ఒకేరోజు 12,39,044 కేసుల పరిష్కారం.. దేశంలోనే నంబర్‌ వన్‌ | Telangana Lok Adalat resolves 12 Lakh Cases In Single Day | Sakshi
Sakshi News home page

ఒకేరోజు 12,39,044 కేసుల పరిష్కారం.. దేశంలోనే నంబర్‌ వన్‌

Published Tue, Oct 29 2024 8:07 AM | Last Updated on Tue, Oct 29 2024 12:32 PM

Telangana Lok Adalat resolves 12 Lakh Cases In Single Day
  • 3వ లోక్‌ అదాలత్‌లో టీజీఎస్‌ఎల్‌ఎస్‌ఏ రికార్డు.. దేశంలోనే నంబర్‌ వన్‌
  • టీజీఎస్‌ ఎల్‌ఎస్‌ఏకు సీజే జస్టిస్‌ అలోక్‌ అరాధే,
  • జస్టిస్‌ సుజోయ్‌పాల్‌ అభినందనలు

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా నిర్వహించిన మూడో జాతీయ లోక్‌ అదాలత్‌లో అత్యధిక కేసులు పరిష్కరించి తెలంగాణ రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ (టీజీఎస్‌ ఎల్‌ఎస్‌ఏ) నంబర్‌ వన్‌గా నిలిచింది. ఒకే రోజు 12,39,044 కేసులను పరిష్కరించి ఈ ర్యాంక్‌ సాధించింది. ఈ నేపథ్యంలో అథారిటీని హైకోర్టు ప్రధాన న్యా యమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ సుజోయ్‌పాల్‌ అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని కేసులను పరిష్క రించి, కక్షిదారులకు సత్వర న్యాయం అందించాలని అభిలషించారు. 

ప్రత్యామ్నాయ పరిష్కార వేదికగా ఎదుగుతున్న అథారిటీకి ప్రజాదరణ పెరుగు తుండటంపై హర్షం వ్యక్తం చేశారు. కోర్టులపై భారం తగ్గడంతోపాటు వేగంగా న్యాయం అందిస్తున్న అథారిటీ మరింత వృద్ధి సాధించాలని అభిప్రాయ పడ్డారు. ఈ సందర్భంగా హైకోర్టు ఆవరణలోని లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ కార్యాలయంలో సభ్యకార్యదర్శి సీహెచ్‌ పంచాక్షరి సోమవారం మీడియాతో మాట్లా డారు. 2024 సెప్టెంబర్‌ 14న నిర్వ హించిన లోక్‌ అదాలత్‌లో 12,39,044 కేసులను పరిష్కరించి రూ.250,19,44,447 పరిహారం కక్షిదారులకు అందజే శామని చెప్పారు. 

కేసుల సత్వర పరి ష్కారం, ఖర్చు లేకుండా న్యాయం అందించడమే లక్ష్యంగా అథారిటీ పనిచేస్తుందన్నారు. అథారిటీ ప్యా ట్రన్‌ ఇన్‌ చీఫ్, హైకోర్టు సీజే జస్టిస్‌ అలోక్‌ అరాధే, అథారిటీ ఎగ్జి క్యూటివ్‌ చైర్మన్, జస్టిస్‌ సుజోయ్‌ పాల్‌ నేతృత్వం, సూచనలతో పెద్ద మొత్తంలో కేసుల పరిష్కారం సాధ్యౖ మెందని వెల్లడించారు. వరుసగా రెండోసారి నంబర్‌ వన్‌గా నిలపడంలో సహకరించిన వారికి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ సుజోయ్‌పాల్‌ కృతజ్ఞతలు తెలిపార న్నారు. ప్రత్యామ్నాయ పరిష్కార యంత్రాంగాన్ని విని యోగించుకుని వివాదాలను సత్వరంగా పరిష్కరించుకోవాలని, అందుకు కక్షిదారులు ముందుకు రావా లని న్యాయమూర్తులు పిలుపునిచ్చినట్లు వివరించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement