lok adalat
-
99.90, 98.74, 98.88.. ఇవేమీ పరీక్షల్లో మార్కులు కాదు!
సాక్షి, హైదరాబాద్: 99.90, 98.74, 98.88.. ఇవి పదో తరగతి ఫలితాలో, ఇంటర్ ఫలితాలో కాదు. జాతీయ లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారంలో తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ (టీజీఎస్ ఎల్ఎస్ఏ) సాధించిన రికార్డులు. వరుసగా ఒకటి, రెండో, మూడో జాతీయ లోక్ అదాలత్‌లలో దేశ వ్యాప్తంగా కేసుల పరిష్కారంలో నంబర్ వన్‌గా నిలిచింది. తెలంగాణకన్నా పెద్ద రాష్ట్రాలున్నా ఏటా రికార్డు స్థాయిలో కేసులను పరిష్కరిస్తూ మన్ననలు పొందుతోంది. కక్షిదారులకు పరిహారం చెల్లింపుల్లోనూ అగ్రగామిగా సేవలందిస్తోంది. ప్రజలకు ఉచిత న్యాయం, సత్వర న్యాయమే ధ్యేయంగా పనిచేస్తోంది. న్యాయస్థానాలకు ప్రత్యామ్నాయ పరిష్కార వేదికగా ఎదుగుతోంది. భవిష్యత్‌లో నూటికి నూరు శాతం కేసుల పరిష్కారమే కాకుండా.. గ్రామీణ ప్రజల వద్దకు చేరుకునేందుకు టీజీఎస్ ఎల్ఎస్ఏ ప్యాట్రన్ చీఫ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, టీజీఎస్ ఎల్ఎస్ఏ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్ నేతృత్వంలో వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నెల 9న జాతీయ న్యాయ సేవల ప్రాధికారిక దినోత్సోవం సందర్భంగా ప్రత్యేక కథనం..భారం లేకుండా పరిష్కారంరాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏటా నాలుగుసార్లు జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తారు. ఈ ఏడాది సుప్రీంకోర్టు న్యాయమూర్తి, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) ఎగ్జిక్యూటివ్ చైర్మన్న్జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆధ్వర్యంలో అదాలత్‌లు నిర్వహించారు. న్యాయపరమైన భారాన్ని తగ్గించి, కక్షిదారులకు సత్వర న్యాయం అందజేయడమే అదాలత్‌ల లక్ష్యం. ఇక్కడ ప్రీ లిటిగేషన్(ఇంకా కోర్టులో కేసు వేయనివి), పెండింగ్ (సివిల్, రాజీ పడదగిన క్రిమినల్) కేసులను కూడా పరిష్కరిస్తారు. వ్యాజ్యాలను సామరస్య పూర్వకంగా పరిష్కారించుకోవడానికి అదాలత్ ఓ చక్కని వేదిక. కోర్టుల్లో నమోదు కాని కేసులు, క్రిమినల్ కాంపౌండబుల్ నేరాలు, ట్రాఫిక్ చలా¯Œనాలు, రెవెన్యూ కేసులు, బ్యాంక్ రికవరీ కేసులు, మోటార్ ప్రమాద క్లెయిమ్‌లు, చెక్ బౌన్స్ కేసులతో సహా కోర్టుల ముందు పెండింగ్‌లో ఉన్న పలు కేసులు, కార్మిక, వివాహ వివాదాలు (విడాకుల కేసులు మినహా), భూ సేకరణ కేసులు, వినియోగదారుల విషయాలను పరిష్కరిస్తుంది.ఆశ్రయించండి ఇలా.. ఉచిత, సత్వర న్యాయం కోసం మండల న్యాయ సేవాధికార సంఘం, జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థలకు, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీకి దరఖాస్తు చేసుకోవచ్చు. 040–23446723 లేదా టోల్‌ఫ్రీ నంబర్ 15100ను సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోగాని, వ్యక్తిగతంగాగానీ న్యాయ సాయం కోరవచ్చు.ప్రత్యామ్నాయ పరిష్కార వేదిక లోక్ అదాలత్‌లలో కక్షిదారుల భాగస్వామ్యాన్ని మరింత పెంపొందిస్తున్నాం. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వేదికగా ఎదిగేందుకు చర్యలు చేపట్టాం. ప్రచార మాధ్య మాల ద్వారా అదాలత్‌పై విస్తృత మైన అవగాహన కల్పిస్తున్నాం. అలాగే జిల్లా, మండల స్థాయిల్లో లోక్ అదాలత్‌లను ఇంకా బలోపేతం చేస్తున్నాం. మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు మెరుగుపర్చ డానికి అథారిటీ ప్యాట్ర¯న్న్చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్న్జస్టిస్ సుజోయ్‌పాల్ కృషి చేస్తున్నారు. వారి నేతృత్వం, సూచనలతో పెద్ద మొత్తంలో కేసుల పరిష్కారం సాధ్యమైంది. న్యాయమూర్తులు, లీగల్ సర్వీసెస్ సంస్థల సహకారంతో భవిష్యత్‌లో 100 శాతం కేసులు పరిష్కరిస్తాం. – సీహెచ్ పంచాక్షరి, సభ్యకార్యదర్శి, టీజీఎస్ఎల్ఎస్ఏఉచిత న్యాయం ఎవరు కోరవచ్చు?న్యాయసేవాధికార చట్టం 1987లోని సెక్షన్ 12 ప్రకారం.. ఎస్టీ, ఎస్సీ, మానవ అక్రమ రవాణా బాధితులు, మహిళలు, పిల్లలు, అంగవైకల్య బాధితులు, విపత్తు బాధితులు, జాతి వైషమ్యాలతో హింసకు గురైనవారు, కులం పేరుతో వేధింపులకు గురైన వారు అథారిటీ నుంచి ఉచిత న్యాయ సాయం పొందవచ్చులోక్ అదాలత్లలోని ప్రత్యేక సేవలు న్యాయవాదిని నియమించుకోలేని అర్హులైన వారికి న్యాయవాదిని ఏర్పాటు చేస్తుంది. పిటిషన్లు, అప్పీల్ వేసేందుకు ప్యానల్ లాయర్లు అందుబాటులో ఉంటారు. న్యాయపరమైన అంశాలపై సలహాలు, సూచలనలు కూడా ఇస్తారు. తీర్పులు, ఉత్తర్వులతో పాటు ఇతర అవసరమైన పత్రాలను ఉచితంగా అందిస్తారు. -
ఒకేరోజు 12,39,044 కేసుల పరిష్కారం.. దేశంలోనే నంబర్ వన్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా నిర్వహించిన మూడో జాతీయ లోక్ అదాలత్‌లో అత్యధిక కేసులు పరిష్కరించి తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ (టీజీఎస్ ఎల్ఎస్ఏ) నంబర్ వన్‌గా నిలిచింది. ఒకే రోజు 12,39,044 కేసులను పరిష్కరించి ఈ ర్యాంక్ సాధించింది. ఈ నేపథ్యంలో అథారిటీని హైకోర్టు ప్రధాన న్యా యమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ సుజోయ్‌పాల్ అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని కేసులను పరిష్క రించి, కక్షిదారులకు సత్వర న్యాయం అందించాలని అభిలషించారు. ప్రత్యామ్నాయ పరిష్కార వేదికగా ఎదుగుతున్న అథారిటీకి ప్రజాదరణ పెరుగు తుండటంపై హర్షం వ్యక్తం చేశారు. కోర్టులపై భారం తగ్గడంతోపాటు వేగంగా న్యాయం అందిస్తున్న అథారిటీ మరింత వృద్ధి సాధించాలని అభిప్రాయ పడ్డారు. ఈ సందర్భంగా హైకోర్టు ఆవరణలోని లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యాలయంలో సభ్యకార్యదర్శి సీహెచ్ పంచాక్షరి సోమవారం మీడియాతో మాట్లా డారు. 2024 సెప్టెంబర్ 14న నిర్వ హించిన లోక్ అదాలత్‌లో 12,39,044 కేసులను పరిష్కరించి రూ.250,19,44,447 పరిహారం కక్షిదారులకు అందజే శామని చెప్పారు. కేసుల సత్వర పరి ష్కారం, ఖర్చు లేకుండా న్యాయం అందించడమే లక్ష్యంగా అథారిటీ పనిచేస్తుందన్నారు. అథారిటీ ప్యా ట్రన్ ఇన్ చీఫ్, హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే, అథారిటీ ఎగ్జి క్యూటివ్ చైర్మన్, జస్టిస్ సుజోయ్ పాల్ నేతృత్వం, సూచనలతో పెద్ద మొత్తంలో కేసుల పరిష్కారం సాధ్యౖ మెందని వెల్లడించారు. వరుసగా రెండోసారి నంబర్ వన్‌గా నిలపడంలో సహకరించిన వారికి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ సుజోయ్‌పాల్ కృతజ్ఞతలు తెలిపార న్నారు. ప్రత్యామ్నాయ పరిష్కార యంత్రాంగాన్ని విని యోగించుకుని వివాదాలను సత్వరంగా పరిష్కరించుకోవాలని, అందుకు కక్షిదారులు ముందుకు రావా లని న్యాయమూర్తులు పిలుపునిచ్చినట్లు వివరించారు. -
Justice D.Y. Chandrachud: న్యాయప్రక్రియతో జనం విసుగెత్తిపోయారు
న్యూఢిల్లీ: దేశంలో కోర్టులకు సంబంధించిన వ్యవహారాలు, సుదీర్ఘంగా సాగే న్యాయ వ్యవస్థ ప్రక్రియతో ప్రజలు విసుగెత్తిపోయారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. వివాదాల పరిష్కారానికి లోక్ అదాలత్‌లు చక్కటి ప్రత్యామ్నాయ వేదికలని చెప్పారు. వాటిని ఉపయోగించుకోవాలని ప్రజలకు సూచించారు. శనివారం సుప్రీంకోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్ వారోత్సవంలో ఆయన మాట్లాడారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న వివాదాలను, కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కరించుకొనే అవకాశం ఉందని, ఇరుపక్షాల అంగీకారంతో రాజీ పడొచ్చని వెల్లడించారు. న్యాయస్థానాల్లో న్యాయం చేకూర్చే ప్రక్రియ కక్షిదారులకు ఒక శిక్షగా మారిపోయిందని, ఇది నిజంగా న్యాయమూర్తులకు ఆందోళన కలిగించే విషయమని జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని ఆకాంక్షించారు. -
CJI D Y Chandrachud: వారం రోజుల స్పెషల్ లోక్ అదాలత్
న్యూఢిల్లీ: వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించడానికి, తద్వారా పెండింగ్ భారాన్ని తగ్గించుకునేందుకు సుప్రీంకోర్టు సోమవారం ప్రత్యేక లోక్ అదాలత్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా సుప్రీంకోర్టులోని మొదటి ఏడు ధర్మాసనాలు మధ్యాహ్నం 2 గంటలకు కేసులను విచారిస్తాయి. సుప్రీంకోర్టు వజ్రోత్సవాల సంబరాల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ వెల్లడించారు. ప్రత్యేక లోక్ అదాలత్ వారం పాటు కొనసాగుతుందని తెలిపారు. సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్న కక్షిదారులు, లాయర్లు దీన్ని వినియోగించుకోవాలని కోరారు. వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడంలో కక్షిదారులకు సాయపడితే కలిగే తృప్తి వెల కట్టలేనిదని ఆయన అభిప్రాయపడ్డారు. సమస్యల పరిష్కారంలో లోక్ అదాలత్‌ల ప్రాధాన్యతకు సంబంధించి స్వీయానుభవాన్ని ఉదాహరించారు. ‘‘నా ముందుకు ఒక విడాకుల కేసు వచి్చంది. భార్య నుంచి విడాకులు కోరుతూ భర్త కింది కోర్టుకు వెళ్లాడు. అతడి నుంచి పరిహారం, పాప సంరక్షణ హక్కులు కోరుతూ భార్య కూడా కోర్టుకెక్కింది. వారితో సామరస్యపూర్వకంగా మాట్లాడిన మీదట మనసు మార్చుకున్నారు. కలిసుండేందుకు ఒప్పుకున్నారు. వైవాహిక జీవితాన్ని ఆనందంగా కొనసాగిస్తామని చెబుతూ కేసులు వెనక్కు తీసుకున్నారు’’ అని వివరించారు. ఇలా లోక్ అదాలత్‌లు ఏర్పాటు చేయడం సుప్రీంకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి! పైగా సోమవారం జరిగిన విచారణల కవరేజీ కోసం మీడియాను కోర్టు రూముల లోపలికి అనుమతించడం విశేషం. -
లోక్ అదాలత్‌లో 10,35,520 కేసుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌కు రికార్డు స్థాయిలో స్పందన వచ్చింది. ఒకేరోజు 10,35,520 కేసులను పరిష్కరించారు. వీటిలో ప్రి–లిటిగేషన్ కేసులు 5,81,611, వివిధ కేటగిరీల్లోని పెండింగ్ కేసులు 4,53,909 ఉన్నాయి. లబ్ధిదారులకు రూ.743 కోట్లు పరిహారం చెల్లింపులకు ఉత్తర్వులు ఇచ్చారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే మార్గదర్శకాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు.తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్విసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ సుజోయ్ పాల్, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి రాష్ట్రవ్యాప్తంగా లోక్ అదాలత్‌లను పర్యవేక్షించారు. ఈ మేరకు కేసుల పరిష్కార వివరాలను సాయంత్రం రాష్ట్ర లీగల్ సర్విసెస్ అథారిటీ సభ్యకార్యదర్శి సీహెచ్.పంచాక్షరి మీడియాకు వెల్లడించారు. రెట్టింపు ఉత్సాహంతో కేసులను పరిష్కరించుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. హైకోర్టులో 132 కేసులు.. హైకోర్టు లీగల్ సర్విసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ఆధ్వర్యంలో జరిగిన జాతీ య లోక్ అదాలత్ కార్యక్రమంలో న్యాయమూర్తి జస్టిస్ కాజా శరత్, న్యాయమూర్తి జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు. హైకోర్టులో 132 కేసులు పరిష్కారమయ్యాయి. రూ.9.5 కోట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. లోక్ అదాలత్‌తో సత్వర న్యాయం.. రంగారెడ్డి కోర్టులు: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాలలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ మాట్లాడుతూ.. లోక్‌అదాలత్‌లో పరిష్కారమైన కేసులతో సత్వర న్యాయంతోపాటు కక్షిదారులు చెల్లించిన కోర్టు రుసుమును కూడా తిరిగి పొందవచ్చునని పేర్కొన్నారు.కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శశిధర్‌రెడ్డి, జిల్లా మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయమూర్తి పట్టాభిరామారావు, రంగారెడ్డి జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కొండల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గులగారి కృష్ణ, న్యాయమూర్తులు, న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్స్, కక్షిదారులు పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి/సీనియర్ సివిల్ న్యాయమూర్తి పి.శ్రీదేవి తెలిపిన వివరాల ప్రకారం శనివారం జిల్లావ్యాప్తంగా అన్ని కోర్టు ప్రాంగణాలలో 33 లోక్ అదాలత్ ధర్మాసనాలు ఏర్పాటు చేయగా సుమారు లక్షా 27వేల పైచిలుకు క్రిమినల్, సివిల్ ఇతర కేసులు పరిష్కరించారు. కక్షిదారులకు మొత్తంగా 5 కోట్ల 85 లక్షల రూపాయలు నష్ట పరిహారం చెల్లించారు. -
5,58,883 కేసుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌కు విశేష స్పందన వచ్చింది. ఒక్క రోజే రికార్డు స్థాయిలో 5,58,883 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందులో కోర్టులో పెండింగ్ కేసులు 5,45,704 కాగా, ప్రీ లిటిగేషన్ కేసులు 13,179 ఉన్నాయి. మొత్తం రూ.180.10 కోట్ల పరిహారాన్ని అందించినట్లు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ పి.శ్యామ్ కోషి, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ టి.వినోద్ కుమార్ సూచనలతో ఈ కార్యక్రమం విజయవంతమైందని చెప్పారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో జస్టిస్ శ్యామ్ కోషితో చెక్కులను కూడా అందజేసినట్లు తెలిపారు. హైకోర్టులో 404 కేసులు.. హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ వినోద్ కుమార్ సూచనలతో నిర్వహించిన లోక్ అదాలత్‌లో హైకోర్టులోని 404 కేసులు పరిష్కారమయ్యాయి. అత్యదికంగా 204 మోటారు వాహనాల కేసులు, 71 కార్మికుల పరిహార వివాదానికి చెందినవి ఉన్నాయి. రూ.15 కోట్ల పరిహారాన్ని ప్రకటించారని, 1,100 మంది లబ్ధి పొందారని హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యదర్శి ఎం.శాంతివర్ధని తెలిపారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ జి.వి.సీతాపతి, జస్టిస్ చల్లా కోదండరాం ఈ కేసులను పరిష్కరించారని వెల్లడించారు. -
ఒకేరోజు 3,30,866 కేసుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌కు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఒకేరోజు రికార్డు స్థాయిలో 3,30,866 కేసులు పరిష్కారమయ్యాయి. వీటిలో ప్రి–లిటిగేషన్ కేసులు 9,262.. వివిధ కేటగిరీల్లోని పెండింగ్ కేసులు 3,21,604 ఉన్నాయి. బాధితులకు రూ.255.48 కోట్ల పరిహారం చెల్లింపులకు ఉత్తర్వులు వెలువడ్డాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మార్గదర్శకాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ పి.నవీన్‌రావు, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ టి.వినోద్‌కుమార్ రాష్టవ్యాప్తంగా లోక్ అదాలత్‌ను పర్యవేక్షించారు. హైకోర్టులో 365 కేసులు.. హైకోర్టు పరిధిలో జరిగిన అదాలత్ కార్యక్రమంలో జస్టిస్ జి.అనుపమ చక్రవర్తి, జస్టిస్ జి.శ్రీదేవి, మాజీ న్యాయమూర్తి జస్టిస్ జీవీ సీతాపతి పాల్గొన్నారు. హైకోర్టులో 365 కేసులు పరిష్కారమయ్యాయి. రూ.26.5 కోట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇక జిల్లా కోర్టుల్లో స్థానిక న్యాయమూర్తులు కేసులను పరిష్కరించారు. -
సమసిన ‘ఇవ–యశోద’ చిత్ర వివాదం
సాక్షి,సిటీబ్యూరో: సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘యశోద’ చిత్ర విషయంలో నిర్మాత, దర్శకులు, ‘ఇవ–ఐవీఎఫ్’ సంస్థ మధ్య తలెత్తిన వివాదం శుక్రవారం సిటీ సివిల్ కోర్టు లోక్ అదాలత్ సమక్షంలో సుఖాంతంగా ముగిసింది. రెండో అదనపు చీఫ్ జడ్జ్ కె.ప్రభాకర్ రావు చొరవతో ఇరు వైపుల నుంచి సానుకూల స్పందన రావడంతో న్యాయస్థానంలో ఈ సమస్య రాజీ మార్గంలో సమసిపోయింది. ‘ఇవ–ఐవీఎఫ్’ సంస్థను కించపరచాలనే ఉద్దేశం తమకు లేదని, చిత్రం షూటింగ్ సమయంలో ట్రేడ్ మార్క్ విషయంలో తెలియక జరిగిన పొరపాటు వల్లనే ఈ వివాదం తలెత్తిందని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఇకపై సంస్థకు ఎలాంటి నష్టం జరగకుండా ఆ సంస్థ పేరును ఉచ్చరించే డైలాగులను, సంస్థ లోగో దృశ్యాలను చిత్రం నుంచి తొలగిస్తున్నట్లు ‘ఇవ–ఐవీఎఫ్’ యాజమాన్యానికి తెలియజేయడంతో పాటు రాత పూర్వక హామీ ఇచ్చారు. దీంతో సిటీ సివిల్ కోర్టులో ‘ఇవ–ఐవీఎఫ్’ దాఖలు చేసిన పిటిషన్‌ను మేనేజింగ్ డైరెక్టర్ మోహన్‌రావు చిత్ర బృందంతో ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా రాజీ పడి ఉపసంహరించుకున్నారు. ‘ఇవ–ఐవీఎఫ్’ ప్రతిష్టను దిగజార్చేలా చిత్రంలో సన్నివేశాలున్నాయంటూ మోహన్‌రావు నవంబరు మూడో వారంలో సిటీ సివిల్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. దీన్ని విచారించిన రెండవ అదనపు చీఫ్ జడ్జి కె.ప్రభాకర రావు డిసెంబరు 30 వరకు ఓటీటీ ప్లాట్ఫారంలో యశోద చిత్రాన్ని విడుదల చేయవద్దంటూ ఆదేశాలు జారీచేశారు. -
లోక్ అదాలత్‌లో 1,11,232 కేసుల పరిష్కారం
సాక్షి, అమరావతి: జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్‌లో పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కారం అయ్యాయి. 1,11,232 కేసులు పరిష్కారం కాగా, రూ.46.06 కోట్ల పరిహారం అందజేశారు. పరిష్కారం అయిన కేసుల్లో 97,455 పెండింగ్ కేసులు కాగా, 13,777 ప్రీ లిటిగేషన్ కేసులున్నాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్ మార్గదర్శకత్వంలో లోక్ అదాలత్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కింది కోర్టుల్లో 418 లోక్ అదాలత్ బెంచ్‌లు నిర్వహించారు. రాజీకి ఆస్కారం ఉన్న కేసులను ఇందులో పరిష్కరించారు. ఇదిలా ఉంటే హైకోర్టులో జరిగిన లోక్ అదాలత్‌లో 511 కేసులను పరిష్కరించారు. రూ.4.01 కోట్ల పరిహారం అందజేశారు. హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ లోక్ అదాలత్‌లో న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి, జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డి, జస్టిస్ కుంభజడల మన్మధరావు, జస్టిస్ వీఆర్కే కృపాసాగర్ నేతృత్వంలో కేసుల విచారణ జరిగింది. -
పెళ్లయిన కొత్తలో విడిపోయి.. 52 ఏళ్ల తర్వాత ఒక్కటయ్యారు!
హుబ్లీ: పెళ్లయిన కొత్తలో గొడవలతో వేరుపడ్డారు. విడాకులు కూడా తీసుకుని 52 ఏళ్ల పాటు ఎవరికొద్దీ వారు జీవించారు. చివరకు లోక్ అదాలత్ వారిని ఒక్కటి చేసింది. ఈ అపరూప సన్నివేశం కర్ణాటక రాష్ట్రం ధార్వాడ జిల్లా కలఘటికిలో నిర్వహిస్తున్న లోక్ అదాలత్‌లో చోటు చేసుకుంది. జెన్నూరు గ్రామానికి చెందిన బసప్ప అగడి (85), మాజీ భార్య కళవ్వ (80) 52 ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి కళవ్వకు బసప్ప ప్రతి నెలా భరణం చెల్లించేవాడు. గత కొన్ని నెలలుగా చెల్లించలేకపోయాడు. దీంతో కళవ్వ కోర్టును ఆశ్రయించగా సోమవారం మెగా లోక్ అదాలత్‌లో జడ్జి జీఆర్ శెట్టర్ వారి సమస్యను పరిశీలించారు. నడవలేని స్థితిలో ఉన్న కళవ్వను చూసి ఇద్దరి మధ్య రాజీ కుదిర్చి కలిసి జీవించాలంటూ హితబోధ చేశారు. దంపతులను ఒక్కటి చేసి పంపించారు. (క్లిక్: అయ్యబాబోయ్ ఏనుగులు.. పరుగో పరుగు!) -
తల్లిదండ్రులు.. దత్త పుత్రుడు.. సొంత కొడుకు !
సాక్షి, హైదరాబాద్: కష్టపడి పెంచి పెద్ద చేసిన దత్తపుత్రుడు తల్లిదండ్రులను పట్టించుకోకపోవడంతో అతనికి ఆదివారం లోక్‌అదాలత్‌లో కౌన్సెలింగ్ నిర్వహించి వివాదాన్ని పరిష్కరించారు. నగరానికి చెందిన భార్యభర్తలకు పిల్లలు కలగకపోవటంతో ఒక అనాథ బాలుడిని దత్తత తీసుకున్నారు. సొంత కొడుకులా అప్యాయంగా చూసుకున్నారు. ప్రయోజకుడ్ని చేయాలని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చేర్చించారు. కొన్నేళ్ల తర్వాత ఆ జంటకు కుమారుడు కలిగాడు. దత్త పుత్రుడితో పాటు సొంత కొడుకును కూడా అల్లారుముద్దుగానే చూసుకున్నారు. కాలం గడుస్తున్న కొద్దీ కుటుంబ పెద్దకు ఆరోగ్యం సహకరించకపోవటం, ఆర్ధిక ఇబ్బందులు మొదలవ్వడంతో సొంత కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్చించారు. ఇదే సమయంలో దత్త పుత్రుడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను చూసుకోవటం మానేశాడు. వారింటిని ఆక్రమించేశారు. మరోవైపు సొంత కొడుకు ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారింది. తల్లిదండ్రుల పోషణే గగనమైపోయింది. సొంత కొడుకు కంటే ఎక్కువగా పెంచి పెద్దచేసిన దత్త పుత్రుడ ప్రవర్తన చూసి కుంగిపోయిన వృద్ధ జంట.. అదనపు జిల్లా న్యాయమూర్తి ఉమాదేవి చొరవతో న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించారు. ఆదివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిటీ సివిల్ కోర్టు కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కే.మురళీమోహన్ సమక్షంలో వృద్ధ జంట, దత్తపుత్రుడు, ఆయన భార్య, సొంత కొడుకును పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రుల బాధ్యత విషయంలో దత్త కుమారుడు, సొంత పిల్లలకు మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించి, కుటుంబ సభ్యుల మధ్య రాజీ కుదిర్చారు. దత్త పుత్రుడు, కోడలికి మనవరాళ్లకు ప్రేమాభిమానాలతో తల్లిదండ్రులు కొంత ఆస్తి, డబ్బు అప్పగించారు. పిల్లలందరూ న్యాయమూర్తి ఉమాదేవి సమక్షంలో మాట ఇచ్చి కుటుంబ వివాదాన్ని పరిష్కరించుకున్నారు. అనంతరం ఖలీల్ అనే వ్యక్తిపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన అప్పు వసూలు కేసును ఉభయ పార్టీలు రాజీ పద్ధతిలో పరిష్కరించుకున్నాయి. తన తల్లి చేసిన బ్యాంకు అప్పును , తన తల్లి మరణానంతరం ఆమె కుమారుడు చెల్లించడానికి ముందుకు రాగా, ఎస్బీఐ కొంత అప్పును మినహాయించి కొడుకుతో రాజీకి ముందుకొచ్చింది. ప్రాథమిక దశలోనే ఈ వివాదాన్ని పరిష్కరించుకున్న ఉభయ పక్షాలను సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి రేణుక యారా అభినందించి వారికి అవార్డు కాపీలను అందజేశారు. (చదవండి: 1,518 సివిల్ కేసుల పరిష్కారం) -
1,518 సివిల్ కేసుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా సిటీ సివిల్ కోర్టుల్లో 1,518 సివిల్ కేసుల పరిష్కారమయ్యాయి. బాధితులకు రూ.24,70,81,376 నష్ట పరిహారం అందజేశారు. నగరంలోని సివిల్ కోర్టులలో మొత్తం పది బెంచీలు ఏర్పాటు చేసి ఆదివారం జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహించినట్లు సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి , జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్ రేణుకా యారా తెలిపారు. ఈ సందర్భంగా 324 మోటార్ ప్రమాదం ఇన్సూరెన్స్ క్లెయిమ్ కేసులను కూడా పరిష్కరించామని, బాధితులకు రూ.21 కోట్ల నష్టపరిహారాన్ని అందజేశామని వివరించారు. పర్మినెంట్ లోక్ అదాలత్‌లోని ప్రజా సేవల రంగంలోని ప్రీలిటిగేషన్ కేసులు, 1,092 ఎస్బీఐ బ్యాంక్ కేసులను కూడా వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో రేణుక యారా మాట్లాడుతూ.. కాలయాపన లేకుండా సత్వర న్యాయం పొందటం కేవలం లోకదాలత్ లోనే సాధ్యమవుతుందన్నారు. కక్షిదారులు ఇలాంటి జాతీయ లోక్ అదాలత్‌లో తమ కేసుల సత్వర పరిష్కారానికి ముందుకు రావాలని సూచించారు. రెండవ అదనపు చీఫ్ జడ్జి కె ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. లోక్ అదాలత్ తీర్పుకు అప్పీలు ఉండదని, అంతేకాక అది శాశ్వత పరిష్కారం అవుతుందని వివరించారు. న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కే.మురళీమోహన్ మాట్లాడుతూ.. లోక్ అదాలత్ లో పరిష్కారమైన సివిల్ కేసులలో కక్షిదారులకు వారు చెల్లించిన కోర్టు ఫీజు వాపసు చెల్లిస్తారన్నారు. బార్ అసోసియేషన్ నూతన కార్యదర్శి నాగభూషణం, మాట్లాడారు. సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్ న్యాయస్థానంలోని లోక్ అదాలత్ బెంచ్‌లకు చీఫ్ జడ్జి రేణుకా యారా, సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జి నిర్మల గీతాంబ, రెండవ అదనపు చీఫ్ జడ్జ్ కె ప్రభాకర్ రావు, అదనపు జిల్లా న్యాయమూర్తులు ఉమాదేవి, అపర్ణ , సీనియర్ సివిల్ జడ్జి కిరణ్ మహి, జూనియర్ సివిల్ జడ్జి అరుణ్ కుమార్ తదితరులు నేతృత్వం వహించగా.. సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టులో అదనపు చీఫ్ జడ్జి జీవన్ కుమార్ నేతృత్వం వహించారు. రాచకొండలో 99,476 కేసుల పరిష్కారం రాచకొండ కమిషరేట్ పరిధిలో పెండింగ్ లో ఉన్న 99,476 కేసులు పరిష్కారం అయ్యాయి. ఇందులో..93,930 కేసులు డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కేసులు కాగా..3,293 కేసులు ఐపీసీ కేసులు, 2.253 డ్రంకెన్ డ్రైవ్ కేసులు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా సెషన్స్ జడ్జి సీ హరే కృష్ణ భూపతి, రంగారెడ్డి జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ (డీఎల్ఎస్ఏ) సెక్రటరీ ఏ శ్రీదేవి, యాదాద్రి జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ జడ్జి వీ బాల భాస్కర్ రావులు లోక్ అదాలత్ లను నిర్వహించి కేసులను పరిష్కరించారు. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్, అదనపు సిపి జీ సుధీర్ బాబు తదితర పోలీస్ అధికారులు పాల్గొని లోక్ అదాలత్ నిర్వహణను పర్యవేక్షించారు. (చదవండి: మాల్స్, పబ్‌లు, రెస్టారెంట్లపై ఆంక్షలు) -
జూన్ 26న జాతీయ లోక్ అదాలత్
సాక్షి, హైదరాబాద్: క్రిమినల్ కేసులు, ఎన్ఐ యాక్ట్ కేసులు, ఎక్సైజ్ కేసులు, కార్మిక వివాదాలు, మ్యాట్రిమోనియల్ కేసుల్లో రాజీ కోసం ఈ నెల 26న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని వివరించారు. (క్లిక్: కరోనా కాదు.. అసమానతే.. అసలు వైరస్!) -
రూ.90తో మొదలై.. రూ.250 కోట్లకు!
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఈ– చలాన్ జరిమానా బకాయిలను భారీగా తగ్గించుకోవడానికి అవకాశం కల్పిస్తున్న ఈ– లోక్ అదాలత్ ఈ నెల 1న మొదలైంది. ఆ రోజు తెల్లవారుజామున 1.24 గంటలకు ఓ వాహనదారు తన ద్విచక్ర వాహనంపై ఉన్న జరిమానా మొత్తంలో రిబేటు పోను రూ.90 చెల్లించారు. ఇదే ఈ– లోక్ అదాలత్‌కు సంబంధించిన తొలి చెల్లింపు. ఇలా మొదలైన చెల్లింపులు బుధవారం నాటికి రూ.250 కోట్లకు చేరాయి. తొలుత ప్రకటించిన దాని ప్రకారం గురువారంతో ఈ– లోక్ అదాలత్ ముగియనున్న నేపథ్యంలో మరో 15 రోజుల పాటు ప్రభుత్వం గడువు పొడిగించిందని ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. మొత్తమ్మీద రాష్ట్ర వ్యాప్తంగా కొన్నేళ్లుగా పేరుకు పోయిన ఈ–చలాన్ బకాయిలు రూ.1700 కోట్ల వరకు ఉన్నాయి. బుధవారం వరకు 2.57 కోట్ల చలాన్లకు సంబంధించి రూ.250 కోట్లను వాహనచోదకులు చెల్లించారు. ఈ స్కీమ్ ప్రారంభమైన తొలినాళ్లల్లో రోజువారీ చెల్లింపులు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉండగా... సోమవారం నుంచి ఇది రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటోంది. ఈ నేపథ్యంలోనే ఈ– లోక్ అదాలత్‌ను ఏప్రిల్ 15వ తేదీ వరకు ప్రభుత్వం గడువు పొడిగించిందని ట్రాఫిక్ అధికారులు పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారానే రూ.60 కోట్లు.. ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల చెల్లింపులు అత్యధికంగా పేటీఎం ద్వారా జరిగాయి. ఈ నెల 1 నుంచి ఇప్పటివరకు పేటీఎం, వాలెట్, యూపీఐ, పోస్ట్‌పెయిడ్, నెట్‌బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డ్‌ల ద్వారా రూ.60 కోట్ల ఈ– చలాన్ చెల్లింపులు జరిగాయి. (చదవండి: నిర్లక్ష్యం చూపారు.. నిలువెల్లా దోచారు) -
చలాన్ క్లియరెన్స్‌కు భారీ స్పందన.. నిమిషానికి 1000
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఈ– చలాన్ జరిమానా బకాయిలు భారీ తగ్గించుకోవడానికి అవకాశం కల్పిస్తున్న ఈ– లోక్ అదాలత్‌కు వాహన చోదకుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. పోలీసులు పెట్టిన వన్‌టైమ్ డిస్కౌంట్ ఆఫర్లకు భారీగా స్పందన లభిస్తోంది. మార్చి ఒకటో తేదీ నుంచి ఆన్లైన్లో ప్రారంభమైన ఈ విధానంలో మంగళవారం వరకు 1.29 కోట్ల చలాన్లు చెల్లించారు. 15 రోజుల వ్యవధిలో చలాన్ల రూపంలో రూ.132 కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరింది. వీటిలో 80 శాతం రాజధానిలోని మూడు కమిషనరేట్లకు సంబంధించినవే కావడం గమనార్హం. హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనరేట్ పరిధిలో 56 లక్షల చలాన్లకు సంబంధించి రూ.43 కోట్లు వసూలయ్యాయి. చదవండి:హైదరాబాద్: కీలక నిర్ణయం.. ఎక్కడపడితే అక్కడ.. ‘ఫొటోలు’ తీయరిక! మార్చి 31 వరకు ఈ ఆఫర్ ఉండనుంది. నిమిషానికి వాహనాదారులు 1000 చలాన్లు క్లియర్ చేసుకుంటున్నారు. మొదటి రోజేజే 5.5 కోట్ల రూపాయలు ఫైన్లుచెల్లించారు. డిసెంబర్ 2021 వరకు 80 లక్షల పెండింగ్ చలాన్ లు ఈ–చలాన్ చెల్లింపుల కోసం ఉద్దేశించిన అధికారిక వెబ్సైట్లో కొన్ని మార్పులు చేశారు. తొలినాళ్లల్లో అక్కడ వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌తో పాటు ఇంజన్ లేదా చాసిస్ నంబర్ ఎంటర్ చేయడం కచ్చితం చేశారు. అప్పుడే పెండింగ్ చలాన్లు కనిపించేవి. అయితే తాజాగా చేసిన మార్పులతో కేవలం వాహనం నంబర్‌తోనే ఎంటర్ కావచ్చు. ఫోన్ నంబర్ పొందుపరిచి, దానికి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయడం మాత్రం తప్పనిసరి. ఈ–లోక్ అదాలత్ నెలాఖరు వరకు కొనసాగనుంది. ఫిబ్రవరి 28వ తేదీ వరకు జారీ అయిన ఈ–చలాన్లకు మాత్రమే ఈ రిబేటు వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మార్చి ఒకటో తేదీ నుంచి జారీ చలాన్లకు మాత్రం మొత్తం చెల్లించాల్సిందేనని వివరిస్తున్నారు. చదవండి: అలా చేస్తే కిషన్‌రెడ్డిని హైదరాబాద్ నడిబొడ్డున సత్కరిస్తాం: మంత్రి కేటీఆర్ -
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వాహనదారులకు.. గోల్డెన్ చాన్స్!
హిమాయత్‌నగర్‌కు చెందిన ఫార్మా ఉద్యోగి తరుణ్ (పేరు మార్చడమైంది) గతేడాది మార్చిలో మద్యం సేవించి వాహనం నడుపుతూ జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పట్టుబడ్డాడు. ఆయన బైక్‌ను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఆ బైక్ ఖరీదు సుమారు రూ. 11 వేల వరకు ఉండటంతో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వారికి రూ. 10,500 జరిమానా విధిస్తుండటంతో బైక్ ఖరీదు, చలానా ఖరీదు ఒకే స్థాయిలో ఉండటంతో ఆయన బైక్‌ను స్టేషన్లో వదిలేశారు. ఇది ఒక్క తరుణ్ పరిస్థితి మాత్రమే కాదు. చాలా మంది డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ద్విచక్ర వాహనదారులు జరిమానా రూ. 10,500 చెల్లించలేక బైక్ ఖరీదు దాదాపుగా అంతే ఉండటంతో అక్కడే వదిలేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్ఆర్నగర్, బేగంపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో 2019 మార్చి నుంచి 2021 డిసెంబర్ వరకు సుమారు 5,776 వాహనాలు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డాయి. ఆయా వాహనాలను సీజ్ చేసి స్టేషన్ల ఆవరణల్లో ఉంచారు. అవికాస్తా దుమ్ముకొట్టుకుపోతున్నాయి. తమ వాహనాలు పాడవుతాయనే ఆందోళన ఉన్నా... అంత జరిమానా కట్టే పరిస్థితి లేక బాధపడని వారుండరు. ► అయితే ప్రభుత్వం వారందరికీ ఓ అవకాశాన్ని కల్పించింది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వాహనదారులు లోక్‌అదాలత్‌లో తాము మద్యం సేవించి వాహనం నడిపినట్లు అంగీకరిస్తే రూ. 2100 చెల్లించి ఆ కేసు నుంచి బయటపడి తమ వాహనాన్ని తీసుకెళ్లవచ్చు. ఈ అవకాశాన్ని ప్రస్తుతం అన్ని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కల్పించారు. 36 నుంచి 100 బీఏసీ ఉంటే రూ. 2100, 100 నుంచి 200 బీఏసీ ఉంటే రూ. 3100, 200 నుంచి 300 బీఏసీ ఉంటే రూ. 4100 చెల్లించాలి. ► వాహనదారుడు మాత్రం తాను మద్యం సేవించి వాహనం నడిపినట్లు లోక్ అదాలత్‌లో ఒప్పుకోవాల్సి ఉంటుంది. ► ఈ పథకంలో భాగంగా ఇప్పటి వరకు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్ఆర్నగర్, బేగంపేట పోలీస్స్టేషన్ల పరిధిలో 736 వాహనాలను లోక్ అదాలత్‌లో పరిష్కరించుకొని వాహనాలను తీసుకున్నారు. ► మనో రంజన్ కాంప్లెక్స్‌లో ఉన్న నాల్గవ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌కోర్టులో ఈ లోక్ అదాలత్ జరుగుతుంది. మరికొన్ని రోజులు ఈ అవకాశాన్ని కల్పించారు. సంబంధిత డాక్యుమెంట్లను తీసుకొని వెళ్తే లోక్ అదాలత్‌లో సమస్యలు పరిష్కరించి వాహనాన్ని రిలీజ్ చేస్తున్నారు. వచ్చే నెల 12 వరకు... ► లోక్ అదాలత్ మార్చి 12వ తేదీ వరకు కొనసాగనుంది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు, లారీలు, డీసీఎంలు ఇలా అన్ని వాహనాలు సీజ్ అయి పోలీస్ స్టేషన్ల ఆవరణలో ఉండగా వీరంతా ఆయా పోలీస్ స్టేషన్లకు వచ్చి పోలీసులను సంప్రదిస్తే పోలీసులే మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి జరిమానా చెల్లింపజేసి వాహనాన్ని అందజేస్తారు. మంచి అవకాశం చాలా మంది వాహనదారులు వేలాది రూపాయలు చెల్లించుకోలేక డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వాహనాలు తీసుకోలేకపోవడంతో అన్ని పోలీస్ స్టేషన్ల ఆవరణలో సీజ్ చేసిన వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. ► కొన్ని ఖరీదైన కార్లు, ఖరీదైన బైక్‌లు కూడా ఉన్నాయి. వీరందరికీ ఇదొక సువర్ణ అవకాశమనే చెప్పాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు అప్పటికే ప్రచారం చేశారు. ► సంబంధిత వాహనదారులకు కూడా లోక్ అదాలత్‌పై అవగాహన కల్పించి సమాచారం ఇస్తున్నారు. రోజూ వంద నుంచి 200 వాహనాలు ఇలా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి వాహనాలు విడుదల అవుతున్నాయని సబంధిత వర్గాలవారు చెబుతున్నారు. -
జాతీయ లోక్ అదాలత్ మార్చి 12న
సాక్షి, హైదరాబాద్: కేసుల రాజీకి సంబంధించిన జాతీయ లోక్ అదాలత్ మార్చి 12న జరగనుంది. దీనికి సంబంధించి న్యాయ విభాగం నుంచి నగర పోలీసులకు సమాచారం అందింది. ప్రజలకు ఉపయుక్తమైన లోక్ అదాలత్‌పై అందరికీ అవగాహన కల్పించాలని కొత్వాల్ సీవీ ఆనంద్ ఆదేశించారు. వీలున్నంత వరకు అత్యధికులు దీన్ని వినియోగించుకుని, ఫలితాలు పొందేలా కృషి చేయాలని స్పష్టం చేశారు. ఈ బాధ్యతలను జోనల్ డీసీపీలకు అప్పగించారు. దీంతో ఈస్ట్ జోన్ డీసీపీగా ఉన్న సంయుక్త పోలీసు కమిషనర్ ఎం.రమేష్ రెడ్డి బుధవారం తన పరిధిలోని అధికారులు, సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతీయ స్థాయిలో జరిగే ఈ భారీ లోక్ అదాలత్‌కు సంబంధించిన సమాచారం సంబంధిత వ్యక్తులకు అందించే బాధ్యతలను ఇన్స్పెక్టర్లు, సబ్– ఇన్స్పెక్టర్లకు అప్పగించారు. ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించడం ద్వారా లోక్ అదాలత్‌తో పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా, ఈ కార్యక్రమం విజయవంతమయ్యేలా చూడాలని రమేష్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశాలు జారీ చేశారు. (క్లిక్: హైదరాబాద్‌లో వర్క్ ఫ్రమ్ హోంకు ఎండ్‌కార్డ్.. ఐటీ కంపెనీల కీలక నిర్ణయం) -
విడాకులు వద్దు..కలసి కాపురం చేయండి: న్యాయమూర్తులు
మైసూరు: చిన్న చిన్న కారణాలతోనే విడాకులకు దరఖాస్తు చేసే జంటలు ప్రస్తుతం పెరిగిపోయాయి. ఇదే రీతిలో విడాకుల కోసం వచ్చిన జంటలను ఆదివారం మైసూరులో నిర్వహించిన లోక్ అదాలత్‌లో న్యాయమూర్తులు బుజ్జగించి మళ్లీ ఒక్కటి చేశారు. నగరంలోని కోర్టు కాంప్లెక్స్‌లో కుటుంబ తగాదాల జంటలకోసం లోక్ అదాలత్ నిర్వహించగా సుమారు 25 మంది దంపతులు విడాకులు కోరుతూ హాజరయ్యారు. వారికి విడాకుల వల్ల వచ్చే అనర్థాలను జడ్జిలు, న్యాయ నిపుణులు వివరించి.. కలసి కాపురం చేయాలని నచ్చజెప్పడంతో వారంతా మళ్లీ ఒక్కటయ్యారు. -
61 వేల కేసుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో నిర్వహించిన లోక్‌అదాలత్‌కు అనూహ్య స్పందన లభించింది. వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో దాదాపు 61 వేల కేసులను పరిష్కరించారు. ఇందులో 1,400 సివిల్, 52,420 వేల క్రిమినల్, విచారణ దశలో ఉన్న 7,180 కేసులను పరిష్కరించి బాధితులకు రూ.60.52 కోట్లు పరిహారంగా అందించారు. హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో న్యాయమూర్తులు జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ జి.శ్రీదేవి, జస్టిస్ అభిషేక్‌రెడ్డి నిర్వహించిన లోక్‌అదాలత్‌లో 203 కేసులు పరిష్కరించినట్లు అథారిటీ కార్యదర్శి రమేష్‌బాబు తెలిపారు. అలాగే సిటీ సివిల్ కోర్టులో నిర్వహించిన లోక్‌అదాలత్‌లో 634 కేసులను పరిష్కరించి బాధితులకు రూ.19.66 కోట్లు పరిహారంగా అందించినట్లు అథారిటీ చైర్మన్, చీఫ్ జడ్జి సుమలత, కార్యదర్శి మురళీమోహన్ తెలిపారు. సికింద్రాబాద్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో 120 కేసులను పరిష్కరించి రూ.5.90 కోట్లు పరిహారంగా అందించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, లీగల్ సర్వీస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు పర్యవేక్షణలో ఈ అదాలత్ నిర్వహించినట్లు లీగల్ సర్వీస్ అథారిటీ సభ్య కార్యదర్శి జి.అనుపమా చక్రవర్తి శనివారం తెలిపారు. 15 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి... ‘వారిద్దరూ భార్యాభర్తలు. అభిప్రాయ భేదాలు రావడంతో 15 ఏళ్ల కింద న్యాయస్థానాన్ని ఆశ్రయించి విడాకులు పొందారు. కాలక్రమంలో వారి పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారు. ఇప్పుడు వారిద్దరూ మళ్లీ ఒక్కటవ్వాలని భావించారు. మళ్లీ వివాహం చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ విడాకులు మంజూరు చేసిన ఫ్యామిలీ కోర్టులోనే మళ్లీ వారు పిటిషన్ వేశారు. వీరిద్దరి మధ్య ఒప్పందం చేశాం. మళ్లీ పెళ్లి చేసుకుని సుఖ సంతోషాలతో జీవించాలని అనుకున్న వారి కోరిక తీరనుంది’అని లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి మురళీమోహన్ తెలిపారు. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్‌లో పనిచేసిన శ్రీనిజ సర్టిఫికెట్లు పోగొట్టిన ఘటనలో ఆ బ్యాంకు అధికారులను ఒప్పించి సిటీ సివిల్ కోర్టు లీగల్ సర్వీస్ అథారిటీ రూ.1.15 లక్షల పరిహారాన్ని ఇప్పించింది. -
ఒక్కరోజే 6,351 కేసుల పరిష్కారం
సాక్షి, అమరావతి: జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా హైకోర్టుతో సహా అన్ని న్యాయస్థానాల్లో ఈ–లోక్ అదాలత్ నిర్వహించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్యాట్రన్ ఇన్ చీఫ్, లీగల్ సరీ్వసెస్ అథారిటీ చైర్మన్ జస్టిస్ రాకేశ్ కుమార్ ఆదేశాల మేరకు ఈ–లోక్ అదాలత్ చేపట్టారు. హైకోర్టులో మూడు బెంచ్‌లు, 13 జిల్లాల్లోని కోర్టుల్లో 322 లోక్ అదాలత్ బెంచ్‌లు ఏర్పాటు చేశారు. ఈ–లోక్ అదాలత్‌లో మొత్తం 6,351 కేసులను పరిష్కరించారు. రూ.33.77 కోట్లను సెటిల్మెంట్ కింద చెల్లింపులు చేశారు. ఈ–లోక్ అదాలత్‌కు సహకరించిన వారందరికీ న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి చిన్నంశెట్టి రాజు కృతజ్ఞతలు తెలిపారు. హైకోర్టులో 262 కేసులు పరిష్కారం... హైకోర్టులో నిర్వహించిన ఈ–లోక్ అదాలత్ కేసులను న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ నైనాల జయసూర్య బెంచ్‌లు విచారించాయి. ఈ మూడు బెంచ్‌లు 368 కేసులను విచారించి, అందులో 262 కేసులను పరిష్కరించాయి. రూ.1.01 కోట్లను సెటిల్మెంట్ కింద నిర్ణయించాయి. హైకోర్టులో లోక్ అదాలత్ విజయవంతం కావడానికి సహకరించిన వారికి హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యదర్శి ఎంవీ రమణకుమారి కృతజ్ఞతలు తెలిపారు. -
తొలిసారి హైకోర్టులో ఈ–లోక్ అదాలత్
సాక్షి, అమరావతి: హైకోర్టులో శనివారం నిర్వహించిన ఈ–లోక్ అదాలత్‌లో 187 కేసులు పరిష్కారం అయ్యాయి. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న మోటారు వాహన ప్రమాద అప్పీళ్లను ఈ లోక్ అదాలత్‌లో పరిష్కరించారు. ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ–లోక్ అదాలత్‌కు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ నైనాల జయసూర్య నేతృత్వం వహించారు. 192 కేసులు విచారణకు రాగా, అందులో ఇద్దరు న్యాయమూర్తులు 187 కేసులు పరిష్కరించారు. బాధితులకు రూ.76.91 లక్షలు పరిహారంగా నిర్ణయించారు. కరోనా నేపథ్యంలో హైకోర్టులో తొలిసారి ఈ–లోక్ అదాలత్ జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ లోక్ అదాలత్ నిర్వహించారు. ఇందులో బీమా కంపెనీల ప్రతినిధులు, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. ఈ–లోక్ అదాలత్ విజయవంతం కావడానికి సహకరించినవారందరికీ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యదర్శి ఏవీ రమణకుమారి శనివారం ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. -
ఒక్క రోజులో 26,488 కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా శనివారం అన్ని కోర్టుల్లో లోక్ అదాలత్‌లను నిర్వహించారు. మొత్తంగా ఈ రోజు 26,488 కేసులు పరిష్కారం అయ్యాయి. ఇందులో హైకోర్టులో 503 కేసులు, కింది స్థాయి కోర్టుల్లో 25,985 కేసులు కొలిక్కి వచ్చాయి. ఈ జాబితాలో వివాద ప్రారంభ దశలో ఉన్న 14,462 కేసులు, విచారణలో ఉన్న 11,523 కేసులున్నాయి. హైకోర్టు కేసులు రాజీ కావడం ద్వారా కక్షిదారులకు రూ. 4.71 కోట్లు అందనుంది. కింది స్థాయి కోర్టుల్లో కేసుల రాజీతో రూ. 54.60 కోట్ల మేరకు వాద, ప్రతివాదులకు చెల్లించేలా ఉత్తర్వులు వెలువడ్డాయి. హైకోర్టులో న్యాయమూర్తులు జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ కె.లక్ష్మణ్, రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ జీవీ సీతాపతిలు పలు కేసుల్ని రాజీ చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ ఆదేశాలతో రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు, హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ అయిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులు అన్ని జిల్లాల్లో లోక్ అదాలత్‌లను పర్యవేక్షించారు. ముగ్గురు న్యాయమూర్తులు హైకోర్టు నుంచి జిల్లా కోర్టుల్లో కేసులను వాద, ప్రతివాదుల అంగీకారంతో రాజీ అయ్యేలా చేశారు. జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా పెద్ద సంఖ్యలో కేసుల్ని ఇరుపక్షాల అంగీకారంతో భారీ సంఖ్యలో కేసులు పరిష్కారమైనట్లు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి జీవీ సుబ్రహ్మణ్యం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
సరస్సుల నగరాల.. సొగసులు కాపాడాల్సిందే..!
సాక్షి, హైదరాబాద్: ఏళ్ల తరబడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా, జంట నగరాల్లోని చెరువుల పరిరక్షణ, మూసీ నది ప్రక్షాళణ ముందుకు కదలకపోవడంతో ఇప్పుడు హైకోర్టే స్వయంగా రంగంలోకి దిగింది. సరస్సుల నగరంగా గతంలో ఉన్న ఖ్యాతిని నిలబెట్టి పూర్వవైభవం తెచ్చేందుకు న్యాయసేవాధికార సంస్థ ద్వారా చెరువుల పరిరక్షణ, మూసీ ప్రక్షాళణకు చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. న్యాయసేవాధికార సంస్థ తరఫున ఓ న్యాయమూర్తి ఈ విధంగా చొరవ తీసుకుని సమావేశం జరపడం ఇదే మొదటిసారి. హైకోర్టులో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ సమావేశం జరిగింది. సరస్సుల నగరాలుగా పేరుగడించిన హైదరాబాద్–సికింద్రాబాద్ జంట నగరాలు, ఇప్పుడు ఆక్రమణలకు గురి కావడం, పరిశ్రమల వ్యర్థాలు, ఇతరాలతో అవి ఉనికిని కోల్పోవడంపై జస్టిస్ చౌహాన్ ఈ సమావేశంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చెరువులకు, మూసీ నదికి పూర్వ వైభవం తీసుకురావాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇందుకోసం ఏం చేయాలన్న దానిపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆక్రమణల తొలగింపు విషయంలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులు జస్టిస్ చౌహాన్ దృష్టికి తీసుకొచ్చారు. మూడు నెలల్లో మొదట ఓ సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ)ను ఏర్పాటు చేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ చెప్పారు. ఆక్రమణలకు సంబంధించి వివిధ కోర్టుల్లో 405 సివిల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అలాగే క్రిమినల్ కేసులు కూడా పెండింగ్‌లో ఉన్నాయని జస్టిస్ చౌహాన్ దృష్టికి జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ తీసుకొచ్చారు. లోక్ అదాలత్‌ల్లో అనుభవజ్ఞులైన మధ్యవర్తుల ద్వారా ఈ కేసులను పరిష్కరిస్తామని జస్టిస్ చౌహాన్ చెప్పారు. మూసీ ప్రక్షాళణ కోసం ఏం చేయాలో క్షేత్రస్థాయి పరిస్థితులతో మూడు నెలల్లో పూర్తిస్థాయి నివేదిక సమర్పిస్తామని మూసీ రివర్ ఫ్రంట్ ఎండీ హామీ ఇచ్చారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏం చేస్తున్నామో వివరిస్తూ నివేదిక ఇస్తామని పీసీబీ సభ్య కార్యదర్శి తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో, క్షేత్రస్థాయిలోని పరిస్థితులతో మరోసారి సమావేశం అవుదామని అధికారులందరూ హామీ ఇచ్చారు. చెరువుల పరిరక్షణ, మూసీ నది ప్రక్షాళణకు చెందిన వ్యవహారాలను ఇకపై న్యాయసేవాధికార సంస్థ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటుందని జస్టిస్ చౌహాన్ వారికి స్పష్టంచేశారు. -
పరిష్కారమైన వివాదంపై అప్పీల్ ఏమిటి?
సాక్షి, హైదరాబాద్: లోక్ అదాలత్‌లో పరిష్కారమైన ఓ వివాదంపై మళ్లీ అప్పీళ్లు దాఖలు చేసిన నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ తీరును హైకోర్టు తప్పుబట్టింది. ప్రత్యామ్నాయ పరిష్కార వేదికలను భూస్థాపితం చేసేలా ఇటువంటి పనికిరాని వ్యాజ్యాలను దాఖలు చేస్తూ కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నారని వ్యాఖ్యానించింది. ఇలాంటి వ్యాజ్యం దాఖలు చేసినందుకు ఆ కంపెనీకి రూ.లక్ష జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డిల ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లాలో జరిగిన లోక్ అదాలత్‌లో పెంటమ్మ, యేసమ్మ తదితరులకు పరిహారం చెల్లించేందుకు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అంగీకరించింది. దీంతో లోక్ అదాలత్ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ సదరు బీమా కంపెనీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. వీటిపై సోమవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. నేషనల్ ఇన్సూరెన్స్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, లోక్ అదాలత్‌లో ఉత్తర్వులు జారీ చేసే సమయంలో తమ అధికారుల నుంచి తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారని తెలిపారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. అదెలా సాధ్యమని ప్రశ్నించింది. ఆ అధికారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంది. -
బలవంతంగా మా పెళ్లిని అడ్డుకున్నారు
కడప అర్బన్ : కడప నగర శివారులోని చింతకొమ్మదిన్నె మండలం ఊటుకూరు సాయినగర్‌లో ఉంటున్న ఎం.రాజ్‌కుమార్ తాను వివాహం చేసుకున్న ఎం.శిరీషాతో కలిసి వచ్చి.. తమకు న్యాయం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోకవరపు శ్రీనివాస్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమంలో వారు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్ తమ పరిస్థితి వివరించారు. తాను పెద్దల సమక్షంలో ఈ ఏడాది ఏప్రిల్ 19న వివాహం చేసుకునేందుకు నిశ్చయం చేసుకోగా.. ముందు రోజు 18న రాత్రి 11 గంటల సమయంలో చైల్డ్ హోం నోడల్ ఆఫీసర్ సి.రామకృష్ణారెడ్డి, వీఆర్ఏ వెంకటేశ్వర్లు, వీఆర్వో సాల్మన్లు తదితరులు వచ్చి తమ వివాహాన్ని నిలుపుదల చేశారన్నారు. పెళ్లికుమార్తె వయసు నిర్ణీత వయసు కంటే తక్కువగా ఉందని, నిలుపుదల చేశారన్నారు. ఆమె 2000 ఫిబ్రవరి 22న జన్మించినట్లుగా ఆధార్ కార్డులో ఉందని, ఈ ప్రకారం మేజర్ అయిందని ఎంత చెప్పినా వినకుండా వారు వివాహాన్ని నిలిపి వేశారన్నారు. తాము చూపించిన ఆధారాల గురించి పట్టించుకోకుండా వివాహాన్ని రద్దు చేశారన్నారు. కానీ వివాహం ఆగిపోయినందుకు ఆ సమయంలో తాము తీసుకొచ్చిన లక్షన్నర మేరకు వస్తువులతోపాటు అంతకు ముందే లక్షన్నర మేరకు మొత్తం మూడు లక్షల రూపాయలు వృథాగా ఖర్చయ్యాయన్నారు. దీంతో తాము ఆర్థికంగా నష్టపోయమామని, మానసికంగా వేదన భరించామని చెప్పారు. తర్వాత పెద్దల సమక్షంలోనే వివాహం చేసుకున్నామన్నారు. తాము న్యాయవాది ద్వారా నోటీసులు వారికి పంపించినా స్పందన రాలేదన్నారు. కావున తమరు న్యాయం చేసి తగిన నష్టపరిహారం ఇప్పించాలని బాధితులు రాజ్‌కుమార్, అతని సతీమణి శిరీష విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఆయన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పర్మినెంట్ లోక్ అదాలత్‌లో సమస్యను పరిష్కరిస్తామని సూచించారు. -
ఒక్కరోజులో 31 వేల కేసుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్వ హించిన లోక్‌అదాలత్‌లకు మంచి స్పందన లభించింది. ఒక్క రోజులోనే 31,733 కేసులు పరిష్కారమయ్యాయి. రాజీ వల్ల బాధితులకు రూ.81.33 కోట్ల మేర పరిహారాన్ని ప్రకటించారు. వీటిలో అత్యధికంగా తెలంగాణలో రూ.56.02 కోట్లు అందింది. ఏపీలో రూ.25.31 కోట్లు పరిహారం ప్రకటించారు. కేసుల సంఖ్య పరంగా చూస్తే అత్యధికంగా ఏపీలో 18,891 కేసులు పరిష్కారమయ్యాయి. తెలంగాణలో 12,842 కేసుల్లో రాజీ చేసుకున్నాయి. వీటిలో 6,988 కేసులు ప్రాథమిక విచారణ దశలో ఉండగా, 5,854 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి బి.ఆర్.మధుసూదన్‌రావు తెలిపారు. ఏపీలో పరిష్కారమైన కేసుల్లో 14,404 పెండింగ్‌లో ఉన్నవి కాగా, 4,487 కేసులు ప్రాథమిక విచారణ దశలో ఉన్నట్లు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి పీవీ రాంబాబు తెలిపారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడు, జస్టిస్ వి.రామసుబ్రమణియన్, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్ ఆదేశాల మేరకు ఆదివారం రాత్రి వరకు లోక్‌అదాలత్‌లు నిర్వహిం చారు. హైకోర్టులో జరిగిన లోక్‌అదాలత్‌లో 58 కేసులు పరిష్కారం కాగా, బాధితులకు రూ.3 కోట్లు పరిహారం ప్రకటించారు. హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్, న్యాయమూర్తులు జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ కొంగర విజయలక్ష్మి, మాజీ న్యాయమూర్తి జస్టిస్ జీవీ సీతాపతిలతో కూడిన ధర్మాసనాలు ఈ కేసులను పరిష్కరించినట్లు హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యదర్శి రమేశ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
లోక్ అదాలత్‌లో 28 వేల కేసులు పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా ఉభయ రాష్ట్రాల్లో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్‌లో 28 వేల కేసులు పరిష్కారమయ్యాయి. ఈ కేసుల్లో రూ.58 కోట్ల వరకు పరిహారం చెల్లించాలని ఆదేశాలు వచ్చాయి. ఏపీలో 18 వేల కేసులు పరిష్కారమైనట్లు ఆ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి రాంబాబు తెలిపారు. పరిహారం కింద రూ.32.4 కోట్లు చెల్లించామన్నారు. రాష్ట్రంలో 10 వేలు పరిష్కారం కాగా, రూ.26 కోట్ల మేర పరిహారం చెల్లించామని ఆ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి బి.ఆర్.మధుసూదన్‌రావు తెలిపారు. ఈసారి హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ నిర్వహించిన లోక్ అదాలత్‌లో పెద్ద ఎత్తున కేసులు పరిష్కృతమయ్యాయి. హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ అధ్యక్షుడు జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్ నేతృత్వంలో శనివారం హై కోర్టులో లోక్‌అదాలత్ జరిగింది. జస్టిస్ సంజయ్‌కుమార్ తో పాటు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాద్, జస్టిస్ షమీమ్ అక్తర్, జస్టిస్ పి.కేశవరావు, జస్టిస్ గంగారావుతో పాటు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ జి.వి.సీతాపతి లోక్ అదాలత్‌లో కేసులను విచారించారు. 119 కేసులను పరిష్కరించారు. ఈ కేసుల్లో 500 మందికి రూ.6.5 కోట్ల మేర పరిహారం చెల్లింపునకు న్యాయమూర్తులు ఆదేశాలు జారీ చేసినట్లు లీగల్ సర్విసెస్ కమిటీ ఇన్చార్జి కార్యదర్శి తెలిపారు. -
61 ఏళ్ల భూపంచాయతీకి తెర పడింది
-
టీడీపీ ఆగడాలపై న్యాయపోరాటం
♦ కోమటిలంకలో చెరువుల తవ్వకంపై ఫిర్యాదు ♦ లోక్ అదాలత్‌లో కోమటిలంక వాసుల పిటీషన్ ♦ కలెక్టర్‌తో సహా పలువురు ♦ జిల్లా అధికారులు ప్రతివాదులు ఏలూరు రూరల్: ఏలూరు మండలం కోమటిలంక వాసులు న్యాయపోరాటం మొదలుపెట్టారు. అధి కారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నాయకులు కొల్లేరులో చేపట్టిన అక్రమ చెరువుల తవ్వకాలను అడ్డుకునేందుకు లోక్ అదాలత్ తలుపు తట్టారు. గ్రామానికి చెందిన జైభీమ్ సంక్షేమ సంఘం సభ్యులు ఈనెల 21న లోక్ అదాలత్‌లో పిటీషన్ వేశారు. కలెక్టర్ భాస్కర్‌తో పాటు ఏలూరు ఆర్డీఓ జి.చక్రధరరావు, ఏలూరు తహసీల్దార్ కేవీ చంద్రశేఖర్‌తో పాటు అటవీ, మైన్స్, ఫిషరీస్, విజిలెన్స్ జిల్లా అధికారులను సైతం ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఏలూరు మం డల టీడీపీ అధ్యక్షుడు నేతల రవి, టీడీపీ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు గుత్తా కాశీబాబు, శ్రీపర్రు టీడీపీ నాయకుడు సైదు గోవర్దన్ అక్రమ చెరువుల తవ్వకాలకు సూత్రధారులని వివరిం చారు. నిబంధనలు ఉల్లంఘించి అడ్డగోలుగా తమ భూముల్లో చెరువులు తవ్వుతున్నారని న్యాయమూర్తి కె.శైలజ వద్ద ఆవేదన వెళ్లగక్కారు. ఇదేమని ప్రశ్నిస్తే తప్పుడు పోలీసు కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు కోమటిలంక పరిధిలో సుమారు 1,000 ఎకరాల రెవెన్యూ పోరంబోకు భూమి ఉంది. ఎన్నోఏళ్లుగా గ్రామస్తులు ఈ భూమిలో చేపల సాగు చేసుకుని జీవిస్తూ పట్టాలు మంజూరు చేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ నాయకులు రంగప్రవేశం చేసి పట్టాలు ఇప్పిస్తామని నమ్మిం చారు. దీనికి బదులుగా గతంలో గ్రామస్తులు సాగుచేసిన సర్వే నంబర్ 16 నుంచి 30 వరకూ ఉన్న సుమారు 36 ఎకరాల గ్రామంలోని రెవెన్యూ భూమిని తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందుకు సర్పంచ్, ఎంపీటీసీతో పాటు పలువురిని ఒప్పించారు. దీనిని భూమిలేని జై భీమ్ దళిత సంఘం సభ్యులు వ్యతిరేకించారు. ఇవేమీ పట్టించుకోని టీడీపీ నాయకులు యథేచ్ఛగా చెరువు తవ్వకాలు మొ దలుపెట్టారు. అ డ్డుపడ్డ సభ్యులపై టీడీపీ నా యకులు పోలీసు కేసులు పెట్టించారు. గత్య ంతరం లేక సంఘం సభ్యులు రెవెన్యూ, పో లీసు, అటవీ అధికారులతో పాటు కలెక్టర్ భా స్కర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పం దించిన కలెక్టర్ రెవెన్యూ భూమిలో తవ్వకాలు అడ్డుకోవాలంటూ ఆదేశించారు. అయినా పనులు సాగిపోయాయి. కొద్దిరోజుల్లో చెరువులో నీ రుపెట్టి చేపల సాగు ప్రారంభించనున్నారు. దీం తో దళితులు లోక్ అదాలత్‌ను ఆశ్రయించారు. పట్టాలు ఇప్పిస్తామన్నారు ఎంతోకాలంగా చేపల సాగు చేసుకుని బతుకుతున్నాం. మా భూములకు పట్టాలు ఇప్పిస్తామని నాయకులు చెప్పారు. దీనికి బదులుగా భూమి తీసుకున్నారు. ఇప్పటివరకూ పట్టాలు ఇప్పించలేదు సరికదా పేదలకు చెందిన భూమి తీసుకున్నారు. దీనిని మేం వ్యతిరేకిస్తున్నాం. – తెనాలి దానియేలు, సంఘం సభ్యుడు టీడీపీ నాయకుల కుట్ర టీడీపీ నాయకులు పేదలను మోసం చేసి భూమి కాజేశారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేశారు. పోలీసు కేసులు బనాయించారు. రెవెన్యూ, అటవీ, పోలీసుశాఖ అధికారులతో పాటు చివరగా జిల్లా కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేశాం. అందరూ న్యాయం మా పక్షాన్నే ఉందన్నారు. చర్యలు మాత్రం తీసుకోలేదు. అందుకే లోక్ అదాలత్ ఆశ్రయించాం. – మద్దుల రత్నయ్య, జైభీమ్ సంఘం అధ్యక్షుడు -
కేసుల పరిష్కారమే ధ్యేయం
► నేషనల్ లోక్ అదాలత్ ప్రారంభంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ► రాత్రి వరకు ఐదు బెంచీలతో కేసుల పరిష్కారం లీగల్ ( కడప అర్బన్ ): జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారమే ధ్యేయంగా నేషనల్ మెగా లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోకనూరు శ్రీనివాస్ అన్నారు. శనివారం నేషనల్ మెగా లోక్ అదాలత్‌ను జిల్లాలోని వివిధ కోర్టుల్లో ప్రారంభించారు. జిల్లా కోర్టులో నేషనల్ మెగా లోక్ అదాలత్‌ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోకనూరు శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్ మెగా లోక్ అదాలత్ చైర్మన్ దీపక్ మిశ్రా ఆదేశాల మేరకు ప్రతి రెండు నెలలకు ఒకసారి లోక్ అదాలత్‌ను నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుతం జరుగుతున్న నేషనల్ మెగా లోక్ అదాలత్‌లో ప్రత్యేకంగా మెజిస్ట్రేట్లతో కూడిన ఐదు బెంచీలను ఏర్పాటు చేశామన్నారు. అర్ధరాత్రి వరకు పెండింగ్ కేసులను పరిష్కరించుకునేలా చర్యలు చేపట్టామన్నారు. రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకుంటే కోర్టు ఫీజులను కూడా తిరిగి పొందవచ్చన్నారు. ప్రత్యర్థి వర్గం వారితో సమన్వయంతో కేసులను పరిష్కరించుకోగలుగుతామన్నారు. ఈ అవకాశాన్ని పోలీసులు, న్యాయవాదులు సహకరించాలని కోరారు. సమావేశానంతరం లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమైన ఓ కేసు పత్రాన్ని సంబంధిత న్యాయవాదికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసమూర్తి, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ విష్ణు ప్రసాద్‌రెడ్డి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ యూయూ ప్రసాద్, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జీవీ రాఘవరెడ్డి, ప్రభుత్వ న్యాయవాది గుర్రప్ప, మెజిస్ట్రేట్లు శోభారాణి, సీడబ్యూసీ చైర్మన్ శారద, భారతరత్న మహిళా మండలి వ్యవస్థాపకురాలు మూలె సరస్వతి తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 2274 కేసుల పరిష్కారం: నేషనల్ మెగా లోక్ అదాలత్ ఆదేశాల మేరకు శనివారం జిల్లా కోర్టులోని లోక్ అదాలత్ భవన్‌తోపాటు జిల్లాలోని వివిధ కోర్టులలో కూడా కేసుల పరిష్కారం జరిగింది. మొత్తం 2274 కేసులు పరిష్కారం అయ్యాయి. తద్వారా కక్షిదారులకు రూ.2,00,42,286ల నష్టపరిహారం లభించింది. కేసుల పరిష్కారానికి కృషి చేసిన మెజిస్ట్రేట్లు, న్యాయవాదులు, సంబంధిత అధికారులు, బాధితులను జిల్లా ప్రధాన న్యాయమూర్తి అభినందించారు. -
నిరుపేదలకు న్యాయం అందించాలన్నదే లక్ష్యం
మెగాలోక్ అదాలత్‌లో జిల్లా వ్యాప్తంగా 1392 కేసులు పరిష్కారం రాజమహేంద్రవరం క్రైం : నిరుపేదలకు న్యాయం అందించాలన్నదే లక్ష్యంగా నేషనల్ మెగాలోక్ అదాలత్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి తుకారామ్ జీ, జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ కార్యదర్శి ఎల్. వెంకటేశ్వరరావులు పేర్కొన్నారు. శనివారం జిల్లా వ్యాప్తంగా వివిధ కోర్టుల్లో పెండింగ్ కేసులను ఇరువర్గాల రాజీ మార్గం ద్వారా పరిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా 1392 కేసులు పరిష్కరించారు. రాజమహేంద్రవరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవాధికార సంస్థ భవనంలో శనివారం మెగాలోక్ అదాలత్ నిర్వహించారు. మూడు బెంచీలు ఏర్పాటు చేసి కేసులు పరిష్కరించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి తుకారామ్ జీ, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎల్. వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. 391 కేసులు పరిష్కరించారు. న్యాయమూర్తులు నీలిమా, వై పరశురామ్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. ఇరువర్గాలు రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించాలనే దృక్పథంతో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు. రాజమహేంద్రవరం జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవాధికార సంస్థ భవనంలో పర్మినెంట్ లోక్ అదాలత్ ఏర్పాటు చేశామన్నారు. -
అప్పీల్ లేని అంతిమ తీర్పు
జిల్లా ప్రధాన జడ్జి తిరుమలదేవి ఈనెల 8న జాతీయ లోక్ అదాలత్ వరంగల్ లీగల్ : కక్షిదారులు రాజీమార్గంలో లోక్ అదాలత్‌లో చేసుకున్న తీర్పు అప్పీల్ లేని అంతిమ తీర్పు అని జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జి కమ్ జిల్లా న్యాయసేవా అధికార సంస్థ చైర్మన్ ఈద తిరుమలదేవి అన్నారు. మంగళవారం జిల్లా న్యా యసేవా సదన్ భవనంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈనెల 8న నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని విజ్ఞప్తిచేశారు. ఆర్థికభారాన్ని తగ్గిం చుకోవడానికి విలువైన సమయాన్ని కాపాడుకోవడానికి కక్షిదారులు రా జీమార్గాన్ని ఆశ్రయించాలన్నా రు. దేశవ్యాప్తంగా జాతీయ న్యాయసేవా సంస్థ ఆదేశాల మేరకు ఈనెల 8న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే సంబంధిత కక్షిదారులకు నోటీసులు జారీచేసినట్లు చెప్పారు. కేసులు నమోదు కాని ప్రిలిటిగేషన్ కేసులు 400 సైతం పరిష్కరించడానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో అదనపు జిల్లా జడ్జి కె.రమేష్, సీనియర్ సివిల్ జడ్జి వై.పద్మ, జూనియర్ సివిల్ జడ్జిలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయవాదులతో కూడిన 11 బెంచ్‌లో ఏర్పాటు చేసినట్లు, మహబూబాబాద్–3, ములుగు–2, జనగామ–3, పరకాల–2, నర్సంపేట, తొర్రూరు కోర్టుల్లో ఒక బెంచ్ చొప్పున ఏర్పాటు చేసి లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జడ్జి తిరుమలదేవి తెలిపారు. సమావేశంలో జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి సత్యనారాయణ పాల్గొన్నారు. -
ప్రీ–లోక్ అదాలత్ ప్రారంభం
శ్రీకాకుళం పాతబస్టాండ్ : ఈ నెల 8వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌కు అనుగుణంగా ప్రీ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జిల్లా ఫస్ట్ క్లాస్ అడిషనల్ జిల్లా జడ్జితో పాటు ఇన్చార్జి జిల్లా జడ్జి, జాతీయ లోక్ అదాలత్ అధ్యక్షుడు బి. గౌతం ప్రసాద్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ మోటారు వాహన ప్రమాదాల కేసులు పరిష్కరించడంలో భాగంగా బీమా కంపెనీలతో మాట్లాడి కక్షిదారుల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామన్నారు. క్రిమినల్ కేసులకు సంబంధించి రాజీ చేయదగ్గ కేసుల వివరాల జాబితాను పోలీసు అధికారులు తయారుచేయాలన్నారు. వీటిని కూడా లోక్ అదాలత్‌లో ఇరువర్గాల ఆమోదంతో సత్వరమే పరిష్కరిస్తామని వివరించారు. పారాలీగల్ వలంటీర్లు అందుబాటులో ఉండి లోక్ అదాలత్ కార్యక్రమంలో తమ సేవలను అందించి విజయవంతం చేయడానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఫోర్త్ క్లాస్ అడిషినల్ జడ్జి, ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి వి.గోపాలకృష్ణారావు, స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కోర్టు వై. శ్రీనివాసరావు, గేదెల ఇందిరాప్రసాద్, పోలీసు, అధికారులు, పారా లీగల్ వలంటీర్లు, కక్షిదారులు తదితరులు హాజరయ్యారు. -
సత్వర న్యాయమే లోక్ అదాలత్ ధ్యేయం
- జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి - ఏప్రిల్ 8న దేశవ్యాప్తంగా లోక్‌అదాలత్ బనగానపల్లె రూరల్ : కక్షిదారులకు సత్వర న్యాయమే ధ్యేయంగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి తెలిపారు. దేశ వ్యాప్తంగా రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాల్లో ఏప్రిల్ 8వతేదీన నిర్వహించే లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని కక్షిదారులకు సూచించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని న్యాయవాదులు, పోలీసులకు సూచించారు. బనగానపల్లె జూనియర్ సివిల్ జడ్జీ కోర్టు బార్ అసోసియేషన్ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం జడ్జీ లావణ్యతో కలిసి సమావేశం నిర్వహించారు. అధికారులందరూ సమన్వయంతో సామరస్యంగా కక్షిదారులతో చర్చించి ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా కృషి చేయాలన్నారు. రాజీ కాదగిన క్రిమినల్, చెక్‌బోన్స్, రెవెన్యూ, పంచాయతీ, బ్యాంకు రుణాల కేసులు పరిష్కరించుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సోమశేఖర్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు జెడ్‌వీ కృష్ణారెడ్డి, ఏపీపీ గోపాలకృష్ణ, పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు, -
మైనర్లకు ఉచిత న్యాయ సహాయం
– లోక్ అదాలత్ జడ్జి ఎంఏ సోమశేఖర్ కర్నూలు(అర్బన్): మైనర్ చిన్నారులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని జిల్లా లోక్ అదాలత్ జడ్జి ఎంఏ సోమశేఖర్ తెలిపారు. శుక్రవారం స్థానిక సీ క్యాంప్‌లోని మున్సిపల్ హైస్కూల్లో డా.జె. యధుభూషణ్‌రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు స్వైన్‌ఫ్లూ నివారణకు ఉచిత హోమియా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన సోమశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు, స్కూల్ టీచర్లు హోమియో మందులను తప్పక వాడాలన్నారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. న్యాయ పరంగా ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహనను పెంచుకోవాలన్నారు. పిల్లలతో పాటు మహిళలకు కూడా ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామన్నారు. బాలల హక్కులు, అనాథ పిల్లలకు ఎన్జీఓ ఆర్గనైజేషన్స్ అందిస్తున్న సేవలను వివరించారు. ఈ నేపథ్యంలోనే హాజరైన విద్యార్థులు, టీచర్లకు హోమియో మందులను అందించారు. కార్యక్రమంలో న్యాయవాదులు బి. ఆదినారాయణరెడ్డి, పి. నిర్మల, ఎంఏ తిరుపతయ్య, శివసుదర్శన్, స్కూల్ ప్రధానోపాధ్యాయులు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మెగాలోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి
బనగానపల్లె రూరల్: ఈ నెల 11న నిర్వహించే మెగా లోక్ అదాలత్‌ను ఇరువర్గాల కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి సూచించారు. సోమవారం సాయంత్రం స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పలు శాఖల అధికారులు, న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ సివిల్, క్రిమినల్, చెక్‌బౌన్స్ కేసులు, పీఎల్సీ, భూసేకరణ తదితర కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకునేలా అ«ధికారులు కక్షిదారులకు సూచించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీస్ అథారిటి కార్యదర్శి సోమశఖర్, స్థానిక జడ్జి లావణ్య, తహసీల్దార్ అనురాధ, సీఐ శ్రీనివాసులు, ఎస్ఐలు సీఎం రాకేసు, విజయలక్ష్మి, హనుమంత్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి, సీనియర్ న్యాయవాదులు పరశురామిరెడ్డి, మాధవరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, అబ్దుల్‌ఖైర్, యూసుప్హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
– లోక్ అదాలత్ జడ్జి కర్నూలు: చట్టాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని లోక్ అదాలత్ జడ్జి ఎంఏ సోమశేఖర్ అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం సంతోష్‌నగర్‌లోని ఉమామాధవ ఇంగ్లిషు మీడియం స్కూలులో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి సోమశేఖర్ హాజరయ్యారు. ప్రాథమిక హక్కులు, వాటి బాధ్యతల గురించి సోమశేఖర్ విద్యార్థులకు క్లుప్తంగా వివరించారు. న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదులు ఆదినారాయణ రెడ్డి, నాగముని, వరలక్ష్మి, కళాశాల ప్రిన్సిపాల్ మాధవకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
లోక్‌అదాలత్‌తో సత్వర న్యాయం
11న జాతీయ లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి శ్రీసుధ గతేడాది 6,381 కేసులు పరిష్కరించామని వెల్లడి హైదరాబాద్: లోక్‌అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవడం ద్వారా సత్వర న్యాయం అందడమేగాక శాశ్వత పరిష్కారం లభిస్తుందని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి శ్రీసుధ తెలిపారు. ఫిబ్రవరి 11న జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించనున్న నేపథ్యంలో శుక్రవారం ఆమె లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి వై.వీర్రాజుతో కలసి తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గతేడాది సిటీ సివిల్ కోర్టు ఆవరణలో ఆరు పర్యాయాలు లోక్‌అదాలత్ నిర్వహించి 6,381 కేసులను పరిష్కరించి బాధితులకు రూ.65 కోట్లు పరిహారంగా అందించామని తెలిపారు. సిటీ సివిల్ కోర్టులో 31 వేల పెండింగ్ కేసులు ఉన్నాయని, ఇందులో కుటుంబ వివాదాలు, సివిల్ కేసులతోపాటు జీహెచ్ఎంసీ, రెవెన్యూ, చిట్‌ఫండ్, ప్రమాద బీమా, రుణాల రికవరీ కోసం బ్యాంకులు వేసిన కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. వీటిలో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న 2 వేల కేసులను గుర్తించి లోక్‌అదాలత్‌లో పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలి పారు. ఇందుకోసం బ్యాంకు అధికారులు, న్యాయవాదులు, ఇన్సూరెన్స్ కంపెనీలతో సమీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రాజీ ద్వారా పరిష్కరించేందుకు అవకాశం ఉన్న కేసులను గుర్తించి కక్షిదారులకు నోటీసులు పంపుతున్నామని వివరించారు. లోక్ అదాలత్‌లో కేసులను పరిష్కరించుకోవడం ద్వారా ఇరువర్గాలు గెలిచినట్లేనని, సమ యం, డబ్బు ఆదా అవుతుందన్నారు. లోక్‌అదాలత్ ఇచ్చే అవార్డుకు అప్పీల్ ఉండదని, ఇక్కడ కేసు పరిష్కరించుకోవడం ద్వారా కోర్టు ఫీజును తిరిగి పొందవచ్చ న్నారు. ప్రీలిటిగేషన్ కేసులను కూడా పరిష్కరిస్తామన్నారు. కక్షిదారులు అవకాశా న్ని సద్వినియోగం చేసుకొని కేసులను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి లోక్‌అదాలత్‌ను నిర్వహిస్తామని.. మరింత సమాచారం కోసం లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. -
11న జాతీయ లోక్ అదాలత్
– జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.అనుపమ చక్రవర్తి కర్నూలు(లీగల్): ఫిబ్రవరి 11న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.అనుపమ చక్రవర్తి అన్నారు. బుధవారం జిల్లా న్యాయ సేవాసదన్‌లో ప్యానల్ అడ్వకేట్స్, రీటైనర్స్, జువైనల్ బోర్డు అడ్వకేట్స్, లీగల్ ఎయిడ్ అడ్వకేట్స్, పారాలీగల్ వాలంటీర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి 11న నిర్వహించే లోక్ అదాలత్‌లో రాజీ కాగల క్రిమినల్ కేసులు, అన్ని సివిల్ కేసులు, ప్రిలిటిగేషన్ కేసులు, రోడ్డు ప్రమాద కేసులు పరిష్కారం చేస్తారన్నారు. కక్షిదారులకు వీలైనంత వరకు ప్రచారం కల్పించి పాత కేసులకు ప్రాధాన్యతనిచ్చి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో లోక్ అదాలత్ జడ్జి ఎం.ఎ.సోమశేఖర్, న్యాయవాదులు పాల్గొన్నారు. -
నిరాదరణకు గురైతే రూ. పదివేల భరణం
- జిల్లా లోక్ అదాలత్ జడ్జి ఎంఏ సోమశేఖర్ - వృద్ధాశ్రమంలో న్యాయ విజ్ఞాన సదస్సు కర్నూలు (కొండారెడ్డి ఫోర్టు): కొడుకులు, కుమార్తెల నిరాదరణకు గురైన తల్లిదండ్రులు, వయోవృద్ధులు కనిష్టంగా పది వేల రూపాయల భరణం పొందేందుకు చట్టాలున్నాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, లోక్ అదాలత్ జడ్జి ఎంఏ సోమశేఖర్ తెలిపారు. ఇందుకు వయోవృద్ధులు, ముసలి తల్లిదండ్రులు, రక్షణ, సంరక్షణ చట్టం-2007 అవకాశం కల్పిస్తోందన్నారు. అలాంటి వారు ఆర్డీఓకు దరఖాస్తు చేసుకుంటే నెలకు కనీసం పదివేల రూపాయల భరణం పోందే అవకాశం ఉందన్నారు. సోమవారం ఎలుకూరు ఎస్టేట్‌లోని శ్రీమాతా అన్న పూర్ణేశ్వరి వృద్ధుల ఆశ్రమంలో న్యాయ విజ్ఞానా సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆస్తి రాయించుకున్న తరువాత వారి సంతతి నిరాదరణకు గురిచేస్తే ఆ రిజిస్ట్రేషన్ పత్రాలు చెల్లవన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు ప్రసాదు, తిరుపతయ్య, అశ్రమ మేనేజర్ కేసీ రంగస్వామి పాల్గొన్నారు. -
విద్యా హక్కుపై చట్టంపై అవగాహన అవసరం
– జిల్లా లోక్ అదాలత్ జడ్జి సోమశేఖర్ కర్నూలు సీక్యాంప్: విద్యా హక్కు చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా లోక్ అదాలత్ జడ్జి సోమశేఖర్ అన్నారు. ఆదివారం అశోక్‌నగర్‌లోని పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో అవగాహన కార్యక్రమం రాయలసీమ మహిళా సంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ.. విద్య ప్రజల ప్రాథమిక హక్కు అన్నారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఉచిత న్యాయ సలహాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు మాట్లాడారు. కార్యక్రమంలో రాయలసీమ మహిళా సంఘ్ నాయకురాళ్లు, నిరాశ్రయుల వసతి గృహం సభ్యులు పాల్గొన్నారు. -
పేదలకు ఉచిత న్యాయ సహాయం
– లోక్ అదాలత్ జడ్జి ఎంఏ సోమశేఖర్ కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : రూ.లక్షలోపు ఆదాయం ఉన్న అల్పసంఖ్యాక వర్గీయులు ఉచిత న్యాయ సహాయాన్ని వినియోగించుకోవాలని లోక్ అదాలత్ జిల్లా జడ్జి ఎంఏ సోమశేఖర్ ప్రజలకు సూచించారు. గురువారం బి.తాండ్రపాడులో సంగీతరావు ఎడ్యుకేషనల్ అకాడమి ఆధ్వర్యంలో ఉచిత న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ..ఉచిత న్యాయ సాయాన్ని మతిస్థిమితం లేనివారు, పారిశ్రామిక కార్మికులు, మహిళలు, పిల్లలు, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు పొందవచ్చన్నారు. ఇందుకు న్యాయ సేవాధికార సంస్థ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అనంతరం గృహహింస, మహిళాసాధికారత చట్టాలపై ప్రజలకు ఆయన అవగాహన కల్పించారు. కార్యక్రమంలో న్యాయవాదులు వాడాలా ప్రసాదు, ఆదినారాయణరెడ్డి, మధుబాబు, ఎస్సీ, ఎస్టీ సొసైటీ డైరక్టర్ రామాంజనేయులు పాల్గొన్నారు. -
కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యం
జిల్లా ప్రధాన న్యాయమూర్తి నెల్లూరు(లీగల్) : పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించి కక్షిదారులకు సమన్యాయం అందించాలనే లక్ష్యంతో ప్రతినెలా జాతీయ లోక్‌అదాలత్‌ను నిర్వహిస్తున్నామని సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి మౌలానా అహ్మద్ జునైద్ పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవాధికారసంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్‌అదాలత్‌ను నిర్వహించారు. ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడుతూ జిల్లా, మండల స్థాయిల్లో ఏర్పాటు చేసిన న్యాయసేవాధికారసంస్థల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత సత్వర సమన్యాయం అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ సారి జరిగిన లోక్‌అదాలత్‌లో ఎక్కువ కేసుల పరిష్కారానికి కృషి చేశామని, కక్షిదారులు బాగా స్పందించారని పేర్కొన్నారు. 4 బెంచ్‌ల ఏర్పాటు జిల్లా కోర్టు ఆవరణలో కేసుల పరిష్కారానికి 4 బెంచ్‌లను ఏర్పాటు చేశారు. అదనపు జిల్లా జడ్జి పాపిరెడ్డి, సీనియర్ సివిల్ జడ్జి భూపాల్‌రెడ్డి, జూనియర్ సివిల్ పి.కేశవ, వాసుదేవన్‌లు ప్రిసైడింగ్ అధికారులుగా వ్యవహరించి 715 కేసులను పరిష్కరించారు. జిల్లా న్యాయసేవాధికారసంస్థ కార్యదర్శి సత్యవాణి నేతృత్వం వహించారు. జిల్లా వ్యాప్తంగా 9 మండలాల్లోని కోర్టుల న్యాయమూర్తు ప్రిసైడింగ్ అధికారులుగా వ్యవహరించి 808 కేసులను పరిష్కరించారు. గూడూరు 201, కోవూరు 51, కావలి 295, ఆత్మకూరు 17, వెంకటగిరి 61, కోట 16, సూళ్లూరుపేట 91, నాయుడుపేట 21, ఉదయగిరి 55 కేసులను పరిష్కరించారు. మోటారువాహన ప్రమాద కేసులతోపాటు సివిల్, బరణం, చెక్కుల కేసులలోని లబ్ధిదారులకు రూ. 5,79,66,857 కోట్లు రూపాయలు అందేలా కేసులను పరిష్కరించారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జిలు శ్యామలాదేవి, శ్రీలక్ష్మీ, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి టీవీ సుబ్బారావు, నగరంలోని పలు కోర్టుల న్యాయమూర్తులు, పలు సంస్థల అధికారులు, న్యాయశాఖ సిబ్బంది, న్యాయవాదులు కక్షిదారులు పాల్గొన్నారు. -
లోక్‌అదాలత్‌లో 1222 కేసుల పరిష్కారం
శ్రీకాకుళం సిటీ : జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో మొత్తం 1,222 కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షురాలు వీబీ నిర్మలాగీతాంబ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. జిల్లా కోర్టులో జరిగిన లోక్‌అదాలత్‌లో పాల్గొన్న జిల్లా జడ్జి మాట్లాడుతూ ప్రీలిటిగేషన్ కేసులు 52, జనరల్ కేసులు 1137, 33 సివిల్ కేసులు పరిష్కరించామన్నారు. ఈ లోక్ అదాలత్ ద్వారా వివిధ రూపాల్లో రూ.2,32,68,743 రాజీ కుదిర్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో నాల్గవ అదనపు జిల్లా జడ్జి వి.గోపాలకృష్ణ, లోక్ అదాలత్ చైర్మన్ షేక్‌ఇంతియాజ్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.మేరీగ్రేస్‌కుమారి, స్పెషల్ జుడీషియల్ ఫస్ట్‌క్లాస్ ఎక్సైజ్ మెజిస్ట్రేట్ వై.శ్రీనివాసరావు, న్యాయవాదులు జి.ఇందిరా్రçపసాద్, ఎ.ఉమామహేశ్వరరావు, జె.శ్రీనివాసరావు, ఎం.చందనకుమారి, సీఎస్ ప్రకాశరావు, బి.రమణ తదితరులు పాల్గొన్నారు. పొటోలు -
దీర్ఘకాల కేసులే అసలైన సవాల్: సీజేఐ
అహ్మదాబాద్: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించడమే న్యాయ వ్యవస్థ ముందున్న అసలైన సవాలు అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ అన్నారు. గుజరాత్ జ్యుడీషియల్ అకాడెమీని శనివారం ఆయన ప్రారంభించి ప్రసంగించారు. తాను పంజాబ్, హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ లోక్ అదాలత్‌లు నిర్వహించడం ద్వారా 14 లక్షల కేసుల్ని పరిష్కరించానని ఆయన తెలిపారు. అయితే చిన్న కేసుల్ని పరిష్కరించడమంటే చీపురు చేతబట్టి.. ఇంటిలో ఉన్న చెత్తాచెదారాన్ని ఊడ్చటంలాంటిదేనన్న భావన కలిగిందని, దీర్ఘకాలంగా కోర్టుల్లో మూలుగుతున్న కేసులను పరిష్కరించడంలోనే అసలైన సవాలు దాగుందన్న విషయం అవగతమైందని పేర్కొన్నారు. -
లోక్ అదాలత్‌లో 1,946 కేసుల పరిష్కారం
* కేసుల పరిష్కారంలో మూడోసారి రాష్ట్రంలో ప్రథమ స్థానం * న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి లక్ష్మీనరసింహారెడ్డి గుంటూరు లీగల్: జిల్లా న్యాయసేవాధికార సంస్థ శనివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో అత్యధిక కేసులు పరిష్కరించి రాష్ట్రంలో వరసగా మూడోసారి ప్రథమ స్థానంలో నిలిచింది. జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు నిర్వహించిన అదాలత్‌లో జిల్లా వ్యాప్తంగా 1,946 కేసులు పరిష్కరించినట్లు న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి జి.లక్ష్మీనరసింహారెడ్డి చెప్పారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.సుమలత ఆధ్వర్యలో నిర్వహించిన అదాలత్‌లో 53 సివిల్ కేసులు, 368 క్రిమినల్ కేసులు, 31 వివాహ సంబంధమైనవి, 8 మోటారు వాహన ప్రమాద కేసులు, 8 లేబర్ కోర్టు కే సులు, 176 విద్యుత్ కేసులు, 1234 ఎస్టీసీలు, 50 బీఎస్ఎన్ఎల్ కేసులు, 18 ఇతర ప్రీలిటిగేషన్లు పరిష్కారమయ్యాయి. రూ.2,82,91,514 పరిహారంగా మంజూరు చేశారు. -
రాజీ మార్గంతో శాశ్వత పరిష్కారం
జిల్లా ప్రధాన న్యాయమూర్తి మౌలానా జునైద్ అహ్మద్ నెల్లూరు(లీగల్) : కక్షిదారులు కేసులను రాజీ చేసుకోవడం ద్వారా శాశ్వత పరిష్కారం జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ మౌలానా జునైద్ అహ్మద్ పేర్కొన్నారు. శనివారం జిలా ్లకోర్టు ప్రాంగణంలోని న్యాయసేవాసదన్ భవనంలో జాతీయ లోక్‌అదాలత్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసుల సత్వర పరిష్కారానికి లోక్‌అదాలత్ దోహదపడుతుందని, కక్షిదారులకు సమయంతో ఖర్చు తగ్గుతుందన్నారు. 926 కేసుల పరిష్కారం జాతీయ లోక్‌అదాలత్ సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణలో 7 బెంచీలను ఏర్పాటు చేశారు. అదనపు జిల్లా జడ్జిలు పాపిరెడ్డి, శ్రీరామచంద్రమూర్తి, న్యాయసేవాధికారసంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సత్యవాణి, మొదటి అదనపు సీనియర్ సివిల్‌జడ్జి భూపాల్‌రెడ్డి, జూనియర్ సివిల్ జడ్జిలు శోభారాణి, కేశవ, వాసుదేవన్‌లు ప్రిసైడింగ్ అధికారులుగా వ్యవహరించి 926 కేసులను పరిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ కోర్టుల్లో నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌లో 490 కేసులను పరిష్కరించారు. మోటారు ప్రమాద కేసులలోని పిటీషనర్లుకు పరిహారంగా రూ.2,5,62,715లు చెల్లించారు. ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి శ్యామలాదేవి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి సుబ్బారావు, జూనియర్ సివిల్ జడ్జిలు హేమలత, పద్మ, అరుణశ్రీ, పద్మశ్రీ, బ్యాంక్అధికారులు పాల్గొన్నారు. -
లోక్ అదాలత్‌లతో కేసుల నుంచి విముక్తి
శ్రీకాకుళం సిటీ : లోక్ అదాలత్‌ను వినియోగించుకుని కేసుల నుంచి ఉపశమనం పొందాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి.నిర్మలాగీతాంబ అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లోక్ అదాలత్‌ల నిర్వహణలో భాగంగా జిల్లాలో మొత్తం 15 బెంచ్‌లను ఏర్పాటు చేశామన్నారు. అందులో నాలుగు బెంచ్‌లు జిల్లా కోర్టులో ఏర్పాటు చేశామని చెప్పారు. లోక్ అదాలత్‌లలో ఇచ్చిన తీర్పు సివిల్ డిక్రీలతో సమానమన్నారు. దీనిని ఎవరైనా అమలుచేయకపోతే జిల్లా కోర్టు దృష్టికి తీసుకురావచ్చని చెప్పారు. లోక్ అదాలత్లకు ప్రి లిటిగేషన్ కేసులను కూడా తీసుకురావచ్చన్నారు. ముందుగా జిల్లా న్యాయసేవాసాదికార సంస్థను సంప్రదిస్తే అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తారని తెలిపారు. లక్షలోపు ఆదాయం వారికి ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని చెప్పారు. ప్రభుత్వ పథకాల అమల్లో సమస్యలు ఉన్నా, సక్రమంగా అందకపోయినా, విద్య, రియల్ ఎస్టేట్ తదితర సమస్యలు ఉన్నా న్యాయసేవాసాధికార సంస్థ దృష్టికి తేవచ్చని సూచించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గంగు కృష్ణారావు మాట్లాడుతూ లోక్ అదాలత్‌లో రాజీమార్గం ద్వారా కక్షిదారుల మధ్య విభేదాలు తొలగిపోతాయన్నారు. జిల్లా న్యాయసేవాధికారిత సంస్థ కార్యదర్శి ఎ.మేరీ గ్రేస్‌కుమారి మాట్లాడుతూ లోక్ అదాలత్‌కు విశేషమైన స్పందన వచ్చిందన్నారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి బి.గౌతం ప్రసాద్, ఫ్యామిలీ కోర్టు జడ్జి ఎన్.సుధామణి, ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి, నాలుగో అదనపు జడ్జి వి.గోపాలకృష్ణారావు, శాశ్వత లోక్ అదాలత్ అధ్యక్షుడు షేక్ ఇంతియాజ్ అహ్మద్, అదనపు సీనియర్ సివిల్ జడ్జి పి.రాజేంద్రప్రసాద్, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎన్.పద్మావతి, ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి వై.శ్రీనివాసరావు, మొబైల్ కోర్టు న్యాయమూర్తి పి.సాయిసుద, న్యాయవాదులు íపి.ఇందిరాప్రసాద్, పి.ఉషాదేవి, డి.సరళాకుమారి, భూ సేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు జె.సీతారామారావు, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మామిడి క్రాంతి, సామాజిక సేవాప్రతినిధులు బి.వి.రమణశాస్త్రి పాల్గొన్నారు. -
సత్వర న్యాయమే లోక్ అదాలత్ ధ్యేయం
– జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి కర్నూలు(లీగల్) : కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లోక్ అదాలత్ ధ్యేయమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.అనుపమ చక్రవర్తి అన్నారు. శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.లోక్ అదాలత్ ద్వారా సమస్యలు పరిష్కారమైతే కక్షిదారులకు సమయం, ధనం ఆదా అయినట్లేనన్నారు. కేసుల పరిష్కారంలో రాష్ట్ర వ్యాప్తంగా కర్నూలు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందని, ఇక్కడి న్యాయవాదులు, పోలీసు శాఖల సహకారం బాగుందని తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్‌లో అధ్యక్షులు కె.ఓంకార్, జిల్లా అదనపు న్యాయమూర్తులు ఎస్.ప్రేమావతి, టి.రఘురాం, వి.వి.శేషు బాబు, ఏసీబీ కోర్టు న్యాయమూర్తి కె.సుధాకర్, సబ్ జడ్జి సి.కె.గాయత్రిదేవి, లోక్ అదాలత్ కార్యదర్శి ఎం.ఎ.సోమశేఖర్, జూనియర్ సివిల్ జడ్జిలు కె.పద్మిని, ఎం.బాబు, పి.రాజు, కె.స్వప్నరాణి, సీనియర్ న్యాయవాదులు నాగలక్ష్మిదేవి, శివసుదర్శన్, కోటేశ్వరరెడ్డి, కక్షిదారులు పాల్గొన్నారు. 1,707 కేసులు పరిష్కారం... జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌తో 1,707 కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.అనుపమ చక్రవర్తి, కార్యదర్శి ఎం.ఎ.సోమశేఖర్ తెలిపారు. ఒకవైపు బంద్ జరుగుతున్న అత్యధిక కేసులు పరిష్కారం కావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. -
జాతీయ లోక్ అదాలత్‌లో 2,046 కే సుల పరిష్కారం
వరంగల్ లీగల్ : జాతీయ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శనివారం జిల్లావ్యాప్తంగా లోక్ అదాలత్ నిర్వహించారు. ప్రతీ నెల రెండో శనివారం నిర్వహించే లోక్‌అదాలత్‌లో భాగంగా జిల్లాలోని కోర్టుల్లో 17 బెంచీలు ఏర్పాటుచేయగా వివిధ రకాల 2,046 కేసులు పరిష్కారమయ్యాయి. జిల్లా కోర్టు, మహబూబాబాద్ కోర్టుల్లో 23 సివిల్ కేసులు పరిష్కారం కాగా, జిల్లావ్యాప్తంగా అన్ని కోర్టుల్లో కలిపి 173 క్రిమినల్ కేసులు పరిష్కరించారు. ఇంకా 1,740 విద్యుత్ సంబంధిత కేసులు రాజీ మార్గంలో పరిష్కరించగా, ప్రమాద బాధితులకు నష్టపరిహారం చెల్లింపునకు సంబంధించి 23 కేసుల్లో బాధితులకు రూ.54.36 లక్షలు చెల్లించేందుకు వివిధ ఇన్సూరెన్స్ కంపెనీలు అంగీకరించాయి. లోక్ ఆదాలత్‌లో జిల్లా ప్రధాన జడ్జి, జిల్లా న్యాయాధికార సంస్థ చైర్మన్ ఎం.లక్ష్మణ్, మొ దటి అదనపు జిల్లా జడ్జి కే.బీ.నర్సింహాలు, ఏడో అదనపు జిల్లా జడ్జి సాల్మన్‌రాజ్, సీనియర్ సివిల్ జడ్జి వరప్రసాద్, న్యాయాధికార సేవ సంస్థ కార్యదర్శి జడ్జి నీలిమతో పాటు ఇతర న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యా యవాదులు పాల్గొన్నారు. -
సత్వర న్యాయమే లోక్ అదాలత్ లక్ష్యం
జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ నెల్లూరు(లీగల్): ప్రజలకు సత్వర సమన్యాయం అందించడమే జాతీయ లోక్‌అదాలత్ లక్ష్యమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికారసంస్థ చైర్మన్ మౌలానా జునైద్ అహ్మద్ అన్నారు. జాతీయ, రాష్ట్ర న్యాయసేవాధికారసంస్థల ఉత్తర్వుల మేరకు శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవాసదన్ భవనంలో జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ విస్తృతంగా న్యాయసేవలు అందించడంతోపాటు తక్షణ పరిష్కారం లోక్‌అదాలత్‌లో జరుగుతుందని తెలిపారు. 85 కేసుల పరిష్కారం.. జాతీయ లోక్‌అదాలత్ సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణంలో 5 బెంచీలను ఏర్పాటు చేశారు. అదనపు జిల్లా జడ్జిలు పాపిరెడ్డి, శ్రీరామచంద్రమూర్తి, న్యాయసేవాధికారసంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సత్యవాణి, జూనియర్ సివిల్ జడ్జిలు పద్మ, హేమలత, ప్రిసైడింగ్ అధికారులుగా వ్యవహరించి 85 కేసులను పరిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ కోర్టులలో నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌లో 300 కేసులను పరిష్కరించి మోటారు ప్రమాద కేసులలోని పిటీషనర్లుకు పరిహారంగా రూ.1,86,31,408 చెల్లించారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి శ్యామలాదేవి, మేజిస్ట్రేట్లు శోభారాణి, వాసుదేవన్, అరుణశ్రీ, జూనియర్ సివిల్ జడ్జి కేశవ్, బ్యాంక్, అధికారులు, న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
పెండింగ్ కేసుల పరిష్కారమే లోక్ అదాలత్ లక్ష్యం
బద్వేలు అర్బన్: దీర్ఘ కాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసులను ఇరువురి సమ్మతంతో పరిష్కరించడమే లోక్ అదాలత్ లక్ష్యమని జూనియర్ సివిల్ జడ్జి ఆర్ఎం.శుభవల్లి అన్నారు. శనివారం స్థానిక జూనియర్ సివిల్ కోర్టులో నిర్వహించిన మెగా లోక్ అదాలత్‌లో ఆమె మాట్లాడుతూ ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి సమయం వృధా చేసుకోకుండా కేసులు పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకున్నప్పుడే మానవ జీవితానికి సార్థకత ఉంటుందని తెలిపారు. లోక్ అదాలత్‌లో 15 క్రిమినల్ కేసులు పరిష్కరించినట్లు కోర్టు వర్గాలు తెలిపాయి. కార్యక్రమంలో ఏజీపీ డీవీఎస్ఆర్ క్రిష్ణ,బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డిఎ.కుమార్, ఈ.చంద్ర ఓబుల్‌రెడ్డి, సీనియర్ న్యాయవాదులు బ్రహ్మారెడ్డి , కేఓబీ ధన్యరాజ్, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ న్యాయవాది వాసుదేవరావు, న్యాయవాదులు రమణారెడ్డి, లోక్ అదాలత్ బెంచ్‌మెంబర్లు నాగభూషణమ్మ, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
లోక్‌అదాలత్‌తో కేసుల సత్వర పరిష్కారం
జిల్లా జడ్జి నాగమారుతీశర్మ సెంటినరీకాలనీ : లోక్‌అదాలత్ ద్వారా వివిధ కేసులకు పరిష్కారం లభిస్తుందని జిల్లా జడ్జి నాగమారుతీశర్మ అన్నారు. రాజ్యాంగం, చట్టాల ప్రకారం ఆస్తులపై వ్యక్తులకు హక్కు ఉన్నా బహుళజాతి ప్రయోజనాల దృష్ట్యా వాటిని స్వాధీనం చేసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుందని వెల్లడించారు. శనివారం సెంటినరీకాలనీలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల ఆడిటోరియంలో న్యాయ విజ్ఞాన సదస్సు, బుధవారంపేట గ్రామంలో భూసేకరణపై అభిప్రాయ సేకరణ సభ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జడ్జి మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం ఆస్తిపై యజమానికి సర్వాధికారాలు ఉన్నా.. బహుళజాతి ప్రయోజనాల దృష్ట్యా స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని, అరుుతే పరిహారం అడగడంలో మాత్రం స్వేచ్ఛ ఉంటుందని వెల్లడించారు. పరిహారం చెల్లింపులో అన్యాయం జరుగుతుందని బావిస్తే చట్ట పరిధిలో వివిధరూపాల్లో తన భావాన్ని వ్యక్తీకరించవచ్చన్నారు. కోర్టులకు వెళితే సమయం వృథాతోపాటు ఆశించిన లాభం కూడా కలగపోవచ్చని, పైగా ఆర్థికంగా నష్టపోయే ప్రమాదముందని పేర్కొన్నారు. లీగల్ సర్వీసెస్ అథారిటీ తెలంగాణ మెంబర్ సెక్రటరీ ఏ.వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ మూడో వ్యక్తితో సంబంధం లేకుండా.. ఇరువురి మధ్య వారధిగా ఉండి సమస్యను పరిష్కరించడమే లోక్ అదాలత్ లక్ష్యమన్నారు. పరిహారం సక్రమంగా నిర్ణరుుంచాలి సదస్సులో సర్పంచ్, జెడ్పీటీసీ, నిర్వాసితులు తమ అభిప్రాయాలను వివరించారు. సింగరేణి యాజమాన్యం తమ భూములు తీసుకునే క్రమంలో చుట్టుపక్కల గ్రామాల భూముల ధరలను పరిగణనలోకి తీసుకోవాలని కోరా రు. వ్యవసాయ భూములు తీసుకుంటే జీవనాధారం కోల్పోతామని, సింగరేణి స్పందించి ఉద్యోగావకాశాలు కల్పించాలని సూచించారు. బోర్లు, బావులు, పైపులైన్లను పరిగణనలోకి తీసుకుని పరిహారం నిర్ణరుుంచాలన్నారు. కార్యక్రమంలో మంథని జూనియర్ సివిల్ జడ్జి ఏ. కుమారస్వామి, స్పెషల్ డెప్యుటీ కలెక్టర్ ఎన్.మధుసూదన్‌రావు, అడిషనల్ జీఎం (లా) తిరుమల్‌రావు, సీజీఎం ఎస్టేట్స్ అంటోనిరాజా, ఆర్జీ-3, ఏపీఏ జీఎంలు ఎంఎస్.వెంకట్రామయ్య, ఎస్.చంద్రశేఖర్, టూటౌన్ సీఐ దేవారెడ్డి, కమాన్‌పూర్ ఎస్సై ప్రదీప్‌కుమార్, ముత్తారం జెడ్పీటీసీ చొప్పరి సదానందం, సర్పంచ్ రవీందర్, రైతులు పాల్గొన్నారు. -
విడాకుల కేసులో బాధితురాలికి రూ.15 లక్షల భరణం
మదనపల్లి క్రైం : ఇద్దరూ ఇష్టపడి విడాకులు తీసుకోవడానికి లోక్ అదాలత్‌కు వచ్చిన కేసులో న్యాయమూర్తులు ఆనంద్, జయరాజ్ యువతికి రూ.15 లక్షల భరణం ఇప్పించారు. గుర్రకొండ మండలం చెర్లోపల్లెకు చెందిన వరపన సిద్దారెడ్డి కుమారుడు రవీంద్ర(25)కు అదే మండలం వెలిగల్లుకు చెందిన హరిత(20)తో ఐదేళ్ల క్రితం పెద్దలు పెళ్లి చేశారు. వీరి కాపురం కొంతకాలం సజావుగా సాగింది. ఇద్దరి మధ్య ఒద్దికలేకపోవడంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ శనివారం లోక్‌అదాలత్‌ను ఆశ్రయించారు. విచారణ అనంతరం న్యాయమూర్తులు దంపతుల సమ్మతి మేరకు విడాకులు మంజూరు చేశారు. బాధితురాలు హరితకు పరిహారంగా భరణం, కట్నం, బంగారు ఆభరణాలు, పెళ్లి ఖర్చులు అన్నీ కలిపి రూ.15 లక్షలు ఇప్పించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు మోహనరావు, ప్రదీప్‌కుమార్, ఏపీపీలు మాలతి, ఆవుల శివరాంరెడ్డి, న్యాయవాదులు అలకం మనోహర్ నాయుడు, చైతన్య, యసానుల్లా, ఆనంద్‌రెడ్డి, కోర్టు సిబ్బంది నాగమణి, మహిత తదితరులు పాల్గొన్నారు. -
లోక్ అదాలత్‌లో 1.20 కోట్ల కేసు పరిష్కారం
మదనపల్లె రూరల్: లోక్ అదాలత్‌లో రూ. 1.20 కోట్ల భూతగాదా కేసు పరిష్కారమైంది. మదనపల్లె మండల న్యాయసేవ అధికార సంస్థ చైర్మన్, రెండో అదనపు జిల్లా జడ్జి ఎస్.ఎస్.ఎస్.జయరాజ్ అధ్యక్షతన స్థానిక కోర్టు ఆవరణలో జరిగిన లోక్‌అదాలత్‌లో జిల్లా జడ్జి ఆనంద్ ఈ కేసులో ఇరు వర్గాలకు రాజీ కుదిర్చారు. వివాదమిదీ.. మదనపల్లెకు చెందిన గార్ల రాజేంద్ర ప్రసాద్ వాల్మీకిపురానికి చెందిన తబ్జూలోళ్ల స్వర్ణకుమారి వద్ద నాలుగేళ్ల క్రితం రూ. కోటి 10 లక్షలు అప్పు తీసుకున్నారు. ఇందుకు తనఖాగా రూ. కోట్ల విలువ చేసే ఐదు కుంటల స్థలాన్ని రాసిచ్చారు. ఏడాది లోపు అప్పు వడ్డీతో సహా చెల్లిస్తానని చెప్పారు. దాన్ని తీర్చలేదు. ఈ విషయమై ఏడాది క్రితం స్వర్ణకుమారి లోక్‌అదాలత్‌ను ఆశ్రయించడంతో ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తులు వారి మధ్య రాజీ కుదిర్చారు. -
ఎక్సైజ్ కోర్టు జడ్జి సస్పెన్షన్
వరంగల్ లీగల్ : లోక్ అదాలత్‌లలో పరిష్కారమైన కేసుల్లో చెల్లించిన జరిమానా డబ్బులను రికార్డుల్లో పేర్కొనకుండా, కోర్టులో జమ చేయకుండా దుర్వినియోగానికి పాల్పడిన ఆరోపణలపై వరంగల్ ఎక్సైజ్ కోర్టు జడ్జి ఎ.ఆర్.విలాసితను సస్పెండ్ చేస్తూ గురువారం హైకోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడ్డారుు. గత సంవత్సరం డిసెంబర్ 12న, ఈ సంవత్సరం ఫిబ్రవరి 13న, మార్చి 12న జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లలో ఎక్సైజ్ కోర్టు పరిధిలో రాజీకి అవకాశం ఉన్న 55 కేసులు పరిష్కారమయ్యూరుు. వీటిలో జరిమానా రూపంలో చెల్లించిన డబ్బులు కోర్టులో డిపాజిట్ చేయకుండా, రికార్డులో సైతం పేర్కొనలేదు. తప్పుడు చాలానా లు, స్టాంపులు సృష్టించి ఆర్థిక దుర్వినియోగానికి పాల్పడిన ఆరోపణలపై సస్పెండ్ చేశారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆరవ ము న్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి రఘునాథ్‌రెడ్డిని ఎక్సైజ్ కోర్టుకు ఇన్చార్జి జడ్జిగా అదనపు బా ధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. -
లోక్ అదాలత్‌తో కేసుల సత్వర పరిష్కారం
జిల్లా జడ్జి ఉదయగౌరి 154 కేసుల్లో రాజీ ఆదిలాబాద్ క్రైం : లోక్ అదాలత్ ద్వారా కక్షిదారుల కేసులు సత్వరమే పరిష్కారమవుతాయని జిల్లా జడ్జి ఉదయగౌరి పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహించారు. ఇరువురు కక్షిదారుల మధ్య సామరస్యపూర్వకంగా రాజీ కుదిర్చి సమస్యలను పరిష్కరించారు. మొత్తం జిల్లావ్యాప్తంగా 154 కేసుల్లో రాజీ కుదిరింది. అందులో 129 క్రిమినల్ కేసులు, 23 సివిల్ కేసులు, మూడు ప్రిలిటిగేషన్ కేసులు పరిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ, కక్షిదారులు కోర్టుల చుట్టూ నెలల తరబడి తిరగకుండా లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందులో కక్షిదారులకు ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఫ్యామిలీ కోర్టు జడ్జి అరుణసారిక, మేజిస్ట్రేట్లు మేరిసార దానమ్మ, భారతి, రాజ్‌కుమార్, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి డాక్టర్ జ్ఞానేశ్వర్, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. -
రాజీయే రాచమార్గం
లోక్‌అదాలత్‌లతో బాధితులకు సత్వర న్యాయం మదనపల్లె రూరల్ : రాజీయే రాజ మార్గమని పెద్దలు చెప్పారు. ఇప్పుడు చట్టాలు అందుకు అనుకగుణంగానే ఉన్నా యి. బాధితులను కోర్టుల చుట్టూ తిప్పడం కంటే రాజీతో కేసులు పరిష్కారం చేయాలని నూతన విధానాన్ని అమలుచేస్తున్నారు. ఇందులో భాగంగా లోక్ అదాలత్‌లు నిర్వహిస్తున్నారు. తద్వారా ఇరువర్గాలను రాజీ కుదిర్చి అప్పటికప్పుడే కేసులు పరిష్కరిస్తున్నారు. అంతేకాకుండా బాధితులకు తక్షణ సాయంగా పరిహారం అందజేస్తూ న్యాయస్థానాలు మరో అడుగు ముందుకేస్తున్నాయి. ఇక్కడ పరిష్కారమైన కేసులపై తిరిగి పైకోర్టులను ఆశ్రయించిన దాఖలాలు లేకపోవడంతో లోక్ అదాలత్‌లు విజయవంతమైనట్టే చెప్పవచ్చని న్యాయ వాదులు చెబుతున్నారు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన వందల కేసులకు పరిష్కారమార్గం లభిస్తోంది. జిల్లాలో గత ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు జిల్లాలోని 51 కోర్టుల్లో జాతీయ, మెగా లోక్ అదాలత్‌లు 8,092 నిర్వహించగా అందులో 5,075 కేసులు పరిష్కారమయ్యాయి. ఈ కేసుల్లో బాధితులకు పరిహారంగా రూ.50 కోట్లను అందజేసి రికార్డులు బద్దలు కొట్టారు. అలాంటి వాటిలో ప్రధానంగా క్రిమినల్ కేసులు 3,270, సివిల్ కేసులు 670, ఎన్ఓపీలు169, పీఎల్‌పీలు 853, ఎక్సైజ్ 113 కేసులు పరిష్కారమయ్యాయని అధికారులు తెలిపారు. -
'రాజీతోనే ప్రశాంత జీవితం'
మెదక్ : రాజీతోనే ప్రశాంత జీవితం గడుపవచ్చునని మెదక్ జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ లలిత శివజ్యోతి పేర్కొన్నారు. శనివారం మెదక్ పట్టణంలోని కోర్టు ఆవరణలో జాతీయ స్థాయి లోక్ అదాలత్ నిర్వహించారు. పలు కేసులను ఆమె రాజీ మార్గం ద్వారా పరిష్కరించారు. ఈ సందర్భంగా జడ్జి శివజ్యోతి మాట్లాడుతూ.. చిన్న చిన్న తగాదాలు, గొడవలతో కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి విలువైన సమయం, డబ్బును వృధా చేసుకోద్దన్నారు. పెద్ద కేసులను రాజీచేయడం తగదని, చిన్నపాటి కేసుల్లో రాజీ మార్గమమే ఉత్తమమని ఆమె సూచించారు. జూనియర్ సివిల్ జడ్జి వెంకటేశం మాట్లాడుతూ... కక్షిదారులు చీటిమాటికి గొడవ పెట్టుకొని బంగారు భవిష్యత్ నాశనం చేసుకోకుండా రాజీపడటమే ఉత్తమమన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రాజారత్నం, పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుర్గోజి, లోక్ అదాలత్ సభ్యులు కరుణాకర్, శ్రీపతిరావు తదితరులు ఉన్నారు. -
క్రిమినల్ కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్
-
'ప్రజలంతా లోక్ అదాలత్‌ల గురించి తెలుసుకోవాలి'
ఢిల్లీ: ప్రజలంతా లోక్ అదాలత్‌ల వలన కలిగే ప్రయోజనాలు తెలుసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. న్యాయసేవల దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన న్యాయసేవా సదస్సులో మోదీ పాల్గొని ప్రసంగించారు. లోక్ అదాలత్‌ల ద్వారా సామాన్యులకు న్యాయం జరుగుతోందనీ, ఇవి అందిచే న్యాయసేవలను గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. ఇప్పటివరకు లోక్ అదాలత్ ద్వారా 8.5 లక్షల కేసులు పరిష్కారమయ్యాయని ఆయన వెల్లడించారు. కోర్టులకు రావడానికి ఆర్థీక స్థోమత లేని వారికి లోక్ అదాలత్‌లు ఎంతగానో ఉపయోగపడుతాయని తెలిపారు. ప్రజలందరికీ అభివృద్ధితో పాటు న్యాయసేవలు కూడా అందాల్సిన అవసరముందని తెలిపిన ప్రధాని న్యాయ విశ్వవిద్యాలయాలయాలు లోక్ అదాలత్లకు సంబంధించిన ప్రత్యేక ప్రాజెక్టులను తమ విద్యార్ధులకు ఇవ్వాలని సూచించారు. -
కేసుల సత్వర పరిష్కారానికే లోక్ అదాలత్
- సీనియర్ సివిల్ జడ్జీలు రాధాకృష్ణమూర్తి, భవానీప్రసాద్ - నిర్మల్, అసిఫాబాద్‌లో పలు కేసుల పరిష్కారం నిర్మల్ అర్బన్/ఆసిఫాబాద్ : ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికే లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు నిర్మల్, ఆసిఫాబాద్ సీనియర్ సివిల్ జడ్జీలు రాధాకృష్ణమూర్తి, భవానీప్రసాద్ తెలిపారు. నిర్మల్, ఆసిఫాబాద్ కోర్టు ల్లో శనివారం వేర్వేరుగా లోక్ అదాలత్ నిర్వహించగా వారు మాట్లాడారు. చిన్నచిన్న గొడవలతో కేసుల్లో చిక్కుకుని ఇబ్బంది పడొద్దని హితవు పలికారు. ప్రతీ నెల రెండో శనివారం లోక్‌అదాలత్ జరుగుతుందని, పెండింగ్ కేసులు ఉన్న వారు ఇందులో పరిష్కరించుకోవాలని సూచించారు. అలాగే, మండల న్యాయ సే వా సంస్థ ద్వారా అందించే ఉచిత న్యాయ సహాయా న్ని నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇంకా కేసుల పరిష్కారం అనంతరం ఇరువర్గాల వా రు సత్ప్రవర్తనతో మెలగాలన్నారు. ఈ సందర్భంగా కక్షిదారులు, ఫిర్యాదుదారులతో మాట్లాడిన న్యాయమూర్తులు పలు కేసులను పరిష్కరించారు. నిర్మల్‌లో జరిగిన కార్యక్రమంలో అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ చంద్రశేఖర్‌రావు, డీఎస్పీ మనోహర్‌రెడ్డి, టౌన్, రూరల్ సీఐలు జీవన్‌రెడ్డి, పురుషోత్తమాచారి, ఏపీపీవోలు శ్యాంసుందర్‌రెడ్డి, నాగభూషణం, అడ్వకేట్ జేఏసీ నాయకులు లింగయ్య పాల్గొన్నారు. కాగా, ఆసిఫాబాద్ లోక్ అదాలత్‌లో ఎనిమిది కేసుల తో పాటు కెరమెరి, వాంకడి, రెబ్బెన మండలాలకు పలు కేసులు పరిష్కరించారు. కార్యక్రమంలో సీఐ సతీష్‌కుమార్, న్యాయవాదులు ఎం.సురేష్, టి.సురేష్, నికోడె రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
‘కోర్టుల చుట్టూ తిరగాలని అనుకోవడం లేదు’
హైదరాబాద్: కోర్టుల చుట్టూ ఏళ్ల తరబడి తిరగాలని కక్షిదారులు కోరుకోవడం లేదని, వెంటనే పరిష్కారం కోరుకుంటున్నారని ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏ.రామలింగేశ్వర్రావు తెలిపారు. సిటీ సివిల్ కోర్టు, రంగారెడ్డి, మెట్రోపాలిటన్ న్యాయసేవాధికార సంస్థల తరపున ప్యానెల్ న్యాయవాదులకు నిర్వహిస్తున్న శిక్షణ శిబిరం ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగించారు. లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కారం: శనివారం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన లోక్‌అదాలత్‌లో 5,627 కేసులు పరిష్కారమయ్యాయి. ఏపీలో 8,308 కేసులు పరిష్కరించి 11.63 కోట్లు పరిహారంగా ప్రకటించారు. ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి. భోసలే, తెలంగాణ న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిగ్యూటివ్ చైర్మన్ ఆర్.సుభాష్‌రెడ్డిల మార్గదర్శకత్వంలో లోక్‌అదాలత్‌లు జరి గాయి. సిటీ సివిల్‌కోర్టు చీఫ్ జడ్జి ఎన్.బాలయోగి నేతృత్వంలో జరిగిన లోక్ అదాలత్‌లో 436 కేసులు పరిష్కరించి రూ.2.44 కోట్లు పరిహారాన్ని ప్రకటించారు. -
ప్రిన్సిపాల్ బాబూరావుపై ఎట్టకేలకు ఫిర్యాదు
-
విద్యార్థులు అడిగితేనే డ్యాన్స్ చేశా
-
'విద్యార్థులు అడిగితేనే డ్యాన్స్ చేశా'
గుంటూరు: విద్యార్థులు అడిగితేనే డ్యాన్స్ చేశానని ఆచార్య నాగార్జునా యూనివర్శిటీలోని ఆర్కిటెక్చరు కాలేజీ ప్రిన్సిపాల్ జి.బాబూరావు స్పష్టం చేశారు. అందులో తన తప్పేం లేదన్నారు. ఆర్కిటెక్చరు విద్యార్థి రిషితేశ్వరీ ఆత్మహత్యపై శుక్రవారం గుంటూరులో నిర్వహించిన లోక్ అదాలత్ ఎదుట బాబూరావు హాజరయ్యారు. అనంతరం విలేకర్లతో బాబూరావు మాట్లాడారు. కాలేజీల్లో ర్యాగింగ్ జరుగుతున్నట్లు తనకు సమాచారం లేదన్నారు. అయితే రిషితేశ్వరి తండ్రి తనను కలవనే లేదని చెప్పారు. ఓ సారి మాత్రం ఆయన హాస్టల్‌కు వచ్చారని తెలిసిందన్నారు. యూనివర్శిటీలో జరిగిన ఫంక్షన్ లో విద్యార్థులతో కలసి ప్రిన్సిపాల్ బాబురావు డ్యాన్స్ చేసిన వీడియోలు మీడియాలో హల్ చల్ చేశాయి. అంతేకాకుండా కాలేజీతోపాటు హాస్టల్ లో జూనియర్స్ ను సీనియర్స్ ర్యాగింగ్ చేసిన అంతగా పట్టించుకునే వారు కాదని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. -
9 లక్షల కేసులు పరిష్కారం
బండీ: న్యాయం మీ ఇంటి ముందుకు(జస్టిస్ ఎట్ యువర్ డోర్ స్టెప్) ప్రచారంతో రాజస్థాన్ ప్రభుత్వం నిర్వహించిన లోక్ అదాలత్ లు మంచి ఫలితాన్ని ఇచ్చాయి. ఇప్పటివరకు లోక్ అదాలత్ ల ద్వారా గ్రామాల్లో భూమి వివాదాలకు సంబంధించిన 9 లక్షల కేసులు పరిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన 4 వేల లోక్ అదాలత్ లతో ఈ కేసులు పరిష్కరించినట్టు ప్రభుత్వం వెల్లడించింది. మే 18 నుంచి ప్రారంభమైన లోక్ అదాలత్ లు జూలై 15 వరకు కొనసాగనున్నాయి. పంచాయతీ కారాలయాల్లో లోక్ అదాలత్ లు నిర్వహిస్తున్నారు. కౌన్సెలింగ్, రాజీ కుదర్చడం ద్వారా కేసులు పరిష్కరిస్తున్నారు. బండీ జిల్లాలో 996 రెవెన్యూ కేసులు పరిష్కారమయ్యాయని కలెక్టర్ నెహా గిరి తెలిపారు. -
న్యాయ వ్యవస్థపై ప్రజలకు అపార నమ్మకం
కర్నూలు (లీగల్) : ప్రజలకు న్యాయ వ్యవస్థపై రోజు రోజుకు అపార నమ్మకం కలుగుతుండటంతో న్యాయస్థానాలను ఆశ్రయించే వారి సంఖ్య పెరుగుతోందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆర్.మురళి అన్నారు. శనివారం జిల్లా న్యాయ సేవా సదన్‌లో నిర్వహించిన జాతీయ ప్రజా న్యాయపీఠం (లోక్‌అదాలత్)ను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించే సదుద్దేశంతో సుప్రీంకోర్టు ప్రజా న్యాయపీఠం (లోక్‌అదాలత్) చట్టం తెచ్చి కేసుల పరిష్కారం చేస్తుందన్నారు. జిల్లాలో లోక్ అదాలత్‌ల పట్ల ప్రజలకు చైతన్య పరిచేందుకు గ్రామాల్లో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ► జిల్లా ఆరవ అదనపు జడ్జి వి.వి.శేషుబాబు మాట్లాడుతూ ప్రజాన్యాయ పీఠంలో పరిష్కారమైన కేసులకు అప్పిల్స్ ఉండవని, ఇక్కడ జరిగే పరిష్కారమే శాశ్వత పరిష్కారమన్నారు. న్యాయస్థానాల్లో ఓడిన వారు అక్కడే ఏడిస్తే.. గెలిచిన వారు ఇంటికెళ్లి ఏడుస్తారనేది పెద్దలు చెబుతుంటారన్నారు. కక్షిదారులు గెలుపు, ఓటమి సమస్య లేకుండా సామరస్యంగా పరిష్కారం చేసుకోవడమే లోక్ అదాలత్ ధ్యేయమన్నారు. ► జిల్లా ఎస్పీ రవికృష్ణ మాట్లాడుతూ దేశంలో ఎక్కువ పనిభారం ఉన్న వ్యవస్థ ఏదైనా ఉందంటే అది న్యాయ వ్యవస్థ అని, న్యాయ వ్యవస్థపై పనిభారం తగ్గించి, కేసుల పరిష్కారం చేస్తున్న న్యాయమూర్తులకు తాను సెల్యూట్ చేస్తున్నానన్నారు. ► కార్యక్రమంలో ఫ్యామిలీ కోర్టు జడ్జి ఎస్.ప్రేమావతి, సీనియర్ సివిల్ జడ్జిలు శివకుమార్, సి.కె.గాయత్రిదేవి, లోక్ అదాలత్ జడ్జి సోమశేఖర్, జూనియర్ సివిల్ జడ్జీలు రామచంద్రుడు, పి.రాజు, ఎం.బాబు, పద్మిని, సీనియర్ న్యాయవాదులు ఎ.చంద్రశేఖర్‌రావు, కోటేశ్వరరెడ్డి, పి.నిర్మల, ఆదినారాయణరెడ్డి, సీఐలు మొలకన్న, గౌతి, రామకృష్ణ, కక్షిదారులు, ఇన్సూరెన్స్ అధికారులు పాల్గొన్నారు. రాష్ర్టంలో జిల్లా టాప్ జిల్లా వ్యాప్తంగా శపివానం నిర్వహించిన లోక్ అదాలత్‌లో 2442 కేసులను పరిష్కరించారు. కర్నూలులో 1,269 కేసులు, ఆదోనిలో 131, ఆత్మకూరులో 61, బనగానపల్లెలో 23, నందికొట్కూరులో 3, నంద్యాలలో 474, పత్తికొండలో 112, ఆళ్లగడ్డలో 38, ఆలూరులో 57, డోన్‌లో 100, కోవెలకుంట్లలో 53, ఎమ్మిగనూరులో 117 కేసులు పరిష్కారమయ్యాయి. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాల్లో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. గత ఆరు మాసాలుగా నిర్వహిస్తున్న మెగా లోక్ అదాలత్‌లో వరుసగా 6వ సారి కేసుల పరిష్కారంలో జిల్లా అగ్రభాగాన నిలువగా, రెండో స్థానంలో గుంటూరు, మూడో స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లాలు నిలిచాయి. ► శనివారం నిర్వహించిన లోక్ అదాలత్‌లో దీర్ఘకాలంగా ఉన్న రోడ్డు ప్రమాద కేసులను పరిష్కరించాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాలో 168 రోడ్డు ప్రమాద కేసులు పరిష్కరించి బాధితులకు రూ.4,10,26,000 నష్టపరిహారం అందించినట్లు లోక్ అదాలత్ జడ్జి సోమశేఖర్ తెలిపారు. ఇందులో నంద్యాలలో 106, కర్నూలు 57, ఆదోని 5 కేసులు ఉన్నాయి. -
లోక్ అదాలత్‌లో 2,569 కేసుల పరిష్కారం
న్యాయవాదుల నిరసనల నడుమ జిల్లా కోర్టు ప్రాంగణంతో పాటు తాలూకా కోర్టుల్లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 2,569 కేసులు పరిష్కారమయ్యూయి. రాష్ర్టంలో జిల్లా మూడో స్థానంలో నిలిచింది. - వరంగల్ లీగల్ వరంగల్ లీగల్ : జిల్లా కోర్టు ప్రాంగణంతో పాటు తా లూకా కోర్టుల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. అయితే, హైకోర్టు సాధన కోసం ఉద్యమిస్తున్న న్యాయవాదులు లోక్ అదాలత్‌ను బ హిష్కరించి ధర్నాకు దిగగా.. వారి నిరసనల నడుమే జాతీయ లోక్ అదాలత్‌లో పెద్దసంఖ్యలో కేసులు పరి ష్కరించారు. ఈ మేరకు రాష్ర్టంలో కేసుల పరిష్కారంలో జిల్లా మూడో స్థానంలో నిలిచింది. సివిల్, క్రిమినల్ ప్రమాద బాధితుల నష్టపరిహారం చెల్లింపు, ప్రభుత్వ భూసేకరణలో భూములు కోల్పోయిన రైతుల నష్టపరిహారం చెల్లింపులు కేసులు పరిష్కరిం చారు. జిల్లావ్యాప్తంగా 35 సివిల్ కేసులు, 146 క్రిమినల్, 2388 ప్రిలిటిగేషన్ కేసులు కలిపి మొత్తం 2,569 కేసులను పరిష్కరించారు. ఇక ప్రమాదాలకు సంబంధించి 17 కేసుల్లో బాధితులకు రూ.13,39,130, నాలుగు కేసుల్లో రైతులకు రూ.1, 81,135 భూసేకరణ కింద నష్టపరిహారంగా చెల్లించడానికి అంగీకరించారు. కాగా, జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ కోసం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆరు బెంచ్‌లు ఏర్పాటుచేయగా మొదటి అదనపు జిల్లా జ డ్జి కే.బీ.నర్సింహులు, రెండో అదనపు జిల్లా జడ్జి యార రేణుక, సీనియర్ సివిల్ జడ్జిలు డి.సరళాకుమారి, రవీంద్రశర్మ, ఎం.జాన్సన్, సీహెచ్.ఆశాలత, శారదాదేవి, కళ్యాణచక్రవర్తి, రాజేంద్రారెడ్డి, ఆర్.రఘునాథ్‌రెడ్డి, టి.అనిత, బి.చంద్రయ్య వివిధ బెంచ్‌లకు నేతృత్వం వహించారు. బహిష్కరణ, కోర్టు హాల్ ఎదుట ధర్నా జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయలోక్ అదాలత్‌ను న్యాయవాదులు బహిష్కరించారు. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ మేజిస్రేట్(పీడీఎం) కోర్టు ఎదుట న్యాయవాదులు ధర్నా చేశారు. అయితే, లోపల అదనపు జిల్లా జడ్జిలు నర్సింహులు, యార రే ణుక నేతృత్వంలో బెంచ్ కొనసాగుతుండగా.. బయ ట న్యాయవాదులు నినాదాలు చేస్తుండడంతో కొద్దిసేపటికి న్యాయమూర్తులు వెళ్లిపోయారు. చిల్లా రాజేంద్రప్రసాద్, లెక్కల జలేందర్‌రెడ్డి, ఇ.వేణుగొపాల్, డాగర రాములు, వి.లలితకుమారి, మడ్డి మంజుల, స్వప్న, సత్యరాజ్, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. -
విభజిస్తేనే ఆందోళన విరమిస్తాం
* హైకోర్టు విభజనకు పట్టుబడుతున్న న్యాయవాదుల సంఘాలు * విధులు బహిష్కరించి ఆందోళన.. స్తంభించిన కోర్టు కార్యకలాపాలు సాక్షి, హైదరాబాద్: హైకోర్టును విభజించాలని, ప్రత్యేక బార్ కౌన్సిల్‌ను ఏర్పాటుచేయాలని... అప్పటి వరకు న్యాయవ్యవస్థలో ఎలాంటి నియామకాలు చేపట్టరాదంటూ న్యాయవాదులు చేపట్టిన ఆందోళన తీవ్రమవుతోంది. ఇప్పటికే న్యాయవాదుల విధుల బహిష్కరణతో 20 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కోర్టు విధులు స్తంభించిపోయాయి. ఈ నెల 14న లోక్ అదాలత్‌ను న్యాయవాదులు అడ్డుకున్నారు. ఈ నెలాఖరు వరకు విధులు బహిష్కరించాలంటూ న్యాయవాదుల సంఘాలు నిర్ణయించాయి. హైకోర్టు విభజన జరిగే వరకూ ఆందోళన ఆపేది లేదని మరోవైపు ఆ సంఘాలు హెచ్చరిస్తుండడంతో ఆందోళన సద్దుమణిగేలా కన్పించడం లేదు. న్యాయవాదులు ఆందోళనకు న్యాయశాఖ ఉద్యోగులూ మద్దతు తెలుపుతున్నారు. హైకోర్టు విభజనలో జాప్యం జరిగితే తాము నిరవధిక సమ్మెకు దిగేందుకూ వెనుకాడమని వీరు ఇప్పటికే ప్రకటించారు. న్యాయవాదుల ఆందోళనలకు అన్ని రాజకీయ పార్టీలు. ప్రజాసంఘాలు మద్దతుగా నిలుస్తున్నాయి. హైకోర్టు విభజన జరిగే వరకూ నియామకాలు చేపట్టరాదని తెలంగాణ సమాజం డిమాండ్ చేస్తోంది. ఈ విషయంపై అఖిలపక్షం ప్రతినిధులు, బార్ కౌన్సిల్ సభ్యులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, గవర్నర్‌ను కలసి వినతిపత్రం సమర్పించారు. త్వరలో ప్రధానమంత్రిని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలసేందుకూ అఖిలపక్షం నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. -
ఐదేళ్లలో రూ. లక్ష కోట్లు
ప్రభుత్వ రంగ బ్యాంకులు రద్దు చేసిన మొండి బకాయిల విలువ ఇది... న్యూఢిల్లీ: గడచిన అయిదేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులు(పీఎస్బీ) ఏకంగా రూ. 1,06,170 కోట్ల మేర రుణాలను మొండి బకాయిల కింద రద్దు చేశాయి. పునర్వ్యవస్థీకరించిన రుణాల మొత్తం గడచిన మూడేళ్లలో రెట్టింపయ్యాయి. 2011-12లో రూ. 20,752 కోట్లుగా ఉన్న ఈ మొత్తం .. ఈ ఏడాది మార్చి నాటికి రూ. 44,447 కోట్ల స్థాయికి చేరింది. మొండి బకాయిలు పెరగడానికి ఆర్థిక వ్యవస్థ మందగమనం తదితర అంశాలు కారణమయ్యాయి. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా మంగళవారం రాజ్యసభకి ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఈ విషయాలు తెలిపారు. మరోవైపు, మార్చి 31 నాటి దాకా గణాంకాల ప్రకారం రూ. 25 లక్షలు పైగా బకాయిపడిన వారిలో 1,600 మందిని ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా ప్రకటించినట్లు ఆయన వివరించారు. సమస్యను ముందుగానే గుర్తించేందుకు, సత్వరం దిద్దుబాటు..రికవరీకి చర్యలు తీసుకునేందుకు రుణాల పునర్వ్యవస్థీకరణ వంటి విధానాలు, లోక్ అదాలత్ వంటి వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయని సిన్హా పేర్కొన్నారు. అటు పోంజీ తరహా మోసపూరిత స్కీముల నిర్వాహకులను కఠినంగా శిక్షించేందుకు వివిధ చర్యలు తీసుకుంటున్నట్లు సిన్హా తెలిపారు. సాధారణంగా మల్టీ లెవెల్ మార్కెటింగ్ (ఎంఎల్ఎం) లేదా ఉమ్మడి పెట్టుబడి పథకాలు(సీఐఎస్) రూపంలో ఇలాంటివి జరుగుతున్నట్లు ఆయన వివరించారు. ఇటీవలి కాలంలో 55 కంపెనీలు సీఐఎస్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గుర్తించిందని ఆయన తెలిపారు. ఇన్వెస్టర్ల సొమ్ము వాపసు చేశాక, స్కీములను నిలిపివే యాలని 19 కేసుల్లో సెబీ తుది తీర్పునిచ్చింది. -
మోసం చేసిన మహిళపై జాలి చూపిన నటుడు అలీ..
హైదరాబాద్: హాస్యనటుడు అలీ ఔదార్యాన్ని ప్రదర్శించారు. తనను లక్షల రూపాయల మేర మోసం చేసిన ఓ మహిళపై జాలి చూపారు. ప్రస్తుతం తినడానికి తిండి కూడా లేనిస్థితిలో వృద్దాప్యంలో ఉన్న ఆమెపై కేసును వెనక్కి తీసుకున్నారు. జాతీయ లోక్‌అదాలత్ సందర్భంగా శనివారం నాంపల్లి కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్‌లో పాల్గొని ఆ వృద్ధురాలిపై కేసు ఉపసంహరించుకున్నారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీకి చెందిన సాంబశివరావు, శకుంతల దంపతుల ఇంటిని 1998లో అలీ కొనుగోలు చేశారు. అయితే ఆ ఇంటిపై సాంబశివరావు దంపతులు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.90 లక్షల రుణం తీసుకున్నారు. ఈ సంగతి చెప్పకుండానే ఇంటిని విక్రయించారు. బ్యాంకు అధికారుల ద్వారా ఆలస్యంగా ఆ విషయాన్ని తెలుసుకున్న అలీ... 2006లో వారిద్దరిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటంతో చీటింగ్ కేసు నమోదైంది. ప్రస్తతం నాంపల్లి నాలుగో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో తుది విచారణ దశలో ఉంది. ఈ నేపథ్యంలో జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా న్యాయమూర్తి ఎస్.ఎస్.శ్రీదేవి... శకుంతల దయనీయ పరిస్థితిని అలీకి వివరించారు. దీంతో కేసును ఉపసంహరించుకునేందుకు ఆయన ముందుకొచ్చారు. లోక్ అదాలత్ లో నిందితుల నుంచి తమకు రావాల్సిన డబ్బు తీసుకొని కక్షిదారులు రాజీ అవుతుండగా..అలీ మాత్రం తనకు రావల్సిన డబ్బును వదులుకొని పెద్ద మనసుతో కేసును ఉపసంహరించుకున్నారు. ఈ విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించిన అలీని న్యాయమూర్తులు అభినందించారు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని మరికొందరు ముందుకొచ్చి కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. -
లోక్ అదాలత్ మెగా హిట్
కడప లీగల్: జిల్లాలో శనివారం నిర్వహించిన మెగా లోక్ అదాలత్ మెగా హిట్ అయిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాఘవరావు పేర్కొన్నారు. కోర్టు హాలులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మెగా లోక్ అదాలత్ ద్వారా 2988 కేసులు పరిష్కార మయ్యాయన్నారు. ఈ కేసులు పరిష్కారం కావడం ద్వారా కక్షిదారులకు 7కోట్ల 07 లక్షల 62 వేల 601 రూపాయలు నష్టపరిహారంగా వచ్చిందన్నారు. కేసుల పరిష్కారానికి కక్షిదారులు లోక్ అదాలత్‌కు స్వచ్ఛందంగా రావడంతో మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక సంఖ్యలో జిల్లా అంతటా కేసులు పరిష్కారమయ్యాయన్నారు. లోక్ అదాలత్ విజయవంతమయ్యేందుకు సహకరించిన జిల్లా కలెక్టర్ కేవీ రమణ, జిల్లా ఎస్పీ నవీన్ గులాఠీ, తోటి న్యాయమూర్తులు సూర్యనారాయణగౌడ్, లోక్ అదాలత్ న్యాయమూర్తి మాలతి, సీనియర్ సివిల్ జడ్జి రఘురాం, జూనియర్ సివిల్ జడ్జిలు దీన, శైలజ, లావణ్య, భారతి, అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు, ఇన్సూరెన్స్ కంపెనీ న్యాయవాదులకు, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు నాగరాజుకు, సభ్యులకు, లోక్ అదాలత్ సిబ్బందికి, న్యాయమూర్తులకు, సహాయకులుగాపని చేసిన న్యాయవాదులకు, వాలంటీర్లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. లోక్ అదాలత్ అన్ని రకాలుగా ప్రయోజనమే... కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ అన్ని విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ కేవీ రమణ అభిప్రాయపడ్డారు. శనివారం ఉదయం 10 గంటలకు జిల్లా కోర్టు ప్రాంగణంలోని లోక్ అదాలత్ భవనంలో నేషనల్ మెగా లోక్ అదాలత్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కేవీ రమణ మాట్లాడుతూ రాజీ మార్గమే రాజ మార్గమన్నారు. లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవడం వలన డబ్బు, శ్రమ, కాలం వృథా కాదని, కక్షిదారుల మధ్య భేదాభిప్రాయాలు తొలుగుతాయన్నారు. జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ మాట్లాడుతూ రాజీ కాదగిన అన్ని రకాల కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. -
లోక్ అదాలత్ రికార్డు
కరీంనగర్ లీగల్ : రెండో జాతీయ లోక్‌అదాలత్‌లో భా గంగా శనివారం జిల్లాలో 33 వేలకు పైగా కేసులను పరిష్కరించినట్లు జిల్లా జడ్జి బి.నాగమారుతీశర్మ తెలిపారు. ఇది ఆల్‌టైమ్ రికార్డ్‌గా ప్రకటించారు. 182 మోటార్ వాహన ప్రమాద కేసులలో రూ.3.36 కోట్ల పరిహారాన్ని బాధితులకు ఇప్పించామని, తొలిసారిగా 70 సివిల్ కేసులను పరిష్కరించామని తెలిపారు. కేసులను పరిష్కరించుకోవటం ద్వారా కక్షిదారులకు శ్రమ, ఖర్చు, సమయం ఆదా అవుతాయన్నారు. సివిల్ కేసులో కక్షిదారులు కోర్టుకు చెల్లించిన ఫీజులను కూడా వాపసు తీసుకునేందుకు అవకాశముందన్నారు. ఎస్పీ శివకుమార్మాట్లాడుతూ బేషజాలకు పోకుండా కక్షిదారులు రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవటానికి ముందుకు రావాలని అన్నారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జిలు వాసుదేవరావు, వెంకటకృష్ణంరాజు, న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి బాల భాస్కర్ రావు, సీనియర్ సివిల్ జడ్జిలు రంజన్‌కుమార్, భవానీ చంద్ర, మేజిస్ట్రేట్లు అప్రోజ్ ఆఖ్తర్, అజర్ హుస్సేన్, ప్రవీణ్‌కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గోపు మధుసూదన్‌రెడ్డి, బి.రఘునందన్‌రావు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కేసుల పరిష్కారం కోసం కృషి చేసిన పోలీసు సిబ్బందికి ఎస్పీ శివకుమార్ ప్రసంశపత్రాలను అందజేశారు. సమస్యలను స్థానికంగా చర్చించుకోవాలి గంగాధర: భూతగాదాలు, భార్యాభర్తల మధ్య గొడవలను స్థానికంగానే పరిష్కరించుకోవాలని, కోర్టు వరకూ తేవొద్దని జడ్జి బి.నాగమారుతీశర్మ కోరారు. మండలంలోని తాడిజెర్రి గ్రామాన్ని నేరరహితంగా ప్రకటించిన సందర్భంగా గ్రామంలో శనివారం అభినందన సభ ఏర్పాటు చేశారు. లోక్‌అదాలత్ నిర్వహించి మూడు కేసుల్లో ఇరుపక్షాల మధ్య రాజీ కుదిర్చారు. అనంతరం జడ్జి మాట్లాడుతూ పంథాలకుపోయి కోర్టుల చుట్టు తిరిగితే డబ్బులు వృథా అవుతాయన్నారు. ఎస్పీ శివకుమార్ మాట్లాడుతూ గ్రామం నుంచి పోలీస్‌స్టేషన్‌కు ఒక్క ఫిర్యాదు కూడా రాకపోవడం మంచి మార్పు అని కొనియాడారు. వివాదాలకు దూరంగా ఉంటామని గ్రామస్తులతో ప్రమాణం చేయించారు. శాంతిసూచకంగా జడ్జి, ఎస్పీలు పావురాలను ఎగురవేశారు. హిమ్మత్‌నగర్, తాడిజెర్రి, బూర్గుపల్లి గ్రామ రక్షక దళాలకు వాలీబాల్ కిట్లు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచు మ్యాక రామమ్మ, వేములవాడ జూనియర్ సివిల్ జడ్జి ఎం.భాస్కర్, పెద్దపెల్లి డీఎస్పీ మల్లారెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు ఆకుల శ్రీలత, చొప్పదండి సీఐ సత్యనారాయణ, గంగాధర ఎస్సై రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. భీంరాజ్‌పల్లి చరిత్రలో నిలవాలి గొల్లపల్లి : మండలంలోని మారుమూల పల్లె భీంరాజ్‌పల్లి నేరరహిత గ్రామంగా గుర్తింపు పొందిందని, ఇలాగే కొనసాగిస్తూ.. చరిత్రలో నిలవాలని జిల్లా జడ్జి నాగమారుతీశర్మ, ఎస్పీ వి.శివకుమార్ అన్నారు. గ్రామంలో రెండు క్రిమినల్ కేసులు నమోదు కావడంతో శనివారం నిర్వహించిన లోక్‌అదాలత్‌లో పరిష్కరించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి జడ్జి, ఎస్పీ హాజరయ్యారు. వారికి గ్రామస్తులు, విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. వేదికవద్ద భీంరాజ్‌పల్లికి చెందిన కేసుల్లో కక్షిదారులు రాజీకి ఒప్పుకోవడంతో వాటిని కొట్టివేసి నేరరహిత గ్రామంగా ప్రకటించారు. చెందోళికి చెందిన రెండు కేసుల కక్షిదారులు రాజీపడటంతో అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ చిన్నచిన్న తగాదాలను కోర్టు వరకు తీసుకెళ్లకుండా స్థానికంగా పరిష్కరించుకోవాలని, లేకుంటే నష్టపోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. ‘ఓడినవారు కోర్టులో ఏడిస్తే.. గెలిచినవారు ఇంటికెళ్లి ఏడ్చాడట..’ అనే సామెతను గుర్తు చేశారు. శాంతిమార్గమే బెటర్ : ఎస్పీ సమస్యలు వస్తాయని, వాటిని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఎస్పీ శివకుమార్ అన్నారు. అందరు సహకరిస్తే నేర రహిత జిల్లాగా తప్పక మారుతుందని పేర్కొన్నారు. కేసుల పరిష్కారానికి కృషి చేసిన ఎస్సై నిరంజన్‌రెడ్డి, సీఐ వెంకటరమణను అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్ సింగారపు ఎల్లవ్వ, ఎంపీటీసీ నాగవ్వ, సింగిల్‌విండో అధ్యక్షుడు చంద్రశేఖర్‌రావు, జగిత్యాల జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్, జగిత్యాల డీఎస్పీ రాజేంద్రప్రసాద్, ఎస్సైలు బిల్లా కోటేశ్వర్, దేవయ్య, నరేష్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. లీగల్ సెల్ సిబ్బందికి ప్రశంసపత్రాలు కరీంనగర్ క్రైం : జాతీయస్థాయి లోక్‌అదాలత్ ముగింపు సందర్భంగా జిల్లాలో ఎక్కువ శాతం కేసుల్లో రాజీ కుదిర్చి పరిష్కరించడంలో ప్రధాన పాత్ర పోషించిన జిల్లాలోని పోలీస్ విభాగం లీగల్ సెల్ కోర్టు కానిస్టేబుళ్లకు ప్రశంసపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి నాగమారతీశర్మ, ఎస్పీ శివకుమార్, న్యాయ సేవాసంస్థ కార్యదర్శి బాలభాస్కర్ సీఐ సంపత్, ఎస్సైలు వలీబాబా, కృష్ణారెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ గోవర్ధన్, అనందం, ఎండీ రఫూఫ్, ప్రకాశ్‌రెడ్డి, సత్తయ్య, కానిస్టేబుళ్లు చేరాలు, తిరుపతి, శ్రీనివాస్, గోపీ, రాజ, వంశీకిరణ్, రవి, సతీష్‌కుమార్, దేవేందర్, సందీప్‌కు ప్రశంసపత్రాలు అందించారు. -
సత్వర న్యాయం కోసమే లోక్ అదాలత్‌లు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్. దత్తు ఉమ్మడి హైకోర్టులో జాతీయ లోక్ అదాలత్ ప్రారంభం కక్షిదారులు చిరునవ్వుతో వెళ్లేలా చూడాలి కేసులు పరిష్కరించుకోవాలని వారిపై ఒత్తిడి చేయొద్దు ఏడాది పొడవునా లోక్ అదాలత్‌లు నిర్వహించాల్సిన అవసరముంది తన తల్లిదండ్రులు తెలుగు వారేనన్న దత్తు సాక్షి, హైదరాబాద్: కేసుల పరిష్కారంలో జాప్యాన్ని నివారించి, కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లోక్ అదాలత్‌ల లక్ష్యమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు అన్నారు. గతేడాది లోక్ అదాలత్ ద్వారా పది లక్షల కేసులు పరిష్కారమయ్యాయన్నారు. ఈసారి అంతకన్నా ఎక్కువ కేసులను పరిష్కరించగలమనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. శనివారం దేశవ్యాప్తంగా రెండో జాతీయ లోక్ అదాలత్ ప్రారంభమైంది. అందులో భాగంగా ఇక్కడి ఉమ్మడి హైకోర్టు ప్రాంగణంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జస్టిస్ దత్తు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇరు రాష్ట్రాల న్యాయసేవాధికార సంస్థల ప్యాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్ న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి, న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ జస్టిస్ ఖండవల్లి చంద్రభాను, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ గుండా చంద్రయ్య, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ దత్తు మాట్లాడుతూ.. ‘లోక్ అదాలత్‌కు వచ్చే కక్షిదారులను కొంత ఒత్తిడి చేస్తున్నారనేది నా అభిప్రాయం. ఇదే విషయాన్ని ఓ కక్షిదారుడు బహిరంగంగానే చెప్పారు. ఇది ఎంత మాత్రం సరికాదు. లోక్ అదాలత్లకు వచ్చిన కక్షిదారులు చిరునవ్వుతో తిరిగి వెళ్లాలి. ఆ బాధ్యత అధికారులదే’ అని జస్టిస్ దత్తు తెలిపారు. పెండింగ్ కేసుల సంఖ్య తగ్గాలంటే ఏడాది పొడగునా లోక్ అదాలత్‌లను నిర్వహించాల్సిన అవసరం ఉందని జస్టిస్ దత్తు అభిప్రాయపడ్డారు. తన తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారేనని, మూడు దశాబ్దాల క్రితం కర్ణాటకకు వలస వెళ్లారని, అందువల్ల తను ఇరు రాష్ట్రాలకు చెందిన వ్యక్తినని తెలిపారు. ‘అందరికీ నమస్కారం’ అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించి, ‘నమస్కారం’ అంటూ తెలుగులోనే ముగించారు! లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించదగ్గ కేసులు ఆంధ్రప్రదేశ్‌లో 80,831, తెలంగాణలో 91, 626 ఉన్నట్లు జస్టిస్ సేన్‌గుప్తా చెప్పారు. సుప్రీంకోర్టులో సోషల్ జస్టిస్ బెంచ్ ఏర్పాటు చేసినందుకు జస్టిస్ దత్తును జస్టిస్ నర్సింహారెడ్డి అభినందించారు. జస్టిస్ దత్తును సన్మానించారు. కాగా, శనివారం హైకోర్టులో జరిగిన లోక్ అదాలత్ ద్వారా 608 కేసులు పరిష్కారమయ్యాయి. దీని ద్వారా మూడు వేల మంది లబ్ధి పొందారు. హాస్యనటుడు అలీ ఔదార్యం హాస్యనటుడు అలీ పెద్దమనసుతో వ్యవహరిం చారు. తనను లక్షల రూపాయల మేర మోసం చేసిన ఓ మహిళపై జాలి చూపారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీకి చెందిన సాంబశివరావు, శకుంతల దంపతుల ఇంటిని 1998లో అలీ కొనుగోలు చేశారు. ఈ ఇంటిపై సాంబశివరావు దంపతులు రూ.90 లక్షల బ్యాంక్ రుణం తీసుకున్న సంగతి దాచిపెట్టారు. దాంతో 2006లో వారిద్దరిపై అలీ చీటింగ్ కేసు పెట్టారు. శనివారం నాంపల్లి కోర్టులో నిర్వహించిన లోక్‌అదాలత్‌లో అలీ పాల్గొన్నారు. శకుంతల దయనీయ పరిస్థితిని న్యాయమూర్తి వివరించడంతో, రావాల్సిన డబ్బు వదులుకొని కేసు వెనక్కు తీసుకున్నారు. -
లోక్ అదాలత్‌తో సత్వర పరిష్కారం
ఒంగోలు సెంట్రల్ : పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం లోక్ అదాలత్‌తోనే సాధ్యమని కలెక్టర్ విజయకుమార్ పేర్కొన్నారు. స్థానిక జిల్లా కోర్టు సముదాయాల ఆవరణలో శనివారం నిర్వహించిన రెండో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంఘటన జరిగినప్పుడు ఆగ్రహం, ఆవేదనతో పెట్టిన కేసులను అనంతరం ఉపసంహరించుకునే అవకాశం కొన్ని సందర్భాల్లో ఉండదన్నారు. అలాంటి కేసులతో పాటు ఇరువర్గాలు రాజీపడే కేసులను సైతం లోక్ అదాలత్ ద్వారా వెంటనే పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కొన్ని కేసులకు సంబంధించి హైకోర్టు, సుప్రీంకోర్టులకు వెళ్లడం ద్వారా విలువైన సమయం, డబ్బు వృథా అవుతాయన్నారు. ఇలా ఇరువర్గాలూ నష్టపోకుండా ఉండాలంటే లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. లోక్ అదాలత్‌లో కేసు పరిష్కారమైతే సుప్రీంకోర్టులో పరిష్కారమైనట్లేనని, దానిపై మళ్లీ కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా ఇన్చార్జి న్యాయమూర్తి, మొదటి అదనపు జిల్లా జడ్జి ఎస్కే మహ్మద్ ఇస్మాయిల్ మాట్లాడుతూ పెండింగ్ కేసులకు సంబంధించి రాజీమార్గమే రాజమార్గమని పేర్కొన్నారు. పొరపాట్లు జరుగుతూ ఉంటాయని, పరస్పర అంగీకారం ద్వారా పరిష్కరించుకుని మిగిలిన జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని ప్రజలకు సూచించారు. ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ మాట్లాడుతూ ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవడం ఉత్తమమని పేర్కొన్నారు. తద్వారా కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య కూడా తగ్గిపోతుందన్నారు. అనంతరం నిర్వహించిన లోక్ అదాలత్ కేసుల పరిష్కార కార్యక్రమంలో మొదటి కేసును ఎస్పీ శ్రీకాంత్ పరిష్కరించారు. కలెక్టర్ విజయకుమార్ రెండు ఐపీసీ కేసులు, ఒక వివాహ సంబంధ కేసును పరిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి వి.మోహన్‌కుమార్, ఏడో అదనపు జిల్లా జడ్జి రమణికృపావతి, జిల్లా అదనపు సీనియర్ సివిల్ జడ్జి డి.అమ్మన్నరాజా, జూనియర్ సివిల్ జడ్జిలు టి.హరిత, శ్రీకుమార్‌వివేక్, ఎస్కే ఇబ్రహీం, షరీఫ్, జె.శ్రావణ్‌కుమార్, పి.లక్ష్మీకుమారి, డి.దుర్గారాణి, పలు ప్రభుత్వ శాఖల ఆధికారులు, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. -
ఉద్యమ కేసులు ఉపసంహరణ
సంగారెడ్డి లీగల్: తెలంగాణ ఉద్యమం సందర్భంగా ధర్నాలు, రాస్తారోకోలతో పాటు వివిధ ఆందోళనల్లో పాల్గొన్న వారిపై నమోదైన 107 కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకుందని జిల్లా జడ్జి రాధారాణి తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాలకనుగుణంగా శనివారం జిల్లా కోర్టులో రెండవ మెగా లోక్ అదాలత్‌ను నిర్వహించారు. ఈ మెగా లోక్‌అదాలత్‌లో మొత్తం 6,206 కేసులు పరిష్కారం కాగా, అందులో ఉద్యమకారులకు సంబంధించినవి 107 ఉన్నాయి. లోక్‌అదాలత్ అనంతరం జిల్లా జడ్జి రాధారాణి మాట్లాడుతూ, లోక్ అదాలత్‌లో పరిష్కారమైన కేసులపై మరోసారి పైకోర్టులకు వెళ్లే అవకాశం ఉండదన్నారు. లోక్ అదాలత్ ద్వారా కొన్ని కేసులైనా వెంటనే పరిష్కారం అవుతున్నాయని, దీంతో కోర్టులకు కొంత పని భారం తగ్గుతుందన్నారు. లోక్ అదాలత్ ద్వారా చిట్‌ఫండ్, బ్యాంకులకు సంబంధించిన కేసుల్లో రూ.2 కోట్లు కక్షిదారులకు అందజేశామన్నారు. విదేశాల్లోని కోర్టులతో పోలిస్తే మనదేశంలోని కోర్టుల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటుందన్నారు. అందువల్లే లోక్‌అదాలత్‌లు నిర్వహించి బాధితులకు సత్వర న్యాయం అందిస్తున్నామన్నారు. కేసుల పరిష్కారానికి మంచి అవకాశం కలెక్టర్ రాహుల్ బొజ్జా మాట్లాడుతూ, కేసులు పరిష్కరించుకునేందుకు లోక్‌అదాలత్ మంచి మార్గమన్నారు. క్రిమినల్ కేసుల్లో తప్ప మిగతా అన్ని సివిల్ కేసుల్లో సమన్యాయం జరుగుతుందన్నారు. రాజీ పద్ధతిలో కేసులు పరిష్కరించుకోవడం చాలా మంచిదన్నారు. లోక్ అదాలత్ ద్వారా కేసులు ఉపసంహరించుకోవడం వల్ల సమయం, డబ్బు ఆదా అవుతుందన్నారు. భూసేకరణ కేసులు చాలా వరకు పరిష్కారం అవుతున్నాయని, బాధితులకు కూడా నష్టపరిహారం వెంటనే అందుతుందన్నారు. బాధితులకు సత్వర న్యాయం ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ మాట్లాడుతూ, జిల్లాలో 3,500 కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అందులో లోక్‌అదాలత్ ద్వారా 1,050 కేసులు పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. లోత్ అదాలత్ ద్వారా ఔటర్‌రింగ్ రోడ్డులో భూములు కోల్పోయిన వారికి ఇళ్ల స్థలాలు ఇప్పించామన్నారు. విద్యుత్ వినియోగదారులపై ఆశాఖ పెట్టిన కేసులకు జరిమానా కట్టించి పరిష్కరించినట్లు గుర్తు చేశారు. అలాగే ఆస్తి తగాదాలు సంబంధించిన కేసులను పరిష్కరించినట్లు ఆమె తెలిపారు. అంతకుముందు కలెక్టర్ రాహుల్ బొజ్జా, జిల్లా జడ్జి రాధారాణి జ్యోతిప్రజ్వలనతో మెగా లోక్‌అదాలత్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో న్యాయసేవాప్రాధికార సంస్థ కార్యదర్శి కనకదుర్గ, సివిల్ జడ్జి షేక్ రజాక్ ఉజ్ జమా, జిల్లా జువైనల్ బోర్డు చైర్మన్ దుర్గప్రసాద్, ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్, బార్ అసోషియేషన్ అధ్యక్షులు విష్ణవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. 6,206 కేసులు పరిష్కారం శనివారం జరిగిన రెండవ లోక్ అదాలత్‌లో మొత్తం 6,206 కేసులు పరిష్కారం అయ్యాయని జిల్లా జడ్జి రాధారాణి తెలిపారు. అందులో మోటర్ వెహికిల్ యాక్ట్, సివిల్ కేసులు 100. క్రిమినల్ కేసులు 2,058, పీఎల్సీ కేసులు 3,048, విద్యుత్ చోరీ కేసులు, బ్యాంకు, బీఎస్ఎల్ కేసులు 1,000 పరిష్కారం చేశామన్నారు. మోటర్ వెహికల్ చట్టానికి సంబంధించి రూ. 57,09,000 బాధితులకు అందజేశారు. అదేవిధంగా బ్యాంకులు, చిట్ ఫండ్లకు సంబంధించిన కేసుల్లో రూ. 2,50,00,000 లు బాధితులకు అందజే సినట్లు జిల్లా జడ్జి తెలిపారు. -
లోక్ అదాలత్‌ను ప్రారంభించిన భారత ప్రధాన న్యాయమూర్తి
హైదరాబాద్: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ ఎల్ దత్తు శనివారం హైకోర్టులో మెగా లోక్ అదాలత్‌ను ప్రారంభించారు. ఇది జాతీయ స్థాయిలో రెండో లోక్ అదాలత్. గత ఏడాది పది లక్షల కేసులు పరిష్కారించామని, ఈసారి మరింత ఎక్కువ లక్ష్యాన్ని పెట్టుకున్నామని జస్టిస్ దత్తు చెప్పారు. ఇదో చారిత్రక దినమని, న్యాయ వ్యవస్థలో కొత్త అధ్యాయానికి నాంది వంటిదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జ్యోతిసేన్ గుప్తా అన్నారు. -
న్యాయవ్యవస్థలో కొత్త అధ్యాయానికి నాంది:సీజేఐ
-
రాజీమార్గం..సత్వర న్యాయం
కామారెడ్డి : కోర్టుల్లో కేసులు ఏళ్లతరబడిగా నడవడం వల్ల అటు బాధితులు, ఇటు కక్షిదారులు ఇబ్బందులు పడుతుంటారు. పెండింగ్ కేసులు పెరుగకుండా న్యాయమూర్తులు ప్రయత్నిస్తున్నా సాక్షులు, ఆధారాలను సరైన సమయంలో అందించకపోవడం, తదితర కారణాలతో కేసులు పెండింగ్ అవుతూనే ఉంటాయి. చిన్నచిన్న కేసుల్లో కూడా ఏళ్ల తరబడి తిరుగుతుంటారు. దీంతో బాధితులు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతుంటారు. కక్షిదారులు కూడా ఇబ్బందులను ఎదుర్కొంటారు. రవాణా ఖర్చులు, ఫీజులు, ఇతర ఖర్చులు పెరిగిపోయి ఇబ్బందుల పాలవుతుంటారు. అయితే ఇరువర్గాల వారు ఏదో రకంగా సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయడం ద్వారా కేసులు తగ్గిపోతాయి. రాజీ కుదరించి.. ఇరువర్గాలు పంతాలకు వెళ్లి ఎవరూ పరిష్కారానికి ముందుకు రాకపోవడంతో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో న్యాయస్థానాలు లోక్ అదాలత్‌లను నిర్వహించి.. పైసా ఖర్చు లేకుండా, రాజీమార్గంలో బాధితులు, కక్షిదారులతో మాట్లాడి కేసులను పరిష్కరిస్తున్నాయి. ఏళ్ల నుంచి కొలిక్కిరాని ఎన్నో కేసులను లోక్ అదాలత్‌లు సులువుగా పరిష్కరిస్తున్నాయి. దీంతో చాలామంది బాధితులు లోక్ అదాలత్‌లను ఆశ్రయిస్తున్నారు. రాష్ట్రంలోనే మొదటి స్థానం గత ఏడాది నిర్వహించిన మెగా లోక్ అదాలత్‌ల ద్వారా కేసుల పరిష్కారంలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. గత యేడాది 129 సివిల్ కేసులు, 2834 క్రిమినల్కేసులు, 10,324 విద్యుత్తు కేసులు, 2963 ఇతర కేసులు పరిష్కారమయ్యాయి. ఈ ఏడాది కూడా జిల్లాలో భారీ సంఖ్యలో ఉన్న పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు గాను న్యాయమూర్తులు, న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు. నేడు దేశవ్యాప్తంగా లోక్ అదాలత్ దేశవ్యాప్తంగా శనివారం(డిసెంబర్ 6) మెగా లోక్‌అదాలత్ నిర్వహించనున్నారు. వేలాది పెండింగ్ కేసుల పరిష్కారం లక్ష్యంగా ఈ మెగా లోక్ అదాలత్‌ను చేపడుతున్నారు. అందులో భాగంగా జిల్లాలో 23 లోక్ అదాలత్‌లను ఏర్పాటు చేశారు. నిజామాబాద్ నగరంతో పాటు కామారెడ్డి, ఆర్మూర్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, భిచ్కుందలల్లో ఉన్న కోర్టుల ఆవరణల్లో లోక్ అదాలత్‌లను నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు కొనసాగనున్నాయి. కామారెడ్డిలో నాలుగు బెంచ్‌లను ఏర్పాటు చేసినట్టు న్యాయమూర్తులు తెలిపారు. ఎలాంటి కేసులు.. లోక్ అదాలత్‌లో భార్యాభర్తలకు సంబంధించిన వివాదాలు, తల్లితండ్రులకు సంబంధించిన జీవనభృతి, క్రిమినల్, సివిల్ కేసులు, మోటర్ వాహనాల కేసులు, ఎక్సైజ్ కేసులు వంటి అన్ని రకాల కేసులను పరిష్కరిస్తున్నారు. ఈ కే సుల్లో ఇరువర్గాలు రాజీ చేసుకునే వెసలుబాటు కల్పించడంతో పాటు రాజీ చేసుకున్న కేసులను అక్కడికక్కడే పరిష్కరిస్తారు. ఇలా లోక్ అదాలత్‌లో ఇచ్చిన తీర్పులపై హైకోర్టు, సుప్రీంకోర్టు వంటి కోర్టులకు అప్పీలకు పోయే అవకాశం లేదు. లోక్ అదాలత్ తీర్పు తుది తీర్పుగా భావించబడటంతో చాలామంది కక్షిదారులు లోక్ అదాలత్‌లను ఆశ్రయించి కేసులను రాజీ చేసుకుంటున్నారు. ఇటీవల బ్యాంకులు సైతం రుణాలు పొంది తిరిగి చెల్లించని వ్యక్తులకు లోక్ అదాలత్ ద్వారా నోటీసులు జారీ చేస్తూ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకుంటున్నాయి.