
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్: మీర్‌పేట్‌లో విదేశీ మహిళపై సామూహిక అత్యాచారం చోటు చేసుకుంది. లిఫ్ట్ పేరిట ఆమెను ఎక్కించుకుని వెళ్లిన కొందరు యవకులు ఘాతుకానికి ఒడిగట్టారు.
మీర్‌పేట వద్ద వాహనాల కోసం ఎదురు చూస్తున్న విదేశీయురాలిని లిఫ్ట్ వంకతో తీసుకెళ్లారు. ఆపై పహాడీషరీఫ్ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు.
ఘటనపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు అయ్యింది. సదరు బాధితురాలు జర్మనీకి చెందిందని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం.. చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.