల భాగస్వామ్యంతోనే జరిగాయి. అప్పట్లో పిల్లలందరికీ ఇంగ్లిష్ మీడియంలో బోధన చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా పేరెంట్స్ కమిటీలు సంపూర్ణంగా ఆమోదించి తీర్మానాలు చేశాయి. ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్స్ మెయింటెనెన్స్ ఫండ్, స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ నిర్వహణలో తల్లిదండ్రులదే ముఖ్య భూమిక. ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లల భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దడంలో ఈ విధంగా తల్లిదండ్రులు తమ వంతు పాత్ర పోషించారు. ఇప్పుడు ఈ సమావేశాలకు కొత్త టైటిల్స్ పెట్టి, ఓవైపు విద్యా రంగాన్ని నాశనం చేస్తూ, మరోవైపు తామేదో కొత్తగా చేస్తున్నామనే భ్రమ కల్పించడానికి చంద్రబాబు, టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. మరో విశేషం ఏంటంటే.. పేరెంట్స్ కమిటీ సమావేశాలకు దాతల నుంచి చందాలు, సామగ్రిని తీసుకోవాలని ఏకంగా సర్క్యులర్ పంపడం. మేం అమ్మ ఒడి కింద ప్రతి తల్లికీ ఏడాదికి రూ.15 వేల చొప్పున, క్రమం తప్పకుండా 44.49 లక్షల మంది తల్లులకు రూ.26,067 కోట్లు ఇచ్చాం. నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అంటూ చంద్రబాబు సహా కూటమి పార్టీల నాయకులు ప్రతి ఇంటికీ వెళ్లి ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ రూ.15 వేల చొప్పున ఇస్తామన్నారు. సూపర్ సిక్స్ అంటూ ఊరూరా, ప్రతి ఇంటికీ డప్పు కొట్టారు. ఇద్దరు పిల్లుంటే రూ.30 వేలు.. ముగ్గురుఉంటే రూ.45 వేలు.. నలుగురు ఉంటే రూ.60 వేలు ఇస్తామన్నారు. ఎంత మంది పిల్లలనైనా కనాలని చంద్రబాబు పిలుపు కూడా ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయ్యింది. ఇప్పటి వరకు ఒక్క పైసా ఇవ్వలేదు కదా.. గతంలో ఉన్న అమ్మ ఒడి పథకాన్నీ ఆపేశారు. బడ్జెట్లో రూ.12,450 కోట్లు పెట్టాల్సి ఉండగా పెట్టలేదు. మరి ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారు? ఆ హామీని అమలు చేయక పోవడంతో తల్లిదండ్రుల మీద పిల్లల ఖర్చులు, వారి భారం పడుతోంది కదా? నిన్నటి పేరెంట్స్ కమిటీ సమావేశాల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, విద్యా శాఖ మంత్రిగా లోకేష్ అసలు దీని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇది దగా చేయడం కాదా? ఒక్క మాట కూడా మాట్లాడ్డం లేదంటే తల్లిదండ్రులకు సున్నం పెడుతున్నట్టే కదా?గతంలో రోజుకో మెనూతో ఘనంగా ఉన్న మధ్యాహ్న భోజన పథకం గోరు ముద్ద కార్యక్రమం అత్యంత దారుణంగా తయారయ్యిందంటూ ఈ మీటింగ్స్‌లో పేరెంట్స్ గగ్గోలు పెట్టడం మీ చెవులకూ వినిపించిందా చంద్రబాబు గారూ? డొక్కా సీతమ్మ అనే మహా తల్లి పేరుపెట్టి చివరకు స్కూళ్లలో, హాస్టళ్లలో విద్యార్థుల డొక్క మాడుస్తున్నారు. కనీసం ఆయాలకు జీతాలు కూడా ఇవ్వడం లేదు. విద్యార్థులు అపరిశుభ్రమైన ఆహారం తిని ఆరోగ్యంపాడై ఆస్పత్రుల్లో చేరుతున్న ఘటనలు మీ ప్రభుత్వ హయాంలో కోకొల్లలు. పిల్లలు వెళ్లే గవర్నమెంటు స్కూళ్లలో టాయిలెట్ల నిర్వహణ కోసం ఇచ్చే టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్, స్కూళ్ల నిర్వహణ కోసం ఇచ్చే స్కూల్ మెయింటినెన్స్ ఫండ్ ఈ రోజు ఏమైంది? టాయిలెట్ల మెయింటెనెన్స్ గురించి గానీ, స్కూళ్ల మెయింటినెన్స్ గురించి గానీ ఎవరైనా పట్టించుకున్నారా? అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఇలా ప్రభుత్వ విద్యా రంగాన్ని దిగజార్చి, కావాలనే సమస్యలు సృష్టించి ఉద్దేశ పూర్వకంగా ప్రైవేటు బడులకు వెళ్లేలా చేసి, తల్లిదండ్రులు చదువు కొనుక్కునేలా వారిపై ఆర్థిక భారం మోపి, ఇప్పుడు అదే పిల్లల ముందుకు, తల్లిదండ్రుల ముందుకు వెళ్లి ఏమార్చే మాటలు చెప్పడానికి, వారిని మభ్యపెట్టడానికి సిగ్గేయడం లేదా?అధికారంలోకి రాగానే స్కూళ్ల బాగు కోసం వైఎస్సార్సీపీ చేసిన మంచి పనులన్నింటినీ కూడా నిలిపేశారు. మలి దశలో మిగిలిపోయిన నాడు–నేడు పనులను ఉద్దేశ పూర్వకంగా ఆపేశారు. అదనపు తరగతి గదుల నిర్మాణాలనూ పట్టించుకోలేదు. ఏ కారణంతో నిలిపేశారు? ఎందుకు నిలిపేశారు? ఎంతో కష్టపడి స్కూళ్లకు సీబీఎస్ఈ అఫిలియేషన్ తీసుకు వచ్చాం. ఇప్పుడు సీబీఎస్ఈని ఎందుకు రద్దు చేశారు? ఇంగ్లిష్ మీడియం బోధనను ఎందుకు నిరుత్సాహ పరుస్తున్నారు? ప్రపంచ స్థాయిలో గవర్నమెంటు స్కూలు పిల్లలను తయారు చేసేలా 3వ తరగతి నుంచి ప్రవేశ పెట్టిన టోఫెల్ క్లాసు, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ల విధానం, సీబీఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం, ఫ్యూచర్ టెక్నాలజీపై తరగతులు.. ఇలా ఇవన్నీ ఎందుకు ఆపేశారు? డిజిటల్ లెర్నింగ్‌లో భాగంగా 8వ తరగతి విద్యార్థులకు ఇచ్చే ట్యాబుల పంపిణీని ఎందుకు రద్దు చేశారు? 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ల కాన్సెప్ట్‌ను ఎందుకు రద్దు చేశారు?మేం స్కూళ్లలో 6వ తరగతి నుంచే ప్రతి క్లాసులో, ప్రతి స్కూల్లో పెట్టిన ఐఎఫ్‌పీ ప్యానెల్స్, డిజిటల్ స్క్రీన్ల సమర్థ వినియోగం కోసం ఫైనల్ ఇయర్ ఇంజినీరింగ్ స్టూడెంట్ను ప్రతి స్కూలుకూ పెట్టాలన్న కార్యక్రమాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? దీనివల్ల వేల మంది ఇంజినీరింగ్ స్టూడెంట్లకు వచ్చే ఉపాధి పోతుంది కదా? ఐఎఫ్‌పీ ప్యానెల్స్ మెయింటినెన్స్ మూలన పడదా?విద్యా దీవెన, వసతి దీవెనల కింద గతంలో విద్యార్థులకు ఇచ్చే తోడ్పాటు ఇప్పుడు లభిస్తోందా? ఈ జనవరి వస్తే నాలుగు త్రైమాసికాలుగా ఎలాంటి చెల్లింపులు లేవు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇచ్చే వసతి దీవెన, విద్యా దీవెన.. ఈ రెండింటికీ కలిపి ఏకంగా రూ.3,900 కోట్లు బకాయిలుగా పెట్టి, ఈ రోజు పిల్లలను ఉద్ధరిస్తున్నట్టుగా మీరు చేస్తున్న డ్రామా మరో డీవియేషన్ రాజకీయం కాదా? -
విద్యా వ్యవస్థలో సమూల మార్పులు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ప్రభుత్వం నిర్వహిస్తున్న మెగా పేరెంట్, స్టూడెంట్స్, టీచర్స్ ఈవెంట్ గిన్నిస్ బుక్‌లో శాశ్వతంగా లిఖించదగ్గ కార్యక్రమమని సీఎం చంద్రబాబు చెప్పారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నామన్నారు. శనివారం బాపట్ల మున్సిపల్ పాఠశాలలో జరిగిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ దేశంలో నంబర్ వన్ అయిందంటే తాను అమలు చేసిన విజనేనన్నారు. ఇప్పుడు 2047 విజన్ తెచ్చానన్నారు. ప్రైవేట్ పాఠశాలలకంటే బెటర్‌గా ప్రభుత్వ పాఠశాలల పిల్లలను చదివిస్తామన్నారు. ఏడాదికి మూడు సార్లు సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఏటా డిసెంబర్ 7న మెగా ఈవెంట్ నిర్వహిస్తామని వెల్లడించారు. విద్యార్థులకు విద్యతోపాటు ఆసక్తి ఉన్న అన్ని రంగాల్లోని అంశాలపై శిక్షణ ఇస్తామన్నారు. తన హయాంలో 11 డీఎస్సీలు నిర్వహించి.. 1.50 లక్షల మందికి టీచర్ పోస్టులు ఇచ్చామన్నారు. 16,347 మెగా డీఎస్సీ పోస్టులు జూన్ నాటికి భర్తీ చేస్తామన్నారు. ఇక నుంచి ఏటా డీఎస్సీ ఉంటుందన్నారు. 117జీవో 4 లక్షల మంది పిల్లలు పాఠశాలలకు రాని పరిస్థితి ఉందన్నారు. రాబోయే ఏడాదికి పాఠశాలల్లో పెనుమార్పులు తెస్తామన్నారు. కాగా సభకు చ్చిన ఓ విద్యార్థి తండ్రి గుండెపోటుకు గురైతే నడిపించుకుంటూ తీసుకెళ్లడం ఆందోళనకు గురి చేసింది. సభకు ఎనిమిదో తరగతి చదువుతున్న సాహుల్ అనే విద్యార్థి తండ్రి పఠాన్‌బాజీ హాజరయ్యారు. ఉదయం 8 గంటల నుంచే విద్యార్థులను, వారి తల్లిదండ్రులను హైస్కూలుకు పిలిపించారు. సీఎం వచ్చే వరకు అందరినీ అక్కడి నుంచి లేవకుండా ఉంచారు. కనీసం ఫ్యాన్లు కూడా వేయలేదు. ఈ వాతావరణం మధ్య ఇమడలేక 11 గంటల సమయంలో పఠాన్‌బాజీ గుండెపోటుకు గురయ్యాడు. అక్కడే మెడికల్ క్యాంపు ఉన్నప్పటికీ వీల్‌చైర్ కూడా లేకపోవటం, అంబులెన్సు లేకపోవటంతో బాధితుడిని నడిపించుకుంటూ బయటకు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆటోలో ఏరియా వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. -
TG: మధ్యాహ్న భోజనంపై పిటిషన్.. హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా విద్యార్థులకు పోషకాలతో కూడిన భోజనం వడ్డించాలని కోర్టు ఆదేశించింది. భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థతకు గురైన ఘటనల్లో నివేదికను సమర్పించాలని ఆదేశించిన ధర్మాసనం.. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేసింది.భోజనం వికటించిన ఘటనల్లో రెండు కమిటీలు ఏర్పాటు చేసినట్లు ఏఏజీ కోర్టుకు తెలిపారు. బాధ్యులను వాళ్లను ఇప్పటికే సస్పెండ్ చేసినట్లు కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. నాణ్యమైన భోజనాన్ని అందించడానికి ఏజెన్సీలకు చెల్లించే డబ్బులను 40 శాతం పెంచామని ఏఏజీ తెలిపారు.పీఎం పోషణ్ పథకంలో భాగంగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలుండాలన్న పిటిషనర్ తరఫు న్యాయవాది.. కమిటీల పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. కమిటీలు సరిగ్గా పనిచేసేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు. అన్ని కమిటీలు పనిచేస్తున్నాయని ఏఏజీ చెప్పారు. ఏఏజీ చెప్పిన వివరాలను హైకోర్టు నమోదు చేసుకుంది. -
కర్నూలు జిల్లా ప్రభుత్వ స్కూళ్లలో పెరుగుతోన్న విద్యార్థుల డ్రాపౌట్స్
-
విద్యార్థుల ఆహారంపై నిర్లక్ష్యం చేస్తే వేటే: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ల విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్తో వరుసగా అస్వస్థతకు గురవుతున్న అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీరియస్ అయ్యారు. పలుమార్లు హెచ్చరించినా ఇలాంటి ఘటనలు జరగడాన్ని తీవ్రంగా పరిగణించారు. విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాలని, వారికి అందించే ఆహారం విషయంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉండవద్దని స్పష్టం చేశారు. ఏమాత్రం నిర్లక్ష్యం ఉన్నట్లు తేలినా సదరు అధికారులు, సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. తరచూ తనిఖీలు చేయండి ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు పరిశుభ్ర వాతావరణంలో పౌష్టికాహారం అందించే విషయంలో ఎటువంటి అలక్ష్యానికి తావు ఇవ్వొద్దని కలెక్టర్లను సీఎం రేవంత్ ఆదేశించారు. ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై ఇదివరకే పలుమార్లు సమీక్షించానని గుర్తు చేశారు. పలుమార్లు ఆదేశాలు ఇచ్చినా పొరపాట్లు చోటుచేసుకుంటుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్లు తరచూ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలలను తనిఖీ చేయాలని.. ఈ మేరకు నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఉదాసీనంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అప్రతిష్టపాలు చేసేందుకు కొందరి యత్నాలు విద్యార్థులకు మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో వేల సంఖ్యలో ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టామని.. పౌష్టికాహారం అందించేందుకు డైట్ చార్జీలు పెంచామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తాము ఇలా సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నా.. కొందరు ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అటువంటి శక్తుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, బాధ్యులైన వారిని చట్టప్రకారం శిక్షిస్తామని ప్రకటించారు. వసతి గృహాల్లో ఆహారం విషయంలో కొందరు ఉద్దేశపూర్వకంగా వదంతులు సృష్టిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళన సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. -
ప్రాణాలు పోయినా పట్టించుకోరా?: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: నారాయణపేట జిల్లా మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం కలుíÙతమై విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులు చనిపోయినా పట్టించుకోరా? అని మండిపడింది. ‘ఒకే పాఠశాలలో మూడుసార్లు ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు అస్వస్థతకు గురైతే అధికారులు ఏం చర్యలు తీసుకున్నారు? విద్యార్థులు చనిపోతున్నా స్పందించకపోవడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా లేనట్లు అనిపిస్తోంది. హైకోర్టు ఆదేశాలిస్తేనే అధికారులు పని చేస్తారా?’అని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యతాప్రమాణాలు పాటించడం లేదని, అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు నియంత్రణకు కమిటీని నియమించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ‘హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్’అధ్యక్షుడు కీతినీడి అఖిల్ శ్రీ గురుతేజ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావుతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఫుడ్ పాయిజన్‌తో ఎంత మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.. అధికారులు ఏం చేశారు.. బాధ్యులపై ఏం చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలతో నివేదిక అందజేయాలని అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇమ్రాన్‌ఖాన్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి (డిసెంబర్ 2వ తేదీ) వాయిదా వేసింది. చట్టం అమలే లేదు.. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించటం లేదని పిటిషనర్ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ‘రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. 8వ తరగతి వరకు ప్రభుత్వ స్కూళ్లలో ప్రధానమంత్రి పోషణ్ మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అమలు చేయడం లేదు. అర్హులైన మహిళలు, పిల్లలకు సమీకృత శిశు అభివృద్ధి సేవా పథకం (ఐసీడీఎస్) ప్రకారం మెనూ అందించడం లేదు. మాగనూర్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో ఈ నెల 20న 100 మంది.. 26న 30 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మరోచోట చిన్నారి మృతి చెందింది. కరీంగనర్ జిల్లా గంగాధర్ మండలంలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 షెడ్యూల్ 2 ప్రకారం నాణ్యత, పోషకాహార ప్రమాణాలు పాటించి మధ్యాహ్న భోజనం ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలి’అని కోరారు. ఇంత నిర్లక్ష్యమా? ఫుడ్ పాయిజన్ ఘటనల విషయంలో అధికారుల తీరుపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘జిల్లా విద్యాశాఖాధికారులు నిద్రపోతున్నారా? వారికి కూడా పిల్లలు ఉన్నారు కదా! మానవత్వం లేకుండా వ్యవహరిస్తారా? నవంబర్ 20న, 24న, 26న.. ఒకే పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయినా ఉన్నతాధికారులకు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదా? ఇంత సాంకేతిక యుగంలో వారం క్రితం జరిగిన ఘటనపై వివరాలు లేవంటూ వాయిదా కోరతారా? ఘటన జరిగింది మారుమూల ప్రాంతంలో కూడా కాదు.. హైదరాబాద్‌కు కేవలం 70 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. జిల్లా విద్యాశాఖాధికారికి ఫోన్ లేదా? ఇది సిగ్గుపడాల్సిన విషయం. మమ్మల్నే నిర్ణయం తీసుకోమంటే వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారిని సస్పెండ్ చేస్తాం. పాస్ ఓవర్ (స్పల్ప వాయిదా)కు గానీ, వాయిదాకుగానీ అంగీకరించం. వెంటనే ఏఏజీ వచ్చి సమాధానం చెప్పాలి’అని ఆదేశించింది. దీంతో భోజన విరామం తర్వాత ధర్మాసనం ముందు ఏఏజీ హాజరై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అన్ని జిల్లాల్లో ఆహార నాణ్యతను పరీక్షించండి పాఠశాలల్లో ఆహార కలుషితంపై కఠిన చర్యలు తీసుకొంటున్నామని ధర్మాసనానికి ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్ తెలిపారు. ‘చిన్నారులే ఈ రాష్ట్ర ఆస్తులు, భవిష్యత్ ఆశాకిరణాలు. వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటాం. విద్యార్థుల కోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోంది. ఈ నెల 20న ఉప్మా తిని విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే దాన్ని మార్చాం. ఫుడ్ పాయిజన్ ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రధానోపాధ్యాయుడు సహా బాధ్యులపై సస్పెన్షన్‌కు వెనుకాడం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం. ఫుడ్ పాయిజన్‌పై పూర్తి వివరాలతో నివేదిక అందజేస్తాం. రెండు రోజుల సమయం ఇవ్వండి’అని కోరారు. వాదనలు విన్న కోర్టు.. ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున ఆహార శాంపిల్ సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్లను ఆదేశించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం– 2013 షెడ్యూల్ 2 ప్రకారం నాణ్యత, పోషక విలువలను పరిశీలించాలని సూచించింది. ఇప్పటికే చోటుచేసుకొన్న ఫుడ్ పాయిజన్ ఘటనలతోపాటు భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఏం చర్యలు తీసుకున్నారో వివరంగా తెలుపుతూ డిసెంబర్ 2వ తేదీలోగా నివేదిక అందజేయాల ఆదేశించింది. -
వికటించిన మధ్యాహ్న భోజనం
గంగాధర (చొప్పదండి): కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూర్గుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించింది. శుక్రవారం మధ్యాహ్నం అన్నం తిన్న పలువురు విద్యార్థులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో మొత్తం 205 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో శుక్రవారం 180 మంది హాజరయ్యారు. మధ్యాహ్న సమయంలో పాఠశాలలో వండిన భోజనం తిన్నారు. కాసేపటికి ముగ్గురు విద్యార్థులు వాంతులు చేసుకున్నారు.ఇది చూసిన మరో 20 మంది విద్యార్థులు కడుపునొస్తోందని ఉపాధ్యాయులకు చెప్పారు. వెంటనే వారు ప్రభుత్వ వైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి వైద్యం అందించి, మాత్రలు ఇచ్చారు. విషయం తెలుసుకున్న పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు. మధ్యాహ్న భోజనానికి వండిన బియ్యం కొత్తవి కావడంతో పాటు అన్నం మెత్తగా కావడం వల్ల విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారని, ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని ఎంఈవో ప్రభాకర్‌రావు వివరించారు. -
పరువు పోతోంది పరిష్కారమేంటి?
సాక్షి, హైదరాబాద్: మధ్యాహ్న భోజనం పురుగులతో విద్యార్థులు ఏదో ఒకచోట అస్వస్థతకు లోనవుతూనే ఉన్నారు. ‘ఒకరోజు ఖమ్మం జిల్లాలో, మరోరోజు నారాయణపేట జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు తినే మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. దీనివల్ల ప్రభుత్వం పరువు పోతోంది. ఏం చేద్దాం..ఎలా పరిస్థితిని చక్కబెడదాం’అంటూ ఉన్నతాధికారులు హెచ్ఎంల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు.‘నాణ్యత లేని భోజనం పెడితే కటకటాలు లెక్కబెట్టిస్తాం’అని సీఎం నవంబర్ 14న ప్రకటించారు. అయినా వరుస ఘటనలు చోటు చేసుకోవడంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను సీఎంవో ఆదేశించింది. ఘటన జరిగినప్పుడు హెచ్ఎంనో, డీఈవోనో సస్పెండ్ చేస్తే కొత్త సమస్యలొస్తున్నాయి. ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. టీచర్ల నుంచి వ్యతిరేకత కొని తెచ్చుకుంటున్నామని సీఎం భావిస్తున్నారు. ఇవేవీ లేకుండా పురుగుల అన్నంతో పరువు పోకుండా ఏం చేయాలో నివేదిక ఇవ్వడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. సమస్య ఎక్కడ? రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ స్కూళ్లున్నాయి. విద్యార్థుల హాజరుశాతం పెంచేందుకు మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టి పౌర సరఫరాల శాఖ నుంచి బియ్యం అందజేస్తారు. మిగతా సరుకులన్నీ స్వయం సహాయ బృందాల నిర్వహణలో ఉంటాయి. ఎక్కువ మంది విద్యార్థులుంటే కొంత వరకూ నిర్వహణ సాధ్యమవుతోంది. మరీ తక్కువగా విద్యార్థులుంటేనే నిర్వహణ వ్యయం ఇబ్బందే. 13,005 స్కూళ్లలో 50 లోపు విద్యార్థులే ఉన్నారు.ఈ కారణంగా వచ్చే నిధులు తక్కువ. స్వయం సహాయ బృందాలకు నెలవారీ బిల్లులు కూడా చెల్లించడం లేదు. అప్పు తెచ్చి వంట చేస్తున్నామని, వడ్డీ తామే కడుతున్నామంటున్నారు. ఈ సమస్యలు పరిష్కరించకుండా ఏం చేసినా నాణ్యత ఎలా పెరుగుతుందని వారు ప్రశి్నస్తున్నారు. అదీగాక సివిల్ సప్లై నుంచి వచ్చే బియ్యంలో పురుగులు ఉంటున్నాయని, వాటిని రీ సైక్లింగ్ చేస్తే తప్ప పురుగులు అరికట్టడం సాధ్యం కాదంటున్నారు. దీనికి బడ్జెట్ ఉండదని హెచ్ఎంలు అంటున్నారు. ఇక్కడో రీతి... అక్కడో తీరు కేజీబీవీ, రెసిడెన్షియల్ స్కూళ్లలో నాణ్యమైన మెనూ అమలు చేస్తున్నారు. ఒక్కో రోజు ఒక్కో రకమైన ఆహారం ఇస్తారు. గుడ్లు కూడా ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. అన్నం, వెజిటబుల్స్, రసం, కోడిగుడ్డు, ఆకుకూరపప్పు, నెయ్యి, పెరుగు ఇస్తున్నారు. కాబట్టి నిర్వహణ వ్యయం సరిపోతుందనేది హెచ్ఎంల వాదన. ప్రభుత్వ స్కూళ్లలో మాత్రం బియ్యం, కూరగాయలు, పప్పు మాత్రమే ఇస్తున్నారు. పప్పు, కోడిగుడ్డు రోజూ ఉండదు. కూరల రేట్లు రోజుకో విధంగా ఉంటున్నాయి. ఇవన్నీ నిర్వహణ సమస్యగా ఉన్నాయని ప్రధానోపాధ్యాయులు విద్యాశాఖకు తెలిపారు.విధాన పరమైన లోపాలున్నాయి మధ్యాహ్న భోజన నాణ్యత పెంచాలంటే ముందుగా విధానపరమైన మార్పులు అవసరం. సంబంధిత ఏజెన్సీలకు ముందుగా బిల్లులు చెల్లించాలి. నాణ్యత పెంచేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించాలి. నిధులు పెంచాలి. తప్పు జరిగినప్పుడు హెచ్ఎంలనే బాధ్యులను చేయడం అన్యాయం. – పి.రాజాభాను చంద్రప్రకాశ్, తెలంగాణ గెజిటెడ్ హెచ్ఎంల సంఘం అధ్యక్షుడు టీచర్లనే ప్రశ్నించడం సరికాదు మధ్యాహ్న భోజన పథకం అమలులో హెచ్ఎంల పాత్ర నామమాత్రమని 2014లో ముంబై హైకోర్టు తీర్పు చెప్పింది. బోధన సంబంధమైన విధులే హెచ్ఎంలకు తలకు మించి ఉన్నాయి. తప్పు జరిగితే బాధ్యులను చేయాలనే విధానం మంచిది కాదు. – పింగిలి శ్రీపాల్‌రెడ్డి, పీఆర్టీయూటీఎస్ అధ్యక్షుడు -
ప్రభుత్వ స్కూల్లో ఫుడ్‌పాయిజన్.. హరీశ్‌రావు ఆగ్రహం
సాక్షి,హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్‌పై మాజీ మంత్రి,బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు ఆగ్రహం వ్వక్తం చేశారు. తాజాగా నారాయణపేట ప్రభుత్వ పాఠశాలలో భోజనం తిని 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై బుధవారం(నవంబర్20) ఒక ప్రకటన విడుదల చేశారు. అవి గురుకులాలా లేక నరక కూపాలా? ప్రభుత్వ పాఠశాలలా లేక ప్రాణాలు తీసే విష వలయాలా? అని ప్రశ్నించారు.‘నల్లగొండ జిల్లాలో పాముకాటుకు గురైన విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.నారాయణపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో 50 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. రాష్ట్రంలోని గురుకులాల్లో,ప్రభుత్వ పాఠశాలల్లో అసలు ఏం జరుగుతున్నది.పాఠాలు నేర్చుకోవడం కాదు ప్రాణాలతో బయటపడితే చాలు అనే పరిస్థితిని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం.రేవంత్ ఇందుకేనా మీరు విజయోత్సవాలు జరుపుతున్నది? మీ నిర్లక్ష్య పూరిత వైఖరికి ఇంకెంతమంది విద్యార్థులు బలి కావాలి? ఆస్పత్రి పాలైన విద్యార్థులను హైదరాబాదుకు తరలించి మెరుగైన వైద్యం అందించాలి’అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. -
మేమూ ఇంగ్లిష్‌లో మాట్లాడతాం!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇంగ్లిష్ సులువుగా అర్థం చేయించడం.. ఆపై మాట్లాడేలా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ ‘వుయ్ కెన్ లెర్న్ స్పోకెన్ ఇంగ్లిష్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ఉన్నప్పటికీ.. విద్యార్థుల్లో భయాన్ని తొలగించేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఇంగ్లిష్ సబ్జెక్ట్తోపాటే విద్యార్థులు మాట్లాడేలా గతనెల 28 నుంచి జిల్లాలోని 16 ప్రభుత్వ పాఠశాలల్లో స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులను నిర్వహిస్తున్నారు. 1,252 మంది విద్యార్థులకు లబ్ధి జిల్లాలోని కల్లూరు, తల్లాడ, వైరా, కొణిజర్ల, చింతకాని, ముదిగొండ, బోనకల్, ఖమ్మంఅర్బన్, రఘునాథపాలెం, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ మండలాల్లోని 16 పాఠశాలలను స్పోకెన్ ఇంగ్లిష్ ప్రాజెక్టుకు ఎంపిక చేశారు. ఆయా పాఠశాలల్లో 6, 7 తరగతుల విద్యార్థులు 1,252 మంది ఉండగా.. 16 మంది టీచర్లకు అవగాహన కల్పించారు. ఇంటరాక్టివ్ ప్లాట్ ప్లానర్ (ఐఎప్పీ) డిజిటల్ బోర్డులున్న పాఠశాలలను ఎంపిక చేశారు. హైదరాబాద్‌కి చెందిన భారత్ దేఖో, మంత్రా పర్ చేంజ్, అలోకిట్, శిక్షా లోక్ స్వచ్ఛంద సంస్థలు రోజూ 15 నిమిషాల నిడివి ఉన్న వీడియోలను ఈ పాఠశాలలకు ఆన్లైన్లో పంపిస్తుండగా.. వీడియో చూశాక మరో 15 నిమిషాలు విద్యార్థుల నడుమ గ్రూప్ డిస్కషన్ నిర్వహిస్తున్నారు. వీడియోలోని బొమ్మలు, వాటి నడుమ సంభాషణ గుర్తుండి ఇంగ్లిష్ మాట్లాడటం సులువవుతుందని భావిస్తున్నారు. వీటిద్వారా విద్యార్థులు ఉత్సాహంగా ఇంగ్లిష్ నేర్చుకుంటున్నారు. 15 రోజులకోసారి సమీక్షిస్తున్న కలెక్టర్.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతీ విద్యార్ధికి ఇంగ్లిష్ పరిజ్ఞానం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. విద్యార్థులకు మంచి అవకాశం ఇంగ్లిష్ నేర్చుకోవడానికి విద్యార్థులకు ఇది చక్కని అవకాశం. ఆడియో, వీడియోల ద్వారా పిల్లలు ఉత్సాహంతో ఒత్తిడి లేకుండా నేర్చుకుంటారు. ఇప్పటికే చిన్నచిన్న వాక్యాలు మాట్లాడుతున్నారు. కలెక్టర్, డీఈఓ ఆదేశాలతో త్వరలోనే ఇంకొన్ని పాఠశాలల్లో ప్రారంభిస్తాం. –జక్కంపూడి జగదీష్, జిల్లా కోఆర్డినేటర్, ఉయ్ కెన్ లెర్న్ ప్రోగ్రాం ఇంగ్లిష్ అంటే భయం పోతోంది.. ఈ కార్యక్రమంతో విద్యార్థుల్లో ఇంగ్లిష్ అంటే భయం తగ్గింది. కథల ద్వారా నేర్చుకోవడం, మాట్లాడటం జరుగుతోంది. విద్యార్థులు చిన్నప్పటి నుంచే ఇంగ్లిష్‌పై పట్టు సాధిస్తారు. ఈ కార్యక్రమం ప్రారంభించిన జిల్లా విద్యాశాఖకు ధన్యవాదాలు. –బి.రామనాథం, టీచర్, జెడ్పీహెచ్ఎస్, చిన్న కోరుకొండి, కల్లూరు మండలం చక్కగా నేర్చుకుంటున్నా.. ఈ కోర్సు వల్ల ఇంగ్లిష్ నేర్చుకున్నా. ప్రస్తుతం చిన్నచిన్న వాక్యాలను మాట్లాడగలుగుతున్నా. త్వరలోనే ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడతాననే నమ్మకం ఏర్పడింది. మాలాంటి విద్యార్థులకు ఇది ఒక చక్కటి అవకాశం. – డి.బ్యూలా, 7వ తరగతి, జెడ్పీహెచ్ఎస్, గుబ్బగుర్తి, కొణిజర్ల మండలం కలెక్టర్ సార్‌కు ధన్యవాదాలు.. స్పోకెన్ ఇంగ్లిష్ ప్రోగ్రాంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేర్చుకోగలుగుతున్నాం. రోజూ వినడం వల్ల కొంతకాలం తర్వాత మాట్లాడగలుగుతాం. మా పాఠశాలలో స్పోకెన్ ఇంగ్లిష్ మొదలు పెట్టినందుకు కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ సార్‌కు ధన్యవాదాలు. –బి.దేవిక, 7వ తరగతి, జెడ్పీఎస్ఎస్, కల్లూరు, ఖమ్మం జిల్లా త్వరలోనే 200 పాఠశాలల్లో.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో ఇంగ్లిష్ మాట్లాడగలమనే విశ్వాసం కలిగించేలా ఈ కార్యక్రమం చేపట్టాం. ప్రస్తుతం 16 పాఠశాలలను ఎంపిక చేసినా త్వరలోనే 200 పాఠశాలలకు విస్తరిస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివాక డిగ్రీ, పీజీ పూర్తిచేసిన వారు ఇంగ్లిష్‌లో రాణించలేక ప్రైవేట్ ఉద్యోగాల ఇంటర్వ్యూల్లో ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. దీంతో ‘వుయ్ కెన్ లెర్న్ స్పోకెన్ ఇంగ్లిష్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. – ముజమ్మిల్‌ఖాన్, కలెక్టర్, ఖమ్మం జిల్లా చక్కగా నేర్చుకుంటున్నా.. ఈ కోర్సు వల్ల ఇంగ్లిష్ నేర్చుకున్నా. ప్రస్తుతం చిన్నచిన్న వాక్యాలను మాట్లాడగలుగుతున్నా. త్వరలోనే ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడతాననే నమ్మకం ఏర్పడింది. మాలాంటి విద్యార్థులకు ఇది ఒక చక్కటి అవకాశం.– డి.బ్యూలా, 7వ తరగతి, జెడ్పీహెచ్ఎస్, కొణిజర్ల మండలం -
తరగతి గదిలో కొత్త తరం!
సాక్షి, హైదరాబాద్: ఇటీవల డీఎస్సీ ద్వారా ఎంపికైన 10,006 మంది కొత్త ఉపాధ్యాయులు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా విధుల్లో చేరారు. వాస్తవానికి వారి నియామక తేదీ ఈనెల 10 అని, అన్ని జిల్లాల డీఈవోలు పేర్కొన్నారు. ప్రతీ జిల్లాలోను కౌన్సెలింగ్ చేపట్టిన తర్వాత వారికి ప్రభుత్వ స్కూళ్లను కేటాయించారు. అధికార వర్గాల సమాచారం ప్రకారం ఎక్కువ మంది సొంత మండలాల్లోనే విధుల్లో చేరారు. ఇతర మండలాలకు వెళ్లిన వాళ్లు 20 శాతం ఉండొచ్చని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఎస్జీటీలు చేరిన వాటిలో 85 శాతం ఏకోపాధ్యాయ పాఠశాలలే ఉన్నట్టు తెలిసింది. వీటిలో గరిష్టంగా 20 మంది విద్యార్థులే ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంగళవారం కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తికానందున బుధవారం కూడా కొనసాగినట్టు వార్తలొచ్చాయి. టీచర్లు రిలీవ్...ఇటీవల జరిగిన సాధారణ బదిలీలు, పదోన్నతుల్లో స్థాన చలనం జరిగిన ఉపాధ్యాయులకు కొత్త టీచర్లు రావడంతో విముక్తి లభించింది. ఒకే ఉపాధ్యాయుడు ఉండటం, ఇతర ప్రాంతాల నుంచి తీసుకునే వెసులుబాటు లేకపోవడంతో దాదాపు 7 వేల మంది టీచర్లు బదిలీ అయినప్పటికీ ఇంతకాలం రిలీవ్ కాలేదు. డీఎస్సీ ద్వారా కొత్త టీచర్లు రావడంతో వారికి బాధ్యతలు అప్పగించి రిలీవ్ అయ్యారు. అయితే మూడు నెలలుగా ఎదురుచూస్తున్న 317 మంది బాధితుల వ్యవహారం ఇప్పటికీ కొలిక్కి రాలేదు. కొత్త నియామకాలకు ముందే ఈ సమస్యను పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదు.ఆగని డిప్యుటేషన్లుకొత్త టీచర్ల నియామకంతో ఖాళీలు భర్తీ అవుతున్న నేపథ్యంలో... మళ్లీ డిప్యుటేషన్ల అంశం విద్యాశాఖలో కలకలం రేపుతోంది. అనారోగ్య కారణాలతో డిప్యుటే షన్లు చేస్తున్న వైనం విమర్శలకు దారితీస్తోంది. డిప్యుటే షన్ల కమిటీ పరిశీలనకు పంపకుండానే ఇష్టానుసారం డిప్యూటేషన్ బాధ్యతలు ఇస్తున్నారని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చావా రవి తెలిపారు. తాజాగా మేడ్చల్ జిల్లాలో ఏడుగురికి ఈ తరహాలో అనుమతి ఇవ్వడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. మరి కొన్ని డిప్యుటేషన్లు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగు తున్నాయని, ఇవన్నీ పైరవీలేనని సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలకు ఇతర ప్రాంతాల నుంచి సర్దుబాటు పేరుతో అక్రమ డిప్యుటేషన్లు ఇస్తున్నారని పీఆర్టీయూ–తెలంగాణ నాయకుడు ఎం.చెన్నయ్య ఆరోపించారు. చదివిన బడిలో ఉపాధ్యాయుడిగా!ఖానాపురం: విద్యాబుద్ధులు నేర్చిన పాఠశాల లోనే ఉపాధ్యా యునిగా ఉద్యో గం వస్తే?.. అలా ంటి అరుదైన అవకాశం పొందారు వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేటకు చెందిన వెంకటేశ్వర్లు. ఆయన 1998 నుంచి 2002 వరకు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏడు నుంచి పదో తరగతి వరకు చదివారు. డీఎస్సీ–2024లో సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయునిగా ఎంపికైన వెంకటేశ్వర్లు బుధవా రం విధుల్లో చేరగా.. స్థానికులు అభినందించారు. -
7, 10 తరగతులకు ‘ఎడ్యుకేషనల్ ఎపిఫని’ ప్రతిభా పరీక్ష
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో 2024–2025 విద్యాసంవత్సరంలో 7,10 తరగతుల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించేందుకు ఎడ్యుకేషనల్ ఎపిఫని సంస్థ ఏటా నిర్వహించే ప్రతిభా పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. సోమవారం మంగళగిరిలోని పాఠశాల విద్య రాష్ట్ర కార్యాలయంలో డైరెక్టర్ విజయ రామరాజు వివరాలను విడుదల చేశారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఈ పరీక్షలో విజేతలైన వారికి రూ.9 లక్షల విలువైన నగదు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు చెప్పారు.ఎడ్యుకేషనల్ ఎపిఫని సంస్థ అధ్యక్షుడు డాక్టర్ తవనం వెంకటరావు మాట్లాడుతూ 12 ఏళ్లుగా ఈ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. 26 జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 7, 10 తరగతులు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రెండు దశల్లో జరిగే ఈ పరీక్షలో ప్రిలిమ్స్ డిసెంబర్ 29న, మెయిన్స్ జనవరి 19న నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్ర అకడమిక్ కేలండర్‌ను అనుసరించి డిసెంబర్ 2024 వరకు గల గణితం, సైన్స్, సోషల్ సిలబస్‌పై 80 శాతం ప్రశ్నలు, జీకే, ఐక్యూపై 20 శాతం ప్రశ్నలు ఉంటాయన్నారు. ఆసక్తి గల విద్యార్థులు వచ్చే నెల 14 వరకు https://educationalepiphany.org/eemt2025/ registrations2025.php లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి సమాచారం కోసం www. educationalepiphany.org లేదా 9573139996/ 9666747996/ 6303293502లో సంప్రదించాలన్నారు. -
కొత్త గురువులకు సరికొత్త పాఠాలు
సాక్షి, హైదరాబాద్: మరికొన్ని నెలల్లో ప్రభుత్వ పాఠశాలల్లోకి కొత్త టీచర్లు రాబోతున్నారు. 11,062 మందిని డీఎస్సీ ద్వారా నియమించబోతున్నారు. వాస్తవానికి వీళ్లంతా ఉపాధ్యాయ అర్హత పరీక్ష పాసైన వాళ్లే. బోధనకు అవసరమైన బీఈడీ, డీఎడ్ వంటి కోర్సుల్లో ఉత్తీర్ణులైన వాళ్లే. అంతిమంగా డీఎస్సీ పరీక్షలోనూ ర్యాంకు కొట్టినోళ్లే. ఇన్ని ఉండీ వీళ్ళకు మళ్లీ శిక్షణ ఏంటి? అనే అనుమానం రావొచ్చు. కొత్తగా అడుగుపెట్టే టీచర్లకు సామాజిక, నైతిక విలువలపై ప్రత్యేక శిక్షణ అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ శిక్షణ ముగిసిన తర్వాతే బోధనకు అర్హత ఇవ్వాలని విద్యాశాఖకు చెప్పింది. దీంతో కొత్త టీచర్ల కోసం ప్రత్యేక శిక్షణ సిలబస్‌ను రూపొందిస్తున్నారు. ఈ బాధ్యతను రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) తీసుకుంటోంది. అవసరమైన పాఠ్యాంశాలను రూపొందిస్తోంది. టీచర్ల శిక్షణ కోసం ప్రత్యేకంగా రిసోర్స్ పర్సన్స్‌ను కూడా ఎంపిక చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ నెల 9న టీచర్లకు నియామక ఉత్తర్వులు ఇవ్వనుండగా, ఆ తర్వాత నెల రోజులపాటు స్వల్పకాలిక శిక్షణ ఇవ్వనున్నారు. విలువలే ముఖ్యం పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తి కొన్నేళ్లుగా వక్రమార్గం పడుతోందన్న ఆరోపణలున్నాయి. విలువల్లేని టీచర్లపై విమర్శలొస్తున్నాయి. అనేక చోట్ల ఉపాధ్యాయుడే కీచకుడైన ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో పనిచేసే టీచర్లకు వీటిపై పెద్దగా అవగాహన ఉండదని అధికారులు భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని బాలికల చట్టాలు, మహిళా చట్టాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఇటీవల కాలంలో వచ్చిన కొత్త చట్టాలను ఇందులో చేరుస్తున్నారు. అవసరమైతే మహిళా న్యాయవాదులు, మహిళా సంఘాల నేతలతో క్లాసులు చెప్పించే యోచనలో ఉన్నారు. దీంతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపునకు కృషి చేసేలా ప్రేరణపరమైన క్లాసులు ఇప్పించనున్నారు. టెక్నాలజీపై పట్టు విద్యా వ్యవస్థలో సాంకేతికత వేగంగా చొచ్చుకుపోతోంది. టీచర్ కన్నా విద్యార్థే ముందుగా గూగుల్ సెర్చ్ ద్వారా సవాలక్ష అంశాలను తెరమీదకు తెస్తున్నాడు. వీటి నివృత్తిలో సాంకేతిక పరిజ్ఞానం కొత్త టీచర్లకు అవసరం. టెక్నాలజీపై పట్టున్న యువత టీచర్లుగా వస్తున్నారు. ఈ నేపథ్యంలో అత్యాధునిక ఏఐ టెక్నాలజీ ద్వారా బోధన చేయడం వంటి మెళకువలను అందించేందుకు నిపుణుల చేత శిక్షణ ఇప్పించనున్నారు. బోధనలో త్రీడీ, వర్చువల్ రియాలిటీ, ఆగుమెంటేషన్ వంటి సరికొత్త విధానాలపైనా మెళకువలు నేరి్పంచనున్నారు. మార్పు దిశగా అడుగులు కొత్త టీచర్లలో చాలామంది కొన్నేళ్ల క్రితం బీఈడీ పూర్తి చేశారు. ఆ సమయంలో వారి బీఈడీ సిలబస్‌లో ఉన్న పాఠ్యాంశాలు వేరు. ఇప్పుడు బోధన విధానం, విద్యార్థి మానసిక ధోరణిలో అనేక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా కరోనా తర్వాత ఊహించని ధోరణి కన్పిస్తోందనేది జాతీయ విద్యా సర్వే నివేదికల సారాంశం. దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థి సైకాలజీ, టీచర్లకు విద్యార్ధికి మధ్య సమన్వయం, సరికొత్త మెళకువలతో బోధన వంటి టెక్నిక్స్‌పై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ మంచిదే: పింగిళి శ్రీపాల్ రెడ్డి (పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు) నేటి విద్యావిధానంలో మార్పులను అందిపుచ్చుకునేందుకు కొత్త టీచర్లకు శిక్షణ అవసరం. చట్టాలను వారికి తెలియజెప్పాలి. ఎప్పుడో బీఈడీ చేసిన వారికి ఈ తరహా పునశ్చరణ మేలు చేస్తుంది. అయితే, వేగంగా మారుతున్న సమాజంలో ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు తరచూ చేపట్టాల్సిన అవసరం ఉంది. అంకిత భావం పెరుగుతుంది : సయ్యద్ ఫౌకత్ అలీ (టీఎస్పీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు) పోటీ పరీక్షల్లో విజయం సాధించి, టీచర్‌గా వచ్చే వ్యక్తికి ఉపాధ్యాయ వృత్తి ప్రాధాన్యత తెలియజేయాల్సిన అవసరం ఉంది. దీనివల్ల అంకిత భావం పెరుగుతుంది. కొత్త తరం ఉపాధ్యాయులకు సరైన మార్గనిర్దేశం ఉంటే అద్భుతాలు సృష్టిస్తారు. బోధనతో ప్రభుత్వ పాఠశాలల్లో మార్పులు తెస్తారు. -
మద్యం సేవిస్తూ, బార్ డ్యాన్సర్లతో అసభ్య నృత్యాలు.. స్కూల్లో ఇవేం పనులు!
పాఠశాల అంటే టీచర్లు, విద్యార్ధులు, క్లాస్‌లు, విద్యాబోధన ఇవే మనకు తెలుసు. సాయంత్రం వేళ ఆటలు, సమయం సందర్భం బట్టి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంటుంది. కానీ ఓ చోట బడికి వచ్చిన పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి, వారి భవిహ్యత్తుకు బాటలు వేయాల్సిన చోట కొందరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారు. ఏకంగా స్కూల్లోనే మద్యం తాగుతూ, బార్ డ్యాన్సర్లతో కలిసి అసభ్యకరంగా డ్యాన్స్‌లు చేశారు. ఈ షాకింగ్ ఘటన బీహార్‌లో మంగళవారం వెలుగు చూసింది.సహర్సా జిల్లా జలాయిలో ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పెళ్లి వేడుకల నేపథ్యంలో కొందరు వ్యక్తులు బ్యాండ్, నలుగురు బార్ డ్యాన్సర్లను తీసుకొచ్చారు. పాఠశాలలోనే మద్యం తాగుతూ ఆశ్లీల డ్యాన్స్‌లు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో పలువురు మహిళలు భోజ్‌పురి పాటలకు అసభ్యకరంగా డ్యాన్స్ చేయడం కనిపిస్తుంది. ఆ మహిళల చుట్టూ కొందరు వ్యక్తులు చేరి, మద్యం తాగుతూ వారితో కలిసి డ్యాన్స్ చేయడం కూడా చూడొచ్చు. అయితే స్కూల్లో తాగి డ్యాన్సులు చేయడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. పాఠశాలలో ఇలాంటి వేడుకలకు విద్యాశాఖ ఎలా అనుమతి ఇచ్చిందని ప్రశ్నించారు. మరోవైపుఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి మమతా కుమారి స్పందిస్తూఇలాంటి ఏ కార్యక్రమానికీ పోలీసులు అనుమతి ఇవ్వలేదన్నారు. ఈ వైరల్ వీడియో తమ దృష్టికి రాగా.. దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారుबिहार के सरकारी स्कूल में बार बालाओं ने लगाए ठुमकेसहरसा के जलई ओपी क्षेत्र में स्थित विरगांव पंचायत के प्राथमिक विद्यालय नया टोला में बार बालाओं ने जमकर ठुमका लगाया। विडियो 24 सितंबर की रात का बताया जा रहा है। @bihar_police @NitishKumar @BiharEducation_ pic.twitter.com/Jk9Sn0fHhp— Republican News (@RepublicanNews0) September 26, 2024 -
139 మంది విద్యార్థులకు ఒకే మూత్రశాల
జగిత్యాల రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు లేక విద్యార్థినులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునే వారే కరువయ్యారు. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో 77 మంది విద్యార్థులున్నారు. వీరిలో 37 మంది బాలికలు, 40 మంది బాలురు ఉన్నారు. ప్రాథమిక పాఠశాలలో 62 మంది విద్యార్థుల్లో 36 మంది బాలికలు, 26 మంది బాలురు ఉన్నారు. గతంలో నిర్మించిన మరుగుదొడ్లు, మూత్రశాలలు శిథిలావస్థకు చేరడంతో కూల్చేశారు. వాటి స్థానంలో ఉపాధి హామీ కింద పాఠశాలకు ఒకటి చొప్పున రెండు మూత్రశాలల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. పనులు కొనసాగుతుండగానే జిల్లా అధికారులు నిధులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఫలితంగా పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. అప్పటి నుంచి రెండు పాఠశాలల్లో ఉన్న మొత్తం 139 మంది విద్యార్థులకు ఒకే మూత్రశాల గతి అయ్యింది. బహిర్భూమికి విద్యార్థులు ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గమనిస్తున్న తల్లిదండ్రులు తమ పిల్లలకు టీసీలు ఇవ్వాలని ఉపాధ్యాయులపై ఒత్తిడి పెంచుతున్నారు. పిల్లలకు టీసీలు ఇస్తే పాఠశాల ఎలా నడిపేదని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
Telangana: బడి.. ఇక త్రీడీ!
సాక్షి, హైదరాబాద్: క్లాస్ రూంలో తాజ్‌మహల్ పాఠం చెప్పడం కాదు.. తాజ్‌మహల్ పక్కనే ఉండి వివరిస్తున్నట్టుగా ఉంటే.. విత్తనం మొలకెత్తే దగ్గర్నుంచి.. చెట్టుగా మారి.. పూలు, కాయడం మొత్తాన్ని ప్రత్యక్షంగా చూసిన అనుభూతి వస్తే.. విద్యార్థులకు ఈ థ్రిల్లే వేరు. సబ్జెక్ట్‌పై మంచి అవగాహన రావడమేకాదు, చదువుకోవడం, నేర్చుకోవడంపై మరింత ఆసక్తి కలగడమూ ఖాయమే. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో త్వరలోనే ఈ తరహా డిజిటల్ బోధన అందుబాటులోకి రానుంది. విద్యార్థులకు వర్చువల్ రియాలిటీ (వీఆర్), త్రీడీ విధానాల్లో పాఠాలు బోధించే ఏర్పాట్లపై రాష్ట్ర సర్కారు దృష్టిసారించింది. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇతర ఏర్పాట్లపై పరిశీలన జరుపుతోంది. నూతన విద్యా విధానంలో భాగంగా దీనిని అమల్లోకి తీసుకురానుంది. ఇటీవల రాష్ట్రంలో డిజిటల్ విద్యా బోధనపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సందర్భంగా.. అధికారుల నుంచి ప్రభుత్వం నివేదిక కోరింది. విద్యాశాఖ అధికారులు డిజిటల్ బోధనకు గల అవకాశాలు, అవసరమైన ఏర్పాట్ల వివరాలను సేకరిస్తున్నారు. నిపుణులతో చర్చించి నివేదిక రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. రెండేళ్ల కిందటి నుంచే ప్రయత్నాలు వర్చువల్ రియాలిటీ, త్రీడీ వంటి డిజిటల్ బోధన వల్ల విద్యలో నాణ్యత పెరుగుతుందని కేంద్ర అధ్యయనాలు తేల్చాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు సర్కారీ బడుల్లో అత్యాధునిక సాంకేతికత సమకూర్చుకుని, డిజటల్ బోధనను అమలు చేయాలని కేంద్రం కోరింది. ఇందుకోసం అయ్యే వ్యయంలో 60శాతం భరిస్తామని ప్రకటించింది. వాస్తవానికి ఈ ప్రయత్నం 2022లోనే మొదలైంది. అవసరమైన మౌలిక వసతులనూ గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వ బడుల్లో డిజిటల్ విద్యపై రెండేళ్ల క్రితం కొంత కసరత్తు జరిగింది. త్రీడీ విద్యను రెండు స్కూళ్లలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. కానీ ప్రతిపాదనల దశలోనే అది ఆగిపోయింది. ఆధునిక విద్యకు ఎన్నో అవసరాలు! స్కూళ్లలో డిజిటల్ బోధనకు 75 అంగుళాల మానిటర్లు అవసరం. కంప్యూటర్లు, వర్చువల్ రియాలిటీ, త్రీడీ పరికరాలతో కూడిన స్మార్ట్ క్లాస్రూంలు, మెటల్ ఫ్రేమ్ కూడిన బోర్డ్, పాఠ్యాంశాల బోధన కోసం యాప్‌లు, ట్యూబ్‌లైట్లు, గ్రీన్‌బోర్డ్‌లు, విద్యుత్ అంతరాయంతో ఇబ్బంది రాకుండా యూపీఎస్‌లు వంటివి అవసరం. దీనికితోడు వేగవంతమైన ఇంటర్నెట్, వైఫై తప్పనిసరి. విద్యార్థులకు కావాల్సిన ఆడియో, వీడియో, త్రీడీ చిత్రాలు, గ్రాఫ్‌లు, మ్యాప్‌లు, వీడియోలను డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉండాలి. యానిమేషన్, త్రీడీ చిత్రాలను ఉపయోగించే సాంకేతికత ఉండాలి. కొత్త టెక్నాలజీలతో సులువుగా.. ఇప్పుడు డిజిటల్, త్రీడీ, వర్చువల్ విద్యా బోధన సులువుగా మారిందని నిపుణులు తెలిపారు. గతంలో ప్రొథీయమ్ బోర్డ్ వాడాల్సి వచ్చేదని.. దానితో ఒక్కో బడికి రూ.25 లక్షల దాకా వెచ్చించాల్సి వచ్చేదని.. ఇప్పుడు తక్కువ ఖర్చయ్యే కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ప్రస్తుతం ప్రొజెక్టర్, స్మార్ట్ టచ్ స్క్రీన్ టీవీలను వాడుతున్నారని.. బోధనకోసం వాడే కంటెంట్‌ను బడిలోని కంప్యూటర్లోనే ఇన్స్టాల్ చేయడానికి వీలుందని వెల్లడించారు. బోధన కంటెంట్ ఉచితంగా కూడా దొరుకుతుందని.. కాకపోతే స్థానికతను దృష్టిలో ఉంచుకుని కంటెంట్ రూపొందించుకుంటే సరిపోతుందని స్పష్టం చేశారు. కంటెంట్‌ను తగిన మెళకువలతో అందిస్తే విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతుందని తెలిపారు. సూచనలు, అంచనాలివీ.. – 6 నుంచి 10 తరగతుల వరకు రికార్డు చేసిన డిజిటల్ కంటెంట్‌ను ఇంటర్నెట్ సాయంతో వినేలా చేయవచ్చు. టీచర్లు చెప్పే లైవ్ పాఠాలు ఇంటివద్దే వినే, చూసే వీలుంటుంది. – ప్రతి పాఠశాలలో రెండు డిజిటల్ క్లాస్ రూంలను ఏర్పాటు చేయాలి. ఇందులో ప్రొజెక్టర్, కంప్యూటర్లు, డిజిటల్ తెర, ఇంటరాక్టివ్ వైట్ బోర్డులు.. ఇలా మొత్తం 25 ఎల్రక్టానిక్ పరికరాలు అమర్చాల్సి ఉంటుంది. – ప్రయోగాత్మక పరిశీలన కోసం రాష్ట్రంలో 3 వేల స్మార్ట్ క్లాస్‌రూమ్‌ల అవసరం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇందులోనే వర్చువల్, డిజిటల్, త్రీడీ పాఠాలు చెప్పవచ్చు. ఒక్కో స్కూల్‌కు రూ.10 లక్షల వరకూ ఖర్చు అవుతుందని అంచనా. ఇలా మొత్తంగా 300 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని విద్యాశాఖ అంచనా వేసింది. ఇంటర్నెట్, ఇతర వసతులు కల్పించాలి మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ విద్యను ప్రవేశపెట్టడం స్వాగతించాల్సిన అంశం. ఇందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పన ముఖ్యం. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో స్కూళ్లకు ఇంటర్నెట్ నెట్ సదుపాయం లేదు. కొన్నిచోట్ల వేగం సరిగారాదు. ఇలాంటి సమస్యలను పరిష్కరించాలి. డిజిటల్ విద్యా బోధన వల్ల ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. – పింగిలి శ్రీపాల్‌రెడ్డి, పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు లోకల్ కంటెంట్ అవసరం డిజిటల్, త్రీడీ విద్యా బోధన ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలనే మారుస్తుంది. అయితే ఎక్కడి నుంచో పాఠాలు దిగుమతి చేసుకుంటే లాభం లేదు. జాతీయ స్థాయిలో రూపొందించిన పాఠాలు. స్థానిక పరిస్థితులను ప్రతిబింబించేలా వీడియోలు, యానిమేషన్ ఉండాలి. దీనిపై రాష్ట్రంలో కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి. వాటి భాగస్వామ్యాన్ని తీసుకోవాలి. విద్యార్థులకు పాఠం చెప్పే సమయంలోనే డిజిటల్, త్రీడీ విధానాలను వినియోగించాలి. కేవలం రివిజన్ సమయంలో వాడితే ప్రయోజనం ఉండదు. – పన్నీరు భానుప్రసాద్, సూపర్ టీచర్ ఎడ్యు రీఫారŠమ్స్ సీఈవో -
ఏపీలో గవర్నమెంటు స్కూలు పిల్లలపై వివక్ష ఎందుకు?. సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
ప్రభుత్వ స్కూలు పిల్లలపై ఎందుకీ వివక్ష?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధన రద్దుతో మీరు మరోసారి పేదల వ్యతిరేకిగా నిరూపించుకున్నారు అని సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. సీబీఎస్ఈ బోధన రద్దు ద్వారా నాణ్యమైన విద్యకు గండికొడుతున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థుల భవితను అంధకారంలోకి నెట్టేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ‘ఎక్స్’ వేదికగా వైఎస్ జగన్ నిలదీశారు. సోమవారం ఎక్స్‌లో చేసిన పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..‘‘ముఖ్యమంత్రిగా మీరు, విద్యాశాఖ మంత్రిగా మీ కుమారుడు తిరోగమన నిర్ణయాలతో ప్రభుత్వ స్కూళ్లను మళ్లీ మొదటికే తీసుకెళ్తున్నారు. మీ ఇళ్లల్లో పిల్లలకు అత్యుత్తమ చదువులు అందించాలనుకుంటారు కానీ, గవర్నమెంటు స్కూలు పిల్లల విషయంలో వివక్ష ఎందుకు? వాళ్లు ఎప్పటికీ కింద స్థాయిలోనే ఉండిపోవాలా? వారి జీవితాలకు మీరు శాపంపెట్టిన మాదిరిగా ఈ నిర్ణయాలు ఏంటి?గవర్నమెంటు స్కూళ్ల పిల్లలను ప్రైవేటు బాట పట్టించే కుట్ర..గవర్నమెంటు స్కూళ్ల రూపురేఖలు మార్చే కార్యక్రమాలను రద్దు చేయడం ఎంతవరకు సమంజసం? ముఖ్యమంత్రిగా మీ 14 ఏళ్ల కాలంలో చేయలేని పనులన్నీ ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసింది. నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ, ఐబీవైపు అడుగులు, టోఫెల్, సబ్జెక్టు టీచర్ల కాన్సెప్ట్, తరగతి గదుల్లో 6వ తరగతి నుంచి ఇంటరాక్టివ్ ఫ్లాట్ పానల్స్, 8వ తరగతి వచ్చే సరికే ట్యాబుల పంపిణీ, విద్యాకానుక, రోజుకో మెనూతో గోరుముద్ద.. ఇలా పేద పిల్లల తలరాతలను మార్చే చదువులను అందించడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను తీసుకువచ్చింది. మీ హయాంలో ఇప్పుడు ఒక్కొక్కటిగా వీటిని రద్దుచేస్తూ వస్తున్నారు. గవర్నమెంటు స్కూళ్ల పిల్లలను ప్రైవేటు బాట పట్టించడానికి మీరు, మీ కుమారుడు కుట్రను అమలు చేస్తున్నారు. మీ పార్టీ నాయకులకు చెందిన ప్రైవేటు స్కూళ్లు బాగుండాలి? గవర్నమెంటు స్కూళ్లు నిర్వీర్యం అయిపోవాలి? మీ ఉద్దేశం అదేగా? తమ పిల్లలకు మంచి చదువులు అందించడం కోసం తల్లిదండ్రులు వారి సొంత జేబు నుంచి ఎందుకు ఖర్చుచేయాలి? అలాంటప్పుడు ఇక ప్రభుత్వాలు ఎందుకు? గవర్నమెంటు స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు, ఈ ‘‘ఈనాడు’’ కోర్టులకు వెళ్లి అడ్డుకున్న తీరును ఇప్పటికీ ప్రజల మరిచిపోలేరు.గవర్నమెంటు స్కూలు పిల్లలు, టీచర్లను తక్కువగా చూడొద్దు..మన గవర్నమెంటు స్కూలు పిల్లలు, అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు దేనిలోనూ తక్కువ కాదు చంద్రబాబూ. వీళ్లంతా తెలివైన వారు. పైగా ప్రభుత్వ టీచర్లు లక్షల మంది పోటీపడే పరీక్షల్లో ఉత్తీర్ణులై, చక్కటి శిక్షణ కూడా పొందినవారు. ప్రైవేటు స్కూళ్లలో ఉన్నవారి కంటే గొప్ప చదువులు చదివినవారు, గొప్పగా చదువులు చెప్పగలిగినవారు. అలాంటివారిని తక్కువగా చూసే మీ మనస్తత్వాన్ని ముందు మార్చుకోండి. పిల్లలకు కావాల్సింది వారిలో ఆత్మవిశ్వాసం నింపడం, సరైన శిక్షణ, పటిష్ట బోధన. టీచర్లకు అందించాల్సింది ప్రేరణ, ప్రోత్సాహం, ఓరియంటేషన్. గడచిన ఐదేళ్లలో ఈ దిశగా వారు ఎంతో ప్రయాణంచేశారు. మళ్లీ ఇప్పుడు వారిని నిరుత్సాహపరిచి, ఉద్దేశపూర్వకంగా ఎందుకు దెబ్బతీస్తున్నారు చంద్రబాబూ? చదువుతోనే పేదరికం దూరంపేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించే ఆయుధం చదువు మాత్రమే. వెంటనే ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యంచేసే తప్పుడు పనులు మానుకోండి. మేం తీసుకొచ్చిన సంస్కరణలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లండి. గవర్నమెంటు స్కూళ్ల పిల్లలు ప్రపంచస్థాయి చదువులను చదువుకునే అవకాశాలను దెబ్బతీయకండి. లేదంటే మీరు పేదప్రజల వ్యతిరేకులుగా, చరిత్రహీనులుగా మిగిలిపోతారు’’ అని చంద్రబాబు విధానాలను ఎండగట్టారు. -
ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్ఈ రద్దుపై వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి,తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్ఈ రద్దుపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించారు. ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్ఈ రద్దుతో చంద్రబాబు మరోసారి పేదల వ్యతిరేకి అని నిరూపించుకున్నారన్నారు. తద్వారా నాణ్యమైన విద్యకు గండికొడుతున్నారని విమర్శించారు. సీఎంగా చంద్రబాబు, విద్యాశాఖ మంత్రిగా లోకేష్ తిరోగమన నిర్ణయాలతో ప్రభుత్వ స్కూళ్లను మళ్లీ మొదటికే తీసుకెళ్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు వైఎస్ జగన్ ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. ‘చంద్రబాబు.. గవర్నమెంటు స్కూళ్లలో సీబీఎస్ఈ రద్దుతో మీరు మరోసారి పేదల వ్యతిరేకి అని నిరూపించుకున్నారు. తద్వారా నాణ్యమైన విద్యకు గండికొడుతున్నారు. ముఖ్యమంత్రిగా మీరు, విద్యాశాఖ మంత్రిగా మీ కుమారుడు తిరోగమన నిర్ణయాలతో ప్రభుత్వస్కూళ్లను మళ్లీ మొదటికే తీసుకెళ్తున్నారు. మీ ఇళ్లల్లో పిల్లలకు అత్యుత్తమ చదువులు అందించాలనుకుంటారు కానీ, గవర్నమెంటు స్కూలు పిల్లల విషయంలో వివక్ష ఎందుకు? వాళ్లు ఎప్పటికీ కింద స్థాయిలోనే ఉండిపోవాలా? వారి జీవితాలకు మీరు శాపంపెట్టిన మాదిరిగా ఈ నిర్ణయాలు ఏంటి?దశాబ్దాలుగా ఎవరూ పట్టించుకోకపోవడంతో గవర్నమెంటు స్కూళ్ల రూపురేఖలు మార్చే కార్యక్రమాలను రద్దుచేయడం ఎంతవరకు సమంజసం? ముఖ్యమంత్రిగా మీ 14 ఏళ్లకాలంలో చేయలేని పనులన్నీ ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసింది. నాడు-నేడు, ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్ఈ, ఐబీవైపు అడుగులు, టోఫెల్, సబ్జెక్టు టీచర్ల కాన్సెప్ట్, తరగతి గదుల్లో 6వ తరగతి నుంచి ఇంటరాక్టివ్ ఫ్లాట్ పానల్స్, 8వ తరగతి వచ్చే సరికే ట్యాబుల పంపిణీ, విద్యాకానుక, రోజుకో మెనూతో గోరుముద్ద… ఇలా పేద పిల్లల తలరాతలను మార్చే చదువులను అందించడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను తీసుకువచ్చింది.మీ హయాంలో ఇప్పుడు ఒక్కొక్కటిగా వీటిని రద్దుచేస్తూ వస్తున్నారు. గవర్నమెంటు స్కూళ్ల పిల్లలను ప్రైవేటు బాట పట్టించడానికి మీరు, మీ కుమారుడు కుట్రను అమలు చేస్తున్నారు. మీ పార్టీ నాయకులకు చెందిన ప్రైవేటు స్కూళ్లు బాగుండాలి? గవర్నమెంటు స్కూళ్లు నిర్వీర్యం అయిపోవాలి? మీ ఉద్దేశం అదేగా? తమ పిల్లలకు మంచి చదువులు అందించడం కోసం తల్లిదండ్రులు వారి సొంతజేబు నుంచి ఎందుకు ఖర్చుచేయాలి? అలాంటప్పుడు ఇక ప్రభుత్వాలు ఎందుకు? గవర్నమెంటు స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు, ఈ “ఈనాడు’’ కోర్టులకువెళ్లి అడ్డుకున్న తీరును ఇప్పటికీ ప్రజల మరిచిపోలేరు. 1.@ncbn గారూ.. గవర్నమెంటు స్కూళ్లలో సీబీఎస్ఈ రద్దుతో మీరు మరోసారి పేదల వ్యతిరేకి అని నిరూపించుకున్నారు. తద్వారా నాణ్యమైన విద్యకు గండికొడుతున్నారు. ముఖ్యమంత్రిగా మీరు, విద్యాశాఖ మంత్రిగా మీ కుమారుడు తిరోగమన నిర్ణయాలతో ప్రభుత్వస్కూళ్లను మళ్లీ మొదటికే తీసుకెళ్తున్నారు. మీ ఇళ్లల్లో…— YS Jagan Mohan Reddy (@ysjagan) September 16, 2024మన ప్రభుత్వ స్కూలు పిల్లలు, అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎందులోనూ తక్కువకాదు చంద్రబాబుగారూ? వీళ్లంతా తెలివైన వారు. పైగా ప్రభుత్వ టీచర్లు లక్షలమంది పోటీపడే పరీక్షల్లో ఉత్తీర్ణులై, చక్కటి శిక్షణకూడా పొందినవారు. ప్రైవేటు స్కూళ్లలో ఉన్నవారికంటే గొప్పచదువులు చదివినవారు, గొప్పగా చదువులు చెప్పగలిగినవారు. అలాంటివారిని తక్కువగా చూసే మీ మనస్తత్వాన్ని ముందు మార్చుకోండి. పిల్లలకు కావాల్సింది వారిలో ఆత్మవిశ్వాసం నింపడం, సరైన శిక్షణ, పటిష్ట బోధన. టీచర్లకు అందించాల్సింది ప్రేరణ, ప్రోత్సాహం, ఓరియెంటేషన్. గడచిన ఐదేళ్లలో ఈ దిశగా వారు ఎంతో ప్రయాణంచేశారు. మళ్లీ ఇప్పుడు వారిని నిరుత్సాహపరిచి, ఉద్దేశపూర్వకంగా ఎందుకు దెబ్బతీస్తున్నారు.పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించే ఆయుధం చదువు మాత్రమే. వెంటనే ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యంచేసే తప్పుడు పనులు మానుకోండి. మేం తీసుకొచ్చిన సంస్కరణలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లండి. గవర్నమెంటు స్కూళ్ల పిల్లలు ప్రపంచస్థాయి చదువులను చదువుకునే అవకాశాలను దెబ్బతీయకండి. లేదంటే మీరు పేదప్రజల వ్యతిరేకులుగా, చరిత్రహీనులుగా మిగిలిపోతారు’అని ట్వీట్లో వైఎస్జగన్ పేర్కొన్నారు. ఇదీ చదవండి : మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మానుకోండి -
ఫీజుల దరువుకు బ్రేకులెలా?
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వాలని మంత్రివర్గ ఉప సంఘం ఆదేశించిన నేపథ్యంలో, పాఠశాల విద్య డైరెక్టరేట్ దీనిపై కసరత్తుకు సిద్ధమవుతోంది. ఫీజుల నియంత్రణకు 2017లో ఆచార్య తిరుపతిరావు కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలను పరిగణనలోకి తీసుకొని ముందుకెళ్లాలని భావిస్తోంది. అవసరమైతే ప్రత్యేక చట్టం తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటు స్కూళ్లలోనే విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. సర్కారీ స్కూళ్లలో మౌలికవసతుల లేమి, ఉపాధ్యాయుల కొరత విద్యార్థులు ప్రైవేటు స్కూళ్ల వైపు ఆకర్షితులయ్యేలా చేస్తున్నాయి. ప్రైవేటు యాజమాన్యాలు స్కూలును బట్టి రూ.12 వేల నుంచి రూ.4 లక్షల వరకు వార్షిక ఫీజును వసూలు చేస్తున్నాయి. కొన్ని స్కూళ్ళు ప్రతి ఏటా ఏకంగా 25 శాతం వరకూ ఫీజులు పెంచుతున్నాయి. దీనిపై కొన్నేళ్లుగా ఫిర్యాదులొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఫీజుల నియంత్రణపై దృష్టి సారించింది. మౌలిక వసతుల ఆధారంగానే ఫీజులు! ఫీజుల నియంత్రణకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ సహా 15 రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తెచ్చాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే తరహాలో పటిష్టమైన చట్టాన్ని తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. 35 లక్షల మందికిపైగా చదివే 11 వేల ప్రైవేటు స్కూళ్లను దీని పరిధిలోకి తేవాలని భావిస్తోంది. ఇష్టానుసారం కాకుండా స్కూళ్లలోని మౌలిక వసతుల ఆధారంగా ఫీజుల పెంపునకు అనుమతించేలా నిబంధనలు రూపొందించే యోచనలో ఉంది. అవసరం లేని ఖర్చును అభివృద్ధిలా..! ఫీజుల నియంత్రణకు సంబంధించి గతంలో ఇచ్చిన జీవోలు అమలు కాకపోవడంతో చట్టపరమైన అడ్డంకులు లేకుండా చేయాలని పాఠశాల విద్య అధికారులకు ఉప సంఘం సూచించింది. స్కూల్ డెవలప్మెంట్ చార్జీలు, ఇతర ఖర్చులు కలిపి ఏటా 15 శాతం ఫీజులు పెంచుకునేందుకు ఉమ్మడి రాష్ట్రంలో జీవోలిచ్చారు. వాటిని ఆధారంగా చేసుకుని పెద్ద స్కూళ్ళు అవసరం లేని ఖర్చును చేస్తూ ఆ పనులను అభివృద్ధిగా చూపిస్తున్నాయి. ఓ ఉదాహరణను పరిశీలిస్తే.. ఒక స్కూలు ప్రతి గదిలో అత్యాధునిక సౌండ్ సిస్టం, టెక్నాలజీ అభివృద్ధి చేసింది. దీన్ని విద్యార్థుల కోసం ఖర్చు పెట్టినట్టుగా లెక్కల్లో చూపింది. ఫీజులు 25 శాతం పెంచేసింది. ఇలా స్కూళ్లు ఫీజులు అడ్డగోలుగా పెంచేస్తున్నాయి. వీటిని క్రమబధ్ధికరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఖర్చు 10 శాతం దాటితే పక్కా లెక్క ఉండాలి స్కూళ్ల మూడేళ్ల ఖర్చును బట్టి వార్షిక ఫీజుల పెంపునకు అనుమతించవచ్చని తిరుపతిరావు కమిటీ సూచించింది. ప్రతి స్కూలు 10 శాతం లోపు ఫీజు పెంచుకోవచ్చు. పది శాతం దాటి ఖర్చు చేసే ప్రతి పైసా బ్యాంక్ లావాదేవీగా ఉండాలని ప్రతిపాదించారు. వేతనాలు, స్కూలు కోసం కొనుగోలు చేసే మౌలిక వసతులు, ఇతరత్రా ఖర్చులకు బ్యాంకు ద్వారానే చెల్లింపులు ఉండాలనే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలి. వీటితో పాటు మరికొన్ని అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని కసరత్తు కొనసాగించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. 11 వేల స్కూళ్ళ ఆదాయ, వ్యయ లెక్కలు చూడాలంటే ప్రత్యేక యంత్రాంగం ఉండాలి. ఈ దిశగానూ కొన్ని సిఫారసులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 10 శాతం పైగా ఫీజు పెంచే స్కూళ్లు విధిగా లెక్కలు చూపేలా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టనున్నారు. -
కూటమి రాజకీయ కక్ష.. అటకెక్కనున్న CBSE
-
ఇదొక నిశ్శబ్ద విధ్వంసం!
విశాఖ నగరం సమీపంలోని భీమ్లీలో అదొక ప్రభుత్వ పాఠశాల. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం నాడు ఆ బడిని సందర్శించారు. ఓ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులను పలకరించారు. ‘మీరు ముందుగా ఏ భాషలో మాట్లాడుకుంటారు... తెలుగులోనా, ఇంగ్లీషులోనా?’ అని అడి గారు. అక్కడున్న విద్యార్థినులు తడుముకోకుండా ‘ఇంగ్లీషు లోనే’ అని సమాధానమిచ్చారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం ఆసక్తి కరంగా ఉన్నదని కూడా వారు చెప్పారు. ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న పేద వర్గాల పిల్లల గుండెల్లో గూడు కట్టుకున్న ఆకాంక్షలకు ఈ ఘటన అద్దం పట్టింది.అంతకు ముందు రోజు గిడుగు రామమూర్తి పంతులు జయంతి సభ విజయవాడలో జరిగింది. ఆ సభలో రాష్ట్ర ముఖ్య మంత్రి, ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఆ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి తెలుగు భాషతోనే జీవితమని మరోసారి చెప్పు కొచ్చారు. జీతం కోసం ఇంగ్లీషు కూడా నేర్పిస్తామని తన ఉభయ భాషాభిమానాన్ని కూడా వెల్లడించారు. ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవలసిన ధర్మ సూక్ష్మం ఒకటున్నది. జీతం కోసం నేర్చుకునే ఇంగ్లీష్ ప్రైవేట్ స్కూళ్లకు, ‘జీవితం’ కోసం నేర్చుకునే తెలుగు ప్రభుత్వ స్కూళ్లకు ప్రత్యేకం.తొంభై శాతానికి పైగా ప్రైవేట్ స్కూళ్లలో ఇంగ్లీషు మీడి యమే ఉంటుందన్న సంగతి జగమెరిగిన సత్యమే! కనుక తెలుగు భాషను రక్షించి పోషించవలసిన బాధ్యత ప్రభుత్వ బడుల్లో చదువుకునే పిల్లలది, కష్టజీవులైన వారి తల్లిదండ్రులది. మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర్నుంచీ ఈ బాధ్యతను వారు తమ భుజాల మీద మోస్తూనే వస్తున్నారు. మన తెలుగు జాతి లోని సంపన్న శ్రేణివారు, ఉన్నతోద్యోగులు, క్రీమీ లేయర్‌లోని ఓ పదిమంది కూడిన ప్రతిచోట ఏ భాషలో మాట్లాడుకుంటారు? నిస్సందేహంగా ఇంగ్లీషులోనే! వారు ఇంగ్లీషులోనే పలక రించుకుంటారు. ఇంగ్లీషులోనే తుమ్ముతారు, ఇంగ్లీషులోనే దగ్గు తారు. తెలుగు భాషా సంస్కృతులను రక్షించవలసిన అవస రాన్ని సామాన్య ప్రజలకు వారే గుర్తు చేస్తుంటారు.కొద్దిమంది పండితుల చేతుల్లోనే బందీ ఆయిన తెలుగు సాహిత్యాన్ని విముక్తం చేసి సామాన్య ప్రజలకు అర్థమయ్యే వ్యవహారిక భాషలో రచనలు జరగాలని ఉద్యమించి గెలిచిన యోధుడు గిడుగు రామమూర్తి పంతులు. ఆయన నుంచి తీసు కోవలసిన స్ఫూర్తి ఏమిటి? ఉన్నత స్థానాలను అధిరోహించే అవకాశాలను కల్పిస్తున్న ఇంగ్లీషు మీడియాన్ని సంపన్న శ్రేణికే పరిమితం చేయకుండా సమస్త ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పడం కాదా? అటువంటి సంకల్పమే గదా పంతులు గారికి ఇవ్వదగిన నిజమైన నివాళి!మనకు కొంతమంది స్వయం ప్రకటిత తెలుగు పెద్ద లున్నారు. వృద్ధనారీ పతివ్రతల వంటివారు. తెలుగు మీడియంలోనే చదువుకోవాలని పదేపదే గుర్తు చేస్తుంటారు. ఆ పిలుపు ప్రభుత్వ బడులకూ, బడుగు వర్గాలకే వర్తిస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ వర్గాలను ఉత్తేజితం చేయడం కోసం తమ జీవితమే వారికొక సందేశమని చెబుతారు. తెలుగులోనే చదువుకోవడం వల్ల తాము దిగ్గజాలుగా ఎదిగామనీ, ‘మీరు కూడా తెలుగులోనే చదవండి, మా అంతటివారు అవుతార’ని ఊదరగొడుతుంటారు. అసలు పరభాషా మాధ్యమంలో చదువుకున్నంత మాత్రాన మాతృభాష అంతరించిపోతుందనే వాదనే నిర్హేతుకమైనది. సురవరం ప్రతాపరెడ్డి, దాశరథి సోదరులు, పీవీ నరసింహారావు, కాళోజి నారాయణరావు, డాక్టర్ సి. నారాయణరెడ్డి, వట్టికోట ఆళ్వార్ స్వామి తదితరు లంతా ఉర్దూ మీడియంలో చదివి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసినవారే. మన తాజా తెలుగు పెద్దలతో పోల్చితే మహాదిగ్గజాలే.ఇదొక్క ఇంగ్లీషు మీడియం గొడవ మాత్రమే కాదు. నాణ్యమైన విద్య, సరైన వసతులు, పర్యవేక్షణ, బోధనా పద్ధతులు... వగైరాలన్నింటిలోనూ ప్రభుత్వ పాఠశాలల ప్రమా ణాలు పడిపోతూ వస్తున్నాయి. గత మూడు దశాబ్దాలుగా ఈ పరిణామం వేగవంతమైంది. ఇందుకు ప్రధాన కారణం మన పాలకులు. పేద, మధ్యతరగతి పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడానికి పెట్టుబడి పెట్టడం మన ‘సంస్కరణోత్తర’ రాజకీయ వేత్తలకు ఇష్టంలేదు. ఈ కేట గిరీలో ముందు వరసన నిలిచిన రాజకీయవేత్త చంద్రబాబు. విద్య, వైద్యం మాత్రమే కాదు... ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వకూడదనే ఫిలాసఫీ ఆయనది. ‘మనసులో మాట’ అనే పేరుతో ఆయన రచించిన పుస్తకం నిండా ఈ ఫిలాసఫీయే ఉంటుంది. ఐదేళ్లకు పూర్వం విభజిత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఈ తత్వధారను వారబోస్తూనే వచ్చారు. ‘ఉచిత విద్యను అందించడం ప్రభుత్వ బాధ్యత కాదు, ప్రభుత్వ స్కూళ్లలో సదుపాయాలుండవు. డబ్బులున్న వాళ్లు ప్రయివేటు స్కూళ్లలో చదువుకోండి. అక్కడ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. అన్నీ బాగుంటాయ’ని ఆయన ఉద్బోధించేవారు.వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యా సంస్కరణలు ప్రారంభించిన తర్వాత చంద్రబాబుతో పాటు ఆయన మీడియా కూడా విమర్శల వర్షం కురిపిస్తూనే వచ్చింది. ఒకేసారి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే పిల్లలకు అర్థం కాకుండా పోతుందని గగ్గోలు పెట్టారు. కానీ, బైలింగ్వల్ పాఠ్యపుస్తకాల ప్రయోగంతో ఈ సమస్యను ప్రభుత్వం అవలీలగా అధిగమించిందని విద్యా రంగ నిపుణులు పలువురు కొనియాడారు. చంద్రబాబు ప్రభుత్వం రాగానే ప్రభుత్వ స్కూళ్ల వైభవం అంతరించిపోతుందన్న అంచనా ప్రజల్లో చాలామందికి ముందే ఉన్నది. కనుకనే ఈ సంవత్సరం పెద్ద ఎత్తున ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు టీసీలు తీసుకుని ప్రైవేట్ బడుల్లో చేరిపోయారు. పూర్తి వివరాలు రాలేదు గానీ, ఈ సంఖ్య మూడు లక్షలకు పైగానే ఉండొచ్చని అంచనా.ప్రజలు ఊహించినట్టుగానే చంద్రబాబు ప్రభుత్వం సర్కారు బళ్లపై దాడిని ప్రారంభించింది. ‘అమ్మ ఒడి’ ఇవ్వలేదు. ‘వసతి దీవెన’ లేదు, ‘విద్యా కానుక’ లేదు. ‘మధ్యాహ్న భోజనం’, ‘గోరు ముద్దలు’ గాడి తప్పాయి. ఇంగ్లీష్ ప్రమాణాలు పెంచేందుకు ఉద్దేశించిన ‘టోఫెల్’ పరీక్షను తొలగించారు. వెయ్యి స్కూళ్లల్లో అమలవుతున్న సీబీఎస్ఈ సిలబస్‌ను ఎత్తేశారు. ఉచితంగా లభించాల్సిన అంతర్జాతీయ స్థాయి ఐబీ సిలబస్‌ను అటకెక్కించారు. కార్పొరేట్ స్కూళ్లకు మేలు చేయడం కోసమే ఇటువంటి చర్యలు చేపడుతున్నారనే ఆరోపణలు బలపడుతున్నాయి. నేడో రేపో ఇంగ్లీష్ మీడియానికి కూడా వీడ్కోలు చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విద్యామంత్రి లోకేశ్‌కు విశాఖ బాలికలు తమ గుండెచప్పుడును వినిపించారు.పేద ప్రజానీకం బిడ్డలకు కూడా అత్యున్నత ప్రమాణాలు కలిగిన నాణ్యమైన విద్య అందాలన్న లక్ష్యంతో జగన్ ప్రభుత్వం విద్యా సమీక్షా కేంద్రాల (వీఎస్కే)ను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు, విద్యార్థులు – ఉపాధ్యాయుల హాజరు, మధ్యాహ్న భోజనం నిర్వహణ, స్టూడెంట్ కిట్స్ పంపిణీ, ట్యాబులు, ఐఎఫ్‌పీల నిర్వహణ వగైరా అంశాలపై నిరంతర పర్యవేక్షణ చేయడం ఈ వీఎస్‌కేల పని. ఇప్పుడా పనులేవీ వీఎస్‌కేలు చేయవలసిన అవసరం లేదని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఒక్క ఉదాహరణ చాలు, ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఈ ప్రభుత్వం ఏం చేయనున్నదో తెలుసుకోవడానికి!ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల నిర్వహణ తీరుతెన్నులపై ఈ ఒక్క నెల రోజుల్లోనే డజన్‌కు పైగా విషాదకర వార్తలు వెలువడ్డాయి. నూజివీడు ట్రిపుల్ ఐటీలో చదువుతున్న విద్యార్థుల్లో 566 మంది కేవలం మూడు రోజుల్లోనే ఆస్పత్రి పాలయ్యారు. జ్వరం, కడుపునొప్పి, విరేచనాలు, వాంతులతో ఆ విద్యార్థులు తల్లడిల్లారు. విజయనగరంలోని ఓ ఆశ్రమ విద్యార్థులు 21 మంది ఆస్పత్రి పాలయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో ఓ కేజీబీవీలో 20 మంది వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరారు. ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థుల ఆరోగ్యంపై ఈ ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉన్నదో ఈ సంఘటనలు చూస్తే అర్థమవుతుంది. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అధికారి వరకు సంక్షేమ హాస్టల్స్‌ను నిరంతరం తనిఖీ చేసేలా ఒక ప్రత్యేక కార్య క్రమాన్ని జగన్ ప్రభుత్వం తయారు చేసింది. ఆ కార్యక్రమాన్ని చాప చుట్టేసిన ఫలితమే ఈ నెల రోజుల్లో జరిగిన దుర్ఘటనలు. హాస్టల్స్‌లో వుండే విద్యార్థుల వసతి, వైద్య సౌకర్యాలపై జీవో నెంబర్ 46 కింద గత ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. ఉద్దేశపూర్వకంగానే కూటమి ప్రభుత్వం ఆ మార్గదర్శకాలను విస్మరించింది. ఎందుకంటే పేద ప్రజలకు నాణ్యమైన విద్య అనేది ఈ ప్రభుత్వం ఎజెండా కాదు. ఉచితంగా ఉత్తమ విద్యను అంద జేయడం ఈ ప్రభుత్వ ఫిలాసఫీ కాదు. అది జగన్ ప్రభుత్వ ఫిలాసఫీ, జగన్ ప్రభుత్వం ఎజెండా. పేద వర్గాల ప్రజలను సాధికార శక్తులుగా మలచడానికి జగన్ ప్రభుత్వం ప్రారంభించిన నాణ్యమైన ఉచిత విద్యపై కూటమి సర్కార్ దాడిని ప్రారంభించింది. నిశ్చబ్దంగా ఒక మహా విధ్వంసానికి శ్రీకారం చుట్టింది. జగన్ ప్రభుత్వం విద్యారంగంలో నిశ్శబ్ద విప్లవాన్ని ప్రారంభిస్తే, బాబు సర్కార్ అదే రంగంలో నిశ్శబ్ద విధ్వంసాన్ని మొదలుపెట్టింది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
విశాఖలో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బడిబాట
-
'పర్యవేక్షణ' లేని ప్రభుత్వ బడులు
సాక్షి, అమరావతి: గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో పూర్తిగా నిర్వీర్యమైపోయిన సర్కారు విద్యను వైఎస్ జగన్మోహన్ రెడ్డి చక్కదిద్దారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో పాఠశాలలను రూపుదిద్దారు. ప్రతి పేదింటి బిడ్డకు నాణ్యమైన ఉచిత ఇంగ్లిష్ మీడియం విద్యను అందించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పాఠశాలల్ని తిరిగి నిర్వీర్యం చేసే దిశగా సాగుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలో 44,617 ప్రభుత్వ పాఠశాలలు, 14 వేల ప్రైవేటు స్కూళ్లలో పరిస్థితులపై పర్యవేక్షణకు 2022లో ఏర్పాటు చేసిన ‘విద్యా సమీక్ష కేంద్రాల (వీఎస్కే)’ లను నిర్వీర్యం చేస్తోంది. ఉపాధ్యాయుల అటెండెన్స్ మినహా మిగిలిన అన్ని విధుల నుంచి ఈ కేంద్రాలను తప్పించింది. జాతీయ విద్యా విధానం–2020లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విద్యా రంగంలో పలు పథకాలు, సంస్కరణలు ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా నేషనల్ డేటా ఎడ్యుకేషనల్ ఆర్కిటెక్చర్‌కు అనుగుణంగా పనిచేసేలా కేంద్ర ప్రభుత్వం 2022లో ‘విద్యా సమీక్ష కేంద్రాల (కమాండ్ కంట్రోల్ సెంటర్)’ను అన్ని రాష్ట్రాల్లోనూ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నంలో రెండు వీఎస్‌కేలు ఏర్పాటయ్యాయి. వీటి నిర్వహణకు కేంద్ర ప్రభుత్వమే ఏటా రూ.5 కోట్లు కేటాయిస్తోంది. ఈ కేంద్రాల్లో విద్యకు సంబంధించి 8 మాడ్యూల్స్‌ను అభివృద్ధి చేసి పర్యవేక్షించడంతో పాటు సచివాలయంలోని రియల్ టైం గవర్నెన్స్ (ఆరీ్టజీ)తో అనుసంధానించారు. టీచర్లు, విద్యార్థులు హాజరు, మధ్యాహ్న భోజనం, కన్సిస్టెంట్ రిథమ్స్ (సీఆర్), యూడైస్, అకడమిక్ మానిటరింగ్, పరీక్షల మూల్యాంకనం వంటి అంశాలను డాష్ బోర్డు ద్వారా పర్యవేక్షిస్తుంటారు. పాఠశాలల్లో విధులపై పూర్తి అవగాహన ఉన్న ఉపాధ్యాయులను జిల్లాకు ఇద్దరు చొప్పున డెప్యుటేషన్‌పై నియమించి, రెండు సెంటర్లలోనూ నలుగురు చొప్పున పర్యవేక్షకులుగా నియమించారు. ఎంతో కీలకమైన ఈ విభాగంలో విధులను పొరుగు సేవల సిబ్బంది అప్పగిస్తే లక్ష్యం నెరవేరదన్న ఆలోచనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థి బడికి రాకపోయినా, టీచర్ అటెండెన్స్ వేయకపోయినా లేదా సెలవు లేకుండా పాఠశాలలో లేకపోయినా వీఎస్కేలోని సిబ్బంది హెచ్ఎంతో పాటు ఎంఈవో, డీఈవోలకు సమాచారం ఇస్తారు. వరుసగా 3 రోజులు విద్యార్థి హాజరు కాకపోతే నేరుగా తల్లిదండ్రులకే మెసేజ్ చేయడంతో పాటు స్థానిక సచివాలయంలోని సిబ్బందికి విషయం చెప్పి ఆ విద్యార్థి ఇంటికి వెళ్లి ఆరా తీస్తారు. రోజూ మధ్యాహ్న భోజనం ఎంత మంది తీసుకుంటున్నారన్న వివరాలు నమోదు చేసి, లోటుపాట్లను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సరిదిద్దేలా చేస్తారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ కేంద్రాలకు ఇప్పుడు ఉపాధ్యాయుల హాజరు మినహా మిగతా 7 అంశాలపై పర్యవేక్షణను ప్రభుత్వం తొలగించింది. గతంలో మండల, జిల్లా విద్యా శాఖ అధికారులు వారంలో రెండు సార్లు చేసే తనిఖీలను కూడా ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో పాఠశాలల్లో ఏం జరుగుతోందో ఉన్నతాధికారులకు తెలియడంలేదు. పర్యవేక్షణ లేక స్కూళ్లల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. గ్రామ స్థాయి నుంచే వ్యవస్థల నిర్వీర్యం గత ప్రభుత్వంలో గ్రామ స్థాయిలో విద్యా సంబంధ అంశాలు కూడా సంబంధిత మంత్రి, కార్యదర్శి, కమిషనర్ వరకు తెలిసేలా డ్యాష్ బోర్డును అభివృద్ధి చేశారు. దీంతో ఎక్కడ ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు పక్కా సమాచారంతో చర్యలు తీసుకునేవారు. గ్రామ, వార్డు పరిధిలో ఎంత మంది పిల్లలున్నారు, ఏ స్కూళ్లల్లో ఏ తరగతులు చదువుతున్నారో పూర్తి సమచారం ఉండేది. బడి ఈడు పిల్లలు, బడి మానేసిన పిల్లలను తిరిగి బడుల్లో చేర్ఫించే బాధ్యతను వలంటీర్లు, వార్డు విద్యా కార్యదర్శి, గ్రామ సచివాలయం విద్యా సంక్షేమ సహాయకులు తీసుకున్నారు. ఇప్పుడు వలంటీర్, సచివాలయ వ్యవస్థలను ప్రభుత్వం నిర్వీర్యం చేసేసింది. వీరికి వారానికి రెండు రోజులు పాఠశాలల్లో టాయిలెట్ల శుభ్రతపై ఫొటోలు అప్లోడ్ చేసే పని అప్పగించింది. మధ్యాహ్న భోజనంపైనా పర్యవేక్షణ లేకపోవడంతో నాణ్యత లేని ఆహారం తినలేక విద్యార్థులు ఇంటి నుంచే ఆహారం తెచ్చుకునే పరిస్థితి తీసుకొచ్చి0ది. -
పని సర్దుబాటుకు కొత్త మార్గదర్శకాలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో పని సర్దుబాటు ప్రక్రియకు పాఠశాల విద్యాశాఖ తాజాగా ఆదివారం మార్గదర్శకాలిచ్చింది. ఇప్పటికే రెండుసార్లు ఈ ప్రక్రియ చేపట్టాలని మార్గదర్శకాలిచ్చినా ప్రభుత్వ షరతులకు ఉపాధ్యాయులు అంగీకరించలేదు. దీంతో 14న మరోసారి పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్‌రామరాజు ఉపాధ్యాయ సంఘాలతో చర్చించారు. నేతలు తమ డిమాండ్లను ఆయన ముందుంచారు. ఇందులో జీవో నం.117 రద్దు మినహా మిగిలిన వాటికి అంగీకరించారు. దీనిప్రకారమే ఆదివారం ఉత్తర్వులిచ్చారు. బదిలీ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.ఈ మార్గదర్శకాల ప్రకారం పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో క్యాడర్ సీనియారిటీ పరంగా జూనియర్‌ను మిగులుగా గుర్తిస్తారు. సీనియర్ ఉపాధ్యాయుడి అంగీకారంతో మిగులు ఉపాధ్యాయుల స్థానంలో పని సర్దుబాటుకు సిద్ధంగా ఉంటే వారికి అవకాశమిస్తారు. క్యాడర్ సీనియారిటీని లెక్కించేందుకు ఒకే డీఎస్సీ, మెరిట్–కమ్–రోస్టర్‌లో ఉన్న టీచర్ల సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటారు. బదిలీల్లో సబ్జెక్ట్ టీచర్ లేదా సెకండరీ గ్రేడ్ టీచర్ లేని పాఠశాలలకు మొదటి ప్రాధాన్యం ఇస్తారు. పని సర్దుబాటు ప్రక్రియ 9వ తేదీ నాటికి యూడైస్‌లో నమోదైన డేటా ఆధారంగా నిర్వహిస్తారు. -
సిఫారసులకే సర్దుబాటు!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ స్కూళ్ల ఉపాధ్యాయుల సర్దుబాటు బదిలీలకు రంగం సిద్ధమైంది. ఈ ప్రక్రియ ఆదివారం నాటికి పూర్తి కావాల్సి ఉండగా టీచర్, విద్యార్థుల నిష్పత్తి, సర్వీస్, స్టేషన్ అంశాల్లో ఏది ప్రామాణికంగా తీసుకోవాలన్న అంశంపై తర్జనభర్జనతో బదిలీలను సోమవారానికి వాయిదా వేశారు. పైకి మాత్రం పని సర్దుబాటు ఆధారంగా బదిలీలు అని చెబుతున్నా అంతర్గతంగా కూటమి నేతలకు కాసులు కురిపించే ప్రక్రియగా మారిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తమ సిఫారసు లేఖలతో వచ్చిన వారికి బదిలీలలో ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు మంత్రులు, కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.ఇదే అదనుగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సిఫారసు లేఖలతో మండలం, జిల్లా కేంద్రాలకు లేదంటే సమీపంలోని పాఠశాలలకు డిప్యూటేషన్‌పై వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మొత్తం ప్రక్రియ జిల్లా స్థాయిలో జరుగుతుండటంతో భారీగా అక్రమాలకు ఆస్కారముందని పలు ఉపా«ద్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విద్యాశాఖ లెక్కల ప్రకారం స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు మొత్తం 29,992 మంది ఉపాధ్యాయులు మిగులు కనిపిస్తుండగా ఈ ఏడాది ఇప్పటివరకు ఉద్యోగ విరమణ చేసిన వారు 2 వేల మంది వరకు ఉన్నట్టు తెలుస్తోంది. 30 మంది విద్యార్థులకు ఓ టీచర్ ఉండాలని విద్యాశాఖ నిబంధన తేవడంతో గరిష్టంగా 4 వేల నుంచి 5 వేల మందికి బదిలీకి అవకాశముంది. ఈ ఏడాది పదవీ విరమణ చేయనున్న వారిని బదిలీల నుంచి మినహాయించారు. బదిలీలు 1: 20 ప్రకారం చేయాలని డిమాండ్ ఇటీవల ఉపాధ్యాయుల అటెండెన్స్ యాప్‌లో సిబ్బంది సర్వీసు వివరాల నమోదు కోసం ప్రత్యేక కాలమ్ జోడించారు. దీనిద్వారా ఉపాధ్యాయులంతా తమ సర్వీస్ రికార్డు వివరాలను నమోదు చేశారు. ఈ లెక్కల ప్రకారం స్కూల్ అసిస్టెంట్లు (సబ్జెక్టు టీచర్లు) 8,773 మంది, ఎస్జీటీలు 20,469 మంది మిగులు ఉన్నట్టు తేల్చారు. ఎయిడెడ్‌లో మరో 750 మంది కలిపి మొత్తం మిగులు ఉపాధ్యాయలు 29,992 మంది ఉన్నారు. సర్దుబాటు బదిలీల్లో భాగంగా 30 మంది విద్యార్థులకు ఓ టీచర్ చొప్పున ఉండేలా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ లెక్కన సర్దుబాటు చేస్తే సెకండరీ గ్రేడ్ టీచర్లకు నష్టం జరుగుతుంది.ప్రాథమిక పాఠశాలల్లో 20 మంది విద్యార్థులకు ఒక టీచర్ నిష్పత్తిలో, ఉన్నత పాఠశాలలకు 1:45 నిష్పత్తిలో లేదా జీవో53 ప్రకారం ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేసు్తన్నారు. దీనివల్ల 6 నుంచి 7 వేల మందికి అవకాశం లభిస్తుందంటున్నాదీనిపై ప్రభుత్వం స్పందించలేదు. సర్దుబాటు బదిలీల్లో సమస్యలను పరిష్కరించుకునేందుకు టీడీపీ ఎమ్మెల్సీలతో చర్చించేందుకు రావాలని ఉపాధ్యాయ సంఘాలను ఆహ్వానించినప్పటికీ తామనుకున్న వి«దంగా ప్రక్రియ ముగించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సర్దుబాటు బదిలీలు తొలుత రాష్ట్ర స్థాయిలో చేపట్టాలని నిర్ణయించినా అనంతరం జిల్లా స్థాయిలో మండల యూనిట్‌గా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. కూటమి నేతలు దీన్ని ఆసరాగా చేసుకుని తమ సిఫారసు లేఖలు తెచ్చుకున్న వారిని కోరుకున్నచోటకు పంపించాలని ఆదేశిస్తున్నట్లు సమాచారం. -
టీడీపీ నేతల రౌడీయిజం.. స్కూల్ విద్యా కమిటీ ఎన్నికల్లో అరాచకం
సాక్షి, గుంటూరు: ప్రత్తిపాడు మండలం పెద్ద గొట్టిపాడులో తెలుగుదేశం నాయకుల రౌడీయిజానికి దిగారు. జడ్పీ హైస్కూల్లో పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నిక వ్యవహారంలో తెలుగు తమ్ముళ్లు అరాచాకానికి పాల్పడ్డారు. విద్యా కమిటీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులతో బూసి యేసు మరియమ్మ చైర్మన్‌గా ఎంపికయ్యారు. దీంతో మరియమ్మ గెలిచనట్లు అధికారులు ప్రకటించారు.అయితే అధికారులపై ఒత్తిడి తెచ్చిన టీడీపీ నేతలు.. బూసి ఏసు మరియమ్మ పానెల్ గెలుపును రద్దు చేయించారు. అంతేగాక వైఎస్సార్సీపీ మద్దతుదారులపై దాడి చేసి పోలీసులు సహాయంతో బయటకు నెట్టేశారు. అనంతరం తెలుగుదేశం మద్దతుదారుల ప్యానెల్ గెలిచినట్టు అధికారులతో ప్రకటన చేయించుకున్నారు.విషయం తెలుసుకున్న విద్యార్ధుల తల్లిదండ్రులు భారీ స్థాయిలో జడ్పీ హైస్కూల్‌కు తరలి వచ్చారు. ప్రజాస్వామ్య బద్దంగా ఒక దళిత మహిళ చైర్మన్ అయితే ఎందుకు రద్దు చేశారంటూ ఇంచార్జి ప్రిన్సిపాల్‌తో తల్లిదండ్రుల వాగ్వాదానికి దిగారు. తమ పిల్లలకు టీసీలు ఇచ్చేయమని పట్టుబట్టారు. ఉదయం నుంచి పిల్లల టీసీల కోసం గొడవ చేశారు. చైర్మన్ పదవికి దళిత మహిళ పనికి రానప్పుడు స్కూల్లో పిల్లలకు ఎలా న్యాయం జరుగుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఒక దళిత మహిళకు అన్యాయం చేసి చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి.. ఓడిపోయిపి ఎలా చైర్మన్ పదవి కట్టబెడతారంటూల్లి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
చదువులకూ ‘చంద్ర’ గ్రహణం!
రాష్ట్రంలో ప్రభుత్వ బడుల్లో చదువులు గాడి తప్పాయా? విద్యార్థులందరికీ యూనిఫాం అందలేదా?కొంత మందికే బూట్లు ఇచ్చారా? టీచర్ల కొరత వేధిస్తోందా? మధ్యాహ్నం పిల్లలకు రుచీపచీ లేని భోజనం పెడుతున్నారా? ఇదివరకటి మెనూ అమలు కావడం లేదా? వంట వాళ్లను ఇష్టానుసారం మార్చేస్తున్నారా? టోఫెల్‌కు మంగళం పాడారా? ఇంగ్లిష్ మీడియంను చిన్నచూపు చూస్తున్నారా? స్టూడెంట్ కిట్లను కూటమి నేతలు పంపిణీ చేస్తున్నారా?.... ఈ ప్రశ్నలన్నింటికీ ప్రతి జిల్లాలో,ప్రతి ఊళ్లో, ప్రతి ఒక్కరూ ‘అవును’ అని సమాధానమిస్తున్నారు. ఇన్నాళ్లూ బంగారంలా చక్కగా సాగిపోతున్న చదువులకు గ్రహణం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు రెండు నెలలు సమీపిస్తున్నా ఇప్పటికీ ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫారం, బ్యాగులు అందలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేదింటి పిల్లలకు బడి తెరిచిన మొదటి రోజే అందాల్సిన స్టూడెంట్ కిట్లు ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో అందించండంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. గత విద్యా సంవత్సరం వరకు వేడుకగా సాగిన చదువులను నిస్తేజంగా మార్చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 60 శాతం మంది విద్యార్థులకు యూనిఫారం అందనే లేదు. చాలా జిల్లాలకు బ్యాగులు చేరలేదు. పుస్తకాలు సైతం అందరికీ పంపిణీ చేయలేదు. ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు ప్రతిరోజు పుస్తకాలు, బ్యాగులు, ఇతర విద్యా సమగ్రిని ’సర్దుబాటు’ చేసుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. స్కూళ్లకు చేరిన వస్తువులను సైతం స్థానిక కూటమి నేతల చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారు. ‘ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ కార్యకర్తలకు ప్రాధాన్యం ఉంటుంది. అన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు వారి చేతుల మీదుగానే జరుగుతాయి. ఇది మీకు నేను ఇస్తున్న వాగ్దానం’ అని ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన నేపథ్యంలో పుస్తకాల పంపిణీలో కూడా ‘తమ్ముళ్లు’ భాగస్వాములవుతున్నారు. పంపిణీ ఆలస్యం అవడానికి ఇది కూడా ఓ కారణం. రెండు నెలలుగా విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ ప్రహసనంగా సాగుతోంది. ఈ నెలాఖరున ఫార్మాటివ్ అసెస్మెంట్–1 పరీక్షలు ఉన్న నేపథ్యంలో విద్యార్థులు పుస్తకాల కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. 35.60 లక్షల కిట్లకు ఆర్డర్.. అందినవి అంతంతే.. ప్రస్తుత (2024–25) విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం గతేడాది సెపె్టంబర్లో విద్యా కానుక కిట్ల సరఫరాకు విద్యా శాఖ ఆర్డర్ పెట్టింది. హైస్కూల్ విద్యార్థులకు అన్ని సబ్జెక్టుల పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, టోఫెల్ వర్క్ బుక్, ఫ్యూచర్ స్కిల్స్ సబ్జెక్ట్ పుస్తకంతో పాటు 3 జతల యూనిఫాం క్లాత్, స్కూల్ బ్యాగ్, బెల్ట్, ఆక్స్ఫర్డ్ నిఘంటువు.. 1–5 తరగతుల విద్యార్థులకు వర్క్ బుక్స్, పిక్టోరియల్ డిక్షనరీ అందించాలి. గత నాలుగేళ్లుగా ఇదే ప్రక్రియ కొనసాగింది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 35.60 లక్షల స్టూడెంట్ కిట్ల సరఫరాకు సమగ్ర శిక్షణ ఆదేశాలు జారీ చేసింది. అన్ని వస్తువులను మే చివరి నాటికి మండల స్టాక్ పాయింట్లకు చేర్చి, అక్కడి నుంచి జూన్ మొదటి వారంలో ఆయా స్కూళ్లకు తరలించి కిట్‌గా రూపొందించాలి. బడులు తెరిచిన మొదటి రోజే 9 వస్తువులతో కూడిన కిట్‌ను విద్యార్థులకు నేరుగా స్కూల్లోనే అందించాలి. ఇందులో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండకూడదు. కొత్తగా చేరే విద్యార్థులకు మండల స్టాక్ పాయింట్ నుంచి ఎప్పటికప్పుడు తెప్పించి ఇవ్వాలి. కానీ ఈ ఏడాది అందుకు భిన్నంగా జరుగుతోంది. గత విద్యా సంవత్సరంలో మిగిలిన 90 వేల కిట్లు మాత్రమే నూరు శాతం పంపిణీ చేశారు. ఆపై కంపెనీల నుంచి వస్తున్న వస్తువులను స్కూళ్లకు ఇంకా పంపిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు విద్యా కానుక కిట్‌లో అందించే 9 వస్తువుల్లో ఏ ఒక్కటీ స్కూల్‌కు సరిపడినన్ని ఇవ్వకపోవడం గమనార్హం. జగన్ సర్కారులో ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని గత ప్రభుత్వం ప్రభుత్వ విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. సర్కారు బడిలో చదువుతున్న విద్యార్థులున్న తల్లిదండ్రులకు ఎలాంటి ఆర్ధిక భారం ఉండకూడదన్న లక్ష్యంతో ‘జగనన్న విద్యా కానుక’ (జేవీకే)ను 2020–21 విద్యా సంవత్సరం నుంచి తీసుకొచ్చింది. ఈ విద్యార్థులు కార్పొరేట్ స్కూల్ విద్యార్థులకు సమానంగా ఆత్వవిశ్వాసంతో బడికి వెళ్లాలని రూ.2,900 విలువైన కిట్‌లో నాణ్యమైన స్కూలు బ్యాగు, టెక్స్స్ట బుక్స్, నోటు పుస్తకాలు, జత బూట్లు, రెండు జతల సాక్సులు, వర్క్‌బుక్స్ (ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు), ఇంగ్లిష్–తెలుగు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ(హైస్కూల్), పిక్టోరియల్ డిక్షనరీ, మూడు జతల యూనిఫారం క్లాత్, బెల్టు, టై అందించింది. వస్తువుల నాణ్యతను పరిశీలించేందుకు భారత ప్రభుత్వం మద్దతుతో లాభాపేక్ష లేకుండా నడుస్తున్న ‘క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ సంస్థకు అప్పగించింది. 2024–25 విద్యా సంవత్సరానికి రూ.1,042.51 కోట్లతో విద్యా కానుక కిట్ల సరఫరాకు గత సెపె్టంబర్ నెలలోనే ఆదేశాలు జారీ చేసింది. 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు మొదటి సెమిస్టర్లో బోధించే 3.12 కోట్ల పాఠ్యపుస్తకాలతో పాటు ఈ విద్యా సంవత్సరం అదనంగా టోఫెల్ వర్క్‌బుక్, ఫ్యూచర్ స్కిల్స్ సబ్జెక్ట్ పుస్తకం కూడా అందించాలి. కానీ 80 శాతం పుస్తకాలను సరఫరా చేసి, మిగిలిన వస్తువులను అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ‘సర్దుబాటు’తో నెట్టుకొస్తున్న వైనం గతంలో విద్యా కానుక కిట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడంతో వస్తువుల సరఫరాదారు నుంచి పాఠశాలకు చేరే దాకా ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉండేది. ఈ ఏడాది ప్రభుత్వ నిర్లక్ష్యంతో అంతా తారుమారైంది. విద్యార్థులకు ఒక వస్తువు ఇస్తే మరో వస్తువు అందే పరిస్థితి లేదు. యూనిఫారాలు ఇప్పటికీ బడులకు చేరలేదు. వస్తువుల కొరత కారణంగా ప్రతి మండలంలో ఏరోజుకారోజు వస్తువులను ఒక స్కూల్ నుంచి మరో స్కూల్‌కు సర్దుబాటు చేస్తున్నారు. ముఖ్యంగా పుస్తకాల విషయంలో ప్రతిరోజు విద్యార్థుల చేరికను బట్టి స్టాక్ ఉంచుకుని మిగిలిన వాటిని ఉన్నతాధికారులు సూచించిన స్కూలుకు తరలిస్తున్నారు. ఇక్కడి బడిలో విద్యార్థులు చేరితే, ఆ మేరకు వస్తువులను ఇంకో స్కూల్ నుంచి తరలిస్తున్నారు. ఇదిలా ఉంటే అందిన వస్తువులను సైతం విద్యార్థులకు వెంటనే అందించకుండా బడుల్లో స్టాక్ పెట్టి, స్థానిక కూటమి నాయకులు వస్తేనే వారి చేతుల మీదుగా పంపిణీ చేస్తున్నారు. నాయకులు రానిచోట వస్తువుల పంపిణీ నిలిపేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు సైతం చేష్టలుడిగి చూస్తున్నారు. దీంతో జూన్ 13న స్కూళ్లు తెరిచిన నాటి నుంచి ఆగస్టు వచ్చినా పంపిణీ ప్రక్రియ ప్రహసనంగా కొనసాగుతోంది.టోఫెల్‌కు రాం రాం.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లల్లో ఇంగ్లిష్ ప్రావీణ్యం పెంపొందించాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతో చొరవ తీసుకుని టోఫెల్ క్లాసులు ప్రవేశపెట్టింది. ఇందుకోసం ప్రత్యేక పీరియడ్ కూడా కేటాయించింది. 3–5 తరగతుల పిల్లల కోసం టోఫెల్ ప్రైమరీ, 6–9 తరగతుల వారి కోసం టోఫెల్ జూనియర్ క్లాసులు నిర్వహించి మార్చిలో పరీక్షలు కూడా జరిపింది. తాజాగా కూటమి ప్రభుత్వం ఆ పరీక్ష ఫలితాలు ప్రకటించకపోగా, ఏకంగా టోఫెల్‌కే తిలోదకాలు ఇచ్చింది. పేదలకు ఇంగ్లిష్ మీడియమే ఎక్కువ.. అనుకుంటుంటే ఆ భాషపై మరింత పట్టు సాధించేలా టోఫెల్ అవసరమే లేదని ప్రభుత్వ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారని స్పష్టమవుతోంది. దీనికి తోడు అమ్మ ఒడి (తల్లికి వందనం) పథకం అమలు చేస్తారో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు మార్గదర్శకాలు కూడా విడుదల కాక పోవడం చూస్తుంటే ఈ పథకానికీ ఈ ఏడాది మంగళం పాడినట్లేనని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ ఏటా రూ.15 వేల చొప్పున ఇస్తామని చంద్రబాబు సహా కూటమి నేతలు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తీరా గద్దె నెక్కాక ఈ పథకం అమలు గురించి మాట్లాడటమే మానేయడం గమనార్హం. గత వైఎస్ జగన్ ప్రభుత్వం పిల్లలను బడికి పంపే తల్లులకు అమ్మ ఒడి పథకం కింద ఏటా రూ.15 వేలు సాయం అందించింది.జిల్లాల్లో ఇదీ పరిస్థితి⇒ అనంతపురం జిల్లాలో 450కి పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నాయి. జిల్లాలోని ఏ ఒక్క స్కూల్‌కూ యూనిఫాం క్లాత్ చేరలేదు. కొన్ని స్కూళ్లకు బూట్లు, మరి కొన్ని స్కూళ్లకు డిక్షనరీలు అందలేదు. జిల్లాలో 677 మధ్యాహ్న భోజన ఏజెన్సీల నిర్వాహకులను మార్చారు. ఆహారంలో నాణ్యత లోపించింది. ⇒ శ్రీసత్యసాయి జిల్లాలో 345 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాకు మంజూరైన విద్యా కానుక కిట్లు 1,38,634 పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ, పలు చోట్ల విద్యార్థులకు కొన్ని వస్తువులు అందలేదు. కిట్లు పక్కదారి పట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. 1,438 మధ్యాహ్న భోజన ఏజెన్సీల నిర్వాహకులను మార్చివేశారు. చాలాచోట్ల భోజనం నాణ్యతగా ఉండడం లేదు. కొన్ని చోట్ల కోడిగుడ్లను స్వాహా చేస్తున్నారు. ⇒ ఉమ్మడి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం బృందావనంలోని ప్రాథమిక పాఠశాలలో ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేరు. ఇటీలవల ఆళ్లగడ్డ పట్టణంలోని పాఠశాలలో పని చేస్తున్న ఓ ఉపాధ్యాయున్ని తాత్కాలికంగా డిప్యుటేషన్‌పై పంపారు. జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజనం సరిగా అమలు కావడం లేదు. వంట ఏజెన్సీలు మార్చాలని టీడీపీ నేతలు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. 1,07,225 మంది విద్యార్థులకు యూనిఫామ్స్ ఇవ్వాల్సి ఉంది. 2,600 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ⇒ చిత్తూరు జిల్లాలో అన్ని పాఠశాలల్లో గోరుముద్ద పేరు తొలగించి, ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం’ అని బోర్డు రాయిస్తున్నారు. కొద్ది రోజులుగా దాదాపు 10 వేల మంది విద్యార్థులు ఇంటి నుంచి భోజనం తెచ్చుకుంటున్నారు. 909 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆక్స్‌ఫోర్డ్ డిక్షనరీ ఇంకా అందలేదు. తిరుపతి జిల్లాలో దాదాపు 4 వేల జతల బూట్ల కొలతల్లో తేడా రావడంతో పంపిణీ చేయలేదు. ⇒ వైఎస్సార్ జిల్లాలో మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపించింది. దీంతో చాలా మంది విద్యార్థులు తినేందుకు ఆసక్తి చూపడం లేదు. మండల స్థాయికి కిట్లు అందినా, పూర్తి స్థాయిలో పంపిణీ కాలేదు. ⇒ ప్రకాశం జిల్లాలో చాలా ప్రాంతాల్లోని స్కూళ్లలో మధ్యాహ్న భోజనం సరిగా ఉండటం లేదు. బియ్యంలో నాణ్యత లేదు. స్టాండర్డ్ మెనూ ఉండటం లేదు. కోడిగుడ్ల సైజు తగ్గింది. వందల సంఖ్యలో ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. కంభం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వాటర్ ప్లాంట్ పని చేయడం లేదు. దీంతో విద్యార్థులకు బోరు నీరే దిక్కయింది. ఇంకా 20 శాతం మంది విద్యార్థులకు విద్యా కానుక కిట్ పంపిణీ చేయాల్సి ఉంది. ⇒ ఉమ్మడి కృష్ణా జిల్లాలో 1,208 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో వివిధ విద్యా సంస్థల్లో 140 మంది సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. ⇒ అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలో నాలుగు ప్రాథమిక పాఠశాలలు ఈ ఏడాది మూతపడ్డాయి. ఆంగ్ల మాధ్యమాన్ని కొనసాగిస్తారో లేదోనన్న అనుమానంతో తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్చించామని తల్లిదండ్రులు చెబుతున్నారు. బేతపూడి ఎంపీపీ స్కూల్, సీతంపేట ఎంపీపీ స్కూల్, కె.ఎం పాలెం పంచాయితీలో గల ఎండపల్లిపాలెం ఎంపీపీ స్కూల్, మారేపల్లి పంచాయితీ శివరామచేనులపాలెంలో ఎంపీపీ స్కూళ్ల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో చేరారు. ⇒ ఏలూరు జిల్లాలో 1035 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. విద్యా కానుక కిట్లు వైఎస్సార్సీపీ హయాంలో సిద్ధం చేసినవే పంపిణీ చేశారు. పశి్చమగోదావరి జిల్లాలో వందకు పైగా ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు ఉన్నాయి. మధ్యాహ్న భోజనం బాగోలేదని పిల్లలు చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఇదే పరిస్థితి. కిట్లు పూర్తి స్థాయిలో పంపిణీ కాలేదు. కోనసీమ జిల్లాలో 464 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఐఆర్ వెంటనే ప్రకటించాలిఏపీ జేఏసీ అమరావతిఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే ఐఆర్ ప్రకటించాలని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు, కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్షణమే 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించాలన్నారు. విజయవాడలోని రెవెన్యూ భవన్లో శనివారం నిర్వహించిన ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వీరు పాల్గొన్నారు. 12వ పీఆర్సీ కమిషనర్ రాజీనామా చేసినందున వెంటనే కొత్త కమిషనర్‌ను నియమించాలన్నారు. మహిళా ఉద్యోగులపై లైంగిక, ఇతర వేధింపులపై ఫిర్యాదుల కోసం ప్రతి కలెక్టరేట్లో ‘షీ బాక్స్’లు ఏర్పాటు చేయాలని కోరారు. మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం కల్పించిన పిల్లల సంరక్షణ సెలవుల అమలుపై ఆర్థిక శాఖ నుంచి ఉత్తర్వులివ్వాలని పేర్కొన్నారు. – సాక్షి, అమరావతిఫీజు రీయింబర్స్మెంట్ ఏదీ?ఏబీవీపీ పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కల్పిస్తూ ప్రత్యేకంగా జీవో తెస్తానని యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ ఇచ్చిన హమీ మేరకు జీవో మంజూరు చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర కార్యదర్శి ఎస్.యచంద్ర డిమాండ్ చేశారు. జీవో–77 రద్దు చేసేంత వరకు పీజీ కౌన్సెలింగ్ ప్రక్రియను నిలిపివేయాలని ఏబీవీపీ నాయకులు ఏపీ ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ రామ్మోహనరావును మంగళగిరిలోని ఆయన కార్యాలయంలో శనివారం కలిసి వినతిపత్రమిచ్చారు. జీవో 77ను రద్దు చేసి ఫీజు రీయింబర్స్మెంట్ కల్పిస్తూ మరో జీవో విడుదల చేసిన తర్వాతే పీజీ సెట్ కౌన్సెలింగ్ చేపట్టాలన్నారు. ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెంకట గోపి మాట్లాడుతూ జీవో–77 రద్దు చేయని పక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తుందన్నారు. – మొగల్రాజపురం (విజయవాడ తూర్పు)సర్కారు వారూ..సమస్యలివిగో..!ఉద్యోగ భద్రత కల్పించాలి‘ఔట్ సోర్సింగ్’ ఉద్యోగులురాష్ట్రంలో ఆరోగ్య (ఎన్టీఆర్ వైద్య సేవ) పథకం కింద సేవలందిస్తున్న వైద్య మిత్రలకు ఉద్యోగ భద్రత కల్పించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఏపీ వైద్య సేవ దళిత, గిరిజన కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమాఖ్య ప్రతినిధులు కోరారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం పల్లాను కలిసిన ప్రతినిధులు గత 17 ఏళ్లుగా పనిచేస్తున్నామని, తమకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. అదే విధంగా సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు, ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని కోరారు. పల్లాను కలిసి వారిలో సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు మాచర్ల బుజ్జి, ప్రధాన కార్యదర్శి ప్రత్యూష ఉన్నారు. – సాక్షి, అమరావతిఈహెచ్ఎస్ పరిధి పెంచాలిఏపీ ఉపాధ్యాయ సంఘంఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఉచిత వైద్య సదుపాయాలతో పాటు ఈహెచ్ఎస్ అమల్లో తలెత్తుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాలాజీ, సత్యనారాయణ, సంఘం నేతలు శనివారం ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్) పథకంలో కొన్ని ఆస్పత్రులు నగదు రహిత వైద్యసేవలు అందించడం లేదని, ఈ మేరకు మెడికల్ రీయింబర్స్మెంట్ సౌకర్యాన్ని కల్పించాలని మంత్రిని కోరారు. అలాగే రీయింబర్స్మెంట్ సీలింగ్‌ను రూ.5లక్షలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. – సాక్షి, అమరావతిపదోన్నతులు ఇవ్వాలిటీఎన్యూఎస్డీఈవో పూల్‌లో ఉన్న భాషా పండితులకు పదోన్నతి కల్పించాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం (టీఎన్‌యూఎస్) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్‌కు భాషా పండితులు మాత్రమే అర్హులుగా కాగా, 2019లో లాంగ్వేజ్ పండిట్ల పోస్టులను అప్‌గ్రేడ్ చేసి సెకండ్ గ్రేడ్ టీచర్లు కూడా అర్హులుగా పరిగణించడంతో దాదాపు 1,100 మంది భాషా పండితులకు డీఈవో పూల్‌లో చోటు దక్కలేదని సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగా ఐదేళ్లుగా ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు మన్నం శ్రీనివాస్, శ్రీరామిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజుకు శనివారం విజ్ఞప్తి చేశారు. – సాక్షి, అమరావతిసబ్సిడీ సరిచేయాలిగొర్రెలు, మేకల పెంపకందార్లురాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకల షెడ్ల నిర్మాణానికి సబ్సిడీ అందించడంలో ఉన్న వ్యత్యాసాన్ని సరిచేసి అందరికీ సమన్యాయం చేయాలని మంత్రి అచ్చెన్నాయుడికి ఆంధ్రప్రదేశ్ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం విజ్ఞప్తి చేసింది. విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయనను కలిసి సంఘం నేతలు వినతిపత్రమిచ్చారు. ప్రభుత్వం గేదెలు, ఆవుల షెడ్ల నిర్మాణానికి 90శాతం, గొర్రెలు, మేకల షెడ్ల నిర్మాణానికి 70శాతం సబ్సిడీని ప్రకటించిందని, అలా కాకుండా అన్నింటికి 90శాతం సబ్సిడీ ఇవ్వాలని కోరారు. వర్షాకాలం సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా అంటువ్యాధులు ప్రబలి గొర్రెలు మేకలు మృత్యువాత పడుతున్నాయని, వాటిని కాపాడుకునేందుకు అవసరమైన టీకాలు, డీ వారి్మంగ్ మందులు ఉచితంగా అందించాలన్నారు. – సాక్షి, అమరావతి -
రేవంత్ సార్ ఒక్కసారి ఇది చూడు...
-
టీచర్లు లేక పేద విద్యార్థులకు ఇబ్బంది.. డీఎస్సీకి సిద్ధం కండి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య సరిగా లేక పేద విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని.. దీన్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు డీఎస్సీ పరీక్ష రాసేందుకు సిద్ధం కావాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ప్రస్తుతం 11 వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నామని.. కొన్ని నెలల్లో మరిన్ని పోస్టులతో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తామని ప్రకటించారు.ఆదివారం గాం«దీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకేట అన్వేశ్‌రెడ్డి తదితరులతో కలసి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఉద్యోగాలను స్థానికులకే ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచి్చందన్నారు. జాబ్ కేలండర్ ప్రక్రియ వేగవంతం చేస్తాం గత పదేళ్లలో గ్రూప్స్, డీఎస్సీ పరీక్షలు నిర్వహించకుండా బీఆర్ఎస్ సర్కారు నిరుద్యోగులను గాలికి వదిలేసిందని భట్టి విక్రమార్క మండిపడ్డారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేసేందుకు ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉందని.. జాబ్ కేలండర్ విడుదల ప్రక్రియను వేగవంతం చేస్తామని చెప్పారు.తాము అధికారంలోకి వచి్చన మూడు నెలల్లోనే 30వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామన్నారు. గురుకుల పీఈటీలు, అసిస్టెంట్ ఇంజనీర్లు, డివిజనల్ అకౌంట్ ఆఫీసర్లు, లైబ్రేరియన్లు, జూనియర్ లెక్చరర్లు, మెడికల్ ల్యాబ్ అసిస్టెంట్ వంటి మరో 13,321 మంది ఉద్యోగుల నియామక ప్రక్రియ చివరి దశకు చేరుకుందని చెప్పారు. షెడ్యూల్ ప్రకారం పరీక్షలు భర్తీ సాధ్యం కాదని తెలిసినా గత ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచి్చందని ఆరోపించారు. తాము వాటికి మరో 6వేల పోస్టులు కలిపి 11వేల టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తే.. 2.79 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. జూలై 18 నుంచి ఆగస్టు 5వరకు పరీక్షల షెడ్యూల్ ఉందని.. ఆ షెడ్యూల్ ప్రకారం పరీక్షలు రాసేందుకు 2.05 లక్షల మంది హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు.ఈ పరీక్షకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండేలా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామన్నారు. నిరుద్యోగులెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని.. ఖాళీగా ఉన్న మరో ఐదువేల టీచర్ పోస్టులతోపాటు మరికొన్ని పోస్టులు కలిపి త్వరలోనే మరో నోటిఫికేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులు డీఎస్సీని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గతంలో పరీక్ష పెట్టారు.. లీక్ చేశారు..! గత ప్రభుత్వం గ్రూప్–1 పరీక్షకు నోటిఫికేషన్ ఇచి్చందని.. ఆ పేపర్ లీక్ అయిందని భట్టి చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ నోటిఫికేషన్‌ను రీషెడ్యూల్ చేశామని.. ప్రిలిమ్స్ పరీక్షను విజయవంతంగా నిర్వహించామని, 31,382 మంది మెయిన్స్‌కు కూడా ఎంపికయ్యారని వివరించారు. గత ప్రభుత్వం గ్రూప్–2 పరీక్షలను మూడు సార్లు వాయిదా వేసిందని.. తాము అధికారంలోకి రాగానే ఆగస్టులో పరీక్షలు నిర్వహించేలా తేదీలు ఖరారు చేశామన్నారు.గత సర్కారు గ్రూప్–3 కోసం డిసెంబర్ 30, 2022న నోటిఫికేషన్ ఇచ్చినా పరీక్షలు నిర్వహించలేదని.. తాము నవంబర్‌లో ఆ పరీక్ష తేదీలు ఖరారు చేశామని చెప్పారు. తెలంగాణ బిడ్డలు ఉద్యోగాలు సాధించి జీవితాల్లో స్థిరపడాలన్నదే తమ ప్రభుత్వ ఆశ, ఆలోచన అని.. డీఎస్సీకి సిద్ధమవుతున్న నిరుద్యోగులు పరీక్షలు బాగా రాసి, త్వరగా పాఠశాలల్లో చేరి పేదబిడ్డలకు పాఠాలు చెప్పాలని కోరారు. -
టీచర్ అంటే ఇలా ఉండాలి..
-
పేదపిల్లలపై పిడుగు!.. ఫీజు రీయింబర్స్ మెంట్ కు ఎసరు
-
మరోసారి ‘టెట్’తో డీఎస్సీ ఆలస్యం!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ యాజమాన్యాల్లోని పాఠశాలల్లో 6,100 టీచర్ పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరిలో గత ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతోపాటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు సైతం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా టెట్ నిర్వహించింది. అయితే సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా టెట్ నిర్వహించలేదని పేర్కొన్నారు. అంటే.. మరోసారి టెట్ నిర్వహణ పేరుతో డీఎస్సీని ఆలస్యం చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.గతంలో నిర్వహించిన టెట్‌కు సంబంధించి సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్ జీటీ) అర్హత పరీక్ష పేపర్–1ఏని 1,13,296 మంది, స్కూల్ అసిస్టెంట్ టీచర్ల అర్హత పరీక్ష పేపర్–2ఏని 1,19,500 మంది, ప్రత్యేక విద్య ఉపాధ్యాయ అర్హత పరీక్ష పేపర్–1బి, పేపర్–2బిలను 3,111 మంది రాశారు. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 2.33 లక్షల మంది టెట్‌కు హాజరయ్యారు. వాస్తవానికి మార్చి∙20న టెట్ ఫలితాలు ప్రకటించాలని షెడ్యూల్లో ప్రకటించినా.. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఆలస్యమైంది.అయితే, అభ్యర్థులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో పాఠశాల విద్యాశాఖ టెట్ ఫలితాల ప్రకటన, డీఎస్సీ నిర్వహణకు అనుమతి కోరుతూ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. అయితే, టీడీపీ వర్గాల ఒత్తిడితో ఎన్నికల సంఘం అందుకు అంగీకరించలేదు. ఇప్పటికే నిర్వహించిన టెట్ ఫలితాలు ప్రకటించాల్సింది పోయి, మరోసారి టెట్ నిర్వహించేందుకే ప్రస్తుత ప్రభుత్వం ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. ఇదే జరిగితే.. డీఎస్సీ నిర్వహణ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.కొత్త ప్రభుత్వం ఉద్దేశం ఇదేనా?వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రూప్–1, గ్రూప్–2, డిగ్రీ కళాశాలల లెక్చరర్లు, జూనియర్ కళాశాలల లెక్చరర్లు, పాలిటెక్నిక్ కళాశాలల లెక్చరర్లు, తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిలో పలు పోస్టులకు ప్రిలిమ్స్ కూడా నిర్వహించి ఫలితాలను ప్రకటించింది. మెయిన్స్ పరీక్షలు జరిగే సమయంలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో కొన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీలో నియమితులైన చైర్మన్, సభ్యులు ఉన్నంతకాలం ఈ పోస్టుల భర్తీ చేపట్టకూడదనే ఉద్దేశంతో కొత్త ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.తద్వారా ఆ పోస్టులను తామే భర్తీ చేశామన్న క్రెడిట్‌ను కొట్టేయడమే కొత్త ప్రభుత్వ ఉద్దేశమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీలో ప్రస్తుతం ఉన్న సభ్యులను తప్పించేందుకు రాజీనామా చేయాలని వారిపై ఒత్తిడి తోపాటు అవసరమైతే వారిపై కేసుల నమోదుకు కూడా పావులు కదుపుతున్నట్టు తెలిసింది. ఇదే కోవలో మరోసారి టెట్ నిర్వహణ పేరుతో డీఎస్సీని ఆలస్యం చేసేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. -
Big Question: కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా ఏపీలో ప్రభుత్వ బడులు.. ఇదంతా నాడు.. మరి నేడు ?
-
ఇంగ్లీషు మీడియం కొనసాగేనా?
మొత్తం దేశ చరిత్రనే మార్చే పథకం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంగ్లీషు విద్య. ఆ విద్యా విధానాన్ని కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందా, ఆపేస్తుందా అనేది ప్రశ్న. గత ఐదేండ్లుగా ప్రభుత్వ పాఠశాల విద్యారంగంలో వచ్చిన మార్పులు గణనీయమైనవి. ఆ మార్పులను అనిష్టంగానైనా కొత్త ప్రభుత్వం కొనసాగిస్తే రానున్న ఐదేండ్లలో విద్యారంగంలోని మార్పులు పాతుకు పోతాయి. అలాకాకుండా మళ్ళీ పాత పద్ధతిలోకి విద్యావ్యవస్థను నెడితే ప్రజలు ఏం చెయ్యాలనేది చాలా కీలకమైంది. అందుకే స్కూళ్ళలో పిల్లల భవిష్యత్తును కొత్త ప్రభుత్వం వెనక్కి నెట్టకుండా చూడాల్సిన బాధ్యత వైసీపీ రాజకీయ శక్తులతో పాటు, పిల్లల తలిదండ్రుల మీద కూడా ఉంది.ఎన్నికల సమయంలో చండీగఢ్‌లో జరిగిన రాజ్యాంగ రక్షణ సదస్సుకు నేను వక్తగా వెళ్ళాను. అది ఆఖరి ఘట్టం ఎన్నికల ముందు. చివరి ఘట్టంలో పంజాబు రాష్ట్ర ఎన్నికలు జరిగాయి. ఆ సదస్సు మే 22న జరిగింది. మరుసటి రోజు అక్కడి మేధావులు పంజాబు గ్రామాల్లో నాకోసం సమావేశాలు ఏర్పాటు చేశారు. నేను మూడు గ్రామాల్లో జరిగిన మూడు మీటింగుల్లో పాల్గొని మాట్లాడాను. మీటింగులో ఆడా, మగా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. పంజాబులో ప్రభుత్వ పాఠశాల విద్య పంజాబీ భాషలోనే బోధిస్తారు. అన్ని రాష్ట్రాల్లో ఉన్నట్టు ఒక్క సబ్జెక్టు మాత్రం ఇంగ్లీషులో ఉంటుంది. అయితే అక్కడ కూడా ప్రైవేట్ స్కూళ్లు ఇంగ్లీషు మీడియంలో నడుస్తాయి. పంజాబీలు ఇతర దేశాలకు ఎక్కువ వలసపోతారు కనుక వారు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ఉండాలని డిమాండ్ చేస్తున్నారా అని నేను అడిగాను. వాళ్ళు లేదు అన్నారు. అప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంగ్లీషు మీడియం గురించీ, అది గ్రామాల్లోని పిల్లల్లో తెస్తున్న మార్పుల గురించీ వివరించాను. ‘మా పిల్లలకు కచ్చితంగా అటువంటి ఇంగ్లీషు మీడియం విద్య కావాలి; వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల ముందు ఈ డిమాండ్ పెడతా’మని వాళ్లు తీర్మానించుకున్నారు. మొత్తం దేశ చరిత్రనే మార్చే పథకం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీషు విద్య. ఆ విద్యా విధానాన్ని కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందా, ఆపేస్తుందా అనేది కీలకమైన ప్రశ్న. చంద్రబాబు నాయుడు క్యాబినేట్ ప్రమాణ స్వీకారం రోజు వేదిక మీద ఉన్నవారంతా గ్రామీణ పిల్లలు ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీషు మీడియం చదువు నేర్చుకోవడాన్ని వ్యతిరేకించినవారే. చంద్రబాబు ప్రభుత్వాన్ని ఢిల్లీ నుంచి శాసించే అమిత్ షా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం చదువుకు బద్ద వ్యతిరేకి. అంతేకాదు, తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు స్కూళ్ళను స్థాపించి ప్రభుత్వ విద్యారంగాన్ని నాశనం చేసిన నారాయణ మళ్ళీ మంత్రి అయ్యారు. కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ళు చంద్రబాబు ప్రైవేటీకరణలో భాగంగా ఎదిగాయి.ప్రభుత్వ రంగంలో ఇంగ్లీషు మీడియం విద్య ఒక సంక్షేమ పథకం కాదు. ప్రపంచంలోని అన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో పాఠశాల విద్య ప్రభుత్వ రంగంలోనే ఉన్నది. కానీ, భారతదేశంలో ప్రైవేట్ పాఠశాల విద్య ప్రభుత్వ రంగ విద్యను సర్వనాశనం చేసింది. అటువంటి విద్యావిధానం నుండి గ్రామీణ విద్యార్థులను కాపాడే విద్యావిధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రభుత్వం దీన్ని రద్దు చేసి మళ్ళీ పాత పద్ధతిలోకి విద్యావ్యవస్థను నెడితే ప్రజలు ఏం చెయ్యాలనేది చాలా కీలకమైంది. కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం, 2024–25 ఎకడమిక్ సంవత్సర స్కూళ్ల ప్రారంభం ఏకకాలంలో జరిగాయి. అయితే ఈ సంవత్సరానికి కావలసిన బైలింగ్వల్ బుక్స్(ఉభయ భాషా పుస్తకాలు), పిల్లలకిచ్చే డ్రెస్సులు, బూట్లు ఈ ప్రభుత్వం సకాలంలో ఇస్తుందా అనేది ప్రశ్న. గత ఐదేండ్లుగా ప్రభుత్వ పాఠశాల విద్యారంగంలో వచ్చిన మార్పులు గణనీయమైనవి. ఆ మార్పులను అనిష్టంగానైనా కొత్త ప్రభుత్వం కొనసాగిస్తే రానున్న ఐదేండ్లలో విద్యారంగంలోని మార్పులు పాతుకుపోతాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలలో బీదవారు, అగ్రకులాలలో బీదవారి పిల్లలకు 2029 ఎన్నికల నాటికి ఈ విద్యావ్యవస్థ తమకు ఎటువంటి భవిష్యత్తును ఇవ్వనుందో అర్థమయ్యే దశ వస్తుంది. కానీ ఇప్పుడు స్కూళ్ళలో పిల్లల భవిష్యత్తును కొత్త ప్రభుత్వం వెనక్కి నెట్టకుండా చూడాల్సిన బాధ్యత అటు వైసీపీ రాజకీయ శక్తులతో పాటు, ఇటు పిల్లల తలిదండ్రుల మీద ఉంది. ఇప్పటి నుండి గ్రామాల్లో పిల్లల తల్లిదండ్రులు ఇంగ్లీషు మీడియం విద్యా పరిరక్షణ కమిటీలు వేసుకోవలసిన అవసరం ఉంది. గ్రామాల్లో ప్రజలు తమ రాజకీయ అభిప్రాయాలను అధిగమించి విద్యారంగ పరిరక్షణ కోసం కమిటీలు వేసుకుని గ్రామంలోని పిల్లలందరి భవిష్యత్ కాపాడవలసిన బాధ్యత ఉంది. గ్రామాల్లో కూడా ధనవంతులున్నారు. వారి పిల్లలను ప్రైవేట్ స్కూళ్ళలో విపరీతంగా డబ్బులు ఖర్చుపెట్టి చదివించగలిగేవారూ ఉన్నారు. ఇటువంటివారు, ఉద్యోగులు, పట్టణాల్లోని ధనవంతులు... బీద బక్క పిల్లలందరికి ఇంగ్లీషు వస్తే తమ పిల్లలు వారితో పోటీ పడాల్సి వస్తుందని భావించి ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీషు మీడియంను వ్యతిరేకించే అవకాశం ఉంది.జగన్ ప్రభుత్వాన్ని ఉద్యోగస్థులు, కొంత మంది ఉపాధ్యాయులతో పాటు ఇతర ధనవంతులు వ్యతిరేకించడంలో తమ పిల్లల భవిష్యత్ స్వార్థం పనిచేసింది. ఈ స్వార్థం కులాలకు అతీతంగా ఉంటుంది. ప్రతి రిజర్వేషన్ కేటగిరిలో డబ్బున్నవారు తమ పిల్లలను ప్రైవేటు ఇంగ్లీషు మీడియం స్కూళ్ళలో చదివించి, ప్రభుత్వ తెలుగు మీడియం పిల్లలు తమ పిల్లలతో పోటీ పడకుండా ఉండాలనే స్వార్థం ఓటు వేసే దగ్గర కూడా పనిచేస్తుంది. ఈ స్వార్థపు వేళ్లను తెంపడం చాలా కష్టం. మార్పు తెచ్చే ప్రభుత్వాలను దింపెయ్యాలనే ఈ ధనిక వర్గం ఓటు వ్యవస్థను తమకు అనుకూలంగా తిప్పుకుంటుంది. ప్రపంచీకరణ యుగంలో వర్గం, హోదా, ఆధిక్యత... నాణ్యమైన ఇంగ్లీష్ విద్యతో ముడిపడి ఉన్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ నిర్మాణాల్లో కూడా ఈ విధంగా ఆలోచించే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. మార్పు తమ వర్గ శత్రువు అనుకునే శక్తులు వీరు. వీరు గ్రామాల్లో ఉన్నారు, పట్టణాల్లో ఉన్నారు. భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా స్కూలు విద్య ఎన్నికల్లో చర్చనీయాంశం కాలేదు. ఈసారి ఆంధ్ర ఎన్నికల్లో అది చర్చనీయాంశం అయింది. బహిరంగ సభల్లో సైతం స్కూలు పిల్లలు ఇంగ్లీషు, తెలుగులో వాగ్దాటితో మాట్లాడటం, అదీ బీద కుటుంబం నుంచి వచ్చిన వారు మాట్లాడటం ఆ యా గ్రామాల్లో, పట్టణాల్లో ధనవంతులు జీర్ణించుకోలేని విషయం. మార్పును అంగీకరించదల్చుకోని విషయం. ఇది వైసీపీ ఓటమికి కొంత దోహదపడి ఉండవచ్చు. ఈ ధోరణిని తిప్పి కొట్టాలంటే ప్రభుత్వ స్కూళ్ళలో చదివే పిల్లల తల్లిదండ్రుల తిరుగుబాటు మాత్రమే పనిచేస్తుంది. భారతదేశంలో విద్య మీద గ్రామీణ స్థాయిలో చర్యలు, పోరాటాలు జరగలేదు. కమ్యూనిస్టులు కూడా ఇటువంటి పోరాటాన్ని జరపలేదు. ఈసారి ఆంధ్ర ఎన్నికల్లో కొత్త విద్యావిధానాన్ని ఓడించడానికి కమ్యూనిస్టులు కూడా సహకరించారు. ఆ విధంగా వీరు బీజేపీ భావజాలానికి మద్దతిచ్చారు. అందుకే రానున్న ఐదేండ్లలో సమాన భాష, పురోగామి భావజాల పాఠశాల విద్య కోసం బలమైన పోరాటం జరగాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ ఈ పోరాటానికి నేతృత్వం వహించాల్సి ఉంది.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
ఈ విషానికి విరుగుడేదీ?
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చాక విద్యా రంగాన్ని అత్యంత ప్రాధాన్యత రంగాల్లో ఒకటిగా గుర్తించింది. ఈ నేపథ్యంలో దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ‘ఆర్థిక సమస్యలతో ఏ పేదింటి బిడ్డ చదువు ఆగిపోకూడదు.. వారు బాగా చదవాలి, అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇంగ్లిష్ మీడియంలో చదువుకుని వారంతా ఉన్నతంగా ఎదగాలి. వారి చదువుకు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుంది.. అన్ని సదుపాయాలు కల్పిస్తుంది’ అంటూ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు.ఇందుకు తగ్గట్టే దేశవిదేశాలు కీర్తించేలా విప్లవాత్మక పథకాలను అమలు చేశారు. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వంలో సౌకర్యాలకు దూరమై కునారిల్లిన ప్రభుత్వ బడులకు జవసత్వాలు కల్పించి వాటిని కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా పరుగులు పెట్టించారు. వైఎస్ జగన్ ప్రభుత్వ చర్యలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు అంతకుముందెన్నడూ లేని రీతిలో పెరిగాయి. వివిధ రాష్ట్రాలు, దేశాలు, ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంక్‌లాంటి సంస్థలు ఏపీ విద్యా సంస్కరణలపై ప్రశంసలు కురిపించినా ఈనాడు పత్రిక మాత్రం వాస్తవాలను జీర్ణించుకోలేక మరోసారి వికృత రాతలతో విషం జిమ్మింది. ఐదేళ్ల జగన్ పాలనలో విద్య అస్తవ్యస్తమైపోయిందని.. ‘పాఠశాల విద్యలో ప్రతిదీ సవాలే!’ అంటూ తప్పుడు రాతలకు బరితెగించింది. జగన్ ప్రభుత్వం పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా రాణించేందుకు అవసరమైన అన్ని వసతులు కల్పించింది.మనబడి నాడు–నేడుతో 44,617 ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. కార్పొరేట్ విద్యా సంస్థలే అసూయచెందేలా కొత్త పాఠశాల భవనాలు, టాయిలెట్ల నుంచి కాంపౌండ్ వాల్ వరకు 11 రకాల సదుపాయాలతో అత్యుత్తమంగా తీర్చిదిద్దింది. ప్రభుత్వ బడి అంటే పగిలిన గోడలు.. పెచ్చులూడే స్లాబులు, నేలబారు చదువులేనన్న అభిప్రాయంతో ఉన్న పరిస్థితి నుంచి.. ఆంధ్రప్రదేశ్‌లో సర్కారు చదువులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి ప్రభుత్వ బడి పిల్లలు ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే వరకు తీసుకెళ్లిన ఘనత ఏపీకి మాత్రమే దక్కింది.దేశంలోనే అత్యత్తమ విద్యా విధానం ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేసినట్టు స్వయంగా కేంద్ర ప్రభుత్వమే కితాబిచ్చినా ఈనాడు పత్రిక మాత్రం అంగీకరించలేక తన అల్పబుద్ధిని చాటుకుంటోంది. ఈ విద్యా సంస్కరణలే తప్పు అనేలా వక్రీకరణలు చేస్తోంది. ఏదోలా ఈ సంస్కరణలను రద్దు చేసి, పేదింటి పిల్లలను ఉత్తమ విద్యకు దూరం చేసే కుట్ర చేస్తున్నట్టు విద్యా రంగ నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రీయంగా సంస్కరణలు 2019కి ముందు ప్రభుత్వం కార్పొరేట్ విద్యకు ఇచ్చిన ప్రాధాన్యం ప్రభుత్వ పాఠశాలలకు ఇవ్వకపోవడంతో ప్రభుత్వ బడుల్లో పరిస్థితి దిగజారింది. అదే విషయాన్ని ‘అసర్, నాస్’ వంటి సర్వేలు కూడా స్పష్టం చేశాయి. దీంతో 2019లో అధికారంలోకి వచ్చాక వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యా నాణ్యతను పెంచేందుకు ఈ సర్వేల అంశాలను ప్రామాణికంగా తీసుకొని పలు కార్యక్రమాలను అమలు చేసింది. టీచింగ్ ఎట్ రైట్ లెవెల్, లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్, సపోరి్టంగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ వంటి కార్యక్రమాలు అందులో కొన్ని. అసర్ నివేదిక ఆధారంగా రూపొందించిన ‘టీచింగ్ ఎట్ రైట్ లెవెల్’ కార్యక్రమంలో విద్యార్థుల స్థాయికి అనుగుణంగా పలు నూతన విధానాలతో విద్యాబోధన అమలు చేశారు.ఇందుకోసం ప్రత్యేకంగా ‘ప్రథమ్’ సంస్థతో కలిసి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అన్ని ప్రభుత్వ పాఠశాలలకు అందించారు. దీనిద్వారా విద్యార్థుల లెర్నింగ్ ఎబిలిటీ, రీడింగ్ ఎబిలిటీ మెరుగుపడినట్లుగా 2022 బేస్‌లైన్ ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఎంపిక చేసిన కొన్ని జిల్లాల్లో ప్రాథమికోన్నత స్థాయిలో అభ్యసన సామర్థ్యాలు మెరుగుపరిచేందుకు ‘లిప్’ ప్రోగ్రాం అమలు చేశారు. విద్యార్థుల క్లాస్ రూమ్ పరీక్షల నిర్వహణలోనూ అనేక మార్పులు తీసుకొచ్చారు.గతంలో ఫార్మెటివ్ అసెస్‌మెంట్స్‌ను ఎక్కడికక్కడ క్లాస్ రూమ్‌లో టీచర్ రూపొందించి ఇచ్చేవారు. ఇందులో పరీక్ష, ప్రశ్నల నాణ్యత తక్కువగా ఉండడంతో రాష్ట్ర స్థాయిలో నిపుణులతో ప్రశ్నపత్రాలు రూపొందించి అన్ని పాఠశాలల్లోనూ ఒకే తరహా ప్రశ్నపత్రాలు అందించారు. బైజూస్ ఉచితంగా అందించిన ఈ–కంటెంట్‌తోపాటు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) రూపొందించిన తెలుగు, ఇంగ్లిష్, హిందీ కంటెంట్‌ను కూడా ఉపాధ్యాయులకు డీటీహెచ్ చానల్స్ ద్వారా, ఈ–పాఠశాల యాప్ ద్వారా అందజేశారు. ఒకే సిలబస్.. బోర్డుల ప్రకారం పరీక్షలుసెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ)కి రాష్ట్రంలో 1,000 పాఠశాలలను అనుసంధానించారు. ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి మొదటి బ్యాచ్ సీబీఎస్ఈ పరీక్షలు రాస్తారు. అందుకు అవసరమైన ప్రణాళికను ముందే అమల్లోకి తెచ్చారు. 2025–26 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ బడుల్లో ఒకటో తరగతి నుంచి పేద పిల్లలకు ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) విద్యను అందించాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 44,478 స్కూళ్లలోనూ జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) సిలబస్‌నే బోధిస్తున్నారు. అన్ని తరగతులకు ఒకే తరహా సిలబస్ ఉంది. పరీక్షా విధానం మాత్రమే ఆయా బోర్డుల ప్రకారం ఉంటుంది. ఇంగ్లిష్ నైపుణ్యాల పెంపునకు టోఫెల్ విద్యార్థులకు కమ్యూనికేషన్స్ స్కిల్స్, మంచి ఇంగ్లిష్ ఒకాబులరీ నైపుణ్యాలను అందించేందుకు 3వ తరగతి నుంచి టోఫెల్ శిక్షణ ప్రవేశపెట్టారు. అన్ని పాఠశాలల్లో టోఫెల్ బోధనకు ప్రత్యేకంగా పీరియడ్ కేటాయించారు. ఈ ఏడాది తొలిసారి నిర్వహించిన ‘టోఫెల్’ పరీక్షకు దాదాపు 16.50 లక్షల మంది విద్యార్థులు హాజరు కావడం గమనార్హం. ప్రతి విద్యార్థికీ డిజిటల్ బోధన నాడు–నేడు పనులు పూర్తయిన హైసూ్కళ్లలో ఇంటర్నెట్తో పాటు 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు (ఐఎఫ్‌పీ), 45 వేల స్మార్ట్ టీవీలను అందించారు. వీటితో 3డీ పాఠాలను బోధిస్తున్నారు. దేశంలో 25 వేల ఐఎఫ్‌పీలు మాత్రమే ఉంటే.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో 62 వేల డిజిటల్ స్క్రీన్లు ఉండటం విశేషం. 8వ తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కలిపి 2021–22, 2022–23 విద్యా సంవత్సరాల్లో 9.53 లక్షల మందికి బైజూస్ కంటెంట్‌తో ఉచితంగా ట్యాబ్స్ ఇచ్చారు. ‘ఏపీ ఈ–పాఠశాల’ మొబైల్ యాప్, దీక్ష వెబ్సైట్, డీటీహెచ్ చానెళ్లు, యూట్యూబ్ చానెల్స్ ద్వారా నిరంతరం పాఠాలను విద్యార్థులకు చేరువ చేసింది. విద్యార్థులకు సబ్జెక్టుల్లో వచ్చిన సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం ‘ఏఐ’ టెక్నాలజీతో పనిచేసే ‘డౌట్ క్లియరెన్స్ బాట్’ యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. భావి నైపుణ్యాలపై విద్యార్థులకు శిక్షణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను భవిష్యత్ టెక్ నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ‘ఫ్యూచర్ స్కిల్స్ కోర్సుల’ను జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆరు నుంచి ఇంటర్ వరకు మూడు దశల్లో విద్యార్థులకు ఫ్యూచర్ స్కిల్స్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), 3డీ ప్రింటింగ్, గేమింగ్ వంటి 10 విభాగాల్లో శిక్షణ ఇస్తారు. ఈ కోర్సులను 6,790 ఉన్నత పాఠశాలల్లో బోధించేందుకు ఇంజనీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులను ఫ్యూచర్ స్కిల్స్ ఫెసిలిటేటర్స్‌గా నియమించారు. పేదలకు ‘ఐబీ’తో అంతర్జాతీయ విద్య పేదింటి పిల్లలు ప్రపంచానికి దిక్సూచిగా మారాలనే సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఇంటర్నేషనల్ బాకలారియేట్(ఐబీ) బోధన 2025 జూన్ నుంచి ఒకటో తరగతి నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటిదాకా దేశంలో 210 వరల్డ్ క్లాస్ కార్పొరేట్ స్కూళ్లలో మాత్రమే ఐబీ సిలబస్ అమల్లో ఉంది. సంపన్నులు మాత్రమే చదివించగల ఐబీ చదువులను రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలోకి తెచ్చి పేద పిల్లలకు అందించాలన్న సంకల్పంతో జగన్ సర్కారు ముందడుగు వేసింది. ఏటా ఒక తరగతి చొప్పున ఐబీ బోధన పెంచుతూ 2037 నాటికి +2 వరకు విద్యనందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. బాలికల కోసం ప్రత్యేకంగా జూనియర్ కాలేజీలు హైసూ్కల్ చదువు పూర్తయిన బాలికలు చదువు మానేయకుండా ప్రతి మండలంలోనూ వారి కోసం ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. 292 ఉన్నత పాఠశాలలను బాలికల కోసం హైస్కూల్ ప్లస్‌గా అప్‌గ్రేడ్ చేశారు. 352 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)ల్లో ఇంటరీ్మడియెట్ను ప్రవేశపెట్టారు. 2022–23 నుంచి 14 కోఎడ్యుకేషన్ జూనియర్ కళాశాలలను గరŠల్స్ జూనియర్ కళాశాలలుగా మార్చారు. రాష్ట్రంలోని 679 మండలాల్లోనూ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలను తీసుకొచ్చారు. మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ బోధనప్రస్తుతం ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 66,245 మంది సబ్జెక్టు ఉపాధ్యాయులు 3 నుంచి 10 తరగతులకు బోధించాలి. ఇందులో 59,663 మంది ఉపాధ్యాయులు ఇప్పటికే ఆ తరహా సేవలు అందిస్తున్నారు. 2023–24 విద్యా సంవత్సరంలో 6,582 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ)కు పదోన్నతి కల్పించి సబ్జెక్ట్ టీచర్లు(స్కూల్ అసిస్టెంట్లు)గా హైసూ్కళ్లకు పంపించారు. ప్రతి స్కూల్లో ఎంత మంది ఉపాధ్యాయులు తగ్గారో ఒక్కరోజైనా ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి పరిశీలించని ‘ఈనాడు’ ఈ విషయంలోనూ కాకి లెక్కలు వేసింది. రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు సుమారు 7 వేల వరకు ఉన్నాయి. అవన్నీ ఏజెన్సీ, కొండ ప్రాంతాల్లోనే ఉన్నాయి. అక్కడ విద్యార్థుల సంఖ్య 8 నుంచి 15 మంది లోపే ఉన్నా ప్రతి బడికి ప్రభుత్వం ఉపాధ్యాయుడిని నియమించింది. ఇప్పటి వరకు పాకల్లోనూ, శిథిల గదుల్లోనూ కొనసాగిన వీటికి ‘నాడు–నేడు’ కింద కొత్త భవనాలను నిరి్మస్తోంది. కానీ ‘ఈనాడు’ నోటికొచ్చిన ఓ అంకెను ముద్రించి అసత్యాలను ప్రచురిస్తోంది. హేతుబదీ్ధకరణపైనా అసత్యాలే..రాష్ట్రంలో 2019 కంటే ముందు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు చాలా తక్కువగా ఉన్నాయని పలు సంస్థల అధ్యయనాలు తేల్చాయి. దీంతో వైఎస్ జగన్ సర్కారు ప్రభుత్వ విద్యలో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టి.. 1, 2 తరగతుల బోధన, అభ్యాసంపై దృష్టి పెట్టింది. 3, 4, 5 తరగతులను హైసూ్కల్ విద్యలోకి తీసుకురావడం ద్వారా బీఈడీ, సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ ఉన్న సబ్జెక్ట్ టీచర్ల ద్వారా పిల్లలకు బోధన అందించి అభ్యసనా సామర్థ్యాలను బలోపేతం చేసింది.ఇందుకోసం ప్రాధమిక పాఠశాలల్లోని 3 నుంచి 5 తరగతులను హైసూ్కల్‌కు మార్చింది. ప్రాథమిక పాఠశాలల్లో అంగన్వాడీ పిల్లలకు పీపీ–1, పీపీ–2తో పాటు ఒకటి, రెండు తరగతుల బోధన ప్రారంభించింది. దీంతో ఏ స్కూల్‌ను మూసివేయాల్సిన అవసరం తలెత్తలేదు. ఈ సంస్కరణలను ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు సైతం స్వాగతించారు. కానీ గత టీడీపీ ప్రభుత్వం మాత్రం విద్యా సంస్కరణలు చేపట్టకుండా సరిపడినంత మంది విద్యార్థులు లేరన్న సాకుతో 2014–2019 మధ్య 1,785 పాఠశాలలను మూసివేయడం గమనార్హం. ఉన్నత విద్యకు అనువుగా ఇంగ్లిష్ మీడియం పదో తరగతి లేదా ఇంటర్ తర్వాత పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులు పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలోనే చదవాలి. పాఠశాల స్థాయిలో ఇంగ్లిష్ మీడియం లేనివారు ఉన్నత విద్యలో వెనుకబడుతున్నారు. మరికొందరు మానేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2020లో రాష్ట్రవ్యాప్తంగా తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరించగా 97 శాతం మంది ఇంగ్లిష్ మీడియం బోధన తప్పనిసరిగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. దీంతో జగన్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టింది. విద్యార్థుల్లో ఇంగ్లిష్ భాషా నైపుణ్యాన్ని పెంచేందుకు ద్విభాషా పాఠ్యపుస్తకాలు, డిక్షనరీలను కూడా అందించింది. ముగిసిన విద్యా సంవత్సరంలో 93 శాతం పైగా విద్యార్థులు ఇంగ్లి‹Ùలోనే పరీక్షలు రాయడం విశేషం. పదో తరగతిలో ఇంగ్లిష్ మీడియం అమలు చేయకున్నా 2.23 లక్షల మంది విద్యార్థులు కూడా ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాశారు. వీరిలో 1.96 మందికి పైగా ఉత్తీర్ణత సాధించారంటే ఇంగ్లిష్ బోధనను ఎంత బలంగా కోరుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన నేషనల్ అచీవ్మెంట్ సర్వేలోనూ 90 శాతం పైగా ఇంగ్లిష్ మీడియం చదువులనే కోరుకున్నారు. -
ఏడాదిలోగా ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఏడాదిలోగా పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎల్రక్టానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. ఆయన శనివారం ఉండవల్లి నివాసంలో విద్యా శాఖ, ఉన్నత విద్యా శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజనం రుచిగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్కూళ్లలో పారిశుద్ధ్యం నిర్వహణకు సంబంధించి ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని చెప్పారు. గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు స్కూళ్లకు మారిన విద్యార్థుల సంఖ్య, అందుకు కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అలాగే ఎన్ని పాఠశాలలు మూతపడ్డాయి, కారణాలేమిటో తెలియజేయాలన్నారు. బెజూస్ కంటెంట్, ఐఎఫ్‌పీ వినియోగం మీద సమగ్ర నోట్ ఇవ్వాలన్నారు. సీబీఎస్ఈ పాఠశాలలపై సమగ్ర వివరాలివ్వాలని చెప్పారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాయనున్న 82 వేల మంది విద్యార్థులకు ఇచ్చే శిక్షణపై సమగ్ర నోట్ ఇవ్వాలని చెప్పారు. ఈ నెలాఖరులోగా స్టూడెంట్ కిట్ల పంపిణీ పూర్తిచేయాలన్నారు. ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వచ్చే నెల 15 నాటికి పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, బ్యాక్ ప్యాక్ (బ్యాగ్) అందించాలని ఆదేశించారు. ఇకపై ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా జరుగుతాయని తెలిపారు. విద్యా దీవెన, వసతి దీవెన బకాయిల వివరాలివ్వండి విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిల వివరాలు ఇవ్వాలని మంత్రి లోకేశ్ ఉన్నత విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. 2018–19 నుంచి ఇప్పటి దాకా ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాల వివరాలు, ఈఏపీసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజీ, ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజులు ఎంత ఉండాలో వివరాలు సమర్పించాలన్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల సంఖ్య తగ్గడంపైనా నివేదిక ఇవ్వాలన్నారు. వివాదాస్పద వీసీలు, యూనివర్సిటీల్లో అవినీతి ఆరోపణలపైనా సమగ్ర వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశాల్లో ఉన్నత విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ జె.శ్యామలరావు, కమిషనర్ పోలా భాస్కర్, ఆర్జేయూకేటీ రిజి్రస్టార్ ఎస్ఎస్వీ గోపాలరాజు ఇతర అధికారులు పాల్గొన్నారు. త్వరలో నూతన ఐటీ పాలసీఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించే విధంగా త్వరలో నూతన ఐటీ పాలసీని విడుదల చేయనున్నట్లు మంత్రి లోకేశ్ ప్రకటించారు. శనివారం ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖలపై మంత్రి ఉండవల్లిలోని నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలను రప్పించడానికి ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు, ఇప్పటికే ఉన్న కంపెనీలకు చెల్లించాల్సిన ప్రోత్సాహకాల బకాయిల వివరాలను సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలన్నారు. విశాఖను ఐటీ హబ్‌గా, తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్‌గా మార్చడానికి ప్రణాళిక సిద్ధం చేయాలని, ఈ రంగాల్లో పేరుగాంచిన కంపెనీలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించాలని అధికారులను కోరారు. -
ప్రభుత్వ స్కూళ్లన్నీ ఇంగ్లిష్ మీడియంలోకి..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లిష్ మీడియంలోకి మార్చాలని ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. విద్య కోసం ఎన్ని నిధులైనా కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు. దేశానికే మోడల్‌గా నిలిచేలా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం చేపట్టడమే కాకుండా అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మించేందుకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో నిధులు కేటాయించామని చెప్పారు. ఖమ్మంలోని ఎన్నెస్పీ ప్రభుత్వ పాఠశాలలో బుధవారం ఆయన విద్యార్థులకు యూనిఫామ్ అందజేశారు. అనంతరం కలెక్టరేట్లో విద్య, నీటి పారుదలశాఖలపై మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సమీక్ష నిర్వహించారు ఆ తర్వాత మీడియాతో భట్టి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైన తొలిరోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అందించడం రాష్ట్ర చరిత్రలోనే ఇది మొదటిసారన్నారు. ఏడాదిలోగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల ద్వారా అందిస్తున్న ఓవర్సీస్ స్కాలర్íÙప్ సంఖ్య మరో వంద పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు భట్టి వెల్లడించారు. రూ.8 వేల కోట్లు ఖర్చు పెట్టినా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు పనులు మొదలుపెట్టి పదేళ్లయినా.. రూ.8 వేల కోట్లు ఖర్చు పెట్టినా ఇప్పటివరకు చుక్క నీరు కూడా గత పాలకులు అందించలేకపోయారని భట్టి విమర్శించారు. సీతారామ ప్రాజెక్టులో గత ప్రభుత్వం ఎక్కడా రిజర్వాయర్ డిజైన్ చేయలేదని, కేవలం లిఫ్ట్ ఇరిగేషన్ మాత్రమే చేసిందని భట్టి పేర్కొన్నారు. ఈ మేరకు తమ ప్రభుత్వం నీటిని స్టోరేజ్ చేసేలా 10 టీఎంసీల కెపాసిటీతో రిజర్వాయర్ డిజైన్ చేయనున్నట్లు వెల్లడించారు. సమీక్షలో కలెక్టర్ వీపీ.గౌతమ్, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, మట్టా రాగమయి పాల్గొన్నారు. -
బడిబాటలో కీలకం అమ్మ కమిటీలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలకు మరింత గురుతర బాధ్యత అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించించిది. మౌలిక వసతుల కల్పనలో కీలక భూమిక పోషించబోయే ఈ కమిటీలు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమ నిర్వహణలోనూ క్రియాశీలంగా వ్యవహరించనున్నాయి. బడిబాట కార్యక్రమం శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొదలైంది. ఈ నెల 19వ తేదీ వరకూ ఇది కొనసాగుతుంది. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకురావడం, విద్యార్థుల చేరికల శాతాన్ని పెంచడం దీని ముఖ్యోద్దేశం. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో జరుగుతున్న కార్యక్రమమే అయినా, ఈసారి వినూత్నంగా నిర్వహించాలని, ప్రైవేటు, ప్రభుత్వ స్కూళ్లకు మధ్య ఉన్న తేడాలను తల్లిదండ్రులకు వివరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ స్కూళ్లపై అపోహలు తొలగించేలా.. ప్రైవేటు స్కూళ్లపై ప్రజల్లో ఉన్న మోజును తగ్గించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా కన్పిస్తోంది. ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్య అందదనే అపోహ ఉందని, ఈ కారణంగానే ప్రైవేటు బాట పడుతున్నారనేది ప్రభుత్వ పరిశీలన. దీన్ని దూరం చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సర్కారీ స్కూళ్లలో ఉండే నాణ్యత, విద్యా ప్రమాణాలు, ఖర్చుపై బడిబాటలో భాగంగా అవగాహన కల్పించాలని, ఈ బాధ్యతను అమ్మ ఆదర్శ పాఠశాలలు సమర్థవంతంగా నిర్వహించగలవని ప్రభుత్వం భావిస్తోంది. ప్రైవేటు స్కూల్లో చేరితే రూ.50 వేల నుంచి రూ 1.50 లక్షల వరకు ఖర్చవుతుందని, అలా కాకుండా ప్రభుత్వ స్కూళ్లల్లో చేర్పించి, ఆదా చేసే డబ్బును ఉన్నత చదువులకు ఉపయోగించవచ్చనే ఆలోచన ప్రజల్లోకి తీసుకెళ్ళాలంటూ కమిటీలకు చెబుతున్నారు. ఇంగ్లిష్ విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం లాంటి అంశాలను ప్రజలకు వివరించాలని సూచించారు. సౌకర్యాల కల్పనలో కమిటీలు.. రాష్ట్రంలో మొత్తం 26,823 ప్రభుత్వ పాఠశాలల్లో 20,680 చోట్ల ఇప్పటికే అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలను ఏర్పాటు చేశారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన బాధ్యతను ఆ కమిటీలకు అప్పగించారు. 17,729 పాఠశాలల్లో చేపట్టాల్సిన పనులన్నీ ఈ కమిటీలకు అప్పగించారు. పాఠశాలల్లో తలుపులు, కిటికీలు, బ్లాక్ బోర్డులు, ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డులు, ఫ్యాన్లు, మరుగుదొడ్ల తాత్కాలిక మరమ్మతుల పనులన్నింటినీ ప్రభుత్వం ఈసారి వేసవిలోనే మొదలు పెట్టింది. ఈ పనులకు రూ.667.25 కోట్లు కేటాయించింది. అందులో ఇప్పటికే రూ.147 కోట్లు కమిటీలకు అడ్వాన్సుగా చెల్లించింది. -
3 నుంచి బడిబాట
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా జూన్ 3 నుంచి 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఏ రోజున ఎవరేం చేయాలనే మార్గదర్శకాలను బుధవారంరాత్రి విద్యాశాఖ విడుదల చేసింది. నిర్ణయించిన తేదీల్లో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు ఉపాధ్యాయులు తమ పరిధిలోని గ్రామాలు, శివారు గ్రామాలకు వెళ్లాల్సి ఉంటుంది. చదువుకోని పిల్లలను గుర్తించి, వారిని సమీపంలోని అంగన్వాడీలు, స్కూళ్లలో చేర్పించడం, ప్రభుత్వ స్కూళ్లల్లో ప్రవేశాలు పెంచడం, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలపై అవగాహన కల్పించడం బడిబాట ఉద్దేశం. ఈ క్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక బృందాలు, ఎన్జీఓల తోడ్పాటు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. 3 నుంచి 19వ తేదీ వరకు ఏ రోజు ఏం చేయాలనే వివరాలతో కూడిన షెడ్యూల్‌ను కూడా విద్యాశాఖ ప్రకటించింది. కలెక్టర్ల నేతృత్వంలో కార్యాచరణ» జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో డీఈఓలు, ఎంఈఓలు, స్కూల్ ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఈ నెల 30వ తేదీన వివిధ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహిస్తారు. బడిబాట కార్యక్రమ ప్రణాళిక ఖరారు చేస్తారు. జూన్ 10వ తేదీ నాటికి ప్రభుత్వ స్కూళ్లల్లో నోట్‌బుక్స్, టెక్ట్స్‌బుక్స్, యూనిఫాం పంపిణీకి సిద్ధం చేస్తారు.» సామాజిక సేవాసంస్థలు, ఎన్జీఓలు వివిధ వర్గాలను డీఈఓలు సమన్వయపరిచి, బడిబాటను ముందుకు తీసుకెళ్లాలి. ఎంఈఓలు, హెచ్ఎంలకు, టీచర్లకు బడిబాట దిశానిర్దేశం చేస్తారు. కార్యక్రమంపై విస్తృత ప్రచారం కల్పిస్తారు. మండలపరిషత్ అధికారులు, ఎస్ఐ, వివిధ వర్గాల నేతృత్వంలో కమిటీలు ఏర్పాటు చేస్తారు. »మండలస్థాయి కమిటీలను ఎంఈఓలు ఏర్పాటు చేస్తారు. ఏరోజు ఏం చేయాలనే కార్యాచరణను మండల పరిధిలో ఎంఈఓలు రూపొందిస్తారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తారు.» గ్రామస్థాయిలో కమిటీలు, బడిబాటపై అవగాహన, ప్రచార కార్యక్రమాన్ని స్కూల్ హెచ్ఎంలు నిర్వహిస్తారు. స్థానిక నేతల భాగస్వామ్యాన్ని తీసుకోవడంలో కీలక భూమిక పోషిస్తారు. బడిబాట ద్వారా గుర్తించిన విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియ చేపడతారు. -
పిల్లల మార్కులు నేరుగా తల్లిదండ్రులకే
సాక్షి, అమరావతి: విద్యార్థి ఒక్క రోజు బడికి రాకపోతే తల్లిదండ్రులకు మెసేజ్ (ఎస్ఎంఎస్లు)ల ద్వారా తెలియజేస్తున్న పాఠశాల విద్యాశాఖ.. మరో వినూత్న ప్రక్రియను చేపట్టింది. విద్యార్థులు వివిధ పరీక్షల్లో సాధించిన మార్కులను, నెలలో ఎన్నిరోజులు బడికి వచ్చారో చెబుతూ ‘హోలిస్టిక్ రిపోర్టు కార్డు’ లను తల్లిదండ్రులకు పంపిస్తోంది. ఫార్మేటివ్ (యూనిట్), సమ్మేటివ్ (అర్ధ, వార్షిక) అసెస్‌మెంట్స్‌లో విద్యార్థులు సాధించిన మార్కులను నేరుగా తల్లిదండ్రులకే చేరవేస్తోంది.గతంలో వార్షిక పరీక్షల ఫలితాలను మాత్రమే ప్రోగ్రెస్ కార్డుల్లో ఇవ్వగా, ఈ ఏడాది అందుకు భిన్నంగా రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల ఫోన్లకు హోలిస్టిక్ రిపోర్టు కార్డులను ఎస్ఎంఎస్ రూపంలో పంపించింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 1 నుంచి 9 తరగతుల పిల్లలకు ఈ నూతన విధానం ప్రవేశపెట్టింది. ఇందుకోసం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆధ్వర్యంలో ఐటీ విభాగం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అన్ని మేనేజ్మెంట్స్లోని బడుల్లో 9వ తరగతి వరకు చదువుతున్న సుమారు 61.81 లక్షల మంది విద్యార్థుల మార్కులు, బడికి హాజరైన రోజుల సమాచారాన్ని తల్లిదండ్రులకు పంపిస్తున్నారు. ఇప్పటి వరకు 55,71,173 మందికి (90.13 శాతం) ఎస్ఎంఎస్లు పంపారు. పిల్లల ప్రగతి తల్లితండ్రులకు తెలిసేలా.. గతంలో విద్యార్థులు వార్షిక పరీక్షల్లో సాధించిన మార్కులను ప్రోగ్రెస్ రిపోర్టుగా ఏప్రిల్/ మే నెలల్లో పంపించేవారు. అయితే 2023–24 విద్యా సంవత్సరంలో నాలుగు ఎఫ్ఏ పరీక్షలు, రెండు ఎస్ఏ పరీక్షల్లో సాధించిన మార్కులు, ఎన్ని రోజులు బడికి హాజరయ్యారో కూడా వివరిస్తూ తల్లిదండ్రులకు హోలిస్టిక్ రిపోర్టు కార్డులను వారి ఫోన్ నంబర్లకు ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తున్నారు. కార్డులను డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు. దీనిద్వారా తమ పిల్లలు ఏ పరీక్షలో ఎన్ని మార్కులు సాధించారు, ఎన్ని రోజులు బడికి వెళ్లారో తల్లిదండ్రులకు తెలుస్తుంది. ఏ సబ్జెక్టులో మార్కులు తక్కువ వచ్చాయో గుర్తించి తల్లిదండ్రులు తప్పనిసరిగా ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, మేనేజ్మెంట్లను అడిగేందుకు అవకాశముంటుంది. దీనిద్వారా తల్లిదండ్రుల్లో బాధ్యత పెరుగుతుందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురే‹Ùకుమార్ ‘సాక్షి’కి తెలిపారు.100 శాతం పూర్తిచేసిన ప్రభుత్వ బడులు విద్యార్థుల మార్కులు, హాజరు వివరాలను పాఠశాల విద్యా శాఖ కమిషనరేట్ వెబ్సైట్లో నమోదు చేసేందుకు రాష్ట్రంలోని ప్రతి పాఠశాల (ప్రాథమిక, ఉన్నత) ప్రధానోపాధ్యాయులకు ప్రత్యేక లాగిన్ ఇచ్చారు. ప్రతి విద్యార్థి వ్యక్తిగత హాజరు, ఎఫ్ఏ, ఎస్ఏ పరీక్షల్లో సాధించిన మార్కులను ఇందులో నమోదు చేయాలి. ఈ ప్రక్రియను ప్రభుత్వ పాఠశాలలు నూరు శాతం పూర్తి చేయగా, ప్రైవేటు పాఠశాలలు 89 శాతం మాత్రమే నమోదు చేశాయి. బడులు తెరిచేలోగా అన్ని స్కూళ్లూ ఈ వివరాలను నమోదు చేయాలని విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది.డిజీ లాకర్లో 8, 9 తరగతుల మార్కులు ఇప్పటికే డిగ్రీ, ఇంటర్మీడియట్‌తో పాటు పదో తరగతి మార్కుల జాబితాలను ‘డిజీ లాకర్’లో నమోదు చేస్తుండగా.. 2023–24 విద్యా సంవత్సరంలో 8, 9 తరగతుల మార్కుల జాబితాలను సైతం డిజీ లాకర్లో అందుబాటులో ఉంచారు. బడులు తెరిచాక పేరెంట్స్ కమిటీ సమావేశాల్లో డిజీ లాకర్‌పై అవగాహన కల్పించనున్నారు. -
మన బడుల్లో చేరండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక క్రమంగా తగ్గుతోంది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చేరికలు కొంత ఆశాజనకంగానే ఉన్నా ఆ తర్వాత క్లాసుల్లో ఎన్రోల్మెంట్ పడిపోతోంది. ఆరో తరగతి నుంచి విద్యార్థులు ప్రైవేటు బాటపడుతున్నారు. దీన్ని సరిదిద్దేందుకు అధికారులు కార్యాచరణ చేపట్టడం లేదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. తాజాగా సమగ్ర శిక్ష ప్రాజెక్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.రాష్ట్రంలో ఎన్రోల్మెంట్ పెంచాల్సిన అవసరం ఉందని సూచించింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని జూన్ 1 నుంచి 11 వరకు బడిబాట కార్యక్రమాన్ని అధికారులు చేపట్టనున్నారు. ఏటా పాఠశాలలు తెరిచే ముందు ప్రభుత్వం ఈ ప్రక్రియ చేపట్టడం సాధరణమే అయినప్పటికీ ఈసారి విద్యార్థుల శాతాన్ని ఎక్కువగా పెంచాలని విద్యాశాఖకు స్పష్టమైన ఆదేశాలు అందాయి.సమస్యలు పరిష్కరిస్తేనే.. ఈ ఏడాది రూ. 1,907 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచించింది. ఈ నిధులతో ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలతోపాటు భవనాల మరమ్మతులు, స్మార్ట్ క్లాస్రూంలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సిబ్బంది జీతాలకు ఖర్చు చేయనుంది. గతంలో మన ఊరు–మన బడి కార్యక్రమం కింద స్కూళ్లలో మౌలికవసతులు కల్పించాలని నిర్ణయించగా ప్రభుత్వం మారడంతో ఈ కార్యక్రమం నత్తనడకన నడుస్తోంది. దీంతోపాటు టీచర్ల కొరత ప్రభుత్వ పాఠశాలలను వేధిస్తోంది. ప్రధానంగా ఈ రెండు సమస్యలను పరిష్కరిస్తే తప్ప ప్రభుత్వ బడుల్లో ఎన్రోల్మెంట్ పెరిగే అవకాశం లేదని అధ్యాపక వర్గాలు అంటున్నాయి.ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి ఇది..⇒ రాష్ట్రంలో 30,023 ప్రభుత్వ స్కూళ్లు ఉన్నాయి. వాటిలో 1,213 స్కూళ్లలో గతేడాది జీరో ఎన్రోల్మెంట్ నమోదైంది. 13,364 పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ సంఖ్య 50లోపే ఉంది. ⇒ రాష్ట్రంలో 21 వేల టీచర్ పోస్టుల ఖాళీలున్నాయి. 5,821 స్కూళ్లు ఒకే టీచర్‌తో నడుస్తున్నాయి. 80 శాతం స్కూళ్లలో సబ్జెక్టు లేదా భాషా పండితుల కొరత ఉంది. ⇒దివ్యాంగులకు టాయ్‌లెట్స్ లేని స్కూళ్లు 15.45 శాతం ఉన్నాయి. బాలికలకు టాయ్‌లెట్స్ లేని బడులు 9.44 శాతం ఉన్నాయి. ⇒ 18, 19 పాఠశాలల్లో సమీకృత సైన్స్ లే»ొరేటరీలు లేవు. ఐసీటీ ల్యాబ్‌లు లేని స్కూళ్లు 11.7 శాతం. స్కిల్ ఎడ్యుకేషన్ ల్యాబ్‌లు లేని బడులు 71 శాతం ఉన్నాయి. ⇒ ఎస్సీఈఆర్టీలో మంజూరైన పోస్టుల్లో 46.15 శాతం పోస్టులు, డైట్ కాలేజీల్లో 67.83 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కోవిడ్ కాలంలో పెరిగి.. మళ్లీ తగ్గి.. రాష్ట్రవ్యాప్తంగా ఒకటి నుంచి పదో తరగతి వరకు 60 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్నారు. వారిలో 28 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతుంటే మిగతా విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్నారు. కోవిడ్ సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెరిగింది. 2020 నుంచి 2022 వరకూ ఏటా 2.5 లక్షల మంది కొత్తగా ప్రభుత్వ బడుల్లో చేరారు. కానీ 2023 నుంచి మళ్లీ క్రమంగా ఏటా లక్ష మంది ప్రభుత్వ పాఠశాలల నుంచి నిష్క్రమిస్తున్నారు. మెరుగైన విద్య లేనందుకేనా? రాష్ట్రంలోని స్కూళ్లలో విద్యార్థుల హాజరుపై సమగ్ర శిక్ష ప్రాజెక్టు ఇటీవల ఓ నివేదిక రూపొందించింది. దీని ప్రకారం 44 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం 50 మంది విద్యార్థులు కూడా ఉండటం లేదు. ఐదో తరగతి వరకు ఒక్కో క్లాసులో 40 నుంచి 60 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ తర్వాత నుంచి విద్యార్థుల చేరికలు క్లాసుకు 46 నుంచి 35కు పడిపోయాయి. ప్రభుత్వ పాఠశాలలు సక్రమంగా నడవకపోవడం, ఉపాధ్యాయుల కొరత, సకాలంలో పుస్తకాలు అందకపోవడం వల్ల బోధన కుంటుపడుతోంది. దీంతో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తమ పిల్లలకు మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు పట్టణాలకు తరలుతున్నాయని నివేదిక పేర్కొంది. విస్తృత ప్రచారం కల్పించేలా.. ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు, నాణ్యతా ప్రమాణాలు పెంచుతున్న తీరుపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని విద్యాశాఖ క్షేత్రస్థాయి టీచర్లకు సూచించింది. జూన్ ఒకటి నుంచి 11వ మధ్య చేపట్టే బడిబాట కార్యక్రమంలో స్కూళ్లను ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా తీర్చిదిద్దుతున్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాలని, ఉపాధ్యాయ నియామకాలు చేపడుతున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొంది. -
ఉచిత పాఠ్య పుస్తకాలు సిద్ధం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్య పుస్తకాలు సిద్ధమయ్యాయి. బడి తెరిచిన రోజే వాటిని అందించేందుకు ఇప్పటికే ప్రింటర్స్ నుంచి జిల్లా స్టాక్ పాయింట్లకు, అక్కడి నుంచి మండల స్టాక్ పాయింట్లకు చేరుతున్నాయి. 2024–25 విద్యా సంవత్సరానికి 1 నుంచి 10వ తరగతి వరకు మొత్తం 4.20 కోట్ల పాఠ్యపుస్తకాలు అవసరం కాగా, మొదటి సెమిస్టర్‌కు అవసరమైన 3.12 కోట్ల పుస్తకాలను పంపిణీకి సిద్ధం చేశారు. 1, 2 తరగతులు మినహా మిగతా అన్ని తరగతుల పాఠ్య పుస్తక ముఖచిత్రాలు మార్చారు. ముఖ చిత్రాల ఆధారంగా సులభంగా పుస్తకాలను గుర్తించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. గతంలో ఇచ్చినట్టుగానే ఈసారీ ద్విభాషా పుస్తకాలనే ముద్రించారు. వేసవి సెలవుల అనంతరం జూన్ 12న స్కూళ్లు ప్రారంభమవుతాయి. జూన్ 8వ తేదీకే అన్ని స్కూళ్లకు విద్యార్థుల సంఖ్యను అనుసరించి పుస్తకాలను తరలించనున్నారు. 8, 9, 10 తగరతుల విద్యార్థులకు 1.08 కోట్ల రెండో సెమిస్టర్ పుస్తకాల ముద్రణ సైతం దాదాపు పూర్తయింది. సెమిస్టర్–2 బోధన అక్టోబర్ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో వాటిని జూలైలో విద్యార్థులకు అందిస్తారు.ఈసారి పదో తరగతి ఇంగ్లిష్ మీడియంలోగత విద్యా సంవత్సరం వరకు 1 నుంచి 9వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం అమల్లో ఉంది. జూన్‌లో ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి కూడా ఇంగ్లిష్ మీడియంలోకి మారనుంది. ఈ నేపథ్యంలో ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను అనుసరించి అధికారులు పుస్తకాలను సిద్ధం చేశారు. పదో తరగతి ఫిజికల్ సైన్స్ పుస్తకాలను తొలిసారి పూర్తి ఆర్ట్ పేపర్‌పై ముద్రించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఫ్యూచర్ స్కిల్స్ కోర్సును అందుబాటులోకి తెచ్చింది. ఈ కోర్సు బోధనకు ఇంజినీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులను ఎక్స్‌పర్ట్స్‌గానూ నియమించింది. ఫ్యూచర్ స్కిల్స్ సిలబస్‌ను అనుసరించి మొత్తం 4.30 లక్షల పుస్తకాలను సిద్ధం చేసింది. బైలింగ్యువల్‌లో మేథమెటిక్స్, బయాలజీ, ఫిజిక్స్, సామాజిక శాస్త్ర పాఠ్య పుస్తకాలను విద్యార్థులు ఆసక్తిగా చదివేలా తీర్చిదిద్దారు. దీనిద్వారా విద్యార్థులకు సబ్జెక్టులపై మరింత అవగాహన పెరుగుతుందని, ఆంగ్ల భాషా నైపుణ్యాలు మెరుగుపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలను మార్కెట్లోకి రెండు రోజుల్లో విడుదల చేస్తామని ప్రభుత్వ టెక్టŠస్ బుక్స్ డైరెక్టర్ కొండా రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. వాటిని ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలన్నారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పుస్తకాల ముద్రణను జ్యుడిషియల్ ప్రివ్యూ పూర్తయిన తర్వాతే కాంట్రాక్టు అప్పగించామన్నారు. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటి నుంచి 10వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు పాఠశాల విద్యా శాఖ వెబ్సైట్ ( ఠీఠీఠీ. ఛిట్ఛ. ్చp. జౌఠి. జీn)లో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. -
వరుసగా ఐదోసారి ‘అమ్మఒడి’
సాక్షి, అమరావతి: ‘జగనన్న అమ్మఒడి’ పథకం నిధులను వచ్చేనెలలో తల్లుల ఖాతాల్లో జమచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. గత నాలుగేళ్లుగా విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత మొదటి నెలలో ఈ పథకాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి సుమారు 43 లక్షల మంది విద్యార్థుల తల్లులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను అందించనుంది. వచ్చేనెల 12న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.అదేరోజు ప్రభుత్వ బడుల్లో చదువుతున్న సుమారు 43 లక్షల మందికి పైగా విద్యార్థులకు ‘జగనన్న విద్యాకానుక’ కింద నాణ్యమైన యూనిఫారంతో పాటు పుస్తకాలను అందజేయనున్నారు. మన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించాలని, వారు అంతర్జాతీయంగా రాణించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పాఠశాల విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల అభ్యసన ఫలితాలను మెరుగుపరిచే లక్ష్యంతో సమగ్ర విద్యా, పరిపాలనా సంస్కరణలను అమలుచేసింది.‘మనబడి నాడు–నేడు’ కింద డిజిటల్ మౌలిక సదుపాయాలు, అదనపు తరగతి గదులు కల్పించడంతో పాటు జగనన్న అమ్మఒడి, విద్యాకానుక, గోరుముద్ద, పాఠ్యాంశాల సంస్కరణలు, ప్రతి పాఠశాలలోను మరుగుదొడ్లు–వాటి నిర్వహణకు ప్రత్యేక నిధి వంటివి ఏర్పాటుచేసింది. రాష్ట్రంలో మొత్తం 58,950 పాఠశాలలు ఉండగా, 72,20,633 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 44,617 ప్రభుత్వ పాఠశాలల్లో 43.10 లక్షల మంది విద్యార్థులున్నారు. వీరందరికీ అత్యున్నత ప్రమాణాలతో విద్యనందించాలని 2019–20 విద్యా సంవత్సరంలోనే ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఐదోసారి రూ.6,400 కోట్ల పంపిణీకి ఏర్పాట్లు..ఇక నవరత్నాల్లో భాగంగా ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు జగనన్న అమ్మఒడి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.15 వేలు చొప్పున అందజేస్తోంది. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కాగానే 2019–20 విద్యా సంవత్సరంలో తొలిసారి 42,33,098 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,349.6 కోట్లు జమచేసి ఇచ్చిన మాట నిలుపుకున్నారు.ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకే కాక, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్న వారికీ అమ్మఒడి అమలుచేసి, 2022–23 విద్యా సంవత్సరం వరకు నాలుగు విడతల్లో రూ.26,067 కోట్ల నిధులను తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమచేసింది. ఇక ఐదోసారి 2023–24 విద్యా సంవత్సరానికి జూన్ నాలుగో వారంలో సుమారు రూ.6,400 కోట్ల నిధులను జమచేయనున్నారు. గత విద్యా సంవత్సరంలో 75 శాతం హాజరున్న ప్రతి విద్యార్థికీ నగదు జమకానుంది. కార్పొరేట్ స్కూళ్లు ప్రభుత్వ బడులతో పోటీపడేలా..గత టీడీపీ ప్రభుత్వంలో బడులు తెరిచి 6–7 నెలలు అయినప్పటికీ యూనిఫారం సంగతి దేవుడెరుగు, కనీసం పాఠ్యపుస్తకాలు కూడా అందించలేని దుస్థితి. ఇక ఇతర వస్తువుల ఊసే ఉండేది కాదు. ఆ పరిస్థితిని సమూలంగా మారుస్తూ జగనన్న ప్రభుత్వం పాఠశాలలు తెరిచిన రోజే రూ.2,400 విలువైన జగనన్న విద్యా కానుక కిట్ అందజేస్తోంది. కార్పొరేట్ స్కూళ్లే ప్రభుత్వ బడులతో పోటీపడేలా, మన విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించి అమలుచేస్తోంది. దీంతో గత నాలుగు విద్యా సంవత్సరాల్లో రెండేళ్లు కోవిడ్ ఇబ్బందులు తలెత్తినా సంస్కరణలు ఆగలేదు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఇంగ్లిష్ మీడియం బోధన, డిజిటల్ ఎడ్యుకేషన్, టోఫెల్, సీబీఎస్ఈ సిలబస్ అమలుతో మన విద్యార్థులు అంతర్జాతీయ ప్రమాణాలను అందుకుంటున్నారు.ప్రతిభావంతులకు ‘జగనన్న ఆణిముత్యాలు’ సత్కారం..ఇదిలా ఉంటే.. విద్యా రంగంలో సంస్కరణల కొనసాగింపుగా, విద్యలో నాణ్యత, నైపుణ్యాన్ని పెంపొందించడంతో పాటు.. విద్యార్థుల కృషిని అభినందించి ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గడిచిన విద్యా సంవత్సరంలో గొప్ప ముందడుగు వేసింది. ప్రభుత్వ స్కూళ్లు, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుకుని ప్రతిభ చాటిన విద్యార్థులను ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరుతో సత్కరించింది. 2023 మార్చిలో ఇంటర్, టెన్త్ పరీక్షల్లో వివిధ ప్రభుత్వ మేనేజ్మెంట్లలోని విద్యార్థులు కార్పొరేట్ స్కూళ్లను తలదన్ని అత్యధిక మార్కులు సాధించారు.వీరిలో మొదటిస్థానంలో నిలిచిన 22,768 మందికి ‘జగనన్న ఆణిముత్యాలు బ్రిలియన్స్ అవార్డు’లను ప్రదానం చేశారు. రాష్ట్రస్థాయి విజేతలకు ప్రథమ స్థానంలో ఉన్న వారికి రూ.లక్ష, ద్వితీయ స్థానంలో ఉన్నవారికి రూ.75 వేలు, తృతీయ బహుమతిగా రూ.50 వేలు నగదు బహుమతిగా అందజేశారు. అలాగే, జిల్లా స్థాయి ప్రథమస్థానంలో నిలిచిన వారికి రూ.50 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.30 వేలు, తృతీయ స్థానంలో ఉన్నవారికి రూ.15 వేలు ప్రదానం చేశారు.ఇక నియోజకవర్గ స్థాయిలో మొదటి మూడుస్థానాల్లో నిలిచిన వారికి రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు చొప్పున ఇవ్వగా, పాఠశాల స్థాయిలో రూ.3 వేలు, రూ.2 వేలు, రూ.వెయ్యి చొప్పున ప్రదానం చేశారు. 2023–24 విద్యా సంవత్సరంలోనూ ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లోను విద్యార్థులు భారీ సంఖ్యలో రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు సాధించారు. స్కూళ్లు తెరిచిన అనంతరం వీరిని కూడా సత్కరించేందుకు అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు.బడి తెరిచిన తొలిరోజే ‘జగనన్న విద్యాకానుక’ మరోవైపు.. ప్రభుత్వ, ఎయిడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు బడి తెరిచిన తొలిరోజు జూన్ 12న జగనన్న విద్యా కానుక కిట్లను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లుచేసింది. ప్రతి విద్యార్థికీ రూ.2,400 విలువైన కిట్‌లో బైలింగువల్ పాఠ్య పుస్తకాలు (ఇంగ్లిష్–తెలుగు), నోట్‌బుక్స్, వరŠుక్బక్స్, కుట్టు కూలితో మూడు జతల యూనిఫామ్ క్లాత్, జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతో పాటు 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీషు–తెలుగు డిక్షనరీ, ఒకటి నుంచి ఐదో తరగతి పిల్లలకు పిక్టోరియల్ డిక్షనరీ గల కిట్‌ను మొదటిరోజే అందజేయనుంది.ఇప్పటివరకు ఇలా నాలుగు సార్లు అందజేయగా, గతేడాది రూ.1,042.53 కోట్ల ఖర్చుతో 43,10,165 మంది విద్యార్థులకు విద్యాకానుకను అందించారు. 2024–25 విద్యా సంవత్సరానకి కూడా అంతే సంఖ్యలో కిట్లను సిద్ధంచేస్తున్నారు. ఇప్పటికే పుస్తకాల ముద్రణ దాదాపు పూర్తయింది. ఎన్నికల నేపథ్యంలో రవాణా నిలిపివేశారు. పోలింగ్ ముగిసిన అనంతరం విద్యాకానుక కిట్లు స్టాక్ పాయింట్లకు చేరుస్తారు.గత విద్యా సంవత్సరాల్లో అమ్మఒడి, విద్యాకానుక పంపిణీ ఇలా..జగనన్న అమ్మ ఒడి.. సంవత్సరం లబ్ధిదారులు నగదు (రూ.కోట్లలో)2019–20 42,33,098 రూ.6,349.62020–21 44,48,865 రూ.6,673.42021–22 42,62,419 రూ.6,393.62022–23 42,61,965 రూ.6,392.9జగనన్న విద్యాకానుక ఇలా..విద్యా సం. లబ్ధిదారులు నిధులు (రూ.కోట్లలో)2020–21 42,34,322 రూ.648.102021–22 47,32,064 రూ.789.212022–23 45,14,687 రూ.886.692023–24 43,10,165 రూ.1,042.53 -
మా పిల్లల చదువులపై కుట్రలొద్దు బాబూ
సాక్షి, అమరావతి: పేదింటి పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదువుకుని తమ పెత్తందారుల పిల్లలకు ఎక్కడ పోటీకు వస్తారోనని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ఎత్తేయడానికి చంద్రబాబు కుట్రలు పన్నుతుండటంపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పిల్లలకు ఉన్నత భవిష్యత్ దక్కాలంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం చదువులు ఉండాల్సిందేనని వారంతా డిమాండ్ చేస్తున్నారు. తాము ఇంగ్లిష్ చదువుల్లేక జీవితంలో ఎదగలేకపోయామని.. తమ పిల్లలకు ఇలాంటి దుస్థితి తలెత్తకూడదని కోరుకుంటున్నారు. సీఎం వైఎస్ జగన్ తమ పిల్లలకు మేనమామలా ఉంటూ అనేక విప్లవాత్మక సంస్కరణలు, పథకాలు ప్రవేశపెట్టి అత్యుత్తమ విద్యను అందిస్తున్నారని ఘంటాపథంగా చెబుతున్నారు. రాష్ట్రంలోని 15,784 ప్రైవేటు స్కూల్స్‌లోనూ ఇంగ్లిష్‌లోనే బోధన ఉందని గుర్తు చేస్తున్నారు. వాటికి లేని తెలుగు భాషాభిమానం ప్రభుత్వ స్కూళ్ల విషయంలోనే వచ్చిందా.. అంటూ నిలదీస్తున్నారు. తమ పిల్లలకు ఇప్పుడు ఇంగ్లిష్ చదువులు అందకపోతే వారి జీవితం అంధకారమైనట్టేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు తన మేనిఫెస్టోలో ‘కేజీ టు పీజీ సిలబస్ రివ్యూ’ అనే అంశాన్ని చేర్చడం వెనుక ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ఎత్తేసే కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. నిరుపేదల పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని వారికి సీఎం వైఎస్ జగన్ ఉత్తమ బోధన, ఇంగ్లిష్ మీడియం చదువులను ఉచితంగా అందిస్తుంటే చంద్రబాబు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని మండిపడుతున్నారు. పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియం బోధిస్తే మాతృభాష మరుగున పడిపోతుందంటూ మొసలికన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు. ఉన్నత విద్యకు ఇంగ్లిష్ తప్పనిసరి పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులు చదవాలంటే ఇంగ్లిష్‌పై గట్టి పట్టు ఉంటే తప్ప సాధ్యం కాదు. పాఠశాల స్థాయిలో ఇంగ్లిష్ మీడియం లేనివారు ఉన్నత విద్యలో వెనుకబడుతున్నారు. మరికొందరు అర్థం చేసుకోలేక డ్రాపవుట్ కావడమో లేదా సాధారణ డిగ్రీ కోర్సులకు మారిపోవడమో చేస్తున్నారు. వీరిలో ప్రతిభ ఉన్నా ఇంగ్లిష్ భాషపై పట్టులేకపోవడంతో వెనకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాల స్థాయిలో ఇంగ్లిష్ మీడియం చదువుతున్న విద్యార్థులు ఉన్నత విద్యలోనూ అద్భుతంగా రాణిస్తారని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేట్ పాఠశాలలకు ఇచ్చిన ప్రాధాన్యం ప్రభుత్వ పాఠశాలలకు ఇవ్వకపోవడంతో ప్రభుత్వ విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. దీంతో 2019లో అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్ సర్కారు ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. 2020లో రాష్ట్రవ్యాప్తంగా తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరించగా.. 97 శాతం మంది ఇంగ్లిష్ మీడియం బోధన తప్పనిసరిగా ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను 2020–21 విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టింది. విద్యార్థుల్లో ఇంగ్లిష్ భాషా నైపుణ్యాన్ని పెంచేందుకు ద్విభాషా పాఠ్యపుస్తకాలు, డిక్షనరీలను కూడా అందించింది. ఇటీవల ముగిసిన పరీక్షలను దాదాపు 93 శాతం పైగా విద్యార్థులు ఇంగ్లి‹Ùలోనే రాశారు. పదో తరగతిలో ఇంగ్లిష్ మీడియం అమలు చేయకున్నా 2.23 లక్షల మంది విద్యార్థులు ఇందులోనే పరీక్షలు రాసిన సంగతి తెలిసిందే. వీరిలో 1.96 లక్షల మందికి పైగా ఉత్తీర్ణత సాధించడం విశేషం. దీన్ని బట్టి ఇంగ్లిష్ బోధనను ఎంత బలంగా కోరుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన నేషనల్ అచీవ్మెంట్ సర్వేలోనూ 90 శాతం పైగా ఇంగ్లిష్ మీడియం చదువులనే కోరుకున్నారు. ఇంగ్లిష్ మీడియం లేకపోతే ఉద్యోగాలు ఎలా? సరైన ఇంగ్లిష్ చదువులు లేక మేము ఇబ్బందులు పడుతున్నాం. దాన్ని అందకుండా చేస్తే పిల్లలు పెద్దయ్యాక ఎలా బతుకుతారు? ఉద్యోగాలు ఎలా వస్తాయి? జగన్ ప్రభుత్వం ఉచితంగానే ఇంగ్లిష్ మీడియం బోధన అందిస్తోంది. అమ్మఒడి కింద ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం పిల్లల చదువులకు ఉపయోగపడుతోంది. మా పిల్లలను ఇంగ్లిష్ మీడియంలోనే చేర్పించాం. ఎల్రక్టీíÙయన్‌గా కుటుంబాన్ని పోషిస్తున్న నాకు పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించడం ఆర్థికంగా భారమే. – షేక్ బాజీ, నజ్మా, గుంటూరు ఇంగ్లిష్ మీడియం పేదలకు వరం కూలి పనులు చేసుకుంటే తప్ప జీవనం గడవని మాలాంటి కుటుంబాలకు పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్చే స్తోమత లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం చదువులు చెప్పించడం మాలాంటి పేదలకు వరం. మా ఇద్దరు పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇంగ్లిష్‌లో మీడియంలో చదువుకుంటున్నారు. ఇప్పుడే పేద విద్యార్థులకు మంచి జరుగుతోంది. కార్పొరేట్ పాఠశాలలకు మించి చదువు చెబుతున్నారు. కొంతమంది నాయకులు ఇంగ్లిష్ మీడియం వద్దని చెబుతున్నారు. మరి వారి పిల్లలను ఏ పాఠశాలలో చదివిస్తున్నారో చెప్పాలి. వారికో న్యాయం, మాకో న్యాయమా? – రాగోలు విజయలక్ష్మి, వంగర, విజయనగరం జిల్లా పిల్లల భవిష్యత్‌కు భరోసా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన ద్వారా పిల్లల భవిష్యత్‌కు భరోసా లభిస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యావిధానంలో తీసుకొచ్చిన సంస్కరణలు అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు తల్లిదండ్రులు అందరూ తమ పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో చదివించేందుకు ఆసక్తి చూపుతున్నారు. చంద్రబాబు ఇంగ్లిష్ విద్యాబోధనపై ఆరోపణలు చేయడం అన్యాయం. పేదల ఉత్తమ చదువులు అందడం ఆయనకు ఇష్టం లేదు. ఇంగిŠల్ష్ మీడియంను రద్దు చేయాలని చూస్తున్నారు. అదే జరిగితే ప్రభుత్వ స్కూళ్లు మూతపడే ప్రమాదముంది. – వాడపర్తి సుబ్బు, కోటనందూరు, కాకినాడ జిల్లా ఇప్పుడెన్నో సదుపాయాలు మా చిన్నప్పుడు ఇన్ని అవకాశాలను ఏ ప్రభుత్వం కల్పించలేదు. టీడీపీ ప్రభుత్వంలో అయితే పేద పిల్లలు ఇంగ్లిష్ మీడియం చదువులు దేవుడెరుగు.. అసలు స్కూళ్లనే పట్టించుకోలేదు. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పేద, మధ్య తరగతి పిల్లలకు ఉచితంగా ఇంగ్లిష్ మీడియంతో పాటు మరెన్నో సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు చంద్రబాబు ఇంగ్లిష్ మీడియం స్థానంలో తెలుగు మీడియం తీసుకువస్తామని చెప్పడం పిల్లల భవిష్యత్‌ను నాశనం చేయడానికే. మా పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివించకలేకపోయాను, కానీ జగన్ దయవల్ల మా మనవళ్లు, మనవరాళ్లను ఇంగ్లిష్ మీడియంలో చదివించుకుంటున్నాను. – కర్రి రామ్‌గోపాల్, నర్సీపట్నం, అనకాపల్లి జిల్లా -
బాబొస్తే ఇంగ్లిష్ మీడియం రద్దే..!
సాక్షి, అమరావతి: తన పాలనలో అన్ని రంగాల్లో ‘ప్రైవేటు’కు పెద్దపీట వేసి ప్రభుత్వ రంగాన్ని నిండా ముంచిన చంద్రబాబు చివరకు పేదింటి పిల్లలు విద్యనభ్యసించే ప్రభుత్వ పాఠశాలలనూ విడిచిపెట్టలేదు. తన జమానాలో కార్పొరేట్ విద్యా సంస్థలైన ‘చై–నా’లకే ఆయన పెద్దపీట వేయడం ఇందుకు నిదర్శనం. తక్కువ మంది విద్యార్థులు ఉన్నారని ఆరు వేల స్కూళ్లను మూసేసి వాటికి మంగళం పాడేశారు. పేదల విద్య ప్రభుత్వ బాధ్యతే కాదని ప్రకటించిందీ కూడా ఆయనే. ప్రభుత్వ ఉపాధ్యాయులకు అసలు నైపుణ్యం ఉండదనేది చంద్రబాబు ప్రగాఢ విశ్వాసం. నారాయణ స్కూళ్ల సిబ్బందితో ప్రభుత్వ టీచర్లకు శిక్షణ ఇప్పించిన తెంపరితనం ఆయనది. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదింటి పిల్లల చదువులకు పెద్దపీట వేసింది. దేశంలో కనివినీ ఎరుగని స్థాయిలో విప్లవాత్మక సంస్కరణలు, పథకాలు ప్రవేశపెట్టింది. పేద విద్యార్థులను ప్రపంచ స్థాయి పౌరులుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనను అమలు చేస్తోంది. దీన్ని చంద్రబాబు, ఆయన ముఠా జీర్ణించుకోలేకపోతోంది. పేద పిల్లలు ఇంగ్లిష్‌లో నిష్ణాతులైతే ఎక్కడ తమ పెత్తందారుల పిల్లలకు పోటీ వస్తారోనని ఇంగ్లిష్ మీడియం చదువులను తొలగించడానికి చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారు. ఇందులో భాగంగానే టీడీపీ తాజా మేనిఫెస్టోలో ‘కేజీ టు పీజీ విద్య రివ్యూ’ అనే అంశాన్ని చేర్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.పేద పిల్లల చదువుల ఆనందాన్ని తుంచేయాలనే..వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లలో పేద విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం బోధనను అందిస్తుంటే తెలుగు మీడియం సరైందంటూ చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. తద్వారా పేద విద్యార్థుల భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టేయడమే లక్ష్యంగా కంకణం కట్టుకున్నారు. ఇదే జరిగితే పేదింటి పిల్లల భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ‘నేను మా ఊళ్లో జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నాను. డిగ్రీ తర్వాత ఎంబీఏ చేశాను. ఈ సిలబస్ పూర్తిగా ఇంగ్లిష్‌లో ఉంది.. దీంతో చదవడం చాలా కష్టమైంది. ఎలాగోలా బట్టీపట్టి పరీక్షలు పాసయ్యాను గాని మంచి మార్కులు సాధించలేకపోయాను. ఇంటర్వ్యూలు ఇంగ్లిష్‌లోనే చేస్తుండడంతో ప్రశ్నలను అర్థం చేసుకోలేక ఉద్యోగం సాధించలేకపోయాను. నన్ను ఉద్యోగిగా చూడాలన్న నా తల్లిదండ్రుల ఆశను నెరవేర్చలేకపోయాను. ఆ బాధ ఇప్పటికీ నన్ను వెంటాడుతోంది. స్కూల్ స్థాయి నుంచి ఇంగ్లిష్ మీడియంలో చదివి ఉంటే ఈ దుస్థితి ఉండేది కాదు. ఇదే పరిస్థితి నా ఇద్దరు పిల్లలకు రాకూడదని వారిని కాకినాడలో ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చదివించాను. ఇప్పుడు ఇద్దరూ మంచి ఉద్యోగాల్లో ఉన్నారు’ అని కాకినాడ జిల్లా పోలవరం గ్రామానికి చెందిన ఓ తండ్రి వెల్లడించారు. రాష్ట్రంలో అందరి తల్లిదండ్రుల పరిస్థితి ఇదే. ఇప్పటి లాగా తాము చదువుకున్నప్పుడు సరైన సదుపాయాలు ఉండి ఉంటే తాము మరింత ఉన్నతంగా ఉండేవారిమన్న అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది. ఇప్పుడు ప్రభుత్వ బడుల్లో సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న ఇంగ్లిష్ మీడియం బోధన, డిజిటల్ ఎడ్యుకేషన్, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న అమ్మఒడి, 3వ తరగతి నుంచే టోఫెల్ శిక్షణ, 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌తో కూడిన ఉచిత ట్యాబ్‌ల పంపిణీని వారంతా కీర్తిస్తున్నారు. తమలాంటి పేద, మధ్యతరగతి కుటుంబాల్లోని పిల్లలకు సీఎం జగన్ పుణ్యమాని నాణ్యమైన విద్య ఇన్నేళ్లకు అందుతోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం పెత్తందారుల పిల్లలకు పేద పిల్లలు ఎక్కడ పోటీ వస్తారోనని.. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం బోధనను రద్దు చేయడానికి కుట్రలు పన్నుతుండటం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. చైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ సంస్థలకు విద్యను ధారాదత్తం చేయడానికి ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.విద్య ప్రభుత్వం బాధ్యత కాదని కాడిపారేసిన బాబు.. పేదలకు ఉచితంగా చదువు చెప్పడం ప్రభుత్వం బాధ్యత కాదని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబు ప్రకటించారు. ప్రభుత్వ బడుల్లో సదుపాయాలు ఉండవని.. ప్రైవేటు బడులు బాగుంటాయని చెప్పిందీ ఆయనే కావడం గమనార్హం. డబ్బున్నవారు వాటిల్లో చదువుకుని మేధావులుగా తయారవుతారని.. పేద పిల్లలు ఫీజులు కట్టి ప్రైవేటు స్కూళ్లలో చేరాలని పిలుపునిచ్చిందీ చంద్రబాబే. దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుభవం, రాష్ట్రానికి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకు పేదలన్నా.. వారి చదువులన్నా ఎంతటి చులకన భావం ఉందో ఈ వ్యాఖ్యలే తెలియజేస్తాయి. కార్పొరేట్ విద్యా సంస్థలకు బాహాటంగా కొమ్ముకాస్తూ పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ విద్యను నామరూపాల్లేకుండా చేశారు. తక్కువ మంది విద్యార్థులున్నారని 2014–19 మధ్య 1,785 పాఠశాలలను చంద్రబాబు మూసివేశారు. అక్కడి విద్యార్థులను గాలికి వదిలేశారు. అంతకుముందు టీడీపీ పాలనలోనే మరో 4,300 ప్రభుత్వ పాఠశాలలను కూడా శంకరగిరి మాన్యాలు పట్టించారు.ప్రభుత్వ ఉపాధ్యాయులను హేళన చేసి..పేదింటి పిల్లలనే కాకుండా ప్రభుత్వ ఉపాధ్యాయులను సైతం చంద్రబాబు దారుణంగా అవమానించారు. వారిలో బోధనా నైపుణ్యాలు తక్కువగా ఉంటాయని గతంలో బహిరంగంగానే ప్రకటించిన చరిత్ర ఆయనది. అంతేకాకుండా ప్రభుత్వ ఉపాధ్యాయులకు నారాయణ స్కూళ్ల సిబ్బందితో శిక్షణ ఇప్పించే సాహసానికి కూడా ఒడిగట్టారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించకుండా, సదుపాయాలు కల్పించకుండా ఫలితాలు తేవాలని ఒత్తిడి తెచ్చారు. ఎవరైనా ధైర్యం చేసి తమ స్కూళ్లకు సిబ్బందిని అడిగితే బహిరంగంగానే చంద్రబాబు సస్పెండ్ చేయడం పరిపాటిగా మారింది. దీంతో ఎంతోమంది ఉపాధ్యాయులు అవమానభారంతో ప్రాణాలు వదిలిన ఘనలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు 2000లో అనంతపురం జిల్లా నార్పల మండలం గూగూడులో జన్మభూమి సమావేశం ఏర్పాటు చేసి స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని స్టేజీ మీదకు పిలిచి మరీ అవమానించారు. ఆ సంవత్సరం 100 శాతం ఫలితాలు తేవాలని చంద్రబాబు ఆదేశించారు. తమ పాఠశాలకు సరిపడినంత మంది టీచర్లు లేరని ఆయన ఎదుటే చెబితే.. ఆగ్రహంతో రగిలిపోయిన బాబు అదే వేదికపై సదరు హెచ్ఎంను సస్పెండ్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 2003లో బాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నిమ్మల కిష్టప్ప గోరంట్ల జన్మభూమి కమిటీ సమావేశంలో టీచర్‌ను చెట్టుకు కట్టేసి కొట్టాలని అనుచరులను రెచ్చగొట్టారు. ఇలా చంద్రబాబు పాలనలో ఉపాధ్యాయులకు అడుగడుగునా అవమానాలే దక్కాయి.చై–నాలపై ప్రేమ అందుకే..తన అనుకూలవర్గానికి చెందిన నారాయణ– చైతన్య విద్యా సంస్థలను తలదన్నేలా ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఫలితాలు సాధిస్తుంటే చంద్రబాబు ఈర‡్ష్యతో రగిలిపోతున్నారు. సర్కారు బడులను నిర్వీర్యం చేయాలని కంకణం కట్టుకున్నారు. పేదలు ఎప్పుడూ అలాగే ఉండాలి, పైస్థాయికి వెళ్లగూడదన్న కక్షతో ఇంగ్లిష్ మీడియం చదువులు వద్దంటున్నారు. పెత్తందారుల పిల్లలకు మాత్రమే ఇంగ్లిష్ మీడియం, ఐబీ సిలబస్ బోధన ఉండాలని భావిస్తున్నారు. తద్వారా పేద పిల్లలను కూలీలుగా మార్చాలని చూస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో 45 వేల ప్రభుత్వ బడులను ఇంగ్లిష్ మీడియంలోకి మార్చడం తప్పని, దీనివల్ల తెలుగు భాషకు అన్యాయం జరిగిపోతుందంటూ చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారు. వాస్తవానికి నారాయణ, చైతన్యతో పాటు రాష్ట్రంలోని మొత్తం 15,784 ప్రైవేటు స్కూళ్లలోను ఇంగ్లిష్ మీడియంలోనే బోధన సాగుతోంది. మరి అక్కడ లేని ఇంగ్లిష్ ఇబ్బంది ప్రభుత్వ బడుల విషయంలోకి వచ్చేసరికి ఏమొచ్చిందో చంద్రబాబుకే తెలియాలి. సర్కారు బడులను నాశనం చేసి, నారాయణ, చైతన్య స్కూళ్లను పెంచడమే ఆయన ఎత్తుగడల ఉద్దేశమని అంటున్నారు.పేద పిల్లలు తినే అన్నంలో మన్నుదాదాపు ఐదేళ్ల పాటు ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలను చంద్రబాబు ప్రభుత్వం అర్ధాకలితో అలమటించేలా చేశారు. బడికి వచ్చే విద్యార్థులకు మధ్యాహ్నం పెట్టే భోజనంలోనూ చంద్రబాబు కక్తుర్తి పడ్డారు. రోజూ ముద్దయిపోయిన అన్నం, నీళ్ల సాంబారు ఇదొక్కటే మెనూ. ఈ అన్నం తినలేక, ఆకలితో ఉండలేక పేదింటి పిల్లలు ఆకలితో అలమటించారు. తిన్నవారికి కడుపునొప్పి సర్వసాధారణంగా మారింది. ఇక కౌమార దశ బాలికలైతే అనారోగ్య సమస్యలు ఎదుర్కొనేవారు. బడికి వచ్చిన పిల్లల్లో గరిష్టంగా 30 శాతం మంది ఈ నాసిరకం మధ్యాహ్న భోజనం చేయలేకపోయేవారు. రక్తహీనతతో ఆస్పత్రి పాలైన విద్యార్థులు కోకొల్లలు. ప్రభుత్వ బడుల్లో ఇన్ని ఘోరాలు జరుగుతున్నా చంద్రబాబుకు భుజం కాసే ఎల్లో మీడియా ఏనాడూ బడి పిల్లల ఆకలి కేకలను విననట్టే నటించింది. పేదల చదువుల బాధ్యత ప్రభుత్వానిది కాదని బహిరంగంగానే ప్రకటించిన చంద్రబాబు.. అందుకు తగ్గట్టుగానే సర్కారు బడులను నిర్వీర్యం చేసేందుకు మధ్యాహ్న భోజనంలో కోత పెట్టారు. ఏటా సగటున రూ.450 కోట్ల బడ్జెట్ మాత్రమే కేటాయించారు. ఈ నిధులను సైతం సరుకు సరఫరా చేసిన ఏజెన్సీలకు ఏనాడూ సకాలంలో చెల్లించిందీ లేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యేదాకా సర్కారు బడి పిల్లలను పట్టించుకున్న వారే కరువయ్యారు.పాఠశాల భవనాలకు బీటలు.. బెంచీలకు చెదలుచంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో ఒక్క ప్రభుత్వ బడికి భవనాన్ని నిర్మించిన పాపాన పోలేదు. ఏనాడూ అవి ఎలా ఉన్నాయో చూసింది లేదు. బాబు 2014లో ప్రకటించిన మేనిఫెస్టోలో బడుల రూపురేఖలు మార్చడం, హైస్కూల్ స్థాయిలో ఇంగ్లిష్ మీడియం, ప్రతి స్కూల్లోనూ బాల, బాలికలకు ప్రత్యేక టాయిలెట్లు వంటి హామీలు ఇచ్చారు. కానీ 2019లో జగన్ సీఎం అయ్యేనాటికి దాదాపు 6 వేల స్కూళ్లను చంద్రబాబు మూసివేశారు. ఏకోపాధ్యాయ పాఠశాలలు దాదాపు మూతపడ్డాయి. 20 మంది కంటే తక్కువ విద్యార్థులున్న చోట 1,725 స్కూళ్లకు తాళాలు వేసేశారు. 2019 మేనిఫెస్టోలో కూడా చంద్రబాబు ఇవే అంశాలను పొందుపరిచారు. చివరకు బడిలో సుద్దముక్కలు, పిల్లలు, ఉపాధ్యాయులకు బెంచీలు లేని పరిస్థితిని తెచ్చారు. చాలాచోట్ల పాఠశాలల భవనాలు శిథిలమైపోయి విద్యార్థులు, ఉపాధ్యాయులు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఉండేది. గత్యంతరం లేక వేల స్కూళ్ల నుంచి విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లకు వెళ్లిపోవడం, అవకాశం లేనివారు బడి మానేసే దుస్థితి బాబు జమానాలోనే సంభవించాయి.బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పేరుతో దోపిడీఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం విద్యను అందించేందుకు వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీకారం చుట్టారు. వీటికే ‘బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌గా చంద్రబాబు పేరు మార్చారు. కేవలం 33 వేల మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను తన అనుకూలవర్గాల చేతుల్లోని 383 ప్రైవేటు స్కూళ్లలో చేర్పించారు. నిరుపేద విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం చదువులంటూ భారీగా నిధులను దండుకున్నారు.నేడు అంతర్జాతీయ స్థాయికి ఏపీ విద్యా సంస్కరణలుటీడీపీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ విద్యను ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత అత్యంత ప్రాధాన్యత రంగాల్లో ఒకటిగా గుర్తించారు. పిల్లలను బడికి పంపించే తల్లులకు ఏటా అమ్మ ఒడి కింద రూ.15 వేల చొప్పున ఇచ్చారు. 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం చదువులను అందుబాటులోకి తెచ్చారు. 43 లక్షల మంది పిల్లలకు సమాన అవకాశాలు అందించారు. గిరిజన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన 371 ఆశ్రమ పాఠశాలలు, 18 ప్రీ మెట్రిక్ హాస్టళ్లు, 159 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు, 1,958 పాఠశాలలను ఆధునికీకరించారు. వీటిలో ఇప్పుడు 1,55,599 మంది విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో విద్య అందుతోంది. వారి భోజన, సదుపాల కోసం ఒక్క 2023లోనే ప్రభుత్వం రూ.920.31 కోట్లను ఖర్చు చేసింది. గిరిజన సంక్షేమ విద్యా సంస్థల్లో చవిదిన విద్యార్థులు గత నాలుగేళ్లలో 400 మందికి పైగా ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు సాధించారు. 50 మందికి పైగా నీట్ ర్యాంకులు సాధించి మెడిసిన్ చదువుతున్నారు.నాడు–నేడుతో బడులకు కొత్త సొబగులువిద్యా సంస్కరణలకు సీఎం వైఎస్ జగన్ రూ.73 వేల కోట్లను ఖర్చు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో 11 సౌకర్యాల కల్పనకు మనబడి నాడు–నేడు పథకాన్ని ప్రవేశపెట్టారు. నిరంతరం నీటి సరఫరాతో టాయిలెట్లు, శుద్ధమైన తాగునీరు, భవనాలకు మరమ్మతులు, కొత్త భవనాల నిర్మాణం, ఫ్యాన్లు, లైట్లతో విద్యుద్దీకరణ, విద్యార్థులు, సిబ్బందికి ఫర్నీచర్, గ్రీన్ చాక్ బోర్డులు, భవనాలకు పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్, కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్, అదనపు తరగతి గదులు నిర్మించారు. నాడు–నేడు మొదటి విడతలో 15,715 పాఠశాలల్లో రూ.3,669 కోట్లతో సౌకర్యాలు కల్పించి ప్రజలకు అంకితం చేయగా, రెండో దశలో రూ.8 వేల కోట్లతో 22,344 పాఠశాలల్లో పనులు చేపట్టారు.ప్రతి విద్యార్థికీ డిజిటల్ బోధన నాడు–నేడు పనులు పూర్తయిన హైస్కూళ్లల్లో ఇంటర్నెట్తో పాటు 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, 45 వేల స్మార్ట్ టీవీలను అందించారు. వీటితో 3డీ పాఠాలను బోధిస్తున్నారు. దేశంలో 25 వేల ఐఎఫ్‌పీలు ఉంటే.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే 62 వేల డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయడం దేశ చరిత్రలో ఓ విప్లవం. 8వ తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కలిపి 2021–22, 2022–23 విద్యా సంవత్సరాల్లో 9.53 లక్షల మందికి బైజూస్ కంటెంట్‌తో ఉచితంగా ట్యాబ్స్ ఇచ్చారు. ‘ఏపీ ఈ–పాఠశాల’ మొబైల్ యాప్, దీక్ష వెబ్సైట్, డీటీహెచ్ చానెళ్లు, యూట్యూబ్ చానెల్స్ ద్వారా నిరంతరం పాఠాలను విద్యార్థులకు చేరువ చేసింది.భాషపై పట్టుకోసం టోఫెల్ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు అంతర్జాతీయంగా రాణించేందుకు వీలుగా ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రవేశపెట్టింది. భాషపై పట్టు సాధించేందుకు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేంపదుకు 3వ తరగతి నుంచి టోఫెల్ శిక్షణ ఇస్తోంది. ఈ ఏడాది తొలిసారి నిర్వహించిన ‘టోఫెల్’ పరీక్షకు దాదాపు 16.50 లక్షల మంది విద్యార్థులు హాజరు కావడం గమనార్హం. విద్యార్థుల్లో ప్రమాణాలు పెంచేందుకు మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లను నియమించింది. ఇందుకోసం అర్హత గల 25 వేల మందికి పైగా ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించి హైస్కూళ్లల్లో నియమించింది.సీబీఎస్ఈ బోధన పేదింటి పిల్లలు జాతీయ, అంతర్జాతీయంగా పోటీపడేలా తీర్చిదిద్దేందుకు వీలుగా మొదటి విడతలో ప్రభుత్వం 1,000 పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధన ప్రారంభించింది. వచ్చే విద్యా సంవత్సరం ఈ విద్యార్థులు పదోతరగతి పరీక్షలను సీబీఎస్ఈ సిలబస్‌లో రాయనున్నారు.బాలికల కోసం జూనియర్ కాలేజీహైస్కూల్ చదువు పూర్తయిన బాలికలు చదువు మానేయకుండా ప్రతి మండలంలోనూ బాలికలకు ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలను జగన్ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. 292 ఉన్నత పాఠశాలలు బాలికల కోసం హైస్కూల్ ప్లస్‌గా అప్‌గ్రేడ్ చేశారు. 352 కేజీబీవీల్లో ఇంటర్మీడియెట్‌ను ప్రవేశపెట్టారు. 2022–23 నుంచి 14 కో–ఎడ్ జూనియర్ కళాశాలలను గరŠల్స్ జూనియర్ కళాశాలలుగా మార్చి రాష్ట్రంలోని 679 మండలాల్లోనూ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలను తీసుకొచ్చారు.ప్రపంచ టెక్నాలజీపై విద్యార్థులకు శిక్షణప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను భవిష్యత్ టెక్ నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ‘ఫ్యూచర్ స్కిల్స్ కోర్సుల’ను జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆరు నుంచి ఇంటర్ వరకు మూడు దశల్లో విద్యార్థులకు ఫ్యూచర్ స్కిల్స్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), 3డీ ప్రింటింగ్, గేమింగ్ వంటి 10 విభాగాల్లో శిక్షణ ఇస్తారు. ఈ కోర్సులను 6,790 ఉన్నత పాఠశాలల్లో బోధించేందుకు ఇంజనీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులను ఫ్యూచర్ స్కిల్స్ ఫెసిలిటేటర్స్‌గా ప్రభుత్వం నియమించింది.పేదలకు ‘ఐబీ’ విద్యపేదింటి పిల్లలు ప్రపంచానికి దిక్సూచిగా మారాలన్న సీఎం జగన్ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఇంటర్నేషనల్ బాకలారియేట్(ఐబీ) బోధన 2025 జూన్ నుంచి ఒకటో తరగతి నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటి దాకా దేశంలో 210 వరల్ట్ క్లాస్ కార్పొరేట్ స్కూళ్లలో మాత్రమే ఇంటర్నేషనల్ బాకలారియేట్ (ఐబీ) సిలబస్ అమల్లో ఉంది. ఏటా ఒక తరగతి చొప్పున ఐబీ బోధన పెంచుతూ 2037 నాటికి +2 వరకు విద్యనందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. -
ప్రభుత్వ బడిలో ప్రగతి కెరటాలు
తల్లిదండ్రులు కష్టపడితేనే పూట గడిచే కుటుంబాలకు చెందిన పిల్లలు వీరు. సీఎం వైఎస్ జగన్ సంకల్పంతో అత్యాధునికంగా మారిన ప్రభుత్వ బడుల నుంచి ఐక్యరాజ్య సమితిలో మెరిసిన మెరుపు తీగలు. 2022–23 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో 550 నుంచి 590 మార్కులు సాధించి, ప్రతిభను నిరూపించుకున్న ఆణిముత్యాలు.నానాజీ అంకంరెడ్డి, సాక్షి అమరావతి: ప్రభుత్వ బడులు, జూనియర్ కాలేజీల్లో చదువుకుని టాపర్లుగా నిలిచిన వారికి ఏటా ’జగనన్న ఆణిముత్యాలు’ పేరిట వైఎస్ జగన్ ప్రభుత్వం సత్కరిస్తోంది. రాష్ట్రంలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులు 22 వేల మందిని ప్రభుత్వం ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరిట నగదు ప్రోత్సాహకాలతో సత్కరించి, పేద విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అంతేకాదు.. ఇలాంటి పేదింటి రత్నాలను ప్రభుత్వ ప్రతినిధులుగా 10 మందిని ఎంపిక చేసి ఐక్యరాజ్య సమితికి పంపించారు. అప్పటి వరకు కనీసం జిల్లా కేంద్రాన్ని కూడా చూడని ఈ విద్యార్థులు ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకులో ప్రసంగించడం చరిత్ర సృష్టించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చేసిన మార్పులు, మనబడి నాడు – నేడుతో సమకూరిన సదుపాయాలు, ఆధునిక ల్యాబ్స్‌తో జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్‌లో టాపర్లుగా నిలిచిన మరో ఏడుగురు విద్యార్థులు జపాన్ వెళ్లి వచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకు ఈ స్థాయిలో ప్రోత్సహించడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. పేదింటి ఆణిముత్యాలే రాష్ట్ర ప్రతినిధులు 2019లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు తీసుకున్న వెంటనే ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, పేదల పిల్లల విద్యాభివృద్ధిపై దృష్టి సారించారు. మన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్న లక్ష్యంతో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు సమూలంగా మార్చేశారు. స్మార్ట్ టీవీలు, ఐఎఫ్‌పీ స్క్రీన్ల ద్వారా బోధన, టోఫెల్ శిక్షణ వంటివి ప్రవేశపెట్టి, బోధన ప్రమాణాలు పెంచి, సర్కారు స్కూళ్లను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ఇదే అంశాన్ని తెలియజేస్తూ గతేడాది ఆగస్టులో న్యూయార్క్ నగరంలోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన హైలెవల్ పొలిటికల్ ఫోరం (సదస్సు)లో ఏపీ విద్యా సంస్కరణలను తెలియజెబుతూ ఏర్పాటు చేసిన స్టాళ్లు అంతర్జాతీయ ప్రతినిధులను ఆకర్షించాయి. ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల అభివృద్ధిని స్వయంగా తెలుసుకుంటామని పలు దేశాల ప్రతినిధులు కోరడంతో పాటు ఐక్యరాజ్య సమితికి ప్రతినిధులను పంపాలని ఆహా్వనించారు. సాధారణంగా ఇలాంటి అంతర్జాతీయ సదస్సులకు అత్యున్నత అధికారులను పంపిస్తారు. కానీ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, పాఠశాలల అభివృద్ధిపై మాట్లాడేందుకు విద్యార్థులే సరైన ప్రతినిధులని సీఎం జగన్ భావించారు. అందుకే ఈ ఆణిముత్యాలను అంతర్జాతీయ వేదికలపై ప్రతినిధులుగా పంపించారు. సీఎం నమ్మకాన్ని వమ్ము చేయని మన పిల్లలు 2022–23 విద్యా సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ స్కూళ్లలోని పిల్లలను 150 మందిని ఎంపిక చేసి, వారికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, మారిన బడుల తీరుపై పరీక్ష పెట్టారు. వీరిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 30 మందికి ఇంటర్వ్యూలు చేసి, వారి నుంచి 10 మందిని ఎంపిక చేశారు. గత ఏడాది సెప్టెంబర్ 15 నుంచి 27 వరకు వీరంతా ప్రభుత్వ ఖర్చుతో అమెరికా వెళ్లి ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించారు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో స్వయంగా మాట్లాడారు. ప్రపంచంలో అత్యంత అరుదుగా మాత్రమే ప్రవేశం లభించే అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో సైతం వీరు మాట్లాడే అవకాశం లభించింది. పేదింటి పిల్లలైనా, ప్రభుత్వ చేయూతతో అంతర్జాతీయ స్థాయి విజ్ఞానాన్ని సముపార్జించుకొన్న వీరంతా సీఎం జగన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్రంలో జరుగుతున్న విప్లవాత్మక మార్పులను వివరించారు. సీఎం జగన్ ఆదర్శవంతమైన సంస్కరణలను ప్రపంచానికి చాటిచెప్పారు. జపాన్ సకురా సైన్స్ ఫెయిర్‌కూ ఏపీ విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం నాడు – నేడు పథకంతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను కల్పించింది. దీంతో అక్కడి సైన్స్ ల్యాబ్స్, నిష్ణాతులైన ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నిర్వహించే ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్‌స్యుట్ ఫర్ ఇన్‌సై్పర్డ్ రీసెర్చ్ (ఇన్‌సై్పర్) పోటీల్లో సత్తా చాటుతున్నారు. పాఠశాల స్థాయి విద్యార్థులు దైనందిన జీవితంలో చూసిన సమస్యలకు పరిష్కారాలను చూపే ఆకర్షణీయమైన అంశాలు, నమూనాలు తయారు చేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో లేబొరేటరీలు అత్యాధునికంగా తీర్చిదిద్దడంతో మన విద్యార్థులు గత నాలుగేళ్లుగా ఏటా 40 వేలకు పైగా ప్రాజెక్టులు చేస్తున్నారు. వీటి నుంచి రాష్ట్ర స్థాయి పోటీలకు 400 వరకు ఎంపికవుతున్నాయి. గత నాలుగేళ్లుగా జాతీయ పోటీలకు దాదాపు 45 ప్రాజెక్టులు ఎంపికవుతున్నాయి. ఈ పోటీల్లో విజేతలకు ప్రభుత్వం పేటెంట్ హక్కులు కూడా ఇస్తుంది. 2019కి ముందు జాతీయ స్థాయి ఇన్‌సై్పర్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో ఉంటే ఇప్పుడు 3వ స్థానానికి చేరుకుంది. ఇక్కడే కాదు.. 2019 నుంచి 2022 వరకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఏడుగురు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపించి, ‘జపాన్ సకురా’ అంతర్జాతీయ పోటీలకు ఎంపికై జపాన్‌లో పర్యటించి వచ్చారు.ప్రభుత్వ బడిలో కొత్త ఆవిష్కరణలు విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించడంతో విద్యార్థులు చేస్తున్న ప్రయోగాలు సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలకడంతో పాటు పేటెంట్లు సైతం అందుకుంటున్నారు. గుంటూరు జిల్లా అత్తోట జెడ్పీ స్కూల్ విద్యార్థిని పి.కీర్తి వీధుల్లో కూరగాయలు అమ్ముకునేవారికి ఉపయోగపడే వెండర్స్ ఫ్రెండ్లీ సోలార్ కార్ట్‌ను రూపొందించింది. చిత్తూరు జిల్లా ఏఎల్‌పురం జెడ్పీ స్కూల్ విద్యార్థిని కె.ప్రణయ 15 రోజులు కూరగాయలు పాడవకుండా నిల్వ చేసుకునే గార్లిక్ బ్యాగ్‌ను రూపొందించింది. చిత్తూరు జిల్లా జంగంపల్లి జెడ్పీ స్కూల్ విద్యార్థి పి.చరణ్ తేజ బైక్‌పై వెనుక కూర్చున్న వారికి రక్షణగా ఉండే సైడ్ సీట్‌ను తయారుచేశాడు. రైతు కుటుంబాలకు చెందిన ఈ ముగ్గురూ వారు నిత్యం చూస్తున్న సమస్యలకు పరిష్కారంగా ఈ ఆవిష్కరణలు చేసి, జాతీయ ప్రతినిధులను మెప్పించడమే కాదు.. గత నవంబర్‌లో జపాన్ వెళ్లి వచ్చారు. మరో నలుగురు విద్యార్థులు వచ్చే నెలలో జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు.అత్యంత సామాన్యుల పిల్లలకే అవకాశం ⇒ ఏలూరు జిల్లా పెదపాడు మండలం వట్లూరు జెడ్పీ స్కూల్లో చదువుకున్న పసుపులేటి గాయత్రి గతేడాది పదో తరగతిలో 590 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచింది. జగనన్న ఆణిముత్యాలు అవార్డు కింద రూ.50 వేలు అందుకుంది. కూలి పనులు చేసే తండ్రి కష్టంపైనే బతుకుతున్న ఈ కుటుంబానికి జగనన్న విద్య, సంక్షేమ పథకాలు దన్నుగా నిలిచాయి. ⇒ కర్నూలు జిల్లా కౌతాళం మండలం పొదలకుంటకు చెందిన మించాలవారి సోమనాథ్, గంగమ్మలకు నలుగురు సంతానంలో ఒకరైన శివలింగమ్మ ఆదోని కేజీబీవీలో పదో తరగతిలో 541 మార్కులు సాధించింది. ⇒ తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురానికి చెందిన వంజవాకం యోగీశ్వర్ తండ్రి నాగరాజు సామాన్య రైతు. చంద్రగిరి ప్రభుత్వ బాలుర పాఠశాలలో చదువుకున్న యోగీశ్వర్ గతేడాది పదో తరగతిలో 586 మార్కులు సాధించి జిల్లాలో రెండోస్థానంలో నిలిచాడు. ⇒ విజయనగరంలో మెకానిక్‌గా పనిచేస్తున్న అల్లం రామకృష్ణారెడ్డి, ఉదయలక్ష్మిల కుమార్తె రిషితారెడ్డి స్థానిక కస్పా మున్సిపల్ కార్పొరేషన్ హైసూ్కల్లో పదో తరగతిలో 587 మార్కులు సాధించింది. ప్రస్తుతం నూజివీడు ట్రిపుల్ ఐటీలో చదువుతోంది. ⇒ శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బకు చెందిన షేక్ ఫాతిమా భర్త చనిపోవడంతో కూలీ పనులు చేస్తూ ఇద్దరు ఆడపిల్లలను పోషించుకుంటోంది. ఈమె రెండో కూతురు అమ్మాజాన్ వేంపల్లిలోని ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో చదివి గతేడాది పదో తరగతిలో 581 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో జగనన్న ఆణిముత్యాలు సత్కారం కింద రూ.లక్ష నగదు బహుమతి అందుకుంది. ఇప్పుడు ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో చదువుతోంది. ⇒ నంద్యాల పట్టణం బొమ్మలసత్రం ప్రాంతానికి చెందిన సి.రాజేశ్వరి తండ్రి దస్తగిరి లారీడ్రైవర్. తల్లి రామలక్ష్మమ్మ ఇంటి వద్ద బట్టలు ఇస్త్రీ చేస్తుంటారు. రాజేశ్వరి నంద్యాలలోని ఏపీ మోడల్ స్కూల్లో పదో తరగతి చదివి 583 మార్కులు సాధించి జిల్లాలో రెండో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఈ బాలిక ట్రిపుల్‌ఐటీలో ఇంజినీరింగ్ చదువుతోంది. ⇒ అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన రామారావు, మణి దంపతుల రెండో కుమార్తె మోతుకూరి చంద్రలేఖ స్థానిక కేజీబీవీలో చదువుకుని గతేడాది పదో తరగతిలో 523 మార్కులు సాధించింది. జిల్లా టాపర్‌గా నిలిచి జగనన్న అణిముత్యాలు సత్కారం కింద రూ.50 వేల నగదు బహుమతి అందుకుంది. ⇒ కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం రమణక్కపేటకు చెందిన దడాల సింహాచలం ప్రైవేటు సెక్యూరిటీ గార్డు. ఈయన రెండో సంతానమైన డి.జ్యోత్స్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయంలో చదువుకుని పదో తరగతిలో 589 మార్కులు సాధించి జగనన్న ఆణిముత్యాలు రాష్ట్రస్థాయి ప్రతిభా పురస్కారాన్ని అందుకుంది. ప్రస్తుతం కృష్ణాజిల్లా ఈడుపుగల్లులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయం ఐఐటీ అకాడమీలో ఇంటర్ చదువుతోంది. ⇒ పశ్చిమ గోదావరి జిల్లా వల్లూరుపల్లి గ్రామానికి చెందిన జి.గణేష్ అంజన సాయి ఏలూరు జిల్లా టి.నర్సాపురం మండలం అప్పలరాజుగూడెం గురుకుల పాఠశాలలో చదువుకుని గతేడాది పదో తరగతిలో 581 మార్కులు సాధించి నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీటు సాధించాడు. ఇతని తండ్రి గోపి కౌలు రైతు కాగా, తల్లి లక్ష్మి గృహిణి. -
నాడు–నేడుకు దేశం ఫిదా
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ విద్యా వ్యవస్థలో సీఎం జగన్ ప్రవేశపెట్టిన నాడు–నేడుతో పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. ఆ అంశం యావత్ దేశాన్ని ఆకర్షిస్తోంది. నాడు–నేడు ద్వారా బడుగు, బలహీన వర్గాల పిల్లలకు పెద్దపీట వేయడాన్ని ఉత్తరాది రాష్ట్రాలు కొనియాడుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పాఠశాలల పరిస్థితులు, ప్రస్తుతం సీఎం జగన్ హయాంలో పాఠశాలల స్థితిగతులపై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కళ్లకు కట్టినట్లు వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. నాడు–నేడు షార్ట్ వీడియోలు ట్రెండీగా మారాయి. ఏపీలోని నాడు–నేడుపై దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ► రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు విద్యాసంస్థలను పట్టించుకోలేదు. ► విద్య, మధ్యాహ్న భోజన విషయంలో సైతం సర్కారీ బడులపై బాబు చిన్నచూపు చూశారు. ► 2014–19 మధ్య దాదాపు 1,785 పాఠశాలలను మూసివేసిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుంది.► 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యధిక మెజార్టీ సీట్లతో గెలిచి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 58 నెలల్లో దాదాపు రూ.73 వేల కోట్లతో 45 వేల ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేశారు. ► 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ల ద్వారా విద్యాబోధన అందిస్తున్నారు. ఏ ఒక్క పిల్లవాడు చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో..సీఎం జగన్ అమ్మఒడి కింద ఏటా రూ.15 వేలు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.సోషల్ మీడియాలో పలువురి కామెంట్లు ఇలా..► ఇది కేవలం విజనరీ సీఎం జగన్ వల్లే సాధ్యం► నాకు ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ అంటే ఇష్టం.. మంచి విద్య, అద్భుతమైన ఆట స్థలాలు ► అవును ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా విద్యార్థులకు అవసరమే► దేశంలో ప్రతి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ని స్ఫూర్తిగా తీసుకోవాలి► ఏపీ సీఎం జగన్ కింగ్ ట్రెండింగ్‌లో కావ్య వీడియోసీఎం జగన్ విద్యా వ్యవస్థలో నాడు–నేడు ద్వారా తీసుకొచి్చన విప్లవాత్మక మార్పులను గుర్తిస్తూ ఢిల్లీకి చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ‘కావ్య’ ఓ వీడియోను రూపొందించారు. ►విద్యా వ్యవస్థలో దేశంలోనే ఏపీ సరికొత్త అడుగులు వేసిందని, గతంలో ఉన్న అధ్వాన పరిస్థితిని సమూలంగా మార్చివేసిందంటూ ప్రశంసలు కురిపించారు. ►అత్యాధునిక ఫర్నిచర్, ఫ్యాన్లు, మరుగుదొడ్లు వంటివి ఏర్పాటు చేశారని.. ఆ రోజుల్లో మనకు ఇటువంటి సౌకర్యాలు లేవే అంటూ.. సీఎం జగన్ చేసిన మంచి పనిని మెచ్చుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ►ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టి, ఐబీ సిలబస్‌ను పరిచయం చేయడం అభినందనీయమని, ఈ ఐదేళ్ల కాలంలో ఏపీలో నిరక్షరాస్యత తగ్గిందని, బడుగు, బలహీన వర్గాల వారికి చదువుపై ఆసక్తి పెరిగిందంటూ వీడియో చేశారు. ►ఆ వీడియోను యూట్యూబ్, ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేయడంతో పదిలక్షలకు పైగా నెటిజన్లు వీడియో చూసి, వేల సంఖ్యలో షేర్ చేస్తూ ‘సూపర్ ఏపీ స్కూల్స్’ అంటూ కితాబు ఇస్తున్నారు. ►మరికొంత మంది నాడు–నేడుపై షార్ట్ వీడియోస్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఉత్తరాది జనం ఫిదా అవుతున్నారు. ►యూపీ, హరియాణా, రాజస్థాన్, బిహార్ వంటి రాష్ట్రాల్లో ఈ తరహా విద్య ఉంటే బాగుంటుందంటూ కామెంట్ల రూపంలో వారి అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు. ►దేశవ్యాప్తంగా ఉన్న నెటిజన్లు ఈ వీడియోపై స్పందిస్తూ ఇదే తరహా నాణ్యమైన విద్య దేశం మొత్తం తీసుకురావాలని, సీఎం జగన్‌ను కొనియాడుతూ లైకులు, కామెంట్లు, షేర్ చేస్తున్నారు. -
థాంక్యూ జగన్ మామయ్య..
-
ఆనందాల ఏలుబడి
ప్రభుత్వ బడుల్లో కల్పించిన సదుపాయాలు 1. నిరంతరం నీటి సరఫరాతో మరుగుదొడ్లు 2. శుద్ధి చేసిన తాగునీరు 3. పూర్తి స్థాయి మరమ్మతులు 4. ఫ్యాన్లు, లైట్లతో విద్యుదీకరణ 5. విద్యార్థులు, సిబ్బందికి ఫరి్నచర్ 6. గ్రీన్ చాక్‌బోర్డులు 7. భవనాలకు పెయింటింగ్ 8. ఇంగ్లిష్ ల్యాబ్ 9. కాంపౌండ్ వాల్; 10. కిచెన్ షెడ్ 11. అదనపు తరగతి గదుల నిర్మాణం సాక్షి, అమరావతి: ప్రభుత్వ విద్యకు జగనన్న ప్రభుత్వం పట్టం కట్టింది. అలా ఇలా కాదు.. అక్షరానికి అగ్రాసనం వేసి, సౌకర్యాలకు సమున్నత స్థానం కల్పించారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ లేనట్లుగా.. నిధులు కేటాయించి సర్కారు బడి రూపురేఖల్ని సమూలంగా మార్చింది. కార్పొరేట్ విద్యా రంగం ఈర‡్ష్యపడేలా కొత్త పాఠశాల భవనాలు.. టాయిలెట్ల నుంచి కాంపౌండ్ వాల్ వరకు 11 రకాల సదుపాయాలు కల్పించారు. నాడు–నేడు రెండు దశల్లో 44,617 ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు చేశారు. తెలుగు, ఇంగ్లిషులో టెక్టŠస్ బుక్స్ అందించి ప్రతి విద్యార్థి ఇంగ్లిష్‌ను సులభంగా నేర్చుకునేలా చర్యలు తీసుకున్నారు. కేవలం విద్యా సంస్కరణల కోసం జగనన్న ప్రభుత్వం జూన్ 2019 నుంచి ఫిబ్రవరి 2024 వరకు రూ.72,919 కోట్లు ఖర్చు చేసి విద్యా రంగంలో సంస్కరణల పట్ల తన నిబద్ధత చాటుకుంది. సర్కారు బడిలో డిజిటల్ శకం ఒకప్పుడు బ్లాక్ బోర్డులపై రాసే సుద్దముక్కలు లేక ఇబ్బందులు పడిన దశ నుంచి ప్రభుత్వ బడి డిజిటల్ బోధనతో సరికొత్త హంగులు సంతరించుకుంది. స్కూల్లో చదువుకునేందుకు అనువైన వాతావరణం ఉన్నప్పుడే చిన్నారులు ఆసక్తి చూపుతారన్న ఆలోచనతో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం మనబడి నాడు–నేడు పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 11 రకాల సదుపాయాలు కల్పించారు. సరికొత్తగా.. నాడు–నేడులో పాఠశాలల రూపురేఖలు మారాయి. ఈ పనులన్నీ పూర్తి పారదర్శకతతో కొనసాగేందుకు తల్లిదండ్రుల కమిటీని ఏర్పాటు చేశారు. నాడు–నేడు పనులు చేపట్టిన అన్ని ఉన్నత పాఠశాలల్లోను ఇంటర్నెట్తో పాటు 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లతో 3డీ డిజిటల్ పాఠాలను బోధిస్తున్నారు. ప్రా«థమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీలతో పాఠాలతో పాటు టోఫెల్ శిక్షణ అందిస్తున్నారు. నాలుగో తరగతి నుంచి ఇంటర్ వరకు బైజూస్ పాఠాలను ఉచితంగా బోధిస్తున్నారు. దేశంలో 25 వేలఐఎఫ్‌పీలు ఉంటే.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే 62 వేల డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయడం దేశ చరిత్రలో ఒక విప్లవం. . అమ్మ ఒడితో అండగా.. ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ అందించేందుకు, అంతర్జాతీయంగా రాణించాలన్న దీర్ఘకాలిక లక్ష్యంతో ప్రభుత్వం పాఠశాల విద్యకు అధిక ప్రాధాన్యం ఇచి్చంది. ‘మనబడి నాడు–నేడు’ కింద డిజిటల్ మౌలిక సదుపాయాలు, అదనపు తరగతి గదులతో పాటు జగనన్న అమ్మ ఒడి, విద్యాకానుక, గోరుముద్ద, పాఠ్యాంశాల సంస్కరణలు, ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు–వాటి నిర్వహణకు ప్రత్యేక నిధి వంటివి ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో మొత్తం 58,950 పాఠశాలలు ఉండగా, 72,20,633 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 44,617 ప్రభుత్వ పాఠశాలల్లో 43.10 లక్షల మంది చదువుతున్నారు. వీరికి అత్యున్నత ప్రమాణాలతో విద్య కోసం 2019–20 విద్యా సంవత్సరంలోనే ప్రభుత్వం సంస్కరణలు మొదలుపెట్టింది. ఒకటి నుంచి ఇంటర్ వరకు చదివే పిల్లల తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15 వేలు చొప్పున జమ చేశారు. టెక్ ప్రపంచంలో రాణించేలా.. ప్రస్తుత టెక్ ప్రపంచంలో మన విద్యార్థులు రాణించేందుకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న టెక్నాలజీ కోర్సులపై స్కూల్ స్థాయిలోనే అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను భవిష్యత్ టెక్ నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం 2024–25 విద్యా సంవత్సరం నుంచి ఫ్యూచర్ స్కిల్స్ కోర్సుల్ని ప్రవేశపెడుతోంది. ఆరు నుంచి ఇంటర్ వరకు మూడు దశల్లో విద్యార్థులకు ఫ్యూచర్ స్కిల్ శిక్షణ ఇవ్వనున్నారు. టెక్ అంశాల్లో విద్యార్థుల ఆలోచన శక్తిని విస్తరించడం, విజ్ఞానంలో ముందుండేందుకు ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), 3డీ ప్రింటింగ్, గేమింగ్ వంటి 10 విభాగాల్లో శిక్షణ ఇస్తారు. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్ కోసమే దాదాపు రూ.2400 కోట్లు ఖర్చు చేస్తోంది. నాస్కామ్, జేఎన్టీయూ నిపుణులు, ఏపీ ఎస్సీఈఆరీ్ట, స్వతంత్ర నిపుణులతో ఫ్యూచర్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌ను రూపొందించారు. ఈ కోర్సులను 6,790 ఉన్నత పాఠశాలల్లో బోధించేందుకు ఇంజినీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులను ఫ్యూచర్ స్కిల్స్ ఫెసిలిటేటర్స్‌గా నియమిస్తోంది. విద్యార్థుల ప్రతిభకు పట్టం విద్యా రంగంలో సంస్కరణల కొనసాగింపుగా, విద్యలో నాణ్యత, నైపుణ్యాన్ని పెంపొందించడంతో పాటు.. విద్యార్థుల కృషిని అభినందించి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది మరో గొప్ప ముందడుగు వేసింది. ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో చదువుకుని ప్రతిభ చాటిన వారిని ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరుతో సత్కరించింది. 2023 మార్చిలో ఇంటర్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో వివిధ ప్రభుత్వ మేనేజ్మెంట్లలో అత్యధిక మార్కులు సాధించి, మొదటి స్థానాల్లో నిలిచిన 22,768 మంది స్టేట్ బ్రిలియన్స్ అవార్డులు అందుకున్నారు. -
Fact check: చదువులపై విషం కక్కిన నారా వారి కూలీ..
సాక్షి, అమరావతి: తల్లిదండ్రుల తరువాత గురువుకు ప్రత్యేక స్థానం ఇచ్చిన సంస్కృతి మనది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆ సంస్కృతిని కొనసాగిస్తూ వారికి అత్యున్నత గౌరవం ఇస్తోంది. ప్రతి అంశంలోనూ ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్న గురివింద రామోజీకి ఇది మింగుడు పడలేదు. మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులను కాపలా పెట్టింది.. వారిచేత మరుగుదొడ్లు ఊడ్పించిందని టీచర్లను అవమానించేలా కట్టుకథ అల్లేసింది. ఈ పనులు ఎక్కడ చేయించిందో మాత్రం ఆ పత్రిక రాయదు. గత ప్రభుత్వంలో పిల్లలకే కాదు.. టీచర్లకూ మరుగుదొడ్లు లేవన్న సత్యాన్ని మరుగున పరిచింది. ఈ ప్రభుత్వ హయాంలో ప్రతి స్కూల్లో స్టాఫ్‌కు ప్రత్యేక, ఆధునిక సదుపాయాల కల్పన ఆ పత్రికకు కనబడవు. ఒకేసారి 25 వేల మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించింది ఈ ప్రభుత్వమే. నాడు–నేడుతో 45 వేల ప్రభుత్వ బడులు అద్భుతంగా రూపురేఖలు మార్చుకున్నాయి. ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు, బోధనకు ఐఎఫ్‌పీ స్క్రీన్ల ఏర్పాటు జరిగాయి. వీటిని కావాలనే విస్మరించి ఆధారాలు లేని రాతలతో ఎల్లో మీడియా రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. పాఠశాల అభివృద్ధిలో టీచర్లను భాగస్వామ్యం చేయడం తప్పేనా? ఒకప్పటి బ్లాక్ బోర్డుల స్థానంలో ఇప్పుడు డిజిటల్ బోధన సాగుతోంది. విద్యార్థులు నేర్చుకునేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు 2019–20 విద్యా సంవత్సరంలో ‘మనబడి నాడు–నేడు’ పథకానికి శ్రీకారం చుట్టింది. పాఠశాల విద్య, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సాంఘిక, బీసీ, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖ, జువైనల్ వెల్ఫేర్, ఫిషరీస్, రెసిడెన్షియల్ పాఠశాలల ఆధ్వర్యంలో ఉన్న మొత్తం 44,512 స్కూళ్లను ఈ పథకం కిందకు తీసుకొచ్చింది. నిరంతర నీటి సరఫరాతో టాయిలెట్లు, శుద్ధి చేసిన తాగునీరు, ఫ్యాన్లు, లైట్లు, విద్యుదీకరణ, విద్యార్థులు, సిబ్బందికి ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డులు, భవనాలకు పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్, కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్, అదనపు తరగతి గదుల నిర్మాణం జరిగాయి. నాడు–నేడు మొదటి విడతలో రూ.3,669 కోట్లతో 15,715 పాఠశాలలు, రెండో దశలో రూ.8 వేల కోట్లతో 22,344 పాఠశాలు బాగుపడ్డాయి. నాడు–నేడు పనులు చేపట్టిన అన్ని ఉన్నత పాఠశాలల్లోను ఇంటర్నెట్తో పాటు 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లతో 3డీ డిజిటల్ పాఠాలు బోధిస్తున్నారు. ప్రాధమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీలతో పాఠాలతో పాటు టోఫెల్ శిక్షణ అందిస్తున్నారు. నాలుగో తరగతి నుంచి ఇంటర్ వరకు బైజూస్ పాఠాలను ఉచితంగా అందిస్తున్నారు. 62 వేల డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయడం దేశ చరిత్రలో ఓ రికార్డు. ఇవన్నీ పూర్తి పారదర్శకత కొనసాగేందుకు తల్లిదండ్రులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుల కమిటీని ఏర్పాటు చేశారు. ఆ పాఠశాలకు ఏం అవసరమో వారే నిర్ణయించుకునే స్వేచ్ఛను ప్రభుత్వం ఉపాధ్యాయులకు అప్పగించింది. వీటిని తప్పంటోంది ఈనాడు పత్రిక. మీ రమాదేవి స్కూల్లో.. మీ నారాయణ స్కూళ్లల్లో ఇలాగే చేయిస్తున్నారా రామోజీ. జగన్ పాలనలో ► విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కొత్త భవనాల నుంచి మరుగుదొడ్ల వరకు సమకూరాయి. ►గత నాలుగేళ్లలో అర్హత కలిగిన 25 వేల మంది టీచర్లు ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందారు. ఇందులో నాలుగేళ్ల సర్వీసు ఉన్నవారికీ అవకాశం లభించింది. ►నాడు–నేడుతో ప్రతి బడిలోనూ 12 రకాల సదుపాయాలు. ►బోధనకు డిజిటల్ స్క్రీన్లు, స్మార్ట్ టీవీలు. ►బడుల్లోకి కొత్త ఫర్నిచర్. ►మన బడికి అంతర్జాతీయ కీర్తి. ►కోవిడ్ కష్ట కాలంలో నెలల తరబడి పాఠశాలలు మూతబడినా ప్రతి టీచర్‌కు ఠంచన్‌గా వేతనాలు. ►బడిలో పాఠాలు చెప్పడం, అభివృద్ధి పనులు పర్యవేక్షించడం తప్ప ఏ ఉపాధ్యాయుడికీ అదనపు పనులు అప్పగించలేదు. ►మరుగుదొడ్లను ప్రతిరోజు శుభ్రంగా ఉంచేందుకు సిబ్బంది ఉన్నారు. వారికి ప్రతినెలా వేతనాలు చెల్లించేందుకు ‘టాయిలెట్ మెయింటనెన్స్ ఫండ్’ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ టాయిలెట్లు పరిశుభ్రంగా ఉన్నదీ లేనిదీ పరిశీలించే బాధ్యత స్థానిక ఉపాధ్యాయులు తీసుకున్నారు. చంద్రబాబు పాలనలో ► 2000 సంవత్సరంలో అనంతపురం జిల్లా నార్పల మండలం గూగూడులో చంద్రబాబు జన్మభూమి సమావేశం ఏర్పాటు చేసి స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని స్టేజీ మీదకు పిలిచారు. నూరు శాతం ఫలితాలు తేవాలని ఆదేశించారు. సబ్జెక్టు టీచర్లు లేకపోవడంతో సాధ్యం కాదని ఆ ప్రధానోపాధ్యుడు ఉన్నది ఉన్నట్టు చెప్పారు. అంతే అదే వేదికపై ఆ హెచ్ఎంను సస్పెండ్ చేశారు. ► 2003లో మంత్రిగా చేసిన నిమ్మల కిష్టప్ప గోరంట్లలో నిర్వహించిన జన్మభూమి కమిటీ సమావేశంలో టీచర్‌ను చెట్టుకు కట్టేసి కొట్టమని అనుచరులను రెచ్చగొట్టారు. ►మరుగుదొడ్లు లేక మహిళా టీచర్ల ఇబ్బందులు వర్ణనాతీతం. విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ఆ అవసరం తీర్చుకునేవారు. ►జన్మభూమి సభ్యులే పేరెంట్స్ కమిటీల్లో చేరిపోయి పప్పు, బియ్యం ఎత్తుకెళితే అడిగినందుకు ఉపాధ్యాయులపై దౌర్జన్యాలు చేశారు. ►ఉపాధ్యాయులను నియమించకుండా నూరు శాతం ఫలితాలు తేవాలని ఒత్తిడి చేశారు. సాధ్యం కాదని చెబితే వెంటనే సస్పెండ్ చేసేవారు. ఈ రాతలు టీచర్లను అవమానించడమే గతంలో పాఠశాలల్లో మరుగుదొడ్లు లేక ఉపాధ్యాయినులు పట్టణాలకే గాని మండల స్థాయి పాఠశాలలకు వచ్చేందుకు ఇష్టపడేవారు కాదు. బ్లాక్ బోర్డులౖపె రాసేందుకు సుద్దముక్క కూడా ఉండేది కాదు. ఈ ప్రభుత్వంలో పిల్లలకు, స్టాఫ్‌కు అన్ని సదుపాయాలు కల్పించింది కళ్లకు కనిపిస్తున్నాయి. తప్పుడు రాతలు రాసి టీచర్ల మనోభావాలను కించపరచడం దుర్మార్గం. ఉపాధ్యాయుల విధులు, సిబ్బంది విధులు ప్రత్యేకంగా ఉంటాయి. రాష్ట్రంలో ఎక్కడా ఏ టీచర్ కూడా మరుగుదొడ్లు కడిగింది లేదు. గతంలో ఎన్నికల విధులకు వెళ్లే ఉపాధ్యాయులు స్థానిక బడుల్లో ఉండలేక కష్టాలు పడేవారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ పాఠశాలకైనా నిర్భయంగా వెళ్లే అవకాశం ఈ ప్రభుత్వం కల్పించింది. – గోపీకృష్ణ, ఉపాధ్యాయుడు (వైఎస్సార్‌టీఏ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్) -
ఇంగ్లిష్ వ్యతిరేకులను చీపుర్లతో స్వాగతించండి
‘ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు భారతదేశానికే దిక్సూచిలా మారింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా విధానం భవిష్యత్తులో ప్రతీ ఒక్కరూ అనుసరించక తప్పదు. వద్దన్న వారికి చీపుర్లతో బుద్ధి చెప్పాలి’ అని ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లభాష అమలు, దాని ఫలాలపై ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. దేశాన్ని మార్చే విద్యా విధానం.. ఇంగ్లిష్ మీడియం కోసం 1990 నుంచి నేను గళం విప్పాను. మండలి బుద్ధప్రసాద్, ఏబీకే ప్రసాద్, చుక్కా రామయ్య.. వీళ్లంతా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అంటే నా మీద తీవ్ర స్థాయిలో విమర్శలతో దాడి చేశారు. ఈ విషయంలో సీఎం జగన్ చేసిన పోరాటం చాలా గొప్పది. ఆయన దేశాన్ని మార్చే విద్యా విధానం తీసుకొచ్చారు. మొత్తం బీజేపీ ప్రభుత్వ అజెండాను కూడా మార్చే శక్తి దానికుంది. నిజానికి గ్రామాల్లో నుంచి వచ్చే పిల్లలతో నగరాల్లోని పిల్లలు పోటీ పడలేరు. గ్రామీణ పిల్లలకు కేవలం కమ్యూనికేషన్ ఒక్కటే సమస్యగా ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల పిల్లలు బాగా మాట్లాడుతున్నారు. స్కూలు పిల్లల్ని బహిరంగ సభల్లో తెచ్చి మాట్లాడించిన నాయకుడ్ని నా జీవితంలో చూడలేదు. ఇంగ్లిష్ మీడియం విద్య జగన్‌ను గెలిపించబోతోంది. దీన్ని ఎవరూ ఆపలేరు. ఇటీవల రాహుల్ గాం«దీకి కూడా చెప్పా. దేశమంతా ఆంధ్ర మోడల్ తీసుకురండి.. బీజేపీని ఓడించగలుగుతారు అని. విజయవాడలో అంబేడ్కర్ విగ్రహం, మ్యూజియంలను నేను అంబేడ్కర్ గుడి అంటాను. 2002లో నేను మా ఊర్లో గుడ్ షెçపర్డ్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ పెట్టి.. లంబాడి కూలోళ్ల పిల్లలకు ఇంగ్లిష్ చదువులు చెప్పించాను. ఇప్పుడు అద్భుతంగా వాళ్లు ఇంగ్లిష్‌లో మాట్లాడుతున్నారు. మీ పిల్లల్ని తెలుగు మీడియంలో చదివిస్తారా? వెంకయ్యనాయుడు, రమణ, చంద్రబాబు, పవన్‌కు చెబుతున్నా. మీ ఆధ్వర్యంలో తెలుగు మీడియం స్కూల్స్ పెట్టించండి. మీ పిల్లల్ని, అగ్రకులాల పిల్లల్ని తెలుగు మీడియంలో బాగా చదివించండి. మేం మాత్రం దిక్కుమాలిన ఇంగ్లిష్‌లోనే చదువుకుంటాం. మీరు తెచ్చిన నారాయణ, చైతన్య, విజ్ఞాన్ స్కూల్స్‌ను తెలుగు మీడియంకు మార్చండి. ఇంగ్లిష్ మీడియం వద్దన్న వారికి ఊరూరా మహిళలు చీపుర్లతో స్వాగతం చెప్పండి. అలాంటి మేధావులకు అంటిన మురికిని వదిలించడానికి చీపుర్లతో శుభ్రం చేయండి. తొలి మార్పు వైఎస్సార్ నుంచే వైఎస్సార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక 2006లో 6 వేల స్కూల్స్‌లో ప్యారలల్ ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడితే పలువురు వ్యతిరేకించారు. ఈ విషయం మీద తనని కలిసిన వారిని మీ పిల్లలు, మనవళ్లు ఏ మీడియంలో చదువుతున్నారు అని వైఎస్సార్ ప్రశ్నించాక నోరు మూసుకున్నారు. మన పిల్లలకు ఇంగ్లిష్ చదువులు కావాలా? బీదల పిల్లలకి అక్కర్లేదా? అని వారందర్నీ మందలించారు. బహుశా అదే జగన్‌కు స్ఫూర్తినిచ్చి ఉంటుంది. పాదయాత్రలో పిల్లల పరిస్థితి చూసిన జగన్.. మేనిఫెస్టోలో ఇంగ్లిష్ విద్య గురించి పెట్టారు. ఇచ్చింన మాట ప్రకారం ఆయన ఇంగ్లిష్ మీడియం తేవడానికి ప్రయత్నిస్తే వెంకయ్యనాయుడు, చంద్రబాబు, పవన్‌లాంటి వాళ్లంతా వ్యతిరేకించారు. నా దృష్టిలో వాళ్లంతా యూజ్లెస్. కమ్యూనిస్ట్‌లు, నాతో పనిచేసిన వారు కూడా వ్యతిరేకించారు. ఆఖరికి అప్పట్లో సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్న రమణ కూడా వీరికి జతకలిశారు. ఆయన తెలుగు భాష గురించి ఉపన్యాసాలు ఇస్తుంటారు. ఆయన అసలు ఏం తెలుగు రాశారని? వీళ్లందరికీ ఏం తెలుగు వచ్చని? లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ్‌కు చెబుతున్నా. ఒక్కసారి ఆ పిల్లలతో ఇంగ్లిష్‌లో మాట్లాడు. మేధావితనం ముసుగు మాత్రమేనని నీకే తెలుస్తుంది. -
ఇంగ్లిష్ మీడియం జగన్ విజన్
► మన పిల్లలు ఇంగ్లిషు చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చేయాలి.. ► ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదివి తమ ప్రతిభను చాటాలి.. ► కేవలం కార్పొరేట్ కళాశాలల విద్యార్థులకే ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలా? ► ప్రభుత్వ బడుల్లో చదివే మన పిల్లలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశాలు కలేనా.. ► ఎన్నో ఏళ్ల నుంచి సామాన్య,పేద వర్గాల తల్లిదండ్రులను తొలిచే ఈ ప్రశ్నలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా సంస్కరణలతో సమాధానమిచ్చారు. ► మన పిల్లలకు ఇంగ్లిషు మీడియం చదువుల్ని అందుబాటులోకి తెచ్చారు. ► ‘‘ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియం బోధన.. ► 3వ తరగతి నుంచి సబ్జెక్టు టీచర్ విధానం.. ► 1000 ప్రభుత్వ స్కూళల్లో సీబీఎస్ఈ సిలబస్ ► 2025 జూన్ నుంచి ఐబీ సిలబస్ ► మన చిన్నారులకు ట్యాబ్‌లతో డిజిటల్ బోధన’’ – సాక్షి, అమరావతి బోధన, పాఠ్యాంశాల్లో సంస్కరణలు విద్యార్థుల్లో నేర్చుకునే తత్వం, జిజ్ఞాస పెంచేలా ప్రభుత్వం పాఠ్యాంశాల్లో సంస్కరణలు తీసుకొచ్చింది. 21వ శతాబ్దపు నైపుణ్యాలు అందిపుచ్చుకునేలా, ఫౌండేషనల్ అక్షరాస్యత ప్రోత్సాహం కోసం క్లాస్రూమ్ బేస్డ్ అసెస్మెంట్ అమలు చేస్తోంది. 3 నుంచి 10 తరగతుల విద్యార్థులకు సబ్జెక్ట్ టీచర్లను అందించారు. అన్ని పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల అవసరాలు తీర్చేందుకు దాదాపు 25 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కలి్పంచారు. ఉపాధ్యాయుల్లో బోధనా సామర్థ్యాలు పెంచేందుకు, సీబీఎస్ఈ బోధనకు అనగుణంగా ‘టీచర్ కెపాసిటీ బిల్డింగ్’ శిక్షణ ఇచ్చారు. ఇందుకోసం ఇఫ్లూ, రివర్సైడ్ లెరి్నంగ్ సెంటర్లలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐబీ సిలబస్ బోధన ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఏడాది ఉపాధ్యాయులకు ఐబీ సిలబస్ బోధనపై శిక్షణకు చర్యలు ప్రారంభించారు. మరోపక్క విద్యార్థుల్లో నిర్మాణాత్మకమైన లైఫ్ స్కిల్స్, నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు, సమాజంలో ఉన్నత విలువలతో ఉన్నతంగా జీవించేందుకు ఉపయోగపడే నైపుణ్యాలను అందించేందుకు ‘సంకల్పం’ శిక్షణను సైతం ప్రభుత్వం అందిస్తోంది. డిజిటల్ విద్య కోసం 8వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు రూ.1,306 కోట్లతో 9,52,925 ఉచిత బైజూస్ కంటెంట్ ట్యాబ్‌ల పంపిణీ ఆరో తరగతి నుంచి ఆపైన రూ.838 కోట్లతో ప్రతి తరగతిలోను 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్‌పీ),ప్రాథమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీల ఏర్పాటు విద్యార్థుల చెంతకు డిజిటల్‌పాఠాలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 4 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ఉత్తమ కంటెంట్‌ను ఉచితంగా అందించేందుకు దేశంలోనే అతిపెద్ద ఎడ్ టెక్ కంపెనీ అయిన బైజూస్‌తో ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఈ కంటెంట్‌ను ఇంటర్ విద్యార్థులకు కూడా అందించడం విశేషం. ఎనిమిదో తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కలిపి 2021–22, 2022–23 విద్యా సంవత్సరాల్లో 9.53 లక్షల మందికి బైజూస్ కంటెంట్‌తో ఉచితంగా ట్యాబ్‌లు ఇచ్చి, విద్యార్థులు ఇంటి వద్ద కూడా డిజిటల్ పాఠాలు నేర్చుకునేలా చర్యలు తీసుకుంది. డిజిటల్ పాఠాలు ట్యాబ్స్‌తో పాటు 16 లక్షల మంది విద్యార్థులు తమ తల్లిదండ్రుల మొబైల్స్‌లో కూడా చూడడం విశేషం. ఏపీ ఈ పాఠశాల మొబైల్ యాప్, దీక్ష వెబ్సైట్, డీటీహెచ్ చానెళ్లు, యూట్యూబ్ చానెల్ వంటి వాటి ద్వారా నిరంతరం ప్రభుత్వం పాఠాలను అందిస్తోంది. దీంతో విద్యార్థులు ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా చదువుకునే ఏర్పాటు చేసింది. సబ్జెక్టుల్లో సందేహాలను నివృత్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఏఐ’ టెక్నాలజీతో పనిచేసే ‘డౌట్ క్లియరెన్స్ బాట్’ యాప్‌ను రూపొందించింది. ఇది ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్, టోఫెల్ శిక్షణలో ఎదురయ్యే క్లిష్టమైన సందేహాలను నివృత్తి చేస్తుంది. మూడో తరగతి నుంచే టోఫెల్ శిక్షణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేదింటి పిల్లలు ఉన్నత చదవులకు వచ్చేసరికి ఇంగ్లిష్ భాషపై పట్టు అవసరమని ప్రభుత్వం భావించి తెలుగు, ఇంగ్లిష్‌లో పాఠాలు మిర్రర్ ఇమేజ్ విధానంలో ముద్రించి బైలింగ్వుల్ పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం అందించింది. ఒకటో తరగతి నుంచే ఇంగ్లిషు బోధనను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లిష్‌పై పట్టు సాధించేలా, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు అమెరికాకు చెందిన ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్విసెస్ (ఈటీఎస్)తో టోఫెల్ శిక్షణ అందిస్తోంది. టోఫెల్ ప్రైమరీలో 3 నుంచి 5 తరగతులకు, టోఫెల్ జూనియర్లో 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు శిక్షణనిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల పిల్లలకు ఈ సదుపాయం లభించింది. ఈనెల 10వ తేదీన టోఫెల్ ప్రైమరీ పరీక్షను నిర్వహించగా 13,104 ప్రాధమిక పాఠశాలల్లో చదువుతున్న 3 నుంచి 5 తరగతుల విద్యార్థులు 4,17,879 మంది (92 శాతం) రాశారు. శుక్రవారం (ఏప్రిల్ 12)న జరిగిన టోఫెల్ జూనియర్ పరీక్షకు 5,907 పాఠశాలకు చెందిన 11,74,338 మంది హాజరయ్యారు. ప్రపంచ వేదికలపై మెరిసేలా ఐబీ విద్య మన పేదింటి పిల్లలు ప్రపంచానికి దిక్సూచిగా మారాలన్న సీఎం జగన్ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు సమున్నతంగా మారాయి. ఇంగ్లిష్ మీడియం బోధన, సీబీఎస్ఈ సిలబస్ అమలుతో ఆగిపోకుండా ప్రభుత్వ బడుల్లోకి ఇప్పుడు ‘ఇంటర్నేషనల్ బాకలారియేట్ (ఐబీ) బోధనను కూడా తెస్తోంది. ఇప్పటిదాకా దేశంలో 210 వరల్ట్ క్లాస్ కార్పొరేట్ స్కూళ్లలో సంపన్నుల పిల్లలకు మాత్రమే చదువుకొనగలిగే ఐబీ బోధన 2025 జూన్ నుంచి ప్రారంభం కానుంది. తొలి ఏడాది ఒకటో తరగతి నుంచి ప్రారంభమై ఏటా ఒక తరగతి చొప్పున ఐబీ బోధన పెంచుతూ 2037 నాటికి +2 వరకు విద్యనందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. విద్యార్థులకు క్రిటికల్. లేటరల్, డిజైన్ థింకింగ్, ప్రాబ్లమ్ సాలి్వంగ్ వంటి నైపుణ్యాలు అందించడంతోపాటు భవిష్యత్ రంగాల్లో రాణించేలా, ప్రపంచ వ్యాప్తంగా ఉపాధి పొందేలా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. మన ఇంగ్లిషు విద్యపై ప్రసంశల జల్లు ► ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బైలింగువల్ పాఠ్యపుస్తకాలను అందించడం గొప్ప పరిణామం– కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కితాబు..’’ ► ‘‘ప్రాథమిక స్థాయి నుంచి నాణ్యమైన విద్య అందించడంలో పనితీరు అద్భుతంగా ఉంది: కేంద్ర పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ కార్యదర్శి సంజయ్ కుమార్’’ ►‘‘మహారాష్ట్ర, ఒడిశా, అసోం, హరియాణా, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, గుజరాత్, పుదుచ్చేరి, కేరళ, తెలంగాణ, అండమాన్ –నికోబార్, డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీ విద్యాశాఖాధికారులు మన సంస్కరణలు తమ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలుకు సిద్ధం’’ ►‘‘అమెరికాలోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై జరిగిన ఉన్నత స్థాయి సదస్సులో 140 దేశాల విద్యావేత్తలు మన విద్యా సంస్కరణలపై ప్రశంసలు’’ సీబీఎస్ఈ బోధన రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు జాతీయ, అంతర్జాతీయంగా పోటీపడేలా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. అందుకు అనువైన బోధన కోసం మొదటి విడతగా ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం 1,000 పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధన ప్రారంభించింది. ఇప్పుడు తొమ్మిదో తరగతి చదువుతున్న ఈ స్కూళ్లలోని విద్యార్థులు 2024–25 విద్యా సంవత్సరంలో తొలిసారి పదో తరగతి పరీక్షలు సీబీఎస్ఈ విధానంలో రాయనున్నారు. హైసూ్కల్లో ఉత్తీర్ణులైన బాలికలు చదువు మానేయకుండా ప్రభుత్వం ప్రతి మండలంలో బాలికల కోసం ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు చేసింది. 292 ఉన్నత పాఠశాలలు బాలికల కోసం హైసూ్కల్ ప్లస్‌గా అప్‌గ్రేడ్ చేశారు. మొత్తం 352 కేజీబీవీల్లో ఇంటరీ్మడియట్ ప్రవేశపెట్టారు. 2022–23 నుంచి 14 కో–ఎడ్ జూనియర్ కళాశాలలను బాలికల జూనియర్ కళాశాలలుగా మార్చారు. దీంతో మొత్తం 679 మండలాల్లో బాలికల కోసం ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల చొప్పున అందుబాటులోకి వచ్చింది. -
బడులు తెరిచే నాటికి అందుబాటులోకి..
ఆదిలాబాద్: రానున్న విద్యా సంవత్సరంలో బడులు తెరిచే నాటికే ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు యూనిఫాం అందించే దిశగా జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. యూనిఫాం కుట్టే బాధ్యతలను స్వయం సహాయక సంఘాల సభ్యులకు అప్పగించింది. ఆసక్తి, వృత్తి నైపుణ్యాలు కలిగిన సభ్యులను ఇప్పటికే ఎంపిక చేసింది. ప్రస్తుతం విద్యార్థుల కొలతలను సేకరిస్తున్నారు. విద్యాశాఖ నుంచి వస్త్రం కొనుగోలు చేసి ఇచ్చిన వెంటనే దుస్తులు కుట్టే పనిని ప్రారంభించనున్నారు. అయితే కుట్టు కూలిపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వక పోవడం వారిని కొంత ఆందోళనకు గురి చేస్తోంది. యునిఫామ్లంతా వేసవిలోనే కుట్టేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అంతా సవ్యంగా సాగితే జూన్లొనే విద్యార్థులకు కొత్త దుస్తులు అందనున్నాయి. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో మొత్తం 1,200 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇందులో 84,097 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో బాలురు 42,082 మంది, బాలికలు 42,015 మంది ఉన్నారు. వీరికి ప్రభుత్వం ఏటా రెండు జతల యూనిఫాంలను ఉచితంగా అందజేస్తుంది. ఇదివరకు వీటిని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఆధ్వర్యంలో కుట్టించి విద్యార్థులకు అందించే వారు. పాఠశాల ప్రారంభమై నెలలు గడిచినా చాలా మందికి అందేవి కావు. పైగా గుత్తేదారు విద్యార్థుల కొలతలు తీసుకోకుండా కుట్టడంతో సైజ్ సరిపోక ఇబ్బందిగా మరేది. ఇలాంటి పరిస్థితిని దూరం చేయడంతో పాటు స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక పరిపుష్టి కల్పించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ బాధ్యతలను ఎస్ హెచ్జీలకు అప్పగించింది. ఇందుకోసం అర్హులైన ఆసక్తి గల సభ్యులను ఎంపిక చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కసరత్తు షురూ.. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, విద్యాశాఖ అధికారులు కసరత్తు చేపట్టారు. కుట్టు నైపుణ్యాలతో పాటు మిషన్ కలిగి ఉన్న 1,807 మంది ఎస్‌హెచ్‌జీ సభ్యులను ఎంపిక చేశారు. ఇదిలా ఉంటే విద్యాశాఖ అధికారులు విద్యార్థులకు సంబంధించిన కొలతలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. పాఠశాల, తరగతుల వారీగా కొలతలు తీసుకుంటున్నారు. వారంలోగా ఈ ప్రక్రియ పూర్తి చేసి వాటిని ఎస్‌హెచ్‌జీ సభ్యులకు అందించనున్నారు. అవసరమైన వస్త్రం అందిన వెంటనే వేసవి సెలవుల్లో యూనిఫాం కుట్టే ప్రక్రియను ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. వస్త్రం రాగానే ఐకేపీ వారికి ఇస్తాం 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫాంలను కుట్టించే బాధ్యత స్వయం సహాయక సంఘాలకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఐకేపీ సిబ్బంది విద్యార్థుల కొలతలు తీసుకుంటున్నారు. ఆప్కో నుంచి వస్త్రం వచ్చిన వెంటనే వారికి అప్పగిస్తాం. వారు కుట్టించి విద్యార్థులకు అందిస్తారు. – సుజాత్‌ఖాన్, విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి -
మా మంచి జగన్ మామయ్య (ఫొటోలు)
-
ఏపీకి ప్రైమ్ మినిస్టర్ ఎక్స్‌లెన్స్ అవార్డు
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అందిస్తున్న విద్యా బోదనకు గాను ‘ప్రైమ్ మినిస్టర్ ఎక్స్‌లెన్స్’ అవార్డుకు ఆంధ్రప్రదేశ్ ఎంపికైంది. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక విద్యకు శ్రీకారం చుడుతూ సీఎం జగన్ ప్రవేశపెట్టిన విద్యా విప్లవానికి దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. బ్లాక్ బోర్డు స్థానంలో తెచ్చిన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్(ఐఎఫ్‌పీ), బైజూస్ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌ల ద్వారా ఆధునిక బోధనకు గాను రాష్ట్రాన్ని ఈ అవార్డు వరించింది. ప్రభుత్వ పాఠశాలల్లో అమర్చిన ఐఎఫ్‌పీలు, 8, 9వ తరగతుల విద్యార్థుల చేతుల్లో ఉన్న ట్యాబ్‌ల ద్వారా విద్యాబోధన, సందేహాల నివృత్తికి బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులను పాఠశాలలకు అనుసంధానం చేస్తూ ప్రవేశపెట్టిన ‘ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్పర్ట్స్’ కార్యక్రమం బెస్ట్ ఇన్నోవేషన్ కేటగిరీలో అవార్డు ఎంపికలో కీలకపాత్ర వహించింది. దేశంలోనే అత్యుత్తమ విద్యాబోధన చేస్తున్న రాష్ట్రంగా అత్యున్నత అవార్డుకు ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో పరిశీలనకు ఇద్దరు అధికారులను రాష్ట్రానికి పంపింది. కేంద్ర డిప్యూటీ కార్యదర్శులు ఆశిష్ సక్సేనా, హరీష్ రాయ్‌తో కూడిన బృందం గురువారం గుంటూరు జిల్లాలోని పెదకాకాని మండలం వెనిగండ్ల జెడ్పీ హైసూ్కల్, గుంటూరు చౌత్రా సెంటర్లోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, పట్టాభిపురంలోని నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలను సందర్శించింది. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ వీరికి పాఠశాలల్లో అమలు చేస్తున్న సాంకేతిక విద్యా బోధన గురించి వివరించారు. ‘ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్పర్ట్స్’పై ప్రశంసలు కార్పొరేట్‌ను తలదన్నేలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆధునిక బోధన పద్ధతులు, వసతులను తిలకించిన అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఐఎఫ్‌పీలు, ట్యాబ్‌ల ద్వారా విద్యాబోధన అందించడంతో పాటు దేశంలోనే తొలిసారిగా ఇంజినీరింగ్ విద్యార్థులను పాఠశాలలకు అనుసంధానం చేస్తూ ప్రవేశపెట్టిన ‘ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్పర్ట్స్’ కార్యక్రమంపై ప్రశంసలు కురిపించారు. విద్యార్థులతో మాట్లాడిన ఆశిష్ సక్సేనా, హరీష్ రాయ్‌లు.. వారిలోని అద్భుతమైన మేధస్సు, సబ్జెక్టుల వారీగా పట్టు, ఇంగ్లిష్ భాష పరిజ్ఞానంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ట్యాబ్‌ల ద్వారా ఇన్నోవేటివ్ ట్రెండ్స్, స్విఫ్ట్‌చాట్ యాప్, బైజూస్ కంటెంట్‌ను ఇంజినీరింగ్ విద్యార్థులు బోధిస్తున్న తీరును, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషీన్ లెర్నింగ్ తదితర సాంకేతిక నైపుణ్యాలపై పాఠశాల స్థాయిలోనే అవగాహన కల్పింస్తున్న తీరును పరిశీలించారు. ఐఎఫ్‌పీల ద్వారా ఉపాధ్యాయుల బోధనను ప్రత్యక్షంగా తిలకించారు. ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్పర్ట్స్ కార్యక్రమం ద్వారా ఏ ఏ అంశాలను నేర్చుకుంటున్నదీ విద్యార్థులతో మాట్లాడి తెలుసుకున్నారు. తరగతులను బోధిస్తున్న బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులతోనూ మాట్లాడారు. మూడు పాఠశాలల సందర్శన ముగించుకున్న అధికారుల బృందం.. సంబంధిత విద్యార్థులు చదువుతున్న కళ్లం హరనాథరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు వెళ్లి యాజమాన్యంతో చర్చించారు. సమగ్రశిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ కేవీ శ్రీనివాసులురెడ్డి, ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి, డీఈవో పి.శైలజ, సీఎస్ఈ ఐటీ సెల్ ప్రతినిధి రమేష్, హెచ్ఎంలు ఉన్నారు. -
Fact Check: ‘పచ్చ’ ముసుగుతో ‘కోడ్’కూతలా?
ఉన్నపళంగా చంద్రబాబును గద్దెనెక్కించేయాలనీ... ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేయాలనీ... ప్రజలను తప్పుదారి పట్టించి అధికార పక్షంపై ఏవగింపు కలిగించాలన్నది రామోజీ ఆకాంక్ష. అందుకోసం పదేపదే అబద్దాలను అచ్చేయడం... లేనిపోని అభాండాలకోసం పేజీలకు పేజీలు కేటాయించడం... అడ్డగోలుగా ఆరోపణలతో శునకానందం పొందడం ఈనాడుకు నిత్యకృతమైపోయింది. వాస్తవాలు తెలుసుకోకుండా అత్యుత్సాహంతో నిబంధనల్ని సైతం వారికి అనుకూలంగా మలచుకుంటున్నారు. గతేడాది ఇచ్చిన పాఠ్యపుస్తకాలపై సీఎం జగన్మోహన్రెడ్డి చిత్రాలున్నాయనీ... ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ‘వీటికెలా ముసుగేస్తారు?’ అంటూ సొంత పైత్యాన్ని వండివార్చింది. సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు గత ప్రభుత్వం పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు ఇవ్వడంలో విఫలమైంది. నోటు పుస్తకాలు అస్సలు ఇవ్వలేకపోయింది. అప్పులు చేసి వారంతా పుస్తకాలు కొనుక్కోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. పైగా ‘పిల్లల చదువుల బాధ్యత ప్రభుత్వానిది కాద’ంటూ ఓ కొత్త వాదాన్ని తీసుకొచ్చింది. ‘ప్రైవేటు స్కూళ్లున్నాయి.. అక్కడ వసతులు బాగుంటాయి, మీకు ఏది కావాలో నిర్ణయించుకోండి’ అంటూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సెలవిచ్చారు. ప్రజలకోసం ప్రభుత్వాలు ఏం చేయాలో తనకే తెలుసన్నట్టు నిత్యం గొంతు చించుకునే రామోజీకి ఆనాడు బాబు చేసిన వ్యాఖ్యల్లో తప్పిదం కనిపించలేదు. పైగా పూర్తిస్థాయిలో సర్కారు బడుల్లోని పిల్లలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్న సీఎం జగన్ ప్రభుత్వంపై విరుచుకు పడుతూ ప్రభుత్వం విద్యను నిర్లక్ష్యం చేసిందనీ, పిల్లలకు పుస్తకాలు ఇవ్వలేదని బరితెగించి అబద్ధాలు రాసింది. తీరా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 47 లక్షల మంది విద్యార్థులకు విద్యా కానుక కిట్లను జగన్ చిత్రంతో ఉన్నవి అందించినట్టు ఒప్పుకుంది. ‘కోడ్’ నిబంధనలేంటో తెలుసుకోరా.. బాబు కోసం బరితెగించిన ఎల్లో మీడియా అన్నింటికి ముసుగులు వేస్తున్నారు.. మరి ఈ పుస్తకాల సంగతేంటని ప్రశ్నించింది. ‘ఇవన్నీ ఎన్నికల సంఘం కళ్లకు కనిపించవా అని నిలదీసింది. వాస్తవానికి ‘ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చాక’’ విద్యుత్, నీటి బిల్లులు, బోర్డింగ్ పాస్‌లు, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు తదితర వాటిపై ప్రజా ప్రతినిధుల ఫొటోలు, సందేశాలు వంటివి ఉండరాదని ఎన్నికల సంఘంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. అంటే ఈ నెల 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ఇచ్చేవాటిపై ఉండరాదని. కానీ 2023 జూన్ 12న పాఠశాలలు తెరిచిన మొదటి రోజు ఇచ్చిన జగనన్న విద్యాకానుక బ్యాగ్, నోటు పుస్తకాలకు, గతేడాది డిసెంబర్లో ఇచ్చిన ట్యాబ్స్‌పై ఉన్న సీఎం జగన్ స్టిక్కర్లకు ఈ నిబంధన వర్తించదని తెలిసినా... పాపం బాబుకు ఎలాగైనా మేలు చేయాలని... వారి మెప్పుపొందాలనీ... అబద్దపు వార్తను రామోజీ నేతృత్వంలోని ఈనాడు పతాక శీర్షిక చేసింది. కానీ వారికి తెలియని విషయమేంటంటే... ఎన్నికల సంఘం నియమావళిని నూరుశాతం పాటించాలన్న లక్ష్యంతో మార్చి 16వ తేదీ తర్వాత పాఠశాలల్లో విద్యార్థులకు ఇచ్చే చిక్కీలపై సీఎం ఫొటో ముద్రించిన ర్యాపర్‌ను తొలగించి విద్యార్థులకు అందించాలని పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఇవేమీ పట్టించుకోకుండానే ‘ఈనాడు’ ఉపాధ్యాయులపైనా, విద్యాశాఖ ఉన్నతాధికారులపైనా నిందలు వేస్తూ గాలివార్తను అచ్చేసింది. అసలు నిబంధన ఏంటంటే.. భారత ఎన్నికల సంఘం ప్రచురించిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని పేజీ నంబరు 94లోని నిబంధన 5(1)లో ఏముందంటే.. లబ్దిదారుల కార్డులు, విద్యుత్ బిల్లులు, నిర్మాణ స్థలం ఫలకాలువంటి వాటిపై రాజకీయ కార్యకర్తల ఫోటోల ప్రదర్శన అంశంలో.. లబ్దిదారులకు పంపిణీ చేసిన లబ్దిదారుల కార్డులు, మోడల్ ప్రవర్తనా నియమావళి అమలు సమయంలో ఏర్పాటు చేసే ఫలకాలపై ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర రాజకీయ కార్యకర్తల ఫొటోలు, సందేశాలు ఉండకూడదు. మోడల్ ప్రవర్తనా నియమావళి అమలుకు ముందు పంపిణీ చేసిన /ప్రతిష్టించిన లబ్దిదారుల కార్డులు, నిర్మాణ ఫలకాలు వంటి వాటిపై ఫొటోలు ఉన్నా తప్పులేదు. ఈనాడుపై చర్యలు తీసుకోండి ఈసీకి ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ కార్యదర్శి అప్పిరెడ్డి ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ నడుపుతున్న ఈనాడు దినపత్రిక టీడీపీ ప్రయోజనాల కోసం పనిచేస్తోందని... దానిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మంగళవారం ఎన్నిక సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రజలకు అవసరమైన వార్తా కథనాలను ప్రచురించేందుకు బదులు చంద్రబాబు అభిప్రాయాలను ప్రచురిస్తోందని పేర్కొన్నారు. కొన్ని నెలలుగా ఈనాడు ప్రధాన సంచికలో వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు, ప్రజల్లో దానిపై దురభిప్రాయం కలిగించేలా వక్రీకరించి కథనాలు అచ్చు వేస్తోందన్నారు. అందుకు నిదర్శనంగా మంగళవారం ప్రచురించిన ‘‘వీటికెలా ముసుగేస్తారు?’’ కథనాన్ని ఎన్నికల సంఘానికి అందించారు. ఈ కథనంలో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అందించిన బ్యాగులు, పుస్తకాలు, ఆహార పదార్థాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బొమ్మలకు ఎలా కవర్ చేయాలో ఈనాడు తన అభిప్రాయాలను వ్యక్తం చేసిందన్నారు. భారత ఎన్నికల సంఘం జారీ చేసిన సూచన ప్రకారం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత లబ్దిదారుల కార్డులు, విద్యుత్ బిల్లులు, నిర్మాణ సైట్ ఫలకాలు వంటి వాటిపైనేతల ఫోటోలు ఉండకూడదని చెప్పారు. కోడ్ అమలుకు ముందు పంపిణీ చేసిన వాటికి ఈ నిబంధన వర్తించదని ఆయన వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల పునరుద్ధరణ, పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా అన్ని పుస్తకాలు, బ్యాగులు, ఆహార పదార్థాలను ప్రభుత్వమే పంపిణీ చేసిందని వాటిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఫొటో ఉందనీ, ఇవన్నీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలుకు ముందే అందజేసినవని ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ ఈనాడు పత్రిక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరువు తీసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఈ రకమైన వార్తా కథనాల ద్వారా సాధారణ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు, భారత ఎన్నికల సంఘం పరువు తీయడానికి ప్రయత్నిస్తోందన్నారు. ఈ తప్పుడు కథనం ప్రచురించిన ఆ దినపత్రిక, దాని ప్రచురణకర్తపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
‘పాపులరైజింగ్ సైన్స్’.. గ్రామీణ విద్యార్థులకు ఐఐటీ మద్రాస్ కానుక
చెన్నై: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు స్థానిక భాషల్లోనే సైన్స్ అంశాలతో పాటు కెరీర్ గైడెన్స్‌పై అవగాహన పెంచేందుకు ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఐఐటీ మద్రాస్ ‘సైన్స్ పాపులరజైషన్’ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటికే ఈ ప్రోగ్రామ్ కింద ఏడు రాష్ట్రాల్లో 9193 గ్రామీణ ప్రభుత్వ స్కూళ్లలో 3లక్షల20వేల702 పుస్తకాలను పంపిణీ చేసింది. 2026 వరకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్, వెస్ట్‌బెంగాల్‌లోని మొత్తం 50 వేల స్కూళ్లలో ఈ ప్రోగ్రామ్ కింద విద్యార్థులకు అవగాహన కల్పించడాన్ని ఐఐటీ మద్రాస్ లక్ష్యంగా పెట్టుకుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్(ఎస్టీఈఎమ్)లలో కెరీర్‌ను ఎంచుకోవడం పట్ల విద్యార్థులను సన్నద్ధులను చేయడమే ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం. ఈ ప్రోగ్రామ్ పట్ల ఆసక్తి ఉన్న స్కూళ్లు, విద్యార్థులు బయోటెక్.ఐఐటీఎమ్.ఏసీ.ఇన్ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని ప్రోగ్రామ్ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న ఐఐటీ మద్రాస్‌లో డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ప్రొఫెసర్ శ్రీనివాస్ చక్రవర్తి కోరారు. ఈయన ఇప్పటివరకు 70 సైన్స్ పుస్తకాలను ప్రభుత్వ హై స్కూళ్లలో చదివే విద్యార్థులకు అర్ధమయ్యేలా తెలుగులోకి అనువదించి ప్రచురించారు. ‘సైన్స్ పాపులరైజేషన్’ ప్రోగ్రామ్ కింద ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు క్లిష్టతరమైన సైన్స్ పరిశోధనలకు సంబంధించిన విషయాలను వారికి అర్ధమయ్యే భాషలో చేరవేస్తున్నామని చక్రవర్తి తెలిపారు. ప్రోగ్రామ్‌కు అవసరమయ్యే వనరులను సమకూర్చడంలో ఐఐటీ పూర్వ విద్యార్థులు, అకడమిక్‌గా సైన్స్ నేపథ్యం ఉన్న ఇతర వ్యక్తులు కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. -
యునెస్కోలో ‘మన బడి’పై చర్చ
సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వ పాఠశాల మరోసారి అంతర్జాతీయ వేదికపై మెరిసింది. విద్యపై ప్రభుత్వం చూపిన శ్రద్ధ, సంస్కరణలు మారిన పరిస్థితులు, సాధించిన ఫలితాలు ఇప్పటికే ఐక్యరాజ్య సమితి వరకు చేరగా..తాజాగా ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో మనబడి నాడు–నేడుపై చర్చ జరిగింది. ఈనెల 13న యునెస్కో ఆధ్వర్యంలో ప్యారిస్‌లోని ప్రధాన కార్యాలయంలో ‘గ్లోబల్ ఇంక్లూజివ్ స్కూల్స్ ఫోరమ్’ సదస్సు ప్రారంభమైంది. 90కి పైగా దేశాల నుంచి 400 మంది విద్యా శాఖ ముఖ్య అధికారులు, స్పెషలిస్టులు ఈ సదస్సుకు హాజరయ్యారు. సదస్సులో ఐక్యరాజ్యసమితి స్పెషల్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్ ఏపీ ప్రతినిధిగా గురువారం పాల్గొని రాష్ట్రంలో అమలు చేస్తోన్న మనబడి నాడు–నేడుపై వివరించారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ అసమానతలు లేని అన్ని సదుపాయాలతో సమగ్ర విద్య అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ సదస్సులో ఏపీ విద్యా సంస్కరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పేదింటి పిల్లలు చదువుకునే బడుల్లో ఇంగ్లిష్ మీడియం అమలు, విభిన్న భాషలు మాతృభాషగా ఉన్న విద్యార్థులు కూడా సులభంగా ఇంగ్లిష్ నేర్చుకునేందుకు వీలుగా బైలింగ్వుల్ పాఠ్యపుస్తకాలు, ప్రతి విద్యార్థి కార్పొరేట్ స్థాయిలో గౌరవంగా చదువుకునేలా యూనిఫాం, బూట్లు అందజేత, పోషక విలువలతో కూడిన గోరుముద్ద, తరగతి గదుల్లో ఐఎఫ్‌పీలు, విద్యార్థులకు ట్యాబ్స్ వంటి అంశాలు అంతర్జాతీయ ప్రతినిధులను ఆకట్టుకున్నాయని షకిన్ కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. సమగ్ర విద్య మూలస్తంభాల్లో ‘మనబడి నాడు–నేడు’తో వచ్చిన మార్పు ఒకటి అని యునెస్కో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ స్పెషలిస్ట్ వివిఎన్ గైరిస్, ఎడ్యుకేషన్ ఫర్ ఇంక్లూజన్ అండ్ జెండర్ ఈక్వాలిటీ చీఫ్ జస్టీన్ సాస్ అభివర్ణించినట్లు షకిన్ తెలిపారు. -
మనబడి ‘ఐబీ’కి అనుకూలం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన, బహు భాషలు మాట్లాడే విద్యార్థులు, చదువులో తమ అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు తొట్రుపాటు లేకుండా ఆత్మవిశ్వాసంతో ఉపాధ్యాయులను ప్రశ్నించే తీరు.. ఎదుటివారితో మర్యాదగా మాట్లాడేతత్వం, పిల్లల్లో సహకార గుణం, క్లాస్‌రూమ్‌లో విద్యార్థులు –టీచర్ల మధ్యనున్న అన్యోన్యత తదితర అంశాలు అంతర్జాతీయ విద్యావేత్తలను ఆశ్చర్యపరిచాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2025 జూన్ మొదలు ఐబీ సిలబస్‌ను ఒకటో తరగతి నుంచి ప్రభుత్వం అమలుచేయనున్న నేపథ్యంలో.. ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) ప్రతినిధులు ఫిబ్రవరి 26 నుంచి ఈనెల ఏడో తేదీ వరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా.. ఇప్పటికే రాష్ట్రంలో అమలుచేస్తున్న ఏపీ విద్యా సంస్కరణలు, విద్యార్థుల్లో నేర్చుకునే తత్వం వారిని ఆశ్చర్యపరిచాయి. తాము పరిశీలించిన పాఠశాలల్లో చక్కటి వాతావరణం, మెరుగైన మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, పాఠశాల పరిశుభ్రతపై కేంద్రీకృత పరిశీలన, పాఠశాలల పనితీరు.. సమీక్షలో రోజువారి యాప్స్ వినియోగం, కేంద్రీకృత మానిటరింగ్ సిస్టం, టోఫెల్ శిక్షణ, కంటెంట్ అనుసంధానం, అటల్ టింకరింగ్ ల్యాబ్స్, గ్రంథాలయాల వినియోగం, మెరుగైన అసెస్మెంట్, యూనిఫారం, ద్విభాషా పాఠ్యపుస్తకాలు, పోషకాలతో కూడిన నాణ్యమైన మధ్యాహ్న భోజనం, టాయిలెట్ల నిర్వహణపై ఆ ప్రతినిధులు ప్రభుత్వాన్ని, విద్యాశాఖను అభినందించారు. విద్యార్థుల్లో నేర్చుకునే తత్వంపై అభినందన.. ఇంటర్నేషనల్ బాకలారియెట్ సిలబస్ అమలుచేసే స్కూళ్లల్లో విద్యార్థుల వ్యక్తిగత ప్రొఫైల్‌కు అధిక ప్రాధాన్యతనిస్తారు. బహు భాషలు, విద్యేతర అంశాలపై దృష్టిపెడతారు. వివిధ రకాల భాషలు మాట్లాడే పిల్లలు ఒకేచోట కలిసి ఉన్నప్పుడు ఒకరికొకరు సహకరించుకునే గుణం తప్పనిసరిగా ఉండేలా చూస్తారు. ఇలాంటి వాతావరణాన్ని ఏపీ ప్రభుత్వ స్కూళ్లల్లో గుర్తించినట్లు వారు తెలిపారు. తెలుగు, ఉర్దూ, తమిళం, కన్నడ, ఒరియాతో పాటు సవర, కొండ, కోయ, సుగాలి, ఆదివాసి, కువి వంటి గిరిజన భాషలు మాట్లాడే పిల్లలు కలిసి ఉన్నప్పుడు వారివారి భాషలను గౌరవించుకోవడం, ఇతర భాషలను నేర్చుకునేందుకు ఆసక్తి చూపడాన్ని ఐబీ ప్రతినిధులు గమనించి అభినందించారు. తరగతి గదులలో బహుభాషావాదం, ఉపాధ్యాయ–విద్యార్థి సంబంధం, విద్యార్థుల మధ్య ఆత్మవిశ్వాసం, పాఠశాల విద్యా వ్యవస్థపై సమాచారాన్ని పంచుకోవడంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతరులు ఆసక్తి చూపిన తీరు ఐబీ విద్యా విధానానికి దగ్గరగా ఉన్నట్లు ఆ ప్రతినిధులు తెలిపారు. ఇక ఐబీ అమలు విషయంలో ఏపీ పాఠశాల విద్యాశాఖకు అవసరమైన మౌలిక సదుపాయాలున్నాయని, ఉపాధ్యాయులకూ తగిన అర్హతలు ఉన్నాయన్నారు. ఇక్కడి విద్యార్థులు ప్రపంచ పోకడలను అర్థంచేసుకునేందుకు, అవకాశాలను అందుకునేందుకు ఐబీ పాఠ్యాంశాలను సులభంగా అనుసరించగలరన్న నమ్మకాన్ని వారు వ్యక్తంచేశారు. మరోవైపు.. ఐబీ బృందం పర్యటనకు సంబంధించిన పూర్తి నివేదికను జూన్‌లో ప్రభుత్వానికి అందజేయనుంది. నివేదిక ఆధారంగా ఉపాధ్యాయులకు, విద్యాశాఖ సిబ్బంది శిక్షణనివ్వాలని అధికారులు నిర్ణయించారు. -
ఇంగ్లిష్.. భవిత భేష్
మన పిల్లలు ఇంగ్లిష్ చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చేయాలి.. ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదివి తమ ప్రతిభను చాటాలి.. కేవలం కార్పొరేట్ కళాశాలల విద్యార్థులకే ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలా? ప్రభుత్వ బడుల్లో చదివే మన పిల్లలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశాలు కలేనా.. ఎన్నో ఏళ్ల నుంచి సామాన్య, పేద వర్గాల తల్లిదండ్రులను తొలిచే ఈ ప్రశ్నలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా సంస్కరణలతో సమాధానమిచ్చారు. మన పిల్లలకు ఇంగ్లిష్ మీడియం చదువుల్ని అందుబాటులోకి తెచ్చారు. ‘‘ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియం బోధన.. 3వ తరగతి నుంచి సబ్జెక్టు టీచర్ విధానం.. 1000 ప్రభుత్వ స్కూళల్లో సీబీఎస్ఈ సిలబస్ 2025 జూన్ నుంచి ఐబీ సిలబస్ మన చిన్నారులకు ట్యాబ్‌లతో డిజిటల్ బోధన’’ – సాక్షి, అమరావతి ♦ డిజిటల్ విద్య కోసం 8వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు రూ.1,306 కోట్లతో 9,52,925 ఉచిత బైజూస్ కంటెంట్ ట్యాబ్‌ల పంపిణీ ♦ ఆరో తరగతి నుంచి ఆపైన రూ.838 కోట్లతో ప్రతి తరగతిలోను 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్(ఐఎఫ్‌పీ), ప్రాథమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీల ఏర్పాట మూడో తరగతి నుంచే టోఫెల్ శిక్షణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేదింటి పిల్లలు ఉన్నత చదవులకు వచ్చేసరికి ఇంగ్లిష్ భాషపై పట్టు అవసరమని ప్రభుత్వం భావించి తెలుగు, ఇంగ్లిష్‌లో పాఠాలు మిర్రర్ ఇమేజ్ విధానంలో ముద్రించి బైలింగ్వుల్ పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం అందించింది. ఒకటో తరగతి నుంచే ఇంగ్లిషు బోధనను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లిష్ పై పట్టు సాధించేలా, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు అమెరికాకు చెందిన ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్విసెస్ (ఈటీఎస్)తో టోఫెల్ శిక్షణ అందిస్తోంది. టోఫెల్ ప్రైమరీలో 3 నుంచి 5 తరగతులకు, టోఫెల్ జూనియర్లో 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు శిక్షణనిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల పిల్లలకు ఈ సదుపాయం లభించింది. మన ఇంగ్లిష్ విద్యపై ప్రసంశలజల్లు ♦ ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బైలింగువల్ పాఠ్యపుస్తకాలను అందించడం గొప్ప పరిణామం– కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కితాబు..’’ ♦ ‘‘ప్రాథమిక స్థాయి నుంచి నాణ్యమైన విద్య అందించడంలో పనితీరు అద్భుతంగా ఉంది: కేంద్ర పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ కార్యదర్శి సంజయ్ కుమార్’’ ♦ ‘‘మహారాష్ట్ర, ఒడిశా, అసోం, హరియాణా, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, గుజరాత్, పుదుచ్చేరి, కేరళ, తెలంగాణ, అండమాన్ –నికోబార్, డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీ విద్యాశాఖాధికారులు మన సంస్కరణలు తమ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలుకు సిద్ధం’’ ♦ ‘‘అమెరికాలోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై జరిగిన ఉన్నత స్థాయి సదస్సులో 140 దేశాల దేశాల విద్యావేత్తలు మన విద్యా సంస్కరణలపై ప్రశంసలు’’ విద్యార్థుల చెంతకు డిజిటల్ పాఠాలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 4 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ఉత్తమ కంటెంట్‌ను ఉచితంగా అందించేందుకు దేశంలోనే అతిపెద్ద ఎడ్ టెక్ కంపెనీ అయిన బైజూస్‌తో ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఈ కంటెంట్‌ను ఇంటర్ విద్యార్థులకు కూడా అందించడం విశేషం. ఎనిమిదో తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కలిపి 2021–22, 2022–23 విద్యా సంవత్సరాల్లో 9.53 లక్షల మందికి బైజూస్ కంటెంట్‌తో ఉచితంగా ట్యాబ్‌లు ఇచ్చి, విద్యార్థులు ఇంటి వద్ద కూడా డిజిటల్ పాఠాలు నేర్చుకునేలా చర్యలు తీసుకుంది. డిజిటల్ పాఠాలు ట్యాబ్స్‌తో పాటు 16 లక్షల మంది విద్యార్థులు తమ తల్లిదండ్రుల మొబైల్స్‌లో కూడా చూడడం విశేషం. ఏపీ ఈ పాఠశాల మొబైల్ యాప్, దీక్ష వెబ్సైట్, డీటీహెచ్ చానెళ్లు, యూట్యూబ్ చానెల్ వంటి వాటి ద్వారా నిరంతరం ప్రభుత్వం పాఠాలను అందిస్తోంది. దీంతో విద్యార్థులు ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా చదువుకునే ఏర్పాటు చేసింది. సబ్జెక్టుల్లో సందేహాలను నివృత్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఏఐ’ టెక్నాలజీతో పనిచేసే ‘డౌట్ క్లియరెన్స్ బాట్’ యాప్‌ను రూపొందించింది. ఇది ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్, టోఫెల్ శిక్షణలో ఎదురయ్యే క్లిష్టమైన సందేహాలను నివృత్తి చేస్తుంది. సీబీఎస్ఈ బోధన రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు జాతీయ, అంతర్జాతీయంగా పోటీపడేలా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. అందుకు అనువైన బోధన కోసం మొదటి విడతగా ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం 1,000 పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధన ప్రారంభించింది. ఇప్పుడు తొమ్మిదో తరగతి చదువుతున్న ఈ స్కూళ్లలోని విద్యార్థులు 2024–25 విద్యా సంవత్సరంలో తొలిసారి పదో తరగతి పరీక్షలు సీబీఎస్ఈ విధానంలో రాయనున్నారు. హైస్కూల్ లో ఉత్తీర్ణులైన బాలికలు చదువు మానేయకుండా ప్రభుత్వం ప్రతి మండలంలో బాలికల కోసం ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు చేసింది. 292 ఉన్నత పాఠశాలలు బాలికల కోసం హైస్కూల్ ప్లస్‌గా అప్‌గ్రేడ్ చేశారు. మొత్తం 352 కేజీబీవీల్లో ఇంటర్మీడియట్ ప్రవేశపెట్టారు. 2022–23 నుంచి 14 కో–ఎడ్ జూనియర్ కళాశాలలను బాలికల జూనియర్ కళాశాలలుగా మార్చారు. దీంతో మొత్తం 679 మండలాల్లో బాలికల కోసం ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల చొప్పున అందుబాటులోకి వచ్చింది. బోధన, పాఠ్యాంశాల్లో సంస్కరణలు విద్యార్థుల్లో నేర్చుకునే తత్వం, జిజ్ఞాస పెంచేలా ప్రభుత్వం పాఠ్యాంశాల్లో సంస్కరణలు తీసుకొచ్చింది. 21వ శతాబ్దపు నైపుణ్యాలు అందిపుచ్చుకునేలా, ఫౌండేషనల్ అక్షరాస్యత ప్రోత్సాహం కోసం క్లాస్రూమ్ బేస్డ్ అసెస్మెంట్ అమలు చేస్తోంది. 3 నుంచి 10 తరగతుల విద్యార్థులకు సబ్జెక్ట్ టీచర్లను అందించారు. అన్ని పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల అవసరాలు తీర్చేందుకు దాదాపు 25 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించారు. ఉపాధ్యాయుల్లో బోధనా సామర్థ్యాలు పెంచేందుకు, సీబీఎస్ఈ బోధనకు అనగుణంగా ‘టీచర్ కెపాసిటీ బిల్డింగ్’ శిక్షణ ఇచ్చారు. ఇందుకోసం ఇఫ్లూ, రివర్సైడ్ లెర్నింగ్ సెంటర్లలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐబీ సిలబస్ బోధన ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఏడాది ఉపాధ్యాయులకు ఐబీ సిలబస్ బోధనపై శిక్షణకు చర్యలు ప్రారంభించారు. ప్రపంచ వేదికలపై మెరిసేలా ఐబీ విద్య మన పేదింటి పిల్లలు ప్రపంచానికి దిక్సూచిగా మారాలన్న సీఎం జగన్ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు సమున్నతంగా మారాయి. ఇంగ్లిష్ మీడియం బోధన, సీబీఎస్ఈ సిలబస్ అమలుతో ఆగిపోకుండా ప్రభుత్వ బడుల్లోకి ఇప్పుడు ‘ఇంటర్నేషనల్ బాకలారియేట్(ఐబీ) బోధనను కూడా తేస్తోంది. ఇప్పటిదాకా దేశంలో 210 వరల్ట్ క్లాస్ కార్పొరేట్ స్కూళ్లలో సంపన్నుల పిల్లలకు మాత్రమే చదువుకొనగలిగే ఐబీ బోధన 2025 జూన్ నుంచి ప్రారంభం కానుంది. తొలి ఏడాది ఒకటో తరగతి నుంచి ప్రారంభమై ఏటా ఒక తరగతి చొప్పున ఐబీ బోధన పెంచుతూ 2037 నాటికి +2 వరకు విద్యనందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. విద్యార్థులకు క్రిటికల్. లేటరల్, డిజైన్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ వంటి నైపుణ్యాలు అందించడంతో పాటు భవిష్యత్ రంగాల్లో రాణించేలా, ప్రపంచ వ్యాప్తంగా ఉపాధి పొందేలా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. -
‘ఏఐ’ బడి
చీపురుపల్లి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) శకం ఆరంభమైంది. ఇప్పటి వరకు రాష్ట్రంలోని కార్పొరేట్ స్కూళ్లలో సైతం ఎక్కడా లేని విధంగా విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇంటెల్ ఇండియా సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ అధునాతన ఏఐ ల్యాబ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది రాష్ట్రంలోనే తొలి ఏఐ ల్యాబ్ కావడం విశేషం. ఈ ల్యాబ్ పేద పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయనుంది. రానున్న రోజుల్లో మరిన్ని అధునాతన ల్యాబ్‌ల ఏర్పాటుకు మార్గదర్శి కానుంది. సమాజానికి ఉపయోగపడే ఆధునిక ఆవిష్కరణలకు దోహదపడనుంది. ‘ఏఐ ఫర్ యూత్’ పేరుతో నాలుగు సెషన్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్‌లలో ‘ఏఐ ఫర్ యూత్’ అనే పేరుతో నాలుగు సెషన్లలో 8, 9 తరగతుల విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. మొదటి సెషన్లో ఇన్‌సై్పర్, రెండో సెషన్లో ఎక్వయర్, మూడో సెషన్లో ఎక్స్పీరియన్స్, నాలుగో సెషన్లో ఎంపవర్ అనే అంశాలపై శిక్షణ ఇస్తారు. ఈ నాలుగు సెషన్లు పూర్తయిన తర్వాత సమాజంలో ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులను విద్యార్థులు తయారు చేయాల్సి ఉంటుంది. రూ.15 లక్షలతో ల్యాబ్ ఏర్పాటు రాష్ట్రంలో తొలిసారిగా రూ.15 లక్షలతో చీపురుపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్‌లో తొమ్మిది అత్యాధునిక కంప్యూటర్లు, డిజిటల్ బోర్డులు, ఏసీలు ఉన్నాయి. దీనికోసం బాలుర ఉన్నత పాఠశాలలో ఒక గదిని కేటాయించారు. విద్యార్థులకు వరం ఏఐ ల్యాబ్ ఏర్పాటు చేయడం విద్యార్థులకు వరం. రాష్ట్రానికి ఒక ల్యాబ్ కేటాయిస్తే దానిని చీపురుపల్లిలో ఏర్పాటు చేయడం ఇక్కడి విద్యార్థులు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. విద్యార్థులు ఈ ల్యాబ్‌ను సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్‌లో ఎంతో అవసరమైన అద్భుత నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చు. – ఏవీఆర్‌డీ ప్రసాద్, ఏఐ ల్యాబ్ కన్సల్టేటర్ -
ప్రగతి దిశగా బాలికా చదువు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాల అంటే బాలికలకు గతంలో ఓ నరకం.. చదువుకుందామని ఆశ ఉన్నా సదుపాయాలు ఉండేవి కావు. కనీసం టాయిలెట్ కూడా లేని దుస్థితి. కౌమార దశ బాలికల పరిస్థితి మరీ దారుణం. దాంతో చాలామంది 8 లేదా 9 తరగతిలోనే చదువు మానేసేవారు. అత్యధిక బాలికల డ్రాప్ అవుట్స్ కూడా ఈ తరగతుల్లోనే ఉండేవి. ఈ సమస్యను గుర్తించిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం బాలికలు చదువుల ఆకాంక్షను నెరవేర్చేందుకు అవసరమైన సదుపాయాలను కల్పించింది. ప్రతి ప్రభుత్వ పాఠశాలలోను నాడు–నేడు ప్రాజెక్టులో 100 శాతం నిరంతర నీటి సరఫరాతో టాయిలెట్లు, అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునేందుకు ప్రత్యేక గదిని అందుబాటులోకి తెచ్చింది. స్కూలు స్థాయిలోనే వారి ఆరోగ్యంపైనా దృష్టిపెట్టి, రక్తహీనత ఉన్న బాలికలకు ఫోలిక్ ఐరన్ మాత్రలను అందిస్తోంది. ఏటా కౌమర దశ బాలికలు 9.74 లక్షల మందికి ‘స్వేచ్ఛ’ పేరిట శానిటరీ న్యాప్కిన్స్ను ఇస్తోంది. ఈ తరహా సేవలు నూరుశాతం అందిస్తున్న రాష్ట్రాల్లో దేశంలో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. ఫలితంగా గత నాలుగేళ్లుగా బడుల్లో బాలికల సంఖ్య పెరిగింది. ఉత్తీర్ణతలోనూ వారు ముందున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్స్ సాధనలోనూ బాలురు కంటే బాలికలే ముందున్నారు. బాలికలకు నూరు శాతం సదుపాయాలు పాఠశాల స్థాయిలో డ్రాప్ అవుట్స్‌కు ప్రధాన కారణం టాయిలెట్లు, గతంలో పట్టణాల్లోని కొన్ని ప్రభుత్వ బడుల్లో మాత్రమే అరకొరగా ఉండేవి. దాంతా విద్యార్థులు, ముఖ్యంగా బాలికలు చాలా ఇబ్బంది పడేవారు. టాయిలెట్ల సదుపాయం లేని చోట్ల కౌమర బాలికలు తమ చదువుకు స్వస్తి పలికేవారు. రాష్ట్ర ప్రభుత్వం మనబడి నాడు–నేడు ప్రాజెక్టు ప్రారంభించి ప్రతి పాఠశాల, జూనియర్ కళాశాలలోను టాయిలెట్ల నిర్మాణం చేపట్టింది. ప్రస్తుతం 49,293 ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో నీటి సరఫరాతో టాయిలెట్లు అందుబాటులోకి వచ్చినట్టు కేంద్ర ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. 45,137 పాఠశాలల్లో బాలికలకు ప్రత్యేక గది, టాయిలెట్లు ఉన్నట్టు ప్రకటించింది. ఫలితంగా బాలికల డ్రాప్ అవుట్స్ తగ్గిపోవడమే గాక చేరికలు పెరిగాయి. 2018–19 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ బడుల్లో బాలికల సంఖ్య 18,80,591 మంది ఉంటే 2023–24లో 19,26,724 మందికి పెరిగింది. డ్రాప్ అవుట్స్ కూడా 2018–19లో 16.37 శాతం నుంచి 2023–24 నాటికి 12 శాతానికి తగ్గిపోయింది. దీంతో పాటు బాలికల గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) గణనీయంగా పెరిగింది. ‘స్వేచ్ఛ’గా చదువుకునేలా.. దేశంలో 23 శాతం బాలికలు రుతుక్రమ సమయంలో పాఠశాలలు, కళాశాలలకు దూరంగా ఉంటున్నారని అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి ఉండేది, పాఠశాల స్థాయిలో అధిక డ్రాప్ అవుట్స్‌కు ఇదే కారణంగా ఉండేది. బాలికల డ్రాప్ అవుట్స్‌కు కారణమవుతున్న రుతుక్రమ ఇబ్బందులను పరిష్కరించేందుకు 2020–21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం ‘స్వేచ్ఛ’ పథకాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఏడు నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న కిశోర బాలికలకు నెలకు 10 చొప్పున ఏడాదికి 120 శానిటరీ ప్యాడ్స్‌ను పంపిణీ చేస్తోంది. ఏడాదికి 12 కోట్ల ప్యాడ్స్‌ను బాలికలకు ఉచితంగా అందిస్తున్నారు. 10,144 పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లోని 9,74,121 మంది కౌమార బాలికలకు వీటిని అందిస్తోంది. ఇప్పుడు బాలికల డ్రాప్ అవుట్స్ తగ్గాయి. చదువుపై దృష్టి పెట్టడంతో ఫలితాల సాధనలోనూ బాలురను మించిపోయారు. అమ్మఒడి .. జగనన్న గోరుముద్ద చిన్నారుల చదువుకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా సీఎం జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం అమ్మ ఒడి. ప్రభుత్వంతోపాటు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఏటా రూ.15 వేలు క్రమం తప్పకుండా ప్రభుత్వం అందజేస్తోంది. దీనివల్ల విద్యార్థుల హాజరు గణనీయంగా పెరిగింది. దీనికి తోడు రోజుకొక మెనూతో మధ్యాహ్న భోజనం చక్కగా అమలవుతోంది. -
9 లక్షల మంది విద్యార్థులకు విద్యా దీవెన ఫండ్స్ రిలీజ్
-
చరిత్ర ఎరుగని వినూత్న నమూనాలు
వైఎస్ జగన్ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత, గత 75 ఏళ్లలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నమూనాను మార్చేశారు. గత ఐదేళ్లలో రాష్ట్ర మానవాభివృద్ధికి బలమైన పునాది వేయడానికి అనేక చర్యలు తీసుకున్నారు. పిల్లల నాణ్యమైన విద్య కోసం ఖర్చు చేయడం మానవ వనరుల అభివృద్ధికి ఖర్చు చేయడమే తప్ప మరొకటి కాదు. దేశంలోని వికృతమైన విద్యా వ్యవస్థలో ఇది అత్యంత కష్టతరమైన సంస్కరణ. పాఠశాలలు, కళాశాలలపై దృష్టి సారించే మానవశక్తి అభివృద్ధి నమూనాను ఇంతవరకూ ఏ మూడవ ప్రపంచ దేశంలోనూ ప్రయత్నించలేదు. అలాగే, ప్రతి సంక్షేమ పథకాన్నీ పర్యవేక్షించడానికీ వాలంటీర్లను నియమించడం కూడా ప్రజాస్వామ్య పరిపాలనలో పూర్తిగా కొత్త ఆలోచన. ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని అధికార వైఎస్సార్సీపీకీ, చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ, భావోద్వేగ సినీ నటుడు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీలకూ మధ్య పోటీ నెలకొంది. జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లు తమిళనాడులో వలె నామమాత్రపు ఆటగాళ్లుగా ఉన్నాయి. ఆసక్తికరంగా, బీజేపీ రాష్ట్ర శాఖకు చంద్రబాబు వదిన పురందేశ్వరి నాయకత్వం వహిస్తుండగా, కాంగ్రెస్ రాష్ట్ర శాఖను జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల నడిపిస్తున్నారు. రెండు జాతీయ పార్టీలు, తమ సమీప బంధువులైన ప్రాంతీయ పార్టీల అధినేతలను ఇబ్బంది పెట్టేందుకు మహిళా అధ్యక్షులను ఎంపిక చేశాయి. ఇలాంటి పరిస్థితి దేశంలో ఎక్కడా లేదు. 2014 ఎన్నికల నుంచి జగన్ ఒంటరి పోరాటం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి చంద్రబాబు పొత్తుల కోసం తహతహలాడుతున్నారు. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని 102 సీట్లు గెలుచుకున్న చంద్రబాబు, 2019లో కేవలం 23 సీట్లు గెలుచుకుని జగన్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. అందుకే ఇప్పుడు ఆయన జనసేన, బీజేపీతో పొత్తుకు తెగ ఆరాటపడుతున్నారు. ఇది కచ్చితంగా బాబులో ఉన్న అలజడిని తెలియజేస్తోంది. 2019 ఎన్నికలకు ముందు ప్రధాని మోదీపై చంద్రబాబు దూషణలు చేసినందున, ప్రధాని ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ‘అందితే జుట్టు... అందకపోతే కాళ్ళు’ అనే తెలుగు సామెత చెప్పినట్టుగా ఉంది చంద్రబాబు రాజకీయ జీవితం. ఇప్పుడు చంద్రబాబు రాజకీయ స్థితిని మోదీ చక్కగా ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌కు చాలా కీలకమైనవి. ఎందు కంటే వైఎస్ జగన్ 175 సీట్లలో 151 సీట్ల భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత, గత 75 ఏళ్లలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ప్రయత్నించని విధంగా రాష్ట్ర అభివృద్ధి నమూనాను మార్చేశారు. రాష్ట్రంలోని పాఠశాల, విశ్వవిద్యాలయ విద్య ప్రాథమిక నిర్మాణాన్ని మార్చడం ద్వారా వైఎస్ జగన్, భౌతిక అభివృద్ధి అని పిలుచుకునే అభివృద్ధి నమూనాను మానవ అభివృద్ధి నమూనాగా మార్చారు. గత ఐదేళ్లలో రాష్ట్ర మానవాభివృద్ధికి బలమైన పునాది వేయడానికి జగన్ అనేక చర్యలు తీసుకున్నారు. ఆయన తీసుకున్న మొదటి అడుగు – ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టడం. భారతదేశంలోని వికృతమైన విద్యా వ్యవస్థ చరిత్రలో ఇది అత్యంత కష్టతరమైన సంస్కరణ. పట్టణ పేదల పిల్లలను, వ్యవసాయ రంగంలోని శ్రామిక జనాల పిల్లలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటూ కదలలేని ప్రాంతీయ భాషా విద్యా విధానంలో ఉంచాయి. భాషాప్రయుక్త రాష్ట్రాల ఆలోచన పేద పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలల మెడకు చుట్టుకుంది. ధనవంతులు తమ పిల్లలను ప్రైవేట్ ఇంగ్లీషు మీడియం పాఠశాలల్లో చేర్పిస్తే, గ్రామీణ ప్రజలలో మాత్రం ప్రాంతీయ భాషావాదం ప్రచారం చేశారు. పాఠశాల మౌలిక సదుపాయాలు, నాణ్యమైన బోధన, ఆర్థిక స్థోమత లేని పిల్లలకు మంచి ఆహారం కోసం బడ్జెట్‌ను ఖర్చు చేయడానికి ఏ ప్రభుత్వమూ కూడా సిద్ధపడలేదు. పిల్లల నాణ్యమైన విద్య కోసం ఖర్చు చేయడం మానవ వనరుల అభివృద్ధికి ఖర్చు చేయడమే తప్ప మరొకటి కాదు. అసెంబ్లీల బడ్జెట్ సమావేశాల్లో చర్చలన్నీ రోడ్లు, భవ నాలు, అప్పుడప్పుడు డ్యామ్‌లకు మాత్రమే డబ్బు ఖర్చు చేసే విధంగా సాగుతుంటాయి. ఇలాంటి భౌతిక అభివృద్ధిలో భారీ మొత్తంలో డబ్బులు కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళతాయి. పాఠశాల విద్యకూ, విశ్వవిద్యాలయ విద్యకూ; పేద పిల్లల తల్లిదండ్రుల ఖాతాలకు నగదు బదిలీ పథకాలకూ గణనీయమైన మొత్తంలో బడ్జెట్‌ను కేటాయించడం ద్వారా ఆ నమూనాను జగన్ ప్రభుత్వం మార్చింది. ఇది దళారుల పాత్రను రూపుమాపింది. ఈ మార్పు అంతరార్థం ఏమిటంటే దళారీ వ్యవస్థ బలహీనపడుతుంది. తాము పొరపాటున అధికారంలోకి వచ్చినా, పాత భౌతిక వనరుల అభివద్ధి నమూనా వైపు తిరిగి వెళ్లలేమన్నది ప్రతిపక్ష పార్టీల ఆందో ళన. అదే వైఎస్ జగన్ తిరిగి అధికారంలోకి వస్తే, సంస్కరణలు మరింత లోతుగా సాగుతాయి. పది పదిహేనేళ్లలో మంచి విద్యావంతులు, ఆత్మవిశ్వాసం ఉన్న గ్రామీణ యువత సామాజిక–రాజకీయ వ్యవస్థలోకి వస్తారు. మానవ వనరుల అభివృద్ధికి అలవాటు పడిన ఆర్థిక వ్యవస్థను మార్చడానికి వారు అనుమతించరు. పైగా ఉద్యోగ స్వామ్యంతో పనిలేని అవినీతి రహిత కార్యకలాపాల కోసం పని చేస్తారు. వివిధ స్థాయుల పరిపాలనలో ‘సివిల్, పోలీసు నియంతల’ వలె పని చేయాలనుకునే అవినీతి ఉద్యోగులు, ఉన్నత స్థాయి బ్యూరో క్రాట్లు కూడా ఈ మానవ అభివృద్ధి నమూనాకు మద్దతు ఇవ్వడానికి ఇష్టపడరు. కానీ నగదు బదిలీ జీవితాన్ని రుచి చూసిన పేద గ్రామీణ, పట్టణ ప్రజలు కొత్త వ్యవస్థకు కచ్చితంగా మద్దతు ఇస్తారు. ప్రతి సంక్షేమ పథకాన్నీ పర్యవేక్షించడానికీ వాలంటీర్లను నియమించడం ప్రజాస్వామ్య పరిపాలనలో పూర్తిగా కొత్త ఆలోచన. వృద్ధులకు, రోగులకు ప్రభుత్వం నుండి వృద్ధాప్య పింఛన్ అందేలా లేదా రేషన్ వంటి ప్రయోజనాలను ఇంటి వద్దే ఇచ్చేలా వీరు సాయపడుతున్నారు. మధ్య, ఉన్నత స్థాయి బ్యూరోక్రాట్లు గ్రామాల్లో ఉన్న స్వచ్ఛంద సేవకులపై అసంతృప్తిగా ఉన్నప్పటికీ, పెద్ద సంఖ్యలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఒక గ్రామంలోని వాలంటీర్ ప్రతి గ్రామస్థునికీ ఒక సహాయ హస్తం! పాఠశాలలు, కళాశాలలపై దృష్టి సారించే మానవశక్తి అభివృద్ధి నమూనాను ఇంతవరకూ ఏ మూడవ ప్రపంచ దేశంలోనూ ప్రయత్నించలేదు. ఉదాహరణకు, చైనా... విద్య, ఆరోగ్య వ్యవస్థలలో ఒక రకమైన సారూప్య వ్యవస్థను ప్రయత్నించింది. వారు పెద్ద సంఖ్యలో కాలినడక వైద్యులను నియమించారు. మెరుగైన పర్యవేక్షణ వ్యవస్థ లతో కూడిన అసమానమైన ఆరోగ్య మౌలిక సదుపాయాలను కూడా జగన్ కల్పించారు. కరోనా సంక్షోభాన్ని అధిగమించడంలో ఇది ఎంతో సహాయపడింది. ఆరోగ్య రంగంలో కూడా గ్రామ వాలంటీర్లు చక్కటి పని చేస్తున్నారు. ఈ కొత్త ప్రయోగాలన్నీ దేశంలోని కాంట్రాక్టర్ వర్గాన్ని ఆశ్చర్యపరిచాయి. కాంట్రాక్టర్ వర్గం భౌతికాభివృద్ధిని కోరుకుంటుంది కానీ భారీ స్థాయి మానవ శక్తి అభివృద్ధిని కాదు. తెలంగాణలో నా చిన్నతనంలో స్థానిక భూస్వాములు ఊరి స్కూల్ టీచర్లను చదువు చెప్పవద్దనీ, జీతం తీసుకుని ఇంట్లో సంతోషంగా ఉండమనీ అనేవారు. పల్లెటూరి పిల్లలందరూ చదువుకుంటే తమ పశువుల చుట్టూ బాలకార్మికులుగా ఎవరు పని చేస్తారు, పెద్దయ్యాక జీతగాళ్లుగా ఎవరు పని చేస్తారన్నది వారి తర్కం. ఆ సమయంలో భూస్వాములు విద్య ద్వారా మానవ శక్తిని అభివృద్ధి చేయడాన్ని భూస్వామ్య వ్యతిరేకతగా చూశారు. ఇప్పుడు ఏపీలో ఇంగ్లీషు విద్యావంతులైన మానవశక్తిని అభివృద్ధి చేయడాన్ని కాంట్రాక్ట్ వ్యతిరేక పెట్టుబడిగా చూస్తున్నారు. కాంట్రాక్ట్ పెట్టుబడికీ, ప్రైవేట్ విద్యా రంగానికీ, చంద్రబాబుకూ చాలా దగ్గరి సంబంధం ఉంది.2024 ఎన్నికలలో జగన్ గెలిస్తే ఈ మోడల్ దాని మూలాలను మరింత లోతుగా పాతుకుపోయేలా చేస్తుంది. పైగా దానిని ఎవరూ మార్చలేరు. ఇది జాతీయ విద్యావ్యవస్థపై కూడా ప్రభావం చూపు తుంది. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
విద్యా సాధికారత దిశగా అడుగులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఎడెక్స్’ (ఈడీఈఎక్స్) కార్యక్రమాన్ని ఆరంభించడం ద్వారా ఉన్నత విద్యను అందరికీ అందుబాటులో ఉంచే దిశగా ఒక కీలక అడుగు వేసింది. ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఈ కార్య క్రమం ద్వారా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, హార్వర్డ్, ఎమ్ఐటీ, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ వంటి ప్రపంచ ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల నుండి రెండు వేల కోర్సులు ఉచితంగా అందించబడు తున్నాయి. ఇది నిజానికి రాష్ట్రంలోని యువతకు ఇస్తున్న గొప్ప పెట్టుబడి. ఇది భారత రాజ్యాంగం, మానవ హక్కుల చట్టాలు ప్రోత్సాహించే విద్యా హక్కును మరింత బలోపేతం చేస్తుంది. భారతీయ రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ఏ ప్రకారం, 6 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు ఉచితంగా, నిర్బంధంగా విద్యను అందించాలి. అంతర్జాతీయ కోర్సులను కలిగిన ఉన్నత విద్యను అందరికీ అందుబాటులో ఉంచడం ద్వారా, ఏపీ ప్రభుత్వం నాణ్యమైన విద్య కేవలం కొన్ని వర్గాలకు పరిమితం కాకుండా ‘సమాన విద్యా హక్కు’ను గుర్తించింది. మానవ హక్కుల ప్రకటనలోని 26వ ఆర్టికల్ పేర్కొంటున్న ‘ప్రతి ఒక్కరికీ విద్య హక్కూ, అర్హత ఆధారంగా ఉన్నత విద్య అందరికీ సమానంగా అందుబాటులో ఉండాలి’ అన్న అంశాన్ని ఏపీ ప్రభుత్వం కార్యరూపంలోకి తెచ్చినట్లయింది. ‘ఎడెక్స్’ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు, ముఖ్యంగా ఆర్థికంగా వెనకబడిన వర్గాల నుండి వచ్చిన వారికి ప్రపంచ స్థాయి విద్యా సంస్థలలో ఉన్నత విద్యను అభ్యసించే కలను నిజం చేస్తుంది. సామాజిక, సాంస్కృతిక శాస్త్రాల నుండి శాస్త్ర, సాంకే తిక రంగాల వరకు వివిధ విషయాలలో ఉచిత కోర్సు లను అందించడం ద్వారా ఈ కార్యక్రమం కేవలం విద్యా పరిధిని విస్తరించడమే కాకుండా, విభిన్న నైపుణ్యాలను కలిగి ఉన్న ప్రపంచ స్థాయి కార్మిక శక్తిని సిద్ధం చేస్తుంది. అంతర్జాతీయ సంస్థలలో ఉన్నత విద్య అందించే ‘ఎడెక్స్’ ప్రోగ్రామ్ మూలంగా యువత తమ ప్రతిభను ప్రపంచ వేదికపై ప్రదర్శించే అవకాశాలను పొందు తుంది. విద్యా రంగంలో ఈ రకమైన ప్రగతి కారక అడుగులు, సమాజంలో ఆర్థిక, సామాజిక సమా నత్వాన్ని సాధించడానికి తప్పనిసరిగా దోహద పడతాయి. విద్యార్జన వంటి మౌలిక హక్కును అందరికీ అందించడం వల్ల వ్యక్తులు తమ సామర్థ్యాలను గుర్తించి, వాటిని పరిపూర్ణంగా వాడుకోవడానికి వీలవుతుంది. ఇది వారికి ఉత్తమ ఉద్యోగ అవకాశాలను అందించడమే కాకుండా, వారి కుటుంబాలు, సమా జాలలో ఆర్థిక స్థితిని మెరుగు పరచడంలో కూడా సహాయపడుతుంది. విద్య ద్వారా సాధించే ఈ పరివర్తన నిరంతరం కొనసాగాలి. అందుకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు... వెరసి సమాజం మొత్తం సహకరించాలి. ఈ సమన్వయం ద్వారానే, మనం ఒక సంక్షేమ సమాజం నిర్మాణంలో పాల్గొనగలం. చివరగా, ‘ఎడెక్స్’ పథకం వంటి సంకల్పాలు సామాజిక న్యాయం, సమానత్వం అనే భారతీయ రాజ్యాంగ ఆదర్శాలను బల పరుస్తూ, ప్రతి విద్యార్థికీ విద్యా అవకాశాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇది సమాజంలో ఆర్థిక, సాంస్కృతిక వైవిధ్యాలను గౌరవిస్తూ, అన్ని వర్గాల నుండి వచ్చిన విద్యార్థులకు సమాన విద్యా అవకాశాలను కల్పించి, వారిలో సమాజం పట్ల బాధ్యత ప్రపంచ సమస్యలపై స్పందించే సామర్థ్యం నెలకొల్పు తుంది. ‘ఎడెక్స్’ వంటి పథకాలు కేవలం విద్యార్థులకు మాత్రమే కాకుండా, ఉపాధ్యాయులు, విద్యా సంస్థలు, ప్రభుత్వంలోని ఇతర భాగాలకు కూడా లాభ దాయకం. వీటి ద్వారా, విద్యా రంగంలో సమగ్రత, నవీనీకరణ, సామర్థ్యపూర్వక ప్రగతి సాధించడం సాధ్య మవుతుంది. ఓరుగంటి సుబ్బారావు వ్యాసకర్త ట్రైబల్ డెవలప్మెంట్ మిషన్ నేషనల్ వర్కింగ్ చైర్మన్ ‘ 90001 77777 -
ప్రభుత్వ బడులపై బండలు
-
Fact check: ప్రభుత్వ బడులపైనే బండలా!
సాక్షి, అమరావతి: అచ్చోసిన ఆంబోతు తిని ఊరి మీద పడి తిరిగినట్టు.. ఎన్నికల ముందు ఈనాడు పత్రికాధినేత రామోజీరావు కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి విషయంలోనూ విషం జిమ్మడమే పనిగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే పేదింటి పిల్లలకు ప్రపంచ స్థాయి విద్యను అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలలపై కత్తిగట్టారు. వాస్తవాలను వక్రీకరించి అసత్యాలతో తనకలవాటైన రీతిలో చెలరేగిపోయారు. ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యా సంస్కరణలు, పేద పిల్లల ప్రగతిపై ఏనాడూ అక్షరం ముక్క రాయని ‘ఈనాడు’ ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదులు లేవంటూ అబద్ధాలను అచ్చేసింది. మొదటి విడత మనబడి: నాడు–నేడుతో సమూలంగా రూపురేఖలు మార్చుకున్న 15,715 ప్రభుత్వ పాఠశాలల గురించి మాటమాత్రంగా ప్రస్తావించలేదు. కానీ నాడు–నేడు రెండోవిడతలో పనులు జరుగుతున్న పాఠశాలలపై రామోజీ విషం కక్కారు. గత ప్రభుత్వంలో సర్కారు బడి భవనాలు బీటలు వారి కూలిపోతున్నా అడిగింది లేదు.. విద్యార్థులకు కనీస వసతులైన పుస్తకాలు, తాగునీరు, యూనిఫామ్ ఇవ్వకున్నా నిలదీసింది లేదు. ఇప్పుడు నాడు–నేడు రెండో దశలో బడులకు కొత్త భవనాలు, అదనపు తరగతి గదులు నిర్మాణ పనులు సాగుతుండగా ఫొటోలు తీసి పనులు నిలిచిపోయాయంటూ రామోజీ దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలా ఒకటీ రెండుసార్లు కాదు.. ఈ విద్యా సంవత్సరంలో 15 సార్లు ఒకే అంశంపై తప్పుడు రాతలు ప్రచురించడం ఆయన మానసిక దౌర్భల్యానికి నిదర్శనం. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలలు అద్భుతంగా ఉన్నాయని.. విద్యార్థులకు గొప్ప సదుపాయాలు కల్పిస్తున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభినందించారు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సైతం ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించి కొనియాడారు. వివిధ దేశాల ప్రతినిధులు సైతం ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి ప్రశంసిస్తున్నారు. తమ దేశంలోనూ ఏపీ విధానాలను అమలు చేస్తామని చెబుతున్నారు. కానీ రామోజీ పచ్చ కళ్లకు మాత్రం ఇవేమీ కనిపించడం లేదు. నాడు–నేడు రెండో దశలో 22,344 స్కూళ్ల అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం 2021–22 విద్యా సంవత్సరంలో నాడు–నేడు మొదటి దశ కింద 15,715 పాఠశాలలను రూ.3,669 కోట్లతో అభివృద్ధి చేసింది. నూతన భవనాలతో పాటు అవసరమైన 12 రకాల మౌలిక సదుపాయాలను కల్పించింది. ఇక 2022–23 విద్యా సంవత్సరంలో 22,344 పాఠశాలల్లో రూ.8,000 కోట్లతో రెండో దశ పనులు చేపట్టారు. ఇందులో మొదటి దశలో లేని అదనపు పనులు సైతం జోడించారు. ఇప్పటికే 99.79 శాతం స్కూళ్లల్లో పనులు ప్రారంభించారు. 2,755 స్కూళ్లలో అభివృద్ధి పనులు పూర్తవగా, 1,331 స్కూళ్లను నూరుశాతం అందుబాటులోకి తీసుకొచ్చారు. మరో 6,340 స్కూళ్లల్లో టాయిలెట్లు, 4,707 స్కూళ్లల్లో కిచెన్ షెడ్లు, 11,840 స్కూళ్లల్లో మేజర్, మైనర్ రిపేర్లు పూర్తి చేశారు. అంతేకాకుండా ఆ పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్లకు రూ.3,361 కోట్లు చెల్లించారు. వాస్తవం ఇదయితే ప్రస్తుతం పనులు కొనసాగుతున్న పాఠశాలల్లో ఫొటోలు తీసి, నిర్మాణ పనులు నిలిచిపోయాయంటూ ఈనాడు పత్రిక వక్రీకరిస్తోంది. ఇందుకోసం పార్వతీపురం మన్యం జిల్లాలోని మూడు స్కూళ్లు, ప్రకాశంలోని కొత్తపట్నం, ఏలూరు జిల్లా ఉంగుటూరు, ఎన్టీఆర్ జిల్లా నందిగామ, విజయనగరం జిల్లా గుర్ల మండలాల్లోని పాఠశాలను చూపించింది. వాస్తవానికి ఆ పాఠశాలల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎలాంటి గాయాలు కాకూడదని ఆరుబయట ఉంచారు. ఈ ఫొటోలను అచ్చేసి రామోజీ పైశాచిక ఆనందం పొందుతున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇవే పాఠశాలల గోడలు బీటలు వారి, పైకప్పులు ఎప్పుడు కూలతాయోనన్న భయంతో చదువులు సాగాయి. కానీ తన శిష్యుడు చంద్రబాబు జమానా కావడంతో రామోజీకి ఒక్క ముక్క కూడా రాయాలనిపించలేదు. ఇప్పుడు అన్నీ బాగున్నా చంద్రబాబు ముఖ్యమంత్రిగా లేరు కాబట్టి అన్నీ తప్పులే ఆయనకు కనిపిస్తున్నాయి. -
రూ.1,042.51 కోట్లతో విద్యాకానుక
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకిచ్చే జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీకి ప్రణాళిక సిద్ధమైంది. రాష్ట్రంలోని 44,617 పాఠశాలల్లో చదువుతున్న 39,51,827 మందికి వీటిని అందించనున్నారు. ఇందుకోసం రూ.1,042.51 కోట్లతో వీటిని సిద్ధంచేస్తున్నారు. గతేడాది మాదిరిగానే 2024–25 విద్యా సంవత్సరంలో పాఠశాల తెరిచిన మొదటిరోజే విద్యార్థులకు విద్యా కానుక (జేవీకే–5)ను అందించాలని పాఠశాల విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది ఒకటి నుంచి పదో తరగతి వరకు పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఈ కిట్లను తీసుకుంటున్నారు. అయితే, జేవీకే–4లో మిగిలిన వాటిని కూడా పరిగణనలోకి తీసుకుని వచ్చే విద్యా సంవత్సరం కిట్లను తీసుకోనున్నారు. ఇప్పటికే కిట్లకు అవసరమైన వస్తువులను సరఫరా చేసేందుకు ఆయా సంస్థలు అంగీకారం తెలపగా, ఏప్రిల్ చివరివారం నుంచి వాటిని సరఫరా చేయనున్నారు. ఈలోగా టెన్త్ పరీక్షలతో పాటు ఏప్రిల్ రెండోవారం నాటికి మిగతా తరగతుల పరీక్షలు కూడా పూర్తవుతాయి. దీంతో.. అప్పటి విద్యార్థుల సంఖ్య ఆధారంగా కిట్లను తీసుకుంటారు. గత విద్యా సంవత్సరంలో పదో తరగతి తప్పి, తిరిగి పాఠశాలల్లో చేరిన వారిని ఈ విద్యా సంవత్సరం ‘రెగ్యులర్’గా పరిగణించి వారికి కూడా విద్యాకానుక కిట్లను అందించారు. గతేడాది ఏ ధరకు వస్తువులను సరఫరా చేశాయో, జేవీకే–5 కిట్‌లోని వస్తువులకు కూడా అదే ధరను నిర్ణయించారు. ఇక ఈ నాలుగేళ్లలో జేవీకే పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.3,366.53 కోట్లు వెచి్చంచింది. నూరు శాతం నాణ్యతతో కిట్లు.. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. సర్కారు బడిలో చదువుతున్న విద్యార్థులందరికీ 2020–21 విద్యా సంవత్సరం నుంచి ‘జగనన్న విద్యా కానుక’ను అందిస్తోంది. ఇప్పటివరకు నాలుగుసార్లు ఈ కిట్లను అందించారు. ఇందులో నాణ్యమైన స్కూలు బ్యాగు, పాఠ్య, నోటు పుస్తకాలు, జత బూట్లు, రెండు జతల సాక్సులు, వర్క్‌బుక్స్ (ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు), ఇంగ్లిష్–తెలుగు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ (హైస్కూల్), పిక్టోరియల్ డిక్షనరీ, కుట్టుకూలీతో సహా మూడు జతల యూనిఫారం క్లాత్, బెల్టు, టై ఉంటాయి. వీటి సరఫరాతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల నుంచి సంతోషం వ్యక్తమవుతోంది. మరోవైపు.. విద్యార్థులకిచ్చే ఈ కిట్ల నాణ్యతను ఆయా కంపెనీలు పరిశీలించే సరఫరా చేస్తున్నాయి. ఇందుకోసం గతంలో బ్యాగుల నాణ్యతా ప్రమాణాలను సీపెట్ (సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ) చూసింది. 2023–24 విద్యా సంవత్సరం నుంచి విద్యాశాఖ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేసింది. అంటే.. రా మెటీరియల్ నుంచి బ్యాగుల ఉత్పత్తి, స్టాక్ పాయింట్‌కు చేరే వరకు అన్ని దశల్లోనూ పర్యవేక్షణకు లాభాపేక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వం మద్దతుతో నడుస్తున్న ‘క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ సంస్థకు అప్పగించింది. వచ్చే విద్యా సంవత్సరానికి సరఫరా చేసే వస్తువులను సైతం క్యూసీఐ సంస్థే నాణ్యతను పర్యవేక్షించనుంది. -
ఇంగ్లిష్ 'పది'లం
మా లాంటి పేదలకు అండగా సీఎం గిరిజన ప్రాంతంలో జన్మించిన నేను ప్రారంభంలో తెలుగు మీడియంలోనే చదువుకున్నా. జగన్ మావయ్య ప్రభుత్వం వచ్చిన తరువాత ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నా. ప్రస్తుతం జీకే వీధి ఇంగ్లిష్ మీడియం ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నా. జగన్ మావయ్య మాలాంటి పేద విద్యార్థులకు అండగా నిలిచారు. ఉన్నత చదువులు చదివి మావయ్య ఆశయాన్ని సాధిస్తా. మా అమ్మ కిల్లో జమున, నాన్న కిల్లో నవకుమార్ పోడు వ్యవసాయం చేస్తారు. ఆ ఆదాయంతో నన్ను చదివించేవారు. ఇప్పుడు ఇంగ్లిష్ మీడియం స్కూల్లో ఉచితంగా వసతి కల్పిస్తున్నారు. టీచర్లు బాగా బోధిస్తున్నారు. – కె.ధారామణి, ఇంగ్లిష్ మీడియం గిరిజన ఆశ్రమ పాఠశాల, జీకే వీధి, అల్లూరి జిల్లా సాక్షి, అమరావతి: విద్యా రంగంలో సమూల సంస్కరణలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగేళ్ల క్రితం తలపెట్టిన చదువుల యజ్ఞం సత్ఫలితాలనిస్తోంది. మన విద్యార్థులు అంతర్జాతీయంగా సత్తా చాటుకునేలా దూరదృష్టితో ప్రభుత్వ పాఠశాలల్లో తీసుకొచ్చిన ఇంగ్లిష్ మీడియం చదువులకు ఆదరణ పెరుగుతోంది. ఇన్నాళ్లూ మాతృభాష ముసుగులో పేద బిడ్డల ఇంగ్లిష్ చదువులకు అడ్డుపడుతూ కొందరు పెత్తందార్లు కార్పొరేట్ విద్యా సంస్థల కొమ్ము కాశారు. రాష్ట్ర ప్రభుత్వం సర్కారీ స్కూళ్లలో పేద విద్యార్థుల కోసం ఇంగ్లీషు మీడియం తీసుకొస్తే తెలుగును అణగదొక్కుతున్నారంటూ విష ప్రచారం చేశారు. అందరూ ఆంగ్లంలోనే చదివితే తమ పరిస్థితి ఏం కావాలని కార్పొరేట్ విద్యా సంస్థలు బెంబేలెత్తాయి. ఇవన్నీ అధిగమిస్తూ ప్రభుత్వ విద్యా సంస్థలు మంచి ఫలితాలను నమోదు చేస్తున్నాయి. రాష్ట్రంలో ఇంగ్లీషు మీడియంలో టెన్త్ పరీక్షలు రాసే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్య భారీగా పెరుగుతోంది. సర్కారీ స్కూళ్లలో గత ఐదేళ్లలో దాదాపు 25 శాతం మంది విద్యార్థులు తెలుగు నుంచి ఇంగ్లీషు మీడియంలోకి మారిపోయి పదో తరగతి పరీక్షలకు హాజరైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఇంగ్లీషు మీడియం చదువులను ముఖ్యమంత్రి జగన్ అందిస్తుండటం తెలిసిందే. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడంతో అత్యధిక విద్యార్థులు తెలుగు నుంచి ఆంగ్ల మాధ్యమంలోకి మారారు. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్ధులకు జగనన్న విద్యా కానుక కింద పాఠ్యపుస్తకాలతో పాటు యూనిఫాం, బూట్లు తదితరాలతో కిట్‌ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. విద్యార్ధులు సులభంగా అర్ధం చేసుకోవడానికి వీలుగా బైలింగ్యువల్ పాఠ్యపుస్తకాలను సమకూరుస్తోంది. ఇప్పటివరకు జగనన్న విద్యా కానుక కింద రూ.3,366.53 కోట్లను వ్యయం చేయగా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే విద్యా కానుక నిధులను సిద్ధం చేస్తూ రూ.1,042.51 కోట్లకు పరిపాలన అనుమతి మంజూరు చేసింది. ► వచ్చే నెలలో టెన్త్ పరీక్షలు రాయనున్న మొత్తం విద్యార్ధులు 6.23 లక్షల మంది ఉండగా ఏకంగా 4.51 లక్షల మందికిపైగా ఇంగ్లీషు మీడియంలోనే పరీక్షలు రాయనుండటం గమనార్హం. వీరిలో ప్రభుత్వ స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న వారు ఏకంగా 3.97 లక్షల మంది ఉన్నారు. ప్రైవేట్, అన్ ఎయిడెడ్ స్కూళ్లలో చదువుతున్న వారి సంఖ్య 2.25 లక్షల వరకు ఉంది. ఇంగ్లీషు మీడియంలో పరీక్షలు రాసే విద్యార్థుల సంఖ్య త్వరలోనే వంద శాతానికి చేరుతుందంని విద్యావేత్తలు, నిపుణులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థుల ఆంగ్ల నైపుణ్యాలకు పదును పెడుతూ టోఫెల్ శిక్షణ సైతం అందుబాటులోకి తెచ్చిందని ఉదహరిస్తున్నారు. ► చంద్రబాబు హయాంతో పోలిస్తే ఐదేళ్లలో పరిస్థితి తిరగబడింది. సీఎం జగన్ ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడంతో వచ్చే నెలలో పదో తరగతి పరీక్షలు ఆంగ్ల మాధ్యమంలో రాయనున్న విద్యార్ధులు 72.54 శాతానికి పెరిగారు. ఈసారి తెలుగు మీడియంలో టెన్త్ పరీక్షలు రాసే విద్యార్ధులు 26.74 శాతం మంది మాత్రమే ఉన్నారు. మిగతా అతి స్వల్ప శాతం విద్యార్థులు ఉర్దూ, కన్నడ, తమిళం, ఒడియా భాషల్లో చదువుతున్న వారున్నారు. ► టీడీపీ హయాంలో ఇంగ్లీషు మీడియంలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల సంఖ్య 2.88 లక్షలు కాగా ఇప్పుడు ఏకంగా 4.51 లక్షలకు పెరిగింది. గత సర్కారు హయాం కంటే ఇప్పుడు ఇంగ్లీషు మీడియంలో పరీక్షలు రాసే వారి సంఖ్య 1.63 లక్షలు పెరగడం గమనార్హం. వీరంతా ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియంలో చదివిన విద్యార్థులే కావడం మరో విశేషం. పరీక్షలపై సీఎస్ సమీక్ష వచ్చే నెలలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు, ఇతర భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. కలెక్టర్లు పరీక్షా కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లును సమీక్షించాలని ఆదేశించారు. మంచినీటి సౌకర్యంతో పాటు బాలురు, బాలికలకు వేర్వేరుగా టాయిలెట్ సౌకర్యాలుండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొబైల్ పోలీస్ స్క్వాడ్లను నియమించాలని ఎస్పీలను ఆదేశించారు. జగన్ మావయ్య ఆశయాన్ని సాధిస్తా గిరిజన ప్రాంతంలో జన్మించిన నేను ప్రారంభంలో తెలుగు మీడియంలోనే చదువుకున్నా. జగన్ మావయ్య ప్రభుత్వం వచ్చిన తరువాత ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నా. ప్రస్తుతం జీకే వీధి ఇంగ్లీష్ మీడియం ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నా. జగన్ మావయ్య ఇంగ్లీష్ మీడియం పెట్టి మాలాంటి పేద విద్యార్థులకు అండగా నిలిచారు. ఉన్నత చదువులు చదివి మావయ్య ఆశయాన్ని సాధిస్తా. మా అమ్మ కిల్లో జమున, నాన్న కిళ్లో నవకుమార్ పోడు వ్యవసాయం చేస్తారు. వాటి నుంచి వచ్చే ఆదాయంతో నన్ను చదివించేవారు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉచితంగా మాకు వసతి కల్పిస్తున్నారు. స్కూల్లో టీచర్లు చాలా బాగా బోధిస్తున్నారు. – కె.ధారామణి, ఇంగ్లీష్ మీడియం గిరిజన ఆశ్రమ పాఠశాల, జీకే వీధి, అల్లూరి జిల్లా. కోరిక నెరవేరింది మా ఊరి ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి వరకు తెలుగు మీడియంలో చదివా. ఇంగ్లీష్ మీడియంలో చదవాలన్నది నా చిన్ననాటి కోరిక. పేదరికం కారణంగా నా ఆశ నెరవేరదేమో అనుకున్నా. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మా పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంతో నా కోరిక నెరవేరింది. ఇప్పుడు ఇంగ్లీషు మీడియంలో ఆరో తరగతి చదువుతున్నా. జగన్ మామకు మేమంతా రుణపడి ఉంటాం. మా అమ్మ చిలకమ్మ నన్ను కాన్వెంట్లో ఇంగ్లీషు మీడియంలో చదివించాలని బలంగా కోరుకునేది. దళితులమైనందున పేదరికంతో కాన్వెంట్లో చదివించలేకపోయింది. ప్రభుత్వ స్కూళ్లలో జగనన్న ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడంతో మా అమ్మ కోరిక నెరవేరింది. –సామాబత్తుల లక్ష్మి, కాకినాడ జిల్లా, సంపర ప్రాధమిక పాఠశాల మా అదృష్టం.. కళ్యాణదుర్గంలోని కరణం చిక్కప్ప ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నా. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్పడం మా అదృష్టం. భవిష్యత్తులో ఉన్నత చదువులు చదవడానికి, మంచి ఉద్యోగాల్లో స్థిరపడటానికి ఇంగ్లీష్ మీడియం పునాదిగా ఉపయోగపడుతుంది. మా తల్లిదండ్రులు నాగరాజు, పద్మావతి బేల్దారి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. మాలాంటి పేదలకు ఇంగ్లీష్ మీడియం అందించిన సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం. –తలారి శ్వేత, అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం -
విశ్వవిజేతల కార్ఖానా!
తెలుగు ప్రసార మాధ్యమాలు పెద్దగా పట్టించుకోని ఈ వారపు ఘటనల్లో ఎన్నదగ్గవి రెండు: పాఠశాలల్లో ఐబీ సిలబస్‌ను ప్రారంభించేందుకు సన్నాహంగా ఒక బృందం పాఠశాలల పరిశీలనకు బయల్దేరింది. రెండవది – ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ లెర్నింగ్ సంస్థ ఎడెక్స్‌తో ఒక ఒప్పందం చేసుకున్నది. మొదటిది పాఠశాల విద్యకు సంబంధించినదైతే, రెండోది ఉన్నత విద్యకు సంబంధించిన అంశం. చంద్రబాబు యాచిస్తున్న పొత్తు కౌగిలిని బీజేపీ ప్రసాదిస్తుందా లేదా, జనసైనికులు ఆశిస్తున్న సీట్ల ప్యాకేజీని టీడీపీ అంగీకరిస్తుందా లేదా వగైరా పొలిటికల్ మిర్చి ముందు పై రెండు వార్తలను మీడియా చప్పిడి వార్తలు గానే పరిగణించి ఉండవచ్చు. యెల్లో మీడియా అయితే ఉద్దేశ పూర్వకంగానే విస్మరించింది. ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ యెల్లో మీడియాలో ఉక్కపోత ఎక్కువైంది. కడుపు ఉబ్బరం పెరిగింది. ఒత్తిడి పెరిగింది. ఫలి తంగా దాని వార్తా ప్రాథమ్యాలు మరింత అదుపు తప్పాయి. ‘రాజధాని ఫైల్స్’ పేరుతో ఓ సినిమాను విడుదల చేశారు. ‘ఫైల్స్ కాదు పైల్స్’ (మొలలు) అన్నారెవరో! పెత్తందారీ పైల్స్ అనే పేరు పెడితే బాగుండేదన్నారు. యెల్లో మీడియా ఉన్న పరిస్థితికి ఈ సినిమా బాగా కనెక్టయింది. అందుకే యెల్లో మీడియాలో ప్రముఖ వార్తగా మారింది. యెల్లో మీడియాకు తోడయిన ఇంకో కామ్రేడరీ వార్త ‘విధ్వంసం’ పేరుతో పుస్తకావిష్కరణ. ‘కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ’ అంటారు గదా! అట్లాగే పెత్తందారీ బాధ యెల్లో మీడియా ద్వారా సకల జనులకు బాధ. ఈ రెంటికీ మధ్యనున్న కామ్రేడరీ అనుబంధమే ఆ పుస్తక సారాంశం. కనుక అది కూడా వారికి పెద్ద వార్తే. స్కూళ్లలో ఐబీ సిలబస్ పెడితే మాత్రం ఏమిటి విశేషం? ఎడెక్స్ ద్వారా కళాశాలల్లో అంతర్జాతీయ సిలబస్‌ను ప్రవేశ పెడితే ఏం ప్రయోజనముంటుంది? ఇటువంటి సందేహాలు కలగడం సహజం. వాటిని గురించి చర్చించడానికి ముందు ప్రస్తుత ప్రపంచ పరిణామ దశ గురించిన ప్రాథమిక అవగాహన మనకు ఉండాలి. టెక్నాలజీ అభివృద్ధి కారణంగా ప్రపంచం ఏకైక గ్లోబల్ మార్కెట్‌గా అవతరిస్తున్నది. ఈ మార్కెట్‌ను ఒకే ఒక వ్యవహారిక భాష నియంత్రించనున్నది. గ్లోబల్ విలేజి గురించి తరచూ మాట్లాడుతుంటారు. మన పూర్వీకులు ఎప్పటి నుంచో ‘వసుధైక కుటుంబం’ అనే భావనను వ్యాప్తిలోకి తెచ్చారు. ఈ ఏక కుటుంబంలో ఏకైక సంధాన భాష అవసరం కూడా ఏర్పడింది. ఎలిజర్ బెన్ యెహుదా అనే భాషా శాస్త్రవేత్త ఉండేవారు. ఆయన రష్యాలో పుట్టి పెరిగిన యూదు జాతీయుడు. ప్రపంచ మంతా ఒకే భాష మాట్లాడే రోజు వస్తుందనే అభిప్రాయాన్ని వందేళ్లకు పూర్వమే ఆయన ప్రకటించారు. అయితే అది హిబ్రూ భాష కావాలనేది ఆయన కోరిక. అలాగే సంస్కృతానికి గ్లోబల్ భాషయ్యే లక్షణాలున్నాయనే భాషావేత్తలు కూడా చాలామందే ఉన్నారు. కానీ ఇప్పటికే ప్రపంచ భాషగా ఇంగ్లిషు చాలాదూరం వెళ్లిపోయింది. ప్రపంచీకరణ, సాంకేతిక పురోగతి, వలసల కార ణంగా ఏర్పడుతున్న సాంస్కృతిక మార్పులన్నీ ఆంగ్లీకరణను వేగవంతం చేస్తున్నాయి. ఉన్నతమైన జీవనాన్ని ఆకాంక్షించే ప్రతి బాలికా బాలుడు, ప్రతి యువతీ యువకుడు గ్లోబల్ మార్కెట్ లక్ష్యంగా దూసు కొనిపోవలసిన అవసరం ఉన్నది. అలా దూసుకుపోవాలంటే మొదటి అవసరం – ఇంగ్లిషు భాషలో ప్రావీణ్యం. రెండో అవసరం – వేగంగా మారుతున్న టెక్నాలజీల మీద పట్టు సాధించడం. మూడోది – గ్లోబల్ మార్కెట్ అవసరాలకు పనికివచ్చే సబ్జెక్టులను అభ్యసించడం. ఈ అవసరాలను మన పిల్లలు ఎలా సమకూర్చుకోగలరు? ఎవరో పెట్టిపుట్టినవారు, కలవారి పిల్లలు మాత్రమే నెరవేర్చుకోగలిగిన కలలుగా ఇవి కనిపిస్తున్నాయి. భారతదేశమంతా కలిపి కేవలం 210 అత్యున్నతస్థాయి ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రమే ఇప్పుడు ఐబీ సిలబస్‌ను అమలు చేస్తున్నారు. సంపన్నులు మాత్రమే ఆ స్కూళ్ల ఫీజులను భరించగలరు. మనకు అలవాటైన ‘భట్టీయం’ పద్ధతికి భిన్నంగా ఐబీ విద్యాబోధన ఉంటుంది. మన సంప్రదాయ పద్ధతిలో ఇరవై ఎక్కాలు గడగడ చదివేవారు కూడా సాధారణ లెక్కలు చేయలేక పోవడం మనకు తెలిసిందే. భట్టీయం పద్ధతిలో వివేచన, విశ్లేషణ, ఆలోచనలకు అవకాశం తక్కువ. విమర్శనాత్మకంగా ఆలోచించడం, భిన్నంగా ఆలోచించడం, సమస్యను పరిష్కరించడం వంటి నైపుణ్యాలను ఐబీ పాఠశాలల్లో అలవాటు చేస్తారు. వీటితోపాటు వివిధ రంగాల్లో రాణించేలా ప్రపంచమంతటా ఉపాధి, ఉన్నత విద్యావకాశాలు పొందే విధంగా తర్ఫీదు ఉంటుంది. దేశంలో కేవలం 210 బడుల్లో మాత్రమే ఉన్న ఇటువంటి ఖరీదైన ఐబీ విద్యాబోధనను రాష్ట్రంలోని 40 వేల పైచిలుకు ప్రభుత్వ పాఠశాలల్లో దశలవారీగా ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఈ సంవత్సరం ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. వచ్చే సంవత్సరం (2025–26) నుంచి ఒకటో క్లాసులో ఐబీ సిలబస్ ప్రవేశపెడతారు. ఏటా ఒక్కో క్లాసు పెంచుకుంటూ వెళ్తారు. 2037 నాటికి ప్లస్ టూ వరకు ఆంధ్ర ప్రదేశ్ పాఠశాల విద్యార్థులంతా ఐబీ సిలబస్‌లోనే ఉంటారు. ప్రపంచ గమనానికి అనుగుణంగా మన ఉన్నత విద్యా కోర్సులు మారలేదన్నది ఒక వాస్తవం. ప్రభుత్వాధినేతలకు ఉండవలసిన దార్శనికత (విజన్) లేకపోవడం ఒక కారణం. అసలు సంకల్పమే లేకపోవడం మరో కారణం. చంద్రబాబు వంటి పెత్తందారీ నాయకులు అసలు విద్యారంగంలో ప్రభుత్వ జోక్యమే అనవసరమనీ, దాన్ని పూర్తిగా ప్రైవేట్ రంగానికే వదిలి వేయాలనీ బహిరంగంగానే ప్రబోధించారు. అందుకు తగ్గట్టు గానే ప్రభుత్వ విద్యారంగం కుప్పకూలిపోయేవిధంగా ఉద్దేశ పూర్వకంగా వ్యవహరించారు. ఇప్పుడు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన సంస్కరణల ఫలితంగా నాణ్యమైన ప్రపంచశ్రేణి విద్య పేద విద్యార్థులందరికీ ప్రభుత్వ రంగంలోనే ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. కార్పొరేట్, పెత్తందారీ శక్తులు అందువల్లనే జగన్మోహన్రెడ్డిని అధికారంలోంచి దింపేయడానికి భయంకరమైన కుట్రను రచించాయి. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ కోర్సులు చేస్తున్న మన విద్యా ర్థులు ప్రపంచ మార్కెట్లో పోటీపడటానికి అనువుగా వారి పాఠ్యాంశాలు, బోధనా ప్రక్రియలు లేవన్నది నిర్వివాదాంశం. వరల్డ్ క్లాస్ స్థాయికి మన కళాశాలలను తీర్చిదిద్దడానికి చాలా సమయం పట్టవచ్చు. అప్పటివరకు ఏటా బయటకొస్తున్న మన పట్టభద్రులంతా అన్యాయానికి గురికావలసిందేనా? అలా జరగ కూడదన్న లక్ష్యమే ఎడెక్స్‌తో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందానికి కారణమైంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, హార్వర్డ్, కొలంబియా. కేంబ్రిడ్జి, ఎమ్ఐటీ వంటి ప్రతిష్ఠాత్మక గ్లోబల్ వర్సిటీలు అందించే కోర్సులను ఎడెక్స్ ద్వారా మన డిగ్రీ, పీజీ, ఇంజనీ రింగ్ విద్యార్థులకు అందుబాటులోకి తేవడం ఈ ఒప్పందంలోని ప్రధానాంశం. విద్యార్థులకు ఈ కోర్సులు ఉచితంగా అందు బాటులోకి వస్తాయి. కరిక్యులమ్‌లో భాగమవుతాయి. ఆర్టిఫీషి యల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా మైనింగ్, డేటా అనలిటిక్స్, వర్చ్యువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, రిస్క్ మేనేజిమెంట్, రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్, స్టాక్ ఎక్స్ఛేంజ్, వెల్త్ మేనేజిమెంట్ వంటి ఆధునిక కోర్సుల్లో మన దగ్గర ప్రామాణికత లేదు. ఎడెక్స్ ద్వారా ఇందులో వరల్డ్ క్లాస్ కోర్సులను మన విద్యార్థులకు అందుబాటులోకి తెస్తు న్నారు. ఈ వర్టికల్స్‌కు సంబంధించిన పరీక్షను ఎంపిక చేసు కున్న గ్లోబల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో నిర్వహిస్తారు. విద్యార్థికి ఆ కోర్సులకు సంబంధించిన క్రెడిట్స్ లభిస్తాయి. గ్లోబల్ మార్కెట్లో ఉపాధి పొందడానికి, ఉన్నతమైన విదేశీ విద్యను అభ్యసించడానికి ఈ క్రెడిట్స్ ఉపకరిస్తాయి. ఈ ప్రయత్నాలు ఇంకో పది పదిహేనేళ్లు నిర్విఘ్నంగా కొన సాగితే మన విద్యార్థులు ప్రపంచ వేదికపై జైత్రయాత్ర చేస్తారు. అత్యున్నత స్థానాలకు ఎగబాకుతారు. వారితోపాటు వారి కుటుంబాలు, గ్రామాలు, రాష్ట్రం, దేశం అభివృద్ధి ఫలాలను అందుకుంటాయి. పేదవాడు అభివృద్ధి చెందడం పెత్తందారీ శక్తులకు నచ్చదు. వారి అభివృద్ధిని ఓర్వలేరు. ఇంతటి విప్లవా త్మకమైన ప్రగతిశీలతకు విత్తనాలు చల్లుతున్న శుభఘడియలకు వారి దృష్టిలో ప్రాధాన్యం లేదు. అందుకే అవి వార్తలు కావు. పైపెచ్చు మసిపూయాలి. బురద చల్లాలి. విధ్వంసం జరుగుతున్నదని ఓండ్రపెట్టాలి. అభివృద్ధి ఎక్కడు న్నదని మొరగాలి. మూలశంక వ్యాధి వికారాన్ని సినిమాల్లో ప్రద ర్శించాలి. ఇప్పుడదే జరుగుతున్నది. పేదలకు విజ్ఞాన ఫలాలు అందకూడదు, నాణ్యమైన విద్య అందుబాటులో ఉండకూడదనే పెత్తందారుల కుట్ర కేవలం వారి స్వార్థం మాత్రమే కాదు. ఇదొక దేశద్రోహ నేరం. దేశాభివృద్ధికి గొడ్డలిపెట్టు. క్రీస్తుశకం రెండో శతాబ్దం నుంచి ఆరేడు శతాబ్దాల మధ్యకాలంలో భారతీయ మేధావులు చేసిన ఆవిష్కరణలు సామాన్యమైనవి కావు. శూన్యాంకాన్ని (జీరో) ప్రసాదించి ప్రపంచ గణితశాస్త్రాన్ని మలుపుతిప్పిన ప్రతిభాశాలి, గ్రహగతు లను, భూభ్రమణాన్ని నిర్ధారించిన మేధావి ఆర్యభట్ట, గణిత ఖగోళ శాస్త్రజ్ఞులైన భాస్కర – బ్రహ్మగుప్త – వరాహమిహిర, వైద్యశాస్త్ర పితామహుడు చరకుడు, సర్జరీ పితామహుడు సుశ్రుతుడు, ఆటమిక్ థియరీని ప్రతిపాదించిన కణాదుడు, తత్వవేత్త – రసవాద శాస్త్రవేత్త ఆచార్య నాగార్జునుడు, ప్రామా ణిక అర్థశాస్త్ర రచయిత చాణక్యుడు, యోగశాస్త్ర సృష్టికర్త పతంజలి వగైరాలంతా ఆ కాలంలో జీవించినవారే. కానీ ఆనాటి విజ్ఞాన మంతా సంస్కృత భాషకే పరిమితం కావడం, ఆ భాషను నేర్చుకునే అర్హత పిడికెడు మందికే పరిమితం కావడం జాతికి జరిగిన తీరని ద్రోహం. విశాల ప్రజానీకానికి విద్య అందుబాటులో ఉండి ఉంటే, సంస్కృతం నిషిద్ధం కాకపోయి ఉంటే ఈ మేధావుల ఆవిష్క రణలు మరింత ఊర్ధ్వగతి పొందేవి. వందలాదిమంది శాస్త్ర వేత్తలు ఉద్భవించేవారు. పారిశ్రామిక విప్లవం బ్రిటన్ కంటే రెండు మూడు శతాబ్దాల ముందే భారత్‌లో ప్రభవించేది. మన నెమలి సింహాసనం, మన కోహినూర్ వజ్రం మన దగ్గరే ఉండేవని చెప్పడం చాలా చిన్న విషయం. ఇంకా ఏమేమి జరిగి ఉండేవనేది ఒక అధ్యయనాంశం. ఇప్పుడు కూడా ప్రపంచ భాష ఇంగ్లిష్ నేర్చుకోవద్దనీ, నాణ్యమైన విద్యను అభ్యసించ కూడదనీ పేదవర్గాలను మన పెత్తందార్లు శాసిస్తున్నారు. ఇదే దేశద్రోహం. ఈ దేశద్రోహానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ పేద వర్గాల ప్రజలు జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో యుద్ధానికి సిద్ధ మవుతున్నారు. పెత్తందారీ – కార్పొరేట్ శక్తులు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా సకల రాజకీయ పక్షాలను ఏకం చేసి మోహ రించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ‘కుడి ఎడమల డాల్ కత్తులు మెరయగ...’ అన్నట్టు అతివాద మితవాద పార్టీలన్నీ ఎవరి దారిలో వారు ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారు. పెత్తందార్ల సేవలో తరిస్తున్నారు. చివరికి త్యాగాల చరిత గల పతాకాలనూ అపవిత్రం చేస్తున్నారు. పేదవర్గాలు ఈ పరిణామాలను గమనించాయి. సమరోత్సాహంతో నినదిస్తున్నాయి. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
AP: ‘ఐబీ’ సిలబస్ శిక్షణ ఇదిగో
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) సిలబస్ అమలుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించి గత నెల 31వతేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఐబీ సంస్థతో ఏపీ ఎస్సీఈఆర్టీ ఒప్పదం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 15 రోజుల వ్యవధిలో ఐబీ ప్రతినిధులు ఏపీలో విద్యా విధానం, సంస్కరణల అమలు, ఉపాధ్యాయ శిక్షణ తదితర అంశాలను పరిశీలించారు. ఒప్పందం జరిగిన వెంటనే విజయవాడలోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో ఐబీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి సంస్థ ప్రతినిధులు కార్యకలాపాలు ప్రారంభించారు. ఈనెల 26వతేదీ నుంచి 9 రోజుల పాటు ఐబీ అధికారుల బృందం జిల్లాల్లో పర్యటించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లా, మండల, మున్సిపల్ స్కూళ్లతో పాటు ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇతర మేనేజ్మెంట్ పాఠశాలను బృందం పరిశీలిస్తుంది. క్షేత్రస్థాయి పరిస్థితులు, ప్రభుత్వం కల్పించిన సదుపాయాలు, ఉపాధ్యాయుల సామర్థ్యాలను అంచనా వేయనున్నారు. – సాక్షి, అమరావతి తొలుత విజయవాడలో టీచర్లకు శిక్షణ ఇంటర్నేషనల్ బాకలారియెట్ సిలబస్ బోధనపై మార్చి నుంచి విజయవాడలో మాస్టర్ ట్రైనర్స్‌గా తొలుత కొందరు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని యోచిస్తున్నారు. మెక్సికోకు చెందిన ఐబీ ప్రతినిధి ఆల్డో ఇటీవల ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలలను స్వయంగా పరిశీలించారు. సదుపాయాలు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల వినియోగం, బోధనా విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులకు ప్రభుత్వం అందించిన ట్యాబ్‌ల పనితీరును అడిగి తెలుసుకోవడంతో పాటు వారితో సంభాషించి పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న ‘జగనన్న గోరుముద్ద’ను సైతం రుచి చూశారు. పాఠశాలల్లో భౌతిక, జీవశాస్త్ర ప్రయోగశాలలు, ఇంగ్లిష్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్‌లను పరిశీలించి ఉపాధ్యాయులను ప్రశంసించారు. ఐబీకి చెందిన మరో ప్రతినిధి ఆశిష్ రెండు రోజులు విద్యాశాఖ అధికారులతో సమావేశమై పాఠశాలల్లో ఐటీ, ఆన్లైన్ సేవలను తెలుసుకున్నారు. ఏపీ విద్యా విధానాలు ఐబీకి దాదాపు దగ్గరగా ఉన్నాయని పేర్కొనడం గమనార్హం. వచ్చే ఏడాది ఒకటో తరగతి నుంచి.. ఐబీ అమలుపై 2024–25 విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యాశాఖ సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వనున్నారు. ఉపాధ్యాయులతోపాటు మండల, జిల్లా విద్యాధికారులు, ఎస్సీఈఆర్టీ, డైట్ సిబ్బంది, ఎస్సెస్సీ, ఇంటర్ బోర్డు సిబ్బంది వీరిలో ఉంటారు. వీరికి దశలవారీగా ‘ఐబీ’పై అవగాహన, నైపుణ్యం, సామర్థ్యాల పెంపుపై శిక్షణ ఇచ్చి ఐబీ సర్టిఫికెట్లు అందచేస్తారు. దీంతో వీరంతా ప్రతిష్టాత్మక ఐబీ గ్లోబల్ టీచర్ నెట్‌వర్క్‌లో భాగమవుతారు. అనంతరం 2025 జూన్‌లో ప్రారంభమయ్యే 2025–26 విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతితో ఐబీ విద్యాబోధన ప్రారంభం అవుతుంది. ఏటా ఒక్కో తరగతి చొప్పున పెంచుకుంటూ వెళతారు. విద్యార్థులు 2035 నాటికి పదో తరగతి, 2037లో ప్లస్ 2లో ఐబీ సిలబస్‌లో పరీక్షలు రాస్తారు. విద్యార్థులకు ఐబీ, ఏపీ ఎస్సీఈఆర్టీ కలిసి అందించే జాయింట్ సర్టిఫికేషన్‌కు అంతర్జాతీయ గుర్తింపు ఉంటుంది. రూ.73 వేల కోట్లతో సంస్కరణలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పేద పిల్లలు అధికంగా చదువుకునే పాఠశాల విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. విద్యార్థులు ఉన్నతంగా ఎదిగి ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ప్రాథమిక స్థాయి నుంచి ప్రణాళికలు అమలు చేస్తోంది. జగనన్న అమ్మఒడి, విద్యాకానుక, గోరుముద్ద తదితర విప్లవాత్మక కార్యక్రమాలను ప్రవేశపెట్టి విద్యార్థుల ఉన్నతికి బాటలు వేసింది. 2019 జూన్ నుంచి 2024 జనవరి వరకు విద్యా రంగ సంస్కరణల కోసం ఏకంగా రూ.73,293.68 కోట్లు వెచ్చించింది. ఇప్పుడు ఐబీ బోధనను సైతం ప్రభుత్వ స్కూళ్లలో అందుబాటులోకి తెస్తోంది. అత్యధిక ఐబీ స్కూళ్లు ఏపీలోనే.. ప్రాథమిక విద్యా బోధనలో ప్రపంచంలోనే అత్యుత్తమ విధానాలను ఫిన్‌ల్యాండ్ అమలు చేస్తోంది. పాలనలో పారదర్శకత, మానవ వనరుల వినియోగం, ప్రణాళికలో ఎప్పుడూ ముందు వరుసలో నిలుస్తోంది. ప్రస్తుతం ఐబీ బోర్డు డైరెక్టర్ జనరల్‌గా ఉన్న ఓలి పెక్కా హీనోనెన్ ఫిన్‌ల్యాండ్ జాతీయ విద్యాశాఖకు డైరెక్టర్ జనరల్‌గా సేవలందించారు. ఆయనే స్వయంగా ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ విధానాలను పర్యవేక్షిస్తుండడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 వేల వరకు ఐబీ స్కూళ్లు ఉండగా 2025 జూన్‌లో ప్రపంచంలోనే అత్యధిక ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలు చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలువనుంది. ఏపీలో దాదాపు 45 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ (ప్రాథమిక, ప్రాథమికోన్నత) స్కూళ్లు 39 వేల వరకు ఉన్నాయి. ఈ స్కూళ్లలో 2025 జూన్‌లో ఒకటో తరగతితో ఐబీ బోధన ప్రారంభం కానుంది. అంతర్జాతీయంగా పేరున్న ఐబీ బోర్డుకు ప్రపంచంలోనే అతి పెద్ద నెట్వర్క్ మన రాష్ట్రంలోనే ఉండడం విశేషం. -
AP: మన బడికి అంతర్జాతీయ ఖ్యాతి
సాక్షి, అమరావతి : సరైన సదుపాయాలు కల్పిస్తే తామెంతో అద్భుతంగా రాణించగలమని రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నిరూపిస్తున్నారు. జాతీయ స్థాయిలోనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలోనూ ఇప్పుడు వీరు తమ ప్రతిభను చాటుతున్నారు. నాడు–నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్ది, విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. దీంతో అక్కడి సైన్స్ ల్యాబ్స్, నిష్ణాతులైన ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నిర్వహించే ‘ఇన్స్పైర్’ పోటీల్లో వారిప్పుడు తమ సత్తా చాటుతున్నారు. 2019 నుంచి 2022 విద్యా సంవత్సరం వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఏడుగురు విద్యార్థులు తమ సైన్స్ ప్రతిభతో ‘జపాన్ సకురా’ పోటీలకు ఎంపిక కాగా, వీరిలో ముగ్గురు జపాన్‌లో పర్యటించి వచ్చారు. మరో నలుగురు వచ్చే మేలో జపాన్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. 10 నుంచి మూడో స్థానానికి.. నిజానికి.. 2019కి ముందు జాతీయ స్థాయి ఇన్స్పైర్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో ఉంటే ఇప్పుడు 3వ స్థానానికి చేరుకుంది. గతంలో రెండు మూడేళ్లకు ఒక్కరు ఈ పోటీలకు ఎంపికవడమే గగనంగా ఉండే పరిస్థితి నుంచి ఇప్పుడు ఏటా ముగ్గురు నుంచి నలుగురు ఎంపికవుతుండడం విద్యా ప్రమాణాలు, సదుపాయాల పెరుగుదలకు, ఉపాధ్యాయుల శిక్షణ కారణమని విద్యావేత్తలు అభినందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థుల్లో 10 మంది గత సెప్టెంబరులో అమెరికా, యూఎన్ఓలో ప్రసంగించిన విషయం తెలిచిం దే. ఇప్పుడు అదే స్థాయిలో ఇన్స్పైర్ విద్యారు్థలు జపాన్‌కు వెళ్లి ఏపీ విద్యా ప్రగతిని చాటుతున్నారు. జాతీయ పోటీలకు ఏటా 40 మంది.. ‘ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్‌స్యుట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్’ (ఇన్స్పైర్) పేరుతో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం సైన్స్ పోటీలను నిర్వహిస్తోంది. దీనిద్వారా పాఠశాల స్థాయిలోని విద్యార్థులు తమ దైనందిన జీవితంలో చూసిన సమస్యలకు పరిష్కారాలను చూపుతూ నమూనాలను తయారుచేయాలి. ఇందుకోసం ఇన్స్పైర్ వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకుంటే.. ఆకర్షణీయమైన అంశాలౖపె ప్రాజెక్టు చేసేందుకు అవకాశం కల్పిస్తుంది. గత నాలుగేళ్లుగా 40 వేల మందికి పైగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రాజెక్టులు నమోదుచేస్తున్నారు. వీటి నుంచి రాష్ట్రస్థాయి పోటీలకు 400 వరకు ఎంపికవుతుండగా, జాతీయ పోటీలకు 40 నుంచి 45 ప్రాజెక్టులు ఎంపికవుతున్నాయి. జాతీయ పోటీల్లో రాష్ట్రం నుంచి ఇంత పెద్దస్థాయిలో విద్యార్థుల ప్రాజెక్టులు ఎంపికవడం ఇప్పుడే జరుగుతోంది. ఉత్తమ ప్రాజెక్టులకు పేటెంట్ రైట్స్.. గతేడాది గుంటూరు జిల్లా అత్తోట జెడ్పీ స్కూల్ విద్యార్థిని పి. కీర్తి వీధుల్లో కూరగాయలు అమ్ముకునే వారికి ఉపయోగపడే వెండర్స్ ఫ్రెండ్లీ సోలార్ కార్ట్‌ను రూపొందించింది. రూ.10 వేల ఖర్చుతో తయారుచేసిన ఈ బండిపై ఆకు కూరలు వారంరోజుల పాటు ఫ్రెష్‌గా ఉంటాయి. అలాగే.. ► చిత్తూరు జిల్లా ఏఎల్‌పురం జెడ్పీ స్కూల్ విద్యార్థిని కె. ప్రణయ దాదాపు 15 రోజులపాటు కూరగాయలు పాడవకుండా ఫ్రెష్‌గా నిల్వచేసుకునే గార్లిక్ బ్యాగ్‌ను రూపొందించింది. వెల్లుల్లి పేస్టును గోనె సంచికి పూసి తయారుచేసిన ఈ సంచిని నిపుణులు సైతం పరిశీలించి, ప్రణయను అభినందించారు. వెల్లుల్లి ఉన్నచోట బ్యాక్టీరియా చేరదని, రూ.25 ఖరీదుతో చేసిన ఈ బ్యాగ్ రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని విద్యార్థిని చెబుతోంది. ► ఇక చిత్తూరు జిల్లా జంగంపల్లి జెడ్పీ స్కూల్ విద్యార్థి పి. చరణ్ తేజ బైక్‌పై ప్రయాణించే మహిళలు పడిపోకుండా రక్షణగా ఉండే సైడ్ సీట్‌ను రూపొందించాడు. ఇలా.. రైతు కుటుంబాలకు చెందిన ఈ ముగ్గురు విద్యార్థులు తాము ప్రతిరోజూ చూస్తున్న సమస్యలకు పరిష్కారంగా ఈ ఆవిష్కరణలు చేసి, జాతీయ ప్రతినిధులను మెప్పించారు. తమ ఆవిష్కరణలకు పేటెంట్ హక్కులు పొందడంతో పాటు గత నవంబరులో జపాన్ వెళ్లి వచ్చారు. మేలో మరో నలుగురు విద్యార్థులు జపాన్ పర్యటనకు సిద్ధమవుతున్నారని స్టేట్ సైన్స్ ఆఫీసర్ డాక్టర్ భాగ్యశ్రీ ‘సాక్షి’కి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ల్యాబ్స్ సదుపాయాలు, బోధనా పద్ధతులు మెరుగుపడ్డాయని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ ప్రతాప్‌రెడ్డి చెప్పారు. 2022–23 సంవత్సరపు ఇన్స్పైర్ పోటీలు జిల్లా స్థాయిలో ఇప్పటికే ప్రారంభమయ్యాయని, గతంకంటే ఈసారి అంతర్జాతీయ స్థాయి పోటీలకు వెళ్లే మన విద్యార్థులు పెరుగుతారని ఆయన చెబుతున్నారు. -
విద్యా వ్యవస్థలో మరో విప్లవం
రాష్ట్రంలో ప్రతి పేద విద్యార్థికి కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలన్న సంకల్పంతో సీఎం జగన్ విభిన్న ప్రాజెక్టులతో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు సుకొస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో పునాది స్థాయిలోనే కంప్యూటర్ విద్యను అందిస్తే.. భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే యువతగా విద్యార్థులు తలెత్తుకొని జీవించగలరనే నమ్మకంతో మరో కీలక ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అమెజాన్ ఇండియాతో జతకడుతూ ‘అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ ప్రోగ్రాం’ కింద వరుసగా రెండో ఏడాది కూడా ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర జిల్లాల విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి కంప్యూటర్ సైన్స్ పాఠాలు పాఠశాల స్థాయిలో 6వ తరగతి నుంచి బోధించేందుకు అడుగులు పడనున్నాయి. వెనక బాటు జిల్లాలుగా ఉన్న ఈ ప్రాంత భవిష్యత్తు సార థులైన విద్యార్థులకు ప్రభుత్వం ఈ గొప్ప అవకాశం కల్పిస్తోంది. 2024–25 విద్యా సంవత్సరం నాటికి 10 వేల మంది ఏపీ విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్ విద్యతో సాధికారత కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమెజాన్ ఇండియాతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. 2026–27 నాటికి సంపూర్ణంగా ఈ ప్రయోజనాలను లక్ష మందికి అందించాలన్నదే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఇందులో భాగంగా విజయవాడలో ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డి, సమగ్రశిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు సమక్షంలో ఒప్పంద సంతకాలు జరిగాయి. రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రపంచ బ్యాంకు భాగస్వామ్యంతో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన ఈ బృహత్తర కార్యానికి అనేక సంస్థలు మందుకువచ్చాయి. అమెజాన్ ఇండియా ఫండ్స్, సమగ్ర శిక్షతో పాటు ప్రపంచబ్యాంక్ టెక్నికల్ సపోర్ట్ సిస్టమ్, లీడర్షిప్ ఫర్ ఈక్విటీ, క్వెస్ట్ అలయన్స్ అనే ఎన్జీవో ఇందులో ఉన్నాయి. వీరందరి భాగస్వామ్యంతో ఉత్తరాంధ్ర విద్యార్థుల భవితను తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. ‘కంప్యూటేషనల్ థింకింగ్ అండ్ 21 సెంచరీ స్కిల్స్’పై శిక్షణా కార్యక్రమం ద్వారా తరగతి గదుల్లో కంప్యూటర్ సైన్స్ పాఠ్యాంశాలను సమర్థవంతంగా అందించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. కేవలం విద్యార్థులకే కాకుండా ఉపాధ్యాయులకు కూడా బోధన, సాంకేతిక, నాయకత్వ నైపుణ్యాలపై శిక్షణ ఇస్తారు. 10 వేల మంది నుంచి లక్ష వరకూ.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు కంప్యూ టర్ సైన్స్ పాఠ్యాంశాలు సులువుగా అర్థమయ్యేలా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. పైలట్ ప్రాజెక్టు కింద ఉత్తరాంధ్రలో 10 వేల మంది విద్యార్థులకు ఈ తరగతులు అందుబాటులోకి రానున్నాయి. ఏపీలో లక్ష మందికి ఈ విద్యను చేరువ చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఎస్సీఈఆర్టీతో కలిసి పాఠశాలల్లో కంప్యూటేషనల్ థింకింగ్ క్లబ్‌లు ఏర్పాటు చేయనుంది. విద్యార్థులకు కంప్యూటర్ సై న్స్ పాఠాల బోధన, ప్రాక్టికల్‌గా శిక్షణ ఇలా విభిన్న అంశాల్లో తరగతులు నిర్వహించి పిల్లల్ని నిష్ణాతుల్ని చేయనుంది. ఎక్సలెన్స్ కోర్సుల అనుసంధానం కంప్యూటర్ సైన్స్ టీచింగ్ ఎక్సలెన్స్ కోర్సులను అనుసంధానం చేయడం ద్వారా డిజిటల్ యుగానికి అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు అందించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ప్రైవేట్ పబ్లిక్ పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సాంకేతిక విద్యను చేరువ చేస్తున్నాం. దీనివల్ల విద్యార్థుల ఉన్నత చదువులకు ఈ ప్రోగ్రాం ఒక పునాదిలా మారుతుంది. – బి.శ్రీనివాసరావు, సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ ప్రతి విద్యార్థికి అవకాశం అమేజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులందరినీ సాంకేతిక విద్యను చేరువ చేయాలన్నదే అమేజాన్ ఇండియా లక్ష్యం. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంతో అడుగులు వేస్తున్నాం. విద్యార్థులకు వారి కెరీర్లకు అవ సరమైన నైపుణ్యాల్ని అందిస్తాం. బెస్ట్ కెరీర్‌కు కంప్యూటర్ సైన్స్ విద్య ఎంతో దోహద పడు తుంది. రెండేళ్లలో దేశ వ్యాప్తంగా 1.5 మిలి యన్ మంది విద్యార్థులకు, 8 వేల మంది టీచర్లకు కంప్యూటర్ సైన్స్ విద్య అందించాం. – అక్షయ్ కశ్యప్, అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ ఇండియా లీడర్ -
ఇంతటి అభివృద్ధి ఇదే ప్రథమం
గుంటూరు ఎడ్యుకేషన్: ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఉపాధ్యాయుల సంక్షేమం భేషుగ్గా ఉందని పలువురు మేధావులు, విద్యావేత్తలు వెల్లడించారు. విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టి.. ప్రభుత్వ పాఠశాలలకు జీవం పోసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను మళ్లీ గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘జగన్ పాలన–ఉపాధ్యాయుల స్పందన’పై శనివారం గుంటూరులో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళుతుంటే ఎల్లో మీడియా నిత్యం విష ప్రచారం సాగిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలలను సకల హంగులతో తీర్చిదిద్దిన జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయమన్నారు. కాగా లక్ష్మీపార్వతిని ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు. ఈ సదస్సులో బండ్లమూడి రోజారాణి, వైఎస్సార్ ఇంటెలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు జి.శాంతమూర్తి, హైకోర్టు న్యాయవాది ప్రభాకర్, ఉపాధ్యాయులు సత్యనారాయణరెడ్డి, జ్యోతిరెడ్డి, డి.తిరుపతిరెడ్డి, సాదం సత్యనారాయణ, పలువురు విద్యావేత్తలు, మేధావులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి విద్యార్థిపై రూ.90 వేలు ఖర్చు జాతీయ స్థాయిలో విద్యాభివృద్ధి కోసం వివిధ రాష్ట్రాలు ఒక్కో విద్యార్థిపై సగటున రూ.50 వేలు మాత్రమే ఖర్చు చేస్తున్నాయి. అదే మన రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై రూ.90 వేలు ఖర్చు చేస్తోంది. గతేడాది ఉపాధ్యాయులతోపాటు 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లను బైజూస్ కంటెంట్‌తో ఉచితంగా పంపిణీ చేసింది. దేశంలోని మరే రాష్ట్రం వేల కోట్ల రూపాయల విలువైన డిజిటల్ విద్యా ఉపకరణాలను ఉచితంగా ఇవ్వడం లేదు. ఐబీ సిలబస్‌లో చదువుకోవాలంటే ఏడాదికి రూ.నాలుగు లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకు ప్రైవేటు స్కూళ్లు వసూలు చేస్తున్నాయి. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వం పేద పిల్లలకు దీన్ని ఉచితంగా బోధించనుంది. – వీవీఆర్ కృష్ణంరాజు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభుత్వ పాఠశాలలు కొత్తరూపు సంతరించుకున్నాయి.. సీఎం వైఎస్ జగన్ పరిపాలనలో ప్రభుత్వ పాఠశాలలు ఆధునిక వసతులతో కొత్త రూపు సంతరించుకున్నాయి. పేద పిల్లలకు నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం చదువులను అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వం ఉచితంగా చెప్పిస్తోంది. ఉపాధ్యాయులకు అత్యధిక వేతనాలు అందుతున్నాయి. ఆరేళ్ల సరీ్వసు ఉన్న ఉపాధ్యాయులకు కేరళలో రూ.2.6 లక్షలు, కర్ణాటకలో రూ.3 లక్షలు, తమిళనాడులో రూ.4.3 లక్షలు, తెలంగాణలో రూ.5.2 లక్షల వార్షిక వేతనాలు మాత్రమే ఉన్నాయి. అదే ఆంధ్రప్రదేశ్‌లో రూ.5.6 లక్షలు అందుతున్నాయి. –మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బెటర్ ఏపీ కన్వినర్ ప్రభుత్వ రంగాభివృద్ధితో ఉపాధ్యాయులకే ప్రయోజనం నా 50 ఏళ్ల విద్యారంగ అనుభవంలో ఎన్నడూ ఇంతటి అభివృద్ధిని చూడలేదు. ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందితే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. దీనివల్ల ఉపాధ్యాయులకే ప్రయోజనం. మరింత మంది ఉపాధ్యాయులు అవసరమవుతారు. – ప్రొఫెసర్ డీఏఆర్ సుబ్రహ్మణ్యం, డీన్, మహాత్మాగాంధీ కళాశాల, గుంటూరు ఇంతటి అభివృద్ధి చరిత్రలో ఎప్పుడూ లేదు గత టీడీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లు లేక ఆడపిల్లలు చదువులు మానేయాల్సిన దుస్థితిని చూశాం. వైఎస్ జగన్ వచ్చాక నాడు–నేడు ద్వారా జరిగిన అభివృద్ధి చరిత్రలోనే ఎన్నడూ జరగలేదు. – ఆలపాటి రాధామాధవ్, అధ్యాపకుడు, గుంటూరు జగన్‌ను గెలిపించుకోకుంటే ఈ సంక్షేమం ఆగిపోతుంది.. స్వాతంత్య్రం వచ్చాక ప్రభుత్వ పాఠశాలలను ఆధునికంగా తీర్చిదిద్దిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్కరే. పేదలకు అండగా నిలిచిన సీఎం జగన్‌కు ప్రజలందరూ అండగా నిలవాలి. ఆయనను గెలిపించుకోకుంటే ఈ సంక్షేమం ఆగిపోతుంది. – డాక్టర్ పి.ముత్యం, ఏసీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్, గుంటూరు విద్యా రంగంపై రూ.74 వేల కోట్ల వ్యయం విద్యారంగంపై ప్రభుత్వం రూ.74 వేల కోట్లు ఖర్చు చేసింది. వివిధ పథకాలతో పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. డిజిటల్ విద్య, ట్యాబ్స్, ఐఎఫ్‌పీ, స్మార్ట్‌టీవీలతో ఆధునిక చదువులను అందుబాటులోకి తెచ్చారు. జగన్ పాలనలో రాష్ట్రంలో 12 వేల పీఈటీ, భాషా పండిట్లకు పదోన్నతులు కల్పించారు. 1998, 2008, 2018 డీఎస్సీల కింద మొత్తం 13,272 పోస్టులను భర్తీ చేశారు. –టి.కల్పలతారెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ -
AP DSC Notification: 6,100 పోస్టులతో డీఎస్సీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మొత్తం 6,100 పోస్టుల భర్తీకి డీఎస్సీ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ పోస్టుల్లో 2,280 సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ), 2,299 స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ), 1,264 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ), 215 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), 42 ప్రిన్సిపాల్ పోస్టులు ఉన్నాయి. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)తో పాటు డీఎస్సీ–2024 నోటిఫికేషన్లకు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. ఈ మేరకు గురువారం టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఈనెల 12న ఇవ్వనుంది. టెట్, డీఎస్సీకి పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ https://cse.ap.gov.in ద్వారా చేసుకోవాలి. ఈ మేరకు బుధవారం సచివాలయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్ వివరాలు వెల్లడించారు. నోటిఫికేషన్ ఇచ్చిన రోజు నుంచే ఆయా పరీక్షలకు ఆన్లైన్ దరఖాస్తులు కూడా స్వీకరిస్తారు. మొత్తం ప్రక్రియను పూర్తిచేసి, ఏప్రిల్ చివరి నాటికి అభ్యర్థులకు పోస్టింగ్ ఇస్తామని, వారు వచ్చే విద్యా సంవత్సరంలో బోధన కూడా చేపడతారని మంత్రి బొత్స తెలిపారు. అందుకు అనుగుణంగా షెడ్యూల్ ఖరారు చేశామన్నారు. రాష్ట్రంలో చివరిసారిగా 2022 ఆగస్టులో టెట్ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష నిర్వహించామని తెలిపారు. ఈ నేపథ్యంలో బీఈడీ, డీఈడీ పూర్తిచేసినవారికి, గతంలో టెట్ అర్హత సాధించలేని వారికి అవకాశం కల్పించేందుకు టెట్ కూడా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గతంలో తలెత్తిన ఇబ్బందుల దృష్ట్యా పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌లో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్‌ను సైతం ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. వివిధ విద్యా సంస్థల పరిధిలో 6,100 పోస్టులు.. ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి ఖాళీ అయ్యే పోస్టులతో కలిపి మొత్తం 6,100 పోస్టులను భర్తీ చేసేందుకు డీఎస్సీ నిర్వహిస్తున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. జిల్లా, మండల పరిషత్, మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్, ఏపీ మోడల్ స్కూళ్లు, ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ, ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఆశ్రం), ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల్లో మొత్తం అన్ని ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకు 14,219 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందన్నారు. విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిందని గుర్తు చేశారు. ఈ ఐదేళ్లల్లో విద్యపై రూ.73 వేల కోట్లు ఖర్చు చేసినట్టు వివరించారు. రాష్ట్రంలో పేదింటి పిల్లలకు ఎలాంటి విద్యను అందిస్తే వారు ఉజ్వల భవిష్యత్‌ను అందుకుంటారో సీఎం వైఎస్ జగన్‌కు బాగా తెలుసని చెప్పారు. అందుకే ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ, టోఫెల్‌ను అందుబాటులోకి తెచ్చారన్నారు. కొద్దిరోజుల క్రితం ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) సంస్థతో ఒప్పందం కూడా చేసుకున్నామని గుర్తు చేశారు. విద్యార్థుల మేలు కోసం కొత్త నిర్ణయం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మేలు చేసే మరో మంచి నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యా సంవత్సరం మధ్యలో రిటైర్ అయితే విద్యార్థులకు బోధన సమస్య తలెత్తుతోందన్నారు. కొత్తవారిని నియమించినా విద్యార్థులు అలవాటు పడేందుకు సమయం పడుతోందని వివరించారు. ఈ ప్రభావం విద్యార్థుల ఫలితాలపై పడుతున్నట్టు గుర్తించామన్నారు. దీన్ని అధిగమించేందుకు విద్యా సంవత్సరం మధ్యలో ఉపాధ్యాయులు రిటైర్ అయితే, ఆ విద్యా సంవత్సరం మొత్తం వారినే కొనసాగించే యోచన చేస్తున్నామన్నారు. దీనివల్ల విద్యార్థులకు ఆ విద్యా సంవత్సరం మొత్తం ఒకే టీచర్ బోధన అందుతుందని చెప్పారు. ఇప్పటికే ఈ విధానం కేరళలో అమల్లో ఉందని, త్వరలో దీనిపై విధివిధానాలు ప్రకటిస్తామన్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో టెట్, డీఎస్సీ.. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ మాట్లాడుతూ.. ఏపీ టెట్, డీఎస్సీ పరీక్షలు రెండింటినీ ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)గా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రోజుకు రెండు సెషన్లలో నిర్వహిస్తామన్నారు. మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఉంటుందని చెప్పారు. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 185 కేంద్రాలను ఎంపిక చేశామని తెలిపారు. రాష్ట్రం బయట ఉన్నవారి కోసం మరో 22 సెంటర్లను హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, బరంపురంల్లో ఏర్పాటు చేస్తామన్నారు. డీఎస్సీ రాయాలనుకునే జనరల్ అభ్యర్థులకు 44 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 49 ఏళ్ల వయోపరిమితి ఉంటుందని చెప్పారు. ఈసారి డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులకు నాలుగు దశల్లో ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ), టెక్నాలజీ ట్రైనింగ్, టోఫెల్, బోధన సామర్థ్యంపై శిక్షణ ఉంటుందని తెలిపారు. ఇందులో సర్టిఫికెట్లు సైతం ప్రదానం చేస్తామన్నారు. కమిషనర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొత్తం 7 లక్షల మంది పరీక్ష రాసేలా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యాశాఖ కమిషనర్ పి.భాస్కర్, విద్యాశాఖ జేడీలు మేరీ చంద్రిక, మొవ్వా రామలింగం, డాక్టర్ ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ విద్యపై మరోసారి విషం కక్కిన రామోజీ
-
ప్రభుత్వ బడుల్లో ‘ఐబీ’ విద్య అమలుకు ఒప్పందం
భావి తరాలకు నాణ్యమైన విద్య అందించడం ఎంతో ముఖ్యం. భవిష్యత్తు తరాలు మంచి ఉద్యోగాలు సాధించాలన్నా, ప్రపంచంలో నంబర్‌వన్‌గా నిలవాలన్నా నాణ్యమైన విద్యే కీలకం. – ఐబీతో ఒప్పందంలో సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ విద్యా బోధన దిశగా కీలక ఘట్టం పూర్తి అయ్యింది. రాష్ట్రంలో ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) సిలబస్ అమలు చేసేందుకు విద్యాశాఖతో ఐబీ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, ఐబీ చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్నోవేషన్) డాక్టర్ అంటోన్ బెగుయిన్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఐబీ డైరెక్టర్ జనరల్ ఓలి పెక్కా హీనోనెన్ ఈ కార్యక్రమంలో జెనీవా నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగంలో ఐబీని భాగస్వామ్యం చేయడం గొప్ప సంతృప్తినిస్తోందన్నారు. ఐబీతో భాగస్వామ్యం అత్యంత ముఖ్యమైందని, ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ప్రభుత్వ స్కూళ్లను ఐబీతో ఏకీకృతం చేయడం గొప్ప సంతృప్తినిచ్చే కార్యక్రమంగా అభివర్ణించారు. ఐబీ డైరెక్టర్ జనరల్ ఓలీ పెక్కా, ఐబీ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఆ పరిస్థితి ఇక మారుతుంది: సీఎం జగన్ భారత్ లాంటి దేశాల్లో నాణ్యమైన విద్య అత్యవసరమని, ఇప్పుడున్న విధానాలను అప్‌గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ చెప్పారు. సాంకేతికత, పాఠ్య ప్రణాళిక తదితర అంశాలను అప్‌గ్రేడ్ చేయాలన్నారు. సమస్యా పూరణ సామర్థ్యం, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ మోడల్లో ఎడ్యుకేషన్ నాలెడ్జ్ వినియోగం లాంటివి చాలా కీలకమని, ఐబీ ద్వారా ఇది సాధ్యమన్నారు. ఐబీతో భాగస్వామ్యం ద్వారా ఒక ప్రయాణం ప్రారంభమైందని, రానున్న విద్యా సంవత్సరంలో టీచర్లకు, సిబ్బందికి ఐబీ విధానాలపై శిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తామని తెలిపారు. ఐబీ విద్య సంపన్నులకు మాత్రమే అనే పరిస్థితి ఇప్పుడు మారుతుందని వ్యాఖ్యానించారు. పేదలకు, అణగారిన వర్గాలకూ ఇకపై ఐబీ బోధన అందుతుందన్నారు. ప్రతి సంవత్సరం ఒక్కో తరగతిలో ఐబీ బోధన మొదలై 2035 నాటికి పదో తరగతి, 2037 నాటికి పన్నెండో తరగతుల్లో ఐబీ బోధన ప్రారంభమవుతుందని తెలిపారు. ఎస్సీఈఆర్టీ, ఐబీ భాగస్వామ్యంతో విద్యా బోధన కొత్త ప్రమాణాలను నెలకొల్పుతుందన్నారు. ఇతర దేశాలకు ఈ ఒప్పందం స్ఫూర్తి: ఓలి పెక్కా తమది లాభాపేక్ష లేని సంస్థ అని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంపై చాలా నిబద్ధతతో ఉన్నామని ఐబీ డైరెక్టర్ జనరల్ ఓలి పెక్కా హీనోనెన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని పేర్కొంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు ధన్యవాదాలు తెలిపారు. విద్య ద్వారా ఉత్తమ ప్రపంచాన్ని, శాంతియుత సమాజాన్ని నిర్మించాలన్నది తమ లక్ష్యమన్నారు. ఇంత పెద్దస్థాయిలో తమ సంస్థ భాగస్వామ్యం కావడం ఇదే ప్రథమమని, ఇతర దేశాలకు, ప్రాంతాలకు ఈ ఒప్పందం ఒక స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. దీనిద్వారా భారత్‌తో విద్యారంగంలో తమ సంబంధాలు మరింత మెరుగుపడతాయని, నాణ్యమైన విద్యకోసం ఉపాధ్యాయులు, సిబ్బంది మధ్య మంచి వాతావరణాన్ని కల్పించి సామర్థ్యాలను పెంచుతామన్నారు. పిల్లలు, స్కూళ్లు, తల్లిదండ్రులు, యూనివర్శిటీలతోనూ తమ సంబంధాలు మెరుగుపడతాయన్నారు. ఏపీలో కొత్త తరహా విద్యా విధానంలో తొలుత ప్లే బేస్డ్ లెర్నింగ్ విధానంతో పిల్లల్లో ఆసక్తిని కలిగించేందుకు ఆర్ట్స్, సైన్స్, మ్యాథ్స్‌తో పాటు మాతృ భాషల్లోనే కాకుండా పిల్లలు విదేశీ భాషలను నేర్చుకోవడంపైనా దృష్టి సారించినట్లు ఆయన వివరించారు. దీనివల్ల పిల్లల్లో కొత్త సామర్థ్యాలు అలవడతాయన్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, జర్మనీ, సింగపూర్, ఎస్తోనియా, ఫిన్లాండ్, కెనడా దేశాల్లోని విద్యామంత్రులతో ఇటీవల నాణ్యమైన బోధన, అభ్యాసాలపై చర్చించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్.జవహర్‌రెడ్డి, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ సౌరవ్ గౌర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ (ఇన్ఫ్రా) కాటమనేని భాస్కర్, సర్వశిక్ష అభియాన్ ఎస్పీడీ బి.శ్రీనివాసరావు, పాఠశాల విద్యాశాఖ(మిడ్ డే మీల్స్) డైరెక్టర్ ఎస్.ఎస్.శోభిక, ఐబీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఐబీ భాగస్వామ్యంపై జీవో పాఠశాల విద్యలో ఇంటర్నేషనల్ బాకలారియెట్ సిలబస్ అమలుకు అనుగుణంగా ఎస్సీఈఆర్టీలో ఐబీ భాగస్వామ్యంపై పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుధవారం జీవో నంబర్ 5 జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో భవిష్యత్ సాంకేతికత, సిలబస్, బోధన, సదుపాయాలు తదితర అంశాలపై ఐబీ ప్రతినిధులు అధ్యయనం చేయనున్నారు. 21 మంది ఐబీ ప్రతినిధుల బృందం వచ్చే నెల రోజుల్లో 40 పాఠశాలలు, విద్యాశాఖ కార్యాలయాలను పరిశీలించి అధ్యయనం నిర్వహిస్తుంది. ఎగ్జామినేషన్ విధానాలను సైతం పరిశీలించి మార్పుచేర్పులపై సూచనలు చేస్తారు. విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులకు శిక్షణ, సిలబస్‌పై సూచనలు ఇచ్చేందుకు ఎస్సీఈఆర్టీలోని 19 మంది నిపుణులతో పాటు ఐబీకి చెందిన 26 మంది నిపుణులు చర్చించనున్నారు. మొత్తం ప్రక్రియను 2025 మే నాటికి పూర్తి చేసి వచ్చే ఏడాది జూన్ నుంచి ఒకటో తరగతిలో ఐబీ సిలబస్ బోధనను ప్రవేశపెట్టనున్నారు. -
ఏపీలో భవిష్యత్తు తరాలకు నాణ్యమైన విద్యే లక్ష్యంగా..: సీఎం జగన్
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా విధానంలో మరో విప్లవాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఐబీ’ విద్య అమలుకు శ్రీకారం చుట్టింది జగనన్న ప్రభుత్వం. ఈ క్రమంలో.. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో SCERT, IB మధ్య ఒప్పందం కుదిరింది. తద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రైవేటు పాఠశాలల్లో శ్రీమంతుల పిల్లలు చదువుకునే ‘ఇంటర్నేషనల్ బాకలారియెట్’ (ఐబీ) సిలబస్ పేద పిల్లలకు చేరువ కానుంది. ఐబీ సిలబస్ అమలుపై బుధవారం సాయంత్రం ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ) అధికారులతో ఐబీ ప్రతినిధులు సీఎం జగన్ సమక్షంలో ఏపీ విద్యాశాఖతో ఒప్పందం చేసుకున్నారు. ఏపీ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఐబీ చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్(డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్నోవేషన్) డాక్టర్ అంటోన్ బిగిన్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఇక ఈ కార్యక్రమానికి జెనీవా నుంచి వర్చువల్‌గా ఐబీ డైరెక్టర్ జనరల్ ఒల్లి పెక్కా హీనోనెన్ పాల్గొన్నారు. సీఎం జగన్ ఏమన్నారంటే.. ‘‘ఐబీని ప్రభుత్వ విద్యారంగంలో భాగస్వామ్యం చేయడం నాకు గొప్ప సంతృప్తి నిస్తోంది. ఐబీ డైరెక్టర్ జనరల్ ఓలీ పెక్కాకు, ఆన్లైన్ ద్వారా హాజరైన వారితో పాటు ఇక్కడకు వచ్చిన ఐబీ ప్రతినిధులకు ధన్యవాదాలు. ఐబీతో భాగస్వామ్యం అత్యంత ముఖ్యమైనది నేను భావిస్తున్నా. ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ప్రభుత్వ స్కూళ్లను ఐబీతో ఏకీకృతం చేయడం ఇది గొప్ప సంతృప్తినిచ్చే కార్యక్రమం. నాణ్యమైన విద్యను భవిష్యత్తు తరాలకు అందించడం అన్నది చాలా ముఖ్యం. భవిష్యత్తు తరాలు.. మంచి ఉద్యోగాలు సాధించాలన్నా, భవిష్యత్ ప్రపంచంలో నెంబర్‌వన్‌గా నిలవాలన్నా భారత్ లాంటి దేశాల్లో నాణ్యమైన విద్య అవసరం. .. ఇప్పుడున్న విద్యావిధానాలను అప్‌గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పాశ్చాత్య ప్రపంచంతో పోల్చిచూస్తే సాంకేతికత, పాఠ్యప్రణాళిక తదితర అంశాల్లో అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంది. సమస్యా పూరణ సామర్ధ్యం, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ మోడల్లో ఎడ్యుకేషన్ నాలెడ్జ్‌ని వినియోగం వంటివి చాలా కీలకం. ఐబీ ద్వారా ఇది సాధ్యమని విశ్వసిస్తున్నాం. ఐబీకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఐబీతో భాగస్వామ్యం ద్వారా ఒక ప్రయాణం ప్రారంభమైంది. ముందు టీచర్లకు, సిబ్బందికి కెపాసిటీని పెంచేలా శిక్షణ కార్యక్రమాలు రానున్న విద్యాసంవత్సరంలో అమలవుతాయి. సంపన్నులకు మాత్రమే అందే ఐబీ విద్య అన్న పరిస్థితి ఇప్పుడు మారుతుంది. ప్రతి సంవత్సరం ఒక్కో తరగతిలో ఐబీ బోధన మొదలవుతుంది. పదేళ్లలో 2035నాటికి పదోతరగతి, 2037 నాటికి పన్నెండు తరగతిలో ఐబీ బోధన మొదలవుతుంది. పేదలకు, అణగారిన వర్గాలకూ ఐబీ బోధన అందుతుంది. ఎస్ఈఆర్టీలో ఐబీ భాగస్వామ్యం కావడం వల్ల విద్యా బోధన, అభ్యాసాలు పరిణామం చెందుతాయి. ఇది కొత్త ప్రమాణాలను నెలకొల్పుతుంది అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ ఒప్పందం ప్రకారం.. 2024 – 25 విద్యా సంవత్సరంలో ఐబీ బోధనపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. వారిలో బోధన సామర్థ్యం, నైపుణ్యం పెంచేలా ఈ శిక్షణ ఉంటుంది. టీచర్లతో పాటు మండల, జిల్లా విద్యాధికారులు, ఎస్సీఈఆర్టీ, డైట్ సిబ్బంది, ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ బోర్డు సిబ్బందికి ‘ఐబీ’పై అవగాహన, సామర్థ్యం పెంచేలా శిక్షణనిస్తారు. దీంతో వారంతా ప్రతిష్టాత్మక ఐబీ గ్లోబల్ టీచర్ నెట్‌వర్క్‌లో భాగమవుతారు. 2025 జూన్ నుంచి ఒకటో తరగతిలో ఐబీ సిలబస్ బోధన ప్రారంభమవుతుంది. ఏటా ఒక్కో తరగతికి ఈ సిలబస్‌ను పెంచుతూ 2035 నాటికి 10వ తరగతి, 2037కి 12వ తరగతిలో అమలు చేస్తారు. పరీక్షల అనంతరం ఐబీ బోర్డు, ఏపీఎస్సీఈఆర్టీ ఉమ్మడిగా సర్టిఫికెట్‌ను ప్రదానం చేస్తాయి. ఈ సర్టిఫికెట్‌కు అంతర్జాతీయంగా గుర్తింపు సైతం ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్‌రెడ్డి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, ఇంటర్ మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ సౌరవ్ గౌర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్(పాఠశాల మౌలిక సదుపాయాలు) కాటమనేని భాస్కర్, సర్వశిక్ష అభియాన్ ఎస్పీడీ బి శ్రీనివాసరావు, పాఠశాల విద్యాశాఖ(మిడ్ డే మీల్స్) డైరెక్టర్ ఎస్.ఎస్. శోభికా, ఐబీ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
యువత ‘భద్రత’లో ఏపీ నంబర్ వన్
గుంటూరు ఎడ్యుకేషన్: నైపుణ్యాభివృద్ధి, ఇంటర్న్‌షిప్ ఉద్యోగాల కల్పనలో దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలుస్తున్నదని, ఉన్నత విద్యారంగంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలే అందుకు కారణమని పలువురు వక్తలు స్పష్టం చేశారు. గుంటూరు ఏసీ కళాశాలలో సోమవారం ఏపీఎస్సీహెచ్ఈ ఆధ్వర్యంలో ‘ఉన్నత విద్యలో సంస్కరణలు–యువతకు సాధికారత’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కొమ్మాలపాటి మోజెస్ అధ్యక్షత వహించిన సదస్సుకు ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్సీహెచ్ఈ) వైస్ చైర్మన్ ప్రొఫెసర్, కె.రామమోహనరావు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. సాధారణ డిగ్రీ కోర్సులతో యువతకు ప్రయోజనం లేదని గుర్తించిన సీఎం జగన్ ప్రభుత్వం ఉన్నత విద్యలో సమూల మార్పులు తెచ్చిందన్నారు. ఆ.. సంస్కరణలు అద్భుతమైన ఫలితాలిస్తున్నాయని చెప్పారు. ఉన్నత విద్యలో నవరత్నాల వంటి తొమ్మిది కార్యక్రమాలను రూపొందించిన సీఎం వైఎస్ జగన్ ఎంతో నిబద్ధతతో అమలు చేస్తున్నారని తెలిపారు. ఇంజనీరింగ్ తదితర కోర్సుల్లో ప్రవేశపెట్టిన ఇంటర్న్ షిప్ విధానంలో విద్యార్థులను పరిశ్రమలకు అనుసంధానం చేయడంతో విద్యార్థులు తమలోని సామర్థాన్ని, నైపుణ్యాలను స్వయంగా తెలుసుకుని ముందుకు వెళుతున్నారని చెప్పారు. రూ.32కోట్లు వెచి్చంచి రాష్ట్రంలోని 1.25 లక్షల మంది యువతకు పైసా ఖర్చు లేకుండా మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ కోర్సు అందించడం గొప్ప విషయమన్నారు. బీహెచ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.కౌసల్యాదేవి, ఏసీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్ ఎం.కుసుమకుమారి, జీఏ షాలిని, బి.విజయకుమార్, అధ్యాపకులు ఎం.రత్నరాజు, సీహెచ్ అనిత, ఎన్జే సాల్మన్‌బాబు మాట్లాడారు. వివిధ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. యువతకు దిశా, దశ నిర్దేశనం ఉన్నత విద్యలో ఏపీ ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలు యువతకు దిశా, దశ చూపుతున్నాయి. నైపుణ్యాలు లేనిదే సమాజంలో రాణించలేరనే సదుద్దేశంతో ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపడుతున్నది. విద్యార్థులకు నైపుణ్యంతో కూడిన విజ్ఞానాన్ని అందిస్తూ, ప్రపంచంలో ఎక్కడైనా రాణించగల స్థైర్యాన్ని కల్పించడం అభినందనీయం. – కేఎఫ్ పరదేశిబాబు, ఏసీ కళాశాల కరస్పాండెంట్ ఎన్ఈపీ అమల్లో ఏపీ అగ్రస్థానం.. జాతీయ నూతన విద్యా విధానం–2020 అమల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలిపారు. విద్యార్థులు ప్రపంచస్థాయిలో పోటీపడే విధంగా నైపుణ్యంతో కూడిన విద్యను అందించేందుకు ఆయన సాహసోపేతమైన నిర్ణయాలతో ముందుకు వెళుతున్నారు. విజ్ఞానం, నైపుణ్యం, నూతన ఆవిష్కరణల దిశగా విద్యార్థులు ముందుకు సాగాలి. – డాక్టర్ కె.మోజెస్, ప్రిన్సిపాల్, ఏసీ కళాశాల ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీ ఉన్నత విద్యారంగంలో అమలు చేస్తున్న అనేక సంస్కరణలతో మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. పరిశ్రమలను విద్యాసంస్థలకు అనుసంధానం చేయడంలో సఫలీకృతమైన ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి అవకాశాలను యువతరానికి అందిస్తోంది. – పి.మల్లికార్జునప్రసాద్, ప్రిన్సిపాల్, హిందూ కళాశాల ఊహకందని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధారణ సెల్‌ఫోన్‌తో మొదౖలెన ఆధునిక సాంకేతికత.. ఇంటర్నెట్తో వేగం పుంజుకుని ఆరి్టఫీíÙయల్ ఇంటెలిజెన్స్ వరకు ఎదిగింది. ఈ పరిస్థితుల్లో నైపుణ్యం లేనిదే విద్యార్థులు రాణించలేరు. ఉన్నత విద్య దశలోనే పోటీతత్వంతో ముందుకు వెళ్లాలి. – డాక్టర్ ఎంఎస్ శ్రీధర్, పీజీ కోర్సుల డీన్, ఏసీ కళాశాల -
దటీజ్ జగన్: ఆశ్చర్యానికి గురైన నిర్మాత కోన వెంకట్
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత కోన వెంకట్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనపై ప్రశంసలు కురిపించారు. విద్యావ్యవస్థలో ఆయన తీసుకొచ్చిన సమూల మార్పులను చూసి కోన ఆశ్చర్యపోయారు. విషయం ఏంటంటే.. ఆంధ్రప్రదేశ్‌లోని తన సొంత గ్రామానికి వెళ్లిన ఆయన అక్కడి ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. స్కూల్ వాతావరణం, వసతులు, తరగతి గదులు పరిశీలించారు. నా సొంత ఊర్లో ఇంతటి అద్భుతమైన ప్రభుత్వ పాఠశాల ఉన్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. స్కూల్లో కల్పించిన మౌలిక సదుపాయాలు పట్ల తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. బాపట్లలో ని కర్లపాలెంలో ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన ఫోటోలను తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా..ప్రస్తుతం అధికారంలో ఉన్న ఏపీ ప్రభుత్వం నాడు-నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేసింది. గవర్నమెంట్ స్కూల్స్‌లో ఇంగ్లీష్ మీడియంతో పాటు అద్భుతంగా తీర్చిదిద్దింది. పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పనకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వం పాఠశాలలను అభివృద్ధి చేసింది. Very happy and surprised to see a beautiful Government School in Karlapalem which is part of my Hometown Bapatla!! pic.twitter.com/QdwENpKnem — KONA VENKAT (@konavenkat99) January 29, 2024 -
పేదరిక నిర్మూలన చదువు ద్వారానే సాధ్యం: సీఎం జగన్
-
బడి పిల్లలు..బలహీనం
సాక్షి, హైదరాబాద్: షోషకాహారలోపం, శారీరక శ్రమ లేకపోవడంతో జీవనశైలిలో చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా బడి పిల్లలు బలహీనంగా తయారవుతున్నారు. దేశంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల్లో ఆరోగ్యం, ఫిట్నెస్ సామర్థ్యం తెలుసుకునేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద యూత్ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ స్పోర్ట్స్ విలేజ్ సర్వే చేసింది. 250 నగరాలు, పట్టణాల్లో 7 –17 ఏళ్ల వయసు ఉన్న 73 వేల మంది విద్యార్థులపై సర్వే చేసి, 12వ వార్షిక ఆరోగ్య నివేదిక విడుదల చేసింది. దక్షిణాది విద్యార్థులు బలంగానే.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాల్లోని విద్యార్థులు ఆరోగ్యకరంగా ఉన్నారు. ఈ రాష్ట్రాల్లోని పిల్లల్లో ఛాతీ, శరీర కింది భాగం బలంగా ఉన్నాయి. ఉత్తర రాష్ట్రాల పిల్లల్లో బలహీనమైన బీఎంఐ, కీళ్లు, ఉదర కండరాలు సమస్యలున్నాయి. తూర్పు రాష్ట్రాల్లో బీఎంఐ, ఫ్లెక్సిబులిటీ, ఛాతీభాగం ఆరోగ్యకరంగా ఉన్నాయి. ఇక పశ్చిమాది రాష్ట్రాల విద్యార్థులలో ఏరోబిక్ కెపాసిటీ, శరీర కింది భాగం, కీళ్ల కదలికలు మెరుగ్గా ఉన్నాయి. హైదరాబాద్ విద్యార్థులు హెల్తీ ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోని పాఠశాలల విద్యార్థుల ఆరోగ్యం మెరుగ్గానే ఉంది. నగరంలోని 58 శాతం విద్యార్థుల శరీరంలో ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలుండగా, 49 శాతం మందికి బలమైన ఛాతీ, 84 శాతం సమర్థమైన ఉదర భాగాలున్నాయి. 46 శాతం మందిలో శరీర కింది భాగం బలంగా ఉండగా.. 64 శాతం పిల్లల్లో కీళ్ల కదలికలు చురుగ్గా ఉన్నాయి. 41 శాతం మందికి మెరుగైన ఏరోబిక్ సామర్థ్యం, 58 శాతం విద్యార్థుల్లో వాయురహిత జీర్ణక్రియ సమర్థంగా ఉంది. వారంలో రెండు ఫిజికల్ ఎడ్యుకేషన్ (పీఈ) తరగతులు ఉన్న స్కూళ్ల విద్యార్థుల్లో బలమైన ఛాతీ, ఉదర భాగంతో పాటు కండరాల కదలికలలో చురుకుదనం, గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగ్గా ఉన్నాయి. అమ్మాయిలే ఆరోగ్యంగా.. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే ఆరోగ్యంగా ఉన్నారు. 62 శాతం ఆడపిల్లల బీఎంఐ సూచీ ఆరోగ్యకరంగా ఉంది. 47 శాతం అమ్మాయిల్లో బలమైన ఛాతీభాగం, 70 శాతం మందికి కీళ్లు, శరీర కదలికల్లోనూ ఫ్లెక్సిబుల్‌గా ఉన్నాయి. అయితే 20 శాతం బాలికల్లో ఏరోబిక్ కెపాసిటీ, 37 శాతం మందిలో శరీర కింది భాగం బలంగా లేదు. ప్రభుత్వ పాఠశాల పిల్లలే బెటర్ ప్రైవేట్‌తో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల విద్యా ర్థులే ఆరోగ్యంగా ఉన్నారు. వీరిలో బీఎంఐ, ఏరోబిక్ కెపాసిటీ, కీళ్ల కదలికలు ఫ్లెక్సిబుల్‌గా ఉన్నాయి. అయితే 43 శాతం ప్రైవేట్ స్కూల్ పిల్లల్లో మాత్రం ఛాతీ భాగం సౌష్టవంగా ఉంది. గవర్నమెంట్ స్కూళ్ల విద్యార్థులలో 62 శాతం మందికి ఆరోగ్యకరమైన బీఎంఐ, 70 శాతం మందికి ఫ్లెక్సిబుల్ కీళ్లు, 73 శాతం పిల్లల్లో యాన్‌ఏరోబిక్ కెపాసిటీ, 31 శాతం మంది బలమైన ఛాతీ ఉంది. అదే ప్రైవేట్ పాఠశాలల పిల్లల్లో 58 శాతం మందికి బీఎంఐ, 64 శాతం ఫ్లెక్సిబుల్ కండరాలు, 55% యాన్‌ఏరోబిక్ కెపాసిటీ, 43 శాతం మంది విద్యార్థులకు ఛాతీభాగం బలంగా ఉంది. నివేదికలోని ముఖ్యాంశాలు ♦ ప్రతీ ఐదుగురు పిల్లల్లో ఇద్దరి శరీరంలో ఆరోగ్యకరమైన కొవ్వు (బాడీ మాస్ ఇండెక్స్– బీఎంఐ), వాయు రహిత జీర్ణక్రియ (యాన్‌ఏరోబిక్ కెపాసిటీ) ప్రక్రియ సరిగ్గా లేదు. ♦ ఐదుగురిలో ఒకరికి స్వేచ్ఛగా కీళ్లు కదిలే సామర్థ్యం లేదు. ♦ ముగ్గురికి గుండె, ఊపిరితిత్తుల కండరాలకుఆక్సిజన్ సరిగ్గా అందడం లేదు. ♦ ముగ్గురిలో ఒకరికి ఉదర కండరాలు బలహీనంగా ఉన్నాయి. ♦ ప్రతి ఐదుగురిలో ముగ్గురికి ఛాతీ భాగం బలహీనంగా ఉంది. -
జగనన్న విద్యా కానుకకు పరిపాలన అనుమతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరంలో (2024–25) జగనన్న విద్యా కానుక–5 పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే చర్యలు చేపట్టింది. ప్రతీ ఏడాదీ స్కూళ్లు తెరవకముందే ఈ విద్యా కానుకను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. వచ్చే జూన్ 12న కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో జగనన్న విద్యా కానుక–5లో భాగంగా ద్విభాషా పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, వర్క్‌బుక్‌లు, యూనిఫాం, బెల్ట్, బూట్లు, డిక్షనరీ, బ్యాగ్‌లు వంటి వాటిని 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థుల వరకు ఉచితంగా అందించేందుకు వీలుగా రూ.1,042.51 కోట్లకు పరిపాలన అనుమతులను విద్యాశాఖ మంజూరు చేసింది. పాఠ్య పుస్తకాలు, వర్క్‌బుక్స్ మినహా మిగతా వాటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సమగ్ర శిక్షా ప్రాజెక్టు డైరెక్టర్‌కు ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు.. 1వ తరగతి నుంచి టెన్త్ వరకు విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్ ముద్రించి సరఫరా చేసేందుకు ఈ–ప్రొక్యూర్మెంట్లో టెండర్లను ఆహ్వానించనున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. టెండర్ల ఆహ్వానం వీటికే.. ఇదిలా ఉంటే.. 4,73,37,549 పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్ సరఫరాకు, అలాగే.. 4,65,268 పదో తరగతి ఫిజికల్ సైన్స్ పుస్తకాల సరఫరాకు రూ.253.75 కోట్ల అంచనాతో టెండర్లను ఆహ్వానించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన టెండర్ డాక్యుమెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వ టెక్స్ ్టబుక్ ప్రెస్ శుక్రవారం జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపించింది. ద్విభాషల్లో పాఠ్యపుస్తకాలు ముద్రించి సరఫరా చేయాల్సిందిగా అందులో పేర్కొంది. తెలుగు–ఇంగ్లీష్, ఉర్దూ–ఇంగ్లీష్, కన్నడ–ఇంగ్లీష్, ఒడియా–ఇంగ్లీష్, తమిళం–ఇంగ్లీష్ మాధ్యమాల్లో పుస్తకాలు ముద్రించి సరఫరా చేయాల్సి ఉంటుందని తెలిపింది. 26 జిల్లాల్లోని 670 మండల కేంద్రాల్లో ఉన్న విద్యాశాఖాధికారి కార్యాలయాలకు ఈ పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్‌ను నిర్ధేశించిన గడువులోగా సరఫరా చేయాలని వివరించింది. అలాగే, ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా పేపర్ నాణ్యత, కలర్స్‌తో పుస్తకాలను ముద్రించి సరఫరా చేయాల్సి ఉంటుందని, ఈ విషయంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు సూచనలు చేస్తుందని అందులో స్పష్టంచేసింది. ఈ టెండర్లో ఎల్–1గా ఎంపికైన తరువాత రివర్స్ టెండర్ నిర్వహించి బిడ్డర్‌ను ఖరారు చేయనున్నట్లు తెలిపింది. వర్క్ ఆర్డర్ ఇచ్చిన 50 రోజుల్లో 50 శాతం, 60 రోజుల్లో 75 శాతం, ఆ తరువాత వంద శాతం పుస్తకాల సరఫరా చేయాల్సి ఉంటుందని అందులో పేర్కొంది. నిబంధనలు ఇవే.. ► ఇక టెండర్లో పాల్గొనే బిడ్డర్లకు 2020–21, 2021–22, 22–23 సంవత్సరాల్లో కనీసం పది కోట్ల పుస్తకాలు ముద్రించి, సరఫరా చేసిన టర్నోవర్ కలిగి ఉండాలనే నిబంధన విధించారు. ► అలాగే, పుస్తకాల ముద్రణ, సరఫరా కార్యకలాపాల్లో కనీసం మూడేళ్లు అనుభవం ఉండాలనే నిబంధన విధించారు. ► పుస్తకాల కాగితం దగ్గర నుంచి ముద్రణ దశ వరకు నాలుగు దశల్లో నాణ్యతను తనిఖీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ► పుస్తకాల్లో లోపాలుంటే భారీ జరిమానా విధించనున్నట్లు విద్యాశాఖ ఆ టెండర్ డాక్యుమెంట్లో పేర్కొంది. ► దీనిపై అభ్యంతరాలు, సూచనలు ఏమైనా ఉంటే తెలియజేసేందుకు ఈనెల 29 చివరి తేదీగా పేర్కొంది. -
అభివృద్ధిలో సరికొత్త నమూనా
భారత్‌లోని అనేక ప్రాంతాలు ఇప్పటికీ ఆధునిక ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం కాలేదు. ప్రపంచ మార్కెట్ వ్యవస్థలకు అనుసంధానించడంలో విద్యదే కీలక పాత్ర. ఆధునిక విద్యాసంస్థలతో కూడిన గ్రామాభివృద్ధి నమూనాను ఏ రాష్ట్ర ప్రభుత్వమూ అనుసరించలేదు. ఈ నమూనాపై ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం దృష్టి సారించింది. రెండు వినూత్న ఆలోచనలను ముందుకు తేవడం ద్వారా జగన్ దీన్ని సాధ్యం చేశారు: 1. ప్రభుత్వ రంగంలో నాణ్యమైన ఇంగ్లీషు మీడియం విద్యను అందించడం. 2. పాఠశాల మౌలిక సదుపాయాలు, గ్రామ పరిపాలనను భారీగా మార్చడానికి వనరులను ఖర్చు చేయడం. దాని భవిష్యత్తు ప్రభావాన్ని దేశం మొత్తం మీద ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఊహించలేకపోయారు. ఇది విప్లవాత్మకమైన అభివృద్ధి నమూనా. 2024 సాధారణ ఎన్నికలకు ముందు భారతదేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇక, పార్లమెంటు ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనే నాలుగు రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణా చల్ ప్రదేశ్, సిక్కిం. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని మునుపెన్నడూ ఊహించని పథంలోకి మార్చింది. సాధారణంగా అభివృద్ధి అంటే... ఎత్తయిన భవనాలు, మంచి రోడ్లు వంటి పట్టణ మౌలిక సదుపాయాలలో పెట్టుబడి పెట్టడానికి విధానాలను రూపొందించడమే అని రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తాయి. సాధారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ మొత్తంలో బడ్జెట్ నిధులను పెద్ద కాంట్రాక్ట్ నిర్మాణాలకు వెచ్చిస్తాయి. ప్రపంచీకరణ యుగంలో నయా ఉదార వాద ఆర్థికవేత్తలు అలాంటి ఖర్చును మంచి అభివృద్ధిగా పరిగణి స్తారు. ఆరెస్సెస్, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నమూనానే అనుసరిస్తోంది. సోషలిస్ట్ ఎకానమీ నుండి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ వైపునకు మారిన చైనా కూడా ఇదే నమూనాను అవలంబించింది. వీటితో పోలిస్తే భారతీయ కుల అసమానతలకు కాస్త భిన్నమైన విధానం అవసరం. భారతదేశంలో రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యం ఉన్నప్పటికీ, దాని అసాధారణమైన కుల అడ్డంకులు ప్రజల కేంద్రిత అభివృద్ధికి అనేక అవరోధాలను సృష్టించాయి. రెండవది, భారతీయ గ్రామాలు చెల్లాచెదురుగా ఉన్నాయి. వ్యవసాయాభివృద్ధి పూర్తిగా వ్యవసా యాన్ని పెట్టుబడిగా మార్చే దశకు చేరుకోలేదు. దేశంలోని అనేక ప్రాంతాలు ఇప్పటికీ ఆధునిక ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం కాలేదు. ప్రజలను జాతీయ, ప్రపంచ మార్కెట్ ఆర్థిక వ్యవస్థలకు అనుసంధానించడంలో వారి విద్యే కీలక పాత్ర పోషిస్తోంది. గ్రామీణులను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోకి... గ్రామీణ పిల్లలకు, యువతకు విద్యను అందించడానికి ఆధునిక విద్యాసంస్థలతో కూడిన గ్రామాభివృద్ధి నమూనాను ఏ రాష్ట్ర ప్రభు త్వమూ అనుసరించలేదు. ఈ నమూనాపై జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దృష్టి సారించింది. గత ఐదేళ్లలో తన బడ్జెట్లో ఎక్కువ భాగం గ్రామీణ విద్యా మౌలిక సదుపాయాలు, సాఫ్ట్ స్కిల్స్‌ను నిర్మించడం కోసం కేటాయించింది. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో గత పదేళ్లలో టీడీపీ, వైఎస్సా ర్సీపీ ప్రభుత్వాలు పూర్తి వ్యతిరేకమైన అభివృద్ధి నమూనాలను ఎలా ఎంచుకున్నాయో చూడాలి. టీడీపీ ప్రభుత్వం కృష్ణా నది ఒడ్డున ఉన్న 30,000 ఎకరాల సారవంతమైన వ్యవసాయ భూమిని లాక్కొని, రాష్ట్ర బడ్జెట్లో ఎక్కువ భాగం అమరావతిని నిర్మించేందుకు కేటాయించడా నికి సిద్ధమైంది. పెద్ద నగరాలు మాత్రమే పెట్టుబడులు తెస్తాయనీ, వెలుపలి నుంచి వచ్చే పెట్టుబడితో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనేది నయా ఉదారవాద ఆర్థిక ఆలోచన. ఇది భారీ స్థాయి పెట్టుబడులతో కూడిన సిటీ మాల్ మార్కెట్లలోకి విస్తారమైన గ్రామీణ ప్రజలను తీసుకోలేదు. అందుకే, ధనవంతుల కోసం ఉద్దేశించిన ప్రైవేట్ పాఠశాల విద్యతో సరిపోయే పాఠశాల వ్యవస్థలో వారిని విద్యావంతులను చేయాలి. ఆ ప్రైవేట్ పాఠశాల విద్య ఇంగ్లీషు మీడియంలో కొనసాగాలి. గ్రామీణ వ్యవసాయాధారిత పిల్లలకు ప్రభుత్వ రంగంలో ఇలాంటి విద్యను అందించకపోతే వారు రాష్ట్ర, జాతీయ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో చేరలేరు. విప్లవాత్మక అభివృద్ధి నమూనా భారీ మల్టీ లేన్ రోడ్లు, పెద్ద విమానాశ్రయాలు, ఓడరేవులతో కూడిన ‘హైవే ఎకానమీ’, ప్రభుత్వ రంగ పరిశ్రమలను భారీగా ప్రైవేటీకరించడం ఆర్ఎస్ఎస్ దృక్పథానికి బాగా సరిపోతుందని మితవాద ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఆరెస్సెస్‌కి సంబంధించిన ఈ ఆధునిక ఆలోచన పురాతనమైన మధ్యయుగ వర్ణ ధర్మ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానమై ఉంది. ఆ వ్యవస్థలో శూద్ర ఉత్పాదక ప్రజానీకానికి ఆస్తులపై యాజమాన్యం ఉండకూడదు. ఈ నమూనాతో చంద్రబాబు శ్రుతిమించి పోయారు. వైఎస్ జగన్ మాత్రం అభివృద్ధి నమూనానే మార్చేశారు. దీన్ని నేను శూద్ర అభివృద్ధి నమూనా అని పిలుస్తున్నాను. రాష్ట్ర బడ్జెట్ ప్రధానంగా అన్ని కులాలు, కార్మిక వర్గాలను కలిగి ఉన్న వ్యవసాయ, చేతివృత్తుల ఉత్పాదక ప్రజానీకానికి ఉద్దేశించినదని సూచించడానికి నేను శూద్ర అనే చారిత్రక పదాన్ని ఉపయోగిస్తున్నాను. మొత్తం వ్యవసాయ, చేతివృత్తులకు చెందిన ఉత్పాదక ప్రజానీకంలో (ఆదివాసీ, దళిత వర్గాలు, రిజర్వుడ్ శూద్ర ఓబీసీలు, రెడ్డి, కమ్మ, కాపు వంటి అన్‌రిజర్వుడ్ శూద్రులు అందరూ ఇందులో ఉంటారు) నైపుణ్యాలు, వనరుల పునాదిని తప్పనిసరిగా మార్చాలని వైఎస్ జగన్ సరిగ్గా అర్థం చేసుకున్నారు. రాష్ట్ర పెట్టుబడిని పాఠశాల, కళాశాల విద్య, గ్రామ పరిపాలనలోకి మార్చడం ద్వారా ఈ పరివర్తన సాధ్యమవుతుంది. వైఎస్ జగన్ రెండు వినూత్న ఆలోచనలను ముందుకు తేవడం ద్వారా ఇదంతా సాధ్యం చేశారు: 1) ప్రభుత్వ రంగంలో నాణ్యమైన ఇంగ్లీషు మీడియం విద్యను అందించడం. ఇది నైపుణ్యం, జ్ఞానం రెండింటిలోనూ గ్రామాన్ని ప్రపంచంతో కలుపుతుంది. విద్యా ఖర్చుల కోసం డబ్బును బదిలీ చేయడం ద్వారా పాఠశాల, కళాశాల పిల్లల తల్లులకు ఆర్థిక సహాయం అందించడాన్ని కూడా దీనికి జోడించారు. 2) పాఠశాల మౌలిక సదుపాయాలను, గ్రామ పరిపాలనను భారీగా మార్చడానికి రాష్ట్ర అభివృద్ధి వనరులను ఖర్చు చేయడం. ప్రధాన వ్యాపారాలు లేని, శ్రమతో పని చేసే సాంప్రదాయ శూద్రులందరికీ ఈ నమూనాలో కొత్త నైపుణ్యాలు, ప్రపంచ భాషతో వ్యవహరించడానికి ప్రవేశం లభిస్తుంది. దాని భవిష్యత్తు ప్రభావాన్ని ఇప్పటి వరకు దేశం మొత్తం మీద ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఊహించలేకపోయారు. ఇది విప్లవాత్మకమైన అభివృద్ధి నమూనా. పెట్టుబడుల కేంద్ర మార్పు ఈ నమూనా... పెట్టుబడిని కేంద్రీకృత పట్టణ రంగాల నుండి వైవిధ్యమైన గ్రామీణ సమాజాలకు మారుస్తుంది. ఇది పట్టణ బ్యాంకుల్లోని డబ్బు నిల్వలను గ్రామీణ మార్కెట్లకు తరలిస్తుంది. ఇది విస్తారమైన గ్రామీణ ప్రజల ఆరోగ్యం, వ్యయం, ఉత్పత్తి, విజ్ఞాన పునాదిని మెరుగుపరుస్తుంది. మొత్తంగా సంపద కేంద్రీకరణను పట్టణ ధనవంతుల నుండి విస్తారమైన గ్రామీణ ప్రజానీకానికి బదలా యిస్తుంది. ఈ పెట్టుబడి ఉచితాల కిందికి రాదు. ఇది భవిష్యత్ విప్లవా నికి సంబంధించిన పెట్టుబడి. సాధారణంగా విప్లవం గురించి మాట్లాడే కమ్యూనిస్టులు కూడా భారతీయ కుల–సాంస్కృతిక సమాజంలో విప్లవం అంటే ఏమిటో అర్థం చేసుకోలేకపోయారు. బెంగాల్లో వారి 34 ఏళ్ల పాలన గ్రామీణ ప్రజానీకాన్ని ప్రపంచీకరణ ప్రక్రియతోనూ, ఆంగ్ల విద్యతోనూ ముడిపెట్టకుండా ఎలా దూరంగా ఉంచిందో నిరూపించింది. ఈ విప్లవం భారతదేశ అభివృద్ధిపై రెండు ముఖ్యమైన ప్రభావాలను కలిగి ఉంది. చారిత్రాత్మకంగా జ్ఞాన వ్యవస్థను నియంత్రిస్తున్నందున సంపద మొత్తంగా ద్విజ సంఘాల చేతుల్లో కేంద్రీకృతమై ఉంది. పురాతన కాలంలో ఇది సంపదను, సంస్కృత భాషను నియంత్రించింది. మధ్యయుగ కాలంలో ద్విజులు ముస్లిం పాలకులతో కలిసి సంపదను, పర్షియన్ భాషను నియంత్రించారు. గత 75 ఏళ్లుగా వారు సంపదను, ఆంగ్ల భాష ఆధారిత జ్ఞానాన్ని నియంత్రించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం విద్యపై దృష్టి సారించడం ద్వారా వైఎస్ జగన్ ప్రభుత్వం సంపదను, విజ్ఞానాన్ని వ్యవసాయ, చేతివృత్తుల వారి చేతుల్లోకి తెచ్చింది. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
బోగస్ విజనరీ బాబుకు, డెడికేటెడ్ పర్సన్ జగన్‌కు ఉన్న తేడా అదే!
కొద్ది రోజుల క్రితం యూట్యూబ్‌లో ఒక ఆసక్తికరమైన వీడియో చూశాను. అది ఒక ప్రొఫెసర్ చేసిన వీడియో! ఆయన ఎవరో తెలియదు. కానీ ఆయన అనుభవం వింటుంటే మాత్రం గొప్ప అనుభూతి కలుగుతుంది.ఎందుకంటే ఏపీలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకువచ్చిన అద్బుతమైన మార్పులను ఆయన కళ్లకు కట్టినట్లు వివరించారు. పేద పిల్లలకు అంతర్జాతీయ స్థాయి స్కూళ్లలో నేర్పుతున్న విద్యను ఏపీకి ఎలా తీసుకు వస్తున్నది ఆయన చెబుతుంటే ఇది కదా అభివృద్ది అంటే అనిపిస్తుంది. ఎల్కేజీకి రెండు లక్షలు ఫ్రొఫెసర్ రమేష్ అనే ఈయన కొన్నేళ్ల క్రితం తన పిల్లలను చేర్చడం కోసం హైదరాబాద్ ఒక్రిడ్జి ఇంటర్నేషనల్ స్కూల్‌కు వెళ్లాడట. అక్కడ ఎల్కేజీకి తీసుకునే ఫీజు సుమారు రెండు లక్షల రూపాయలని తెలుసుకున్నాడు. ఏం సదుపాయాలు ఉన్నాయో కూడా ఆయన గమనించారు. ప్రత్యేకించి స్కూల్ ఆంబియన్స్ అంటే చూడగానే పిల్లలు ఆకర్షితులయ్యే విధంగా భవనాలు, రంగులు, బొమ్మలు, క్లాస్ రూమ్స్ ,బల్లలు, డిజిటల్ బోదన ఉంటాయి. అలాగే సీబీఎస్ఈ సిలబస్ ఉంది. దానికి తోడు అంతర్జాతీయంగా ప్రాముఖ్యత కలిగిన ఐబీ సిలబస్ కూడా మరికొన్ని చోట్ల ఉంది. వారు పిల్లలకు బస్ రవాణా సదుపాయం, ఇతర వసతులు కల్పిస్తారు. దీనికి గాను వారికి అంత మొత్తం ఫీజ్ కావచ్చు. ఆంగ్ల మాద్యమం అవసరం కానీ ఏపీలో ఇలాంటి వసతులతో కూడిన స్కూల్లో ఒక్క పైసా ఖర్చు కాకుండా జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న తీరు అమోఘం అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాక పిల్లలకు డ్రెస్‌లు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం తదితర అన్ని ఏర్పాట్లను జగన్ ప్రభుత్వం చేస్తోంది. ఇది మరి గొప్ప విషయం కాదా! ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియం ప్రవేశపెట్టడాన్ని ఆ ఫ్రొఫెసర్ స్వాగతించడమే కాకుండా, అంతర్జాతీయంగా ఎక్కడకు వెళ్లాలన్నా ఆంగ్ల మాద్యమం అవసరం అని ఆయన అబిప్రాయపడ్డారు. దివంగత నటి సావిత్రి సాయం ఈ మద్య నేను కూడా రేపల్లె వద్ద వడ్డివారి పాలెం అని ఒక ప్రభుత్వ స్కూల్‌కు వెళ్లడం జరిగింది. ఆ స్కూల్‌ను అభివృద్ది చేయడానికి ప్రముఖ నటి, దివంగత సావిత్రి నాలుగైదు దశాబ్దాల క్రితం ఆర్దిక సాయం చేశారు. ఆ గ్రామం ఆమె అమ్మమ్మగారి గ్రామం కావడంతో ఆమె శ్రద్ద చూపించారు. అందుకు కృతజ్ఞతగా ఆ గ్రామస్తులు స్కూల్ ఆవరణలో ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆమె జయంతి సందర్భంగా ముఖ్య అతిధిగా వెళ్లినప్పుడు అక్కడ ఉన్న సదుపాయాలు గమనించాను. ప్రభుత్వ పాఠశాలకు బస్ సౌకర్యం స్కూల్ ఆంబియన్స్ మార్చారు. స్కూల్ లోపల కూడా రోడ్డు వేశారు. ఒకప్పుడు వంద మంది కూడా లేని స్కూల్లో ఇప్పుడు మూడు వందల మందికి పైగా ఉన్నారని గ్రామస్తులు, స్కూల్ టీచర్లు వివరించారు. వారు సొంతంగా పాఠశాల తరపున ఒక బస్‌ను నడిపి సమీప గ్రామాలకు పంపి పిల్లలను రప్పిస్తున్నారు. బహుశా ఒక ప్రభుత్వ పాఠశాల ఇలా బస్ నడుపుతుండడం అరుదైన విషయమే కావచ్చు. ఏపీలో మారుతున్న సంస్కృతికి నిదర్శనం స్కూల్ గోడలపై మంచి రంగు, రంగుల బొమ్మలతో ఆకర్షణీయంగా కనిపించాయి. ఒకప్పుడు స్కూళ్లలో మంచి నీటి సదుపాయమే ఉండేది కాదు. కాని ఇప్పుడు ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. టాయిలెట్లలో స్టార్ హోటళ్లలో మాదిరి పరికరాలుపెట్టారు. అయితే అక్కడ మాత్రం కాస్త నిర్వహణ లోపం కనిపించింది. నేను చూసిన మరికొన్ని స్కూళ్లలో మాత్రం టాయిలెట్లు చాలా పరిశుభ్రంగా ఉన్నాయి. అయినా పిల్లల కోసం అలాంటి సదుపాయం ఏర్పాటు చేయడమే ఏపీలో మారుతున్న సంస్కృతికి నిదర్శనం. డిజిటల్ విద్యాబోధనకు అవసరమైన సదుపాయాలు ఈ మద్య తెలంగాణలో ఉన్న స్కూళ్ల పరిస్థితిని, ఏపీ స్కూళ్ల స్థితిని పోల్చుతూ కొన్ని వీడియోలు వచ్చాయి. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో ఒక స్కూల్‌కు వెళ్లినప్పుడు పిల్లలతో పాటు తాను కూడా కింద కూర్చోవలసి వచ్చింది. మరి అదే ఇప్పుడు మంచి, మంచి బల్లలు ఏర్పాటు చేశారు. క్లాస్ రూమ్‌లో భారీ టెలివిజన్లు ఏర్పాటై కనిపించాయి. డిజిటల్ విద్యాబోధనకు అవసరమైన అన్ని అక్కడ ఉన్నాయి. అమ్మ ఒడి కింద పదిహేను వేలు ఒక్క బైజూస్ కంటెంట్‌తో కూడిన టాబ్ కావాలంటే ప్రైవేట్ స్కూళ్లలో 35 వేల రూపాయలు చెల్లించవలసి ఉంటుందట. ఈ రకంగా చూస్తే ప్రవేటు స్కూళ్లలో ఎల్‌కేజీకే రెండున్నర లక్షల రూపాయల వ్యయం చేయవలసి వస్తుంది. కాని ఏపీలో పేద పిల్లల విద్యాబ్యాసానికి ఇంత ఖరీదైన విద్యను కాణీ ఖర్చు లేకుండా ఇస్తున్నారు. పైగా అమ్మ ఒడి కింద పదిహేనువేల రూపాయలు ఇస్తున్నారు. చంద్రబాబు పిట్టలదొర కబుర్లు నమ్ముతారా? పిల్లలకు చిన్న క్లాస్‌ల నుంచే టోఫెల్, ఐబీ వంటివాటిలో శిక్షణ ఇవ్వాలని తలపెట్టారు. మాతృభాషకు విఘాతం కలగకుండా ఇంగ్లీష్‌తో పాటు, మరికొన్ని ఇతర విదేశీ భాషలు నేర్పాలన్న తలంపుతో జగన్ ప్రభుత్వం ఉంది. అలాంటి మార్పులు వస్తున్నందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సంతోషపడడం లేదు. పైగా పేదల చదువును అవహేళన చేసేలా మాట్లాడారు. ఇంగ్లీష్ మీడియంను అడ్డుకునే యత్నం చేశారు. బైజూస్‌ను జగన్ జ్యూస్ అంటూ అసభ్యంగా మాట్లాడడానికి కూడా సిగ్గు పడలేదు. పైగా ఇప్పుడు కుప్పంలో తిరుగుతూ మీ పిల్లల భవిష్యత్తుకు, మీకు పుట్టబోయే పిల్లల భవిష్యత్ కోసరం తాను పనిచేస్తానని పిట్టలదొర కబుర్లు చెబుతున్నారు. దీనిని ఎవరైనా నమ్ముతారా? 35 ఏళ్లుగా తను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం సెంటర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలను ఆయన ఎందుకు బాగు చేయించలేకపోయారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఆ స్కూల్‌ను నాడు-నేడు కింద బాగు చేయించారు. దానిని చంద్రబాబు కాదనగలరా! ఆయన ప్రభుత్వం నడిపిన రోజుల్లో ఏమనేవారో గుర్తుకు చేసుకోండి! విద్య అన్నది ప్రభుత్వ బాద్యత కాదని, ప్రైవేటు రంగం పని అని చెప్పేవారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఆయన ఏమన్నారో చూడండి. ఈనాడు నీచ రాతలు ‘మన పిల్లలకు మనం ఇచ్చే సంపద విద్యే. ప్రతి ఒక్కరిని చదివించాలి. అందుకోసం ఎంతవరకైనా వెళతాం’ అని అంటారు. బోగస్ విజనరీ చంద్రబాబుకు, డెడికేటెడ్ పర్సన్ జగన్‌కు ఉన్న తేడా అది! ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. చంద్రబాబును భుజాన ఎక్కించుకుని తిరిగే ఈనాడు మీడియా అయితే ఏకంగా పిల్లలకు టాబ్లు ఇస్తే వారు ఏవేవో చూసి పాడైపోతున్నారని నీచంగా రాసింది. దారుణమైన రీతిలో అసత్యాలు నిజానికి ఆ టాబ్ లలో విద్యకు సంబంధించిన కంటెంట్ తప్ప మరొకటి ఓపెన్ కావు. అయినా పచ్చి అబద్దాలతో, లేదా అజ్ఞానంతో ఈనాడు పేపర్ అలాంటి దిక్కుమాలిన రాతకు పాల్పడింది. అందుకే జగన్ ఒక సభలో ఈనాడు పత్రికను ప్రజలకు చూపించి ఛీ అంటూ విసిరికొట్టి బుద్ది చెప్పే యత్నం చేశారు. అయినా ఆ పత్రిక యాజమాన్యం తన వైఖరి మార్చుకోకపోగా, ఇంకా రెచ్చిపోయి దారుణమైనరీతిలో అసత్యాలు రాసి ప్రజల మీదకు వదులుతోంది. వాటిని తట్టుకుని జగన్ ముందుకు వెళుతున్నారు. విద్య, వైద్య రంగాలకు విశేష ప్రాధాన్యం ఇచ్చి ప్రజలకు, ముఖ్యంగా పేదలకు వాటిని అందుబాటులోకి తెచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటే అతిశయోక్తి కాదు. ప్రత్యేకించి ప్రభుత్వ స్కూళ్లలో చదువుకుంటున్నవారు అత్యధికం బలహీనవర్గాల పిల్లలు, ఇతర వర్ణాలలోని పేదలు మాత్రమే. వారికి విద్య రావాలని తపన పడడం జగన్ ప్రభుత్వంలోనే చూస్తున్నాం. అందుకే ఇంత గొప్పగా విద్యా వ్యవస్థను తీర్చి దిద్దుతున్న జగన్ ప్రభుత్వాన్ని కాదనుకుంటే ఏపీలో విద్యారంగం వందేళ్లు వెనుకబడిపోతుందని ఫ్రొఫెసర్ రమేష్ అంటున్నారు. ఏపీ ప్రజలు విజ్ఞులే కాబట్టి తమ కోసం తపిస్తున్న జగన్ ప్రభుత్వాన్ని కాదనబోరని సర్వేలు కూడా చెబుతున్నాయి. కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో అనాథలకు 2 % కోటా
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో తల్లిదండ్రులు లేనివారికి (అనాథలు) రెండు శాతం కోటా కేటాయించేందుకు కసరత్తు చేయాలని అధికారులను రాష్ట్ర పీఆర్, మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. పిల్లలను దత్తత తీసుకునేందుకు అనేకమంది ఆసక్తి కనబరుస్తున్నా, నిబంధనలు కఠినంగా ఉండడంతో ఎక్కువమంది ముందుకు రావడం లేదన్నారు. దీనికి సంబంధించిన నిబంధనలను కూడా సులభతరం చేయాలని సూచించారు. అంగన్వాడీలకు వచ్చే పాలను సాధ్యమైనంత వరకు మండల కేంద్రాల్లో ఉన్న డెయిరీల ద్వారా సేకరించాలని, ఇందుకు ఒక పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో మహిళ, శిశు సంక్షేమశాఖపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ పిల్లల రక్షణ యూనిట్స్‌కు ట్రైనింగ్ ఇవ్వాలని, ఎన్జీవోల ఆధ్వర్యంలో నడిచినా డిపార్ట్మెంట్ నియంత్రణ ఉండాలన్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఒకటి, రెండు రోజుల పనికోసం వచ్చే వర్కింగ్ ఉమెన్‌కు ముఖ్యమైన పెద్ద నగరాల్లో శాఖాపరంగా హాస్టళ్లు ఏర్పాటు చేసే ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ప్రతి జిల్లాలో వృద్ధాశ్రమాలు కూడా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల దగ్గరే అంగన్వాడీ కేంద్రాలు ఉండేవిధంగా అధికారులు చొరవ చూపాలనన్నారు. ఈ సందర్భంగా శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ఈ సమావేశంలో మహిళ, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ‘స్త్రీ నిధి’ దుర్వినియోగంపై విచారణ కమిటీ అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం సాక్షి, హైదరాబాద్: స్త్రీ నిధి పథకంలో నిధుల దుర్వినియోగం ఫిర్యాదులపై శాఖాపరమైన విచా రణ కమిటీని ఏర్పాటు చేయాలని అధికా రులను పంచాయతీరాజ్, మహిళా శిశుసంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) ఆదేశించారు. ఈ నిధులు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవా లని సూచించారు. ఈ నిధుల దుర్వినియోగంపై ఉమ్మడి వరంగల్ జిల్లాలో వస్తున్న ఆరోపణలు, జరిగిన ప్రచారం వల్ల దీనిపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉందని, ఈ నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మంగళవారం సచివా లయంలో స్త్రీనిధి క్రెడిట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్‌పై సమీక్ష సందర్భంగా సీతక్క మాట్లాడుతూ, స్త్రీనిధిలో పెండింగ్‌లో ఉన్న అన్ని లోన్లను వెంటనే క్లియర్ చేయాలని, మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రజలకు రుణాలు ఎక్కువ ఇచ్చేలా చొరవ చూపాలని సూచించారు. హైవేలతో పాటు ఇతర ప్రధానమైన రోడ్లకు ఇరుపక్కల వివిధ రకాల పండ్లు, కూరగా యలు, ఇతర వస్తువులు అమ్ముకునే వారికి షెడ్స్ ఏర్పాటు ద్వారా మరింత ఉపాధి పొందటానికి అవ కాశం ఉంటుందని చెప్పారు. ఈ తరహా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ట్రైబల్ ఏరియాలో ఎలాంటి అవసరాలు ఉన్నాయో గుర్తించేందుకు అవసరమైన అధ్యయనం చేయాలని సూచించారు. మహిళలు వంద శాతం స్వయం సహాయక సంఘాలలో జాయిన్ అయ్యేలా చూడాలని ఆదేశించారు. ఇక నుంచి ప్రతినెలా ఒకసారి సమీక్షా సమావేశం ఉంటుందని, మహిళల ఆర్థిక సాధికారికత పెంచేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సమావేశంలో పీఆర్, ఆర్డీ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, మహిళ, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ, స్త్రీనిధి డైరెక్టర్ విద్యాసాగర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఇక అన్ని స్కూళ్లలో ‘ఫేషియల్ రికగ్నిషన్’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఇక నుంచి పూర్తి స్థాయిలో ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి తాజాగా అన్ని స్కూళ్లకు పాఠశాల విద్య డైరెక్టర్ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు నమోదును పారదర్శకంగా నిర్వహించేందుకు ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల హాజరు విధానంలో అక్రమాలకు ఆస్కారం లేకుండా చేయాలని భావిస్తున్నారు. దీని కోసం ప్రత్యేక యాప్‌ను కూడా రూపొందించారు. కాగా, ఈ హాజరు విధానం ద్వారానే విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, స్కూల్ డ్రెస్, పాఠ్యపుస్తకాలు ఇవ్వాలన్నది విద్యాశాఖ ఆలోచన. అయితే, ఈ విధానాన్ని దాదాపు ఏడాదికిందటే ప్రవేశపెట్టినప్పటికీ ఇప్పటి వరకూ 40 శాతం స్కూళ్లలో కూడా అమలు కావడం లేదు. ఇంతకాలం ఎన్నికల విధులు, ఉపాధ్యాయులకు శిక్షణ ఉండటం వల్ల ఈ అంశాన్ని పట్టించుకోలేదు. ఇక నుంచి ఈ ప్రక్రియను పకడ్బందీగా కొనసాగించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. తప్పుడు హాజరుకు చెక్ ఇప్పటి వరకూ ప్రభుత్వ స్కూళ్లలో ఉపాధ్యాయులు హాజరు తీసుకునే విధానం ఉండేది. ప్రతీ నెల చివరి తేదీలో తరగతుల వారీగా హెచ్ఎంలు విద్యార్థుల హాజరును రాష్ట్ర కార్యాలయానికి పంపేవాళ్లు. అయితే ఈ వివరాలకు విద్యార్థులకు అందించే భోజనం, దుస్తులు, పుస్తకాల లెక్కకు సరిపోవడం లేదని ఉన్నతాధికారులు అంటున్నారు. అలాగే పాఠశాల నిర్వహణ నిధులను కూడా కచ్చితంగా లెక్కగట్టలేపోతున్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టి 30 లోపు ఉన్న స్కూలుకు రూ. 5 వేలు, 31కి మించి ఉన్న స్కూలుకు రూ. 10 వేల చొప్పున నిర్వహణ నిధులు ఇస్తున్నారు. కొన్ని స్కూళ్లలో విద్యార్థుల హాజరును తప్పుగా చూపించి, నిధులు ఎక్కువ తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. కాగా, హైదరాబాద్‌లోని చాలా స్కూళ్లలో ఫేషియల్ రికగ్నైజేషన్ హాజరును అసలు అమలు చేయడం లేదు. దీనికి అనేక రకాల సాంకేతిక కారణాలు చెబుతున్నారు. ముందు నెట్ ఇవ్వాలి –– పి.రాజాభాను చంద్రప్రకాశ్ (ప్రభుత్వ హెచ్ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు) ఫేషియల్ రికగ్నైజేషన్ హాజరు అమలు విషయంలో అధికారులు సాంకేతిక ఇబ్బందులను పరిశీలించాలి. చాలా స్కూళ్లలో నెట్ సదుపాయం లేదు. ఈ హాజరు విధానం కోసం పక్క వాళ్ల నెట్ తీసుకోవడం రోజూ సాధ్యం కాదు. హెచ్ఎంల మొబైల్ నెట్ కొన్ని సార్లు పనిచేయడం లేదు. ఫేషియల్‌తో పాటు స్కూల్లో రికార్డు కోసం మ్యాన్యువల్‌గా హాజరు తీసుకోవడం కూడా బోధన సమయానికి ఇబ్బందే. మొదటి పీరియడ్‌లో చాలా సమయం హాజరుకే పోయే అవకాశం ఉంది. దీనిపై క్షేత్రస్థాయి సమస్యలు పరిశీలించాలి. నెట్ సదుపాయం అందుబాటులోకి తేవాలి. -
విద్యకు ‘నూతన’ జవసత్వాలు!
సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సరంలో విద్యా రంగం వినూత్న జవసత్వాలను సంతరించుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. జాతీయ, రాష్ట్ర స్థాయిలో గణనీయ మార్పులు, కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యాశాఖపై జరిపిన సమీక్ష తర్వాత రాష్ట్రంలో మార్పులపై సంకేతాలు వస్తున్నాయి. ప్రాథమిక విద్య మొదలుకొని విశ్వవిద్యాలయ స్థాయి వరకు కొత్త అడుగులు పడవచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు జాతీయ స్థాయిలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) వంటి సంస్థలు కూడా ఈ ఏడాది కీలక సంస్కరణల అమలుకోసం సిద్ధమవుతున్నాయి. ఉపాధ్యాయ ఖాళీల భర్తీపై ఆశలు రాష్ట్రంలో 26 వేలకుపైగా ప్రభుత్వ బడులు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే 12 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీచర్లకు పదోన్నతులు కలి్పస్తే మరో 10 వేల వరకు పోస్టులు అందుబాటులోకి వస్తాయి. మొత్తంగా 22 వేల పోస్టులను భర్తీ చేయాల్సి ఉండనుంది. గత ఏడాది 5 వేల పైచిలుకు పోస్టుల భర్తీకి కార్యాచరణ చేపట్టినా అడుగు ముందుకు పడలేదు. అయితే త్వరలో మెగా డీఎస్సీ చేపడతామని రాష్ట్ర సర్కారు ప్రకటించడం విద్యాశాఖలో ఆశలు రేపుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కేవలం ఏడు జిల్లాల్లోనే పర్యవేక్షణ అధికారులు ఉన్నారు. దీంతో విద్యలో నాణ్యత తగ్గిందన్న ఆరోపణలున్నాయి. మరోవైపు పదోన్నతులు, బదిలీలు కూడా చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం టీచర్లలో హర్షం వ్యక్తమవుతోంది. కాలేజీ విద్యకూ మంచి రోజులు ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో 2,400 బోధన సిబ్బంది పోస్టుల భర్తీ కోసం గత ఏడాది ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. కానీ రోస్టర్ పాయింట్ విషయంలో న్యాయపరమైన ఇబ్బందితో భర్తీ ప్రక్రియ ముందుకు కదల్లేదు. నిజానికి రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో రెగ్యులర్ అధ్యాపకులు 1,200 మందే ఉన్నారు. 4,007 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. జూనియర్ కాలేజీల్లో 6,008 పోస్టులుంటే.. 4 వేలకుపైగా ఖాళీలు ఉన్నాయి. వీటన్నింటినీ భర్తీ చేసేందుకు అవసరమైన నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరిన నేపథ్యంలో.. కొత్త ఏడాదిలో కాలేజీ విద్యకు మంచిరోజులు వచ్చినట్టేనని అంటున్నారు. ఇక రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో 3 వేల అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఉన్నత విద్యా మండలి, విశ్వవిద్యాలయాల ప్రక్షాళన, సమన్వయ పాలన వ్యవహారాలపై సర్కారు దృష్టి పెట్టిందని.. ఇవన్నీ 2024 ఏడాదిలో కీలక పరిణామాలకు దారి తీయవచ్చని అంటున్నారు. పరీక్షలకు సన్నద్ధమయ్యేలా.. ఫిబ్రవరిలో ఇంటర్, మార్చిలో టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. గతంలో పేపర్ లీకులు, ఇంటర్ ఫలితాలపై విద్యార్థుల ఆందోళన వంటివి చోటు చేసుకున్నాయి. దీంతో ఈసారి ప్రభుత్వం పరీక్షలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడం, విద్యార్థులను ముందు నుంచే సన్నద్ధం చేస్తూ భయం పోగొట్టడం వంటి చర్యలు చేపట్టనున్నట్టు అధికారులు చెప్తున్నారు. మారుతున్న సిలబస్.. ఈ ఏడాది నుంచి పాలిటెక్నిక్ సిలబస్ మారనుంది. విదేశాల్లోని డిప్లొమా చదువులకు అమలు చేస్తున్న పాఠ్య ప్రణాళికను ఆధారంగా చేసుకుని కొత్త ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి ఒక్కో డిప్లొమా బ్రాంచీకి ఒక్కో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. సింగపూర్, చైనా దేశాల్లోని సిలబస్‌లను ఈ కమిటీలు పరిశీలిస్తాయి. పాలిటెక్నిక్ విద్యలో ఇంటర్న్‌షిప్, ఆన్లైన్ మూల్యాంకనం, ఓపెన్ బుక్ విధానం వంటి సంస్కరణలు తీసుకొచ్చే అవకాశం ఉంది. మరిన్ని డీమ్డ్ వర్సిటీలు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఈ ఏడాది కీలక మార్పులకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. డీమ్డ్, ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు నిబంధనలను మరింత సరళతరం చేస్తోంది. ఇప్పటికే సంబంధిత ముసాయిదాపై అన్ని వర్గాల ఆమో దం తీసుకున్నారు. మూడేళ్లు వరుసగా న్యాక్ ఏ ప్లస్‌తోపాటు గ్రేడ్‌లో నాలుగు పాయింట్లకుగాను కనీసం 3.4 పాయింట్లు సాధించిన కాలేజీలకు డీమ్డ్ హోదా ఇవ్వాలని యూజీసీ నిర్ణయించింది. దీనిని బట్టి తెలంగాణలో పది కాలేజీలకు డీమ్డ్ హోదా లభించే వీలుంది. మరోవైపు విదేశీ విద్యాలయాలు మన దేశంలో బ్రాంచీల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాయి. వాటికి యూజీసీ, సాంకేతిక విద్యా మండలి సూత్రప్రాయ అంగీకారం తెలిపాయి. విదేశీ యూనివర్సిటీల రాకతో విద్యా బోధనలో మార్పు రావొచ్చని నిపుణులు చెప్తున్నారు. -
త్వరలో మెగా డీఎస్సీ
సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి కూడా చదువు కోసం ఇతర గ్రామాలకు, పట్టణాలకు పోయే పరిస్థితి ఉండొద్దని.. విద్యార్థులు లేరంటూ మూసివేసిన అన్ని బడులను తెరిపించాలి. ఎంతమంది పిల్లలున్నా ప్రభుత్వ పాఠశాలను నడపాల్సిందే. దీనికోసం వెంటనే మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల భర్తీకి చర్యలు తీసుకోండి..’’అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయ ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలని సూచించారు. శనివారం సచివాలయంలో విద్యాశాఖపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పాఠశాల లేని గ్రామ పంచాయతీ ఉండొద్దని ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎంత మారుమూల గ్రామమైనా, తండా అయినా కూడా తప్పకుండా ప్రభుత్వ పాఠశాల ఉండాలని.. పట్టణాలు, నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి రానీయొద్దని సూచించారు. విద్యార్థులు లేరనే నెపంతో పాఠశాలలు మూతపడొద్దన్నారు. ఉత్తమ పాఠశాలలుగా తీర్చిదిద్దాలి మన ఊరు, మన బడి కార్యక్రమంలో జరిగిన పనుల పురోగతిని సీఎం సమీక్షించారు. ఆ కార్యక్రమంలో ఇంకా మిగిలిపోయిన పనులన్నింటినీ పూర్తిచేసి, రాష్ట్రంలోని ప్రభుత్వ బడులను ఉత్తమ పాఠశాలలుగా తీర్చిదిద్దాలని సూచించారు. సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) నిధులతో మన ఊరు–మన బడి కింద ఖర్చు చేసిన నిధులకు సంబంధించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కాంట్రాక్టుల్లో అవినీతి జరిగిందనే ఫిర్యాదుల నేపథ్యంలో దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని సూచించారు. ఇక ఉపాధ్యాయుల పదోన్నతులు. బదిలీలలో ఉన్న అవాంతరాలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. బదిలీల విషయంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపాలని.. అవాంతరాలను అధిగమించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. విద్యా సంస్థల విద్యుత్ బిల్లుల కేటగిరీ మార్పునకు తీసుకోవాల్సిన చర్యలపైనా అధికారులకు పలు సూచనలు చేశారు. విద్యాలయాలకు వ్యాపార, పారిశ్రామిక కేటగిరీ కింద బిల్లులు వసూలు చేయడంపై తగిన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేíÙంచాలన్నారు. పాఠశాలల్లో స్వీపర్లు, పారిశుధ్య కారి్మకులను ఏర్పాటు చేయడానికి ఉన్న మార్గాలను సూచించాలని కోరారు. ఉమ్మడి జిల్లాకో నైపుణ్య విశ్వవిద్యాలయంం రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల్లో నైపుణ్య యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలకు తగిన నైపుణ్యాలు సాధించి, ఉద్యోగాలు పొందగలిగేలా ఈ స్కిల్ యూనివర్సిటీలు ఉండాలని అధికారులకు సూచించారు. వాటిలో ఉపాధి ఆధారిత స్వల్పకాల, దీర్ఘకాల కోర్సులను ప్రవేశపెట్టాలని ఆదేశించారు. ఈ విషయంలో గుజరాత్, హరియాణా, రాజస్థాన్, ఒడిశా, ఏపీ తదితర రాష్ట్రాల్లో ఉన్న స్కిల్ యూనివర్సిటీలపై అధ్యయనం చేయాలని సూచించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గంతోపాటు తొమ్మిది జిల్లాల్లో ఈ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ అంశంపై విద్యాశాఖ, పరిశ్రమల శాఖ, కార్మిక శాఖల కార్యదర్శులతో ప్రత్యేక కమిటీ వేసి తగిన ప్రతిపాదనలను సమరి్పంచాలని సీఎస్‌ను ఆదేశించారు. సీఎం సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, పాఠశాల విద్య కమిషనర్ దేవసేన, సీఎంవో అధికారులు శేషాద్రి, షానవాజ్ కాశీం తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటు యూనివర్సిటీలపై విచారణ! రాష్ట్రంలోని ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతులు, మార్గదర్శకాలు, ప్రభుత్వం నుంచి పొందుతున్న సౌకర్యాలు, విద్యార్థుల సంఖ్య, వసూలు చేసిన ఫీజులు, ఫీజు రీయింబర్స్మెంట్, టీచింగ్ సిబ్బంది, నాన్ టీచింగ్ సిబ్బంది వంటి అన్ని అంశాలపై పరిశీలన జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సరైన మౌలిక వసతులు, అర్హతలున్న సిబ్బంది లేకుండానే ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్నామని ప్రైవేటు వర్సిటీలు ఎలా చెప్తున్నాయో పరిశీలించాలన్నారు. ఇండ్ల ప్లాట్ల కింద రిజిస్ట్రేషన్లు అయిన భూములను, ధరణిలో వివాదంలో ఉన్న భూముల్లో ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతి ఇచ్చారని.. దీనివల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఈ అంశంపైనా సమగ్ర నివేదికను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. యూనివర్సిటీకి అనుమతులు రాకుండానే అడ్మిషన్లు నిర్వహించిన ఒక కాలేజీ వల్ల గత విద్యాసంవత్సరంలో చాలామంది విద్యార్థులు ఇబ్బందిపడ్డారని గుర్తు చేశారు. రిజర్వేషన్ల అమలు పరిశీలన రాజ్యాంగబద్ధమైన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను అమలు చేయకుండా ప్రైవేటు యూనివర్సిటీలు నడవడం సరికాదని విద్యాశాఖపై సమీక్ష సందర్భంగా సీఎం రేవంత్ పేర్కొన్నారు. ప్రైవేటు యూనివర్సిటీల మార్గదర్శకాలపై సమగ్రంగా పరిశీలన జరపాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రైవేటు వర్సిటీల్లో రిజర్వేషన్ల అమలు కోసం అవసరమైతే అసెంబ్లీలో చట్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. కాగా ఉన్నత విద్యా మండలి ప్రక్షాళన అంశంపైనా సమీక్షలో చర్చ జరిగినట్టు సమాచారం. అయితే ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి, వైస్ చైర్మన్ వెంకటరమణలను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచి్చనా.. తిరిగి వారిని సమావేశానికి ఆహా్వనించడం చర్చనీయాంశంగా మారింది. -
AP: చక్కదిద్దారు!
బ్లాక్ బోర్డుపై రాసేందుకు నాలుగు సుద్ధ ముక్కల కోసం కూడా వెతుక్కోవాల్సిన దుస్థితి నుంచి ఏకంగా ట్యాబ్‌లు, ఐఎఫ్‌పీ స్క్రీన్స్, స్మార్ట్ టీవీలతో మన ప్రభుత్వ స్కూళ్లు సరికొత్తగా ఆవిష్కృతమయ్యాయి. పగిలిన గోడలు.. పెచ్చులూడే శ్లాబులు.. చెట్ల కింద వానాకాలం చదువులు అనే దురవస్థ నుంచి ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులను ఏకంగా ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే స్థాయికి తీసుకెళ్లిన ఘనత మన రాష్ట్ర ప్రభుత్వానికే దక్కింది. నాలుగంటే నాలుగేళ్లలోనే సాకారమైన మార్పులు ఇవన్నీ! సాక్షి, అమరావతి: చదువుకునేందుకు లక్షలు ధారపోయాల్సిన పరిస్థితి నుంచి పిల్లలు సర్కారు బడికొస్తే చాలు ఎదురు డబ్బులిచ్చి మరీ ప్రోత్సహిస్తోందీ వైఎస్ జగన్ ప్రభుత్వం. మనసుంటే మార్పు వచ్చి తీరుతుందని బలంగా నమ్మిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంస్కరణల బాటతో మన విద్యా వ్యవస్థ 2019కి ముందు.. ఆ తర్వాత అని దేశమంతా చర్చించుకునేలా చేశారు. విద్యారంగంపై వెచ్చిస్తున్న వ్యయాన్ని భావి తరాల బంగారు భవిష్యత్తు కోసం పెట్టు పెట్టుబడిగా దృఢంగా విశ్వసించారు. కార్పొరేట్‌ను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలను డిజిటల్ బోధన బాట పట్టించారు. అక్షరానికి అగ్రాసనం వేస్తూ పేదింటి పిల్లలను అక్కున చేర్చుకున్నారు. నాడు – నేడు ద్వారా ఇప్పటికే రెండు దశల్లో 44,617 ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు తెచ్చారు. ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియం బోధన, 3వ తరగతి నుంచి సబ్జెక్టు టీచర్ విధానం, 1,000 ప్రభుత్వ స్కూళల్లో సీబీఎస్ఈ సిలబస్ ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే సాధ్యమైంది. మధ్యాహ్నం ప్రతి విద్యార్థి సంతృప్తిగా భుజించేలా రోజుకో రుచికరమైన మెనూతో గోరుముద్ద అమలు చేస్తున్నారు. ఏటా సగటున రూ.1,400 కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.6,995.34 కోట్ల బడ్జెట్‌ను పిల్లల భోజనం కోసం కేటాయించింది. వారంలో ఐదు రోజులు ఉడికించిన గుడ్డు, మూడు రోజులు రాగిజావ, బెల్లం చిక్కీను అందచేస్తూ పిల్లల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న శ్రద్ధను అత్యుత్తమ చర్యగా విద్యావేత్తలు ప్రశంసిస్తున్నారు. సర్కారు స్కూళ్లలో ప్రాథమిక స్థాయి నుంచే టోఫెల్ శిక్షణతో పాటు 2025–26 నుంచి ఐబీ సిలబస్‌ను సైతం అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది ప్రభుత్వం. కేవలం విద్యారంగంలో సంస్కరణల కోసమే నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం రూ.71 వేల కోట్లకు పైగా ఖర్చు చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రధమం. అమ్మ ఒడి నుంచి ఆణిముత్యాలు.. విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు, అంతర్జాతీయంగా రాణించాలన్న దీర్ఘకాలిక లక్ష్యంతో పాఠశాల విద్యకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. అభ్యసన ఫలితాలను మెరుగుపరిచే లక్ష్యంతో సమగ్ర విద్య సంస్కరణలను అమలు చేసింది. ‘మనబడి నాడు–నేడు’ ద్వారా మౌలిక సదుపాయాలు, అదనపు తరగతి గదులను సమకూర్చింది. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లను పరిశుభ్రంగా మారుస్తూ నిర్వహణకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో మొత్తం 58,950 పాఠశాలలు ఉండగా 72,20,633 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 44,617 ప్రభుత్వ పాఠశాలల్లో 43.10 లక్షల మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. వీరందరికీ అత్యున్నత ప్రమాణాలతో విద్యనందించాలని 2019–20లోనే ప్రభుత్వం సంస్కరణలు ప్రారంభించింది. నవరత్నాలు పథకంలో భాగంగా పిల్లలను బడికి పంపించే తల్లికి రూ.15 వేలు చొప్పున తొలిసారి 42,33,098 మంది ఖాతాల్లో రూ.6,349.6 కోట్లు జమచేసి ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన మాట నిలుపుకొన్నారు. ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకే కాకుండా ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్న వారికీ అమ్మ ఒడి అమలు చేసి 2022–23 వరకు రూ.25,809.50 కోట్లు తల్లుల ఖాతాల్లో జమ చేసి ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రతిభకు ప్రోత్సాహం.. విద్యా రంగ సంస్కరణల కొనసాగింపు, నైపుణ్యాన్ని పెంపొందించడంతో పాటు విద్యార్థుల కృషిని అభినందించి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది మరో గొప్ప ముందడుగు వేసింది. ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో చదివి ప్రతిభ చాటిన వారిని ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరుతో సత్కరించింది. 2023 ఇంటర్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి మొదటి స్థానాల్లో నిలిచిన 22,768 మంది స్టేట్ బ్రిలియన్స్ అవార్డులు అందుకున్నారు. సదుపాయాలు.. విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంలో నేర్చుకునేలా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం మనబడి నాడు–నేడు ద్వారా శ్రీకారం చుట్టింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 11 సదుపాయాలను కల్పించింది. నిరంతర నీటి సరఫరాతో టాయిలెట్లు, తాగునీరు, మరమ్మతులు, ఫ్యాన్లు, లైట్లతో విద్యుదీకరణ, విద్యార్థులు, సిబ్బందికి ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డులు, భవనాలకు పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్, కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్, అదనపు తరగతి గదులు నిర్మించింది. నాడు–నేడు మొదటి విడతలో 15,715 పాఠశాలల్లో రూ.3,669 కోట్లతో సౌకర్యాలు కల్పించారు. రెండో దశలో రూ.8,000 కోట్లతో 22,344 పాఠశాలల్లో పనులు వడివడిగా చేపట్టారు. నాడు–నేడు పనులు చేపట్టిన అన్ని ఉన్నత పాఠశాలల్లో ఇంటర్నెట్తో పాటు 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లతో 3డీ డిజిటల్ పాఠాలను బోధిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో 33 వేల స్మార్ట్ టీవీలతో పాఠాలతో పాటు టోఫెల్ శిక్షణ అందిస్తున్నారు. నాలుగో తరగతి నుంచి ఇంటర్ వరకు బైజూస్ పాఠాలను ఉచితంగా అందించడం గమనార్హం. దేశంలో 25 వేల ఐఎఫ్‌పీలు ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లోనే 62 వేల డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయడం దేశ చరిత్రలో విప్లవంగా నిలిచిపోయింది. డిజిటల్ శకం.. ప్రభుత్వ పాఠశాలల్లో 4 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉత్తమ కంటెంట్ ఉచితంగా అందించేందుకు అతిపెద్ద ఎడ్ టెక్ కంపెనీ బైజూస్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఈ కంటెంట్‌ను ఇంటర్ విద్యార్థులకు కూడా అందిస్తుండడం విశేషం. ఎనిమిదో తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు కలిపి 2021–22, 2022–23 విద్యా సంవత్సరాల్లో 9.53 లక్షల మందికి బైజూస్ కంటెంట్‌తో ఉచితంగా ట్యాబ్స్ ఇచ్చి ఇంటి వద్ద కూడా డిజిటల్ పాఠాలు నేర్చుకునేలా చర్యలు తీసుకుంది. ఏపీ ఈ పాఠశాల మొబైల్ యాప్, దీక్ష వెబ్సైట్, డీటీహెచ్ చానెళ్లు, యూట్యూబ్ చానెల్ లాంటి వాటి ద్వారా విద్యార్థులు ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా చదువుకునే ఏర్పాటు చేసింది. విద్యార్థుల సందేహాల నివృత్తికి ‘ఏఐ’ టెక్నాలజీతో పనిచేసే ‘డౌట్ క్లియరెన్స్ బాట్’ యాప్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్, టోఫెల్ శిక్షణలో ఎదురయ్యే క్లిష్టమైన సందేహాలను ఇది సునాయాసంగా నివృత్తి చేస్తుంది. సబ్జెక్టు టీచర్లు.. టోఫెల్ శిక్షణ పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా రాణించాలంటే ఇంగ్లిష్ భాషపై పట్టు ఎంతో అవసరం. అందుకోసం ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రవేశపెట్టడంతో పాటు ప్రాథమిక స్థాయి నుంచే కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు అమెరికాకు చెందిన ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ (ఈటీఎస్)తో ప్రభుత్వం టోఫెల్ శిక్షణ ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా 3 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు టోఫెల్ శిక్షణనిస్తున్నారు. విద్యా ప్రమాణాలు పెంచేందుకు మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లను నియమించి ఉత్తమ బోధన అందుబాటులోకి తెచ్చింది. పాఠ్యాంశాల సంస్కరణ.. విద్యార్థుల్లో నేర్చుకునే తత్వం, జిజ్ఞాస పెంచేందుకు ప్రభుత్వం పాఠ్యాంశాల్లో సంస్కరణలు తీసుకొచ్చింది. మూస పద్ధతిలో ఉన్న పాఠాలను 2020–21 నుంచి సమూలంగా మార్చింది. 21వ శతాబ్దపు నైపుణ్యాలను పెంపొందించేందుకు క్లాస్రూమ్ బేస్డ్ అసెస్మెంట్ను అమలు చేస్తోంది. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా పాఠశాలలను ఫౌండేషన్, ఉన్నత పాఠశాలలుగా మార్చింది. అన్ని పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల అవసరాన్ని తీర్చేలా భారీగా పదోన్నతులు కల్పించారు. బోధనా సామర్థ్యాలు పెంచేందుకు, సీబీఎస్ఈ బోధనకు అనుగుణంగా ‘టీచర్ కెపాసిటీ బిల్డింగ్’ శిక్షణనిచ్చింది. ఇందుకోసం ఇఫ్లూ, రివర్సైడ్ లెర్నింగ్ సెంటర్లలో ఉపాధ్యాయ శిక్షణ ఇచ్చారు. సీబీఎస్ఈ.. మండలానికో కాలేజీ ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం 1,000 పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధనను ప్రారంభించింది. ప్రతి మండలంలో బాలికల కోసం ఒక జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసింది. 292 ఉన్నత పాఠశాలలను బాలికల కోసం హైస్కూల్ ప్లస్‌గా అప్‌గ్రేడ్ చేశారు. మొత్తం 352 కేజీబీవీల్లో ఇంటర్మీడియట్‌ను ప్రవేశపెట్టారు. 2022–23 నుంచి 14 కో–ఎడ్ జూనియర్ కళాశాలలను గరŠల్స్ జూనియర్ కళాశాలలుగా మార్చారు. దీంతో మొత్తం 679 మండలాల్లో బాలికల కోసం ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల అందుబాటులోకి వచ్చింది. టెక్నాలజీపై శిక్షణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను టెక్ నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం 2024–25 నుంచి ఫ్యూచర్ స్కిల్స్ కోర్సులను ప్రవేశపెడుతోంది. ఆరు నుంచి ఇంటర్ వరకు మూడు దశల్లో ఫ్యూచర్ స్కిల్ శిక్షణ ఇవ్వనున్నారు. విద్యార్థుల ఆలోచన శక్తిని విస్తరించడం, విజ్ఞానంలో ముందుండేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), 3డీ ప్రింటింగ్, గేమింగ్ లాంటి పది విభాగాల్లో శిక్షణ ఇస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్ కోసమే దాదాపు రూ.2,400 కోట్లు ఖర్చు చేస్తున్నారు. నాస్కామ్, జేఎన్టీయూ నిపుణులు, ఏపీ ఎస్సీఈఆర్టీ, స్వతంత్ర నిపుణులతో ఫ్యూచర్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌ను రూపొందించారు. ఈ కోర్సులను 6,790 ఉన్నత పాఠశాలల్లో బోధించేందుకు ఇంజనీరింగ్ చివరి ఏడాది విద్యార్థులను ఫ్యూచర్ స్కిల్స్ ఫెసిలిటేటర్స్‌గా నియమిస్తున్నారు. ఐబీ దిశగా అడుగులు.. ‘మన పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా ఎదగాలి. ప్రపంచానికి దిక్సూచిగా మారాలి’ అన్న సీఎం జగన్ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఇంటర్నేషనల్ బాకలారియేట్ (ఐబీ) బోధన ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దేశంలో 210 వరల్ట్ క్లాస్ కార్పొరేట్ స్కూళ్లలో మాత్రమే అందుబాటులో ఉన్న ‘ఐబీ’ బోధనను ప్రభుత్వ స్కూళల్లోకి తెచ్చి పేద పిల్లలకు ఉచితంగా అందించాలన్న సంకల్పంతో సీఎం జగన్ అడుగులు ముందుకు వేశారు. 2025 – 26 నుంచి ఐబీ బోధన ప్రవేశపెట్టి ఏటా ఒక్కో తరగతి చొప్పున పెంచుతూ + 2 వరకు అందించేలా చర్యలు తీసుకున్నారు. విద్యార్థుల్లో క్రిటికల్ థింకింగ్, లేటరల్ థింకింగ్, డిజైన్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ లాంటి నైపుణ్యాలకు సాన పెట్టడంతోపాటు అంతర్జాతీయంగా అత్యుత్తమ స్థాయిలో ఉద్యోగాలుయ పొందేలా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. కేవలం నాలుగున్నరేళ్లలోనే ఇన్ని అద్భుతమైన సంస్కరణలు తవిద్యారంగంలో తేవడం చరిత్రాత్మకమని, ఇది ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నామని విద్యావేత్తలు ప్రశంసిస్తున్నారు. విద్యా సాధికారత.. స్కూళ్లలో పూర్తి స్థాయిలో మౌలిక వసతులతో పాటు ఆంగ్ల మాధ్యమం వల్ల విద్యా సాధికారత దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. ప్రాథమిక స్థాయి నుంచి బలమైన పునాదులను నిర్మిస్తోంది. ఇప్పడు మన ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న ఉత్తమ విద్యతో నైపుణ్యం గల మానవ వనరులను సృష్టించడం సాధ్యమేనని బలంగా నమ్ముతున్నా. – ప్రొఫెసర్ కె.శ్రీరామమూర్తి, ఏయూ ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపల్ పదేళ్లలో అద్భుతాలు సృష్టిస్తారు.. గతంలో నేను ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లలకు పుస్తకాలు, యూనిఫారం లాంటివి డొనేట్ చేసేవాడిని. ఈ ప్రభుత్వం వచ్చాక నోటు పుస్తకాల నుంచి యూనిఫారం, బూట్లు వరకు ఆ అవసరం లేకుండా అన్నీ ఉచితంగా అందిస్తోంది. స్వేచ్ఛ న్యాప్కిన్స్ ఇస్తున్నారు. ఆటలు ఆడిస్తున్నారు. పిల్లలకు నేర్పే విధానం, నేర్చుకునే విధానం సంపూర్ణంగా మారింది. ప్రభుత్వ విద్యలో ఇదో గొప్ప సంస్కరణ. కార్పొరేట్ స్కూళ్లలోనూ ఇన్ని వసతులు లేవు. ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలు మరో 10 ఏళ్లలో అద్భుతాలు సృష్టిస్తారనడంలో సందేహం లేదు. – డాక్టర్ రాజశేఖర్, గైనకాలజిస్ట్, కర్నూలు ఆ ఇబ్బందులు తొలగించారు.. ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్లు లేకపోవడం బాలికలకు అతి పెద్ద సమస్య. ఈ ప్రభుత్వం ఆ సమస్యను దూరం చేసింది. బాలికలకు స్వేచ్ఛ పేరుతో శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా ఇస్తున్నారు. గతంలో ఈ సౌకర్యాలు లేక ఇబ్బందులు పడేవారు. నాడు–నేడుతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోను ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు నమ్మకం పెరిగింది. ఇంగ్లిష్ మీడియం, టోఫెల్ శిక్షణ, రక్తహీనత నివారణకు బెల్లం చిక్కీతో పాటు ఐరన్ మాత్రలు ఇవ్వడం ప్రశంసనీయం. – వడిశెట్టి గాయత్రి, పీజీ లెక్చరర్, పిఠాపురం -
Fact Check: వాస్తవాలు దాచిపెట్టి ట్యాబ్‌లపై విష ప్రచారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వం నాలుగున్నర ఏళ్లల్లో విద్యాశాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా మార్చిందని.. వాస్తవాలు తెలుసుకోకుండా కొందరు పేద విద్యార్థులకు జరుగుతున్న మేలుపై తప్పుడు ప్రచారం జరుగుతోందని పాఠశాల విద్యాశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లోని 8వ తరగతి విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్స్ ఆన్లైన్లో తక్కువ ధర లభిస్తున్నా.. అధిక ధరకు కొనుగోలు చేశారంటూ కొందరు చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని తెలిపింది. ట్యాబ్ కొనుగోలులో రూ.1,200 కోట్లు అవినీతి జరిగిందనడం పూర్తిగా అబద్ధమని పేర్కొంది. ట్యాబ్ స్పెసిఫికేషన్, వారంటీ తెలియకుండా ఆన్లైన్ ధర రూ.11,999 ఉందని.. బల్క్‌లో కొంటే రూ.9 వేలకే వస్తున్నట్టు పేర్కొంటూ.. ఈ ట్యాబ్స్‌ను రూ.14,250కు కొనుగోలు చేయడంలో అక్రమాలకు పాల్పడ్డారనడం పూర్తిగా అవాస్తవమని ఖండించింది. పాఠశాల విద్యాశాఖ ఇంకా ఏం తెలిపిందంటే.. ► వాస్తవానికి ఆయా కంపెనీలు పాత స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు ఆన్లైన్లో తక్కువ ధరకు పెడుతుంటాయని, పైగా మనం కోరుకున్న స్పెసిఫికేషన్స్ అందులో ఉండవు. కానీ.. ప్రభుత్వం కొనుగోలు చేసిన ట్యాబ్స్‌కు నిర్ణీత ప్రత్యేకతలు పేర్కొని, ఆ తరహా ట్యాబ్స్ మాత్రమే తీసుకుంది. ► విద్యార్థులకు ప్రధానంగా శాంసంగ్ ఏ7 లైట్ ట్యాబ్‌లు ఇవ్వగా.. దాని బ్యాటరీతో సహా 3 ఏళ్ల వారంటీ, మూడేళ్ల పాటు మొబైల్ డివైజ్ మేనేజ్మెంట్ (ఎండీఎం), ఓటీజీ కేబుల్, ట్యాబ్‌కు రక్షణగా ఫ్లిప్ కవర్ ఉంటాయి. ► 256 జీబీ మెమరీ కార్డు గల ట్యాబ్ ధర మార్కెట్లోగాని, ఆన్‌లైన్‌లోగాని రూ.17,500 పైనే ఉంది. కానీ.. ప్రభుత్వం టెండర్ ద్వారా రూ.14,250 అంటే ఆన్లైన్ ధర కంటే చాలా తక్కువకు తీసుకుంది. ఆయా కంపెనీలు ఓటీజీ కేబుల్, డ్యూయల్ లేయర్ ట్యాబ్ ప్రొటెక్టెడ్ రగ్గడ్ కేస్, ట్యాంపర్డ్ స్క్రీన్ గార్డ్, ఫ్లాష్డ్ ఎడ్యుకేషన్ కంటెంట్‌తో 256 జీబీ యూ3 మెమరీ కార్డు, 3 సంవత్సరాల వారంటీతో అందించాయి. ► ఆన్లైన్లో కొనుగోలు చేసిన వస్తువులకు వారంటీగాని, సాఫ్ట్వేర్ సమస్యలకు కొనుగోలుదారే అదనంగా చెల్లించాలి. కానీ.. విద్యార్థులు ట్యాబ్‌లో ఏదైనా సమస్య తలెత్తితే సమీపంలోని గ్రామ/వార్డు సెక్రటేరియట్లో ఇచ్చి కంపెనీ సేవలకు ఉచితంగా పొందవచ్చు. గతేడాది ట్యాబ్స్ కొనుగోలుపైనా ఆరోపణ ► గత సంవత్సరం ఏసర్ ట్యాబ్ ధర రూ.14 వేలు ఉంటే, దాన్ని ప్రభుత్వం రూ.17,500కి కొనుగోలు చేసిందని, దాంతో రూ.2,500 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపించారు. ► వాస్తవానికి గతేడాది ప్రభుత్వం ఏసర్ ట్యాబ్‌లను కొనుగోలు చేయనేలేదు. ఈ ఏడాది మాత్రమే 1.35 లక్షల ఏసర్ ట్యాబ్‌లను కొనుగోలు చేసింది. ఒక్కో ఏసర్ ట్యాబ్‌ను రూ.14,200కు ఓటీజీ కేబుల్, డ్యూయల్ లేయర్ ట్యాబ్ ప్రొటెక్టెడ్ రగ్గడ్ కేస్, ట్యాంపర్డ్ స్క్రీన్ గార్డ్, ఫ్లాష్డ్ ఎడ్యుకేషన్ కంటెంట్‌తో గల 256 జీబీ యూ3 మెమరీ కార్డు, 3 సంవత్సరాల వారంటీ ఈ ధరలోనే ఉన్నాయి. అన్ని యాక్సెసరీస్‌కు మూడేళ్ల గ్యారెంటీ కూడా ఉంది. ► పైగా ట్యాబ్ కొనుగోలు టెండర్ జ్యుడీషియల్ ప్రివ్యూకు వెళ్లిన తర్వాత, ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే టెండర్లు పిలిచారు. రెండేళ్లలో ప్రభుత్వం 9,52,925 ట్యాబుల కొనుగోలుకు వెచ్చించిన మొత్తం రూ.1.305.74 కోట్లు అయితే.. రూ.2,500 కోట్ల అక్రమాలకు ఎలా ఆస్కారముంటుందని పాఠశాల విద్యాశాఖ ప్రశ్నించింది. -
AP: ప్రభుత్వ చదువులకు సలాం
► ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ద్విభాషా పాఠ్యపుస్తకాలను అందించడం గొప్ప పరిణామం. – ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ► ప్రాథమిక స్థాయి నుంచి నాణ్యమైన విద్యను అందించడంలో ఆంధ్రప్రదేశ్ పనితీరు అద్భుతంగా ఉంది. – సంజయ్ కుమార్, కేంద్ర పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ కార్యదర్శి ► ఏపీ ప్రభుత్వం గిరిజన విద్యార్థులకు వారి మాతృభాషల్లో (సవర, కొండ, కువి, ఆదివాసీ ఒడియా, కోయ, సుగాలి) ద్విభాషా పాఠ్యపుస్తకాలు అందజేయడం గొప్ప పరిణామం. మనబడి నాడు–నేడు పథకాన్ని మా రాష్ట్రంలోనూ అమలు చేస్తాం. – నవీన్ జైన్, విద్యా శాఖ ప్రధాన కార్యదర్శి, రాజస్థాన్ ..ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలను కొనియాడుతున్నారు. విద్యా రంగంలో ఏపీనే తమకు ఆదర్శమని ఎలుగెత్తి చాటుతున్నారు. ఏపీ విద్యా సంక్షేమ పథకాలను తమ రాష్ట్రంలోనూ అమలు చేస్తామని ఘంటాపథంగా చెబుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, ఒడిశా, అసోం, హరియాణా, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, గుజరాత్, పుదుచ్చేరి, కేరళ, తెలంగాణ, అండమాన్ –నికోబార్, డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీ విద్యాశాఖాధికారులు మన విద్యా విధానాలను వారి రాష్ట్రాల్లోనూ, కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ అమలు చేసేందుకు ముందుకు వచ్చారు. అలాగే అమెరికాలోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై జరిగిన ఉన్నత స్థాయి సదస్సులో 140 దేశాల విద్యావేత్తలు మన ప్రభుత్వ విద్యా సంస్కరణలను కొనియాడారు. జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ బోధన, ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబులు, బైజూస్ కంటెంట్, తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెళ్లు, స్మార్ట్ టీవీల ఏర్పాటు, సీబీఎస్ఈ విద్యా విధానం, ఇంగ్లిష్ మీడియం బోధన, బాలికలకు స్వేచ్ఛ శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీని తెలుసుకుని అభినందించారు. ఈ పథకాలతో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించడమే కాదు.. వాటిని కళ్లారా చూస్తున్న తల్లిదండ్రులు సైతం ప్రభుత్వ చదువులకు సలాం కొడుతున్నారు. పేదరికంతో ఏ ఒక్కరి చదువు ఆగిపోరాదని సంకల్పించిన సీఎం వైఎస్ జగన్ ఈ నాలుగున్నరేళ్లల్లో విద్యా సంస్కరణలకు ఏకంగా రూ.71,017 కోట్లు ఖర్చు చేశారు. ఫలితంగా 45 వేల ప్రభుత్వ పాఠశాలలు సమూలంగా తమ రూపురేఖలు మార్చుకున్నాయి. వాటిలో సకల వసతులు వచ్చి చేరాయి. దీంతో 43 లక్షల మంది పేదింటి విద్యార్థుల జీవితాల్లో సరికొత్త వెలుగులు ప్రసరిస్తున్నాయి. – సాక్షి, అమరావతి కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ బడి ప్రభుత్వం మనబడి నాడు–నేడు కింద ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో అనేక రకాల సౌకర్యాలు కల్పించింది. నాడు–నేడు కింద మొదటి దశలో రూ.3,669 కోట్లతో 15,715 పాఠశాలలను అభివృద్ధి చేయగా, రెండో దశలో రూ.8 వేల కోట్లతో 22,344 పాఠశాలలను అభివృద్ధి చేస్తోంది. పనులు పూర్తయిన వాటిల్లో హైస్కూళ్లకు 62 వేల ఐఎఫ్‌పీలు, ఎలిమెంటరీ స్కూళ్లకు 45 వేల స్మార్ట్ టీవీలు అందించి డిజిటల్ బోధనను ప్రవేశపెట్టింది. రెండు విడతల్లో ఎనిమిదో తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌తో 9,52,925 ట్యాబ్‌లను అందించింది. పేదింటి పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీ పడేందుకు వీలుగా 2020–21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులకు ద్విభాషా పాఠ్య పుస్తకాలను అందించింది. దీంతో ఈ విద్యా సంవత్సరంలో జరిగిన రెండు ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ), సమ్మెటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ) పరీక్షల్లో 93% మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలోనే పరీక్షలు రాశారు. ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 43 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా వీరిలో 39 లక్షల మందికి పైగా ఇంగ్లిష్ మీడియంలోనే పరీక్షలు రాస్తుండడం విశేషం. మరోవైపు బడికి దూరమవుతున్న పిల్లలను తిరిగి చేర్పించేందుకు, వారి చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదని 44,48,865 మంది తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15 వేల చొప్పున ప్రభుత్వం జగనన్న అమ్మఒడి కింద నగదు జమ చేస్తోంది. దీంతో గతేడాది కంటే ఈ ఏడాది ఒకటి నుంచి ఇంటర్ వరకు 1,50,005 మంది విద్యార్థులు అధికంగా చేరారు. అలాగే గత విద్యా సంవత్సరంలో పది, ఇంటర్ బోర్డు పరీక్షల్లో ప్రతిభ చాటినవారిని ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరిట ప్రభుత్వం సత్కరించింది. అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో ప్రతిభావంతులను ఎంపిక చేసి ప్రభుత్వం అమెరికా పర్యటనకు పంపించింది. గతంలో ఇన్ని సదుపాయాలు లేవు.. ప్రభుత్వ బడుల్లో ఇన్ని సదుపాయాలు, విద్యా సంస్కరణలు గతంలో ఎప్పుడూ లేవు. ఇప్పుడు ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్‌ను సైతం గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. మా పెద్దమ్మాయి అరుణ కేజీబీవీలో పదో తరగతి ఇంగ్లిష్ మీడియంలో చదువుతోంది. చిన్నమ్మాయి చైత్ర ప్రణవి ప్రభుత్వ బడిలోనే తొమ్మిదో తరగతి సీబీఎస్ఈ సిలబస్‌లో విద్యనభ్యసిస్తోంది. ఇంత ఉత్తమ చదువులు నాలాంటి సామాన్యులకు అందుకోవడం గతంలో సాధ్యమయ్యేది కాదు. కానీ పేద, మధ్య తరగతి పిల్లల చదువుల భారం పూర్తిగా ప్రభుత్వమే చూసుకుంటోంది. ఇప్పుడు ప్రైవేటు కంటే ప్రభుత్వ స్కూళ్లే అద్భుతంగా ఉన్నాయి. – రుత్తల పాపయ్య, అల్లిపూడి, కాకినాడ జిల్లా ఇలాంటి గొప్ప చదువులు మాకు వరం అటవీ ప్రాంతమైన మా సీలేరు గ్రామం ఇంగ్లిష్ చదువులకు చాలా దూరం. జగన్ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం వచ్చింది. ఇప్పుడు సీలేరు జిల్లా పరిషత్ హైస్కూల్లో ఇంగ్లిష్ మీడియంలోనే చదువు చెబుతున్నారు. వచ్చే ఏడాది పదో తరగతి కూడా ఇంగ్లిష్‌లోనే ఉంటుందన్నారు. నా కూతురు జ్యోత్స ్న స్థానిక జెడ్పీ స్కూల్లో 9వ తరగతి ఇంగ్లిష్ మీడియంలో చదువుతోంది. ఇప్పుడు ఇంగ్లిష్ బాగా మాట్లాడుతోంది. ఇది మాకెంతో గర్వంగా ఉంది. ఇలాంటి గొప్ప చదువులు మాలాంటి వారికి వరం. – పెయ్యల సింహాద్రి, సీలేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా పౌష్టికాహారం.. గోరుముద్ద ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలనే గొప్ప ఆలోచనతో 2020, జనవరి 1న రాష్ట్ర ప్రభుత్వం ‘జగనన్న గోరుముద్ద’ పథకానికి శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వం మధ్యాహ్న భోజనంలో రోజూ సాంబారు, అన్నం మాత్రమే పెట్టేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పుడు వారానికి 16 రకాల ఐటెమ్స్‌తోపాటు ఫోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యంతో భోజనం పెడుతోంది. సోమవారం నుంచి శనివారం వరకు రోజుకో మెనూతో విద్యార్థులకు వేడిగా రుచి, శుచితో పోషకాహారాన్ని అందిస్తోంది. అలాగే వారిలో రక్తహీనతను అరికట్టడానికి వారంలో 3 రోజులు బెల్లంతో చేసిన రాగి జావ, మూడు రోజులు చిక్కీ, వారంలో ఐదు రోజులు ఉడికించిన గుడ్డును తప్పనిసరి చేసింది. ఎలా వండితే నచ్చుతుందో విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకుని ఆ మేరకు వంటలో మార్పులు సైతం చేశారు. పర్యవేక్షణ కోసం ‘ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ సిస్టం ఫర్ మిడ్ డే మీల్స్ అండ్ శానిటేషన్ (ఐఎంఎంఎస్)’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. జగనన్న గోరుముద్ద కోసం ఏటా సగటున రూ.1,400 కోట్లు చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.6,995.34 బడ్జెట్‌ను ప్రభుత్వం కేటాయించింది. గత టీడీపీ ప్రభుత్వం మధ్యాహ్న భోజనం కోసం ఏటా చేసిన రూ.450 కోట్లు ఖర్చు కంటే ఇది నాలుగు రెట్లు అధికం. ప్రభుత్వ బడులకు ప్రతి గురువారం స్థానిక ప్రభుత్వ వైద్యశాల, విలేజ్ క్లినిక్ నుంచి సిబ్బంది వచ్చి విద్యార్థులకు వైద్య పరీక్షలు కూడా చేస్తున్నారు. రక్తహీనతను అరికట్టేందుకు మాత్రలూ ఇస్తున్నారు. -
తుమ్మంపేటలో టీటీఏ సేవాడేస్ కార్యక్రమాలు
-
నెట్టింట.. ప్రభుత్వ బడులు!
సాక్షి, అమరావతి: కనీస సదుపాయాల లేమి.. శిథిలమైన గదులు.. ఇది ఒకప్పటి ప్రభుత్వ పాఠశాలల దుస్థితి. ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. కార్పొరేట్ సదుపాయాలతో అవి కళకళలాడుతున్నాయి. గతంలో విద్యార్థులకు టెక్ట్స్ బుక్స్ కూడా లేని పరిస్థితుల నుంచి బూట్లు, బెల్టు, టై, నోటు పుస్తకాలతో సహా ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు సగర్వంగా చదువుకుంటున్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల(ఐఎఫ్‌పీ)ను అందుబాటులోకి తేవడంతో డిజిటల్ వైపు అడుగులు వేసింది. ఇప్పుడు వాటిని సమర్థంగా వినియోగించి, పేదింటి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో అన్ని ప్రభుత్వ బడులను ఇంటర్నెట్తో అనుసంధానం చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నిరంతరాయంగా డిజిటల్ బోధన అందించేందుకు, సమకాలీన ప్రపంచ పోకడలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు అన్ని పాఠశాలలను డిజిటలైజేషన్ చేయనున్నారు. ఇందుకోసం ప్రతి పాఠశాలకు ప్రభుత్వం ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పి స్తోంది. ఇప్పటికే 8,700 పాఠశాలలకు నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురాగా, ఇందులో 3,700 ఉన్నత పాఠశాలలు, మరో 5 వేలు ప్రాథమిక పాఠశాలలున్నాయి. వచ్చే రెండు, మూడు నెలల్లో అన్ని ప్రభుత్వ బడులకు నెట్ సదుపాయం కల్పించే లక్ష్యంతో పాఠశాల విద్యాశాఖ మౌలిక సదుపాయాల కల్పన విభాగం పనిచేస్తోంది. 100 ఎంబీపీఎస్ వేగంతో నెట్ సదుపాయం ఈ ఏడాది ప్రారంభంలో 4,800 ఉన్నత పాఠశాలల్లో ఆరు నుంచి 10వ తరగతి, +2 వరకు సెక్షన్‌కు ఒకటి చొప్పున 30,715 ఐఎఫ్‌పీ స్క్రీన్లను అందుబాటులోకి తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ బోధనను అందుబాటులోకి తెచ్చింది. ప్రాథమిక పాఠశాలల్లో 60మంది విద్యార్థులకు ఒక స్మార్ట్ టీవీ చొప్పున 10,038 స్మార్ట్ టీవీలను అందించి, టోఫెల్ బోధన చేపట్టారు. రెండో దఫాలో 32వేల ఐఎఫ్‌పీలు, 22వేల స్మార్ట్ టీవీలను పాఠశాలలకు అందించింది. వీటితోపాటు విద్యార్థులకు మెరుగైన బోధన, ఉత్తమ కంటెంట్‌ను అందించేందుకు, 4 డీటీహెచ్ (ఈ విద్య) చానెళ్లు, 5 దీక్ష–ఏపీ చానెళ్లు, ఏపీ ఈ–పాఠశాల పోర్టల్ ద్వారా కూడా కంటెంట్‌ను పంపిస్తున్నారు. ఇప్పుడు విద్యార్థులకు టోఫెల్ బోధన అందిస్తున్నారు. 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌తో ట్యాబ్‌లు, మ్యాథ్స్ ల్యాబ్స్ పాల్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్‌ను అందుబాటులోకి తెచ్చి విద్యపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. ఇకపై విద్యార్థులకు ఫ్యూచర్ టెక్ పాఠాలను సైతం బోధించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థుల్లో ఆలోచన శక్తిని విస్తరించడం, విజ్ఞానంలో ముందుండేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా మేనేజ్మెంట్, మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), లార్జ్ లెర్నింగ్ మాడ్యూల్స్, 3డీ ప్రింటింగ్, గేమింగ్ వంటి భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ ఇవ్వనున్నారు. పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్ కోసమే ప్రభుత్వం దాదాపు రూ.2400 కోట్లు ఖర్చు చేసింది. ప్రతి పాఠశాలలోను డిజిటల్ లెర్నింగ్ అంతరాయం లేకుండా కొనసాగేందుకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోను హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని సైతం కల్పిస్తోంది. హైసూ్కళ్లకు ఏపీ ఫైబర్‌నెట్, బీఎస్ఎన్ఎల్ ద్వారా 100 ఎంబీపీఎస్ వేగంతో బ్రాడ్‌బ్యాండ్ సదుపాయాన్ని, ప్రాథమిక పాఠశాలలకు జియో ద్వారా నెట్ అందిస్తోంది. అందుకు అవసరమైన 5జీ సిమ్ కార్డులతో వైఫై రౌటర్లను సరఫరా చేస్తోంది. -
చదువే ఆయుధం
‘‘మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలనే సదుద్దేశంతో బైజూస్ కంటెంట్‌తో ఉచితంగా ట్యాబ్‌లు ఇస్తున్నాం. రూ.620 కోట్లతో 4,34,185 మంది పిల్లలకు మామగా ఈ కానుక అందిస్తున్నాం. వచ్చే ఏడాది నుంచి ఫ్యూచర్ స్కిల్స్ సబ్జెక్ట్ 8వ తరగతి నుంచి బోధన ప్రారంభిస్తున్నాం. 55 నెలలుగా ప్రతి అడుగూ విప్లవాత్మక మార్పు దిశగానే వేస్తున్నాం. పిల్లలకు మనం ఇవ్వగలిగే విలువైన ఆస్తి చదువులే’’ – ట్యాబ్‌ల పంపిణీలో సీఎం జగన్ సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పేద కుటుంబాలకు చెందిన పిల్లల చదువుల పట్ల దేశ చరిత్రలో ఏ ప్రభుత్వమూ తీసుకోనంత శ్రద్ధ వహిస్తూ తరతరాల తలరాతలను మారుస్తున్న మనందరి ప్రభుత్వంపై కొందరు పెత్తందారులు దుర్బుద్ధితో, దురుద్దేశాలతో బురద చల్లుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. పేదరికం నుంచి ప్రజలను బయటకు తీసుకురావాలని మీ జగన్ ఆరాట పడుతుంటే దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని విప్లవాత్మక సంస్కరణలు చేపడితే విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తప్పుడు రాతలతో పేద విద్యార్థులపై విషం కక్కొద్దని సూచించారు. పిల్లలు మరింత మెరుగ్గా పాఠ్యాంశాలను అవగాహన చేసుకునేలా ట్యాబ్‌లు అందిస్తుంటే వారిని చెడగొడుతున్నారంటూ, పాడు చేస్తున్నారంటూ దుర్మార్గమైన కథనాలు ప్రచురిస్తున్నారని, మరి మీ పిల్లలు, మనవళ్ల చేతిలో ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు ఉండవచ్చా? అని పెత్తందారులను నిలదీశారు. అసలు అది పేపరా?.. పేపర్‌కు పట్టిన పీడా? అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ స్కూళ్లను ఇంగ్లీషు మీడియం, ఇంగ్లీషు ల్యాబ్‌లు, ఐఎఫ్‌పీలు, డిజిటల్ బోధనతో తీర్చిదిద్ది బైజూస్ కంటెంట్‌తో ఖరీదైన ట్యాబ్‌లను పిల్లలకు ఉచితంగా అందిస్తున్నామని, ప్రాథమిక స్థాయి నుంచి టోఫెల్ శిక్షణతోపాటు సీబీఎస్ఈ నుంచి ఐబీ దాకా అడుగులు వేయడంతో ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్లు ప్రభుత్వ పాఠశాలలతో పోటీ పడాల్సిన పరిస్థితి కల్పించామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే 8వ తరగతి విద్యార్థులకు వరుసగా రెండో ఏడాది ట్యాబ్‌లు పంపిణీ కార్యక్రమాన్ని గురువారం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి నుంచి ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. తొలుత విశాఖ ఎయిర్‌పోర్టు చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో చింతపల్లి వచ్చారు. ఆశ్రమ పాఠశాలలో డిజిటల్ లెర్నింగ్ స్టాల్‌ని పరిశీలించి విద్యార్థులతో కలసి క్లాస్ రూమ్‌లో కూర్చొని ఆప్యాయంగా ముచ్చటించారు. క్లాస్‌లు ఎలా జరుగుతున్నాయి? భోజనం ఎలా ఉంది? చదువులు బాగా చెబుతున్నారా చిన్నా? అంటూ విద్యార్థులను ఆరా తీశారు. అనంతరం చింతపల్లి మైదానంలో సభా వేదిక వద్దకు చేరుకుని బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ ట్యాబ్స్ రాష్ట్రవ్యాప్తంగా 9,424 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. ఆ వివరాలివీ.. పేద బిడ్డల బంగారు భవిష్యత్ కోసం.. గిరిపుత్రుల స్వచ్ఛమైన మనసుల మధ్య, పేద బిడ్డల బంగారు భవిష్యత్‌ను ఆకాంక్షిస్తూ నా పుట్టిన రోజున ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడం దేవుడిచి్చన అదృష్టం. రాష్ట్రంలోని పిల్లలే మన భవిష్యత్తు, మన వెలుగులు. మన తర్వాత, మనం వెళ్లిపోయిన తర్వాత కూడా రాష్ట్ర భవిష్యత్తును నిలిపే వారసులు వారంతా. వరుసగా రెండో ఏడాది ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్‌లిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. రూ.620 కోట్లు ఖర్చు చేస్తూ 4,34,185 మంది పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు పెడుతున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఎమ్మెల్యే ప్రతి మండలాన్ని సందర్శిస్తూ 10 రోజులపాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. డిజిటల్ విప్లవంలో భాగంగా గతేడాది కూడా నా పుట్టిన రోజున రూ.686 కోట్లతో 5.18 లక్షల ట్యాబ్‌లను పిల్లలకు, టీచర్లకు పంపిణీ చేశాం. ఆఫ్‌లైన్‌లో సైతం పనిచేసేలా బైజూస్ కంటెంట్ అప్లోడ్ చేసి మరీ ఇస్తున్నాం. ట్యాబ్‌ల్లో ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తినా ఆందోళన చెందొద్దు. వాటిని హెడ్ మాస్టార్‌కు లేదా గ్రామ సచివాలయంలో అందచేస్తే రసీదు ఇచ్చి మరమ్మతులకు పంపిస్తారు. వారం రోజుల్లోనే ట్యాబ్ రిపేరు చేసి ఇస్తారు. లేదంటే మరో ట్యాబ్ మీ చేతిలో పెడతారు. వాటిలో సెక్యూర్డ్ మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ లోడ్ చేయడం వల్ల పిల్లలు పాఠాలు, బోధనకు సంబంధించిన అంశాలను మాత్రమే చూడగలుగుతారు. పిల్లలు ఏం చూశారు? ఏం చదివారు? అన్నది టీచర్లకు, తల్లిదండ్రులకు ఈ సాఫ్ట్వేర్ ద్వారా తెలుస్తుంది కాబట్టి ఎలాంటి ఆందోళన అవసరం లేదు. ఉచితంగా రూ.33 వేల ట్యాబ్, కంటెంట్.. ఒక్కో పిల్లాడి చేతిలో పెడుతున్న ఈ ట్యాబ్ మార్కెట్ విలువ రూ.17,500. దీనికి తోడు బైజూస్ కంటెంట్ ఇస్తున్నాం. రూ.33 వేలు విలువ చేసే ట్యాబ్, కంటెంట్ ఉచితంగా ఇస్తున్నాం. శ్రీమంతుల పిల్లలు బైజూస్ కంటెంట్ కొనుగోలు చేసి డౌన్లోడ్ చేసుకోవాలంటే రూ.15 వేలు చెల్లించాలి. మన పిల్లలు దేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్‌వన్‌గా నిలవాలన్న తలంపుతో ఇంత ఖర్చు పెడుతున్నాం. డిజిటల్ గదులు.. ఇంగ్లీష్ ల్యాబ్‌లు నాడు – నేడు తొలిదశ పూర్తైనస్కూళ్లలో 6వ తరగతి ఆపై ఉన్న 32,213 క్లాస్ రూంలలో ఇప్పటికే ఐఎఫ్‌పీలు అమర్చి డిజిటలైజ్ చేశాం. బైజూస్ కంటెంట్‌తో కూడిన పాఠాలను తరగతి గదిలో నేర్పుతారు. అవే పాఠాలు ట్యాబ్స్‌లో కూడా ఉంటాయి. దీనివల్ల మెరుగ్గా నేర్చుకుంటారు. 1 నుంచి 5వతరగతి వరకు స్కూళ్లలో ఇంగ్లీషు ల్యాబ్‌లు తెచ్చి 10,038 స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేశాం. ఐఎఫ్‌పీలు, క్లాస్‌రూంల డిజిటలైజేషన్ కోసం మొదటి దఫాలో చేసిన ఖర్చు రూ.427 కోట్లు. నాడు–నేడు రెండో దశ పనులు వేగంగా జరుగుతున్నాయి. 62,097 తరగతి గదులన్నీ పూర్తిగా డిజిటలైజ్ అయ్యే కార్యక్రమం జనవరి 30 నాటికి పూర్తవుతుందని అధికారులు చెప్పారు. సందేహాల నివృత్తికి యాప్.. ఫిజిక్స్, మేథ్స్, బయాలజీ, ఇంగ్లిషు సబ్జెక్టుల్లో పిల్లల సందేహాలను నివృత్తి చేసేందుకు ఈసారి ట్యాబ్‌లలో డౌట్ క్లియరెన్స్ బాట్ అనే యాప్‌ను డౌన్లోడ్ చేసి అందించాం. ఇంత ధ్యాసపెట్టి పిల్లలు ఏం చదువుతున్నారు? ఎలా చదువుతున్నారు? ట్యాబ్‌లలో ఏం ఉండాలి? పిల్లలకు మరింత మెరుగ్గా ఎలా ఉపయోగపడాలి? సులభంగా అర్ధమయ్యేందుకు ఏం చేయాలి? అనే ఆలోచన చేస్తూ తాపత్రయపడుతున్నాం. సందేహాల నివృత్తికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తెచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. పిల్లలు విదేశీ భాషలను నేర్చుకునేందుకు డ్యుయోలింగో యాప్‌ను కూడా చేర్చాం. ఇలా ట్యాబ్‌లు పిల్లలకు ఒక ట్యూటర్‌లా తోడుంటాయి. కొత్త టెక్నాలజీకి అనుగుణంగా.. మన పిల్లలు ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిలిచేందుకు ప్రాథమిక స్థాయి నుంచే 3వ తరగతి నుంచే టోఫెల్ పరీక్షకు సిద్ధం చేసేలా అమెరికాకు చెందిన టోఫెల్ నిర్వాహణ సంస్ధ ఈటీఎస్(ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్)తో ఒప్పందం చేసుకున్నాం. టోఫెల్ శిక్షణ కోసం ఒక పీరియడ్ కేటాయించేలా చర్యలు తీసుకున్నాం. మారుతున్న టెక్నాలజీ, పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా వేగంగా అడుగులు వేయాలి. రానున్న 20 ఏళ్లలో చాలా ఉద్యోగాలు కనుమరుగవుతాయని చెబుతున్నారు.మన జీవితాల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ప్రభావం పెరుగుతుంది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మన పిల్లలను సిద్ధం చేస్తూ వచ్చే ఏడాది 8వ తరగతి నుంచి ఫ్యూచర్ స్కిల్స్ అనే సబ్జెక్టును ప్రవేశపెడుతున్నాం. అందులో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, మెటావర్స్, డేటా ఎనలెటిక్స్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, వర్చువల్ రియాలటీ, అగ్మెంటెడ్ రియాలటీ, ఫైనాన్షియల్ లిటరసీ లాంటి అంశాలన్నీ పిల్లలకు పరిచయం చేసేలా ఫ్యూచర్ స్కిల్స్ సబ్జెక్టు తెస్తున్నాం. సంబంధిత ట్యూటర్ల నియామకానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న మన పిల్లలు నేరుగా విదేశీ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందేలా ఐబీ (ఇంటర్నేషనల్ బాకలారియేట్) సిలబస్‌ను కూడా రాబోయే రోజుల్లో తెస్తున్నాం. దీనికోసం ఐబీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. గిరికోనల్లో గొప్ప మార్పులు నా చెల్లెమ్మ భాగ్యలక్ష్మి (పాడేరు ఎమ్మెల్యే) నియోజకవర్గానికి బీటీ రోడ్లు, బ్రిడ్జిలు కావాలని అడిగింది. వాటిని యుద్ధప్రాతిపదికన వేగంగా మంజూరు చేస్తాం. ఇవాళ గిరిజన ప్రాంతాన్ని చూస్తుంటే గొప్ప మార్పులు కనిపిస్తున్నాయి. సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ నిర్మాణం వేగంగా జరుగుతోంది. పార్వతీపురం, నర్సీపట్నం, పాడేరులో మూడు మెడికల్ కాలేజీలు వస్తున్నాయి. ఐటీడీఏ పరిధిలో పార్వతీపురం, సీతంపేట, రంపచోడవరం, బుట్టాయిగూడెం, డోర్నాలలో కూడా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం వేగంగా జరుగుతోంది. కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ వేగంగా నిర్మాణం అవుతోంది. గిరిజన ప్రాంతాల్లో గతంలో లేనివి కేవలం ఈ 55 నెలల్లో మీ బిడ్డ హయాంలో మాత్రమే జరుగుతున్నాయి. దుబారా కాదు.. రేపటి భవిష్యత్తు కోసమే గతంలో మన స్కూళ్లు ఎలా ఉండేవి? ఇవాళ మన బడులన్నీ ఎలా ఉన్నాయి? ఈ 55 నెలల కాలంలో మన ప్రభుత్వ స్కూళ్లు ఎలా మారిపోయాయో చూడాలని కోరుతున్నా. ప్రైవేట్ స్కూళ్లు మెరుగ్గా ఉంటాయనే నానుడి పోయి ఇవాళ అవన్నీ ప్రభుత్వ పాఠశాలలతో పోటీపడే పరిస్థితి వచ్చిందా? లేదా? జగన్ దుబారాగా డబ్బులు ఖర్చు చేస్తున్నాడని గిట్టని వారు అంటున్నారు. కానీ మేం ప్రతి పైసా మానవ వనరుల అభివృద్ధి కోసం వెచ్చిస్తున్నాం. రేపటి భవిష్యత్తు మీద ప్రతి పైసా ఖర్చు కూడా పెడుతున్నాం. పిల్లలందరికీ నాణ్యతతో కూడిన విద్య ఇవ్వగలిగితే వారి జీవితం, భవిష్యత్తు మారుతుంది. అప్పుడు పేదరికం ఆటోమేటిక్‌గా పక్కకు పోయే పరిస్ధితి వస్తుందని గట్టిగా నమ్మాం కాబట్టే ఇంత వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ దిశగానే విద్యా దీవెన, విద్యాకానుక, గోరుముద్ద, అమ్మఒడి పథకాలతోపాటు ఇంగ్లీషు మీడియం చదువులు, బైలింగ్యువల్ టెక్ట్స్‌బుక్స్, సీబీఎస్ఈ బోధన తెచ్చాం. విద్యార్థుల సమక్షంలో బర్త్‌డే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పుట్టినరోజు వేడుకలను విద్యార్థుల సమక్షంలో నిర్వహించారు. విద్యార్థుల నడుమ భారీ కేక్ కట్ చేసి వారికి తినిపించారు. హ్యాపీ బర్త్‌డే మామయ్యా అంటూ విద్యార్థులు ఆయనకు ఆప్యాయంగా కేక్ తినిపించారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు సీఎం జగన్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా ఇన్చార్జి మంత్రి గుడివాడ అమర్నాథ్, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యేలు కొట్టగుళ్ల భాగ్యలక్ష్మి, చెట్టి ఫాల్గుణ, ధనలక్ష్మి, పెట్ల ఉమాశంకర్ గణేష్, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, తలశిల రఘురామ్, అనంతబాబు, కుంభారవిబాబు, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాష్, కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. -
'ఆటా' ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో RO ప్లాంట్ ప్రారంభం
ఆటా వేడుకల్లో భాగంగా సిద్దిపేట జిల్లా ఇందుర్తి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఆర్వో(RO)ప్లాంట్‌ను ప్రారంభించారు.ఆటా సహకారంతో సుమారు 3 లక్షల రూపాయల నిధులతో స్కూల్ వేదికకు రేకుల షెడ్డు, పిల్లల కోసం తాగడానికి RO వాటర్ ప్లాంట్ నిర్మాణం, కంప్యూటర్, స్పోర్ట్స్ కిట్స్, స్కూల్ బ్యాగ్స్ అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ కాశీ కొత్త మాట్లాడుతూ..తనను ఈ స్థాయిలో నిలబెట్టిన భారతదేశానికి ఎంత చేసినా తక్కువేనని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ కాశీ కొత్త కుటుంబసభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ బడికి ఫ్యూచర్ స్కిల్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల్లో ఓవైపు నైపుణ్యాభివృద్ధిని పెంపొందిసూ్తనే.. మరోవైపు వారిని ‘ఫ్యూచర్ స్కిల్ ఎక్స్పర్ట్స్’గా వినియోగించుకునేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ మేరకు బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అవకాశం ఇవ్వనున్నారు. వీరికి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్న్‌షిప్‌కు అవకాశం కల్పిస్తూ నెలకు రూ.12 వేల స్టైఫండ్ ఇవ్వాలని అధికారులు తాత్కాలికంగా ప్రతిపాదించారు. ఆయా కోర్సులు అభ్యసిస్తున్నవారితో హైస్కూళ్ల విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఆధునిక సాంకేతిక వినియోగంపై శిక్షణ అందించనున్నారు. ఈ మేరకు ఏడాది పొడవునా ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఫ్యూచర్ స్కిల్ ఎక్స్పర్ట్స్’ సేవలు అందేలా పాఠశాల విద్యాశాఖతో కలిసి ఉన్నత విద్యా మండలి సంయుక్త కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆ తర్వాత అవసరాన్ని బట్టి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ), మెకానికల్ బ్రాంచ్ విద్యార్థులను పరిశీలిస్తారు. ఇంటర్న్‌షిప్‌కు వచ్చే దరఖాస్తులను బట్టి రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేయాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. ఈ ప్రోగ్రామ్‌ను జనవరి నుంచి అమలు చేసేలా కసరత్తు చేస్తోంది. వర్చువల్ విధానంలో మరో ఇంటర్న్‌షిప్.. రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ హైస్కూల్‌ను సమీపంలోని ఇంజనీరింగ్ కళాశాలతో జత చేయనున్నారు. ఇప్పటికే కళాశాలల మ్యాపింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. హైస్కూల్లో ఇంటర్న్‌గా చేసూ్తనే వర్చువల్ విధానంలో కూడా మరో ఇంటర్న్‌షిప్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తున్నారు. భవిష్యత్తులో బోధన రంగంలో రాణించాలనుకునే వారికి, జాబ్ మార్కెట్ ఓరియెంటెడ్ కోర్సులు నేర్చుకోవాలనుకునే వారికి రెండు విధాల ఇంటర్న్‌షిప్ ఉపయోగపడనుంది. వాస్తవానికి విద్యార్థి దశలోనే ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాన్ని సాధించడానికి ప్రభుత్వం ఉన్నత విద్యలో ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ప్రతి విద్యార్థి తమ కోర్సు చివరి ఏడాదిలో ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఏటీఎల్ మెంటార్షిప్.. ‘ఉన్నత విద్యలో కమ్యూనిటీ సర్వీస్’ ప్రాజెక్టు కింద ఇంజనీరింగ్ విద్యార్థులు ఇప్పటికే హైస్కూల్ బాటపడుతున్నారు. రెండు నెలల ఈ ప్రాజెక్టులో భాగంగా హైస్కూళ్లలో ‘అటల్ టింకరింగ్ ల్యాబ్‌్స (ఏటీఎల్)’కు మెంటార్షిప్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలోనే 577 హైస్కూళ్లలో ఏటీఎల్స్ను ఏర్పాటు చేసింది. కానీ, గత టీడీపీ ప్రభుత్వం వాటిని నిరుపయోగంగా వదిలేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘ఏటీఎల్’ అవసరాన్ని గుర్తించి వినియోగంలోకి తెచ్చింది. ఇందులో భాగంగానే ఆయా హైస్కూళ్లను ఇంజనీరింగ్ కాలేజీలతో మ్యాపింగ్ చేస్తోంది. వివిధ బ్రాంచ్‌ల విద్యార్థుల సహాయంతో ‘ఏటీఎల్’కు జీవం పోస్తోంది. ఐక్యరాజ్యసవిుతికి చెందిన యునిసెఫ్‌తో కలిసి పనిచేస్తున్న పూణే సంస్థ.. విజ్ఞాన్ ఆశ్రమ్‌కు చెందిన సోర్స్ పర్సన్స్‌తో ఎంపిక చేసిన ఇంజనీరింగ్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చి మరీ ఏటీఎల్ ద్వారా పాఠశాల విద్యార్థులను నూతన ఆవిష్కరణల వైపు నడిపిస్తోంది. ఈ కోర్సుల్లోనే శిక్షణ.. ఫ్యూచర్ స్కిల్ ప్రోగ్రామ్‌లో భాగంగా విద్యార్థులకు ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్స్ (ఐవోటీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), బ్లాక్‌చైన్ టెక్నాలజీ, వర్చువల్ రియాలిటీ (వీఆర్), ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), మెటావర్స్/వెబ్ 3.0, 3డీ మోడలింగ్ అండ్ ప్రింటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, బిగ్ డేటా/డేటా ఎనలిస్ట్, రోబోటిక్స్‌లో బేసిక్స్ బోధించనున్నారు. ఇందులో భాగంగానే ప్రత్యేక పాఠ్య ప్రణాళిక (కరిక్యులమ్)ను సైతం రూపొందిస్తున్నారు. దీని ద్వారా ఇంజనీరింగ్ విద్యార్థుల సహాయంతో బేసిక్స్ నేర్పిసూ్తనే.. పాఠశాల ఉపాధ్యాయులకు డిజిటల్ పరికరాలపై విద్యా బోధన, హైçస్యూల్ విద్యార్థులకు ట్యాబ్స్ వినియోగంపై శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే కొత్త కంటెంట్ ఇన్స్టాల్ చేసి అందించనున్నారు. చదువుతో పాటే సంపాదన దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర విద్యార్థులు చదువుతో పాటే సంపాదించనున్నారు. ప్రభుత్వ హైస్కూళ్లలో స్టైఫండ్‌తో కూడిన ఇంటర్న్‌షిప్ ఓ గొప్ప మార్పునకు నాంది. అందుబాటులోని మానవ వనరుల సమర్థవంత వినియోగానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యావ్యవస్థలో చేపట్టిన విప్లవాత్మక మార్పులతోనే ప్రభుత్వ బడుల్లో డిజిటల్ లిటరసీ పెరుగుతోంది. పేదింటి విద్యార్థులు స్మార్ట్ ప్యానల్స్‌పై పాఠాలు వింటున్నారు. ట్యాబ్‌ల్లో పాఠాలు చదువుతున్నారు. వీటి ద్వారా మరింత నాణ్యమైన సాంకేతిక పాఠాలను నేర్పించేందుకు ఇంజనీరింగ్ విద్యార్థులను హైస్కూళ్లలో ఇంటర్న్‌షిప్‌నకు ఆహ్వానిస్తున్నాం. తద్వారా పాఠశాలల్లోని కంప్యూటర్ ల్యాబ్స్, ఏటీఎల్స్ పూర్తిస్థాయిలో పనిచేస్తాయి. – ఆచార్య హేమచంద్రారెడ్డి, చైర్మన్, ఉన్నత విద్యా మండలి -
టీటీఏ ఆధ్వర్యంలో..ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ క్లాస్‌రూమ్‌లు
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ సేవాడేస్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా యాదాద్రి జిల్లా, సంస్థాన్ నారాయణ్ పూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ క్లాసురూమ్‌లు ఏర్పాటు చేసింది. టీటీఏ ప్రెసిడెంట్ వంశీరెడ్డి ఆధ్వర్యంలో మయూర్ రెడ్డి బండారు 25 పాఠశాలకు డిజిటల్ క్లాస్ రూమ్ సామాగ్రి అందించారు. ప్రభుత్వ పాఠశాలకు విచ్చేసిన టీటీఏ సభ్యులకు చిన్నారులు సాగర స్వాగతం పలికారు. టీటీఏ బృందం ఇచ్చిన ప్రోత్సాహానికి పాఠశాల ఉపాధ్యాయులు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పలువురు టీచర్లను సన్మనించి, మెమంటోలు అందించారు. -
AP: ప్రభుత్వ బడి పిల్లలకు ట్యాబ్‌లు సిద్ధం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఎనిమిదో తరగతి విద్యార్థులకు మరింత మెరుగైన సదుపాయాలతో ట్యాబ్‌ల పంపిణీకి సర్వం సిద్ధమైంది. వీటిని ఈ నెల 21న విద్యార్థులకు అందించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గతేడాది కంటే మెరుగైన సామర్థ్యం ఉన్న ట్యాబ్‌లను ఎంపిక చేసి, వాటిలో ఎనిమిదో తరగతితోపాటు 9, 10 తరగతుల పాఠ్యాంశాలను చేర్చారు. గత విద్యా సంవత్సరం ఎనిమిదో తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం 5,18,740 ట్యాబ్‌లను బైజూస్ కంటెంట్‌తో పంపిణీ చేసింది. ఈ ఏడాది 4.30 లక్షల ట్యాబ్‌ల పంపిణీకి టెండర్లు పిలవగా శాంసంగ్, ఏసర్, మార్క్ వ్యూ, లావా సంస్థలు ముందుకు వచ్చాయి. ఆయా సంస్థల నుంచి 2.50 లక్షల యూనిట్లు విజయవాడలోని స్టాక్ పాయింట్‌కు చేరాయి. మరో 1.80 లక్షల యూనిట్లు ఈ వారంలో అందనున్నాయి. ఇప్పటిదాకా వచ్చిన ట్యాబ్‌ల్లో అధికారులు సాంకేతిక అంశాలను పరిశీలించారు. వీటిని మంగళవారం ప్రాంతీయ సంయుక్త అధికారుల కార్యాలయాలకు తరలించారు. రెండు, మూడు రోజుల్లో ఇవి ఉన్నత పాఠశాలలకు చేరనున్నట్టు పాఠశాల విద్యాశాఖ మౌలిక సదుపాయాల కల్పన కమిషనర్ కాటమనేని భాస్కర్ ‘సాక్షి’కి తెలిపారు. అలాగే ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ బోధన కోసం అందిస్తున్న ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు (ఐఎఫ్‌పీ)ను సైతం రెండో దశ నాడు–నేడు పనులు పూర్తయిన స్కూళ్లల్లో బిగించనున్నారు. రెండో దఫాలో 30 వేల ఐఎఫ్‌పీలు, 22 వేల స్మార్ట్ టీవీలు ఈ నెల 21 నాటికి స్కూళ్లకు చేరనున్నాయి. మరింత మెరుగ్గా.. గతేడాది ఎనిమిదో తరగతి విద్యార్థులకు 8.7 అంగుళాల తెర, 3 జీబీ ర్యామ్, 32 జీబీ రోమ్, 64 జీబీ ఎస్డీ కార్డు గల ట్యాబ్‌లను అందించారు. వాటిలో అదే తరగతి పాఠ్యాంశాలను అప్లోడ్ చేశారు. అయితే, ఈ ఏడాది ట్యాబ్‌ల సామర్థ్యం పెంచడంతోపాటు అదనపు తరగతుల డిజిటల్ పాఠాలను సైతం అప్లోడ్ చేయడం విశేషం. వచ్చే వారం విద్యార్థులకు ఇచ్చే ట్యాబ్‌లు 8.7 అంగుళాల తెర, 4 జీబీ ర్యామ్, 64 జీబీ రోమ్, 256 జీబీ ఎస్డీ కార్డుతో ఉండనున్నాయి. వీటిలో ఎనిమిదో తరగతితోపాటు 9, 10 తరగతుల బైజూస్ ఈ–కంటెంట్‌ను సైతం అప్లోడ్ చేశారు. అంతేకాకుండా విద్యార్థులకొచ్చే సందేహాలను నివృత్తి చేసేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో పనిచేసే డౌట్ క్లియరెన్స్ యాప్ ‘ఈ–ట్యూటర్’ను కూడా అందుబాటులో ఉంచారు. అలాగే భవిష్యత్తులో విద్యార్థులకు ఇంటర్మీడియట్ పాఠాలను సైతం అప్లోడ్ చేసేంత స్పేస్ కూడా ఈ ట్యాబ్‌ల్లో ఉంది. 30 వేల ఐఎఫ్‌పీలు, 22 వేల స్మార్ట్ టీవీలు.. గతేడాది ఉన్నత పాఠశాలల విద్యార్థులకు సెక్షన్‌కు ఒకటి చొప్పున 30,715 ఐఎఫ్‌పీ స్క్రీన్లను అందుబాటులోకి తెచ్చారు. అలాగే ప్రాథమిక పాఠశాలల్లో 60 మంది విద్యార్థులకు ఒక స్మార్ట్ టీవీ చొప్పున 10,038 స్మార్ట్ టీవీలను సరఫరా చేశారు. ఈ ఏడాది 30 వేల ఐఎఫ్‌పీలు, 22 వేల స్మార్ట్ టీవీలను ఈ నెల 21 నాటికి అందుబాటులోకి తేనున్నారు. అన్ని ట్యాబ్‌ల్లో ‘డ్యులింగో’ యాప్ పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా రాణించేందుకు, విదేశాల్లో సైతం విజయవంతమైన కెరీర్‌ను అందుకునేందుకు వీలుగా ప్రభుత్వ పాఠశాలల్లో విదేశీ భాషలను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఉపాధ్యాయులకు కూడా వివిధ భాషల్లో శిక్షణ ఇవ్వాలని ఇటీవల విద్యాశాఖ అధికారులు హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) అధికారులతో చర్చించారు. ఈ క్రమంలో విదేశీ భాషలు అందించే యాప్ ‘డ్యులింగో’ను ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఇవ్వనున్న ట్యాబ్‌ల్లో ఇన్స్టాల్ చేశారు. గత డిసెంబర్లో ఇచ్చిన 5,18,740 ట్యాబ్‌లతోపాటు ఈ ఏడాది ఇవ్వనున్న 4.30 లక్షల ట్యాబ్‌ల్లోనూ ఈ డ్యులింగ్ యాప్ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా విద్యార్థులు సులభంగా విదేశీ భాషలు నేర్చుకునే వీలుంది. ఉన్నత తరగతులకు కూడా ఉపయోగపడేలా.. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. విద్యార్థులతోపాటు పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు కూడా వీటిని అందిస్తాం. ఇప్పటికే దాదాపు 2.50 లక్షల యూనిట్లు అందాయి. వారంలోగా మొత్తం 4.30 లక్షల ట్యాబ్‌లు స్కూళ్లకు చేరతాయి. ఈసారి ట్యాబ్‌ల సామర్థ్యం పెంచాం. అంతేకాకుండా 8, 9, 10 తరగతుల ఈ–కంటెంట్‌తోపాటు డౌట్ క్లియరెన్స్ యాప్‌ను, ఈ–డిక్షనరీని కూడా అప్లోడ్ చేశాం. కొత్త ట్యాబ్‌ల్లో భవిష్యత్తులో ఇంటర్మీడియట్ పాఠాలను సైతం అప్లోడ్ చేయొచ్చు. విద్యార్థులు పై తరగతులకు వెళ్లినప్పుడు పాత పాఠాలను తొలగించి కొత్త కంటెంట్‌ను అప్లోడ్ చేస్తాం. – కాటమనేని భాస్కర్, కమిషనర్, పాఠశాల విద్య నాడు–నేడు మౌలిక వసతుల కల్పన -
ఏపీ విద్యాసంస్థల్లో భారీగా పెరిగిన స్థూల నమోదు నిష్పత్తి
-
‘ఇంగ్లిష్’లో మనమే టాప్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్ జగన్ సర్కార్ తీసుకువచ్చిన సంస్కరణలతో మన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తాచాటుతున్నారు. గతంలో ఏదైనా పరీక్షను ఆంగ్ల మాధ్యమంలో రాయడానికి వెనకంజ వేసే మన రాష్ట్ర విద్యార్థులు ఇప్పుడు ఆ భయం పోగొట్టుకుని ముందంజలో దూసుకెళుతున్నారు. ఇటీవల ఇంగ్లిష్ మీడియం విద్యా బోధన విషయంలో దేశ వ్యాప్తంగా నిర్వహించిన నేషనల్ అచీవ్మెంట్ సర్వే (ఎన్ఏఎస్)–2023లో మన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రతిభ చూపించారు. ఈ సర్వేలో దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ టాప్ ప్లేస్ సాధించడం గమనార్హం. అంతేగాక జాతీయ సగటు కంటే ‘డబుల్’ రెట్లకు పైగా మన విద్యార్థులు ఈ సర్వేలో పాల్గొన్నారు. దేశంలోని రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లల్లో ఇంగ్లిష్ మీడియం అమలు తీరుపై కేంద్ర ప్రభుత్వం ఆ సర్వే నిర్వహించింది. ఇంగ్లిష్ మీడియం చదువుతున్న 3, 6, 9 తరగతుల విద్యార్థులను ఎంపిక చేసి పరీక్ష నిర్వహించారు. ఇందులో పాల్గొన్న విద్యార్థుల జాతీయ సగటు 37.03 శాతంగా ఉంటే, ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల శాతం 84.11గా ఉండటం విశేషం. ముఖ్యంగా సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడంతో జాతీయ సగటు కంటే ఎక్కువ ప్రగతి సాధించడం సాధ్యమైంది. బైలింగువల్ (ఇంగ్లిష్–తెలుగు) టెక్టŠస్ బుక్స్ పంపిణీ, ఇంగ్లిష్ ల్యాబ్స్‌తో విద్యార్థులకు నిరంతరం ప్రత్యేక బోధన అందించడంతో విద్యార్థులు ఆంగ్ల పాఠ్యాంశాలను సులభంగా నేర్చుకుంటున్నారు. అలాగే ఫార్మెటివ్ అసెస్మెంట్ పరీక్షలను ఆంగ్ల మాధ్యమంలో రాయడం వల్ల వారు భాషపై పట్టు సాధిస్తున్నారు. మూడు తరగతుల విద్యార్థులపై అంచనా పరీక్ష దేశ వ్యాప్తంగా విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు, అభ్యసన లోపాలను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ అచీవ్మెంట్ సర్వే, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసి (ఎఫ్ఎల్ఎన్) సర్వేను ఏటా నిర్వహిస్తుంది. 2021లో కేంద్రం ఎన్ఏఎస్, 2022లో ఎఫ్ఎల్ఎన్ నిర్వహించింది. కరోనా అనంతరం నిర్వహించిన అప్పటి సర్వేలో దేశవ్యాప్తంగా అభ్యసన లోపాలు ఉన్నట్టు గుర్తించింది. వాటిని అధిగమించేందుకు పలు సంస్కరణలు సైతం అమలు చేస్తోంది. ఈ క్రమంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎన్ఏఎస్–2023 సర్వేలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో 3, 6, 9 తరగతులు చదువుతున్న విద్యార్థులను ఎంపిక చేసి సర్వే పరీక్ష నిర్వహించింది. ఇందులో దేశవ్యాప్తంగా ఇంగ్లిష్ మీడియంలో పరీక్ష రాయడానికి 1,12,72,836 మందిని ఎంపిక చేయగా 41,74,195 మంది (37.03 శాతం) హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో 6,42,496 మందిని ఎంపిక చేస్తే 5,40,408 మంది (84.11 శాతం) ఇంగ్లిష్ మీడియంలో పరీక్ష రాశారు. ఈ పరీక్షలో దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, తమిళనాడు మనకంటే వెనుకబడడం గమనార్హం. పేదింటి పిల్లలు అంతర్జాతీయ అవకాశాలను అందుకోవాలంటే ఇంగ్లిష్ మీడియం తప్పనిసరి అని భావించిన సీఎం జగన్మోహన్రెడ్డి సర్కారు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టడంతో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. బోధన, పరీక్షా విధానంలో సంస్కరణలు దేశంలో ఉత్తమ విద్యా సంస్కరణలు అమలు చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందింది. నూతన విద్యా విధానానికి అనుగుణంగా బోధన, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సంస్కరణలను, పథకాలను అమలు చేస్తోంది. బైజూస్ కంటెంట్‌తో ట్యాబ్స్, ఐఎఫ్‌పీ స్క్రీన్లు, ఇంగ్లిష్ ల్యాబ్స్‌తో పాటు, విద్యార్థి సామర్థ్యాల ఆధారంగా బోధన అందిస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అంతేగాకుండా ఏపీ ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో ‘క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్’ను రూపొందించి అమలు చేస్తున్నారు. దాంతో ఈ విద్యా సంవత్సరంలో నిర్వహించిన రెండు ఫార్మెటివ్ అసెస్మెంట్ (యూనిట్ టెస్ట్)లలో 91.03 శాతం మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించారు. ఇంగ్లిష్ మీడియం సర్వేలో పాల్గొన్న విద్యార్థులు ఇలా.. -
ప్రభుత్వ బడుల్లో అంతర్జాతీయ నైపుణ్యాలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేలా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని చర్యలూ చేపట్టింది. ఆరో తరగతి నుంచే వివిధ టెక్నాలజీల పాఠాలు బోధించనుంది. ఈ మేరకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. వచ్చే ఏడాది (2024–25) నుంచి మొత్తం 6,200 హైస్కూళ్లలో ఈ ఫ్యూచర్ స్కిల్స్‌ను అందించనుంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), బ్లాక్‌చైన్ టెక్నాలజీ, వర్చువల్ రియాలిటీ (వీఆర్)– ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), మెటావర్స్/ వెబ్ 3.0, 3డీ మోడలింగ్ అండ్ ప్రింటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, బిగ్ డేటా/డేటా అనలిస్ట్, రోబోటిక్స్, గేమింగ్ వంటి రేపటితరం టెక్నాలజీల్లో శిక్షణ ఇవ్వనున్నారు. రాబోయే కాలంలో ఈ కోర్సులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉండనున్న నేపథ్యంలో పాఠశాల స్థాయిలోనే వీటిపై పూర్తి అవగాహన కల్పించనున్నారు. ప్రస్తుతం విద్యార్థులు తెలుగు, ఇంగ్లిష్, హిందీ, సైన్స్, సోషల్, మ్యాథ్స్ (6) సబ్జెక్టులను చదువుతుండగా, ఇకపై ఏడో సబ్జెక్టుగా టెక్ పాఠాలు చదువుతారు. వచ్చే ఏడాది ఆరు, 9 తరగతి విద్యార్థులకు టెక్ పాఠాలను బోధించనున్నారు. 2025–26లో 7, 10 తరగతులకు, 2026–27లో ఎనిమిది, ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఫ్యూచర్ స్కిల్స్‌పై శిక్షణ అందించనున్నారు. ఇలా 2028 నాటికి మొత్తం ఆరు నుంచి +2 వరకు ఈ కార్యక్రమాన్ని విస్తరించనున్నారు. డిజిటల్ వసతుల కోసం రూ.2,400 కోట్ల ఖర్చు.. ఇప్పటికే పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు (ఐఎఫ్‌పీలు), స్మార్ట్ టీవీలు, ట్యాబ్స్, ఇంగ్లిష్– మ్యాథ్స్ – పాల్ – కంప్యూటర్ ల్యాబ్స్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్ కోసమే దాదాపు రూ.2,400 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇకపై టెక్ అంశాల్లో విద్యార్థుల ఆలోచన శక్తిని పెంపొందించడంతోపాటు విజ్ఞానంలో ముందుండేలా శిక్షణనివ్వనున్నారు. నాస్కామ్, జేఎన్టీయూ నిపుణులు, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఏపీఎస్ఈఆర్టీ), స్వతంత్ర నిపుణులు రూపొందించిన ఫ్యూచర్ స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌కు ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకురావడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఏడో సబ్జెక్టుగా టెక్ పాఠాలు.. 6,200 ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు టెక్నాలజీ నైపుణ్యాలను నేర్పించేందుకు కంప్యూటర్ సైన్స్ లేదా ఎల్రక్టానిక్స్‌లో ఎంటెక్/ఎంసీఏ/బీటెక్ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. తమ ప్రాజెక్టులో భాగంగా వీరు ఫ్యూచర్ స్కిల్స్ ఫెసిలిటేటర్స్‌గా ప్రభుత్వ పాఠశాలల్లో సేవలు అందిస్తారు. విద్యార్థులకు టెక్ పాఠాలు బోధించే ఉపాధ్యాయులకు వీరు ‘టెక్నాలజీ లీడ్’ శిక్షణ ఇస్తారు. ఏటా డిసెంబర్/ఏప్రిల్ నెలల్లో విద్యార్థులకు ప్రత్యేకంగా ఇండక్షన్ శిక్షణ ఇస్తారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో డిసెంబర్ 15 నాటికి ఇండక్షన్ ట్రైనింగ్ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తరగతిని బట్టి టెక్ బోధనాంశాలు... విద్యార్థులకు అనువుగా ఎంపిక చేసిన అంశాలకు ప్రత్యేక కరిక్యులమ్‌ను సైతం రూపొందించారు. 6–8 తరగతులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్స్, ఆల్గారిథమ్, డేటా ఎనాలసిస్, ఏఐ ఎథిక్స్ అండ్ సోషల్ ఇంపాక్ట్స్, మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ అంశాల్లో ప్రాథమిక అంశాలపై అవగాహన కల్పిస్తారు. ♦ 9–10 తరగతులకు ‘ఏఐ’ టెక్నాలజీ, మెషీన్ లెర్నింగ్‌పై ప్రాథమిక అవగాహన, అప్లికేషన్స్, ఆల్గారిథమ్ అండ్ డేటా ఎనాలసిస్, ఆర్టిఫిషియల్ ఎథిక్స్, సోషల్ ఇంపాక్ట్, మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ను నేర్పిస్తారు. ♦ 11–12 తరగతుల విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై అడ్వాన్స్డ్ అంశాలను బోధిస్తారు. ఈ అంశాల్లో అన్ని పాఠశాలల్లోనూ ఒకేసారి ఒకే పాఠాన్ని బోధించనున్నారు. దీనివల్ల విద్యార్థులు ఒక స్కూలు నుంచి మరో స్కూలుకు మారినా టెక్ అంశాల బోధనలో మార్పు ఉండదు. దీంతో విద్యార్థుల సామర్థాలు మెరుగుపడడంతో పాటు అంతర్జాతీయ అవకాశాలను అందుకునే నైపుణ్యాలు నేర్చుకుంటారు. సిలబస్ సిద్ధం చేస్తున్నాం.. ఎంపిక చేసిన 10 మాడ్యూల్స్ బోధనకు సిలబస్‌ను సిద్ధం చేస్తున్నాం. డిసెంబర్ నాటికి అన్ని స్కూళ్లకు ఐఎఫ్‌పీలు నూరు శాతం అందుబాటులోకి వస్తాయి. ఫ్యూచర్ స్కిల్స్ ఫెసిలిటేటర్స్ నియామకానికి అనుమతి లభించింది, వచ్చే నెల రోజుల్లో వీరి నియామకం పూర్తవుతుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 6,200 హైస్కూళ్లలో ఫ్యూచర్ స్కిల్స్‌పై బోధన ప్రారంభమవుతుంది. – కాటమనేని భాస్కర్, కమిషనర్, పాఠశాల విద్యాశాఖ మౌలిక వసతులు -
మేడ్చల్: బాలికను బడిలోనే ఉంచి తాళం వేసుకెళ్లిన సిబ్బంది
సాక్షి, మేడ్చల్: రోజూ బడికి వెళ్లే ఆరేళ్ల కూతురు స్కూల్ అయిపోయిన తరువాత సాయంత్రమైనా ఇంటికి రాకపోతే..ఆ తల్లిదండ్రులకు ఎంత నరకం.. ఎక్కడికెళ్లిందో.. ఏమో..ఎవరెత్తుకెళ్లారోనన్న ఆందోళన..! వెంటనే తెలిసిన వారందరినీ అడుగుతారు.. వారు తెలియదని సమాధానం చెబితే నరకం..!ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాదు.. ఎక్కడని వెతకాలి..పోలీసులకు ఫిర్యాదు చేయాలి.. ఈ టెన్షన్లో ఉన్న అమ్మానాన్నలకు వారి కూతురు పాఠశాలలోనే ఉందని తెలిస్తే వారి ఆనందం వర్ణనాతీతం.. అయితే ఆ బాలికను లోపలే ఉంచి తాళం వేసుకెళ్లారని చెబితే ఇంతకంటే దారుణం మరొకరటి ఉండదేమో. మరి.. ఇలాంటి సంఘటనే బాచుపల్లిలో చోటుచేసుకుంది. పాఠశాల సిబ్బంది బాలికను పాఠశాలలోనే ఉంచి గమనించకుండా తాళం వేసి నిర్లక్ష్యంగా వెళ్లిపోయారు. బాచుపలిలోని ఓ అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం, ప్రభావతి దంపతులకు వేదాంజలి(6) అనే కుమార్తె ఉంది. ఆ చిన్నారి స్థానికంగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి చదువుతోంది. ►రోజూ మాదిరిగానే గురువారం పాఠశాలకు వెళ్లిన చిన్నారి సాయంత్రం 4 గంటలకు స్కూల్ ముగిసిన తరువాత ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి చూడగా తాళం వేసి ఉండటంతో చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోయింది. ►మరోమారు పాఠశాల వద్ద వెతుకుతుండగా తరగతి గది నుంచి చిన్నారి ఏడుపు వినిపించింది. దీంతో తమ కుమార్తె తరగతి గదిలో ఉందని గ్రహంచిన సుబ్రహ్మణ్యం, ప్రభావతిలు చుట్టు పక్కల వారి సహాయంతో పాఠశాల తరగతి గది తాళం పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా చిన్నారి రోదిస్తూ కనిపించింది. దీంతో తమ కుమార్తెను అక్కున చేర్చుకుని ఇంటికి తీసుకువెళ్లారు. ►పాఠశాల ఆయా తప్పిదం వల్లే తమ చిన్నారి తరగతి గదిలో ఉండి పోయిందని.. పాఠశాల ముగిసిన తరువాత తరగతి గదిలో చిన్నారులు బయటకు వెళ్లారో లేదో చూసుకోకుండా తాళం వేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: Tandur: ఓ పార్టీ నుంచి అడ్వాన్స్ తీసుకుని.. మరో పార్టీలోకి జంప్ -
టోఫెల్ తర్ఫీదుకు కీలక అడుగు!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను ‘టోఫెల్ సర్టిఫికేషన్’కు సన్నద్ధం చేయడంలో భాగంగా ‘లిక్విడ్ ఇంగ్లిష్ ఎడ్జ్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ విద్యా సంవత్సరానికి టోఫెల్ శిక్షణకు అవసరమైన సాఫ్ట్వేర్, ఈ–కంటెంట్‌ను ఉచితంగా అందించడంతో పాటు, ఉపాధ్యాయులు, అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. ఇప్పటికే మూడో తరగతి నుంచి తొమ్మిది వరకు ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు రోజుకు గంట పాటు టోఫెల్ శిక్షణ ప్రారంభించినట్టు తెలిపారు. విద్యార్థుల్లో లిజనింగ్, స్పీకింగ్ నైపుణ్యాల పెంపు, వివిధ దేశాల్లో ఇంగ్లిషు మాట్లాడే తీరును అర్థం చేసుకుని.. తిరిగి జవాబు ఇచ్చేలా తర్ఫీదు ఇస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగానే ఎస్సీఈఆర్టీ ద్వారా మెటీరియల్ తయారు చేశామన్నారు. అయితే అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రొఫెషనల్ ఏజెన్సీ మెటీరియల్ అవసరాన్ని గుర్తించి లిక్విడ్ ఇంగ్లిష్ ఎడ్జ్‌తో ఒప్పందం చేసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులే ఎక్కువగా ఉండటంతో వారిని దృష్టిలో పెట్టుకుని లిక్విడ్ సంస్థ ఉచితంగా మెటీరియల్ ఇచ్చేందుకు ముందుకొచ్చిందన్నారు. ఈ ప్రాజెక్టుకు సమగ్ర శిక్ష పీడీ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు. వాస్తవానికి టోఫెల్ సర్టిఫికేషన్ కోసం ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్విసెస్(ఈటీఎస్)తో ప్రభుత్వం ఒప్పందం చేసుకోగా.. విద్యార్థులను టోఫెల్ పరీక్ష కోసం సిద్ధం చేస్తున్నామన్నారు. అయితే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సంస్థల నుంచి టెండర్లు పిలిచినా.. శిక్షణ ప్రక్రియ ప్రారంభించేందుకు సమయం లేదన్నారు. అందుకే ప్రస్తుత విద్యా సంవత్సరానికి మాత్రమే లిక్విడ్ ఇచ్చే కంటెంట్ వినియోగించుకునేలా ఒప్పందం చేసుకున్నట్టు వివరించారు. వచ్చే ఏడాది టెండర్లు పిలిచి కంటెంట్ ఖరారు చేస్తామని వివరించారు. తరగతి గదుల డిజిటలైజేషన్ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చిందని ప్రవీణ్‌ప్రకాశ్ చెప్పారు. ఇందులో భాగంగానే 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 41 లక్షల మంది ఆంగ్ల మాధ్యమం అభ్యసిస్తున్నట్టు చెప్పారు. దేశంలో తొలిసారిగా సైన్స్, సోషల్ సైన్స్, గణితం సబ్జెక్టుల్లో ద్విభాషా పాఠ్యపుస్తకాలను తీసుకొచ్చినట్టు తెలిపారు. విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యం పెంపొందించడంలో భాగంగా బైజూస్ ద్వారా ఉత్తమ కంటెంట్ అందిస్తోందన్నారు. ఎనిమిదో తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు బైజూస్ కంటెంట్‌ను ఇన్స్టాల్ చేసి 5.18 లక్షల ట్యాబ్‌లను పంపిణీ చేసిందని వెల్లడించారు. నాడు–నేడులో భాగంగా పాఠశాలల్లో 30,213 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్(ఐఎఫ్‌పీ), ప్రాథమిక పాఠశాలల్లో 10,038 స్మార్ట్ టీవీలతో తరగతి గదులను డిజిటలైజ్ చేసిందని చెప్పారు. డిసెంబర్ నాటికి మొత్తం తరగతి గదుల్లో హైస్పీడ్ ఇంటర్నెట్తో డిజిటల్ బోధనలు ప్రవేశపెడతామని వివరించారు. అంతర్జాతీయంగా గుర్తింపు నోయిడాకు చెందిన లిక్విడ్ ఇంగ్లిష్ ఎడ్జ్.. కామన్ యూరోపియన్ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ రిఫరెన్స్(సీఇఎఫ్ఆర్)తో పాటు బ్రిటీష్ కౌన్సిల్, పియర్సన్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్, మాక్మిలన్, ఆదిత్య బిర్లా ఫౌండేషన్, పబ్లిషింగ్ కంపెనీలకు విశ్వసనీయ సేవలందిస్తోంది. విద్యార్థుల తరగతి, వయస్సును బట్టి ఈ కంటెంట్‌ను తయారు చేసి అందిస్తోంది. కెయిర్న్ ఇండియా, అలహాబాద్ యూనివర్సిటీ, ఫెయిర్ అండ్ లవ్లీ ఫౌండేషన్, ఫ్రాంక్ఫిన్, గ్లోబల్ లాజిక్, ఇండియన్ మిలిటరీ అకాడమీ, జెట్‌కింగ్, ఒడిశా మోడల్ ట్రైబల్ ఎడ్యుకేషనల్ సొసైటీ వంటి అనేక మందికి సేవలందిస్తోంది. -
పవన్.. ఇవన్నీ ఎందుకు?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక చెప్పాల్సింది ఒకటే. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియం చదివే పిల్లలపై కూడా కేసులు పెడతామని. ఏమో! ఆ మాట కూడా చెప్పేస్తారేమో! మంచి విద్యాబుద్దులు ఉండి ఉంటే పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడేవారు కారేమో! ఆయనకు ఉన్నది మిడిమిడి జ్ఞానం, అత్తెసరు చదువు. అదృష్టం కలిసి వచ్చి యాక్టర్ అయ్యారు. దానినే రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు. అది ఆయన ఇష్టం. కాని తనకు తోచిందల్లా చెప్పి పేదలపైన, ఆంధ్రప్రదేశ్ పైనా విషం చిమ్ముతానంటే ప్రజలు సహిస్తారా?. ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆంగ్ల మీడియంకు సంబంధించిన చదువులు పెట్టినందుకు పవన్ అధికారంలోకి రాగానే కేసులు పెడతారట. ఐబీ సిలబస్ ఎందుకు? టోఫెల్ పరిజ్ఞానం ఎందుకు? యూట్యూబ్ చూస్తే అమెరికా యాక్సెంట్ వచ్చేస్తుందని పవన్ చెబుతున్నారు. మరి అదేదో తాను నేర్చుకుని అమెరికాలో అప్పచెప్పి ఉండాల్సింది కదా!. అమెరికా లో ఒక యూనివర్శిటీకి వెళ్లి , అక్కడి అమెరికన్ విద్యావేత్త ఒకరు అడిగిన ప్రశ్నకు తడుముకుంటూ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ వంక చూడడం ఎందుకు?. జగన్ పేదల చదువులకు వేలకోట్లు ఖర్చు పెట్టడం కూడా తప్పేనట!. అసలు ఏపీలో విద్యావ్యవస్థలో వస్తున్న విప్లవాత్మక మార్పులు ఏనాడైనా పవన్ కల్యాణ్ పరిశీలించారా?. కేవలం తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఏమి చెబితే అదే ఉపన్యసిస్తూ, తన అమాయక అభిమానుల్ని రెచ్చగొట్టి, తానేదో సాధించేశానని అనుకుంటున్నారు. ✍️నిజానికి పవన్ కల్యాణ్ వల్ల ప్రజలకు వచ్చిన నష్టం ఏమీ లేదు. కాని ఆయన తెలిసి, తెలియక అజ్ఞానంతో మాట్లాడి ఆంధ్రుల పరువు తీస్తున్నారనిపిస్తోంది. పవన్ కల్యాణ్ ఏదో తెలుగుదేశం కోసం పనిచేసుకోకుండా, మధ్యలో ఆయనకు ఇంగ్లీష్ మీడియం గొడవ ఎందుకు?. నిజంగానే ఆయనకు ఆ మీడియంపై అంత వ్యతిరేకత ఉంటే.. తన పిల్లలను మంచి,మంచి అంతర్జాతీయ స్థాయిలో ఉండే ఓక్రిడ్జ్ వంటి స్కూళ్లలో ఎందుకు చదివించారు. ఆ సందర్భంగా ఆయన అబ్బో ఇది గొప్ప స్కూలు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అని అన్నారే!. అదే ప్రకారం ఏపీలో కూడా సిలబస్ నుంచి అన్నింటిలో మార్పులు తెచ్చి పిల్లలకు మేలైన విద్య అందించాలని జగన్ తలపెడితే మాత్రం ఎక్కడలేని అక్కసా? అసలు ఐబీ అంటే ఏమిటో, ఏఐ అంటే ఏమిటో? టోఫెల్ అవసరం ఎందుకో? పిల్లలకు వాటిలో ట్రైనింగ్ ఇస్తే వచ్చే ప్రయోజనం ఏమిటో పవన్ కల్యాణ్‌కు తెలిసి ఉంటే ఇలా పిచ్చితనంతో మాట్లాడేవారా?. ఇలాంటి వ్యక్తి రాజకీయాలలో ఉండి ,ప్రజలకు సందేశాలు ఇవ్వడం కన్నా ఏపీకి అవమానం ఏమి ఉంటుంది చెప్పండి!. ఒకవేళ పవన్‌కు విషయాలపై అవగాహన ఉంటే ఫలానా విధంగా అమలు చేస్తే బాగుంటుందని సలహా ఇవ్వొచ్చు. అలాకాకుండా ఈ సిలబస్, విద్యా వ్యవస్థలో మార్పులు తెస్తున్న జగన్‌ను, అందుకు బాధ్యులైన అధికారులు, ఇతరులపై కేసులు పెడతామని అంటే ఏమని అనుకోవాలి. పైగా అతి తెలివిగా యూట్యూబ్‌లో అన్నీ తెలుసుకోవచ్చట. ఆయన తన పిల్లలకు అలాగే చేస్తారా?. యూట్యూబ్ చూసి చదువుకోండి అని చెబుతారా?. ఇక్కడే ఆయన పెత్తందారి బుద్ది తెలిసిపోయిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ✍️పవన్ కల్యాణ్ మాత్రమే కాదు.. తెలుగు అంటూ పెద్ద ఉపన్యాసాలు చేసే నాయకుల పిల్లలు ఎవరూ తెలుగు మీడియంలో చదవలేదు. వారి మనుమళ్లు కూడా అంతే. చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలోనే చదువుకున్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు దేవాన్ష్ ఏ స్కూలులో చదువుతున్నది, ఏ మీడియంలో అభ్యసిస్తున్నది ఎన్నడైనా చెబుతున్నారా! పోనీ పవన్ కల్యాణ్ అయినా అడిగి తెలుసుకున్నారా!. అలాగే రామోజీరావు కుమారులు, మనుమళ్లు,మనుమరాళ్లు అంతా ఆంగ్ల మీడియం దారిలోనే చదువుకున్నారు. ఆయన పెట్టిన స్కూల్ కూడా ఆంగ్ల మీడియంలోనే బోధిస్తోంది. కాని ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో పేదలకు ఆంగ్ల మీడియానికి వ్యతిరేకంగా పుంఖానుపుంఖాలుగా కథనాలు రాసి విషం చిమ్ముతుంటారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వరస అంతే. మిగిలిన తెలుగుదేశం మీడియా వారిది అదే బాట. కాని నీతులు చెబుతుంటారు. ✍️తెలుగును ఎవరూ వద్దనడం లేదు. కాని తెలుగుతోపాటు ఆంగ్ల మీడియంలో చదివితే అంతర్జాతీయ స్థాయిలో మన పిల్లలు కూడా పోటీపడతారన్నది జగన్ ప్రభుత్వ ఆకాంక్ష. ఈ మధ్య ప్రభుత్వ స్కూళ్ల పిల్లల బృందం ఒకటి అమెరికాలో పర్యటించింది. ఐక్యరాజ్యసమితిలో కూడా మాట్లాడి వచ్చింది. అక్కడ వారు మాట్లాడింది ఇంగ్లీష్‌లోనే. అక్కడకు వెళ్లి తెలుగులో మాట్లాడితే తెల్లమొహం వేసుకుని చూడాల్సిందే. ఆంగ్లం రావడం వల్ల వారిలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ధైర్యం వస్తుంది. పోటీ సమాజాన్ని సమర్ధంగా ఎదుర్కోగలుగుతారు. అలాంటివాటిని పట్టించుకోకుండా పవన్ కల్యాణ్ వంటివారు ఆంగ్ల మీడియంకు వ్యతిరేకంగా కొత్తగా వస్తున్న మార్పులకు వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్లు స్పీచ్ లు ఇస్తే ప్రజలే గుణపాఠం చెప్పాలి. ఏపీలో ఏదైనా మంచి చేయాలంటే ఎంత కష్టమో చంద్రబాబు, పవన్ కల్యాణ్ వంటివారిని చూస్తే అర్థమవుతంది. ప్రతిదానికి అడ్డుపడడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. నాలుగేళ్లుగా అదే గేమ్ సాగించారు. కానీ ఆకస్మికంగా పరిస్థితి మారింది. చంద్రబాబు నాయుడు అవినీతి కేసులో అరెస్టు అయి జైలుకు వెళ్లవలసి వచ్చింది. అంతే!. పవన్ కల్యాణ్ స్వరంలో అవినీతి గురించి మార్పు వచ్చింది. అబ్బే! అవినీతి అనేది కామన్.. దానిని కొంతవరకు ఆమోదించవచ్చని ఆయన చెప్పే దశకు చేరుకున్నారు. యాక్సెప్టబుల్ లెవెల్ ఆఫ్ కరప్షన్ అని చెబుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు పై రూ. 240 కోట్ల అవినీతి అభియోగాన్ని పెద్దగా పట్టించుకోనక్కర్లేదని చెబుతున్నట్లుగా ఉంది. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కామ్ లోనే కాదు. ఫైబర్ నెట్, అస్సైన్డ్ భూముల కేసులు ,ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు మొదలైనవన్నివాటిలో వందల కోట్లు తినడం పెద్ద తప్పు కాదని ఆయన చెబుతున్నట్లుగా ఉంది. అవినీతిపై వచ్చిన కేసుల గురించి మాట్లాడని పవన్ కల్యాణ్, చంద్రబాబుపై వచ్చిన వందల కోట్ల అవినీతి గురించి నోరెత్తని పవన్ కల్యాణ్ ఆంగ్ల మీడియం తెచ్చి స్కూళ్లను బాగు చేసినందుకు జగన్ పైన, ఇతర సంబంధిత వ్యక్తులపైన కేసులు పెడతానని అంటున్నారు. ఇలాంటి వాళ్లు ఏపీకి అవసరమా?... :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
భాషా పాఠాలకూ 'డిజిటల్' రూపం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బోధించే భాషా పాఠాలు డిజిటల్ రూపం సంతరించుకున్నాయి. 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు అనువుగా ఈ–పాఠాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సెల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ) రూపొందించింది. ఇప్పటికే సబ్జెక్టు పాఠ్యాంశాలను ఈ కంటెంట్‌లో బోధిస్తుండగా, ఇప్పుడు తెలుగు, ఇంగ్లిష్, హిందీ డిజిటల్ పాఠ్యాంశాలను సైతం సిద్ధం చేసింది. ఆయా సబ్జెక్టుల్లో నిపుణులైన ప్రభుత్వ ఉపాధ్యాయులను ఎంపిక చేసి, వారి ద్వారా 3 నుంచి 10వ తరగతి వరకు ఆయా భాషల పాఠ్యాంశాలను తయారు చేసింది. పదో తరగతి మినహా మిగిలిన తరగతుల కంటెంట్‌ను ప్రభుత్వ పాఠశాలలకు అందించేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఏడాది నుంచి ఉన్నత పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల (ఐఎఫ్‌పీ) ద్వారా డిజిటల్ బోధనను అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం.. సబ్జెక్టు పాఠాలను డిజిటల్ రూపంలోకి మార్చి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అందించింది. ఇప్పటివరకు ఒకటి నుంచి 9వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం పాఠాలను ఎస్సీఈఆర్టీ రూపొందించింది. వచ్చే ఏడాది పదో తరగతి ఇంగ్లిష్ మీడియం పూర్తిస్థాయిలో అమల్లోకి రానున్న నేపథ్యంలో ఆ తరగతి పాఠాలను సైతం డిజిటల్ రూపంలో సిద్ధం చేశారు. యూట్యూబ్‌లోనూ.. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి కలిగించేందుకు డిజిటల్ పాఠాలను డైరెక్ట్ టు హోమ్ (డీటీహెచ్) విధానంలో ‘ఈ–విద్య’ చానెళ్ల ద్వారా టీవీల్లో కూడా ప్రసారం చేస్తోంది. ఒకటి నుంచి ఐదు తరగతులకు ఒక చానెల్ ద్వారాను, ఆరు నుంచి 9వ తరగతి వరకు మరో చానెల్ ద్వారాను పాఠ్యాంశాలను టెలీకాస్ట్ చేస్తున్నారు. అలాగే యూట్యూబ్‌లోని ‘ఈ–పాఠశాల’ చానెల్ ద్వారా ఎప్పుడు కావాలన్నా పాఠాలు వినేందుకు అవకాశం కల్పిస్తూ అన్ని పాఠాలను అప్లోడ్ చేశారు. ఆన్లైన్లో కూడా విద్యార్థులు పాఠాలు చదువుకునేందుకు, ఉపాధ్యాయులు చెప్పినవి వినేందుకు అనువుగా ‘ఈ–పాఠశాల’ మొబైల్ యాప్‌ను సైతం అందుబాటులోకి తెచ్చారు. ఐఎఫ్‌పీ, ట్యాబ్, డీటీహెచ్, యూట్యూబ్, మొబైల్ యాప్.. అన్ని మాధ్యమాల్లోను ఒకే తరహా కంటెంట్, బోధన ఉండేలా వీడియోలను ఉంచారు. అందుబాటులోకి వీడియో కంటెంట్ పాఠశాల విద్యార్థులకు అవసరమైన సబ్జెక్టుల్లోని పాఠాల కంటెంట్‌ను ఇప్పటికే బైజూస్ రూపొందించి విద్యాశాఖకు అందించింది. వీటిని విద్యార్థులకు ఐఎఫ్‌పీల్లో బోధించడంతో పాటు, ట్యాబ్స్‌లోను అప్లోడ్ చేశారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యార్థులకు లాంగ్వేజెస్, కొన్ని సబ్జెక్టుల వీడియో పాఠాలను ఎస్సీఈఆర్టీ రూపొందించింది. ఇందులో ప్రధానంగా మూడో తరగతి విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్–ఈవీఎస్, నాలుగు, ఐదు తరగతులకు తెలుగు, ఇంగ్లిష్, ఆరు నుంచి తొమ్మిదో తరగతి వారికి తెలుగు, ఇంగ్లిష్, హిందీ సబ్జెక్టుల్లో వీడియో పాఠాల కంటెంట్‌ను అందుబాటులోకి తెచ్చారు. -
ఓర్వలేని కళ్లన్నీ నీ మీదే తల్లీ!
ఎదగాలి నాన్నా... నువ్వింకా ఇంకా పైపైకి... ఈ లోకం గుర్తించేంత పైకి ఎదగాలి తల్లీ! దిగువ కులాల వృత్తి చట్రాల్లో బందీలై వెనుకబాటుతనాన్ని వారసత్వంగా మోసుకొస్తున్న మీ అమ్మానాన్నల కలలు ఫలించేలా... మీకు అండగా నిలబడిన మీ జగన్ మామ ఆశీస్సులు సాకారమయ్యేలా ఎదగాలి తల్లీ! అసూయా దృక్కులు నిన్ను వెన్నాడుతాయ్. భయపడకు! ఓర్వలేని తనం శాపనార్థాలు పెడుతుంది. చలించకు! పెత్తందార్లు పగబడతారు. ప్రతిఘటించు! నీ వెనుక మీ మేనమామ ఉన్నాడు. తరతరాలుగా మీ తాత ముత్తాతల దగ్గర్నుంచీ మీ అమ్మానాన్నల దాకా మిమ్మల్ని తొక్కిపెట్టి ఉంచిన పెత్తందార్లు ఇప్పుడు నీ చదువు మీద యుద్ధం ప్రకటించారు. భయం లేదులే! అభయం దొరికింది కదా... ఇక దృష్టి పెట్టి చదువు! చదువే నీ తిరుమంత్రం. చదువే నీ రణతంత్రం. అంబేడ్కర్, ఫూలే, సావిత్రీబాయి, నారాయణ గురులు ఉపదేశించిన విముక్తి మార్గం చదువు. నువ్వు అమెరికాకు వెళ్లి ఐక్యరాజ్యసమితి వేదికపై ఇంగ్లీషులో ధారాళంగా మాట్లాడుతుంటే మన పెత్తందార్లు కళ్లల్లో నిప్పులు పోసుకున్నారు తెలుసా? నువ్వు అంతర్జాతీయ యూనివర్సిటీల్లో మాట్లాడుతుంటే ఈర్ష్యతో వాళ్ల కడుపులు కుతకుతలాడాయి తెలుసా? కానీలే, ‘రానీ, రానీ, వస్తే రానీ! కోపాల్, తాపాల్, శాపాల్ రానీ’ అన్నాడు కదా శ్రీశ్రీ. నిప్పులు పోసుకున్న వాళ్ల కళ్లు పేలిపోనీ, రగిలిన కడుపులు పగిలిపోనీ, ఇప్పుడా పెత్తందార్లు మీ అమ్మానాన్నలపైనే కాదు, అండగా నిలబడిన మీ జగన్ మామ మీద, చదువుకుంటున్న మీ మీద కూడా యుద్ధం ప్రకటించారు. ఈ యుద్ధంలో గెలవాలంటే మీ కర్తవ్యం ఏమిటో తెలుసా? బాగా చదవాలి. పైపైకి ఎదగాలి. అడవులు కొండలు ఎడారులా మనకడ్డంకి అంటూ ముందుకు సాగాలి. సరిహద్దుల్నీ సముద్రాల్నీ దాటుకుంటూ వెళ్లాలి. ఆకాశాన్ని చీల్చుకుంటూ పైకెగరాలి. ఆరుద్ర పాట తెలుసుకదా! ‘‘గ్రహ రాశుల నధిగమించి, ఘనతారల పథము నుంచి, గగనాంతర రోదసిలో,గంధర్వ గోళ గతులు దాటి’’ అలా సాగిపోవాలి. ఇంతకూ పెత్తందార్లంటే ఎవరో తెలుసా చిన్నా? వాళ్లూ అందరిలాగే ఉంటారు. కోరలూ కొమ్ములూ కనిపించవు. కాకపోతే డబ్బు ఉన్నదనే అహంకారంతో కనిపించని కొమ్ములు మొలుస్తాయి. ఈ సృష్టిలో ప్రతీదీ తమకే కావాలనుకుంటుంది పెత్తందార్ల వర్గం. భూమి, గాలి, నీరు, ఆకాశం మీద కూడా వాళ్లకే హక్కు ఉన్నట్టు భావిస్తారు. పొలాలు, ఫ్యాక్టరీలు, డబ్బు, అధికారం, హోదా అన్నీ వాళ్లకే ఉండాలి. మంచి చదువులు చదివితే తెలివి తేటలొస్తాయి. కనుక మంచి చదువులు తమ పిల్లలకే ఉండాలి. పేద పిల్లలు కూడా మంచి చదువులు చదివితే తమ పిల్లలతో సమానంగా ఉంటారు. మంచి ఉద్యోగాలు సంపాదిస్తారు. తమకు నౌకర్లు, చాకర్లు, డ్రైవర్లు, వంట వాళ్లు దొరకరు. సినిమా వాళ్లకు ‘పవర్ స్టార్’.. ‘పంచర్స్టార్’ అని వెర్రికేకలు వేసే ఫ్యాన్స్ దొరకరు. ఈ కారణాల వల్ల ఇంగ్లీష్ మీడియంలో చదివితే చెడిపోతా రని వాళ్లు ప్రచారంలో పెడుతున్నారు. మాతృభాషలో విద్యాబోధన ఆవశ్యక తను గురించి సుద్దులు చెప్పడానికి కొందరు పెద్దల్ని రంగంలోకి దించుతారు. ఇప్పటికే దించారు కూడా! మాతృభాష లోనే పాఠాలు నేర్చుకుంటే జ్ఞానం పెరుగు తుందనీ, సులభంగా అర్థమవుతాయనీ చెబుతారు. అంతేగాకుండా అంతా ఆంగ్ల మీడియంలో చదివితే తెలుగు సంస్కృతి దెబ్బతింటుందని వాపోతారు. అలాంటి వాళ్లు మీకు తగిలినప్పుడు రెండు ప్రశ్నలు వేయండి. ఒకటి – ఇప్పుడు ఇంగ్లీషులో చదవకపోతే పై చదువులకు వెళ్లినకొద్దీ ఇంగ్లీషులోనే చదవాల్సిన పాఠాలకు ఎలా అలవాటు పడతామని అడగాలి. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో ఎలా నెగ్గుతామని అడగాలి. మీరు పై చదువులు పెద్దగా చద వొద్దని కదా వారి ఉద్దేశం. అందుకని మీరా ప్రశ్న అడగ్గానే గతుక్కుమంటారు. ఇక రెండో అంశం – ‘అయ్యా! గత యాభయ్యేళ్లుగా మా అమ్మానాన్నలు, తాతముత్తాతలు తెలుగులోనే చదివి, తెలుగు భాషకు సేవలు చేసి అలసిపోయారు. ఇప్పుడు కొంతకాలం మేము ఇంగ్లీషులో చదువుకుంటాము. మీ పెత్తందార్లంతా ఇంతకాలం ఇంగ్లీషు చదువులు చదివారు కదా! ఇప్పుడు పిల్లల్ని మనవల్నీ తెలుగు మీడియంలో చదివించండి. వారు తెలుగు భాషను రక్షిస్తారు. మేం ఇంగ్లీష్ చదువుకొని అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతామ’ని చెప్పండి. ఏమంటారో చూద్దాం. రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యాన్నిస్తూ ‘నాడు – నేడు’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి మీకు తెలుసు. ఈ కార్యక్రమం ఫలితంగా శిథిలా వస్థకు చేరిన సర్కారు బళ్లు మళ్లీ చిగురించాయి. ప్రైవేట్ స్కూళ్లను మించి సకల హంగులు సంతరించుకున్నాయి. మీకిస్తున్న బూట్లు, బ్యాగ్, బెల్ట్, యూనిఫామ్ అన్నీ బెస్ట్‌గా ఉండాలని స్వయంగా సీఎం హోదాలో ఉన్న మీ మేనమామ స్వయంగా సెలెక్ట్ చేసి పంపిస్తున్నారు. ‘గోరుముద్ద’ మెనూ కూడా ఆయనే తయారు చేశారు. కూలినాలి చేసుకునే పేద తల్లులు వారి బిడ్డల్ని స్కూళ్లకు పంపించేలా ప్రోత్సహించడం కోసం ‘అమ్మ ఒడి’ పేరుతో నగదు అందజేస్తున్న సంగతి కూడా మీకు తెలిసిందే. ఈ మొత్తం కార్యక్రమాల్లో భాగంగా మూడేళ్ల కిందనే ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రారంభించారు. ఏటా ఒక్కో తరగతిని పెంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు తొమ్మిదో తరగతి వరకు అంతా ఇంగ్లీష్ మీడియమే. ఇంగ్లీష్ మీడియాన్ని ప్రారంభించిన ఆదిలోనే పెత్తందారీ ప్రతిఘటన మొదలైంది. తెలుగు భాషోద్యమం పేరుతో ఓ నకిలీ ఉద్యమాన్ని ప్రారంభించడానికి యెల్లో మీడియాతో కలిసి చంద్రబాబు ప్లాన్ చేశారు. కానీ, క్షేత్రస్థాయి నుంచి వ్యతిరేకత వస్తుందన్న సమాచారంతో కాస్త వెనక్కు తగ్గారు. కొద్దిరోజుల విరామం తర్వాత మళ్లీ చంద్రబాబు మొదలుపెట్టారు. ఈసారి ప్రత్యక్షంగా పేద తల్లితండ్రుల మెదళ్లలోకి దూరాలని ప్రయత్నించారు. శ్రీకాకుళం నుంచి రోడ్డు మార్గం ద్వారా వస్తున్న చంద్రబాబుకు విశాఖ సమీపంలో ఓ పదిమంది కూలీలు రోడ్డు పక్కన కనిపించారు. వెంటనే వాహనాన్ని ఆపేసి వాళ్ల మధ్యన కూర్చున్నారు. ఆ మాట ఈ మాట మాట్లాడిన తర్వాత ‘‘ఆయనేదో (జగన్) ఇంగ్లీష్ మీడియం అంటున్నాడు. ఏమొస్తది ఇంగ్లీష్ మీడియంతో! కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోద్ది. మన పిల్లలు మొద్దబ్బాయి లుగా తయారవుతారు...’’ అంటూ ఇంకేదో చెప్పబోయారు. అక్కడున్న జనమంతా అసహ నంతో ‘జై జగన్’ అని నినాదాలు చేయడంతో చల్లగా జారుకున్నారు. పెత్తందార్ల కూటమికి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయకుడు. ఆయన సమన్వయంలోనే యెల్లో మీడియా పనిచేస్తున్నది. ఈ మీడియా సమూహంలో అతి ముఖ్యుడు రామోజీరావు. ఆయన చంద్రబాబుకు గురుపాదుల వంటివారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఎకరాల విశాల సామ్రాజ్యాన్ని అక్రమ పద్ధతుల్లో విస్తరించారు. ఈ విస్తరణలో భాగంగా ఆయన చట్టాలను కూడా యథేచ్ఛగా ఉల్లంఘించారు. ఆయనకు ‘ఈనాడు’ అనే పత్రిక, ‘ఈటీవీ’ పేరుతో చానళ్లున్నాయి. తాను తెలుగు కోసమే పుట్టినట్టు, తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ కోసమే గాలి పీల్చుకుంటున్నట్టు ఆయన డప్పు వేయించుకుంటారు. ఆయన స్థాపించిన ఫిలిం సిటీ చేరువలో కొండల మీద రమాదేవి పబ్లిక్ స్కూల్ పేరుతో ఒక పాఠశాలను స్థాపించారు. అది మాత్రం పక్కా ఇంగ్లీష్ మీడియం, సెంట్రల్ సిలబస్. తెలుగు మీడియం పాఠశాల పెడితే భారీగా ఫీజులు కట్టి ఎవరు చదు వుకుంటారు? కనక తనకు కలెక్షన్ కోసం సంపన్నులు చదువుకునే ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండాలి. పేద బిడ్డలు మాత్రం కనీస వసతులు లేని ప్రభుత్వ బడుల్లో తెలుగు మీడియం చదవాలి. ఇదీ వారి నీతిసారం. ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఈ గురుపాదులవారు రాజ గురువుగా చక్రం తిప్పిన రోజుల్లోనే ప్రభుత్వరంగంలోని విద్యా వ్యవస్థ శిథిలమైపోయి వీథికో ప్రైవేట్ స్కూల్, ఊరికో కార్పొరేట్ కాలేజీ బ్రాంచీలు విస్తరించాయి. చదువు అంగడి సరుకుగా రూపాంతరం చెందింది. పేదలు డ్రాపౌట్లుగా మిగిలి పోయారు. ఫలితంగా రెండు తరాల పేదలు నాణ్యమైన చదువుకు నోచుకోక జీవన ప్రమా ణాలను కోల్పోవలసి వచ్చింది. ఈ మానవ కల్పిత మహా సంక్షోభం మీద పరిశోధన జరగవలసిన అవసరం ఉన్నది. ఇంగ్లీష్ మీడియం విద్యకు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడేందుకు చంద్రబాబు, ఆయన ముఠా వెనుకడుగు వేసినా పరోక్ష ప్రయత్నాలను మాత్రం ఆపలేదు. తెలుగు భాషా సంస్కృతుల ముసుగులో వివిధ వేదికల ద్వారా ఇంగ్లీష్ మీడియంపై విషం చల్లుతూనే వస్తున్నారు. రాజ్యాంగబద్ధ పద వుల్లో పనిచేసిన పెద్దమనుషుల సేవలను కూడా ఇందుకోసం విరివిగా వినియోగించు కున్నారు. అయినా ఫలితం కలుగలేదు. ప్రజల సంపూర్ణ మద్దతుతో ఇంగ్లీషు మీడియంతో పాటు ఆనక విద్యాసంస్కర ణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు ట్యాబ్‌లు అందజేసిన తర్వాత, ఐఎఫ్‌పీ స్క్రీన్లను అందుబాటులోకి తెచ్చిన తర్వాత ఆ యా విద్యా ర్థుల నాణ్యతా ప్రమాణాలు పెరిగినట్టుగా అసెస్మెంట్ పరీక్షల్లో ఉపాధ్యా యులు గుర్తించారు. ఈ స్ఫూర్తితో దశలవారీగా ఐబీ సిలబస్‌ను కూడా అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిశ్చయించింది. ఇక లాభం లేదనుకున్న పెత్తందారీ ముఠా ఎన్నికలకు ఇంకో ఆరు నెలల సమయం ఉండగా ఆఖరు కృష్ణుడిని రంగంలోకి దించింది. పవన్ కల్యాణ్:ది లాస్ట్ కృష్ణా తన సహచరుడు నాదెండ్ల మనోహర్‌తో కలిసి శుక్రవారం నాడు ఇంగ్లీష్ మీడియంపై, విద్యాసంస్కరణలపై విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి రాగానే ఈ విద్యావిధానంపై కేసులు పెట్టి దీంతో సంబంధం ఉన్న వారందరినీ జైలుకు పంపుతారట! తమ పిల్లల్ని ఏ స్కూల్లో, ఏ మీడి యంలో, ఏ సిలబస్‌తో చదివించారో కూడా పవన్, మనోహర్‌లు ఈ సమావే శంలో చెబితే బాగుండేది. కానీ చెప్పలేదు. పవన్ హెచ్‌ఎమ్‌వి రికార్డులాంటోడు. అందులో రికార్డయిందే చెప్పగలడు. కానీ, పేద విద్యార్థుల ప్రగతికి ఉద్దేశించిన ఇంగ్లీష్ మీడియంపై యుద్ధం ప్రకటించి తాను ఏ వర్గం తరఫున పనిచేస్తున్నాడో చాటి చెప్పుకున్నాడు. లంకలో పుట్టిన ప్రతివాడూ రాక్షసుడే అన్నట్టు ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకించే ప్రతివాడూ పెత్తందార్ల తాబేదారే! నీవారెవరో పరవారెవరో గుర్తించడానికి ఇది మాత్రమే లిట్మస్ టెస్ట్ తల్లీ! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
పవన్‌కు ఎందుకంత కడుపుమంట?
ఆంధ్రప్రదేశ్రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం సీబీఎస్ఈ టోఫెల్ , ఐబీ సిలబస్ ఎందుకు? ఇది నిన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యున్నత సిలబస్‌ను అందించడంపై తన ఆక్రోశాన్ని వెల్లగక్కారు పవన్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యలో రాష్ట్ర సిలబస్‌ను బోధిస్తున్నారు. దీని వల్ల సాంప్రదాయ విద్యాబోధన అందుతోంది. అయితే మారిన పరిస్థితులు, పోటీ ప్రపంచంలో భాగంగా ప్రైవేట్ స్కూళ్లు అన్నీ కొత్త సిలబస్‌ను ఎంచుకుంటున్నాయి. దీంట్లో భాగంగా ఇప్పటికే CBSE అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌ను ఎక్కువ శాతం ప్రైవేట్ స్కూళ్లు ఎంచుకున్నాయి. ఇక మరికొన్ని కార్పోరేట్ స్కూళ్లు IB సిలబస్ అంటే ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్.. (దీన్నే లాటిన్ నామంలో The International Baccalaureate® (IB) గా పిలుస్తారు) ఎంచుకున్నాయి. సాధారణంగా.. డబ్బున్న కుటుంబాలకు చెందిన పిల్లలు ఇప్పుడు IB సిలబస్‌ను మాత్రమే ఎంచుకుంటున్నారు. దీంట్లో చదవడం ద్వారా విద్యార్థులకు ప్రపంచ అవగాహన కలగడంతో పాటు భవిష్యత్తులో సులభంగా అంతర్జాతీయ విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందగలుగుతారు. అలాగే అక్కడి కరిక్యులమ్‌కు అనుగుణంగా సులభంగా మారిపోగలరు. దీని విశిష్టతను గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి IB సిలబస్‌ను ఏపీలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. పవన్ కల్యాణ్‌కేంటీ అభ్యంతరం పేద విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసిస్తే.. ఆ కుటుంబ భవిష్యత్తుకు ఎంతో భరోసా. ఉన్నత చదువులు ఎక్కువ మంది చదువుకోగలిగితే.. సమాజం అభివృద్ధి చెందుతుంది. డబ్బున్నవాళ్లే కాదు.. పేదవాడు కూడా చదువుకోవడం.. ఇప్పుడు చాలా మంది ఓర్వలేకుండా ఉన్నారు. ఐబీ సిలబస్‌ను ఉచితంగా పేద విద్యార్థికి ఎలా అందిస్తారన్న కడుపు మంట ఈ వ్యాఖ్యల్లో బయటపడుతోంది. తమ పిల్లలను ఇంటర్నేషనల్ స్కూళ్లకు మాత్రమే పంపే ఈ నియో రిచ్ నాయకులు.. పేదలకు మాత్రం ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తెలుగు భాష మీద నెపం మోపుతారా? తెలుగు భాష అమ్మ అయితే ఇంగ్లిష్ భాష నడిపించే నాన్న. మారిన ప్రపంచీకరణ వల్ల జీతం, జీవితం ఇంగ్లిష్‌పై ఆధారపడుతోంది. ఇటీవల ఐక్యరాజ్యసమితికి వెళ్లిన ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను చూసి యావత్తు దేశం అబ్బురపడింది. అంతర్జాతీయ యవనికపై వారి భాష, ప్రదర్శించిన ఆత్మవిశ్వాసం ఏపీ ప్రభుత్వ పాఠశాలల నాణ్యమైన విద్యకు అద్దం పట్టింది. ఇప్పుడు పిల్లలంతా చదువుకుని ప్రయోజకులయితే తమ సంగతి ఏంటన్న ఆందోళనలో పచ్చపార్టీ నాయకులు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. హఠాత్తుగా వీరికి తెలుగుభాష మీద ప్రేమ పుట్టింది. తెలుగులో చదువుకోకపోతే ఎలా అంటూ దీర్ఘాలు తీస్తున్న వీరి అసలు ఉద్దేశ్యం మాత్రం కడుపు మంటే. చంద్రబాబు అధికారంలో ఉన్నన్నాళ్లు.. చైనా విద్యాసంస్థలను ప్రోత్సహించి ప్రభుత్వ పాఠశాలల్లో ఎవరూ చేరకుండా చేశాడు. ఇప్పుడు పేదవాడు బాగుపడుతున్నాడంటే జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. పిల్లలకు మనమిచ్చే నిజమయిన ఆస్థి విద్య అని భావించిన సీఎం జగన్ ప్రభుత్వం 70 వేల కోట్లు ఖర్చు చేసింది. అందుకే ఐబీ అయినా టోఫెల్ అయినా ప్రతీ సామాన్యుడికి అందాలన్న ఆశయం దిశగా అడుగులేస్తోంది. -
పేద పిల్లల విద్యపై విషమెందుకు?
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేదింటి పిల్లలకు మంచి జరుగుతుంటే కొందరు ఓర్వలేక, విషం కక్కుతున్నారని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్, అంతర్జాతీయ స్థాయి విద్యను అందిస్తే పేద పిల్లలు గొప్పగా ఎదుగుతారని, ఇది ఇష్టం లేకే కొందరు దిగజారి ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంటర్నేషనల్ బకలారియెట్ (ఐబీ) సిలబస్ అమలుపై పచ్చ పత్రిక కథనాన్ని ఆయన ఖండించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలు విధివిధానాల రూపకల్పనపై ఒప్పందం జరిగితే, అదేదో తప్పు చేసినట్టు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని తమ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. అందులో భాగంగా బైజూస్ కంటెంట్‌తో ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు, తరగతి గదుల్లో అత్యాధునిక ఐఎఫ్‌పీ స్క్రీన్లతో బోధనను డిజిటలైజ్ చేశామన్నారు. ఇప్పుడు ఆ విద్యార్థులు అంతర్జాతీయ పోటీని తట్టుకుని నిలబడేలా టోఫెల్ శిక్షణ కూడా అందిస్తున్నామన్నారు. విద్యార్థులు ఇంగ్లిష్ భాషపై పట్టు సాధించేందుకు ఇస్తున్న టోఫెల్ శిక్షణను ఎలా తప్పుబడతారని ప్రశ్నించారు. రాష్ట్రంలోని విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలుకు చర్యలు ప్రారంభించామన్నారు. ఒకటి నుంచి 12వ తరగతి వరకు ఏటా ఒక తరగతి పెంచాలని భావిస్తున్నట్టు చెప్పారు. ఇందుకు మార్గదర్శకాల రూపకల్పనపై ఒప్పందం జరిగితే.. ఎకాయెకిన సిలబస్ అమలు చేస్తున్నామని, అందుకోసం వేల కోట్ల ప్రభుత్వ నిధులు ఖర్చు చేసినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఐబీ సిలబస్ అమలు ప్రాథమిక స్థాయిలో ఉందని, ఇప్పటివరకు ఎలాంటి నిధులూ ఖర్చు చేయలేదని చెప్పారు. ఇవన్నీ సిలబస్ అమలు సమయంలో వచ్చే అంశాలన్నారు. ఐబీ సిలబస్ అమలు 12 ఏళ్ల దీర్ఘకాలిక ప్రక్రియ అని తెలిపారు. ఐబీ సిలబస్ అమలుకు ఢిల్లీ, మహారాష్ట్ర, హరియాణా ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నాయని గుర్తుచేశారు. మారుతున్న ప్రపంచ పోకడలకు అనుగుణంగా మన విద్యార్థులు ప్రగతి సాధించకపోతే వెనుకబడిపోతారని, వారిని ఉన్నతంగా నిలపడమే తమ ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. సామాన్య కుటుంబాల్లోని విద్యార్థులకు మంచి జరుగుతుంటే సెలబ్రిటీ పార్టీ నాయకులు ఓర్వలేకపోతున్నారని, వారికి ఎల్లో మీడియా వంతపాడుతోందని మంత్రి విమర్శించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమ ప్రభుత్వ లక్ష్యం మారదని, పేద పిల్లలకు అంతర్జాతయ విద్యను అందించి ఉన్నతంగా తీర్చిదిద్దుతామని మంత్రి బొత్స తెలిపారు. ఈ సమావేశంలో పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్, సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు, ఏఎస్పీడీ శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. -
కొత్త ఒర‘బడి’!
తూరంగి, తుని నుంచి నానాజీ అంకంరెడ్డి, సాక్షి ప్రతినిధి : ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన విద్యా సంస్కరణలు ఫలితాలనిస్తున్నాయి. దశాబ్దాల తరబడి తగినంత మంది ఉపాధ్యాయలు లేక ఇబ్బందులు పడ్డ విద్యార్థులకు ఇప్పుడు సుశిక్షితులైన టీచర్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడంతో విద్యా సామర్థ్యాలు, పరీక్షల్లో మార్కులు పెరిగాయి. పేద పిల్లల చదువులు, ఆరోగ్య స్థితిగతులు గణనీయంగా మెరుగుపడ్డాయి. వసతుల కల్పనతో డ్రాపౌట్లు నిలిచిపోయాయి. ప్రతి నెలా పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు రక్తహీనత ఉన్న విద్యార్థులను గుర్తించి ప్రతి గురువారం స్కూళ్లలోనే ఐరన్ మాత్రలు పంపిణీ చేస్తూ భావి పౌరుల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. యోగా, డ్రిల్ తప్పనిసరి చేయడంతో విద్యార్థుల ఫిట్‌నెస్‌లో మార్పు వచ్చింది. నిరంతర నీటి సదుపాయంతో కూడిన టాయిలెట్లు, ఆర్వో తాగు నీటితోపాటు మధ్యాహ్నం జగనన్న గోరుముద్దతో పోషకాహారం, రాగిజావ, చిక్కీ, వారానికి ఐదురోజులు కోడిగుడ్డు ఇవ్వడంతో విద్యార్థులు ఉత్సాహంగా చదువులపై దృష్టి సారిస్తున్నారు. బాలికలకు శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీతో పాటు రుతుక్రమ పరిస్థితులపై అవగాహన కల్పించడంతో మానసికంగా వారిలో మార్పు వచ్చింది. రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లలో ఐదారేళ్ల క్రితం వరకు 40 నుంచి 60 శాతం దాటని హాజరు ఇప్పుడు సగటున 98 శాతానికి పైగా పెరిగింది. ప్రైవేట్ నుంచి ప్రభుత్వ స్కూళ్లల్లో తమ పిల్లలను చేర్పించిన తల్లిదండ్రులు ఫీజులు రూపంలో చెల్లించే మొత్తం మిగలడం, మెరుగైన బోధన అందడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తగినంత మంది టీచర్లు.. పీఈటీలు కాకినాడ జిల్లా తూరంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 720 మంది విద్యార్థులుండగా వీరిలో 80 మంది ప్రైవేట్ స్కూళ్ల నుంచి వచ్చిన వారే ఉన్నారు. ఇక్కడ చదువుకున్న వారిలో గత నాలుగేళ్లలో 15 మంది విద్యార్థులు ఐఐఐటీల్లో సీట్లు సాధించడం, ఆరుగురు నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్లు అందుకోవడం గమనార్హం. ఆరు నుంచి 10వ తరగతి వరకు బోధనకు గతంలో 12 మంది మాత్రమే ఉపాధ్యాయులు ఉండగా ఇప్పుడు 29కి పెరిగింది. తునిలోని శ్రీరాజా ఉన్నత పాఠశాలలో 540 మంది విద్యార్థులు ఉండగా ఎన్నో ఏళ్ల పాటు ఉపాధ్యాయుల సంఖ్య 10 మందికి మించలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక ఆ సంఖ్య 17కి పెరిగింది. చాలా ఏళ్ల తర్వాత వ్యాయామ ఉపాధ్యాయుడి రాకతో విద్యార్థులు క్రీడల్లోనూ రాణిస్తున్నారు. ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులు ఇంగ్లిష్ బోధనను సునాయాసంగా అర్థం చేసుకోవడం, పరీక్షలు రాయడంతో పాటు సగటు మార్కుల శాతాన్ని కూడా పెంచుకోవడం గమనార్హం. వ్యాయామ ఉపాధ్యాయులను అందించడంతో రాష్ట్ర స్థాయి పోటీలకు సిద్ధమవుతున్నారు. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ, ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ బోధన, టోఫెల్ శిక్షణతో ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలకు క్యూ కడుతున్నారు. ప్రతినెలా తల్లిదండ్రులు– ఉపాధ్యాయుల సమావేశాలను నిర్వహించడం, విద్యార్థులు సాధిస్తున్న ప్రగతిని విశ్లేషించడం, అవసరానికి తగట్టు బోధనతో పిల్లల్లో నేర్చుకునే సామర్థ్యాలు, నైపుణ్యాలు మెరుగుపడ్డాయి. నాలుగేళ్లలో ప్రభుత్వ విద్యా వ్యవస్థల్లో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పుల ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తుని, తూరంగిలోని ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ‘సాక్షి’ ప్రతినిధి వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు తమ ఆనందాన్ని పంచుకున్నారు. మారిన తలరాతలు.. వెలుగు నిండిన స్కూళ్లు తల్లిదండ్రులకు ఆర్థిక భారంగా మారిన పిల్లల చదువుల బాధ్యతను పూర్తిగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం పుస్తకాల నుంచి యూనిఫారం దాకా సర్వం సమకూరుస్తోంది. పిల్లలకు స్కూళ్లలో నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించడంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలోనే చేర్చినా గతంలో ఒక్కో కుటుంబం పుస్తకాలు, యూనిఫారం కోసం ఏటా రూ.రెండు మూడు వేలు వెచ్చించాల్సి వచ్చేది. బెల్టు, బూట్లు, పుస్తకాల బ్యాగు ఖర్చు దీనికి అదనం. ఈ ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితి లేదు. రాష్ట్రంలోని దాదాపు 45 వేల పాఠశాలల్లో 42 లక్షల మంది పిల్లల తల్లిండ్రులకు చదువుల బెంగ తీరిపోయింది. బడికి పంపించినందుకు ఏటా రూ.15 వేలను జగనన్న అమ్మ ఒడి కింద ప్రభుత్వమే జమ చేస్తోంది. నాడు–నేడుతో ప్రభుత్వ స్కూళ్లు సమూలంగా మారిపోయాయి. ల్యాబ్స్, డిజిటల్ విద్య, ట్యాబ్స్, కొత్త తరగతి గదులు, ఆర్వో తాగునీరు, మరుగుదొడ్లు, బాలికలకు శానిటరీ ప్యాడ్స్ అన్నీ అందుబాటులో ఉండడంతో బాలికల చేరికలు పెరిగాయి. టెక్నాలజీ బోధన.. టోఫెల్ శిక్షణ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనను కలలో కూడా ఊహించలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసమే గతంలో అప్పులు చేసి ప్రైవేట్ స్కూళ్లల్లో చేర్చామని గుర్తు చేసుకుంటున్నారు. ఇద్దరు పిల్లలున్న తల్లిదండ్రులకు ప్రైవేట్ స్కూళ్లలో చదివించేందుకు ఏటా సగటున రూ.లక్ష వరకు ఖర్చయ్యేదని పేర్కొంటున్నారు. తెలుగు మీడియం నుంచి వచ్చిన వారికి అర్థమయ్యేలా బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలను ఇవ్వడం పిల్లలకు ఎంతో మేలు చేస్తోందని చెబుతున్నారు. ఇక మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. 1,000 పాఠశాలల్లో పూర్తిగా సీబీఎస్ఈ బోధనను అందిస్తోంది. అన్ని స్థాయిల్లో పాఠ్య పుస్తకాలను డిజిటల్ పీడీఎఫ్ రూపంలో ఆన్లైన్లో ఉంచడంతో పాటు బైజూస్ కంటెంట్‌తో ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్‌లను ఉచితంగా ఇవ్వడంతో చదువుల్లో రాణిస్తున్నట్లు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. 6 నుంచి 10 వరకు తరగతి గదుల్లో 30,213 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు (ఐఎఫ్‌పీ), ఎలిమెంటరీ పాఠశాలల్లో 10,038 స్మార్ట్ టీవీలతో డిజిటల్ బోధనను అందుబాటులోకి తేవడంతో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ స్కూళ్లను మించిపోయాయి. సైన్స్ ల్యాబ్‌లు, అటల్ టింకరింగ్ ల్యాబ్‌లతో సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెరిగినట్లు విద్యార్థులు వెల్లడిస్తున్నారు. ఇక టోఫెల్ శిక్షణ పిల్లల భవిష్యత్‌కు ఎంతో ఉపయోగపడుతుందని, ఇవన్నీ ఎవరూ ఊహించని అద్భుతమైన సంస్కరణలని విద్యావేత్తలు ప్రశంసిస్తున్నారు. ఆరోగ్య సంరక్షణ బాధ్యతలు కూడా.. ప్రతినెలా పాఠశాలలోనే విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించడం, ప్రతి గురువారం రక్తహీనత గల పిల్లలకు ఫోలిక్ ఐరన్ మాత్రలు అందజేయడంతో గతంలో 30 శాతంగా ఉన్న రక్తహీనత బాధితులు ఇప్పుడు 10 శాతానికి తగ్గిపోయారు. కేవలం పిల్లల చదువులనే కాకుండా వారి ఆరోగ్య సంరక్షణ బాధ్యతను కూడా రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించడం గొప్ప విషయమని తల్లిదండ్రులు, విద్యావేత్తలు ప్రశంసిస్తున్నారు. విద్యా రంగ సంస్కరణల కోసం నాలుగున్నరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.66,722.36 కోట్లు వ్యయం చేసింది. జగనన్న అమ్మ ఒడి, మనబడి: నాడు–నేడు, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, పాఠ్యాంశాల సంస్కరణలు, విదేశీ విద్యాకానుక లాంటి పలు విప్లవాత్మక కార్యక్రమాలను అమలు చేసింది. పిల్లల అభ్యసన ఫలితాలను మెరుగుపరిచే లక్ష్యంతో సమగ్ర విద్యా, పరిపాలనా సంస్కరణలు తెచ్చింది. ప్రతి బడిలోనూ డబుల్ డెస్కు బెంచీలు, కుర్చీలు, బీరువాలు, టేబుళ్లు లాంటి ఫర్నిచర్, గ్రీన్ చాక్‌బోర్డులు, పాఠశాల మొత్తానికి పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్, కాంపౌండ్ వాల్ నిర్మాణం లాంటి వసతులు కల్పించింది. ఎంతో బాగుంది చాలామందికి ప్రభుత్వ స్కూళ్లంటే చిన్నచూపు. ఇన్నాళ్లూ మేమూ అలాగే అనుకున్నాం. మాది సొంతూరు విజయనగరం జిల్లా చీపురుపల్లి. గతంలో హైదరాబాద్‌లో మా బాబు నాగసాయి వంశీని ప్రైవేట్ స్కూల్లో చదివించాం. ఫీజుల మోతతోపాటు ఆటపాటలు ఉండేవి కాదు. రెండేళ్ల క్రితం ఉద్యోగ రీత్యా తుని వచ్చాం. కొద్దిగా సంకోచిస్తూనే మా బాబును శ్రీరాజా హైస్కూల్లో 9వ తరగతిలో చేర్చాం. ఏడాదిలోనే ఎంతో మార్పు కనిపించింది. గతేడాది టెన్త్‌లో 555 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచాడు. క్రీడల్లోను రాణించాడు. ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లల్లో ఉన్న సదుపాయాలు కార్పొరేట్ స్కూళ్లల్లో కూడా లేవు. పుస్తకాలతో పాటు బ్యాగు, యూనిఫారం, బూట్లూ సమస్తం ఉచితంగా ఇచ్చారు. మధ్యాహ్నం చక్కటి భోజనం పెడుతున్నారు. ఇంట్లో కంటే బడిలోనే పిల్లలను బాగా చూసుకుంటున్నారు. – బసవరసు సంతోషి, తుని ఇంతకంటే ఏం కావాలి? నా భర్త వడ్రంగి పని చేస్తాడు. ప్రస్తుతం మా పాప తొమ్మిదో తరగతి, బాబు ఏడో తరగతి చదువుతున్నారు. ఖర్చులు తడిసి మోపెడైనా ఇంగ్లీష్ మీడియం ఉందనే ఆశతో ఇద్దరినీ ఐదో తరగతి దాకా ప్రైవేట్ స్కూళ్లలోనే చదివించాం. సీఎం జగన్ ప్రభుత్వం వచ్చాక సర్కారు స్కూళ్లలో ఇంగ్లీషు మీడియాన్ని తెచ్చింది. దీంతో పిల్లలను రా>జా హైస్కూల్లో చేర్చాం. తల్లిదండ్రులతో సమావేశాలను నిర్వహిస్తూ ప్రతి నెలా పిల్లల పురోగతిని ఉపాధ్యాయులు తెలియచేస్తున్నారు. గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి లేదు. ఇక పుస్తకాల నుంచి యూనిఫారం వరకు అన్నీ ఉచితమే. సైన్స్ ప్రయోగాలు నేర్పిస్తున్నారు. రోజు ఇంగ్లిష్ పదాలను నేర్పిస్తున్నారు. ఆటలకూ ప్రాధాన్యం ఇస్తున్నారు. తల్లిదండ్రులకు ఇంతకంటే ఇంకేం కావాలి? – వేమవరపు హేమనాగలక్ష్మి. తుని ఏం జరుగుతోందో అంతా తెలుసు.. మా చిన్నమ్మాయి తేజస్విని తూరంగి జెడ్పీ స్కూల్లో పదో తరగతి చదువుతోంది. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న మా పెద్దమ్మాయి కూడా ఇదే స్కూల్లో చదువుకుంది. గతంలో ఇలాంటి పథకాలే లేవు. అచ్చు పుస్తకాలు మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు బడి తెరిచిన రోజే అన్ని పుస్తకాలు, యూనిఫారం, బ్యాగుతో సహా ఇస్తున్నారు. అమ్మ ఒడి, విద్యా దీవెన అందుతోంది. మా ఇల్లు బడి పక్కనే ఉంది. అక్కడేం జరుగుతోందో నాకు బాగా తెలుసు. గత నాలుగేళ్లుగా చూస్తున్నా. ప్రభుత్వ బడి ఇంత చక్కగా మారుతుందని ఎప్పుడూ అనుకోలేదు. పేద పిల్లలకు ఇంగ్లిష్ చదువులు చెప్పించడం ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నా. – జక్కా యోగీశ్వరి, తూరంగి ఇక్కడే చదువుకున్నా.. 2007లో ఇదే జెడ్పీ స్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నా. మా అబ్బాయి కూడా ఇక్కడే టెన్త్ పూర్తి చేశాడు. మా అమ్మాయిలు రామతులసి, లక్ష్మి తులసి 9వ తరగతి చదువుతున్నారు. మా కాలానికి ఇప్పటికి బడి పూర్తిగా మారిపోయింది. అప్పట్లో కనీసం బాత్రూమ్ కూడా ఉండేది కాదు. పుస్తకాలకు ఇబ్బంది పడేవాళ్లం. ల్యాబ్ అంటే ఏమిటో తెలియదు. బెంచీలు కూడా పూర్తిగా ఉండేవి కావు. మధ్యాహ్నం భోజనం బదులు బియ్యం ఇచ్చేవారు. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ స్కూళ్లు పూర్తిగా మారిపోయాయి. ఐదు రోజులు పిల్లలకు గుడ్లు ఇస్తున్నారు. రోజుకో మెనూ చొప్పున పోషకాలు ఉన్న అన్నం వడ్డిస్తున్నారు. పుస్తకాలకు, యూనిఫారం కోసం ఇబ్బంది లేదు. ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తున్నారు. మా ఇద్దరు పిల్లలకు ట్యాబ్‌లు ఇచ్చారు. అమ్మ ఒడి వస్తోంది. నేను చదువుకున్నప్పుడు కూడా ఇన్ని సదుపాయాలు ఉంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంది. నిజంగా జగన్ సర్ గ్రేట్. – తంగిళ్ల నాలక్ష్మి, తూరంగి మరో ఐదేళ్లల్లో అద్భుతాలు దాదాపు 25 ఏళ్లకు పైగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నా. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంత అద్భుతమైన మార్పులను చూస్తానని అనుకోలేదు. చదువులు పూర్తి స్నేహపూర్వక వాతావరణంలోకి మారిపోయాయి. నీటి సౌకర్యం ఉన్న బాత్రూమ్లు, శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీతో ఆడపిల్లల డ్రాపౌట్లు ఆగిపోయాయి. మా స్కూల్లో 720 మంది పిల్లలు చదువుతున్నారు. 29 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రైవేట్ స్కూల్లో చదివే 80 మంది విద్యార్థులు ఈ ఏడాది ఇక్కడ చేరారు. గత నాలుగేళ్లుగా ప్రభుత్వ బడుల్లో చదువుతున్న పిల్లలు మరో ఐదేళ్లల్లో అద్భుతాలు సృష్టిస్తారనడంలో సందేహం లేదు. కార్పొరేట్ స్కూళ్లల్లో లేనన్ని సదుపాయాలు, బోధన ఇక్కడ అందుతున్నాయి. – కడలి లక్ష్మీదుర్గ, తూరంగి జెడ్పీ స్కూల్ హెచ్ఎం పూర్వ వైభవం తుని సమీపంలోని 40 గ్రామాల కోసం 1904లో ఈ హైస్కూల్ ఏర్పాటైంది. దాదాపు 50 ఏళ్ల పాటు ఎంతో ఉన్నతంగా నడిచింది. ప్రభుత్వంలో విలీనం అయ్యాక ఆ ప్రాభవం తగ్గిపోయింది. మళ్లీ ఇన్నేళ్లకు పూర్వ వైభవం వచ్చింది. ఇదే స్కూల్లో గతంలో టీచర్‌గా పనిచేశా. ఇప్పుడు హెచ్ఎంగా సేవలందిస్తున్నా. నాడు–నేడు కింద అదనపు గదులు నిర్మించారు. డిజిటల్ బోధన, ఇంగ్లిష్ మీడియం సామాన్యులకు చేరువ కావాలని ఎన్నోసార్లు కోరుకున్నా. వాటితో పాటు టోఫెల్ శిక్షణను కూడా ప్రభుత్వం పేద పిల్లలకు చేరువ చేసింది. పూర్తిస్థాయిలో టీచర్లను ఇచ్చింది. విద్యార్థులు సైతం ఇంగ్లిష్ చదువుల్లో బాగా రాణిస్తున్నారు. ఇంత అద్భుతమైన మార్పులను చూస్తాననుకోలేదు. – టి.శేషగిరి శ్రీరాజా హైస్కూల్ హెచ్ఎం, తుని. ► ఎలక్ట్రికల్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే కాకినాడ జిల్లా తూరంగి వాసి పరమట శ్రీనుకు ముగ్గురు పిల్లలు. ఇంగ్లిష్ మీడియం కోసం వారిని ప్రైవేట్ స్కూళ్లలో చేర్చడంతో ఏటా రూ.90 వేలు ఖర్చయ్యేవి. ఇతర ఫీజులు పేరుతో మరో రూ.15 వేలు చెల్లించాల్సి వచ్చేది. రోజంతా కష్టపడితే రూ.500 సంపాదించే శ్రీను ఫీజులు కట్టడం ఆలస్యం కావడంతో ఆయన పిల్లలను బడి బయట నిలబెట్టిన సందర్భాలు ఎన్నో! ఇంటికొచ్చి పిల్లలు ఏడ్చిన సందర్భాలూ ఉన్నాయి. ఇంత ఖర్చు చేసినా ప్రైవేట్ చదువులేమీ గొప్పగా లేవని శ్రీను గతాన్ని గుర్తు చేసుకున్నాడు. 2019 నుంచి ఆయన పిల్లల చదువుల భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. ముగ్గురు పిల్లలను తూరంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేర్చాడు. ఆయన పెద్ద కుమార్తెకు రెండేళ్లు జగనన్న అమ్మ ఒడి వచ్చింది. ఇప్పుడు పాలిటెక్నిక్ చదువుతూ జగనన్న విద్యా దీవెన కింద ఉచిత విద్యను పొందడంతో పాటు వసతి దీవెన కింద రూ.20 వేలు అందుకుంటోంది. టెన్త్ చదివే రెండో పాపకు అమ్మ ఒడి అందుతోంది. ఉచితంగా, పుస్తకాలు, యూనిఫారంతో పాటు బూట్లు కూడా ఇచ్చారు. ఎనిమిదో తరగతి చదువుతున్న కుమారుడికి కూడా అన్ని సదుపాయాలు అందాయి. ఇంగ్లిష్ మీడియం చదువుల కోసం తపన పడ్డ ఈ తండ్రి ఆశలను ప్రభుత్వం నెరవేర్చింది. ట్యాబ్‌లు, డిజిటల్ బోధన లాంటి చక్కటి సదుపాయాలను కల్పించింది. ప్రైవేటు చదువులతో ఆర్థికంగా చితికిపోయిన శ్రీను గతంలో పిల్లల ప్రైవేటు చదువుల కారణంగా కొత్త దుస్తులు కూడా కొనుక్కోలేకపోయానని, నాలుగేళ్లుగా చదువుల ఖర్చు లేకపోవడంతో ఇప్పుడు సొంత ఇంటి నిర్మాణం చేపట్టినట్టు ఆనందంగా చెప్పాడు. ► కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఉత్తర కంచిలో ఇటుకల బట్టీని నిర్వహించే మొల్లేటి బేబి కుటుంబం గతంలో బతుకుదెరువు కోసం హైదరాబాద్ వలస వెళ్లింది. కుమారుడు ఆదిత్యవర్థన్‌ను రెండో తరగతి వరకు అక్కడే చదివించారు. ఫీజుల భారాన్ని తట్టుకోలేక తునిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఐదో తరగతి వరకు చదివించారు. ఇక్కడా అదే పరిస్థితి తలెత్తడంతో తునిలోనే శ్రీరాజా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతిలో చేర్చారు. ‘రెండేళ్ల నుంచి బాబులో మంచి మార్పు గమనిస్తున్నా. ప్రైవేట్ స్కూళ్లలో లేని ఎన్నో మంచి వసతులు ఇక్కడున్నాయి. ల్యాబ్‌ల్లో ప్రయోగాలు చేయిస్తున్నారు. చదువుల్లో, ఆటల్లో బాగా రాణిస్తున్నాడు. ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తున్నారు. ప్రతి నెలా తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించి పిల్లల ప్రగతిని వివరిస్తున్నారు. మాలాంటి కుటుంబాలకు భారంగా మారిన పిల్లల చదువులను ప్రభుత్వమే తన బాధ్యతగా తీసుకోవడం ఎంతో గొప్ప విషయం. ప్రభుత్వ బడికి మారడంతో ఏటా ఫీజులు రూపంలో చెల్లించే రూ.50 వేల వరకు మిగులుతోంది. ఇంత గొప్ప సౌకర్యాలు, సదుపాయాలు, బోధన హైదరాబాద్‌లోని ప్రైవేట్ స్కూల్లో కూడా చూడలేదు’ అంటూ ఆమె సంతోషంగా చెబుతోంది. -
సర్కారు బడుల్లో సిలబస్ తంటాలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ బడుల్లో సిలబస్ పూర్తవ్వకపోవడం విద్యాశాఖలో సరికొత్త వివాదానికి దారితీస్తోంది. దీనికి పాఠశాల హెచ్ఎంలు, సంబంధిత టీచర్లను బాధ్యులను చేయాలని పాఠశాల విద్య డైరెక్టరేట్ భావించడం కొత్త సమస్యను సృష్టిస్తోంది. ఈ పరిస్థితికి విద్యాశాఖ అధికారులే కారణమని ఉపాధ్యాయులు నిందిస్తున్నారు. నేరం తమపై మోపితే సహించేదే లేదని చెబుతున్నారు. సిలబస్ పూర్తికాని బడుల వివరాలను పాఠశాల విద్య డైరెక్టరేట్ ఇటీవల తెప్పించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా బడుల్లో దసరా సెలవులలోపు 80 శాతం సిలబస్ పూర్తవ్వాల్సి ఉండగా, ఎక్కడా 40 శాతానికి మించి పూర్తవ్వలేదని డీఈవోలు చెబుతు న్నారు. కొన్ని చోట్ల 25 శాతం మాత్రమే అయిందంటున్నారు. ఇలాంటి బడుల హెచ్ఎంలు, టీచర్ల నుంచి వివరణ కోరాలని పాఠశాల విద్య డైరెక్టర్ డీఈవోలకు సూచించినట్టు తెలిసింది. దీంతో డీఈవోలు సంబంధిత బడుల హెచ్ఎంల నుంచి వివర ణ కోరేందుకు సన్నద్ధమయ్యారు. దీనిపై ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇక సమయమెక్కడిది? పాఠశాల విద్యశాఖ సూచించిన లక్ష్యం పూర్తవ్వకపోవడంతో, భవిష్యత్‌లో సిలబస్ సమగ్రంగా పూర్తి చేయడం అసాధ్యమని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. స్కూళ్లు తెరిచిన రెండు నెలల వరకూ పాఠ్యపుస్తకాలు అందలేదని, ఈ కారణంగా బోధన చేపట్టలేదని టీచర్లు చెబుతున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం టీచర్ల బదిలీలు, పదోన్నతుల అంశాన్ని తెరమీదకు తెచ్చిం ది. దీంతో బోధన కొంతమేర కుంటుపడింది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలవ్వడంతో మరో రెండు నెలలపాటు టీచర్లు ఇదే హడావిడిలో ఉంటారు. చాలామంది పోలింగ్ విధులకు వెళ్లాల్సి ఉంటుంది. వారికి కొన్ని రోజులపాటు శిక్షణ ఇస్తారు. వీటితో బోధన జరిగేందుకు వీలుకాని పరిస్థితి ఉంటుందని టీచర్లు చెబుతున్నారు. అదీగాక, చాలాచోట్ల సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. ఇతర స్కూళ్ల నుంచి సర్దుబాటు చేయడంలో అధికారులు జాప్యం చేశారని టీచర్లు ఆరోపిస్తున్నారు. కాబట్టి వందశాతం సిలబస్ పూర్తి చేయడంపై వారు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది టెన్త్ పబ్లిక్ పరీక్షలపై ఇవన్నీ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. వాస్తవాలు ఇలా ఉంటే తమనే బాధ్యులను చేయడమేంటని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఏకపక్ష నిర్ణయం తీసుకుంటే ప్రతిఘటన తప్పదని హెచ్చరిస్తున్నారు. -
Bathukamma: తెలంగాణ పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)
-
ప్రపంచంతో పోటీ పడండి
సాక్షి, అమరావతి: ప్రపంచంతో పోటీపడితేనే మన బతుకులు మారతాయని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. పేదరికం సమసిపోవాలంటే దానికి విద్య ఒక్కటే మార్గమని తెలిపారు. ఐక్యరాజ్యసమితి సదస్సులో పాల్గొనడానికి 10 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు గతనెలలో 15 రోజులపాటు అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారంతా సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘అమెరికా పర్యటన ద్వారా గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పైకి వెళ్లడానికి మీకు ఆ అనుభవాలు ఉపయోగపడతాయి. ప్రపంచస్థాయికి ఎదగాలన్న కోరిక మీకు మరింత గట్టిపడుతుంది. ఈ పర్యటన మీ మనసులో ఒక ముద్ర వేస్తుంది. ప్రపంచం ఎలా ఉంది? మనం ఎక్కడ ఉన్నాం? ఎంత వెనుకబడి ఉన్నాం? అనేది అర్థమవుతుంది. ప్రపంచం వేగంగా పరుగులు తీస్తోంది. మనం చాలా వెనుకబడి ఉన్నాం.. ప్రపంచంతో మనం పోటీపడి నిలబడాలి. అప్పుడే మన బతుకులు మారతాయి. ఇందుకు చదువు ఒక్కటే సాధనం’ అని విద్యార్థులకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. విద్య అనే సాధనం ద్వారా పెద్ద పెద్ద కలలను కనాలని సూచించారు. ఆ కలల నుంచే వాస్తవాలు సాకారం అవుతాయన్నారు. ఇప్పటి నుంచే తెలుసుకోవాలి.. విద్యార్థులు చూసిన కొలంబియా యూనివర్సిటీ లాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 350 కాలేజీల్లో 21 కోర్సుల్లో సీటు సాధిస్తే ప్రభుత్వమే చదివిస్తుందని సీఎం జగన్ విద్యార్థులకు భరోసా ఇచ్చారు. సంబంధిత కాలేజీల్లో ఫీజులు రూ.80 లక్షల నుంచి రూ.1 కోటి వరకూ ఉంటాయన్నారు. వీటిలో సీటు తెచ్చుకుంటే జగనన్న విదేశీ విద్యాదీవెన ద్వారా రూ.1.25 కోట్ల వరకు ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. ‘సీఈవో వంటి స్థాయికి వెళ్లాలంటే ప్రతిభ, నైపుణ్యం ఉండాలి. మనం చదివే చదువులవల్లే ఇవి వస్తాయి. ప్రపంచ అత్యుత్తమ కాలేజీల్లో చదువుకోవడం ద్వారా మీ నైపుణ్యానికి మంచి గుర్తింపు లభిస్తుంది. అప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీలు మీకు మంచిస్థానాల్లో ఉద్యోగాలు కల్పిస్తాయి. తద్వారా మీ జీవితాలు మారతాయి. అలాంటి కాలేజీల్లో విద్యాభ్యాసం కోసం, సీటు సాధించేందుకు మీరు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి’ అని సీఎం జగన్ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ‘మీకు ఆసక్తి ఉన్న కోర్సు ఏంటి? ప్రపంచంలో ఈ కోర్సును అందిస్తున్న అత్యుత్తమ కాలేజీలు ఎక్కడ ఉన్నాయి?’ అనేది ఇప్పటి నుంచే తెలుసుకోవాలని సూచించారు. ఆ కాలేజీల్లో సీటు రావాలంటేం ఏయే పరీక్షల్లో ఎన్ని మార్కులు రావాలో కూడా తెలుసుకోవాలన్నారు. జీమ్యాట్, జీఆర్ఈ, టోఫెల్ వంటి పరీక్షలు ఏమున్నాయో.. వాటికి ఎలా సన్నద్ధం కావాలో తెలియాలన్నారు. జీఆర్ఈ, జీమ్యాట్‌లకు కూడా ఉచిత శిక్షణ టోఫెల్‌కు ఎలా తీసుకువచ్చామో.. అలాగే జీఆర్ఈ, జీమ్యాట్‌లకు కూడా మెటీరియల్, ఉచిత శిక్షణను విద్యార్థులకు అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. విదేశీ విద్యాదీవెన ద్వారా సీటు సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని విద్యార్థులకు సూచించారు. కొలంబియా యూనివర్సిటీ, వార్టన్, ఎల్ఎస్ఈ, ఇన్సీడ్.. ఇలాంటి యూనివర్సిటీలు, కాలేజీలు 350 ఉన్నాయని.. వీటిలో సీటు సాధించాలని హితబోధ చేశారు. ఆ కాలేజీల్లో కోర్సులు పూర్తి చేశాక విద్యార్థుల జీవితాల్లో మంచి మార్పులు వస్తాయన్నారు. ఇది సాకారమైతే మీ, మీ కుటుంబాల బతుకులు మారడమే కాకుండా రాష్ట్ర ప్రతిష్టను కూడా పెంచినవారవుతారన్నారు. అంతేకాకుండా మీ స్థాయిలో మరో పది మందికి సహాయపడొచ్చని విద్యార్థులకు సీఎం హితబోధ చేశారు. విద్యార్థులకు మార్గనిర్దేశం చేసేందుకు ఓ ఐఏఎస్ అధికారిని నియమించాలని అధికారులను ఆదేశించారు. ‘ఇక్కడున్న ఈ పిల్లలు చిన్నప్పుడు ట్రిపుల్ ఐటీలో సీటు సాధించాలని కలలు కని ఉంటారు.. చాలా మందికి సీట్లు వచ్చాయి. ఆ విజన్ అక్కడితో పూర్తయ్యింది. ఇప్పుడు ట్రిపుల్ ఐటీ నుంచి తర్వాత ఎక్కడికి అనేది విజన్ కావాలి’ అని సీఎం పేర్కొన్నారు. పాఠ్య ప్రణాళికలోకి 1,800 సబ్జెక్టులు మన పాఠ్యప్రణాళికలో లేని 1,800 సబ్జెక్టులను పాఠ్యప్రణాళికలోకి తెస్తున్నామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఎంఐటీ, హార్వర్డ్ వంటి యూనివర్సిటీ నిపుణులతో తయారు చేయించిన సబ్జెక్టులను మన విద్యార్థులకు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎడెక్స్‌తో ఒప్పందం జరిగిందని గుర్తు చేశారు. ఈ కోర్సులు చేసిన వారికి జాయింట్ సర్టిఫికేషన్ కూడా లభిస్తుందన్నారు. ఈ కోర్సులు నేర్చుకోవాలని.. దీనివల్ల ఉపయోగం ఉంటుందని విద్యార్థులకు సూచించారు. ‘మీరు ఇలా విదేశాలకు వెళ్లి బయటి ప్రపంచం చూసినప్పుడు మరింత కష్టపడాలన్న స్ఫూర్తి మీలో కలుగుతుంది. ఈ పర్యటన మీకు మాత్రమే కాకుండా, మీ వల్ల ఇతరులకు కూడా స్ఫూర్తి కలిగిస్తుంది. ఒక స్థాయిలో ఉన్న మనం బాగా కష్టపడటం ద్వారా మరో స్థాయికి చేరుకుంటాం. మన కష్టమే మనల్ని పై స్థానాలకు తీసుకెళుతుంది. మీ అందరికీ అభినందనలు’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. పర్యటన ఎలా జరిగింది? అమెరికాలో పర్యటించిన విద్యార్థులు శివలింగమ్మ, చంద్రలేఖ, గణేశ్, జ్యోత్స్న, రాజేశ్వరి, గాయత్రి, రిషితారెడ్డి, యోగీశ్వర్, షేక్ అమ్మాజాన్, మనస్వినిలతోపాటు వారి తల్లిదండ్రులను అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు పరిచయం చేశారు. ఐక్యరాజ్యసమితి, వరల్డ్ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), కొలంబియా యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్‌లో విద్యార్థులు పాల్గొన్నారని వివరించారు. ‘ఆణిముత్యాలు’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన 126 మంది విద్యార్థులను గుర్తించి వారికి పోటీపరీక్ష నిర్వహించామని తెలిపారు. విద్యార్థుల భాషా పరిజ్ఞానాన్ని పరిశీలించి అమెరికా పర్యటనకు 10 మందిని ఎంపిక చేశామని సీఎంకు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం.. అమెరికా పర్యటన ఎలా జరిగిందో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్, పాఠశాలల మౌలిక వసతుల కమిషనర్ కాటమనేని భాస్కర్, సమగ్రశిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు, మధ్యాహ్న భోజనం డైరెక్టర్ నిధి మీనా, ఉత్తర అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్, ఐక్యరాజ్యసమితి సభ్యులు ఉన్నవ షకిన్ కుమార్, మంగ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. అదృష్టంగా భావిస్తున్నా.. ఇంత చిన్న వయసులో అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా. నేను మహిళా సాధికారత, బాలికా విద్యపై ప్రసంగించాను. మీ విజన్ వల్ల ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. మాకు చక్కటి అవకాశం కల్పించారు.. థ్యాంక్యూ సార్. – రాజేశ్వరి, విద్యార్థిని అంతర్జాతీయ వేదికలపై మాట్లాడే అవకాశమిచ్చారు.. మాకు అంతర్జాతీయ వేదికలపై మాట్లాడే అవకాశం కల్పించారు. విద్యా వ్యవస్థలో మీరు తీసుకొచ్చిన మార్పులన్నీ వివరించాం. మేం విమానం ఎక్కుతామని కలలో కూడా అనుకోలేదు.. కానీ మీరు సాధ్యం చేశారు. మీరు చెప్పిన ‘వన్ చైల్డ్.. వన్ టీచర్.. వన్ పెన్.. వన్ బుక్.. కెన్ చేంజ్ ద వరల్డ్’ మాటకు తిరుగులేదు.. మీ నమ్మకాన్ని నిలబెడతాం సార్. – అల్లం రిషితారెడ్డి, విద్యార్థిని యూఎన్వోను మీ వల్ల నిజంగా చూడగలిగా.. నేను యూఎన్వో గురించి సోషల్ బుక్స్‌లో చదువుకున్నాను. దాన్ని మీ వల్ల నిజంగా చూడగలిగాను. థ్యాంక్యూ సార్. ఏపీలో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా అందుతుందనేది నేను అమెరికాలో వివరించాను. – వంజివాకు యోగీశ్వర్, విద్యార్థి ప్రపంచంతో పోటీపడే స్థాయిలో నిలబెట్టారు.. కొలంబియా యూనివర్సిటీలో జరిగిన ఎకో అంబాసిడర్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నా. డిజిటల్ ఎడ్యుకేషన్ వంటి అనేక అంశాలపై మాట్లాడాను. అక్కడంతా ఆశ్చర్యపోయారు. మేం ఈ రోజు ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో నిలబెట్టారు. – సామల మనస్విని, విద్యార్థిని మీ గొప్ప ఆలోచన వల్లే.. విద్యావ్యవస్థలో చాలా మంచి మార్పులు తెచ్చారు. మీ గొప్ప ఆలోచన వల్లే ఇదంతా సాధ్యమైంది. ఈ రోజు మన రాష్ట్రం గొప్ప స్థాయిలో ఉందంటే అది మీ వల్లే. థ్యాంక్యూ సీఎం సార్. – షేక్ అమ్మాజాన్, విద్యార్థిని -
అవగాహనే అస్త్రం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కల్పిస్తోంది. దశాబ్దాలుగా ప్రకటనలకే పరిమితమైన ‘స్కూల్ కన్జ్యూమర్ క్లబ్’లను ప్రస్తుత వైఎస్ జగన్ సర్కార్.. ప్రతి ప్రభుత్వ స్కూల్లోనూ ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే 8, 9 తరగతుల విద్యార్థులతో దాదాపు 6 వేలకు పైగా వినియోగదారుల క్లబ్‌లను ఏర్పాటు చేయించింది. ఒక్కో క్లబ్లో కనీసం 100 మంది విద్యార్థులను భాగస్వాములను చేస్తూ.. సుమారు 6 లక్షల మందిని వినియోగదారుల హక్కుల పరిరక్షకులుగా తీర్చిదిద్దబోతోంది. విద్యార్థులే వినియోగదారులుగా తమ హక్కులను అర్థం చేసుకోవడంతో పాటు వాటిని తమ కుటుంబసభ్యులకు, గ్రామాల్లోని నిరక్షరాస్యులకు, తోటి విద్యార్థులకు బోధించేలా ప్రభుత్వం ఈ క్లబ్‌లకు రూపకల్పన చేసింది. వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు దోపిడీకి గురికాకుండా సమగ్ర పరిజ్ఞానాన్ని అందిస్తోంది. ఇప్పటికే జిల్లాకు ఇద్దరు మాస్టర్ ట్రైనర్లను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చింది. ఈ మాస్టర్ ట్రైనర్లు రాష్ట్రంలోని అన్ని క్లబ్‌ల టీచర్ గైడ్లకు దశలవారీగా, క్రమం తప్పకుండా శిక్షణ ఇవ్వనున్నారు. పుస్తకాలు, వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా వినియోగదారుల హక్కులకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందిస్తున్నారు. ఇందులో భాగంగానే ‘మేము సైతం’ పేరుతో శిక్షణ మాడ్యూల్ పుస్తకాన్ని వెలువరించారు. త్వరలోనే వినియోగదారుల హక్కుల పరిజ్ఞానాన్ని పంచుకోవడానికి, క్లబ్‌లు చేపట్టిన కార్యకలాపాలను అప్లోడ్ చేయడానికి వీలుగా ప్రత్యేక యాప్ అందుబాటులోకి రానుంది. క్లబ్‌ల కార్యక్రమాల ఆధారంగా అవార్డులతో విద్యార్థులను ప్రోత్సహిస్తారు. పోస్టర్లతోనూ విస్తృత ప్రచారం వినియోగదారుల హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పిం చేలా 10 రకాల పోస్టర్లతో కూడా ప్రభుత్వం విస్తృత ప్రచారం నిర్వహించనుంది. వస్తువు కొనుగోలులో వినియోగదారులకు ఉండే హక్కులు, బాధ్యతలు, ఎల్పీజీ గ్యాస్, పెట్రోల్ బంకుల్లో పొందే హక్కులు, విత్తనాలు, ఎరువుల కొనుగోలుపై అవగాహన, సమస్య వస్తే వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేసే విధానం, బిల్లు ఆవశ్యకత తదితర అంశాలను వివరించనుంది. అలాగే వినియోగదారుల హక్కుల పరిరక్షణ అంశాలతో ‘మేలు కొలుపు’ పేరుతో మాస పత్రికను కూడా ప్రచురిస్తోంది. నెలకు సుమారు 9 వేల కాపీలను విడుదల చేస్తుండగా వీటిని వినియోగదారుల క్లబ్‌లకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాల్లో వినియోగదారుల అవగాహన కార్యక్రమాల నిర్వహణకు జాయింట్ కలెక్టర్లను నోడల్ అధికారులుగా నియమించారు. విద్యార్థులతోనే చైతన్యం.. ఏదైనా ఒక వస్తువును కొనుగోలు చేసినప్పుడు లేదంటే సేవను పొందేటప్పుడు వినియోగదారుడికి చట్టం కొన్ని హక్కులు కల్పిం చింది. వీటి ద్వారా మోసాల నుంచి కొనుగోలుదారుడు తనను తాను రక్షించుకోవచ్చు. కానీ, ఎన్నో ఏళ్లుగా వినియోగదారులు తమ హక్కులు తెలుసుకోవడంలో వెనుకబడిపోయారు. అందుకే ప్రభుత్వం పాఠశాల విద్య దశలోనే ఈ అంశంపై సమగ్ర అవగాహన కల్పిం చేందుకు కృషి చేస్తోంది. విద్యార్థుల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావచ్చు. అందుకే సమస్య వస్తే వినియోగదారుడు ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఫిర్యాదు చేయాలో తెలియజేయడంతో పాటు మోసపోకుండా సంపూర్ణ అవగాహన కల్పిస్తున్నాం. – హెచ్.అరుణ్ కుమార్, వినియోగదారుల వ్యవహారాలు, పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో సెక్రటరీ -
5వ తరగతి వరకు స్మార్ట్‌టీవీలతో పాఠాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందించడం ద్వారా వారిని ప్రపంచ స్థాయిలో పోటీపడేలా తీర్చిదిద్దాలని సర్కార్ సంకల్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం వారికి డిజిటల్ బోధనను అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా తొలి దశ నాడు–నేడు స్కూళ్లలో 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు 30,213 తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్‌పీ)లను అమర్చింది. అలాగే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు స్కూళ్లలో 10,038 స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేసింది. తరగతి గదుల డిజిటలైజేషన్లో భాగంగా.. ఇక ఇప్పుడు నాడు–నేడు కింద రెండో దశ స్కూళ్లలో కూడా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, స్మార్ట్ టీవీల ఏర్పాటు చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా 1 నుంచి 5వ తరగతి వరకు డిజిటలైజేషన్లో భాగంగా తరగతి గదుల్లో 28,014 స్మార్ట్ టీవీల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. 65 ఇంచులు గల స్మార్ట్ టీవీల కొనుగోలుకు ఓపెన్ కాంపిటీటివ్ బిడ్స్ పద్ధతిలో టెండర్లను ఆహ్వానించాలని విద్యా శాఖ నిర్ణయించింది. వీటి కొనుగోలుకు రూ.100 కోట్ల కన్నా ఎక్కువ వ్యయం అవుతుండటంతో నిబంధనల మేరకు ఓపెన్ కాంపిటీటివ్ బిడ్ టెండర్ డాక్యుమెంట్‌ను జ్యుడిíÙయల్ ప్రివ్యూకు పంపింది. ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 9 వరకు సమర్పించడానికి గడువు విధించింది. అనంతరం జ్యుడిషియల్ ప్రివ్యూ సూచనల మేరకు ఓపెన్ కాంపిటీటివ్ బిడ్ల కోసం టెండర్లను ఆహ్వానించనుంది. లోపాలుంటే 24 గంటల్లోపే పరిష్కారం 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రతి 60 మంది పిల్లలకు ఒక స్మార్ట్ టీవీ ఏర్పాటు చేసి వాటి ద్వారా బోధించనున్నారు. డిసెంబర్ నాటికల్లా వీటి ఏర్పాటు పూర్తి చేయనున్నారు. స్కూళ్లకు స్మార్ట్ టీవీలను తీసుకువచ్చి అమర్చిన నాటి నుంచి ఐదేళ్ల వారంటీ ఉండాలనే నిబంధనను ప్రభుత్వం విధించింది. స్మార్ట్ టీవీలను సరఫరా చేసిన తరువాత నెల రోజుల్లోనే వాటి పనితీరులో లోపాలున్నా, సంతృప్తికరంగా పనిచేయకపోయినా వాటి స్థానంలో కొత్తవి అమర్చాల్సి ఉంటుంది. అలాగే వాటిలో ఏమైనా లోపాలుంటే.. ఫిర్యాదు చేసిన 24 గంటల్లోగా పరిష్కరించాలి. ఒకవేళ స్మార్ట్ టీవీ కొత్తది అమర్చాలంటే మూడు రోజుల్లోపే అమర్చాలనే నిబంధన విధించింది. అదేవిధంగా సేవల కోసం కాల్ సెంటర్ నంబర్‌ను ఏర్పాటు చేయనున్నారు. -
CM's Breakfast Scheme: సీఎం అల్పాహారంలో ఇడ్లీ సాంబార్, పూరీ కుర్మా కూడా!
సాక్షి, హైదరాబాద్: సాంబార్ ఇడ్లీ, పూరీ–ఆలూ కుర్మా, ఉప్మా, వెజిటబుల్ పలావ్, ఉగ్గాని.. ఇలా సర్కార్ బడులలో విద్యార్థులకు ఉచితంగా.. వేడి వేడిగా రోజుకో అల్పాహారం అందించేలా మెనూ ఖరారయ్యింది. శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముఖ్యమంత్రి అల్పాహారం’ పథకం ప్రారంభించేందుకు అధికా రులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. మహేశ్వరం మండలం రావిర్యాల ప్రభుత్వ పాఠశాలలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. సీఎం కేసీఆర్‌కి బదులు.. మంత్రి హరీశ్‌రావు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని అధికార వర్గాలు తెలిపాయి. ఇక రాష్ట్రంలోని ప్రతి నియోజక వర్గంలో ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు అల్పాహార పథకం ప్రారంభిస్తారు. విద్యార్థులను బడికి రప్పించడం, వారికి తగిన పౌష్టికాహారం అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 27,147 పాఠశాలల్లో 1–10వ తరగతి వరకు చదివే 23 లక్షల మంది విద్యార్థులకు దీనివల్ల ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం చెబుతోంది. పాఠశాల ప్రారంభానికి 45 నిమిషాల ముందే విద్యార్థులకు అల్పాహారం అందించనున్నారు. హెచ్ఎంలకు నిర్వహణ బాధ్యత రాష్ట్ర విద్యాశాఖ, పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో అమలయ్యే ముఖ్యమంత్రి అల్పాహారం పథకాన్ని తొలుత నియోజకవర్గానికి ఒకటీ రెండు పాఠశాలల్లో లాంఛనంగా ప్రారంభిస్తారు. దసరా నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠ శాలల్లో పూర్తి స్థాయిలో అమలు చేస్తారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను, మెనూను విద్యా శాఖ వెల్లడించింది. ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రభుత్వం అమలు తీరును పర్యవేక్షించేందుకు ప్రత్యేక ట్రాకింగ్ మొబైల్ యాప్‌ను కూడా రూపొందించింది. అన్ని రకాల విటమిన్స్ లభించే పౌష్టికాహారంతో రోజుకో రకమైన బ్రేక్‌ఫాస్ట్ ఉంటుందని అధికారులు తెలిపారు. పథకం నిర్వహణ బాధ్యత సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యా యులపైనే పెట్టారు. మండల నోడల్ అధికారి మండల స్థాయిలో, జిల్లా విద్యాశాఖాధికారి జిల్లా స్థాయిలో, పాఠశాల విద్య శాఖ రాష్ట్ర స్థాయిలో పథకం అమలు తీరును పర్యవేక్షిస్తుంది. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, స్థానిక సంస్థల అధికారులకు అల్పాహారం అందుతున్న తీరును పర్యవేక్షించే అధికారాలు ఇచ్చారు. బ్రేక్‌ఫాస్ట్ అందించే వేళలివే..: మధ్యాహ్న భోజనం పథకం కార్మికులే అల్పాహారం తయారు చేస్తారు. హైదరాబాద్, సికింద్రాబాద్ మినహా రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక పాఠశాలు ఉదయం 9.30 మొదలవుతాయి. ఆయా చోట్ల ఉదయం 8.45 గంటలకు విద్యార్థులకు అల్పాహారం అందిస్తారు. జంటనగరాల్లో ప్రైమరీ స్కూళ్ళు ఉదయం 8.45 గంటల నుంచి మొదలవుతాయి. దీనివల్ల ఈ స్కూళ్ళలో ఉదయం 8 గంటలకే బ్రేక్‌ఫాస్ట్ ఇస్తారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 8.45 గంటలకు, జంటనగరాల్లో ఉదయం 8 గంటలకు అల్పాహారం అందిస్తారు. ఆరు రోజులు..ఆరు రకాలు సోమవారం: ఇండ్లీ సాంబార్ లేదాపచ్చడితో కూడిన గోధుమరవ్వ ఉప్మా మంగళవారం: ఆలూ కుర్మాతో పూరీ లేదా టమాటో బాత్ సాంబార్‌తో బుధవారం: సాంబార్ ఉప్మా లేదా చట్నీతో కూడిన బియ్యం రవ్వ కిచిడీ గురువారం: మిల్లెట్స్ ఇడ్లీ విత్ సాంబార్ లేదా సాంబార్‌తో పొంగల్ శుక్రవారం: ఉగ్గానీ, పోహా,మిల్లెట్ ఇడ్లీ విత్ చట్నీలో ఏదో ఒకటి లేదా గోధుమరవ్వ కిచిడీ చట్నీతో శనివారం: సాంబార్‌తో పొంగల్ లేదా వెజిటబుల్ పలావ్, రైతా, ఆలూకుర్మా డ్రాపౌట్లు తగ్గిస్తుంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు పౌష్టికా హారం అందించే ఈ పథకం విద్యార్థుల డ్రాపౌట్ల (బడి మానేవారి సంఖ్య)ను తగ్గిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి తెలిపారు. పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే రూ.672 కోట్లు తన వాటాగా ఖర్చు చేస్తోందన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మధ్యాహ్న భోజన పథకం కింద సన్న బియ్యంతో కూడిన భోజనం, వారానికి మూడు గుడ్లను అందిస్తున్నామని తెలిపారు. ఐరన్, సూక్ష్మ పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించే ఉద్దేశంతో రూ. 32 కోట్లు వెచ్చించి రాగి జావను ఇస్తున్నామని చెప్పారు. – మంత్రి సబితా ఇంద్రారెడ్డి -
‘అల్పాహారం’ ఎలా?.. మెనూ తేల్చకుండానే అమలుకు సన్నద్ధం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ‘అల్పాహారం’ అమలు విధివిధానాల ఖరారు, మెనూపై ఓ స్పష్టత రాకముందే ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలన్న ఆదేశాలతో అధికారుల్లో హడావుడి మొదలైంది. వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని దసరా రోజు ప్రారంభిస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అయితే వచ్చేవారం ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఈ పథకాన్ని ఈ నెల 6నే మొదలుపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రంగారెడ్డిజిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల నుంచి సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అయితే విద్యార్థులకు ఏ రోజు ఏం ఇవ్వాలనే దానిపై అధికారులు స్పష్టతకు వచ్చినట్టు లేదు. మెనూపై రూపొందించిన నివేదికపై ఈవారం మంత్రి సబితతో సంప్రదింపులు జరపాలని భావించారు. మార్పులు చేర్పులపై అధికారుల్లో నూ తర్జనభర్జన జరుగుతోంది. దీంతోపాటు అల్పాహారం అమలుకు విధి విధానాలు, ఏ అధికారులకు ఏ తరహా బాధ్యతలు అప్పగించాలనే దానిపై విద్యా శాఖ ఇంకా ఓ స్పష్టతకు రాలేదు. కార్యక్రమాన్ని హడావుడిగా ప్రారంభించినా, కొద్దిరోజుల పాటు అమలు మాత్రం కష్టమేనని అధికారులు అంటున్నారు. దీనిపై వివరణ కోరేందుకు విద్యాశాఖ ఉన్నతాధి కారులను సంప్రదించగా, వారు నిరాకరించారు. చదవండి: ‘కానిస్టేబుల్’ తుది ఫలితాల వెల్లడి