నిరాదరణకు గురైతే రూ. పదివేల భరణం | Rs.10 thousand alimony for neglected | Sakshi
Sakshi News home page

నిరాదరణకు గురైతే రూ. పదివేల భరణం

Published Mon, Jan 23 2017 10:44 PM | Last Updated on Tue, Sep 5 2017 1:55 AM

నిరాదరణకు గురైతే రూ. పదివేల భరణం

నిరాదరణకు గురైతే రూ. పదివేల భరణం

- జిల్లా లోక్‌ అదాలత్‌ జడ్జి ఎంఏ సోమశేఖర్‌
- వృద్ధాశ్రమంలో న్యాయ విజ్ఞాన సదస్సు
 
కర్నూలు (కొండారెడ్డి ఫోర్టు): కొడుకులు, కుమార్తెల నిరాదరణకు గురైన తల్లిదండ్రులు, వయోవృద్ధులు కనిష్టంగా పది వేల రూపాయల భరణం పొందేందుకు చట్టాలున్నాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, లోక్‌ అదాలత్‌ జడ్జి ఎంఏ సోమశేఖర్‌ తెలిపారు. ఇందుకు వయోవృద్ధులు, ముసలి తల్లిదండ్రులు, రక్షణ, సంరక్షణ చట్టం-2007 అవకాశం కల్పిస్తోందన్నారు. అలాంటి వారు ఆర్‌డీఓకు దరఖాస్తు చేసుకుంటే నెలకు కనీసం పదివేల రూపాయల భరణం పోందే అవకాశం ఉందన్నారు.
 
సోమవారం ఎలుకూరు ఎస్టేట్‌లోని శ్రీమాతా అన్న పూర్ణేశ్వరి వృద్ధుల ఆశ్రమంలో న్యాయ విజ్ఞానా సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆస్తి రాయించుకున్న తరువాత వారి సంతతి నిరాదరణకు  గురిచేస్తే ఆ  రిజిస్ట్రేషన్‌ పత్రాలు చెల్లవన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు ప్రసాదు, తిరుపతయ్య, అశ్రమ మేనేజర్‌ కేసీ రంగస్వామి పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement