
తండ్రి చితికి నిప్పంటించిన బిడ్డ
ముగిసిన వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్
వెంకట్ రామ్ నర్సయ్య అంత్యక్రియలు
హైదరాబాద్: దేశంలోనే ప్రసిద్ధి గాంచిన వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ డాక్టర్ వెంకట్ రామ్‌నర్సయ్య (82) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం చిక్కడపల్లి వివేక్‌నగర్‌లోని తన ఇంట్లో కన్నుమూశారు. ఆయనకు కుమారులు లేకపోవడంతో కుమార్తె శాంతి తండ్రి చితికి నిప్పటించి అంత్యక్రియలు నిర్వహించారు. ఇందుకు తల్లి లక్ష్మితో పాటు శాంతి భర్త నవీన్ చక్రవర్తి ఆమోదం తెలపడంతో శుక్రవారం అంబర్‌పేట శ్మశాన వాటికలో ఆయన దహన సంస్కారాలు పూర్తి చేశారు.
రామ్‌నర్సయ్య వృత్తి రీత్యా డాక్టర్ అయినా ప్రవృత్తి మాత్రం వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ. వైల్డ్‌లైప్ ఫొటో గ్రఫీలో అప్పటి కాంగ్రెస్ అగ్రనేత, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్‌కు ఆయన గురువు కావడం గమనార్హం. ఉమ్మడి ఏపీలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో దిగి్వజయ్‌సింగ్, డాక్టర్ వెంకట్ కలిసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ఆయన తీసిన పులుల ఫొటోలతో దేశంలోనే టాప్ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా పేరు తెచి్చపెట్టాయి. అంతేగాకుండా పులులపై ఆయన ఓ పుస్తకాన్ని కూడా రాశారు.