Married
-
అంచనాలు నెరవేరకపోయినా..బంధం స్ట్రాంగ్‌గానే ఉండాలి..!
అనిత, అరవింద్ ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. యూనివర్సిటీ లెక్చరర్ అవ్వాలని అరవింద్ కలలు కన్నాడు. అదే లక్ష్యంగా చదువుతూ, అనితకు కూడా తన భవిష్యత్తుపై అదే ఆశను కల్పించాడు. కానీ పెళ్లయిన రెండేళ్ల తర్వాత, అరవింద్ తన ఆలోచన మార్చుకున్నాడు. అకడమిక్ కెరీర్ కంటే తనకు వ్యాపారం సరిపోతుందని భావించి, స్నేహితుడితో కలిసి టీవీ షోరూం ప్రారంభించాడు. అనితకు ఇది పెద్ద షాక్.అనిత ఎప్పుడూ ‘యూనివర్సిటీ ప్రొఫెసర్ భార్య’ అని తనను ఊహించుకుంది. కానీ అరవింద్ వ్యాపారం ప్రారంభించడం ఆమె అంచనాలను తారుమారు చేసింది. దాన్ని ఆమె భరించలేకపోయేది. ‘‘నువ్వు లెక్చరర్ అవుతావని నిన్ను పెళ్లి చేసుకున్నా!’’అంటూ తరచు విమర్శించేది. దానికితోడు వ్యాపారంలో అరవింద్‌కు నష్టం వచ్చింది. దాంతో అనిత విమర్శల జోరు పెరిగింది. ‘‘ఈ మాత్రం దాని కోసమేనా లెక్చరర్ ఉద్యోగం వద్దనుకుంది’’ అని దెప్పి పొడిచేది. కష్టాల్లో అండగా ఉండాల్సిన భాగస్వామి అలా మాట్లాడటం అరవింద్ మనసును తీవ్రంగా గాయపరిచింది. తనను తాను నిరూపించుకోవాలని అరవింద్ కసిగా పనిచేశాడు. వ్యాపారం పట్టాలెక్కింది. పట్టణంలో ఒక ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. తన వ్యాపారం పట్ల అరవింద్ ఎంత సంతోషంగా ఉన్నా, అనిత మాత్రం అతని మార్పును అంగీకరించలేదు. తన కలలను నాశనం చేశాడనే బాధ ఆమె మనసును దాటడంలేదు. దాంతో సూటిపోటి మాటలు అంటూనే ఉంది. దీంతో వారి మధ్య మాటలు తగ్గాయి. ఒకరి ఆనందాన్ని మరొకరు పంచుకోవడం మానేశారు. చివరకు ఒకరినొకరు ఇష్టపడటం కూడా మానేశారు. ఒకే ఇంట్లో ఉంటున్న ఇద్దరు అపరిచితులుగా మారిపోయారు.అంచనాలు నెరవేరకపోతే!?‘నా కలలు తుడిచిపెట్టుకుపోయాయి’ అనే భావనతో నిరాశ పెరుగుతుంది.‘నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు’ అంటూ విమర్శ తారస్థాయికి చేరుతుంది.‘ఇప్పటికైనా మారవచ్చు కదా’ అనే ఒత్తిడి పెరుగుతుంది. ‘ఇతను నా జీవితానికి సరైన వ్యక్తి కాదు’ అంటూ ప్రేమ తగ్గిపోతుంది ‘ఇదే కొనసాగితే విడిపోవడమే సరైన మార్గమేమో’ అనే ఆలోచన బలపడుతుంది.అసలైన సమస్య ఏమిటి?‘పెళ్లికి ముందు మాయ మాటలు చెప్పి నన్ను మోసం చేశాడు’ అని అనిత భావించడం.‘నా నిర్ణయాన్ని, నా కెరీర్ మార్పును భార్య అర్థం చేసుకోవడం లేదు!’ అని అరవింద్ భావించడం.నిజానికి ఇద్దరూ బాధితులే కాని, ఇద్దరూ ఒకరినొకరు బాధ్యుల్ని చేయడం.భాగస్వామి మారుతున్నప్పుడు మనం కూడా మారాలనే దృక్పథం లేకపోవడం.ఒకరి మార్పును మరొకరు అంగీకరించకపోవడం.ఆర్థిక భద్రత, భవిష్యత్తు పట్ల భయం సంబంధాన్ని దెబ్బతీసేలా మారడం. బంధాన్ని ఎలా కాపాడుకోవాలి? ‘నా దృష్టికోణం మాత్రమే నిజం’ అనే ఆలోచన వదలాలి. ‘అతను నన్ను మోసం చేశాడు’ అనే ఆలోచన పక్కనపెట్టి ‘అతనికి సంతోషం ఇచ్చే మార్గం మారిపోయింది. నేను దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు?’ అని ఆలోచించాలి.ఆశలకు, వాస్తవానికి మధ్య తేడా ఎక్కడుందో గుర్తించాలి. భర్త లెక్చరర్ అవ్వాలి, జీతం స్థిరంగా ఉండాలనేది అనిత ఆశ. భద్రత కంటే ఆనందం అరవింద్‌కు ముఖ్యం. ఈ తేడాను అంగీకరించకపోతే, సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది!‘వ్యాపారంలో నష్టం వస్తే మన భవిష్యత్తు ఏమిటి?’ అనే భయాన్ని ‘మన ఇద్దరి భద్రత కోసం మనం కలిసి ప్లాన్ చేసుకోవచ్చు’ అని ప్రేమగా మార్చాలి.అరవింద్ అనితను ప్రేమించడంలేదని కాదు, అతను తన కలలను మార్చుకున్నాడు, కాని, అనిత తన ఊహల్లోనే ఉంది. కలిసుండాలంటే, ఒకరి కలలను మరొకరు అర్థం చేసుకోవాలి.అరవింద్ మారిన మార్గాన్ని అనిత అర్థం చేసుకోవాలి. భద్రత పట్ల ఉన్న అనిత భయాన్ని అర్థం చేసుకోవాలి. ఇద్దరూ సంపాదన, భద్రత, భవిష్యత్తు గురించి కలిసి చర్చించుకోవాలి.పెళ్లంటే ఒకరినొకరు మార్చడం కాదు, ఒకరి కోసం ఒకరు మారడమని, ఇద్దరూ కలిసి ప్రయాణం చేయడమని అర్థం చేసుకోవాలి. సంబంధాల్లో ప్రధానమైనది భాగస్వాముల ఆనందం. ఆర్థిక భద్రత అవసరమే కాని, అది మాత్రమే ప్రేమను నిర్వచించలేదు. పరిస్థితులకు అనుగుణంగా మన ఆలోచనలను సర్దుబాటు చేసుకోగలగాలిసైకాలజిస్ట్ విశేష్ www.psyvisesh.com(చదవండి: హీరోయిన్ నయనతారలాంటి స్టన్నింగ్ లుక్ కోసం..!) -
పెళ్లి చేసుకుంటారా?.. ఉద్యోగం వదులుకుంటారా?: కంపెనీ వార్నింగ్
బ్యాచిలర్లకు మాత్రమే ఉద్యోగాలిచ్చే కంపెనీల గురించి విన్నాం. పెళ్లి చేసుకున్న వారికి జాబ్స్ ఇచ్చే కంపెనీలను చూసాం. కానీ పెళ్లి చేసుకోకపోతే ఉద్యోగం వదులుకోవాల్సి వస్తుంది అని అంటోంది ఓ సంస్థ. దీని గురించి మరిన్ని వివరాలు విపులంగా ఇక్కడ తెలుసుకుందాం.చైనాలోని 'షాన్డాంగ్ షుంటియన్ కెమికల్ గ్రూప్ కో. లిమిటెడ్' కంపెనీ ఒంటరిగా ఉన్న, విడాకులు తీసుకున్న ఉద్యోగులు సెప్టెంబర్ నాటికి వివాహం చేసుకోవాలి. లేకుంటే.. ఉద్యోగం వదులుకోవాల్సి వస్తుందని ఆదేశాలు జారీ చేసింది. అయితే వివాదాస్పద విధానాన్ని ప్రవేశపెట్టిన కంపెనీని అధికారులు మందలించారు.అధికారులు మందలించినప్పటికీ.. కంపెనీ మాత్రం తమ విధానాన్ని సమర్ధించుకుంది. దేశంలో వివాహ రేటు గణనీయంగా తగ్గుతోంది. వివాహ రేటును మెరుగుపరచాలనే ప్రభుత్వ పిలుపుకు మద్దతుగా ఈ ప్రకటన జారీ చేసినట్లు సంస్థ తెలిపింది. కానీ ఇది రాజ్యాంగ విరుద్ధమని న్యాయ నిపుణులు కూడా విమర్శించారు.ఇదీ చదవండి: రోజుకు రూ.27 కోట్లు విరాళం ఇచ్చిన వ్యక్తి.. ఈయన గురించి తెలుసా?కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం మీద.. పెకింగ్ యూనివర్సిటీ లా స్కూల్లో అసోసియేట్ ప్రొఫెసర్ 'యాన్ టియాన్' మాట్లాడుతూ.. చైనా కార్మిక చట్టాల ప్రకారం, కంపెనీలు ఉద్యోగ దరఖాస్తుదారులను వారి వివాహం లేదా పిల్లలు కనడానికి సంబంధించిన విషయాలను గురించి అడగడానికి అనుమతి లేదు. ఇది వారి స్వేచ్చకు భంగం కలిగించడం అవుతుందని అన్నారు. వివాదం ముదరడంతో.. కంపెనీ నోటీసును రద్దు చేస్తూ ఒక ఉత్తర్వు జారీ చేసింది. -
పెళ్లి పీటలు ఎక్కబోతున్న ప్రభాస్ హీరోయిన్
-
ఇక్కడి అమ్మాయి.. అక్కడి అబ్బాయి (ఫొటోలు)
మైసూరు: ప్రేమ ఎల్లలు దాటింది. మైసూరుకు చెందిన యువతి, నెదర్లాండ్‌కు చెందిన యువకుడి మధ్య చిగురించిన ప్రేమ ఫలించింది. దీంతో పెద్దల సమక్షంలో హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. నగరంలోని హూటగళ్లికి చెందిన విద్య, నెదర్లాండ్‌కు చెందిన యువకుడు రుటైర్ పరస్పరం ప్రేమించుకున్నారు. ఈ విషయాన్ని ఇరు కుటుంబాల పెద్దలకు తెలియపరచగా వారి పెళ్లికి అంగీకరించారు. దీంతో నగరంలోని కల్యాణ మండపంలో చెన్నగిరి తాలూకాలోని పాండోమట్టి విరక్త మఠం డాక్టర్ గురుబసవ స్వామీజీ నేతృత్వంలో విద్యా మెడలో రుటైర్ తాళి కట్టాడు. అనంతరం పెళ్లికి వచ్చిన అతిథులు వారిని ఆశీర్వదించి శుభాశీస్సులు పలికి విందు భోజనం ఆరగించారు. -
తాగుబోతు భర్తతో విసిగి.. రికవరీ ఏజెంట్‌తో పెళ్లి
రోజూ మద్యం తాగి వచ్చి వేధింపులకు గురిచేస్తున్న భర్తపై ఆమెకు విరక్తి కలిగింది. మద్యం తాగవద్దని ఎంత చెప్పినా వినని భర్త తీరుపై విసుగు చెందిన ఆ ఇల్లాలు ఒక విచిత్ర నిర్ణయం తీసుకుంది. ఇది స్థానికంగా చర్చనీయాంశంగా నిలిచింది. విషయం తెలుసుకున్న కొందరు భర్తకు తగిన శాస్తి జరిగిందని అంటున్నారు. వివరాల్లోకి వెళితే..బీహార్‌లోని జముయీలో విచిత్రమైన ప్రేమకథ వెలుగు చూసింది. ఈ ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల ఇంద్రకుమారి మందుబాబు అయిన తన భర్తను విడిచిపెట్టి, లోన్ రికవరీ ఏజెంట్ పవన్ కుమార్‌ను ఒక ఆలయంలో వివాహం చేసుకుంది. ఈ ప్రేమ పెళ్లిని ఇక్కడివారంతా వింతగా చెప్పుకుంటున్నారు. ఇంద్రకుమారికి 2022లో చకాయీ నివాసి నకుల్ శర్మతో వివాహం జరిగింది. అయితే నకుల్ శర్మ నిత్యం మద్యం తాగేవాడు. గృహహింసకు కూడా పాల్పడేవాడు. దీంతో ఇంద్రకుమారి భర్త తీరుకు విసిగిపోయింది.ఇదేసమయంలో ఆమెకు వవన్ కుమార్ యాదవ్ పరిచయమయ్యాడు. పవన్ ఒక ఫైనాన్స్ కంపెనీలో రికవరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. వారిద్దరి మధ్య కుదిరిన స్నేహం కొంతకాలానికి ప్రేమగా మారింది. గత ఐదేళ్లుగా వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఫిబ్రవరి 4న వారు తమ ఇళ్లలో చెప్పకుండా, అసన్సోల్ చేరుకున్నారు. అక్కడ ఇంద్రకుమారి మేనత్త ఉంటోంది. ఫిబ్రవరి 11న ఇంద్రకుమారి, పవన్ కుమార్ అక్కడి ఒక శివాలయంలో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి పవన్ కుటుంబ సభ్యులు మద్దతునివ్వగా, ఇంద్రకుమారి కుటుంబ సభ్యులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు చకాయీ పోలీస్ స్టేషన్లో పవన్‌పై ఫిర్యాదు చేశారు.ఇంద్రకుమారి మీడియాతో మాట్లాడుతూ తన ఇష్టాపూర్వకంగానే పవన్‌ను వివాహం చేసుకున్నానని తెలిపారు. పవన్‌పై పోలీసులకు ఫిర్యాదు అందిన నేపధ్యంలో ఈ జంట తమకు రక్షణ కల్పించాలని అధికారులను కోరుతోంది. మరి పోలీసులు ఈ జంట విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి. ఇది కూడా చదవండి: న్యూఢిల్లీ: వందరోజుల కార్యాచరణకు బీజేపీ కసరత్తు -
అప్పు తీర్చలేదని.. రాక్షస వివాహం!
యశవంతపుర: ఓ మహిళ అప్పు తీర్చలేదని ఆమె కూతురిని బలవంతంగా ఎత్తుకెళ్లారు. ఆమెను తన కొడుక్కి పెళ్లి చేశాడో వడ్డీ వ్యాపారి. బెళగావి నగరంలోని తళకవాడి పోలీసుస్టేషన్ పరిధిలో ఈ రాక్షస వివాహ ఘటన జరిగింది. వివరాలు.. ఒక మహిళ రూ.50 వేలును అప్పుగా తీసుకొంది. ఆమె సరిగ్గా వడ్డీని చెల్లించలేదు. దీంతో బంగారు ముక్కెరను లాక్కున్నాడు. ఆమె కూతురిని అపహరించి తన కుమారునికి వివాహం చేశాడు. అతడు బాలికపై బలవంతంగా లైంగికక్రియకు పాల్పడ్డాడు. న్యాయం చేయాలంటూ బాలిక శుక్రవారం బెళగావి తళకవాడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీస్ కమిషనర్ యడా మార్టిన్ ఆదేశాలతో భర్త, అతని తల్లిదండ్రులు సహా మరికొందరిపై కేసు నమోదుచేసి బాలికను రక్షించారు. ఇప్పటివరకు ఇద్దరిని అరెస్టు చేశారు. బాలిక చదువుకునేలా సాయం చేస్తామని కమిషనర్ తెలిపారు. -
నా భార్యకు నేను మూడో భర్తను!
బనశంకరి: వివాహం చేసుకోవడానికి అమ్మాయిల కొరత ఉందనే సాకుతో కొందరు మోసగాళ్లు పురుషులను నిండా ముంచుతున్నారు. ఓ వ్యక్తికి ఉత్తుత్తి పెళ్లి చేసి లక్షలాది రూపాయలను తీసుకుని బ్రోకర్, వధువు ఉడాయించారు. బాగల్కోటె జిల్లా ముధోళ్వాసి సోమశేఖర్ బాధితుడు. శివమొగ్గ మంజుళ అనే యువతిని పెళ్లి చేసి మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆమెకు 3వ పెళ్లి ఇప్పటికే రెండు పెళ్లిలు చేసుకున్న శివమొగ్గవాసి మంజుళతో బ్రోకర్ సత్యప్ప మాట్లాడాడు. పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి వేటలో ఉన్న సోమశేఖర్‌ను టార్గెట్ చేసుకున్నారు. అమ్మాయిని చూపించి పెళ్లి చేస్తామని రూ.4 లక్షలు డిమాండ్ చేశాడు. ఆడపిల్ల దొరకలేదని బాధలో ఉన్న సోమశేఖర్ ఎగిరి గంతేశాడు. ముధోళ్లోని కాళికా దేవి దేవస్థానంలో ఏడాది క్రితం పెళ్లి జరిపించారు. ఆ రోజునే బ్రోకర్ రూ.4 లక్షలు వసూలు చేశాడు. నెలరోజులు కాపురం సాగిందో లేదో ఓ రోజు మంజుళ ఉడాయించింది. సోమశేఖర్ ఆమె గురించి విచారించగా ఇప్పటికే రెండు పెళ్లిళ్లయినట్లు తెలిసింది. బ్రోకర్ ఇలాంటివారితో కలిసి మోసాలకు పాల్పడుతుంటాడని గుర్తించాడు. దీంతో డబ్బు తిరిగి ఇవ్వాలని బ్రోకర్‌ను కోరాడు. అతడు పట్టించుకోకపోవడంతో 7 మందిపై కేసు పెట్టాడు. -
Armaan Malik: ప్రియురాలిని పెళ్లాడిన 'బుట్టబొమ్మ' సింగర్ (ఫోటోలు)
-
కజకిస్థాన్ వధువు– తమిళ వరుడు
అన్నానగర్: అరియలూరు జిల్లా ముల్లుకురిచ్చి గ్రామానికి చెందిన రామచంద్రన్ కుమారుడు ప్రభాకరన్ (33). ఇతను మార్కిస్టు కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు. గత 2 సంవత్సరాలుగా కజకిస్థాన్‌లోని విమానాశ్రయంలో ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అతడితో పాటు పనిచేసే కజకస్తాన్కు చెందిన షేక్మెదోవ్ కుమార్తె ఐ దానా(29)కు మధ్య పరిచయం ఏర్పడింది. చివరికి ఈ అది ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని తల్లిదండ్రులకు చెప్పారు. వివాహానికి ఇరు కుటుంబాలు పచ్చజెండా ఊపారు. తమిళ సంస్కృతి ప్రకారం ప్రభాకరన్ తమిళనాడులో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దాని ప్రకారం ఐ దానా కుటుంబం అరియలూరుకు వచ్చింది. కాగా, మార్కిస్టు కమ్యూనిస్టు పార్టీ 24వ జిల్లా సదస్సు ఆదివారం కడలూరు జిల్లా పన్నాడంలోని ఓ ప్రైవేట్ హాలులో జరిగింది. ఈ సమావేశ వేదికపై పెళ్లికి ఏర్పాట్లు కూడా జరిగాయి. తమిళ సంçస్కృతి ప్రకారం వరుడు పట్టు పంచె, వధువు పట్టుచీరలో సమావేశ వేదికపైకి వచ్చారు. కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు వాసుకి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రభాకరన్, ఐ దానా కి తాళి కట్టారు. ఈ వేడుకకు బంధువులు, స్నేహితులు, పార్టీ సభ్యులు అందరూ హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. -
పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్ పెళ్లి, మిస్టరీ గర్ల్ ఎవరో తెలిసిపోయింది (ఫోటోలు)
-
మోడల్ని పెళ్లి చేసుకున్న నటుడు జయరామ్ కొడుకు (ఫొటోలు)
-
ఎట్టకేలకు పెళ్లి చేసుకున్న యాక్టర్ సుబ్బరాజు (ఫొటోలు)
-
ఎట్టకేలకు మూడుముళ్ళ బంధంతో ఒక్కటైన లవ్‌బర్డ్స్ (ఫొటోలు)
-
లేటు వయసులో ఘాటు ప్రేమ.. ఈ బుల్లితెర జంట పెళ్లి వేడుక చూశారా? (ఫొటోలు)
-
నాలుగుసార్లు ప్రేమలో పడినా..!
రతన్ టాటా పారిశ్రామికవేత్తగా ఘనవిజయాలు సాధించినా, అవివాహితుడిగానే మిగిలిపోయారు. ఆయన తన జీవితంలో నలుగురు మహిళలతో ప్రేమలో పడ్డారు. కొన్నిసార్లు దాదాపు పెళ్లి వరకు వెళ్లినా, పెళ్లి మాత్రం చేసుకోకుండానే మిగిలిపోయారు. ఈ సంగతిని రతన్ టాటా స్వయంగా వెల్లడించారు.దాదాపు పుష్కరం కిందటి ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ ఇంటర్వ్యూలో రతన్ టాటా తన ఆంతరంగికమైన సంగతులను ప్రస్తావించారు. ‘నాలుగుసార్లు ప్రేమలో పడ్డాను. కొన్నిసార్లు దాదాపు పెళ్లి వరకు వెళ్లాను. పరిస్థితుల ప్రభావంతో పెళ్లి మాత్రం జరగలేదు. పెళ్లి చేసుకోవలసిన పనుల్లో తీరికలేకుండా మునిగిపోవడం సహా అనేక కారణాల వల్ల పెళ్లి చేసుకోలేకపోయాను’ అని చెప్పారు. లాస్ ఏంజెలెస్‌లో ఉన్నప్పుడే తొలిసారి ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డానని, కొన్ని పరిస్థితుల వల్ల భారత్‌కు తిరిగి వచ్చేయాల్సి వచ్చిందని తెలిపారు.సిమీ గరేవాల్‌తో ప్రేమాయణంబాలీవుడ్ నటి సిమీ గరేవాల్‌తో రతన్ టాటా ప్రేమాయణం గురించి చాలా కథనాలే వెలువడ్డాయి. సిమీ గరేవాల్ ఒక టీవీ చానెల్ కోసం నిర్వహించిన ‘రెండెజ్వూస్ విత్ సిమీ గరేవాల్’ కార్యక్రమంలో ఒకసారి రతన్ టాటాను కూడా ఇంటర్వ్యూ చేశారు. ఆమె కూడా తన ఇంటర్వ్యూలో ‘ఎందుకు పెళ్లి చేసుకోకుండా ఉండి;yయారు?’ అని రతన్ టాటాను అడిగారు. ఇదిలా ఉంటే, సిమీ గరేవాల్ వేరే ఇంటర్వ్యూలో రతన్ టాటాతో కొంతకాలం తానే డేటింగ్ చేసినట్లు చెప్పారు. తాను సినిమాల్లో బిజీగా ఉంటున్నా, ఇద్దరమూ తరచు కలుసుకునేవాళ్లమని తెలిపారు. రతన్ టాటా మరణం పట్ల సంతానాన్ని వ్యక్తం చేస్తూ ‘నువ్వు వెళ్లిపోయావని అంటున్నారు. నువ్వు లేని లోటును భరించడం చాలా కష్టం.. వీడ్కోలు మిత్రుడా!’ అని గురువారం ఉదయం సిమీ గరేవాల్ ఒక పోస్ట్ పెట్టారు. (చదవండి: రతన్ టాటా నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలివే..!) -
నిశ్చితార్థం ఒకరితో-పెళ్లి మరొకరితో.. మలయాళ నటి వివాహం (ఫొటోలు)
-
అదితి-సిద్ధార్థ్ ఒక్కటైంది ఇక్కడే (చిత్రాలు)
-
హీరోయిన్ అమీ జాక్సన్ రెండో పెళ్లి.. బోట్లో గ్రాండ్ పార్టీ (ఫొటోలు)
-
చై- శోభితల పెళ్లి ఎప్పుడంటే?
హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్లల నిశ్చితార్థం ఈ నెల 8న జరిగిన విషయం తెలిసిందే. అప్పట్నుంచీ వీరి వివాహం ఎక్కడ జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది? అనే చర్చ ఆరంభమైంది. కాగా నాగచైతన్య, శోభితల వివాహం ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది మార్చిలో రాజస్థాన్‌లో జరిగే అవకాశం ఉందనే టాక్ ప్రచారంలోకి వచ్చింది. ఈ ఇద్దరి సినిమా కాల్షీట్స్, వీరి కుటుంబంలోని ముఖ్య సభ్యులు అందుబాటులో ఉండే సమయం వంటి అంశాలు చర్చించుకుని పెళ్లి తేదీ, వివాహ వేదికపై ఇద్దరి కుటుంబ సభ్యులు ఓ స్పష్టతకు వస్తారట. మరి... ఈ ఏడాది చివర్లో నాగచైతన్యతో శోభిత ఏడడుగులు వేస్తారా? లేక వచ్చే ఏడాది మార్చిలో శోభిత మెడలో చైతన్య మూడు ముళ్లు వేస్తారా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. ఇక ప్రస్తుతం నాగచైతన్య ‘తండేల్’ సినిమాతో బిజీగా ఉన్నారు. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు చందు మొండేటి దర్శకుడు. -
పెళ్లి ఫొటోలు షేర్ చేసిన కేకేఆర్ బౌలర్ (ఫొటోలు)
-
భార్యకు మూడు పెళ్లిళ్లు చేయించిన భర్త
మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో వింత ఉదంతం చోటుచేసుకుంది. స్థానికంగా ఇది సంచలనం సృష్టించింది. ఒక భర్త స్వయంగా తన భార్యకు మూడు పెళ్లిళ్లు చేయించాడు. దీని వెనుక గల బాగోతం తెలిసినవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు.ఆ భర్త తన భార్య కోసం ఆర్థికంగా ఉన్నతస్థాయిలో ఉన్నవారి సంబంధాలు చూసేవాడు. ఆమె తన భార్య అని వారికి తెలియకుండా ఆమెకు పెళ్లి జరిపించేవారు. తరువాత ఆమె అత్తవారింటికి వెళ్లి, అక్కడ నగదు, నగలు మూటగట్టుకుని, భర్త దగ్గరకు వచ్చేసేది. తరువాత వారిద్దరూ కలసి అక్కడి నుంచి పరారయ్యేవారు. ఈ విధంగా సదరు భర్త ఆ భార్యకు మూడు పెళ్లిళ్లు చేశాడు. అయితే దొంగ వ్యవహారాలు ఎంతోకాలం దాగవన్నట్లు ఆ మహిళ పోలీసులకు పట్టుబడింది. తాము సాగిస్తున్న వ్యవహారాలన్నీ ఆమె పోలీసుల ముందు ఉంచింది.ఈ ఉదంతం గురించి పోలీసులు మీడియాకు తెలియజేస్తూ డబ్బు సంపాదనకు ఈ భార్యాభర్తలు జనాలను మోసం చేస్తుంటారన్నారు. భర్తే స్వయంగా భార్యకు పెళ్లి చేస్తూ, తాను ఆమెను సోదరుడినని పెళ్లివారిముందు నమ్మబలికేవాడు. ఆమెకు వివాహం జరిగిపించాక వారి ఇంటితో తిష్టవేసి, ఆ ఇంటిలోని నగదు, నగలను తస్కరించేవాడు. ఇందుకు ఆమె సహకారం అందించేంది. లేదంటే ఆమెనే చోరీకి పాల్పడి, భర్త దగ్గరకు వచ్చేసేది. ఈ భార్యాభర్తల వ్యవహారం అత్యంత విచిత్ర పరిస్థితుల్లో బయటపడింది.ఖార్గోన్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మహిళ తన కుమార్తె చాలా రోజులుగా కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన కుమార్తె.. భర్తతో కలిసి దొంగ పెళ్లికూతురి నాటకం ఆడుతోందని ఆమెకు తెలియదు. పోలీసులు విచారణ ప్రారంభించి, ఆ మహిళ అల్లుడిని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. దీంతో పోలీసులు ఆ భార్యాభర్తలను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
Deepak Hooda: మన ఇంటికి స్వాగతం.. ప్రేయసితో క్రికెటర్ పెళ్లి(ఫొటోలు)
-
వింత వివాహం.. వీళ్లకు పెళ్లేంటి? అంటూ పురోహితుడు పరార్
హర్యానాలోని గురుగ్రామ్‌లో జరిగిన వింత పెళ్లి వేడుక స్థానికంగా చర్చనీయాంశంగామారింది. ఇద్దరు యువతులు ఆచార సంప్రదాయాలు పాటిస్తూ, పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహ వేడుకలో ఇతర వివాహాలలో మాదిరిగానే అన్ని వ్యవహారాలు జరిగాయి.మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈ వివాహ వేడుక హల్దీ వేడుకతో మొదలై అప్పగింతలతో ముగిసింది. కవితా టప్పు, అంజు శర్మలు వధూవరులుగా మారి దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. వధువు వేషధారణలో ఉన్న కవిత, వరుడి వేషధారణలో ఉన్న అంజు శర్మ వేదికపై కుర్చీలలో కూర్చుని అతిథుల ఆశీర్వాదాలు అందుకున్నారు.భారతదేశంలో స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధమైన గుర్తింపు లేదు. అయినప్పటికీ వీరి వివాహానికి ఎటువంటి ఆటంకం ఎదురుకాలేదు. ఈ వివాహానికి కవిత, అంజుల కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. అయితే పెళ్లి జరిపించాల్సిన పురోహితునికి తాను ఇద్దరు యువతులకు పెళ్లి చేయాల్సి ఉందని తెలియానే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే వారి బంధువులలో ఒకరు ఆ పురోహితుడిని ఒప్పించి వివాహ వేడుక సవ్యంగా జరిగేలా చూశారు. -
సామూహిక వివాహాల్లో 30 జంటలకు ‘మళ్లీ పెళ్లి’
ప్రభుత్వం పేదలకు మంచి చేయాలనే ఉద్దేశంతో చేపడుతున్న కొన్ని పథకాలు పెడదారి పడుతున్నాయి. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందాలనే ఆశతో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు.ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో జరిగిన సామూహిక వివాహ యోజనలో పలు అక్రమాలు వెలుగు చూశాయి. ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బుతో పాటు ఇంటి సామగ్రి పొందాలనే ఆశతో 30 జంటలు ఈ కార్యక్రమంలో మళ్లీ పెళ్లి చేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే దుర్గ్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు జరిగాయి. 301 జంటలకు వివాహం జరిగింది.ఈ కార్యక్రమానికి సీఎం విష్ణుదేవ్ సాయి కూడా హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే ఇక్కడ వివాహాలు చేసుకున్న జంటలలో 30 జంటలు మళ్లీ పెళ్లిచేసుకున్నాయని మీడియాకు తెలియవచ్చింది. అలాగే ఇక్కడ పెళ్లిళ్లు చేయిస్తామంటూ కొందరు ఏజెంట్ల తయారైన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. వీరు కొందరు జంటల నుంచి సొమ్ము వసూలు చేసినట్లు భోగట్టా. ఒక జంటకు ఇద్దరు పిల్లలను ఉన్నప్పటికీ వారు ఇక్కడ మళ్లీ పెళ్లి చేసుకున్నారని తెలియవచ్చింది.దుర్గ్‌లోని అగ్రసేన్ భవన్లో ఏర్పాటు చేసిన సామూహిక వివాహ కార్యక్రమంలో సినిమా తరహా దృశ్యాలు అనేకం కనిపించాయి. ఒకరు పెళ్లి విషయంలో గొడవ పడుతూ, డబ్బు కోసం పెళ్లి చేసుకున్నట్లు కనిపించింది. అలాగే ఒక ఏజంట్ ఏడు జంటలను మళ్లీ పెళ్లి కోసం తీసుకువచ్చినట్లు నిర్వాహకుల విచారణలో తేలింది. కాగా ఈ ఏజెంట్ ఆ జంటల నుంచి రూ. రెండు వేలు చొప్పున వసూలు చేశాడని సమాచారం. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సామూహిక వివాహాల్లో పెళ్లి చేసుకునే జంటలకు రూ. లక్షతో పాటు ఇతరత్రా సామాను అందిస్తుంటుంది. -
వందేళ్ల యుద్ధ సైనికుని వివాహం.. హాజరైన బైడెన్
రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడిన అమెరికా మాజీ సైనికుడు హెరాల్డ్ టెరెన్స్ తన 100 ఏళ్ల వయసులో ప్రియురాలిని పెళ్లాడి సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ వివాహానికి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.దేశాధినేతలైన బైడెన్, మాక్రాన్‌లు కొత్తగా పెళ్లయిన హెరాల్డ్ టెరెన్స్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. వీరి వివాహం ఫ్రాన్స్, అమెరికాతో పాటు ఇతర దేశాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. హెరాల్డ్ పెళ్లి చేసుకున్న ప్రియురాలికి 96 ఏళ్లు. ఆమె పేరు జీన్ స్వెర్లిన్. వారిద్దరూ ఫ్రాన్స్‌లోని నార్మాండీలోని డి-డే బీచ్‌లలో ఉన్న టౌన్ హాల్లో వివాహం చేసుకున్నారు. 1944 జూన్ 6న అడాల్ఫ్ హిట్లర్ దౌర్జన్యాల నుండి ఐరోపాను విముక్తి చేయడానికి మిత్రరాజ్యాల విమానాలు ఇక్కడే ల్యాండ్ అయ్యాయి. అనంతరం ఇక్కడ భీకర యుద్ధం జరిగింది.హెరాల్డ్ తన పెళ్లికి రెండవ ప్రపంచ యుద్ధంలో తాను పోరాడిన ప్రదేశాన్నే ఎంచుకున్నారు. వీరి వివాహానికి హాజరైన కొందరు రెండవ ప్రపంచ యుద్ధం నాటి దుస్తులు ధరించారు. జీన్ స్వెర్లిన్ గులాబీ రంగు దుస్తులు ధరించగా, టెరెన్స్ లేత నీలం రంగు సూట్ ధరించారు. ఈ సందర్భంగా టెరెన్స్ మాట్లాడుతూ తన పెళ్లి రోజు తన జీవితంలోని ఉత్తమమైన రోజు అని, ప్రేమ అనేది కేవలం యువతీయువకులకు సంబంధించినది మాత్రమే కాదని పేర్కొన్నాడు. వీరి వివాహ విందు ఎలీసీ ప్యాలెస్‌లో జరిగింది. -
హీరోయిన్ మూడో పెళ్లి.. తెలుగులోనూ నటించింది (ఫోటోలు)
-
తొమ్మిదేళ్ల బాలికతో దేవదేవుని వివాహం
రాయదుర్గంటౌన్: అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో శ్రీప్రసన్న వేంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీవారి కల్యాణం తొమ్మిదేళ్ల బాలికతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. దాదాపు ఆరు దశాబ్దాల నుంచి ఇక్కడ కొనసాగుతున్న విశిష్ట సంప్రదాయంలో భాగంగా అరవ తెగకు చెందిన బాలికతో దేవదేవుని కల్యాణం జరిపించారు. స్వామి వారిని వివాహమాడిన ఆ బాలికకు సుగుణ æసంపన్నుడైన భర్త లభిస్తాడని భక్తుల నమ్మకం. ఏటా బ్రహ్మోత్సవాల్లో భాగంగా పద్మశాలి వంశం అరవ తెగకు చెందిన బాలికతో శ్రీవారికి పెళ్లి చేసే సంప్రదాయం ఇక్కడ కొనసాగుతోంది.ఈ ఏడాది రాయదుర్గం పట్టణానికి చెందిన అరవ రమే‹Ù, జయమ్మ దంపతుల కుమార్తె మౌనికతో శ్రీవారి వివాహం జరిపించారు. పెళ్లి పెద్దలుగా శ్రీవారి తరఫున బ్రాహ్మణులు, ఆలయ పాలక కమిటీ సభ్యులు, పుర ప్రముఖులు వ్యవహరించారు. శనివారం ఉదయం మేళతాళాలతో పెళ్లి కూతురు అయిన పద్మావతి (మౌనిక)ని ఊరేగింపుగా మార్కండేయస్వామి ఆలయానికి తీసుకొచ్చారు. అక్కడ పెళ్లికూతురిని అలంకరించి కోటలోని శ్రీవారి సన్నిధి వరకు ఊరేగింపుగా తెచ్చారు. అనంతరం శ్రీవారి ఉత్సవ విగ్రహం ముందు కూర్చోబెట్టారు.వేద మంత్రోచ్ఛారణ మధ్య వివాహం జరిపించారు. అభిజిత్ లగ్న శుభపుష్కరాంశమునందు పురోహితులు మంగళసూత్రాన్ని బాలిక మెడకు తాకించి శ్రీవారి పక్కనే ఉన్న పద్మావతి ఉత్సవ విగ్రహానికి కట్టారు. పసుపు కొమ్ముతో ఉన్న మంగళసూత్రాన్ని బాలిక మెడలో తల్లి కట్టడంతో పెళ్లితంతు ముగిసింది. -
‘సర్.. నేను మీ అమ్మాయిని లవ్ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)
-
లండన్ అమ్మాయి.. మంచిర్యాల అబ్బాయి
మంచిర్యాల: లండన్ అమ్మాయి.. బెల్లంపల్లి అబ్బాయి పరిచయం ప్రేమగా మారింది.. ఒకరి నొకరు ఇష్టపడ్డారు.. దేశాలు వేరైనా మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పాతబెల్లంపల్లి గ్రామానికి చెందిన కర్రె రాజు కొన్నాళ్ల క్రితం లండన్‌కు వెళ్లాడు. అక్కడ ఓ షాపింగ్ మాల్లో పని చేస్తుండగా డయానా అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమకు దారి తీసింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి సొంతంగా వ్యాపారం చేస్తున్నారు. ఆచారాలు, సంప్రదాయాలు వేరైనా పెద్దల సమక్షంలో హిందూ సంప్రదాయబద్దంగా పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. బెల్లంపల్లిలోని ఏఆర్ కన్వెన్షన్‌లో గురువారం రాజు డయానాకు తాళి కట్టి తన జీవిత భాగస్వామిని చేసుకున్నాడు. చీరకట్టుతో పెళ్లిపీటలపై కూర్చున్న వధువు డయానా అందరి దృష్టిని ఆకర్శించింది. వీరి పెళ్లికి వధువు తల్లిదండ్రులు రాకపోవడంతో రాజు కుటుంబీకులు అన్నీ తామై వ్యవహరించి పెళ్లి జరిపించారు. -
Infosys Sudha Murty: పుస్తకం కలిపింది ఇద్దరినీ
1974. సరిగ్గా యాభై ఏళ్ల క్రితం మొదటిసారి సుధామూర్తి, నారాయణమూర్తి పూణెలో కలిశారు. వారి మధ్య ప్రేమ చిగురించడానికి దోహదం చేసింది పుస్తక పఠనం. ఆ ప్రేమ కథ ఏమిటో 50 ఏళ్ల తర్వాత ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 2024’లో పంచుకున్నారు సుధామూర్తి. తమ సుదీర్ఘ వైవాహిక జీవితం సఫలం కావడానికి ఇద్దరూ తీసుకున్న జాగ్రత్తలు చెప్తూ ఈనాటి యువతకు అనుభవంతో నిండిన సూచనలు చేశారు. అందమైన ప్రేమకథలు, సఫలమైన ప్రేమకథలు తెలుసుకోవడం బాగుంటుంది. ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో ఫిబ్రవరి 5న ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి పాల్గొన్నారు. చిత్రా బెనర్జీ దివాకరుని రాసిన బయోగ్రఫీ ‘యాన్ అన్‌కామన్ లవ్: ది ఎర్లీ డేస్ ఆఫ్ సుధా అండ్ నారాయణమూర్తి’ విడుదలైన సందర్భంగా తనకు నారాయణమూర్తికీ మధ్య ఎలా ప్రేమ పుట్టిందో కొద్దిగా సిగ్గుపడుతూ, ముసిముసిగా నవ్వుకుంటూ గుర్తు చేసుకున్నారు. ఆ ప్రేమ కథ వినండి. 1974 అక్టోబర్. పూణెలోని ‘టెల్కొ’లో మొదటి మహిళా ఇంజనీరుగా చేరిన సుధ రోజూ కంపెనీ బస్‌లో వచ్చి వెళుతుండేవారు. ప్రసన్న ఆమె కొలీగ్. అతను ఏదో ఒక పుస్తకం చదువుతుంటే ఏ పుస్తకమా అని సుధ తొంగి తొంగి చూసేవారు. అతను చదివే ప్రతి పుస్తకం మీద ఒకే పేరు ఉండేది... మూర్తి అని. ఒకరోజు ఉండబట్టలేక ‘ఎవరీ మూర్తి’ అని అడిగారు సుధ. ‘నా రూమ్మేటు. పుస్తకాల పిచ్చోడు. చాలా పుస్తకాలు చదువుతాడు’ అన్నాడు ప్రసన్న. ‘నీకూ పుస్తకాల పిచ్చేగా. కావాలంటే పరిచయం చేస్తానురా’ అన్నాడు. ‘అమ్మో... బేచిలర్ల రూముకు వెళ్లడమా’ అని సుధ జంకారు. కాని కుతూహలం పట్టలేక ‘ఫలానా రోజున ఐదు నిమిషాలకు వచ్చి వెళతా’ అని ఫిక్స్ చేశారు. అప్పటి నుంచి ఆమె ఆలోచనలు రకరకాలుగా సాగాయి. ఈ మూర్తి ఎలా ఉంటాడు? పొడవుగా ఉంటాడా... రింగుల రింగుల జుట్టుతో ఉంటాడా.. షోగ్గా (అప్పటికి హిందీ సినిమాల ఫ్యాన్ కాబట్టి) రాజేష్ ఖన్నాలా ఉంటాడా అని ఒకటే ఊహలు. తీరా రూముకు వెళ్లేసరికి దళసరి కళ్లద్దాల బక్కపలచటి యువకుడు ఎదురుపడ్డాడు. సుధని చూసి, ఆమెకు పుస్తకాలంటే ఇష్టమని తెలిసి తన దగ్గరున్న పుస్తకాలన్నీ చూపించాడు. ఆమె బయల్దేరే ముందు అబ్బాయిలు వేసే పాచిక ‘కావాలంటే తీసుకెళ్లి చదివి ఇవ్వు’ అన్నాడు. కొన్నిరోజుల తర్వాత ‘మనం డిన్నర్ చేద్దామా’ అని ఆహ్వానించాడు. దానికీ భయమే సుధకు. ‘వస్తా. కాని మన కామన్ఫ్రెండ్ ప్రసన్న కూడా మనతో ఉండాలి. నా వాటా బిల్లు డబ్బులు నేనే కడతా’ అందామె. వారి స్నేహం బలపడింది. ఒకరోజు నారాయణమూర్తి ధైర్యం చేసి సుధతో చెప్పాడు– ‘ఆరోజు నువ్వు మొదటిసారి నా రూమ్‌కు వచ్చి వెళ్లాక అంతవరకూ లేని వెలుగు వచ్చినట్టయ్యింది. జీవితం పట్ల ఇంత ఆసక్తి ఉన్న అమ్మాయిని నేను చూళ్లేదు’... ఆ మాటలే ప్రేమను ప్రపోజ్ చేయడం. ఆమె సంతోషంగా నవ్వడమే ప్రేమను అంగీకరించడం. ప్రేమ మొదలైన నాలుగేళ్లకు సుధ.. సుధామూర్తి అయ్యారు. ‘నారాయణమూర్తి, నేను భిన్నధృవాలం. నేను అన్నింటికీ మాట్లాడతాను. అతను అసలు మాట్లాడడు. నాకు అన్నింట్లో జోక్యం కావాలి. అతను అవసరమైతే తప్ప జోక్యం చేసుకోడు. మా జీవితంలో అనంగీకారాలు, ఆర్గ్యుమెంట్లు లేవని కాదు. ఇన్ఫోసిస్ మొదలెడుతున్నప్పుడు నువ్వు ఇందులో ఉండకూడదు అన్నాడు నారాయణమూర్తి. ఐదేళ్లు నేను పిల్లల్ని చూసుకుంటూ ఉండిపోయాను. అప్పుడప్పుడు కొంత చివుక్కుమంటూండేది. కాని తర్వాత ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌కు చైర్మన్‌గా నేను సామాజిక సేవతో ఎందరి జీవితాలకో చేయూతనిచ్చి తృప్తి పొందాను. వైవాహిక బంధంలో భార్యాభర్తలు ఎవరిని వారులా ఉండనివ్వాలి. నారాయణమూర్తి కోరుకున్నట్టుగా నేను అతణ్ణి ఉండనిచ్చాను, నాలా నన్ను అతను ఉండనిచ్చాడు’ అన్నారామె. ‘ఇన్ఫోసిస్ పెట్టాక అతి కష్టమ్మీద ఒక క్లయింట్ దొరికాడు. కాని పేమెంట్స్ ఇష్టమొచ్చినప్పుడు ఇచ్చేవాడు. నారాయణమూర్తికి ఉద్యోగుల జీతాలు సమయానికి చెల్లించాలని నియమం. అతను టెన్షన్ పడుతుంటే– ఎందుకంత టెన్షన్... నగలు బ్యాంకులో కుదవ పెట్టి డబ్బు తెస్తాను. సర్దుబాటు చేసుకో అన్నాను. నారాయణమూర్తి కదిలిపోయాడు. ఎందుకంటే ఏదో అవసరం వచ్చి గతంలో తల్లి నగలు కుదువ పెట్టాల్సి వచ్చిందట. అవి విడిపించుకోలేకపోయారు. అది గుర్తొచ్చి వద్దు వద్దు అన్నాడు. ఏం పట్టించుకోకు.. లోను తీసుకోవడానికి సెంటిమెంట్లు ఏమిటి అని తెచ్చి ఇచ్చాను. ఆ రోజు గాజులు లేని నా బోసి చేతులను చూసి నారాయణమూర్తి చాలా బాధ పడ్డాడు. కొన్నాళ్లకు విడిపించాడనుకోండి. ఈ మాత్రం సర్దుబాట్లు కాపురంలో అవసరం’ అన్నారామె. వైవాహిక బంధం ఎలా నిలబడుతుంది? ఆడియెన్స్‌లో ఎవరో అడిగారు. ‘నమ్మకం, సహనం, సర్దుబాటుతనం వల్ల మాత్రమే. జీవితంలో సహనం ముఖ్యమైనది. సహనంగా ఉంటే జీవితం మనకు కావలసినవి ఇస్తుంది. వైవాహిక జీవితంలో అనుకున్నవన్నీ చేసే స్వేచ్ఛ, వీలు లేకపోవచ్చు. అప్పుడు ఉన్న పరిమితుల్లోనే ఎలా ఆనందంగా ఉండాలో తెలుసుకోవాలి. నారాయణమూర్తి ఇన్ఫోసిస్ మొదలుపెట్టి బిజీగా ఉండగా నేను ఐదేళ్లూ పిల్లల్ని చూసుకుంటూ కూడా పుస్తకాలు రాసి సంతోషపడ్డాను. వీలైనంతగా కొత్త ప్రాంతాలు చూశాను. మగవాళ్లకు సాధారణంగా ఆడవాళ్లు తమ కంటే తెలివితక్కువగా ఉండాలని ఉంటుంది. అవసరమైతే వారిని అలా అనుకోనిచ్చేలా చేస్తూ స్త్రీలు తమ సామర్థ్యాలను వీలైనంత ఉపయోగించుకోవాలి. జీవితంలో, వైవాహిక జీవితంలో రాణించాలి’ అన్నారు సుధామూర్తి. – జైపూర్ నుంచి సాక్షి ప్రతినిధి -
Rakul Marriage: ఫిబ్రవరిలో పెళ్లి?
జాకీ భగ్నానీ, రకుల్‌ప్రీత్ సింగ్ ఫిబ్రవరిలో ఏడడుగులు వేయనున్నారనే వార్త గుప్పుమంది. హీరోయిన్ రకుల్, హీరో–నిర్మాత జాకీ దాదాపు రెండు మూడేళ్లుగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్లాలని ఈ ఇద్దరూ నిర్ణయించుకున్నారట. ఫిబ్రవరి 22న పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని సమాచారం. గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారట. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో రకుల్, జాకీల పెళ్లి జరగనుందని భోగట్టా. సోమవారం ఈ పెళ్లి వార్త వైరల్‌గా మారినప్పటికీ రకుల్, జాకీ నుంచి ఎలాంటి స్పందన లేదు. -
పెందుర్తిలో టీడీపీ నేత రాక్షసత్వం
పెందుర్తి: విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో టీడీపీ నేతల దుశ్శాసన పర్వం కొనసాగుతోంది. చింతగట్ల పంచాయతీ నందవరపువానిపాలెంలో ఒంటరిగా నివసిస్తున్న ఓ మహిళపై పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు చీపురపల్లి నరసింగరావు రాక్షసంగా దాడి చేయడంతో పాటు ఆమె వద్ద ఉన్న రూ.5 లక్షలు, బంగారు ఆభరణాలను తస్కరించాడు. తీవ్ర గాయాలతో దాదాపు నాలుగు రోజుల పాటు నిందితుడు, అతడి కుటుంబ సభ్యుల చేతిలో బందీగా ఉండి సక్రమంగా చికిత్స అందక నరకయాతన అనుభవించిన ఆ అభాగ్యురాలు.. తెగించి శనివారం పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలు.. బాధితురాలి కథనం ప్రకారం.. విజయనగరం జిల్లాకు చెందిన మహిళ భర్తతో విభేదాల కారణంగా విశాఖ గోపాలపట్నం ప్రాంతంలో బ్యుటీషియన్‌గా పనిచేసేది. మూడేళ్ల కిందట నందవరపునవానిపాలెంలో చింతగట్ల పంచాయతీ టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న చీపురపల్లి నరసింగరావు వద్ద ఇంటి స్థలాన్ని కొని అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంది. ఈ క్రమంలో ఇంటి స్థలం కొన్న చనువుతో ఆమె వద్దకు తరచూ నరసింగరావు వస్తూ ఆమెను లోబరుచుకున్నాడు. ఎంతో ప్రేమ నటిస్తూ ఆరి్థక అవసరాలు కూడా తీర్చుకునేవాడు. ఈ వ్యవహారంలో నరసింగరావు భార్య చిన్ని కూడా ‘నువ్వు లేకపోతే నా భర్త ఉండలేడు.. మీ ఇద్దరూ కలిసి ఉండండి’ అంటూ బాధితురాలిని ఒప్పించడం గమనార్హం. ఇలా సహజీవనం సాగిస్తున్న తరుణంలో నరసింగరావు ప్రవర్తనలో మార్పు రావడంతో అతడిని దూరం పెట్టింది. యాసిడ్‌తో దాడి చేసి.. నరసింగరావుకు ఆమె దూరంగా ఉండటంతో అతడు సహించలేకపోయాడు. ఆమె ఇంటికి వెళ్లి కొడుతూ ఉండేవాడు. అలా నరసింగరావు వేధిస్తూ ఉంటుంటే.. అతడి భార్య చిన్ని వచ్చి బాధితురాలికి సర్ది చెబుతూ ఉండేది. ఈ క్రమంలో ఈ నెల 7 మధ్యాహ్నం 2.30 సమయంలో నరసింగరావు ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఆమె దుస్తులు చింపేసి యాసిడ్‌ను ఆమెపై చల్లాడు. దీంతో ఆమె ఛాతి భాగం కాలిపోయింది. అంతటితో ఆగకుండా ఆమె పొత్తికడుపు, మెడపై పిడిగుద్దులు గుద్దుతూ పేట్రేగిపోయాడు. బాధితురాలు అపస్మారక స్థితికి వెళ్లిపోవడంతో ఆమె బీరువాలోని నగదు, బంగారు ఆభరణాలను దొంగిలించాడు. ఇంట్లో గొడవను గుర్తించిన స్థానికులు రావడంతో నిందితుడు నరసింగరావు గోడ దూకి పారిపోయినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అయితే బాధితురాలికి ఏదైనా అయితే తన మెడకు చుట్టుకుంటుందన్న భయంతో ఆమెను నరవలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించాడు. తన భార్య, కుటుంబ సభ్యులను ఆమె వద్ద కాపాలా ఉంచి అరకొర చికిత్సను అందించాడు. ఈ నాలుగు రోజుల పాటు ఆమె ఎక్కడుందో ఆమె బంధువులకు కూడా తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే ఆస్పత్రి నుంచి బాధితురాలు బయటికొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మెరుగైన చికిత్స నిమిత్తం ఆమెను కేజీహెచ్‌కు తరలించినట్టు పోలీసులు చెప్పారు. -
సీన్ మారింది
పెళ్లయిన కథానాయికలు సినిమాల్లో కొనసాగాలంటే ‘కీ’ రోల్స్‌తో సరిపెట్టుకోవాల్సిందే అనే సీన్ మారిపోయింది. పెళ్లయినా, తల్లయినా ‘లీడ్’ రోల్స్ చేయొచ్చనే సీన్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఫార్టీకి దగ్గర్లో, ఫార్టీ ప్లస్ తారలు లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ లీడ్ లేడీస్‌గా, రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో హీరోల సరసన నటిస్తూ దూసుకెళుతున్నారు. హాలీవుడ్లో ఫార్టీ, ఫిఫ్టీ ప్లస్ తారలు కూడా లీడ్ రోల్స్ చేస్తున్నట్లు ఇండియన్ హీరోయిన్లు చేయడం ఓ శుభ పరిణామం. ఇక ఆ కథానాయికలు చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. ►లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్న నయనతార చేతిలో ఎప్పుడూ మూడు నాలుగు సినిమాలు ఉంటాయి. వాటిలో లేడీ ఓరి యంటెడ్ మూవీస్ మినిమమ్ మూడు అయినా ఉంటాయి. ప్రస్తుతం ఆమె కథానాయికప్రాధాన్యంగా చేస్తున్న చిత్రాల్లో ‘అన్నపూరణి’ (అన్నపూర్ణ), ‘టెస్ట్’ ఉన్నాయి. ‘అన్నపూరణి’ నయనకి 75వ చిత్రం. డిసెంబరు 1న విడుదల కానున్న ఈ చిత్రంలో బ్రాహ్మణ యువతిగా నటించారు నయన. ఈ చిత్రం టీజర్లో మాంసాహారానికి సంబంధించిన బుక్ చదువుతూ కనిపించారామె. ఇక మరో చిత్రం ‘టెస్ట్’. ఇందులో మాధవన్, సిద్ధార్థ్, నయనతార లీడ్ రోల్స్‌లో కనిపిస్తారు. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ముగ్గురి జీవితాలు క్రికెట్‌తో ఎలా ముడిపడ్డాయనేది ఈ చిత్రం కథాంశం. ► హీరో సూర్యను పెళ్లి (2006) చేసుకుని సుమారు పదేళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన జ్యోతిక 2015 నుంచి ఇప్పటివరకూ దాదాపు డజను కథానాయికప్రాధాన్యంగా సాగే చిత్రాల్లో నటించారు. ఆ తరహా చిత్రాలు మరిన్ని చేయడానికి కథలు వింటున్న జ్యోతిక ఇరవయ్యేళ్ల తర్వాత ఇటీవల హిందీలో ‘శ్రీ’, ‘బ్లాక్ మ్యాజిక్’ చిత్రాల్లో లీడ్ రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే మలయాళంలో ‘కాదల్–ది కోర్’ అనే చిత్రంలో ముమ్ముట్టితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. పదేళ్ల తర్వాత జ్యోతిక మలయాళంలో చేస్తున్న చిత్రమిది. ఇరవయ్యేళ్ల తర్వాత హిందీలో, పదేళ్ల తర్వాత మలయాళంలో సినిమాలు ఒప్పుకున్నారంటే నటిగా తన కెరీర్‌ని ఇంకా విస్తరించేలా జ్యోతిక ప్లాన్ చేసుకుంటున్నారని ఊహించవచ్చు. ►హీరో ఉపేంద్ర భార్య, నటి ప్రియాంక ఓ ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సింగిల్ లెన్స్‌తో తీసిన తొలి చిత్రం ‘క్యాప్చర్’లో ఆమె లీడ్ రోల్ చేశారు. ఒక నటి లీడ్ రోల్ చేసిన ఈ చిత్రానికి లీడ్ రోల్స్ చేస్తూ దూసుకెళుతున్న మరో నటి రాధికా కుమారస్వామి సమర్పకురాలిగా వ్యవహరించడం విశేషం. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఇలా ఏజ్‌తో సంబంధం లేకుండా తగ్గేదే లే అంటూ లీడ్ రోల్స్ చేస్తున్న తారలు ఇంకొందరు ఉన్నారు. ►కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి భార్య, నటి రాధికా కుమారస్వామి ఒకేసారి రెండు ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రాలు ‘అజాగ్రత్త’, ‘భైరా దేవి’లో నటిస్తున్నారు. ‘భైరా దేవి’ సినిమాలో ఆమె అఘోరాగా కనిపించనున్నారు. ఇక ‘అజాగ్రత్త’ ఏడు భాషల్లో విడుదల కానుంది. మామూలుగా స్టార్ హీరోల చిత్రాలు పాన్ ఇండియాగా పలు భాషల్లో విడుదలవు తుంటాయి. కథానాయికప్రాధాన్యంగా సాగే ఓ సినిమా ఏడు భాషల్లో పాన్ ఇండియాగా రిలీజ్ కావడం అంటే చిన్న విషయం కాదు. ►నలభయ్యేళ్ల వయసులో ఉన్న తారల్లో త్రిష ఒకరు. ఈ బ్యూటీ ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాల్లో కన్నా రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో హీరోల సరసన నటిస్తూ బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం అజిత్ సరసన తమిళంలో ‘విడా ముయర్చి’, మోహన్‌లాల్‌తో మలయాళంలో ‘రామ్’ చిత్రాల్లో నటిస్తున్నారు త్రిష. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో ‘పొన్నియిన్ సెల్వన్ 2’లో యువరాణిగా కనిపించిన త్రిష గత నెల విజయ్ సరసన ‘లియో’తో పాటు ‘ది రోడ్’ అనే ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలో కనిపించారు. -
15 ఏళ్లకే అమ్మ.. 33కు అమ్మమ్మ.. కొత్త ట్విస్ట్ ఇదే!
తల్లి అయ్యే వయసులో అమ్మమ్మగా మారిన ఓ మహిళ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఆమె హృదయం ఇప్పుడు మరొకరిని కోరుకుంటోంది. ఆమె ఆ దేశంలో అతి పిన్న వయస్కురాలైన అమ్మమ్మ టైటిల్‌ను గెలుచుకుంది. ఇప్పుడు ఆ మహిళ తన 34 ఏళ్ల వయసులో మరోసారి పెళ్లికూతురుగా ముస్తాబవుతోంది. రేచెల్ మెక్‌ఇంటైర్ అనే మహిళ యునైటెడ్ కింగ్డమ్లో ఉంటోంది. మీడియా కథనాల ప్రకారం ఆమె ప్రపంచంలోనే అత్యంత పిన్నవయస్కురాలైన అమ్మమ్మ. కుమార్తెకు జన్మనిచ్చినప్పుడు రేచెల్ వయసు కేవలం 15 సంవత్సరాలు. పెరిగి పెద్దయిన ఆ కుమార్తెకు వివాహం జరిగింది. ఆమె కూడా ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. ఫలితంగా రేచెల్ తన 33 సంవత్సరాల వయసులో అమ్మమ్మగా మారింది. రేచెల్ జీవిత చిత్రం ఎంతో ఆసక్తికరం. ఈ అమ్మమ్మ ఇప్పుడు మరోమారు పెళ్లికూతురు అవుతోంది. మూరత్ అనే యువకుడిని ప్రేమిస్తున్నట్లు రేచెల్ తన కుమార్తెకు చెప్పింది. వీరి ప్రేమకు కుమార్తె కూడా మద్దతు పలికింది. కొంతకాలం క్రితం ఆమె మూరత్తో తొలి చూపులోనే ప్రేమలో పడింది. ఆ తర్వాత ఇద్దరూ దగ్గరయ్యారు. ‘మూరత్ ప్రవర్తన నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అందుకే అతనిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నా నిర్ణయానికి నా కుమార్తె కూడా మద్దతు తెలిపిందంటూ’ పెళ్లి కుమార్తెగా మారబోతున్న రాచెల్ సంబరపడుతూ మీడియాకు తెలిపింది. ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్ ఎన్నికలతో భారత్, పాక్, చైనాలకు లింకేమిటి? -
Amala Paul Second Marriage Pics: రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
-
ఇవాళే సౌభాగ్యదాయిని ‘అట్లతద్ది’!
అట్లతద్ది ముఖ్యంగా స్త్రీలు జరుపుకునే పండుగ. ‘తదియ’ నే ‘తద్దె’ అంటారు. ఉండ్రాళ్ల తద్దె , అట్ల తద్దె అనేవి అలా వచ్చినవే. ఆశ్వయుజ బహుళ తదియనాడు దీనిని జరుపుకుంటారు. దీనినే ఉయ్యాల పండుగ అనీ , గోరింటాకు పండుగ అనీ అంటారు. అసలు ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారు? దాగున్న ఆరోగ్య రహస్యాలు ఏమిటీ? తదితరాల గురించే ఈ కథనం!. ఈ పండుగకు గోరింటాకు పెట్టుకోవడం చాలా ముఖ్యం అట్లతద్దె ఈ తద్ది ప్రసిద్దమైనది. ఆంధ్ర ఆడపడుచులకు చాల ముఖ్యమైన పండుగ. అట్లతద్ది ముందురోజు భోగి అని పిలుస్తారు. ఆడపిల్లలందరూ చేతులకు, కాళ్ళకు గోరింటాకు పెట్టుకుని తెల్లవారుఝామునే లేచి ఉట్టి కింద కూర్చుని చద్దన్నం తింటారు(ఇప్పుడు ఉట్లు లేవు లెండి) ఆటపాటలతో కాలక్షేపం చేసి ఉయ్యాలలూగుతారు! పగలంతా ఉపవాసముండి సాయంకాలం చంద్రోదయం అయిన తరువాత చంద్రదర్శనం చేసుకుని 'చంద్రోదయోమా వ్రతం' చేసి అట్లు దానమిచ్చి , ఉమాదేవిని పూజించి భోజనం చేస్తారు. ఈ అట్లతద్దికి గోరింటాకును పెట్టుకోవడం చాల ముఖ్యం! చర్మ వ్యాధులు రాకూడదని.. గోరింట అంటే గోరు+అంటు= గోరింట అని బ్రౌణ్యం చెపుతోంది. సంస్కృతంలో కూడ దీన్ని నఖరంజని అంటారు. దీన్ని బట్టి చూస్తే గోరింటాకు గోర్లకు మంచిది అని తెలుస్తుంది. ఈ గోరింటాకు ఎంత బాగా పండితే అంత మంచి మొగుడొస్తాడని సరసాలడతారు. గ్రీష్మఋతువులోని ఆషాఢమాసంలోనూ వర్షఋతువులోని భాద్రపద మాసంలోనూ శరదృతువులోని ఆశ్వయుజ మాసంలోనూ మూడు సందర్భాలలో గోరింటాకును పెట్టుకుంటారు. ఇవి మూడు వానకారు పబ్బాలుగా ప్రసిద్ది! తెల్లవారుఝాము నుంచీ ఆడపిల్లలు పాడుతూ ఆడుకునే పాటలలో ఎన్నో ఆరోగ్యరహస్యాలను పొందుపరిచారు. ఇళ్ళల్లో నీళ్ళతావుల్లో తిరిగే ఆడవాళ్ళకు చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వాటికి వాడవలసిన మందులను తెలిపే పాట.... 'కాళ్ళగజ్జ కంకాళమ్మ వేగుచుక్క వెలగామొగ్గ మొగ్గా కాదు మోదుగనీరు నీరుకాదు నిమ్మలబావి బావికాదు వావిటికూర కూరకాదు గుమ్మిడిపండు పండుకాదు పాపిడిమీసం' కాళ్ళకు గజ్జి లాంటి చర్మవ్యాధులొస్తే కంకాళమ్మ ఆకును నూరి పసరుతీసి రాస్తే గజ్జి పోతుంది. దానికి లొంగకపోతే వెలగ మొగ్గను నుజ్జుచేసి శరీరంపై పూసుకోవాలి. అప్పటికీ తగ్గకపోతే వావిటికూరను ముద్దగాజేసి పట్టీలు వేసుకోవాలి అప్పుడు ఆ వ్యాధి నిమ్మళించి గుమ్మడి పండులాగ నిగనిగలాడతారని ఈ పాటలో చెప్పారు! అలాగే గోరింటాకు పెట్టుకున్నగోళ్ళు వాటి రంగులు చూసుకుంటూ 'చిప్పచిప్ప గోళ్ళు సింగరాజు గోళ్ళు' అని పాడుకుంటారు. 'ఒప్పులకుప్ప ఒయ్యారిభామా సన్నబియ్యం ఛాయాపప్పు మునగాపప్పూ నీమొగుడెవరు గూట్లోరూపాయి నీమొగుడు సిపాయి' అని ఈరోజు ఉదయంనుంచి తయారు చేసిన పదార్ధాల మూలాలను తలచుకుంటూ వీర్యవృద్ధి కలిగిన ఈ పిండివంటలన్నీ రాబోయే మొగుడికోసమేనని మేలమాడుతూ రోటిపాటలు పాడతారు.ఆ రోళ్ళకు ఉయ్యాలలు కట్టి ఊయలలూపుతూ పెళ్ళయిన పడుచులను మొగుడిపేరు గట్టిగా చెప్పేదాకా వదలకుండా ఊపుతారు. పెట్టుకున్న గోరింటాకు ఎలా పండిందో చూసుకుని మురిసిపోతూ ... 'గోపాలకృష్ణమ్మ పెళ్ళయ్యేనాడు గోరింట పూచింది కొమ్మలేకుండా మాఇంట అబ్బాయి పెళ్ళయ్యేనాడు మల్లెలు పూచాయి మొగ్గలేకుండా' ఈ సంప్రదాయ స్త్రీ పాటనే కృష్ణశాస్త్రిగారు తమపాట పల్లవిగా మలచుకున్నారు. తరువాత వారి చరణమే 'మందారంలా పూస్తే మంచిమొగుడొస్తాడు గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు సిందూరంలా పూస్తే చిట్టిచేయంతా అందాల చందమామ అతనే దిగివస్తాడు' అనుకుంటూ చంద్రోదయోమావ్రతం చేసుకుంటారు! ఇవన్నీ నిన్నామొన్నటి వరకు పల్లెపడుచుల అట్లతద్ది ఆటపాటలు. బహుశః ఏ పైలోకాలలోనో తెలుగు ఆడపడుచులకు వాళ్ళ చిన్నతనంలోని పాటలన్నీ వినాలనిపించిందేమో ... ఈ పాటల ఊయలలను తీసుకుపోయి అందనంత ఎత్తులో వాళ్ళదగ్గరే ఉంచేసుకున్నారు. కానీ ఊయలెప్పుడూ ఒకేచోట ఉండదు! అది కిందకు రాక తప్పదు!! మళ్ళీ ఈ అట్లతద్ది ఆటపాటలు మాకందివ్వకా తప్పదు!!! ఈ తరం పడుచులందరికీ ఒకటే వినతి! రండి లేవండి తెల్లవారు ఝామునే చద్దన్నం తిని మన ఆటపాటల ఊయలను మనమే పట్టుకుందాం రండి!! 'అట్లతద్దోయ్ ఆరట్లోయ్ ముద్దపప్పోయ్ మూడట్లోయ్ సీమ పచ్చిమిరపకాయ్ చిఱ్ఱో చిఱ్ఱో నీ మొగుడు కొడితే మొఱ్ఱో మొఱ్ఱో' అట్లతద్ది అంతరార్థం త్రిలోక సంచారి అయిన నారదముని ప్రోద్బలంతో గౌరీదేవి శివుని పతిగా పొంద గోరి మొదటి సారిగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్త్రీలు సౌభాగ్యం కోసమై చేసుకునే వ్రతం ఇది. చంద్రారాధన వల్ల చంద్రకళల్లో కొలువై ఉన్న శక్తి వ్రతం చేసిన వారికి వస్తుందని , ఆయన అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని , కుటుంబంలో సుఖశాంతులు వర్థిల్లుతా యని శాస్త్ర వచనం. ఈ పండుగలో అమ్మవారికి అట్లని నైవేద్యంగా పెట్టడంలో ఒక అంతరార్థం దాగి ఉంది. నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే మహా ప్రియం. అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోషం పరిహారమై సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులూ రావని నమ్మకం. రుతుచక్రం సరిగా ఉండేలా చేసి కాపాడతాడు. అందువల్ల గర్భధారణలో ఎటువంటి సమస్యలూ ఉండవు. మినపపిండి , బియ్యపు పిండిని కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువుకు , బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు. గర్భ దోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనంగా ఇవ్వాలి. బియ్యం , మినప్పప్పు కలిపి చేసిన అట్లను అమ్మవారికి నివేదించటంలో సమస్త గ్రహాలు కూడా శాంతించి జీవితాన్ని సుఖవంతంగా ఉండేటట్లుగా అనుగ్రహిస్తుందని నమ్మకం. అమ్మవారి నైవేద్యం ఆరోగ్యాన్ని , శక్తిని కలిగిస్తుంది. ఈ పండుగను అవివాహిత స్త్రీలు చేస్తే మంచి మొగుడు వస్తాడని, పెళ్లైన వారు చేస్తే సౌభాగ్యం కలకలం ఉంటుందని శాస్త్ర వచనం. (చదవండి: కోరికలు కలలోని పూదోటలు! వాటి కోసం పరుగులు తీస్తే చివరికి..) -
పెళ్లికి ఎస్
హీరోయిన్ అమలా పాల్ తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈవెంట్ మేనేజర్ జగత్ దేశాయ్‌ను పెళ్లాడనున్నారు అమలా పాల్. గురువారం (అక్టోబరు 26) ఆమె బర్త్ డే. ఈ సందర్భంగా అమలా పాల్‌కు తాను ప్రపోజ్ చేసిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి, ‘‘నా కలల రాణి నాకు ‘ఎస్’ చెప్పింది. వెడ్డింగ్ బెల్స్, హ్యాపీ బర్త్ డే మై లవ్’ అని పేర్కొన్నారు జగత్ దేశాయ్. సో.. జగత్ దేశాయ్, అమలా పాల్ ఒకింటివారు కానున్నారని స్పష్టమవుతోంది. ఇక 2014లో తమిళ దర్శక–నిర్మాత ఏఎల్ విజయ్‌తో అమలా పాల్ వివాహం జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. అయితే ఈ ఇద్దరూ 2017లో విడాకులు తీసుకున్నారు. -
సగం కాలిన శవంతో రోడ్డుపై ఆందోళన
బీహార్‌లోని మోతిహరిలో ఒక నవవివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కట్నం కోసమే అత్తింటివారు తమ అమ్మాయిని హత్య చేశారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కుమార్తెను హ్యత చేసి, మృతదేహానికి రహస్యంగా దహన సంస్కారాలు నిర్వహిస్తుండగా, తమకు గ్రామస్తుల ద్వారా విషయం తెలియడంతో, తాము పెంటనే ఇక్కడికి వచ్చామని వారు తెలిపారు. గ్రామానికి వచ్చిన మృతురాలి కుటుంబ సభ్యులు చితిపై మండుతున్న మృతదేహాన్ని బయటకు తీసి రోడ్డుపై ఆందోళనకు దిగారు. తమ కుమార్తె చేతులు, కాళ్లు కట్టేసి, ఆమె గొంతునొక్కి చంపేశారని మృతురాలి తల్లి ఆరోపించింది. కాగా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థాలానికి చేరుకుని, మృతురాలి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టంనకు తరలించారు. పోలీసులు మృతురాలిని సుగౌలీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శ్రీపుర్ గోపాల్‌పుర్ నివాసి పారస్ వర్మ కుమార్తె ఫూల్‌పరి దేవి(20)గా గుర్తించారు. మృతురాలి తండ్రి గతంలోనే మరణించాడు. దీంతో తల్లి కూలీనాలీ చేస్తూ కుమార్తెను చదివించింది. మృతురాలి తల్లి రామ్‌వతి మాట్లాడుతూ తన కుమార్తెకు టోలా గ్రామానికి చెందిన సుభుశ్ శర్మ కుమారుడు నితేష్ కుమార్‌తో ఈ ఏడాది మార్చ 8న వివాహం చేశానని తెలిపారు. పెళ్లయిన తరువాత నుంచి అత్తింటివారు తమ కుమార్తెను వరకట్న వేధింపులకు గురిచేశారన్నారు. ఐదు లక్షల రూపాయలతో పాటు ఒక బైక్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ఆమె తెలిపింది. పెళ్లయిన నాటి నుంచి తమ కుమార్తెను వేధింపులకు గురిచేశారని ఆమె ఆరోపించింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: దేశంలో తొలి సామూహిక గణేశ ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? అంతకుముందు ఏం జరిగింది? -
భార్య ప్రేమను అర్థం చేసుకుని.. ప్రియునితో పంపించాడు!
సినిమాను తలపించే కథ యూపీలోని దేవరియాలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక యువకుడు ఇటీవలే వేరొకరితో పెళ్లయిన తన ప్రియురాలిని కలుసుకునేందుకు ఆమె ఇంటికి వచ్చాడు. విషయమంతా తెలుసుకున్న ఆ యువతి భర్త తన భార్యకు ఆమె ప్రియునితో వివాహం జరిపించాడు. ఈ ఉదంతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దేవరియా జిల్లాలోని బరియార్‌పుర్ నగర్ పంచాయతీలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక యువకునికి ఏడాది క్రితం బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన ఒక యువతితో వివాహం జరిగింది. వీరి కాపురం అంతా సవ్యంగానే జరుగుతున్నదనుకునేంతలో ఉన్నట్టుండి ఆమె ప్రేమికుడు వారింటికి వచ్చాడు. దీనిని చూసిన చుట్టుపక్కలవారు అతడిని చితకబాదారు. అయితే ఇంతలో ఆమె భర్తకు గతంలో ఆ యువకునితో గల ప్రేమ వ్యవహారాన్ని చెప్పింది. వారి ప్రేమను అర్థం చేసుకున్న ఆమె భర్త ఆమెకు ప్రియునితో వివాహం చేయాలని నిశ్చయించుకున్నాడు. ఇందుకోసం ముందుగా తన ఇంటిలోని వారిని, భార్య ఇంటిలోనివారిని ఒప్పించాడు. తరువాత ఒక ఆలయంలో తన భార్యకు ఆమె ప్రియునితో వివాహం జరిపించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోపాల్ గంజ్ జిల్లాలోని రెడ్వరియా గ్రామానికి చెందిన ఆకాశ్ షా తమ పొరుగు గ్రామంలో ఉంటున్న యువతిని ప్రేమించాడు. వారిద్దరి మధ్య రెండేళ్ల పాటు ప్రేమాయణం సాగింది. ఏడాది క్రితం ఆమెకు వేరే యువకునితో వివాహం జరిగింది. అయితే ఆకాశ్ తన ప్రియురాలిని మరచిపోలేక రెండు రోజుల క్రితం ఆమె ఉంటున్న ఇంటికి వచ్చాడు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు అతనిపై దాడి చేశారు. అయితే ఆమె భర్త విషయమంతా తెలుసుకుని తన భార్యకు ప్రియునితో వివాహం జరిపించాడు. ఇది కూడా చదవండి: భార్య డెలివరీ చూసి, మతిస్థిమితం కోల్పోయిన భర్త.. డబ్బుల కోసం డిమాండ్! -
ఆలయానికి ఇటలీ యువతి, కాశీ యువకుడు.. వదంతులకు పూజారి చెక్!
ప్రేమ అనేది ఎప్పుడు ఎవరిమధ్య ఎలా చిగురిస్తుందో ఎవరూ చెప్పలేరని అంటారు. దీనికి ఇప్పుడు మరో తాజా ఉదాహరణ మనముందు నిలిచింది. ఆ సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లోని త్రిలోచన్ ఆలయంలో సందడి నెలకొంది. ఈ ఆలయానికి ఒక జంట వచ్చారు. ఆలయంలో మహాశివుడిని దర్శించుకున్న ఆ జంటను చూసిన అక్కడి భక్తులు ఆశ్చర్యపోయారు. ఆ జంట వేర్వేరు దేశాలకు చెందినవారు కావడమే అందుకు కారణం. వారణాసికి చెందిన యువకుడు, ఇటలీకి చెందిన యువతి జంటగా వచ్చారు. వారు ఇంతకుముందే జార్జియాలో వివాహం చేసుకున్నారని సమాచారం. అయితే వారు త్రిలోచన్ ఆలయంలో వివాహం చేసుకున్నారనే వదంతులు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. ఆ దంపతులు త్రిలోచన్ మహాదేవ్ మందిరంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన నేపధ్యంలో వారికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ జంటకు సంబంధించిన వివరాలను త్రిలోచన్ మందిరం ప్రధాన పూజారి సోనూ గిరి మాట్లాడుతూ ఆ జంటకు ఈ ఆలయంలో పెళ్లి జరిగిందనేది అవాస్తవమని, రిజిస్ట్రేషన్ లేకుండా ఇక్కడ పెళ్లిళ్లి చేయమని అన్నారు. వారణాసికి చెందిన అఖిలేష్ విశ్వకర్మ, ఇటలీకి చెందిన తానియా ఇంతకుముందే జార్జియాలో వివాహం చేసుకున్నారని తెలిపారు. ఇక్కడ పూజలు చేసేందుకు మాత్రమే వచ్చారన్నారు. మీడియాకు అందిన సమచారం ప్రకారం వారణాసి జిల్లాలోని కార్ఖియాం గ్రామ నివాసి అఖిలేష్ విశ్వకర్మ 2016లో హోటల్ మేనేజిమెంట్ కోర్సు చేసిన తరువాత కతర్ దేశం వెళ్లాడు. అక్కడ కతర్ ఎయిర్వేస్లో క్యాబిన్ క్రూ సిబ్బందిగా ఉద్యోగం పొందాడు. కొద్దిరోజుల తరువాత అతనికి ఇటలీకి చెందిన తానియాతో ప్రేమ ఏర్పడింది. తరువాత వారిద్దరూ జార్జియాలో వివాహం చేసుకున్నారు. కొద్దిరోజుల క్రితమే అఖిలేష్ తన భార్యతో పాటు ఇంటికి వచ్చాడు. ఈ నేపధ్యంలోనే వారు త్రిలోచన్ మందిరానికి వచ్చారు. ఈ సందర్భంగా అఖిలేష్ మాట్లాడుతూ తానియా ఇటలీలో పుట్టిందని, ఆమె ఫిలిప్పీన్స్‌లో చదువుకున్నదని తెలిపారు. తానియా తల్లిదండ్రులు అమెరికాలో ఉంటారన్నారు. ఇది కూడా చదవండి: ఇందిరను ప్రధానిని చేసిన కే. కామరాజ్ లైఫ్ స్టోరీ! -
'ఆవిడ వల్లే నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు..'
మహబూబాబాద్: అప్పట్లో ట్రాన్స్‌జెండర్‌ను పెళ్లి చేసుకుని వార్తల్లోకి ఎక్కిన మహబూబాబాద్ జిల్లా వాసి ధరావత్ శివరాం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ట్రాన్స్‌జెండర్ తపస్వీ వేధింపులు భరించలేకే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని బాధితుని తల్లి పోలీసులను ఆశ్రయించింది. తపస్వీతో విడిపోయిన తన కొడుకు మరో పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించగా.. అడ్డుకుని వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేటకు చెందిన ధారావత్ శివరాం, జల్లి గ్రామానికి చెందిన ట్రాన్స్‌జెండర్ కొర్ర ప్రవీణ్ అలియాస్ తపస్విని వివాహం చేసుకున్నారు. ఇద్దరు మధ్యలో మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. మళ్లీ పెళ్లి చేసుకునేందుకు శివరాం ప్రయత్నిస్తుండగా ట్రాన్స్‌జెండర్ తపస్వి అడ్డుకున్నారు. అయితే.. ఈ క్రమంలో శివరాం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తపస్వి వేధింపులు భరించలేక పురుగులు మందు తాగి శివరాం ఆత్మహత్య చేసుకున్నట్లు అతని తల్లి పోలీసులును ఆశ్రయించింది. గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇదీ చదవండి: కామపిశాచికి ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇస్తారు?: శేజల్ సంచలన ఆరోపణలు -
కాఫీ షాప్‌లో ప్రేమ.. 4 ఏళ్ల సహజీవనం.. యూపీ యువకునితో దక్షిణ కొరియా యువతి వివాహం!
ప్రేమకు హద్దులు లేవని చెబుతుంటారు. ఈ విషయాన్ని యూపీలోని షాజహాన్‌పూర్‌కు చెందిన ఒక యువకుడు రుజువు చేశాడు. సుఖ్జీత్ అనే ఈ యువకుడు నాలుగేళ్ల పాటు దక్షిణ కొరియాలో ఉద్యోగం చేశాడు. కాఫీషాపులో పనిచేస్తున్న సమయంలో అతను ఒక యువతి ప్రేమలో పడ్డాడు. తన ప్రియురాలితో మాట్లాడేందుకు దక్షిణ కొరియా బాషను నాలుగు నెలల్లో నేర్చుకున్నాడు. నాలుగేళ్ల తరువాత వారిద్దరూ వివాహం చేసుకున్నారు. వారిద్దిరి ప్రేమ ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా సాగింది. మీడియాకు అందిన సమచారం ప్రకారం దక్షిణ కొరియాకు చెందిన కిమ్ బోహ్నీ అనే యువతి యూపీలోని పువాయా తహసీల్‌లోని ఒక గ్రామానికి చెందిన యువకుని సరసన వధువుగా మారింది. వరుడు సుఖజీత్ సింగ్ తండ్రి బల్దేవ్సింగ్ రైతు. అతని తల్లి హర్జిందర్ కౌర్ గృహిణి. సుఖజీత్ సింగ్ తమ్ముడు జగజీత్‌సింగ్ పొలంలో పనిచేస్తూ తండ్రికి చేదోడువాదోడుగా ఉంటాడు. 28 ఏళ్ల సుఖజీత్ సింగ్ నాలుగేళ్ల క్రితం ఉద్యోగవేటలో దక్షిణ కొరియా వెళ్లాడు. అక్కడి బుసాన్‌లోని ఒక కాఫీషాప్‌లో పనికి కుదిరాడు. అదే కాఫీషాప్లోని బిల్లింగ్ సెషన్లో దక్షిణకొరియాకు చెందిన 30 ఏళ్ల కిమ్ బోహ్ నీ పనిచేస్తోంది. సుఖజీత్ తెలిపిన వివరాల ప్రకారం కాఫీషాపులోనే వారి మధ్య ప్రేమ ఏర్పడింది. అయితే వారి ప్రేమకు భాష అడ్డంకిగా మారింది. దీంతో సుఖజీత్ నాలుగు నెలల్లో అక్కడి భాష నేర్చుకున్నాడు. అనంతరం ఇరు కుటుంబాల సమ్మతితో నాలుగేళ్లపాటు లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారు. అనంతరం ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. నాలుగు నెలల క్రితమే సుఖజీత్ సింగ్ తన ఇంటికి వచ్చాడు. రెండు నెలల క్రితం కిమ్ కూడా తన డిల్లీ స్నేహితురాలితో పాటు మూడు నెలల టూరిస్టు వీసాపై భారత్ వచ్చింది. ఆగస్టు 18న వారిద్దరూ పువాయాలోని గురుద్వారా నానక్ బాగ్‌లో వివాహం చేసుకున్నారు. సుఖజీత్ మీడియాతో మాట్లాడుతూ తన భార్య మూడు నెలల క్రితం భారత్ వచ్చిందని, ఆమె తమ గ్రామంలో ఉంటూ రెండు నెలలు అయ్యిందని తెలిపారు. ఇంకొక నెల రోజుల తరువాత ఆమె దక్షిణ కొరియా వెళ్లిపోతుందని, నెల రోజుల తరువాత తిరిగి భారత్ వస్తుందని, అప్పుడు తామిద్దం తిరిగి దక్షిణ కొరియా వెళ్లేలా ప్లాన్ చేసుకున్నామని తెలిపారు. ఇది కూడా చదవండి: అగ్రరాజ్యంలో మన ఇంజినీర్లు చేసే 12 పనులివే.. -
వైవాహిక జీవితంపై ప్రశ్న.. స్మృతి ఇరానీ ఫైర్
ఢిల్లీ: స్నేహితురాలి భర్తను వివాహమాడారని ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఫైరయ్యారు. 'ఆస్క్ మీ ఎనీథింగ్' అనే కార్యక్రమంలో భాగంగా అభిమానులు ఆమెను పలు ప్రశ్నలు అడిగారు. తన భర్త జుబిన్ ఇరానీని వివాహమాడిన అంశాన్ని, జుబిన్ ఇరానీ మాజీ భార్య మోనా గురించి కూడా ఆమె స్పందించారు. అయితే.. సామాజిక మాధ్యమాల వేదికగా తరచు ఈ ప్రశ్నలు తనకు ఎదురవుతుంటాయని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. ఈసారి మాత్రం జుబిన్ ఇరానీ, మోనా గురించి మాత్రం స్పష్టంగా మాట్లాడారు. మోనాతో తనకు ఉన్న సంబంధాన్ని కూడా వివరించారు. ఈ సందర్భంగా మోనా ఇరానీ తన చిన్ననాటి స్నేహితురాలు కాదని ప్రజలకు విన్నవించారు. తనకంటే మోనా 13 ఏళ్ల పెద్దదని తెలుపుతూ ఇన్‌స్టాలో పోస్టు చేశారు. 'మోనా కుటుంబం రాజకీయ నేపథ్యం లేనిది. ఆమెను ఇందులోకి లాగొద్దు. నాతోనే పోరాడండి. నాతోనే వాదించండి. నా గౌరవ మర్యాదలపైనే మాట్లాడండి. కానీ ఒక అమాయక పౌరురాలిని ఇందులోకి లాగకండి. రాజకీయంగా ఏమీ సంబంధం లేని మోనాతో పోరాడకండి. ఆమె గౌరవానికి భంగం వాటిల్లవద్దు.' అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. స్మృతి ఇరానీ జుబిన్ ఇరానీని 2001లో వివాహం చేసుకున్నారు. వారికి ఓ కుమారుడు 'జోర్' కూడా ఉన్నాడు. కూతురు 'జోయిష్' ఉంది. జుబిన్కి మోనాతో ఇంతకుముందే వివాహం జరిగింది. వారిరువురికి 'షానెల్లే' పేరుగల కూతురు ఉంది. ఈ కార్యక్రమంలో స్మృతి ఇరానీని తన టీవీ లైఫ్ గురించి కూడా ప్రశ్నించారు. రీల్ లైఫ్‌ను మిస్ అవుతున్నారా? అని అడిగిన ఓ ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. రీల్ లైఫ్ వదిలేసే నాటికి అది చాలా అద్భుతంగా అనిపించింది. కానీ ఎప్పటికీ ఆలాగే ఉంటుందని చెప్పలేమని అన్నారు. కాలం ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి నేర్పిస్తోందని చెప్పారు. ఇదీ చదవండి: ఎడతెరిపిలేని వర్షాలు.. విరిగిన కొండచరియలతో కూలిన గుడి.. 21 మంది మృతి.. -
రెండు సార్లు విడాకులు.. మూడోసారి లివ్ ఇన్ రిలేషన్ షిప్.. స్టార్ హీరో లైఫ్ ఇదే!
నాలుగేళ్ల వయసులో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన కమల్ హాసన్.. ఇటీవలే నటుడిగా 64 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసుకున్నారు. ఆరు భాషల్లోని చిత్రాల్లో నటించిన ఏకైక హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. బహుభాషా నటుడిగా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ ఇప్పుడు రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. 960లో ‘కలత్తూరు కన్నమ్మ’ సినిమాలో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన కమల్.. ప్రభాస్ నటిస్తోన్న కల్కి చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించనున్నారు. దక్షిణాదిలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కమల్ హాసన్.. తన వైవాహిక జీవితంలో మాత్రం గెలవలేకపోయారు. రెండు సార్లు పెళ్లి చేసుకున్న కమల్ హాసన్ ఇద్దరికీ విడాకులు ఇచ్చి.. నటి గౌతమితో దాదాపు 13 ఏళ్ల పాటు లివ్ ఇన్ రిలేషన్ షిప్లో ఉన్నారు. బాలనటుడిగా నటించి సినీ రంగ ప్రవేశం చేసిన కమల్‌హాసన్ .. తమిళ సినిమాకు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించారు. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా, రచయితగా పేరుపొందారు. కమల్ హాసన్ తమిళంతో పాటు మలయాళం, తెలుగు, హిందీ, కన్నడ, బెంగాలీ సినిమాల్లో కూడా నటించారు. అలా సినీ జీవితంలో ఎన్నో విజయాలను చవిచూసిన కమల్ హాసన్ వ్యక్తిగత జీవితంలో ఓడిపోయారు. శ్రీవిద్యతో పరిచయం కమల్ కెరీర్ తొలినాళ్లలో మొదట నటి శ్రీవిద్యతో ప్రేమాయణం కొనసాగించారు. అతని కంటే రెండేళ్లు పెద్దదైన శ్రీవిద్యతో కమల్ హాసన్ చాలా సినిమాల్లో నటించారు. వీరిద్దరు కలిసిన నటించిన అపూర్వ రాగంగల్ సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే కొన్నేళ్లకే వీరిద్దరి బంధం ముగిసింది. ఆ తర్వాత శ్రీవిద్య మలయాళ చిత్రాలలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న జార్జ్ థామస్‌ను పెళ్లాడింది. 2006లో శ్రీవిద్య ఆసుపత్రిలో ఉండగా పరామర్శించడానికి వెళ్లిన కమల్ మరోసారి వార్తల్లో నిలిచారు. వాణి గణపతితో మొదటి పెళ్లి వాణి గణపతిని ప్రేమించి 1978లో పెళ్లి చేసుకున్నారు కమల్ హాసన్. వాణీ గణపతి శాస్త్రీయ నృత్య కళాకారిణి. అంతా సవ్యంగా సాగుతన్న సమయంలోనే కమల్ హాసన్ జీవితంలోకి సారిక ప్రవేశించింది. దీంతో వాణి గణపతితో 1988లో విడాకులు తీసుకున్నారు. సారికను రెండో పెళ్లి చేసుకున్న కమల్ అదే ఏడాల్లోనే కమల్ హాసన్ సారికను పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు శృతి హాసన్, అక్షర హాసన్ జన్మించారు. కమల్ హాసన్ తన రెండో భార్యతో అంతా సవ్యంగా సాగుతున్న సమయంలోనే సిమ్రాన్ పేరు తెరపైకి వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో సారిక డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. అప్పట్లో సారిక ఆత్మహత్యాయత్నం చేసిందని కూడా కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. 2002లో వాణితో విడాకుల కోసం దరఖాస్తు చేయగా.. 2004లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. దీంతో 16 ఏళ్ల వివాహాబంధానికి తెరపడింది. ప్రముఖ తమిళ నటి, సిమ్రాన్ బగ్గా సూపర్‌హిట్ చిత్రం పంచతంత్రంతో సహా పలు సినిమాల్లో కమల్ హాసన్‌తో నటించింది. కమల్ వయసులో ఆమె కంటే 22 ఏళ్లు పెద్దవాడు కావడంతో వారిబంధం అప్పట్లో చాలా చర్చనీయాంశమైంది. గౌతమితో లివ్ ఇన్ రిలేషన్ షిప్ సిమ్రాన్‌కు పెళ్లి కావడంతో ఆ తర్వాత కమల్ హాసన్ గౌతమితో లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారు. కాగా.. గౌతమికి అప్పటికే పెళ్లయి ఒక కూతురు ఉంది. గౌతమి కూడా తన భర్తతో విడాకులు తీసుకుంది. రెండుసార్లు వైవాహిక జీవితంలో విఫలమైన కమల్ హాసన్ మూడోసారి పెళ్లి చేసుకోలేదు. దీంతో లివ్-ఇన్ రిలేషన్షిప్ కొనసాగించారు. ఈ జంట కొన్ని సినిమాల్లో కలిసి నటించింది. ఇద్దరూ దాదాపు 13 ఏళ్ల పాటు లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో 2017లో తమ బంధానికు గుడ్ బై చెప్పారు. కాగా.. ఆ తర్వాత కమల్ హాసన్ నటించిన విశ్వరూపం సహ నటి పూజా కుమార్‌తో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వినిపించాయి. -
'చావడమే మేలు..' పాక్ వెళ్లి ప్రియున్ని పెళ్లాడిన అంజు తండ్రి ఆవేదన..
జైపూర్: పాక్ వెళ్లి ఫేస్బుక్ ప్రియుడు నస్రుల్లాను వివాహం చేసుకున్న భారతీయ మహిళ అంజు చర్యల పట్ల ఆమె తండ్రి గయా ప్రసాద్ థామస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన కూతురు చనిపోవడమే మేలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తిరిగి భారత్‌కు రావడానికి అంజూకు హక్కు లేదని అన్నారు. ఒకవేళ తిరిగివస్తే కఠిన శిక్షలు ఉంటాయని చెప్పారు. ఆమె చేసింది చాలా తప్పు పని అని అన్నారు. అంజు.. వివాహిత అయిన రాజస్థాన్‌కు చెందిన భారతీయ మహిళ. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇండియా నుంచి పాక్‌కు వెళ్లి తన ఫేస్బుక్ ప్రియుడు నస్రుల్లాతో గత మంగళవారమే వివాహం చేసుకుంది. ఈ ఘటనతో తీవ్ర దుఖాన్ని అనుభవిస్తున్నట్లు చెప్పిన అంజూ తండ్రి థామస్.. తమ కూతురు చేసిన పనికి సిగ్గుపడుతున్నట్లు చెప్పారు. గౌరవప్రదేమైన భారతదేశానికి తన కూతురు చర్యతో కలంకం సోకినందుకు క్షమాపణలు కోరుతున్నట్లు వెల్లడించారు. అంజు తండ్రిగా తన పేరును ప్రభుత్వ రికార్డుల నుంచి తీసేయాలని కోరారు. ఇదీ చదవండి: ఫాతిమాగా మారిన అంజూ.. మతం మార్చుకొని ప్రియుడితో పెళ్లి! అంజూతో తమకు ఎలాంటి బంధుత్వం లేదని థామస్ తెలిపారు. దేశ సరిహద్దు దాటినప్పుడే తమతో సంబంధాలు తెగిపోయాయని అన్నారు. తన కూతురు ఇలాంటి పని చేస్తుందని కలలో కూడా ఊహించలేదని చెప్పారు. చాలా విచారకరమైన విషయమని అన్నారు. సీమా హదర్ కేసుకు భిన్నంగా అంజు అనే వివాహిత రాజస్థాన్ నుంచి పాకిస్థాన్‌లోని తన ఫేస్బుక్ ప్రియున్ని కలవడానికి వెళ్లింది. రాజస్థాన్‌లో బివాడీకి చెందిని అంజూకు అప్పటికే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీసాతో అధికారికంగానే పాక్‌లోకి అడుగుపెట్టిన అంజు.. ప్రియుడు నస్రుల్లాను వివాహం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే.. తాను తన స్నేహితున్ని కలవడానికి మాత్రమే వెళ్లినట్లు అంజు చెప్పారు. ఈ పరిణామాల అనంతరం అంజూ తండ్రి తీవ్రంగా స్పందించారు. అంజు తనకు చెప్పకుండానే పాక్ వెళ్లిందని ఆమె భర్త తెలిపారు. లాహోర్‌లో ఉన్నట్లు కాల్ చేసినట్లు తెలిపిన ఆయన.. రెండు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ అంశాన్ని ప్రేమ వ్యవహారంగా భావించిన రాజస్థాన్ పోలీసులు.. నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎలాంటి కేసు నమోదు కాలేదని చెప్పారు. ఇదీ చదవండి: ఫేస్బుక్ ప్రియుడి కోసం పాకిస్థాన్‌కు.. అంజూ వ్యవహారంలో కొత్త ట్విస్ట్! -
ముక్కంటిని మనువాడిన 27 ఏళ్ల యువతి.. ఎందుకంటే..?
లక్నో: పచ్చని పందిళ్లు, మేలతాళాలు, వేదమంత్రాలు, బంధువుల చిరునవ్వులు, ఏ లోటు రాకుండా చూసుకోవాలనుకునే కుటుంబ సభ్యుల హడావిడి మధ్య పెళ్లిమండపానికి సిగ్గు పడుతూ వస్తోంది వధువు. ఇదంతా చెబుతుంటే ఎవరిదో వివాహం అని అర్థమవుతోంది కదా..! కానీ ఇది మీరు పురాణాల్లో తప్పా మరెక్కడా చూడని పెళ్లి. భక్తితో పరమ శివున్నే వివాహం చేసుకున్నది ఓ యువతి.. ఏంటో ఈ కథ తెలుసుకుందాం పదండి.. మంచి వరుడు కావాలని ప్రతి యువతి కలలు కంటుంది. ఏ దుర్గునాలు లేని వాడితో జీవితాన్ని పంచుకోవాలని ఆశపడతారు. అయితే.. మనుషుల్లో అలాంటివారు ఉండరనుకుందో ఏమో? కానీ ఓ యువతి ఏకంగా ముక్కంటినే వివాహం చేసుకుంది. పరమేశ్వరుని మీద భక్తితో శివలింగాన్నే వరునిగా భావించి మనువాడింది. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. శివుని సేవలోనే.. ఝాన్సీలో అన్నపూర్ణ కాలనీకి చెందిన యువతి తన తల్లిదండ్రులతో జీవిస్తోంది. వారి కుటుంబమంతా చాలా ఏళ్లుగా బ్రహ్మకుమారి సంస్థతో అనుసంధానమై ఉన్నారు. అనునిత్యం శివుడి సేవలో ఉన్న యువతి.. అపారమైన భక్తి విశ్వాసాలను పెంచుకుంది. దీంతో శివుడినే వివాహమాడుతానని తల్లిదండ్రులకు తెలిపింది. వారు కూడా అందుకు అంగీకరించడంతో యువతి అభీష్టం నెరవేరింది. నెలరోజుల ముందే.. పెళ్లికి నెలరోజుల ముందే వారి కుటుంబమంతా అన్ని ఏర్పాట్లు చేసింది. పెళ్లిమండపాలు వెయించడం, బంధువులకు పత్రికలు పంచడం, పెళ్లి బట్టలు ఖరీదు చేయడం ఇలా అన్నీ పనులు మనుషుల పెళ్లికి చేసినట్లు చేశారు. మేలతాళాల చప్పుళ్లతో బంధువుల మధ్య అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. ఈ విభిన్నమైన వివాహాన్ని చూడటానికి చుట్టపక్కల ప్రాంతాల ప్రజలు ఆసక్తికనబరిచారు. ఇదీ చదవండి: మత్స్యకారుల చేతికి డాల్ఫిన్.. ఇంటికెళ్లి కూర వండేసుకున్నాక.. -
‘పెళ్లిళ్లే నా ఆరోగ్య రహస్యం’.. ఐదో పెళ్లి చేసుకున్న 90 ఏళ్ల వరుని స్టేట్మెంట్
సౌదీ అరబ్ మీడియాలో 90 ఏళ్ల వృద్ధుని వివాహం హెడ్‌లైన్స్‌లో నిలిచింది. ఈ 90 ఏళ్ల వృద్ధుడు తాజాగా ఐదవ వివాహం చేసుకుని, సౌదీ అరబ్‌లో అత్యధిక వయసు కలిగిన వరునిగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆ వృద్ధుడు తన ఐదవ భార్యతో హనీమూన్ ఎంజాయ్ చేస్తూ, భవిష్యత్‌లోనూ ఇలానే మరిన్ని పెళ్లిళ్ఘు చేసుకుంటానని చెబుతున్నాడు. గల్ఫ్‌న్యూస్‌కు చెందిన ఒక రిపోర్టు ప్రకారం నాదిర్ బిన్ దహైమ్ వాహక్ అల్ ముర్షీదీ అల్ ఓతాబీ తాజాగా సౌదీలోని అఫీస్ ప్రాంతంలో తన ఐదవ వివాహం చేసుకున్నాడు. సోషల్ మీడియాలో ఈ వృద్ధ పెళ్లికొడుకుకు సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో అతిథుల ఆ వృద్ధ వరునికి ఐదవపెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆ వృద్ధ వరుడు అపరిమితమైన ఆనందంతో ఉప్పొంగిపోతూ కనిపిస్తున్నాడు. ఈ వీడియోలో ఒక మనుమడు తన తాతకు వివాహ శుభాకాంక్షలు తెలియజేయడం కనిపిస్తుంది. సౌదీకి చెందిన ఈ వృద్ధ పెళ్లికొడుకు అరేబియా టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ అవివాహితులంతా తప్పకుండా వివాహం చేసుకోవాలనే సందేశాన్నిచ్చాడు. ఈ పెళ్లి తరువాత కూడా మరో పెళ్లి చేసుకుంటానని అన్నాడు. వైవాహిక జీవితం ఎంతో శక్తివంతమైనదని, పెళ్లి చేసుకోవడంవలన జీవితంలో ప్రశాంతత దొరుకుతుందని అన్నారు. తన దీర్ఘాయుష్షకు కారణం తాను చేసుకున్న పెళ్లిళ్లేనని తెలిపాడు. 90 برس کی عمر میں پانچویں شادی رچانے والے معمر ترین سعودی دلہا نے کنوارے نوجوانوں کا کیا مشورہ دیے، ویڈیو دیکھیےhttps://t.co/laYvvZpxUy pic.twitter.com/da0hb4WE3w — العربیہ اردو (@AlArabiya_Ur) July 13, 2023 ఇది కూడా చదవండి: ప్రియునితో ఉండగా పిన్నికి దొరికిపోయింది.. కంగారులో బ్రిడ్జిపై నుంచి దూకేసి.. -
నిరుద్యోగ భర్తకు చేదోడువాదోడు.. అధికారి కాగానే ఆమెకు అన్యాయం చేస్తూ..
ఆ బాధిత మహిళ న్యాయం కోసం కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తోంది. ఆమె పేరు మమత. తన భర్త పెద్ద ఆఫీసర్ కాగానే తనను విడిచిపెట్టి మరో వివాహం చేసుకుని తనకు అన్యాయం చేశాడని ఆమె ఆరోపిస్తోంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం వారి పెళ్లినాటికి భర్త నిరుద్యోగి. దీంతో ఆమె కూలీ పనులు చేసి, అతని ఉన్నత చదువులకు ఆసరా అందించి, అతను పెద్ద ఆఫీసర్ అయ్యేందుకు సహాయపడింది. అయినా ఆమెకు అన్యాయమే ఎదురయ్యింది. నిరుద్యోగిగా ఉన్న భర్తను చదివించి.. ఈ ఉదంతం మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక మహిళ రోదిస్తూ మీడియా ముందు తన గోడు వెళ్లగక్కింది. మమతకు 2015లో కమరూ హఠీలేతో వివాహం జరిగింది. కమరూ ఆ సమయంలో నిరుద్యోగి. అయితే గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. నిరుద్యోగిగా ఉన్న భర్తకు ఆమె అన్ని విధాలుగా చేదోడువాదోడుగా నిలిచింది. ఆమె అండతో కమరూ పెద్ద అధికారి అయ్యాడు. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇళ్లలో వంట పనులు చేస్తూ.. భర్తను చదివించేందుకు ఆమె పలు ఇళ్లలో వంట పనులు, పాచిపనులు చేసింది. కొన్నిరోజులు దుకాణాలలోనూ పనిచేసింది. ఇలా వచ్చిన ఆదాయంతో భర్తను ఉన్నత చదువులు చదివించింది. భార్య సాయంతోనే అతను పోటీ పరీక్షలకు కూడా సిద్ధం అయ్యాడు. ఇది కూడా చదవండి: ఆవు మొదలు ఆడ కుక్క వరకూ.. చెత్తపనులుచేసే మసలోడికి అరదండాలు! 2019-20లో కమర్షియల్ టాక్స్ అధికారిగా.. చివరాఖరికి 2019-20లలో కమరూ పోటీపరీక్షల్లో విజయం సాధించాడు. కమర్షియల్ టాక్స్ అధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టాడు. రత్నాం జిల్లాలో అతనికి పోస్టింగ్ వచ్చింది. ఈ నేపధ్యంలో అతను జోబట్ ప్రాంతానికి చెందిన మరో యువతితో సంబంధం పెట్టుకున్నాడు. మమతను ఆమె పుట్టింటికి పంపివేసి, ఆ యువతితో ఉండసాగాడు. వారిద్దరూ ఆరేళ్లుగా కలిసే ఉంటున్నారు. మమత పెళ్లి వెనుక.. మమత తెలిపిన వివరాల ప్రకారం ఆమెకు మొదటి వివాహం 16 ఏళ్ల క్రితం జరిగింది. పెళ్లియన రెండేళ్లకే ఆమె భర్త మరణించాడు. ఆ మెదటి భర్తతో ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు 15 ఏళ్ల వయసులో మృతి చెందాడు. కమరూ.. మమతకు దూరపు బంధువు. ఈ నేపధ్యంలో ఇద్దరిమధ్య ప్రేమ చిగురించింది. అనంతరం ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. భర్త చేతిలో మోసపోయి.. ఆ సమయంలో కమరూ చదువుకునేవాడు. అతను చదువు కొనసాగించేందుకు మమత ఎంతగానో సహాయం చేసింది. కమరూ తనకు ఉద్యోగం వచ్చాక పూర్తిగా మారిపోయాడు. ఒక ఆదివాసీ మహిళను వివాహం చేసుకుని, మమతను విడిచిపెట్టాడు. భర్త కారణంగా మోసపోయిన ఆమె న్యాయం కోసం పలువురు అధికారులకు కలసి వేడుకుంటోంది. భర్త నుంచి నెలకు రూ.12 వేల భరణం ఇప్పించాలని కోరుతూ ఆమె కోర్టు చుట్టూ తిరుగుతోంది. ఇది కూడా చదవండి: నాటకీయ పరిణామంలో అత్యాచార బాగోతం వెల్లడి.. -
ఒకవైపు భార్య.. మరోవైపు ప్రియురాలు.. బెడిసి కొట్టిన యువకుని ప్లాన్!
ఆ యువకుడు ఒక వైపు భార్యను, మరోవైపు ప్రియురాలిని ఇద్దరినీ మెయింటెయిన్ చేయలనుకున్నాడు. అయితే ఈ విషయం భార్యకు తెలియడంతో నానా హంగామా జరిగింది. తరువాత విషయం పోలీసుల వరకూ చేరింది. బీహార్‌లోని ముజప్ఫర్‌పూర్‌లో ఒక వివాహితుడు ఫేస్బుక్ మాధ్యమలో ఒక పెళ్లయిన యువతితో అఫైర్ పెట్టుకున్నాడు. తరువాత ఇంటినుంచి పారిపోయి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అయితే భర్తకు మరొక యువతితో సంబంధం ఉందని భార్యకు తెలిసింది. ఆమె ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసింది. వెంటనే పోలీసులు ఆ యువకుడిని, అతని ప్రియురాలిని పట్టుకున్నారు. వారిద్దరినీ పోలీసులు విచారిస్తున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఉదంతం ముజప్ఫర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేదార్నాథ్ రోడ్డులో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక యువకునికి 2016లో వివాహం అయ్యింది. అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే అతనికి ఫేస్ బుక్ మాధ్యమంలో మరో వివాహితతో ప్రేమ వ్యవహారం ఏర్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ యువకుడు తన భార్యకు తెలియకుండా ఫేస్బుక్లో పరిచయం అయిన ఆ మహిళను కూడా పెళ్లి చేసుకుని ఒకరికి తెలియకుండా మరొకరిని మెయింటైన్ చేయాలనుకున్నాడు. అయితే ఈ విషయం అతని భార్యకు తెలిసింది. దానిని ఆమె వ్యతిరేకించింది. దీంతో ఆ యువకుడు ఇంటి నుంచి వెళ్లి పోయాడు. ఒక ఆలయంలో ఆ మహిళను పెళ్లాడాలని ప్లాన్ చేసుకున్నాడు. ఇంతలో అతని భార్య పోలీసుకు ఈ సమాచారం అందించింది. దీంతో పోలీసులు ఆ యువకుడిని, ఆ మహిళను పట్టుకున్నారు. ఈ సందర్బంగా ఆ యువకుని భార్య మాట్లాడుతూ తన భర్త 4 రోజుల క్రితం ఏదోపని ఉందని బయటకు వెళ్లాడని, దీంతో తాను భర్తపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. పోలీసుల జోక్యంతో సమస్య పరిష్కారం అయ్యిందన్నారు. ఇది కూడా చదవండి: ‘బయటకు వెళ్లి సిగరెట్ కాల్చుకో’ అన్నాడని.. -
తనను తాను పెళ్లాడిన యువతి ఫస్ట్ యానివర్సరీ, అదిరిపోయే వీడియో వైరల్
గుజరాత్ అమ్మాయి క్షమా బిందు గుర్తుందా. వడోదరకు చెందిన క్షమా బిందు జూన్ 8, 2022 లో తనను తాను పెళ్లి చేసుకున్న యువతిగా సంచలనం రేపింది. పెళ్లి తరువాత సింగిల్‌గానే హనీమూన్ కి కూడా వెళ్లి ఎంజాయ్ చేసింది. ఇపుడు తొలి వార్షికోత్సవం సందర్భంగా మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఫస్ట్ యానివర్సరీ సందర్భాన్ని ఒక రేంజ్లో సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఎవరి ఇష్టం వచ్చినట్టువారు, ఎవరి మనస్తత్వానికి తగినట్టు వాళ్లు కమెంట్ చేస్తున్నారు. 1.9 వేలకు పైగా లైక్‌లు, పలు కామెంట్లు వచ్చాయి. చాలా మంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ అభిమానాన్ని చాటుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ యానివర్సరీ.. కంగ్రాట్స్ .. సో ప్రౌడ్ ఆఫ్ యూ చాలా మంది విషెస్ అందిస్తున్నారు. అదే సమయంలో పంది బురదలో దొర్లి అదే జీవితమని మురిసిపోతుంది.. అర్జంటుగా ఈమెకు చికిత్స అవసరం అంటూ నోరు పారేసుకుంటున్నారు. కానీ ఇవేమీ ఆమెను అస్సలు బాధించడంలేదు. ఈ రకమైన ట్రోలింగ్ గతంలో కూడా ఎదుర్కొంది. మీరేమన్నా అనుకోండిరా బై.. నా జీవితం నా యిష్టం.. నాకు నచ్చినన్ని రోజులు ఇలాగే ఒంటరిగానే హ్యాపీగా గడిపేస్తానంటోంది. తనకు నచ్చినట్టు జీవితాన్ని ఆస్వాదిస్తోంది. మరెవ్వరికీ హాని చేయకుండా.. కుడోస్ మై డియర్ అంటున్నారు నెటిజన్లు. కాగా 25 ఏళ్ల క్షమా బిందు దేశంలో తొలిస్వీయ వివాహం లేదా సోలోగామిగా నిలిచిన సంగతి తెలిసిందే. అంతకు ముందు బ్రెజిల్‌కు చెందిన ఓ మోడల్‌కు 33 ఏళ్ల క్రిస్ గలెరా. తనను తాను పెళ్లి చేసుకున్న ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. అంతేకాదు రూ. 4 కోట్లు ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటానన్న అరబ్ షేక్‌ను తోసి రాజంది. కొనుక్కోవడానికి, అమ్మడానికి తానేమీ ఆట వస్తువును కాదని తనకు నచ్చినన్ని రోజులు ఇలాగే ఒంటరిగా గడుపుతానంటూ క్రిస్ తెగేసి చెప్పిన సంగతి తెలిసిందే. -
ఓ ఇంటివాడైన జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ (ఫొటోలు)
-
ఇదేం విడ్డూరం.. కోడలిని పెళ్లి చేసుకున్న మామా, అసలేం జరిగిందంటే!
-
ముంబైలో ఘనంగా క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ పెళ్లి (ఫొటోలు)
-
తెలుగు అబ్బాయి.. ఫ్రాన్స్ అమ్మాయి.. ముఖ్య అతిథిగా సుమ.. ఫొటోలు వైరల్..
తూర్పు గోదావరి: ఖండాలు దాటినా తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను మరువలేదు ఆ కుటుంబం. ఫ్రెంచి జాతీయత కలిగిన వారిద్దరికీ తెలుగు సంప్రదాయ రీతిలో వివాహం ఘనంగా జరిగింది. కేంద్ర పాలిత ప్రాంతం యానాం పట్టణానికి చెందిన చింతా వెంకట్ కుటుంబం ఎన్నో ఏళ్ల క్రితం ఫ్రాన్స్ దేశంలో స్థిరపడ్డారు. చింతా వెంకట్, వేద దంపతుల కుమారుడు సుమంత్ ఫ్రాన్స్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అదే దేశానికి చెందిన యువతి క్లమెన్టైన్తో అతడికి వివాహం కుదిరింది. ఈ వివాహాన్ని కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో స్వస్థలం యానాంలో చేయాలని నిర్ణయించారు. దీంతో హిందూ సంప్రదాయ రీతిలో స్థానిక గాజుల గార్డెన్స్ కల్యాణ మండపంలో సుమంత్, క్లమెన్టైన్ల వివాహం ఆదివారం అంగరంగవైభవంగా జరిగింది. వధూవరులను యాంకర్ సుమ, రాజీవ్ కనకాల దంపతులు, బంధుమిత్రులు ఆశీర్వదించారు. -
ముగ్గురు అమ్మాయిలను పెళ్లాడిన వ్యక్తి!: వీడియో వైరల్
ఇటీవల భారత్‌లో ఇద్దరు కవలలను పెళ్లి చేసుకున్న ఒక వ్యక్తి బహు భార్యత్వం కేసు కింద అరెస్టు అయ్యాడు. ఆ ఘటన మరువక మునుపే అలాంటి ఘటనే కెన్యాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కేట్, ఈవ్, మేరీ అనే ముగ్గురు అక్కా చెల్లెళ్లు స్టీవ్ అనే వ్యక్తిని పెళ్లాడారు. తొలుత ఆ కవలల్లో కేట్ అనే అమ్మాయి స్టీవ్ అనే వ్యక్తిని కలిసింది. ఆ తర్వాత వారిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక పెళ్లి విషయమై మాట్లాడేందుకు వాళ్ల చెల్లెళ్లను కలిసేందుకు వెళ్లాడు స్టీవ్. అనుహ్యంగా స్టీవ్‌కి అక్కడకు వెళ్లేంత వరకు తెలియదు ముగ్గుర్ని చేసుకోవాల్సి వస్తుందని. తాను ఒకరిని వివాహం చేసుకునేందుకు మాట్లాడటానికి వెళ్లితే ముగ్గుర్ని పెళ్లి చేసుకుంటానని అస్సలు అనుకోలేదని చెబుతున్నాడు. ఐతే వారు తాము ముగ్గురు తననే ఇష్టపడుతున్నామని చెప్పటంతో ఆశ్చర్యపోయానని చెబుతున్నాడు స్టీవ్. ఆ తర్వాత కాసేపు ఆలోచించి ముగ్గుర్ని పెళ్లాడేందుకు అంగీకరించినట్లు వివరించాడు. ఐతే ఆ ముగ్గరికి ఒకరిని వదిలి ఒకరు ఉండేందుకు ఇష్టపడకపోవడంతోనే ఇలా ఒక్క వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఐతే తమను పెళ్లి చేసుకునేందుకు స్టీవ్ ఒక కండిషన్ కూడా పెట్టాడని చెబుతున్నారు ఆ అక్కాచెల్లెళ్లు. అలాగే ఏ సమస్య రాకుండా తాము ఎవరికీ కేటాయించిన సమయంలో వారు స్టీవ్‌తో గడిపేలా గట్టి టైం షెడ్యూల్ కూడా కేటాయించుకున్నట్లు ఆ కవలలు చెబుతున్నారు. (చదవండి: చీరకట్టులో డైవింగ్ చేసిన సీనియర్ సిటిజన్ మహిళలు) -
పెళ్లి పీటలు ఎక్కిన ‘నేనింతే’ హీరోయిన్, వరుడు ఎవరంటే!
మాస్ మహారాజ రవితేజ ‘నేనింతే’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ముంబై బ్యూటీ శియా గౌతమ్ అలియాస్ అదితి గౌతమ్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు పొందింది. ఈ చిత్రంలో ఆమె అందం, అభినయానికి మంచి మార్కులే పడ్డాయి. అయితే హీరోయిన్గా మాత్రం ఎక్కువ కాలం రాణించలేకపోయింది. నేనింతే తర్వాత పలు చిత్రాల్లో నటించి ఆమెకు ఆ తర్వాత అవకాశాలు కరువయ్యాయి. చదవండి: ఓర్వలేక నా బిజినెస్‌పై కుట్ర చేస్తున్నారు.. ఇది పెయిడ్ బ్యాచ్ పనే: కిరాక్ ఆర్పీ వేదం చిత్రంలో మనోజ్ భాజ్‌పాయి భార్యగా నటించిన ఆమె ఆ తర్వాత తెలుగులో కనిపించనే లేదు. ఆ తర్వాత కన్నడ మూవీ డబుల్ డెక్కర్‌లో నటించిన ఆమె హిందీలో రణ్‌బీర కపూర్ సంజూ సినిమాతో అదృష్టం పరీక్షించుకుంది. అయినా అక్కడ కూడా ఆమెకు చేదు అనుభవమే ఎదురైంది. సంజూ మూవీ మంచి హిట్ అయినప్పటికీ శియాకు మాత్రం అవకాశాలు రాలేదు. దీంతో నటనకు కాస్తా బ్రేక్ ఇచ్చిన ఆమె ఇటీవల వచ్చిన గోపిచంద్ పక్కా కమర్షియల్ చిత్రంలో చిన్న పాత్రలో మెరిసింది. చదవండి: వచ్చే వారం ప్రభాస్-కృతి సనన్ నిశ్చితార్థం? ట్వీట్ వైరల్ అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులను పలకరిస్తున్న శియ తాజాగా పెళ్లి పీటలు ఎక్కింది. తన హల్దీ, సింగీత్, పెళ్లి వేడుకులకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో ఆమెకు సినీ సెలబ్రెటీలు, ఫాలోవర్స్ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. శియ భర్త పేరు నిఖిల్ పాల్కేవాలా. ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్త అని తెలుస్తోంది. ఇక శియా పెళ్లి వేడుకలో నటి ప్రియమణి తన భర్తతో కలిసి హాజరైంది. ప్రియమణితో పాటు పలువురు సినీ సెలబ్రెటీలు శియా పెళ్లిలో సందడి చేశారు. View this post on Instagram A post shared by Karan Sampat (@karansampat87) -
అతడికి 72, ఆమెకు 28..కోడలినే పెళ్లి చేసుకున్న ప్రబుద్ధుడు
72 ఏళ్ల వృద్ధుడు 25 ఏళ్ల కోడలిని పెళ్లిచేసుకున్నాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఛపియా ఉమారో అనే గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..72 ఏళ్ల కైలాష్ అనే వ్యక్తి బరహల్‌గంజ్ పోలీస్టేషన్లో చౌకీదార్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య 12 ఏళ్ల క్రితం చనిపోయింది. ఐతే అతని మూడో కొడుకు కూడా అనుకోకుండా మరణించాడు. దీంతో అతని కోడలు పూజా వితంతువుగా మారడంతో అప్పటి నుంచి ఆమె తన పుట్టింట్లోనే ఉంటోంది. ఐతే అనుహ్యంగా గత కొన్ని రోజులుగా మళ్లీ తన భర్త ఇంటికి వచ్చి ఉంటోంది. దీంతో ఒక్కసారిగా ఆ గ్రామంలో ఈ విషయమై పలు అనుమానాలు తలెత్తాయి. ఈ కైలాష్ అనే వృద్ధుడు తన కోడలు పూజానే ఎవరికీ తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. అందుకు సంబంధించిన ఫోటో వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా ఈ విషయం గుప్పుమంది. ఈ ఫోటో కాస్త పోలీసులు దృష్టికి వచ్చింది. దీంతో బర్హల్‌గంజ్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, ఈ ఘటనపై విచారిస్తామని చెప్పారు. (చదవండి: ఎయిర్ షో సందర్భంగా నాన్‌వెజ్ అమ్మకాలు బంద్!) -
వైరల్ వీడియో: వధువుని ఎత్తుకొని కిందపడ్డ వరుడు
-
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్
-
ప్రేమిస్తున్నానంటూ వెంటపడి..పెళ్లి మాట ఎత్తగానే...
సాక్షి, హిందూపురం: ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి సర్వమూ దోచేసిన యువకుడు.. పెళ్లి మాట ఎత్తగానే ముఖం చాటేశాడంటూ ఓ యువతి నడిరోడ్డుపై ధర్నాకు దిగింది. బాధితురాలు తెలిపిన మేరకు.. హిందూపురం మండలానికి చెందిన ఓ యువతి అనంతపురం జిల్లా గుత్తిలోని ఓ కళాశాలలో ఎంబీఏ పూర్తి చేసింది. కళాశాలలో చదువుకుంటున్న సమయంలోనే కర్నూలు జిల్లా పెద్దకడుబూరు ప్రాంతానికి చెందిన గణేష్ పరిచయమయ్యాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. మూడేళ్ల పాటు తనతో పాటు తిప్పుకున్నాడు. ప్రస్తుతం దళితురాలిననే కారణం చూపి పెళ్లికి అంగీకరించడం లేదు. గణేష్ చేసిన మోసంపై ఇప్పటికే పోలీసు స్పందన కార్యక్రమంలో ఎస్పీని కలసి ఫిర్యాదు చేసింది. దీనిపై 20 రోజుల క్రితం హిందూపురం రూరల్ పోలీసులు పిలిపించుకుని విచారణ చేశారు. అయినా తనకు న్యాయం చేకూరలేదంటూ శనివారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద కేవీపీఎస్ నాయకులతో కలసి భైఠాయించి నిరసన వ్యక్తంచేసింది. తనకు న్యాయం జరిగే వరకూ పోరాడుతానని పేర్కొంది. కార్యక్రమంలో బాధితురాలితో పాటు తల్లి, కేవీపీఎస్ నాయకులు అన్నమయ్య, రమణ, రాము, జ్యోతమ్మ, మధు తదితరులు పాల్గొన్నారు. హిందూపురం రూరల్ సీఐ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. అబ్బాయిని పిలిపించి విచారిస్తే అతను ఒప్పుకోవడం లేదన్నారు. బాధితురాలు రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. (చదవండి: అప్పు కట్టకుంటే.. జైలుశిక్ష ) -
భర్త రెండో పెళ్లి.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన మొదటి భార్య
బొమ్మనహాళ్(అనంతపురం జిల్లా): రెండో పెళ్లి చేసుకున్న యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. బొమ్మనహాళ్ మండలం గోవిందవాడ నివాసి సుధాకర్‌కు విడపనకల్లు మండలం మల్లాపురానికి చెందిన శ్రీలేఖను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంత కాలం వీరి కాపురం అన్యోన్యంగా సాగింది. కొన్ని రోజులుగా శ్రీలేఖకు దూరంగా వచ్చిన సుధాకర్.. గురువారం ఉదయం కుటుంసభ్యులతో కలసి ఉరవకొండ మండలం రాకెట్లకు చెందిన యువతిని నేమకల్లు ఆంజనేయస్వామి ఆలయంలో రెండో వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న శ్రీలేఖ వెంటనే బొమ్మనహాళ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై విచారణ అనంతరం సుధాకర్‌తో పాటు అతణ్ని రెండో వివాహానికి ప్రేరేపించిన తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: వీడియోలు ఎక్కువగా చూడొద్దని భర్త మందలింపు.. నవవధువు ఆత్మహత్య -
పెళ్లి పీటలెక్కనున్న నటి.. కాబోయే భర్త ఎవరంటే?
బనశంకరి(కర్ణాటక): కన్నడ నటి అదితి ప్రభుదేవా దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టనున్నారు. సోమవారం ప్యాలెస్ మైదానంలో వివాహ వేడుక జరగనుంది. ఆమె శాండల్‌వుడ్‌లో డిమాండ్ ఉన్న నటి. కాగా, కాఫీ రంగ పారిశ్రామికవేత్త యశస్‌తో పెళ్లి జరగనుంది. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి అని తెలిపారు. ఆదివారం సాయంత్రం జరిగిన రిసెప్షన్లో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. చదవండి: అలీ కూతురిని ఆశీర్వదించిన మెగాస్టార్, వీడియో వైరల్ -
ఇంటివాడైన టాలీవుడ్ హీరో నాగశౌర్య
-
మొదటి భర్త ఘాతుకం...తనని కాదని మరో పెళ్లి చేసుకుందని పెట్రోల్‌తో...
హిమాయత్‌నగర్: తనను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందనే కోపంతో ఓ యువకుడు తన మాజీ భార్య, ఆమె భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పది నెలల చిన్నారి ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి నారాయణగూడ ఎక్స్‌రోడ్ సమీపంలోని జీహెచ్ఎంసీ మార్కెట్‌వద్ద చోటు చేసుకుంది’. డయల్–100 ఫిర్యాదుతో రంగంలోకి దిగిన నారాయణగూడ పోలీసులు స్థానికుల సాయంతో బాధితులను గాంధీ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం క్లూస్‌టీం వివరాలు సేకరించింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అంబర్‌పేటకు చెందిన నాగుల సాయి, చిక్కడపల్లి మునిసిపల్ మార్కె ట్ ప్రాంతానికి చెందిన ఆర్తీ ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. నాగుల సాయి బ్యాండ్ కొట్టే పనిచేస్తుండగా ఆర్తీ నారాయణగూడ ఫ్లైఓవర్ సమీపంలో పూలు విక్రయించేది. ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో రెండేళ్ల క్రితం ఆర్తీ అతడి నుంచి విడిపోయి తల్లి లక్ష్మీబాయి, సోదరుడు జితేందర్లతో కలిసి ఉంటుంది. ఈ నేపథ్యంలో చిక్కడపల్లికి చెందిన ట్యాంక్ క్లీనర్ నాగరాజుతో పరిచయం ఏర్పడి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. తనని వదిలేసి మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఆర్తిని, ఆమె వివాహం చేసుకున్న నాగరాజు, అన్ని విషయాల్లో తనకు అడ్డుపడుతున్న ఆర్తి సోదరుడు జితేందర్‌ను అంతమొందించేందుకు నాగుల సాయి రెండేళ్ల క్రితమే కుట్ర పన్నాడు. భార్యను అంతమొందించేందుకు ఆమె వద్దకు వెళ్లగా జితేందర్ అడ్డుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో జితేందర్‌పై నాగుల సాయి దాడి చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు నాగుల సాయిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఏడాది క్రితం మరోసారి నారాయణగూడ పరిధిలో నాగులసాయిపై కేసు నమోదైంది. దీంతో వారిపై కక్ష పెంచుకున్న నాగుల సాయి ఈసారి పక్కాగా హత్య చేయాలని కుట్ర పన్నాడు. ఇందులో భాగంగా సోమవారం రాత్రి జగ్గులో పెట్రోల్ తీసుకువచ్చి ఆర్తీ, భర్త నాగరాజులపై చల్లి నిప్పటించాడు. ఆ పెట్రోల్ ఆర్తీ ఒడిలో ఉన్న చంటిపిల్లాడు విష్ణుపై (10 నెలలు) కూడా పడింది. దీంతో ముగ్గురూ మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. ఆర్తీ, నాగరాజులకు 50శాతం గాయాలవ్వగా..90 శాతం గాయపడిన చిన్నారి విష్ణును గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడు నాగుల సాయి కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. (చదవండి: జ్యూస్‌లో మత్తు మందు ఇచ్చి..) -
అమెరికా అమ్మాయి.. ఆంధ్రా అబ్బాయి.. ఇలా ఒక్కటయ్యారు.. ఆ పెళ్లిలో ఇదే ప్రత్యేక ఆకర్షణ
చీరాల రూరల్(ప్రకాశం జిల్లా): అమెరికా అమ్మాయి, ఆంధ్రా అబ్బాయి ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించుకున్నారు. సంప్రదాయంగా పెళ్లి చేసుకుని చీరాలలో శనివారం ఒక్కటయ్యారు. చీరాల కొత్తపేటకు చెందిన లింగం జాన్ సుశీల్‌బాబు, రత్నకుమారి దంపతుల కుమారుడు లింగం జాన్కిరణ్బాబు ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాడు. చదవండి: వామ్మో.. 8 నెలల చిన్నారి ఛాతి మధ్యలో ఏముందో తెలిస్తే షాకే..! ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్న ఇతనికి తోటి ఉద్యోగి అయిన అమెరికాలోని ఆరిజోనా స్టేట్ హుడ్ రివర్ పట్టణానికి చెందిన కోరి ఎలిజబెత్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలకు విషయం చెప్పారు. వారు ఒప్పుకోవడంతో వివాహం చేసుకున్నారు. కోరి ఎలిజబెత్ కుటుంబ సభ్యులు పట్టుచీరలు కట్టుకుని వివాహానికి హాజరవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు.. చివరికి ట్విస్ట్
వేంపల్లె(వైఎస్సార్ జిల్లా): ఇద్దరు మహిళలు వివాహం చేసుకున్న ఘటన వైఎస్సార్ జిల్లాలో జరిగింది. పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చి ఎవరిళ్లకు వారిని పంపించివేశారు. కమలాపురం నియోజకవర్గం చెన్నూరు గ్రామానికి చెందిన ఓ మహిళకు, పెండ్లిమర్రి మండలం మిట్టమీదపల్లెకు చెందిన వ్యక్తితో ఏడాది కిందట వివాహమైంది. వారి మధ్య మనస్పర్థలున్నాయి. చదవండి: మాజీ ఎంపీ హర్షకుమార్ కుమారుడి నిర్వాకం.. యువతిపట్ల అసభ్యకర ప్రవర్తన మహిళకు తమ బంధువైన వేంపల్లె రాజీవ్ కాలనీకి చెందిన మరో మహిళతో పరిచయమేర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ క్రమంలో గత శనివారం వీరిద్దరూ వెళ్లిపోయి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో వివాహం చేసుకున్నారు. మంగళవారం వేంపల్లె పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. సీఐ సీతారామిరెడ్డి వారిద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి, వారి బంధువులను పిలిపించి అప్పగించారు. -
3 సార్లు పెళ్లి వరకు.. దేవుడు దయతో బయటపడ్డ: స్టార్ హీరోయిన్
Sushmita Sen Says Why She Never Get Married Till Now: మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిందీ చిత్రసీమలో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన సుస్మితా 'ఆర్య' వెబ్ సిరీస్‌తో మరోసారి తన మార్క్ చూపించింది. అంతకుముంచి ఇటీవల కాలంలో తన బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ వార్తలతో మరింత పాపులర్ అయింది. తాజాగా ట్వింకిల్ ఖన్నా హోస్ట్ చేస్తున్న 'ట్వీక్ ఇండియా: ది ఐకాన్స్' కార్యక్రమంలో వివాహ బంధం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది సుస్మితా సేన్. 'అదృష్టవశాత్తు నేను చాలా ఆసక్తికరమైన వ్యక్తులను కలుసుకున్నాను. కానీ నేను ఎప్పుడూ పెళ్లి చేసుకోకపోవడానికి ఏకైక కారణం వారు నిరాశ చెందటమే. దీనికి నా పిల్లలకు ఎలాంటి సంబంధం లేదు. నా పిల్లలతో నాకు ఎప్పుడు మంచి సాన్నిహిత్యమే ఉండేది. నా జీవితంలో వచ్చిన ప్రతి ఒక్కరిని ముక్తకంఠంతో అంగీకరించారు. ప్రతి ఒక్కరికీ సమానమైన ప్రేమ, గౌరవాన్ని ఇచ్చారు. ఇది చాలా సంతోషమైన విషయం. నిజానికి నేను సుమారు మూడు సార్లు పెళ్లి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. మూడు సార్లు వివాహ బంధానికి అతి దగ్గరగా వెళ్లాను. కానీ ఆ దేవుడు నన్ను రక్షించాడు. వారి జీవితంలో జరిగిన విషయాలను నేను మీకు చెప్పలేను. కానీ దేవుడు నన్ను, నా పిల్లలను కాపాడుతున్నాడు. అతను ఎలాంటి చెడు బంధంలోకి వెళ్లనివ్వడు' అని సుస్మితా సేన్ తెలిపింది. చదవండి: ఫ్రెండ్‌తో బెడ్ షేర్.. అబార్షన్.. ఎలాంటి పశ్చాత్తాపం లేదు: నటి నగ్నంగా విజయ్ దేవరకొండ.. ఫొటో వైరల్ సుస్మితా సేన్ గతేడాది మోడలైన బాయ్‌ఫ్రెండ్ రోహ్మాన్తో బ్రేకప్ చేసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా సుస్మితా సేన్‌కు ఇద్దరు కుమార్తెలు. 2000 సంవత్సరంలో రెనీని, 2010లో అలీసాను దత్తత తీసుకుంది. 1994లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని కైవసం చేసుకున్న సుస్మితా సేన్ 1996లో వచ్చిన 'దస్తక్' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. తర్వాత బీవీ నెంబర్ 1, డు నాట్ డిస్టర్బ్, మై హూ నా, మైనే ప్యార్ క్యూ కియా, తుమ్కో నా భూల్ పాయేంగే, నో ప్రాబ్లమ్ వంటి చిత్రాలతో పాటు ఆర్య, ఆర్య 2 వెబ్ సిరీస్‌లో నటించి మెప్పించింది. చదవండి: నా రిలేషన్ గురించి దాచాలనుకోవట్లేదు: శ్రుతి హాసన్ తొలిసారిగా మోహన్ బాబు, మంచు లక్ష్మీల కాంబినేషన్.. View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) -
మీరు నాకు నచ్చారు.. పెళ్లి చేసుకుందాం.. చివరికి ఊహించని ట్విస్ట్
నెల్లూరు(క్రైమ్): మీరు నాకు నచ్చారు. పెళ్లి చేసుకుందామని చెప్పాడు. ఆమె ఎంతో సంతోషించింది. అయితే నాగదోషముంది. పూజలు చేస్తే పోతుందని ఆ మహిళను నమ్మించి నగదు కాజేసిన ఘటనపై నెల్లూరులోని వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. ఓ మహిళ భర్త 2013వ సంవత్సరంలో మృతిచెందాడు. అప్పటినుంచి ఆమె తన కుమార్తెతో కలిసి మహిళా ప్రాంగణంలో ఉంటోంది. ఇటీవల రెండో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని ఆన్లైన్లో మ్యారేజ్ బ్యూరోలకు వివరాలను పంపారు. చదవండి: ప్రేమ..పెళ్లి.. గొడవ.. మధ్యలో పద్మ.. ఇంతకీ ఏంటా కథ? ఈక్రమంలో రాఘవరెడ్డి అనే వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి డిఫెన్స్‌లో కల్నల్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్‌రెడ్డికి తాను బాబాయ్ అని పరిచయం చేసుకున్నాడు. మీ ప్రొఫైల్ శ్రీకాంత్‌రెడ్డికి నచ్చిందని అతడితో మాట్లాడమని ఫోన్ నంబర్ ఇచ్చాడు. సదరు మహిళ శ్రీకాంత్‌రెడ్డికి ఫోన్ చేయగా ఫొటోలు పంపితే సిద్ధాంతికి చూపించి వివాహం చేసుకుందామని నమ్మబలికాడు. దీంతో ఆమె ఫొటోలను పంపారు. సిద్ధాంతికి ఫొటోలు చూపించగా నాగదోషం ఉందని, కన్యాకుమారిలో నాలుగునెలలపాటు హోమం, రోజూ అన్నదానం, వస్త్రదానం చేస్తే నివారణ అవుతుందని చెప్పాడు. అందుకు రూ.1.72 లక్షలు ఖర్చవుతుందని శ్రీకాంత్‌రెడ్డి ఆమెను నమ్మించాడు. అతడి మాటలను గుడ్డిగా నమ్మిన మహిళ గత నెల మే 7వ తేదీన రూ.1.72 లక్షల నగదును అతడి ఖాతాకు పంపారు. అప్పటినుంచి శ్రీకాంత్‌రెడ్డి, రాఘవరెడ్డి మొబైల్ ఫోన్లు స్విచ్ ఆపేసి ఉన్నాయి. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు వేదాయపాళెం పోలీసులకు పిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ కె.నరసింహారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్ హీరో నరేష్ !
Is Senior Actor Naresh Getting Married With Pavithra Lokesh: ప్రేమకు వయసుతో సంబంధం లేదు అనే మాట చాలా సార్లు వింటుంటాం. కానీ అప్పుడప్పుడు కొన్ని సార్లు అది ప్రూవ్ అవుతుంటుంది కూడా. ప్రస్తుతం టాలీవుడ్ లో జోరుగా వినిపిస్తున్న టాక్ ప్రకారం సీనియర్ హీరో, నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్‌తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వీళ్లు చాలా కాలంగా లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో జంటగా కనిపించారు. ఆ పరిచయంతో నిజ జీవితంలో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారని భోగట్టా. ఇటీవల వీళ్లిద్దరూ కలిసి మహాబలేశ్వర్ వెళ్లి ఒక స్వామిజీని దర్శించుకోవడంతో ఇక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త గుప్పుమంది. నటుడు, విజయ నిర్మల తనయుడు నరేశ్ ఇప్పటికే దాదాపుగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారనే టాక్ ఉంది. కానీ తన భార్యలతో మనస్పర్థలు రావడంతో ఆయన విడాకులు ఇచ్చి ఒంటరి జీవితం గడుపుతున్నారు. అత్యంత విలాసవంతమైన జీవితం గడుపుతున్న నరేష్ తనకు ఈ వయసులో ఒక మంచి వ్యక్తి తోడుగా ఉండాలని భావిస్తున్నారని, అందుకే పలు సినిమాల్లో తనతో కలిసి నటించిన పవిత్ర లోకేష్ ని పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: సినిమా సెట్లో ఇద్దరు నటులు మృతి.. ఆరుగురికి గాయాలు వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్ ఇక పవిత్ర లోకేష్ విషయానికి వస్తే ఆమె 2007లో కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన సుచేంద్ర ప్రసాద్‌ను వివాహం చేసుకుంది. కానీ భర్తతో మనస్పర్థల కారణంగా ఒంటరిగా జీవిస్తోంది. కాకపోతే ఇంకా ఆమెకు చట్టబద్ధంగా విడాకులు రాలేదు. కోర్ట్ త్వరలో విడాకులు మంజూరు అవ్వగానే వీరు ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని టాక్. అయితే ఈ వార్తను ఇద్దరూ ఖండించకపోవడం, కలిసి నటిస్తుండడం, కలిసి కనిపిస్తుండడంతో ఈ టాక్ మరింతగా పెరిగింది. అయితే ఈ విషయంపై ఒక్కొక్కరు ఒక్కో రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇది ఎంతవరకు నిజం అనే ప్రశ్నకు సమాధానం చెప్పగలిగింది ఒక్క కాలం మాత్రమే. చదవండి: చెత్త ఏరిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్ సాయి పల్లవి వివరణపై ప్రకాశ్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. -
తండ్రి కళ్లేదుటే దారుణం... పక్షవాతంతో చెప్పలేని దీనస్థితి
రామభద్రపురం: మండల పరిధిలోని ముచ్చర్లవలస గ్రామంలో ఓ వివాహిత శనివారం హత్యకు గురైంది. ఈ సంఘటనపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు గ్రామానికి చెందిన దాలి రమణమ్మ(35) ఇంట్లో ప్రవేశించి కర్రతో తల వెనుక భాగాన కొట్టడంతో బలమైన గాయమై తీవ్ర రక్తస్రావంతో కింద పడి ఉంది. శనివారం తెల్లవారు జామున టీవీ పెద్ద శబ్దం రావడం, లైట్ వేసి ఉండడంతో పక్కింటి వారు వచ్చి చూడగా ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో ఆర్ఎంపీ వైద్యుడిని పిలిచి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం బాడంగి సీహెచ్‌సీకి తరలించగా వైద్యులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చి మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేశారు. విజయనగరం కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న సీఐ శోభన్‌బాబు, ఎస్సై కృష్ణమూర్తి సంఘటనా స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్, క్లూస్‌టీంను రప్పించి పరిశీలించారు. సీఐ శోభన్‌బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ రమణమ్మది హత్యగానే భావిస్తున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు. అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఇంటి వద్ద డాగ్ ఆగడంతో ఆ వ్యక్తిని రప్పించి విచారణ చేస్తామని తెలిపారు. హతురాలి నేపథ్యం ..రమణమ్మకు తెర్లాం మండలం ఎంఆర్ అగ్రహారానికి చెందిన రామారావుతో విహహం జరగగా భర్త పదేళ్ల క్రితం మరణించాడు. ఆమెకు ఒక కుమార్తె, కుమారుడు ఉండగా ఐదేళ్ల క్రితం కుమారుడు మృతిచెందాడు. హతురాలి తల్లి చిన్నమ్మ, తండ్రి పైడితల్లి 20 ఏళ్ల క్రితం విడాకులు తీసుకోగా తల్లి ప్రస్తుతం ఎంఆర్ అగ్రహారంలో ఉంటోంది. ముచ్చర్ల వలసలో ఉంటున్న తండ్రి పైడితల్లికి పక్షవాతం సోకడంతో రమణమ్మ తన కూతురిని తల్లి వద్ద ఉంచి రెండేళ్ల క్రితం తండ్రికి సేవలందించేందుకు ముచ్చర్లవలస గ్రామానికి వచ్చి ఉంటోంది. శుక్రవారం రాత్రి ఈ సంఘటన తండ్రి కళ్ల ముందే జరిగినా పక్షవాతంతో బాధపడుతుండడంతో ఏం జరిగిందో? ఎలా జరిగిందో చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. అయితే పోలీసులు మాత్రం వివాహేతర సంబంధం నేపథ్యంలో ఏమైనా హత్య జరిగి ఉండవచ్చా అనే కోణంలో కూడా విచారణ సాగిస్తున్నారు. రమణమ్మ మృతితో కుమార్తె మౌనిక ఒంటరిదైపోయింది. (చదవండి: సర్వశ్రేయో నిధితో ఆలయాల అభివృద్ధి) -
పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం
రామభద్రపురం: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ప్రియుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితురాలు శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మిర్తివలస గ్రామానికి చెందిన సువ్వాడ ఉషారాణి అదే గ్రామానికి చెందిన పొట్నూరు గోపాలకృష్ణ 2019 నుంచి ప్రేమించుకుంటున్నారు. గోపాలకృష్ణ హైదరాబాద్ సెంట్రల్ పోలీస్ లైన్స్‌లో రిజర్వ్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నాడు. అయితే 2020లో ఇద్దరి మధ్య బేదాభిప్రాయాలు రావడంతో గ్రామపెద్దల వద్దకు పంచాయితీ చేరింది. దీంతో గోపాలకృష్ణ నుంచి కొంత మొత్తాన్ని ఉషారాణికి ఇప్పించి రాజీ కుదిర్చారు. కొద్ది రోజుల తర్వాత ఇద్దరూ మళ్లీ ఒక్కటయ్యారు. గోపాలకృష్ణ డిప్యుటేషన్‌పై విశాఖపట్నంలో విధులు నిర్వహిస్తూ, అప్పుడప్పుడూ గ్రామానికి వచ్చి ఉషారాణితో గడుపుతుండేవాడు. ఈ క్రమంలో ఆమె గర్భవతి కావడంతో పెళ్లి చేసుకోవాలని గోపాలకృష్ణపై ఒత్తిడి తీసుకువచ్చింది. అయితే పెళ్లికి ప్రియుడు నిరాకరించడంతో తనకు న్యాయం చేయాలని బాధితురాలు విజయనగరం హ్యూమన్ రైట్స్ సంఘం సభ్యులను ఆశ్రయించింది. వారి సూచన మేరకు గ్రామ పెద్దలతో కలిసి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సీఐ ఎం. నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్సై కృష్ణమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ఇంటి దొంగ గుట్టురట్టు.. అసలు సూత్రధారి బ్యాంకు మేనేజరే!) -
భర్త నిర్వాకం.. ప్రియురాలితో గుట్టుగా కాపురం.. భార్యకు తెలిసి..
ఆటోనగర్(విజయవాడతూర్పు): ప్రేమించి పెళ్లి చేసుకున్న వివాహితను మోసం చేసి మరొక అమ్మాయిని వివాహం చేసుకున్న వ్యక్తిపై పటమట పోలీస్ స్టేషన్లో బుధవారం కేసు నమోదయింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పెనమలూరుకు చెందిన గంగాలక్ష్మికి ప్రసాదంపాడుకు చెందిన ఫణికుమార్‌తో 2017లో వివాహం అయింది. వీరిద్దరిదీ ప్రేమ వివాహం. 2018లో వీరికి ఒక పాప పుట్టింది. మూడేళ్ల పాటు వీరి వైవాహిక జీవితం అన్యోన్యంగానే సాగింది. చదవండి: వివాహితను ఇంటిలో నిర్బంధించి లైంగికదాడి.. రెండు రోజుల తర్వాత.. గత కొంత కాలంగా ఫణికుమార్ కాంట్రాక్ట్ పనుల నిమిత్తం హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాలకు వెళుతున్నాడు. రెండు నెలలకు ఒక సారి ఇంటికి వస్తూ పోతూ, రాను రాను ఇంటికి రావడం మానేశాడు. దీంతో గంగాలక్ష్మి పెనమలూరులోని తన సొంత ఇంటికి వెళ్లింది. ఫణికుమార్ వేరొక అమ్మాయిని వివాహం చేసుకొని ఆయుష్ ఆసుపత్రి సమీపంలో కాపురం పెట్టినట్టు గంగాలక్ష్మికి తెలియడంతో గంగాలక్ష్మి పటమట పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి బైఠాయింపు
అక్కన్నపేట(హుస్నాబాద్): పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించింది. ఆమె కథనం ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా, రుద్రంగి మండలానికి చెందిన కాదాసు కీర్తన, అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామానికి చెందిన బత్తుల సతీశ్ తొమ్మిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి గర్భవతిని చేశాడు. గర్భం పోయేందుకు అబార్షన్ చేయించాడు. అనంతరం వారి ఇరువురి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటానని సతీశ్ ఒప్పకున్నాడు. అయితే పెళ్లి చేసుకోకుండా ఏదో ఒక సాకు చూపుతూ పెళ్లిని దాటవేస్తున్నాడు. 2020 సెప్టెంబర్ 12 తేదీన సతీశ్ తల్లిదండ్రులు గ్రామ పెద్దల సమక్షంలో కొడుకుతో పెళ్లి చేస్తామని ఒప్పంద ప్రతం రాసి ఇచ్చారు. ఆ మేరకు రెండు నెలల క్రితం రుదంగ్రి గ్రామంలోని లక్ష్మీ నర్సింహస్వామి దేవాలయంలో వరపూజ జరిగింది. నెలలోపు పెళ్లి ఏర్పాటు చేస్తామని ప్రియుడు, అతడి తల్లిదండ్రులు అంగీకరించారు. అయితే వరకట్నంగా కారు, డబ్బులు ఇస్తేనే పెళ్లి చేసుకుంటానంటూ ప్రియుడు, అతడి తల్లిదండ్రులు వేధిస్తున్నారని కీర్తన కన్నీటి పర్యతమైంది. ప్రియుడు, అతడి తల్లిదండ్రులు బత్తుల కొమురయ్య, ఎల్లవ్వ, వారిని ప్రోత్సహిస్తున్న మల్లేశ్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం జరగకుంటే ప్రియుడి ఇంటి ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని కీర్తన హెచ్చరించింది. -
ప్రేమజంటపై పెద్దల దాష్టీకం.. పెళ్లైన రెండు రోజులకే..
మైసూరు(బెంగళూరు): రెండేళ్లపాటు ప్రేమించుకున్న ప్రేమ జంట పెళ్ళి జరిపించాలని పెద్దలను కోరగా ససేమిరా అన్నారు. దీంతో ఆ జంట పోలీసుల సహాయంతో పెళ్లి చేసుకోగా పెద్దలు వచ్చి విడదీశారు. హుణసూరులో ఈ సంఘటన జరిగింది. మండ్య జిల్లా నాగమంగల తాలూకా కదబహళ్లికి చెందిన అభిషేక్, చోళెనహళ్లివాసి అనన్య ప్రేమించుకున్నారు. వారి ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలు వ్యతిరేకించారు. దాంతో హుణసూరు పోలీసులను సంప్రదించి మంగళవారం ఒక ఆలయంలో మూడుముళ్లు వేసుకున్నారు. ఇది తెలిసి అనన్య తల్లిదండ్రులు, బంధువులు బుధవారం మైసూరులో ఆ జంట ఒక కెఫేలో ఉండగా దాడి చేసి కొట్టారు. అనన్యను బలవంతంగా తీసుకెళ్లారు. దీంతో భర్త హుణసూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరో ఘటనలో.. మహిళ ఆత్మహత్య హోసూరు: మతి స్థితిమితం కోల్పోయిన మహిళ ఉరివేసుకొన్న ఘటన మంగళవారం రాత్రి బాగలూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. హోసూరు తాలూకా బాగలూరు సమీపంలోని జి.మంగలం గ్రామానికి చెందిన తోపయ్య భార్య శశికళ (55) ఆరు నెలలుగా మతిస్థిమితం కోల్పోయిన స్థితిలో ఉండేది. మంగళవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. బాగలూరు పోలీసులు శవాన్ని హోసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చదవండి: Extramarital Affair: పక్కింటి మహిళ ఇంట్లోకి రావడంతో.. -
వరుడు లేకుండా చిన్నారులకు పెళ్లి
చింతపల్లి (పాడేరు): ఆడ పిల్లలు పుడితే ఆ గిరిజనుల ఆనందానికి హద్దులు ఉండవు. అల్లారుముద్దుగా పెంచుకుంటారు. ముచ్చటగా మూడు సార్లు పెళ్లి కూడా చేస్తారు. ఆడపిల్లలకు పెళ్లికి ముందు బాల్యంలో ఒకసారి, యుక్తవయసు వచ్చాక మరోసారి పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి తంతు నిర్వహించడం వారి ఆచారం. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో నివసించే మాలి జాతి గిరిజనుల్లో ఈ ఆచారం కొనసాగుతోంది. సోమవారం చింతపల్లి మండలంలోని చౌడుపల్లిలో 27 మంది ఐదేళ్లలోపు బాలికలకు వరుడు లేకుండా సామూహిక వివాహాలు జరిపించారు. గ్రామ సమీపంలో రాటలు వేసి, వాటికి కుండలను అమర్చి, పెళ్లి పందిరి నిర్మించారు. చిన్నారులకు కొత్త చీరలు కట్టి పెళ్లికూతురు వలె ముస్తాబు చేసి తల్లిదండ్రులు, బంధుమిత్రుల సమక్షంలో సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసారు. అనంతరం భారీ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బాల్యంలో పెళ్లిళ్లు చేయడం మాలి తెగ గిరిజనులకు తరతరాలుగా వస్తోన్న ఆనవాయితీ. ఏజెన్సీలో కూరగాయలు సాగు చేసేందుకు ఒడిశా నుంచి వలస వచ్చిన ఈ గిరిజనుల భిన్నమైన ఆచారం అందరినీ ఆకట్టుకుంటోంది. -
వరుడికి ట్రాఫిక్ కష్టాలు... కాలినడకన వెళ్లిన తాళి కట్టాడు
కర్ణాటక(యశవంతపుర): ఓ వైపు ముహూర్తం దగ్గర పడుతోంది... రోడ్డంతా ట్రాఫిక్ జామ్... కల్యాణ మంటపం చేరుకోవడానికి పెళ్లి కుమారుడితో బయలుదేరిన బంధువులు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. ఇక లాభం లేదనుకున్న పెళ్లి కుమారుడు కాలినడకన కల్యాణ మంటపానికి వెళ్లి వధువు మెడలో మూడుముళ్లు వేశారు. చామరాజనగరకు చెందిన వధువుకు, తమిళనాడులోని సత్యమంగళకు చెందిన వరుడికి వివాహం నిశ్చయమైంది. సత్యమంగల సమీపంలోని బన్నారి ఆలయంలో శుక్రవారం ఉదయం వివాహం జరగాల్సి ఉంది. గురువారం రాత్రి కర్ణాటక, తమిళనాడు సరిహద్దులో సత్యమంగలం అటవీ ప్రాంతం వద్ద రాత్రి సమయంలో వాహన సంచారాన్ని నిషేధించారు. దీంతో మరుసటిరోజు ఉదయం రోడ్డు పొడవునా వందల సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. ఇదే సమయంలో ఓ పెళ్లి కుమారుడు, బంధువులు కారులో వచ్చారు. ట్రాఫిక్ పునరుద్ధరణకు గంటల కొద్ది సమయం పడుతుందని తెలియడంతో పెళ్లి కుమారుడు కాలినడకన మంటపానికి బయలుదేరాడు. సకాలంలో అక్కడికి చేరుకుని వధువు మెడలో తాళికట్టాడు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
వృక్షాన్ని వివాహం చేసుకున్న మహిళ!...ఎందుకో తెలుసా!!
కొంతమంది పర్యావరణం కోసం ఎంతలా పాటుపడతారంటే తమ జీవితం మొత్తం ధారపోసేలా శ్రమిస్తారు. ఆహర్నిసలు మొక్కలు పెంచుతూ ఒక అడవినే తయారు చేసి అవార్డులు పొందిన మహామహుల్ని చూశాం. అంతేకాదు సుందర్లాల బహుగుణ చిప్కో ఉద్యమానికి యావత్తు దేశం ఆకర్షింపబడటమే కాక చాలామంది అదేబాటలో నడిచినవాళ్లు కూడా ఉన్నారు. అచ్చం అలానే మెక్సికన్ దేశంలోని మహిళా పర్యావరణ ప్రేమికులను ఆదర్శంగా తీసుకుని యూకేకి చెందిన ఒక మహిళ ఒక విన్నూతమైన పనికి శ్రీకారం చుట్టింది. (చదవండి: ప్రధాని ఫోటో తొలగించాలి!...అని పిటిషన్ దాఖలు చేసినందుకు రూ లక్ష జరిమానా!!) అసలు విషయంలోకెళ్లితే...యూకేలో మెర్సీసైడ్‌లోని సెఫ్టన్‌లో 37 ఏళ్ల కేట్ కన్నింగ్‌హామ్ అనే మహిళ 2019లో చాలా ఏళ్ల నాటి పెద్ద వృక్షాన్ని పెళ్లి చేసుకుంది. అంతేకాదు తన ఇంటిపేరును ఎల్డర్‌గా మార్చుకుంది. పైగా వారానికి ఐదు సార్లు చెట్టును సందర్శిస్తానని కూడా చెబుతుంది. అంతేకాదు ఆమె కుటుంబ సభ్యులందర్నీ ఇంట్లో వదిలి బాక్సింగ్ డేని తన బెటర్ హాఫ్‌తో గడపాలని ప్లాన్ చేసుకుంటుందట. అయితే రిమ్రోస్ వ్యాలీ కంట్రీ పార్క్ గుండా బైపాస్ నిర్మించాలనే ఆలోచనకు వ్యతిరేకంగా కేట్ ఆ పార్క్‌లోని ఆ మహా వృక్షాన్ని వివాహం చేసుకుంది. అంతేకాదు చాలా ఏళ్ల క్రితం ల్యాండ్ క్లియరెన్స్ కోసం చట్టవిరుద్ధంగా చెట్టను నరకడాన్ని వ్యతిరేకించి చెట్లను వివాహం చేసుకున్న మెక్సికన్ మహిళలు తనకు ఆదర్శం అని కేట్ చెప్పింది. పైగా తాను పెళ్లి చేసుకోవాలనుకునే చెట్టుని వెతకడానికే ఆ పార్క్‌ని సందర్శించానని కూడా చెబుతోంది. అంతేకాదు కేట్ ఆ చెట్టుతో కలిసి మూడో క్రిస్మస్ని జరుపుకోనున్నట్లు చెప్పింది. ఈ మేరకు కేట్ పండుగ కోసం చెట్టును పుష్పగుచ్ఛం, టిన్సెల్, బాబుల్స్‌తో కూడా అలంకరించింది. పైగా కేట్ తన క్రిస్మస్ కార్డులపై 'విత్ వింటర్ విషెస్, ఫ్రమ్ మిస్టర్ అండ్ మిసెస్ ఎల్డర్' అని సంతకాలు కూడా చేసింది. కేట్ కుటుంబ సభ్యులు స్నేహితులు ఆమె వివాహానికి పూర్తిగా మద్ధతు ఇవ్వడం విశేషం. (చదవండి: నరమాంస భక్షణ వల్ల బ్రైయిన్ క్యూర్ అవుతుందని నమ్మాడు...ఐతే చివరికి..!!) -
విడాకులు వద్దు..కలసి కాపురం చేయండి: న్యాయమూర్తులు
మైసూరు: చిన్న చిన్న కారణాలతోనే విడాకులకు దరఖాస్తు చేసే జంటలు ప్రస్తుతం పెరిగిపోయాయి. ఇదే రీతిలో విడాకుల కోసం వచ్చిన జంటలను ఆదివారం మైసూరులో నిర్వహించిన లోక్ అదాలత్‌లో న్యాయమూర్తులు బుజ్జగించి మళ్లీ ఒక్కటి చేశారు. నగరంలోని కోర్టు కాంప్లెక్స్‌లో కుటుంబ తగాదాల జంటలకోసం లోక్ అదాలత్ నిర్వహించగా సుమారు 25 మంది దంపతులు విడాకులు కోరుతూ హాజరయ్యారు. వారికి విడాకుల వల్ల వచ్చే అనర్థాలను జడ్జిలు, న్యాయ నిపుణులు వివరించి.. కలసి కాపురం చేయాలని నచ్చజెప్పడంతో వారంతా మళ్లీ ఒక్కటయ్యారు. -
వేకువన పెళ్లి.. సాయంత్రం ప్రమాదం.. అదృష్టవశాత్తు..
సాక్షి, నరసన్నపేట(శ్రీకాకుళం): సోమవారం వేకువన పెళ్లి చేసుకున్న ఓ జంట అదే రోజు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అదృష్టవశాత్తు గాయాలతో ఇరువురూ బయట పడడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. విశాఖ జిల్లా పెందుర్తిలో అదే గ్రామం వెలమ తోటకు చెందిన జి.శంకరరావు, టెక్కలి మండలం తలగాంకు చెందిన ఢిల్లీశ్వరి(స్వప్న)కు సోమవారం వేకువన 4 గంటలకు వివాహమైంది. వివాహం అనంతరం అత్తవారింటిలో అడుగు పెట్టేందుకు నూతన వధూవరులు కారులో వచ్చారు. ఈ కార్యక్రమం అయ్యాక తిరుగు ప్రయాణంలో గట్లపాడు సమీపంలోని జాతీయ రహదారిపై ముందున్న లారీని అధిగమించే ప్రయత్నంలో కారు మరో లారీని ఢీ కొట్టింది. దీంతో కారు రోడ్డుపై పల్టీలు కొట్టింది. ప్రమాదంలో వధూవరులకు గాయాలు కాగా.. వరుడు శంకరరావుకు బలమైన దెబ్బలు తగిలాయి. వీరితో పాటు పెళ్లి కుమార్తె మేనత్త జ్యోతి, డ్రైవర్ బాలాజీలు కూడా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బీఎస్ఎఫ్ జవాను మాధవరావు అటుగా వెళ్తున్నారు. ప్రమాదాన్ని గమనించిన ఆయన కారు నుంచి క్షతగాత్రులను బయటకు తీసి 108 వాహనం ద్వారా ఆస్పత్రికి తరలించారు. వధూవరుల వద్ద ఉన్న ఆభరణాలను జాగ్రత్త చేసి వారికి అప్పగించారు. క్షతగాత్రులు ప్రస్తుతం నరసన్నపేటలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చదవండి: Karimnagar: బ్యూటీషియన్ అదృశ్యం -
హీరోయిన్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి ఫోటోలు
-
Malala Yousafzai Marriage Video: పెళ్లి చేసుకున్న మలాల.. వీడియో వైరల్
-
పెళ్లి చేసుకున్న మలాల.. ఫోటోలు వైరల్
బ్రిటన్: బాలికల విద్య కోసం కృషి చేసిన ప్రచారకర్త, బాలికల విద్య కోసం ప్రచారకర్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ వివాహం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో తెలిపింది. తన వివాహాన్ని బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్ నగరంలో తమ ఇరు కుటుంబాల సమక్షంలో జరుపుకున్నట్లు వెల్లడించింది. (చదవండి: అద్భుత చిత్రం సౌర మంట! అత్యంత అరుదుగా కనిపించే దృశ్యం) అంతేకాదు తన భర్తని పేరు అస్సర్ అని చెప్పింది. ఈ మేరకు తన వివాహానికి సంబంధించిన ఫోటోలను మేము జీవిత భాగస్వాములమవ్వడానికి ముడివేశాం అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే మలాల పెళ్లి చేసుకున్న వ్యక్తి పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి చెందిన హైపెర్ఫార్మెన్స్ సెంటర్ జనరల్ మేనేజర్ అస్సర్ మాలిక్‌గా గుర్తించారు. గానీ దీని పై ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదు. ఈ క్రమంలో మలాల గతంలో బ్రిటన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో "ప్రజలు ఎందుకు వివాహం చేసుకోవాలో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. మీరు మీ జీవితంలో ఒక వ్యక్తిని కలిగి ఉండాలనుకుంటే, మీరు వివాహ పత్రాలపై ఎందుకు సంతకం చేయాలి" అంటూ మాట్లాడటం గమనార్హం. (చదవండి: అపార్ట్మెంట్లో మంటలు ...కానీ అగ్నిమాపక సిబ్బంది వచ్చేటప్పటికి!!) Today marks a precious day in my life. Asser and I tied the knot to be partners for life. We celebrated a small nikkah ceremony at home in Birmingham with our families. Please send us your prayers. We are excited to walk together for the journey ahead. 📸: @malinfezehai pic.twitter.com/SNRgm3ufWP — Malala (@Malala) November 9, 2021 -
రాచరికపు హోదా వదులుకొని... ప్రేమను గెలిపించుకుంది
ప్రేమ దేశం యువరాణి పూతప్రాయం విరబోణి ఏరికోరి మెచ్చావే ఈ తోట రాముణ్ణి అని అంటూ సినిమాల్లోనే కోటలో రాజకుమారి తోటలో సామాన్యుడిని పెళ్లి చేసుకోవడం చూశాం. కానీ ఇక్కడ నిజజీవితంలో జపాన్ యువరాణి మాకో తాను ప్రేమించినవాడితో జీవితాన్ని పంచుకోవడం కోసం అన్నీ వదులుకొని సామాన్యురాలిగా మారిపోయింది. డబ్బుని, విలాసవంతమైన జీవితాన్ని, రాచరిక హోదాని వదులుకొని అత్యంత నిరాడంబరంగా ప్రేమికుడు కీశాన్ కొమురొని పెళ్లాడింది. వారిద్దరి వివాహ ధ్రువీకరణ పత్రాన్ని రాజభవనం అధికారులు మంగళవారం అధికారికంగా విడుదల చేశారు. రాజభరణాన్ని తిరస్కరించి.. జపాన్ రాచరిక చట్టాల ప్రకారం అమ్మాయిలు సామాన్యుల్ని పెళ్లి చేసుకుంటే రాణీవాసాన్ని, రాజభోగాల్ని వదులుకోవాలి. అందు కోసం రాజభరణం కింద 14 కోట్ల యెన్లు (దాదాపుగా రూ 9.30 కోట్లు) చెల్లిస్తారు. కానీ మాకో తమ ప్రేమ ముందు అన్నీ తృణప్రాయంగా భావించింది. రాజభరణాన్ని తిరస్కరించి కట్టుబట్టలతో రాజప్రసాదాన్ని వీడింది. రెండో ప్రపంచయుద్ధం తర్వాత రాజభరణాన్ని వద్దనుకొని సామాన్యుడి వెంట అడుగులు వేసిన యువరాణి మాకో ఒక్కరే. కొమురొ, మాకో జంట అమెరికాలోని న్యూయార్క్‌లో తమ భావి జీవితాన్ని గడపనున్నారు. న్యూయార్క్‌లో కొమురొ లాయర్ వృత్తిలో ఉన్నారు. వీరిద్దరినీ ఇప్పుడు బ్రిటన్ రాచరిక జంట ప్రిన్స్ హ్యారీ, మేఘాన్ మార్కెల్లతో పోలుస్తున్నారు. అతనో పెన్నిధి దేశం విడిచి వెళ్లే ముందు కొత్త జంట మీడియాతో మాట్లాడారు. కొమురొ వెలకట్టలేని ఒక పెన్నిధి అని, తమ మనసులు మరింతగా పెనవేసుకొని జీవితాంతం ఆనందంగా గడపడానికే ఈ పెళ్లిచేసుకున్నామని మాకో చెప్పారు. మరోవైపు కొమురొ కూడా మాకోపై అంతే ప్రేమను కురిపించారు. ‘‘మాకోని నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఈ జీవితం ఒక్కటే. ఇది ఆమె ప్రేమలోనే గడిపేస్తాను’’అని భావోద్వేగంతో చెప్పారు. కష్టమైనా, సుఖమైనా కలిసి పంచుకుంటూ, ఒకరికొకరు తోడు నీడగా ఉంటామన్నారు. – టోక్యో ఆది నుంచి వివాదాలే కోటలో యువరాణి మనసిచ్చిన సామాన్యుడ్ని మనువాడడం అంత సులభం కాదు. వీరి జీవితంలోనూ సినిమాల్లో చూపించే మలుపులు, వివాదాలు ఎన్నో ముసురుకున్నాయి. జపాన్ చక్రవర్తి నరుహితోకు మేనకోడలైన మాకో , టోక్యోలోని ఇంటర్నేషనల్ క్రిస్టియన్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు కొమురొ క్లాస్మేట్. అలా వారిద్దరి పరిచయం ప్రేమగా మారింది. 2017 సెప్టెంబర్‌లోనే వారిద్దరూ తాము ప్రేమలో ఉన్నామని ప్రకటించారు. ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. అయితే కొమురొ తల్లితో వచ్చిన ఒక ఆర్థికపరమైన వివాదం కారణంగా అప్పట్లో వారి వివాహం ఆగిపోయింది. కొమురొ తల్లి ఆమె మాజీ ప్రియుడి నుంచి డబ్బులు తీసుకొని ఎగవేశారన్న ఆరోపణలున్నాయి. కొమురొ, మాకో పెళ్లికి ఆ ఆరోపణలతో సంబంధం లేదని రాజకుటుంబం అప్పట్లోనే ప్రకటించింది. అప్పట్నుంచి మీడియాలో వారిద్దరి ప్రేమపై లెక్కలేనన్ని కథనాలు వచ్చాయి. కొమురొ యువరాణికి తగిన జోడీ కాదని మీడియాలో హోరెత్తిపోయింది. ప్రజలు కూడా యువరాణి ప్రేమని మెచ్చలేదు. ఆ స్థాయిలో వ్యతిరేకతను తట్టుకోలేక మాకో మానసికంగా కుంగిపోయింది. ఆ డిప్రెషన్ నుంచి కోలుకోవడానికి ఆమెకు మూడేళ్లు పట్టింది. ఎన్నో వివాదాలు, వ్యతిరేకతల్ని ఎదుర్కొని సంపదని, రాజభోగాల్ని వదులుకొన్న యువరాణి మాకో రియల్ హీరోయిన్ అనిపించుకుంది. -
ప్రేమ పెళ్లి చేసుకున్న యువకుడు.. ఆరునెలలకే సామాజిక సేవ అంటూ..
సాక్షి, తిరువొత్తియూరు(తమిళనాడు): ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ యువతి ఆరు నెలలకే విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన చెన్నైలో చోటుచేసుకుంది. చెన్నై పెరంబూర్ నీలం తోటకు చెందిన రామచంద్రన్ (21). ఇతను ఆరు నెలల ముందు కీర్తన (21)ను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. కీర్తన చెన్నైలోని ఓ సూపర్ మార్కెట్లో పని చేస్తోంది. కొన్ని రోజులుగా రామచంద్రన్ పనికి వెళ్లకుండా సామాజిక సేవపై ఆసక్తి చూపినట్లు తెలిసింది. దీంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో విరక్తి చెందిన కీర్తన శనివారం ఉదయం ఇంట్లో పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆమెను రాజీవ్‌గాంధి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం కీర్తన మృతి చెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆషాఢ ఎడబాటు వెనుక.. ఆచారం.. ఆంతర్యం ఇవే..
సాక్షి, సిరిసిల్ల (కరీంనగర్): ఆషాఢాన్ని శూన్య మాసంగా భావిస్తారు. శుభకార్యాలు చేయకూడదని పెద్దలు విశ్వసిస్తారు. నిజానికి పెద్ద పండుగల రాకను ఈ మాసం తెలుపుతుంది. కొత్త దంపతులకు ఆషాఢం విరహ మాసం. ఒకరికొకరు దూరంగా ఉండాల్సిన అనివార్యమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సిన తరుణం. చూసుకోవడానికి కూడా వీల్లేకుండా కఠిన నిబంధనలు.. కలుసుకుంటే కలిగే దుష్పరిణామాల గురించి ఎన్నో అనుమానాలు. మారిపోయిన ప్రస్తుత కాలంలో నెల రోజుల ఎడబాటు అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త దంపతుల ఎడబాటు అనివార్యం అనే సంప్రదాయం సడలింపు దిశగా సాగిపోతోంది. ఫార్మాలిటీ కోసం ఓ 5 రోజులపాటు పుట్టింటికి వెళ్లి వస్తే చాలు అనే భావన కొందరు వెలిబుచ్చుతున్నారు. పెద్దల నియమం కూడా మంచికే అనుకునే వాళ్లూ ఉన్నారు. అయితే ఎడబాటు కూడా మంచికే అన్నది పెద్దల నిశ్చితాభిప్రాయం. ఆచారం.. ఆంతర్యం ఇవే.. ఆషాఢ మాసం నవ దంపతులను దూరంగా ఉంచడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నెల ప్రారంభం నుంచి కొత్త కోడలు అత్తగారి ముఖం చూడకూడదు. అలాగే కొత్త అల్లుడు అత్తగారింటి గడప తొక్కకూడదు అనే ఆచారం తరతరాలుగా వస్తోంది. కోడలు, అత్త ఒకరినొకరు చూసుకోవడం వల్ల వచ్చే సమస్యలు ఏమీ లేవు. మృగశిర నుంచి మొదలయ్యే చినుకుల ఆగమనం.. క్రమంగా ఆషాఢ మాసం ప్రవేశించే సరికి సమృద్ధిగా వర్షాకాలం అవుతుంది. సాగు ప్రధాన వృత్తిగా ఉన్న మెజార్టీ కుటుంబాల్లో ఇంటిల్లిపాది అదే పనుల్లో తలమునకలవుతారు. దీంతో కొత్త అల్లుడికి చేయాల్సిన మర్యాదలు చేయలేకపోతారు. పని ఆధారిత ప్రాంతాల్లో చేసే వృత్తిని కాదని మిగిలిన వాటికి ప్రాధాన్యత ఇవ్వరు. అందుకే ఈ నెలలో కొత్త అల్లుడు ఇంటికి రాకుండా ఉంటే సాగు పనులు నిరాటంకంగా సాగిపోతాయనే ఉద్దేశంతో ఈ నియమం విధించారు. వ్యవసాయాధారిత కుటుంబాలన్నింటిలోనూ ఇదే పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ దీన్ని అనుసరిస్తున్నారు. సంప్రదాయం వెనక శాస్త్రీయత నవ దంపతులు ఆషాఢ మాసంలో విడిగా ఉండాలనే నియమం పూర్వం నుంచి కొనసాగుతూ వస్తోంది. కొత్తగా పెళ్లయిన దంపతులు ఆరు నెలలపాటు అత్తగారింట్లో ఉండే సంప్రదాయం ఉండేది. శ్రమించే సమయంలో అత్తగారింట్లో కూర్చుని ఉంటే జరగాల్సిన పనులు నిలిచిపోతాయి. నవ దంపతులు ఒకే గూటిలో ఉండటం అంత మంచిది కాదంటారు. ఈ సమయంలో గర్భధారణ జరగడం తల్లీబిడ్డలకు అంత క్షేమం కాదు. ఆషా«ఢ మాసంలో కురిసే వర్షాలు, వరదల కారణంగా జలాశయాలు, పరిసరాల్లోని నీళ్లు కలుషితం అవుతాయి. ఈ నీటి వినియోగం అనారోగ్యాలకు కారణమవుతుంది. చలిజ్వరాలు, విరేచనాలు, తలనొప్పి మొదలైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. చీడపీడలు జనించే సమయంలో అనారోగ్య రోజులు, అశుభ సమయాల్లో గర్భధారణ జరిగితే అది పుట్టే శిశువుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని శాస్త్ర వచనం. ప్రత్యామ్నాయాలు బోలెడు ఎడబాటు కొత్త జంటకు కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ ఆధునిక కాలంలో అందుబాటులో ఉన్న సాంకేతిక పరికరాలు ఆ భావనను దూరం చేస్తున్నాయి. సెల్‌ఫోన్ వచ్చాక మనుషుల మధ్య మానసికంగా దూరం చాలా వరకు తగ్గిపోయింది. ఎస్ఎంఎస్లు, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా పరస్పర సందేశాల ఎలాగూ మార్చుకునే సౌకర్యం ఉండనే ఉంది. దూరంగా ఉండటమే శ్రేయస్కరం ఆషాఢ మాసంలో విడిగా ఉండటం శ్రేయస్కరమే. ఈ సమయంలో గర్భధారణ జరిగితే ప్రసవం వచ్చే ఎండాకాలంలో అవుతుంది. అధిక ఉష్ణోగ్రతల సమయంలో శిశువు జన్మిస్తే బాహ్య పరిసరాలను భరించడం కష్టమవుతుంది. ఆషాఢ మాసంతోపాటు పూజలు, నోముల పేరుతో శ్రావణంలో ఎడబాటు కొనసాగిస్తే సంతానోత్పత్తి› సమయాన్ని జూలై, ఆగస్టు వరకు పొడిగించుకునే అవకాశం ఉంటుంది. సుఖ ప్రసవానికి అనువుగా ఉంటుంది. – డాక్టర్ గీతావాణి, గైనకాలజిస్టు వివాహ బంధం బలోపేతం ఆషాఢ మాసం కొత్త దంపతుల మధ్య అనురాగాన్ని చిగురింపజేస్తుంది. అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు, ఆచారాలు, వ్యవహారాలు, సంప్రదాయాలు అన్నీ చూసి నిర్ధారించిన వివాహాల్లో ఈ నియమం చాలా బాగా పని చేస్తుంది. ఆషాఢ మాసంతో పరస్పర అభిప్రాయాలను పంచుకునే వీలు కలుగుతుంది. తద్వారా వివాహ బంధం బలోపేతం అవుతుంది. – బోయిని గౌతమ్, హారిక సంప్రదాయాన్ని పాటిస్తున్నాం పెద్దవాళ్లు ఏ నియమం పెట్టినా అది పిల్లల మంచి కోసమే. తరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని పాటించడం వల్ల సమస్యేమీ లేదు. పైగా ఇప్పుడు సెల్‌ఫోన్ లాంటి సాంకేతిక పరికరాలు మనుషులను కలిపే ఉంచుతున్నాయి. పెద్దవాళ్లు వి«ధించిన నియమ నిబంధనలు శాస్త్రీయ కోణంలోనే చూడకుండా, ఆరోగ్యం దృష్ట్యా పాటిస్తే మేలు కలుగుతుంది. అందుకే మేము ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నాం. – గూడెల్లి సురేశ్, వాసవి, సాఫ్ట్వేర్ దంపతులు 5 రోజులు తీసుకెళ్లారు పిల్లలు బాగుండాలనే పెద్దలు అనేక నియమాలను వి«ధించారు. టైమ్‌తో సంబంధం లేకుండా ఉద్యోగాలు చేసుకునే కాలంలో ఇలాంటి ఇవి కొంత అసౌకర్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి సంప్రదాయం కోసం ఐదు రోజులు పుట్టింటికి తీసుకెళ్లారు. ఎడబాటుతో అన్యోన్యత కూడా పెరుగుతుంది కాబట్టి ఆషాఢ నియమం మంచిదే. – గోవిందు భరత్‌కుమార్ (ప్రైవేట్ ఉద్యోగి), పద్మజ -
20ఏళ్ల అవమానాలు: బారాత్, డీజే, విందుతో వృద్ధ జంట పెళ్లి
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్‌లో హింస, మహిళలపై దారుణాలకు సంబంధించిన కథనాలనే ఎక్కువగా వింటూ ఉంటాం కదా. అయితే యూపీలోని ఉన్నావ్ జిల్లాలో ఒక వృద్ధ జంటకు వైభవంగా వివాహం జరిపించిన ఘటన ఒకటి ఆసక్తికరంగా మారింది. అంతేకాదు దాదాపు 20 సంవత్సరాలు సహజీవనం తరువాత ఈ పెళ్లి జరగడం మరో విశేషం. మరో విశేషం ఏమిటంటే, పెళ్లి ఖర్చులన్నీ గ్రామ సర్పంచ్, ఇతర గ్రామస్తులు భరించడం. దీంతో ముచ్చటైన పెళ్లి సందడితో అధికారికంగా ఒక్కటైన ఈ జంటకు అతిధులందరూ అభినందనలు తెలిపారు ఈ స్టోరీలోని వృద్ధ దంపతులు, సారీ నూతన వధూవరుల పేర్లు నరేన్ రైదాస్(60), రామ్రతి (55). వ్యవసాయ కుటుంబానికి చెందిన వీరిద్దరూ 2001నుండి కలిసి జీవిస్తున్నారు. అయితే వివాహం చేసుకోకుండా కలిసి కాపురం చేయడంపై గ్రామస్తులనుంచి చాలా అవమానాలను ఎదుర్కొన్నారు. అయినా తమ జీవనాన్ని కొనసాగించారు. వీరికి అజయ్ అనే 13 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. చివరికి కుమారుడితోపాటు, గ్రామపెద్దల ప్రోత్సాహంతో అధికారికంగా ఆ పెళ్ళి వేడుక కాస్తా ముగించేందుకు అంగీకరించారు. తద్వారా గత రెండు దశాబ్దాలుగా తాము పడుతున్న వేదనకు, కొడుకు ఎదుర్కొంటున్న అవమానాలను చెక్ పెట్టాలని ఇద్దరూ భావించారు. గ్రామ పెద్ద రమేశ్‌కుమార్, సామాజిక కార్యకర్త ధర్మేంద్ర బాజ్ పేయీ కలిసి గంజ్ మొరాదాబాద్, రసూల్పూర్ రూరి గ్రామంలో నరైన్, రామ్రతిని వివాహాన్ని ఘనంగా నిర్వహించారు. వివాహానికి ముందు వీరు గ్రామంలోని బ్రహ్మదేవ్ బాబా ఆలయాన్ని సందర్భించి ఆశీస్సులు తీసుకున్నారు. అంతేనా బ్యాండ్ బాజాలతో బారాత్, డీజేతో సందడి చేశారు. అనంతరం చక్కటి విందును కూడా ఏర్పాటు చేశారు. ముదిమి వయసులో,అదీ షష్టిపూర్తి చేసుకోవాల్సిన తరుణంలో కొడుకు సమక్షంలో ఒక్కటైన ఈ జంటకు పలువురు శుభాకాంక్షలు అందజేశారు. -
పెళ్లి కావడం లేదని మహిళా ఎస్సై ఆత్మహత్య
అమ్మాయికి 20 ఏళ్లు వచ్చాయంటే చాలు పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలనే చాలామంది తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు. కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బునంతా కూతురు చదువుకు పెట్టి అప్పటి వరకు ఏ లోటు లేకుండా చూసుకున్న పేరేంట్స్ ఆమె మంచి స్థాయిలో స్థిరపడ్డాక పెళ్లి పేరుతో తన జీవితానికి సంకేళ్లు వేస్తుంటారు. దీనికి తోడు మీ అమ్మాయికి ఇంకా పెళ్లి చేయలేదా అంటూ చుట్టుపక్కల వాళ్లు, బంధువుల సూటిపోటి మాటలు ఒకటి. దీంతో తన ఆశలను అటు తల్లిదండ్రులకు చెప్పలేక, ఇటు తనలో తాను కుమిలిపోయి చివరికి ఆత్మహత్య శరణమనుకునే యువతులు కోకొల్లలు. ఈ కోవలోకి అందరూ రాకపోయినా ఎక్కడో ఒక్కచోట నిత్యం ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.. చూస్తూనే ఉన్నాం. తాజాగా పెళ్లి కావడం లేదన్న బాధను తట్టుకోలేక ఎస్సైగా పని చేసే యువతి ఆత్మహత్య చేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని రత్లామ్ జిల్లా కేంద్రంలో పోలీస్ స్టేషన్లో కవితా సోలంకి అనే మహిళ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె ఒక బాధ్యతాయుతమైన పోలీసు ఆఫీసర్. ఎంతో కష్టపడితే గానీ ఆ కొలువును సాధించలేము. ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న ఆమెకు 35 సంవత్సరాలు. సెలవుల్లో ఇంటికి వెళ్లిన ఆమెకు ఓ ఘటన ఎదురైంది. పెళ్లి ఎప్పుడంటూ ఇంటి దగ్గర ఉన వాళ్లంతా ప్రశ్నించడం మెదలు పెట్టారు..ఇప్పుడే కాదు ఇంటికి వెళ్లిన ప్రతీ సారి ఇదే అడగుతుండటంతో ఆవేదన చెందింది. దీంతో ఇంటి నుంచి బయలుదేరి తిరిగి డ్యూటీలో జాయిన్ అయింది. బుధవారం రాత్రి అధికార నివాసంలో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తర్వాత తన స్నేహితురాలికి ఆత్మహత్యాయత్నం చేసినట్లు చెప్పడంతో ఆమె హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుంది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ దురదృష్టవశాత్తు గురువారం ఆమె మరణించింది. మృతురాలి ఇంట వద్ద నుంచి సుసైడ్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో.. తనకు పెళ్లి కావడం లేదని ఆందోళన చెందుతున్నట్లు, వివాహంపై ఇరుగుపొరుగు వారి మాటలకు సమాధాన చెప్పలేక అలసి పోయానని రాసుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. -
ఒకే పెళ్లి పందిట్లో అక్కాచెల్లెళ్లకు తాళికట్టిన యువకుడు !
కొల్చారం (నర్సాపూర్): ఒకే పెళ్లి పందిట్లో అక్కాచెల్లెళ్లకు ఓ యువకుడు తాళికట్టాడు. కొద్ది రోజుల కిందట కర్ణాటకలోని కోలార్ జిల్లాలో జరిగిన పెళ్లిలాగే మెదక్ జిల్లా కొల్చారం మండలం అంసాన్పల్లి గ్రామంలో తాజా ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గొల్పాల వెంకటేశ్‌కు స్వాతి, శ్వేత ఇద్దరు కూతుళ్లు. పెద్దమ్మాయి స్వాతికి శివ్వంపేట మండలం పాంబండకు చెందిన మేనబావ బాల్‌రాజ్‌తో పెళ్లి కుదిరింది. రెండో కూతురు శ్వేతకు మతిస్థిమితం లేదు. దీంతో శ్వేతని కూడా బాల్‌రాజ్‌కు ఇచ్చి పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. దీంతో పెళ్లి పత్రికలో వరుడితో పాటు ఇద్దరు అమ్మాయి ల పేర్లు కూడా ముద్రించి ఆదివారం గుట్టుచప్పుడు కాకుండా వివాహం జరిపించారు. అయితే వరుడు స్వాతిని మాత్రమే ఇంటికి తీసుకెళ్లగా.. మతిస్థిమితం లేని శ్వేతను తండ్రి తన ఇంటి వద్దే ఉంచుకున్నాడు. -
కట్టుకున్నోడే పుస్తేలు తెంపేశాడు!
కోరుట్ల: తాళి కట్టిన భర్త పుస్తెల తాడు లాక్కెళ్లడంతో మనస్తాపానికి గురై ఓ వివాహిత ఆత్మహత్యకు యత్నించి కెనాల్ వద్ద కళ్లు తిరిగిపడిపోయిన ఘటన మహిళా దినోత్సవం రోజు కోరుట్ల మండలం ఎఖీన్‌పూర్ వద్ద చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కథలాపూర్ మండలం గంభీర్‌పూర్‌కు చెందిన ఎన్నమనేని హర్షిత అలియాస్ నాగరాణి(25)కి ఆరు నెలల క్రితం కొడిమ్యాల మండలం కోనాపూర్‌కు చెందిన ఎన్గందుల రాజేందర్(41)తో వివాహమైంది. రాజేందర్‌కు రెండో వివాహం కాగా కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య సఖ్యత కొరవడింది. ప్రతీరోజు రాజేందర్ తాగి వచ్చి హర్షితను కొట్టడం, తిట్టడం చేసేవాడు. దీంతో విసిగిపోయిన హర్షిత కొన్ని రోజుల క్రితం గంభీర్‌పూర్‌కు వచ్చింది. శనివారం రాత్రి గంభీర్‌పూర్‌కు వచ్చిన రాజేందర్ మళ్లీ హర్షితతో గొడవపడి ఆదివారం ఉదయం పుస్తెలతాడు లాక్కెళ్లాడు. దీంతో మనస్తాపానికి గురైన హర్షిత గంభీర్పూర్ నుంచి కోరుట్ల మండలం ఎఖీన్‌పూర్ ఎస్సారెస్పీ కెనాల్ వద్దకు వెళ్లింది. అక్కడ నీటి ప్రవాహాన్ని చూసి కళ్లు తిరిగిపడిపోయింది. చుట్టుపక్కల రైతులు ఆమెను గమనించి వివరాలు తెలుసుకుని వెంటనే బంధువులకు సమాచారమిచ్చారు. కోరుట్లలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేసే హర్షిత పెద్దమ్మ కారంగుల శ్యామల కెనాల్ వద్దకు వచ్చి ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించింది. హర్షిత ఆరోగ్యం మెరుగ్గానే ఉంది. తనకు న్యాయం చేయాలని హర్షిత కోరుతోంది. -
డ్రగ్స్ కేసు; బయటపడిన కొత్త విషయం
సాక్షి, బెంగళూరు: శాండల్‌వుడ్‌లో డ్రగ్స్ కేసులో అరెస్టయిన బహుభాషా నటి సంజన గల్రానికి పెళ్లయిందా, లేదా? అని సీసీబీ పోలీసులు విచారించగా కొత్త విషయం బయటపడింది. తనకు పెళ్లికాలేదని అరెస్ట్ చేసినపుడు మంగళవారం పోలీసులకు సంజన చెప్పారు. అయితే ఏడాది క్రితం ఆమె పెళ్లి ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విచారణలో ఆ ఫొటోను చూపడంతో ఆమె కంగుతిన్నారు. అజీజ్ పాషా అనే వైద్యున్ని ఆమె రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అతడు బెంగళూరులో ప్రముఖ ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. పోలీసులు సాక్ష్యాలన్నీ చూపడంతో సంజన పెళ్లయిందని ఒప్పుకోక తప్పలేదు. మత్తు గుట్టురట్టు శాండల్‌వుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ రాకెట్ కేసులో సీసీబీ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కేసులో అరెస్టయిన నటీమణులు రాగిణి ద్వివేది, సంజనా గల్రానిలను వేర్వేరుగా ప్రశ్నిస్తున్నారు. వారి సన్నిహితులు, మిగతా నిందితులు ముఖ్య సమాచారం వెల్లడించినట్లు తెలుస్తోంది. డ్రగ్స్‌ను డెబిట్, క్రెడిట్, బిట్ కాయిన్ల ద్వారా కొనుగోలు చేసినట్లు సీసీబీ పోలీసులు ఆధారాలను సేకరించారు. డార్క్ వెబ్‌లో డ్రగ్స్ ముఠాలు, ఆఫ్రికన్ల నుంచి కొనుగోలు చేసేవారని తెలిసింది. (ఇదంతా నా కర్మ : బోరున ఏడ్చిన సంజన) మరికొందరు నటీమణులు? కొందరు నటీమణులు డ్రగ్స్ పార్టీలలో పాల్గొనేవారని సీసీబీ విచారణలో బయటపడింది. రవిశంకర్, రాహుల్, వీరేన్ఖన్నాలు ముగ్గురూ విచారణలో రాగిణి, సంజనల పేర్లు చెప్పినట్లు తెలిసింది. మరికొందరు నటీమణులకు కూడా డ్రగ్స్ రాకెట్‌తో సంబంధాలు ఉన్నట్లు నిందితులు తెలిపారు. నటి సంజనా గతంలో కారు నడుపుతూ సెల్ఫీ తీసుకుంటున్న వీడియో సీసీబీ పోలీసులకు చిక్కింది. డ్రగ్స్ కేసులో 13వ నిందితుడు నియాస్ అహమ్మద్ కారులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ కేసుల్లో నిందితులు బెయిలు కోసం ప్రయత్నాలు చేస్తుండగా సీసీబీ పోలీసులు మరింతకాలం విచారించాల్సి ఉన్నందుకు అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. ఇద్దరికీ విడి విడి గదులు డ్రగ్స్ కేసులో మహిళా సాంత్వన కేంద్రంలో ఉంటున్న రాగిణి, సంజనా గల్రానీలకు ప్రత్యేక గదులను కేటాయించారు. ఐదు పడకలు ఉన్న హాల్‌ను ఇద్దరికీ ఉమ్మడిగా ఇవ్వగా, ప్రత్యేక గదులు కావాలని పట్టుబట్టారు. వారిద్దరి మధ్య విభేదాలున్నందున ప్రత్యేక గదులను కేటాయించి భద్రతను పెంచారు. ల్యాబ్‌కు ఇద్దరి మొబైళ్లు సీసీబీ పోలీసులు రాగిణి, సంజనాల మొబైల్ఫోన్ల నుంచి వాట్సాప్, అవుట్ గోయింగ్ కాల్ డేటాను సేకరిస్తున్నారు. సుమారు 100 మందితో వీరు నిత్యం ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. అరెస్ట్ చేస్తారని తెలియడంతోనే వీరు మొబైళ్లలోని సమాచారాన్ని తొలగించినట్లు ఆరోపణలున్నాయి. దీంతో వారి ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి సమాచార పునరుద్ధరణ చేస్తున్నారు. రాగిణికి అస్వస్థత రాగిణి తల తిరుగుతున్నట్లు, ఊపిరి ఆడడం లేదని చెప్పడంతో ఆమెను కేసీ జనరల్ ఆస్పత్రికీ తీసుకెళ్లి పరీక్షలు చేయించగా లో బీపీతో పాటు గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నట్లు బయట పడింది. రక్తపరీక్షలు చేస్తామని వైద్యులు చెప్పగా రాగిణి వ్యతిరేకించారు. కోర్టు ఆదేశాల మేరకు రక్త పరీక్షలను నిర్వహిస్తున్నట్లు సీఐ అంజుమాల చెప్పగా, సరేనన్నారు. -
నిత్య పెళ్లికొడుకు గుట్టురట్టు..
సాక్షి, కృష్ణా జిల్లా: నిత్య పెళ్లికొడుకుగా మారిన ఒక ప్రధానోపాధ్యాయుడి గుట్టురట్టయింది. శీలం సురేష్ అనే ప్రధానోపాధ్యాయుడు ముగ్గురు యువతలను మోసం చేసి వివాహం చేసుకున్నాడు. 2011లో గుంటూరుకు చెందిన శాంతిప్రియతో, 2015లో ఉయ్యూరుకు చెందిన శైలజతో, 2019లో విశ్వనాథపల్లికి చెందిన అనూషతో ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహం చేసుకున్నాడు. రెండో భార్య శైలజ ఫిర్యాదుతో నిత్య పెళ్లి కొడుకు బండారం బయటపడింది. దీంతో దిశా పోలీస్‌స్టేషన్ సిబ్బంది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు యువతులను మోసం చేసిన ప్రధానోపాధ్యాయుడిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
నిరాడంబరంగా బ్రిటన్ ప్రిన్సెస్ వివాహం
లండన్ : ప్రిన్స్ ఆండ్రూ పెద్ద కుమార్తె ప్రిన్సెస్ బీట్రెస్(31) వివాహం శుక్రవారం ఓ వ్యాపారవేత్తతో జరిగింది. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 మనవరాలు అయిన బ్రీట్రెస్ ఇటలీకి చెందిన మాపెల్లి మొజ్జిని(37) పెళ్లి చేసుకున్నారు. కరోనా వైరస్ కరాణంగా వీరి వివాహం నిరాడంబరంగా జరిగినట్లు బకింగ్హమ్ ప్యాలెస్ వర్గాలు ధృవీకరించాయి. ('క్వీన్ ఎలిజబెత్ ఆరోగ్యంపై దిగులుగా ఉంది') అయితే ప్రిన్సెస్ బ్రీట్రెస్, మాపెల్లిల పెళ్లి మొదటగా మే 29న లండన్‌లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో జరగాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వీరి వివాహం వాయిదా పడింది. అనంతరం జూలై 17న శుక్రవారం ఉదయం 11 గంటలకు విండ్సర్లోని రాయల్ లాడ్జ్‌లోని రాయల్ చాపెల్ ఆఫ్ ఆల్ సెయింట్స్ వద్ద వీరి వివాహం జరిగినట్లు రాజ కుటుంబం ఓ ప్రకటలో తెలిపింది. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలోనే ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది.(ఆ విషయంలో అమెరికా తర్వాత ఇండియానే) -
వాలంటీర్‌కు వందనం
-
గ్రామ వాలంటీర్ గొప్పతనం
సాక్షి, అనంతపురం: వైఎస్ జగన్ ఏడాది పాలనలో సర్వత్రా ప్రశంసలు పొందింది గ్రామవాలంటీర్ వ్యవస్థ. అందుకు అనుగుణంగానే సీఎం ఆశయాలకు తోడ్పాటుగా గ్రామ వాలంటీర్లు పనిచేస్తూ తమ పెద్ద మనసును చాటుకుంటున్నారు. అనంతపురం జిల్లాలో ఓ గ్రామవాలంటీర్ పెళ్లయిన గంటల వ్యవధిలోనే విధుల్లో చేరి తనకున్న బాధ్యతను తెలియజేశాడు. అమడగూరు మండలం గోపాల్‌నాయక్ తాండాలో తెల్లవారుజామున 6 గంటలకు పెళ్లి చేసుకున్న రాజశేఖర్ నాయక్ అనే గ్రామవాలంటీర్ 9 గంటలకు పెళ్లి బట్టల్లోనే గ్రామంలో పింఛన్లు పంపిణీ చేస్తూ తన గొప్పతనాన్ని చాటుకోవడం విశేషం. గ్రామ సచివాలయం, ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్లను నియమించి ప్రభుత్వాన్ని ప్రజల ముంగిటకు తీసుకురాగలిగారు. అంతేకాదు ఈ వాలంటీర్ల సహాయంతో వృద్ధాప్య పెన్షన్లను రికార్డు స్థాయిలో లబ్ధిదారుల ఇళ్ల దగ్గరకు ఒకటవ తేదీనే చేర్చగలుగుతున్నారు. రాష్ట్రంలో మార్పు కోసమే గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చినట్లు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో అనేకసార్లు చెప్పిన సంగతి తెలిసిందే. చదవండి: తాకట్టులో సాగరిక.. విడిపించిన మాజీ ఎంపీ . -
పెళ్లి పీటలెక్కిన బన్నీ హీరోయిన్
స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పరుగు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి షీలా కౌర్ తాజాగా పెళ్లి పీటలెక్కారు. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న షీలా.. ప్రముఖ వ్యాపారవేత్త సంతోష్ రెడ్డిని బుధవారం చైన్నైలో వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేశారు. ‘ఈ రోజు మాకెంతో ప్రత్యేకమైనది. పోల్చడానికి మించిన సమయం. గుండె లోతుల్లో సంతోషం నిండుకుంది. మేమిద్దరం కలిసి నూతన జీవితాన్ని ఆరంభించే ఓ కొత్త రోజు’ అంటూ ఫేస్బుక్లో పెళ్లి ఫోటో షేర్ చేశారు. ఈ సందర్భంగా అభిమానులు షీలాకు అభినందనలు తెలుపుతున్నారు. (గత రిలేషన్‌షిప్‌పై దీపిక సంచలన వ్యాఖ్యలు) 2006లో విడుదలైన సీతాకోక చిలుక చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన షీలా.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం బాషల్లో నటించారు. అనంతరం మనోజ్ ‘రాజుభాయ్’, ఎన్టీఆర్ ‘అదుర్స్’, రామ్ ‘మస్కా’, బాలయ్య ‘పరమవీర చక్ర’ వంటి సినిమాల్లో నటించారు. అయితే షీలాకు అవేవి మంచి హిట్‌ను అందిచకపోయినా.. పరుగు సినిమా మాత్రం ఆమెకు మంచి పేరును తెచ్చి పెట్టింది.. 2011లో విడుదలైన బాలకృష్ణ పరమవీర చక్ర సినిమాలో తెలుగు తెరపై చివరిసారిగా కనిపించారు. అనంతరం సినిమాలకు దూరంగా ఉన్నారు. (బిగ్‌బాస్-4: హోస్ట్‌గా మహేశ్ బాబు!) చదవండి : కేజీఎఫ్ 2 : డేట్ గుర్తుపెట్టుకోండి -
పెళ్లయ్యాక అదృశ్యం.. ఏడేళ్ల తర్వాత లవర్‌తో
భువనేశ్వర్ : ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో ఓ ఆశ్చర్యకర సంఘటన చోటుచేసుకుంది. పెళ్లయిన రెండు నెలలకే అదృశ్యమైన మహిళ.. ఏడేళ్ల తర్వాత కనిపించింది. అయితే ఈ కేసులో ఆమె భర్త ఆమెను చంపేశాడన్న కారణంతో నెలరోజులు జైలు జీవితం అనుభవించడం గమనార్హం. ఒడిశా రాష్ట్రంలోని కేంద్రపారా జిల్లాకు చెందిన అభయ్ సుతారా అనే యువకుడికి, అదే ప్రాంతానికి చెందిన ఇతిశ్రీ మొహరానాతో 2013లో వివాహమైంది. పెళ్లయిన రెండు నెలలకే ఇతిశ్రీ ఇంటి నుంచి అదృశ్యమైంది. చదవండి: నేను బాగా మందేస్తా, అదేమైనా నేరమా: నటి ఎంత ప్రయత్నించినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో ఆమె తండ్రి ప్రహ్లాద్ తన కూతురిని అల్లుడు అభయ్ వరకట్నం కోసం వేధించి చంపేశాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైలులో ఉంచారు. తనకు భార్య అదృశ్యం కావడానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. అయితే నెలరోజులు తర్వాత ఆమెకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో అభయ్‌ని బెయిల్‌పై విడుదల చేశారు. చదవండి: అన్ని పూర్తయ్యాయి, ఇక మిగిలింది ఉరే ఎలాగైనా తనమీద ఉన్న హంతకుడు అనే నింద పోగోట్టుకోవాలని.. అప్పటి నుంచి భార్యను వెతకడం ప్రారంభించాడు. ఏడు సంవత్సరాల తర్వాత పూరి జిల్లాలోని పిపిలీ ప్రాంతంలో ఇతిశ్రీ కనిపించింది. దీంతో వెంటనే అభయ్ పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఆమెను వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ.. పెళ్లికి ముందే రాజీవ్ లోచన్ మహారాణా అనే యువకుడిని ప్రేమించానని తల్లిదండ్రులు అతనితో పెళ్లికి ఒప్పుకోకపోవడంతో అభయ్‌ని పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. పెళ్లయిన రెండు నెలలకు రాజీవ్‌తో కలిసి కోల్‌కతా పారిపోయినట్లు తెలిపింది. అయితే అభయ్ మాత్రం హంతకుడు అనే ముద్రను తొలగించుకోవడానికి ఏడు సంవత్సరాలు ప్రయత్నించి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నాడు. -
నవదంపతులు ఆత్మహత్యయత్నం.. భర్త మృతి
-
భారత ప్రజలమైన మేము..!
ఈ ఫోటో చూడండి. ఇందులో పెళ్లి కొడుకున్నాడు. పెళ్లి కూతురు ఉంది. ఒకరిద్దరు పెద్దలు ఉన్నారు. స్పష్టంగా మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే.. వాళ్లు పెళ్లి మాత్రమే చేసుకోవాలనుకున్నారు. ఫొటోలు వద్దనుకున్నారు. ఈ ఫొటో అయినా ఎవరో తీసిన వీడియోలోంచి బయటికి వచ్చింది. ఇద్దరూ ఒకే మతం వారు. అయితే మూడు మతాల పెద్దలు పెళ్లి జరిపించారు. మంత్రాలు లేవు. అక్షింతలు లేవు. వచ్చిన వారు వధూవరులపై పూలు మాత్రం చల్లారు. ఒక ‘ప్రియాంబుల్’ను చదివించారు. ప్రియాంబుల్ అంటే రాజ్యాంగ ప్రవేశిక. ‘భారత ప్రజలమైన మేము..’ అనే వాక్యంతో ఈ ప్రవేశిక మొదలౌతుంది. ‘కలిసుంటాం’ అనే భావంతో ముగుస్తుంది. కర్ణాటక గదగ్ జిల్లా గదగ్ పట్టణంలోని అంబేద్కర్ భవన్లో ఈ పెళ్లి జరిగింది. శాంతలింగ స్వామీజీ, మౌల్వీ షబీర్ మౌలానా, ఫాదర్ ఎబినజర్.. మూడు మతాల సాక్షులుగా ఉండి పెళ్లి జరిపించారు. ప్రియాంబుల్‌ని కానుకగా ఇచ్చింది ఈ ముగ్గురే. తర్వాత సన్మానం జరిగింది. ఎవరికనుకున్నారూ? పౌర కార్మికులకు. అంటే పారిశుద్ధ్య కార్మికులు. ఎంత మంచి పెళ్లి కదా! బసవరాజు, సంగీతలను మెచ్చుకోవాలి. వాళ్లెవరు? ఇంకెవరూ.. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు. ట్రాన్స్ జెండర్లమైన మేము..! స్వప్న గురించి గతంలో మీరు వినే ఉంటారు. మదురై అమ్మాయి. అమ్మాయి అంటే అమ్మాయి కాదు. అమ్మాయిలా మారిన అబ్బాయి. ట్రాన్స్‌జెండర్. తాజాగా స్వప్నకు తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 పరీక్షల్లో 228వ ర్యాంకు వచ్చింది. తమిళనాడు గ్రూప్ వన్‌లో విజేతగా నిలిచిన తొలి ట్రాన్స్‌జెండర్‌గా కూడా ఈ విజయం స్వప్నకు గుర్తింపు తెచ్చింది. ప్రభుత్వంలో పరీక్ష రాసి ర్యాంక్ సాధించారు స్వప్న! మొదట్లో ట్రాన్స్జెండర్లు సర్వీస్ కమిషన్ రాసేందుకు వీల్లేకపోయేది. స్వప్నే తమిళనాడు ప్రభుత్వంతో పోరాడి హైకోర్టు నుంచి పరీక్ష రాసే యోగ్యతకు ఆదేశాలు తెచ్చుకున్నారు. అది మిగతా ట్రాన్స్‌జెండర్లకూ మేలయింది. తొలిసారి 2013లో ‘యోగ్యత’ కేసు వేశారు స్వప్న. తనను మహిళ కేటగిరీలో గుర్తించాలని 2015లో మరో కేసు. గెలిచే వరకు పోరాడారు. 2018లో గ్రూప్ 2లో పాసై అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా, అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ అఫీసర్‌గా మదురైలోనే పని చేశారు. ఇప్పుడు ఏకంగా పెద్ద ర్యాంకు, పెద్ద పోస్టు. డిఎస్పీగా గానీ, కమర్షియల్ టాక్స్‌లోనే అసిస్టెంట్ కమిషనర్‌గా గానీ! నిర్ణయం ఆమెదే. ఈ రోజు చెన్నైలో కౌన్సెలింగ్. -
వరుడి వేట.. అమ్మకు పెళ్లి
పెద్దవాళ్లకు పిల్లలు పెళ్లి చేయడం అనే కాన్సెప్ట్‌ని ‘మా నాన్నకు పెళ్లి’ సినిమాలో చూశాం. ఆ రీల్ లైఫ్‌లో కొడుకు తన తండ్రి కోసం వధువును వెతుకుతాడు. ఈ రియల్ లైఫ్‌లో పిల్లలు కుదిర్చిన పెళ్లిళ్లన్నీ అమ్మల కోసమే. ‘‘మా అమ్మకు అందమైన యాభై ఏళ్ల వరుడి కోసం అన్వేషిస్తున్నాం. వరుడు శాకాహారి అయి ఉండాలి. మద్యం అలవాటు ఉండకూడదు. జీవితంలో చక్కగా ఎదిగిన వ్యక్తి అయి ఉండాలి’’ – ఇది ఆస్థా వర్మ అనే ఢిల్లీకి చెందిన లా స్టూడెంట్ పెట్టిన ట్వీట్. ఈ ట్వీట్ తోపాటు తల్లితో తానున్న ఫొటో కూడా పెట్టింది ఆస్థా వర్మ. ఈ ట్వీట్‌కి 33 వేల లైక్‌లు వచ్చాయి. ఏడు వేల రీ ట్వీట్లు వచ్చాయి. వారిలో ఎక్కువ మంది ఆమె ప్రయత్నాన్ని హర్షించారు. కొద్దిమంది మాత్రం ‘ఇదేం పని’ అని అన్నారు. మరికొందరైతే ఏకంగా ట్రోలింగ్కి దిగారు. ట్విట్టర్లో తనకు వ్యతిరేకంగా వచ్చిన రెస్పాన్స్‌కు ఆస్థా వర్మ ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. ‘‘మా అమ్మ టీచర్. ఉన్నత విద్యావంతురాలు. ఎక్కువమంది నా ప్రయత్నాన్ని అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు. మా అమ్మకు దూరమైన ప్రేమను ఆమెకు తిరిగి అందివ్వాలనుకుంటున్నాను’’ అని తిరిగి ట్వీట్ చేసింది. గోకుల్ శ్రీధర్ది కేరళ, కొల్లాం జిల్లా. గోకుల్ తల్లి మినీ అయ్యప్పన్‌ది విషాదభరితమైన వైవాహిక జీవితం. గోకుల్ పదవ తరగతికి వచ్చే వరకు తన తండ్రి తరచూ తల్లిని కొట్టడం, తల్లి మౌనంగా భరించడం చూస్తూనే ఉన్నాడు. ఓ రోజు తండ్రి కొట్టిన దెబ్బలకు తల్లి నుదురు చిట్లి రక్తం కారడం చూసిన గోకుల్ ‘‘ఎందుకమ్మా మౌనంగా భరిస్తున్నావ్’’ అని అడిగాడు. ‘‘నీ కోసమే’’ అంటూ కొడుకును దగ్గరకు తీసుకుంది ఆమె. ‘‘మనిద్దరం మన కష్టంతో బతుకుదాం రామ్మా’’ అని తల్లిని ఇంటి నుంచి తీసుకొచ్చేశాడు గోకుల్. మినీ కొల్లాంలో లైబ్రేరియన్‌గా చేరింది. కొన్నేళ్లకు గోకుల్ పైచదువుల కోసం తల్లిని వదిలి వెళ్లాల్సి వచ్చినప్పుడు ‘‘అమ్మా! కష్టాల కడలి నుంచి నిన్ను బయటకు తీసుకొచ్చాను. ఇప్పుడు నిన్ను ఒంటరిగా వదిలి దూరంగా వెళ్తున్నాను. నా చదువు పూర్తయ్యే వరకు నాకు టైమివ్వు. జీవితంలో నువ్వు కోల్పోయిన ప్రేమను, నిన్ను ప్రేమించే వ్యక్తిని నీ కోసం వెదకి తెస్తాను’’ అని మాటిచ్చాడు. కొడుకు మాటలకు నవ్వి ఊరుకుంది మినీ.ఆ సంగతి మర్చిపోయింది కూడా. అయితే గోకుల్ ఇంజనీరింగ్ పూర్తయిన తరవాత తన పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిసి అయోమయంలో పడిందామె. ఒంటరి జీవితానికి అలవాటు పడుతున్నానని, తనను ఇలాగే జీవించనివ్వమని చెప్పింది. తల్లిని కన్విన్స్ చేయడంతోపాటు ఆమె పరిస్థితిని అర్థం చేసుకునే వ్యక్తిని వెతికి పెట్టాడు గోకుల్. తల్లి కోసం వెతికిన పెళ్లి కొడుకు పేరు కె. వేణు. ఆర్మీలో కల్నల్‌గా రిటైరయ్యారు. భార్య మరణించింది. ఒక కొడుకు, కూతురు. వాళ్లు జీవితాల్లో స్థిరపడ్డారు. గోకుల్ చేసిన ఈ పెళ్లిని సోషల్ మీడియాలో 43 వేల మంది లైక్ చేశారు. గుర్గావ్కి చెందిన సంహిత అగర్వాల్ తన తల్లి గీతకు రెండేళ్ల కిందట ఇలాగే పెళ్లి చేసింది. నాలుగు వందల మంది అతిథులతో వైభవంగా పెళ్లి వేడుక నిర్వహించింది సంహిత. అలాగే భర్తను కోల్పోయిన తారకు ఆమె కొడుకు సుశాంత్, కోడలు నేహ కలిసి పెళ్లి ఖాయం చేశారు. ‘‘యాభై ఏళ్ల వయసులో ఒంటరితనాన్ని భరించడం చాలా కష్టమని, స్నేహం, ప్రేమ లేకుండా రోజు గడపడం దుర్భరంగా ఉంటుందని’ ఆమెకు నచ్చచెప్పి ఒప్పించారు. సుశాంత్ తన తల్లి కోసం ఓఎన్జీసీలో ఉద్యోగం చేస్తున్న 57 ఏళ్ల నాథూభాయ్ పటేల్‌తో ఇటీవలే పెళ్లి కుదిర్చాడు. గోకుల్, సుశాంత్, సంహిత అమ్మ కోసం వరుణ్ని వెతికారు. ఇప్పుడు తాజాగా ఆస్థావర్మ కూడా వాళ్ల అమ్మ కోసం వరుణ్ని వెతికే పనిలో పడింది. జీవితం విలువ తెలిసిన ఈ పిల్లలు కొత్త ట్రెండ్‌ని సెట్ చేస్తున్నారు. సమాజానికి కొత్త విలువల పాఠాలు చెబుతున్నారు. – మను -
స్పానిష్ అమ్మాయి.. అనంతపురం అబ్బాయి..!!
సాక్షి, తాడిపత్రి టౌన్: స్పెయిన్ యువతి, అనంతపురం జిల్లా తాడిపత్రి యువకుడు ప్రేమించుకొని పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. వివరాల్లోకి వెళితే.. తాడిపత్రికి చెందిన విజయకుమార్ వృత్తిరీత్యా వైద్యుడు. బత్తలపల్లిలోని ఆర్టీటీ ఆస్పుత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు. స్పెయిన్ దేశానికి చెందిన కార్లా అనే యువతి వృత్తి రీత్యా దంత వైద్య నిపుణురాలు. ఈమె కూడా ఆర్డీటీ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. రెండేళ్ల క్రితం ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఆ తర్వాత ఇరువురూ పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చి వారి పెద్దలతో చర్చించారు. ఇరువైపుల నుంచి అంగీకారం లభించడంతో శనివారం తాడిపత్రి పట్టణంలోని మార్కండేయస్వామి ఆలయంలో పెద్దల సమక్షంలో వీరి వివాహం హిందూ సంప్రదాయంలో వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువులు వధూవరులను ఆశీర్వదించారు. -
నవంబ్రాలు
భూమిపై పడ్డ ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు పెళ్లి చేసుకోవలసిందే. ఇందులో ఏదైనా దురర్ధం ధ్వనిస్తుంటే మీరు మరీ సున్నిత మనస్కులైనట్లు! పెళ్లి చేసుకోబోయేవారు ప్రతి దాన్నీ తేలిగ్గా తీసుకునే తత్వాన్ని అలవవరచుకోవాలి. పెళ్లి అనేది భూతం ఏమీ కాదు. అలాగని భూతలం మీది అత్యున్నత సౌఖ్యమూ కాదు. బేసిగ్గా పెళ్లి అంటే బాధ్యత. బాధ్యతలను మీద వేసుకోడానికి ఈ నవంబరులో బలమైన ముహుర్తాలు చాలానే ఉన్నాయి. కార్తీకం ఆరంభం అయింది కదా! ఏయే తేదీలు, తిథులు ఈ నెలలో పెళ్లికి దివ్యంగా ఉన్నాయో పంచాంగం తిప్పే ముందు.. పెళ్లిళ్లు, భార్యాభర్తల విశేషాలు కొన్ని తెలుసుకోవడం వల్ల నూతన వధూవరులకు కొంత ఉపయుక్తంగా ఉండొచ్చు. ►తొలిచూపులోనే ప్రేమలో పడి, పెళ్లి చేసుకున్న దంపతులలో 75 మంది విడాకుల వరకు వెళ్లే ప్రమాదం ఉంది. కంగారు పడకండి. మిగతా 25 మంది సక్సెస్ఫుల్ కపుల్స్‌లో మీరు ఉండొచ్చు కదా! ►‘బ్రైడ్’ అంటే వధువు. బ్రైడ్కి ‘గ్రూమ్’ని కలిపితే వరుడు. (బైడ్ గ్రూమ్). సరే, ఈ నాలెడ్జికేంగానీ, బ్రైడ్ అంటే అసలు అర్థం తెలుసా! ‘వంట చేయడం’ అని!! ప్రాచీన జర్మన్ భాషల నుంచి బ్రైడ్ అనే పదం పుట్టుకొచ్చింది. ►భర్తగానీ, భార్యగానీ రోజుకి కనీసం 45 నిముషాలు ప్రయాణంలోనే గడుపుతుంటే వాళ్ల పెళ్లి పెటాకులయ్యే ఛాన్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ అట. మీ ఇష్టం మరి. ►ఆ మధ్య 99 ఏళ్ల ఓ భర్త తన 96 ఏళ్ల భార్యకు పెళ్లయిన 77 ఏళ్ల తర్వాత విడాకులు ఇచ్చాడు. నైంటీన్ ఫార్టీస్లో ఆమెకు ఎవరితోనో అఫైర్ ఉందని ఆయనకు తెలిసిందట! అదీ విడాకులకు కారణం. ►పెళ్లికి ముందు దీర్ఘకాలం కలిసి ఉన్నవారు, పెళ్లయ్యాక అంతకన్నా తక్కువ సమయంలోనే విడిపోతారట! ఇదింకో అధ్యయనంలో తేలిన విషయం. ►పెళ్లయిన మూడో ఏడాది.. ఏ దంపతుల జీవితంలోనైనా అత్యంత ఆనందకరమైన సంవత్సరంగా ఉంటుందట! మీరిప్పుడు పెళ్లి చేసుకుంటే అత్యంత ఆనందకరమైన ఆ ఏడాది కోసం రెండేళ్లు ఎదురు చూడాలన్నమాట. పెళ్లి ఖర్చు తక్కువగా ఉంటే ఎక్కువ కాలం, పెళ్లి ఖర్చు ఎక్కువగా ఉంటే తక్కువ కాలం దంపతులు కలిసి ఉంటారట! ఇది ఇంకో అబ్జర్వేషన్. ►పెళ్లంటే ఉండే భయాన్ని ‘గామోఫోబియా’ అంటారు. మరి ఇలాంటి విషయాలన్నీ చెప్పుకుంటే గామోఫోబియా రాదా అని మీరు అనుకుంటుంటే ఈ టాపిక్‌ని ఇక్కడితో ఆపేద్దాం. అనుకోకపోతే ఇంకో రెండు విషయాలు చెప్పుకుని ముగిద్దాం. ►ఒకటి: ధైర్యంగా పెళ్లి చేసుకోండి. ఏ ఫోబియాలూ మీ దరి చేరవు. ►రెండు: ముహూర్త బలం ఎంత బలమైనదో.. దాంపత్య ఫలం అంతే బలమైనది. భార్యాభర్తల్లోని ఇచ్చిపుచ్చుకునే సర్దుబాటు ధోరణి పెళ్లిని పదికాలాల పాటు పదిలంగా ఉంచుతుంది. ముహూర్తానికే వన్నె తెస్తుంది. భలే మంచి ముహూర్తము 8 నవంబర్ 2019 శుక్రవారం ముహూర్తం: మధ్యాహ్నం 12.24 నుంచి నవంబర్ 9 తెల్లవారుఝాము 06.39 వరకు; నక్షత్రం: ఉత్తరాభాద్ర; తిథి : ద్వాదశి 9 నవంబర్ 2019 శనివారం ముహూర్తం: ఉదయం 06.30 నుంచి నవంబర్ 10 ఉదయం 06.39 వరకు. నక్షత్రం: ఉత్తరాభాద్ర, రేవతి; తిథి: ద్వాదశి, త్రయోదశి. 10 నవంబర్ 2019 ఆదివారం ముహూర్తం: ఉదయం 06.39 నుంచి 10.44 వరకు; నక్షత్రం: రేవతి; తిథి: త్రయోదశి 14 నవంబర్ 2019 గురువారం ముహూర్తం: ఉదయం 09.15 నుంచి నవంబర్ 15 ఉదయం 06.43 వరకు; నక్షత్రం: రోహిణి, మృగశిర; తిథి: విదియ, తదియ 22 నవంబర్ 2019 శుక్రవారం ముహూర్తం: ఉదయం 09.01 నుంచి నవంబర్ 23 ఉదయం 06.50 వరకు; నక్షత్రం: ఉత్తర ఫల్గుణి, హస్త; తిథి: ఏకాదశి 23 నవంబర్ 2019 శనివారం ముహూర్తం: ఉ. 06.50 నుంచి మధ్యాహ్నం 02.46 వరకు; నక్షత్రం: హస్త; తిథి: ద్వాదశి 24 నవంబర్ 2019 ఆదివారం ముహూర్తం: మధ్యాహ్నం 12.48 నుంచి నవంబర్ 25 అర్ధరాత్రి 01.06 వరకు; నక్షత్రం: స్వాతి; తిథి: త్రయోదశి 30 నవంబర్ 2019 శనివారం ముహూర్తం: సాయంత్రం 06.05 నుంచి డిసెంబర్ 1 ఉదయం 06.56 వరకు; నక్షత్రం: ఉత్తరాషాఢ; తిథి: పంచమి. ►(నవంబర్ 15, 19, 20, 21, 22 తేదీలలో పెళ్లి ముహూర్తాలు అతి స్వల్ప నిడివిలో మాత్రమే ఉండగా.. 27, 28, 29 మంచి ముహూర్తాలు లేవనే చెప్పాలి). -
నన్ను పదకొండో కొడుకుగా చూసుకో...
సనాతన ధర్మంలో దంపతుల వైశిష్ఠ్యం, ముఖ్యంగా స్త్రీ వైశిష్ట్యం ఎంత గొప్పగా ఉంటుందంటే... వివాహం అయిపోయిన తరువాత అగ్నికార్యం చేసేటప్పుడు పురుషుడు భార్యను ఉద్దేశించి కొన్ని విషయాలు అడుగుతాడు... వాటిలో ఒకటి–‘‘నీవు పది మంది పిల్లల్ని కని నన్ను పదకొండవ కొడుకుగా చూడు’’–అని. అంటే దానర్థం?భార్య పురుషునికి శాంతి స్థానం. పురుషుడు ఎన్ని ఆటుపోట్లకు గురయినా పురుషుడి శాంతి అంతిమంగా స్త్రీ చేతిలో ఉంటుంది. నేనీ మాట ఉబుసుపోక చెప్పట్లేదు... అగ్ని సాక్షిగా అడుగుతాడు ఇలా... ఆయనకు పదిమంది కొడుకులు పుట్టారు. ఆయన సహస్ర చంద్ర దర్శనోత్సవాలకు అందరూ వచ్చారు. ఏదో పని అలా కాదు ఇలా చేయమని తండ్రి చెబితే ఒక కొడుకు ‘నాన్నగారూ, ఇంకా మీ కెందుకివన్నీ, మేం పెద్దవారమయ్యాం. మేం చూసుకుంటాం. మీరు ఇన్నాళ్ళూ మమ్మల్ని పెంచి పెద్దచేయడంలో మీకు తీరిక దొరకక రామాయణ భారతాలు చదవలేకపోయారు. ఇప్పుడు హాయిగా అవి చదువుకోండి’..అనడంతో తన మాటకు పిల్లలు గౌరవం ఈయడం లేదని అలిగి ఆయన అన్నం తినకుండా ఓ మూలన కూర్చుంటే... ఆయన మనసెరిగిన ఇల్లాలు ఆయనను పిల్లల్ని బుజ్జగించినట్లు బుజ్జగించి, కాస్తచనువుతో గదమాయిస్తూ ఆయనను చేయిపట్టి తీసుకొచ్చి విస్తరి దగ్గర కూర్చోబెడుతుంది. తర్వాత కొద్ది సెకన్లలోనే ఆ కారుమేఘాలన్నీ మాయమయి పరిస్థితి మామూలు స్థాయికి చేరిపోతుంది.రామాయణాన్ని పరిశీలించండి. సీతమ్మ తల్లి పక్కన ఉన్నంత కాలం ఎన్ని కష్టాలు వచ్చినా రాముడు తట్టుకున్నాడు. రాజ్యం పోయింది. బెంగ పెట్టుకోలేదు, తండ్రి మరణించాడు, దిగులుపడలేదు. అరణ్యవాసం చేసాడు, రాక్షసులు మీద పడ్డారు, ఎన్నో కష్టాలొచ్చాయి. కించిత్ మథనపడలేదు. సీతమ్మ కనబడలేదు. అంతే! రాముడు ఉగ్రుడయిపోయాడు. అప్పటివరకు చేయనివాడు రావణ సంహారం చేసాడు. రాక్షసులను తుదముట్టించాడు. అంటే అసలు నిజానికి రాముడు శ్రీరాముడిగా సీతమ్మ కారణంగా అంత శాంతిని పొందాడు.అందుకే సుమంతుడు తిరిగి వచ్చిన తరువాత ‘సీతారాములెలా ఉన్నారు?’ అని దశరథ మహారాజు, కౌసల్యాదేవి అడిగితే ముందు సీతమ్మ గురించి చెప్పాడు. పక్కన నా భర్త రాముడు ఉన్నాడని చిన్నపిల్ల ఎలా ఆడుకుంటుందో అలా ఆడుకుంటోంది, అంత సంతోషంగా ఉంది’ అన్నాడు. భార్య అంత సంతోషంగా ఉంటే రాముడూ అంత సంతోషంగా ఉన్నాడు. స్త్రీ పురుషుడి శాంతికి కారణమవుతుంది. ఆమె పరిమితి, ఆమె ఉపాసన ఈ దేశంలో, ఈ ధర్మంలో ఒక అద్భుతం. -
మా ఆయన అపరిచితుడు
‘‘గుర్తుంది కదా...వచ్చే నెల్లో మా శ్రీదేవి కూతురి పెళ్లి. ఆదివారం నలుగు వేళకి మనం అక్కడుండాలి. అసలే తిరుపతి... ఆపై శనివారం ప్రయాణం.. ఇప్పుడు బద్ధకించి... చివర్లో టేక్సీలు మాట్లాడి బడ్జెట్ పెంచేయకుండా.. కాస్త మెలకువలో ఉండి తొందరగా రైలు టికెట్లు బుక్ చేసేయి... స్లీపర్ చాలు.. ఎటూ రాత్రి ప్రయాణమే కద, ఎండాకాలమే అయినా హాయిగా వెళ్లిపోవచ్చు..’’ కేరేజీ సర్దుకుంటూ ఏకబిగిన మాట్లాడేస్తున్న నాకు, పేపర్ చదువుతున్న ఆయన భంగిమ చూసి... అసలు నా మాటలు వింటున్నాడో లేదో అని అనుమానం వొచ్చేసింది. మొలకెత్తిన పెసరగింజల్ని నోట్లో వేసుకుంటూ ఓ క్షణం పాటు ఆయనకేసి చూసి... ‘‘ఏం వింటున్నావా.. ఇవాళ టికెట్లు అవుతున్నట్టేనా?’’ అన్నాను తేల్చుకోవడానికి. ‘‘నాకు ఖాళీ లేదు. నువు చేసుకోవాల్సిందే’’ పేపర్లోంచి తలతిప్పకుండా చెప్పేశాడు.‘‘అంత లావు పనేం ఉందీ... రిటైరైన కాణ్నించీ ఊరుమ్మడి జనానికీ పనులన్నీ చేసి పెడుతూనే ఉన్నారుగా...’’ యథాలాపంగానే అన్నాను. దానికి జవాబుగా కాదుగానీ.. విసురుగానే మరో మాట వచ్చింది.. ‘‘ఇదిగో పెళ్లికి నేను రావట్లేదు. నువ్వొక్కదానివే వెళ్లాలి...’’ గాభరా పడ్డాను. నా మాటల్తో నొప్పించానా? మా మధ్యలో ఆ మాత్రం దెప్పిపొడుపులు కొత్తేం కాదు. ప్రతి దెప్పిపొడుపునూ సరదాగానే తీసుకునే మనిషి, ఇవాళ ఇంత చిన్న మాటకు నొచ్చుకున్నాడని అనుకో బుద్ధి కావడం లేదు. ‘నొచ్చుకున్నారా’ అని నేరుగా అడిగితే.. ఇంకాస్త బెడిసికొడుతుంది గనుక... వాలుకుర్చీలో ఉన్న ఆయన దగ్గరికెళ్లి భుజం మీద చేయేసి... ‘‘నువు తోడు రాకుండా ఎక్కడికైనా వెళ్లినదాన్నేనా... నాకు చేతకాదులెమ్మని బిడాయించుకుంటున్నావు... ఇదిగో బోల్డంత బతిమాలేస్తాను. ఇవాళ కాపోతే రేపైనా కాస్త ఆ టికెట్ల పని చూడాలి...’’ అని అర్థిస్తున్న భంగిమలో కాస్త ఆకట్టుకునేలాగానే అడిగాను. కానీ ఫలం లేదు. ఆయన నా వైపు నింపాదిగా చూసి... ‘‘నేను రావడం లేదండీ... మీరే బుక్ చేసుకోండి. మీరే ప్లాన్ చేసుకోండి’’ అంటూ వీలైనంత ముక్తసరిగా చెప్పాడు. లోపల ఏదో ఉంది. ఏంటో అంతుబట్టడం లేదు. మొన్నమొన్నటిదాకా బాగానే ఉన్నాడు. ఈలోగా ఏమైందో అర్థం కావడం లేదు. ఏదో అయిందన్నంత వరకు వాస్తవం. కానీ ఇలా పీటముడివేసుకుని ఉన్నప్పుడు మనం పొడిగించి హితం లేదు. అప్పుడప్పుడూ నా కిది మామూలే. మరోవైపు ఆఫీసుకు టైమైపోతోంది. అలాగని తలెగరేసినట్లుగా కాకుండా... ‘‘సాయంత్రం వచ్చి నిన్ను మరింత బతిమాలుకుంటాన్లే’’ అని మాత్రం అనేసి కేరేజీ పుచ్చుకుని వెళ్లిపోయాను. కానీ ఆయన ఎందుకిలా భీష్మించుకున్నాడో తెలుసుకోవాలనే దేవులాట మాత్రం నన్ను వీడలేదు. మా అమ్మల కాలంలో, ఏదో చాకలి పద్దు రాసుకోగలిగినంత వరకు ఆడాళ్లు చదువుకుంటే చాలని అనేవాళ్లుట. ఇవాళ్టి రోజుల్లో ఏదో టికెట్లు బుక్ చేసుకోవడమూ, క్యాబ్‌లు పురమాయించడమూ, బిల్లులు చెల్లించడమూ వరకైనా కంప్యూటర్ జ్ఞానం అందరికీ అవసరం అయిపోయింది. డబులెమ్మే చేసి... గ్రూప్స్ పాసై ఉద్యోగం చేస్తున్న నాక్కూడా ఆ పాటి తెలిసి ఉండాల్సిందే. కానీ...ఆఫీసులో పనికి అవసరమైనంత మేరా సర్కారు వాళ్లు బలవంతాన నేర్పించారు. కిందామీదా గల్లంతయిపోతూ... ఆ పని నడిపిస్తూనే ఉన్నాను. కానీ కంప్యూటరు మీద ఇతరత్రా లౌకిక వ్యవహారాలను నడిపించే నేర్పు మాత్రం పట్టుబడలేదు. ఏముందండీ ఇదంతా చాలా సింపుల్ అంటుంటారు కొంతమంది. కానీ నేనెప్పుడూ ఆ జోలికి వెళ్లలేదు. సాధారణంగా ఈ పన్లన్నీ ఆయన చూసుకుంటూ ఉంటాడు. డబ్బు లావాదేవీ ప్రతిదీ కంప్యూటరు మీదుగానే జరగాలంటాడు. చెబితే నవ్వుతారు గానీ... చెత్త తీసుకెళ్లే మునిసిపాలిటీ వాడికి నెలనెలా యిచ్చే యాభయ్యీ తప్ప.. పాలవాడికీ ఇంట్లో పనమ్మాయికీ కూడా నెలమొత్తాలు కంప్యూటర్లోనే చెల్లించేస్తుంటాడు. అవసరానికి ఊర్లకు వెళ్లాలన్నా, ఏడాదికోమారు సినిమాకు వెళ్లాలన్నా, వెచ్చాలు కొనాలన్నా.. అన్నీ కంప్యూటరు చెల్లింపులే. కాకుంటే క్రెడిట్ కార్డు గోకుతారు. దాని ముడుపును కంప్యూటర్లో కట్టేస్తాడు. పిల్లలిద్దరూ బయట సెటిలైపోయారు. వారి రాకపోకల గురించి మాకు ఖాతరు లేదు. మా ఇద్దరి బతుకును చూసుకోవడానికే, ఊపిరి సలపనంతగా రోజులు గడిచిపోతున్నాయి. మా రోజువారీ పనుల్లో ఏ అవసరానికీ ‘అయ్యో పిల్లలు దగ్గర్లో లేరే’ అనే ఆలోచన లేకుండా.. బండి నడుస్తోంది. కుంటుంబం సాగడంలో– ‘నాకు చేతనైన పనులు నావీ... ఆయనకు చేతనైన పనులు ఆయనవీ’ అనే అప్రకటిత ఒడంబడిక ఒకటి ఉన్నట్లుగా మా వ్యవహారం నడుస్తుంటుంది. ఇప్పుడైతే ఇంకా చోద్యం. ఆయన రిటైరై ఏడాది అయింది. గవర్నమెంటు కొత్తగా పొడిగించిన గడువును కూడా కలుపుకుంటే రిటైర్ కావడానికి నాకింకా ఎనిమిదేళ్ల సర్వీసుంది. ఈ ఏడాదిగా ఆయనకు వ్యాపకం తగ్గింది. సాయంత్రం క్లబ్బులు కాదు కదా.. ఉదయం వాకింగ్ కు వెళ్లే దురలవాటు కూడా లేని మూలవిరాట్టు మా ఆయన. పొద్దున్లేచి రెండు గంటలపాటూ తిథివారనక్షత్రాల సహా పేపరు చదివేయడం... నేను ఆఫీసుకెళ్లిపోయాక ఒంటరిగా ఇంట్లో కూర్చుని పుస్తకాలు చదువుకుంటూ... పాతాకొత్తా నానా చెత్త సినిమాలన్నీ చూస్తూ గడపడం ఆయన వ్యాపకం. ఈ సందిట్లో చుట్టాలు, స్నేహితులూ అయితే పర్లేదు.. పరిచయస్తుల్లో ఎవరికి ఏ అవసరం వొచ్చినా తగుదునమ్మా అని ముందుంటాడు. వాళ్ల కరెంటు బిల్లు చెల్లింపులు, వాళ్లకు రైలు టికెట్లు బుక్ చేయడాలూ.. ఇలా ఇంట్లో కంప్యూటరు ముందు కూర్చుని మినీ మీ సేవ కేంద్రం నడుపుతుంటాడు. అలాంటి పెద్దమనిషి... శ్రీదేవి కూతురు పెళ్లికి వెళ్లడానికి టికెట్లు బుక్ చేయమంటే పెడసరం మాటలంటాడా? పైగా నేను రాను.. నువ్వే వెళ్లు అంటాడా? నేను ఒంటరిగా ఎప్పడూ ఎక్కడికీ వెళ్లిన దాన్ని కాదనేగా ఆయన పొగరు. చూస్తా చూస్తా సాయంత్రం ఇంటికెళ్లాక మొత్తం దించి పారేస్తా. ... ఈ ఆలోచనల్లో ఉండగానే ఆఫీసు వచ్చేసింది. ఆఫీసు సీట్లో కూచోగానే కాస్త రిలాక్స్ అయి ముందుగా శ్రీదేవికే ఫోన్ చేశాను. ‘మా ఆయన్తో ఏమైనా గొడవ పెట్టుకున్నావా..రీసెంట్ గా’ అన్నాను ఫోనెత్తగానే. అది మాలో ఆఖరిది. మా అందరిలోకి చాలా షార్ప్. ఒక్క మాటతోనే సాంతం గ్రహించేసినట్టుగా... ‘ఏంటే ఇలాంటి స్కెచ్ వేసి పెళ్లి ఎగ్గొడదామని అనుకుంటున్నావా? తాట తీస్తా... నీదీ మీ ఆయన్దీ’ అంది. నేననుకున్నదేమీ లేదనిపించింది. ‘ఎందుకలా అడిగా’వని అది గుచ్చి గుచ్చి అడుగుతున్నా పట్టించుకోకుండా... టాపిక్మార్చి పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయని కాసేపు వాకబు చేసి.. ఫోన్ పెట్టేశాను. మరి మా శ్రీవారు హఠాత్తుగా స్టయిలు మార్చి.. ఎందుకిలా భీష్మించుకున్నట్టు. ఏదో మూడ్ పాడై ఉంటుందిలే.. సాయంత్రం ఇంటికెళ్లాక చపాతీలోకి టమోటా పప్పు బదులు ఆలూ కూర చేసి పెడితే చాలు.. ఐసై పోతాడు. అసలే అల్ప సంతోషపు ప్రాణి.. అని నాకు నేనే సర్ది చెప్పుకుని.. ఆనక పన్లో పడిపోయాను. ‘‘ఇవాళ కాస్త లేటయ్యేలా ఉంది’’ అన్నాను ఫోన్‌చేసి. ‘‘ఓకే ఓకే’’ అన్నాడు ఎప్పటిలాగానే.ఇంటికి చేరగానే చపాతీలోకి ఆయనకిష్టమైన ఆలూకూర చేసేసి.. ఇంప్రెస్ చేసి.. టికెట్లు బుక్ చేయించుకోవాలని అనుకుంటూ.. బస్ దిగాక, సందు చివర కొట్టులో ఆలూతోపాటు కొన్ని దినుసులు కొనుక్కుని ఇంటికి వచ్చేసరికి ఎనిమిదిన్నరయ్యింది. అలా ఆపసోపాలు పడి వచ్చిన నాకు ఇంటికి రాగానే షాక్ తగిలినట్లయింది. ‘‘త్వరగా స్నానం ముగించి వచ్చేయ్... టిఫిన్ రెడీగా ఉంది. తినేద్దాం’’ అన్నాడు. ‘‘లేటవడం నిజమే గానీ.. వచ్చాక పది నిమిషాల్లో చేసేస్తా కదా. ఆ భాగ్యానికి స్విగ్గీ వాణ్ని మనం పోషించాలా’’ అంటూనే.. లోపలకు వచ్చిన నాకు హాట్ బాక్స్ లో చపాతీలు, గిన్నెలో కూర కనిపించాయి. తనే చేశాడా? నా సామ్రాజ్యంలోకి ఎవరో చొచ్చుకు వచ్చేస్తున్నట్టు అనిపించింది. తనకు వంట తెలుసు. చిన్నప్పుడు చేసేవాణ్ననీ, బ్యాచిలర్‌గా బతికిన రోజుల్లో కూడా స్వయంపాకమేననీ చెప్తుంటాడు. ఎప్పుడైనా బతిమాల్తే నాక్కాస్త సాయం చేయడం తప్ప.. ఇన్నేళ్ల సంసారంలో ఎన్నడూ ఆయన చేతివంట రుచెరగను. ఆశ్చర్యమూ అనిపించింది. నిజానికి పెళ్లయిన కొత్తల్లో కాస్త ప్రయత్నించాడు గానీ.. అదేదో నా సామ్రాజ్యం అన్నట్టుగా వంటింట్లోకి అడుగుపెట్టనివ్వకుండా నేనే అడ్డుకున్నాను. ఆ తర్వాతే నాకు ఉద్యోగమొచ్చింది. అయినా రెండు పనులూ నాలుగు చేతులా చేయడమే అలవాటైంది. కూరగిన్నెలో వేలుముంచి, నోట్లో పెట్టుకుని చప్పరించాను. పరవాలేదు. కూర చేయడం మాత్రమే కాదు... ఎన్నడూ లేనిది ఈ మనిషి, సందు చివరి దాకా వెళ్లి ఆలూ తెచ్చుకుని మరీ చేశాడంటేనే తెగ ఆశ్చర్యంగా ఉంది నాకు. నేను డ్రెస్ మార్చుకున్నాక.. ప్లేట్లలో సర్దుకుని తనకొకటి ఇచ్చి, పక్కనే కూర్చుని ‘‘నువ్వే చేశావా’’ అడిగాను. గర్వంగా నవ్వాడు. బుగ్గ చిదిమి ముద్దు పెట్టుకుని ‘‘మా బాగా చేశావ్’’ అన్నాను. ‘‘థేంక్యూ’’ అన్నాడు సిగ్గు అభినయిస్తూ. ‘నా’ పనులు చేయమని అడిగినప్పుడు మొండికేస్తున్నాడే తప్ప మా మధ్య ఇలాంటి సరదాలు, సరసాలు అన్నీ ఎప్పటిలా నిండుగా ఉన్నాయి. అదే నాకు అర్థం కావడం లేదు. అందరి పనులూ చేసి పెడుతుంటాడు. నేను మాత్రం ఏది అడిగినా ‘నాకు కుదర్దు’ అంటాడు. పైగా ‘నువ్వేం వేలిముద్ర దానివి కాదు కదా...ఆ పాటి పనులు నేర్చుకోలేవా?’ అంటూ అదనంగా దెప్పిపొడుపు కూడా. సినిమాకెళ్దాం అంటే టికెట్లు నువు బుక్ చేస్తే వొస్తానంటాడు... బయటికెళ్దాం అంటే క్యాబ్ నువ్వే బుక్ చేయాలంటాడు.. ప్రయాణాలకు టికెట్ల సంగతి సరేసరి. ఆ మధ్య నాల్రోజులు వరుసగా సెలవులొచ్చేసరికి చిన్న ట్రిప్ వెళ్లాం. ఎక్కడికెళ్లాలనే దగ్గరినుంచి ఎలా వెళ్లాలి ఎక్కడ బస అనే వరకు సమస్తం గూగుల్ చేయించి...రూట్ మ్యాప్, ఏర్పాట్లు అన్నీ నాతోనే చేయించాడు. కంప్యూటరు ఎదురుగా నన్ను కూర్చోబెట్టి, నా పక్కన తను కూర్చుని! ఈ వ్యవహారం మొత్తం నాకు అంతుబట్టకుండా తయారైంది. ఇదివరకు ఇలా కాదు. ఎప్పుడు ఏ అవసరం వొచ్చినా తానే ముందుండి, అన్నీ ప్లాన్ చేసి.. అన్ని బుకింగ్ లూ ముగించి.. పక్కా ప్లాన్ తో సిద్ధం చేసేసేవాడు. బిల్లుల చెల్లింపులూ ఆన్లైన్ కొనుగోళ్లూ లాంటి సమస్త వ్యవహారాలూ అసలు జరుగుతున్నాయో లేదో మనకు తెలియకుండా పూర్తి చేసేస్తుండేవాడు. ఇప్పుడు ఈ లంపటం మొత్తం నాకు తగిలిస్తున్నాడు. ఈ తేడా అంతా అయిదారు వారాలనుంచే... ఆ మధ్యన నేను ఆయన నొచ్చుకునేలా ఏమైనా చేశానా? అని నన్ను నేను కొన్ని వందల సార్లు ప్రశ్నించుకున్నాను. జవాబు చిక్కలేదు. ఎందుకిలా వ్యవహరిస్తున్నాడో అర్థం కావడంలేదు. ఆయనతో నాకంటూ పని పడనంత వరకూ జీవితం చాలా హాయిగా, సరదాగానే ఉంటుంది. బజార్నించి ఇది తెచ్చిపెట్టండీ అంటే చాలు.. కుదరదనేస్తాడు. నేను కొంత కించపడి, నా అంత నేను తెచ్చుకున్నాక కాసేపటికి మళ్లీ సర్దుకుంటూ ఉంటాను. రోజులు నిమ్మళంగానే గడుస్తున్నాయి. ఓ రోజు ఆఫీసులో ఉండగా పద్మజక్క ఫోను చేసింది.‘‘ఏం రమా మీ ఆయన దేశంలో లేడా? రెండ్రోజుల్నుంచీ ఫోను స్విచాఫ్ వస్తోంది...’’ అంది. నిజానికి ఆ పాయింటు నేను కూడా గుర్తించలేదు. వేరే ఊర్లకు వెళ్లినప్పుడు తప్ప ఆయన మొబైల్‌కు కాల్ చేసే అవసరం నాకు అంతగా ఉండదు. రెండ్రోజులుగా ఇంట్లో ఉన్నప్పుడు కూడా అది మోగడం నేను విన్లేదు గానీ.. స్విచాఫ్ చేసేసాడని అనుకోలేదు. ‘‘ఏముందక్కా నీకూ నాకూ నెలకోసారి అయితే మూడురోజులుంటుంది. ఆయనకు నెలలో ఎన్ని సార్లు అవుతుందో తెలీదు... అయ్యాక ఎన్ని రోజులుంటుందో తెలీదు..’’ అన్నాను. ఇద్దరం నవ్వుకున్నాం.కాసేపు పిచ్చాపాటీ మాట్లాడుకున్నాక ‘‘ఇంటికెళ్లాక ఓసారి ఫోన్ చేయించు’’ అంది.దొరికాడు. రెండ్రోజులుగా ఫోను కూడా వాడకుండా షెల్‌లో కూర్చుని గుడ్లు పొదుగుతున్నాడన్నమాట. ఇవాళ పద్మజక్కతో మాట్లాడకుండా ఎలా ఉంటాడో చూడాలి అనుకున్నాను. పద్మజక్కంటే మా ఆయన ఎలిమెంటరీ స్కూల్ క్లాస్మేట్. మా ఊరి దగ్గర చిన్న పల్లెలో ఉంటుంది. వాళ్ల ఆయన పోయాక ఉన్న ఒక కూతురికి పెళ్లి చేసి పంపేసింది. పల్లెలోనే చిన్న ఇల్లు ఉంది. కూతురికి పెళ్లి చేసినప్పుడు దాన్ని అమ్మి కట్నం కింద ఇచ్చేయాలని అనుకుంది. అవతలి వాళ్లు కూడా దానికి ఆశపడ్డారు. ఇల్లమ్మేసి మా ఇంట్లోనే ఉండిపొమ్మని అక్కకు ఆఫర్ ఇచ్చారు. కానీ మా ఆయనే అడ్డం పడ్డాడు. ఎటూ పద్మజ పోయాక అది మీకే దక్కుతుంది. ఉన్నంత కాలమూ తను అక్కడుండాల్సిందేనని పట్టుబట్టాడు. పెళ్లి సంబంధం ఆయన చూసిందే. వాళ్లను కన్విన్స్ చేశాడు. అలా పద్మజక్క పల్లెలోనే మిగిలిపోయింది. వ్యాపకమూ, తెరువూ ఉండాలని ట్యూషన్లు చెబుతుంటుంది. ఆ చిన్న ఊళ్లో ట్యూషన్లు చెప్పుకుంటే ఏమొస్తుంది? ఎటూ కాస్త పింఛనొస్తుంది గనుక..గుట్టుగా బతికేస్తుంటుంది. ఇంటికెళ్లేసరికి... ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. ‘‘పద్మజక్క ఫోన్‌చేసింది’’ అన్నాను. ఇప్పుడు తన ఫోన్ ఆన్ చేయకపోతాడా అనుకుంటూ. ‘‘ఏదీ నీ ఫోనిలా ఇవ్వూ..’’ అంటూ నా చేతిలోంచి తీసుకుని, ఫోన్‌చేసి ‘‘చెప్పు పద్మజా’’ అన్నాడు.ఫోనెందుకు స్విచాఫ్ చేశావని అడిగినట్లుంది. ‘‘అది కాస్త రిపేర్ వచ్చిందిలే.. రెండు మూడు రోజుల్లో బాగైపోతుంది’’ సంజాయిషీ చెప్పుకుంటున్నాడు. నాకెప్పుడూ మహా ఆశ్చర్యం వేస్తుంటుంది. ఈయన నెలలో ఎన్ని సార్లు ఇలా ఫోను చెడిపోయిందనే అబద్ధం చెప్పినా ఆయన ఫ్రెండ్స్ ప్రతిసారీ దాన్ని నమ్మినట్లే కనిపిస్తుంటారు. వాళ్లలో ఎవరూ అంత అమాయకులు కాదు. కానీ ఒక్కసారి కూడా ‘కథలు కట్టిపెట్టవోయ్’ అనరు. డెబ్భయివేలు తగలేసి కొనుక్కున్న ఫోను ఇలా తరచుగా ఎందుకు చెడిపోతుందని గానీ, అన్ని సార్లు చెడిపోయే ఫోనుని మార్చవచ్చుకదా అని గానీ అనరు. అవతలినుంచి అక్క గొంతు కూడా వినిపిస్తూనే ఉంది. ‘‘పది రోజుల్నుంచీ టౌనుకు వెళ్లడం కుదరడం లేదు రవీ..’’‘‘ఒంట్లో బానే ఉంటోందా?’’‘‘అబ్బెబ్బే ఆ ఇబ్బందేం లేదు గానీ.. కరెంటు బిల్లింకా కట్టలేదు..’’ సాగదీస్తోంది. ‘‘నేను కట్టేస్తాలే..’’‘‘సర్వీస్ నెంబరు మెసేజీ పెట్టనా..’’‘‘నా డైరీలో ఉందిలే... రేపుదయాన్నే కట్టేస్తా. పాపెలా ఉందీ... మనవరాలితో మాట్లాడుతున్నావా..’’ అని కుశలాలు ఆరా తీసి ఫోను పెట్టేశాడు. ఖచ్చితంగా రేపు బిల్లు కట్టేస్తాడు. నేను ఇలాంటి సందర్భంకోసమే ఎదురుచూస్తున్నా.. ఆయన వాలుకుర్చీకి ఎదురుగా బాసింపట్టు వేసుకు కూర్చున్నా! ‘‘ఇప్పుడు నాకు చెప్పి తీరాల్సిందే. ఏంటి సంగతి? నేను రైలు టికెట్లు అడిగితే బుక్ చేయవు... ప్రీమియం కట్టమంటే కట్టవు... పద్మజక్క ఫోన్ చేస్తే మాత్రం యుద్ధప్రాతిపదిక మీద కట్టేస్తావు.. ఏంటి సంగతి? నా పనులు మాత్రం ఎందుకు చేయవు? చెప్పి తీరాల్సిందే’’ అన్నాను. ఆయన నాకేసి ఓ చూపు చూసి... ‘‘అదంతే. నువ్వు నా భార్యవు కాబట్టి’’ అని మళ్లీ పుస్తకంలోకి మళ్లిపోయాడు. ‘‘ఏంటి పద్మజ మాత్రం అంత స్పెషలా... భార్య కంటె ఎక్కువగా...’’ చివుక్కున నాకేసి చూశాడు. ఆ కోపంలో, నా పెడసరపు మాట అనుచితంగా, సంకుచితంగా ఉన్నదనే స్పృహ అప్పటికి నాకు లేదు. తనే సంబాళించుకుని, నెమ్మదించి...‘‘పద్మజ ప్రతిసారీ అడగదు. రెండ్రోజులుగా ఫోను ట్రై చేసి మరీ కరెంటు బిల్లు కట్టమన్నదంటే.. తన దగ్గర ఇప్పుడు డబ్బు లేదని అర్థం.. ఆ మాట చెప్పలేకపోతోంది. నేను అడగడమూ బాగుండదు. అన్నిటినీ మించి నా ఫ్రెండు..’’ అన్నాడు.‘‘అయితే నన్ను కూడా ఫ్రెండ్ లిస్టులో పెట్టుకో’’ విసురుగా తన చేతిలో పుస్తకం లాక్కుని అన్నాను. తేలిగ్గా నవ్వేసి ‘‘ఆ లిస్టులో మొదటి పేరు ఎప్పటికీ నీదే. కానీ భార్యగా మారిపోయావ్ నువ్వు’’ అనేశాడు. ఇదేం ట్విస్టు. పెపంచికంలో ఎక్కడైనా భార్య కాబట్టి ఎక్కువ ప్రయారిటీతో చూసుకునే మొగుళ్లుంటారు. ప్రయారిటీ ప్రస్తావన లేకపోయినా.. గతంలోనూ ఈయన నన్ను తన ఫ్రెండ్స్ తో సమానంగానే చూసుకునే వాడు. ఇప్పుడు భార్య కావడం నా తప్పు అన్నట్లుగా.. నీ అవసరాలు మాత్రం పట్టించుకోను.. అని తేల్చేయడం ఏమిటో నాకు అస్సలు అర్థం కాలేదు. పద్మజక్కకు మాత్రం ఇలా చెప్పగానే అలా పనులెందుకు చేస్తున్నాడనే చెత్త అనుమానం నాకు లేదు. ఉడుక్కుని, మాట తూలానంతే. నా విషయంలో మాత్రం.. నీ చావు నువ్వు చావాల్సిందే అన్నట్టుగా ఎందుకు తేడాగా చేస్తున్నాడో తెలియడం లేదు. ఆయన మొహంలో ఎలాంటి ఫీలింగ్ ఉన్నదో వెతుకుదామని తదేకంగా చూశాను. ఈ మనిషితో ఇదే ఖర్మ. కోపంగా ఉంటే తగ్గవచ్చు. అలిగి ఉంటే బుజ్జగించవచ్చు. గారంగా ఉంటే ఆడించవచ్చు. దు:ఖంగా ఉంటే ఊరడించవచ్చు. ప్రేమగా ఉంటే అనుభూతించవచ్చు. స్నేహంగా ఉంటే ఆస్వాదించవచ్చు. సంతోషంగా ఉంటే పంచుకోవచ్చు. విసుక్కుంటే తగాదా పడవచ్చు. కానీ ఎలా ఉన్నాడో తెలియకుండా అభావంగా ఉంటే ఎలా స్పందించగలం. అలా చూసి చూసి, నామీద నాకే చిరాకేసి లేచి నా పనుల్లో పడ్డాను. నాకు నెమ్మదిగా ఈ పనులన్నీ అలవాటు కావడంలో వింతేమీ లేదు. కాకపోతే అంతకంటె పెద్ద వింత మరొకటి ఉంది. ఆయన ఇప్పుడు చాలా తరచుగా వంట చేసేస్తున్నాడు. నాకు ఆఫీసునుంచి లేటైన ఏ సందర్భంలోనూ ఇప్పుడు మేం జై జొమాటో అనడం లేదు. వంటొక్కటే కాదు.. పని ఒత్తిడి ఉండే సందర్భాల్లో బట్టలు ఉతికేస్తున్నాడు. ఇల్లంతా శుభ్రంగా పెట్టేస్తున్నాడు. నా వంతులో నేను బాగా ముదిరిపోయాను. టెక్ బేబీ అయిపోయానంటే నిజం. చాలా మంది ఫ్రెండ్స్‌కి ఇప్పుడు నేనే దిక్కు. ఇలాంటి చిన్నచిన్న కంప్యూటరు పనులే కాదు.. బయటకెళ్లే పనులున్నా సరే నేనే తోడుగా, గైడుగా మారిపోతున్నాను. అంతెందుకు... కుశలప్రశ్నలకు తప్ప పద్మజక్క కూడా ఆయనకిప్పుడు ఫోను చేయడం లేదు. ఏ పని ఉన్నా నాకే చెబుతోంది. తమాషా ఏంటంటే... ఆయన ఆన్లైన్ బ్యాంక్ అకౌంట్ లాగిన్ డీటెయిల్స్ కూడా నాకు యిచ్చేశాడు. ఎప్పుడైనా అవసరం పడుతుందని. అప్పట్లో ఓ రెణ్నెల్లపాటూ తెగ తిట్టుకున్నాను. అలవాటు పడడం మొదలయ్యాక ఆ అసంతృప్తి పోయింది. ఈలోగా నా పుట్టిన రోజొచ్చింది. కోదండరామాలయానికి వెళ్లాం. శంషాబాద్ నుంచి నాలుగైదు కిలోమీటర్లు లోపలకు వెళ్తే వస్తుంది అమ్మపల్లి. అద్భుతమైన ఆలయం. నవమి రోజుల్లో తప్ప నిత్యమూ నిర్జనంగా ఉంటుందనే మాకు ఆ గుడి అద్భుతం. ఇష్టం. సీతను వెతికే ప్రయత్నంలో ఉత్తరాదినుంచి దక్షిణపు కొన వరకూ దేశమంతా తిరుగుతూ మార్గమధ్యంలో అలసి, రాముడు సతీసోదర సమేతంగా వెలసిన క్షేత్రమట ఇది. మూలవిరాట్టుల్లో భాగంగా హనుమంతుడు ఉండడిక్కడ. ప్రశాంతంగా ఉండే గుడి. ఓపిక ఉన్నంతవరకూ దర్శనం చేసుకుని..ఆవరణలో ఓ గంటసేపు కూర్చున్నాం. అప్పుడు– తన లాల్చీ పక్క జేబులోంచి ఓ కవరు తీసి నా చేతికిచ్చాడు. ‘‘బర్త్ డే గిఫ్టా’’‘‘అలాంటిదేలే’’దాన్ని అందుకుని... తడిమిచూసి... అడిగాను.‘‘చెక్కా?’’ఏమీ చెప్పకుండా చిరునవ్వు నవ్వాడు. ‘‘లవ్ లెటరా?’’ అదే నవ్వు.‘‘లవ్ లెటర్ని ఇలా బ్రౌన్ కవర్లో ఇవ్వడమేంటి మహాప్రభూ! గులాబీరంగు కవర్లో ఇవ్వాలని ఎప్పుడూ పుస్తకాల్లో చదవలేదా?’’ కోప్పడ్డాను. తెరవబోతుండగా నా చేయి పట్టుకుని ఆపాడు. ఎందుకన్నట్టుచూశాను.‘‘ఇప్పుడు కాదు’’‘‘ఇంటికెళ్లాక ఏకాంతంలో చదువుకోనా...? అంత రసహృదయం ఉందా ఇందులో’’‘‘ఇప్పుడు కాదు. ఎప్పుడైనా, ఒకవేళ నేను ముందుగా, తుదివీడ్కోలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నప్పుడు...’’చివాల్న చెంపమీద ఓ దెబ్బ వేశాను. లాఘవంగా తప్పుకున్నాడు– గట్టిగా తాకకుండా! ‘‘గుళ్లో అలాంటి మాటలెత్తుతావా?’’ కోపంగానే అన్నాను.‘తథ్యమైన సంగతులు మాటాడ్డానికి స్థల కాల నిషేధాలెందుకు?’’నిజమే కావొచ్చు. కానీ, మనసు వికలమై ఆ కవరు బ్యాగులో పెట్టేసుకున్నాను. ‘రమా!’’బ్యాగులోంచి బీరువాలోకి వెళ్లిపోయిన కవరు. ఇవాళ తెరవాల్సి వచ్చింది. ‘‘దాంపత్యం అంటే ఏమిటి?దీనికి ప్రపంచంలో ఏ ఇద్దరూ ఒకేమాదిరి సమాధానం చెప్పలేకపోవచ్చు. అన్ని వేల కోట్ల వైవిధ్యాలున్న అనుభూతి కాగలిగింది కాబట్టే... అది ప్రపంచంలో ఎప్పటికీ అనన్యమైన బంధంగా తయారైంది. కానీ కొన్ని సందర్భాల్లో నేను ఇందులో ఒక సిమిలారిటీ గమనించాను. అది దీనికి నిర్వచనం కాదుగానీ...ఎవరూ చెప్పకపోయినా, ఒప్పుకోకపోయినా సరే.. నిర్వచనంలో ఒక భాగం అవుతున్నదా అనిపించింది. అదే ‘ఇంటర్ డిపెండబిలిటీ’!ధర్మం అను, మతం అను... ముసుగు ఏదైనా.. ఎలాగైనా సరే మన వ్యవస్థలో దంపతుల్ని ఇంటర్ డిపెండబుల్‌గా మార్చేయడం ఒక సాంప్రదాయం అయిపోయింది. ఈ డిపెండబిలిటీ పర్యవసానాలుగా కొన్ని అసహజ పరిణామాలు కనిపించాయి నాకు. బహుశా అది నా దృష్టిలోపం కూడా కావొచ్చు. భర్త అనేవాడు చనిపోగానే... ‘నా ఎస్సెస్సీ సర్టిఫికెట్లు ఎక్కడ పెట్టాడో కూడా తెలియదే‘ అంటూ ఓ అమ్మాయి డూప్లికేట్లకు అప్లయి చేసుకుని ఆ సర్టిఫికెట్లు వచ్చిన తర్వాత.. సగం హరించుకుపోయిన జీవితాన్ని కొత్తగా ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నించడం ఏమిటసలు? ‘ఇబ్బందేమీ తెలియనీకుండా, నాకేం కావాల్సి వచ్చినా తనే చూసుకునేవాడమ్మా’ అనే విలాపంలో, బయటకు వ్యక్తం అయ్యేది ఆవేదనే గానీ.. కాస్త లోతుగా చూస్తే అసలామె ఎందుకంత అశక్తంగా తయారైపోయినట్లు? ఆశ్చర్యం అనిపించేది నాకు. ‘నన్ను అన్యాయం చేసి వెళ్లిపోయావే’, ‘నువు లేకుండా ఎలా బతికేదిరా దేముడా’... ఇలాంటివి చాలా విన్నాను. సహగమనం అనే వెధవాయిత్వాన్ని మనం పూడ్చిపెట్టగలిగాం గానీ... ఆ స్థాయిలో ఇలా డిపెండబిలిటీతో ముడిపడ్డ ఆవేదన ఎందుకు మిగలాలి? భార్య అలా తయారైపోవడంలో– ఉదాత్తత, పెద్దరికం ముసుగులో భర్తల అప్రకటిత కుట్ర ఏమైనా ఉంటున్నదా? అని కూడా అనిపిస్తుండేది నాకు తరచుగా!! ఏడవకూడదని, ఏడుపు వస్తే ఆపుకోవాలనీ నా ఉద్దేశం కాదు. కానీ ఆ కన్నీళ్లు ‘డిపెండబుల్’ సేఫ్‌జోన్ పోతున్నందుకు కాకుండా, ‘డిపార్ట్’ అవుతున్న వియోగానికి సంబంధించి మాత్రమే అయిఉండాలని నా కోరిక. ఇంకా లోతుగా వెళ్లే సందర్భం ఇది కాదు గానీ.. మరణం అంటే ఏమిటసలు? ఐహికమైన, దైహికమైన బాధ్యతలనుంచి విముక్తి కదా? అలాంటి విముక్తి ప్రదాయకమైన అద్భుత సందర్భాన్ని కన్నీటితో నింపుకోవడం ఎందుకు? ఇదివరకు చెప్పిన ‘ఇంటర్ డిపెండబిలిటీ’ లేకపోతే... అలాంటి కన్నీళ్లు ఆగిపోతాయి కదా... అనేది నాకు పుట్టిన ఆలోచన! సమాజాన్ని దిద్దడానికి నేను సంస్కర్తని కాను. దిద్దే నెపం మీద బురిడీ కొట్టించడానికి బాబాను కాను. కానీ, ముందు నన్ను దిద్దుకుంటే చాలు. నాలో భాగమైన నిన్ను దిద్దుకుంటే చాలు. అందుకే నీ నిత్య వ్యవహారాలు సమస్తం నువ్వే చేసుకోగలగాలి అనుకున్నాను. నేను భౌతికంగా లేకపోవడం వలన నీ జీవితంలో ఎలాంటి తేడా రాకూడదని అనుకున్నాను. అందుకే అలా ప్రవర్తిస్తూ వచ్చాను. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ రమా! వ్యవహారాలను సంబాళించుకోవడంలో నువ్వు నన్ను మించిపోయావ్! అదృష్టవశాత్తూ నాకే గనుక ముందుగా విముక్తి లభిస్తే.. ఈ కారణాల వల్ల నువ్వు కన్నీళ్లు పెట్టే పరిస్థితి రాదని మాత్రం నమ్ముతున్నా... ప్రేమతో నీ...’’పెదవులు బిగబట్టి వెక్కడం లేదు... కళ్లనుంచి మాత్రం ధారగా కారిపోతున్నాయి. ఆ నీటి చుక్కలు పడి, కాగితమ్మీది అక్షరాలు చాలావరకు అలుక్కుపోయాయి... అసలే మా ఆయనకు సిరా పేనాతో రాసే అలవాటు. బిగియపట్టుకున్న ఆయన చేతుల్లో అప్పటికే ఆ కాగితం పూర్తిగా తడిచి, నలిగి పోయింది. విశాలమైన గదిలో మేమిద్దరమే ఉన్నాం. రెండు రోజుల కిందటే పిలిపించిన పిల్లల్ని పది నిమిషాల కిందట బయటకు పంపేశాడు. మా ఏకాంతం కోసం..., ఈ సమయంలో! ఆ తర్వాత చదవడం మొదలెట్టాడు. చదవడం పూర్తయ్యాక నా చేతిని గట్టిగా పట్టుకుని అన్నాడు... ‘‘ఇందులో రాసిందంతా తప్పు... డిపెండబిలిటీ కాదు. డిపార్ట్ గురించి కూడా కాదు. ఇంకా ఏదో ఉంది.. ఏదో ఉంది. అది నా మూర్ఖత్వానికి తెలియదు... మూర్ఖత్వానికి తెలియదు...’’ ముద్దగా మారుతున్న మాట నాకు స్పష్టంగా వినిపిస్తోందో లేదో అని... రిపీట్ చేస్తున్నాడు. ఐసీయూలో సెలైన్ ఎక్కుతున్న నా చేతిని– నలిగిపోయిన కాగితంతో సహా గట్టిగా పట్టుకున్న తన చేతివేళ్ల వణుకు కూడా నాకు స్పష్టంగా తెలుస్తోంది. అచేతనంగా ఉన్న కళ్లతో ఆయన్ను నేను కొత్తగా చూస్తున్నాను. నలభయ్యేళ్లుగా ఎరిగిన ఆయనలో... నాలుగేళ్ల కిందట ఒకడు కొత్తగా కనిపించాడు. ఈ గడియలో మరొకడు ఇంకా కొత్తగా కనిపిస్తున్నాడు. వాడూ వీడూ మా ఆయనలోని అపరిచితులు! తృప్తిగా ఉంది. మా ఆయనని పూర్తిగా తెలుసుకోగలుగుతున్నందుకు!ఆయన పట్టుకున్న నా చేతిమీద... తన కళ్లనుంచి రాలుతున్న నీటిచుక్కల స్పర్శ తెలుస్తోంది. కళ్లు మూసుకున్నాను. కె.ఎ. మునిసురేష్ పిళ్లె -
పెళ్లింట విషాదం
చందంపేట : అప్పటి వరకు బంధువుల హడావుడితో కళకళలాడిన ఆ పెళ్లింట విషాదం నెలకొంది... పెళ్లి తంతు ముగిసిన అనంతరం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వివాహ వేడుకలో మునిగి ఉన్న బంధువులలో ఇద్దరు మృత్యువాతపడడంతో ఆ ఇంట శోకం నిండింది.. చందంపేట మండలం గన్నెర్లపల్లి మూలమలుపు వద్ద బైక్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండ మండలం చింతకుంట్ల గ్రామానికి చెందిన ఎదుళ్ల వెంకట్, డిండి మండలం ఎర్రారం గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి వివాహం గురువారం ఎర్రారం గ్రామంలో జరిగింది. వివాహ వేడుక ముగిసిన అనంతరం తిరుగు ప్రయాణం అవుతున్న క్రమంలో డీసీఎంలో బంధువులు బయలుదేరగా కంభాలపల్లి గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ రామకృష్ణ(35), నేరెడుగొమ్ము మండలం పేర్వాల గ్రామానికి చెందిన దారముల రామస్వామి(42), కంభాలపల్లి గ్రామానికి చెందిన ఆనందం బైక్‌పై బయల్దేరారు. అయితే మార్గమధ్యలో చందంపేట మండలం గన్నెర్లపల్లి వద్ద మూలమలుపు వద్ద వీరి బైక్ విద్యుత్ స్తంభాన్ని బైక్ ఢీకొంది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న రామకృష్ణ, రామస్వామి మృత్యువాతపడగా ఆనందం పరిస్థితి విషమంగా ఉంది. -
‘పెళ్లి పిలుపులు రాని తల్లి’
టెలివిజన్ రంగంలో ఎన్ని ఘన విజయాలు సాధించినప్పటికీ ఏక్తా కపూర్ సాంఘికంగా ‘పెళ్లి కాని తల్లి’గానే గుర్తింపబడుతోంది. ఆమె ఎదురుపడితే మొదలయ్యే మొదటి ప్రశ్న ‘పెళ్లెప్పుడు?’ అనే!ఏక్తా కపూర్‌కు 43 ఏళ్లు వచ్చాయి. కాని ఇప్పటికీ ఆమె బంధువులకు ఎదురు పడటానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. ముఖ్యంగా పెళ్ళిళ్లకు హాజరవ్వడానికి ఇంకా ఇబ్బందిపడుతూ ఉంటుంది. దానికి కారణం ఆ పెళ్లిలో ‘నెక్ట్స్ నీ పెళ్లే’ అని బంధువులు ఆమెతో అంటూ ఉంటారు. అదీ ఆమె భయం. దానికి ఏం సమాధానం చెప్పాలో తెలియదు ఆమెకు. ‘స్త్రీ ఎన్ని ఘనవిజయాలు సాధించినా పెళ్లితోనే ఆమె జీవితం సంపూర్ణమవుతుందనే సాంఘిక అభిప్రాయానికి కాలం చెల్లాల్సి ఉంది’ అని ఏక్తా అంటుంది. పెళ్ళిళ్లకు తీసుకెళితే పెళ్లి మీద మనసు పుడుతుందేమోనని ఏక్తా తల్లి శోభా కపూర్ గతంలో ఏక్తాను పెళ్ళిళ్లకు పిలుచుకుని వెళ్లేది. కాని అక్కడ ఏక్తాను ఇలా అర్థం లేని ప్రశ్నలు అడుగుతుంటే దానికి ఏక్తా అర్థం లేని సమాధానాలు చెప్పడం చూసి, ఆ సమాధానాలకు ఎదుటివారు హర్ట్ అవడం గమనించి ఏక్తాను పెళ్లిళ్లకే తీసుకెళ్లడం మానుకుంది. ఎలాగూ రాదు కదా అని అసలు పెళ్లి పిలుపులు ఆమెకు పంపడం కూడా మానేశారు బంధువులు.ఏక్తా కపూర్ జనవరి 2019లో సరొగసి ద్వారా ఒక మగబిడ్డకు తల్లయ్యింది. ‘నా జీవితంలో నేను చూసిన అన్ని విజయాలకంటే గొప్పది నా కుమారుణ్ణి నా జీవితంలోకి ఆహ్వానించడం’ అని ఏక్తా అంది. ఏక్తా మొదట తనే ఐవిఎఫ్ పద్ధతి ద్వారా గర్భం దాల్చి బిడ్డకు జన్మనివ్వాలని అనుకుంది. అయితే అందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. దాంతో డాక్టర్లు సరొగసి ద్వారా ఆమె తల్లయ్యే ఏర్పాటు చేశారు. ఏక్తా తండ్రి జితేంద్ర, ఏక్తా సోదరుడు తుషార్ కపూర్ మాత్రమే కాదు ఏక్తా స్నేహితులు కూడా ఈ నిర్ణయాన్ని ఆహ్వానించారు. ఏక్తా తన కుమారుడికి ఘనంగా నామకరణం కూడా చేసింది. జితేంద్ర అసలు పేరైన ‘రవి కపూర్’ను తన కుమారుడికి పెట్టుకుంది. తుషార్ కపూర్ కూడా ఇంకా పెళ్లి చేసుకోకుండా సరొగసి ద్వారా తండ్రైన సంగతి తెలిసిందే.ఈ ఘట్టం ఇలా ముగిసినా పెళ్లి గురించి వెంటపడే బంధువులు మాత్రం అలాగే ఉన్నారు. ‘మా అమ్మా నేను ఈ విషయమై లక్ష సార్లు మాట్లాడుకున్నాం’ అంటుంది ఏక్తా. ‘నేను చేయాల్సిన పనులు చాలా ఉండగా పెళ్లెలా చేసుకోను’ అంటుందామె. ‘కాని గత పదేళ్లుగా మా బంధువుల్లో చాలా మంది ఆడపిల్లలు విడాకులు తీసుకున్నారు. అది చూసి మా అమ్మ నయం... నీకింకా పెళ్లి కాలేదు... నీ నిర్ణయమే సరైనదిలా ఉంది అని నిట్టూర్చింది’ అని నవ్వింది ఏక్తా.జితేంద్ర బంగ్లా ఇప్పుడు ఇద్దరు చిన్నారుల కేరింతలతో కళకళలాడుతోంది. అది కోడలు లేని బంగ్లా, అల్లుడు లేని బంగ్లా కావచ్చు. కాని మనుమలు ఉన్న బంగ్లా. వారంతా సంతోషంగా ఉన్నారు. సమాజానికి ఒక కొత్తపద్ధతి చూపించారు. ఈ దారిలో అందరూ నడవక పోవచ్చు.... ఈ దారి ఒకటి అంగీకారం పొందుతోంది అని తెలుసుకుంటే సరిపోతుంది. -
కోటమామ కూతురు
బుజమ్మీద పెట్టుకున్న కర్రమీద రెండు చేతులు ఏలాడదీసి ముందు పోతున్న గొర్రెల మందలో ఒక గొర్రెలా కల్సిపోయి పొలానికి పోతున్న చినసుబ్బయ్యమామ, బైలిక్కి పోయత్తన్న నన్ను వాక్కాడ ఆపి ‘‘ఆ నాగమనోల్ల ఇంటికాడెందబ్బాయ్ అంతమందున్నారో’’ అని అడిగేడు. ‘‘ఆటే వత్తంటివే వాళ్ళనే అడగ్గూడదా నన్నడక్కపోతే’’ అని కసురుకున్నట్టు అనేతలికి ‘‘అడుగుదామనుకుని ఆగేనబ్బాయ్ కాని అక్కడి జనాలని చూసి గొర్రెలు బెదిరిపోయి లగుదోల్నియ్, వాటెనకాలే నేను కూడా లగుదోలాల్సి వచ్చిందే, దీనెమ్మ నాయాల్ది ఈ గొర్రెలు నాకు కూడుబెట్టె సంగతి దేవుడెరుగ్గానే ఈటికి మేతమేపటానికి వూరెందో వల్లకాడేందో కూడా తెలుసుకొనే సమయం లేకపోయేనే నా దగ్గర చత్... ’’ అంటా ముందుకి కదిలేడు. నా కళ్ళు గబుక్కున సమాదుల పక్కకి తిరిగినియ్ ఎవరికోసమైన గుంట తీస్తన్నారేమోనని. ఎత్తు పల్లాల మట్టితప్ప మనుసులజాడ కనపళ్ళా అక్కడ. ‘‘హమ్మయ్య’’ అనుకోని హడావిడిగా నాగమనోల్ల ఇంటికి బయల్దేరాను. నాగమనోల్ల ఇంటికెళ్ళే రోడ్డుమూల తిరిగేసరికి ఆరేళ్ళ జాషువాతాత మనవడు మొండిమోల్నసైడుకాలవ మీద కూర్చొని గుంటగిన్నెలో ఎండుమిరగబాయలతో నూరిన గోగూరపచ్చడి మెండుగా కలుపుకొని తింటా కనిపించాడు. వాడిపక్కనే ఒకకుక్క కోడలు తెచ్చే కూటికోసం ఎదురుచూస్తున్న ముసలిఅత్తలా దిగాలుగా కూర్చొని వుంది. ఆ గోంగూర పచ్చడి మంటకి వాడి ముక్కోలోంచి కళ్ళలోంచి కారతన్న నీళ్ళపైన ఈగలు ఒకటేమాయన అరుసుకుంటూ ఎగురుతున్నాయ్. ‘‘నాయాలకాన లెగు ఇక్కడ్నుంచ... ఇంట్లో కూచ్చొని కూడు తినలేవా’’ అని బెదిరించినట్టు అరిసి ‘‘ఓ కాంతత్తో నీ మనవడు ఆ మురికిగుంట పక్కన కూర్చొని కూడు తింటన్నాడు, లోపలికి పిలువు’’ అని అరిసా . ‘‘ఆనాబట్ట నామాట ఏడింటాడబ్బాయ్....’’ అని ‘‘ఒరేయ్ ఒరేయ్ దోవ తప్పినోడో మర్యాదగా ఇంట్లోకి వత్తావా లేకపోతే మెల్లెత్తుకొని రావాల్న’’ అని అర్సింది పిల్లోడి మీద ఇంట్లోనుంచే. వాడు లేవల.‘‘కనీసం గుడ్డలన్న ఎయ్యకూడదా వాడికా ... వాళ్ళమ్మ నాన్నయాడికి బొయేరో.....’’‘‘వాళ్ళకేడ కుదిరిద్దయ్య పిల్లోడికి గుడ్డలెయ్యనో... వాడేమో పొద్దున్నేమొద్దులు కొట్టను పోవాలయ్య ఆ పిల్లేమో గ్రేడింకి పోవాలయ్యే, వాళ్ళు ఎల్లబోయే టయానికి వీడు నిద్దర లేవడయ్యే వాళ్ళకేడ కుదిరిద్ది పిల్లోడి గురించి పట్టించుకోను, వీన్నేమో నా జివానేసి పోయేరు. నేనేమో కూసుంటే లేవలేనయ్యే నుంచుంటే కూసోలేనయ్యే.... ఈనా సితనాపిబట్టేమో సెప్పిన మాట గంగావినడయ్యే.... రేయ్ అక్కడనుంచి లేత్తావా లేవ్వా’’ అంటా సిన్నగా లేసి ఒక సీపురు పుల్ల తీసుకొని వాణ్ని కొట్టడానికి వస్తుంది.‘‘ ఎంత పన్లున్నాగాని పిల్లల్ని జాగ్రత్తగా సూసుకోవద్దంటే.... వాడికి ఆ సైడు కాలవలో దోమలుకుట్టి రేపు డెంగో బుంగో వస్తే అప్పుడు బాధ పడేదెవురొ’’ అంటా నాగమనోల్ల ఇంటి వైపుకి గబా గబా నడిచాను. నాగమణి వాళ్ళ ఇంటికాడికి జనం సేరుకొని, వచ్చినోల్లు వచ్చినట్టు పెద్ద పెద్దగా మాట్లాడకుండా గుస గుస లాడుకుంటూ వున్నారు. ఎవరో తెలియదుగాని ఇద్దరుముగ్గురు ఆడోల్లు దూరంగా నాగమణి రెండునెలల కొడుకు నిద్రపోతున్న మంచంకాడ మూతులకి కొంగు అడ్డం పెట్టుకొని ముక్కులు పైకి ఎగబీల్చుకుంటున్నారు. నాగమణి మొగుడు మాణిక్యరావు కుడితి తొట్టిమీద తల ఏలాడేసుకొని కూసోనివున్నాడు అప్పుడే వూరినుంచి వచ్చినట్టు వున్నాడు కర్రల సంచి ఆయన కాలు పక్కనే వుంది. ఇంకో పక్క నాగమణి నుంచొని ఏడుస్తా వుంది. ‘‘బంగారం లాంటి పిల్లోన్ని నిలువున నాశనం చేసేవు కదంటే సెడిపోయిన్దానా’’ ఆదమరచి నిలుచున్న నాగమణిని ఎగిసి కాలితో తన్నాడు మాణిక్యరావు. అల్లంత దూరంలో పడింది నాగమణి.‘‘నీకు ముసలమేమన్నా పుట్టిందంట్రా సెడు నాబట్ట పచ్చి బాలింతని కాలితో తంతున్నావ్’’ లగుదోలింది కిందబడ్డ నాగమణిని పైకి లేపడానికి నాగమణి అమ్మమ్మ పంచలోనుంచి.కుట్లేసిన కాడ కలుక్కుమన్నట్టుంది నాగమణికి. గబుక్కున తడిమిచూసుకుంది కుట్లు పిగిలి నెత్తురేమన్నా వస్తుందేమోనని. నెప్పేగాని నెత్తురు రాల. తనకలాడుతుంది పైకి లేవడానికి.పద్మ గోడకి కూలబడి వల వల ఏడుస్తుంది. కూతురికి పట్టిన గతిని తలుచుకొని. కోటమామ కూతురుదగ్గరికి పోలేక వెనకడుగు వెయ్యలేక కొయ్యబారిపోయి బిత్తర సూపులు చూస్తున్నాడు జనాలవైపు.‘‘దీనెమ్మ దీన్ని సంపినా పాపంలేదు’’ అంటా పొయ్యికాడ వున్న వూదులుగొట్టం తీసుకొని కిందపడున్న నాగమణి వీపు మీద బాదాడు మాణిక్యరావు. నాగమణి ఆ దెబ్బకి కూసోలేక నున్చోలేక గిల గిల తన్నుకుంటా నేలమీద పడి దొర్లుతుంది.‘‘ఒసే కోపమొస్తే మనిషి కాదమ్మా ఈ ముండమోపోడు... పిల్లని సంపెసేటట్టున్నాడో.... అయ్యో అయ్యో ఆ నా బట్టని లాక్కెల్లండయ్యా మీకు పుణ్యమున్దిద్దె’’ అని ఏడుస్తా మాణిక్యరావుని ఎనక్కి నెడతంది. ‘‘నీ యమ్మ నువ్వు లేయే దాని అంతు తేలుస్తా ఈ రోజు’’ అంటా ఆ ముసలిదాని పక్కకి తోసి నాగమణి మీదకి దూకాడు.‘‘అన్నో ఆ పిల్లమీద ఇంకొక్క దెబ్బ పడిందంటే నీ దొమ్మలు పగుల్తియ్ సెబ్తన్న’’ గట్టిగా అరిసేను ఆయనికి అడ్డంపోయి.వూదులుగొట్టం కిందేసి పిల్లోడు పడుకొని వున్న మంచం కాడికి ఎడుస్తా పోయేడు మాణిక్యరావు.పద్మ గబుక్కున నాగమణి కాడికివచ్చి నాగమణి తల దీసి వొళ్ళో బెట్టుకొని ‘‘అమ్మో నాగమనో లేయే .. తల్లో లేయే ... నా బిడ్డో లేయే ..’’ అని ఎక్కిళ్ళు ఎక్కిళ్ళు బెట్టుకుంటా ఏడుస్తా వుంది.‘‘ అయ్యో నువ్వు రాకపోతే సంపెసేవోడయ్యా నా బిడ్డనే.... అమ్మో నాగమనో .... లేయే మనింటికి పోదామో ’’ అంటా నాగమణి కాళ్ళ కాడ కూల బడ్డాడు కోటమామ. ‘‘అబ్బాయ్ అబ్బాయ్ కొంచెం మంచినీళ్ళు తీసుకురండయ్యా ఎవురన్నా బోయే ... మోయ్ నాగమనా మోయ్... ఇటుసూడే తల్లో ....’’ అని హడావిడిపడతా కొంగుతో నాగమణి మొఖమ్మీద గాలి ఇసురుతుంది నాగమణి అమ్మమ్మ. జనాలు నాగమణి దగ్గరకు వచ్చేరు. ‘‘మీరు పక్కకి రండి ఆ పిల్లకి కొంచెం గాలి తగల్నియ్యండి’’ అంటా నాగమణి ముందుకొచ్చి ‘‘అమ్మాయ్ నాగమనా పైకి లెగూ’’ అంటా చెయ్యి పట్టుకుని పైకి లేపేను. నాగమణి కూర్చుంటూ కళ్ళార్పకుండా నా వైపే చూస్తు, ‘‘నా బిడ్డ సచ్చిపోయాడు మామ ....నా బిడ్డ సచ్చిపోయేడు.... నా బంగారి బిడ్డ సచ్చిపోయేడు మామా... నా బంగారు బిడ్డ ... ’’ అంటా పెద్దగాఏడుపందుకుంది. ఎండిపోయిన నాగమణి కళ్ళలో ఎవరో ఏతమేసి తోడినట్టు కన్నీళ్లు వుబికినాయి బయటికి, అవి కిందికి జారి రయికపై అట్టకట్టుకుపోయిన పాలమరకల్లో కలిసిపోయినాయి. ‘‘అమ్మో ఏడవబాకే నీకేమన్నా అయ్యిద్దె ....’’ అంటా అరికాల్లమీద అరిచేత్తో రుద్దుతున్నాడు కోటమామ. అక్కడున్నోల్లన్దరిలో కోటమామే పిరికోడు.మూడు సంవత్సరాల కిందటి మాట....మా అమ్మ కోటమామ పోయిన తరువాత చెప్పింది. అప్పటికే కోటమామ మా ఇంటికీ వచ్చి గంట పైన అయ్యిందంట. మా యమ్మ కూడా అప్పటికే నాలుగైదు సార్లు‘‘ఎందబ్బాయ్ ఇట్టా వచ్చేవో మామ కోసమా ఏంది?’’ అని అడిగినా కూడా ‘‘వూరికినేలేప్పా’’ అంటా అక్కడే నేనొచ్చిన్దాక కూసోని వున్నాడు.నన్ను చూసి గబక్కన సర్దుకొని కూర్చుంటా ‘‘అబ్బాయ్ పెద్దోడా ఇట్టారా ?’’ అన్నాడు.‘‘ఏంది కోటమాం ఈ జామునొచ్చేవ్ ఏంది కతా’’ అని పక్కన కూర్చున్న ఆయన మీదున్న చనువుతో‘‘అది కాదబ్బాయ్ మా గురించి నీకు తెల్వంది ఏముంది? అత్తా నేను నాగపడకుండా పనికిపోయినా ఇల్లు గడవడం కష్టమేనయ్యా... జెరమొచ్చినా తలనొప్పొచ్చిన ఒల్లునొప్పులొచ్చిన బిర్రుగా దుప్పటి కప్పుకొని పడుకుంటా గాని ఆస్పిటిలిగ్గా పోను డబ్బులు కర్చు అవుతాఎమోనని. అప్పో నన్నెక్కడన్నా పెళ్ళిళ్ళలో చూసా’’ అని మమ్మసాయ తిరిగి అడిగి ‘‘కనీసం పెళ్ళిళ్ళకి కూడా పోను సదివిమ్పులు ఇయ్యాల్సి వస్తున్దేమోనని. ఎవురేమైనా అనుకోని పండగపూటకూడా నాగాపెట్టకుండా పనికిపోతా కావాలంటేమన పల్లెల్లో యెవుర్నయినా అడుగు’’‘అబ్బాయ్ కోటయ్య ఇయన్ని పిల్లోడికి ఎందుకు సెప్తన్నా’’ ఎదురడిగింది మమ్మ. నాది కూడా అదే డౌటు కాబట్టి నేను కూడా ఊ అన్నా .‘‘ఇదంతా ఎవురికొస్మప్పా నాగమణి పెళ్లికోసం కదంటే...’’ ఆయనికి ఏడుపు వస్తంది గాని ఆపుకుంటున్నాడు. ‘‘ఎవురు కాదన్నారబ్బాయ్...అసలు సంగతేంది?’’ నావైపు అనుమానంగా చూస్తా అడిగింది ఆయన్ని.‘‘మీ అబ్బాయి నాగమణి తో ఏమన్నాడో నువ్వే అడుగు’’ అన్నాడు కొంచెం కోపంగా.‘‘నేనేమన్నాను ... అసలు దేని గురించి?’’ నాక్కూడా కోపమొచ్చింది.‘‘వచ్చే నెలలో పిల్ల పెళ్లి పెట్టుకుంటిమే ....ఆ పిల్లకి ఇప్పుడుగాని పెళ్లి చేస్తే పోలీసు కంప్లెంటు ఇస్తానన్నవంటగా?’’ గుటకలు మింగుతా అన్నాడు. ‘‘ఏందిరా ... పోలీసు కంప్లెంటు ఏంది?’’ అయోమయంగా అడిగింది మా అమ్మ.‘‘అదా ...లేకపోతే ఎందిమా ఆ పిల్లకి పద్నాలుగేళ్ళు కూడా లేవు అప్పుడే పెళ్ళంట! కనీసం ఆపిల్ల పుష్పావతన్నా అవ్వద్దంటే?అందులో మాణిక్యరావు అన్నకి ఆపిల్లకి వయసు తేడా పదకొండేళ్ళు...అందుకే ఆపిల్లకి ఇప్పుడుగాని పెళ్లి చేస్తే బాల్యవివాహం అని చెప్పి పోలీసు కంప్లెంటు ఇస్తానని చెప్పా?’’ అన్నాను గర్వంగ. ‘‘అప్పో నువ్వు చెప్పే పిల్లకి పెళ్లి సెయ్యాలంటే ఈ రోజుల్లో మనం సెయ్య గలిగి వున్నామా..... ఎంత పనికిమాలినోడుకూడా లచ్చ కట్నం ఇయ్యంది పెళ్లిచేసుకోడయ్యా.... లచ్చలేడ దేవాలప్ప’’ గొంతుకి కల్లె అడ్డం పడి దగ్గేడు, కళ్ళలోంచి నీళ్ళు కారతన్నాయ్. ‘‘నాయాల్ది ఆడపిల్లని కన్న పాపానికి పెళ్లి మనమే సెయ్యలయ్యే, పుట్టింటి సామాన్లు మనమే తేవాలయ్యే,కానుపులు మనమే సెయ్యాలయ్యే, పిల్లకి ఏ కష్టమొచ్చినా మనమే మున్డున్డాలయ్యే.... అన్ని డబ్బులు నాకాడ యాడుండాయిమే... రేయింబగళ్ళు పని చేసినా కూటికే సరిపోతున్నే....ఆ పిల్లోడు మా అక్కాయ కొడుకే కాబట్టి కట్నం బొట్నం ఏమొద్దన్నాడు. ఈ పిల్ల పెద్దమనిశయ్యిందాక ఎదురుచూస్త కూసుంటే వాడి వయసు పోదా? వాడు గాని ఈ పిల్లని పెళ్లి చేసుకోకపోతే నేను డబ్బులేడ్నుంచి తెవాలిమే... పెద్దమనిషి కాకపోతేనేం ఆపిల్లేమన్నా ఇప్పుడు సూట్టానికి సిన్నపిల్లలాగుందా నువ్వుసూడ్లా? ఇప్పుడు పెళ్లిచేస్తే పెద్దమనిషి అయినాకే కాపరం చేసుకుంటారు అప్పుడు దాక పిల్ల మనింట్లోనే ఉండటానికి కూడా పిల్లోడు ఒప్పుకున్నాడు. ఎట్టో కట్ట ఈ పిల్లని వాడికిచ్చి పెళ్లిచేస్తే వాళ్ళ బతుకు వాళ్ళుబతుకుతారు.... లేకపోతే నేను పిల్లకి పెళ్లి చెయ్యగలిగి వున్నానంటప్ప మీ వోడేమో పోలీసులుకి సెప్తానంటన్నే... నేనేడ సావాలో సెప్పప్పా’’ అంటా మా అమ్మ సేతులు పట్టుకున్నాడు. ‘‘ఆయన్న కాకపోతే ఇంకొకడు మామ... కనీసం ఆ పిల్లకి పద్దేనిమిదేల్లన్నా నిండద్దా?’’‘‘నోర్మూసుకోరా ఆయన్ని నీకెందుకు ? వాళ్ళ కూతురు వాళ్ళిష్టం’’ నా మీద అరిసింది మా అమ్మ.‘‘అబ్బాయ్ నువ్వన్నట్టే మా అమ్మాయిని ఆపుతాంగానే ఎన్నేళ్ళు కావాలంటే అన్నేళ్ళు... నువ్వే పెళ్లిచేసుకో కట్నంలేకుండా...సరేనా ’’ అన్నాడు కళ్ళుతుడుసుకొని నవ్వుతా‘‘నాగమణికేమి బంగారంలాగ వుండిద్ది ఆపాలేగానే పెళ్లిచేసుకోనా ఏంది?’’ అన్న నవ్వుతా నేను కూడా.‘‘మాటలకేమి గానే ... పెద్దోడో అయ్యో నీకు దండం పెడతా పోలీసులుకి మాత్రం సెప్పబాకయ్య’’ అన్నాడు కొంచెం దీనంగా.‘‘అసె వాడి మాటలకేమొచ్చే గాని నువ్వు పోరే....వాడేదో నవులాటకి అనుంటాడు’’ అంది మా అమ్మ కోట మామతో.‘‘ఆ మాట మీ పిల్లోన్ని సెప్పమనప్పా అట్టానే పోతా... ఈ మాట ఎవుడన్నా సదూకోనోడు గాని అనుంటే నేను నవ్వులాటకే అనుకునేవోన్ని మీవోడు సదూకున్న పిల్లోడైనా అన్నంత పని సేత్తాడేమోనని బయమ్మే ’’ అన్నాడు‘‘ఇప్పుడు నేనేమి పోలీసులుకి సెప్పన్లెకానా రేపు పెళ్ళయినాక నాగమణికి ఏమన్నాకావాలా? అప్పుడున్దిద్ది నీకు’’ అన్న నవ్వుతా. ‘‘నువ్వేం బయపడబాకరా ఈడిప్పుడు కాలేజ్ కి పోతే మల్లి వచ్చేదెప్పుడో... వాడెవురికి సెప్పడ్లే నువ్వు ఇంటికిపోయి పెళ్లి పన్లు చూసుకో’’ అని హామీ ఇచ్చింది మా అమ్మఅది జరిగిన రెండు సంవత్సరాలకి అనుకుంటా క్రిస్మస్ పండగ రోజు కోటమామ నన్ను వాళ్ళ ఇంటికి పిలిచేడు. ఇంటికెల్లా, కావాలనే నాగమణి చేత పిండి వంటలు తెప్పించేడు.‘‘ఇప్పుడు చెప్పరా అల్లుడా నాగమణి ఎట్టుందో? అప్పుడు తెగ బయపడి పోతివే పెద్ద మనిషి కాకుండానే పెళ్లి చేస్తున్నామని? ఇప్పుడు చూడు ఎట్టుందో’’ అన్నాడు కోట మామ.నిజంగానే తేరిపార చూడాల్సి వచ్చింది. ‘‘మామ ఆ రోజు నీ మాటిని నాగమణిని నేను పెళ్లి చేసుకున్నా బాగుండేది మామ? మిస్సయాను పొ’’ అన్నాను అందరు పగలబడి నవ్వారు, మాణిక్యరావు అన్న కూడా.చిన్నప్పటినుంచి నాగమణిని మొఖంలో ఇదే మొదటిసారి ఏడుపు చూడటం. ఎంతో అందంగా ఏ మాత్రం కల్మషంగాని కుట్రబుద్దిగాని లేని నాగమణి అలా ఏడుస్తుంటే చూడలేకపోయాను. అందుకే తన నుండి దూరంగా బయటికొచ్చేసాను. మొన్ననే పండక్కని ఇంటికొచ్చిన నేను నాగమణి ఇక్కడే వుందని తెలుసుకొని ఇంటికి పోయినప్పుడు, కొడుక్కి అప్పుడే నీల్లుపోసిందిగామాల గుండ్రాయిలాగా బొద్దుగా వుండే వాడికి ఒళ్ళు తుడుస్తా ఆ రెండు నెలెల పిల్లోడికి ఆ చొక్కా ఎవరు తెచ్చేరో, ఆ టవలు ఎవరు తెచ్చేరో, వాళ్ళ నాన్న ఎప్పుడు వస్తాడో, వస్తూ వస్తూ పిల్లోడికోసం ఏమేమి బొమ్మలు తెస్తాడో అని చెబుతుంటే వాడు అవన్నీ నిజంగా వింటున్నట్టు నమ్ముతున్నట్టు వాడి చిట్టి చేతులను బుగ్గలపై రుద్దుకుంటూ, కాళ్ళను ముందుకూ వెనక్కి ఆడిస్తూ, నాగమణి వైపు ఆ చిట్టి కళ్ళతో తీక్షణంగా చూస్తూ వున్నాడు నేను అక్కడికి చేరుకునేసరికి.‘‘అయ్యో నిజమే మీ నాన్న నీకోసం ఒక లారి నిండా సామాను తీసుకొని వస్తున్నాడంట’’ అన్నాను పంచలోకి చేరుకుంటూ.‘‘రా మామా కూర్చో’’ అంటా కాల్లకట్టె వైపు చెయ్యి చూపించింది నవ్వుతా‘‘మేయ్ ఎందిమే పిల్లోన్ని కనమంటే గుమ్మడికాయని కన్నవో’’ అన్నాను పిల్లోడి అరికాళ్ళ వేళ్ళను మెత్తగా నిమురుతూ.‘‘ ఊరుకో మామ పిల్లోడికి మారు పేర్లు పెట్టమాక ...నా బంగారి కొడుక్కీ .....’’ అంటా మురిసిపోయింది.‘‘ ఏమాటకామాటే చెప్పుకోవాలిగాని నాగమనా...మీ పిల్లోడికి అన్నీ నీపోలికలే వచ్చినియ్మే నీలాగే చాల అందంగా ఉన్నాడో....’’ అన్నాను.‘‘ఊరుకో మామ దిష్టిబోద్ది మా పిల్లోడికే’’ అంటా వెంట్రుకల ముడివిప్పి ఆ పొడవాటి వెంట్రుకలతో కాళ్ళ నుంచి తలవరకూ మూడు చుట్లుతిప్పి దిష్టితీసి అరికాల్లో కాటుకతో కుంకుడుకాయంత దిష్టిబొట్టు పెట్టింది. ‘పిల్లోడు మీద అంత జాగ్రత్తగా ప్రేమగా వుండే పిల్లకి ఇట్ట జరిగిందేంది దేవుడా’ అనుకుంటా పక్కనే వున్న బొంకు అరుగు కాడికి వొచ్చేను. ‘‘మామో అవ్వాయ్ సువ్వాయ్ లేమన్నా తేవాలంటే ఒంగోలు పోయే ’’ అంటా సమాదుల్లో గుంట తవ్వను పోతున్న సుధాకరు అక్కడ కూర్చున్న పేతురుతాతని అడిగేడు.‘‘అసె చిన్న పిల్లోడికి అయ్యన్ని ఎందుకురా? ఏదో అంత గుట తీసి బూడ్చిపెట్టకా’’ అన్నాడు చుట్ట ముట్టిస్తా.గుండె జల్లుమంది.‘‘అయ్యో ప్రైటు సీసా ఒకటియ్యయ్యా పిల్ల బాగానీరంసంగా ఉంది’’ అంటా బొంకు కాడికి వచ్చింది నాగమణి అమ్మమ.‘‘నాయనమ్మో అసలెంయ్యిందే నిన్నటిదాకా పిల్లోడు బాగానేఉన్నే ఇంతలోనే ఏందిది’’ అన్నాను‘‘ఏం సెప్పమంటావయ్యా ఆడి గాచారం అట్టరాసుంది... ఎవురు మాత్రం ఏమి సెయ్యగలరు’’ అంది స్ప్రైటు సీసా అందుకుంటా.‘‘ఒరేయ్ అబ్బాయ్ ఇటురాయ్య ఈప్రైటు తీసుకెళ్ళి పద్మమ్మకియ్యి’’ అంటా పక్కనున్న సిన్నపిల్లోడికి ఇచ్చి అరుగు పక్కనున్న సిన్నరాయిమీద కూసుంది.‘‘ మొన్న నేను ఇంటికి పోయినప్పుడు ఎంత బాగున్నాడు పిల్లోడు....పాపం నాగమణి మొకం సూడలేకపోతున్నానే’’ అన్నాను.‘‘అయ్యో రాత్రి పోడుకోబోయేటప్పుడుకూడా పిల్లోడుతో మేమందరం బాగానే ఆడుకుంటిమికదయ్యా , పిల్లోడు మేము సేప్పేయి బాగానే ఆలకించేడు, ఎండుమిరగబాయల్తో బాగానే దిష్టి తీసెను, దోమలు కుడతాయేమోనని దోమతెరకట్టి నేను పక్కనే మంచమేసుకొని పొడుకున్న, అంతా బాగానే ఉన్నే, రెండు మూడు టైం అయ్యేలోకే పిల్లోడు మామూలుగా ఎప్పుడు పాలకి లేవనూ ఏడవనూ చేసేవాడు, అక్కడినుంచి పాపం ఆ పిల్లకి నిద్ర వుండేది కాదు. నాకెందుకో గబుక్కన మెలుకువొచ్చింది ఒక జామున, ఏంది ఇంకా పిల్లోడు పాలకి లేవలేదు అని అనుమానం వొచ్చి నాగమణిని లేపుదాం అని దోమతెరలోకి పోయి పిల్లోన్ని పట్టుకునేలికి పిల్లోడి వొళ్ళంతా సల్లంగా అయిసుగడ్డ లాగుంది. నాకు గుండెలు పగిలే’’ కళ్ళు తుడుసుకుంది.‘‘మేయ్ నాగమనా ఎందిమే పిల్లోడి వొళ్ళు ఇంత సల్లంగా ఉందా అని గబక్కన లైటేసి సూస్తినే... పిల్లోడు తెల్లగా పాలిపోయి నీలక్క పోయి వున్నాడు బిడ్డ, మొవ్ ఉచ్చ పోసుకొని ఉంటాడు లేయే పిల్లోడో... లైటాపే మల్లి వోడు లేచేడంటే నాకు నిద్రున్దదే... అంటా కదిలింది. అప్పడు తెలిసిందయ్యా నాకాపిల్లోడు ఎందుకుసచ్చిపోయేడో....బిడ్డ మొకంమీద నాగమణి రొమ్ము పడివుంది. మొదులుకే దానియి ఎత్తురొమ్ములు దానికితోడు అవి పాలతో నిండి ఇంకా బరువెక్కిల్లా..... పాపం బిడ్డ ఎంత అల్లడిపోయి ఉంటాడో తలుసుకుంటేనే ఒళ్ళు జలదరిస్తంది. బిడ్ద పిల్లోన్ని బంగారమాల సూసుకునేది... పిల్లోడికి బాగా పాలు పడాలని బాగా కూడు తినేది. దానికి ఏం ముసలం పట్టిందో ఒళ్ళు తెలియకుండా నిద్రబోయింది’’ కొంగుతో కళ్ళు తుడుచుకుంది. ‘‘యెంటనే ఒసే అడ్డల్దానా పిల్లోడు సచ్చిపోయేడే.... లేసి సూడే అనేతలికి, నీ యమ్మ గూప్పగలగొడ్త ఆమాటన్నావంటే నాబిడ్డని అంటా తాసుపాములాగా నా మీదకి లేసిందయ్యా. పిల్లోడి పక్కకి తిరిగి ఈడెమో దుప్పటి కప్పుకోడు ఒళ్లంతా సూడు ఎలా సల్లగయ్యిందో అంటా రొమ్ముతీసి పిల్లోడి నోట్లో పెట్టి నుదుటిమీద ముద్దుపెట్టుకుని శానాసేపు అట్టాగే పడుకుందయ్యా బిడ్డ. నేను పోయి వాళ్ళమ్మా నాయన్ని లేపకొచ్చేలికే.....మా వైపు చూసి, బిత్తరసూపులు సూస్తా, మౌ పిల్లోడికేమయ్యిన్దిమా....బిడ్డ పాలుతాగట్లేదే....ఒళ్లంతా సల్లన్గయ్యిందే ఫానాపండా.... రేపు వాళ్ళనాన్న ఉయ్యాల తెత్తానన్నాడే పిల్లోడ్ని ఉయ్యాలలో పండేద్దామే.....నాపక్కనొద్దె వాడికేమన్నా అయ్యిద్దేమోనని భయంగా వుందే .....అంటానే వుంది కళ్ళనీళ్ళు కారతానే ఉండాయ్...పాపం దానికేమిసెయ్యాలో అర్ధంగాక...’’ ముసల్ది ఇకసెప్పలేక పోయింది.‘‘అంత మొద్దు నిద్రెట్టా పట్టిందిరా దానికి మగల్లారా..... బంగారం లాంటి పిల్లోడు సచ్చిపోయినే’’ అన్నాడు బొంకేసేబు.‘‘ అల్లా బొద్దికూరప్పాడు ఇస్రాన్తమ్మ మనవడు కూడా ఇట్టాగే మామ సచ్చిపోయిందే ‘‘ అన్నాడు పక్కనే వున్నా సిన్నమోసే.‘‘పోయినాదివారం యరజర్లలో ఇట్టాగే ఒక పిల్లోడు వాళ్ళమ్మ జాకెట్కి వుండే పిన్నిసు ఎట్ట కిందపడిందో...అది ఆపిల్లోడ నోట్లోకి ఎట్టాపోయిందో గొంతుకడ్డంపడి గిలగిల కొట్టుకుంటంటే హాస్పిటల్ కి తీసుకెల్లెలికె ప్రాణాలు పోయినియంట’’ చాల బాధ పడతా చెప్పేడు బాబురావు.‘‘చాల జరుగుతున్నయబ్బాయ్ ఇట్టంటియే’’ నిట్టూర్చింది రాయేలు సినమ్మ.‘‘నాగమణి అంత మొద్దుతరాగ నిద్రబోయే పిల్ల కాదె’’ అన్నాను నేను గొనుగుతున్నట్టు.‘‘పిల్లకి ఏవిల్లొచ్చి అయిదోనెల రాన్గల్లోనే తెచ్చి పుట్టింట్లో వదిలిపెట్టి మొత్తం మీదే బాద్యతన్నట్లు చేతులుదులుపుకొని పోతుంట్రే మొగుళ్ళు, దాని కూటికని, హాస్పిటల్కని, కానుపులుకని కర్సులుమీద కర్సులు సెయ్యాల్సోస్తన్నే.... తీసుకున్న వడ్డీ డబ్బులు కట్టడానికి వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతా బిడ్డని కనిపెట్టుకొని కూసోడానికి దాని అమ్మకి అయ్యకి కుదరకపోతున్నే, నాకేమో సుగరొచ్చి మోకాళ్ళ నొప్పులుతోటే అడుగు దీసి అడుగు వెయ్యలేక పోతుంటినే... బిడ్డ దాని తప్పేముందిలె.... పొద్దున్నే లేసి ఇల్లూడ్సి, బాసిన్లు తోమి, గుడ్లుతుక్కొని, కావాల్సింది ఒండుకొని, పిల్లోడికి నీలు పోసి, గుడ్లేసి, అట్టకన్నుమూస్తే పిల్లోడికి ఎమయ్యిద్దో అని కనిపెట్టుకొని వుండాలయ్యే, రాత్రన్న నిద్రబోదామంటే వాడేమో తొమ్మిదికే పొడుకుంటున్నే వాడు పొడుకున్నకే ఈ పిల్ల కూటికి లేవలయ్యే...అన్ని పన్లు చేసుకొని పడుకునేలికి పిల్లోడు నిద్రలేస్తాడయ్యే బిడ్డ అట్టాగే ఎట్టోకట్టా నెట్టకోస్తానే వుంది. అది మాత్రం ఏమి చేసిద్ది. ఎంత కాలం అని నిద్రలేకుండా వుండిద్ది. దాని కర్మకాలి ఇట్టా జరిగే. ఇంకా అదేదో దాని తప్పే అయినట్టు ఆమూగి మొద్దోడేమో వూరినుంచి వచ్చీరాంగల్లోనే గొడ్డుని బాదినట్టు బాదుతున్నే’’ అని సెప్పుకుంటా అక్కడనుంచి లేచి వెళ్లి పోయింది. చాల సేపు ఎవురూ ఏమి మాట్లాడలా. నాకూ అక్కడ కూర్చో బుద్దెయ్యలేదు. అక్కడినుంచి బయటకొచ్చాను.ఒక ఆరేళ్ళ పిల్ల ఇంకో తొమ్మిది నెల్ల పిల్లోన్ని సంకలో ఎత్తుకొని రోడ్డు దాటబోతూ ట్రాక్టర్ హార్న్ విని ఉలిక్కి పడి వెనక్కి వెళ్ళింది.ఒకామె నెత్తిమీద పలుగూ పార పెట్టుకొని సంకలో ఒక పిల్లోన్ని చేతిలో ఇంకో పిల్లోన్ని తీసుకొని నడిజామున మట్టి పని నుంచి ఇంటికి వస్తూ వుంది. సంకలో పిల్లోడు నిద్ర పోతూ తన చేతిలో వేలాడుతూ వున్నాడు.ఇద్దరు పిల్లోల్లు ట్రాన్సా్ఫం దగ్గరలో బచ్చాలాట ఆడుకుంటా వున్నారు.జాషువా మనవడు ఆ వీదిలో పోతున్న కుక్కల్ని రాళ్ళతో కొడుతున్నాడుపిల్లలందరూ అపాయపు అంచునే కనిపించేరు నాకు.పిల్లోని బూడ్చి పెట్టిందాకా అక్కడే వుండి అందరూ పోయాకా స్మశానం గేటు మూసి గొళ్ళెం పెట్టి బయటకొస్తుంటే ముందు గొర్రెలు వాటెనకాల చినసుబ్బయ్యమామ వస్తా కనిపించేరు.‘‘ఎందబ్బాయ్ ఇక్కడున్నావు?’’ అని అడిగేడు ‘‘నాగమణి కొడుకు....’’ చెప్పబోయేను. ట్రాక్టర్ హార్న్ మోగిందిగొర్రెల గుంపు చెల్లా చెదురయ్యింది‘‘హోయ్ ... టుర్ర్ర్ర్.... దీనెమ్మ ఈ గొర్రెలు .....’’ పరిగెత్తేడు.చూస్తూ వున్నాను గొర్రెల గుంపుని, ప్రతి గొర్రె ఇంకో గొర్రెను పట్టించుకోవడంలేదు గాని అన్ని లైన్ లోనే వెళ్తూవున్నాయి. అన్నీ గొర్రెలు మందలో ఉన్నాయన్న ధీమాతో చిన సుబ్బయ్య మామ వాటి వెనకాలె వెళుతున్నాడు. ఒక్క గొర్రె మాత్రం ఆ పోతున్న గొర్రెలను చూస్తూ నిలబడి పోయింది ఇంకేమి చెయ్యలేక. -
మూడు ముళ్ల అబద్ధం
వంద అబద్ధాలు చెప్పి అయినా ఒక పెళ్లి చేయాలని పెద్దలు అంటారు.అబద్ధం ఎందుకు చెప్పాలి? నిజాలు చెప్పి పెళ్లి చెయ్యలేమా?అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలు కాదా?వంద నిజాలు చెప్పాక, వాటికి అంగీకరించిపెళ్లికి ఇరుపక్షాలూ రాజీపడితే, అప్పుడు పెళ్లి జరిగితే భార్యాభర్తల మధ్య పొరపొచ్ఛాలకు తావుండదు.ఒక్క నిజం మీద నిలబడిన పెళ్లి వంద అబద్ధాల మీద నిలబడిన పెళ్లి కంటే దృఢమైనది. పెళ్లి గురించి ఆడపిల్ల ఎన్నో కలలు కంటుంది.నిజమే.కాని పెళ్లి గురించి మగపిల్లాడు కూడా ఎన్నో కలలు కంటాడు.సైకియాట్రిస్ట్ ఎదుట ఇద్దరు వృద్ధ దంపతులు ఉన్నారు.వారం అయ్యినట్టుంది వారు సరిగ్గా తిని, నిద్ర పోయి, శుభ్రపడి.ఎక్కడెక్కడో తిరుగుతున్నట్టున్నారు. ఎవరెవరి సహాయమో అర్థిస్తున్నట్టున్నారు. వాళ్లకొచ్చిన సమస్య పంచాయితీతో తీరేది కాదా?అది ఒక సైకియాట్రిస్ట్ చేతిలోనే తీరుతుందా?‘ఏంటమ్మా... మీ సమస్య?’ సైకియాట్రిస్ట్ అడిగాడు.‘మా అబ్బాయి ఇంట్లో నుంచి తరిమేశాడయ్యా’‘ఎందుకు?’‘మేం వాడికి ద్రోహం చేశామని’‘చేశారా?’‘లేదు’‘మరెవరు చేశారు?’వాళ్లిద్దరు నిస్సహాయంగా ఒకరిముఖం వొకరు చూసుకున్నారు. ఫణీంద్ర బాగా చదువుకున్నాడు. సాఫ్ట్వేర్ రంగంలో మంచి ఉద్యోగం క్యాంపస్ సెలెక్షన్లోనే వచ్చింది. తల్లిదండ్రి కష్టపడి చదివించారని అతడికి వారంటే చాలా ఇష్టం. తల్లిదండ్రులకు కూడా అతడంటే చాలా ప్రాణం. ఫణీంద్ర మొదటి శాలరీ నుంచే సేవింగ్స్ మొదలుపెట్టి పాతికేళ్ల వయసుకే ఒక ఫ్లాట్ లోన్‌తో తీసుకున్నారు. తల్లిదండ్రులు, కొడుకు, ఒక కారు ఇంట్లో కావలసిన పరికరాలు... అన్నీ ఉన్నాయి... ఒక్క కోడలు తప్ప.‘ఆడపిల్లలు దొరకట్లేదురా... ఇవాళ రేపు’ అన్నారు వాళ్లు కొడుకుతో.‘మంచి అమ్మాయిని వెతకండమ్మా... మీ ఇద్దరి కాపురంలా మాది కూడా హాయిగా గడచిపోవాలి. మంచి మేరీడ్ లైఫ్ కావాలని ఉంది నాకు. డిస్ట్రబెన్స్ ఉండకూడదు. జీవితాన్ని గొప్పగా కాకపోయినా సంతోషంగా గడిపేయాలి’ అన్నాడు ఫణీంద్ర.అతడికి గుళ్లూ గోపురాలు అంటే ఇష్టం. సంప్రదాయ విలువల గురించి ఫేస్బుక్లో పోస్టులు కూడా పెడుతుంటాడు.మేట్రిమొని యాడ్ ద్వారా ఫణీంద్ర తల్లిదండ్రులు ఒక సంబంధం తెచ్చారు. అమ్మాయి ఫణీంద్రతో సమానంగా చదువుకుంది. ఫణీంద్రలాగే ఉద్యోగం చేస్తోంది. అస్తిపాస్తులు కూడా ఉన్నాయి.‘మంచి సంబంధంరా’ అన్నారు వాళ్లు.‘సరే... మాట్లాడి చూస్తాను’ అన్నాడు ఫణీంద్ర.దివ్యతో అతనికి మీటింగ్ అరేంజ్ అయ్యింది. రెండు మూడు సార్లు వాళ్లు రెస్టరెంట్లకూ హ్యాంగౌట్లకు తిరిగారు. దివ్య బాగుంది... ఇష్టంగా అనిపించింది గానీ మనస్ఫూర్తిగా తనను ఇష్టపడుతున్నట్టు లేదు... నిండుగా తనతో జీవితాన్ని ఆశిస్తున్నట్టు లేదు అని ఫణీంద్రకు కొంత సందేహం వచ్చింది.అదే మాట తల్లిదండ్రులతో అన్నాడు.‘మరో సంబంధం చూద్దాంలే’‘అదేంట్రా... అంత మంచి సంబంధానికి ఏం తక్కువ. పెళ్లయితే అంతా సర్దుకుంటుంది. ఆడపిల్ల మనసు రెండు మూడు మీటింగుల్లో తెలియదు’ అన్నారు వాళ్లు.‘మీరూ ఒకసారి చెక్ చేయండమ్మా’‘చూశాంరా.. అంతా బాగానే ఉంది’పెళ్లయిపోయింది.కాపురం మొదలయిపోయింది.ఇద్దరూ ఆఫీసులకు వెళ్లి వస్తున్నారు.దివ్య బాధ్యతగా భర్త అవసరాలు చూస్తోంది. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తోంది. చెప్పినట్టు వింటోంది. అత్తమామలను గౌరవంగా చూసుకుంటుంది... కాని ఎక్కడా ప్రేమ లేదని ఫణీంద్రకు అనిపించడం మొదలుపెట్టింది.చివరకు అతడు ఆమెను ఆమె ఆఫీస్ కొలీగ్‌తో రోడ్డు మీద చూశాడు.తర్వాత ఆరా తీశాడు.ఆ తర్వాత నిస్పృహతో కూలబడ్డాడు.దివ్యకు ఆఫీసులో తన కంటే ఏడేళ్ల వయసు పెద్ద ఉన్న ఒక వ్యక్తితో ప్రేమ ఉంది. కాని వాళ్ల పద్ధతి, సంప్రదాయం వేరు. దివ్య తల్లిదండ్రులకు ఆ పెళ్లి ఇష్టం లేదు. అందుకని ఫణీంద్రతో పెళ్లి జరిపించారు.‘మీరు బలవంతంగా నాకు పెళ్లి చేసినా నాకు నా ప్రేమ కావాల్సిందే’ అని ముందే హెచ్చరించింది దివ్య.పెళ్లయితే అంతా మారుతుందనుకున్నారు వాళ్లు. కాని మారలేదు. ఫణీంద్ర ఇదంతా తెలుసుకుని భారీ ఎత్తున గొడవకు దిగాడు. మూడు విషయాలు అతణ్ణి తీవ్రంగా బాధించాయి. తన తల్లిదండ్రులు బాధ్యతగా పెళ్లి చేయలేదు– అనుమానం వ్యక్తం చేసినా. దివ్య తల్లిదండ్రులు నిజాన్ని దాచి పెట్టి పెళ్లి చేశారు– అంతా తెలిసినా. దివ్య తనకు తానుగా కూడా అసలు సంగతి చెప్పక మోసం చేసింది.ఇన్ని మోసాలా? అని ఫణీంద్ర తట్టుకోలేకపోయాడు.సంఘంలో పరువూ మర్యాద గురించి అతడికి పదే పదే ఎరుక వచ్చింది.‘నేను డివోర్సు తీసుకుంటాను’ అని దివ్య అంది.ఫణీంద్ర దానికీ ఒప్పుకోలేదు.‘చూడు దివ్యా. పెళ్లనేది ఒక్కసారే జరుగుతుంది. స్త్రీ జీవితంలోనే కాదు పురుషుడి జీవితంలో కూడా పెళ్లి చాలా ముఖ్యం. నువ్వు డివోర్స్ తీసుకొని నా పరువు గంగలో ముంచకు’ అన్నాడు.కాని దివ్య వినలేదు.పెళ్లి పెటాకులైంది.ఫణీంద్ర డిప్రెషన్లో కూరుకుపోయాడు.అత్తామామలను ఏమీ చేయలేడు. భార్యను ఏమీ అనలేదు. ఇక కళ్లెదురుగా ఉన్నది నిస్సహాయులైన తల్లిదండ్రులు. తన జీవితం నాశనం కావడానికి వారే కారణం అని ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడు. వాళ్లు ఎంత ఏడ్చి మొత్తుకున్నా నిర్దాక్షిణ్యంగా తానొక్కడే ఉంటున్నాడు. ‘ఇదీ డాక్టర్ జరిగింది’ అన్నారా తల్లిదండ్రులు సైకియాట్రిస్ట్‌తో.సైకియాట్రిస్ట్ అతి కష్టం మీద ఫణీంద్రకు కాల్ చేసి మాట కలిపి క్లినిక్‌కు వచ్చేలా చేశాడు.‘ఫణీంద్ర. మన వ్యవస్థ పట్ల గౌరవం ఉండటం మంచిదే కాని పెళ్లితోనే మనిషి మర్యాద ముడిపడి ఉంటుందని, ఒక బంధం చెదిరిపోతే ఇక జీవితమే నాశనం అయిపోతుందని అనుకోవడం సరికాదు. చాలామంది పురుషుల జీవితాలలో ఇలా జరుగుతుంది. పూర్వం కాన్పుల్లో ఎందరో స్త్రీలు మరణించేవారు. ఆ వెంటనే ఆ పురుషులు మరో పెళ్లి చేసుకునేవారు. వారిని సంఘం ఏమైనా చిన్న చూపు చూసిందా? ఇవాళ మేట్రిమొనీ యాడ్స్‌లో ద్వితీయ వివాహం అంటే ఒక సపరేట్ కాలమే నడుపుతున్నారు. అందులో ఎందరో స్త్రీ పురుషులు ఉన్నారు. అంతెందుకు, మనకు తెలిసిన సెలబ్రిటీలు తమ సంతానం మొదటి పెళ్లి ఫెయిల్ అయితే రెండో పెళ్లి కూడా అంతే ఘనంగా చేయడం దానికి ఏ మాత్రం ఇబ్బంది పడకపోవడం గమనిస్తున్నాం. సమాజం ఏ పద్ధతిలో ముందుకు పోతుంటే మనమూ ఆ పద్ధతిలోనే పోవాలి. నిన్ను నిన్నుగా ప్రేమించే అమ్మాయి నీ జీవితం పంచుకునే అమ్మాయి ఉండదని ఎందుకు అనుకుంటున్నావు’ అన్నాడు సైకియాట్రిస్ట్.ఫణీంద్ర సాలోచనగా చూశాడు.‘మరో విషయం... ఎవరో మూడో వ్యక్తి కోసం నువ్వు తల్లిదండ్రులను క్షోభ పెడుతున్నావు. వారు నీకు చేసిందంతా మర్చిపోతున్నావు. వారు లేకుండా నువ్వు లేవు. అలాగే నువ్వు లేకుండా వారు లేరు’ అన్నాడు.అతనికి కొన్ని మందులు అవసరం అయ్యాయి.ఆరు నెలలు గడిచిపోయాయి.ఫణీంద్ర మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.మొన్నటి శుక్రవారం హైదరాబాద్ ఐమాక్స్ ఎదుట కొత్త సినిమా మీద బైట్ ఇచ్చినవాళ్లలో అతడూ ఉండటం టీవీ చూసుంటే మీకు కనిపించి ఉండేది. కథనం: సాక్షి ఫ్యామిలీ ఇన్పుట్స్: డాక్టర్ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్ -
బిత్తి చిత్రాల మయూరి
ఫుల్పతియాకు దేవత పూనినట్లు ఉంది. వాళ్లమ్మకేమో భూమి అనేది లేదు. కాలువ సూపర్వైజర్ నీటితీరువా ట్యాక్సు పదిహేను రోజుల్లోపల కట్టమని ప్యూనుతో నోటీసు పంపాడు. అలా కట్టకపోతే ఆస్తిని, పశువులను జప్తు చేస్తామని నోటీసులో ఉంది. ఫుల్‌పతియా ఉగ్రురాలైంది. ‘‘ఇన్స్పెక్టరూ అరెస్టు చెయ్యాలంటే నన్ను అరెస్టు చెయ్యండి. ఈ వృద్ధాప్యంలో మా అమ్మ చేతికి సంకెళ్లు వేయడం మాత్రం నేనొప్పుకోను. నా బొందిలో ప్రాణముండగా నేనది జరగనివ్వను.’’ఈ విషయం తెలుసుకొని ఊళ్లోని వాళ్లందరూ పొలాల్లోంచి, తోటల్నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి అక్కడ గుమిగూడారు. పద్దెనిమిది సంవత్సరాల ఫుల్‌పతియా అమ్మను వెనకేసుకుని ‘‘నా ప్రాణం పోనీ. నా శవం ఇక్కడి నుంచి వెళ్లినా, నేను మాత్రం ఇది జరగనివ్వను’’ అని బిగ్గరగా అరిచింది. మాటిమాటికీ ఉమ్మేస్తూ.. కారణం లేకుండా మాటిమాటికీ నవ్వే వాడు తోఫాలాల్ సాహు అందరికంటే ముందు పరుగెత్తుకుంటూ వచ్చి, ఇన్స్పెక్టరుకు సలామ్ చేసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఎదురుగా నిలబడ్డాడు అదను దొరికితే మాట్లాడాలని. ఆ ఊరిలో ఎవరికి ఏ ఆపద సంభవించినా, ఏ దుర్ఘటన జరిగినా, తండ్రీ కొడుకుల మధ్య పోట్లాట జరిగినా, ఎవడైనా తన భార్యను కొట్టినా అందరికంటే ముందు తోఫాలాల్ ఆ స్థలానికి చేరుకుంటాడు. ఇతరులు కష్టాల్లో ఉండటం చూస్తే అతనికి మహానందం కలుగుతుంది. ఎక్కడైనా ఎవరికైనా మంచి జరిగితే ఆ చల్లని సమాచారం విని అతనెప్పుడూ అక్కడికి వెళ్లడు. ఇప్పుడేమో ఫుల్‌పతియా అమ్మ అరెస్టు మాట విని అందరి కంటే కూడా ఎక్కువ సంతోషం కలిగింది అతడికి. తన తమ్ముని కూతురి పెళ్లి సందర్భంలో ‘‘వదినా, నీవు వచ్చి పెళ్లిమండపం దగ్గర గోడలపై బొమ్మలు గీచిపెట్టు ఫుల్‌పతియా వాటికి రంగులు వేస్తుంది’’ అని ఫుల్‌పతియా అమ్మను బతిమాలాడాడు. కానీ ఆవిడ కాదంటే కాదు అంది. నడుము నొప్పిగా ఉందని ఏదో సాకు చెప్పింది. అప్పుడు కూడా ఫుల్‌పతియా ఎగతాళి చేస్తూ ‘‘పోరాదే అమ్మా! తోఫా కాకా పట్నం నుంచి మంచి డాక్టరును పిలిచి వైద్యం చేయిస్తాడులే’’ అని అంది. ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు తోఫాలాల్కు ఫుల్‌పతియా అమ్మను, ఫుల్పతియాను ఎగతాళి చేస్తూ నవ్వే అవకాశం లభించింది. ‘‘ఫుల్‌పతియా ఎదిగినదానివి, పెళ్లికానిదానివి ఎందుకు పోతావే జైలుకు. ఇప్పుడు మీ అమ్మ పోతే పోనీలే. మీ అమ్మ జైలుకు పోతే జైల్లో సర్కారీ డాక్టరు ఉచితంగా వైద్యం కూడా చేస్తాడు.’’ అంటూ వెకిలిగా నవ్వుతూ అన్నాడతను.‘‘నువ్వు నోరు మూసుకుంటావా లేదా..’’ అని గద్దించి తోఫాలాల్ నోరు మూయించింది.ఇంతలోనే ఊరి సర్పంచ్ తాహా మియా కూడా వచ్చాడు. వస్తూనే గవర్నమెంట్ వాళ్ల మనిషి మాదిరి ‘‘నీకేమైనా పిచ్చి పట్టిందా? ఊరుకో’’ అని ఫుల్పతియాని గద్దించాడు.ఫుల్‌పతియా ఈ రోజు ఎవరి మాటా వినేట్లు లేదు. ఊరికి పెద్దగానీ, సర్పంచ్‌గానీ.. తాహా మియా మాటకు అడ్డొస్తూ.. ‘‘మాకు ఈ రోజు ఎవరడ్డు వచ్చినా వాళ్లను వదిలేది లేదు. సర్పంచ్ గానీ, గిర్పంచ్ గానీ’’ అంటూ బల్లగుద్దినట్టు ఫుల్‌పతియా అన్నది. ఇన్స్పెక్టర్ ఫుల్‌పతియా దగ్గరకొచ్చి నిలబడిచేతులెత్తి నమస్కారం చేస్తూ, ‘‘ఏమండీ, నేను ఇన్స్పెక్టర్ని కాదు. ఎవరినీ అరెస్టు చేయడానికి రాలేదు. నేను కుటీర శిల్ప విభాగం, పట్నా నుంచి వచ్చాను. నేను వచ్చిన పనేమిటంటే..’’ అన్నాడు.అతని మాటలు విని అక్కడ గుమిగూడిన వాళ్లంతా గొల్లుమన్నారు. ‘‘భలే! ఎవరూ ఏమీ తెలుసుకోకుండానే ఏమిటనీ ఇంత రాద్ధాంతం.’’ కానీ ఈ విషయం నవ్వులాటగా ఉండిపోలేదు. నెమ్మది నెమ్మదిగా ఊరంతా పాకింది. ‘‘ఏమి విడ్డూరం. ఇదెక్కడైనా విన్నారా? పట్నా నుంచి ఎవరో జెంటిల్మన్ ఆఫీసర్ వచ్చి ఫుల్‌పతియా రాసిన చిత్రాలను చూసి, వీటిని ప్రింటు చేసి అమెరికా, రష్యా పంపిస్తారట’’ ‘‘ఎవరిని పంపుతారట రష్యా, అమెరికాలకు.. ఫుల్‌పతియా అమ్మనా?’’‘‘డబుల్ ఇనామ్ ఇస్తానన్నారట. కానీ అతనేమో, చూడటానికి మన దేశపువాడిలాగే ఉన్నాడు.’’‘‘ఫుల్‌పతియా అప్పుడేమో గర్జించింది. ఇప్పుడు చూడుపో, పట్నం నుంచి వచ్చిన ఆ ఆఫీసర్‌కు రకరకా వంటకాలు తయారు చేస్తోంది.’’‘‘అతడు మన అన్నం తింటాడా? ఏ కులస్తుడో మరి?’’‘‘ఫుల్‌పతియా అమ్మ అదృష్టం లేచొచ్చిందనుకో’’‘‘అది కాదురా పాపం, ఆవిడ ఆస్తిపాస్తులను భర్తను పోగొట్టుకుని ఎన్ని కష్టాలు అనుభవిస్తోందో నీకేం తెలుసు? ఇంటి వాకిళ్లకు ‘శుభ్‌లాభ్’ పెండ్లీ పేరంటాలప్పుడు ఊళ్లో వాళ్ల ఇంటి గోడలకు పూలు, తీగలు, వాటి మధ్య దేవుళ్లు దేవతలను చిత్రిస్తోంది కదా! ఆ సుకృత ఫలమే ఇది. మనం అంటాం గానీ భగవంతుడు గుడ్డివాడేమీ కాదు..’’‘‘ఇంకేమీ ఫర్వాలేదు. ఫుల్‌పతియా పెళ్లి కూడా జరిగిపోతుంది. పెళ్లి ఖర్చులకు అమెరికా, రష్యాల నుంచి పైసలొచ్చేస్తాయి.’’గులాబీ రంగు దిండుపైన గంజాయి ఆకులను కత్తెరతో కత్తిరిస్తూ అనూప్లాల్– ‘‘ ఏమిటేమిటో వాగుతున్నారే. ముందు ఆ వచ్చిన మనిషి ఎవడు? అసలోడా, నకిలీవాడా.. అన్నీ ఆలోచించాలి కదా. మీకు గుర్తుంది కదా ఒకసారి నకిలీ లాటరీ కంపెనీ వాడు, నకిలీ ఏజెంటు వచ్చి లబ్బోలియా ఊరులోని మరచూ మహతోను మోసం చేసి యాభై రూపాయలు కాజేశాడు. అప్పుడు అన్ని ఊళ్లల్లో పుకార్లు పుట్టించారు కదా, మరచూ మహతో లాటరీలో లక్షాధికారి అయ్యాడని! యాభై రూపాయల స్టాంపు పేపరు కొని, దానిపైన అఫిడవిట్ రాయించాడు. అఫిడవిట్ చూపించి, బ్యాంకు నుంచి లక్ష రూపాయలు తీసుకో అన్నాడు. మరేమైందో మనందరికీ తెలిసిన విషయమే కదా. మరచూ మహతో ఆ దెబ్బకు పిచ్చోడైపోవాల్సింది. అదృష్టం బాగుండి పిచ్చివాడు కాలేదు.’’ అని అన్నాడు. అందరూ నవ్వారు. రామ్‌ఫల్ మాటలు అల్లేదాంట్లో నేర్పరి. ‘‘మరచూకు లక్షరూపాయలు దొరకలేదు గాని ఓటర్ల లిస్టులో అతని పేరు మహతో లక్షాధికారి అని నమోదైంది. అరే ఒకటే ఊరిలో ఇద్దరు మరుచూలు, ఇద్దరూ మహతోలే! ఓటర్ల పేర్లు నమోదు చేసుకునే ఆయన ఒకటే పేరుతో ఇద్దరు వ్యక్తులుంటే చాలా తంటా అవుతుంది అన్నాడు. అప్పుడు మరచూ మహతోను ఊళ్లో వాళ్లు ఎగతాళికి లక్షాధికారి అంటారని చౌకీదారు అన్నాడు. ఇంకేముంది నమోదు చేసే ఆయన ఆ విధంగా నమోదు చేసుకున్నాడు.’’నాగేశర్ దాస్ ఆ ఊళ్లో అబద్ధాలకోరని ప్రతీతి– కానీ అతను చెప్పేదంతా ఊళ్లో వాళ్లు శ్రద్ధగా వింటారు. ‘‘మరచూ మహతోకు తగిలిన లాటరీలో ఒక రహస్యముంది. అది మీలో ఎవరికన్నా తెలుసా?’’ అన్నాడు. ‘‘మరచూ దగ్గరకు వెళ్లి నీవు ఐదువేల రూపాయలు ఖర్చు చేశావంటే మంచి వయసులో ఉన్న వితంతువుతో నీ వివాహానికి ఏర్పాటు చేయిస్తానన్నాడు. మరచూ ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నట్లు ఒక కాగితం మీద రాయించుకున్నాడు. పాపం మరచూకు లాటరీ తగల్లేదు. కానీ జోఖన్ అతని చేత రాయించుకున్న కాగితాన్ని ఆధారంగా పెట్టుకుని మరచూ మాట తప్పినందుకు అతని రెండు గేదెలను..’’‘‘ఏమయ్యో, ఈ మనిషి తప్పకుండా సీఐడీ అయి ఉండొచ్చు. లేకపోతే పట్నాల్లో ఫొటోలు, చిత్రాలుకరువా, చిన్న చిన్న పాన్ దుకాణాల్లో కూడా ఒక దాని కంటే మించి ఒకటికి మించిన రంగు రంగుల దేవతల, దేవుడి బొమ్మలు గల కేలండర్లు వేలాడుతూ ఉంటాయి. అలాంటప్పుడు పట్నం నుంచి ఈపల్లెటూరికి వచ్చి, ఈ పల్లెటూర్లో గోడలపై రాసిన చిత్రాలపై మోజుపడటం నమ్మదగిన మాటేనా’’ అని ఒక మధ్య వయస్కుడన్నాడు.సాయంత్రం బండి ఎక్కిపోయే ముందు ‘‘వచ్చేవారం మీకు ఉత్తరం రాసి అన్ని విషయాలూ తెలియజేస్తా’’మని ఫుల్‌పతియా అమ్మతో చెప్పి పోయాడు ఆ జంటిల్మన్.‘‘బాబూ, అన్ని విషయాలూ చెప్పావు. గానీ నీ పేరు మాత్రం చెప్పలేదు’’ అంది ఫుల్‌పతియా అమ్మ.‘‘నా పేరు సనాతన్ ప్రసాద్’’ అన్నాడు నవ్వుతూ.‘‘తెలియక కోపంతో ఏమేమో అన్నాను. అవన్నీ మనసులో పెట్టుకోకండి’’ అంది ఫుల్‌పతియా సిగ్గుతో తలవంచుకుని.‘‘ఉహూ.. మనసులో ఉంచుకుంటాను. నీవునాతో ఏమన్నావు..‘నన్ను అరెస్టు చేయండి’ అని అన్నావు!’’ సనాతన్ ఎగతాళిగా ఆమె వైపు చూస్తూ అన్నాడు. ఫుల్‌పతియా ముఖం సిగ్గుతో ఎర్రబడింది.పరుగెత్తుకుంటూ లోపలికి వెళ్లిపోయింది. లక్ష్మి వచ్చిందంటే పైకప్పును కూడా చీల్చుకొని వస్తుంది అంటే ఇదేనేమో. పద్దెనిమిది పంతొమ్మిదేళ్ల కిందట ఫుల్‌పతియా నాన్న కోర్టు వ్యవహారాల్లో ఉన్న ఆస్తినంతా తగలేసి, తను తగలబడిపోయాడు. కోర్టుకేసులో ఓడిపోయాననే దుఃఖంతో విషం తాగి చనిపోయాడు. అప్పటి నుంచి ఊళ్లో వాళ్ల ఇళ్లల్లో దంచి, విసరి ఒడిలో ఉన్న ఒక్కగానొక్క సంతానాన్ని సాకింది. తన చేతిలో ఉన్న నైపుణ్యం వల్ల ఊళ్లో పేరు ప్రతిష్ఠలుండేవి. కానీ ఇప్పుడు కాగితాలపైన ప్రింటైన రంగురంగుల చిత్రాలు రావడంతో ఇప్పుడు పెళ్లి పేరంటాలకు గోడలపై ముగ్గులూ రకరకాల బొమ్మలూ అలంకరించడానికి ఆమెను ఎవరూ పిలవడం లేదు. నిన్న పోస్ట్‌మ్యాన్ వచ్చి ఆమెకు రెండొందల యాభై రూపాయలు మనియార్డరు వచ్చిందని డబ్బులిచ్చిపోతే అప్పుడనిపించింది ఊళ్లోవాళ్లందరికీ పాతకాలపు వస్తువులన్నీ బేకారు కాదని. ‘‘పాట్నా నుంచి వచ్చిన ఆ వ్యక్తి నకిలీ కాదని, అసలైన ఆఫీసరేనని ఊరిలోని అందరికీ తెలిసిపోయింది.వారం పది రోజుల తర్వాత సనాతన్ ప్రసాద్ మళ్లీ ఆ ఊరికొచ్చాడు. ‘‘ఫుల్‌పత్తి అమ్మ వెళ్లిపోయిందని– పాట్నాకు కాదు సరాసరి ఢిల్లీకి, సనాతన్ ప్రసాదే ఆమెను తీసుకెళ్లాడని, ఢిల్లీలో ఒక్కొక్క భిత్తి చిత్రానికి వెయ్యి రూపాయలు మజూరీ ఇస్తారట అని ఊళ్లో వాళ్లకితెలిసిపోయింది.’’‘‘మజూరీ కాదు, బక్షీస్ అను.’’‘‘ఫుల్పత్తీ! వెంటపోలేదా?’’‘‘పోలేదు. ఏదో ఊళ్లో టీచరుగా పనిచేసే ఆవిడ అత్త వచ్చిందట. ఇక్కడే పది పదిహేను రోజులుండి పోవడానికి సెలవు తీసుకొని వచ్చిందట.ఇక చూడండి. అందరూ వచ్చి చేరుతారు– మామాఅత్త, పెద్దమ్మ–పెదనాన్న, మేనత్త–మేనమామ.. వీళ్లే కాకుండా అమ్మవైపు వాళ్లు, నాన్నవైపు వాళ్లు బంధుత్వం కలుపుకుంటూ వస్తారు. ఇంతకు ముందెన్నడూ వీళ్లను పట్టించుకోని వారంతా వస్తారు.’’ చాలా రోజుల తర్వాత స్టేషన్ బజారులో ఉండే బదరీ భగత్ ఫుల్పత్తీ అమ్మ ఫొటో పడిన పేపర్ తీసుకొని వచ్చాడు. చాలా పెద్ద ఆఫీసరు చేత్తో ఫుల్‌పత్తి అమ్మ బహుమానం తీసుకుంటున్నఫొటోఅది.భగత్ ఉండేదేమో స్టేషన్ బజారులో. జాతికి కోమటాయన. బియ్యం, పప్పుల ధరలతో పాటు ప్రపంచంలో జరిగే సమాచారమంతా తెలుసుకొంటాడు. ఎప్పుడూ పేపరు చదువుతూనే ఉంటాడు. ‘‘ఏరోజు ఫుల్‌పత్తి అమ్మ తిరిగొస్తుందో ఆ రోజు మనమందరమూ స్టేషన్ వద్ద ఆమెకు బ్రహ్మాండంగా స్వాగతం పలకాల’’ని అందరికీ చెప్పాడు. వెదుర్లతో బోదతో స్వాగత తోరణాలు కట్టించి, వాటికి మట్టి మెత్తి ఆ మట్టి గోడలపైన ఫుల్పత్తితో బొమ్మలు గీయిద్దాం. ఓ ఫులోదీదీ నీకు సంక్రమించిన అమ్మ విద్యను జాగ్రత్తగా నేర్చుకున్నావంటే నీకు కూడా ఒక రోజు సర్కారోళ్లు బహుమానం ఇస్తారు. అప్పుడు మన ఊరు పేరు ప్రతిష్ఠలు ఆలిండియా ఏమిటి, ఇండియా బయటికి కూడా వ్యాపిస్తాయి. ఈ పేపరులో ఏమి రాశారో తెలుసా? శ్రీమతి ఫణియా ఉరఫ్ పన్నాదేవి తాను గీసే ప్రతి చిత్రంలో వచ్చీరాని భాషలో తన పేరుతో పాటు తన ఊరు జిల్లా పేరు కూడా తప్పకుండా రాసుకుంటుంది. మీరే చెప్పండి అలాంటప్పుడు మన ఊరి పేరు గణింపులోకి వస్తుంది కదా’‘‘అవును మరి.’’‘‘పన్నాదేవికి జై పన్నాదేవికి జై!’’ ఊరిలోని యువకులందరూ జయజయ ధ్వానాలు చేశారు. ఇప్పుడు ఫుల్‌పత్తి చెయ్యి బాగా తిరిగింది. అమ్మ విద్యను ఆకట్టుకుంది. ‘‘ఎందుకు రాదు. అమ్మ చేత నేర్చుకునేటప్పుడు ఫుల్‌పత్తి తక్కువ దెబ్బలు తిందా’’ అంది ఫుల్‌పత్తి అత్త. ఆమె తన ఊరు పోరియాలోని కన్యా పాఠశాలలో పంతులమ్మ. ఎప్పుడూ తాంబూలం నములుతూ ఉంటుంది. ఆవిడ బదరీ భగత్‌తో ‘‘మిగతా పనులన్నీ వాళ్ల అమ్మ ఉన్నప్పుడు ఫుల్పత్తినే చేసేది. నానిన బియ్యాన్ని బండపై చాలా మెత్తగా నూరటం, పిండిని పాలల్లో కలపటం, ఆ తర్వాత అడవి చెట్టు ‘మేధాకార్’ చిగుళ్లను దానిలో వేసి బాగా చిలకటం, బొమ్మలు గీసే పుల్లలకుగుడ్డపీలికలు చుట్టడం, రంగులు కలుపుకోవడం అలాంటి పనులన్నీ ఫుల్‌పత్తి చిన్నప్పటి నుంచే చేస్తూ ఉంది. ఎప్పుడైనా పిండి కొంచెం మందమైనా చిత్రాలు గీసే పుల్లలకు కట్టిన గుడ్డ పీలికలు వదులైనా, లేకరంగులు ఎక్కువ చిక్కగా తయారైనా లేక పల్చనయినా జుట్టు పట్టుకుని వీపుపైన బాదేది ఢమా ఢమా!’’‘‘మామీ, ఫుల్‌పత్తిని మీ ఇంట్లో ఉంచుకుని నాలుగు అక్షరాలు నేర్పిస్తే బాగుంటుంది కదా’’ అని బదరీ భగత్ అన్నాడు. ‘‘నిజమేనండీ భగత్గారు, ఫుల్‌పత్తిని లోయర్ వరకు చదివించి, రామాయణం చదవడంనేర్పించిన తర్వాత అప్పర్ ప్రైమరీ కూడా చదివించాలనుకున్నా. కాని వాళ్లమ్మొండి పట్టు పట్టింది. పిల్లను ఇంక చదివించకూడదని, అక్కకూ ఒకటే కూతురు కదా! మనమేం జేస్తాం.’’ ఆ అత్త అన్నది.‘‘ఇక నీవే ఏదో ఒక మంచి సంబంధం చూసి, ఫుల్పత్తికి పెండ్లి చేయించు. అంతో ఇంతో ఇవ్వాల్సి వచ్చినా ఫర్వాలేదులే’’ అన్నాడు భగత్.దరీ భగత్ ఇచ్చిన జర్దా నోట్లో వేసుకుంటూ, ‘‘బదరీ బాబు, మంచి సంబంధం దొరికేది ఉందే అదంతా భగవంతుని చేతిలో ఉంది. భగవంతుడి దయ ఉంటే ఏ పనైనా సులువుగా అయిపోతుంది’’ అని అంది.నాగేశర్ దాస్ మళ్లీ ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు. ‘‘జోఖన్ ఇక్కడ విచారించి ముందు వెనుకా చూసి ఒక సంబంధం చూశాడు.ఫుల్పత్తిఅమ్మ ఐదువేలు అడ్వాన్స్ ఇచ్చి ఉంటే పెళ్లికొడుకు దొరికుండేవాడు. కానీ ఫుల్‌పత్తి అత్తకు సంబంధం నచ్చలేదు.’’ఫుల్‌పత్తి అమ్మ తిరిగొచ్చింది. తన వెంట తనకు లభించిన ఇనాము బాపతు సరుకు మూడు ఎడ్ల బండ్లలో వెంట తీసుకొచ్చింది. స్టేషన్ వద్ద జయజయ ధ్వానాలతో ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. నిజంగానే ముచ్చటైన స్వాగత తోరణాలు కట్టారు. స్టేషన్ వద్ద ఫుల్‌పత్తి నైపుణ్యం– ఎనిమిదణాల నుంచి పన్నెండణాల వరకు పెరిగింది. సనాతన్ ప్రసాద్ కూడా వెంట వచ్చాడు. బండి దిగుతూనే అతని దృష్టి అందరికంటే ముందు స్వాగత తోరణాలపై ఉన్న చిత్రాలు, వాటి కళా నైపుణ్యంపైన పడింది. వాటి ఫ్రేము తయారు చేయడం, కలశ నిర్మాణం, పువ్వుల తీగల అల్లికలతో కూడిన చిత్రాలు చాలాసేపటి వరకు అతను వాటినే చూస్తుండిపోయాడు. ఇంటికెళ్లిన తర్వాత ఫుల్‌పత్తిని అడిగాడు. ‘‘ఎర్రరంగు చేపలు ఏ నదిలో దొరుకుతాయి. అక్కడ కలశానికి నాలుగువైపులా నువ్వు గీసిన చేపల ఎర్రరంగును చూసి నా మనసులో ఓ ప్రశ్న రేకెత్తింది’’ అన్నాడు.‘‘ఎక్కడేమిటి? మా ఊరిలోని చంద్రభాగా నదిలో జ్యేష్ఠ ఆషాడ మాసాల్లో కురిసే వర్షాల తర్వాత వెళ్లి చూడండి. మీకే తెలుస్తుంది. ఈ చేపల కారణంగానే నది కూడా అప్పుడప్పుడు ఎర్రగామారిపోతుంది. ఈ నదులు మీ పాట్నా వైపు ప్రవహించవా?’’‘‘అటువైపు చంద్రభాగా, కోసి నది గాని, వాటి ఏ ఉపనదిగాని ప్రవహించదు’’ఫుల్‌పత్తి మామ నరోత్తమ్ బాబుకు ఒక్క నిమిషం కూడా విశ్రాంతి తీసుకోనివ్వకుండా ‘‘ఢిల్లీ విశేషాలేమిటి?’’ అని అందరూ చుట్టుముట్టారు.‘‘ఇప్పుడే వచ్చారుగా! మమ్మల్ని ఇంటివిషయాలుకూడామాట్లాడుకోనివ్వండి’’ అని ఫుల్‌పత్తి అత్త వాళ్లతో అంది.ఫుల్‌పత్తి అత్త తన భర్తను లోపలికి తీసుకెళ్లి ఏకాంతంగా అడిగింది. ‘‘ఈ సనాతన్ ప్రసాద్ ఏమంటున్నాడో నీకు తెలుసా?’’‘‘తెలుసు. అతను అంటున్నది నిజమే! ఇక్కడ ఏముందని? నాలుగు గుడిసెలు, తాతల నాటి కాలంలోని ఒక పాత మిద్దె ఉంది అంతే కదా. మీ అక్క ఈ కొంపలోనే పడి ఉంటే ఏం లాభం? భగవంతుడే దయతలచి ఆమె అదృష్టాన్ని మార్చాలన్నప్పుడు మీ అక్క పట్నంలో పోయి ఉండవచ్చు కదా. ఐదు నుంచి తొమ్మిది వందల వరకు నెలసరి జీతం, లోహిదానగరంలో ఉండటానికి మంచి ఇల్లు, సనాతన్ ఆవిడ మంచికే చెప్పాడని ఫుల్‌పత్తి మామ జవాబిచ్చాడు. ‘‘సనాతన్ మన బంధువా ఏమన్నానా?’’‘‘బంధువులు ఎవరికి సహాయం చేస్తున్నారు ఈ కాలంలో. మనిషి ఎవరూ? అతని హోదా ఏమిటి? ఇది తెలుసుకుంటే చాలు. మన బం«ధువే అవ్వాల్సిన అవసరం లేదు. సనాతన్ గొప్పింటి బిడ్డ. తండ్రి గొప్ప ఆస్తిపాస్తులు సంపాదించి చనిపోయాడు. తండ్రి కట్టించిన పెద్ద ఇల్లుంది. కారుంది. ఏడాదిలో పది పన్నెండువేల చిత్రాలు కొని అమ్ముతుంటాడు. పాట్నాలో పెద్ద పెద్ద చదువుకున్నవాళ్లతోను, క్లబ్బులవాళ్లతోను మంచి పరిచయాలు ఉన్నాయి. పాట్నా కళా అకాడమీ సెక్రటరీగా ఉన్నాడు. ఇంతకంటే ఏం కావాలి మరి?’’‘‘అక్క దీనికేమంటుంది? అక్కకిది సమ్మతమేనా?’’‘‘సమ్మతం దేనికుండదు? సమ్మతం లేకపోయినా ఆమెను ఒప్పించే ప్రయత్నం చేయడం మన పని’’ఫుల్‌పత్తి అమ్మ గోవు. గంగిగోవుతో సమానం. ఆవిడ మనసులో ఎలాంటి మోసం, కపటం లేదు. ఆవిడ వాళ్లు చెప్పిన మాటలన్నీ విని అర్థం చేసుకుని రాజీ అయింది. ఈ పిల్ల ఫుల్‌పత్తి ఏమంటుందో?ఫుల్‌పత్తి బొత్తిగా ఒప్పుకోవడం లేదు. ఈ సంబంధం గురించి ఆలోచిస్తున్నారని ఎప్పుడైతే ఫుల్పత్తికి తెలిసిందో అప్పటి నుంచి తిండితిప్పలు మానేసి ఇంట్లోనే పడి ఉంది. అమ్మ నచ్చజెప్పాలని ఎంతో ప్రయత్నించి అలసిపోయింది. మామ కూడా ప్రయత్నించి లాభం లేదనుకున్నాడు. నేను నచ్చచెప్పి ప్రయత్నిస్తానంటూ మామి ఫుల్పత్తివద్దకు వెళ్లింది.‘‘అమ్మాయీ, ఫుల్‌పత్తి!’’‘‘అత్త ఇక నువ్వొచ్చావా నన్ను ఏడిపించడానికి? ఢిల్లీ పాట్నా పోవాలని నీ మనసు ఉబలాటపడుతోందా? మా తాత తండ్రులు ఉన్న చోటును వదిలి నేనెక్కడికీ పోను. మీరుమొండి పట్టు పట్టారంటే నా శవమే ఈ ఇంటి నుంచి బయటకు పోతుంది’’ అని ఏడవసాగింది.‘చిన్నప్పటి నుంచి ఇంతే ఈ పిల్ల మొండిఘటం..’’సనాతన్ ఆలోచిస్తూ కూర్చున్నాడు. గత రెండు రాత్రుళ్లుగా అతనికి నిద్రలేదు. కళ్లు మూస్తూనే అతనికి తన లోపల ఎవరో కూర్చుని ఉన్నట్లు, తనను గుడ్లురిమి చూస్తూ ‘‘నీవు చేసేదేమిటి? బలత్కారమా?కన్నెను అపవిత్రం చేస్తావా? నీ కామోద్రేకం తీర్చుకోవడానికా ఈ కళా వ్యాపారం? హ, హ, హ.. బిగ్ స్కేల్ ఫేక్ ఆర్ట్ ఇండస్ట్రీ? హి, హి, హి.. ఇండస్ట్రీ పట్నంలో– మీ ఫ్యాక్టరీలో ఫుల్‌పత్తి, వాళ్ల అమ్మను బలి చేస్తావా? మధుబనీ శైలిలో మర్మజ్ఞుడు. ప్రవక్త, అధికారిగా వ్యవహరిస్తూ లోక కళ్యాణ వాతావరణానికి కళ్లు గప్పి నీవేమో నీ ప్రైవేటు చాంబరులో కూర్చుంటావు. ఫుల్‌పత్తి, వాళ్లమ్మ వీళ్లే కాకుండా, వందల కొద్దీ కళాకారులు నీ స్లాటర్ హోమ్‌లో బలిఅవుతూ ఆక్రందనలు చేస్తారు.’’ అని అడుగుతున్నట్లు అనిపించింది.ఈ వేళ తను ఫుల్పత్తితో స్వయంగా మాట్లాడుతాడు.ఈ వేళ ఫుల్‌పత్తి కొంచెం శాంతంగా ఉంది. తన వాకిలి పక్కనున్న గోడపైన అమ్మ గీసిన నెమలి లేఖలపైన రంగు పూస్తోంది.ఆమె దగ్గరికి వెళ్లి సనాతన్ అడిగాడు, ‘‘నాట్యం చేసేది మగ నెమలా లేక ఆడ నెమలా?’’‘‘నీవెప్పుడైనా నెమలి నాట్యం చూశావా?’’‘‘ఈ అడవిలో ఉండే కుగ్రామంలో నివసించే ప్రతి ఒక్కరూ ప్రతి వర్షాకాలం నెమళ్లు అరవటం వింటారు. అడవిలో అవి నాట్యం చేయడం కళ్లారా చూస్తారు. అసలు మీరు ఏమి చెప్పదలచుకున్నారో స్పష్టంగాఎందుకు చెప్పరు?’’ ‘‘అదే.. అదే.. మీరు మళ్లీ ఒకసారి ఆలోచించుకోండి!’’‘‘మాటిమాటికీ ఆలోచిస్తే ఏమవుతుంది? ఆలోచించాల్సి వస్తుంది. ఒకేసారి సనాతన్ బాబుగారు, మీరు తీసుకుని వెళ్లాలని ఉంటే ఆమె కూడా రావాలనుకుంటేఅమ్మను తీసుకెళ్లండి. అంతేగాని నన్నేమీ అడక్కండి.’’‘‘నాకు తెలుసు. అది వచ్చిన రోజే విన్నాను కదా!’’‘‘మీరు మమ్మల్ని ఏమనుకుంటున్నారు? మమ్మల్ని కూడా బొమ్మల్లోకి జమకట్టారా?’’‘‘అంటే’’‘‘అంటే మీరు డబ్బులిచ్చి ఏమైనా కొనగలరనుకుంటున్నారు.’’‘‘కొనటమా? లేదే! నేనే అమ్ముడుపోవాలనుకుంటున్నాను.’’‘‘సనాతన్ బాబు, మీరు చదువుకున్న వాళ్లు. విషయాలు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు.’’సనాతన్ బాబు మౌనం వహించి తెలుసుకునేందుకు ప్రయత్నించాడు. కొంతసేపాగి ‘‘సరే.. ఒకటడుగుతాను దయచేసి జవాబిస్తారా? అతను ఎవరు? అదే ఆ అదృష్టవంతుడు. మీరు వరించిన అతను ఎవరోచెప్పండి. అతని పేరు విని నేను చాలా సంతోషపడతాను’’ అని అన్నాడు.ఫుల్‌పత్తి గోడపై పింఛాన్ని విప్పి ఆహ్లాదకరంగా నాట్యం చేస్తూ ఉన్నట్లు రంగు రంగులతో చిత్రించబడిన నెమలి వైపు వేలితో చూపిస్తూ, ‘‘అతడే అక్కడ నాట్యం చేస్తున్నాడే అర్థమైందా?’’ అంది.ఒక నిట్టూర్పు విడిచి సనాతన్ అన్నాడు. ‘‘అర్థం చేసుకున్నా ఏమీ లాభం లేదు. సరే నాది మరొక కోరిక.. అంటే ప్రార్థన అన్నమాట.’’సనాతన్ తన రెండో కోరిక చెప్పుకుంటూ పోతున్నాడు. కానీ ఫుల్‌పత్తి చాలా ఉత్సాహంగా గోడపైన చిత్రించబడిన నెమలి పింఛానికి రంగులు పూస్తూ ఉంది. ఉన్నట్లుండి నెమలి పింఛాన్ని విప్పి ఎగిరినట్లు అతనికి అనిపించింది. నెమలి అరుపులో అతని మనసులోని బిజూ బన్ వికసించింది. మామిడి వనంలో ఉయ్యాల్లో ఊగుతూ బారామాస పాటలు పాడే బాలికల కంఠధ్వని– బిజూబన్ కుహూక మయూర్.. చాలాసేపటి వరకు ప్రతిధ్వనిస్తూ ఉంది.పల్లెలో మరొకసారి ఈ మాట వ్యాపించింది. పోవడం లేదు. ఫుల్‌పత్తి అమ్మ ఊరు విడిచి ఎక్కడికీ పోదు. తన భర్త ఇల్లు వదిలి ఆమె ఎక్కడికీ వెళ్లదు. కానీ సనాతన్ ఊరిలో ఒక సెంటర్ తెరవాలని నిర్ణయించుకున్నాడు. పాట్నా, ఢిల్లీ, కలకత్తా నుంచి ఎన్నుకోబడిన బాలికలు, మూడు నెలల ట్రైనింగ్ పొందడానికి ఇక్కడికొస్తారు.అంటే ఐదువందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఇంట్లో కూర్చొనే నెలనెలా దొరుకుతాయన్న మాట. దీంతో పాటు జిల్లాలోని ఆడపిల్లలకు కూడా ట్రైనింగ్ ఇస్తారు. పేపర్లో కూడా ఈ సమాచారం వచ్చింది. బదరీ భగత్ పేపర్లో పడిన ఈ వార్తను చదివి అందరికీ వినిపిస్తున్నాడు. ఈ దఫా పేపర్లో మన ఊరి పేరు పెద్ద అక్షరాల్లో పడింది. ‘‘మోహన్పూర్ మధుబనీ ఆర్టు సెంటర్’’ ఈ సెంటర్ బిల్డింగ్ శంకుస్థాపనకుదేశంలోని ప్రసిద్ధిగాంచిన చిత్రకారుడు హుస్సేన్‌ను రమ్మని ఆహ్వానించారు.’’వినే వాళ్లందరూ బిగ్గరగా జయజయధ్వానాలు చేశారు. ‘‘మోహన్పూర్ గ్రామానికి జై.. మోహన్పూర్ గ్రామానికి జై..’’ హిందీ మూలం : ఫణీశ్వరనాథ్ రేణ్డు తెలుగు : పి.విజయరాఘవరెడ్డి -
నన్ను కట్టుకో
‘‘అబ్బ.. ఎంత బాగుందోనే ఈ చీర...’’ కళ్లల్లో మెరుపుతో కాంప్లిమెంట్ ఇచ్చింది మందాకిని.‘‘కదా... అందుకే.. బడ్జెట్ కంటే ఎక్కువైనా కొనేసుకున్నా ...’’ అపురూపంగా చీరను హత్తుకుంటూ తార. ‘‘ఊ... చాలాబాగుందే..’’ మందాకిని మనసంతా చీరమీదే ఉంది. ‘‘ఎక్కడ కొన్నావ్?’’ ఆదుర్దాగా అడిగింది .‘‘అదృశ్యపట్టులో’’ ఉత్సాహంగా తార. ‘‘ అయితే.. నా పెళ్లి షాపింగ్ కూడా అక్కడే చేస్తా...’’ మందాకిని. పదిహేను రోజుల్లో తార పెళ్లి. ఫార్మాసిస్ట్. ప్రాక్టికల్‌గా ఉండే మనిషి. అనవసర ఖర్చులకు దూరం. అందుకే పెళ్లి కూడా చాలా సింపుల్‌గా జరగాలని పెళ్లికొడుకు వాళ్లతో ఒప్పించింది. కట్నం ముచ్చటేరానివ్వలేదు. కాని ఈ పెళ్లి చీర పట్లే ఎందుకో విపరీతమైన కాంక్షను కనబరిచింది. వందల చీరల్లో ఈ చీరే ఆకర్షించింది ఆమెను. ఎన్ని సార్లు దాన్ని చూడొద్దనుకున్నా.. దానివైపే మనసు లాగింది. దాని ధర చూశాక గుండె గుభేల్మనడంతో పక్కన పడేసింది కూడా. అయినా అది తననే చూస్తున్నట్టు.. నన్ను తీసుకో అంటూ అభ్యర్థించినట్టూ.. వెంటాడినట్టూ అనిపించింది తారకు. దాంతో ఆ చీరనే తీసుకుంది. తార తల్లి, మేనత్తకు ఆశ్చర్యమేసింది...పీనాసిగా ముద్రేసుకున్న తార.. పెళ్లి చీర విషయంలో ఇంత ఉదారంగా ఉందేంటని! ‘‘ ఇంకా వారమే ఉందే. బ్లౌజ్ కుట్టడానికి ఇవ్వనేలేదు. చీరకు ఫాల్ కూడా వేయాలి. ఎప్పుడిస్తావ్?’’ కేకలేసింది తార మేనత్త పెళ్లి సరంజామా అంతా సర్దుతూ.‘‘ఇస్తాలే అత్తా...’’ నీరసంగా తార ..కాఫీ కప్‌తో మేనత్త పక్కనే కూర్చుంటూ.‘‘ఇంకెప్పుడూ?’’ అంది పసుపు కొమ్ముల మూట విప్పుతూ మేనత్త. ‘‘అబ్బా.. అది మూటకట్టేసేయత్తా’’ చిరాగ్గా తార. ‘‘ఏమైందే? శుభమాని పసుపు మూట విప్పుతూంటే కట్టేయమంటావ్’’ మేనకోడలి ప్రవర్తనకు విస్తు పోతూ.‘‘ తీసేయ్ ’’ అని అరుస్తూ ఆ మూటను కాలుతో విసిరికొట్టింది తార.అవాక్కయి నోరెళ్లబెట్టింది మేనత్త. ఎంత కోపన్నయినా బ్యాలెన్స్ చేసుకునే పిల్ల.. ఇలా అకారణంగా చిరాకుపడడం.. ఇదే మొదటిసారి. కొంపదీసి ఈ పెళ్లిగాని ఇష్టంలేదా ఏంటీ? ఒక్క క్షణంలోనే రకరకాల ఆలోచనలు మేనత్తకు. ‘‘అత్తా.. పసుకొమ్ముల మూటేంటి? అలా గిరాటేశారు?’’ అమాయకంగా తార.. షాక్ మేనత్తకు. ‘‘అత్తా..నిన్నే అడుగుతోంది? ’’చేష్టలుడిగిన మేనత్త భుజం పట్టి ఊపుతూ తార.‘‘ ఎవరు గిరాటేసారో నీకు తెలీదా’’ అయోమయంగా అడిగింది మేనత్త. ‘‘ నాకేం తెలుసత్తా? నేనిప్పుడే కదా వచ్చింది ’’ అంటూ నేల మీద గొంతుక్కూర్చుని పసుపు కొమ్ములన్నీ ఏరసాగింది. మతిపోయింది మేనత్తకు. వంగి.. తార గడ్డాన్ని పట్టుకుని తల పైకెత్తుతూ.. ‘‘ఏమే... వీటిని ఎవరు విసిరికొట్టారో నిజంగానే నీకు తెలీదా?’’ అడిగింది.‘‘ఏమైందత్తా నీకు?’’ గాబరాగా తార. తల పట్టుక్కూలబడ్డది మేనత్త. మధ్యాహ్నం భోజనాలప్పుడు.. ఎంత వడ్డిస్తున్నా వద్దనడం లేదు తార. వంచిన తలెత్తకుండా తింటూనే ఉంది. ఉదయం జరిగిన సంఘటనతో ఇంకా తేరుకోని మేనత్త.. తార తింటున్న తీరుతో మరింత గందరగోళంలో పడిపోయింది. ఇంట్లో వాళ్లందరికీ వింతగానే ఉంది. తారను అలా వదిలేసి మౌనంగా వేరే గదిలోకి వెళ్లిపోయారు వాళ్లు ఏమీ అర్థంకాక. మేనత్త కూడా మళ్లీ మళ్లీ తిరిగి చూస్తూ భయం భయంగానే అక్కడి నుంచి కదిలింది. లోపల గదిలో ఉన్న తార తల్లిదండ్రులకు పొద్దున జరిగిన విషయం చెప్పింది ఆమె. కారణం కనుక్కొనే యోచనలో పడ్డారంతా. ఇంతలోకే వగరుస్తూ ఆ గదిలోకి వచ్చింది తార.. ‘‘అమ్మా.. ఆకలేస్తోందే. అన్నం పెట్టవా? మందాకిని వస్తానంది. తినేసి పార్లర్‌కు, అక్కడి నుంచి టైలర్ దగ్గరకూ వెళ్లాలి.. బ్లౌజ్ ఇవ్వాలి.. ఫాల్ కుట్టించాలి.. అమ్మో.. టెన్షన్ వచ్చేస్తుంది’’ అంది ఫోన్లో ఏదో నంబర్ కలుపుతూమేనత్తకైతే మొహంలో నెత్తురు చుక్కలేదు.. మిగతా వాళ్లది ఉదయం మేనత్తకు ఎదురైన అనుభవమే!తార తండ్రి.. మెల్లగా భార్య వెనకాలకు వచ్చి.. మోచేత్తో పొడిచాడు.. ‘‘వెళ్లి పిల్లకు అన్నం పెట్టు’’ అన్నట్టుగా!కన్ఫ్యూజన్ స్టేట్‌లోనే తార తల్లి డైనింగ్ హాల్లోకి వెళ్లింది ‘‘రామ్మా.. అన్నం పెడతాను’’ అని కూతురిని పిలుస్తూ!‘‘ఆ.. ఆ..’’ అని తల్లికి సమాధానమిస్తూ ఫోన్లోంచి తల పైకెత్తింది. కళ్లు పెద్దవి చేస్తూ అందరూ తననే చూస్తూండే సరికి.. ‘‘ఏమైంది’’ అడిగింది . ఏమీ కాలేదన్నట్టుగా తలలూపారు అందరూ! ‘‘మరెందుకలా చూస్తున్నారంతా?’’ ఈసారి ఆశ్చర్యం తారది. సేమ్ ఓల్డ్ ఎక్స్ప్రెషన్లో ఫ్యామిలీ మెంబర్స్.ఏంటో అన్నట్టుగా భూజాలెగరేస్తూ నడిచింది తార భోజనాల గదిలోకి. పెళ్లికి మూడు రోజుల ముందు.... ఉదయం ఏడైంది.. దగ్గరి చుట్టాలతో తారా వాళ్లిల్లంతా సందడిగా ఉంది. వదినామరదళ్ల పరాచికాలు.. బావామరదుల వేళాకోళాలు.. అత్తాకోడళ్ల సరదాలతో కళకళలాడుతోంది. కాని అసలు మనుషుల మొహాల్లో సంతోషం కనపడ్డం లేదు. బయటికి నవ్వు నటిస్తున్నారు కాని లోపలంతా తెలియని భయం... పూటపూటకూ మారుతున్న తార బిహేవియర్ గురించి. పెళ్లి కూతురుని చేయడానికి పీట మీద కూర్చోబెట్టారు తారను. అమ్మమ్మ, నానమ్మతోపాటు అత్త వరస, పిన్ని వరస, అక్క వరస అయ్యేవాళ్లంతా ఒక్కొక్కళ్లే వచ్చి బొట్టు పెడ్తున్నారు...తార తల్లి,మేనత్త ఉగ్గబట్టుకుంటున్నారు.. తార ఎప్పుడు ఎలా.. రియాక్ట్ అవుతుందోనని!వాళ్ల అంచానాలను తారుమారు చేస్తూ ... తార .. చక్కగా నవ్వుతూ.. సిగ్గు పడుతూ కూర్చుంది. పసుపు రాస్తున్నారు.. నలుగు పెడ్తున్నారు.. మంగళ వాద్యాలు మోగుతున్నాయి.. పెరట్లో ఆరుబయట ఆనవాయితీగా మంగళ స్నానం చేయించాక.. షాంపూతో తలంటుకొమ్మని పెరట్లోనే ఉన్న బాత్రూమ్లోకి పంపించారుతారను.టిఫిన్ పని చూసేందుకు వాళ్లంతా వంటింట్లోకి వెళ్లబోతుంటే తార ఎదురు పడింది. నిశ్చేష్టులయ్యారంతా. అసంకల్పితంగానే వెనక్కి తిరిగి చూశారు బాత్రూమ్ వైపు. తలుపు వేసే ఉంది. మళ్లీ తార ౖవైపు తిరిగారు. ‘‘సారీ.. అమ్మా.. అలారం మోగినా మెలకువ రాలేదు. ముహూర్తం ఎనిమిదిలోపు ఎప్పుడైనా అన్నారు కదా?’’అంది తార. యాంత్రికంగా తలూపింది తార తల్లి. ‘‘బ్రష్చేసుకొని వస్తానుండండి’’ అంటూ పెరట్లోని బాత్రూమ్లోకి వెళ్లింది. మతి పోయినంత పనైంది అందరికీ! వీళ్ల స్థితి ఇలా ఉండగా.. తార అన్నయ్యకు ఫోన్‌కాల్ వచ్చింది. ‘‘సర్.. మీరు ఈ మధ్యఅదృశ్యపట్టులో ఏమైనా షాపింగ్ చేశారా?’’‘‘అవును’’‘‘అక్కడ బిల్ డిటైల్స్‌లో మీ నంబర్ తీసుకుని ఫోన్ చేస్తున్నా సర్.. ఒకవేళ పెళ్లి చీర కొంటే మాత్రం అది కట్టుకోవద్దని చెప్పండి. కొనే వరకు నన్నుతీసుకో అని.. కొన్నాక నన్ను కట్టుకో అంటూ కలలో కూడా వెంటాడుతుంది ఆ చీర. మా చెల్లి ఆ షాప్‌లోనే పనిచేసేది. పెళ్లి కుదిరాక అక్కడే పెళ్లి చీర కొనుక్కుంది. పెళ్లికొడుక్కి ఇదివరకే పెళ్లయిందని తెలిసి పీటల మీద పెళ్లి ఆగిపోయింది. మా చెల్లి ఆ చీరతోనే ఉరేసుకుంది సర్’’ఫోన్ డిస్కనెక్ట్ చేసి గబగబా తల్లి దగ్గరకు పరిగెత్తాడు తార వాళ్ల అన్నయ్య. - సరస్వతి రమ -
పెళ్లిఇళ్లు
దేవుడు కలుపుతాడు.. కానీ కలిసి ఉండాల్సింది మనమేగా!పెళ్లి ఇద్దరి మధ్య జరుగుతుంది.. తంతు రెండు అభిప్రాయాల మధ్య జరుగుతుంది!ఎన్ని చూడరు పెళ్లికి ముందు? గ్రహాల దగ్గర్నుంచి గృహాలదాకా!కాని వర్కవుట్ చేయాల్సింది ఈ మ్యాగ్నెట్లు కాదు.. అవగాహన, ఆకర్షణ, అనుగారం, అభిమానం! తొమ్మిది పెళ్లిళ్లు.. తొమ్మిది ఇళ్లల్లో!పెళ్లి..ఇళ్లు!! అదిల్ ఖన్నా.. వ్యాపారి. అతని భార్య తారా ఖన్నా. తన స్నేహితుడు కరణ్‌తో కలిసి వెడ్డింగ్ ప్లాన్ కంపెనీని నిర్వహిస్తూ ఉంటుంది. అదే ‘మేడ్ ఇన్ హెవెన్’. అమెజాన్ ప్రైమ్‌లో విమెన్స్ డే (మార్చి 8) నుంచి స్ట్రీమ్ అవుతోంది.. కళ్యాణ వేదికగా సామాజిక పరిస్థితులను చూపించే తొమ్మిది ఎపిసోడ్లతో. ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ గోల్డ్ అంగద్‌కు ఆలియా అంటే చచ్చేంత ప్రేమ. ఆమెతో పెళ్లికి తన తల్లిదండ్రులను ఒప్పిస్తాడు. కొడుకు కోసం కాదనలేరు కాని ఆలియా అంటే అంగద్ తల్లిదండ్రులకు అంతగా ఇష్టం ఉండదు. ఆమె గురించి ఆరా తీస్తారు. గతంలో ఆమెకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉండేవాడని, అబార్షన్ కూడా అయిందని తెలుస్తుంది. అయితే ఆలియా గతం తెలిసే అంగద్ ఆమెను ప్రేమిస్తాడు. కాబట్టి అమ్మానాన్న ఆంతర్యం అర్థమైన అతను.. ఆ బాయ్‌ఫ్రెండ్ తనే అని చెప్తాడు. ఆ అబద్ధం ఆలియాకు కోపాన్ని తెప్పిస్తుంది. ఆత్మాభిమానం దెబ్బతిన్నట్టు ఫీలవుతుంది. అంగద్ సారీ చెప్పినా వినదు. చివరకు ఆ వెడ్డింగ్‌ను ప్లాన్ చేస్తున్న తారా ఖన్నా ఇంటర్ఫియరై ‘‘అయిదువేల కోట్ల రూపాయల ఆస్తి. పెళ్లి పాతబడగానే ప్రేమ ఆవిరై డబ్బే మిగులుతుంది. థింక్ ఎబౌట్ 5 థౌజెండ్ క్రోర్స్’’అని చెప్పి పెళ్లికి ఆలియా తలూపేలా చేస్తుంది. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు.. కాని ఇన్నర్ స్పిరిట్ బ్యాక్ సీట్ తీసుకుంటుంది లైఫ్ వెహికిల్‌లో. గమ్యానికి చేర్చడానికి. ఇట్స్ నెవర్ టూ లేట్ గాయత్రి మాథుర్.. ఢిల్లీలోని ‘న్యూ ఎరా’ స్కూల్స్ యజమాని. అరవైఏళ్ల వితంతువు. బిజోయ్ చటర్జీ.. బ్లాగర్. అతనికీ భార్య చనిపోతుంది. ఆ వయసులో ఒకరికొకరు తోడుగా ఉండాలనుకుంటారు. బిజోయ్‌కి పిల్లలుండరు. గాయత్రికి ఒక కొడుకు, కూతురు. వివాహాలైపోయి వాళ్ల వాళ్ల కుటుంబాలతో ఉంటూంటారు. ఆ వయసులో అమ్మ తీసుకున్న నిర్ణయానికి వీళ్లు సిగ్గుపడ్తారు. ఆ పెళ్లిని వ్యతిరేకిస్తారు. ‘‘అమ్మ విషయంలో ఎమోషన్స్ బాగా పనిచేస్తాయి’’ అంటూ సలహా ఇస్తుంది ‘మేడ్ ఇన్ హెవెన్’ ప్రొడక్షన్ అసిస్టెంట్ జస్ప్రీత్. చిన్న వయసులోనే భర్తను కోల్పోయి.. ఒంటరిగా పిల్లలను ఎలా పెంచి పెద్దచేసిందో గాయత్రి చెప్తూంటే వీడియో తీసి.. ఆమె పిల్లలకు చూపిస్తారు తారా ఖన్నా, కరణ్. ఎమోషన్స్ పనిచేస్తాయి. పిల్లల మనసు కరుగుతుంది. లవ్ ఈజ్ ఆల్ యూనిక్.. ది ప్రైజ్ ఆఫ్ లవ్ ‘‘యూపీ,బీహార్‌లో ఐఏఎస్‌కు ఎంత డిమాండో తెలుసు కదా? అందుకే డిఫెన్స్ (ఢిల్లీ)కాలనీలో ఇల్లు, విశాల్ అకౌంట్లో రెండు కోట్లు.. జస్ట్ అంతే!’’ఖంగు తిన్నారు పెళ్లికూతురి పేరెంట్స్. ‘‘ఇది విశాల్‌కు తెలుసా?’’ వాళ్ల ప్రశ్న. ‘‘అతని కోసమే కదా’’ వరుడి పేరెంట్స్ సమాధానం. ‘‘రెండు కోట్లు ఇస్తానంతే. డిఫెన్స్ కాలనీలో ఇల్లు ఇవ్వలేను’’ పెళ్లి కూతురి తండ్రి నిస్సహాయత. ‘‘అయితే నాలుగు కోట్లు క్యాష్’’ అవతలి వాళ్ల బెట్టు. బారాత్ (ఊరేగింపు) పందిట్లోకి రావాలంటే ఒప్పుకోని పరిస్థితి. తలవంచుతాడు పెళ్లికూతురి తండ్రి. పీటల మీద వరుడితో వధువుకి కొంగుముడి పడుతుంది. అప్పుడు వధువు చెవిలో తారాఖన్నా చెప్తుంది వరుడి తల్లిదండ్రులు ఆడిన వరకట్న బేరం గురించి. వధువు అడుగుతుంది వరుడిని..‘‘అది నీకు తెలుసా?’’ అని. ‘‘మనకోసమే కదా’’ అంటాడు వరుడు. ‘‘పెళ్లి కొడుకును కొనుక్కునే దౌర్భాగ్యం నాకొద్దు’’ అంటూ కొంగుముడి విప్పుకొని మంటపంలోంచి వెళ్లిపోతుంది పెళ్లికూతురు. ఆమె పేరు.. ప్రియాంక. తరతరాల పురుషాధిపత్యం చెంప చెళ్లుమనిపించిన ఒక ధైర్యం.. సాహసం. అవర్ విమెన్ డోంట్ డిజర్వ్ దిస్.. అవర్ విమెన్ ఆర్ బెటర్ దాన్ దిస్! ఎ మ్యారేజ్ ఆఫ్ కన్వీనియెన్స్ లుథియానాలోని ఓ వీథి.. అందాల పోటీలు జరుగుతున్నాయి. సుఖ్మనీ అనే అమ్మాయి నెగ్గింది. ‘‘సుఖ్మనీ.. నాక్కోబోయే కోడలు’’ అంటూ ప్రకటించాడు ఓ పెద్దాయన. అందాల పోటీలో నెగ్గిన అమ్మాయిని తనింటి కోడలిగా చేసుకోవాలని ముచ్చటపడలేదు. తనింటి కోడలిని ఎంపిక చేసుకోవడం కోసమే ఆ అందాల పోటీ నిర్వహించాడు. ‘‘ఇక్కడ (లుథియానా) ఇవి మామూలే. ఎన్ఆర్ఐ పెళ్లి కొడుకులకు అంత టైమ్ ఉండదు. సో.. ఇలా వాళ్లు చూడాలనుకున్న అమ్మాయిలందరికీ ఒక్కచోట బ్యూటీ కంటెస్ట్ కండక్ట్ చేస్తారు. మన ఆచారాలు, సంప్రదాయాలు, వంటలు వగైరా క్వశ్చన్స్ అడుగుతారు. ఈ కంటెస్ట్‌లో పాల్గొనడానికి ట్రైనింగ్ కూడా తీసుకుంటాం’’ అని చెప్తుంది సుఖ్మనీ. విషాదం ఏంటంటే.. సుఖ్మనీ పెళ్లవుతుంది. భర్త ఇంపోటెంట్ అని తేలుతుంది. ఇది అతనికి రెండో పెళ్లి. అతను ఇంపోటెంట్ అవడం వల్లే మొదటి భార్య విడాకులిస్తుంది. కాని ఆమె క్యారెక్టర్ మంచిదికాదని తామే విడాకులు ఇచ్చామని అబద్ధం చెప్పి సుఖ్మనీ గొంతు కోస్తారు. ఇలాంటివీ అక్కడ మామూలే! సుఖ్మనీ మొదటి అమ్మాయి కాదు. సమ్‌థింగ్ ఓల్డ్.. సమ్‌థింగ్ న్యూ అమ్మాయి పుట్టిందని తల్లిదండ్రులు ఆసుపత్రిలోనే వదిలేసిన అనాథ గీతాంజలి. మంచి హోదాలో ఉన్న ఓ జంట ఆమెను దత్తత తీసుకుంటారు. ఉద్యోగంలో స్థిరపడ్డాక నిఖిల్ అనే అబ్బాయితో పెళ్లి సెటిల్ అవుతుంది. వరుడి తల్లిదండ్రులూ ప్రగతిశీల భావాలు కలవాళ్లే. అయినా జాతకాలు చూపిస్తారు. అమ్మాయి జాతకం ప్రకారం ముందు చెట్టుతో పరిణయం జరిపించాలంటాడు పురోహితుడు. అమ్మాయి సిద్ధపడ్తుంది. ఆమె ఆ నిర్ణయానికి హతాశులవుతారు తల్లిదండ్రులు. ‘ఏ చిన్న రిస్క్‌కైనా సిద్ధంగాలేను’ అంటుంది గీతాంజలి. ఆమె అలా చెట్టును పెళ్లాడిందనే విషయం నిఖిల్‌కు తెలియదు. తెలియనివ్వరు అతని తల్లిదండ్రులు. చదువు అన్నిటినీ నేర్పదు. ఎన్నో తెలుసుకోవడానికి దారులు చూపిస్తుంది. వాటిలో విశ్లేషణ, తర్కమీమాంసలూ ఉంటాయి. ఎ రాయల్ ఎఫైర్ రనావత్.. రాజ్‌పుత్ రాజవంశీయుడు. హోటల్స్ యజమాని. అతని కొడుకు సమర్ రనావత్కు పైలట్ అయిన దేవయానిని నిశ్చయిస్తాడు. మెహందీ ఫంక్షన్లో పూజా అనే మైనర్ పిల్ల మీద లైంగిక హింసకు పాల్పడుతాడు. ఆ ఇంటి పరువుప్రతిష్ట పోలీస్‌స్టేషన్ మెట్టెక్కకూడదని కాబోయే కోడలు దేవయాని పూజాతో బేరం ఆడుతుంది. అయిదు లక్షలతో రాజీ కుదుర్చుకుంటుంది పూజా. ఇదీ మన డీఎన్ఏ. ఇరవై ఒకటవ శతాబ్దాన్నీ రాజరికమే ఏలుతోంది. అదేం చేసినా శిరసావహించడమే! ప్రైడ్ అండ్ బ్రైడ్జిల్లా తరానా అలీ.. ఆస్మా అన్సారీ... ఇద్దరు వధువులు. తరానా అలీ.. తన తల్లిదండ్రుల ఆర్థికస్థితితో సంబంధం లేకుండా రాయల్ వెడ్డింగ్‌కి డిమాండ్ చేస్తుంది. బిడ్డ కోసం తల్లిదండ్రులు లక్షలు అప్పు తెస్తారు. ఆస్మా అన్సారీ దిగువ మధ్యతరగతి అమ్మాయి. తన పెళ్లితో తండ్రి అప్పులపాలు కావద్దని సింపుల్ మ్యారేజ్‌కి ప్లాన్ చేస్తుంది. పెళ్లిని ఇద్దరు వ్యక్తులు.. ఆ రెండు కుటుంబాల వ్యక్తిగత వ్యవహారంగా మాత్రమే ఎందుకు చూడరు? ది గ్రేట్ ఎస్కేప్ నూతన్ యాదవ్.. ఓ రాజకీయ నాయకుడి కూతురు. క్రిస్టియన్‌ను ప్రేమిస్తుంది. అది తెలిసీ ఆమెను హౌజ్ అరెస్ట్ చేస్తారు పెద్దలు. తమ పార్టీలోనే ఔత్సాహిక యువ నాయకుడితో పెళ్లి ఖాయం చేస్తారు. పెళ్లికి ముందురోజు ఇంట్లోంచి వెళ్లిపోయి తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడుతుంది. స్టేట్మెంట్ కూడా ఇస్తుంది.. భవిష్యత్‌లో తమకేం జరిగినా దాని బాధ్యత తన తల్లిదండ్రులదేనని. కారణం... ప్రేమించిన పాపానికి నూతన్ యాదవ్ అక్క చనిపోతుంది. ఇంకోవైపు.. తారా ఖన్నా భర్త అదిల్ ఖన్నా.. భార్య స్నేహితురాలైన ఫైజాతో వైవాహిక సంబంధంలో ఉంటాడు. ఆ విషయం తారాకు తెలుస్తుంది. మారిపోయినట్టు నటిస్తుంటాడు ఆదిల్. తల్లి కావాలనుకుంటుంది తార. భర్తలో లోపం వల్ల ప్రెగ్నెన్సీ రాదు. మేడ్ ఇన్ హెవెన్ కో ఫౌండర్ కరణ్ది ఇంకో సమస్య. అతను గే. తల్లే అతణ్ణి అసహ్యించుకుంటుంది. అలాంటి ఎన్నో అవమానాలతో ఆర్టికిల్ 377 సవరణ (377 ఆర్టికిల్ నిషేధానికి ముందన్నమాట) కోసం ఉద్యమంలోకి దిగుతాడు. సంప్రదాయవాదులు అతనిమీద కోపంతో మేడ్ ఇన్ హెవెన్ ఆఫీస్‌ను ధ్వంసం చేస్తారు. ఇటు.. తన భర్త మారలేదని అర్థమవుతుంది తారకు. ఆ బంధంలోంచి బయటకు రావడమే కరెక్ట్ అనుకొని ఇంట్లోంచి వెళ్లిపోతుంది. మేడ్ ఇన్ హెవెన్ ఆఫీస్‌కు చేరుతుంది. అప్పటికే అక్కడికి వచ్చి ఉంటాడు కరణ్. నవ్వుకుంటారు.. కన్నీళ్లు వచ్చేదాకా. తార ఒళ్లో పడుకుని సేద తీరుతుంటాడు కరణ్.. ఓ బిడ్డలా! ఓదారుస్తుంటుంది తార.. ఒక అమ్మలా! భయం ధైర్యాన్నిస్తే.. ఆశపుడుతుంది.. నమ్మకం కలుగుతుంది.. అంతా మంచే జరుగుతుందని! ఆశిద్దాం.. ఆడ–మగ, పేద–ధనిక, పాత–కొత్త తరాలకు.. అందరికీ...అంతా మంచే జరగాలని! సరస్వతి రమ -
కన్యాదానం ఏంటీ?
భారతదేశంలో చాలాకాలంగా పాతుకుపోయిన పితృస్వామ్య వ్యవస్థకు భిన్నంగా, ఒక మహిళ పౌరోహిత్యం వహించి, కన్యాదానం లేకుండా వివాహం జరిపించింది. ‘‘పితృస్వామ్య వ్యవస్థ నుంచి బయటకు వచ్చి, మహిళ ప్రాధాన్యతను తెలియచేయాలనుకున్నాను’’ అంటారు నందిని భౌమిక్. అన్విత జనార్దన్, అర్క భట్టాచార్యల వివాహాన్ని కన్యాదానం లేకుండా చేయించారు. స్త్రీ సాధికారతను తెలియచేయాలన్నదే నందిని భౌమిక్ లక్ష్యం. జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో టీచర్‌గా పనిచేస్తున్న నందిని, ఈ పది సంవత్సరాల కాలంలో 40 పెళ్లిళ్లు కన్యాదానం లేకుండా చేయించారు. ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూనే, పది నాటక కంపెనీలలో... మతాంతర, కులాంతర వివాహ విధానాలను ప్రదర్శిస్తున్నారు. భౌమిక్లో ఇటువంటి ఆలోచన కలగడానికి కారణం ఆవిడకు విద్య నేర్పిన గౌరీ ధర్మపాల్. పౌరోహిత్యంతో వచ్చే ధనంలో అధికభాగం అనాథలకు అందచేస్తున్న నందిని, తన ప్రాణ స్నేహితురాలితోను, కాలేజీ విద్యార్థులతోనూ కలిసి ఈ వేడుకను కొత్తగా జరిపించారు.సంస్కృతంలో ఉన్న మంత్రాలను ఇంగ్లీషు, బెంగాలీ భాషలలోకి అనువదించి, వధూవరుల చేత పలికిస్తున్నారు నందిని. ఆమెతో వచ్చిన విద్యార్థులు బ్యాక్ గ్రౌండ్లో రవీంద్ర సంగీత్ ఆలపిస్తుంటారు.‘‘చాలామంది మగ పురోహితులు మంత్రాలను తప్పులు పలకడం గమనించాను. మా స్నేహితుల వివాహంలో నందిని చేస్తున్న వివాహంలో ఆవిడ సంస్కృత మంత్రాలను వివరించడం చూసి, నా వివాహం ఆమె చేత చేయించుకోవాలనుకున్నాను’’ అంటారు అర్క. ఋగ్వేదంలో కన్యాదానం లేని వివాహాలు జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి. అందుకే నందిని... కన్యాదానం లేని వివాహాల గురించి ప్రచారం చేయడానికి నడుం బిగించారు. సంస్కృత పండితుడైన నృసింహప్రసాద్ భాదురి... మహిళలు పౌరోహిత్యం వహించకూడదని హిందూధర్మం ఎన్నడూ చెప్పలేదని, వేదాల గురించి జరిగిన చర్చలలో మహిళలు పాల్గొని ఆధ్యాత్మిక, తాత్విక అంశాలలో ప్రతిభను ప్రదర్శించినట్లు ఆధారాలు ఉన్నాయని అంటారు. నందిని గురించి తెలుసుకున్న యువత ఇప్పుడు ఆమెను చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. – జయంతి -
మారుతున్న మగతరం
పెళ్లితో ఒక అమ్మాయి భార్య అవుతుంది, ఒక అబ్బాయి భర్త అవుతాడు. అప్పటి వరకు వాళ్లిద్దరూ తల్లిదండ్రుల ముద్దుల సంతానమే. భర్త హోదా రాగానే బాస్ అనుకుంటాడా? పెళ్లితో అమ్మాయి తనను తాను తగ్గించుకుని ఒదిగి ఉండాలా? నిజానికి పెళ్లి పరమార్థంలో ఇలా ఏమీ చెప్పలేదు. భార్యభర్త స్నేహితుల్లా ఉండాలని, గృహస్థ జీవనంతో పిల్లలను కని, మంచి సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని మాత్రమే చెప్పింది పెళ్లి. మధ్యలో ఎప్పుడో లౌక్యమైన సవరణలతో భర్త అంటే ఆదేశించేవాడు, భార్య అంటే అనుసరించాల్సిన ప్రాణి అనే భావజాలం రాజ్యమేలింది. సమాజంలో స్త్రీ ప్రాధాన్యం తగ్గడం మొదలైంది కూడా అప్పుడే. ఆ వివక్షపూరితమైన మార్పును స్వాగతించిన తరాలు అంతరించాయి. ఆ పునాదుల మీద కరడు గట్టిన తరాలు ఇప్పుడిప్పుడే కళ్లు తెరుస్తున్నాయి. పేగుబంధం పాపాయి ఏడిస్తే లాలించడానికి తల్లి రావాలి. తల్లి ఆ క్షణంలో రాలేకపోతే నానమ్మ, మేనత్త, పెద్దమ్మ, చిన్నమ్మ ఎవరో ఒకరు వస్తారు. ఇది ఉమ్మడి కుటుంబాల్లో. ఇప్పుడన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీలే. భార్య కూరగాయలు తరుగుతున్నప్పుడు పాపాయి ఏడిస్తే... చేతులు కడుక్కుని ఎత్తుకున్నా సరే... మిర్చి, ఉల్లిపాయల ఘాటు పాపాయి ఒళ్లు మండుతుంది. ఇదంతా చూస్తూ ఉన్న భర్త తాను మగాడినని ఊరుకోలేడు. భర్త అనే భేషజాన్ని భుజం మీద నుంచి తీసి పక్కన పెట్టి బిడ్డను భుజానికెత్తుకుంటాడు. ‘వీడు డయాపర్ వేయనివ్వకుండా కాళ్లు ఒకటే ఆడిస్తున్నాడు చూడు’ అంటూ భార్యకు కంప్లయింట్ చేస్తూ నాలుగు నెలల కొడుకు చేయిస్తున్న విన్యాసాలన్నీ చేస్తుంటాడా భర్త. మరో ఇంట్లో... భార్య బిడ్డకు పాలిస్తుంటే, భర్త వంట చేస్తున్నాడు. భార్య వంట చేసి ఆఫీస్‌కి రెడీ అవుతుంటే తాను బాక్సులు సర్దుతున్నాడు. ఇది ట్వంటీ ట్వంటీకి చేరువవుతున్న ఈ తరం విద్యావంతుల కుటుంబ ముఖచిత్రం. నలిగిన బంధం భార్య– భర్త బంధం కొన్ని తరాల పాటు ఆధిపత్యానికి– అణిగిమణిగి ఉండడానికి మధ్య నలిగిపోయింది. సున్నితత్వం మేళవించిన పెంపకం, న్యూక్లియర్ కుటుంబాలతో వర్క్షేరింగ్ అలవడింది. భర్తలో సున్నితత్వం బయటికొచ్చింది. భార్య పట్ల రెస్పెక్ట్ పెరుగుతోంది. భార్య హోదా తనకంటే పెద్దదైనప్పుడు ఇంటి నాలుగ్గోడల మధ్య ఆమెను మానసికంగా వేధించిన ఒకప్పటి కురచ మనసులు కనుమరుగవుతున్నాయి. మార్పు మొదలైంది. ఈ మార్పు ఉమెన్ ఫ్రెండ్లీగా కనిపిస్తుంది కానీ, నిజానికిది హ్యూమన్ ఫ్రెండ్లీ సమాజ నిర్మాణానికి దారి తీస్తున్న మార్పు. – వాకా మంజులారెడ్డి అలాంటి పెళ్లి వద్దన్నాను నరేన్ (సుప్రియ భర్త) నాకు ఇంటి పనుల్లో షేర్ చేసుకోవడం, పిల్లలను కేర్టేకింగ్తోపాటు అన్ని విషయాల్లోనూ హెల్ప్ చేస్తాడు. ప్రతిదీ ఓపెన్‌గా మాట్లాడుకుంటాం. ‘పెళ్లి అంటే... భర్త అంటే బాస్‌లా ఉంటాడు, భార్య తన అభిప్రాయాలను భర్త నిర్ణయాలకు అనుగుణంగా మార్చుకుంటూ జీవించాలనేదే అయితే... ఆ పెళ్లి నాకు వద్దు’ అని పెళ్లికి ముందే చెప్పాను. మా పెళ్లి 2007లో జరిగింది. మేమిద్దరం ఉద్యోగం చేస్తాం. మాకు ఇద్దరు పాపలు. నా జాబ్ టైమింగ్స్‌ని బట్టి తను, తన వర్క్ షెడ్యూల్స్‌ని బట్టి నేను అడ్జస్ట్ చేసుకుంటాం. భర్త ఎక్కడా అడ్జస్ట్ కాకూడదు, అడ్జస్ట్ కావాల్సింది భార్యే అనే ధోరణి మా ఇంట్లో ఉండదు. భార్యాభర్త అంటే మంచి ఫ్రెండ్స్. మా నుంచి మా పిల్లలూ అదే నేర్చుకుంటారు కదా! – సుప్రియ, ఫిజికల్ థెరపిస్ట్, వర్జీనియా, అమెరికా -
ఘనంగా సిక్కి రెడ్డి, సుమీత్ రెడ్డిల వివాహం
భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్స్ నేలకుర్తి సిక్కి రెడ్డి, సుమీత్ రెడ్డిల వివాహం హైదరాబాద్‌లో శనివారం రాత్రి ఘనంగా జరిగింది. తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా, పీవీ సింధు, తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు. -
ఒక దీపం చాలదా?
ఒకరోజు ఒక పేదవాడు ప్రవక్త ముహమ్మద్ (స) వద్దకు వచ్చి, ‘‘అయ్యా! నేను పేదవాడిని. నా కూతురు పెళ్ళీడుకు వచ్చింది. దయచేసి నా కూతురు పెళ్లికి ఏదైనా సహాయం చేయండి’ అని అడిగాడు. ‘‘బాబూ! ప్రస్తుతం నీకు సహాయం చేయడానికి నా వద్ద ఏమీ లేవు. నువ్వు ఒక పని చేయి, ఫలానావ్యక్తి దగ్గరకు వెళ్ళు. మీ అమ్మాయి పెళ్ళికి అవసరమైన సహాయం చేస్తాడు’’ అని సలహా ఇచ్చారు. ఆ పేదవాడు ప్రవక్త ముహమ్మద్ (స) తెలిపిన వ్యక్తి దగ్గరకు వెళ్ళే సమయానికి సాయంత్రం అయింది. ఇంట్లో నుండి ‘‘రెండు దీపాలు వెలిగించావు, ఒక దీపం చాలదా’’ అని భార్యతో ఆ పెద్దమనిషి అంటున్న మాటలు విని, ‘ఇంత పిసినారి నాకేం సహాయం చేస్తాడు’ అని మళ్ళీ తిరిగి ప్రవక్త (స) వద్దకు వెళ్ళి తాను విన్నది విన్నవించాడు. ప్రవక్త (స) మళ్ళీ ఆ వ్యక్తి వద్దకే వెళ్ళమన్నారు. అతడు తిరిగి ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి తాను వచ్చిన విషయం విన్నవించాడు. ఆ పెద్దమనిషి ఇతన్ని ఎంతో ఆదరంగా ఆహ్వానించి, పెద్దమొత్తంలో డబ్బు సాయం చేశాడు. ఆ పెద్దాయన తాను ఆశించిన దానికన్నా ఎక్కువ సహాయం చేయడాన్ని చూసి ఆశ్చర్యపోతూ, ‘‘అయ్యా! ఇందాక మీరు రెండు దీపాలు వెలిగించినందుకు మీ భార్యను గద్దించారు. ఇప్పుడేమో నాకు నేను ఆశించిన దానికన్నా ఎక్కువ సహాయం చేశారు’’ అని అన్నాడు.‘‘నేను ఇలా పొదుపు చేయడం వల్లేకదా నీలాంటి వారికి సహాయం చేయగలిగాను. కాసిన్ని పుణ్యాలు సంపాదించుకోగలిగాను’’ అని సమాధానం ఇచ్చాడు ఆ పెద్దాయన. ‘‘వ్యర్థమైన ఖర్చులు చేయకండి. వ్యర్థమైన ఖర్చులు చేసేవారు సైతాన్ సోదరులు. సైతాన్ మీ బద్ధశత్రువు’’ (17: 27) అని ఖురాన్లో అల్లాహ్ చేసే హితబోధను మనమంతా పాటించి శాశ్వతమైన స్వర్గం కోసం పుణ్యాలు సమకూర్చుకునే సద్బుద్ధి ప్రసాదించు గాక. – షేక్ అబ్దుల్ బాసిత్ -
ప్రేమ కానుక
ఇద్దరికీ ఒకరిపట్ల మరొకరికి ప్రేమ అంకురించింది. ఇంకేం, లక్ష్మీనారాయణుల పెళ్లికి సిద్ధమైంది దేవలోకమంతా. తన ప్రేమకానుకగా ఆయన ఆమెకి తన వక్షఃస్థలాన్ని ఇచ్చాడు నివాసంగా. సముద్రంలో నిక్షిప్తమైన ఉన్న అమృతాన్ని, అమృతోపమానమైన వస్తుసామగ్రినీ పొందడం కోసం పాలసముద్రాన్ని చిలకాలనుకున్నారు దేవతలూ రాక్షసులూ. పాలసముద్రం దగ్గరికొచ్చారు అందరూ కలిసి. సముద్రంలో దాగున్న లక్ష్మీదేవి గమనిస్తోంది. తాము పాము తలవైపు పట్టుకుని చిలుకుతామన్నారు రాక్షసులు. సరేనన్నాడు శ్రీహరి. కొంతసేపయ్యాక తోకవైపు పట్టుకుంటామన్నారు– తలవైపు నుండి విషం వస్తుంటే ఆ ఘాటుకి తట్టుకోలేక. దానిక్కూడ సరేనన్నాడు నారాయణుడు. ఇంతలో కవ్వంగా ఉన్న మందర పర్వతం దిగబడిపోయింది. మేం వెళ్లిపోతాం అన్నారు రాక్షసులు. ‘కాదుకాదని’ రాక్షసుల్ని ఒప్పించి తాను తాబేలు రూపాన్నెత్తి పనిని కొనసాగింపజేశాడు విష్ణువు. ఇలా ప్రతి సందర్భంలోనూ తన కార్యసాధన పద్ధతిని నిరూపించుకుంటూ ఓసారి గద్దించి మరోసారి బతిమాలి ఇంకొకసారి తాబేలు రూపాన్నెత్తి... ఇలా మొత్తానికి అమృతాన్ని సాధించి దాన్ని రాక్షసులకి కానీకుండా చేశాడు జనార్దనుడు. సముద్రపు కెరటాల మీదుగా ఉయ్యాలలూగుతూ వచ్చి శ్రీమన్నారాయణుని కార్యదీక్షాదక్షతకి ఆనందపడి చూపుల్ని కలిపింది క్షీరాబ్ధి తనయ శ్రీ మహాలక్ష్మి శ్రీహరితో. అంతేకాదు, పాదాభివందనం కూడా చేసింది. ఒంటినిండా బంగారు ఆభరణాలని ధరించి కూడ ఆవంతైనా అహంకారం లేకుండా వినయంతో నమస్కరించింది. ఆనందపడ్డ విష్ణువు చూపుల్ని కలిపాడు లక్ష్మితో. ఇద్దరికీ ఒకరిపట్ల మరొకరికి ప్రేమ అంకురించింది. ఇంకేం, లక్ష్మీనారాయణుల పెళ్లికి సిద్ధమైంది దేవలోకమంతా. తన ప్రేమకానుకగా ఆయన ఆమెకి తన వక్షఃస్థలాన్ని ఇచ్చాడు నివాసంగా. ఆమె శ్రీహరి హృదయం మీదనే నివసిస్తూ– ఆయన ఏ ఆలోచనతో ఉన్నాడో ముందే గమనించి తనవంతు సహకారాన్ని ఇయ్యడం ప్రారంభించింది. ‘రావణుణ్ణి ఎలా వధించాలా?’ అని ఆలోచిస్తుంటే వేదవతీ రూపంతో వెళ్లి రావణునికి మరణ శాపాన్నిచ్చి వచ్చింది. అంటే పెళ్లికి ముందూ పెళ్లికాలంలో పెళ్లయ్యాక కూడ ఉండేదే ప్రేమ అని పురాణ భావం కదా... – డి.వి.ఆర్. -
ఆడపెళ్లివారమండీ
ఒక వధువు, ఒక వరుడు ఏకమై దంపతులుగా జీవనం గడపాలంటే వాస్తవంగా కొన్ని వందల రూపాయలు మాత్రమే ఖర్చవుతాయి, అవసరం అవుతాయి. కానీ ఏళ్ల తరబడి కొనసాగుతున్న ‘సాంప్రదాయ ఖర్చులు’ పెళ్లీడుకు వచ్చిన యువతుల పాలిట ముళ్ల కంచెలు అవుతున్నాయి. వాళ్ల తల్లిదండ్రులకు మోయలేనంత భారంగా పరిణమిస్తున్నాయి. ఈ పరిస్థితి నుంచి ముస్లిం మైనారిటీ మహిళలకు, వాళ్ల తల్లిదండ్రులకు విముక్తి కల్పించేందుకు ఆవిర్భవించిన సంస్థే ‘అమన్’.ముస్లిం కుటుంబాలలో నికాహ్ సందర్భంగా.. కట్న కానుకలతో పాటు ఏర్పాటు చేసే విందు భోజనాల ఖర్చులు వధువు తల్లిదండ్రులకు తలకు మించిన భారం అవుతాయి. అమన్ సంస్థ ఈ విందు భోజనాలకు సంబంధించి ముస్లిం కుటుంబాలతో ఒక అవగాహన కల్పించాలని ప్రయత్నం చేసి ఆ దిశగా ఆచరణలోకి తీసుకొచ్చింది. లక్షల రూపాయలు ఖర్చయ్యే మాంసాహార భోజనానికి తెరదించాలని ప్రచారం చేస్తోంది. దశాబ్ద కాలంగా ఈ సంస్థ చేస్తున్న కృషి వల్ల వేలాది కుటుంబాలు లబ్దిపొందాయి. ‘అవాయిడ్ మటన్ ఆఫ్టర్ నికాహ్’ (అమన్) అనే నినాదంతో బయలుదేరిన ఈ సంస్థ తన లక్ష్య సిద్ధి కోసం చిత్తశుద్ధితో నిర్విరామంగా కృషి చేస్తోంది. నికాహ్ ఖర్చులను తగ్గించేందుకు పనిచేస్తూ ఇప్పటి వరకు కర్నూలు నగర ముస్లింలకు నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ఆదా చేసినట్లు అమన్ నిర్వాహకులు చెబుతున్నారు. నికాహ్ వేడుకల్లో మాంసాహార నిషేధం కోసం తమ కమిటీ సభ్యులు నిరంతరం శ్రమిస్తూ, తద్వారా ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆర్థికపరమైన ఊరటను చేకూర్చుతున్నారని సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. హమీద్, సహాయ కార్యదర్శి ఎండి అన్వర్ బాషా తెలిపారు. అమన్ ఆవిర్భావం వెనుక ‘‘2005లో అనంతపురం జిల్లా గుంతకల్లులో ఓ ముస్లిం ఇంట పెళ్లి జరిగింది. అందులో నికాహ్ తరువాత పెళ్లి కొడుకు బంధువులకు విందు భోజనాల్లో మాంసాహారం సంతృప్తికరంగా వడ్డించలేదని వరుని తరుపున వచ్చిన బంధువులు గొడవ పెట్టుకున్నారు. ఆ ఘర్షణ చివరకు సాయంత్రానికే పెళ్లి తెగతెంపులకు దారి తీసింది. ఈ ఘటన పేపరులో చదివి చాలా బాధపడ్డాం. ఆ తరువాత చికెన్ తింటే ‘చికున్ గున్యా’ వస్తుందనే ప్రచారం సంచలనం రేపింది. అప్పటివరకు కర్నూలు పెళ్లిళ్లలో తక్కువ ఖర్చు అని చికెన్‌తో భోజనాలు పెట్టే వారు. అయితే చికెన్ తింటే చికున్ గున్యా వస్తుందన్న భ్రమతో నికాహ్ భోజనాలు పొట్టేలు మాంసంతోనే పెట్టాలని అబ్బాయిల తల్లిదండ్రులు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. ఈ సంఘటనలు ఆందోళన కలిగించాయి. కర్నూలు నగరంలో 80శాతం మంది ముస్లింలు పేద, సామాన్య కుటుంబాలే. బీడి కార్మికులు, రిక్షా, తాపీ కార్మికులు, హమాలీలు ఖరీదైన పొట్టేలు మాంసం వండి వచ్చిన బంధువులందరికీ భోజనాలు ఏర్పాటు చేయాలంటే ఖర్చు లక్షలకు చేరుతుంది. ఈ సమస్య పరిష్కారానికి ఉద్యమం తీసుకురావాలని యునైటెడ్ మైనారిటీ సొసైటీ అధ్యక్షుడు మౌలానా జుబేర్ అహ్మద్ ఖాన్ రషాదీతో 2006 జనవరిలో మలిగియా మసీదులో కూర్చొని చర్చించాం. అయన సానుకూల స్పందనతో ‘అమన్’ కమిటీని ఏర్పాటు చేసి నికాహ్ వేడుకల్లో మాంసాహారం నిషేధం కోసం అభిప్రాయ సేకరణకు సిద్ధమయ్యాం. ఉద్యోగులు, లాయర్లు, ఇంజనీర్లు, డాక్టర్లను వ్యక్తిగతంగా కలిసి అమన్ కమిటీ ఆశయాలు వివరించాం. అబ్బాయి తల్లిదండ్రులు నిర్వహించే వలిమా విందుకు ఎలాంటి అభ్యంతరాలు ఉండబోవని చెప్పాం. ప్రతి రోజు ఉదయం నుంచి రాత్రి 11గంటల వరకు వివిధ కుటుంబాలను కలిసి ప్రచారం చేపట్టాం. ఐదు నెలలకు పైబడిన మా శ్రమకు అల్లాహ్ కరుణ తోడవడంతో ముస్లిం ప్రజల్లో చైతన్యం వచ్చేసింది. 80వేల సంతకాలు సేకరించాం. వాటిలో ప్రభుత్వ ఖాజీలు హాఫీజ్ సయ్యద్ సలీం బాషా (హనఫీ), యూసుఫ్ జానీ (అహెలే హదీస్)లు సంతకాలు చేశారు. ‘అవాయిడ్ మటన్ ఆఫ్టర్ నికాహ్’ అనే నినాదంతో ఆ ఆంగ్లపదాల్లోని మొదటి అక్షరాలతో అమన్ కమిటీ అని పేరు పెట్టాం. ముందుగా మటన్‌ను మాత్రమే నిషేధించాలనుకున్నాం. కానీ ప్రజల నుంచి వచ్చిన విన్నపాల మేరకు మటన్, చికెన్‌తోపాటు ఇతర ఏ మాంసాహారాన్నీ నికాహ్‌లో పెట్టరాదనే నిర్ణయానికి వచ్చాం. అయితే అప్పటికే ప్రజల్లో ‘అమన్’ కమిటీ పేరు బాగా పాపులర్ అవడంతో ఆ పేరును అలాగే కొనసాగిస్తున్నాం’’ అని వివరించారు హమీద్, అన్వర్ బాషా.భవిష్యత్తులో వరకట్న కానుకలు, అదనపు కట్నాలపై సైతం ఇదే తరహాలో పోరాటాలు నిర్వహించి, ఆ భారం నుంచి కూడా అమ్మాయిల తల్లిదండ్రులను తప్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది ‘అమన్’. అందుకోసం ‘ఆమని’ (ఆడపిల్లల మరణాల నివారణ) అనే సంస్థను ఏర్పాటు చేయబోతోంది. -
తగిన సమయం
పూర్వం సౌభరి అనే పేరుగల మహర్షి ఉండేవారు. ఆయన మహా తపశ్శాలి. ఓ రోజున ఆయన ఎప్పటిలాగే నదికి వెళ్లి, సూర్యునికి ఎదురుగా నిలబడి దోసిలి నిండా నీళ్లు తీసుకున్నాడు. మంత్ర పూర్వకంగా సూర్యునికి అర్ఘ్యం సమర్పించబోతుండగా ఆయన చేతిలో అయిదారు చేపలు కనిపించాయి. అవన్నీ ఒకదానితో ఒకటి ఎంతో ప్రేమగా ఉన్నాయి. వాటిని చూడగానే మహర్షికి సంసార జీవితం మీదకు ధ్యాస మళ్లింది. ‘ఎందుకు నేను ఇంతకాలం తపస్సు చేస్తున్నాను. ఎవరికోసం చేస్తున్నాను. నన్ను ఆదరించేవారెవరు. నా అంతిమ ఘడియలలో నన్ను ప్రేమతో సాగనంపేవారెవరున్నారు. అల్పజీవులైనప్పటికీ ఈ చేపలు ఎంత హాయిగా కుటుంబ జీవనం గడుపుతున్నాయి! వాటితో పోల్చుకుంటే నేను జీవితంలో చాలా కోల్పోయాను. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. వెంటనే వివాహం చేసుకుంటే బాగుంటుంది’ అనుకుంటూ ఆ దేశపు రాజు వద్దకెళ్లి, తనకు పెళ్లి చేసుకోవాలని ఉందన్న కోరికను వెళ్లబుచ్చాడు. అంతటి మహాయోగి తనంత తానుగా వచ్చి అడిగితే ఎలా కాదనగలం అనుకుని తన కుమార్తెలనే ఇచ్చి వివాహం చేశాడు. వారితో కొంతకాలం పాటు అన్ని సౌఖ్యాలనూ అనుభవించాడు సౌభరి. ఆ తర్వాత అర్థమైంది ఆయనకు ఈ జీవితంలో ఏమున్నదో! నిద్రలేవడం, వండుకోవడం, తినడం, వినోదాలతో కాలక్షేపం చేయడం, నిద్రపోవడం... ఇంతకు మించి ఏమీ కనిపించడం లేదని భార్యలతో అన్నాడు. వారు కూడా ఆయన అభిప్రాయాన్ని గ్రహించి, గౌరవించారు. తాము కూడా యోగమార్గానికి, ఆధ్యాత్మిక మార్గానికి మళ్లి, తర్వాత మోక్షం పొందాలని ఉందని తెలియజేశారు. ఆ తర్వాత అందరూ కలసి ఆధ్యాత్మిక మార్గంలో పయనించి, ముక్తి పొందారు. పిన్న వయసులో వైరాగ్యాన్ని, వేదాంతాన్ని అలవరచుకోవడం ఎంత హాస్యాస్పదమో, వృద్ధాప్యంలో కూడా యవ్వనంలో ఉన్నట్లు ప్రవర్తించడం అంతటి హేయం. అంటే ఏ వయసులో ఆ ధర్మాన్ని పాటించాలని సౌభరి మహర్షి కథ ద్వారా వ్యాసుడు మనకు తెలియజేశాడు. కొందరు ఎంత సంపాదించినా, ఇంకాస్త సంపాదిస్తేనో లేదా ఇల్లు, గృహోపకరణాలు అన్నీ అమర్చుకుంటేనే కానీ పెళ్లి చేసుకోవడం సరికాదు అన్నట్లుగా ప్రవర్తిస్తూనో కాలయాపన అయ్యాక చివరికి బాధపడుతుండడం మనం చూస్తున్నదే. – డి.వి.ఆర్. -
శ్వేత కల్యాణం
మొత్తానికి పెళ్లయింది!శ్వేతా బసు ప్రసాద్ పెళ్లి కాదు. ప్రియాంక, నిక్‌ల పెళ్లి.అంతకు ముందు కూడా..మొత్తానికి పెళ్లైంది. రణవీర్, దీపికల పెళ్లి.అంతకన్నా ముందూ..మొత్తానికి పెళ్లయింది. అనుష్క, కొహ్లీల పెళ్లి.బాలీవుడ్ తారల పెళ్లి డేట్లు ఒక పట్టాన కదిలి రావు. అందుకే..‘మొత్తానికి పెళ్లైంది’ అనిపిస్తుంది. శ్వేతాబసు మరీ అంత సాగతీయడం లేదు. డేట్ చెప్పారు. డేటింగ్ గురించీ చెప్పారు. నచ్చిన వరుడు. మెచ్చిన వధువు. పెళ్లి పనుల్లో ఉండి కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. చూతము రారండి.. శ్వేతా కల్యాణం. త్వరలో ‘మిసెస్’ కాబోతున్నందుకు ముందుగా కంగ్రాట్స్... శ్వేత: థ్యాంక్స్. ఈ నెల 13న రోహిత్‌తో నా పెళ్లి. అందుకే పెళ్లి పనుల్లో హడావిడిగా ఉన్నాం. అసలు మీ ఇద్దరూ ఫస్ట్ టైమ్ ఎక్కడ కలిశారు? దాదాపు ఐదేళ్ల క్రితం కలిశాం. ఫ్యాంథమ్ ఫిలిమ్స్‌లో నేను స్క్రిప్ట్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నప్పుడు రోహిత్ కూడా వేరే పని మీద అక్కడ ఉన్నాడు. అయితే చాలామంది అనుకుంటున్నట్లు తను అక్కడ పని చేయడం లేదు. అసిస్టెంట్‌గా కూడా వర్క్ చేయడం లేదు. తనకు డైరెక్టర్ అవ్వాలన్నది లక్ష్యం. ప్రొడ్యూసర్‌గా కూడా చేయాలనే ఎయిమ్‌తో ఉండేవాడు. మీ ఇద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగిందట కదా? లేదు. పెళ్లికి ముందు రోజు మెహందీ, ఎంగేజ్మెంట్ ఉంటాయి. ప్రిన్సెస్ కట్ డైమండ్ రింగ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓ మంచి భర్తకు కావాల్సిన లక్షణాలు రోహిత్లో ఏం ఉన్నాయి? ఓపికకు మారు పేరు రోహిత్. అలాగే చేసే పని మీద శ్రద్ధ ఎక్కువ. చాలా వినయంగా ఉంటాడు. స్త్రీల దగ్గర తను నడుచుకునే తీరు చాలా బాగుంటుంది. ఆ తీరే నా మనసుని గెలుచుకుంది. రోహిత్‌ది చాలా మంచి పెంపకం. బాలీలో బ్యాచిలరెట్ పార్టీ చేసుకున్నట్లున్నారు. ఆ ప్లేస్‌నే సెలెక్ట్ చేసుకోవడానికి ప్రత్యేక కారణం ఏదైనా ఉందా? పార్టీకి అద్భుతమైన ప్లేస్ అది. అందుకే వెళ్లాం. గత నెల 25 నుంచి 30 వరకూ అక్కడే ఉన్నాం. శుక్రవారం రాత్రి ముంబై చేరుకున్నాం. బాలీలో ఓ ప్రైవేట్ విల్లాని బుక్ చేసుకున్నాం. మా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులతో వెళ్లాం. ముఖ్యంగా నన్ను బాగా ప్రేమించేవాళ్లతో ఈ పార్టీ చేసుకున్నాను. ఫుల్‌గా రిలాక్స్ అవ్వాలనే ఆలోచనతోనే ఈ పార్టీ ప్లాన్ చేశాను. బాలీ పొలాల్లో ఫార్మింగ్ చేశాం. అలాగే పొలాల్లో వంటలు చేసుకున్నాం. ఒకట్రెండు రోజులైతే విల్లా నుంచి బయటికి రాలేదు కూడా. బోర్డ్ గేమ్స్ ఆడుకున్నాం. నా బ్రదర్ రాహుల్ ప్లే చేసిన మ్యూజిక్‌కి డ్యాన్స్ చేశాం. ఫుల్‌గా రిలాక్స్ అయ్యాను. మీ ఇద్దరూ పేరెంట్స్‌ని ఒప్పించడానికి కష్టపడ్డారా? నా కుటుంబ సభ్యులకు రోహిత్ మూడేళ్లుగా తెలుసు. నాక్కూడా తన ఫ్యామిలీతో అన్నేళ్ల అనుబంధం ఉంది. మేమంతా ఒకే కుటుంబం అన్నట్లుగా ఉండటం మొదలుపెట్టాం. ఏ బంధంలో అయినా గౌరవం ఉంటే ఆ బంధం బలంగా ఉంటుంది. మాకు ఒకరి కుటుంబం అంటే మరొకరికి గౌరవం ఉంది. మా పెద్దలు కూడా ఒకరినొకరు గౌరవించుకుంటారు. అందుకే మా ప్రేమ గురించి చెప్పగానే కాదనలేదు. మరి.. సహజీవనం చేశారు కదా.. అప్పుడు కూడా ఏమీ అనలేదా? లేదు. దాదాపు రెండేళ్లు సహజీవనం చేశాం. మా నిర్ణయాల మీద మావాళ్లకు నమ్మకం ఉంది. అందుకే ఏమీ అనలేదు. పెళ్లి తర్వాత కెరీర్ కంటిన్యూ చేస్తారా? డెఫినెట్‌గా. రోహిత్‌కి అభ్యంతరం లేదు. పెళ్లయితే కెరీర్‌ని వదిలేసుకోవాలన్న మైండ్‌సైట్ నాకూ లేదు. నా మనవళ్లు, మనవరాళ్లు పుట్టేటప్పటికి కూడా నేను నటిస్తూనే ఉంటా (నవ్వుతూ). ప్రస్తుతం ఏం చేస్తున్నారు? హిందీ చిత్రం ‘తాష్కెంట్ ఫైల్స్’లో నటించాను. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. నసీరుద్దీన్ షా, మిథున్ చక్రవర్తి, నేను, ఇంకొంతమంది ప్రముఖ స్టార్స్ నటించాం. మన రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిగారి డెత్ మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ‘జామున్’ అని మరో సినిమా చేశాను. తండ్రీ కూతురి అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. నా తండ్రిగా రఘుబీర్ యాదవ్ నటించారు. ఈ రెండూ వచ్చే ఏడాది విడుదలవుతాయి. ఫైనల్లీ... విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్? థ్యాంక్యూ వెరీ మచ్. నన్ను కథానాయికను చేసిన తెలుగు పరిశ్రమ అన్నా, తెలుగు ప్రేక్షకులన్నా నాకు చాలా అభిమానం. ఎవరీ రోహిత్? పూణేకు చెందిన బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు రోహిత్ మిట్టల్. వాళ్ల నాన్నగారు బిల్డర్. రోహిత్ లా పూర్తి చేసినప్పటికీ ఫిల్మ్ మేకింగ్ మీద శ్రద్ధతో లాస్ ఏంజెల్స్‌లో న్యూయార్క్ అకాడమీలో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ పూర్తి చేశారు. ప్రస్తుతం బాలీవుడ్లో దర్శక–నిర్మాతగా కొనసాగుతున్నారు. నెట్‌ఫ్లిక్స్ కోసం ‘ఆటోహెడ్’ అనే ఫీచర్ ఫిల్మ్ డైరెక్ట్ చేశారు. ఆ సినిమాకు కో–ప్రొడ్యూసర్‌గానూ వ్యవహరించారు రోహిత్. బాలీవుడ్లో చేయబోయే నెక్ట్స్ ఫీచర్ ఫిల్మ్ షూటింగ్ కూడా పూర్తయింది. ఎ... క్క...డ...?? ఎ..క్క..డ?? ఎ..క్క..డ..? అంటూ ఓ కొత్త డైలాగ్ మాడ్యులేషన్‌తో ‘కొత్త బంగారు లోకం’ ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు శ్వేతా బసు. ఈ సినిమా రిలీజ్ అయి పదేళ్లు పూర్తయింది. అక్టోబర్ 9, 2008లో రిలీజ్ అయిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా గురించి శ్వేతా మాట్లాడుతూ – ‘‘పదేళ్ల క్రితం ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాను. సెన్సేషనల్ రొమాంటిక్ హిట్. పాటలు, సంభాషణలు అన్నీ కూడా యూత్‌కి ఇట్టే కనెక్ట్ అయిపోయాయి. కమర్షియల్ సక్సెస్‌తో పాటు విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. తెలుగులో నా ఫస్ట్ స్టెప్ ఓ స్వీట్ మెమరీ’’ అని పేర్కొన్నారు. పెళ్లి ఎక్కడ? రోహిత్‌ది పుణె. శ్వేత ఫ్యామిలీ ముంబైలో ఉంటుంది. పెళ్లి వేడుక పుణేలో జరుగుతుంది. రిసెప్షన్ మాత్రం పుణె, ముంబైలలో జరుగుతుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకుని, రిసెప్షన్‌కి సినిమా పరిశ్రమలోని వారిని ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారు. శ్వేత ఇంట్లో పూజలు బాగా చేస్తారు. రోహిత్ ఫ్యామిలీకి కూడా దైవభక్తి ఎక్కువే అట. ఈ ఏడాది వినాయక చవితిని ఎప్పటిలానే గ్రాండ్‌గా చేసుకున్నారు శ్వేత. తన ప్రేయసి ఇంట్లో జరిగిన గణేశ్ పూజలో రోహిత్ పాల్గొన్నారు. అప్పుడు ఇద్దరూ వినాయకుడికి హారతి ఇచ్చిన సందర్భంగా దిగిన ఫొటో ఇది. ఈ కాబోయే దంపతులు అప్పట్లో ఇచ్చిన ఫస్ట్ హారతి. – డి.జి. భవాని -
సమయస్ఫూర్తి
రంగరాజపురంలో రమణయ్య అనే రైతు ఉండేవాడు. అతని కూతురుకు వివాహం నిశ్చయమైంది. బంగారు నగలు కొనటానికి పట్నానికెళ్ళాడు. నగలు కొని ఇంటిదారి పట్టాడు. అప్పటికే చీకటి పడుతుండటంతో త్వరగా ఇల్లుచేరాలని అడ్డదారిన గబగబా నడుస్తున్నాడు. దారిలో గజదొంగ వీరయ్య కత్తితో అడ్డగించాడు. ‘నీ దగ్గరున్న ధనంతీసివ్వు’ అన్నాడు. రమణయ్య గజగజ వణుకుతూ ‘అయ్యా! నా దగ్గర ధనం లేదు.మా అమ్మాయి పెళ్ళి ఉంది. నగలు కొని తెస్తున్నాను. అవిలేకుంటే పెళ్ళి ఆగిపోతుంది. దయవుంచి నన్ను వదిలేయండి. మీకు పుణ్యమొస్తుంది’ అని ప్రాధేయపడ్డాడు. దొంగ తనపంట పండిందని సంతోష పడుతూ ‘నువ్వు ప్రాణాలతో వెళ్ళాలనుకుంటే నగలివ్వు. నువ్వు ఎంత ప్రాధేయపడినా నేను దయతో వదలను. నగలివ్వటంతప్ప నీకు మరో మార్గంలేదు’ అన్నాడు. రమణయ్య ఏడ్పు ముఖంతో వణికిపోతూ చొక్కాలోపల నడుముకు కట్టుకున్న నగల మూట తీసి దొంగ చేతిలో పెట్టాడు. వాడు సంతోషంపట్టలేక మూటవిప్పి చూశాడు. తళతళా మెరిసిపోతున్న పెళ్ళినగలను చూసి ఉక్కిరిబిక్కిరయ్యాడు.రమణయ్య దొంగతో ‘అయ్యా! ఓ చిన్నమాట చెబుతావినండి. నా ఇంటిపక్కనున్న గోవిందయ్య నాకు బద్ధశత్రువు. వాడికీ నాకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వాడి కూతురికీ పెళ్ళి నిశ్చయమైంది. రేపు వాడు నగలకోసం పట్నం పోతున్నాడనే విషయం నా చెవినపడింది. రేపు వాడు నగలుకొని ఈ దగ్గరి దారిన రావచ్చు. వాడి నగలను కూడా తీసుకోండి. వాడి కూతురి పెళ్ళి కూడా ఆగిపోవాలి’ అన్నాడు.వీరయ్య సంతోషపడిపోయి ‘వాడి నగలను లాక్కుని నీకోరిక నెరవేర్చుతాను’ అన్నాడు.రమణయ్య ఇల్లు చేరుకున్నాడు. జరిగిన సంఘటనను భార్యతో చెప్పి ‘ఇలాంటి దొంగలుంటారనే నేను కొన్ని నకిలీ నగలను, బంగారు నగలను కొని నడుముకు కట్టుకున్నాను. వాడిని ప్రాధేయపడుతూభయం, ఏడ్పు నటిస్తూ వాడికి నకిలీ బంగారు నగలమూట తీసిచ్చాను.పెళ్ళి కోసం కొన్న బంగారు నగల మూట నా నడుముకు మరో వైపు భద్రంగా ఉంది’ అని చెప్పి తీసిచ్చి భద్రపరచమన్నాడు.వెంటనే ఇంటి నుండి బయటపడి రాజభటులను కలిసి, జరిగిన సంగతి చెప్పి, ‘గోవిందయ్య నాకు శత్రువని, రేపు నగలతో ఆ దారిన వస్తాడని దొంగకు కట్టుకథ చెప్పాను. మీరు అక్కడ కాపుకాస్తే గజదొంగ దొరుకుతాడు’ అని వివరించాడు.మరుసటిదినం భటులు ఆ దారిలో మాటు వేసి దొంగను బంధించారు. ఊరందరూ రమణయ్య ముందుచూపును, సమయస్ఫూర్తిని అభినందించారు. డి.కె.చదువుల బాబు -
జీవితంలో మరోసారి కనిపించకు!
పూర్వం ఒక వ్యక్తి ఉండేవాడు. పెద్దల నుంచి వచ్చిన వ్యాపారాన్ని నిర్వహించుకుంటూ, ఉన్న కొద్దిపొలంలో వ్యవసాయం చేసుకుంటూ, పశువులను పెంచుకుంటూ ఉన్నంతలో బాగానే జీవించేవాడు. అయితే, ఒకరోజు ఉన్నట్టుండి ఆ వ్యక్తికి చావు గురించిన చింత పట్టుకుంది. చావు తన దరి చేరకుండా ఉండాలని కోరుతూ యముని గురించి ఘోరతపస్సు చేశాడు. యముడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అతను భక్తితో చేతులు జోడించి, ‘‘యమరాజా! నువ్వు ఎవరికైనా ఒకసారే కనిపిస్తావు. నాకు నువ్వు ఇప్పుడు ఒకసారి కనిపించావు కాబట్టి మరోసారి నాకు కనిపించకు. అది చాలు నాకు’’ అన్నాడు వినయంగా. అతని తెలివితేటలకు యముడు ఆశ్చర్యపోయాడు. తాను రెండోసారి కనిపించకూడదంటే ఇతడికి మరణం రానట్లే కదా లెక్క. అయినా ఏదైతే అదవుతుందిలే అనుకుని ‘తథాస్తు’ అన్నాడు. వ్యాపారి ఆనందానికి అంతులేదు. వెంటనే వెళ్లి పెళ్లి చేసుకుని పిల్లలను కన్నాడు. వాళ్లు పెరిగి పెద్దవాళ్లయ్యారు. వాళ్లకు పెళ్లిళ్లయి, పిల్లలు పుట్టారు. వారూ పెరిగి పెద్దయ్యారు. వారికీ ళ్లయ్యాయి. ఇలా తరాలు గడిచిపోతూనే ఉన్నాయి. కానీ, ఎంత వయసు మీదపడినా, ఇతనికి మాత్రం మరణం రావడం లేదు. దాంతో ఇంట్లోవాళ్లు, బయటివాళ్లు అందరూ ఇతనికి సేవలు చేయలేక ఇంకెప్పుడు చచ్చిపోతావంటూ బయటికే తిట్టసాగారు. ఇతనికి బతుకు దుర్భరంగా మారింది. తాను అనాలోచితంగా కోరుకున్న వరమే, ఇప్పుడు శాపంగా మారిందని తెలుసు కున్నాడు. దాంతో చావుకోసం తపస్సు చేయాలనుకున్నాడు. పుట్టిన ప్రతి ప్రాణీ గిట్టక తప్పదన్నది నిజం. దీనిని గుర్తించి, బతికి ఉన్నన్నాళ్లూ సంతోషంగా జీవించాలి కానీ, చావు గురించి భయపడటం, చావును చూసి దిగులు పడటం అవివేకం. ఎప్పటికీ జీవించే ఉండాలని కోరుకోవడం దురాశ. మన చేతిలో లేని చావును గురించి చింతపడేకంటే, చేతిలో ఉన్న జీవితాన్ని ఫలప్రదం చేసుకునేందుకు ప్రయత్నించడం కర్తవ్యం. –డి.వి.ఆర్. -
పెళ్లిపై క్లారిటి ఇచ్చిన సైనా నేహ్వాల్
-
అవును... డిసెంబరు 16నే మాపెళ్లి: సైనా
హైదరాబాద్: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్... తన వివాహ తేదీపై స్పష్టతనిచ్చింది. సహచర క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్‌ను డిసెంబరు 16న పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించింది. బిజీ షెడ్యూల్ నేపథ్యంలో ఈ ఒక్క తేదీనే తమకు అనుకూ లంగా ఉందని ఆమె పేర్కొంది. కశ్యప్‌తో ప్రేమ గురించి తాను చెప్పకున్నా తన తల్లిదండ్రులు అర్థం చేసుకున్నారని తెలిపింది. -
ఏం కావాలోయి? ఉందిగా ద్వారకామాయి!!
ఎంతో వేగంగా ప్రవహించి ప్రవహించి బలంగానూ, ముందూ వెనుకలకి కదులుతూనూ ఉన్న నీరంతా ఒక్కసారి ఆనకట్ట దగ్గర ఆగిపోయిందంటే, దాన్ని అలా ఆపగలిగిన ఆనకట్ట గట్టిదనాన్ని, అలా ఆపగలిగేలా కట్టిన ఆ మహానుభావుల గొప్పదనాన్నీ తెలుసుకోవలసిందే వాళ్లని స్మరిస్తూ ఉండాల్సిందే! అదే తీరుగా ఓ పండితుడు తగిన ప్రమాణాలని చూపుతూ మాత్రమే పదిమందిలో గుర్తింపు పొందగలిగాడంటే... ఆయనకి చదువు చెప్పిన ఆ గురువుల్నీ, ఆ గురువుల నేతృత్వంలో ఈయన చదువుని ఒంటబట్టించుకున్న తీరునీ ప్రశంసించవలసిందే. ఈ నేపథ్యంలో ఎవరైనా సరే.. ఫలాని కష్టం వచ్చిపడిందని అనుకుంటూ ద్వారకామాయిని దర్శిస్తే సాయి నామస్మరణని అక్కడే కూచుని చేస్తే ఆ ఇబ్బంది నుండి బయటపడగలుగుతున్నారంటే.. ఆ ద్వారకామాయికున్న గొప్పదనాన్ని, ఆ ద్వారకామాయి నిర్మాణంలో దాగిన విశేషాలనీ తెలుసుకుని తీరాల్సిందే! ఓ పాత్రలో ఉన్న రుచికరమైన పానీయాన్ని ఒకరివెంట ఒకరుగా తాగుతూ వెళుతూ ఉంటే.. ఎలా పాత్ర ఖాళీ అయిపోతుందో, అలా కాకుండా ఎందరు ఎందరెందరు ఈ కాలం ఆ కాలం అనకుండా సర్వకాలం ద్వారకామాయిని సేవిస్తూ ఉన్నా ఆ కష్టాలని దాటింపజేసే శక్తి ఆ స్థలానికి ఉంటూనే ఉంటోందంటే నిజంగా మనం ఆ గొప్పదనాన్ని అర్థం చేసుకోవలసిందే! సాయి విడిది! తన గుర్రాన్ని సొంత కుటుంబసభ్యునిలా చూసుకుంటున్న ‘చాంద్‌పాటిల్’ ఓ మంచి వేసవివేళ దిక్కు తోచక తిరుగుతుంటే సాయి అతడ్ని పిలిచి, కారణమడిగి, సరిగా వెతకలేదని అతనికి చెప్పి.. ‘ఫలాని చోట ఉంది తెచ్చుకో!’ అనడమూ ‘చాంద్‌పాటిల్’కి గుర్రం సరిగ్గా అక్కడే దొరికి ఉండటం..’ అనే ఆ చరిత్రని లోగడ అనుకున్నాం. సాయిని చాంద్‌పాటిల్ తనతో తన ఇంట్లోనే ఉంచుకుని, తన కుటుంబం మొత్తం షిర్డీకి ఓ పెళ్లికి వెళ్తూ ఉంటే.. తనతో సాయిని తీసుకెళ్లి ఉండటం కూడా మనకి గుర్తుంది కదా! ఆ షిర్డీకి పెళ్లివారితో సహా సాయి రాగానే పెళ్లివాళ్లంతా రెండెడ్లబళ్లు దిగగానే సాయిని చూస్తూనే ఆహ్వానించిన వ్యక్తి ‘ఖండోబా’ అనే గ్రామదేవతా ఆలయంలో అర్చకుడైన ‘మహల్సాపతి’ మాత్రమే! ఇంతవరకూ మనకి తెలుసు!సాయి వేషాన్ని చూశారు షిర్డీలోని అక్కడి వారంతా. పెద్ద బురఖా (కుఫ్ని)ని ధరించి, తలకి ఓ టోపీలాంటి గుడ్డని చుట్టి, గడ్డంతో కన్పిస్తూ ఎవ్వరు అలా చూసినా స్పష్టంగా మహమ్మదీయుడే అనేలా తనని గురించి చెప్పక చెప్తూన్న సాయిని ఏ ఒక్కరూ కూడా ఖండోబా దేవాలయంలోనికి అడుగు పెట్టనీయకూడదని అనుకున్నారు. ఎందరో ఆ అభిప్రాయాన్ని తమలో తాము అనుకుంటున్నట్లుగా, కొద్దిగా బిగ్గరగా అనుకున్నారు కానీ ఒకరిద్దరు ఆ మాటని పైకి అననే అన్నారు కూడా. ‘లా సాయీ!’ (దయచేసి ఓ అతిపవిత్రుడా! లోనికి రా!) అని ఖండోబా దేవాలయ అర్చకుడు మహల్సాపతి ఆ సాయి రూపాన్నీ ఆయన లో–దాగిన గొప్పదనాన్ని గుర్తించి పైకి అలా ఆహ్వానించగలిగాడు. గానీ, తానొక అర్చకరూపంలో ఉద్యోగిగా ఉన్న కారణంగా అక్కడ సాయికి నివాసాన్ని ఇప్పించగల శక్తి లేనివాడయ్యాడు. మనసుంటే మార్గముంటుందన్నట్లు మహల్సాపతే స్వయంగా అక్కడి పెద్దలతో మాట్లాడి అక్కడికి పెద్ద దూరం కాని ఓ మసీదులో సాయిని ఉంచే ఏర్పాటుని మాత్రం చేయగలిగాడు. సాయిని తానే తీసుకువెళ్లాడు ఆ మసీదుకి. ఆ మసీదులో సాయిని దిగబెట్టి ‘సాయీ! ఇదే నీ విడిది!’ అని నమస్కరించి వెనుదిరిగాడు. ఎలా ఉంది ఆ మసీదు? మసీదుకి ముందు ఏ ఆవరణా(ఓ కప్పు ఉన్న ప్రదేశం) లేదు. గోడలన్నీ బాగా పాతబడిపోయి ఉండడమే కాక ఆ మసీదుకున్న ఓ పిట్టగోడ (ప్రహరీగా ఉన్న ఎత్తు తక్కువ గోడల్లో ఒకటి) దాదాపు కూలిపోయిన స్థితిలో ఉంది. మసీదు నిండుగా బూజులు వేలాడుతూ కన్పిస్తున్నాయి. ఏదైనా ఓ అవసరం వచ్చి పిలిస్తే పలికేందుకు ఏ ఒక్కరూ అక్కడ లేరు. అస్తమానం మసీదులోనే కూర్చుని కూర్చుని విసుగొచ్చి ఓ క్షణం ఎక్కడైనా కూచుందామంటే ఒకే ఒక్క దిక్కు ఆ మసీదుకు ఎదురుగా ఉన్న వేపచెట్టు మాత్రమే. సాయికి ఆనందమే అన్పించింది. ఒంటరిగా ఉన్న వేపచెట్టుకి తానొక జంటగా ఉండేందుకు వచ్చాను గదా! అని. ఇంతకాలం ఎవరింట తాను అతిప్రీతిపాత్రంగా గౌరవింపబడ్డాడో ఆ చాంద్‌పాటిల్ కనపడలేదు. తనతో రాలేదు. అలాగని తనని వదిలించుకుందామనేది అతని అభిప్రాయం కాదు. పెళ్లి పనుల్లో ఉన్నాడతను. అదీ కాక తాను అతనికి చెప్పి ఇక్కడికి రాలేదు కూడా. ఇక కొంతకాలం తాను షిర్డీలో ఉన్నప్పటికీ మరో చోటికి వెతుక్కుందామనే దృష్టీ తనకి లేదు.మసీదంతా తిరిగి చూస్తే ఓ చిన్నకుండ కన్పించింది. ‘హమ్మయ్య! నీటి అవసరాన్ని తీర్చడానికి చాలు’ అనుకున్నాడు సాయి. పాతకాలపు పెద్ద తిరుగలి ఆ ఆవరణలోనే కన్పించింది. ‘అబ్బో! గోధుమల్ని విసురుకుని తినడానికి, రొట్టె చేసుకునేందుకు ఇది కూడా ఉందిలే’ అనుకున్నాడు. ఇక పొయ్యిని ఏర్పాటు చేసుకోవడం, ఎండిన కట్టెలూ, పడుకునే చోటూ.. అనే వాటినన్నింటినీ ప్రకృతే ఇస్తుంది తనకి.మంచి వసతి, నీరు, భోజనం అనేవి దొరికాక తనకి లోటేముంది? అనుకున్నాడు. మరో ఆనందకరమైన అంశమేమంటే తనని ఎవరూ కూడా వచ్చి పలకరించేందుకు వీలు లేకుండా మసీదు ఆవరణలో కాలు పెట్టే సౌకర్యంగానీ, స్థలంగానీ ఏ మాత్రపు వీలుగానూ లేకపోవడమే. గోతులతో ఎగుడు దిగుడులతో – సన్నతోవతో – ఇరుకు సందుతో – మసీదు వరకూ రావలసిన తీరుకి ఎవ్వరూ కూడా రారు. ఏదైనా పొరపాటున వచ్చిన వీళ్లే చాలు మరొకరు రాకుండా ఉండేలా చేయడానికి ఇలా ఉన్న ఆ వసతిలో సాయి చక్కని అంగరంగవైభవంగా ఉన్న భవనంలోనికి ప్రవేశించినట్లుగా భావిస్తూ, ఏ మాత్రపు అసంతృప్తీ లేకుండా ఆ మసీదులోనే ఉండదలిచాడు. భగవద్గీతలో కృష్ణుడన్నాడు. యదృచ్ఛా లాభ సంతుష్టః– ‘ఏది తన అదృష్టానికి దొరికినా దాంతోనే పరమసంతోషపడేవాడే నిజమైన గొప్పవాడని.’ సరిగ్గా అలాంటి లక్షణమే సాయిది! చేసిన మార్పులు ఏదైనా ఓ ప్రదేశానికి మనం వెళ్లాక, అక్కడే మనం ఉండాల్సి వస్తే కొన్ని మనకున్నంత పరిధిలో యధాశక్తి చేసుకుంటాం కదా! అలాగే సాయి ఆ మసీదులోకి ప్రవేశించాక చేసిన మొదటి పని చక్కని తులసి మొక్కని నాటడం. ‘ఇదేమిటి? మహమ్మదీయుడేమిటి? తులసి మొక్కని నాటడమేమిటి?’ అనుకున్నారు ఆ మసీదుపక్కగా పలచపలచగా వెళ్తూండే జనం. కొన్ని రోజులయ్యాక ఆ తులసి మొక్క దగ్గర వెలుగుతున్న దైవారాధనకి చిహ్నమైన దీపాన్ని ప్రతిరోజూ ఉండటాన్ని గమనించారు.మరి కొన్ని రోజులయ్యాక అక్కడికి కొద్ది పక్కగా రాత్రీపగలూ అనే భేదం లేకుండా అలా వెలుగుతూ– ఏనాడూ ఆరిపోవడమనేదే లేని అగ్నిహోత్రాన్ని గమనించసాగారు. దీంతో వచ్చేపోయే వాళ్లకి ఓ వింతగానూ ఆశ్చర్యపరిచేది గానూ అయింది ఆ మసీదూ, మసీదులోని సాయీను.లోనికి వెళ్లి పలకరించడమూ ఆయన చేస్తున్న ఈ విధానమూ గురించి అడిగి లో–రహస్యాన్ని తెలుసుకుందామనుకున్నా ఆ గోతుల్లో అడుగేస్తూ ఎగుడుదిగుడు నేలలో నడుస్తూ ఆ సన్నని తోవలో ఇరుకుగా ఉన్న రెండు పాడుబడ్డ గోడల మధ్యలో నుండి నడుస్తూ సాయిని చేరుకోవడానికి ఎవరూ సాహసించలేకపోయారు. ఆసక్తి ఉంది గానీ ఆ శక్తి లేదు. ఉత్సాహముందిగానీ ఆ ప్రోత్సాహం లేదు. ఒంటరిగానైనా వెళ్దామనే ఊహ ఉంది గానీ ఆ ధైర్యం చాలడం లేదు. ఇలా రోజులు గడుస్తుంటే సాయి మెల్లగా మసీదులో కొంతసేపు ఆ ఎదురుగా ఉన్న వేపచెట్టు కింద ఎక్కువసేపూ ఉండటాన్ని గమనించి ఆనందపడ్డారు ఆ వస్తూ పోతూ ఉండే జనం.ఎవరు ఎలా ఉన్నా ఖండోబా దేవాలయ అర్చకుడైన మహల్సాపతి మాత్రం సాయి ఆ మసీదులో ఉన్నకాలంలో కూడా నిత్యం రావడం, సాయికి అర్ఘ్యపాద్యాదులనిచ్చి నమస్కరించి వెళ్తూండటం మాత్రం చేస్తూనే ఉండేవాడు. ఈ విషయం జనంలోకి మరింతగా వెళ్లడంతో క్రమంగా సాయికి భక్తులు రావడం ప్రారంభించారు.మసీదేమిటి? తులసి మొక్కేమిటి? నిత్య దీపారాధన ఏమిటి? హిందువులంతా లక్ష్మీదేవిగా భావించే వేపచెట్టు మొదట్లో కూర్చుని కనిపిస్తూ ఉండటమేమిటి? పైగా హిందూధర్మాన్ని అనుసరిస్తూ ఉండే నిష్ఠాగరిష్ఠులు ప్రతి నిత్యం చేసే అగ్నిహోత్రంలా అక్కడ అగ్నిని వెలిగించి ఉంచడమేమిటి? మహమ్మదీయులే కాకుండా హిందువులూ పైగా జాతి, మత, వర్గ, కుల, స్త్రీ–పురుష, బాల, వితంతు భేదం లేకుండా క్రమక్రమంగా అందరూ రావడం ప్రారంభించాడు. దీని పేరేమిటి? ఇలా జరుగుతుంటే ఓసారి అడిగారు భక్తజనం. చూడ్డానికి మసీదే.. మసీదులా ఉండటం కాదు. కనిపిస్తున్నది పవిత్ర దైవదీపారాధనమే... దీపంలా ప్రకాశంకోసం పెట్టబడింది కాదు. లోపల ఉన్నది తులసి మొక్కే. అదేదో యధాలాపంగా మొలిచింది కానే కాదు. కావాలని నాటబడిందే..! వస్తున్నది గ్రామ దేవాలయ అర్చకుడు మహల్సాపతే. ఏదో మారు వేషంలో వస్తుండటం కాదు. ఇందరొస్తూ ఉన్న ఒక్క చిల్లుకానిని(రూపాయిలో 64వ వంతు) అడిగిన జాడ లేనే లేదు. ఇదంతా ఏమిటి? ఈ ప్రదేశం పేరేమిటి? ఈ విధానం పేరేమిటి?’ అని. సాయి చిరునవ్వు నవ్వుతూ ‘ఈ స్థలం పేరు ద్వారకామాయి. ఆ వెలుగుతున్న అగ్నిపేరు ‘ధుని’ అన్నాడు. పూర్తిగా అర్థంకాని అందరూ మరికొద్ది వివరణనీయవలసిందిగా అడిగితే సాయి చెప్పాడు.‘చతుర్ణా మపి వర్ణానాం యత్ర ద్వారాణి సర్వతఃఅతో ద్వారవతీత్యుక్తా విద్వద్భి స్తత్వవేదిభిః’అనే శ్లోకానికి అర్థాన్ని.లోకంలో నాల్గువిధాల వృత్తుల్ని చేస్తూ అలాంటి ప్రవర్తనతో ఉండే ‘బ్రహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర’ అనే వారున్నారు గదా! ఆ అందరికీ కూడా ‘ధర్మం అర్థం కామం మోక్షం’ అనే నాలుగూ పొందగలిగేలా చేసే శక్తి ఉన్న క్షేత్రం పేరు ‘ద్వారవతి’ దాన్నే ‘ద్వారక’ అంటారు హిందూసంప్రదాయంలో. అదుగో అలాంటి ద్వారకే ఇది. ఆ ద్వారకకి ప్రతిబింబం లాంటి ఈ ప్రదేశానికి నేను ‘ద్వారకామాయి’ అని పేరు పెట్టుకున్నానన్నాడు. ఎంత లోతైన అర్థమున్నపేరు! అది నీ పని కాదు! సహజంగా ఇలాంటి పరిస్థితిలో ఎవరైనా ఉంటే.. ఎవరు దేన్ని విరాళంగా ఇచ్చినా ఆ స్థలానికో లేక తనకో అలాంటి వాడు కానేకాదని భక్తులకి నిత్యానుభవంలో అర్థమైంది. ఇలా వస్తూండే రాకపోకల భక్తుల్లో మరింత విశ్వాసం పెరిగిన గోపాలరావు గుండ్’ అనే అతను ఈ మసీదు స్థితిని గమనించి దీన్ని బాగుచేయదలిచి బాగుజేతకి కావలసిన రాతినీ సున్నాన్నీ ఇతర వస్తువుల్నీ పరికరాలనీ సమకూర్చి పనిని ప్రారంభించబోతే సాయి అతడ్ని పిలిచి ‘ఇది నీ వంతు కాదు. మానెయ్’ అన్నాడు. నానా (నానా సాహెబ్ ఛందోర్కర్)చేస్తాడులే! కంగారు పడకు అన్నాడు. నిజానికి నానా అప్పటికింకా ఆ పనికి సంబంధించిన ఆలోచనకి రానే లేదు.అలాగే ‘చెప్పలేనంత దుమ్ము ధూళి బూజులు బల్లులూ, ఎలుకలు ఇతర క్రిమికీటకాలు, పాములు తిరుగాడే ఆ ప్రదేశాన్ని బాగు చేసి ఎల్తైన గోడల్నీ లోపల ఎవరైనా వస్తే కూర్చుండే విధంగా సౌకర్యవంతమైన అరుగుల్ని కట్టించదలిచా’ అని అనగానే అది నీ పని కాదు. కాకా(కాకా సాహెబ్ దీక్షిత్) ఆ బాధ్యతని తీసుకోబోతున్నాడన్నాడు సాయి.తీవ్రమైన నిరుత్సాహం ఒక పక్కా, ఏదో చేసి సాయికి చక్కని సౌకర్యాలని కల్పించాలనే తపన ఒక పక్కా ఎవరెవరికో వచ్చిన ఆ అవకాశం తనకెలా వస్తుందా? అనే ఆత్రుత ఒక పక్కా ఉన్న సమయంలో మహల్సాపతి అక్కడి కొచ్చి పరిస్థితిని గమనించి ‘సాయిదేవా! అనుగ్రహించు!! ఆ భక్తుని కోరికని ఆదరించు’ అన్నాడు భక్తిగా ప్రణామం చేస్తూ. సాయి వెంటనే ‘ఈ ఆడంబరం దేనికి నాకు? నేను ఏదైనా అసౌకర్యం ఉందని అన్నానా? ఎప్పటి నుండోలేని ఈ సౌకర్యాలు ఇప్పుడెందుకు?’ అన్నాడు. అయినా పట్టుబట్టి మహల్సాపతి ప్రాధేయపడి ఒప్పించాడు సాయిని.అంతే! మసీదు మొత్తం దులపబడింది. నేల ఎత్తు చేయబడింది. గోడలన్నీ పటిష్ఠంగా నిర్మించబడ్డాయి. నేల గోతులు, ఎగుడుదిగుడులూ సరిచేయబడ్డాయి. ఎల్తైన ప్రదేశం మీద ధుని ఏర్పాటయింది. ఒక అంగవస్త్రం (తుండు/తువ్వాలు/పై వస్త్రం) వేసుకుని దానిమీద కూచునే సాయి చోటులో చక్కని ఎల్తైన వేదిక వచ్చింది. ఇక ఆ ఎదురుగా ఆవరణా సభామండపంలా అనిపించే తీరులో ఇనుప స్తంభాలు వాటి మీద ఓ కప్పు దాదాపుగా అయిపోతున్న దశలో ‘చావడి’ నుంచి ద్వారకామాయి కి వచ్చాడు సాయి. కోపంతో ఊగిపోతూ స్తంభాలన్నింటినీ దూరదూరంగా వెళ్లిపోయేలా తన్నేసాడు.కప్పుకోసం తెచ్చిన వస్తువుల్ని విసిరేసాడు. ఎవరికీ ఏమీ అర్థం కాలేదు.కాసేపు మౌనధ్యానంలో ఉండిపోయాడు. మరికొంత సేపు ఏదో నామజపాన్ని చేసుకున్నాడు. పెద్ద వర్షం వచ్చి ఆగిపోయాక ఉండే పరిస్థితిలా ప్రశాంతంగా కళ్లు తెరిచి ఇనుపస్తంభాలని పాతబోయిన గుంటల్లో రూపాయి నాణాలని వేశాడు. మట్టి తానే వేసాడు స్వయంగా. ఈ ద్వారకామాయి రూపురేఖలని మార్చిన ఇద్దరు భక్తులకీ (కాకా తాత్యా) నూతన వస్త్రాన్ని తెప్పించి తలపాగలని తానే కట్టాడు.ఇలా ఆగ్రహించడానికి కారణం – ఏది సరైన ముహూర్తమో అడగకుండా తెలుసుకోకుండా ఉత్సాహం కారణంగా కట్టదలిచి పనిని ప్రారంభించేయడమే! మరి తులసి మొక్క దీపారాధనం వేపచెట్టు నీడ విశ్రమించడం ద్వారకామాయి అని పేరు పెట్టడం.. వంటి పనుల్ని చేసిన సాయి హిందువు కాడా? హిందూ ధర్మాన్ని పాటించాలని ఉపదేశించిన వాడు కాడా?అంతా అయ్యాక కొత్త ద్వారకామాయిలో అడుగిడిన సాయి అన్నాడు– ‘ఇక్కడ కోరితే కానిపని ఉండదు. ఇబ్బంది అనేది తొలగిపోతుంది’ అని. దానికి కారణం సాయి చేసే మంత్రజపశక్తి మాత్రమే! బాబా చిత్రప్రవర్తనలూ – అంతరార్థాలూ చూద్దాం! – సశేషం - డా. మైలవరపు శ్రీనివాసరావు -
పెళ్లికి చెలి కళ
అమ్మాయి పెళ్లికి చెలులే కళ.. అలంకారాలకు పువ్వులు, ముగ్గులు, తోరణాలే కాదు స్నేహితులు కూడా! స్నేహాన్ని మించిన.. ఆభరణం ఉండదు కదా! పెళ్లి కూతురుకి వీళ్లే శుభశకునాలు.. పెళ్లికళలు... పెళ్లి కూతురేకాదు ఆమెను అంటిపెట్టుకుని ఉండే నిచ్చెలుల అలంకారణం కూడా ఇప్పుడు ప్రధానమైంది. ప్రత్యేకమైంది. ట్రెండ్ అయ్యింది. కళకళలాడుతూ చెలుల అంతా ఒకే అలంకారంలో తిరుగుతుంటే పెళ్లి కళ వెయ్యింతలై వెలుగుతోంది. రాజకుమారిలా నవవధువు.. ఆమె చుట్టూ తూనీగల్లా చెలులు తిరగాడుతుంటే ఫ్లాష్ కెమరాలు షార్ప్‌గా మెరుస్తుంటాయి. బ్రైడ్స్ మెయిడ్ అనే ఈ ఫ్యాషనబుల్ డ్రెస్‌కి తప్పనిసరిగా పాటించాల్సిన రూల్స్.. ఎంగేజ్మెంట్, సంగీత్, రెసెప్షన్ వేడు స్నేహితులు/అక్కచెల్లెళ్లను మీ ప్లాన్‌లో భాగస్తులను చేయండి. ఎంత మంది అవుతారో ఒక జాబితా తయారుచేసుకొని డిజైనర్స్‌ని సంప్రదించాలి. రంగులు, డిజైన్స్ ఏవి బాగుంటాయో పెళ్లి కూతురు డ్రెస్ ఎంపికను బట్టి ఎంపిక చేసుకోవాలి. గ్రూప్ అందరూ ఒకలా ఉండి అందులో ఒకరు రాంగ్ డ్రెస్ డిజైన్, రంగులు వేరేగా ఉంటే ప్లాన్ ప్లాప్ అవుతుంది. అందుకని వధువు అందరి డ్రెస్ డిజైన్స్ వేడుకకు కనీసం వారం రోజుల ముందుగానే ఫైనల్ చేయాలి. పెళ్లికి ముందు డ్రెస్సులు వేసుకొని సరిచూసుకోవడం పెళ్లికి ముందు చాలా వరకు చేయరు. కానీ, ముందుగా అందరూ ఒకసారి ధరించి సరిచూసుకోవడం వల్ల వేడుక అనుకున్న విధంగా పూర్తి అవుతుంది. వేడుకలో ధరించే దుస్తులు ఒకసారి ధరించి చూసుకోవడం వల్ల ఆల్ట్రేషన్ సమస్యలు ఉండవు. అందరూ ఎలాంటి ఆభరణాలు ధరించాలో చూసుకోవాలి. ఉదాహరణకు : కుందన్స్ లేదా పోల్కీ, వరుసల హారాలు, చెవి బుట్టలు, గాజులు, వడ్డాణాలు.. ఇవన్నీ అందరూ ఒకే తరహావి ఎంచుకోవాలి. ∙అత్యంత ఖరీదైన ఆభరణాలను ధరించకపోవడమే మేలు. సంగీత్ వంటివి ఆటపాటలతో వేడుక జరిగే సమయం. మరీ ఖరీదైన లెహంగా వంటివి కూడా గ్రూప్‌కి పెట్టకూడదు. బ్రైట్ కలర్స్‌లో ఉండే ఒకే రంగు చీరలు లేదా సల్వార్ కుర్తా వంటివి కూడా బాగుంటాయి. డ్యాన్స్ చేయడానికి అనువైన డ్రెస్ అయితే సౌకర్యానికీ లోటుండదు. ఇండోవెస్ట్రన్ లుక్ వచ్చేలా గౌన్లు, క్రాప్‌టాప్, లంగాఓణీ డ్రెస్ .. కూడా ఈ వేడుకకు నిండుదనాన్ని తీసుకువస్తాయి. హెవీగా మేకప్ కాకుండా మీదైన సొంత మేకప్‌నే ఎంచుకోవడం ఉత్తమం. పెళ్లి కూతురువరకు మేకప్ ఆర్టిస్ట్‌కి ఛాన్స్ ఇవ్వచ్చు. ఎవరికి వారు మేకప్‌కి సొంత మేకప్బాక్స్ని ఉపయోగించడం వల్ల ఇరిటేట్ వంటి సమస్యలు తలెత్తవు. వెంట మేకప్ బాక్స్‌లో .. చెమట అద్దడానికి బ్లాటింగ్ షీట్స్, కన్సీలర్, హెయిర్ స్ప్రే, చిన్న అద్దం, లిప్‌స్టిక్, మస్కారా, టచ్అప్స్ వంటివి ఉంచుకోవాలి. పెళ్లి కూతురు దగ్గర ఉండే సమయం ఎక్కువ ఉంటుంది కాబట్టి చెలుల తయారీ ముఖ్యం. అందుకని డ్రెస్సులు, ఆభరణాలు కనీసం రెండు సెట్స్ అయినా ఉండేలా చూసుకోవాలి. ఏ సంప్రదాయ వేడుకకైనా హాజరయ్యే సమస్యంలో డ్యాన్స్ చేయడానికి అనువుగా ఉండేలా మరొక డ్రెస్ కూడా వెంట తీసుకెళ్లడం ముఖ్యం. సేఫ్టీ పిన్స్, డ్రేప్స్, ఐ లాష్, గ్లూ, సూది–దారం వంటివి తప్పనిసరిగా ఉండాలి. – నిర్వహణ: ఎన్.ఆర్ -
దెయ్యం పట్టింది
కొత్తగా సున్నం వేసిన ఆ ఇల్లింకా పచ్చి వాసన కొడుతూ ఉండగానే వాళ్లిద్దరూ వచ్చి చేరారు. వచ్చి నెలైంది. కొత్తింటికి కొత్తగా సున్నం వేయడం ఏంటన్న ఆలోచన వాళ్లకు గానీ, వాళ్ల పెద్దవాళ్లకు గానీ రాలేదు! పద్దెనిమిదేళ్ల వయసున్న భార్య, ఇరవై ఏళ్ల వయసున్న భర్త మధ్య మొదలయ్యే గొడవ.. మధ్య యుగాల్లో ఫ్రాన్సు, ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన నూరేళ్ల యుద్ధంలా.. అలా ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందేమో అన్నంత అర్థరహితంగా కనిపిస్తుంది. ఆ వయసులో అమ్మాయి రోషంగా ఉంటుంది. అబ్బాయి మూర్ఖంగా ఉంటాడు. కొత్తగా సున్నం వేసిన ఆ ఇల్లింకా పచ్చి వాసన కొడుతూ ఉండగానే వాళ్లిద్దరూ వచ్చి చేరారు. వచ్చి నెలైంది. కొత్తింటికి కొత్తగా సున్నం వేయడం ఏంటన్న ఆలోచన వాళ్లకు గానీ, వాళ్ల పెద్దవాళ్లకు గానీ రాలేదు! అమ్మాయి, అబ్బాయి బిలో ట్వంటీ ట్వీంటీవన్. అబ్బాయికైతే పెళ్లయినట్లే లేదు. బ్యాచిలర్‌గా ఎలా ఉన్నాడో మ్యారీడ్గా కూడా అలానే ఉన్నాడు. భార్యని ఫీల్ అవడం, భార్య అని ఫీల్ అవడం ఇంకా మొదలవలేదు. అమ్మాయి హ్యాపీగా ఉంది. పెళ్లితో కొత్తగా వచ్చిన హ్యాపీనెస్ కాదది.అమ్మాయిల్లో సహజంగానే తొణికిసలాడే సంతోషం. పెళ్లికి ముందెలా ఉందో, పెళ్లి తర్వాతా ఆమె అలానే ఉంది. తన పని తను చేసుకుంటుంది. ఇప్పుడు ఇంకొకరి పని చేస్తోంది. ఆ ఇంకొకరు తన భర్త అని, భర్త కాబట్టి భర్త పని కూడా తనదే అనుకునీ ఆమేం చెయ్యడం లేదు. ఇంట్లో ఇద్దరో ముగ్గురో నలుగురో ఉన్నప్పుడు అలవాటైన పనులు, అలవాటుగా చేసే పనులు ఉంటాయి కదా.. అలా చేస్తోంది.పెద్దవాళ్ల బాధ్యతను తీర్చడానికా అన్నట్లు వీళ్లు భార్యాభర్తలయ్యారే కానీ, భార్యాభర్తలుగా మాత్రం లేరు. ఆమె ఇంకా చదువుతోంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్. అతడు ఇంకా ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. ఇంటికెవరైనా గెస్టులు వచ్చి చూస్తే.. పూర్తిగా ఇది పెద్దవాళ్ల తొందరపాటు వల్ల జరిగిన పెళ్లి అని వాళ్లకు ఏ మూలో అర్థమైపోతుంది. ఈ వయసులో జరిగే పెళ్లిళ్లు సాధారణంగా.. జరిగిన పెళ్లిళ్లు అయి ఉండవు. చేసుకున్న పెళ్లిళ్లు అయి ఉంటాయి. చేసుకున్న పెళ్లిలో దంపతుల మధ్య పెద్దలు ఉండరు. ప్రేమ ఉంటుంది. ఈ జంట మధ్య ప్రేమ లేదు. పెద్దలు ఉన్నారు. వీళ్లున్న ఇంట్లో ప్రస్తుతం పెద్దలెవరూ లేరు. ప్రేమా లేదు. వీళ్లిద్దరు మాత్రమే ఉన్నారు. అయితే వీళ్లకు తెలీకుండా మరో ఇద్దరు కూడా ఆ ఇంట్లో ఉన్నారు! ఆ ఇద్దరూ ఇంకో జంట. ఇంచుమించు అదే వయసున్న జంట. కొన్ని నెలల క్రితమే ఆ ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయిన జంట. పెళ్లి చేసుకున్నా వదిలిపెట్టకుండా ఇద్దర్నీ వేరు చేద్దామని ఆ ఇద్దరి తల్లిదండ్రులు రకరకాల ప్రయత్నాలు చేశారు. కలిసి చనిపోతే ఇక తమనెవరూ వేరు చేయలేరని ఆ జంట ఆత్మహత్య చేసుకుంది. శరీరాలు వేర్వేరుగా అక్కణ్ణుంచి వెళ్లిపోయాయి. ఆత్మలు మాత్రం ఒకటిగా ఆ ఇంట్లోనే ఉండిపోయాయి. అది ఆ ఇంటాయనకూ తెలీదు. ఈ కొత్త జంటకు తెలిసే అవకాశం లేదు. ఎప్పట్లా ఇద్దరి మధ్యా యుద్ధం మొదలైంది. ఎక్కడ మొదలైందో, ఎలా మొదలైందో మర్చిపోయారు. యుద్ధమే జీవిత పరమార్థంగా కత్తులు, కటార్లు విసురుకుంటున్నారు. అమ్మాయి వంటింట్లో గిన్నెలు ఎత్తి పడేసింది. అబ్బాయి గోడను కాలితో ఒక్క తన్ను తన్నాడు.‘‘నువ్విలాంటి మనిషివని అనుకోలేదు. మీ తాత నీ పెళ్లి చూసి చచ్చిపోవాలని అశపడుతున్నాడని, మీవాళ్లు మావాళ్లను ఒప్పించి నన్ను నీకిచ్చిపెళ్లి చేశారు. ఖర్మ. ఆయన చావు నా పెళ్లికొచ్చింది’’ అని నుదురు కొట్టుకుంది అమ్మాయి.‘‘మాటలు జాగ్రత్తగా రానియ్’’ అని కళ్లెర్ర చేశాడు. ‘‘జాగ్రత్తా!! ఏదీ మళ్లీ అనూ’’ అని ముందుకొచ్చింది అమ్మాయి. అబ్బాయి ఉగ్రుడయ్యాడు. ‘‘నీది కాదు, నాదీ ఖర్మ. నీలాంటి దాన్ని చేసుకున్నందుకు! అబ్బాయి నచ్చాడని మీవాళ్లొచ్చి అడిగితే ‘అమ్మాయి బాగుందిరా.. చేసుకో’ అని మావాళ్లు నన్నుబలవంత పెట్టారు. నాకేం తెలుసు బుద్ధి కూడా ముఖంలాగే ఉంటుందనుకున్నాను’’ అన్నాడు. అమ్మాయికి కాస్త జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం చేత అతడు తననేం అన్నదీ గ్రహించింది. ‘‘ఇప్పుడే ఫోన్ చేసి చెప్పేస్తాను. నువ్వు అన్‌ఫిట్ అని మావాళ్లకు చెప్పేస్తాను’’ అని ఫోన్ తీసుకుంది. ‘అన్‌ఫిట్’ అనే మాటకు అబ్బాయి ఒణికిపోయాడు.‘‘దెయ్యంలా దాపురించావు నా బతుక్కి’’ అని పెద్దగా అరిచేశాడు. ఆ అరుపుకి.. అమ్మాయేం బెదరలేదు కానీ, అప్పటివరకు వాళ్లిద్దర్నీ గెడ్డం కింది చెయ్యి ఆన్చుకుని చూస్తూ ఉన్న ఆ రెండు ఆత్మలు ఉలిక్కిపడి.. ‘దెయ్యంలా’ అనే మాటకు నొచ్చుకున్నాయి. ఆ నొచ్చుకోవడం అక్కడితో ఆగలేదు. ‘‘ఏంటలా ఊగిపోతున్నారు! దెయ్యం పట్టినట్లుగా..’’ అన్నారు.. సడెన్‌గా ఊరినుంచి దిగిన మామగారు.. కూతుర్నీ, అల్లుణ్ణీ ఆ వార్ సీన్లో చూసి! ఆ మాటకు ఇంకా నొచ్చుకున్నాయి ఆ రెండు ఆత్మలు. మామగారి పక్కనే అత్తగారూ ఉన్నారు. వాళ్లు తలుపుకొట్టి రానవసరం లేకుండానే తలుపు తెరిచి కొట్లాడుకుంటున్నారు అమ్మాయీ.. అబ్బాయీ.‘‘దెయ్యం నాకు కాదు. మీ కూతురికి పట్టింది’’అన్నాడు అబ్బాయి ఉక్రోషంగా. ‘‘నాకు కాదు.. నీకే దెయ్యం పట్టింది’ అంది అమ్మాయి. ‘‘ఇద్దరీకి పట్టింది. ఇక ఊర్కోండి’’ అన్నారు అమ్మాయి తల్లిదండ్రులు.ఆ క్షణమే అనుకున్నాయి ఆ రెండు ఆత్మలూ.. నిజంగా దెయ్యం పడితే ఎలా ఉంటుందో చూపించాలని. చూపించాయి కూడా. ఆ రాత్రికే! ‘‘అబ్బాయికి సున్నుండలు ఇష్టమని తెచ్చామమ్మా. నీకిష్టమైన నువ్వుండలు కూడా. అసలు అందుకోసమే వచ్చాం’’.. తెల్లారే తిరిగి ఊరెళుతూ చెప్పారు పెద్దవాళ్లిద్దరూ. వాళ్లలా వెళ్లిపోగానే భార్యను మీదకు లాక్కుని బలంగా హత్తుకున్నాడు అబ్బాయి. ‘‘నిజంగానే రాత్రి నీకేదో దెయ్యం పట్టింది’’ అన్నాడు నవ్వుతూ. ‘‘ముందు నీకు పట్టాకే నాకు పట్టింది’’ అంది అమ్మాయి అతడి ముక్కు మీద తన చూపుడు వేలితో మృదువుగా రాస్తూ. ఆత్మలు రెండూ ఈ దృశ్యాన్ని చూసి రెండు కన్నీటి బొట్లు రాల్చాయి. ఆ బొట్లు ఈ ఇద్దరి చెంపల మీదుగా జారాయి. ప్రేమ కరిగిందా? కాదు. ప్రేమకు దెయ్యం పట్టింది. -
సోనియాను పెళ్లాడిన హిమేష్
బాలీవుడ్ తారాల సీక్రెట్ పెళ్లిళ్ల జాబితా పెరుగుతోంది. ఎలాంటి హడావిడి లేకుండా పెళ్లిపీటలెక్కేస్తున్నారు బాలీవుడ్ స్టార్స్. ఇటీవల నేహాధూపియా ఎలాంటి ప్రకటన లేకుండా పెళ్లి చేసేసుకుంది. పెళ్లి రోజున తన భర్తను సోషల్ మీడియా ద్వారా అభిమానులకు పరిచయం చేసింది. తాజాగా మరో బాలీవుడ్ నటుడు ఈ లిస్ట్ లో చేరిపోయాడు. బాలీవుడ్ నటుడు, సంగీత దర్శకుడు హిమేష్ రేష్మియా టీవీ నటి సోనియా కపూర్‌ను వివాహం చేసుకున్నారు. హిమేష్‌కు ఇది రెండో వివాహం. గతంలో కోమల్‌ను పెళ్లి చేసుకున్న హిమేష్ ఇటీవల ఆమె నుంచి విడాకులు తీసుకున్నారు. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల మధ్య హిమేష్, సోనియాల వివాహం జరిగింది. -
ప్రేమ పేరుతో ప్రధానోపాధ్యాయుడి మోసం
శంషాబాద్ రూరల్(రాజేంద్రనగర్) : ప్రేమ పేరుతో మైనర్ బాలికను మోసం చేసిన ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని ముచ్చింతల్ ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న అక్బర్ స్థానికంగా ఉండే ఓ బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకున్నా డు. బాధితురాలు మూడు రోజుల కిందట శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
పెళ్లి చీర
‘‘అమ్మలూ! అమ్మ ఎక్కడే..?’’ సోఫాలో కూర్చొని ల్యాప్‌టాప్ వంక తదేకంగా చూస్తున్న ప్రతిమ దగ్గరకు వెళ్ళి అడిగాను నేను, గౌరి గురించి.‘‘అత్త ఫోన్ చేసింది అమ్మమ్మా!’’ అని ప్రతిమ చెప్పింది. ప్రతిమ దృష్టి ల్యాప్‌టాప్ మీదే ఉన్నట్టుంది. అందుకే పొడిపొడిగా బదులిచ్చింది. ఏదో పని చేసుకుంటున్నట్టంది.‘‘అమెరికానించా?’’ అనడిగా.‘‘అవునమ్మమ్మా!’’ అంది తల ల్యాప్‌టాప్ నుండి తిప్పకుండానే.‘ఏ రంగు...? అలా రంగులేమీ అనుకోలేదు..’ అని మంచం మీద కూర్చుని కులాసాగా నవ్వుతూ మాట్లాడుతోంది గౌరి. నావైపు చూసింది కుర్చోమని చెప్తున్నట్టుగా, మంచం మీద తడుతూ. వెళ్ళి గౌరి పక్కన కుర్చున్నా. ‘‘నువ్వు ఇక్కడే ఉంటే ఆ ముచ్చట్లవీ దగ్గరుండి చూసుకునేదానివి కదా...’’ అంటోంది గౌరి. నేను గౌరి వైపు చూసాను. నేను అలా చూస్తే మాత్రం ఆ ముచ్చటించుకుంటున్న ముచ్చట్లేవో నాకు తెలిసేటట్టు.‘‘లేదు లేదు. ఈ రంగు అని అనుకోలేదు. పెళ్ళి దానిది, కాబట్టి ప్రతిమకి ఏ రంగు నచ్చితే ఆ రంగు తీసుకుంటాం.’’ అంది గౌరి.అప్పటికి నాకు విషయం అర్థమైంది. వాళ్ళు మాట్లాడుకుంటున్నది పెళ్ళి చీర గురించి.నా మనవరాలు ప్రతిమ పెళ్ళి కుదిరింది. నేనిక్కడికి వచ్చింది కూడా ఆ పెళ్లి కోసమే. నేను వచ్చిన దగ్గరనుండి వింటున్న మాట ‘పెళ్ళి చీర’ గురించే. రోజుకి పదిసార్లు అయినా గౌరి పెళ్ళి చీర గురించి అనుకుంటూ ఉంటుంది.నా పెళ్ళి సమయంలో నేను కానీ మా అమ్మ కానీ పెళ్లిచీర గురించి ఇంత మాట్లాడుకున్నామా? నా ఆలోచనలు జ్ఞాపకాల్లోకి పరుగులు తీసాయి. నాకున్న మోకాళ్ళ నొప్పులు నా ఆలోచనలకి లేనట్టున్నాయి. సునాయాసంగా నా బాల్యాన్ని చేరుకున్నాయి అవి. మా అమ్మగారికి ఇద్దరు మగపిల్లల తరవాత మూడవ సంతానంగా పుట్టాను నేను. అమ్మ నన్ను చాలా మురిపెంగా చూసుకునేది. ఆటలాడుకుంటున్న వయసులో హఠాత్తుగా వచ్చి ‘నీకు పెళ్ళి’ అన్నారు.పెళ్ళి అయిపోయాక అత్తవారింటికి వెళ్ళిపోవాలని తెలియని వయసు నాది. పూల జడ కుట్టించుకుని, బుగ్గన చుక్క పెట్టించుకుని బుట్టలో కూర్చోడమే పెళ్ళి అనుకున్నాను అప్పుడు.మా అమ్మ ‘కాంతానికి మంచి చీర కొనాలి’ అని ఒకటి రెండుసార్లు అన్నదేమో. ఆకుపచ్చటి చీరకి ఎర్రని అంచు ఉన్న పెద్ద పట్టుచీర కొంది నాకోసం.‘‘కాంతం.. చీర ఎంత బాగుందో.. చాలా బాగుంది.’’ అని మా వైపు బంధువర్గం, మా అత్తింటి వారు అనడం నాకు జ్ఞాపకమే. ఆ చీర ఇప్పటిలా ఎక్కడికో బయటికి వెళ్ళి తీసుకురాలేదు. ఇంటింటికి తిరిగి చీరలు అమ్ముకునే ఒకతని దగ్గరే మా అమ్మ తనకు కావాల్సిన చీరలన్నీ కొనేది. నాకు కూడా అతని వద్దే కొంది. మా నాన్నగారు పెళ్ళి ఖర్చులను దృష్టిలో పెట్టుకుని ఏదో కొంత పైకం నా చీర నిమిత్తం మా అమ్మకు ఇచ్చారు. ఆ పెళ్ళి చీర బేరం చేస్తున్న రోజున – ‘‘ఏదీ.. ఆ చీర పైకి తియ్యి...’’ మా అమ్మ అమ్ముకునే అతనితో అంది. నేను మా అమ్మ పక్కనే కూర్చుని ఉన్నాను.‘‘ఏదమ్మగారూ?’’ అతను అడిగాడు. ఆ మూటలో చాలా చీరలు ఉన్నాయి. ‘‘ఇదీ..’’ అంది మా అమ్మ వేలు పెట్టి ఒక చీరని చూపించి. నేనూ అసక్తిగా చూస్తున్నాను. ఆ మూటలో పాతిక, ముప్ఫై చీరలు ఉంటాయేమో. అన్ని చీరలూ గొప్పవేమీ కావు. ఆ మూట కాక అతని వద్ద విప్పని ఇంకొక మూట ఉంది.మా అమ్మ అడిగిన చీర బయటకి తీసాడతను. మా అమ్మ వెంటనే ఆ చీరని నా భుజం పైన వేసి చూసింది. ‘‘అమ్మాయి గారికి ఈ రంగు బాగా నప్పింది.’’ అన్నాడతను.‘‘మా కాంతానికి చంద్రకాంతం లేకపోతే ఎలాగ.?’’ అని అమ్మ అంటూ ఉండగా అటువైపు వెళుతున్న నాన్నగారు అన్నారు – ‘‘చాల్చాలు ఇంకెన్ని చీరలు? ఆ మొదటి దానికి డబ్బిచ్చి అతన్ని తొందరగా పంపూ. అవతల చాలా పనులున్నాయి’’.నాన్నగారి మాటలకి అప్రమత్తం అవుతూ.. ‘‘ఈ చీరెంత?’’ అని గుసగుసగా అడిగింది అమ్మ. అతను ఏదో చెప్పేలోపే, ‘‘ఏమేవ్!’’ మా నాన్నగారు సింహంలా కేక వేసారు. మా అమ్మ అతనికేదో సైగ చేసి ఒక చీరకి డబ్బిచ్చి పంపేసింది. నా భుజం మీద చీరని అతను పట్టుకుని వెళ్ళిపోతుంటే ఆ రంగు నాకు ఎలా ఉందో అద్దంలో చూసుకోలేకపోయానే అనే బాధ అలాగే ఉండగా అతను వెళ్ళిపోయాడు. తరువాత నేనూ ఆ సంగతి మర్చేపోయాను. కానీ ఎలా వచ్చిందో మరి.. పెళ్ళి రోజున మళ్ళీ ఆ చీర కనిపించింది నాకు.‘‘అమ్మా! అమ్మా! ఈ చీర ఎప్పుడు కొన్నావే?’’ నేను హడావుడిలో కూడా మా అమ్మని అడిగాను. మా అమ్మ ‘ష్!’ అంది కానీ ఇంకేం చెప్పలేదు.కానీ పరుగున వెళ్ళి నాకు అ రంగు ఎలా నప్పుతుందో అద్దంలో ఆ రోజు చూసుకోనేలేదు నేను. ‘‘అమ్మా! భోజనం చేస్తావా?’’ అన్న గౌరి పిలుపుతో నా పెళ్ళి వయసు నుండి మనవరాలున్న వయసులోకి వచ్చేశాను. పెళ్ళి చీర అనగానే నాకు ఆ రెండు చీరలు, అవి ఎలా కొన్నది జ్ఞాపకం వచ్చాయి. ‘‘ఏమిటి? అంత దీర్ఘాలోచన?’’ అని అడిగింది గౌరి.‘‘ఏం లేదు. ఇంతకీ నీ ఆడపడుచు ఏమంటోందేమిటి?’’ అని అడిగాను.‘‘ఏముంది... రేపు బట్టలు కొనడానికి వెళ్ళాలి అంటేను, ప్రతిమకి ఏ రంగు చీర కొంటావ్ పెళ్ళి పీటల మీదకి, అని అడుగుతోంది.’’ అంది గౌరి. కాసేపు ఆలోచనల్లో పడింది. ‘అయినా రేపు వెళ్తాం కదాకొనడానికి, జాగ్రత్తగా చూసి కొనాలి‘ అని తనలో తను అనుకున్నట్టే పైకి అంది. ‘‘ప్రతిమ అత్తగారు కూడా వస్తామని అన్నారు కదా?’’ పెళ్ళిచీర కొనడానికి నేను, గౌరి, ప్రతిమ కార్లో వెళ్తోంటే గౌరితో అన్నాను. గౌరి ముందు సీట్లో మా అల్లుడుగారి పక్కన కూర్చుని ఉంది. అక్కడ నుండే తల తిప్పి, ‘‘ఆవిడ వస్తానని అన్నారు కానీ కుదరలేదుట. వాళ్ళ అబ్బాయి అయినా వస్తాడని అనుకున్నాం.’’ అంది గౌరి.‘‘ఏమే అమ్మలూ! అతను ఎందుచేత రావడంలేదు.’’ అని ప్రతిమని అడిగాను. ప్రతిమ ఫోన్‌తో చాలా బిజీగా ఉంది. నాకు సమాధానం కూడా ఫోన్ నుండి తల తిప్పకుండానే ఇచ్చింది – ‘‘తనకు ఈ షాపింగ్లూ అవీ నచ్చవుట అమ్మమ్మా!’’. కారు నడుపుతున్న మా అల్లుడు కిసుక్కున నవ్వి, ‘‘తెలివైనవాడు’’ అన్నాడు. గౌరి కనుచివర్ల నుండే భర్తని కోపంగా చూసింది.‘‘షాప్ ఇదేనా నువ్వు అనుకున్నది’’ అంటూ అల్లుడు తెలివిగా గౌరి కోపాన్ని మాయం చేసాడు. ‘‘ఇదే!’’ అని గౌరి చెప్పాక కారు ఆగింది. ‘‘మీరూ రండీ’’ బట్టల దుకాణం ముందు మేము ముగ్గురం దిగిపోయాక గౌరి భర్తతో అంది. ‘‘లేదు. నాకు పని ఉంది. మీరు వెళ్ళి రండి, మీ పని అవ్వగానే ఫోన్ చేస్తే నేను వస్తాను.’’ అని అల్లుడు అనగానే ప్రతిమ గౌరి వైపు చూసి చిన్నగా నవ్వింది.‘‘అమ్మా! ఈ చీర ఎప్పుడు కొన్నావే? ఇందాకటి నుండి అనుకుంటున్నాను’’ అని అల్లుడు వెళ్ళీ వెళ్ళగానే అడిగింది గౌరి, బట్టల దుకాణం మెట్లు ఎక్కుతుంటే. ‘‘ఇదా?’’ నేను కట్టుకున్న ఉల్లిపాయ రంగు పట్టుచీర వైపు చూపిస్తూ అడిగాను. ‘‘అవునూ!’’ అంది. ‘‘ప్రతిమ చిన్నప్పుడు కొన్నది’’ అని నేను చెప్పగానే గౌరి నమ్మలేనట్లుగా చూస్తూ, ‘‘అయినా ఎంత మెరుపుగా ఉందో,’’ అంటూ తన చీర వైపు చూసుకుంటూ, ‘‘ఇది కొని మూడేళ్లు కూడా కాలేదు. చూడూ, నీ చీర ముందు ఎంత వెలవెలపోతోందో’’ అంది.‘అలా ఏం కాదే బాగుంది.’’ అన్నాను. నేనేమీ గౌరి కోసం చెప్పలేదు. దాన్ని సాయంత్రం సంపెంగపండు రంగు చీరలో చూసిన దగ్గర నుండి అనుకుంటున్నాను, సంధ్యాదీపంలా మెరిసిపోతోంది అని. ‘‘నీకు వయసు అయిపోయింది. అందుకే అలా అంటున్నావ్’’ అంది. గౌరి వేళాకోళానికే అన్నదని తెలిసిపోతోంది.‘‘ఇందాకటి నుండి నీ గురించి సంధ్యాదీపంలా ఉన్నావ్ అని అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పూ... నాకు వయసు అయిపోయిందా?’’ అని అడిగాను.ప్రతిమ ఫకాలున నవ్వింది. మౌనంగా మారడం గౌరి వంతయ్యింది.ముగ్గురం కలిసి ఆ పెద్ద బట్టల షాపులో అడుగుపెట్టాం. నేను ఇంత పెద్ద బట్టల దుకాణానికి రావడం ఇదే మొదటిసారి. లోపలికి వెళ్ళీ వెళ్ళగానే పెద్ద లక్ష్మి దేవి విగ్రహం, పక్కనే రెండు పెద్ద ఇత్తడి దీపపు సమ్మెల్లో దీపం వెలుగుతోంది. ఆ విగ్రహం ముందు అర్చక స్వామి కూర్చొని ఉన్నాడు. సన్నగా కీర్తనలు వినిపిస్తున్నాయి. ముక్కుకి అగరబత్తి పరిమళం తెలుస్తోంది. ఎటు చూసినా చీరలే. మమ్మల్ని చెప్పులు విడిచి చీరలు చూడటానికి వెళ్ళమన్నారు. నాకు ఆ చీరల అంగడిని చూడగానే ఇంటికి చీరల వాడు తెచ్చిన చీరల మూట గుర్తుకు వచ్చింది. ఇక్కడ చీరల సంఖ్య లక్షల్లో ఉండి ఉండచ్చు. ‘‘ఇది దుకాణంలా లేదు, గుడిలా ఉంది’’ అన్నాను గౌరితో.‘‘నాకు జరిగినట్టు ప్రతిమకి జరగకూడదనే ఎంతోమందిని ఎన్నోసార్లు వాకబు చేసి ఈ షాప్ గురించి తెలుసుకున్నాను.’’ అంది గౌరి గొప్పగా. ఆ మాట అనేసి గౌరి చీరలు చూడటంలో పడిపోయింది. నేను మాత్రం అక్కడే ఆగిపోయాను. గౌరికి నేనూ ఏం తక్కువ చెయ్యలేదు. కానీ ఎందుకు గౌరి అలా అన్నది అన్న చింతన మొదలయ్యింది. ఆ చింతనే నన్ను మళ్ళీ గతంలోకి లాక్కెళ్ళిపోయింది. గౌరి చదువు పూర్తి కావస్తుండగా మా అత్తగారి తరుపు వేలు విడిచిన బంధువొకడు ఆవిడ చెవిన ఒక మాట వేసి వెళ్ళాడు, ‘‘మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి అని చెప్పటం కాదు కానీ ఆజానుబాహుడు, అందగాడు, ఆస్తిపరుడు, ప్రభుత్వోద్యోగి, తల్లిదండ్రులకి ఆఖరి సంతానం. మన గౌరమ్మ అక్కడ అడుగుపెడితే అంతే! ఇక చూసుకోవక్కర్లేదు.’’ అని. అంతే! మా అత్తగారు అబ్బాయిని నేరుగా చూడక మునుపే మాట మాత్రానికే, ‘‘తల్లీ కామాక్షీ! నా మనవరాలికి ఈ సంబంధం ఖాయం అయితే నీ దగ్గరికి వస్తాను తల్లీ!’’ అని మొక్కేసుకున్నారు. మొక్కు మహిమో లేక భగవంతుడే వేసిన బంధమో గౌరికి అదే సంబంధం ఖాయం అయిపోయింది. వెంటనే మా అత్తగారికి మొక్కు చెల్లించేసుకురావాలనే ఆదుర్దా మొదలయ్యింది. మా మరిదిగారిని వెంట తీసుకుని కంచి బయలుదేరారు. పెళ్ళి పనుల తాకిడి ఎక్కువగా ఉండటంతో మేము వెళ్ళడం కుదరలేదు. అత్తగారు అక్కడికి వెళ్ళడం వలన, పట్టుచీరల విషయంలో కంచికి ఉన్న ప్రాశస్త్యంవల్ల గౌరికి అక్కడ నుండే చీరలు తెప్పించాం.పెళ్ళికి వచ్చిన ప్రతీ ఒక్కరూ చీరని పొగడకుండా వెళ్ళింది లేదు. ‘‘అమ్మా! చూడూ.. ఆ చీర ప్రతిమకి నప్పిందా?’’ అంటూ పిలిచింది గౌరి. ఆ పిలుపుకి నా ఆలోచనలు కాస్త విశ్రమించాయి. దుకాణంలోని ఒక అమ్మాయి చీరని పూర్తిగా విప్పకుండానే చీర కట్టినట్టు చీరని ప్రతిమకి చక్కగా చుట్టబెట్టింది. ‘బావుంది’ అని పైకి అన్నానే కానీ మనస్ఫూర్తిగా నా భావాన్ని వెల్లడించడానికి నేను ప్రతిమకి కట్టిన చీరని చూడనేలేదు. గౌరి అది గమనించినట్టుంది. ప్రతిమకి మరో చీర కూడా కట్టి చూడమని చెప్పి, ‘‘ఏమైందమ్మా! ఏమైనా ఇబ్బందిగా ఉందా?’’ అని అడిగింది. ‘‘లేదు’’ అని చెప్పినట్టు తల అడ్డంగా ఊపాను. అయినా గౌరి ఊరుకోలేదు. నేను నోరు మెదిపేదాకా అడుగుతూనే ఉంది. ‘‘నీకు మేం ఏం తక్కువ చేసాం చెప్పూ? ఆ రోజుల్లో కంచి నుండి చీర వేలు పోసి తెప్పించాం. నీకు జరిగినట్టు ప్రతిమకి జరగకూడదని ఎందుకన్నావ్?’’ అని ఉండబట్టలేక అడిగేసాను. గౌరి అన్నిసార్లు అడగబట్టి కానీ లేదంటే ఆ విషయం చెప్పేదాన్ని కాదేమో!గౌరి చిన్నగా నవ్వీ ‘‘అందుకా ఇంత ఆలోచనా?’’ అంది.‘‘నీకూ ఒక కూతురుంది, అది నిన్ను ఇలా అంటే అప్పుడు అర్థమవుతుంది నీకు నా బాధ’’ అని చెప్పాను నేను.‘‘అది కాదమ్మా! చీర ఖరీదు ఎంత, అది ఎక్కడ నుండి తెప్పించాం అన్నదే కాదు కదా.. ఆ రోజుల్లో నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళవాళ్ళ పెళ్ళి చీరలు వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. కానీ నా విషయంలో అలా జరగలేదనే చిన్న బాధ మిగిలిపోయింది అంతే!’’ అంది.‘‘నువ్వు అప్పుడే చెప్పవలిసింది.’’‘‘అప్పుడు నాకు అంత వయసు లేదు కదే, చెప్తే ఎవరు ఏమంటారో అని నోరు తెరవలేకపోయాను.’’ అంది నవ్వుతూ. నేను ఇంక ఏం మాట్లాడలేదు. మళ్ళీ గౌరి కూతురికి నచ్చిన చీర కొనే పనిలో పడింది. అక్కడ సూపర్వైజర్ అన్ని రకాల చీరలు ఓపికగా చూపిస్తున్నాడు. ఒక్కో చీరకి ఒక్కో పేరు. వెయ్యి రూపాయలు మొదలుకొని లక్ష రూపాయల వరుకు ఎన్నో రంగుల్లో రకరకాల పేర్లు చెప్తూ చాలా చీరలు చూపించాడు సూపర్వైజర్. గౌరి చిన్నతనంలో ఇన్ని రకాల పేర్లతో చీరలు లేనే లేవు. ఇన్ని చీరల్లో ఏ ఒక్కటీ ప్రతిమని మురిపించలేకపోయింది. ఒక చీర రంగు నచ్చితే అందులో డిజైన్ నచ్చలేదు. డిజైన్ నచ్చిన చీర రంగు తన మేని ఛాయకి సరిపడదని ఇలా ఒక్కో చీరకి ఒక్కో వంక చెప్తూ చాలా సమయం గడిపేసింది కానీ ప్రతిమ ఒక్క చీర కూడా కొనలేదు. గౌరి ముఖంలో వెలుగు మాయం అయ్యింది కానీ, సూపర్వైజర్ పెదాల మీద నవ్వు చెక్కు చెదరలేదు. ప్రతిమలాంటి వాళ్ళని చాలా మందిని చూసి ఉంటాడు. ‘‘అయితే ఏం ఒద్దా?’’ గౌరి ప్రతిమని అడిగింది విసుగ్గా. ‘‘నాకు ఇక్కడ అంతగా నచ్చలేదు.’’ అని నిర్మొహమాటంగా చెప్పిన ప్రతిమని ఏమనాలి? ఇంత పెద్ద దుకాణంలో ఇన్ని లక్షల చీరల్లో దానికి ఒక్కటి కూడా నచ్చలేదంటే నేను ఆశ్చర్యపోయాను. గట్టిగా మాట్లాడలేక గౌరి నీరసంగా ముఖం వేలాడేసింది. ‘‘దాని సంగతి వదిలేయ్. నువ్వు ఏదైనా తీసుకో’’ అన్నాను నేను గౌరితో.‘‘ఇప్పుడు నాకేం ఒద్దే’’ అంది గౌరి విసుగ్గా.‘‘ఏమిటి ఒద్దంటావ్? పెళ్ళి పీటల మీద కన్య ధార పోసేటప్పుడు నువ్వు కట్టుకోవు కొత్త చీర?’’ అని నేను అనగానే గౌరి ఒద్దని చెప్పబోతే, ‘‘అప్పుడెలాగో నీ ముచ్చట గ్రహించలేకపోయాను. ఇప్పుడైనా నువ్వు ఇష్టపడి ఒక్క చీర కొనుక్కుంటే నేను సంతోషిస్తాను. నీ కూతురి పెళ్ళి వయసు వచ్చేంత ఆలస్యం చేసాను. అదే నన్ను గుంజుతోంది. నేను ఇంకా బాధపడేలా చెయ్యకు తల్లీ!’’ అన్నాను గౌరితో.గౌరి ముఖంలో వెలుగు మళ్ళీ తిరిగి వచ్చింది. ‘సరే’ అని నవ్వింది. సూపర్వైజర్కి మళ్ళీ పనిపడింది. ‘‘అమ్మమ్మా!’’ ప్రతిమ సంబరంగా నాకు కునుకు పడుతున్న సమయంలో వచ్చి పిలిచింది. కళ్ళు తెరిచి చూస్తే ప్రతిమే కాదు గౌరి కూడా ఉంది దాని పక్కనే. నేను వెంటనే గడియారం వంక చూసాను. గంట పన్నెండవుతోంది. ఏమైంది ఈవేళప్పుడు అని కంగారుగా లేచి కూర్చుని, ‘‘ఏమిటమ్మలూ?’’ అని అడిగాను.‘‘నా పెళ్ళిచీర చూపించేందుకు వచ్చాను.’’ అంది ప్రతిమ సంబరంగా.‘‘పెళ్ళిచీరా!?’’ మేం వెళ్ళిన దుకాణం నుండి తిరిగి వచ్చిన తరువాత ఆ వారం రోజుల్లో మరో దుకాణానికి వెళ్ళింది లేదు. నాకు చెప్పకుండా గౌరి వెళ్ళదు. మరి ఎలా? ఎప్పుడు? ఎక్కడ? కొన్నారు ప్రతిమకిచీర అని మనసులో అనిపిస్తూ ఉండగా, ‘‘ఏది చూడనీ?’’ అన్నాను.నా చేతికి ప్రతిమ చీర ఉన్న అట్టపెట్టే ఇస్తుందని అనుకుంటే ల్యాప్‌టాప్ అందించింది. బరువుగా ఉండి పట్టు సడలబోతుండగా, ‘‘ల్యాప్‌టాప్ అమ్మమ్మా! జాగ్రత్తా!’’ అని ప్రతిమ అన్నాక నా కళ్ళు బాగానే పని చేస్తున్నాయి అనుకున్నాను. ‘‘చీర అన్నావ్..’’‘‘ఇదిగో అమ్మమ్మా!’’ అంటూ స్క్రీన్ మీద వేళ్ళతో ముట్టుకుని ఏదో చేసేసరికి ఎదురుగా ప్రతిమ ఫొటో వచ్చింది. అందులో చీర కట్టుకుని ఉంది ప్రతిమ. ఆ చీర రంగు ఇది అని నేను చెప్పలేను. ‘‘ఎలా ఉంది?’’ అని అడిగింది మెరిసిపోతున్న వదనంతో.‘‘బావుందమ్మా!’’ అన్నాను మామూలుగా.‘‘చూడూ! నీ కన్నా అమ్మమ్మ బెటర్, వెంటనే బావుందని చెప్పింది.’’ అంటూ ఆ ల్యాప్‌టాప్ తీసుకుని ప్రతిమ అక్కడి నుండి వెళ్ళిపోయింది. నాకు ప్రతిమ కొనుక్కున్న చీర సరిగ్గా గుర్తు కూడా లేదు. ప్రతిమ అలా గది దాటగానే, ‘‘నిజం చెప్పూ... చీర ఎలా ఉంది?’’ అని అడిగింది గౌరి.‘‘బాగుందే..!’’ అన్నాను. ప్రతిమకి నచ్చింది కదా అంతే చాలు అనిపించింది నాకు. ‘‘ఏం బాగుందే... అసలు ఆ బట్ట ఏమిటో, మామూలుదో, మంచిదో కాదో ఏం తెలీదు.దాని ఫ్రెండ్స్ ఎవరో ఇలా చేసారట. ఇది కూడా అలాగే కొనుక్కుంటుందిట. చీర ఎవరి ఇష్ట ప్రకారమో కాకుండా దానికి నచ్చిన తీరులో డిజైన్ చేయించుకుంటుందిట. పైటంచంతా ముత్యాలు వచ్చేస్తాయిట. డిజైనంతా రాళ్ళూంటాయిట. ఏమిటేమిటో చెప్తోంది ప్రతిమ. నాణ్యత చూడద్దే అంటే ఇంత ఖరీదుంది నాణ్యత అదే ఉంటుంది అంటుంది.’’ అని విసుగ్గా చెప్పింది గౌరి.‘‘పోనీలేవే....పెళ్ళి దానిది, చీర కట్టుకోవలిసినది అది. దానికి నచ్చితే మనకి సంతోషమే కదా...’’ అని నచ్చజెప్పచూసాను.‘‘అది కాదమ్మా! ఇన్ని వేలు పోసినప్పుడు కాస్త మంచిది, జీవితాంతం గుర్తుగా ఉండిపోయేది అయితే బావుంటుంది కదా...’’ అంది గౌరి నిట్టూరుస్తూ.‘‘నువ్వు అన్నది నిజమే, నేను అలా ఆలోచించే ఆ రోజు మీ నాయనమ్మ నీకు అక్కడ నుంచి చీర తీసుకువస్తానని అంటే సరే అన్నాను. కానీ ఇప్పుడు నీ మనసులో ఉన్న లోటు తెలుసుకున్న తరువాత అనాలోచితంగా ప్రవర్తించానా? అనిపించింది.’’ అని నేను చెప్పాక గౌరి ఏం మాట్లాడక మౌనంగా మారింది.‘‘పెళ్ళే కాదు... పెళ్ళి చీర కూడా ప్రతి ఆడపిల్ల జీవితంలో ఒక మధురమైన విషయం. అది ఒక జ్ఞాపకం మాత్రమే శాశ్వతం కాదు. అది ఇష్టపడి ఎంచుకోవడంలో కలిగే ఆనందం, అనుభూతి మాత్రమే శాశ్వతం. నువ్వు నీ కూతురికి అలాంటి అనుభూతిని మిగల్చబోతున్నావ్. రేపు నాలాగా నువ్వు ‘అయ్యో!’ అని బాధపడనవసరం లేదు. నేను ఇప్పుడు నీకు చెప్పిన విషయం అమ్మమ్మగా మనవరాలి పెళ్ళి సమయంలో తెలుసుకోవడం నాకు ఎంత బాధగా ఉందో!’’ అన్నాను నేను. ‘‘ఛ! అలా అంటావేంటమ్మా! ఇప్పటికీ ఆ చీర చెక్కు చెదరలేదు. నేనే ఏదో తెలియక బాధపడ్డాను. ఇప్పుడు ప్రతిమని చూసాక మీరు చేసిన పని ఎంత మంచిదో అర్థమవుతోంది.’’ అని నా పక్క నుండి లేస్తూ, ‘‘ఆలస్యం అయ్యింది నిద్రపో.’’ అని చెప్పి గౌరి వెళ్ళిపోయింది.ఈ సందర్భాన్ని గౌరి ఒకలా అర్థం చేసుకుంటే నేను మరోలా అర్థం చేసుకున్నాను. మా తరం అమాయకత్వంలో కొట్టుకుపోయింది. గౌరి తరం బయటపడటం సబబో కాదో తెలియని సందిగ్ధంలో కొట్టుకుపోయింది. ప్రతిమ తరం గురించి ఏమనుకోవాలో ఈ మారుతున్న పోకడకి ఏ పేరు పెట్టాలో నాకు అర్థం కావడం లేదు.ఆడపిల్ల తన హక్కుని వినియోగించుకుంటోంది అనుకోవాలా? సొంతంగా నిర్ణయం తీసుకునే సమర్ధతని పొందింది అనుకోవాలా? తమకి ఏం తెలియదులే ఇంత రాణిస్తున్నాం నేటి ప్రపంచంలో అని దూసుకుపోతోంది అనుకోవాలా?ఇలా నాలో సాగుతున్న ఈ ఆలోచనలు నాకే వింతగా తోచాయి.ఏది అయితేనేం ఆనందంగా ప్రతిమ పెళ్ళి చీర కొనుక్కుంది. దీని మీద అనవసరమైన చర్చలు చేసి లాభనష్టాలు దానికి తెలిసేలా చేస్తే దాని వల్ల ప్రతిమకి మిగిలేది బాధే. గౌరికి కాలం ఎలా కొన్ని విషయాలని తెలియజెప్పిందో రేపు ప్రతిమకీ అదే కాలం అన్నీ తెలియజేస్తుంది. అప్పటి దాకా నేనుంటే చూస్తాను. లేదంటే ఎలా జరగవలిసినది అలా జరగక ఆగిపోతుందా? అనుకుని కళ్ళు మూసుకున్నాను. ఎంత ప్రయత్నించినా ప్రతిమ కొత్తగా కొనుకున్న ఆ పెళ్ళిచీర ఎలా ఉన్నది గుర్తుకురావడం లేదు. దానికి గుర్తుంటే చాలును కదా అని నాలో నేనే నవ్వుకుని నిద్రపోయాను. -
పోలీసుల సమక్షంలో ఏకమైన ప్రేమికులు
సాలూరురూరల్(పాచిపెంట): ఓ ప్రేమ జంట పోలీసుల సమక్షంలో ఏకమైంది. ఏడాదిన్నర కాలంగా ప్రేమించుకున్నారు. పెళ్లికి అబ్బాయి తరపు వాళ్లు అడ్డుపడి, వేరే అమ్మాయితో పెళ్లికి ముహుర్తం కూడా తీసేశారు. విషయం తెలుసుకున్న అమ్మాయి స్థానికంగా ఉన్న స్ఫూర్తి మహిళా మండలి సభ్యులను ఆశ్రయించారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇద్దరు ప్రేమపక్షుల పెళ్లి జరిగింది. ఎస్టీ,ఎస్సీ సెల్ డీఎస్పీ గురుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం..పాచిపెంట మండలం పి.కోనవలస పంచాయతీ గంగందొరవలస గ్రామానికి చెందిన పండిక వరలక్ష్మీ అనే అమ్మాయి, అదే మండలం గడివలస గ్రామానికి చెందిన బెవర భానుప్రకాశ్ అనే వ్యక్తి ఏడాదిన్నరగా ప్రేమించుకున్నారు. అమ్మాయి ఎస్టీ, అబ్బాయి బీసీ సామాజిక వర్గాలకు చెందినవారు. విషయం తెలుసుకున్న అబ్బాయి తల్లిదండ్రులు వేరే పెళ్లికి సిద్ధమవడంతో అమ్మాయి. స్థానిక స్ఫూర్తి మహిళా మండల అధ్యక్షురాలు బలగ రాధను ఆశ్రయించారు. ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ సన్యాసినాయుడు ఇరువర్గాల పెద్దలను స్టేషన్‌కు పిలిపించారు. అబ్బాయి తరపు వాళ్లు అంగీకరించనప్పటికీ ఇద్దరు మేజర్లు కావడంతో తొలుత అమ్మాయి ఇంటి వద్ద గంగందొరవలసలో వివాహం చేసి, తర్వాత సాలూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో సంతకాలు చేయించారు. -
జీవితం... చక్కదిద్దింది
జీవితాన్ని చక్కదిద్దుకోడానికినాలుగిళ్లు చక్కదిద్దగలిగితే?!అరె! భలే ఉందే ఐడియా!ఇళ్లను అందంగా సర్ది..తన జీవితాన్నీ అంతే అందంగాతీర్చిదిద్దుకున్న ఓ సుగంధ కథ ఇది. చదువు లేని సుగంధ..భర్తలేని సుగంధ..డబ్బు లేని సుగంధ..ఆదరించేవారు లేని సుగంధ.. కథ ఇది! ఒక చేత్తో బిడ్డను, ఒక చేత్తో పెట్టెను మోసుకుంటూముంబైలో దిగగానే.. ఒంటరి స్త్రీకి ఈ సమాజంలో ఎదురయ్యేవన్నీసుగం«దకూ ఎదురయ్యాయి. అయితే జీవితం అంటే ఎదురీదడమేననే సత్యాన్నీ ముంబైని చూసే ఆమె తెలుసుకుంది. మగవాళ్లు ఉద్యోగం చేసి డబ్బు సంపాదించడం, ఆడవాళ్లు ఇంటి దగ్గరే ఉండి వంట పని, ఇంటి పని చూసుకోవడం.. ఏళ్లుగా సమాజంలో స్థిరపడిపోయిన సంప్రదాయం! ఇప్పటికీ చాలావరకు ఆ సంప్రదాయమే మన కుటుంబాలను, సమాజాన్ని నడిపిస్తోంది. అందుకే సుగంధ.. ఇంటి నుంచి బయటికి అడుగేయగానే ఒడ్డున పడిన చేప అయింది! అయితే ఆమె చేపలా విలవిల్లాడలేదు. బతుకు ఎడారిలో ఆత్మవిశ్వాసంతో పయనించి తన కోసం ఒక జీవ నదినే వెతుక్కుంది! తెలిసింది రెండే గడపలు సుగంధకు 16 సంవత్సరాల వయసు వచ్చేసరికి, వాళ్ల ఇంటికి మూడిళ్ల అవతల ఉన్న సుధీర్‌తో ఆమె వివాహం నిశ్చయం అయింది. ఏదో కులాచారం అని చెప్పి ఇంట్లో వాళ్లు ఆమెను చదివించలేదు. సుగంధకు ఒక్క అక్షరం కూడా చదవడం రాదు! ‘చదువుతాను’ అని ఆమె ఎప్పుడూ అనలేదు. ‘ఎందుకు చదివించలేదు?’ అనీ అడగలేదు. తల్లిదండ్రుల మాటే ఆమెకు వేదం. తల్లి చెప్పినట్లుగా చక్కగా వంట పనులు, ఇంటి పనులు నేర్చుకుంది. పుట్టింటికి మంచి పేరు తేవాలని అమ్మ చెప్పిన మాటలు ఒంట బట్టించుకుంది. అత్తవారింట్లో అడుగుపెట్టింది. సుగంధకు తెలిసింది రెండే గడపలు. పుట్టింటి గడప, మెట్టినింటి గడప. మూడేళ్లకే భర్తకు నూరేళ్లు! మూడేళ్లు సంతోషంగా గడిచాయి. ఒక బాబు పుట్టాడు. వాడికి దీపక్ అని పేరు పెట్టుకున్నారు. ప్రేమించే భర్త, ముద్దుల కొడుకు.. వాళ్లిద్దరి మధ్య సుగంధ జీవితం బాంధవ్యపు సుగంధాలు వెదజల్లింది. అంతలోనే అనుకోకుండా ఓ దుర్ఘటన! రోడ్డు మీద జరిగిన యాక్సిడెంట్లో సుధీర్ కన్నుమూశాడు! అప్పటికింకా సుగంధ వయసు ఇరవయ్యే. అంత చిన్నవయసులో ఆమెకది పెద్ద దెబ్బ. జీవితాన్నే తలకిందులు చేసే దెబ్బ. అసలు ఆ ఘటనకు ఎలా స్పందించాలో కూడా ఆమెకు మొదట అర్థం కాలేదు. రోజులు ఎలా గడుస్తున్నాయో కూడా తెలియని స్థితిలోకి జారిపోయింది సుగంధ. ఆ స్థితిలోనే.. చదువు లేని సుగంధకు ఒక్క విషయం ఏ మాత్రం స్పష్టంగా అర్థం అయ్యింది, తాను, తన బిడ్డ ఎవ్వరికీ భారం కాకూడదని. ఆమె అత్తింటివాళ్లు, పుట్టింటి వాళ్లు కూడా ఆర్థికంగా అంతంత మాత్రమే. అందుకని కాదు కానీ, ఎవ్వరినీ చేయి చాచి ఒక్క రూపాయి కూడా అడక్కూడదనుకుంది సుగంధ. అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చింది. మూడో గడప ముంబై అత్తింటివారు వారిస్తున్నా వినకుండా.. ఓరోజు బిడ్డనొక చేత్తో, బట్టల పెట్టెను ఒక చేత్తో పట్టుకుని, తన దగ్గరున్న కాస్త డబ్బుతో తను ఉంటున్న కల్యాణ్ ప్రాంతం నుంచి సమీపంలోనే ఉన్న ముంబైకి బయలుదేరింది సుగంధ! ఆ మహానగరంలో ఎలాగైనా బతకొచ్చనే ఆశ ఆమెను ఇంటి బయటికి అడుగు వేయించింది. అయితే అక్కడకు వచ్చాక తెలిసింది ఆమెకు.. ముంబై వచ్చి తప్పు చేశానని! జీవితం అంటే భయం కలగడం ప్రారంభమైంది. పుట్టింటి నుంచి నేరుగా అత్తింటికి వెళ్లిన సుగంధకు ఈ రెండిటి మధ్య ఉండే బయటి జీవితంలో ఇటువంటివి ఎదురౌతాయని అస్సలు తెలీదు. ముంబైలో దిగగానే ఒంటరి స్త్రీకి ఈ సమాజంలో ఎదురయ్యేవన్నీ సుగంధకు ఎదురయ్యాయి. అయితే జీవితం అంటే ఎదురీదడమేననే సత్యాన్నీ ముంబైని చూసే ఆమె తెలుసుకుంది. కొడుకును చూసి ఆగిపోయేది! ఏ ఉద్యోగానికైనా కొద్దో గొప్పో చదువు అవసరం. మరి నిరక్షరాస్యురాలైన సుగంధకు ఉద్యోగం ఎలా వస్తుంది? రోజులు గడిచిపోతున్నాయి. ఆమె దగ్గర ఉన్న డబ్బు కర్పూరంలా కరిగిపోతోంది. ఆమె ఆశలు కూడా ఆవిరైపోతున్నాయి. చాలాసార్లు కుంగిపోయింది సుగంధ. ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకుంది. బిడ్డ ముఖం గుర్తుకు రాగానే నిర్ణయం మార్చుకునేది. చివరికి వాడినే తన ఆశాదీపం అనుకుంది. తాను కుంగిపోవడం సరి కాదనుకుంది. ఒకరోజు ఉదయం నిద్ర లేస్తూన్న సమయంలో వచ్చిన ఆలోచనతో సుగంధ మనసు తేలికపడినట్లయింది. కొత్త శక్తి పుంజుకుంది, డబ్బు సంపాదించడానికి మార్గం కనిపించింది. ప్రతి మనిషిలోను ఏదో ఒక శక్తి ఉంటుంది. అలాగే తనలో ఉన్న శక్తి ఏమిటో గమనించుకుంది. అమ్మ నేర్పిన ‘విద్య’ ఆదుకుంది పుట్టింట్లో ఉండగా తల్లి ఆమెకు కుదురుగా ఇల్లు సర్దడం నేర్పించింది. ఆ నమ్మకంతో ధనవంతుల ఇళ్లలో ఇంటిని అందంగా సర్దే పని చేయడానికి నిశ్చయించుకుంది. ఆలోచన వచ్చిందే తడవుగా ముంబై అంధేరిలోని ఒక ఇంట్లో పనికి కుదిరింది. ఆమె పనితీరుకు ముచ్చట పడిన మిగతా ఇళ్లవాళ్లు కూడా ఆమెను పిలిపించుకుని ఇల్లు సర్దించుకునేవారు. ప్రతిఫలం కూడా వేలల్లోనే దక్కేది. అలా కొద్దికొద్దిగా డబ్బు సమకూరుతూ ఉండడంతో అక్కడికి దగ్గరలోని ఒక స్లమ్ ఏరియాలో చిన్న గది అద్దెకు తీసుకుంది సుగంధ. ఆ వెంటనే దీపక్‌ను స్కూల్లో చేర్పించింది. ఏళ్లు గడుస్తున్నాయి. దీపక్ పదో తరగతి, ఇంటర్ పూర్తి చేసి, ఇంజనీరింగ్‌లో చేరాడు. కొద్ది కొద్దిగా డబ్బు పోగు చేసి, చిన్న ఇల్లు కొనుక్కోగలిగింది. ఇంతలోనే మరో ఘటన. అయితే అది ఆమె మంచికే జరిగింది. తను నివసిస్తున్న స్లమ్ ఏరియాను ఒక బిల్డర్ కొనేశాడు. పరిహారంగా స్లమ్ రీడెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద, అక్కడ చిన్న హౌసింగ్ కాంప్లెక్స్ కట్టి సుగంధకు, ఇంకా కొందరికి ఆ కాంప్లెక్స్‌లో సొంత ఇంటిని కేటాయించాడు. గతమే సుగంధ వర్తమానం ఇప్పుడు సుగంధకు ఒక ఇల్లు ఉంది, చేతికి అంది వచ్చిన కుమారుడున్నాడు. అతడు ఉద్యోగం చేస్తున్నాడు. పనిచేయవలసిన అవసరం లేదు. కాని ఆమె తన పని మానలేదు. ‘‘ఇళ్లను సర్దేపని నా జీవితాన్నీ చక్కగా సర్దింది. ఈ పనితోనే ఈ రోజు నేను ఈ స్థితికి వచ్చాను. ఈ పని కూడా రాకుండా ఉంటే, నా జీవితం ఎలా ఉండేదో! నా గతాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. ఎందుకంటే నా గతమే నా వర్తమానం’’ అంటుంది సుగంధ. జీవిత ఆరంభంలో బెరుకుగా, పిరికిగా ఉన్న సుగంధ ఈ రోజు ఆత్మస్థైర్యంతో, ఆనందంతో ఉంది. మహిళలకు ఒక ఆదర్శంగానూ నిలిచింది. (సుగంధ విజయగాథను పాలక్ కపాడియా అనే కాలమిస్ట్ మూడు రోజుల క్రితమే ‘షీరోస్’లో పొందుపరిచారు) – రోహిణి -
కల్యాణం ఖరారు?
పెళ్లి పీటల మీద కూర్చుని, మూడు ముళ్లు వేయించుకుని, ఏడడుగులు వేయడానికి శ్రియ రెడీ అయ్యారని సమాచారం. ‘మీ పెళ్లెప్పుడు?’ అని ఎప్పుడు అడిగినా ‘దాని గురించి నేను చెప్పను. అది నా వ్యక్తిగత విషయం’ అని నిర్మొహమాటంగా చెప్పేవారు శ్రియ. ఇటీవల ‘గాయత్రి’ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్లోనూ అలానే అన్నారు. అయితే శ్రియ సైలెంట్‌గా పెళ్లి పనులతో బిజీగా ఉన్నారన్నది తాజా వార్త. రష్యాకి చెందిన క్రీడాకారుడు, వ్యాపారవేత్త ఆండ్రై కొశ్చీవ్, శ్రియ లవ్‌లో ఉన్నారని కొన్ని రోజుల క్రితం వార్త వచ్చింది. ఈ ఇద్దరూ త్వరలో ‘వెడ్లాక్’లోకి ఎంటరవ్వాలనుకుంటున్నారట. ఇటీవల రష్యా వెళ్లి ఆండ్రై తల్లిదండ్రులను కూడా కలిశారట శ్రియ. పెద్దల సమ్మతం లభించిందని టాక్. వచ్చే నెల 17, 18, 19 తేదీల్లో రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వివాహ వేడుకలు జరుగుతాయని తెలిసింది. హోలీ థీమ్‌లో ఓ రోజు వేడుక, ఇంకో రోజు సంగీత్, మరో రోజు మెహందీ.. ఇలా మూడు వేడుకలను ఇప్పటికి ప్లాన్ చేశారట. మరి... మూడు ముళ్లు పడే డేట్ ఈ మూడు తేదీల్లో ఒకటా? లేక వేరేనా? అని తెలియాల్సి ఉంది. -
కడపటి కోరిక
‘‘బాగా యెవరైనా బతుకుతారు. కాని బాగా చనిపోయేవాళ్లు తక్కువ. వాళ్లే ధన్యులు’’ అంటుండేవారు ఆత్రేయ. ఆయన మాట అక్షరాలా నిజమని వెంకటేశ్వర్లు విషయంలో రుజువయింది.’’ బయట నుంచి వస్తూనే సానుభూతితో నిట్టూర్చి కుర్చీలో కూలబడ్డాడు నారాయణ.‘‘అలా అంటారేమిటండీ? ఆయన రోగం రొష్టూ లేకుండా సునాయాసంగా పోయాడట కదా?’’ భర్త మాటలకు ఆశ్చర్యపోయింది రమ.‘‘పోవడం వరకు నువ్వు విన్నది నిజమే. భోంచేసి పడక కుర్చీలో చేరబడి కొంచెం ఆయాసంగా వుందని భార్యను పిల్చాడట. ఆమె చెయ్యి కడుక్కొని వచ్చేలోగా ప్రాణాలు వదిలేశాడట. నలుగురూ కూడి హాస్పిటల్‌కి తీసుకెళ్దామని హడావిడి చేసే సరికి అనుభవజ్ఞుడెవరో నాడి చూసి యింక ఆ అవసరం లేదని, మనిషిని కిందకు దింపించేశాడట! అదిగో, అక్కడే ప్రారంభమైంది అసలు కథ. శవాన్ని యింట్లో వుంచడానికి వీల్లేదని యింటి యజమాని గొడవ చేస్తుంటే కొందరు దగ్గర్లోనే వున్న కొడుకు యింటికి శవాన్ని తీసుకెళ్దామని ప్రతిపాదించారట. కాని కొడుకు సోమేశం శవాన్ని తీసుకెళ్లడానికి ససేమిరా అనడమే కాకుండా అసలు కర్మకాండే చెయ్యను పొమ్మన్నాట్ట...’’‘‘అయ్యో.. అతనికేం పొయ్యేకాలం? సొంత తండ్రే కదా? పైగా సోమేశానిది సొంత యిల్లేనేమో!’’ రమ ముక్కున వేలేసుకొంది. ‘‘నిజమే. వెంకటేశ్వర్లు రెండో పెళ్లి చేసుకోవడం పిల్లలకిష్టం లేదు. ఆ కోపంతో సోమేశం తండ్రి అంత్యక్రియలు చెయ్యనన్నాడు.’’‘‘అవును మరి వెంకటేశ్వర్లు మాష్టారిది మాత్రం తప్పుకదా? రిటైర్మెంట్కి దగ్గరగా వున్నప్పుడు కదా ఆయన రెండో పెళ్లి చేసుకొన్నాడు. ఆ వయసులో రెండో పెళ్లి అంత అవసరమా? ఆ వయసులో భర్త పోయిన ఆడది మరో మనువుకి సిద్ధమైతే లోకం దుమ్మెత్తి పోసేది. ఈ కాలంలో కూడా ఆడామగా మధ్య యింత తేడానా? చచ్చినోళ్లను తిట్టకూడదు కాని వెంకటేశ్వర్లు మాష్టారికి తగిన శాస్తి జరిగింది.’’‘‘రమా. వెంకటేశ్వర్లును నీలాగే చాలమంది ఆడాళ్లు అపార్థం చేసుకొని కొడుకును సమర్థిస్తున్నారు. కాని మాష్టారు మీరనుకుంటున్నంత దుర్మార్గుడు, కాముకుడు కాదు. మనం చాలా సార్లు చర్చించుకునే సమస్యే మొదటి భార్య పోయినప్పుడు అతనికీ యెదురయ్యింది. అదే – భర్తపోయిన తర్వాత భార్య జీవితం దుర్భరమని నువ్వూ, భార్యపోయిన మగాడి బతుకు నరకమని నేనూ వాదించుకొంటుంటాం కదా. నా అభిప్రాయం నిజమని భార్యావియోగం వల్ల యేర్పడిన వెలితినీ, వేదననూ అనుభవిస్తూ వెంకటేశ్వర్లు యెన్నోసార్లు అనేవాడు. తన మనోభావాలను పట్టించుకోని పిల్లల అనాదరణ గురించి నాతో చెప్పుకొని యేడ్చేవాడు. తోడు–నీడ లేని మోడు లాంటి బతుకు వెళ్లదీసే కంటె చావు వస్తేనో, ఆత్మహత్య చేసుకొంటేనో నయమని వాపోయేవాడు. అతని బాధ చూడలేక మళ్లీ పెళ్లి చేసుకోమని ప్రోత్సహించిన స్నేహితుల్లో నేనొకణ్ని. అయితే అతని పెన్షన్ కోసం ఆశపడి భార్య స్థానంలో వచ్చిన కృష్ణవేణి ఆ లోటును భర్తీ చెయ్యలేకపోవడమే కాదు – తన గొంతెమ్మ కోరికలతో అతనిని హింసించేది. సోమేశాన్ని, అతని చెల్లెలను దగ్గరకు చేరనిచ్చేదికాదు. అలా వెంకటేశ్వర్లు పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి దూకినట్టయింది. ఈ పెళ్లి వల్ల తనెంతగా నలిగిపోతున్నాడో నాకు చెప్పుకొని బాధపడేవాడు. నేను, మరికొందరు ఆత్మీయమిత్రులు అతణ్ని ఓదార్చడం తప్ప ఆ సమస్యను పరిష్కరించలేకపోయాం. ఆ మానసిక వేదన వల్లే హార్టెటాక్ వచ్చి అతనంత హఠాత్తుగా చనిపోయాడు. కృష్ణవేణి లాంటి పెంకిఘటం రెండో పెళ్లాంగా రావడం అతని దురదృష్టం తప్ప, గతి లేని స్థితిలో రెండో పెళ్లి చేసుకోవడం తప్పుకాదని యిప్పటికీ నా దృఢమైన అభిప్రాయం..’’ ‘‘మీ మగబుద్ధి పోనిచ్చుకొన్నారు కాదు. రేపు నాకేమైనా జరిగితే వెంకటేశ్వర్లు మాష్టారిలాగే మీరూ పెళ్లికొడుకవడానికి సిద్ధపడతారా?’’‘‘అలాంటి పరిస్థితి చస్తేరాదు. నువ్వే ప్రమాణం చెయ్యమన్నా చేస్తాను. అయినా నీకెన్నోసార్లు చెప్పాను. నీ కంటె నేను వయసులో పెద్ద. అందువల్ల ముందు ముందే వెనుక వెనుకే అన్న న్యాయంగా మనం కళ్లు మూసేలా అనుగ్రహించమని ఆ దేవుణ్ని కోరుకుంటుంటానని...’’‘‘అసురసంధ్యవేళ ఈ పాడుమాట లేమిటండీ? మీరు మళ్లీ మళ్లీ యిలా మాట్లాడితే మీ కళ్లెదుటే ప్రాణం తీసుకొంటాను...’’ రమ మొహం ఆకస్మికంగా మేఘావృతమైన ఆకాశంలా మారిపోయింది.‘‘ఛ! ఊరుకో రమా. అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతాయా పిచ్చిదానా? ఈ చావుల్ని చూస్తుంటే నేను కూడా చివరికొచ్చేశానని అనిపిస్తోంది–అంతే! వెంకటేశ్వర్లు నాకంటె రెండేళ్లు చిన్న. ఈ సంవత్సర కాలంలో నాతో పనిచేసిన యిద్దరు ముగ్గురు మాష్టర్లు పోయారు. ఇలా ఒక్కొక్కరూ వెళ్లిపోతుంటే నాకు బ్రతుకుతున్న ప్రతిరోజు బోనస్‌లా అనిపిస్తోంది. ఈ మధ్య కలల్లో తరచుగా చనిపోయిన మా కుటుంబ సభ్యులంతా కనిపిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే...’’ నారాయణ స్వరంలో వైరాగ్యధోరణి. ‘‘ఏవండీ. మీరీ చావుకబుర్లు చాలిస్తారా? నన్నొచ్చి మీ నోరు ముయ్యమంటారా? చావుకి వయసుతో నిమిత్తం లేదు. ఎవరికి టైమొస్తే వాళ్లు వెళ్లిపోతుంటారు. వాళ్లతో మీరెందుకు పోల్చుకుంటారు? మీ కంటె పదేళ్లు ముందు రిటైరయిన వాళ్లు రాళ్లలా లేరూ? ఆ వైపు చూడకుండా నెగెటివ్ థాట్స్‌తో నన్నెందుకు భయపెట్టి చంపుతారు? నేనెన్నోసార్లు చెప్పాను. మళ్లీ చెపుతున్నాను. మీరు నిండు నూరేళ్లు బతుకుతారు. నేను పండు ముల్తైదువుగా పుణ్య స్త్రీగా మీ వొళ్లో కళ్లు మూస్తాను. మీరు లేంది నేను ఒక్కక్షణం కూడా బ్రతకను.’’‘‘నువ్వు తోడు లేనిది నేను మాత్రం బ్రతకగలనా? మా పెన్షనర్స్‌లో కొందరం మార్నింగ్ వాక్ తర్వాత, అప్పుడప్పుడూ సాయంత్రాలు పార్క్ దగ్గర కూర్చొని కాలక్షేపానికి కబుర్లు చెప్పుకొంటుంటాం. మాలో యిటీవల భార్యలను కోల్పోయిన వాళ్లు ప్రసంగవశాత్తు వాళ్ల యిక్కట్లను చెపుతుంటే మేమంతా జాలితో సానుభూతితో స్పందిస్తుంటాం. వాళ్ల హృదయవిదారకమైన అనుభవాలు విని భర్తవియోగం కంటే భార్యావియోగం కష్టతరమనే అభిప్రాయానికొచ్చాం. అది స్త్రీకి మేమిచ్చే గౌరవమే కాని, చులకన చేయడం కాదు. భర్త దూరమైన భార్య రెండు పాత్రలనూ తానే పోషిస్తూ యింటిని చక్కదిద్దగలదు. పురుషుడికి ఆ సమర్థత లేదు. ఇలా మా మిత్రబృందం చర్చల ప్రభావంతో వృద్ధాప్యంలో మగాడు ఏకాకిగా సంసారాన్ని ఈదలేడని నీతో వాదిస్తుంటాను కాని, మన విషయం మాత్రం దీనికి భిన్నమని నేను అనుక్షణం భయపడుతుంటాను. అనుకున్నామని జరగవు అన్నీ అన్నట్టు అనుకోకుండా నాకేమైనా జరిగితే సహజంగా ఆవేశపరురాలివి, అమాయకురాలివి అయిన నువ్వు నా తర్వాత యెలా బతుకుతావో అని కూడా అప్పుడప్పుడూ...’’‘‘అయ్యా, మీకు పుణ్యముంటుంది. ఆ పార్క్ దగ్గరకెళ్లి యెక్కువగా ఆలోచించి మీ బుర్రపాడు చేసుకోకండి. నా బుర్ర తినకండి. పుణ్యం కొద్దీ పురుషుడన్నట్టు మీలాంటి మంచి భర్తనిచ్చిన భగవంతుణ్ని నేను సుమంగళిగా కన్నుమూసే అదృష్టాన్ని కూడా యిమ్మని నిత్యం ప్రార్థిస్తుంటాను. ఒకవేళ దేవుడు మన ప్రార్థనల్ని ఆలకించి మన అన్యోన్యతని గమనించి యిద్దర్నీ ఒకేసారి తీసుకొనిపోతే అది యింకా అదృష్టం. ఇంతకీ వెంకటేశ్వర్లుగార్ని అనాథ ప్రేతంలా వదిలేశారా? దహన సంస్కారం చేయించారా?’’ ‘‘ఇంతమంది మిత్రుల ముండి యెలా వదిలేస్తాం? సోమేశాన్ని బ్రతిమలాడి, వినకపోతే సమాజమనీ, పాపమనీ భయపెట్టి కర్మ వరకు చెయ్యడాని కొప్పించాం...’’‘‘పోన్లెండి. తక్కిన ఖర్చులకు ప్రభుత్వం డబ్బిస్తుందట కదా. మీరా ఆలోచనల నుంచి తేరుకొని ఏ టీ అయినా తాగండి. మీరసలే డయాబెటిక్. ఇంతసేపు ఏమీ తినకుండా తాగకుండా వుంటే మీ ఆరోగ్యానికి ప్రమాదం కదా? ఇంతకీ స్నానం చేసి బట్టలు మార్చుకొన్నారా?’’‘‘అన్నీ అక్కడే పూర్తిచేశా. లోపలకు పద... వస్తున్నాను..’’ అంటూ దండెం మీద తడి బట్టలు ఆరెయ్యడానికి వెళ్లిన నారాయణ, ‘దబ్’మనే శబ్దం విని కంగారుగా పరుగెత్తుకొని వెనక్కి వచ్చాడు – నేల మీద స్పృహ లేకుండా రమ...!అంతవరకు తనతో లక్షణంగా మాట్లాడిన రమను హఠాత్తుగా ఆ స్థితిలో చూసేసరికి నారాయణకు ఒళ్లంతా చెమటలు పట్టాయి. నిలువెల్లా వణికిపోతూ తడబడుతున్న కాళ్లతో దగ్గరగా వెళ్లి ‘రమా... రమా’ అని పిలిచాడు. ఆమె కళ్లలో నిస్తేజం తప్ప నోట మాటలేదు. శ్వాస మాత్రం ఆడుతున్నట్టు గమనించి ఇరుగుపొరుగు వాళ్లను పిలిచి, వాళ్ల సహాయంతో హాస్పిటల్లో జాయిన్ చేశాడు.రమకు తెలివి వచ్చేసరికి హాస్పిటల్ వాతావరణాన్ని, పక్కనే ఆందోళనతో నిల్చుని తనకేసి చూస్తున్న భర్తనూ, పరీక్షలు చేస్తున్న డాక్టర్ని చూసి గాబరాపడింది.‘‘ఏమ్మా, కొంచెం సులువుగా వుందా? ఇలా పడిపోవడం యిదే మొదటిసారా? ఇంతకు ముందు కూడా ఈ కంప్లైంట్ వుందా?’’ డాక్టర్ గుచ్చిగుచ్చి అడుగుతున్నాడు.‘‘ఈ మధ్య యెప్పుడైనా నీరసంగా వున్నప్పుడు, మనస్సు బాగోలేనప్పుడు ఫిట్స్‌లా వచ్చి యిలా పడిపోతున్నాను’’ రమ స్పష్టంగా మాట్లాడలేకపోతోంది. ఆమె తన శరీరంలోకెక్కుతున్న సెలైన్ బాటిల్ వేలాడ దీసిన స్టాండ్కేసి చూస్తోంది. ‘‘ఈరోజు ఈమె మనస్సు గాయపడే సంఘటన ఏదైనా జరిగిందా మాష్టారూ?’’ నారాయణకేసి చూసి అడిగాడు డాక్టర్.‘‘అలాంటిదేం కాదు కాని...’’ అని నసుగుతూ తమ మధ్య జరిగిన సంభాషణను వివరించాడు నారాయణ. అంతా విన్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిన డాక్టర్ తన అనుమాన నివృత్తి కోసం కొన్ని టెస్ట్‌లు చెయ్యాలన్నాడు. రమ యిష్టపడకపోయినా నారాయణ నచ్చజెప్పి దగ్గరుండి టెస్ట్‌లన్నీ చేయించాడు. అతని మనసులో ఒక అపరాధ భావన – తను మూర్ఖంగా వాదించడం వల్లనే రమకీ అనర్థం జరిగిందని!అన్ని టెస్ట్‌లూ పరిశీలించిన తర్వాత డాక్టర్ తోటి వైద్యులతో కూడా చర్చించి రోగ నిర్ధారణను చేశాడు. నారాయణను పక్కకు పిలిచి జాలిగా చూస్తూ – ‘వెరీ సారీ మాష్టారూ’ అంటూ ప్రారంభించగానే నారాయణ ఎలాంటి దుర్వార్త వినవలసి వస్తుందోనని వణికిపోయాడు.రమకున్న కంప్లైంట్ టోటల్ కెరోటిడ్ బ్లాక్ అనీ, అంటే రక్తనాళాల్లో రక్త ప్రవాహానికి ఆటంకం యేర్పడ్డం వల్ల మెదడుకు రక్తం సరఫరా కావడంలో తేడా వస్తోందనీ, చికిత్స చేయించకుండా నిర్లక్ష్యం చేస్తే పక్షవాతం వచ్చే ప్రమాదం వుందనీ, అందువల్ల ఆమెకు మెడ దగ్గర సర్జరీ చెయ్యాల్సివుంటుందనీ, దానికి రెండు మూడు లక్షల వరకూ ఖర్చవుతుందనీ డాక్టర్ విశదంగా చేప్పేసరికి నారాయణకు గుండెదడ కొంత తగ్గింది, ‘‘ఖర్చు యెంతయినా వెనుకాడను. రమకు ఏ ప్రమాదమూ జరక్కుండా మామూలు మనిషిని చెయ్యండి. దయచేసి ఆమెకు మాత్రం వ్యాధి తీవ్రత గురించి చెప్పకండి..’’ అంటూ డాక్టర్ చేతులు పట్టుకొని ప్రాధేయపడ్డాడు నారాయణ.రమ మాత్రం యెంత సర్దిచెప్పినా సర్జరీకి సుముఖత చూపలేదు. ‘‘ఆ దేవుడు నా మొరాలకించాడు. ఈ కుంకుమతో ఈ గాజులతో పుణ్యస్త్రీగా కడతేరడానికి ఆ స్వామి అనుజ్ఞ అయింది. మీరు అప్పుచేసి అవస్థలు పడి నన్ను బతికించకండి. బాధ్యతలన్నీ తీరిపోయాయి కదా! ఇంకా నేను బతికి యెవర్ని ఉద్ధరించాలి?’’ అంటూ మొండికేసింది.‘‘నిన్ను బతికించడానికి మాత్రమే కాదు. పక్షవాతంతో మంచానపడి జీవచ్ఛవంలా నరకం అనుభవించకుండా ఉండడానికి కూడా ఈ సర్జరీ...’’ అంటూ నారాయణ మొత్తుకొని, కావలసిన వాళ్లందరి చేత చెప్పించేసరికి రమ అయిష్టంగానే ‘సరే’ అంది.హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి రమ క్రమంగా కోలుకొంటున్న కొద్దీ ఆమెలో కృతజ్ఞతాభావం, మృత్యు ముఖం నుంచి బయటపడిన ఆమె పట్ల నారాయణ భద్రతాచర్యలు ఆ దంపతుల అనుబంధాన్ని అన్యోన్యతను దృఢతరం చేశాయి. జీవితంలో చివరి మజిలీకి చేరుకున్న ఆ దంపతుల మధ్య పరస్పర ఆరోగ్య పరిరక్షణ ప్రయత్నాల్లో వింతకోపాలు, చిత్రమైన అంతర్యుద్ధాలు ఆరంభమయ్యాయి.వైద్యుల సూచన ప్రకారం రమ సమయానికి మందులు వేసుకోకపోతే నారాయణ మందలిస్తాడు. అతను చక్కెర వ్యాధిని లెక్కచెయ్యకుండా చాటుమాటుగా తీపి పదార్థాల కోసం కక్కుర్తిపడితే ఆమె కళ్లెర్ర జేసి వాటిని బలపవంతంగా లాక్కుంటుంది. ఆమె వంట వార్పులతో అలసిపోతుందని పనిమనిషిని పెట్టుకోమని అతను పోరుతుంటాడు. అతను కూరగాయలకో కిరాణా సరుకులకో యెండలో నడిచివెళ్తుంటే అంత పొదుపు తగదని ఆమె రుసరుసలాడుతుంది. ఆమె అర్ధరాత్రి వరకు టీవీ దగ్గర నుంచి లేవడం లేదని అతను బలవంతంగా స్విఛాఫ్ చేస్తాడు. అతను పొద్దుటపూట నడకను నిర్లక్ష్యం చేస్తే ఆమె డాక్టర్ సలహాను గుర్తుచేసి అతణ్ని విసిగిస్తుంటుంది. ఇక అతని మీద ఈగ వాలినా కంగారు పడిపోయి అతను వద్దని వారిస్తున్నా ఆమె దగ్గర కూర్చొని కాళ్లూవేళ్లూ నొక్కి సపర్యలు చేస్తుంది. ఆమె శరీరం జ్వరంతో కాగిపోతున్నా అతను తలనొప్పి మందు కూడా రాయడానికి వీల్లేదని ఆమె చేతులడ్డం పెడుతుంది – ఇలా మగని చేత సేవలు చేయించుకోవడం పతివ్రతా లక్షణం కాదట! పెళ్లయిన కొత్తలో చీటికీ మాటికీ తన మీద అలిగి పుట్టింటికి పరుగెత్తిన రమేనా ఈమె అని అతను, తనవాళ్లను వీసమెత్తు మాటన్నా వీరావేశంతో చెయ్యి చేసుకొన్న భర్తేనా యితనని రమ – తమలో వచ్చిన మార్పుకి ఆశ్చర్యపోతున్నారు. వయసులోని దాహం కేవలం మోహమనీ, వార్ధక్యంలో పడిన ముడి నిజమైన ప్రేమ అనీ అనుభవపూర్వకంగా తెలుసుకొన్న రమా నారాయణులు – యముణ్ని మెప్పించి పతిప్రాణం దక్కించుకొన్న సావిత్రినీ, పాముకాటుతో మరణించిన ప్రమద్వరను సగం ఆయువును ధారపోసి బ్రతికించుకొన్న రురుణ్నీ స్ఫూర్తిగా తీసుకొని పరస్పరం పార్ట్నర్ కోసం ప్రాణం పెడుతున్నారు. ఒకరికొకరు మాత్రమే సాయంగా సంసారసాగరాన్ని ఈదుతూ ఎడబాటు యెరక్కుండా యిద్దర్నీ ఒకేసారి తీసుకుపొమ్మని భగవంతుణ్ని వేడుకొనే ఆ దంపతులు యెప్పుడైనా కొడుకు వరప్రసాద్నూ, కూతురు సుమతినీ, మనవల్నీ తల్చుకొని వాళ్ల ముచ్చట్లను చెప్పుకుంటుంటారు. వరప్రసాద్ ఆ దంపతుల ఏకైక సంతానం. అతని భార్య మోహిని మొదట్నుంచీ అత్తరికాన్ని అసహ్యించుకోవడం వల్ల వూళ్లోనే దూరంగా కాపురముంటున్నాడు. పంచాయతీ సెక్రటరీ వుద్యోగాన్నడ్డెట్టుకొని బాగానే సంపాదిస్తున్నట్టు జనం చెప్పుకొంటారు. అతను మాత్రం సంతానమిద్దరూ ఆడపిల్లలు కావడం వల్ల అడ్డదారులు తప్పవని సమర్థించుకుంటాడు. సుమతి రమానారాయణులు దత్తత తీసుకొన్న కూతురు. రమ ఆడపిల్ల మీద మక్కువతో ఆమెను చేరదీసి సొంత కూతురులా పెంచి పెళ్లి చేసింది. సుమతికి ఓ కొడుకూ, కూతురూ భర్త వుద్యోగం దృష్ట్యా వాళ్లు బెంగళూరులో ఉండడం వల్ల పెంచిన తల్లి తండ్రుల మీద ప్రేమవున్నా, సుమతి తరచుగా రాదు. రమకు సర్జరీ జరిగినప్పుడు మాత్రం వచ్చి చూసి రెండ్రోజులుండి వెళ్లింది. వరప్రసాద్ హాస్పిటల్‌కి ఒకటిరెండుసార్లు రాగా, మోహిని ఆ మర్యాదను కూడా దక్కించుకోలేదు!వరప్రసాద్ చాలాకాలం తర్వాత తల్లిని చూడ్డానికి యింటికి రావడం రమ, నారాయణలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అదే మాట తండ్రంటే, వాళ్లు మర్చిపోయిన పెళ్లిరోజును గుర్తుచేద్దామని వచ్చానన్నాడు. తల్లి చచ్చిబతికింది గనుక వారం రోజులు మాత్రమే గడువున్న తల్లిదండ్రుల పెళ్లిరోజును అట్టహాసంగా జరపాలని ప్రతిపాదించాడు. అయితే ఆ యేడు రమ చికిత్సకోసం అయిన ఖర్చును, వచ్చేయేడు జరుపుకోదగిన వైవాహిక స్వర్ణోత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని నారాయణ కొడుకు ప్రతిపాదనను కాదన్నాడు. తన మాటకు యెప్పుడు మాత్రం విలువిచ్చారని వరప్రసాద్ యెదురు తిరిగి తల్లిదండ్రులను దులిపేశాడు. పెన్షన్ మీద అప్పుతీసుకొని అన్ని లక్షలు పెట్టి ముసలావిడకు వైద్యం చేయించడం అవసరమా? అని కడిగేశాడు. తండ్రికేమన్నా అయితే ఆ అప్పు తనమీదే పడుతుంది కదా అని ప్రశ్నించాడు. తనకిద్దరు ఆడపిల్లలుండగా తల్లి తదనంతరం ఆమె బంగారాన్ని పెంపుడు కూతురు కూతురికిస్తాననడం యెంతవరకు న్యాయమని నిలదీశాడు. తల్లిదండ్రులుంటున్న యింటిని తనకు విల్లుగానో గిఫ్ట్గానో రాయకపోతే రేపు చెల్లెలు ఆస్తిలో వాటాకొస్తే తన గతేమిటని వాపోయాడు. కొడుకు ప్రశ్నలన్నిటికీ నారాయణ దీటుగా ఘాటుగా సమాధానాలు చెప్పిన తర్వాత అతను కాళ్లబేరానికొచ్చాడు. తను లంచం తీసుకొంటుండగా ఏసీబీకి దొరికిపోయి ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యాననీ, తనను ఆర్థికంగా ఆదుకోపోతే సంసారం వీధిన పడుతుందనీ తల్లిదండ్రులను కాళ్లావేళ్లా పడి బ్రతిమలాడాడు. పాండురంగడిలా తనలో మార్పు వచ్చిందనీ, తను పశ్చాత్తాపపడుతున్నాననీ, ఇకముందు వ్యసనాలను విడిచిపెట్టి తల్లిదండ్రులను తన రెండు కళ్లలా చూసుకొంటాననీ నమ్మబలికాడు. కొడుకు దైన్యానికి కరిగిపోయి బ్యాంకులో తాకట్టు పెట్టుకొని డబ్బు తెచ్చుకోమని తన నగలిచ్చిన రమ మాతృ ప్రేమకు నారాయణ ఆశ్చర్యపోయాడు. వరప్రసాద్ కృతజ్ఞతతో తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి, నామమాత్రంగా జరిగినా సరే పెళ్లిరోజున వస్తానని మొహమాటపెట్టినా నారాయణ రావద్దన్నాడు. ‘‘ఈ భ్రష్టుడిలో నిజంగా మార్పు వచ్చిందంటావా? లేక ఏదో దురాలోచనతో వచ్చి నటిస్తున్నాడంటావా?’’ వరప్రసాద్ వెళ్లగానే అనుమానంగా అడిగాడు నారాయణ.‘‘అలా అనకండి. స్నేహాల వల్ల చెడిపోయాడు గాని మనవాడు బంగారమే. వాడు కన్నీళ్లు పెట్టుకొంటే చూడలేక ఆ నగలిచ్చాను.’’ రమ గిల్టీగా బదులిచ్చింది.‘‘గొప్పపని చేశావ్. నీతో అతివృష్టి, అనావృష్టి! ఇన్నాళ్లూ కోడలి మీద కోపంతో వాణ్ని గడప తొక్కొద్దన్నావ్. ఇప్పుడేమో వాడి అవస్థ చూసి, వెనకా ముందూ ఆలోచించకుండా...’’‘‘ఏం చెయ్యమంటారు? కడుపుతీపిని చంపుకొని వాడి కర్మకు వాణ్ని వదిలెయ్యమంటారా? మీరు మాత్రం? వాడెగిరినంతసేపు యెదురుదాడి చేశారు కాని, కాళ్లు పట్టుకోగానే కరిగిపోలేదూ! రేపు మనవరాళ్లను తీసుకొచ్చి మీ ఒళ్లో కూర్చోబెడితే ముద్దు చెయ్యకుండా వుండగలరా?’’‘‘అదే ఆలోచిస్తున్నాను రమా. వరం మీద ఆంక్షలు పెట్టి దూరంగా వుంచటం కంటేæ పాజిటివ్‌గా దగ్గరకు తీసుకుంటేనే వాడిలో క్రమంగా మార్పు వస్తుందనుకుంటున్నాను.’’‘‘ఏవండీ, మీరేనా ఈ మాటంటున్నది?’’ నారాయణకు దగ్గరగా జరిగి ఆనందంగా ఆశ్చర్యంగా అతని కళ్లలోకి చూసింది రమ.‘‘అవును రమా. డబ్భైకి దగ్గరవుతున్న ఈ వయసులో యింకా పంతాలూ, పట్టింపులూ దేనికి? నీ అనంతరం వాడి పిల్లలకు ఈ ఆస్తిపాస్తులు సంక్రమించేలా విల్ రాసేద్దామనుకుంటున్నాను.’’‘‘మాటాడితే ‘నీ’ అనకండి ‘మన’ అనండి. మీరు లేకుండా నేనెక్కడుంటాను?’’ రమ గొంతు గాద్గదికమైంది.‘‘పిచ్చి రమా. నీపాత పాట విడిచిపెట్టు. రేపేం జరుగుతుందో ఎవరికి తెలుసు? నీ సెక్యూరిటీ’ గురించి ఆలోచించి అలా అన్నాను. పోనీ, ఓ పని చేద్దాం. లాయరుగార్ని సంప్రదించి ఆయన సలహా తీసుకుందాం. లే. నువ్వు తయారయితే లాయరు గారింటికి వెళ్దాం.‘‘లేడికి లేచిందే పరుగన్నట్టు ఇప్పుడా? మనం బాగా ఆలోచించుకొని రేపు వెళ్దాం లెండి’’‘‘అలాక్కాదు. వరాన్ని మ్యారేజ్ డేకి రావద్దంటే చిన్నబుచ్చుకొని వెళ్లిపోయాడు. అందువల్ల వాణ్ని ఆ రోజున పిల్చి, ‘విల్’ గిఫ్ట్‌గా యిచ్చి సర్ప్రయిజ్ చేద్దామని...’’భర్త మాటకు యెప్పుడూ యెదురు చెప్పని రమ నిమిషాలమీద రెడీ అయింది. వాళ్లిద్దరూ మెయిన్‌రోడ్ వరకు వెళ్లి ఆటోను ఆపి లాయరు గారింటికి బేరమాడుకొని ఆటో యెక్కారు. ఆటో నేలమీద వెళ్తున్నట్టు లేదు. ఆటో వేగానికి భయపడి ఆందోళనతో నారాయణ ఎన్నిసార్లు హెచ్చరించినా, జాగ్రత్తలు చెపుతున్నా ఆటో డ్రైవర్ వినిపించుకోవడం లేదు. పైగా విసుక్కొంటున్నాడు కూడా. ఒక దశలో ఆటో నుంచి దిగి పోదామని నారాయణ ఆటోను ఆపమంటుండగానే అది అదుపు తప్పి యెదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఆ భయంకరమైన శబ్దానికి అదిరిపడిన చుట్టుపక్కల జనం యాక్సిడెంట్ జరిగిన స్థలం చుట్టూ చేరేసరికి ఒక పక్క నుజ్జునుజ్జయిన ఆటో భాగాలు, మరో పక్క నెత్తుటి మడుగులో రమానారాయణల మృతదేహాలు! మృత్యుముఖంలో కూడా చేతులు వీడని ఆ జంటను చూసి చెమర్చని కళ్లు లేవు!. డా. పైడిపాల -
రెండు ముళ్ల పెళ్లి
పెళ్లికి మూడు ముళ్లు అవసరం. యవ్వనంలో.. వృద్ధాప్యంలో.. మరోజన్మలో కూడా కలిసి ఉండటానికే ఈ ముడులు. కానీ ఈ చెల్లికి మాత్రం రెండుసార్లూ.. పెళ్లి ముల్లైంది. విధి మొదటి ముల్లు. అందం రెండో ముల్లు. ఈ రెండు ముళ్ల పెళ్లి.. రెండో భర్త రూపంలో ఆమెకు నరకం చూపించింది! ఆమె అంతరంగమిది. నిన్నటి జీవితం నేడు అనుకుని.. నేటి జీవితమే నేను అనుకుని కొత్తగా మొదలుపెడదామంటే నీడను గుచ్చుకున్న ముల్లుకంటే నేటిని గుచ్చుతున్న ముల్లే ఎక్కువగా బాధిస్తోంది! ‘వన్స్ బిటెన్.. ట్వైస్ షై’ అంటారు. ఒకసారి జరిగిన నష్టం రెండోసారి జరక్కుండా చూసుకోవాలని! ఇది ముందే తెలిసుంటే ఎంత బాగుండేది! నాకు పాతికేళ్ల వయసులో పెళై్లంది. ఏడాదికే ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. యుక్త వయసులోనే నా జీవితం రోడ్డు పాలైంది. ఇది చూసి మా అమ్మా నాన్న తట్టుకోలేక మళ్లీ పెళ్లి సంబంధాలు చూశారు. అదే సమయంలో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న ఆయన.. మొదటి భార్యకు విడాకులు ఇవ్వడం, మా ఇంటికి పెళ్లి చూపులకు రావడం, నేను నచ్చడం, ఇద్దరికీ పునర్వివాహం.. చకచకా జరిగిపోయాయి. పాత బాధలన్నీ మర్చిపోయి కొత్త జీవితం వైపు అడుగులు వేసేందుకు మెట్టినింట్లో కాలు పెట్టాను. పెళై్లన పది రోజుల వరకూ జీవితం సాఫీగానే సాగింది. ఎప్పుడూ నా వెంటే ఉండే వారు. నేను ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో జాబ్ చేస్తుండటంతో ఆయనే స్వయంగా నన్ను బ్యాంక్‌కు డ్రాప్ చేసే వారు. సాయంత్రం అరగంట ముందుగానే వచ్చి బ్యాంకులో నా ఎదురుగా కూర్చొని.. నన్ను చూస్తూ ఉండేవారు. కొన్నిసార్లు ఆలస్యమైనా కోపగించుకునేవారు కాదు. ఇవన్నీ చూసి నా అంత అదృష్టవంతురాలు లేదని అనుకున్నాను. ఎంతో ప్రేమగా చూసుకునే భర్త దొరికాడని సంబర పడిపోయాను. కానీ.. ఆ ఆనందమంతా కేవలం గాలి బుడగలేనని తెలుసుకోడానికి ఎంతో సమయం పట్టలేదు. ఒకే ఒక్క సంఘటన నా జీవితంలో ఎన్నో మర్చిపోలేని కాళరాత్రుల్ని పరిచయం చేసింది. ఇంతసేపు ఎక్కడికెళ్లావ్?! ఒక రోజు సాయంత్రం బ్యాంకు పని త్వరగా అయిపోయింది. ఆయనకు ఫోన్ చేశాను. లైన్ బిజీ అని రావడంతో నేనే ఆటోలో వెళ్లిపోయాను. దారిలో మార్కెట్‌కి వెళ్లి ఇంటికి కావలసిన సరకులు కొన్ని తీసుకున్నాను. స్వీట్స్ తీసుకున్నాను. ఓ బట్టల షాప్‌లో చీర నచ్చింది. ఆఫర్లో తక్కువ ధరకు వచ్చిందని తీసుకున్నాను. రాత్రి 8 గంటలు గడిచింది. ఇంటికి వెళ్లేసరికి ఆయన సోఫాలో గంభీరంగా కూర్చొని ఉన్నారు. ఎక్కడికి వెళ్లావంటూ గద్దించారు. విషయమంతా చెప్పినా విసుక్కున్నారు. కాల్ చేశానని చెప్పినా కసురుకున్నారు. ‘‘ఇన్ని రోజులూ నీ వెంట వస్తోంది నువ్వంటే ఇష్టమని కాదు. నా మొదటి పెళ్లాంలా వేరే సంబంధం పెట్టుకోవని. కానీ ఇంతలా కాపలా కాస్తున్నా తప్పించుకున్నావ్! చెప్పు.. నీకు చీర ఎవరు కొనిచ్చారు?’’ అంటూ అనుమానపు పిశాచిలా నన్ను ఆ రాత్రంతా చిత్రహింసలకు గురిచేశాడు. ఉదయం లేచేసరికి మామూలుగానే ప్రవర్తించారు! ఆ నవ్వు వెనుక విషం! ‘‘నువ్వు కనిపించలేదనే ఎమోషన్లో నోటికొచ్చినట్లు మాట్లాడేశాను’’ అంటూ బుజ్జగించారు. నువ్వు చాలా అందంగా ఉంటావ్. అందుకే నిన్ను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నానంటూ నవ్వుకుంటూ చెప్పడంతో నేనూ హ్యాపీ ఫీలయ్యాను. కానీ.. ఆ నవ్వుల వెనుక విషం అలాగే ఉందని గమనించలేకపోయాను. పాప పుట్టినా మారలేదు నేను అందంగా ఉన్నానని ఆయన చెప్పడంతో ఆయన కోసం మరింత అందంగా కనిపించాలని భావించేదాన్ని. మొదటి రెండు రోజులు గమనించిన ఆయన మూడో రోజునుంచి టార్చర్ పెట్టడం మొదలు పెట్టారు. ఎవరి కోసం ఇలా రెడీ అవుతున్నావంటూ అప్పటి నుంచి మనోవేదనకు గురి చేస్తున్నారు. రెండేళ్ల వరకూ రోజూ నరకం చూశాను. గర్భవతిని అయినా విడిచిపెట్టలేదు. ఆడపిల్ల ప్రసవించింది. పోనీ పాప పుట్టిన తర్వాత అయినా మారతారని అనుకున్నాను. కానీ ఆయన ప్రవర్తనలో మార్పు రాలేదు. పైగా ఆడపిల్ల పుట్టిందంటూ నానా గొడవా చేశారు. ఆ పిల్లను చంపేస్తానంటూ బెదిరించారు. చిత్రహింసలు ఎక్కువయ్యాయి విషయం తెలిసిన మా అమ్మా నాన్న కేసు పెడదామంటూ నన్ను తీసుకొచ్చారు. కానీ నేను ఒప్పుకోలేదు. ఆయనలో మార్పు వస్తుందన్నాను. కానీ హింస మరింత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో బ్యాంకులో ఉన్న నా సహచరురాలు మహిళా శక్తి గురించి చెప్పింది. ఆ బృందంతో మాట్లాడాను. వారు మా ఆయనను పిలిపించారు. విషయం తెలుసుకున్నారు. ‘‘నా మొదటి భార్య ఇలాగే చేసి నన్ను మోసం చేసింది. ఆమె కంటే ఈమె అందంగా ఉంది. అలాంటప్పుడు ఈమె కూడా ఆమెలాగే తనని మోసం చేయకుండా ఉంటుందా అని అనుమానపడ్డాను’’ అని చెప్పారు. ఆ తర్వాత వాళ్లు మా ఇద్దరికీ వేర్వేరుగానూ, ఇద్దరినీ కలిపి కౌన్సిలింగ్ చేశారు. అయినా.. ఈ మూడేళ్లు పడిన కష్టాలు జీవితంలో మర్చిపోలేను. – కనకదుర్గ (పేరుమార్చాం), గాజువాక ఇంటర్వ్యూ: కరుకోల గోపి కిశోర్ రాజా, విశాఖ సిటీ -
అందరూ చూస్తుండగానే ఆత్మహత్య
హైదరాబాద్: అందరూ చూస్తుండగా ఓ గుర్తు తెలియని మహిళ క్వారీ గుంతలో పడి ఆత్మహత్య చేసుకుంది. వారిస్తున్నా పట్టించుకోకుండా వెళ్లి ప్రాణాలు తీసుకుంది. హైదరాబాద్ శివారులోని గాజుల రామారం దేవేందర్‌నగర్ ప్రాంతంలో కొన్ని క్వారీ గుంతలున్నాయి. ఏళ్ల తరబడి వీటిని వినియోగించకపోవడంతో నిండా నీళ్లు చేరాయి. ఈ గుంతల వద్ద దేవేందర్‌నగర్ వైపు కొన్ని అక్రమ నిర్మాణాలు వెలిశాయి. దీంతో గురువారం ఉదయం రెవెన్యూ అధికారులు కూల్చివేతల్ని చేపట్టారు. అంతలో గుంతలకు అవతలి వైపున ఉన్న ఖైసర్‌నగర్ నుంచి ఓ వివాహిత నడుచుకుంటూ రావడాన్ని స్థానికులు గమనించారు. దీంతో ముందుకు వెళ్లవద్దంటూ వారిస్తూ, అరుస్తూ ఆమె వైపునకు కొందరు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మరికొందరు తమ సెల్ఫోన్లలో వీడియో తీయడం మొదలెట్టారు. ఏమీ పట్టించుకోకుండా ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతో ముందుకు వెళ్లిన ఆమె క్వారీ గుంతలోకి దిగుతూ ఆరడుగులు వేసింది. హఠాత్తుగా పట్టుతప్పి కాలు జారడంతో నీళ్లల్లోకి పడిపోయింది. తలకు రాళ్లు తగలడంతో తీవ్రంగా గాయపడిన ఆమె నీళ్లలో పడిన కొద్దిసేపటికే చనిపోయింది. మృతదేహాన్ని స్థానికులు వెలికితీయగా జగద్గిరిగుట్ట పోలీసులు వచ్చి దానిని మార్చురీకి తరలించారు. మృతురాలి గురించిన వివరాలు తెలియకపోవడంతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలోని ఠాణాలకు సమాచారమిచ్చారు. గత రెండు రోజుల్లో నమోదైన మిస్సింగ్ కేసుల్నీ పరిశీలిస్తున్నారు. మృతురాలు ఎవరన్నది తెలిస్తే తప్ప ఆత్మహత్యకు గల కారణాలు తెలియవని పోలీసులు చెబుతున్నారు. మరణాలకు కేరాఫ్ అడ్రస్ దేవేందర్‌నగర్ శివార్లలో మొత్తం 14 క్వారీ గుంతలున్నాయి. ఇవి ప్రమాదాలకు, ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాయి. రెండేళ్లలో ఈ ప్రాంతంలో 14 మంది చనిపోయారు. క్వారీ గుంతల చుట్టూ ఫెన్సింగ్ నిర్మించాలని కలెక్టర్ కొన్ని నెలల క్రితం ఆదేశాలు జారీ చేసినా అతీగతీలేదు. ఇకనైనా అధికారులు స్పందించి ఈ ప్రాంతంలో మరణాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
ప్రభుత్వాలు కళ్లు తెరవాలి
లేని పెద్దరికాన్ని తెచ్చుకుని సమాజంపై స్వారీ చేస్తున్న బృందాలకు మళ్లీ సర్వోన్నత న్యాయస్థానం నుంచి మొట్టికాయలు పడ్డాయి. పెళ్లీడు వచ్చిన ఆడ, మగ వివాహం చేసుకుంటే అందులో జోక్యం చేసుకునే హక్కు వ్యక్తులకు గానీ, బృందాలకుగానీ, కుల పంచాయతీలకుగానీ లేదని సోమవారం సుప్రీంకోర్టు ధర్మాసనం విస్పష్టంగా చెప్పింది. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లలో సమా జానికి, ముఖ్యంగా మహిళలకు బెడదగా పరిణమించిన ఖాప్ పంచాయతీల తీరును, వాటి విషయంలో పట్టనట్టు ఉంటున్న ప్రభుత్వాల వైఖరిని ప్రశ్నిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరుపుతున్న సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రేమ పెళ్లి చేసుకున్నవారిని ఊరి నుంచి వెలేయడం దగ్గరనుంచి వారిని హత్య చేసేవరకూ ఈ ఖాప్ పంచాయతీలు సాగి స్తున్న అరాచకాలకు అంతూ పొంతూ లేదు. ఆడపిల్లలు బయటకు వెళ్తే సెల్‌ఫోన్ వాడకూడదని, 40 ఏళ్లలోపు మహిళలు బయటకు వెళ్లాల్సివస్తే తలపై వస్త్రం కప్పుకోవాలని, ఒంటరిగా వెళ్లకూడదని, సూర్యాస్తమయం అనంతరం బయటికే రాకూడదని, వారి దుస్తులు ఫలానా విధంగా మాత్రమే ఉండాలని, సగోత్రీకుల మధ్య వివాహం జరిగితే ఊరుకోబోమని అయిదేళ్లక్రితం హర్యానాలోని ఖాప్ పంచాయతీ తీర్మానాలు చేసింది. ఈ ఖాప్ పంచాయతీల ఆగడాలపై వ్యంగ్య చిత్రాన్ని నిర్మించిన దర్శకుడి తల తెచ్చి ఇచ్చినవారికి 51 గేదెలు బహుమానంగా ఇస్తామని 2015లో ఉత్తరప్రదేశ్‌లోని ఖాప్ పంచాయతీ ప్రకటించింది. అదే ఏడాది హర్యానాలో తల్లిదండ్రులు కుదిర్చి చేసిన పెళ్లిని సైతం ఒక ఖాప్ పంచాయతీ రద్దు చేసింది. పెళ్లయి అయిదు నెలలయ్యాక ఇద్దరూ అన్నాచెల్లెళ్లలా ఉండాలంటూ ఫర్మానా జారీచేసింది. గ్రామం వెలివేసిన పరిస్థితుల్లో వారిద్దరూ గత్యంతరం లేక పంజాబ్ హర్యానా హైకోర్టును ఆశ్రయించవలసి వచ్చింది. నిజానికి ఈ దేశంలో ప్రజలెన్నుకున్న చట్టసభలున్నాయి. వాటి ద్వారా ఏర్ప డిన ప్రభుత్వాలున్నాయి. ఇటీవలి కాలంలో ప్రభుత్వాల ఉనికి పోలీసుల అత్యు త్సాహం వల్లా, పన్నుల విధింపు ద్వారా తప్ప ప్రజలకు ఇతరత్రా తెలియడం లేదు. అధికార పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలే అధికారులపైనా, సామాన్యులపైనా దాడు లకు దిగడం పెరిగింది. ఇక ఖాప్ పంచాయతీలనూ, గోరక్షణ బృందాలనూ, మతోన్మాదంతో రెచ్చిపోయే ముఠాలనూ అదుపు చేయడం గురించి అడిగేదే ముంటుంది? అందువల్లే ‘శక్తివాహిని’ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టును ఆశ్ర యించాల్సివచ్చింది. ఈ వ్యాజ్యం దాఖలై కూడా అయిదేళ్లవుతోంది. ఎప్పుడో ఒకప్పుడు న్యాయస్థానానికి సంజాయిషీ ఇచ్చుకోవాల్సివస్తుందని, కనుక ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలని ఇన్నేళ్లలో ఏ ఒక్క ప్రభుత్వానికీ అనిపించలేదు. ఈ అయిదేళ్లలో పలు రాష్ట్రాల్లో వేరే పార్టీల ప్రభుత్వాలు వచ్చాయి. కేంద్రంలో యూపీఏ నిష్క్రమించి, ఎన్డీఏ ఏలుబడి ప్రారంభమైంది. అయినా ఈ బృందాల ఆగడాలు మాత్రం యథాప్రకారం సాగుతున్నాయి. పైగా ఈ మాదిరి బృందాలు, వాటి ఆగడాలు మరింతగా పెరిగాయి. సారాంశంలో రాజకీయ పక్షాలన్నీ ఈ బృందాల ముందు మోకరిల్లుతున్నాయి. వాటి చేతుల్లో ఓటు బ్యాంకులున్నాయన్న ఏకైక కారణంతోనే ఇలా వ్యవహరిస్తున్నాయి. బహుశా సుప్రీంకోర్టు కూడా ఈ సంగతిని గ్రహించి ఉండొచ్చు. అందువల్లే సమాజంపై స్వారీ చేస్తున్న ఈ నానా రకాల బృందాల విషయంలో ఏం చేయాలన్న సూచనలిచ్చేందుకు సీనియర్ పోలీస్ అధికారులతో కమిటీని నియమించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయమై రెండు వారాల్లో మార్గదర్శకాలను తయారు చేస్తుందని అదనపు సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టుకు తాజాగా చెబుతున్నారు. విచారణ సందర్భంగా ఖాప్ పంచాయతీల తరఫు న్యాయవాది వినిపించిన వాదనలు గమనించదగ్గవి. 1955నాటి హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 5 సగోత్రీకుల మధ్య వివాహబంధాన్ని నిషేధిస్తున్నదని ఆ న్యాయవాది వివరించారు. ఖాప్ పంచాయతీలు అలాంటి వివాహాలను మాత్రమే వ్యతిరేకిస్తున్నాయని సంజా యిషీ ఇచ్చారు. అయితే పెళ్లీడు వచ్చిన ఇద్దరు వ్యక్తుల మధ్య వివాహం జరి గినప్పుడు ఏ ఒక్క వ్యక్తి లేదా బృందం, సమాజం జోక్యం చేసుకోవడానికి, ఆ దంపతులను వేధించడానికి వీల్లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎవరితో సహ జీవనం చేయాలో, జీవితాంతం కలిసి ఉండాలో ఎంపిక చేసుకునే హక్కు యుక్త వయస్కులందరికీ ఉంటుందని చెప్పింది. ఆ వివాహం చెల్లుతుందో, లేదో...అది సక్రమమో కాదో చెప్పేందుకు న్యాయస్థానాలకు తప్ప మరెవరికీ అధికారం లేద న్నది. ఇది సామాజికాంశం తప్ప, చట్టపరమైనది కాదని ఖాప్ న్యాయవాది చేసిన వాదనను అంగీకరించలేదు. ఖాప్ పంచాయతీలు, ఇతర ప్రైవేటు బృందాలు నిర్వహిస్తున్నవారికి చదువు సంధ్యలు సక్రమంగా లేని కారణం వల్లనే ఇలా అనాగరికంగా వ్యవహరిస్తారని చాలామందిలో అపోహలుంటాయి. తోటి మనుషులతో మర్యాదగా మెలగాలని, వారిని అగౌరవపర్చడం, వారిపై పెత్తనం చలాయించడం, దౌర్జన్యం చేయడం నాగరిక లక్షణం కాదని తెలియడానికి చదువు అవసరం లేదు. ఇంగితజ్ఞానం ఉంటే చాలు. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలించడం ద్వారా వచ్చే అతి సాధారణ జ్ఞానాన్నే ఇంగితజ్ఞానం అంటారు. ఈ బాపతు బృందాలను వెంటేసుకు తిరిగే వారికి ఆ జ్ఞానం కూడా లోపిస్తోంది. ఇలాంటివారు సమాజాన్ని బాగు చేస్తామని బయల్దేరితే ఆ సమాజం ఎంతటి దురవస్థలో పడుతుందో చెప్పనవసరం లేదు. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు ఎటూ మూర్ఖత్వంలో కూరుకుపోయినవారిలో మార్పు తీసుకురాలేవు. కఠిన శిక్షలే వారికి మందు. కనీసం ప్రభుత్వాలైనా కళ్లు తెరవాలి. ఈ బృందాల కారణంగా రాజ్యాంగ విలువలు, పౌరు లకు అది ప్రసాదించిన హక్కులు ధ్వంసమవుతున్నాయని గుర్తించాలి. కనీసం ఓటేసి గద్దెనెక్కించిన పౌరుల మాన ప్రాణాలు కాపాడటం తమ ప్రాథమిక కర్తవ్య మని తెలుసుకోవాలి. ప్రైవేటు బృందాల ఆగడాలను అరికట్టేందుకు సమగ్రమైన, కఠినమైన చట్టం తీసుకురావాలి. -
తల్లే కాళ్లు కడిగింది
కూతుర్ని ఒడిలో కూర్చోబెట్టుకొని రాజీ కన్యాదానం చేస్తున్న ఈ ఫొటోను చూసిన వారెవరైనా... ఆమె సంప్రదాయ విరుద్ధంగా వెళ్లిందనుకోరు. ఆమె చిరునవ్వులో.. స్వచ్ఛమైన, నిష్కల్మషమైన కుటుంబ ఆనందాన్ని మాత్రమే చూస్తారు. అనురాగం నిండిన తల్లి హృదయాన్ని మాత్రమే చూస్తారు. అమ్మాయి పెళ్లిలో తల్లి తన చేతుల మీదుగా నీరు పోస్తుంటే, తండ్రి ఆ నీళ్లతో వరుడి కాళ్లు కడిగి తన కుమార్తెను వరుడికి కన్యాదానం చేస్తాడు. ఒకవేళ తండ్రి లేకపోతే దగ్గరి బంధువులు కన్యాదానం చేస్తారు. అయితే వేరెవరో కన్యాదానం చేయడానికి ఈ తల్లి మనసు అంగీకరించలేదు. తన కుమార్తెకు తానే కన్యాదానం చేయాలనుకుంది. అనుకోవడమే కాదు చేసింది కూడా! హిందూ వివాహాలలో తండ్రి కన్యాదానం చేస్తూ, ‘ఇంతవరకు నేను నా కుమార్తెను ఎంతో గారాబంగా పెంచుకున్నాను. ఈ రోజు నుంచి నీ చేతిలో పెడుతున్నాను. నేటి నుంచి నా కుమార్తె బాధ్యతంతా నీదే. జాగ్రత్తగా చూసుకో’ అని వరుడికి చెబుతాడు. అదే విధంగా ఈ తల్లి కన్యాదానం చేస్తూ తన కూతుర్ని కళ్లల్లో పెట్టి చూసుకొమ్మని వరుడిని కోరింది. రాజీ సింగిల్ మదర్. ఆమెది పెద్దలు కుదిర్చిన వివాహం. వరుడిది ఆస్ట్రేలియా. రాజీ ఉండేది చెన్నై. పెళ్లయ్యాక భర్తతో పాటు ఆస్ట్రేలియా వెళ్లిపోయింది. పిల్లలు పుట్టారు. సంధ్య, మహేశ్. 17 ఏళ్లు సాఫీగానే సాగాయి. క్రమేపీ భార్యాభర్తల మధ్య స్పర్థలు బయలుదేరాయి. అవి భరించలేని స్థాయికి చేరాయి. రాజీ విడాకులు తీసుకుంది. అంతకాలం భర్త మీదే ఆధారపడి జీవించడంతో, తన జీవితాన్ని మళ్లీ నిర్మించుకోవలసి వచ్చింది. ఆమెకు చిన్నప్పటి నుంచి వంట చేయడమంటే ఇష్టం. అదిప్పుడు ఎంతో ఉపయోగపడింది. శని, ఆదివారాల్లో కిచెన్ క్లాసెస్‌తో ఆదాయ మార్గం వెతుక్కుంది. విడాకులు తీసుకున్నందు వల్ల కుమార్తె వివాహంలో ఏవైనా ఇబ్బందులు వస్తాయేమో అనుకుంది. అలాంటివేమీ జరగలేదు. అయితే ఒక అడ్డంకి వచ్చింది. కన్యాదానం చెయ్యడానికి తండ్రి లేడు. ఎలా అని ఆమె నా మనసులో దిగులు బయలుదేరింది. ‘‘చాలా ఆలోచించాను. తల్లిని నేనున్నానుగా అనుకుని చివరికి నేనే కన్యాదానం ఇవ్వడానికి నిర్ణయించుకున్నాను’’ అన్నారు రాజీ. ఆ విషయం వరుడి తల్లిదండ్రులకు చెప్తే వారు కూడా సంతోషంగా అంగీకరించారు. అయితే సంప్రదాయ విరుద్ధంగా చేస్తున్నందుకు రాజీ బంధువులు ఆమెను వ్యతిరేకించారు. ఆచారాన్ని మంటగలుపుతోందని నిందించారు. అయినా పట్టించుకోలేదు. ఆమె చేత కన్యాదానం చేయించడానికి రాఘవన్ అనే పండితుడు ముందుకు వచ్చారు. పెళ్లి నిరాటంకంగా జరిగిపోయింది. -
వదిలించుకునేందుకే హత్య
కొయ్యూరు(పాడేరు): మండలంలోని డౌనూరు జీడితోటల్లో జరిగిన గుర్తుతెలియని వివాహిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారం, ఫోన్‌కాల్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు హంతకులను పట్టుకున్నారు. వివాహేతర సంబంధం పెట్టుకునే వ్యక్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. కొయ్యూరు సీఐ ఉదయ్‌కుమార్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేసి, హంతకులను పట్టుకున్నారు. ఆ వివరాలను సీఐ ఉదయ్‌కుమార్, ఎస్ఐ రుక్మాంగదరావు గురువారం విలేకరులకు తెలిపారు. మండలకేంద్రమైన కోటవురట్లకు చెందిన జనవేది రాంబాబు తాపీమ్రేస్త్రిగా హైదరబాద్‌లో పనిచేస్తున్నాడు. హైదరాబాద్ పటాన్ చెరువు సమీపంలో టీ దుకాణం నిర్వహిస్తున్న మైసపు శివమ్మతో పరిచ యం ఏర్పడింది. అక్కడే రోజూ టీ తాగి, భోజనం చేసేవాడు. ఇలా ఇద్దరి మధ్య పరిచయం పెరగడంతో వివాహేతర సంబంధం ఏర్పడింది. శిమమ్మకు వివా హమైనా భర్త లేడు. రాంబాబుకు భార్య, కుమారుడు ఉన్నారు. తనతో పూర్తిగా ఉండిపోవాలని రాంబాబు ను శివమ్మ కోరేది. రాంబాబు కొడుకును కూడా ఇక్కడకు తీసుకువచ్చి ఉంచేయాలని అనేకసార్లు చెప్పింది. భార్య దగ్గరకు వెళ్లకుండా తనతో పూర్తిగా ఉండిపోవాలని పట్టుపట్టింది. సంక్రాంతి సందర్భంగా రాంబాబు,శిమమ్మ కలిసి కోటవురట్ల వచ్చారు. ఇక్కడకు వచ్చిన తరువాత కూడా భార్యను వదిలిపెట్టి కొడుకుతో కలిసి తనతో రావాలని గొడవ చేసింది. శివమ్మ దగ్గర నుంచి రూ.రెండు లక్షల వరకు రాంబాబు తీసుకున్నాడు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని, లేదా కొడుకును తీసుకుని తనతో రావాలని పట్టుపట్టింది. ఈ విషయం గ్రామంలో కొందరికి తెలిసింది. ఈమెతో ఉంటే భార్యతో ప్రమాదం వస్తుందని రాంబాబు భావించాడు. స్నేహితుడు కర్రి నరేశ్‌తో కలిసి హత్యచేయాలని ప్లాన్ వేశాడు. జనవరి 22న శివమ్మను పర్యాటక ప్రాంతమైన చింతపల్లి మండలం తాజంగి తీసుకువచ్చాడు.అక్కడ సాయంత్రం వరకు ఆ ముగ్గురు ఉన్నారు.అయితే జనాలు ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ హత్యచేయడం కుదరలేదు. దీంతో డౌనూరు సమీపంలో జీడిమామిడి తోటలను ఎంచుకున్నారు. చీకటి పడిన తరువాత శిమమ్మ, రాంబాబు,నరేశ్‌లు జీడితోటల్లోకి వచ్చారు. ముందుగా అనుకున్న ప్రకారం ముగ్గురూ కలిసి మద్యం సేవించారు. ఈ సందర్భంగా రాంబాబు,శివమ్మ మధ్య వాగ్వాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న శిమమ్మ మెడను రాంబాబు బ్లేడ్‌తో కోశాడు.దీనికి నరేశ్ సహకరించాడు. తరువాత రోజు ఏమి తెలియనట్టుగా వారిద్దరూ గ్రామంలోకి వచ్చారు. వెళ్లేటప్పుడు ముగ్గురు వెళ్లి, ఇద్దరు రావడంపై కొందరికి అనుమానం వచ్చింది. 24న జీడితోటల్లో మృతదేహాన్ని కనుగొన్న కొయ్యూరు పోలీసులు విచారణ చేపట్టారు. 25న అన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. దీంతో కోటవురట్లకు చెందిన కొందరు సీఐకు సమాచారం ఇచ్చారు.దాని ఆధారంగా విచారణ ప్రారంభించారు. హంతకుడు ఫోన్‌ను ట్రాప్ చేశారు. చివరకు అరెస్టు చేశారు. -
శ్రీమతి ఇలియానా!!
ఇలియానా పోర్చుగీసు అమ్మాయి. ముంబైలో ఉంటోంది. ఆండ్రూ నీబోన్ ఆస్ట్రేలియా అబ్బాయి. ఇండియాలో ఉంటున్నాడు. ఇద్దరూ కలిసి కొంతకాలంగా ఫ్రీ బర్డ్స్‌లా ఎక్కడబడితే అక్కడ ఎగురుతూ కనిపిస్తున్నారు. ఊహు.. ఫ్రీ బర్డ్స్ కాదు. లవ్ బర్డ్స్! ఊహూ.. లవ్ బర్డ్స్ కూడా కాదు. లవింగ్ కపుల్! కపుల్ అంటే? అయ్య బాబోయ్ ఇలియానా పెళ్లయిపోయిందా? అలా గుండెలు బాదేసుకోకండి బాయ్స్! ఇలియానాకు, ఆండ్రూకీ పెళ్లి అయిందో లేదో కానీ, అయినట్లే కనిపిస్తోంది. ఏం కనిపిస్తోంది? ఇలియానా ఇన్‌స్టాగ్రామ్‌లో.. ఆండ్రూపై ఆమె చూపిస్తున్న లవ్ కనిపిస్తోంది. అఫెక్షన్ కనిపిస్తోంది. భార్యాభర్తలు తప్ప ఇంకెవరూ ఇంత దగ్గరగా ఉండరు కనుక.. కాగల వివాహకార్యం ఆల్రెడీ ఎక్కడో, ఎప్పుడో జరిగినట్టే ఉందని బాలీవుడ్ ఊహిస్తోంది. ఊదరగొడుతోంది. ఆండ్రూ మంచి ఫొటోగ్రాఫర్. సినిమాటోగ్రాఫర్ కూడా చూపించలేనంత అందంగా ఇలియానాను షూట్ చేశాడు. ఆ ఫొటోలే ఇప్పడు ఇలియానా ఇన్స్టాగ్రామ్ నుండి విడుదల అవుతున్నాయి. వాటిని చూసి షాక్ తినేవాళ్లు తింటున్నారు. జెలసీ ఫీల్ అయ్యేవారు ఫీల్ అవుతున్నారు. ‘కోతి మొహం’ అనేవాళ్లు అంటున్నారు. ఎవరిదట కోతి మొహం!! కుళ్లుమోతులు ఏమైనా అంటారు. పట్టించుకోకండి. -
కోరిక
నీ భార్యని కిడ్నాప్ చేశాం. ఐదు లక్షలు రెడీ చేస్కో. ఇరవై నాలుగు గంటలు టైమ్. డబ్బు ఎక్కడ ఇవ్వాలో రేపు చెబుతాం. అమృత హోటల్లో మీల్స్ సెక్షన్లో హడావుడి మొదలైంది. కార్తీక మాసం చలిరాత్రి.. ఎనిమిదింటికే వణికిస్తోంది. హోటల్ పక్కనే పార్క్ ఉండటంతో చల్లటి గాలి వీస్తోంది. హోటల్ ముందు బైక్ ఆపి.. కౌంటర్లో కూర్చున్న నరసింహ దగ్గరకు వచ్చాడు భూమయ్య. అతను ప్రశాంతి నగర్ కాలనీలో నరసింహ ఇంటిపక్కన ఇంట్లో ఉంటాడు. అప్పుడప్పుడు చపాతీలో, మసాలా దోశలో పార్సిల్ చేయించుకుని తీసుకెళ్లడానికి వస్తాడు భూమయ్య! ఇప్పుడు అందుకే అనుకున్నాడు నరసింహ. ‘‘నరసింహా..! మీ ఆవిడ గుడికని వెళ్లి ఇంకా ఇంటికి రాలేదు. పిల్లలు మా ఇంట్లో ఉన్నారు. అమ్మ... అమ్మా అని చిన్నది ఏడుస్తోంది. నువ్వు ఒక సారి ఇంటికి రా!’’ అన్నాడు తగ్గుస్వరంతో.. నరసింహ తలెత్తి వాల్ క్లాక్ వైపు చూశాడు. ఎనిమిదిన్నర దాటింది. ‘‘ఇంకా రాలేదా?’’ గొనుగుతున్నట్లు అన్నాడు. భూమయ్య తలూపాడు. ‘‘వస్తున్నా.. నువ్వు పదా!’’ అన్నాడు నరసింహ ‘‘తొందరగా రా!’’ అని భూమయ్య వెళ్లిపోయాడు.నరసింహలో కంగారు మొదలైంది. కార్తీక మాసంలో శివుడి గుడికి వెళ్లి దీపాలు వెలిగించి వెంటనే వచ్చేస్తుంది. ఆరింటికి వెళ్లి ఏడింటి లోపలే వస్తుంది. ఈ రోజు ఎందుకు రాలేదు? అని ఆలోచనలో పడ్డాడు. నరసింహ కిచెన్‌లోకి వెళ్లి ‘‘అమ్ములూ..! కౌంటర్లో కూర్చో..! ఇంటికెళ్లొస్తా!’’ అన్నాడు.‘‘ఇప్పుడేంది? అవతల భోజనాల హడావుడి..!’’ అన్నది అమ్ములు.‘‘అర్జెంట్ పని ఉందిలే..!’’ అని హడావుడిగా బైక్ ఎక్కి బయలుదేరాడు.ప్రశాంతినగర్ కాలనీలో అన్నీ ఇండిపెండెంట్ ఇళ్లే. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతోంది. చాలా వరకూ ఖాళీ ప్లాట్లే ఉన్నాయి.నరసింహ వెళ్లే సరికి అతని ఇంటి ముందు ఇరుగుపొరుగు ఆడవాళ్లు కొందరు నిలబడి మాట్లాడుకుంటున్నారు.నరసింహ బైక్ ఆపగానే చిన్న కూతురు లత.. ‘‘నాన్నా!’’ అంటూ ఏడుస్తూ వచ్చింది. నరసింహ లతని ఎత్తుకున్నాడు.‘‘ఎందుకురా ఏడుస్తున్నావు?’’ అన్నాడు కన్నీళ్లు తుడుస్తూ...‘‘అమ్మా... అమ్మా..!’’ అన్నది ఏడుస్తూ..అక్కడికి రెండు ఫర్లాంగుల దూరంలో గుట్టమీద ఉంది శివాలయం. తమకంటే ముందే బయలుదేరి ఇంటికి వెళ్తున్నట్లు దేవకి చెప్పినట్లు కొందరు ఆడవాళ్లు నరసింహతో చెప్పారు.పిల్లలకు అన్నం పెట్టమని భూమయ్య భార్యకి చెప్పి నరసింహ, భూమయ్యా.. శివాలయం వైపు బయలుదేరారు. గుడిలో జనం పల్చగా ఉన్నారు. దీపాలు వెలుగుతున్నాయి. గుడి వెనుక ఉన్న తోటలో వెతికారు. దేవకి జాడ తెలియలేదు. నరసింహలో భయం మొదలైంది. గుడికి వెళ్లిన దేవకి ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్లిందో అతడికి అర్థం కాలేదు.ఇక అక్కడ చేసేదేం లేక ఇంటికి వెళ్లారు. పిల్లలు అన్నం తిని భూమయ్య ఇంట్లోనే నిద్రపోతున్నారు. నరసింహకు ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడంలేదు.‘‘నరసింహా! ఎందుకైనా మంచిది పోలీస్ స్టేషన్‌కి వెళ్లి రిపోర్ట్ ఇద్దాం పదా’’ అన్నాడు భూమయ్య.దేవకి ఎక్కడికీ వెళ్లే అవకాశంలేదు. ఆమెకి తల్లిదండ్రులు లేరు. అన్న మిర్యాలగూడలో ఉంటాడు. పెద్దగా రాకపోకలు కూడా లేవు. నరసింహ జేబులో సెల్‌ఫోన్ రింగ్ అయ్యింది. అమ్ములు కాల్ చేసింది.‘‘ఎక్కడున్నావ్’’ తొమ్మిదిన్నర అయ్యింది. నేను ఇంటికి వెళ్లొద్దా? అర్జెంట్ పని అన్నావు. ఏంది?’’ అన్నది అమ్ములు.‘‘కొంచెం ఆగు.. వచ్చేస్తా..!’’ అని స్విచ్ ఆఫ్ చేశాడు.తర్వాత పోలీస్ స్టేషన్‌కి వెళ్లి దేవకి ఫొటో ఇచ్చి.. గుడికి వెళ్లి తిరిగి రాలేదని కంప్లైంట్ రాసిచ్చాడు నరసింహ. దేవకి ఫొటో సిటీలోని అన్ని స్టేషన్లకి పంపించారు పోలీసులు. ఎస్సై రామ్‌కుమార్ ప్రశాంతినగర్ కాలనీలో దేవకి గురించి ఎంక్వైరీ చేశాడు. దేవకి ప్రవర్తనలో తేడాలేదని, ఆమెకు భక్తి ఎక్కువని, గుళ్లకే కాకుండా మిర్యాలగూడ దగ్గరలో ఉన్న జాన్పాడు దర్గాకు పిల్లలను తీసుకెళ్లి మొక్కుబడులు చెల్లిస్తుందని చెప్పారు.మంచి ప్రవర్తన గల గృహిణి దేవకి ఏమైనట్లు? వారి కుటుంబానికి శత్రువులు ఉన్నట్లు కూడా లేరు. ఎవరితోనూ శత్రుత్వం లేదని నరసింహ పోలీసులకు చెప్పారు.మరునాడు ఉదయం ఏడింటికి నరసింహ సెల్‌కి కాల్ వచ్చింది.‘‘నీ భార్యని కిడ్నాప్ చేశాం. ఐదు లక్షలు రెడీ చేస్కో. ఇరవై నాలుగు గంటలు టైమ్. డబ్బు ఎక్కడ ఇవ్వాలో రేపు చెబుతాం.’’‘‘నా దగ్గర అంత డబ్బులేదు.’’ అన్నాడు నరసింహ.‘‘మాకు అంతా తెలుసు. అమ్ములు మొగుడు యాక్సిడెంట్లో పోతే ఏడు లక్షలు నీకే ఇచ్చింది. హోటల్ బాగా నడుస్తోంది. ఎవరికీ చందాలు ఇవ్వవు. ఏ పార్టీ వాళ్లనీ లెక్కచెయ్యవు. డబ్బంతా ఏం చేస్తున్నావ్?’’‘‘అమ్ములు హోటల్ బిజినెస్‌లో పెట్టుబడి పెట్టింది. ఆమె నా పార్ట్నర్. నాకు ఊరకనే ఇవ్వలేదు.’’ అన్నాడు నరసింహ.‘‘అదంతా అనవసరం మాకు. ఐదు లక్షలు రెడీ చెయ్యకపోతే నీ భార్యని చంపేస్తాం. తరువాత ఏడుస్తావు.’’ అన్నాడు కిడ్నాపర్.కాల్ కట్ అయ్యింది. నరసింహ పోలీసులకు చెప్పాడు. దేవకిని ఎవరో కిడ్నాప్ చేసి ఐదులక్షలు డిమాండ్ చేశారని.నరసింహ సెల్లో రికార్డ్ అయిన నంబర్ టెలిఫోన్ డిపార్ట్మెంట్కి పంపించి.. ఎంక్వైరీ చేయించారు. అది ఒక కాయిన్ బాక్స్ నంబర్ అని తేలింది. ‘‘ఎవరైనా పిల్లలని కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేస్తారు. వీడెవడయ్యా తల్లిని కిడ్నాప్ చేశాడు. అంతా విడ్డూరంగా ఉంది.’’ అన్నాడు ఇన్స్పెక్టర్ గోపీనాథ్, ఎస్సై రామ్ కుమార్‌తో...‘‘సార్...! నాకైతే నరసింహ మీదే అనుమానంగా ఉంది.’’ అన్నాడు ఎస్సై.‘‘ఎందుకు?’’ ‘‘అతని భార్యను డబ్బుకోసం ఎవరో కిడ్నాప్ చేశారంటే నమ్మకం కలగడం లేదు. నరసింహకి అమ్ములుతో సంబంధం ఉందని హోటల్ వర్కర్స్ చెబుతున్నారు. ఆ విషయంలో భార్య గొడవ పెడుతూ ఉండి ఉంటుంది. అమ్ములు ఎర్రగా బుర్రగా చలాకీగా ఉంటుంది. తనని వదులుకోలేడు. అంతకంటే పెళ్లాన్ని వదిలించుకుంటేనే హ్యాపీ అనుకొని కిడ్నాప్ నాటకం ఆడుతున్నాడని నా అనుమానం.’’ చెప్పాడు ఎస్సై. ఇన్స్పెక్టర్ గోపీనాథ్ ఆలోచనలో పడ్డాడు. ‘నేరాలు డబ్బుకోసం, ఆడదాని కోసమేగా ఎక్కువగా జరిగేది. అక్రమ సంబంధాల విషయంలో మనిషి ఎంతకైనా తెగిస్తాడు’ అనుకున్నాడు.‘‘సార్! కిడ్నాప్ అంతా నాటకం. గుడికి వెళ్లే దారిలో కొంతమేర స్ట్రీట్‌లైట్స్ లేవు. చీకటిగా ఉంటుంది. దేవకి గుడి నుంచి ఒంటరిగా ఇంటికి బయలుదేరింది. చీకటిగా ఉన్న ప్రాంతానికి రాగానే ఆమెను ఏ కారులోనో లాక్కెళ్లి పోయుంటారు.’’ అన్నాడు ఎస్సై.‘‘అది కరక్టే. దుండగులు దేవకిని ఎక్కడో బంధించారు. డబ్బును డిమాండ్ చేశారు. ఇరవై నాలుగు గంటలు డెడ్‌లైన్. ఇప్పుడు మనం వాళ్లు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో తెలుసుకోవాలి.’’‘‘సార్! వాళ్లు ఎక్కువసేపు మాట్లాడరు. ఏ కాయిన్ బాక్స్ నుంచో కాల్ చేస్తారు. అంతకంటే డబ్బు రెడీగా ఉందని, ఎక్కడ అందజేయాలో చెప్పమని అడిగి ట్రాప్ చేద్దాం’’ అన్నాడు ఎస్సై.‘‘యు ఆర్ కరెక్ట్.’’ అన్నాడు ఇన్స్పెక్టర్, ఎస్సైవైపు మెచ్చుకోలుగా చూస్తూ. మర్నాడు ఉదయం ఏడుగంటలకు కిడ్నాపర్ చెప్పిన గడువు ముగుస్తుంది. ఆ సమయానికి నరసింహ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. కిడ్నాపర్ డబ్బు ఎక్కడికి తెమ్మంటాడో దాన్నిబట్టి వ్యూహరచన చెయ్యాలనుకున్నారు పోలీసులు. ‘‘నరసింహా..! చెప్పండి. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా?’’ ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్.‘‘సార్..! కార్పొరేటర్ ముకుంద తన బర్త్‌డే అని రెండు వందల మందికి భోజనాలు పెట్టమన్నాడు. నేను హోటల్ పెట్టిందే కొత్తగా. ఇంకా పుంజుకోలేదు. ప్రస్తుతం నష్టాల్లో ఉంది. అంతమందికి భోజనాలు పెట్టలేను. పదివేలు డొనేషన్ ఇస్తానన్నాను. ముష్టి వేస్తావా? అవసరం లేదన్నాడు. అప్పటినుంచి నా మీద కోపంగా ఉంది అతనికి.’’ చెప్పాడు నరసింహ.కార్పొరేటర్ ముకుందకు నేరచరిత్ర ఉన్న మాట వాస్తవమే. అతణ్ని కూడా అనుమానించాల్సిందే అనుకున్నాడు ఇన్స్పెక్టర్.కేవలం డబ్బు కోసమే దేవకిని కిడ్నాప్ చేయించింది కార్పొరేటర్ అనుకోవచ్చు. డబ్బు ముట్టగానే ఆమెను వదిలేస్తాడు. కానీ, నరసింహ అయితే కేవలం డబ్బుకోసం కిడ్నాప్ నాటకం ఆడే అవకాశం లేదు. ఆ సాకుతో ఆమెను మర్డర్ చేయించడానికి ప్లాన్ చేశాడా?పోలీస్ స్టేషన్లో పోలీసులు కిడ్నాపర్ నుంచి వచ్చే ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ, ఎంతకీ కాల్ రాలేదు. నరసింహ సెల్‌ఫోన్ టేబుల్ మీద పెట్టి ఇన్స్పెక్టర్ ఎదురుగా కూర్చున్నాడు. ఉదయం తొమ్మిది దాటింది. కిడ్నాపర్ పెట్టిన గడువు దాటి రెండు గంటలైంది. డబ్బు ఎక్కడికి తెచ్చి ఇవ్వమంటాడో సమాచారం లేదు. బహుశా నరసింహ పోలీస్ రిపోర్ట్ ఇచ్చి ట్రాప్ చేసే సన్నాహాలలో ఉన్నట్టు కనిపెట్టారా? ఏమో?అందరికీ విసుగ్గా ఉంది.‘‘సార్..! ఇంటికి వెళ్తాను. పిల్లలు ఎట్లున్నారో?’’ అన్నాడు నరసింహ.‘‘ఇంట్లో మీవాళ్లు ఎవరూ లేరా?’’‘‘మా అమ్మానాన్నా ఊరి నుంచి వచ్చారు. మా వదిన కూడా తోడుగా ఉంది. పిల్లలకు వాళ్లతో పెద్దగా చనువు లేదు. నేనుంటే ధైర్యంగా ఉంటారు. చిన్నది బాగా బెంగ పెట్టుకుంది’’ అన్నాడు నరసింహ.‘‘సరే..! వెళ్లండి. కాల్ వస్తే, వాళ్లేం చెప్పారో విని ఇక్కడికి రండి.’’ అన్నాడు ఇన్స్పెక్టర్.నరసింహ తల ఊపి అక్కడి నుంచి బయటికి వెళ్లాడు.ఆ రోజంతా కిడ్నాపర్ నుంచి ఏ సమాచారం రాలేదు. తెల్లావారుతూనే పోలీస్ కంట్రోల్ రూమ్‌నుంచి ఇన్స్పెక్టర్ గోపీనాథ్‌కు సమాచారం వచ్చింది.బొంగులూరు దగ్గర యాక్సిడెంట్ జరిగింది. తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో అక్కడ ఆగి ఉన్న ట్రక్‌ను క్వాలీస్ వాహనం వెళ్లి గుద్దుకుంది. అందులో ఓ స్త్రీ, నలుగురు మగవాళ్లు ఉన్నారు. ఆడమనిషి, ముగ్గురు మగవాళ్లు స్పాట్‌డెడ్. ఇంకొక్కడు కొన ఊపిరితో ఉన్నాడు. ఆడమనిషి కిడ్నాపైన దేవకిలా ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. బాడీ ఉస్మానియాలో ఉంది. వెళ్లి కన్ఫార్మ్ చేస్కోండి.ఇన్స్పెక్టర్ గోపీనాథ్, ఎస్సై రామ్‌కుమార్, ఇద్దరు కానిస్టేబుల్స్‌తో ఉస్మానియా చేరుకున్నారు. వెళ్తూ నరసింహకు కాల్ చేసి హాస్పిటల్‌కు రమ్మన్నారు. మార్చురీలో దేవకి శవాన్ని చూసి గొల్లుమన్నాడు నరసింహ. డబ్బు డిమాండ్ చేసినవాళ్లు సమాచారం చెప్పకుండా దేవకిని తీసుకొని ఎక్కడికి బయలుదేరినట్లు?మోస్ట్మార్టమ్ రిపోర్ట్‌లో సమాచారం దొరికింది. దేవకి యాక్సిడెంట్లో చనిపోలేదు. రాత్రి ఎనిమిది గంటలకే ఆమె ప్రాణం పోయింది. గొంతు పిసికి చంపేశారు. శవాన్ని ఎక్కడికో తరలిస్తున్నారు.ఆ నలుగురు మనుషులు రౌడీషీటర్ జంగ్లీ యూసఫ్ గ్యాంగ్‌కు చెందినవారు. చావుబతుకుల్లో కొట్టుకుంటున్న ఫిరోజ్ అనేవాడికి తెలివొచ్చింది. ఆమెను చంపడానికి జంగ్లీ యూసఫ్ సుపారీ తీసుకున్నాడని స్టేట్మెంట్ ఇచ్చాడు. జంగ్లీ యూసఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి సుఫారీ ఇచ్చింది అమ్ములూ అని తెలిసి నివ్వెర పోయారంతా. అమ్ములును కస్టడీలోకి తీసుకోగా నేరం ఒప్పుకుంది.పటాన్‌చెరువులో ఉన్న బేరింగ్ ఫ్యాక్టరీ క్యాంటీన్లో వంట చేసేది అమ్ములు. ఆమె భర్త లారీ డ్రైవర్. అక్కడే క్యాంటీన్ సరుకు మాస్టర్ నరసింహ. అమ్ములు భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు. నరసింహ, ‘మనం సొంతంగా హోటల్ పెట్టుకుందామ’ని అమ్ములుకు చెప్పాడు. వాళ్లకు అప్పటికే సంబంధం ఉంది. హోటల్ పెట్టాక తనను పెళ్లి చేసుకోమని అమ్ములు నరసింహను ఒత్తిడి చేసింది. భార్య బతికి ఉండగా మళ్లీ పెళ్లి చేసుకుంటే, చెడ్డపేరు వస్తుందని, అలాగే ఉందామని దాటవేస్తుండేవాడు నరసింహ.భర్తవల్ల పిల్లలు కలగలేదు అమ్ములుకు. పిల్లలు కావాలనే కోరిక బలంగా ఉందామెకు. నరసింహ వల్ల నెల తప్పింది. పెళ్లి చేసుకుందామంటే అబార్షన్ చేయించుకోమన్నాడు. భార్య బతికుందనే కదా పెళ్లి చేసుకోవడం లేదు, ఆమెను తప్పిస్తే సరిపోతుంది అని అమ్ములు డిసైడ్ అయింది. జంగ్లీ యూసఫ్కి సుఫారీ ఇచ్చింది.నరసింహ అక్రమ సంబంధం అతని భార్య ప్రాణాలు తీసింది. పిల్లలు కావాలనే అమ్ములు కోరిక అందుకు దారి తీసింది. - వాణిశ్రీ కేవలం డబ్బు కోసమే దేవకిని కిడ్నాప్ చేయించింది కార్పొరేటర్ అనుకోవచ్చు. డబ్బు ముట్టగానే ఆమెను వదిలేస్తాడు. కానీ, నరసింహ అయితే కేవలం డబ్బుకోసం కిడ్నాప్ నాటకం ఆడే అవకాశం లేదు. ఆ సాకుతో ఆమెను మర్డర్ చేయించడానికి ప్లాన్ చేశాడా? -
ఆగర్భ హింస
‘‘పాఠం ఒప్పచెప్పకపోతే పెళ్ళి చేస్తాన’’ని పంతులుగారన్నప్పుడే భయమేసింది.‘‘ఆఫీసులో నా మొగుడున్నాడు ! అవసరమొచ్చినా సెలవివ్వడ’’ని అన్నయ్య అన్నప్పుడే అనుమానమేసింది – ‘‘వాడికేం? మగమహారాజని ‘‘ఆడా మగా వాగినప్పుడే అర్థమైపోయింది – ‘‘పెళ్ళి’’ అంటే ‘‘పెద్దశిక్ష ’’ అని ‘‘మొగుడు’’ అంటే ‘‘స్వేచ్ఛా భక్షకుడు’’ అని మేం పాలిచ్చి పెంచిన జనంలో సగం మమ్మల్ని విభజించి పాలిస్తుందని ! సావిత్రి అనే స్త్రీవాద కవయిత్రి రాసిన ఈ కవిత మొదటిసారి చదివినపుడే కాదు, చదివిన ప్రతిసారీ హృదయాన్ని కంపింపజేస్తుంది . కేవలం పదకొండు పొట్టి వాక్యాలలో సావిత్రి మనం చూస్తున్న సమాజాన్ని, మన చుట్టూ పంజరంలా వేల ఊచలతో పరుచుకున్న పురుష పెత్తందారీ సమాజాన్ని చిత్రిక పట్టింది . చిత్రంగా మగవాళ్ళు కూడా విసుగునో, తప్పించుకోలేని పెత్తనాన్నో చెప్పాలంటే మొగుడు అన్న పదాన్నే వాడుతూ మొగుడు అనే పదవికి వున్న నిరంకుశ ధోరణిని చెప్పకనే ఒప్పుకుంటూ ఉంటారని ఆమె ఈ చిన్ని కవితలో చెప్పుకొచ్చింది. ‘తల్లి’ కడుపును చీల్చుకొని బయట పడకముందునుంచే బంగారు ‘తల్లి’కి లెక్కలేనన్ని కష్టాలు. ఒక్కో దశలో ఒక్కోరకం హింసను దాటుకొనొచ్చి నిలబడాలి ఆ తల్లి. పెళ్లయ్యాకైతే కొంతమందికి చెప్పుకోలేని, చెప్పనివ్వలేని హింస.. గృహహింస. నవంబర్ 25 ‘ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వయొలెన్స్ అగైనెస్ట్ విమెన్’ సందర్భంగా...రవీందర్ బాగా చదువుకున్న వ్యక్తి. ఒక ప్రైవేట్ సంస్థలో ఉన్నతోద్యోగంలో వున్నాడు. అతని భార్య ప్రవీణ, టీచర్. వారికిద్దరు పిల్లలు. అత్తమామలు వంటి బాదరబందీ లేని ఆధునిక కుటుంబం. అయినా రవీందర్ ఎప్పుడూ ప్రవీణను మనశ్శాంతిగా ఉండనిచ్చేవాడు కాదు. దానికి కారణం ఆమె ఒంటి రంగు. ఆమె నల్లగా ఉండటం అతనికి చాలా అసహనం కలగజేసేది. ఆమె ఇచ్చిన కట్నం డబ్బు ఆమె రంగును ఆనాడు అతని కంటికి కనిపించనీయకుండా అడ్డుపడింది. కానీ ఈరోజు ఆమెకి పుట్టిన ఇద్దరు పిల్లలు కూడా ఆమె లాగే నల్లగా ఉండటం అతనికి చిరాకుగా మారింది. ఆ చిరాకును అతను మొదట్లో సూటిపోటి మాటలతో వ్యక్తపరచేవాడు. కాలక్రమంలో ప్రవీణకు పుట్టింటివాళ్ళ వెన్నుదన్ను పెద్దగా లేదని అర్థమయ్యాక అతని అసహనం మాటల నుంచి చేతలకు మారింది. అతను పెట్టే హింస తట్టుకోలేనిదిగా వున్నా నలుగురి ముందు పరువు పోతుందనీ, పిల్లలు తండ్రి లేనివారవుతారనీ, ఈ వయసులో మొగుడ్ని వదిలేస్తే ఇంక దిక్కేముందనీ, నిదానంగా ఆయనే మారుతారని ప్రవీణ ఈ అత్యాచారాన్ని తన కర్మగా భావిస్తూ, భరిస్తూ వచ్చేది. సరిగ్గా పోయిన కార్తీక మాసంలో రవీందర్ కొట్టిన దెబ్బలు ఆమెకు తగలరాని చోట తగిలి అక్కడికక్కడే మరణించింది. అలా మరణించే వరకు ఆమె తన సహనాన్ని పాతివ్రత్యం అనీ, ఆ పాతివ్రత్యానికి దేవుడి ఆశీస్సులు తప్పకుండా వుంటాయని అందరికీ చెప్తూ ఉండేది. ప్రవీణ మరణం ప్రమాదకర మరణం అని అందరినీ నమ్మించిన కొంతకాలానికి రవీందర్ ప్రవీణకు పుట్టిన నల్ల పిల్లల్ని ఆమె తల్లిదండ్రుల వద్దకు పంపేసి, ఇంకా పసి వయసులోనే వున్నాడు అని సమాజపు ఆమోదాన్ని పొంది రెండవ పెళ్లి చేసేసుకున్నాడు. ఈసారి కట్నానికి పెద్ద ఆశపడకూడదనీ, తనకి తెల్లటి అమ్మాయే కావాలని తెలిసివచ్చిందని భావించి, తెల్లటి అమ్మాయిని వెదికి పెళ్లి చేసుకున్నాడు. ప్రవీణ కేసు భారత దేశంలో నమోదు కాని అనేకానేక గృహ హింస కేసులలో ఒక కేసుగా, పోలీస్ స్టేషన్ వరకు రాని హత్యగా కాలగర్భంలో కలిసి పోయింది. స్త్రీవాద యోధులు మిరాబెల్ సిస్టర్స్ నవంబర్ 25వ తేదీని ఐక్య రాజ్య సమితి ‘‘ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వయొలెన్స్ అగైనెస్ట్ విమెన్’’గా ప్రకటించింది. చలమూ, పెరియార్ ఈ వీ రామస్వామి ఇంకా చాలామంది స్త్రీ అభ్యుదయాన్ని కాంక్షించిన పెద్ద మనుషులు స్త్రీకి ’నీ గురించి నీవే ఆలోచించుకోవాలి’ అని చెప్పారు. తనకేం కావాలో, తాను అనుభవిస్తున్న బాధల రూపమేమిటో తానైతేనే బాగా చెప్పగలదని భావించారు. ప్రపంచవ్యాప్తంగా మొలకెత్తిన ఈ ఆలోచనా రూపమే స్త్రీవాదం. ఈ స్త్రీవాదం సాధించిన విజయమే నవంబర్ 25. స్త్రీలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా నినదిస్తూ ఏర్పడిన ఈ రోజు వెనుక ఒక ఘనమైన త్యాగం వుంది. ఆ త్యాగమూర్తులు ముగ్గురూ అనన్య సామాన్యమైన సాహసం కలిగిన స్త్రీలు. వీరే డొమినికన్ రిపబ్లిక్కు చెందిన ‘మిరాబెల్ సిస్టర్స్’గా ప్రసిద్ధి పొందిన పాట్రియా మెర్సిడెస్ మిరాబెల్ రెయెస్, మారియా అర్జెంటీనా మినెర్వా మిరాబెల్ రెయెస్, ఆంటోనియా మారియా టెరెసా మిరాబెల్ రెయెస్లు.డొమినికన్ నియంత రాఫెల్ ట్రుజిలో అమలు జరుపుతున్న అన్యాయాలకు, అకృత్యాలకు వ్యతిరేకంగా వీరు గొంతెత్తారు. వీరి నిర్భీకతను సహించలేక నియంత రాఫెల్ 1960 నవంబర్ 25న వారిని హత్య చేయించాడు. దేశంపై వీరి హత్య తీవ్ర ప్రభావాన్ని చూపింది. తరువాతి కాలంలో వీరు ‘‘ఫెమినిస్ట్ ఐకాన్స్’’గా ప్రసిద్ధి పొందారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 1999 డిసెంబర్ 17 నాటి సమావేశంలో వీరి వర్ధంతిని ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వయొలెన్స్ అగైనెస్ట్ విమెన్‌గా ప్రకటించింది. ఈ దినోత్సవం ఎందుకంటే..? ఈ అంతర్జాతీయ దినోత్సవం ఆవశ్యకత ఏమిటన్న దానికి ఐక్యరాజ్య సమితి ఇలా సమాధానమిచ్చింది... ‘‘మహిళలపై జరుగుతున్న హింస మానవ హక్కుల ఉల్లంఘన. చట్టాలలో, ఆచరణలో స్త్రీల మీద వున్న వివక్షకు, స్త్రీపురుషుల మధ్య వున్న అసమానత్వానికి పర్యవసానమే మహిళలపై జరుగుతున్న హింస. మహిళలపై జరుగుతున్న హింస అనేక రంగాలపై తిరోగమన ప్రభావాన్ని కలుగజేస్తుంది. పేదరిక నిర్మూలన, ఎయిడ్స్‌పై పోరాటం, శాంతిభద్రతలు వంటి అనేక అంశాలకు విఘాతం కలిగిస్తూ వుంది. మహిళలపై హింస అనివార్యమైనది కాదు. నివారణ సాధ్యమైనది, అత్యంత ఆవశ్యకమైనది. మహిళలపై హింస యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న జాడ్యం, రుగ్మత. మహిళలపై హింస బహిరంగ ప్రదేశాలలోనూ, రహస్య ప్రదేశాలలోనూ జరుగుతూనే వుంది. దీనికి అనేక రూపాలున్నాయి. కొన్ని సార్లు ఇది గృహ హింస, సన్నిహిత భాగస్వామి చేసే హింసగా ఉంటే, మరికొన్నిసార్లు లైంగిక వేధింపులు, లైంగిక దాడుల రూపంలోనూ, స్త్రీల జననాంగ విచ్ఛేదన, లైంగిక హత్యల రూపంలోనూ వుంటున్నది’’ అని పేర్కొన్నది. అంతే కాకుండా నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10వ తేదీన జరిగే ‘హ్యూమన్ రైట్స్ డే’ వరకు క్రియాశీలంగా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యపరచాల్సిందిగా పిలుపునిస్తున్నది. ఈ సంవత్సరం ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ‘‘స్త్రీలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ఐక్యత’’ప్రచారానికి థీమ్‌గా ‘‘లీవ్ నో వన్ బిహైండ్: ఎండ్ వయొలెన్స్ అగైనెస్ట్ విమెన్ అండ్ గర్ల్స్’’ని ప్రకటించారు. అంటే అణగారిన వర్గాల వారిని, అల్పసంఖ్యాక వర్గాల వారిని, శరణార్థులను ఎవ్వరినీ వదిలి పెట్టకుండా అందర్నీ కలుపుకుని ‘‘యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్’’–30 సాధించడానికి మహిళలపై హింస నిర్మూలనకు కృషి చేయాలని అన్నారు. అన్ని వర్గాల మహిళలూ బాధితులే! ప్రపంచవ్యాప్తంగా మహిళలపై హింసకు సంబంధించి ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన నివేదికలోని వివరాలు ఇలా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా స్త్రీలు శారీరక, మానసిక, లైంగిక, ఆర్థిక హింసకు బలవుతున్నారు. ఈ హింసకు అన్ని ఆదాయ వర్గాల వారు, అన్ని వయసుల వారు, అన్ని విద్యార్హతలు కలిగిన మహిళలూ బాధితులే. ఈ హింస స్త్రీల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నది . తీవ్రమైన సంఘటనల్లో మహిళలు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. స్త్రీల మీద హింసకు ప్రపంచ వ్యాప్తంగా భర్త వంటి సన్నిహిత భాగస్వాములే కారణమవుతున్నారు. స్త్రీల మీద జరిగే హింసలో శారీరక హింస కంటే లైంగిక హింస తక్కువే అయినప్పటికీ సన్నిహిత భాగస్వాములు హింసకు పాల్పడే ఘటనల్లో రెండు హింసలూ ఏకకాలంలో జరుగుతున్నాయి. అసమానతల నేపథ్యం ఆదిమ సమాజంలో స్త్రీ పురుషుల మధ్య ఎలాంటి అసమానత లేదు. ఉత్పత్తి కన్నా, సంతానోత్పత్తికి ఎక్కువ గౌరవమున్న కాలంలో స్త్రీ సమ ప్రాధాన్యతను పొందుతూ వచ్చింది. ఎప్పుడైతే పురుషుడు ఆయుధోత్పత్తిపై ఆసక్తి చూపుతూ ఉత్పత్తిని పెంచుకుంటూ వచ్చాడో అప్పుడు శ్రమ విభజన మొదలయింది, దీనినే ఏంగెల్స్ ‘‘చరిత్రలో మొదటి శ్రమ విభజన స్త్రీపురుషుల మధ్య జరిగింది. మొదటి వర్గ పీడన, స్త్రీలపై పురుషుల పీడన ఒకే కాలంలో సంభవించాయి. కుటుంబంలో భర్త బూర్జువా, భార్య కార్మికురాలు’’ అని తన ‘కుటుంబం – వ్యక్తిగత ఆస్తి రాజ్యాల పుట్టుక’ లో పేర్కొన్నాడు. ఆశ్చర్యకరంగా ఎంతెంతో పెద్ద మేధావులు, తత్వవేత్తలూ స్త్రీకి కూడా పురుషునితో సమానమైన ఆలోచన చేయదగ్గ మెదడు ఉందని అంగీకరించడానికి నిరాకరించిన వారే. స్వేచ్ఛగా పుట్టిన మానవుడు సర్వత్రా సంకెళ్ళమయమయ్యాడన్న రూసో స్త్రీ దగ్గరికొచ్చేసరికి ‘‘స్త్రీల చదువంతా తప్పనిసరిగా పురుషులను ఆనందపెట్టడానికి, వారికి ఉపయోగపడటానికి, పురుషులకు చిన్నతనంలో చదువు నేర్పటానికి, పెద్దయ్యాక వారి అవసరాలు తీరుస్తూ వారి జీవితం సౌఖ్యంగా సాగటానికి స్త్రీలు చదువుకోవాలి’’ అన్నాడు. పురుషులు స్త్రీని సంతాన రక్షణకు, ఇంటి అవసరాలను చూసుకోవడానికి పరిమితం చేసిన తరువాత అందుకు అనుగుణమైన తర్ఫీదును స్త్రీలకూ ఇవ్వడం మొదలు పెట్టారు. ఆ శిక్షణలో మొదటి అంశమే నీవు పురుషుని సౌఖ్యం కోసం పుట్టావ్ అన్న భావజాలం. ఈ భావజాలం స్త్రీ మనశ్శరీరాలను ఎంత ఆక్రమించుకున్నదంటే మూడవ నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వేలో కుటుంబ హింస గురించి చేసిన సర్వేలో ఆడవాళ్లను మగవాళ్ళు కొట్టవచ్చు అని 55% మహిళలు అంగీకరించారు. అత్తమామలను అగౌరవపరిస్తే 48%, ఇంటిని నిర్లక్ష్యం చేస్తే 38%, భర్తతో వాదన పెట్టుకుంటే 35%, భర్త అనుమతి లేకుండా బయటకు వెళితే 30% మహిళలు భర్త తమను కొట్టవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ తరహా పితృస్వామ్యం మెదడులో ఇంకిపోయిన మహిళలు కీలకమైన పదవులలో, భావజాల వ్యాప్తికి పనిచేసే విద్యాలయాల్లో ఉంటూ పురుషులకు ఇతోధికంగా సహాయం చేస్తూ వస్తున్నారు. పురుషస్వామ్యం దాని పని అది చేసుకుంటూ వెళుతూ ఉంటే చైతన్యవంతులైన స్త్రీలు స్త్రీవాదులుగా మారి స్త్రీల జీవితాలకు చేసిన సేవ చిన్నది కాదు. పునరుత్పత్తి చేసే అవయవాలు ఉన్నప్పటికీ తాను బిడ్డకు జన్మనివ్వాలా వద్దా అని నిర్ణయించుకునే హక్కు స్త్రీకి ఈనాటికీ లేదు. కానీ బ్రిటన్‌కి చెందిన మార్గరెట్ సాంగర్ వంటివారు ఎంతో పోరాడిన తరువాత ఈ రోజు అబార్షన్ హక్కు అమలులోకి వచ్చింది. స్త్రీలకు మేలు చేసిన సంస్కరణోద్యమం స్త్రీ వాద ఉద్యమమే కాదు, సంస్కరణోద్యమం కూడా భారతీయ స్త్రీలకు మేలు చేసింది, మార్పు రాత్రికి రాత్రే రాకపోయినా మార్పు రాకుండా ఆగిపోలేదు. గృహ హింస ఇండియాలో ప్రత్యేకమైన నేరంగా మొదటిసారి 1983లో చట్టాల్లో చేరింది. ఆ సంవత్సరం ఇండియన్ పీనల్ కోడ్ లో ‘సెక్షన్ 498–ఎ’ చేర్చడం ద్వారా భర్త లేదా అతని కుటుంబం భార్య మీద చేసే క్రూరత్వం ఒక ప్రత్యేకమైన నేరంగా పరిగణనలోకి వచ్చింది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే గృహహింసను కొలవడానికి కాన్ఫ్లిక్ట్ టాక్టిక్ స్కేల్‌ను ఉపయోగించింది. ఈ సర్వే ప్రకారం భారతదేశంలో 15 నుంచి 49 వయసు ఉన్న మహిళల్లో 39.7% మంది ఎదో ఒక రకమైన హింసకి బాధితులు. బీహార్‌లో అత్యధికంగా 60% మంది మహిళలు హింసకి బాధితులు. దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్‌లో 36.8% మంది, కేరళలో 19.8%, తమిళనాడులో 44.1%, కర్ణాటకలో 21.5%. స్త్రీలు హింసకి బాధితులు. ఈ సర్వే ప్రకారం... నిరక్షరాస్యులైన స్త్రీలలో 44% హింసకి బాధితులైతే, విద్యాధికులైన స్త్రీలలో బాధితులు 14%. అలాగే భర్త నిరక్షరాస్యుడు అయితే 20% స్త్రీలు హింసకి బాధితులు అవుతుండగా, భర్త విద్యాధికుడు అయితే 8.9% స్త్రీలు హింసకి బాధితులు అవుతున్నారు. అసలు మద్యపానం చేయని భర్త ఉంటే 12% స్త్రీలు హింసకి బాధితులు అయితే భర్త తాగుబోతు అయితే 38% స్త్రీలు హింసకి బాధితులు అవుతున్నారు. ఆర్థిక స్థితిగతులు కూడా కుటుంబ హింసని ప్రభావితం చేస్తున్నాయి. సంపన్న వర్గాలలో హింసకి బాధితులు అయిన మహిళలు 19% అయితే నిరుపేద వర్గాలలో బాధిత మహిళలు 44%. ఈ సర్వే ప్రకారం మన దేశంలో 66%మంది మహిళలు తమపై జరిగిన హింసను ఎవరికీ చెప్పుకోరు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) డేటా ప్రకారం భర్త మరియు ఇతర కుటుంబ సభ్యుల క్రూరత్వం వల్ల మహిళలపై జరిగిన నేరాలు 2012 లో 29% ఉండగా, 2015లో అది 34% అయింది. ఈ కేసులు నమోదు చేయడానికి స్త్రీలు ముందుకు రావడానికి కారణం 2005 నుంచి అమలులోకి వచ్చిన ‘గృహ హింస’ చట్టం కారణం కావచ్చుట! ప్రతి 5 నిమిషాలకీ ఒక ఇంటిలో కుటుంబ హింస జరుగుతూ వుండే భారత దేశంలో ఇటువంటి చట్టం అవసరం ఎంతైనా వుంది. ఈ చట్టానికి ముందు కుటుంబ హింసకి గురైన మహిళలకు అందుబాటులో వుండిన చట్టపరమైన ఉపశమనాలన్నీ దీర్ఘకాలికమైనవి. అటు 498–ఎ అయినా, విడాకులయినా అనేక సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఈ చట్టం ఈ లోపాలని సరిదిద్దిందనే చెప్పవచ్చు. ఈ చట్టంలోకి హింసకు గురయ్యే భార్యలే కాకుండా పిల్లలు, లివ్ ఇన్ రిలేషన్షిప్లో వుండే మహిళలు, వితంతువులై పుట్టింటికి చేరిన వారు వారి సొంత అన్నదమ్ములపై కూడా కేసులు పెట్టొచ్చు. ఈ చట్టం హింసను విపులంగా వర్గీకరించింది. అది శారీరక, లైంగిక హింస మాత్రమే కాదు, మాటలతో వేధించడం, మానసికంగా హింసించడం కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. ఈ కేసు జరుగుతున్నంత కాలం ఆమె కావాలనుకుంటే తన భర్త ఇంటిలోనే వుండి పోరాడే నివాస హక్కుని ఈ చట్టం కల్పించింది. ఈ చట్టం అమలు తీరుపై పలువురు పలురకాలైన సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. సిగ్గుపడాలి మన దేశంలోనే కాదు ప్రపంచమంతటా బయటకి రాకుండా స్త్రీలు హింసను తాము తట్టుకోగలిగినంత మేర అనుభవిస్తున్నారు. సమాజం స్త్రీ చుట్టూ అల్లి పెట్టిన సంప్రదాయ వల చాలా గట్టిది. స్త్రీలు ఈ భ్రమాత్మకమయిన సంప్రదాయాలను ఛేదించుకుని బయటకి రావాలి. సమాజం కోసమో సంప్రదాయాల కోసమో లేదా చివరికి పిల్లల కోసమో స్త్రీలు హింసను భరించాల్సిన అవసరంలేదని తెలుసుకోవాలి. తండ్రులుగా, సోదరులుగా మగవాళ్ళు తమ స్త్రీలకు అక్కర వచ్చినపుడు పటిష్టమైన కొండంత అండగా నిలబడే శిక్షణను మన విద్య నేర్పించాలి. తస్లీమా నస్రీన్ అంటారు ‘‘మనం స్త్రీలం. ఒంటరిగా, చప్పుడు కాకుండా ఒంటరి ప్రదేశాల్లో ఏడుస్తూ ఇక ఎంతో కాలం ఉండలేం. మనం బాధితులమైతే గట్టిగా అరవాలి. మన అరుపులు అందరికీ వినిపించాలి’’. వ్యవస్థల ద్వారా జరిగే అణచివేతను ఆపటానికి స్త్రీలు పోరాడకపోతే ఆ స్త్రీలు సిగ్గుపడాలి. ప్రతిఘటించకుండా, పోరాడకుండా, ఆ వ్యవస్థను కొనసాగనిస్తున్నందుకు, మన పిల్లలను, మన పిల్లల పిల్లలనూ ఆ అణచివేతలో పడిపోనిస్తున్నందుకు సిగ్గుపడాలి. గృహహింసపై కవీంద్రుని కథ రవీంద్రనాథ్ టాగోర్ 1913లో ఒక క«థ రాశాడు. ఆ క«థ పేరు ‘‘భార్య వ్రాసిన లేఖ’’. 104 ఏళ్ళ క్రితం ఆయన రాసిన ఈ క«థలోని భార్య తన భర్తకి రాసిన ఉత్తరంలో చాలా విషయాలను చర్చకు పెడుతుంది. ఆమె ఆదరించి పెంచిన చిన్న అమ్మాయి ఒకతె వివాహానంతరం చీరకు నిప్పంటించుకుని చనిపోతుంది. అది చూసి సమాజం దిగ్భ్రమ చెందదు, కనీసం అయ్యో అని సానుభూతి కూడా చూపదు, చూపకపోగా ’’ఆడవాళ్లు చీరలకు నిప్పంటించుకుని చచ్చిపోవడం ఒక ఫ్యాషన్ అయిపోయింది’’ అని చిరాకు పడుతుంది. దానిని ప్రశ్నిస్తూ ఆ ఉత్తరం రాసిన భార్య ‘ఇదంతా నాటకం’ అన్నారు మీరు. కావచ్చు. కానీ ఈ నాటక క్రీడ కేవలం బెంగాలీ స్త్రీల చీరల మీదుగానే జరుగుతుందేం! బెంగాలీ వీరపురుషుల ధోవతుల అంచుల మీదుగా జరగదెందుకని?అది కూడా ఆలోచించి చూడటం యుక్తం...!’’ అంటుంది. స్త్రీలు అనుభవిస్తున్న కుటుంబ హింస ఈ కథా కాలానికంటే కూడా చాలా పురాతనమైంది. – సామాన్య కిరణ్ -
శృంగార పాఠాలు.. 40 ఏళ్ల జైలు శిక్ష
కొలంబియా : విద్యార్థులకు మంచిబుద్ధులు చెప్పివారిని సమాజ హితకారులుగా మార్చాల్సిన పంతులమ్మే దారి తప్పింది. విద్యార్థులను తన శారీరక అవసరాలకు ఉపయోగించుకుంటూ.. వారికి పరీక్షల్లో ఇచ్చినట్లు గ్రేడ్లు కూడా ఇచ్చింది. ఆమె విపరీత చేష్టలకు బెదిరిన తల్లిందడ్రులు కేసు పెట్టడడంతో విషయం మొత్తం బయటకు పొక్కింది. ఈ ఘటన కొలంబియా దేశంలో జరిగింది. యోకాస్తా (40) అనే టీచరమ్మ కొలంబియాలోని మెడిలిన్ సిటీలోని ఒక ప్రయివేట్ బాలుర పాఠశాలలో పనిచేస్తోంది. నాలుగు పదులకు చేరిన ఈ పంతులమ్మ 15 నుంచి 19 మధ్యనున్న టీనేజ్ విద్యార్థులను స్పెషల్ తరగతుల పేరుతో.. ఇంటికి పిలిపించుకుని.. వారితో శృంగారంలో పాల్గొనేది. అంతేగాక విద్యార్థులకు స్కూల్లో ర్యాంకులు, గ్రేడ్లు ఇచ్చినట్లు ఈమె.. వారికి గ్రేడ్లను కూడా ఇచ్చేది. టీనేజ్ విద్యార్థులను ఆకర్షించేందుకు ఆమె వాట్సప్, ఫేస్బుక్ ఇతర సామాజిక మాధ్యమాలను సైతం ఇందుకు ఉపయోగించుకునేది. ప్రారంభంలో చదువు చెబుతున్నట్లు వారిని నమ్మించి.. నెమ్మదిగా వారిని ఆకర్షించేది. పంతులమ్మ చేసే పనులు నచ్చని ఒక విద్యార్థి పేరంట్స్కు చెప్పడం.. పోలీసులు విచారణ, కోర్టు కేసులు మొదలయ్యాయి. కోర్టు విచారణలనే టీచరమ్మ పద్దతి నచ్చని.. ఆమె భర్త విడాకులు తీసుకున్నట్లు తేలింది. పంతులమ్మ వ్యవహరాన్ని పూర్తిగా విచారించిన కోర్టు.. ఆమెకు 40 ఏళ్ల జైలు శిక్షను విధించింది. -
పవిత్ర బంధం!
ఒకప్పుడు పెళ్లిళ్లకు జాతకాలు చూడటం కొన్ని సామాజిక వర్గాలకే పరిమితం. ఇప్పుడు జాతక పరిశీలన చేయడం అందరికీ అలవాటుగా, ఆచారంగా మారిపోయింది. వివాహ పొంతనలకు జాతకం తీసుకోగానే ‘‘అమ్మో అమ్మాయిది ఆశ్లేష నక్షత్రం అట అత్తగారికి గండం మాకు ఆ సంబంధం వద్దనీ, మూల నక్షత్రంలో పుట్టిన కన్యను కోడలిగా తెచ్చుకుంటే మూలనున్న ముసలివాళ్లు కూడా ఎగిరిపోతారని, జ్యేష్ట నక్షత్రంలో పుట్టిన కన్యను కోడలిగా తెచ్చుకుంటే కోడలి బావగారు అంటే ఇంటికి పెద్ద కుమారుడికి గండం అని, విశాఖ నక్షత్రంలో పుట్టిన కన్యను కోడలిగా తెచ్చుకుంటే ఇంకేదో అని, మఖ నక్షత్రంలో పుట్టిన కన్యను కోడలిగా తెచ్చుకుంటే మరోటి అవుతుందని... ఇలా చాలా మూఢ నమ్మకాలు సమాజంలో పాతుకు పోయి ఉన్నాయి. ఒకరి జన్మ నక్షత్రాల వల్ల మరణాలు మరొకరికి సంభవించేటట్లయితే ఇంక వ్యక్తిగత జాతకాలెందుకు? కోడలి నక్షత్రం వల్లో, మరొకరి రాశి వల్లో చెడు జరుగుతుందనుకోవడం అసంబద్ధం. నక్షత్రాలపైన మీకు ఏదైనా సంశయం ఉంటే అది వివాహం చేసుకున్న భార్యాభర్తలకే వర్తిస్తుంది కాని వారి తల్లిదండ్రులకు, అక్క చెల్లెళ్లకు లేక అన్నదమ్ములకు వర్తింపచేయడం ఏ మాత్రం సహేతుకం కాదు. కాబట్టి జాతక పరిశీలనలో అన్ని విషయాలకు పొంతన కుదిరితే నక్షత్రం పేరు మీద అనవసరంగా భయానికి లోనై విద్య, వినయం, వివేకం, గుణం, సాంప్రదాయం, సంస్కారం, రూపం గల వధువులను వదులుకోవద్దు. ఏమాత్రం సంకోచం లేకుండా మీరు ఆ కన్యను కోడలిగా తెచ్చుకోవచ్చు. ఒకప్పుడు ఎదిగిన ఆడపిల్ల ఇంట్లో ఉంటే, గుండెల మీద కుంపటి ఉన్నట్లు భావించేవారు ఆడపిల్ల తల్లిదండ్రులు. ఇప్పుడది కాస్తా తిరగబడింది. అవును మరి, చేసిన పాపం ఊరికే పోతుందా? మగపిల్లలం మాకేమిటని విర్రవీగిన వారు కాస్తా ఇప్పుడు అమ్మాయిలు, వారి అమ్మానాన్నలు చెప్పిన సవాలక్ష నిబంధనలకు తలవంచి మరీ తాళి కట్టేస్తున్నారు. అబ్బాయిల తలిదండ్రులు తమ కొడుక్కి ఎలాగయినా పెళ్లి జరిగేలా చూడమని దేవుళ్లకి ముడుపులు కడుతున్నారు. ఏమయినా, ఇలాంటి పరిస్థితిలో మార్పు రావాలి. అలా మార్పు రావాలంటే ముందు మనం మారాలి. జాతక పరిశీలన బంధాలను ముడి వేయడానికే తప్ప మనుషులను దూరం చేయడానికి కాదు. -
జస్ట్ మ్యారీడ్
పెళ్లి చూపులు అయ్యాయి. అమ్మాయికి అబ్బాయి బాగా నచ్చేశాడు. ‘అమ్మాయికి నచ్చితే చాలండీ, ఈ పెళ్లి జరిగిపోతుంది’ అని అబ్బాయి తండ్రి.. ముందే చెప్పేశాడు కాబట్టి అబ్బాయికి అమ్మాయి నచ్చిందా లేదా అన్నది ప్రశ్నే కాదసలు. తల్లి లేని బిడ్డ. ఒకడే బిడ్డ. చేతనైనంత త్వరగా వాడికో తోడును జత చేయడం తన బాధ్యత అనుకున్నాడు ఆ తండ్రి. అంతే తప్ప ‘నా కొడుకు నచ్చకపోతాడా’ అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ కాదది. పెళ్లిచూపులు అయ్యాక, వరుడు చిరంజీవి అలోక్, వధువు చి.ల.సౌ. అఖిల అని శుభలేఖలు ప్రింట్ అవడానికి ముందు.. అలోక్ తండ్రి అలోక్‌కి తెలియకుండా మళ్లీ ఒకసారి అఖిల తల్లిదండ్రులను కలిశాడు. అప్పుడు అక్కడ అఖిల లేదు. ‘‘కడుపులో దాచుకుంటానంటే మీకొక విషయం చెబుతాను. చెప్పడం నా ధర్మం అనుకున్నాను. దాచుకోవడం మీ ధర్మం అనుకుంటారని ఆశిస్తున్నాను’’ అన్నాడు భారంగా. ఆ తర్వాత దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలి, ‘‘అలోక్ ఇప్పటికీ నా గదిలోనే పడుకుంటాడు’’ అన్నాడు. ‘అందులో ఏముందీ’ అన్నట్లు చూశారు వియ్యంకులు. ‘‘ఇప్పటికీ వాడు నా పక్కనే పడుకుంటాడు’’ అన్నాడు.‘‘గారాబంగా పెరిగినట్లున్నాడు.. తల్లి లేని బిడ్డ కదా’’ అని నవ్వారు.‘‘గారాబం కాదు చెల్లెమ్మా’’ అన్నాడు అలోక్ తండ్రి.. అఖిల తల్లి వైపు చూసి. ఆమె తన భర్త వైపు చూసింది. ఇద్దరూ కలిసి మళ్లీ అలోక్ తండ్రి వైపు చూశారు. ‘‘మావాడికి.. దెయ్యాలంటే భయం. రాత్రి పూట ఒక్కడే పడుకోలేదు’’ అన్నాడు ఆయన.. కాస్త ఇబ్బంది పడుతూ. రాబోయే నవ్వును ఆపుకున్నారు అలోక్‌కి కాబోయే మామగారు. నవ్వితే బాగుండదని అలా ఉండిపోయింది అలోక్‌కి కాబోయే అత్తగారు. ‘‘అన్నయ్యా.. అసలిది విషయమే కాదు. మీరు మాకేం చెప్పలేదు. మేమేమీ వినలేదు. మీ అబ్బాయికీ తెలియనివ్వకండి. మా అమ్మాయికీ తెలియనివ్వం’’ అంది అఖిల తల్లి. ఆ వెంటనే ఇంకో మాట కూడా అంది ఆవిడ. ‘‘దెయ్యాలకు భయపడడం అంటే.. ఉన్నాయని భయపడతాడా? ఉన్నాయేమోనని భయపడతాడా?’’ అని. ‘‘తను నిద్రపోతున్నప్పుడు రోజూ రాత్రి ఇంట్లోకి ఎవరో వస్తున్నట్లు అనిపిస్తుందని భయపడతాడు చెల్లెమ్మా’’ అన్నాడు. ‘‘ఎప్పట్నుంచి ఆ భయం మొదలైంది’’. ‘‘గుర్తులేదు బావగారూ.. ఓసారెప్పుడో మెలకువ వచ్చి చూస్తే, పెద్దగా ఎవరితోనో పోట్లాడుతున్నాడు. ఆ అరుపుకే నేను లేచింది. ‘‘ఏమైంది అలోక్..’’ అని దగ్గరికి వెళ్లి అడిగితే.. ఇంట్లోనే ఓ మూలకు చెయ్యి చూపిస్తూ భయంతో వణికిపోతున్నాడు’’. ‘‘ఆ తర్వాత?’’ ‘‘ఆ తర్వాతెప్పుడూ వాడు అరవలేదు. ఎందుకంటే.. ఆ తర్వాత ఎప్పుడూ వాడు ఒంటరిగా పడుకోలేదు’’ అని చెప్పాడు అలోక్ తండ్రి. అలోక్, అఖిల పెళ్లి జరిగిపోయింది. పెళ్లిలో చాలాసార్లు అల్లుడి ముఖం చూశారు అఖిల తల్లి, తండ్రి. దెయ్యాలకు భయపడే అబ్బాయిలా అనిపించలేదు. ∙∙ ఫస్ట్ నైట్ ముగుస్తుండగా..తెల్లవారు జామునే అఖిల నుంచి ఫోన్! ‘‘మమ్మీ.. మమ్మీ.. డాడీ.. డాడీ..’’ అంటోంది కానీ, ఏమీ చెప్పలేకపోతోంది. ఆమె తల్లిదండ్రుల ఆలోచన అల్లుడి మీదకు మళ్లింది. ఫోన్ స్పీకర్ ఆన్ చేశారు. ‘‘చెప్పమ్మా అఖీ.. ఏమైంది? నువ్వెలా ఉన్నావ్? అల్లుడుగారు ఎక్కడ?’’ అని అడిగారు. ‘‘అలోక్.. అలోక్..’’ – అఖిల చెప్పలేకపోతోంది. ఆయాస పడుతోంది.‘‘ఊ.. అలోక్‌కి ఏమైందమ్మా...’’‘‘అలోక్.. అలోక్.. అలోక్.. అలోక్వాళ్ల డాడీ చనిపోయారమ్మా.. చనిపోయారు’’.వెంటనే బయల్దేరారు అఖిల తల్లిదండ్రులు అఖిల దగ్గరకు. సిటీలోనే వాళ్లది ఆ మూల, వీళ్లది ఈ మూల. అలోక్ దుఃఖాన్ని ఎవరూ ఆపలేకపోతున్నారు. ‘‘రాత్రి నాకు.. పక్క గదిలోంచి ‘అలోక్.. అలోక్’ అని నాన్న అరవడం వినిపించింది. కలలా అనిపించింది. అప్పుడే వెళ్లుంటే ఇంతపని జరిగి ఉండేది కాదు’’ అంటున్నాడు. ‘‘ఏం జరిగింది బాబూ’’ అని భుజం మీద చెయ్యేసి అడిగారు అత్తమామలు. ‘‘డాక్టర్ హార్ట్ ఎటాక్ అంటున్నారు. కాదని నాకు తెలుసు. కచ్చితంగా తెలుసు. ఆయన్ని దెయ్యం చంపేసింది. ఇన్నాళ్లూ నేను నాన్న పక్కన పడుకునేవాణ్ణి కాబట్టి అది నాన్నను ఏమీ చేయలేకపోయింది. ఒక్కరోజు లేకపోయేసరికి దానికి అవకాశం దొరికింది’’ అంటున్నాడు అలోక్. ‘‘నీకెలా తెలుసు బాబూ’’ అన్నారు మామగారు. ‘‘నాకు తెలుసు. నాకే తెలుసు. నాన్నకు కూడా తెలీదు. ఓరోజు రాత్రి నేను దెయ్యంతో గొడవపడ్డాను. నాన్నను చంపుతాను అని అది ఆయన గదిలోకి వెళ్లబోతుంటే నేను పెద్దగా అరుస్తూ దాన్ని తరిమేశాను. ‘చూస్తా ఎంతకాలం మీ నాన్నను కాపాడుకుంటావో’ అని వికృతంగా నవ్వుకుంటూ గాలిలో కలిసిపోయింది. ఆ రోజు నుంచీ నేను నాన్న మంచం మీదే, నాన్న పక్కనే పడుకుంటున్నాను. దెయ్యాలు కలలోకి వస్తున్నాయి నాన్నా.. అని నాన్నకు అబద్దం చెప్పి ఆయన పక్కనే పడుకుంటున్నాను’’ అని చెప్పాడు అలోక్. అత్తమామమలు ముఖముఖాలు చూసుకున్నారు. అఖిలకైతే ఏమీ అర్థం కావడం లేదు. పదో రోజు. ఫ్యామిలీ అల్బమ్ చూస్తున్నాడు అలోక్. పక్కనే అఖిల ఉంది. ‘‘ఎవరీవిడ?’’ అంది ఆల్బమ్‌లో ఓ ఫొటోపై వేలు ఉంచి.‘‘మా పిన్నమ్మ’’ అని చెప్పాడు. ‘‘మీ అమ్మ సొంత చెల్లెలా?’’ అని అడిగింది. ‘‘అవును. మా నాన్నంటే తనకు కోపం. ప్రేమించిన తనను కాదని, నాన్న తను ప్రేమించిన అమ్మను చేసుకున్నాడని. అమ్మ అనారోగ్యంతో చనిపోయినప్పుడు.. ‘అది బతికుండగా నన్ను చేసుకోలేదు. ఇప్పుడైనా చేసుకుంటావా?’ అని నాన్నను అడిగితే నాన్న కాదన్నారట. నాన్న మీద ప్రేమతో, అమ్మ మీద కోపంతో ఆమె పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయింది. మనోవేదనతో మంచం పట్టి ఏడాదిన్నర క్రితం చనిపోయింది’’ అని చెప్పాడు అలోక్. అఖిల మౌనంగా ఉండిపోయింది. అలోక్ చెబుతున్న దానికీ, ఆ రోజు మామగారి గదిలో ఆయన మంచం పక్కనే అత్తగారి ఫొటో పడి పగిలి ఉండడానికీ... ఏదైనా సంబంధం ఉందా అని ఆమె ఆలోచిస్తోంది. -
మనసున్న యువతి
అన్నానగర్: ప్రేమించిన యువకుడిని పెళ్లిచేసుకొవాలనుకుంది ఆ యువ తి. ఎత్తు తక్కువని వద్దన్నారు ఆ యువతి తల్లిదండ్రులు. తమ ప్రేమకు ఇదేమి అడ్డంకి కాదని అతడినే పెళ్లాడింది ఆ యువతి. ఈ ఘటన అరంతాగి సమీపంలో శుక్రవారం జరిగింది. వివరాలు.. పుదుకోట జిల్లా, అరంతాగి సమీపం, నెయ్వత్తలికి చెందిన సోయన్ కుమారుడు బాబు(28). ఇతను 3అడుగులు ఎత్తు ఉండి, ఎంఏ, బీఎడ్ చదివాడు. ప్రస్తుతం ఆవణం– కైకాట్టులో జిరాక్స్ దుకాణం నడుపుతున్నాడు. ఇతను కుళమంగళానికి చెందిన షణ్ముగం కుమార్తె ప్రియ(26) కొన్ని ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ప్రియ ఎంఎస్సీ, బీఎడ్ చదివింది. వీరి ప్రేమ విషయం ఇంట్లో వాళ్లకి తెలియగా ప్రియ ఇంట్లో వారు వ్యతిరేకించారు. వారిని సమాధాన పరచాలని ప్రియ ప్రయత్నించినా వారు మారలేదు. దీంతో శుక్రవారం నెయ్వత్తలి ముత్తుమారియమ్మన్ ఆలయంలో బాబు, ప్రియ వివాహం చేసుకున్నారు. ఈ వేడుకలో బాబు కుటుంబీకుల సమక్షంలో జరిగింది. -
భువీ జోడీకి రెడీ...
న్యూఢిల్లీ: భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ బ్యాచిలర్ లైఫ్‌కి బైబై చెప్పేసి... త్వరలో ఓ ఇంటివాడవుతున్నాడు. అతని ఇంట పెళ్లి బాజా మోగనుంది. ఈ విషయాన్ని అభిమానులతో అతనే స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్నాడు. నుపుర్ నాగర్‌తో తనకు వివాహం జరుగనుందని చెప్పేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫొటోను పోస్ట్ చేసిన భువీ ‘ఇదిగో ఈమె నా భాగస్వామి. పేరు నుపుర్ నాగర్’ అని పేర్కొన్నాడు. సరిగ్గా గత మే 11న తన పెళ్లి ముచ్చటను, పెళ్లి కూతుర్ని త్వరలోనే పోస్ట్ చేస్తానని ఇదే ఇన్స్టాగ్రామ్ వేదికగా పేర్కొన్నాడు. అన్నట్లుగానే చెప్పేశాడు. -
పెళ్లి చేసుకొని పారిపోయాడు
♦ న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు ♦ గతంలోనూ పలు పెళ్లిళ్లు చేసుకున్నాడన్న మొదటి భార్య సాక్షి పలమనేరు : తాను రియల్టర్‌నని, తన భార్య చనిపోయిందని మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుని నెలరోజుల తర్వాత భర్త పారిపోయాడు. బాధితురాలు న్యాయం కోసం ఆదివారం పలమనేరు పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం మేరకు.. పలమనేరుకు చెందిన మనోహర్ విశాఖ జిల్లా చోడవరం మండలం లక్కవరంలో కొన్నాళ్లుగా ఉంటున్నాడు. తాను రియల్టర్‌నని అక్కడ చెప్పుకునేవాడు. ఈ క్రమంలో తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని, భార్య చనిపోయిందని అదే గ్రామానికి చెందిన ఓ మ్యారేజ్ బ్రోకర్‌కు చెప్పాడు. తాను రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు పేర్కొన్నారు. బ్రోకర్ ద్వారా అదే గ్రామానికి చెందిన తాతాబాయి కుమార్తె నాగమణిని గత నెల 16న సింహాచలం ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు. అత్తగారింట్లోనే కాపురం పెట్టాడు. అదే ప్రాంతంలో పలువురు నిరుద్యోగులకు ఉద్యోగాలు తీసిస్తానంటూ డబ్బులు వసూలు చేశాడు. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయం తెలుసుకున్న మనోహర్ భార్యను వదలి అక్కడి నుంచి ఉడాయించాడు. అతను మరిచిపోయిన పర్సును పరిశీలించగా చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన వాడిగా గుర్తించారు. బాధితురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం పలమనేరు పోలీసులను ఆశ్రయించింది. మనోహర్ మొదటి భార్యను పోలీసులు విచారించారు. మనోహర్ గతంలోనూ కదిరి, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో పెళ్లిళ్లు చేసుకున్నాడని తెలిపింది. స్థానికంగా ట్రాన్స్‌కోలో ఉద్యోగాలు తీసిస్తానంటూ పలువురికి టోపీ పెట్టినట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో తాను మోసపోయినట్టు గ్రహించిన బాధితురాలు నాగమణి లబోదిబోమంటోంది. న్యాయం చేయాలని పోలీసు స్టేషన్ వద్దే వేచి చూస్తోంది. మనోహర్ అందుబాటులో లేడని అతని మొదటి భార్య చెప్పడం గమనార్హం. -
ఒంటరిగా వెళ్లింది.. జంటగా వచ్చింది
సురక్షితంగా సత్తెనపల్లి పోలీస్టేషన్‌కు వచ్చిన యువతి సత్తెనపల్లి : పట్టణంలోని వడ్డవల్లికి చెందిన యువతి రాసంశెట్టి శ్రీలక్ష్మి అదృశ్యం చిక్కుముడి ఎట్టకేలకు వీడింది. వివరాలు ఇలా ఉన్నాయి. రామిశెట్టి అజయ్‌కుమార్, లక్ష్మిల దంపతులకు నలుగురు కుమార్తెలు. వీరిలో ఒక కుమార్తెకు వివాహం అయ్యింది. కాగా, అజయ్‌కుమార్ రెండేళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. లక్ష్మి కూడా అనారోగ్యంతో బాధపడుతోంది. కుమార్తెలు ముగ్గురు ట్యూషన్లు చెబుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. చివరి కుమార్తె అయిన శ్రీలక్ష్మి ఇంటర్మీడియట్ చదువుకుని కొంతకాలంగా ఖాళీగా ఉంటోంది. డిగ్రీ పూర్తి చేసి ఏదైనా ఉద్యోగం చేయవచ్చుకదా అని ఆమె అక్కలు పలుమార్లు చెబుతుండేవారు. దీంతో మనస్తాపానికి గురైన శ్రీలక్ష్మి గత నెల 16న రెండు పేజీల లేఖ రాసి ఇంటి నుంచి అదృశ్యమైంది. తాను ఆత్మహత్య చేసుకుంటానని, తన శరీరం కూడా దొరకదని అందులో పేర్కొనడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గతనెల 17న పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈనెల 11న యానాం నుంచి ఫేస్బుక్ ద్వారా కుటుంబ సభ్యులకు లక్ష్మి మెసేజ్ పంపింది. తాను సురక్షితంగా ఉన్నానని, వివాహం చేసుకున్నట్లు తెలిపింది. దీంతో కుటుంబ సభ్యులు కొంత మేర ఊపిరి పీల్చుకున్నారు. పట్టణ పోలీసులకు విషయాన్ని తెలియ చేయడంతో ఫేస్బుక్ అకౌంట్ ఆధారంగా ఆచూకీని కనుగొన్నారు. శ్రీలక్ష్మి ఫేస్బుక్లో పరిచయమైన యానాం వాసి పెద్దిరెడ్డి ఈశ్వరప్రసాద్ వద్దకు వెళ్లిపోయింది. ఇద్దరు వివాహం చేసుకున్నారు. బుధవారం శ్రీలక్ష్మితోపాటు ఈశ్వర ప్రసాద్‌లను పోలీసులు తీసుకొని జిల్లా రూరల్ ఎస్పీ వెంకటప్పలనాయుడు వద్దకు తీసుకెళ్లారు. అనంతరం సత్తెనపల్లి పోలీస్టేషన్‌కు తీసుకు వచ్చారు. శ్రీలక్ష్మి సత్తెనపల్లి చేరుకోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన తొలిగింది. -
కూతురు మృతిని తట్టుకోలేక ఆగిన తల్లి గుండె
కూతురు మృతిపై పలు అనుమానాలు కార్వేటినగరం : మండలంలోని అన్నూరు పంచాయతీ శెట్టిగుంట ఎస్టీ కాలనీలో శనివారం అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతిచెందింది. కూతురి మరణాన్ని చూసి తట్టుకోలేక తల్లి కుప్పకూలింది. తల్లీ కూతురు ఒకేసారి తనువు చాలించడంతో శెట్టిగుంట ఎస్టీ కాలనీలో విషాదం అలుముకుంది. ఎస్ఐ కథనం మేరకు.. మండలంలోని శెట్టిగుంట ఎస్టీకాలనీకి చెందిన పి. శ్రీనివాసులు భార్య పి.రోజా(24) స్థానిక అంగన్వాడి కేంద్రంలో ఆయాగా పనిచేస్తోంది. శ్రీనివాసులు శనివారం రాత్రి కూలి పనుల నుంచి వచ్చాడు. ఈ క్రమంలో భార్య స్పృహతప్పి పడి ఉండడాన్ని గుర్తించి ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో ఆమె మృతి చెందింది. ఇదిలా ఉండగా రోజా ప్రతి రోజూ అంగ్వాడీ కేంద్రానికి పిల్లలను తీసుకెళ్లి వస్తుండేది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన బాలాజీ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం నెలకొన్న ట్టు కాలనీలో పుకార్లు వచ్చాయి. దీంతో బాలాజీ భార్య ద్రాక్షాయణి శనివారం రాత్రి బంధువులతో కలిసి రోజాపై దాడి చేసింది. దీన్ని అవమానంగా భావించిన రోజా ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. రోజా ను చితకబాదడంతోనే మృతి చెందిన ట్లు పలువురు ఆరోపిస్తున్నారని ఎస్ఐ తెలిపారు. శెట్టిగుంట ఎస్టీ కాలనీలో విషాదం కూతురు రోజాపై దాడి చేసినట్టు శ్రీరంగరాజపురం మండలంలోని పిళ్లారికుప్పం ఎస్టీకాలనీలో ఉన్న రోజా తల్లి కుప్పమ్మకు తెలిసింది. ఆమె వెంటనే శెట్టిగుంటకు వచ్చింది. చనిపోయిన రోజాను చూసి రోదిస్తూ స్పృహతప్పి పడిపోయింది. స్థానికులు ఆమెను చికిత్సకోసం తిరుపతికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. ఈ ఘటనతో ఎస్టీ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పిల్లలను బాగా చూసుకోండి..
బావ కొట్టాడన్న బాధతో వివాహిత ఆత్మహత్య బుక్కాపురం(మహానంది): బావ కొట్టాడన్న బాధతో ఓ వివాహిత సూసైడ్‌నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుక్కాపురంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.... గ్రామానికి చెందిన మారెడ్డి కృష్ణయ్య అలియాస్ కిట్టు, ఉమాదేవి దంపతులు. కిట్టు నంద్యాలలోని ఓ పెట్రోల్‌బంక్‌లో పనిచేసేవాడు. వీరికి నాగకార్తీక్(7 వ తరగతి), జ్యోతిక(5వ తరగతి) సంతానం. కిట్టు తల్లి కూడా వీరి వద్దే ఉండేది. ఇటీవల ఆమెకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో సుమారు రూ. 15వేల వరకు ఖర్చు పెట్టి చికిత్స చేయించారు. అయితే కిట్టు వాళ్ల అన్న వెంకటసుబ్బయ్య మాత్రం తమ తల్లిని బాగా చూసుకోవడం లేదంటూ తరచూ వారితో గొడవకు దిగేవాడు. ఈ క్రమంలో ఈ నెల 28న ఉమాదేవిపై దాడి చేసి గాయపరిచాడు. ఈ విషయంపై కిట్టు, ఉమాదేవిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మళ్లీ వారితో గొడవకు పడి ఆమెను కొట్టడంతో అవమానంగా భావించి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ‘కిట్టూ...పిల్లలను బాగా చదివించి మంచి ప్రయోజకులను చేయాలని నా చివరి ఆశ. నా చావుకు కారణమైన నా బావను విడిచిపెట్టవద్దు. అత్తను బాగా చూసుకోండి. అమ్మా, నాన్నా, తమ్ముడు, అక్క మీ అందరితో చివరిసారిగా మాట్లాడాలనుకున్నాను. కానీ మాట్లాడలేకపోతున్నాను. అందరికీ చెప్పేదేమంటే పిల్లలని బాగా చూసుకోండి. హైమావతి, పెద్దశివుడు పిల్లల్ని బాగా చూసుకోండి రా. బావ కొట్టినందువల్ల ఆ బాధను భరించలేక చనిపోతున్నా’ అంటూ సూసైడ్ నోట్లో పేర్కొంది. మహానంది ఎస్ఐ పెద్దయ్యనాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలి తల్లి ఎం.కిట్టమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
మీకు తెలుసా?
ఒకరు ధరించిన పాదరక్షలు, వస్త్రం, యజ్ఞోపవీతం, అలంకారం, పూలదండ, కమండలం– వీటిని మరొకరు ధరించరాదు. శనివారం నాడు, అమావాస్య నాడు ఇంటిని శుభ్రం చేసి, మనకు అవసరం లేని వస్తువులను ఇతరులకు దానం చేయడం వల్ల దరిద్రం తొలగి, సంపదలు కలుగుతాయి. చతురంగ బలాలంటే ఏనుగులు, గుర్రాలు, రథాలు, సైనికులు. వివాహం ఆలస్యం అవుతున్న వారు ప్రతి బుధ, శనివారాలలో శ్రీమహావిష్ణువుకు తులసి దళాలు సమర్పించడం వల్ల త్వరలో వివాహం అవుతుంది. మాసిన, చిరిగిన వస్త్రాలను ధరించిన వారిని, పళ్లు తోముకోనివారిని తిండిపోతును, నిష్ఠూరంగా మాట్లాడేవారిని, సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో నిద్రపోయేవారిని, స్త్రీలను నిందిస్తూ, వారి దుఃఖానికి కారకులైనవారిని లక్ష్మీదేవి పరిత్యజిస్తుంది. చిల్లర నాణేలు కదా అని చులకనగా చూడకూడదు. కరెన్సీ నోట్లను నిర్లక్ష్యంగా ఎలా పడితే అలా నలిపి పర్సులో పెట్టుకోరాదు.