'ఆవిడ వల్లే నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు..' | Mahabubabad Dharawat Shivaram Who Married Transgender Commits Suicide Due To Harassment - Sakshi
Sakshi News home page

'ఆవిడ వల్లే నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు..'

Published Tue, Aug 22 2023 2:41 PM | Last Updated on Tue, Aug 22 2023 3:18 PM

Dharawat Shivaram Who Married Transgender Suicide  - Sakshi

మహబూబాబాద్: అప్పట్లో ట్రాన్స్‌జెండర్‌ను పెళ్లి చేసుకుని వార్తల్లోకి ఎక్కిన మహబూబాబాద్ జిల్లా వాసి ధరావత్ శివరాం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ట్రాన్స్‌జెండర్ తపస్వీ వేధింపులు భరించలేకే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని బాధితుని తల్లి పోలీసులను ఆశ్రయించింది. తపస్వీతో విడిపోయిన తన కొడుకు మరో పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించగా.. అడ్డుకుని వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. 

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేటకు చెందిన ధారావత్ శివరాం, జల్లి గ్రామానికి చెందిన ట్రాన్స్‌జెండర్‌ కొర్ర ప్రవీణ్ అలియాస్ తపస్విని వివాహం చేసుకున్నారు. ఇద్దరు మధ్యలో మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. మళ్లీ పెళ్లి చేసుకునేందుకు శివరాం ప్రయత్నిస్తుండగా ట్రాన్స్‌జెండర్ తపస్వి అడ్డుకున్నారు. అయితే.. ఈ క్రమంలో శివరాం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తపస్వి వేధింపులు భరించలేక పురుగులు మందు తాగి శివరాం ఆత్మహత్య చేసుకున్నట్లు అతని తల్లి పోలీసులును ఆశ్రయించింది.

గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com

ఇదీ చదవండి: కామపిశాచికి ఎమ్మెల్యే టికెట్‌ ఎలా ఇస్తారు?: శేజల్ సంచలన ఆరోపణలు


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement