Crime News
-
రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య
అనకాపల్లి జిల్లా: జిల్లాలోని దేవరాపల్లి రిసార్ట్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక నడింపల్లి సత్యనారాయణ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు విశాఖ సీతమ్మధారకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారిగా గుర్తించారు. గత కొంతకాలంగా కుటుంబ సభ్యులు దూరంగా ఉన్న సత్యనారాయణ.. బకాయిలు ఉన్న వారికి బకాయిలు తీర్చకపోవడం వలన ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ లో వెల్లడించారు. తన ఆత్మహత్యకు సంబంధించి 12 పేజీల సూసైడ్ నోట్ రాసినట్లు తెలుస్తోంది. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
భార్య కళ్లెదుటే ప్రియుడ్ని?.. పట్టపగలే పెద్దపల్లిలో దారుణం
సాక్షి, క్రైమ్: పట్టపగలే.. అదీ అంతా చూస్తుండగానే పెద్దపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మరో వ్యక్తిని కిరాతకంగా పొడిచి చంపడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. సోమవారం వ్యవసాయ మార్కెట్లో చోటు చేసుకున్న ఘటన వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి మండలం అప్పన్నపేటకు చెందిన పొలం కుమార్ అనే యువకుడు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో దారుణ హత్యకు గురయ్యాడు. ధర్మారం మండలం దొంగతుర్తికి చెందిన రైలుకుల సంతోష్(సతీష్) అనే వ్యక్తి కుమార్‌ను కత్తితో పొడిచి హతమార్చాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. అయితే.. ఆ మహిళ సంతోష్ భార్యగా నిర్ధారణ అయ్యింది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని.. అందుకే భార్య కళ్ల ముందే ప్రియుడ్ని హతమార్చి ఉంటాడని భావిస్తున్నారు. నిందితుడు సంతోష్‌ను పోలీసులు అక్కడికక్కడే అరెస్ట్ చేశారు. అయితే కేసు విచారణ చేపట్టిన పోలీసులు.. హత్యకు గల పూర్తి వివరాలు తెలియజేయాల్సి ఉంది. -
తిరుపతిలో ఘోర ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం
తిరుపతి, సాక్షి: జిల్లాలో ఇవాళ ఘోర ప్రమాదం జరిగింది. పాకాల మండలం తోటపల్లి దగ్గర ఓ కారు కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. పూతలపట్టు- నాయుడుపేట జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళుతున్న కంటైనర్ లారీని కారు వెనకనుంచి ఢీకొట్టినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. -
పాకిస్థాన్ నుంచి ఆపరేట్.. విశాఖలో లోన్ యాప్ ముఠా అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం: నగరంలో లోన్ యాప్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ లోన్ యాప్.. పాకిస్థాన్ నుంచి ఆపరేట్ అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. రూ. 200 కోట్ల రూపాయల లావాదేవీలను పోలీసులు గుర్తించారు.ఈ ముఠా లోన్ యాప్‌ల ద్వారా ఆర్థిక నేరాలకు పాల్పడుతోంది. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులో ప్రధాన నిందితుడితో సహా 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోన్ యాప్‌లో రూ. 2 వేల రూపాయలు అప్పు తీసుకున్న నరేంద్ర అనే యువకుడిని వేధించిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నరేంద్ర భార్య ఫోటోలను మార్ఫింగ్ చేసిన సైబర్ నేరగాళ్లు.. బంధువులకు పంపించారు. దీంతో అవమాన భారంతో పెళ్లయిన 40 రోజులకే నరేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు.పాకిస్థాన్ కేంద్రంగా ఈ ముఠా నడుస్తున్నట్టు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. సుమారు భారత్ నుంచి 9 వేల మంది బాధితులు ఈ ముఠా చేతిలో మోసపోయినట్టు గుర్తించిన పోలీసులు.. 18 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్ టాప్, 54 సిమ్‌లు, రూ.60 లక్షల రూపాయల నగదును ఫ్రిజ్ చేశారు. -
ఆస్తి కోసం.. కన్న కొడుకే కాలయముడై..!
పూసపాటిరేగ( విజయనగరం జిల్లా): కడుపున పుట్టిన కొడుకే ఆస్తికోసం తల్లిదండ్రులను ట్రాక్టర్‌తో గుద్దించి హతమార్చిన ఘటన విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం రెల్లివలస గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పాండ్రింకి అప్పలనాయుడు (55), పాండ్రింకి జయమ్మ (53)కు రాజశేఖర్, రాధ ఇద్దరు పిల్లలు. కుమార్తె రాధను ఆనందపురం మండలం నేలతేరుకు చెందిన వ్యక్తితో వివాహం చేశారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంత కాలం తరువాత ఆమె మృతిచెందింది. తమకు ఉన్న 80 సెంట్లు పొలంలో వివాహ సమయంలో 20 సెంట్లు భూమిని రాధ పేరిట తల్లిదండ్రులు రిజిస్ట్రేషన్ చేశారు. దీనిపై కుమారుడు రాజశేఖర్ తల్లిదండ్రులపై కక్ష పెంచుకున్నాడు. భూమి విషయమై వారితో కొంత కాలంగా గొడవపడుతున్నాడు. తల్లిదండ్రుల నుంచి విడిపోయి తన భార్య, కుమార్తెతో కలిసి వేరుగా నివసిస్తున్నాడు. సొంతంగా ట్రాక్టర్ నడుపుతున్నాడు. వ్యసనపరుడు కావడంతో అప్పుల పాలయ్యాడు. ఈ క్రమంలో గ్రామానికి సమీపంలోని నడుపూరి కల్లాల వద్ద రాధకు ఇచ్చిన భూమిని విక్రయించేందుకు సిద్ధపడ్డాడు. ఇందులో భాగంగా జేసీబీ, ట్రాక్టర్ సాయంతో చదునుచేసే పనులను సాయంత్రం చేపట్టాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పొలం వద్దకు వెళ్లి కుమారుడిని ప్రశ్నించారు. ఈ క్రమంలో వారిపై ఆగ్రహంతో ఊగిపోతూ ట్రాక్టర్‌తో ఢీకొట్టి హతమార్చాడు. వారు మృతి చెందినట్టు నిర్ధారణ అయ్యాక అక్కడ నుంచి ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు. భోగాపురం రూరల్ సీఐ జి.రామకృష్ణ, ఎస్ఐ ఐ.దుర్గాప్రసాద్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసి విచారణ చేస్తున్నారు. -
తండ్రికి బైక్‌ను బహుమతిగా ఇవ్వాలని బయలుదేరి..
మునగాల(సూర్యాపేట జిల్లా): సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన యువతి మృతిచెందింది. భీమవరం మండలం తుందుర్రు గ్రామానికి చెందిన చేడె జనార్దన్ కుమార్తె యశస్విని (24) మూడేళ్లుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తోంది.తన తండ్రికి బహుమతిగా ఇవ్వాలనుకుని యశస్విని బుల్లెట్ వాహనాన్ని కొనుగోలు చేసి శుక్రవారం రాత్రి తన సహ ఉద్యోగి బడ్డుకొండ అచ్యుత్‌కుమార్‌తో కలిసి అదే బుల్లెట్‌పై తమ స్వగ్రామమైన తుందుర్రుకు బయలుదేరింది. బుల్లెట్ బైక్‌ను అచ్యుత్‌కుమార్ నడుపుతున్నాడు. ఈ క్రమంలో ఆకుపాముల శివారులోకి రాగానే హైవేపై పడిఉన్న గేదె కళేబరాన్ని ఢీకొట్టారు. దీంతో యశస్విని బుల్లెట్‌పై నుంచి ఎగిరి రోడ్డుపై పడింది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే లారీ అతివేగంతో వచ్చి రహదారిపై పడిఉన్న యశస్విని మీదుగా వెళ్లింది. దీంతో యశస్విని తల, మెడభాగం ఛిద్రమై అక్కడికక్కడే మృతిచెందింది. అచ్యుత్‌కుమార్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న మునగాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యశస్విని మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శనివారం మృతురాలి కుటుంబ సభ్యులు మునగాలకు చేరుకున్నారు. మృతురాలి బాబాయ్ చేడె సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. యశస్విని మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
చెల్లికి ఆస్తిలో వాటా.. తల్లిదండ్రులను ట్రాక్టర్‌తో ఢీకొట్టి..
సాక్షి, విజయనగరం జిల్లా: పూసపాటిరేగ మండలం చల్లవానితోట పంచాయతీ నడుపూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి కోసం తల్లిదండ్రులనే కన్న కొడుకు హత్య చేశాడు. తల్లిదండ్రులను కన్నకొడుకు ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపేశాడు. అక్కడిక్కడే తండ్రి అప్పలనాయుడు (60), తల్లి జయమ్మ (58) మృతి చెందాడు. కుమారుడు పాండ్రంగి రాజాశేఖర్ (25) పరారీలో ఉన్నాడు.ఆస్తి తగాదా నేపథ్యంలోనే దాడి చేసినట్టు బంధువులు అంటున్నారు. తల్లిదండ్రులు ఆస్తిలో చెల్లికి వాటా ఇవ్వడంతో రాజశేఖర్ అనే వ్యక్తి వారిపై కక్ష పెంచుకున్నాడు. కొంతకాలంగా ఈ వివాదం నడుస్తోంది. కుమార్తెకు ఇచ్చిన భూమిని చదును చేస్తుండగా తనను అడ్డుకోవడంతో తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగిన రాజశేఖర్.. అనంతరం వారిని ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపాడు. పూసపాటిరేగ మండలంలో జరిగిన అమానవీయ ఘటనతో మృతుల బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
విజయవాడలో దారుణం.. డేటింగ్ పేరుతో హోటల్ రూమ్ బుక్ చేసి..
సాక్షి, విజయవాడ: మాయమాటలతో అమ్మాయిలను దోచేస్తున్న కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను సెంట్రల్ ఏసీపీ దామోదర్ మీడియాకు వెల్లడించారు. కోనసీమ జిల్లాకు చెందిన ఓ యువతి ఉద్యోగం కోసం విజయవాడకు వచ్చింది. వెటర్నరీ కాలనీలోని ఓ హాస్టల్లో ఉంటున్న ఆ యువతికి నెల రోజుల క్రితం కిలారి నాగతేజతో లవ్లీ డేటింగ్ యాప్‌లో పరిచయమైంది. కాగా, నెల రోజుల నుంచి కిలారి నాగతేజ, సదరు యువతి రోజూ ఫోన్లలో మాట్లాడుకుంటున్నారు. డేటింగ్లో భాగంగా ఈ నెల 22 తేదీన ఓ హోటల్లో నాగతేజను ఆ యువతి కలిసింది.ఇద్దరి కోసం హోటల్లో రూమ్ బుక్ చేసిన నాగతేజ.. యువతి నగ్నవీడియోలు తీశాడు. అనంతరం కత్తి చూపించి ఆ యువతి ఒంటిపై బంగారాన్ని తీసుకుని నాగతేజ పారిపోయాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో నాగతేజను పోలీసులు అరెస్ట్ చేశారు.వ్యసనాలకు బానిసైన నాగతేజ.. డబ్బుల కోసం అమ్మాయిలను మోసగిస్తున్నాడు. గతంలోనూ పలువురు యువతులను మోసం చేసిన నాగతేజ.. జైలుకు వెళ్లొచ్చినా తీరు మారలేదు. నాగతేజ అరెస్ట్‌లో సీసీ ఫుటేజ్ కీలకంగా మారింది. డేటింగ్ యాప్, టెలిగ్రామ్, ఫేస్ బుక్, ఇన్‌స్టా గ్రామ్ ద్వారా జరిగే మోసాలపై మహిళలు అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ దామోదర్ సూచించారు. -
కడపలో ట్రేడింగ్ పేరుతో భారీ మోసం.. రూ.12 కోట్లకు కుచ్చుటోపి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ట్రేడింగ్ పేరుతో యువతకు కుచ్చుటోపి పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. కడపకు చెందిన పాపిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి చేతిలో 35 కుటుంబాలు మోసపోయాయి. అధిక లాభాల పేరుతో సోమశేఖర్‌రెడ్డి, కుటుంబ సభ్యులు 12 కోట్ల రూపాయలు దండుకున్నారు. ఇచిన డబ్బును తిరిగి అడిగితే బెదిరింపులకు దిగుతున్నారని బాధితులు లబోదిబో అంటున్నారు.మంత్రి నారా లోకేష్, హోం మంత్రి అనిత తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. పెట్టుబడి పెట్టిన వారిలో ఒకరు ఆత్మహత్య చేసుకోగా, మరో వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహ్యతే గతి అంటూ మిగతా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
వివాహేతర సంబంధం, భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని..
హైదరాబాద్: ఇటీవల కుప్పలుతెప్పలుగా వివాహేతర సంబంధాలు వెలుగులోకి వస్తున్నాయి. అచ్చం అలాంటి పనిచేసే..ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్యకు అడ్డంగా దొరికిపోయాడు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్‌కి చెందిన శివ అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం దీప్తి అనే మహిళతో పెళ్లి కాగా ఈ దంపతులకు మూడేళ్ల కుమార్తె కూడా ఉంది. అయితే పెళ్లై, పిల్లలున్న శివ కొంతకాలంగా తన భార్యతో దూరంగా ఉంటున్నాడు. కారణం మరో మహిళతో వివాహేతర సంబంధమే. ఆ విషయం అతడి భార్య దీప్తి కనిపెట్టింది. ఎలాగైనా రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకోవాలని గట్టి నిఘా పెట్టింది.చివరికి తన భర్త శివ, సుష్మా అనే ఆమెతో కలిసి కూకట్‌పల్లిలో ఓ ఇంట్లో నివసిస్తున్నాడని తెలుసుకుని, కుటుంబసభ్యుల సాయంతో ఒకే గదిలో ఉన్న భర్త శివ, సుష్మలను రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకుంది. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించింది. అంతేగాక తనను పట్టించుకోకుండా మరో మహిళతో తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాట్లు ఫిర్యాదు కూడా చేసింది. pic.twitter.com/95aRDE2twc— Telugu Scribe (@TeluguScribe) April 26, 2025 -
జైలు శిక్ష విధిస్తావా..చంపేస్తాం
తమిళనాడు: గంజాయి అక్రమ రవాణా కేసులో 12 సంవత్సరాల జైలు శిక్ష విధించిన న్యాయమూర్తిని కోర్టు ఆవరణలోనే చంపేస్తామని ఇద్దరు సోదరులు బెదిరించిన ఘటన తేని కోర్టు ఆవరణలో శుక్రవారం కలకలం రేపింది. వివరాలు.. మదురై జిల్లా విల్లాపురం తూర్పు వీధిలోని మునియాండి ఆలయం సమీపంలో కొంతమంది గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు కీరతురై పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి 25 కిలోల గంజాయి తరలిస్తున్న మురతంభత్రి ప్రాంతానికి చెందిన పాండియరాజన్, ప్రశాంత్, పాండియరాజన్ భార్య శరణ్యలను అరెస్టు చేశారు. విచారణలో, మధురైలోని కామరాజపురం ప్రాంతానికి చెందిన రౌడీ వెల్లైౖకలి మేనల్లుడు షణ్ముగవేలు తమకు 25 కిలోల గంజాయి ఇచ్చాడని వారు వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసు గురువారం మదురై జిల్లా నార్కోటిక్స్ కంట్రోల్ మొదటి అదనపు కోర్టు న్యాయమూర్తి హరిహరకుమార్ ముందు విచారణకు వచ్చింది. ఆ సమయంలో, ముగ్గురిని దోషులుగా నిర్ధారించి, ఒక్కొక్కరికి 12 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఈ పరిస్థితిలో, పోలీసులు వారిని జైలుకు తరలించారు. ఆ సమయంలో నిందితులు పాండియరాజన్, ప్రశాంత్, న్యాయమూర్తిని చూసి చంపేస్తామని బెదిరించారు. వారు న్యాయమూర్తిని దుర్భాషలాడుతూ కోర్టు భవనం కిటికీలను పగులగొట్టి వీరంగం చేశారు. న్యాయమూర్తిని చంపేస్తామని బెదిరించారు. పోలీసులు, న్యాయవాదులపై అసభ్యకర పదజాలంతో దూషించారు. పోలీసులు వారిద్దరిని వైద్యపరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. న్యాయమూర్తిని చంపుతామని బెదిరించారని ఆరోపిస్తూ అన్నానగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
విశాఖలో దంపతుల దారుణహత్య
విశాఖపట్నం: విశాఖ నగరం గాజువాక సమీపంలోని రాజీవ్‌నగర్‌లో భార్యాభర్తలు దారుణహత్యకు గురయ్యారు. డాక్‌యార్డులో పనిచేసి రిటైరైన గంపాల యోగేంద్రబాబు (66), లక్ష్మి (58) దంపతులను గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. వారు 35 ఏళ్లుగా రాజీవ్‌నగర్‌లో ఉంటున్నారు. రెండు రోజుల కిందట హైదరాబాద్ వెళ్లిన వారు గురువారం ఉదయం ఇంటికి చేరుకున్నారు.శుక్రవారం రాత్రి వరకు వారి ఇంటి తలుపులు తెరవకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో స్థానికంగా ఉన్న బంధువుల అమ్మాయి ఇంటికి వచ్చి చూసింది. ఇంటికి రెండువైపులా తాళం వేసి ఉండటాన్ని గమనించింది. అనుమానం వచ్చిన.. స్థానికుల సాయంతో పోలీసులకు సమాచారం అందించింది. సౌత్ ఏసీపీ టి.త్రినాథ్, దువ్వాడ సీఐ మల్లేశ్వరరావు అక్కడికి చేరుకుని తాళాలు పగలుగొట్టించి తలుపులు తెరిచారు. లోపలికి వెళ్లి చూస్తే హాల్లో యోగేంద్రబాబు, బెడ్రూమ్లో లక్ష్మి రక్తపుమడుగులో పడి ఉన్నారు. వారు అప్పటికే మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు. యోగేంద్రబాబుది మచిలీపట్నం కాగా లక్ష్మిది శ్రీహరిపురం. 40 ఏళ్ల కిందట కులాంతర ఆదర్శ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. వారికి వివాహాలు జరిగి, అమెరికాలో స్థిరపడ్డారు. క్లూస్ టీం రంగంలోకి దిగి వివరాలు సేకరించింది. -
బిడ్డను చంపి తల్లిపై గ్యాంగ్‌రేప్!
దేశంలో మహిళలపై అఘాయిత్యాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) గణాంకాల ప్రకారం.. సగటున రోజుకి వందకి పైగా కేసులు నమోదు అవుతున్నాయి. వెలుగులోకి రానివి మరెన్నో?. తాజాగా.. హర్యానాలోని జింద్‌లో ఘోరమైన ఘటన జరిగింది. నలుగురు దుండగులు అయిదేళ్ల చిన్నారిని హత్య చేసి, ఆమె తల్లిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పాత గొడవల కారణాంగానే నిందితులు ఈ దారుణానికి తెగబడినట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత కుటుంబం చెత్త ఏరుకుంటూ జింద్ జిల్లా(Jind) శివారులోని గుడిసెల్లో నివసిస్తోంది. కొన్నిరోజుల కిందట అమిత్ అనే వ్యక్తికి, బాధిత మహిళ భర్తకి గొడవ జరిగింది. ఈ గొడవలో ఆమె భర్త తలకు గాయం కాగా పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు నిందితుడు అమిత్‌పై చర్యలు తీసుకోకుండా.. గొడవను సర్దిచెప్పి పంపించారు. ఇది మనసులో పెట్టుకున్న అమిత్, అతని మైనర్ సోదరుడు కోపంతో రగిలిపోయారు. మంగళవారం రాత్రి ఆమె భర్త లేని సమయం చూసి మరో ఇద్దరు స్నేహితులతో కలిసి గుడిసెలోకి చొరబడ్డారు. ముగ్గురు పిల్లలతో కలిసి నిద్రపోతున్న బాధితురాలిపై దాడి చేశారు. ఆమె స్పృహ కోల్పోయాక.. ఆమెతోపాటు అయిదేళ్ల చిన్నారిని పక్కనే ఉన్న ఖాళీ ప్రాంతానికి లాక్కెళ్లారు. అక్కడ చిన్నారి గొంతునులిమి హత్య చేసి, బాధితురాలిపై నలుగురూ అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న మహిళను అక్కడే వదిలేసి పారిపోయారు. చిన్నారి మృతదేహం రాత్రంతా చెత్తకుప్పలోనే ఉంది. శుక్రవారం ఉదయం బహిర్భూమికి వెళ్లిన ఓ మహిళ వాళ్లను గుర్తించి స్థానికులకు సమాచారం అందించింది. చిన్నారిని ఖననం చేశాక.. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తనతో పాటు తన ఐదేళ్ల వయసున్న బిడ్డపైనా నిందితులు అత్యాచారానికి ఒడిగొట్టారని చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో స్థానిక ఎస్సై యశ్వీర్, సమాధి నుంచి పసికందు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకి తరలించారు. మరోవైపు.. బాధితురాలి ఫిర్యాదు మేరకు అమిత్‌తో సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లే కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది. -
వరకట్న వేధింపులకు వివాహిత బలి
కర్ణాటక: వరకట్న వేధింపులతో ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తాలూకాలోని కాడదేనహళ్లిలో జరిగింది. వివరాలు.. హాసన జిల్లా అరసీకెరె తాలూకా గండసి ఫిర్కా కుడుకుంది గ్రామానికి చెందిన సోమశేఖర్ కుమార్తె కేఎన్ రశ్మి(24)కి మాలూరు తాలూకా సొసగెరె గ్రామ పంచాయతీ వ్యాప్తిలోని కాడదేనహళ్లి గ్రామానికి చెందిన దినేష్ గౌడతో 14 నెలల క్రితం వివాహం చేశారు.వివాహం అనంతరం దినేష్ గౌడ ఇంట్లో ఇంకా ఎక్కువ మొత్తంలో వరకట్నం తీసుకు రావాలని రశ్మిపై ఒత్తిడి చేసేవారు. దీంతో విసుగు చెందిన రశ్మి పైఅంతస్తులో ఉన్న గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రశ్మి తండ్రి సోమశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాలూరు ఎస్ఐ వసంతకుమార్ ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఘటనకు సంబంధించి మాలూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని రశ్మి భర్త దినేష్గౌడ, మామ అప్పాజిగౌడ, రత్నమ్మ, సరోజమ్మలను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. -
టాపర్ కాస్త హంతకుడిగా..
చదివిన ప్రతి తరగతిలోనూ అత్యధిక మార్కులతో పాసైన ఓ కుర్రాడు బెట్టింగ్ అలవాటు మానుకోలేక చదువుకు దూరమై హొటల్లో సర్వర్‌గా మారి ఆఖరుకు హంతకుడిగా మిగిలాడు. చెడు సాంగత్యాన్ని మొదటిలోనే తుంచలేక ఓ వివాహిత చేతులారా బంగారం లాంటి బతుకును బుగ్గిపాలు చేసుకుంది. పైడి భీమవరంనడిబొడ్డున జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసు వివరాలు తెలిసే కొద్దీ ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. రణస్థలం: పైడిభీమవరంలో ఊరి నడిబొడ్డున ఈ నెల 19న జరిగిన అవాల భవానీ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని జేఆర్ పురం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు జేఆర్ పురం పోలీస్ స్టేషన్లో సీఐ ఎం. అవతారం గురువారం వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. అవాల భవానీ పైడిభీమవరంలోని ఓ హొటల్లో పనిచేసేది. అక్కడే సర్వర్‌గా పనిచేస్తున్న కొండక వీర్రాజు అనే వ్యక్తితో నాలుగు నెలల కిందట ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం హోటల్ యజమానికి తెలియడంతో వీర్రాజు ను పనిలో నుంచి మానిపించేశారు. ఆ తర్వాత భవానీ ఈ విషయం తమ ఇంటిలో తెలిసిపోతుందని వీర్రాజును దూరం పెట్టింది. ఫోన్ చేసినా మాట్లాడకపోవడంతో వీర్రాజు ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. మరొకరితో అక్రమ సంబంధం ఉండడం వల్లనే తనను దూరం పెడుతోందని భావించి ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఈ నెల 19న పైడిభీమవరంలోని ఒక దుకాణంలో చాకు కొను క్కుని తన దగ్గర ఉంచుకున్నాడు. పైడిభీమవరం నడిబొడ్డున ఉన్న గుర్రమ్మ గుడి వెనుక ఉన్న కాజావారి కోనేరుగట్టు వద్ద అవాల భవాని రావడం గమనించి ఆమెను పిలిచి కొంత సమయం గొడవ పడ్డాడు. అయితే ఆమె అతడితో మాట్లాడేందుకు నిరాకరించింది. దీంతో తనతో తెచ్చుకున్న చాకుతో భవాని గొంతును రెండు సార్లు బలంగా కోసినట్లు పోలీసులు తెలిపారు.తర్వాత అక్కడ నుంచి పారిపోయిన వీర్రాజు విజయవాడలోని ఇంటికి చేరుకుని ఎవరూ గుర్తు పట్టకుండా గుండు గీసుకుని తిరుపతి వెళ్లిపోయాడు. తిరిగి వస్తుండగా పోలీసులకు వచ్చిన కచ్చితమైన సమాచారం మేరకు రణస్థలం మండలంలోని కమ్మసిగడాం వద్ద అదుపులోకి తీసుకున్నారు. కేసును త్వరగా ఛేదించి జేఆర్ పురం సీఐ అవతారం, ఎస్ఐ ఎస్.చిరంజీవి, సిబ్బంది పి.హేమంత్ కుమార్, కేకే సింగ్, సీహెచ్ సురేష్ ను జిల్లా ఉన్నతాధికారులు ప్రశంసించారు.అన్నింటింలోనూ టాపరే..ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు కొండక వీర్రాజు స్వగ్రామం విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలో గల నడిపల్లి గ్రామం. కుటుంబ సభ్యులతో చిన్నతనం నుంచి విజయవాడ వలస వెళ్లి అక్కడే ఉండేవాడు. ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు అక్కడే చదువుకున్నాడు. పదిలో పదికి పది, ఇంటర్లో 965 మార్కులు, డిగ్రీ రెండేళ్లలోనూ 90శాతం మార్కులు సాధించాడు. డిగ్రీ చివరి ఏడాదిలో బెట్టింగులకు అలవాటు పడి డబ్బులు అప్పు చేసి చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. దీంతో అన్నదమ్ములు నాలుగు నెలలు క్రితం స్వగ్రా మం నడిపిల్లి పంపించేశారు. తదుపరి నడిపిల్లి వచ్చిన అతను పైడిభీమవరంలోని ఒక హోటల్లో సర్వర్‌గా పనిలో జాయినయ్యాడు. అంత తెలివైన విద్యార్థి బెట్టింగ్ మానుకోలేక ఆఖరుకు హంతకుడిగా మిగిలాడు.వివాహిత దారుణహత్య -
భర్త దుబాయ్‌లో.. పక్కింటి వ్యక్తి ఇంట్లో రేఖ అనుమానాస్పద మృతి
గంభీరావుపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగవరంలో గురువారం రాత్రి అనుమానాస్పద స్థితిలో ఇద్దరు మృతి చెందారు. ఒకరు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడగా.. అక్కడే ఓ మహిళ మృతదేహం పడి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఒకే ఇంట్లో రెండు మృతదేహాలు కనిపించిన సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గజసింగవరం గ్రామానికి చెందిన ఉల్లి శ్రీకాంత్(27) తన ఇంట్లో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే ఇంట్లో చెరుకూరి రేఖ(25) అనే వివాహిత మృతదేహం పడి ఉంది. ఆమె శరీరంపై గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శ్రీకాంత్‌కు వివాహం కాగా.. భార్య గురువారం పుట్టింటికి వెళ్లింది. రేఖ భర్త గల్ఫ్‌లో ఉంటున్నాడు. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సీఐ శ్రీనివాస్‌గౌడ్, ఎస్సై ప్రేమానంద్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. -
కొడుకు అందంగా పుట్టాడని వేధింపులు
జగిత్యాల క్రైం: ‘అమ్మా, నాన్నా.. నా కొడుకును మీరే పెంచండి. భర్త, అత్తమామల వేధింపులు భరించలేకపోతున్నా. నా భర్త మారతాడని అనుకున్న. నా ఆశ నిరాశే అయ్యింది. కొడుకు అందంగా పుట్టాడన్న అనుమానంతో నిత్యం వేధిస్తున్నాడు. కట్నం వేధింపులు కూడా ఎక్కువయ్యా యి’.. అని సూసైడ్ నోట్ రాసి వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడకు చెందిన ప్రసన్నలక్ష్మి (26)ని రెండేళ్ల క్రితం వెల్గటూర్ మండలం రాంనూర్ గ్రామానికి చెందిన తిరుపతికి ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి సమయంలో రూ.55 లక్షల కట్నం ఇస్తామని ఒప్పుకుని.. రూ.10 లక్షలు ముట్టజెప్పారు. దంపతులిద్దరూ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ప్రసన్నలక్ష్మికి బాబు జన్మించాడు. అప్పటి నుంచి ఆమె ఇంటివద్దే ఉంటోంది. ప్రసన్నలక్ష్మి, తిరుపతి ఇద్దరూ చామన ఛాయలో ఉండగా.. బాబు తెల్లగా, అందంగా పుట్టాడన్న అనుమానం తిరుపతి మనసులో మొలకెత్తింది. అప్పటి నుంచి తరచూ ప్రసన్నలక్ష్మిని వేధిస్తున్నాడు. మిగతా కట్నం డబ్బు కావాలని ఒత్తిడి పెంచాడు. భర్త తిరుపతి, అత్త, మామ, ఆడబిడ్డలు వేధిస్తుండటంతో ఐదురోజుల క్రితం ప్రసన్నలక్ష్మి బెంగళూరు నుంచి జగిత్యాలలోని తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. ఇంట్లో ఉన్న అద్దంపై ‘అమ్మా నాన్న నాకు బతకాలని లేదు. నా కొడుకు జాగ్రత్త. ప్లీజ్ వాళ్లకు మాత్రం నా బాబును ఇవ్వకండి’అని రాసి ఫ్యాన్‌కు ఉరేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ప్రసన్నలక్ష్మి భర్త, అత్త మామలపై చర్యలు తీసుకోవాలని గురువారం ఉదయం ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. డీఎస్పీ రఘుచందర్, పట్టణ సీఐ వేణుగోపాల్ మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మృతురాలి తండ్రి ఉప్పునీటి గంగాధర్ ఫిర్యాదు మేరకు ఆమె భర్త, అత్తమామలు, ఆడబిడ్డలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
వికటించిన ప్రేమపెళ్లి
కర్ణాటక: ప్రేమించి కులాంతర వివాహం చేసుకొన్న ఓ యువతి.. నిండు గర్భిణిగా ఉండి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘోరం రాయచూరు జిల్లా సింధనూరు గ్రామీణలో చోటు చేసుకుంది. వివరాలు.. తాలూకాలోని బూదిహాల్కు చెందిన యువకుడు నాగరాజు బ్రతుకుతెరువు కోసం బెంగళూరులో పని చేయడానికి వెళ్లాడు. అక్కడ పనిచేసే దుకాణ యజమాని కూతురు, చామరాజనగర జిల్లా కొళ్లేగాళకు చెందిన పల్లవి అలియాస్ అనుపమతో పరిచయం పెరిగి ప్రేమగా మారింది. కట్న వేధింపులు పెరిగి సుమారు ఏడాది కిందట గంగావతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. పల్లవి తొమ్మిది నెలల గర్భిణి. పల్లవి అగ్రవర్ణురాలు కాగా, నాగరాజ్‌ది మరో కులం. ఈ నేపథ్యంలో కుటుంబ కలహాలు, కట్న వేధింపులు మొదలయ్యాయి. ప్రేమ కోసం అందరినీ వదులుకుని వస్తే జీవితం తలకిందులైందని పల్లవి ఆక్రోశించింది. గురువారం బూదిహాల్లో భర్త ఇంట్లోనే ఉరివేసుకుంది. ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీఎస్పీ తలవార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గొడవలు జరగకుండా బూదిహాళలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భర్త నాగరాజ్, అతని తల్లిదండ్రులను అరెస్ట్ చేశామని సిఐ వీరారెడ్డి తెలిపారు. -
హైదరాబాద్‌లో భారీగా పట్టుబడిన హవాలా డబ్బు..
హైదరాబాద్: నెల రోజుల నుండి నిఘా ఉంచి రూ.74.56 లక్షల హవాలా డబ్బును రాయదుర్గం పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపిన మేరకు.. ఇద్దరు యువకులు యాక్టివాపై డబ్బు తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందడంతో రాయదుర్గంలోని విస్పర్ వ్యాలీ జంక్షన్లో ఎస్ఐ శ్రీనివాస్ వాహనాల తనిఖీలు చేపట్టారు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో వాహనంపై ఒక బ్యాగ్ కనిపించింది. తనిఖీ చేయగా ఆ బ్యాగ్‌లో రూ. 74,56,200 నగదు లభించింది. కరీంనగర్‌కు చెందిన బి.సాయికృష్ణ బీటెక్ పూర్తి చేసి చిత్రపురి కాలనీలో నివాసం ఉంటున్నాడు. రాయదుర్గంలో ఉండేరవితో కలిసి బేగంపేట్‌లోని సురేందర్ అగర్వాల్ నుంచి డబ్బు తీసుకొని వస్తున్నారు. రవి డ్రైవింగ్ చేస్తుండగా బ్యాగ్‌తో సాయి కృష్ణ వెనకాల కూర్చున్నాడు. మియాపూర్‌కు వెళ్లి ఫోన్ చేస్తే ఎవరికి ఇచ్చేది చెప్తారని పోలీసులకు తెలిపారు. స్వాధీనం చేసుకొని నగదును ఆదాయపు పన్నుశాఖ అధికారులకు అప్పగించామన్నారు. కొంత కాలంగా బ్లాక్ మనీ అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం ఉంది. ఈ క్రమంలోనే రెండు మూడు సార్లు పట్టుకునేందుకు ప్రయతి్నంచినా పట్టుబడలేదు. ఎట్టకేలకు భారీ నగదును స్వా«దీనం చేసుకున్నారు. -
ఫోన్‌కాల్ రచ్చ ప్రాణం తీసింది..!
మంచిర్యాలక్రైం: ఫోన్ కాల్ విషయమై జరిగిన రచ్చ ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకునేలా చేసింది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భీమిని మండలం జగ్గయ్యపేటకు చెందిన జంగంపల్లి గోపాల్, నాగమ్మ దంపతుల రెండో కూతురు లక్ష్మీప్రసన్న మంచిర్యాలలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతోంది. గురువారం ఉదయం హాస్టల్ భవనం నాలుగో అంతస్తు నుంచి దూకింది. కళాశాల విద్యార్థులు, సిబ్బంది ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మధ్యాహ్నం చనిపోయింది. మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, సీఐ ప్రమోద్‌రావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థిని ఆత్మహత్యకు కళాశాల సిబ్బంది, నైట్‌వాచ్‌మెన్ మహేశ్ వేధింపులే కారణమంటూ ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు. అదనపు కలెక్టర్ మోతీలాల్ ఆస్పత్రికి చేరుకోగా.. విద్యార్థిని తండ్రి గోపాల్ ఆయన కాళ్లపై పడి న్యాయం చేయాలంటూ వేడుకున్నాడు. లక్ష్మీప్రసన్నమృతికి కారణమైన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. రూ. 20లక్షలు పరి హా రం, కుటుంబంలో ఒకరికి ప్ర భుత్వ ఉద్యోగం ఇవ్వాలని అ న్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్, నా యకులు పాల్గొన్నారు. మృతురాలి కుటుంబ సభ్యులతో మా ట్లాడిన అదనపు కలెక్టర్.. న్యాయం చేస్తామని హామీనివ్వడంతో ఆందోళన విరమించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ వెల్లడించారు. అసలేం జరిగింది..ఈ నెల 23న రాత్రి 9.30గంటలకు లక్ష్మీప్రసన్న తన చిన్నమ్మ కొడుకు వెంకటేష్‌కు వాచ్మెన్ మహేశ్ సెల్‌ఫోన్ నుంచి ఫోన్ చేసింది. తర్వాత 9.45గంటలకు వెంకటేష్ వాచ్‌మెన్‌కు ఫోన్ చేసి ఇంత రాత్రి ఫోన్ ఎందుకు ఇచ్చావంటూ బెదిరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్త ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ మేనేజర్ మల్లేష్‌కు ఫోన్ ద్వారా వెంకటేష్ ఫిర్యాదు చేయడం, మహేశ్‌పై మల్లేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉద్యోగంలో నుంచి తొలగిస్తానని బెదిరించడం, ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ అనూష దృష్టికి తీసుకెళ్లడం వరకు వెళ్లాయి. అయితే ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం, వాచ్మెన్ మహేశ్ లక్ష్మీప్రసన్నపై ఒత్తిడి చేసి వేధించారని, భరించలేకనే ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు, విద్యార్థిని చిన్నమ్మ కొడుకు వెంకటేష్ ఆరోపించారు. -
భార్య, అత్తపై అల్లుడి దాడి
మియాపూర్(హైదరాబాద్): భార్యా భర్తల మధ్య ఏర్పడిన వివాదం దాడికి దారి తీసింది. భార్యపై భర్త కత్తితో దాడి చేయగా..అడ్డుగా వచ్చిన అత్తను సైతం కత్తితో పొడవడంతో తీవ్రంగా గాయపడింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన వివరాలు..సీఐ క్రాంతి కుమార్ తెలిపిన ప్రకారం..కాకినాడకు చెందిన బండారులంక మహేష్ మియాపూర్ జనప్రియనగర్ రోడ్డు నెం.5 శ్రీ వెంకట నిలయంలో భార్య శ్రీదేవి, రెండేళ్ల కుమార్తెతో కలిసి ఉంటూ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా మహేష్ తన సంపాదనను ఇంటి ఖర్చులకు ఇవ్వకుండా..మద్యం తాగేందుకు ఖర్చుచేస్తున్నాడు. ఈ విషయంలో భార్య శ్రీదేవితో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం శ్రీదేవి చందానగర్ హుడాకాలనీలో ఉంటున్న తల్లి మంగ ఇంటికి వెళ్లింది. సోమవారం మధ్యాహ్నం శ్రీదేవికి ఫోన్‌చేసి ఇంటికి తిరిగి రమ్మని మహేష్ కోరగా..ఆమె మధ్యాహ్నం ఒంటి గంటకు కుమార్తెతో కలిసి వచ్చింది. అదేరోజు సాయంత్రం మహేష్ తన సోదరుడు సాయికుమార్ పుట్టిన రోజు ఉందని, జనప్రియ కాలనీలో ఉంటున్న తమ తల్లిదండ్రుల ఇంటికి వెళ్దామని చెప్పాడు. దీనికి శ్రీదేవి నిరాకరించడంతో ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఈ విషయాన్ని శ్రీదేవి తల్లి మంగకు ఫోన్ చేసి చెప్పగా ఆమెకూడా ఇక్కడికి వచ్చింది. దాడిని ప్రశ్నించడంతో ఆవేశానికి లోనైన మహేష్ వంటగదిలోకి వెళ్లి కూరగాయలు కోసే కత్తి తీసుకుని వచ్చి మొదట శ్రీదేవిపై దాడి చేశాడు. వారించేందుకు వెళ్లిన అత్త మంగను విచక్షణారహితంగా కత్తితో పొడవడంతో ఆమె తీవ్రంగా గాయపడగా..స్థానికులు గమనించి ఇద్దర్నీ సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరతించారు. ఘటనపై శ్రీదేవి భర్త మహేష్‌పై మియాపూర్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితుడు మహేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. -
యువ ప్రేమజంట ఆత్మహత్య!
సాక్షి, బళ్లారి: ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. వారం రోజుల క్రితం కనిపించకుండా పోయిన ప్రేమికులు శవాలై తేలారు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. ఉమ్మడి బళ్లారి జిల్లాలోని హరపనహళ్లి తాలూకా బిట్టినకట్టి గ్రామానికి చెందిన మద్దనస్వామి (18), బండ్రి గ్రామానికి చెందిన దీపిక (18) అనే ఇద్దరు ప్రేమించుకున్నారు. పీయూసీలో ఇద్దరు ప్రథమ శ్రేణిలో పాసయ్యారు. అయితే వారం రోజుల క్రితం ఏమైందో కాని ఇరువురు కనబడకుండా వెళ్లిపోయారు. దీనిపై పోలీసు స్టేషన్లో కూడా తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు, కుటుంబ సభ్యులు గాలిస్తున్న నేపథ్యంలో హరపనహళ్లి పట్టణ శివారులోని ఐటీఐ కళాశాల సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉరి వేసుకున్న స్థితిలో శవాలై తేలారు. స్థానిక పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అక్కడి ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. గ్రామంలో తీవ్ర విషాదం అలముకొంది. -
హత్యాయత్నం నిజమా.. నాటకమా?
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): మాజీ మాఫియా డాన్ దివంగత ముత్తప్ప రై చిన్న కుమారుడు రిక్కీ రై పై కాల్పులు జరిగిన కేసులో బిడది పోలీసులు అతని గన్‌మ్యాన్ మన్నప్ప విఠల్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. రిక్కీ రై తానే కాల్చుకుని హత్యాయత్నం డ్రామా ఆడుతున్నాడని పోలీసులు తాజాగా అనుమానిస్తున్నారు. రిక్కీ రైకి ఉన్న ముగ్గురు గన్ మ్యాన్లు ఒక్కొక్కరు ఒక్కో వాంగ్మూలం ఇస్తుండడంతో పోలీసుల అనుమానాలు బలపడుతున్నాయి. తన పిన్ని అనురాధ, రాకేశ్ మల్లి, మరో ఇద్దరిపై ఆరోపణలు చేసి రిక్కీ కేసును పక్కదారి పట్టిస్తున్నారా అని సందేహిస్తున్నారు. కాల్పులు జరగడానికి ముందు కుక్కలు అరవడంతో గాల్లోకి కాల్పులు జరిపామని గన్ మ్యాన్లు చెప్పిన మాటల్లో నిజం లేదని గుర్తించారు. హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్న రాకేశ్ మల్లి తన లాయర్లతో కలిసి రామనగర ఎస్పీ కార్యాలయానికి వచ్చాడు. ఎస్పీ శ్రీనివాసగౌడ అతనిని విచారించారు. పిన్ని అనురాధకు ఊరట ఈ కేసులో ఏ2గా ఉన్న రిక్కి రై పిన్ని అనురాధకు హైకోర్టులో ఊరట దక్కింది. కేసులో నుంచి తన పేరు తొలగించాలని ఆమె హైకోర్టును ఆశ్రయించగా, ఆమెపై తొందరపాటు చర్యలు, బలవంతపు చర్యలు తీసుకోరాదని కోర్టు పోలీసులను ఆదేశించింది. అనురాధకు 14వ తేదీన యూరోప్‌కు వెళ్లిపోయిందని, 6 నెలల క్రితమే ఆస్తి గొడవలపై రాజీ చేసుకున్నారని ఆమె లాయర్ వాదించారు. నాపై హత్యాయత్నం చేసింది పిన్ని అనురాధ..? -
వివాహేతర సంబంధం: భార్యను పోలీసులకు అప్పగించిన భర్త
వరంగల్ క్రైం : తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతోపాటు తనను గతంలో సస్పెండ్ చేయించాడనే కోపంతో సామాజిక కార్యకర్త ఛిడం సాయి ప్రకాశ్‌ను హత్య చేసిన కేసులో ఓ కానిస్టేబుల్‌తో సహా ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వరంగల్ పోలీసు కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ వివరాలు వెల్లడించారు. ములుగు జిల్లా వెంకటాçపురం(ఎం) పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న బాషబోయిన శ్రీనివాస్ గతంలో వెంకటాçపురం(కె) పోలీస్ స్టేషన్లో విధులు నిర్వరిస్తున్న క్రమంలో ఓ భూమి విషయంలో పోలీస్ స్టేషన్‌కు వచ్చిన చింతం నిర్మలతో పరిచయం పెంచుకుని వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆ విషయంపై నిర్మల భర్తతో కలిసి మృతుడు సాయి ప్రకాశ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో శ్రీనివాస్‌ను సస్పెన్షన్ చేశారు. ఫోన్ సమాచారంతో కిడ్నాప్.. హత్యఈనెల 15వ తేదీన నిందితురాలు నిర్మల, ఆమె భర్తతో కలిసి మృతుడు సాయిప్రకాశ్ తన కారులో ఆస్పత్రికి వచ్చారు. ఈ విషయన్ని నిర్మల.. నిందితుడు శ్రీనివాస్‌కు ఫోన్లో తెలియజేయడంతో ప్రణాళిక ప్రకారం కారును వెంబడించి రాత్రి 11.30 గంటల సమయంలో గోపాల్‌పూర్‌లోని బేబిసైనిక్ స్కూల్ వద్ద కారును ఆటోతో ఢీకొట్టించాడు. అనంతరం సాయి ప్రకాశ్‌ను కారులోనే కిడ్నాప్ చేసి హసన్‌పర్తి పరిసర ప్రాంతాలకు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి శాలువతో గొంతు బిగించి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని హుస్నాబాద్ పీఎస్ పరిదిలోని జిల్లేడగడ్డ తండా గ్రామ శివారులోని ఓ బావి లో పడేశారు. అనంతరం వేలేరు మండలం మీదుగా హనుమకొండ ఏషియాన్ మాల్ దగ్గర కారు నిలిపి వేసి వెళ్లారు. నిందితుల అరెస్ట్..ప్రధాన నిందితుడు కానిస్టేబుల్ బాషబోయిన శ్రీనివాస్‌తో పాటు ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన డేవిలిసాయి, హనుమకొండకు చెందిన అలోతు అరుణ్‌కుమార్ అలియాస్ పండు, బాదావత్ అఖిల్ నాయక్, బాదావత్ రాజు, వాజేడు వెంకటాపూర్‌కు చెందిన చింతం నిర్మలను అరెస్ట్ చేసినట్లు సీపీ తెలిపారు. నిందితుల నుంచి హత్యకు వినియోగించిన ఓ కారు, రెండు ఆటోలు, రెండు ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్ఫోన్లు, పిస్టోల్‌ను స్వా«ధీనం చేసుకున్నట్లు సీపీ పేర్కొన్నారు. అధికారులకు అభినందనలు..సామాజిక కార్యకర్త సాయి ప్రకాశ్ హత్య కేసును వేగంగా ఛేదించి నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్, హనుమకొండ ఏసీపీ కొత్త దేవేందర్‌రెడ్డి, హనుమకొండ ఇన్స్పెక్టర్ సతీశ్, సిబ్బందిని సీపీ సన్‌ప్రీత్‌సింగ్ అభినందించారు. -
పని వారి విషయంలో నిలువెల్లా నిర్లక్ష్యమే!
హైదరాబాద్: నారాయణగూడ పోలీసుస్టేషన్ పరిధిలో నివసించే కేడియా ఆయిల్స్ కంపెనీ యజమాని రోహిత్ కేడియా ఇంట్లో ఈ ఏడాది ఫిబ్రవరి 11న భారీ చోరీ జరిగింది. బీహార్, పశ్చిమ బెంగాల్ లకు చెందిన ముగ్గురు నిందితులు దాదాపు రూ.40 కోట్ల విలువైన సొత్తు దోచుకుపోయారు. వీరిని అరెస్టు చేసిన సందర్భంలో పోలీసులు పని వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని పదేపదే సూచించారు. ఈ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోని కాచిగూడ వాసి, పారిశ్రామిక వేత్త హేమ్ రాజ్ కుటుంబం నేపాలీలను ఎలాంటి ఆధారాలు లేకుండా పనిలో పెట్టుకుంది. ఫలితం... ఆదివారం రాత్రి రూ.2 కోట్ల సొత్తుతో ఆ నేపాలీలు ఉడాయించారు. ఈ కేసును ఈస్ట్‌జోన్ పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలను రంగంలో దింపిన డీసీపీ డాక్టర్ బి.బాలస్వామి కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పథకం ప్రకారం పనిలో చేరిన నేపాలీలు... కాచిగూడ లింగంపల్లి అమ్మవారి దేవాలయం సమీపంలో హేమ్ రాజ్ తన భార్య మీనా దుగ్గర్, కుమారుడు, కోడలు, మనుమళ్లతో కలిసి ఉంటున్నారు. కొన్నాళ్లుగా వీరి వద్ద నేపాల్‌కు చెందిన ఓ మహిళ పని చేస్తోంది. ఆ ఇంటి వ్యవహారాలు పూర్తిగా తెలిసిన ఆమె అదును చూసుకుని కొల్లగొట్టాలని పథకం వేసింది. త్వరలో తాను పని మానేసి తన స్వదేశానికి వెళ్లిపోతానంటూ ఇటీవల ఆ మహిళ చెప్పింది. తన స్థానంలో పని చేయడానికి తమ దేశం నుంచే వచి్చన మరో మహిళ సిద్ధంగా ఉందని దాదాపు నెల రోజుల క్రితం చేర్చింది. హేమ్రాజ్ ఇంట్లో ప్రస్తుతం రెన్నోవేషన్ పని నడుస్తోంది. దీంతో ఆ పనిలో సహకరించడానికి, ఇంటిని శుభ్రం చేయడానికి మరో మనిషి కావాలంటూ పది రోజుల క్రితం కొత్త పని మనిషికి చెప్పారు. ఆ పని చేయడానికి తన పరిచయస్తుడు ఉన్నాడని చెప్పిన ఈ కొత్త పనిమనిషి మరో నేపాలీని ఆ ఇంటికి తీసుకువచ్చింది. నేపాలీలు అంతా కలిసి అదును చూసుకుని... ఇలా కొత్తగా పనిలో చేరిన ఇద్దరి ఫొటోలు, వివరాలను హేమ్ రాజ్ కుటుంబం తీసుకోలేదు. కనీసం వాళ్లు చెప్పిన పేర్లు నిజమా? కాదా? అనేది పరిశీలించలేదు. వేసవి సెలవుల నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం హేమ్రాజ్ కుమారుడి కుటుంబం విదేశాలకు వెళ్లింది. వృద్ధ దంపతులే ఇంట్లో ఉండటంతో ఆ ఇంటిని కొల్లగొట్టడానికి ఇదే సరైన సమయమని ఇరువురు నేపాలీలు నిర్ణయించుకున్నారు. ఆదివారం రాత్రి వృద్ధ దంపతుల ఆహారంలో మత్తుమందు కలిపారు. వీళ్లు మత్తులో ఉండగా... అల్మారాలు, లాకర్లు పగులకొట్టిన నేపాలీ ద్వయం బంగారం, వజ్రాభరణాలు, నగదుతో సహా మొత్తం రూ.2 కోట్ల విలువైన సొత్తు కాజేశారు. ఇంటిని బయట నుంచి తాళం వేసి యజమాని కారులోనే సంతో‹Ùనగర్ వరకు వెళ్లిన ఇరువురూ వాహనం అక్కడ వదిలేశారు. ఆపై ఆటోలో శంషాబాద్ వైపు ఉడాయించారు. సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో వచ్చిన ఫాల్స్ సీలింగ్ వర్కర్లు ఎంత పిలిచినా యజమానల నుంచి స్పందన లేకపోవడంతో సమీపంలో ఉండే బంధువులకు సమాచారం ఇచ్చారు. వివిధ రాష్ట్రాలకు వెళ్లిన ప్రత్యేక బృందాలు... ఈ నేరంపై పోలీసులకు సోమవారం మధ్యాహ్నం సమాచారం అందింది. ఈస్ట్‌జోన్ డీసీపీ డాక్టర్ బి.బాలస్వామి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. యజమానుల దగ్గర నేపాలీల పేర్లు తప్ప వారి వివరాలు, చిరునామాలు, ఫొటోలు లేకపోవడం దర్యాప్తును సంక్లిష్టం చేసింది. పాత పనిమనిíÙతో పాటు కొత్త పని వాళ్లు ఇద్దరి ఆచూకీ కోసం రాష్ట్రం చుట్టపక్కల ఉన్న సాధారణ, రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మూడు ప్రత్యేక బృందాలు ఉత్తరాదిలోని వివిధ రాష్ట్రాలకు వెళ్లాయి. నేపాల్ సరిహద్దుల్లో ఉన్న ఇమ్మిగ్రేషన్ చెక్పోస్టునూ అప్రమత్తం చేశారు. శంషాబాద్ నుంచి నేపాలీలు ఎటు వెళ్లారనేది గుర్తించడానికి వివిధ సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను విశ్లేషిస్తున్నారు. అఫ్జల్‌గంజ్ ఫైరింగ్ కేసు అనుభవం నేపథ్యంలో ఈ నేరగాళ్లు దేశం దాటకముందే పట్టుకోవాలనే లక్ష్యంతో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
అంతా చేసి..భర్త కన్పించలేదంటూ ఫిర్యాదు
కేపీహెచ్‌బీ కాలనీ(హైదరాబాద్): కూతురు పెళ్లి విషయంలో తలదూర్చవద్దని, ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించిన భర్తను కరెంటు షాక్ పెట్టి హత్య చేసిన కేసులో భార్యతో పాటు సహకరించిన మరో ఇద్దరిని కేపీహెచ్‌బీ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డిలు హత్య కేసు వివరాలు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా లింగాయపల్లికి చెందిన సాయిలును భార్య కవిత గత శుక్రవారం రాత్రి పథకం ప్రకారం విద్యుత్ షాక్ ఇచ్చి హత్య చేసిన విషయం విదితమే. ఈ కేసులో కవితకు సహకరించిన సోదరి జ్యోతి, ఆమె భర్త మల్లేష్‌లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా నిందితులు మృతదేహాన్ని గుర్తు పట్టకుండా కవర్లో చుట్టి ఆటోలో తరలించి జోగిపేట వద్ద పూడ్చి పెట్టేందుకు యత్నంచగా ఆటో డ్రైవర్ నిలదీయడంతో తిరిగి వారు నివాసం ఉంటున్న మిత్ర హిల్స్‌కు చేరుకొని అక్కడి నిర్మానుష్య ప్రాంతంలో పూడ్చి పెట్టారు. అనంతరం ఆటో డ్రైవర్ ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రెండు సెల్ఫోన్లను స్వా«దీనం చేసుకున్నారు. పూడ్చి పెట్టిన మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. గుట్టు రట్టు చేసిన ఆటో డ్రైవర్... కవర్లో మూటకట్టిన మృతదేహాన్ని చెత్త కుప్పగా నమ్మించి సంగారెడ్డి చెరువులో పడవేసేందుకు ఆటోను మాట్లాడుకొని శనివారం రాత్రి బయలుదేరి వెళ్లగా నిర్మానుష్య ప్రాంతంలో పూడ్చిపెట్టేందుకు యతి్నస్తున్న విషయాన్ని ఆటోడ్రైవర్ వలీనాయక్ కనిపెట్టాడు. అనుమానం వచ్చి కవితను గట్టిగా నిలదీశాడు. దీంతో ఆమె తిరిగి తమను ఎక్కడ ఎక్కించుకున్నావో అక్కడే దించాలని చెప్పడంతో మిత్రహిల్స్ వద్ద దించాడు. అప్పటికే కవర్లో మూటగట్టిన మృతదేహం వాసన రావడంతో అనుమానం వచి్చన ఆటోడ్రైవర్ వలీనాయక్ మరుసటి రోజు కేపీహెచ్‌బీ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డిని కలిసి విషయం చెప్పాడు. దీంతో హత్య కేసు గుట్టు రట్టయింది. ధైర్యంగా ముందుకు వచ్చి జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పిన వలీనాయక్ను పోలీస్ అధికారులు అభినందించారు. -
ఐదేళ్లుగా అదే పని.. మహిళలు స్నానం చేస్తుండగా..
వెంగళరావునగర్(హైదరాబాద్): మహిళలు స్నానం చేస్తుండగా ఫొటోలు, వీడియోలు తీస్తున్న వ్యక్తిని మధురానగర్ అసోసియేషన్ నేతలు పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం ప్రకారం... మధురానగర్‌కాలనీ కమ్యూనిటీహాల్లో కొన్నేళ్లుగా ఓ కుటుంబం విధులు నిర్వర్తిస్తోంది. వారి కుమార్తె సమీపంలోని చీరల దుకాణంలో సేల్స్‌గర్ల్‌గా పని చేస్తోంది. ఆమె సోమవారం ఉదయం విధులకు వెళ్లడానికి స్నానం చేస్తూ సబ్బు కోసం వెతికింది. అయితే ఆమెకు అక్కడ మొబైల్ ఫోన్ చేతిని తాకింది. భయపడి దుస్తులు ధరించి బయటకు వచ్చి చూడగా కమ్యూనిటీహాల్లో ఎలక్ట్రిషియన్‌గా విధులు నిర్వర్తించే వై.మరియాలి కుమార్ స్నానం గది కిటికీ పక్కన దాక్కుని ఉన్నాడు. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు తెలియజేయగా అతడు వచ్చి మరియాలి కుమార్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ఫోన్‌తో సహా అతను పారిపోయాడు. విషయాన్ని బాధితురాలు సంక్షేమ సంఘం అధ్యక్షులు ప్రతాప్‌రెడ్డి తదితరులకు తెలియజేసింది. సంఘం నేతలు పోలీసులకు ఫోన్ చేసి ఎలక్ట్రిషియన్‌ను పట్టుకుని విషయాన్ని సేకరించారు. ఐదేళ్లుగా మహిళలు స్నానం చేస్తుండగా వీడియోలు, ఫొటోలు తీస్తున్నట్లుగా అంగీకరించాడు. తాను తీసిన వీడియోలు, ఫొటోలు అన్నీ తొలగించినట్టుగా తెలియజేశాడు. అనంతరం నిందితుడిని కాలనీ నేతలు మధురానగర్ పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఐదు రోజులుగా గూగుల్‌లో అదే పని..
బెంగళూరు: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య కేసు(Om Prakash Case) దర్యాప్తులో మరో షాకింగ్ విషయం వెలుగు చూసింది. గూగుల్‌లో వెతికి మరీ భర్త ఓం ప్రకాశ్‌ను పల్లవి(Wife Pallavi) హతమార్చినట్లు వెల్లడైంది. అంతేకాదు తన భర్త తనపై విష ప్రయోగం చేశాడని.. ఆయన పెట్టే హింస భరించలేకే హత్య చేశానని ఆమె పోలీసుల ఎదుట చెప్పినట్లు అక్కడి మీడియా కథనాలు ఇస్తున్నాయి. హత్యకు ఐదు రోజుల ముందు నుంచి పల్లవి గూగుల్‌లో విపరీతంగా వెతుకుతూ వస్తోంది. ఎక్కడ నరాలు తెగితే మనిషి త్వరగా చనిపోతాడోనని వెతికిందామె. చివరకు మెడ దగ్గరి నరాలను దెబ్బ తీస్తే చనిపోతారని నిర్ధారించుకుని హత్య చేసింది. ఆస్తి తగాదాలు, కుటుంబ వివాదాల నేపథ్యంలో తన భర్త, కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్‌ను పల్లవి హతమార్చిన సంగతి తెలిసిందే. అయితే..ఓం ప్రకాశ్ కొడుకు కార్తీక్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. స్కిజోఫ్రెనియా అనే మానసిక సమస్యతో బాధపడుతున్న ఆమె.. భర్త నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఊహించుకుంటూ వస్తోంది. ఈలోపు ఆస్తి తగదాలు కూడా మొదలు కాగా.. భర్తకు మరో మహిళతో సంబంధం ఉందంటూ కుటుంబ వాట్సాప్ గ్రూపుల్లో కొన్నిరోజులుగా ఆమె సందేశాలు ఉంచుతూ వస్తోంది. పీటీఐ కథనం ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నాం ఓం ప్రకాశ్ భోజనం చేస్తున్న సమయంలో పల్లవి భర్త ఓం ప్రకాశ్ కళ్లలో కారం కొట్టింది. ఆపై కాళ్లు చేతులు కట్టేసి విచక్షణరహితంగా పొడిచి హత్య చేసింది. భర్త ప్రాణం పోతుండగానే పోలీసులకు ఆమె సమాచారం అందించింది. పోలీసులు వచ్చి చూసే సరికి ఆయన రక్తపు మడుగులో పడి ఉండగా.. ఆమె రిలాక్స్‌గా ఓ కుర్చీలో కూర్చుని ఉంది. హత్య అనంతరం.. ఐపీఎస్ ఫ్యామిలీ గ్రూప్‌లో సందేశం ఉంచిన ఆమె.. ఓ మాజీ అధికారికి తానొక మృగాన్ని చంపినట్లు సందేశం కూడా పంపినట్లు నిర్ధారణ అయ్యింది. ఇక ఈ హత్య తన సోదరి కృతి పాత్ర కూడా ఉండొచ్చని ఓం ప్రకాశ్ తనయుడు కార్తీక్ ఆరోపిస్తున్నాడు. ప్రస్తుతానికి ఈ కేసులో పల్లవిని ప్రాథమిక నిందితురాలిగా అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆమె నుంచి కీలక వివరాలు రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. -
ఎంత పని చేశావమ్మా..
మెదక్: కన్న పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తల్లే వారిని కడతేర్చింది. చుట్టుముట్టిన ఆర్థిక పరిస్థితులతో జీవితం భారమై వారిని వాగులోకి తోసి అంతమొందించింది. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు యత్నించింది. అయితే.. తృటిలో ప్రాణాలతో బయటపడింది. ఈ హృదయ విదారకరమైన సంఘటన తూప్రాన్‌లో సోమవారం జరిగింది. ఎస్ఐ శివానందం, గ్రామస్తుల కథనం ప్రకారం.. మాసాయిపేటకు చెందిన వడ్డేపల్లి స్వామి– మమత దంపతులకు ఇద్దరు కుమార్తెలు. మద్యానికి బానిసైన స్వామి నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. కుటుంబ పెద్ద లేకపోవడంతో కుటుంబం గడవడం కష్టతరంగా మారింది. ఇద్దరు చిన్నారులతో కూలి పనులకు వెళ్ల లేక పస్తులుండాల్సిన పరిస్థితి దాపురించింది. చిన్న తనంలోనే మమత తల్లిదండ్రులను కోల్పోవడంతో చిన్నమ్మ పెద్ద చేసి పెళ్లి చేసింది. ఈక్రమంలో భర్త చనిపోవడంతో కుటుంబం రోడ్డున పడింది. దీంతో శివ్వంపేట మండలం దంతాన్‌పల్లిలో ఉండే చిన్నమ్మ మైసమ్మ వద్దకు ఇద్దరు చిన్నారులతో కలిసి చేరింది. కూలికి వెళ్లి వచ్చిన డబ్బులతో తన ఇద్దరు పిల్లలను పోషించుకుంటుంది. పెద్ద కూతురు పూజిత (7) గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతుండగా, రెండో కూతురు తేజస్విని (5) అంగన్వాడీ స్కూల్లో చదువుకుంటుంది. దశదినకర్మకు వెళ్తున్నానని.. దుబ్బాక మండలం వడ్డెపల్లిలో బంధువుల ఇంట్లో దశదిన కర్మకు వెళ్తున్నానని చిన్నమ్మకు చెప్పిన మమత.. ఇద్దరు కూతుర్లతో కలిసి ఇంటి నుంచి ఉదయం 8.30 గంటలకు బయలు దేరింది. నాగులపల్లి సమీపంలోని రైలు పట్టాలపై కూర్చొని తన బిడ్డలతో ‘నాన్న వద్దకు వెళుదాం’అని చెప్పింది. అనంతరం దంతాన్‌పల్లిలోని తన ఇంటి పక్కన ఉన్న కుటుంబ సభ్యులతో ఫోన్లో పిల్లలతో మాట్లాడించింది. ‘మా అమ్మ మమ్మల్ని.. మా నాన్న వద్దకు తీసుకెళుతానంటుంది, మేము అక్కడికే వెళ్తున్నాం’ఆ చిన్నారులు ఫోన్లో మాట్లాడారు. అనుమానం వచ్చిన పక్కింటి వారు రైలు పట్టాల వద్ద వెతికినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఫోన్ పని చేయలేదు. గంట అనంతరం హల్దీవాగులో ఇద్దరు చిన్నారులతో కలిసి దూకింది. మమత ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడగా.. పిల్లలు మృత్యువాతపడ్డారు. గజ ఈతగాళ్ల సహాయంతో వాగు నుంచి ఇద్దరు చిన్నారుల మృతదేహాలపై బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించా రు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సంఘటన స్థలా నికి చేరుకొని బో రున విలపించారు. పోలీసులు తల్లి మమతను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
కానిస్టేబుల్‌తో నిర్మల వివాహేతర సంబంధం..
వరంగల్ క్రైం: ములుగు జిల్లా వెంకటాపూర్ (కె) మండల కేంద్రానికి చెందిన ‘చేయూత’స్వచ్ఛంద సంస్థ కార్యకర్త చేడం సాయి ప్రకాశ్(30)ను కిడ్నాప్ చేసి హత్యకు పాల్పడినట్లు తెలిసింది. పోలీసులు, అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సాయి ప్రకాశ్ ఈనెల 15న వెంకటాపూర్ నుంచి హనుమకొండకు తన బంధువులను ఆస్పత్రికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత తన ఆచూకీ తెలియకపోవడంతో ఈనెల 16, 17 తేదీల్లో వెతికిన అనంతరం 18న బంధువులు హనుమకొండ పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తులో భాగంగా సాయిప్రకాశ్ హనుమకొండకు వచ్చిన ఆస్పత్రి, ఆ తరువాత వెళ్లిన దృశ్యాలను సీసీ టీవీ ఫుటేజీల ద్వారా పరిశీలించారు. తన ఫోన్ ద్వారా ఆచూకీ కనిపెట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికి వివరాలు రాకపోవడంతో ఏసీపీ కొత్త దేవేందర్‌రెడ్డి రెండు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అప్పటికే సాయి ప్రకాశ్‌ను కిడ్నాప్ చేసిన దుండగులు కరీంనగర్లో హత్య చేసినట్లు తెలిసింది. దీంతో సాయి ప్రకాశ్‌కు ఎవరితో శతృత్వం ఉందనే కోణంలో విచారణ చేపట్టడంతో నిందితుల సమాచారం తెలిసినట్లు తెలిసింది. నిందితుల్లో కానిస్టేబుల్? సాయి ప్రకాశ్ హత్య సంఘటనలో పాల్గొన్న నిందితుల్లో ఓ కానిస్టేబుల్ ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఇప్పటికే ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు సమాచారం. హనుమకొండలో సాయి ప్రకాశ్‌ను కిడ్నాప్ చేసి కరీంనగర్లో హత్య చేసినట్లు గుర్తించారు. ఈ హత్యకు గతంలో వెంకటాపూర్ పోలీస్ స్టేషన్లో పనిచేసిన ఓ కానిస్టేబుల్ ప్రధాన కారణమని తెలిసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కానిస్టేబుల్ శ్రీనివాస్‌తో కలిసి ప్రకాష్‌ను సుపారీ గ్యాంగ్‌తో పిన్ని నిర్మల హత్య చేయించింది. కానిస్టేబుల్ వివాహేతర సంబంధం విషయంలో సాయి ప్రకాష్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు పడినట్లు తెలిసింది. దానిని మనస్సులో పెట్టుకుని సాయి ప్రకాశ్‌ను కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు తెలిసింది. -
ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్‌పై దాడి కేసులో ట్విస్ట్
బెంగళూరు: ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్‌పై దాడి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. బెంగళూరులో తమపై కొందరు దాడి చేశారని వింగ్ కమాండర్ షీలాదిత్యా బోస్, ఆయన భార్య, స్క్వాడ్రన్ లీడర్ మధుమిత ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే.. తొలుత బోస్ దాడికి దిగినట్లుగా కన్పిస్తున్న సీసీటీవీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ విషయాన్ని ఓ పోలీసు అధికారి ధ్రువీకరించారు కూడా.భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ బోస్ సంచలన ఆరోపణలకు దిగారు. కారులో వెళ్తున్న తమను కొందరు వ్యక్తులు బైక్‌పై వచ్చి అడ్డగించి దాడి చేశారని ఆరోపించారు. ఆయన భార్య, స్క్వాడ్రన్ లీడర్ మధుమిత కూడా.. పోలీసులకు ఈ విషయం చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోతూ ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో బోస్ ముఖం, మెడ నిండా రక్తం కనిపించింది. పక్కనే ఆయన భార్య కారు నడుపుతూ కనిపించింది. ఈ వ్యవహారం ‘కన్నడిగ వర్సెస్ నాన్ కన్నడిగ’గా మారింది. అయితే వీడియో ఆధారంగా విచారణ జరిపిన ఈస్ట్ జోన్ డీసీపీ దేవ్‌రాజ్ షాకింగ్ విషయం తెలియజేశారు. తొలుత బోస్ వాళ్లపై దాడికి దిగారని తెలియజేశారు. అంతేకాదు.. ఈ ఘటనకు సంబంధించిన నిందితుడు కూడా బోస్పై ఫిర్యాదు చేశారని అన్నారు. అయితే పరస్పర దాడికి కారణాలు పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాతే తెలియజేస్తామన్నారు. బోస్, మధుమిత వీడియోలో.. ‘‘కారులో వెళ్తున్న మమ్మల్ని మా వెనకే బైక్‌పై వచ్చిన వ్యక్తులు అడ్డగించారు. మమ్మల్ని తిట్టడం మొదలుపెట్టారు. మా కారుపై ఉన్న డీఆర్డీఓ స్టిక్కర్‌ను చూశారు. నా భార్యను తిట్టడంతో తట్టుకోలేకపోయాను. దాంతో నేను కారు నుంచి బయటకు రావడంతో.. ఒక వ్యక్తి కీతో నా ముఖంపై కొట్టాడు. దాంతో నా ముఖమంతా రక్తం కారింది. మిమ్మల్ని రక్షించే వ్యక్తులతో మీరు ఇలాగేనా వ్యవహరించేదని’’ నేను గట్టిగా మాట్లాడాను. కానీ ఆశ్చర్యంగా ఇంకా చాలా మంది వ్యక్తులు వచ్చి, మమ్మల్ని దూషించడం మొదలుపెట్టారు. ఒక వ్యక్తి రాయి తీసుకొని, కారు అద్దాలను, నా తలను పగలగొట్టాలని ప్రయత్నించాడు. అదీ నా పరిస్థితి. వెంటనే అప్రమత్తమైన నా భార్య నన్ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లింది. ఫిర్యాదు చేద్దామని వెళ్తే అక్కడ ఎలాంటి స్పందనా రాలేదు. కర్ణాటకలో ఇలాంటి పరిస్థితులు ఆశ్చర్యంగా ఉన్నాయి.’’ అంటూ ఆ భార్యాభర్తలు వీడియోలో వ్యాఖ్యానించారు.#BREAKINGWing commander assault case in #BengaluruCCTV tells a different story.. Wing Commander Shiladitya Bose seen brutally assaulting the biker at Tin Factory JunctionDespite locals stepping in to stop the violence, the officer can be seen continuing the attack...blowing… pic.twitter.com/ovMg9g4xcS— Nabila Jamal (@nabilajamal_) April 21, 2025 -
Domalguda: నీటి సంపులో యువతి అస్తిపంజరం
కవాడిగూడ(హైదరాబాద్): లోయర్ ట్యాంక్ బండ్, డీబీఆర్ మిల్స్‌లోని నీటి సంపులో గుర్తుతెలియని యువతి అస్తిపంజరం బయటపడింది. ఆలస్యంగా వెలుగులోకి వచి్చన ఈ ఘటన ఆదివారం దోమల గూడ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. డీఆర్ఆర్మిల్స్ 40 ఏళ్ల క్రితమే మూతపడింది. సెక్యురిటీ సిబ్బంది ఆదివారం సాయంత్రం మూత్ర విసర్జన కోసం పురాతన భవనం వైపు వెళ్లాడు. అనంతరం నీటి కోసం 3వ అంతస్తులో ఉన్న సంపు మూత తెరిచి చూడగా యువతి మృత దేహం కనిపించింది. దీంతో అతను వెంటనే దోమల గూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సోమవారం ఉదయం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి వయస్సు 25 నుంచి 35 ఏళ్లలోపు వయస్సు ఉంటుందని భావిస్తున్నారు. ఆరు నెలల క్రితం ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి సంపులో పడవేసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. మృత దేహం పూర్తిగా కుళ్లిపోవడంతో నీటి సంపును పగల గొట్టారు. క్లుస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. గుర్తుతెలియని వ్యక్తులు సదరు యువతిని ఇక్కడికి తీసుకువచ్చి అత్యాచారం చేసి హత్య చేసి ఉండవచ్చునని భావిస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తీసుకెళ్లలేని పరిస్థితి ఉండటంతో గాంధీ ఆసుపత్రి ఫోరెన్సిక్ సిబ్బందిని రప్పించి సోమవారం మధ్యాహ్నం అక్కడే పోస్టు మార్టం నిర్వహించారు. దోమల గూడ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ నిరంజన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
Hyderabad: పారిశ్రామికవేత్త ఇంట్లో భారీ చోరీ
కాచిగూడ(హైదరాబాద్): వృద్ధ దంపతులకు భోజనంలో మత్తుమందు కలిపి దాదాపు 2 కిలోల బంగారు నగలు, రూ.3కోట్ల నగదు, ఖరీదైన కారు ఎత్తుకెళ్లిన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగులోకి వచి్చంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కాచిగూడ లింగంపల్లి అమ్మవారి దేవాలయం సమీపంలో పారిశ్రామికవేత్త హేమ్రాజ్ (62), అతడి భార్య మీనా దుగ్గర్ (59) నివాసముంటున్నారు. కొద్ది రోజుల క్రితం వారు నేపాల్‌కు చెందిన దంపతులను ఇంట్లో పనికి పెట్టుకున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఇటీవల వారి కొడుకు, కోడలు విదేశీ యాత్రకు వెళ్లడంతో హేమ్రాజ్, అతడి భార్య మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఇదే అదనుగా భావించిన పనివారు ఆదివారం రాత్రి భోజనంలో మత్తు మందు కలిపారు. వారు మత్తులోకి వెళ్లగానే ఇంట్లోని బంగారు ఆభరణాలు, నగదుతో ఉడాయించారు. ప్రతి రోజూ వాకింగ్‌కు వెళ్లే హేమరాజ్ సోమవారం వాకింగ్‌కు రాకపోవడంతో అతని స్నేహితుడు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచి్చంది. దీంతో అతను స్నేహితుడి ఇంటికి వచ్చి తలుపు కొట్టడంతో మత్తులో ఉన్న హేమ్రాజ్ డోర్ తీశాడు. భార్య మీనా పూర్తిగా మత్తులోకి జారుకుంది. దీనిని గుర్తించిన అతను వారిని హైదర్‌గూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చించాడు. ప్రస్తుతం హేమ్రాజ్ స్పృహలో ఉన్నాడని, అతని భార్య ఇంకా స్పృహలోకి రాలేదని స్థానికులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని ఈస్ట్‌జోన్ డీసీపీ, అడిషనల్ డీపీసీ, కాచిగూడ డిఐ, ఎస్ఐ పరిశీలించారు. క్లూస్‌టీంను రప్పించి ఆధారాలను సేకరించారు. నాలుగు టీంలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బ్లాక్‌మెయిల్‌కు బలైన ప్రతిభా కుసుమం
రాయచూరు రూరల్(కర్ణాటక): పాగల్ ప్రేమికుని వేధింపులకు ప్రతిభా కుసుమం రాలిపోయింది. పరువు పోతుందనే వ్యథతో ఓ వ్యాయామ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన గదగ్ జిల్లా అసుండి గ్రామంలో చోటు చేసుకుంది. మాజీ ప్రియుడు బ్లాక్మెయిల్ చేస్తుండటంతో భయపడి గదగ్ తాలూకా అసుండి సైరా బాను నదాఫ్ (29) డెత్‌నోట్ రాసి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మే 8న సైరాబానుకు ఓ యువకునితో పెద్దలు పెళ్లి నిశ్చయం చేశారు. పెళ్లి కోసం ఆమె తల్లిదండ్రులు వస్తుసామగ్రిని కొనుగోలు చేశారు. గతంలో ఆమెకు మైలారి అనే వ్యక్తితో ప్రేమ వ్యవహారం ఉండేది. మరొకరిని పెళ్లాడతావా అనే దుగ్ధతో మైలారి రగిలిపోయాడు. గతంలో తామివద్దరూ కలిసి ఉన్న ఫోటోలు వీడియోలను, అలాగే ఆడియోలను వైరల్ చేస్తానంటూ సైరాబానును బెదిరించసాగాడు. ఈ విషయం ఇంట్లో తెలిస్తే పెళ్లి ఆగిపోతుంది, పరువు పోతుందని ఆమె బాధపడింది. తన చావుకు మైలారి కారణమని నోట్ రాసి ఉరివేసుకుని చనిపోయింది. ఆటల్లో ఆమె మేటి సైరాబాను చిన్నచాటి నుంచి ఆటపాటల్లో మేటిగా ఉండేది. క్రీడాంశాల్లో ప్రతిభావంతురాలు. స్కూలు, కాలేజీ రోజుల్లో క్రీడాకారిణిగా ట్రోఫీలను సాధించింది. కుస్తీ పోటీలలో రాష్ట్ర స్థాయిలో పేరు సంపాదించింది. అదే నైపుణ్యంతో పీఈటీ కోర్సు పూర్తి చేసి ప్రస్తుతం ఓ ప్రైవేటు స్కూల్లో డ్రిల్ టీచర్‌గా ఉద్యోగం చేస్తోంది. గదగ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మైలారిని అరెస్టుచేశారు. -
ఇంటి కలహం.. అంతు చూసింది
కర్ణాటక: విశ్రాంత డీజీపీ ఓం ప్రకాష్ ఆదివారం ఇంట్లో డైనింగ్ టేబుల్‌పై చేపల కూరతో భోజనం చేస్తుండగా హత్య చేసినట్లు తెలిసింది. బెంగళూరు హెచ్ఎస్ఆర్ లేఔట్ లోని నివాస భవనంలో ఆయన దారుణ హత్యకు గురికావడం తెలిసిందే. ఆయన భార్య పల్లవి, కూతురు కృతిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. హత్యా సంగతులు క్రమంగా బయటపడుతున్నాయి. మధ్యాహ్నం ఓంప్రకాష్ చేపల కూరను తెప్పించుకున్నారు. డైనింగ్టేబుల్పై ఆరగిస్తుండగా భార్య గొడవకు దిగింది. రగడ తారాస్థాయికి చేరుకుంది, భార్య ఆవేశం పట్టలేక ఓంప్రకాష్ కళ్లలో కారంపొడి చల్లి కత్తితో పొడిచి చంపింది. తరువాత పై అంతస్తు గదిలోకి వెళ్లిన భార్య, కుమార్తె పోలీసులకు సమాచారం అందించారు. హెచ్‌ఎస్‌ఆర్‌లేఔట్ పోలీసులు వెళ్లగానే కూతురు కృతి తలుపులను లాక్ చేసింది. హత్య చేసింది ఎవరు అని పోలీసులు ప్రశ్నించగా భార్య పల్లవి నేనే అని బదులిచ్చింది. క్రైంసీన్ పరిశీలనలో భోజనం ప్లేట్ డైనింగ్టేబుల్పై కనబడింది. డైనింగ్ హాల్ రక్తసిక్తమైన ఓంప్రకాష్ శవం పడి ఉంది. కళ్లలో కారంపొడి చల్లిన గుర్తులు కనబడ్డాయి. చాకుతో , బీర్ బాటిల్‌తో పొడిచారు. పగిలిన బీర్ బాటిల్ లభించింది. సోమవారం ఉదయం తల్లీకూతురిని హెచ్ఎస్ఆర్ లేఔట్ ఠాణాకు తరలిస్తుండగా గొడవకు దిగారు. మమ్మల్ని ఎందుకు అరెస్టు చేశారు అని కేకలు వేస్తూ జీపు నుంచి దిగలేదు. పోలీసులు సముదాయించి తీసుకెళ్లారు. ఓంప్రకాష్ హత్య కేసు విచారణను మడివాళ ఏసీపీ వాసుదేవ్ కు అప్పగించారు. కాగా, కుటుంబసభ్యులు సంప్రదాయరీతిలో అంత్యక్రియలను నిర్వహించారు. మరో మహిళతో ఎఫైర్ ఓంప్రకాష్ చిక్కమగళూరుకు చెందిన మహిళతో ఆత్మీయంగా ఉంటున్నారు. సదరు మహిళ 2015లో ఓంప్రకాష్ డీజీపీగా ఉండగా ప్రధాన కార్యాలయం ముందు ధర్నా చేసింది. ఓంప్రకాష్ మోసం చేశాడని ఆరోపించింది. ఈ సంఘటన ఓంప్రకాష్ దంపతుల మధ్య కలహాలకు కారణమైంది. ఇప్పుడు ఆమెను కూడా కనిపెట్టి విచారణ చేయాలని పోలీసులు తీర్మానించారు. శాంతిభద్రతలు ఉన్నాయా: విపక్ష నేత దొడ్డబళ్లాపురం: రిటైర్డ్ డీజీపీ ఓం ప్రకాశ్ తన కుటుంబ సభ్యుల చేతుల్లో దారుణ హత్యకు గురికావడం రాష్ట్రంలో శాంతిభద్రతల దుస్థితికి అద్దం పడుతోందని బీజేపీ పక్ష నేత ఆర్ అశోక్ విమర్శించారు. బెంగళూరులో మాట్లాడుతూ ఈ హత్య విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ అసలు ఉందా అనే అనుమానం కలుగుతోందన్నారు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు రోజూ ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయన్నారు.దాండేలిలో ఫాంహౌస్, రిసార్టు ఓంప్రకాష్ గతంలో ఉత్తర కన్నడ జిల్లా ఎస్పీగా పనిచేశారు. ఆయనకు దాండేలిలో కోట్లాది రూపాయలు విలువచేసే ఆస్తులు ఉన్నాయి. సామజోయిడా గ్రామంలో 2 ఎకరాలకు పైగా భూమిలో సుందరమైన ఫాంహౌస్‌ను నిర్మించారు. శ్రీగంధం, అరటి తోట వేశారు. అక్కడే కాళీనది పక్కన ఐదెకరాల భూమి ఉంది ఈ స్దలంలో రిసార్టు నిర్మించి పర్యాటకులకు రివర్ ర్యాఫ్టింగ్ కూడా చేస్తున్నారు. ఈ ఆస్తి ఓంప్రకాష్ కుమారుడు కార్తీకేశ్ పేరులో ఉంది.ఇప్పుడే చెప్పలేను: హోంమంత్రి రిటైర్డ్ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య కేసులో సమగ్ర విచారణ జరిగేవరకు ఏమి చెప్పేందుకు సాధ్యపడదు. తనిఖీలో ఎలాంటి సమాచారం లభిస్తుంది అనేది చూడాల్సి ఉందని హోం మంత్రి పరమేశ్వర్ అన్నారు. ఉత్తమ అధికారికి, మంచి వ్యక్తి. ఈ విధంగా జరుగకుండా ఉండాల్సిందని అన్నారు. విచారణ పూర్తయ్యేవరకు ఘటనకు కారణం ఏమిటనేది చెప్పలేమని అన్నారు. క్రూరంగా హత్య చేశారు బనశంకరి: విశ్రాంత డీజీపీ ఓంప్రకాష్ హత్యకు గురయ్యే గంట ముందు వరకు వ్యక్తిగత సిబ్బందితో బాగానే మాట్లాడారు, ఇలా హత్యకు గురికావడం దురదృష్టకరమని వీవీఐపీ సెక్యూరిటీ విభాగం ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఓంప్రకాష్ ఇంటి వద్ద ఆయన మాట్లాడుతూ.. ఆదివారం మధ్యాహ్నం 3.05 నిమిషాలకు ఓంప్రకా‹Ùకు ఫోన్ చేస్తే సంతోషంగా మాట్లాడారు, సోమవారం ఇంటికి వస్తాను సార్ అని చెప్పా, వద్దు ఇంట్లో మేడం ఉన్నారని సార్ చెప్పారు అని పేర్కొన్నారు. చాలా క్రూరంగా హత్య చేశారని, గొంతు భాగంలో రెండుసార్లు పొడిచారు, మృతదేహాన్ని చూడగానే సారేనా హత్యకు గురైంది అని దిగ్భ్రాంతికి లోనయ్యాను అన్నారు. కుమార్తెకు పెళ్లి చేసి, కొడుకుతో ఉంటానని చెప్పేవారన్నారు. -
‘నేను లేని టైమ్ చూసి నాన్నను చంపేశారు’
బెంగళూరు: ఓ రాష్ట్రానికి డీజీపీగా పని చేసిన వ్యక్తి దారుణంగా హత్య గావించబడటం చాలా విచారకరం. అది కూడా భార్య, కూతురు కలిసి చేసిన మాస్టర్ ప్లాన్ కు బలికావడం ఇంకా దురదృష్టకరం. కర్ణాటక రాష్ట్ర మాజీ డీజీపీ ఓమ్ ప్రకాష్ హత్య అనంతరం అనేక విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భార్య పల్లవి బాధ పడలేక తన సోదరి సరితా కుమారి ఇంటి వద్దే ఉంటున్న ఓమ్ ప్రకాష్ ను ఇంటికి రప్పించి మరీ హత్య చేయడం సమాజంలోని పరిస్థితులు ఇంతలా దిగజారిపోవడానికి అద్దం పడుతోంది. నేను ఇంట్లో లేని సమయంలోనే నాన్న హత్యఅయితే ఈ విషయంలో కుమారుడు కార్తీకేష్ ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం తల్లి, సోదరి పాత్రలను ప్రముఖంగా ప్రస్తావించాడు. గత కొంతకాలంగా తల్లి పల్లవి.. నాన్నను చంపుతానంటూ బెదిరిస్తోందనే విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే గతంలో నాన్నపై హత్యాయత్నం చేయడానికి అమ్మ యత్నించిందన్నాడు. పెద్ద రాయి తీసుకుని తలపై కొట్టి చంపాలని చూసిందన్నాడు.‘ మా తండ్రిని చంపుతానని పదే పదే అమ్మ బెదిరిస్తూ వస్తోంది. ఈ బెదిరింపులతో మా నాన్న కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోయి బయటే ఉంటున్నారు. నాన్న సోదరి( మా అత్త) సరితా కుమారి ఇంటికి వెళ్లిపోయి అక్కడే ఉంటున్నారు. అయితే రెండు రోజుల క్రితం నా సోదరి కృతి.. నాన్న వద్దకు వెళ్లింది. ఇంటికి తిరిగి రావాలని పట్టుబట్టింది. నేను రానని నాన్న చెప్పినా పట్టుబట్టుకుని కూర్చొంది. దాంతో నాన్న తిరిగి ఇంటికి వచ్చారు.నాన్నను వెంట తీసుకునే వచ్చింది కృతి. ఇష్టంలేకుండానే నాన్న ఇంటికి వచ్చారు. ఇంతలోనే ఈ దారుణం జరిగిపోయింది. నేను ఇంట్లో లేని సమయం చూసి వాళ్లిద్దరూ కలిసి నాన్నను హత్య చేశారు. నాకు ఓ స్నేహితుడు ఫోన్ చేసి చెప్పాడు. మీ నాన్నకు ఇలా అయ్యిందనే విషయాన్ని చెప్పాడు. నేను సరిగ్గా నిన్న సాయంత్రం(ఆదివారం) గం. 5.45 ని.లకు ఇంటికి తిరిగి వచ్చేశాను. అప్పటికే మా ప్రాంగణమంతా పోలీసులు, చుట్టుపక్కల వారితో నిండిపోయి ఉంది. నేను మా నాన్న రక్తమడుగులో పడి ఉండటం చూశాం. ఆయన శరీరమంతా గాయాలతో నిండిపోయింది. నాన్న శరీరంలో పగిలిన బాటిల్, కత్తి ఉండటాన్ని గమనించాను. అప్పుడు సెయింట్ జాన్స్ హాస్పిటల్ప్ కి నాన్నని తీసుకెళ్లాం. మా అమ్మ, చెల్లి కూడా పూర్తి డిప్రెషన్ లో ఉన్నారు. అమ్మా, సోదరి కలిసే నాన్నను హత్య చేశారనే విషయాన్ని బలంగా నమ్ముతున్నా’ అని పోలీస్ లకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో కార్తీకేష్ చెప్పుకొచ్చాడు.12 ఏళ్లుగా.. భయం భయంగానే? -
తెల్లారితే భార్య ప్రసవం.. పిడుగు పాటుతో భర్త మృతి
ఎమ్మిగనూరురూరల్(కర్నూలు): తెల్లారితే తన రక్తాన్ని పంచుకుని పుట్టే శిశువును ఆ యువకుడు చూడాల్సి ఉంది. అయితే విధి పగపట్టింది. పసికందును చూడకుండానే పిడుగు రూపంలో మృత్యు ఒడికి చేర్చింది. ఈ దుర్ఘటన ఆదివారం రాత్రి ఎమ్మిగనూరు మండలం గుడేకల్ కొండపై చోటుచేసుకుంది. పెద్దకడుబూరు మండలం హనుమాపురం గ్రామానికి చెందిన గొల్ల ఈరన్న(25) ఎమ్మిగనూరు యాక్సిస్ బ్యాంక్‌లో బంగారు నగలపై తీసుకున్న రుణాలు రికవరీ చేసే ఉద్యోగం చేస్తున్నాడు. ఈ యువకుడు అదే గ్రామానికి చెందిన గొల్ల సరస్వతిని పెళ్లి చేసుకున్నాడు. సరస్వతి నేడు (సోమవారం) ప్రసవం అవుతుందని వైద్యులు చెప్పారు. గొల్ల ఈరన్న తల్లి లక్ష్మీకి అనారోగ్యంగా ఉండటంతో గుడేకల్ కొండపై ఉండే సుంకాలమ్మకు మొ క్కు తీర్చుకుంటే తగ్గుతుందని పెద్దలు చెప్పారు. దీంతో ఆదివారం సాయంత్రం గొల్ల ఈరన్న, అతని స్నేహితులు, బంధువులైన సహదేవుడు, ఈరన్న, రామాంజనేయులు కలసి కొండపై శ్రీ సుంకాలమ్మ గుడి దగ్గరకు వెళ్లారు. మొక్కుబడి తీర్చుకొని అక్కడే వంట చేసుకొని భోజనం చేశారు. ఆకస్మాత్తుగా ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు రావడంతో చెట్టు కిందకు నలుగురు వెళ్లారు. చెట్టు కింద కూర్చున్న గొల్ల ఈరన్నపై పిడుగు పడటంతో అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయాడు. పక్కనే ఉన్న సహదేవుడు, ఈరన్న, రామాంజనేయులకు స్వల్ప గాయాలయ్యాయి. గ్రామంలో ఉన్న బంధువులకు సమాచారం అందించటంతో అక్కడికి వచ్చి గొల్ల ఈరన్నతో పాటు మరో ముగ్గురిని చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే గొల్ల ఈరన్న(25) మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తన భార్య సరస్వతికి సోమవారం ప్రసవం ఉందని బంధువుల దగ్గర గొల్ల ఈరన్న చెప్పారు. భార్య ఒకరికి ప్రాణం పోసేలోపే భర్త ప్రాణం పిడుగు రూపంలో తీసుకుపోవటంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. రూరల్ ఏఎస్ఐ రామేశ్వరావు, కానిస్టేబుల్ బి.గోపాల్ ప్రభుత్వాసుపత్రికి వచ్చి ప్రమాదం జరిగిన తీరును మృతుడి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎమ్మిగనూరు రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు చెప్పారు. -
Bengaluru: 12 ఏళ్లుగా.. భయం భయంగానే?
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య కేసు దర్యాప్తు లోతుకు వెళ్లే కొద్దీ షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. భార్య పల్లవి ఆయనపై ఓ బాటిల్‌తో దాడి చేసి.. ఆపై కారం పొడి చల్లి కట్టేసి మరీ కడతేర్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ప్రాణం పోతున్న టైంలో పోలీసులకు సమాచారం అందించిన ఆమె.. భర్త ముఖం మీద గుడ్డ కప్పి తాపీగా కుర్చీలో కూర్చుని చూస్తున్నట్లు తేలింది.బెంగళూరు: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్(Ex DGP Om Prakash) తనయుడు కార్తీక్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఓం ప్రకాశ్ భార్య పల్లవి, కూతురు క్రుతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత 12 ఏళ్లుగా స్కిజోఫ్రెనియా(Schizophrenia)తో బాధపడుతోంది. నగరంలోని ఓ ప్రముఖ వైద్యుడి దగ్గర ఆమె చికిత్స కూడా తీసుకుంటోంది. ఈ క్రమంలో గత కొంతకాలంగా భర్తపైనా ఆమె సంచలన ఆరోపణలు చేస్తూ వస్తోంది. తన ప్రాణాలకు తన భర్త నుంచి ముప్పు పొంచి ఉందని.. తుపాకీతో పలుమార్లు బెదిరించడాన్ని ఫ్యామిలీకి చెందిన ఐపీఎస్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపులో మెసేజ్‌లు పెడుతూ వచ్చింది. అయితే ఆమె మానసిక స్థితి గురించి తెలిసిన ఓం ప్రకాశ్.. ఆ చేష్టలను తేలికగా తీసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో.. ఈ మధ్య ఆస్తి తగాదాలు మొదలయ్యాయి. ఈ కారణాలతోనే ఆమె భర్తను హత్య చేసి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా ఓ అంచనాకి వచ్చినట్లు ఇండియా టుడే ఓ కథనం ప్రచురించింది. ఆదివారం సాయంత్రం నుంచి పల్లవి(Pallavi)ని, క్రుతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే పోస్టుమార్టం నివేదిక వచ్చాకే ఈ కేసులో అరెస్టులు చేస్తామని బెంగళూరు కమిషనర్ బీ దయానంద్ చెబుతున్నారు. ఈ ఘటనను దురదృష్టకరమైందిగా అభివర్ణించిన హోం మంత్రి పరమేశ్వర.. ఓం ప్రకాశ్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరుగుతుందని పేర్కొన్నారు. 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఓం ప్రకాశ్ స్వస్థలం బిహార్‌లోని చంపారన్. 2015 మార్చి 1న కర్ణాటక డీజీపీగా బాధ్యతలు చేపట్టి, 2017లో పదవీ విరమణ పొందారు. ఆపై కుటుంబంతో బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో నివసిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన భార్య పల్లవి ఇచ్చిన సమాచారంతో ఇంటికి వెళ్లిన పోలీసులు.. ఓం ప్రకాశ్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు. చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. హత్య అనంతరం మరో మాజీ డీజీపీకి ‘ఐ హ్యావ్ ఫినిష్డ్ మాన్స్టర్’ అంటూ ఫోనులో మెసేజ్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన ఛాతీలో, మెడ వద్ద, కడుపులో, చేతిలో కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తీవ్ర రక్త స్రావం కారణంగానే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటన జరిగిన టైంలో కూతురు క్రుృతి కూడా ఇంట్లోనే ఉంది. దీంతో ఆమె పాత్ర కూడా ఏమైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.స్కిజోఫ్రెనియా(Schizophrenia).. ఈ సమస్యతో బాధపడేవారు ఎప్పుడూ ఒక రకమైన భ్రమలో ఉంటారు. లేనిపోనివి ఊహించుకుని భయపడిపోతుంటారు. మనస్సులో ఏదో ఊహించుకుంటూ నిరంతరం ఆందోళన చెందుతూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులు వాస్తవానికి దూరంగా ఊహల్లో ఉంటారు. తమలో తాము మాట్లాడుకోవడం, నవ్వుకోవడం, ఇతరులను పట్టించుకోకుండా తన మానాన తానుండటం, నిరంతర ఆలోచనలు, నిద్రలేమి, ఎవరో పిలుస్తున్నట్టుగా, తనతో మాట్లాడుతున్నట్టుగా భావించి సమాధానం ఇవ్వడంలాంటివి వ్యాధి లక్షణాలు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సైకియాట్రిస్టును సంప్రదించాల్సి ఉంటుంది. -
చిన్నారిని ఛిదిమేసిన కారు
గోదావరిఖని(రామగుండం): రెండోకాన్పు కోసం తల్లిగారింటికి వచ్చింది.. పండంటి పాపకు జన్మనిచ్చింది. అంతా సంతోషంగా ఉన్న సమయంలో ఆమె మొదటి సంతానం మూడేళ్ల బాలున్ని కారు రూపంలో మృత్యువు బలితీసుకుంది. గోదావరిఖని వన్‌టౌన్ ఎస్సై భూమేశ్ కథనం ప్రకారం.. స్థానిక గంగానగర్‌లో శివరాజ్‌కుమార్(3) ఆదివారం కారు ఢీకొని మృతిచెందాడు. ముత్తారం మండలం మచ్చుపేట గ్రామానికి చెందిన పులిపాక రమేశ్ కొండగట్టు జేఎన్టీయూలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడికి గంగానగర్‌కు చెందిన సంధ్యతో వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల శివరాజ్‌కుమార్ ఉండగా, సంధ్య రెండో కాన్పుకోసం తల్లిగారింటికి గంగానగర్ వచ్చింది. పాప జన్మించి మూడు నెలలు అయ్యింది. ఆదివారం కుటుంబ సభ్యులతో శివరాజ్‌కుమార్ ఆడుకుంటూ అనుకోకుండా ఒక్కసారిగా రోడ్ పైకి రాగా, మంచిర్యాల్ నుంచి గంగానగర్‌కు వెళ్తున్న కార్ ఢీకొట్టింది. ఈప్రమాదంలో శివరాజ్‌కుమార్ మెడపై భాగంలో గాయాలయ్యాయి. స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి, అక్కడ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అప్పటివరకు అందరితో ఆడుకుంటూ క్షణాల్లో మాయమైన కుమారున్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించడం అందరినీ కంటతడి పెట్టించింది. -
ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
దుండిగల్(హైదరాబాద్): ఓఆర్ఆర్పై వేగంగా దూసుకువచ్చిన కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు సాఫ్వేర్ ఇంజినీర్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన భాను ప్రకాశ్ (36), నళినికంఠ బిస్వాల్ (37)లు స్నేహితులు. వీరు తమ కుటుంబాలతో కలిసి రాజేంద్రనగర్ మంచిరేవులలోని ఓ అపార్ట్మెంట్లో నివాసముంటూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. వీరిద్దరు ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో మేడ్చల్ నుంచి పటాన్చెరు వైపు కారులో వస్తున్నారు. ఈ క్రమంలో మల్లంపేట ఓఆర్ఆర్ ఎగ్జిట్ వద్ద వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భాను ప్రకాశ్, బిస్వాల్ అక్కడికక్కడే మృతి చెందారు. భాను ప్రకాశ్ భార్య సాయి లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిద్రమత్తుతో పాటు అతివేగం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. -
బెట్టింగ్ యాప్స్‌లో గెలిచిన డబ్బులు తీసుకోలేని పరిస్థితి..!
సాక్షి, హైదరాబాద్: అత్తాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో గురువారం ఆత్మహత్య చేసుకున్న పవన్.. షాద్‌నగర్ ఠాణా పరిధిలో శనివారం వెలుగులోకి వచ్చిన సాయిరాహుల్ హత్య.. మూడు రోజుల వ్యవధిలోనే ఈ రెండు దారుణాలకు బెట్టింగ్ యాప్సే కారణం. ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసినప్పటికీ... వీటి కార్యకలాపాలు మాత్రం ఆగట్లేదు. ఈ బెట్టింగ్, గేమింగ్స్ యాప్స్ వెనుక చైనీయులే ఉంటున్నారు. ఉత్తరాదిలోని మెట్రో నగరాల కేంద్రంగా, స్థానికులతో షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి దందా నడిపిస్తున్నారు. ప్రత్యేక ఆల్గర్‌థెమ్ ఆ«ధారంగా పని చేసే ఈ యాప్స్ నిర్వాహకులకే లాభం చేకూర్చేలా పని చేస్తుంటాయి. వీటిలో డబ్బు వేయడానికి పరిమితులు లేకపోయినా.. డ్రా చేసుకోవడానికి మాత్రం పరిమితులు ఉంటాయి. ఇలా గెలిచినా, ఓడినా ఆ మొత్తం తమ అ«దీనంలోనే ఉండేలా డిజైన్ చేస్తున్నారు. మరో రెండు ప్రాణాలు బలి.. సీరియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రారంభించిన ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’ ప్రచారం తర్వాత ప్రభుత్వం ఈ బెట్టింగ్ యాప్స్ కేసుల దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసింది. అయినప్పటికీ యాప్స్ తమ కార్యకలాపాలు మాత్రం ఆపలేదు. ఇప్పటికీ కొన్ని యాప్స్ ఆన్లైన్ ద్వారా తమ ప్రచారం కొనసాగిస్తున్నాయి. బెట్టింగ్‌కు బానిసగా మారిన యువకుడు అత్తాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్నాళ్లుగా ఈ బెట్టింగ్‌కు అలవాటుపడిన పవన్ స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల నుంచి డబ్బు తీసుకున్నాడు. చివరకు తాను ఎంతో ముచ్చటపడి ఖరీదు చేసుకున్న బుల్లెట్, ఐఫోన్ సైతం అమ్మేశాడు. బెట్టింగ్ విషయంలో నగరంలోని ఓ హాస్టల్లో ఉంటున్న సాయి రాహుల్, వెంకటేష్ మధ్య ఏర్పడిన వివాదం రాహుల్ ప్రాణాలు తీసే వరకు వెళ్లింది. ఓ చోట కంపెనీ, మరోచోట అకౌంట్లు.. ఈ గేమింగ్ యాప్స్‌లో లావాదేవీలన్నీ ఆన్లైన్లోనే జరుగుతాయి. ఈ నేపథ్యంలో కరెంట్ బ్యాంకు ఖాతాలు నిర్వాహకులకు అనివార్యం. చైనీయులకు నేరుగా ఖాతాలు తెరిచే అవకాశం లేకపోవడంతో దళారుల ద్వారా ఉత్తరాదికి చెందిన వారిని సంప్రదిస్తున్నారు. డమ్మీ డైరెక్టర్లను ఏర్పాటు చేసి షెల్ కంపెనీలు రిజిస్టర్ చేయించుకుంటున్నారు. ఓ నగరంలో కంపెనీ రిజిస్టర్ చేస్తే.. మరో నగరంలో దాని పేరుతో బ్యాంకు ఖాతాలను తెరుస్తున్నారు. డమ్మీ కంపెనీల పేరుతో వెబ్‌సైట్స్‌ను రిజిస్టర్ చేస్తున్నారు. వీటి ముసుగులోనే బెట్టింగ్, గేమింగ్ యాప్స్ నిర్వహిస్తున్నారు. ఆ కంపెనీల పేరుతోనే పేమెంట్ గేట్వేస్ అయిన కాష్ ఫ్రీ, పేటీఎం, రేజర్ పే, ఫోన్ పే, గూగుల్ పేలతో లావాదేవీలకు ఒప్పందాలు చేసుకున్నారు. లింకుల ద్వారానే యాప్స్ చలామణి.. ఈ యాప్స్‌ను నిర్వాహకులు ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్స్‌లో హోస్ట్ చేయట్లేదు. కేవలం టెలిగ్రాం, వాట్సాప్ గ్రూపుల ద్వారా లింకుల రూపంలో మాత్రమే చలామణి చేస్తున్నారు. ఈ లింకు ద్వారా యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆపై అందులో నగదు నింపడాన్ని లోడింగ్‌గా పిలుస్తారు. ఒక వ్యక్తి, ఒక రోజు ఎంత మొత్తమైనా లోడ్ చేసుకోవచ్చు. ఎదుటి వ్యక్తికి తమ గేమ్‌కు బానిసలుగా మార్చడానికి గేమింగ్ కంపెనీలు పథకం ప్రకారం వ్యవహరిస్తున్నాయి. ఈ గేమ్స్ అన్నీ వాటి నిర్వాహకులు రూపొందించిన ప్రత్యేక ఆల్గర్‌థెమ్ ద్వారా నడుస్తుంటాయి. దాని ప్రకారం గేమ్ ఆడటం కొత్తగా ప్రారంభించిన వారి ఐపీ అడ్రస్ తదితర వివరాలను నిర్వాహకులు సంగ్రహిస్తారు. దీని ఆధారంగా తొలినాళ్లల్లో దాదాపు ప్రతి గేమ్‌లోనూ వాళ్లే గెలిచేలా చేసి బానిసలుగా మారుస్తారు. ఆపై గెలుపు–ఓటములు 3:7 రేషియోలో ఉండేలా ఆల్గర్‌థెమ్ పని చేస్తుంది. రోజుకు విత్‌డ్రా రూ.500.. ఈ బెట్టింగ్, గేమింగ్‌లో ఓ వ్యక్తి ఎంత మొత్త గెలిచాడనేది ఆయా యాప్స్‌కు సంబంధించిన వర్చువల్ అకౌంట్లలో కనిపిస్తూ ఉంటుంది. ఆ మొత్తాన్ని గేమింగ్‌లో వెచి్చంచడానికి పరిమితులు ఉండవు. విత్‌డ్రా చేసుకోవడానికి ఆ మొత్తాన్ని తొలుత యాప్ నుంచి బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి మాత్రం నిర్వాహకులు పరిమితులు విధిస్తున్నారు. కనిష్టంగా రూ.500 నుంచి రూ.1000 వరకు మాత్రమే విత్‌డ్రా చేసుకునే అవకాశం ఇస్తున్నారు. ఈ కారణంగా ఎవరైనా ఆయా గేమ్స్, బెట్టింగ్‌లో గెలిచినా.. డబ్బు డ్రా చేసుకోలేని పరిస్థితి ఉంటోంది. దీంతో అప్పటికే బానిసై ఉండటంతో ఆ మొత్తం వెచ్చించి ఆడటానికే ఆసక్తి చూపి నష్టపోతున్నారు. ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉన్న ఆన్లైన్ గేమింగ్‌కు రాష్ట్రంలో అనుమతి లేదు. ఇక్కడ ఎవరైనా ఆ యాప్‌ను ఓపెన్ చేస్తే.. జీపీఎస్ ఆధారంగా విషయం గుర్తించే నిర్వాహకులు గేమ్‌కు అక్కడ అనుమతి లేదంటూ స్క్రీన్‌పై సందేశం కనిపించేలా చేస్తారు. అయితే ఫేక్ జీపీఎస్ యాప్స్‌ను ఇన్‌స్టల్ చేసుకుంటున్నారు. -
అందంగా లేదని చిత్రహింసలు
రాయచూరురూరల్(కర్ణాటక): ఎన్నో ఆశలతో అత్తింటిలోకి అడుగు పెట్టిన నవ వధువుకు కొద్ది రోజుల్లోనే వేధింపులు ఎదురయ్యాయి. అందంగా లేవని సూటిపోటి మాటలతో చిత్రహింసలు పెట్టడంతో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గదగ్ జిల్లాలో చోటు చేసుకుంది. గదగ్ బేటిగేరిలోని శరణ బసవేశ్వర కాలనీకి చెందిన అమరేష్‌కు బళ్లారికి చెందిన పూజాతో నాలుగు నెలల క్రితం వివాహమైంది. భర్త అమరేష్ యాదగరి జిల్లా శహపురలోని ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇటీవలే ఇతర ప్రాంతానికి బదలీ చేశారు. కొద్ది రోజలు పాటు బేటిగేరిలోనే ఉండాలని, అనంతరం బదిలీ అయిన ప్రాంతానికి తీసుకెళ్తాని భర్త చెప్పి వెళ్లిపోయాడు. అనంతరం ఆమెకు అత్తింటిలో వేధింపులు మొదలయ్యాయి. అందంగా లేవని, వంటలు సరిగా చేయడం లేదని అత్త శశికళ, బావ వీరన గౌడలు సూటిపోటిమాటలతో మనస్సు నొచ్చుకునేలా వ్యవహరించేవారు. ఈ విషయాన్ని పుట్టింటి వారికి చెప్పగా కొద్ది రోజులు సర్దుకొని వెళ్లాలని సూచించారు. అయితే వేధింపులు ఎక్కువ కావడంతో పూజా ఈనెల 15న ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వెళ్లి పరిశీలించగా సూసైడ్ నోట్ లభించింది. అత్త శశికళ, బావ వీరన గౌడ వేధించినట్లు అందులో ఉండటంతో వారిని పోలీసుల అరెస్ట్ చేశారు. -
నిశ్చితార్థం వేళ.. చితి మంటల ఘోష!
తూర్పు గోదావరి(పిఠాపురం): తెల్లారితే కాబోయే ధర్మపత్నికి దండ వేసి, ఉంగరాలు మార్చుకోవాల్సిన ఆ యువకుడి బతుకు అంతలోనే తెల్లారిపోయింది. నిత్యం వేదం పలికే ఆ గొంతు మూగబోయింది. తాంబూలాలు అందుకోవాల్సిన తండ్రి తల కొరివి పెట్టాల్సి వచ్చింది. కొద్ది గంటల్లో ఓ యువతితో నిశ్చితార్థం చేసుకోవాల్సిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక ఘటన కాకినాడ జిల్లా పిఠాపురంలో చోటు చేసుకుంది. బంధువుల కథనం ప్రకారం.. వింజమూరి వెంకటేష్ (30) పిఠాపురంలో పురోహితుడిగా జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం అతని వివాహ నిశ్చితార్థం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో శనివారం ఉదయమే కోనసీమ జిల్లాలోని వాడపల్లి వెళ్లి, వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని వచ్చాడు. నిశ్చితార్థంలో వధువుకు, తనకు కావాల్సిన ఉంగరాలను తమ వేలి ముద్రలు ఉండేలా ప్రత్యేకంగా ముంబయిలో ఆర్డరు ఇచ్చి మరీ తయారు చేయించుకున్నాడు. కొత్త దుస్తులు, ఇతర సామగ్రి సిద్ధం చేసుకున్నాడు. స్నేహితులకు, తోటి పురోహితులకు ఆహా్వనం పలికాడు. సంప్రదాయం ప్రకారం ఇంట్లో వారు నిశి్చతార్థానికి అన్ని ఏర్పాట్లూ చేశారు. ఇంతలో ఏమైందో ఏమో కానీ.. ఊహించని విధంగా శనివారం అర్ధరాత్రి పిఠాపురం సమీపంలో వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి మరీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని స్థానికులు గమనించి, రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. సామర్లకోట రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఆత్మహత్య చేసుకునేంత సమస్యలేవీ లేవని చెబుతూ కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. తండ్రి శర్మ, తల్లి లక్ష్మి గుండెలవిసేలా రోదించారు. నిశి్చతార్థం కోసం తెచి్చన పూలను అంతిమ యాత్రకు వినియోగించాల్సి వచ్చింది. నిశ్చయ తాంబూలాలకు వచ్చిన పెద్దలు, బంధువులు బరువెక్కిన గుండెలతో అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఏదో బలమైన ఒత్తిడి... ఎవరో బెదిరించడం వల్లే వెంకటేష్ ఇలా అఘాయిత్యానికి పాల్పడినట్లు చర్చ జరుగుతోంది. -
నిశ్చితార్థంలో కాబోయే భార్య చేసిన పనికి.. పెళ్లిరోజే వరుడు షాకింగ్ నిర్ణయం
నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కాబోయే భార్య వేధింపులకు తాళలేక పెళ్లి రోజే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. నాసిక్‌కు చెందిన ఆదాయపు పన్ను శాఖ అధికారి హరేరామ్(36)కి, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన మోహినికి నిశ్చితార్థం జరిగింది.మోహిని తన లవర్‌ను హగ్ చేసుకోవడం చూసిన హరేరామ్.. నిలదీశాడు. ఈ సంఘటన ఆమె ప్రేమ వ్యవహారాన్ని బట్టబయలు చేయడంతో ఈ విషయం బయటకు చెబితే తనతో పాటు కుటుంబంపై వరకట్న వేధింపుల కేసు పెడతానని ఆమె బ్లాక్‌మెయిల్‌కు దిగింది.నిరంతరం తీవ్ర వేధింపులకు గురిచేయడంతో మానసిక ఒత్తిడికి గురై విసిగిపోయిన హరేరామ్.. నాసిక్‌లోని ఉత్తమ్‌నగర్ ప్రాంతంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. యువతితో పాటు ఆమె లవర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు. -
కూల్‌డ్రింక్‌లో విషం కలిపి.. కన్నతల్లే..
సాక్షి, హైదరాబాద్: బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్‌లో దారుణం జరిగింది. కన్నతల్లే నాలుగేళ్ల కూతురికి కూల్ డ్రింక్‌లో ఎలుకల మందు కలిపి ఇచ్చి చంపేసింది. అనంతరం తల్లి కృష్ణ పావని సైతం విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రగతినగర్ ఆదిత్య గార్డెన్లో ఓ అపార్ట్మెంట్లో సాంబశివరావు, తన భార్య నంబూరి కృష్ణ పావని, కూతురు జశ్వికలతో కలిసి నివాసం ఉంటున్నారు 18వ తేదీ (శుక్రవారం) సాయంత్రం ఇంట్లో భర్త లేని సమయంలో కృష్ణ పావని.. తమ కూతురు జశ్వికకు కూల్‌డ్రింక్‌లో ఎలుకల మందు తాగించి.. ఆ తర్వాత తాను తాగింది. 19వ తేదీ తెల్లవారుజామున విషం తాగినట్లు గుర్తించిన భర్త.. భార్య, కూతురిని ఆసుపత్రికి తరలించారు.ఇవాళ తెల్లవారుజామున చికిత్స పొందుతూ చిన్నారి జశ్విక మృతి చెందింది. తల్లి కృష్ణ పావని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కృష్ణ పావనికి ఆరోగ్య సమస్యల కారణంగానే దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం కృష్ణ పావని పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రిలోని ఐసీయులో చికిత్స అందిస్తున్నారు. -
వివాహేతర సంబంధం.. వాట్సప్ స్టేటస్‌లో ప్రియురాలి ఫొటో..
అచ్చంపేట (మహబూబ్‌నగర్): పట్టపగలే ఓ వ్యక్తిపై గొడ్డలి, సుత్తితో దాడిచేసి హతమార్చిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఈ నెల 15న అచ్చంపేట మండలం నడింపల్లి సమీపంలోని ప్రధాన రహదారిపై చోటు చేసుకున్న హత్య కేసు వివరాలను శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ శ్రీనివాసులుతో కలిసి ఏఎస్పీ రామేశ్వర్ వెల్లడించారు. వివరాలిలా.. నడింపల్లి గ్రామానికి చెందిన బూరం వీరయ్య చిన్న కుమారుడు పరమేశ్ అదే గ్రామానికి చెందిన సుగూరు మహేశ్ భార్యతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. గత నెల 10న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా గురుజాలకు ఆమెను తీసుకెళ్లాడు. తన భార్య అదృశ్యంపై అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌లో భర్త మహేశ్ ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న మహేశ్ బంధువులు గురుజాలకు వెళ్లి పరమేశ్‌పై దాడిచేసి సదరు మహిళను ఇంటికి తీసుకువచ్చారు. ఆ తర్వాత పరమేశ్ వైఖరిలో మార్పు రాక పోవడం.. వాట్సప్ స్టేటస్‌లో ఈ నెల 15న మహిళతో ఉన్న ఫొటోలను పెట్టాడు. ఈ క్రమంలో భర్త మహేశ్ అదే గ్రామానికి చెందిన పదిర శివ, ఎడ్ల మహేశ్‌లతో కలిసి పరమేశ్ కుటుంబ సభ్యులను హత్య చేసేందుకు పథకం రచించారు. ఈ నెల 15న అచ్చంపేట నుంచి నడింపల్లికి బైక్‌పై వెళ్తున్న పరమేశ్ తండ్రి బూరం వీరయ్య, సోదరుడు వెంకటేశ్ ను కారు, బైక్‌తో వెంబడించారు. నడింపల్లి సమీపానికి రాగానే ఒక్కసారిగా వీరయ్యపై గొడ్డలి, సుత్తితో దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటేశ్‌పై దాడికి యత్నించగా.. సమీప గ్రా మస్తులు రావడంతో వదిలిపెట్టి వెళ్లారు. హత్యలో పాల్గొన్న ముగ్గురు నిందితులు గతంలో నేర చరిత్ర కలిగి ఉండటంతో వారిపై రౌడీషీట్ ఓపెన్ చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. నిందితులను అరెస్టుచేసి కోర్టులో హాజరుపర్చగా.. రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. హత్య కేసును చేధించిన డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రవీందర్, ఉప్పునుంతల ఎస్ఐ వెంకట్‌రెడ్డి, ఇందిర, సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు. సమావేశంలో హెడ్ కానిస్టేబుల్ రమేశ్, కానిస్టేబుళ్లు విశ్వనాథ్, బాలస్వామి, మల్లేష్, విష్ణు ఉన్నారు.భర్త, ఇద్దరు పిల్లలున్న మహిళతో వివాహేతర సంబంధం -
ప్రియుడి మోజులో పడి భర్తను చంపిన భార్య
వనపర్తి(మహబూబ్‌నగర్): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నా డని కట్టుకున్న భర్తను కడతేర్చిందో భార్య. వనపర్తి జిల్లా పెబ్బేరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలను శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రావుల గిరిధర్ వెల్లడించారు. సూగూరు గ్రామానికి చెందిన రవి, అతడి భార్య సునీత మేస్త్రి నరేశ్ వద్ద పనిచేస్తుండే వారు. క్రమంలో శ్రీరంగాపూర్‌కు చెందిన అరవింద్‌తో సునీతకు పరిచయమై వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్త రవికి తెలియడంతో అరవింద్‌ను హెచ్చరించాడు. అప్పటి నుంచి రవి తన భార్య సునీతను ఇబ్బంది పెడుతుండేవాడు. ఈ క్రమంలో తన భర్త అడ్డు తొలగించాలని ప్రియుడు అరవింద్‌కు చెప్పడంతో గత నెల 18న అతడు తన స్నేహితులైన భగవంతు, గిరితో కలిసి అయ్యవారిపల్లిలో మద్యం తాగుతూ రవి హత్యకు పథకం రచించారు. ఈ మేరకు మార్చి 19న సాయంత్రం అరవింద్ తన స్నేహితుడైన సూగూరుకు చెందిన బాష కారును అవసరం ఉందని తీసుకుని అయ్యవారిపల్లిలో భగవంతు, గిరిని ఎక్కించుకున్నాడు. వెంకటాపురంలో ఒక కిరాణం షాపులో మద్యం, వాటర్ బాటిల్స్, నల్ల కవర్స్ తీసుకున్నారు. అక్కడి నుంచి సూగూరుకు వెళ్లి ఆంజనేయులు అనే వ్యక్తితో రవికి ఫోన్ చేయించి మద్యం తాగుదామని పిలిపించారు. వారి వద్దకు వచ్చిన రవిని కారులో ఎక్కించుకుని గ్రామ సమీపంలోని శ్మశానవాటిక వద్దకు వెళ్లి మద్యం తాగారు. రవి మత్తులోకి వెళ్లిన తర్వాత అందరూ కలిసి అతడి ముఖానికి ప్లాస్టిక్ కవర్లు చుట్టి ఊపిరాకుండా చేసి చంపారు. ఎవరికీ అనుమానం రాకూడదని కొత్త సూగూరు ఊరి బయట రోడ్డు పక్కన శవాన్ని ఉంచి, నేరానికి ఉపయోగించిన ప్లాస్టిక్ కవర్లను బూడిదపాడు వద్ద వాగులో పడేసి వెళ్లిపోయా రు. మృతుడి భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేపట్టారు. సునీతను తమదైన శైలిలో విచారించగా.. చేసిన నేరాన్ని ఒప్పుకుంది. హత్య లో పాల్గొన్న వారిని అరెస్టు చేసి.. వారి నుంచి కారు, సెల్‌ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా.. రిమాండ్ విధించినట్టు ఎస్పీ తెలిపారు. సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ రాంబాబు, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, పెబ్బేరు ఎస్ఐ యుగంధర్ రెడ్డి ఉన్నారు. -
క్షేమంగా ఊరికి పంపిస్తామని.. కాటేశారు
కర్ణాటక: ఆ కూలీ యువతికి భాష తెలియదు, ఊరు తెలియదు, క్షేమంగా ఊరికి పంపిస్తానని నమ్మించి అఘాయిత్యానికి పాల్పడ్డారు కామాంధులు. మంగళూరు నగరం వద్ద ఉళ్లాలలోని మున్నూరు బంగ్లా వద్ద బెంగాల్ యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనలో కొత్త నిజాలు బయటపడ్డాయి. వివరాలు.. బాధిత యువతి 3నెలల క్రితం తన ప్రియుని కలిసి పశ్చిమబెంగాల్ నుంచి కేరళకు కూలీ పనికి వచ్చింది. ఏప్రిల్ 16న ఇద్దరి మధ్య గొడవ జరిగి ప్రియుడు ఆమె మొబైల్ ని పగలగొట్టి వెళ్లగొట్టాడు. దీంతో యువతి కేరళ నుండి మంగళూరుకు వచ్చే రైలు ఎక్కింది. మంగళూరులో దిగిన ఆమె స్వంత ఊరికి వెళ్లడానికి డబ్బులు లేక రైల్వేస్టేషన్లో చాలామంది వద్ద డబ్బులు అడిగింది. ఈ క్రమంలో నిందితుడు ఆటోడ్రైవర్ ప్రభురాజ్ ఆమైపె కన్నేసి మొబైల్ రిపేరీ చేయించి ఆమె అక్కకు కాల్ చేయమని చెప్పాడు. అక్క ఆమెకు ఆన్లైన్లో రూ.2 వేలు పంపించి ప శ్చిమ్ బెంగాల్ రైలు ఎక్కాలని చెప్పింది, ప్రభురాజ్ తో కూడా మాట్లాడిండి.కూల్‌డ్రింకులో మత్తు కలిపిరైలు ఆలస్యంగా వస్తుందని యువతిని నమ్మించి ప్రభురాజ్ తన ఆటోలో ఆమెను 6 గంటలపాటు ఊరంతా తిప్పాడు. రాత్రి కాగానే మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ తాగించి ఆమె స్పృహ కోల్పోయాక మిత్రులు మణి, మిథున్‌ను పిలిపించాడు. ముగ్గురూ కలిసి మున్నూరు బంగ్లా వద్ద నిర్జన ప్రదేశంలో అత్యాచారం చేసి పరారయ్యారు. బాధితులు ఓ ఇంటి వద్దకు వచ్చి పడిపోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. నిందితులను కంకనాడి పోలీసులు అరెస్టు చేసి కస్టడీకి తీసుకున్నారు. బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇప్పటి వరకూ బాధితురాలి కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదని తెలిసింది. -
అద్దె చెల్లించమన్నందుకు ట్రాన్స్జెండర్లతో హల్చల్
హైదరాబాద్: అద్దె వివాదంలో ఇంటి యజమానిపైకి ట్రాన్స్ జెండర్లతో పాటు రౌడీలను పంపించి దౌర్జన్యానికి దిగిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్లో నివాసం ఉంటున్న మాజీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని ఇందుకూరి నిర్మలాదేవికి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వెనక భవనం ఉంది. ఈ భవనాన్ని గత ఏడాది జూన్‌లో ఆద్య ఎడ్యుకేషన్ సొసైటీకి లీజుకు ఇచ్చేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ముందుగానే అడ్వాన్స్ చెల్లించడంతో పాటు నెలనెలా అద్దె ఇస్తానంటూ ఆద్య ఎడ్యుకేషన్ సొసైటీ నిర్వాహకులు, మాజీ ఐఏఎస్ కుమారుడు గొబ్బూరు సాయి కృష్ణకిషోర్ చెప్పారు. కాగా యజమాని నిర్మలాదేవికి, సాయి కృష్ణకిషోర్ మధ్య అద్దె విషయమై గొడవ జరుగుతోంది. దీనికితోడు గతంలో బంజారాహిల్స్ రోడ్ నెం 14లో ఉన్న అధ్యాస్ జూనియర్ కాలేజీకి సంబంధించిన 16 నెలల అద్దె బకాయిలు ఉండడంతో గత ఫిబ్రవరిలో ఖాళీ చేయించారు. ఈ నేపథ్యంలో నిర్మలాదేవిని కలిసిన కృష్ణకిషోర్ ఇంటర్మీడియట్ పరీక్షల కోసం ఎన్టీఆర్ భవన్ పక్కనున్న కొత్త భవనాన్ని ఇవ్వాలని కోరాడు. అయితే తనకు గతంలోనే అద్దె సరిగా ఇవ్వలేదని, గతంలో అనేక వివాదాలు ఉన్నందున కళాశాల ఏర్పాటుకు ఒప్పుకునేది లేదని చెప్పింది. అయితే అప్పటికే ఈ భవనాన్ని ఇంటరీ్మడియట్ సెంటర్‌గా ప్రకటించడంతో చివరి క్షణంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఏకంగా జిల్లా కలెక్టర్ కోరడంతో అందుకు ఆమె అంగీకరించింది. కాగా పరీక్షల అనంతరం భవనాన్ని ఖాళీ చేయాలని నిర్మలాదేవి కోరినా పట్టించుకోకపోవడంతో నాలుగురోజుల క్రితం ఆమె వచ్చి తాళాలు వేసుకుంది. శనివారం మధ్యాహ్నం నిర్మలాదేవి అక్కడ ఉండగా సుమారు 10మంది రౌడీలతో పాటు హిజ్రాలు ఒక్కసారిగా భవనంలోకి ప్రవేశించి వీరంగం సృష్టించడమేగాక నిర్మలాదేవిని బయటకు తరిమివేశారు. దీంతో ఆమె బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆరుగురు ట్రాన్స్ జెండర్లు, మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్మలాదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
గొంతుకోసి..కత్తులతో పొడిచి..
హైదరాబాద్: ఆన్లైన్ బెట్టింగ్ కారణంగా చోటు చేసుకున్న వివాదం హత్యకు దారి తీసిన సంఘటన షాద్‌నగర్ శివారులో ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. శంషాబాద్ ఇన్చార్జి, రాజేంద్రనగర్ డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. ఈ నెల 13న షాద్‌నగర్ లింగారెడ్డిగూడెం శివారులోని ఎంఎస్ఎన్ పరిశ్రమ సమీపంలో జాతీయరహదారి పక్కన కత్తిపోట్లకు గురైన గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని గుర్తించిన షాద్‌నగర్, శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి కుడి చేయిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా అతను నంద్యాల జిల్లా, బండి ఆత్మకూరు మండలం, చిన్నదేవులాపురం గ్రామానికి చెందిన కిలారి సాయిరాహుల్(23) గుర్తించారు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేసిన సాయి రాహూల్ ఉద్యోగం కోసం నగరానికి వచ్చాడు. 11 విన్నర్స్ అనే ఆన్లైన్ క్యాసినో బెట్టింగ్‌కు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో నగరంలోని ఓ పీజీ హాస్టల్లో ఉంటున్న తన ఊరికే చెందిన చిన్ననాటి స్నేహితుడు శాఖమురి వెంకటేష్‌కు కూడా బెట్టింగ్ అలవాటు చేశాడు. ఈ క్రమంలో వెంకటేష్ రూ.15 లక్షలు పోగొట్టుకున్నాడు. మూడు నెలల క్రితం కూడా సాయిరాహుల్ మరోమారు అదే గేమ్స్‌లో డబ్బులు పెట్టి తిరిగి సంపాదించుకుందామని చెప్పి వెంకటే‹Ùతో రూ. 3 లక్షలు బెట్టింగ్ పెట్టించాడు. అయితే డబ్బులు పోవడంతో వెంకటేష్ తనకు రూ. 3 లక్షలు ఇవ్వాలని సాయిరాహుల్పై ఒత్తిడి చేశాడు. దీంతో సాయిరాహుల్ తనను డబ్బులు అడిగితే చంపేస్తానని బెదిరించాడు. భయంతోనే హత్యకు కుట్ర.. గతంలోనూ ఓ మారు సాయిరాహుల్ రూ. 20 వేల విషయమై వెంకటేష్‌పై బీరుబాటిల్‌తో దాడి చేశాడు. ఆ తర్వాత తిరిగి స్నేహితులయ్యారు. సాయి తనను హత్య చేస్తాడనే భయంతో వెంకటేష్ తనతో కలిసి హాస్టల్లో ఉంటున్న స్నేహితులతో కలిసి సాయిని అంతమొందించాలని పథకం వేశాడు. ఇందుకు రూ. 2 లక్షలు ఇస్తానని చెప్పి కొంత అడ్వాన్స్‌గా ఇచ్చాడు. దీంతో వారు సురారం వెళ్లి కత్తులు కొనుగోలు చేసి అద్దెకారు తీసుకున్నారు. ఈ నెల 12 సాయిని బెట్టింగ్ పేరుతో లింగారెడ్డిగూడెం రప్పించారు. అతడికి మద్యం తాగించి గొంతుకోయడంతో పాటు కత్తులతో విచక్షణ రహితంగా పొడిచి హత్య చేశారు. అనంతరం బహదూర్‌పల్లి గండిమైసమ్మ సమీపంలోని బంధువుల ఇంట్లో తలదాచుకుని అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. కేసు దర్యాప్తులో భాగంగా ప్రధాన నిందితుడు వెంకటేష్ శనివారం ఉదయం ఆ«రాంఘర్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు. మిగతా నలుగురు నిందితులతో పాటు కారును అద్దెకిచ్చిన వ్యక్తి పరారీలో ఉన్నారు. నిందితుడి నుంచి మూడుఫోన్లు, కారు స్వా«దీనం చేసుకున్నారు. కేసును చేధించిన షాద్‌నగర్ సీఐ విజయ్‌కుమార్, ఎస్ఓటీ పోలీసులను డీసీపీ అభినందించారు. -
నా భార్య వేధింపులు భరించలేకపోతున్నా.. ఇక సెలవు
భార్యాభర్తల సంబంధం అనేది చాలా సున్నితమైనది. ఇది ప్రేమ అనే బంధంతో ముడిపడి ఉంటుంది. చిన్నపాటి దారంతో మెలివేసి ఉంటుంది. ఈ బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోవడానికి చిన్న పొరపాటు సరిపోతుంది. ప్రేమ దారంతో ముడిపడాల్సిన బంధం.. అనుమానం అనే ఆయుధంతో దాడి చేస్తే కాపురాలు నాశనం అవుతాయి. ఆ బంధాలు శాశ్వతంగా నిలబడువు. ఈ ఘటనలో అదే జరిగింది.వారిది పెద్దగా అన్యోన్యమైన దాంపత్యం కాదు. పెళ్లై ఐదేళ్లే అవుతుంది. అప్పట్నుంచీ ఇంట్లో రోజూ చికాకులు. భార్యాభర్తల మధ్య గొడవలు. ఒకరి కంఫర్ట్ జోన్ లోకి ఇంకొకరు రాలేకపోయారు. దాంతో భర్త ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. తాను చేయని తప్పుకు భార్య నిందించడంతోపాటు కేసును కూడా పెట్టడంతో భర్త ప్రాణాలు వదిలేశాడు. సమాజం, కుటుంబం తానేమిటీ అన్న విషయాన్ని నమ్మాలంటే అది తన ఆత్మహత్య ద్వారానే సాధ్యమవుతుందని భావించి విషం తాగి ప్రాణాలు తీసుకున్నాడు.34 ఏళ్ల మోహిత్ త్యాగి అనే వ్యక్తికి పెళ్లైన దగ్గర్నుంచీ భార్య నుంచి ఏవో వేధింపులకు గురవుతూనే ఉన్నాడట. 2020, డిసెంబర్లో ప్రియాంక అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న మోహిత్.. ఆపై నరకం చూసాడట.తనకు రెండో పెళ్లి కావడంతో భార్య తన ఆస్తి కోసం, తన సంపాదన కోసమే చేసుకుని ప్రతీరోజూ నరకం చూపించేదని సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక్కడ భార్య ప్రియాంకను, ఆమె తరఫు బంధువులు పేర్లు పేర్కొంటూ సూసైడ్ నోట్ రాశాడు. తాను చనిపోవడానికి నిర్ణయించుకున్న కొన్ని సెకన్ల ముందే ఆ నోట్ తన ఫ్రెండ్స్ అందరికీ పంపించాడు. ఆ వెంటనే విషం తాగాడు. రెండు రోజుల మృత్యువుతో పోరాడి చనిపోయాడు.2024లో మోహిత్ తల్లి చనిపోయిన క్రమంలో భార్య ప్రియాంక బాగా గొడవపడిందట. ఆ సమయంలోనే భార్య కొంతమందిని ఇంటికి తీసుకొచ్చి రూ. 12 లక్షల నుంచి రూ. 15 లక్షల విలువైన బంగారాన్ని మొత్తం అపహరించిందట. ఈ విషయాన్ని మోహిత్ సోదరుడు తాజాగా వెల్లడించాడు.సూసైడ్ నోట్ లో ఏముందంటే..నాపై అనుమానంతో ఒక తప్పుడు కేసును భార్య పెట్టించింది. ఆ కేసుకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఒక ప్లాన్ ప్రకారమే నన్ను పెళ్లి చేసుకుంది. అనేక సార్లు గర్భం వస్తే దాన్ని తీయించుకుంది. నన్ను చాలా హింసించింది. నేను ఇక తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు నాపై పోలీస్ కేసు పెట్టడంతో నా జీవితం ఇక అనవసరం. నేనూ ఏ తప్పూ చేయలేదు. నేను చనిపోతున్నందుకు నాకు బాధేమీ లేదు. కాకపోతే నాకు పుట్టిన కొడుకు పరిస్థితి ఏమౌంతుందో అని ఆలోచిస్తున్నా. నాకు అదొక్కటే విచారంగా ఉంది. వీరంతా నా కొడుకును చంపేసే అవకాశం కూడా ఉంది. మీరు నిజాన్ని నమ్మాలంటే నాకు చావు ఒక్కటే శరణ్యం’ అని పేర్కొన్నాడు. భార్య ప్రియాంక, ఆమె తరుఫు బంధువులే తన చావుకు కారణమని తెలిపాడు. తన చావు తర్వాత భార్య ప్రియాంక కచ్చితంగా చింతిస్తుందని సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. ఏప్రిల్ 15వ తేదీన సూసైడ్ చేసుకోగా, రెండు రోజులు మృత్యువుతో పోరాడి చనిపోయాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
అత్తతో గొడవపడి వెళ్లిపోయిన కోడలు
వికారాబాద్: ఇంట్లో అత్త తో గొడవ పడిన కోడలు ఎటో వెళ్లిపోయిన సంఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని సంగెం గ్రామానికి చెందిన కూడళ్ల బాలమణికి నలుగురు సంతానం. అందులో రెండో కూతురు స్పందనను ఎక్లాస్‌ఖాన్‌పేట గ్రామానికి చెందిన బట్టు సురేష్ కు ఇచ్చి పదేళ్ల క్రితం వివాహం జరిపించారు. భార్యాభర్తలు వేములనర్వ గ్రామంలో ఆర్ఎంపీ వైద్యులుగా పనిచేస్తున్నారు. గురువారం సాయంత్రం అత్తాకోడళ్లు గొడవ పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన స్పందన ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆచూకీ కోసం భర్త సురేష్ వెతకగా లభ్యం కాలేదు. దీంతో స్పందన తల్లి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజ్‌కుమార్ తెలిపారు. ట్రాన్స్జెండర్లపై కేసు నమోదు మీర్‌పేట: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ట్రాన్స్‌జెండర్స్‌పై మీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ నాగరాజు కథనం ప్రకారం.. స్టేషన్ పరిధిలోని ప్రధాన రహదారులు, కూడళ్లలో కొందరు ట్రాన్స్జెండర్లు రాత్రివేళల్లో అసభ్యకర దుస్తులు ధరించి వికృత చేష్టలు చేయడంతో పాటు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడు తూ అసౌకర్యం కలిగిస్తున్నారన్న సమాచారం రావడంతో మీర్‌పేట పోలీసులు గురువారం రాత్రి స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. మందమల్లమ్మ చౌరస్తా, ఆర్సీఐ రహదారిపై 7 మంది ట్రాన్స్జెండర్లను అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. -
తన కూతురిపై కన్నేశాడనే కడతేర్చింది
మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఒక కానిస్టేబుల్ కనిపించడం లేదంటూ అతని భార్య, బంధువులు ఫిర్యాదు చేశారు. మంగళగిరిలో మిస్ అయిన కానిస్టేబుల్ నంద్యాల–కడప ఘాట్రోడ్లో శుక్రవారం శవమై కనిపించాడు. సేకరించిన వివరాల మేరకు నంద్యాల జిల్లా, ఆళ్లగడ్డ మండలం, తోటకందుకూరు గ్రామానికి చెందిన ఫారుక్ (30) ఏపీఎస్పీ రెండో బెటాలియన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. కొంతకాలంగా మంగళగిరి ఆక్టోపస్ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. మంగళగిరి పట్టణంలోనే ఉంటున్నాడు. ఏప్రిల్ 8న ట్రైనింగ్ ఉందంటూ వెళ్లిన ఫారుక్ తిరిగి రాకపోవడం, ఫోన్ స్విచ్చాఫ్ కావడంతో 12న భార్య బషీరున్ తన బంధువులతో కలిసి ఆక్టోపస్ కార్యాలయానికి వెళ్లింది. ఏప్రిల్ 9 నుంచి 12 వరకు ఫారుక్ సెలవు పెట్టాడని అక్కడి అధికారులు చెప్పడంతో మంగళగిరి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో తన భర్త కనిపించడం లేదంటూ ఈనెల 14న ఫిర్యాదు చేశారు. మంగళగిరి పట్టణ పోలీసులు మిస్సింగ్‌గా కేసు నమోదు చేశారు. విచారణలో వెలుగు చూసిన నిజాలు ఫారుక్ ఫోన్ స్విచ్చాఫ్‌గా ఉండడంతో ఆక్టోపస్ అధికారుల ఆదేశాల మేరకు అతని కాల్ డేటాను పోలీసులు సేకరించారు. అందులో ఉన్న కాల్స్ ఆధారంగా విచారణ చేపట్టారు. ఫారుక్ ఫోన్ లొకేషన్ నంద్యాలలో ఉన్నట్లు తేలడంతో చివరగా ఫోన్ చేసిన వారిని నంద్యాల జిల్లా పోలీసులు విచారణ చేశారు. ఈ నేపథ్యంలో నంద్యాలకు చెందిన అనీషను కూడా విచారణ చేశారు. దీంతో అసలు నిజం బయటపడింది. ఫారుక్‌కు పెళ్లికాక ముందు నుంచి అనీషతో పరిచయముంది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో అనీష కుమార్తెతో కూడా ఫారుక్ సన్నిహితంగా ఉండడంతో ఆమె తట్టుకోలేకపోయింది. ఈ విషయమై ఫారుక్‌తో తరచూ గొడవ పడేది. ఫారుక్ నంద్యాలలోని తెలిసిన వ్యక్తి ద్వారా అనీషకు డబ్బులు పంపిస్తున్నాడు. ఆ వ్యక్తి సన్నిహితంగా ఉండడంతో అనీష కుమార్తెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీంతో ఫారుక్‌ను అడ్డు తొలగిస్తేనే పెళ్లికి అంగీకరిస్తానని అనీష చెప్పింది. పథకం ప్రకారం.. ఫారుక్‌ను హతమార్చేందుకు ఇద్దరూ పథకం పన్నారు. అతనికి ఫోన్ చేసి కొన్ని రోజులు సెలవు పెట్టుకుని రావాలని అనీష కోరింది. ఫారుక్ మంగళగిరి నుంచి నంద్యాలకు ఏప్రిల్ 8న సాయంత్రం బయలు దేరాడు. 9న అక్కడకు చేరుకున్న ఫారుక్ తనకు పరిచయమున్న వ్యక్తిని కలిశాడు. అక్కడి నుంచి బయటకు వెళ్దామంటూ ఆ వ్యక్తి మరో ఇద్దరిని తీసుకుని ఫారుక్‌తో కారులో బయలుదేరారు. మద్యం సేవించిన అనంతరం నంద్యాలలో కారులో వెళుతుండగా ఎదురు సీట్లో కూర్చున్న ఫారుక్‌ను వెనుక ఉన్న వ్యక్తి ఓ వైర్‌తో మెడకు గట్టిగా బిగించాడు. దీంతో ఊపిరి ఆడక ఫారుక్ అక్కడికక్కడే మరణించారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం వీరు మృతదేహాన్ని ఒక కవర్లో చుట్టి నంద్యాల శివారు ప్రాంతంలో ఉన్న ఓ చెరువులో పడవేశారు. కొంత సమయం తరువాత వచ్చి చూడడంతో మృతదేహాన్ని కవర్‌తో చుట్టడం వల్ల చెరువులో తేలుతూ కనబడింది. మరుసటి రోజు ఎవరూ లేని సమయంలో వచ్చి ఆ మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్లి నంద్యాల – కడప ఘాట్రోడ్లో ఫారెస్ట్ ప్రాంతంలో పైనుంచి కిందకు పడవేశారు. నంద్యాల సీసీఎస్ పోలీసులు అనీషను, మరో ఇద్దరు యువకుల్ని అదుపులోకి తీసుకోగా, మరో యువకుడు పరారయ్యాడు. ఆ ముగ్గురిని పోలీసులు తమదైన శైలిలో విచారించారు. నిందితులు తెలిపిన వివరాలతో ఫారుక్ మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ఫారుక్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. -
బంగ్లాదేశ్ యువతులతో హైదరాబాద్‌లో వ్యభిచారం
సాక్షి, హైదరాబాద్: రాజధానితో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటీవల విదేశీ యువతులతో వ్యభిచారం చేయిస్తున్న అనేక ముఠాలు పట్టుబడ్డాయి. ఈ బాధితుల్లో అత్యధికం బంగ్లాదేశీ యువతులే ఉంటున్నారు. దీంతో వీరు దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న విధానంపై దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు. ప్రాథమిక ఆధారాలను బట్టి కొన్ని కీలక విషయాలు గుర్తించారు. ఈ మనుషుల అక్రమ రవాణా దందాకు పశ్చిమ బెంగాల్ కీలకంగా ఉన్నట్లు తేలింది. అక్కడి కొందరు సూత్రధారులు బంగ్లాదేశ్‌లోనూ నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. వారి ద్వారా ఒకరిని అక్రమంగా బోర్డర్ దాటించడానికి రూ.4 వేలు చొప్పున వసూలు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. కీలకంగా వ్యవహరిస్తున్న రాహుల్... బంగ్లాదేశీయులతో పాటు మయన్మారీల అక్రమ రవాణా దందాకు పశ్చిమ బెంగాల్‌లోని సరిహద్దు జిల్లాలు కీలకంగా మారాయి. ఆయా దేశాల్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఇటీవలి కాలంలో అక్రమ రవాణా పెరిగింది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు కొత్తగా ముఠాలు పుట్టుకువచ్చాయి. వీటికి నేతృత్వం వహిస్తున్న వ్యక్తులకు ఇటు పశ్చిమ బెంగాల్ తో పాటు అటు బంగ్లాదేశ్‌లోని సరిహద్దు గ్రామాల్లో అనుచరులు ఉంటున్నారు. ఇలాంటి సూత్రధారుల్లో పశ్చిమ బెంగాల్ లోని బసిర్హత్ జిల్లా సోలదాన గ్రామానికి చెందిన రాహుల్ అమన్ దాలి కీలకమని దర్యాప్తు అధికారులు గుర్తించారు. అక్రమంగా సరిహద్దులు దాటాలని భావించిన బంగ్లాదేశీయులు ఆ దేశంలో ఉన్న సరిహద్దు గ్రామాలకు చేరుతున్నారు. వీరిని సంప్రదిస్తున్న రాహుల్ అనుచరులు రూ.4 వేలకు.. డిమాండ్ ఎక్కువగా ఉంటే రూ.5 వేలకు ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఇక్కడి నుంచే కథ నడిపించే రాహుల్... ఈ మొత్తాన్ని ఆ యువతులతోనే బంగ్లాదేశ్‌లోని సరిహద్దు గ్రామాల్లో ఉండే దుకాణదారుల వద్ద భారత కరెన్సీలోకి మార్పిస్తున్నాడు. మరికొందరు దళారుల ద్వారా ఈ నగదు బ్యాంకు ఖాతా లేదా యూపీఐ ద్వారా తనకు చేరేలా చేస్తున్నాడు. ఈ మొత్తం నుంచి రూ.1000 కమీషన్‌గా సరిహద్దుకు అటు–ఇటు ఉన్న గ్రామాలకు చెందిన తన అనుచరులకు ఇస్తుంటాడు. అక్కడ ఉన్న వారు అనువైన ప్రాంతం, సమయంలో యువతుల్ని పంపిస్తుండగా... ఇక్కడ ఉన్న వాళ్లు రిసీవ్ చేసుకుని సురక్షిత ప్రాంతానికి తరలిస్తుంటారు. రాహుల్ ఎక్కడా తెరపైకి రాకుండా ఈ వ్యవహారం నడిపిస్తుంటాడని అధికారులు చెబుతున్నారు. 2017 నుంచి ఈ దందా చేస్తున్న రాహుల్‌కు కోల్‌కతాకు చెందిన కొన్ని ముఠాలతో సంబంధాలు ఉన్నాయి. వారి సహకారంతోనే డిమాండ్ చేసిన మొత్తం చెల్లించిన వారికి నకిలీ గుర్తింపుకార్డులు తయారు చేయించి ఇస్తున్నాడు. ఇలా ఇక్కడి ఆధార్, ఓటర్ ఐడీలు పొందుతున్న బంగ్లాదేశీ యువతులు పశ్చిమ బెంగాల్ వాసులుగా చెలామణి అవుతున్నారు. హైదరాబాద్ సహా మరికొన్ని చోట్లకు... కొందరు దళారులు సదరు యువతులను హైదరాబాద్ సహా మరికొన్ని నగరాలకు తరలిస్తున్నారు. ఉద్యోగం పేరుతో తీసుకువచ్చి వ్యభిచార కూపాల్లోకి నెడుతున్నారు. అతి తక్కువ మంది మాత్రం మసాజ్ పార్లర్లు, బార్ అండ్ రెస్టారెంట్లలో పని చేస్తున్నారు. ఇదే పంథాలో కొందరు బంగ్లాదేశ్ యువకులు కూడా అక్రమంగా సరిహద్దులు దాటి వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మనుషుల అక్రమ రవాణా నెట్వర్క్ పూర్వాపరాలతో ఓ సమగ్ర నివేదికను సిద్ధం చేస్తున్నారు. ఎవరెవరు కీలకంగా వ్యవహరిస్తున్నారు? ఎక్కడ నుంచి సరిహద్దులు దాటిస్తున్నారు? తదితర అంశాలను నిఘా వర్గాలతో పాటు సరిహద్దు భద్రతా దళం దృష్టికి తీసుకెవెళ్లాలని దర్యాప్తు అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లో నమోదైన మనుషుల అక్రమ రవాణా కేసుల్లో కొన్ని దర్యాప్తు నిమిత్తం జాతీయ దర్యాప్తు సంస్థకు (ఎన్ఐఏ) చేరాయి. దీంతో ఆ విభాగంతో సమన్వయం ఏర్పాటు చేసుకుని, సమాచార మార్పిడి చేసుకోనున్నట్లు తెలిసింది. -
కూతురే.. కుమారుడిగా..
హైదరాబాద్: దేశంలోనే ప్రసిద్ధి గాంచిన వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ డాక్టర్ వెంకట్ రామ్‌నర్సయ్య (82) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం చిక్కడపల్లి వివేక్‌నగర్‌లోని తన ఇంట్లో కన్నుమూశారు. ఆయనకు కుమారులు లేకపోవడంతో కుమార్తె శాంతి తండ్రి చితికి నిప్పటించి అంత్యక్రియలు నిర్వహించారు. ఇందుకు తల్లి లక్ష్మితో పాటు శాంతి భర్త నవీన్ చక్రవర్తి ఆమోదం తెలపడంతో శుక్రవారం అంబర్‌పేట శ్మశాన వాటికలో ఆయన దహన సంస్కారాలు పూర్తి చేశారు. రామ్‌నర్సయ్య వృత్తి రీత్యా డాక్టర్ అయినా ప్రవృత్తి మాత్రం వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ. వైల్డ్‌లైప్ ఫొటో గ్రఫీలో అప్పటి కాంగ్రెస్ అగ్రనేత, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్‌కు ఆయన గురువు కావడం గమనార్హం. ఉమ్మడి ఏపీలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో దిగి్వజయ్‌సింగ్, డాక్టర్ వెంకట్ కలిసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ఆయన తీసిన పులుల ఫొటోలతో దేశంలోనే టాప్ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా పేరు తెచి్చపెట్టాయి. అంతేగాకుండా పులులపై ఆయన ఓ పుస్తకాన్ని కూడా రాశారు. -
ఈ సైకిళ్లు ఎవరికి ఇవ్వాలి దేవుడా?
ఖమ్మం: వేసవి సెలవులు వచ్చేశాయి.. ఒకటి, రెండు రోజుల్లో వెళ్లి మనవళ్లను తీసుకురావాలి.. నెలపాటు వారితో ఇంట్లో సందడిగా ఉంటుంది.. అని భావించిన ఆ తాత హతాశుడయ్యే సమాచారం అందింది. మనవళ్లు ఇద్దరిని కుమార్తె హత్య చేసి ఆమె సైతం బలవన్మరణానికి పాల్పడిందని తెలియడంతో కన్నీరమున్నీరయ్యాడు. మనవళ్లు గత ఏడాది వచ్చినప్పుడు అడిగినట్లుగా కొన్న సైకిళ్లు ఎవరికి ఇవ్వాలి అంటూ ఆయన రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. పెనుబల్లి మండలం తాళ్లపెంటకు చెందిన గువ్వల వెంకటరెడ్డి సింగరేణిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం సత్తుపల్లిలోని బైపాస్‌రోడ్ టీచర్స్ కాలనీలో ఇల్లు కట్టుకుని నివస్తుండగా ఆయనకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె తేజస్వినిరెడ్డి(35) వివాహం 13ఏళ్ల క్రితం సత్తుపల్లి మండలం రేజర్లకు చెందిన గండ్ర వెంకటేశ్వరరెడ్డితో జరగగా వారికి కుమారులు హర్షిత్‌రెడ్డి(11), అశిష్‌రెడ్డి(7) ఉన్నారు. కుటుంబమంతా హైదరాబాద్‌లోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తుండగా గురువారం వెంకటేశ్వరరెడ్డి విధులకు వెళ్లొచ్చేలోగా కుమారులిద్దరిని చంపిన తేజస్విని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా, వెంకటరెడ్డి కుమారుడు, తేజస్విని తమ్ముడు సైతం 14ఏళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు కుమారుడు, ఇప్పుడు కుమార్తె, మనవళ్ల మృతితో వెంకటరెడ్డి కుటుంబీకుల రోదనలను ఆపడం ఎవరి వల్లా కాలేదు. ఘటనా సమాచారం తెలియగానే కుటుంబమంతా హైదరాబాద్ వెళ్లగా ముగ్గురి మృతదేహాలకు హైదరాబాద్‌లోనే అంత్యక్రియలు నిర్వహించారు. -
అనుమానంతో బ్లేడుతో భార్య గొంతు కోసిన భర్త
క్రోసూరు(పల్నాడు): స్థానిక బోయ కాలనీలో భార్యపై అనుమానం పెంచుకుని భర్త బ్లేడుతో గొంతుకోసిన సంఘటన శుక్రవారం జరిగింది. స్టేషన్ రైటర్ దాసు వివరాల ప్రకారం.. బోయ కాలనీకి చెందిన చార్ల శ్రీను భార్య మల్లమ్మ. ఆమె ఎవరితోనో ఫోనులో మాట్లాడుతుండటంతో అనుమానపడి శ్రీను బ్లేడుతో దాడి చేసి గొంతు కోశాడు. చుట్టపక్కల వారు ఆమెను సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆమెకు వైద్యులు 25 కుట్లు వేశారు. ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించాలని వైద్యులు సూచించారు. శ్రీను, మల్లమ్మలకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం కూడా అయింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు రైటర్ దాసు తెలిపారు. -
అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త
కర్ణాటక: భార్యపై అనుమామానం పెంచుకొని తలపై బండరాయి వేసి కడతేర్చిన భర్త ఉదంతం మండ్య జిల్లా, శ్రీరంగ పట్టణ తాలూకా బాబురాయనకొప్పలు గ్రామంలో జరిగింది. తాలూకాలోని పి.హోసహళ్లికి చెందిన వీరభద్రాచారి కుమారుడు చంద్ర అనే వ్యక్తితో పాండవపుర తాలూకా సణబ గ్రామానికి చెందిన సౌమ్య(32)తో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. చంద్ర కూలీ పనులు చేసేవాడు. రెండేళ్లుగా బాబురాయన కొప్పలు గ్రామంలో నివాసం ఉంటున్నారు. మద్యానికి బానిసైన చంద్ర భార్యతో గొడవపడేవాడు. సౌమ్యకు మరో వ్యక్తితో సంబంధం ఉందని అనుమానం పెంచుకున్నాడు. గురువారం రాత్రి ఇదే విషయంపై గొడవపడి బండరాయిని ఆమె తలపై వేసి ఉడాయించాడు. సౌమ్య తీవ్ర గాయాలతో మృతి చెందింది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి నిందితుడు చంద్ర కోసం గాలిస్తున్నారు. -
Hit And Run: స్విగ్గీ డెలివరీ బాయ్ దుర్మరణం
హైదరాబాద్: కానిస్టేబుల్ పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న యువకుడు వేసవి సెలవుల్లో స్విగ్గీబాయ్గా చేరి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలను పోగొట్టుకున్న ఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. నార్సింగి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌కు చెందిన కుతాడి జీవన్ కుమార్ (21) కానిస్టేబుల్ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. వేసవి సెలవులు ఉండటంతో నగరానికి వచ్చి స్విగ్గీ డెలివరీ బాయ్‌గా చేరాడు. తన తండ్రికి ఇటీవల గుండె ఆపరేషన్ కావటం, కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో నగరానికి వచ్చి పని చేస్తున్నాడు. విధుల్లో భాగంగా శుక్రవారం ఉదయం పుప్పాలగూడ ఈఐపీఎల్ కార్నర్ స్టోన్ సమీపంలో జీవన్ ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. కింద పడిన అతడిపై నుంచి వెనకగా వచ్చిన టిప్పర్ వెళ్లడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు, టిప్పర్ల డ్రైవర్లు పరారయ్యారు. మృతుడి తండ్రి తిరుపతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఢిల్లీలో కుప్పకూలిన బిల్డింగ్.. ఇంకా శిథిలాల కిందే పలువురు
న్యూఢిల్లీ, సాక్షి: ముస్తాఫాబాద్(Mustafabad) భవన కుప్పకూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సంయుక్తంగా చేపట్టిన సహాయక చర్యల్లో.. ఇప్పటిదాకా 14 మందిని రక్షించగలిగారు. మరో 12 మంది శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని భావిన్నారు. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే.ANI న్యూస్ ఏజెన్సీ కథనం ప్రకారం.. అర్ధరాత్రి 3గం. ప్రాంతంలో ముస్తాఫాబాద్‌లో ఓ భవనం కుప్పకూలినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎన్డీఆర్ఎఫ్ సాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఉదయం కల్లా పలువురిని బయటకు తీసి జీబీటీ ఆస్పత్రికి తరలించారు. వాళ్లలో నలుగురు చనిపోయారు. ఆ భవనంలో ఒక పోర్షన్లో ఒకే కుటుంబానికి చెందిన పది మంది నివాసం ఉంటున్నారని, అందులో ఆరుగురు చిన్నపిల్లలే ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. వాళ్ల జాడపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఢిల్లీలో శుక్రవారం ఒక్కసారిగా వాతావరణం మారింది. ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. ఈ ప్రభావంతోనే భవనం కూలి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతవారం కూడా ఢిల్లీలో ఇలాంటి ఘటనే జరిగింది. భారీ వర్షం, ఈదురు గాలుల ధాటికి నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలి ఓ వ్యక్తి మరణించగా..ఇద్దరు గాయపడ్డారు.#WATCH | Delhi: Mustafabad building collapse caught on camera. As per Delhi Police, "Among the 10 people who were taken out, 4 succumbed. Rescue operations still underway"(Source - local resident) https://t.co/lXyDvOpZ3q pic.twitter.com/NlknYWODRR— ANI (@ANI) April 19, 2025#WATCH | Delhi: 4 people died after a building collapsed in the Mustafabad area; rescue and search operation is underway 8-10 people are still feared trapped, said Sandeep Lamba, Additional DCP, North East District pic.twitter.com/qFGALhkPv3— ANI (@ANI) April 19, 2025 -
Delhi: ఎవరీ లేడీ డాన్?.. ఆ సంచలన కేసుతో లింకేంటి?
ఢిల్లీ: నగరంలో 17ఏళ్ల బాలుడు కునాల్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు సీలంపూర్‌లో ఓ లేడీ డాన్ చుట్టూ తిరుగుతోంది. బాలుడి హత్య వెనుక లేడీ గ్యాంగ్ స్టర్ జిక్రా ఉందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జిఖ్రా తన కుమారుడిని చాలాసార్లు బెదిరించిందని.. ఆమె తుపాకీతో తిరుగుతూ ఉండేదన్నారు. అవకాశం దొరికితే నా కొడుకును చంపేస్తానని చెప్పేదని బాలుడి తండ్రి అన్నారు. జిక్రా గన్‌తో రీల్స్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వీడియోలు కూడా ఉండగా, సీలంపూర్‌లో ఆమెపై పలు కేసులు కూడా నమోదయ్యాయి.జిక్రాకు పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ హషీమ్ బాబాతో ప్రేమ సంబంధం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఆమెకు అండర్ వరల్డ్‌తో కూడా సంబంధాలు ఉన్నాయని సమాచారం. గతంలో ఢిల్లీలో బడా క్రిమినల్ అయిన గ్యాంగ్‌స్టర్ హషీమ్ బాబా భార్య జోయా ఆమెను బౌన్సర్‌గా నియమించినట్లు సమాచారం. ప్రస్తుతం 10-15 మందితో జిక్రా తన సొంత ముఠాను నడిపిస్తుందనే ప్రచారం జరుగుతోంది.పాలస్తీనియన్ జెండా ప్రొఫైల్ ఫోటో ఉన్న జిక్రాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 15,300 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఇటీవలి పోస్ట్‌లలో చాలా వరకు ఆమె వివిధ పాటలకు డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తాయి. గన్‌తో ప్రజలను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురిచేసేంది. తుపాకులతో రీల్స్ చేసినందుకు ఆయుధ చట్టం కింద జిక్రాపై ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయ్యింది. ఆమె పోలీసు కస్టడీలోనూ వీడియోలు తీసి ఆన్లైన్లో పోస్ట్ చేసేంది. కునాల్ వర్గానికి చెందిన వ్యక్తులు గతంలో జిక్రా సోదరుడు సాహిల్‌పై దాడి చేయగా, దానికి ప్రతీకారంగానే కునాల్‌ను హత్య చేసి ఉండొచ్చని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. -
వ్యభిచార ముఠా గుట్టు రట్టు
నర్సంపేట రూరల్ : వ్యభిచార ముఠా గుట్టు రట్టు అయ్యింది. విశ్వసనీయ సమాచారం మేరకు వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై దాడిచేసి నిర్వాహకురాలితోపాటు ముగ్గురు విటులను అరెస్ట్ చేసి ఇద్దరు మహిళలను కాపాడినట్లు వరంగల్ టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ కథనం ప్రకారం.. నర్సంపేటలోని మాధన్నపేట రోడ్డులో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు వరంగల్ టాస్క్‌ఫోర్స్, నర్సంపేట పోలీసుల ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఇందులో ముగ్గురు విటులు నర్సంపేటకు చెందిన కేసనపల్లి విక్రమ్, బానోజీపేటకు చెందిన కొయ్యల రమేశ్, కొయ్యల నితిన్, గృహ నిర్వాహకురాలు మాధన్నపేట రోడ్డులోని సీపీఐ కాలనీ చెందిన కన్నెరపు ఉమ పట్టుబడ్డారు. దీంతో వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 5 సెల్ఫోన్లు, రూ. 2,750 న గదు, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్ సీఐ శ్రీధర్, నర్సంపేట ఎస్సై అరుణ్, హెడ్‌కానిస్టేబుల్ రాజేశ్వరి, కానిస్టే బుళ్లు కృష్ణ, రాజు, నరేశ్, గణేశ్ పాల్గొన్నారు. -
అవసరాలకు అప్పు ఇచ్చి.. భార్యను లొంగదీసుకున్నాడు..
మహబూబాబాద్: ఇంటి అవసరాల కోసం అప్పు ఇప్పించా డు. ఇది ఆసరా చేసుకుని అప్పు తీసుకున్న వ్యక్తి భార్యను శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈ విషయం తెలిసిన భర్త పరువు పోయిందని భావించి భార్యను నిలదీశాడు. దీంతో తాము కలిసి ఉండాని నిర్ణయించుకుని లొంగదీసుకున్న వ్యక్తిని పథకం ప్రకారం భార్యాభర్తలు హత్యచేశారు. నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లిలో ఈ నెల 12వ తేదీన జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. బుధవారం నర్సంపేటలోని దుగ్గొండి సీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ సాయిరమణ.. ఎస్సై గోవర్ధన్‌తో కలిసి హత్య వివరా లు వెల్లడించారు. ఐదేళ్ల క్రితం మూడుచెక్కలపల్లి గ్రామానికి చెందిన బానోత్ జంపయ్య 23 గుంటల వ్యవసాయ భూమి కొనుగోలు చేశాడు. ఇంటి ని ర్మాణ పనులు చేపట్టారు. ఈక్రమంలో బానోత్ కొమ్మాలు(40) మధ్యవర్తిగా ఉండి రెండుసార్లు రూ.1.50 లక్షలు జంపయ్యకు అప్పుగా ఇప్పించా డు. ఇది ఆసరా చేసుకుని జంపయ్య భార్య విజ యను కొమ్మాలు శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న జంపయ్య పెద్ద మనుషులను ఆశ్రయించగా కొమ్మాలుకు రూ.70 వేలు జరి మానా విధించారు. ఈ క్రమంలో కొమ్మాలు వ్యవహరశైలితో తన పరువు పోయిందని భావించిన జంపయ్య.. కొమ్మాలును చంపాలని అనుకున్నాడు. కాగా, జంపయ్య తన భర్య విజయతో గొడవపడ్డాడు. కొమ్మాలును అయినా, నిన్ను అయినా చంపుతానని చెప్పాడు. దీంతో భయపడిన విజయ మనం కలిసే ఉందామని భర్తకు తెలిపింది. అనంతరం కొమ్మాలును హత్య చేయాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా కొమ్మాలు ఫోన్ చేసిన ప్రతీసారి అతడితో మాట్లాడడానికి వెళ్లమని జంపయ్య తన భార్య విజయకు చెప్పాడు. దీంతో విజయ పూర్తిగా కొమ్మాలును నమ్మించింది. ఈ క్రమలో పథకం ప్రకారం ఈ నెల 12న విజయ.. కొమ్మాలుకు ఫోన్ చేసి మాట్లాడాలి మొక్కజొన్న చేనువద్దకు రావాలని కోరింది. అనంతరం దంపతులు పథకం ప్రకారం కత్తులు తీసుకుని మొక్కజొన్న చేనులోకి వెళ్లారు. జంపయ్య ఎవరికీ కనిపించకుండా మొక్కజొన్న చేనులో కొంతదూరంగా ఉన్నాడు. ఈ విషయం గమనించకుండా కొమ్మాలు మొక్కజొన్న చేనువద్దకు చేరుకున్నాడు. ఇదే అదునుగా భావించి జంపయ్య వెనుకవైపు నుంచి కొ మ్మాలును కత్తితో పలుమార్లు పొడిచాడు. అనంతరం దంపతులిద్దరు పరారయ్యారు. ఈ క్రమంలో రుద్రగూడెంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించడంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. కాగా, హత్య కేసు ఛేదనలో ప్రతిభకనబర్చిన ఎస్సై గోవర్ధన్, సిబ్బందిని సీఐ అభినందించారు. -
డ్రైవర్‌గా చేరి ప్రైవేటు వీడియోలతో బ్లాక్ మెయిల్
విశాఖపట్నం: ప్రైవేటు వీడియోలతో సాఫ్ట్వేర్ ఉద్యోగి కుటుంబాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్న కారు డ్రైవర్ అప్పలరాజును ద్వారకా పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ చేకూరి గిరీష్, భార్య పిల్లలతో కలిసి సీతమ్మధార ప్రాంతంలో నివాసముంటున్నారు. అతనికి అంగవైకల్యం కారణంగా పిల్లలను చూసుకోవడానికి, ఇంటి పనుల కోసం డ్రైవర్‌గా రామెళ్ల అప్పలరాజును పెట్టుకున్నాడు. అతడు నమ్మకంగా ఉండడంతో వారి మధ్య స్నేహం పెరిగింది. ఒక రోజు గిరీష్‌ను హోటల్‌కు తీసుకెళ్లి అమ్మాయిని పరిచయం చేశాడు. ఆమెతో సన్నిహితంగా ఉన్న దృశ్యాలను అప్పలరాజు మొబైల్లో చిత్రీకరించాడు. కొద్ది రోజుల తరువాత ఆ వీడియోలు సాయంతో గిరీష్‌ను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. తనకు రూ.లక్ష ఇవ్వాలని లేదంటే ఫొటోలు సోషల్ మీడియాలోను, కుటుంబ సభ్యులకు పంపిస్తానని బెదిరించాడు. దీంతో పరువు పోతుందని భావించిన గిరీష్ తన బంధువు సిబ్బంది ద్వారా ఆ మొత్తాన్ని ఏర్పాటు చేసి ఆరు యూపీఐ లావాదేవీల ద్వారా డ్రైవర్‌కు బదిలీ చేశారు. చాలా కాలంగా గిరీష్‌తో పాటు అతని కుటుంబ సభ్యులను డ్రైవర్ అప్పలరాజు వేధిస్తూ వచ్చాడు. ఎప్పటికప్పుడు డబ్బులు తీసుకుంటున్నాడు. ఐఫోన్16 ప్లస్‌ను కూడా కొనుగోలు చేయించుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 21న గిరీష్‌ను అప్పలరాజు కత్తితో బెదిరించి అతని వద్ద ఉన్న రూ.5 వేలు బలవంతంగా తీసుకున్నాడు. అలాగే గిరీష్ తన భార్య పేరు మీద కొనుగోలు చేసిన ఫ్లాట్‌ను కూడా కాజేయడానికి ప్రయత్నించాడు. అంతటితో ఆగకుండా గిరీష్ వీడియోలు అతని భార్యకు పంపించి ఆమెను సైతం వేధింపులకు గురి చేశాడు. వీరి పార్కింగ్ స్థలాన్ని ఆక్రమించి అక్కడ పోలీస్ స్టిక్కర్ ఉన్న కారును పార్క్ చేసేవాడు. డ్రైవర్ అప్పలరాజు వేధింపులను భరించలేక గిరీష్ చివరకు ద్వారకా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు అప్పలరాజును అరెస్టు చేసి గురువారం రిమాండ్‌కు పంపించారు. అతడి నుంచి నకిలీ పిస్టల్‌తో పాటు కొంత మొత్తంలో నగదు, కారు, ఫోన్ స్వా«దీనం చేసుకున్నారు. -
ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని..
హైదరాబాద్: ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి లోనైన ఓ యువతి ప్రియుడి ఇంటిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని బంజారానగర్‌లో చోటు చేసుకుంది. ఎస్ఐ రాములు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అస్సాం రాష్ట్రం, బస్కంది గ్రామానికి చెందిన సుల్తానా బేగం(26) సిద్ధిఖీనగర్‌లో ఉంటూ గచ్చిబౌలిలోని అంతేరా హోటల్లో సర్వర్‌గా పని చేస్తోంది. వెస్ట్ బెంగాల్‌కు చెందిన సైదుల్లా షేక్ గచ్చిబౌలిలోని నావాబ్ హోటల్లో మేనేజర్‌గా పని చేస్తూనే పెస్ట్ కంట్రోల్ పని చేసేవాడు. సుల్తానా, సైదుల్లా షేక్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సుల్తానా తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేసేందుకు సంబంధాలు చూస్తుండటంతో తనను పెళ్లి చేసుకోవాలని సుల్తానా సైదుల్లాపై ఒత్తిడి పెంచింది. బుధవారం సాయత్రం పెళ్లి విషయమై గొడవ జరిగింది. దీంతో పెళ్లికి నిరాకరించిన అతను ఆమె ఫోన్‌ను బ్లాక్‌లో పెట్టాడు. దీంతో సుల్తానా మరో యువతికి ఫోన్ చేసి షైదుల్లా ఉంటున్న ఇంటిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. దీంతో ఆమె ఈ విషయాన్ని సైదుల్లాకు చెప్పినా అతను పట్టించుకోలేదు. దీంతో మనస్తాపానికి లోనైన సుల్తానా గురువారం ఉదయం సైదుల్లా నివాసం ఉండే భవనంపైకి ఎక్కి 6వ అంతస్తు నుంచి దూకడంతో కింద పార్క్ చేసి ఉన్న కారుపై పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి నిమ్స్‌కు తరలించగా ఉదయం మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మామిడి తోటలో మృత్యువు కాటేసింది
శంషాబాద్: బైక్‌పై వెళ్తున్న దంపతులకు రహదారి పక్కనే ఉన్న ఓ తోటలో కనిపించిన మామిడి కాయలు ఆకర్షించాయి. వాటిని తెంపి తీసుకొస్తున్న క్రమంలో భర్త విద్యుదాఘాతంతో అక్కడికక్కడే అసువులు బాసిన విషాదకర ఘటన శంషాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికులు..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నంలో నివాసముంటున్న తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలానికి చెందిన కె.చేతన్‌రెడ్డి (26) నగరంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగి. ఆయన భార్య బిందు. మొయినాబాద్‌లోని భాస్కర లా కళాశాలలో గురువారం ఆమెతో పరీక్షలు రాయించి తిరిగి ఇబ్రహీంపటా్ననికి బైక్‌పై బయలుదేరారు. పెద్దషాపూర్ రైల్వేట్రాక్‌కు సమీపంలో రహదారి పక్కనే ఉన్న ఓ తోటలో విరగగాసిన మామిడి కాయలను చూసిన చేతన్‌రెడ్డి వాహనాన్ని నిలిపివేశాడు. తోటలోని మామిడికాయలు కోసుకు వస్తుండగా.. చెట్టు పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్ఫార్మర్ తీగలు తగలడంతో చేతన్‌రెడ్డి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. భర్త అచేతనగా పడి ఉండటాన్ని చూసిన బిందు అరవడంతో స్థానికులు వచ్చి అతడిని పక్కకు జరిపారు. సీపీఆర్ చేసినా ఫలితం లేకుండాపోయింది. అప్పటికే అతడు మృతి చెందినట్లు నిర్ధారించారు. అక్కడికి వచి్చన శంషాబాద్ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బెట్టింగ్ యాప్‌కు మరో యువకుడు బలి
రంగారెడ్డి: బెట్టింగ్ యాప్ మరో విద్యార్థి ప్రాణాన్ని బలి తీసుకుంది. బెట్టింగ్ యాప్స్ లో బెట్టింగ్ పాల్పడిన పవన్ అనే యువకుడు.. ఒకేసారి రూ. లక్ష పోగొట్టుకున్నాడు. దాంతో ఆత్మహత్య చేసుకున్నాడు. అత్తాపూర్ రెడ్డిబస్తీలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.తన వద్ద ఉన్న ఐఫోన్.. రాయల్ఎన్ ఫీల్డ్ బైక్ ను సైతం అమ్ముకుని బెట్టింగ్ కు పాల్పడ్డాడు. తల్లి దండ్రులు పంపిన డబ్బులను సైతం బెట్టింగ్ లో పెట్టాడు. ఇందులో మొత్తం పోగొట్టుకోవడంతో తీవ్ర మనస్తాపం చెంది ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పవన్ స్వస్థలం గద్వాల్ జిల్లా. పవన్ మరణవార్త విని కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న అత్తాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
హైదరాబాద్‌లో దారుణం.. గోడకేసి కొట్టి.. ఐదు కుక్క పిల్లలను కిరాతకంగా..
సాక్షి, హైదరాబాద్: నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఐదు కుక్క పిల్లలను గోడకేసి కొట్టి చంపేసిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, సైకోగా మారిన ఆ వ్యక్తిని నెటిజన్లు తిట్టి పోస్తున్నారు.అసలు ఏం జరిగిందంటే.. ఫతేనగర్‌లో ఇండిస్ అపార్టుమెంట్ దగ్గర ఓ వీధి కుక్క ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. అక్కడే ఉన్న అపార్ట్మెంట్ సెల్లార్లో ఆ కుక్క పిల్లలు ఉంటున్నాయి. అదే అపార్ట్మెంట్లో నివశించే అశీష్ అనే వ్యక్తి తన పెంపుడు కుక్కతో రోజూ బయటకు వెళ్లే క్రమంలో ఆ కుక్కపిల్లలు దగ్గరకు వచ్చేవి. దీంతో ఓ కుక్క పిల్లను గోడకేసి బలంగా కొట్టగా.. అది రక్తం కక్కుకుని కింద పడిపోయింది. బతికిందో లేదో తెలుసుకోవడానికి మరోసారి గట్టిగా కొట్టాడు.. ఇలా మొత్తం ఐదు కుక్క పిల్లలను దారుణంగా చంపేశాడు.కుక్క పిల్లలు చనిపోయి ఉండడంతో అనుమానం వచ్చిన అపార్ట్మెంట్ వాసులు.. ఈ క్రమంలో అక్కడున్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా, అదే అపార్ట్మెంట్లో ఉన్న వ్యాపారి ఆశిష్ ఈ దారుణానికి పాల్పడినట్లు తేలింది. ఖాన్ అనే వ్యక్తి ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. జంతువులపై ఇంత కిరాతకంగా వ్యహరించిన వ్యక్తిని జైలుకు పంపించాలని కోరాడు.ఆశిష్‌ను అపార్ట్మెంట్ వాసులు ప్రశ్నించగా.. ఆ కుక్క పిల్లలు తన పెంపుడు కుక్క దగ్గరకు వచ్చాయని.. అందుకే చంపేశానంటూ సమాధానమిచ్చాడు. ఈ ఘటనపై అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నగరంలో సైకోలు పెరిగిపోతున్నారని.. జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని అరికట్టడానికి కఠినమైన శిక్షలు విధించాలని కోరుతున్నారు.*VB City Community – Urgent Alert!* The safety of our community, especially our children, is at serious risk.A disturbing incident has come to light—an individual was caught on video brutally attacking puppies just 5 to 6 days old. This act of cruelty is not only heartbreaking pic.twitter.com/hedp136Mrt— Khan (@khanbr1983) April 17, 2025 -
కాల్ సెంటర్ ద్వారా అమ్మాయిల్ని ముగ్గులోకి దింపుతున్నారు
-
పాము కాటు కాదు.. భార్య నిర్వాకమే!
ప్రియుడికి తనకు మధ్యలో అడ్డుగా ఉన్నాడని భర్తను ముక్కలు చేసి సిమెంట్ డ్రమ్ములో కుక్కింది ఓ భార్య. ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో చోటు చేసుకున్న ఈ ఉదంతం దేశవ్యాప్తంగా ఎంతటి చర్చకు దారి తీసిందో తెలిసిందే. ఈ క్రమంలో తమ ప్రాణాలను రక్షించుకునేందుకు ఒకరిద్దరు భర్తలు తమ భార్యలను ప్రియుడికి ఇచ్చి వివాహం చేసిన సందర్భాలూ చూశాం. ఇప్పుడు అదే ప్రాంతంలో మరో ఘోరం చోటు చేసుకుంది.రెండు రోజుల కిందట సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ఓ వార్త తీవ్ర చర్చనీయాంశమైంది. నిద్రలోనే ఓ వ్యక్తిని పాము పదిసార్లు కాటేసిందని, ఆ విష ప్రభావంతో అతను కన్నుమూశాడని. రాత్రంతా ఆ పాము అలాగే పక్కలోనే ఉండిపోయింది. ఉదయం దానిని తొలగించి అతన్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. దీంతో ‘పాపం’ అనుకున్నారంతా. అయితే బుధవారం సాయంత్రం ఈ కేసులో పోస్టుమార్టం నివేదిక బయటకు వచ్చింది. అందులో షాకింగ్ విషయం ఒకటి వెలుగు చూసింది.మీరట్ అక్బర్పూర్ సదాత్ గ్రామానికి చెందిన అమిత్(25) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ఏప్రిల్ 14వ తేదీ రాత్రి మంచంలో నిద్రిస్తున్న అతన్ని పాము కాటేయడంతో మరణించాడని ప్రచారం చేశారు. అయితే పోస్టుమార్టం నివేదికలో అతను విషం వల్ల కాకుండా ఊపిరి ఆడకపోవడం వల్లే మరణించాడని తేలింది. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. భార్య రవిత అసలు విషయం బయటపెట్టింది.రవితకు అమర్జీత్ అనే యువకుడితో ఏడాదిగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం తెలిసి అమిత్ తన భార్యను మందలించాడు. అయినా తీరు మార్చుకోకపోవడంతో ఆ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో ప్రియుడు అమర్జీత్తో కలిసి భర్తను కడతేర్చాలని రవిత స్కెచ్ వేసింది. అమర్జీత్ సాయంతో అమిత్ నిద్రిస్తున్న సమయంలో గొంతు నులిపి ఊపిరి ఆడకుండా చేసి చంపింది. ఆపై రోజుకి రూ.వెయ్యి ఖర్చు అద్దెతో తెచ్చిన ఓ పామును మంచం మీద పడేసింది. పాము కాటు వల్లే చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది. స్థానికుల సాయంతో పాములు పట్టేవాడిని తెచ్చి దానిని తొలగించింది. దీంతో జనం కూడా పాము కాటు వల్లే అతను చనిపోయాడని నమ్మి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. రవితతో పాటు అమర్జీత్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనలో ఇంకా వేరే ఎవరి ప్రమేయం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
అన్నయ్య సారీ రా...
ఆదిలాబాద్(బెల్లంపల్లి): కొంతకాలంగా అనారో గ్యంతో బాధపడుతున్న ఓ యువకుడు చికిత్స చేయించుకున్నా మెరుగు పడకపోవడంతో మనస్తాపం చెందాడు. అనారోగ్యం బాధను భరించలేకపోయాడు. ఇక చావే శరణ్యమనుకున్నాడు. ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం జెండా వెంకటాపూర్‌లో జరిగింది. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాశాడు. ఎస్సై ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన చెల్మాటికారి సత్తయ్య, అమృత దంపతుల కుమారుడు అనిల్ (24) పీజీ పూర్తిచేసి ఇంటివద్దే ఉంటున్నాడు. కొంతకాలంగా పచ్చకామెర్లు, దవడ బిల్లలు, వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నాడు. చికిత్స చేయించినా నయం కాకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం ఇంట్లోనే దూలానికి చీరతో ఉరేసుకుని బలవన్మరణం చెందాడు. ఉరేసుకునే ముందు బెడ్రూమ్లో అతని మంచంపై సుసైడ్ నోట్ రాసిపెట్టాడు. ‘అమ్మా.. నన్ను క్షమించండి.. నాకు ఆరోగ్యం బాగుండడంలేదు. బాధ భరించలేక చనిపోతున్నా. నా చావుకు ఎవరూ కారణం కాదు. నా సొంత నిర్ణయంతో చనిపోతున్నా. అన్నయ్య సారీ రా... నీవు ఈ లెటర్ చదివే సమయానికి నేను నీతో ఉండను.. అమ్మా నాన్నను కష్టపెట్టకు.. నన్ను మీరంతా క్షమిస్తారని ఆశిస్తూ.. సెలవు తీసుకుంటున్నా.. అని నోట్ రాసి ఉంచాడు. మృతుని తండ్రి సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.నేత్రదానంఅనిల్ కళ్లు దానం చేయడానికి తల్లిదండ్రులు ముందుకు వచ్చి సోపతి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు భీం పుత్ర శ్రీనివాస్, బ్లడ్ డోనర్ అసోసియేషన్ అధ్యక్షుడు రహీమ్‌కు సమాచారం అందించారు. దీంతో వారు హైదరాబాద్‌లోని ఎల్వీప్రసాద్ ఐ బ్యాంకు టెక్నీషియన్ ప్రదీప్‌కుమార్‌కు తెలియజేయడంతో గ్రామానికి వచ్చి నేత్రాలు సేకరించారు. -
బామ్మర్ది మీ అక్క చనిపోయింది..!
శ్రీకాకుళం: మండలంలోని సంతవురిటి గ్రామానికి చెందిన బాలబోమ్మ భవానీ(21) అనే వివాహిత మంగళవారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలఖండ్యాం గ్రామానికి చెందిన భవానీకి సంతవురిటి గ్రామానికి చెందిన దినేష్‌తో తొమ్మిది నెలల కిందట వివాహం జరిగింది. దినేష్ సచివాలయ లైన్‌మేన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కొన్నాళ్లుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పాలఖండ్యాంలోని పుట్టింటికి వెళ్లిన భవానీ ఈ నెల 14న సంతవురిటి వచ్చింది. అదే రోజు రాత్రి మళ్లీ దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో మంగళవారం వేకువజామున 4 గంటల సమయంలో భవానీ సోదరుడు నాగరాజుకు దినేష్ ఫోన్ చేసి భవానీ మృతిచెందినట్లు సమాచారం అందించాడు. సోదరుడు వెళ్లి చూసేసరికి భవానీ విగతజీవిగా కనిపించింది. భవానీ మృతికి అల్లుడు దినేష్ , అత్తింటి వారే కారణమని బంధువులు ఆరోపించారు. భవానీ మెడపై గాయాలు ఉండటంతో దినేష్ హత్య చేశాడని ఆరోపిస్తూ మృతురాలి తండ్రి ధారబోయిన రాము పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జె.ఆర్.పురం సీఐ అవతారం, ఇన్చార్జి ఎస్ఐ లక్ష్మణరావు, క్లూస్‌టీం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పంచనామా పూర్తి చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజాం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి భర్త దినేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెల్లడించారు. -
గుండెపోటుతో భక్తుడి మృతి.. ఆలయం మూసివేత..!
కాళేశ్వరం: జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థాన ఆవరణలో ఓ భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం..పెద్దపల్లి జిల్లా ఎలిగేడుకు చెందిన రాంపల్లి కనుకయ్య(72) కుటుంబ సభ్యులతో కలసి కాళేశ్వరం వచ్చారు. కుమారుడు కాలసర్పనివారణ పూజలు చేస్తుండగా.. కనుకయ్య ఆలయ ఆవరణలోని ఓ హోటల్ వద్ద కూర్చోని మాట్లాడుతున్నాడు. ఛాతీలో నొప్పితో కుప్పకూలాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన మహదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందాడు.గంటన్నర ఆలయం మూసివేతకనుకయ్య ఆలయ ఆవరణలో మృతి చెందిన విషయం ఆలయ అధికారులకు తెలియడంతో ఆలయాన్ని ఉదయం 8.10 గంటల నుంచి సుమారు గంటన్నరపాటు మూసివేశారు. ఆ తర్వాత సంప్రోక్షణ జరిపి యథావిధిగా పూజలు పునఃప్రారంభించారు.గుండెపోటుతో వ్యక్తి..సిరిసిల్లక్రైం: సిరిసిల్లలో ప్రముఖ స్వీట్‌హౌస్ యజమాని అశోక్(42) సోమవారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతిచెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన అశోక్ సిరిసిల్లలో స్వీట్‌షాప్ పెట్టుకొని కుటుంబంతో స్థిరపడ్డాడు. కొన్నిరోజులుగా పట్టణానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగికి, అశోక్‌కు మధ్య ఓ కారు విషయంలో గొడవలు జరుగుతున్నాయి. కొన్ని నెలల క్రితం సదరు ఉద్యోగి కారును అశోక్ తీసుకెళ్లాడని, ఆ కారు కాస్త గంజాయి రవాణాలో కర్ణాటక పోలీసులకు చిక్కింది. దీంతో అక్కడి పోలీసులు కారును సీజ్ చేశారు. తన కారు తనకు కావాలని, లేకుంటే కొత్తది కొనివ్వాలని అశోక్, సదరు ఉద్యోగి మధ్య పలుమార్లు పంచాయితీలు జరిగాయి. సోమవారం రాత్రి సిరిసిల్లలో కారు పంచాయితీ జరుగగా, పెద్దలు చెప్పిన దానిపై ఆలోచన చేస్తానని అశోక్ ఇంటికి వెళ్లాడు. మానసిక ఒత్తిడి అధికమై గుండెపోటుకు గురయినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. దీనిపై సిరిసిల్ల టౌన్ సీఐ కృష్ణను వివరణ కోరగా కారు కేసు వేరే రాష్ట్రంలో జరిగిందని, గొడవలపై, అశోక్ మృతిపై కుటుంబీకులు ఫిర్యాదు చేయలేదని తెలిపారు. -
అపార్ట్మెంట్లో అక్కా చెల్లెళ్లు మృతి
హైదరాబాద్: మానసిక స్థితి సరిగా లేని ఇద్దరు అక్కచెల్లెళ్లు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కార్ఖాన పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ నరేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. స్థానిక మనోవికాస్ నగర్ శ్రీనిధి ఆపార్ట్‌మెంట్‌లో మీనా చంద్రన్ (59 ), వీణా చంద్రన్ (60) అనే అక్కా చెల్లెళ్లు నివాసం ఉంటున్నారు. వీరు చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటమేగాక మానసిక స్థితి సరిగా లేదు. ఈనెల 11న ఇంట్లో తలుపులు వేసుకుని విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గది నుంచి దుర్వాసన æవస్తుండటాన్ని గుర్తించిన స్థానికులు 13 సాయంత్రం కార్ఖాన పోలీసులకు, మారేడుపల్లిలో ఉంటున్న మరో సోదరి సాధనకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారి మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. వీరి తండ్రి చంద్రన్ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి కాగా అతను మృతి చెందడంతో గత కొన్నేళ్లుగా అతని పెన్షన్ డబ్బులతో వీరు జీవనం సాగిస్తున్నారని వీరి సోదరుడు దుబాయ్‌లో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా మానసిక స్థితి సరిగా లేని వీరు వింతగా ప్రవర్తిస్తూ ఆపార్ట్మెంట్ వాసులను ఇబ్బందులకు గురిచేసే వారని పలుమార్లు వీరిపై పోలీసులకు ఫిర్యాదులు చేయడంతో కౌన్సెలింగ్ ఇచ్చినట్లు ఎస్ఐ తెలిపారు. సీఐ రామకృష్ణ నేతృత్వంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇన్‌స్టా లవర్‌తో వివాహిత ప్రేమాయణం.. భర్త ఇంటికి వచ్చే సరికి..
ఛండీగఢ్: ఇటీవలి కాలంలో సోషల్ మీడియా పరిచయాలు హత్యలకు దారితీస్తున్నాయి. కొందరు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. క్షణికావేశంలో తీసుకునే కొన్ని నిర్ణయాలు.. వారిని జైలుపాలు చేస్తున్నాయి. తాజాగా ప్రియుడి కోసం భర్తనే హత్య చేసిన మరో దారుణ హర్యానాలో చోటుచేసుకుంది. సోషల్ మీడియా రీల్స్ వారి కాపురంలో చిచ్చుపెట్టింది.వివరాల ప్రకారం.. హర్యానాలోని భివానీకి చెందిన ప్రవీణ్‌తో రవీనాకు 2017లో వివాహం జరిగింది. వీరిద్దరికీ ముకుల్ అనే ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే, రవీనా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఒక యూట్యూబ్ రన్ చేస్తూ అందులో వీడియోలు షేర్ చేస్తుంది. ఇన్స్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ ఆప్‌లోడ్ చేస్తుంటుంది. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం యూట్యూబర్ సురేష్‌తో రవీనాకు పరిచయం ఏర్పడింది. దీంతో, వారిద్దరూ స్నేహితులయ్యారు.అనంతరం, ఇన్స్‌స్టాగ్రామ్ వేదికగా ఇద్దరూ కలిసి రీల్స్ కూడా చేశారు. ఇలా రెండేళ్ల పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరు మరింత దగ్గరయ్యారు. శారీరకంగా ఇద్దరూ ఒక్కటయ్యారు. ఇలా గడుస్తున్న సమయంలో వారి వ్యవహారం భర్త ప్రవీణ్‌కు వీరి వ్యవహారం తెలిసింది. రవీనాకు గట్టిగానే హెచ్చరించాడు. ఈ క్రమంలో మార్చి 25వ తేదీన రవీనా ఇంటికి సురేష్ వచ్చాడు.. ఇదే సమయంలో ప్రవీణ్ ఇంటికి రావడంతో వారిద్దరూ అభ్యంతరకర స్థితిలో దొరికిపోయారు. తర్వాత, వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో, రవీనా, సురేష్ కలిసి.. ప్రవీణ్ హత్య చేశారు. అనంతరం, ప్రవీణ్ మృతదేహాన్ని తన బైక్‌పై తీసుకెళ్లి.. దూరంగా ఉన్న మురుగు కాలువలో పడేశారు. తర్వాత ఏమీ తెలియనట్టుగా ఉండిపోయారు.ఈ ఘటన తర్వాత ప్రవీణ్ కనిపించకపోవడంతో అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసకున్న పోలీసులు.. వారి ఇంటి వద్ద ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా.. మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. దీంతో, రవీనాను అదుపులోకి తీసుకుని పోలీసులు గట్టిగా విచారించగా.. అసలు విషయం చెప్పుకొచ్చింది. తన ప్రియుడు సురేష్‌తో కలిసి ప్రవీణ్‌ను హత్య చేసినట్టు ఒప్పుకుంది. ప్రస్తుతం సురేష్ పరారీలో ఉండగా.. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.In Bhiwani, Haryana, a woman along with her lover strangled her husband to death. They took the body on a bike & threw it in the drain. The matter came to light when Raveena & her lover were seen with the body in CCTV. Police arrested Raveena & her lover Suresh is absconding. pic.twitter.com/Ae36kcs1Wp— Baba Banaras™ (@RealBababanaras) April 16, 2025 -
అనూష గర్భంలో ఆడబిడ్డ
మధురవాడ: భర్త చేతిలో హత్యకు గురైన గర్భిణి అనూష మృతదేహానికి కేజీహెచ్‌లో వైద్యులు మంగళవారం పోస్టుమార్టం పూర్తి చేశారు. ఆమె నిండు గర్భిణి కావడంతో కడుపులోని శిశువు కూడా మరణించింది. గర్భం నుంచి ఆడ మృత శిశువును బయటకు తీశారు. ఇరువురినీ చూసి కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అమ్మ తోటే వెళ్లిపోతున్నావా తల్లీ అంటూ గుండెలవిసేలా రోదించారు. అనూష తండ్రి ఇది వరకే చనిపోగా.. తల్లి అంధురాలు కావడం మరింత ఆవేదనకు గురి చేసింది. ప్రత్యక్షంగా భార్యను, పరోక్షంగా తల్లి కడుపులో బిడ్డను హత్య చేసిన నిందితుడు గెద్దాడ జ్ఞానేశ్వర్‌ను కఠినంగా శిక్షించాలని ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అనూష అంత్యక్రియలను దువ్వాడలో పూర్తి చేశారు. కాగా.. దువ్వాడకు చెందిన జ్ఞానేశ్వర్ నర్సీపట్నం రోడ్డులోని అడ్డురోడ్డు తిమ్మాపురానికి చెందిన కేదారిశెట్టి అనూష (27)ని ప్రేమించాడు. 2023లో సింహాచలంలో పెళ్లి చేసుకున్నాడు. భార్యాభర్తలు ఏడాది నుంచి మధురవాడ మిథిలాపురి వుడాకాలనీ ఆర్టీసీ డిపో సమీపం లలితా విహార్ అపార్ట్మెంట్లోని 303వ నంబర్ ప్లాట్‌లో నివాసం ఉంటున్నారు. మనస్పర్థలు కారణంగా వారి మధ్య గొడవలు జరుగుతు న్నాయి. ఏడాది కాలంగా ఆమె అడ్డు తొలగించుకునేందుకు రకరకాలుగా ప్రయతి్నస్తున్నాడు. పిల్లలు పుడితే ఆమెను వదిలించుకోవడం మరింత కష్టమని భావించి.. హత్యకు పథకం వేశాడు. సోమవారం తెల్లవారుజామున ఆమె పీక నులిమి కిరాతకంగా చంపేశాడు. భార్యతో పాటు కడుపులో ఉన్న బిడ్డను కూడా హత్య చేసినందుకు పోలీసులు జ్ఞానేశ్వర్‌ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. నిందితుడిని భీమిలి కోర్టులో హాజరు పరచగా.. మెజి్రస్టేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నిందితుడిని సెంట్రల్ జైలుకు తరలించినట్టు సీఐ బాలకృష్ణ తెలిపారు. -
సారీ..నీ ఉద్యోగానికి మా అమ్మాయిని ఇవ్వలేం..!
వరంగల్: ఉన్నత విద్యనభ్యసించాడు. ఎంతకూ పెద్ద ఉద్యోగం రాలేదు. చివరికి ఓ కంపెనీలో చిన్న ఉద్యోగంలో చేరాడు. వచ్చే వేతనం ఖర్చులకూ సరిపోవడం లేదు. మంచి ఉద్యోగం లేదని వచ్చిన పెళ్లి సంబంధాలు రద్దువుతున్నాయి. దీంతో ఓ యువకుడు మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఇంగోళి రాజేశ్వర్‌రావు, పద్మ దంపతుల కుమారుడు వేణు(30) బీటెక్ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు సాగించి చివరికి తక్కువ వేతనానికి హైదరాబాద్‌లో ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అయితే వేతనం ఖర్చులకు సరిపోకపోవడంతో నాలుగు రోజుల క్రితం ఇంటికి వచ్చాడు. ఈ విషయం తండ్రికి చెప్పడంతో వ్యవసాయం చేసుకుందామని చెప్పి ఓదార్చాడు. వ్యవసాయ పనులు చేయలేక పోయాడు. ఏ పనిచేయలేక తల్లిదండ్రులకు భారంగా మారానని మదనపడుతున్నాడు. ఇదే తరుణంలో వేణుకు అనేక పెళ్లి సంబంధాలు చూశారు. వేణు ఉద్యోగ వివరాలు తెలుసుకున్నాక పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదు. ఇలా మూడు సంబంధాలు రద్దు అయ్యాయి. ఇక తనకు పెళ్లికాదని మనస్తాపంతో తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లిన అనంతరం ఇంట్లో ఉరేసుకున్నాడు. గమనించిన మృతుడి అమ్మమ్మ లచ్చమ్మ దారి వెంట వెళ్తున్న వారిని పిలిచి విషయం చెప్పి తలుపులు తీయించింది. అప్పటికే వేణు ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. కిందికి దించి చూడగా మృతిచెంది ఉన్నాడు. చేతికందొచ్చిన కుమారుడు బలవన్మరణానికి పాల్పడడంతో రాజేశ్వర్‌రావు, పద్మ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నీలోజు వెంకటేశ్వర్లు తెలిపారు. -
ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్.. నాగలక్ష్మీ, సరళ ఎక్కడికి వెళ్లినట్లు..!
సంగారెడ్డి(తూప్రాన్): యువతి అదృశ్యమైన ఘటన మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో చోటు చేసుకుంది. సోమవారం ఎస్ఐ సుభాష్‌గౌడ్ కథనం మేరకు.. మండలంలోని కాళ్లకల్ గ్రామంలో నివాసముంటున్న చామంతుల గణేశ్, మంజులకు కూతురు నాగలక్ష్మీ(19), కుమారుడు ఉన్నారు. వీరు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. నాగలక్ష్మీ 10 రోజుల నుంచి మేడ్చల్ మండలంలోని అత్వెల్లి గ్రామ పరిధిలోని నేషనల్ మార్ట్‌లో పనికి వెళ్తుంది. 12న ఉదయం పనికి వెళ్లిన యువతి సాయంత్రం వరకు ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. యువతి తల్లి మంజుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సికింద్లాపూర్‌లో గృహిణి శివ్వంపేట(నర్సాపూర్): గృహిణి అదృశ్యమైన ఘటన మండల పరిధి సికింద్లాపూర్ పంచాయతీ పిట్టల వాడలో చోటు చేసుకుంది. ఎస్ఐ మధుకర్‌రెడ్డి కథనం మేరకు.. పిట్టలవాడకు చెందిన సునీత 6న ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు గ్రామ పరిసరాలు, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. సోమవారం సునీత భర్త సురేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.– సంగారెడ్డిలో యువకుడు, గృహిణి సంగారెడ్డి క్రైమ్: ఇంటి నుంచి వెళ్లి వ్యక్తి అదృశ్యమైన ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ రమేశ్ కథనం మేరకు.. మెదక్ జిల్లా రంగంపేట మండలానికి చెందిన ఎరుపుల వెంకట్ (37) బతుకుదెరువు కోసం కుటుంబంతో కలిసి ఏడాది కిందట పట్టణంలోని శాంతినగర్‌కి వచ్చి మేస్త్రీగా పని చేస్తూ జీవిస్తున్నారు. గత నెల 28న దంపతులు గొడవ పడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన వ్యక్తి అదే రోజు ఇంట్లోంచి వెళ్లిపోయాడు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. ఆదివారం సాయంత్రం భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గృహిణి అదృశ్యమైన ఘటన సంగారెడ్డి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పుల్కల్ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన బేగరి ప్రసన్న కుమార్, సరళ భార్యాభర్తలు. సరళ (30) భర్తతో గొడవపడి 11న నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
హైదరాబాద్‌లో దారుణం.. వృద్ధురాలిని హత్య చేసి.. శవంపై డ్యాన్స్
హైదరాబాద్: తన స్వీయ రక్షణ కోసం పెట్టుకున్న ఆయుధమే ఆమె పాలిట యమపాశమైంది. ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిని ఓ మైనర్ అతికిరాతకంగా చంపేశాడు. అంతటితో ఆగకుండా వృద్ధురాలి శవంపై నిలబడి డ్యాన్సులు చేసుకుంటూ తన సెల్ఫోన్లో చిత్రీకరించాడు. హత్య జరిగిన మూడు రోజుల తర్వాత తాను ఓ ఘనకార్యం చేశానంటూ మిత్రుడికి ఫోన్ చేసి హత్య చేసిన వీడియోను షేర్ చేశాడు. అలా వీడియో కాస్తా వైరల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ నెల 11న చోటు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికుల సమాచారం మేరకు..రాజస్తాన్‌కు చెందిన పుక్రాజ్ చౌదరి, కమలాదేవి (70) దంపతులు చాలా ఏళ్ల క్రితం నగరానికి వచ్చి మీర్పేట్–హెచ్‌బీకాలనీ డివిజన్, కృష్ణానగర్ కాలనీ రోడ్డు నెంబరు–5లో ఉంటున్నారు. వారికి సంతానం లేదు. పదేళ్ల క్రితం భర్త చనిపోవడంతో కమలాదేవి ఒంటరిగానే ఉంటుంది. మొదటి అంతస్తులో ఆమె నివాసముంటూ గ్రౌండ్‌ఫ్లోర్‌లో షాపులను తన బంధువులకు అద్దెకిచ్చింది. అద్దె షాపుల్లో ప్రకాశ్ చౌదరి అనే వ్యక్తి హార్డ్‌వేర్ షాపు నిర్వహిస్తున్నాడు. 8 నెలల క్రితం రాజస్తాన్‌కు చెందిన ఓ బాలుడిని (17) షాపులో పనికి పెట్టుకున్నాడు. ఈ క్రమంలో కమలాదేవికి బాలుడితో పరిచమైంది. కొన్ని విషయాల్లో కమలాదేవి ఆ బాలుడిని మందలించింది. దీన్ని మనసులో పెట్టుకున్న బాలుడు ఆమెను హత్య చేయాలని నిర్ణయిచుకున్నాడు. ఈ నెల 11న రాత్రి 10:15 గంటల సమయంలో కమలాదేవి ఇంట్లోకి వెళ్లి తనకు ఆకలిగా ఉందని చెప్పాడు. ఆమె రొట్టె చేసి ఇస్తానని చెప్పి పిండి సిద్ధం చేస్తుండగా..అక్కడే ఉన్న ఓ ఇనుప రాడ్‌ను తీసుకుని వెనుకనుంచి ఆమె తలపై బలంగా మోదాడు. కమలాదేవి రక్షణ కోసం పెట్టుకున్న రాడ్‌తోనే ఆమెపై దాడి చేశాడు. అప్పటికీ చనిపోకపోవడంతో రాడ్‌తో బలంగా గొంతులో పొడిచి ఆమె చీర కొంగుతో ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేశాడు. చనిపోయిన వృద్ధురాలి గొంతు, చాతిపై నిలబడి డ్యాన్సులు చేస్తూ తన సెల్ఫోన్లో చిత్రీకరించాడు. రాత్రి 12:30 గంటల సమయంలో ఇంట్లోంచి ఓ కవరుతో బయటకు వచ్చి తాను ఉంటున్న ఇంటికి వెళ్లిపోయాడు. మరుసటి రోజు, ఆ తర్వాతి రోజు కూడా ఏం తెలియనట్లు షాపునకు వచ్చాడు. హత్య చేసిన మరుసటి రోజు పైకి వెళ్లి విగతజీవిగా పడి ఉన్న కమలాదేవిని చూసి వచి్చన దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అంతటితో ఆగకుండా ఈ నెల 14న బెంగుళూరులో ఉంటున్న మిత్రుడు సురేందర్‌కు ఫోన్ చేసి తాను ఓ ఘనకార్యం చేశానంటూ గొప్పగా చెప్పాడు. కమలాదేవిని హత్య చేసిన విషయాన్ని మిత్రుడికి చెప్పాడు. సరదాగా అంటున్నాడనుకొని మొదట నమ్మలేదు. దీంతో తన సెల్ఫోన్లో చిత్రీకరించిన వీడియోను మిత్రుడికి షేర్ చేశాడు. కంగుతిన్న సురేందర్ వెంటనే కిషన్‌సింగ్ పనిచేస్తున్న షాపు యజమానికి విషయం తెలియపరిచాడు. స్థానిక పెద్దల సాయంతో విషయాన్ని పోలీసులకు తెలపడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వా«దీనం చేసుకోవడంతో పాటుగా నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
స్నేహితుడుమోసం చేశాడని.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
అమీర్‌పేట: స్నేహితుడు డబ్బులు తీసుకుని మోసం చేయడంతో మనస్తాపానికి లోనైన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాగపూర్‌కు చెందిన శివాని, రుడాల్ప్ ఆంటోని (30) దంపతులు అమీర్‌పేట ధరమ్‌కరం రోడ్డులో నివాసముంటున్నారు. గత కొన్నాళ్లుగా ఆరి్థక ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో భార్య కూడా ఉద్యోగం చేయాలని ఆంటోని భావించాడు. ఈ నేపథ్యంలో అతడి స్నేహితుడు విశాల్ శివానికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో అతడికి రూ.4.50 లక్షలు ఇచ్చాడు. అయితే అతను ఉద్యోగంఇప్పించకపోవడంతో ఆదివారం రాత్రి అల్వాల్‌లోని విశాల్ ఇంటికరి వెళ్లి గొడవ పడ్డాడు. రాత్రి ఇంటికి తిరిగి వచి్చన ఆంటోని కష్టపడి కూడబెట్టిన డబ్బు స్నేహితుడే కాజేశాడని భార్యకు చెప్పి బాధపడ్డాడు. ఆ తర్వాత తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. అతను గదిలో నుంచి బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన శివాని స్నేహితుల సాయంతో తలుపులు పగులగొట్టి చూడగా ఆంటోనీ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ఎగిరిపడిన స్కార్పియో టాప్
ఒంటిమిట్ట/నంద్యాల: వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలోని కడప–చెన్నై జాతీయ రహదారి సోమవారం నెత్తురోడింది. స్కార్పియో, బస్సు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. తిరుపతి నుంచి నంద్యాలకు వెళ్తున్న స్కార్పియో(ఏపీ31 cw 7479) వాహనం ఒంటిమిట్ట మండల పరిధిలోని నడింపల్లి వద్దనున్న కడప–చెన్నై జాతీయ రహదారిపైకి రాగానే తిరుపతికి వెళ్తున్న ఏపీఎస్ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు(ఏపీ 39 యుఎం 9771)ను వేగంగా ఢీకొంది.స్కార్పియో పల్టీకొట్టి ఎలక్ట్రిక్ బస్సు వెనుక వస్తున్న పెట్రోలింగ్ వాహనాన్ని కూడా ఢీ కొట్టింది. ప్రమాదంలో స్కార్పియోలోని నలుగురిలో తేజనాయుడు(19), ధర్మారెడ్డి(26), వినోద్(25)లు అక్కడికక్కడే మరణించారు. మహానంది పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న సునిల్‌నాయుడుకి తీవ్రగాయాలు అయ్యాయి. ఇతనితో పాటు పెట్రోలింగ్ వాహనం నడుపుతున్న కానిస్టేబుల్ రఘురాంరెడ్డి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడు ధర్మారెడ్డిచేత మద్యం మాన్పించేందుకు తిరుపతికి నాటుమందు కోసమని వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న సీఐ బాబు, ఎస్ఐ శివప్రసాద్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని 108లో కడప రిమ్స్‌కు తరలించారు. ప్రమాదం జరిగిన సమాచారాన్ని కడప డీఎస్పీ వెంకటేశ్వర్లకు చేరవేయడంతో ఆయన సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పరిశీలించి, ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. ఘటనపై రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల వివరాలు ⇒ తేజనాయుడు స్వస్థలం నంద్యాలలోని హౌసింగ్ బోర్డు కాలనీ. తల్లిదండ్రులు భద్ర, రాజేశ్వరి. ఇతను పట్టణంలోని ఓ కళాశాలలో ఐటీఐ చదువుతున్నాడు. ⇒వినోద్ స్వస్థలం బండిఆత్మకూరు మండలంలోని సోమయాజులపల్లె. తల్లిదండ్రులు వెంకటలక్ష్మమ్మ, వెంకటరాముడు. టవర్ల వద్ద జనరేటర్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ⇒ ధర్మారెడ్డి స్వస్థలం చాగలమర్రి మండలం డి.కొత్తపల్లె. తండ్రి శివశంకర్‌రెడ్డి వ్యవసాయం చేస్తుండగా, తల్లి అన్నమ్మ ఉన్నారు. నంద్యాలలోని జియో కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇటీవల అక్క జ్యోతి వివాహం కాగా, తమ్ముడు శ్రీనివాసరెడ్డి ట్రాన్స్ఫారం కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.స్కార్పియో మితిమీరిన వేగమే కారణం రోడ్డు ప్రమాద స్థలాన్ని కడప ఆర్టీసీ ఆర్ఎం పి.గోపాల్‌రెడ్డి పరిశీలించారు. అక్కడ ఉన్న పరిస్థితిని చూస్తే స్కార్పియో వాహనం నడిపిన వారిదే తప్పుగా తెలుస్తోందన్నారు. మితిమీరిన వేగంతో బస్సు మోటును ఢీకొట్టడంతో స్పీడ్ మీదు తిరుగుకుంటూ వెళ్లి బస్సు వెనుక వైపు వస్తున్న పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టి ఉంటారన్నారు. పూర్తిగా తెలుసుకునేందుకు ఎలక్ట్రిక్ బస్సుకు ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలిస్తామని తెలిపారు. -
నాన్నా..! నా పిల్లలను నువ్వే చూసుకో.. నేను చనిపోతున్నా..
విశాఖపట్నం: బెట్టింగులకు అలవాటు పడి అప్పుల ఊబిలో చిక్కుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఉద్యోగిని పోలీసులు కాపాడిన సంఘటన భీమిలి బీచ్‌రోడ్డులో చోటు చేసుకుంది. పీఎంపాలెం సీఐ జి.బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గాజువాక ప్రాంతానికి చెందిన కొండా సుందర్ (30), భార్య, కుమార్తెతో కలిసి పీఎంపాలెంలో నివాసం ఉంటున్నారు. రెండున్నరేళ్లుగా రుషికొండ ఐటీ సెజ్‌లోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఖాళీ సమయాల్లో బెట్టింగులకు పాల్పడుతూ, అది కాస్తా వ్యసనంగా మారింది. బెట్టింగ్‌ల కారణంగా సుమారు రూ. 21 లక్షల అప్పు చేశాడు. స్నేహితుల ఖాతాలో బ్యాంకుల నుంచి కూడా అప్పులు తీసుకున్నాడు. అప్పులు తీర్చాల్సిందిగా.. ఒత్తిడి పెరిగింది. దీంతో మానసికంగా ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం విధులకు వెళ్తున్నానని చెప్పి బయల్దేరాదు. కాసేపటి తర్వాత ‘నాన్నా నన్ను క్షమించు, నీకు ముఖం చూపించలేకపోతున్నా రూ. 21 లక్షలు అప్పు చేశాను. నేను ఎంత కష్టపడినా అప్పులు తీర్చలేని పరిస్థితి. నాభార్య, కుమార్తెను బాగా చూసుకోండి.. నేను చచ్చిపోతానంటూ..’ఓ సెల్ఫీ వీడియో తీసి తన తండ్రికి పంపించాడు. అది చూసిన తండ్రి వెంటనే 112కు కాల్ చేసి విషయం చెప్పి, ఆ వీడియోను పోలీసులకు పంపించారు. అతను పంపిన వీడియోలో.. తన కోసం వెతికితే బీచ్ రోడ్డులో ఫోన్ దొరుకుతుందని చెప్పడంతో.. ఆయన పంపిన వీడియోలో బ్యాక్‌గ్రౌండ్ ఆధారంగా పోలీసులు వెంటనే స్పందించి భీమిలి బీచ్ రోడ్డు రామానాయుడు ఫిల్మ్సూ్టడియో సమీపంలో ఉన్న బీచ్‌కు చేరుకున్నారు. సుందర్ ఓ చెట్టు కింద కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు. పీఎంపాలెం బీచ్ మొబైల్ పోలీసులు ఆయనను పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు పోలీసులు తెలుసుకుని సుందర్‌కు కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే దీనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదని, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి అతి తక్కువ సమయంలో సుందర్‌ను గుర్తించి ప్రాణాలు కాపాడిన సిబ్బందిని సీఐ బాలకృష్ణ అభినందించారు. -
ఒకరితో సహజీవనం..మరొకరితో పెళ్లి..
నిడమనూరు: నిడమనూరు మండలం బొక్కమంతలపహాడ్ గ్రామానికి చెందిన యువతిని అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమ పేరుతో మోసం చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. యువతి కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు సోమవారం రాత్రి కోదాడ–జడ్చర్ల రహదారిపై బొక్కమంతలపహాడ్ గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బొక్కమంతలపహాడ్ గ్రామానికి చెందిన ధర్మారపు మల్లేశ్వరి హైదరాబాద్‌లోనే సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధి హాస్టల్లో ఉంటూ నిమ్స్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది. అదే గ్రామానికి కుక్కల జాన్‌రెడ్డి కూడా హైదరాబాద్‌లోనే రీహాబిలిటేషన్ సెంటర్లో పనిచేస్తున్నాడు. ఒకే గ్రామం కావడంతో వీరిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. జాన్‌రెడ్డి ఇటీవల మరో యువతిని వివాహం చేసుకోవడంతో అది భరించలేక మల్లేశ్వరి ఆదివారం హాస్టల్లో విషపూరితమైన ఇంజెక్షన్ వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ సిబ్బంది గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత సోమవారం సాయంత్రం కుటుంబ సభ్యులు, బంధువులు మల్లేశ్వరి మృతదేహాన్ని బొక్కమంతలపహాడ్ గ్రామానికి తమకు న్యాయం చేయాలని జడ్చర్ల– కోదాడ జాతీయ రహదారిపై రాత్రి వరకు రాస్తారోకో చేపట్టారు. -
9 నెలల గర్భిణిని హత్య చేసిన భర్త
మధురవాడ(భీమిలి): కట్టుకున్న భర్తే కాలయముడిగా మారి నిండు చూలాలైన భార్యను గొంతు నులిమి హత్య చేసిన ఘటన విశాఖపట్నం మధురవాడ ఆర్టీసీ డిపో సమీపంలో చోటు చేసుకుంది. విశాఖ నార్త్ జోన్ ఏసీపీ అప్పలరాజు, మృతురాలి బంధువుల వివరాల ప్రకారం... కూర్మన్నపాలెం సెక్టార్–2, దువ్వాడకు చెందిన గెద్డాడ జ్ఞానేశ్వర్(28), అనకాపల్లి జిల్లా నర్సీపటా్ననికి చెందిన కేదారిశెట్టి అనూష (27)తో 2023లో వివాహమైంది. జ్ఞానేశ్వర్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో పనిచేస్తూ స్కూళ్లలో ట్రైనింగ్ ఇస్తుంటాడు. ఏడాది క్రితం వీరిద్దరూ మిథిలాపురి వుడాకాలనీకి వచ్చారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నా... అప్పుడప్పులు గొడవలు పడుతుండేవారు. ఏడాది కాలంగా జ్ఞానేశ్వర్ ఆమె అడ్డు తొలగించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. నూషకు తొమ్మిది నెలలు నిండగా సోమవారం కాన్పు నిమిత్తం ఆస్పత్రిలో చేరాల్సి ఉంది. ఇందుకోసం ఆమె అమ్మమ్మ అన్నవరం వచి్చంది. ఈక్రమంలో సోమవారం ఉదయం జ్ఞానేశ్వర్ భార్య అనూషను హత్యచేసి ఏమీ తెలియనట్టు బెడ్రూంలో కూర్చున్నాడు. అనూషను ఆస్పత్రికి తీసుకెళ్లే సమయం అవుతుండటంతో అమ్మమ్మ అన్నవరం ఆమెను పిలిచింది. స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి తట్టి లేపింది. అయినా కదలకపోవడంతో జ్ఞానేశ్వర్‌కు చెప్పింది. ఏమీ తెలియనట్టు వెంటనే జ్ఞానేశ్వర్ స్థానికుల సాయంతో అనూషను ఆరిలోవ కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. వైద్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకున్న సీఐ బాలకృష్ణ విచారణ చేపట్టారు. ఇంటికి ఆలస్యంగా వస్తుండటంతో తనను అనూష అనుమానించి మానసికంగా హింసించిందని, విసుగు చెంది గొంతు నులిమి హత్యచేసినట్టు నిందితుడు జ్ఞానేశ్వర్ విచారణలో అంగీకరించాడని పోలీసులు తెలిపారు. అతడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. -
Vizag: మరో 24 గంటల్లో భార్య డెలివరీ... భార్యను హతమార్చిన భర్త
-
మాతో పెట్టుకుంటే రక్తపు మరకలే..
వేములవాడ: వేములవాడ పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఆదివారం సాయంత్రం ఓ ఫంక్షన్ హాల్ మర్డర్‌తో దద్దరిల్లింది. ఆగ్రహావేశాలతో రెండు గొడ్డళ్లు, కత్తితో హత్య చేసిన దశ్యాలు కలచివేశాయి. ఈ దారుణ ఘటన అనంతరం నేనే బైరెడ్డి.. రక్తపు మరకలే సాక్ష్యం.. ఎవడినీ వదలను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తీవ్ర కలకలం రేపింది. పోలీసుల ప్రాథమిక విచారణలో ఇది డ్రగ్స్ ముఠా, గంజాయి గుంపుల మధ్య అంతర్గత వివాదంగా గుర్తించినట్లు సమాచారం. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. పట్టణంలోని బైపాస్ రోడ్డులోని మహాలింగేశ్వర ఫంక్షన్ హాల్ ఆదివారం సాయంత్రం భయంకరమైన హత్య జరిగింది. రెండు గొడ్డళ్లు, ఒక కత్తితో దుండగులు వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లికి చెందిన చెట్టిపల్లి పర్శరాం(36)ను నిర్దాక్షిణ్యంగా మెడ, తలపై గొడ్డలితో దాడి చేసి హత్య చేశారు. మృతుడికి భార్య కల్యాణి, కూతురు అమ్ములు, కుమారుడు బబ్లీ ఉన్నారు. ఫంక్షన్ హాల్లో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు చేరుకొని శవాన్ని ఫంక్షన్ హాల్ బంగ్లాపై నుంచి కిందికి దించి ట్రాక్టర్లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయతి్నంచగా.. పోలీసులు స్పందించలేదు. ట్రాక్టర్ వద్ద రోదనలు.. మృతుడి తల్లిదండ్రులు, భార్య, పిల్లలు ఘటనా స్థలానికి రాగా.. భార్య స్పృహ తప్పి పడిపోయింది. చిన్న పిల్లలు డాడి ఎక్కడ అంటూ అడగడంతో.. స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. అతడి మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు కేకలు వేస్తూ ట్రాక్టర్ పైకి ఎక్కేందుకు ప్రయత్నించారు. తమతో పెట్టుకుంటే రక్తపు మరకలే.. తమతో పెట్టుకుంటే రక్తపు మరకలే అంటూ సదరు అనుమానితుల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కత్తులు, గొడ్డలితో అత్యంత భయంకరంగా వ్యవహరిస్తూ తమతో పెట్టుకుంటే రక్తపు మరకలు అని బెదిరింపులకు పాల్పడినట్లుగా వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. అనుమానితులు 25 ఏళ్ల వయసు లోపున్న వారే కావడం, యువత దారి తప్పిన విధానం వేములవాడలో కలకలం రేపుతోంది. అనుమానితులు ఇప్పటికే ఒక హత్య కేసులో నిందితులుగా ఉన్నట్లు సమాచారం. వేములవాడలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. -
మిస్టరీగానే తల్లి, కుమార్తె మరణం
మిర్యాలగూడ అర్బన్: మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో శనివారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన తల్లి, కుమార్తె మరణం మిస్టరీగానే మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా మాచర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన గుర్రం సీతారాంరెడ్డి తన అక్క కుమార్తె రాజేశ్వరీ(34)ని 2008లో వివాహం చేసుకున్నాడు. అప్పటికే ఓ ప్రైవేట్ ఆగ్రో కెమికల్ సంస్థలో పనిచేస్తున్న సీతారాంరెడ్డి నల్లగొండ జిల్లా సేల్స్ మేనేజర్‌గా బదిలీపై 15ఏళ్ల క్రితమే మిర్యాలగూడకు వచ్చి హౌసింగ్‌బోర్డులో అద్దెకు ఉంటున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు వేదశ్రీ, వేద సాయిశ్రీ(13) సంతానం. ఈ నెల 10న కంపెనీ బడ్జెట్ ఆడిట్ సమావేశం ఉండటంతో సీతారాంరెడ్డి హైదరాబాద్‌కు వెళ్లాడు. రెండు రోజుల తర్వాత ఇంటికి వచ్చిన సీతారాంరెడ్డికి గొంతుపై గాయాలతో చిన్న కుమార్తె వేద సాయిశ్రీ, బెడ్రూంలో ఉరేసుకుని భార్య రాజేశ్వరీ మృతిచెంది ఉండటంతో పోలీసులకు సమాచారం అందించాడు. నోరు విప్పని పెద్ద కుమార్తె..సీతారాంరెడ్డి పెద్ద కుమార్తె వేదశ్రీ నోరు విప్పితేనే రాజేశ్వరీ, వేద సాయిశ్రీ మృతికి గల కారణాలు తెలుస్తాయి. కానీ ఆమె మాత్రం తాను శుక్రవారం రాత్రి నిద్రపోగా శనివారం మధ్యాహ్నం మేలుకువ వచ్చిందని చెబుతోంది. దీంతో వారిపై మత్తు పదార్ధాల ప్రయోగం జరిగిందా..? అనే అనుమానాలకు తావిస్తోంది. అయితే సీతారాంరెడ్డి హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు వస్తున్న సమయంలో ‘ఎక్కడ ఉన్నావు డాడీ’ అంటూ మెసేజ్ చేయడం, తల్లి ఫోన్‌కు వరుసగా వస్తున్న ఫోన్ కాల్స్‌ను కట్ చేయడం వంటివి చూస్తే పెద్ద కుమార్తె వేదశ్రీ స్పృహాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరి మృతదేహాలపై కత్తి గాట్లు..రాజేశ్వరీ ఎడమ చేయి మణికట్టు, పాదాల వద్ద కత్తిగాయాలు ఉండగా, వేద సాయిశ్రీ గొంతును పదునైన కత్తితో కోసినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే మృతురాలి కుటుంబ సభ్యులు మాత్రం ఇది హత్యగానే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసును ఛేదించేందుకు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు నేతృత్వంలో మూడు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే మృతుల ఇంట్లో ఓ లేఖ లభ్యమైనట్లు ప్రచారం జరుగుతుండగా పోలీసులు మాత్రం దానిని ధ్రువీకరించడం లేదు. మిర్యాలగూడ వన్ టౌన్ సీఐ మోతీరాం పర్యవేక్షణలో తల్లి, కుమార్తె మృతదేహాలకు ఆదివారం పోస్టుమార్టం పూర్తిచేసి బంధువులకు అప్పగించారు. అనుమానాస్పద స్థితిలో తల్లి, కుమార్తె మృతిఅన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం: డీఎస్పీ తల్లి, కుమార్తె మరణంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు తెలిపారు. మూడు బృందాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మృతుల శరీరాలపై కత్తిగాట్లు ఉన్నందున పోస్టుమార్టం నివేదిక తర్వాత క్లూస్‌టీం సమాచారం మేరకు లోతైన విచారణ చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ తెలిపారు. -
చనిపోయే ముందు మేము గుర్తుకు రాలేదా అమ్మ..!
కరీంనగర్: అదనపు కట్నం వేధింపులు ఓ వివాహితను బలి తీసుకున్నాయి. పెళ్లయి ఎనిమిదేళ్లయినా అత్తింటివారి వేధింపులు ఆగలేదు. నాలుగేళ్లపాటు భర్త, అత్తామామ, బావ, మరిది వేధింపులు తట్టుకుంది. ఆర్నెళ్ల క్రితం ఆడపిల్ల పుట్టడంతో మరింత ఎక్కువయ్యాయి. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ అయినా తీరు మారలేదు. చివరకు ఆ వివాహిత చావే శరణ్యనుకుంది. ఉరేసుకుని తనువు చాలించింది. ఫలితంగా ఆమె కుమారుడు (6), కూతురు (ఆర్నెళ్లు) తల్లిలేనివారయ్యారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై తహాసీనొదీ్దన్ కథనం ప్రకారం.. దండేపల్లికి చెందిన గంగధరి మల్లేశ్‌కు, బుగ్గారం మండలం యశ్వంత్‌రావుపేటకు చెందిన వరలక్ష్మి అలియాస్ మేఘనతో 2017లో వివాహమైంది. పెళ్లి సమయంలో రూ.4 లక్షల కట్నం, 4 తులాల బంగారం, ఇతర సామగ్రి ఇచ్చారు. నాలుగేళ్లపాటు వీరి కాపురం బాగానే సాగింది. కూలీ పనులకు వెళ్లే మల్లేశ్‌కు అదనపు కట్నంపై ఆశపుట్టింది. అప్పటి నుంచి భార్యను వేధిస్తున్నాడు. దీనికి మల్లేశ్ తల్లిదండ్రులు లక్ష్మి, నర్సయ్య, సోదరులు తోడయ్యారు. కుటుంబమంతా వేధించడంతో మేఘన భరించలేకపోయింది. విషయాన్ని పుట్టింటివారికి చెప్పడంతో ఏడాది క్రితం పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. నచ్చజెప్పి మళ్లీ కాపురానికి పంపించారు.ఆరు నెలల క్రితం పాప జననం..ఆర్నెళ్ల క్రితం మేఘన పాపకు జన్మనిచ్చింది. అప్పటినుంచి కట్నం వేధింపులు మొదలయ్యాయి. భీవండిలో ఉండే తన తండ్రి రాజమల్లుకు 10 రోజుల క్రితం ఫోన్ చేసి చెప్పింది. త్వరలోనే యశ్వంత్‌రావ్‌పేటకు వస్తానని, వచ్చాక పుట్టింటికి తీసుకొస్తానని నచ్చజెప్పాడు. శనివారం స్వగ్రామానికి వచ్చిన రాజమల్లు ఆదివారం భార్య అమ్మాయితో కలిసి దండేపల్లిలోని కూతురు ఇంటికి వెళ్లాడు. అక్కడ కూతురు కనిపించకపోవడంతో లోపలికి వెళ్లి చూడగా చీరతో ఉరేసుకుని కనిపించింది. కన్నబిడ్డను విగతజీవిగా చూసిన తల్లిదండ్రులో బోరున విలపించారు. పుట్టింటికి తీసుకుపోతానంటిని కదా బిడ్డా.. అంతలోనే ఇలా అయ్యిందా అంటూ తండ్రి విలపించిన తీరు అందరినీ కన్నీరు పెట్టించింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన కూతురు మృతికి అల్లుడు, అతని తల్లిదండ్రులు, అన్న, తమ్ముడే కారణమని రాజమల్లు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.తల్లి ప్రేమకు దూరమైన చిన్నారులు..వరలక్ష్మి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కుమారుడు శ్రీనాథ్, కూతురు శరణ్య తల్లిప్రేమకు దూరమయ్యారు. తల్లి ఏమైందో కూడా ఆ చిన్నారులకు తెలియడం లేదు. కనీసం ఆ తల్లికి ఆత్మహత్య చేసుకునే ముందు తన పిల్లలైన గుర్తుకు రాలేదా అని పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. -
భర్తను హత్య చేసేందుకు 20 లక్షల సుపారీ..!
ఖమ్మంఅర్బన్: వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ మహిళ భర్తను హత్య చేయించేందుకు ఐదుగురు కలిసి ప్రణాళిక రచించిన ఘటన వెలుగులోకి వచ్చింది. హత్యకు రూ.20 లక్షల సుపారీ ఇస్తానని, అందులో అడ్వాన్స్‌గా రూ.ఐదు లక్షలు ఇచ్చినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్టు ఖమ్మంఅర్బన్ (ఖానాపురం హవేలీ) సీఐ భానుప్రకాష్ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ముదిగొండ మండలం సువర్ణపూరానికి చెందిన ఓ వివాహితకు అదే గ్రామానికి చెందిన కొండూరి రామాంజనేయులు అలియాస్ రాముతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం ఆమె భర్తకు తెలిసి దంపతుల మధ్య విభేదాలు పెరిగాయి. ఈ క్రమంలో మహిళ భర్తను చంపేందుకు రామాంజనేయులు ప్రణాళిక రచించాడు. ఖమ్మంరూరల్ మండలం బారుగూడెం గ్రామానికి చెందిన దంతాల వెంకటనారాయణ అలియాస్ వెంకట్‌ను సంప్రదించి హత్య విషయమై వివరించాడు. వెంకట్ తన స్నేహితుడు, రౌడీషి టర్ అయిన పగడాల విజయ్‌కుమార్ అలియాస్ చంటిని పరిచయం చేశాడు. హత్యకు రూ.20 లక్షలు సుపారీగా ఒప్పుకొని, మొదటగా రూ.ఐదు లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నారు. ఈ క్రమంలో మార్చి 12న ఖమ్మం నగరంలోని ధంసలాపురం వద్ద సదరు మహిళ భర్తను కిడ్నాప్ చేశారు. మిగతా డబ్బు కోసం రామును సంప్రదిస్తే స్పందించకపోవడంతో ఆమె భర్తను బెదిరించి రూ.1,50,000 నగదు, బంగారు గొలుసు తీసుకొని వదిలేశారు. కాగా, సదరు వ్యక్తి ఏప్రిల్ 11న ఖమ్మంఅర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, నగర ఏసీపీ రమణమూర్తి పర్యవేక్షణలో విచారణ చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిందితులు సువర్ణాపురానికి చెందిన పొక్లెయిన్ ఆపరేటర్ కొండూరి రామాంజనేయులు, దంతాల వెంకటనారాయణ (కారుడ్రైవర్, బారుగూడెం, ఖమ్మంరూరల్), పగాడాల విజయ్‌కుమార్ (చంటి – బైక్ మెకానిక్, అగ్రహారంకాలనీ, ఖమ్మం), వేముల కృష్ణ (బైక్ మెకానిక్, అగ్రహారంకాలనీ, ఖమ్మం), బుర్రి విజయ్ (డెకరేషన్ వర్కర్, బృందావన్‌కాలనీ పువ్వాడఅజయ్‌నగర్, ఖమ్మం) ఆదివారం నగర శివారులోని చెరుకూరి మామిడి తోటలో సమావేశమైనట్లు తెలుసుకొని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రెండు కత్తులు, ఒక ఎయిర్ గన్, రూ.90,000 నగదు, 5 సెల్ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ భానుప్రకాష్ వివరించారు. -
నీవు నాకు తెలుసు.. నీ నంబర్ నా దగ్గర ఉంది..!
వట్పల్లి(అందోల్): ఫోన్లో పరిచయమైన ఓ వ్యక్తి వివాహిత మహిళను అత్యాచారం చేసి ఆమె మెడలో ఉన్న బంగారు నగలతోపాటు సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లిన ఘటన వట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం వెలుగు చూసింది. ఎస్ఐ విఠల్ కథనం మేరకు.. మండల పరిధిలోని పల్వట్ల గ్రామానికి చెందిన ఓ వివాహిత(35) ఆదివారం జోగిపేటలో చీరలు కొన్నది. చీర డ్యామేజ్ ఉండటంతో తిరిగి ఇవ్వడానికి గురువారం జోగిపేటకు వెళ్లింది. ఫోన్‌కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి కాల్ రాగా లిఫ్ట్ చేసి మాట్లాడగా.. కొత్త వ్యక్తి అని ఫోన్ కట్ చేసింది. మళ్లీ ఫోన్ చేసి నీవు నాకు తెలుసు, నీ నంబర్ నా దగ్గర ఉంది.. అంటూ పరిచయం చేసుకొని ఎక్కడ ఉన్నావు అని అడుగగా తాను ఉన్న బట్టల షాపు అడ్రస్ చెప్పింది. వెంటనే అక్కడికి వచ్చి వ్యక్తి ఆమె డబ్బులను షాపులో చెల్లించాడు. షాపింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 5 గంటల సమయంలో మహిళను బైక్‌పై ఎక్కించుకున్నాడు. అల్లాదుర్గం మండలం బహిరన్‌దిబ్బ గ్రామ రోడ్డు సమీపంలోకి రాగానే వర్షం రావడంతో తన బైక్‌ను నిలిపాడు. మళ్లీ రాత్రి 8 గంటల ప్రాంతంలో మహిళను ఎక్కించుకొని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం బైక్‌పై వట్పల్లి మీదుగా బాధిత మహిళ గ్రామం పల్వట్ల వైపు వెళ్తూ నాగులపల్లి గ్రామ సమీపంలోకి రాగానే మహిళను దిగమన్నాడు. నన్ను మా ఇంటి దగ్గర దించాలంటూ ఆమె బైక్ దిగలేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవ పెరిగింది. అతడు మహిళను బయపెట్టి మెడలో ఉన్న రెండు తులాల బంగారు పుస్తెల తాడు, సెల్‌ఫోన్ తీసుకొని పరారయ్యాడు. బాధిత మహిళ అదే రాత్రి వట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాల్‌డేటా ఆధారంగా మనూర్ మండలం బెల్లాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించి అతడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
భార్గవి.. ఎందుకమ్మా ఇలా చేశావు..!
రామన్నపేట: ఉరేసుకుని యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రామన్నపేట మండలం బోగారం గ్రామంలో శనివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బోగా రం గ్రామానికి చెందిన కూనూరు సుదర్శన్, లక్ష్మి దంపతుల కుమార్తె కూనూరు భార్గవి(22) డిగ్రీ పూర్తిచేసి ఇంటి వద్దనే ఉంటూ పీజీ పరీక్షలకు సన్నద్ధమవుతోంది. భార్గవి తండ్రి సుదర్శన్ పది నెలల క్రితమే చనిపోయాడు. తల్లి లక్ష్మి కుట్టు పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. శనివారం మధ్యాహ్నం తల్లి బయటకు వెళ్లగా.. భార్గవి ఇంట్లో దూలానికి చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చుట్టుపక్కల వారు గమనించి తల్లికి సమాచారం అందించారు. మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భార్గవి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
సురేష్ హత్య కేసు దర్యాప్తు ముమ్మరం
నల్లగొండ: నల్లగొండ పట్టణంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన మణికంఠ లేజర్ కలర్ ల్యాబ్ యజమాని గద్దపాటి సురేష్ హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో రామగిరి సెంటర్లోని గీతాంజలి అపార్ట్మెంట్లో మణికంఠ లేజర్ కలర్ ల్యాబ్ నిర్వహిస్తున్న సురేష్ వద్దకు శుక్రవారం రాత్రి 11గంటల ప్రాంతంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మాస్కులు ధరించి వచ్చి తమకు ఫొటోలు ప్రింట్ తీసి ఇవ్వాలని కోరారు. దీంతో సురేష్ ప్రింట్ మిషన్ ఆన్ చేసి కంప్యూటర్‌పై కూర్చున్న సమయంలో నిందితులు మొదట అతడి గొంతు కోసి ఆ తర్వాత గుండెలపై విచక్షణారహితంగా పొడవడంతో సురేష్ అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసు జాగిలాలు, ఫింగర్ ప్రింట్స్ టీంలను పిలిపించి వివరాలు సేకరించారు. ఇద్దరు వ్యక్తులు హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. సీసీ కెమెరాల సీడీఆర్‌ను సేకరించడంతో పాటు మృతుడి కాల్ డేటా ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. హత్య అనంతరం నిందితులు ఏ దారి గుండా బయటకు వెళ్లారు. హత్యకు ముందు ఎక్కడి నుంచి వచ్చారనే కోణంలో నల్లగొండ పట్టణంలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ఎస్పీ శరత్చంద్ర పవార్ ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. పాత కక్షలతోనే హత్య చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫొటో స్టూడియోలు బంద్ చేసి ర్యాలీ..మృతుడు సురేష్ నల్లగొండతో పాటు నకిరేకల్, చిట్యాల, మిర్యాలగూడ తదితర ప్రాంతాల్లో ఫొటో కలర్ ల్యాబ్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. సురేష్ హత్యకు గురికావడంతో నల్లగొండలో శనివారం ఫొటో, వీడియో గ్రాఫర్లు, కలర్ ల్యాబ్ యజమానులు ఫొటో స్టూడియోలు బంద్ చేసి నల్లబ్యాడీ్జలు ధరించి ర్యాలీ నిర్వహించారు. సురేష్ చిత్రపటానికి నివాళులరి్పంచారు. నిందితులను అరెస్ట్ చేసి సురేష్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.నకిరేకల్‌లో అంత్యక్రియలు నకిరేకల్: సురేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శుక్రవారం రాత్రే ఘటనా స్థలం నుంచి నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శనివారం మధ్యాహ్నం పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత సురేష్ సొంతూరు నకిరేకల్‌కు అతడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. నల్లగొండ ఆస్పత్రి మార్చురీ వద్ద సురేష్ కుటుంబ సభ్యులను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పరామర్శించారు. సురేష్ సొంతూరు కట్టంగూర్ మండలం పందెనపల్లి కాగా.. కొన్నేళ్ల క్రితమే కుటుంబం అంతా నకిరేకల్‌లోని చీమలగడ్డ ఫ్లైఓవర్ సమీపంలో స్థిర నివాసం ఏర్పరుచుకుని గూనల వ్యాపారం చేసుకుంటున్నారు. సురేష్ తల్లి, భార్య నాగమణి కలిసి గూనల వ్యాపారం నిర్వహిస్తుండగా.. సురేష్ ఏడేళ్ల క్రితమే నల్లగొండలో ఫొటో కలర్ ల్యాబ్ పెట్టుకుని ప్రతిరోజు నకిరేకల్ నుంచి వెళ్లి వస్తున్నాడు. సురేష్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సురేష్ తండ్రి 30ఏళ్ల క్రితమే చనిపోగా.. తల్లి రెండు నెలల క్రితమే మృతిచెందింది. సురేష్ మృతదేహానికి నివాళులర్పించిన వారిలో టీపీసీసీ నేత దైద రవీందర్ తదితరులు ఉన్నారు. -
కూతురి పెళ్లి రోజే.. నిండు ముత్తైదువుగా తల్లి కాటికి
తమిళనాడు: కుమార్తె పెళ్లికి భర్తతో కలిసి బైక్‌పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. అయితే తల్లి మరణవార్త కుమార్తెకు తెలియనివ్వకుండా బంధువులు పెళ్లి జరిపించారు. వివరాలు.. తంజావూరు జిల్లా అయ్యనార్పురం గ్రామానికి చెందిన రంగస్వామి (55). ఇతని భార్య మాలతి (50). ఇద్దరూ రోజువారీ కూలీలు. వీరి కుమార్తె సుకీర్త, సతీష్ కుమార్ వివాహం గురువారం ఊరణిపురంలోని ఆలయంలో జరిగింది. కుమార్తె వివాహానికి ఏర్పాట్లు చేసిన దంపతులు రంగస్వామి, మాలతి ఇంటి నుంచి మోటారు సైకిల్‌పై వివాహానికి వెళ్లారు. మోటారు సైకిల్‌ను రంగస్వామి నడిపాడు. మాలతి వెనక కూర్చుంది.తిరువోణం సమీపంలోని కాళయరాయన్ రోడ్డులోని నరియట్రు వంతెన వైపు వెళ్తుండగా.. ద్విచక్రవాహనం అనూహ్యంగా రోడ్డు పక్కన ఉన్న బ్రిడ్జి బారికేడ్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాలతి తలకు గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన రంగస్వామిని చికిత్స నిమిత్తం తంజావూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో అసుపత్రిలో చేర్చారు. కూతురు పెళ్లి చేయబోతున్న సమయంలో ప్రమాదంలో రంగస్వామి తీవ్రంగా గాయపడగా.. మాలతి మృతి చెందడం బంధువులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.కూతురు పెళ్లి చేయబోతున్న సమయంలో ప్రమాదంలో రంగస్వామికి తీవ్రగాయాలు కాగా మాలతి మృతి చెందడం బంధువులను దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే యాక్సిడెంట్లో తల్లి మరణించిన విషయాన్ని వధువుకు తెలియజేయకుండా పెళ్లి జరిపించాలని బంధువులు నిర్ణయించారు. ఆ ప్రకారమే సుకీర్త, సతీష్ పెళ్లి చేశారు. తర్వాత ప్రమాదంలో తల్లి చనిపోయిందని, తండ్రికి తీవ్రగాయాలు అయ్యాయని బంధువులు వధువు సుకీర్తకు తెలిపారు. అది విని బోరున ఏడ్చింది. బంధువులు ఆమెను ఓదార్చారు. కూతురి పెళ్లి రోజునే ప్రమాదంలో తల్లి మృతి చెందడం బంధువులు, గ్రామస్తుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. -
పాస్టర్ ప్రవీణ్‌ది సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్: ఏలూరు డీఐజీ
ఏలూరు, సాక్షి: పాస్టర్ ప్రవీణ్ పగడాల(Pastor Praveen Pagadala) మృతి కేసుపై నెలకొన్న అనుమానాలకు పోలీసులు పుల్‌స్టాప్ పెట్టారు. మద్యం మత్తులో బైక్ నడిపి కింద పడిపోవడం వల్లే ప్రవీణ్ ప్రాణాలు పొగొట్టుకున్నారని ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్(Ashok Kumar) వెల్లడించారు. ఈ మేరకు ఈ కేసుకు సంబంధించిన వివరాలను శనివారం రాజమండ్రిలో ఆయన మీడియాకు వివరించారు.హైదరాబాద్ నుంచి పాస్టర్ బైక్ మీద బయల్దేరారు. ఆయన ప్రయాణించిన మార్గంలో సీసీ టీవీ ఫుటేజీ వివరాలు అన్నీ సేకరించాం. ఒక్క రామవరప్పాడు జంక్షన్ వద్ద సీసీటీవీ ఫుటేజీ లభించలేదు. పాస్టర్ ఆరోజు ఎవరెవరితో మాట్లాడారో గుర్తించాం. పాస్టర్ ప్రవీణ్ కుటుంబ సభ్యులను కూడా విచారించాం. ఆయన్ని హత్య చేశారని, అనుమానాస్పద మృతి అని రకరకాల ప్రచారాలు చేశారు. సోషల్ మీడియాలో అలా దుష్ర్పచారం చేసినవారికి నోటీసులు ఇచ్చి విచారిస్తున్నాం.అరోజు ప్రవీణ్ కుమార్ వస్తున్నారని కుటుంబ సభ్యులకు తప్ప ఎవరికీ తెలియదు. మార్గమధ్యలో ఆరుగురితో పాస్టర్ ప్రవీణ్ మాట్లాడారు. మూడు చోట్ల లిక్కర్ కొనుగోలు చేశారు. మద్యం, పెట్రోల్ బంకులలో యూపీఐ పేమెంట్స్ జరిపినట్లు ఆధారాలున్నాయి. మార్గం మధ్యలో ఓ పోలీస్ అధికారి ప్రవీణ్‌తో మాట్లాడారు. మద్యం సేవించడంతో డ్రైవ్ చేయొద్దని వారించారు. అయినా కూడా ఆయన వినకుండా ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో మూడు చోట్ల ఆయనకు యాక్సిడెంట్లు అయ్యాయి. ప్రమాదంలో హెడ్ లైట్ డ్యామేజ్ అయ్యిది. హెడ్ లైట్ పగిలిపోవడంతో రైట్ ఇండికేటర్ వేసుకుని పాస్టర్ ప్రయాణించారు.పోస్ట్ మార్టం రిపోర్టులో, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదికలో (ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్)లో ఆయన మద్యం సేవించినట్లు తేలింది. మరో వాహనంతో ప్రమాదం జరిగినట్లు ఆధారాలు లభించలేదు. ప్రమాద స్థలానికి చేరుకున్నపుడు పాస్టర్ ప్రవీణ్ 70 కి.మీ. వేగంతో ప్రయాణిస్తోంది. కంకర రోడ్డు కారణంగా బైక్ స్లిప్ అయి రోడ్డుపక్కన గుంతలో పడిపోయారు. గుంత అర్ధచంద్రాకారంలో ఉండడం వల్ల బైక్ ఎగిరి పాస్టర్‌పై పడింది. తలకు బలమైన గాయమై చనిపోయారని వైద్యులు తమ నివేదికలో తెలిపారు. పాస్టర్ ప్రవీణ్‌ది సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్ అని ఏలూరు డీఐజీ అశోక్ కుమార్ ప్రకటించారు.పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణంపై సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలో అన్ని విధాలుగా, క్షుణ్ణంగా పరిశోధించామని ఆయన తెలిపారు. కంకర వల్ల బైక్ స్లిప్ అయి పడిపోవడమే పాస్టర్ మరణానికి కారణమని, మరే వాహనం ఆయన బైక్ ను ఢీ కొట్టలేదని స్పష్టంగా తేలిందన్నారు. పాస్టర్ బయలుదేరిన సమయం నుంచి ప్రమాద స్థలం వరకు ఎప్పుడెప్పుడు ఏం జరిగిందనే వివరాలు పరిశోధించి తెలుసుకున్నామని ఆయన వివరించారు. -
'ఇక మమ్మల్ని ఎవరూ విడదీయలేరు'
తమిళనాడు: విడదీస్తారనే భయంతో పెళ్లి చేసుకున్న ఓ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన వేలూరు జిల్లాలో చోటుచేసుకుంది. వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలోని అరుంబాక్కం గ్రామానికి చెందిన మణికంఠన్(27) ఇళ్లకు టైల్స్ వేసే పనిచేస్తుంటాడు. ఇదివరకే వివాహం జరిగిన ఇతను భార్యను వదిలి ఒంటరిగా జీవిస్తున్నాడు.ఈక్రమంలో కడలూరు జిల్లా నెల్లికుప్పం గ్రామానికి చెందిన కోకిల(19) కడలూరులోని ఓ ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. వీరిద్దరికి ఇన్‌స్ట్రాగామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారి రెండు నెలల క్రితం ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. విషయం తెలిసి కోకిల కుటుంబసభ్యులు కడలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి చేసుకున్న ఇద్దరూ విచారణకు రావాలని పోలీసులు తరచూ ఫోన్ చేస్తున్నట్లు తెలిసింది. దీంతో గురువారం ఉదయం బైకులో ఇద్దరూ కలిసి కడలూరుకు బయలుదేరారు. పోలీసులు ఇద్దరిని విడదీస్తారని భయంతో ఇద్దరూ లత్తేరి సమీపంలోని పట్టివూరు రైలు పట్టాల వద్దకు వెళ్లి ఇద్దరూ కౌగిలించుకొని పట్టాలపై తలపెట్టి పడుకున్నారు. ఆ సమయంలో రైలు వారిపై వెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన ప్రయాణికులు జోలార్‌పేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి విచారణ చేస్తున్నారు. -
నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారుల మృతి
అన్నమయ్య జిల్లా : అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం ఎం. రాచపల్లిలో శుక్రవారం సాయంత్రం ప్రమాదవశాత్తూ నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చొక్కారాజు దేవాన్స్ (5), చొక్కారాజు విజయ్(4), రెడ్డిచెర్ల యశ్వంత్ (5) ఆడుకోవడానికి పక్కనే ఉన్న కుంట వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తూ అందులో ఉన్న నీటిలో పడి మృతి చెందారు. చిన్నారుల ఆచూకీ కోసం వెతుకుతుండగా కుంటలో విగతజీవులుగా పడి ఉన్నారు. వెంటనే ముగ్గురిని చిట్వేలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. దీంతో గ్రామమంతా శోకసముద్రంలో మునిగిపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. -
పెళ్లీడుకొచ్చిన పిల్లలను వదిలేసి.. ఇదేం పాడు పని నారాయణ
బాపట్ల టౌన్ : అతడికి 64 ఏళ్లు. ఆమెకు 54. ఇద్దరికీ వేర్వేరు కుటుంబాలున్నాయి. పెళ్లీడుకొచ్చిన సంతానం ఉన్నారు. ఆర్థికంగా స్థిరపడినవారే. పిల్లలు ఉన్నత విద్యావంతులు. అయినా వారి వల్లమాలిన వివాహేతర సంబంధం ప్రాణాల మీదకు తెచ్చింది. ఆ పెద్దాయన తన మాట వినలేదనే ఆవేశంలో ఆమె అఘాయిత్యానికి ఒడిగట్టింది. ఈ ఘటన బాపట్లలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు...రిటైర్డ్ రైల్వే ఉద్యోగి తులాబందుల లక్ష్మీనారాయణ బాపట్ల రైల్వేస్టేషన్ ఎదుట ఐఆర్సీటీసీ సెంటర్ నిర్వహిస్తున్నారు. పట్టణానికి చెందిన నల్లమోతు మాధవితో కొన్నేళ్ళుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. ఇదిలాఉండగా లక్ష్మీనారాయణ భార్య అరుణాదేవి కళ్ళకు ఆపరేషన్ చేయించే నిమిత్తం హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న మాధవి లక్ష్మీనారాయణను వెళ్ళటానికి వీల్లేదంటూ అడ్డగించింది. కుటుంబ సభ్యులతో కలిసి అరుణాదేవిని పంపించాలంటూ హెచ్చరించింది. దీనికి ఆయన అంగీకరించకపోవడంతో శుక్రవారం ఉదయం తన వెంట తెచ్చుకున్న పెట్రోలును ముందు తనపై పోసుకొని ఆ తర్వాత లక్ష్మీనారాయణపై పోసి నిప్పంటించింది. రైల్వే స్టేషన్ ఎదురుగా ఐఆర్సీటీసీ బుకింగ్ కౌంటర్ నుంచి పొగలు రావడంతో స్థానికులు మంటలు ఆర్పివేసే ప్రయత్నం చేశారు. అప్పటికే మాధవి 80 శాతం, లక్ష్మీనారాయణ 60 శాతం కాలిపోయారు. వెంటనే స్థానికులు ఇద్దరినీ చికిత్స నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులను బాపట్ల సీనియర్ సివిల్‌జడ్జి పరామర్శించి వాంగ్మూలం తీసుకున్నారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ఇరువురినీ గుంటూరు తరలించారు. ఘటనపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. pic.twitter.com/cwB2QDewFD— Kumaruuu💙 (@CalmnessSoull) April 11, 2025 -
ఆస్తి కోసం సవతి తల్లి ఘాతుకం.. వెలుగులోకి షాకింగ్ నిజాలు
సాక్షి, నల్లగొండ జిల్లా: శాలి గౌరారం మండలం వంగమర్తి గ్రామం మూసీ వాగులో మృతదేహం బయటపడింది. మేడిపల్లికి చెందిన మహేశ్వరి (26)గా పోలీసులు గుర్తించారు. మహేశ్వరీని హత్య చేసింది సవతి తల్లిగా పోలీసులు తేల్చారు. మూడు నెలల క్రితం హైదరాబాద్ నుంచి మృతదేహాన్ని తీసుకువచ్చి మూసీ వాగులో సవతి తల్లే యువతిని పాతిపెట్టింది. మృతిచెందిన యువతి సొంత గ్రామం జనగామ జిల్లా దేవర ఉప్పల మండలం పడమటి తండా గ్రామంగా పోలీసులు గుర్తించారు.మేడిపల్లి పీఎస్ పరిధి బోడుప్పల్‌లోని లక్ష్మీ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న జాటోత్ మహేశ్వరి (26) అనే యువతి గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన అదృశ్యమైంది. ఈ నెల 2న తండ్రి జాటోత్ పీనా మేడిపల్లి పోలీసులకు పిర్యాదు చేశారు. మేడిపల్లి పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. సవతి తల్లి లలిత పన్నాగంతో మహేశ్వరిని హత్య చేసినట్లు తేలింది. తనకు దక్కాల్సిన ఆస్తిని పెళ్లి పేరుతో మహేశ్వరి తీసుకుపోతుందనే కారణంతోనే లలిత ఈ హత్య చేసినట్లు సమాచారం.లలిత మేనమామ రవితో పాటు మరో వ్యక్తి సహాయంతో మహేశ్వరిని లలిత అంతమొందించింది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సవితి తల్లి లలిత, మేనమామ రవి, మరో వ్యక్తి సహాయంతో మహేశ్వరిని హత్య చేసినట్లు నిందితులు విచారణలో ఒప్పుకున్నారు. నిందితులు చెప్పిన సమాచారంతో వంగమర్తిలో మహేశ్వరి మృతదేహాన్ని వెలికితీశారు. -
నరసింగాపురం పరువు హత్య కేసు.. వాట్సాప్ చాట్‌లో సంచలన విషయాలు
సాక్షి, తిరుపతి జిల్లా: చంద్రగిరిలో సంచలనం రేపిన పరువు హత్య ఘటనలో మిస్టరీ వీడింది. చంద్రగిరి మండలం నరసింగాపురంలో నిఖిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనలో తల్లే నిందితురాలిగా పోలీసులు గుర్తించారు. కూతురు నిఖిత ప్రేమ వ్యవహారం నచ్చకే ఆమె తల్లి సుజాత నిఖితను తలగడతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. నిఖిత తల్లి సుజాతను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.మిట్టపాళెనికి చెందిన అజయ్ అనే వ్యక్తిని 17 ఏళ్ల నిఖిత ప్రేమించింది. ఏడాది క్రితం కూతురు నిఖిత గర్భం దాల్చడంతో కడుపులోని బిడ్డను డెలివరీ చేసి మరి తల్లి సుజాత హత్య చేసినట్లు సమాచారం. నిఖిత తల్లిదండ్రులు పిర్యాదుతో అజయ్‌పై ఫోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు.. జైలుకు పంపారు. నాలుగు నెలల పాటు జైలులో ఉన్న అజయ్‌ను నిఖిత పలుమార్లు కలుస్తూ వచ్చింది.బెయిల్ బయటకు వచ్చిన అజయ్‌ను మళ్లీ కలిసిన నిఖితపై కోప్పడిన తల్లి సుజాత.. గత శుక్రవారం నిద్రిస్తున్న కూతురిని చంపి గంటల వ్యవధిలో మృతదేహాన్ని కాల్చివేసింది. సాధారణ మరణంగా బంధువులను సుజాత నమ్మించింది. ఈ కేసులో సుజాతకు సహకరించిన వారు ఎవరనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో వాట్సాప్ చాట్ ద్వారా నిజాలు వెలుగు చూశాయి. తనకు విషం పెట్టి చంపేందుకు కుట్రలు చేస్తున్నారంటూ ప్రియుడు అజయ్‌కు నిఖిత తెలిపింది. మా అత్త, అమ్మ, తాతయ్య విషం పెట్టీ చంపేందుకు కుట్రలు చేస్తున్నారంటూ నిఖిత పేర్కొంది. వాట్సాప్ చాట్.. పోలీసులకు కీలక ఆధారంగా మారింది. -
అమ్మా.. కాసేపు పడుకుంటా! అని శాశ్వత నిద్రలోకి..
‘‘అమ్మా.. ఇక సెలవు.. శాశ్వతంగా నిద్రలోకి జారుకుంటున్నా’’ అంటూ ఓ కొడుకు రాసిన సూసైడ్ లెటర్ ఆ తల్లిని తల్లడిల్లిపోయేలా చేసింది. ఉత్తర ప్రదేశ్ బరేలీలో బుధవారం ఘోరం జరిగింది. భర్తపై కక్ష గట్టి మరీ ఆ భార్య అతని కటకటాలపాలు చేసింది. అది భరించలేకపోయిన ఓ భర్త.. పైగా ఆ విషయం సోషల్ మీడియాకు కూడా చేరడంతో అఘాయిత్యానికి పాల్పడ్డాడు.రాజ్ ఆర్య, సిమ్రాన్లకు ఏడాది కిందట వివాహం జరగ్గా.. ఈ జంటకు నెలల బాబు ఉన్నాడు. అయితే గతకొంతకాలంగా ఆ కాపురంలో గొడవలు జరుగుతున్నాయి. దీంతో తన సిమ్రాన్ పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే ఓ వివాహ వేడుకకు భార్యతో పాటు హాజరు కావాల్సిన పరిస్థితి రావడంతో రాజ్, అతని తండ్రి షాహ్జన్పూర్లోని సిమ్రాన్ ఇంటికి వెళ్లాడు. అయితే సిమ్రాన్‌ను పంపించేందుకు ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుని సిమ్రాన్ సోదరులంతా రాజ్, అతని తండ్రిపై దాడి చేశారు. దీంతో చేసేది లేక ఆ ఇద్దర బరేలీకి తిరిగి వచ్చారు. ఈలోపు..ఇంటికొచ్చి మరీ తన కుటుంబ సభ్యులపై దాడి చేశారంటూ రాజ్, అతని తండ్రిపై సిమ్రాన్ కేసు పెట్టింది. దీంతో విచారణ పేరిట బుధవారం రాజ్‌ను పోలీస్ స్టేషన్‌కు పిలిచారు. గురువారం ఉదయం ఇంటికి వచ్చిన రాజ్.. తనకు నిద్రగా ఉందంటూ గదిలోకి వెళ్లి పడుకున్నాడు. స్టేషన్లో తనకు తీవ్ర అవమానం జరిగిందని, అది భరించలేక పోతున్నానంటూ సూసైడ్ నోట్ రాసి ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.అయితే.. సిమ్రాన్ వివాహేతర సంబంధమే దీనంతటికి కారణమని రాజ్ సోదరి అంటోంది. పైగా రాజ్‌పై ఫిర్యాదు చేయడానికి ముందు.. చేశాక.. ‘ఇక ఊచలు లెక్కపెట్టు’ అంటూ ఇన్‌స్టాలో సిమ్రాన్ చేసిన పోస్టులను ఆమె బయటపెట్టింది. అంతేకాదు పోలీస్ అధికారి అయిన సిమ్రాన్ సోదరుడు రాత్రంతా రాజ్‌ను పీఎస్‌లో ఉంచి చితకబాదాడని, ఆ అవమానాన్ని తన సోదరుడు భరించలేకపోయాడని ఆరోపించిందామె. ఇక ఈ ఘటనపై రాజ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. In the suicide case of #RajArya, a resident of #AkankshaEnclave under the #Izzatnagar police station area in #UttarPradesh's #Bareilly, an FIR has been registered against seven individuals, including his wife #Simran.The report was filed by the deceased's brother, Suresh,… https://t.co/Z4MGrKhyEt pic.twitter.com/otNGtaMmvs— Hate Detector 🔍 (@HateDetectors) April 10, 2025 ఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కారం కాదు. తీవ్ర నిర్ణయాలు తీసుకునే ముందు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
ప్రియుడితో వెళ్లిపోయి రీల్స్.. తండ్రి కోపాగ్నికి బలి
నా కూతురు ఎవడితోనో వెళ్లిపోయింది. ఎవడో చెబితే తిరిగొచ్చింది. మళ్లీ ఎవడి కోసమో ఇంట్లోంచి వెళ్లిపోయింది. మా గురించి ఆలోచించని కూతురి గురించి మేమెందుకు ఆలోచించాలి.. అంటూ పోలీసుల ఎదుట భావోద్వేగంతో ఓ తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే ప్రాణంగా పెంచుకున్న కూతురిని పరువు పేరిట పొట్టన పెట్టుకుంటాడని కన్నతల్లి సహా ఎవరూ ఊహించలేకపోయారు.బీహార్ సమస్తిపూర్(Samastipur)లో పరువు హత్య ఘటన చోటు చేసుకుంది. తక్కువ కులం వాడితో తన కూతురు వెళ్లిపోయి.. తిరిగొచ్చిందని ఓ తండ్రి ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆమెను కడతేర్చి ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు కన్నీరు పెట్టసాగాడు. మూడు రోజుల తర్వాత దుర్వాసన రావడంతో ఇంట్లోని బాత్రూం నుంచి ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాక్షి(20) అనే యువతి కాలేజీ చదివే ఓ యువకుడిని ప్రేమించింది. ఆ యువకుడు ఉండేది కూడా ఆమె ఉండే కాలనీలోనే. ఆమె తండ్రి ముకేష్ కుమార్ సింగ్(Mukesh Singh Kumar) రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. అతనిది పరాయి కులమంటూ ఆ ప్రేమను ఆ తండ్రి అంగీకరించలేదు. దీంతో.. మార్చి 4వ తేదీన ఆమె ఆ యువకుడితో ఢిల్లీకి వెళ్లిపోయింది. అక్కడ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయసాగింది. ఈలోపు యువకుడి బంధువు ఒకరు వాళ్లను ఒప్పించి వెనక్కి పంపించారు. వారం కిందట ఆమె తిరిగి ఇంటికి చేరుకుంది. సాక్షి తిరిగి రావడంతో ఈ కథ సుఖాంతమైందని బంధువులంతా అనుకున్నారు. కానీ, ఇంట్లోంచి వెళ్లిపోవడమే కాకుండా.. నలుగురికి తెలిసేలా కూతురు చేసిన రీల్స్‌పై ఆ తండ్రి ఆగ్రహంతో రగిలిపోయాడు.అయితే ఏప్రిల్ 7వ తేదీ నుంచి సాక్షి(Sakshi) మళ్లీ కనిపించకుండా పోయింది. దీంతో ఆమె తల్లి కంగారుపడిపోయింది. కూతురు మళ్లీ ఇంట్లోంచి వెళ్లిపోయిందటూ తండ్రి ముకేష్ సింగ్ భార్య సహా అందరినీ నమ్మించే ప్రయత్నిం చేశాడు. ఈ క్రమంలో సాక్షి తల్లికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముకేష్‌ను పోలీసులు విచారించగా.. ఎమోషనల్ డ్రామాలు ఆడాడు. ఈలోపు.. ముకేష్ బాత్రూం నుంచి దుర్వాసన రావడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులతో నిజం ఒప్పుకున్న నిందితుడు.. తానే కూతురిని కడతేర్చినట్లు అంగీకరించాడు. కూతురిని చంపాక.. ఆ యువకుడిని కూడా చంపేందుకు ముకేష్ ప్రయత్నించాడని, కానీ సమయానికి ఆ యువకుడు ఊరిలో లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడని పోలీసులు వెల్లడించారు. ఇదీ చదవండి: కాళ్ల పారాణి ఆరకముందే అదనపు కట్నం కోసం.. -
భర్త వివాహేతర సంబంధం.. భార్య ఆత్మహత్య..!
యశవంతపుర(కర్ణాటక): వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందినఘటన బెంగళూరుని హెబ్బాళ కనకనగరలో సోమవారం సాయంత్రం జరిగింది. బషీర్ ఉల్లా, బాహర్ అస్మా(29) దంపతులకు రెండేళ్ల క్రితం వివాహమైంది. అయితే భర్త మరో మహిళతో సన్నిహితంగా మెలుగుతున్నట్లు అస్మా అనుమానించింది. ఇదే విషయంపై తీవ్ర మనో వేదనకు గురైనట్లు సమాచారం. ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో అస్మా ఉరివేసుకున్న స్థితిలో విగతజీవిగా మారింది. విషయం తెలుసుకున్న మృతురాలి బంధువులు వచ్చి పరిశీలించారు. అస్మాను చంపి ఉరివేసినట్లు ఆరోపించారు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి బషీర్ ఉల్లాను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేపట్టారు. -
కూతురిని చంపి.. తల్లి ఉరేసుకుని..
పెద్దపల్లి రూరల్: ఉన్నత చదువులు చదివింది.. కన్నబిడ్డకు విద్యాబుద్ధులు ప్రాప్తించేలా చూడాలంటూ రెండ్రోజుల క్రితమే బాసరలోని సరస్వతీదేవి అమ్మవారి ఎదుట అక్షరాభ్యాసం చేయించింది.. ఇంతలో ఏమైందో ఏమో.. క్షణికావేశంలో కన్న కూతురినే కడతేర్చింది.. ఆపై తానూ ఉరివేసుకుంది. పెద్దపల్లి టీచర్స్ కాలనీలో బుధవారం రాత్రి వెలుగుచూసిన ఈ ఘటనపై మృతురాలి కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి ఎల్ఐసీ కార్యాలయంలో పనిచేస్తున్న లోక వేణుగోపాల్‌రెడ్డికి సాహితి (29)తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమార్తె రితన్య (2) ఉంది. టీచర్స్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. బుధవారం భర్త ఇంట్లో లేని సమయంలో.. సాహితి కూతురు రితన్యకు ఉరివేసి చంపి, తర్వాత తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సాహితికి రాత్రి తల్లిదండ్రులు ఫోన్‌చేసినా ఎత్తలేదు. దీంతో అనుమానించి ఇరుగు పొరుగు వారితో మాట్లాడి సమాచారం తెలుసుకోవడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఎంటెక్ చదివిన సాహితి ఎక్కువగా ఆలోచిస్తుండేదని, సన్నగా ఉన్నాననే వేదనతో ఉండేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఆ బాధ తాలూకు క్షణికావేశంలోనే సాహితి.. కూతురిని చంపి, ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని భావిస్తున్నట్లు సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. అక్షరాభ్యాసం చేయించి.. రెండు రోజుల క్రితమే బాసరలో చిన్నారి రితన్యతో తల్లిదండ్రులు అక్షరాలు దిద్దించారు. వచ్చే విద్యాసంవత్సరంలో కరీంనగర్‌లోని ఓ పాఠశాలలో నర్సరీలో చేర్పించాలని నిర్ణయించుకున్నారు. ఇంతలోనే ఈ ఘోరం చోటుచేసుకుంది. సాహితి ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో.. భర్త వేణుగోపాల్‌రెడ్డి మంచివాడేనని స్పష్టం చేసింది. తన చావుకు ఎవరూ బాధపడొద్దని, తాను లేకుండా బిడ్డ ఎలా ఉంటుందోననే వేదనతోనే.. వెంట తీసుకెళ్తున్నానని లేఖలో పేర్కొంది. -
16 రోజుల్లో.. ఉగ్ర విధ్వంసం
సాక్షి, హైదరాబాద్: ఒక సూత్రధారి.. మరో సహాయకుడు.. నలుగురు పాత్రధారులు.. 16 రోజుల ఆపరేషన్.. 25 కేజీల పేలుడు పదార్థం... వెరసీ.. 18 ప్రాణాలు. 2023 ఫిబ్రవరిలో జరిగిన దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల నేపథ్యమిదీ. ఈ కేసులోనే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఐదుగురు ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులకు విధించిన ఉరి శిక్షను మంగళవారం హైకోర్టు సమర్థించిన విషయం విదితమే. పాక్ నుంచి కథ నడిపిన రియాజ్... పాకిస్థాన్‌లో ఉన్న ఐఎం వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్ 2007లో మాదిరిగానే హైదరాబాద్‌ను మరోసారి టార్గెట్ చేయాలని 2012లో నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు యాసీన్ భత్కల్‌కు ఈ–మెయిల్ ద్వారా ఆదేశాలు ఇచ్చాడు. ఇతడు అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీ, వఖాస్, తెహసీన్ అక్తర్, ఎజాజ్ షేక్‌లను రంగంలోకి దింపాడు. అప్పటి వరకు వీరంతా మంగుళూరులోనే ఉన్నారు. పేలుళ్ల ఆపరేషన్ పూర్తి చేయడానికి షెల్టర్ వెతకడం కోసం 16 రోజుల ముందు (2013 ఫిబ్రవరి 5న) నగరానికి చేరుకున్న మోను అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. హడ్డీ అదే నెల 10న హైదరాబాద్ చేరుకున్నాడు. గదితో పాటు చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించి సంతృప్తి చెందిన హడ్డీ తిరిగి మంగుళూరు వెళ్లాడు. భత్కల్స్ ఆదేశాల మేరకు మంగుళూరులోని యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి 25 కేజీల అమోనియం నైట్రేట్ పేలుడు పదార్థం, 30 డిటొనేటర్లు ఉన్న బంగారం రంగు బ్యాగ్ ఇతడికి అందింది. సైకిళ్లు, కుక్కర్లు ఇక్కడే కొనుగోలు.. ముందు హడ్డీతో పాటు వఖాస్ సైతం పేలుడు పదార్థాలతో సిటీకి వచ్చారు. మలక్‌పేట, అబిడ్స్, దిల్‌సుఖ్‌నగర్‌ల్లో రెక్కీ చేసినా.. దిల్‌సుఖ్‌నగర్‌నే టార్గెట్ చేశారు. 2013 ఫిబ్రవరి 19న చిన్న బాంబు తయారు చేసిన హడ్డీ అబ్దుల్లాపూర్‌మెట్ కొండల్లో టెస్ట్ బ్లాస్ట్ చేశాడు. ఆ మరుసటి రోజు (2013 ఫిబ్రవరి 20) హడ్డీ, వఖాస్, మోను ముగ్గురూ కలిసి మలక్‌పేట వెళ్లి... యశోదా ఆస్పత్రి నుంచి టీవీ టవర్ వైపునకు వచ్చే మార్గంలో ఉన్న ఓ సైకిల్ రిపేరింగ్ దుకాణం నుంచి పాత సైకిల్ కొన్నారు. మరొకటి కావాలనగా దాని యజమాని పాత బస్తీలోని జుమ్మేరాత్ బజార్ వెళ్లాలని సూచించాడు. మలక్‌పేట రైల్వేస్టేషన్లో పార్క్ చేసి.. ఆ సైకిల్‌ను మలక్‌పేట రైల్వేస్టేషన్లో పార్కింగ్ చేసి.. ముగ్గురూ ఆటోలో లక్డీకాపూల్ వెళ్లి మంగుళూరు వెళ్లేందుకు టికెట్లు రిజర్వ్ చేసుకున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్‌కు తిరిగి వస్తూ బాంబుల తయారీకి ఎల్బీ నగర్లో రెండు ప్రెషర్ కుక్కర్లు, ఆ సమీపంలోని పండ్ల వ్యాపారుల నుంచి కొన్ని ఖాళీ చిన్న సైజు అట్ట పెట్టెలు కొనుగోలు చేశారు. బి–డే (బ్లాస్ట్ డే) అయిన 2013 ఫిబ్రవరి 21 ఉదయం వఖాస్‌కు బాంబుల తయారీ బాధ్యతల్ని అప్పగించిన హడ్డీ, మోను 11 గంటల ప్రాంతంలో పాతబస్తీలోని జుమ్మేరాత్‌బజార్‌కు చేరుకున్నారు. అక్కడ మరో పాత సైకిల్ కొనుగోలు చేసి దాన్ని కూడా తీసుకుని మలక్‌పేట రైల్వేస్టేషన్ పార్కింగ్‌లో మొదటి సైకిల్ పెట్టిన చోటే పెట్టి ఇంటికి వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటలకు బాంబుల తయారీ పూర్తయింది. విధ్వంసానికి ముందే గది ఖాళీ.. రెక్కీ ప్రకారం ఏ–1 మిర్చ్ సెంటర్, దాని వెనుక రోడ్డులో అనునిత్యం రద్దీగా ఉండే మద్యం దుకాణం వద్ద బాంబులు పెట్టాలి. 2013 ఫిబ్రవరి 21 సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ త్రయం అబ్దుల్లాపూర్‌మెట్‌లోని గదిని ఖాళీ చేసింది. రెండు కుక్కర్ బాంబుల్ని పట్టుకున్న ముగ్గురూ షేర్ ఆటోలో ఎల్బీనగర్కు, అక్కడ నుంచి ప్రత్యేక ఆటోలో మలక్‌పేట వచ్చారు. రైల్వేస్టేషన్ పార్కింగ్ నుంచి సైకిళ్లను తీసుకున్నారు. ప్యాక్ చేసిన బాంబుల్ని వాటిపై పెట్టుకున్న ముగ్గురూ దిల్‌సుఖ్‌నగర్‌కు వచ్చారు. మొదటి సైకిల్ తీసుకుని మోను, రెండో సైకిల్‌తో వఖాస్ వెళ్లగా... హడ్డీ గడ్డిఅన్నారం చౌరస్తా వద్ద ఎదురు చూశాడు. మోను నేరుగా వెళ్లి ఏ–1 మిర్చ్ సెంటర్ వద్ద సైకిల్ పెట్టాడు. మద్యం దుకాణం వరకు చేరే సమయం లేదని నిర్థారించుకున్న వఖాస్ 107 బస్టాప్ వద్ద పార్క్ చేసి వెళ్లిపోయాడు. పేలుళ్లు జరిగిన అనంతరం హడ్డీ, మోను గడ్డిఅన్నారం చౌరస్తా నుంచి ఆటోలో లక్డీకాపూల్‌లోని ట్రావెల్స్ కార్యాలయం వద్దకు వెళ్లారు. అక్కడ నుంచి ట్రావెల్స్‌కు చెందిన షటిల్ సరీ్వస్ వ్యానులో రేతి»ౌలి చౌరస్తా చేరుకుని అక్కడ నుంచి ట్రావెల్స్ బస్సులో మంగుళూరు వెళ్లిపోయారు. సైకిల్ పెట్టిన తరవాత వేరే మార్గంలో మోను నగరాన్ని దాటి వెళ్లిపోయాడు. -
Hyderabad: క్షణికావేశం..పెను విషాదం!
హయత్‌నగర్: భార్యాభర్తల మధ్య ఏర్పడిన చిన్న తగాదా ఇరువురి ఉసురు తీసింది. 11 నెలల బాలుడిని అనాథను చేసింది. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగిన ఈ విషాద ఘటన వివరాలు పోలీసులు తెల్పిన మేరకు ఇలా ఉన్నాయి. సంపంగి నగేష్ (25), శిరీష(20) భార్యాభర్తలు. రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 11 నెలల కుమారుడు ఉన్నాడు. హయత్‌నగర్ ముదిరాజ్ కాలనీలో నివసిస్తూ జీహెచ్ఎంసీ కార్మికులుగా పని చేస్తున్నారు. మంగళవారం భార్యా భర్తల మధ్య చిన్న వివాదం తలెత్తింది. దీంతో మనస్తాపం చెందిన శిరీష క్షణికావేశంలో..ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. శిరీష తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నగేష్ ను అదుపులోకి తీసుకున్నారు. బంధువుల పూచీకత్తుతో రాత్రి 9 గంటలకు వదిలి పెట్టారు. ఆవేదనతో భర్త ఆత్మహత్య... భార్య మరణంతో తీవ్ర ఆవేదనకు గురైన నగేష్ బుధవారం తెల్లవారుజామన హయత్‌నగర్‌లోని రిలయన్స్ డిజిటల్ షోరూం భవనం పైకి ఎక్కి కిందకు దూకాడు. రక్తం మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించిన పోలీసులు..నగేష్ ఒక్కడే భవనంపైకి ఎక్కి కిందకు దూకినట్లుగా నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.పాపం పసికందు... భార్యా భర్తలిద్దరూ ఒక రోజు తేడాలో ఆత్మహత్యకు పాల్పడడంతో ముదిరాజ్ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన 11 నెలల బాలుడిని చూసి బంధువులు, స్థానికులు కన్నీరు మున్నీరుగా విలపించారు. -
తల్లీ, తండ్రి టార్చర్.. తనయుడు బలవన్మరణం
కాకినాడ రూరల్: నా కన్న తల్లి, తండ్రివల్ల నేను చనిపోతున్నాను.. సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాను.. నావల్ల ఇంకో అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది. పెళ్లిచేసి టార్చర్ పెట్టారు. ముఖ్యంగా నా తల్లి పేరుకే ఆడది, వంద జన్మలెత్తినా అలాంటి దానికి పుట్టకూడదని కోరుకుంటున్నాను. నేను పెళ్లి చేసుకుని ఇంకో అమ్మాయికి అన్యాయం చేశాను. నన్ను, నా భార్యను మానసికంగా వేధించారు. నిజంగా నేను వారికి పుట్టానో లేదో తెలీదు. ఇవీ.. కాకినాడ శశికాంత్‌నగర్‌లో ఆదివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన దాకారపు దుర్గా వేణుగోపాల్ ప్రసాద్ (39) సెల్ఫీ వీడియోలోని మాటలు. ఇందుకు సంబంధించి మృతుడి భార్య పాప, పోలీసుల వివరాల ప్రకారం.. వాటా లేదంటూ ఇంట్లోంచి పొమ్మన్నారు దుర్గా వేణుగోపాల్ ప్రసాద్‌కు తామరాడకు చెందిన యువతి పాపతో 2021 ఫిబ్రవరి 14న వివాహం జరిగింది. పాప టీసీఎస్‌కు వర్క్ ఫ్రమ్ హోం పద్ధతిలో ఉద్యోగం చేస్తూ కాకినాడలో తన తండ్రి ఇంట్లో ఉంటున్నారు. ప్రసాద్‌కు ఎటువంటి ఉద్యోగం లేకపోవడంతో భార్య సంపాదనతో ఇద్దరు అక్కడే ఉంటున్నారు. ఇంట్లో వాటాలేదని, జగ్గంపేట మండలం మల్లిసాలలో ఉన్న స్కూల్లోనూ వాటాలేదని చెప్పడమే కాక తన ఇంట్లో ఉండవద్దని తల్లి వెంకటలక్ష్మి, తండ్రి శ్రీరామమూర్తి చెప్పడంతో పాటు ప్రసాద్, పాపలను ఇంటి నుంచి పొమ్మన్నారు. దీంతో పాప తండ్రి ఇంట్లో అద్దె చెల్లిస్తూ అక్కడే ఉన్నారు. ఈనెల 3న చనిపోతానని పాపతో పాటు ఆమె అన్నయ్యకు ప్రసాద్ వీడియో పెట్టడంతో వారు కంగారుపడి అదేరోజు తామరాడ తీసుకొచ్చారు. మరుసటి రోజు బయటకెళ్లి తల్లిదండ్రులు ఇంట్లోకి రానివ్వడంలేదని భార్యకు ఫోన్లో చెప్పి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
క్రికెట్ బెట్టింగ్.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
కాకినాడ: క్రికెట్ బెట్టింగ్‌లో సొమ్ము కోల్పోయిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కోలనాటి రమణబాబు (33) ఆత్మహత్య చేసుకున్నాడని తుని జీఆర్పీ ఎస్సై జి.శ్రీనివాసరావు తెలిపారు. సోమవా రం అందిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం నక్కపల్లి గ్రామానికి రమణబాబు వర్క్ ఫ్రం హోంగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. నెలవారీ వస్తున్న జీతం ఇంటికి ఇవ్వకుండా బెట్టింగ్‌కి అలవాటు పడి సొమ్ము పోగొట్టుకున్నాడు. అప్పుల బాధతో నర్సీపట్నం– రేగు పాలెం మధ్యలో రైలు పట్టాల పై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి వద్ద లభించిన సెల్‌ఫోన్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
హత్యకేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష
జగిత్యాలజోన్: ముగ్గురు పిల్లలున్న వివాహితపై కన్నేసి, మాట వినకుంటే కిరోసిన్ పోసి నిప్పంటించి, ఆమె మృతికి కారణమైన నిందితుడు ఇల్లంతకుంట శ్రీధర్‌కు యావజ్జీవ శిక్ష, రూ 1.02 లక్షల జరిమానా విధిస్తూ జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.నీలిమ సోమవారం తీర్పునిచ్చారు. పీపీ జంగిలి మల్లికార్జున్ కథనం ప్రకారం కొడిమ్యాలలో నివాసం ఉండే దంపతులకు ముగ్గురు పిల్లలు. భర్త ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లాడు. భార్య బీడీలు చుడుతూ పిల్లలను చదివిస్తోంది. వీరి ఇంటి పక్కన ఉండే ఇల్లంతకుంట శ్రీధర్ సదరు మహిళపై కన్నేశాడు. కోరిక తీర్చకపోతే చంపుతానని బెదిరించాడు. దీంతో సదరు మహిళ తన పిల్లలతో కలిసి అదే గ్రామంలో వేరే చోటుకు అద్దె ఇంట్లోకి మారింది. అక్కడికి వెళ్లిన శ్రీధర్ మహిళకు ఇల్లు ఎందుకు అద్దెకిచ్చావని యాజమానితో గొడవకు దిగాడు. దీంతో ఆ మహిళ తిరిగి సొంతింటికి వచ్చింది. ఏప్రిల్ 14, 2019 రోజున సదరు మహిళ ఇంట్లో బీడీలు చుడుతుండగా, శ్రీధర్ వచ్చి తన కోరిక తీర్చమని వేదించాడు. ఒప్పుకోకపోవడంతో తన ఇంట్లోంచి కిరోసిన్ తీసుకొచ్చి ఆమెపై పోసి నిప్పంటించాడు. ఈ సమయంలో మహిళ పిల్లలు గ్రామంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొని తిరిగి వస్తుండగా, ఇంట్లోంచి కేకలు వినపడ్డాయి. చుట్టుపక్కల వారు వచ్చి మంటలు ఆర్పివేస్తుండగా శ్రీధర్ అక్కడి నుంచి పారిపోయాడు. సదరు మహిళను జగిత్యాలకు తరలించి, అనంతరం హైదరాబాద్‌లోని గాంధీ అసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి కూతురు పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి సీఐలు సీహెచ్.నాగేందర్, కె.కిశోర్ కేసు నమోదు చేసి, శ్రీధర్‌ను అరెస్ట్ చేసి, చార్జీషీట్ దాఖలు చేశారు. కోర్టు మానిటరింగ్ అధికారులు ఎం.కిరణ్‌కుమార్, కేవీ.సాగర్ బలమైన సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టడంతో, పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడైన ఇల్లంతకుంట శ్రీధర్‌కు యావజ్జీవ శిక్షతో పాటు రూ.1.02 లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. -
అనారోగ్యంతో రిసెప్షనిస్టు మౌనిక ఆత్మహత్య
చౌటుప్పల్(నల్గొండ): అనారోగ్యంతో బాధపడుతున్న యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సోమవారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో జరిగింది. సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ పట్టణ కేంద్రానికి చెందిన గుండ్ల రామచంద్రయ్య–లక్ష్మమ్మ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు సంతానం. వీరు పండ్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమార్తె గుండ్ల మౌనిక(25) స్థానిక వలిగొండ రోడ్డు వద్ద ఉన్న అఖిల్ నేత్రాలయంలో రిసెప్షనిస్టుగా పనిచేసేది. ఇటీవల తనకు ఎర్ర రక్తకణాలు హెచ్చుతగ్గులు అవుతుండడంతో నాలుగు నెలలుగా ఉద్యోగం మానేసి ఇంటి వద్దనే ఉంటోంది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో సన్నద్ధమవుతోంది. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉన్న మౌనిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి రామచంద్రయ్య మధ్యాహ్నం ఇంటికి రాగా.. తలుపు పెట్టి ఉండడం, కుమార్తెను పలకకపోవడంతో తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా.. మౌనిక ఉరేసుకుని కనిపించింది. వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందిందని నిర్ధారించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. -
ఫుడ్ పాయిజన్‌తో తల్లీకొడుకుల మృతి
రుద్రంగి (వేములవాడ): ఫుడ్ పాయిజన్‌తో గంటల వ్యవధిలోనే తల్లీకుమారుడు మృతిచెందిన విషాదకర సంఘటన రుద్రంగి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన కాదాసు పుష్పలత (35), నిహాల్ (6), శుక్రవారం రాత్రి ఇంట్లో రొట్టెలు తిని పడుకున్నారు. అనంతరం వాంతులు విరోచనాలు కావడంతో స్థానిక ఆర్ఎంపీ వద్ద వైద్యం చేయించుకున్నారు. పరిస్థితి విషమించడంతో శనివారం కోరుట్ల, కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. చికిత్స పొందుతూ ఆదివారం తల్లి పుష్పలత మృతిచెందగా.. పరిస్థితి విషమించడంతో కొడుకు నిహాల్‌ను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిహాల్ ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రాణాలు కోల్పోయాడు. గంటల వ్యవధిలో తల్లీకొడుకులు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతిపై అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదుకాగా పుష్పలత, నిహాల్ మృతిపై అనుమానాలు ఉన్నాయని పుష్పలత అన్న పాలెపు శ్రీనివాస్ రుద్రంగి పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఫి ర్యాదు చేశాడు. ఇంట్లో తరచూ గొడవలు జరిగేవని.. వాటిని మనసులో పెట్టుకొని పుష్ప లత అత్తగారి కుటుంబ సభ్యులే విషప్రయో గం చేసి ఉంటారని ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేశాడు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని పాలెపు శ్రీనివాస్ కోరారు. బాధితుల ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని రుద్రంగి ఎస్సై అశోక్ తెలిపారు. -
యానాం ఎమ్మెల్యే ఫొటోను పెళ్లి ప్రొఫైల్‌లో పెట్టి..
బంజారాహిల్స్ (హైదరాబాద్): వివాహ వెబ్సైట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా పెళ్లిళ్ల పేరుతో యువతులను మోసగించిన ఘరానా మోసగాడు జోగడ వంశీకృష్ణ అలియాస్ చెరుకూరి హర్ష (33)ని కస్టడీకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు, తమ విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలను రాబట్టారు. తన కాలేజ్‌మేట్ అయిన యానాం ఎమ్మెల్యే ఫొటోలను పెళ్లి ప్రొఫైల్‌లో తన ఫొటోగా పెట్టి నాలుగు రాష్ట్రాల్లో.. పెళ్లిళ్ల పేరుతో 26 మంది యువతులను అతను మోసం చేసినట్లుగా గుర్తించారు. గత నెలలో నగరానికి చెందిన ఒక వైద్యురాలిని షాదీ డాట్ కామ్ వెబ్సైట్ ద్వారా ఎన్ఆర్ఐగా పరిచయం చేసుకుని దాదాపు రూ.10 లక్షలకుపైగా మోసానికి పాల్పడ్డాడు. తన తల్లి అమెరికా నుంచి రాగానే వివాహం చేసుకుంటానని ఆమెను నమ్మించాడు. మోసాన్ని గ్రహించిన వైద్యురాలు గత నెలలో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు హర్షని అరెస్టు చేశారు. నిందితుడిపై హైదరాబాద్, రాచకొండ, విజయవాడ, ఖమ్మం పట్టణాలతో పాటు పలు రాష్ట్రాల్లో 20కి పైగా కేసులు ఉన్నట్లు గుర్తించారు. హర్షను ఐదు రోజుల కస్టడీకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం అతన్ని తిరిగి కోర్టులో హాజరుపర్చి జైలుకు తరలించారు. విచారణలో భాగంగా హర్షపై మరో ఐదు కేసులు నమోదై ఉన్నట్లు తెలిసింది. పోలీసులకు పట్టుబడకుండా స్నేహితుల పేరు మీద మూడు సిమ్‌కార్డులు తీసుకుని పలు మోసాలకు పాల్పడినట్లు విచారణలో గుర్తించారు. ఎన్ఆర్ఐగా నటించి పెళ్లిళ్ల పేరుతో మోసం చేసి సంపాదించిన డబ్బులతో వంశీకృష్ణ బెట్టింగ్‌లకు పాల్పడటమే కాకుండా విదేశీ టూర్లు కూడా చేసినట్లు పోలీసులు తెలిపారు. -
మియాపూర్‌లో షెల్టర్!
సాక్షి, సిటీబ్యూరో: కర్నాటకలోని బీదర్, నగరంలోని అఫ్జల్‌గంజ్‌లో తుపాకులతో విరుచుకుపడిన ఇద్దరు దుండగులు అమన్ కుమార్, అలోక్ కుమార్ ఈ నేరాలు చేయడానికి ముందు మియాపూర్‌లో బస చేసినట్లు వెలుగులోకి వచి్చంది. అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన హైదరాబాద్ పోలీసులు ఈ విషయం గుర్తించారు. దీనికి సంబంధించిన రికార్డులను సైతం స్వాధీనం చేసుకున్నారు. నగరంలో నేరం చేసిన తర్వాత దేశ సరిహద్దులు దాటి నేపాల్ పారిపోయినట్లు ఈ ద్వయం ప్రస్తుతం నేపాల్‌లో ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. జనవరి 12న నగరానికి రాక... బీహార్‌లోని వైశాలీ జిల్లా ఫతేపూర్ పుల్వారియాకు చెందిన అమన్ కుమార్, అలోక్ కుమార్ ఏటీఎం మిషన్లలో నగదు నింపే వాహనాలనే టార్గెట్‌గా చేసుకున్నారు. ఈ గ్యాంగ్ 2023 సెపె్టంబర్ 12న ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లో సెక్యూరిటీ గార్డు జై సింగ్‌ను హత్య చేసి రూ.40 లక్షలు దోచుకుపోయింది. నేపాల్ పారిపోయిన ఈ గ్యాంగ్ యూపీ పోలీసుల హడావుడి తగ్గిన తర్వాత బీహార్ చేరుకుంది. అక్కడ నుంచి తమ స్వస్థలానికి వెళ్లి... ఈ ఏడాది జనవరిలో నగరానికి వచ్చింది. బీదర్‌ను టార్గెట్‌గా చేసుకున్న అమన్, అలోక్ ఆ నెల 12న మియాపూర్‌లోని శ్రీ సాయి గ్రాండ్ ఇన్ హోటల్లో బస చేసింది. అక్కడ నుంచి బీదర్‌కు రాకపోకలు సాగించడం తేలికనే ఉద్దేశంతోనే అక్కడ షెల్టర్ ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు చెప్తున్నారు. అమిత్ కుమార్, మహేష్ కుమార్ పేర్లతో నకిలీ ఆధార్ కార్డులు తయారు చేసిన దుండగులు వాటి ఆధారంగానే రూమ్ తీసుకున్నారు. మూడు రోజుల పాటు రెక్కీ... బీదర్‌లో ఎస్బీఐ ఏటీఎం మిషన్లలో నగదు నింపే సీఎంఎస్ సంస్థ వ్యాన్‌ను దోచుకోవడానికి ముందు మూడు రోజుల పాటు పక్కాగా రెక్కీ చేసింది. తమ వెంట తెచ్చుకున్న ద్విచక్ర వాహనంపై జనవరి 13, 14, 15 తేదీల్లో అక్కడకు వెళ్లి వస్తూ ఈ పని పూర్తి చేసింది. చివరకు ఆ నెల 16న నేరం చేయడానికి బీదర్ వెళ్లిన ఈ ద్వయం సీఎంఎస్ సంస్థ ఉద్యోగుల్లో గిరి వెంకటే‹Ùను చంపి, శివకుమార్‌ను గాయపరిచి రూ.83 లక్షలు దోచుకుంది. అక్కడ నుంచి డబ్బు నింపిన బ్యాగ్‌లు తీసుకుని నేరుగా తాము బస చేసిన హోటల్‌కే వచ్చారు. రూమ్ ఖాళీ చేయడంతో పాటు తమ వస్తువుల్నీ తీసుకుని ద్విచక్ర వాహనంపై బయలుదేరి మియాపూర్ నుంచి ఎంజీబీఎస్‌కు వచ్చారు. నేరం చేయడానికి వాడిన ద్విచక్ర వాహనాన్ని ఎంజీబీఎస్ పార్కింగ్‌లో ఉంచారు. అఫ్జల్‌గంజ్‌లోని రోషన్ ట్రావెల్స్ నుంచి ప్రైవేట్ బస్సులో రాయ్‌పూర్ వెళ్లేందుకు అమిత్‌కుమార్ పేరుతో టిక్కెట్ బుక్ చేసుకున్నారు. నేపాల్‌లో ఉండటంతో పటిష్ట నిఘా... ఈ ట్రావెల్స్ వద్ద జరిగిన పరిణామాలతో మేనేజర్ జహంగీర్‌ను కాలి్చన ఇద్దరూ అక్కడ నుంచి పారిపోయారు. అఫ్జల్‌గంజ్ నుంచి ఆటోలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లిన వీళ్లు... అక్కడ నుంచి గజ్వేల్ వెళ్లడానికి మరో ఆటో మాట్లాడుకున్నారు. అనివార్య కారణాలతో తిరుమలగిరిలో దిగేసి... ఇంకో ఆటోలో మియాపూర్ వెళ్లారు. ఆపై తిరుపతి వెళ్లే ఏపీఎస్‌ఆరీ్టసీ ఎక్కి కడపలో దిగిపోయారు. మరో బస్సులో నెల్లూరు, అట్నుంచి చెన్నై వెళ్లారు. చెన్నై నుంచి రైలులో కోల్‌కతా చేరుకున్న ఈ ద్వయం పశి్చమ బెంగాల్‌లోని సిలిగురి ప్రాంతం నుంచి నేపాల్ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. మీర్జాపూర్ నేరం తర్వాత ఇలా వెళ్లిన ఈ ద్వయం కొన్నాళ్లకు తమ స్వస్థలాలకు తిరిగి వచి్చంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సిటీ పోలీసులు వారి కదలికలపై పటిష్ట నిఘా ఉంచారు. -
సహజీవనం చేసే వాడే చంపేశాడు
తిరుమలగిరి(జగ్గయ్యపేట): తనతో సహజీవనం చేస్తున్న మహిళను రోకలి బండతో మోది చంపిన ఘటన సోమవారం తెల్లవారుజామున ఎన్టీఆర్ జిల్లాలో కలకలం రేపింది. జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన పసుపులేటి మురళీకృష్ణ అవివాహితుడు. లారీ క్లీనర్‌గా పని చేస్తుంటాడు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం తక్కెళ్ళ పాడుకు చెందిన వివాహిత కనపర్తి మంగమ్మ (44) తో పరిచయం ఏర్పడింది.ఆమె తన భర్త, ఇద్దరు పిల్లలను వదిలి మురళీకృష్ణ దగ్గరికి రాగా ఇద్దరూ కలసి తిరుమలగిరిలోనే ఓ అద్దె ఇంట్లో గత 12 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. కొంతకాలంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో తరచూ గొడవలు పడుతుండేవారు. ఇంటి యజమాని, చుట్టుపక్కల వారు సర్ది చెబుతుండేవారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మురళీ కృష్ణ ఇంట్లో నిద్రిస్తున్న మంగమ్మ తలపై రోకలిబండతో బలంగా కొట్టి చంపి పరారయ్యాడు. ఇది గమనించిన ఇరుగుపొరుగు వారు చిల్లకల్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ తోట సూర్య శ్రీనివాసులు ఘటనా స్థలానికి వచ్చి, వివరాలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్డం నిమిత్తం పేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆ తర్వాత నిందితుడు మురళీకృష్ణ పోలీసుస్టేషన్లో లొంగిపోయాడు. -
ప్రభాకర్‌రావే కీలకం.. బెయిల్ ఇవ్వొద్దు
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ1 నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(SIB) మాజీ చీఫ్ ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్‌పై సోమవారం తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ పిటిషన్‌పై పోలీసులు తరఫున కౌంటర్ దాఖలు చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్.. వివిధ కారణాలను ప్రస్తావిస్తూ నిందితుడికి బెయిల్ ఇవ్వొద్దని వాదించారు.కౌంటర్ కాపీలో ఏముందంటే.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్‌రావే కీలకం. ఎస్ఐబీలో ఎస్వోటీ(Special Operations Team)ని నెలకొల్పింది ఇతనే. ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలోనే ఎస్వోటీ పనిచేసింది. ఫోన్ట్యాపింగ్కే ప్రధాన లక్ష్యంగా విధులు నిర్వహించింది. ట్యాపింగ్ బాధితుల్లో ప్రతిపక్షాలకు చెందిన వాళ్లను, కొందరు అధికారులు, వ్యాపారులు, రియల్టర్లను బెదిరించి డబ్బు వసూలు చేశారు. అంతేకాదు.... ఓఎస్డీగా ఇతర అధికారులకు తప్పుడు డాక్యుమెంట్లతో ప్రమోషన్లు ఇప్పించారు. ఐపీఎస్ అధికారిగా విరమణ పొంది చట్టపరంగా దర్యాప్తునకు సహకరించడం లేదు. ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడంతో విధిలేక హైకోర్టుకు వచ్చారు. హైదరాబాద్ వస్తున్నానని గతంలో ట్రయల్‌కోర్టులో పిటిషన్ వేశారు. దాదాపు తొమ్మిది నెలలు గడిచినా నిందితుడు భారత్‌కు రాలేదు’’ అని ఉంది. బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని వాదించిన పీపీ.. పోలీస్ దర్యాప్తునకు సహకరించేలా నిందితుడు ప్రభాకర్ రావుకు ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే.. ఈ కేసులో ఇప్పటిదాకా అరెస్టైన నిందితులందరికీ దాదాపుగా బెయిల్ లభించింది. -
కర్ణాటకలో లైంగిక వేధింపులు.. హోంమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
బెంగళూరు: కర్ణాటకలో ఇద్దరు మహిళలపై లైంగిక వేధింపుల అంశంపై హోంమంత్రి జి పరమేశ్వర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు వంటి పెద్ద నగరాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. బీజేపీ నేతలు కౌంటరిస్తున్నారు.బెంగళూరులోని వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళలను ఓ వ్యక్తి లైంగికంగా వేధించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా హోంమంత్రి జి పరమేశ్వర స్పందించారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘పెద్ద నగరాల్లో అలాంటి ఘటనలు జరుగుతుంటాయి. నిరంతరం అప్రమత్తంగా ఉండమని నేను ప్రతీరోజు పోలీసులకు చెబుతూనే ఉంటాను. ఇటీవల జరిగిన ఓ ఘటనపై ఉదయం కూడా కమిషనర్‌తో మాట్లాడాను. ఇక్కడ కొన్ని ఘటనలు జరిగినప్పుడు ప్రజల దృష్టి వాటిపైకి మళ్లుతుంది. పోలీసులు 24X7 పనిచేస్తున్నారు. మేము చట్టం ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటాము అని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.Sexist shocker from Karnataka Home Minister G Parameshwara- HM trivialises molestation incident: 'Such incidents happen in big cities'- Home Min underplays issue of #WomenSafetyMirror Now's @NehaHebbs shares details | @RitangshuB#BengalururMolestationShocker pic.twitter.com/mThTr3kkVJ— Mirror Now (@MirrorNow) April 7, 2025హోంమంత్రి వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి ప్రశాంత్ మాట్లాడుతూ..‘హోంమంత్రి వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. ఇది చాలా సున్నితమైన విషయం. లైంగిక వేధింపులు, మహిళలపై నేరాలను ఆయన సాదారణ విషయంగా భావిస్తున్నారా?. ఇలా మాట్లాడి తన బాధ్యత నుండి ఆయన తప్పించుకుంటున్నారు. జవాబుదారీగా ఉండటానికి ఇష్టపడటం లేదు. ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ప్రజలు ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోతారు. కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రత పరిస్థితులకు ఈ ఘటన అద్దం పడుతుంది అంటూ ఘాటు విమర్శలు చేశారు.A shocking case of sexual harassment on the street has emerged from the #BTMLayout in #Suddaguntepalya area of #Bengaluru, where a youth allegedly touched the private parts of a woman walking on the street on April 4.The accused reportedly approached her from behind and behaved… pic.twitter.com/PqzDc9sMg8— Hate Detector 🔍 (@HateDetectors) April 6, 2025 -
భర్త చనిపోయి బాధలో ఉన్న అత్తను ఓదార్చాల్సిందిపోయి ...
బద్వేలు అర్బన్ : భర్త చనిపోయి బాధలో ఉన్న అత్తను ఓదార్చాల్సిందిపోయి ... ఇదే అదునుగా భావించి ఆ అల్లుడు ఆమె ఇంటికే కన్నం వేశాడు. రూ.6 లక్షలు విలువైన బంగారు ఆభరణాలు చోరీ చేసి చివరకు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఆదివారం స్థానిక అర్బన్ స్టేషన్ ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను అర్బన్ సీఐ ఎం.రాజగోపాల్ వెల్లడించారు. గోపవరం మండలం టీ.సండ్రపల్లె గ్రామానికి చెందిన పిచ్చయ్య, పెంచలమ్మ దంపతులు గత కొన్నేళ్లుగా పట్టణంలోని తెలుగుగంగ కాలనీలో నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తె భర్త అయిన మంగుదొడ్డి మురళి డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. వీరు గతంలో నెల్లూరు జిల్లా కలువాయి గ్రామంలో నివసిస్తూ రెండేళ్ల క్రితం నుంచి అత్తగారింటికి సమీపంలో వేరే ఇంటిలో అద్దెకు ఉంటున్నారు. నిందితుడి వివరాలను వెల్లడిస్తున్న అర్బన్ సీఐ రాజగోపాల్ అయితే గత నెల 18వ తేదీన పిచ్చయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో అంత్యక్రియల నిమిత్తం కుటుంబ సభ్యులంతా స్వగ్రామమైన టీ.సండ్రపల్లెకు వెళ్లారు. వారితో పాటు మురళి కూడా వెళ్లాడు. అయితే ముందస్తు ప్రణాళిక ప్రకారం గత నెల 27న బద్వేలుకు వచ్చిన మురళి తెలుగుగంగ కాలనీలో ఉన్న అత్తగారింటికి వెళ్లి చోరీకి పాల్పడ్డాడు. ఇంట్లోని బీరువాలో ఉన్న రూ.6 లక్షలు విలువ చేసే 7 తులాల బంగారు ఆభరణాలు (ఒక లాంగ్‌చైన్, ఒక జత బంగారు గాజులు, ఒక జత బుట్టకమ్మలు, ఒక పాపిడిబిళ్ల) ఎత్తుకెళ్లాడు. అనంతరం ఎవరికి అనుమానం రాకుండా తిరిగి టీ.సండ్రపల్లెకు వెళ్లి కుటుంబ సభ్యులతో ఉన్నాడు. మరుసటిరోజు ఇంటి తాళాన్ని తెరిచి ఉండటం గమనించిన చుట్టుపక్కల వారు పెంచలమ్మ రెండవ కుమార్తె శిరీషకు విషయం తెలపడంతో ఆమె వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తాళాలు పగులకొట్టి ఉండటంతో చోరీ జరిగినట్లు గ్రహించి అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా చోరీ చేసింది అల్లుడు మురళినే అని గుర్తించి అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో తనతో పాటు ఎస్ఐలు రవికుమార్, సత్యనారాయణ, సిబ్బంది కలిసి నిందితుడు మురళిని పట్టణంలోని నెల్లూరు రోడ్డులో గల పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి చోరీకి గురైన బంగారు నగలు స్వా«దీనం చేసుకుని కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో అర్బన్ ఎస్ఐలు రవికుమార్, సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, కానిస్టేబుళ్లు వెంకటే‹Ù, ఓబులేసు, చెన్నారెడ్డి, నరసింహులు, కోటేశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. -
వివాహేతర సంబంధం.. చిన్నారిపై తల్లి పైశాచికం
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): మూడేళ్ల చిన్నారిపై తల్లి పైశాచికంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విజయవాడ పరిధిలోని జక్కంపూడి కాలనీలో నివసించే వందనకు (23) అమ్ములు అనే మూడేళ్ల పాప ఉంది. కొన్ని నెలలుగా భర్తకు దూరంగా ఉంటోంది. శ్రీరాములు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో వందన, శ్రీరాములు హైదరాబాద్‌కు మకాం మార్చారు. తమ ఆనందానికి పాప అడ్డుగా ఉందని భావించిన వారు.. ఆ చిన్నారిని చిత్రహింసలకు గురిచేశారు. వంటిపై, వీపుపై ఇష్టానుసారంగా వాతలు పెట్టడంతో ఆ చిన్నారి కేకలు వేసేది. కేకలు బయటకు రాకుండా నోరు మూసి ఈ అకృత్యాలకు పాల్పడినట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం విజయవాడ వచ్చిన వందన, శ్రీరాములు పాపను రైల్వే స్టేషన్లో వదిలేశారు. విషయం తెలుసుకున్న శ్రీరాములు తల్లి సుమలత రైల్వేస్టేషన్‌కు వెళ్లి అమ్ములును ఇంటికి తీసుకొచ్చింది. కాగా, ఈ అకృత్యాలు తెలుసుకున్న స్థానికులు విషయాన్ని మీడియా దృష్టికి తెచ్చారు. ఈ ఘటన తమ దృష్టికి వచ్చిందని, విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
Hyderabad: భార్య కడుపుతో ఉన్నా కనికరించని దుర్మార్గుడు..
హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై విచక్షణా రహితంగా సిమెంట్ బ్రిక్‌తో దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన ప్రకారం.. వికారాబాద్ జిల్లా కోట్‌పల్లికి చెందిన మహ్మత్ బస్రత్(32) కోల్‌కత్తాకు చెందిన షబానా పర్వీన్(22)ను 2024 అక్టోబర్‌లో పెళ్లి చేసుకున్నాడు. హఫీజ్‌పేట్‌లోని ఆదిత్యనగర్‌లో నివాసం ఉంటున్నారు. బస్రత్ తల్లిదండ్రులతో పర్వీన్ తరచు గొడవ పడుతుండటంతో రెండు నెలల క్రితం వేరు కాపురం పెట్టాడు. కాగా పర్వీన్‌కు వాంతులవుతుండడంతో రాఘవేంద్ర కాలనీలోని సియాలైఫ్ హాస్పిటల్లో చేర్పించాడు. ఏప్రిల్1న రాత్రి 10 గంటలకు డిశ్చార్జి చేయగా బయటకు వచ్చి ఇద్దరు గొడవపడ్డాడు. కోపంతో బస్రత్ తన్నడంతో షబానా పర్వీన్ కిందపడి పోయింది. అక్కడ ఉన్న రెండు సిమెంట్ బ్రిక్లతో దాదాపు 15 సార్లు తల, శరీరంపై మోదాడు. చనిపోయిందనుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలిని నిమ్స్ ఆస్పత్రికి తరలించగా అక్కడి చికిత్సపొందుతోంది. వైద్యులు నిర్వహించిన పరీక్షలలో మూడు నెలల గర్భిణి అని తేలిందని, షబానా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. pic.twitter.com/St6JwDt1Ti— ChotaNews App (@ChotaNewsApp) April 7, 2025 -
ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య
చేవెళ్ల: వివాహిత ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. చేవెళ్ల హౌసింగ్ బోర్డు కాలనీలో ఉండే గోవిందగారి పురుషోత్తంరెడ్డికి రెండేళ్ల కిత్రం హైదరాబాద్‌లోని కాళీమందిర్‌కు చెందిన తరుణి అలియాస్ యమున(30)తో వివాహ జరిగింది. కొన్నేళ్ల పాటు వారిద్దరూ అన్యోన్యంగా ఉన్నారు. అనుకోకుండా శనివారం రాత్రి భర్త ఇంట్లో లేని సమయంలో ఆమె గదిలో గడియ పెట్టుకొని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎంత పిలిచినా బయటకు రాకపోవటంతో కుటుంబసభ్యులు తలుపు తెరిచి చూడగా విగత జీవిగా కనిపించింది. దీనిపై మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. యువతి అదృశ్యం నాగోలు: ఇంట్లో నుండి బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన ఘటన నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..బండ్లగూడ ఇందు అరణ్య అపార్ట్మెంట్లో నివాసముండే సంకేపల్లి నిహారిక(28) ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంది. ఈ నెల5న ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లి రాత్రైనా రాలేదు. కుటుంబ సభ్యు లు ఫోన్ చేయగా స్విచ్ఛా ఫ్ వచి్చంది. స్నేహితులు, బంధువులతో ఆరా తీసి నా ఫలితం లేకపోవడంతో ఆదివారం తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
టెక్కీనని చెప్పి రెండో పెళ్లి
కర్ణాటక: సోషల్ మీడియాలో పరిచయమైన యువతిని ప్రేమించిన వివాహితుడు, చివరకు ఆమెను చంపిన ఘటన జిల్లాలోని హుణసూరు తాలూకా బిళికెరె ఫిర్కా బూచనహళ్లి గ్రామంలో జరిగింది. తుమకూరుకు చెందిన పవిత్ర (26)ను ఆమె భర్త సచిన్ (26) హత్య చేశాడు. కొబ్బరి బోండాల వ్యాపారి సచిన్‌కు ఆరు నెలల క్రితం ఇన్‌స్టాలో పరిచయమైన పవిత్ర తనకు ఎవరూ లేరని, తాను ఇన్ఫోసిస్‌లో టెక్కీనని చెప్పుకుంది. సచిన్‌కు అదివరకే పెళ్లయినా ఆమెతో ప్రేమాయణం నడిపాడు. చివరకు ఆమె కుటుంబ సభ్యుల సమక్షంలో తాళికట్టాడు.రోజూ ఆఫీసుకు డ్రాప్సచిన్ ఆమెను మైసూరులోని ఇన్ఫోసిస్‌లో రోజూ డ్రాప్ చేసి వచ్చేవాడు. పవిత్ర పెద్దమ్మగా చెప్పుకున్న ఆమెకు సచిన్ ఫోన్ చేయగా, పవిత్ర ఎవరో తమకు తెలియదని చెప్పింది. ఆమె అన్నగా చెప్పుకున్న వ్యక్తితో మాట్లాడగా, పవిత్రకు ఇదివరకే పెళ్లయి విడాకులు తీసుకుందని తెలిపాడు. ఆమె ఇన్ఫోసిస్ ఉద్యోగిని కాదని, ఆమె వద్ద ఉన్నది నకిలీ ఐడీ కార్డు అని తెలుసుకున్నాడు. తనను నమ్మించేందుకు ఉత్తుత్తిగా ఆఫీసుకు వెళ్తోందని తెలిసి రగిలిపోయాడు. దీనిపై భార్యను ప్రశ్నించగా గొడవ జరిగింది. చివరకు బయట టిఫిన్ తిందాం రా అని భార్యను ఆటోలో తీసుకెళుతూ మార్గమధ్యంలో పొలంలోకి తీసుకెళ్లి పవిత్రకు తాడుతో గొంతు బిగించి చంపాడు. ఓ బాలుడు కూడా ఇందుకు సహకరించాడు. తరువాత సచిన్ బిళికెరె పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. స్థలాన్ని ఎస్పీ విష్ణువర్ధన్, ఏఎస్పీ మాలిక్, డీఎస్పీ గోపాలకృష్ణ, ఇన్స్పెక్టర్ లోలాక్షి చేరుకుని పరిశీలించారు. నిందితులను అరెస్టు చేసి విచారణ చేపట్టారు.భార్యను గొంతుకోసి హతమార్చిన భర్తబొమ్మనహళ్లి: భార్యను నడిరోడ్డుపై చాకుతో గొంతు కోసి హత్య చేసిన భర్త ఉదంతం బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌సిటీ పోలీసు స్టేషన్ పరిధిలోని దొడ్డతోగూరులో శుక్రవారం రాత్రి జరిగింది. ఆగ్నేయ విభాగం డీసీపీ సారా ఫాతిమా విలేకరులకు తెలియజేసిన వివరాలు.. బాగేపల్లికి చెందిన కృష్ణ, శారద (35) దంపతులు దొడ్డతోగూరులో ఉంటున్నారు. శారద పనికివెళ్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటోంది. కృష్ణ మరో మహిళపై మోజులో పడ్డాడు. ఈక్రమంలో భార్యను అడ్డు తొలగించుకోవాలని పథకం రచించాడు. శుక్రవారం రాత్రి శారద పనికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రగతి నగరలో దారి కాచిన కృష్ణ రెండు చాకులతో దాడి చేశాడు. భార్యను కింద పడేసి గొంతు కోసి హత్య చేసి ఉడాయిస్తుండగా స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి నిందితుడు కృష్ణను అరెస్ట్ చేశారు. హత్యోదంతంపై విచారణ చేపట్టామన్నారు. దారుణ హత్యతో స్థానికంగా తీవ్ర కలకలం ఏర్పడింది. -
Hyderabad : ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అదృశ్యం
హైదరాబాద్: బోయిన్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో గల్లంతైన ఆరుగురు కుటుంబ సభ్యులు విజయవాడ వెళ్లినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వారి ఆచూకీ కనిపెట్టేందుకు బోయిన్పల్లి పోలీసులు ప్రత్యేక బృందాన్ని విజయవాడ పంపించారు. ఆరుగురిలో ఒక్కరి వద్దే సెల్‌ఫోన్ ఉండగా అది కూడా స్విచ్చాఫ్ కావడంతో వారి ఆచూకీ కనుక్కోవడం కొంత కష్టంగా మారినట్లు తెలుస్తోంది.బోయిన్‌పల్లికి చెందిన మహేశ్ తన భార్య ఉమ, ముగ్గురు పిల్లలు రిషి, చైతు, శివన్, మరదలు సంధ్యతో కలిసి ఈ నెల 1న ఇంటి నుంచి బయటికి వెళ్లి కనిపించకుండా పోయారు. రెండు రోజుల అనంతరం మహేశ్ బావమరిది బిక్షపతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ మొదలు పెట్టారు. మహేశ్ కుటుంబం 1వ తేదీన బోయిన్పల్లి నుంచి నేరుగా, ఇమ్లీబన్‌కు చేరుకుని అక్కడ విజయవాడకు వెళ్లే గరుడ బస్సు ఎక్కినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. మరుసటి రోజు ఉదయం విజయవాడలో దిగినట్లు కూడా సీసీ కెమెరాల్లో రికార్డయింది.సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని బాలంరాయి పంప్‌హౌజ్‌లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న మహేశ్, తోటి ఉద్యోగులతో ముభావంగానే ఉండేవాడని తెలుస్తోంది. మహేశ్ కుమారుడు ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో తీర్థయాత్రలకు వెళ్లి ఉండచ్చొని మహేశ్ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు వీరి గల్లంతుకు గల ఇతరత్రా కారణాలు ఏవైనా ఉంటాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇతర కుటుంబ సభ్యుల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు. గల్లంతయిన వారి ఆచూకీ తెలిశాకే పూర్తిస్థాయిలో వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. -
పూజలకు పీరియడ్స్ ఆటంకం, తప్పు జరిగిందంటూ..
నవరాత్రి వేడుకలను నిష్టగా ఆచరించేందుకు ఆ వివాహిత ఏడాదిగా ఎదురుచూస్తూ వచ్చింది. తీరా ఆ సమయం వచ్చేసరికి అందులో పాల్గొనలేకపోయింది. ఆ బాధతోనే మానసికంగా కుంగిపోయింది. తన బదులు ఆ పూజలు చేసేందుకు భర్త సైతం సిద్ధం అయ్యాడు. అయినా కాని ఆమె కోలుకోలేకపోయింది. చివరకు.. ఏకంగా ప్రాణమే తీసుకుంది!. ఉత్తర ప్రదేశ్ ఝాన్సీ జిల్లాలోని పన్నా లాల్ గొల్లా కువాన్ ప్రాంతంలో ప్రియాంషా సోని(36).. భర్త ముఖేష్ సోనీ, పిల్లలు జాన్వి, మాన్విలతో కలిసి నివసిస్తుంది. అయితే, ప్రియాంషా సోనికి దుర్గాదేవి అంటే అపరామైన భక్తి. ప్రతి ఏడాది ఎంతో ఇష్టంగా నవరాత్రి వేడుకలు జరుపుకునేది. అలాగే, ఈసారి నవరాత్రి వేడుకలు నిర్వహించుకోవాలని అంతా సిద్ధం చేసుకుంది. భర్త ముఖేష్‌తో చెప్పి పూజకు కావాల్సిన సామాగ్రిని ఏర్పాటు చేసుకుంది.మార్చి 30వ తేదీన చైత్ర నవరాత్రి ప్రారంభమైంది. అయితే మొదటి రోజే ప్రియాంషాకి పీరియడ్స్ వచ్చింది. దీంతో ఆమె నవరాత్రి పూజల్లో పాల్గొనలేకపోయింది. ఏడాదిగా ఆ పూజ కోసమే ఎదురు చూసిన ఆమె.. నాటి నుంచి తీవ్రంగా కుంగిపోయింది. ఇది సహజంగా జరిగేదే అని భర్త ముఖేష్ సర్ధి చెప్పేందుకు ప్రయత్నించినప్పటికి ఆమె వినిపించుకోలేకపోయింది. బదులుగా తాను పూజలు చేస్తానని చెప్పినా వినలేదు. తప్పు జరిగిపోయిందంటూ ఏడుస్తూ ఉండిపోయింది. దీంతో పుట్టింట్లో అయినా ఆమె సంతోషంగా ఉంటుందని భావించి కొన్నాళ్లు ఉండమని దింపి వచ్చాడు. అయితే.. తల్లిదండ్రులు ఓదార్చిన ఆమె ఆ బాధ నుంచి బయటపడలేకపోయింది. ఈ బాధలోనే చనిపోవాలని విషం తాగింది. వెంటనే కుటుంబసభ్యులు గమనించి, చికిత్స కోసం ఆమెను ఝాన్సీ మెడికల్ కాలేజీకి తరలించారు. పరిస్థితి మెరుగుపడటంతో డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చింది. అయితే, ఇంటికి వచ్చాక ప్రియాంషా ఆరోగ్యం మరోసారి క్షీణించింది. దీంతో ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించగా, అక్కడి చికిత్స పొందుతూ, బుధవారం మరణించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
అంత కష్టం ఏమొచ్చిందో..
నెల్లూరు: ఆడుతూ.. పాడుతూ తిరిగే బాలికకు ఏ కష్టమొచ్చిందో తెలియదు గానీ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన ఆత్మకూరులో గురువారం జరిగింది. ఎస్సై జిలానీ, స్థానికుల కథనం మేరకు.. పట్టణంలోని వందూరుగుంట ప్రాంతానికి చెందిన ప్రకాష్, రత్నమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం. ప్రకాష్ పెయింట్ పనిచేస్తుంటాడు. రత్నమ్మ ప్రభుత్వాస్పత్రిలో తాత్కాలిక నర్సుగా వ్యవహరిస్తోంది. పెద్ద కుమార్తె నిహారిక (11) జెడ్పీ బాలికల పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. నిహారిక గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది. నానమ్మ భోజనం తినాలని చెప్పగా స్కూల్లోనే చేశానంది. ఆ సమయంలో రత్నమ్మ సమీపంలోని తెలిసిన వారింటికి వెళ్లింది. కొద్దిసేపటి అనంతరం ఆమె ఇంటికొచ్చి కుమార్తెను పిలవగా స్పందన లేదు. దీంతో నానమ్మ మిద్దైపెన బాత్రూమ్కు వెళ్లిందని చెప్పడంతో తల్లి అక్కడికి వెళ్లి పిలిచింది. అయితే నిహారిక పలక్కపోవడంతో కేకలు వేసింది. కిందనే ఉన్న భర్త ప్రకాష్‌కు తెలిపింది. అతను పైకి వచ్చి కొంత ప్రయత్నం చేసి తలుపు తీశాడు. ఇనుప పైపునకు చున్నీతో ఉరేసుకుని కనిపించిన నిహారికను చూసి తల్లిదండ్రులు షాక్ తిన్నారు. బాలికను కిందకు దించి పరీక్షించగా అప్పటికే మృతిచెందినట్లు తల్లి గుర్తించింది. హుషారుగా తిరిగే నిహారిక మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్సై జిలానీ కానిస్టేబుల్ విజయకుమార్‌తో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసున్నారు. కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
భార్య, ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్య
యశవంతపుర: కుటుంబ కలహాలకు ఓ కుటుంబమే కడతేరింది. ప్రభుత్వ ఉద్యోగి తన భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసి, అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కలబురగి పట్టణం జీవర్గి రోడ్డులోని కెహెచ్బీకాలనీ అపార్ట్మెంట్లో బుధవారం జరిగింది. సంతోష్ కోరళ్లి(45) అనే వ్యక్తికి బీదర్‌కు చెందిన శృతి(32)తో పదేళ్ల క్రితం వివాహమైంది. ఈయన జెస్కాంలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరికి మునిశ్(9), మూడు నెలల అనిశ్ అనే సంతానం ఉన్నారు. శృతి పుట్టింటికి వెళ్లే విషయంలో బుధవారం దంపతుల మధ్య గొడవ జరిగింది. ఇదే విషయాన్నిసంతోష్ తన తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. కాగా తనను పుట్టింటికి పంపకపోతే చావో రేవో తేల్చుకుంటానని శృతి పేర్కొంది. విచక్షణ కోల్పోయి భార్య, ఇద్దరు పిల్లలను గొంతుపిసికి హత్య చేశాడు. అనంతరం సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కలబురగి నగర కమిషనర్ డాక్టర్ శరణప్ప ఘటన స్థలాన్ని పరిశీలించారు. స్టేషన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేసుకోని విచారణ చేస్తున్నారు. మానసిక సమస్యలతో సంతోష్ ఈ అకృత్యానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. కలబురగి ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టుం నిర్వహించి కుటుంబసభ్యులకు అందజేశారు. -
‘నాన్న.. సౌదీ వెళ్లేందుకు పనిపూర్తయ్యింది..’
కరీంనగర్: వాళ్లిద్దరూ మంచి స్నేహితులు.. ఎవరికి ఆపద వచ్చినా సహకరించుకుంటారు.. సుఖదుఃఖాలనూ పంచుకుంటారు.. చివరకు మరణంలోనూ ఇద్దరూ కలిసే వెళ్లారు.. హృదయం ద్రవింపజేసిన ఈ ఘటన రాజీవ్ రహదారిపై గురువారం రాత్రి చోటుచేసుకుంది. ప్రమాదంలో మహమ్మద్ గౌస్(34), షేక్ ఇమ్రాన్(28) దుర్మరణం చెందారు. ఎస్సై శ్రావణ్‌కుమార్, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. రామగుండానికి చెందిన మహమ్మద్‌గౌస్ ఎన్టీపీసీలో జీమ్ ట్రైనర్. విదేశాలకు వెళ్లేందుకు యత్నిస్తున్నాడు. ఈక్రమంలో వీసా దరఖాస్తు చేసేందుకు తన ఇంటిసమీపంలో ఉండే స్నేహితుడు, కారు డ్రైవర్ షేక్ ఇమ్రాన్‌తో కలిసి బంధువుల కారులో గురువారం ఉదయం హైదారాబాద్ వెళ్లారు. అక్కడ పనులు పూర్తిచేకుని రాత్రివేళ బయలు దేరారు. శుక్రవారం తెల్లవారుజామున సుల్తానాబాద్ చేరుకున్నారు. ఇక్కడి రాజీవ్ రాహదారిపై ఆగిఉన్న లారీని అదుపుతప్పి వెనకాల ఢీకొన్నారు. తీవ్రగాయాలైన ఇమ్రాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మహమ్మద్గౌస్ను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయాడు. మహమ్మద్ గౌస్ కారు నడుపుతుండగా ఇమ్రాన్ పక్క సీట్లో కూర్చున్నాడు. ఆగిఉన్న లారీని ఢీకొట్టగా రెండు బెలూన్స్ తెరుకున్నాయి. అయినా, ఇద్దరి ప్రాణాలు దక్కలేదు. కారు నుజ్జునుజ్జు అయ్యింది. గౌస్‌కు భార్య, పాప(4), బాబు(1.5) ఉన్నారు. ఇమ్రాన్‌కు ఇంకా పెళ్లికాలేదు. ‘నాన్న.. సౌదీ వెళ్లేందుకు పనిపూర్తయ్యింది..’ రామగుండం: ‘నాన్న.. సౌదీ వెళ్లేందుకు అవసరమైన వీసా పనిపూర్తయ్యింది.. నాలుగైదు రోజుల్లో వీసా వస్తుంది..’ అని తన తండ్రి పాషాతో ఫోన్లో మాట్లాడిన మహ్మద్ గౌస్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. మహ్మద్ గౌస్ ఉరఫ్ నిసార్ బాడీబిల్డర్. స్థానికంగా పలు వ్యాపారాలు నిర్వహించినా నష్టాలు వచ్చాయి. దీంతో ఉపాధి కోసం సౌదీ వెళ్లేందుకు నిర్ణయించారు. హైదరాబాద్ కారులో వెళ్లి వీసాకు సంబంధించిన ప్రక్రియ పూర్తిచేసుకుని తండ్రి పాషాతో మాట్లాడారు. అంతలోనే సుల్తానాబాద్ వద్ద రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇదే ప్రమాదంలో చనిపోయిన ఇమ్రాన్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నాలుగు నెలల్లో నలుగురు స్నేహితులు.. పట్టణానికి చెందిన ఎండీ గౌస్, ఇమ్రాన్, షేక్ అఫ్సరొద్దీన్, సయ్యద్ ఇమ్రాన్ నలుగురూ మంచి స్నేహితులు. వీరిలో సయ్యద్ ఇమ్రాన్ గతేడాది అక్టోబర్ 8న అంతర్గాం గోదావరి నది ఒడ్డున స్నేహితులతో కలిసి విందు చేసుకునే క్రమంలో ప్రమాదవాశాత్తు నీటిలో పడి మృతిచెందాడు. అదే ఏడాది డిసెంబర్ 24న షేఖ్ అఫ్సరొద్దీన్ ద్విచక్ర వాహనంపై రామగుండం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా కరీంనగర్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. నలుగురు మంచిస్నేహింతులు నా లుగు నెలల్లోనే కానరానికి లోకాలకు వెళ్లడం వారి కుటుంబాన్ని తీరని విషదం నింపినట్లయ్యింది. అంత్యక్రియలకు హాజరు రామగుండం: మృతుల అంత్యక్రియలు శుక్రవారం పట్టణంలో నిర్వహించారు. వీటికి ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ఠాకూర్ హాజరయ్యారు. మృతుల కుటుంబీకులను పరామర్శించారు. -
ఐదేళ్ల క్రితం అంత్యక్రియలు.. ఇప్పుడు ప్రత్యక్షం
కర్ణాటక: భార్య అదృశ్యమైంది. భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్య మరణించిందటూ ఓ మృతదేహానికి భర్త అంత్యక్రియలు పూర్తి చేశారు. మా కూతురిని హత్య చేశాడంటూ అనుమానంతో అత్తంటివారు ఫిర్యాదు చేయటంతో భర్తను కేసు పెట్టి జైలుకు పంపారు. ఎలానో శిక్ష నుంచి బయట పడ్డారు. ఇదీ కథ కాదు. ఐదేళ్లు క్రితం జరిగిన యద్దార్థ ఘటన. ఇప్పుడు ఆ భార్య ప్రియునితో కలిసి ప్రత్యక్షమైంది. ఈ విచిత్ర సంఘటన కొడగు జిల్లా కుశాలనగర తాలూకా బసవనహళ్లి గ్రామంలో జరిగింది. ఓ రోజు మిస్సింగ్ కుశాలనగర తాలూకా బసవనహళ్లికి చెందిన సురేశ్, మల్లిగె దంపతులు కూలిపని చేసుకుని జీవిస్తుండగా వారికి ఇద్దరు పిల్లలున్నారు. ఒక రోజు మల్లిగె అదృశ్యమైంది. ఆమె ఆక్రమ సంబంధం కారణంగా వెళ్లిపోయిందని భర్త చెప్పేవాడు. ఓ రోజు మల్లిగెకి ఫోన్ చేసి నాతో సంసారం చేయకున్నా పర్వాలేదు. ఇద్దరు పిల్లలున్నారు. చూసుకోవడానికైనా రావాలని మల్లిగెని ప్రాధేయ పడ్డాడు. ఆమె మనసు కరగలేదు. చివరికి సురేశ్ 2021లో కుశాలనగర పోలీసులకు మిస్సింగ్ అని ఫిర్యాదు చేశాడు. 2022లో శవం లభ్యం 2022లో సురేశ్‌కు కుశాలనగర పోలీసులు ఫోన్ చేసి మీ భార్య మృతదేహం లభించినట్లు సమాచారం ఇచ్చారు. పిరియాపట్టణ పోలీసులు సురేశ్‌తో పాటు మల్లిగె తల్లి గౌరిని తీసుకెళ్లి బెట్టదపురలో ఓ అస్తిపంజరాన్ని చూపించగా ఇది మల్లిగెది అని గుర్తించారు. అక్కడే అంత్యసంస్కారంను పూర్తి చేయించారు. తన అల్లుడే ఆమెను చంపాడని అత్త గౌరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సురేశ్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. రెండేళ్లు తరువాత డీఎన్ఎ పరీక్షల రిపోర్ట్ రాగా, ఎవరి శవమో అని తెలియడంతో సురేశ్ జైలు నుంచి బయట పడ్డారు. ఇలా దొరికింది ఇలా ఉండగా మల్లిగె ఈ నెల 1ను తన ప్రియునితో కలిసి మడికేరిలోని ఒక హోటల్‌కు వెళ్లింది. అక్కడ సురేశ్ స్నేహితులు ఆమె ఫోటో తీసి సురేశ్‌కు, పోలీసులకు పంపారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేయగా తను ప్రియునితో కలిసి వెళ్లినట్లు వెల్లడించింది. మల్లిగెని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజర్ పరిచి మైసూరు జైలుకు తరలించారు. అప్పట్లో లభించిన శవం ఎవరిది, అన్యాయంగా సురేశ్‌ను జైలుకు పంపారనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తాయి. -
మొదటి భార్యకు విడాకులపై నాటకం
కర్ణాటక: మొదటి భార్యకు విడాకులు ఇచ్చానని నకిలీ దాఖలాలను సృష్టించిన వ్యక్తి రెండో పెళ్లి చేసుకోగా రెండో భార్య వద్ద నుంచి సుమారు రూ.50 లక్షలకు పైగా నగదు తీసుకొని పరారైన సంఘటన నగరంలోని కువెంపునగర పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మోసకారి వ్యక్తిని రెండో పెళ్లి చేసుకొని వంచనకు గురైన బాధితురాలు రోజా ఆనే మహిళ కువెంపు నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. నగరంలోని కువెంపు నగరలో లేడీస్ పీజీని నిర్వహిస్తున్న రోజా ఆనే మహిళ మొదటి భర్త నుంచి కొన్ని కారణాలతో విడాకులు తీసుకుంది. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. తన కుమారుడికి అండగా ఉండటం కోసం రెండో పెళ్లి చేసుకోడానికి డైవర్స్ మ్యాట్రిమోనిలో యాప్ ద్వారా ప్రయత్నాలు మొదలు పెట్టింది. కేరళకు చెందిన త్రిశూర్‌లో నివాసం ఉంటున్న శరత్ రామ్ రోజాను పరిచయం చేసుకున్నాడు. తనకు పెళ్లి అయిందని, మొదటి భార్యకు విడాకులు కూడా ఇచ్చానని నకిలీ దాఖలాలు రోజాకు చూపించాడు. దాంతో శరత్రామ్ను నమ్మిన రోజా ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లికి ముందే షికార్లు ఇద్దరు కలిసి పెళ్లికి ముందు షికార్లు తిరిగారు. శారీరకంగాను కలిశారు. పెళ్లి ఘనంగా వద్దని రిజిస్టర్ పెళ్లి చెసుకుందామని ఆనుకున్నారు. ఈ సందర్బంగా తనకు వ్యాపారం కోసం అని విడతల వారీగా రోజా వద్ద నుంచి సుమారు రూ.50 లక్షల వరకు నగదును తీసుకున్నాడు. అనంతరం లేడీడిస్ పీజీలో వచ్చిన డబ్బు కూడా తీసుకున్నాడు. రోజా పేరుతో రెండు కంపెనీలు పెట్టి ఆందులో ప్రజల నుంచి డబ్బులు సేకరించి వారిని కూడా మోసం చేశారు. పెళ్లి చేసుకుందామని కోరుతున్నా వాయిదా వేస్తూ వచాచడు. దాంతొ ఆనుమానం పెంచుకున్న రోజా ఆతని విడాకులు నిజమా, కాదా? అని న్యాయవాది ద్వారా విచారిందగా అవి నకిలీ అని, అతను విడాకులు తీసుకోలేదని మొదటి భార్యతో కలిసి ఉంటున్నాడని తెలిసింది. ఈ విషయాన్ని రోజా ప్రశ్నించడంతో తననే ఎదిరిస్తావా? ఆని రోజా పైన దాడి చేసి కొట్టి పారిపోయాడు. దీంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితురాలు కువెంపునగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నేను డీఎస్పీని..పదండి పోలీస్‌స్టేషన్‌కు..
హైదరాబాద్: నంబర్ ప్లేట్ లేని కారుకు పోలీస్ స్టిక్కర్ తగిలించుకుని వెళ్లిన ఆగంతకులు గదిలో ఉన్న ఇద్దరు సినీ పరిశ్రమకు చెందిన యువకులను కిడ్నాప్ చేసి అచ్చంపేటకు తీసుకువెళ్లి చితకబాదిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..కడప జిల్లాకు చెందిన భూమిరెడ్డి కిషోర్‌రెడ్డి టీవీ నటులు ఇంద్రాణి, మేఘనలకు పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. టీవీ సీరియళ్లకు డ్రైవర్‌గా పనిచేస్తున్న సందీప్‌రెడ్డి, ఓ తెలుగు ఛానల్లో కాస్ట్యూమర్‌గా పనిచేస్తున్న పల్లె శివ ముగ్గురూ కలిసి శ్రీకృష్ణానగర్‌లో అద్దెకు ఉంటున్నారు. అచ్చంపేట సమీపంలోని బీకే ఉప్పనూతల గ్రామానికి చెందిన శివ అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. ఇద్దరూ కలిసి నాలుగు రోజుల క్రితం పెద్దలకు చెప్పకుండా పారిపోయారు. ఈ నేపథ్యంలో ఆమె సోదరుడు సోహెల్‌తో పాటు మరో ఇద్దరు యువకులు గురువారం రాత్రి కిషోర్‌రెడ్డి గదికి వచ్చారు. తాము పోలీసులమని, శివ ఆచూకీ చెప్పాలని అతడిని చితకబాదారు. తమకు ఏమీ తెలియదని చెప్పినా వినిపించుకోకపోగా, తాము పోలీసులమంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు పదండి అంటూ కిషోర్, సందీప్‌లను కారులో ఎక్కించుకుని తక్కుగూడకు తీసుకెళ్లి మళ్లీ కొట్టి, ఫోన్లు లాక్కున్నారు. అక్కడి నుంచి ఉప్పనూతల గ్రామానికి తీసుకెళ్లడంతో అప్పటికే అక్కడ అప్పటికే రెండు కార్లలో సిద్ధంగా ఉన్న మరో 10 మంది యువకులతో కలిసి వారిని మరోసారి తీవ్రంగా కొట్టారు. అనంతరం బాధితులను అచ్చంపేట పోలీస్ స్టేషన్ సమీపంలో వదిలేసి వెళ్లిపోయారు. టీవీ నటి ఇంద్రాణికి కిషోర్ ఫోన్ చేసి చెప్పడంతో ఆమె జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం అందించింది. బాధితులు కూడా అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌లో జరిగిన విషయాన్ని చెప్పారు. జూబ్లీహిల్స్ పోలీసుల నగరానికి తిరిగి వచ్చిన కిషోర్, సందీప్ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సోహెల్, ఇబ్బూతో పాటు ప్రియురాలి పెదనాన్న, వారి బంధుమిత్రులపై కేసు నమోదు చేశారు. కిషోర్, సందీప్‌లను కిడ్నాప్ చేసింది నకిలీ పోలీసులని తేల్చారు. అమ్మాయి అడ్రస్ కనుక్కునేందుకు వారిని కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి గాలిస్తున్నారు. జూబ్లీహిల్స్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కాన్పు కోసం వచ్చి మాయం.. ఆపై బస్టాండ్‌లో ప్రత్యక్షం
కాకినాడ, సాక్షి: కాన్పు కోసం వచ్చిన ఓ మహిళ.. ఉన్నట్లుండి ఆస్పత్రి నుంచి మాయమైంది. ఆందోళనకు గురైన భర్త, కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కట్ చేస్తే.. కొన్నిగంటల తర్వాత ఆమె ఆచూకీ లభ్యమైంది. అయితే తనకు బలవంతంగా ప్రసవం చేసి పుట్టిన కవలలను ఎత్తుకెళ్లారంటూ ఆమె కన్నీళ్లు పెడుతుండడంతో ఇటు భర్త, అటు పోలీసులు షాక్‌కు గురయ్యారు. అల్లూరు సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలం ఇందుకూరుపేటకు చెందిన కుప్పిశెట్టి సంధ్యారాణికి నెలలు నిండడంతో కాన్పు కోసం రాజమండ్రిలోని ఓ ఆస్పత్రిలో గురువారం మధ్యాహ్నాం చేర్పించారు. కాసేపటికే ఆసుపత్రి బయట వాకింగ్ చేస్తూ హఠాత్తుగా ఆమె అదృశ్యమైంది. ఆందోళనకు గురైన భర్త లోవరాజు.. రాజమండ్రి త్రీటౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో రాత్రి కాకినాడ ఆర్టీసి బస్టాండ్ వద్ద సంధ్యారాణీ ఆచూకీ లభించింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తనను కారులో అపహరించారని, తనకు ఇంజెక్షన్ ఇచ్చి డెలివరీ చేశాక పుట్టిన కవలలను ఎత్తుకెళ్లారని సంధ్యారాణీ ఏడుస్తూ చెబుతోంది. అనంతరం ఆమెను కాకినాడ జీజీహెచ్‌కి తరలించి చికిత్స అందించారు. అయితే ఆమె చెబుతున్న విషయాలు నిజమో కాదో తెలుసుకునేందుకు.. శుక్రవారం ఉదయం ఆమెను పోలీసులు రాజమండ్రికి తరలించారు. ఈ క్రమంలో సీసీఫుటేజీ కీలకంగా మారిందని పోలీసులు చెబుతున్నారు. ఓ ఆటోలో ఆమె ఎక్కి వెళ్తున్నట్లుగా దృశ్యాలు అందులో రికార్డు అయినట్లు కనిపిస్తోంది. -
పల్నాడులో ఘోరం.. వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య
పల్నాడు, సాక్షి: కూటమి పాలనలో టీడీపీ గుండాలు మరో దారుణానికి తెగబడ్డారు. కిడ్నాప్ చేసిన వైఎస్సార్సీపీ కార్యకర్త హరిచంద్రను దారుణంగా హతమార్చారు. ఈ ఘటనతో జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.రెండు రోజుల కిందట నాగార్జునసాగర్ లోని హిల్ కాలనీలో పింఛన్ తీసుకోవడానికి వెళ్లిన హరిచంద్ర తిరిగి రాలేదు. టీడీపీ నేతలు కొందరే ఆయన్ని కిడ్నాప్ చేసినట్లు తర్వాత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలో ఆయనను చంపేస్తారేమో అని ఆందోళన వ్యక్తం చేశారు కూడా. చివరకు.. టీడీపీ నేతలే చంపేసి ఆ మృతదేహాన్ని ఆయన పొలంలోనే పడేశారు. -
టీచర్‌తో వివాహేతర సంబంధం.. ఇద్దరు పిల్లులున్నా ప్రియుడే కావాలని..
సాక్షి, మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి శనిగపురం గ్రామ శివారు బోరింగ్‌తండా సమీపంలో గత నెల 31వ తేదీన అర్ధరాత్రి హత్యకు గురైన పార్ధసారథి కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భార్య.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిందని మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. ఈ మేరకు గురువారం టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని జగదీశ్ కాలనీలో నివాసం ఉండే తాటి పార్ధసారథికి స్వప్నతో వివాహం జరగగా వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. స్వప్నకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏటపాక మండలం నెల్లిపాకలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న సొర్లాం వెంకట విద్యాసాగర్‌తో పరిచయం ఉంది. స్వప్న తల్లిగారి ఇంటి ప్రాంతంలో వెంకట విద్యాసాగర్ ఇల్లు అద్దెకు తీసుకుని ఉండగా 2016లో స్వప్నకు పరిచయమయ్యాడు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం పార్ధసారథికి తెలియడంతో దంపతుల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. పార్ధసారథి హెచ్చరించినా స్వప్న పట్టించుకోలేదు.ఈ క్రమంలోనే పార్ధసారథికి మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి ఎంజేపీలో హెల్త్ సూపర్వైజర్ ఉద్యోగం రాగా గతేడాది ఫిబ్రవరి నుంచి విధులు నిర్వహిస్తున్నాడు. సెలవుల సమయంలో ఇంటికి వెళ్లి వస్తుండగా అప్పుడప్పుడు స్వప్నకు వీడియో కాల్ చేసి మాట్లాడేవాడు. అయితే వివాహేతర సంబంధానికి భర్త అడ్డు ఉన్నాడని, అతడిని ఎలాగైనా అంతమొందించాలని స్వప్న తన ప్రియుడు వెంకట విద్యాసాగర్‌కు చెప్పింది. దీంతో వెంకట విద్యాసాగర్.. కొత్తగూడెం మండలానికి చెందిన తెలుగూరి వినయ్‌కుమార్, శివశంకర్, ఏటపాక మండలానికి చెందిన వంశీతో మాట్లాడి పార్ధసారథిని హత్య చేయించాలని పథకం రచించించారు.దీంతో, ముగ్గురు వ్యక్తులకు రూ.5 లక్షలు సుపారీగా ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉగాది, రంజాన్ సెలవుల కోసం పార్ధసారథి కొత్తగూడెం వచ్చి మార్చి 31వ తేదీన సాయంత్రం దంతాలపల్లికి వెళ్లే క్రమంలో కొత్తగూడెంలో దంపతులు షాపింగ్ చేశారు. అనంతరం పార్ధసారథి తన బైక్‌పై బయలుదేరాక స్వప్న వెంటనే వెంకట విద్యాసాగర్‌కు ఫోన్ చేసి తన భర్త వెళ్తున్న సమాచారం తెలిపింది. దీంతో సుపారీ గ్యాంగ్ ఓ కారును అద్దెకు తీసుకుని పార్ధసారథిని వెంబడిస్తూ మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి శనిగపురం గ్రామ శివారు బోరింగ్‌తండా సమీపంలోకి చేరుకోగానే అడ్డగించి దారుణంగా హత్య చేశారు.ఈ కేసులో పార్ధసారథి భార్య స్వప్న, ప్రియుడు వెంకట విద్యాసాగర్‌ను అరెస్ట్ చేయగా వినయ్‌కుమార్, శివశంకర్, వంశీ పరారీలో ఉన్నారని తెలిపారు. అదే విధంగా ఏడాది క్రితం పార్ధసారథిపై దాడి జరిగిన ఘటనలో రెక్కీ నిర్వహించినట్లు కూసం లవరాజు అనే వ్యక్తిని గుర్తించగా అతడు కూడా పరారీలో ఉన్నారన్నారు. కాగా, కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన డీఎస్పీ తిరుపతిరావు, సీఐలు సర్వయ్య, సూర్యప్రకాశ్, హథీరాం,నరేందర్, రవికుమార్, ఎస్సైలు దీపిక, మురళీధర్, సతీశ్, ఐటీకోర్ పీసీ సుమన్, క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్ బృందం సభ్యులను ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. -
100 కోట్లతో ఉడాయించిన చిట్టీల పుల్లయ్య అరెస్ట్
హైదరాబాద్ : చిట్టీలు, అధిక వడ్డీల ఆశ చూపి ప్రజలను నిలువునా మోసం చేసిన పుల్లయ్య ఆస్తులను సీసీఎస్ పోలీసులు సీజ్ చేశారు. సనత్‌నగర్ బీకేగూడ దాసారం బస్తీ రవీంద్రనగర్ సమీపంలో ఉండే పుల్లయ్య చిట్టీలు, వడ్డీల పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి..వందల మందిని మోసం చేసిన విషయం విదితమే. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు ఇటీవల బెంగుళూరులో పుల్లయ్యను అరెస్టు చేసి నగరానికి తీసుకువచ్చారు. విచారణలో భాగంగా బుధవారం సాయంత్రం సీసీఎస్ పోలీసులు బీకేగూడలోని నివాసానికి పుల్లయ్యను తీసుకువచ్చారు. ఏసీపీ మల్లికార్జున చౌదరి ఆధ్వర్యంలో పుల్లయ్య తోపాటు అతని ఇద్దరు కుమారులను మూడు గంటల పాటు విచారించి ఆస్తులకు సంబంధించిన పలు కీలక పత్రాలను స్వా«దీనం చేసుకున్నారు. ఐదు అంతస్తుల ఇంటితో పాటు ఫార్చూనర్ కారు, ఇతర సామాగ్రిని సీజ్ చేసి తరలించారు. కాగా ఇంటిపై రూ.60 లక్షల బ్యాంకు లోను ఉన్నట్లు తెలిపారు. కాగా పుల్లయ్యను ఇంటికి తీసుకువచ్చారన్న సమాచారంతో బాధితులు పెద్ద ఎత్తున నివాసానికి చేరుకుని ఆందోళకు దిగారు. మహిళా బాధితులు కొందరు ఆగ్రహంతో ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పుల్లయ్యతో మాట్లాడించాలని వారు పోలీసులతో వాగి్వవాదానికి దిగారు. తిరిగి పుల్లయ్యను సీసీఎస్‌కు తరలించే క్రమంలో పోలీసు వాహనాలను వెళ్లనివ్వకుండా అడ్డు తగిలారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కారు వెంట పరుగెత్తడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ దశలో పోలీసులు అప్రమత్తమై జనాలను అడ్డుకున్నారు. -
భర్తతో 20 ఏళ్లు గ్యాప్.. క్లాస్మేట్ శివతో వివాహేతర సంబంధం
సంగారెడ్డి జోన్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని ముగ్గురు పిల్లలను ఊపిరి ఆడకుండా చేసి అతి కిరాతకంగా తల్లే హత్య చేసిందని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ వెల్లడించారు. బుధవారం తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమీన్పూర్ మండలం బీరంగూడ గ్రామం రాఘవేంద్రనగర్‌లో ఇటీవల జరిగిన ముగ్గురు పిల్లల మృతి ఘటనకు సంబంధించిన వివరాలు తెలిపారు. పిల్లల తల్లి రజిత ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తుండగా.. ఆరు నెలల క్రితం పదో తరగతి పూర్వ విద్యార్థులు అంతా కలసి పార్టీ చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. ఆ పార్టీ సందర్భంగా తన క్లాస్ మేట్ అయిన శివతో రజిత స్నేహం ఏర్పరుచుకుంది.రోజూ చాటింగ్, కాల్స్, వీడియో కాల్స్ మాట్లాడేవారు. అంతే కాకుండా పలు మార్లు రహస్యంగా కలుసుకున్నారు. కాగా, రజిత భర్త చెన్నయ్య.. ఆమె కంటే వయసులో ఇరవై సంవత్సరాలు పెద్దవాడు కావడంతో మొదటి నుంచీ ఆమెకు చెన్నయ్య అంటే ఇష్టం ఉండేది కాదు. తరచూ గొడవలు పడేవారు. ఈ క్రమంలో తన పదోతరగతి క్లాస్మేట్ శివను కలసుకోవడం, అతనికి పెళ్లి కాకపోవడంతో ఎలాగైనా అతడిని పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖంగా ఉండాలని భావించింది. ఈ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకోమని రజిత, శివను అడగ్గా.. పిల్లలు లేకుండా ఒంటరిగా తనతో వస్తా అంటే కచ్చితంగా పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. దీంతో శివను పెళ్లి చేసుకోవాలంటే పిల్లలను అడ్డు తొలగించుకోవాల్సిందేనని రజిత నిర్ణయించుకుంది. మార్చి 28న సాయంత్రం ఆరు గంటలకు పిల్లలను చంపేస్తానని శివకు చెప్పగా, త్వరగా ఆ పని పూర్తి చేయమని చెప్పాడు. అదే రోజు రాత్రి భర్త భోజ నం చేసి 10 గంటలకు ట్యాంకర్ తీసుకొని చందానగర్ వెళ్లగా, ఇదే అదనుగా భావించి మొదట పెద్ద కొడుకు సాయికృష్ణ (12)ను, తర్వాత కూతురు మధుప్రియ (10)ను, ఆ తర్వాత చిన్న కొడుకు గౌతమ్ (8)ను.. ఇలా ముగ్గురిని ఒకరి తరువాత ఒకరిని ముక్కు, మూతిపై టవల్ వేసి, చేతితో గట్టిగా అదిమి ఊపిరాడకుండా చేసి చంపింది. పిల్లలను అడ్డు తొలగించుకోవాలని రజితను శివ ప్రోత్సహించగా ఆమె కిరాతకంగా వారిని చంపివేసిందని ఎస్పీ వెల్లడించారు. నిందితులిద్దరినీ అరెస్టు చేశామన్నారు. ఈ సమావేశంలో పటాన్చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, అమీన్పూర్ ఇన్స్పెక్టర్ నరేశ్, డీఐ రాజు, ఎస్ఐ సోమేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
‘గుట్ట’లోకి వెళ్లడాన్ని గుర్తించి అత్యాచారం
కల్వకుర్తిటౌన్: బాధితురాలి కదలికలను గుర్తించే నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని నాగర్‌కర్నూల్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ అన్నారు. ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట శివారులో జరిగిన ఆ ఘటన వివరాలను బుధవారం కల్వకుర్తిలోని డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వెల్లడించారు. జడ్చర్లకు చెందిన ఓ వివాహిత తన తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి మార్చి 29న (శనివారం) మధ్యాహ్నం ఊర్కొండపేటకు వచ్చి దైవదర్శనం చేసుకొని రాత్రి అక్కడే బస చేశారు. అదేరోజు రాత్రి 9 గంటల సమయంలో మరో బంధువు అక్కడకు రాగా.. ఆయనతో మాట్లాడుతూ 150 మీటర్ల దూరంలో ఆలయానికి ముందు భాగంలో ఉన్న గుట్ట ప్రాంతంలోకి వెళ్లడాన్ని నిందితులు గమనించారు. ఈ క్రమంలో నిందితులు అక్కడకు వెళ్లి బా ధితులను బెదిరించి, ఆ వ్యక్తిని చెట్టుకు కట్టేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో మార్పాకుల ఆంజనేయులు, సిద్ధిఖ్ బాబా, వాగుల్దాస్ మణికంఠ, కార్తీక్ మొదట అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఈ నలుగురు.. మట్ట మహేష్‌గౌడ్, హరీశ్‌గౌడ్, మట్ట ఆంజనేయులును ఘటనా ప్రాంతానికి పిలిపించగా, మద్యం తాగి వారు సైతం అత్యాచారం చేశారు. బాధిత మహిళ తాగడానికి నీరు అడగ్గా, కార్తీక్ బాటిల్లో మూత్రం పోసి ఇచ్చాడని ఎస్పీ పేర్కొన్నారు. నిందితులంతా 28 ఏళ్లలోపు వారేనని, మహిళపై రాత్రి 12 గంటల వరకు అత్యాచారం చేశారని, ఈ విషయాన్ని బయటకు చెబితే మీరు కలిసి ఉన్న ఫొటోలను పబ్లిక్ చేస్తామని హరీశ్‌గౌడ్ బెదిరించారని చెప్పారు. మార్చి 30న (ఆదివారం) తెల్లవారుజామున బాధితురాలు తన బంధువుతో కలిసి వెళ్తుండగా విషయాన్ని బయటకు చెప్పకుండా వారిని బెదిరించి ఆలయ ఔట్సోర్సింగ్ ఉద్యోగి మహేశ్‌గౌడ్ వారి వద్ద రూ.6 వేలు డిమాండ్ చేసి వసూలు చేశాడు. బాధితురాలు తన ఊరికి వెళ్లి, తిరిగి సోమవారం ఊర్కొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. అత్యాచార ఘటనలో నిందితులను కల్వకుర్తి కోర్టులో హాజరుపరిచామని, జడ్జి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్టు ఎస్పీ వెల్లడించారు. అత్యాచార ఘటనలో బాధితురాలి నుంచి నిందితులు బంగారం, నగదు తీసుకున్నారని చెప్పినా.. అందుకు సంబంధించిన రికవరీని పోలీసులు చూపించలేదు. ఈ సమావేశంలో కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు నాగార్జున, విష్ణువర్ధన్‌రెడ్డి, ఎస్ఐలు మాధవరెడ్డి, కృష్ణదేవ, కురుమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భాగ్యలక్ష్మి .. చివరకు
తమిళనాడు: పల్లావరం సమీపంలో ఓ నిండు ప్రాణాన్ని వివాహేతర సంబంధం బలితీసుకుంది. ప్రియురాలు మరొకరితో సంబంధం కలిగి ఉందనే కారణంతో ప్రియుడు ఆమెను బండరాయితో కొట్టి హత్య చేశాడు. లొంగిపోయిన కార్పొరేషన్ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై శివారు పల్లావరం సమీపంలోని అనకాపుత్తూరు గౌరీ ఎవెన్యూ 2వ వీధికి చెందిన జ్ఞానసిద్ధన్ (40). నితను తాంబరం కార్పొరేషన్లో లారీ డ్రైవర్. ఇతను అవివాహితుడు. అపార్ట్మెంట్లో ఒంటరిగా నివసిస్తున్నాడు. అనకాపుత్తూరు అరుల్ నగర్ 3వ వీధికి చెందిన భాగ్యలక్ష్మి(33)తో ఇతనికి వివాహేతర సంబంధం ఏర్పడింది. భాగ్యలక్ష్మి అప్పటికే భర్తకు విడాకులు ఇచ్చి, తన ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉంటోంది. ఇద్దరూ తరచూ కలుసుకుని సరదాగా గడుపుతూ వచ్చారు. ఈక్రమంలో భాగ్యలక్ష్మిని పెళ్లి చేసుకోవాలని జ్ఞానసిద్ధన్ నిర్ణయించుకున్నాడు. భాగ్యలక్ష్మికి జ్ఞానసిద్ధన్‌తో పాటు మరొకరితో సంబంధం ఉందని తెలిసింది. ఆగ్రహించిన జ్ఞానసిద్ధన్ బుధవారం ఉదయం భాగ్యలక్ష్మితో గొడవపడ్డాడు. ఆగ్రహించిన జ్ఞానసిద్ధన్ పెద్ద బండరాయితో భాగ్యలక్ష్మి తలపై వేశాడు. భాగ్యలక్ష్మి సంఘటన స్థలంలోనే మృతిచెందింది. జ్ఞానసిద్ధన్ శంకర్ నగర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నువ్వు యాంకరింగ్ చేయడం నాకు ఇష్టం లేదు..!
విశాఖపట్నం: కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త కొట్టడంతో తీవ్రంగా గాయపడిన భార్య చికిత్స పొందుతూ మృతి చెందింది. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాలివి.. వెంకటేశ్వరమెట్టకు చెందిన పోలిపల్లి రమాదేవి, భీమ్‌నగర్‌కు చెందిన బంగార్రాజు భార్యాభర్తలు. ఇద్దరూ వృత్తిరీత్యా డ్యాన్సర్లు. రమాదేవి యాంకరింగ్ కూడా చేస్తుంటుంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే రమాదేవి యాంకరింగ్ చేయడం బంగార్రాజుకు ఇష్టం లేదు. ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీనికి తోడు ఆమె వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందని బంగార్రాజు అనుమానించడంతో గొడవలు మరింత పెద్దవయ్యాయి. ఈ క్రమంలో గత నెల 31న గొడవ జరగడంతో.. రమాదేవి పిల్లలను తీసుకుని వెంకటేశ్వరమెట్టలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. అదే రోజు బంగార్రాజు అక్కడికి వెళ్లి, తిరిగి ఇంటికి రమ్మని భార్యను పిలిచాడు. ఆమె అందుకు నిరాకరించడంతో.. ఆగ్రహంతో ఆమెను ఇంటి నుంచి బయటకు లాగి చెంపపై కొట్టాడు. ఈ ఘటనలో ఆమె పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో తలకు బలంగా గాయమైంది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మరణించింది. మృతురాలి బంధువులు బంగార్రాజుపై టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశా రు. బంగార్రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కేసు దర్యాప్తులో ఉంది. -
విడాకులు ప్లీజ్
కర్ణాటక: అక్రమంగా బంగారం తరలిస్తూ పట్టుబడి జైలుపాలైన నటి, ఓ డీజీపీ దత్త కుమార్తె రన్య రావు కుటుంబంలో కలతలు తీవ్రమయ్యాయి. ఆమె నుంచి విడాకులు కావాలని భర్త జతిన్ హుక్కేరి కోరుతున్నారు. ఈ మేరకు బెంగళూరు హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. పెళ్లయినప్పటి నుంచి రన్య రావుతో సంసారం ఇబ్బందిగానే ఉందని ఆయన దూరంగా ఉంటున్నారు. ఇంతలో బంగారం స్మగ్లింగ్‌లో భార్య అరెస్టు కావడంతో ఇక కాపురం కుదరదని భావిస్తున్నారు. గత ఏడాది అక్టోబరు 6వ తేదీన బెంగళూరులో బాస్టిన్ రెస్టారెంట్లో రన్యా, జతిన్హుక్కేరి ఇద్దరూ ఓ పెళ్లిళ్ల పేరయ్య ద్వారా కలుసుకున్నారు. అలా పరిచయం పెరిగి పెళ్లి వరకూ వచ్చింది. అక్టోబరు 24వ తేదీన జతిన్, రన్య నిశి్చతార్థం జరిగింది. గత ఏడాది నవంబరు 27 తేదీన తాజ్‌వెస్ట్ ఎండ్హోటల్లో అంగరంగ వైభవంగా వివాహ వేడుక జరిగింది, ల్యావెల్లీ రోడ్డులోని ఖరీదైన అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఆది నుంచీ గొడవలు తరువాత నెలకే రన్య, జతిన్ మధ్య మనస్పర్థలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఇరువురి మధ్య మాటలు లేవని జతిన్ పిటిషన్లో ప్రస్తావించారు. బంధుమిత్రులు రాజీకి ప్రయతి్నంచినా ఫలితం లేదని తెలిసింది. ఆమె తరచూ దుబాయ్‌కు వెళ్లి వచ్చేది, దీనిని భర్త ప్రశ్నించడంతో గొడవలు జరిగేవి. మరోవైపు స్నేహితుడు తరుణ్ రాజుతో కలిసి బంగారం స్మగ్లింగ్ కేసుల్లో చిక్కుకుంది. -
అమీన్పూర్ ముగ్గురు పిల్లల మృతి కేసు.. వెలుగులోకి సంచలన నిజాలు
సాక్షి, సంగారెడ్డి: అమీన్పూర్ ముగ్గురు పిల్లల మృతి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముగ్గురు పిల్లల్ని తల్లే చంపినట్లు పోలీసులు తేల్చారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. వివాహితర సంబంధంతో భర్తతో పాటు ముగ్గురు పిల్లలను కూడా చంపాలని హంతకురాలు రజిత ప్లాన్ చేసింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని ముగ్గురు పిల్లల్ని ఊపిరాడకుండా చేసి కన్నతల్లే చంపేసింది.ఇటీవలే పదవ తరగతి విద్యార్థుల గెట్ టుగెదర్ పార్టీలో స్నేహితుడితో రజితకు పరిచయం ఏర్పడింది. హంతకురాలు రజిత లావణ్య, ప్రియుడు సూరు శివ కుమార్‌ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.రంగారెడ్డి జిల్లా మెడకపల్లికి చెందిన చెన్నయ్య భార్యాపిల్లలతో సహా రాఘవేంద్ర కాలనీకి వచ్చి స్థానికంగా వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మార్చి 28వ తేదీ ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వచ్చి చూసేసరికి.. ముగ్గురు పిల్లలు నోటి నుంచి నురగలు కక్కుతూ పడి కనిపించారు. పిల్లలు అచేతనంగా పడి ఉండగా.. భార్య రజిత కడుపు నొప్పితో విలవిలలాడుతూ కనిపించింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్‌తో ముగ్గురు పిల్లలు నిద్రలోనే కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధారించారు.పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపి.. ఆమె కూడా తిని ఆత్మహత్యాయత్నం చేసిందని తొలుత అంతా భావించారు. అయితే కుటుంబ కలహాల నేపథ్యంతో భర్త చెన్నయ్య పాత్రపై పోలీసులకు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పైగా భార్యాభర్తల మధ్య గతకొన్నేళ్లుగా తరచూ గొడవలు జరుగుతుండడంతో.. రజిత తల్లితో పాటు స్థానికులు ఈ విషయాన్ని నిర్ధారించడంతో ఆ కోణంలోనూ పోలీసులు దృష్టిసారించారు.కానీ విచారణలో చెన్నయ్య పాత్ర ఏం లేదని తేలడంతో పోలీసులు వదిలేశారు. ఆపై ఆస్పత్రిలో కోలుకుంటున్న రజితను పోలీసులు విచారించారు. ఆమె కదలికలు అనుమానంగా తోచడంతో లోతైన దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో విస్తుపోయే విషయం ఒకటి వెలుగు చూసింది. అదే వివాహేతర సంబంధం. రజిత పదో తరగతి క్లాస్మేట్స్ ఈ మధ్య గెట్ టు గెదర్ చేసుకున్నారు. ఆ టైంలో రజిత స్కూల్ డేస్‌లో చనువుగా ఉండే ఓ వ్యక్తి మళ్లీ టచ్‌లోకి వచ్చాడు.అలా తన పాత క్లాస్‌మేట్‌తో రజిత చాటింగ్, ఫోన్లు మాట్లాడడం చేసింది. ఇది క్రమంగా వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్త, పిల్లలను అడ్డు తొలగించుకుంటే ప్రియుడితో హాయిగా జీవించవచ్చని అనుకుంది. మార్చి 27వ రాత్రి విషం కలిపిన భోజనం భర్త, పిల్లలకు పెట్టాలనుకుంది. అయితే భర్త మాత్రం పప్పన్నం మాత్రమే తిని పనికి వెళ్లిపోగా.. పిల్లలు ఆఖర్లో విషం కలిపిన పెరుగన్నం పిల్లలు తిన్నారు. అలా ముగ్గురు పిల్లలు సాయి క్రిష్ణ (12), మధు ప్రియ(10), గౌతమ్ (8) నిద్రలోనే కన్నుమూశారు. -
విశాఖ మధురవాడలో దారుణం
-
నాగర్‌కర్నూల్ ఘటన.. వెలుగులోకి కీలక విషయాలు
సాక్షి, నాగర్ కర్నూల్: ఊర్కొండపేటలో మహిళపై లైంగిక దాడి కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు ఇవాళ ఆరెస్టు చేశారు. గత శనివారం ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయంలో దర్శనం కోసం వెళ్లిన మహిళపై అదే గ్రామానికి చెందిన ఏడుగురు నిందితులు పాశవికంగా ప్రవర్తించి సామూహిక లైంగిక దాడి చేశారని నాగర్‌కర్నూల్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘనాద్ తెలిపారు.తన బంధువుతో కలిసి ఆలయానికి సమీపంలో ఉండగా నిందితులు ఆమెను లాక్కెళ్లి అత్యాచారం చేశారని తెలిపారు. ఆమెతో ఉన్న వ్యక్తిని చెట్టుకు కట్టేశారని వివరించారు. మొదట వారిద్దరి ఫోటోలు తీసి బెదిరించారని విషయం బయటికి చెబితే ఫోటోలో సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారని తెలిపారు. వారిపై దాడి చేసి రూ.6 వేలు లాక్కున్నారని చెప్పారు. బీఎన్ఎస్ సెక్షన్ 70, సెక్షన్ 351, సెక్షన్ 310, కింద నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు.నిందితులు ఊర్కొండ పేటకు చెందిన మరి పాకుల ఆంజనేయులు, సిద్ధిక్ బాబా, మొగుల్దాస్ మనీ అలియాస్ మణికంఠ, కార్తీక్, మట్టా మహేష్ గౌడ్, హరీష్ గౌడ్, మట్ట ఆంజనేయులుగా గుర్తించినట్టు ఎస్పీ తెలిపారు. దాహం వేసి నీళ్లు అడిగితే ఓ నిందితుడు మూత్ర విసర్జన చేశాడని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామని.. మళ్లీ నిందితులను కస్టడీకి తీసుకుని విచారిస్తామని ఎస్పీ తెలిపారు. -
విశాఖలో ప్రేమోన్మాది దాడి.. తల్లి మృతి, కూతురి పరిస్థితి విషమం
సాక్షి, విశాఖపట్నం: నగరంలో దారుణం జరిగింది. తల్లి, కూతురిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. గతంలో న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన మరువకముందే మధురవాడలో జరిగిన మరో ఘటన నగరంలో కలకలం రేపుతోంది. ప్రేమోన్మాది దాడిలో తల్లి మృతి చెందగా, కూతురు పరిస్థితి విషమంగా ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న పీఎం పాలెం పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.ప్రేమోన్మాది నవీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా బూర్జిలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, మృతురాలు లక్ష్మి చెల్లి సాక్షి మీడియాతో మాట్లాడుతూ.. నిందితుడు నవీన్‌ను నడిరోడ్డుపై ఉరి తీయాలంటూ డిమాండ్ చేసింది. పెళ్లి చేస్తామని చెప్పిన కానీ దారుణంగా చంపాడు. కాళ్లు, చేతులు నరికి నిందితుడిని కఠినంగా శిక్షించాలి. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఆమె అన్నారు. -
భర్త మొబైల్లో పక్కంటి మహిళ ఫోన్ నంబరు..
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఇరు కుంటుంబాలు పక్కపక్కనే ఉంటాయి.. తెల్లారితే ఒకరి ముఖాలు.. ఒకరు చూసుకోవాలి. తీరా బంధువులు కూడా.. అయితే ఏమైందో..ఏమో కానీ..ఆ ఇరు కుటుంబీకు ల మధ్య కొన్ని నెలల కిందట వివాదం తలెత్తింది. దూరం పెరిగింది. మాటల్లేవ్.. ఈ తరుణంలో భర్త ఫోన్లో ఆ పక్కంటి మహిళా ఫోన్ నంబరు ఉందని భార్య గొడవకు దిగింది. దీంతో మనస్తాపానికి గురైన పక్కంటి మహిళా ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది. పదెంకెల ఫోన్ నంబరు తెచ్చిన తంటాకు ఓ ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఈ ఘటన మంగళవారం చిత్తూరు మండలం ఏనుగుండ్లపల్లి గ్రా మంలో చోటుచేసుకుంది.గ్రామస్తులు, పోలీసులు వివరాల మేరకు...చిత్తూరు మండలం ఏనుగుండ్లపల్లి గ్రామానికి చెందిన రమేష్ భార్య ఉమ (30). ఈ దంపతులకు పెళ్లిలై ముగ్గురు పిల్లలున్నారు. వీళ్ల ఇంటి పక్కనే శివమణి, సుజాత అనే దంపతులు ఉన్నారు. ఈ ఇరుకుటుంబీకులు దగ్గర బంధువు లు. వీళ్ల మధ్య ఏర్పడిన చిన్న తగదాలు గొడవగా మారాయి. కొన్ని నెలలుగా ఈ ఇరు కుటుంబీకుల మధ్య మాటలు లేవు. అయితే సోమవారం శివమణి మొబైల్లో ఉమ ఫోన్ నంబరును సుజాత గమనించింది. ఆ నంబరు నీ ఫోన్లో ఎందుకు ఉందని సుజాత భర్తతో వాగ్వాదానికి దిగింది. ఇలా అక్రోశానికి గురైన సుజాత రోడెక్కింది. ఉమతో గొడవకు దిగింది. ఇద్దరు దుర్భాషలాడుకున్నారు. ఇలా మాట మాట పెరిగి జట్టు పట్టుకొని కొట్టుకున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైనా ఉమ సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈక్రమంలో జాకెట్లోని అట్టముక్కలో తన చావుకు కారణం సుజాతనేని రాసి పెట్టింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మల్లికార్జున తెలిపారు. అనుమానం పెనుభూతమైంది. ఓ మహిళా ప్రాణాన్ని బలి తీసుకుంది. క్షణికావేశానికి గురై ఆ మహిళ పరువుకు తలొంచి ఆత్మహత్య చేసుకుంది. -
గోడు చెప్పుకోలేక..వినేవారులేక!
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో బీటెక్ ఫస్టియర్ చదువుతున్న రాష్ట్రానికి చెందిన ఓ మూగ, బధిర విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం అర్ధరాత్రి హాస్టల్ భవనం ఐదో అంతస్తు నుంచి దూకి ఎం. రాహుల్ చైతన్య (18) అనే యువకుడు తనువు చాలించాడు. పుట్టినరోజున తల్లికి మెసేజ్ పంపి బలవన్మరణానికి పాల్పడటం గమనార్హం. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు తెలియజేశారు. మృతుడి స్వస్థలం నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సత్యనారాయణపురం గ్రామం. ఇదే కళాశాలకు చెందిన కాట్రవత్ అఖిల్ (20) అనే మరో తెలంగాణ విద్యార్థి కార్డియాక్ అరెస్ట్‌తో ఆదివారం రాత్రే మరణించడం గమనార్హం. తీవ్రంగా గాయపడిన రాహుల్‌ను సమీపంలోని ఎస్ఆర్ఎన్ హాస్పిటల్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ధూమన్‌గంజ్ ఏసీపీ అజేంద్ర యాదవ్ తెలిపారు. తమ కళాశాలలోని మూగ, బధిర విభాగంలో రాహుల్ చైతన్య బీటెక్ ఫస్టియర్‌లో చేరాడని అలహాబాద్ ట్రిపుల్ ఐటీ పీఆర్వో పంకజ్ మిశ్రా చెప్పారు. గత మూడు నెలలుగా అతను తరగతులకు హాజరుకావడం లేదని.. చదువుల సంబంధిత ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడని పేర్కొన్నారు. ఈ ఒత్తిడి గురించి అతను తల్లికి కూడా తెలియజేశాడని వివరించారు. ఇద్దరు విద్యార్థుల మరణంపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టేందుకు యాజమాన్యం త్రిసభ్య విచారణ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. -
గ్రూప్ 1 పరీక్ష సరిగ్గా రాయలేదని.. యువతి ఆత్మహత్య
కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలకేంద్రానికి చెందిన ఆకుల శృతి (27) సోమవారం ఉదయం తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. శృతి ఎంకాం పూర్తి చేసింది. పోటీ పరీక్షల కోసం ప్రిపేరవుతూ.. ఇటీవలే గ్రూప్–1, 2 పరీక్ష రాసినా మంచి ర్యాంక్ రాలేదు. వీటికితోడు శృతి తండ్రి శ్రీనివాస్ అనారోగ్యంతో మంచానికి పరిమితమయ్యాడు. మరోవైపు శృతి ఏడాదికాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. చికిత్స చేయించుకుందామంటే ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మనస్తాపానికి గురైన శృతి ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. శృతి తల్లి రోజ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్‌కుమార్ పేర్కొన్నారు. పండుగ కోసం వచ్చి.. ప్రాణాలు వదిలి.. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి సుల్తానాబాద్‌రూరల్ (పెద్దపల్లి): ఐతరాజుపల్లి గ్రామ శివారులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన పంగ నిఖిల్(26) మృతి చెందాడు. ఎస్సై శ్రావణ్‌కుమార్ కథనం ప్రకారం.. పంగ భాస్కర్–పద్మ దంపతుల కుమారుడు నిఖిల్ హైదారాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఉగాది పండుగ కోసమని ఈనెల 29న స్వగ్రామానికి వచ్చాడు. ఆదివారం సాయంత్రం ఐతరాజుపల్లిలోని తన స్నేహితుడి ఇంటికి వెళ్లి రాత్రి ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి బయలు దేరాడు. ఈక్రమంలో ప్రమాదవాశాస్తు ద్విచక్ర వాహనంపై నుంచిపడి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. -
అనకాపల్లి: వేపాడు దివ్య కేసులో సంచలన తీర్పు
అనకాపల్లి, సాక్షి: పదేళ్ల కిందట తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిన్నారి వేపాడు దివ్య హత్య కేసులో సంచలన తీర్పు వెలువడింది. ఈ కేసులో నిందితుడు గుణశేఖర్‌ను దోషిగా ప్రకటించిన చోడవరం కోర్టు.. మరణశిక్షను ఖరారు చేసింది. దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. గుణశేఖర్‌కు దివ్య కుటుంబంతో గొడవలు ఉన్నాయి. ఇది మనసులో పెట్టుకుని.. స్కూల్‌కి వెళ్లి వస్తున్న ఆరేళ్ల చిన్నారి దివ్యను నిందితుడు తన వెంట తీసుకెళ్లాడు. బిళ్లలమెట్ల రిజర్వాయర్ వద్దకు తీసుకెళ్లి బీర్ బాటిల్‌తో గొంతు కోసి పైశాచికంగా హత్య చేశాడు. ఈ ఘటన అప్పట్లో కలకలం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా జరిపారు. చివరకు బంధువైన గుణ శేఖరే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారించుకుని అరెస్ట్ చేశారు. ఇన్నేళ్లపాటు విచారణ జరగ్గా.. చివరకు దివ్య కుటుంబానికి న్యాయం జరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
హైదరాబాద్‌లో విదేశీ మహిళపై గ్యాంగ్ రేప్
హైదరాబాద్: మీర్పేట్లో విదేశీ మహిళపై సామూహిక అత్యాచారం చోటు చేసుకుంది. లిఫ్ట్ పేరిట ఆమెను ఎక్కించుకుని వెళ్లిన కొందరు యవకులు ఘాతుకానికి ఒడిగట్టారు.మీర్‌పేట వద్ద వాహనాల కోసం ఎదురు చూస్తున్న విదేశీయురాలిని లిఫ్ట్ వంకతో తీసుకెళ్లారు. ఆపై పహాడీషరీఫ్ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు.ఘటనపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు అయ్యింది. సదరు బాధితురాలు జర్మనీకి చెందిందని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం.. చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. -
దైవసన్నిధికి వెళుతూ... మృత్యు ఒడికి..
అవనిగడ్డ: కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పులిగడ్డ వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. పోలీసుల కథనం మేరకు... గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటకు చెందిన జిడుగు సందీప్ తన తల్లిదండ్రులు మోహన్‌బాబు(57), అరుణ(50), భార్య పల్లవి, కుమార్తె సాత్విక(5), కుమారుడు షణ్ముఖ(3 నెలలు)తో కలసి కారులో కృష్ణా జిల్లా మోపిదేవిలోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి బయలుదేరారు. వారి కారును పులిగడ్డ–పెనుమూడి వంతెన టోల్‌ప్లాజా మధ్య ఎదురుగా పామాయిల్ లోడుతో వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మోహన్‌బాబు, అరుణ, షణ్ముఖ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన సాతి్వకను అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లి ప్రథమ చికిత్స చేయించిన అనంతరం మచిలీపట్నం తరలిస్తుండగా, మార్గంమధ్యలో మరణించింది. గాయపడిన పల్లవి, సందీప్‌లను మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పల్లవి పరిస్థితి విషమంగా ఉంది. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో చిన్నారి షణ్ముఖను ఊయలలో వేసేందుకు వస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడటం చూపరులను కలచివేసింది. -
గ్యాస్ సిలిండర్ పేలి ఏడుగురి మృతి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ దక్షిణ 24 పరగణాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. మరొకరికి గాయాలు కాగా చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో నలుగురు పిల్లలు, ఇద్దరు మహిళలు ఉన్నారు. పథార్ ప్రతిమా మండలంలోని ధోలాహట్ గ్రామంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. ఓ నివాసంలో సోమవారం రాత్రి 9గం. ప్రాంతంలో సిలిండర్ పేలింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసి.. సహాయక చర్యలు చేపట్టారు. ఏడు మృతదేహాలను బయటకు తీసుకురావడంతో పాటు గాయపడ్డ మహిళను ఆస్పత్రికి తరలించారు. ఇంట్లో బాణాసంచా తయారీ కేంద్రం నడుపుతున్నారేమోననే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. రెండు గ్యాస్ సిలిండర్లు ఒకేసారి పేలాయని.. బాణాసంచా కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని, ఘటనపై దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. #Breaking: 7 people, including 4 children, killed in a gas cylinder blast at Pathar Pratima in Bengal''s South 24 Parganas district.#WestBengal #South24Parganas #CylinderBlast #Blast pic.twitter.com/JC3togdyt5— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) March 31, 2025 -
అవమానం భరించలేక ఆత్మహత్యాయత్నం
చిత్తూరు అర్బన్ : తీసుకున్న రూ.10 వేల అప్పుకు వడ్డీల మీద వడ్డీలు కట్టినా.. అవమానకరంగా మాట్లాడినందుకు ఓ మహిళ ఆత్మహత్యే శరణ్యంగా భావించింది. ఏకంగా రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టగా స్థానికులు, పోలీసులు వచ్చి సకాలంలో ఆమెను రక్షించారు. ఆదివారం చిత్తూరు నగరంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. నగరంలోని కన్నయ్యనాయుడు కాలనీకి చెందిన ప్రియాకు వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈమె భర్త కూలీ పనులు చేస్తుండగా ప్రియా ఇళ్లల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. ఇటీవల ఆమె తన పిల్లాడికి స్కూల్ ఫీజు కట్టడానికి రాజా అనే వ్యక్తి నుంచి రూ.10 వేలు అప్పుగా తీసుకున్నారు. ఇందుకు గానూ ప్రతివారం రూ.3 వేలు చొప్పున రెండు నెలలుగా చెల్లించారు. అయితే అది మొత్తం వడ్డీ కింద జమ చేసుకున్నారని, అసలు రూ.10 వేలు ఇచ్చి తీరాల్సిందేనంటూ రాజా అనే వ్యక్తి ఇటీవల బాధితురాలిని బెదిరించాడు. ఫోన్లో సైతం ఆమెను అసభ్యంగా తిడుతూ వేధించాడు. ఈ బాధలు, అవమానం భరించలేని ప్రియా.. ఆదివారం మధ్యాహ్నం మెసానిక్ మైదానం సమీపంలో ఉన్న రైల్వే పట్టాలపై పడుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. అటువైపుగా రైలు వచ్చేందుకు 15 నిముషాలు ఉందనగా, ప్రియాను గుర్తించిన జ్ఞానరాజ్ అనే వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను బలవంతంగా పట్టాలపై నుంచి పక్కకు లాక్కెళ్లారు. ఆత్మహత్యాయత్నానికి కారణాలను తెలుసుకుని, కౌన్సెలింగ్ ఇచ్చారు. వేధింపులకు గురిచేసిన రాజా అనే వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.వివాహిత ఆత్మహత్య చిత్తూరు నగరంలో హేమలత (48) అనే వివాహిత ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య కథనం మేరకు.. నగరంలోని టెలిఫోన్ కాలనీకి చెందిన హేమలతకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధ పడుతున్నారు. దీంతో కలత చెంది ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బాత్ రూమ్ కి వెళ్లి ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నారు. -
రూ. 800 ఫీజు కట్టలేదని అవమానించారు.. బాలిక ఆత్మహత్య!
ఆ బాలిక చదివేది తొమ్మిదో తరగతి.. ఎగ్జామ్ టైమ్ వచ్చింది. కానీ ఆ బాలిక స్కూల్ ఫీజు రూ. 800 కట్టాల్సి ఉంది. పరిస్థితులు అనుకూలించక ఆ కొద్ది మొత్తాన్ని పరీక్షల నాటికి కట్టలేకపోయింది. ఇంకేముందే పరీక్షలు రాయడానికి స్కూల్ యాజమాన్యం అంగీకరించకపోగా, అవమానించింది. ఇది కూడా బహిరంగంగా ఆ అమ్మాయిని స్కూల్ యాజమాన్యం అవమానించింది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ప్రతాప్ గడ్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా పెద్ద కలకలం రేపింది.స్కూల్ ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ దగ్గర్నుంచీ స్కూల్ మేనేజర్ సంతోష్ కుమార్, ఆఫీసర్ దీపక్ సరోజ్ లు ఆ బాలికను అవమానానికి గురి చేశారు. స్కూల్ పరీక్ష ఫీజు కట్టలేకపోయిందంటూ అవమానించారు. అంతేకాకుండా పరీక్షలకు అనుమతించేది లేదని చెప్పారు. ఇక చేసేది లేక అక్కడ ఏమీ మాట్లాడకుండా ఇంటికి వచ్చేసింది. లోపలకి వెళ్లి తలుపు వేసుకుంది. ఆమె తల్లి పొలం పనికి వెళ్లిపోయింది. తిరిగి సాయంత్రం వచ్చి చూసేసరికి ఆ అమ్మాయి విగత జీవిలా కనిపించింది.స్కూల్ ఫీజు కట్టలేదని ఆమెను పరీక్షకు అనుమతించడమే కాకుండా అవమానించడం దారణమని న్యాయవాది, స్థానిక పంచాయతీ సభ్యుడైన మొహ్మద్ అరిఫ్ స్పష్టం చేశారు. విద్యార్థుల్ని స్కూల్ యాజమాన్యాలు అవమానించాయంటే అది నేరం కిందకు వస్తుందన్నారు.తన కూతురు చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని తల్లి డిమాండ్ చేస్తోంది. దీనిపై భారతీయ న్యాయ సన్నిహిత సెక్షన్ 107 కింద స్కూల్ యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com