విడాకుల కేసులో బాధితురాలికి రూ.15 లక్షల భరణం
మదనపల్లి క్రైం : ఇద్దరూ ఇష్టపడి విడాకులు తీసుకోవడానికి లోక్ అదాలత్‌కు వచ్చిన కేసులో న్యాయమూర్తులు ఆనంద్, జయరాజ్ యువతికి రూ.15 లక్షల భరణం ఇప్పించారు. గుర్రకొండ మండలం చెర్లోపల్లెకు చెందిన వరపన సిద్దారెడ్డి కుమారుడు రవీంద్ర(25)కు అదే మండలం వెలిగల్లుకు చెందిన హరిత(20)తో ఐదేళ్ల క్రితం పెద్దలు పెళ్లి చేశారు. వీరి కాపురం కొంతకాలం సజావుగా సాగింది. ఇద్దరి మధ్య ఒద్దికలేకపోవడంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ శనివారం లోక్‌అదాలత్‌ను ఆశ్రయించారు. విచారణ అనంతరం న్యాయమూర్తులు దంపతుల సమ్మతి మేరకు విడాకులు మంజూరు చేశారు.
బాధితురాలు హరితకు పరిహారంగా భరణం, కట్నం, బంగారు ఆభరణాలు, పెళ్లి ఖర్చులు అన్నీ కలిపి రూ.15 లక్షలు ఇప్పించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు మోహనరావు, ప్రదీప్‌కుమార్, ఏపీపీలు మాలతి, ఆవుల శివరాంరెడ్డి, న్యాయవాదులు అలకం మనోహర్ నాయుడు, చైతన్య, యసానుల్లా, ఆనంద్‌రెడ్డి, కోర్టు సిబ్బంది నాగమణి, మహిత తదితరులు పాల్గొన్నారు.