నా కోరిక తీర్చకపోతే మొహంపై యాసిడ్‌ పోస్తా..! | police case file Auto driver in Jubilee Hills Police Station | Sakshi
Sakshi News home page

నా కోరిక తీర్చకపోతే మొహంపై యాసిడ్‌ పోస్తా..!

Published Tue, Apr 29 2025 9:04 AM | Last Updated on Tue, Apr 29 2025 11:06 AM

police case file Auto driver in Jubilee Hills Police Station

వివాహితకు వరుసకు సోదరుడి బెదిరింపులు

బంజారాహిల్స్‌(హైదరాబాద్‌): వివాహితపై కన్నేసిన ఆమెకు వరుసకు సోదరుడైన యువకుడు తన గదికి వచ్చి కోరిక తీర్చకపోతే మొహంపై యాసిడ్‌ పోస్తానంటూ బెదిరించిన సంఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జూబ్లీహిల్స్‌లోని నందగిరిహిల్స్‌లో నివసించే మహిళకు (26)కు ముగ్గురు సంతానం.

 ఆమెకు భర్తకు దూరపు బంధువైన నవీన్‌ అనే యువకుడు నగరంలోనే ఉంటూ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. తరచూ ఇంటికి వచ్చే అతను ఆమెతో మాటలు కలుపుతూ తన కోరికను బయటపెట్టేవాడు. తాను అడిగింది ఇవ్వకపోతే పరువు తీస్తానంటూ బెదిరించేవాడు. రెండు నెలల క్రితం బాధితురాలు ఈ విషయం తనకు భర్తకు చెప్పడంతో  అప్పటి నుంచి నవీన్‌ ఆమెకు ఫోన్‌ చేయడం మానేశాడు. 

ఈ నెల 26న కొందరి వద్ద నవీన్‌ ఆమెపై అసభ్యకరంగా ప్రచారం చేశాడు. ఆమె పనిచేస్తున్న సెలూన్‌కు వెళ్లి నువ్వు బయటకు వస్తావా..? నన్ను లోపలికి రమ్మంటావా? అంటూ బెదిరించాడు. తాను బయటకు రానని చెప్పడంతో నువ్వు నా గదికి రాకపోతే మొహంపై యాసిడ్‌ పోసి చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో ఆందోళనకు గురైన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్‌ పోలీసులు నవీన్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement