Mahabubabad District
-
ఎంతటి దుర్భర పరిస్థితి.. 118 మంది ఒకటే బాత్రూం
మహబూబాబాద్ అర్బన్: ఈ పాఠశాలలో మొత్తం 250 మంది విద్యార్థులు.. అందులో 132 మంది బాలురు.. బాలికలు 118 మంది.. కానీ ఉన్నది ఒక్కటే మూత్రశాల. బాలురకు చెరువు కట్టే దిక్కు కాగా, బాలికలు ఒకరి తరువాత ఒకరు క్యూలైన్ కట్టాల్సిందే. ఇదేదో మారుమూల గ్రామంలో కాదు.. జిల్లా కేంద్రం పరిధిలోని ఓ ఉన్నత పాఠశాలలో దుస్థితి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఈదులపూసపల్లి పరిధి ఒకటో వార్డులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలికలు, బాలురకు కలిపి ఒకే మూత్రశాల ఉంది. గతంలో నిర్మించిన మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకోవడంతో నిరుపయోగంలో ఉన్నాయి.బహిర్భూమికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఇంటికి పోవాల్సిందే. మగపిల్లలు సమీపంలోని చెరువుకట్టకు వెళ్తుండగా, బాలికలు క్యూలైన్లో నిలబడి మూత్రశాలకు వెళ్లాల్సిన దయనీయ పరిస్థితి. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలో నూతన మరుగుదొడ్లు నిర్మించాలని, లేకపోతే తమ పిల్లలకు టీసీలు ఇవ్వాలని ఉపాధ్యాయులపై ఒత్తిడి చేస్తున్నారు. పలుమార్లు విద్యాశాఖ అధికారులకు, స్థానిక ఎమ్మెల్యేకు వినతిపత్రాలు ఇచ్చామని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. -
కేటీఆర్ ఫ్లెక్సీలను చించేసిన గుర్తుతెలియని వ్యక్తులు
-
నేడు మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ మహా ధర్నా
మహబూబాబాద్: లగచ ర్ల బాధితులకు అండగా సోమవారం మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ దళిత, గిరిజన రైతులతో కలసి మహా ధర్నా నిర్వహించనుంది. మహబూబాబాద్ తహసీల్దార్ కార్యాల యం ఎదుట ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్ర మం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పా ర్టీ కార్యాలయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ తదితరులు మీడియాతో మాట్లాడారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్న సీఎం రేవంత్‌రెడ్డిలో మార్పు రావాలని, ఆయనలో మార్పు వచ్చేవరకూ వదిలి పెట్టమని ఎర్రబెల్లి అన్నారు.ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వందకుపైగా సీట్లతో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. లగచర్ల రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేసి, వారిని విడుదల చేయాలని, ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. సీఎం సొంత గ్రామంలో ఆయన కుటుంబ సభ్యుల కారణంగా మాజీ సర్పంచ్ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ తలపెట్టిన మహాధర్నాకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నారని తెలిపారు.ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ పోలీసులు సంఘవిద్రోహ శక్తులను ముందే అరెస్ట్ చేసి ధర్నాకు ఆటంకం కలగకుండా చూడాలని కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ ధర్నాకు అనుమతి విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్‌కు చెంప పెట్టులాంటిందన్నారు. అనంతరం ధర్నా జరిగే ప్రాంతాన్ని నాయకులు పరిశీలించారు. -
రైతు ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
-
బీఆర్ఎస్ మహబూబాబాద్ ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: గిరిజనులు, దళితులపై జరిగిన దాడికి నిరసనగా మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ తలపెట్టిన గిరిజన రైతు ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 25న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అనుమతిస్తూ.. ధర్నాలో వెయ్యి మంది మాత్రమే పాల్గొనాలని షరతు విధించింది.అయితే, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గిరిజన రైతు ధర్నా ఇవాళ చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించిన సంగతి తెలిసిందే.. కానీ పోలీసులు అనుమతించకపోవడంతో గిరిజన రైతు ధర్నాకు అనుమతి ఇవ్వాలంటూ బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. ధర్నాకు అనుమతినిస్తూ హైకోర్టు పచ్చజెండా ఊపింది. -
మహబూబాబాద్ లో BRS తలపెట్టిన ధర్నాకు అనుమతి నిరాకరణ
-
బీఆర్ఎస్కు షాకిచ్చిన పోలీసులు.. కేటీఆర్ పర్యటన వాయిదా
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ తలపెట్టిన ధర్నాకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. మరోవైపు.. శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని అనుమతి నిరాకరించడంతో బీఆర్ఎస్ కూడా ధర్నా వాయిదా వేసుకుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్.. మహబూబాబాద్ పర్యటనను వాయిదా వేసుకున్నారు.గిరిజన, దళిత, పేద రైతులపై దాడికి నిరసగా మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ నేతలు ధర్నాకు పిలుపునిచ్చారు. కాగా, బీఆర్ఎస్ ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో వెంటనే రైతు మహాధర్నాకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మహబూబాబాద్ ఎస్పీ క్యాంపు కార్యాలయం ముందు బీఆర్ఎస్ నాయకులు బుధవారం రాత్రి ధర్నాకు దిగారు.అయినప్పటికీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ రైతు మహా ధర్నాకు కేటీఆర్ కూడా హాజరు కావాల్సి ఉండగా పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో పర్యటనను రద్దు చేసుకున్నారు. మరోవైపు.. ఈరోజు మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా పోలీసులు 144 సెక్షన విధించినట్టు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. నిమిషానికి నలభైసార్ల KCR రావాలే అని తెగ ఒర్లుతావు! అసెంబ్లీలో KCR ముందు నుంచునే మాట దేవుడెరుగు…కనీసం మహబూబాబాద్ లో మహాధర్నా కు అనుమతిచ్చేందుకు ధైర్యం సరిపోవట్లేగా చిట్టినాయుడు?!— KTR (@KTRBRS) November 20, 2024 -
ఔషధాల కొండ.. కందికొండ గుట్ట
కురవి: దేశంలో పూర్వకాలంలో ఆయుర్వేద వైద్యం విరాజిల్లింది. ప్రకృతిలో లభించే వనమూలికలు, ఔషధమొక్కలతో పలు రకాల రోగాలను నయం చేసేవారు. ప్రస్తుతం ఆయుర్వేద వైద్యం మనుగడలోకి వస్తోంది. వన మూలిక మొక్కలు ప్రకృతిలో ఎక్కువగా కొండలు, గుట్టల్లో లభిస్తాయి. అలాంటి ఔషధ మొక్కలకు మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కందికొండ గుట్ట నిలయంగా పేరుగాంచింది. మునులు తపస్సు చేసిన ప్రాంతం కందికొండపై ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. కొండపైకి నడక దారి, మార్గమధ్యలో గుహలు, పైన దేవాలయం, కోనేర్లు ఉన్నాయి. ఈ క్షేత్రంలో పూర్వం కపిలవాయి మహాముని, స్కంద మహాముని వంటి వారు తపస్సులు చేసినట్లు చరిత్ర చెబుతోంది. అయితే అప్పటి నుంచి ఈ కొండపై తపస్సుకు వినియోగించే మొక్కలతో పాటు, వైద్యం చేసేందుకు ఉపయోగపడే ఔషధ మొక్కలు కూడా పెంచినట్లు చరిత్ర చెబుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొండ పరిసర ప్రాంతాలకు వెళ్లగానే ఏదో అనుభూతి, ప్రత్యేకమైన సువాసన వెదజల్లుతోందని స్థానికులు చెబుతారు. మూలికల సేకరణ.. గుట్టపై పెద్ద కందిచెట్టు ఉండేదని, అందుకే ఇది కందికల్ గుట్టగా చరిత్రలో లిఖించి ఉందని పూర్వికులు చెబుతుంటారు. కొండ అనేక వనమూలికలకు ప్రసిద్ధి అని, ఇక్కడికి సాధువులు, కోయ గిరిజనులు, ఆయుర్వేద వైద్యులు వచ్చి వనమూలికలు, ఔషధ మొక్కలను తీసుకెళ్తుంటారని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికీ కొంత మంది కోయ జాతికి చెందిన గిరిజనులు వచ్చి మొక్కలను తీసుకెళ్తుంటారని చెబుతుంటారు.గుట్ట ఎక్కుతుంటే మధ్యలో భోగం గుడి ఎదురుగా రెండు కోనేర్లు ఉంటాయి. అందులో అనేక ఔషధమొక్కలు కనిపిస్తుంటాయి. గుడి ముందు మరో కోనేరు ఉంటుంది. ఈ కోనేటిలో స్నానాలు ఆచరించడం వల్ల రోగాలు నయమవుతాయని నమ్మకం. అయితే కార్తీక పౌర్ణమితోపాటు, ఇతర శుభ దినాల్లో మూలికలను సేకరిస్తే మంచి ఫలితం ఉంటుందని సాధువులు చెబుతారు. అందుకోసమే తెలంగాణ ప్రాంతంలోని జంగాలు ఈ ప్రాంతం నుంచి ఔషధ మొక్కలు, వన మూలికలు సేకరించి తయారు చేసిన ఆయుర్వేద మందులు చెన్నై, ముంబై, సింగపూర్, ఢిల్లీ వంటి ప్రాంతాలతో పాటు ఇతర దేశాలకు వెళ్లి వైద్యం చేసి వస్తారు.ఔషధ మొక్కల పేర్లు..గుట్టపై ఉన్న కోనేరులో నాలుగు రకాల మొక్కలు కనిపిస్తాయి. ఈరజడ, రక్తజడ, అంతర దామెర, మద్దెడ వీటిని గుట్ట ఎక్కిన భక్తులు తెంపుకుని తీసుకెళ్తుంటారు. ఈరజడ ఆకులను ఇంటికి తీసుకెళ్లి చిన్నారులకు ఊదు పడుతుంటారు. వీటికి తోడు రాజహంస, పరంహంస, పందిచెవ్వు చెట్టు, నల్ల ఉసిరి చెట్టు, అడవి నిమ్మ, బుర్రజమిడి, నల్లవాయిలి చెట్లు ఉన్నాయి. గుడి దగ్గర బండ పువ్వు లభిస్తుంది. అలాగే నాగసారం గడ్డ, నేల ఏను మొక్కల ఆకులను పశువులకు రోగాలు వచ్చినప్పుడు ఉపయోగిస్తారు. కొండ మామిడి చెట్టుతో కాళ్లు, చేతులు విరిగితే కట్టు కడుతుంటారు. పొందగరుగుడు చెక్క, నల్లెడ తీగలు, బురుదొండ, అడవిదొండ లాంటి మొక్కలు లభిస్తా యని గ్రామస్తులు తెలిపారు. గొర్రెలు, మేకల కు రోగాలు వస్తే న యం చేసేందుకు చే గొండ ఆకు, ఉప్పుచెక్క, ముచ్చతునక చెట్టు ఆకులను వాడుతుంటారని గొర్రెలు, మేకల పెంపకందారులు చెబుతున్నారు. అలాగే కలములక చెట్టు మనుషులకు దగ్గుదమ్ముకు, సోమిడిచెట్టు చెక్క, ఆకులు చిన్న పిల్లలకు జబ్బు చేస్తే వాడుతుంటారని చెబుతున్నారు.కార్తీక పౌర్ణమిరోజు మూలికలు సేకరిస్తారు కందికొండ గుట్టపై అనేక ఔషధ మొక్కలుంటాయి. మొక్కల కోసం ఏటా కోయ జాతి గిరిజనులు, ఆయుర్వేద వైద్యులు, సాధువులు వస్తుంటారని గ్రామంలో చర్చించుకుంటారు. కార్తీక పౌర్ణమిరోజు మూలికలు సేకరిస్తే మంచిగా పని చేస్తాయని నమ్మిక. – బి.హేమలత, కందికొండ మాజీ సర్పంచ్ప్రతీ మొక్కలో ఔషధ గుణమే కొండపైన ఉన్న ప్రతీ మొక్కకు ప్రత్యేకత ఉంది. మనం రోజువారీగా చూసే మొక్కలతోపాటు, రకరకాల మొక్కలు దొరుకుతాయి. పెద్ద పెద్ద రోగాలను కూడా నయం చేసే మొక్కలు ఇక్కడ దొరుకుతాయట. దూర ప్రాంతం నుంచి వచ్చిన వారు గొర్రెల కాపరులను తీసుకెళ్లి మొక్కలు తెస్తారు. – మెట్టు ఉప్పల్లయ్య, కందికొండఆయుర్వేద కళాశాల ఏర్పాటు చేయాలి మా ఊరు సరిహద్దులో కందికొండ గుట్ట ఉంటుంది. ఇక్కడ దొరికే ఔషధ మొక్కలు ఎక్కడ దొరకవు అంటారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న గుట్టపై ఉన్న మందు మొక్కలను పరిరక్షించాలి. దీనిని రాబోయే తరాలకు, ఆయుర్వేదంలో ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలి. ఈ ప్రాంతంలో ఆయుర్వేద కళాశాల ఏర్పాటు చేయాలి. – గాండ్ల సతీశ్, సూదనపల్లి -
నిషేధం.. నట్టింట్లో అపహాస్యం!
‘మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రానికి చెందిన దంపతులు ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో మొదటగా లింగనిర్ధారణ పరీక్షలు చేసేవారు. ఆపై కురవిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అప్పటికే ఆ ఆస్పత్రి యజమానిపై లింగనిర్ధారణ, ఆబార్షన్లు చేస్తున్నారని కేసు నమోదైంది. అయితే ఆస్పత్రి యజమాని, ఆ దంపతులు కలిసి ల్యాప్‌టాప్ సైజులో ఉన్న స్కానింగ్ మెషిన్ కొనుగోలు చేశారు. టెక్నికల్ పరిజ్ఞానం తెలిసిన ఖమ్మం పట్టణానికి చెందిన ఆర్ఎంపీతో కలిసి గిరిజన తండాలు, పల్లెల్లో స్కానింగ్ చేయడం, ఆడపిల్ల అని తేలితే అక్కడే అబార్షన్లు చేసి ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వసూళ్లు చేశారు. ఈ విషయం పసిగట్టిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. మొబైల్ స్కానింగ్, అబార్షన్ వ్యవహారాన్ని బట్టబయలు చేసి సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసి కురవి పోలీసులకు అప్పగించారు’ కామారెడ్డి జిల్లా రాజంపేటకు చెందిన ఒక ముఠా స్కానింగ్ మెషిన్‌ను ఓ గర్భిణి ఇంటికి తీసుకెళ్లి పరీక్షలు చేస్తుండగా ఇటీవల టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఆ కేసులో నలుగురిని అరెస్టు చేశారు. వీరు కొంత కాలంగా మొబైల్ స్కానింగ్ యూనిట్‌ను నిర్వహిస్తున్నారు. ఎన్ని పరీక్షలు, నిర్ధారణలు చేశారన్న విషయంపై విచారణ కొనసాగుతోంది. సాక్షి, మహబూబాబాద్: ఇప్పటి వరకు కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రత్యేకంగా స్కానింగ్ సెంటర్‌కు వెళ్లి.. నిబంధనల మేరకు పరీక్షలు చేయించుకునేవారు. కానీ ఇప్పుడు కొనిచోట్ల పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కొత్తగా వచ్చిన మొబైల్ స్కానింగ్ మెషిన్లు.. అదీ కూడా ల్యాప్‌టాప్ అంత సైజులో ఉన్నవి మార్కెట్లోకి రావడంతో అక్రమార్కుల పని సులువైంది. నాలుగైదు కేసులు ఉంటే.. లేదా చుట్టూ పక్కల తండాల్లోని గర్భిణులను ఒకచోటకు రమ్మని చెబుతున్నారు. చదవండి: స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారంబ్యాగుల్లో మెషిన్లు పెట్టుకెళ్లి అక్కడే పరీక్షలు చేసి ఆడ, మగ శిశువు అని నిర్ధారిస్తున్నారు. పరీక్షలకు ఒక్కొక్కరి నుంచి రూ.5వేలకు పైగా తీసుకుంటున్నట్టు సమాచారం. పరీక్ష తర్వాత మగశిశువు అయితే ఆ గర్భిణిని ఇంటికి పంపించడం.. ఆడశిశువు అయితే అక్కడే అబార్షన్లు కూడా చేస్తున్నట్టు తెలిసింది. ఇలా చేయడంతో పలువురు మహిళలు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడం, పెద్ద ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకొని బతికి బయటపడిన సంఘటనలు ఉన్నాయని గిరిజనులు చెబుతున్నారు. ఆయా జిల్లాల్లో ఇలా..మొబైల్ స్కానింగ్ పరికరాలతో లింగనిర్ధారణ చేసి ఆడశిశువును చంపేస్తున్న సంఘటనలు ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలోని కురవి మండలంలో మొబైల్ స్కానింగ్‌తో లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుంటే పట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో బీడీ ఖార్ఖానా ముసుగులో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ పట్టుపడ్డారు. ములుగు జిల్లా మంగపేట మండలంలో, సిద్దిపేట జిల్లా అక్కన్నపేట, ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో గర్భవిచ్ఛిత్తి కేసులు బయటపడ్డాయి. అబార్షన్ సమయంలో మహిళలు చనిపోవడం, లేదా ప్రాణాపాయస్థితికి వస్తే కానీ బయటకు రావడం లేదు. మౌనంగా అధికారులుచట్టవిరుద్ధంగా లింగనిర్ధారణ చేయడం (illegal gender test) అబార్షన్లు చేస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నా.. పలు జిల్లాల్లో వైద్యారోగ్యశాఖ అధికారులు మాత్రం మౌనంగా ఉంటున్నారు. స్కానింగ్ సెంటర్ల తనిఖీల సమయంలో పెద్దగా పట్టించుకోవడం లేదని, సెంటర్ల నిర్వాహకులు ఇచ్చే మామూళ్లతో కొందరు అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు ఈ విషయంపై స్పందించి చట్టవిరుద్ధంగా నిర్వహించే లింగనిర్ధారణ పరీక్షలను అడ్డుకోకపోతే ఆడపిల్లల రేషియో మరింత పడిపోయే ప్రమాదం ఉందని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
బడికి పోవాలంటే భయం భయం
-
రైలొస్తేనే బతుక్కి పట్టాభిషేకం
ఆ గ్రామాలు, గిరిజన తండాలన్నీ రైల్వే పట్టాల వెంబడే ఉంటాయి.. అందుకే వారి జీవన ప్రయాణం రైలు పరుగులపై ఆధారపడి ఉంటుంది. విధివంచితులు.. చిన్నతనంలోనే భర్తను కోల్పోయి.. కుటుంబ భారం మీదపడి పిల్లలను పోషించుకునేందుకు కొందరు.. జీవనోపాధి లేక మరికొందరు.. రైళ్లలో పల్లీ, బఠాణీలు, సీజన్ పండ్లు అమ్ముకొని వచ్చే ఆదాయంతో కుటుంబాలను పోషించుకుంటున్నారు. రైలు బండి నడిస్తేనే.. కుటుంబానికి తిండి దొరుకుతుంది. - సాక్షి, మహబూబాబాద్ రైలులోనే ప్రయాణం మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్, గార్ల, గుండ్రాతి మడుగు, మహబూబాబాద్, తాళ్లపూపల్లి, కేసముద్రం స్టేషన్ల పరిధిలోని తండాలతోపాటు, అటు విజయవాడ, ఇటు సికింద్రాబాద్, బల్లార్షా వరకు ఉన్న తండాల్లో మహిళలకు వ్యాపారమే ప్రధానాధారం. పండించిన పల్లీలు, తమ గ్రామాలు, తండాల పరిసరాలలో దొరికే సపోటా, ఈతపండ్లు, తాటిముంజలు, జామకాయలు ఇలా సీజన్ల వారీగా సేకరించి వాటిని విక్రయించి కుటుంబాలను పోషించుకునేందుకు గిరిజన మహిళలు రోజూ రైలులో ప్రయాణిస్తారు. ఇలా రోజూ ఉదయం ఆరు గంటలకు ప్రారంభమయ్యే వీరి ప్రయాణం రాత్రి 10 గంటల వరకు ఉంటుంది.ఒక్కోరోజు రాత్రి 12 గంటల వరకు సరుకులు అమ్ముకొని ఇంటికి వస్తారు. కొన్ని సందర్భాల్లో రైల్వేస్టేషన్లలో తలదాచుకొని మర్నాడు ఇంటికి చేరిన సందర్భాలు ఉన్నాయి. ఇలా రోజూ 200 మంది వరకు ఈ వ్యాపారం చేస్తున్నారు. రోజుకు రూ.300 నుంచి రూ.1,000 వరకు సంపాదిస్తున్నారు.గుర్తింపు కార్డులివ్వాలి.. నా భర్త 14 ఏళ్ల క్రితం చనిపోయాడు. అప్పటినుంచి పల్లీలు అమ్ముకుంటూ నాకున్న ముగ్గురు బిడ్డలు, ముగ్గురు కుమారులను కష్టపడి సాదుకుంటూ వచ్చా. పొట్టకూటి కోసం పల్లీలు అమ్ముకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నా. రైలు బండి నడిస్తేనే తిండి దొరుకుతుంది. పెద్దసార్లు దయ ఉంచి గుర్తింపు కార్డులు ఇస్తే భయం లేకుండా వ్యాపారం చేసుకుంటాం. – బానోతు హచ్చి, బడితండా, కేసముద్రం మండలంబొగ్గు బండి ఉన్నప్పటి నుంచి.. నలభయ్యేళ్లుగా రైలులో పల్లీలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చా. బొగ్గు బండి ఉన్నప్పటి నుంచి పల్లీలు అమ్మడం మొదలుపెట్టా. పల్లి గ్లాసు.. పైస నుంచి అమ్మిన. రైలులో ఎన్నోమార్లు ఆర్పీఎఫ్ అధికారులు పట్టుకున్నారు. కోర్టులో జరిమానా కట్టి వచ్చేవాళ్లం. ఆర్పీఎఫ్ అధికారులు పట్టుకున్న ప్రతిసారీ తిరిగి ఇంటికి వచ్చేసరికి అర్ధరాత్రి అయ్యేది. పొట్టకూటికోసం పల్లీలు అమ్ముకుంటూ ఇబ్బందులు పడుతూ వచ్చాం. నాకు ముగ్గురు బిడ్డలు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. పల్లీలు అమ్మి అందరి పెళ్లిళ్లు చేసిన. మగ పిల్లలను చదివించిన. – బానోతు చాంది, బడితండా, కేసముద్రంవితంతువులే అధికం మహబూబాబాద్ జిల్లాలో ఏ తండాను కదిలించినా కన్నీళ్లే ఉబుకుతాయి. గుడుంబాకు బానిసలు కావడం, తండాలను కబళించే వింత వ్యాధులతో పాతికేళ్లు నిండక ముందే మృత్యువాత పడిన మగవారు ఎక్కువగా ఉన్నారు. అప్పటికే వివాహాలు చేసుకొని ఇద్దరు, ముగ్గురు పిల్లలతో 20 ఏళ్లు కూడా నిండని భార్యపై పిల్లలు, వృద్ధ అత్తామామల భారం పడుతుంది. ఈ సంసార సాగరాన్ని దాటేందుకు రైళ్లలో వ్యాపారం చేసుకోవడం సాధారణమవుతోంది. ఇలా పల్లీలు, బఠాణీలు, పండ్లు అమ్ముకొని పిల్లలను పెద్ద చదువులు చదివించి ప్రభుత్వ కొలువుల్లో చేరి్పంచిన వారు కొందరైతే.. ఆడపిల్లల పెళ్లిళ్లు చేసి భారం తీర్చుకున్నవారు మరికొందరు ఉన్నారు. అవమానాలు.. ఆప్యాయతలు నిత్యం రైలులో ప్రయాణం చేసుకుంటూ సరుకులు అమ్మే మహిళలకు అవమానాలు.. అ ప్యాయతలు ఎదురవుతుంటాయి. టికెట్ లేదని కేసులు పెట్టి జైలుకు పంపిన రైల్వే అధికారులు ఉన్నారు. మహిళలు కావడంతో ఆకతాయిలు ఇబ్బంది పెట్టడం, సూటిపోటి మాటలు, లైంగిక వేధింపులు కూడా చవిచూడాల్సి వస్తుందని గిరిజన మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం రోజూ ప్రయాణం చేసే వారి ఆప్యాయత కూడా ఉంటుందంటున్నారు. దశాబ్దాలుగా రైలునే నమ్ముకొని జీవించే తమకు గుర్తింపు కార్డులు ఇచ్చి స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. -
TG: రెండు జిల్లాలో భీకర వర్షం.. ఈ రాత్రి ఎలా గడిచేనో..
సాక్షి, ఖమ్మం/మహబూబాబాద్: తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాల నుంచి కోలుకునేలోపే మరోసారి మహబూబాబాద్, ఖమ్మంలో శనివారం మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. కుండపోతగా కురుస్తున్న వర్షం ధాటికి ఇళ్లలోకి వరద నీరు చేరుతోంది.ఇక, శనివారం సాయంత్రం నుంచి మహబూబాబాద్ జిల్లా కేంద్రం సహా బయ్యారం మండలంలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో, జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరింది. పలు కాలనీలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. అటు.. బయ్యారంలో జగ్నతండా జల దిగ్బంధమైంది. అన్ని వైపుల నుంచి వరద చుట్టుముట్టడంతో తండాలోని ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.దీనిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాల వలన మరోసారి పెరుగుతున్న మునేరు వాగు ప్రవాహం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంటోందన్నారు. అవసరమైతే సహాయక శిబిరాలు మళ్లీ తెరవాలని అధికారులను ఆదేశించారు.జిల్లాలో లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలు వెంటనే అక్కడినుండి తరలి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలకు వెళ్లాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సూచనలను పాటించి, తగినంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత అధికారులతో సంప్రదించాలని కోరారు. అధికారులు వెంటనే అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చేవరకు, ప్రజలకు సహాయ సేవలు నిరంతరం అందుబాటులో ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. Inatensive Heavy rain in Mahabubabad bro now pic.twitter.com/3JQBEnpwLP— MKS Goud (@KothaMukesh2) September 7, 2024 మరోవైపు.. ఖమ్మంలో కూడా మరోసారి పరిస్థితి దారుణంగా మారాయి. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మున్నేరుకు వరద పెరిగే అవకాశం ఉంది. శనివారం అర్ధరాత్రి తర్వాత మున్నేరు ఉధృతి పెరిగే సూచనలు ఉండటంతో కేఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. కమిషనర్.. అధికారులను అందరినీ అత్యవసరంగా ఆఫీసుకు పిలిపించారు. ముంపు ప్రాంతాలను ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు వెళ్లాలని అధికారులు ప్రజలకు సూచించారు. Water level is rising in munneru due to heavy rains in mahabubabad and warangal.* Munneru river* Date: *07.09.2024*Time : 7.26 PMWater level: 8.75'ft1st warning 16.00 ft 2nd Warning 24.00ft. Trend:- steadyదాన్వాయిగూడెం, రమణపేట,… pic.twitter.com/mngqnDTD9U— Municipal Commissioner (@MC_Khammam) September 7, 2024 #Mahabubabad #Telangana has again got very heavy rain and many places in #Khammam as well as #Yellandu catchment of #Munneru is getting heavy rains in the last 2 hours. Strict vigil required along Munneru sub-basin. @APSDMA @10NDRF @CWCOfficial_FF @ndmaindia pic.twitter.com/3yErRTI7Vj— S Lakshminarayanan (@sln_1962) September 7, 2024 -
చదువులూ వరద పాలు!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం/సాక్షి, మహబూబాబాద్: భారీ వర్షాలు మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో విద్యార్థుల చదువునూ వరదపాలు చేశాయి. మానుకోటలో 188 పాఠశాలలు, ఖమ్మం జిల్లాలో 72 పాఠశాలలు దెబ్బతిన్నాయి. శ్లాబ్‌లు కూలిపోవడం, పగుళ్లు రావడం, లీకేజీలు, కాంపౌండ్ వాల్ దెబ్బతినడం, కిచెన్ షెడ్ కూలిపోవడం, ఫర్నిచర్ దెబ్బతినడం, పుస్తకాలు, కంప్యూటర్లు, రికార్డులు, సర్టిఫికెట్లు తడిసిపాడైపోవడం వంటివి సమస్యగా మారాయి. అటు ముంపు ప్రాంతాల్లోని ఇళ్లలోనూ విద్యార్థుల బ్యాగులు, పుస్తకాలు తడిసి పాడైపోయాయి. దీనితో వేలాది మంది విద్యార్థుల చదువుపై ప్రభావం పడే పరిస్థితి నెలకొంది. సోమవారం నుంచి బడులు తెరుచుకోనున్న నేపథ్యంలో చదువులు ఎలా సాగుతాయి, మళ్లీ పుస్తకాలు కొనడం ఎలాగని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం రూరల్ మండలం జలగంనగర్‌లోని మండల పరిషత్ ఉన్నత పాఠశాల ఇది. రెండు అంతస్తుల ఈ భవనం గ్రౌండ్ ఫ్లోర్ తరగతి గదుల్లో బురద మేటలు వేశాయి. తొమ్మిదో, పదో తరగతి పుస్తకాలు తడిసి పాడైపోయాయి. పాఠశాలను చూసేందుకు వచ్చిన తొమ్మిదో తరగతి విద్యార్థులు రాంచరణ్, వరుణ్‌తేజ్, ప్రైమరీ స్కూల్ విద్యార్థులు ఇక్కడి పరిస్థితి చూసి ఆవేదన చెందారు.బడికి వెళ్లాలంటే.. సర్కస్ ఫీట్లే..మహబూబాబాద్ జిల్లాలోని చిన్నగూడూరు– ఉగ్గంపల్లి మార్గంలో బ్రిడ్జి పక్కన రోడ్డు తెగిపోయింది. దీంతో విద్యార్థులు బడికి వెళ్లేందుకు సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తోంది. తల్లిదండ్రులు బ్రిడ్జి పైనుంచి నిచ్చెన సాయంతో పిల్లలను కిందికి దింపి, రోడ్డుపైకి తీసుకెళ్లి పంపిస్తున్నారు. సాయంత్రం మళ్లీ అదే తరహాలో తిరిగి తీసుకెళుతున్నారు.భయం భయంగా వెళ్లాల్సి వస్తోందిమంగళవారం నుంచి రెండు రోజులు బడికి వెళ్లలేదు. మూడోరోజు మా నాన్న బ్రిడ్జి వద్దకు వచ్చి నిచ్చెన మీది నుంచి కిందికి దింపి రోడ్డు వరకు తీసుకొచ్చి బడికి పంపించాడు. సాయంత్రం మళ్లీ వచ్చి తీసుకెళ్లాడు. బ్రిడ్జి పైనుంచి నిచ్చెనతో దిగాలన్నా.. ఎక్కాలన్నా భయం వేస్తోంది. – ఏనుగంటి శ్రీజ, ఏడో తరగతి, ఉగ్గంపల్లి -
యువరైతును మింగిన వర్షాలు
కురవి: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సాగు చేసిన మిర్చి పంట కుళ్లిపోవడం.. చేసిన అప్పులు తీర్చేమార్గం లేక మనస్తాపానికి గురైన యువ రైతు భూక్య హత్తిరాం (33) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం రాజోలు శివారు హరిదాసు తండా జీపీ పరిధిలోని హర్య తండాలో శుక్రవారం జరిగింది. హత్తిరాం తనకున్న రెండు ఎకరాలకు తోడు మరో ఎకరం భూమిని కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్నాడు. గతేడాది మిర్చి సాగు చేయగా నల్లి రోగంతో పంట నాశనమైంది. అప్పుడు పంట కోసం రూ.6 లక్షల అప్పులు చేశాడు.ఆ అప్పులు తీరలేదు. ఈ ఏడాది అదే పంటను నమ్ముకుని తిరిగి మిర్చి సాగు చేశాడు. ఇటీవల భారీ వర్షాలు కురవడంతో వేసిన మిరప తోట కుళ్లిపోయి పనికిరాకుండా పోయింది. దీంతో మనస్తాపానికి గురైన హత్తిరాం గురువారం తోట వద్ద పురుగుల మందు తాగి ఇంటికి వచ్చాడు. అస్వస్థతకు గురైన హత్తిరాం కుటుంబ సభ్యులకు మందు తాగినట్లు చెప్పాడు. అప్పటికే పరిస్థితి విషమిస్తుండటంతో కుటుంబసభ్యులు వెంటనే మహబూబాబాద్‌లోని జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. మృతుడి తండ్రి భూక్య స్వామి (సామ్య) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కురవి ఎస్సై గండ్రాతి సతీశ్ తెలిపారు. మృతుడికి భార్య మీనా, అరవింద్, అరుణ్ కుమారులున్నారు. -
రైల్వే ట్రాక్ పునరుద్ధరణ
-
36 గంటల్లో మహబూబాబాద్ రైల్వే ట్రాక్ పునరుద్ధరణ
మహబూబాబాద్, సాక్షి: తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లాలోని ఇంటికన్నె రైల్వే స్టేషన్ సమీపంలోని పెద్ద మోరీ వద్ద వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పూర్తి అయింది. ఈ పట్టాల పునరుద్ధరణ నిర్మాణ మరమ్మతు పనులను రైల్వే శాఖ అధికారులు యుద్ద ప్రాతిపదికన కేవలం 36 గంటల్లో పూర్తి చేసి రికార్డు సృష్టించారు.తాజాగా నిర్మాణ పనులు తుది దశకు చేరుకోవడంతో రైల్వే అధికారులు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఆదివారం తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా ట్రాక్ కొట్టుకుపోవటంతో వందలాది రైళ్లను దక్షిణమధ్య రైల్వే రద్దు చేసింది. కొన్ని రైళ్లను దారిమళ్లించి విషయం తెలిసిందే. రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పూర్తి కావటంతో రేపటి(బుధవారం) నుంచి యాధావిధిగా రైళ్ల రాకపోకలు కొసాగుతాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు. -
వరద బాధితులను పరామర్శించి నష్టపరిహారం ప్రకటించిన సీఎం రేవంత్
-
గుండె కరిగిపోయే, మనసు చెదిరిపోయే దృశ్యాలు చూశా: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వరద పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. గుండె కరిగిపోయే దృశ్యాలు, మనసు చెదిరిపోయే దృశ్యాలు స్వయంగా చూశానని తెలిపారు. బాధితుల కష్టం తీర్చడానికి, కన్నీళ్లు తుడవడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. సర్కార్ ఎంతటి సాయం చేయడానికైనా సిద్దమని తెలిపారు. బాధితుల మొఖాలలో ఓవైపు తీరని ఆవేదన.. మరోవైపు అన్నా’ వచ్చాడన్న భరోసా కనిపించిందన్నారు.గుండె కరిగిపోయే దృశ్యాలు…మనసు చెదిరిపోయే కష్టాలు…స్వయంగా చూశాను.బాధితుల మొఖాలలో …ఒకవైపు తీరని ఆవేదన…మరోవైపు “అన్నా” వచ్చాడన్న భరోసా.వీళ్ల కష్టం తీర్చడానికి…కన్నీళ్లు తుడవడానికి…ఎంతటి సాయమైనా చేయడానికి సర్కారు సిద్ధం.#TelanganaRains2024 pic.twitter.com/0NQPobJsd5— Revanth Reddy (@revanth_anumula) September 3, 2024మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం మహబూబాబాద్ జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్లారు.వరదలో కొట్టుకుపోయి చనిపోయిన సైంటిస్టు అశ్విని కుటుంబాన్ని పరామర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాలు, పొలాలు, రోడ్లు పరిశీలించనున్నారు. -
గాలిలో రైలు పట్టాలు..
సాక్షి, మహబూబాబాద్/ డోర్నకల్/ మహబూబా బాద్ రూరల్/ కేసముద్రం: మహబూబాబాద్ జిల్లాలో వర్షాలు కురుస్తుండటంతో నాలుగు చోట్ల రైల్వే లైన్లు దెబ్బతిన్నాయి. వరద తాకిడికి పట్టాల కింద సిమెంట్ దిమ్మెలు, కంకరరాళ్లు, మట్టి కొట్టుకుపోయి ఊయలలా పట్టాలు వేలాడుతున్న విషయాన్ని రైల్వే సిబ్బంది పసిగట్టడం.. అప్రమత్తమైన అధికారులు ఎక్కడిక క్కడ రైళ్లను నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. అయోధ్య పెద్దచెరువు కట్ట తెగడంతో..మహబూబాబాద్ రూరల్ మండలం అయోధ్య పెద్ద చెరువు కట్ట తెగడంతో వరద నీరు ఉధృతంగా తాళ్లపూసపల్లి సమీపంలో రైల్వేట్రాక్ కిందినుంచి వెళ్లింది. దీంతో కొత్తగా వేస్తున్న విజయవాడ– సికింద్రాబాద్ లైన్‌తోపాటు, పాత లైన్ల కింద ఉన్న మట్టి, కంకర రాళ్లతోపాటు, సిమెంట్ దిమ్మెలు కూడా కొట్టుకుపోయాయి. దీంతో ఆరు నుంచి పది అడుగుల మేరకు గొయ్యిపడి పట్టాలు గాలిలో వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. అదేవిధంగా కేసముద్రం విలేజీ పెద్ద చెరువు, దామర చెరువు, ఇంటికన్నె చెరువుల వరదతో ఇంటికన్నె, కేసముద్రం మధ్యలో వరద తీవ్రత పెరిగి ట్రాక్ అడుగు భాగం అంతా కొట్టుకుపోయింది. దీంతో ఇంటికన్నె–కేసముద్రం మధ్య 200 మీటర్ల మేర, తాళ్లపూసపల్లి–మహబూబాబాద్ మధ్యలో ఒక చోట 50 మీటర్లు, మరోచోట 10 మీటర్ల మేరకు పట్టాల కింద మట్టి కొట్టుకుపోయి ట్రాక్ తీవ్రంగా దెబ్బతిన్నది. అదేవిధంగా నెక్కొండ– వరంగల్ మధ్య రెండు మీటర్ల మేర గొయ్యి పడింది. వేలాది మంది ప్రయాణికులతో ఉక్కిరి బిక్కిరిట్రాక్లు దెబ్బతిన్న విషయాన్ని ముందుగానే గుర్తించిన అధికారులు కేసముద్రంలో సంఘమిత్ర రెండు రైళ్లు, మహబూబాబాద్‌లో సింహపురి, మచిలీపట్నం, డోర్నకల్‌లో పద్మావతి, అప్, డౌన్ రెండు గౌతమి రైళ్లు నిలిపి వేయడంతో సుమారు పదివేలకు పైగా ప్రయాణికులు ఒక్కసారిగా మూడు స్టేషన్లలో దిగారు. రైళ్లు ఎప్పుడు వెళ్తాయో తెలియకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. కొందరు ప్రైవేట్ వాహనాలలో వెళ్లగా, మరికొందరు లాడ్జీలు తీసుకొని ఉన్నారు. ఎటూ వెళ్లలేని వారు స్టేషన్లలోనే ఉండటంతో మహబూబాబాద్, కేసముద్రం, డోర్నకల్ ప్రాంతాల ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు వారికి పండ్లు, బిస్కెట్లు, టిఫిన్, మధ్యాహ్న భోజనం, మంచినీరు, మందులు అందజేశారు.సార్లకు సమాచారం ఇచ్చాను..నేను కేసముద్రం– ఇంటికన్నె లైన్‌లోని 550 ఆర్ఏ ఎఫ్టీ వద్ద ఉన్నా. పైనుంచి వరద పెరిగింది. అప్ప టికే నా వద్దకు వచ్చిన పెట్రోలింగ్ టీమ్‌తో మాట్లాడి విషయం ముందుగా ఎస్ఎస్ఏ శ్రీనివాస్‌కు, తర్వాత రాజమౌళికి ఇచ్చాం. ట్రైన్ల వేగం తగ్గించారు. తర్వాత కూడా వరద పెరగడంతో కాషన్ ఆర్డన్ ఇవ్వాలని కోరాం. – మోహన్, ట్రాక్‌మన్, ఇంటికన్నెవారిద్దరి సమాచారంతో రైళ్లు ఆపేశాంగతంలో జరిగిన వరద అనుభవాల దృష్ట్యా రైల్వే లైన్లకు ఇబ్బందులు ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక వాచ్మెన్లను పెట్టాం. ట్రాక్‌మన్ సమాచారంతో అప్రమత్తమై రోడ్డు మార్గంలో నేను 575 రైల్వే ఎఫెక్టెడ్ ట్యాంక్ వద్దకు వెళ్లాను. అప్పటికే పరిస్థితి విషమించింది. వరద పెరిగింది. విషయాన్ని పై అధికారులకు చేరవేశా. దీంతో ఎక్కడి రైళ్లు అక్కడ ఆపేశారు. – రాజమౌళి, సీనియర్ రైల్వే సెక్షన్ ఇంజనీర్ప్రమాద స్థాయి గమనించానునేను తాళ్లపూసపల్లి– కేసముద్రం లైన్‌లోని 575 ట్యాంకు వద్ద ఉన్నా. సాయంత్రంనుంచి గంట గంటకూ వరద ఉధృతి పెరుగుతోంది. ప్రమాద స్థాయికి చేరుతుందని గమనించి రాత్రి 12 గంటల సమయంలోనే మా ఎస్ఎస్ఈ రాజమౌళికి చెప్పా. గస్తీ వాళ్లకు సమాచారం ఇచ్చి ఆయన వచ్చారు. రైళ్లు ఆపేశాం. – జగదీశ్, ట్రాక్‌మన్, తాళ్లపూసపల్లి -
భారీ వర్షానికి కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్..
-
TG And AP: వరదల నీటిలో రైల్వే ట్రాక్.. 18 రైళ్లు ఆలస్యం!
సాక్షి, మహబూబాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా పలుచోట్ల రోడ్లు, రైల్వే ట్రాక్‌లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. మరోవైపు.. భారీ వర్షాలతో మహబూబాబాద్ జిల్లా జలదిగ్బంధమైంది. జిల్లాలో రైల్వేట్రాక్ కింద కంకర కొట్టుకోయింది. దీంతో మట్టి కోతకు గురవడంతో ట్రాక్ కింది నుంచి వరద ప్రవహిస్తున్నది. దీంతో విజయవాడ- కాజీపేట మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.కాగా, భారీ వర్షాల కారణంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుంచి బయటకు వెళ్లే దారులన్నీ జలమయం అయ్యాయి. కేసముద్రం మండలంలో రైల్వే ట్రాక్ పూర్తిగా కొట్టుకుపోయింది. మట్టి కోతకు గురవడంతో ట్రాక్ కింది నుంచి వరద ప్రవహిస్తున్నది. దీంతో విజయవాడ- కాజీపేట మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. తాళ్లపూసలపల్లి వద్ద రైల్వేట్రాక్‌పై నుంచి వరద ప్రవహిస్తుండటంతో పందిపల్లి వద్ద మహబూబ్‌నగర్-విశాఖ ఎక్స్‌ప్రెస్ నాలుగు గంటల పాటు నిలిచిపోయింది. మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో మచిలీపట్నం, సింహపురి రైళ్లు నిలిచిపోయాయి. దాదాపు 18 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో ఈ రైళ్లను దారి మళ్లించే అవకాశం ఉంది.భారీ వర్షానికి కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్మహబూబాబాద్ - కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి దగ్గర భారీ వర్షాలకు కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్.దీంతో మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌తో పాటు పలు రైళ్లను నిలిపేసిన రైల్వే అధికారులు pic.twitter.com/1uJvcXA7Iw— HARISH TIRRI (@TIRRIHARISH) September 1, 2024 -
‘ఆరుద్ర’ను చూస్తే అనువైన వరుడు..
గిరిజనులకు తల్లీ తండ్రి ప్రకృతే. కొరత లేకుండా ధాన్యాన్ని పస్తులు ఉంచకుండా పంటల్ని పుష్కలంగా ఇవ్వడమే కాదు తమకు అనువైన తోడును కూడా ప్రకృతి మాతే తీసుకువస్తుందన్నది ప్రగాఢమైన నమ్మకం. ఆ నమ్మకం పెళ్లీడుకు వచ్చిన పడతుల్లో కోటి ఆశలను విరబూయిస్తుంది. ఆ ఆశలే ఇంటింటా సంబరమవుతాయి.పంట సాగు నుండి కన్నెపిల్లల పరిణయాల వరకు అంతా ప్రకృతి చెప్పిన విధంగానే నడుచుకుంటారు గిరిజనులు. అంతటి ప్రాధాన్యత కల్గిన వాటిల్లో ‘తీజ్’ పండుగ ముఖ్యమైనది."నాకు అరవై ఏళ్లు. మా చిన్నప్పుడు కూడా తీజ్ పండుగ చేసుకున్నాం. తీజ్ పెరిగిన తీరును చూసి మా అమ్మానాన్నలు, తండా పెద్దలు నాకు పెళ్లి చేశారు. ఇదే ఆనవాయితీ మా పిల్లలు కూడా చేస్తున్నారు0." – భూక్యా వీరమ్మ గన్యాతండ, మహబూబాబాద్తీజ్ అంటే..పెళ్లీడుకు వచ్చిన గిరిజన (లంబాడ) అమ్మాయిలు సంబురంగా జరుపుకునే పండుగ తీజ్. గోధుమ నారునే కాదు ఈ కాలాన కనిపించే ఆరుద్ర పురుగులనూ తీజ్ అంటారు. ఎర్రగా అందంగా ఉండే ఆరుద్ర పురుగులను దేవుడు తమకోసం పంపిస్తాడని, ఈ పురుగులు కనిపించినప్పుడు మనసులో కోరుకున్న కోరిక ఫలిస్తుందని వీరి నమ్మకం.ఇంటింటి ఆశీస్సులు..పెళ్లీడుకు వచ్చిన యువతులు తమకు కావాల్సిన వరుడి కోసం చేసే ఈ పండగకు ముందు గా తల్లిదండ్రులు, పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు. యువతులందరు ఇంటింటికి వెళ్లి పెద్దల ఆశీస్సులు తీసుకోవడం, వారు కానుకగా ఇచ్చే విరాళం తీసుకోవడంతో తండా అంతా సందడిగా మారుతుంది. ఇలా సేకరించిన విరాళం (ధాన్యం) తో తమకు కావాల్సిన గోధుమలు, శనగలు, ఇతర సామాన్లు కొనుగోలు చేస్తారు.గోధుమ మొలకలు..తీజ్ పండుగలో ముఖ్యమైనది తీజ్ (గోధుమ మొలకలు) ఏపుగా పెరిగేందుకు ఆడపిల్లలు అడవికి వెళ్ళి దుస్సేరు తీగలు తెచ్చి, బుట్టలను అల్లి, తమ ఆరాధ్య దైవం తుల్జా భవాని, సేవాబాయి, సీత్లాభవానీలకు పూజలు చేసి, పుట్టమట్టిని తెస్తారు. మేకల ఎరువును కలిపి తండా నాయక్ చేతిలో ఉంచిన బుట్టలో ΄ోస్తారు. అప్పటికే నానబెట్టి ఉంచిన గోధుమలను అందులో వేస్తారు. శనగలకు రేగుముళ్లుతీజ్ వేడుకల్లో భాగంగా నానబెట్టిన శనగలకు యువతులు రేగుముళ్లు గుచ్చుతారు. ఈ ప్రక్రియను బావ వరుసయ్యే వారు పడతుల మనస్సు చెదిరేలా వారిని కదిలిస్తూ ఉంటారు.నియమ నిష్టలతో..తండాలోని యువతులందరు తమ బుట్టలను ఒకేచోట పెడతారు. ఈ తొమ్మిది రోజులు పెట్టిన బుట్టలకు నీళ్లు ΄ోస్తూ, వాటి చుట్టూ తిరుగుతూ గిరిజన నృత్యాలు, పాటలు పాడుతూ గడుపుతారు.ఏడవ రోజు ఢమోళీ.. ఏడవరోజు జరిగే ఢమోళీ చుర్మోను మేరామా భవానీకి నివేదిస్తారు. వెండితో చేసిన విగ్రహం, రూపాయి బిళ్ల అమ్మవారి ముందు పెట్టి మేక΄ోతులు బలి ఇచ్చే తంతును‘ఆకాడో’ అంటారు.దేవతల ప్రతిరూపాలకు..ఎనిమిదవ రోజు మట్టితో ఆరాధ్య దైవాల ప్రతిరూపాలను తయారు చేస్తారు. అబ్బాయి(డోక్రా), అమ్మాయి(డోక్రీ)లుగా పేర్లు పెడతారు. వీటికి గిరిజన సాంప్రదాయాల ప్రకారం పెండ్లి చేస్తారు. ఆడపిల్లలు పెళ్లి కూతురుగా, మగ పిల్లలు పెళ్లికొడుకుగా ఊహించుకుంటూ ఈ తంతులో పాల్గొంటారు. పెళ్లి తర్వాత తమ కుటుంబ సభ్యులను విడిచి పెడుతున్నట్లు ఊహించుకుని ఏడ్వడం, వారిని కుటుంబ సభ్యులు ఓదార్చడంతో ఈ తంతును నిర్వహిస్తారు.తొమ్మిదవ రోజు నిమజ్జనం..డప్పు చప్పుళ్లు, నృత్యాలతో అందరూ బుట్టల వద్దకు వెళ్తారు. తండా నాయక్ వచ్చి యువతులకు బుట్టలను అందజేస్తారు. యువతులు ఆశీర్వాదాలు తీసుకుంటారు. తమ పూజాఫలంగా పెరిగిన తీజ్‌ను అన్నదమ్ముళ్లకు ఇచ్చి.. వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. తర్వాత యువతీ, యువకులు బుట్టలను పట్టుకొని ఊరేగింపుగా వెళ్లి చెరువులో నిమజ్జనం చేస్తారు. – ఈరగాని భిక్షం, సాక్షి, మహబూబాబాద్, ఫొటోలు: మురళీ కృష్ణ -
మహబూబాబాద్
గురువారం శ్రీ 25 శ్రీ జూలై శ్రీ 2024 7నెహ్రూసెంటర్: ఆర్టీసీలో ప్రమాదాలను నివారించేలా సంస్థ వారోత్సవాలు నిర్వహిస్తోంది. ఈమేరకు ఈ నెల 24నుంచి 30వ తేదీ ప్రమాద రహిత వారోత్సవాలను నిర్వహించేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈమేరకు రోడ్డు భద్రత నియమాలు, జాగ్రత్తలపై డ్రైవర్లకు అవగాహన కల్పించనున్నారు. అలాగే శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రమాదాలను నిలువరించేలా చర్యలు తీసుకోనున్నారు.ప్రత్యేక కార్యక్రమాలు..ప్రమాద రహిత వారోత్సవాలను ఏడు రోజులు నిర్వహించనున్నారు. ప్రతీరోజు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతారు. మొదటి రోజు వారోత్సవాలను ప్రారంభించడం, రెండోరోజు డ్రైవర్లకు శిక్షణ, మూడో రోజు డ్రైవర్లకు మెడికల్ క్యాంపు ద్వారా చెకప్‌లు చేయించడం, నాలుగోరోజు ప్రైవేట్ హైర్ బస్సు డ్రైవర్లు, ఓనర్లతో మీటింగ్ ఏర్పాటు చేసి వారికి వివరించడం, ఐదోరోజు బస్సు ప్రత్యేక సేఫ్టీ కోసం అదనపు మెకానిక్‌లతో స్పెషల్ మెయింటెనెన్స్ చేయించడం, ఆరోరోజు తరచూ ప్రమాదాలు చేసే డ్రైవర్లు, వారి కుటుంబ సభ్యులతో కోఆర్డినేషన్ మీటింగ్, కౌన్సెలింగ్, ఏడోరోజు ఉత్తమ ప్రమాద రహిత డ్రైవర్లను సన్మానిస్తారు.డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు...డ్రైవర్లు ౖడ్రైవింగ్ సమయంలో మెళకువలు పాటించాలి. వైపరు పనిచేసేలా చూసుకోవడం, బ్రేకులు, లైట్లు, టైర్లలో గాలి, సైడు అద్దాలను సరి చూసుకోవాలి. వేగ నియంత్రణ పాటించడంతో పాటు ముందు వెళ్లే వాహనాలకు సురక్షిత దూరాన్ని పా టించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు.జాగ్రత్తలు పాటించాలి..ఆర్టీసీ డ్రైవర్లు రోడ్డుపై తగు జాగ్రత్తలు పాటించాలని డీఎస్పీ తిరుపతిరావు సూచించారు. ప్రమాద రహిత వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ ప్రాంగణంలో వారోత్సవాలను బుధవారం ప్రారంభించారు. డీఎస్పీ మాట్లాడు తూ.. డైవర్లు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా బస్సులను నడపాలని సూచించారు. ఆర్టీసీ అంటే ప్రజల సంస్థ అని డ్రైవర్లు సమయపాలన పాటించాలని, మంచి ప్రవర్తన కలిగి ఉండాలని సూచించారు. వర్షాకాలంలో జాగ్రత్తలు పాటిస్తూ ప్రమాదాలు జరుగకుండా చూసుకోవా లన్నారు. ప్రమాద రహిత వారోత్సవాలను విజయవంతం చేయాలని మానుకోట డీఎం ఎం.శివప్రసాద్ తెలిపారు. అనంతరం ప్రమాదరహిత వారోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది ఈఎస్ చారి, మల్లికార్జున్, రాఘవేంద్ర, పాపిరెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.ప్రమాదాల నివారణకు చర్యలుప్రమాదాలను నివారించేలా డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రమాద రహిత వారోత్సవాలను నిర్వహిస్తూ డ్రైవర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నాం. డ్రైవర్లు అప్రమత్తంగా ఉండేలా శిక్షణతో పాటు ఆరోగ్య పరీక్షలు, అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ప్రమాద రహిత ఆర్టీసీగా చర్యలు చేపడుతాం.– ఎం.శివప్రసాద్, ఆర్టీసీ డీఎంన్యూస్రీల్ -
మర్యాదకు మందు తెస్తే తాగకుండా పారిపోయిన చుట్టం
-
విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి
కొత్తగూడ: విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం రాత్రి మండలంలోని ఎదుళ్లపల్లిలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జినుకల రాజు(24) నాటు వేయడానికి తన పొలం సిద్ధం చేశాడు. ఈ క్రమంలో నీరు పారించడానికి వ్యవసాయ క్షేత్రం వద్దకు వెళ్లాడు.రాత్రి అయినా ఇంటికి రాకపోవడం.. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కుటుంబీకులకు అనుమానం వచ్చింది. దీంతో పొలం వద్దకు వెళ్లి చూడగా మోటార్ వద్ద షాక్ తగిలి మృతి చెంది ఉన్నాడు. దీంతో తల్లిదండ్రులు సింహద్రి, నాగమల్లు గుండెలవిసేలా రోదించారు.