
ప్రతీకాత్మక చిత్రం
మైసూరు: చిన్న చిన్న కారణాలతోనే విడాకులకు దరఖాస్తు చేసే జంటలు ప్రస్తుతం పెరిగిపోయాయి. ఇదే రీతిలో విడాకుల కోసం వచ్చిన జంటలను ఆదివారం మైసూరులో నిర్వహించిన లోక్ అదాలత్‌లో న్యాయమూర్తులు బుజ్జగించి మళ్లీ ఒక్కటి చేశారు.
నగరంలోని కోర్టు కాంప్లెక్స్‌లో కుటుంబ తగాదాల జంటలకోసం లోక్ అదాలత్ నిర్వహించగా సుమారు 25 మంది దంపతులు విడాకులు కోరుతూ హాజరయ్యారు. వారికి విడాకుల వల్ల వచ్చే అనర్థాలను జడ్జిలు, న్యాయ నిపుణులు వివరించి.. కలసి కాపురం చేయాలని నచ్చజెప్పడంతో వారంతా మళ్లీ ఒక్కటయ్యారు.