Irrfan Khan
-
అపస్మారక స్థితిలో ఉన్నా.. కన్నీళ్లు కారుస్తూనే ఉన్నారు
సాక్షి, హైదరాబాద్: దివంగత లెజెండరీ నటుడు ఇర్ఫాన్ ఖాన్ జయంతి సందర్భంగా ఆయన భార్య సుతాపా సిక్దర్ భావోద్వేగానికి గురయ్యారు. ఇర్ఫాన్‌తో పంచుకున్న జీవితాన్ని, ఇతర విషయాలను తరచు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సుతాప అతనితో మరెన్నో జ్ఞాపకాలను పంచుకున్నారు. భర్త చనిపోవడానికి ముందు రోజురాత్రి అతనికిష్టమైన పాటల్ని పాడుతూ కూచున్నానని గుర్తు చేసుకున్నారు. ఒక వెబ్‌సైట్‌తో తన ఆవేదనను పంచుకున్నారు సుతాప. తాను పాడుతోంటే..అపస్మారక స్థితిలో ఉన్నప్పటికీ ఇర్ఫాన్ కళ్ల నుంచి నీళ్లు అలా ప్రవహిస్తూనే ఉన్నాయని చెప్పారు. ఉమ్రావ్ జాన్ మూవీలోని 'ఝూలా కిన్నే దాలా రే, హమ్రియా, లతా మంగేష్కర్ ఆలపించిన పాపులర్ సాంగ్ ‘లగ్ జా గలే’, ఆజ్ జానే కీ జిద్ న కర్ అనే గజల్‌ను ఇర్ఫాన్ కోసం పాడి వినిపించానంటూ సుతాప ఎమోషనల్ అయ్యారు. ఇర్ఫాన్ లేకుండా, సింగిల్ మదర్‌గా తన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకునే వారు సుతాప. గత ఏడాది ఇర్ఫాన్ వర్ధంతి సందర్భంగా ఇర్ఫాన్కెంతో ఇష్టమైన నైట్ క్వీన్ మొక్కను నాటి నివాళి అర్పించారు. ఈ పూల సువాసన ఇర్ఫాన్‌కి చాలా ఇష్టమని పేర్కొన్నారు. అలాగే ఇర్ఫాన్ పెద్ద కుమారుడు బాబిల్ ఖాన్ కూడా తమకు దూరమైన తండ్రి గురించి తలచుకుంటూ ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. కాగా కేన్సర్‌తో బాధపడుతూ ఏప్రిల్ 29, 2020న ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. -
Irrfan Khan Birthday Special: ఆ పాత్రలు ఎప్పటికీ సజీవమే
-
Irrfan Khan Birth Anniversary: ఆ పాత్రలు ఎలా మర్చిపోగలం?
సాక్షి, హైదరాబాద్: సినీ ప్రపంచం మరచిపోలేని నటుడు, నిర్మాత ఇర్ఫాన్ ఖాన్. ఆయన ఎంచుకున్న పాత్రలన్నీ దేనికదే ప్రత్యేకం. స్క్రీన్ మీద ఆ పాత్రలు తప్ప ఇర్ఫాన్ కనిపించడు. అంతటి విలక్షణమైన ప్రతిభ నటన ఆయన సొంతం. అలాంటి గొప్ప కళాకారుడి అకాల మరణం దురదృష్టకరం. కానీ వెండితెరపై ఆయన ఆవిష్కరించిన అద్భుత పాత్రలు ఎప్పటికీ సజీవమే. ఇర్ఫాన్ 55వ జయంతి (జనవరి,7) సందర్భంగా ‘సాక్షి’ డిజిటల్ నివాళులర్పిస్తోంది. జనవరి 7, 1967న రాజస్థాన్ లోని జైపూర్‌లో ఇర్ఫాన్ ఖాన్ జన్మించారు. మూడు దశాబ్దాల సుదీర్ఘ కరియర్లో ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లోనే కనిపించినప్పటికీ, పలు హాలీవుడ్, ఇతర భారతీయ భాషల్లో కూడా నటించారు. సహజమైన నటన, వైవిధ్య భరిత పాత్రలకు ఆయన పెట్టింది పేరు. 1988లో సలామ్ బాంబే సినిమాలో తొలిసారిగా నటించిన ఇర్ఫాన్, ది నేమ్‌సేక్, కమలాకీ మౌత్, జజీరే, దృష్టి, ఏక్ డాక్టర్ కీ మౌత్ లాంటి సినిమాలతో పాటు.. తెలుగులో మహేష్ హీరోగా నటించిన సైనికుడు మూవీలో నటించారు. హాలీవుడ్లో స్లమ్‌డాగ్ మిలియనీర్, ఎ మైటీ హార్ట్, జురాసిక్ వరల్డ్, లైఫ్ ఆఫ్ పై వంటి ఉత్తమ చిత్రాల్లో నటించి మంచి పేరును సంపాదించారు. పాన్ సింగ్ తోమర్ సినిమాకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. ముఖ్యంగా లైఫ్ ఆఫ్ పై సినిమాతో పాపులర్ అయిన ఇర్ఫాన్ ఖాన్ సినీ కరియర్లో ప్రతీ సినిమా ఒక మైలురాయి లాంటిదనే చెప్పాలి. పాన్ సింగ్ తోమర్, లంచ్ బాక్స్, హైదర్, తల్వార్, మఖ్బూల్, పీకూ, ఇంగ్లీష్ మీడియం ఇటీవల ఓటీటీలో రిలీజ్ మర్డర్ ఎట్ తీసరీ మంజిల్ 302 లాంటి చిత్రాల్లో ఇర్ఫాన్ నటన అద్భుతం. పీకూ మూవీలో అమితాబ్‌కు పోటీపడి నటించి మెప్పించారు. అలాగే ఇర్ఫాన్ ఖాన్ అనగానే తల్వార్ మూవీలో సీబీఐ ఆఫీసర్ పాత్ర, కార్వాన్ లో షౌకత్ పాత్రను గుర్తు రాకమానవు. ఒక్కసారి ఆయన మూవీ చూస్తే ఆ పాత్ర ప్రేక్షకుడిని చాన్నాళ్లు వెంటాడుతుంది. కాలర్ పట్టి నిలదీస్తుంది. అలా నటనలో జీవితాన్ని ఆవిష్కరించి ప్రేక్షక హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న నటుడు ఇర్ఫాన్. అసామాన్య ప్రతిభతో రాణిస్తున్న ఇర్ఫాన్‌ను కేన్సర్ బలితీసుకుంది. 2020, ఏప్రిల్‌లో ఆయన కన్నుమూశారు. తల్లి చనిపోయిన కొన్ని రోజులకే ఆయన కూడా తల్లి ఒడికి చేరిపోవడం అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇర్ఫాన్ ఖాన్ పెద్ద కుమారుడు బాబిల్ ఖాన్ మూవీల్లో నటించేందుకు ప్రయత్నిస్తున్నాడు. దీనికి సంబంధించి ఫోటోషూట్ కూడా చేశాడు. కాగా కళా రంగంలో కృషి చేసినందుకు గాను భారత ప్రభుత్వం ఇర్ఫాన్ ఖాన్‌కు 2011లో పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది. -
బాలీవుడ్లో మరో వారసుడొస్తున్నాడు..
బాలీవుడ్లో వారసుల జాబితా ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది. తాజాగా ఈ లిస్ట్‌లో బాబిల్ ఖాన్ పేరు చేరింది. దివంగత ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ వారసుడే ఈ బాబిల్. బాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్కా శర్మ ప్రొడక్షన్ హౌస్ క్లీన్ స్లేట్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఓ సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీలో బాబిల్ హీరోగా చేస్తున్నారు. ఈ సినిమాకు ‘కాలా’ అనే టైటిల్ అనుకుంటున్నారు. అన్విత దత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో డిమ్రీ త్రిపాఠి హీరోయిన్. అయితే ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కావడం లేదు. ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. చదవండి: ‘ఆర్ఆర్ఆర్’ రచయిత విజయేంద్ర ప్రసాద్‌కు కరోనా ఖరీదైన డ్రెస్‌లో మెరిసిన తమన్నా.. ధర తెలిస్తే కళ్లు తిరుగుతాయ్ -
పీకు రీమేక్‌లో టాప్ హీరోయిన్?
దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్, ఇర్ఫాన్ ఖాన్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన హిందీ చిత్రం ‘పీకు’. సూజిత్ సర్కార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ డ్రామాకు విశేషమైన ఆదరణ లభించింది. 2015లో ఈ సినిమా విడుదలైంది. విడుదలైన ఐదేళ్లకు ఈ సినిమా సౌత్‌లో రీమేక్ కాబోతోందని సమాచారం. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రం రీమేక్ హక్కులను తీసుకుందట. హిందీలో దీపికా చేసిన పాత్రను ఈ రీమేక్‌లో త్రిష చేస్తారని టాక్. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా తెరకెక్కనుంది. చర్చల దశలోనే ఉన్న ఈ రీమేక్ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మలయాళంలో మోహన్‌లాల్‌తో ‘రామ్’, మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వమ్’ సినిమాల్లో నటిస్తున్నారు త్రిష. -
ఇర్ఫాన్ ఖాన్‌కు మనమిచ్చే గౌరవం ఇదేనా?
ముంబై : దివంగత నటుడు ఇర్ఫాన్‌ఖాన్ సమాధిని పాలరాయితో కట్టించాలని నటుడు శేఖర్ సుమన్ అన్నారు. చిత్రపరిశ్రమలో ఎంతో గుర్తింపు సంపాదించుకున్న ఇర్ఫాన్‌కు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఇండస్ర్టీపై ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతమున్న ఇర్ఫాన్ సమాధి అపరిశుభ్రంగా ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఎంతో కీర్తి ప్రతిష్టలు పొందిన ఇర్ఫాన్‌కు తగిన గౌరవం ఇచ్చేలా వైట్ మార్భుల్స్‌తో పాలరాతి సమాధి కట్టించాలని, దీనికి చిత్రపరిశ్రమ ముందుకు రావాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశాడు. ఇంతకుముందు ఇర్ఫాన్ భార్య సుతాపా సిక్దార్ ఇర్ఫాన్ గురించిన చేసిన పోస్ట్‌పై ఓ అభిమాని స్పందిస్తూ ఇర్ఫాన్ సమాధిపై ఆందోళన వ్యక్తం చేశారు. (‘ఆయన జ్ఞాపకాలను పంచుకున్నందుకు ధన్యవాదాలు’) ఆ స్మశానవాటిక చెత్తకుండీలా ఉందని, అలాంటి ప్రదేశంలో ఇర్ఫాన్ సమాధి ఉండటం ఏంటని ప్రశ్నించారు. అసలు ఇది నిజమేనా లేకపోతే స్మశానవాటిక ఫోటో పంపాల్సిందిగా ఇర్ఫాన్ భార్య సుతాపకు ట్వీట్ చేయగా..ముస్లిం మహిళలు అక్కడికి వెళ్లడానికి అనుమతి లేదని సుతాప బదులిచ్చింది. ఇక స్మశానవాటిక గురించి స్పందిస్తూ..అడవుల్ని, మొక్కల్ని ఎంతో ఇష్టపడే ఇర్ఫాన్ సమాధిని అందుకు దగ్గరగా ఉన్న ప్రాంతంలోనే ఏర్పాటుచేశాం. దాన్నొక అందమైన ప్రదేశంగా చూడాలని, ఇర్ఫాన్ ఆత్మ ఎల్లప్పుడూ తనతోనే ఉంటుందని పేర్కొంది. విలక్షణ నటుడు ఇర్ఫాన్ న్యూరో ఎండోక్రిన్ క్యాన్సర్‌తో బాధపడుతూ ఏప్రిల్ 29న మరణించిన విషయం తెలిసిందే. (‘కలువ పూలు నిన్ను గుర్తు చేస్తున్నాయి ఇర్ఫాన్’) This is d late actor Irrfan Khan's grave.Does it teach anything about life?After all the fame n adulation,International acclaim,you lie alone in an unkempt grave.Can the industry wake up and at least get this place done in white marble wid a loving epitaph? pic.twitter.com/nJWTspC53M — Shekhar Suman (@shekharsuman7) September 30, 2020 -
మీ నాన్న ఉంటే సిగ్గుపడేవాడు; నోరు మూసుకోండి!
ముంబై: ‘‘మా నాన్న గురించి తమకు తెలుసు అని చెప్పుకొనే వారి పట్ల నేటితో గౌరవం పోయింది. అయితే ఒక్కటి మాత్రం నిజం నా కంటే మా నాన్న అన్ని విషయాల్లో బెటరే. మీ ద్వేషం కారణంగా నాకు ఈరోజు లిబరేషన్ అంటే ఏమిటో అర్థమైంది. అయినా మీరేం చేయలేరు. అయితే ఓ వ్యక్తి గురించి వెంటనే జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. అన్నట్లు మీ నాన్న కూడా నిన్ను చూసి సిగ్గుపడుతారు. కాబట్టి నోరు మూసుకో. నేను, బాబా బెస్ట్‌ఫ్రెండ్స్. మా నాన్న ఏం చేసేవారో చెప్పడానికి అస్సలు ప్రయత్నించకండి. ఆయన నమ్మకాల గురించి తెలియకుండా మాట్లాడవద్దు’’ అంటూ బాలీవుడ్ దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ తనయుడు బాబిల్ ఖాన్ ట్రోల్స్‌పై మండిపడ్డాడు. తన తండ్రి గురించి తనకు చెప్పాల్సిన అవసరం లేదని చురకలు అంటించాడు. దర్శక- నిర్మాత అనురాగ్ కశ్యప్‌కు మద్దతుగా నిలిచినందుకు తనను విమర్శించిన వాళ్లకు ఈ విధంగా సమాధానమిచ్చాడు. (చదవండి: ఇది మహిళల కోసం నిలబడే సమయం: పాయల్ ) కాగా నటి పాయల్ ఘోష్ అనురాగ్ కశ్యప్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతుండగా, ఆయన మాజీ భార్యలు ఆర్తీ బజాజ్, కల్కి కొచ్లిన్ సహా తాప్సీ వంటి సినీ ప్రముఖులు మద్దతుగా నిలుస్తున్నారు. పాయల్ చేసిన ఆరోపణల్లో నిజం లేదంటూ అనురాగ్‌కు అండగా నిలబడుతున్నారు. ఈ క్రమంలో బాబిల్ ఖాన్ సైతం ఇదే బాటలో నడిచాడు. అంతేగాక ఎంతో గొప్పదైన మీటూ ఉద్యమాన్ని దుర్వినియోగం చేయడం వల్ల, నిజమైన బాధితులకు అన్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డాడు. ఓ వ్యక్తిపై నిందలు వేయడం సులువేనని, అయితే నిజాన్ని నిరూపించడం కష్టమని చెప్పుకొచ్చాడు. (చదవండి: మీ టూ: అనురాగ్‌కు మాజీ భార్య మద్దతు ) అంతేగాక మీటూ అంటూ కొంతమంది చేసే నిరాధార ఆరోపణల వల్ల లైంగిక వేధింపుల బాధితులపై నమ్మకం పోయే అవకాశం ఉందని, అలాంటి వాళ్లు ఎప్పటికీ చీకట్లోనే మగ్గిపోవాల్సిన దుస్థితి కలుగుతుందంటూ.. ‘‘చిన్ అప్ అనురాగ్ సర్’’అని ఇన్‌స్టాలో ఓ పోస్టు షేర్ చేశాడు. ఇక ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘మీరన్నట్లు ఒకరిపై అభాండాలు వేయడం తేలికే కావొచ్చు. ఇన్ని విషయాలు తెలిసిన వాళ్లు, ఎదుటి వ్యక్తి చెప్పేది కచ్చితంగా అబద్ధమేననే స్టాంఢ్ తీసుకోవడం ఎంత వరకు కరెక్ట్. ఒకవేళ ఆ అమ్మాయి చెప్పేది నిజమే అయితే అప్పుడు ఏం చేస్తారు. మీ నాన్న ఉంటే నిజంగా సిగ్గుపడేవారు. ఆయనలా బతికేందుకు ప్రయత్నించు’’అంటూ బాబిల్‌ను విమర్శించారు. దీంతో తన జడ్జిమెంట్‌పై తనకు నమ్మకం ఉందని, ఒకవేళ ఇది తప్పని తేలితే అందుకు బాధ్యత వహిస్తానని బాబిల్ చెప్పుకొచ్చాడు. కాగా ఇర్పాన్ ఖాన్- సుతాపా సికిందర్ దంపతులకు బాబిల్ ఖాన్. ఆర్యన్ అనే ఇద్దరు కుమారులు ఉన్న సంగతి తెలిసిందే. View this post on Instagram Chin up, Anurag sir. I know you all are gonna hate me for this but I’ve got to stand up when something feels wrong. A lot of people in the comments are asking ‘What if the girl is right?’ I am trusting my judgement, I will take responsibility for my words if I’m wrong. A post shared by Babil (@babil.i.k) on Sep 21, 2020 at 4:37am PDT -
‘బాలీవుడ్ సినిమాలకు గౌరవం లేదు’
ముంబై: బాలీవుడ్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ నటనకు ప్రాధాన్యత పెంచేందుకు ప్రయత్నిస్తూ తన తండ్రి జీవితాన్ని ధారపోశాడని బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్ భావోద్వేగానికి లోనయ్యాడు. ప్రపంచ సినిమాల్లో బాలీవుడ్ గౌరవించలేదంటూ ఫిలిం స్కూల్లో తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇర్ఫాన్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ‘నేను లండన్ ఫిలిం స్కూల్‌కు వెళ్లేముందు నా తండ్రి నాకు నేర్పించిన అతి ముఖ్యమైన పాఠం ఏంటో మీకు తెలుసా! ప్రపంచ సినిమాల్లో బాలీవుడ్ అరుదుగా గౌరవించబడుతున్నందున నటుడిగా నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. బాలీవుడ్‌కు మించిన భారతీయ సినిమా గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చాడు. (చదవండి: ‘అక్కడ బాలీవుడ్ సినిమాలకు గౌరవం లేదు’) ‘‘నా త్రండి చెప్పినట్టుగా దురదృష్టవశాత్తు అదే జరిగింది. లండన్ ఫిలిం స్కూల్‌కు వెళ్లిన నాకు అక్కడ బాలీవుడ్ సినిమాలు గౌరవించబడినట్లు కనిపించలేదు. ఇక 60, 90 నాటి సినిమాల గురించి అయితే అక్కడ ఎవరికీ అవగాహన కానీ సరైన అభిప్రాయం కానీ లేదు. ‘బాలీవుడ్ అండ్ బియాండ్’ అన్నట్టుగా మన సినిమాలను చూస్తున్నారు. ప్రముఖ దర్శకులైన సత్యజిత్ రే, కె ఆసిఫ్‌ల గురించి అయితే సరైనా ఉపన్యాసం దొరకదు. అది ఎందుకో తెలుసా? ప్రేక్షకులుగా మనం అభివృద్ధిని నిరాకరించాం కాబట్టి’ అంటూ బాబిల్ రాసుకొచ్చాడు. (చదవండి: ప్రముఖ నటుడు జగదీప్ కన్నుమూత) View this post on Instagram You know one of the most important things my father taught me as a student of cinema? Before I went to film school, he warned me that I’ll have to prove my self as Bollywood is seldom respected in world cinema and at these moments I must inform about the indian cinema that’s beyond our controlled Bollywood. Unfortunately, it did happen. Bollywood was not respected, no awareness of 60’s - 90’s Indian cinema or credibility of opinion. There was literally one single lecture in the world cinema segment about indian cinema called ‘Bollywood and Beyond’, that too gone through in a class full of chuckles. it was tough to even get a sensible conversation about the real Indian cinema of Satyajit Ray and K.Asif going. You know why that is? Because we, as the Indian audience, refused to evolve. My father gave his life trying to elevate the art of acting in the adverse conditions of noughties Bollywood and alas, for almost all of his journey, was defeated in the box office by hunks with six pack abs delivering theatrical one-liners and defying the laws of physics and reality, photoshopped item songs, just blatant sexism and same-old conventional representations of patriarchy (and you must understand, to be defeated at the box office means that majority of the investment in Bollywood would be going to the winners, engulfing us in a vicious circle). Because we as an audience wanted that, we enjoyed it, all we sought was entertainment and safety of thought, so afraid to have our delicate illusion of reality shattered, so unaccepting of any shift in perception. All effort to explore the potential of cinema and its implications on humanity and existentialism was at best kept by the sidelines. Now there is a change, a new fragrance in the wind. A new youth, searching for a new meaning. We must stand our ground, not let this thirst for a deeper meaning be repressed again. A strange feeling beset when Kalki was trolled for looking like a boy when she cut her hair short, that is pure abolishment of potential. (Although I resent that Sushant’s demise has now become a fluster of political debates, but if a positive change is manifesting, in the way of the Taoist, we embrace it.) A post shared by Babil Khan (@babil.i.k) on Jul 8, 2020 at 12:42am PDT ఇర్ఫాన్ గురించి చెబుతూ.. ‘‘మా నాన్న బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు వెళ్లాడు. ఆయన ఓ లెజెండరి నటుడిగా గుర్తింపు పొందారు. అయినప్పటికీ ఆయన సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద ఓడిపోయాయి. ఆయన బాలీవుడ్లో కేవలం నటనకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ బాలీవుడ్ సినిమాలు అంటే సిక్స్ ప్యాక్స్ అబ్స్, జీరో సైజ్, ఐటెం సాంగ్స్, సెక్సిజం, నెపోటిజంతో నిండిపోయాయి. ప్రేక్షకులు కూడా వాటికే అలవాటు పడిపోయారు. కానీ నా తండ్రి నటన ప్రత్యేకత పెంచడం కోసం తన జీవితాన్నే ఇచ్చాడు’’ అంటూ భావోద్యేగానికి లోనయ్యాడు. చివరిగా ‘అంగ్రేజీ మీడియం’లో నటించిన ఇర్ఫాన్ ఈ ఏడాది ఏప్రిల్ 29న మృతి చెందిన విషయం తెలిసిందే. -
'ఇర్ఫాన్ మాకెంతో చేశాడు.. అందుకే ఈ నిర్ణయం'
ముంబై : కొందరు దిగ్గజాలు మనల్ని విడిచిపెట్టి వెళ్లినప్పుడు వారి సేవలకు గుర్తుగా ఊరి పేరును మార్చడం లేదా అతని పేరు మీద సామాజిక కార్యక్రమాలు చేయడం చూస్తుంటాం. తాజాగా బాలీవుడ్ దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్‌కు అలాంటి గౌరవమే లభించింది. మహారాష్ట్రలోని ఇగాత్ పురి గ్రామస్తులు ఇర్ఫాన్ గ్రామానికి చేసిన సేవలకు గుర్తుగా ఊరికి అతని పేరు పెట్టాలని నిశ్చయించుకున్నారు. ఇర్ఫాన్ ఖాన్ మనల్ని విడిచిపెట్టి రెండు వారాలు కావొస్తున్న అతని జ్ఞాపకాలతో ఇంకా మన మధ్యలోనే ఉన్నట్లు అనిపిస్తుంది. కేవలం తన నటనతో కోట్లాది మందిని తన అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఎంతో చిన్నస్థాయి నుంచి వచ్చిన ఇర్ఫాన్ చాలా కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎప్పటికి గుర్తుంచుకునే నటుడిగా తనకంటూ పేరు సంపాధించాడు. అలాంటి ఇర్ఫాన్‌కు ఇగాత్ పురి గ్రామస్తులు ఊరికి అతని పేరు పెట్టి రుణం తీర్చుకోవాలని అనుకుంటున్నారు. ఇదే విషయంపై గ్రామస్తులను ఆరా తీయగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. (ఆడితే ఆడావు.. వాటిపై కాలు మాత్రం పెట్టకు) ఇగాత్ పురి గ్రామంలో ఇర్ఫాన్ కొంత భూమిని కొన్నాడని, అతను కొనే సమయానికి ఆ ఊరు ఎలాంటి అభివృద్దికి నోచుకోలేదని పేర్కొన్నారు. ఈ తరుణంలోనే ఇర్ఫాన్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎలాగైనా సరే తాను భూమి కొన్న గ్రామాన్ని కొంతమేరకైనా అభివృద్ధి చేయాలనుకున్నాడు. ఆ ఊరిలో గిరిజన విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని తెలుసుకున్న ఇర్ఫాన్ వారికి తన వంతు సహాయం చేయాలనుకున్నాడు. ఆ గిరిజన పిల్లలు చదువుకునేందుకు పుస్తకాలు, రెయిన్ కోట్స్, స్వెటర్లు, ఇతర నిత్యావసరాలు అందించాడు. అంతేగాక వారి కుటుంబసభ్యులతో కలిసి పండుగలను నిర్వహించడమే గాక స్వీట్‌బాక్స్‌లు ఇచ్చేవాడు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తన దగ్గరకు రావొచ్చని ఊరి వాళ్లకు హామీ ఇచ్చాడు. తాజాగా ఇర్ఫాన్ మరణంతో ఇగాత్ పురి గ్రామం మూగబోయింది. తమ ఇంటి మనిషినే కోల్పోయినట్లుగా భావిస్తున్నారు. తమ గ్రామానికి ఎంతో సేవ చేసిన ఇర్ఫాన్‌కు గుర్తుగా తమ ఊరికి అతని పేరు పెట్టడమే సరైన నిర్ణయమని గ్రామస్తులు భావించారు. 2018లో న్యూరో ఎండోక్రైన్ సంబంధిత ట్యూమర్‌కు గురైన 53 ఏళ్ల ఇర్ఫాన్ లండన్‌కు వెళ్లి శస్త్ర చికిత్స చేసుకొని వచ్చాడు. అప్పటి నుంచి కాస్త అనారోగ్యంగానే ఉన్న ఇర్ఫాన్ ఏప్రిల్ 29, 2020న ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. కాగా, జనవరి 7, 1967న జన్మించిన ఇర్ఫాన్ ఖాన్, హిందీతో పాటు హాలీవుడ్, దక్షిణాది చిత్రాల్లోనూ నటించారు. స్లమ్‌డాగ్ మిలియనీర్, ఎ మైటీ హార్ట్, జురాసిక్ వరల్డ్, లైఫ్ ఆఫ్ పై వంటి హాలీవుడ్ ఉత్తమ చిత్రాల్లోనూ నటించి మంచి పేరును సంపాదించారు. (అది తీవ్రంగా బాధిస్తుంది: జిమ్మీ షెర్గిల్) -
ఇర్ఫాన్ విషయంలో పెద్ద తప్పు చేశా: నటుడు
బాలీవుడ్ లెజండరి నటుడు ఇర్ఫాన్ ఖాన్‌ను చివరి రోజుల్లో కలుసుకోలేనందుకు నటుడు జిమ్మీ షెర్గిల్ విచారం వ్యక్తం చేశాడు. బాలీవుడ్లో ‘హసీల్’, ‘షాహెబ్ బీవీ’, ‘గ్యాంగ్‌స్టార్ రిటర్న్స్’లో ఇర్ఫాన్‌తో కలిసి నటించాడు. ఇక ఇర్ఫాన్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని.. చివరి రోజుల్లో ఆయనను కలుసుకులేనందకు ఎంతగా పశ్చాత్తాప పడుతున్నాడో చెబుతూ భావోద్యేగానికి లోనయ్యారు. ఇర్ఫాన్‌పై ఆయనకు ఉన్న అభిమాన్ని తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో హృదయాపూర్వ లేఖ రాశాడు. ‘దీని నుంచి మళ్లీ మాములుగా ఉండటానికి చాలా కాలం పడుతుంది. ఈ నష్టాన్ని అధిగమంచడానికి చాలా ఏళ్లు తీసుకుంటుంది. మీ మరణవార్త విని షాక్‌కు గురయ్యాను. ఆ షాక్ నుంచి బయటకు రాలేక పోతున్నా’ అని పేర్కొన్నాడు. (ఆయన బతికే ఉంటారు: మీరా నాయర్) View this post on Instagram It’s going to take time..a long long time ..to get over this loss.Just like it’s taking time to come out of this shock.My biggest regret is I couldn’t even get to see you once in the last few years,though I tried to .We worked on five films together.My love and respect for you was immense and you knew that.You knew that I was a fan of yours since the first one ‘HAASIL’.Its very hard to come to terms with the fact that your gone.May the almighty give your family all the strength at this moment..You have inspired and will continue to inspire many like me...RIP Irfan Bhai ..🙏 A post shared by Jimmy Sheirgill (@jimmysheirgill) on May 6, 2020 at 5:10am PDT ఇక ‘‘నేను చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే మిమ్మల్నీ గత కొన్నేళ్లుగా కలవకపోవడం. కలవాలని ఎంతగానో ప్రయత్నించాను కానీ కుదరలేదు. మనం కలిసి 5 సినిమాల్లో పని చేశాము. మీ పట్ల నాక్ను ప్రేమ, గౌరవం అపారమైనది. అది మీకు కూడా తెలుసు. మన ఇద్దరం కలిసి మొదటిసారి నటించిన ‘హాసిల్’ చిత్రం నుంచే మీ అభిమానిని అయ్యాను. అంతేగాక మీరు నాలాంటీ ఎంతో మందికి ప్రేరణ నిస్తూ స్పూర్తిగా నిలిచారు. చివరిగా మిమ్మల్ని చూడలేకపోయానన్న బాధ నన్ను తీవ్రం కలచివేస్తోంది. ఆ దేవుడు మీ కుటుంబానికి అని విధాల ధైర్యం ఇస్తాడు. మిస్ యూ ఇర్ఫాన్ భాయ్.. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ మీ జిమ్మీ’’ అంటూ ఇన్‌స్టాలో భావోద్వేగానికి గురయ్యారు. కాగా ఇర్ఫాన్ ఖాన్ గత రెండేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతూ చివరకూ ఏప్రిల్ 29న తుది శ్వాస విడిచారు. (మరణంపై ఇర్ఫాన్ ఖాన్ భావోద్వేగ మాటలు!) -
ఇర్ఫాన్ ఖాన్ వీడియో షేర్ చేసిన బాబిల్
బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ స్విమ్మింగ్ చేస్తున్న వీడియోను ఆయన కుమారుడు బాబిల్ మంగళవారం సోషల్ మీడియాలో షేర్ చేశాడు. గత వారం ఆయన క్యాన్సర్‌తో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఇర్ఫాన్ పెద్ద కుమారుడు బాబిల్ తండ్రి జ్ఞపకాలను అభిమానులతో పంచుకుంటున్నాడు. తాజాగా ఇర్ఫాన్ ఐస్ కోల్డ్ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తున్న వీడియోను అభిమానులకు కోసం షేర్ చేశాడు. స్విమ్మింగ్ చేయడానికి నీళ్లలోకి దూకిన ఇర్ఫాన్ ఈ నీళ్లు చాలా చల్లగా ఉన్నాయని చెప్తున్న ఈ వీడియోను బాబిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇక వీడియోకు నటుడు అనూప్ సోనీ, ఇషాన్ ఖత్తర్లు హర్ట్ ఎమోజీతో తమ స్పందనను తెలిపారు. (థాంక్యూ: ఉద్వేగానికి లోనైన ఇర్ఫాన్ కుమారుడు) View this post on Instagram A post shared by Babil Khan (@babil.i.k) on May 5, 2020 at 12:24am PDT అంతేగాక ఇర్ఫాన్‌తో డిస్కవరి ఆఫ్ ఇండియాలో కలిసి నటించిన విపిన్ శర్మ ‘‘ఇర్ఫాన్‌కు స్విమ్మింగ్ అంటే ఇష్టం. డిస్కవరి ఆఫ్ ఇండియా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆ షూటింగ్ స్పాట్ పక్కనే ఒక చిన్న సరస్సు ఉంది. ఇక ఇర్పాన్ ఆ సరస్సులో స్విమ్మిగ్ చేయడానకి తెగ ఆసక్తిని చూపాడు. షూటింగ్ ఆయ్యాక ఆయన ఆ సరస్సులో ఈత కోడుతుంటే నేను బయట ఒడ్డు మీద కుర్చుని ఆయనతో కబుర్లు చెప్పాను’’ అంటూ కామెంట్లో రాసుకొచ్చాడు. చల్లని నీళ్లలో కూడా స్విమ్మింగ్‌ను ఎంజాయ్ చేస్తున్న ఇర్ఫాన్ వీడియోకు నెటిజన్లు ‘బాబిల్ ఆయన ఎప్పుడూ నీతో, మీ కుటుంబంతోనే ఉన్నారు. అలాగే మా అందరితో కూడ ఉంటారు. ధైర్యంగా ఉండు, మీ అమ్మని, తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆయన జ్ఞాపకాలను పంచుకున్నందుకు బాబిల్‌కు అభిమానులు ధన్యవాదాలు తెలుపుతున్నారు. (నా భర్త నాతోనే ఉన్నాడు: ఇర్ఫాన్ భార్య) -
ఆయన బతికే ఉంటారు: మీరా నాయర్
‘‘ఇర్ఫాన్ ఖాన్ ఎల్లప్పుడూ సజీవంగానే ఉంటారు. స్నేహం, ప్రేమ రూపంలో బతికే ఉంటారు. వీధి బాలల ఆలోచనల్లో ఆయన ఉంటారు. కాబట్టి ఆయనను గతం అని సంబోధించలేను’’ అంటూ దర్శకురాలు మీరా నాయర్ ఇర్ఫాన్ ఖాన్ గురించి ఉద్వేగ పూరిత వ్యాఖ్యలు చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో హోం టూ హోం ఫండరైజర్ కార్యక్రమం.. ‘‘ఐ ఫర్ ఇండియా’’ ఫేస్బుక్ లైవ్‌లో ఆదివారం ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా... ఇర్ఫాన్ ఖాన్‌కు నివాళులు అర్పించారు. విలక్షణ నటుడిగా పేరొందిన ఇర్ఫాన్ తొలి సినిమా సలాం బాంబేకు మీరా నాయర్ దర్శకురాలన్న సంగతి తెలిసిందే.(దేశ ప్రతిష్టను పెంచిన నటుడు.. పోరాడి ఓడిపోయాడు) ఈ క్రమంలో కెరీర్ తొలినాళ్ల నుంచే అతడు వైవిధ్యమైన పాత్రలను ఎంచుకునే వాడని మీరా తెలిపారు. నిజాయితీకి మారుపేరుగా నిలిచిన ఇర్ఫాన్ ఇప్పుడు ఈ లోకాన్ని వీడినా.. అతడి స్ఫూర్తితో నటులు ముందుకు సాగాలన్నారు. ‘‘ఉపఖండంలో ఎంతో మంది నటులపై నీ ప్రభావం ఉంది. నిన్ను చూసి ఈ రంగంలోకి అడుగుపెట్టిన వారిలో నీ స్ఫూర్తి రగిల్చిన జ్వాల ఆరిపోలేదు. సినీ పరిశ్రమకు నువ్వు చేసిన సేవ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి అని నీకు తెలుసు. నువ్విచ్చిన వారసత్వాన్ని ఇక్కడున్న వాళ్లు కొనసాగిస్తారు. నిన్ను చాలా మిస్సవుతున్నాం’’ అని మీరా నాయర్ ఇర్ఫాన్ ఖాన్‌పై అభిమానాన్ని చాటుకున్నారు. కాగా కొంతకాలంగా కాన్సర్‌తో బాధపడుతున్న ఇర్ఫాన్ ఖాన్ గత బుధవారం ముంబైలోని ఓ ఆస్పత్రిలో కన్నుమూసిన విషయం విదితమే.(ఇర్ఫాన్ భార్య సుతప భావోద్వేగ పోస్టు) -
బాలీవుడ్ విషాదం: నటుడి తండ్రి కన్నుమూత
‘‘మళ్లీ మనం కలుసుకునేంత వరకు.. ప్రశాంతంగా ఉండండి నాన్న’’అంటూ ప్రముఖ సింగర్, నటుడు అర్జున్ కనుంగో భావోద్వేగానికి లోనయ్యాడు. బాల్యంలో తండ్రితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసి.. ఆయనను మిస్సవుతున్నట్లు పేర్కొన్నాడు. కాగా గత కొంతకాలంగా కాన్సర్‌తో పోరాడుతున్న అర్జున్ తండ్రి బుధవారం రాత్రి కన్నుమూశారు. బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణించిన కొన్ని గంటల తర్వాత ఈ విషాదకర వార్త బయటకు వచ్చింది. ఈ క్రమంలో అనేక మంది సినీ ప్రముఖులు అర్జున్ కుటుంబానికి సంతాపం ప్రకటిస్తూ.. విషాద సమయాల్లో మరింత ధైర్యంగా నిలబడాలంటూ సోషల్ మీడియా వేదికగా అతడిని ఓదార్చారు. గాయకులు దర్శన్ రావల్, జోనితా గాంధీ, విశాల్ మిశ్రా ఈ మేరకు ట్వీట్లు చేశారు. (కుల్మీత్ మక్కర్ మృతి; విద్యాబాలన్ దిగ్ర్బాంతి) కాగా బాకీ బాతే పీనే బాద్, ఆయా నా తూ అండ్ హోనా చైదా వంటి పాటలతో 29 ఏళ్ల అర్జున్ తనకంటూ అభిమానులను సంపాదించుకున్నాడు. న్యూయార్క్‌లోని లీ స్ట్రాబెర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో నటన నేర్చుకున్న అర్జున్.. సల్మాన్ ఖాన్ రాధే సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ విషయం గురించి గతంలో ఓ మీడియాతో మాట్లాడిన ఈ యువ నటుడు.. సల్మాన్ వంటి మోగాస్టార్లతో కలిసి నటించడం ద్వారా తన కల నిజమైందని హర్షం వ్యక్తం చేశాడు. రాధే మూవీలో ఆఫర్ వచ్చిన నాటి నుంచి కొన్ని రాత్రుల పాటు ఆనందంతో నిద్ర కూడా పట్టలేదని చెప్పుకొచ్చాడు. కాగా ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ సినిమా 2020 వేసవికి విడుదల కావాల్సి ఉంది. ఇక ప్రస్తుతం కరోనా లాక్డౌన్ నేపథ్యంలో రాధే థియేటర్లలోకి ఎప్పుడు వస్తాడో తెలియని పరిస్థితి ఏర్పడింది. (దేశ ప్రతిష్టను పెంచిన నటుడు.. పోరాడి ఓడిపోయాడు) -
వారిద్దరిని మిస్సవుతున్నాం: అమెరికా దౌత్యవేత్త
వాషింగ్టన్: బాలీవుడ్ దిగ్గజ నటులు రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్ మరణం పట్ల అమెరికా దక్షిణ-మధ్య ఆసియా వ్యవహారాల తాత్కాలిక సహాయక కార్యదర్శి అలైస్ వెల్స్ సంతాపం ప్రకటించారు. వీరిద్దరు భారతీయులతో పాటు ప్రపంచ సినీ ప్రేమికులను తమ నటనతో కట్టపడేశారని.. వారిని మిస్సవుతున్నామని విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు... ‘‘ఈ వారంలో ఇద్దరు బాలీవుడ్ లెజెండ్స్ ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ ఈ లోకాన్ని విడిచి వెళ్లారనే వార్త నన్ను బాధకు గురిచేసింది. తన నటనా కౌశల్యంతో అమెరికా, ఇండియాతో పాటు ప్రపంచంలోని ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు వీరిద్దరు. నిజంగా వారులేని లోటు తీర్చలేనిది’’ అని ఆమె తన అధికారిక ఖాతాలో ట్వీట్ చేశారు. (నా జీవితంలోకి ప్రేమను తెచ్చారు: అలియా భావోద్వేగం) కాగా గత రెండేళ్లుగా కాన్సర్‌తో పోరాడిన ఇర్ఫాన్ ఖాన్(53) బుధవారం ముంబైలో కన్నుమూసిన విషయం విదితమే. ఆ మరుసటి రోజే.. కాన్సర్ నుంచి కోలుకున్న రిషి కపూర్(67) శ్వాసకోశ సంబంధిత వ్యాధితో ముంబైలోని ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు దిగ్గజాలు శాశ్వత నిద్రలోకి జారిపోవడంతో సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ క్రమంలో చిత్ర, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో కడచూపునకు నోచుకోలేక పోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇర్ఫాన్ ఖాన్ లైఫ్ ఆఫ్ పై, స్లమ్‌డాడ్ మిలియనీర్ వంటి ప్రముఖ హాలీవుడ్ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. (రిషీ కపూర్ అనే నేను..) దేశ ప్రతిష్టను పెంచిన నటుడు.. పోరాడి ఓడిపోయాడు Very saddened to hear of the passing two Bollywood legends this week, Irrfan Khan @irrfank and Rishi Kapoor @chintskap. Both actors stole the hearts of audiences in America, India, and around the world and will be truly missed. AGW — State_SCA (@State_SCA) May 1, 2020 -
నా భర్త నాతోనే ఉన్నాడు: ఇర్ఫాన్ భార్య
బాలీవుడ్ లెజెండరి నటుడు ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్‌తో బుధవారం తుది శ్వాస విడిచారు. కాగా ఆయన భార్య సుతప సిక్దర్ సోషల్ మీడియాలో తన భర్తతో దిగిన ఫొటోను గురువారం షేర్ చేస్తూ.. భావోద్యేగానికి లోనయ్యారు. అంతేకాదు సోషల్ మీడియాలోని తన ఖాతాలన్నింటికీ ప్రొఫైల్ ఫొటోగా పెట్టుకున్న ఈ ఫొటోలో సుతప తన భర్త ఇర్ఫాన్ పక్కనే కూర్చుని ఆయన భుజాన్ని తన చేతులతో చుట్టేసుకుని కనిపిస్తుంది. (ఉద్వేగానికి లోనైన ఇర్ఫాన్ కుమారుడు) తన భర్త లోకాన్ని విడిచినప్పటికీ తనతోనే ఉన్నాడంటూ ఉద్వేగంతో షేర్ చేసిన ఈ పోస్టుకు ‘నేను కోల్పోలేదు.. అన్ని విధాలుగా కలిగి ఉన్నాను’ అనే క్యాప్షన్‌ను జత చేసి పోస్టు చేశారు. ఆమె షేర్ చేసిన ఈ ఫొటో ప్రతి ఒక్కరి హృదయాన్ని హత్తుకుంటోంది. సుతప ఆత్మస్థైర్యాన్ని ప్రశంసిస్తూ నెటిజన్లు ఆమెకు మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు. క్యాన్సర్‌తో ఇర్ఫాన్ ముంబైలోని కోకిలాబెన్ దీరుభాయి అంబాని ఆస్పత్రిలో బుధవారం కన్నుమూశారు. ఈ విలక్షణ నటుడి మరణానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించగా... బాలీవుడ్ ఓ గొప్ప నటుడి కోల్పోయిందంటూ సోషల్ మీడియాలో నెటిజన్ల భావోద్యేగంతో సంతాపం వ్యక్తం చేశారు. (మరణంపై ఇర్ఫాన్ ఖాన్ భావోద్వేగ మాటలు!) -
తెలివి తక్కువ ఇర్ఫాన్ ఎవరా? అనుకున్నాను
బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఇక లేరన్న విషయాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటు బాలీవుడ్ నటులు సైతం అతనితో గల సాన్నిహిత్యపు మధురానుభూతులను నెమరేసుకుంటున్నారు. తాజాగా నటుడు, దర్శకుడు అయిన బాబీ పర్వేజ్ శాన్ అలాంటి ఓ జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ గతంలోకి తొంగి చూశాడు. "సుమారు ఇరవై సంవత్సరాల క్రితం ముచ్చట ఇది. అప్పుడు నేను బొంబాయిలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాను. ఆ కాలంలో మొబైల్ ఫోన్లు అంటే చాలా ఖరీదైనవి, ఏ ఒకరిద్దరి దగ్గర మాత్రమే ఉండేవి. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ ఢిల్లీ నుంచి వందల సంఖ్యలో నటీనటులు అక్కడికి వచ్చేవారు. వందలాది మంది తమ ఫొటోల వెనక ఓ ఫోన్ నంబర్, పేరు రాసి ఇచ్చేవారు. (పోరాడి పోరాడి మరణించాడు) ఎనీ టైమ్ రెడీగా.... ఆశ్చర్యం ఏంటంటే ఆ వందలాది మంది రాసిన పేర్లు, ఫోన్ నెంబర్ ఒకే ఒక్కరివి. అతడే ఇర్ఫాన్ ఖాన్ లేదంటే కొన్నిసార్లు అతడి భార్య సుతాపా పేరు ఉండేది. ఎవరైనా నటీనటులను ఎంపిక చేసుకుంటే వారిచ్చిన నంబర్ ఆధారంగా ఇర్ఫాన్కే కాల్ వెళుతుంది. అతను శ్రద్ధగా విని ఏ ఆఫీసు నుంచి కాల్ చేస్తున్నారో తెలుసుకుని, ఎంతో ఓపికతో సంబంధిత వ్యక్తులకు సమాచారం చేరవేసేవాడు. ఒకవేళ నేను వేళ కాని వేళలో ఫోన్ చేసినా అతను ఏమాత్రం విసుగు చెందకుండా అన్ని వివరాలు అడిగి తెలుసుకునేవారు. సెల్ఫోన్లు అందరికీ అందుబాటులోకి వచ్చేవరకు వాళ్ల కోసం అతను కష్టపడుతూనే ఉన్నాడు. ఇలా అందరి గురించి ఫోన్లు మాట్లాడుతూ కూర్చునే తెలివితక్కువ ఇర్ఫాన్ ఎవరు? అని నేననుకున్నాను. కానీ అతను ప్రతి విషయాన్ని నటీనటులకు చేరవేసేవాడు. ఇది కొన్ని సంవత్సరాలపాటు కొనసాగింద"ని బాబీ చెప్పుకొచ్చాడు. (ఇర్ఫాన్‌ఖాన్ మృతి పట్ల సినీ ఇండస్ట్రీ నివాళి) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
24 గంటల్లోనే ఇలా జరిగితే ఎలా.. ?
ముంబై : 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు దిగ్గజ నటులు ఈ లోకాన్ని వీడటం.. బాలీవుడ్‌నే కాకుండా యావత్తు భారత చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. నిన్న ఇర్ఫాన్ ఖాన్, నేడు రిషీకపూర్ కన్నుమూయడంతో సినీ అభిమానులు సైతం కంటతడి పెడుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో వారి కడచూపు కూడా చూసుకోలేకపోతున్నామని ఆప్తులు, అభిమానులు ఆవేదన చెందుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిమాన నటులకు నివాళులర్పిస్తున్నారు. ఈ వార్తలు నమ్మలేకుండా ఉన్నాయని.. వీరి మరణం సినీ పరిశ్రమకు తీరనిలోటని పేర్కొంటున్నారు. ► రిషీకపూర్ చనిపోయారు. ఆయన మరణం నన్ను కుంగిపోయేలా చేసింది.- అమితాబ్ బచ్చన్ ► రిషీకపూర్ మరణం తీరని లోటు. గొప్ప స్నేహితుడు, గొప్ప ఆర్టిస్ట్.. అలాగే ఎన్నో లక్షల మంది హృదయ స్పందన. ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆర్ఐపీ రిషికపూర్- చిరంజీవి ► ఒకదాని తర్వాత మరో విషాదం.రిషీకపూర్ జీ మరణం తీవ్రంగా కలిచివేసింది. రాజు చాచా(2000)తో మా ఇద్దరి ప్రయాణం బంధం మొదలైంది.. అప్పటి నుంచి అది కొనసాగుతూనే ఉంది. నీతూజీ, రణ్‌బీర్, రిధిమాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను-అజయ్ దేవగన్ ► పరిస్థితులు చూస్తుంటే మనం పీడకల మధ్యలో ఉన్నట్టు ఉంది. ఇప్పుడే రిషీకపూర్ లేరనే హృదయాన్ని కలిచివేసే వార్త విన్నాను. ఆయన ఒక లెజెండ్, గొప్ప సహచర నటుడు, మా కుటుంబానికి మంచి స్నేహితుడు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి- అక్షయ్ కుమార్ ► నిన్న అత్యతం ట్యాలెంట్ కలిగిన ఇర్ఫాన్ ఖాన్‌ను, నేడు లెజండరీ రిషీకపూర్ సాబ్‌ను కోల్పోవడం హార్ట్ బ్రేకింగ్ ఉంది. ఇది భారత చిత్ర పరిశ్రమకు తీరని లోటు- జూనియర్ ఎన్టీఆర్ ► ఓ మై గాడ్.. ఇది జరిగి ఉండాల్సి కాదు. రిషీకపూర్ సార్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. 24 గంటల్లో ఇద్దరు దిగ్గజాలను కోల్పోవడం ఎలా ఉంటుంది?.. ఇది తీరని నష్టం- కాజల్ అగర్వాల్ ► నిన్న ఇర్ఫాన్ ఖాన్, నేడు రిషీకపూర్ మరణించడం షాక్‌కు గురిచేసింది.ఈ ఏడాది, ఈ వారం ఎంత భయాంకరమైనది?. వారిద్దరు వారి చిత్రాలతో ఎప్పటికీ గుర్తిండిపోతారు - కేటీఆర్ ► రిషీకపూర్ జీ ఇక లేరనే వార్త గుండెను కలిచివేసింది. ఇండియన్ సినిమాకు చెందిన మరో గొప్ప వ్యక్తి నేడు మనల్ని విడిచి వెళ్లిపోయారు. కపూర్ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.- రామ్‌చరణ్ ► మరోకమైన అందమైన రెక్క రాలిపోయింది. ఆర్ఐపీ లెజెండ్ రిషీకపూర్ - సుధీర్ బాబు ► నేను ఈ వార్తను నమ్మలేకపోతున్నాను. ఈ వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. జరుగుతుంది చూస్తుంటే భయమేస్తోంది. ఇంతా త్వరగా మరో లెజెండ్ మనను విడిచిపోయారు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను- పూజా హెగ్డే ► రిషీకపూర్ మరణం నన్ను కలిచివేసింది. ఆర్ఐపీ.. మై డియరెస్ట్ ప్రెండ్- రజినీకాంత్ ► అతను నా బాల్యం- కరణ్ జోహర్ ► మాటలు రావడం లేదు.. ఆర్ఐపీ డియర్ లెజెండ్ రిషీకపూర్ జీ - క్రిష్ ► నిజంగా నమ్మలేకుండా ఉంది. నిన్న ఇర్ఫాన్ ఖాన్.. నేడు రిషీకపూర్ జీ. రిషి కపూర్ మరణవార్తను అంగీకరించడానికి మనసుకు కష్టంగా ఉంది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆర్ఐపీ- విరాట్ కోహ్లి ► ఇది చాలా విషాదం నింపింది. 24 గంట్లోనే ఇద్దరు దిగ్గజాలను కోల్పోవడం షాక్‌కు గురిచేసింది. సినీ పరిశ్రమకు ఇది తీరని లోటు. వారి సినిమాల ద్వారా వారు జీవించే ఉంటారు- నందమూరి కల్యాణ్‌రామ్ ► రిషీకపూర్ మరణం తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది- రాధిక శరత్‌కుమార్ చదవండి : ప్రముఖ నటుడు రిషీకపూర్ కన్నుమూత ఇర్ఫాన్‌ఖాన్ మృతి పట్ల సినీ ఇండస్ట్రీ నివాళి var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1361281962.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అప్పుడే అందరి దృష్టి ఇర్ఫాన్‌పై పడింది
‘‘ఒక గొప్ప కళాకారుడు కన్ను మూసినప్పుడు ప్రపంచంలో గొప్ప సినిమా చేయాలనుకునే అందరికీ అది లాసే. ఇర్ఫాన్ ఖాన్ లాంటి నటుడు ఇంత త్వరగా మనల్ని వదిలి వెళ్లిపోవడం షాకింగ్ గా ఉంది. మరెన్నో గొప్ప సినిమాలు, గొప్ప పెర్ఫార్మన్స్‌లు చూసే అవకాశాన్ని మనందరం కోల్పోయాం’’ అన్నారు దర్శకుడు గుణశేఖర్. ప్రపంచవ్యాప్తంగా కీర్తి పొందిన ఇర్ఫాన్ ఖాన్ యాక్ట్ చేసిన ఒకే ఒక్క తెలుగు సినిమా ‘సైనికుడు’. మహేష్ బాబు హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ‘పప్పు యాదవ్’ అనే విలన్ పాత్రలో నటించారాయన. ఇర్ఫాన్‌ని తెలుగు సినిమాలో నటింపజేసిన దర్శకుడు గుణశేఖర్‌తో ‘సాక్షి’ జరిపిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ. ► ఇర్ఫాన్ ఇక లేరనే వార్త వినగానే మీకు గుర్తొచ్చిన విషయాలు? గుణశేఖర్: క్వారంటైన్ సమయంలో పాత క్లాసిక్స్ దగ్గర నుంచి మంచి మంచి సినిమాలన్నీ మళ్లీ చూస్తూ, ఇర్ఫాన్ ఖాన్ కెరీర్ ప్రారంభంలో చేసిన ‘దృష్టి’ కూడా చూశాను. అప్పుడు పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. క్యాన్సర్ తో పోరాడి మళ్లీ మనందర్నీ తెరపై అలరిస్తారనుకున్నాను. ఇంతలో ఈ వార్త వినాల్సి వచ్చింది. నమ్మబుద్ధి కాలేదు. నమ్మాలనిపించలేదు. ‘సైనికుడు’ సినిమాలో మహేష్‌తో ఇర్ఫాన్ ► ఇర్ఫాన్ ఖాన్ని ‘సైనికుడు’ సినిమాలో నటింపజేయాలని ఎందుకు అనిపించింది? ఇర్ఫాన్ గొప్ప నటుడు అనే సంగతి అందరికీ తెలిసిందే. ‘దృష్టి’లో గజల్ సింగర్ గా చిన్న పాత్ర చేశారు. అందులో శేఖర్ కపూర్, డింపుల్ కపాడియా ముఖ్య పాత్రధారులు. ఇర్ఫాన్ ది చిన్న పాత్ర. కేవలం ఆ పాత్రతోనే దేశవ్యాప్తంగా తన మీద దృష్టి పడేలా చేసుకున్నారు. తర్వాత ‘సలాం బొంబాయి’ చేశారు. అది మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. బొంబాయిలో ఉన్న వీధి పిల్లలతో ఆ సినిమా చేశారు. అటు ఇటుగా అదే సమయంలో నేను చిన్నపిల్లలతో తీసిన ‘రామాయణం’ విడుదలయింది. ఆయన ఎక్కువ శాతం ఆఫ్ బీట్ సినిమాలు చేస్తుండేవారు. కమర్షియల్ సినిమాలు కూడా చేయాలని 2001 నుంచి ఆసక్తి చూపించారు. అదే సమయంలో సౌత్ నుంచి చాలా మంది ఆయన్ను ఇక్కడి సినిమాల్లో యాక్ట్ చేయించాలని ప్రయత్నించారు. మా సినిమాకు బావుంటారని మహేష్, నేను అనుకోవడంతో ఆయన్ను సంప్రదించాం. ఇర్ఫాన్ నన్ను కేవలం ‘ఒక్కడు’ సినిమా దర్శకుడిగా కాకుండా చిన్న పిల్లలతో ‘రామాయణం’ సినిమా చేసిన దర్శకుడిగా కూడా గుర్తు పెట్టుకున్నారు. అలా ఆయన మా సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ► ఆయనతో పని చేసిన రోజుల గురించి? ఆఫ్ బీట్ సినిమాలు చేసేవాళ్లు ఎక్కువ శాతం నేషనల్ స్కూల్ ఆఫ్ ఢిల్లీ నుంచి వస్తారు. వాళ్లందరిలో సాధారణంగా కనిపించేది ఏంటంటే.. పాత్రను ఎక్కువగా స్టడీ చేయడం. అయితే ఇర్ఫాన్ ఆఫ్ బీట్ సినిమాలకు ఎంత ఎఫర్ట్ పెట్టేవారో కమర్షియల్ సినిమాలకూ అంతే శ్రమించేవారు. అది నన్ను ఆశ్చర్యపరిచింది. ‘సైనికుడు’లో ‘పప్పు యాదవ్’ పాత్ర చేశారు. భాష రాని నటులు ఉంటే షూటింగ్ సమయంలో చిన్నఇబ్బంది ఉంటుంది. డైలాగ్స్ సరిగ్గా చెప్పలేని సందర్భాలు ఉంటాయి. ఆ డైలాగ్ కాకుండా వేరే లైన్స్ పలుకుతుంటారు. కానీ ఇర్ఫాన్ గారు ‘మమ’ అనిపించేద్దాం అనుకునే ఆర్టిస్ట్ కాదు. తెలుగు నేర్చుకుని, ప్రతి డైలాగ్ అర్థం ఏంటి? ఎలా పలకాలి? అని తెలుసుకుని, నటించారు. ‘సైనికుడు’లో ప్రకాష్ రాజ్, కోటా శ్రీనివాస్ గారు, ఇర్ఫాన్ కాంబినేషన్ లో ఒక సన్నివేశం ఉంది. ఆ సీన్లో ఇర్ఫాన్ తన డైలాగ్స్ అన్నీ పర్ఫెక్ట్గా చెప్పడంతో కోటా గారు అభినందించారు. ► సినిమా గురించి మాత్రమే కాకుండా వ్యక్తిగత విషయాలేమైనా గుర్తు చేసుకుంటారా? ఆరోగ్య విషయంలో ఇర్ఫాన్ చాలా జాగ్రత్తగా ఉండేవారు. ‘ఏ.యం.సి’ కుక్ వేర్ లో నూనె వాడకుండా వంట చేయొచ్చు. మా ఆవిడ (రాగిణి గుణ) ఆ పాత్రలను వాడుతుండేవారు. ఆ విధానం ఆయనకు బాగా నచ్చింది. ఆ పాత్రల గురించి మా ఆవిడ దగ్గర తెలుసుకొని హైదరాబాద్ నుంచి సామాగ్రి కొనుక్కొని తీసుకుని వెళ్లారు. అదో మంచి జ్ఞాపకం. ఆయన చనిపోయిన వార్త విని మా ఆవిడ కూడా షాక్ అయ్యారు. ► చాలామంది సెలబ్రిటీలు ఇర్ఫాన్ చనిపోవడం పర్సనల్ లాస్లా ఉంది అంటున్నారు.. అది నిజమే. ఎన్నో గొప్ప సినిమాలు చేశారాయన. ఇంకా ఎన్నో సినిమాలు మనకు అందిస్తారు, గొప్ప కథలు చెబుతారు, అద్భుతమైన ఆర్ట్‌ని ప్రపంచానికి చూపిస్తారని ఊహించాం. ఇక అది జరగదనే విషయం ఎవరికీ నమ్మబుద్ధి కావడం లేదు. అందుకే పర్సనల్ లాస్ లా ఫీల్ అవుతున్నారు. ► ‘సైనికుడు’ చేస్తున్నప్పుడే ఆయనకు హాలీవుడ్ సినిమా ఆఫర్ కూడా వచ్చిందట కదా? అవును. అప్పుడే ఆయనకు తొలి హాలీవుడ్ సినిమా ‘మైటీ హార్ట్’ ఆఫర్ వచ్చింది. ఆ సినిమా షూటింగ్ షెడ్యూల్, మా డేట్స్ ఒకటే. దాంతో ఇర్ఫాన్ చాలా ప్రొఫెషనల్‌గా ‘ఒక హాలీవుడ్ సినిమా ఆఫర్ వచ్చింది. మన డేట్స్ ని మార్చడానికి వీలవుతుందా?’ అని అడిగారు. మహేష్ గారు, అశ్వనీ దత్ గారు, నేను మాట్లాడుకుని మొత్తం డేట్స్ అన్నీ మార్చేశాం. నెల రోజులు తర్వాత చేయాల్సిన షూటింగ్ ని ముందుకు మార్చి, 30 రోజుల పనిని 18 నుంచి 20 రోజుల్లో పూర్తి చేసి ఆయన్ను పంపించాం. ఆయన చాలా సంతోష పడ్డారు. హాలీవుడ్ ఆఫర్ అనేది ఆయనకు కొత్త ఇన్నింగ్స్. ఇర్ఫాన్ పొటెన్షియాల్టీకి తగ్గ కాన్వాస్ దొరికిందనుకున్నాను. ఆ తర్వాత ఆయనలా ఎవరికీ దొరకలేదు. హాలీవుడ్ హిట్ సినిమాలన్నిట్లో ఇర్ఫాన్ ఉండటం చాలా సాధారణం అయిపోయింది. మనందరం గర్వపడే స్థాయికి వెళ్లారాయన. -
ఇర్ఫాన్ మృతిపై స్పందించిన యువీ
ముంబై: విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణంపై టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. క్యాన్సర్‌తో ఇర్ఫాన్ చివరి వరకు పోరాడాడని, ఆ బాధ తనకు తెలుసునని యువీ అన్నాడు. ‘ఈ ప్రయాణం గురించి నాకు తెలుసు. నొప్పి గురించి తెలుసు. చివరి వరకు అతను పోరాడాడని నాకు తెలుసు. కొంతమంది అదృష్టం బాగుండి మనుగడ సాగిస్తారు. కొంత మంది ప్రయాణం ఎంతవరకు సాగుతుందో కచ్చితంగా చెప్పలేం. ఇర్ఫాన్ ఖాన్ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాల’ని యువరాజ్ సింగ్ ట్వీట్ చేశాడు. యువీ కూడా క్యాన్సర్ బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. అతడికి క్యాన్సర్ సోకినట్టు 2011 వన్డే వరల్డ్‌కప్ సమయంలో బయటపడింది. అయినప్పటికీ పట్టుదలతో ఆడిన యువీ.. టీమిండియాను 28 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రపంచ విజేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించాడు. ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ దక్కించుకుని అందరి మన్ననలు పొందాడు. (ఇర్ఫాన్ ప్రేమకథ; కాలేజీ నుంచి కడవరకు..) -
ఇర్ఫాన్, సుతాప అపూర్వ ప్రేమకథ
విలక్షణ నటనతో వెండితెరపై తనదైన ముద్ర వేసిన ఇర్ఫాన్ ఖాన్ శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ప్రపంచమంతా కరోనా మహమ్మారితో పోరాడున్న సమయంలో క్యాన్సర్ రక్కసి కోరలకు చిక్కి ఈ మహా నటుడు నిశ్శబ్దంగా నిష్క్రమించాడు. ప్రేమించి పెళ్లిచేసుకున్న సహచరిని, తన ఇద్దరు కుమారులను శోక సంద్రంలో ముంచి శాశ్వత సెలవు తీసుకున్నాడు. ముంబైలోని వెర్సోవా శ్మశాన వాటికలో బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఎటువంటి హడావుడి లేకుండా అంత్యక్రియలు ముగిశాయి. ఇర్ఫాన్ ఖాన్ తోడునీడగా ఉన్న అతడి భార్య సుతాప సిక్దర్ గురించి చాలా మందికి తెలియదు. ఆమె ఎప్పుడు అతడి పక్కనే ఉండేవారు. కానీ కెమెరా కంటికి చిక్కకుండా కాస్త ఎడంగా ఇర్ఫాన్ వెంట నడిచేవారు. ఇర్ఫాన్ గొప్ప నటుడిగా ఎదిగాడంటే అందులో మాటల రచయిత అయిన సుతాప పాత్ర కూడా ఉంది. గత ఫిబ్రవరిలోనే తమ వైవాహిక జీవిత రజోత్సవాన్ని జరుపుకుంది ఈ జంట. (మృత్యువుతో పోరాడి ఓడిన ఇర్ఫాన్) నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ఎస్డీ)లో వీరిద్దరి ప్రేమకు బీజం పడింది. సహ విద్యార్థులైన వీరిద్దరికీ సినిమా, కళలు అంటే ఎంతో ఇష్టం. వీటిపై లోతైన చర్చలు జరిపేవారు. కొన్నిసార్లు వాదులాడుకునే వారు. ఇద్దరి అభిరుచులు కలవడంతో కొన్నాళ్లకు ప్రేమ ప్రక్షులుగా మారిపోయారు. 1986లో దర్శకురాలు మీరా నాయర్ ‘సలాం బాంబే’ సినిమా కోసం ఇర్ఫాన్‌ను ఎంపిక చేయడం అతడి జీవితంలో కీలక మలుపు. అయితే ముందు వీధి బాలుడు సలీం పాత్రకు అతడిని ఎంపిక చేసిన మీరా నాయర్ తర్వాత మనసు మార్చుకుని టైపిస్ట్ పాత్ర ఇచ్చారు. ఆ సమయంలో ఇర్ఫాన్ నిరాశపడినా సుతాప అండగా నిలబడటంతో కుదుటపడ్డాడు. ఇర్ఫాన్, సుతాప్ ఫిబ్రవరి 23, 1995లో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాదితో వీరి వివాహ బంధానికి 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ రెండున్నర దశాబ్దాల కాలంలో వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. విశాల్ భరద్వాజ్ తెరకెక్కించిన మఖ్బూల్(2003), మీరా నాయర్ సినిమా ది నేమ్‌సేక్(2006) ముందు వరకు ఇర్ఫాన్‌కు పెద్దగా గుర్తింపు దక్కలేదు. అద్భుత నటనతో ఒక్కో మెట్టు ఎక్కుతూ అతడు అత్యుత్తమ నటుడిగా అందరి మన్ననలు పొందాడు. అటు సుతాప కూడా మాటల రచయితగా ఖమోషీ, శబ్ద్, కహాని వంటి సినిమాలకు పనిచేశారు. తర్వాత నిర్మాతగా మారి తన భర్తను హీరోగా పెట్టి మదారి(2016), ఖరీబ్ ఖరీబ్ సింగిల్(2017) సినిమాలు నిర్మించారు. 2018లో క్యాన్సర్ బారినప్పుడు ఇర్ఫాన్ జీవితంలో మరోసారి కల్లోలం రేగింది. చికిత్స కోసం అతడు లండన్ వెళ్లినప్పుడు కుటుంబం అండగా నిలిచింది. తన భర్త పోరాట యోధుడని ప్రతి అడ్డంకిని విపరీతమైన దయ, అందంతో పోరాడుతున్నాడని ఆ సమయంలో సుతాప తన ఫేస్బుక్ పేజీలో రాసుకొచ్చారు. ఏడాది తర్వాత క్యాన్సర్ నుంచి కోలుకుని వచ్చిన ఇర్ఫాన్ ‘అంగ్రేజీ మీడియం’ సినిమాతో అందరినీ అలరించాడు. ఈ సినిమా ప్రమోషన్లో తొలిసారిగా తన భార్యా పిల్లల గురించి ఇర్ఫాన్ బహిరంగంగా మాట్లాడాడు. ‘నేను జీవించాలి అనుకుంటే అది కేవలం నా భార్య కోసమే. నేను ఇంకా బతికి ఉండటానికి ఆమె కారణం’ అంటూ భార్యపై తనకున్న ప్రేమను వ్యక్త పరిచాడు. ఇద్దరు కొడుకులు బాబిల్, అయాన్ కూడా తనకు ఎంతో అండగా నిలిచారని పుత్సోత్సాహం ప్రదర్శించాడు. మార్చి 20న ‘అంగ్రేజీ మీడియం’ సినిమా విడుదలైంది. ఈ సినిమా ఇర్ఫాన్ ఆఖరి చిత్రం అవుతుందని ఎవరూ ఊహించలేదు. అందరూ అంటున్నట్టుగా భౌతికంగా ఇర్ఫాన్ లేకపోయిపోయినప్పటికీ వెండితెరపై అతడు ప్రాణం పోసిన పాత్రలతో కళ్లముందు మెదులుతూనే ఉంటాడు! (ఇంత తొందరగా వెళ్లిపోతారనుకోలేదు) -
మరణంపై ఇర్ఫాన్ ఖాన్ భావోద్వేగ మాటలు!
బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ రెండేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడి బుధవారం కన్నుముశారు. కాగా ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ నాయకులు, బాలీవుడ్ ప్రముఖులు దిగ్ర్బాంతి వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక ఆయన అభిమానులు కూడా సోషల్ మీడియాలో సంతాపం తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఆయన నటించిన హాలీవుడ్ చిత్రం ‘లైప్ ఆఫ్ పై’లో పుట్టుక, మరణాలపై మాట్లాడిన సన్నివేశాన్ని ట్వీట్ చేస్తూ ఆయనకు నివాళులు ఆర్పిస్తున్నారు.(ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత) ‘మరణం మన జీవితాన్ని ముగిస్తుందని నేను ఏప్పడు అనుకుంటాను. అయితే బాధకరమైన విషయం ఎంటంటే కనీసం వీడ్కోలు చేప్పెటప్పుడు అది ఒక్క క్షణం కూడా తీసుకోదు’ అని చెప్పిన సన్నివేశానికి ‘‘మీమ్మల్ని మిస్ అవుతున్నాము సార్.. వీ లవ్ యూ’’ అనే క్యాప్షన్‌తో ఓ అభిమాని ట్వీట్ చేశాడు. ‘‘ఆయన సినిమాలో చెప్పిన ఈ మాటలు దురదృష్టవశాత్తు ఈ రోజు సరిగ్గా సరిపోతాయి’’ ‘‘ఇన్ని రోజులు పోరాటం చేశారు.. ఇప్పుడు ఆయన ఆత్మ ప్రశాంతంగా ఉందని ఆశిస్తున్నాం’’ అంటూ నెటిజన్లు భావోద్యేగంతో కామెంట్లు పెడుతున్నారు. కాగా హాలీవుడ్ డైరెక్టర్ అంగ్ లీ తెరకెక్కించిన ‘లైఫ్ ఆఫ్ పై’ లో ఇర్ఫాన్‌తో పాటు హీరోయిన్ టబు, సూరజ్ శర్మ నటించారు. ఈ చిత్రం నాలుగు ఆస్కార్ ఆవార్డులను అందుకోగా.. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 600 మిలియన్ డాలర్లకుపైగా వసూళ్లను సాధించింది. (ఆయన మరణాన్ని నమ్మలేకపోతున్నాం) Scene from "LIFE OF PI" "I suppose in the end, the whole of life becomes an act of letting go, but what always hurts the most is not taking a moment to say goodbye" We love and will miss you #IrrfanKhan. #ripirfankhan 🙏💔 pic.twitter.com/BFz0kRGhis — Devil V!SHAL (@VishalRC007) April 29, 2020 -
ఇర్ఫాన్ కాల్ కోసం ఎదురు చూస్తా
సాక్షి, జైపూర్ : ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణంపై ఆయన చిన్ననాటి స్నేహితుడు భరత్ పూర్ (రాజస్థాన్) ఎస్పీ హైదర్ అలీ జైదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. తన స్నేహితుడు ఇర్ఫాన్ ఖాన్ ఇక లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన చెందారు. ఇర్ఫాన్ గొప్ప మనిషి అని వ్యాఖ్యానించిన ఆయన ఏ క్షణమైనా అతడినుంచి ఫోన్ వస్తుందని ఇప్పటికీ ఎదురు చూస్తున్నానంటూ కంటతడి పెట్టారు. ఇంతటి విషాదాన్ని తట్టుకునే ధైర్యం ఆ కుటుంబానికి కలగాలని ప్రార్థించారు. ఇర్ఫాన్ కుటుంబానికి సన్నిహితంగా మెలిగిన జైదీ ఈ సందర్భంగా ఇర్ఫాన్ జీవితానికి సంబంధించి ఒక విషయాన్ని పంచుకున్నారు. ఇర్ఫాన్ ఉపాధ్యాయుడు కావాలని ఆమె తల్లి కోరుకున్నారని జైదీ గుర్తు చేసుకున్నారు. (ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత) క్యాన్సర్ బారిన పడిన ఇర్ఫాన్ ఖాన్ లండన్ లో కొంతకాలం చికిత్స పొందారు. ఇటీవలే భారత్‌కు తిరిగి వచ్చిన ఇర్ఫాన్ తీవ్ర అనారోగ్యంతో బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో యావత్ సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి లోనైంది. కాగా గత వారం, ఇర్ఫాన్ ఖాన్ తల్లి సయీదా బేగం (95) జైపూర్‌లో కన్నుమూశారు. అయితే లాక్ డౌన్ కారణంగా తల్లి అంత్యక్రియలకు ఇర్ఫాన్ వెళ్లలేకపోయారు. Irrfan Khan's friend, Haider Ali Zaidi, the SP of Bharatpur, shares a video after coming to know of his death pic.twitter.com/IsZhRVAWEq — Jayadev (@jayadevcalamur) April 29, 2020 -
ఆయన మరణాన్ని నమ్మలేకపోతున్నాం
న్యూఢిల్లీ: విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ హఠాన్మరణం పట్ల దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. తనకు ఎంతో ఇష్టమైన నటుల్లో ఒకరైన ఇర్ఫాన్ ఖాన్ ఇంత త్వరగా కన్నుమూయడం బాధ కలిగించిందని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ పేర్కొన్నారు. ఆయన నటన చిరస్మరణీయమని అన్నారు. ఇర్ఫాన్ కుటుంబానికి సంతాపం తెలిపారు. ఇర్ఫాన్ ఖాన్ అసాధారణ నటుడని, ఆయనకు మరణం లేదని టీమిండియా బౌలర్ మహ్మద్ షమి ట్వీట్ చేశాడు. చనిపోయే వరకు అద్భుతమైన తన నటనతో అందరినీ అలరించారని గుర్తు చేసుకున్నాడు. మన కాలపు అత్యుత్తమ నటులలో ఒకరైన ఇర్ఫాన్ ఖాన్ మరణం గురించి భయంకర వార్త విన్నందుకు బాధగా ఉందని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ అన్నారు. ఈ కష్ట సమయంలో ఇర్ఫాన్ ఖాన్ కుటుంబానికి భగవంతుడు తట్టుకునే శక్తిని ఇవ్వాలని ప్రార్థించారు. ఇర్ఫాన్ ఖాన్‌ను ఇంత తొందరగా కోల్పోతామని అనుకోలేదని, ఆయన మరణాన్ని నమ్మలేకపోతున్నామని నటి రవీనా టాండన్ పేర్కొన్నారు. ప్రతిభావంతుడైన సహ నటుడిని మరణం బాధించిందన్నారు. దేశం గొప్ప నటుడిని కోల్పోయిందని అకాలీదళ్ నాయకుడు, ఢిల్లీ గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు మజీందర్ సిర్సా పేర్కొన్నారు. ‘భారత్ అద్భుతమైన ప్రతిభ కలిగిన నటుడిని, మంచి మనిషిని కోల్పోయింది. దేవుడు ఆయన ఆత్మకు శాంతి కలిగించాల’ని ఆయన ట్వీట్ చేశారు. ఇర్ఫాన్ మరణం.. మహేశ్ సంతాపం -
ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత
ముంబై : బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ (54) ఇకలేరు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. బుధవారం ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో పోరాటం చేస్తున్న ఈ నటుడు కొన్నాళ్లు లండన్‌లో చికిత్స కూడా తీసుకున్నాడు. ఈ మధ్యే భారత్‌కు తిరిగి వచ్చిన ఆయన ఆంగ్రేజీ మీడియం సినిమాలో నటించారు. మంగళవారం ఇర్ఫాన్ మరోసారి అనారోగ్యానికి గురికావడంతో ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. (చదవండి : క్యాన్సర్ కదా... అందుకే: నటుడి భావోద్వేగం!) ఈ నెల 25న ఇర్ఫాన్ ఖాన్ తల్లి సైదా బేగం మృతి చెందిన విషయం తెలిసిందే. లాక్డౌన్ కారణంగా కన్నతల్లిని కడసారి చూపులకు నోచుకోలేకపోయాడు. ఇక తన తల్లి అంత్యక్రియలను అతను వీడియో మాధ్యమం ద్వారా వీక్షించి ఎంతో తల్లడిల్లిపోయాడు. కన్నతల్లి మరణించిన నాలుగైదు రోజులకే ఇర్ఫాన్ మృతి చెందండం బాలీవుడ్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకుంది. (చదవండి : వీడియో కాన్ఫరెన్స్‌లో తల్లికి నివాళులర్పించిన నటుడు) కాగా, జనవరి 7, 1967న జన్మించిన ఇర్ఫాన్ ఖాన్, హిందీతో పాటు హాలీవుడ్, దక్షిణాది చిత్రాల్లోనూ నటించారు. స్లమ్‌డాగ్ మిలియనీర్, ఎ మైటీ హార్ట్, జురాసిక్ వరల్డ్, లైఫ్ ఆఫ్ పై వంటి హాలీవుడ్ ఉత్తమ చిత్రాల్లోనూ నటించి మంచి పేరును సంపాదించారు. చిత్ర రంగంలో ఆయన చేసిన కృషికి ప్రతిఫలంగా భారత ప్రభుత్వం 2011లో పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది. 'పాన్ సింగ్ తోమర్' సినిమాకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న ఇర్ఫాన్, చివరిగా 'అంగ్రేజీ మీడియం' అనే సినిమాలో నటించాడు. ఈయన మొదటి సినిమా ‘సలామ్ బాంబే’. తెలుగులో కూడా ఈయన మహేష్ బాబు హీరోగా నటించిన సైనికుడు సినిమాలో నటించారు. ఇర్ఫాన్‌కు భార్య సుతాపా సిక్దార్, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
మృత్యువుతో పోరాడి ఓడిన ఇర్ఫాన్
ముంబై: తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృత్యువుతో పోరాడి శాశ్వతంగా విశ్రాంతి తీసుకున్నారు. పెద్దపేగు సంబంధిత వ్యాధికి ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించారు. ఇర్ఫాన్ మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు, పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, ఇర్ఫాన్ కుటుంబానికి సంతాపం తెలిపారు. ఆయన చివరిగా ‘అంగ్రేజీ మీడియం’ లో ముఖ్యపాత్రలో నటించారు. ప్రారంభంలో బుల్లితెరపై పేరు తెచ్చుకున్న ఇర్ఫాన్ ‘సలామ్ బాంబే’ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే ‘పాన్ సింగ్ తోమర్’ చిత్రానికి ఉత్తమ నటుడుగా ఆయన జాతీయ అవార్డు అందుకున్నారు. (ముంబై ఆసుపత్రిలో చేరిన నటుడు ఇర్ఫాన్) కేవలం నా భార్య కోసమే.. కాగా ఇర్ఫాన్‌ఖాన్ తల్లి సైదా బేగం శనివారం మృతి చెందారు. అటు లాక్‌డౌన్‌తోపాటు ఇటు ఆయన ఆరోగ్యం కూడా బాగోలేకపోవడంతో వీడియో కాన్ఫరెన్స్‌లోనే తల్లిని కడసారి చూసుకున్నారు. విలక్షణ నటుడుగా పేరుగాంచిన ఇర్ఫాన్... బాలీవుడ్లో తనకంటు ఓ స్థానాన్ని సంపాదించుకున్నారు. గత రెండేళ్లుగా ఆయన క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. అనంతరం ముంబై వచ్చిన ఇర్ఫాన్... ‘జీవితం అనేది రోలర్ క్యాస్టర్ రైడ్ వంటిది. మధురమైన అనుభూతులతోపాటు చేదు అనుభవాలు కూడా ఉంటాయి. సంతోషకరమైన క్షణాలను మాత్రమే గుర్తుంచుకోవాలి. మేము కొన్ని బాధలను అనుభవించాం.. అంతకంటే ఎక్కువ ఆనందంగా గడిపాం. నేను విపరీతమైన ఆందోళనకు గురయ్యాను.. కానీ దానిని ప్రస్తుతం నియంత్రించగలిగాను. నా కొడుకులతో గొప్ప సమయం గడిపాను. నేను జీవించాలి అనుకుంటే కేవలం నా భార్య కోసం జీవించాలనుకుంటున్నాను. నేను ఇంకా బతికి ఉండటానికి ఆమె కారణం’ అంటూ తెలిపారు. (వీడియో కాన్ఫరెన్స్‌లో తల్లికి నివాళులర్పించిన నటుడు)