breaking news
Crime News
-
‘నన్ను చంపినా నేను ఆ యువకులతోనే ఉంటా’
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువకుడు తన భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు. శనివారం ఉదయం ఈ ఘటన మహారాజ్‌పూర్ పోలీస్ స్టేషన్లో కలకలం రేపింది. సార్… నేను నా భార్యను గొంతు నులిమి చంపేశా. ఆమె శరీరం ఇంట్లో దుప్పటిలో చుట్టి ఉంది” అని చెప్పాడు.భార్యను హత్య చేసిన తర్వాత సచిన్ నాలుగు గంటల పాటు నగరంలో తిరిగాడు.. పారిపోవాలనుకున్నాడు. చివరికి లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడని పోలీసులు తెలిపారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని.. సంఘటనా స్థలానికి అతని భార్య శ్వేత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.ఫతేహ్పూర్ జిల్లా మోహన్పూర్ గ్రామానికి చెందిన సచిన్, శ్వేత ప్రేమించుకున్నారు. కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలపడంతో కోర్టులో పెళ్లి చేసుకున్నారు. మొదట సూరత్‌లో నివసిస్తూ సచిన్ ఫ్యాక్టరీలో పనిచేశాడు. నెలరోజుల తర్వాత కాన్పూర్‌కి వచ్చి గది అద్దెకు తీసుకుని, ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో భార్య ప్రవర్తనపై సచిన్‌కు అనుమానం కలిగింది. శ్వేత ఖాతాలో తరచూ డబ్బు జమ అవుతుండటంపై సచిన్ నిలదీశాడు. ఆమె తన అమ్మమ్మ పంపిందని చెప్పింది. ఎదురింట్లో ఉండే యువకులపై కూడా భర్తకు అనుమానం కలిగింది.భార్య ప్రవర్తనపై నిగ్గు తేల్చడానికి సచిన్.. స్నేహితులతో పార్టీకి వెళ్తున్నానని.. ఇంటికి రానంటూ భార్యకు తెలిపాడు. కానీ తిరిగి వచ్చి గది తలుపు తెరిచి ఉండగా, భార్యతో పాటు ఇద్దరు యువకులు ఉన్నారు. దీంతో వారి మధ్య గొడవ జరిగింది. స్థానికులు 112 ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌కి కాల్ చేయడంతో పోలీసులు వారిని స్టేషన్‌కి తీసుకెళ్లారు. దంపతులను పోలీసులు కౌన్సెలింగ్ చేసి ఇంటికి పంపించారు.ఇంటికి చేరుకున్న తర్వాత సచిన్‌కు భార్యతో గొడవ మరింత ముదిరింది. ‘‘నన్ను చంపినా నేను ఆ యువకులతోనే ఉంటాను” అంటూ శ్వేత బెదిరించిందని సచిన్ పోలీసులకు తెలిపాడు. దీంతో ఆగ్రహంతో ఆమెను గొంతు నులిమి చంపేసినట్లు పోలీసులకు తెలిపాడు. “మేము ఒకరికి ఒకరం మాత్రమే ఉన్నాం. పారిపోయి పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు ఆమెకు ఎవరూ లేరు. నాకు కూడా ఎవరూ లేరు. అందుకే పోలీస్ స్టేషన్‌కి వచ్చి లొంగిపోయాను” అని చెప్పాడు. శ్వేత మృతదేహాన్ని పోలీసులు పోస్ట్‌మార్టం కోసం పంపించారు. -
నిమ్మకాయ వివాదం.. ఫాస్ట్‌ఫుడ్ హోటల్ వద్ద ఘర్షణ
తాడేపల్లిగూడెం అర్బన్: పట్టణంలోని ఒక పాస్ట్‌ఫుడ్ హోటల్ నిర్వాహకులకు ఫుడ్ కొనుక్కోనేందుకు వచ్చిన యువకులకు మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం తాడేపల్లిగూడెం రైల్వేస్టేషన్ సెంటరులో హిబ్బు అనే వ్యక్తి కింగ్స్ ఫాస్ట్‌ఫుడ్ హోటల్‌ను నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి 11గంటల సమయంలో పెంటపాడుకు చెందిన ఇద్దరు యువకులు ఫాస్ట్‌ఫుడ్ కొనుగోలు చేశారు. కొనుగోలుదారులు మరో నిమ్మకాయ ఇమ్మని అడగడంతో హోటల్, లో పనిచేస్తున్న సిబ్బంది అక్కడ ఉన్నాయని తీసుకోమని చెప్పడంతో సిబ్బందికి యువకులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం కొంతసేపటికి హోటల్ నిర్వాహకులకు చెందిన వ్యక్తులు కొందరు సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరు యువకులపై తీవ్రంగా దాడి చేయడంతో చీర్ల వెంకటరెడ్డి కన్నుకు తీవ్ర గాయమైంది. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చీర్ల వెంకటరెడ్డిని వైద్యం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.గురువారం మళ్లీ దాడిఅయితే గురువారం సాయంత్రం గాయాలపాలైన చీర్ల వెంకటరెడ్డికి చెందిన పెంటపాడు, ముదునూరుపాడు ప్రాంతాలకు చెందిన వబంధువులు స్థానిక హోటల్ వద్దకు చేరుకుని హోటల్ యజమాని ఎక్కడని ప్రశ్నించగా అక్కడి సిబ్బంది తమకు తెలియదని చెప్పడంతో ఫుడ్ కొనుగోలు చేయడానికి వచ్చిన తమ వారిని ఎందుకు కొట్టారు? అని కోపంతో అక్కడి సిబ్బందిపై దాడి చేసి హోటల్లోని సామగ్రిని చెల్లాచెదురు చేశారు. సమాచారం అందుకున్న పట్టణ ఎస్సై నాగరాజు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని సంబంధిత వ్యక్తులను అదుపులోనికి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరరలించారు.ఇరువర్గాలపై కేసుల నమోదుహోటల్ నిర్వాహకులు మహ్మద్ అబ్దుల్, గాయాలపాలైన చీర్ల వెంకటరెడ్డిలతోపాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఘర్షణలో చీర్ల వెంకటరెడ్డి వద్ద ఉన్న కొంత నగదును, అతని శరీరంపై ఉన్న బంగారు ఆభరణాలను హోటల్ నిర్వాహకులు దౌర్జన్యంగా లాక్కొన్నారని ఫిర్యాదు చేశాడు. తమ హోటల్ వద్ద గొడవ చేసి క్యాష్ కౌంటర్లోని నగదును చీర్ల వెంకటరెడ్డి బంధువులు కాజేశారని హోటల్ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు పట్టణ ఎస్సై నాగరాజు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
ఇద్దరు మహిళలతో వివాహేతర సంబంధం
తమిళనాడు: పల్లవరం సమీపంలోని త్రిసూలం, అమ్మన్ నగర్, 4 వ వీధికి చెందిన ఆరుముగం. ఇతని కుమారుడు సెల్వకుమార్(22), భవన నిర్మాణ కార్మికుడు. ఇతని స్వస్థలం దిండివనం. సెల్వకుమార్ కి పాత పల్లవరంలోని పచ్చై యమ్మన్ కోవిల్ వీధికి చెందిన వివాహిత రీనా, ఆమె స్నేహితురాలు రజిత ఇద్దరితో అక్రమ సంబంధంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ స్థితిలో, సెల్వ కుమార్ తరచుగా ముఠా నాయకులు రీనా, రజితతో వాదనలకు దిగేవాడు. ఇది వారి మధ్య నిరంతరం ఘర్షణకు దారితీసింది. ఈ స్థితిలో, 14వ తేదీ రాత్రి 10 గంటల ప్రాంతంలో, సెల్వకుమార్ పాత పల్లవరంలోని సుబార్ నగర్ ప్రాంతంలో రీనా, రజితలతో మాట్లాడుతున్నాడు. అప్పుడు అక్కడికి వచ్చిన అనుమానాస్పద వ్యక్తులు అకస్మాత్తుగా సెల్వకుమార్ ను చుట్టుముట్టి కత్తులతో వరుస దాడుల్లో పాల్పడ్డారు. తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన సెల్వకుమార్‌ను రక్షించి తాంబరం ఆసుపత్రికి తరలించారు. తరువాత, తదుపరి చికిత్స కోసం చెన్నై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా సెల్వ కుమార్ గురువారం విషాదకరంగా మరణించాడు. దీని గురించి పల్లవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివాహేతర వివాదంలో సెల్వకుమార్ హత్యకు గురైనట్లు తేలింది. దీని తరువాత, అతని వివాహేతర ప్రియురాలులైన రీనా, రజితను విచారించగా, వారు సెల్వ కుమార్‌ను హత్య చేసినట్లు అంగీకరించారు. సెల్వ కుమార్ తరచుగా తాగి ఉన్నప్పుడు గొడవలకు దిగేవాడు. దీనితో ఆగ్రహించిన రీనా, రజిత అతన్ని కొందరు దుండగులతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. -
ఒక ప్రమాదం.. ఆరు ప్రాణాలు
ఒక ప్రమాదం నాలుగు ప్రాణాలను బలి తీసుకోగా.. ఆ ఆవేదనతో కుటుంబంలోని మిగిలిన ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో ఖమ్మం జిల్లా మిట్టపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.తల్లాడ మండలం మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్-రేవతి దంపతులకు కవల పిల్లలు. గత ఏడాది ఏప్రిల్ 29వ తేదీన వాళ్ల ఇంట్లో గ్యాస్ సిలిండర్ ప్రమాదం జరిగింది. మంటలు వ్యాపించి వినోద్ కవల పిల్లలు తరుణ్, వరుణ్‌తోపాటు.. వినోద్ నాయనమ్మ గుత్తికొండ సుశీల, మేనకోడలు మృతి చెందారు. ప్రాణంగా పెంచుకున్న ఇద్దరు కొడుకులు ఒకేసారి చనిపోవడంతో ఆ దంపతులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. డిప్రెషన్లోకి వెళ్లిన రేవతి గత నెలాఖరున ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఈ నెల 1న కన్నుమూసింది. అటు పిల్లలు, నాయనమ్మ, మేనకోడలితోపాటు భార్య మృతి చెందడంతో తాను మాత్రం ఎందుకు బతకాలని పలువురితో చెబుతూ రోదించిన వినోద్.. ఈనెల 7వ తేదీన వినోద్ ఇంట్లో ఉరి వేసుకున్నాడు. కాసేపటికి గుర్తించిన చుట్టుపక్కల వారు కొనఊపిరి ఉన్నట్లు గుర్తించి ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. -
ఆటోడ్రైవర్‌తో వివాహేతర సంబంధం.. చివరికి!
అజిత్‌సింగ్ నగర్ (విజయవాడ సెంట్రల్): భర్తతో విభేదాల కారణంగా విడిపోయి... వేరొకరితో సహజీవనం చేస్తున్న ఆమె అతడి చేతిలోనే దారుణ హత్యకు గురైంది. విజయవాడ అజిత్‌సింగ్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం కేదారేశ్వరపేట 8వ లైన్‌కు చెందిన మహ్మద్ ఉసీనా (36) భర్తకు దూరంగా ఉంటూ కొడుకు, కూతురుతో కలిసి వేరుగా జీవిస్తోంది. మంగళగిరి సమీపంలోని నులకపేట ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్ కొల్లిపర సాయి శివకుమార్(40)తో సహజీవనం చేస్తోంది. ఈమె కుమార్తె ఎండీ సోని (19)కి కొంతకాలం క్రితం వివాహం కాగా ఆమె భర్తతో గొడవలు పడి పుట్టింటికి వచ్చేసింది. సోని రెండో వివాహం విషయమై శివకుమార్, ఉసీనాకు మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున ఉసీనా గది నుంచి పెద్దగా అరుపులు వినిపించాయి. సోని వెళ్లి చూడగా ఉసీనాపై శివకుమార్ విచక్షణారహితంగా దాడి చేస్తూ, గొంతు నులుముతూ కనిపించాడు. సోని భయంతో కేకలు వేయగా రోకలిబండతో ఆమె తల పగుల కొట్టేందుకు ప్రయత్నించాడు. రక్తంతోనే ఆమె బయటకు పరుగులు తీసింది. వారి కేకలు విన్న స్థానికులు వచ్చి చూసేలోపు శివకుమార్ ఆటోతో పరారయ్యాడు. గది లోపలకు వెళ్లి చూడగా ఉసీనా మృతి చెంది కనిపించింది. సీఐ బీహెచ్ వెంకటేశ్వర్లు సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకుని సోనిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఉసీనా కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. -
‘గ్లాస్’ గొడవ.. అన్నను చంపిన తమ్ముడు
సాక్షి, హైదరాబాద్: నాచారంలో దారుణం జరిగింది. అన్నను తమ్ముడు హత్య చేశాడు. మద్యం తాగే క్రమంలో గ్లాస్ కోసం గొడవ జరిగింది. మూడంతస్తుల భవనంపై నుంచి అన్నను తమ్ముడు తోసేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.వరంగల్‌లో..మరో ఘటనలో వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఈరియా తండాలో ఓ యువకుడిపై దాడికి పాల్పడ్డారు. బెల్ట్ షాప్ వద్ద మద్యం కోసం వచ్చిన గణేష్ అనే యువకుడిపై దంపతులు రోకలి బండతో దాడి చేశారు. గణేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరతలించారు. దాడి చేసిన దంపతులు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. -
టీడీపీ గూండాల దాడి.. వైఎస్సార్సీపీ కార్యకర్త కన్నుమూత
సాక్షి, పల్నాడు జిల్లా: గురజాల నియోజకవర్గంలో దారుణం జరిగింది. టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్సార్సీపీ కార్యకర్త సాల్మన్.. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. దీంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. పిన్నెల్లి గ్రామానికి చెందిన సాల్మన్ మొదటి నుంచి వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా ఉంటున్నాడు. అయితే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఊరు వదిలి వెళ్లిపోవాలని సాల్మన్‌కు తెలుగుదేశం నాయకులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రాణభయంతో కుటుంబంతో సహా బ్రహ్మణపల్లికి మకాం మార్చాడు. అయితే.. వైఎస్సార్సీపీ నేతలు ధైర్యం చెబుతుండడంతో రెండు నెలల కిందట సాల్మన్ కుటుంబం తిరిగి పిన్నెల్లికి వచ్చే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కొందరు స్థానికుల సాయంతో టీడీపీ నేతలు వాళ్లను అడ్డుకున్నారు. పంచాయితీ తర్వాత చివరకు సాల్మన్ మినహా కుటుంబ సభ్యులను మాత్రమే ఊర్లో ఉండేందుకు అనుమతి ఇచ్చారు. అయితే.. సాల్మన్ భార్య ఈ మధ్య అస్వస్థతకు గురైంది. దీంతో.. ఈనెల 10వ తేదీన పిన్నెల్లి వెళ్లి ఆమెను చూడటానికి సాల్మన్ ప్రయత్నించాడు. రావొద్దన్నా.. ఎందుకు వచ్చావ్ అంటూ టీడీపీ గూండాలు ఆయన్ని చితకబాదారు. తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న టైంలోనే కోమాలోకి వెళ్లిన సాల్మన్.. చివరకు నాలుగు రోజుల తర్వాత ఈ ఉదయం కన్నుమూశాడు. ఈ ఘటనపై స్థానిక వైఎస్సార్సీపీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.సాల్మన్‌పైనే కేసు!సాల్మన్ మృతి చెందిన విషయం తెలిసి మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్ అండతోనే ఈ హత్య జరిగిందని మండిపడ్డారు. ‘‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పిన్నెల్లి గ్రామానికి చెందిన వందలాది కుటుంబాలు బయటికి వెళ్లిపోయాయి. సాల్మన్ కూడా బయటే బతుకుతున్నాడు. టీడీపీ నేతల చేతిలో తీవ్రంగా గాయపడిన కోమాలోకి వెళ్లిన సాల్మన్‌పైనే కేసు పెట్టారు. ఈ కేసులో సీఐ పనికిమాలిన సెక్షన్స్ పెట్టాడు. రేపు పిన్నెల్లిలోనే సాల్మన్ అంత్యక్రియలు జరిపి తీరుతాం. చంద్రబాబు, లోకేష్‌లు మీడియా ముందు నీతులు చెప్పడం కాదు.. పిన్నెల్లి అంశంపై మాట్లాడండి అంటూ మహేష్ రెడ్డి హితవు పలికారు. -
వీడియోలు తీసి.. బ్లాక్మెయిల్ చేసి..
కరీంనగర్‌రూరల్: వ్యాపారంలో నష్టం.. ఆర్థిక ఇబ్బందులు.. ఆపై ఈజీ మనీకోసం అలవాటు పడిన ఆ దంపతులు అడ్డదార్లు తొక్కారు. ఇందుకు సోషల్ మీడియాను వేదికగా మార్చుకున్నారు. ఇన్‌స్టాగ్రాంలో తన భార్య ఫొటోలు షేర్ చేస్తూ యువకులకు వలపు గాలం వేశాడో భర్త. ఆపై ఇంటికి పిలిచించి.. భార్యతో వారు ఏకాంతంగా ఉన్నప్పుడు రహస్యంగా వీడియోలు చిత్రీకరించాడు. బ్లాక్మెయిల్ చేస్తూ.. అందినకాడికి దండుకున్నారు. ఇలా రూ.లక్షల్లో మోసపోయిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో కరీంనగర్ రూర ల్ పోలీసులు విచారణ చేసి ఆ డర్టీ కపుల్స్‌ను అరెస్టు చేశారు. సీఐ నిరంజన్‌రెడ్డి కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లాకు చెందిన వ్యక్తి కరీంనగర్ వచ్చి మార్బుల్ వ్యాపారం ప్రారంభించాడు. ఈ క్రమంలో అదే జిల్లాకు చెందిన యువతి పరిచయం కావడంతో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. రెండేళ్లుగా ఆరెపల్లిలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. వ్యాపారంలో నష్టం రావడంతో ఇంటీరియల్ డెకరేషన్ ప్రారంభించి, బ్యాంకులో లోన్ తీసుకున్నాడు. అందులోనూ నష్టం రావడంతో ఈఎంఐలు ఇబ్బందిగా మారాయి. దీంతో ఇన్‌స్టాగ్రాంలో తన భార్య ఫొటో, సెల్‌నంబరు పెట్టి వలపువల వేశాడు. దాదాపు 100 మందికిపైగా యువకులు పలుమార్లు ఫ్లాట్‌కు వచ్చి భార్యతో గడిపి వెళ్లేవారు. అలా వచ్చినవారి ఫొటోలు, వీడియోలు చిత్రీకరించేవారు. ఆపై బెదిరించి డబ్బులు వసూలు చేసేవారు. ఏడాది క్రితం కరీంనగర్‌కు చెందిన ఓ వ్యాపారిని ఇలానే బెదిరించి ఫ్లాట్, కారు ఈఎంఐలు కట్టించారు. కొన్ని రోజుల నుంచి సదరు వ్యాపారి తమ వద్దకు రాకపోవడంతో రూ.5 లక్షలు ఇవ్వకుంటే నగ్న ఫొటోలు, వీడియోలు కుటుంబసభ్యులు పంపిస్తామని బెదిరించారు. భయపడి రూ.లక్ష ఇచ్చాడు. ఇలా రూ.14 లక్షలు ఇచ్చానని, వీడియోలు తొలగించాలని వ్యాపారి కోరగా మరో రూ.4 లక్షలు ఇవ్వాలని బెదిరించారు. దీంతో సదరు వ్యాపారి మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఏసీపీ విజయ్‌కుమార్ ఆదేశాల మేరకు సీఐ నిరంజన్‌రెడ్డి బుధవారం బైపాస్‌రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. నేరాన్ని అంగీకరించడంతో కోర్టులో హాజరుపర్చారు. -
చంద్రబాబు ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం
సాక్షి, తిరుపతి: చంద్రగిరి మండలంలోని సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లి ఇంటి వద్ద ఓ వృద్ధుడి ఆత్మహత్య యత్నం తీవ్ర కలకలం రేపింది. న్యాయం చేస్తామని చెప్పి ఏడాది గడిచినా ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని.. పైగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని వాపోతూ పురుగుల మందు తాగాడు. ప్రస్తుతం ఆ పెద్దాయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం నాగి రాజయ్య గారిపల్లికి చెందిన గోవిందరెడ్డి(65) తనకున్న భూసమస్యపై సీఎంకు వినతి పత్రం ఇచ్చేందుకు బుధవారం ఉదయం నారావారిపల్లికి వచ్చాడు. అయితే.. సీఎం పండుగ వేడుకల్లో బిజీగా ఉన్నారని చెబుతూ పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. దీంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అది గమనించిన స్థానికులు హుటాహుటిన నారావారిపల్లి ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం రుయాకు తరలించారు. ఏడాది గడిచినా.. గోవిందరెడ్డికి తన అన్నదమ్ములతో భూ పంచాయితీ నడుస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే లక్షలు ఖర్చు చేశాడు. అయితే.. గత ఏడాది జనవరిలో మంత్రి లోకేష్, సీఎం చంద్రబాబును నారావారిపల్లెలోనే కలిసి న్యాయం చేయమని బతిమాలాడాడు. ఆ సమయంలో.. తాము చూసుకుంటామంటూ తండ్రీకొడుకులు మాట ఇచ్చారు. అయితే ఏడాది అవుతున్నా ఇంతవరకు న్యాయం జరగలేదు. గోవిందరెడ్డితో వచ్చిన రెడ్డప్ప అనే వ్యక్తి మాట్లాడుతూ.. నేను బైక్ పార్కింగ్ చేస్తుండగా ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గోవిందరెడ్డి వద్ద అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. కలెక్టర్, ఎమ్మార్వోలను కలిసినా ఫలితం లేకుండా పోయింది. దీనికి తోడు పంచాయితీల పేరుతో లక్షలు నష్టపోయాడు. డబ్బులు ఖర్చు చేసినా న్యాయం జరగలేదు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. న్యాయం కోసం గత ఏడాది నారావారిపల్లెలో మంత్రి లోకేష్‌ను కలిశాం. న్యాయం కోసం ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఘటన గురించి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ గోవిందరెడ్డికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. -
ఏపీలో సీజ్ ద కైట్!
పతంగులకు కట్టిన దారం.. ప్రాణాలు తీస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో చైనీస్ మాంజా ప్రమాదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే.. పలువురి ప్రాణాలు బలిగొందీ భూతం. ఈ పండుగ సీజన్లోనే ఇరు చోట్ల చైనీస్ మాంజా ధాటికి పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. దీంతో నిషేధిత మాంజా అమ్మకాలు, వాడకంపై కఠిన చర్యలు అమలు కావడం లేదనే విమర్శ బలంగా వినిపిస్తోంది. అటు పోలీసు శాఖలు చేపడుతున్న డ్రైవ్స్.. అరకొర ఫలితాలనే ఇస్తున్నాయి.. తెలంగాణలో చైనీస్ మాంజా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా.. నిజామాబాద్‌లో మాంజా చుట్టుకుని ఓ రైతు తీవ్ర గాయాలపాలయ్యాడు. హైదరాబాద్‌లో ఈ ప్రమాదాలు మరీ ఎక్కువగా జరుగుతున్నాయి. రోజుకొక ఘటన చోటు చేసుకుంటోంది. చైనా మాంజా అమ్మినా.. కొన్నా.. ఆఖరికి ఆ మాంజాతో గాలి పటాలు ఎగరేసినా కేసులు పెడుతామని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆఖరికి పీడీ యాక్టు ప్రయోగిస్తామన్న ప్రయోజనం కనిపించడం లేదు. ఇదిలా ఉండగానే..హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌కు తెలంగాణ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. చైనీస్ మాంజా విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టారు.. ఇప్పటిదాకా జరిగిన ప్రమాదాల తాలుకా వివరాలతో పూర్తి నివేదికను ఫిబ్రవరి 26వ తేదీలోపు అందజేయాలని కమిషన్ ఆయన్ని ఆదేశించింది.ఇటు ఏపీలోనూ చైనీస్ మాంజా విషయంలో పోలీసులు చేస్తున్న ప్రకటనలకు విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చైనీస్ మాంజా అమ్మినా.. కొన్నా.. కఠిన చర్యలు తప్పవని పోలీసులు చేస్తున్న హెచ్చరికలను వ్యాపారులు బేఖాతరు చేస్తున్నారు. దీంతో 112కి డయల్ చేసి సమాచారం అందించాలని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. వైజాగ్ పోలీసులు మరో అడుగు ముందుకేసి.. చైనీస్ మాంజా ఉన్న 650 గాలి పటాలను సీజ్ చేశారు. మరికొన్ని జిల్లాల్లోనూ పోలీసులు అమ్మేవారిని ఏం చేయలేక.. కొనేవారిని, ఎగరేసే వారిని పట్టుకుని వాళ్ల చేతుల్లోని గాలి పటాలు సీజ్ చేస్తున్నట్లు ప్రచారం జరగుతోంది. చైనీస్ మాంజాలో.. సింథటిక్ పదార్థాలతో(నైలాన్, ప్లాస్టిక్) తయారు చేసి.. గాజు లేదంటే లోహపు పొరతో దారానికి పూత పూస్తారు. అందుకే ఇది తీవ్రమైన గాయాలు చేస్తుంది. పైగా ఇది పర్యావరణానికి హానికరం(బయోడిగ్రేడబుల్ కాదు). అందుకే భారత ప్రభుత్వం 2017లో చైనా మాంజా (Chinese Manjha)పై నిషేధం విధించింది. తొలుత ఇది చైనా నుంచి దిగుమతి అయ్యేది. అలా దానికి చైనీస్ మాంజా, చైనా మాంజా అనే పేర్లు స్థిరపడిపోయాయి. ఆ తర్వాతి కాలంలో మన దేశంలోనే దీనిని తయారుచేయడం మొదలుపెట్టారు. ఇండస్ట్రీయల్ అవసరాల కోసం తయారీకి మినహాయింపు ఇచ్చారు. ఇదే అదనుగా కాసుల కక్కుర్తితో చైనీస్ మాంజాను మార్కెట్లలోకి తెస్తున్నారు. చైనా మాంజా తయారీ.. నిల్వ.. విక్రయం(అమ్మడం) నేరం. ఉల్లంఘిస్తే ఐదు సంవత్సరాల జైలు శిక్ష లేదంటే రూ.1 లక్ష వరకు జరిమానా ఒక్కోసారి రెండూ విధించవచ్చు. వినియోగం పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం.. చైనీస్ మాంజా కారణంగా ప్రమాదాల బారిన పడ్డవాళ్లు పరిహారం కోసం కోర్టులను ఆశ్రయించవచ్చు. -
ప్రమాదమే కాపాడింది.. అసలేం జరిగిందంటే..
ధార్వాడ్: కర్ణాటకలోని ధార్వాడ్‌లో ఇద్దరు విద్యార్థుల కిడ్నాప్ కలకలం రేపింది. బైక్ ప్రమాదానికి గురవ్వడంతో నిందితుడు పట్టుబడగా.. చిన్నారులు సురక్షితంగా బయటపడ్డారు. ధార్వాడ్‌లోని ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సోమవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో మూడో తరగతి చదువుతున్న తన్వీర్ దొడ్మని, లక్ష్మి కరియప్పనవర్ అనే ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు.విరామం తర్వాత పిల్లలు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు.. వారు కిడ్నాప్‌కు గురయ్యారని అనుమానించారు. దీంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు.. ఓ వ్యక్తి ఆ పిల్లలిద్దరినీ బైక్‌పై తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. నిందితుడిని కరీం మేస్త్రీగా గుర్తించారు.పిల్లలను తీసుకుని వెళ్తున్న క్రమంలో నిందితుడు ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాద సమాచారం అందుకున్న దండేలి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ గాయపడిన వ్యక్తితో పాటు ఇద్దరు పిల్లలు ఉండటాన్ని గమనించారు. పోలీసుల విచారణలో ఆ వ్యక్తి.. తాను పిల్లలను "ఉలవి చెన్నబసవేశ్వర జాతరకు తీసుకువెళ్తున్నట్లు పోలీసులకు చెప్పాడు. అయితే కిడ్నాప్ ఉద్దేశంతోనే వారిని తీసుకువెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చిన్నారులను సురక్షితంగా వారి తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. ప్రమాదంలో గాయపడిన నిందితుడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పలు కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
మన విషయం అందరికీ తెలిసిపోయింది..!
చెన్నై: కోరిక తీర్చలేదని బావ మరదలను హత్య చేసిన ఘటన ధర్మపురి జిల్లాలో చోటుచేసుకుంది. ఇండోర్ సమీపంలోని ఓషా అల్లిపుత్తూర్కు చెందిన ప్రభు (40). ఇతని భార్య రాజేశ్వరి (30). వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రభు బెంగళూరులో భవన కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. రాజేశ్వరి సోదరి మునియమ్మన్ భర్త హనుమంతన్ (40) భవన కాంట్రాక్టర్. ఇతను సొంత ట్రాక్టర్ కలిగి ఉన్నాడు. ప్రభు, హనుమంతన్ ఇద్దరూ భాగస్వాములు. ఈ స్థితిలో బెంగళూరులో నివసించే ప్రభు నెలలో ఒకటి, రెండుసార్లు స్వస్థలానికి వెళ్తాడు. ఈక్రమంలో రాజేశ్వరి, హనుమంత్న్ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇరుగు పొరుగుకు విఝయం తెలియడంతో హనుమంతన్తో రాజేవ్వరి మాట్లాడడం ఆపేసింది. అయినా హనుమంతన్ తన కోరికను తీర్చాలని ఆమె కోరడంతో నిరాకరించింది. ఈక్రమంలో రాజేశ్వరి శనివారం మధ్యాహ్నం కొడుకు చదువుతున్న పాఠశాలకు వెళ్లినప్పుడు, హనుమంతన్ ఆమెను అడ్డుకుని, చివరిసారిగా ఏకాంతంగా మాట్లాడడానికి పిలిచాడు. దీంతో, రాజేశ్వరి తన ఇంటికి సమీపంలోని తలవాయిఅల్లి ప్రాంతంలోని కల్లుకొల్లైమేడు ప్రదేశానికి వెళ్ళారు. అక్కడ ఇద్దరూ గొడవ పడ్డారు. ఆగ్రహించిన హనుమంతన్ రాజేశ్వరిని సమీపంలోని గుంతలోకితోసి రాయితో కొట్టాడు. తర్వాత ట్రాక్టర్‌లోని మట్టిని ఆమెపై పడేశాడు. ఇదంతా సమీపంలోని వ్యవసాయ భూమిలో పనిచేస్తున్న వ్యక్తులు ఇద్దరూ వాదించుకోవడం చూశారు. సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని హనుమంత్న్ను అరెస్టు చేసి, రాజేశ్వరిని హత్య చేసి మట్టిలో పాతిపెట్టానని అతను పేర్కొన్నాడు. పోలీసులు మట్టిని తవ్వి రాజేశ్వరి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. కేసు నమోదు చేసి హనుమంత్‌ను అరెస్టు చేశారు. -
నా భార్య నిత్య పెళ్లికూతురు
బెంగళూరు: బెంగళూరులో భార్యాభర్తల వివాదం రచ్చకెక్కింది. తనపై ఫిర్యాదు చేసిన భార్యే అసలు మోసగత్తె అని భర్త ఆరోపిస్తున్నాడు. వివరాలు.. తన భర్త ఇంట్లో తల్లిదండ్రులు ముందు నగ్నంగా తిరుగుతాడని, వీడియోలు చూపించి అలా లైంగిక క్రియకు ఒత్తిడి చేస్తాడని మేఘశ్రీ అనే యువతి కేంద్ర మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఇటీవల ఫిర్యాదు చేసింది. విల్సన్‌గార్డెన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివసించే వీరికి 3 నెలల కిందటే పెళ్లయింది. ఇప్పుడు భర్త మంజునాథ్ స్పందిస్తూ మేఘశ్రీ అబద్ధాలు చెబుతోందని, రూ.30 లక్షల నగదు, 50 గ్రాముల బంగారం కోసం తనను బ్లాక్మెయిల్ చేస్తోందని ఆరోపించాడు. ఆమె నిత్య పెళ్లికూతురని, గతంలో రెండు వివాహాలు చేసుకుందని, భర్తలపై పోలీసులకు ఫిర్యాదులు చేసి విడాకులు తీసుకుని, తనను పెళ్లాడిందని చెప్పాడు. ఇద్దరూ ఒకే కంపెనీలో పనిచేస్తూ, పరిచయమై వివాహం చేసుకున్నామని మంజునాథ్ తెలిపాడు. మేఘశ్రీ స్పందిస్తూ నేను మంజునాథ్ నుంచి రూపాయి కూడా తీసుకోలేదని, నాకు రెండు వివాహాలు జరిగిన మాట నిజమని చెప్పింది. భర్త లైంగికంగా తీవ్రంగా వేధిస్తున్నాడని ఆరోపించింది.సినీ నటి కేసులో మలుపు సాక్షి బెంగళూరు: నగరంలో ఓ శాండల్‌వుడ్ నటిని నిర్మాత అరవింద్ వెంకటేశ్ రెడ్డి లైంగికంగా వేధించాడని కేసు పెట్టగా అతనిని పోలీసులు విచారించారు. అయితే ఇద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు ఇప్పుడు ప్రచారంలోకి వచ్చాయి. తనను నటి మోసం చేసినట్లు విచారణలో వెల్లడించినట్లు, ఇందుకు అవసరమైన వారిద్దరు కలిసి ఉన్న ప్రైవేటు ఫోటోను కూడా అందించినట్లు తెలిసింది. తాను ఆమెకు ఖరీదైన బహుమతులు కూడా ఇచ్చినట్లు చెప్పాడు. -
అల్లుడు చేతిలో అత్త దారుణ హత్య
సాక్షి, విజయవాడ: విజయవాడ నగరంలోని న్యూ రాజరాజేశ్వరి పేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అల్లుడు తన అత్తను కత్తితో పొడిచి హత్య చేసిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ సమస్యల కారణంగా అల్లుడు నాగ సాయి అత్త కోలా దుర్గపై దాడి చేసి కత్తితో పొడిచి చంపినట్లు సమాచారం. సంఘటన తర్వాత నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని విచారిస్తున్న పోలీసులు, హత్యకు దారితీసిన కారణాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ కలహాలు ఇంతటి దారుణానికి దారితీసినందుకు ప్రజలు షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. త్వరలో మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది. -
అప్పుడు భర్త హత్య .. ఇప్పుడు భార్యను కాల్చి చంపేశారు!
ఢిల్లీ ఉత్తర-పశ్చిమ ప్రాంతంలో ఉన్న షాలిమార్ బాగ్‌లో దారుణం చోటు చేసుకుంది. భర్త హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న భార్యను కూడా హత్య చేశారు దుండగులు. శనివారం రాత్రి సమయంలో పాయింట్ బ్లాంక్‌లో రేంజ్లో గన్ గురిపెట్టి కాల్చి చంపేశారు. రచనా యాదవ్.. ఆమెకు 44 ఏళ్లు. సుమారు మూడేళ్ల క్రితం ఆమె భర్త విజేంద్ర యాదవ్‌ను కోల్పోయింది. 2023లో విజేంద్ర యాదవ్‌ను కొంతమంది హత్య చేశారు. ప్రస్తుతం ఆ కేసు అండర్ ట్రయల్‌లో ఉంది. ఆ కేసులో భార్య రచనా యాదవ్‌నే కీలక సాక్షిగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆమెను కూడా గుర్తుతెలియని పలువురు గన్‌తో కాల్చి హత్య చేశారు. అయితే భర్తను హత్య చేసిన నిందితులే.. ఆమెను హత్య చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె షాలిమార్ బాగ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్(ఆర్డబ్యూఏ)కు ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఆమెను తలపై కాల్చడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. విజేంద్ర యాదవ్ కేసులో ఐదుగురు నిందితులురచనా యాదవ్ భర్త విజేంద్ర యాదవ్ హత్య కేసులో ఐదుగురు నిందితులుగా ఉన్నారు. భరత్ యాదవ్ అనే వ్యక్తితో పాటు మరో నలుగురు నిందితులుగా చేర్చారు పోలీసులు. ఈ కేసు దర్యాప్తు దశలో ఉన్న క్రమంలో భార్య రచనా యాదవ్‌ను కూడా హత్య చేయడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భర్తను అప్పుడు హత్య చేసిన వారే ఇప్పుడు భార్యను కూడా అడ్డులేకుండా తొలగించుకోవాలని చూశారా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. అయితే భర్త హత్య కేసులో నిందితుడిగా ఉన్న భరత్ యాదవ్.. ఇంకా పరారీలో ఉన్నాడు. భరత్ యాదవ్ అనే వ్యక్తి ప్రకటిత నేరస్థుడిగా ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు. -
తాగి పడి ఉన్న వ్యక్తిని పీక్కుతిన్న కుక్కలు!
రంగారెడ్డి జిల్లా: తాగిన మైకంలో స్పృహ లేకుండా పడి ఉన్న ఓ వ్యక్తి గొంతును కుక్కలు పీక్కుతిన్న సంఘటన శంషాబాద్ సర్కిల్లోని మధురానగర్ కాలనీలో చోటు చేసుకుంది. ఆర్జీఐఏ పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడు రాష్ట్రం వేలూరు అక్కలాయక్కన్‌పట్టి గ్రామానికి చెందిన చిన్నారసు (36) ఇటీవల విమానాశ్రయంలో ఉద్యోగం చేయడానికి శంషాబాద్ వచ్చాడు. అక్కడ మరికొందరితో కలిసి ఓ గదిలో నివాసముంటున్నాడు. శుక్రవారం రాత్రి బాగా మద్యం తాగిన అతడు మధురానగర్ కాలనీ సంతోషిమాతా ఆలయం వీధి మూలమలుపుపై పడిపోయాడు. రాత్రి 9.30 గంటల సమయంలో రోడ్డుపై పడి ఉన్న అతడిని స్థానికులు కొందరు పక్కకు తీసుకెళ్లి పడుకోబెట్టారు. ఇదిలా ఉండగా శనివారం ఉదయం 6 గంటల సమయంలో అతను శవమై కనిపించాడు. పారిశుద్ధ్య సిబ్బంది చిన్నారసు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. తొలుత హత్యగా భావించినప్పటికీ చిన్నారసు గొంతు భాగం పూర్తిగా కొరికేసినట్లుగా ఉండటంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గొంతుభాగంలో ఎక్కువగా మాంసం కోల్పోయి ఉండటంతో కుక్కలు పీక్కుతిన్నట్లు అనుమానించారు. ఆ దిశగా సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా.. స్పృహలేకుండా పడి ఉన్న చిన్నారసును మధ్యరాత్రి సమయంలో కుక్కలు చుట్టుముట్టినట్లు గుర్తించారు. అయితే కుక్కల కన్నా ముందే అతడి గొంతును పందికొక్కులు లేదా పందులు కొరికి ఉండవచ్చని, ఆ తర్వాత కుక్కలు పీక్కుతిని ఉండవచ్చని వైద్యుల పరిశీలనలో తేలినట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
మీర్‌పేట తల్లీబిడ్డ కేసులో బిగ్ ట్విస్ట్!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మీర్‌పేటలో బిడ్డకు విషమించి.. తాను బలవన్మరణానికి పాల్పడిన వివాహిత సుష్మిత కేసుపై వివాదం నెలకొంది. ఉస్మానియా మార్చురీ వద్ద సుష్మిత, ఆమె భర్త యశ్వంత్ తరఫు బంధువులు పరస్పరం వాగ్వాదానికి దిగారు. తమ మధ్య గొడవలేం లేవని యశ్వంత్ చెబుతుండగా.. ఆత్మహత్య కాదంటూ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సుష్మ తరఫు బంధువులు. మా మధ్య విబేధాలు లేవు. ఆత్మహత్య చేసుకునేంత గొడవలేం కూడా జరగలేదు. సుష్మ క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉండొచ్చు. నా బాబుకి మా అత్తే విషమిచ్చి ఉండొచ్చు అని యశ్వంత్ అంటున్నాడు. అయితే.. తమ కూతురు చనిపోయాక పక్కనే ఉండి తమకు వెంటనే ఎందుకు సమాచారం ఇవ్వలేదని తల్లిదండ్రులు, ఆమె తరఫు బంధువులు నిలదీశారు. పోలీసులు వచ్చిన తర్వాతే సుష్మ చనిపోయిందని మాకు చెప్పారు. చనిపోయే ముందు అరగంట ఏదో జరిగిందనేది మా అనుమానం. ఆ అరగంట ఏం జరిగిందో పోలీసులే తేల్చాలి. ఫ్యాన్ ఒక రెక్కకు ఉరి ఎలా వేసుకుంటారు. రెక్క సుష్మ బరువు ఆపుతుందా?. ఆస్తి కోసమే ఇదంతా చేశారనిపిస్తోంది. యశ్వంత్, అతని బంధువులే సుష్మను మానసికంగా వేధించారు. అందుకే ఆధారాలు మార్చేసి ఉంటారు అని సుష్మ బంధువులు అంటున్నారు. అయితే మీడియా ఎదుటే జరిగిన ఆ వాగ్వాదంలో జోక్యం చేసుకున్న పోలీసులు వాళ్లకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా రామన్నపేట ప్రాంతానికి చెందిన యశ్వంత్‌రెడ్డి చార్టెడ్ అకౌంటెంట్. అదే ప్రాంతానికి చెందిన సుస్మిత(27)తో మూడేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులు నగరంలోని హస్తినాపురం జయకృష్ణ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి అశ్వంత్ నందన్‌రెడ్డి (11 నెలలు) కుమారుడు ఉన్నాడు. అయితే.. గురువారం ఉదయం భర్త ఆఫీస్‌కు వెళ్లి, తిరిగి ఇంటికి వచ్చే సరికి భార్య పడకగదిలో చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకొని కన్పించడంతో పాటు, కుమారుడు మృతిచెంది ఉన్నాడు. వారితో పాటే ఉండే సుస్మిత తల్లి లలిత(50) సైతం అపరస్మారక స్థితిలో ఉండగా ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మొదట బాబుకు విషమిచ్చిన సుస్మిత, తర్వాత ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని భావించారు. అయితే.. సుస్మితను భర్త వేధించేవాడని, బయటకు వెళ్లనీయకపోవడంతో పాటు ఎవరితోనూ మాట్లాడనిచ్చేవాడు కాదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఆందోళనల నడుమే.. తల్లీకొడుకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించినట్లు వెల్లడించారు. -
కొడుకును చంపి.. తానూ ఉరేసుకుని!
హైదరాబాద్: మరో నెల రోజుల్లో కుమారుడి తొలి పుట్టిన రోజు వేడుకలు....ఇందుకోసం భార్యా భర్తలిద్దరూ అవసరమైన షాపింగ్ చేశారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి...వీటిని తట్టుకోలేక ఓ తల్లి తన 11 నెలల బాబుకు విషమిచ్చి తానూ ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఇదే తరుణంలో కన్న కూతురు, మనవడు తన కళ్లముందే చనిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మృతురాలి తల్లి విషం తాగింది. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. ఈ విషాద సంఘటన రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జయకృష్ణ ఎన్‌క్లేవ్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా మల్లేపల్లి మండలం పాల్వయికి చెందిన యశ్వంత్ రెడ్డి, సుష్మిత (27)లకు రెండున్నరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి 11 నెలల బాబు అశ్వంత్ నందన్ రెడ్డి ఉన్నాడు. కొంత కాలంగా వీరు హస్తినాపురం జయకృష్ణ ఎన్‌క్లేవ్‌లోని కుందనిక అపార్ట్మెంట్లో నివాసముంటున్నారు. యశ్వంత్ రెడ్డి చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. కాగా, తండ్రి గతంలోనే చనిపోవడంతో సుషి్మత తల్లి లలిత (50) కూడా కూతురు, అల్లుడి వద్దే ఉంటోంది. మరో నెల రోజుల్లో కుమారుడు అశ్వంత్ నందన్ రెడ్డి తొలి జన్మదినం ఉండడంతో ఈనెల 7న భార్యాభర్తలిద్దరూ షాపింగ్ చేశారు. అనంతరం వీరి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. రోజూ మాదిరిగానే ఈనెల 8న ఉదయం విధులకు వెళ్లిన యశ్వంత్ రాత్రి 8 గంటలకు ఇంటికి తిరిగి రాగా, లోపల గడియ పెట్టి ఉంది. ఎంత కొట్టినా తీయకపోవడంతో అపార్ట్మెంట్ వాసుల సాయంతో కిటికీ తొలగించి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే ఫ్యాన్‌కు ఉరివేసుకుని భార్య, మంచంపై కొడుకు మృతి చెందగా, అత్త కొనఊపిరితో ఉండగా వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మీర్‌పేట పోలీసులు తల్లీకొడుకుల మృతదేహాలను పోస్టుమారా్టనికి తరలించారు. మృతురాలి బంధువులు ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ శంకర్ నాయక్ తెలిపారు. యశ్వంత్ రెడ్డి వేధింపుల వల్లే సుష్మిత తన కుమారుడికి విషమిచ్చి బలవన్మరణానికి పాల్పడిందని మృతురాలి పెద్దనాన్న సంజీవరెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
చైనా మాంజాపై హైదరాబాద్ పోలీసుల ఉక్కు పాదం
సాక్షి, హైదరాబాద్: చైనా మాంజా విషయంలో నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ దారాన్ని అమ్మినా.. కొనుగోలు చేసినా.. ఆ మాంజాతో పతంగులు ఎగరేసినవాళ్లపైనా కేసులు పెడతామని హెచ్చరించారు. తాజాగా భారీగా నిషేధిత మాంజాను పోలీసులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కమిషనర్ సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. చైనా మాంజాపై నిషేధం విధించి పదేళ్లు అవుతోంది. ఇండస్ట్రీయల్ అవసరం కోసం తయారైన దారాన్ని మాంజాగా ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మనుషుల ప్రాణాలు పోతున్నాయి. ఇక మీదట నగరంలో అమ్మినా.. కొన్నా.. ఆ దారంతో పతంగులు ఎగరేసినా కేసులు పెడతాం. చైనా మాంజా కారణంగా ఎవరికైనా గాయాలైనా కేసులు పెడతాం. చైనా మాంజా విషయంలో పీడీ యాక్ట్ ప్రయోగించే ఆలోచన చేస్తున్నాం అని సజ్జనార్ హెచ్చరించారు. చైనా మాంజాపై బ్యాన్ ఉన్నప్పటికీ.. సంక్రాంతి సీజన్‌కు ఉన్న మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని దుకాణాదారులు మాత్రం ఇతర రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్నారు. పతంగులు ఎగురవేసే సమయంలో అవి తెగి మాంజా గాలిలో వేలాడుతున్నాయి. వాహనాలపై ప్రయాణించేవారికి చుట్టుకొని తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే పక్షులు చనిపోతున్నాయి. తాజాగా.. నగరంలో అధికారులు పట్టుకున్న మాంజా విలువ రూ.1.2 కోట్లు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీ, సూరత్, మహారాష్ట్ర నుంచి దుకాణాదారులు చైనా మాంజాను తెప్పించే క్రమంలో వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అంతేకాదు.. చైనా మాంజా తయారు చేస్తున్న రెండు ఫ్యాక్టరీలను సీజ్ చేసినట్లు.. గుజరాత్, రాజస్థాన్ తోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ మాంజా ఫ్యాక్టరీలపై పోలీసుల ఆపరేషన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. -
క్రికెటర్.. నాకంటే 12 ఏళ్లు పెద్దది కావడంతో..
చిత్తూరు అర్బన్/ గంగాధరనెల్లూరు: ఇద్దరు విభిన్న ప్రతిభావంతుల మధ్య చిగురించిన ప్రేమ చివరకు విషాదాంతంగా ముగిసింది. ప్రియురాలు తనకన్నా పెద్దది కావడం.. ఆమెను వదిలించుకునే క్రమంలో ప్రియుడు కిరాతకంగా మారిపోయాడు. ఆమెను నిర్ధాక్షిణ్యంగా హత్య చేసి నీవానదిలో పడేశాడు. చిత్తూరులో నమోదైన అదృశ్యం కేసు హత్యగా పలుపు తిరిగింది. బుధవారం ప్రియురాలి మృతదేహాన్ని గంగాధర నెల్లూరులోని నీవానదిలో గుర్తించారు. అప్పటికే మృతదేహం కుళ్లిపోయి.. గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. చిత్తూరు నగరంలోని గిరింపేట బాలజీ కాలనీకి చెందిన కవిత విభిన్న ప్రతిభావంతురాలు. కాణిపాకం ఆలయంలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిస్తున్నారు. గత నెల 31వ తేదీ ఉదయం ఇంటి నుంచి వెళ్లిన కవిత సాయంత్రం వరకు రాకపోవడంతో ఆమె తమ్ముడు చిట్టిబాబు అన్ని చోట్లా వెదికాడు. జనవరి 1వ తేదీన చిత్తూరు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. 2వ తేదీన కేసు నమోదు చేశారు.ప్రియుడే హంతకుడు?చిత్తూరులోని మిట్టూరు ఎస్బీఐలో అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజరుగా విభిన్న ప్రతిభావంతుడు గణేష్(26) పనిచేస్తున్నాడు. కొంతకాలంగా కవిత, గణేష్ మధ్య పరిచయం పెరిగింది. ఈ పరిచయం ప్రేమగా మారి, పెళ్లికి దారితీసినట్లు తెలుస్తోంది. తనకన్నా కవిత వయస్సులో 12 ఏళ్లు పెద్దది కావడంతో.. ఆమెను వదిలించుకోవడానికి గణేష్ ఈ దారుణానికి ఒడిగట్టిట్లు సమాచారం.పెళ్లి చేసుకుంటానని నమ్మించి చంపేశాడు!కవితను పెళ్లి చేసుకుంటామని చెప్పిన గణేష్.. ఆమెను గత నెల 31న ఆటోలో గంగాధరనెల్లూరులోని ఠాణా వద్దకు రప్పించాడు. కొద్దిసేపు తరువాత గణేష్, కవిత మధ్య తీవ్ర వాదనలు జరిగాయి. తీరా పెళ్లి చేసుకుంటామని నమ్మించి, తన మూడు చక్రాల స్కూటర్లో కవితను ముందర కూర్చోబెట్టుకుని ఆమె తలను వాహనంపై ఉన్న ఓ ఇనుపరాడ్‌కు బలంగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావంతో కవిత చనిపోవడంతో.. గంగాధరనెల్లూరు బ్రిడ్జిపై నుంచి ఆమెను నీవానదిలోకి తోసేసి వెళ్లిపోయాడు. పోలీసులు గణేష్‌ను పలుమార్లు స్టేషన్‌కు పిలిపించి విచారించినా, తాను కూడా ఆమెను వెతుకుతున్నట్లు తప్పుదారి పట్టించాడు. బుధవారం సాయంత్రం నీవానదిలో పడి ఉన్న కవిత మృతదేహాన్ని గుర్తించిన ఆమె సోదరుడు చిట్టిబాబు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చి టూటౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకు ఉద్యోగి అయిన గణేష్.. కవితను వాడుకుని వదిలించుకోవడానికే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.క్రికెటర్..బ్యాంక్ ఉద్యోగివిభిన్న ప్రతిభావంతుడైన గణేష్ జాతీయ స్థాయిలో క్రికెటర్‌గా రాణించి క్రీడా కోటాలో బ్యాంకు ఉద్యోగం వచ్చింది. బలిష్టంగా ఉన్న ఇతను కవిత మృతదేహాన్ని అవలీలగా నదిలో పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.పోలీసుల వైఫల్యమే కారణంపోలీసుల వైఫల్యం వల్లే కవిత హత్య జరిగిందని.. దీనికి చిత్తూరు టూటౌన్ సీఐ నెట్టికంటయ్య నిర్లక్ష్యమే కారణమని వైఎస్సార్సీపీ చిత్తూరు సమన్వయకర్త విజయానందరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ హయంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ఆయన దుయ్యబట్టారు.మా నిర్లక్ష్యం లేదుసీఐ స్పందిస్తూ.. ‘సెల్ టవర్ల లొకేషన్లతో అడవుల్లో, బావులు, చెరువుల వద్ద కవితను వెదికాము. మూడు రాత్రులు మావాళ్లు, నేను నిద్రకూడా పోలేదు. ఆమె కుటుంబ సభ్యులు వాయిస్ మెసేజ్ మాకు ముందుగా ఇచ్చి ఉంటే కేసు త్వరగా ఛేదించేవాళ్లం. ఇందులో మా నిర్లక్ష్యం ఎక్కడాలేదు..’ అని నెట్టికంటయ్య పేర్కొన్నారు. -
గదిలో బంధించి.. యువతిపై 12 మంది అత్యాచారం!
బెంగుళూరు: మంగళూరులో అమానుష ఘటన జరిగింది. యువతి తండ్రి అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న కామాంధులు బాధితురాలిని లోబర్చుకొని కామవంఛతీర్చుకున్నారు. రెండు రోజులు నరకం అనుభవించిన యువతి కామాంధుల బారి నుంచి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించింది. చిక్కమగళూరు జిల్లా బీరూరు గ్రామానికి చెందిన తల్లిలేని బిడ్డ తన బంధువుల ఇంటిలో ఉంటూ పీయూసీ వరకు చదివింది. అనంతరం తండ్రి వద్దకు వచ్చింది. గతనెలలో తన అవ్వ ఇంటికి వెళ్లి రెండు రోజులు అక్కడే ఉంది. మంగళూరుకు చెందిన భరత్‌శెట్టి అనే వ్యక్తి యువతి తండ్రి వద్దకు వెళ్లి స్నేహంగా ఉండేవాడు. మంగళూరులో తమకు ఇల్లు ఉందని, మీరిద్దరూ వస్తే ఆశ్రయం కల్పిస్తామని చెప్పడంతో యువతి, ఆమెతండ్రి, యువతి అవ్వ కలిసి భరత్‌శెట్టి వెంట వెళ్లారు. అక్కడ భరత్‌శెట్టి ఆ యువతి తండ్రిని మభ్య పెట్టి డబ్బు ఇచ్చాడు. అనంతరం యువతిని ఒక ఇంటిలో ఉంచి కొంతమంది విటులను పంపించాడు. రెండు రోజులపాటు కామాంధులు ఆ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. తనను వదిలేయాలని యువతి వేడుకున్నా కనికరించలేదు. భరత్‌శెట్టికి డబ్బులు ఇచ్చామని చెప్పి లైంగికదాడికి పాల్పడ్డారు. ఎట్టకేలకు యువతి తప్పించుకొని వచ్చి దక్షిణకన్నడ జిల్లాలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మంగళూరుకు వెళ్లి భరత్శెట్టితోపాటు మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. యువతి తండ్రి, అవ్వపై కూడా కేసు నమోదు చేశారు. -
యువతి తల్లికి ప్రేమోన్మాది నిప్పు..
కర్ణాటక: ఓ మహిళ ఆమె కూతురితో పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేమోన్మాది పెట్రోలు చల్లి నిప్పంటించడంతో మహిళ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చివరికి కన్నుమూసింది. బాధితురాలు గీత (42) విక్టోరియా ఆసుపత్రిలో గత 20 రోజులుగా చావుబతుకుల మధ్య పోరాడుతూ మంగళవారం రాత్రి చనిపోయింది. వివరాలు.. గీతా బసవేశ్వరనగర బోవికాలనీలో కిరాణా షాపును నడుపుతోంది. అక్కడే ప్రేమోన్మాది ముత్తు టీస్టాల్ పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంతో గీత కుమార్తె (19)ను ముత్తు ప్రేమించాడు. ఆమెతో తనకు వివాహం చేయాలని గీతను కోరేవాడు, ఇందుకు ఆమె నిరాకరించేది. కోపోద్రిక్తుడైన అతడు.. గీత ఇంట్లో ఉండగా పెట్రోలు చల్లి నిప్పు అంటించి ఉడాయించాడు. తీవ్రంగా గాయపడిన గీత ఆస్పత్రిలో మరణించింది. స్థానిక పోలీసులు దుండగున్ని అరెస్ట్ చేశారు. -
50 వేలు సుపారీ ఇచ్చి ప్రియుడితో కలిసి..
విశాఖపట్నం: ప్రియుడి మోజులో పడి, సుపారీ ఇచ్చి మరీ భర్తను అంతమొందించింది ఓ ఇల్లాలు. విశాఖపట్నం జిల్లాలోని మధురవాడలో జరిగిన ఈ ఘటన వివరాలు పీఎంపాలెం పోలీసులు బుధవారం తెలిపారు. బక్కనపాలెం ఎనీ్టఆర్ కాలనీకి చెందిన అల్లాడ నాగరాజు(38), రమ్య దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కంచరపాలేనికి చెందిన సంజీవి వసంతరావుతో రమ్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమకు అడ్డు వస్తున్నాడనే నెపంతో ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి హత్యకు పథకం రచించింది. నాగరాజును చంపేందుకు వీరిద్దరూ కంచరపాలేనికి చెందిన బాలకృష్ణ, ప్రవీణ్‌కు రూ.50 వేలు ఇచ్చారు. నిందితులు వసంతరావు, బాలకృష్ణ, ప్రవీణ్ పథకం ప్రకారం నవంబరు 29న మధురవాడ మిథిలాపురి వుడా కాలనీలో గల ఓ లాడ్జిలో నాగరాజును హత్య చేసి శవాన్ని తిమ్మాపురం వెళ్లే రోడ్డులో ఉన్న బావికొండ సమీప నిర్మానుష్య ప్రాంతంలో పడేశారు. అనంతరం ఏమీ తెలియనట్లు రమ్య తన భర్త కనిపించడం లేదంటూ డిసెంబర్ 17న పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు ఇచి్చంది. మిస్సింగ్ కేసు నమోదు చేయాలని, తన భర్త మద్యానికి బానిసయ్యాడని, రూ.5 వేలు నగదు, బంగారం పట్టుకుని వారం రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడని ఫిర్యాదులో పేర్కొంది. అనుమానం వచి్చన పోలీసులు రమ్యను తమదైన శైలిలో విచారించగా, హత్య ఉదంతం బయటపడింది. పథకం ప్రకారం తామే హత్య చేసినట్లు ఒప్పుకుంది. దీంతో పోలీసులు బుధవారం మృతదేహం పడేసిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. బాగా పాడైపోయిన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కి తరలించారు. కేసు నమోదు చేసి, నిందితులు నలుగురినీ అరెస్టు చేసినట్లు పీఎంపాలెం సీఐ బాలకృష్ణ చెప్పారు. -
గొర్రె, మేకల రక్తం మాఫియా.. ఖంగుతిన్న అధికారులు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గొర్రె, మేకల రక్తం మాఫియా వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించింది. బతికున్న గొర్రెలు, మేకల నుంచి రక్తాన్ని సేకరించి అక్రమంగా వ్యాపారం చేస్తున్న ముఠాపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. సీఎన్కే ఇంపోర్ట్ ఎక్స్‌పోర్టు కంపెనీపై దాడులు చేసిన 1000 లీటర్ల రక్తాన్ని సంబంధించిన ప్యాకెట్లను డ్రగ్ కంట్రోల్ అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై కేంద్ర డ్రగ్ కంట్రోల్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి దర్యాప్తు ప్రారంభమైంది.వివరాల ప్రకారం.. కేంద్ర డ్రగ్ కంట్రోల్ అధికారుల సూచనలతో హైదరాబాద్ పోలీసులు, రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అధికారులతో కలిసి కాచిగూడ ప్రాంతంలోని CNK ఇంపోర్ట్ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీలో బుధవారం ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీ మొత్తంలో రక్త నిల్వలు బయటపడ్డాయి. సుమారు 1000 లీటర్లకు పైగా గొర్రె, మేక రక్తంతో నిండిన ప్యాకెట్లను అధికారులు సీజ్ చేశారు. ఇంత పెద్ద మొత్తంలో రక్తం నిల్వ చేయడం వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అయితే, ఈ రక్తంతో క్లినికల్ ట్రయల్స్ ఏమైనా చేస్తున్నారనే అనుమానాన్ని డ్రగ్ కంట్రోల్ అధికారులు వ్యక్తం చేశారు. సీఎన్కే కంపెనీ యజమాని నికేష్ పరారీలో ఉన్నాడు. రెండు రోజులుగా నికేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నికేష్ దొరికితే రక్త సేకరణపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కీసరలోని నిర్మానుష్య ప్రాంతం నుంచి నికేష్.. గొర్రెలు, మేకల రక్తాన్ని తెప్పించుకుంటున్నట్టు అధికారులు గుర్తించారు. -
నా మొగుడు నాకే సొంతం
సాక్షి, వరంగల్: నా భర్త నాకు కావాలి. అది కుదరకుంటే అతను బతికి ఉండడానికి వీల్లేదు.. అంటూ వరంగల్ చౌరస్తాలో ఓ వివాహిత కత్తితో కాసేపు హల్ చల్ చేసింది. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగగా.. పోలీసులు రంగంలోకి దిగి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం వరంగల్ చౌరస్తాలో జ్యోత్స్న అనే వివాహిత తన భర్తపై దాడికి యత్నించింది. తప్పించుకున్న భర్త స్థానికంగా ఓ నగల దుకాణంలో దాక్కున్నాడు. అయితే.. ఎలాగైనా చంపుతానంటూ ఆమె రోడ్డు మీదే బైఠాయించింది. దీంతో ఆ భర్త ప్రాణభయంతో పోలీసులకు ఫోన్ చేశాడు.తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని.. తన ఆస్తులన్నింటినీ లాగేసుకున్నాడని.. ఇప్పుడు విడాకులు ఇచ్చేందుకు చూస్తున్నాడని ఆరోపిస్తూ ఆవేదన వ్యక్తం చేసిందామె. కోర్టులో కేసు నడుస్తున్నందున.. చంపాలనుకున్నట్లు చెప్పింది. అయితే ఈలోపు రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఆమె చేతి నుంచి కత్తి లాక్కుని పీఎస్‌కు తీసుకెళ్లారు. -
నిన్న ప్రియురాలు.. నేడు ప్రియుడు!
సాక్షి, హైదరాబాద్: ప్రేమ వ్యవహారం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. ఒకరికొకరు దూరం అవుతున్నారనే బాధలో.. బలవన్మరణానికి పాల్పడి తమ కుటుంబాల్లో విషాదం నింపారు. యాచారం మండలం మేడిపల్లి గ్రామ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. హయత్ నగర్ పీఎస్ పరిధి బ్రహ్మణపల్లిలో బుధవారం ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న ఓ వెంచర్లోకి వెళ్లి పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకున్నాడు. అది గమనించిన కొందరు స్థానికులు రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతుడ్ని మేడిపల్లి గ్రామానికి చెందిన మహేష్‌గా గుర్తించారు. అయితే కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు విస్తుపోయే విషయం ఒకటి తెలిసింది. మేడిపల్లి గ్రామానికే చెందిన పూజ(17) నిన్న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మహేష్-పూజలు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ప్రియురాలి మృతిని తట్టుకోలేకనే మహేష్ ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే.. ఈ ఇద్దరూ గతంలోనూ సూసైడ్ అటెంప్ట్ చేసినట్ల తేలింది. రెండు నెలల కిందట ఇద్దరూ పురుగుల మందు తాగగా.. స్థానికులు గుర్తించి రక్షించారు. ఆ తర్వాత ఏమైందో తెలీయదుగానీ.. వెనువెంటనే ఇలా ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
సిట్ దూకుడు.. సీఎం సోదరుడు, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపులు తీసుకుంటోంది. ఈ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. తాజాగా ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి సైతం నోటీసులు జారీ చేసింది. రేపు(గురువారం) తమ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యలకు నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో మాజీ అధికారులను దఫదఫాలుగా ప్రశ్నించిన సిట్.. రాజకీయ నేతలను సైతం సిట్ విచారించడం మొదలుపెట్టింది. మొన్నీమధ్యే ఎమ్మెల్సీ నవీన్ రావును సుదీర్ఘంగా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను ప్రశ్నించబోతుండడం విశేషం. అయితే.. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను అధికారులు గతంలోనే విచారించారు. ఈ కేసులో మరో నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ అదనపు ఎస్పీ మేకల తిరుపతన్న ఫోన్లో లింకు దొరికిన నేపథ్యంలో.. ఆ ఆధారాలను ముందుపెట్టి ఈ మాజీ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. అయితే.. తాజాగా ఈ కేసులో సిట్‌ను తెలంగాణ ప్రభుత్వం మార్చింది. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో 9 మంది అధికారుల బృందానికి ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును అప్పగించింది. అప్పటి నుంచి పొలిటికల్ లీడర్లను ప్రశ్నించడం మొదలైంది. ఇక సీఎం రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డికి సైతం సిట్ నుంచి పిలుపు వచ్చింది. ప్రతిపక్ష నేతగా ఉన్న టైంలో రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాపింగ్‌కు గురైనట్లు సిట్ గుర్తించింది. ఈ క్రమంలోనే ఆయనను సైతం తమ ఎదుట హాజరు అయ్యి తాము అడిగే ప్రశ్నకు సమాధానాలు ఇవ్వాలని సిట్ కోరినట్లు సమాచారం. మరోవైపు ఈ కేసులో మాజీ మంత్రి హరీష్‌రావును విచారించాలన్న సిట్ ప్రయత్నం ఫలించలేదు. ఆయనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను గతంలో తెలంగాణ హైకోర్టు కొట్టేయగా, తాజాగా ఆ తీర్పును ఇటు సుప్రీం కోర్టు సమర్థించడంతో ఊరట లభించినట్లైంది. ఇక.. ఈ కేసులో ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును సిట్ రెండు దఫాలుగా కస్టోడియల్ ఎంక్వైరీ జరిపింది. ఆ విచారణకు సంబంధించిన నివేదికను ఈ నెలాఖరులోపే దర్యాప్తు బృందం కోర్టుకు సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు విచారణ రాజకీయ మలుపు తీసుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. -
KPHB: ఆలయంలో భారీ చోరీ.. గర్భగుడి తాళాలు పగులగొట్టి..
సాక్షి, హైదరాబాద్: కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో సర్దార్ పటేల్ నగర్‌లోని ఆలయంలో చోరీ జరిగింది. వెంకటేశ్వరస్వామి ఆలయంలో గర్భగుడి తాళాలు పగులగొట్టి విగ్రహానికి ఉన్న నగలు అపహరించారు. సుమారు రూ.30 లక్షల విలువ చేసే 15 తులాల వెండి ఆభరణాలతో పాటు 3 తులాల బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో గుడిలోకి ప్రవేశించి చోరీ చేసినట్లు గుర్తించారు.తెల్లవారుజామున రోజు వారిలానే ఆలయాన్ని తెరిచి పూజలు నిర్వహించే క్రమంలో పూజారులు గుర్తించారు. వెంటనే ఆలయ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
అతి కిరాతకంగా భార్య గొంతు కోసి హత్య చేసిన భర్త..
విజయనగర జిల్లా: విజయనగర జిల్లా హొసపేటె తాలూకాలో వరుసగా హత్యలు జరగడంతో నగర ప్రజలు హడలెత్తుతున్నారు. ఇటీవల తాలూకాలోని కారిగనూరు వద్ద పురుషుడు, కమలాపుర సమీపంలోని వెంకటాపుర క్యాంప్‌లో వివాహిత హత్య ఘటనలు జరిగిన విషయం తెలిసిందే. ఈ రెండు హత్య కేసులను మరువక ముందే నగరంలోని చాపలగడ్డ ప్రాంతంలో మంగళవారం ఉదయం మరో మహిళ గొంతు కోసి హత్య చేసిన ఘటన నగరంలో చర్చనీయంగా మారింది. హత్యకు గురైన మహిళ ఉమా (35) నగరంలోని రైల్వేస్టేషన్ రోడ్డులోని చాపలగడ్డ ప్రాంతవాసి. ఆమె భర్త ఖాజా హుస్సేన్ ని చిత్తవాడ్గి పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవలే రెండో పెళ్లి.. ఉమాకు 13 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రఘు అలియాస్ రామాంజినితో వివాహమైంది. ఆ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఉమా గత 6 ఏళ్లుగా తన భర్త నుంచి విడిపోయి చాపలగడ్డలోని తన ఇంట్లో ఉంటోంది. ఉమా నాలుగు నెలల క్రితం నగరానికి చెందిన ఖాజా హుస్సేన్ అనే వ్యక్తిని పరిచయం చేసుకొని కొండనాయకనహళ్లిలోని సాయిబాబా గుడిలో పెళ్లి చేసుకొంది. ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్థలు పెరగడంతో ఖాజా హుస్సేన్ కోపోద్రేకంలో ఉమాను కత్తితో గొంతు కోసి చంపినట్లు చిత్తవాడిగి పోలీసులు తెలిపారు. విజయనగర జిల్లా ఎస్పీ ఎస్.జాహ్నవి, ఏఎస్పీ మంజునాథ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై చిత్తవాడిగి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.భర్తపై భార్య దాడి బనశంకరి: రెండో భార్యను వదిలేయాలని మొదటి భార్య.. భర్తపై (రౌడీషిటర్) దాడికి పాల్పడింది. ఈ ఘటన జేజే నగర పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. దాడికి గురైన భర్త మొదటి భార్యపై జేజే నగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వివరాలు.. జేజే నగర నివాసి సయ్యద్ అస్గర్ చోరీలు, డ్రగ్స్ విక్రయాల కేసులో జైలు పాలయ్యాడు. ఇటీవల జైలు నుంచి విడుదలయ్యాడు. ఇతడికి ఇద్దరు భార్యలు ఉన్నారు. రెండో భార్యను వదిలేయాలని భర్త సయ్యద్ అస్గర్‌ను మొదటి భార్య కోరింది. భర్త ఒప్పుకోక పోవడంతో మొదటి భార్య దాడి చేసి గాయపరిచింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సయ్యద్ అస్గర్‌ను చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న జేజే నగర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నాన్నా.. మేమేం చేశాం?
మహబూబ్ నగర్ జిల్లా: భార్య విడాకులు ఇచ్చిందనే కోపంలో అతడు కిరాతకుడిలా మారాడు. అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన కొడుకు, కూతురిని కర్కశంగా హతమార్చాడు. ఆపై మూడుసార్లు ఆత్మహత్యకు యత్నించాడు. చివరకు ఆస్పత్రిలో చిక్సిత పొందుతూ మృతి చెందాడు. సీఐ రాజేందర్‌రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరు గ్రామానికి చెందిన చాకలి శివరాములుకు ఊట్కూరు మండలం పెద్దజట్రం గ్రామానికి చెందిన ఓ మహిళతో తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. శివరాములు డ్రైవర్‌గా పనిచేస్తూ హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. వీరికి కూతురు రితిక, కుమారుడు చైతన్య ఉన్నారు. అయితే దంపతులు తరచూ గొడవపడేవారు. ఆరేళ్ల క్రితం భర్తను వదిలి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో శివరాములు తీలేరుకు వచ్చాడు. ఇద్దరు పిల్లల ఆలనాపాలనా శివరాములు అమ్మానాన్న చూసేవారు. ఈ క్రమంలో దంపతులను కలపాలని రెండుసార్లు గ్రామపెద్దలు పంచాయతీ పెట్టారు. ఫలితం లేకపోవడంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా.. గతేడాది మార్చి నెలలో కోర్టు విడాకులు మంజూరు చేసింది. అప్పటి నుంచి శివరాములు మనస్తాపానికి గురై ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. మూడు రోజుల నుంచే ప్లాన్.. తాను చనిపోతే పిల్లలు అనాథలు అవుతారని భావించిన శివరాములు మూడు రోజుల క్రితం నిర్ణయించుకున్న ఓ ప్లాన్ ప్రకారం తన ఇద్దరు పిల్లలు రితిక(8), చైతన్య(6)లను పొలం దగ్గరకు తీసుకెళ్లి రాత్రి అక్కడే నిద్రించి ఉదయం ఇంటికి వచ్చేవారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం భోజనం చేయకుండా తన పిల్లలను బైక్‌పై తీసుకెళ్లాడు. ఇంటికి రాకపోవడంతో శివరాములు తమ్ముడి భార్య రాత్రి 8 గంటలకు ఫోన్ చేయగా రితిక అనారోగ్యంతో ఉందని మరికల్ ఆస్పత్రికి తీసుకొచ్చా.. డాక్టర్‌కు చూపించి వస్తానని చెప్పి ఫోన్ పెట్టేశాడు. మళ్లీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా వెళ్లి కూతురు, కుమారుడిని పొలం దగ్గర ఉన్న పశువుల కొట్టంలో పడుకోబెట్టాడు. అర్ధరాత్రి సమయంలో వారు గాఢనిద్రలో ఉండగా తాడుతో ఒక్కొక్కరి గొంతు నులిమి చంపేశాడు. పొలం పక్కనే ఉన్న కోయిల్‌సాగర్ సాగునీటి కాల్వలో మృతదేహాలను పడేసి నీళ్లలో లోపలికి తొక్కేశాడు. పిల్లలను చంపిన తర్వాత తానూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ముందుగా పొలం దగ్గర ఉన్న గడ్డి మందు తాగాడు. ఆపై పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను పట్టుకున్నాడు. అయితే సింగిల్ ఫేజ్ ఉండి అది ట్రిప్ కావడంతో షాక్ కొట్టి వదిలేసింది. మళ్లీ పశువుల కొట్టంలోకి వచ్చి గడ్డపారతో పొడుచుకొని చనిపోవాలని ప్రయత్నించాడు. అది కూడా సాధ్యం కాకపోవడంతో బ్లేడ్‌తో గొంతు కోసుకున్నాడు. అయినా చనిపోకపోవడంతో తనను బతికించాలని పక్క పొలం రైతులకు మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు ఫోన్ చేశాడు. వారు వెంటనే అక్కడకుచేరుకొని చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. పిల్లలను కాల్వలో నుంచి బయటకు తీశారు. శివరాములు పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఉస్మానియాకు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చిన్నారుల మృతదేహాలను నారాయణపేట ఆస్పత్రికి తరలించారు. కాగా.. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో రితిక 4వ తరగతి, చైతన్య 1వ తరగతి చదువుతున్నారు. డబ్బులు ఇవ్వడం లేదని.. తండ్రిని చంపిన తనయుడు పాపన్నపేట(మెదక్): డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ఓ కొడుకు కన్నతండ్రినే దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని సీతానగర్‌లో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్‌గౌడ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన లంగడి లక్ష్యయ్య (48) వ్యవసాయంతోపాటు విద్యుత్ లైన్మెన్ వద్ద సహాయకుడిగా పనిచేస్తున్నాడు. భార్య శేఖమ్మతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు శ్రీకాంత్ వివాహం, వ్యవసాయం నిమిత్తం కొంత అప్పులు చేశాడు. శ్రీకాంత్ ఏ పని చేయకుండా జులాయిగా తిరుగుతూ, ఖర్చుల కోసం తరచూ తండ్రిని వేధింపులకు గురిచేసేవాడు. ఈ క్రమంలో పలుమార్లు తండ్రీకొడుకు మధ్య గొడవలు జరిగాయి. సోమవారం రాత్రి లక్ష్మయ్య ఇంటికి రాగానే కొడుకు డబ్బులు అడగడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంతో శ్రీకాంత్ ముందుగా సుత్తితో తండ్రిపై దాడి చేయగా, తల్లి కొడుకు చేతి నుంచి సుత్తి లాక్కుంది. తీవ్ర ఆవే«శంతో రగిలిపోతున్న శ్రీకాంత్.. అక్కడే ఉన్న కర్రతో తండ్రి తలపై బాదాడు. తీవ్రంగా గాయపడిన లక్ష్మయ్యను చికిత్స నిమిత్తం మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు చెప్పారు. -
ఖతర్నాక్ విగ్గురాజా
బట్టతల కారణంగా పెళ్లి ఈడు దాటిపోతుండడంతో.. అతగాడు ఘరానా మోసానికి దిగాడు. విగ్గుతో మేనేజ్ చేస్తూ ఎలాగోలా ఓ అమ్మాయికి తాళిబొట్టు కట్టేశాడు. తీరా.. కాపురంలోకి అడుగుపెట్టాక అతగాడి హెయిర్‌స్టైల్‌పై అనుమానం వచ్చిందామెకు. కొన్నాళ్లు ఎలాగోలా నెట్టుకొచ్చిన అతను.. చివరకు అడ్డంగా దొరికిపోయాడు. అక్కడి నుంచే అసలు డ్రామా మొదలుపెట్టాడు.. బట్టతల భర్త పెట్టే టార్చర్ తట్టుకోలేక ఓ భార్య నోయిడా పోలీసులను ఆశ్రయించింది. విగ్గు పెట్టుకుని తనను పెళ్లి చేసుకున్నాడని.. ఆ తర్వాత జుట్టు రాలుతోందంటూ డ్రామాలు ఆడాడనని.. చివరకు విషయం తెలిసిపోవడంతో విగ్గు పీకేసి విలన్ వేషాలు వేస్తున్నాడని వాపోయిందామె. అప్పటి నుంచి సైకోలా మారిపోయి వేధించడం మొదలుపెట్టాడు.. నా ఫోన్ నుంచి వ్యక్తిగత ఫొటోలు సేకరించి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేశాడు. చేసేది లేక నగలు ఇచ్చేశాను. ఆపై అదనపు కట్నం కోసం నా తల్లిదండ్రులను వేధించడం మొదలుపెట్టాడు. భరించలేక న్యూఢిల్లీ ప్రతాప్ భాగ్‌లోని అత్తింటి నివాసంలో పంచాయితీ పెట్టించా. అందరి ముందు విగ్గు తీసేసి.. ఏం చేస్తావో చేసుకో అంటూ తన కుటుంబ సభ్యులతో కలిసి మమ్మల్ని వేధించాడు అని ఫిర్యాదులో పేర్కొందామె. సదరు భర్త కుటుంబం మొత్తంపై పోలీసులు కేసు నమోదు చేశారు. భార్య ఆరోపణలకు తగిన ఆధారాలు ఉన్నాయని.. పరారీలో ఉన్న భర్త కుటుంబం కోసం గాలిస్తున్నట్లు బిస్రాఖ్ పీఎస్ అధికారి మనోజ్‌కుమార్ చెబుతున్నారు. -
నిజామాబాద్ సౌమ్య కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, నిజామాబాద్: భర్తను హత్య చేసిన ఘటనలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. భర్త పల్లటి రమేష్‌పై రూ.2 కోట్లకు పైగా ఇన్స్యూరెన్స్ ఉండగా.. బీమా డబ్బుల కోసమే భార్య సౌమ్య, ప్రియుడు దిలీప్ పక్క ప్లాన్ చేసినట్లు పోలీసులు తేల్చారు. వివాహేతర సంబంధానికి అడ్డు తొలగించుకోటం ఆపై ఇన్స్యూరెన్స్ డబ్బులతో పారిపోవడానికి ప్లాన్ చేశారు.ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం నార్మల్ డెత్ గుండె పోటు అంటూ చిత్రీకరించారు. నిద్ర మాత్రలు ఇచ్చి భర్తగొంతు నులిమి హత్య చేసి హార్ట్ ఎటాక్‌గా భార్య నమ్మించింది. మృతుడి తమ్ముడి ఫిర్యాదుతో మృతదేహానికి రీపోస్టు మార్టం నిర్వహించారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో తామే హత్య చేసినట్లు భార్య సౌమ్య, ప్రియుడు దిలీప్ ఒప్పుకున్నారు.పోలీసుల వెల్లడించిన వివరాలు ప్రకారం.. నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం బొర్గాం గ్రామానికి చెందిన పట్టాటి రమేష్ భార్య సౌమ్య ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తోంది. అదే పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న దిలీప్‌తో ఆమెకు పరిచయం.. వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం భర్త రమేష్‌కు తెలియడంతో, ఇద్దరినీ గట్టిగా మందలించాడు.దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని సౌమ్య ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది. గత నెల 20న సౌమ్య తన ప్రియుడు దిలీప్‌తో కలిసి రమేష్‌ను ఇంట్లోనే హత్య చేశారు. అనంతరం భర్త గుండెపోటుతో మృతి చెందినట్లు నమ్మించి, ఎవరికీ అనుమానం రాకుండా హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, అంత్యక్రియల సమయంలో రమేష్ మెడపై గాట్లు కనిపించడంతో స్థానికులకు అనుమానం కలిగింది. వెంటనే ఇజ్రాయెల్‌లో ఉన్న అతని తమ్ముడు కేదారికి సమాచారం అందించడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి విచారణ చేపట్టగా అసలు నిజం బయటపడింది. ఈ కేసులో సౌమ్యతో పాటు మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
భర్త ప్రాణ స్నేహితుడితో భార్య వివాహేతర సంబంధం
చిత్తూరు అర్బన్: ప్రియుడు మోజులో పడ్డ మహిళ తన భర్తను చంపడానికి ప్రయత్నించగా.. ఆమె చూస్తూ ఉండిపోయింది. అదృష్టవశాత్తు భర్త బతికి బయటపడ్డాడు. చిత్తూరు నగరంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి... ఓ మహిళకు తన భర్త స్నేహితుడితో ఏర్పడ్డ పరిచయం చనువుగా మారింది. వీరిద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. భర్త అడ్డుగా ఉండడంతో అతడిని తప్పించాలని నిర్ణయించుకున్నారు. భర్త ఇంట్లో నిద్రపోతున్న సమయంలో దిండు తీసుకొని అతని మొహం పై పెట్టి చంపడానికి ప్రియుడు ప్రయత్నించాడు. ఉన్నట్టుండి మెలకువ రావడంతో భర్త ఆ ఘటన నుంచి బయటపడి పోలీసులను ఆశ్రయించాడు. చిత్తూరు పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. -
అమెరికాలో తెలంగాణ అమ్మాయి దారుణ హత్య
-
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి యువతిపై కత్తితో దాడి
హైదరాబాద్: నిన్ను ప్రేమిస్తున్నా.. నా ప్రేమను అంగీకరించాలని ఓ యువకుడు ఓ యువతి ఇంట్లోకి చొరబడి కత్తితో దాడిచేశాడు. నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది . స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు.. అలకాపూర్ టౌన్షిప్లో ఓ యువతి(21) మరో ఇద్దరు యువతులతో కలిసి ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఉంటుంది. అదే భవనంలో కొనసాగుతున్న ఓ హోటల్లో వెయిటర్‌గా పర్వతాల రోహిత్(23) పనిచేస్తున్నాడు. ఈనెల 1న యువతి కొత్త సంవత్సరం వేడుకల అనంతరం అర్ధరాత్రి ఇంటికి వచ్చింది . అప్పటికీ ఆమె మిత్రులు రాకపోవటంతో తలుపు తెరచి ఉంచి నిద్రకు ఉపక్రమించింది. రెండు నెలలుగా ప్రేమిస్తున్నానని వెంటపడుతున్న రోహిత్ అదే అదనుగా ఇంట్లోకి చొరబడ్డాడు. యువతి అతన్ని గమనించి అరవటంతో కత్తితో దాడి చేశాడు. ఈదాడిలో యువతి చేతికి గాయమైంది. అయినా అతను అసభ్యంగా ప్రవర్తించి పరారయ్యాడు. దీంతో బాధితురాలు ఈనెల 2 నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈవిషయమై సెక్టార్ ఎస్సై మునీందర్‌ను వివరణ కోరగా యువతిపై కత్తితో దాడి, అసభ్యంగా ప్రవర్తించిన రోహిత్‌పై ఫిర్యాదు వచ్చిందని, నిందితునిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. -
పీఎస్ ఎదుటే వేట కొడవళ్లతో.. సత్యసాయి జిల్లాలో దారుణ హత్య
సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: పోలీసుల ఘోర వైఫల్యంతో దారుణ హత్య చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంతో కొందరు ఓ వ్యక్తిని నరికి చంపారు. కదిరి నియోజకవర్గంలో పరిధిలోని తనకల్లు పీఎస్ వద్ద.. అదీ పోలీసులు చూస్తుండగానే ఈ ఘోరం చోటు చేసుకుంది.సత్యసాయి జిల్లాకు చెందిన ఈశ్వరప్ప అనే వ్యక్తి ప్రేమ పేరుతో ఓ వివాహితను గూడూరు తీసుకెళ్లాడు. ఈ ఘటనపై ఫిర్యాదు ఆమె భర్త హరి, బంధువులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యింది. అయితే వాళ్లిద్దరి జాడ గుర్తించిన పోలీసులు.. గూడూరు నుంచి తనకల్లు తీసుకొచ్చారు. గత రాత్రి సమయంలో పోలీసు జీపు దిగిన వెంటనే ఈశ్వరప్పను హరి, అతని బంధువులు కొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. ఈ ఘటనతో పోలీసులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈశ్వరప్ప తరలింపు వ్యవహారంలో తనకల్లు ఎస్సై గోపి తగిన జాగ్రత్తలు తీసుకోలేదని స్పష్టమవుతోంది. -
గోవిందరాజస్వామి ఆలయ ఘటన కేసులో కీలక పరిణామం
సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయ ఘటన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు కుత్తడి తిరుపతిని గత రాత్రి జడ్జి ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. ఆలయ గోపురం ఎక్కి.. తాను కోరినంత మద్యం ఇవ్వకుంటే కలశాలను ధ్వంసం చేస్తానంటూ హల్చల్ చేశాడు కుత్తడి తిరుపతి. జనవరి 2 రాత్రి ఏకాంత సేవ ముగిశాక ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో భక్తులతోపాటే లోనికి చొరబడిన తిరుపతి.. ఆలయం మూసేశాక కర్ర ఏర్పాట్ల మీదుగా ఆలయ గొపురం ఎక్కాడు. విజిలెన్స్ సిబ్బంది నిద్రమత్తులో ఈ విషయం గమనించలేదని తెలుస్తోంది. అయితే.. ఆ తర్వాత గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది తిరుపతిని దిగమని ఎంత బతిమాలినా వినలేదు. చివరకు.. 3 గంటలపాటు శ్రమించి నిచ్చెన సాయంతో బలవంతంగా అతన్ని కిందకు తీసుకొచ్చారు. అయితే కిందకు దిగిన తిరుపతి తొలుత తనను చంపేస్తారని బెదిరించారని.. అందుకే పైకి ఎక్కానంటూ పొంతన లేని మాటలు మాట్లాడాడు. అయితే.. మద్యం మత్తులోనే అతను ఈ అపచారానికి పాల్పడ్డాడని.. ఆధార్ కార్డ్‌ను బట్టి నిజామాబాద్‌కు చెందిన వ్యక్తిగా తిరుపతి ఈస్ట్ పోలీసులు నిర్ధారించారు. నిందితుడిని పీఎస్‌కు తరలించిన పోలీసులు.. నిన్న రాత్రి సమయంలో జడ్జి ముందు ప్రవేశపెట్టడం గమనార్హం. ఈ నెల 12వ తేదీ దాకా రిమాండ్ విధించడంతో తిరుపతి సబ్ జైలు కు తరలించారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీటీడీ ప్రతిష్ట పూర్తిగా మంటగలుస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీఐపీ సేవల్లో తరలిస్తూ సామాన్యులను పట్టించుకోవడం లేదని.. పైగా వరుస అపచారాలు జరుగుతున్నా దిద్దుబాటు చర్యలు ఉండడం లేదని.. ఒక తాగుబోతు ఆలయ గోపురం మీదకు ఎక్కి కలశాలు ధ్వంసం చేసే ప్రయత్నం జరిగిందంటే విజిలెన్స్ నిఘా ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందని.. మరి ముఖ్యంగా సనాతనం గురించి మాట్లాడే పవన్ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించకపోవడం దారుణమంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. -
పట్టపగలే ఇంటర్ విద్యార్థిని కిడ్నాప్
మంగళగిరి టౌన్: పట్టపగలే ఇంటర్ విద్యార్థిని కిడ్నాప్‌కు గురైన ఘటన శనివారం గుంటూరు జిల్లా మంగళగిరిలో కలకలం రేపింది. దీనిపై బాలిక తల్లిదండ్రులు మంగళగిరి పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా.. మంగళగిరి పట్టణ పరిధిలోని గండాలయపేటకు చెందిన భార్యాభర్తలు ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నారు. ఒక కుమార్తె విజయవాడలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. ఈనెల 2వ తేదీ అనుమతి లేకుండా మీ కుమార్తె బయటకు వెళ్లిందని కాలేజీ యాజమాన్యం బాలిక తండ్రికి ఫోన్ చేసి చెప్పారు. విచారించగా కురగల్లుకు చెందిన రవితేజ అనే అబ్బాయితో వెళ్లినట్లు తేలింది. అదేరోజు రాత్రి బాలిక తల్లిదండ్రులు కురగల్లులోని రవితేజ ఇంటికి బాలికను తీసుకెళ్లారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం రవితేజ కొంతమంది యువకులతో బాలిక ఇంటికి వచ్చి బలవంతంగా తీసుకువెళ్లాడు. అడ్డుకునేందుకు యత్నించిన తమపై దాడి చేశారని విద్యారి్థని తల్లి ఫిర్యాదు చేసింది. 12 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు విద్యార్థిని కిడ్నాప్‌కు గురైన ఘటనపై కేసు నమోదు చేసిన పట్టణ సీఐ వీరాస్వామి పలు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. 12 గంటల వ్యవధిలోనే విద్యార్థినిని తీసుకువెళ్లిన రవితేజను వెలగపూడి సచివాలయం వద్ద అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉన్న కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సీఐ తెలిపారు. రవితేజతో పాటు వెళ్లిన యువకులు విజయవాడకు చెందిన వారని, అందులో కొంతమందిని గుర్తించామని, మరో వ్యక్తి కురగల్లుకు చెందిన వ్యక్తి అని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. రవితేజపై పోక్సో యాక్ట్‌తో పాటు కిడ్నాప్, మహిళలపై దాడి కేసు నమోదు చేశామని, అతనికి సహకరించిన వారిపై కూడా కేసులు నమోదు చేశామన్నారు. అయితే తల్లిదండ్రులతో వెళ్లేందుకు విద్యారి్థని నిరాకరించడంతో మేయర్స్ హోంకు తరలించారు. -
పెళ్లికి నిరాకరించిందని వివాహితను హత్య చేసి.. ఆ తర్వాత
యల్లాపుర: కర్ణాటకలో విషాద ఘటన చోటుచేసుకుంది ఓ వివాహిత.. తన బాల్య స్నేహితుడి చేతిలో హత్యకు గురైంది. హత్య అనంతరం ఆ యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. యల్లాపుర పట్టణంలో ఈ ఘటన జరిగింది. తాను వివాహానికి అంగీకరించకపోవడంతో ఆమె స్నేహితుడే కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. స్నేహితురాలిని హత్య చేసిన నిందితుడు రఫిక్ ఇమామ్‌సాబ్ సమీపంలోని అడవిలోకి వెళ్లి ఉరేసుకున్నాడు.బాధితురాలు రంజిత బనసోడే, నిందితుడు రఫిక్ ఇద్దరూ పాఠశాల రోజుల నుంచే స్నేహితులు. రంజిత సుమారు 12 ఏళ్ల క్రితం మహారాష్ట్రకు చెందిన సచిన్ కటేరాను వివాహం చేసుకుంది. వీరికి 10 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఆమె భర్తతో వేరుగా ఉంటూ.. యల్లాపురలో తన కుటుంబంతో నివసిస్తోంది. రంజిత ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన సహాయకురాలిగా పనిచేస్తోంది. రఫిక్ తరచుగా రంజిత ఇంటికి భోజనానికి వచ్చేవాడు.అతను పెళ్లి చేసుకోమని రంజితను ఒత్తిడికి గురిచేసేవాడు. పెళ్లికి రంజితతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహించిన రఫిక్.. రంజిత పనివేళ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో పదునైన కత్తితో దాడి చేశాడు. రంజితను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించింది. కొన్ని గంటల తర్వాత రఫిక్ సమీప అడవిలో ఉరేసుకుని మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. అతని వద్ద తాడు, మద్యం సీసా కూడా లభించాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఉత్తర కన్నడ జిల్లా ఎస్పీ దీపన్ ఎం.ఎన్. తెలిపారు. -
ఈ సవతిపోరును భరించలేకపోతున్నా..!
తమిళనాడు: సెంగం సమీపంలో గుడిసెలో గాఢ నిద్రలో ఉన్న రైతుతోపాటు ఆయన రెండో భార్యపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన సంఘటన ఆ ప్రాంతంలో సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే తిరువణ్ణామలై జిల్లా సెంగం సమీపంలోని పక్రిపాళ్యం గ్రామానికి చెందిన శక్తివేల్(51) వ్యవసాయంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఇతని భార్య తమిళరసి, ఇద్దరి మద్య మనస్పర్థల కారణంగా గత మూడు సంవత్సరాల క్రితం విడి పోయారు. దీంతో శక్తివేల్ తీర్థాండపట్టు గ్రామానికి చెందిన అమృదం(44)ను రెండవ వివాహం చేసుకొని జీవిస్తున్నారు. భార్యభర్తలు ఇద్దరూ కలిసి ఆ ప్రాంతంలో ఒక వ్యవసాయ భూమిని లీజుకు తీసుకొని వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నారు. వ్యవసాయ భూమిలో గుడిసెను వేసుకొని వాటిలోనే జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో శక్తివేల్, అమృదం ఇద్దరూ గురువారం రాత్రి వ్యవసాయ భూమిలోని గుడిసె ఇంటిలో నిద్రించారు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గుడిసె ఇంటికి ముందు పక్కన ఉన్న తలుపులు మూసి వేసి గుడిసెపై పెట్రోల్‌ను పోసి నిప్పు పెట్టారు. పెట్రోల్ పోయడంతో ఉన్నపళంగా మంటలు చెలరేగాయి. గాఢ నిద్రలో ఉన్న శక్తివేల్ ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు ప్రయతి్నంచినప్పటికీ తలుపులు మూసి వేయడంతో బయటకు వచ్చేందుకు కుదరలేదు. దీంతో మంటల్లో చిక్కుకొని ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం స్థానికులు గమనించగా గుడిసె మంటల్లో చిక్కుకొని దంపతులు ఇద్దరూ కాలి బూడిదగా మారి ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. సెంగం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. గుడిసె ఇంటికి ఎవరు నిప్పు పెట్టారు, ఎందుకు పెట్టారు, పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
విలేజ్ ఆఫీసర్ అరుణ పరువు హత్య?!
తమిళనాడు: ప్రేమించి కులాంతర వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న క్రమంలో తన ప్రియురాలిని ఆమె తల్లిదండ్రులు విషం ఇచ్చి చంపేశారని ఆరోపిస్తూ ప్రియుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన తిరువళ్లూరు జిల్లా పొన్నేరి వద్ద కలకలం రేపింది. తిరువళ్లూరు జిల్లా పొన్నేరి తాలుకా అగరం గ్రామానికి చెందిన రవి. ఇతని కుమార్తే అరుణ(27). ఈమె పొన్నేరి సమీపంలోని కీరపాక్కం వీఏఓ. అరుణకు తన సహచర వీఏఓ శివభారతి మూడేళ్లుగా సాగిన ప్రేమ పెళ్లి వరకు వెళ్లింది. కులాలు కావడంతో అరుణ ఇంట్లో వివాహానికి అంగీకరించలేదు. ఈక్రమంలో గత 29న అరుణ విషం సేవించి ఆత్మహత్యకు యత్నించిందని, ఆమె పరిస్థితి విషమంగా మారడంతో చెన్నైలోని రాజీవ్‌గాంధీ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నట్టు శివభారతికి సమాచారం అందింది. చికిత్స పొందుతూ అరుణ తుదిశ్వాస విడిచింది. విషయం తెలుసుకున్న శివభారతి, అరుణ మృతిలో అనుమానం వుందని ఆరోపిస్తూ తిరుపాళ్యవ నం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ పెళ్లికి అరుణ తల్లిదండ్రులు అడ్డు చెప్పడంతో పాటు గతంలో తనపై, అరుణపై దాడి చేశారని పోలీసులకు వివరించారు. విషం తాగి ఆత్మహత్యకు యత్నించి వైద్యశాలలో చికిత్స పొందుతున్న అరుణ, 30న రాత్రి తననూ ఇన్స్టాగ్రామ్ ద్వారా సంప్రదించానని, పెళ్లి విషయాన్ని ఇంట్లో చెప్పడంతో బలవంతంగా తన నోట్లో విషం పోసినట్టు తన వద్ద వాపోయిందని పోలీసులకు వివరించాడు. వారిపై చర్య లు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
అమ్మ..ఇక రాదు కన్నా..!
హైదరాబాద్: ‘‘పిల్లలూ..ఇక్కడ కూర్చొని ఈ ఫోన్‌తో ఆడుకోండి.. నేను కాసేపటి తరువాత వస్తా’’ అంటూ వెళ్లిన తల్లి అనంతలోకాలకు వెళ్లిపోయింది. అమ్మ.. ఇక రాదని తెలియని ఆ చిన్నారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. నాలుగేళ్ల క్రితం తండ్రి మృతి చెందగా.. ఇపుడు అమ్మ కూడా పిల్లలను కూడా వదలి వెళ్లింది. హృదయ విదారకమైన ఈ సంఘటన శుక్రవారం జరిగింది. లేక్‌పోలీసులు తెలిపిన మేరకు.. పహాడీషరీఫ్‌కు చెందిన వసంత (29) భర్త లక్ష్మణ్ నాలుగేళ్ల క్రితం మృతి చెందాడు. వీరికి కుమారుడు నందు, కుమార్తె చెర్రి ఉన్నారు. భర్త మృతి అనంతరం సోదరుడు, తల్లితో ఉంటూ కూలీపనిచేస్తూ జీవనం సాగిస్తోంది. ఇటీవల కాలంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. శుక్రవారం సాయంత్రం పిల్లలను తీసుకుని ట్యాంక్‌బండ్‌కు వచ్చింది. వారిని లవ్ హైదరాబాద్ దగ్గర బెంచీపై కూర్చోబెట్టి మొబైల్ ఫోన్ ఇచ్చి ఆడుకోమని చెప్పి వెళ్లింది. అయితే కాసేపటికే ఆమె హుస్సేన్ సాగర్‌లో దూకింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన చేరుకోగా అప్పటికే ఆమె నీటిలో మునిగిపోయింది. అదే ప్రాంతంలో గాలించగా మృతదేహం లభించింది. పిల్లల దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ ద్వారా మృతురాలు వసంతగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. -
హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఎమోషనల్ పోస్ట్
పాము తన బిడ్డలను కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే తింటుంది. అదే తరహాలో మనిషీ ప్రవర్తిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో తాజాగా.. అదీ కొత్త ఏడాది తొలిరోజునే జరిగిన రెండు ఘటనలు ‘‘అయ్యో పాపం’’ అనుకునేలా చేశాయి. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో పిల్లల్ని పోషించలేనని మనోవేదనతో తల్లి పిల్లలకు విషం పెట్టగా.. ఏపీలో కన్న తండ్రి తన ముగ్గురు బిడ్డల విషయంలో అదే పని చేశాడు. ఈ రెండు ఘటనలపై హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ ఎమోషనల్ స్పందించారు.నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో పిల్లల్ని పోషించలేనని మనోవేదనతో పిల్లలతో సహా విషపూరిత ఆహారం తల్లి, కుమార్తె మృతి చెందారు. కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. ఏపీలో కన్న తండ్రి ముగ్గురు బిడ్డలకు విషమిచ్చి.. తానూ బలవన్మరణం పొందారు. ఈ ఘటనలపై హైదరాబాద్ సీపీ సజ్జానార్ ఇవాళ (శుక్రవారం) ఎక్స్ వేదికగా స్పందించారు.నూతన సంవత్సర వెలుగులు చూడాల్సిన కళ్లు.. శాశ్వతంగా మూసుకుపోయాయి.. గోరుముద్దలు తినిపించాల్సిన చేతులే విషం కలిపాయని, గుండెలకు హత్తుకోవాల్సిన వారే ఊపిరి తీశారని పేర్కొన్నారు. అమృతం లాంటి ప్రేమను పంచాల్సిన తల్లిదండ్రులే.. ఇలా మారితే ఆ పసి ప్రాణాలు ఎవరికి చెప్పుకోగలవు? అని ప్రశ్నించారు. నాన్న ఇచ్చిన పాలలో విషం ఉందని ఆ చిన్నారులకు ఏం తెలుసు? అమ్మ కొంగు ఉరితాడవుతుందని ఆ అమాయకులకు ఏం ఎరుక? అని ఆవేదన చెందారు. కష్టాలు సునామీలా వచ్చినా సరే.. ఎదురీదాలే తప్ప, ఇలా పసిమొగ్గలను చిదిమేయడం పిరికితనం, పాపం, క్షమించరాని నేరం.. నూతన సంవత్సర వెలుగులు చూడాల్సిన కళ్లు.. శాశ్వతంగా మూసుకుపోయాయి. గోరుముద్దలు తినిపించాల్సిన చేతులే విషం కలిపాయి. గుండెలకు హత్తుకోవాల్సిన వారే ఊపిరి తీశారు. అమృతం లాంటి ప్రేమను పంచాల్సిన తల్లిదండ్రులే.. ఇలా మారితే ఆ పసిప్రాణాలు ఎవరికి చెప్పుకోగలవు?నాన్న ఇచ్చిన పాలలో విషం ఉందని… pic.twitter.com/LZCLiepwxs— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 2, 2026చనిపోవడానికి ఉన్న ధైర్యం.. బ్రతకడానికి, పోరాడటానికి ఎందుకు సరిపోవడం లేదు? అని సజ్జనార్ ప్రశ్నించారు. ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదు.. అది మీపై ఆధారపడిన వారికి తీరని ద్రోహం.. అని తెలిపారు. దయచేసి ఆలోచించండి.. క్షణికావేశంలో నూరేళ్ళ జీవితాన్ని, బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకండి. బ్రతికి గెలవండి.. పారిపోయి ఓడిపోవద్దు.. అని ట్వీట్లో పేర్కొన్నారు. న్యూఇయర్ రెజల్యూషన్గా.. నూతన సంవత్సరాన్ని వృద్ధాశ్రమంలో తన సిబ్బందితో గడిపిన నగర కమిషనర్.. ఈ ఉదయం మరో పోస్ట్ చేశారు. నూతన సంవత్సర వేడుకల భద్రతా ఏర్పాట్లలో నిన్నటివరకు పూర్తిగా నిమగ్నమైన ఈ పోలీస్ అధికారి.. ఈ రోజు తన సంకల్పాలను ప్రజలతో పంచుకున్నారు. ఆయన మాటల్లో.. జీవితం అనేది వృత్తి బాధ్యతలు మరియు వ్యక్తిగత కర్తవ్యాల మధ్య సమతుల్యం. పోలీస్ అధికారిగా తన ప్రధాన సంకల్పం నగరాన్ని మరింత సురక్షితంగా, భద్రంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దడమే. ఈ ఏడాది సైబర్ క్రైమ్, ఆన్లైన్ మోసాలు వంటి కొత్త తరహా నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచడం, కఠినమైన అమలు చర్యలు తీసుకోవడం ప్రాధాన్యతగా ఉంటుందది. అదే సమయంలో పోలీస్ సిబ్బంది ఆరోగ్యం, మానసిక ధైర్యం అత్యంత కీలకం. వారి సంక్షేమం నా ప్రధాన లక్ష్యంగా కొనసాగుతుంది. ప్రజలతో నిరంతర సంబంధం కారణంగా వ్యక్తిగత సమయం తగ్గిపోతున్నా, చదువుకోవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం ద్వారా వృత్తిలో సమకాలీనంగా ఉండాలి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడిపే సమయం అత్యంత ముఖ్యం. వారి సహకారం వల్లే సమాజానికి అంకితభావంతో సేవ చేయగలుగుతున్నాం. చివరగా.. శారీరక దృఢత్వం కోసం స్థిరమైన వ్యాయామ పద్ధతిని అవలంబించాలని, నిజాయితీగా చెప్పాలంటే ఈసారి జిమ్‌లో చేరతానంటూ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారాయన. Having been fully engaged until yesterday with New Year security and arrangements alongside my dedicated and committed team, I felt today was the right moment to share my New Year resolutions with my extended family—you.Life, as we know, is a balance between professional… pic.twitter.com/WroFZxqDqu— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 2, 2026 -
యూట్యూబర్ అన్వేష్ కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: యూట్యూబర్ అన్వేష్‌పై నమోదు అయిన కేసుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసు దర్యాప్తును పంజాగుట్ట పోలీసులు వేగవంతం చేశారు. అతగాడు చేసిన అభ్యంతకర.. అనుచిత వ్యాఖ్యల తాలుకా వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో అన్వేష్‌కు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లపై ఆరాలు తీస్తున్నారు. (Prapancha Yatrikudu Anvesh Controversy)నా అన్వేషణ చానెల్స్‌తో ప్రపంచ యాత్రికుడు, ఆటగాడిగా పాపులారిటీ సంపాదించుకున్న అన్వేష్.. సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ సినీనటి, బీజేపీ నేత అయిన కరాటే కల్యాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అభ్యంతర కంటెంట్ ప్రచారం చేశారని పేర్కొనడంతో అన్వేష్‌పై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. ఈ కేసులో నోటీసులు ఇవ్వడానికి ముందు అతని అకౌంట్లకు వెరిఫై చేసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు అన్వేష్ యూజర్ ఐడీ వివరాలు కావాలంటూ ఇన్‌స్టాగ్రామ్‌కు ఓ లేఖ రాసినట్లు తెలుస్తోంది. తద్వారా వారిచ్చే వివరాలతో అతని అకౌంట్లను పరిశీలించనున్నారు. (Naa Anveshana Police Case News)ఇప్పటికే అన్వేష్‌పై ఖమ్మంలోని ఖానాపురంహవేలి పీఎస్‌లో ఓ కేసు నమోదయ్యింది. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా హిందువులు పూజించే సీతాదేవి, ద్రౌపదీదేవిలపట్ల అసభ్యంగా వీడియో రిలీజ్ చేశాడని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. హీరోయిన్ల వస్త్రధారణపై సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలను ఖండించే క్రమంలో అన్వేష్ తన నోటికి పని చెప్పాడు. హిందూ దేవతల ప్రస్తావనతో వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను హిందూ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అన్వేష్‌ను దేశద్రోహిగా ప్రకటించాలని.. వెంటనే భారత్‌కు రప్పించి.. శిక్షించాలని కోరుతున్నాయి. అదే సమయంలో అతన్ని అన్‌ఫాలో కొడుతూ నెట్టింట మినీ ఉద్యమమే నడిపిస్తున్నారు. -
బళ్లారిలో తీవ్ర ఉద్రిక్తత.. గాలి జనార్దన్‌పై కేసు నమోదు
బెంగళూరు: రాజకీయ ఘర్షణలు.. ఇరు వర్గాల గన్ ఫైట్‌తో కర్ణాటక బళ్లారిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి అనుచరులు, గంగావతి బీజేపీ ఎమ్మెల్యే.. మాజీమంత్రి గాలి జనార్దన్‌రెడ్డి వర్గీయుల మధ్య ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలో వివాదం చెలరేగింది. అది చినికి చినికి గాలివానగా మారి.. కాంగ్రెస్-గాలి వర్గీయులు పరస్పరం దాడులకు దిగారు. ఇది కాల్పులకు దారి తీయడంతో ఒకరు మృతి చెందారు. బళ్లారిలోని గాలి జనార్దన్‌రెడ్డి నివాసం వద్ద గురువారం రాత్రి కాంగ్రెస్-బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. అనంతరం జరిగిన కాల్పుల్లో ఒకరు మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఇది తనపై జరిగిన హత్యాయత్నమేనని, తాను తృటిలో తప్పించుకున్నానని గాలి జనార్దన్ అంటున్నారు. అయితే ఆ అవసరం తనకు లేదని.. గాలి జనార్దన్ జరిపిన కాల్పుల వల్లే కాంగ్రెస్ కార్యకర్త మృతి చెందాడని భరత్‌రెడ్డి కౌంటర్ ఇస్తున్నారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతంగా మారడంతో బళ్లారి సిటీలో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. గాలి జనార్దన్‌పై కేసుగొడవ జరిగినపుడు ఎమ్మెల్యే భరత్‌రెడ్డి ఊళ్లో లేరు. గొడవ గురించి తెలిశాకే బళ్లారి వచ్చారు. అనుచరులతో ఎస్పీ సర్కిల్‌కు చేరుకుని ఘటన గురించి ఆరా తీశారు. ఇరువర్గాలు మొత్తం 8 రౌండ్ల కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. మృతి చెందిన వ్యక్తిని కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్‌గా గుర్తించాారు. ఈ కాల్పుల్లో సతీష్‌రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో బళ్లారిలో ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు 144 సెక్షన్ విధించి.. అదనపు బలగాలు మోహరించారు. కాల్పుల ఘటనపై బ్రూస్‌పేట పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. జనార్ధన్‌రెడ్డి, శ్రీరాములు, సోమశేఖర్ రెడ్డి సహా 11మంది పేర్లను నిందితులుగా చేర్చారు.నారా వర్సెస్ గాలిగన్ఫైట్.. బళ్లారిలో హైటెన్షన్ వేళ నారా భరత్‌రెడ్డి, గాలి జనార్దన్‌రెడ్డి పరస్పరం మాటల తుటాలు పేల్చారు. ‘‘గురువారం ఉదయం ఇంటి ఆవరణలో బ్యానర్లు కట్టారని తమ సెక్యూరిటీ గార్డ్ మా దృష్టికి తీసుకొచ్చాడు. అనంతరం బ్యానర్ పడిపోయింది. దీనిపై క్షమాపణ చెప్పి బ్యానర్ కడుతామని చెప్పాం. అయినా వినకుండా నా ఇంటి ముందు రహదారిపై ఎమ్మెల్యే ఆప్తుడు సతీష్‌రెడ్డి, చానాళ్ శేఖర్ కుర్చీ వేసుకుని కూర్చున్నారు. వారితో పాటు కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఘర్షణలో ఇంటిపై రాళ్లు విసిరారు. సరిగ్గా నేను గంగావతి నుంచి వచ్చే సమయంలో సతీష్‌రెడ్డి భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. బీజేపీ ప్రభుత్వంలోనే రూ.8 కోట్లతో వాల్మీకి భవనం నిర్మించాం. ఇప్పటికే వాల్మీకి విగ్రహం ప్రతిష్ఠించినా మళ్లీ ఎందుకని ప్రశ్నించారు. రాజకీయ భవిష్యత్తు లేదని, అభివృద్ధి చేయలేక ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నార’’ని గాలి ఆరోపించారు. అయితే.. బళ్లారి నగరంలో వాల్మీకి విగ్రహం ప్రతిష్ఠను శాంతియుతంగా నిర్వహించాలని చూస్తుంటే.. ఈ కార్యక్రమం జరగకుండా చూడాలని ఘర్షణకు పాల్పడుతున్నారని నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి ఆరోపించారు. ‘‘బ్యానర్ విషయంలో అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వాల్మీకి అజ్జ వారి పాపాలను చూసుకుంటారని తెలిపారు. నాకు 35 ఏళ్లు.. వాళ్లది నా కంటే డబుల్ వయసు. యువకులే శాంతియుతంగా ముందుకు వెళ్తుంటే వయస్సు మీదపడినా వారే రెచ్చగొట్ట్టేలా చేయడం సరికాదు’’ అని ఆయన అన్నారు. ఈఘటనపై చట్టపరంగా ముందుకు వెళ్తామని భరత్ స్పష్టం చేశారు. ఫ్లెక్సీ వద్దని.. బళ్లారి సిటీ సెంటర్లో ఈ నెల 3న మహర్షి వాల్మీకి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంది. ఈ సందర్భంగా ఊరంతా కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్‌రెడ్డి అనుచరులు ఫ్లెక్సీలు కడుతున్నారు. అయితే హవ్వబావిలో గాలి జనార్దన్ ఇంటి గోడకు ఫ్లెక్సీ కట్టబోతుండగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే భరత్‌కి సన్నిహితుడైన సతీష్‌రెడ్డి అక్కడికి చేరుకుని వీరంగం సృష్టించారు. జనార్దన్ ఇంటి ముందు కుర్చీ వేసుకుని మరీ ఫ్లెక్సీ ఏర్పాటు చేయించే ప్రయత్నం చేయబోయారు. విషయం తెలుసుకుని గాలి అనుచరులు, బీజేపీ కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకుని ఆ ప్రయత్నాన్ని అడ్డుకోబోయారు. సరిగ్గా.. అదే సమయంలో గాలి జనార్దన్ అక్కడికి రావడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. ఇరువర్గాల మధ్య తీవ్రవాగ్వాదం చోటు చేసుకోవడంతో.. తోపులాట జరిగింది. అయితే గుంపును చెదరగొట్టేందుకు గాలి జనార్దన్ గన్‌మెన్, అటు సతీష్‌రెడ్డి గన్మెన్లు గాల్లోకి కాల్పలు జరిపారు. కోపంతో సతీష్‌రెడ్డి తన గన్‌మెన్ తుపాకీ లాక్కుని గాలి జనార్దన్‌రెడ్డి వైపు కాల్పులు జరిపాడు. ప్రతిగా.. గాలి కూడా కాల్పులు జరపడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ ఉద్రిక్తతల గురించి తెలుసుకున్న గాలి సన్నిహితుడు.. మాజీ మంత్రి శ్రీరాములు, కంప్లి ఎమ్మెల్యే సురేశ్‌బాబు, గాలి సోమశేఖర్‌రెడ్డి అక్కడకు చేరుకున్నారు. అయితే లాఠీఛార్జి చేసి ఇరు వర్గాలనూ పోలీసులు చెదరగొట్టారు. నా మర్డర్‌కు స్కెచ్..ఘటన తర్వాత తనకు తప్పిన ప్రాణాయం గురించి బుల్లెట్‌ను చూపిస్తూ గాలి జనార్దన్ మీడియాతో మాట్లాడారు. తనను చంపేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్‌రెడ్డి స్కెచ్ వేశారని ఆరోపించారు. అయితే గాలి జనార్దన్‌ను చంపాల్సిన అవసరం తనకు లేదని భరత్ అంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్త మృతికి, సతీష్‌రెడ్డి మీద హత్యాయత్నానికిగానూ గాలి జనార్దన్ మీద కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. -
చిచ్చు రాజేసిన న్యూఇయర్ కేక్ కటింగ్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో అర్ధరాత్రి కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. పల్లె, పట్నం అంతా 2026కు ఘనంగా స్వాగతం పలికారు. అయితే పోలీసుల వైఖరితో న్యూఇయర్ సెలబ్రేషన్స్ వేడుకల్లో అక్కడక్కడ చిన్నపాటి ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇటు జగ్గయ్యపేట పరిధిలో కేక్ కట్టింగ్ యువకుల మధ్య చిచ్చును రాజేసింది. జగ్గయ్యపేట పట్టణంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అర్ధరాత్రి దాటాక.. తొర్రగుంటపాలెం రోడ్డుపై కొందరు యువకులు కేక్ కటింగ్‌కు ప్రయత్నించారు. అదే సమయంలో.. అటువైపుగా కారులో నలుగురు యువకులు వచ్చారు. నడిరోడ్డుపై సెలబ్రేషన్స్ ఏంటని?.. పక్క నిర్వహించుకోవాలని.. తమకు దారి ఇవ్వాలంటూ వాళ్లను కోరారు. అయితే.. కేక్ కట్టింగ్ అయ్యాకే కారు ముందుకు వెళ్తుందంటూ తేల్చి చెప్పడంతో మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో యువకులు ఒకరినొకరు తోసేసుకుని పిడిగుద్దులు గుప్పించుకున్నారు. ఈ దాడిలో కారులో వచ్చిన యువకులకు గాయాలు కావడంతో.. స్థానికులు జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. దాడి సమయంలో యువకులు మద్యం మత్తులో ఉన్నారా?. ఫిర్యాదు నమోదు అయ్యిందా?.. అనే విషయాలు తెలియాలంటే ఈ ఘటనపై పోలీసులు స్పందించాల్సిందే. -
మోసం చేశారు.. వేధిస్తున్నారు!
నంద్యాల: తమను మోసం చేశారని, అంతేకాకుండా డబ్బులు ఇవ్వాలని వేధిస్తున్నారని ఎస్పీ సునీల్ షెరాన్‌కు బాధితులు ఫిర్యాదు చేశారు. నంద్యాలలోని ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. తన భర్త బాలుగ్రం అనే వ్యక్తి వేరే అమ్మాయిలతో తిరుగుతూ మోసం చేస్తున్నాడని, ఈఎంఐ చెల్లించాని వేధిస్తున్నాడని ఏఎన్ఎంగా పనిచేస్తున్న ఒక మహిళ ఫిర్యాదు చేశారు. తాను నంద్యాలలోని ఒక ప్రైవేటు జూనియర్ కళాశాలలో పనిచేయగా జీతం ఇవ్వకుండా మోసం చేశారని మల్లికార్జునయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. తన స్థలాన్ని ఆక్రమించుకుని బెదిరిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని బండిఆత్మకూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు వినతి పత్రం అందజేశారు. మొత్తం 75 ఫిర్యాదులు రాగా వాటికి చట్ట పరిధిలో పరిష్కారం చూపాలని పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. -
రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థిని దుర్మరణం
రంగారెడ్డి జిల్లా: పరీక్షలు రాసేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరిలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మిగిలిన ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్‌లోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్న గణేశ్‌తో కలిసి బండల హంసలేఖ (22), దీప్తి అనే ఇద్దరు విద్యార్థులు పిగ్లీపూర్ గ్రామంలోని అన్నమాచార్య కళాశాలలో పరీక్ష రాసేందుకు బైక్‌పై వెళ్తున్నారు. బ్రిలియంట్ కమాన్ నుంచి ముకుంద డెయిరీ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో హంసలేఖ, దీప్తి కిందపడగా, ఇదే సమయంలో వెనక నుంచి వచ్చిన లారీ వెనుక చక్రాల కింద పడిన హంసలేక అక్కడికక్కడే చనిపోయింది. దీప్తికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గణేశ్‌కు సైతం గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. -
నా భర్త అశ్లీల వీడియోలు చూస్తూ.. నరకం చూపిస్తున్నాడు..!
బెంగళూరు: భర్త విచిత్ర ప్రవర్తన, లైంగిక వేధింపులతో మనస్తాపం చెందిన భార్య పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన బెంగళూరు నగరంలో చోటు చేసుకుంది. వివరాలు.. భార్యాభర్తలిద్దరూ ఒకే కంపెనీలో సహోద్యోగులు. హెచ్ఆర్గా ఉన్నప్పుడే ఇద్దరికీ పరిచయమై అనంతరం ప్రేమకు దారి తీసింది. యువతి తల్లిదండ్రులను ఒప్పించిన అనంతరం 2025 సెపె్టంబరు 3 తేదీన కుటుంబ సభ్యులు చింతామణిలో మంజునాథ్‌తో వివాహం జరిపించారు.వివాహమైన అనంతరం భర్త సైకోలా ప్రవర్తిస్తుండగా ఫోన్ చూసి లైంగిక ప్రక్రియకు డిమాండ్ చేస్తున్నారు. ఇంట్లో వారి ముందు నగ్నంగా తిరుగుతూ ఇబ్బందికి గురి చేస్తున్నారని మహిళ ఆరోపించింది. ప్రస్తుతం సైకో భర్త వేధింపులకు భార్య హడలిపోయింది. నేను వివాహం చేసుకుంది ఇలాంటి సైకో వ్యక్తినా అని మదనపడుతోంది. వివాహమైన కొద్దిరోజుల పాటు అన్యోన్యంగా ఉన్న భర్త ప్రస్తుతం సైకోలా ప్రవర్తిస్తుండటంతో భార్య బెంబేలెత్తిపోతోంది. అత్తమామల ముందు కూడా నగ్నంగా సంచరిస్తుండటంతో పాటు ప్యాసేజ్లోకి వెళ్లి చుట్టుపక్కల వారిని ఇబ్బందికి గురి చేస్తున్నాడని భార్య వాపోయింది. భర్త విచిత్ర ప్రవర్తన, వేధింపులతో పాటు తనను భర్త అసభ్య పదజాలంతో దూషిస్తూ, శారీరకంగా, మానసికంగా హింసించాడని, తనతో పాటు తన తల్లిని కూడా అసభ్యంగా దూషించి దాడికి ప్రయత్నించాడు. అతడి ప్రవర్తనకు అతని తల్లిదండ్రులు మద్దతు ఇస్తున్నారని బాధితురాలు ఆరోపించారు. కేంద్ర విభాగం మహిళా స్టేషన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘అమ్మా’ అని పిలిచి, అదను చూసి..
సాక్షి, హైదరాబాద్: నాచారం మర్డర్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఒంటరి మహిళ అని సుజాతను గుర్తించి.. ఆమెతో మంచిగా ప్రవర్తించి.. నగల కోసం దారుణానికి ఒడిగట్టాడు ప్రధాన నిందితుడు అంజిబాబు. ఈ కేసులో పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. సుజాత భర్త, పిల్లలు కొన్నేళ్ల కిందట యాక్సిడెంట్లో మరణించారు. దీంతో ఆమె ఒంటరిగా ఉంటోంది. రెండు నెలల కిందట డ్రైవర్‌గా పని చేసే అంజిబాబు ఆమె ఇంట్లో అద్దెకు దిగాడు. అయితే సుజాత ప్రతీరోజూ ఒంటి నిండా బంగారం ధరించేది. ఇది గమనించిన అంజిబాబు.. ఆ నగల కోసం సుజాతను హత్య చేయాలని ప్లాన్ వేశాడు. ఈ క్రమంలో.. అమ్మా అని సుజాతను పిలుస్తూ దగ్గరయ్యాడు. ఆ పిలుపు విని ఆమె కూడా మోసపోయింది. ఈ నెల 18వ తేదీన కిచెన్‌లో ఉన్న సుజాతను వెనుక నుండి ముసుగు వేసి అంజి బాబు ఊపిరి ఆడకుండా చేసి ప్రాణం తీశాడు. ఆపై ఆమె ఒంటిపై నగలు తీసేసి.. ఇంటికి తాళం వేసి ఉడాయించాడు. అయితే.. పారిపోతే తన మీదకే నేరం వస్తుందని ఆలోచించి స్నేహితులతో కలిసి ఓ పన్నాగం పన్నాడు. మృతదేహాన్ని మాయం చేయాలనీ తన స్నేహితులు దుర్గారావు, యువరాజులతో కలిసి ప్లాన్ వేశాడు. ఓ పెద్ద ట్రాలీ సూట్‌కేసు తెచ్చి.. అందులో సుజాత మృతదేహం కుక్కి రాజమండ్రి(ఆంధ్రప్రదేశ్) తీసుకెళ్లారు. ఆ బ్యాగును కోనసీమ రాజోలు దగ్గర గోదావరిలో పడేసి వచ్చారు.సుజాత కనిపించకపోవడంతో బంధువులు ఆందోళన చెందారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది. అయితే తనకు ఏం తెలియనట్లు.. ఆ బంధువులతో కలిసి అంజిబాబు ఆమె కోసం గాలించడం మొదలుపెట్టాడు. ఈలోపు.. సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు ఈ కేసును చేధించారు. అంజిబాబు, అతనికి సహకరించిన యువకుల్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించడంతో నేరం ఒప్పుకున్నారు. వాళ్లు ఇచ్చిన సమాచారంతో గోదావరి నది నుంచి ట్రాలీ బ్యాగ్‌ను వెలికి తీశారు. అందులోంచి సుజాత మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పంపారు. నిందితుల నుంచి నాలుగు బంగారు గాజులు, చెవి దిద్దులు స్వాధీనం చేసుకున్నారు. -
ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నికీలలు
సాక్షి, అనకాపల్లి/సామర్లకోట: ఎర్నాకుళం వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం అర్ధరాత్రి 12.45 గంటల సమయంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. జార్ఖండ్‌లోని టాటానగర్ నుంచి కేరళలోని ఎర్నాకుళం వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్–18189)లో అనకాపల్లి జిల్లా యలమంచిలి వద్ద భారీగా మంటలు చెలరేగాయి. అగ్నికీలలు ఎగిసిపడడంతో బీ–1, ఎం–2 ఏసీ బోగీలు దగ్ధమయ్యాయి. పొగ విపరీతంగా కమ్ముకోవడంతో బీ–1 బోగీలో ప్రయాణిస్తున్న విజయవాడ వాసి చంద్రశేఖర్ సుందర్ (70) అనే వృద్ధుడు స్పృహ తప్పి పడిపోయి.. అగ్నికీలల్లో సజీవ దహనమయ్యాడు.ఈ ఘటనతో యలమంచిలి రైల్వేస్టేషన్లో రెండు గంటలపాటు భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అనకాపల్లి, యలమంచిలి, నక్కపల్లి నుంచి అగి్నమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈలోపు లోకో పైలట్లు కాలిపోతున్న రెండు బోగీలను వేరుచేసి మంటలు ఇతర బోగీలకు వ్యాపించకుండా అడ్డుకున్నారు. పరుగులు తీసిన ప్రయాణికులు మంటలు చెలరేగిన రెండు ఏసీ బోగీల్లోని ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ రైలు దిగి యలమంచిలి రైల్వే స్టేషన్లోకి పరుగులు తీశారు. లగేజీలను కూడా వదిలేసి పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ మంటల్లో రెండు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సజీవ దహనమైన ఒక్కరు మినహా అంతా సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి గురైన రెండు బోగీలతోపాటు ఎం–2 బోగీని కూడా తప్పించి ఉదయం 7 గంటలకు రైలు బయల్దేరింది. ఆ బోగీల నుంచి దింపేసిన సుమారు 125 మంది ప్రయాణికులను ఆర్టీసీ బస్సుల్లో కాకినాడ జిల్లా సామర్లకోట రైల్వే స్టేషన్‌కు తరలించారు. అక్కడ మూడు కొత్త బోగీలు అటాచ్ చేసి ప్రయాణికులను అదే రైలులో వారి గమ్యస్థానాలకు పంపించారు. రైలు కదలికలో తేడా రావడంతో.. ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో నర్సింగిబిల్లి–యలమంచిలి స్టేషన్ల మధ్య బ్రేకుల్లో తలెత్తిన లోపాల కారణంగా.. ఏసీ బోగీలో అర్ధరాత్రి సమయంలో పొగ రావడం మొదలైంది. ఆ తరువాత కొద్దిసేపట్లోనే యలమంచిలి స్టేషన్‌కు రైలు చేరుకుంది. వాస్తవానికి ఇక్కడ ఆ ట్రైన్‌కు హాల్టు లేదు. ఈ రైల్వేస్టేషన్లో లోకో పైలట్ల విశ్రాంతి గది ఉండటంతో ఒక పైలట్‌ను దించేందుకు రైలును ఆపినట్టు రైల్వే సిబ్బంది చెప్పారు. ముందుగా రైలు వేగాన్ని తగ్గించి.. స్టేషన్‌కు రాగానే బ్రేక్ వేశారు. ఆ సమయంలో బ్రేకుల్లో లోపాలున్నట్టు అర్థమైంది. బ్రేక్‌లు పట్టేయడం, రైలు కదలికలో తేడాను పైలట్లు గమనించారు.దిగి చెక్ చేయాలని భావిస్తున్న సమయంలోనే.. ప్రయాణికులు చైన్ లాగిన సంకేతాలు వచ్చాయి. దీంతో లోకో పైలట్లు వేగంగా చైన్ లాగిన బోగీలవైపు పరుగులు తీశారు. బోగీల్లో మంటలు మొదలవడంతో ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ.. ప్లాట్‌ఫామ్ పైకి దిగి పరుగులు తీశారు. యలమంచిలి రైల్వే స్టేషన్లో రైలును నిలపడంతో ప్రయాణికులు తొందరగా సులువుగా ప్లాట్‌ఫామ్‌పైకి దిగగలిగారు. ఫైర్ ఇంజిన్లు త్వరితగతిన చేరుకోగలిగాయి. అక్కడ రైల్వే పోలీసు సిబ్బంది కూడా ఉండటం వల్ల వేగవంతంగా సహాయక చర్యలు చేపట్టగలిగారు. లేదంటే భారీ ప్రాణనష్టం జరిగి ఉండేదని అధికారులు చెప్పారు.మృతుడి బ్యాగ్‌లో నగదు, బంగారం గుర్తింపు ప్రమాదంలో మృతి చెందిన చంద్రశేఖర్ సుందర్ బ్యాగులో నగదు, బంగారం ఉన్నట్టు రైల్వే పోలీసులు గుర్తించారు. చంద్రశేఖర్ కుటుంబ సభ్యుల సమక్షంలో బ్యాగును తెరిచి చూడగా.. అందులో రూ.6.50 లక్షల నగదు, బంగారం ఉంది. చాలావరకు నోట్ల కట్టలు కాలిపోయి ఉన్నాయి. మృతుడు విజయవాడలో హోల్‌సేల్ వస్త్ర వ్యాపారం చేస్తుంటారు. విజయనగరంలో ఒక వస్త్ర దుకాణం నుంచి డబ్బు వసూలు చేసుకుని విజయవాడ వెళ్తుండగా ప్రమాదంలో మృతి చెందారు. మృతుడి బ్యాగ్‌లో దొరికిన రూ.6.50 లక్షల నగదు, బంగారు ఆభరణాలను అతడి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు రైల్వే ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. బ్రేకులు పట్టేయడమే కారణమా? ప్రమాదానికి కారణాలను గుర్తించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందంతో దర్యాప్తు చేయిస్తామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. బ్రేకుల ఫెయిల్యూరే కారణమా లేదా షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా.. ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణాల్లో సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తామని తెలిపారు. ప్రమాద స్థలాన్ని సోమవారం దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాత్సవ, విజయవాడ డీఆర్ఎం మోహిత్ సోనాకియా, రైల్వే డీఐజీ బి.సత్య ఏసుబాబు, రైల్వే సేఫ్టీ అధికారులు పరిశీలించారు.డీఆర్ఎం మోహిత్ మాట్లాడుతూ.. బ్రేకులు పట్టేయడం వల్లే మంటలు చెలరేగాయని.. బోగీల్లో ఉన్న దుప్పట్లు అంటుకుని మంటలు శరవేగంగా వ్యాపించాయని భావిస్తున్నట్టు చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. మృతుడి కుటుంబానికి రైల్వే శాఖ రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. ప్రమాదంపై రైల్వే సేఫ్టీ కమిషనర్ శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. సౌత్ సెంట్రల్ సర్కిల్ రైల్వే సేఫ్టీ కమిషనర్ మాధవిని విచారణాధికారిగా నియమించారు.వైఎస్ జగన్ దిగ్భ్రాంతి సాక్షి, అమరావతి: అనకాపల్లి జిల్లా ఎలమంచిలి రైల్వేస్టేషన్ సమీపంలో ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగి రెండు బోగీలు పూర్తిగా దగ్ధమై ఒక ప్రయాణికుడు మృతిచెందడం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. మృతుడి కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు. సీట్ల కింద నుంచి మంటలొచ్చాయిఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ బీ–1 బోగీలో ఆదివారం రాత్రి 10.30 గంటలకు అనకాపల్లిలో ఎక్కాను. రైలు యలమంచిలి చేరుకుంటున్న సమయంలో పైబెర్తులోని ప్రయాణికుడు టాయిలెట్‌కు వెళ్లూ బోగీలోని సీట్ల కింద నుంచి మంటలు వస్తున్న విషయాన్ని గమనించి నాకు చెప్పాడు. ఆయన, నేను కేకలు వేస్తూ బోగీలోని ప్రయాణికులను నిద్రలేపి చైన్ లాగాం. అప్పటికే రైలు యలమంచిలి స్టేషన్‌కు వచ్చి ఆగింది.వెంటనే ప్రయాణికులు రైలులోంచి ప్రాణభయంతో దిగేశారు. అదే సమయంలో సమీపంలోని ఎం–2 బోగీకి కూడా మంటలు వ్యాపించాయి. యలమంచిలి రైల్వేస్టేషన్ ఆవరణ అంతా పొగతో నిండిపోయిది. ప్రమాదం జరిగిన బోగీల్లోని ప్రయాణికులను సామర్లకోట తీసుకు వచ్చారు. చాలామంది తమ లగేజీలను అక్కడే వదిలేసి ఇక్కడకు వచ్చారు. –నాగేంద్ర, ప్రత్యక్ష సాక్షి -
ట్రాప్ చేసి సర్వం దోచుకున్న నయవంచకుడు
కర్ణాటక: ప్రేమ, పెళ్లి పేరుతో యువతులను నమ్మించి సర్వం దోచుకుని మోసగిస్తున్న నయ వంచకుని ఉదంతమిది. చివరకు బాధితులు ఫిర్యాదు చేయడంతో బెంగళూరు బాగలగుంట పోలీసులు గాలించి అరెస్టు చేశారు. హరియానాకు చెందిన శుభాంశు శుక్లా (27) ఆ కిలాడీ. ఇతడు గత నాలుగేళ్లుగా బెంగళూరులోని టీ దాసరహళ్లిలో నివసిస్తున్నాడు. మంచి ఉద్యోగం చేస్తున్నట్లు చెప్పుకుని ఫేస్బుక్, ఇన్‌స్టా తదితరాల ద్వారా నిందితుడు స్థానిక యువతులను ట్రాప్ చేయడం ప్రారంభించాడు. ముందు పరిచయం చేసుకుని, ఆపై తీయని మాటలతో ప్రేమ వల విసరడం, వారి నుంచి భారీ మొత్తాల్లో డబ్బు తీసుకోవడం, ఇతరత్ర మోసగించడం ఇతని నైజం. ఓ యువతితో ఇలాగే ప్రేమాయణం నడుపుతున్నాడు. ఆమె ద్వారా ఆమె మైనర్ చెల్లెలిని కూడా మభ్యపెట్టి లైంగిక దాడులకు పాల్పడుతున్నాడు. వారి నుంచి రూ.34 లక్షలు వసూలు చేశాడు. ఇది తెలిసి బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో అతని మోసాలు ఒక్కొక్కటే బయటపడుతున్నాయి. -
వ్యభిచారం కేసులో మహిళ అరెస్ట్
గుణదల(విజయవాడ తూర్పు): పలువురు యువతుల సహకారంతో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మహిళను మాచవరం పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మాచవరం శాంతినగర్‌కు చెందిన వేముల రమణమ్మ తాను ఉంటున్న అద్దె ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తోంది. నివాసాల మధ్య అసభ్యకరంగా జరుగుతున్న ఈ వ్యవహారంపై గతంలో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిఘా ఏర్పాటు చేసిన మాచవరం పోలీసులు దాడులు నిర్వహించగా ముగ్గురు యువతులతో పాటు బి.రాజు అనే విటుడు ఉన్నట్లు గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితురాలు రమణమ్మను అరెస్ట్ చేశారు. -
అనకాపల్లి: ‘ఎర్నాకుళం’ మృతుడికి పరిహారం ప్రకటించిన రైల్వే
సాక్షి, అనకాపల్లి: ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ అగ్నిప్రమాద ఘటనలో ఒకరు మరణించారని.. మిగతా ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నారని అధికారులు ధృవీకరించారు. అలాగే మంటలు పూర్తిగా అదుపులోకి రావడంతో సహాయక చర్యలు పూర్తైనట్లు ప్రకటించారు. టెక్నికల్ క్లియరెన్స్ అనంతరం.. ప్రమాదానికి గురైన రెండు బోగీలతో పాటు మరొక బోగీని(ఎం2 కూడా) మినహాయించడంతో సోమవారం ఉదయం 7గంటలు ఆలస్యంగా రైలు ఎర్నాకుళం బయల్దేరింది.టాటానగర్(జార్ఖండ్) నుంచి ఎర్నాకుళం(కేరళ) వెళ్తున్న ఎక్స్‌ప్రెస్(18189) రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని ఎలమంచిలి సమీపంలోని పాయింట్ వద్ద లోకో పైలట్లు గుర్తించి స్టేషన్లో రైలును నిలుపుదల చేశారు. ప్రయాణికులంతా బయటకు దిగి పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈలోపు లోకో పైలట్ కాలిపోతున్న బోగీలను రైలు నుంచి వేరు చేశారు. సమాచారం అందుకున్న అనకాపల్లి, ఎలమంచిలి, నక్కపల్లికి చెందిన ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటల్లో రెండు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనలో ఒకరు సజీవ దహనం కాగా.. మిగతా వారంతా సురక్షితంగా బయటపడ్డారు. తొలుత బీ1 కోచ్‌లోనే మంటలు చెలరేగినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. అర్ధరాత్రి 3.30గంటలు దాటిన తర్వాత రైల్వే అధికారులు కాలిపోయిన రెండు బోగీలను తొలగించి, ఆయా బోగీల్లోని ప్రయాణికులను మిగతా బోగీల్లో సర్దుబాటు చేసి రైలును పంపించడానికి ప్రయత్నాలు చేయబోయారు. కానీ.. దుప్పట్ల వల్లే..ప్రమాద స్థలానికి చేరుకున్న దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ డీఆర్ఎం మోహిత్ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ‘‘ప్రమాదం జరిగిన ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ నాలుగు గంటలు ఆలస్యంగా నడుస్తోంది. ఆదివారం అర్ధరాత్రి దాటాక 1.30గం. ప్రాంతంలో ప్రమాదం జరిగింది. బీ1 కోచ్‌లో మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నాం. ఆ బోగీలో దుప్పట్లు ఉండడం వల్ల మంటలు శరవేగంగా వ్యాపించాయి. రెండు బోగీలు(బీ1, ఎం2) పూర్తిగా కాలిపోయాయి. ప్రమాద సమయంలో బీ1లో 76 మంది, ఎం2లో 82 మంది ఉన్నారు. ప్రమాదంలో ఒకరు మరణించారు. బీ1 బోగీలో మృతదేహాన్ని గుర్తించాం. ప్రయాణికులను ప్రత్యేక బస్సుల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. బ్రేకులు పట్టేయడం వల్లే మంటలు చెలరేగాయని లోకో పైలట్లు చెబుతున్నారు. కానీ, అధికారిక దృవీకరణ జరగాల్సి ఉంది. ఘటనపై విచారణ జరుగుతోంది’’ అని అన్నారు. ఇదిలా ఉంటే.. మృతుడ్ని విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్(70)గా అధికారులు నిర్ధారించారు. ఆయన కుటుంబానికి రైల్వేశాఖ రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. ప్రయాణికుల అవస్థలుఈ ఘటన తర్వాత.. చలిలో సుమారు 2వేల మంది ప్రయాణికులు స్టేషన్లో పడిగాపులు పడ్డారు. అనకాపల్లి, తుని, విశాఖ స్టేషన్లో పలు రైళ్లు నిలిచిపోయాయి. విశాఖ నుంచి విజయవాడ వెళ్లే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పూరి-తిరుపతి, ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్, జన్మభూమి ఎక్స్‌ప్రెస్, బెంగళూర్ హంసఫర్ రైళ్లు వీటిల్లో ఉన్నాయి. ప్రయాణికులు ఈ విషయం గమనించాలని రైల్వే అధికారులు కోరుతున్నారు.ఎఫ్ఎస్ఎల్ ఆధారాలే కీలకంప్రమాదం ఎలా జరిగింది అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ ఉదయం ఘటన స్థలానికి రైల్వే సేఫ్టీ కమిటీ చేరుకుంది. ప్రమాద తీవత్రను సీనియర్ అధికారులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో రెండు ఫోరెన్సిక్ బృందాలు ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్నాయి. ఫైర్ సిబ్బంది మూడు గంటలపాటు శ్రమించి మంటలు అదుపులోకి తీసుకొచ్చారని ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. దర్యాప్తులో ఎఫ్ఎస్ఎల్ ఆధారాలే కీలకమని పోలీసులు చెబుతున్నారాయన. ‘‘ప్రయాణికులకు ఆరోగ్య పరీక్షలు జరిపి సురక్షితంగా ఉన్నారని నిర్ధారించుకున్నాం. ప్రత్యేక బస్సుల్లో రైల్వే స్టేషన్‌కు తరలించాం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో ఎర్నాకులం చేరేలా చూస్తాం’’ అని తెలిపారు.కలెక్టర్ కామెంట్స్.. రైలు ప్రమాద ఘటనపై కలెక్టర్ విజయ కృష్ణన్ మాట్లాడుతూ.. ఎర్నాకులం ఎక్స్ ప్రెస్ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోంది. యలమంచిలి రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చే సరికి ప్రెషర్ తేడాలను లోకో పైలెట్ గుర్తించారు. అప్పటికే పొగలు వ్యాపించడంతో ప్రయాణీకులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికులకు జిల్లా యంత్రాంగం తరపున ప్రయాణీకులకు ఆహారం, మంచినీటి సౌకర్యం కల్పించాం. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా ప్రమాద కారణాలు తెలుస్తాయి అన్నారు. -
హనీమూన్‌లో గొడవ?.. నవ జంట బలవన్మరణం
కొత్తగా పెళలైన ఆ జంట.. హనీమూన్‌కు వెళ్లింది. అక్కడ ఏం జరిగిందో తెలీయదు. తిరిగి రాగానే ఆమె ప్రాణం తీసుకుంది. అది తట్టుకోలేకనో.. కేసు భయం వల్లనో.. అతడు దూరంగా పారిపోయాడు. వెయ్యి కిలోమీటర్ల ప్రయాణం చేసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పచ్చని పందిళ్లు వేసి మూడు నెలలు తిరగకముందే.. ఆ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది ఇప్పుడు.. బెంగళూరు: బెంగళూరుకు చెందిన సూరజ్ శివన్న (36), గణవి (26) జీవితం అర్ధాంతరంగా ముగిసింది. గణవి మొదట బెంగళూరులో ఆత్మహత్యకు పాల్పడగా, రెండు రోజుల తర్వాత సూరజ్ మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఒక హోటల్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.అక్టోబర్ 29వ తేదీన ఈ జంటకు వివాహం జరిగింది. అయితే ఈ మధ్యే హనీమూన్ కోసం శివన్న, గణవి శ్రీలంకకు వెళ్లారు. అక్కడి వెళ్లిన ఆ జంటకు మధ్యలోనే గొడవలు తలెత్తడంతో తిరిగి బెంగళూరుకు వచ్చారు. గణవి తన పుట్టింటికి వెళ్లింది. అత్తింట్లో ఎదురైన అవమానం, తిరస్కారం కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైందని ఆమె కుటుంబం ఆరోపిస్తుండగా.. డిసెంబర్ 23న ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించి ఆసుపత్రిలో చేరింది. రెండు రోజుల పాటు చికిత్స పొందిన ఆమె చివరికి మృతి చెందింది.గణవి మరణం తర్వాత ఆమె కుటుంబం సూరజ్, అతని కుటుంబంపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసింది. ఈ పరిణామాల మధ్య సూరజ్ తన తల్లి జయంతితో కలిసి బెంగళూరును విడిచి నాగపూర్‌కి వెళ్లాడు. అక్కడ వార్ధా రోడ్‌లోని ఒక హోటల్లో ఉరి వేసుకుని మృతి చెందాడు. అదే సమయంలో అతని తల్లి కూడా ఆత్మహత్యకు ప్రయత్నించగా, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.ఈ ఘటన కొత్తగా పెళ్లైన జంట జీవితం ఎంతటి విషాదాంతానికి దారితీసిందో చూపిస్తోంది. కుటుంబ తగాదాలు, వరకట్న వేధింపులు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు సమాజంలో ఇంకా ఎంతటి ప్రమాదకర పరిస్థితులను సృష్టిస్తున్నాయో మరోసారి స్పష్టమైంది.మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
ప్లాన్ చేసి యువకుడి మర్డర్.. అక్కా చెల్లెళ్ల మాస్టర్ ప్లాన్
-
నేరాలపై ఉక్కుపాదం: కోరుట్ల పోలీసుల ఏడాది రికార్డు
కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదేళ్ల బాలిక హత్య కేసును 24 గంటల్లోనే ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేయడం ద్వారా పోలీసులు ప్రజల ప్రశంసలు పొందారు. అలాగే 25 చోరీ కేసుల్లో నిందితుడిని పట్టుకుని రూ.25 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. సైబర్ నేరాల్లో 1,351 ఫిర్యాదులు రాగా.. వాటిలో రూ.1.72 కోట్ల నగదు తిరిగి బాధితులకు అందజేశారు. న్యాయ నిరూపణ ద్వారా ఈ సంవత్సరం 100 కేసులలో నిందితులకు శిక్షలు పడ్డాయి. అలాగే ఐదు విడతల లోక్ అదాలత్‌ల ద్వారా 9,595 కేసులు పరిష్కారమయ్యాయి. ఈ సంవత్సరం గణేష్ నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా జిల్లాలో 11 మంది ట్రాన్స్ జెండర్లను ట్రాఫిక్ నిర్వహణ విధుల నిర్వహించి రాష్ట్రంలోనే జగిత్యాల రెండో జిల్లాగా నిలిచింది. జగిత్యాలక్రైం: జిల్లాలో గత సంవత్సరంతో పోలిస్తే 5.05శాతం నేరాలు తగ్గాయి. 2024లో 5,620 నేరాలు నమోదు కాగా.. 2025లో 5,919 నమోదయ్యాయి. గతంతో పోలిస్తే ఈసారి 229 కేసులు, (5.05 శాతం) తగ్గాయి. ఇందులో అత్యధికంగా జగిత్యాల టౌన్ పోలీస్‌స్టేషన్‌లో 770 కేసులు నమోదు కాగా.. అత్యల్పంగా బుగ్గారం పోలీస్‌స్టేషన్‌లో 135 నమోదయ్యాయి. ఈ ఏడాది మొత్తం 29 హత్య కేసులు నమోదు కాగా.. వీటిలో కలహాలు, ఆస్తి వివాదాలు, వరకట్న హత్యలు, చిన్నచిన్న గొడవలు ప్రధాన కారణాలుగా ఉన్నాయి.381 దొంగతనాలు381 ప్రాపర్టీ కేసులు నమోదు కాగా.. వాటిలో 187 కేసులను చేధించి రూ.22,92,37,439 విలువైన ఆస్తి (69.85 శాతం)ని రికవరీ చేశారు. 104 ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు కాగా.. గతేడాదితో పోలిస్తే 5 కేసులు తగ్గాయి. జిల్లాలో 19 పీడీఎస్ రైస్ కేసులు నమోదు చేసి 1,135.69 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఇసుక అక్రమ రవాణాలో 234 కేసుల్లో 410 మంది నిందితులను, 260 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. గేమింగ్ యాక్ట్ కింద 167 కేసులు నమోదు చేశారు. నిందితుల నుంచి రూ.30,62,036 నగదు స్వాధీనం చేసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 9,290 కేసులు నమోదయ్యాయి. ఇందులో 14 మందికి జైలు శిక్షలు పడ్డాయి. అలాగే రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగినప్పటికీ.. మృతుల సంఖ్య తగ్గింది. మాదక ద్రవ్యాలపై 86 కేసులుమాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా 2025లో ఇప్పటివరకు 24.220 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 86 కేసుల్లో 203 నిందితులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు మాదకద్రవ్యాల నివారనే లక్ష్యంగా జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో 189 యాంటీ డ్రగ్ క్లబ్స్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. 75 హిస్టరీ, 33 రౌడీషీట్ కేసులుతరచూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్ప డుతున్న వారిపై 75 హిస్టరీ షీట్లు ఓపెన్ చేశా రు. హత్య కేసుల్లో పాల్గొన్న వారిపై 33 రౌడీ షీట్లు నమోదు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో పీడీ యాక్ట్ కేసు నమోదైంది. డయల్ 100కు 30,954 కాల్స్ రాగా.. 130 కేసులు నమోదు చేశారు. గల్ఫ్ పంపిస్తామని చెప్పి మోసం చేసిన వాటిలో 44 కేసుల్లో 54 మందిని అరెస్ట్ చేశారు. అధిక వడ్డీల పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై ఏడుగురిపై కేసులు నమోదు చేశారు. ఆపరేషన్ స్మైల్ ముస్కాన్ 11లో భాగంగా 11 కార్యక్రమాలు నిర్వహించి 76 మంది పిల్లలను రక్షించి వారి కుటుంబాలకు అప్పగించారు. ఎన్నికల్లో 21 కేసులుఇటీవల జిల్లాలో రెండో సాధారణ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వారిపై 21 కేసులు నమోదు చేశారు. 21 మంది నుంచి రూ.2,07,643 విలువైన 318.76 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. 34 కేసులు నమోదు చేసి 34 మంది నిందితుల నుంచి రూ.180,800 విలువైన 199.5 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ సోదాలుహన్మకొండ డీటీసీగా పనిచేస్తున్న పుప్పాల శ్రీనివాస్ ఇంట్లో కరీంనగర్ ఏసీబీ అధికారులు ఈ ఏడాది ఫిబ్రవరి 2న సోదాలు చేపట్టారు. శ్రీనివాస్‌పై ఆదాయానికి మించి ఆస్తున్నాయని ఆరోపణల నేపథ్యంలో జగిత్యాలలోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ ఏడాది ఆగస్టు 6న జిల్లా రవాణా శాఖ అధికారి బానోవత్ భద్రునాయక్, ఆయన డ్రైవర్ అరవింద్ జేసీబీ వాహనానికి పొల్యుషన్, ఇన్సూరెన్స్ లేదని యజమానిని బెదిరించి రూ.40 వేలు డిమాండ్ చేశారు. సదరు యజమాని ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. -
కొత్త పెళ్లి జోష్.. పార్టీ మత్తు… నదిలో దూకుడు
తిరువొత్తియూరు: కన్యాకుమారి జిల్లా కలియక్కావిలై దగ్గరలోని మెదుగుమ్మల్ ప్రాంతానికి చెందిన ఇవాంజెరీ (28), లాయర్ అయిన ఇతనిపై పలు కొట్లాట కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. నెల క్రితం సాహినియా (25) అనే లాయర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొత్త వరుడు ఇవాంజెరీ, ఈ సంవత్సరం క్రిస్మస్ పండుగను స్నేహితులతో కలిసి ఉత్సాహంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం 24వ తేదీన స్నేహితులతో కుళిత్తురైలోని ఓ ప్రైవేట్ మద్యం బార్‌కు వెళ్లి మద్యం విందులో పాల్గొన్నారు. అక్కడ అందరూ ఉత్సాహంగా మద్యం తాగారు. దీంతో మత్తులో ఉన్న ఇవాంజెరి మద్యం బార్ వెనుకకు వెళ్లాడు. మద్యం మత్తులో ఉన్న అతను అకస్మాత్తుగా తామ్రపరణి నదిలోకి దూకాడు. తర్వాత నీటిలో కొట్టుకుపోయాడు. దీంతో దిగ్భ్రాంతి చెందిన స్నేహితులు ఈ విషయాన్ని అగి్నమాపక కేంద్రానికి తెలియజేశారు. స్థానిక అగి్నమాపక సిబ్బంది శుక్రవారం సాయంత్రం ఓ ప్రాంతంలో అతడి మృతదేహాన్ని గుర్తించారు. -
నిన్న భార్య.. నేడు భర్త.. రెండు నెలలకే విషాదాంతం
యశవంతపుర(బెంగళూరు): కల్యాణం.. కమనీయం అన్నారు. కానీ ఘోర విషాదంగా పరిణమించింది. పట్టుమని 2 నెలలు కూడా కాపురం చేయని నవ వధూవరులు ఆత్మహత్యలతో పరలోకానికి చేరారు. ఈ ఘోరం బెంగళూరులోనే జరిగింది. నవవివాహిత గానవి (26) ఆత్మహత్యాయత్నం, మృతి కేసు అనూహ్య మలుపు తిరిగింది. భార్యను వేధించాడని, నపుంసకుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న భర్త సూరజ్ మహారాష్ట్ర నాగపూర్‌లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అది తెలిసి సూరజ్ తల్లి జయంతి కూడా ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు. అట్టహాసంగా పెళ్లయితే.. గానవి, సూరజ్ (30)లకు అక్టోబర్ 29న బెంగళూరు ప్యాలెస్ మైదానంలో అట్టహాసంగా వివాహమైంది. 12 రోజుల కిందట శ్రీలంకకు హనీమూన్‌కు వెళ్లారు. కానీ అక్కడ ఇద్దరి మధ్య పోట్లాటలు జరిగి మధ్యలోనే ముగించుకొని బెంగళూరుకు వచ్చేశారు. మీ కూతురిని తీసుకెళ్లాలని ఆమె తల్లిదండ్రులకు సూరజ్ ఫోన్ చేసి చెప్పాడు. ఈ గొడవలతో 24న గానవి ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఆస్పత్రిలో 26న చనిపోయింది. నాగపూర్‌కు వెళ్లిపోయి.. గానవి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సూరజ్ కుటుంబంపై పోలీసులు వరకట్న వేధింపులు, ఆత్మహత్యాయత్నం అభియోగాలతో రామమూర్తినగర పోలీసులు కేసును నమోదు చేశారు. అరెస్టు భయంతో సూరజ్, తల్లి జయంతి, సోదరుడు సంజయ్ నాగపూర్‌కు పరారయ్యారు. శనివారం అక్కడే ఓ విల్లాలో సూరజ్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తల్లి జయంతి కూడా ఆస్పతిర్లో చికిత్స పొందుతోంది. ఈ మేరకు స్థానిక సోనేగావ్ పోలీసులు బెంగళూరు పోలీసులకు సమాచారమిచ్చారు.గానవి తల్లి ఏమన్నారు? సూరజ్ ఆత్మహత్యకు అతని తప్పుడు భావనలే కారణమని గానవి తల్లి ఆరోపించింది. నెలన్నర పాటు సూరజ్ సంసారం చేయలేదు, భార్య పక్కన కూర్చుని భోజనం కూడా చేసేవాడు కాదు. భర్త, అత్తల ప్రేమ కోసం గానవి ఎంతో ప్రయతి్నంచింది, పుట్టింటికీ వెళ్లను ఇక్కడ ఉండి బతుకుతా, నాకు ప్రేమను పంచండి అని గానవి భర్త, అత్తతో మొరపెట్టుకుంది. కానీ పుట్టింటికి వెళ్లిపో అని ఒత్తిడి చేశారు. తప్పుడు ఆలోచనలు, గానవి శాపమే సూరజ్ ఆత్మహత్యకు కారణం అని దుయ్యబట్టారు. భర్త సంసారానికి పనికిరాడని.. నవ వధువు -
కుప్పం నియోజకవర్గంలో కీచకపర్వం
చిత్తూరు జిల్లా: కుప్పం నియోజకవర్గంలో దారుణం జరిగింది. ఓ వివాహితపై ముగ్గురు యువకులు లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన 10 రోజుల అనంతరం వెలుగులోకి వచ్చింది. బాధితురాలికి కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.కుప్పం పోలీస్ స్టేషన్లో బాధితురాలి భర్త ఫిర్యాదు చేశారు. కుప్పం మండలం ఎన్. కొత్తపల్లి పంచాయతీ నిమ్మకంపల్లి గ్రామంలో ఘటన జరిగింది. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పరారీలో ఉన్న మరో నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు.విషయం బయటకు చెప్తే.. తన కుటుంబాన్ని అంతం చేస్తామని నిందితులు బెదిరించారని బాధితురాలి భర్త తెలిపారు. దీంతో నా భార్య విషయం బయటకు చెప్పలేక 10 రోజులుగా మానసికంగా కుంగిపోయింది. నన్ను చంపేస్తామని, నా పిల్లలని చంపుతామని నా భార్యను బెదిరించారు’’ అని బాధితురాలి భర్త ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆపరేషన్ థియేటర్లో కామోన్మాది
యశవంతపుర (బెంగళూరు): ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్లో మహిళలు బట్టలు మార్చుకుంటున్న దృశ్యాలను మొబైల్‌ఫోన్ రికార్డ్ చేయడానికి యత్నించాడో జూనియర్ టెక్నిషియన్. నాగరబావి సెకండ్ స్టేజ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సువెందు మెహతా (23) అనే కామోన్మాదిని అన్నపూర్ణేశ్వరి నగర పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన నిందితుడు ఏడాదిగా ఈ ఆస్పత్రిలో టెక్నిషియన్‌గా పని చేస్తూ పీజీ హాస్టల్లో ఉండేవాడు. 20న ఉదయం 8:30 గంటలకు శస్త్రచికిత్స విభాగం గదిలో మహిళా సిబ్బంది బట్టలు మార్చుకొనే దృశ్యాలను రికార్డ్ చేయడానికి రహస్యంగా మొబైల్ఫోన్ని పెట్టాడు. ఫోన్ చూసిన నర్సులు కేకలు వేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రి యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. చదవండి: ఆ నిమిషం గుండె ఆగినంత పనైంది! -
భార్య రూ.200 ఇవ్వలేదని..
శామీర్‌పేట్: మద్యం తాగేందుకు భార్య డబ్బులు ఇవ్వకపోవడంతో మనస్తాపానికి లోనైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సింహాచలం కొన్నేళ్ల క్రితం తూంకుంటకు వలస వచ్చి దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. కొన్నాళ్లుగా అతను మద్యానికి బానిçసయ్యాడు. శుక్రవారం మధ్యాహ్నం అతను మద్యం తాగేందుకు భార్యను రూ. 200 అడిగాడు. తన వద్ద డబ్బులు లేవని అతడి భార్య అందుకు నిరాకరించింది. ఆ తర్వాత కొద్ది సేపటికి ఆమె లోపలికి వెళ్లి చూడగా సింహాచలం సీలింగ్ హుక్కు చీరతో ఉరి వేసుకుని కనిపించాడు. స్థానికుల సాయంతో అతడిని కిందికి దించి 108కు సమాచారం అందించింది. సంఘటన స్థలానికి చేరుకున్న వైద్య సిబ్బంది అతడిని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య కోనారి సుహాసిని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భర్త సంసారానికి పనికిరాడని.. నవ వధువు
యశవంతపుర: ఉరి వేసుకొని ఆత్మహత్యకు యత్నించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నవ వధువు గానవి (26) గురువారం రాత్రి చనిపోయింది. వివరాలు.. అక్టోబర్ ఆఖరిలో సూరజ్‌తో గానవికి వివాహమైంది. వీరిద్దరూ బెంగళూరువాసులే. ఇటీవల శ్రీలంకకు హనుమూన్కు వెళ్లాగా అక్కడే గొడవపడి తిరిగి వచ్చారు. మూడురోజుల కిందట ఆమె భర్త ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా ప్రైవేటు ఆస్పత్రిలో ఐసీయూలో చేర్పించారు. బ్రెయిన్‌డెడ్ అయి చివరకు మరణించింది. అతడు మగాడు కాదు గానవి పెద్దమ్మ మాట్లాడుతూ భర్త నపుంసకుడని, సంసారానికి పనికిరాడని గానవి తొలి రాత్రిరోజే తనకు చెప్పి బాధపడిందన్నారు. పెద్దమొత్తంలో బంగారం, స్థలం, కారు, ప్రతి నెలా ఖర్చులకు డబ్బులు ఇవ్వాలని భర్త వేధించేవాడని బంధువులు అరోపించారు. వారి ఫిర్యాదు మేరకు రామమూర్తినగర పోలీసులు నమోదుచేశారు. -
అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి..
-
రెండు కుటుంబాల్లో అలుముకున్న చీకట్లు
ఆ రెండు కుటుంబాల్లో ఒకేసారి చీకట్లు అలుముకున్నాయి. రోడ్డు ప్రమాదం.. వాళ్ల ఏకైక బిడ్డలను బలిగింది. బాల్యమిత్రులైన ఇద్దరు స్నేహితుల జీవిత ప్రయాణం అనూహ్యంగా.. అర్ధాంతరంగా ముగిసిపోయింది. సాక్షి, కామారెడ్డి: మాచారెడ్డి మండలం లచ్చాపేట గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. జక్కుల సాయికిషోర్(21), మిరిదొడ్డి అజయ్(21) అనే స్నేహితులు గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. మరణించిన వారు తమ కుటుంబాలకు ఏకైక కుమారులే. యువకుల తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మాచారెడ్డి చౌరస్తా నుంచి లచ్చాపేటకు ద్విచక్రవాహనంపై వెళ్తున్న వీరిద్దరూ శివారులో రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొన్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ స్థానికులు కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కొంపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మొదట సాయికిషోర్, తర్వాత కొంతసేపటికి అజయ్ మరణించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. బాధితుల్లో ఒకరి కాలి ఎముక.. ఆ లారీ చక్రానికి తగిలి టైరు పంక్చర్ అయ్యిందంటే.. ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు!. అందుకే అతివేగం అత్యంత ప్రమాదం అని చెప్పేది. -
ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
సిర్పూర్: మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన కుటుంబాన్ని విషాదంలో ముంచింది. ఈ ప్రమాదంలో జిల్లాకు చెందిన నలుగురు మహిళలు మృతిచెందారు.. ఈ ఘటన దేవాడ్-సోండో సమీపంలో చోటుచేసుకుంది.స్థానికులు మరియు కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, కాగజ్ నగర్ పట్టణంలోని నిజాముద్దీన్ కాలనీకి చెందిన జాకీర్ కుటుంబం వైద్యం కోసం నాగ్‌పూర్‌లోని ఆస్పత్రికి వెళ్ళారు. వారితో పాటు బంధువులూ ఉన్నారు.బుధవారం అర్ధరాత్రి దాటాక తిరుగు ప్రయాణంలో వీరు వస్తున్న కారు అదుపుతప్పి వంతెన పైనుంచి పడింది. ఈ ప్రమాదంలో జాకీర్ భార్య సల్మా బేగం, కుమార్తె శబ్రీమ్ మరియు బంధువులు ఆఫ్జా బేగం, సహారా మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చంద్రపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
పెప్పర్ స్ప్రే కొట్టి భర్తపై భార్య దాడి
విశాఖ సిటీ: తన భార్య, కుమార్తె, ఆమె స్నేహితుడు తనపై పెప్పర్ స్ప్రే కొట్టి, దాడికి పాల్పడ్డారని దీపాటి జార్జ్ మార్టిన్ అనే వ్యక్తి మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు.. మారి్టన్(56) భార్య హన్నా మార్టిన్, ఇద్దరు పిల్లలతో పాండురంగాపురం ప్రాంతంలో నివాసముంటున్నారు. భార్య పేరు మీద ఒక ఇంజనీరింగ్ కంపెనీని ప్రారంభించి, కాంట్రాక్టు పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రెండేళ్ల నుంచి భార్య హన్నా మార్టిన్ ఆ కంపెనీ ఆర్థిక వ్యవహారాలను తన చేతుల్లోకి తీసుకున్నారు. ఆయన చేసిన కాంట్రాక్టు పనుల బిల్లులు సదరు కంపెనీ అకౌంట్లోనే పడడంతో వాటిని తీసుకునే అవకాశం మారి్టన్కు లేకుండా పోయింది. నాలుగు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన మారి్టన్ తన తల్లి, కుటుంబ సభ్యులతో ఉంటున్నారు. మంగళవారం పని మీద ఇంటికి వెళ్లడంతో అక్కడ భార్య, కుమార్తె, అమె స్నేహితుడు మార్టిన్‌పై పెప్పర్ స్ప్రే కొట్టి దాడి చేశారు. అతడి కాలు, చేతికి గాయాలవడంతో కేజీహెచ్‌లో చికిత్స చేయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లంకెలపాలెంలో అర్ధరాత్రి హత్య
పరవాడ: లంకెలపాలెం దరి శ్రీరామనగర్ కాలనీ వద్ద మంగళవారం అర్ధరాత్రి కాలనీకి చెందిన ఈగల వెంకినాయుడు(40) దారుణ హత్యకు గురయ్యాడు. ఘటనకు సంబంధించి పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు తెలిపిన వివరాలు.. లంకెలపాలెం దరి శ్రీరామనగర్‌కాలనీ(విలేకరుల కాలనీ)కి చెందిన వెంకినాయుడు.. మొల్లి సరస్వతి అనే మహిళతో కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు. హతుడి భార్య, ఇద్దరు పిల్లలు పెద్దినాయుడుపాలెం ఉంటారు. మృతుడు ల్యాండ్ సెటిల్మెంట్లు చేయడంతో పాటు కూర్మన్నపాలెంలోని ఓ జిమ్‌లో కోచ్. మంగళవారం రాత్రి కాలనీలోని ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకున్నాడు. రాత్రి 1 గంట సమయంలో తేజ అనే వ్యక్తి వచ్చి వెంకినాయుడును బయటకు రమ్మని పిలిచాడు. హతుడు స్వెటర్ వేసుకుని వెళ్లడం చూసిన సరస్వతి, ఏదో పని మీద బయటకు వెళుతున్నారని భావించి నిద్రపోయింది. వేకువ జామున లేచి వెంకినాయుడుకు, తేజకు ఫోన్ చేసింది. అటునుంచి సమాధానం రాలేదు. ఉదయానికి వెంకినాయుడు మృతదేహం సమీపంలోని లేఅవుట్లో పడి ఉందని స్థానికులు చెప్పడంతో.. వెళ్లి చూసి, హత్యకు గురైంది వెంకినాయుడేనని నిర్ధారించుకుని పరవాడ పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి షర్ట్ చిరిగి ఉండటంతో స్నేహితుల మధ్య పెనుగులాట జరిగి ఉంటుందని, సమీపంలో లభ్యమైన 10 కిలోల బరువుండే బండ రాయితో తలపై గట్టిగా మోదడంతో తల నుజ్జుయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరవాడ డీఎస్పీ వి.విష్ణుస్వరూప్, సీఐ ఆర్.మల్లికార్జునరావు సందర్శించారు. క్లూస్ టీంను రంగంలోకి దించి వివరాలు రాబట్టారు. స్థానికులు, కుటుంబ సభ్యుల నుంచి హత్యకు గల కారణాలను ఆరా తీశారు. ల్యాండ్ సెటిల్మెంట్లే కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదుచేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. -
బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి రాంగ్ రూట్లో..
సాక్షి, హైదరాబాద్: నగరంలో డ్రగ్స్ దందా మరోసారి బయటపడింది. ఈసారి.. చిక్కడపల్లిలో బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్‌ను విక్రయిస్తున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుస్మిత అనే యువతి నగరంలోని ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పని చేస్తోంది. అయితే.. తన బాయ్ ఫ్రెండ్ ఇమాన్యుల్‌తో కలిసి డ్రగ్స్ దందా నడుపుతోంది. ఈ క్రమంలో ముఠా గుట్టు రట్టు కావడంతో ఈ ప్రేమ జంట కటకటాల పాలైంది. సుస్మిత, ఇమాన్యుయెల్ సహా మొత్తం నలుగురి పోలీసులు అదుపులోకి తీసుకుని వాళ్ల నుంచి ఎండీఎంఏ, LSD బాటిళ్లు, ఓజీ కుష్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.4 లక్షల దాకా ఉండొచ్చని అధికారులు తెలిపారు. -
గచ్చిబౌలి: ఏఐతో కాపీ కొట్టి.. అలా ఇన్విజిలేటర్‌కు దొరికారు!
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ ఎగ్జామ్స్‌లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ వ్యవహారంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీని ఉపయోగించి కాపీ కొట్టే ప్రయత్నంలోనే అనూహ్యంగా ఆ ఇద్దరూ దొరికిపోయారని పోలీసులు వెల్లడించారు. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ బాలరాజు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ పరీక్షలు జరిగాయి. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ ఇద్దరు అభ్యర్థులు అనిల్ కుమార్, సతీష్ పట్టుబడ్డారు. వర్సిటీ రిజిస్ట్రార్ దివేశ్ నిగం ఫిర్యాదుతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశాం.అయితే.. డిసెంబర్ 21వ తేదీన నిర్వహించిన పరీక్షల్లో ఇద్దరు ఏఐతో పరీక్ష కాపీ కొట్టబోయారు. ముందుగా.. షర్ట్ బటన్లకు అమర్చిన మైక్రో స్కానర్లతో పేపర్ స్కాన్ చేశారు. తరచూ బాత్రూమ్కు వెళ్లి ఏఐ సాయంతో సమాధానాలు సేకరించారు. చెవిలో ఉన్న బ్లూటూత్ పరికరాల ద్వారా సమాధానాలు వింటూ ఎగ్జామ్ రాశారు. ఈ క్రమంలో.. బ్లూటూ్ నుంచి వచ్చిన ‘బీప్’ శబ్దంతో ఇన్విజిలేటర్‌కు అనుమానం వచ్చి తనిఖీలు నిర్వహించడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటనలో.. నిందితుల మొబైల్ ఫోన్, బ్లూటూత్ ఇయర్ ఫోన్స్, మైక్రో ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. -
మరిది.. నీ భార్యకు వేరొకరితో సంబంధం ఉంది!
తమిళనాడు: తన భార్యతో తరచూ ఘర్షణ పడుతుందనే కారణంతో వదిననూ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన మరిదిని మప్పేడు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ ఇరుళంజేరి గ్రామానికి చెందిన ఇళయరాజ. ఇతడికి అదే ప్రాంతానికి చెందిన శాంతిమేరితో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు వున్నారు.కాగా ఇళయరాజ సోదరుడు ఇసైమేగం(29). ఇతడికి పేరంబాక్కం గ్రామానికి చెందిన లావణ్య(24)తో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం లావణ్య మూడు నెలల గర్బవతి. ప్రస్తుతం ఉమ్మడి కుటుంబంగా నివాసం ఉంటున్నారు. కాగా శాంతిమేరికి వివాహమై రెండు సంవత్సరాల తరువాత పిల్లలు పుట్టగా, లావణ్యకు వివాహమైన నాలుగు నెలలకే గర్బం దాల్చింది. ఈ విషయమై శాంతిమేరి తరచూ లావణ్యకు వివాహానికి ముందే వేరొకరితో సంబంధం ఉందంటూ ఇబ్బంది పెట్టినట్టు తెలుస్తోంది. ఇదే విషయమై ఆదివారం రాత్రి శాంతిమేరికి, లావణ్యకు చిన్నపాటి ఘర్షణ జరగడంతో ఆగ్రహించిన ఇసైమేగం తన భార్యకు అక్రమ సంబందాన్ని అంటగట్టుతున్నారనే ఆగ్రహంతో వదినపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డన శాంతిమేరిని స్థానికులు చికిత్స కోసం తిరువళ్లూరుకు తరలించగా మార్గంమధ్యలోనే మృతిచెందింది. ఈ ఘటన ఇరుళంజేరిలో తీవ్ర సంచనలం కలిగింది. మప్పేడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
క్రిఫ్టో కరెన్సీ ఇస్తా అంటూ..దృష్టి మరల్చి కోటి రూపాయలతో ఉడాయింపు
హైదరాబాద్ : నగదుకు బదులుగా క్రిప్టో కరెన్సీ ఇస్తానంటూ నమ్మబలికి దృష్టి మరల్చి రూ కోటి నగదుతో ఉడాయించిన ఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.. వివరాల్లోకి వెళితే.. మెహదీపట్నం ప్రాంతానికి చెందిన ఉమర్ (35) అనే వ్యాపారవేత్తకు ఇటీవల సోమవారం సాయంత్రం బంజారా శాలిబండ ప్రాంతానికి చెందిన ఎత్తెషామ్ ఆన్ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తాము క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ చేస్తామని నమ్మబలికాడు.దీంతో అతడి మాటలు నమ్మిన ఉమర్ సోమవారం సాయంత్రం రోడ్ నెంబర్ 1 లోని తాజ్ దక్కన్ హోటల్ కు వచ్చాడు.. రూ. కోటి కి బదులుగా క్రిప్టో కరెన్సీ ఇస్తామని చెప్పడంతో కోటి రూపాయల నగదును అప్పగించాడు. కొన్ని నిమిషాల్లోనే క్రిప్టో కరెన్సీ వస్తుందంటూ దృష్టి మరల్చిన నిందితుడు అక్కడి నుంచి ఉడాయించాడు.ఎంతసేపు గడిచినా ఎతేశ్యామ్ వెనక్కి రాకపోవడం, అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు ఉమర్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. -
పూర్ణిమా..వాడిని వదిలేయ్!
హైదరాబాద్: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ భార్య భర్తను కడతేర్చింది. ఈ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్ ఈస్ట్ బృందావన్ కాలనీలో నివాసం ఉంటున్న వి.జె.అశోక్ (45) ఓ ప్రైవేట్ కళాశాలలో మేనేజర్‌గా పనిచే స్తున్నాడు. భార్య పూర్ణిమ ప్లేస్కూల్ నిర్వహిస్తోంది. వేరేకాలనీ లో ఉన్నప్పుడు నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న పాలేటి మహేశ్ (22)తో పూర్ణిమ కొన్ని సంవత్సరా లనుంచి వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయంలో అశోక్ గతంలో భార్య ను మందలించాడు. ఈనెల 10వ తేదీన ఇంటిముందు మహేశ్ కనిపించడంతో పూర్ణిమతో భర్త గొడవ పడ్డాడు. దీంతో ఎలా గైనా అశోక్ అడ్డు తొలగించుకోవాలని మహేశ్, పూర్ణిమ పథకం పన్నారు. 11వ తేదీన సాయంత్రం ముందుగా మహేశ్ తన స్నేహితుడు బూక్యా సాయితో కలిసి అశోక్కోసం ఇంట్లోనే వేచి చూస్తున్నారు. అశోక్ ఇంటికి రాగానే ముగ్గురూ మూకుమ్మడిగా అతనిపై దాడికి పాల్పడ్డారు. పూర్ణిమ అశోక్ కాళ్లు పట్టుకోగా, ప్రియుడు, మరోవ్యక్తి మెడకు మూడు చున్నీలను బిగించి హత్యకు పాల్పడ్డారు. అనంతరం అనుమానం రాకుండా మృతుడి ఒంటిపై రక్తపు మరకలున్న దుస్తులను మార్చి, అంబులెన్స్‌లో అశోక్‌ను మల్కాజిగిరి ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు తెలిపారు. వాష్‌రూంలో హార్ట్ ఎటాక్ వచ్చి తన భర్త అపస్మారక స్థితిలోకి వెళ్లాడని పూర్ణిమ బంధువులను నమ్మించింది. ఆసుపత్రి సిబ్బంది మేడిపల్లి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి ఒంటిపై గాయాలు కనిపించడంతో అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా భార్యను విచారించగా ప్రియుడు, మరోవ్యక్తి సాయంతో హత్యచేసినట్లు ఒప్పుకుంది. ప్రియుడు మహేశ్‌తోపాటు సహకరించిన సాయిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి
పశ్చిమగోదావరి జిల్లా: ఆచంట నియోజకవర్గ పరిధిలోని పెనుమంట్ర మండలం పోలమూరు గ్రామంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అతివేగంతో రోడ్డుపై ఉన్న డివైడర్‌ను ఢీకొట్టడంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు.ఈ ప్రమాదంలో పోలమూరు గ్రామానికి చెందిన సత్యనారాయణ (28), అంజిబాబు (25), రాజు (19) మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ముగ్గురూ ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.స్థానికుల కథనం ప్రకారం, క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న అనంతరం అర్ధరాత్రి 12.30 సమయంలో ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొనడంతో ముగ్గురు యువకులు తీవ్ర గాయాలకు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.సమాచారం అందుకున్న పెనుమంట్ర పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పంచనామా నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి అతివేగమే ప్రధాన కారణమని స్థానికులు చెబుతుండగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
అనంతపురంలో కాల్పుల కలకలం
సాక్షి, అనంతపురం: జిల్లాలోని ఆకుతోటపల్లిలో సోమవారం కాల్పుల కలకలం రేగింది. ఓ కేసులో నిందితుడిని పట్టుకోవడానికి వెళ్లిన టౌటౌన్ సీఐ శ్రీకాంత్‌పై దాడి యత్నం జరిగింది. దీంతో ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా సీఐ కాల్పులు జరపడంతో నిందితుడు గాయపడ్డాడు. స్థానికంగా ఉన్న అజయ్ అనే వ్యక్తి నిన్న మద్యం మత్తులో ఓ యువకుడిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు కావడంతో అజయ్‌ను అరెస్ట్ చేయడానికి వెళ్లారు. అయితే నిందితుడు సీఐ శ్రీకాంత్‌పై కత్తితో దాడికి యత్నించగా.. ఆయన తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్పులు జరిపారు. దీంతో అజయ్ కాలు నుంచి తూటా దూసుకెళ్లింది. ఈ ఘటనలో సీఐ శ్రీకాంత్‌కు సైతం గాయాలైనట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి అదనపు సమాచారం అందాల్సి ఉంది. -
కులాంతర వివాహం : ఆరునెలల గర్భిణీని హత్య చేసిన తండ్రి
కర్ణాటకలోని హుబ్బళ్లిలో దారుణం చోటు చేసుకుంది. వేరేకులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న దురహంకారంతో కన్నకూతుర్ని హతమార్చాడో తండ్రి. ఆరు నెలల గర్భిణీ అని కూడా చూడకుండా కన్నబిడ్డను అత్యంత పాశవికంగా చేసిన హత్య ఆధునిక సమాజంలో కూడా వేళ్లూనుకొనిపోయిన కుల అహంకారానికి అద్దం పట్టింది.హుబ్బళ్లి గ్రామానికి చెందిన 19 ఏళ్ల మాన్య పాటిల్ కులాంతర వివాహం చేసుకుంది. కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ఈ ఏడాది మేలో ప్రేమికుడిని పెళ్లాడింది. చంపేస్తారేమోననే భయంతో స్వగ్రామానికి దూరంగా 100 కి.మీ దూరంలో ఉన్న హవేరి జిల్లాలో భర్తతోకలిసి నివసిస్తోంది. ప్రస్తుతం ఆరు నెలల గర్భిణి. ఊర్లో ఉంటున్న అత్తమామల వద్దకు ఆదివారం నాడు వచ్చింది. ఇది పసిగట్టిన ఆ యువతి తండ్రి మరో ముగ్గురితో కలిసి ఆమెపై దాడికి దిగారు. ముందు ఆమె భర్త, మామ వ్యవసాయ పొలంలో ఉన్నప్పుడు వారిపై దాడి చేయడానికి ప్రయత్నించారు. వారు తప్పించుకోవడంతో, సాయంత్రం 6 - 6:30 గంటల మధ్య, ఇనుప పైపులతో సాయుధులైన దుండగులతో కలిసి బాధితురాలి ఇంట్లోకి చొరబడ్డాడు తండ్రి. ఆరు నెలల గర్భవతి మాన్యపై దారుణంగా ఎటాక్ చేశారు. దీంతో ఆమె ప్రాణాలొదిలింది. సంఘటనా స్థలంలోనే ఉన్న అత్తమామలు రేణుకమ్మ, సుభాష్ ఆమెను రక్షించడానికి ప్రయత్నించారు.వారిపై కూడా దారుణంగా దాడి చేశాడు. వారు తీవ్ర గాయాలతో అసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ సంఘటనలో పోలీసులుమాన్య తండ్రి ప్రకాష్ ఫక్కిర్గోడా, మరో ఇద్దరు దగ్గరి బంధువులను అనుమానితులుగా అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది. కాగా ఈ వివాదంలోగతంలఘీ రెండు కుటుంబాల మధ్య సయోధ్య కుదర్చడానికి , ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా నివారించడానికి గతంలో ప్రయత్నాలు జరిగినట్టు తెలుస్తోంది. ఇంత జరిగినా చివరికి కన్నబిడ్డనే హతమార్చిన ఘటన తీవ్ర ఆందోళన రేపింది. -
విషమంగానే హైడ్రా కమిషనర్ గన్‌మెన్ పరిస్థితి
సాక్షి, హైదరాబాద్: హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్‌మెన్ కృష్ణ చైతన్య(32) తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య యత్నం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎల్బీనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అతనికి చికిత్స కొనసాగుతోంది. తాజాగా హెల్త్ బులిటెన్‌ను వైద్యులు విడుదల చేశారు. బుల్లెట్ దెబ్బకు తలకు బలమైన గాయం కావడంతో కృష్ణచైతన్యకు సర్జరీ చేశామని.. అయితే అతని పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు బులిటెన్ ద్వారా వెల్లడించారు. చికిత్స కొనసాగుతోందని.. 48 గంటలు గడిస్తేగానీ పరిస్థితి ఏంటన్నది చెప్పలేమన్నారు. హయత్‌నగర్‌లోని ఇంట్లో ఆదివారం కృష్ణచైతన్య తుపాకీతో పేల్చుకోవడంతో.. వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. తొలుత వ్యక్తిగత కారణాలతోనే ఆయన ఆత్మహత్యకు యత్నించినట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ కారణం ఏంటన్నది స్వయంగా రంగనాథే మీడియాకు వెల్లడించారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే ఆస్పత్రికి వెళ్లి కృష్ణచైతన్య కుటుంబ సభ్యులను రంగనాథ్ పరామర్శించారు. ‘‘దాదాపు రెండేళ్ల క్రితం బెట్టింగ్ యాప్‌లు, గేమింగ్ యాప్‌ల కారణంగా ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు. అప్పుల కారణంగా అతడి జీతంలో ఎక్కువ భాగం కట్ అవుతోంది. కుటుంబ సమస్యల కారణంగా సుమారు 3 నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పుడు హయత్‌నగర్ పీఎస్‌లో ఫిర్యాదు నమోదైంది. అప్పటి నుంచి నాడీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. విధుల్లో బాగానే ఉంటున్నాడు. ఆదివారం ఉదయం ఆత్మహత్యకు యత్నించాడు. ఆయనకు సర్జరీ జరుగుతోంది. దయచేసి ఈ విషయాన్ని సంచలనం చేయొద్దు’’ అని మీడియాకు రంగనాథ్ విజ్ఞప్తి చేశారు. -
మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, మంచిర్యాల: జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జైపూర్ మండలం ఇందారం వద్ద కూలీలతో వెళ్తున్న బోలెరో వాహనాన్ని ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో మగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆగి ఉన్న లారీని బోలెరో ఢీ కొట్టడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై పోలీసుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. -
అప్పులిచ్చినవారి వేధింపులు భరించలేక..
బెజ్జంకి (సిద్దిపేట): అప్పులిచ్చిన వారి వేధింపులు భరించలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని దాచారం గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీనివాస్, రేణుకలకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శ్రీహర్ష (33)కు మూడేళ్ల క్రితం రుక్మిణి (28)తో వివాహం జరిగింది. బెజ్జంకిలో వస్త్ర దుకాణం పెట్టుకుని అక్కడే జీవిస్తున్నారు. వీరికి కూతురు హరిప్రియ ఉంది. కాగా శ్రీహర్ష తన మిత్రుడి వద్ద డబ్బులు తీసుకుని, మరో మిత్రునికి ఇచ్చాడు. డబ్బులివ్వాలని అప్పుచి్చన వ్యక్తి మరో ముగ్గురితో కలిసి వేధిస్తుండగా, తీసుకున్న వ్యక్తి ఇవ్వడం లేదు. ఈ క్రమంలో వారి వేధింపులతో అవమానంగా భావించిన శ్రీహర్ష, భార్య, కూతురుతో కలిసి క్రిమిసంహారక మందు తాగారు. చిన్నారి రోదన విని సమీప వ్యక్తులు శ్రీహర్ష తండ్రికి సమాచారమందించారు. అతను వచ్చి ఇంటి తలుపులు తెరిచి వెళ్లేసరికి అప్పటికే రుక్మిణి మృతి చెందింది. శ్రీహర్ష, చిన్నారిని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం శ్రీహర్షను కరీంనగర్ ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కాగా చిన్నారి సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తమ చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. సంఘటనా స్థలాన్ని ఏసీపీ రవీందర్‌రెడ్డి, రూరల్ సీఐ శ్రీను, ఎస్ఐ సౌజన్య పరిశీలించారు. -
దారుణం.. భార్య కాపురానికి రావడం లేదని..
హవేళిఘణాపూర్(మెదక్): ఓ వ్యక్తి భార్యపై అనుమానంతో తరచూ గొడవలు పడుతుండటంతో భరించలేని ఆమె తల్లిగారింటికి వెళ్లిపోయింది. అయితే ఆమె తిరిగి కాపురానికి రావ డం లేదనే అక్కసుతో అతను తన కుమారుడిని హత్య చేశాడు. మెదక్ జిలాల్లోని మెదక్ మండలంలో ఆదివారం ఈ ఘటన వెలుగు చూసింది. మెదక్ రూరల్ పోలీసుల కథనం ప్రకారం.. పెద్ద బాయి తండాకు చెందిన భాస్కర్ తన భార్య అమీనాపై అనుమానంతో తరచూ గొడవ పడుతుండేవాడు. ఈనెల 19న సాయంత్రం భాస్కర్ తన భార్యను కొట్టడంతో ఆమె పిల్లలను వదిలివేసి తల్లిగారింటికి వెళ్లిపోయింది. దీంతో తిరిగి కాపురం చేసేందుకు రావడంలేదనే కోపంతో అతను శనివారం రాత్రి నిద్రిస్తున్న తన చిన్న కుమారుడు లక్కీ(3)ని గొంతు నొలిమి చంపాడు. ఈ ఘటనపై తల్లి అమీనా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మెదక్ రూరల్ ఎస్ఐ లింగం తెలిపారు. ప్రస్తుతం చిన్నారి లక్కీ మృతదేహాన్ని మెదక్‌జిల్లా ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. -
విజయవాడలో మళ్లీ డ్రగ్స్ కలకలం
సాక్షి, అమరావతి: విజయవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. మాచవరం పీఎస్ పరిధిలో డ్రగ్స్ సేవిస్తున్న ముగ్గురిని పోలీసులు అర్థరాత్రి అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితులను నుంచి ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరుకు చెందిన మరో నిందితుడు అనూహ్యంగా పోలీసుల అదుపులో నుంచి పరారైనట్లు తెలుస్తోంది. విజయవాడలోని ఓ హోటల్లో నిందితులు ముగ్గురు డ్రగ్స్ తీసుకుంటుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వీరి నుంచి మత్తుమందు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి వారు ఉపయోగించిన కారుతో సహా స్టేషన్‌కు తరలించారు. అయితే కారు పార్కు చేసి రావాలని నిందితుడికే తాళాలు అప్పగించడంతో అతడు పరారైనట్లు తెలుస్తోంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. విజయవాడలోని మధురానగర్, సింగ్‌నగర్‌కు చెందిన నిందితులిద్దరూ ఇంటర్ తర్వాత చదువు మానేసి చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. స్నేహితుల పార్టీల్లో వీళ్లకు ఎండీఎంఏ అలవాటైంది. అలా తరచూ బెంగళూరు వెళ్లి అక్కడ కొని విజయవాడ తెచ్చి స్నేహితులతో కలిసి తీసుకునేవారు. ఈనెల 19న కారులో వీరిద్దరూ బెంగళూరుకు బయలుదేరారు. 20న అక్కడకు చేరుకున్నారు. అక్కడ ఓ వ్యక్తి వద్దకు వెళ్లి రూ.36వేలు చెల్లించి 19 గ్రాముల డ్రగ్స్ కొనుగోలు చేశారు.వీరు బెంగళూరు వెళ్లిన విషయాన్ని నిందితుల్లో ఒకడి స్నేహితుడి ద్వారా నెల్లూరుకు చెందిన మరో యువకుడు తెలుసుకున్నాడు. వెంటనే ఫోన్ చేసి తనకు తెలిసిన వ్యక్తి నుంచి 2 గ్రాముల ఎండీఎంఏ తీసుకురావాలని కోరాడు. అయితే.. అప్పటికే బెంగళూరులో ఉన్న నిందితుల్లో ఒకడు పోలీసుల నిఘా ఉందని చెప్పాడు. తర్వాత బతిమిలాడి ఒప్పించి డబ్బులు పంపించాడు. బెంగళూరు నుంచి రెండు గ్రాములు తీసుకుని కారులో బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో నెల్లూరులో దిగి ఎండీఎంఏ ఇచ్చారు. అక్కడవారు కొంత డ్రగ్స్ తీసుకున్నారు. అయితే.. కారు మొరాయించడంతో అక్కడే వదిలేసి, నెల్లూరుకు చెందిన నిందితుడి కారులో ముగ్గురూ విజయవాడ చేరుకుని మాచవరం స్టేషన్ పరిధిలోని ఓ హోటల్లో దిగారు. అక్కడ ముగ్గురూ డ్రగ్స్ తీసుకుని మత్తులో మునిగి తేలారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు హోటల్‌పై దాడి చేసి, వీరిని పట్టుకుని 10 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. వీరికి ఎండీఎంఏ అమ్మిన ఇద్దరి కోసం మరో బృందం బెంగళూరు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. నగరంలో ఈ మధ్యకాలంలో ఇలాంటి వ్యవహారాలు తరచూ వెలుగు చూస్తుండడం గమనార్హం. అయినా కూడా మాదకద్రవ్యాలు కట్టడి చేయలేకపోతున్నారంటూ పోలీస్ శాఖపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
దారి తప్పుతున్న యువ ఖాకీలు
ఒకప్పుడు సరదాగా మొదలైన బెట్టింగ్ ఇప్పుడు అనేక మందికి వ్యసనంగా మారింది. అయితే కేవలం సాధారణ పౌరుల జీవితాలను మాత్రమే ఛిన్నాభిన్నం చేస్తోందని అనుకోవడానికి వీల్లేకుండా పోయింది. ఈ మహమ్మరి కోరల్లో చిక్కుకుని పోలీస్ సిబ్బంది కూడా దారి తప్పుతున్నారు. అందుకు వరుసగా వెలుగుచూసిన ఉదంతాలే కారణం!ఆన్లైన్ బెట్టింగ్తో అప్పులపాలై.. సర్వం కోల్పోయి.. తన దగ్గర గన్‌మెన్‌గా పని చేస్తున్న కృష్ణ చైతన్య ఆత్మహత్యకు ప్రయత్నించాడని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. అంతకు ముందు.. ఈ వలయంలో చిక్కుకున్న ఓ అధికారి(అంబర్‌పేట ఎస్సై భానుప్రకాశ్) దాని నుంచి బయటపడేందుకు ఏకంగా సర్వీస్ రివాల్వర్‌తో పాటు ఓ కేసులో రికవరీ బంగారాన్ని తాకట్టపెట్టాడనే అభియోగాల కింద విచారణ ఎదుర్కొంటున్నారు.ఈ మధ్యలో.. నగరంలోని ఉప్పల్‌లో ఫిల్మ్‌నగర్ పీఎస్‌లో పని చేసే ఓ యువ కానిస్టేబుల్ ఆన్లైన్ బెట్టింగ్‌ల ఉన్న ఇంటిని అమ్మేసుకుని.. విధులకు దూరంగా ఉంటూ వస్తూ.. చివరకు ఒత్తిళ్ల నడుమ మానసికంగా కుంగిపోయి బలవన్మరణానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. అలాగే ఆ మధ్య సంగారెడ్డి టౌన్ పోలీస్‌స్టేషన్‌లో పని చేసిన ఓ కానిస్టేబుల్ పిస్టల్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకోవడం వెనుక ఈ భూతమే ఉందనే ప్రచారం నడిచింది. చిన్న మొత్తాలతో ప్రారంభించిన ఆన్లైన్ గేమింగ్ వ్యసనం.. ఆ తరువాత పెద్ద అప్పులకు దారితీస్తోంది. గేమ్‌లలో డబ్బులు కోల్పోయి, సహోద్యోగులు.. స్నేహితుల వద్ద అప్పులు చేసి తిరిగి ఇవ్వలేని స్థితికి పోలీసు సిబ్బంది చేరుకుంటున్నారు. అప్పులు తీర్చమని ఒత్తిడి పెరగడంతో చివరకు.. మానసికంగా తీవ్రంగా కలత చెంది తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు.బెట్టింగ్ మహమ్మారి కోరల్లో పోలీసులు.. అందునా యువ సిబ్బంది చిక్కుకుపోతుండడం ఇటు ఉన్నతాధికారులకూ ఆందోళన కలిగిస్తోంది. బెట్టింగ్ వ్యసనం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన ఉండి.. అందునా టెక్నాలజీపై పట్టుఉన్న సిబ్బంది కూడా ఆ వ్యసనంలో మునిగిపోతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని అంటున్నారు. దీన్ని అత్యవసరంగా కట్టడి చేసేందుకు కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం పోలీస్ శాఖలో బలంగా వినిపిస్తోంది. -
కొడుకులు కాదు.. దుర్మార్గులు
ఆ పెద్దాయన్ని పాము కాటేసింది. స్థానికులు సకాలంలో స్పందించి ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. హమ్మయ్యా.. అనుకుంటున్న టైంలో వారం వ్యవధిలోనే మరోసారి పాము కాటుకు గురయ్యాడు. ఈసారి ఆస్పత్రికి వెళ్లడం బాగా ఆలస్యమై ప్రాణం పోయింది. అయితే కొడుకుల దొంగ చూపులు.. పొంతన లేని సమాధానాలు.. వాళ్ల కాల్ డాటా.. తండ్రి ఇన్సూరెన్స్ సొమ్ము కోసం పడ్డ తాపత్రయం.. ఇది పక్కా స్కెచ్చేసి చేసిన హత్య అని బయటపెట్టాయి. తండ్రికి రూ.3 కోట్ల దాకా బీమా చేయించి.. ఆపై పాము కాటుతో చంపించిన అమానవీయ ఘటన తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో జరిగింది. రకరకాల వ్యాపారాలు చేసి.. అప్పుల పాలైన ఇద్దరు తనయులు తమ స్నేహితుల సాయంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టారని పోలీసులు నిర్ధారించారు. ఒకసారి స్థానికులు తండ్రిని రక్షించగా.. మరోసారి ఎలాంటి ఆటంకం లేకుండా తమ ప్లాన్‌ను అమలు పరిచారు ఈ దుర్మార్గులు. ఈ ఘోరం వివరాల్లోకి వెళ్తే.. పొదటూర్పేట్ గ్రామానికి చెందిన ఈపీ గణేశన్(56).. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. అక్టోబర్ 22వ తేదీన పాము కాటుతో ఇంట్లోనే ఆయన చనిపోయారు. అయితే.. వారం తిరగకుండానే కుటుంబం ఇన్సూరెన్స్ కోసం క్లెయిమ్ చేయడంతో ఆ కంపెనీ వాళ్లకు అనుమానం వచ్చింది. పోలీసులకు ఈ విషయం చేరవేయడం.. వాళ్లు దర్యాప్తును ముమ్మరం చేయడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. గణేష్ కొడుకు మోహన్‌రాజ్(26), హరిహరన్(27) ప్రైవేట్ ఉద్యోగులు. అయితే ఆన్లైన్ బెట్టింగ్‌లు, ఇతర విలాసాల కోసం అడ్డగోలుగా అప్పులు చేసి ఉన్నారు. ఈ క్రమంలో తండ్రి పేరిట ఇన్సూరెన్స్‌లు చేయించి హతమార్చాలనే దుర్మార్గపు ఆలోచన చేశారు. దీనికి నలుగురు స్నేహితుల సాయం కోరారు. అక్టోబర్ 15వ తేదీన ఒక పామును గణేశన్ మీదకు వదిలారు. అది కాలి మీద కాటేయడంతో.. ఆయన నొప్పితో అరిచారు. దీంతో స్థానికులు ఆస్పత్రికి తరలించి రక్షించారు. వారం తర్వాత ఈసారి మరింత విషపూరితమైన పామును తెచ్చి మెడ మీద కాటు వేయించారు. ఈసారి ఆయన అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కారు. తలుపులు వేసి ఉండిపోయారు. ఆపై చాలా ఆలస్యంగా ఆస్పత్రికి తరలించారు. దీంతో పాము పగ బట్టి చంపిందంటూ స్థానికంగా ప్రచారం జరిగింది.అయితే.. వారం తిరగకుండానే ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కొడుకులు క్లెయిమ్‌కు దిగడంతో ఓ ఇన్సూరెన్స్ కంపెనీకి అనుమానం వచ్చింది. ఏజెంట్‌తో దర్యాప్తు చేయించే క్రమంలో వరుసగా పాము కాటుకు గురికావడం, ఆస్పత్రికి ఆలస్యంగా వెళ్లడం లాంటి విషయాలు తెలిశాయి. దీంతో పోలీసుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. డిసెంబర్ 6వ తేదీన నార్త్ జోన్ ఐజీ అస్రా గార్గ్.. ఈ ఘటనపై దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని నియమించారు. ఆ ఇద్దరు కొడుకుల ఫోన్ కాల్స్ రికార్డింగులు.. ఆర్థిక లావాదేవీల ఆధారంగా తండ్రిని పాము కాటుతో హత్య చేయించినట్లు నిర్ధారించుకున్నారు. నిందితులిద్దరితో పాటు వాళ్లకు సహకరించిన నలుగురిని శుక్రవారం అరెస్ట్ చేశారు. -
మీర్‌పేట మాధవి కేసులో షాకింగ్ ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మీర్‌పేట మాధవి హత్య కేసు దాదాపుగా ఓ కొలిక్కి వచ్చింది. భర్త గురుమూర్తే ఆమెను కిరాతకంగా హతమార్చాడని పోలీసులు సైంటిఫిక్ ఆధారాలను కోర్టు ముందు ఉంచారు. ఈ క్రమంలో మరదలితో గురుమూర్తి వివాహేతర సంబంధ వ్యవహారమే ఈ హత్యకు కారణమని నిర్ధారణ అయ్యింది.మీర్‌పేట మాధవి హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మరదలితో గురుమూర్తి వివాహేతర సంబంధం నడిపిన గురుమూర్తి.. దానికి అడ్డుపడుతోందనే భార్య మాధవిపై ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. ఈ మేరకు కేసు దర్యాప్తునకు సంబంధించిన పూర్తి వివరాలను తాజాగా ఆధారాలతో సహా పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఈ ఏడాది జనవరిలో.. వెంకట మాధవి(35) అనే మహిళ కనిపించడం లేదని ఆమె తల్లి మీర్‌పేట పీఎస్‌లో కంప్లైంట్ ఇచ్చింది. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు జరిపారు. అయితే విచారణలో తన భార్యను తానే చంపినట్లు భర్త పుట్టా గురుమూర్తి అంగీకరించాడు. మాజీ ఆర్మీ జవాన్ అయిన పుట్టా గురుమూర్తి(39).. డీఆర్డీవోలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అయితే తన మరదలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంలోనే భార్య మాధవితో పలుమార్లు గొడవలు జరిగాయి. అయితే చాలాసార్లు పంచాయితీ చేసినప్పటికీ గురుమూర్తి తీరు మారలేదు. ఈ క్రమంలోనే మాధవితో గొడవ పడి.. ఆమెను దారుణంగా హతమార్చాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. వివాహేతర సంబంధం విషయంలో మాధవి-గురుమూర్తి మధ్య గొడవ జరిగింది. మాధవిని గొంతు నులిమి చంపి ఆపై ముక్కలు చేసిన గురుమూర్తి.. శరీర భాగాలను కుక్కర్లో ఉడికించి.. ఎముకలను గ్రైండర్ చేసి జిల్లెలగూడలోని చెరువులో కలిపాడు. మాధవిది హత్యగా తెలిశాక పోలీసులు ఇంటి నుండి స్టౌ, కత్తి, రోలర్, వాటర్ హీటర్, బట్టలు వంటి ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. గురుమూర్తిపై హత్య, ఆధారాలను నాశనం చేయడం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులో శరీర భాగాలు దొరకడం కష్టం కావడంతో ఈ కేసు వీగిపోతుందని అంతా భావించారు. అయితే.. అతికష్టం మీద సైంటిఫిక్ ఆధారాలను సేకరించిన పోలీసులు తాజాగా వాటిని కోర్టు ముందు ఉంచారు. ఈ కేసు దర్యాప్తు సమయంలో.. హత్యకు గల కారణాలపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. చివరకు వివాహేతర సంబంధం కారణంగానే మాధవిని గురుమూర్తి కడతేర్చినట్లు తేలింది. -
సర్పంచ్ విజయోత్సవాల నడుమ దారుణం..
మహబూబ్‌నగర్ జిల్లా: మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం వేములలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిపై అదే గ్రామానికి చెందిన యువకుడు లైంగికదాడికి పాల్పడడంతో ఆమె మృతి చెందింది. పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ యువతి (22) ఇంటర్ వరకు చదివి ఇంటి వద్దే ఉంటోంది. బుధవారం రాత్రి సర్పంచ్ ఎన్నికల విజయోత్సవాలు జరుగుతున్న సమయంలో అదే గ్రామానికి చెందిన విష్ణు మాట్లాడాలని చెప్పి ఆ యువతిని రైతువేదిక వద్దకు తీసుకెళ్లాడు. అక్కడే ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో అధిక రక్తస్రావం కావడంతో ఆ యువతి అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే అతను ఇతరుల సాయంతో స్థానిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. చుట్టు పక్కల వారు తల్లికి సమాచారం ఇవ్వడంతో ఆమె కూడా అక్కడకు వచి్చంది. అప్పటికే ఆ యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికుల సాయంతో అంబులెన్స్‌లో జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆ యువతి మృతి చెందినట్టు తెలిపారు. మృతదేహాన్ని అదే రోజు రాత్రి ఇంటికి తీసుకొచ్చారు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తమ కూతురిపై అత్యాచారం చేసి హత్య చేశారని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ ఘటనా స్థలాన్ని మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, భూత్పూర్ సీఐ రామకృష్ణ, మూసాపేట ఎస్ఐ వేణు పరిశీలించారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో గ్రామంలో విచారణ జరిపారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అత్యాచారం, అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు ఎస్ఐ వేణు చెప్పారు. యువకుడు ఒక్కడే అత్యాచారం చేశాడా... ఇతరుల ప్రమేయం ఉందా అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
లవ్ మ్యారేజ్ చేసుకుని..కొట్టి చంపేశాడు
తాండూరు టౌన్: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అతి కిరాతకంగా కొట్టి చంపిన కేసులో ముగ్గురికి రిమాండ్ విధించినట్లు తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య తెలిపారు. పట్టణంలోని సాయిపూర్‌కు చెందిన పరమేశ్, తన భార్య అనూష (20)ను వరకట్నం తీసుకురావాలంటూ గురువారం కర్రతో కొట్టి దారుణంగా హత్య చేసి పరారైన విషయం విదితమే. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మృతురాలి భర్త పరమేశ్, అతని తల్లిదండ్రులు లాలమ్మ, మొగులప్పను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కీలకంగా మారిన సీసీ పుటేజీ.. ఈ హత్య కేసులో నిందితుడి ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు అయిన పుటేజీ కీలకంగా మారింది. ఈ పుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం మధ్యాహ్నం లావుపాటి కర్రతో అనూష తలపై విచక్షణా రహితంగా దాడి చేస్తున్నట్లు నిక్షిప్తమైంది. Sensitive Content సీసీ ఫుటేజ్.. ప్రేమించి పెళ్లాడిన యువతిని కిరాతకంగా కొట్టి చంపిన భర్తతాండూరులోని సాయాపూర్లో జరిగిన ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు..కట్నం తేవాలని దూషిస్తూ, కర్రతో విచక్షణారహితంగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన అనూష.. చికిత్స మృతియువకుడి… https://t.co/ujX5RCu0jI pic.twitter.com/gnlmskOTnv— Telugu Scribe (@TeluguScribe) December 19, 2025 ప్రేమించి.. పెళ్లి చేసుకుని.. -
తండ్రి భయంతో బాల్కనీ దాటే ప్రయత్నం..
రామచంద్రాపురం (పటాన్చెరు): ఇంట్లో స్నేహితుడితో ఉన్న సమయంలో అకస్మాత్తుగా తండ్రి రావడం చూసి భయపడిన కూతురు.. తమ బాల్కనీ నుంచి మరో బాల్కనీకి వెళ్లే ప్రయత్నంలో ఎనిమిదో అంతస్తు పైనుంచి కిందపడి మృతి చెందింది. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ పరిధిలోని ప్రభుత్వ డబుల్ బెడ్ రూమ్ కేసీఆర్ నగర్లో గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది. కొల్లూరు సీఐ గణేశ్ పటేల్ కథనం ప్రకారం.. హైదరాబాద్ పాతబస్తీలో నివాసముండే యువతి (20) ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తోంది. అక్కడ ఆమెకు ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ యువతి కుటుంబానికి తెల్లాపూర్ పరిధిలోని ప్రభుత్వ డబుల్ బెడ్రూమ్ కాలనీలో ఇల్లు ఉంది. కాగా గురువారం స్నేహితుడితో కలిసి కేసీఆర్ నగర్ కాలనీలోని 8వ అంతస్తులో ఉన్న తమ ఇంటికి వచ్చింది. వారిద్దరూ ఇంట్లో ఉన్న సమయంలో రేషన్ బియ్యం తీసుకునేందుకు నగరం నుంచి యువతి తండ్రి అక్కడికి వచ్చాడు. తలుపులకు తాళం తీసి ఉండటంతో.. లోపల ఎవరున్నారని అతను గట్టిగా అరిచాడు. తండ్రి మాటలు విన్న యువతి భయంతో ఎనిమిదో అంతస్తు బాల్కనీ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పక్క బాల్కనీలోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే పట్టుతప్పి ఆమె పైనుంచి కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పది రూపాయలు ఇవ్వలేదని తాతను చంపిన మనవడు
-
విజయవాడలో ‘10 రూపాయల’ హత్య
సాక్షి, విజయవాడ: విజయవాడలో దారుణం జరిగింది. మద్యం తాగేందుకు రూ.10 రూపాయలు ఇవ్వలేదని తాతని మనవడు హత్య చేశాడు. హత్య చేసిన బాలుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. విజయవాడ కొత్తపేట పీఎస్ పరిధిలో ఘటన చోటుచేసుకుంది. రక్తపు మడుగులో ఉన్న వృద్ధుడ్ని పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందాడు.నగరంలో ఈ ఘటన కలకలం రేపింది. మృతుడు తాపీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఆయన స్వస్థలం మంగళగిరి నుకలపేట కాగా ఉపాధి నిమిత్తం విజయవాడలో ఉంటున్నాడని పోలీసులు చెప్పారు.మరో ఘటనలో బందరు లాకులు వద్ద అనుమానాస్పద స్థితిలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతి చెందినవారు యాచకులుగా స్థానికులు చెబతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న కృష్ణలంక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. -
Hyderabad: వైద్యురాలికి వేధింపులు
బంజారాహిల్స్: రిహాబిలిటేషన్ సెంటర్ నిర్వహిస్తున్న వైద్యురాలికి అందులోనే పనిచేస్తున్న యువకుడి నుంచి రోజురోజుకు వేధింపులు ఎక్కువ అవడంతో జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–2లో నివసించే వైద్యురాలు (41) ఓ రిహాబిలిటేషన్ సెంటర్లో పనిచేస్తున్నారు. 2021 సంవత్సరంలో సెంటర్ సూపర్వైజర్గా నామాల వెంకటేష్ వంశీని నియమించుకున్నారు. ఈ క్రమంలో వైద్యురాలితో పరిచయం ఏర్పడగా.. ఆమె ఫోటోలు తీస్తూ నానా రకాలుగా వేధించసాగాడు. గత ఏడాది నుంచి వెంకటేష్ వంశీ బాధిత వైద్యురాలిని అనుసరిస్తూ వేధించడం మొదలుపెట్టాడు. గత అక్టోబర్‌లో ఆమె అపార్ట్మెంట్లోకి కూడా చొరబడి కారును ధ్వంసం చేశాడు. ఆమె అర్ధనగ్న ఫోటోలను, వీడియోలను బంధు మిత్రులకు వాట్సప్‌లో షేర్ చేశాడు. దీంతో తనను వేధిస్తున్న నిందితుడిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. జూబ్లీహిల్స్ పోలీసులు వెంకటేష్‌వంశీపై బీఎన్ఎస్ సెక్షన్ 77, 78 (1)(2), 79, 351 (2), 324 (2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య, ఇద్దరు బిడ్డల్ని చంపి ఇంట్లోనే.. వాళ్లు బతికిపోయారు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని షామ్లిలో దారుణం చోటు చేసుకుంది. స్వల్ప వివాదానికే ఒక వ్యక్తి తన భార్యను, ఇద్దరు చిన్న కుమార్తెలను హత్య చేశాడు. అంతేకాదు ముగ్గురు బాధితుల మృతదేహాలను వారి ఇంటి ప్రాంగణంలోని ఏడు అడుగుల లోతైన గొయ్యిలో పాతిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. తల్లీ పిల్లలు ఆరు రోజులుగా కనిపించకుండా పోవడంతో అందిన ఫిర్యాదు మేరకు జరిగిన విచారణలో ఈ నేరం వెలుగులోకి వచ్చింది. విచారణలో, ఫరూఖ్ నేరం అంగీకరించాడని తెలుస్తోంది.నిందితుడిని కాంధ్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని గర్హి గ్రామానికి చెందిన ఫరూక్‌గా గుర్తించారు. పోలీసుల ప్రకారం, ఫరూక్ తన భార్య తాహిరా (32) బుర్ఖా ధరించకుండా తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చినప్పుడు ప్రారంభమైన వాగ్వాదం తీవ్రమైంది. దీంతో కోపోద్రిక్తుడైన భర్త తొలుత భార్యను కాల్చి చంపాడు. ఆ తరువాత కుమార్తెలు అఫ్రీన్ (14) , సెహ్రీమ్ (7)కూడా పొట్టనబెట్టుకున్నాడు.ఈ జంటమధ్య గత కొన్ని నెలలుగా తరచుగా గొడవలు ఎదుర్కొంటున్నారని పోలీసు అధికారులు తెలిపారు. కుటుంబ వివాదాలతో ఫరూక్ తల్లిదండ్రులు దావూద్ ,అస్గారి నుండి విడిగా ఉంటున్నాడు. ఈ దంపతులకు మొత్తం ఐదుగురు పిల్లలు ఉన్నారు, వారిలో ముగ్గురు సంఘటన సమయంలో లేనందున ప్రాణాలతో బయటపడ్డారు. డిసెంబర్ 9-10 రాత్రి హత్యలు జరిగాయని పోలీస్ సూపరింటెండెంట్ ఎన్ పి సింగ్ తెలిపారు. టీ తయారుచేసే నెపంతో ఫరూఖ్ తన భార్యను నిద్రలేపి, ఆపై ఆమెను , పెద్ద కుమార్తెను కాల్చి చంపాడు. ఈ దారుణాన్ని చూసిన చిన్న కుమార్తె గొంతు కోసి చంపేశాడు. ఆ తరువాత ఇంట్లోనే లోతైన గొయ్యి తవ్వి, మృతదేహాలను పాతిపెట్టి, ఆ ప్రదేశాన్ని ఇటుకలతో కప్పేశాడ. పథకం ప్రకారం ఈ హత్యలు జరిగినట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ఆర్థిక ఒత్తిడి, తరచుగా వాదనలు, కోపం, అవమాన భారంతోనే ఈ తప్పు చేశానని ఫరూఖ్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.Shamli, Uttar Pradesh: A husband allegedly killed his wife and two daughters and buried their bodies in a 9-foot-deep pit at homeSP N.P. Singh says, “On Tuesday evening around 5 PM, the village head of Gaungori Daulat under Kandhla police station informed us that a man named… pic.twitter.com/RITXJLfsCY— IANS (@ians_india) December 17, 2025 -
హైదరాబాద్ లో దారుణ హత్య..
-
మానుకోటలో ఉద్రిక్తత..
మహబూబాబాద్ రూరల్: అదనపు కట్నం కోసం భర్త, అత్తామామ, మరిది విచక్షణరహితంగా కొట్టడంతో మహబూబాబాద్ మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన బానోత్ స్వప్న మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మృతురాలి తండ్రి అర్జున్ ఫిర్యాదు మేరకు స్వప్న భర్త బానోత్ రామన్న, అత్తామామలు కిషన్, బుజ్జి, మరిది నవీన్‌పై మహబూబాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో స్వప్న మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించడానికి పోలీసులు సిద్ధంకాగా మృతురాలి కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు ఆమె ఇద్దరు కూతుళ్లు, కుమారుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. మొదట పోస్టుమార్టం గది వద్ద ఆందోళన చేపట్టి అక్కడ నుంచి అండర్ బ్రిడ్జి ప్రాంతంలో రాస్తారోకో చేశారు. సుమారు రెండు గంటలకుపైగా రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ స్తంభించింది. తమకు న్యాయం జరగడంలేదని ఆరోపిస్తూ మృతురాలి స్వప్న తమ్ముడు లింగా, తల్లి కౌసల్య, మరికొంతమంది ఆత్మహత్య చేసుకుంటామని పురుగు మందు డబ్బాలతో ఆందోళన చేయగా బంధువులు అడ్డుకున్నారు. అనంతరం అక్కడి నుంచి పోస్టుమార్టం గది వద్దకు చేరుకుని స్వప్న మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చి రోడ్డుపై ఆందోళన చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోస్టుమార్టం గది గేటు తొలగించుకుని ఆగ్రహంతో లోపలికెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో కొంత తోపులాట జరగగా పోలీసులు వారందరినీ ఆపి శాంతింపజేశారు. అప్పటికే మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు స్వప్న కుమార్తెలు సంజన, దక్షిత, కుమారుడు అవిరాజ్ పరిస్థితి ఏమిటని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మహబూబాబాద్ రూరల్, టౌన్ సీఐలు సర్వయ్య, మహేందర్ రెడ్డి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పెదమనుషులు వారి డిమాండ్ మేరకు ముగ్గురు పిల్లలకు ఆస్తి, వ్యవసాయ భూమి, బంగారం చెందేలా మాట్లాడి ఒప్పంద పత్రాలు రాయించాక పోస్టుమార్టం ఒప్పుకున్నారు. బయ్యారం సీఐ రవికుమార్, రూరల్, టౌన్, కురవి ఎస్సైలు దీపిక, షాకీర్, సతీశ్, సివిల్, స్పెషల్ పార్టీ పోలీసులు బందోబస్తు నిర్వహించారు.చనిపోయిన మహిళ నోట్లో పురుగుల మందు పోసి... -
ప్రాణం మీదకొచ్చిన పార్టీ
బెంగళూరు: స్నేహితులతో కలిసి హోటల్లో పార్టీ చేసుకుంటున్న సమయంలో పోలీసులు రావడంతో భయపడి ఓ యువతి పరుగులు తీసే క్రమంలో పై నుంచి కిందపడిపోయింది. ఈ ఘటన బెంగళూరు హెచ్ఏఎల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి జరగ్గా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. వైష్ణవి (21), 8 మంది స్నేహితులతో ఏఇసీఎస్ లేఔట్‌లోని ఓ హోటల్లో 3వ అంతస్తులో పార్టీ పెట్టుకున్నారు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో అర్ధరాత్రి గట్టిగా మ్యూజిక్ వేసుకుని కేకలు వేస్తూ డ్యాన్స్ చేస్తుండటంతో చుట్టుపక్కల ఇళ్లవారు 112 కు ఫోన్‌చేశారు. స్థానిక పోలీసులు వచ్చి పార్టీ జరుగుతున్న పై అంతస్తుకు వెళ్లారు. దీంతో అందరూ తలోదిక్కుకు పరుగులు తీశారు. వైష్ణవి భయపడి పోలీసుల నుంచి తప్పించుకోవడానికి పై అంతస్తు నుంచి పైపును పట్టుకుని కిందికి దిగడానికి ప్రయత్నిస్తుండగా జారి కింద ఇనుప గ్రిల్స్ మీద పడడంతో తీవ్రంగా గాయపడింది. ఆమెను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తలకు, శరీరానికి తీవ్ర గాయాలు కావడంతో మృత్యువు అంచుల్లో ఉంది. లంచం అడిగారు హోటల్ వద్దకు వచ్చిన పోలీసులు కేసు కాకూడదంటే డబ్బులు ఇవ్వాలని అడిగారు, మేము ఫోన్ పే చేస్తామని చెప్పగా, వద్దు క్యాష్ కావాలన్నారు అని పారీ్టలో పాల్గొన్నవారు ఆరోపించారు. దీనిపై డీసీపీ విచారణ చేపట్టారు. హోటల్, పోలీసు సిబ్బందిపై యువతి తండ్రి ఆంథోనీరాజ్ హెచ్ఏల్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. -
కోడలిని కొట్టి కొట్టి చంపి.. సూసైడ్ గా చిత్రీకరణ
-
ఎన్టీఆర్ జిల్లా: బోర్డు తిప్పేసిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఇన్వెస్ట్మెంట్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. విస్సన్నపేటలో ‘లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ అడ్వైజరీ సర్వీసెస్’ బోర్డు తిప్పేసింది. ఒక్కొక్కరిగా బాధితులు బయటకొస్తున్నారు. ఇంటికో మొక్క పెంచితే ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ ఎర వేసిన నిర్వాహకులు.. సంస్థలో డబ్బులు పెడితే మీ భవిష్యత్ మారిపోతుందంటూ ఆశ పెట్టారు. జనం అత్యాశను ఆసరాగా చేసుకుని కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు.ఏజెంట్లను నియమించుకుని టార్గెట్లు పెట్టి మరీ కోట్ల రూపాయలు వసూలు చేశారు. పది వేలు పెడితే ప్రతీ నెలా వెయ్యి రూపాయలు, రూ. ఐదు లక్షలు పెడితే నెలకు రూ.50 వేలు ఇస్తామంటూ టోకరా వేశారు. సుమారు రూ.25 కోట్లకు పైగానే వసూళ్లు చేశారు. డబ్బులు కట్టిన వారు ప్రశ్నించడంతో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అడ్వైజరీ సర్వీసెస్ ఫౌండర్ దుర్గా ప్రసాద్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. దుర్గా ప్రసాద్ చనిపోయిన తర్వాత అతని భార్య నండూరి శివానీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మోసపోయామని గ్రహించిన బాధితులు విజయవాడ సీపీకి ఫిర్యాదు చేశారు. -
పెళ్లైన మూడు నెలలకే నవవధువు ఆత్మహత్య
హైదరాబాద్: కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసాపేట్ ప్రాంతంలో నవవధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ప్రొద్దుటూరుకు చెందిన చందన జ్యోతి కొత్తగూడెంకు చెందిన యశ్వంత్‌తో మూడు నెలల క్రితం వివాహం జరిగింది.వివాహానంతరం యశ్వంత్ ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌కు వచ్చి, భార్య జ్యోతి కలిసి మూసాపేట్లో నివాసం ఉంటున్నాడు. యశ్వంత్ ఓ ప్రైవేటు సంస్థ అయిన మెడ్‌ప్లస్‌లో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం.ఇటీవల కొద్ది రోజులుగా భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతుండడంతో మనస్తాపానికి గురైన చందన జ్యోతి నిన్న(శుక్రవారం) రాత్రి బెడ్ రూమ్ లోకి వెళ్లి తలుపులు వేసుకుని ఆత్మహత్యకి పాల్పడింది. ఈ విషయం గమనించిన భర్త యశ్వంత్ 108కి ఫోన్ చేయగా స్థానిక ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కూకట్పల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు . -
మొదటి భర్త కొడుకుని నెలకేసి కొట్టిన రెండో భర్త..
-
ప్రియుడు వద్దని.. భర్తే సర్వస్వమని..
కర్ణాటక: ఇటీవలి కాలంలో ఫేస్బుక్, ఇన్‌స్టా తదితర యాప్‌లతో పరిచయాలు పెరగడం, జీవిత భాగస్వాములు వదిలేసి వెళ్లడం మామూలు విషయమైంది. దీనివల్ల గొడవలు జరిగి కుటుంబాలు రోడ్ల పాలవుతుంటే అభం శుభం తెలియని పిల్లల జీవితం ఛిద్రమవుతోంది. బెంగళూరు బన్నేరుఘట్ట పరిధిలో ఇదే మాదిరిగా భర్తను వదిలేసి ప్రియునితో వెళ్లిపోయిన మహిళ.. కొన్ని నెలల తరువాత మళ్లీ భర్త వద్దకు వచ్చేసింది. దీంతో కథ సుఖాంతమైందని స్థానికులు నిట్టూర్చారు.ఏం జరిగింది..సెప్టెంబరు ఆఖర్లో లీల అనే మహిళ భర్త, క్యాబ్‌డ్రైవర్ మంజునాథ్, ముగ్గురు పిల్లలను వదిలేసి ప్రియుడు సంతుతో వెళ్లిపోయింది. మంజు కన్నీరు కారుస్తూ తన కోసం కాకపోయినా పిల్లల కోసమైనా తిరిగి రావాలని విలపిస్తూ చేసిన వీడియో ప్రచారమైంది. తాను మాత్రం సంతుతోనే ఉంటానని లీల చెప్పింది. సంతు, లీల సరదా ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ బాగోతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.లీలాలో పరివర్తన..నెలన్నర కిందట మంజు కోపం పట్టలేక సంతును వెతికిపట్టుకుని చితకబాదాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఈ కేసులో మంజును అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇటీవలే విడుదలై కొత్త ఆటోను కొనుక్కుని పిల్లలను పోషిస్తున్నాడు. ఇంతలో లీల మనసులో ఏం పరివర్తన వచ్చిందో గానీ ప్రియున్ని వదిలేసి భర్త చెంతకు చేరింది. మంజు ఆమెను ఆత్మీయంగా స్వాగతించాడు. బన్నేరుఘట్టలోని అద్దె ఇంట్లో కులాసాగా కాపురం ప్రారంభించారు. త్వరలో ధర్మస్థలలో మళ్లీ పెళ్లి చేసుకుంటామని, అన్నీ మరచిపోయి సంతోషంగా జీవిస్తామని ఈ జంట చెబుతోంది. ఇది చూస్తే నవ్వాలో, ఏడవాలో తెలియడం లేదు అని కొందరు నెటిజన్లు వాపోతే, మరికొందరు దీవించారు. -
నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది: కొండా సురేఖ
సాక్షి, హైదరాబాద్: తనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యిందన్న కథనాలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ సీరియస్ అయ్యారు. తనకు ఎలాంటి వారెంట్ జారీ కాలేదని.. కోర్టుకు హాజరు కావాలని మాత్రమే కబురు అందిందని స్పష్టత ఇచ్చారు. ఈ క్రమంలో తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని మండిపడ్డారామె. ఇదిలా ఉంటే.. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నుంచి కొండా సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యిందని తొలుత ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసులో ఈ పరిణామం చోటు చేసుకుందన్నది ఆ ప్రచార సారాంశం. ‘‘గురువారం (డిసెంబర్ 11, 2025) ఈ కేసు విచారణకు రాగా, నిందితురాలి గైర్హాజరును న్యాయమూర్తి తీవ్రంగా పరిగణించారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా కోర్టుకు హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే ఆమెను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించారు’’ అని ఆ ప్రచారంలో ఉంది. అయితే దానిని కొండా సురేఖ కాసేపటికి ఖండించారు. ‘‘కోర్టు నాకు ఎన్బీడబ్ల్యూ జారీ చేయలేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న కోర్టుకు రావాలని చెప్పింది. నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది’’ అని అన్నారామె. కేసు వివరాల్లోకి వెళితే.. తనపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాయని కేటీఆర్ పరువు నష్టం దాదా వేశారు. ఈ కేసు ప్రస్తుతం (C.C. No. 307 of 2025) విచారణ దశకు చేరుకుంది. గురువారం రోజున విచారణ ప్రారంభం కావాల్సి ఉండగా, నిందితురాలైన కొండా సురేఖ కోర్టుకు రాలేదు. ఆమె గైర్హాజరుకు సంబంధించి న్యాయస్థానానికి ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం, మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేయకపోవడాన్ని కోర్టు తప్పుబట్టినట్లు తెలుస్తోంది. -
భార్యను ముక్కలుగా చేసి.. ముద్దలుగా మార్చేసి..
ఆ మధ్య మలయాళంలో సూక్షదర్శిని అనే సినిమా వచ్చింది. అందులో అమాయకంగా కనిపించే తల్లీకొడుకులు.. తమ ఇంటి బిడ్డనే దారుణంగా హతమార్చి.. యాసిడ్‌లో పోసేసి కరిగించేస్తారు. ఆపై ఏం ఎరగనట్లు నాటకాలాడతారు. పరువు హత్య(ఓ సున్నితమైన అంశం) నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా అక్కడ హిట్ అయ్యి.. ఇక్కడ తెలుగు డబ్‌తో ఓటీటీలోనూ అలరించింది. అయితే దాదాపు ఇలాంటి తరహా ఘటనే ఒకటి తెరపైకి వచ్చింది.వింటేనే వెన్నులో వణుకుపుట్టే ఘటన ఇది. తన భార్యను.. ఇద్దరు పిల్లల తల్లిని.. క్షణికావేశంలోనో లేదంటో ఉద్దేశపూర్వకంగానో హత్య చేశాడో భర్త. ఆపై నేరం నుంచి తప్పించుకునేందుకు అతను చేసిన ప్రయత్నమే కిరాతకంగా ఉంది. ఆమెను ముక్కలుగా.. చెక్కలుగా చేసి.. ముద్దగా మార్చేసి కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే.. ఆ ప్రయత్నంలో అడ్డంగా దొరికిపోయి దోషిగా తేలాడు.స్విట్జర్లాండ్‌లో హైప్రొఫెషనల్ కేసుగా ఉన్న క్రిస్టియానా జోక్సిమోవిక్(38) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భర్తే ఆమెను కిరాతకంగా హత్య చేశాడని స్థానిక అధికారులు బుధవారం నిర్ధారించారు. క్రిస్టియానా జోక్సిమోవిక్ మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ కావడమే ఈ కేసు అందరి దృష్టిని ఆకర్షించేలా చేసింది.2024 ఫిబ్రవరిలో బిన్నింగెన్‌లోని తన నివాసంలో క్రిస్టియానా జోక్సిమోవిక్ దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో వేళ్లన్నీ భర్త థామస్ వైపే చూపించాయి. అయితే తన భార్య తనపై దాడికి ప్రయత్నించిందని.. ఆ ప్రయత్నంలో ప్రమాదవశాత్తూ మరణించిందని.. తాను భయంతో ఆ శవాన్ని మాయం చేసే ప్రయత్నం మాత్రమే చేశానని మొదటి నుంచి అతను వాదించాడు. కానీ, ఆధారాలు అన్నీ అతనికి వ్యతిరేకంగానే ఉన్నాయి.ఆమెను గొంతు నులిమి హత్య చేసిన థామస్.. గర్భాశయాన్ని తొలగించి ఆ తర్వాత పెరట్లోని రంపంతో ముక్కలుగా కత్తిరించాడని.. ఆపై మిక్సర్‌లో వేసి ముద్దగా మార్చేశాడని.. అందులో కొంత భాగాన్ని రసాయనాల్లో వేసి కరిగించేశాడని తెలిపారు. నేరానికి ఉయోగించిన రంపాన్ని, తోలు భాగాన్ని, ఎముకల అవశేషాల్ని పోలీసులు స్వాధీనం చేసుకోగలిగారు. ఈ ఘోరాన్ని అతను యూట్యూబ్ వీడియోలు చూస్తూ చేశాడని వెల్లడించారు.శరీరం నుంచి నడుమ జాయింట్లను విరిచేసి.. మెడ, వెన్నెముకను కోసేసి.. చివరకు ఆమె తలను వేరు చేసి శరీరాన్ని ముక్కలుగా చేశాడు. శవపరీక్షలో అత్యంత భయానకమైన ఈ వివరాలు వెల్లడయ్యాయి అని కోర్టుకు దర్యాప్తు అధికారులు సమర్పించిన వివరాల్లో ఉంది.క్రిస్టియానా మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె ఆచూకీ గురించి తీవ్రంగా ప్రయత్నించారు. నెలలు గడిచినా ఆమె ఆచూకీ కానరలేదు. అయితే.. క్రిస్టియానా జుట్టుకు సంబంధించిన అవశేషాలను లాండ్రీ రూమ్‌లో ఆమె తండ్రి గుర్తించడం ఈ కేసును అసలు మలుపు తిప్పింది. ఆ ఘటన తర్వాత ఎలాంటి కంగారు లేకుండా ఉన్నాడని.. అది అతనిలోని క్రూరత్వానికి ప్రతీకగా నిలిచిందని పోలీసులు తమ నివేదికలో వివరించారు. భర్తే హంతకుడిగా తేలడంతో ఈ కేసు ట్రయల్ జరగాల్సి ఉంది.మిస్ నార్త్‌వెస్ట్ స్విట్జర్లాండ్ క్రిస్టియానా జోక్సిమోవిక్.. 2007లో మిస్ స్విట్జర్లాండ్ పోటీల్లో ఫైనలిస్ట్‌తో సరిపెట్టుకుంది. ఆ తర్వత క్యాట్‌వాక్ కోచ్‌గా మారి.. అనేక మంది మోడల్స్‌కు శిక్షణ ఇచ్చింది. పై కేసు చదువుతుంటే.. భార్యను కుక్కర్లో ఉడికించిన కేసు గుర్తొచ్చిందా?.. ఆ కథనమూ చదివేయండి 👉 హైదరాబాద్ మీర్‌పేటలో కిరాతకం -
నలుగురు ఇంటర్ విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం
అనంతపురం: కేఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ వసతి గృహంలో ఉండి చదువుతున్న నలుగురు ఇంటర్ విద్యార్థినులు సూపర్ వేస్మాల్ తాగి ఆత్మహత్యాయత్నకి పాల్పడ్డారు .వివరాల్లోకి వెళ్తే.. వసతి గృహంలో క్రమశిక్షణ ఉల్లంఘన జరిగిందని భావించిన హాస్టల్ వార్డెన్, ఈ విషయం గురించి వారి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తానని విద్యార్థినులను హెచ్చరించినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు మందలిస్తారన్న భయంతో ఆందోళన చెందిన ఆ నలుగురు విద్యార్థినులు సూపర్ వేస్మాల్ తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.ఈ విషయం గమనించిన వార్డెన్ వెంటనే వారిని చికిత్స నిమిత్తం అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతం బాలికల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థినుల నుండి మౌఖిక వాంగ్మూలం తీసుకోవడంతో పాటు, హాస్టల్ వార్డెన్ వ్యవహారం, కళాశాల పరిపాలనలో ఉన్న లోపాలపై కూడా విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. -
కంఠం కొరికి చంపేశాడు..?
శ్రీకాకుళం జిల్లా: మండలంలోని బెలమర గ్రామంలో దండుపాటి అప్పమ్మ(68) అనే వృద్ధురాలు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు పోలాకి పోలీసులు బుధవారం కేసు నమో దు చేశారు. వివరాల్లోకి వెళితే.. మృతురాలి కుమారుడు మద్యానికి బానిసగా మారి భార్యాపిల్లలకు దూరంగా తల్లి అప్పమ్మ వద్ద కొంతకాలంగా ఉంటున్నాడు. తల్లీకొడుకులపై కోడలు అనురాధ గతంలో వేధింపుల కేసు పెట్టడంతో ఆ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అప్పమ్మ కంఠంపై గాయంతో మృతిచెందటంతో కొడుకు వెంకటరమణ మద్యం మత్తులో తల్లి కంఠం కొరికి చంపినట్లు ప్రచారం జరిగింది. సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ రంజిత్ సిబ్బందితో వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్‌టీంతో ఆధారాలు సేకరించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. మృతురాలు అప్పమ్మకు అనారోగ్య సమస్యలు సైతం ఉన్నాయని, దర్యాప్తు అనంతరం స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు. -
మరదల్ని ఎందుకు చంపాడంటే!
బౌద్ధనగర్: తనతో పెళ్లికి నిరాకరించిందని యువతిపై కక్ష పెంచుకొని ఆమె కుటుంబ సభ్యుల ముందే దారుణంగా హత్య చేసి పరారైన ప్రేమోన్మాదిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు బుధవరం చిలకలగూడ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈస్ట్‌జోన్ డీసీపీ బాల స్వామి వివరాలు వెల్లడించారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా మిర్యాపుట్టి మండలం సిరియకంది గొల్లవీధికి చెందిన డుక్క ఉమా శంకర్ కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి రహ్మత్‌నగర్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలో దూరపు బంధువు అయిన కాంతారావు, లక్ష్మి దంపతుల పెద్ద కుమార్తె పవిత్రను తనకిచ్చి పెళ్లి చేయాలని కోరడంతో వారు అంగీకరించారు. ఆరు నెలల క్రితం నిశి్చతార్థం కూడా జరిగింది. అయితే, ఉమా శంకర్‌కు మద్యం అలవాటు ఉంది. తాగిన ప్రతీసారి పవిత్రకు ఫోన్ చేసి అసభ్యంగా ప్రవర్తించి విసిగించాడు. ఈ నేపథ్యంలో అతడిని పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పింది. దీంతో కక్షగట్టిన ఉమాశంకర్ గత సోమవారం పవిత్రను ఆమె తల్లిదండ్రుల ముందే గొంతుకోసి హత్యచేసినట్లు వెల్లడించారు. పోలీసులు దర్యాప్తులో భాగంగా సీసీ ఫుటేజీలను పరిశీలించి హంతకుడు ఉమాశంకర్ చిలకలగూడలోని తన సోదరుడి ఇంట్లో ఉన్నట్లు గుర్తించారు. బుధవారం అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ నర్సయ్య, ఏసీపీ శశాంక్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ మధుసూదన్ రెడ్డి, డీఐ పురేందదర్ రెడ్డి, డీఐ రామకృష్ణ, ఎస్ఐ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
మద్యం మత్తులో భార్యపై కత్తితో దాడి
హైదరాబాద్: పుల్లుగా మద్యం తాగిన ఓ వ్యక్తి భార్యతో గొడవ పడి విచక్షణా రహితంగా ఆమెను కత్తితో పొడిచి హత్యాయత్నం చేశాడు. తీవ్ర గాయాలపాలైన ఆమె ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం రాంనగర్‌కు చెందిన చాకలి గోపాల్, శైలజ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గోపాల్ ఎయిర్‌పోర్టు బస్సు డ్రైవర్‌గా పనిచేస్తుండగా శైలజ వారు నివాసం ఉండే అపార్ట్మెంట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తుంది. గోపాల్ ప్రతి రోజు మద్యం తాగి వచ్చి శైలజను వేధిస్తున్నాడు. దీనిపై ఇటీవలే ఆమె సంగారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. పెద్దల సమక్షంలో మాట్లాడుకోవాలని పోలీసులు సలహా ఇవ్వడంతో తిరిగి ఇంటికి వచి్చంది. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి పుల్లుగా మద్యం తాగి వచి్చన గోపాల్ భార్యతో గొడవకు దిగి..వంటింట్లో ఉన్న కత్తి తీసుకుని ఆమెను విచక్షణా రహితంగా పొడిచాడు. దాదాపు 20 నుంచి 25 కత్తిపోట్లు పొడవడంతో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. పిల్లలు చూస్తుండగానే ఈ ఘాతుకానికి పాల్పడిన గోపాల్ అనంతరం పారిపోయాడు. శైలజ అరుపులకు బయటకు వచి్చన చుట్టుపక్కల వారు ఆమెను అంబర్‌పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ రాంచంద్రారెడ్డి కేసు నమోదు చేసి..మంగళవారం నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
పెళ్లి చేసుకోవడం ఇష్టంలేక..
నల్లగొండ, మర్రిగూడ: పెళ్లి చేసుకోవడం ఇష్టంలేక ఓ డిగ్రీ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంగళవారం నల్లగొండ పట్టణంలోని బీసీ బాలికల హాస్టల్లో జరిగింది. టూటౌన్ ఎస్ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం కొట్టాల గ్రామానికి చెందిన బుర్ర నర్సింహ, రమణమ్మ దంపతుల కుమార్తె శ్రుతి (20) నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతూ.. స్థానికంగా రవీంద్రనగర్‌లోని బీసీ బాలికల హాస్టల్లో ఉంటోంది. శ్రుతికి తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తుండగా, ఆమెకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తెలుస్తోంది. ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పలేక మనస్తాపానికి గురైంది. మంగళవారం ఇంటికి వెళ్తానని హాస్టల్ వార్డెన్‌కు లీవ్ లెటర్ రాసి బాత్రూంలోకి వెళ్లి ఉరేసుకుంది. బాత్రూమ్లో నుంచి ఎంతకీ బయటకు రాకపోవడంతో తోటి విద్యార్థినులు వెళ్లి చూడగా అప్పటికే ఆమె మృతిచెందింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో టూటౌన్ ఎస్ఐ సైదులు ఘటనా స్థలానికి చేరుకుని శ్రుతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
తిరుపతి సంస్కృత వర్సిటీ కేసులో కీలక పరిణామం
సాక్షి, తిరుపతి: జాతీయ సంస్కృత యూనివర్శిటిలో(Tirupati Sanskrit Versity) లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బాధిత యువతి వీడియో స్టేట్మెంట్ రికార్డు చేసిన తిరుపతి మహిళా పోలీసులు.. కీలకమైన వివరాలను రాబట్టినట్లు తెలుస్తోంది. వీటి ఆధారంగా నిందితులిద్దరినీ పోలీసులు మంగళవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. ‘‘ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ నన్ను లైంగికంగా వేధించారు. ఆ వేధింపులు తట్టుకోలేక పైఅధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యా. అయితే ప్రొఫెసర్ శేఖర్ రెడ్డి వద్ద నా వ్యక్తిగత వీడియో ఉందని చెబుతూ లక్ష్మణ్ బెదిరింపులకు దిగాడు. ఆపై పలుమార్లు లైంగికంగా వేధించాడు. లక్ష్మణ్‌లాంటివాళ్లకు కఠినమైన శిక్ష పడాలి’’ అని పోలీసుల వద్ద ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలస్తోంది. తిరుపతి వెస్ట్ స్టేషన్ నుంచి మహిళా పోలీసుల బృందం ఒడిశా జార్హ్ పూర్లో బాధితురాలిని విచారించి.. ఈ మేరకు వీడియో స్టేట్ మెంట్ రికార్డు చేశారు. బాధితురాల స్టేట్మెంట్ ఆధారంగా ఇద్దరు ప్రొఫెసర్లను అరెస్ట్ చేశారు. నిందితుల ఆరెస్టును తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం మీడియా సమావేశంలో ధృవీకరించారు. ‘‘సాంస్కృతిక విశ్వవిద్యాలయంలో విద్యార్థిపై అనుచిత ప్రవర్తన ఘటన చోటు చేసుకుంది. విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఫిర్యాదుతో వెస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఒడిషాకు చెందిన యువతి ఈ ఏడాది జూన్‌లో బీఈడీ కోర్సులో జాయిన్ అయింది. అయితే.. అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్న లక్ష్మణ్ కుమార్ తన హోదాను వినియోగించుకుని ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విద్యార్థినితో చనువుగా ఉంటున్న దృశ్యాలను శేఖర రెడ్డి అనే వ్యక్తి చిత్రీకరించాడు. ఆరోపణల నేపథ్యంలో ప్రత్యేక బృందాన్ని ఒడిషాకు పంపి బాధితురాలి నుంచి ఆధారాలను సేకరించాం. లక్ష్మణ్ కుమార్, శేఖర్ రెడ్డిలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం’’ అని వెల్లడించారు. పార్లమెంట్లో ఆందోళన.. తిరుపతి సంస్కృత వర్సిటీ ఘటన పార్లమెంట్‌లోనూ చర్చ జరిగింది. లోక్‌సభలో సోమవారం అడ్జర్న్‌మెంట్ మోషన్ నోటీసు ద్వారా వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి విషయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. బీఈడీ మొదటి సంవత్సరం చదువుతున్న దళిత విద్యార్థినిని అదే వర్సిటీలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ లైంగికంగా వేధించారని సభలో తెలిపారు. వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను అడ్డుపెట్టుకుని బెదిరించారన్నారు. అది అత్యంత హేయమ చర్యగా అభివర్ణించారు. దళిత విద్యార్థినిపై ఇటువంటి దురాగతం జరగడం పట్ల పార్లమెంట్ వేదికగా ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు మార్గనిర్దేశం చేయాల్సిన గురువులే ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడటం తిరుపతి ప్రతిష్టకు దెబ్బతీస్తోందని ఎంపీ పేర్కొన్నారు. -
హత్య చేసి మృతదేహం పక్కనే కూర్చున్న నిందితుడు
మంచిర్యాల జిల్లా: తనతో సన్నిహితంగా ఉంటూ మరొకరితో తరచూ ఫోన్లో మాట్లాడుతుందన్న కారణంతో ఓ యువకుడు వివాహితను దారుణంగా హత్య చేసిన ఘటన భైంసాలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. భైంసా మండలం కుంసర గ్రామానికి చెందిన అశ్విని(28)కి భైంసా పట్టణంలోని పులేనగర్‌కు చెందిన జోంద్లే సంతోష్‌తో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం.దంపతుల మధ్య విబేధాల కారణంగా కొన్నేళ్లుగా భర్తతో విడిపోయి తన ఇద్దరు పిల్లలతో కలిసి కుంసరలో తల్లి వద్ద ఉంటోంది. ఈ క్రమంలో అంబేడ్కర్‌నగర్‌కు చెందిన నాగేశ్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి సంతోషిమాత నగర్లో టీ స్టాల్ నడుపుతున్నారు. సోమవారం ఇద్దరూ టీస్టాల్కు రాగా, అశ్విని మరొకరితో తరచూ ఫోన్లో మాట్లాడుతుందన్న కారణంతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో మాటామాటా పెరగడంతో కోపంతో నాగేశ్ పక్కనే ఉన్న రాడ్‌తో అశ్విని తలపై మోది కత్తితో గొంతుకోయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ జి.గోపినాథ్ ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతదేహం వద్దే కూర్చున్న నాగేశ్ తానే హత్య చేశానని ఒప్పుకున్నట్లు సీఐ పేర్కొన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించారు. భైంసా ఏఎస్పీ రాజేశ్‌మీనా ఆస్పత్రిలో మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి తల్లి గాయక్వాడ్ భారతిబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు. -
గుండెపోటు కాదు.. ఆత్మహత్యే
కొండాపూర్(సంగారెడ్డి): కట్టుకున్న భర్తే భార్య ఆత్మహత్యను గుండెపోటుగా చిత్రీకరించాడు. తీరా అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో బంధువులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం బయటకు వచ్చింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. కొండాపూర్ ఎస్సై సోమేశ్వరి కథనం ప్రకారం... మండల పరిధిలోని మల్కాపూర్ చౌరస్తాలోని గీతానగర్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ కుటుంబం నివాసం ఉంటోంది. ఉపాధ్యాయుడు శ్రీనివాస్ సంగారెడ్డి మండలం తాళ్లపల్లిలో విధులు నిర్వహిస్తుండగా అతడి భార్య సుచిత(35) బ్యూటీ పార్లర్ నిర్వహిస్తుంది. ఆదివారం ఇద్దరి మధ్యలో మనస్పర్థలు రావడంతో సుచిత ఇంట్లో ఉరివేసుకుంది. కాగా ఈ విషయం బయటకు వెళ్తే ఉద్యోగపరంగా ఇబ్బందులు వస్తాయని, ఆత్మహత్యను కాస్త గుండెపోటుగా చిత్రీకరిస్తూ శ్రీనివాస్ బంధువులకు సమాచారం అందించారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు నారాయణ ఖేడ్ మండలం మద్వార్కు తీసుకెళ్లారు. అక్కడ ఏర్పాట్లు చేస్తున్న సమయంలో మృతురాలి మెడపై మరకలు ఉండడంతో బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. రిపోర్ట్ వచ్చిన అనంతరం ఎస్సై మాట్లాడుతూ సుచితది గుండెపోటు కాదని, ఆత్మహత్య అని ప్రకటించారు. మృతురాలి సోదరుడు ఆశిష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో సీనియర్ అసిస్టెంట్ కుమారి మృతి
కడప జిల్లా: మండలంలోని మడూరు గ్రామ సమీపంలో సోమవారం సాయంత్రం ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న సంఘటనలో తొండూరు తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జి.కుమారి దుర్మరణం చెందారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం సాయంత్రం తహసీల్దార్ కార్యాలయంలో కుమారి విధులు ముగించుకున్నారు. పులివెందుల వచ్చేందుకు తొండూరు సాయిబాబా ఆలయం వద్ద బస్సు కోసం వేచి ఉండగా, బూచుపల్లెకు చెందిన ఓ ప్రైవేట్ బస్సు డ్రైవర్ కనిపించాడు. ఆమె చేయి ఎత్తడంతో తన ద్విచక్రవాహనాన్ని ఆపి ఆమెను ఎక్కించుకుని పులివెందులకు బయలుదేరాడు. మడూరు గ్రామ సమీపంలోకి రాగానే నాలుగు లేన్ల రోడ్డు పనులలో భాగంగా బ్రిడ్జి పనులు జరుగుతున్న ప్రదేశంలో లారీ వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో కుమారి లారీ టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే స్థానికులు, రెవెన్యూ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ ఘన మద్దిలేటి, రెవెన్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని ఆర్డీఓ, జిల్లా కలెక్టర్‌కు తెలియజేశారు. మృతురాలు కుమారికి భర్త విశ్వనాథ్(చిన్నా)తోపాటు ఇద్దరు కుమారులు విశ్వనాథ్, నందు, కుమార్తె సిరిచందన ఉన్నారు. కుమారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, రెవెన్యూ సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు. మృతురాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఎంపీడీఓ రామచంద్రుడు, రెవెన్యూ సిబ్బంది కోరారు. -
కారులో పట్టుబడ్డ 20 కోట్ల నగదు ఎవరిది?
సాక్షి, పుట్టపర్తి: ఓ కారు.. ఇద్దరు వ్యక్తులు.. రూ.కోట్ల నగదు.. పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే వెళ్లి స్వా«దీనం చేసుకున్నారు. కానీ విషయం బయటకు చెప్పలేదు. ఎలాగోలా బయటకు వచ్చి హాట్ టాపిక్ అయ్యింది. దీంతో సోమవారం పెనుకొండ సీఐ రాఘవన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. పెనుకొండ సమీపంలోని ఓ ప్రాంతంలో ధ్వంసమైన కారులో నుంచి రూ.1.20 కోట్ల నగదు స్వా«దీనం చేసుకున్నామని, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఆ డబ్బు ఎవరిదన్నది మాత్రం తెలపలేదు. అన్నీ అనుమానాలే..పోలీసులు స్వా«దీనం చేసుకున్న డబ్బు ఎవరిది? ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారనే అంశాన్ని పోలీసులు వెల్లడించలేదు. రూ.20 కోట్ల వరకు కారులో ఉన్నట్లు స్థానికంగా చర్చ నడుస్తోంది. దీనిపైనా క్లారిటీ ఇవ్వడం లేదు. ఘటన జరిగి వారం రోజులవుతున్నా పోలీసులు ఎందుకు గోప్యంగా ఉంచారన్నది అనుమానాలకు తావిస్తోంది. డబ్బు బడా వ్యాపారవేత్తలదా? రాజకీయ నాయకులదా అన్నది వారం రోజుల తర్వాత కూడా చెప్పలేకపోతున్నారు. కనీసం తమ అదుపులో ఉన్న వారెవరన్న విషయాన్నీ మీడియాకు వెల్లడించలేదు. గోరంట్ల పోలీసులకు సమాచారం.. ‘కియా’ స్టేషన్లో కేసు పెనుకొండ శివారులోని జాతీయ రహదారిపై ద్వంసమైన కారులో నగదు పట్టుబడినట్లు సోమవారం పెనుకొండ సర్కిల్ కార్యాలయంలో సీఐ రాఘవన్ మీడియాకు తెలిపారు. తొలుత పెనుకొండ సమీపంలో ధ్వంసమైన ఓ కారులో డబ్బు ఉందంటూ గోరంట్ల పోలీసులకు సమాచారం అందిందని, అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకుని డబ్బు స్వా«దీనం చేసుకున్నారని, అయితే అది కియా పోలీస్ స్టేషన్ పరిధి కావడంతో ఇక్కడ కేసు నమోదు చేశారని చెబుతున్నారు. ఇదంతా నిజమే అయితే ఆ డబ్బు ఎవరిది? పోలీసుల అదుపులో ఉన్న ఆ ఇద్దరు ఎవరన్నది స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఇక కారులోని వ్యక్తులే సమాచారం ఇచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. అలాగైతే కియా స్టేషన్ పోలీసులకు లేదా పెనుకొండ పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అలా కాకుండా గోరంట్ల పోలీసులకు ఎందుకిచ్చారు? ఈ అంశంలో గోరంట్ల పోలీసుల ప్రమేయం ఏమిటన్నది ప్రశ్నగా మిగిలింది. హవాలా డబ్బేనా? పెనుకొండ పరిధిలో ఇంత భారీ మొత్తంలో నగదు పట్టుబడటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పంపకాల్లో తేడా కారణంగా హవాలా మనీ గురించి తరలిస్తున్న వారే బయట పెట్టారా? లేక దారిదోపిడీదారులు వెంబడించి ఎత్తుకెళ్లారా? అనేది సస్పెన్స్‌గా మారింది. విచారణ చేస్తున్నాం ఈ నెల 5న సూరత్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న కారును స్వా«దీనం చేసుకుని..ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కియా పోలీస్ స్టేషన్ పరిధిలో విచారణ చేపట్టాం. డబ్బు ఎవరిదన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. లోతుగా విచారణ చేసి త్వరలోనే వివరాలు వెల్లడిస్తాం. కారులో డబ్బు తీసుకెళ్తుండగా.. కొందరు దుండగులు దారి కాచి దోపిడీ చేసి నగదు ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. ఇద్దరు వ్యక్తులు గోరంట్ల పోలీసులను ఆశ్రయించగా.. వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ధ్వంసమైన కారుతో పాటు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల పాటు విచారణ చేయగా.. డబ్బు తమదేనని చెబుతున్నారు. అయితే అంత డబ్బు ఎక్కడికి తీసుకెళ్తున్నారనే దానిపై విచారణ చేస్తున్నాం.’ – రాఘవన్, పెనుకొండ సీఐ -
పాలిటెక్నిక్ విద్యార్థినిపై ర్యాపిడో డ్రైవర్ అత్యాచారం
తిరుపతి: నగరంలో మైనర్ పాలిటెక్నిక్ విద్యార్థినిపై ర్యాపిడో ఆటో డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఎస్వీ పాలిటెక్నిక్ చదువుతున్న బాధిత విద్యార్థిని ప్రైవేట్ హాస్టల్లో ఉంటోంది. ఆమె మరో హాస్టల్‌కు మారుతున్న సమయంలో ర్యాపిడో డ్రైవర్ సాయికుమార్‌తో పరిచయం ఏర్పడింది. కొంతకాలానికే వారి పరిచయం పెరగడంతో విద్యార్థిని ర్యాపిడో డ్రైవర్‌ను ఆర్థిక సహాయం కోరింది. దీంతో అతను ఈ అవకాశాన్ని అలుసుగా తీసుకుని, నమ్మించి తన గదికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయం బయటపెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించినట్లు విద్యార్థిని తెలిపింది.దీంతో ఆమె తన స్నేహితురాలితో కలిసి అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి, నిందుతుల ఆచూకీకై గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, నిందితుడు సాయికుమార్ పరారీలో ఉండగా, అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు కొనసాగుతున్నట్లు అలిపిరి పోలీసులు తెలిపారు. -
ఖాకీ తండ్రి... కంత్రీ కొడుకు
సాక్షి, నరసరావుపేట: పెడదారిపడుతున్న కొడుకును మందలించి దారిలో పెట్టాల్సిన తండ్రి తనయుడి మోసాలను చూసీచూడనట్టు వదిలేశాడు. కన్న పేగు మమకారంతో తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇప్పటికే నమోదైన కేసుల్లో బయటపడేలా చేస్తుండటం ఆ కొడుకు మరింత రెచ్చిపోయేలా చేసింది. ఈ క్రమంలో ఈజీ మనీకి అలవాటుపడిన ఓ ఏఎస్ఐ కొడుకు చేసిన నిర్వాకానికి ఏకంగా ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృత్యువాత పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిలకలూరిపేట నేషనల్ హైవే రోడ్డు ప్రమాద ఘటనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. అక్రమ సంపాదనకు అలవాటు పడిన ముఠా జాతీయ రహదారిపై వాహనాలు ఆపి నగదు వసూలు చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసు విచారణలో తేలింది. నకిలీ రవాణాశాఖ అధికారుల పేరుతో... చిలకలూరిపేట బైపాస్ సమీపంలో జాతీయ రహదారిపై ఈనెల 4న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. వినుకొండ రూరల్ మండలంలో అయ్యప్పస్వామి భజనకు హాజరుకావడానికి గుంటూరు నుంచి వెళ్తున్న కారు ట్రాక్టర్ల లోడ్‌తో వెళ్తున్న ట్రాలర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ట్రాలర్‌ను ముందుగా వెళ్తున్న కారులోని వ్యక్తులు ఆపడంతో ప్రమాదం జరిగినట్టు సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా వెల్లడైంది. దీనిపై కేసు నమోదు చేసిన నాదెండ్ల పోలీసులు విచారణ చేపట్టారు. అక్రమ వసూళ్లకు పాల్పడే ముఠా ట్రాలర్‌ను ఆపినట్టు నిర్ధారించారు. ఈ కేసులో నిందితులుగా భావిస్తున్న నరసరావుపేటకు చెందిన ఏఎస్ఐ కుమారుడు వెంకట్ నాయుడు, చిన్న తురకపాలేనికి చెందిన ఎస్కే బాషా, బాలయ్యనగర్‌కు చెందిన వెంకట్రావ్, నకరికల్లు మండలం నర్సింగపాడుకు చెందిన గోపి, మహేష్ లు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. వీరికి పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా నలుగురు తమకేమీ తెలియదని బుకాయించినప్పటికీ, ఒకరు మాత్రం నిజం ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. హైవేపై వెళ్తున్న లారీలను రవాణాశాఖ అధికారుల పేరిట ఆపి నగదు వసూలు చేయడం కోసమే ఆపాం అని, అయితే అనుకోని విధంగా ప్రమాదం జరిగిందని చెప్పుకొచ్చినట్టు తెలియవచ్చింది. పోలీసు దందాలకు నాయకుడు రౌడీషిటర్ ఐదుగురు యువకుల మరణానికి కారణమైన ఏఎస్ఐ కుమారుడిపై నరసరావుపేట రూరల్ పోలీసుస్టేషన్లో రౌడీషిట్ నమోదై ఉంది. పదుల సంఖ్యలో చీటింగ్, చోరీలు, హత్యాయత్నం వంటి తీవ్రమైన నేరారోపరణలో కేసులు నమోదయ్యాయి. ఇటువంటి రౌడీషిటర్లను తరచూ పోలీసుస్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తుండాలి. ఈ పోలీసు కంత్రీ కుమారుడిని ఇటీవల కాలంలో స్టేషన్‌కి పిలిచి కౌన్సెలింగ్ చేపట్టిన దాఖలాలు లేవని రూరల్ పోలీసు సిబ్బంది చెబుతున్నారు. తండ్రికి ఉన్నతాధికారులతో ఉన్న సత్ససంబంధాలతో రౌడీషిటర్ల కౌన్సెలింగ్‌కు వెళ్లాల్సిన పనిలేకుండా సెట్ చేశారట. గతేడాదిగా సదరు రౌడీషిటర్‌తో పోలీసు ఉన్నతాధికారులు మామూళ్ల వసూళ్లకు ఏజెంట్‌గా నియమించినట్టు తెలుస్తోంది. నెలవారీ మామూళ్లను ఈ రౌడీషిటరే తండ్రి తరపున వెళ్లి బెదిరించి మరీ వసూళ్లు చేసేవాడని పోలీసు వర్గాలే చెప్పుకొస్తున్నాయి. తమ శాఖలోని కొందరు ఉన్నతాధికారులు అండతో తండ్రీకొడుకులు రెచ్చిపోయారని, అయినా ఏం చేయలేక మిన్నుకుండిపోయామని వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా సదరు ఏఎస్ఐపై చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో కోటప్పకొండ వద్ద రూ.40 లక్షలు మోసం చేసిన ఘటనలో తండ్రీకొడుకులను శిక్షించి ఉంటే ఈ సమస్య వచ్చేంది కాదని అంటున్నారు. ఇతని బా«ధితులు నరసరావుపేటలో పదుల సంఖ్యలో ఉన్నా తండ్రి అధికారంతో బా«ధితులు బయటకు రావడానికి భయపడుతున్నారు. -
వీధికుక్కలు వెంబడించడంతో స్కూటరిస్టు మృతి
రాయచోటి టౌన్: అన్నమయ్య జిల్లా రాయచోటిలో మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైంది. రాయచోటిలోని కొత్తపేటలో నివాసం ఉండే ఫజల్ (42) ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో గాలివీడు రోడ్డులో ద్విచక్రవాహనంపై తన ఇంటికి వెళుతుండగా కుక్కలు వెంటపడ్డాయి. వాటి నుంచి తప్పించుకోవాలని బైకును వేగంగా నడిపాడు. అయినా కుక్కలు విడిచిపెట్టలేదు. దీంతో వేగాన్ని అదుపుచేసుకోలేక ఎదురుగా ఉన్న గుడి గోడను ఢీకొని అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, రాయచోటిలో రోడ్లపై ఎక్కడికక్కడ కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్తే చలనం లేదని వాపోతున్నారు. -
పాతికేళ్ల నాటి పగ!
సాక్షి, సిటీబ్యూరో/జవహర్‌నగర్: రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని జవహర్‌నగర్‌లో దారుణ హత్య చోటు చేసుకుంది. పాతికేళ్ల నాటి పగ తుపాకీ, కత్తులతో విరుచుకుపడింది. అప్పట్లో తన తండ్రి మరణానికి ఆయన డ్రైవరే కారణమని భావించిన వ్యక్తి...బంధువుతో పాటు మరికొందరితో కలిసి విరుచుకుపడ్డాడు. కుమార్తెను పాఠశాల వద్ద వదిలి వస్తున్న మాజీ డ్రైవర్‌ను పట్టపగలు, నడిరోడ్డుపై అడ్డగించి చంపేశాడు. నేరుగా నగరంలోని షాహినాయత్‌గంజ్ పోలీసుస్టేషన్‌కు వచి్చన ఆరుగురు నిందితులు లొంగిపోయారు. వీరిని అధికారులు జవహర్‌నగర్ పోలీసులకు అప్పగించారు. అప్పట్లో డాన్‌గా వ్యవహరించిన సుదేశ్ సింగ్... నగరంలోని మంగళ్‌హాట్ ప్రాంతానికి చెందిన సుదేశ్ సింగ్ 1990ల్లో ఓ స్థాయి డాన్‌గా చెలామణి అయ్యాడు. మంగళ్‌హాట్, ధూల్‌పేట, జిర్రా తదితర ప్రాంతాల్లో గుడుంబా వ్యాపారంతో పాటు బెదిరింపు వసూళ్లు, గంజాయి దందాలను తన గుప్పెట్లో పెట్టుకున్న సుదేశ్ సింగ్ పోలీసులనూ పరుగులు పెట్టించారు. ఇతడి వ్యవహారాలు శృతిమించడంతో అప్పటి ఉన్నతాధికారులు కట్టడి చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం 1999లో టాస్‌్కఫోర్స్‌లో ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలిసిన సుదేశ్ సింగ్ తన సన్నిహితులైన అనుచరులతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అయితే ఇతడి ప్రధాన అనుచరుడైన అనిల్ ఆచూకీ కామాటిపుర ప్రాంతంలో గుర్తించిన పోలీసులు పట్టుకోవడానికి ప్రయతి్నంచారు. ఈ నేపథ్యంలో జరిగిన ఎదురు కాల్పుల్లో అనిల్ చనిపోయాడు. వెంకటరత్నంనే ఇన్ఫార్మర్గా అనుమానించి... ఈ ఎన్‌కౌంటర్‌తో మరింత అప్రమత్తమైన సుదేశ్ సింగ్ తర్వాతి టార్గెట్ తానే అని భావించారు. తన ఉనికి ఎక్కడా బయటపడకుండా ఉండేందుకు అనుచరుల్నీ దూరంగా ఉంచారు. అయినప్పటికీ నాటకీయ పరిణామాల మధ్య 2000 ఏప్రిల్‌లో జిర్రా ప్రాంతంలోని గుట్టలపై జరిగిన ఎన్కౌంటర్లో సుదేశ్ సింగ్ చనిపోయాడు. అప్పట్లో నగరానికి చెందిన గంటా వెంకటరత్నం డాన్ సుదేశ్ సింగ్‌కు డ్రైవర్‌గా వ్యవహరించారు. పోలీసులు ఇతడిపై ఒత్తిడి పెంచడంతోనే సుదేశ్ సింగ్ కదలికలపై ఉప్పందించాడని, ఈ కారణంగానే ఎన్కౌంటర్ జరిగిందని మృతుడి కుటుంబీకులు భావించారు. దీంతో కొన్నేళ్లుగా సుదేశ్ కుమారుడు చందన్ సింగ్, సమీప బంధువు కక్షతో రగిలిపోయారు. వెంకటరత్నం ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు జవహర్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని సాకేత్ కాలనీలో తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నట్లు గుర్తించారు. పక్కా రెక్కీ చేసి, ఆయుధం సేకరించి... చందన్ తన సమీప బంధువుతో పాటు మరో నలుగురితో కలిసి ముఠా కట్టాడు. సాకేత్ కాలనీలో పక్కాగా రెక్కీ చేసి వెంకటరత్నం కదలికల్ని గమనించారు. ఆపై హత్య పథకాన్ని అమలు చేయడానికి ఓ తుపాకీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. తన తండ్రి పోలీసు కాల్పుల్లో చనిపోయిన నేపథ్యంలో వెంకటరత్నాన్ని కూడా కాల్చి చంపాలని చందన్ భావించాడు. షాహినాయత్‌గంజ్ ప్రాంతంలో నివసించే చందన్, అతడి సమీప బంధువు కొన్నాళ్లుగా ఇతర ప్రాంతాలకు వెళ్లారు. ఓ తుపాకీ ఖరీదు చేసుకుని వచి్చన ఈ ద్వయం సోమవారం మరో నలుగురితో కలిసి రంగంలోకి దిగింది. తుపాకీతో కాల్పులు జరిపినా తప్పించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కత్తులనూ తమ వెంట తెచ్చుకుంది. ఎప్పటిలాగే వెంకటరత్నం తన కుమార్తెను కాప్రాలోని పాఠశాలలో దింపేందుకు ఇంటి నుంచి బయలుదేరారు. ఇది గమనించిన చందన్ విషయాన్ని అనుచరులకు సమాచారమిచ్చాడు.కాపుకాసి దారుణంగా హత్య చేసి..నలుగురు ఆటోలు ఇద్దరు స్కూటీపై వచ్చి కాపుకాశారు. తన కుమార్తెను స్కూల్లో దింపిన వెంకటరత్నం తిరిగి తన ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరాడు. ద్విచక్ర వాహనంపై ఇద్దరు ఈయన్ను వెంబడిస్తుండగా ఆటోలో నలుగురు మార్గమధ్యంలో కాపుకాశారు. వీళ్లు కాపుకాసిన ప్రాంతానికి వెంటకరత్నం చేరుకున్న వెంటనే అడ్డగించి దాడికి తెగబడిన ముఠా ముందు కాల్పులు జరిపింది. కిందపడిపోయిన వెంకటరత్నం దగ్గరకు వెళ్లి విచక్షణారహితంగా కత్తులతో పొడిచి పారిపోయింది. ఛాతి, తల, మెడ భాగాల్లో తీవ్ర గాయాలైన వెంకటరత్నం అక్కడికక్కడే చనిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు జవహర్‌నగర్ పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించింది. క్లూస్‌టీం, డాగ్‌స్వాడ్‌లతో హత్యాస్థలిలో ఆధారాలు సేకరించారు. నిందితులు నేరుగా షాహినాయత్‌గంజ్ పోలీసుస్టేషన్‌కు వచ్చి ఆయుధాలు అప్పగించి లొంగిపోయారు. -
తల్లిదండ్రుల ఎదుటే గొంతు కోసి ఘాతుకం
హైదరాబాద్: ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిందని కక్ష పెంచుకుని..ఓ యువతిని ఆమె తల్లిదండ్రుల ఎదుటే గొంతుకోసి అతిదారుణంగా హత్య చేశాడు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ ఘటన వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపూజీనగర్‌లో జరిగింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం శ్రీకాకుళంకు చెందిన కాంతారావు, లక్ష్మి దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి పార్శిగుట్టలోని బాపూజీనగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు పవిత్ర (19), రేవతి ఉన్నారు. పవిత్ర ఇంటర్ పూర్తి చేసి కంప్యూటర్ కోర్సు చదువుతుంది. శ్రీకాకుళంకు చెందిన ఉమాశంకర్ (25 )వీరికి దూరపు బంధువు. ఉమాశంకర్‌కు తల్లిదండ్రులు లేరు, యూసఫ్‌గూడలోని సోదరి వద్ద నివాసం ఉంటూ టైల్స్ పనిచేస్తుంటాడు. చిలకలగూడలో ఉండే సోదరుడి దగ్గరకు వస్తూ.. ఇదే ప్రాంతంలోని కాంతారావు ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో పవిత్రపై కన్నేసిన ఉమాశంకర్ ఆమెను ప్రేమిస్తున్నాని, తనకు ఇచ్చి పెళ్లి చేయాలని ఒత్తిడి చేశాడు. సంక్రాంతి తర్వాత పెళ్లి చేస్తామని పవిత్ర తల్లిదండ్రులు చెప్పారు. అయితే మద్యానికి బానిసైన ఉమాశంకర్‌తో పెళ్లిని పవిత్ర తిరస్కరించింది. కాగా ఆదివారం కాంతారావు కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ వెళ్లి వచ్చారు. తనకు చెప్పకుండా ఎందుకు విజయవాడ వెళ్లారని ఉమాశంకర్ వారితో గొడవకు దిగాడు. సోమవారం ఉదయం పవిత్ర ఇంటికి వచ్చిన ఉమాశంకర్ మళ్లీ పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చాడు. ఆ సమయంలో కాంతారావు దంపతులు, పవిత్ర ఆమె చెల్లి అందరూ ఇంట్లోనే ఉన్నారు. పెళ్లి గురించి వీరి మధ్య కొద్దిసేపు వాగ్వవాదం జరిగింది. వెంటనే తీవ్ర ఆగ్రహానికి గురైన ఉమాశంకర్ తనతో పాటు తెచ్చుకున్న కత్తితో పవిత్ర గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావంతో తల్లిదండ్రుల కళ్లెదుటే పవిత్ర కన్నుమూసింది. వెంటనే సమాచారం అందుకున్న చిలకలగూడ ఏసీపీ శశాంక్‌రెడ్డి, వారాసిగూడ ఇన్స్పెక్టర్ మధుసూదన్‌రెడ్డి, సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. తల్లడిల్లిన కుటుంబ సభ్యులు పవిత్ర తనను ఇష్టపడడం లేదని తెలుసుకున్న ఉమాశంకర్ ముందే పథకం ప్రకారం ఆమెను హత్యచేసేందుకు వచ్చాడు. ఇందులో భాగంగానే తనతో పాటు కత్తిని కూడా తీసుకొచ్చిన ..ఎవరూ ఊహించని విధంగా అకస్మాత్తుగా పవిత్రపై దాడికి పాల్పడి చంపేశాడు. ఈ ఘటనతో పవిత్ర తల్లిదండ్రులు, చెల్లి రేవతి ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ఏమి జరుగుతుందో తెలుసుకునేలోపే దారుణం జరిగిపోవడంతో వారు తల్లడిల్లిపోయారు. తమ కళ్లముందే బిడ్డను చంపేయడంతో ఆ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పవిత్ర కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. -
HYD: రియల్టర్ దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో రియల్టర్ దారుణ హత్య తీవ్ర కలకలం సృష్టించింది. గుర్తుతెలియని వ్యక్తులు.. కత్తులతో పొడిచి తుపాకీతో కాల్చి వెంకటరత్నం అనే వ్యక్తిని హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. మల్కాజ్‌గిరిలోని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఉన్న సాకేత్ కాలనీ ఫోస్టర్ స్కూల్ సమీపంలో సోమవారం ఉదయం రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటరత్నంను దుండగులు అతి కిరాతకంగా హతమార్చారు. స్కూటీపై వెళ్తున్న వెంకటరత్నంను వెంబడించిన గుర్తుతెలియని వవ్యక్తులు.. కత్తులతో పొడిచి తుపాకీతో కాల్చి చంపారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.అయితే, వెంకటరత్నంపై ధూల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ నమోదై ఉన్నట్లు గుర్తించారు. జంట హత్యల కేసులో నిందితుడిగా ఉన్నట్లు తేలింది. ఆయనను ప్రత్యర్ధులే చంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. నగరంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. పట్టపగలే హత్యలు, దోపిడీలు జరుగుతుండటంతో ప్రజలకు భయాందోళనకు గురవుతున్నారు. -
స్పా ముసుగులో వ్యభిచారం
నెల్లూరు(క్రైమ్): నగరంలోని మూడు స్పా సెంటర్లపై ఆకస్మిక దాడులను పోలీసులు శనివారం చేపట్టారు. పది మంది యువతులతో పాటు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. యువతులను హోమ్‌కు తరలించారు. పోలీసుల వివరాల మేరకు.. నగరంలోని పలు స్పా సెంటర్లలో అసాంఘిక కార్యకలాపాలు, క్రాస్ మసాజ్‌లు జరుగుతున్నాయని ఎస్పీ అజిత వేజెండ్లకు సమాచారమొచ్చింది. ఆమె ఆదేశాల మేరకు నిప్పో సెంటర్లోని ఎవిరీ డే సెలూన్ స్పా సెంటర్‌పై దాడి చేశారు. ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకొని వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిర్వాహకుడు మహేష పై కేసు నమోదు చేశారు. ⇒బాలాజీనగర్ సమీపంలోని జగదీష్ నగర్లో గల యూనిక్స్ సెలూన్ స్పాపై దాడి చేసి ముగ్గురు యువతులు, ఒక విటుడ్ని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిర్వాహకుడు సు«దీర్పై కేసు నమోదు చేశామని బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ సాంబశివరావు తెలిపారు. ⇒ రామలింగాపురంలోని వీఐపీ స్పాపై దాడి చేసి ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకొని నిర్వాహకురాలు కృష్ణవేణిపై కేసు నమోదు చేశామని ఇన్స్పెక్టర్ చెప్పారు. పోలీసుల దాడులతో పలువురు నిర్వాహకులు స్పా సెంటర్లకు తాళాలు వేసి పరారయ్యారు. నగర ఇన్చార్జి డీఎస్పీ గిరిధర్ పాల్గొన్నారు. -
నా కూతురు మృతికి అల్లుడే కారణం
దుబ్బాకరూరల్: అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో జరిగింది. ఎస్ఐ కీర్తి రాజ్ వివరాల ప్రకారం... రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామానికి చెందిన పెద్దోళ్ల సుష్మ(32)ను పన్నెండేళ్ల క్రితం శ్రీకాంత్‌కు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. కొంత కాలంగా భర్త, అత్తామామల నుంచి పలు రకాలుగా వేధింపులు ఎక్కువయ్యాయి. తల్లిదండ్రులకు తరుచు తెలుపడంతో నచ్చజెప్పేవారు. ఈ క్రమంలో శనివారం ఇంట్లో ఉరి వేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తమ కుమార్తె మృతికి అల్లుడు శ్రీకాంత్, అత్త ఎల్లవ్వ, మామ బాబు కారణమని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
పెళ్లైన నెల రోజులకే నవ వరుడు ఆత్మహత్య
అనంతపురం జిల్లా: ఏడడుగుల బంధంతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాల్సిన యువకుడికి ఏం కష్టమొచ్చిందో ఏమో పెళ్లైన 33 రోజులకే జీవితంపై విరక్తి చెంది శెనగ పంటకు వాడే మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల మేరకు.. అనంతపురం జిల్లా యాడికి మండలం నగరూరు గ్రామానికి చెందిన జయరాం నాయుడుకు శరత్ కుమార్ నాయుడు(23), లోకేష్ కుమార్ నాయుడు అనే ఇద్దరు కుమారులు. శరత్ కుమార్ నాయుడు మరో వ్యక్తితో కలిసి కొంత కాలంగా బెంగళూరులో సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నాడు. చిన్న కుమారుడు లోకేష్ కుమార్ నాయుడు నగరూరులో తమ వ్యవసాయ తోటల్లో తండ్రికి చోదోడు వాదోడుగా ఉంటున్నాడు. గత నెల 2, 3వ తేదీల్లో బళ్లారి జిల్లాలోని సుగ్గేనహళ్లి కొట్టాల గ్రామానికి చెందిన సుస్మితతో శరత్ కుమార్ నాయుడికి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. 10 రోజుల క్రితం తన భార్య సుస్మితను నగరూరు గ్రామంలో తమ ఇంటి వద్ద ఉంచి శరత్‌కుమార్ బెంగళూరు వెళ్లాడు. ఈ నెల 3వ తేదీన సుస్మిత తన తల్లిదండ్రులతో కలిసి పుట్టింటికి వెళ్లింది. ఏం కష్టం వచ్చిందో కానీ.. శుక్రవారం బెంగళూరు నుంచి వచ్చిన శరత్‌కుమార్ తాడిపత్రి మీదుగా నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో ఉన్న తన స్నేహితుడు హరీష్ ఇంటికి వెళ్లాడు. రాత్రి 8 గంటల సమయంలో సిమెంట్ ఫ్యాక్టరీకి హరీష్ వెళ్లిన తర్వాత ఇంటిలో ఉన్న శరత్ కుమార్ నాయుడు తన సెల్ఫోన్లో భార్యతో సుమారు గంటసేపు మాట్లాడాడు. 9 గంటల తర్వాత తాను శెనగ గింజలకు వేసే క్రిమిసంహారక మాత్రలు మింగానని శరత్‌కుమార్ హరీష్‌కు ఫోన్ చేశాడు. వెంటనే గదికి వచ్చిన హరీష్ విలవిలలాడుతున్న శరత్‌కుమార్ నాయుడును ఓ వాహనంలో తాడిపత్రికి తరలించాడు. ప్రథమ చికిత్స అనంతరం అక్కడ వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. శరత్‌కుమార్ నాయుడిని పరీక్షించిన డాక్టర్లు ఇక లేడని తెలిపారు. అనంతపురానికి వచ్చిన బాధిత కుటుంబ సభ్యులు మృతి చెందిన శరత్‌కుమార్ నాయుడిని చూసి కన్నీటి పర్యంత మయ్యారు. శనివారం ఉదయం సమాచారం అందుకున్న మృతుడి భార్య సుస్మిత తన తల్లిదండ్రులతో అనంతపురానికి వచ్చి ఆసుపత్రిలో విగత జీవిగా ఉన్న భర్తను చూసి రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. -
ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ.. రెండు ముక్కలైన ట్రాక్టర్..
శామీర్‌పేట్: ట్రాక్టర్‌ను లారీ ఢీ కొట్టిన ఘటన శనివారం శామీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మహారాష్ట్రకు చెందిన ఆకాశ్ ఉత్తమ్ సోనె (31), స్థానికంగా నివాసం ఉంటూ ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శనివారం హైదరాబాద్–కరీంనగర్ రాజీవ్ రహదారి గుండా ట్రాక్టర్ నడుపుతూ వెళ్తుండగా తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని అలియాబాద్ చౌరస్తా వద్ద వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఆర్జె 17 జిబి 0546 నంబరు గల లారీ బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ ఆకాశ్ అక్కడికక్కడే మృతిచెందిగా మరో వ్యక్తి జగదేవ్కు తీవ్ర గాయాలయ్యాయి. కాగా ట్రాక్టర్‌ను లారీ వెనక నుండి అతివేగంగా ఢీ కొట్టడంతో ట్రాక్టర్ ఇంజన్ రెండు ముక్కలైంది. ప్రమాదం జరిగినప్పుడు భారీ శబ్ధం వచి్చందని, దీన్ని బట్టి లారీ వేగాన్ని అంచనా వేయొచ్చని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంతో రాజీవ్ రహదారిపై సుమారు 3 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం అందుకున్న శామీర్‌పేట పోలీసులు క్రేన్ సహాయంతో ట్రాక్టర్ భాగాలను రోడ్డుపై నుండి తొలగించారు. ప్రమాద తీవ్రతకి డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా, ట్రాక్టర్‌పై ఉన్న మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ శ్రీనాథ్ తెలిపారు. -
మిత్రుల కళ్ల ముందే.. రైలుకు ఎదురెళ్లి..
సికింద్రాబాద్: ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు మిత్రుల కళ్లెదుటే రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం సికింద్రాబాద్ పరిధిలో చోటుచేసుకుంది. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ కె.కోటేశ్వరరావు చెప్పిన వివరాల ప్రకారం.. సైనిక్‌పురి శివనగర్ కాలనీకి చెందిన విజయభాస్కర్ కుమారుడు రవిశంకర్ (30) ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. మరో కంపెనీలో ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆ తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్లీ ఉద్యోగం దొరకలేదు. దీంతో మనస్తాపానికి గురైన రవిశంకర్ శుక్రవారం రాత్రి 9 గంటలకు నేరేడ్మెట్లోని తన స్నేహితుడు శ్రీధర్ ఇంటికి వెళ్లి తనకు ఉద్యోగం దొరకడం లేదని ఆవేదనకు గురయ్యాడు. ఆ తర్వాత ఇరువురు కలిసి అదే కాలనీలో నివసించే మరో మిత్రుడు సాయిప్రశాంత్ ఇంటికి వెళ్లారు. అక్కడికి శైలేష్ జగన్ అనే మరో ఇద్దరు మిత్రులు వచ్చి రాత్రి 12.30 గంటల వరకు కలిసి మాట్లాడుకున్నారు. ఈ సమయంలో తీవ్ర మనస్తాపానికి గురైన రవిశంకర్‌ను ఓదార్చారు. అర్దరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత రవిశంకర్‌ను అతడి ఇంట్లో దింపి వచ్చేందుకు మిత్రులు అందరు ద్విచక్ర వాహనాలపై బయలుదేరారు. మార్గంమధ్యలో వాజపేయినగర్ రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద గేట్ పడింది. దీంతో ద్విచక్ర వాహనాలను నిలిన స్నేహితులు గేట్ తెరిచే సమయం కోసం ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో మిత్రుడి ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చున్న రవిశంకర్ ఉన్నఫలంగా దిగిపోయి మిత్రులు చూస్తుండగానే రైలు పట్టాలపైకి చేరుకున్నాడు. అదే సమయంలో వేగంగా వచ్చినన రైలు ఢీ కొట్టిన ప్రమాదంలో అతడి రెండు కాళ్లు తెగిపోయాయి. అంబులెన్స్‌ను రప్పించిన మిత్రులు రవిశంకర్‌ను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మృతి చెందాడు. ఉద్యోగం రావడం లేదని, ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేసి తప్పు పని చేశానని కొద్ది రోజులుగా రవిశంకర్ మనస్తాపానికి గురవుతున్నట్లు అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. -
తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో దారుణం
సాక్షి, తిరుపతి: నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో దారుణం జరిగింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ వేధింపులు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థినిని బెదిరించి గర్భవతిని చేశాడు. బాధిత విద్యార్థిని.. వైస్ ఛాన్సలర్‌కు ఫిర్యాదు చేసింది. కీచక ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ సస్పెండ్ చేస్తూ వీసీ ఆదేశాలు జారీ చేశారు.యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఒడిశాకు చెందిన విద్యార్థినిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ కన్నేశారు. ఆ విద్యార్థినిని మాయమాటలు చెప్పి లోబరుచుకున్నారు. విద్యార్థినితో లక్ష్మణ్ కుమార్ ఏకాంతంగా ఉన్న దృశ్యాలను రికార్డు చేసిన మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా ఆమెను లోబరుచుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం.లక్ష్మణ్ కుమార్‌పై యూనివర్శిటీ సిబ్బంది.. తిరుపతి పశ్చిమ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నం చేశారు. కానీ బాధిత విద్యార్థిని ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. కానీ ఆ విద్యార్థిని సంస్కృత యూనివర్సిటీ నుంచి ఒడిశాకు వెళ్ళిపోయింది. -
గలీ గలీ మే చోర్ హై!
పోలీసింగ్ వ్యవస్థ ఇప్పుడు టెక్నాలజీని మాగ్జిమమ్ వాడేసుకుంటోంది. అయినా కూడా.. దొంగల చేతిలో తాళాలు విరిగిపోతూనే ఉన్నాయి. కళల్లో చోరకళ ఒకటి అంటారు కదా!. దేశంలో ఎన్ని కళలు అంతరించిపోతున్నా.. చోర కళ మాత్రంకు అలాంటి దుస్థితి వచ్చే అవకాశమే కనిపించడం లేదు. నేరగణాంకాల నివేదిక ఒకటి ఈ విషయాన్నే బల్లగుద్ది మరీ చెబుతోంది. ప్రతి లక్ష మందికి సగటున 49.5(50 అనుకోండి ఇక) చోరీకి గురవుతున్నారట. ఆ వివరాలేంటో కాస్త లోతుగా చూద్దాం..చోర కళకు స్వర్గధామంగా (పోలీసుల పరిభాషలో హాట్‌స్పాట్ అని అందురు).. మహారాష్ట్ర (70.4), రాజస్థాన్ (50.9), మధ్యప్రదేశ్ (41.0) వంటి పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ (42.5), బీహార్ (37.5), కర్ణాటక (36.8), ఒడిశా (36.3) కూడా జాతీయ సగటు దరిదాపుల్లో కేసులు నమోదు చేస్తున్నాయి.చండీగఢ్, ఢిల్లీ లాంటి పెద్ద నగరాల్లో స్వేచ్ఛగా సంచరించే అవకాశం దొంగలకు కలుగుతోంది. సగటును పరిశీలిస్తే.. లక్ష మందికి చండీగఢ్‌లో 114.3 కేసులు, ఢిల్లీలో 106.3 కేసులు నమోదు అవుతున్నాయి. అంటే ఇవి దేశ సగటు కంటే రెండింతలు ఎక్కువన్నమాట!. ప్చ్.. ఈ విషయంలో చిన్న రాష్ట్రాలు ఏం వెనకబడిపోలేదు. మిజోరాం (94), మణిపూర్ (74.1) లాంటి ఈశాన్య ప్రాంతాలు కూడా దొంగల బారిన పడుతున్నాయి.అయితే.. కొన్ని రాష్ట్రాలు మాత్రం చోర కళకు చిక్కులు తప్పడం లేదు. తమిళనాడు (23.1), కేరళ (13.1), పశ్చిమ బెంగాల్ (9.4), సిక్కిం (6.7) లాంటి ప్రాంతాలు తక్కువ కేసులతో పాపం.. ఈ జాబితాలో అట్టడుగున నిలిచాయి. అంటే, అక్కడి పోలీసింగ్ వ్యవస్థ అంత బలంగా ఉందన్నమాట. ప్చ్.. లడఖ్ (5.0), దమన్ & దీయూ, డిఎన్హెచ్ (10.0), అండమాన్ & నికోబార్ (16.1), లక్షద్వీప్ (29.0) వంటి ప్రాంతాలు కూడా తక్కువ కేసులు నమోదు చేస్తున్నాయి. అయితే పర్యాటక ప్రాంతమైన గోవా (29.2), గుజరాత్ (29.6)లకు దొంగల పరిస్థితి కాస్త అటు ఇటుగానే నడుస్తోంది.తెలుగు రాష్ట్రాల్లో ఇలా.. తెలుగు రాష్ట్రాల్లో దొంగతనాల స్థాయి మధ్యస్థంగా ఉంది. తెలంగాణలో ప్రతి లక్ష మందికి సగటున 42.5 కేసులు నమోదవుతున్నాయి. ఇది దేశ సగటు (49.5) కంటే కొంచెం తక్కువ అయినప్పటికీ.. మధ్యస్థాయి ప్రమాదంగా పరిగణించొచ్చు. అలాగే.. అర్బన్ భద్రతా వ్యవస్థకు సవాలుగా మారే అవకాశమూ లేకపోలేదు. ఇక ఏపీ విషయానికొస్తే.. సాధారణంగా దేశ సగటు కంటే కాస్త తక్కువ స్థాయిలోనే కేసులు(23.4) నమోదవుతున్నాయి. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు వంటి పట్టణాల్లో దొంగతనాలు ఎక్కువగా నమోదయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం దొంగలు తమ చేతి వాటం తక్కువే ప్రదర్శిస్తున్నారని తేలింది.పై లెక్కలు చూస్తే.. మనం ఊహించేంత సురక్షితంగా మన గల్లీలు అందులో ఉన్న ఇల్లులు.. మనమూ లేమన్న మాట. సమర్థవంతమైన పోలీసింగ్‌కు ప్రజల భాగస్వామ్యం చేరినప్పుడు.. అదే సమయంలో సామాజిక సమస్యల పరిష్కారం కలిసినప్పుడే దొంగతనాలు పూర్తిగా కట్టడి అవుతాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతూనే ఉన్నారు. -
ఐబొమ్మ కేసులో బిగ్ ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: సినీ పైరసీ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నిందితుడు ఇమ్మడి రవిని కస్టడీకి తీసుకోకుండానే.. మరోసారి నాంపల్లి కోర్టును సైబర్ క్రైమ్ పోలీసులు ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల ఇవాళ్టి నుంచి మూడు రోజలపాటు రవిని విచారణ జరపాల్సి ఉంది.. అయితే.. చంచల్‌గూడ్ జైలు నుంచి రవిని ఇంకా అదుపులోకి తీసుకోలేదని సమాచారం. కోర్టు ఇచ్చిన మూడు రోజుల సమయం సరిపోదని సీసీఎస్ పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే మరింత టైం కావాలని కోరుతూ అప్పీల్‌కు వెళ్లాలని నిర్ణయించారు. మరికాసేపట్లో ఈ పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఐబొమ్మ, బప్పం వెబ్సైట్లతో సినీ పైరసీకి పాల్పడినట్లు వైజాగ్‌కు చెందిన ఇమ్మడి రవిపై ప్రధాన అభియోగం నమోదైంది. ఈ క్రమంలో మరో నాలుగు కేసులూ నమోదు అయ్యాయి. అయితే రెండు విడతలుగా ఇప్పటికే రవిని 8 రోజులపాటు విచారణ జరిపారు సీసీఎస్ పోలీసులు. ఈ క్రమంలో.. నాలుగు కేసులకు సంబంధించి కస్టడీకి అనుమతించాలని పిటిషన్ వేశారు. అయితే.. ఇందులో ఒక కేసును తోసిపుచ్చిన కోర్టు.. మిగిలిన మూడు కేసులకు ఒక్కో రోజు చొప్పున మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. శనివారం నుంచి రవిని విచారించాలని ఆదేశించింది. గత విచారణలో రవి నుంచి సైబర్‌క్రైమ్ పోలీసులు కీలక సమాచారాన్నే సేకరించారు. అయితే కీలకమైన లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని రాబట్టాల్సి ఉంది. అందుకే మూడో విడత కస్టడీని అత్యంత కీలకంగా భావిస్తున్నారు. నిందితుడికి నిరీక్షణ తప్పదా?ఇమ్మడి రవి బెయిల్ పిటిషన్ విచారణ కస్టోడియల్ ఎంక్వైరీ కారణంగానే ఆలస్యం అవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో మూడు రోజుల కస్టడీకి ఆదేశించిన సమయంలోనే నాంపల్లి కోర్టు బెయిల్ పిటిషన్ విచారణపై స్పష్టత ఇచ్చింది. సోమవారం ఎట్టి పరిస్థితుల్లో(మూడు రోజుల విచారణ ముగుస్తుంది కాబట్టి) విచారణ జరుపుతామని నిందితుడి తరఫు లాయర్‌కు స్పష్టం చేసింది. అయితే సైబర్ క్రైమ్ పోలీసుల కీలక నిర్ణయంతో ఈ పిటిషన్ విచారణ ప్రశ్నార్థకంగా మారే అవకాశం లేకపోలేదు. ఒకవేళ అదే జరిగితే.. నిందితుడు రవికి షాక్ అనే చెప్పొచ్చు. -
కడప పోక్సో కోర్టు కీలకతీర్పు
కడప అర్బన్: కడప పోక్సో కోర్టు కీలక తీర్పునిచ్చింది. లైంగిక దాడికేసులో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు 10,000/– జరిమానా విధించింది. అంతేగాక గుంతకల్ డీఆర్ఎం బాధితురాలికి రూ.10.50లక్షల పరిహారం చెల్లించాలని కడప పోక్సో కోర్టు జడ్జి సి. ప్రవీణ్ కుమార్ తీర్పు చెప్పారు.వివరాలు..2019 జనవరి 27వ తేదీన తిరుపతి– నిజామాబాద్ (రైలు నంబర్ 12793) రాయలసీమ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లోని బి–2 కోచ్‌లో ఎనిమిదేళ్ల బాలిక ప్రయాణిస్తోంది. సాయంత్రం 6 గంటల సమయంలో బోగీలోని టాయ్‌లెట్‌కు ఒంటరిగా వెళ్లింది. అదే రైలులో ఉన్న నిందితుడు ఆమెను వెంబడించి, టాయిలెట్ లోపలికి నెట్టి, లైంగిక దాడికి పా ల్పడ్డాడు.చిన్నారి కేకలు వేయగా తల్లిదండ్రులు, ప్రయాణికులు తలుపు తట్టడంతో నిందితుడు తప్పించుకోవడానికి ప్రయతి్నంచాడు.ప్రయాణికులు నిందితుడిని ఎస్1 కోచ్‌లో పట్టుకుని, డ్యూటీలో ఉన్న టీటీఐకి అప్పగించారు. రైలు కడప రైల్వే స్టేషన్లోప్లాట్ఫాం నంబర్ 3కి చేరుకున్నప్పుడు, నిందితుడు రైలు నుంచి దూకి తప్పించుకున్నాడు.బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు, సికింద్రాబాద్ ఆర్పీఎస్లో కేసు నమోదు చేశారు. ఆ కేసు అధికార పరిధి ఆధారంగా కడప ఆర్పీఎస్కు బదిలీ చేశారు. రైల్వే డీఎస్పీ (రిటైర్డ్) రమేష్ ఈ కేసు (క్రైం.నంబర్.08/2019)ను దర్యాప్తు చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. నిందితుడు గాలి రామ్ ప్రసాద్ రెడ్డిని 2019 ఫిబ్రవరి 5న అరెస్టు చేసి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.కడప పోక్సో కోర్టు ఆదేశాలతో గాలి రామ్‌ప్రసాద్ రెడ్డి అలియాస్ ప్రసాద్ రెడ్డి(28)కి జీవిత ఖైదు, జరిమానా విధించారు. ఈ ఘటన జరిగిన తేదీన విధుల్లో ఉన్న టీటీఐ (ట్రావెలింగ్ టికెట్ ఇ¯న్స్పెక్టర్)పై శాఖాపరమైన చర్యలకు న్యాయస్థానం సిఫార్సు చేసింది. ఈ కేసును కడప పోక్సోకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొమ్మినేని వేణుగోపాల్, అప్పటి పీపీ సానేపల్లి రామసుబ్బారెడ్డి వాదించారు. ఈ కేసు వివరాలను కడప రైల్వే సీఐ సుధాకర్‌రెడ్డి, ఎస్ఐ సునీల్‌కుమార్‌రెడ్డి తెలియజేశారు. -
వికృత చేష్టలకు బలైన విద్యార్థిని
ఆ చిన్నారి భవిష్యత్‌పై ఎన్నో కలలు కనింది. బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలనుకుంది. తనకోసం రేయింబవళ్లు కష్టపడుతున్న తల్లిదండ్రులను బాగా చూసుకోవాలనుకుంది. అందుకే వ్యయప్రయాసల కోర్చి ధర్మవరానికి వెళ్లి మరీ చదువుకునేది. కానీ బస్సులో ఓ విద్యార్థి తనకు చేసిన అవమానాన్ని తట్టుకోలేక ఉరివేసుకున్న ఆ విద్యార్థిని ఎనిమిది రోజులు మృత్యువుతో పోరాడి అలసిపోయింది. బుధవారం సాయంత్రం జీవితాన్ని ముగించింది.సత్యసాయి జిల్లా: మండల పరిధిలోని పులేటిపల్లికి చెందిన స్పందన(17) ధర్మవరంలోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. రోజూ గ్రామం నుంచి ధర్మవరానికి బస్సులో వెళ్లి వచ్చేది. ఈ క్రమంలో ఎనిమిది రోజుల క్రితం కళాశాలకు బస్సులో వెళ్తున్న క్రమంలో ఓ విద్యార్థి ఆమెతో ఆసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె అతన్ని మందలించింది. దీంతో పట్టరాని కోపంతో ఆ విద్యార్థి బస్సులో ప్రయాణికుల ముందే స్పందనపై రెండుసార్లు దాడి చేశాడు. ఘటనపై స్పందన ధర్మవరం పట్టణంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా.. పోలీసులు తమ పరిధిలోకి రాదని తప్పించుకున్నారు. చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు చేయగా.. అతడిని పిలిపించి మందలిస్తామన్నారు. ఓ బాలికపై భౌతిక దాడి చేస్తే మందలిస్తారా.. అంతేనా.. అని బాధపడిన చిన్నారి ఇంటికి వెళ్లి ఉరి వేసుకుంది. కుటుంబీకులు గమనించి వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఎనిమిది రోజుల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాటం చేసిన బాలిక చివరకు మృత్యువు ఒడిలోకి చేరింది. కుమార్తె మృతితో తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపించారు. విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి ఆత్మహత్యాయత్నానికి ప్రేరేపించినట్లుగా యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఒకేసారి అన్నదమ్ములను కాటువేసిన పాము
అనంతపురం: అభం శుభం తెలియని బాలురు. తల్లిదండ్రుల పక్కన ఆదమరచి నిద్రిస్తున్నారు. ఆ సమయంలో విష సర్పం కాటేసింది. దీంతో ఒకరు మృతి చెందగా, మరొకరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ హృదయ విదారక ఘటన పెద్దవడుగూరు మండలంలోని కండ్లగూడూరు గ్రామంలో చోటు చేసుకొంది. వివరాలు.. గ్రామానికి చెందిన వడ్డే వీరనారాయణస్వామి, లక్ష్మీదేవి దంపతులు వ్యవసాయ పనులు చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు శివరామరాజు (10) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతుండగా, రెండో కుమారుడు శివనారాయణ (7) అదే బడిలో 2వ తరగతి చదువుతున్నాడు. అన్నదమ్ములిద్దరూ మంగళవారం రాత్రి తల్లిదండ్రులతో కలిసి ఇంట్లో నిద్రపోయారు. రాత్రి 12 గంటల సమయంలో శివనారాయణ తనకు కడుపు నొప్పిగా ఉందంటూ తల్లి లక్ష్మీదేవికి చెప్పగా ఆమె బయటకు తీసుకెళ్లింది. చూస్తుండగానే బాలుడు నోటి వెంట నురగలు కక్కుతూ కుప్పకూలాడు. పాముకాటు అని గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే 108కు సమాచారం అందించారు. ఎంత సేపటికీ వాహనం రాకపోవడంతో బాలుడిని ద్విచక్ర వాహనంలో తీసుకుని బయలుదేరారు. మార్గమధ్యంలో 108 రావడంతో అందులోకి ఎక్కించి పెద్దవడుగూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్య సిబ్బంది పరిశీలించి బాలుడి శరీరంలో స్పందన లేకపోవడంతో పామిడికి తీసుకెళ్లాలని చెప్పారు. అక్కడికి తీసుకెళ్లగా వైద్య సిబ్బంది పరీక్షించి శివనారాయణ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ క్రమంలోనే ఇంటి దగ్గర నుంచి మొదటి కుమారుడు శివరామరాజు కూడా అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు సమాచారం రావడంతో వెంటనే ద్విచక్ర వాహనంలో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇద్దరు బాలురు పాము కాటుకు గురవడం, అందులో ఒకరు మృతి చెందారన్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ప్రాణాపాయ స్థితిలో.. అనంతపురం మెడికల్: పాముకాటుకు గురైన శివరామరాజు సర్వజనాస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. చిన్నపిల్లల విభాగాధిపతి డాక్టర్ రవికుమార్ పర్యవేక్షణలో అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ ప్రవీణ్‌దీన్‌కుమార్, డాక్టర్ సంజీవప్ప, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మమత బాలుడికి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఇప్పటికే 40 యాంటీ స్నేక్ వీనమ్స్ వైల్స్‌ను అందించారు. బాలుడి నరాలపై విషం ప్రభావం చూపడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. బాబును చూసి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. -
ప్రేమించిన వ్యక్తి దక్కకపోవడంతో..
సిద్దిపేట జిల్లా (గజ్వేల్): ప్రేమించిన వ్యక్తి దక్కకపోవడంతో మనస్తాపానికి గురై ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలంలో ఈ ఘటన జరిగింది. ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం.. కుకునూరుపల్లికి చెందిన ఆశని శంకర్ కూతురు శ్రావణి (18) ఇంటర్మీడియెట్ చదివి ఇంటి వద్దే ఉంటూ కూలీ పనులకు వెళుతోంది. ఇదిలా ఉండగా శంకర్ కుటుంబీకుల్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు దౌల్తాబాద్ మండలంలోని మల్లేశంపల్లికి చెందిన కుమ్మరి మహేశ్ అలియాస్ రహీం బాబా వద్దకు వెళ్తుండేవారు. ఈ క్రమంలో శ్రావణికి మహేశ్‌తో ఏర్పడిన పరిచయం ఒకరినొకరు ఇష్టపడే స్థాయికి చేరింది. కాగా, నవంబర్ 30న మహేశ్ కామెర్ల వ్యాధితో బాధపడుతూ మృతి చెందాడు. అప్పటి నుంచి శ్రావణి మానసికంగా కుంగిపోవడాన్ని గమనించిన తండ్రి శంకర్ ఆరా తీయగా మహేశ్‌ను ప్రేమించానని, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నానని చెప్పింది. ఈ క్రమంలో శ్రావణి బుధవారం ఇంట్లో పెద్దవాళ్లు లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుంది. ఇది గమనించిన ఆమె తమ్ముడు విషయాన్ని తల్లికి చెప్పగా ఆమె వెంటనే ఇంటికి చేరుకొని తలుపులు బలవంతంగా తెరిచి చూసింది. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న శ్రావణిని గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు ధ్రవీకరించారు. ఈ ఘటనపై శ్రావణి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఇందిరమ్మ చీరతో ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య
చిన్నశంకరంపేట (మెదక్): బిడ్డను తన నుంచి వేరు చేస్తారనే ఆందోళనతో రెండేళ్ల బిడ్డకు ఉరివేసి.. తాను ఉరివేసుకుని ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. నార్సింగి మండలం సంకాపూర్ గ్రామానికి చెందిన తాళ్ల ఆఖిల చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరం కాగా, మేనమామ సిద్దాగౌడ్ వద్ద పెరిగింది. రెండేళ్ల క్రితం ఖాజాపూర్ గ్రామానికి చెందిన ప్రవీణ్‌గౌడ్‌కు ఇచ్చి వివాహం చేశారు. ఆరు నెలల క్రితం ప్రవీణ్‌గౌడ్ నిద్రలో హఠాన్మరణం చెందాడు. అప్పటికే వారికి ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు. భర్త దశదిన కర్మ నుంచే బిడ్డను మాకు ఇచ్చేసి మరో పెళ్లి చేసుకోవాలంటూ అఖిలకు అత్తింటి నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. తన బిడ్డను వదిలేదిలేదన్న అఖిల.. మేనమామ ఇంటి వద్దనే ఆరు నెలలుగా జీవిస్తుంది. అత్తింటి వారు మరోసారి సంకాపూర్‌లో ఉన్న కోడలు వద్దకు వెళ్లి ఇందిరమ్మ చీర వచ్చింది తీసుకెళ్లాలంటూ ఆదివారం అత్తింటికి తీసుకువచ్చారు. ఏమైందో ఏమో కానీ మంగళవారం ఉదయం అత్త ఇంటి ముందు బట్టలు ఉతుకుతున్న సమయంలో తన రెండేళ్ల కుమారుడు రియన్స్‌కు ఉరివేసి, అదే చీరతో తాను ఉరివేసుకుని అఖిల ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న మృతురాలి మేనమామ సిద్దాగౌడ్ అత్తింటి వేధింపులే తన మేనకోడలు, మనవడి మృతికి కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బిడ్డను వేరుచేయాలనే అత్తింటి వేధింపులు తట్టుకోలేకనే తన మేనకోడలు మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు రామాయంపేట సీఐ వెంకటరాజంగౌడ్, చిన్నశంకరంపేట ఎస్ఐ నారాయణగౌడ్ సంఘటన స్థలానికి చేరుకుని శవపంచనామా నిర్వహించి అత్తమామలపై కేసు నమోదు చేశారు. -
తల్లితో వివాహేతర బంధం పెట్టుకొని.. బిడ్డను గర్భవతిని చేసి..
మహబూబాబాద్ జిల్లా: తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి ఆమె కుమార్తెను కూడా లైంగికంగా వాడుకొని గర్భవతిని చేశాడు. మళ్లీ ఆ తల్లి సాయంతోనే అబార్షన్ చేయించాడు. ఈ ఘటన ఆలస్యంగా మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో మంగళవారం వెలుగు చూసింది. బయ్యారం మండల కేంద్రంలోని ముస్తాఫానగర్‌కు చెందిన సైదులుబాబు స్థానికంగా ఉన్న మరో కాలనీకి చెందిన ఓ వివాహితతో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో తల్లి లేని సమయంలో తొమ్మిదవ తరగతి చదువుతున్న ఆమె కుమార్తెను కూడా లైంగికంగా వాడుకున్నాడు. దీంతో ఆ బాలిక గర్భవతి కావటంతో రెండు నెలల కిందట తల్లి సహాయంతో బాలికను జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయించారు. ఇటీవల బాలికకు వివాహం చేసే ప్రయత్నం చేయటంతో సఖి కేంద్ర నిర్వాహకులకు విషయం తెలిసింది. బాలికను జిల్లా కేంద్రానికి తీసుకెళ్లి కౌన్సెలింగ్ నిర్వహించారు. బాలిక.. తనకు అబార్షన్ చేయించిన విషయం చెప్పడంతో వారు బయ్యారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలిక ఫిర్యాదు మేరకు లైంగికదాడికి పాల్పడిన సైదులుబాబుపై పోక్సో కేసు నమోదు చేయగా, అబార్షన్‌కు సహకరించిన బాలిక తల్లిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు గార్ల బయ్యారం సీఐ రవికుమార్ తెలిపారు. -
భార్య కొత్త చీర కట్టిందని కోపంతో భర్త ఏం చేసాడంటే
టేక్మాల్ (మెదక్): వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భార్యను చంపి, ఆపై భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలం బరి్ధపూర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు... బర్దిపూర్ గ్రామానికి చెందిన గంగారం శ్రీశైలం (37), మంజుల (35) దంపతుల కుమారుడు ప్రవీణ్ మధుమేహ వ్యాధిగ్రస్తుడు కావడంతో చికిత్స కోసం నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌కు వెళ్లారు. అక్కడే పనిచేసుకుంటూ జీవనం సాగించారు. అయితే భార్య మంజుల ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న శ్రీశైలం ఈ ఏడాది దసరా పండుగ సమయంలో సొంత గ్రామమైన బర్దిపూర్కు మకాం మార్చాడు. ఈ విషయమై తరచుగా గొడవపడుతుండగా గత నెల టేక్మాల్ పోలీసులు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. భార్యపై అనుమానంతో శ్రీశైలం మద్యానికి బానిసయ్యాడు. తన భార్యను చంపేస్తానని, తనను తలెత్తుకోలేకుండా చేస్తోందని తన స్నేహితులు, గ్రామస్తులతో తరచూ అంటుండేవాడు. ఈ క్రమంలో కుమారుడు ప్రవీణ్ అమ్మమ్మ ఊరికి వెళ్లడంతో సోమవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న మంజుల ముఖంపై దిండు పెట్టి శ్వాసఆడకుండా చేసి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం దూలానికి తాడుతో శ్రీశైలం కూడా ఉరివేసుకున్నాడు. సంఘటన స్థలంలో అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి, టేక్మాల్ ఎస్ఐ అరవింద్, అల్లాదుర్గం ఎస్ఐ శంకర్, ఏఎస్ఐ కృష్ణ ఆధారాలను సేకరించారు. -
తప్పు తెలిసీ మౌనం... నేరంగా మారిన ఇద్దరు మహిళలు
సాక్షి,హైదరాబాద్: నేరుగా తప్పు చేయడమే కాదు... తప్పు జరుగుతోందని, జరిగిందని తెలిసీ పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడమూ నేరమే. ఈ కారణంగానే జూబ్లీహిల్స్ ఠాణాలో నమోదైన పోక్సో, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసులో ఇరువురు మహిళలు నిందితులుగా మారారు. గత ఏడాది చోటు చేసుకున్న ఈ ఘటనపై దర్యాప్తు అధికారులు ఇటీవల కోర్టులో చార్జ్‌షిట్ దాఖలు చేశారు. ప్రాథమిక సమాచార నివేదికలో (ఎఫ్ఐఆర్) లైంగికదాడి చేసిన వ్యక్తి మాత్రమే నిందితుడిగా ఉండగా... అభియోగపత్రాల్లో మాత్రం ఆ విషయం తెలిసీ మిన్నకుండిపోయిన మహిళలూ నిందితులుగా మారారు.ఐదు రోజులు నిర్భంధించి ఘాతుకం..జూబ్లీహిల్స్‌లోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న మహిళ వద్ద ఆర్. రాజిరెడ్డి అనే వ్యక్తి డ్రైవర్‌గా పని చేసేవాడు. అదే అపార్ట్మెంట్లో మరో మహిళ సెక్యూరిటీ గార్డుగా పని చేసేది. అదే ప్రాంతానికి చెందిన బాలికతో రాజిరెడ్డికి పరిచయం ఉండేది. అతను గత ఏడాది అక్టోబర్ 31న ఓ శుభకార్యానికి తీసుకువెళ్తానంటూ బాలికను కారులో ఎక్కించుకున్నాడు. ఆ సమయంలో అతడి యజమాని సైతం వారితో ఉంది. వీరు సదరు బాలికను షాపింగ్‌కు తీసుకెళ్లి వ్రస్తాలు కొనిపెట్టారు. ఆపై అపార్ట్‌మెంట్‌కు తీసుకువచి్చన రాజిరెడ్డి రెండో అంతస్తులోని తన గదిలో నిర్భంధించి నవంబర్ 5 వరకు సదరు బాలికపై పలు మార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. విచారణలో చెప్పని ఆ ఇరువురూ..ఇదిలా ఉండగా... బాలిక కనిపించకపోవడంతో ఆమె తల్లి గత ఏడాది అక్టోబర్ 31న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా ఆ అపార్ట్మెంట్ వద్దకు వెళ్లి పలువురిని విచారించగా ఎవరి నుంచి సరైన సమాచారం లభించలేదు. సెక్యూరిటీగార్డుగా పని చేస్తున్న మహిళతో పాటు రాజిరెడ్డి యజమాని సైతం తనకు ఏమీ తెలియనట్లు వ్యవహరించారు. ఐదు రోజుల నిర్భంధం తర్వాత ఇంటికి వెళ్లిన బాలిక తన తల్లితో జరిగిన విషయం చెప్పింది. దీంతో ఆమె పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించారు.అక్కడ అన్నీ చెప్పిన బాలిక..భరోసా కేంద్రంలో ఉన్న కౌన్సిలర్లు, అధికారులు బాలికకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ ఐదు రోజుల్లో ఏం జరిగిందో చెప్పాల్సిందిగా కోరారు. దీంతో రాజిరెడ్డి తనను నిర్భంధించడంతో పాటు పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పింది. తాను నిర్భంధంలో ఉండగా రాజిరెడ్డి యజమాని ఆహారం అందించిందని, ఆ అపార్ట్‌మెంట్‌కు సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న మహిళకూ తన విషయం తెలుసని వెల్లడించింది. దీంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలను బట్టి నేరం జరిగినట్లు నిర్థారించారు. బాలిక మిస్సింగ్ కేసు విచారణలో భాగంగా వీరు ఇరువురినీ ప్రశి్నంచినా నోరు విప్పకపోకపోవడాన్నీ సీరియస్‌గా తీసుకున్నారు. ఆ ఇద్దరినీ నిందితులుగా చేరుస్తూ..దీంతో బాలిక అదృశ్యం కావడంపై నమోదైన మిస్సింగ్ కేసులో పోక్సో యాక్ట్‌తో పాటు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలోని సెక్షన్లనూ చేర్చారు. ఈ కేసులో రాజిరెడ్డి ఒక్కడే కాకుండా ఇద్దరు మహిళల్నీ నిందితులుగా చేర్చారు. బాలికపై దారుణం జరుగుతున్నా అడ్డుకోకపోవడం, జరిగిందని తెలిసీ బయటకు చెప్పకపోవడం నేరాలేనని దర్యాప్తు అధికారులు తేల్చారు. భారతీయ న్యాయ సంహితలోని (బీఎన్ఎస్) సెక్షన్ 211 (ఓ నేరానికి సంబంధించిన సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా దాచి పెట్టడం), భారతీయ నాగరిక్ సురక్ష సంహితలోని (బీఎన్ఎస్ఎస్) సెక్షన్ 33 (నేరం జరిగినట్లు తెలిసినా వెంటనే పోలీసు లేదా మేజిస్ట్రేట్‌కు చెప్పకపోవడం) కింద అభియోగాలు మోపారు.దర్యాప్తునకు సహకరించకున్నా దండనేఏదైనా నేరం జరిగిందని తెలిసిన వెంటనే పోలీసులు లేదా మేజి్రస్టేట్‌కు సమాచారం ఇవ్వడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. నేరాల నిరోధంతో పాటు చట్టాల అమలుకు పాటుపడాలి. ఏదైనా నేరం జరిగిందని తెలిసీ మిన్నకుండిపోవడం నేరమే అవుతుంది. తమ కళ్ల ముందు నేరం జరిగితే నిందితుడిని అదుపులోకి తీసుకుని, పోలీసులకు అప్పగించే అధికారమూ పౌరులకు ఉంటుంది. వివిధ నేరాలకు సంబంధించి కేసులు నమోదైనప్పుడు పోలీసులు కోరితే దర్యాప్తునకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. బీఎన్ఎస్ఎస్లోని 31, 33, 40 సెక్షన్లు ఇవే అంశాలను స్పష్టం చేస్తున్నాయి. అలా చేయకపోవడం కూడా నేరమే అవుతుంది. బీఎన్ఎస్లోని 211, 239లతో పాటు పోక్సో యాక్ట్‌లోని 19 సెక్షన్ ప్రకారం అభియోగాలు ఎదుర్కోవాల్సిందే.– పి.వెంకటగిరి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ -
Khammam: సత్తుపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం..
ఖమ్మం జిల్లా: ఖమ్మం జిల్లాలో బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చండ్రుగొండ నుండి సత్తుపల్లి వైపు వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టితో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఒకరు 9 ఏళ్ల బాలుడు ఉండటం మరింత హృదయ విదారకంగా మారింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు
సాక్షి, కరీంనగర్ జిల్లా: కరీంనగర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం సొంత అన్నను తమ్ముడే హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. సీపీ గౌస్ ఆలం కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. అన్నను టిప్పర్‌తో ఢీకొట్టి.. ప్రమాదంగా చిత్రీకరించాడు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు.రూ.కోటి 50 లక్షల అప్పుల్లో చిక్కుకున్న ప్రధాన నిందితుడు మామిడి నరేష్.. తన అప్పులు తీర్చుకోవడానిక అన్న వెంకటేశ్ పేరుపై భారీ ఇన్స్యూరెన్స్ పాలసీలు తీసుకున్నాడు. మొత్తం ఇన్స్యూరెన్స్ విలువ రూ. 4 కోట్ల 14 లక్షలు. అదనంగా యాక్సిస్ బ్యాంకులో మరో 20 లక్షల రూపాయల గోల్డ్ లోన్ అన్న పేరిట తీసుకున్న ప్రధాన నిందితుడు.. పెద్దన్నను చంపి ప్రమాదంగా చూపే పకడ్బందీ ప్లాన్ చేశాడు. స్నేహితుడు నముండ్ల రాకేశ్, డ్రైవర్ మునిగాల ప్రదీప్‌తో కలిసి కుట్ర పన్నాడు. ప్లాన్ మాట్లాడుకున్న వీడియోను రాకేశ్.. మొబైల్లో రికార్డ్ చేసి భద్రపరిచాడు.గత నెల (నవంబర్ 29, శనివారం) రాత్రి టిప్పర్‌తో పెద్దన్న వెంకటేష్‌ను ఢీకొట్టాడు. టిప్పర్ బ్రేక్‌డౌన్ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హత్య తర్వాత ప్రమాదంలా చూపేందుకు కుటుంబాన్ని నరేష్ తప్పుదారి పట్టించాడు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేపట్టిన రామడుగు పోలీసులు.. సాంకేతిక ఆధారాలతో కేసు ఛేదించారు. విచారణలో నిందితులు నేరం ఒప్పుకోవడంతో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. హత్య కుట్ర వీడియో ఉన్న మొబైల్, ఇన్సూరెన్స్ పాలసీలు, ఫోన్లు, బ్యాంక్ పాస్‌బుక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
దంపతులను బలిగొన్న పొగమంచు
కర్ణాటక: పొగమంచులో దారి కనిపించక కారు డివైడర్‌ను ఢీకొని అదుపు తప్పి పల్టీలు కొట్టింది, ఈ దుర్ఘటనలో కారులోని భార్యాభర్తలు అక్కడే మరణించారు. జిల్లాలోని మధుగిరి తాలూకాలోని జడగొండనహళ్ళి వద్ద బెంగళూరు హైవేలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. పొరుగునే ఏపీలో ఉన్న మడకశిర తాలూకాలోని గుండంపల్ళివాసులు కృష్ణారెడ్డి (45), జ్యోతి (42) చనిపోగా, కుమారుడు మధుసూదన్‌రెడ్డి (17), బంధువు చిదంబరెడ్డి (45) తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరు నగరంలోని డాన్‌బాస్కో పాఠశాలలో జ్యోతి ఉద్యోగి. భర్త కూడా బెంగళూరులోనే ఉండేవారు. ఓ జాతరకు సొంతూరికి వెళ్లి కుటుంబంతో కలిసి తిరిగి బెంగళూరుకు వెళ్తుండగా దట్టంగా కమ్ముకున్న పొగమంచులో ముందు దారి కనిపించక ప్రమాదం జరిగింది. కృష్ణారెడ్డి స్వగ్రామంలో వైఎస్సార్సీపీ వార్డుమెంబరు కావడంతో మృతదేహాలకు పెద్దసంఖ్యలో నేతలు, జనం నివాళులు అరి్పంచారు. -
హనుమకొండలో నర్సింగ్ స్టూడెంట్ పై యాసిడ్ దాడి
హనుమకొండ జిల్లా: హనుమకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ గ్రామంలో సోమవారం యువతిపై యాసిడ్ దాడి కలకలం రేపింది. స్థానికులు, మడికొండ పోలీసులు వివరాలు తెలిపారు. జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం వడ్డెగూడెం గ్రామానికి చెందిన సునంద హనుమకొండ పద్మాక్షి కాలనీలోని జయ నర్సింగ్ హోం కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. మంగళవారం పరీక్ష ఉండగా హాల్‌టికెట్ కోసం సోమవారం కళాశాలకు వచ్చింది. చీకటి పడటంతో హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపురంలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లి మంగళవారం ఉదయం కళాశాలకు వచ్చి పరీక్ష రాయాలని నిర్ణయించుకుంది. కడిపికొండ మీదుగా తన ద్విచక్ర వాహనంపై స్నేహితురాలితో కలిసి బయల్దేరింది. కడిపికొండ గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపానికి చేరుకోగా.. అప్పటికే మాటువేసిన ముగ్గురు యువకులు ద్విచక్రవాహనం నడుపుతున్న యువతిపై యాసిడ్ దాడిచేసి పారిపోయారు. కాగా, యువతి ధరించిన హెల్మెట్‌పై నుంచి యాసిడ్ కాలిపై పడటంతో స్వల్పంగా గాయపడింది. ఘటనా స్థలానికి చేరుకున్న మడికొండ పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. తీవ్ర ప్రభావం చూపే యాసిడా లేదా బ్యాటరీలో పోసే కెమికలా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రేమ వ్యవహారమా, పాత కక్షలా అనేది తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, కడిపికొండ గ్రామంలో ఎక్కడ కూడా సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితుల ఆచూకీ తెలియలేదు. పోలీసులు వివిధ దుకాణాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. సీసీ కెమెరాలు అందుబాటులో ఉంటే నిందితుల ఆచూకీ లభించేది. హనుమకొండలో 2008, డిసెంబర్ 10న స్వప్నిక, ప్రణీతపై ముగ్గురు యువకులు యాసిడ్ దాడి చేసిన ఘటనను నేటికీ నగరవాసులు మర్చిపోలేదు. సోమవారం చోటుచేసుకున్న యాసిడ్ దాడితో నగరం ఉలిక్కిపడింది. -
పెళ్లికి ఒప్పుకోవడం లేదని..
రంగారెడ్డి జిల్లా: తమ ప్రేమను అంగీకరించని పెద్దలు, పెళ్లికి సైతం నిరాకరిస్తారనే కారణంతో మనస్తాపానికి గురైన ఓ ప్రేమజంట ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన కొత్తూరు పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. సీఐ నర్సయ్య తెలిపిన వివరాల మేరకు.. బిహార్ రాష్ట్రానికి చెందిన నవనీత్‌దత్త తన ఇద్దరు కూతుళ్లు అనామిక(21), అనీషదత్తతో కలిసి నాలుగేళ్ల క్రితం కొత్తూరుకు వలస వచ్చాడు.నవనీత్‌దత్త ఐఓసీఎల్ ప్లాంట్‌లో డ్రైవర్‌గా, ఇద్దరు కూతుళ్లు పట్టణ సమీపంలోని ఓ బేకరీ పరిశ్రమలో పనిచేస్తున్నారు. కాగా, అనామికకు ఇదే పరిశ్రమలో పనిచేస్తున్న బిహార్‌కు చెందిన ధనుంజయ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. మూడు రోజులుగా అనామిక పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో నవనీత్ సోమవారం మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి చేరుకోగా, లోపలి నుంచి తలుపులు పెట్టి ఉండడంతో కిటికీలో నుంచి వెళ్లి చూడగా, అనామిక కింద పడి మృతిచెంది ఉండగా, ధనుంజయ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనామిక పనికి వెళ్లకపోవడంతో ధనుంజయ్ ఆమెకు ఫోన్ చేసి ఇంటికి వచ్చాడు. అప్పటికే అనామిక ఫ్యాన్‌కు ఉరేసుకోవడంతో, ఆమెను కిందికి దింపి, అదే ఫ్యాన్‌కు తాను ఉరేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మృతురాలి ఇంట్లో ఉన్న సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించాల్సి ఉంది. సంఘటన స్థలాన్ని శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్‌గౌడ్ పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ వివరించారు. -
పోలీసులే అన్నను ఎగదోశారు
నాందేడ్: వేరే కులం అనే కారణంగా యువకుడిని యువతి కుటుంబసభ్యులు దారుణంగా హత్యచేసిన ఘటనలో పోలీసుల పాత్ర కూడా ఉందని ఆ యువతి తాజాగా ఆరోపించింది. దీంతో పోలీసుల పాత్రపై అదనపు ఎస్పీ ర్యాంక్ అధికారి నేతృత్వంలో దర్యాప్తు మొదలెడతామని ఎస్పీ అబినాశ్ కుమార్ సోమవారం ప్రకటించారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన ఆన్చల్ మమిద్వార్ అనే యువతిని సక్షమ్ తాటే అనే వేరే కులం అబ్బాయి ప్రేమించడం, ఇది నచ్చని ఆమె తండ్రి, సోదరులు యువకుడిని సోమవారం చంపేయడం తెల్సిందే. సక్షమ్ అంత్యక్రియలు జరుగుతుండగా అక్కడికొచ్చిన ఆన్చల్ అతడి మృతదేహంతోనే వివాహమాడిన విషయం విదితమే. ఈ హత్యోదంతంపై ఆన్చల్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘‘సోమవారం సక్షమ్‌ను చంపేయడానికి ముందే నన్ను నా సోదరుడు హిమేశ్ స్థానిక ఇటా్వరా పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లాడు. సక్షమ్‌పై తప్పుడు ఫిర్యాదుచేయాలన్నాడు. అందుకు నేను ససేమిరా ఒప్పుకోలేదు. దీంతో కోపంతో అక్కడి ఇద్దరు పోలీసులు హిమేశ్‌ను హత్య కు పురిగొల్పారు. వాళ్లతో వీళ్లతో గొడవపడే బదులు నేరుగా వెళ్లి సక్షమ్‌ను చంపేసెయ్ అని హిమేశ్‌ను ఉసిగొల్పారు. అప్పుటికే హిమేశ్ పట్టరాని ఆగ్రహంతో ఊగిపోతున్నాడు. సక్షమ్‌ను చంపేశాక పోలీస్‌స్టేషన్‌కు వస్తా అనుకుంటూ వెళ్లిపోయాడు. అనుకున్నట్లే సక్షమ్‌ను చంపేశాడు. దమ్ముంటే నువ్వు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చెయ్ అని నాతో సవాల్ చేశాడు’’అని మహిళ రోదిస్తూ చెప్పింది. ‘‘నా డిమాండ్ ఒక్కటే. సక్షమ్‌ను చంపేసిన నా తండ్రి, సోదరులు సైతం అదే రీతిలో శిక్షను అమలుచేయాలి. హత్యతో సంబంధం ఉన్న వాళ్లందరీన ఉరితీయాలి. ప్రాణాలు వదిలినా సరే సక్షమే నా భర్త. ఇకపై అతని కుటుంబంతోనే అతని ఇంట్లోనే ఉంటా. సక్షమ్ తల్లిదండ్రుల బాగోగులు చూసుకుంటా’’అని ఆమె తెలిపింది. ఆన్చల్ ఆరోపణలపై ఎస్పీ స్పందించారు. ‘‘హత్యోదంతంలో పోలీసుల పాత్ర ఉందనేది తీవ్రమైన ఆరోపణ. ఈ విషయంపై దర్యాప్తు చేస్తాం. వాస్తవానికి మృతుడు సక్షమ్, నిందితుడు హిమేశ్ ఇద్దరికీ నేరచరిత్ర ఉంది. గతంలో ఇద్దరూ మంచి మిత్రులు. హత్య, దాడిసహా భారతీయ న్యాయసంహిత, ఎస్సీ/ఎస్టీ(వేధింపుల నిరోధక)చట్టం, భారతీయ న్యాయ సంహిత, ఆయుధాల చట్టాల కింద ఆరుగురిపై కేసు నమోదుచేశాం’’అని ఎస్పీ చెప్పారు. అరెస్టయిన వారిని మూడ్రోజులపాటు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. -
వికారాబాద్ జిల్లాలో దారుణం.. భార్యను చంపిన భర్త
వికారాబాద్ జిల్లా: కోపోద్రిక్తుడైన భర్త.. భార్యను హత్య చేశాడు. ఈ సంఘటన పెద్దేముల్ తండాలో చోటు చేసుకుంది. ఎస్ఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన మూడవత్ రవి, అనిత(35) దంపతులు. వ్యవసాయం చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. కొంత కాలంగా రవి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఇరువురి మధ్య గొడవ జరిగింది. దీంతో సదరు వ్యక్తి ఆవేశంతో ఆమెపై దాడి చేశాడు. తల, ముఖంపై పారతో కొట్టి హతమార్చాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరు పట్టణంలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్ రెడ్డి, ఎస్ఐ శంకర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వికారాబాద్ క్లూస్‌టీం ద్వారా వివరాలు సేకరించారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. మృతురాలి సోదరుడు కేతావత్ కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అనితకు ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నాడు. -
iBomma Case: ఇమ్మడి రవికి ఊరట దక్కేనా?
సినీ పైరసీ కేసులో నేడు కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రధాన నిందితుడు, ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో సోమవారం విచారణ జరగనుంది.ఐబొమ్మ, బప్పం పేరుతో వెబ్సైట్లు నడిపిస్తూ సినీ పైరసీకి పాల్పడ్డాడంటూ ఇమ్మడి (ఐబొమ్మ) రవిపై ప్రధాన అభియోగం ఉంది. సైబర్ నేరాల నేపథ్యంలో మరికొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. అయితే రవికి బెయిల్ కోరుతూ సీనియర్ లాయర్ సీవీ శ్రీనాథ్ కోర్టును ఆశ్రయించారు. అయితే అప్పటికే సీసీఎస్ పోలీసులు కస్టడీ కోరడంతో బెయిల్ విచారణ వాయిదా పడింది.ఈగ్యాప్‌లో.. రెండు విడతలుగా ఎనిమిది రోజులపాటు రవిని పోలీసులు ప్రశ్నించారు. విచారణలో అతని నుంచి కీలక సమాచారం రాబట్టడంతో పాటు ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలనూ సేకరించినట్లు తెలుస్తోంది. అయితే రవి లాయర్ మాత్రం బెయిల్ కచ్చితంగా వస్తుందని అంటున్నారు.రవి బెయిల్ అభ్యర్థనకు ఇప్పటికే పోలీసులు నాంపల్లి కోర్టులో కౌంటర్ దాఖలు చేయడంతో.. బెయిలా? జైలా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఒకవేళ బెయిల్ రిజెక్ట్ అయితే గనుక అదనపు విచారణ కోసం పోలీసులు మరోసారి కోర్టులో పిటిషన్ వేసే అవకాశమూ లేకపోలేదు. మరోవైపు.. అతనిపై నమోదు అయిన మరో మూడు కేసుల్లో రేపటిలోగా కోర్టు ముందు హాజరు పరచాల్సి ఉంది. దీంతో ఇవాళే రవిని హాజరు పర్చవచ్చని తెలుస్తోంది.ఇదీ చదవండి: విశాఖలో బొమ్మ.. అందుకే ఆ పేరు పెట్టా! -
వాట్సాప్ స్టేటస్‌గా ‘మధ్యాహ్నం హత్య’!
సాక్షి, క్రైమ్: ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా, కోపోద్రిక్తుడైన బాలమురుగన్.. వెంట తెచ్చుకున్న కొడవలి తీసి శ్రీప్రియపై దాడి చేశాడు. మెడపై బలంగా గాయమవడంతో శ్రీప్రియ అక్కడికక్కడే మరణించింది. అనంతరం భార్య మృతదేహం పక్కన బాలమురుగన్ ఓ కుర్చీ వేసుకుని కూర్చుని సెల్ఫీ తీసుకున్నాడు. భార్యను కొడవలితో నరికి భర్త హత్య చేసిన దారుణ ఘటన ఆదివారం తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగింది. నెల్లై జిల్లా మేలపాళయం సమీపంలోని తరువాయికి చెందిన బాలమురుగన్, శ్రీప్రియ(32) దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాల కారణంగా శ్రీప్రియ తన భర్త, పిల్లలను వదిలి కోయంబత్తూరుకు వచ్చి రేస్‌కోర్సు సమీపంలోని 5వ వీధిలో ఉన్న మహిళల హాస్టల్లో ఉంటూ టౌన్ హాల్ ప్రాంతంలోని ఓ బట్టల దుకాణంలో పనిచేస్తోంది. ఆదివారం శ్రీప్రియను కలవడానికి ఆమె భర్త బాలమురుగన్ వచ్చాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా, కోపోద్రిక్తుడైన బాలమురుగన్.. వెంట తెచ్చుకున్న కొడవలి తీసి శ్రీప్రియపై దాడి చేశాడు. మెడపై బలంగా గాయమవడంతో శ్రీప్రియ అక్కడికక్కడే మరణించింది. అనంతరం భార్య మృతదేహం పక్కన బాలమురుగన్ ఓ కుర్చీ వేసుకుని కూర్చుని సెల్ఫీ తీసుకున్నాడు. ఆ ఫొటోను తన వాట్సాప్ స్టేటస్‌లో పోస్ట్ చేశాడు. అందులో ‘ద్రోహానికి ఫలితం.. మరణం’ అని క్యాప్షన్ ఇచ్చాడు. శ్రీప్రియ తన నుంచి విడిపోయాక ఓ యువకుడితో కలిసి దిగిన ఫొటోను ఇటీవల చూశానని, అందుకే కోపంతో హత్య చేశాడని బాలమురుగన్ పోలీసుల విచారణలో తెలిపాడు. ఈ హత్య ఆదివారం తమిళనాట పెను సంచలనం సృష్టించింది. -
పల్నాడు జిల్లాలో దారుణం.. తల్లి, కుమారుడిపై హత్యాయత్నం
సాక్షి, పల్నాడు జిల్లా: సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో దారుణం జరిగింది. ఇంట్లోకి చొరబడి తల్లి, కుమారుడిపై గుర్తు తెలియని దుండగులు హత్యాయత్నం చేశారు. కుమారుడు సాంబశివరావు మృతి చెందగా, తల్లి కృష్ణకుమారి పరిస్థితి విషమంగా ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకోని పోలీసులు విచారిస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.దోసకాయలపల్లిలో దారుణం..తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లిలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన పిల్లి ఆనంద్ (30)ను కత్తితో నరికి హత్య చేశారు. వరుసకు బావమరిది అయిన ములకల్లంకకు చెందిన వ్యక్తి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
ఎన్నారై భాస్కర్‌రెడ్డికి బెయిల్
సాక్షి, విజయవాడ: సోషల్ మీడియా యాక్టివిస్టు, ఎన్ఆర్ఐ భాస్కర్ రెడ్డికి ఊరట లభించింది. అక్రమ కేసులో విజయవాడ కోర్టు శనివారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. భాస్కర్‌రెడ్డి ప్రస్తుతం ప్రస్తుతం నెల్లూరు జైలులో జ్యుడిషియల్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మాలపాటి భాస్కర్ రెడ్డి స్వగ్రామం కృష్ణాజిల్లా పెనమలూరు మండలంలోని చోడవరం. భాస్కర్ రెడ్డి లండన్‌లో సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నారు. అయితే, జగన్ అభిమాని అయిన భాస్కర్.. సోషల్ మీడియాలో వైఎస్సార్సీపీకి అనుకూలంగా పోస్టులు పెడుతుంటారు. దీంతో కూటమి ప్రభుత్వం ఆయనపై కక్ష కట్టింది. భాస్కర్ రెడ్డిని టార్గెట్ చేసిన కూటమి సర్కార్.. కక్ష సాధింపు చర్యలకు అదను చూసింది. నవంబర్ ఒకటవ తేదీన తన తండ్రి మరణంతో భాస్కర్ రెడ్డి.. లండన్ నుంచి స్వగ్రామం చోడవరం చేరుకున్నారు. ఈ సమాచారం అందుకున్న టీడీపీ నేతలు ఆయనపై తప్పుడు ఫిర్యాదు చేశారు. దీంతో కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో.. అనారోగ్యంతో ఉన్న భాస్కర్ రెడ్డి తన సోదరుడు ఓబుల్ రెడ్డితో కలిసి నవంబర్ 6వ తేదీన ఆస్పత్రికి వెళ్లాడు. ఆ సమాచారం అందుకున్న పోలీసులు వాళ్లిద్దరినీ అరెస్ట్ చేశారు. ఆపై తప్పుడు పోస్టులు చేశానని ఒప్పుకోవాలంటూ ఏకంగా కోర్టు ప్రాంగణంలోనే బెదిరింపులకు దిగారు. అంతేకాదు.. తనని తీవ్రంగా కొట్టారంటూ భాస్కర్‌రెడ్డి మీడియా ఎదుట వాపోయారు కూడా. ఇదిలా ఉంటే.. బెయిల్ సందర్భంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. -
తలుపులు మూసి.. ప్రేమ జంటను దాచి..!
సాక్షి, ఏలూరు జిల్లా: నూజివీడు పోలీస్ స్టేషన్ వద్ద శనివారం సినీ ఫక్కీలో హైడ్రామా నడిచింది. వివాహం చేసుకున్న ఓ ప్రేమజంట పోలీసులను ఆశ్రయించగా.. యువతి బంధువులు దాడికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో ఆ జంటను కాపాడేందుకు పోలీసులు శాయశక్తుల కృషి చేశారు. స్థానికంగా బాపునగర్‌కు చెందిన యువతి, యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో పెద్దల ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్నారు. ఆపై ప్రాణ రక్షణ కోరుతూ నూజివీడు పోలీసులను ఆశ్రయించారు. ఈ సమాచారం అందుకున్న యువతి తరపు బంధువులు.. పీఎస్ వద్దకు భారీగా చేరుకున్నారు. పట్టరాని కోపంతో పోలీసులు పక్కకు నెట్టేసి ఆ జంటపై దాడికి దిగారు. యువకుడిని చితకబాదుతుండడంతో పోలీసులు బంధువుల్ని అదుపు చేసి ఆ జంటను లోపలికి తీసుకెళ్లారు. స్టేషన్ తలుపులు, గేట్లు మూసేసి వాళ్లను రక్షించే ప్రయత్నం చేశారు. అయితే.. గేట్లు ధ్వంసం చేసుకుని మరీ పీఎస్‌లోకి చొరబడేందుకు యువతి బంధువులు ప్రయత్నించినా వీలు కాలేదు. దీంతో అక్కడంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
అందుకే ఐబొమ్మ అని పేరు పెట్టా: ఇమ్మడి రవి
సాక్షి, హైదరాబాద్: సినీ పైరసీ కేసులో ఇమ్మడి రవి రెండవ విడత పోలీసు కస్టడీ ముగిసింది. మూడు రోజులపాటు జరిగిన నిందితుడి మెయిల్స్ నుంచి కీలక సమాచారాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించారు. ఐబొమ్మ, బప్పం వెబ్సైట్లలో మొత్తం 21 వేల సినిమాలు అప్లోడ్ అయినట్లు గుర్తించారు. అంతేకాదు.. ఫైరసీకి సంబంధించిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి రవి సైబర్ పోలీసులకు వివరించినట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో రవి తెలిపిన వివరాలు.. విశాఖలో సినిమాను బొమ్మ అనేవాళ్లం. ఐ బొమ్మ అంటే ఇంటర్నెట్ బొమ్మ. ఇంటర్నెట్లో బొమ్మ చూపిస్తున్నాం కదా.. అందుకే అలా పేరు పెట్టా. అలాగే మరో వెబ్సైట్ బప్పంగా మొదట అనుకున్న పేరు అది కాదు. బలపం అని పేరు పెడదామని అనుకున్నాం. కానీ, డొమైన్ నేమ్‌లో ఎల్(L) అనే అక్షరంతో సాంకేతిక సమస్యలు వచ్చాయి. అందుకే బప్పం అని పెట్టాల్సి వచ్చింది. పైరసీ వెబ్‌సైట్స్ నుంచే సినిమాలు రికార్డు చేశాం. ఓటీటీల్లో వచ్చే కంటెంట్‌ను సైతం రికార్డింగ్ చేయగలిగాం. అలా రికార్డింగ్ చేసిన సినిమా ఆడియో.. వీడియో క్వాలిటీ పెంచేందుకు కరేబియన్ దీవుల్లో ఔట్ సోర్సింగ్ వాళ్లతో ఒప్పందం చేసుకున్నాం. అలాగే తాను అప్లోడ్ చేసిన సినిమాలను టెలిగ్రామ్ చానెల్స్ నుంచి సేకరించినవే అని రవి ఒప్పుకున్నాడు.ఇక.. రవి మెయిల్స్‌లో స్పామ్, హైడ్ ఫైల్స్‌లోనే డాటా మొత్తం దాటి ఉన్నట్లు సీసీఎస్ పోలీసులు గుర్తించారు. అలాగే ప్రహ్లద్ అనే వ్యక్తి గురించి వివరాలు సేకరించారు. తాము ఎన్జిల ఆన్లైన్ ద్వారానే కనెక్ట్ అయ్యామని రవి తెలిపాడు. అయితే ఆ లింకును సైబర్ క్రైమ్ పోలీసులకు చూపించగా అంతలోపే లింక్ రివోక్ అయ్యాయి. దీంతో వాటిని సైబర్ క్రైమ్ పోలీసులు పరిశీలిస్తున్నారు. రెండో విడత కస్టడీ మొదటిరోజు విచారణలో.. ఎన్జీల నెట్వర్క్, ఆర్థిక వ్యవహారాలపై కీలక లీడ్‌ను పోలీసులు సంపాదించారు. ఐపీ మాస్క్ చేసి అనధికారిక వెబ్ సైట్స్ నిర్వహిస్తున్నా ముఠాలపై ఆరా తీశారు. రెండో రోజు విచారణలో మాత్రం రవి సరిగ్గా నోరు విప్పలేదు. పైగా.. బయటకు రాగానే మంచి పనులు చేస్తానంటూ పోలీసులతో అన్నట్లు సమాచారం. మొత్తంగా.. మూడు రోజులపాటు సాగిన రెండో విడత కస్టడీ నేటితో పూర్తైంది. దీంతో రవిని నాంపల్లి కోర్టుకు హాజరుపరిచి.. అక్కడి నుంచి చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరోసారి కస్టడీ కోరతారా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. సినీ పైరసీ కేసులో ఐపీ మాస్క్ లింక్స్ పై త్వరలోనే పోలీసులు కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. -
ప్రియుడి కోసం భర్తను కడతేర్చిన భార్య
బెంగళూరు: తమ ఆనందానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య ఉదంతం బెంగళూరు ఉత్తర తాలూకా మాదనాయకనహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. యాదగిరికి చెందిన బసవరాజు(28), శరణమ్మలకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. ఉపాధి కోసం బెంగళూరు వచ్చి తిగళరపాళ్యలో నివసిస్తున్నారు. ఈక్రమంలో శరణమ్మకు వీరభద్ర అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. తమ ఆనందానికి బసవరాజు ఎప్పటికైనా అడ్డు వస్తాడని భావించిన శరణమ్మ వీరభద్రతో కలిసి భర్తను కడతేర్చేందుకు ప్రణాళిక రచించింది. ఇంట్లో పడుకున్న బసవరాజు తలపై పెద్ద బండరాయి వేసి హత్య చేశారు. తరువాత మృతదేహాన్ని తీసికెళ్లి గంగొండనహళ్లి వద్ద పెట్రోల్ పోసి నిప్పంటించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి కేసును ఛేదించారు. శరణమ్మతోపాటు ఆమె ప్రియుడు వీరభద్ర, అనిల్ అనే నిందితులను అరెస్టు చేశారు. -
దొంగ పోలీసు..ఇంట్లో రోలెక్స్ వాచ్ కాజేసిన కానిస్టేబుల్
సాక్షి, హైదరాబాద్: నకిలీ ఐపీఎస్, ఐఏఎస్ అధికారిగా చెలామణి అయి, వసూళ్లకు పాల్పడిన బత్తిని శశికాంత్ ఇంట్లో సోదాల సమయంలో ఓ వాచీ చోరీ చేసిన పోలీసు ‘దొంగ’ని ఫిల్మ్‌నగర్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశాడు. ఇతడు సిటీ ఆరŠడ్మ్ రిజర్వ్ (సీఏఆర్) విభాగానికి చెందిన కానిస్టేబుల్ ఎస్.శరణ్ కుమార్‌గా తేలింది. ఇతడు ప్రస్తుతం ఫిల్మ్‌నగర్ ఇన్స్పెక్టర్ వాహనానికి డ్రైవర్‌గా వ్యవహరిస్తున్నాడు. బిల్డర్లు, బడాబాబులకు టోకరా వేసి భారీగా వసూళ్లు చేసిన శశికాంత్ షేక్‌పేటలోని అపర్ణా ఔరా అపార్ట్మెంట్స్లోని ఖరీదైన ఫ్లాట్‌లో నివసించాడు. ఇతడి వ్యవహారాలపై సమాచారం అందుకున్న ఫిల్మ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. పోలీసులు బుధవారం తెల్లవారుజామున శశికాంత్ ఫ్లాట్‌కు వెళ్లి సోదాలు చేశారు. ఆ సమయంలో వీడియో రికార్డింగ్ విధుల్ని శరణ్ నిర్వర్తించాడు. సోదాల సమయంలో ఈ కానిస్టేబుల్ కళ్లు నిందితుడి వార్డ్‌రోబ్‌లో ఉన్న రోలెక్స్ వాచీపై పడ్డాయి. దీంతో దాన్ని అతగాడు తస్కరించి తన జేబులో వేసుకున్నాడు. ఈ తతంగం మొత్తం మరో కానిస్టేబుల్ రికార్డు చేసిన వీడియోలో చిక్కింది. అలా ఈ పోలీసు ‘దొంగతనం’ వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై సమగ్ర విచారణ అనంతరం ఫిల్మ్‌నగర్ ఠాణాలోనే అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కానిస్టేబుల్ శరణ్ కుమార్ ఏ వాచీ అయితే అత్యంత ఖరీదైందని భావించి, చోరీ చేసి, అరెస్టు అయ్యాడో..ఆ వాచీ ఒరిజినల్ రోలెక్స్ కాదని, ఇమిటేటెడ్ కాపీ పీస్ అయి అధికారులు తేల్చడం కొసమెరుపు. -
ఎయిర్‌హోస్టెస్‌తో ప్రయాణికుడి అసభ్య ప్రవర్తన
శంషాబాద్: విమానంలో ఎయిర్‌హోస్టెస్‌తో ఓ ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తించడంతో అతడిని ఆర్జీఐఏ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ కనకయ్య కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. దుబాయ్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా ఏఐ–2204 విమానం తెల్లవారు జామున 4 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండైంది. ప్రయాణ మార్గమధ్యలో సీటు 17సీ సీటులో కూర్చున ప్రయాణికుడు ఎయిర్‌హోస్టెస్‌ను పలుమార్లు చేతితో తాకాడు. మద్యం మత్తులో ఉన్న అతను పొరపాటున తాకి ఉండవచ్చని విమానం సిబ్బంది భావించారు. విమానం దిగే సమయంలో తన సీటులో పాస్‌పోర్టును మరిచిపోయినట్లు సదరు ప్రయాణికుడు చెప్పడంతో సిబ్బంది మరోమారు అతడి సీటు వద్దకు వెళ్లగా ఎయిర్‌లైన్స్ సిబ్బంది గురించి తెల్లకాగితంపై అసభ్యకరంగా రాయడంతో పాటు దూషించినట్లు గుర్తించారు. దీంతో వెంటనే ఎయిర్‌లైన్స్ అధికారులు ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎవరైనా ప్రయాణికులు అసభ్య ప్రవర్తించినా.. సిబ్బంది దూషించినా.. ఇతర ప్రయాణికుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ హెచ్చరించారు. -
6ఏళ్ళ ప్రేమ.. మోసం చేసిన ప్రియురాలు
మోర్తాడ్(బాల్కొండ): నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ వద్ద పోలీసు వాహనంపై శవం ఉన్న ఫ్రీజర్‌ను ఎక్కించి నిరసన తెలిపారు. ఆత్మ హత్యకు పాల్పడిన యువకుని కేసులో.. పోలీసులు నిందితులపై సరైన చర్యలు తీసుకోవడం లేదని నిరసిస్తూ చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దోంచంద గ్రామానికి చెందిన నాగిరెడ్డి శ్రీకాంత్ (29) యూకేలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. పెళ్లి చేసుకోడానికి ఇటీవలే ఇంటికి వచ్చాడు. తనను వివాహం చేసుకోవాల్సిన అమ్మాయి.. ఆమె తల్లిదండ్రుల సూచనతో ఈనెల 7న మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లికి ఒకరోజు ముందే శ్రీకాంత్ పురుగు మందు తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు ఏర్గట్ల పోలీసులకు ఫిర్యాదు చేసి యువకుడిని హైదరాబాద్ తరలించగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురు వారం రాత్రి మరణించాడు. మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన కుటుంబ సభ్యు లు.. శుక్రవారం శ్రీకాంత్ ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు దోంచందలో బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆగ్రహించిన గ్రామస్తులు యువకుని మృతదేహంతో దోంచంద నుంచి ఏర్గట్ల వరకు ర్యాలీగా బయలు దేరారు. పోలీసులు తాళ్లరాంపూర్ వద్దనే అడ్డుకోవడంతో పోలీసు వాహనంపై శవం ఉన్న ప్రీజర్ను ఎక్కించి నిరసన తెలిపారు. కొద్ది సేపటి తర్వాత మృతదేహంతో ఏర్గట్ల వరకూ చేరుకుని బస్టాండ్ సమీపంలో రాస్తారోకో నిర్వహించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని, నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.


