24 గంటల్లోనే ఇలా జరిగితే ఎలా.. ? | Celebrities Condolences To Rishi Kapoor Demise | Sakshi
Sakshi News home page

24 గంటల్లోనే ఇలా జరిగితే ఎలా.. ?

Apr 30 2020 11:10 AM | Updated on Apr 30 2020 1:56 PM

Celebrities Condolences To Rishi Kapoor Demise - Sakshi

ముంబై : 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు దిగ్గజ నటులు ఈ లోకాన్ని వీడటం.. బాలీవుడ్‌నే కాకుండా యావత్తు భారత చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. నిన్న ఇర్ఫాన్‌ ఖాన్‌, నేడు రిషీకపూర్‌ కన్నుమూయడంతో సినీ అభిమానులు సైతం కంటతడి పెడుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో వారి కడచూపు  కూడా చూసుకోలేకపోతున్నామని ఆప్తులు, అభిమానులు ఆవేదన చెందుతున్నారు. సోషల్‌ మీడియా వేదికగా తమ అభిమాన నటులకు నివాళులర్పిస్తున్నారు. ఈ వార్తలు నమ్మలేకుండా ఉన్నాయని.. వీరి మరణం సినీ పరిశ్రమకు తీరనిలోటని పేర్కొంటున్నారు.

రిషీకపూర్‌ చనిపోయారు. ఆయన మరణం నన్ను కుంగిపోయేలా చేసింది.- అమితాబ్‌ బచ్చన్‌

రిషీకపూర్‌ మరణం తీరని లోటు. గొప్ప స్నేహితుడు, గొప్ప ఆర్టిస్ట్‌.. అలాగే ఎన్నో లక్షల మంది హృదయ స్పందన. ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆర్‌ఐపీ రిషికపూర్‌- చిరంజీవి

ఒకదాని తర్వాత మరో విషాదం.రిషీకపూర్ జీ మరణం తీవ్రంగా కలిచివేసింది. రాజు చాచా(2000)తో మా ఇద్దరి ప్రయాణం బంధం మొదలైంది.. అప్పటి నుంచి అది కొనసాగుతూనే ఉంది. నీతూజీ, రణ్‌బీర్‌, రిధిమాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను-అజయ్‌ దేవగన్‌

పరిస్థితులు చూస్తుంటే మనం పీడకల మధ్యలో ఉన్నట్టు ఉంది. ఇప్పుడే రిషీకపూర్ లేరనే హృదయాన్ని కలిచివేసే వార్త విన్నాను. ఆయన ఒక లెజెండ్‌, గొప్ప సహచర నటుడు, మా కుటుంబానికి మంచి స్నేహితుడు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి- అక్షయ్‌ కుమార్‌

నిన్న అత్యతం ట్యాలెంట్‌ కలిగిన ఇర్ఫాన్‌ ఖాన్‌ను, నేడు లెజండరీ రిషీకపూర్ సాబ్‌ను కోల్పోవడం హార్ట్‌ బ్రేకింగ్‌ ఉంది. ఇది భారత చిత్ర పరిశ్రమకు తీరని లోటు- జూనియర్‌ ఎన్టీఆర్‌

ఓ మై గాడ్‌.. ఇది జరిగి ఉండాల్సి కాదు. రిషీకపూర్ సార్‌ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. 24 గంటల్లో ఇద్దరు దిగ్గజాలను కోల్పోవడం ఎలా ఉంటుంది?.. ఇది తీరని నష్టం- కాజల్‌ అగర్వాల్‌

నిన్న ఇర్ఫాన్‌ ఖాన్‌, నేడు రిషీకపూర్‌ మరణించడం షాక్‌కు గురిచేసింది.ఈ ఏడాది, ఈ వారం ఎంత భయాంకరమైనది?. వారిద్దరు వారి చిత్రాలతో ఎప్పటికీ గుర్తిండిపోతారు - కేటీఆర్‌

రిషీకపూర్‌ జీ ఇక లేరనే వార్త గుండెను కలిచివేసింది. ఇండియన్‌ సినిమాకు చెందిన మరో గొప్ప వ్యక్తి నేడు మనల్ని విడిచి వెళ్లిపోయారు. కపూర్‌ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.- రామ్‌చరణ్‌

మరోకమైన అందమైన రెక్క రాలిపోయింది. ఆర్‌ఐపీ లెజెండ్‌ రిషీకపూర్‌ - సుధీర్‌ బాబు

నేను ఈ వార్తను నమ్మలేకపోతున్నాను. ఈ వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. జరుగుతుంది చూస్తుంటే భయమేస్తోంది. ఇంతా త్వరగా మరో లెజెండ్‌ మనను విడిచిపోయారు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను- పూజా హెగ్డే

రిషీకపూర్‌ మరణం నన్ను కలిచివేసింది. ఆర్‌ఐపీ.. మై డియరెస్ట్‌ ప్రెండ్‌- రజినీకాంత్‌

అతను నా బాల్యం- కరణ్‌ జోహర్‌

మాటలు రావడం లేదు.. ఆర్‌ఐపీ డియర్‌ లెజెండ్‌ రిషీకపూర్ జీ - క్రిష్‌

నిజంగా నమ్మలేకుండా ఉంది. నిన్న ఇర్ఫాన్‌ ఖాన్‌.. నేడు రిషీకపూర్‌ జీ. రిషి కపూర్‌ మరణవార్తను అంగీకరించడానికి మనసుకు కష్టంగా ఉంది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆర్‌ఐపీ- విరాట్‌ కోహ్లి

ఇది చాలా విషాదం నింపింది. 24 గంట్లోనే ఇద్దరు దిగ్గజాలను కోల్పోవడం షాక్‌కు గురిచేసింది. సినీ పరిశ్రమకు ఇది తీరని లోటు. వారి సినిమాల ద్వారా వారు జీవించే ఉంటారు- నందమూరి కల్యాణ్‌రామ్‌

రిషీకపూర్‌ మరణం తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది- రాధిక శరత్‌కుమార్‌

చదవండి : ప్రముఖ నటుడు రిషీకపూర్‌ కన్నుమూత

ఇర్ఫాన్‌ఖాన్‌ మృతి పట్ల సినీ ఇండస్ట్రీ నివాళి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement