విలక్షణ నటుడికి అవార్డు | Irrfan Khan Gets Best Actor Award For Hindi Medium | Sakshi
Sakshi News home page

విలక్షణ నటుడికి అవార్డు

Published Thu, Mar 22 2018 1:13 PM | Last Updated on Thu, Mar 22 2018 1:13 PM

Irrfan Khan - Sakshi

ఇర్ఫాన్‌ ఖాన్‌ (ఫైల్‌)

ముంబై: విల‍క్షణ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ తన నటనతో బాలీవుడ్‌లోనే కాదు హాలీవుడ్‌లోను సత్తా చాటాడు. హాలీవుడ్‌లో నటుడిగా సక్సెస్‌ అయ్యాడు. అక్కడ ప్రశంసలు పొందాడు. తాజాగా ఇర్ఫాన్‌ ఖాన్‌ నటించిన హిందీ మీడియమ్‌ సినిమాకు ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చింది.  

సాకేత్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో...  భాషలు  సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయో భావోద్వేగంగా చూపించాడు. ఈ సినిమాలో ఇర్ఫాన్‌ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. న్యూస్‌ 18 అందించే రీల్‌ మూవీ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా ఇర్ఫాన్‌ ఖాన్‌ ఎంపికయ్యాడు. అనారోగ్యం కారణంగా ఈ వేడుకకు ఇర్ఫాన్‌ హాజరుకాలేకపోయాడు. ఇర్ఫాన్‌కు బదులు డైరెక్టర్‌ సుదీర్‌ మిశ్రా అవార్డును తీసుకున్నారు. ఈ అవార్డు అతనికి ఆనందాన్ని కలిగిస్తుందని ఆయన అన్నారు. 

అలాగే న్యూటన్‌ సినిమా డైరెక్టర్‌  అమిత్‌ మసుర్కర్‌ ఉత్తమ దర్శకుడిగా, రత్న పటక్‌ షా ఉత్తమ నటిగా, ముక్తి భవన్‌ సినిమాకు ఉత్తమ చిత్రం అవార్డులు లభించాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement