photographer
-
Vishal- Nikki సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ గ్రాండ్ వెడ్డింగ్, ఫోటోలు వైరల్
-
సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ పెళ్లి ఫోటోలు వైరల్, ఎవరు తీశారో ఊహించగలరా?
సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ తన లేడీ లవ్‌తో ఏడడగులు వేశాడు. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట సందడిగా మారాయి. అయితే అందరి పెళ్లి ఫోటోలను అత్యంత అందంగా తీసే ఈ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ పెళ్లి ఫోటోలు ఎవరు తీశారు అనేది నెట్టింట చర్చకు దారి తీసింది. నిజమే కదా.. ఎవ్వరికైనా ఇలాంటి సందేహం రావడం సహజమే కదా? మరి ఇంకెందుకు ఆలస్యం.. అసలింతకీ ఎవరీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్. వీరి బిగ్ డేకు సంబంధించిన ఫోటోలను బంధించింది ఎవరు? ఏమిటి? తెలుసుకుందాం.సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ విశాల్ పంజాబీ ఒక ఇంటి వాడయ్యాడు. ప్రేయసి నిక్కీ కృష్ణన్‌తో వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. తద్వారా ఇటీవల బ్యాచిటర్ లైఫ్ కి గుడ్ బై చెబుతున్న సెలబ్రిటీల సరసన చేరాడు. మార్చి 23,ఇన్స్టాగ్రామ్ పేజీలో తన వెడ్డింగ్ ఫోటోలను పంచుకున్నాడు. ఎంతో ఆనందకరమైన వేడుకను విశాల్ స్నేహితుడు, మరో ప్రముఖ వివాహ ఫోటోగ్రాఫర్ జోసెఫ్ రాధిక్ బంధించడం విశేషం. అంతేకాదు తన స్నేహితుడు విశాల్ పెళ్లికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ వేడుకలనుంచి పవిత్ర హోమం చుట్టూ ప్రదక్షిణలు దాకా, అనేక ఇతర వేడుకల ఫోటోలను అందమైన క్యాప్షన్లతో తన ఇన్‌స్టాలో పోస్ట్ చేయడం మరో విశేషం.ఇదీ చదవండి: Tamannaah Bhatia: సమ్మర్ స్పెషల్ : పింక్ పూల చీరలో ఎథ్నిక్ లుక్‘‘15 ఏళ్ల తన కరియర్లో చాలా తక్కువ సార్లుమాత్రమే తన సన్నిహితుల పెళ్లి వేడుకలను బంధించే అవకాశం లభించింది. అదీ పెళ్ళళ్లలో మాట్లాడే అవకాశం కేవలం రెండు సార్లు మాత్రమే. ఇపుడు నిక్కీ, విశాల్ ఫోటోలను తీయడం అదృష్టం . ఈ అవకాశం కల్పించినందుకు ఇద్దరికీ కృతజ్ఞతలు’’ అంటూ ఇన్‌స్టాలో ఒక నోట్ ద్వారా కొత్త జంటకు అభినందనలు తెలిపాడు.మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తుల్లో వధూవరులు పెళ్లి కళతో కళ కళలాడిపోయాడు. హ్యాండ్లూమ్ పింక్ బనారసి బ్రోకేడ్ లెహంగా, పుదీనా ఆకుపచ్చ టిష్యూ దుపట్టాతో నిక్కీ కృష్ణన్ డిఫరెంట్ లుక్‌లో కనిపించగా, విశాల్ పంజాబీ కాశ్మీరీ థ్రెడ్ ఎంబ్రాయిడరీతో చేసిన సాంప్రదాయ ఓపెన్ షేర్వానీని ఎంచుకున్నాడు. ఫ్లేర్డ్ కుర్తా, వైడ్-బాటమ్ ప్యాంటు , క్యాస్కేడింగ్ డ్రేప్‌తో దీన్ని జత చేశాడు. రష్యన్ పచ్చలు, అన్ కట్ డైమండ్ జ్యుయల్లరీ, 18K బంగారంతో కూడిన ఇంపీరియల్ హెయిర్లూమ్స్తో కొత్త జంట అందంగా మెరిసిపోయారు.విశాల్-నిక్కీ లవ్ స్టోరీవిశాల్ పంజాబీ , నిక్కీ కృష్ణన్ గత ఏడాది జూన్ 2024లో లండన్‌లో క్రైస్తవ వేడుకలో వివాహం చేసుకున్నారు. నిక్కీ సోదరి వివాహంలో తాము మొదట కలుసుకున్నారు. ఆ పెళ్లికి విశాల్ ఫోటోగ్రాఫర్. ఆ సమయంలో వారి పరిచయం ప్రేమగా మారింది. అయితే నిక్కీ లండన్‌కు చెందినది కావడంతో ఆరంభంలో వీరి ప్రేమకు కొన్ని ఇబ్బందులొచ్చాయి, మొత్తానికి తమ బంధం వివాహ బంధంగా బలపడింది. ఎవరీ జోసెఫ్ రాధిక్హై ప్రొఫైల్ పెళ్లిళ్లు అనగానే ప్రముఖ ఫోటోగ్రాఫర్ జోసెఫ్ రాధిక్ గుర్తొస్తాడు. బాలీవుడ్ పవర్ కపుల్స్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, కత్రినా కైఫ్ ,విక్కీ కౌశల్, నయనతార విఘ్నేష్ శివన్, అలాగే అదితి రావు హైదరి, సిద్ధార్థ్ కలల వివాహ క్షణాలను బంధించిన ఘనత జోసెఫ్‌దే. అంతేకాదు అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ల డ్రీమీ వెడ్డింగ్ ఫోటోలు తీసింది కూడా జోసెఫ్. -
ఆరున్నొక్కరు.. జారితే దక్కరు
హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలంటూ ఓ వైపు పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నా వాహనదారులు లెక్కచేయడం లేదు. విజయవాడ అజిత్‌సింగ్ నగర్ ప్రాంతంలో ఆరుగురు పిల్లలతో బైక్‌పై ఇలా దౌడు తీస్తూ ఫొటోకి చిక్కాడు. - సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడబంతికాదది భానుడే చీకట్లను చీల్చుకుని వెలుగులు వెదజల్లుతూ పైకి వస్తున్న బాలభానుడు ఇలా ఓ దీపస్తంభంపైన ఎర్రని బంతి ఉంచినట్లు కనిపించాడు. కడప ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆదివారం ఉదయం ఈ దృశ్యాన్ని సాక్షి కెమెరా క్లిక్‌మనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, కడప సండే సందడివారమంతా పనిఒత్తిడితో బిజీబిజీగా గడిపిన నగరప్రజలు ఆదివారం వచ్చేసరికి ఇలా సముద్ర తీరానికి చేరుకుని సేదతీరారు. పర్యాటకుల సందడితో ఆదివారం సాయంత్రం విశాఖ ఆర్కేబీచ్ ఇలా సందడిగా కనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
మంచు జలపాతం కాదు.. మహా వినాశనానికి సంకేతం!
భారీ హిమానీనదం కరుగుతూ ఆ నీరు సముద్రంలోకి జలపాతంలా దూకుతున్న ఈ దృశ్యం.. మహా వినాశనానికి సంకేతమట. గ్లోబల్ వార్మింగ్ కారణంగా భూమ్మీద అత్యంత వేగంగా మంచు కరిగిపోతున్న ప్రాంతమైన నార్వేలోని స్వాల్బార్డ్లో ఉన్న బ్రస్వెల్బ్రీన్ హిమానీనదం ఇది. ఇజ్రాయెలీ ఫొటోగ్రాఫర్ రో గలిట్జ్ తీసిన ఈ చిత్రం.. ఇంటర్నేషనల్ ట్రావెల్ ఫొటోగ్రాఫర్–2024 అవార్డుల్లో ‘ప్లానెట్ ఎర్త్– ల్యాండ్ స్కేప్, క్లైమేట్, వాటర్’ కేటగిరీ కింద ఎంపికైంది. -
తానే దిద్దుకున్న బతుకు చిత్రం
బాల్యం పేదరికాన్ని పరిచయం చేసింది. చదువుకు దూరం చేసింది. అనివార్యంగా పెళ్లికి తలవంచాల్సి వచ్చింది. భర్త పట్టించుకోని ఇంటి బాధ్యతను మోయడానికి భుజాలనివ్వాల్సి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా ఐదుసార్లు వదిలి వెళ్లాడు భర్త. ఇద్దరు పిల్లలను పోషించుకోవాలి. తనకు దూరమైన చదువును వారికివ్వాలి. అందుకోసం తానెంతయినా కష్టపడాలి. ఇదీ ఆమెకు జీవితం నిర్దేశించిన దారి. ఆ దారి ఆమెను దేశం ఎల్లలు దాటించింది. పరాయి దేశంలో ఆ భాషలు నేర్చుకుంది. చదువుకుంది. ఆ దేశపు మంత్రిత్వ శాఖలో ఉద్యోగంలో చేరింది. ఆ విధుల్లో ఏకైక మహిళ రషీదా బేగం షేక్ పరిచయం ఇది.బతుకు బడి రషీదా పుట్టింది తమిళనాడులో. ఆమె చిన్నప్పుడే తండ్రి ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లాలోని గూడూరుకి వచ్చి స్థిరపడ్డారు. రషీదా బాల్యం, చదువు గూడూరులోనే. ఆమె పాఠశాల చదువు పూర్తయ్యేలోపు తండ్రి పోవడంతో కష్టాలు మొదలయ్యాయి. క్లాసులో ఫస్ట్ ర్యాంకులో చదివిన రషీదకు టెన్త్ క్లాస్ హాల్ టికెట్ తెచ్చుకోవడానికి పాతిక రూపాయలు కష్టమయ్యాయి. చదువు విలువ తెలియని తల్లి కారణంగా రషీదా చదువాగిపోయింది. అడిగిన వారికిచ్చి పెళ్లి చేశారు. వ్యసనపరుడైన భర్త వదిలేసి పోవడంతో ఇద్దరు పిల్లలను పోషించుకోవడానికి వదిన సహాయంతో కువైట్‌కి వెళ్లింది. పిల్లలను అక్క దగ్గర వదిలి కువైట్‌లో ఉద్యోగంలో చేరిన రషీదా లక్ష్యం ఒక్కటే. బాగా డబ్బు సంపాదించాలి, పిల్లల్ని బాగా చదివించాలి. నెలకు నాలుగు వేల రూపాయల ఉద్యోగంతో మొదలైన ఆమె ప్రస్థానంలో ఆమె చేరిన మైలురాయి ఏమిటో తెలుసా? కువైట్ పబ్లిక్ రిలేషన్స్, ఫారిన్ అఫైర్స్ మినిస్ట్రీలో అఫిషియల్ ఫొటోగ్రాఫర్. ఇదేమీ సినిమా కథలా ఒక రీల్లో జరిగిపోలేదు. ఆమె ప్రయాణంలో ఒక్కొక్క అడుగూ చిట్టడవిలో దారి వెతుక్కుంటూ సాగింది. ఒక్కొక్క సంఘటన ఒక్కోపాఠం. భాష తెలియక యజమానురాలి ఆదేశం సరిగ్గా అర్థం కాకపోవడం, దాంతో ఆమెకు ఆగ్రహం కట్టలు తెంచుకోవడం, రషీద ఉన్న గది తలుపు వేసి రెండో రోజు వరకు తియ్యకపోవడం... ఇండియాకి వెళ్లిపోదామనిపించిన చేదు అనుభవం. పిల్లల్ని బాగా చదివించాలి... ఒక్కటే లక్ష్యం ఆమెను కువైట్‌లో కట్టిపడేసింది. ఇటాలియన్ వంటల పుస్తకంలోని బొమ్మల ఆధారంగా రకరకాల సలాడ్లు చేసి జీతం పెంచుకుంది.కష్టాల పాఠాలురషీదా ఓ రోజు పైకి ఎక్కి కిటికీలను తుడుస్తూ కాలు జారి పడిపోయింది. కాలుకు కట్టు కట్టించారు. ఆ ఒక్కరోజే రెస్ట్. రెండో రోజు చేతి కర్ర ఇచ్చి పని చేయమన్నారు. కాలికి కట్టు, కర్ర సాయంతో నడుస్తూ ఇంటి పనంతా చేయాల్సి వచ్చింది. చిమ్మ చీకటిలోనూ ఒక వెలుగురేఖ ప్రకాశిస్తుందనడానికి నిదర్శనం ఆ ఇంటి అమ్మాయి బ్యూటీషియన్ కావడం. ఆమెకు సహాయం చేస్తూ కోర్సు మొత్తం నేర్చుకుంది రషీదా. బ్యూటీషియన్‌గా పని చేసింది. ఒకరోజు అరబ్ వార్తాపత్రికలో మహిళలకు ఫొటోగ్రఫీలో శిక్షణ, ఉద్యోగం ప్రకటన ఆమెను కొత్త దారి పట్టించింది. ఆ ప్రకటనలో ఆమెకు అర్థమైంది మహిళ ఫొటో, కెమెరా బొమ్మ, జీతం అంకె మాత్రమే. కోర్సులో చేరి ఫొటోగ్రఫీ నేర్చుకుంది. డిగ్రీ ఉంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని చెప్పారెవరో. ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ బీకామ్ చేసింది. ఇంగ్లిష్ మాట్లాడడంతోపాటు అరబ్బీ చదవడం, రాయడం కూడా నేర్చుకుంది. గవర్నమెంట్లో స్వీపర్ ఉద్యోగం అయినా చేస్తానని తెలిసిన వాళ్లందరినీ అడిగింది. కానీ ఆమె కోసం అఫిషియల్ ఫొటోగ్రాఫర్ ఉద్యోగం ఎదురు చూసింది. ఇప్పుడామె తనకంటూ మినిస్ట్రీలో ఒక అఫిషియల్ క్యాబిన్, పోలీస్ జాకెట్‌తో ఉన్నతస్థాయిలో ఉన్న విజేత. కొడుకులిద్దరూ ఆమె కోరుకున్నట్లే ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.విజేత లక్ష్యం రషీదా ప్రస్థానం పర్వత శిఖరం చేరిన తర్వాత అక్కడే ఆగిపోలేదు. పరాయి దేశంలో ఒంటరి మహిళకు ఎదురయ్యే కష్టాలను స్వయంగా అనుభవించింది. ఉపాధి కోసం బయటి ప్రాంతాలకు వెళ్లే వారికి మంచి దారి చూపించాలనుకుంది. ఉమెన్స్ థ్రైవ్ ఏపీ పేరులో స్వచ్ఛంద సంస్థను స్థాపించి మహిళలను శిక్షణనిస్తోంది. టైలరింగ్, బ్యూటీషియన్, ఇంగ్లిష్ చదవడం– మాట్లాడడం, కేక్ తయారీ, పెళ్లి మండపాల అలంకరణ వంటి పనుల్లో శిక్షణనిస్తోంది. అలాగే ఉజ్వల భవిష్యత్తు పేరుతో పాఠశాల పిల్లలకు కెరీర్ ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయోననే అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత ఇండియాకి వచ్చి పూర్తి స్థాయిలో మహిళలు, పిల్లల కోసం పని చేయాలనేదే తన లక్ష్యం అంటోంది రషీదా బేగం షేక్. ఇకిగాయ్ నేర్పించింది ఫొటోగ్రఫీతోపాటు ఫొటోషాప్ కోర్సు నేర్చుకోవడానికి వెళ్లినప్పటికి నాకు కీబోర్డ్ కాదు కదా, మౌస్ కదపడం కూడా రాదు. బ్యూటీషియన్‌గా కొనసాగమని సూచించారు. అప్పుడు నాకెంత ఉక్రోషం వచ్చిందంటే... ఆ మాట అన్న వారి నంబర్ బ్లాక్ చేసేశాను. ఏడాది తర్వాత వారికి ఒక ప్రోగ్రామ్‌కి ఫొటోగ్రాఫర్ అవసరం ఏర్పడినప్పుడు ఎంక్వయిరీ చేస్తే ఎవరో నా పేరు చెప్పారట. వాళ్ల ఈవెంట్ కోసం నన్నే పిలిచారు. మరొక సందర్భంలో నా దుస్తుల కారణంగా చిన్నచూపుకు గురవుతున్నానని తెలిసింది. నేను నేర్చుకున్న మరో పాఠం అది. జపాన్ పుస్తకం ఇకిగాయ్ ద్వారా చాలా తెలుసుకున్నాను. ఉమెన్స్ థ్రైవ్ కోర్సులో ఈ పుస్తకంలోని అంశాలను చేర్చాను. నన్ను నేను మలుచుకున్నట్లే సాటి మహిళలను తీర్చిదిద్దాలనేది నా ఆకాంక్ష. – రషీదా బేగం షేక్, ఫొటోగ్రాఫర్, మంత్రిత్వ శాఖ, కువైట్– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ప్రాంక్ అని చెప్పి నిజమైన పెళ్లి..
రీల్స్, ఇన్‌స్ట్రాగామ్ ప్రపంచాన్ని ఏలుతున్న కాలంలో ఏది నిజమో? ఏది అబద్ధమో? తెలియడం లేదు. ఆ్రస్టేలియాలోని ఓ మహిళకు ఇలాంటి సమస్యే ఎదురైంది. సోషల్ మీడియాలో ఫాలోవర్స్‌ను పెంచుకోవడానికి అతను ఏర్పాటు చేసిన ‘ఫేక్ వెడ్డింగ్’నిజమని తేలడంతో ఆమె కోర్టుకెక్కాల్సి వచ్చింది. చివరకు జడ్జి ఆ పెళ్లిని రద్దు చేశారు. వివరాల్లోకి వెళ్తే... మెల్బోర్న్లో ఉంటున్న ఓ మహిళకు 2023 సెప్టెంబర్‌లో ఆన్లైన్ డేటింగ్ వేదికపై ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అది కాస్తా ప్రేమగా మారింది. అదే ఏడాది డిసెంబర్లో ఆమెకు అతను ప్రపోజ్ చేశాడు. ఆమె అంగీకరించింది. రెండు రోజుల తర్వాత సిడ్నీలో ఓ వైట్పార్టీ ఉందని, అక్కడికి అందరూ తెలుపు రంగు దుస్తుల్లో వస్తారని చెప్పారు. ఆమె కూడా అలాగే రెడీ అయి వెళ్లింది. తీరా అక్కడికెళ్లి చూస్తే.. ఫోటోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్ స్నేహితుడు తప్ప మరెవరూ లేరు. ఇదేంటని ప్రశ్నిస్తే... తన ఇన్‌స్ట్రాగామ్‌లో ఫాలోవర్స్ పెరగడం కోసం ప్రాంక్ వెడ్డింగ్ నిర్వహిస్తున్నానని, అందుకు సహకరించాలని ఆమెను కోరాడు. అప్పటికే అతనికి 17,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. అతని వివరణ ఆమెకు సబబుగానే తోచింది. సాయం చేసినట్లవుతుందని ఫేక్ పెళ్లికి అంగీకరించింది. సివిల్ మ్యారేజ్ కోర్టులో జరిగితేనే పెళ్లి చెల్లుబాటవుతుందని నమ్మింది. అదే విషయాన్ని తన స్నేహితురాలితో పంచుకుంది. అదే నిజమైతే వారు ముందుగా వివాహం నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని స్నేహితురాలు కూడా చెప్పడంతో.. ఇది ఉత్తుత్తి పెళ్లే అని నమ్మింది. కట్ చేస్తే.. రెండు నెలల తరువాత, ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం కోసం ఆమె చేసిన దరఖాస్తులో తనను డిపెండెంట్‌గా చేర్చాలని అతను కోరాడు. పెళ్లి కానిది ఎలా కుదురుతుందని ఆమె ప్రశ్నించగా.. సిడ్నీలో జరిగిన వివాహ వేడుక నిజమైనదని బాంబు పేల్చాడు. వివాహ ధృవీకరణ పత్రాన్ని కూడా చూపించాడు. ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి.. వివాహానికి నెలముందే అతను నోటీసులు ఇచ్చాడని అర్థమైంది. అతను మొదటినుంచి అబద్ధం చెప్పాడని, తనను మోసం చేశాడని ఆమె కోర్టుకెక్కింది. పెళ్లి వేడుకలో తాను నటించానే తప్ప.. అది నిజం కాదని కోర్టుకు తెలిపింది. మహిళ వాంగ్మూలాన్ని నమ్మిన మెల్బోర్న్ జడ్జి 2024 అక్టోబర్‌లో వీరి వివాహాన్ని రద్దు చేస్తూ తీర్పు ఇచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
లవ్ హోటళ్లు.. పోటెత్తుతున్న ప్రేమ జంటలు
అణుబాంబుల వినాశనం నుంచి తేరుకుని జపాన్ సాధించిన ప్రగతి అన్ని దేశాలకూ స్ఫూర్తిదాయకమే. అక్కడి గమ్మత్తైన సంగతులను కెమెరాలో బంధించేందుకు బయల్దేరిన ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ ఫ్రాంకోయిస్ ప్రోస్ట్ను లవ్ హోటళ్ల సంస్కృతి బాగా ఆకర్షించింది. ప్రైవసీ కోసం ప్రేమ పక్షులు కాస్త ‘ఏకాంతంగా’ సమయం గడిపే ఈ హోటళ్లు జపాన్‌లో సూపర్‌హిట్‌గా మారాయి. వింత ఆకృతుల్లో అలరించే వీటి విశేషాలను రకరకాల యాంగిళ్లలో కెమెరాలో బంధించాడు.పడవలు, కోటలు, అంతరిక్ష వస్తువులు హోటల్ జాయ్, హోటల్ ప్యాషన్, హోటల్ బేబీ కిస్... ఇలా ఆకర్షణీయ పేర్లతో లవ్, కిస్ సింబళ్లతో ఈ హోటళ్లు ఆకట్టుకునేలా ఉంటాయి. విభిన్న ఆకృతుల్లో ఉండటం వీటిలోని మరో విశేషం. ఒక హోటల్ భారీ పడవలా, మరోటి పేద్ద కోటలాగా దర్శనమిస్తాయి. ఇంకోటి తిమింగలంలా, మరోటి గ్రహాంతరవాసుల ఎగిరే పళ్లెం (యూఎఫ్ఓ)లా నిర్మించారు. సాధారణ భవంతుల మధ్య చూడగానే కనిపెట్టేలా వీటిని కట్టారు. ఇలాంటి 200కు పైగా లవ్ హోటళ్లను ప్రోస్ట్ ఫొటోలు తీశారు. వ్యభిచారాన్ని నిషేధిస్తూ జపాన్‌లో 1958లో చట్టం తెచ్చాక ఈ లవ్ హోటళ్ల సంస్కృతి పెరగడం విశేషం. వీటిల్లో వ్యభిచారం జరుగుతోందని కొందరు విమర్శిస్తుండగా మరికొందరు దాన్ని గట్టిగా ఖండిస్తుండటం విశేషం.ఇరుకు ఇళ్లు, ఉమ్మడి కుటుంబాలు ఉమ్మడి కుటుంబాల్లో కొత్త జంటలకు ఊపిరాడదు. చిలిపి చేష్టలు తదితరాలు కష్టం. పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలు నివసించే ఇళ్లు, గదులు మరీ ఇరుకు, ఇలాంటి కొత్త, పేద జంటల ‘అవసరాలు’ తీర్చే ప్రత్యామ్నాయ వేదికలుగా లవ్ హోటళ్లు బాగా ఉపయోగపడుతున్నాయని జపాన్‌లో చాలామంది భావిస్తున్నారు. కొత్త జంటలు, ప్రేమ పక్షుల ప్రైవసీకే గాక నైట్‌క్లబ్ వంటి పలు వసతులకు ఇవి నెలవులు. జలాంతర్గామిలా, పెద్ద నౌకలా చూపు తిప్పుకోలేనంతటి ముదురు రంగు పెయింటింగుల్లో, రాత్రిళ్లు ధగధగల విద్యుత్ వెలుగుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.ఫుల్ ప్రైవసీ ఈ లవ్ హోటళ్లలో సిబ్బంది చాలా తక్కువగా ఉంటారు. ఉన్నా సరిగా కనపడరు. తెరలు, మసకమసక గాజు తలుపుల వెనుక నుంచే సేవలందిస్తారు. చార్జీలను ఆన్లైన్లోనే చెల్లించవచ్చు. కారు పార్కింగ్ ప్రాంతం కూడా కాస్త చీకటిగానే ఉంటుంది గనుక ప్రైవసీకి లోటే ఉండదు. 1970ల నుంచీ బాగా పాపులరైన మెగురో ఎంపరర్ లవ్ హోటల్‌ను యూరప్ కోట ఆకృతిలో నిర్మించారు. దాని బాటలో జపాన్ అంతటా చాలా నగరాల్లో లవ్ హోటళ్లు కోట డిజైన్లలో పుట్టుకొచ్చాయి. హోన్సు, షికోకు దీవులు మొదలుకుని టోక్యోదాకా అంతటా అలరిస్తూ వచ్చాయి. ఒకయామాలోని హోటల్ అలాదిన్ను గ్రాండ్ అరేబియన్ ప్యాలెస్‌లా భారీ గుమ్మటాలతో కట్టారు.ఏటా 50 కోట్ల మంది జపాన్వ్యాప్తంగా 20,000 లవ్ హోటళ్లుంటాయని అంచనా. 1980ల్లో వచి్చన కఠిన చట్టాల తర్వాత వీటి సంఖ్య తగ్గింది. అయినా ఇప్పటికీ వీటికి విపరీతమైన జనాదరణ ఉంది. 1990ల నుంచి అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఈ హోటళ్లను ప్రేమ జంటలు ఏటా 50 కోట్లసార్లు సందర్శిస్తున్నారు! ఆ లెక్కన జపాన్‌లో సగం శృంగారం ఈ హోటళ్లలోనే జరుగుతోందని ప్రముఖ న్యాయ శాస్త్రవేత్త మార్క్ డి.వెస్ట్ విశ్లేíÙంచారు. 2005లో రాసిన ‘లా ఇన్ ఎవ్రీడే జపాన్’ పుస్తకంలో ఇలాంటి బోలెడు విషయాలను వెల్లడించారాయన.– సాక్షి, నేషనల్ డెస్క్ -
నో అంటే నో: తాప్సీ
‘‘నేను నటిని మాత్రమే. పబ్లిక్ప్రాపర్టీని కాదు’’ అంటున్నారు హీరోయిన్ తాప్సీ. కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా నటించిన ‘ఝుమ్మంది నాదం’ (2010) సినిమాతో హీరోయిన్గా పరిచయమయ్యారు తాప్సీ. ఆ తర్వాత పలు తెలుగు చిత్రాలతో పాటు తమిళ, మలయాళ, హిందీ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ కొన్నేళ్లుగా బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టారు. వరుస హిందీ సినిమాలతో దూసుకెళుతున్న తాప్సీ తాజాగా చేసిన బోల్డ్ కామెంట్స్ వైరల్‌గా మారాయి. సాధారణంగా సెలబ్రిటీలను చూసినప్పుడు వారి ఫోటోలు, వీడియోలు తీయడం కోసం ఉత్సాహం చూపుతుటాంటారు.ఇటీవల తాప్సీని తమ కెమెరాల్లో బంధించేందుకు కొందరు పోటీపడ్డారట. అయితే అందుకు ఆమె నో అంటే నో చెప్పారు. ‘‘నేను నటిని మాత్రమే.. పబ్లిక్ప్రాపర్టీని కాదు. రెండింటికీ చాలా తేడా ఉంది. కెమెరాలతో నా పైకి దూసుకురావడం, ఫిజికల్‌గా హ్యాండిల్ చేయడం చాలా తప్పు. ఎవరైనా నో అని చెబితే వారి అభి్రపాయానికి గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి. నేను ఇలా అంటున్నానని కొందరు నన్ను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఎందుకు హీరోయిన్గా చేస్తున్నావ్? అని కామెంట్ చేయొచ్చు. కానీ నటన నాకు నచ్చిన వృత్తి... అందుకే సినిమాలు చేస్తున్నాను’’ అన్నారు తాప్సీ. -
అలాంటి డ్రెస్ వేసుకుంటే పెద్ద స్టార్ అవుతానన్నాడు: హీరామండి నటి
ఇటీవల హీరామండి వెబ్ సిరీస్‌తో అభిమానులను ఆకట్టుకున్న బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా. 1990ల్లో స్టార్ హీరోయిన్గా రాణించింది. తాజాగా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండిలో కనిపించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన మనీషా తన కెరీర్లో ఎదురైన పలు సంఘటలను గుర్తు చేసుకుంది. 90వ దశకంలో బాలీవుడ్లో మహిళా నటులు ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రస్తావించింది. ఒక ఫోటోగ్రాఫర్‌తో తనకెదురైన చేదు అనుభవాన్ని వివరించింది.మనీషా మాట్లాడుతూ.. 'నా కెరీర్లో ప్రారంభంలో నన్ను చాలామంది ఫోటోషూట్లు అడిగేవారు. ఒకసారి నేను అమ్మతో కలిసి ఫోటోషూట్‌కు వెళ్లాను. అక్కడే ప్రముఖ ఫోటోగ్రాఫర్ కూడా ఉన్నారు. అతను నువ్వే తర్వాతి సూపర్‌స్టార్ అని నాతో అన్నాడు. ఆ తర్వాత అతను నా దగ్గరకు రెండు పీసుల బికినీ తెచ్చి ధరించమని అడిగాడు. అప్పుడు నేను బీచ్‌కి వెళ్లినప్పుడు, ఈత కొట్టేటప్పుడు మాత్రమే ఇది వేసుకుంటాను. కానీ ఇలాంటి వాటితో సినిమాల్లోకి రావాలనుకోవడం నాకు ఇష్టం లేదు. దీంతో బికినీ ధరించను అని చెప్పా. పూర్తి దుస్తులతోనే ఫోటోలు తీయమని సూచించా. ఆ తర్వాత అతను నాకు ఓ డైలాగ్ చెప్పాడు. నేను పెద్దస్టార్ అయ్యాక తానే నా ఫోటోలు తీసేందుకు వచ్చాడు' అని వెల్లడించారు.కాగా.. మనీషా మొదట నేపాలీ చిత్రం ఫెరి భేతౌలాతో సినీ కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత సౌదాగర్ (1991) మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అనంతరం ధన్వన్ , 1942: ఎ లవ్ స్టోరీ, బాంబే , అగ్ని సాక్షి , గుప్త, ది హిడెన్ ట్రూత్, దిల్ సే లాంటి చిత్రాలలో నటించింది. అయితే కొన్నేళ్ల పాటు పరిశ్రమకు దూరంగా ఉన్న మనీషా లస్ట్ స్టోరీస్ (2018)తో రీ ఎంట్రీ ఇచ్చింది. గతేడాది విడుదలైన షెహజాదా (2023) చిత్రంలో కనిపించింది. -
నా భార్యాకుమారుడిని చేరదీయండి
ఖమ్మంక్రైం: ‘మానస నువ్వంటే చెప్పలేనంత ప్రేమ. అనారోగ్యంతో బాధపడుతున్న నీకు తోడగా ఉండాల్సింది పోయి వెళ్తున్నా.. మన కుమారుడు నమన్రెడ్డిని జాగ్రత్తగా చూసుకో.. నాన్నా(కుమారుడిని ఉద్దేశించి) నీ చెయ్యి పట్టుకుని ప్రపంచాన్ని చూపించాల్సి ఉన్నా చేయి విడిచిపెట్టి పోతున్నాను. నన్ను క్షమించండి. అమ్మ, అక్క, తమ్ముళ్లు, అత్తయ్య, మామయ్యలు, బాబాయిలు, పిన్నిలు మీరంతా నా కొడుకు, భార్యను జాగ్రత్త గా చూసుకోండి. నాపై కోపం ఉంటే వారిపై చూపకుండా చేరదీసి ఆదుకోండి’ అంటూ లేఖ రాసిన ఓ ఫొటోగ్రాఫర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడెంకు చెందిన ఎరసాని శ్రీనివాస్‌రెడ్డి(40) ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తూ భార్య మానస, కుమారుడు నమన్రెడ్డితో కలిసి ఉంటున్నాడు. అయితే కొంతకాలంగా ఆయన లోన్‌యాప్‌లు, క్రెడిట్‌కార్డుల ద్వారా తీసుకున్న అప్పులు పెరిగి తీర్చలేని పరిస్థితి ఎదురైనట్లు తెలుస్తోంది. దీంతో ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈనేపథ్యాన కొన్నాళ్ల క్రితం ఖమ్మంలో ఫొటోగ్రాఫర్‌గా పనిచేసిన అనుభవం ఉండడంతో శుక్రవారం సాయంత్రం ఇక్కడకు చేరుకుని లాడ్జీలో గది అద్దెకు తీసుకున్నాడు. శనివారం ఉదయం ఆయనకు టీ ఇవ్వడానికి వెళ్లిన సిబ్బంది ఎంత పిలిచినా తలుపు తీయకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు వచ్చి తలుపులు పగులకొట్టి చూడగా శ్రీనివాస్‌రెడ్డి ఉరి వేసుకుని కనిపించాడు. ఆయన వద్ద లభించిన లేఖ, చిరునామా ఆధారంగా కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. కాగా, అప్పులు పెరగడంతో తీర్చే మార్గం లేక బలవన్మరణానికి పాల్పడగా, శ్రీనివాసరెడ్డి తన భార్య, కుమారుడిని విడిచిపెట్టలేక సంఘర్షణకు గురైనట్లు లేఖ ద్వారా తెలియడంతో చదివిన వారంతా కంటతడి పెట్టారు. కాగా, ఆయన మృతదేహాన్ని అన్నం ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాసరావు, సిబ్బంది సాయంతో మార్చురీకి తరలించి కేసు నమోదు చేసినట్లు ఖమ్మం టుటౌన్ ఎస్ఐ రఫీ తెలిపారు. -
అహో!
వీడియో వైరల్ కావడానికి అసాధారణ అద్భుతాలతో పనిలేదు. ‘ఆహా’ అనిపిస్తే చాలు. ఇది అలాంటి వైరల్ వీడియోనే. ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్ మార్క్ స్మిత్ తీసిన వీడియో నెటిజనులను మంత్రముగ్ధులను చేసింది. చేపను క్యాచ్ చేస్తున్న ఒక డేగకు సంబంధించిన క్లోజ్–అప్ షాట్ ఇది.కెమెరామన్‌గా మార్క్ స్మిత్ అద్భుతమైన పనితనం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఈ స్టన్నింగ్ వీడియో 124 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. -
Gitika Talukdar: ప్యారిస్ ఒలింపిక్స్‌కు మన ఫొటోగ్రాఫర్
వచ్చే నెలలో ప్యారిస్ ఒలింపిక్స్. అన్ని దేశాల ఆటగాళ్లే కాదు మీడియా ఫొటోగ్రాఫర్లు కూడా కెమెరాలతో బయలుదేరుతారు. కాని ‘ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ’ (ఐ.ఓ.సి) గుర్తింపు పొందిన వారికే అన్ని మైదానాల్లో ప్రవేశం. అలాంటి అరుదైన గుర్తింపును పొందిన మొదటి భారతీయ మహిళా ఫొటోగ్రాఫర్ గీతికా తాలూక్దార్. అస్సాంకు చెందిన స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్ గీతికా తాలూక్దార్ పరిచయం.‘స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్‌గా కెరీర్‌ని ఎంచుకోవడానికి స్త్రీలు పెద్దగా ముందుకు రారు. ఎందుకంటే అది మగవాళ్ల రంగం చాలా రోజులుగా. అక్కడ చాలా సవాళ్లు ఉంటాయి. నేను వాటన్నింటినీ అధిగమించి ఇవాళ గొప్ప గుర్తింపు పొందగలిగాను’ అని సంతోషం వ్యక్తం చేసింది గీతికా తాలూక్దార్. జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకూప్యారిస్లో జరగనున్న ఒలింపిక్స్ పోటీల్లో ఫొటోలు తీయడానికి ఆమెకు అక్రిడిటేషన్ లభించింది. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటి (ఐ.ఓ.సి) చాలా తక్కువ మంది ఫొటోగ్రాఫర్లకు మాత్రమే ఒలింపిక్స్‌ను కవర్ చేసే అధికారిక గుర్తింపు ఇస్తుంది. ఈసారి ప్రపంచవ్యాప్తంగా అతి కొద్దిమంది మహిళా స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్లు ఈ గుర్తింపు పొందితే మన దేశం నుంచి మొదటి, ఏకైక మహిళా స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్‌గా గీతికా తాలూక్దార్ చరిత్ర సృష్టించింది. ఫ్రీ లాన్సర్‌గా...‘స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్ అంటే విస్తృతంగా పర్యటించాలి. సంస్థలో ఉద్యోగిగా ఉన్నప్పుడు సంస్థలు ఒక్కోసారి అనుమతిస్తాయి, మరోసారి అనుమతించవు. అందుకని నేను ఫ్రీలాన్సర్‌గా మారాను. స్వేచ్ఛ పొందాను. నా సేవలు కావాల్సిన సంస్థలు నన్ను సంప్రదిస్తాయి’ అంది గీతిక. ఫ్రీ లాన్సర్‌గా ఉంటూనే ఆమె ఇంకా చదువు కొనసాగించింది. కొలంబోలో డిప్లమా కోర్సు చేసింది. అలాగే సౌత్ కొరియా స్పోర్ట్స్ మినిస్ట్రీ వారి స్కాలర్షిప్ పొంది సియోల్ నేషనల్ యూనివర్సిటీ నుంచి స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. ‘కొలంబోలో చదువుకునే సమయంలో సర్ రిచర్డ్ హ్యాడ్లీని ఇంటర్వ్యూ చేయడం గొప్ప అనుభవం. అక్కడ ఆయన పేద పిల్లలకు క్రికెట్ నేర్పేందుకు అకాడెమీ నిర్వహిస్తున్నారు. నేను వెళ్లిన రోజు బాల్ ఎలా విసరాలో నేర్పుతున్నారు. నేను ఇంటర్వ్యూ అడిగితే ఇచ్చారు’ అని చెప్పింది గీతిక.కోవిడ్ రిస్క్ ఉన్నా...ప్రపంచంలో ఎక్కడ భారీ క్రీడా వేడుకలు జరుగుతుంటే అక్కడ ప్రత్యక్షమవుతుంది గీతిక. ఆస్ట్రేలియా ఫీఫా విమెన్స్ వరల్డ్ కప్, ఖతార్‌లో జరిగిన ఫీఫా వరల్డ్ కప్ పోటీలను ఆమె కవర్ చేసింది. 2020 సియోల్ ఒలింపిక్స్‌కు కోవిడ్ కారణంగా చాలా మంది అక్రిడిటెడ్ ఫొటో జర్నలిస్టులు వెళ్లడానికి భయపడ్డారు. కాని అక్రిడిటేషన్ లేకున్నా గీతిక అక్కడకు వెళ్లి ప్రాణాలకు తెగించి ఫొటోలు తీసి గుర్తింపు పొందింది. తన వృత్తి పట్ల ఆమెకు ఉన్న ఈ అంకిత భావాన్నే ఒలింపిక్స్ కమిటీ గుర్తించింది. అందుకే ఈసారి అధికారికంగా ఆహ్వానం పలికింది. జూలై 23న ప్యారిస్ బయలుదేరి వెళ్లనుంది గీతిక. ‘గేమ్స్ వైడ్ ఓపెన్’ అనేది ఈసారి ఒలింపిక్స్ థీమ్. మరిన్ని వర్గాలను కలుపుకుని ఈ క్రీడలు జరగాలనేది ఆశయం. తక్కువ గుర్తింపుకు నోచుకునే మహిళా స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్లను ప్రత్యేకంగా ఆహ్వానించడం కూడా ఈ ఆశయంలో భాగమే. ‘నాకొచ్చిన అవకాశం నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. మరింత కష్టపడి పని చేస్తాను. స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్‌గా కెరీర్‌ను ఎంచుకోవాలనుకునేవారికి క్రమశిక్షణ అవసరం. అంతర్జాతీయ క్రీడాపోటీలు టైముకు మొదలయ్యి టైమ్‌కు ముగుస్తాయి. వాటిని అందుకోవాలంటే క్రీడల్లోని ఉత్తమ క్షణాలను కెమెరాలో బంధించాలంటే ఏకాగ్రత, క్రమశిక్షణ చాలా అవసరం. అవి ఉన్నవారు ఈ రంగంలో నిస్సందేహంగా రాణిస్తారు’ అంటోంది గీతిక.‘టీ సిటీ’ అమ్మాయిఅస్సాంలోని డూమ్డుమా పట్టణాన్ని అందరూ ‘టీ సిటీ’ అని పిలుస్తారు. ఎందుకంటే అక్కడ తేయాకు తోటలు విస్తారం. హిందూస్తాన్ లీవర్ టీ ఎస్టేట్ అక్కడే ఉంది. ఆ ఊళ్లో చిన్న ఉద్యోగి కుమార్తె అయిన గీతిక చిన్నప్పటి నుంచి కెమెరాతో ప్రేమలో పడింది. అందుకు కారణం ఆమె మేనమామ చంద్ర తాలూక్దార్ ఫిల్మ్‌మేకర్‌గా గుర్తింపు పొందడం. అతను కెమెరాలో నుంచి చూస్తూ రకరకాల దృశ్యాలను అందంగా బంధించడాన్ని బాల్యంలో గమనించిన గీతిక తాను కూడా అలాగే చేయాలనుకుంది. పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ చేశాక మాస్ కమ్యూనికేషన్లో డి΄÷్లమా చేసింది. క్రీడలంటే ఆసక్తి ఉండటంతో స్పోర్ట్స్ జర్నలిస్ట్‌గా, ఫొటోగ్రాఫర్‌గా మారి 2005 నుంచి డీఎన్ఏ, బీబీసీ, ఇండియా టుడే, పీటీఐ వంటి సంస్థలతో పనిచేసింది. -
ఆ బ్యూటిఫుల్ ఫొటోలు తీసింది ఈయనే.. చార్జ్ ఎంతో తెలుసా?
Anant-Radhika pre wedding: ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, వీరేన్ మర్చంట్, శైలా మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్ ఇటీవల యూరప్‌లోని విలాసవంతమైన క్రూయిజ్ షిప్లో రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరుపుకొన్నారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.ఈ గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సంబంధించిన అప్డేట్లను అంబానీ కుటుంబం నేరుగా తెలియజేయకపోయినప్పటికీ ఫోటోగ్రాఫర్ జోసెఫ్ రాధిక్ తీసిన అద్బుతమైన ఫొటోలు ఆ ఈవెంట్ ఎంత గ్రాండ్‌గా జరిగిందో తెలియజేస్తున్నాయి. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పంచుకున్న మధుర క్షణాలను ఈ ఫొటోలు మరింత అద్భుతంగా చూపిస్తున్నాయి.జోసెఫ్ రాధిక్ సెలబ్రిటీ వెడ్డింగ్స్ కవరేజ్ చేయడంలో దిట్ట. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల రెండో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు అంబానీ కుటుంబం ఏర్పాటు చేసుకున్న ఫొటో గ్రాఫర్ ఈయనే. ఇంత ఫేమస్ అయిన జోసెఫ్ రాధిక్ ఎప్పుడూ ఫోటోగ్రాఫర్ కావాలనుకోలేదు. ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ చదివి మూడేళ్లు కార్పొరేట్ ప్రపంచంలో పనిచేసిన జోసెఫ్ రాధిక్ తనకు ఆనందాన్నిచ్చే ఏకైక విషయం అద్భుతమైన ఫొటోలు తీయడమేనని త్వరలోనే గ్రహించాడు. అందుకే 2010లో అధిక వేతనం వచ్చే ఉద్యోగాన్ని వదిలేసి పూర్తి స్థాయి వెడ్డింగ్ ఫొటోగ్రఫీలో కెరీర్‌ను ఎంచుకున్నాడు.సోషల్ మీడియాలో వైరల్ అయ్యే పలు సెలబ్రిటీల వెడ్డింగ్ ఫోటోల వెనుక జోసెఫ్ రాధిక్ ఉన్నాడు. కత్రినా కైఫ్-విక్కీ కౌశల్, విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ, సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ, కేఎల్ రాహుల్-అతియా శెట్టి జంటలకు ఆయన వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్. ఇంతకీ జోసెఫ్ రాధిక్ ఎంత చార్జ్ చేస్తాడో చెప్పలేదు కదా.. ఆయన ఒక రోజుకు రూ .1,25,000 - రూ .1,50,000 తీసుకుంటాడు. దీనికి పన్నులు, ట్రావెల్, బస ఖర్చులు అధికం. -
ఫోటోగ్రాఫర్..!
చాలా ఏళ్ళ నా కల FRAMES ఫొటో స్టూడియో. ఆ రోజే ఓపెనింగ్. మా గురువుగారు విచ్చేసి స్టూడియోకి ఒక కాప్షన్‌ని కానుకగా ఇచ్చారు.‘There's more to life that meets the camera eye!’. ‘ఈ కాప్షన్కి అర్థమేంటి గురువు గారు?’ అడిగాను నేను.'You don't have to know everything. You'll know it when you see it' అన్నారాయన.ఆయన ఎందుకలా అన్నారో నాకు అప్పుడు అర్థం కాలేదు. ఎప్పటికైనా సరే, ఈ కాప్షన్ ఎందుకు పెట్టారో తెలుసుకోవాలనిపించింది. స్టూడియో ఓపెనింగ్ రోజున గంగిరెద్దుల్ని ఆడించే ఆయనొచ్చాడు. నాకు శుభసూచకంగా అనిపించింది. చిన్నప్పటి నుండి సంక్రాంతి వచ్చిందంటే చాలు వారితో వీధులు కళకళలాడిపోయేవి. అందుకే వారిని చూసినప్పుడల్లా శుభానికి చిహ్నాలుగా నా స్మృతిపథంలో మిగిలిపోయారు. ఆ గంగిరెద్దులాయన నా ముందు తన కోరికను వెలిబుచ్చాడు.‘బాబయ్యా, మా బసవణ్ణతో ఒక్క ఫొటో తీసిపెట్టవా? బసవడితో ఒక్క ఫోటో దిగాలన్న కోరిక అలాగే మిగిలిపోయుండాది.’నేను సమాధానం ఇచ్చేలోపే మా గురువుగారు అడ్డుపడ్డారు. ‘ఫ్రేమ్ అప్పర్స్ అని ఫ్రేమ్ డౌనర్స్ అని ఉంటారు. ఫొటోగ్రాఫర్ మొదటి ఫ్రేమ్ అందంగా ఉండాలి. రోజూ చూసే మొహాల్ని ఏం తీస్తాం చెప్పు’అంటూ నవ్వాడు ఆయనొక్కడే.ఆ గంగిరెద్దులాయనే కాదు నేను కూడా ఎంతగానో నొచ్చుకున్న సందర్భం అది. కానీ గురువుగా ఆయననే ఆహ్వానించాను కాబట్టి, ఆ రోజున ఆయన మాటకు ఎదురు చెప్పలేకపోయాను. బాధతో నిష్క్రమించిన ఆ గంగిరెద్దులాయన మాత్రం నా మస్తిష్కం అనే ఫొటోస్టూడియోలో ఫ్రేమ్‌గా మిగిలిపోయాడు.నేనొక ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌ని. పైగా నాస్తికుడిని కూడా. నాకు ఫొటోగ్రఫీ నేర్పించిన గురువుగారి ప్రభావం నాపై చాలా ఉండేది. ఆయన ఏం చేస్తే అది చేస్తూ ఉండేవాణ్ణి. ఆయన ఎథీస్ట్ అని తెలిసింది ఒక రోజున. ఆ ఇంగ్లిష్ పదానికి అర్థం తెలియకపోయినా నేనూ అదేనంటూ ప్రగల్భాలు పలికా నా మిత్రుడితో. అతను పరమ భక్తుడు. వెంటనే నవ్వేశాడు.‘ఎందుకు నవ్వుతున్నావ్?’ ‘ఆ పదానికి అర్థం కూడా తెలీకుండా నేనూ అదే అంటూవుంటే నవ్వొచ్చిందిరా!’‘అయినా దేవుడు ఎక్కడున్నాడురా? క్లాస్‌లో మన సర్ చెప్పింది వినలేదా? ఆయన లాజిక్ నూటికి నూరు శాతం కరెక్ట్. కనిపించని వాటిని నమ్మకపోవటమే నయం.’ ‘ఒకటి లేదు అంటున్నావంటేనే దాని ఉనికిని నువ్వు అంగీకరిస్తున్నట్టే లెక్క కదరా..‘‘అర్థం కాలేదు!’ ‘ఒకప్పుడు ఉండటం అంటూ జరిగితేనే కదా ఇప్పుడు లేకపోవటం అంటూ జరిగేది. ఒక వస్తువు ఇక్కడ పెట్టావు. అదిప్పుడు లేదు. ఒక అరగంట క్రితం ఇక్కడే ఉంది. ఇప్పుడు నీ ముందు లేదంతే. ఎక్కడో ఉంది. అది నీకు కనబడట్లేదు.’‘అర్థం అవుతున్నట్టే ఉంది. కానీ నువ్వు భక్తుడివి కాబట్టి నేను కన్విన్స్ అవ్వట్లేదురా..’ ‘ఉంది అన్నా, లేదు అన్నా దాని ఉనికిని అంగీకరిస్తున్నట్టే అవుతుంది కదరా! అసలు ఆ బ్రహ్మ పదార్థం ఉందో లేదో అనుభవం ఉన్నవాళ్లు చెప్పాలి. దైవత్వం అనుభవంలోకి వస్తే ఇంకా మాటలెందుకు మిగులుతాయి చెప్పు..? కాబట్టి వ్యర్థమైన వాదనలతో కాలాన్ని వృథా చేసుకోకు. ఆయన గురువే కావొచ్చు. ఆయన చెప్పిన దాంట్లో నీకు పనికొచ్చే విషయాల్ని మాత్రమే తీసుకో! అనవసరం అయిన వాటి జోలికి వెళ్ళకు. మిత్రుడిగా నీ మంచి కోరి చెబుతున్నా. ఇక నీ ఇష్టం!’వాడి మాటల్లో ఏం మాయ ఉందో తెలీదు కానీ, కేవలం ఫొటోగ్రఫీ పైనే దృష్టి పెడుతూ మిగతా విషయాల్ని పక్కన పెట్టేశాను. అప్పటి నుండి మంచి ఫొటోగ్రాఫర్ అవ్వటమే లక్ష్యంగా పనిచేశాను. అలాంటి నేను ఇప్పుడు చేతిలో పనిలేకుండా అయిపోయాను. రోజూ స్టూడియోకి వెళుతున్నాను. పని ఉండట్లేదు. దానికి కారణం స్మార్ట్‌ఫోన్ డిజిటల్ ఫొటోగ్రఫీ అని నా ప్రగాఢ నమ్మకం.ఇన్నేళ్లల్లో స్మార్ట్‌ఫోన్‌ని నేనెప్పుడూ వాడలేదు. ఎందుకో ఆ స్మార్ట్‌ఫోన్ భూతాన్ని చూస్తేనే చిరాకు. నాలాంటి ఎంతోమంది ఫొటోగ్రాఫర్లకు పనిలేకుండా చేస్తోంది. ఒకప్పుడు పాస్‌పోర్ట్ సైజు ఫొటో కోసం ఎగబడేవాళ్లు. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌తోనే తీసి అప్లోడ్ చేసి పంపించేస్తున్నారు చాలామంది. ఒకప్పుడు ఫ్రెండ్స్ కలిసి గుర్తుగా ఫొటోలు దిగేవాళ్ళు మా స్టూడియోలో. మా స్టూడియోకొచ్చిన వాళ్లతో ఎటువంటి సంబంధం లేని ఒక ఫొటోగ్రాఫర్ తన నిర్మలమైన దృష్టితో ఒక ఫొటో తీస్తాడు. అంటే ఆ కాలాన్ని తన కంటితో బంధిస్తున్నాడు. ఆ క్షణానికి సొంతమైన ఒక నిజాన్ని ఫ్రేమ్ చేస్తున్నాడు. ఇది ఒక ఘనతే అనుకోవచ్చు. అలాంటి కళను మా నుండి దూరం చేసిన భావన కలిగింది ఈ స్మార్ట్‌ఫోన్ డిజిటల్ ఫొటోగ్రఫీ ఎక్కువైపోయాక! అందుకే నా జీవితంలో ఈ స్మార్ట్‌ఫోన్ భూతాన్ని దరిజేరనివ్వను అని శపథం చేశాను. అలాంటి నేను ఆ స్మార్ట్‌ఫోన్ చేతిలోనే అంత ఘోరంగా ఓడిపోతానని కలలో కూడా ఊహించలేదు.నాకు పొద్దున్నే న్యూస్ పేపర్ చదవటం అలవాటు. న్యూస్‌లో కూడా క్రైమ్ సెక్షన్ అంటే ప్రత్యేకమైన ఇంట్రెస్ట్. ఒకరోజు పొద్దున్నే ఒక క్రైమ్ న్యూస్ కవరేజ్ నన్ను అమితంగా ఆకర్షించింది. పుణేలోని ఒక డెలివరీ బాయ్ దాదాపు 15 లక్షలు విలువ చేసే 18 స్మార్ట్‌ఫోన్స్ చోరీ చేశాడు అన్నది ఆ వార్త. ఇదంతా ఒక రెండు నెలల వ్యవధిలో జరిగిందట.కస్టమర్స్ స్మార్ట్‌ఫోన్ ఆర్డర్ చేశాక రీప్లేస్మెంట్ పెట్టుకునే ఆప్షన్ ఒకటుంది. వాళ్లకి హ్యాండ్ సెట్ నచ్చని పక్షంలో! ఈ సదుపాయాన్ని ఆ డెలివరీ బాయ్ దుర్వినియోగం చేశాడు. ఆ డెలివరీ బాయ్ స్మార్ట్‌ఫోన్‌ని తనే దోచేసి, కస్టమర్ రీప్లేస్మెంట్ పెట్టినట్టుగా సృష్టించాడట! అలా హ్యాండ్ సెట్ రీప్లేస్మెంట్ ఉన్న కస్టమర్ల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూపోయే సరికి ఈ అబ్బాయి మీద అనుమానం పెరిగి చివరికి అరెస్ట్ చేశారు.క్రైమ్ న్యూస్ ఇప్పటికి చాలాసార్లు చదివాను. కానీ ఎప్పుడూ కలగని ఓ ఆలోచన ఈసారి మాత్రమే కలిగింది. నాకు కూడా స్మార్ట్‌ఫోన్ చోరీ చేద్దాం అనిపించింది. నేను ఇంతవరకు స్మార్ట్‌ఫోన్ వాడలేదు. ఇంట్లో వాళ్ళని కూడా అడగలేదు. ఇన్నేళ్లల్లో స్మార్ట్‌ఫోన్‌కు, నాకూ మధ్యనున్న ఒక తెలియని దూరం శతృత్వంగా స్థిరపడిపోయింది నా మదిలో. నాకు పనిలేకుండా చేసిన ఆ స్మార్ట్‌ఫోన్‌ని ఇంకొకరికి దూరం చేసి దానిపై నాకుండిపోయిన పగ సాధిద్దాం అనిపించింది.నాకు తెలిసిన ఒక డెలివరీ బాయ్ ఒకరోజు తను డెలివరీ చెయ్యాల్సిన ఐటమ్స్‌లో ఆ ఖరీదైన ఒక స్మార్ట్‌ఫోన్‌ని తీసుకుని అదేదో నా కోసమే అన్నట్టుగా మా స్టూడియోకొచ్చాడు. ‘అన్నా, ఇవ్వాళ వర్క్ లోడ్ ఎక్కువైపోయింది. అన్ని ఆర్డర్లు డోర్ డెలివరీ చేయగలిగాను కానీ చివరిగా ఒక్క స్మార్ట్‌ఫోన్ మిగిలిపోయింది. ఇది మీరు ఇంటికెళ్ళే దారిలోనే ఉన్న అడ్రస్. చాలా సందులు, గొందులు తిరగాలి. దయచేసి ఈ ఒక్కసారికి ఇచ్చేస్తావా?’ అని అడిగాడు. ‘సరే.. అడ్రస్ ఎక్కడన్నావ్?’‘అదే అన్నా.. మీ ఇంటి దగ్గర నేతి గారెల షాప్ బాగా ఫేమస్ కదా! ఆ సందులోనే చివరి ఇల్లు. శివుడి ఇల్లు అని అడిగితే ఎవరైనా చెబుతారంట మరి!’‘శివుడి ఇల్లా? అది కైలాసం కదా..’ అన్నాను.‘ఇంటి దొంగను ఈశ్వరుడు అయినా పట్టలేడు అంటారు. వీళ్ళ ఇంటికి ఆ ఇబ్బందేం లేదనుకుంటా’ అంటూ నవ్వాడు వాడు.స్మార్ట్‌ఫోన్ కొట్టేద్దామనే నా ఆలోచన పసిగట్టినట్టే సామెత చెప్పాడేంటీ అని ముచ్చెమటలు పట్టాయి నాకు. దేవుడనే వాడుండి.. జరగబోయేదాన్ని ఇలా ముందుగానే పలికిస్తాడా ఏంటీ.. అనిపించింది. ‘శివుడు ఆయన పేరా?’ మళ్ళీ అడిగాను.‘అదే తెలియట్లేదన్నా.. శివుడి ఇల్లు అని అడిగితే ఎవరైనా చెబుతారని ఇందాక కస్టమరే చెప్పాడు ఫోన్లో అక్కడికెళ్ళాక డౌట్ వస్తే నాకు కాల్ చెయ్’ అన్నాడు.నేను ధైర్యం చేశాను. స్టూడియో కట్టేసి ఆ స్మార్ట్‌ఫోన్ తీసుకుని రోజూ నేను వెళ్లే దారిలోనే వెళుతున్నాను. కానీ, అవ్వాళ నా మనసు మనసులో లేదు. ధ్యాస అంతా దొంగతనంపైనే ఉంది. నేను వెళ్లే దారిలో శివుడి గుడి ఒకటుంటుంది. ప్రతిరోజూ, అక్కడి నుండి ఏదో ఒకటి వినిపిస్తూనే ఉంటుంది. ఆరోజు మొట్టమొదటిసారి చెవులు రిక్కించి వింటున్నానో.. మరేంటో తెలియదు కానీ గుడిలో జరుగుతున్న ప్రవచనంలో నుండి కొన్ని మాటలిలా వినబడ్డాయి.. ‘ఎదుటివాడికి మోసం చెయ్యాలనే బుద్ధి పుట్టినప్పుడే మనం మోసం చేసేసినట్టు.ఏ కర్మ చెయ్యాలన్నా అది మనసులో నుండి పుట్టాలి. అలాంటి కర్మ చెయ్యాలి అనే ప్రేరణను బుద్ధి మనకిస్తుంది. అది మంచి అయినా.. చెడు అయినా! ఆ బుద్ధికి ప్రేరణను దేవుడే కలిగిస్తున్నాడనుకుంటాడు మనిషి. అందుకే, చెడు కూడా ఆయనే చేయిస్తున్నాడన్న భ్రమలో బతుకుతాడు. నిజానికి నువ్వు చేసే మంచికి ఆయన కారణం కాదు. నువ్వు చేస్తున్న చెడుకి ఆయన కారణం కాదు. ఎవరి కర్మానుసారం వారు ప్రవర్తిస్తూంటారు. భగవంతుడు మనలో ఉండే ఆత్మ చైతన్య శక్తి మాత్రమే!’ఆగి ఒక్క నిమిషం అటు వైపుగా చూశాను. నాలో ఉదయించబోయే కాంతికి ఆయన వాక్యాలు సంకేతాలుగా కనబడ్డాయి. అనుకోకుండా ఆ ప్రవచనకర్త వైపు చూశాను. లిప్త కాలమైనా సరే ఏదో తెలియని అలౌకిక స్థితి నెలకొన్నది నాలో. ఆ భావాన్ని ఏమంటారో చెప్పలేని మనఃస్థితి నాది. ఇన్ని విషయాలు నా గుండెకేం తెలుస్తాయి.. కన్నీటి రూపంలో వెల్లడయ్యాయి.జ్ఞానం వచ్చే లోపే అహం అడ్డొస్తుంది. అహం దహనం అయితే తప్ప అజ్ఞానం తొలగదు. అజ్ఞానం పూర్తిగా తొలిగితే తప్ప జ్ఞానం రాదు. అప్పుడు నాకదే జరిగింది. కన్నీళ్లు తుడుచుకుని సరాసరి ఆ నేతి గారెల షాప్ వరకు వెళ్లాను.. ఏ ఆలోచనను రానివ్వకుండా! అక్కడ ఒకతను కనిపించాడు. ‘శివుడి గారిల్లు తెలుసా అండి?’ అడిగానో లేదో ‘నేను ఆయనింటికే వెళుతున్నానండీ.. ఇంతకీ మీరెవరు?’ తిరిగి ప్రశ్నించాడు. ‘ఆయనకో పార్సెల్ ఇవ్వటానికి వచ్చానండీ..’ అని చెప్పేసి ఆ వస్తువును అక్కడే పెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోయాను భయం భయంగా. ఆయన నన్ను పిలుస్తున్నా సరే వెనక్కి తిరిగి చూడలేదు. కొంత దూరం నడిచాక మళ్ళీ వెనక్కి తిరిగొచ్చాను. నేతి గారెల షాప్‌లో చుట్టూ చూశాను. ఆయన కనబడలేదు. ఈసారి షాప్ ఓనర్ని శివుడి ఇల్లు చిరునామా అడిగాను. చెప్పాడు.ఆయన చెప్పిన వీధిలో వెళుతూంటే శివుడి ఇల్లు కనబడింది దూరం నుంచి. ఎవరో ఒకాయన ఒక వస్తువును ఆ ఇంటి ప్రహరీగోడపై ఉంచి మాట్లాడుతూన్నాడు. శివుడితోటే కాబోలు. ఆ వస్తువును గోడపై ఉంచిన విషయం మరిచిపోయి ఆయన, శివుడు ఇరువురూ ఇంట్లోకి కదిలారు. వెంటనే నేను నా ముఖం కనిపించకుండా చొక్కాని పైకి లాక్కుని.. మెల్లగా ఆ వస్తువును తీసుకుని అక్కడి నుండి పరిగెత్తాను. వెనక్కి తిరిగి చూడకుండా అలా చీకట్లో ఎంత సేపు పరిగెత్తానో తెలీదు. ఇంటికి చేరిపోయాను.శివుడి దగ్గరుండాల్సిన ఆ వస్తువు ఇప్పుడు నా దగ్గరుంది. తెరిచి చూశాను. స్మార్ట్‌ఫోన్.. నిజంగానే నా కంటికి భూతంలా కనిపించింది. చార్జింగ్ పెట్టి వాడదామనుకున్నాను. ఇప్పుడు దాన్ని చూస్తూంటే పరమశివుడి చేతిలో ఉండే డమరుకం గుర్తుకొస్తోంది. శివుడు అనే ఆ కస్టమర్ ఎలా ఉంటాడో తెలీదు. ఆయన దగ్గరుండాల్సిన వస్తువును నేను తస్కరించాను అనే భావనే నాకు నిద్రపట్టనివ్వట్లేదు. వెనక్కి తిరిగొచ్చి దొంగతనం చేసింది కేవలం స్మార్ట్‌ఫోన్ పై నాకున్న పగ, ద్వేషం వల్లనే. దొంగలించిన తర్వాత మాత్రం స్మార్ట్‌ఫోన్ మీదున్న నా పగ ఏమైందో నాకు అర్థం కాలేదు. దొంగతనం చేశానన్న భావన నన్ను కుంగదీయసాగింది.దేవుడిపై నమ్మకం లేకపోయినా ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అనుకున్నాను. అతికష్టం మీద నిద్రపట్టింది. నిద్రలో కల.. గంగిరెద్దులాయన నా ఫొటోస్టూడియోకొచ్చాడు. ‘బాబయ్యా, నా ఫొటో వచ్చినాది’ అన్నాడు.‘అవునా? ఎక్కడ? చూపించు..?’ అడిగాను. ‘ఇదిగో..’ అంటూ తన స్మార్ట్‌ఫోన్‌లో తను దిగిన సెల్ఫీని చూపిస్తూ ఆనందబాష్పాలతో నన్ను చూశాడు. ‘నేను, నా బసవడు’ అంటూ నా ముందే మరొక సెల్ఫీ దిగాడు. కెమెరా షట్టర్ సౌండ్ వచ్చింది. ‘రోజూ కనిపించే మేము ఎంత అందంగా వచ్చామో చూడయ్యా’ అన్నాడు నాతో.ఆ మాట ఎక్కడో గుచ్చుకుంది నాకు. సమాధానం బలంగా తెలుస్తున్నట్టు అనిపించినా ‘నీ పేరేంటి?’ అడిగాను.‘శివుడు’ నిండుగా నవ్వాడు. ‘ఇదే నా సిత్రం’ అంటూ ఆ సెల్ఫీని చూపించాడు. ‘వెళ్ళొస్తాను’ అంటూ నవ్వుతూ తన బసవడితో వెళ్తూ ఒకసారి వెనక్కి తిరిగి.. మా ఫొటోస్టూడియో బోర్డు చూసి ఆగిపోయాడు. నా దగ్గరికొచ్చి నాకు మాత్రమే వినబడేలా.. ‘There's more to life that meets the camera eye!’ అన్నాడు.మా గురువుగారు ఇచ్చిన ఆ కాప్షన్కి అర్థం ఇన్నాళ్లకి.. అది కలలో తెలిసింది. దిగ్గున లేచాను. మధ్యరాత్రని కూడా చూడకుండా నేతి గారెల షాప్ మీదుగా శివుడి ఇల్లున్న వీధికి చేరుకున్నాను. చీకటిగా ఉండటంతో శివుడి ఇల్లు అంత త్వరగా కనబడలేదు. నంబర్ 10 అన్న సంఖ్య గుర్తుండటంతో పదో నెంబర్ ఇల్లు కనబడే దాకా వెళ్లాను. అలా ఇంటి గేట్ దగ్గరికి వెళ్ళానో లేదో ఇంటి వరండా ముందరి జీరో బల్బ్ వెలిగింది. తలుపు తీస్తూ మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఒక వ్యక్తి గేట్ వైపుగా వస్తున్నాడు. నేను భయపడుతూన్నాను. నా ముఖం కనిపించకుండా గుడ్డ అడ్డుపెట్టుకుని ఉన్నాను. ఆ వ్యక్తి సరిగ్గా గేట్ దగ్గరికి చేరగానే స్ట్రీట్ లైట్ వెలిగింది. గేట్‌కి అటువైపునున్న ఆయన.. చేయి చాచాడు. నా చేతిలోని స్మార్ట్ ఫోన్‌ని ఆయనకు అందించాను.‘ఎప్పటి నుండో పాడైన మా వీధి దీపం ఇప్పుడే వెలిగింది. పోయిన వస్తువు తిరిగి చేరాల్సిన చోటికే చేరింది. చీకటి పడింది. ఇక వెళ్ళిపో బాబయ్యా..’ అన్నాడు. ఆ గంగిరెద్దులాయనే ఈ శివుడన్న విషయం నిర్ధారణయ్యి వెనుదిరుగుతున్న నాకు అప్పుడే జ్ఞానోదయం అయ్యింది. – ఈశ్వరచంద్రఇవి చదవండి: ఇది.. 'మట్టిదిబ్బ' అనుకుంటున్నారా!? -
చిత్తంతో చిత్రప్రయాణం
ఉరుకులు పరుగుల జీవితంలో ఉద్యోగికి ఆఫీస్‌కు అవతలి ప్రపంచంపై దృష్టి మళ్లదు. పనే ప్రపంచం అవుతుంది. దీప్తి ఆస్థాన మాత్రం ఆఫీస్ క్యూబికల్‌కు ఆవలి ప్రపంచాన్ని చూడాలనుకుంది. కెమెరా తన నేస్తం అయింది. దేశమంతా తిరుగుతూ స్త్రీల జీవితంలోని ఎన్నో కోణాలను కెమెరా కంటితో ఆవిష్కరిస్తోంది... సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగం నుంచి సెల్ఫ్ లెర్నింగ్ ఫోటోగ్రాఫర్‌గా ప్రయాణం దీప్తి అస్థాన జీవన దృక్పథాన్ని పూర్తిగా మార్చివేసింది. ఆఫీసు క్యూబికల్ అవతల తనకు తెలియని ప్రపంచం గురించి తెలుసుకోవాలనుకుంది. ఎక్కడికి ప్రయాణం చేసినా కెమెరా తనతోపాటు వచ్చేది. సంభాషించేది. కెమెరా ద్వారా ప్రయాణాలలో లోతైన అర్థాన్ని, సామాజిక ప్రయోజ నాన్ని కనుగొంది దీప్తి. మనసులోని భావాలను వ్యక్తీకరించడానికి, తాను కలుసుకున్న వ్యక్తుల జీవిత కథలను ప్రపంచంతో పంచుకోవడానికి ఫొటోగ్రఫీ దీప్తికి బలమైన మాధ్యమంలా ఉపయోగపడింది. సాధారణంగా దూర ప్రయాణాలు అనగానే ప్రముఖ, ప్రసిద్ధ స్థలాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ దీప్తి మాత్రం అనామక, అంతగా ఎవరూ పట్టించుకోనిప్రాంతాలకు వెళ్లేది. ఆప్రాంతాల గురించి ఎవరూ పనిగట్టుకొని ఫొటోలు తీసి ఉండరు. నాలుగు ముక్కలు రాసి ఉండరు. ఆ పని దీప్తి చేసింది. ఆ తరువాత...‘ఉమెన్ ఇండియా’ప్రాజెక్ట్‌తో తన ప్రయాణాన్ని మరింత విస్తృతం చేసుకుంది. ఇది ఒకటి రెండు నెలల పరిమిత కాల ప్రయాణం కాదు. సంవత్సరాలుగా సాగిన ప్రయాణం. పట్టణాల్లోని మార్పుల సంగతి ఎలా ఉన్నా, పల్లెప్రజలు మాత్రం గతంలోనే ఉన్నారని గ్రహించింది దీప్తి. బాల్య వివాహాల నుంచి ఆడపిల్లలు చదువుకు దూరం కావడం వరకు కెమెరా కంటితో ఎన్నో సమస్యలను లోకం దృష్టికి తీసుకువచ్చి మహిళలు తమ గళం విప్పడానికి ఒక వేదికను నిర్మించింది. సోషల్ మీడియా దృష్టిలో పడని మహిళల సమస్యలను అదే మీడియా ద్వారా నలుగురి దృష్టికి తీసుకు వచ్చింది. సమస్యల గురించి మాత్రమే కాకుండా వివిధప్రాంతాలలోని సాంస్కృతిక వైభవాన్ని కళ్లకు కట్టింది. ‘నా ప్రాజెక్ట్‌లో అన్ని కథలు మనుగడ కోసం చేసే పోరాటానికి సంబంధించినవి మాత్రమే కాదు. జీవితాన్ని, సంస్కృతిని సెలబ్రెట్ చేసుకునేవి కూడా’ అంటుంది దీప్తి. స్ఫూర్తిదాయకమైన కథలు మార్పు తీసుకురాగలవా?’ అని అడిగితే ‘అందుకు నేనే ఉదాహరణ. ఆ మార్పు ముందు నాలోనే వచ్చింది’ అంటుంది దీప్తి. తాను షూట్ చేయడానికి ఎంచుకునే ప్రదేశాలతో ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. గుజరాత్‌లోని మిధాపూర్లో పన్నెండేళ్ల భారతితో మాట్లాడింది దీప్తి. ఆ అమ్మాయి ఎప్పుడూ బడి ముఖం చూడలేదు. కొంతకాలం ఇంటిపట్టునే ఉన్న భారతి ఇప్పుడు తల్లిదండ్రులతో పాటు కూలిపనికి వెళుతుంది. ఈ చిన్నారి పెద్ద పెద్ద తట్టలను మోస్తున్న దృశ్యం చూసి దీప్తికి కళ్లలో నీళ్లు తిరిగాయి. ‘భారతి అందమైన, చురుకైన అమ్మాయి. ఆమె భవిష్యత్ కూలిపనులకు పరిమితం కావాల్పిందేనా? అనే బాధ కలిగింది. కెమెరా గురించి భారతి ఆసక్తిగా తెలుసుకుంది. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉత్సాహం ఉన్న ఇలాంటి పిల్లలకు కొత్త దారి చూపితే పురోగమించగలరు’ అంటుంది దీప్తి. భారతి లాంటి ఎంతోమంది పిల్లల కథలను లోకం దృష్టికి తీసుకువచ్చింది. పట్టణ ప్రాం తాలలో పెరిగిన దీప్తి దేశ విదేశాల్లో ఎన్నో మెట్రోపాలిటన్ నగరాలలో పనిచేసింది. ‘సమాజ నిర్మాణంలో మహిళలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నప్పటికీ వారికి సమాన అవకాశాలు లేవు’ అనే ఎరుక ఆమెను ఎప్పటికప్పుడు కొత్తప్రాంతాలకు తీసుకు వెళుతుంది. కొత్త జీవితాలను ఆవిష్కరించేలా చేస్తున్న దీప్తి ప్రస్తుతం గోవాలో ఉంటోంది. లక్ష్యంతో కూడిన ప్రయాణం భావాలను వ్యక్తీకరించడానికి పుస్తకం రాయడం, ఉపన్యాసం చేయడం లాగే ఫొటోగ్రఫీ కూడా ఒక సాధనం. నేను తీసిన చిత్రాలు నా భావాలకు అద్దం పట్టేలా ఉంటాయి. ఒక మహిళగా ఇతర మహిళలు, పిల్లలతో మాట్లాడడం నాకు సులువు అయింది. సోలోగా ట్రావెల్ చేయడంలో లైఫ్‌స్కిల్స్ క్రమక్రమంగా నేర్చుకునే అవకాశం దొరుకుతుంది. ప్రయాణానికి ఒక లక్ష్యం తోడైతే అది అద్భుతంగా ఉంటుంది. – దీప్తి అస్థాన వారి జీవితంలో భాగం అవుతాను కెమెరా ఉన్నా సరే, ఎదుటి వ్యక్తి జీవితపు లోతు అప్పటికప్పుడు ఆవిష్కారం కాదు. వారితో సరిగ్గా కనెక్ట్ కాగలగాలి. మనం వారిని అర్థం చేసుకున్నట్లే వారూ మనల్ని అర్థం చేసుకోవాలి. తమ గురించి తెలుసుకోవడంలో, కెమెరా ఉపయోగించడంలో ఎలాంటి వాణిజ్య ప్రయోజనం లేదనే భావన వారికి కలగాలి. ఇదేమంత సులభం కాదు. అలా అని జటిలం కాదు. మన ఓపిక, ఆసక్తిపై ఆధారపడి ఉంటుంది. ఫోటోలు తీసుకున్నప్పుడు వారి జీవితంలో భాగం అవుతాను. వారు నాలో భాగం అవుతారు. కలిసి భోజనం చేస్తాం. సరదా కబుర్లు చెప్పుకొని నవ్వుకుంటాం. ఇప్పటివరకు ఈ దేశంలో ఏ మూలకు వెళ్లినా తమలో భాగంగా చూసుకున్నారు. ఆత్మీయత పంచారు. ఇది నా అదృష్టం. – దీప్తి అస్థాన -
మీ స్వార్థానికి జర్నలిస్టులను బలి చేస్తారా?
అనంతపురం ఎడ్యుకేషన్: చంద్రబాబు, లోకేశ్, ఈనాడు రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ–5 సాంబ స్వార్థాలకు జర్నలిస్టులను బలి చేస్తున్నారని రాప్తాడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోందని, విలేకరులపై దాడులకు తెగబడుతోందంటూ ఈనాడులో వచ్చిన కథనాన్ని ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ఖండించారు. అనంతపురంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనాడు, ఏబీఎన్, టీవీ–5 మీడియాను వైఎస్సార్సీపీ బ్యాన్‌చేసి ప్రెస్మీట్లు, మీటింగ్‌లకు రావద్దని స్పష్టంచేసినప్పటికీ ఏకంగా 10 లక్షల మంది వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు వచ్చిన రాప్తాడు ‘సిద్ధం’ సభకు ఏబీఎన్ లోగో పట్టుకుని శ్రీకృష్ణ అనే ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ ఎందుకొచ్చారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఆయనను ఎవరు పంపించారు? దాడి జరుగుతుంటే మరో ఏబీఎన్ ఉద్యోగి అక్కడి నుంచి జారుకోవడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. అలాగే, ఓవైపు దాడి జరుగుతుంటే రక్షించే ప్రయత్నం చేయకుండా వీడియోలు తీయడం వెనుక ఉద్దేశమేమిటో కూడా పోలీసులు వెలికితీయాలన్నారు. నిజానికి.. ప్రభుత్వంపై ఎంత దుర్మార్గంగా, వాస్తవాలను వక్రీకరించి కథనాలు రాస్తున్నా రాష్ట్రంలో ఎక్కడా దాడులు జరగలేదని.. ఈ సభకు ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ లోగో పట్టుకుని వెళ్లడం చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. దాడులకు వారే బాధ్యత వహించాలి.. ఇక రాప్తాడులో ఏబీఎన్ ఫొటోగ్రాఫర్‌పై, కర్నూలు ఈనాడు కార్యాలయంపై దాడి జరిగినా అందుకు పూర్తిబాధ్యత వహించాల్సింది చంద్రబాబు, లోకేశ్, ఏబీఎన్ రాధాకృష్ణ, ఈనాడు రామోజీరావు, టీవీ–5 సాంబ మాత్రమేనని తోపుదుర్తి స్పష్టంచేశారు. గతంలో పవన్‌కళ్యాణ్, మోదీని కూడా చాలా దుర్మార్గంగా మాట్లాడారని ప్రకాష్‌రెడ్డి గుర్తుచేశారు. వైఎస్సార్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ప్రజాస్వామ్యవాదులని, చాలా సహనం, ఓర్పు కల్గిన వాళ్లని ఆయనన్నారు. తప్పుడు కథనాలు రాస్తూ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని భావిస్తే అది వారి అమాయకత్వమే అవుతుందన్నారు. -
Women At Leisure: తీరిక వేళలో.. తీయటి జ్ఞాపకాలలో...
‘ఒక వ్యక్తిని బాగా అర్థం చేసుకోవడానికి తీరిక సమయాన్ని మించిన విలువైన సమయం లేదు’ అంటుంది సురభి యాదవ్. పని ఒత్తిడి లేని తీరిక సమయం మహిళలకు ఎలాంటిది? పాట నుంచి ఆట వరకు ప్రతి విన్యాసం, ప్రతి క్షణం అపురూపం. అలాంటి అపురూప కాలాన్ని ‘బసంతి: ఉమెన్ ఎట్ లీజర్ టైమ్’ అందంగా అద్దం పడుతుంది.... మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ ప్రాంతంలోని ఒక గ్రామంలో పుట్టి పెరిగిన సురభి యాదవ్ ఐఐటీ–దిల్లీలో బయో కెమికల్ ఇంజనీరింగ్ చేసింది. పెద్ద చదువు చదువుకున్న తొలి మహిళగా తనకు గ్రామంలో ప్రత్యేక గుర్తింపు ఉండేది. ఊరు దాటి ఐఐటీ–క్యాంపస్‌లోకి అడుగుపెట్టిన సురభికి పెద్ద ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లుగా అనిపించింది. ఎంతోమంది వ్యక్తులు, వందలాది పుస్తకాలు, కళలు... తన ఆలోచనలను విశాలం చేశాయి.. ‘థింకింగ్... రీడింగ్... రైటింగ్’ అనేది తన ప్రధాన వ్యాపకంగా మారింది. పై చదువుల కోసం కాలిఫోర్నియాకు వెళ్లిన సురభి అక్కడినుంచి తిరిగి వచ్చిన తరువాత ఒక ఎన్జీవోలో కొంతకాలం పనిచేసింది. ఆ తరువాత ‘సఝే సప్నే’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. ‘సామాజిక సేవ అనేది ప్రయోజనాన్ని ఆశించి చేసేది కాదు. అది మన జీవనవిధానంలో భాగం’ అని తండ్రి చెప్పిన మాటలు సురభి సామాజిక సేవారంగంలోకి రావడానికి కారణం అయ్యాయి. స్వచ్ఛందసేవా కార్యక్రమాల్లో తలమునకలయ్యే సురభి యాదవ్‌లో మంచి ఫోటోగ్రాఫర్ ఉంది. ఆమె తాజా ప్రాజెక్ట్ ‘బసంతి: ఉమెన్ ఎట్ లీజర్ టైమ్’ తన తల్లి జ్ఞాపకాల స్ఫూర్తితో చేసింది. కొన్ని సంవత్సరాల క్రితం తల్లి చనిపోయింది. తల్లి గురించి బంధువులు, పరిచయస్తులతో మాట్లాడుతున్న క్రమంలో తల్లికి సంబంధించి తనకు తెలియని కొత్త విషయాలు ఎన్నో తెలిసి ఆశ్చర్యానికి గురి చేశాయి. ఎప్పుడూ గంభీరంగా కనిపించే తల్లిలో ఒక సరదా మనిషి ఉన్నట్లు తెలియదు. ఆమెకు ఈత వచ్చు అనే విషయం తెలియదు. ‘ఇలాంటి తల్లులు ఇంకా ఎంతమంది ఉన్నారో?’ అని ఆలోచిస్తున్నప్పుడు ‘ఉమెన్ ఎట్ లీజర్ టైమ్’ ప్రాజెక్ట్ ఆలోచన వచ్చింది. తీరికవేళలలో సురభి తల్లి తన పేరు ‘బసంతి’ని పేపర్ మీద రాస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉండేది. ఆమె చదువుకోలేదు. పిల్లల ప్రోగ్రెస్ కార్డులపై సంతకం పెడుతున్నప్పుడు ఆమె కళ్లలో గొప్ప వెలుగు కనిపించేది. ‘ఒక వ్యక్తిని బాగా అర్థం చేసుకోవాలంటే ఆ వ్యక్తిని తీరిక సమయంలో పరిశీలించాలి. అయితే పని ఒత్తిడి వల్ల ఆ తీరిక సమయాన్ని పట్టుకోవడం కష్టం. ఒకవేళ పట్టుకుంటే అరుదైన సందర్భాలను రికార్డ్ చేయవచ్చు. బసంతి: ఉమెన్ ఎట్ లీజర్ టైమ్ అలాంటి ప్రయత్నమే’ అంటుంది సురభి. ‘ఉమెన్ ఎట్ లీజర్’లో ఉన్న వెయ్యికిపైగా చిత్రాలు దేశంలోని వివిధ ప్రాంతాలలో తీసినవి. -
మిస్సింగ్ కాదు మోసం.. ఆదినారాయణ అదృశ్యం కేసులో బిగ్ ట్విస్ట్
సాక్షి, కోడూరు(అవనిగడ్డ): కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు సూసైడ్ నోట్ ద్వారా నమ్మించే ప్రయత్నం చేసిన ఆదినారాయణ మిస్సింగ్ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. పెడన మండలంలోని కాకర్లపూడి శివారు ముత్రాస్పాలెం గ్రామానికి చెందిన యరగాని ఆదినారాయణ ఈ నెల 25వ తేదీన ఇంటి వద్ద నుంచి తన ద్విచక్రవాహనంపై ఉల్లిపాలెం–భవానీపురం వారధి వద్దకు చేరాడు. రాత్రి 7గంటల సమయంలో ఆదినారాయణ తన బైక్‌ను వారధిపై ఉంచి, అందులో తాను చనిపోతున్నట్లుగా సూసైడ్ నోట్ రాసి బైక్ ట్యాంక్ కవర్లో పెట్టాడు. ఇదే సూసైడ్ నోట్‌ను తన భార్య నవ్యశ్రీ ఫోన్‌కు కూడా పంపాడు. అప్పుల బాధలు ఎక్కువ కావడంతోనే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని, తన కోసం ఎవరూ గాలించవద్దని, గాలించినా కూడా తన మృతదేహం దొరకదంటూ ఆదినారాయణ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. కోడూరు వంతెన సెంటర్లో నడుచుకుంటూ వెళ్తున్న ఆదినారాయణ రెండు రోజుల పాటు ముమ్మర గాలింపు.. ఆదినారాయణ బైక్‌తో పాటు సూసైడ్ నోట్ కూడా వారధిపై ఉండడంతో పోలీసులు ఆదినారాయణ వారధిపై నుంచి కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు భావించారు. ఇందులో భాగంగా రెండు రోజుల పాటు కోడూరు, పెడన పోలీసులు, ఎన్ఢీఆర్ఎప్ బృందాలు, స్థానిక మత్స్యకారుల సహాయంతో కృష్ణానదిని జల్లెడ పట్టారు. బందరు, కోడూరు మండలాల్లో ప్రవహించే నది ప్రాంతమంతా వెతికినా కూడా ఆదినారాయణ ఆచూకీ లభించలేదు. సహజంగా ఓ వ్యక్తి నదిలో దూకితే 36గంటల లోపు నీటిలో పైకి తేలతాడని, అయితే ఆదినారాయణ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు మరో కోణంలో తమ దర్యాప్తును ప్రారంభించారు. సీసీ టీవీ ఫుటేజీల్లో ఆచూకీ.. ఆదినారాయణ నదిలో దూకలేదని పోలీసులకు అనుమానం రావడంతో పెడన దగ్గర నుంచి కోడూరు వరకు ఉన్న అన్ని సీసీ టీవీ ఫుటేజీలను పోలీసులు నిశితంగా పరిశీలించారు. ఇంటి వద్ద నుంచి బయలుదేరినప్పుడు ఆదినారాయణ వద్ద బ్యాగ్ లేదని, బందరులోని ఓ దుకాణంలో బ్యాగ్‌ను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అక్కడ నుంచి బైక్‌పై చిన్నాపురం మీదగా ఉల్లిపాలెం వస్తున్నట్లు సీసీ టీవీల్లో రికార్డు అయింది. ఉల్లిపాలెం వారధి వద్ద ఆదినారాయణ తాను ఇంటి వద్ద వేసుకున్న దుస్తులను మార్చుకొని, ముఖానికి మాస్క్ ధరించి ఆటోలో కోడూరు వెళ్లడాన్ని గుర్తించారు. కోడూరు వంతెన సెంటర్లోని గంగాభవానీ అమ్మవారి దేవాలయం వద్ద ఆదినారాయణ ఆటో దిగడంతో పాటు చేతిలో బ్యాగు పట్టుకొని, మరో బ్యాగు తగిలించుకొని నవ్వుతూ సెల్‌ఫోన్‌ల్లో మాట్లాడుకుంటూ అక్కడ తిరగడం సీసీ టీవీల్లో రికార్డు అయ్యింది. కోడూరు నుంచి అవనిగడ్డకు బైక్‌ను లిఫ్ట్ అడిగి వెళ్లడాన్ని పోలీసులు గుర్తించారు. తప్పుదోవ పట్టించేందుకు.. విషయాన్ని తప్పుదోవ పట్టించేందుకు వారధి వద్ద బైక్, సూసైడ్ నోట్ పెట్టి ఆదినారాయణ బయట ప్రాంతాలకు పరారయ్యాడని పోలీసులు చెప్పారు. చేసిన అప్పులు కట్టకుండా తప్పించుకొనేందుకు ఈ తరహాలో మోసానికి పాల్పడినట్లు తమ విచారణలో తేలిందన్నారు. ఆదినారాయణ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు కొనసాగుతుందని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ కూడా కొనసాగుతుందని ఎస్ఐ రాజేంద్రప్రసాద్ తెలిపారు. పెడన పోలీసులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించారని ఎస్ఐ చెప్పారు. -
ఇద్దరు మిత్రులు
బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూతురు రషా తందానీ భావుకురాలు. ప్రకృతి ప్రేమికురాలు. పద్దెనిమిది సంవత్సరాల రషా మంచి ఫొటోగ్రాఫర్ కూడా. తల్లితో పాటు ప్రపంచంలోని ఎన్నోప్రాంంతాలను చూసి వచ్చింది రషా. తాజాగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ పర్యటనకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో ΄ోస్ట్ చేసింది. ‘హూ ఎల్స్ టు ట్రావెల్ ద వరల్డ్ విత్?’ కాప్షన్‌తో తల్లితో దిగిన ఫొటోలను షేర్ చేసింది. ‘తల్లీకూతుళ్లు క్లోజ్ఫ్రెండ్స్లా కనిపిస్తున్నారు’ అన్నారు ఒక నెటిజన్. -
పెళ్లిలో ఫొటోగ్రాఫర్ స్టెప్పులు.. నెటిజన్స్ ఫిదా..!
ఎక్కడైనా ఫొటోగ్రాఫర్ అంటే వేడుకల్లో మంచి స్టిల్స్ తీస్తూ బిజీగా ఉంటాడు. తనపని తాను చేసుకుంటూ ఫంక్షన్లో సందడిని చూస్తుంటాడు. కానీ ఫొటోగ్రాఫర్ ఏకంగా డ్యాన్సులు వేస్తే..? ఫొటోలు ఎవరు తీస్తారనే ప్రశ్నలు వేయకండి. ఎందుకంటే రెండు పనులను ఒంటి చేత్తే చేసేశాడు మీరు ఇప్పుడు చూడబోయే ఫొటోగ్రాఫర్. పెళ్లికి బంధువులంతా గుమికూడారు. ఇంట్లో సందడి బాగా నెలకొంది. ఆ సందడిని మరింత పెంచాడు పెళ్లికి వచ్చిన ఫొటోగ్రాఫర్. బంధువులతో పాటు కలిసి చిందులు వేశాడు. ఓ వైపు ఫొటోలు తీస్తూనే మరోవైపు వీడియోలు తీశాడు. పెళ్లికి వచ్చిన బంధువులు కూడా అతనితో పాటు కలిసి స్టెప్పులు వేశారు. if your wedding camera man ain’t doing this …..ask for refund pic.twitter.com/UGOwDdedi5 — Punjabi Touch (@PunjabiTouch) August 14, 2023 ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేవలం రెండు రోజుల్లోనే 2 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ డ్యాన్సుకు నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. డ్యాన్సు చేస్తూ ఫొటోలు తీసినందుకు అతన్ని మెచ్చుకున్నారు. అతను తీసిన ఫొటోలు ఎలా ఉన్నాయో చూడాలని ఉందంటూ మరో యూజర్ ఫన్నీగా కామెంట్ పెట్టాడు. ఇదీ చదవండి: స్టైలిష్ లుక్‌లో రాహుల్ గాంధీ.. లద్దాఖ్‌లో బైక్ టూర్.. -
World Photography Day: వారియర్ కెమెరా: కర్తవ్యాన్ని గుర్తు చేసే కెమెరా కన్ను
ఆరతి కెమెరాతో మాట్లాడి చూడండి... చేపల సవ్వడి లేని నదుల దీనత్వాన్ని గురించి చెబుతుంది. చేవ లేని జీవజాలాన్ని గురించి చెబుతుంది. పచ్చదనాన్ని కోల్పోయి నేలకూలనున్న నిర్జీవ వృక్షాల మృత్యుఘోష చెబుతుంది. నదుల నీటిలోని విషాన్ని గురించి వివరంగా చెబుతుంది. స్థూలంగా చెప్పాలంటే...కనిపించే అందాల వెనుక కనిపించిన నిశ్శబ్ద విధ్వంసాన్ని గురించి కళ్లకు కడుతూ చెబుతుంది. బెంగళూరుకు చెందిన ఎన్విరాన్మెంటల్ ఫొటోగ్రాఫర్ ఆరతి కుమార్ రావు తన కెమెరాతో పర్యావరణ సంరక్షణం గురించి క్షణం క్షణం గుర్తు చేస్తోంది... ప్రతి కెమెరాకు ఒక దృష్టి ఉంటుంది. మరి ఆరతి కెమెరా చూసేది ఏమిటి? అట్టడుగున పడి కన్పించని కథలు, నిజజీవిత కథలు, పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నా ఎవరూ పట్టించుకోని కథలు, సంప్రదాయ జీవనశైలులు, వాటిలో వస్తున్న అనూహ్య మార్పులు, పదాలకు దొరకని దృశ్యాలు...ఇలా ఎన్నో ఎన్నెన్నో. చిన్నప్పటి నుంచి ‘నేషనల్ జియోగ్రఫి’ పత్రికలను చూస్తూ పెరిగింది ఆరతి. ఆ ఎల్లో బార్డర్ విండోస్ నుంచి విశాలమైన ప్రపంచాన్ని చూసింది. ఆ పత్రికలోని ఫొటోగ్రాఫ్స్ తనపై ఎంతో ప్రభావం చూపాయి. పదాలతోనే కాదు చిత్రాలతో కూడా గొప్ప సత్యాలు చెప్పవచ్చుననే విషయం అర్థమైంది. చిన్నప్పటి నుంచి ఫిజిక్స్ అంటే ఇష్టం ఉన్న ఆరతి బయోఫిజిక్స్లో మాస్టర్స్ చేసింది. ఆ తరువాత ‘లైఫ్‌టైమ్ టు–డూ’ రూపంలో భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసుకుంది. దానిలో నదులతో పరిచయం ఒకటి. నదులను, వాటి చుట్టూ ఉండే జీవితాన్ని ఫొటోల రూపంలో డాక్యుమెంట్ చేయాలనుకుంది. కాళ్లకు బలపాలు, కళ్లకు కెమెరాలు కట్టుకొని ఊరూరు తిరిగినా తల్లిదండ్రులు ఎప్పుడూ అభ్యంతర పెట్టలేదు. పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. వివిధ ప్రాంతాలలో తన ఫొటోగ్రఫీకి సంబంధించిన విషయాలను కుటుంబసభ్యులతో పంచుకునేది ఆరతి. ఫొటోల ద్వారా ఎన్విరాన్మెంటల్ స్టోరీ టెల్లింగ్‌లో నేర్పు సంపాదించిన ఆరతి తన ప్రయాణంలో ఎన్నో అనుభవాలను సొంతం చేసుకుంది. పర్యావరణం గురించి మాట్లాడే వారిని అభివృద్ధి వ్యతిరేకులుగా భావించే వారిని కూడా చూసింది. ‘రివర్ డైరీస్’ అనేది ఆమె ప్రస్థానంలో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్‌గా పేరు తెచ్చుకుంది. నదుల అందాలతో పాటు వాటికి ఎదురవుతున్న ఆపదలకు ‘రివర్ డైరీస్’ అద్దం పడతాయి. ‘హింస, వివాదాలు మాత్రమే హెడ్‌లైన్‌గా కనిపిస్తాయి. అయితే పర్యావరణ విధ్వంసం అనే భయానకమైన కనిపించని హింస చాపకింద నీరులా కొనసాగుతుంది’ అంటుంది ఆరతి. ఆ కనిపించని హింసమూలాలను నలుగురికి తెలియజేసేలా చేయడంలో తన కెమెరాను బలమైన మాధ్యమంగా ఉపయోగించుకుంటోంది. ఆరతి ఫొటోగ్రాఫర్ మాత్రమే కాదు రచయిత్రి కూడా. ఆమె పుస్తకాలలో ‘మార్జిన్‌ల్యాండ్స్: ఇండియన్ ల్యాండ్‌స్కేప్స్ ఆన్ ది బ్రింక్’ ఒకటి. ఇందులో లడఖ్ నుంచి సుందరబన్ వరకు ప్రకృతికి సంబంధించిన ఎన్నో సుందరచిత్రాలను కళ్లకు కడుతుంది. గంగ– బ్రహ్మపుత్ర–మేఘన పరీవాహక ప్రాంతాలకు తీసుకువెళుతుంది. భౌగోళిక అందాలతో పాటు ఎదురవుతున్న ప్రమాదాలను, అక్కడి ప్రజలు మాట్లాడుకునే పదాలను పరిచయం చేస్తుంది. ‘నిర్మాణాలు, ఇతరత్రా విధ్వంసక కార్యకలాపాల వల్ల ప్రమాదం అంచున ఉన్న ప్రకృతిని కాపాడు కోవడం అనేది మన చేతిలోనే ఉంది’ అని ఈ పుస్తకం ద్వారా చెబుతుంది ఆరతి. ‘పర్యావరణంలో వచ్చే మార్పులు, అవి మన జీవితాల్లో తెచ్చే మార్పులను నా కెమెరా ద్వారా ఇక ముందు కూడా కథలుగా చెప్పాలనుకుంటున్నాను’ అంటోంది ఆరతి. ఒకానొక సందర్భంలో తన నిరసన గళాన్ని ఇలా వినిపించింది ఆరతి,,,, ‘కరువుకాటకాలు, వరదలలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మాత్రమే పర్యావరణ విధ్వంసం, పరిరక్షణ గురించి మాట్లాడుకుంటారు. ఆ తరువాత ఎవరి పనుల్లో వారు మునిగిపోతారు’ అయితే ఆరతిలాంటి ఎన్విరాన్మెంటల్ ఫొటోగ్రాఫర్లు తమ చిత్రాల ద్వారా పర్యావరణ పరిరక్షణకు సంబంధించి మన కర్తవ్యాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉన్నారు. -
బాలుడిని రక్షించిన ఫొటోగ్రాఫర్
బీచ్ రోడ్డు (విశాఖ తూర్పు): బీచ్‌లో అలల తాకిడికి కొట్టుకుపోతున్న బాలుడిని బీచ్‌లో ఫొటోలు తీసుకునే ఫొటోగ్రాఫర్ రక్షించాడు. ఆదివారం ఓ కుటుంబం బాలుడితోపాటు ఆర్కే బీచ్‌కు వచ్చింది. కుటుంబ సభ్యులంతా ఫొటోలు తీసుకోవటంలో బిజీగా ఉండటంతో బాలుడు తీరంలో ఆడుకునేందుకు వెళ్లాడు. ఒక్కసారిగా పెద్దగా వచ్చిన కెరటం బాలుడిని లోపలకు లాక్కుపోయింది. అక్కడ ఉన్న బీచ్ ఫొటోగ్రాఫర్ భాస్కరరెడ్డి వెంటనే స్పందించి బాలుడిని రక్షించాడు. ఓ చేత్తో ఖరీదైన కెమెరాను మరో చేతితో బాలుడిని రక్షించాడు. బాలుడిని వాళ్లు కుటుంబ సభ్యులకు అప్పగించగా.. భాస్కరరెడ్డిని బాలుడు కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు అభినందించారు. -
పాస్‌పోర్ట్ ఫొటోకు సహకరించని చిన్నారి.. శభాష్ అనిపించుకుంటున్న తండ్రి ఐడియా!
చంటిపిల్లలతో ఏదైనా పనిచేయించాలంటే తల్లిదండ్రులకు తల ప్రాణం తోకకువస్తుంటుంది. అదొక పెద్ద టాస్క్‌లా మారిపోతుంది. చిన్నపిల్లలకు హెయిర్ కటింగ్ చేయించాలన్నా, ఇంజక్షన్ చేయించాలన్నా, ఫొటో తీయాలన్నా అది పెద్దలకు శక్తికి మించిన పనిగా మారుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో పిల్లలు ఏడుపునకు దిగితే ఇక తల్లిదండ్రుల తల పట్టుకోవాల్సిందే. అయితే ఇటువంటి సమయంలో ఒక తండ్రి అనుసరించిన పద్దతి ఎంతో చక్కగా ఉన్నదంటూ, అతనిని అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఒక తండ్రి తన కుమార్తెకు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో తీయించాలనుకున్నాడు. అయితే అతని కుమార్తె ఫొటోకు అనుగుణంగా కుర్చీలో కూర్చొనేందుకు సహకరించ లేదు. ఆ చిన్నారి కుర్చీలో కూర్చుంటేనే ఫొటో తీయగలనని ఫొటోగ్రాఫర్ అన్నాడు. దీనికి అతని తండ్రి సమాధానమిస్తూ తన కుమార్తె తన చంకలో నుంచి దిగడం లేదని, కుర్చీలో కూర్చొనేందుకు సహకరించడం లేదని తెలిపాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలని? ఫొటోగ్రాఫర్ అడగగా, నా దగ్గర ఒక ఐడియా ఉందని తండ్రి సమాధానమిచ్చాడు. కుమార్తెకు ఫొటో తీయించేందుకు ఆ తండ్రికి వచ్చిన ఐడియా ఏమిటో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. తన కుమార్తెకు ఫొటో తీయించేందుకు ఆ తండ్రి కుర్చీలో కూర్చుని, తనపై ఒక తెల్లని వస్త్రాన్ని కప్పుకున్నాడు. ఒడిలో కుమార్తెను కూర్చోబెట్టుకున్నాడు. తరువాత ఆ చిన్నారికి ఫొటో తీశారు. దీనికి సంబంధించిన ఫొటో ట్విట్టర్లో వైరల్‌గా మారింది. ఈ ఫొటో చూసిన యూజర్స్ తండ్రి అనుసరించిన టెక్నిక్‌ను ఎంతగానో ఇష్టపడుతున్నారు. ఒక యూజర్ ‘మీ అమ్మాయి ఎంతో ముద్దొస్తోంది. మీరు ఎంతో తెలివైనవారు’ అని కామెంట్ చేయగా, మరొకరు ‘నా కుమారుని పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో కూడా ఇలానే తీయాల్సి వచ్చిందని’ పేర్కొన్నాడు. ఇది కూడా చదవండి: అది ‘వితంతువుల గ్రామం’.. పురుషుల అకాల మృతికి కారణమిదే..! Passport worker - We're gonna need the baby to sit on the chair for the photo. Dad - She won't let me put her down. Passport worker - You're gonna need to figure something out if you want a passport picture. Dad - I got an idea... pic.twitter.com/cx9sm5EsBl — Yair Menchel (@yairmenchel) July 20, 2023 -
పర్ఫెక్ట్ టైమింగ్: కెమెరాకు చిక్కిన మూడు తలల చీతా!
అత్యంత వేగవంతమైన పరుగుకు చీతా కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది. అది పరిగెడున్నప్పుడు చూస్తే అది గాలితో పోటీ పడుతున్నదేమో అని అనిపిస్తుంది. ఇంతటి వేగం కలిగిన చీతాకు అడ్డుపడే ఏ జీవి అయినా ప్రాణాలతో మిగలదని చెబుతుంటారు. ప్రపంచంలో చీతాల జాతి మెల్లమెల్లగా అంతరించిపోతున్నదని పలు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఆఫ్రికాలోని కొన్ని అడవుల్లో చీతాలు విరివిగా కనిపిస్తుంటాయి. ఇప్పుడు మీరు పైనున్న ఫొటోలో చీతాకు సంబంధించిన అద్భుతమైన ఫొటోను చూశారు. దీనిని ఒక వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో క్యాప్చర్ చేశారు. ఈ ఫొటోను చూసిన వారంతా ఆ ఫొటోగ్రాఫర్‌ను మెచ్చుకోవడంతోపాటు, అతను ఎంతో ధైర్యవంతుడైన క్రియేటర్ అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఫొటో కోసం 7 గంటల శ్రమ ఈ అద్భుతమైన ఫొటోను విబుల్డన్కు చెందిన వరల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ పాల్ గోల్డ్‌స్టీన్ తన కెమెరాలో బంధించారు. ఈ చీతా కెన్యాలోని మాసై మారా నేషనల్ పార్కులో కనిపించింది. పాల్ గోల్డ్ ఈ ఫొటో గురించి ఒక మీడియా హౌస్‌లో మాట్లాడుతూ తాను ఈ ఫొటో తీసేందుకు 7 గంటల పాటు వర్షంలో తడిసి ముద్దయ్యానని తెలిపారు. ఈ ఫొటోను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ, తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే ‘ఆ క్షణంలో మంత్రముగ్ధుడనయ్యాను. అవును.. ఇందుకోసం ఏడు గంటలు వర్షంలో తడిశాను’ అనే కాప్షన్ రాశారు. ‘వారేవాహ్.. ఏం టైమింగ్‌రా బాబూ’ ఈ పొటోను పరీక్షగా చూస్తే ఒకే చిరుతకు మూడు తలలు ఉన్నాయని, అవి వేర్వేరు దిశల్లో చూస్తున్నాయని అనిపిస్తుంది. పొటోగ్రాఫర్ పర్ఫెక్ట్ టైమింగ్ అనేది ఈ ఫొటోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఫొటోను చూసినవారంతా ‘వారేవాహ్.. ఏం టైమింగ్‌రా బాబూ’ అని ఆ ఫొటోగ్రాఫర్‌ను మెచ్చుకుంటున్నారు. నిజానికి అవి మూడు చీతాలు. అవి ఒక దగ్గరే వేర్వేరు యాంగిల్స్‌లో కూర్చున్నాయి. అది ఫొటోగ్రాఫర్ కంటపడింది. ఇది కూడా చదవండి: ఇదేమిటో తెలుసా? 90ల నాటి పిల్లలైతే ఇట్టే చెబుతారు! -
కృత్రిమ మేధ కళలకు వధ?
ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు క్లౌడిమోనెట్ ‘వాటర్ లిల్లీస్’ పేరిట రూపొందించిన 250 చిత్రాలు పూర్తి చేయడానికి దాదాపు 30 ఏళ్లు పట్టింది. తన ఇంటి దగ్గర ఉన్న సరస్సులో లిల్లీపూల స్ఫూర్తిగా ఆయన వీటిని చిత్రించారు. వాటర్ లిల్లీస్లోని ఒక చిత్రం 2007లో సోత్బే వేలంలో 1.85 కోట్ల డాలర్లకు అమ్ముడుపోయింది. తరువాతి సంవత్సరం లండన్ క్రిస్టీ వేలంలో మరో చిత్రం 4.1 కోట్ల డాలర్లకు అమ్ముడుపోయింది. మోనెట్ చిత్రించిన వాటర్ లిల్లీస్ను ఓ మంచి ఫొటోగ్రాఫర్ అంతే అందంగా కొన్ని క్షణాల్లో కెమెరాలో బంధించగలడు కానీ వాటికి ఉండే విలువెంత? దొడ్డ శ్రీనివాసరెడ్డి : 19వ శతాబ్దంలో లాండ్ స్కేప్ ఆర్టిస్టులకు, ఫొటోగ్రాఫర్లకు మధ్య వివాదం చెలరేగింది. ఫొటోలను సృజనాత్మక కళగా గుర్తించగలమా అన్నది నాటి కళాకారుల ప్రశ్న. కానీ తదుపరి కాలంలో ఫొటోగ్రఫీ కూడా కళగా అవతరించింది. ఫొటోలు కూడా వందల కోట్ల డాలర్లు ఆర్జించిన సందర్భాలున్నాయి. ఇప్పుడు కళాకారుల మనుగడనే ప్రశ్నించే మరో ముప్పు కృత్రిమ మేధ (ఏఐ) రూపంలో వచ్చి పడింది. ఏళ్లకు ఏళ్లు చేసిన సాధన ద్వారా కళాకారులు సాధించిన నైపుణ్యాన్ని కృత్రిమమేధ క్షణాల్లో అనుకరిస్తోంది. నమూనాలను సృష్టిస్తోంది. కృత్రిమమేధ ఇకముందు కళలకు సమాధి కడుతుందా? మనిషి సృజనాత్మకతతో పోటీపడుతుందా? కారుచౌకగా ఏఐ కళారూపాలను సృష్టిస్తుంటే అసలు కళలకు ఆదరణ ఉంటుందా? ఏఐ రూపొందించే కళలకు విలువ ఉంటుందా? అన్నవి ఇప్పుడు కళా ప్రపంచంలో తలెత్తుతున్న ప్రశ్నలు. ఇప్పటికే అనేక రంగాలను ఆక్రమించుకుంటున్న కృత్రిమమేధ ఇక సృజనాత్మక కళారంగాలనూ కబ్జా చేస్తుందని కళాకారులు ఆందోళన చెందుతున్నారు. కృత్రిమమేధ ఆధారంగా చాట్‌బాట్ ‘చాట్ జీపీటీ’ సృష్టించిన సంస్థ ఓపెన్ ఏఐ రూపొందించిన మరో ప్లాట్‌ఫామ్ డాల్–ఇ. ప్రఖ్యాత ఫ్రెంచ్ సర్రియలిస్ట్ పెయింటర్ సాల్వడార్ డాలీ పేరును పోలినట్లుగా ఉండే ఈ డాల్–ఇ ప్లాట్‌ఫామ్ కృత్రిమమేధను ఉపయోగించి అద్భుతమైన డిజిటల్ పెయింటింగ్స్‌ను సృష్టిస్తోంది. డాల్–ఇ మాదిరిగానే మిడ్ జర్నీ, స్టేబుల్ డిఫ్యూజన్ లాంటి మరికొన్ని ఏఐ ప్లాట్‌ఫామ్‌లు కూడా చిత్ర కళారంగంలో చొరబడి సంచలనం సృష్టిస్తున్నాయి. హేగ్ మ్యూజియంలో ఉన్న జొనెస్ వెర్మర్ అద్భుత కళాఖండం ‘గర్ల్ విత్ ఎ పెరల్ ఇయరింగ్’ స్ఫూర్తిగా జులియన్ వాన్ డైకెన్ అనే ఆర్టిస్టు మిడ్ జర్మీ ప్లాట్‌ఫామ్‌పై కృత్రిమమేధను వినియోగించి రూపొందించిన ‘ఎ గర్ల్ విత్ గ్లోయింగ్ ఇయరింగ్స్’ చిత్రాన్ని ఆమ్స్టర్డామ్లోని ఓ ప్రముఖ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టినప్పుడు చిత్ర కళారంగంలో అలజడి రేగింది. కంప్యూటర్ సృష్టించిన చిత్రాన్ని కళాఖండంగా ఎలా పరిగణిస్తారని ఆర్టిస్టులు ముక్తకంఠంతో ప్రశ్నించారు. ప్రింటింగ్, పబ్లిషింగ్ పరిశ్రమ కూడా ఇప్పుడు కృత్రిమమేధను ఆశ్రయించి కవర్ డిజైన్స్ రూపొందిస్తోంది. ప్రముఖ పత్రిక ‘ది ఎకనామిస్ట్’ ఇప్పుడు తన కవర్ డిజైన్ల సృష్టికి కృత్రిమమేధపై ఆధారపడుతోంది. అనేకమంది రచయితలు తమ నవలలు, పుస్తకాల కవర్ డిజైన్ల కోసం కృత్రిమమేధను ఉపయోగిస్తున్నారు. ఆర్కిటెక్ట్‌లు కూడా అద్భుతమైన కట్టడాలు, డామ్లు, స్టేడియాలు, గార్డెన్ల డిజైన్ల రూపకల్పనకు కృత్రిమమేధను ఆశ్రయిస్తున్నారు. ఫ్యాషన్ ప్రపంచంలోకీ కృత్రిమమేధ అడుగుపెట్టింది. ది ఫ్యాబ్రికెంట్ లాంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు అనూహ్యమైన వ్రస్తాలు, ఆభరణాల డిజైన్లను ఏఐతో సృష్టిస్తున్నాయి. ఇవి ధరించడానికి పనికి రావు కానీ డిజిటల్ రూపంలో వర్చువల్‌గా వీటిని ధరించి ఆనందించవచ్చు. అయితే వీటిని పొందడానికి మాత్రం ‘నిజమైన’ ధర చెల్లించాల్సిందే. కొన్ని వ్రస్తాల డిజైన్లు పదివేల డాలర్ల వరకు ఉన్నాయి. ఇటీవల బీచ్‌లో సర్ఫింగ్ చేస్తున్న వారి ఫొటో ఒకటి ఆ్రస్టేలియాలో ప్రతిష్టాత్మకమైన ఫొటోగ్రఫీ పోటీల్లో విజయం సాధించింది. అయితే ఈ ఫొటో కృత్రిమమేధ ఆధారంగా తయారుచేసిందని తెలిసి ప్యానెల్ జడ్జిలు ఈ చిత్రాన్ని తొలగించి వేరే ఫొటోను ఎంపిక చేయాల్సి వచ్చింది. ఈ విషయంలో చెలరేగిన వివాదం ఫలితంగా పోటీలను రెండు విభాగాలుగా విభజించారు. ఒకటి కంప్యూటర్ సృష్టించే ఫొటోలకు, మరొకటి కెమెరా ద్వారా తీసిన ఫొటోలకి. కదం తొక్కుతున్న కళాకారులు వివిధ రంగాలకు చెందిన కళాకారులు, నిపుణులు ఏళ్ల తరబడి కృషితో సాధించిన నైపుణ్యాన్ని అచ్చుగుద్దినట్లు అనుకరిస్తున్న కృత్రిమమేధపై కదం తొక్కుతున్నారు. కళా నైపుణ్యాన్ని కూడా ఆటోమేషన్ చేస్తే తమ భవిష్యత్తు ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆర్టిస్టులు, డిజైనర్లు, ఫొటోగ్రాఫర్లు, రచయితలు, మ్యుజీషియన్లు తమ మనుగడను అంధకారంలోకి నెడుతోందని కృత్రిమమేధపై విరుచుకుపడుతున్నారు. కృత్రిమమేధ చొరబాటును అడ్డుకునేందుకు రకరకాల ఆయుధాలు సన్నద్ధం చేస్తున్నారు. శాన్ఫ్రాన్సికోకి చెందిన కార్టూనిస్టు సరా అండర్సన్, ఇల్ల్రస్టేటర్ కార్లో వోర్టిజ్ కాపీరైట్ చట్టం కింద న్యాయ పోరాటం చేస్తున్నారు. తమ బొమ్మలను అనుకరిస్తూ నకలు సృష్టిస్తున్న ఏఐ వేదికలు డ్రీమ్ అప్, మిడ్ జర్నీ, స్టేబుల్ ప్యూజన్పై వీరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ అనుమతి లేకుండా, పరిహారం చెల్లించకుండా తమ బొమ్మలను వాడుకుంటున్నందుకు కాపీరైట్ చట్టం కింద శిక్షించాలని కోరారు. గుర్తింపు కావాలి ఏఐ ఆధారిత కంప్యూటర్ ప్రోగ్రాంలు సొంతంగా ఏమీ సృష్టించలేవు. అవి సృష్టించే నకలుకి ఏదో ఒక అసలైన చిత్రమో, కళాకారులు లేదా రచయితల శైలి ఆధారం కావాలి. ఎలాంటి చిత్రం, ఫొటో, రచన కావాలన్నా ఎవరిశైలిలో కావాలన్నా కమాండ్ ఇస్తే వాటిని అనుసరించి కృత్రిమమేధ నకలును సృష్టించగలుగుతుంది. అలాంటప్పుడు వాటికి ఆధారమైన కళాకారులు, రచయితలు, ఫొటోగ్రాఫర్లకు తగిన రీతిలో పరిహారం చెల్లించడం, గుర్తింపు ఇవ్వాలనేది వారి వాదన. క్రిస్ కస్టనోవా అనే రచయిత్రి ‘జోర్యా ఆఫ్ ద డాన్’ పేరిట ప్రచురించిన కామిక్ నవలకు అమెరికా కాపీరైట్ ఆఫీసు తొలుత ఆమోదం తెలిపింది. అయితే ఈ కామిక్‌లో ఉపయోగించిన బొమ్మలు మిడ్‌జర్నీ ప్లాట్‌ఫామ్ ద్వారా సృష్టించినట్లు తరువాత వెల్లడైంది. దీనిపై వివాదం చెలరేగడంతో నవలలో కథకు మాత్రమే కాపీరైట్ ఇస్తున్నామని, కంప్యూటర్ సృష్టించిన బొమ్మలకు ఇవ్వలేదని కాపీరైట్ ఆఫీసు తన నిర్ణయాన్ని సవరించుకుంది. బొమ్మలు, కార్టూన్లు, చిత్రాలను కృత్రిమమేధ కాపీ కొట్టకుండా షికాగో యూనివర్సిటీకి చెందిన ఓ బృందం ‘గ్లేజ్’ అనే సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. దీన్ని ఉపయోగిస్తే, అది చిత్రాలపై కంటికి కనిపించని ఒక తెరను కప్పేస్తుంది. దాంతో కృత్రిమమేధ ఈ చిత్రాన్ని కాపీ కొట్టడం కుదరదు. ‘కృత్రిమమేధ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఈ తరుణంలో కొన్ని మార్గదర్శకాలు, ఆంక్షలు అవసరం’ అని గ్లేజ్ సృష్టికర్త స్వాన్షాన్ అభిప్రాయపడ్డారు. సహజీవనం తప్పదు కృత్రిమమేధ విస్తృతిని ఆపడం ఎవరివల్లాకాదు. అన్ని రంగాల్లోకి అది చొచ్చుకుపోతోంది. ఇక కృత్రిమమేధను మన జీవితాల్లోకి ఆహ్వా నించక తప్పదు. దాంతో సహజీవనానికీ మార్గం సుగమం చేసుకోవాల్సిందే అని విజ్ఞులు చెబుతున్నారు. సాల్వడార్ డాలీ సర్రియలిస్టు పెయింటింగ్స్‌ను, పికాసో అబ్ స్ట్రాక్ట్ పెయింటింగ్స్‌ను, బ్రాక్ క్యూబిజమ్ను మొదట్లో కళగా గుర్తించలేదు. కానీ ఇప్పుడవి అద్భుత కళాఖండాలుగా ఆవిష్కృతమయ్యాయి. కొత్తదనాన్ని స్వీకరించడానికి మనిషికి కొంత సమయం పడుతుంది. ఇప్పుడు కృత్రిమమేధ సృష్టించే కళారూపాల్ని ముందు ముందు మనం ఆమోదించి ఆహ్వా నిస్తామేమో?. -
'యూ ఆర్ వెరీ స్పెషల్'.. నిహారిక పోస్ట్ వైరల్
గత కొంతకాలంగా మెగాడాటర్ నిహారిక కొణిదెల తరచుగా వార్తల్లో నిలుస్తోంది. భర్త చైతన్య జొన్నలగడ్డతో మనస్పర్థల కారణంగా వీరి విడాకులు తీసుకోనున్నారంటూ రూమర్స్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇంతవరకు మెగా ఫ్యామిలీలో ఎవరూ స్పందించలేదు. ఇప్పటికే చైతన్య.. నిహారికను అన్‌ఫాలో చేయడమే కాకుండా పెళ్లి ఫోటోలన్నింటినీ డిలీట్ చేశాడు. అయితే తాజాగా నిహారిక తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో చేసిన పోస్ట్ తెగ వైరలవుతోంది. తాజాగా నిహారిక బర్త్ డే విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. యూ ఆర్ వెరీ స్పెషల్ అంటూ విషెస్ చెప్పింది నిహారిక. ప్రముఖ ఫోటోగ్రాఫర్ అరిఫ్ పుట్టినరోజు సందర్భంగా అతనితో దిగిన పిక్స్ షేర్ చేసింది. కాగా.. ఇప్పటికే నటనకు గుడ్‌బై చెప్పి నిర్మాతగా మారిన నిహారిక సొంతంగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌ను నెలకొల్పిన సంగతి తెలిసిందే. తాజాగా నిహారిక మరో ముందడుగు వేసింది. తన ప్రొడక్షన్ బ్యానర్‌కు ఒక ఆఫీస్‌ను ఏర్పాటు చేసుకుంది. ఎప్పటి నుంచో సొంతంగా ఆఫీస్ నెలకొల్పాలని కలలు కన్న నిహారిక ఇటీవలే ఆ పని పూర్తిచేసింది. (ఇది చదవండి: అనుకున్న పని చేసేసిన నిహారిక.. కంగ్రాట్స్ అంటూ కామెంట్స్) -
ఫొటోగ్రాఫర్ హత్య వెనుక ‘టీడీపీ’ నేత హస్తం?
సాక్షి ప్రతినిధి, కాకినాడ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన మండపేటలో ఫొటోగ్రాఫర్‌ను పీక నులిమి చంపేశారు. నూతన సంవత్సర వేడుకల వేళ మండపేట బైపాస్ రోడ్డులోని ఒక లే అవుట్లో ఆ ఫొటోగ్రాఫర్ అనుమానాస్పద రీతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసులు కూడా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. తీరా తీగ లాగితే డొంక కదిలింది. అనుమానితులను పోలీసులు తమదైన శైలిలో విచారించారు. పోస్టుమార్టం నివేదికలో ఫొటోగ్రాఫర్‌ను హత్య చేసినట్టుగా నిర్ధారించారు. ఈ హత్య వెనుక పట్టణంలోని తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక మాజీ ప్రజాప్రతినిధి హస్తం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసులో కీలక నిందితునిగా ఉన్న అతడి అనుచరుడు పరారీలో ఉండటం ఇందుకు బలం చేకూరుస్తోంది. అసలు ఈ హత్యకు, ఆ మాజీ ప్రజాప్రతినిధికి మధ్య సంబంధం ఏమిటి, హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే కోణంలో పోలీసు దర్యాప్తు సాగుతోంది. మండపేటకు చెందిన ఫొటోగ్రాఫర్ కొనిజాల సురేష్ (28) డిసెంబర్ 31వ తేదీ రాత్రి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు స్నేహితులతో కలిసి వెళ్లి శవమై తేలాడు. తొలుత పట్టణ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహంపై ఉన్న గాయాల ఆధారంగా నాలుగు రోజులుగా వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మండపేట బైపాస్ రోడ్డులోని ఓ లే అవుట్లో ఆ రోజు నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. ఇందులో పట్టణ టీడీపీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధి కారు డ్రైవర్‌తో కలిసి సురేష్ పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ డ్రైవర్‌తో పాటు మరికొందరిని తమదైన శైలిలో విచారించి, సురేష్ హత్యకు గురైనట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ హత్యతో సంబంధం ఉన్న మరికొందరు అనుమానితుల పేర్లను సేకరించారు. వారిలో సదరు మాజీ ప్రజాప్రతినిధి ప్రధాన అనురుడు కూడా ఉన్నాడని నిర్ధారించుకున్నారు. అతడితో పాటు మరికొందరు పరారీలో ఉండటంతో వారి కోసం రెండు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. హతుడు సురేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడి కుటుంబ సభ్యులు ఆ మాజీ ప్రజాప్రతినిధి ఇంట్లో పని చేసేవారనే విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. మాజీ ప్రజాప్రతినిధితో పాటు మరికొందరు అనుమానితుల పేర్లు విచారణలో పోలీసులకు చెప్పినట్టుగా హతుని సోదరుడు ఫోన్ సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం సంచలనమైంది. విచారణలో వచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలు, అనుమానితుల కాల్‌డేటా వివరాలు సేకరించి పరిశీలిస్తున్నారు. హత్య విషయం వెలుగులోకి వచ్చినప్పటి నుంచీ రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి మండపేట వచ్చి అనుమానితులను విచారిస్తున్నారు. జిల్లా ఎస్పీ సు«దీర్కుమార్రెడ్డి కేసు పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. శుక్రవారం వచ్చిన పోస్టుమార్టం నివేదికలో సురేష్ మెడ భాగంలో ఎముకలు విరిగి ఉన్నట్టు నిర్ధారణ అయింది. చదవండి: కానిస్టేబుల్ నిర్వాకం.. యువతితో 4 ఏళ్ల ప్రేమ.. బర్త్‌డే పేరుతో! దీంతో అనుమానాస్పద మృతి కేసును పోలీసులు హత్య కేసుగా మార్చారు. పరారీలో ఉన్న అనుమానితులు దొరికితే మాజీ ప్రజాప్రతినిధి పాత్రపై స్పష్టత వస్తుందని పోలీసులు అంటున్నారు. ఈ కేసును అన్ని కోణాల్లోనూ సమగ్రంగా విచారణ చేస్తున్నామని మండపేట టౌన్ సీఐ పి. శివగణేష్ చెప్పారు. కేసులోని ప్రధాన నిందితులను ఆధారాలతో సహా పట్టుకుంటామని అన్నారు. -
పాలపుంతతో ప్రాణానికి నిశ్చింత
పాలపుంత చిత్రాలు ఎప్పుడూ అద్భుతంగా ఉంటాయి.. అలాంటిదే ఇది కూడా.. ఈ చిత్రాన్ని అమెరికాకు చెందిన ఆస్ట్రోఫొటోగ్రాఫర్ డెరెక్, కొలరాడోలోని మరూన్ బెల్స్ పర్వతాల వద్ద తీశాడు. ఇంతకీ మానసిక చింతకు పాలపుంతకు కనెక్షన్ ఏమిటి అనే కదా మీ డౌట్. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న డెరెక్‌కు ఈ నక్షత్రాలే ఓదార్పునిచ్చాయట. డెరెక్‌కు ఆస్ట్రోఫొటోగ్రఫీ మీద ఆసక్తి ఉండేది కాదట. 20 ఏళ్ల వయసులో హృదయ సంబంధిత వ్యాధి వల్ల గుండెపోటు వచ్చింది. అప్పటినుంచి తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడేవాడు. ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు వెంటాడేవి. అలాంటి టైంలో వాటి నుంచి బయటపడటానికి, మనసును వేరేపని మీద లగ్నం చేయడానికి ఆకాశంలోని నక్షత్రాలను చూడటం అలవాటు చేసుకున్నాడు. ఆసక్తి పెరిగింది. తర్వాత ఓ రోజు తన కెమెరాను పట్టుకుని.. పాలపుంతల చిత్రాలను తీయడానికి బయల్దేరాడు. కట్ చేస్తే.. ఇప్పుడు ప్రొఫెషనల్ ఆస్ట్రోఫొటోగ్రాఫర్గా ఇలాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలను తీస్తూ.. శభాష్ అనిపించుకుంటున్నాడు. ఇదీ చదవండి: LOFTID: ‘రక్షణ కవచం’ సక్సెస్.. గంటకు 20వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చి.. -
Shikha Khanna: నూరు తల్లుల కథ
31 ఒక్క దేశాలు. 100 మంది తల్లులు. వారు టీచర్లు, సైంటిస్ట్‌లు, క్రీడాకారులు, సంగీతకారులు, మహిళా సైనికులు... రంగాలు వేరు. కాని మాతృత్వం ఒకటే. ఒక మహిళ నిర్వహించే అత్యుత్తమ కర్తవ్యం తల్లి కావడం. అందుకు ప్రతి తల్లీ ఒక భిన్న ప్రయాణం చేస్తోంది. ఆ తల్లుల గాధలు అందరికీ తెలియాలి అని భావించిన ప్రసిద్ధ పోర్ట్రయిట్ ఫొటోగ్రాఫర్ శిఖా ఖన్నా వందమంది తల్లుల ఫొటోలు, ఇంటర్వ్యూలతో ‘100 సెల్ఫ్పోర్ట్రయిట్స్ 100 డ్రీమ్స్’ పేరుతో పుస్తకం తెస్తోంది. ఈ సందర్భంగా వచ్చే వారం పూణెలో ఈ వందమంది తల్లులు ఒక వేదిక మీదకు రానున్నారు. ఈ ఘట్టం తల్లి గొప్పదనాన్ని చాటనుంది. ఎయిర్‌ఫోర్స్‌లో పని చేసే ఒక తల్లికి లడాఖ్‌లో డ్యూటీ. ఆ సమయానికి ఆమెకు రెండేళ్ల పాప ఉంది. దూరాన వదల్లేదు. లడాఖ్‌లో ప్రతికూల వాతావరణంలో పెంచడం రిస్క్. ఉద్యోగమా... మాతృత్వమా? ఏం... రెండూ ఎందుకు చేయకూడదు. ఆమె తన రెండేళ్ల కూతురిని లడాఖ్ తీసుకెళ్లింది. ఒకవైపు డ్యూటీ చేస్తూనే మరోవైపు కూతురిని పెంచింది. ఆ తల్లి ఆ సవాలును ఎలా స్వీకరించి దాటిందో ఆ కథ తెలిస్తే ఎలా ఉంటుంది? ఒక తల్లి అంధురాలైన కళాకారిణి. అంధత్వంతో కళలో సాగడమే ఒక కష్టమైతే తల్లిగా బాధ్యతలు నెరవేర్చడం ఇంకా కష్టం. కాని ఆ తల్లి ఆ బాధ్యతను నెరవేర్చింది. అందుకు ఏ యే ఇక్కట్లను దాటింది? ఆమె నోటి గుండా వింటే ఎంత బాగుంటుంది? ఒక తల్లి క్రీడల్లో కొనసాగాలి. దేశాలు తిరగాలి. మరోవైపు పిల్లలు. ఆటల కోసం వ్యాయామానికి, ప్రాక్టీసుకు సమయం ఇవ్వాలి. మరోవైపు పిల్లలకూ ఇవ్వాలి. ఎంత ఒత్తిడి. ఏదో ఒకటి ఎంచుకొని రెండోది వదిలేయకుండా రెంటినీ నిర్వహించడంలోనే ఆ తల్లి గొప్పదనం ఉంది. ఆ కథ లోకంలో ఎందరికి తెలుసు? తల్లులు ఇంటి పట్టునే ఉన్నా, కెరీర్లో ఉన్నా పిల్లల పెంపకం కోసం ఎనలేని త్యాగాలు చేస్తూనే ఉంటారు. ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. పిల్లల కోసం స్వార్థమెరుగని అంకితాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అలా వివిధ రంగాల్లో ఉంటూ ఆ రంగాల్లో తమదైన విజయాన్ని నమోదు చేస్తూ కూడా పిల్లల పెంపకంలో ఏ వంకా వదలని తల్లులు తమ జీవితాలను తమ మాటల్లో చెప్తే కచ్చితంగా ఈ కాలం తల్లులకు, కాబోయే తల్లులకు స్ఫూర్తిగా ఉంటుంది. మగవారు వాటిని వింటే తల్లులకు ఇవ్వాల్సిన స్థానం, గౌరవం మరింత విశదం అవుతుంది. ఆ ఆలోచనతోనే ఫొటోగ్రాఫర్ శిఖా ఖన్నా ‘ఎంయుఎం’ (మదర్స్ యునైటెడ్ మూవ్మెంట్) అనే ప్రాజెక్ట్ మొదలెట్టింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ‘100 సెల్ఫ్ పోర్ట్రెయిట్స్ 100 డ్రీమ్స్’ అనే పుస్తకాన్ని తెచ్చింది. ఆ పుస్తకంలో తల్లుల జీవన గాథలు వారి మాటల్లోనే రికార్డు చేసింది. 31 దేశాల నుంచి 100 మంది తల్లులు– వారంతా తమ తమ కెరీర్‌ను కొనసాగిస్తున్నవారు... వృత్తిలో విజయం సాధిస్తూనే తల్లిగా కూడా విజయం సాధించినవారు– తమ అనుభవాలను ఈ పుస్తకంలో చెప్పారు. భారతదేశం నుంచి అథ్లెట్ అశ్వినీ నాచప్ప, పారా అథ్లెట్ దీపా మాలిక్ తదితరులు ఉన్నారు. ఇతర దేశాల నుంచి టీచర్లుగా, మ్యూజిక్ టీచర్లుగా, లైఫ్‌స్టయిల్ కోచ్‌లుగా, గాయనులుగా, హక్కుల ఉద్యమకారులుగా, చెఫ్‌లుగా, ఫొటోగ్రాఫర్లుగా వివిధ రంగాలలో కొనసాగుతున్న తల్లులు ఉన్నారు. ‘తల్లి గొప్పదనం ఎంత చెప్పినా తక్కువే. ఈ పుస్తకం ఆమెను మరింత ఉన్నతంగా ఉంచుతుంది’ అంటుంది శిఖా ఖన్నా. స్వయంగా ప్రసిద్ధ ఫొటోగ్రాఫర్ అయిన శిఖా భారతదేశంలో న్యూబోర్న్ బేబీల ఫొటోగ్రఫీని తొలిగా ప్రవేశ పెట్టింది. దాదాపు 1000 ప్రముఖ కుటుంబాల ఫొటోలు తీసిందామె. అంతే కాదు యువతరం కోసం ఆన్లైన్లో ఫొటోగ్రఫీ క్లాసులు తీసుకుంటూ ఉంటుంది. తను తల్లయ్యాక ఫొటోగ్రాఫర్/ తల్లిగా రెండు పాత్రలు పోషించడంలో తానెంత ఫోకస్డ్గా ఉండాల్సి వచ్చిందో అర్థమయ్యాక ఇలా పని చేసే తల్లుల కథలు ఎందరికో స్ఫూర్తినిస్తాయి కదా అనిపించింది. పిల్లలు పుట్టగానే చాలామంది తల్లులు తమకు ఎంతో ఇష్టమైన వృత్తిని, ఉపాధిని, హాబీని వదిలేస్తుంటారు. అలాంటి వారు ఒక ధైర్యం తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఈ పుస్తకం తెచ్చిందామె. పూణెలో నవంబర్ 11 నుంచి 13 తేదీల మధ్య జరిగే ఈవెంట్లో ఈ 100 మంది తల్లులు వచ్చి నేరుగా ప్రేక్షకులతో మాట్లాడనున్నారు. స్త్రీల మాతృత్వానికి, జీవన రంగానికి సంబంధించిన అనేక సెషన్స్ జరగనున్నాయి. అలాగే ఈ పుస్తకం ఆవిష్కరణ కూడా జరగనుంది. ప్రధాని మెచ్చుకుని ఈ ఈవెంట్ విజయవంతం కావాలని సందేశం పంపారు. ఈ ఈవెంట్లో పాల్గొనే తల్లులకు శుభాకాంక్షలు. తల్లులు ఇంటి పట్టునే ఉన్నా, కెరీర్లో ఉన్నా పిల్లల పెంపకం కోసం ఎనలేని త్యాగాలు చేస్తూనే ఉంటారు. ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. పిల్లల కోసం స్వార్థమెరుగని అంకితాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అలా వివిధ రంగాల్లో ఉంటూ ఆ రంగాల్లో తమదైన విజయాన్ని నమోదు చేస్తూ కూడా పిల్లల పెంపకంలో ఏ వంకా వదలని తల్లులు తమ జీవితాలను తమ మాటల్లో చెప్తే కచ్చితంగా ఈ కాలం తల్లులకు, కాబోయే తల్లులకు స్ఫూర్తిగా ఉంటుంది. మగవారు వాటిని వింటే తల్లులకు ఇవ్వాల్సిన స్థానం, గౌరవం మరింత విశదం అవుతుంది. -
అక్షర లక్షలు
దక్షిణాసియా సాహిత్యపు ప్రతిష్ఠను పెంచుతూ ఈ ఏటి బుకర్ పురస్కారాన్ని శ్రీలంకకు చెందిన సెహన్ తిలకరత్న గెలుచుకున్నారు. మరణానంతర థ్రిల్లర్ ‘ద సెవన్ మూన్స్ ఆఫ్ మాలీ అల్మీదా’ ఆయనకు ఈ పురస్కారం తెచ్చిపెట్టింది. ఉన్నట్టుండి ఒకరోజు చావు నుంచి మేల్కొన్న ఫొటోగ్రాఫర్ మాలీ అల్మీదా తను దాచిన ఛాయాచిత్రాలను సరైన మనిషి చేతుల్లో పెట్టడానికి చేసే ప్రయత్నం ఈ నవల. దానికిగానూ అతడికి ఉన్న కాలం కేవలం ఏడు చంద్రులు. ఈ ప్రయాణంలో భాగంగా 1980–90ల నాటి శ్రీలంక సంక్షుభిత కాలాన్ని, అంతర్యుద్ధం వల్ల జరిగిన మానవ నష్టాన్ని నవల చిత్రిస్తుంది. ఇంత కల్లోలంలోనూ ప్రతి మానవ జీవితమూ విలువైనదేనన్న ఒక ఆదర్శం కోసం అన్వేషించడం బుకర్ న్యాయనిర్ణేతలను కదిలించింది; షార్ట్‌లిస్టులో ఉన్న ఆరుగురు రచయితల్లోంచి కరుణతిలక వైపు మొగ్గేలా చేసింది. ఒక శ్రీలంక రచయిత ఈ బహుమతిని పొందడం ఇది రెండోసారి. మొదటి రచయిత కెనడాలో స్థిరపడిన మైకేల్ ఆండాట్జీ. 1992లో ‘ది ఇంగ్లిష్ పేషెంట్’ నవలకుగానూ ఆయన ఈ గౌరవం పొందారు. అక్టోబర్ నెలంతా సాహితీ మాసంగా గడిచిపోయింది. ఈ నెలలోనే అంతా ఎదురుచూసిన ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం ఫ్రెంచ్ రచయిత్రి ఆనీ ఎర్నౌను వరించింది. ఆంగ్లంలో రాసిన, యునైటెడ్ కింగ్డమ్ లేదా ఐర్లాండ్‌లో ప్రచురించిన పుస్తకాలు మాత్రమే అర్హమయ్యే బుకర్ ప్రై జ్ ‘పరిధి’ పరిమితమైనది అయినప్పటికీ, దీని కోసం కూడా సాహిత్య లోకం ఆసక్తిగా చూసింది. ఆంగ్ల భాషా వ్యాప్తి పెరుగుతూండటమూ, ఇతర భాషల సాహిత్యాలు కుంచించుకుపోతుండటమూ, ఇతర భాషీయులు కూడా ఆంగ్లాన్ని తమ మాతృభాషలాగే స్వీకరించి సాహిత్యపరమైన ఆలోచనను కూడా ఆ భాషలోనే చేస్తూండటమూ, ఆంగ్ల సాహిత్యం నిత్యనూతనంగా ఉంటుండటమూ, ఇలా చాలా కారణాల వల్ల బుకర్ ప్రైజ్ అచ్చమైన అంతర్జాతీయ అవార్డు స్థాయిని పొందింది. ఈ పురస్కార విజేతకు 50 వేల పౌండ్ల నగదు లభిస్తుంది. బ్రిటిష్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, దీని విలువ సుమారు 47 లక్షల రూపాయలు! బుకర్ ప్రైజ్ పేరుతో ఇస్తున్నప్పటికీ 1969–2001 వరకు మాత్రమే బ్రిటిష్ ఫుడ్ హోల్‌సేల్ ఆపరేటర్ అయిన ‘బుకర్ గ్రూప్ లిమిటెడ్’ ఈ అవార్డుకు నిధులు సమకూర్చింది. అది తప్పుకొన్న తర్వాత, 2002–19 వరకు ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ‘మ్యాన్ గ్రూప్’ ఇచ్చినందున మ్యాన్ బుకర్ ప్రైజ్ అని వ్యవహరించారు. 2019 నుంచి వెల్‡్ష శ్రీమంతుడు మైకేల్ మోరిట్జ్ ఛారిటీ సంస్థ ‘క్రాంక్‌స్టార్ట్’ దీనికి నిధులు ఇస్తోంది. దాతలు మారుతున్నప్పటికీ, ‘అత్యధిక పారితోషికం గల సాహిత్య పురస్కారాల్లో ఇదీ ఒక’టన్న ప్రతిష్ఠకు మాత్రం లోటురావడం లేదు. తమాషా ఏమిటంటే, దీన్ని తలదన్నే మొత్తాన్ని ఇస్తున్న పురస్కారాలు కూడా ఉన్నాయి. యూఏఈకి చెందిన ‘మిలియన్స్ పొయెట్’ పోటీకి 50 లక్షల ధీరమ్స్ (సుమారు 11 కోట్ల రూపాయలు) ఇస్తున్నారు. అరబిక్ దేశాల్లోని అత్యుత్తమ కవులను వెతికే ఈ రియాలిటీ టెలివిజన్ కవితల పోటీ ప్రసారమైనప్పుడు, టీఆర్పీ రేటింగ్స్‌లో ఫుట్‌బాల్‌నే వెనక్కి నెట్టేస్తుంది. నగదును టాప్–5 కవులకు పంచుతారు. ఇక స్పెయిన్ లో ఇచ్చే ‘ప్రీమియో ప్లానెటా దె నావెలా’ ప్రైజ్‌మనీ పది లక్షల యూరోలు. అంటే సుమారు 8 కోట్ల రూపాయలు. ప్రపంచంలో ఆర్థిక పరంగా ప్రస్తుతం ఇదే అత్యంత ఘనత వహించిన అవార్డు. 1952లోనే ఇది మొదలైంది. పుస్తకాల ప్రచురణ కర్త ‘గ్రూపో ప్లానెటా’ దీన్ని బహూకరిస్తుండటం గమనార్హం. ఇక ‘ఆస్ట్రిడ్ లిండ్‌గ్రెన్ మెమోరియల్ అవార్డు’ పేరుతో స్వీడన్ లో ఇచ్చే పురస్కార విలువ 50 లక్షల స్వీడిష్ క్రోనాలు(సుమారు 37 లక్షల రూపాయలు). గుర్తుంచుకోవాల్సింది స్వీడన్ జనాభా అక్షరాలా ఒక కోటి నలభై లక్షలు మాత్రమే. ఇక అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ విజేతకు ఒక కోటి స్వీడిష్ క్రోనార్ల నగదు (సుమారు ఏడున్నర కోట్ల రూపాయలు)తోపాటు 18 క్యారెట్ల బంగారు పతకం బహూకరిస్తారు. మళ్లీ బుకర్ వద్దకే వస్తే– ఆంగ్లంలోకి అనువాదమైన ఇతర భాషా పుస్తకాల కోసం ప్రత్యేక విభాగంగా నెలకొల్పిన ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ పురస్కార నగదు కూడా 50,000 పౌండ్లు. దీన్ని రచయిత, అనువాదకులకు సమంగా పంచుతారు. పోయినేడాది హిందీ నవలా రచయిత్రి గీతాంజలి శ్రీ, అనువాదకురాలు డైసీ రాక్వెల్తో పాటు గెలుచుకున్నది ఇదే. ఇంతేసి పారితోషికాలు, ఒక పుస్తకం కోసం సాహిత్య లోకం ఎదురుచూడటాలు తెలుగు నేలకు ఏమాత్రం సంబంధం లేని వ్యవహారంగా కనిపించడం లేదూ! ఉమ్మడిగా రెండు రాష్ట్రాల జనాభా సుమారు తొమ్మిది కోట్లు. అయినా ఒక రచయిత తన సొంత ఖర్చుతో వేసుకునే వెయ్యి కాపీలు అమ్మడం కూడా దుర్భరం. ఇలాంటి వాతావరణానికి కారణాలు ఏమిటి? పఠనాన్ని తగ్గించాయని చెప్పే అన్ని కారణాలూ అన్ని దేశాలకూ వర్తిస్తాయి కదా. మరెక్కడుంది లోపం? మన సంస్కృతిలో. ‘చదవడం’ అంటే మనకు అర్థం వేరే. ‘ఒక దేశం తన కథకులను కోల్పోయిందంటే, తన బాల్యాన్ని కోల్పోయినట్టే’ అన్నాడు పీటర్ హాండ్కే. మన జీవితమంతా మన చిన్నతనంలోనే ఉండిపోయిందని పెద్దయినకొద్దీ అర్థమవుతూ వస్తుంది. డబ్బులు మాత్రమే సర్వస్వమా అంటే– అది మన సారస్వత నిర్మాతలను మనం ఎలా గౌరవించుకుంటున్నాం అన్నది తెలియజేస్తుంది. బాక్సాఫీస్ కలెక్షన్లలో వెయ్యి కోట్లు దాటే సినిమాలు తీస్తున్న తెలుగు నేల మీద, ఒక తెలుగు రచయితకు కోటి రూపాయల బహుమతి ఇచ్చే ఊహయినా చేయగలమా? -
డిలీట్.. డిలీట్.. డిలీట్... ఒకప్పటిలా ఆ కిక్కు ఇప్పుడు లేదు
పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన కుమార్తె ఫొటో తండ్రికి జీవిత కాలపు తోడుయవ్వనంలో ఉన్నప్పుడు నాన్న తీయించుకున్న ఛాయా చిత్రం అమ్మ దాచుకున్న రహస్యం. బీరువాలో దొరికే నానమ్మ ఫొటో బాల్యానికి దగ్గరి దారి. గోడ మధ్యన వేలాడుతూ కనిపించే టెన్త్ క్లాస్ గ్రూప్ ఫొటో ఎన్నో జ్ఞాపకాలకు కేరాఫ్ అడ్రస్. పెళ్లి ఆల్బమ్‌లు, విహారాల ఫొటోలు చిటికెలో బాధను మాయం చేయగల మందులు. ఫొటో అంటే కేవలం కాగితం కాదు .. అందరి గతం. కాలాన్ని బంధించే శక్తి దీనికి మాత్రమే ఉంది. జ్ఞాపకాల ఖజానా టెక్కలి: ఫొటో తీయడం.. బాగులేకపోతే డిలీట్ చేయడం. ఫొటోగ్రఫీ గతం కంటే ఈజీ అయిపోయింది. డిజిటల్ వచ్చినప్పటి నుంచి ఫొటోలు తీయడంలో ఉన్న కిక్కు పోయింది. కెమెరా కడుపులో రీళ్లు ఉన్నప్పుడు అపురూప క్షణం కోసం గంటల కొద్దీ వేచి ఉండడం, సరైన చిత్రాన్ని తీయడానికి ఏకాగ్రతతో ఎదురు చూడడం, తదేక దీక్షతో క్లిక్ మనిపించడం చాలా మందికి ఇంకా గుర్తుండే ఉంటుంది. మెమొరీ కార్డులు వ చ్చి రీళ్లకు సమాధి కట్టేశాయి. పాత తరం కెమెరాను చూస్తే చాలాకాలానికి చూసిన బంధువులా అనిపిస్తుంది. బాల్య జ్ఞాపకమేదో కళ్ల ముందు కనిపిస్తుంది. అలాంటి జ్ఞాపకాల పెట్టెలను టెక్కలికి చెందిన హనుమంతు మల్లేశ్వరరావు సేకరిస్తున్నారు. వృత్తిరీత్యా వీడియో ఎడిటర్ అ యిన మల్లేశ్వరరావు పాతతరం కెమెరాలు సేకరించడం హాబీగా పెట్టుకున్నారు. తెలిసిన వ్యక్తుల వద్ద ఉన్న పా తతరం కెమెరాలను సేకరించడం మొదలు పెట్టారు. 50 ఏళ్ల నాటి కెమెరాను పరిశీలిస్తున్న మల్లేశ్వరరావు గత కొన్ని రోజులుగా పాతతరం కెమెరాల సేకరణ వేటలో నిమగ్నమయ్యారు. యాభై ఏళ్ల కిందటి కెమెరాలను కూడా సేకరించారు. సాగరసంగమం సినిమాలోని ఓ సన్నివేశంలో కమల్‌హాసన్‌కు ఓ బాలుడు ఫొటోలు తీసే కెమెరా అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాంటి కెమెరాను కూడా సంపాదించారు. రీల్ కెమెరా నుంచి ప్రస్తుతం అందుబాటులో ఉన్న యాక్షన్ డిజిటల్ కెమెరాల వరకు వివిధ రకాల వీడియో, ఫొటో కెమెరాలను సేకరించి భద్రపరిచారు. మల్లేశ్వరరావు వీడియో కెమెరాల్లో ఎన్ఈజీఎస్, త్రీసీసీడీ, 3500 తో పాటు మరి కొన్ని పాతతరం వీడియో కెమెరాలు మల్లేశ్వరరావు వద్ద ఉన్నాయి. వీటితో పాటు వివిధ రకాల రీల్ కెమెరాలతో పాటు సరికొత్త 7డీ, 70డీ, ఫోర్‌కె, గోప్రో, గింబల్, స్లైడర్ తదితర కెమెరాలను సేకరించారు. విహంగాలతో దోస్తీ జి.సిగడాం: వృత్తి రీత్యా ఆయన ఇంజినీర్. ఓ ఉన్నత సంస్థలో ఉద్యోగం. తలమునకలయ్యే పని. కానీ ఆయన ఒక రోజు పని చేస్తున్న సమయంలో ఓ పక్షి ప్రాణాల కోసం కొట్టుకుంటూ నేల మీద పడింది. ఆయన దాన్ని రక్షించి పంజరంలో పెట్టి కాపాడారు. ఆ క్షణం నుంచి ఆ ఇంజినీర్ జీవితం మరో మేలి మలుపు తిరిగింది. పక్షులపై ప్రేమ పెరిగింది. కెమెరా కంటితో పక్షుల కదలికలు చూడడం అలవాటైంది. సాధారణంగా పక్షులను చూసి ఆస్వాదించే కంటే ఫొటోలు తీసి ఆ క్షణాలను నిక్షిప్తం చేయడంలో మజా తెలిసింది. ఇంకే ముంది అప్పటి నుంచి పక్షుల కోసం అన్వేషణ సాగిస్తున్నారు. ఇప్పటి వరకు 105 రకాల పక్షుల ఫొటోలు తీసి భద్రపరిచారు. కిశోర్ తీసిన పక్షుల చిత్రాలు జి.సిగడాం మండలం పెంట గ్రామానికి చెందిన పెరుంబుదూరి నర్సిహంమూర్తి పెద్ద కుమారుడు పెరుంబుదూరి కిశోర్ పక్షుల కోసం అన్వేషణ సాగిస్తున్నారు. ఇటీవలే సొంత ఊరికి వచ్చి కిశోర్ ప్రతి రోజు చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లి పక్షుల ఫొటోలు సేకరిస్తున్నారు. అవి ఎలా గుడ్లు పెడుతున్నాయి, బుల్లి పిట్టలు ఎలా జన్మిస్తున్నాయి, వాటి ఆహారం ఎలా పంచుకుంటున్నాయి అనే విషయాలను తెలుసుకుంటున్నారు. ఇటీవల తామర ఆకులపై నెమలి తోక జకనా అనే పక్షి రాకపోకలు, విన్యాసాలను ఫొటోలు తీసి నిక్షిప్తం చేశారు. గుడ్లు పెట్టిన దశ నుంచి పొదిగే దశ వరకు అన్నింటినీ సేకరించారు. ఈ ఫొటోల కోసం సెలవుల్లో అటవీ ప్రాంతాలకు వెళ్తుంటారు. -
World Photography Day: ‘ఫొటోగ్రఫీ నేర్చుకున్నాను... అని ఎప్పుడూ అనకూడదు’
World Photography Day 2022: ఇల్లు అలకగానే పండగ కాదు. సెల్‌ఫోన్‌తో అల్క(తేలిక)గా క్లిక్ అనిపించగానే ఫొటో కాదు. కాస్త కళా పోసన ఉండాలా. అది ఉంటే... పబురన్ బసు మాదిరిగా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవచ్చు... పబురన్ బసు తండ్రి కెమెరాను చేతుల్లోకి తీసుకునే నాటికి తన వయసు నాలుగు సంవత్సరాలు మాత్రమే. తండ్రి ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ కావడం వలన ఉత్తర కోల్‌కతాలోని ఆ ఇంట్లో ఎటు చూసినా రకరకాల ఫొటోగ్రాఫిక్ ఎక్విప్మెంట్లు కనిపించేవి. తనకు తోచినట్లు గా వాటితో ఏవో ప్రయోగాలు చేస్తుండేవాడు బసు. కోవిడ్ కల్లోలంతో అందరూ ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ తీరిక సమయాన్ని బాగా ఉపయోగించుకున్నాడు బసు. ఫొటోగ్రఫీపై పూర్తిగా దృష్టి పెట్టాడు. మ్యూజియం ఆఫ్ మోడ్రన్ ఆర్ట్, న్యూయార్క్ ఆన్లైన్ ఫొటోగ్రఫీ కోర్స్ పూర్తిచేశాడు. ఫొటోగ్రఫీ లోతుపాతులు తెలుసుకోవడానికి ఇది తనకు ఎంతగానో ఉపయోగపడింది. ఫొటోగ్రఫీకి సంబంధించిన మ్యాగజైన్లు, పుస్తకాలు చదవడం మొదలుపెట్టాడు. PC: Pubarun Basu ‘ఇలా నేను తీయగలనా?’ సోనీ వరల్డ్ ఫొటోగ్రఫీ అవార్డ్‌ల గురించి ఎప్పుడూ వింటుండేవాడు బసు. బహుమతి గెలుచుకున్న ఫొటోలను చూస్తూ అబ్బురపడేవాడు. ‘ఇలా నేను తీయగలనా?’ అనుకునేవాడు. పోటీలో తొలిసారి పాల్గొన్నప్పుడు ఎలాంటి అవార్డ్లు రాలేదుగానీ, తన ఫొటో గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ప్రశంసాపూర్వకమైన వాక్యాలు రాశారు ఎడిటర్. ఇది తనకు ఎంతో కిక్ ఇచ్చింది. తనపై తనకు నమ్మకాన్ని పెంచింది. అద్భుతం ఆవిష్కృతం! కొన్నిసార్లు సందర్భాలు అద్భుతమైన అవకాశాన్ని సృష్టిస్తాయి. అలాంటి సువర్ణ అవకాశం ఒకరోజు తనకు వచ్చింది. అవి లాక్డౌన్ రోజులు. కిటికీ నుంచి వస్తున్న సూర్యకిరణాల నీడ కర్టెన్పై పడుతోంది. తనకు వెంటనే ఒక ఐడియా తోచింది. ‘అమ్మా! తెర వెనుక వెళ్లి చేతులు ఆనించు’ అన్నాడు తల్లితో. ఆమె అలాగే చేసింది. నిజంగా ఒక అద్భుతం ఆవిష్కారం అయింది. ఆ ఫొటోకు ‘నో ఎస్కేప్ ఫ్రమ్ రియాలిటీ’ అని పేరు పెట్టి ‘సోనీ వరల్డ్ ఫొటోగ్రఫీ అవార్డ్–2021’కి పంపాడు. ఆ ఫొటో తనని ‘యూత్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్’ టైటిల్ గెలుచుకునేలా చేసింది. ‘ఇది నిజమేనా?’ అని తనలో తాను ఎన్నిసార్లు అనుకున్నాడో లెక్కేలేదు! అంతర్జాతీయ అవార్డ్ దక్కించుకున్నంత మాత్రాన ‘ఇక నాకు ఎదురులేదు’ అనుకోవడం లేదు బసు. అలా అనుకోకూడదు! ‘ఫొటోగ్రఫీ నేర్చుకున్నాను... అని ఎప్పుడూ అనకూడదు. నేర్చుకుంటూనే ఉన్నాను అని మాత్రమే అనాలి’ అంటూ తండ్రి చెప్పిన మాట తనకు బాగా గుర్తుండిపోయింది. బీబిసి, నేషనల్ జాగ్రఫీ... మొదలైన ఫొటోగ్రఫీ పోటీల్లో కూడా బహుమతులు గెలుచుకున్నాడు బసు. PC: Pubarun Basu ‘సెల్కెమెరా కావచ్చు, మామూలు కెమెరా కావచ్చు అవి ఫొటోగ్రాఫర్ క్రియేటివిటీకి పరిమితులు విధించలేవు. ఖరీదైన కెమెరాలతో మాత్రమే ఆహా అనిపించే ఫొటోలు వస్తాయనడంలో నిజం లేదు. తమ దగ్గర ఉన్న సాదాసీదా కెమెరాలతోనే అద్భుతమైన ఫొటోలు తీస్తున్న స్ట్రీట్ ఫొటోగ్రాఫర్లే దీనికి ఉదాహరణ’ అంటున్న బసు తన కెమెరా ద్వారా సమాజానికి సంబంధించి ఎన్నో కథలు చెప్పాలనుకుంటున్నాడు. ఫిల్మ్‌మేకింగ్‌లోకి వెళ్లాలనేది అతడి భవిష్యత్ కల. చదవండి: Divine Space: శ్వాసపై ధ్యాస Cyber Crime Prevention Tips: టెక్ట్స్ మెసేజ్‌తో వల.. ఆపై..! వాట్సాప్ స్కామ్.. చా(చీ)టింగ్! -
చిన్న ఫోటోగ్రాఫర్...అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రపతికే వ్యక్తిగత ఫోటోగ్రాఫర్‌గా
పావగడ: తాలూకాలోని ఓబుళాపుర గ్రామంలో ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చెందిన కృష్ణమూర్తి, నాగరత్నమ్మ దంపతుల కుమారుడు వై కే లోకనాథ్ ఫొటోగ్రఫీ రంగంలో ఉన్నత స్థానానికి ఎదిగాడు. చిన్నపాటి ఫొటోగ్రాఫర్‌గా వృత్తిని ప్రారంభించిన ఆయన నేడు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వ్యక్తిగత ఫొటో గ్రాఫర్‌గా ఎదిగాడు. బెంగుళూరులో కలర్ ల్యాబ్ నిర్వహిస్తున్న అతని చిన్నాన్న ఎంసీ గిరీశ్ ప్రేరణతో ప్రభుత్వ చలనచిత్ర, జయచామరాజేంద్ర పాలిటెక్నిక్‌లో చేరారు. 1989లో డిప్లొమా పూర్తి చేశాడు. ప్రసార భారతి ఛానల్లో విధులు నిర్వహించాడు. తదనంతరం ఢిల్లీలో అడుగు పెట్టి ఛాయాగ్రహ వృత్తిలో అంచెలంచెలుగా ఎదిగి చివరకు ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత ఛాయాగ్రాహకుడిగా ఎంపికయ్యాడు. రెండు దశాబ్దాల పాటు ప్రధాని కార్యాలయంలో విధులు నిర్వహించిన ఆయన ఇటీవల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వ్యక్తిగత ఫోటోగ్రాఫర్‌గా రాష్ట్రపతి భవన్లో విధులు నిర్వహిస్తున్నాడు. అతని ఎదుగుదల పట్ల గ్రామస్థులు, బంధువులు, స్నేహితులు హర్షం ప్రకటించారు. (చదవండి: ‘మాజీ ప్రధానితో సీఎం కేసీఆర్ భేటీ.. రెండు, మూడు నెలల్లో సంచలన వార్త’) -
వివాహేతర సంబంధం.. మహిళతో న్యూడ్ కాల్స్.. వాటిని రికార్డ్స్ చేసి!
సాక్షి, హైదరాబాద్: ఫేస్బుక్ పరిచయం అక్రమ సంబంధానికి దారితీసి చివరకు హత్యచేయించింది. మీర్‌పేటలో ఫోటోగ్రాఫర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు ప్రధాన నిందితురాలైన ఓ మహిళతో పాటు సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. మీర్‌పేట సీఐ మహేందర్‌రెడ్డి ప్రకారం... నగరంలోని భాగ్ అంబర్‌పేటకు చెందిన మల్కాపురం యష్మాకుమార్ (32) వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్. ఈయనకు 2018లో మీర్‌పేట నందిహిల్స్‌కు చెందిన వివాహిత బుచ్చమ్మగారి శ్వేతారెడ్డి (32)తో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరి మధ్య తరచూ ఫోన్ సంభాషణలు కొనసాగడంతో సన్నిహిత్యం పెరిగి అక్రమ సంబంధానికి దారితీసింది. కాగా యష్మాకుమార్ శ్వేతారెడ్డికి ఫోన్ చేసి న్యూడ్ కాల్స్ చేయమన్నాడు. వాటిని రికార్డ్ చేసుకున్న యష్మాకుమార్ నెల రోజుల నుంచి తనను పెళ్లి చేసుకోవాలని శ్వేతారెడ్డిపై ఒత్తిడి పెంచాడు. లేదంటే న్యూడ్ ఫొటోలు, వీడియో కాల్స్‌ను బంధువులకు పంపుతానని బెదిరించసాగాడు. ఆందోళనకు గురైన శ్వేతారెడ్డి యష్మాకుమార్ను హతమార్చాలని నిర్ణయించుకుంది. ఇందుకు కృష్ణాజిల్లా తిరువూరు మండలం ఎరుకోపాడు గ్రామానికి చెందిన ఓ ప్రైవేటు కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్‌గా పనిచేసిన కొంగల అశోక్ (28), ఎలక్ట్రీషియన్ కొత్తపల్లి కార్తీక్(30) సాయం కోరింది. పథకం ప్రకారం శ్వేతారెడ్డి ఈ నెల 3న యష్మాకుమార్కు ఫోన్ చేసి ఇంటికి రావాలని కోరింది. దీంతో అతను అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ప్రశాంతిహిల్స్ వద్దకు చేరుకోగానే అప్పటికే అక్కడ మాటువేసిన అశోక్, కార్తీక్ సుత్తితో యష్మాకుమార్ తలపై బలంగా దాడి చేశారు. దీంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. హత్య చేసిన తరువాత యష్మాకుమార్వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను తీసుకుని రావాలని శ్వేతారెడ్డి తెలుపగా సెల్‌ఫోన్ కనిపంచకపోవడంతో అక్కడి నుంచి వారు పారిపోయారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన యష్మాకుమార్ ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 6న మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న మీర్‌పేట పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టి హత్య కేసులో ప్రధాన నిందితురాలైన శ్వేతారెడ్డి ఆమెకు సహకరించి హత్య చేసిన అశోక్, కార్తీక్‌లను బుధవారం రిమాండ్‌కు తరలించారు. చదవండి: ప్రేమించి పెళ్లి.. సంతానం కలగకపోవడంతో.. సోదరుల సమాధుల వద్ద -
పులుల సఫారీ చూసొద్దాం
తెలంగాణ ఆదిలాబాద్ సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్ర తిప్పేశ్వర్ ప్రాంతంలోని పులుల సంరక్షణ కేంద్రం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. తిప్పేశ్వర్ అభయారణ్యంలో పులులను తిలకించేందుకు సందర్శకులు ఆసక్తిగా తరలి వస్తున్నారు. తిప్పేశ్వర్ అటవీ ప్రాంతంలో మొత్తం 18 పులులు, 2 చిరుత పులులున్నాయని అక్కడి సిబ్బంది తెలిపారు. సఫారీలో పర్యాటకులు పులులను తిలకిస్తూ ఆనందంగా గడుపుతున్నారు. ఈ అటవీ ప్రాంతం ఆదిలాబాద్ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
Urshita Saini: కాన్పు సమయంలో ఫొటోలా?.. ఎందుకిలా?
Birth Photographer Urshita Saini: కాన్పు సమయంలో ఫొటోలా? పుట్టిన పసిగుడ్డు కళ్లు తెరిచి మిటకరించి చూసిన క్షణాన్ని కెమెరాలో బంధించడం సాధ్యమా? ఆ క్షణంలో తల్లి కంటి నుంచి కారే ఆనందధారకు ఫొటో సాక్ష్యం పలికితే. దేశంలో స్త్రీలు కొత్త ఉపాధులను కనిపెడుతున్నారు. ఢిల్లీకి చెందిన ఉర్షిత సైనీ తన ఉద్యోగాన్ని వదిలి ‘బర్త్ ఫొటోగ్రఫీ’లో కొత్త పేరు సంపాదిస్తోంది. బిడ్డ కేర్మనగానే క్లిక్‌మనిపించే ఉర్షిత పరిచయం. ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్, వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ ఉన్నట్టుగా బర్త్ ఫొటోగ్రాఫర్ ఉంటారా? ‘పాశ్చాత్య దేశాలలో ఇది కామన్. మనకు కొత్త’ అంటుంది ఢిల్లీకి చెందిన ఉర్షిత సైని. ‘మమ్మాస్టోరీ’ పేరుతో స్టుడియో పెట్టి మెటర్నిటీ ఫొటోగ్రఫీ, న్యూబోర్న్ ఫొటోగ్రఫీతో పాటు బర్త్ ఫొటోగ్రఫీ కూడా చేస్తోంది ఉర్షిత. ‘ఇప్పటికి మేము 500 కాన్పులను షూట్ చేశాం. అందులో 300 నేను చేశా’ అంటుందామె. 2017లో మొదలు ఉర్షితకు ఫొటోగ్రఫీ హాబీ. ఎల్ఎల్బి చదువుతూ ఇంట్లో, బంధువుల ఇళ్లలో ఏ ఫంక్షన్ జరిగినా తనే ఫొటోలు తీసేది. అవి అందరికీ నచ్చేవి. రాను రాను తాను లాయర్ కావడం కన్నా ఫొటోగ్రాఫర్ కావడమే మేలని అనుకుంది. 2016లో ఒక ఫొటోగ్రఫీ మేగజీన్‌లో చేరింది. ‘నేను చేరాక ఒక సంచికలో గర్భిణీ స్త్రీల ఫొటోషూట్‌ను వేశాం. ఆ తర్వాత సంచికను బర్త్ ఫొటోగ్రఫీ స్పెషల్‌గా తేవాలనుకున్నాం. కాని ఎంత వెతికినా మన దేశంలో బర్త్ ఫొటోగ్రఫీ చేస్తున్న వాళ్లు కనిపించలేదు. ‘‘ఎవరో ఎందుకు, నువ్వే ఎందుకు చేయకూడదు?’’ అన్నాడు నా కలీగ్. నిజమే, ఎందుకు చేయకూడదు అనుకున్నాను. కాని మన దేశంలో ఆ పని ఎంత కష్టమో తర్వాత తెలిసింది’ అంటుంది ఉర్షిత కాన్పు సమయం సెంటిమెంట్లు మన దేశంలో కాన్పు సమయంలోకాని, పుట్టిన బిడ్డ విషయంలోకాని ఎన్నో సెంటిమెంట్స్ ఉంటాయి. ‘40 రోజుల వరకూ బయట వాళ్లను చూడనివ్వరు... దిష్టి అని. కొందరైతే అప్పుడే పుట్టిన బిడ్డను ఫొటోలు తీయడంలో ఏదైనా కుట్ర ఉందా అని భయపడ్డారు. ఇక హాస్పిటళ్ల వాళ్లయితే లేబర్రూమ్లోకి రానివ్వం అని కరాఖండీగా చెప్పేశారు (ఇప్పుడు కాన్పు సమయంలో భర్తను అనుమతిస్తున్నారు. చట్టప్రకారం మరో వైద్య సిబ్బంది కాకుండా మరో పురుషుడు ఉండకూడదు. మహిళా ఫొటోగ్రాఫర్ ఉండొచ్చు. అందుకే ఉర్షిత తన టీమ్‌లో మహిళలను తీసుకుంది). చివరకు ఒక తెలిసిన హాస్పిటల్ వాళ్లు ఓకే అన్నారు. కాని ఎంత మందిని బర్త్ ఫొటోగ్రఫీ చేస్తానన్నా ఒప్పుకోలేదు. చిట్ట చివరకు ఒక భార్యాభర్త అంగీకరించారు. నా చెవులను నేనే నమ్మలేకపోయాను’ అంది ఉర్షిత. తొలి అనుభవం 2017లో తొలి బర్త్ ఫొటోగ్రఫీ చేసింది ఉర్షిత. లేబర్ రూమ్‌లో కెమెరాను పట్టుకుని నిలబడితే ఆమె చేతులు వణికాయి. ‘డాక్టర్లు అంత టెన్షన్లో కూడా కూల్‌గా ఉన్నారు. ఒక దశలో వాళ్లు గర్భిణిని లైట్‌గా తీసుకున్నారా అనిపించింది. బిడ్డకు జన్మనివ్వడానికి తల్లి వేస్తున్న కేకలు కంగారు పుట్టిస్తుండగా బిడ్డ బయటకు రాగానే ఫ్లాష్ ఉందా, యాంగిల్ ఏమిటి అనేది చూడకుండా టకటకా ఫొటోలు తీశాను. ఒక జీవి భూమ్మీదకు వచ్చే క్షణాలను ఫొటో తీయడం నాకు చాలా సంతోషం కలిగించింది. ఆ ఫొటోలు చూసి తల్లిదండ్రులు చాలా సంతోషించారు’ అంటుంది ఉర్షిత. స్పెషలిస్ట్ ఉర్షిత ఎవరి దగ్గరా ఫొటోగ్రఫీ నేర్చుకోలేదు. కాని యూట్యూబ్‌లో చూసి ఏ కెమెరాను ఎలా వాడాలో తెలుసుకుంది. భావోద్వేగాన్ని సరిగ్గా పట్టుకోవడంలోనే ఆమె ప్రతిభ అంతా ఉంది. గర్భిణీ స్త్రీల ఫొటోలను ఆమె ఎంత బాగా తీస్తుందో న్యూబోర్న్ ఫొటోలు కూడా అంతే బాగా తీస్తుంది. అంటే కాన్పు సమయంలో కాకపోయినా ఒక రెండు మూడు వారాల తర్వాత ఫొటోలు తీయించుకుంటారు కొందరు తల్లిదండ్రులు. వాటిని తీస్తుంది ఉర్షిత. ‘కాని ఈ పని సామాన్యం కాదు. ఒక కాన్పు అయితే మూడురోజుల పాటు వెయిట్ చేయించింది. డెలివరీ ఇప్పుడవుతుంది అప్పుడవుతుందని ఎదురు చూడటమే. చాలా ఓపిక కావాలి’ అంటుంది ఉర్షిత. ఒక ఇంటి బర్త్ ఫొటోగ్రఫీ చేసిన ఉర్షిత ఆ ఫొటోలు ఉన్న పెన్‌డ్రైవ్ ఇవ్వడానికి వెళ్లినప్పడు ఆ ఇంటి నానమ్మ మురిసి 500 రూపాయలు చేతిలో పెట్టడం తనకు ఎంత ఫీజు వచ్చినా ఎంతో విలువైనదిగా భావిస్తుంది ఉర్షిత. తల్లి గుండెల మీదకు చేరిన పసిగుడ్డు పెదాలపై విరిసీ విరియని చిరునవ్వు కూడా ఆమెకు ఫీజే. చదవండి: ఆర్కిటెక్చర్ వాక్.. అడుగు అడుగులో నిర్మాణం -
ఆదర్శ జీవితానికి కొలమానం
సుప్రసిద్ధ ఫొటో జర్నలిస్టుగా, ప్రజల జీవనాన్ని, వారి సంస్కృతిని జీవితాంతం తన కెమెరాకన్నులో బంధించి పేద ప్రజల బతుకు చిత్రాన్ని అక్షర సత్యంగా నాలుగు దశాబ్దాలకు పైగా అందిస్తూ వచ్చిన ప్రజా కళాకారుడు భరత్ భూషణ్. ఆయన నిజ జీవితంలో కూడా తిరుగులేని ఒక ఆదర్శ శిఖరం! భరత్ దశాబ్దాలుగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ కూడా తన కెమెరా కన్నుకు క్షణం విశ్రాంతి నివ్వలేదు. విద్యావంతురాలైన పేదింటి మహిళా రత్నం సుభద్రను ఆదర్శ వివాహం చేసుకున్నారు. ఈ వివాహం తర్వాత రెండు కుటుంబాలకు కనపడకుండా నెలల తరబడి కాదు, కొన్నేళ్లపాటు అజ్ఞాత జీవితాన్ని కూడా గడుపుతూ ఆమె జీవితాన్ని తీర్చిదిద్దాడు. ఈ జంటను కాపాడుకుంటూ వారి ఆదర్శానికి ఒక దిక్సూచిగా నిలబడవలసిన ధర్మం నాకూ, నా భార్య సుధారాణిపైన పడింది. అలా వారి అజ్ఞాత దాంపత్యం కొత్త చిగుళ్లు తొడిగింది. కలవారి కుటుంబంలో పుట్టిన భరత్, పేద కుటుంబంలో పుట్టిన విద్యావంతురాలైన సుభద్రను చేసుకోవడంతో ఎదురైన కొత్త కష్టాలను ధైర్యంతో, మనో నిబ్బరంతో ఎదు ర్కొంటూ వచ్చాడు. ‘ఉదయం’ దినపత్రిక ద్వారా (1984–86) మొదలైన మా స్నేహం వయోభేదంతో నిమిత్తం లేకుండా, ప్రాంతా లతో సంబంధం లేకుండా ఎదుగుతూ వచ్చింది. అందు వల్ల భరత్ భౌతికంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాగమైన తెలంగాణకు చెందినా, ఏ కోశానా ప్రాంతాల స్పృహ లేకుండా తెలుగువాళ్లుగా స్నేహ బాంధవ్యం పెరిగి బలపడుతూ వచ్చింది. ఈ బంధం, ఆత్మీయతల అనుబంధంగా పెరుగుతూ వచ్చింది కనుకనే హైదరాబాద్ లోని మా ఇల్లు భూషణ్ దంపతుల సొంతిల్లుగానే మారిపోయింది. ఈ చరిత్ర మన జర్నలిస్టు మిత్రులలో చాలా కొద్దిమందికే తెలుసు. మొన్న భరత్ పేద ప్రజా జీవితాలకు అంకితమైన ఫొటో జర్నలిస్టుగా కన్నుమూసే వరకూ మా కుటుంబాల ఆత్మీయతలు ఎక్కువ మందికి తెలియవు. మొన్నమొన్న భరత్ కన్నుమూసే వరకు, చివరి క్షణాల వరకూ భరత్, సుభద్రలు, వారి కుమార్తె అనుప్రియ, కొడుకు అభినవ్ నాతో భరత్ ఆరోగ్య విషయాల గురించి చెబుతూనే ఉన్నారు. వృద్ధాప్యం వల్ల నేను ఎక్కువసార్లు భరత్ ఇంటికి వెళ్లి ఇంతకు ముందులా అతడిని పరామర్శిస్తూ ముచ్చటలాడటం కుదరలేదు. అందువల్ల కేవలం ఫోన్ కాల్స్ ద్వారా సమాచారం తెలుసుకుంటూ ఉండేవాడిని. తను ఏ చిన్న ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకున్నా విధిగా నాకు ఫోన్ చేస్తూ మీరు కూడా వస్తే ‘నాకు దండి’గా ఉంటుందని చెప్పేవాడు. కానీ నా ఆరోగ్య పరిస్థితి, వృద్ధాప్య దశవల్ల నేను వాటిలో కొన్నింటికీ వెళ్లేవాడిని కాదు. ఐనా విధిగా సమాచారం మాత్రం భరత్ అందిస్తూనే ఉండేవాడు. అరుదైన ప్రజల, పేదసాదల ఫొటో జర్నలిస్టుగా, కళాకారుల్లో అరుదైన సమాజ స్పృహ తీవరించి ఉన్న వ్యక్తిగా భరత్‌ను నేను పరిగణిస్తాను. అంతేగాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, తరువాత ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా తెలంగాణ వాసి అయిన భరత్‌కు తెలిసినంత లోతుగా తెలంగాణ సంస్కృతీ వైభవానికి చెందిన అనంతమైన పార్వ్శాలు మిగతా తెలంగాణ కళాకారులకు తెలియ వంటే ఆశ్చర్యం చెందాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజా జీవితానికి చెందిన అనేక కోణాలను, చివరికి ఇళ్ల తలుపు చెక్కల సొగసుల్ని, వంటింటి సామాన్ల తీరు తెన్నుల్ని అక్షరబద్ధమూ, చిత్రాక్షర బద్దమూ చేసి చూపరుల్ని ఆశ్చర్యచకితులను చేశాడు భరత్. (క్లిక్: నిబద్ధ కెమెరా సైనికుడు.. సెల్యూట్ మై ఫ్రెండ్!) అందుకే ఏ తెలంగాణ చిత్రకారునికన్నా, ఫొటో జర్నలిస్టుకన్నా లోతైన అవగాహనతో భరత్ తెలంగాణ ప్రజా జీవన చిత్రాలను ప్రాణావశిష్టంగా మలిచారని చెబితే అతిశయోక్తి కాదు. భరత్ కుంచెలోనూ, కలం లోనూ విలక్షణమైన ఈ శక్తియుక్తులను పెంచి పోషించింది అభ్యుదయ భావ సంప్రదాయాలేనని మనం గుర్తించాలి. సబ్బు ముక్క, తలుపు చెక్క కాదేదీ కవితకనర్హం అన్నాడు శ్రీశ్రీ. అలాగే తెలంగాణ పల్లెపట్టుల్లో తలుపు చెక్కల సౌందర్యాన్ని ఫొటో జర్నలిజం ద్వారా చిత్రబద్ధం చేశాడు భరత్. మహాకవి కాళోజి అన్నట్లు ‘‘చావు నీది, పుట్టుక నీది/ బతుకంతా దేశానిది’’. ఈ సత్యాన్ని ఎన్నటికీ మరవకండి! అందులోనే నిజం ఉంది, నిజాయితీ ఉంది!! (చదవండి: ఆదివాసీ సంప్రదాయ చరిత్రకారుడు) - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
నిబద్ధ కెమెరా సైనికుడు.. సెల్యూట్ మై ఫ్రెండ్!
భరత్ భూషణ్ (బి.బి)... ఆ పేరు చెప్పగానే ముఖం మీద ఓ చిన్న నవ్వు, మెడల వరకూ పొడవాటి జుట్టు, భుజానికి కెమెరా గుర్తు కొస్తాయి. కానీ, ఆ చిరునవ్వు వెనుక ఎన్నో ఒడుదొడుకులు, కష్టాలు, కన్నీళ్ళు. వాటన్నిటినీ దిగమింగుకొని పైకి మాత్రం అదే నవ్వుతో పలకరిస్తూ ఉండే వాడు. క్యాన్సర్ ఆపరేషన్ అయ్యాక తన మెడ మీద మచ్చ ఏర్పడింది. ఆ మచ్చ, క్యాన్సర్ తాలూకు బాధ ఎవరికీ కనపడకుండా దాచాలని తను జుట్టు పొడుగ్గా పెంచాడు. భూషణ్ స్వతహాగా మిత భాషి. జర్నలిస్టు, ఫోటో గ్రాఫర్ సహచరులు ఏ అసైన్ మెంట్లో కనపడినా, ‘ఎలా ఉన్నావు మిత్రమా’ అన్న పిలుపు, పలకరింపు. ‘ఏం కొత్త కెమేరాలు కొన్నారు’ అనే స్టాండర్డ్ ప్రశ్న. అలా 1984లో ‘ఉదయం’ రోజుల నుంచి పరిచయం. భూషణ్ ఎక్కువగా వామపక్ష (సీపీఐ, సీపీఎం, ఎంఎల్) ప్రోగ్రామ్స్ కవర్ చేసేవారు. అవి జరిగే ముఖ్దూమ్ భవన్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం లాంటి చోట్ల కెమేరాతో ప్రత్యక్ష మయ్యేవాడు. అప్పట్లో పేపర్లలో ఎవరైనా మావోయిస్టుల ఫొటోలు కావాలన్నా, సీపీఐ, సీపీఎం లీడర్ల క్లోజప్ ఫొటోలు కావాలన్నా తననే అడిగేవాళ్లం. ఆ ఫొటోలకు తను ఫేమస్. ఫొటోలలో ఎవరు ఏది అడిగినా ప్రింట్ చేసి, ఇచ్చేవాడు. కాల క్రమేణా ఫొటో ప్రింట్స్, డిజిటల్‌గా మార డంతో కొంత ఇబ్బంది పడ్డాడు. ఫొటోగ్రాఫర్ వృత్తిని కొన్ని రోజులు పక్కనపెట్టి కార్టూన్స్, పెయింటింగ్స్ సాన బెట్టాడు. అప్పుడప్పుడు పిలిచి మరీ చూపించేవాడు. ఆ సమయంలోనూ ఫొటో గ్రాఫర్లకు గుర్తింపు లేదని బాధపడేవాడు. (చదవండి: నాన్న చూపిన ఉద్యమ పథం...) అనారోగ్యం, ఆర్థిక కష్టాలు, కుటుంబ బాధ్యతలు మానసికంగా కుంగదీశాయి. అయినా ఎక్కడా బాధపడేవాడు కాదు. ఎప్పుడూ తెలంగాణ గురించి, సంస్కృతి గురించి మాట్లాడేవాడు. అప్పుడే ప్రత్యేక తెలంగాణ గురించి తన ఆలోచనకు పదును పెట్టాడని చెప్పవచ్చు. ‘రంగుల కల’ లాంటి కొన్ని ఆర్ట్ సినిమాలకూ పనిచేశాడు. కొత్త రాష్ట్రం వచ్చాక బతుకమ్మ, తెలంగాణ సంస్కృతిపై ఎగ్జిబిషన్ పెట్టడం అతనికి సంతోషాన్నిచ్చింది. తనకు బ్లూ కలర్ ఇష్టం. వేసుకొనే టీ షర్ట్లు, రాసుకొనే పెన్ను, ఆఖరికి తను వాడే వస్తువులు, ఇంట్లో కూడా అంతా ‘బ్లూ’ కలరే. ఆయన తీసిన ఫొటోలలో బ్లాక్ అండ్ వైట్, బ్లూ, రెడ్, గ్రీన్, ఆరెంజ్ రంగులు కనపడేవి. (చదవండి: తెలుగు కవితా దండోరా ఎండ్లూరి) గజ్జెల మల్లారెడ్డి, ఏబీకే ప్రసాద్, వి. మురళి, కె. శ్రీనివాస్ లాంటి ఎడిటర్లందరికీ ఇష్టమైన ఫొటో జర్నలిస్టుల్లో బి.బి. ఒకడు. ఇటీవల క్యాన్సర్ మళ్ళీ తిరగబెట్టినప్పుడు ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ వ్యక్తిగతంగా సాయపడింది. ప్రెస్ అకాడమీతో ప్రస్తుత తెలంగాణ సర్కార్ ఆర్థికంగా సాయపడింది. అనారోగ్యాలు, ఆర్థిక కష్టాలు ఎన్ని ఉన్నా అసోసియేషన్ మీటింగంటే, ఓపిక చేసుకొని, తోటి ఫొటోగ్రాఫర్ల బండి మీద వచ్చి, వెళ్ళేవాడు. అందరితో కలవడం అతని కెమేరాకి కొత్త రీఛార్జ్. రోజుకో ఉద్యోగం మారే రోజుల్లో దశాబ్దాల తరబడి నమ్ము కున్న వృత్తిలోనే నిబద్ధతతో పని చేసినవాడు... పని తప్ప బతకడం తెలీనివాడు.. ఫోటోనే ప్రేమించిన వాడు భూషణ్. పాతికేళ్ళుగా క్యాన్సర్‌పై పోరాడిన అతనొక సైనికుడు. చేతిలోని కెమేరానే కన్ను, గన్ను. ఆఖరి వరకూ అలాగే నిలిచాడు. ప్రాణం పోయినా, పోరాటస్ఫూర్తిలో గెలిచాడు. సెల్యూట్ మై ఫ్రెండ్! – కె. రవికాంత్ రెడ్డి ఫొటో ఎడిటర్, సాక్షి -
ప్రముఖ ఫోటో జర్నలిస్టు భరత్ భూషణ్ ఇక లేరు
ప్రముఖ సీనియర్ ఫోటో జర్నలిస్టు గుడిమల్ల భరత్ భూషణ్ ఇకలేరు. అనారోగ్యంతో పోరాడుతూ ఆయన ఆదివారం అర్థరాత్రి తుదిశ్వాస విడిచారు. తెలంగాణా బతుకమ్మ చారిత్రక వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన భరత్ భూషణ్ అస్తమయం సాహితీ లోకంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తెలంగాణ సాంఘిక సాస్కృతిక జీవితాన్ని అపురూపంగా చిత్రించిన ఆయన మరణం తీరని లోటంటూ పలువరు నివాళులర్పించారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రముఖ ఫొటోగ్రాఫర్ గుడిమల్ల భరత్ భూషణ్ ఆదివారం తుదిశ్వాస విడిచారు. గుడిమల్ల అనసూయ, లక్ష్మీనారాయణ దంపతులకు వరంగల్‌లో ఆయన జన్మించారు. నిజానికి బాల్యం నుంచి ఆయనకు చిత్రకళ అంటే ఆసక్తి ఉండేది. అలా కాల క్రమంలో ఫొటోగ్రఫీపై ఆసక్తిని పెంచుకున్న తన అద్భుతమైన ఫోటోలతో గొప్ప ఫోటోగ్రాఫర్‌గా పాపులర్ అయ్యారు. అనారోగ్యం కారణంగా మళ్లీ తన కుంచెకు పని చెప్పారు. ప్రజల జీవన శైలిని, చారిత్రక ఘట్టాలను, సంస్కృతిని తన ఛాయా చిత్రాల్లో అద్భుతంగా చూపించారు. ముఖ్యంగా ఫోటోల ద్వారా బతుకమ్మ సంస్కృతి ప్రపంచానికి తెలియజేసి కల్చరల్ అంబాసడర్ ఆఫ్ తెలంగాణగా ఎదిగారంటే అతిశయోక్తి కాదు. తెలంగాణపల్లె జీవనం , పల్లె దర్వాజా, బొడ్డెమ్మ, బతుకమ్మ, తెలంగాణా మహిళలు ఫోటోలు సహా తెలంగాణ బతుకు చిత్రాన్ని తన ఫోటోలలో చిత్రీకరించిన ఘనుడు భరత్ భూషణ్. పల్లె ప్రజల జీవన వైవిద్యాన్ని ఆయన ఫోటోలు మనకు అర్థం చేయిస్తాయి. కలర్ ఫుల్ దర్వాజాలు, గోడలపై చిలికిన వెల్ల, గొళ్లాలు, కూలిన గోడలు, దర్వాజాలు, ముగ్గులు, వంటింటి వస్తువుల సౌందర్యాన్ని మన కళ్ల ముందుంచుతూ తెలంగాణ పల్లె జీవితం ఆవిష్కరించిన తీరు అద్భుతం. దైనందిన జీవితమే కాదు, పండుగలను పబ్బాలు, జాతర వైభవాన్ని కూడా ఆయన కెమెరా కన్ను అద్భుతంగా మలిచింది. అలాగే చిందుఎల్లమ్మ తొలి చిత్రాన్ని, చాకలి ఐలమ్మ ఫోటోలను ఎలా మర్చిపోగలం. కవి శివ సాగర్, నల్ల కలువ టీ.ఎన్.సదాలక్ష్మి, జానపద పితామహులు బిరుదురాజు రామరాజు వంటి వారి ఫొటోలు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. అంతేనా తెలంగాణా కవి కాళోజి ఛాయాచిత్రాలు తీసిన ఘనతకూడా భరత్ భూషణ్‌దే. భరత్ భూషణ్ సినిమాలకు స్టిల్ ఫోటోగ్రాఫర్ గా కూడా పనిచేశారు. హరిజన్, కాంచన సీత, రంగులకల వంటి మూవీలకు ఫొటోగ్రఫీ చేశారు. మెగాస్టార్ చిరంజీవిగా కరియర్ ఆరంభంలో పత్రికలకోసం చక్కటి ఫోటోలను తీసింది కూడా ఆయననే చెప్పుకుంటారు. వీటన్నింటికి తోడు భరత్ భూషణ్ ఫోటో జర్నలిస్టు మాత్రమే కాదు జానపద కళలపై, కుల వృత్తులపై వ్యాసాలు రాసిన రైటర్ కూడా. ఒకసారి కేన్సర్‌బారిన పడి కోలుకున్నప్పటికి దాదాపు పాతిక సంవత్సరాల తర్వాత ఇటీవల క్యాన్సర్ మళ్ళీ తిరగబెట్టింది. దీనికి తోడు ఇతర ఆనారోగ్య సమస్యలు కూడా తీవ్రం కావడంతో శాశ్వతంగా సెలవు తీసుకున్నారు. దీంతో ఆపై లోకంలో ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టడానికి మన భరత్ భూషణ్ తరలిపోయాడంటూ పలువురు ఫోటోగ్రాఫర్లు, రచయితలు కన్నీటి నివాళులర్పించారు. అనారోగ్యంతో బాధపడుతూ కూడా దశాబ్దాల పాటు ఫోటోగ్రఫీ రంగంలో ఆయన చేసిన కృషి గొప్పదని కొనియాడారు. ఇటీవల కవి ఎండ్లూరి సుధాకర్ వెళ్లిపోయిన విషాదం నుంచికోలుకోకముందే మరో దెబ్బ తగిలిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే అనేక సందర్భాల్లో ఆయనకు తమకు అందంగా తీసిచ్చిన అద్భుతమైన ఫోటోలను గుండెలకు హత్తుకుని పలువురు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అలాగే తన జీవితకథను గ్రంథస్థం చేయాలనుకున్న కల తీరకుండానే వెళ్లిపోయారంటూ సాహితీ మిత్రులు శోకసంద్రమయ్యారు. మరోవైపు భరత్ మరణంతో తెలంగాణ అరుదైన ఫొటో జర్నలిస్టును, చిత్రకారుడిని కోల్పోయిందంటూ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. -
ఐపీఓవై–2022కు హైదరాబాద్ ఆతిథ్యం
గచ్చిబౌలి: ఇంటర్నేషనల్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్(ఐపీఓవై) అవార్డులకు ఎంపికైన హైదరాబాద్‌కు ప్రపంచ వ్యాప్తంగా మరింత గుర్తింపు రానుందని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్, హెచ్ఎండీఏ కార్యదర్శి బి.ఎం.సంతోష్ పేర్కొన్నారు. శుక్రవారం నానక్‌రాంగూడలోని హెచ్‌జీసీఎల్ కార్యాలయంలో మీడియాతో ఐపీవోవై–2022 వివరాలను ఆయన వెల్లడించారు. ఇంటర్నేషనల్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్‌కు ఆతిథ్య నగరంగా హైదరాబాద్ ఎంపికైందన్నారు. 65 దేశాల నుంచి 5 వేల మంది ఫొటోగ్రాఫర్లు పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఫొటో జర్నలిజం, డాక్యుమెంటరీ, ట్రావెల్ అండ్ నేచర్, వైల్డ్ లైఫ్, స్ట్రీట్, పోర్ర్టెయిట్, వెడ్డింగ్, మొబైల్స్ తదితర 8 విభాగాల్లో అవార్డులు ఇస్తారని తెలిపారు. ఐపీఎఫ్ (ఇండియన్ ఫొటో ఫెస్టివల్) వ్యవస్థాపకులు అక్విన్ మాథ్యూస్ మాట్లాడుతూ మొబైల్ ఫోన్లను ప్రత్యేక కేటగిరీగా చేర్చామన్నారు. మార్చి 21 నుంచి ప్రపంచ వ్యాప్త ఫొటోగ్రాఫర్ల నుంచి ఎంట్రీలను స్వీకరిస్తారన్నారు. విజేతల ప్రకటన ఆగస్టు 15, అవార్డుల ప్రదానం హైదరాబాద్‌లో సెప్టెంబర్ 10న ఉంటుందని తెలిపారు. రూ.25 లక్షలు నగదు, కెమెరాలను గెలుచుకునే అవకాశం ఫొటోగ్రాఫర్లకు ఉంటుందన్నారు. -
పట్టి తెచ్చాడులే.. నిండు సూర్యుడినే..
Astrophotographer Andrew McCarthy Sun Photo: సుడులు తిరుగుతున్న లావాలా ఉన్న అగ్నిగోళం ఉపరితలం... పసుపు, ఎరుపు కలగలిసిన ఈకలను తలపిస్తున్న భానుడి భగభగలు... అక్కడక్కడా నల్లటి చుక్కలు... సూర్యుడిని అతి సమీపం నుంచి చూస్తున్నట్టుగా ఉన్నది కదూ! ఇంతటి అద్భుతమైన చిత్రాన్ని ఆస్ట్రోఫొటోగ్రాఫర్ ఆండ్రూ మెక్ కాతీ పట్టి బంధించాడు. నిప్పులు కక్కుతున్న ఆ నిండు సూర్యుడిని... ఓ సోలార్ ఆర్బిటార్ తీసినంత స్పష్టంగా తన కెమెరాలో కట్టిపడేసిన ఆండ్రూ... సూర్యుడిని అంత సమీపంగా, అంత అద్భుతంగా చిత్రీకరించిన మొట్టమొదటి ఫొటోగ్రాఫర్. (చదవండి: అప్పుడే పుట్టిన నవజాత శిశువు పేరు ‘బోర్డర్’..ఎందుకో తెలుసా?) ఇందుకోసం 300 మెగాపిక్సల్స్ కలిగిన కెమెరాను ఉపయోగించాడు. ఇది... సాధారణ కెమెరాకంటే 30 రెట్లు అధికం. ఒక్క పర్ఫెక్ట్ చిత్రం కోసం... ఆయన లక్షా యాభైవేల చిత్రాలను తీసి, వాటిని లేయర్ చేశాడు. నల్లటి చుక్కలను ఫొటోషాప్‌తో ఎడిటింగ్ చేశాడు. సాధారణంగా ఇలాంటివి తీస్తున్నప్పుడు మంటలు వచ్చే ప్రమాదం ఉంది. కళ్లు కూడా పోవచ్చు. వీటిని నివారించడానికి రెండు ఫిల్టర్లు ఉన్న ప్రత్యేక టెలిస్కోప్ వాడాడు. ‘ఆకాశాన్ని ఆవిష్కరించాలనుకున్నప్పుడు అందరూ చంద్రుడినే బెంచ్‌మార్క్‌గా చూస్తారు. కానీ సూర్యుడిని క్యాప్చర్ చేయడం నన్ను ఉత్సాహపరిచే అంశం. ఎందుకంటే సూర్యుడెప్పుడూ బోర్ కొట్టడు. తీసిన ప్రతిసారీ కొత్తగా కనిపిస్తాడు’అని ఆండ్రూ చెబుతున్నాడు. (చదవండి: వామ్మో! ఆ దేశం కేవలం పూల వ్యాపారంతోనే.... రూ.180 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందటా!!) -
పెళ్లింట అవమానం.. ఫోటోలు డిలీట్ చేసి ప్రతీకారం తీర్చుకున్న ఫోటోగ్రాఫర్
పెళ్లి వేడుకలో అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తుల్లో ఫోటోగ్రాఫర్ కూడా ఉంటాడు. పెళ్లి తంతును అందమైన జ్ఞాపకాలుగా మలుస్తాడు. అలాంటి వ్యక్తిని సరిగా గౌరవించకుండా చిరాకు తెప్పిస్తే.. ఇదిగో ఇక్కడ మీరు చూడబోయే ఫోటోగ్రాఫర్ మాదిరిగా ప్రవర్తిస్తాడు. ఆ తర్వాత లబోదిబో అన్నా ఏం ప్రయోజనం ఉండదు. ఉదయం నుంచి పని చేయించుకున్నారు తప్ప.. తిండి పెట్టలేదని ఆగ్రహించిన ఫోటోగ్రాఫర్.. మొత్తం పెళ్లి ఫోటోలను డిలీట్ చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. రెడిట్‌లో షేర్ చేసిన ఈ స్టోరీ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. సదరు ఫోటో గ్రాఫర్ ఆవేదన ఇలా ఉంది.. ‘‘నేను డాగ్ గ్రూమర్ (కుక్కలను అందంగా తయారుచేసే వ్యక్తి)గా పని చేస్తుండేవాడిని. కానీ నా స్నేహితుడి కోరిక మేరకు.. అతడి పెళ్లికి ఫోటోగ్రాఫర్‌గా మారాను. ఉదయం 11.00 గంటలకు పని మొదలు పెడితే సాయంత్రం 7.30 వరకు పని చేస్తూనే ఉన్నాడు. మధ్యలో కాసేపు కూడా విరామం లభించలేదు’’ అని చెప్పుకొచ్చాడు. (చదవండి: వెరైటీ ఆహ్వానం: గిఫ్ట్ విలువను బట్టే పెళ్లి భోజనం) ‘‘కాఫీ, టీల సంగతి పక్కకు పెడితే.. కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. సాయంత్రం ఐదు గంటలకు విందు ఏర్పాటు చేశారు. అప్పుడు కూడా నాకు తినడానికి అవకాశం ఇవ్వలేదు. ఓపిక నశించి.. చివరకు వరుడి దగ్గరకు వెళ్లి.. నాకు 20 నిమిషాల పాటు బ్రేక్ కావాలి. ఏమైనా తిని వస్తాను అని అడిగాను. కానీ పెళ్లి వేడుక జరిగే ప్రాంతంలో ఒక్కటంటే ఒక్క ఓపెన్ బార్ కూడా లేదు. వెనక్కి వచ్చి విషయం చెప్పాను. కానీ వారు దాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. పైగా నువ్వు ఉండాల్సిందే.. వెళ్లిపోతే.. నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని బెదిరించాడు’’ అని చెప్పుకొచ్చాడు. (చదవండి: పెళ్లి చేసుకోవాల్సిన ఈ వధూవరులు ఏం చేస్తున్నారో తెలుసా?) ‘‘ఓ వైపు ఉక్కపోత.. ఆకలి.. దాహంతో నోరు ఎండుకుపోతుంది. ఆ సమయంలో నాకు సాయం చేయాల్సింది పోయి.. అంత రూడ్‌గా మాట్లడటంతో.. నా కోపం పెరిగిపోయింది. ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. వెంటనే నేను అప్పటి వరకు తీసిన ఫోటోలను డిలీట్ చేశాను. ఆ తర్వాత బయట ఒక్క గ్లాస్ చల్లని మంచినీటి కోసం నేను ఏకంగా 250 డాలర్లు ఖర్చు చేశాను. నా స్నేహితుడి తీరు నన్ను ఎంతో బాధించింది’’ అని తెలిపాడు సదరు ఫోటోగ్రాఫర్. ఈ పోస్ట్ చూసిన నెటిజనులు ఫోటోగ్రాఫర్‌కి మద్దతు తెలుపుతున్నారు. ‘‘నీ స్నేహితుడి ప్రవర్తన సరిగా లేదు. వారికి తగిన విధంగా బుద్ధి చెప్పావ్’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: భావోద్వేగం: వధువుని అలా చూసి కంటతడి పెట్టిన వరుడు -
సముద్రంలో పడిన మహిళ..! కాపాడిన ఫోటోగ్రాఫర్..వీడియో వైరల్..!
ముంబై: మనకు ఆపద ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పడం కష్టం. ఆపదలో చిక్కుకుంటే కాపాడే వ్యక్తులు రావడం మన అదృష్టమే. తాజాగా ముంబైలోని. గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలో గోడపై కూర్చున్న ఓ మహిళ ప్రమాదవశాత్తూ సముద్రంలో పడిపోతే ఓ ఫోటోగ్రాఫర్ తన ప్రాణాలకు తెగించి కాపాడాడు. వివరాల్లోకి వెళ్తే.. గేట్ వే ఆఫ్ ఇండియాను చూడడానికి వచ్చిన 30 ఏళ్ల పల్లవి ముండే పక్కనే ఉన్న గోడ మీద కూర్చొని ఉంది. ఒక్కసారిగా ఆ మహిళకు మైకం రావడంతో పక్కనే ఉన్నా సముద్రంలో పడిపోయింది. అదే సమయంలో అక్కడికి వచ్చినా గులాబ్‌చంద్ గోండ్ గమనించి ఆమెను రక్షించడానికి వెంటనే సముద్రంలో దూకాడు. ఆమెను తాడు సహాయంతో ఒడ్డు తీసుకొచ్చాడు . కాగా ఆ మహిళను కాపాడిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సమయస్పూర్తితో మహిళను కాపాడినందుకుగాను ఫోటోగ్రాఫర్పై ప్రశంసల జల్లులు వెలువెత్తున్నాయి. #WATCH | Mumbai: A photographer rescued a woman who lost her balance as she was sitting on the safety wall near Gateway of India and fell into the sea yesterday. pic.twitter.com/9Nraxm0gVu — ANI (@ANI) July 12, 2021 -
పాతబస్తీలో ముజ్ర పార్టీ.. వీడియోలు లీక్
-
పాతబస్తీలో ముజ్ర పార్టీ.. వీడియోలు లీక్
సాక్షి, హైదరాబాద్: ఒక పెళ్లి రిసెప్షన్లో ఏర్పాటు చేసిన ముజ్ర పార్టీ వీడియోలు లీక్ చేశాడనే కారణంతో ఫొటోగ్రాఫర్‌పై దాడి చేసిన ఘటన పాతబస్తీలో జరిగింది. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని వల్లి ఫంక్షన్ హాల్లో జరిగిన పెళ్లి రిసెప్షన్లో నజీర్ అనే వ్యక్తి ముజ్ర పార్టీ ఏర్పాటు చేశారు. వీడియోలు బయటకు రావడంతో ఫొటోగ్రాఫర్‌పై పెళ్లి బృందం దాడికి పాల్పడింది. దీంతో ఫొటోగ్రాఫర్ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాడి చేసిన నజీర్, షేక్ సలాం, అబ్దుల్ రజాక్, ఫైజర్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. -
డ్రోన్‌తో అద్భుతం; ఎనిమిదో వింతను చూడాల్సిందే
ఇజ్రాయెల్‌కు చెందిన డ్రోన్ ఫోటోగ్రాఫర్ లయర్ పటేల్ తన కెమెరాతో అద్భుతం చేశాడు. వందలాది గొర్రెల మంద ఒకేసారి కదులుతుండగా.. పై నుంచి అవి దిశను మార్చుకుంటున్న తీరును కెమెరాలో బందించాడు. ఆ వీడియోలో గొర్రెల కదలికల్ని ఫాస్ట్ పార్వర్డ్ పద్దతిలో ఒకసారి.. స్లో మోషన్ యాంగిల్లో చూపెట్టాడు. ఒకసారి పాములా మెలికలు తిరుగుతూ కనిపించిన గొర్రెల మంద మరోసారి పక్షి ఆకారంలోకి మారడం కనువిందు చేసింది. డ్రోన్‌తో అద్భుతం చేసి చూపించిన లయర్ పటేల్ దీని వెనుక కఠోర శ్రమ దాగి ఉందంటూ చెప్పుకొచ్చాడు. ''కొన్ని నెలలుగా 1000-1700 సంఖ్య ఉన్న గొర్రెల మంద కదలికను డ్రోన్‌లో బందించేందుకు చాలా శ్రమించా. అవి ఒకచోట కుదురుగా ఉండకపోవడంతో వాటి చుట్టే ఏడు నెలల పాటు తిరగాల్సి వచ్చింది. అలా చివరికి ఒక దగ్గర ఆగి అవి ఆహారం మేస్తుండగా.. ఒకసారి స్లో మోషన్లో.. మరోసారి ఫాస్ట్ ఫార్వర్డ్ పద్దతిలో చిత్రీకరించా. తీరా వీడియోను చూశాకా అంత అందంగా వస్తుందని ఊహించలేదు. ఇన్నాళ్ల నా కష్టం ఊరికే పోలేదు. '' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా లయర్ పటేల్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఇప్పటికే వేల సంఖ్యలో వ్యూస్ రాగా.. లయర్ కెమెరా పనితనానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వీలైతే మీరు ఒకసారి లుక్కేయండి. చదవండి: వావ్ అంకుల్.. స్టెప్పులిరగదీశావ్ కదా..! View this post on Instagram A post shared by Lior Patel - Drone Photography (@liorpatel) -
చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. సీనియర్ సినిమాటోగ్రాఫర్ కన్నుమూత
చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు శివన్ (89)కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా వయోభారం, అనారోగ్యం బాధపడుతున్న ఆయన గురువారం(జూన్ 24) కేరళరాష్ట్రం తిరువనంతపురంలోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ తండ్రే శివన్. 60 ఏళ్ల క్రితం తిరువనంతపురంలో శివన్ స్టూడియో పేరుతో ఓ ఫోటో స్టూడియో పెట్టిన శివన్.. స్టిల్ ఫోటోగ్రాఫర్ గా శివన్ విశేష ఖ్యాతి గడించారు. పలు సాంస్కృతిక సంస్థలకు ఆయన ఫోటో స్టూడియోనే కేంద్రంగా ఉండేది. ఆయన తీసిన ఛాయాచిత్రాలు నేషనల్ జియోగ్రాఫిక్, న్యూస్ వీక్, స్పాన్ వంటి పలు అంతర్జాతీయ పత్రికలలో ప్రచురితమయ్యాయి. నిర్మాత, దర్శకుడిగా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఆయన రూపొందించిన ‘అభయమ్’ మూవీ నేషనల్ అవార్డు గెలుచుకుంది.శివన్‌కి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. శివన్ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, గవర్నర్ అరిఫ్ అహ్మద్ ఖాన్ సంతాపం వ్యక్తం చేశారు. -
అగ్ని ప్రమాదం కేసులో కీలక మలుపు
తిరుపతి: తిరుమల అగ్ని ప్రమాదం కేసు కీలక మలుపు తిరిగింది. సజీవ దహనమైన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీవారి ఆలయం ముందున్న ఆస్థాన మండపంలో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 20 దుకాణాలు కాలిపోవడం, ఓ వ్యక్తి సజీవ దహనమవడం కలకలం రేపింది. కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టిన పోలీసులకు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలిశాయి. మృతుడు మల్లిరెడ్డి తన సెల్‌ఫోను, పర్స్ మరో దుకాణంలో ఉంచాడు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. మృతుడి భార్య శోభ సహాయంతో లాక్ తీసి సెల్ ఫోన్‌ను పరిశీలించారు. మంగళవారం వేకువజామున 5 గంటల సమయంలో మల్లిరెడ్డి ఓ సెల్ఫీ వీడియో రికార్డు చేసినట్టు గుర్తించారు. కీలకంగా మారిన ఆ వీడియోలోని విషయం ఏమన్నదే ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మరింది. మరోవైపు ఇప్పటికే పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. మల్లిరెడ్డి ఎలా చనిపోయాడు? అతని ద్వారానే అగ్నిప్రమాదం జరిగిందా? లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ విచారణ లో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ అగ్ని ప్రమాదానికి అరగంట ముందు మలిరెడ్డి పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పట్టుకుని వెళ్తున్న దృశ్యాలు లభించాయి. ఆస్థానమండపంలో జరిగిన అగ్నిప్రమాదం పై ఓ క్లారిటీ వచ్చింది. మల్లిరెడ్డి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్ధారణకు వచ్చారు. ఇక్కడ చదవండి: తిరుమలలో భారీ అగ్నిప్రమాదం : ఫొటోగ్రాఫర్ సజీవ దహనం -
అగ్నిప్రమాదం కేసులో కీలక మలుపు
-
తిరుమలలో భారీ అగ్నిప్రమాదం : ఫొటోగ్రాఫర్ సజీవ దహనం
తిరుమల: శ్రీవారి ఆలయానికి అభిముఖంగా ఉన్న ఆస్థాన మండపం సెల్లార్‌లోని షాపింగ్ కాంప్లెక్స్‌లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఫొటోగ్రాఫర్ సజీవ దహనమయ్యారు. తిరుమల వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ సీఐ జగన్మోహన్రెడ్డి, అగ్నిమాపకశాఖాధికారి ఎం.వెంకటరావిురెడ్డి తెలిపిన వివరాల మేరకు.. ఉదయం 6.30 గంటల సమయంలో షాపింగ్ కాంప్లెక్స్‌లో మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపకశాఖకు, టీటీడీ భద్రతా విభాగానికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అతికష్టం మీద మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో 10 దుకాణాలు పూర్తిగా కాలిపోగా, మరో పది దుకాణాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కాలిపోయిన 84వ నంబరు షాపులో ఒక మృతదేహాన్ని గుర్తించారు. మృతుడిని ఆ షాపులో పనిచేస్తున్న ఫొటోగ్రాఫర్ తుమ్మల మల్లిరెడ్డి (45)గా గుర్తించారు. తిరుచానూరులో నివాసం ఉంటున్న మల్లిరెడ్డి రాత్రి షాపులోనే నిద్రపోయాడు. ఈ నేపథ్యంలో అగ్నిప్రమాదం జరగడంతో వెలుపలకు రాలేక సజీవంగా కాలిపోయాడు. అతడికి భార్య శోభ, కుమారుడు ఉన్నారు. అగ్నిప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా గుర్తించినట్లు సీఐ చెప్పారు. ప్రమాదంలో రూ.40 లక్షలకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంపై, వ్యక్తి మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ చెప్పారు. పరిశీలించిన టీటీడీ ఉన్నతాధికారులు అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, వీజీవో బాలిరెడ్డి, డీఎస్పీ ప్రభాకర్‌రావు ఆ ప్రాంతాన్ని పరిశీలించి ప్రమాదంపై ఆరాతీశారు. మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించారు. సాయంత్రం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి.. బాధితులను ప్రభుత్వం తరఫున ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
మార్కస్‌బార్‌ట్లే: చంద్రుడిని చూపినవాడు
‘గుండమ్మ కథ’లో అక్కినేనికి, జమునకు పెళ్లవుతుంది. తొలిరాత్రి. డాబా మీద వధువు, వరుడు చేరారు. రాత్రి బాగుంది. కొబ్బరాకుల మీద నుంచి వీచే గాలి బాగుంది. ఒకరినొకరు చూసుకుంటున్నారు సరే... ఏం మాట్లాడుకుంటారు. ఆకాశంలో చంద్రుడు కనిపించాడు. తెల్లగా, చల్లగా, నిండుగా ఉన్నాడు. అతన్ని మధ్యవర్తిగా తెచ్చుకుంటే పోదా... పాట మొదలవుతుంది. ‘ఎంత హాయి ఈ రేయి ఎంత మధురమీ హాయి చందమామ చల్లగా మత్తుమందు చల్లగా’... ప్రేక్షకులూ వారిద్దరితో పాటు చందమామను చూస్తారు. చందమామతో కలిసి పాడతారు. చందమామను గుర్తు పెట్టుకుంటూ ఇంటికెళ్లి తమ డాబా మీద కూడా దానిని దించొచ్చేమోనని చూస్తారు. అది చందమామ మహాత్యమా? కాదు. సినిమాటోగ్రాఫర్ మార్కస్ బార్ట్లే మహత్యం. తెలుగువారికి చంద్రుణ్ణి, పున్నమిని, వెన్నెలను, చల్లదనాన్ని ఇచ్చి మబ్బుల్లోకి చేరిన భావుకుడైన సినిమాటోగ్రాఫర్ ఆయన. ‘విజయా’ సంస్థలో సుదీర్ఘంగా పని చేసి, పని చేసిన ప్రతి సినిమాలోనూ చంద్రుణ్ణి స్టూడియోలోకి దించిన ఘనుడు. అందుకే చందమామను తెలుగువారు విజయావారి చందమామ అని కూడా అంటారు. జగతిలో నిజం చందమామ కంటే ఈ విజయావారి చందమామే బాగుంటాడు. మార్కస్ బార్ట్లే ఆంగ్లో ఇండియన్. చిన్నప్పటి నుంచి తండ్రి ప్రోత్సాహంతో కెమెరా పట్టుకుని ప్రయోగాలు చేసి పెద్దయ్యాక సినిమాటోగ్రాఫర్ అయ్యాడు. ట్రిక్ ఫొటోగ్రాఫీలో ఆయన జీనియస్. పాతాళభైరవి, మాయాబజార్‌లలో ఆయన విశ్వరూపం భారతదేశంలో మరెవరికీ సాధ్యం కానిది. కాని అవన్నీ ఆబాలగోపాలం వినోదానికి. కాని రస హృదయం కలిగిన స్త్రీ, పురుషులందరికీ ఆయన సేద ప్రసాదించినది తన చందమామతోనే. వీలున్న ప్రతిపాటలో ఆయన నిండు చందమామను చూపించేవాడు. శాంతం కలిగించేవాడు. ‘పాతాళభైరవి’లో ‘ఎంత ఘాటు ప్రేమయో’ డ్యూయెట్ చూడండి. రాజమహల్లో మాలతి పాడుతూ ఉంటుంది. నిండు చందురూడు వేళ్లాడుతున్న ఉద్యానవనంలో ఎన్.టి.ఆర్. ‘ఓ జాబిలి ఓ వెన్నెల ఓ మలయానిలమా’... అని జాబిల్లితో ఎన్.టి.ఆర్ నివేదించుకోవడం బార్ట్లే అందుకు తగ్గట్టుగా చందమామను సెట్ చేయడం... అద్భుతం. ‘మిస్సమ్మ’ కథంతా చందమామే. ‘ఏమిటో ఈ మాయా’ పాటలో, ‘బృందావనమది అందరిది’ పాటలో చందురుడి అందమే అందం. ఆపై అదే సినిమాలో ‘రావోయి చందమామా’ అనే పాట మార్కస్ బార్టే›్ల చంద్రుడి కోసమే పుట్టింది. అసలు ఈ చంద్రుడే లేకుంటే వీళ్లందరి విరహాలు, వేడుకోళ్లు ఎలా తీరేవా అని. ‘జగదేకవీరుని కథ’లో బి.సరోజా ‘హలా’ అని చంద్రుడికి హలో చెప్పగా ఎన్.టి.ఆర్ పక్కన చేరగా ‘అయినదేదో అయినది ప్రియ గానమేదే ప్రేయసి’ పాట మొదలైతే చూడాలి ఆ పోటీ... ఎన్.టి.ఆర్ అందమా, సరోజా దేవి చందమా, చంద్రుడి చందనమా. ఇక ‘మాయాబజార్’దే కదా అసలు కథంతా. ఆ సినిమా అంతా ఎన్నోసార్లు చంద్రుడు కనిపిస్తాడు. ‘నీ కోసమే నే జీవించునది’ పాటలో చందమామలో ఏకంగా శశిరేఖనే చూస్తాడు అభిమన్యుడు. అసలు రెల్లు పొదల చాటు నుంచి ఉదయించిన చంద్రుడు ద్యోతకమవుతుండగా, నీటి అద్దంపై అతగాడి ప్రతిబింబం పడుతూ ఉండగా, నౌకాయానానికి బయలుదేరిన శశిరేఖను, అక్కినేనిని చంద్రుడు ఎంత ప్రేమగా తల నిమిరాడని. ఎంత అక్కరగా లాలించాడని. మార్కస్ బార్ట్లే మహిమ వల్ల శ్రీకృష్ణుడు, రుక్మిణి సరే బలరాముడు, రేవతి కూడా ముచ్చటగొలుపు తారు. మార్కస్ బార్ట్లే గొప్పవాడని సినీ అభిమానులకు తెలుసు. ఆయనను చాలా ఇష్టంగా తలుచుకుంటారు. ఎప్పుడు ఆకాశాన పూర్ణ చంద్రుడు కనిపించినా ‘అదిగో విజయావారి చందమామ’ అని ఆయనకు నివాళులు అర్పిస్తారు. మార్కస్ బార్ట్లే 1993లో మద్రాసులో మరణించారు. -
ఒక చిత్రం వెయ్యి పదాలు.. కాదు వెయ్యి కావ్యాలు!
కొన్ని ఫొటోలను చూస్తుంటే, ఒక చిత్రం వెయ్యి పదాలు కాదు వెయ్యి కావ్యాలు అనిపిస్తుంది! సొసైటీస్ ఆఫ్ ఫొటోగ్రాఫర్స్ ‘ఫొటో ఆఫ్ ది ఇయర్’ అవార్డ్‌ల కోసం పలు విభాగాల్లో ప్రపంచవ్యాప్తంగా వేలాది ఫొటోలు వచ్చాయి. వాటిని కాచి వడపోసిన తరువాత మిగిలిన ఫొటోలను చూస్తుంటే ఎవరికైనా సరే భావుకత్వం వరదలెత్తుతుంది. ‘న్యూ బార్న్’ విభాగంలో ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ రాచెల్ బర్టన్ తీసిన బేబీ జాస్మిన్ ఫొటో ‘టాప్ ప్రైజ్’ గెలుచుకుంది. ‘వెడ్డింగ్’ విభాగంలో బంధుమిత్రులంతా కలిసి సంతోషంతో వధువును పైకి ఎగరేస్తున్న ఫొటో, ‘ఫ్యామిలీ’ విభాగంలో చల్లటి అనుబంధన చందనం ఉట్టిపడే తండ్రీకొడుకుల ఫొటోలు బహుమతులు గెలుచుకున్నాయి. -
ఫొటోగ్రాఫర్‌కు బాలీవుడ్ హీరో హెచ్చరిక!
బాలీవుడ్ ప్రేమ జంట అర్జున్ కపూర్, మలైకా అరోరాను ఫొటోగ్రాఫర్లు నీడలా వెంటాడుతున్నారు. ఈ లవ్ బర్డ్స్ ఎక్కడికి వెళ్లినా వారిని కెమెరాలో బంధిస్తూ క్లిక్‌మనిపిస్తున్నారు. ఆదివారం నాడు అర్జున్, మలైకా.. కరీనా కపూర్- సైఫ్ అలీఖాన్ దంపతుల నివాసానికి వెళ్లారు. ఈ క్రమంలో ఓ ఫొటోగ్రాఫర్ వీరిని తన కెమెరాలో బంధించేందుకు తెగ ఆరాటపడ్డాడు. ఇందుకోసం ఏకంగా కరీనా ఇంటి గోడెక్కడానికి ప్రయత్నించాడు. అది చూసిన అర్జున్ ఆగ్రహానికి లోనయ్యాడు. వెంటనే అతడిని సమీపించి ఇది చాలా తప్పు అని చెప్తూ ముందు గోడ దిగండి అని కోరాడు. 'అసలు అలా ఎలా గోడెక్కుతారు? మీరు చేసేది చాలా తప్పు' అంటూ వారించాడు. దీంతో అతడు వెంటనే గోడ దిగేశాడు. తర్వాత ఈ ప్రేమ పక్షులు కరీనా ఇంట్లోకి వెళ్లి ఆమె రెండో కొడుకును చూసి, వారికి శుభాకాంక్షలు చెప్పి బయటకు వచ్చారు. వీరిని చూసిన సదరు ఫొటోగ్రాఫర్ తను చేసిన పనికి చింతిస్తూ అర్జున్‌కు క్షమాపణలు చెప్పాడు. ఇదిలా ఉంటే కరీనా కపూర్ ఫిబ్రవరి 21న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఈ తల్లీకొడుకులను చూసేందుకు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఆమె ఇంటికి వెళ్లొస్తున్నారు. కానీ ఇప్పటివరకు సైఫ్ దంపతులు వారి కొడుకు ఫొటోలను అభిమానులతో పంచుకోనేలేదు. చదవండి: ప్రియుడిని ఇంటికి తీసుకెళ్లిన బాలీవుడ్ నటి -
ఫోటో గ్రాఫర్ ఓవరాక్షన్.. వరుడి రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: పుట్టినరోజు, పెళ్ళి..శుభకార్యమేదైనా, వేడుక ఏదైనా, సందర్బం ఏదైనా ఆ మధుర జ్ఞాపకాలను పదికాలాలపాటు పదిలపర్చుకునేందుకు ఫోటోలు, వీడియోలకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. మారుతున్న కాలానికనుగుణంగా ఫోటోగాఫర్లు తమని తాము అప్డేట్ చేసుకుంటున్నారు. వినూత్నంగా సరికొత్త మార్గాలను అన్వేషిస్తూ, పలు టెక్నిక్‌లతో వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇవి చాలావరకు ఆకర్షణీయంగానూ, ఆసక్తికరంగానూ ఉంటాయి కూడా. ముఖ్యంగా పెళ్ళిళ్లలో ఫోటోలు, వీడియోల సందడి లేని సందర్భాన్ని అస్సలు ఊహించలేం..అయితే రాను రాను ఈ ముచ్చట కాస్త.. వెర్రి తలలు వేస్తోంది. మరీ ఇంత అవసరమా అన్న అభిప్రాయం కలుగుతోంది. వేలంవెర్రి అంటూ విసుక్కున్న సందర్భాలు మనలో చాలామందికి అనుభవంలోకి వచ్చి ఉంటాయి. ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెటిజనులను కడుపుబ్బ నవ్విస్తోంది. ‘అతి సర్వత్రా వర్జయేత్’ అంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఒక పెళ్లి వేడుకలో ఫోటోగ్రాఫర్ మరీ అతి చేసి భంగపడిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వరుడి రియాక్షన్ చూసి...వధువు పొట్ట పట్టుకుని పగల బడి నవ్వుతుండటం హైలైట్. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఈ వీడియోను చూసి సరదాకా నవ్వుకోండి..!! ఈ వీకెండ్లో మాంచి టైం పాస్.... -
‘సాగర సంగమం’ ఫోటోగ్రాఫర్ కన్నుమూత
ప్రముఖ ఛాయాగ్రాహకుడు పీఎస్ నివాస్ (73) సోమవారం తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన కేరళలోని కోళిక్కోడ్‌లో ప్రభుత్వాస్పత్రిలో కన్నుమూశారు. క్యాలికట్‌లోని నడక్కావులో పుట్టారు నివాస్. చెన్నైలోని అడయార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిలిం టెక్నాలజీలో సినిమాటోగ్రఫీ కోర్స్ చేశారు. ఛాయాగ్రాహకుడిగా ఆయన తొలి చిత్రం మలయాళ ‘సత్యత్తింటే నిళల్’ (1975). మలయాళ చిత్రం ‘మోహినీయాట్టమ్’ ఆయనకు ఉత్తమ ఛాయాగ్రాహకుడిగా జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది. భారతీరాజా దర్శకత్వంలో కమల్‌హాసన్–రజనీకాంత్–శ్రీదేవి కాంబినేషన్లో రూపొందిన ‘16 వయదినిలే’ (1977) చిత్రం ద్వారా తమిళ తెరకు పరిచయమయ్యారు. మలయాళ, తమిళ చిత్రాలు చేస్తూ ‘వయసు పిలిచింది’ చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత చేసిన ‘నిమజ్జనం’ (1979) ఆయనకు ఉత్తమ ఛాయాగ్రాహకుడిగా నంది అవార్డు తెచ్చిపెట్టింది. చిరంజీవి ‘పునాదిరాళ్లు, కె. విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన క్లాసిక్ ‘సాగర సంగమం’ చిత్రాలకు ఛాయాగ్రాహకుడు నివాసే. భారతీరాజా లీడ్ రోల్లో నటించిన తమిళ చిత్రం ‘కల్లుక్కుళ్ ఈరమ్’ ద్వారా దర్శకుడిగా మారారు నివాస్. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత తమిళంలో 3 సినిమాలకు దర్శకత్వం వహించారు. నివాస్ మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు. -
అనుమానాస్పదస్థితిలో ఫొటోగ్రాఫర్ మృతి
సాక్షి, కట్టంగూర్(నల్గొండ) : అనుమానస్పద స్థితిలో ఫొటోగ్రాఫర్ మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని మల్లారం పంచాయతీ పరిధి ఎస్ఎల్బీసీ కాల్వపక్కనే ఉన్న పెద్దవాగు సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కట్టం గూర్‌లోని అంబేద్కర్‌నగర్‌కు చెందిన మేకల హరికృష్ణ(23) ఈనెల 23న ఉదయం ఈదులూరు రోడ్డు వెంట ఉన్న ఫొటో స్టూడియో తీస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి ద్విచక్రవాహనంపై వెళ్లాడు.సాయంత్రం వరకు ఇంటికి రాక పోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో వారు షాప్‌వద్దకు వెళ్లి చూసేసరికి ఓపెన్ చేసి ఉంది కానీ హరికృష్ణ లేడు. దీంతో బంధువులకు ఫోన్ చేసినా ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యులు వెతుకుతుండగా.. మల్లారం శివారులోని పెదవాగు సమీపంలో ద్విచక్రవాహనం ఉందని గ్రామస్తులు ఆదివారం తెలిపారు. అక్కడికి వెళ్లి చుట్టుపక్కల చూసి.. అటుగా వచ్చేవారిని వాకబు చేశారు. వాగుపక్కనే యువకుడు పడి ఉన్నాడని తెలుసుకుని.. అక్కడికి వెళ్లి చూడగా హరికృష్ణ విగతజీవిగా కనిపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పంచనామా చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హరికృష్ణ అన్న హరిబాబు ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివప్రసాద్ తెలిపారు. -
ఇక చాలు, ఆపేయండి: అనుష్క ఫైర్
సెలబ్రిటీలు కాలు బయటపెడితే చాలు.. ఆటోగ్రాఫులు, ఫొటోగ్రాఫులు అంటూ జనాలు మీదపడిపోతుంటారు. మీడియా అయితే ఊపిరి సలపనివ్వని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఫొటోగ్రాఫర్లు రెప్పపాటులోనే పది ఫొటోలను క్లిక్ క్లిక్‌మనిపిస్తారు. వారి కాలి గోటి నుంచి జుట్టుకు వేసుకున్న రంగు వరకు ఆపాదమస్తకమంతా కెమెరాల్లో నిక్షిప్తం చేస్తారు. వాళ్లేం చేసినా కెమెరాల్లో రికార్డు చేస్తుంటారు. ఇది కొన్నిసార్లు సెలబ్రిటీలకు ఇబ్బందిగా ఉంటుంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి, హీరోయిన్ అనుష్క శర్మకు కూడా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితే ఎదురైంది. బుధవారం నాడు ఆమె, తన భర్తతో బయటకు వెళ్లొచ్చారు. అనంతరం విరాట్‌తో బాల్కనీలో కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. (చదవండి: కేజీఎఫ్ ‘గరుడ’ ఎవరో తెలుసా..?!) అయితే ఈ ఫొటో ఆమె తీయించుకున్నది కాదు, ఎవరో ఫొటోగ్రాఫర్ విరుష్కల అనుమతి లేకుండా తీసి తమ పబ్లికేషన్స్‌లో ఉపయోగించుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో వేదికగా సదరు ఫొటోగ్రాఫర్, పబ్లికేషన్స్‌పై ఒంటికాలిపై లేచారు. "ఎన్నిసార్లు చెప్పినా మారరా? మీరు పదేపదే మా గోప్యతకు భంగం కలిగిస్తూనే ఉన్నారు. ఇక చాలు, ఇలాంటివి తక్షణమే ఆపేయండి" అని ఘాటుగా హెచ్చరించారు. కాగా అనుష్క మరికొద్ది రోజుల్లో పండంటి శిశువుకు జన్మనివ్వబోతున్నారు. ఆరోజు కోసం విరుష్కలు మాత్రమే కాదు, ఆ దంపతుల అభిమానులు సైతం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక అనుష్క గర్భంతో ఉన్న సమయంలోనూ అటు షూటింగ్ సెట్స్‌కు వెళ్తూనే మరోవైపు జిమ్‌లో వర్కవుట్లు చేస్తూ చెమటలు చిందిస్తున్నారు. దీనితోపాటు వైద్యుల సూచనలు, భర్త సహకారంతో యోగాసనాలు కూడా చేస్తున్నారు. (చదవండి: అనుష్క శీర్షాసనం.. కోహ్లి సాయం!) -
షేపవుట్..? ఫొటోషూట్..
‘నాకో మంచి పోర్ట్ ఫోలియో చేసిపెట్టండి’ అంటూ అభ్యర్థిస్తూ ఫొటో గ్రాఫర్లను కలిసేవారిలో సాధారణంగా గ్లామర్ రంగంలో ప్రవేశం కోసం ఎదురుచూస్తున్న ఔత్సాహిక యువతే ఎక్కువ.. అయితే ప్రపంచంలోని అందరి రూట్లనూ అన్ని సంప్రదాయాలనూ మార్చేసిన కరోనా దెబ్బకి ఇదీ మారిపోయింది. దీంతో ఇప్పటికే గ్లామర్ రంగంలో తమకంటూ ఒక ప్లేస్ ఉన్నవారు సైతం ఫిర్ ఏక్‌బార్ అంటూ ఫొటో షూట్స్ కోసం క్యూ కడుతున్నారు. సాక్షి, హైదరాబాద్: ‘అవకాశాలు రావడం మొదలయ్యాక సదరు అవకాశాలు ఇచ్చిన వారి కోసం పాత్రలకు అనుగుణంగా ఫొటో షూట్స్ గ్లామర్ రంగంలో సర్వసాధారణం. అయితే ఇప్పుడు దాదాపు ప్రతి అప్‌కమింగ్ నటి/మోడల్ మళ్లీ తమని తాము మొదటి నుంచీ పరిచయం చేసుకోవాల్సి వస్తోంది. అందుకే మరోసారి పోర్ట్ ఫోలియో ప్లీజ్ అంటున్నారు’ అని చెప్పారు బంజారాహిల్స్‌లో స్టూడియో నిర్వహిస్తున్న ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ షరీఫ్ నంద్యాల. ఒత్తిడితో అధిక బరువు.. ⇔ అనూహ్యంగా వచ్చిపడిన మహమ్మారి దెబ్బకు అందాల తారల రొటీన్ మొత్తం తలకిందులైంది. మొదట్లో ఇది ఒక రోజో, ఒక వారమో ఉండిపోయేది అనుకుని తేలిగ్గా తీసుకున్న కొందరు.. రోజులు, నెలల తరబడి లాక్డౌన్ కొనసాగడంతో జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమయ్యారు. ⇔ నాలుగ్గోడల మధ్య ఉండటమనే అలవాటు లేని వారు, కొత్తగా వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకున్నవారు అంతలోనే ఈ దెబ్బ తగలడంతో ఒత్తిడికి లోనై, ఈటింగ్ డిజార్డర్‌కు గురై బరువు పెరిగిపోయారు. ⇔ యోగా వంటివి చేసినప్పటికీ జిమ్స్‌లో తప్పనిసరిగా చేయాల్సిన స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటి బాడీ టోనింగ్ వ్యాయామాలు చేయకపోవడంతో మరికొందరిలో ఆ మేరకు కండరాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ‘రూపు’దిద్దుకోండి.. నగరంలో గ్లామర్ రంగం ఇప్పడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటోంది. వెబ్ సిరీస్, టీవీ సీరియల్స్, సినిమా షూటింగ్స్, యాడ్ షూట్స్.. నిదానంగానే అయినా పుంజుకుంటున్నాయి. దీంతో తారలు మళ్లీ తమ ‘పాత్ర’లు పోషించడం కోసం సిద్ధమవుతున్నారు. ⇔ సిద్ధమవుతున్న వారు.. తమలో ఎలాంటి మార్పులూ రాలేదని రుజువు చేసుకోవాల్సిందిగా నిర్మాతలు, రూపకర్తల నుంచి ఆదేశాలు అందుతున్నాయి. దీంతో వీరంతా.. జిమ్‌లలో కసరత్తుల టైమ్ పెంచడంతో పాటు సరికొత్త పోర్ట్ ఫోలియోలను రూపొందించమని ప్రముఖ ఫొటోగ్రాఫర్లను కలుస్తున్నారు. ⇔ విచిత్రం ఏమిటంటే.. తమను తాము పరిచయం చేసుకోవడానికి మంచి ఆల్బమ్ రూపొందించమని అడగాల్సిన ఔత్సాహికులు.. కోవిడ్ పుణ్యమాని ఇప్పుడు కొత్త అవకాశాలు దక్కించుకునే పరిస్థితి లేకపోవడం పోర్ట్ ఫోలియోలను వాయిదా వేసుకుంటున్నారు. ఈ చిత్రమైన పరిస్థితులు ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్‌గా మారాయి. కొలత.. కలత.. ⇔ నిత్యం తీసుకుంటున్న కార్బొహైడ్రేట్లను, కేలరీలను కొలుచుకుంటూ ఆ ప్రకారం ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామాన్ని రోజువారీ పనుల్లో భాగంగా మార్చడం వగైరాలు గ్లామర్ రంగంలో పనిచేస్తున్న వారికి మరీ ముఖ్యంగా యువతులకు ఎంత ముఖ్యమో తెలియంది కాదు. ⇔ రూపురేఖలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే రంగం కాబట్టి.. అవకాశాలు అందించడంలో ఫిజికల్ ఫిట్నెస్, మెజర్మెంట్స్ కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే అంగుళాలతో సహా లెక్కించుకుని, శరీరపు కొలతల్లో ఎటువంటి తీవ్రమైన మార్పు చేర్పులూ చోటు చేసుకోకుండా కేర్ తీసుకుంటారు గ్లామర్ తారలు. పోర్ట్‌ఫోలియో తప్పదు.. కొత్తగా అవకాశాలు అందుకోవాలనుకున్నవారు మాత్రమే కాదు లాక్డౌన్ తర్వాత అందరూ కొత్త తారలే అయ్యారు. ఫ్రెష్ ఫొటోషూట్ ద్వారా మాత్రమే వారు తమ లుక్ మీద కాన్ఫిడెన్స్ తెచ్చుకోగలుగుతున్నారు. లాక్డౌన్ సడలింపుల తర్వాత నేను చేసిన వర్క్స్‌లో తారల పోర్ట్ఫోలియోలే ఎక్కువగా ఉన్నాయి. – షరీఫ్ నంద్యాల, ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ -
వెలుగులోకి వచ్చిన రహస్య బీచ్
ఈ భూమండలం మీద ఇప్పటికీ మానవుల దృష్టికి రాని ప్రాకతిక అందచందాలెన్నో ఉన్నాయనే విషయం తెల్సిందే. అలాంటి దృశ్యాలు మానవాళి దృష్టికి అప్పుడప్పుడు రావడం వాటిని చూసి అబ్బుర పడటం కూడా మనకు తెల్సిందే. అందులో కొన్ని సామాన్యంగా కనిపించని అపురూపమైనవి కూడా ఉంటాయి. అలాంటి మెక్సికో పశ్చిమ తీరానికి మారియెట్ దీవుల్లో దాగిన రహస్య బీచ్. ఇదిపై నుంచి చూస్తే ఓ బిలంలో దాగి ఉన్నట్లు కనిపించడం ఈ బీచ్ విశేషం. దీన్ని రహస్య బీచ్‌గా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు మెక్సికో బాంబర్లు బాంబులను దాచేందుకు ఈ దీవిని ఉపయోగించగా, ఆ తర్వాత మెక్సికో ప్రభుత్వం సైనిక్ జోన్‌గా ప్రకటించింది. ఇప్పుడు దాన్ని నేచర్ రిజర్వ్‌గా మార్చడంతో ప్రజలు దీన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలయింది. ఇది పుంటా మీటాకు కొన్ని మైళ్ల దూరంలోనే ఉన్నప్పటికీ దీన్ని మొదటి నుంచి సైనిక కార్యకలాపాలకే ఉపయోగించినందున ఈ రహస్య దీవి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉండిపోయింది. పై నుంచి చూస్తే ఈ రహస్య బీచ్ ఓ బిలం లోపల ఉన్నట్లు కనిపించడానికి కారణం ఎప్పుడు బాంబులు వేయడం వల్లనే ఆ బిలం అలా ఏర్పడి ఉండవచ్చనే అనుమానాలు ఉన్నాయి. ఏదిఏమైనా టార్సిసియో స్వారెజ్ అనే వీడియో గ్రాఫర్ ఇటీవల అక్కడికెళ్లి తన డ్రోన్ కెమేరాతో బిలం బీచ్‌ను అద్భుతంగా వీడియో తీసి విడుదల చేయడం ఇప్పుడు ఈ అందాలు ప్రపంచం దృష్టికి వచ్చింది. -
‘చీకటి’ రోజుల్లో చెన్నై
సాక్షి, చెన్నై: ఆ ఫోటోగ్రఫీ కళాకారుడు ఈ కరోనా కాలాన్ని బ్లాక్డేస్గా అభివర్ణించాడు. తన కంటికి కెమెరా కన్ను జోడించి రంగ రంగుల చెన్నై మహానగరాన్ని నలుపు తెలుపుల మద్రాసు పట్టణంగా మార్చివేశాడు. ‘చెన్నై టూ మద్రాస్’ పేరున ఆనాటి పాత మధురాలను ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంతర్జాతీయ ప్రముఖ ఫొటోగ్రాఫర్ ఎల్ రామచంద్రన్ మాట్లాడారు. ఫొటోగ్రఫీపై ఒక వ్యక్తికి శిక్షణ ఇచ్చేందుకు లాక్డౌన్ సమయంలో చెన్నైలో పర్యటించినపుడు నిర్మానుష్యంగా మారిపోయినరోడ్లు, ప్రయాణికులు లేని కారణంగా బోసిపోయిన చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్, ప్రాచీనకాలం నాటి హెరిటేజ్ భవనాలు ఆశ్చర్యపరిచాయని తెలిపారు. వచ్చేపోయే జనాలతో నిత్యం రద్దీగా ఉండే చెన్నై మహానగరం వెలవెలబోతూ వందేళ్ల వెనకటి మద్రాసు నగరంగా మారిపోయిందా అనిపించింది. లాక్డౌన్ వల్ల కీడేకాదు ప్రకృతి, పర్యావరణ పరంగా మేలు కూడా జరిగింది. రిప్పన్ బిల్డింగ్ కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలు తిరగడం లేదు, బ్రిటీష్ కాలంనాటి ప్రాచీన కట్టడాలు కొత్త అందాన్ని సంతరించుకున్నాయి. 1940 కాలంలో ఎవ్వరూ ఆఫీసులకు వెళ్లేవారు కాదని, ఇళ్ల నుంచే పనిచేసేవారని సమాచారం. నేడు అదే పునరావృతమైంది. భవిష్యత్తులో మరోసారికి అవకాశం లేని ఇటువంటి అరుదైన దృశ్యాలను కెమెరాలో బంధించాలనే ఆలోచన నుంచి ‘చెన్నై టూ మద్రాసు’ అల్బమ్ పుట్టుకొచ్చింది. నాటి రోజులకు అద్దం పట్టాలనే ఉద్దేశంతో బ్లాక్ అండ్ వైట్‌లో ఫొటోలను తీసి అప్పటి మధురస్ముృతులకు అనుగుణంగా వాటిని తీర్చిదిద్దాను. ఫొటోగ్రఫీ అనేది అనంతరం, ఎన్నిరకాల కొత్తపుంతలు తొక్కినా ఇంకా పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. ఫొటోగ్రాఫర్‌గా తన 13 ఏళ్ల కాలంలో యూరప్, నార్త్ అమెరికాతోపాటూ ఆసియా దేశాలన్నీ పర్యటించాను. ఆల్బమ్ ఆవిష్కరణలో ఫొటోగ్రాఫర్ ఎల్ రామచంద్రన్ యూఎస్‌లో యూనివర్సిటీ తమిళ విభాగం నుంచి డాక్టరేట్ పొందాను. అంతర్జాతీయ ఫొటోగ్రఫీ పోటీల్లో అనేక అవార్డులు అందుకున్నాను. సాధారణ ప్రజలు సైతం నా ఫొటో గురించి మాట్లాడుకున్నపుడే నేను ఎంతో కొంత విజయాన్ని సాధించినట్లు భావిస్తాను. రూ.45 వేల విలువ జేసే 550 డీ కెనాన్ అనే సాధారణ కెమెరాతో నా వృత్తిజీవితాన్ని ప్రారంభించి ఈ ఆల్బమ్ కోసం అత్యంత ఖరీదైన అత్యాధునిక 5 డీ మార్క్–4 కెమెరాతో సిగ్మా 14 ఎంఎం ఆర్ట్ లెన్స్‌ను వినియోగించాను. ఆల్బం కోసం తీసిన 400 ఫొటోలు అన్నీ అద్భుతాలే. అభిలాష, అంకిత భావం ఉంటే ఫొటోగ్రఫీలో ఎవరైనా అద్భుతాలు సాధింవచ్చని తెలిపారు. మెరీనాబీచ్ వద్ద నెప్పియార్ వంతెన -
చివరి క్షణాల్లో చావు నుంచి తప్పించిన ఫోటోగ్రాఫర్!
తిరువనంతపురం : చనిపోయిన వారికి అంతిమ కర్మలు నిర్వహించడం సాధారణ విషయం. కానీ ప్రాణాలతో ఉన్న వ్యక్తి చనిపోయాడని భావించి అతని జీవితాన్ని అర్ధాతరంగా ముంగించబోయారు అధికారులు. ఈ విచిత్ర సంఘటన కేరళలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ఎర్నాకుళం జిల్లాలో శివదాసన్ అనే వ్యక్తి మరణించడంతో మృతదేహాన్ని ఫోటో తీసేందుకు ఫోటోగ్రాఫర్ టామీ థామస్‌ను పోలీసులు పిలిపించారు. ఈ ఫోటోలు కోర్టు విచారణలో సాక్షాలుగా వాడేందుకు పోలీసులు ఫోటోగ్రాఫర్‌ను రప్పించారు. (ప్రేమిస్తే తాళి కట్టించుకో, లేదా కత్తితో పోడిపించుకో) మృతదేహాన్ని ఫోటో తీసేందుకు సిద్ధ పడ్డ టామీకి ఓ వింతైన అనుభవం ఎదురైంది. మృతదేహం దగ్గర ఏదో అలికిడి వినిపించడంతో ఉలిక్కిపడ్డ ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్లి చూశాడు. చనిపోయాడని భావిస్తున్న శివదాసన్ ఊపిరి పీల్చుకోవడం పరీక్షించిన టామీ అతడు బతికే ఉన్నాడని గ్రహించి తక్షణమే పోలీసులకు సమాచారం అందించాడు. అనంతరం పోలీసులు అతన్ని ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా అసలు చనిపోయింది శివదాసన్ వాళ్ల బంధువు. అయితే శివదాసన్ తలకు కూడా గాయమై కింద పడిపోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో బంధువులు అతను చనిపోయాడని భావించి దహన సంస్కారాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. (కరోనాతో సీఐ మృతి.. ఎంపీ మాధవ్ దిగ్భ్రాంతి) శివదాసన్ అదృష్టం కొద్ది చివరి క్షణాల్లో చావు నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషయంపై ఫోటో గ్రాఫర్ టామీ మీడియాతో మాట్లాడుతూ.. రెండు దశాబ్దాలుగా ఈ వృత్తిలో కొనసాగుతున్నప్పటికీ ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురవలేదని అన్నారు. మృతదేహం ఉన్న గదిలో వెలుతురు తక్కువ ఉన్నందున స్పష్టత కోసం శరీరం దగ్గరకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. కానీ ఆ వ్యక్తి ఊపిరి పీల్చుకోవడం విన్నప్పుడు ముందుగా భయమేసిందని, ఆతర్వాత పోలీసులకు విషయం తెలిపినట్లు పేర్కొన్నారు. (ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి..) -
సుశాంత్ మరణంపై డబ్బు సంపాదించడం భావ్యమా!
ముంబై : బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై చిత్ర పరిశ్రమ ఇంకా కోలుకోలేకపోతోంది. ఈ యంగ్ హీరో మరణంతో ఇండస్ట్రీలోని అనేక చీకటి కోణాలు వెలుగుచూస్తున్నాయి. బాలీవుడ్లో నెపోటిజమ్‌పై ఇప్పటి వరకు సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ కొనసాగుతోంది. ఇండస్ట్రీలో వారసులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శలు వెల్లువెత్తగా, తాజాగా బాలీవుడ్ స్థార్ దీపికా పదుకొనే సుశాంత్ మరణంపై ఓ ఫోటోగ్రాఫర్పై మండిపడ్డారు. (సల్మాన్ ట్వీట్: విమర్శలు గుప్పించిన సింగర్!) ఇండస్ట్రీలో ఫోటో గ్రాఫర్ల పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సెలబ్రిటీల ఫోటోలు, వీడియోలను అభిమానులకు చేరవేయడంతో వీరు ముందుంటారు. సాధారణంగా సెలబ్రిటీలు ఎక్కడ కనిపించినా ఫోటోగ్రాఫర్లు వారిని క్లిక్‌మనిపించేందుకు తెగ ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలో ఓ ప్రముఖ ఫోటోగ్రాఫర్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ అంతియ యాత్రకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో సుశాంత్ మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి శ్మశాన వాటిక వరకు తీసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. దీనిపై సదరు ఫోటోగ్రాఫర్ ఇలా పేర్కొన్నాడు. దయచేసి నా ఫోటోలు లేదా వీడియోలను నా అనుమతి లేకుండా ఏ ప్లాట్‌ఫామ్‌లోనూ పోస్ట్ చేయరాదు' అంటూ రాసుకొచ్చారు. (జీవితం చాలా చిన్నది నన్బా : కీర్తి) అయితే దీనిపై స్పందించిన దీపికా పదుకొనే.. 'అవునా. మీకు ఈ వీడియో తీయడం సరైనదేనా?. సుశాంత్ కుటుంబం అనుమతి లేకుండా దీనిని సోషల్ మీడియోలో పోస్ట్ చేయడమే కాకుండా దీని ద్వారా డబ్బు సంపాదించడం భావ్యమేనా..' అంటూ దీపికా ప్రశ్నించారు. ఇక దీపికా మాట్లాడిన తీరుపై నెటిజన్లు ప్రసంశలు కురిపిస్తున్నారు. ఇలాంటి విషయాన్ని ప్రస్తావించినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. (సుశాంత్ నెలకు ఎంత ఖర్చు చేస్తారంటే..?) -
ప్రముఖ ఛాయాగ్రాహకుడు బి. కణ్ణన్ కన్నుమూత
ప్రముఖ ఛాయాగ్రాహకుడు భీమ్‌సింగ్ కణ్ణన్ శనివారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. కణ్ణన్ ప్రముఖ తమిళ నిర్మాత, రచయిత, దర్శకుడు భీమ్‌సింగ్ కుమారుడు. బి. కణ్ణన్‌గా అందరికీ తెలిసిన ఈయన ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజాతో ఎక్కువ చిత్రాలకు పనిచేశారు. ఒక్క భారతీరాజాతోనే దాదాపు 40 సినిమాలు చేశారు కణ్ణన్. అందుకే తమిళనాడులో ‘భారతీరాజా విన్కన్గళ్’ (భారతీరాజా కళ్లు) గా ఆయన ప్రసిద్ధి. భారతీరాజాతో ఆయన చేసిన చివరి చిత్రం ‘బొమ్మలాట్టమ్’ (2008). తమిళ్, తెలుగు, మలయాళ భాషల్లో పలు చిత్రాలకు కెమెరామేన్‌గా పనిచేశారు కణ్ణన్. తెలుగులో ఆయన కెమెరామేన్‌గా పని చేసిన చిత్రాల్లో ‘సీతాకోకచిలుక’, ‘ఆరాధన’ వంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. కణ్ణన్‌కు భార్య కాంచన, కుమార్తెలు మధుమతి, జనని ఉన్నారు. ఫిల్మ్ మేకర్ బి. లెనిన్‌కి సోదరుడు కణ్ణన్. బి. కణ్ణన్ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కణ్ణన్ అంత్యక్రియలు నేడు చెన్నైలో జరుగుతాయి. -
అనారోగ్యంతో సాక్షి ఫొటోగ్రాఫర్ మృతి
ముషీరాబాద్ (హైదరాబాద్): సాక్షి దినపత్రిక స్టాఫ్ ఫొటోగ్రాఫర్ ఎం.రవికుమార్ (42) ఆదివారం రాత్రి మృతి చెందారు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రవి అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం తన స్వగ్రామం జడ్చర్లలో జరిగాయి. మూడేళ్ల కిందట ఆయనకు బ్రెయిన్లో ట్యూమర్ ఏర్పడడంతో మొదట ఆపరేషన్ చేశారు. ఒక సంవత్సరం ఆరోగ్యంగా ఉన్న రవి కుమార్.. మళ్లీ ట్యూమర్ పెరగడంతో రెండవసారి ఆపరేషన్ చేయించుకుని ఇంటి దగ్గరే మందులు వాడుతున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో కొద్ది రోజుల కిందట ఆయన్ను స్వగ్రామం జడ్చర్లకు తీసుకువెళ్లారు. కాగా, ఆదివారం ఆరోగ్యం విషమించి మృతిచెందారు. మొదట సూర్య దినపత్రికలో పనిచేసిన ఆయన.. 11 ఏళ్లుగా సాక్షి దినపత్రికలో ఫొటోగ్రాఫర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణ సమాచార శాఖ ఫొటోగ్రఫీ డే సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ఆయన పలుమార్లు రాష్ట్రస్థాయిలో ప్రథమ, ద్వితీయ బహుమతులు గెలుచుకున్నారు. రవికుమార్ మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం తెలిపారు. -
ఈ జింక చాలా తెలివైనది గురూ...
అటు ఒక్కటి కాదు రెండు కాదు... ఐదు చీతాలు.. ఇటేమో ఒక్కటే జింక. మామూలుగా అయితే ప్రాణాలపై ఆశలు వదిలేసుకోవాల్సిందే. ఎందుకంటే అక్కడ ఫ్యామిలీ మొత్తం వచ్చి మీద పడింది. అయితే.. ఈ జింక కాస్త తెలివైనది లాగుంది. టైమ్ కోసం వేచి చూసింది. చాన్స్ రాగానే...వెనక్కాళ్లతో డిష్యూం డిష్యూం అంటూ ఒక్కోదానికి జింతాత చితాచితా చేసి... రయ్యిమంటూ అక్కడ నుంచి పరుగులు తీసింది. కెన్యాలోని సలాయ్షో పార్కులో జరిగిన ఈ సన్నివేశాల్ని బ్రిటన్‌కు చెందిన ఫోటోగ్రాఫర్ కెవిన్ క్లిక్ మనిపించారు. -
కీచక ఫోటో గ్రాఫర్
-
టర్కీ ఫొటోగ్రాఫర్ భావోద్వేగ పోస్ట్..
అంకారా: సోషల్ మీడియాలో టర్కీష్ ఫొటోగ్రాఫర్ ఉగుర్ గాలెన్కు భావోద్వేగ పూరిత ఫోటో సంచలనం రేపుతోంది. ప్రపంచంలో అన్ని దేశాలు ఈ గ్రహంలో నివసిస్తున్నప్పటికీ పాశ్చాత్య దేశాలు, మిగతా దేశాలకు ఉన్న వ్యత్యాసాలను వివరించిన తీరు అద్భుతమని నెటిజన్లు అభినందిస్తున్నారు. గాలెన్కుకు సంబంధించిన ఫొటోను డాక్టర్ సారా హుమర్ ట్విటర్లో పోస్ట్ చేశారు. విశ్వవ్యాప్తంగా నెలకొన్న విభిన్న పరిస్థితులను ఒకే దృశ్యం ద్వారా చిత్రీకరించారని సారా తెలిపారు. ప్రపంచంలో కొన్ని దేశాలు అధిక ఆహారం, అభివృద్ది, సామరస్యతతో వెలుగుతుంటే మరికొన్ని దేశాలు పేదరికం, ఆహార లభ్యత, హింస తదితర అంశాలతో బాధపడుతున్నాయని వీడియో ద్వారా తెలుస్తోంది. పాశ్చాత్య దేశాలలో వినియోగదారులు, నిరుపేద దేశాలలో ప్రజలు ఏ విధంగా నివసిస్తున్నారో ఈ వీడియో ద్వారా అద్భుతంగా వివరించారు. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ..ప్రపంచంలోని కొన్ని దేశాలు మనుషులను చంపడానికి ఉపయోగపడే యంత్రాలను తయారు చేస్తున్నారని..ఈ యంత్రాల వల్ల ప్రజల మధ్య విద్వేషపూరిత వాతావరణం నెలకొంటుందని ఆరిఫ్ ఆయూబ్ అనే నెటిజన్ ట్వీట్ చేశారు. పాశ్చాత్య దేశాలు తమ సైనిక శక్తి, ఆర్థిక ప్రణాళికల ద్వారా వెనకబడిన దేశాలను బానిసలుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారని మహమ్మద్ ఉపాలా అనే మరో నెటిజన్ అభిప్రాయపడ్డాడు. కొన్ని దేశాలు మానవుల హక్కుల గురించి మాట్లాడుతుంటే, మరికొన్ని వాటిని ఉల్లంఘిస్తున్నాయని, ఒకరు న్యాయం గురించి మాట్లాడుతుంటే మరికొందరు అన్యాయాన్ని ఎదుర్కొంటున్నారని ఖాన్ అనే నెటిజన్ తెలిపారు. ఈ భావోద్వేగ అంశాన్ని ప్రపంచానికి చూపించినందుకు మిన్నట్ అలీ అనే నెటిజన్ తన సంతోషాన్ని వ్యక్తపరిచాడు. ఈ వీడియోకు 30 లక్షలపైగా ప్రజలు వీక్షించారని ట్విటర్ అభినందించడం విశేషం. చదవండి: నెమలి ఆర్డర్ చేస్తే టర్కీ కోడి వచ్చింది..! -
స్ఫూర్తిదాయక కథ.. వేలల్లో లైకులు, కామెంట్లు..!
ఢిల్లీ : తినేందుకు తిండి, ఉండేందుకు గూడులేని ఓ యువకుడి జీవన గమనం, అతను ఎదిగిన తీరు ఫోర్బ్స్ ఆసియా-2016 ‘30 అండర్ 30’ జాబితాలో చోటు దక్కించుకునేలా చేసింది. ఢిల్లీ నడి వీధుల్లో గడిచిన తన బాల్యం, ఓ ఎన్జీవో ఆపన్న హస్తంతో బడివైపు అడుగులు.. ఒక్కో మెట్టు ఎక్కుతూ ‘స్ట్రీట్’ ఫొటోగ్రాఫర్‌గా సాగుతున్న ఢిల్లీకి చెందిన విక్కీ రాయ్(32) జీవితం నిజంగా స్ఫూర్తిదాయకం. విక్కీ తన విజయగాథను ఎంతో పాపులర్ అయిన ‘హ్యూమన్స్ ఆప్ బాంబే’ ఫేస్బుక్ పేజీలో గత సోమవారం పంచుకున్నాడు. రెండు రోజుల వ్యవధిలోనే అతని పోస్టు వైరల్ అయింది. 28 వేలకు పైగా లైకులు, వేలాది కామెంట్లతో దూసుకుపోతోంది. ‘మబ్బు వీడిన తర్వాత వెలుగు రాక తప్పదు’ ‘మనసు కదిలించే కథ నీది గురూ..!’ అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ‘స్ట్రీట్’ ఫొటోగ్రాఫర్ కథ విక్కీ మాటల్లోనే.. ‘పశ్చిమ బెంగాల్‌లోని ఓ మారుమూల గ్రామం మాది. నాకు మూడేళ్ల వయస్సు ఉన్నప్పుడు అమ్మానాన్నలు నన్ను తాతయ్య దగ్గర వదిలేశారు. అయితే ఆయన ఎప్పుడూ నన్ను కొడుతుండే వాడు. బతుకుదెరువు కోసం ఊళ్లో చాలా మంది పట్టణానికి వెళ్తున్నారని తెలిసి నేను వెళ్లాలని నిర్ణయించుకున్నా. అప్పుడు నాకు పదకొండేళ్లు. ఓరోజు మా తాత దగ్గర డబ్బు దొంగలించి ఢిల్లీ రైలు ఎక్కేశా. దుర్భర పరిస్థితుల నుంచి బయటపడి గొప్పగా బతికేయాలని ఢిల్లీకి చేరాను. కానీ, ఇక్కడ నన్ను పట్టించుకునే వారెవరూ. నా ఆకలి తీర్చేవారెవరూ. పొట్టకూటి కోసం చెత్త ఏరుకోవడం మొదలు పెట్టాను. బతకాలంటే తిండి కావాలి కదా. బాగా బతకాలనే కోరిక బదులు బతికితే చాలు అనే పరిస్థితులు దాపురించాయి. అయినా పోరాటం ఆపలేదు. కొన్ని రోజుల తర్వాత రైళ్లలో నీళ్ల సీసాలు అమ్మాను. వచ్చిన ఆ కొద్దిపాటి చిల్లరతో దొరికిందేదో కొనుక్కుని తిని.. రోడ్డుపక్కన ఖాళీ స్థలాల్లో నిద్రపోయేవాడిని. దాబా హోటల్లో ప్లేట్లు కడిగేవాడిని. ఆకలితో అలమటించి కస్టమర్లు వదిలేసిన ఆహారాన్ని తిన్నరోజులూ ఉన్నాయి. అయితే, అక్కడికొచ్చే ఓ డాక్టర్ నా దీనస్థితిని గమనించి ‘సలాం బాలక్’ అనే ఎన్జీవోలో చేర్పించారు. చాలా కాలానికి నాకొక ఆశ్రయం దొరికింది. ఆ ట్రస్టు నిర్వాహకులు నాకు చేయూతనందించారు. మూడు పూటలా తిండి పెట్టేవారు. చదువు కూడా చెప్పించారు. అలా త్రివేణి కళా సంగంలో ఫొటోగ్రఫీ కోర్సు చేశాను. అయితే, ఓ ఫొటో ఎగ్జిబిషన్ జరుగున్నప్పుడు బ్రిటీష్ ఫొటోగ్రాఫరొకరు నా పనితనం చూసి మెచ్చుకున్నారు. అదే విషయాన్ని ఎన్జీవో నిర్వాహకులకూ చెప్పాడు. దాంతో నాకు రూ.500 విలువ చేసే ఒక బుల్లి కెమెరా కొనిచ్చారు. స్థానికుడైన ఒక ఫొటోగ్రాఫర్ సాయంతో ఫోటోగ్రఫీపై మరింత పట్టుసాధించా. ‘స్ట్రీట్ డ్రీమ్స్’ పేరుతో వీధి బాలల బతుకు చిత్రాలను చిత్రించి నేను తీసిన ఫొటోలతో ఓ ఎగ్జిబిషన్ పెట్టాను. అది సక్సెస్ అయింది. నా ఫొటోల్ని కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపించారు. న్యూయార్క్, లండన్, దక్షిణాఫ్రికా, శాన్ఫ్రాన్సిస్కో నగరాల్లో పర్యటించి పలు డాక్యుమెంటరీ ఫొటోగ్రఫీ ఈవెంట్లలో పాల్గొన్నాను. నా ఫొటోలతో మంచి గుర్తింపు వచ్చింది. ఇంతలా నా జీవితం మారతుందని కలలో కూడా అనుకోలేదు’అని విక్కీ ఆనందం వ్యక్తం చేశాడు. 2014లో ప్రతిష్టాత్మక ఎంఐటీ మీడియా ఫెలోషిప్‌నకు కూడా విక్కీ ఎంపికవడం విశేషం. -
సాక్షి ఫొటోగ్రాఫర్‌కు జాతీయ అవార్డులు
తిరుపతి కల్చరల్ : తిరుపతికి చెందిన సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్ కేతారి మోహన్ క్రిష్ణకు రెండు జాతీయ అవార్డులు లభించాయి. ఇండియన్ ఇంటర్నేషనల్ ఫొటో గ్రాఫర్స్ కౌన్సిల్, ఆంధ్రప్రదేశ్ ఫొటో గ్రాఫర్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయస్థాయి ఫొటో కాంటెస్ట్ నిర్వహించారు. ఫొటో ట్రావెలర్ విభాగంలో రాత్రి వేళ తిరుమల శ్రీవారి ఆలయ సౌందర్యం ఫొటోకు, ఫొటో జర్నలిజం విభాగంలో తిరుమలకు వైఎస్.జగన్మోహన్రెడ్డి నడుçస్తూ వస్తున్న సమయంలో ఆయనను చూసిన ఓ అభిమాని వెళుతున్న బస్సు కిటికీలోనుంచి దూకుతుండగా తీసిన మరో ఛాయా చిత్రానికి బహుమతులు లభించాయి. అమరావతిలో ఈనెల 18వ తేదీన నిర్వహించనున్న ప్రపంచ ఫొటో గ్రాఫర్స్ దినోత్సవాల్లో కేతారి మోహన్ క్రిష్ణ ఈ అవార్డులను అందుకోనున్నారు. -
బాపట్లవాసికి జాతీయ అవార్డు!
సాక్షి, బాపట్ల : మండలంలోని ముత్తాయిపాలెం గ్రామానికి చెందిన పీవీఎస్ నాగరాజుకు జాతీయ స్థాయిలో ఉత్తమ ఛాయాచిత్ర అవార్డు లభించింది. పాట్నాకు చెందిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫొటోగ్రపీ వారు నేషనల్ డిజిటల్ సర్క్యూట్ నిర్వాహకులు నాగరాజును తృతీయ బహుమతికి ఎంపిక చేశారు. మహిళా వంట చేస్తున్నప్పుడు తీసిన ఫొటోకు అవార్డు లభించింది. ఈ సందర్భంగా బాపట్ల ప్రగతి ఫొటోగ్రాఫర్ అసోసియేషన్ సభ్యులు నాగరాజుకు అభినందనలు తెలిపారు. -
నిశ్చల ప్రేమ కథా చిత్రం
ప్రేమ కథలు భారీగా ఉండక్కర్లేదు. కొన్ని కరిగిపోయే ఐస్‌క్రీమ్‌లా ఉంటాయి. కొన్ని ఎక్కడ తిన్నామో మర్చిపోయి రుచి మాత్రం మిగిలిపోయే స్ట్రీట్ ఫుడ్‌లా ఉంటాయి. కొన్ని గుంపులో మనం అనుకోకుండా క్లిక్ చేసిన ఫొటోగ్రాఫ్లా ఉంటాయి. ఫొటోలో ఉన్న అమ్మాయి నిజ జీవితంలో దొరుకుతుందని ఆశ పడటం ప్రేమకు బాగుంటుంది కాని వాస్తవానికి కాదు. ‘ఫొటోగ్రాఫ్’ సినిమా ఒక ఫొటోగ్రాఫర్‌కి, ఫొటోలోని అమ్మాయికి మధ్య నడిచే ప్రేమ కథ. ‘రఫీ... దాదీ (నానమ్మ) మందులేసుకోవడం మానేసిందట. నిజమేనా?’ అడుగుతాడు బస్తీలోని బడ్డీకొట్టు యజమాని.‘రఫీభాయ్.. మీ దాదీకి బాగలేదట?’ అంటాడు పక్కింటాయన.‘ఏ రఫీ.. దాదీ విషయం ఏదో వింటున్నాను..?’ ఆరా తీస్తాడు స్నేహితుడు!‘ఏంటీ.. ఉత్తరప్రదేశ్‌లోని మా ఊళ్లో ఉన్న దాదీ సంగతి అప్పుడే ముంబైదాకా పాకిందా?’ రఫీ మనసులో ఆశ్చర్యం.దాదీ సమస్యకు పరిష్కారం వెదికాడు. తను ‘నూరీ’ అనే అమ్మాయితో ప్రేమలో పడ్డట్టు దాదీకి ఓ ఉత్తరం రాశాడు. ఆ అమ్మాయి ఫోటోనూ జత చేసి జాబు పోస్ట్ చేశాడు. ‘పిల్ల చందమామ తునకరా! చూడ్డానికి వస్తున్నా’ అంటూ ప్రత్యుత్తరం కన్నా ముందే ముంబైకి వచ్చేసింది దాదీ.అసలు కథ ఇక్కడ నుంచి సాగే ఈ సినిమా పేరు ‘ఫోటోగ్రాఫ్’. దర్శకుడు రితేష్ బత్రా. ‘లంచ్ బాక్స్’ సినిమాను తీసి గుర్తింపు పొందిన దర్శకుడు ఇతడే. అయితే లంచ్‌బాక్స్‌ను దృష్టిలో పెట్టుకోకుండా ఫోటోగ్రాఫ్‌ను చూడండి. మీకు నచ్చుతుంది. అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. సాన్యా మల్హోత్రా (దంగల్, పటాకా, బధాయీ హో ఫేమ్), నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఫరూఖ్ జఫర్, గీతాంజలీ కులకర్ణి ముఖ్య పాత్రలు. పాజ్ ఆఫ్.. ప్లే ఆన్ అయితే రఫీ చెప్పిన నూరీ ఎవరు? వాస్తవానికి ‘నూరీ’ గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర కనిపించిన అమ్మాయికి రఫీ పెట్టుకున్న పేరు. ఆమె ఒరిజినల్ పేరు మిలోని (సాన్యా మల్హోత్రా). గుజరాతీ, అప్పర్ మిడిల్‌క్లాస్ అమ్మాయి. సీఏ ఇంటర్ చదువుతూంటుంది. టాప్ స్టూడెంట్. ఒకరోజు కుటుంబంతో కలిసి షాపింగ్ వెళ్లిన మిలోని గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర ఇన్స్టంట్ ఫోటోగ్రాఫ్స్ తీసిపెట్టే రఫీ (నవాజుద్దీన్ సిద్దిఖీ)కి కనపడుతుంది. ఆమెకు ఫొటో తీసుకోవాలని ఉండదు. కాని ఆమెను కన్విన్స్ చేసి ఫోటో తీస్తాడు. ఆ ఫోటోగ్రాఫ్ తీసుకొని డబ్బు చెల్లించే లోపే తల్లి పిలవడంతో మిలోని వెళ్లిపోతుంది. ఆ రోజే రఫీకి వాళ్ల దాదీ నుంచి కొత్త బెదిరింపు ఎదురవుతోంది. తను బతికుండగానే రఫీ పెళ్లి చూడాలని.. అల్లా కరుణిస్తే.. రఫీ పిల్లలతో ఆడుకోవాలనీ ఆమె ఆశ. రఫీకేమో ఇప్పుడప్పుడే పెళ్లి ఆలోచన ఉండదు. ఊర్లో చేసిన అప్పు తీరాక.. ఆర్థికంగా కాస్త స్థిరపడ్డాక.. అంటే సొంతంగా ఓ వ్యాపారం మొదలుపెట్టిగాని పెళ్లి జోలికి వెళ్లొద్దు అనుకుంటాడు. అందుకే దాదీ మాటను లెక్కచేయడు. దాంతో దాదీ (ఫరూఖ్ జఫర్) రకరకాల హెచ్చరికలు, బెదిరింపులకు పాల్పడుతూ ఉంటుంది. ఊరి నుంచి అతడు నివాసం ఉండే ప్రాంతంలోని ఇరుగుపొరుగు వారికి తెలిసేలా గోల చేస్తుంటుంది. మనవడు పెళ్లికి ఒప్పుకునేదాకా మందులు వేసుకోవడం మానేస్తుంది. ఆ బెదిరింపుకి విరుగుడుగా రఫీ ఆడిన అబద్ధమే అనుకోకుండా కనిపించిన మిలోనీని తను ప్రేమించిన ‘నూరీ’గా ఉత్తరం ద్వారా దాదీకి పరిచయం చేయడం. ఆ అమ్మాయిని చూడ్డానికి వస్తాను అని దాదీ అనేసరికి ఆ అబద్ధాన్ని నిజంలా నటించే ప్రమాదం రఫీ నెత్తిన పడుతుంది. సెర్చింగ్‌లో.. కనీసం పేరు కూడా తెలియని మిలోనీని ఎలా వెదకాలి అనే ఆలోచనల్లో పడ్తాడు రఫీ. సిటీబస్‌లో వెళ్తుంటే ఓ చోట ఓ పెద్ద హోర్డింగ్ కనపడ్తుంది. ఆత్రంగా వెనక్కి తిరిగి మరీ చూస్తాడు. ఆ అమ్మాయే! తర్వాత స్టాప్‌లో దిగిపోయి గబగబా ఆ హోర్డింగ్ ఉన్న చోటికి వస్తాడు. అదో సీఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్. టాప్ స్టూడెంట్ అయిన మిలోని ఫోటోతో పబ్లిసిటీ కోసం పెట్టిన హోర్డింగ్ అది. దాని ఆధారంగా ఆమెను వెతుక్కుంటూ వెళతాడు. కాసేపటికి మిలోనీ దర్శనమిస్తుంది. రఫీ మొహం విప్పారుతుంది. బస్‌లో కలిసే ప్రయాణం చేస్తారు. తర్వాత రోజూ ఆమెను కలుస్తాడు. విషయం వివరిస్తాడు. దాదీ ఆగమనం.. మిలోని మితభాషి. యాక్టర్ కావాలనుకుంటుంది. సీఏ కావాలని తండ్రి డిసైడ్ చేస్తాడు. మారు మాట్లాడకుండా సీఏలో చేరుతుంది. ఆ అమ్మాయి వేసుకునే బట్టలను వాళ్లమ్మ సెలెక్ట్ చేస్తుంది. తనకి ఇష్టమైనవి కాకపోయినా ఒప్పేసుకుంటుంది. అలా మిలోని మనసు విప్పి మాట్లాడే సందర్భాలను ఆ ఇంట్లో చాలా తక్కువగా కల్పిస్తుంటారు. అన్నిటికీ అన్నిటినీ పెద్దవాళ్లే నిర్ణయిస్తారు. ఆ అమ్మాయి ఫాలో అవుతుంది. అలాంటి మిలోని దాది దగ్గర గలగలా మాట్లాడుతుంది. రఫీ దాదీని పరిచయం చేశాక ‘మీరెలా కలిశారు?’ అని అడుగుతుంది దాదీ. గేట్ ఆఫ్ ఇండియా దగ్గర అని నిజమే చెప్తుంది. మీ కుటుంబం? అన్న ప్రశ్నకే అతికే అబద్ధాన్ని సెకన్లలో అవలీలగా అల్లేస్తుంది. ‘మా అమ్మానాన్న.. మస్జిద్ గోడ కూలి చనిపోయారు. అక్కా, బావల దగ్గర పెరిగాను. హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాను’’ అని. ఆశ్చర్యపోతాడు రఫీ. అలా దాదీతో మాట్లాడ్డం, ఆమెతో ముంబైలో తిరగడాన్ని చాలా ఇష్టపడ్తుంది మిలోని. ఇంట్లో దొరకని సాన్నిహిత్యం, ప్రేమ, స్వేచ్ఛ ఆమె దగ్గర పొందుతున్నట్టు ఫీలవుతుంది. రఫీ బాల్యం గురించి చెప్తూ ఉంటుంది దాదీ. వింటూ ఎంజాయ్ చేస్తుంది మిలోని. సోల్‌మేట్స్.. దాదాపు రోజూ క్లాసెస్ అయిపోగానే లేదంటే కొన్ని క్లాసెస్ డుమ్మా కొట్టి మరీ దాదీని కలుస్తూ ఉంటుంది మిలోని. తెలియకుండానే రఫీ, మిలోని ఒకరి సాంగత్యాన్ని ఒకరు ఇష్టపడుతూ ఉంటారు. ఆ అమ్మాయిని సినిమాకు తీసుకెళ్తాడు. అతనితో తన బాల్య జ్ఞాపకాలను నెమరువేసుకుంటుంది. తనెలా ఉండాలని కోరుకుంటుందో అలా ఉంటూంటుంది రఫీ దగ్గర. అయినా తామిద్దరి మధ్యా ఉన్న మతం, డబ్బు అంతరాన్ని ఓ పక్క గుర్తు చేసుకుంటూనే ఉంటుంటాడు రఫీ. ఇంకోవైపు ఆమె బాయ్ప్రెండ్లా ప్రొటెక్టివ్గానూ ప్రవర్తిస్తుంటాడు. దాదీ స్ట్రీట్‌ఫుడ్ (ఐస్‌ఫ్రూట్ లాంటిది) ఇప్పిస్తున్నప్పుడు ‘వద్దు.. ఆమెకు జలుబు చేస్తుంది. అసలే పరీక్షలు. జబ్బు పడితే కష్టం’ అనే మిషతో ఆ ఐస్‌ఫ్రూట్‌ను మిలోని తిననివ్వకుండా రఫి చేసే ప్రయత్నం మొదటి విషయంలో భాగమైతే మిలోని కోచింగ్ ఇన్స్టిట్యూట్లోని ఫ్యాకల్టీ ఆ అమ్మాయి పట్ల చనువుగా బిహేవ్ చేస్తుంటే మిలోనీని అక్కడి నుంచి తీసుకెళ్లడం రెండో విషయానికి ఉదాహరణ. మొత్తానికి ఇద్దరికీ ఒకరి పట్ల ఒకరికి ఇష్టం అయితే ఉంటుంది. కాని ప్రకటించుకోరు. సోల్మేట్స్లా బిహేవ్ చేస్తారు. పెళ్లి చూపులు.. ఇంకోపక్క మిలోనికి పెళ్లి సంబంధం వస్తుంది. వరుడు విదేశాల్లో డాక్టర్. ఇంట్లో వాళ్లకు నచ్చుతాడు. మిలోని సమ్మతి మాట వరుసకే. అబ్బాయిని కలవమని చెప్తారు ఇంట్లో వాళ్లు. ఓ రెస్టరెంట్లో కలుస్తుంది. ఇష్టాయిష్టాలు తెలుసుకునే క్రమంలో ‘నీకు ఎక్కడ ఉండాలని ఉంది? ఇండియాలోనా? అబ్రాడ్లోనా?’ అంటాడు పెళ్లికొడుకు.‘ఇండియాలోని పల్లెటూళ్లో’ అని సమాధానమిస్తుంది మిలోని.అవాక్కవుతాడు అబ్బాయి.‘పల్లెటూళ్లోనా? అక్కడ ఏం చేస్తావ్?’ అడుగుతాడు అదే విస్మయాన్ని కంటిన్యూ చేస్తూ.‘ఆ స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ పొలాల్లో పనిచేస్తూ ప్రశాంతంగా ఉంటా’ చెప్తుంది మిలోని.ఏడ్వలేక నవ్వుతాడు అబ్బాయి అయోమయంగా. అతణ్ణి కలిశాననిపించుకొని క్లాస్ ఉందని వెంటనే రఫీ దగ్గరకు వెళ్తుంది మిలోని. రఫీ దాదీ ఆ ఇద్దరి పెళ్లి ఏర్పాట్లకు సన్నద్ధమవుతుంది. ‘ఆ అమ్మాయి ఇంకా చదువుకోవాలి.. ఇప్పుడప్పుడే కాదు’’అని దాటవేసేందుకు ట్రై చేస్తాడు రఫీ. నిజానికి అతనికీ మనసులో మిలోని జీవితభాగస్వామి అయితే బాగుండు అనే బలంగా అనిపిస్తూంటుంది. ఆమెతో సమం కావాలంటే ఆ స్ట్రీట్ ఫోటోగ్రాఫర్ పనికి స్వస్తి పలక వల్సిందే అనుకుంటాడు. వ్యాపారం మొదలుపెట్టాలి ఏం వ్యాపారం? అనే తలపుతోనే ఆ రాత్రి నిద్రపోతాడు. ఫ్యాన్‌కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న తన ఇంటి యజమాని కనిపిస్తాడు. తనలా కూల్‌డ్రింక్ ఫ్యాక్టరీ పెట్టుకోమని సలహా ఇచ్చి వెళ్లిపోతాడు. నిద్రలేస్తాడు. ఆ వ్యాపారం ఆరంభించాలనే నిశ్చయానికి వస్తాడు. ఆ రోజు మిలోనితో మళ్లీ సినిమాకు వెళ్తాడు. మధ్యలోనే బయటకు వచ్చేస్తుంది మిలోని. వెంట రఫీ వచ్చి.. ‘సినిమా నచ్చలేదా?’ అడుగుతాడు. ‘అన్నీ ఒకేరకంగా ఉంటున్నాయి. మీకు బోర్ కొట్టదా?’ అని తిరిగి ప్రశ్నిస్తుంది. ఇక్కడితో ఈ సినిమాకు ఎండ్ టైటిల్స్!సినిమాలన్నీ ఒకే రకంగా ఉంటాయో.. ఉండవో.. చూసే వాళ్ల పర్సెప్షన్! ప్రేమ కథలూ అన్నీ ఒకే రకంగా అనిపిస్తాయా లేదా అన్నది కూడా పాఠకుల, వీక్షకుల దృక్పథాన్ని బట్టే! ఈ ఫోటోగ్రాఫ్ కూడా అంతే! అందుకే కాబోలు.. ఈ స్టోరీ ముగింపును ప్రేక్షకులకు వదిలేశాడు దర్శకుడు.బహుశా రఫీ కూడా ఆమెకు కొన్నాళ్లకు బోర్ కొడతాడా? ఫొటో తీసిన లిప్తకాలం పాటు నిలబడి జారిపోయే ప్రేమకథా ఇది? కెమెరా ఉన్నంత మాత్రాన ఫిల్మ్‌లో బంధించే ప్రతీది ఫొటోగ్రాఫర్ సొంతమవదు కదా అని చెప్పదలుచుకున్నాడా... అది ఒక్కొక్కరు ఒక్కోవిధంగా ఊహించుకోవాలి. ఒక నిశ్చల ప్రేమ కథా చిత్రం ‘ఫొటోగ్రాఫ్’. – సరస్వతి రమ -
తేజ్ ప్రతాప్ బౌన్సర్ వీరంగం
-
తేజ్ ప్రతాప్ బౌన్సర్ వీరంగం
పట్నా : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ వ్యక్తిగత సిబ్బంది ఒకరు వీరంగం సృష్టించాడు. ఏడో విడత ఎన్నికల పోలింగ్ సందర్భంగా తేజ్ ప్రతాప్ ఆదివారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఈ సందర్భంగా తేజ్ ప్రతాప్ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఓ ఫోటోగ్రాఫర్... కారు అద్దాలు ధ్వంసం చేశాడంటూ తేజ్‌ప్రతాప్ బౌన్సర్ దౌర్జన్యం చేసి, అతడిపై చేయి చేసుకుంటూ కెమెరాను ధ్వంసం చేశాడు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అయితే ఇంత జరిగినా తేజ్ ప్రతాప్ ఏమాత్రం జోక్యం చేసుకోలేదు. అంతేకాకుండా తమ బౌన్సర్ల తప్పేమీ లేదంటూ ఆ చర్యను ఆయన సమర్థించుకున్నారు. తాను ఓటు వేసి వెళుతున్న సందర్భంగా తన కారు అద్దాలను ఓ ఫోటోగ్రాఫర్ ధ్వంసం చేశాడని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తేజ్ ప్రతాప్ తెలిపారు. ఇదంతా చూస్తుంటే తనను హతమార్చేందుకు కుట్ర జరిగినట్లు ఉందని ఆయన ఆరోపణలు చేశారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
సీఎం మార్ఫింగ్ ఫొటో షేర్ చేసినందుకు...
కోల్‌కత : వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫొటో షేర్ చేసినందుకు ఓ బీజేపీ కార్యకర్త అరెస్టయ్యారు. మమత పరువుకు భంగం కలిగించారంటూ కొందరు ఫిర్యాదు చేయడంతో బీజేపీ యువమోర్చా కార్యకర్త ప్రియాంక శర్మను మే10న పోలీసులు అరెస్టు చేశారు. గత సోమవారం న్యూయార్క్‌లో మెట్‌గాలా ఫ్యాషన్ షో - 2019 జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో ప్రియాంకా చోప్రా, ఆమె భర్త నిక్ జోనస్ పింక్ కార్పెట్‌పై నడిచారు. సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. అయితే, ప్రియాంక ఫొటోతో మమతా బెనర్జీ చిత్రాన్ని మార్పింగ్ చేసి కొందరు ఔత్సాహికులు సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. (బెస్ట్ కపుల్... వరస్ట్ లుక్) దీనిని ప్రియాంక శర్మ కూడా షేర్ చేశారు. అయితే, మమత పరువుకు భంగం కలిగించారంటూ అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. పరువు నష్టం (ఐపీసీ సెక్షన్ 500), అభ్యంతరకర మెసేజ్‌లు (66 ఏ-ఐటీ చట్టం) కింద కేసులు నమోదు చేశారు. కోర్టు ఆమెకు14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. కాగా, తన కూతురు బీజేపీకి చెందిన వ్యక్తి కావడంతో అరెస్టు చేశారని ప్రియాంక తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, 6 నెలల క్రితమే బీజేపీలో చేరిన ప్రియాంక హౌరా జిల్లా క్లబ్ సెల్ కన్వీనర్‌గా పనిచేస్తున్నారు. ప్రియాంక శర్మ -
సాక్షి ఫొటోగ్రాఫర్‌పై పోలీసుల నిర్బంధకాండ
సాక్షి, అమరావతి: విధి నిర్వహణలో ఉన్న సాక్షి ఫొటో జర్నలిస్టుపై పోలీసులు నిర్బంధకాండకు పాల్పడ్డారు. తాను సాక్షి ఫొటోగ్రాఫర్‌నని చెప్పినా.. అందుకు సంబంధించిన గుర్తింపు కార్డులు చూపినా పోలీసులు వినిపించుకోలేదు. ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఆదేశాలతో శుక్రవారం మాచవరం పోలీస్‌స్టేషన్‌కు తరలించి గంటల తరబడి అక్రమంగా నిర్బంధించారు. విషయం తెలుసుకున్న జర్నలిస్టులు పోలీసుస్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగడంతో పోలీసులు దిగివచ్చారు. సాక్షి ఫొటోగ్రాఫర్ విజయకృష్ణను విడుదల చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల్ని అమలు చేయాలని శుక్రవారం హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు విధుల నుంచి రిలీవ్ కావాల్సి ఉంది. అదే సమయంలో ఇంటెలిజెన్స్ పోలీసుల వాహనాల్లో టీడీపీ అభ్యర్థులకు భారీఎత్తున డబ్బుల సంచులు చేరవేస్తున్నారనే సమాచారం రావడంతో అక్కడ సాక్షి ఫొటోగ్రాఫర్ విజయకృష్ణ కెమేరాతో వేచి ఉన్నారు. అతన్ని గమనించిన ఇంటెలిజెన్స్ సిబ్బంది కెమేరా లాక్కొని కార్యాలయంలోనికి తీసుకెళ్లి నిర్బంధించారు. కెమేరాలోని ఫొటోలన్నీ డిలీట్ చేయాలని ఒత్తిడి తెచ్చారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఫొటోలతోపాటు మరికొన్ని ముఖ్యమైన ఫొటోలున్నాయని ఫొటోగ్రాఫర్ బదులిచ్చారు. అయినా బెదిరించిన ఇంటెలిజెన్స్ సిబ్బంది కెమేరా లాక్కొని వారి సొంత ఫొటోగ్రాఫర్‌తో చిప్ ఫార్మెట్(ఫొటోలు డిలీట్) చేయించారు. అక్కడితో ఆగకుండా ఫొటోగ్రాఫర్ నుంచి గుర్తింపు కార్డులను, సెల్‌ఫోన్‌ను లాక్కున్నారు. లోకల్ పోలీసులకు అప్పగించాం.. విషయం తెలుసుకున్న సాక్షి స్టేట్బ్యూరో ఇన్చార్జి ఎన్.వెంకటరెడ్డి ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావుతో ఫోన్లో మాట్లాడారు. సాక్షి ఫొటోగ్రాఫర్‌ను ఇంటెలిజెన్స్ ఆఫీసు వద్ద పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారని, ఎందుకు తీసుకున్నారో చెప్పాలంటూ మాట్లాడుతుండగానే.. మేము లోకల్ పోలీసులకు అప్పగించాం. అక్కడ మాట్లాడుకోండంటూ ఫోన్ కట్ చేశారు. అనంతరం విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావును ఫోన్లో సంప్రదించగా తనకు సమాచారం లేదని, తెలుసుకుంటానని జవాబిచ్చారు. బాస్‌ల డైరెక్షన్.. పోలీసుల యాక్షన్.. మాచవరం పోలీసులు ఇంటెలిజెన్స్ పోలీస్ బాస్ డైరెక్షన్లో ఓవరాక్షన్ చేశారు. గుర్తింపు కార్డులు పరిశీలించిన తర్వాత కూడా ఉద్దేశపూర్వకంగానే నిర్బంధించారు. విషయం తెలిసి మాచవరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన పలువురు జర్నలిస్టులు ఫొటోగ్రాఫర్‌ను నిర్బంధించడాన్ని తప్పుబట్టారు. ఫొటోగ్రాఫర్‌ను వదిలిపెట్టడానికి పోలీసులు నిరాకరిస్తూ.. తమ బాస్‌ల నుంచి ఆదేశాలు రావాల్సి ఉందన్నారు. జర్నలిస్టులు సీఐ వచ్చాక మాట్లాడగా.. అక్కడకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో లెటర్ రాసిస్తే విడిచిపెడతామని ఆయన మెలికపెట్టారు. ఏ తప్పూ లేనప్పుడు ఎందుకు లెటర్ రాసివ్వాలని ప్రశ్నించిన జర్నలిస్టులు అక్రమ నిర్బంధానికి నిరసనగా మాచవరం పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఫొటోగ్రాఫర్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన ఉధృతం కావడంతో సీఐ శ్రీనివాస్ యాదవ్.. పోలీస్ కమిషనర్, ఇతర పోలీస్ బాస్‌లతో మాట్లాడి ఫొటోగ్రాఫర్‌ను విడిచిపెట్టారు. ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి... ఇలాంటి చర్యలు పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడమే అవుతుందని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(ఏపీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకట్రావు తప్పుబట్టారు. మాచవరం పోలీస్‌స్టేషన్ ఎదుట జరిగిన ఆందోళన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న ఫొటో జర్నలిస్టును కావాలనే నిర్బంధించారని, తాను జర్నలిస్టునని గుర్తింపుకార్డు చూపాక కూడా దౌర్జన్యానికి పాల్పడటం సరైంది కాదని అన్నారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శాంతిశ్రీ,, సాక్షి స్టేట్ బ్యూరో ఇన్చార్జి ఎన్.వెంకటరెడ్డి, సాక్షి ఫొటో ఎడిటర్ కె.రవికాంత్‌రెడ్డి, సీనియర్ జర్నలిస్టులు సి.మాణిక్యాలరావు, మల్లు విశ్వనాథరెడ్డి, ఆకుల అమరయ్య, సీహెచ్ శ్రీనివాసరావు, జీపీ వెంకటేశ్వర్లు, వనం దుర్గాప్రసాద్, డొక్కా రాజగోపాల్లతోపాటు పలువురు జర్నలిస్టులు, ఫొటో జర్నలిస్టులు, స్థానిక విలేకరులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. -
స్టార్ట్డస్ట్
జూనియర్ ఆర్టిస్ట్ సునందను ఎవరో కత్తితో పొడిచి చంపేశారని పోలీస్ స్టేషన్‌కి సమాచారం వచ్చింది. ఇన్స్పెక్టర్ వేణుగోపాల్‌కి ఫోన్ చేసి ఎస్సై అన్వర్ ఈ సంఘటన గురించి చెప్పాడు. అతను ఇంకా రెడీకాలేదు. ‘వేళాపాళా లేని దరిద్రగొట్టు ఉద్యోగం’ అని గొణుక్కుంటూనే స్టేషన్‌కి వెళ్లాడు.‘ఎక్కడ మర్డర్ జరిగిన స్పాట్?’’ స్టేషన్లోకి ఎంటరవుతూనే ఎస్సైని ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్వేణుగోపాల్.‘‘ఎల్లారెడ్డిగూడా సార్’’‘‘సరే.. పద..!’’ అని పోలీసు వ్యాన్‌లో కొందరు పోలీస్ కానిస్టేబుల్స్‌ని తీసుకుని బయల్దేరాడు. సునంద ఉంటున్నది ఒక రేకుల ఇల్లు. రెండువందల గజాల స్థలంలో చుట్టూ కాంపౌండ్ వాల్ మధ్య రెండుగదుల ఇల్లు. ఇంటి ముందు పూల మొక్కలతో నీట్‌గా ఉంది. బెడ్రూమ్లో సునంద రక్తపు మడుగులో పడి ఉంది. పల్చటి నీలం రంగు నైటీ వేసుకుని ఉంది. ఆమెకు సుమారు నలభై ఏళ్లుండొచ్చు.బెడ్ మీద శవం పడి ఉంది. ఒక స్టూలు మీద కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తోంది సునంద కూతురు అనుపమ.‘‘వెపన్ దొరుకుతుందేమో వెతకండి..’’ అని ఎస్సైతో చెప్పాడు ఇన్స్పెక్టర్ వేణుగోపాల్.‘‘ఎస్సార్..’’ అని హెడ్‌తో కలసి ఇల్లు, బయట పూలమొక్కల మధ్య, పెరట్లోను వెతకసాగాడు ఎస్సై అన్వర్.‘‘చెప్పమ్మా! మీ అమ్మను ఎవరు హత్య చేసి ఉంటారు?’’ అనుపమను ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్.‘‘ఏమో సార్! తెలియడం లేదు..’’ అని చున్నీతో కన్నీళ్లు తుడుచుకుంది.‘‘మీ అమ్మ చనిపోవడం ఎప్పుడు గమనించావు?’’‘‘నేను పక్క రూమ్‌లో పడుకుంటాను సార్! అమ్మ లేటుగా వస్తుంటుంది. షూటింగ్లో ఆలస్యమవుతూ ఉంటుంది. గేటు మామూలుగా తెరుచుకునేట్టు గొళ్లెం పెట్టి, ఇంటికి తాళం వేసి వెనుక పెరట్లో నుంచి లోపలకు వెళ్లి పడుకుంటాను. అమ్మ దగ్గర డూప్లికేట్ ‘కీ’ ఉంటుంది. ఎప్పుడో వచ్చిపడుకుంటుంది. నైట్ షూటింగులప్పుడు అలాగే జరుగుతుంది. నిన్న రాత్రి కూడా నేను లాక్ చేసి పెరట్లో నుంచి ఇంట్లోకి వచ్చి పడుకున్నాను. రోజూ నేనే ముందు లేస్తాను. ఇల్లు ఊడ్చి టీ పెట్టిన తర్వాత అమ్మను నిద్ర లేపుతాను. అలాగే ఈరోజూ లేచాను. అయితే, ఇంటి తలుపుకి లోపల బోల్టు పెట్టి లేదు. అమ్మ లాక్ తీసి, లోపలకు వచ్చి బోల్టు పెట్టడం మర్చిపోయిందేమో అనుకున్నాను. టీ పెట్టి అమ్మ రూమ్‌లోకి వెళ్లి చూసే సరికి చనిపోయి ఉంది. నెత్తుటితో నైటీ తడిసిపోయి ఉంది సార్!..’’ అని ఏడవసాగింది అనుపమ. ఎస్సై వచ్చి ‘‘సార్! ఎక్కడా వెపన్ కనిపించలేదు.’’ అన్నాడు నెమ్మదిగా.‘‘అమ్మాయ్! మీ నాన్న ఎక్కడ?’’ అడిగాడు ఇన్స్పెక్టర్.‘‘సార్! లేడు. నా చిన్నప్పుడే అమ్మా నాన్నా విడిపోయారు. ఇంట్లో అమ్మా నేనూ మాత్రమే ఉంటాం’’‘‘నువ్వు చదువుకుంటున్నావా?’’‘‘ఇంటర్ పాసయ్యాను సార్!’’‘‘తర్వాత కాలేజీలో చేరలేదా?’’‘‘మా అమ్మకు ఇష్టం లేదు నేను కాలేజీలో చేరడం. నన్ను సినిమాల్లో చేర్చాలని ట్రై చేస్తోంది. ఉద్యోగం చేస్తే ఏం సంపాదిస్తావు? సినిమా హీరోయిన్ అయితే కోట్లు సంపాదిస్తావు అంటుంది కాని నాకుచదువుకోవాలని ఉంది..’’అనుపమ మాటల్లో ఏదో క్లూ దొరుకుతున్నట్లుగా అనిపించసాగింది ఇన్స్పెక్టర్కి.‘‘చెప్పు! మీ అమ్మకు విరోధులు ఎవరైనా ఉన్నారా?’’‘‘నాకు తెలిసి ఎవరూ లేరు సార్! అమ్మ అందరితోనూ మంచిగా ఉంటుంది.’’‘‘మీ అమ్మ ఎవరికైనా డబ్బు ఎగ్గొట్టడం, అన్యాయం చెయ్యడంలాంటివి చేసి ఉండాలి. ఎవరైనా ఊరికే మర్డర్ చెయ్యరు కదా..?’’ ఇన్స్పెక్టర్ మాటలకు రెస్పాన్స్ ఇవ్వలేదు అనుపమ. మౌనంగా ఉండిపోయింది. అప్పుడప్పుడు చున్నీతో కన్నీళ్లు తుడుచుకుంటోంది.ఇంతలో ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్, ఫొటోగ్రాఫర్ వచ్చారు. వాళ్ల పని వాళ్లు చేస్తున్నారు. పోలీసు కుక్కని తీసుకొచ్చాడు ట్రైనర్. బెడ్ దగ్గర వాసన చూసి బయటకు పరుగెత్తింది. శ్రీనగర్ కాలనీరోడ్డు మీద నుంచి స్టేట్ హోమ్ దగ్గరకు వెళ్లి ఆగిపోయింది. హంతకుడు హత్యచేసి నడుచుకుంటూ స్టేట్ హోమ్ వరకు వెళ్లాడు. అక్కడి నుంచి ఎటు వెళ్లాడో జాడ కనిపెట్టలేకపోయింది కుక్క. అంటేఅక్కడి నుంచి ఏదో ఒక వెహికల్లో వెళ్లిపోయాడు హంతకుడు అని డిసైడ్ అయ్యాడు ఇన్స్పెక్టర్.‘‘ఈ ఇల్లు మీ సొంతమేనా?’’ అనుపమని అడిగాడు ఇన్స్పెక్టర్.‘కాదు సార్! సోమరాజుది..’’‘సోమరాజు ఎవరు?’’మాటల్లోనే అక్కడకు వచ్చాడు సోమరాజు.‘‘సార్! నేనే సోమరాజు.. జూనియర్ ఆర్టిస్ట్స్ యూనియన్ ప్రెసిడెంట్‌ని. ఈ ఇల్లు నాదే. సునంద అద్దెకు ఉంటోంది’’ అన్నాడు.ఇన్స్పెక్టర్ అతన్ని ఎగాదిగాచూశాడు. ‘‘చెప్పండి సోమరాజూ! సునందను ఎవరు మర్డర్ చేసి ఉంటారు..?’’ అడిగాడు ఇన్స్పెక్టర్.‘‘సునంద మంచిది సార్! ఎవరితోనూ తగాదాలు పడే మనిషి కాదు. ఎందుకు మర్డర్ చేశారో అర్థకావడం లేదు..’’ విచారంగా చెప్పాడు.‘‘మర్డర్ చేసిన వాడు దొంగ మాత్రం కాదు. ఎందుకంటే ఆమె వంటి మీద బంగారం అలాగే ఉంది. బీరువా తెరిచినట్లు లేదు. కేవలం ఏదో కసితోనే మర్డర్ చేశాడు.’’అన్నాడు ఇన్స్పెక్టర్.శవ పంచనామా చేసిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్‌కి ఇంక్వెస్ట్ రిపోర్ట్ కోసం పంపించారు పోలీసులు. ఎల్లారెడ్డిగూడలో సునంద ఇంటి చుట్టుపక్కల వారిని ఎంక్వైరీ చేసి వచ్చారు మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్స్ అన్సారీ, జనార్దన్‌లు.‘‘సార్! సునందకు, సోమరాజుకు ఇల్లీగల్ కనెక్షన్ ఉందని చెప్తున్నారు. ఆ స్థలం సోమరాజు కబ్జా చేసి ఆక్రమించుకున్నాడు. వాడి కన్ను అనుపమ మీద ఉంది. అనుపమకు బాగా చదువుకోవాలని ఉంది. బాగా చదివి డాక్టర్ అవుతానని చుట్టుపక్కల పిల్లలతో అంటుండేదట. అనుపమనుహీరోయిన్ చెయ్యాలని తల్లి సునంద, సోమరాజు ఆమె మీద ఒత్తిడి తెస్తున్నారట.’’‘‘ఆ సంగతి అనుపమే చెప్పింది. చదివి ఏం సంపాదిస్తావు? హీరోయిన్ అయితే కోట్లు సంపాదిస్తావు అని సునంద కూతురితో అంటుండేదట. అయితే అనుపమకు అదంతా ఇష్టంలేదు. అదే ఇప్పుడు ప్రాబ్లెమ్.’’‘‘సునంద ప్రాబ్లమ్ అదే సార్! అరకొర సంపాదనతో కూతుర్ని చదివిస్తోంది. మెడికల్ కాలేజీలో చదివించాలంటే అది ఆమె వల్ల కాదు. అనుపమ మెరిట్ స్టూడెంట్. ఎంసెట్‌లో ర్యాంకు తెచ్చుకుంటే వస్తుందని, కోచింగ్‌కు వెళతానని పట్టుబట్టింది. సునంద ఒప్పకోలేదు. కూతుర్ని కొడుతుందని, ఆమె ఏడుపులు బయటకు వినిపిస్తుంటాయని చెప్పారు.’’ జనార్దన్ చెప్పాడు.ఇన్స్పెక్టర్ తల ఊపాడు.‘‘జూనియర్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ దగ్గర ఇంకొక సంగతి కూడా చెప్పారు.’’ అన్నాడు అన్సారీ.‘‘ఏంటది?’’‘‘టిప్పుఖాన్ అని ఒక గూండా ఉన్నాడట. వాడు సినిమాలకు ఫైనాన్స్ కూడా చేస్తాడట. వాడు తల్చుకుంటే అమ్మాయిలకు సినిమా చాన్సులు ఇప్పిస్తాడట. అయితే, వాడితో అమ్మాయిలు గడపాలట. అదంతా ఇక్కడ కాదు. టూరిజం అని సింగపూర్‌కో, బ్యాంకాక్‌కో తీసుకెళ్లి ఎంజాయ్ చేస్తాడట. సోమరాజు టిప్పుఖాన్ గుడ్‌లుక్స్‌లో ఉన్నాడట. అనుపమ ఫొటోలు టిప్పుఖాన్కి చూపించి, హెల్ప్చెయ్యమని సునందని తీసుకెళ్లి అడిగించాడట. యూరప్ ట్రిప్ వెళ్తున్నాను. అనుపమని పంపించమన్నాడట. టాప్ హీరో పక్కన హీరోయిన్ చాన్స్ ఇప్పిస్తానని భరోసా ఇచ్చాడట టిప్పుఖాన్. అనుపమఒప్పుకోవడం లేదట. సోమరాజు కూడా ఇంటికెళ్లి అనుపమను కొడుతున్నాడని చెప్తున్నారు.’’ చెప్పాడు అన్సారీ.ఇన్స్పెక్టర్ ఆలోచనలో పడిపోయాడు.‘‘చదువుకుని జాబ్ సంపాదించుకుని గౌరవంగా బతకాలని అనుపమ ఆశపడుతోంది. తల్లే అడ్డుపడుతోంది. ఘర్షణ తల్లీకూతుళ్లదే..’’ అన్నాడు ఇన్స్పెక్టర్.‘అనుపమే తల్లిని చంపి ఉంటుందేమో సార్!’’ అన్సారీ సందేహం వెలిబుచ్చాడు.‘అనుపమకు అంత సాహసం ఉండదు. అనుపమ మేలు కోరే వారెవరో సునందను హత్య చేసి ఉంటారు.’’ అన్నాడు ఇన్స్పెక్టర్ వేణుగోపాల్.‘సార్! శ్రీనగర్ కాలనీ ఎల్లారెడ్డిగూడా చౌరస్తాలో కరెంట్ పోల్ మీదఉన్న సీసీ కెమెరాలో రికార్డయిన ఫుటేజీ తెచ్చాను’’ అన్నాడు ఎస్సై అన్వర్ వచ్చీరాగానే.పెన్‌డ్రైవ్ కంప్యూటర్‌కి అటాచ్ చేసి సీసీ కెమెరా రికార్డు చేసిన ఫుటేజీ చూస్తున్నారు. రాత్రి పదిగంటలకు అనుపమ, ఒక సెక్యూరిటీ గార్డుతో మాట్లాడుతోంది. అనుపమ ఏడుస్తుంటే అతను ఓదారుస్తున్నాడు. అతనికి దాదాపు యాభయ్యేళ్లు ఉన్నట్టుగా ఉంది. మనిషి లావుగా ఎత్తుగా ఉన్నాడు.‘‘హంతకుడు దొరికాడు పదండి.’’ అన్నాడు ఇన్స్పెక్టర్ సీట్లోంచి లేస్తూ..పోలీసు వ్యాను సరాసరి ఆ బ్యాంకు ముందు ఆగింది. సెక్యూరిటీ గార్డు తుపాకీ పట్టుకుని అటెన్షన్లో నిలబడ్డాడు పోలీసులను చూసి.‘‘దామోదర్!నిన్ను అరెస్టు చేస్తున్నాం.’’ అన్నాడు ఇన్స్పెక్టర్ వేణుగోపాల్.‘‘అరెస్టు చేస్తున్నారా? ఎందుకు?’’ అన్నాడు వెలవెలబోతున్న ముఖంతో.‘‘ఎందుకా? సునందను చంపినందుకు.’’‘నేనా..?’’‘‘ఆ.. నువ్వే.. పద..’’ అన్నాడు ఇన్స్పెక్టర్.బ్యాంకు మేనేజర్‌కి విషయం చెప్పి డ్యూటీ నుంచి తప్పించి, అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చారు దామోదర్ని. అతను సునంద భర్త.విడాకులిచ్చాడు.అనుపమ అతని కూతురే. పెద్దగా శ్రమ లేకుండా సునందను హత్య చేసిన విషయం ఒప్పుకున్నాడు.‘‘నిజం సార్! సునందను నేనే హత్య చేశాను. అది నీచురాలు. సినిమాల్లో వేషాల కోసం నన్ను కాదని వెళ్లిపోయింది. దాని తిరుగుళ్లు భరించలేక విడాకులిచ్చాను. అది నా కూతుర్ని కూడా పాడు చేయాలని చూస్తోంది. అనుపమ అదంతా చెప్పుకుని ఏడుస్తోంది. ఆ రోజు అనుపమ తలుపు తీసింది. గదిలో నిద్రపోతున్న సునందను నేనే చంపాను. నా కూతురు జీవితం కాపాడుకోవడానికి హత్య చేశాను’’ చెప్పాడు దామోదర్. - వాణిశ్రీ -
ఫోటోగ్రాఫర్‌కు రాహుల్ చేయూత
భువనేశ్వర్ : తన కళ్లెదుట కింద పడిపోయిన ఫోటోగ్రాఫర్‌ను పైకి లేపేందుకు ఒక్క ఉదుటున కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ కదిలిన వీడియో వైరల్ అవుతోంది. భువనేశ్వర్ విమానాశ్రయంలో శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి రాహుల్ స్పందించిన తీరును పలువురు ప్రశంశిస్తున్నారు. రాహుల్ ఫోటోగ్రాఫర్‌కు చేయూత ఇచ్చేందుకు కదిలిన తీరుపై కాంగ్రెస్ సభ్యులు హసీబా ప్రధాని నరేంద్ర మోదీని ఎండగట్టేందుకు ఉపయోగించుకున్నారు. కిందపడిన ఫోటోగ్రాఫర్‌కు సాయం అందించేందుకు కాంగ్రెస్ చీఫ్ ఎలా పరుగులుపెట్టారో చూడండి అంటూ ఆమె ట్వీట్ చేశారు. గతంలో మోదీ ప్రసంగిస్తుండగా ఆయన ఎదుటే ఓ పోలీస్ అధికారి కుప్పకూలినా ఆయన తన ప్రసంగం కొనసాగించిన ఘటనతో పోల్చుతూ ఇంత జరిగినా ఏమీ జరగనట్టే ప్రధాని అప్పట్లో తన ప్రసంగాన్ని కొనసాగించారని దుయ్యబట్టారు. ఒకరు ప్రాణాలు విడుస్తున్నా మోదీజీ పట్టించుకోకుండా తన ఉపన్యాసం కొనసాగిస్తారని ఆమె చురకలు వేశారు. మీ పక్కనున్న వ్యక్తి హఠాత్తుగా గుండె పోటుకు గురైతే మీరు ఆ వ్యక్తికి సాయపడేందుకు ఉద్యుక్తులవుతారు అయితే మన ప్రధాని అలా కాదంటూ అప్పటి వీడియోను పోస్ట్ చేశారు. కాగా 2013లో మోదీ గుజరాత్ సీఎంగా వ్యవహరిస్తున్న సమయంలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతుండగా అప్పటి రాష్ట్ర డీజీపీ అమితాబ్ పాథక్ ఒక్కసారిగా కుప్పకూలారు. ఆ తర్వాత తాను కుదుటపడ్డానని ఆయన చెప్పుకొచ్చారు. -
పంటలు.. ఇబ్బడి ముబ్బడి!
పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్టుగా అత్యధిక దిగుబడులు సాధించేందుకు శాస్త్రవేత్తలు ఒక కొత్త మార్గం కనుక్కున్నారు. కిరణజన్య సంయోగ క్రియ వ్యవస్థలో ఉన్న లోపాన్ని సరిచేయడం ద్వారా మొక్కలు అతితక్కువ కాలంలో ఎక్కువ కాపునిచ్చేలా చేయవచ్చునని దీనిద్వారా పంట దిగుబడులు కనీసం 40 శాతం వరకూ పెరుగుతాయని పాల్ సౌత్ అనే శాస్త్రవేత్త తెలిపారు. సూర్యుడి నుంచి వచ్చే వెలుతురు శక్తిగా మార్చుకునే ప్రక్రియకు కిరణ జన్య సంయోగ క్రియ అంటారన్నది తెలిసిందే. అయితే యుగాలుగా ఈ ప్రక్రియ పూర్తి సామర్థ్యంతో పనిచేయడం లేదు. ఒక దశలో కార్బన్డయాక్సైడ్ కణాలను లాక్కునేందుకు రుబిస్కో అనే ఎంజైమ్ ఉపయోగపడుతూంటుంది.అయితే కొన్నిసార్లు ఈ ఎంజైమ్ కార్బన్‌డయాక్సైడ్‌కు బదులుగా ఆక్సిజన్‌ను లాగేసుకుంటుంది. దీని ప్రభావం దిగుబడులపై ఉంటుంది. సౌత్ తన బృందంతో కలిసి చేసిన పరిశోధనల్లో ఈ ఎంజైమ్‌ను నియంత్రించేందుకు ఒక పద్ధతిని తెలుసుకోగలిగారు. ఈ పద్ధతితో సాగైన పొగాకు పంట తక్కువ కాలంలోనే 40 శాతం వరకూ ఎక్కువ దిగుబడిని ఇచ్చింది. సోయా, వరి, బంగాళాదుంప, టమోటా వంటి పంటల్లోనూ ఈ పద్ధతిని పరీక్షించేందుకు ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నాయని.. ఆ తరువాత విస్త్రత వినియోగానికి అందుబాటులోకి తెస్తామని సౌత్ తెలిపారు. -
అశ్లీల దృశ్యాలను ఇంటర్నెట్లో పోస్ట్ చేశాడా?
పెరంబూరు: నటి అక్షరహాసన్ మాజీ ప్రియుడే ఆమె అశ్లీల దృశ్యాలను ఇంటర్నెట్లో పోస్ట్ చేశాడా? అనే అంశం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. నటుడు కమల్‌హాసన్ రెండవ కూతురు అక్షరహాసన్. బాలీవుడ్, కోలీవుడ్‌ల్లో నటిగా పరిచయం అయిన ఈ అమ్మడు కొంత కాలం నటుడు తనూజ్‌తో ప్రేమ కలాపాలను సాగించింది. గత ఏడాదే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో బ్రేకప్ చెప్పేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో నటి అక్షరహాసన్ ఆంతరంగ దృశ్యాలు ఇంటర్నెట్లో ప్రసారం అయ్యి కలకలం రేపాయి. దీంతో ఆ అశ్లీల ఫొటోల వ్యవహారంలో అక్షరహాసన్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అక్షరహాసన్, తనూజ్ ప్రేమ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. తనూజ్ ఎవరో కాదు ఒకప్పుడు హీరోయిన్గా వెలిగిన నటి రతీఅగ్నిహోత్రి పుత్రుడు. అతను, అక్షరహాసన్ 2013లోనే ప్రేమలో మునిగిపోయారు. అలా ఐదేళ్ల పాటు సాగిన ఈ సంచలన జంట ప్రేమ 2017లో బ్రేకప్ అనే మూడక్షరాల పదంతో ముగిసింది. అయితే వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలిన సమయంలో తీసుకున్న ఆంతరంగిక ఫోటోలు ఒకరి సెల్‌ఫోన్‌కు మరోకరు షేర్ చేసుకున్నారట. ఆ ఫోటోలను ఇప్పుడు అక్షరహాసన్ మాజీ ప్రియుడు ఇంటర్నెట్లో విడుదల చేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై తనూజ్ తరఫు వ్యక్తి మీడియాకు వివరణ ఇచ్చాడు. తనూజ్ అక్షరహాసన్ ప్రేమించుకున్న మాట నిజమేనన్నారు. అదే విధంగా వారిద్దరూ ఆంతరంగిక దృశ్యాలను సెల్ఫోన్లో పొందుపరిచిన విషయం వాస్తవమేనన్నారు. అయితే తనూజ్, అక్షర్‌ల విడిపోయినా వారి మధ్య ఇప్పటీకి స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయన్నారు. అందుకు రెండు రోజుల క్రితం వారిద్దరూ ఫోన్లో మాట్లాడుకున్నట్లు ఆధారాలు కావాలంటే చూపడానికి సిద్దం అని పేర్కొన్నారు. అక్షర ఆంతరంగిక దృశ్యాలను తనూజ్ ఎలాంటి సోషల్ మాధ్యమాల్లోనూ విడుదల చేయలేదన్నారు. పోలీసులు తనూజ్‌ను విచారించలేదన్నారు. ఒక వేళ విచారించినా, తన నిజాయితీని నిరూపించుకోవడానికి తనూజ్ సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. -
మిస్సయితే సీన్ మళ్లీ రాదు
పెళ్లి ఫొటోలంటే ఇప్పుడు పెళ్లి తర్వాతి ఫొటోలే. ఏడడుగులు వేసిన దంపతులు సినిమాటిక్‌గా ఉండటం కోసం మరో నాలుగడుగులు ముందుకు వేసి వైరల్ అయ్యేలా ఫొటోలు తీయించుకుంటున్నారు.కొచ్చి నుంచి గంట దూరంలో ఉంది చేర్తాళ గ్రామం. ప్రతాపన్, ఇందుల వివాహం అక్కడ ఘనంగా జరిగింది. ఫొటోగ్రాఫర్లు షైన్ సిద్ధార్థ్ తన ఆరుగురు బృందంతో కొత్త ఎక్విప్మెంట్తో చిన్న కొలను దగ్గరకు చేరారు. కొత్త దంపతులు ఊరులి (పడవ లాంటి బుట్ట) లో ఎదురెదురుగా పడుకున్నారు. వారి మీద ఒక చిన్న గొట్టం ద్వారా నీళ్లను వర్షంలా కురిపిస్తున్నారు. దంపతులు చక్కగా పోజ్ ఇస్తున్నారు. ఈ ఫొటోల షూటింగ్ నాలుగు గంటల్లో పూర్తి చేశారు షైన్. ఈ దంపతులు ఊహించిన దానికంటే వారి ఫొటోలకు ఎక్కువ ప్రచారమే వచ్చింది. ‘‘మా పెళ్లి ఆల్బమ్‌కి మంచి సెట్టింగ్స్ కావాలని మేం అడగలేదు. మా స్నేహితులే పూనుకుని చేశారు ఇదంతా’’ అంటారు ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ప్రొఫెషనల్ ప్రతాపన్ బిచ్చు. ఫొటోలు తీసిన ప్రతాపన్ స్నేహితులు వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అవి బాగా వైరల్ అయ్యాయి. ‘మా బంధువుల దగ్గర నుంచి విపరీతంగా ఫోన్లు వస్తున్నాయి. కొందరు కొత్తవారు, ఈ ఫొటోలు ఎలా తీశారు అని అడుగుతున్నారు’ అని చెప్పారు బిచ్చు. నలుగురూ మెచ్చుకోవాలని కొంతకాలంగా కేరళలో వివాహ వేడుకల ఫొటోలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సంప్రదాయబద్ధంగా జరిగే పెళ్లి తంతులన్నిటినీ ఇప్పుడు సృజనాత్మకంగా షూట్ చేస్తున్నారు. ఇప్పుడు అది మరింత ముందుకు సాగి, సుదూర తీరాలకు వెళ్లి ఫొటోలు తీయించుకునే దశకు. అందరి లక్ష్యం ఒక్కటే, వారి ఫొటోలు వైరల్ కావాలి. అందుకోసం కేరళలోని బ్యాక్ వాటర్స్, బీచ్‌లు, హౌస్ బోట్లు... ఇలా అన్నిటినీ ఉపయోగించుకుంటున్నారు. బిచ్చు, ఇందులకు తీసిన ఫొటోల వెనుక ఫొటోగ్రాఫర్ షైన్ కష్టం చాలా ఉంది. అతని ఇంటి వెనకాలే చిన్న సరస్సు ఉంది. అక్కడ కృత్రిమంగా కురిపిస్తున్న వానలో వధూవరుల హావభావాలను జాగ్రత్తగా పట్టి కెమెరాలో బిగించాలి. ఇలా తీయడం సినిమా తీయడానికి ఏ మాత్రం తక్కువ కాదు. ఔట్‌డోర్‌లో వధూవరులు ‘మేడ్ ఇన్ మోనో’ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు వసీమ్ అహ్మద్. ఈయన పెళ్లి ఫొటోలు, పెళ్లికి ముందు ఫొటోలు తీయడంలో అనుభవజ్ఞులు. చెన్నైకి చెందిన వసీమ్ తరచుగా కేరళ వెళ్తుంటారు. ‘‘మలయాళీ వివాహాలు మాకు చాలెంజింగ్. సాధారణంగా ఉంటూనే వారు స్పెషల్‌గా కనిపిస్తుంటారు’’ అంటారు అహ్మద్. ‘‘మలయాళీల పెళ్లిళ్లలో ఫొటోలు తీయడానికి సమయం ఎక్కువగా ఉండదు. ఒక్కసారి మిస్ అయ్యామంటే మళ్లీ ఆ సీన్ రాదు. అందువల్ల కేరళలో అవుట్డోర్ ఫొటో షూటింగ్ బాగా పాపులర్ అవుతోంది’’ అంటారు వసీమ్ అహ్మద్. దక్షిణాదిలో చాలామంది సినిమాలకు ప్రభావితులవుతున్నారు. సినిమాలలో చూపుతున్న పెళ్లి విధానాన్ని అనుసరిస్తున్నారు. వారి అభిరుచికి తగ్గట్లు షైన్, అహ్మద్ వంటి ఫొటోగ్రాఫర్లు ఎంతో శ్రద్ధ, సమయం తీసుకుని షూట్ చేస్తున్నారు. బీచ్‌లు.. సరస్సులు.. చెట్లు.. కువైట్‌లో ఉంటున్న అశ్వతి ఎస్ కుమార్ అనే ఇంజనీర్ నాయర్ల విధానంలో వివాహం చేసుకున్నారు. సాధారణ ఫొటోలతో పాటు సాహసాలు చేస్తూ ఫొటోలు తీయించుకోవాలనుకుని, వివాహమయ్యాక అళప్పుఝాలోని కట్టాడి బీచ్‌లో పచ్చటి చెట్ల దగ్గర విలక్షణంగా ఫొటోలు తీయించుకున్నారు. ఫొటోలకు మాత్రం పెళ్లిరోజు వేసుకున్న వస్త్రాలనే ధరించారు. కొట్టాయంలో ఉంటున్న పెళ్లిఫొటోల ఎక్స్పర్ట్ వర్ఘీస్ను సంప్రదించి ఫొటోలు తీయించుకుంటున్నారు. వెంబనాడ్ సరస్సులో హౌస్‌బోట్‌లో అంచున నిలబడి పోజులిస్తున్నారు. వీరికి ఫొటోలు తీయడానికి మరో బోటు అద్దెకు తీసుకోవలసి వచ్చింది. అయితే ‘‘ఎనిమిది గంటల కష్టానికి మంచి ఫలితమే వచ్చింది’’ అంటారు వాళ్ల ఫొటోలు తీసిన సంజీవ్ అనే మరో ఫొటోగ్రాఫర్. పర్మిషన్ తప్పనిసరి ఫొటోలకు డ్రోను ఉపయోగిస్తున్నారు. ఒక రోజులోనే ఫొటో షూట్ పూర్తి చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తికావడానికి నెల రోజులు çపడుతోంది. ఒక్కోసారి ఫొటోగ్రాఫర్లు ఫీట్లు చేస్తున్నారు. త్రిసూర్‌కు చెందిన 23 సంవత్సరాల విష్ణు అనే ఫొటోగ్రాఫర్ చెట్టుకి తల్లకిందులుగా వేలాడి టాప్ యాంగిల్లో షూట్ చేయడం వైరల్ అయింది. కేరళలో పైన పేర్కొన్న ప్రదేశాలలో ఫొటోలు తీయించుకోవాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. – జయంతి -
బంగారు కోతులు అతని పంట పండించాయి
95 దేశాల నుంచి 45 వేల ఫొటోలు.. అందులోంచి ఎంపిక చేశారు.. ఈ ఒక్క చిత్రాన్ని.. 2018 వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం నెదర్లాండ్స్‌కు చెందిన మార్సల్కు దక్కింది.. గోల్డెన్ కపుల్ పేరిట ఆయన తీసిన ఈ బంగారు కోతుల చిత్రానికి గ్రాండ్ ప్రైజ్ వరించింది. దీన్ని చైనాలోని కిన్‌లింగ్ పర్వత ప్రాంతంలో తీశారు. ఈ కోతులు అంతరించిపోతున్న జీవజాతుల జాబితాలో ఉన్నాయి. అది కూడా ఈ పర్వత ప్రాంతంలోనే ఉన్నాయట. ఒకచోట స్థిరంగా ఉండకుండా అటూ ఇటూ దూకుతూ ఉన్నాయని.. ఈ ఫొటో తీయడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని మార్సల్ తెలిపారు. ఏటా ఈ పోటీలను లండన్‌లోని ప్రఖ్యాత నేచురల్ హిస్టరీ మ్యూజియం నిర్వహిస్తోంది. -
ఈ పైపులోని గుడ్లగూబల ఫొటో.. పదేళ్ల బాలుడి క్లిక్!
వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్.. ఈ పురస్కారం ప్రపంచవ్యాప్తంగా ఫేమస్.. లండన్‌లోని ప్రఖ్యాత నేచురల్ హిస్టరీ మ్యూజియం ఈ పోటీలను ఏటా నిర్వహిస్తోంది. వివిధ విభాగాల్లో అవార్డులను ఇస్తారు. వీటిని గెలవడాన్ని వన్యప్రాణి ఛాయాచిత్రకారులు గొప్ప విషయంగా భావిస్తారు. అలాంటి పురస్కారాన్ని మన దేశానికి చెందిన బుడతడు గెలుచుకున్నాడు. 2018 పోటీకి సంబంధించి వివిధ విభాగాల కోసం 95 దేశాల నుంచి 45 వేల ఎంట్రీలు వచ్చాయి. 10 ఏళ్లు, అంతకన్నా తక్కువ వయసున్నవారి కేటగిరీలో వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ పురస్కారాన్ని పంజాబ్‌లోని కపుర్తలాకు చెందిన అర్షదీప్ సింగ్(10) గెలుచుకున్నాడు. ఇతడి తండ్రి రణ్‌దీప్ సింగ్ కూడా ఫొటోగ్రాఫరే. దీంతో సహజంగానే ఆసక్తి పెరిగింది. 6 ఏళ్ల వయసు నుంచే ఫొటోలు తీస్తున్నాడు. గతంలో జూనియర్ ఏసియన్ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ పురస్కారాన్ని కూడా గెలుచుకున్నాడు. పలు అంతర్జాతీయ మ్యాగజీన్లలో ఇతడు తీసిన చిత్రాలు ప్రచురితమయ్యాయి. ఈ పైపులోని గుడ్లగూబల ఫొటోను కపుర్తలాలోనే తీశాడు. తన తండ్రితో పాటు కారులో వెళ్తున్నప్పుడు దీన్ని గమనించాడట. సాధారణంగా ఉదయం పూట గుడ్లగూబలు కనిపించవు. దీంతో కారును ఆపమని చెప్పాడట. డోరు అద్దం కిందకు దింపి.. అక్కడ్నుంచి ఫొటో క్లిక్‌మనిపించాడట. అర్షదీప్ సింగ్‌కు జూనియర్ ఏసియన్ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ పురస్కారాన్ని తెచ్చిపెట్టిన ఫొటో -
న్యూడ్ ఫొటో షూట్: ఫొటోగ్రాఫర్‌కు బెదిరింపులు
కోల్‌కతా: వైవిధ్యంగా ఫొటోలు తీయాలనే ఉద్దేశంతో చేసిన పని ఓ వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ ప్రాణాల మీదకు తెచ్చింది. కోల్‌కతాకు చెందిన ప్రీతమ్ మిత్రా అనే ఓ వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్. ఇటీవల ఓ మోడల్‌తో ఫొటోషూట్ నిర్వహించాడు. అయితే అది సాధారణ ఫొటోషూట్ అయితే ఏ సమస్య ఉండేది కాదు. కానీ మోడల్‌ను పెళ్లికూతురుగా, బెంగాల్ స్టైల్లో పెద్ద బొట్టుతో అలంకరించి న్యూడ్ ఫొటోలు తీశాడు. ఆ మోడల్ ఎవరో తెలియకుండా కళ్లు మాత్రమే కనిపించేలా తమలపాకులతో జాగ్రత్తపడ్డాడు. అలాగే ఆమె ప్రయివేట్ పార్ట్స్ కనిపించకుండా జుట్టుతో, చేతిలో కుంకుమ భరణి పెట్టి కవర్ చేశాడు. అంతటితో ఆగకుండా ఈ ఫొటోను తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. దీంతో వివాదం చెలరేగింది. ఈ ఫొటో బెంగాల్ వివాహ వ్యవస్థను, హిందువులను అవమానపరిచేలా ఉందని నెటిజన్లు మండిపడుతున్నారు. 24 గంటల్లో ఆ ఫొటోను.. ఆ ఫేస్బుక్ పేజీని తొలిగించకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారు. అలాగే అతని తలను తీసుకొచ్చినవారికి బహుమానం కూడా ఇస్తామని పిలుపునిస్తున్నారు. గత వారం రోజులుగా వస్తున్న ఈ బెదిరింపులకు భయపడ్డ ప్రీతమ్ రక్షణ కల్పించాలని కోల్‌కతా పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇక ఏదో చేద్దామని చేసిన పని ప్రీతమ్‌కు మనశ్శాంతి లేకుండా చేస్తోంది. గత ఐదేళ్లుగా ప్రీతమ్ ఫ్రొఫెషనల్ వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీతమ్ తీసిన ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారడంతో వ్యవహారం కూడా రచ్చైంది. -
హార్ట్ టచింగ్ ఫోటో: కంటతడి పెట్టాల్సిందే..
అమ్మ తనకు ఆకలిగా ఉన్నా.. పిల్లల కడుపు నింపిన తర్వాతే భోజనం చేస్తుంది. కానీ పిల్లలు ఒక వయసుకు వచ్చిన తర్వాత ఆ తల్లి ప్రేమను మర్చి పోతారు. తమ దారేదో తాము చూసుకుంటారు. తల్లిదండ్రులకు పట్టేడన్నం పెట్టడానికి వెనుకాడతారు. వయసు పైబడిన వారు తమకు భారమైనట్టు, తీసుకెళ్లి వృద్ధాశ్రమాల్లో విడిచిపెడుతుంటారు. మనవళ్లు, మనవరాళ్లను వారికి దూరం చేస్తున్నారు. దీనికి నిదర్శనంగా ఓ ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటో ప్రతి ఒక్కరినీ చలింప చేస్తోంది. ఓ స్కూల్ బాలిక, ఓ వృద్ధురాలి పక్కన కూర్చుని గుక్కపెట్టి ఏడ్చే ఆ ఫోటో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. ఈ ఫోటోలోని బాలిక, స్కూల్ ఫీల్డ్ ట్రిప్‌లో భాగంగా అనూహ్యంగా ఓ వృద్ధాశ్రమంలో ఉన్న తన నాన్మమ్మను కలుసుకుంటోంది. ఇన్నాళ్లు నాన్నమ్మ బయటికి వెళ్లిందని నాన్న చెప్పే మాటలనే నమ్ముతూ వస్తున్న ఆ బాలికకు.. వృద్ధాశ్రమంలో తన నాన్నమ్మ కనిపించడం, ఆ తర్వాత నిజం తెలియడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. గుజరాత్‌లోని ఓ ఫోటోగ్రాఫర్ దాదాపు పదేళ్ల కిందట ఈ హృదయ విదారకమైన సంఘటనతో పాటు వారి ఫోటోను కూడా గుజరాతి డైలీ ‘దివ్య భాస్కర్’లో ఫ్రంట్ పేజీలో పబ్లిష్ చేశాడు. అప్పట్లో అది ఓ సంచలన టాఫిక్‌గా మారింది. ఆ ఫోటో ఫేస్బుక్లో పెద్ద ఎత్తున షేర్ అయింది. తాజాగా పదేళ్ల తర్వాత మరోసారి ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 2007 సెప్టెంబర్ 12న ఫోటోజర్నలిస్ట్ కల్పెష్ ఎస్ భరేచ్‌కు గుజరాత్ మనినగర్‌లోని జీఎన్సీ స్కూల్ ప్రిన్సిపాల్ నుంచి ఫోన్ వచ్చింది. ఘోదసర్‌లోని మనిలాల్ గాంధీ వృద్ధాశ్రమానికి స్కూల్ పిల్లలను తీసుకెళ్తున్నామని, ఈ స్కూల్ ట్రిప్‌ను కవర్ చేయమని ప్రిన్సిపాల్ కోరారు. భరేచ్, పిల్లలతో పాటు వృద్ధాశ్రమానికి చేరుకున్నాడు. కానీ ఆ అసైన్‌మెంటే తన జీవితాన్ని ఓ మలుపు తిప్పుతుందని భరేచ్ కలలో కూడా ఊహించి ఉండడు. ఫీల్డ్ ట్రిప్‌లో భాగంగా పిల్లలను, పెద్ద వాళ్ల పక్కన కూర్చోమని.. మంచి మంచి ఫోటోలు తీస్తున్నాడు. స్కూల్ పిల్లల్లో ఒక చిన్న అమ్మాయి.. ఒక గదిలోకి వెళ్లగానే ఓ ముసలావిడ దగ్గరికి ఏడ్చుకుంటూ పరిగెత్తింది. ఆ మహిళ కూడా చిన్నారిని గట్టిగా పట్టుకుని ఏడ్చింది. ఏం జరిగిందా? అని అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కానీ ఆ ముసలావిడ చెప్పిన స్టోరీ వినగానే మేమందరం ఒక్కసారిగా మూగబోయాం అని భరేచ్ చెప్పాడు. ఆ ముసలావిడ, ఆ అమ్మాయికి నాన్నమ్మ అట. ఎంతో కాలం తర్వాత మనవరాలిని చూసిన ఆ ముసలావిడ తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. ఒకరినొకరు గట్టిగా పట్టుకుని తనివితీరా ఏడ్చారు. నాన్నమ్మ బయటికి వెళ్లిందని ఎప్పుడూ నాన్న చెబుతుండే వాడని ఆ పాప చెప్పింది. కానీ ఎప్పుడూ కూడా వృద్ధాశ్రమంలో ఉందని చెప్పలేదని కన్నీంటి పర్యంతమైంది. నానమ్మ, మనవరాళ్లు ఒకరినొకరు పట్టుకుని ఏడుస్తున్న ఫోటోతో పాటు, వీరి స్టోరీని గుజరాతి డైలీ దివ్య భాస్కర్లో ఫ్రంట్ పేజీలో పబ్లిష్ చేశారు. గుజరాత్ అంతటా అప్పట్లో ఇదే బిగ్ డిబేట్. అన్ని పత్రికలు, ఛానళ్లు కూడా దీన్నే మెయిన్ స్టోరీగా బ్రాడ్కాస్ట్ చేశాయి. ఆమెను వృద్ధాశ్రమం నుంచి తన ఇంటికి తీసుకెళ్లినట్టు భరేచ్ తర్వాత స్థానిక టీవీ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడెందుకు వైరల్ అవుతుంది.... ఆగస్టు 19న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా.. బీబీసీ గుజరాతీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్‌లను తమ కెరీర్లో తీసిన ఉత్తమమైన ఫోటోలను షేర్ చేయమని కోరింది. బీబీసీ గుజరాతీకి భరేచ్.. తన బెస్ట్ ఫోటోలన్నింటిన్నీ షేర్ చేయగా.. ఈ ఫోటో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయింది. భరేచ్ ప్రస్తుతం దివ్య భాస్కర్లో పనిచేస్తున్నాడు. తన తండ్రి ఫోటో సోషల్ మీడియా వైరల్ అయిందని... చాలామంది సెలబ్రిటీలు దీనిపై ట్వీట్ చేస్తున్నారని.. కేవలం పేరు కోసం కాకుండా.. వృత్తి మీద ప్రేమతో పనిచేయాలని తన తండ్రి ఎప్పుడూ సూచిస్తుంటాడని... నిజంగా ఇది తమకెంతో గర్వకారణమని భరేచ్ కొడుకు దీపమ్ ఫేస్బుక్లో ఓ పోస్టులో తెలిపాడు. -
మరోసారి లీకైన ‘సైరా’ స్టిల్స్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. ఖైదీ నంబర్ 150తో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన చిరు లాంగ్ గ్యాప్ తరువాత తన డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు లీకులు బెడద తప్పటం లేదు. గతంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ నటించిన సన్నివేశాలకు సంబంధించిన స్టిల్స్‌ను ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో చిత్రయూనిట్ షాక్ అయ్యింది. తరువాత ఎలాంటి స్టిల్స్ లీక్ అవ్వకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు చిత్రయూనిట్. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లీకులు మాత్రం ఆగటంలేదు. ఇటీవల సినిమా లోకేషన్‌కు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. తాజాగా యుద్ధ సన్నివేశాలకు సంబంధించి ఫొటోలు నెట్లో సర్క్యూలేట్ అవుతున్నాయి. ఈ ఫొటోలలో నటీనటులు కనిపించకపోయినా.. ఓ భారీ కోట తగలబడుతున్న స్టిల్‌తో పాటు కొందరు బ్రిటీష్ సైనికుల దుస్తుల్లో ఉన్న స్టిల్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. -
‘ముత్యం లాంటి ముద్దు’పై వివాదమా!
సాక్షి, న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నగరం. అది ఢాకా యూనివర్శిటీ ప్రాంతం. అప్పుడే పెద్ద వర్షం కాస్త తుంపరగా మారింది. నేలంతా తడి తడిగా ఉంది. వెనకాల ఓ వినియోగదారుడు నెత్తున గొడుగు పట్టుకొని సెల్ఫోన్లో ఏదో వెతుక్కుంటున్నాడు. టీ కాసి పోసే వారిరువురు తమ పనిలో నిమగ్నమై ఉన్నారు. రోడ్డు మీద బాటసారులు ఇవేమి పట్టకుండా తమ మానాన తాము పోతున్నారు. సరిగ్గా ఆ సమయంలో అక్కడ కొంత ఎత్తైన అరుగులు మీద కూర్చున్న ఇద్దరు ప్రేమికులు తమకీ ప్రపంచం పట్టనట్టు ఒకరికొకరు అత్యంత సహజంగా ముద్దు పెట్టుకుంటున్నారు. ఆ సన్నివేశంలో వారికి తెలియకుండా వారి ఫొటోను జిబాన్ అహ్మద్ తీశారు. ‘వర్షం దీవెనలతో విరిసిన కవిత, ప్రేమకు స్వేచ్ఛనివ్వండి’ అన్న నినాదంతో జిబాన్ అహ్మద్ ఆ ఫొటోను సోమవారం నాడు ఆన్లైన్లో పోస్ట్ చేయగా అది వైరల్ అవుతోంది. లౌకిక బెంగాలీ జాతీయ వాదం, ఇస్లాం ఛాందసవాదం మధ్య తీవ్ర సంఘర్షణలు జరిగే బంగ్లాలో ఈ ఫొటోపై పెద్ద దుమారమే రేగుతోంది. ఫొటోలో కనిపిస్తున్న కళాత్మక దృశ్యాన్ని మెచ్చుకుంటున్న వాళ్లు, బరితెగించిన ప్రేమగా అభివర్ణిస్తున్న వాళ్లు ఎక్కువే ఉన్నారు. ‘ఇదే నిజమైన బంగ్లాదేశ్. ఇలాంటి ప్రేమను పాటించడం వల్ల దేశంలో ఇస్లాం ఛాందసవాదం నశించిపోతుంది. నా బంగ్లాదేశ్‌ను ప్రేమిస్తున్నాను’ అంటూ కొందరు ‘మనం అంతటా ముద్దు పెట్టుకోవాలి. తరచుగా ముద్దు పెట్టుకోవాలి. ముద్దులతోనే వ్యతిరేకులపై పోరాటం సాగిద్దాం’ అంటూ మరికొందరు ట్వీట్లు పేల్చారు. స్వచ్ఛమైన నీటి బిందువులాంటి ముద్దుపై అసలు వివాదం ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్న వాళ్లూ ఉన్నారు. బరితెగించిన ప్రేమగా పరిగణించిన యువకులు మాత్రం జిబాన్ అహ్మద్‌ను వెతికి పట్టుకొని రోడ్డుపైనే కర్రలతో కొట్టారు. కాళ్లతో తన్నారు. వారిలో తోటి ఫొటోగ్రాఫర్లు కూడా ఉండడం మరీ విచారకరం. జిబాన్ ఫొటోగ్రాఫర్ ఉద్యోగం కూడా పోయింది. ఆయన పనిచేస్తున్న వెబ్సైట్ యాజమాన్యం ఆయన్ని తొలగించింది. ఇస్లాం ఛాందసవాదులతో పెట్టుకోవడం జిబాన్ అహ్మద్‌కు ఇది మొదటిసారి కాదు. 2015లో బంగ్లాదేశ్–అమెరికన్ హేతువాద బ్లాగర్ అవిజిత్ రాయ్, ఆయన భార్యపై ఇస్లాం ఛాందసవాదులు హత్యాప్రయత్నం చేశారు. రక్తం వోడుతూ ప్రాణాపాయా స్థితిలో కాపాడంటూ రాయ్ భార్య వేడుకుంటుంటే ఎవరు సాయం చేయడానికి ముందుకు రాకపోవడంతో జిబాన్ అహ్మద్‌ను ఆస్పత్రికి చేర్చారు. అందుకు ఇస్లాం ఛాందసవాదుల చేతుల్లో తన్నులు తిన్నారు. -
నటి ప్రైవేట్ ఫోటోలు లీక్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
‘హిందీ మీడియం’ ఫేమ్ పాకిస్తాన్ నటి సబా కమర్‌ను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేసి పడేస్తున్నారు. ‘అసలు నువ్వు ముస్లింవేనా..?’ ‘నువ్వు కూడా మహీరా ఖాన్‌లా తయారవుతున్నావా..?’ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. సబాను ఇంతలా ట్రోల్ చేయడానికి కారణం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న ఆమె ఫోటోలు. ఈ ఫోటోల్లో సబా పొగతాగుతున్నట్లు ఉన్నారు. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు కాస్తా ‘సిగరెట్ తాగడమే కాక, ఆ ఫోటోలను సోషల్ మీడియోలో పోస్టు చేస్తావా’ అంటూ సబాపై మండిపడుతున్నారు. ఈ సందర్భంగా నెటిజన్లు సబాను ‘అసలు నువ్వు ముస్లింవేనా.. నువ్వు కూడా మహీరా ఖాన్‌లా తయారవుతున్నావా’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. Today I feel sad that a colleague and one of the finest actor of Pakistan is being exploited by someone for a cheap publicity stunt ... it was just a simple BTS ( behind the scene) vdo during a photo shoot from which the screen shots were taken and made viral on social media ... its disgusting that people can go upto any extent for cheap publicity... saba you are a superstar and don’t let these haters demotivate you .. #wesupport #sabaqamar #pakistanidrama #pakistanimovie #pakistanifilm #repost #instapakistan #instalike #movieshoovy #divamagazinepakistan #showbizpakistan A post shared by Aijaz aslam (@aijazzaslamofficial) on Jul 19, 2018 at 12:33pm PDT అయితే అసలు విషయం ఏంటంటే ఈ ఫోటోలు యాడ్ చిత్రకరణ విరామ సమయంలో తీసినవి. అంతేకాక ఈ ఫోటోలను సబా షేర్ చేయలేదంటా. పొరపాటున లీకైన ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా సైట్లలో చక్కర్లు కొడుతున్నాయి. కొందరు సబా సహనటులు ఒస్మాన్ ఖాలిద్ బిట్, అద్నాన్ సిద్దికి, ఎద్జాజ్ అస్లాం మాత్రం ఆమెకు మద్దతు ఇస్తున్నారు. ఈ విషయం గురించి వారు సోషల్ మీడియాలో ‘ఒక యాడ్‌లో భాగంగా నువ్వు సిగరెట్‌ను పట్టుకోవాల్సి వచ్చింది. విరామ సమయంలో తీసిన ఫోటోలు ఇవి. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం కొందరికి అలవాటు. అటువంటి వారి వ్యాఖ్యలను నువ్వు పట్టించుకోవద్దు. నువ్వు ఎంటో మాకు తెలుసు’ అంటూ మద్దతు తెలుపుతున్నారు. గతంలో పాకిస్తాన్ నటి మహీరా ఖాన్, రణబీర్‌తో కలిసి సిగరెట్ తాగుతున్నట్లు ఉన్న ఫోటలపై కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయి. ఆ సమయంలో కూడా మహీరాను ఇలానే విమర్శించారు. -
ప్రశంసలు వేన'వేల్'..
కుక్క తోక పట్టుకుని గోదారిని ఈదగలమా.. కానీ తిమింగలం తోక పట్టుకుని అవార్డుల సాగరాన్ని మాత్రం అవలీలగా ఈదేయొచ్చట. ఇది మేం చెప్పడం లేదు.. జపాన్‌కు చెందిన రికో తకహషి చెబుతోంది. ఎందుకంటే.. ఆమె తీసిన ఈ హంప్‌బ్యాక్ వేల్ (తిమిం గలం) పిల్లకు సంబంధించిన చిత్రం ప్రతిష్టాత్మక నేషనల్ జియోగ్రాఫిక్ ట్రావెల్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ 2018 పోటీలో అన్ని విభాగాలకు కలిపి గ్రాండ్ ప్రైజ్ విన్నర్‌గా నిలిచింది. జ్యూరీ బృందం ప్రశంసలను అందుకుంది. వివిధ దేశాల నుంచి తుది పోటీకి మొత్తం 13 వేల ఎంట్రీలు రాగా.. ‘మత్స్య కన్య’ పేరిట రికో తకహషి తీసిన ఈ చిత్రం తొలి స్థానా న్ని దక్కించుకుంది. దీంతోపాటు ‘నేచర్’విభాగంలో నూ ఈ చిత్రం విజేతగా నిలిచింది. అండర్ వాటర్ ఫొటోగ్రఫీ అంటే పడిచచ్చే తకహషి.. తన ఆశయ సాధ న కోసం ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టారు. తిమింగలాలు వాటి పిల్లలతో కలిపి ఉన్న ఫొటోను తీయాలని అనుకున్నానని.. అయితే.. ఈ తిమింగలం పిల్ల కొంతసేపు తన తల్లిని వదిలేసి.. తమ వద్దకు వచ్చి.. తోకను అలా దగ్గరగా ఆడించినప్పుడు తానీ ఫొటోను క్లిక్‌మనిపించినట్లు తకహషి చెప్పారు. ఈ చిత్రాన్ని ఆమె జపాన్‌లోని కుమిజిమా ద్వీప సముద్ర గర్భంలో తీశారు. -
ఫేస్బుక్లో ఫొటోల కారణంగా..
-
ఫేస్బుక్లో ఫొటో.. యువతి పెళ్లి రద్దు
సాక్షి, వరంగల్ అర్బన్, ఎల్కతుర్తి: కలిసి పనిచేసిన చోట దిగిన ఫొటోను ఫేస్బుక్లో పోస్టు చేయడంతో మరికొన్ని గంటల్లో జరగాల్సిన ఓ యువతి పెళ్లి ఆగిపోయింది. ఫేస్బుక్లో ఫొటోల కారణంగా తన పెళ్లి నిలిచిపోయిందని మండలంలోని సూరారం గ్రామానికి చెందిన ఓ యువతి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఓ యువతి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తుంది. తోటి ఉద్యోగి మల్లెబోయిన ప్రశాంత్ తనతో దిగిన ఫొటోను ఫేస్బుక్లో అప్లోడ్ చేయడం వల్ల తన వివాహం నిలిచిపోయిందని ఫిర్యాదులో పేర్కొంది. కాగా ఎస్సై టీవీఆర్ సూరి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మంచిర్యాల జిల్లాకు చెందిన వ్యక్తితో ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో యువతి వివాహం జరగాల్సి ఉంది. కానీ యువతితో కలిసి ఉన్నట్లు కొన్ని ఫొటోలను ఆదివారం ఉదయం ప్రశాంత్ ఫేస్బుక్లో పోస్ట్ చేయడం కారణంగా పెళ్లి రద్దయినట్లు సమాచారం. -
రాయల్ ఫొటోగ్రాఫర్
ఛాయాశిల్పి పైన ఒక ఎర్రలైటు. దాని పక్కన మరో సాధారణ లైటు. ఆ లైట్ల కింద టేబుల్ పైన ఒక డిష్, డెవలపర్, ఫిక్సల్, వాటర్.. నెగటివ్‌ను డెవలప్‌చేసిన తర్వాత కనిపించే ఫొటో! తొమ్మిదో తరగతి సైన్స్ క్లబ్లో చేసిన ఆ ప్రయోగం అతడిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఫొటోలు డెవలప్‌చేయడం ఎలా?’ అనే ఉత్సుకతతో తన కెరీర్‌కు శ్రీకారం చుట్టారు కుసుమ ప్రభాకర్. ఫొటోలు డెవలప్ చేయాలంటే ముందు ఫొటోలు తీయాలి కదా. అలా మొదలైన అభిరుచి ప్రభాకర్‌ని ఒక ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్‌గా మలిచింది. 1969 నాటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కారణంగా బీఎస్సీ పూర్తి చేయలేకపోయినా చక్కటి ఫొటోగ్రాఫర్‌గా రాణించారు. 1977లోనే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫొటోగ్రాఫర్స్‌లో సభ్యుడయ్యారు. ‘‘షట్టర్ నొక్కితే బొమ్మ వస్తుంది. కానీ నాకు కావలసింది ఆ బొమ్మ వెనుక ఉన్న ఆలోచన. దానిలో భావం ప్రతిఫలించాలి. జీవితాన్ని పట్టుకోవాలి. ఈ తపనతోనే నా జర్నీ ప్రారంభించాను. అనేక ప్రాంతాలు తిరిగాను. ఈ అన్వేషణలోనే ‘ది రాయల్æఫొటోగ్రఫిక్ సొసైటీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్’ గురించి తెలిసింది. 1853లో ఆవిర్భవించిన సంస్థ అది. 1984లో ఆ సంస్థలో నాకు అసోసియేట్‌షిప్ లభించింది. ఆ సంస్థ నుంచే ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన ఫెలోషిప్ లభించింది’’ అని సంతోషం వ్యక్తం చేశారు ప్రభాకర్. 1986లో ‘లైఫ్ ఇన్ కామన్వెల్త్’ అనే అంశంపైన కామన్వెల్త్ దేశాల్లో ఫొటోగ్రఫీ పోటీలు జరిగినప్పుడు ఆ పోటీల్లో ప్రభాకర్ తీసిన ఫొటోలకు స్పెషల్ మెరిట్ అవార్డు లభించింది. ఆ పోటీల కోసం లంబాడాల జీవితాన్ని ఆయన ఇతివృత్తంగా ఎన్నుకున్నారు. వెలుతురు లేని నీడలు! ‘‘పెయింటింగ్ విత్ లైట్, పెయింటింగ్ విత్ షాడోస్.. సాధారణంగా ఏ ఫొటోగ్రాఫరైనా లైట్ల వెలుతురులోనే ఫొటోలు తీస్తారు. కానీ నా ఫొటోల్లో ఆ వెలుతురు ఉండదు. నీడలు మాత్రమే కనిపిస్తాయి. తల్లీబిడ్డల అనుబంధం, లంబండాల నృత్యాలు, ఆనందోత్సాహాలు వంటి ఛాయా చిత్రాలు నా ఫొటోగ్రఫీకి ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి. అవన్నీ ఎలాంటి వెలుతురు అవసరం లేకుండా తీసినవే..’’ అని చెప్పారు ప్రభాకర్. కామన్వెల్త్ పోటీల్లో గెలుపొందడమే కాకుండా ప్రత్యేక ఆహ్వానంపైన నెల రోజుల పాటు ఆయన లండన్‌లోనే ఉండిపోయారు. మరిన్ని మెళకువలు నేర్చుకొన్నారు. ఆ తరువాత ఇండియాకు వచ్చి అనేక ప్రాంతాల్లో పర్యటించి జీవితాన్ని, ప్రకృతిని, సమాజ పరిణామాలను ప్రతిబింబించే అనేక చిత్రాలను షూట్ చేశారు. భావాల బంధనం ఫొటోగ్రఫీ కోసం వరంగల్‌లోని ఓ శరణాలయంలో చిన్నారులతో అనేక రోజులు గడిపారు ప్రభాకర్. వాళ్లలో లైంగిక వేధింపులకు గురైన ఓ అమ్మాయి మతిస్థిమితం కోల్పోయి తరచుగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నప్పుడు; ఆకలో, ఇంకే బాధో తెలియని మరో చిన్నారి కంఠ నాళాలు తెగిపోతాయేమోనన్నంతగా అరుస్తున్నప్పుడు వారి ముఖకవళికలను ప్రభాకర్ కెమెరా వడగట్టింది ‘‘అలా 8 నెలల పాటు తీసిన ఫొటోల్లో 20 ఫొటోలను మాత్రమే పోటీకి పంపాను. ప్రపంచంలోని అనేక దేశాల నుంచి ఆ పోటీల్లో పాల్గొన్నారు. భారత్ నుంచి నాకు అవార్డు లభించింది’’ అని ప్రభాకర్ తెలిపారు. గత నెల 24న ఆయన ఈ ప్రతిష్టాత్మకమైన ఫెలోషిప్‌ను సొంతం చేసుకున్నారు. – పగిడిపాల ఆంజనేయులు, సాక్షి, హైదరాబాద్ ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ ఇదే! భావోద్వేగాలకు పటంలో ఘనీభవింపజేసే శక్తి ఒక్క కెమెరాకు మాత్రమే ఉంది. క్లిక్‌మనిపించే ఆ క్షణం ఒక జీవన సత్యం. అయితే ప్రతి దృశ్యం ఛాయాచిత్రం కాలేదు. దాని వెనుక ఉన్న భావం మాత్రమే ఒక అద్భుతమైన ఫొటో అవుతుంది. అలాంటి ఫొటోలను క్లిక్‌మనిపించడమే అభిరుచిగా, అలవాటుగా, వృత్తిగా, ప్రవృత్తిగా మలచుకున్నారు ప్రముఖ ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్ కుసుమ ప్రభాకర్. ఎన్నో అవార్డులను, అభినందనలను అందుకున్నారు. తాజాగా ప్రతిష్టాత్మక బ్రిటిష్ రాయల్ ఫొటోగ్రఫిక్ సొసైటీ ఫెలోషిప్ ఆయనను వరించింది. గత మూడు దశాబ్దాల్లో ఈ ఫెలోషిప్‌ను పొందిన రెండో తెలుగు ఫొటోగ్రాఫర్ ప్రభాకరే. 1987లో అప్పటి ప్రముఖ ఫొటోగ్రాఫర్ రాజన్‌బాబుకు ఈ అవార్డు లభించింది. ఆ తర్వాత కుసుమ ప్రభాకర్ ఈ అవార్డును అందుకున్నారు. -
మైనార్ బాలిక మెడలో తాళి.. ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: మియాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు మైనర్ బాలిక మెడలో తాళి కట్టి ఆ ఫోటోలను ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడు. ఈ విషయం తెలుకున్న బాలిక అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంది. దీంతో బాలిక కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితుడు బాబుగా గుర్తించిన పోలీసులు ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్లు తెలిపారు. -
ఫొటో’.. తలరాతను మార్చేసింది!
-
‘తలకిందులు ఫొటో’.. తలరాతను మార్చేసింది!
త్రిసూర్: ‘‘జీవితంలో మరుపురాని గుర్తులంటే పెళ్లి ఫొటోలే కదండి! అందుకే వాటిని మరికాస్త వినూత్నంగా తియ్యాలనుకుంటాను. ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌గా కొత్త తరహాలో ఆలోచించక తప్పదుమరి!’’ అంటున్నాడు 23 ఏళ్ల విష్ణు. చెట్టు పైకెక్కి తలకిందులుగా వేలాడుతూ ఫొటోలు తీసిన ఆ వీడియో ఏ రేంజ్లో వైరల్ అయిందో మీరంతా చూసే ఉంటారు. విచిత్ర విన్యాసాలు చేస్తూ అతను తీసిన తలకిందులు ఫొటో.. ఇప్పుడతని తలరాతను మార్చేసింది. సోషల్ మీడియా పుణ్యమాని ఓవర్‌నైట్‌లో స్టార్ అయిపోయిన విష్ణుకు ఇప్పుడు ఆఫర్లమీద ఆఫర్లు వచ్చిపడుతున్నాయట! సరదాగా తీసిన వీడియో: విష్ణు స్వస్థలం కేరళలోని త్రిసూర్. ‘వైట్‌ర్యాంప్’ అనే వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్స్ గ్రూప్‌లో సభ్యుడు. ఏప్రిల్ 15న త్రిసూర్‌కే చెందిన ‘షియాజ్-నవ్య’ల పెళ్లిని కవర్ చెయ్యడానికి వెళ్లాడు. కొత్త తరహాలో ఫొటోలు తీస్తానంటూ కొత్త జంటను కన్విన్స్ చేయడం, చెట్టుకొమ్మకు తలకిందులుగా వేలాడుతూ ఫొటోలు తీయడం.. అలా విష్ణు చేసిన విచిత్ర విన్యాసాలను వాళ్ల గ్రూప్ మెంబర్ ఒకరు షూట్ చేశారు. సరదాగా తీసిన ఆ వీడియోను త్రిసూర్ ఫొటోగ్రాఫర్స్ వాట్సప్ గ్రూప్‌లో అప్లోడ్ చేశారు. విపరీతంగా నవ్వుపుట్టించే ఆ వీడియో గంటల్లోనే వైరల్ అయింది. దాదాపు అన్ని సైట్లూ, పత్రికలూ ఫొటోగ్రాఫర్ విచిత్ర విన్యాసం గురించి వార్తలు రాశాయి. విష్ణు ది వివ్వల్ ఫొటోగ్రాఫర్: ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయిన విష్ణును త్రిసూర్ వాసులంతా ముద్దుగా ‘వివ్వల్(గబ్బిలం) ఫొటోగ్రాఫర్’ అని పిలుచుకుంటున్నారట. ఫొటోలు బాగా రావడంతో షియాజ్-నవ్యలు కూడా ఫుల్‌ఖుష్. పైసా ప్రచారం ఖర్చు లేకుండా ఫేమస్ అయిపోయిన విష్ణు అండ్ గ్రూప్‌కి ఇప్పుడు ఆఫర్లమీద ఆఫర్లు వస్తున్నాయట. ‘‘నిజానికి ఇంతకు ముందు కూడా నేను చెట్లెక్కి ఫొటోలు తీశాను. చిన్నప్పుడు కోతికొమ్మచ్చి బాగా ఆడేవాణ్ని. ఆ ఎక్స్పీరియన్స్ బాగా కలిసొచ్చింది..’ అని నవ్వేస్తాడు విష్ణు. -
స్పైడర్ మ్యాన్ ఫొటోగ్రాఫర్..!
-
వీడెవడండీ బాబు.. స్పైడర్ మ్యానా? ఫొటోగ్రాఫరా?
ఏదైనా పని చేపట్టినపుడు దానిమీదే దృష్టి మొత్తం కేంద్రీకరించినప్పుడు ఫలితం తొందరగా దరిచేరుతుందంటారు. అంతేకాదు మనకు నచ్చిన పనిలో ఎంత కష్టం ఉన్నా అది ఇష్టంగానే అనిపిస్తుంది. దానిపై ఎంతో శ్రద్ధ పెట్టి ముందుకెళ్తాము. ఒక్కోసారి దాని కోసం ఎంతటి సాహసాలు చేయడానికైనా వెనకాడం. అందుకు నిదర్శనంగా ఈ ఫొటోగ్రాఫర్‌ని చెప్పుకోవచ్చు. అసలు విషయానికి వస్తే.. కొత్తగా పెళ్లైన ఓ జంట ఫొటోలు తీయించుకోవడానికి ఓ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్‌కి కబురు పెట్టారు. దీంతో ఫోటోగ్రాఫర్ వచ్చి నవ దంపతులకు ఫోటో షూట్ చేశాడు. అయితే అతను ఫొటోలు తీసే విధానం చూసి ఆ దంపతులే కాదు.. నెటిజన్లు కూడా అవాక్కయ్యారు. ఆ ఫొటోగ్రాఫర్ వారిద్దరినీ ఓ చెట్టు కింద నిలబడమని చెప్పి అతను ఓ చెట్టు ఎక్కాడు. అక్కడితో ఆగకుండా ఏకంగా చెట్టు కొమ్మకు తలకిందులుగా వేలాడుతూ మరీ వారి ఫొటో తీశాడు. ఆ ఫొటో కూడా చాలా చక్కగా వచ్చింది. ఇలా ఫొటో తీస్తున్న వీడియోను రాజబాబు అనే నెటిజన్ తన ట్విటర్లో పోస్ట్ చేశాడు. ‘నేరాలకు వ్యతిరేకంగా పోరాడటానికి స్పైడర్ మ్యాన్ కావాలనుకున్నప్పుడు.. తల్లిదండ్రుల ఒత్తిడి తట్టుకోలేక ఫొటోగ్రాఫర్ అయితే ఇలాగే ఉంటుంది’ అని సరదాగా ట్వీట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడెవడండీ బాబు.. స్పైడర్ మ్యానా.? ఫొటోగ్రాఫరా.? అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు. అయితే ఫోటో షూట్ ఎక్కడ జరిగింది అన్న విషయం తెలియదు. -
ధైర్యమున్న పిల్లే!
కింగ్ ఫిషర్స్ క్యాలెండర్ గురించి మీరు వినే ఉంటారు. చాలా ఫేమస్.అందులో లేడీ మోడల్స్ ఉంటారు. అయితే ఇందులో మేల్ మోడల్స్ఉంటారు. అందుకే దీన్ని క్వీన్ ఫిషర్స్ క్యాలెండర్ అనొచ్చు. విశేషం ఏంటంటే.. ఈ మేల్ క్యాలెండర్ కోసం బాలీవుడ్ బాయ్స్‌ని షూట్ చేసింది... ఓ లేడీ ఫొటోగ్రాఫర్. ధైర్యమున్న పిల్లే! మహిళా మోడళ్లతో ఏ దివిలోనో ఫొటో సెషన్ పెట్టి, ఏటా అందమైన క్యాలెండర్ రిలీజ్ చేసి, ఓ ట్రెండ్ సెట్ చేసింది ‘కింగ్ ఫిషర్స్’ సంస్థ. అయితే ఆ క్రెడిట్ అంతా ఫొటోగ్రాఫర్ అతుల్ కాస్బేకర్ది. అలా స్త్రీ సౌందర్య రాశులను మగ ఛాయాచిత్ర గ్రాహకులు అందాల చట్రంలో బంధించడం అన్నది ఓ సంప్రదాయం అయింది. అయితే ఇప్పుడా సంప్రదాయాన్ని బద్దలు కొట్టేశారు లేడీ ఫొటోగ్రాఫర్ శర్వీ చతుర్వేది. ఎలా సాధ్యం అయింది? శర్వీ 2015లో తొలిసారిగా.. కింగ్ ఫిషర్ క్యాలెండర్ చిన్నబుచ్చుకునేలా.. ఆల్ మేల్ మోడల్స్‌తో ఫొటో షూట్ చేశారు. మేల్ మోడల్స్‌గా పోజ్ ఇచ్చిన వాళ్లంతా బాలీవుడ్ యంగ్ చాప్స్. ‘‘లైఫ్ ఇన్ ఏ డాట్ సిరీస్’’ అనే పేరుతో ఆ షూట్‌ను నిర్వహించారు శర్వీ. కింగ్‌ఫిషర్ క్యాలెండర్.. స్విమ్ సూట్లో అమ్మాయిలను షూట్ చేసినట్టే శర్వీ కూడా పన్నెండు మంది బాలీవుడ్ అబ్బాయిలను స్విమ్‌సూట్‌లో షూట్ చేశారు. ఇలాంటి షూట్ చేసిన ఫిమేల్ ఫొటోగ్రాఫర్స్ చాలా చాలా అరుదు. వాళ్లలో శర్వీ ఒకరు. ‘‘చాలా మందికి విడ్డూరంగా అనిపించవచ్చు. కాని ఇది ఫోటోగ్రాఫర్ ఈస్థటిక్స్‌కు సంబంధించింది. ఇలాంటి వాటిని అర్థం చేసుకోవడానికి, ఆవిష్కరించడానికి పరిణతి ఉండాలి. కళాత్మకతతో పాటు గ్లామరస్ ఫార్మెట్ కూడా అవసరం’’ అంటారు శర్వీ. ఇక్కడ జెండర్ ప్రాధాన్యం కాదు అని కూడా అంటారు శర్వీ.‘‘ స్విమ్‌సూట్‌లో అమ్మాయి అయినా, అబ్బాయి అయినా ఫొటోగ్రాఫర్‌కు ఇమేజ్ ముఖ్య భూమిక పోషిస్తుంది. అమ్మాయిలతో ఫొటో షూట్ అంటే వందరకాల ప్రయోగాలకు ఆస్కారం ఉంటుంది. అదే అబ్బాయిలతో అంతగా ఉండదు. చాలెంజింగ్ తీసుకోవాలి. స్టీరియోటైప్‌ను బ్రేక్‌ను చేయాలి. మోడల్స్‌తో కంటే యాక్టర్స్‌తో షూట్ తేలిక అనుకుంటున్నా. ఎందుకంటే క్యాలెండర్‌కు ఓ థీమ్ ఉంటుంది. ఆ థీమ్ ప్రకారమే ఫొటో ఇమేజెస్‌ను ప్రొజెక్ట్ చేయాలి. అంటే ఒకరకంగా వాళ్లతో యాక్ట్ చేయించడమన్నట్టే కదా. యాక్టర్స్ అయితే కాన్సెప్ట్‌ను త్వరగా అర్థం చేసుకుంటారు. కావల్సిన హావభావాలు పలికిస్తారు. అందుకే మెడల్స్ కన్నా యాక్టర్స్తోనే ఫోటో షూట్ ఈజీ అనుకుంటున్నా’’ అని అంటారు శర్వీ. ఈ ఫొటో షూట్ కోసం దబ్బూ రత్నాని, సుభాష్ ఘై లాంటి దిగ్గజాలతో కలిసి పనిచేశారు శర్వీ. ‘‘దబ్బూ సర్.. అబ్జర్వేషన్ స్కిల్స్‌ను ఎలా పెంపొందించుకోవాలో, సహనంగా ఎలా ఉండాలో నేర్పారు. ఇక సుభాష్ ఘై సర్.. ‘‘గ్రహించాలి.. వినాలి.. చదవాలి’’ అనే మూడు ప్రిన్సిపల్స్ పాటిస్తారు. తనతో పనిచేసేవాళ్లు అవి పాటించేలా చూస్తారు. ‘‘జీవితంలో నువ్వు నిత్య విద్యార్థివే’’ అని చెప్తుంటారు’’ అని వాళ్లతో పనిచేసిన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు శర్వీ చతుర్వేది. లైఫ్ ఇన్ ఏ డాట్ అంటే? డాట్ అంటే శర్వీ భావనలో ఒక వృత్తం. జీవితమనే పరిపూర్ణమైన వృత్తం. జీవితంలోని ప్రతి పని ఆ వృత్తాన్ని పెంచుతూ ఉంటుంది. దీనికి లైఫ్ ఇన్ ఏ డాట్ అనే లోగోలో పెద్ద ఎర్ర కుర్చీని సంకేతంగా చూపించారు శర్వీ. ఇలా డిఫరెంట్ ఫొటో షూట్‌ను కంటిన్యూ చేయడం ఇష్టమేనని, చాలెంజెస్‌ను స్వీకరించడం తన నైజమని అంటున్నారు శర్వీ చతుర్వేది. -
సైరా టీమ్‌కు షాక్
సాక్షి, సినిమా : మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. సుమారు రూ. 150 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న సైరాలో సౌత్ నటులతోపాటు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో లీక్ కావటంతో చిత్ర యూనిట్ కంగుతింది. ఓ ఇంట్లో ప్రధాన తారాగణం షూటింగ్లో పాల్గొన్న ఫోటో అది. చిరుతోపాటు హీరోయిన్ నయనతార.. మరికొందరు పాత్రధారులు అందులో ఉన్నారు. చేతిలో చంటిబిడ్డను ఎత్తుకున్న నయన్.. చిరు కుటుంబ సభ్యులతో సీరియస్‌గా మాట్లాడుతుండగా.. వెనకాల చిరు (నరసింహారెడ్డి) అనుచరులు ఉన్న ఫోటో అది. చిత్ర యూనిట్ సభ్యుల్లో ఎవరో రహస్యంగా ఆ ఫోటోను తీసి ఇంటర్నెట్లో పెట్టినట్లు స్ఫష్టమౌతోంది. అయితే ఫోటో లీక్ అయిన విషయాన్ని తెలుసుకున్న చిత్ర యూనిట్ అప్రమత్తమై వెంటనే దానిని తొలగించింది. ఈ వ్యవహారంపై చిరుతోపాటు నిర్మాత రామ్ చరణ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక మీదట జాగ్రత్తగా ఉండాలని చిత్ర యూనిట్‌కు వాళ్లు వార్నింగ్ ఇచ్చారంట. -
మేడారం భక్తులకు కాంటెస్ట్
సాక్షి, వరంగల్ రూరల్: మేడారం జాతరలో ఎక్కడ చూసినా భక్తులు సెల్ఫీలు దిగుతూ కనిపిస్తున్నారు.. ఏంటి ఈ సెల్ఫీ పిచ్చి అనుకుంటున్నారా.. ప్రభుత్వం ఈసారి మేడారం జాతర కాంటెస్ట్–2018 పేరుతో సెల్ఫీ, ఫొటో, షార్ట్‌ఫిల్మ్ పోటీలను నిర్వహిస్తోంది. ఈ కాంటెస్ట్‌కు మేడారంలోని సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లే భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మేడారం జాతరకు అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించేందుకు ప్రభుత్వం ఈ కాంటెస్ట్‌ను భక్తుల ముందుకు తీసుకొచ్చింది. విజేతలకు నగదు బహుమతులు.. పోటీల్లో గెలుపొందిన వారికి మొత్తం రూ.4.25 లక్షల నగదు బహుమతులను అందించనున్నారు. సెల్ఫీ మొద టి బహుమతి రూ.25 వేల నగదు, ద్వితీయ బహుమతి రూ.15 వేలు, తృతీయ బహుమతి రూ.10 వేలు, బెస్ట్ ఫొటోగ్రఫీ విభాగంలో మొదటి బహుమతి రూ.75 వే లు, ద్వితీయ బహుమతి రూ.50 వేలు, తృతీయ బహుమతి రూ.25 వేలు, షార్ట్ ఫిల్మ్ విభాగంలో మొదటి బహుమతి రూ.లక్ష, ద్వితీయ బహుమతి రూ.75 వేలు, తృతీయ బహుమతి రూ.50 వేలు అందించనున్నారు. ప్రచారం కోసమే.. జాతర విశేషాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ కర్ణన్ ఇటీవల స్థానిక యువతతో నిర్వహించిన సమావేశంలో పేర్కొన్నారు. కొత్తకొత్త ఆలోచనలతో యువకులు షార్ట్ ఫిల్మ్‌లను రూపొందిస్తున్నారు. ఈ పోటీల ద్వారా జాతర ప్రచారం విశ్వ వ్యాప్తమవుతుందనే ప్రభుత్వం భావిస్తోంది. 12,561 మంది లైక్‌లు.. ప్రస్తుతం సోషల్ మీడియాపై అందరూ దృష్టి పెట్టారు. దీంతో ప్రభుత్వం అఫీషియల్ ఫేస్బుక్ లైక్ పేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు 12,561 మంది ఫేస్బుక్ లైక్ పేజీకి లైక్ కొట్టారు. సెల్ఫీలు, ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్‌ల కాంటెస్ట్ కోసం అఫీషియల్ ఫేస్బుక్ లైక్ పేజీలో పోస్ట్ చేయాలని పేర్కొన్నారు. దీంతో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. గద్దెల వద్ద, గంట కొడుతూ, ఎదురుకోళ్లను ఇస్తూ ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా సెల్ఫీలు దిగి పోస్ట్ చేస్తున్నారు. జంపన్నవాగులో స్నానం చేస్తున్నవి, ఎడ్ల బండ్లలో జాతరకు వస్తున్న ఫొటోలు దిగి ఫేస్బుక్లో పోస్ట్ చేస్తున్నారు. ఫిబ్రవరి 5వ వరకు పోటీలు ఇటీవల హైదరాబాద్‌లో వరంగల్‌కు చెందిన ఓ వ్యక్తి లోకల్ ట్రైన్ దగ్గర సెల్ఫీ దిగి ప్రమాదం బారిన పడడంతో ప్రభుత్వం పలు నిబంధనలు పెట్టింది. ప్రయాణిస్తూ, గుట్టలు ఎక్కుతూ, విద్యుత్ తీగల దగ్గర, జంతువుల దగ్గర, ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు సెల్ఫీలు దిగొవద్దని సూచించారు. ఫిబ్రవరి 5 వరకు ఫేస్బుక్ ద్వారా ఫొటోగ్రఫీ, సెల్ఫీ, షార్ట్ ఫిల్మ్‌లను అప్లోడ్ చేయాలని ప్రభుత్వం పేర్కొంది. జాతరకు ప్రచారం వస్తుంది.. మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర సందర్బంగా సెల్ఫీలకు బహుమతులు పెట్టడం చాలా బాగుంది. అన్ని వయస్సుల వారు సెల్ఫీలు ఎక్కువగా దిగుతున్నారు. సెల్ఫీతోపాటు ఫొటోగ్రఫీ, షార్ట్‌ఫిల్మ్ కాంటెస్ట్‌లను ప్రభుత్వం నిర్వహిస్తోంది. మా ఫ్రెండ్స్‌తో దిగిన ఫొటోను అప్లోడ్ చేశాం. చాలా మంది లైక్‌లు సైతం కొట్టారు. దీంతో జాతరకు చాలా ప్రచారం కూడా వస్తుంది. –మడిపెల్లి సుశీల్, వరంగల్ -
సింగిల్‌గా తెచ్చింది
ఓ సినిమాలో పాపులర్ డైలాగ్.. ‘సింహం సింగిల్‌గా వస్తుందని’! పాస్‌పోర్టు ఆఫీస్ మాత్రం.. జారియా జంటగానే రావాలి అంది! ‘‘కుదర్దు సింగిల్‌గానే వస్తుంది.. సింగిల్‌గానే మార్పు తెస్తుంది’’ అని మనసులోనే శపథం చేసుకుంది జారియా! ఈ సింగిల్ మదర్ .. పోరాటం.. విజయం.. వెరిమచ్ ఇన్స్పైరింగ్. ‘‘క్యా హువా బేటా (ఏమైందమ్మా)’’బయటి నుంచి వచ్చి ఈసురోమంటూ సోఫాలో చేరగిలబడ్డ కూతురిని చూస్తూ అడిగింది తల్లి ఆత్రంగా! ‘‘కుఛ∙నహీ హువా మా... హమేషాకి తరహ్ (ఏమీ కాలేదమ్మా.. ఎప్పటిలాగే)’’.. నిరాశగా నిట్టూరుస్తూ జవాబిచ్చింది కూతురు.‘‘పరేషాన్ మత్ హో.. సబ్ ఠీక్ హోగా (కంగారు పడకు.. అంతా సవ్యంగానే జరుగుతుంది)’’.. అంది తల్లి కూతురి తల నిమురుతూ! కళ్లల్లో నీళ్లొచ్చాయి కూతురికి తల్లి స్పర్శతో. వెంటనే తమాయించుకుని ‘‘ఏక్ మినట్ మా... ’’అంటూ దిగ్గున లేచి తన గదిలోకి వెళ్లింది కూతురు. హడావుడిగా ల్యాప్‌ట్యాప్ తెరిచి.. ‘ఛేంజ్ డాట్ ఓఆర్జీ’కి ఓ పిటిషన్ మెయిల్ చేసింది. తర్వాత విదేశీ వ్యవహారాలశాఖా మంత్రి సుష్మాస్వరాజ్‌కు ట్వీట్ చేసింది. ఆమె పేరు జారియా పట్నీ. ముంబై నివాసి. ఉన్నపళంగా పిటిషన్, మంత్రికి ట్వీట్ చేయాల్సిన అవసరమేంటి? గతం జారియాకు పందొమ్మిదేళ్లప్పుడు పెళ్లయింది. ముంబైలో వాళ్ల బిల్డింగ్‌లోనే ఓ అపార్ట్మెంట్లో అద్దెకుండే ఓ వ్యక్తితో పరిచయమైంది. అతను ఆమెకన్నా ఏడేళ్లు పెద్దవాడు. ‘‘నువ్వంటే ఇష్టం’’ అన్నాడు. ఆమె స్నేహం చేసింది. కాఫీ షాప్‌లు, సినిమాలు, షాపింగ్‌లకు కలిసి వెళ్లేవారు. ఆ చనువు ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో పెళ్లీ అయింది. పెళ్లయ్యాక అతనికి దుబైలో ఉద్యోగం రావడంతో జారియాను తీసుకొని దుబై వెళ్లాడు. ఆమె ఏం తినాలి? ఎలాంటి బట్టలు వేసుకోవాలి? ఎవరితో మాట్లాడాలి? ఎలాంటి వాళ్లు స్నేహితులుగా ఉండాలి అనేవన్నీ అతనే నిర్ణయించడం మొదలుపెట్టాడు. మొదట్లో.. ఏ బట్టలు వేసుకోవాలో, ఏం తినాలో భర్త చెబుతుంటే ప్రేమ అనుకుంది. కాని రానురాను ఆ తీరు పొసెసివ్‌నెస్‌గా, అతని అభద్రతగా అర్థమైంది జారియాకు. అయితే ఆయన ప్రతాపం అంతటితో ఆగలేదు. జారియా తన హక్కు గురించి ఏమాత్రం మాట్లాడినా చేయిచేసుకునేదాకా వెళ్లింది. ఆ సమయంలోనే ఆమె ప్రెగ్నెంట్ అని తేలింది. అయినా హింస ఆపలేదు. గర్భిణి అని కూడా చూడకుండా ఆమెను కొట్టాడు. తీవ్ర అస్వస్థతకు లోనై ఆసుపత్రి పాలైంది. ఒక్కరోజు ఆలస్యమైనా జారియా ప్రాణంమీదకు వచ్చేదని చెప్పారు డాక్టర్లు. దాంతో భయపడిపోయిన జారియా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవగానే ముంబైకి ప్రయాణమైంది. జరిగిన విషయం ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పింది. అండగా నిలిచారు. మళ్లీ వెనక్కి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. విడాకులకు దరఖాస్తు చేసుకుంది. కేస్ కోర్టులో ఉండగానే జారియాకు కొడుకు పుట్టాడు. బిడ్డతో పాటు విచారణలకు వెళ్లొచ్చేది. ఎట్టకేలకు బిడ్డకు ఆమెను లీగల్ గార్డియన్‌గా చేస్తూ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఊపిరి పీల్చుకుంది జారియా. ప్రస్తుతం చేంజ్ డాట్ ఓఆర్జీలో ఆమె పిటిషన్‌కు తొంభైఆరువేల మంది మద్దతు పలికారు. దాంతో ప్రభుత్వం... సుప్రీంకోర్టు గైడ్‌లైన్‌కు విరుద్ధంగా ఉన్న తన నిబంధనను వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది. తల్లి లీగల్ గార్డియన్ అని ఉన్న సుప్రీంకోర్టు గైడ్‌లైన్‌ను గౌరవిస్తూ తల్లి సంతకంతోనే జారియా కొడుకుకు పాస్‌పోర్ట్ మంజూరు చేశారు. తన పోరాటం ఎంతో మంది ఒంటరితల్లులకు ఊరటైనందుకు చాలా సంతోషంగా ఉంది జారియా పట్నీ! బ్రాండ్ ఫొటోగ్రాఫర్ ఓ వైపు పిల్లాడి పెంపకం బాధ్యతలు చూసుకుంటూనే ఇంకోవైపు తండ్రికి వ్యాపారంలో చేదోడువాదోడుగా ఉంటోంది జారియా. బాబు కొంచెం పెద్దయ్యాక భర్త పక్కన పెట్టించిన ఫొటోగ్రఫీ అభిరుచిని మళ్లీ ప్రారంభించింది. త్వరలోనే మంచి పేరున్న బ్రాండ్స్ నుంచి ఆఫర్స్ రావడం మొదలయ్యాయి. ఆ షూటింగ్‌లు, వ్యాపారంతో చాలా బిజీ అయిపోయింది. షూటింగ్స్ విదేశాల్లో ఉండటంతో అక్కడికీ వెళ్లాల్సి వచ్చింది. ఒకసారి కొడుకును కూడా తీసుకెళ్దామనుకుంది. పాస్‌పోర్ట్‌కు అప్లయ్ చేస్తే రిజెక్ట్ అయింది. కొంతకాలం ఆగి మళ్లీ చేసింది. మళ్లీ దరఖాస్తును తోసిపుచ్చారు. ఖంగు తినింది. కారణమేంటో తెలియలేదు. పాస్‌పోర్ట్ ఆఫీస్‌కు వెళ్లి ఆరా తీసింది. పిల్లాడి తండ్రి సంతకం తప్పనిసరిగా కావాలన్నారు. ‘‘అదేంటి? సింగిల్ పేరెంట్‌ని. విడాకులు కూడా తీసుకున్నాను. ఇప్పుడు అతని దగ్గరకు వెళ్లి సంతకం ఎలా తీసుకొస్తాను? తేలేను’’ అని తేల్చేసింది. ‘‘మేమూ ఇవ్వలేం’’ అని వాళ్లూ స్పష్టం చేశారు. షాక్ అయింది జారియా. అతని హింసను భరించలేక కాపురం వద్దనుకోవడమే కాదు జన్మలో అతని మొహమే చూడకూడదనుకుంది. సంతకం కోసం అలాంటి వ్యక్తి దగ్గరకు మళ్లీ వెళ్లాలా? సమస్యే లేదు. పాస్ పోర్ట్ ఎలా రాదో చూస్తా అనుకుంది. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ చూసింది. విడాకుల కేసుల్లో పిల్లలకు సంబంధించి దరఖాస్తు ఫారాల్లో తల్లి, తండ్రి ఇద్దరిలో ఎవరి సంతకమైనా చెల్లుతుంది అని రాసి ఉంది. ఆ గైడ్‌లైన్‌ను పట్టుకొని ఇంకోసారి పాస్‌పోర్ట్ ఆఫీస్‌కు వెళ్లింది. తండ్రి సంతకం తప్పనిసరిగా కావాలని ప్రభుత్వ నియమాన్ని, నిబంధనను తీసి చూపించారు పాస్‌పోర్ట్ అధికారులు. సుప్రీంకోర్టు గైడ్‌లైన్‌ను చెల్లదు పొమ్మన్నారు! డీలా పడి ఇల్లు చేరింది. అంతలోకే ఆలోచన వచ్చి చేంజ్ డాట్ ఓఆర్జీకి పిటిషన్, సుష్మాస్వరాజ్‌కు ట్వీటూ చేసింది. – శరాది -
ఈ సోదరి కష్టం చూస్తే కన్నీరే..
కూలీకి వెళ్తేకాని రోజు గడవని పరిస్థితి వారిది. అయినా ఉన్నదాంట్లో అందరూ సంతోషంగా ఉండేవారు. అయితే పెద్దలు చెప్పినట్లు మనం బాధల్లో ఉన్నప్పుడే కష్టాలు మరింతగా పలకరిస్తాయన్నట్లు, అలాంటి సమయంలోనే ఇంటికి పెద్ద దిక్కు రోడ్డు ప్రమాదంలో కన్ను మూశాడు. ఇక వారిపరిస్థతి అగమ్యగోచరం కొద్ది రోజులు పాటు తినడానికి తిండిలేదు. ఏదైనా కొనడానికి ఇంట్లో చిల్లిగవ్వలేదు. ఇక కుటుంబ భారాన్ని మోసే బాద్యతను 12ఏళ్ల చిన్నారి తీసుకుంది. బడికి వెళ్లాల్సిన వయసులో కొండంత కుటుంబ భారాన్ని మోస్తోంది. బలపంతో అక్షరాలు దిద్దాల్సిన చేతులు ఇటుకలను పగలకొడుతున్నాయి. తనవారి కోసం బాల్యాన్ని త్యాగం చేసి కుటుంబం కోసం నిలబడింది ఓ చిన్నారి. వివరాల్లోకి వెళ్తే బంగ్లాదేశ్‌కు చెందిన రోణా అక్తర్ 12 ఏళ్ల వయసులోనే కుటుంబ భారాన్ని మోస్తోంది. తండ్రి ప్రమాదంలో చనిపోవడంతో కుటుంబాన్ని పోషించడానికి తల్లితో ఇటుకలను పగలకొట్టేపనికి చేరింది. ప్రారంభంలో రోజు 35 టాకాలు సంపాదించేది. ఇప్పడు రోజుకు 125 టాకాలు సంపాదిస్తోంది. తనకు వచ్చే ఈ చిన్న మొత్తం తోనే ఇంటి అద్దె, అవసరాలు తీరుస్తోంది. అంతేకాదు చదువులో రాణిస్తున్న తన సోదరుడు రాణాకు సైకిల్ కొనివ్వడం కోసం గత ఆరు నెలలుగా అదనంగా పనిచేస్తోంది. రాణా రోజు ట్యూషన్‌కు వెళ్లిరావడానికి ఇబ్బంది పడుతున్నాడని, తన సంపాదనతో సైకిల్ కొనివ్వాలన్నది తన కోరిక అక్తర్ అని తెలిపింది. బంగ్లాదేశ్ ఫొటోగ్రాఫర్ ఆకాశ్ వీరి కష్టాన్నితన ఫేస్బుక్ వాల్‌పై రాసుకొచ్చాడు. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
సోదరుడుకి సైకిల్ కొనివ్వడం కోసం..
-
కిల.. కిల.. కిల
ఏటా పక్షులు ఓ చోటు నుంచి మరో చోటుకు వలస వెళ్తుంటాయి. అది వాటికి అవసరం.. ఆవశ్యకం. మనకు మాత్రం ఆహ్లాదం. అవి అలా గుంపులు గుంపులుగా ఆకాశంలో వెళుతూ సందడి చేస్తుంటే మనసుకు అదో ప్రశాంతత. అయితే అక్కడితోనే ఆగిపోకుండా ఓ ఫొటోగ్రాఫర్ పక్షుల వలసలో కూడా సృజనాత్మకతను వెలికి తీశాడు. జర్మనీకి చెందిన డేనియల్ బైబర్ వేలాది పక్షులు మరో పక్షి ఆకారంలోకి మారినప్పుడు ఈ అద్భుతమైన ఫొటోలను క్లిక్‌మనిపించాడు. ఈశాన్య స్పెయిన్‌లోని కోస్ట్రాబావాలో నాలుగు రోజుల పాటు కష్టపడి ఈ అద్భుతాలను ప్రపంచానికి అందించాడు. -
మళ్లీ విభిన్న కథాంశంతో సుమంత్
చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూసిన సుమంత్‌కు 'మళ్లీరావా' మంచి బూస్ట్‌నిచ్చింది. సత్యం, గోదావరి తరువాత మళ్లీ తన కెరీర్లో ఈ సినిమా ప్లస్ అయింది. అయితే మధ్యలో చాలా సినిమాలు చేసినా సమంత్‌కు విజయం దక్కలేదు. నరుడా డోనరుడా (హిందీ సినిమా ‘విక్కీ డోనర్’) తెలుగులో కొత్త కథే అయినా అది ప్రేక్షకులకు చేరుకోలేకపోయింది. చాలాకాలం తర్వాత మంచి కథాంశంతో, తనకు సరిపోయే ప్రేమకథా చిత్రంతోనే మళ్లీ సక్సెస్ అందుకున్నారు. ఈ ఉత్సాహంలో మరో కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో సుమంత్ నిద్ర సమస్యతో బాధపడే పత్రిక ఫోటోగ్రాఫర్ పాత్రలో నటించనున్నట్లు సమాచారం. తనకు ఉన్న సమస్యతో ఎదురయ్యే సమస్యలేంటి? వాటిని ఎలా పరిష్కరించుకుంటాడనేదే సినిమా కథ అని సమాచారం. అనిల్‌కుమార్ ఈ సినిమాతో తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. అనిల్ ఈ చిత్రాన్ని సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇక మళ్లీరావా బాక్సాఫీస్ వద్ద తన హవా కొనసాగిస్తోంది. ఇప్పటికీ ఏ-సెంటర్లలో ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబడుతోంది. హిందీ టీవీ సీరియల్ నటి ఆకాంక్ష సింగ్ మళ్లీరావాతో హీరోయిన్గా పరిచయం అయింది. -
‘ఆ వెబ్సైట్ల’పై మా ఫిర్యాదు
-
‘ఆ వెబ్సైట్ల’పై 'మా' ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ప్రయివేట్ వెబ్సైట్లు, యూ ట్యూబ్ ఛానళ్లపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. ‘మా’ ఫిర్యాదు మేరకు అశ్లీల వెబ్ సైట్లపై సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. తమ ఫొటోలను మార్ఫింగ్ చేసి తమ క్యారెక్టర్ ని దెబ్బ తీయాలని చూస్తున్న వెబ్సైట్ల ఫై చర్యలు తీసుకోవాలని 'మా' అసోసియేషన్ సభ్యులు పోలీసులను కోరారు. ఉద్దేశపూర్వకంగా కొందరు వారి సైట్లలో అశ్లీల ఫొటోలు పోస్ట్ చేసి తమకు ఇష్టమొచ్చిన కథనాలను ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ ఎస్పీ రాంమోహన్ మీడియాతో మాట్లాడుతూ.. దాదాపు వందల వెబ్సైట్లఫై ఈ విషయంలో ఫిర్యాదులు అందాయని తెలిపారు. సినీ సెలబ్రిటీలే కాకుండా, వ్యక్తిగతంగా ఎవరిని కించపరిచేలా కథనాలు రాసినా, ప్రచురించినట్లు ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎవరిని అశ్లీలంగా చూపెట్టినా నిందితులు శిక్షార్హులని పేర్కొన్నారు. ఐటీ యాక్ట్ 66 ప్రకారం ఇటువంటి బూతు కథనాలు, అవాస్తవాలు రాయడం, ఫొటోలు మార్ఫింగ్ చేసి అశ్లీల ఫొటోలు అప్ లోడ్ చేసేవారితో పాటు ఆ వెబ్ సైట్ల నిర్వాహకులఫై కేసులు నమోదు చేసి చర్య తీసుకుంటామన్నామని చెప్పారు. విదేశాల్లో ఉండి వెబ్సైట్లను నిర్వహిస్తున్న వారిని సైతం విడిచిపెట్టేది లేదన్నారు. -
మెరుపులాంటి చిత్రం
ఇది నిజంగానే మెరుపులాంటి చిత్రం కదూ.. అందుకే ఈ ఫొటో వెదర్ ఫొటో గ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ 2017 కు ఎంపికైంది. మొత్తం 60 దేశాల నుంచి 2 వేల ఎంట్రీలు రాగా.. అందులో ఈ చిత్రం మొదటి బహుమతిని గెలుచుకుంది. ఈ పురస్కారాన్ని బ్రిటన్ కు చెందిన రాయల్ ఫొటోగ్రాఫిక్ సొసైటీ ఏటా ప్రదానం చేస్తోంది. ఈ చిత్రాన్ని ఆరిజోనాలో మైక్ ఒబెన్స్కీ అనే ఫొటోగ్రాఫర్ తీశారు. పర్ఫెక్ట్ షాట్ కోసం మైక్ దాదాపు గంటన్నర పాటు అక్కడ ఎదురు చూశారట. -
మేము పబ్లిక్ సొత్తు కాదు.
తమిళసినిమా: మేము పబ్లిక్ సొత్తు కాదని అంటోంది నటి ఇలియానా. ఈ గోవా బ్యూటీ కోలీవుడ్‌లో కేడీ చిత్రంతో నాయకిగా ఎంట్రీ ఇచ్చినా హిట్ ఖాతాను ప్రారంభించింది మాత్రం టాలీవుడ్లోనే. అక్కడ దేవదాసు చిత్రంతో రంగప్రవేశం చేసిన ఇలియానాకు ఆ చిత్ర విజయం వెనక్కు తిరిగి చూసుకునే అవకాశం కలిగించలేదు. టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలో మళ్లీ కోలీవుడ్‌లో విజయ్‌కు జంటగా నన్భన్ చిత్రంలో నటించే అవకాశం తలుపుతట్టింది. అయితే అంతకుముందు పలు ప్రముఖ హీరోలతో నటించే అవకాశాలు వచ్చినా ఇలియానా అంగీకరించలేదనే ప్రచారం జరిగింది. కారణాలేమైనా నన్బన్ చిత్రం తరువాత కూడా ఇలియానా కోలీవుడ్‌లో కనిపించలేదు. ఆ తరువాత టాలీవుడ్‌కు దూరమై బాలీవుడ్లో తెలింది. ఇప్పటికీ హిందీ చిత్రాలనే నమ్ముకున్న ఇలియానాపై బోలెడన్ని వదంతులు ప్రచారమై అవి సినీ జనాలకు చాలా ఎంటర్టెయిన్ ఇచ్చాయి. అందులో ఒకటి ఇలియానా ఆస్ట్రేలియాకు చెందిన ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో జరుపుతున్న ప్రేమాయణం అంశం. చాలా మంది హీరోయిన్లు ఇప్పుడు తన ప్రచారాల కోసం ఇన్‌స్టాగ్రామ్‌ను వాడుకుంటున్నారు. తమ గ్లామరస్ ఫొటోలను అందులో పోస్ట్ చేసి అభిమానుల దృష్టిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా నటి ఇలియానా కూడా తన లవర్ ఆండ్రూతో రొమాంటిక్‌గా ఉన్న ఫొటోలను ఇన్స్ట్ర్రాగాంలో పోస్ట్ చేసి ప్రచారం పొందే ప్రయత్నం చేసింది. అయితే అది బెడిసి కొట్టినట్లుంది. ఈ అమ్మడి గురించి వదంతుల పర్వం తీవ్రం అవడంతో తలనొప్పిగా మారిందట. దీంతో వదంతుల రాయుళ్లపై ఇలియానా ఆగ్రహంతో ఊగిపోతోందట. నిజమే హీరోయిన్లు సెలబ్రిటీలే. అయితే వారేమీ పబ్లిక్ సొత్తు కాదు. తామూ మనుషులమే. తమకు పర్సనల్ జీవితం అంటూ ఉంటుంది. ఈ విషయాన్ని ఎందుకు గ్రహించరూ? స్త్రీలమన్న భావనతో తమకు కాస్త గౌరవం ఇవ్వండి అంటూ చిర్రుబుర్రులాడుతోందట. మరి లవర్‌తో ఉన్న రొమాంటిక్ ఫొటోలను ఇన్స్ట్ర్రాగాంలో పోస్ట్ చేసే ముందు ఈ విషయాల గురించి ఎందుకు ఆలోచించలేదు ఈ అమ్మడు అన్న అభిమానుల ప్రశ్నకు ఇలియానా వద్ద బదులు లేదట. మొత్తం మీద బాయ్‌ఫ్రెండ్‌ను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్ల డించిన ఇలియానా ప్రకటనతో తన నట జీవితానికి ఎఫెక్ట్ అవుతుందని భావించి ఆయనతో పెళ్లిని వాయిదా వేసుకుందట. -
యూట్యూబ్‌లో ఆ ఫీచర్లు ఔట్
యూట్యూబ్ ఓ రెండు ఫీచర్లను సెప్టెంబర్ 20 నుంచి తన ప్లాట్‌ఫామ్‌పై తొలగిస్తోంది. వీడియో ఎడిటర్, ఫోటో స్లైడ్షోస్ టూల్స్ సెప్టెంబర్ 20తో రిటైర్ అయిపోతాయని యూట్యూబ్ తెలిపింది. అయితే అన్ని ఎడిటింగ్ ఫీచర్లను యూట్యూబ్ తీసివేయడం లేదు. ట్రిమింగ్, బ్లరింగ్, ఫిల్టర్స్ వంటి వాటిల్లో మెరుగుపరిచిన వాటిని వీడియో క్రియేటర్స్ వాడుకోవచ్చని యూట్యూబ్ చెప్పింది. ఈ ఫీచర్లను తొలగించడానికి ప్రధాన కారణం, వీటిని తక్కువగా వాడేలా చేసేందుకేనని కంపెనీ వివరించింది. వీటికి స్వస్తి పలికి, కొత్త టూల్స్‌ను అభివృద్ధి చేయడానికి, ఉన్నవాటికి మెరుగుపరడానికి చూస్తున్నామని గూగుగ్ ప్రొడక్ట్ ఫోరమ్ పేజ్ కమ్యూనిటీ మేనేజర్ మారిస్సా చెప్పారు. వీడియో ఎడిటర్ లేదా ఫోటో స్లైడ్‌షో సెక్షన్‌పై ప్రాజెక్టులు ఉన్న యూట్యూబ్ క్రియేటర్లు సెప్టెంబర్ 20 వరకు వీటిపై పైనలైజ్ చేసుకోవాలని, లేనిపక్షంలో వారు ప్రాజెక్టులు కోల్పోతారని చెప్పారు. వీడియో ఎడిటర్ లేదా ఫోటో స్లైడ్షోస్లతో ఇప్పటికే పబ్లిష్ అయిన వీడియోలు మాత్రం దీనికి ప్రభావితం కావు. ఒకవేళ ఆ వీడియోలను వీడియో ఎడిటర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే కష్టం. 720పీ రెజుల్యూషన్లోనే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. -
ఇదొక అందమైన ప్రదేశం.. కానీ...
మనం ఎదైనా సుందరమైన, అద్భుతమైన ప్రదేశాలను సందర్శించినపుడు వాటి జ్ఞాపకాలు ఎప్పటికీ మనతోనే ఉండాలని వాటిని కెమెరాల్లో బంధిస్తుంటాం. దానికి ఎవరూ అడ్డుచెప్పరు. అలా తీసిన ఫొటోలను మనం ఫేస్బుక్, ట్వీటర్, ఇన్స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి... వచ్చిన లైక్‌లు, షేర్లు, కామెంట్లను చూసి మురిసిపోతుంటాం. ఇదిలా ఉంటే... యూరోప్‌లోని స్విస్ ఆల్పస్ అనే సుందరమైన, అద్భుతమైన పర్వతాలతో కూడిన ఓ గ్రామం ఉంది. ఈ ప్రదేశంలో ఫొటోలు తీయడంపై స్థానిక అధికారులు మాత్రం నిషేధం విధించారు. దీనికి అధికారులు ఓ వింతైన కారణాన్ని చూపుతున్నారు. ఇక్కడకు వచ్చిన పర్యాటకులు ఇక్కడి అందాలను తమ కెమెరాల్లో బంధించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తుంటారు. అయితే ఈ ఫొటోలను చూసిన వారు మాత్రం జెలసీగా ఫీల్ అవుతున్నారట. అంతేకాకుండా ఇంత అద్భుత ప్రదేశాన్ని వెంటనే చూడలేకపోతున్నామని డిప్రెషన్‌కు లోనవుతున్నారట. ఈ కారణంతో ఫొటోలు తీయడంపై నిషేధం విధించామని అధికారుల చెబుతున్నారు. -
వివాదంలో ప్రముఖ నటుడు.. కేసు నమోదు
ముంబై: బాలీవుడ్ ప్రముఖ నటుడు అర్జున్ రాంపాల్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ఆ హీరోపై దాడి కేసు నమోదైంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. మోడల్ గా కెరీర్ ఆరంభించి ఆపై కొన్ని సినిమాల్లో హీరోగా నటించిన రాంపాల్ 2000 దశకంలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగాడు. నిర్మాతగానూ రాంపాల్ కొన్ని సినిమాలను రూపొందించాడు. ప్రస్తుతం టెలివిజన్ షోలతో బిజీగా ఉన్న అర్జున్ రాంపాల్ ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఓ ఫొటోగ్రాఫర్ పై దాడికి పాల్పడ్డాడు. ఈ వివాదం ముదిరి పోలీస్ స్టేషన్ కు చేరింది. ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో జరిగిన ఈవెంట్లో ఓ ఫొటోగ్రాఫర్ రాంపాల్ వద్దకు వచ్చాడు. నటుడు వద్దని ఎంత వారిస్తున్నా ఫొటోగ్రాఫర్ కెమెరాకు పని చెబుతూ.. ఫొటోలు తీశాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన రాంపాల్ మొదట ఫొటోగ్రాఫర్ చేతిలో కెమెరాను తీసుకుని విసిరికొట్టడంతో అది పాడయింది. దీంతో వెంటనే రాంపాల్ ను ప్రశ్నించగా.. తనపై దాడికి పాల్పడి గాయపరిచాడని బాధిత ఫొటోగ్రాఫర్ పోలీసులను ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయాలని కోరుతూ నటుడు రాంపాల్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. -
రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ ఫొటోగ్రాఫర్ దుర్మరణం
తొర్రూరు : కారు అదుపు తప్పి గోడకు ఢీకొనడంతో ఓ ఫొటోగ్రాఫర్ అక్కడిక్కడే మృతిచెందాడు. హైదరాబాద్‌లోని మోతీనగర్‌కు చెందిన ఫొటోగ్రాఫర్ యదాల శ్రీనివాస్‌రావు(41) మానుకోటలో జరిగే శుభకార్యానికి సంబంధించి ఫొటోలు తీసేందుకు కారులో బయల్దేరాడు. మార్గం మధ్యలో తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కార్యాలయం సమీపంలో అడ్డుగా వచ్చిన కుక్క పిల్లని తప్పించబోయి రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ప్రహరీని ఢీకొట్టింది. దీంతో ముందు సీటులో కూర్చున్న శ్రీనివాస్‌రావు తలకు తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతిచెందాడు. డ్రైవర్ రాజశేఖర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అతడిని 108 వాహనంలో స్థానిక ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాస్‌రావు భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
ఫొటోగ్రాఫర్‌ను ఢీకొట్టిన సూపర్ స్టార్ కారు..
బాలీవుడ్లో కింగ్‌ఖాన్‌గా పేరొందిన షారుఖ్ ఖాన్ పేరుకు తగ్గట్టే మనస్సున్న మహారాజు. నిరాడంబరంగా, ఎంత ఎదిగినా ఒదిగే ఉండే తత్వం ఆయనది. తాజాగా ఆయన సాటివారి పట్ల తన స్పృహను, పెద్ద మనసును చాటుకున్నాడు. 'డియర్ జిందగీ'లో తనతోపాటు కలిసిన నటించిన అలియా భట్ జన్మదినం కావడంతో శుభాకాంక్షలు తెలిపేందుకు బుధవారం షారుఖ్ ఆమెకు ఇంటికి వెళ్లారు. ఎప్పటిలాగే షారుఖ్‌ను చూడగానే ఫొటోగ్రాఫర్లు పోటెత్తారు. ఆయన ఫొటోలు తీసుకోవడానికి పోటీపడ్డారు. ఈ హడావిడిలో ఓ ఫొటోగ్రాఫర్‌కు గాయాలయ్యాయి. షారుఖ్ కారు వేగంగా వస్తున్న సమయంలో దానిని పట్టించుకోకుండా షారుఖ్ ఫొటోలు తీయడంలో ఓ ఫొటోగ్రాఫర్ నిమగ్నమయ్యారు. అతను కొత్త ఫొటోగ్రాఫర్ అని సమాచారం. షారుఖ్ ఫొటోలు క్లిక్ చేస్తున్న ఆనందంలో కారు తనవైపు వస్తున్న విషయాన్ని అతను చూసుకోలేదు. దీంతో అతని కాలిపై నుంచి కారు టైరు వెళ్లింది. గాయపడిన అతన్ని చూసిన వెంటనే షారుఖ్ కారు దిగి వచ్చాడు. తన బాడీగార్డును తోడు ఇచ్చి ఆ ఫొటోగ్రాఫర్‌ను వెంటనే నానావతి ఆస్పత్రికి తరలించాడు. అతను బాగా అయ్యేవరకు తానే చూసుకుంటానని, ఆ ఫొటోగ్రాఫర్ వైద్యఖర్చులు కూడా తానే చెల్లిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చాడు. ఈ సందర్భంగా షారుఖ్ ఎంతో హుందాగా ప్రవర్తించాడని, గాయపడిన ఫొటోగ్రాఫర్‌కు పూర్తి భరోసా ఇచ్చాడని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. -
ఫోటోల తారుమారుపై స్పందించిన ఈసీ
-
ఫోటోల తారుమారుపై స్పందించిన ఈసీ
హైదరాబాద్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నకల్లో బ్యాలెట్ పేపర్‌పై దొర్లిన తప్పుల గురించి ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ స్పందించారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫోటో తారుమారు పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు. మొదటి ప్రూఫ్‌లో కేవలం స్ఫెల్లింగ్ మిస్టేక్ మాత్రమే ఉంది. రెండో ప్రూఫ్‌లో ఫోటోలు తారుమారు అయ్యాయి. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేస్తున్నాం.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రెండవ ప్రూఫ్ నాటికి నేను విదేశి పర్యటనలో ఉన్నాను. అప్పుడు ఏమైందో తెలియాల్సి ఉందన్నారు. ఇదిలా ఉండగా.. ఈ విషయంపై భన్వర్‌లాల్‌ను కలిసిన యూటీఎఫ్ నేతలు అధికార పార్టియే ఈ సంఘటనకు బాధ్యత వహించాలన్నారు. ఓడిపోతామనే ఇలాంటి చర్యలకు పాల్పడిందని రిపోలింగ్‌కు ఆదేశం ఇవ్వకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. -
బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల ఫోటోలు తారుమారు
వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో గురువారం ఉదయం ప్రారంభమైన ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక బ్యాలెట్ పేపర్లో తప్పులు దొర్లాయి. అభ్యర్థి లక్ష్మయ్య ఫొటో పక్కన మాణిక్ రెడ్డి పేరు ముద్రించడంతోపాటు మాణిక్‌రెడ్డి ఫొటో పక్కనే మరో అభ్యర్థి లక్ష్మయ్య పేరు ముద్రించారు. దీంతో టీఎస్‌యూటీఎఫ్ అభ్యర్థి మాణిక్ రెడ్డి బ్యాలెట్ పేపర్‌ను తిరిగి ముద్రించాలని డిమాండ్ చేశారు. పోలింగ్ రద్దు చేయాలని రిటర్నింగ్ అధికారిని కోరారు.ఇరువురు అభ్యర్థులు ఈ విషయమై ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ బ్యాలెట్లో అభ్యర్థుల ఫొటోలు మారాయన్నారు. పోలింగ్ కొనసాగిస్తామని, దీనిపై ఎన్నికల కమిషనకు నివేదికలు పంపుతున్నామని భన్వర్‌లాల్ తెలిపారు. పోలింగ్ నిలిపివేయాలంటూ ముషీరాబాద్ పోలీంగ్ బూతు వద్ద ఆందోళన చేస్తున్న టీఎస్‌యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చావ రవి, రాష్ట్ర కార్యదర్శి రాందాసు, రామకృష్ణ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా అరెస్టు చేసిన వారిన వెంటనే విడుదల చేయాలని, వెంటనే పోలింగ్ నిలిపివేయాలని వరంగల్ రూరల్ టీఎస్ యూటీఎఫ్ డిమాండ్ చేసింది. -
కుటుంబ కలహాలతో ఫొటోగ్రాఫర్ ఆత్మహత్య
అనంతపురం సెంట్రల్: నగరంలోని కమలానగర్లో నివాసం ఉంటున్న వెంకటరమణ (40) ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటరమణ ఫొటో స్టూడియో నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. కొంతకాలంగా భార్యతో మనస్పర్థలు ఉన్నాయి. భార్య ఇటీవల ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. మనస్థాపంతో వెంకటరమణ ఆదివారం స్టూడియోలోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గమనించి, అతన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కాసేపటికే మృతి చెందాడు. వన్‌టౌన్ ఎస్ఐ రంగడు కేసు నమోదు చేసుకున్నారు. -
నాసాకు పోయేకాలం
చంద్రుడు చల్లగా ఉంటాడు కాబట్టి మన పప్పులు ఉడికాయి. ఆయనపైన కాలు మోపి, కాసేపు ఉండి వచ్చాం. కానీ ఈయనెవరు?! సూర్యుడు! పప్పులు ఉడకడం కాదు, మాడిపోతాయి. మాడి మసైపోతాయి. ఆ మసి కూడా మిగల్దు. తెలియన్దేముందీ... మామూలు హీటేం కాదు కదా. అయితే అంత హీట్లోకి ఇప్పుడు ‘నాసా’ బయల్దేరబోతోంది. పోయేకాలమే! అదింకా రాలేదు లెండి. 2018కి తన పోయేకాలాన్ని ప్లాన్ చేసుకుంటోంది నాసా. ఇంత కూల్ థాట్ నాసాకు ఎందుకొచ్చింది చెప్మా! అది తర్వాత చూద్దాం. ముందు మాట్లాడుకోవలసిన సంగతేంటంటే... నాసా సూర్యుడిపైకి వెళుతోంది. కానీ మనిషిని పంపడం లేదు. అలాగని శాటిలైట్‌నూ పంపడం లేదు. మరి ఎవరు వెళుతున్నట్లు? ఒక రోబో వెళుతోంది. వెళ్లి అదేం చేస్తుందంటే... కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం కనుక్కుంటుంది! అయితే అది మరీ సూర్యుడి మీదకు వెళ్లి దిగదు. సూర్యుడికి దూరంగా ఉండి, శలభంలా ఆ చుట్టుపక్కలే తిరుగుతూ భూమి మీదకు సమాచారం పంపుతుంది. ‘ఇక్కడ అలా ఉంది, అక్కడ ఇలా ఉంది’ అని. అన్నిటికన్నా కూడా శాస్త్రవేత్తల్ని ఏళ్లుగా ఒక ప్రశ్న పీడిస్తోంది. సూర్యుడి లోపల వేడి తక్కువగా ఉంటుంది. సూర్యుడి బయట వేడి ఎక్కువగా ఉంటుంది. ఎందుకలా అన్నదే ఆ పీడించే ప్రశ్న. దానికి సమాధానం కనుక్కోడానికే నాసా ఇప్పుడీ రోబోను పంపుతోంది. సూర్యుడి ఉపరితలాన్ని ‘ఫొటోస్పియర్’ అంటారు. అక్కడ సహజంగానే వేడి అదిరిపోతుంది. సూర్యుడి చుట్టూ వాతావరణాన్ని ‘కరోనా’ అంటారు. అక్కడ మరీ అంత అదిరిపోకూడదు. కానీ ఫొటోస్పియర్‌లో కన్నా, కరోనాలోనే ఎక్కువ వేడి ఉంటున్నట్లు ఏళ్ల క్రితమే శాస్త్రవేత్తలు కనిపెట్టారు! సూర్యుడి ఉపరితలంపై 5,500 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటే, సూర్యుడి చుట్టుపక్కల 20 లక్షల డిగ్రీల సెల్సియస్ ఉంటోంది!! అలా ఎందుకు ఉంటోందన్నది మాత్రం ఇప్పటికీ తెలుసుకోలేకపోయారు. ఆ సంగతి తేల్చుకోడానికే నాసా ఇప్పుడు చొక్కా చేతులు పైకి మడుస్తోంది. భూమి నుంచి సూర్యుడి దూరం 14 కోట్ల 90 లక్షల కిలోమీటర్లు. అంత దూరంలో ఉండి కూడా ఆ మహానుభావుడు ఎవ్రీ సమ్మర్ మన భూగోళాన్ని ఫ్రై చేసేస్తుంటాడు. ఇప్పడీ రోబో తగుదునమ్మా అంటూ సూట్‌కేస్ పట్టుకుని ఆయన దగ్గరికే బయల్దేరుతోంది. అందులో ఏవో టూల్స్ ఉంటాయట! వాటితో పరిశోధనలు చేస్తుందట. ఎంత వెళ్లినా, సూర్యుడికి 60 లక్షల కిలో మీటర్ల దూరం వరకే ఆ రోబో వెళ్లగలదు. అంతవరకే మనిషి శాస్త్రవిజ్ఞాన సామర్థ్యం. సరే, ఇన్ని చెప్పుకున్నాం, ఎరిక్ క్రిస్టియన్ అనే పెద్దాయన గురించి కూడా చెప్పుకోవాలి. నాసా సైంటిస్ట్ ఈయన. సూర్యుడి మీదకు రోబోను పంపించే ప్రాజెక్టుకు ఈయనే హెడ్డు. -
ఫొటోగ్రాఫర్ కాలర్ పట్టుకొని మరీ.. హీరో దాడి!
ముంబై: విడాకుల కేసు దాఖలు చేయడానికి వచ్చిన బాలీవుడ్ హీరో పులకిత్ సామ్రాట్ ఓ ఫొటో జర్నలిస్టుపై దాడికి దిగాడు. విబేధాల కారణంగా గతకొంతకాలంగా దూరంగా ఉంటున్న పులకిత్, అతని భార్య శ్వేత రోహిరా విడాకుల కేసు దాఖలు చేయడానికి మంగళవారం బంద్రా ఫ్యామిలీ కోర్టుకు వచ్చారు. కోర్టులో వాదనలు ముగిసిన అనంతరం పులకిత్ బయటకు వస్తుండగా ఫొటోగ్రాఫర్లు క్లిక్‌మనిపించారు. తన ఫొటోలు తీస్తుండటంతో సహనం కోల్పోయిన పులకిత్ ఓ ఫొటోగ్రాఫర్‌ను పట్టుకొని మరీ కొట్లాటకు దిగాడు. ఫొటోగ్రాఫర్ కాలర్ పట్టుకొని మరీ పులకిత్ దాడికి దిగినట్టు ఫొటోలను బట్టి తెలుస్తోంది. తాను కోర్టు నుంచి బయటకు వస్తుండగా ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీస్తూ కనిపించారని, దీంతో కోపోద్రిక్తుడైన పులకిత్ సామ్రాట్ ఓ ఫొటోగ్రాఫర్‌పై దాడికి దిగారని ముంబై మీడియా తెలిపింది. అతను ఫొటోగ్రాఫర్ కాలర్ పట్టుకొని మరీ గొడవకు దిగిన ఫొటోలు ఆన్లైన్లో వైరల్‌గా మారిపోయాయి. సల్మాన్ రాఖీ సోదరిగా పేరొందిన శ్వేత రోహిరా.. యామీ గౌతమ్ వల్లే తాను భర్తతో వీడిపోతున్నానని పేర్కొన్న సంగతి తెలిసిందే. పులకిత్, తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నామని, మొదట్లో తమ కాపురం సవ్యంగా సాగిందని, యామీ గౌతమ్‌తో తన భర్తకు ఎఫైర్ ఉండటంతో తమ ఇద్దరి మధ్య కలతలు వచ్చాయని రోహిరా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. పులకిత్తో తాను విడిపోవడానికి యామీ గౌతమ్ కారణమని ఆరోపించింది. కాగా, తన భార్యతో కలిసుండలేనని పులకిత్ చెప్పాడు. సానుభూతి పొందేందుకు తన ఇమేజ్ ను శ్వేత దెబ్బతీస్తొందని, వ్యక్తిగత విషయాలను బహిరంగపరచి రచ్చ చేస్తోందని విమర్శించాడు. ఇక ఆమెతో ఎటువంటి సంప్రదింపులు సాగించనని, తన వివాహ బంధం ముగిసినట్టేనని పులకిత్ పేర్కొన్నాడు. -
ప్రత్తిపాడు ఫొటోగ్రాఫర్‌కు కేసీపీ అవార్డు
ప్రత్తిపాడు : కోనసీమ చిత్రకళా పరిషత్ (కేసీపీ) ఇటీవల నిర్వహించిన చిత్రకళా ప్రదర్శనలో ప్రత్తిపాడుకు చెందిన ఫొటోగ్రాఫర్ సలాది కృష్ణకు అవార్డు లభించింది. మోనోక్రోమ్ (బ్లాక్ అండ్ వైట్) విభాగంలో ‘గోయింగ్ టు ఫీల్డ్’ పేరిట తీసిన ఫొటోకు ఈ అవార్డు లభించిందని కృష్ణ సోమవారం విలేకరులకు తెలిపారు. ప్రదర్శన ముగింపు సందర్భంగా అమలాపురం మున్సిపల్ చైర్మ¯ŒS చిక్కాల గణేష్, అంతర్జాతీయ శిల్పి డి.రాజ్‌కుమార్ వుడయార్, పరిషత్ అధ్యక్షుడు మెట్ల రమణబాబుల చేతుల మీదుగా అవార్డు, ప్రశంసాపత్రం అందుకున్నాని చెప్పారు. కృష్ణను ఫొటోగ్రాఫర్ల సంఘ నాయకులు నామన వెంకట భాస్కర్, కొమ్ముల ఆనంద్, చవల శ్రీను, ధర్మవరం సంఘ నాయకులు గుత్తుల వీరరాఘవులు, పాలిక ఆంజనేయులు, అంబటి రాజు, దేవాడ బాబ్జీ తదితరులు అభినందించారు. -
ఫొటోలపై వ్యామోహం.. ప్రాణాలు తీసింది!
-
ఫొటోలపై వ్యామోహం.. ప్రాణాలు తీసింది!
ఫొటోలంటే అందరికీ సరదానే. కానీ అందులో ఉన్న రిస్కు తెలుసుకోకపోతే నిండు ప్రాణాలు బలైపోతాయి. దేశ రాజధానిలో ఇలాగే జరిగింది. రైలు పట్టాల మీద నిలబడి సెల్ఫీ తీసుకుంటున్న ఇద్దరు యువకులను రైలు ఢీకొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. యశ్ కుమార్ (16), శుభమ్ (14) అనే ఇద్దరూ మరో ఐదుగురితో కలిసి ఒకే ట్యూషన్ సెంటర్లో చదువుతున్నారు. వీళ్లు డబ్బు పోగేసుకుని రోజుకు రూ. 400 అద్దెకు ఒక డీఎస్ఎల్ఆర్ కెమెరా తీసుకున్నారు. వాళ్లంతా కలిసి మోడలింగ్ కోసం ఫొటోలు తీసుకుందామని అనుకున్నారు. రైలు పట్టాల మీద నిలబడి, వెనకాల రైలు వస్తుండగా దాని బ్యాక్‌గ్రౌండ్‌లో ఫొటోప తీసుకోవాలని వాళ్లు ప్లాన్ చేశారు. ఫొటోలు తీయించుకోవడంలో వాళ్లు, తీయడంలో మిగిలినవాళ్లు మునిగిపోవడంతో ఎదురుగా వస్తున్న మరో రైలును ఎవరూ గుర్తించలేదు. బాగా దగ్గరకు వచ్చిన తర్వాత చూసుకున్న యశ్, శుభమ్ తాము రెండు రైళ్ల మధ్య నలిగిపోతామన్న భయంతో రెండో ట్రాక్ మీదకు దూకారు. కానీ, ఆ ట్రాక్ మీద అప్పటికే ఒక రైలు వస్తుండటంతో దాని కింద పడి నలిగి చనిపోయారు. అంతకుముందు రోహిత్ కుమార్, తుషార్ యాదవ్, భవీత్ తోమర్, రోహిత్ సింగ్, అమన్ కుమార్ అనే మరికొందరు స్నేహితులతో కలిసి అక్షర్ ధామ్ వద్దకు వెళ్లి అక్కడ ఫొటోలు తీసుకున్నా, అవి వాళ్లకు అంతగా నచ్చలేదు. దాంతో డేరింగ్ ఫొటోలు తీసుకోవాలనుకుని రైలు పట్టాల వద్దకు వెళ్లారు. యశ్ బాగా తెలివైన విద్యార్థి అని, అతడికి ఫొటోగ్రఫీ అంటే ప్రాణమని అతడి తల్లి చెప్పారు. ఉదయం తన ఫొటోలు కూడా తీశాడని, ఎందుకు తీశావని దెబ్బలాడటంతో వాటిని డిలీట్ చేసేశాడని ఆమె తెలిపారు. ఇన్నాళ్లూ ఎప్పుడూ తన అక్కతో కలిసి ఇంట్లోనే ఫొటోలు తీసుకునేవాడని.. తొలిసారి బయటకు వెళ్లి ఇలా బలైపోయాడని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. -
నాన్న.. దివి నుండి దిగిరావా?
ఆ పిల్లాడిది అమాయకత్వమో... తిరిగిరాని లోకాలకు వెళ్లిన తండ్రే.. తన కోరికలన్నీ తీరుస్తాడనే నమ్మకమో.. లేక.. ఎవరినడగాలో తెలియని నిస్సాహయతో... క్రిస్మస్ బహుమతుల కోసం తండ్రికి లేఖ రాశాడు.. స్వర్గంలో ఉన్న తండ్రికి పంపేందుకు దానికి ఓ బెలూన్ కట్టాడు.. నాన్నకు చేరని ఆ లేఖ.. ఇప్పుడు ఎంతోమంది కన్న తండ్రులను కన్నీరు పెట్టిస్తోంది. బహుమతులిచ్చి ఆ పిల్లాడిని ఊరుకోబెడదామంటే.. పిల్లాడు లేడు.. లేఖ మాత్రమే ఉంది. ఫొటోగ్రాఫర్ మెక్‌కోల్ స్నేహితులతో కలిసి బల్ములే ప్రాంతంలోని ఓ ఫోర్స్టార్ హోటల్ సమీపంలో నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. దూరంగా ఓ బెలూన్ మెరుస్తూ కనిపించింది. దగ్గరికెళ్లి చూస్తే దానికో పేపర్ కట్టి ఉంది. అందులో ఏవో బొమ్మలు.. ఇంకేదో రాసి ఉంది. చదివితే.. ఓ పిల్లాడు తన తండ్రికి రాసిన లెటర్ అది. దానిని చదివిన మెక్‌కోల్ కళ్లు చెమర్చాయి. గుండె కరిగిపోయింది. రెండు పెదాలను పళ్లకింద అదిపెడుతూ.. గుండెలో నుంచి వస్తున్న దుఃఖాన్ని ఆపుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయినా ఆ బాధ కళ్లల్లో నుంచి కన్నీరుగా బయటకు వచ్చేస్తోంది. స్నేహితులు దగ్గరకు పరిగెత్తుకొచ్చారు. వారంతా లేఖ చదివారు. వారిదీ అదే పరిస్థితి. ఇంతకీ ఆ లేఖలో ఏముందంటే... ‘హాయ్ డాడ్... నిన్ను చాలా మిస్సవుతున్నానని చెప్పేందుకే ఈ లేఖ రాస్తున్నా. నాకు బాధేస్తుందనే విషయం నీకు తెలుసు. అమ్మ కూడా జ్వరమొచ్చినప్పుడు ఎలా ఉంటుందో.. అలాగే ఉంది. రేపు మేము ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నాం. స్కూల్‌ను, నిన్ను నిజంగానే మిస్సవుతున్నా. నాకు తెలుసు పైనున్న స్వర్గంలో నువ్వు క్షేమంగా ఉన్నావని. అందుకే ఇక్కడి నుంచి వెళ్లేముందు నాకు క్రిస్మస్ బహుమతులుగా ఏమేం కావాలో ఓ లిస్ట్ రాసి నీకు పంపుతున్నా. నా కలలన్నీ నీ గురించే.. నా ఆలోచనలు, ఆశలన్నీ నీ గురించే.. నా నమ్మకం నీపైనే. అందుకే ఈ లెటర్ నీకు పంపుతున్నా. ఇది నా క్రిస్మస్ బహుమతుల జాబితా: బూట్లు, స్టడ్స్, రీబౌండర్ నెట్, న్యూ ప్రీమియర్ లీగ్ బాల్, రియల్ మాడ్రిడ్ జెర్సీ, షార్ట్స్, రుబిక్స్ క్యూబ్. ..బై బై డాడీ. లవ్ యూ. ‘లేఖను చదివిన తర్వాత నాకు ఏడుపు ఆగలేదు. అలాగే ఇంటకెళ్లిపోయా. ఆలోచిస్తూ కూర్చున్నా. కనీసం సోషల్ మీడియాలో వివరాలను పోస్ట్ చేస్తే ఆ పిల్లాడి ఆచూకీ తెలుస్తుందని, ఎక్కడున్నా నేనే స్వయంగా వెళ్లి బహుమతులు అందజేయాలని నిర్ణయించుకున్నా. ఈ క్రిస్మస్కు జీసస్‌ను ఒకటే కోరుతున్నా... ఎవరి ద్వారానైనా ఆ పిల్లాడి ఆచూకీ తెలియాలి. నేను బహుమతులు అందజేయాలి’ – మెక్‌కోల్ -
ఆ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తోంది?
కత్రినా కైఫ్ సినిమాలు హిట్ అయి చాలా కాలమైంది. ఆమె ఇంతకుముందు నటించిన మూడు సినిమాలు ఫాంటమ్, ఫితూర్, బార్ బార్ దేఖో.. మూడూ బాక్సాఫీసు వద్ద ఫట్టయ్యాయి. తర్వాత ప్రస్తుతం తన మాజీ బోయ్‌ఫ్రెండు రణబీర్ కపూర్‌తో కలిసి జగ్గా జాసూస్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా విడుదలకు కూడా ఇంకా చాలా సమయం ఉంది. ఇప్పటి లెక్కప్రకారం అయితే ఏప్రిల్ 7వ తేదీన ఆ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే.. ఈలోపు ఖాళీగా ఉండం ఎందుకని రకరకాల ఫొటోషూట్లు చేస్తోంది క్యాట్. అందులో భాగంగా సెలబ్రిటీ డిజైనర్ మనీష్ మల్హోత్రాతో కలిసి మాల్దీవులకు వెళ్లింది. అక్కడ ఓ ఫ్యాషన్ మ్యాగజైన్ వాళ్ల బ్రైడల్ ఎడిషన్ కోసం ఫొటోషూట్‌లో పాల్గొంటోంది. అక్కడ వీళ్లిద్దరూ కలిసి దిగుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండవుతున్నాయి. మరి కత్రినా ఫొటో షూట్ అంటే మామూలుగా ఉండదు కదా మరి.. నల్లటి బికినీ వేసుకుని, దానిపైన పసుపు రంగు కేప్ ధరించిన కత్రినా.. చక్కగా మనీష్ ఒళ్లో కూర్చుని మరీ ఓ ఫొటో తీయించుకుంది. ఆ ఫొటోను మనీష్ మల్హోత్రా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి, దానికి 'పోజర్స్ ఇన్ మాల్దీవ్స్' అనే క్యాప్షన్ పెట్టాడు. అంతేకాదు.. కత్రినా, మిగిలిన టీం అంతా ఉంది కదా అని తన బర్త్‌డే కూడా అక్కడే చేసేసుకున్నాడు. ఇక కత్రినా కూడా మరో్ తెల్లటి దుస్తులతో కూడిన తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అప్పటి నుంచి వీళ్లిద్దరూ తెగ ట్రెండవుతున్నారు. -
ఇలాంటి అద్భుతాన్ని ఎప్పుడైనా చూశారా?
ఒక్కొక్కటికాదు షేర్‌ఖాన్.. వంద విమానాలు ఒకేసారి, ఒకే విమానాశ్రయం నుంచి, ఒకే రన్‌వేపై నుంచి గాలిలోకి ఎగిరితే ఆ దృశ్యం ఎలా ఉంటుందో తెలుసా? టీమ్‌కి ఐదుగురు ఆడాల్సిన ఆటను వందలమంది కలిసి ఆడితే దాన్ని బాస్కెట్ బాల్ అనొచ్చా? మంచం మీద పడుకున్న మనిషి.. పొగలాంటి ఆత్మలా మారితే చూసి తట్టుకోగలరా? అనే ప్రశ్నలు సమాధానం తెలియాలంటే నికోలస్ గురించి తెలుసుకోవాల్సిందే. వంద అక్షరాల్లో చెప్పలేనిది ఒక్క ఛాయచిత్రంతో చెప్పేయొచ్చంటారు. కానీ అమెరికాకు చెందిన ఇన్ఫోగ్రాఫిక్ జీనియస్ నికోలస్ ఫెల్టన్.. వందలాది ఫొటోలను కలగలిపి ఇదిగో మీరు చూస్తున్న అద్భుతాలను సృష్టిస్తాడు. మూకుమ్మడిగా ఎగురుతున్న విమానాల ఫొటో నిజమైనదే. లాస్ ఏంజిల్స్ విమానాశ్రయంలో రకరకాల విమానాలు, వివిధ సమయాల్లో ల్యాండ్, టేకాఫ్ అవుతుండగా తీసిన 400 ఫొటోలను గ్రాఫిక్స్ సహాయంతో ఒక్కటి చేసి ఈ ఫోటోను రూపొందించారు. అంటే పచ్చివాస్తవానికి పక్కా సాంకేతికతను జోడిస్తే ఇలాంటి అద్భుతం తయారవుతుంది అని నికోలస్ చెప్పుకొచ్చారు. అలా ఏర్చికూర్చిన ఫొటోల్లో కొన్నింటిని ‘ఫొటోవిజ్’పేరుతో పుస్తకంగా మలిచాడు. ‘visualizing information through photography’ ఫొటోవిజ్ కు క్యాప్షన్. అన్నట్టు ఈ గ్రాఫిక్ జీనియస్ నికోలస్ ఫేస్బుక్ ప్రాడక్ట్ డిజైనర్ గానూ పనిచేశాడు. ప్రపంచంలోనే టాప్-50 గ్రాఫిక్ డిజైనర్లలో ఒకడిగా నిలిచారు. -
'సోషల్ మీడియా ఫోటోలతో జాగ్రత్త'
బహదూర్‌పురా : సోషల్ మీడియాలో వచ్చే ఎలాంటి చిత్రాలనైనా ఎక్కువగా ఇతరులకు పంపిస్తూ ప్రచారం చేయవద్దని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్ రెడ్డి సూచించారు. ఇటీవల సోషల్ మీడియాలో హల్చల్ చేసిన ఫోటోల నేపథ్యంలో కమిషనర్ వివిధ మత పెద్దలు, విద్యా సంస్థల ఉపాధ్యాయులు, విద్యార్థులతో శనివారం సాలార్జంగ్ మ్యూజియంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సోషల్ మీడియా వాట్సాఫ్, ఫేస్బుక్, ట్విట్టర్లలో వచ్చే చిత్రాలు మత విశ్వాసాలకు భంగం కలిగిస్తూ మనోభావాలను దెబ్బతిసేలా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. గత కొద్దిరోజుల కిందట సోషల్ మీడియాలో వచ్చిన ఓ చిత్రం పాతబస్తీలో కలకలం రేపిందన్నారు. ఇలాంటి వాటిపై మత పెద్దలు, విద్యావంతులు జాగ్రత్తతో ఉండాలన్నారు. విదేశాల నుంచి వచ్చే వాటిపై కూడా కేంద్ర సహకారం తీసుకుని, ఆ దేశాలకు ఫిర్యాదు చేస్తూ తగిన చర్యలు తీసుకుంటామన్నారు. వీటన్నిటిపై పాఠశాల, కళాశాల దశలోనే విద్యార్థులకు అవగాహన కల్పించనున్నట్లు మహేందర రెడ్డి చెప్పారు. -
దుపట్టు
మోడ్రన్, స్టైలిష్, లేటెస్ట్ ఖాదీ, కాందారీ టస్సర్, చందేరీ షిఫాన్, జార్జెట్ కుర్తా ఏదైనా కానీ పైన ఒక ‘పట్టు’ వేస్తే అదేనండి పట్టు దుపట్టా వేస్తే పోస్ట్ నియో మోడ్రన్ కట్ కూడా ట్రెడిషనల్ అయిపోతుంది. పట్టు దుపట్టా.. అదే దు‘పట్టు’. ► పాలనురుగు లాంటి తెల్లటి లాంగ్ అనార్కలీ ఫ్రాక్ మీదకు ఎరుపు రంగు పట్టు దుపట్టా సంప్రదాయానికి సిసలైన చిరునామాగా నిలుస్తుంది. ► లాంగ్ అనార్కలీ సెట్‌కి అదే రంగు జరీ జిలుగుల అంచు గల దుపట్టా ధరిస్తే, సంప్రదాయంగా కనువిందు చేస్తూనే స్టైలిష్ మార్కులు కొట్టేస్తారు. ► లాంగ్ అనార్కలీ సెట్ మీదకు పాత కాలం నాటి చీరలకుండేలా పెద్ద అంచున్న పట్టు దుపట్టా వేడుకను కళాత్మకంగా మార్చేస్తుంది. ► గోల్డ్ కలర్ లాంగ్ కుర్తాకి బెనారస్ పట్టు దుపట్టా ఏ వేదిక మీదనైనా, ఏ వేడుకలోనైనా సంప్రదాయపు హంగుతో ఆకట్టుకుంటుంది. ► తెల్లని కుర్తా పైజామా మీదకు మెజెంటా కలర్ ప్యూర్ సిల్క్ దుపట్టా ప్రత్యేక ఆకర్షణ. ► స్టైలిష్ ప్లెయిన్ రెడ్ కుర్తాకు క్రీమ్ కలర్ దుపట్టా ధరిస్తే చూపు తిప్పుకోలేని అందంతో మెరిసిపోవచ్చు -
మోడల్స్‌తో నకిలీ ట్రంప్ హల్చల్
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష పీఠం కోసం పోటీపడుతోన్న రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ సొంత ఊరు.. న్యూయార్క్. అక్కడి మాన్ హట్టన్ వీధుల్లో ట్రంప్ పేరుమీద ట్రంప్ టవర్స్, ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్.. లాంటి ఎన్నో వ్యాపారకేంద్రాలున్నాయి. అలాంటి చోట మంగళవారం నకిలీ ట్రంప్ హల్ చల్ చేశాడు. పదుల సంఖ్యలో మోడల్స్ వెంటరాగా అచ్చం ట్రంప్ లాంటి హెయిర్ స్టైల్, హావభావాలతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇంతకీ ఇదేదో ఎన్నికల ప్రచారం అనుకునే పొరపాటే! బ్రిటన్ కు చెందిన మహిళా ఫొటోగ్రాఫర్ అలిసన్ జాక్సన్ పేరెప్పుడైనా విన్నారా? స్పూప్ ఫొటోగ్రాఫర్ గా ఆమె వరల్డ్ ఫేమస్. సెలబ్రిటీలను పోలీనవ్యక్తులను వెతికిపట్టుకుని ఫొటో ఆల్బమ్స్ రూపొందిస్తుంది. తాజాగా డోనాల్డ్ ట్రంప్ కు సంబంధించిన ఆల్బంను కూడా తయారుచేసింది. అందులో చికాగోకు చెందిన 63 ఏళ్ల వ్యక్తికి ట్రంప్ లా కనిపిస్తాడు. ట్రంప్ హావభావాలు ప్రదర్శిస్తూంటాడు. సదరు ఆల్బంలోని ఫొటోల ప్రదర్శన ప్రారంభంకానున్న నేపథ్యంలో మంగళవారం ఇలా హడావిడిచేశారు. -
ఈ అద్భుతం ఇండియాలోనే..
గడిచిన 100 ఏళ్లుగా కణకణ మండిపోతూ ప్రపంచ ప్రకృతి వింతల్లో ఒకటిగా నిలిచిన ఈ బొగ్గుగని జార్ఖండ్ లోని ఝరియా అనే ఊళ్లో ఉంది. ' నిత్యం తగలబడుతున్న గ్రామం'గా పేరుమోసిన ఈ ఊరిలో బతకలేక చాలామంది ఏళ్ల కిందటే వలసవెళ్లిపోయారు. ఏ దిక్కూలేని కొద్ది మంది మాత్రం బొగ్గుల కుంపటినే ఆధారం చేసుకుని జీవిస్తున్నారు. మండే బొగ్గు విడుదలచేసే ప్రమాదకరమైన వాయువుల కారణంగా చర్మవ్యాధులు, ఇతర సమస్యలకు లోనవుతున్నారు. ఇక్కడి మహిళల్లో చాలామంది గనుల్లో పడిఉన్న బొగ్గును ఏరుకుంటూ కనిపిస్తారు. (తప్పక చదవండి: నిత్యం తగలబడుతున్న గ్రామం) రకరకాల కారణాలతో వెనుకబాటుకు గురై, హీనస్థితిలో బతుకీడుస్తున్న వీరిపై అనేక వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవలే ఇండియన్ ఫొటోగ్రాఫర్ రోని సేన్ ఝరియా వాసులపై రూపొందించిన ఫొటో ఆల్బంకు ప్రఖ్యాత గెట్టి ఇన్ స్టాగ్రామ్ అవార్డు లభించింది. ఈ అవార్డుకింది ఆయనకు 10వేల అమెరికన్ డాలర్లు ఇస్తారు. భయంకరమైన పరిస్థితుల మధ్య బతుకీడుస్తూ ఎలాంటి గుర్తిపునకు నోచుకోలేనివారి కథనాలను ప్రపంచానికి తెలియజేసే ఉద్దేశ్యంతో 'గెట్టి ఇమేజెస్' సంస్థ అవార్డులు అందిస్తోంది. 'ఝరియా బొగ్గుగనుల్లో చీకటిసూర్యుల కథలను ప్రపంచం ముందు ఉంచుతున్నందుకు గర్వంగా ఉంది. కొందరికి వేరే దారిలేక ఇక్కడుంటున్నారేతప్ప ఝరియా అసలు నివాసయోగ్యమేకాదు. ఏళ్లుగా ప్రభుత్వాలు హామీఇస్తున్నా.. ఇక్కడివాళ్లకు పునరావాసం దొరకనేలేదు. నా ఫొటోలతోనైనా ఝరియా ప్రజల జీవితాలు బాగుపడితే సంతోషిస్తా'అని అంటున్నాడు రోనీ సేన్. -
లీకైన ఆ ఫొటోల్లో ఉన్నది నా భర్తే: హీరోయిన్
తాజాగా మరో హీరోయిన్ సైబర్ దాడుల వలలో పడింది. కన్నడ హీరోయిన్ సోనూ గౌడ (శృతి రామకృష్ణన్) వ్యక్తిగత ఫొటోలు ఆన్లైన్లో లీక్ కావడం దుమారం రేపింది. కొన్ని న్యూస్ చానెళ్లు ఆ ఫొటోలను ప్రసారం చేయడం సోనూ గౌడను ఇబ్బందిపరిచింది. ఓ వ్యక్తితో ఆమె అత్యంత సాన్నిహిత్యంగా ఉన్న మూడు ఫొటోలు ఆన్లైన్లో చక్కర్లు కొట్టాయి. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన సోను గౌడ మీడియా ముందుకు వచ్చి తన ఆవేదన వ్యక్తం చేసింది. ఆన్లైన్లో లీకైన ఫొటోల్లో ఉన్న వ్యక్తి తన భర్త మనోజ్ గౌడ అని ఆమె తెలిపింది. ఓ రాజకీయ నాయకుడి కొడుకుతో సోనుగౌడ సన్నిహితంగా మెలుగుతున్నదని, అతనితో దిగిన ప్రైవేటు ఫొటోలు లీక్ అయ్యాయంటూ కొన్ని చానెళ్లు విపరీత ప్రచారం చేయడం సోనుగౌడను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. దీంతో చానెళ్లు, తన ఫొటోలు లీక్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు ఆమె ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. 2008లో ’ఇంతి నిన్న ప్రీతియా’ అనే కన్నడ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన సోనూ గౌడ కన్నడంతోపాటు తమిళ, మలయాళ చిత్రాల్లో నటించింది. ఇటీవల పెళ్లయిన తర్వాత కూడా ఆమె నటనను కొనసాగిస్తున్నది. ప్రస్తుతం ఆమె పలు కన్నడ, తమిళ చిత్రాల్లో నటిస్తోంది. -
తన సోయితప్పి పడుకోవడంతో!
లైబ్రెరీకి వెళితే.. ఎవరైనా బుద్ధిగా చదువుకుంటారు. పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది, చదువుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి చాలామంది లైబ్రెరీకి వెళ్లి పరీక్షలకో, కాంపిటేషన్కో ప్రిపేర్ అవుతుంటారు. కానీ, ఓ అమ్మాయి మాత్రం గ్రంథాలయానికి వెళ్లి కునుకుతీసింది. అలా-ఇలా కాదు. లోకం మరిచిపోయి గాఢ నిద్రలో మునిగిపోయింది. లైబ్రెరీ సోఫాలో ఒకింత విచిత్రమైన భంగిమతో సోయితప్పి నిద్రలోకి జారుకున్న ఆమె ఫొటో ఆన్లైన్లో దర్శనమిచ్చింది. ఇంకేముంది కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టు ఆ ఫొటోతో కొందరు నెటిజన్లు ఆట ఆడుకున్నారు. ఫొటోషాప్ బ్యాటల్తో తమ క్రియేటివిటీని అంతా ఆమె ఫొటోపై చూపారు. చూడటానికి ఒకింత చిత్రంగా ఉండి నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఆ ఫొటోలివి. గేమ్స్ ఆఫ్ థ్రోన్స్ నుంచి ఒలింపిక్స్ వరకు అన్నీ ఈవెంట్లలోకి ఆమె ఫొటోను మార్ఫింగ్ చేసి.. ఇలా వింత ఫొటోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ‘రెడిట్’లో కనిపించి హల్చల్ చేస్తున్న ఈ ఫొటోలపై ఓసారి లుక్కేయండి! ఇనుపముళ్ల మధ్య కూడా ఎంత శాంతంగా నిద్రోపోతున్నదో! అరె.. మైకేల్ జాక్సన్‌కే మతిపోయే భంగిమ! ర్యాపర్ డ్రాకె కూడా పోటీపడలేకపోతున్నాడు! నిద్రలోనూ రేసులో దూసుకుపోతోంది.. ఉసేన్ బోల్టు కూడా ఉలికిపడతాడేమో! ఊహాల్లో తేలిపోతే.. సోఫానే ఎంత అందమైన సముద్రతీరమవుతుందో మీరే చూడండి హా..! ఎంత రెజ్లింగ్ ఫైటరైనా ఇలా మీద పడితే తట్టుకోగలడా? కోతులకు తగ్గ కోతి దొరికిందట! హాహాహా.. మన నిద్రరారాణి ఈ పెయింటింగ్‌లో ఎక్కడుందో కనిపెట్టండి చూద్దాం! పింక్ సోఫాలో కన్నా.. ఇలా బేటర్ గా నిద్రపోవచ్చేమో! -
క్లిక్ కొట్టి.. అవార్డు పట్టి..
‘సాక్షి’ ఫొటోగ్రఫీ పోటీలో మొదటి బహుమతి పొందిన పాలచర్ల యువకుడు గతంలోనూ అనేక పురస్కారాలు పొందిన గిరి పాలచర్ల (రాజానగరం) : చూపుడు వేలిని కెమెరా మీటపై ఒత్తితే చాలు.. కళ్లెదుట ఉన్న దృశ్యం ఫొటోగా మారిపోతుంది. అయితే ఆ ఫొటోలో జీవన వైవిధ్యాన్ని.. ప్రకృతి సౌందర్యాన్ని ప్రతిభావంతంగా ఆవిష్కరించాలంటే.. కంటిచూపు ఒక్కటే చాలదు.. మనసుతోనూ ఆ దృశ్యాన్ని చూడగలగాలని అంటున్నాడు పాలచర్లకు చెందిన ఫొటోగ్రాఫర్ గిరి. వృత్తిరీత్యా దివాన్‌చెరువులో ఫొటో స్టూడియో నడుపుతున్న ఈ యువకుడు.. ప్రకృతి అందాలను తన కెమెరాలో అపూరూపంగా బంధించి పలు అవార్డులు సొంతం చేసుకుంటున్నాడు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ టీవీ ఇటీవల నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీలో గిరి తీసిన ఫొటో మొదటి బహుమతి పొందింది. నాగలికి కట్టిన దున్నలు అదుపు తప్పి పరుగు తీస్తూండగా.. వాటిని అదుపులోకి తెచ్చేందుకు ఒక యువకుడు చేసిన సాహస కత్యాన్ని గిరి తన కెమెరాలో అత్యంత నైపుణ్యంగా బంధించారు. ఈ ఫొటోకు ‘సాక్షి’ టీవీ అవార్డు దక్కింది. కాగా, గత ఏడాది ఏపీ స్టేట్ అకాడమీ ఆఫ్ ఫొటోగ్రఫీ నిర్వహించిన పోటీలో కూడా గిరి మొదటి బహుమతి సాధించాడు. దీనికిగానూ రూ.5 వేల నగదు, అకాడమీ గోల్డ్ మెడల్ అందుకున్నాడు. అలాగే అమలాపురంలోని కోనసీమ చిత్రకళా పరిషత్ జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో ద్వితీయ బహుమతి సాధించాడు. క్లిక్‌తో అవార్డులు సాధిస్తున్న గిరిని పలువురు అభినందిస్తున్నారు. -
ఘనంగా ఫొటోగ్రఫీ దినోత్సవం
మక్తల్ : ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా శుక్రవారం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అందరూ కలిసికట్టుగా ఉండి తమ సమస్యలను పరిష్కరించుకుందామని అన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు బి.శ్రీనివాసులు, పాపిరెడ్డి, హసన్, నర్సింహ, హస్మొద్దీన్, శంకర్, జయంత్, అశోక్‌రెడ్డి, ఆనంద్, మైబు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
క్లిక్‌మంటే.. అవార్డు వచ్చినట్లే!
⇒ బాపట్ల ఫొటోగ్రాఫర్ పీవీఎస్కు అమెరికా పురస్కారం ⇒ నేడు ప్రపంచ ఫొటోగ్రాఫర్స్ దినోత్సవం బాపట్ల: మండలంలోని ముత్తాయపాలెం గ్రామానికి చెందిన పీవీఎస్ నాగరాజు తన చేతిలోని కెమెరాను క్లిక్ మనిపిస్తే చాలు మండలం నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ఏదో ఒక అవార్డు సాధించడం ఖాయం. గ్రామీణ ప్రాంతాల ప్రజల స్థితిగతులు, సహజ సిద్ధంగా, ఆహ్లాదకరమైన వాతావరణాలను చూపించే ఆయన ఛాయాచిత్రాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు సాధించాయి. నాగరాజు ప్రకృతి ప్రేమికుడిగా, ప్రకతిలో కనిపించే వన్యప్రాణుల దృశ్యాలు తన కెమెరాలో బంధిస్తుంటారు. అందుకున్న అవార్డులు.. జూలైలో అమెరికాలోని ఇమేజ్ కోలిగ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ పోటీల్లో గిరిజనుల జీవనశైలిపై తీసిన 12 ఛాయాచిత్రాలు ప్రథమ స్థానంలో నిలిచాయి. దీంతో అమెరికాకు చెందిన కోలిగ్ సొసైటీలో పీవీఎస్కు జీవితకాల సభ్యత్వాన్ని కల్పించడంతోపాటు, అమెరికా పురస్కారం (హానరి), సర్టిఫికెట్లను ఈమేల్ ద్వారా అందజేశారు. మార్చిలో పశ్చిమబెంగాల్లో నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో ఉత్తమ పురస్కారంతోపాటు, రూ. 2 వేల నగదు, మెమోంటోను అందుకున్నారు. ఏప్రిల్‌లో న్యూఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ఉత్తమ పురస్కారం అందుకున్నారు. కలకత్తాలో నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో ఉత్తమ పురస్కారాన్ని అందుకున్నారు. జూన్‌లో వెస్ట్‌బెంగాల్‌లో నిర్వహించిన అంతర్జాతీయ పోటీల్లో ఉత్తమ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆగస్టులో న్యూఢిల్లీలో నిర్వహించిన ఇండియన్ ఇంటర్నేషనల్ ఫొటోగ్రఫీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ పోటీల్లో ఉత్తమ పురస్కారం లభించింది. నాగరాజును గురువారం ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ప్రభాకర్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో అభినందించారు. -
బతుకు‘చిత్రం’
-
తప్పు ఎమ్మెల్యేదా.. ఫొటోషాప్దా?
గోవాలో బీజేపీ ఎమ్మెల్యే ఒకరు పప్పులో కాలేశారు. సుభాష్ ఫల్దేశాయ్ అనే ఈయన తన అనచరులతో కలిసి తిరగేసిన జెండా ముందు ఉన్నట్లుగా ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా వ్యాపించింది. అయితే, దుష్టశక్తులు కొన్ని కావాలనే ఫొటోషాప్‌లో జెండాను కావాలని తిరగేసి అలా ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే అంటున్నారు. రాష్ట్రంలో స్వాతంత్ర్య దినోత్సవాలు జరుగుతున్న సందర్భంలో వాట్సప్‌లో ఎమ్మెల్యే ఫొటో విపరీతంగా షేర్ అయ్యింది. దీనిపై తనకు చాలా ఫోన్లు వచ్చాయని ఎమ్మల్యే ఫల్దేశాయ్ చెప్పారు. సంగ్యూమ్ అనే ప్రాంతంలో జరిగిన ఉత్సవాల సందర్భంగా తీసిన తన ఫొటో తీసుకుని.. వేరే చోట తిరగేసి ఉన్న జెండాతో దాన్ని మార్ఫింగ్ చేశారని ఆయన తెలిపారు. ఫొటోషాప్‌లో రెండు ఫొటోలను కలపడం పెద్ద కష్టమేమీ కాదని, తన ప్రతిష్ఠను మంటగలపడానికి కావాలనే ఇలా చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. -
హీరో అని తెలియక ఫొటో తీయమన్నారు!
స్విట్జర్లాండ్.. ఆకాశం నుంచి నేలకు దిగివచ్చిన తెల్లని మేఘాల్లాంటి మంచుకొండలతో ప్రకృతి సౌందర్యంతో అలారాడే పర్యాటకుల స్వర్గధామం. అలాంటి ప్రదేశానికి వెళితే.. ఎవరికైనా ఫొటో దిగాలనిపిస్తుంది. ఆ ప్రకృతి సౌందర్యం చెంత ఫొటో తీసుకోవాలని ఓ కొరియన్ జంటకు కూడా అనిపించింది. అదే సమయంలో అక్కడ తచ్చాడుతున్న ఓ యువకుడిని పిలిచి 'ప్లీజ్ సర్. మా ఫొటో తీసిపెట్టండి' అని రిక్వెష్ట్ చేశారు. అతను కూడా ఆనందంగా ఒప్పుకున్నాడు. అందమైన ప్రకృతిముందు ఆనందంగా ఒదిగిపోయిన ఈ జంటను క్లిక్‌మనిపించాడు. కానీ, ఆ ఫొటో వారి జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని మధురానుభూతిని మిగిల్చింది. ఎందుకంటే ఆ ఫొటో తీసింది బాలీవుడ్ 'బాజీరావు' రణ్వీర్ సింగ్. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో విహరిస్తున్న ఈ యువ హీరో గురించి మనకు తెలుసు కానీ, కొరియన్ కపుల్‌కి ఏం తెలుసు? అందుకే ఓ మామూలు పర్యాటకుడు అనుకొని ఫొటో తీయించుకున్నారు. కానీ, తర్వాత తమ ఫొటో తీసింది బాలీవుడ్ స్టార్ హీరో అని తెలుసుకొని ఆశ్చర్యపోయారు. 'అతను భారత్‌లో పెద్ద హీరో అని తెలియదు. కానీ అడుగగానే ఈ ఫొటో తీసి పెట్టాడు. ఆయన పెద్ద మనస్సుకు కృతజ్ఞతలు. ఆయన పెద్ద సూపర్ స్టార్ అని తెలిసి ఆశ్చర్యపోయాం' అని కొరియన్ జంట ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. రణ్‌వీర్‌సింగ్ తీసిన ఫొటోను కూడా షేర్ చేసింది. -
ఎటు చూసినా ట్రంపే!
అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ అభ్యర్థిగా బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ తలపై జుట్టు... నార్వేలో పెరిగే ఒక రకం గడ్డిని పోలి ఉంటుందని ఆ మధ్య ఎవరో ట్రంప్ ఫొటోను, గడ్డి ఫొటోను పక్కపక్కన పెట్టి నెట్లోకి తోసేశారు. నిన్నమొన్న అమెరికాలో మూడు రకాల పెండెంట్ లు మార్కెట్లోకి వచ్చాయి. పిల్లుల (క్యాట్స్) వెనుకభాగంలో కట్టడం కోసమే తయారైన ఆ పెండెంట్లలో మూడు రకాల హావభావాలతో ట్రంప్ ముఖచిత్రం ఉంటుంది! ఇప్పుడిక తాజాగా ఇంగ్లండులోని హియర్ఫోర్డ్షైర్లో దారి పక్కన ఉండే ఓ రంపపు ఆకుల చెట్టు (ఎల్మ్) అచ్చు ట్రంప్ ముఖంలా ఉందని బ్రిటిష్ ఫొటోగ్రాఫర్ జోన్ రోలీ ఓ ఫొటోను విడుదల చేశారు. అమెరికా ఎన్నికలు అయ్యేలోపు ట్రంప్‌ను మనం ఎన్నివిధాలుగా చూడాలో! ఎన్ని విధాలుగా చూసినా పర్వాలేదు, అమెరికా అధ్యక్షుడిగా మాత్రం చూడకూడదని మీరు గానీ అనుకోవడం లేదు కదా! -
ఇదో లోకం!
ఫొటో తీయడం కోసం మేకల్ని చెట్టు మీద పెట్టారా లేక ఫొటోషాప్‌లో ఇలా క్రియేట్ చేశారా అని అనుమానం వస్తోంది కదూ! అవి రెండూ కాదు. నిజంగానే మేకలు చెట్టు మీదికెక్కి ఆకులు తింటున్నాయి. మొరాకోలోని కొన్ని ప్రాంతాల్లో అర్గాన్ అనే చెట్లు పెరుగుతాయి. సంవత్సరమంతా కాసే ఈ చెట్టు పండ్లు, ఆకులు సువాసనలు వెదజల్లుతూ ఉంటాయట. చాలా రుచిగా కూడా ఉంటాయట. దాంతో మేకలు ఇలా చెట్లు ఎక్కి మరీ మేస్తుంటాయన్నమాట! అర్మేనియా దేశంలోని స్కూళ్లలో ఆరేళ్ల వయసు నుంచే పిల్లలకు చెస్ ఆడటం నేర్పిస్తారు. అది అక్కడ మ్యాన్డేటరీ. చెస్ నేర్పించడం వల్ల పిల్లల మెదళ్లు బాగా పదునెక్కుతాయని వాళ్ల ఉద్దేశం, నమ్మకం. యూకేకి చెందిన ఈ అంద మైన భామల పేర్లు లూసీ, మారియా. ఇద్దరూ అక్కా చెల్లెళ్లు. పైగా కవలలు. అలా చెప్తే ఎవ్వరూ నమ్మరు. ఎలా నమ్ముతారు? ఎక్కడైనా ఒక్క పోలిక ఉంటే కదా! వీళ్లు ఇలా ఎలా పుట్టారో మాకే అర్థం కావడం లేదు అంటుం టారు వాళ్ల తల్లిదండ్రులు. ప్రపంచం మొత్తంలో ఏమాత్రం పోలిక లేని ట్విన్స్ వీళ్లిద్దరేనట! తెల్లని గౌను, మెడలో పూసల దండ, చేతిలో చాకు, ఎదురుగా కేకు... దీని స్టైల్ చూశారా? క్రిస్టల్ అనే ఈ కోతిగారు పెద్ద సెలెబ్రిటీ. అందుకే అంత ఫోజు మరి. సినిమాలకు జంతువుల్ని సప్లై చేసే ఓ కంపెనీ దీనికి నటనలో తర్ఫీదునిచ్చింది. మన క్రిస్టల్గారు సహజ నటి కావడంతో బాగా ఫేమస్ అయిపోయారు. పాతిక పైగా సూపర్ హిట్ హాలీవుడ్ చిత్రాల్లో నటించి ‘లైఫ్ టైమ్ దివా అచీవ్మెంట్’ అవార్డు కూడా అందుకున్నారు. ఆ సందర్భంలో తీసిన ఫొటోయే ఇది! మామూలుగా జూలో జంతువులు బోనుల్లో ఉంటాయి. సందర్శకులు వెళ్లి వాటిని చూస్తుంటారు. కానీ చైనాలోని లెహె లెడూ వైల్డ్ లైఫ్ జూలో అంతా రివర్స్. సందర్శకులను వాహనాలకు అమర్చిన బోనుల్లో బంధించి జూ అంతా తిప్పుతారు. జంతువులేమో స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. ఇదిగో ఇలా! బ్రిటన్‌లోని సమ్మర్‌హిల్ స్కూల్లో ఉన్నంత స్వేచ్ఛ మరే స్కూల్లోనూ ఉండదు. అక్కడ చదివే పిల్లలు తమకు ఆసక్తి ఉన్నప్పుడే పాఠాలు వినొచ్చు. లేదంటే డ్రామానో, సినిమానో చూడొచ్చు. మ్యూజిక్, పెయింటింగ్ ఇంకేదైనా నేర్చుకోవచ్చు. తమకు నచ్చిన పని చేయొచ్చు. అదంతా కూడా ఎడ్యుకేషనే అంటుంది స్కూల్ యాజమాన్యం. లండన్‌లోని హాంకీ టాంక్ రెస్టారెంట్లో పనిచేసే క్రిస్ అనే చెఫ్ ఓ బర్గర్‌ను తయారు చేశాడు. దాని పేరు గ్లామ్బర్గర్. నాణ్యమైన బీఫ్, ఖరీదైన బటర్, ప్రత్యేకంగా పండించిన మిర్చి, రకరకాల సాస్‌లతో అతడు తయారు చేసిన ఈ బర్గర్ బాగా ఫేమస్ అయ్యింది. దాంతో రేటు చుక్కలను చేరింది. దీని ఖరీదెంతో తెలుసా... 1100 పౌండ్లు. అంటే మన కరెన్సీలో తొంభై ఆరు వేల పైనే. కనిపించాయి కదా చుక్కలు!!! హ్యారీపాటర్ చిత్రాల హీరో డ్యానియెల్ రెడ్క్లిఫ్కి ఓసారి మీడియా మీద విపరీతమైన కోపం వచ్చింది. ఎప్పుడు చూసినా వెంటపడి ఫొటోలు తీయడంతో విసుగొచ్చి, ఓ ఆరు నెలల పాటు ఎక్కడికి వెళ్లినా ఒకే డ్రెస్ వేసుకుని వెళ్లాడు. కొత్త ఫొటో ఇవ్వ కుండా మీడియాని విసిగించాలని! డిస్నీ వాళ్లు ‘ప్రిన్సెస్ అండ్ ఫ్రాగ్’ పేరుతో ఓ యాని మేషన్ చిత్రం తీశారు. ఇది సూపర్‌హిట్ అయ్యింది. దీని ప్రభావం పిల్లల మీద ఎంతగా పడిందంటే... ఆ చిత్రంలోని హీరోయిన్ మాదిరిగానే కప్పలను ముద్దాడదామని ప్రయత్నించి, సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా బారిన పడి యాభై మందికి పైగా చిన్నారులు ఆస్పత్రి పాలయ్యారట! జపాన్లోకి ఒకినావా దీవిలో వందేళ్ల వయసు దాటినవాళ్లు 450 మంది వరకూ ఉన్నారు. అక్కడి వాతావరణం, ఆహారపుటలవాట్ల వల్ల ఇలా ఎక్కువకాలం జీవిస్తున్నారట. అందుకే ఈ దీవిని ‘హెల్దీయెస్ట్ ప్లేస్ ఆన్ ద ఎర్త్’ అంటారు. రోమ్‌లో ‘ద ఆపియన్ వే’ అనే రోడ్డు ఉంది. ఇది అత్యంత పురాతనమైనది. క్రీస్తు శకం 312లో వేశారట. ఇప్పటికీ ప్రజలు దీన్ని వాడుతున్నారు. -
నిజామాబాద్‌లో మొక్కుబడిగా హరితహారం
చంద్రశేఖర్‌కాలనీ : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం రాష్ట్రమంతటా విజయవంతంగా కొనసాగుతుంటే, జిల్లా కేంద్రంలో మాత్రం తూతూ మంత్రంగా జరుగుతోందని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఏఎస్ పోశెట్టి విమర్శించారు. జిల్లా కేంద్రంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణ చేయాలనే సదాశయంతో చేపట్టిన హరితహారం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మినహా అన్ని నియోజకవర్గాల్లో దిగ్విజయంగా కొనసాగుతోందన్నారు. జిల్లా కేంద్రంలోని నలువైపులా గల ప్రధాన రోడ్లకు ఇరువైపుల మొక్కలు నాటడంలో మున్సిపల్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. అర్బన్ ఎమ్మెల్యే, మేయర్ ఐదారు మొక్కలు నాటి ఫొటోలకు ఫోజులిస్తున్నారనే తప్ప కేసీఆర్ ఆశయ సాధనకనుగుణంగా మొక్కలు నాటడంపై శ్రద్ధ కనబరచడం లేదని ధ్వజమెత్తారు. అక్రమ వసూళ్ల (పంచుకోవడం, ఎంచుకోవడం)పై చూపుతున్న శ్రద్ధ నగరమంతా మొక్కలు నాటడంపై, ఇంకుడు గుంతల ఏర్పాటుపై, రోడ్ల మరమ్మతులపై, పార్కుల ఏర్పాటుపై చూపడం లేదని ఆరోపించారు. జిల్లా అధికారులు ఉండే జిల్లా కేంద్రంలో హరితహారం కింద కనీసం కోటి మొక్కలు నాటాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చినప్పటికీ నామమాత్రంగా మొక్కలు నాటి చేతులు దులుపుకున్నారన్నారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ హరితహారంపై ఎప్పకటిప్పుడు సమీక్షించడమే కాక వారు స్వయంగా పల్లెపల్లెల్లో మొక్కలు నాటిస్తున్నారని తెలిపారు. కాకపోతే నిజామాబాద్ అర్బన్‌లోనే హరితహారం మొక్కుబడిగా సాగుతుందని పోశెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నాయకులు ఈర్ల శేఖర్, కోనేరు సాయికుమార్ పాల్గొన్నారు. -
ఫొటోగ్రాఫర్లకు హీరోయిన్ వార్నింగ్!
బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్‌కు ఫొటోగ్రాఫర్లు అంటే అస్సలు పడదు. ఎవరైనా తనను వెంటాడి ఫొటోలు తీస్తే.. ఆమెకు కోపం నషాలానికి ఎక్కుతోంది. ఎక్కడపడితే అక్కడ తనను క్లిక్ మనిపించడం అస్సలు నచ్చదు. ఈ విషయమై గతంలోనే ఫొటోగ్రాఫర్లకు కత్రినా ఓసారి ఘాటు హెచ్చరికలు చేసింది. తన పర్మిషన్ తీసుకోకుండా ఫొటోలు తీస్తే.. పోలీసు కేసు పెడతానని బెదిరించింది. తాజాగా మరోసారి కత్రిన ఫొటోగ్రాఫర్లపై చిందులు తొక్కింది. శుక్రవారం కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య స్టూడియోలో డ్యాన్స్ రిహార్సల్ అనంతరం కత్రిన బయటకు వచ్చింది. అనంతరం ఆమె కారులోకి ఎక్కుతుండగా అక్కడ ఉన్న కొందరు ఫొటోగ్రాఫర్లు క్లిక్‌మనిపించారు. అంతే కోపంతో ఊగిపోయిన కత్రిన కారు దిగి వచ్చి మరీ ఫొటోగ్రాఫర్లకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. తనకు తెలియకుండా ఫొటోలు తీస్తే.. పోలీసు కేసు పెడతానని ఆమె హెచ్చరించినట్టు సమాచారం. ప్రస్తుతం వరల్డ్ టూర్ కోసం కత్రిన రిహార్సల్స్ చేస్తోంది. కత్రినకు శుక్రవారం అనారోగ్యంగా ఉండటంతో డాక్టర్ స్టూడియోకు వచ్చారని, డాక్టర్ సూచనలతో ఆమె అర్థాంతరంగా రిహార్సల్స్ మానుకొని ఇంటికి వెళ్లిందని, ఈ నేపథ్యంలో ఫొటోగ్రాఫర్ల తీరు ఆమెకు కోపం తెప్పించి ఉండొచ్చునని సన్నిహిత వర్గాలు తెలిపాయి. గతంలో రణ్‌బీర్ కపూర్‌తో బ్రేకప్ అయిందని వార్తలు వచ్చిన సమయంలోనూ కత్రిన ఫొటోగ్రాఫర్లను ఇదేవిధంగా బెదిరించింది. సెలెబ్ మేనేజర్ రేష్మా శెట్టితో వెళుతుండగా ఫొటోలు తీయడంతో ఆమె ఫొటో జర్నలిస్టులకు వార్నింగ్ ఇచ్చింది. -
పోలీసులకు చిక్కకుండా ఫొటోలకు పోజులు
లక్నో: ఓ పక్క బూట్లు అరిగేలా పోలీసులు బీజేపీ బహిష్కృత నేత దయాశంకర్ సింగ్ జాడ కోసం గాలింపులు జరుపుతుండగా ఆయన మాత్రం దర్జాగా ఫొటోలకు పోజులిస్తున్నారు. జార్ఖండ్ లో ఓ ఆలయం వద్ద మొక్కులు చెల్లిస్తూ ఉన్న ఫొటోలు బయటకు వచ్చి హల్ చల్ చేస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రమైన జార్ఖండ్‌లో కొందరు బీజేపీ నేతలతో కలిసి ఆయన దర్జాగా నవ్వుకుంటూ పూజలు చేస్తూ కనిపించడం గమనార్హం. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ దళితుల ఓట్లు కొల్లగొట్టాలని వ్యూహం రచించగా దయాశంకర్ బీఎస్పీ అధినేత్రి మాయావతిని తీవ్ర పదజాలంతో దూషించి అబాసు పాలైన విషయం తెలిసిందే. అతడి వ్యాఖ్యలతో బీజేపీకి తీరని నష్టం జరిగింది. దీంతో ఆ పార్టీ అతడిని బహిష్కరించి ఆరేళ్లు దూరం పెట్టింది. దళితుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యానించిన దయాశంకర్ ను వెంటనే అరెస్టు చేయాలని ముక్తకంఠంతో దళితులు నినదించిన నేపథ్యంలో పోలీసులు అతడిని అరెస్టు చేసేందుకు గాలిస్తున్నారు. కానీ, అతడు మాత్రం వారికి చిక్కడం లేదు. కేసు నమోదై వారం గడుస్తున్నా ఆయన మాత్రం ఇలా పోలీసుల కళ్లు గప్పి ఏం చక్కా చక్కెర్లు గొడుతున్నారు. తాజాగా బయటకొచ్చిన ఈ ఫొటోల కారణంగా మరోసారి దళితులు ఆగ్రహం కట్టలు తెంచుకునే అవకాశం ఉంది. -
అయ్యో.. ఐశ్వర్యా!
-
పాప భయంపై ఫొటోషాప్ పోట్లాట
ఒక్కసారిగా పురివిప్పిన నెమలిని ఎక్కడ తనను పొడుచుకుతింటుందోనన్న భయంతో ప్రాణాలు అరచేతిలోపెట్టుకుని పరుగుపెడుతోన్న ఈ ఆరేళ్ల పాప ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సమస్యలన్నీ ఇప్పుడా పాపను చుట్టేశాయి. సంబంధంలేని ఎన్నెన్నో సంఘటనల్లోకి ఆమెను లాగేశారు. ఇదంతా ఎలా జరిగిందంటే.. ప్రఖ్యాత న్యూస్ నెట్ వర్కింగ్ సైట్ రెడిట్ లో ఓ పాఠకుడు తన కూతురి ఫొటోను పోస్ట్ చేశాడు. కూతురిని తీసుకుని చిన్నపిల్లల పార్కుకు వెళ్లామని, అయితే ఆ సందర్శన అనుకున్నంత సజావుగా (నెమలిని చూసి పాప భయపడిపోవడం వల్ల) జరగలేదని ఫొటో కింద కామెంట్ పెట్టాడు. రెడిట్ లో జూన్ 26న ఈ ఫొటో పోస్ట్ అయిన కొద్ది గంటల్లోనే ఫొటోషాప్ కొట్లాట మొదలైంది. ఒక వ్యక్తి .. పాప భయాన్ని బ్రెగ్జిట్ తో ముడిపెడుతూ నెమలిని యురోపియన్ యూనియన్(ఈయూ)గా, పాపను ఈయూ నుంచి భయపడి పారిపోతున్న బ్రిటన్ గా పోల్చుతూ ఫొటోలో మార్పులు చేశాడు. ఇంకొకడు.. అలాకాదంటూ పాపను ట్రంప్ తో పోల్చాడు. ట్రంప్ (పాప) పరుగు పందెంలో ఉస్సేన్ బోల్ట్ తో పోటీపడుతున్నట్లు ఫొటోషాప్ చేశాడు. ఇలా పాప భయంపై లెక్కకు మిక్కిలిగా పుట్టుకొచ్చిన ఫొటోషాప్డ్ ఫొటోల పోట్లాట ఇంటర్నెట్ లో నడుస్తూనేఉంది.. -
ఆ ఇద్దరి సహకారంతోనే సినిమాల్లోకి వచ్చా!
మాతృదేవోభవతో మంచి గుర్తింపు ఇప్పటి వరకు 70 సినిమాలకు పని చేశా.. సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు మిర్యాలగూడ : చిన్నప్పటి నుంచి నాకు చదువు అబ్బలేదు.. దీంతో సినీరంగంలోకి అడుగుపెట్టానని సినిమాటోగ్రఫీ చోటా కెనాయుడు అన్నారు. శనివారం మిర్యాలగూడలో పింక్స్ ఎన్ బ్లూస్ బ్యూటీ సెలూన్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇంటర్ మొదటి సంవత్సరం తర్వాత చదువులో రాణించలేకపోవడంతో తండ్రి కామారెడ్డి చిట్టిబాబునాయుడి సహకారంతో ఫొటో అసిస్టెంట్‌గా సినిమాల్లో పని చేసినట్లు తెలిపారు. కొంత కాలంపాటు కేఎస్ వద్ద పని చేసి టీవీ సీరియల్స్‌కు కెమెరామెన్‌గా పని చేసినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత దాసరి నారాయణరావు, చిరంజీవిల సహకారంతో సినిమాలకు కెమెరామెన్‌గా వెళ్లి సినిమాటోగ్రఫీలో రాణిస్తున్నట్లు చెప్పారు. మొట్టమొదటి సినిమా మాతృదేవోభవతో మంచి గుర్తింపు వచ్చిందని ఆ తర్వాత సూరిగాడు, అమ్మ రాజీనామా, వారసుడు, మాస్టర్, డాడీ, చూడాలని ఉంది. అంజి, కొత్త బంగారులోకం, అదుర్స్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేసినట్లు వివరించారు. 1979 నుంచి ఇప్పటి వరకు 70 సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేశానన్నారు. తన తండ్రి చిట్టిబాబునాయుడు కూడా కథలు రాయడంతో పాటు డ్రామా ఆర్టిస్టుగా పని చేసినట్లు పేర్కొన్నారు. ఇటీవల సాయిధరమ్‌తేజ్‌తో ఒక సినిమా, బెక్కం రాంమ్మోహన్ నిర్మాతగా మరో సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నట్లు తెలిపారు. -
అడవిలో కెమెరాలు వదిలిపెట్టి దౌడో దౌడు..
ఆఫ్రికా: ఈ మధ్య అటవీ జంతువులకు మనుషులంటే తెగ కోపమొచ్చేస్తుంది. సరదాగా వాటిని చూసేందుకు వెళ్లినా.. ఫొటోలు తీసేందుకు ప్రయత్నించినా వెంటపడి తరుముతున్నాయి. కార్లలో కూర్చున్నప్పటికీ గుండెలు జారీపోయేంత పనిచేస్తున్నాయి. దురదృష్టంకొద్ది కారు ఆగిందో ప్రాణాలుపోవడం తప్పని పరిస్థితి ఎదురవుతుంది. మొన్న ప్రముఖ హాలీవుడ్ నటుడికి గుండెల్లో రైల్లు పరుగెత్తించినట్లుగానే రెండు ఖడ్గమృగాలు ఇద్దరు దంపతులకు చుక్కలు చూపించాయి. బ్రతికితే చాలు అన్నంత వేగంగా ఆ ఇద్దరు, మరికొందరు కార్లలో దౌడు తీశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అది ఆఫ్రికాలోని హుహువి పార్క్. ఇద్దరు దంపతులు సఫారీకి వెళ్లారు. ఆ ఓపెన్ వన్యప్రాణి క్షేత్రంలో రెండు కెమెరాలతో కనిపించిన ప్రతి జంతువును ఫొటోలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో దుమ్ముకొట్లాడే రోడ్డులో ఓ రెండు ఖడ్గమృగాలు బలంగా కొట్టుకుంటున్నాయి. యుద్ధాన్ని తలపించే రీతిలో వాటి బలమైన పదునైన కొమ్ములతో పోట్లాడుకుంటున్నాయి. ఆ సన్నివేశాన్ని చూసిన ప్రతి ఒక్కరు తమ కార్లలో ఉండి కెమెరాల్లో బందిస్తుండగా.. ఓ దంపతులు మాత్రం ఉత్సాహంతో వాటికి సమీపంగా వెళ్లారు. ఆ సమమంలో హాలీవుడ్ సినిమాలో చూపించినట్లుగా పోట్లాటను ఆపేసిన ఖడ్గమృగాలు.. ఒక్కసారిగా నిశ్శబ్దంలోకి జారుకొని స్లోమోషన్లో తలలు ఎత్తి ఏదో మాట్లాడుకున్నట్లుగా తలలు ఊపి వెంటనే ఆ దంపతులవైపు వేగంగా వచ్చాయి. వాటి వేగాన్ని చూసిన ఆ ఇద్దరు కార్లో దూరి దౌడోదౌడు అంటూ పారిపోయారు. ఆ కారును వెంబడించిన తీరు చూస్తే ఒళ్లుగగుర్పొడవాల్సిందే. -
అమ్మో.. అన్ని కోట్ల సెల్ఫీలా!
సెల్ఫీ.. సెల్ఫీ.. సెల్ఫీ. ఎక్కడ చూసినా సెల్ఫీలు. అక్కడా ఇక్కడా అన్న తేడా లేదు. ఇప్పుడూ అప్పుడూ అన్న పట్టింపూ లేదు. ప్రపంచమంతా సెల్ఫీల మాయలో మునిగితేలుతోంది. తాజాగా సెల్ఫీల గురించి గూగుల్ వెల్లడించిన గణాంకాలు.. మానవాళి ఎంతగా సెల్ఫీ మోజులో పడిపోయిందో తెలుపుతున్నాయి. ఒక సంవత్సర కాలంలో కేవలం గూగుల్ ఫోటోస్ యాప్‌లో అప్లోడ్ చేసిన సెల్ఫీల సంఖ్య అక్షరాలా 2,400 కోట్లు. ఈ విషయాన్ని గూగుల్ ఫోటోస్ యాప్‌లో అప్లోడ్ చేస్తున్న ఫోటోలలో సెల్ఫీలెన్నో తెలుసుకోవడానికి.. మెషిన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీని ఉపయోగించి లెక్కించి స్వయంగా గూగుల్ సంస్థ వెల్లడించింది. ప్రతినెలా 200 మిలియన్లకు పైగా జనాలు గూగుల్ ఫోటోస్ యాప్‌లో సెల్ఫీలు అప్లోడ్ చేస్తున్నారు. గూగుల్ యూజర్లు 13.7 పెటాబైట్స్ డేటాని గూగుల్ ఫోటోస్ యాప్‌లో ఫోటోలను అప్లోడ్ చేయడానికి వినియోగించారు. ఇదంతా కేవలం ఒక్క గూగుల్‌కు సంబంధించిన వ్యవహారం మాత్రమే అనే విషయాన్ని గమనించాలి. ఈ గణాంకాలను చూసిన వారు.. ఇక ఫెస్బుక్, స్నాప్ చాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లాంటి విరివిగా ఉపయోగించే సోషల్ మీడియా సైట్లతో పాటు, యాపిల్ ఐక్లౌడ్‌లో అప్లోడ్ చేసిన సెల్ఫీలు కూడా కలిపితే.. సెల్ఫీల సంఖ్య ఇంకెన్ని కోట్లుండాలి అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రతి ఫొటో వెనకా ఒక్కో కథ!
అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు గడించిన ఫొటోగ్రాఫర్లలో గావిన్ ఎవాన్స్ ఒకరు. ఈయన చిత్రాలన్నీ విభిన్నంగా ఉంటాయి. వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి. దేశ విదేశాల్లో చేపట్టిన ఫొటోగ్రఫీ ప్రాజెక్టులు ఆయన తెగువని తెలియజేస్తాయి. కాలం చెల్లిన ఆచారాలు, సంప్రదాయాలను ఆయన సవాల్ చేస్తారు. అలా గడచిన కొన్నేళ్లుగా ఎన్నో విశేషమైన ప్రాజెక్టులను ఆయన ఎంచుకున్నారు. వాటిలో ముఖ్యమైనది ‘ప్రాజెక్ట్ టచ్’. ప్రపంచంలోని మానవులందరూ ఆ భగవంతుడి సృష్టేనన్న నమ్మకాలు మనలో చాలామందికి ఉంటాయి. అయినప్పటికీ సమానత్వం, సౌభ్రాతృత్వం లాంటి మాటలు ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మేలు! ఇలాంటి అంశాలను మనలో చాలామంది సమర్థించరు. అగ్రకులాలు, నిమ్నకులాలు పేరిట మనుషులను విభజించి, గుర్తిస్తారు. ఈ ప్రక్రియ ఎంతటి చేటు తెస్తుందంటే.. మన దేశంలో కొందరు నేటికీ ఓ వర్గాన్ని అంటరానివాళ్లుగానే పరిగణిస్తున్నారు. వారిని ముట్టుకోవడం, గృహాల్లోకి, ఆఫీసుల్లోకి, ఆలయాల్లోకి ప్రవేశాలు కల్పించడం దాదాపు నిషేధం. ‘ప్రాజెక్ట్ టచ్’కు రూపకల్పన చేస్తున్న సమయంలోనే గావిన్‌కు మనదేశంలోని ఈ విపరీత పోకడ గురించి తెలిసింది. అంతే.. 2005లో రెక్కలు కట్టుకుని భారత్‌లో వాలిపోయాడు. ఇక్కడ అంటరాని వారెవరో, అంటదగిన వారెవరో తెలుసుకున్నాడు. ఢిల్లీ, రాజస్థాన్‌లలో పర్యటించి అంటరాని వారందరినీ కలుసుకున్నాడు. అంటరానివారిని తాకితే ఏం జరుగుతుందో చూద్దామనుకున్నాడు. తాకి చూశాడు కూడా. విచిత్రం! అతనికేమీ కాలేదు. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగానే ఉన్నాడు!! మరి, ఈ అంటరానితనం ఎక్కడి నుంచి, ఎందుకు వచ్చినట్టు..? ఇలాంటి ప్రశ్నలతోనే దాదాపు 700 మంది స్త్రీ, పురుషులను, వృద్ధులను, చిన్నారులను కలిశాడు. వారందరికీ తన చేతిని అందించాడు. భయపడినవారిని ఫర్వాలేదు తాకండంటూ ధైర్యం చెప్పాడు. అంతే.. అందరూ గావిన్తో చేతులు కలిపారు. తోటి భారతీయులే తాకనీయని తమను, తెల్లజాతి వ్యక్తి ముట్టుకోవడమా అంటూ ఆశ్చర్యపోయారు. ఆనందపడ్డారు. తాను తీసిన ప్రతి ఫొటో వెనకా ఒక్కో కథ ఉందని చెబుతాడు గావిన్. తన చేయి మాత్రమే చిత్రంలో కనిపించేలా, మరోచేతితో కెమెరాను క్లిక్‌మనిపిస్తున్న సమయంలో వారు చెప్పే ‘అంటరాని’ సమస్యలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని చెప్పాడు. ఇకపై వారెవరూ అంటరాని వారు కాదనే సందేశాన్నివ్వడమే తన ప్రాజెక్ట్ లక్ష్యమని చెబుతున్నాడు. గావిన్ ‘టచ్’ అయినా మన దేశ భవిష్యత్తును మార్చుతుందేమో చూద్దాం..! -
వీరీవీరీ వీడియో సీన్...వీరి పేరేమీ..?
‘తుని’ ఘటనకు బాధ్యుల్ని నిర్ధారించే పనిలో రెవెన్యూ, పోలీసు శాఖలు గత నెల 31 నాటి వీడియోలు, ఫొటోలు, సెల్ఫీల సేకరణ అమలాపురం కిమ్స్‌లో డివిజన్లోని వీఆర్వోలకు ప్రదర్శన అమలాపురం టౌన్/ అమలాపురం రూరల్: కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌తో గత నెల 31న తునిలో నిర్వహించిన కాపు ఐక్యగర్జన సభ సందర్భంగా జరిగిన విధ్వంసకర ఘటనలకు సంబంధించి ఇప్పటికే పోలీసు శాఖ వీడియోలు, ఫొటోలు, సెల్ఫీలను సేకరించింది. నాటి దృశ్యాలను అక్కడున్న వీడియోగ్రాఫర్లే కాక కొందరు కొందరి వ్యక్తులు తమ స్మార్ట్ ఫోన్లతో చిత్రీకరించారు. మరికొందరు ఆ దృశ్యాలను సెల్ఫీలతో బంధించారు. తుని ఘటన నాటి నుంచి జిల్లా పోలీసు యంత్రాంగం ఆ రోజు విధ్వంసకర సంఘటనలకు సంబంధించి వీడియోలు, ఫొటోలు సేకరిస్తూనే ఉంది. ఇప్పటికే నాటి ఘటనల్లోప్రత్యక్షంగా, ప్రముఖంగా కనిపించిన కాపు నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే నాటి విధ్వంసంలో మరీ విచక్షణారహితంగా అల్లర్లకు పాల్పడిన యువకులను వీడియోలు, ఫొటోల్లో గుర్తించినప్పటికీ వారు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు వంటి సమాచారం లభ్యం కావటం లేదు. వారిని గుర్తించి తగిన ఆధారాలతో కేసులు నమోదు చేసేందుకు ప్రభుత్వ ఒత్తిడితో పోలీసుశాఖ నడుం బిగించింది. దీంట్లో భాగంగానే ఆ వీడియోలు, ఫోటోలు, సెల్ఫీలను పోలీసుశాఖ ఆయా రెవెన్యూ డివిజన్లకు పంపి, గ్రామస్థాయిలో విధులు నిర్వర్తించే వీఆర్వోలకు చూపి, వారెవరో గుర్తించే బాధ్యతను రెవెన్యూ, పోలీసు విభాగాల డివిజన్ స్థాయి అధికారులకు ఉమ్మడిగా అప్పగించారు. ఈ క్రమంలోనే కాపు ఉద్యమాలు చురుకుగా జరిగిన ప్రాంతాలకు వీడియోలు, ఫొటోలు పంపించి వీఆర్వోలతో విధ్వంసానికి బాధ్యులను గుర్తించే కసరత్తు జరుగుతోంది. ఆర్డీఓ, డీఎస్పీల ఆధ్వర్యంలో ప్రదర్శన.. జిల్లాలో కాపు ఉద్యమాలకు సంబంధించి కోనసీమ.. అందులోనూ అమలాపురం ప్రాంతాలు చాలా వరకూ కీలకంగానే వ్యవహరించాయి. దీంతో వీడియోలు, ఫొటోల గుర్తింపు ప్రక్రియను జిల్లాలో అమలాపురం డివిజన్ నుంచే మొదలు పెట్టారు. అమలాపురం కిమ్స్ వైద్య కళాశాలలోని కాన్ఫరెన్స్ హాలులో డివిజన్లోని 275 గ్రామాల వీఆర్వోలతో గురువారం ఉదయం ఓ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. వారికి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నాటి తుని విధ్వంసకర దృశ్యాలు, అల్లర్లకు పాల్పతున్న ఆందోళనకారులను చూపించారు. అమలాపురం ఆర్డీవో జి.గణేష్‌కుమార్, డీఎస్పీ లంక అంకయ్య ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరిగింది. సందిగ్ధంలో వీఆర్వోలు తుని విధ్వంసకర దృశ్యాలను తెరపై చూసిన డివిజన్ వీఆర్వోల్లో సందిగ్ధంలో చిక్కున్నారు. ఒకవేళ వీడియోల ఆధారంగా ఎవరినైనా గుర్తిస్తే పోలీసులు తమతోనే ఫలానా వ్యక్తిపై ఫిర్యాదు రాయించి, కేసులు నమోదు చేస్తే గ్రామాల్లో వారికి శత్రువులై, వ్యక్తిగతంగా లక్ష్యం అవుతామన్న జంకు వారిని పీడిస్తోంది. కొందరు వీఆర్వోలు నిందితులను గుర్తించే పని పోలీసు వారిదేనని, ఇందులో తమను ఇరికించటమేమిటని వాపోతున్నారు. కాగా అమలాపురం డివిజన్ వీఆర్వోలు వీడియోలు, ఫొటోలు చూసిన వెంటనే ఓ ఒక్కరినీ గుర్తించలేదని తెలిసింది. వీడియోలు, ఫొటోల్లో స్పష్టత లేకపోవటం వల్లే గుర్తించలేపోతున్నామని కొందరు వీఆర్వోలు అంటున్నారు. ఇదిలా ఉంటే అమలాపురం పోలీసులు తుని ఘటనలో సెల్ఫీలు, సెల్ఫోన్లలో వీడియో తీసిన వారి ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుని వాటిని కూడా క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. -
ఎఫ్బీ అకౌంట్ హ్యాక్ చేసి.. మార్ఫింగ్ ఫొటో పెట్టారు!
న్యూఢిల్లీ: దేశద్రోహం ఆరోపణలపై జైలుపాలైన జెఎన్యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్యకుమార్ ఫేస్బుక్ ఖాతాను హ్యాక్ చేసినట్టు తెలుస్తోంది. ఆయన ప్రొఫైల్ పిక్చర్‌ను మార్చి.. దానిస్థానంలో సైనికులు జాతీయ జెండాను ఎగురవేస్తున్న ఫొటోను పెట్టారు. కన్హయ్యకుమార్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉండగా.. ఆయన ప్రొఫైల్ పిక్చర్‌ను శనివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో అప్డేట్ చేసినట్టు చూపిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆయన ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ చేశారని భావిస్తున్న ఆయన మద్దతుదారులు ఈ వ్యవహారంపై ఢిల్లీ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. జెఎన్యూ వివాదంలో 'దేశద్రోహం' ఆరోపణలపై అరెస్టయిన కన్హయ్యకుమార్ ఫేస్బుక్ ఖాతాలో జాతీయవాది ముద్రను కలిగించేందుకు దానిని హ్యాక్ చేసి మార్చినట్టు తెలుస్తున్నది. నిజానికి కన్హయ్య అకౌంట్లో సీపీఎం లోగో ముందు ఆయన నిలబడి ఉన్న ఫొటో ప్రొఫైల్ పిక్చర్‌గా ఉండేది. దీని స్థానంలో పెట్టిన భారత జాతీయ జెండా ఫొటో కూడా ఫొటోషాప్ చేసి మార్పులు చేసినది కావడం గమనార్హం. అమెరికా సైనికులు తమ దేశ జెండాను నిలబెడుతున్న బ్లాక్ అండ్ వైట్ ఫొటోను మార్ఫింగ్ చేసి.. కలర్ లో ఉన్న భారత జాతీయ జెండాను అమెరికా జెండా స్థానంలో ఉంచారు. కన్హయ్యకుమార్ అకౌంట్ హ్యాక్ చేసి.. ఈ ఫొటో పెట్టడంపై ఆయనకు మద్దతుదారులైన విద్యార్థులు మండిపడుతున్నారు. కన్హయ్యకుమార్ విడుదల చేయాలని ఆందోళన కొనసాగిస్తున్న వారు.. ఈ అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.