
హైకోర్టులో రన్య రావు భర్త జతిన్ పిటిషన్
గత నవంబరులోనే ఘనంగా పెళ్లి
కర్ణాటక: అక్రమంగా బంగారం తరలిస్తూ పట్టుబడి జైలుపాలైన నటి, ఓ డీజీపీ దత్త కుమార్తె రన్య రావు కుటుంబంలో కలతలు తీవ్రమయ్యాయి. ఆమె నుంచి విడాకులు కావాలని భర్త జతిన్ హుక్కేరి కోరుతున్నారు. ఈ మేరకు బెంగళూరు హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. పెళ్లయినప్పటి నుంచి రన్య రావుతో సంసారం ఇబ్బందిగానే ఉందని ఆయన దూరంగా ఉంటున్నారు. ఇంతలో బంగారం స్మగ్లింగ్‌లో భార్య అరెస్టు కావడంతో ఇక కాపురం కుదరదని భావిస్తున్నారు.
గత ఏడాది అక్టోబరు 6వ తేదీన బెంగళూరులో బాస్టిన్ రెస్టారెంట్‌లో రన్యా, జతిన్‌హుక్కేరి ఇద్దరూ ఓ పెళ్లిళ్ల పేరయ్య ద్వారా కలుసుకున్నారు. అలా పరిచయం పెరిగి పెళ్లి వరకూ వచ్చింది. అక్టోబరు 24వ తేదీన జతిన్, రన్య నిశి్చతార్థం జరిగింది. గత ఏడాది నవంబరు 27 తేదీన తాజ్‌వెస్ట్ ఎండ్‌హోటల్‌లో అంగరంగ వైభవంగా వివాహ వేడుక జరిగింది, ల్యావెల్లీ రోడ్డులోని ఖరీదైన అద్దె ఇంట్లో నివసిస్తున్నారు.
ఆది నుంచీ గొడవలు
తరువాత నెలకే రన్య, జతిన్ మధ్య మనస్పర్థలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఇరువురి మధ్య మాటలు లేవని జతిన్ పిటిషన్‌లో ప్రస్తావించారు. బంధుమిత్రులు రాజీకి ప్రయతి్నంచినా ఫలితం లేదని తెలిసింది. ఆమె తరచూ దుబాయ్‌కు వెళ్లి వచ్చేది, దీనిని భర్త ప్రశ్నించడంతో గొడవలు జరిగేవి. మరోవైపు స్నేహితుడు తరుణ్ రాజుతో కలిసి బంగారం స్మగ్లింగ్ కేసుల్లో చిక్కుకుంది.