
రతన్ టాటా పారిశ్రామికవేత్తగా ఘనవిజయాలు సాధించినా, అవివాహితుడిగానే మిగిలిపోయారు. ఆయన తన జీవితంలో నలుగురు మహిళలతో ప్రేమలో పడ్డారు. కొన్నిసార్లు దాదాపు పెళ్లి వరకు వెళ్లినా, పెళ్లి మాత్రం చేసుకోకుండానే మిగిలిపోయారు. ఈ సంగతిని రతన్ టాటా స్వయంగా వెల్లడించారు.
దాదాపు పుష్కరం కిందటి ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ ఇంటర్వ్యూలో రతన్ టాటా తన ఆంతరంగికమైన సంగతులను ప్రస్తావించారు. ‘నాలుగుసార్లు ప్రేమలో పడ్డాను. కొన్నిసార్లు దాదాపు పెళ్లి వరకు వెళ్లాను. పరిస్థితుల ప్రభావంతో పెళ్లి మాత్రం జరగలేదు. పెళ్లి చేసుకోవలసిన పనుల్లో తీరికలేకుండా మునిగిపోవడం సహా అనేక కారణాల వల్ల పెళ్లి చేసుకోలేకపోయాను’ అని చెప్పారు. లాస్ ఏంజెలెస్‌లో ఉన్నప్పుడే తొలిసారి ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డానని, కొన్ని పరిస్థితుల వల్ల భారత్‌కు తిరిగి వచ్చేయాల్సి వచ్చిందని తెలిపారు.
సిమీ గరేవాల్‌తో ప్రేమాయణం
బాలీవుడ్ నటి సిమీ గరేవాల్‌తో రతన్ టాటా ప్రేమాయణం గురించి చాలా కథనాలే వెలువడ్డాయి. సిమీ గరేవాల్ ఒక టీవీ చానెల్ కోసం నిర్వహించిన ‘రెండెజ్‌వూస్ విత్ సిమీ గరేవాల్’ కార్యక్రమంలో ఒకసారి రతన్ టాటాను కూడా ఇంటర్వ్యూ చేశారు. ఆమె కూడా తన ఇంటర్వ్యూలో ‘ఎందుకు పెళ్లి చేసుకోకుండా ఉండి;yయారు?’ అని రతన్ టాటాను అడిగారు.
ఇదిలా ఉంటే, సిమీ గరేవాల్ వేరే ఇంటర్వ్యూలో రతన్ టాటాతో కొంతకాలం తానే డేటింగ్ చేసినట్లు చెప్పారు. తాను సినిమాల్లో బిజీగా ఉంటున్నా, ఇద్దరమూ తరచు కలుసుకునేవాళ్లమని తెలిపారు. రతన్ టాటా మరణం పట్ల సంతానాన్ని వ్యక్తం చేస్తూ ‘నువ్వు వెళ్లిపోయావని అంటున్నారు. నువ్వు లేని లోటును భరించడం చాలా కష్టం.. వీడ్కోలు మిత్రుడా!’ అని గురువారం ఉదయం సిమీ గరేవాల్ ఒక పోస్ట్ పెట్టారు.
(చదవండి: రతన్ టాటా నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలివే..!)
Comments
Please login to add a commentAdd a comment