నా పెళ్లిలో బాలీవుడ్‌ స్టార్స్‌ డ్యాన్స్‌.. అంతా ఆయనవల్లే! | Riddhima Kapoor: Sridevi, SRK, Salman Khan performed at My Sangeet | Sakshi
Sakshi News home page

Riddhima Kapoor: నా పెళ్లికి శ్రీదేవి, సల్మాన్‌, షారుక్‌.. ఇలా అంతా డ్యాన్స్‌ చేశారు!

Published Thu, Apr 25 2024 1:07 PM | Last Updated on Thu, Apr 25 2024 1:12 PM

Riddhima Kapoor: Sridevi, SRK, Salman Khan performed at My Sangeet

బాలీవుడ్‌ సెలబ్రిటీలందరూ ఒకే వేదికపై కనిపిస్తే.. అందరూ సంతోషంగా స్టెప్పులేస్తుంటే.. చూడటానికి భలే ఉంటుంది కదూ! అంతా ఒకే కుటుంబంగా అనిపిస్తుంది. ఈ మధ్య అంబానీ ఇంట జరిగిన సెలబ్రేషన్స్‌లో బాలీవుడ్‌ స్టార్స్‌ అందరూ హాజరయ్యారు. అయితే అప్పట్లోనే స్టార్‌ సెలబ్రిటీలు తన పెళ్లిలో సందడి చేశారంటోంది హీరో రణ్‌బీర్‌ కపూర్‌ సోదరి రిద్ధిమా కపూర్‌.

స్టార్స్‌ డ్యాన్స్‌
బాలీవుడ్‌ స్టార్‌ రిషి కపూర్‌- నీతూ కపూర్‌ల కూతురు రిద్ధిమా కపూర్‌ వివాహం 2006లో జరిగింది. ఈ పెళ్లిలో శ్రీదేవి నుంచి షారుక్‌ ఖాన్‌ వరకు అందరూ సందడి చేశారు. తాజాగా ఈ విషయాన్ని గుర్తు చేసుకుంది రిద్ధిమా. ఆమె మాట్లాడుతూ.. శ్రీదేవిగారు, సల్మాన్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌.. ఇలా అందరూ నా సంగీత్‌లో డ్యాన్స్‌ చేశారు. ఇదంతా నాన్న వల్లే సాధ్యమైంది.

ఆయన వల్లే సాధ్యం
ఆయన ప్రేమ, సంకల్పం వల్లే ఆ వేడుక అంత ఘనంగా జరిగింది. వాళ్లంతట వాళ్లే ఇష్టంగా, మనస్ఫూర్తిగా డ్యాన్స్‌ చేశారు. అదంతా ఎంతో సరదాగా జరిగిపోయింది. ప్రతిఒక్కరూ ఆ ఫంక్షన్‌ను ఎంజాయ్‌ చేశారు. తమ ఇంటి పండుగ.. కాదు కాదు.. తమ కుటుంబంలోని షాదీలా ఫీలయ్యారు అంటూ ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంది. కాగా రిద్ధిమా- భరత్‌ పెళ్లి చేసుకుని 18 ఏళ్లవుతోంది. వీరికి సమర అనే కూతురు పుట్టింది. ఫాబ్యులస్‌ లైవ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌ వైవ్స్‌ అనే నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్‌తో త్వరలోనే నటనా రంగంలోకి ప్రవేశించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement