Hindi medium
-
గిట్లయితే ఎట్లా? చేతి రాతతో ప్రశ్నపత్రం.. అర్థంకాక తికమక
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షల్లో మరోసారి గందరగోళం చోటుచేసుకుంది. ఇటీవల కోదాడలో ఫస్టియర్ ఇంగ్లిష్ పేపర్‌కు బదులు కెమిస్ట్రీ ప్రశ్నపత్రాలు రాగా, తాజాగా హిందీ మీడియం విద్యార్థులకు బోర్డ్ చుక్కలు చూపింది. బుధవారం ఫస్టియర్ పొలిటికల్ సైన్స్ పరీక్ష జరిగింది. కొంతమంది విద్యార్థులు హిందీ మీడియంలో పరీక్ష రాస్తున్నారు. అయితే, ఈ ప్రశ్నపత్రాన్ని బోర్డ్ హిందీ భాషలో ప్రింట్ చేయించకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. ఇంగ్లిష్ మాధ్యమంలో పరీక్ష కేంద్రానికి పంపే ప్రశ్నపత్రాన్నే హిందీలో తర్జుమా చేసి, విద్యార్థులకు ఇవ్వాలని బోర్డ్ ఆదేశించింది. అనువాదకులను పరీక్ష కేంద్రం వాళ్లే ఏర్పాటు చేసుకోవాలని హుకుం జారీ చేసింది. హైదరాబాద్‌లోని అంబేడ్కర్ కాలేజీ, నిజామాబాద్‌లోని మరో కేంద్రంలో హిందీ మీడియం విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష ప్రారంభానికి ముందు అనువాదకులను పిలిపించి వాళ్లతో ప్రశ్నపత్రం తర్జుమా చేయించి విద్యార్థులకు ఇచ్చారు. దీంతో పరీక్ష ఆలస్యమైంది. ఇదిలాఉంటే, అనువాదకుల చేతిరాత అర్థం కాక, విద్యార్థులు తిప్పలు పడ్డారు. ఆ రాతను అర్థం చేసుకోవడానికే చాలా సమయం పట్టిందని అంబేడ్కర్ కాలేజీలో పరీక్ష రాసిన విద్యార్థులు చెప్పారు. అర్థం కాని విషయాలను అడిగే అవకాశం కూడా చిక్కలేదన్నారు. ఈ కారణంగా పొలిటికల్ సైన్స్ పరీక్ష సరిగా రాయలేకపోయామని వాపోయారు. చేతితో రాసిన ప్రశ్నపత్రం ఎందుకీ పరిస్థితి? గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి ఎదురవ్వలేదని అధ్యాపక వర్గాలు అంటున్నాయి. బోర్డ్ పరిధిలో హిందీ అనువాదకులు లేరని, ఉన్నవాళ్లంతా రిటైరయ్యారని, అందుకే కాలేజీ వాళ్లనే ఏర్పాటు చేసుకోమన్నట్టు చెబుతున్నారు. అనువాదం కోసం బయట వ్యక్తులను పిలిస్తే, పేపర్ లీక్ చేసే ప్రమాదం ఉందనే ఈ నిర్ణయం తీసుకున్నామని సమర్థించుకుంటున్నారు. దీన్ని బోర్డ్‌లోని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. కాలేజీల్లో హిందీ మీడియంలో బోధన సాగుతున్నప్పుడు అధ్యాపకులు ఎందుకు ఉండరని ప్రశ్నిస్తున్నారు. పరీక్ష ఉదయం 9 గంటలకు మొదలవుతుంది. 8.30 గంటలకు ప్రశ్నపత్రం బండిల్ విప్పుతారు. అంటే అరగంటలో అనువాదకుడు ఇంగ్లిష్ నుంచి హిందీలోకి తర్జుమా చేయాలి. నెలల తరబడి ప్రింట్ చేస్తున్న పేపర్లలోనే తప్పులు వస్తుంటే, అరగంటలో ట్రాన్స్‌లేట్ చేస్తే వచ్చే తప్పుల మాట ఏంటని వారు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. హిందీ మాధ్యమంలో బోధించే అధ్యాపకులతో ముందే అనువాదం చేయించి ప్రశ్నపత్రం ప్రింట్ చేయించి ఉండాల్సిందని అంటున్నారు. వాస్తవ పరిస్థితులపై ఏమాత్రం అవగాహన లేకుండా బోర్డ్ వ్యవహరిస్తోందనే విమర్శలు సర్వత్రా విన్పిస్తున్నాయి. ఇంత నిర్లక్ష్యమా: మాచర్ల రామకృష్ణ గౌడ్ (తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి కన్వీనర్) హిందీ మాధ్యమంలో ప్రశ్నపత్రాలు ప్రింట్ చేయించకుండా, విద్యార్థులను గందరగోళంలో పడేయడం ఇంటర్ బోర్డ్ నిర్లక్ష్యానికి నిదర్శనం. పరీక్షల విభాగం కొంతమంది పైరవీకారుల చేతుల్లో ఇరుక్కుపోవడం వల్ల విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతోంది. బోర్డ్ ప్రయత్నం చేస్తే హిందీ అనువాదకులు ఎందుకు దొరకరు. అప్పటికప్పుడు తర్జుమా చేయించడం వల్ల తప్పులు దొర్లితే దానికి ఎవరు బాధ్యత వహించాలి. లెక్చరర్లు లేకనే : ఇంటర్ బోర్డ్ లెక్చరర్లు అందుబాటులో లేకపోవడం వల్లే ఫస్టియర్ హిందీ మీడియం విద్యార్థులకు ప్రశ్నప్రతాలను ప్రింట్ చేయించడం సాధ్యం కాలేదని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ బుధవారం రాత్రి వివరణ ఇచ్చారు. గతంలో అనువాదం కోసం బోర్డ్ హిందీ మాధ్యమానికి చెందిన రిటైర్డ్ రెగ్యులర్ లెక్చరర్ల సేవలను పొందేదని, కోవిడ్ కారణంగా పాత లెక్చరర్లు అందుబాటులో లేరని, గోప్యమైన విషయం కాబట్టి ఈ పనిని వేరే వాళ్లకు అప్పగించలేమని చెప్పారు. హిందీ మాధ్యమంలో పరీక్ష రాసే విద్యార్థులు ఫస్టియర్‌లో 32 మంది, సెకండియర్‌లో 24 మందే ఉన్నారన్నారు. అందువల్లే అందుబాటులో ఉన్న అనువాదకుల సేవలు వినియోగించుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్స్‌కు చెప్పినట్టు తెలిపారు. -
ఇర్ఫాన్ రిటర్న్స్
న్యూరో ఎండోక్రైన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్. దానికోసం ఆయన లండన్‌లో చికిత్స కూడా పొందుతున్నారు. అయితే ఆయన దీపావళికి ఇండియా తిరిగి రానున్నారనే వార్త షికారు చేస్తోంది. తిరిగి రాగానే ‘హిందీ మీడియం’ సీక్వెల్ ‘హిందీ మీడియం 2’ షూట్లో పాల్గొంటారని బాలీవుడ్లో చెప్పుకుంటున్నారు. తొలి భాగంలో ఆయనే నటించారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇర్ఫాన్ సన్నిహిత వర్గాలు మాత్రం ఈ విషయాన్ని ఖండించాయి. ‘‘డిసెంబర్ నుంచి ఇర్ఫాన్ మళ్లీ షూటింగ్స్‌లో పాల్గొంటాడన్నది అవాస్తవం. కానీ దీపావళి తర్వాత ఇర్ఫాన్ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి’’ అని పేర్కొన్నారట. తిరిగి వచ్చేస్తున్నారంటే ఇర్ఫాన్ ఆరోగ్యం మెరుగుపడినట్టే అని ఆయన అభిమానులు, సన్నిహితులు సంతోషపడుతున్నారు. -
భారత్‌కు తిరిగి రానున్న ఇర్ఫాన్
బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. తమ అభిమాన నటుడికి న్యూరో ఎండోక్రైన్ క్యాన్సర్ అన్న విషయం తెలిసిన దగ్గర నుంచి అభిమానులు ఆయన ఆరోగ్య పరిస్థితి విషయంలో ఆందోళన చెందుతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇర్ఫాన్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందట. అంతేకాదు ఈ దీపావళిని ఆయన భారత్‌లోనే జరుపుకోబోతున్నారన్న వార్త అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో ఇర్ఫాన్ భారత్‌కు తిరిగిరానున్నారు, త్వరలో హిందీ మీడియం సినిమా సీక్వెల్లో నటించనున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఇర్ఫాన్ సన్నిహితులు ప్రస్తుతానికి సినిమాలకు సంబంధించిన నిర్ణయం తీసుకోకపోయినా దీపావళి తరువాత ఇర్ఫాన్ ఖాన్ భారత్‌కు తిరిగి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. -
నటి ప్రైవేట్ ఫోటోలు లీక్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
‘హిందీ మీడియం’ ఫేమ్ పాకిస్తాన్ నటి సబా కమర్‌ను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేసి పడేస్తున్నారు. ‘అసలు నువ్వు ముస్లింవేనా..?’ ‘నువ్వు కూడా మహీరా ఖాన్‌లా తయారవుతున్నావా..?’ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. సబాను ఇంతలా ట్రోల్ చేయడానికి కారణం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న ఆమె ఫోటోలు. ఈ ఫోటోల్లో సబా పొగతాగుతున్నట్లు ఉన్నారు. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు కాస్తా ‘సిగరెట్ తాగడమే కాక, ఆ ఫోటోలను సోషల్ మీడియోలో పోస్టు చేస్తావా’ అంటూ సబాపై మండిపడుతున్నారు. ఈ సందర్భంగా నెటిజన్లు సబాను ‘అసలు నువ్వు ముస్లింవేనా.. నువ్వు కూడా మహీరా ఖాన్‌లా తయారవుతున్నావా’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. Today I feel sad that a colleague and one of the finest actor of Pakistan is being exploited by someone for a cheap publicity stunt ... it was just a simple BTS ( behind the scene) vdo during a photo shoot from which the screen shots were taken and made viral on social media ... its disgusting that people can go upto any extent for cheap publicity... saba you are a superstar and don’t let these haters demotivate you .. #wesupport #sabaqamar #pakistanidrama #pakistanimovie #pakistanifilm #repost #instapakistan #instalike #movieshoovy #divamagazinepakistan #showbizpakistan A post shared by Aijaz aslam (@aijazzaslamofficial) on Jul 19, 2018 at 12:33pm PDT అయితే అసలు విషయం ఏంటంటే ఈ ఫోటోలు యాడ్ చిత్రకరణ విరామ సమయంలో తీసినవి. అంతేకాక ఈ ఫోటోలను సబా షేర్ చేయలేదంటా. పొరపాటున లీకైన ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా సైట్లలో చక్కర్లు కొడుతున్నాయి. కొందరు సబా సహనటులు ఒస్మాన్ ఖాలిద్ బిట్, అద్నాన్ సిద్దికి, ఎద్జాజ్ అస్లాం మాత్రం ఆమెకు మద్దతు ఇస్తున్నారు. ఈ విషయం గురించి వారు సోషల్ మీడియాలో ‘ఒక యాడ్‌లో భాగంగా నువ్వు సిగరెట్‌ను పట్టుకోవాల్సి వచ్చింది. విరామ సమయంలో తీసిన ఫోటోలు ఇవి. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం కొందరికి అలవాటు. అటువంటి వారి వ్యాఖ్యలను నువ్వు పట్టించుకోవద్దు. నువ్వు ఎంటో మాకు తెలుసు’ అంటూ మద్దతు తెలుపుతున్నారు. గతంలో పాకిస్తాన్ నటి మహీరా ఖాన్, రణబీర్‌తో కలిసి సిగరెట్ తాగుతున్నట్లు ఉన్న ఫోటలపై కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయి. ఆ సమయంలో కూడా మహీరాను ఇలానే విమర్శించారు. -
ఐఫా అవార్డులు-2018
ప్రతిష్టాత్మక ఐఫా అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. గత రాత్రి(ఆదివారం) బ్యాంకాక్‌లో జరిగిన 19వ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల(ఐఫా) కార్యక్రమంలో బాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేశారు. తుమ్హారి సులు చిత్రం అత్యధికంగా ఆరు కేటగిరీల్లో నామినేట్ కాగా, ఐదు అవార్డులతో తర్వాతి స్థానంలో రాజ్‌కుమార్ రావ్ నటించిన న్యూటన్ నామినేట్ అయ్యింది. పెద్ద చిత్రాలేవీ అవార్డులను కొల్లగొట్టకపోగా.. చిన్న చిత్రాలు సత్తా చాటాయి. అవార్డుల విషయానికొస్తే... ఉత్తమ చిత్రంగా తుమ్హారి సులు, ఉత్తమ దర్శకుడిగా సాకేత్ చౌదరి(హిందీ మీడియం), ఉత్తమ నటిగా మామ్ చిత్రానికి గానూ దివంగత నటి శ్రీదేవి(భర్త బోనీకపూర్ అందుకున్నారు), ఉత్తమ నటుడిగా ఇర్ఫాన్ ఖాన్(హిందీ మీడియం) అవార్డులు దక్కించుకున్నారు. అవార్డుల పూర్తి జాబితా... ఉత్తమ చిత్రం- తుమ్హారి సులు ఉత్తమ దర్శకుడు- సాకేత్ చౌదరి(హిందీ మీడియం) ఉత్తమ నటుడు- ఇర్ఫాన్ ఖాన్ (హిందీ మీడియం) ఉత్తమ నటి-శ్రీదేవి(మామ్) ఉత్తమ సహయ నటుడు-నవాజుద్దీన్ సిద్ధిఖీ (మామ్) ఉత్తమ సహయ నటి-మెహర్ వీఐజే (సీక్రెట్ సూపర్‌స్టార్) ఉత్తమ కథ- న్యూటన్ చిత్రం(అమిత్ వీ మసూర్కర్) ఉత్తమ సంగీత దర్శకుడు -అమాల్ మాలిక్, తనిష్క్ బాగ్చి, అఖిల్ సచ్దేవ-బద్రీనాథ్ కీ దుల్హానియా బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ -ప్రీతమ్ (జగ్గా జసూస్ చిత్రానికి) బెస్ట్ స్క్రీన్ ప్లే -నితీశ్ తివారీ, శ్రేయస్ జైన్ (బరేలీ కీ బర్ఫీ) ఉత్తమ కొరియోగ్రఫీ-విజయ్ గంగూలీ, రూలె దౌసన్ వరిందని (జగ్గా జసూస్ చిత్రంలోని గల్తీ సే మిస్టేక్ పాటకు) ఉత్తమ డైలాగులు-హితేష్ కేవల్య(సుభ మంగళ్ సావధాన్) ఉత్తమ సినిమాటోగ్రఫీ-మార్కిన్ లస్కవైక్, యూఎస్సీ(టైగర్ జిందా హై చిత్రానికి గానూ...) ఉత్తమ ఎడిటింగ్- శ్వేత వెంకట్ మాథ్యూ (న్యూటన్) ఉత్తమ సింగర్(మహిళా)- మేఘనా మిశ్రా(సీక్రెట్ సూపర్ స్టార్ చిత్రంలోని మైన్ కౌన్ హూ పాటకు) ఉత్తమ సాహిత్యం - మనోజ్ ముంటషిర్ (బాద్షావో చిత్రంలోని మెరే రష్కే ఖమర్ పాటకు...) ఉత్తమ సింగర్ (మేల్)- అర్జిత్ సింగ్( జబ్ హ్యారీ మెట్ సెజల్ చిత్రంలోని హవాయెన్ పాటకు) ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ - కోంకణ్ సేన్ శర్మ అవుట్‌స్టాండింగ్ అఛీవ్మెంట్ అవార్డు- సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఉత్తమ స్టైల్ ఐకాన్- నటి కృతి సనన్ ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డు - ఎన్వై వీఎఫ్‌ఎక్స్‌వాలా (ప్రసాద్ వసంత్ సుటార్ -జగ్గా జసూస్ చిత్రం) ఉత్తమ సౌండ్ డిజైన్ - దిలీప్ సుబ్రమణియమ్-గణేశ్ గంగాధరన్(వైఆర్ఎఫ్ స్టూడియోస్).. టైగర్ జిందా హై చిత్రం ఇక ఈవెంట్ మధ్యలో రణ్‌బీర్ కపూర్, వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్, లూలియా వంటూర్, కృతి సనన్, బాబీ డియోల్, అర్జున్ కపూర్ తమ ఫెర్ఫార్మెన్స్‌తో ఆహతులను ఆకట్టుకున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత సీనియర్ నటి రేఖ స్టేజీపై నృత్య ప్రదర్శన ఇవ్వటం కార్యక్రమానికే హైలెట్‌గా నిలిచింది. -
చైనాలో సత్తా చాటుతున్న ఇండియన్ మూవీ
ఇండియన్ మార్కెట్లో చైనా వస్తువులు డామినేట్ చేస్తుంటే... చైనాలో ఇండియన్ సినిమాలు భారీ వసూళ్లను కొల్లగొడుతున్నాయి. చైనాలో ఇండియన్ సినిమాలకు ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే దంగల్, సీక్రెట్ సూపర్‌స్టార్, భజరంగీ భాయిజాన్ సినిమాలు రికార్డు కలెక్షన్లు సాధించాయి. తాజాగా... ఇర్ఫాన్ ఖాన్ నటించిన ‘హిందీ మీడియం’ విజయవంతంగా దూసుకెళ్తోంది. హిందీ మీడియం సినిమా చైనాలో రూ. 200 కోట్ల రూపాయలను కొల్లగొట్టబోతోంది. ఇప్పటికే రూ. 184 కోట్లను రాబట్టిందని అతి త్వరలోనే రెండు వందల కోట్ల మార్క్‌ను చేరుకుంటుందని మార్కెట్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విటర్లో పేర్కొన్నారు. ఇండియన్ సినిమాలు చైనా మార్కెట్‌ను బాగానే ఆకర్షిస్తున్నాయి. అమెరికా తరువాత చైనాలో ఇండియన్ సినిమాలకు ఆదరణ పెరుగుతోంది. బీ టౌన్ ప్రస్తుతం చైనా మార్కెట్ వైపు చూస్తోంది. వాస్తవికత, సహజతత్వానికి దగ్గరకు ఉన్న కథలకు చైనా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. #HindiMedium biz more than doubles on second Sat in CHINA... Is nearing ₹ 200 cr mark... [Week 2] Fri $ 0.62 mn Sat $ 1.41 mn Total: $ 28.20 million [₹ 184.06 cr] — taran adarsh (@taran_adarsh) 15 April 2018 -
ఆరు రోజుల్లోనే రూ.150 కోట్ల వసూళ్లు
సాక్షి, ముంబై : సరిహద్దు గొడవలైనా.. ఇరుదేశాల మధ్య సఖ్యత లేదని నాయకులు వాదిస్తున్నా.. ఎల్లలు, సంస్కృతీ సంప్రదాయాలకు అతీతంగా ప్రజలందరినీ కలిపి ఉంచే మాధ్యమం సినిమా అని మరోసారి నిరూపించారు చైనా ప్రేక్షకులు. ఆమిర్ ఖాన్ దంగల్ సినిమాతో భారతీయ సినిమాలపై మొదలైన చైనీయుల ప్రేమ బాక్సాఫీస్ వద్ద కనక వర్షాన్ని కురుపిస్తూనే ఉంది. తాజాగా బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్, సబా కమర్ జంటగా తెరకెక్కిన హిందీ మీడియం సినిమా చైనాలో విడుదలైన ఆరు రోజుల్లోనే 150 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ తర్వాత చైనాలో విడుదలైన మొదటి రోజే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. మనుషులను కలిపి ఉంచడానికి మాతృభాష అవసరమని చెబుతూనే.. వ్యాపారంగా మారిన విద్యా వ్యవస్థపై విమర్శనాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా తమ నేటివిటీకి దగ్గరగా ఉండటంతో చైనా ప్రజలు ఆదరించారని స్థానిక మీడియా పేర్కొంది. ఈనెల 4న కిపోజియాన్(స్టార్టింగ్ లైన్) పేరుతో చైనాలో విడుదలైంది హిందీ మీడియం. పిల్లల విద్య కోసం ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొనే తల్లిదండ్రుల మనోభావాలకు అనుగుణంగా తెరకెక్కిన ఈ సినిమా చైనీయులను అమితంగా ఆకర్షించిందని గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. సామాజిక సమస్యలపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ తెరకెక్కిన ఇలాంటి భారతీయ సినిమాలను చైనీయుల తప్పక ఆదరిస్తారని మరోసారి ఈ సినిమా నిరూపించిందని పేర్కొంది. -
విలక్షణ నటుడికి అవార్డు
ముంబై: విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తన నటనతో బాలీవుడ్లోనే కాదు హాలీవుడ్‌లోను సత్తా చాటాడు. హాలీవుడ్లో నటుడిగా సక్సెస్ అయ్యాడు. అక్కడ ప్రశంసలు పొందాడు. తాజాగా ఇర్ఫాన్ ఖాన్ నటించిన హిందీ మీడియమ్ సినిమాకు ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చింది. సాకేత్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో... భాషలు సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయో భావోద్వేగంగా చూపించాడు. ఈ సినిమాలో ఇర్ఫాన్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. న్యూస్ 18 అందించే రీల్ మూవీ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా ఇర్ఫాన్ ఖాన్ ఎంపికయ్యాడు. అనారోగ్యం కారణంగా ఈ వేడుకకు ఇర్ఫాన్ హాజరుకాలేకపోయాడు. ఇర్ఫాన్‌కు బదులు డైరెక్టర్ సుదీర్ మిశ్రా అవార్డును తీసుకున్నారు. ఈ అవార్డు అతనికి ఆనందాన్ని కలిగిస్తుందని ఆయన అన్నారు. అలాగే న్యూటన్ సినిమా డైరెక్టర్ అమిత్ మసుర్కర్ ఉత్తమ దర్శకుడిగా, రత్న పటక్ షా ఉత్తమ నటిగా, ముక్తి భవన్ సినిమాకు ఉత్తమ చిత్రం అవార్డులు లభించాయి. -
ఇంత అవమానమా.. వెక్కివెక్కి ఏడ్చిన నటి!
ఇటీవల ఇర్ఫాన్ ఖాన్‌తో కలిసి బాలీవుడ్ సినిమా ’హిందీ మీడియం’లో నటించిన సబా కమర్ తాజాగా వెక్కివెక్కి ఏడ్చారు. ఒక పాకిస్థానీ అయినందుకు అంతర్జాతీయ విమానాశ్రయంలో తాను ఏ రకంగా అవమానాలు ఎదుర్కొన్నది వెల్లడించారు. కేవలం పాకిస్థానీ కావడం వల్ల అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఎదుర్కొంటున్న కఠినమైన తనిఖీలు, ప్రశ్నల గురించి ఓ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ.. సబా ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. కళ్ల నుంచి ధారగా కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ ఆమె ఎంతో ఉద్వేగంగా మాట్లాడారు. ‘హిందీ మీడియం’ సినిమాలో ఇర్ఫాన్ ఖాన్, సబా కమర్ జోడీతో పాట షూట్ చేసేందుకు జార్జియాలోని తబ్లిసికి వెళ్లినప్పుడు తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని ఆమె వివరించారు. ‘పాకిస్థాన్‌లో ఉండి మనం పాకిస్థాన్ జిందాబాద్. పాకిస్థాన్ జై అంటూ ఎన్నో నినాదాలు చేస్తాం. కానీ మనం బయటకు వెళ్లినప్పుడు మన పట్ల జరిగే తనిఖీలు ఎంత దారుణంగా ఉంటాయో నేను చెప్పలేను. ఎంతో అవమానకరంగా ఈ తనిఖీలు జరుపుతారు. భారతీయ చిత్రయూనిట్‌తో షూటింగ్ కోసం మేం తబ్లిసీ వెళ్లినప్పుడు ఏం జరిగిందో నాకు ఇప్పటికీ గుర్తుంది. భారతీయ చిత్రయూనిట్ మొత్తం ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లిపోయింది. కానీ, నన్ను మాత్రం అదుపులోకి తీసుకొని ప్రశ్నించి.. పూర్తిగా తనిఖీలు చేసిన తర్వాత అధికారులు పంపించారు. నేను పాకిస్థానీని అనే ఒకే ఒక్క కారణంతో ఇంతగా అవమానించారు. బయట మనకు ఈ పరిస్థితి ఉందా? అన్న విషయం ఆ రోజు నాకు తెలిసింది’అంటూ ఎంతో భావోద్వేగంగా కన్నీళ్లు పెట్టుకుంటా సబా అన్నారు. 49 సెకన్లు ఉన్న ఆమె ఈ వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. It's not just #SabaQamar who feels humiliated. All #Pakistanis feel humiliated when we are considered a terrorist state, when our children are killed like flies & we can't get justice for them, when terrorist like #HafizSaeed roam around freely & we watch them helplessly. pic.twitter.com/pHalKqo7cq — Sabah Alam (@AlamSabah) 16 January 2018 -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
మా కూతురంటే నమ్మలేకపోతున్నాం హిందీ మీడియం : ట్రైలర్ నిడివి : 2 ని. 42 సె. ::: హిట్స్ : 80,27,124 ఇంగ్లిష్ ఒక భాష కాదు. ఒక హోదా! రైట్? ఇర్ఫాన్‌ఖాన్ కొత్త సినిమా ‘హిందీ మీడియం’ ట్రైలర్ ఈ సంగతే చెబుతోంది. ఇందులో ఇర్ఫాన్ పక్కన పాకిస్థానీ నటి సబా ఖమర్ జమన్ నటిస్తున్నారు. ప్రపంచంలో ఎన్ని వర్గాలైనా ఉండనివ్వండి. వాటి అన్నిటిపైనా ఉన్నవి రెండే రెండు వర్గాలు. ఇంగ్లిష్ మాట్లాడే వర్గం ఒకటి. ఇంగ్లిష్ మాట్లాడలేని వర్గం ఒకటి. ఈ రెండున్నర నిముషాల ట్రైలర్లో... హిందీ మాత్రమే వచ్చిన ఇర్ఫాన్‌ఖాన్, ఇంగ్లిష్‌ను అనర్ఘళంగా మాట్లాడే ఆయన భార్య సబా... కూతురికి మంచి ఇంగ్లిష్ ఎడ్యుకేషన్‌ను ఇప్పించే విషయమై పడే తపన హాస్యభరితంగా ఉంటుంది. సాకేత్ చౌదరి దర్శకత్వంలో వస్తున్న ఈ మలయాళీ రీ మేక్ (సాల్ట్ మ్యాంగో ట్రీ) మూవీ మే 12న విడుదల అవుతోంది. ‘ఈ రోజు నుంచి నేను ఇంగ్లిషులోనే మాట్లాడతానని ప్రమాణం చేస్తున్నాను. ఎందుకంటే ఇంగ్లిషే ఇండియా, ఇండియానే ఇంగ్లిష్’ అనే సెటైర్‌తో వీడియో ముగుస్తుంది. మరి ప్రారంభం ఎలా ఉంటుంది? ‘ఈ అమ్మాయి మా కూతురంటేనే నమ్మలేకపోతున్నాం సార్. అంత తెలివైన అమ్మాయి’ అంటాడు ఇర్ఫాన్ ప్రిన్స్‌పాల్‌తో! తన కూతురికి ఎలాగైనా ఇంగ్లిష్ మీడియం స్కూల్లో సీటు సంపాదించడం అతడి లక్ష్యం. అలా నాలుగైదు స్కూళ్లకు దరఖాస్తు చేస్తాడు. ఈలోపు తను కూడా ఇంగ్లిషు నేర్చుకోడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇంటర్వూ్యలలో పేరెంట్స్ కూడా ఇంగ్లిష్‌లో మాట్లాడాలి కదా. అందుకు. మధ్య మధ్య భార్య అతడి ఇంగ్లిష్ పరిజ్ఞానాన్ని పరీక్షిస్తుంటుంది. ఇంగ్లిష్‌లో మాట్లాడలేకపోతే జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో ఫ్రీక్వెంట్‌గా కన్నీళ్లు పెట్టుకుని మరీ చెబుతుంది. ఇర్ఫాన్ నలిగిపోతాడు. ఇంగ్లిష్ స్కూల్లో కూతురు నలిగిపోతుంటుంది. ఈ వైనాన్నంతా హాస్యానికి వ్యంగ్యాన్ని జోడించి చూపించారు. సో... జీవితానికి దగ్గరగా ఉండే మరొక మంచి బాలీవుడ్ మూవీ మన కోసం ఎదురుచూస్తూ ఉందన్నమాట. ఆట పాటైంది... పాట ఆటైంది! సచిన్స్ క్రికెట్ వాలీ బీట్ నిడివి : 3 ని. 44 సె. ::: హిట్స్ : హిట్స్ : 25,66,013 సచిన్ మొబైల్ యాప్ ‘100 ఎంబి’ కోసం క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, మ్యూజిక్ రాక్ స్టార్ సోనూ నిగమ్ కలిసి పాడిన జుగల్బందీ ‘నాచో నాచో నాచో సారె.. క్రికెట్ వాలి బీట్ పె..’ క్రికెట్ లవర్స్‌ని, సచిన్ ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగిస్తోంది. వరుణ్ లిఖాటే, షామీర్ టాండన్ ఈ పాటను రాశారు. మ్యూజిక్‌ను షామిర్ టాండన్ అందించారు. ఇక ఈ వీడియోకి డైరెక్షన్ నిషాంత్ నాయక్. ఈ పాటలో సచిన్ ప్రసిద్ద క్రికెట్ సెలబ్రిటీలను, తను ఆడిన ఆరు ప్రపంచ కప్‌లలోని ప్లేయర్లను తలచుకున్నాడు. ప్రవీణ్, రవి, సుబ్రోతో, కపిల్, కిరణ్, వినోద్, అజార్, అనిల్ కృష్ణమాచారి, అశీష్ కపూర్, సంజయ్, నయాన్, మనోజ్, సలీల్; అజయ్, జవగళ్, వెంకటేశ్, రాజు, సౌరవ్, సడగోపన్, సిద్ధు, రాహుల్, రాబిన్, దేబశీష్, నిఖిల్, అజిత్, అమేయ్, అశీష్; జహీర్, బంగర్, దినేశ్, వీరు, పార్థివ్, భజ్జీ, యువీ, కైఫ్, ఉతప్ప, కార్తీక్, మునాఫ్, శ్రీశాంత్, గౌతమ్, ఇర్ఫాన్, యూసప్ పఠాన్; సురేశ్, పీయూష్, విరాట్ కొహ్లీ, అశ్విన్, ఎం.ఎస్.ధోనీ.. లవ్ యూ గైస్ అంటూ... పాటలో ఈ పేర్లను ఓ చరణంలో రాగయుక్తంగా పాడతాడు సచిన్. బాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఊగుతూ పాడడం చూస్తుంటే వింతైన అనుభూతి కలుగుతుంది. క్రికెట్లోని కొన్ని అద్భుత క్షణాల నిశ్చల చిత్రాలను కూడా వీడియో మధ్యలో మిక్స్ చేశారు. అభిమానులు తట్టుకోలేని విషాద చిత్రం వినోద్‌ఖన్నా షాకింగ్ లుక్ నిడివి : 2 ని. 57 సె. ::: హిట్స్ : హిట్స్ : 18,30,003 తీవ్రమైన డీ హైడ్రేషన్‌తో ఈ నెల 2న ఆసుపత్రిలో చేరిన పూర్వతరం నటుడు వినోద్ ఖన్నా ఆరోగ్య స్థితిపై గత రెండు రోజులుగా ఆందోళనకరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ముంబైలోని సర్ హెచ్.ఎన్. రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న వినోద్‌ఖన్నాను పరామర్శించేందుకు ముంబై ప్రముఖులంతా వెళ్లివస్తున్నారు. ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగవ్వాలని దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. 1968–2013 మధ్య కాలంలో వినోద్‌ఖన్నా 140కి పైగా చిత్రాలలో నటించారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి బి.జె.పి. అభ్యర్థిగా లోక్‌సభకు పోటీ చేసిన ఖన్నా తన ప్రత్యర్థిపై లక్షా 36 వేల 65 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. మేరే అప్నే, మేరా గావ్ మేరా దేశ్, ఇంతిహాన్, ఇన్కార్, అమర్ అక్బర్ ఏంథోనీ, లహు కె దొ రంగ్, ఖుర్బానీ, దయవాన్, జుర్మ్ చిత్రాలతో అసమాన నటనను ప్రదర్శించి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన ఈ హీరో... ప్రస్తుతం ఆసుపత్రి పడకపై ఎలా ఉన్నారో ‘లెహ్రెన్ రెట్రో’ అనే సైట్.. ఖన్నా గతాన్ని, ప్రస్తుతాన్ని గుదిగుచ్చిన చిత్రాలతో ఈ వీడియోను రూపొందించి యూట్యూబ్‌లోకి అప్లోడ్ చేసింది. వినోద్ ఖన్నా కొంతకాలంగా బ్లాడర్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారన్న వదంతికి బలం చేకూర్చే ఈ వీడియోలో ఖన్నా క్లిప్పింగ్ కనిపిస్తుంది. ఏదైనా ఇది సినీ అభిమానులు తట్టుకోలేని విషాదమే.