నటి ప్రైవేట్‌ ఫోటోలు లీక్‌.. ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు | Pakistani Actress Saba Qamar Trolled Her Private Pictures | Sakshi
Sakshi News home page

నటి ప్రైవేట్‌ ఫోటోలు లీక్‌.. ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు

Published Tue, Jul 24 2018 7:16 PM | Last Updated on Tue, Sep 3 2019 8:44 PM

Pakistani Actress Saba Qamar Trolled Her  Private Pictures - Sakshi

పాకిస్తాన్‌ నటి సబా కమర్‌

హిందీ మీడియం’ ఫేమ్‌ పాకిస్తాన్‌ నటి సబా కమర్‌ను నెటిజన్లు విపరీతంగా ట్రోల్‌ చేసి పడేస్తున్నారు. ‘అసలు నువ్వు ముస్లింవేనా..?’ ‘నువ్వు కూడా మహీరా ఖాన్‌లా తయారవుతున్నావా..?’ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. సబాను ఇంతలా ట్రోల్‌ చేయడానికి కారణం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోన్న ఆమె ఫోటోలు. ఈ ఫోటోల్లో సబా పొగతాగుతున్నట్లు ఉన్నారు. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు కాస్తా ‘సిగరెట్‌ తాగడమే కాక, ఆ ఫోటోలను సోషల్‌ మీడియోలో పోస్టు చేస్తావా’ అంటూ సబాపై మండిపడుతున్నారు. ఈ సందర్భంగా నెటిజన్లు సబాను ‘అసలు నువ్వు ముస్లింవేనా.. నువ్వు కూడా మహీరా ఖాన్‌లా తయారవుతున్నావా’ అంటూ ట్రోల్‌ చేస్తున్నారు.

అయితే అసలు విషయం ఏంటంటే ఈ ఫోటోలు యాడ్‌ చిత్రకరణ విరామ సమయంలో తీసినవి. అంతేకాక ఈ ఫోటోలను సబా షేర్‌ చేయలేదంటా. పొరపాటున లీకైన ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియా సైట్లలో చక్కర్లు కొడుతున్నాయి. కొందరు సబా సహనటులు ఒస్మాన్ ఖాలిద్ బిట్, అద్నాన్ సిద్దికి, ఎద్జాజ్ అస్లాం మాత్రం ఆమెకు మద్దతు ఇస్తున్నారు. ఈ విషయం గురించి వారు సోషల్‌ మీడియాలో ‘ఒక యాడ్‌లో భాగంగా నువ్వు సిగరెట్‌ను పట్టుకోవాల్సి వచ్చింది. విరామ సమయంలో తీసిన ఫోటోలు ఇవి. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం కొందరికి అలవాటు. అటువంటి వారి వ్యాఖ్యలను నువ్వు పట్టించుకోవద్దు. నువ్వు ఎంటో మాకు తెలుసు’ అంటూ మద్దతు తెలుపుతున్నారు.

గతంలో పాకిస్తాన్‌ నటి మహీరా ఖాన్, రణబీర్‌తో కలిసి సిగరెట్‌ తాగుతున్నట్లు ఉన్న ఫోటలపై కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయి. ఆ సమయంలో కూడా మహీరాను ఇలానే విమర్శించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement