
మూడు స్కూళ్లలో పిల్లలు నిల్..
రోజూ విధులకు హాజరై ఖాళీగా కూర్చొని వెళ్తున్న టీచర్లు
గార్ల: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని మూడు ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు రాక పోవడంతో ఉపాధ్యాయులు విధులకు హాజరై ఖాళీగా కూర్చొని వెళ్లిపోతున్నారు.
వెంకటాపురం తండా, సర్వన్ తండా, కేళోత్ తండాలోని ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలలను గురువారం ‘సాక్షి’ సందర్శించింది. మూడింటి లోనూ ఒక్క విద్యార్థి కూడా పాఠశాలకు రాలేదు. తండాల్లోని ఇంటింటికీ తిరిగి తమ పిల్ల లను పంపాలని కోరు తున్నా.. తల్లిదండ్రులు మాత్రం గార్లలోని ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారని ఉపా ధ్యాయులు పేర్కొన్నారు.