Rishi Kapoor
-
Christmas 2024 నింగికెగిసిన తారలు, కళ్లు చెమర్చే AI ఫోటోలు
-
'నా భర్త అందగాడు.. గతాన్ని మర్చిపో'.. హీరోయిన్‌కు సూచన!
రాజ్‌కపూర్- నర్గీస్.. వీరి ప్రేమాయణం గురించి అందరూ కథలుకథలుగా చెప్పుకునేవాళ్లు. 18 చిత్రాల్లో కలిసి నటించిన వీరికి ఒకరిపై మరొకరికి అంతులేని ప్రేమ.. కానీ అప్పటికే రాజ్ కపూర్‌కు పెళ్లయి, పిల్లలు కూడా ఉన్నారు. దీంతో ఈ ప్రేమ సఫలం కాలేదు. అనంతరం నర్గీస్.. సునీల్ దత్ అనే నటుడిని పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత రాజ్ కపూర్‌తో కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. వాళ్లు ఏర్పాటు చేసే కార్యక్రమాలకు కూడా వెళ్లేది కాదు. 24 ఏళ్లు ఇలాగే గడిచిపోయాయి.రాజ్ కపూర్, భార్య కృష్ణ, హీరోయిన్ నర్గీస్పెళ్లికి హాజరుదశాబ్దాల తర్వాత రాజ్.. తన కుమారుడు రిషి కపూర్ పెళ్లికి రావాలంటూ నర్గీస్‌ను ఆహ్వానించాడు. ఇచ్చిన మాట ప్రకారం తన భర్తను తీసుకుని పెళ్లికి హాజరైంది. కానీ ఎందుకో అదోలా ఉంది. ఆమె ఇబ్బందిని అర్థం చేసుకున్న రాజ్ కుమార్ భార్య కృష్ణ తనను దగ్గరకు పిలిచింది. నా భర్త అందగాడు, రొమాంటిక్ కూడా! అతడు అందరినీ ఆకర్షిస్తాడు. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు.భార్య కృష్ణతో రాజ్ కపూర్గతాన్ని మర్చిపోదయచేసి గతం గురించి వదిలేయు.. దాన్ని తవ్వుకుంటూ కూర్చుని బాధపడొద్దు. మా ఇంట్లో జరుగుతున్న శుభకార్యానికి వచ్చావు. ఇప్పుడు మనం స్నేహితులం అని చెప్పింది. ఈ విషయాలను రిషి కపూర్ తన పుస్తకంలో రాసుకొన్నాడు. అలాగే తన తండ్రి.. హీరోయిన్ వైజయంతిమాలతోనూ సన్నిహితంగా ఉండేవాడని పేర్కొన్నాడు. కాగా రాజ్ కపూర్ 1988లో కన్నుమూశాడు.చదవండి: ‘సరిపోదా శనివారం’ టాక్ ఎలా ఉందంటే..? -
నా పెళ్లిలో బాలీవుడ్ స్టార్స్ డ్యాన్స్.. అంతా ఆయనవల్లే!
బాలీవుడ్ సెలబ్రిటీలందరూ ఒకే వేదికపై కనిపిస్తే.. అందరూ సంతోషంగా స్టెప్పులేస్తుంటే.. చూడటానికి భలే ఉంటుంది కదూ! అంతా ఒకే కుటుంబంగా అనిపిస్తుంది. ఈ మధ్య అంబానీ ఇంట జరిగిన సెలబ్రేషన్స్‌లో బాలీవుడ్ స్టార్స్ అందరూ హాజరయ్యారు. అయితే అప్పట్లోనే స్టార్ సెలబ్రిటీలు తన పెళ్లిలో సందడి చేశారంటోంది హీరో రణ్‌బీర్ కపూర్ సోదరి రిద్ధిమా కపూర్.స్టార్స్ డ్యాన్స్బాలీవుడ్ స్టార్ రిషి కపూర్- నీతూ కపూర్ల కూతురు రిద్ధిమా కపూర్ వివాహం 2006లో జరిగింది. ఈ పెళ్లిలో శ్రీదేవి నుంచి షారుక్ ఖాన్ వరకు అందరూ సందడి చేశారు. తాజాగా ఈ విషయాన్ని గుర్తు చేసుకుంది రిద్ధిమా. ఆమె మాట్లాడుతూ.. శ్రీదేవిగారు, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్.. ఇలా అందరూ నా సంగీత్‌లో డ్యాన్స్ చేశారు. ఇదంతా నాన్న వల్లే సాధ్యమైంది.ఆయన వల్లే సాధ్యంఆయన ప్రేమ, సంకల్పం వల్లే ఆ వేడుక అంత ఘనంగా జరిగింది. వాళ్లంతట వాళ్లే ఇష్టంగా, మనస్ఫూర్తిగా డ్యాన్స్ చేశారు. అదంతా ఎంతో సరదాగా జరిగిపోయింది. ప్రతిఒక్కరూ ఆ ఫంక్షన్‌ను ఎంజాయ్ చేశారు. తమ ఇంటి పండుగ.. కాదు కాదు.. తమ కుటుంబంలోని షాదీలా ఫీలయ్యారు అంటూ ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంది. కాగా రిద్ధిమా- భరత్ పెళ్లి చేసుకుని 18 ఏళ్లవుతోంది. వీరికి సమర అనే కూతురు పుట్టింది. ఫాబ్యులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్ అనే నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌తో త్వరలోనే నటనా రంగంలోకి ప్రవేశించనుంది. -
మనుషులు చేజారుతారు
‘హమ్ తుమ్ ఏక్ కమరే మే బంద్ హో’.... భారత సినీ ప్రేక్షకుల్ని ఉర్రూతలూపిన ‘బాబీ’ మొన్నటి సెప్టెంబర్ 28కి యాభై ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇవాళ్టికీ దేశంలోని అన్ని భాషల్లో ఏదైనా టీనేజ్ ప్రేమకథ తీస్తూంటే గనక అది ఏదో ఒక మేరకు ‘బాబీ’కి కాపీ. ఆ సినిమా ఇచ్చిన ఫార్ములాతో వందలాది కథలు వచ్చాయి. వస్తాయి. ‘మేరా నామ్ జోకర్’ తీసి నిండా మునిగిన రాజ్‌కపూర్‌ను కుబేరుణ్ణి చేసిన సినిమా అది. ఆ సంపద వచ్చిన సందర్భంలోనే రాజ్‌కపూర్ ఒక మనిషిని చేజార్చుకున్నాడు. తెలిశా.. తెలియకనా? ‘బాబీ’ని కనీస ఖర్చుతో తీద్దామనుకున్నాడు రాజ్‌కపూర్. హీరో తన కొడుకే రిషికపూర్. హీరోయిన్ కొత్తమ్మాయి డింపుల్ కపాడియా. ముఖ్య పాత్రలు ప్రేమ్‌నాథ్, ప్రేమ్చోప్రా భార్య తరఫు బంధువులు. లక్ష్మీకాంత్– ప్యారేలాల్ ఇంకా కెరీర్ ప్రారంభంలో ఉండి రాజ్‌కపూర్‌తో మొదటి సినిమా చేయడమే వరం అనుకునే రకం. ఖర్చేముంది? ఒక్కటి ఉంది... ప్రాణ్ రెమ్యూనరేషన్ . ఆ రోజుల్లో ప్రాణ్ సినిమాకు రెండు, మూడు లక్షలు తీసుకుంటున్నాడు. రాజ్‌కపూర్‌తో అప్పటికి నలభై ఏళ్లుగా ప్రాణస్నేహం. ‘ఒక్కరూపాయి తీసుకొని చేస్తా. సినిమా ఆడితే ఇవ్వు. ఆడకపోతే మర్చిపో’ అన్నాడు ప్రాణ్. అన్నమాట ప్రకారం ఒక్క రూపాయికే చేశాడు. సినిమా రిలీజ్ అయ్యింది. ఇరవై పాతిక లక్షలు పెట్టి తీస్తే దేశంలో, బయట కలిపి 30 కోట్లు వచ్చాయి. నేటి లెక్కల ప్రకారం 1200 కోట్లు! రాజ్‌కపూర్ ప్రాణ్‌ని పిలిచి మంచి పార్టీ ఇస్తే బాగుండేది. థ్యాంక్స్ చెప్పి అడిగినంత ఇచ్చి ఉంటే బాగుండేది. ఇవ్వకపోయినా బాగుండేది. కాని రాజ్‌కపూర్ లక్ష రూపాయల చెక్ పంపాడు. లక్ష? తను అడగలేదే? పోనీ తాను అందరి దగ్గరా తీసుకునేంత కూడా కాదే. ప్రాణ్ ఆ చెక్ వెనక్కు పంపాడు. మళ్లీ జీవితంలో రాజ్కపూర్ని కలవలేదు. జారిపోయాడు. ‘షోలే’ రిలీజ్ అయితే మొదటి రెండు వారాలు ఫ్లాప్‌టాక్. రాసిన సలీమ్–జావేద్ ఆందోళన చెందారు. ఫ్లాప్ కావడానికి స్క్రిప్ట్ కారణమనే చెడ్డపేరు ఎక్కడ వస్తుందోనని బెంబేలెత్తారు. మాటల్లో మాటగా దర్శకుడు రమేష్ సిప్పీతో ‘గబ్బర్‌సింగ్ వేషం వేసిన అంజాద్‌ఖాన్ వల్లే సినిమా పోయింది. అతడు ఆనలేదు’ అన్నారు. అప్పటికే తన తొలి సినిమాకు ఇలాంటి టాక్ రావడం ఏమిటా అని చాలా వర్రీగా ఉన్న అంజాద్‌ఖాన్ బ్లేమ్ గేమ్‌లో తనను బలి చేయబోతున్నారని తెలిసి హతాశుడయ్యాడు. తీవ్రంగా కలత చెందాడు. కాని సినిమా కోలుకుంది. ఎలా? అలాంటి కలెక్షన్లు ఇప్పటికీ లేవు. అతి గొప్ప విలన్ గా అంజాద్‌ఖాన్ ఎన్నో సినిమాలు చేశారు. కాని ఒకనాటి మిత్రులైన సలీమ్–జావేద్ రాసిన ఏ స్క్రిప్ట్‌లోనూ మళ్లీ యాక్ట్ చేయలేదు. చేజారిపోయాడు. దాసరి నారాయణరావు తొలి రోజుల్లో నటుడు నాగభూషణాన్ని ఎంతో నమ్ముకున్నాడు. అభిమానించాడు. నాగభూషణం దాసరికి దర్శకుణ్ణి చేస్తానని చెప్పి చాలా పని చేయించుకున్నాడు. చివరి నిమిషంలో వేరొకరిని పెట్టుకున్నాడు. దాసరి ఆ తర్వాత పెద్ద దర్శకుడయ్యి 150 సినిమాలు చేశాడు. వందల పాత్రలు రాశాడు. కాని దాసరి కలం నుంచి ఒక్క పాత్ర కూడా నాగభూషణం కోసం సృజించబడలేదు. దాసరి సినిమాల్లో నాగభూషణం ఎప్పుడూ లేడు. రామానాయుడు అవకాశం ఇస్తే ఎంతో కష్టం మీద ‘ప్రేమఖైదీ’ సినిమాకు దర్శకత్వం వహించాడు ఇ.వి.వి.సత్యనారాయణ. అప్పటికి అతని మొదటి సినిమా ఫ్లాప్. ఈ సినిమా కూడా పోతే భవిష్యత్తు లేదు. ఫస్ట్ కాపీ చూసిన పరుచూరి బ్రదర్స్ ఏ మూడ్‌లో ఉన్నారో ‘మా స్క్రిప్ట్‌ను చెడగొట్టినట్టున్నాడే’ అనే అర్థంలో రామానాయుడు దగ్గర హడావిడి చేశారు. వారు స్టార్‌రైటర్స్. వారి మాట మీద రామానాయుడుకు గురి. ఇ.వి.వి హడలిపోయాడు. స్క్రిప్ట్‌ను తన బుర్రతో ఆలోచించి మెరుగుపెట్టి తీస్తే ఇలా అంటారేమిటి అని సిగరెట్లు తెగ కాల్చాడు. సినిమాను మూలపడేస్తే ఇంతే సంగతులే అని కుంగిపోయాడు. కాని సినిమా రిలీజయ్యి సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత 51 సినిమాలు తీశాడు ఇ.వి.వి. ఒక్కదానికీ గురు సమానులైన పరుచూరి సోదరుల స్క్రిప్ట్ వాడాలనుకోలేదు. బాగా చనువుగా, ఆత్మీయంగా ఉండే మనుషుల పట్ల కొందరికి హఠాత్తుగా చిన్నచూపు వస్తుంది. ఆ.. ఏముందిలే అనుకోబుద్ధవుతుంది. వారితో మనం ఎలా వ్యవహరించినా చెల్లుబాటవుతుందిలే అనిపిస్తుంది. వారితో చెప్పకుండా ఫలానా పని చేద్దాం... శుభలేఖ ఆఖరున పంపుదాం... కష్టంలో ఉన్నారని తెలిసినా చూసీ చూడనట్టు ఉందాం... ఇచ్చిన మాటను తేలిగ్గా తీసుకుందాం... వారి వీపు మీద విస్తరి పరిచి భోం చేద్దాం... అనుకుంటే ఆ క్షణంలో ఆ సదరు వారు మనం చెప్పింది విన్నట్టుగా కనపడతారు. నవ్వుతున్నట్టే ఉంటారు. కాని వారి లోపల మనసు చిట్లుతున్న చప్పుడు మన చెవిన పడకుండా జాగ్రత్త పడతారు. ఆ తర్వాత వారు మనకు కనిపించరు. జారిపోతారు. చేజారిపోతారు. మనుషులు చేజారితే ఏమవుతుంది? వారితో మాత్రమే సాధ్యమయ్యే జీవన సందర్భాలన్నీ నాశనమవుతాయి. వారితో నిర్మించుకున్న గతం తుడిచిపెట్టుకుపోతుంది. వారితో వీలైన భవిష్యత్తు నష్టమవుతుంది. ఉంటే బాగుండు అనుకునే క్షణాల్లో వారు ఉండరు. డబ్బు, దస్కం, పలుకుబడి, క్షమాపణ ఏదీ వారిని మళ్లీ వెనక్కు తీసుకురాదు. హాయ్, హలో బాపతు సవాలక్ష దొరుకుతారు. ఈ నిజమైన ఆత్మీయులను కాపాడుకుంటున్నారా? అసలు మీరెంత మందిని చేజార్చుకున్నారో ఎప్పుడైనా లెక్క చూసుకున్నారా? -
ఛీ, భర్త చనిపోయినా ఎంజాయ్ చేస్తోంది.. నీతూ కపూర్‌పై ట్రోలింగ్
బాలీవుడ్ యంగ్ హీరో రణ్‌బీర్ కపూర్ తండ్రి, నటుడు రిషి కపూర్ మరణించి రెండేళ్లు కావొస్తుంది. సుమారు రెండేళ్లు క్యాన్సర్‌తో పోరాడిన ఆయన 2020 ఏప్రిల్‌లో చనిపోయారు. అయితే తన భర్త మరణం తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో తనను ట్రోల్ చేస్తున్నారని రిషి కపూర్ భార్య నీతూ కపూర్ తెలిపారు. రిషి కపూర్ ఇక లేరన్న బాధలో నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆమె కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. అయితే భర్త చనిపోయాడన్న బాధ లేకుండా ఇలా పోస్ట్‌లు పెట్టడంపై నెటిజన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారట. దీంతో ఈ ట్రోలర్స్‌కు స్ట్రాంగ్‌గానే కౌంటర్ ఇచ్చింది నీతూ కపూర్. ఇన్‌స్టాగ్రామ్‌లో 1.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న నీతూ మాట్లాడుతూ 'నేను ఇలా ఉండటాన్ని ఇష్టపడుతున్నాను, ఆస్వాదిస్తున్నాను. నేను నా ఫాలోవర్స్‌ను ప్రేమిస్తున్నాను. నన్ను ట్రోల్ చేసేవారిని బ్లాక్ చేస్తున్నాను. ఎందుకంటే భర్త చనిపోయాక కూడా ఎంజాయ్ చేస్తుందని కొందరు అంటున్నారు. నేను ఏడుస్తూ, బాధపడుతూ, విధవలా ఉండటాన్ని చూడాలనుకుంటున్నవారిని నేను బ్లాక్ చేస్తాను. నేను ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను. ఇలాగే ఉంటాను.' అని తెలిపారు. ఇంకా 'ఇలా ఉండటం వల్ల బాధ నుంచి ఉపశమనం కలుగుతుంది. కొందరు ఏడుస్తూ, మరికొందరూ నవ్వుతూ బాధ నుంచి కోలుకుంటారు. నేను నా భర్తను మరచిపోలేను. అతను ఎప్పుడూ ఇక్కడ నాతో, నా పిల్లలతో జీవితాంతం ఉంటాడు. ఇప్పుడు కూడా నాతోనే ఉన్నాడు. భోజనానికి వచ్చి సగం సమయం అతని గురించే మాట్లాడుతున్నాం. రణ్‌బీర్ ఇప్పటికీ తన మొబైల్ స్క్రీన్‌సేవర్‌లో అతని ఫొటోనే ఉంది. అంటే మేము అతన్ని ఎంతగా మిస్ అవుతున్నామో అర్థం చేసుకోండి. కానీ మేము అతన్ని మిస్ అవుతున్నందుకు దిగులుగా లేదు. మేము అతన్ని మిస్ అవడాన్ని కూడా సంతోషంగా భావిస్తాం. అతను ఎంతో గొప్ప వ్యక్తి అని ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటాం' అని పేర్కొన్నారు నీతూ కపూర్. View this post on Instagram A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
శర్మాజీ నమ్కీన్... ఓ రిటైరైన నాన్న కథ
‘అమితాబ్ బచ్చన్ రిటైర్ కాలేదు. నేనెందుకు కావాలి’ అంటాడు ఈ సినిమాలో శర్మాజీ అనే తండ్రి. అమితాబ్‌కు 78. శర్మాజీకి 58. వి.ఎర్.ఎస్ ఇవ్వడం వల్లో రిటైర్మెంట్ వల్లో తండ్రులు పనికి దూరం అవుతారు. ఇక వారి జీవితం ముగిసినట్టేనా? ఆశలు, ఆకాంక్షలు అంతమేనా? అసలు రిటైర్ అయిన తండ్రులను ఎంతమంది పిల్లలు అర్థం చేసుకుంటున్నారు? రిషి కపూర్ చివరి సినిమా ‘శర్మాజీ నమ్కీన్’. మరో విశేషం ఏమంటే రిషి మరణం వల్ల మిగిలిన సినిమాని అదే పాత్ర పోషించి పరేశ్ రావెల్ మెప్పించటం! ఈ వారం సండే సినిమా. ఈ సినిమాలో రిటైర్ అయిన శర్మాజీ, అతని స్నేహితుడు ‘బాగ్బన్’లోని క్లయిమాక్స్‌ను ఫోన్లో చూస్తుంటారు. శర్మాజీ ఫ్రెండ్ అయిన శిక్కు చెడ్డా ‘దీనిని కాలేజీ పిలకాయలందరికీ సిలబస్‌గా పెట్టాలి’ అంటాడు. ఎందుకంటే అమితాబ్– హేమమాలిని నటించిన బాగ్బన్లో పిల్లల నిర్లక్ష్యానికి లోనయ్యే తల్లిదండ్రులను చూపిస్తారు. అయితే ‘శర్మాజీ నమ్కిన్’ ఈ సమస్యను తీసుకోకుండా తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉండే గ్యాప్‌ను చర్చిస్తుంది. వారి వైపు ఉండే కథలను వినాలని చెబుతుంది. కథ ఏమిటి? ఢిల్లీలో మిడిల్‌క్లాస్ కాలనీలో ఉండే శర్మాజీ (రిషి కపూర్) తాను పని చేసే మిక్సీ, గ్రైండర్ తయారీ ఫ్యాక్టరీ నుంచి వి.ఆర్.ఎస్. తీసుకుంటాడు. అంటే ఫ్యాక్టరీయే అతనికి వి.ఎర్.ఎస్. ఇచ్చి పంపిస్తుంది, అది దివాలా తీయడంతో. ఇంట్లో భార్య ఉండదు. చాలా ఏళ్ల క్రితమే డబుల్ టైఫాయిడ్ తో చనిపోయి ఉంటుంది. పెద్ద కొడుకు ఉద్యోగం. చిన్న కొడుకు కాలేజీ. శర్మాజీకి ఉత్సాహం ఉంది. జీవితాన్ని ఆస్వాదించాలని ఉంది. ఏదో ఒకటి చేస్తూ పనికొచ్చేలా ఉండాలని ఉంది. టీవీ చూసి చూసి, ఖాళీగా ఉండి ఉండి బోర్ కొడుతుంది. ‘నాకు బోర్ కొడుతుంది’ అని పిల్లలతో అంటే ‘ట్రావెల్ చెయ్యి. లేదా రెస్ట్ తీసుకుని ఎంజాయ్ చెయ్యి’ అంటారు తప్ప ఇంకో పనేదైనా చేస్తానంటే ఒప్పుకోరు. 58 ఏళ్లొస్తే ఏ పని చేయకుండా ఎందుకు ఉండాలి ఇదేం రూలు అంటాడు శర్మాజీ. చివరకు అతని ఫ్రెండ్ అతనికి ఒక సలహా ఇస్తాడు. ‘నీకు వంట బాగా వచ్చు కదా. నాకు తెలిసిన వాళ్లు కిట్టీ పార్టీలు చేసుకుంటూ మంచి వంటవాడు కావాలంటుంటాడు. నువ్వెళ్లి వండు. కాలక్షేపం.’ అంటాడు. శర్మాజీకి నిజంగానే వంట బాగా వచ్చు. ‘ఇంత బతుకు బతికి వంటవాడిగా మారడమా’ అని ముందు తటపటాయించినా చివరకు అంగీకరిస్తాడు. అలా కిట్టీ పార్టీలు చేసుకునే ఒక స్త్రీల బ్యాచ్‌తో అతనికి స్నేహం ఏర్పడుతుంది. ఇదంతా కొన్నాళ్లు పిల్లలకు తెలియకుండా జరిగినా ఆ తర్వాత పిల్లలకు తెలియడంతో వాళ్లు మా పరువేం కాను అని గొడవకు దిగుతారు. చివరకు ఇద్దరూ ఒకరినొకరు ఎలా అర్థం చేసుకున్నారన్నది క్లయిమాక్స్. వారి మనసులో ఏముంది? ‘శర్మాజీ నమ్కిన్’లో దర్శకుడు తెలివిగా ఒక విషయాన్ని చెబుతాడు. రిటైర్ అయిన తల్లిదండ్రుల భావోద్వేగాలు ఏమిటో ఎవరూ పట్టించుకోరు అనేది ఒకటి– మిడిల్ ఏజ్‌కు వచ్చిన వివాహిత స్త్రీలు తమకు వ్యాపకాలు లేక చేసేందుకు పని లేక కుటుంబాలకే జీవితాలు అంకితం చేసి చేసి విసిగిపోతున్నారనేది ఒకటి. శర్మాజీ లాంటి రిటైర్ అయిన వాళ్లు, కిట్టీ పార్టీ చేసుకునే మధ్య వయసు స్త్రీలు ఒకరి సమస్యను మరొకరు సానుభూతితో అర్థం చేసుకుంటారు. ఒకరికి మరొకరు సపోర్ట్‌గా నిలుస్తారు. అలాగే శర్మాజీ పెద్ద కొడుకు తనకు ఉద్యోగంలో ప్రమోషన్ రాగానే ఇంటి నిర్ణయాలు తానే తీసుకోగలను అనుకుంటూ ఉంటాడు. ఆ మిడిల్ క్లాస్ ఇంటి నుంచి పెద్ద ఫ్లాట్‌లోకి మారాలని అతని కోరిక. ఇక్కడే మీ అమ్మ చనిపోయింది... నేను కూడా ఇక్కడే పోతాను... రాను అని తండ్రి అంటుంటాడు. తనకు బయట ఏవైనా సమస్యలు వస్తే తండ్రితో మనసు విప్పి చెప్పుకోడు. అలాగే తండ్రి కూడా తన మనసులో ఏముందో చెప్పుకునేంత స్పేస్ ఇవ్వడు. ఇలాంటి పిల్లలు ఇప్పుడు అన్ని చోట్లా ఉన్నారు. శర్మాజీ వంటి తండ్రులు కూడా. వీళ్లు తమను ఈ సినిమాలో చూసుకుంటారు. రిషి చివరి సినిమా రిషి కపూర్ ఈ సినిమా యాభై శాతం ముగించాక అనారోగ్యం వల్ల మరణించాడు. సినిమా ఎలా పూర్తి చేయాలనే సమస్య వచ్చింది. రణ్‌బీర్ కపూర్ తాను ఆ వేషాన్ని పూర్తి చేద్దామని అనుకున్నాడు. చివరకు పరేష్ రావెల్ తాను మిగిలిన పోర్షన్ చేస్తానని ముందుకు వచ్చాడు. రిషి కపూర్ పూర్తి చేయని సీన్లన్నీ పరేష్ చేశాడు. అంటే సినిమా అంతా ముందు వెనుకలుగా రిషి కపూర్, పరేశ్ రావెల్ వస్తూనే ఉంటారు. అయితే ఇద్దరూ మంచి నటులు కాబట్టి ఆడియెన్స్ అసౌకర్యంగా భావించరు. కాని రిషి కపూర్ ఎక్కువ నచ్చుతాడు. జూహీ చావ్లా చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో రిషి కపూర్ పక్కన కనిపిస్తుంది. సినిమా మొదట్లో రణ్‌బీర్ తన తండ్రి నటించిన ఈ సినిమా గురించి భావోద్వేగంతో మాట్లాడతాడు. సినిమా ముగిశాక రిషి కపూర్ ఆన్ లొకేషన్ షాట్స్ రన్ అవుతూ ఉంటే ఇన్నాళ్ల పాటు అతడు పంచిన వినోదం, అతడు ఇచ్చిన సినిమాలు గుర్తొచ్చి మనసు భారం అవుతుంది. తేలికపాటి హాస్యంతో సాగిపోయే ఈ సినిమా అమేజాన్ ప్రైమ్‌లో మార్చి 31న విడుదలైంది. చూడండి. -
సహజీవనం చేస్తా.. కానీ పెళ్లి చేసుకోను.. వైరల్ అవుతున్న రిషి కపూర్ పాత ఇంటర్వ్యూ
Neetu Kapoor and Rishi Kapoor Throwback: బాలీవుడ్ యంగ్ హీరో రణ్‌బీర్ కపూర్ తండ్రి, నటుడు రిషీ కపూర్ గతేడాది మరణించిన విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్లు క్యాన్సర్‌తో పోరాడిన ఆ నటుడు 2020 ఏప్రిల్‌లో చనిపోయాడు. అయితే గతంలో కరణ్ జోహర్ హోస్ట్‌గా వ్యవహరించే కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్నారు. ఆ షోలో తన భార్య నీతూ కపూర్‌తో ప్రేమ, పెళ్లి జీవితం గురించి మాట్లాడాడు. ఆ ఇంటర్వూ ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. మీ ప్రేమ బంధం గురించి చెప్పమని షోలో కరణ్ రిషికపూర్ణి అడడగా ఆయన అందరూ షాక్ అయ్యే బదులు ఇచ్చాడు. ‘మా కెరీర్ ప్రారంభంలో మంచి స్నేహితులుగా ఉండేవాళ్లం. చాలా సమయం గడిపేవాళ్లం. అనంతరం డేటింగ్ చేశాం. కానీ నీతో సహజీవనం చేస్తాను. కానీ పెళ్లి చేసుకోను’ అని భార్య నీతూతో చెప్పినట్లు నటుడు తెలిపాడు. ఆయన చాలా టఫ్ వ్యక్తినని, ఆయన ఇచ్చిన షాక్‌లను ఆమె తట్టుకొని నిలబడం వల్లే వారు ఇంకా కలిసి ఉండగలిగారని చెప్పాడు. అయితే ఈ విషయం గురించి మాట్లాడిన నీతూ..‘ రిషి చాలా మంచి భర్త. మంచి తండ్రి. కాబట్టి ఏమి జరిగినా ఆయనతో ఉండాలని నిర్ణయించుకన్నట్లు’ తెలపింది. అయితే 5ఏళ్లు సహజీవనం చేసిన అనంతరం వారిద్దరూ వివాహం చేసుకోగా, కూతురు రిద్ధిమా కపూర్ సాహ్ని, కొడుకు రణ్‌బీర్ కపూర్ పుట్టారు. రణ్‌బీర్ సైతం మంచి సినిమాలు చేస్తూ బాలీవుడ్లో స్టార్‌గా ఎదిగాడు. చదవండి: ‘రణ్‌బీర్ నా దుస్తులను తన గర్ల్‌ప్రెండ్స్‌కు గిఫ్ట్‌గా ఇచ్చేవాడు’ -
Guess Who: చిరునవ్వుల చిన్నారిని గుర్తుపట్టారా?
పై ఫొటోలో పెళ్లి గెటప్‌లో ఉన్నది మరెవరో కాదు హిందీ స్టార్ జంట రిషి కపూర్, నీతూ సింగ్‌లు. మరి వీరి ముందు నిల్చుని కెమెరా వైపు గుడ్లప్పగించి చూస్తూ చిలకలా నవ్వుతున్న చిన్నారెవరో గుర్తుపట్టారా? ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన రవీనా టండన్. ఆమె తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అరుదైన ఫొటోను షేర్ చేసింది. చింటూ అంకుల్(రిషి కపూర్) పెళ్లిలో ఇలా ఫొటోకు పోజిచ్చానని చెప్పుకొచ్చింది. దీన్ని తన బయోగ్రఫీలో వాడుకుంటానని చెప్పాడని గుర్తు చేసుకుంది. ఈ ఫొటో తనకు ఎంతో అమూల్యమైనదని తెలిపింది. ఇక అందులో ఉన్నది హీరోయిన్ రవీనా టండన్ అని తెలియడంతో అభిమానులు అవాక్కవుతున్నారు. ఎంతో ముద్దొస్తున్నావంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో 'సజన్ కీ బహూన్ మేన్' సినిమాలో రవీనా రిషితో కలిసి నటించిన సన్నివేశాలు చాలా బాగుంటాయంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా రిషి కపూర్, నీతూ సింగ్‌లు 1980 జనవరి 22న పెళ్లి చేసుకున్నారు. జిందా దిల్, ఖేల్ ఖేల్ మెయిన్, అమర్ అక్బర్ అండ్ ఆంటోనీ, డో డూనీ చార్ వంటి పలు చిత్రాల్లో వీరు కలిసి నటించారు. వీరికి రిద్ధిమా కపూర్, రణ్‌బీర్ కపూర్ సంతానం. లుకేమియా వ్యాధితో బాధపడుతున్న రిషి కపూర్ గతేడాది ఏప్రిల్ 30న కన్నుమూశాడు. చదవండి: పెళ్లికి ముందు అజయ్ దేవ్‌గణ్ ఓ ప్లే బాయ్! View this post on Instagram A post shared by Raveena Tandon (@officialraveenatandon) -
ఆడిషన్‌కు వెళ్తే... చొక్కా బటన్లు తీసి
పురుషుడు పని ఎప్పుడు చేస్తాడు? యుక్త వయసు నుంచి. స్త్రీ కూడా ఆ వయసు నుంచే చేయాలి కదా..ప్రతిభ, సామర్థ్యం, చదువు, పని చేయాలనే ఆసక్తి ఉన్నా ఆమెకు అది అంత సులువుగా వీలవదు. ఇంటి బాధ్యత, పిల్లల బాధ్యత, భర్త బాగోగులు...ఇవి ఒక కొలిక్కి వచ్చేసరికి ఆమెకు నలభైలో యాభైలో దాటిపోతాయి. ఇప్పుడిక ఏం చేస్తాంలే అని కొందరు అనుకుంటారు. ఇప్పుడు పని చేద్దాం అని మరికొందరు అనుకుంటారు. 62 సంవత్సరాల నటి నీతూ సింగ్, 52 సంవత్సరాల లోదుస్తుల మోడల్ గీత ఇద్దరూ ఇటీవలే పని మొదలెట్టారు.‘ఏజ్ ఈజ్ నాట్ కేజ్’ అంటున్నారు వీరు. ‘నాకిప్పుడు పని చేయాలని ఉంది. నా పిల్లల సపోర్ట్ నాకు ఉన్నా ఒక ఒంటరితనం ఉంది. నన్ను నేను ఎంగేజ్ చేసుకోవాలని అనిపిస్తోంది. అందుకని నటించాలని ఉంది’ అన్నారు నీతూ సింగ్ కపూర్. 62 ఏళ్ల నీతూ సింగ్ గత రెండేళ్లుగా చాలా ఆటుపోట్లను చూశారు. భర్త రిషి కపూర్ కేన్సర్ బారిన పడటం, ఆ తర్వాత మరణించడం దాదాపు నలభై ఏళ్లుగా ఉన్న తోడు వీడిపోవడం ఆమెకు కూడదీసుకోవాల్సిన అవసరాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఆమె కూడదీసుకుంది. ‘నన్ను నేను పరీక్షించుకోవడానికి అసలు నేను నలుగురి ముందు కాన్ఫిడెంట్‌గా ఉండగలనా లేదా చూసుకోవడానికి ఈ షోకు వచ్చాను’ అని రెండు రోజుల క్రితం ప్రసారం అయిన ‘ఇండియన్ ఐడెల్’ షోలో గెస్ట్‌గా పాల్గొన్నప్పుడు అన్నారు. ఈ సందర్భంగా ఆమె మనసులోని మాటలు ఎన్నో చెప్పారు. ఏడేళ్ల వయసులోనే వార్నింగ్ తెలుగులో హిట్ అయిన ‘లేత మనసులు’ హిందీ రీమేక్ ‘దో కలియా’తో బాలనటి గా స్టార్ అయ్యారు నీతూ సింగ్. ‘దో కలియాకు నేను ఆడిషన్స్‌కు వెళితే కృష్ణన్–పంజు (ఆ సినిమా దర్శక ద్వయం) గార్లు బనియన్లు కనిపించేలా చొక్కా బటన్లు తీసి కాళ్లు కుర్చీల పైన పెట్టి ఆడిషన్స్ తీసుకుంటున్నారు. నాకు ఏడేళ్లు. ముందు షర్టు బటన్లు పెట్టుకుని కాళ్లు కిందకు దించితే ఆడిషన్ ఇస్తానని చెప్పాను. వాళ్లు ఆ ఒక్క మాటకు దిమ్మెరపోయి నాకు వెంటనే సినిమా ఆఫర్ ఇచ్చారు’ అని నీతూ సింగ్ చెప్పారు. సినిమాలు... పెళ్లి.. పిల్లలు రిషి కపూర్ నటించిన ‘బాబీ’ సూపర్ హిట్ అయ్యాక అది రిలీజయ్యేలోపే డింపుల్ కపాడియా పెళ్లి చేసుకోవడంతో రిషి కపూర్‌కు హీరోయిన్గా కొత్త అమ్మాయి కావాల్సి వచ్చింది. దాంతో 14 ఏళ్లే ఉన్నా నీతూ సింగ్ ‘ఖేల్ ఖేల్ మే’లో హీరోయిన్ అయ్యింది. ఆ సినిమా హిట్ కావడంతో 22 ఏళ్లు వచ్చేసరికి దాదాపు 60-డెబ్బై సినిమాలు చేసి స్టార్ అయ్యింది. కాని రిషి కపూర్ పెళ్లి ప్రస్తావన తేవడంతో అతనితో ప్రేమలో ఉన్న నీతూ మొత్తం తన కెరీర్‌ను పక్కన పెట్టి, అడ్వాన్సులు వెనక్కు ఇచ్చి వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఆమె నటన వైపు చూడనే లేదు.. ఎందరో అభిమానులు ఉన్నా. కూతురు రిథమ, కొడుకు రణ్‌బీర్ వీళ్ల పెంపకం, రిషి కపూర్ అబ్సెసివ్ బిహేవియర్ వల్ల అతన్ని అనుక్షణం కనిపెట్టుకోవాల్సి ఉండటం... వీటిలో పడి ఆమె తానొక నటి అన్న సంగతే మర్చిపోయారు. చాలా ఏళ్ల తర్వాత 2010లో భర్తతో కలిసి ‘దూ దూని చార్’ వంటి ఒకటి రెండు సినిమాల్లో నటించినా నటనకు ఆమెకు సమయం చిక్కలేదు. ఇప్పుడు పని చేయాలని ఉంది 2020 ఏప్రిల్‌లో రిషి కపూర్ మరణించాడు. దాదాపు సంవత్సరం ఆమె తనలో తాను తన కుటుంబంతో తాను ఉండిపోయింది. ‘ఇప్పుడు నాకు పని చేయాలని ఉంది. నేను పని చేస్తాను’ అని ఆమె అంది. పిల్లలు సెటిల్ అయ్యాకనో, భర్త మరణం లేదా భర్త ‘ఇన్సెక్యూరిటీస్’ తగ్గాకనో లేదా కుటుంబం ‘జాలి తలిచి అనుమతి’ ఇస్తేనో లేదా కుటుంబంతో పోరాడో లేటు వయసులో స్త్రీలు పనికి మొగ్గు చూపుతున్నారు. ‘అమ్మ ఆసక్తులు అమ్మను పూర్తి చేసుకోనిద్దాం’ అని మనస్ఫూర్తిగా అనే కుటుంబాలు కూడా ఉన్నాయి. కాని ఈ కుటుంబ బంధం స్త్రీకు ఉన్నంతగా పురుషుడికి లేదు. పురుషుడు సర్వకాలాల్లో కుటుంబం అనుమతి చూడకుండా తాను చేయవలసింది చేయగలడు. స్త్రీలకు కూడా ఈ అవకాశం ఉండాలి అంటారు స్త్రీలు, ఆలోచనాపరులు. ‘ఏజ్ ఈజ్ నాట్ కేజ్’ 52 ఏళ్ల లోదుస్తుల మోడల్ గీత.జె వార్తల్లో ఉన్నారు. అందుకు కారణం ఆమె ‘ఏజ్ ఈజ్ నాట్ కేజ్’ పేరుతో లోదుస్తుల తయారీ సంస్థలకు ఒక ఆన్లైన్ పిటిషన్ ఉద్యమం మొదలెట్టడమే. ఇప్పటికే ఆ పిటిషన్ మీద దాదాపు 7 వేల మంది సంతకాలు చేశారు. ఇంతకీ గీత ఎందుకు వార్తల్లో ఉన్నారు? ఆమె మోడల్ కాదలుచుకున్నారు. అది కూడా లోదుస్తులకు. కాని తయారీ సంస్థలు ఈ వయసులో మీరు కాలేరండీ అంటూ తిరస్కరించాయి. నిన్న మొన్నటి వరకూ ముంబైలో టీచర్‌గా పని చేసిన గీత ఏమంటున్నారో చూడండి. అదే నాలో కాన్ఫిడెన్స్‌ను పెంచింది ‘ప్రతి స్త్రీకి తన భవిష్యత్తు గురించి కలలు ఉంటాయి. కాని వాటిని నెరవేర్చుకోవడానికి సమయం ఉండదు కుటుంబం వల్ల. ఒక దశలో ఇప్పుడైనా మన కలల్ని నెరవేర్చుకుందాం కుటుంబం కోసం చేయాల్సింది చేశాం కదా అనిపిస్తుంది. నాకు మోడల్ కావాలని ఉండేది. వీలవలేదు. యాభై ఏళ్లు వచ్చాక ‘సీనియర్ మహిళల అందాల పోటీలో’ పాల్గొని రన్నర్ అప్‌గా నిలిచాను. అది నా కాన్ఫిడెన్స్‌ను పెంచింది. ఆ సమయంలోనే నేను లోదుస్తుల కొనుగోలుకు ఆన్లైన్ షాపింగ్ సైట్స్ సెర్చ్ చేశాను. నా వయసు వారి లోదుస్తులకు కూడా యంగ్ మోడల్సే ఉన్నారు. ఎందుకు నా వయసు వారి లోదుస్తులకు నా వయసు వారే మోడల్స్‌గా ఎందుకు ఉండకూడదు అనుకున్నాను. ఈ వయసులో ఈ పని అవసరమా అన్నారు అప్పుడే బ్రెజిల్‌కు చెందిన హెలెనా సేజల్ గురించి తెలుసుకున్నాను. ఆమె డెబ్బై ఏళ్ల వయసులో లోదుస్తుల మోడల్‌గా మారి గొప్ప స్ఫూర్తినింపారు. ఆ స్ఫూర్తితోనే నేను లోదుస్తుల మోడల్‌గా మారి ఫొటోషూట్ చేసుకున్నాను. సోషల్ మీడియాలో ఆ ఫోటోలు పోస్ట్ చేశాక నా కుటుంబం, స్నేహితులు, తెలియనివారు చాలామంది అప్రిసియేట్ చేశారు. ‘ఈ వయసులో ఈ పని అవసరమా’ అన్నవారు ఉన్నారు. స్త్రీలు ఏ వయసులో ఏం చేయాలో ఎందుకు చెప్తారు. అది పర్సనల్ చాయిస్. ఏ దుస్తులు ధరించాలో కూడా పర్సనల్ చాయిస్. మా మీద లక్ష్మణరేఖ ఉంటుంది. అది దాటితే ఏదో ఒక లోపం, వంక, విమర్శ ఎదురవుతాయి. వయసు రావడం అనేది ఒక సహజ శారీరక ప్రక్రియ. మనం దానిని ఆపలేం. కాని ఆ వయసును మన కలలకు అడ్డంగా రానివ్వకుండా మనం చేసుకోగలం. నేను చెప్పాలనుకుంటున్నది అదే’ అంటారు గీత. ఆమె స్త్రీల వ్యక్తీకరణలు, ఆకాంక్షలు, కలలు, అభిలాషల పట్ల సగటు సమాజానికి ఉన్న పడికట్టు దృష్టిని మాత్రం చెదరగొడుతున్నారు.నీతూ సింగ్, గీత ఇద్దరూ కూడా స్త్రీలకు సంబంధించి ఏదో చెబుతున్నారు. మనం చేయవలసిందల్లా ఆ చెబుతున్నది సరిగ్గా విని అర్థం చేసుకుని అందుకు బాసటగా నిలవడమే. – సాక్షి ఫ్యామిలీ -
హిట్ హీరో కాలేకపోయాడు.. రెండేళ్లకే విడాకులు
రాజ్‌కపూర్ ముగ్గురు కుమారుల్లో రిషి కపూర్ హీరోగా హిట్ అయ్యాడు. రణ్‌ధీర్ కపూర్ హీరోగా రాణించకపోయినా తన కుమార్తెల వల్ల గుర్తింపు పొందుతున్నాడు. ‘చింపూ కపూర్’ అని అందరూ పిలిచే రాజీవ్ కపూర్ నటుడిగా రాణించలేదు. దర్శకుడిగా, నిర్మాతగా కూడా ఫ్లాప్ అయ్యాడు. ఆల్కహాల్‌కు బానిసయ్యి 58 ఏళ్లకు మంగళవారం (ఫిబ్రవరి 9)న హార్ట్ ఎటాక్‌తో మరణించాడు. ఒక ఇంట పుట్టినవారందరికీ ఒకే రకమైన అదృష్టం దక్కాలని లేదు. కొందరు లేస్తారు. కొందరు పడతారు. పృథ్వీరాజ్ కపూర్‌కు జన్మించిన ముగ్గురు కుమారుల్లో రాజ్ కపూర్ ఒక్కడే వెంటనే హిట్ హీరో అయ్యాడు. షమ్మీ కపూర్, శశికపూర్ చాలా స్ట్రగుల్ చేయాల్సి వచ్చింది. స్ట్రగుల్ చేసి నిలబడ్డారు. కాని రాజ్‌కపూర్‌కు జన్మించిన ముగ్గురు కొడుకుల్లో రిషి కపూర్ ఒక్కడే హిట్ హీరో అయ్యాడు. రణ్‌ధీర్ కపూర్ కాలేకపోయాడు. స్ట్రగుల్ చేసి నిలబడలేకపోయాడు. అలాగే ఆఖరు కొడుకు రాజీవ్ కపూర్ కూడా హిట్ హీరో కాలేకపోయాడు. స్ట్రగుల్ చేసి నిలబడలేకపోయాడు. రాజీవ్ కపూర్‌ను అందరూ చింపూ కపూర్ అని పిలిచేవారు. 20 ఏళ్లు వచ్చేసరికి బాలీవుడ్లో అతన్ని హీరోగా పెట్టి సినిమాలు తీయడం మొదలెట్టారు. అతని మొదటి సినిమా ‘ఏక్ జాన్ హై హమ్’ (1983). ఆ సినిమాలో షమ్మీ కపూర్ అతనికి తండ్రిగా నటించాడు. సినిమాలో రాజీవ్ కపూర్ కూడా అచ్చు షమ్మీ కపూర్లానే ప్రేక్షకులకు కనిపించాడు. షమ్మీ కపూర్‌ను నటనలో అనుకరించడంతో రాజీవ్ కపూర్ మీద షమ్మీ కపూర్ నకలు అనే ముద్రపడింది. దాంతో 1985 లో అతణ్ణి గట్టెక్కించడానికి రాజ్‌కపూర్ రంగంలోకి దిగాడు. తను తీస్తున్న ‘రామ్ తేరి గంగా మైలీ’లో హీరోగా బుక్ చేశాడు. ఆ సినిమాలో మందాకిని హీరోయిన్. పాటలు రవీంద్ర జైన్ చేశాడు. జలపాతంలో అర్ధనగ్నంగా ఛాతీ కనిపించేలా మందాకిని చేసిన పాట దుమారం రేపింది. సినిమా పెద్ద హిట్ అయ్యింది. అంతే కాదు రాజీవ్ కపూర్ మీద ఉన్న షమ్మీ కపూర్ ముద్రను చెరిపేసింది. ఆ తర్వాత రాజీవ్ కపూర్ ‘ఆస్మాన్’, ‘జబర్దస్త్’లాంటి సినిమాలు చేశాడు. ఏవీ ఆడలేదు. ‘హెన్నా’ సినిమా సగంలో ఉండగా రాజ్‌కపూర్ మరణించగా రణ్‌ధీర్ కపూర్ దర్శకత్వం వహించాడు. రాజీవ్ కపూర్ నిర్మాతగా వ్యవహరించాడు. ‘హెన్నా’ హిట్ అయ్యింది. ఆ తర్వాత రాజీవ్ కపూర్ ‘ప్రేమ్‌గ్రంథ్’ సినిమాకు దర్శకత్వం వహించాడు. అది ఫ్లాప్ అయ్యింది. రిషి కపూర్‌ను దర్శకుడుగా పెట్టి ‘ఆ అబ్ లౌట్ చలే’ నిర్మించాడు. అదీ ఆడలేదు. ఆ తర్వాత రాజీవ్ కపూర్ ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. రాజీవ్ కపూర్ పూణెలో తన బంగ్లాలో నివసించేవాడు. అతని పెళ్లి ఆర్తి సబర్వాల్ అనే ఆర్కిటెక్ట్‌తో 2001లో జరిగింది. అయితే రెండేళ్లకు మించి ఆ వివాహం నిలువలేదు. 2003లో వాళ్లు డివోర్స్ తీసుకున్నారు. గత సంవత్సరం లాక్డౌన్ వచ్చాక రాజీవ్ కపూర్ ముంబై చెంబూర్‌లోని రణ్‌ధీర్ కపూర్ దగ్గరకు వచ్చి నివసించ సాగాడు. హార్ట్ఎటాక్ వచ్చినప్పుడు రణ్‌ధీర్ కపూరే ఆస్పత్రిలో చేర్చాడు. కాని ఫలితం లేకపోయింది. కపూర్ ఫ్యామిలీని విషాదంలో ముంచుతూ రాజీవ్ కపూర్ వీడ్కోలు తీసుకున్నాడు. చదవండి: ఆమిర్ ఖాన్ అందుకే మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఉత్తరాఖండ్ విలయం.. గొంతెత్తిన దియా మిర్జా -
రిషికపూర్ నా ప్రాణదాత
రిషికపూర్, పద్మినీ కొల్హాపూరి అనగానే ట్రైన్ మీద సాగే ‘హోగా తుమ్ సే ప్యారా కౌన్.. హే కంచన్’ పాట గుర్తుకొస్తుంది. ‘జమానే కో దిఖానాహై’, ‘ప్రేమ్‌రోగ్’, ‘హవాలాత్’ తదితర సినిమాల్లో వీరు నటించి హిట్ పెయిర్‌గా గుర్తింపు పొందారు. ఇటీవల ‘ఇండియన్ ఐడెల్ 12’ ఎపిసోడ్ కోసం పాల్గొన్న (ఈ శనివారం టెలికాస్ట్ అవుతుంది) పద్మినీ కొల్హాపురి రిషి కపూర్‌ను తలుచుకొని భావోద్వేగానికి లోనయ్యారు. ‘జమానే కో దిఖానాహై సినిమా సెట్లో, ఆ తర్వాత ప్రేమ్‌రోగ్ సెట్లో అగ్నిప్రమాదం జరిగింది. రెండుసార్లూ రిషి కపూర్ నన్ను కాపాడారు. ఆయన చాలామంచి మనిషి. ఎదుటివాళ్లకు సాయం చేయడానికి తప్పకుండా ముందుండేవారు. ఆయన మనందరికి దూరం కావడం బాధాకరం’ అని చెప్పి కళ్లనీళ్ల పర్యంతం అయ్యారు. పద్మినీ కొల్హాపురి ఒక కాలంలో అత్యంత బిజీ హీరోయిన్గా బాలీవుడ్లో వెలిగారు. 1985లో ఆమె, మిథున్ చక్రవర్తి నటించిన ‘ప్యార్ ఝక్తా నహీ’ అతి పెద్ద హిట్‌గా నిలిచింది. తెలుగులో ఇది కృష్ణ, శ్రీదేవిల ‘పచ్చని కాపురం’గా వచ్చింది. పద్మినీ కొల్హాపురి నటి శ్రద్ధా కపూర్‌కు పిన్ని. పద్మిని అక్కను నటుడు శక్తికపూర్ వివాహం చేసుకున్నాడు. -
రిషీ బదులు రావల్
బాలీవుడ్ సీనియర్ సూపర్ స్టార్ రిషీ కపూర్ గత ఏడాది మరణించిన సంగతి తెలిసిందే. అయన పూర్తి చేయని చిత్రాన్ని పూర్తి చేయడానికి మరో స్టార్ యాక్టర్ సిద్ధమయ్యారు. రిషీ కపూర్ ప్రధాన పాత్రలో గత ఏడాది ఆరంభమైన చిత్రం ‘శర్మాజీ నమ్కీన్’. హితేష్ భాటియా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కథ అరవై ఏళ్ల శర్మాజీ అనే వ్యక్తి జీవితం చూట్టూ తిరుగుతుంది. ఆ పాత్రను రిషీ కపూర్ అంగీకరించారు. అయితే ఇంకా సినిమా చిత్రీకరణ పూర్తి కాలేదు. ఈలోగా రిషీ కపూర్ మరణించారు. ఇప్పుడు ఆయన పాత్రలో పరేష్ రావల్ నటించి, ఆ సినిమాను పూర్తి చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ తిరిగి ప్రారంభం కానుంది. ఈ సినిమాను రిషీ కపూర్ పుట్టినరోజున (సెప్టెంబర్ 4) థియేటర్స్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. -
పగిలిన గుండెలో జీవించే ఉన్నావు నాన్నా!
సరస సంగీతమయ కథానాయకుడుగా బాలీవుడ్‌ను అలరించిన అలనాటి హీరో రిషి కపూర్ 68వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన కుమార్తె రిధిమా కపూర్ సాహ్ని తండ్రిని గుర్తు చేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘నాన్నా.. మనం ఎవరినైనా కోల్పోయినపుడు, వాళ్లను వదిలి జీవించలేమని.. గుండె పగిలిపోతుందని అంటూ ఉంటారు! అయితే ఈ ముక్కలైపోయిన హృదయంలోనే నువ్వు జీవించి ఉన్నావని.. ఎప్పటికీ అలాగే ఉంటావని నాకు తెలుసు! నువ్వు మమ్మల్ని కాచుకునే ఉంటావని నాకు తెలుసు.. నువ్వు మాకు నేర్పిన విలువల్లో బతికే ఉంటావని తెలుసు! దయ కలిగి ఉండే గుణాన్ని నాకు బహుమతిగా ఇచ్చావు- బంధాల విలువను తెలియజేశావు, ఈరోజు నేనిలా ఉన్నానంటే దానికి కారణం నువ్వే! నిన్న ప్రతిరోజూ మిస్పవుతూనే ఉన్నా, ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నా! నేడే కాదు.. ఎప్పటికీ నువ్వు నాతోనే ఉంటావు- హ్యాపీ బర్త్‌డే’’ అంటూ తండ్రి పట్ల తనకున్న ప్రేమానురాగాలను వ్యక్తం చేశారు. తల్లిదండ్రులతో తనకున్న అనుబంధాన్ని ప్రతిబింబించేలా ఉన్న ఫొటోలు ఈ సందర్భంగా షేర్ చేశారు.(చదవండి: స్పెషల్ స్టోరీ: సరస సంగీతమయ కథానాయకుడు) కాగా కాన్సర్ బారిన పడిన రిషి కపూర్ ఈ ఏడాది ఏప్రిల్ 30న ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ ఆస్పత్రిలో కన్నుమూసిన విషయం విదితమే. ఆ సమయంలో ఢిల్లీలో అత్తవారింట్లో ఉన్న రిధిమ లాక్డౌన్ కారణంగా తండ్రి అంతిమ చూపనకు కూడా నోచుకోలేపోయారు. లాక్డౌన్ నిబంధనల ప్రకారం సాయంత్రం 5 గంటలలోపే అంత్యక్రియలు ముగించాలని పోలీసులు సూచించడంతో ఢిల్లీ నుంచి బయలుదేరిన రిధిమా ముంబై చేరుకోక ముందే.. రిషి అంత్యక్రియలు ముగిశాయి. దీంతో ఆమె ఫేస్‌టైంలో వీడియో ద్వారా తండ్రికి అంతిమ వీడ్కోలు పలికారు. ఇక కోవిడ్ కారణంగా.. కేవలం 20 మందికే అనుమతి ఉన్న నేపథ్యంలో రిషి కుమారుడు రణబీర్‌కపూర్, భార్య నీతూకపూర్, సోదరి రీమా జైన్, మనోజ్ జైన్, ఆర్మాన్, నటులు సైఫ్ అలీఖాన్, అభిషేక్ బచ్చన్, కరీనా కపూర్, అలియా భట్, అనిల్ అంబానీ, అయాన్ ముఖర్జీ వంటి కొద్దిమంది మాత్రమే ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. -
అమ్మకు తోడు
'డిప్రెషన్’ గురించి ఇప్పుడు చర్చ ఎక్కువగా నడుస్తోంది. మనసులోకి వెలితి ఎప్పుడు అడుగు పెడుతుందో తెలియదు. ముఖ్యంగా అయినవారిని కోల్పోయినప్పుడు. రిషి కపూర్ మరణంతో నీతూ కపూర్ కచ్చితంగా ఒక ఖాళీని అనుభూతి చెందుతూ ఉంటుంది. అందుకే కుమార్తె రిథిమ కపూర్ తండ్రి మరణించినప్పటి నుంచి తన అత్తవారిల్లు ఢిల్లీని వదిలి ఆమెతోనే ఉంటోంది. అంతే కాదు ఇప్పుడు తల్లికి ఒక కుక్కపిల్లను బహూకరించింది. నీతూసింగ్ ఆ కుక్క పిల్లను తన కుటుంబ సభ్యునిగా సంతోషంగా స్వీకరించింది. అంతేకాదు, దానికి ‘డూడుల్ కపూర్’ అని పేరు కూడా పెట్టుకుంది. దేనికీ ఏదీ ప్రత్యామ్నాయం కాదు. కాని మనసును దారి మళ్లించడానికి ప్రతిదీ ఉపయోగపడుతుంది. డిప్రెషన్లో ఉన్నవారిని పూలతోట పెంచమని అంటూ ఉంటారు. కుక్కపిల్లలను పెంచుకోవడం కూడా యాంటీ డిప్రెసెంటే. నీతూకు ఈ కుక్కపిల్ల మంచి ఓదార్పు కానుంది.(ఐ వాన్న అన్‌ఫాలో యు) -
బాలీవుడ్ నటుడిపై కేసు నమోదు
ముంబై : బాలీవుడు నటుడు కమల్ ఆర్ ఖాన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల మృతిచెందిన బాలీవుడ్ దిగ్గజ నటులు రిషీ కపూర్, ఇర్ఫాన్ ఖాన్‌లను అవమానించే రీతిలో సోషల్ మీడియాలో కామెంట్లు చేశారనే ఫిర్యాదుతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రిషీ కపూర్, ఇర్ఫాన్ ఖాన్‌లపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కమల్‌పై చర్యలు తీసుకోవాలని యువసేన కోర్ కమిటీ మెంబర్ రాహుల్ కనాల్ బాంద్రా సబ్అర్బన్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. రిషీ కపూర్ హాస్పిటల్ చేరిన రోజున.. ‘త్వరలోనే వైన్ షాప్‌లు తెరుచుకోనున్నాయి.. అప్పటివరకు ఆయన మరణించకూడదు’ అని కమల్ ట్వీట్ చేశారు. మరోవైపు ఇర్ఫాన్ ఖాన్‌ను కూడా అవమానపరిచేలా కమల్ వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఓ సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ..‘ ఇటీవ మరణించిన ఇద్దరు బాలీవుడ్ నటులను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన కమల్ ఆర్ ఖాన్‌పై సెక్షన్ 294 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. ఈ కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతుంది’ అని తెలిపారు.(చదవండి : నా భర్త ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడో కదా??) -
నన్ను ఊసరవెల్లి అని పిలుస్తారు: జాన్వీ
దివంగత నటి శ్రీదేవీ పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో క్వారంటైన్ క్లిప్‌ను షేర్ చేసింది. ఇందులో తను చిన్న వయసులో అమ్మ చేయి పట్టుకుని నడుస్తున్న వీడియో మొదలు ఇప్పటివరకు దిగిన ఫొటోలు, వీడియోలు అన్నింటినీ ఒకే దగ్గర చేర్చింది. ఈ దృశ్య మాలికకు తను వాయిస్ ఓవర్ అందించింది. ఈ వీడియోలో జాన్వీ తన తల్లి శ్రీదేవీ పక్కన అమ్మకూచిలా కనిపిస్తుంటే, తండ్రి బోనీ కపూర్ దగ్గర గారాలు పోతోంది. ఇక చెల్లి ఖుషీ కపూర్‌తో కుప్పిగంతులేస్తోంది. అల్లరి పిల్లగా అలరిస్తోంది. ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేస్తోంది. బాల్యంలోనైనా, ఇప్పటికైనా డ్యాన్స్‌ను విడవనంటోంది. ఇక ఈ వీడియో జాన్వీ కపూర్ ఎవరు? అన్న ప్రశ్నతో ప్రారంభం అవుతుంది. మళ్లీ తనే ఫ్లాష్ బ్యాక్‌కు వెళ్లి.. "నాలో అమ్మ, నాన్న, చెల్లి అందరూ ఉన్నారు. నేను ఒక్కో పరిస్థితుల్లో ఒక్కోలా మారిపోతాను. దీన్ని నా స్నేహితులు ఊసరవెల్లి అంటారు. (అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చిన లారా దత్తా) నేను బిజీగా ఉంటాను, ప్రయాణాలు చేస్తాను. కాబట్టి నేను ఆశించినంతగా కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం లేదు. నాన్న ఒంటరిగా ఉన్నాడు. ఆయనకు నేనింకా ఎక్కువ సమయం కేటాయించాలి. కానీ ఇప్పుడున్న లాక్డౌన్ వల్ల అది సాధ్యం అవట్లేదు. మీరే మూడో వ్యక్తిగా మారి మీ జీవితాల్ని తరచి చూసుకోండి. నాకు నేను ఎక్కువ సమయం కేటాయించుకోవడం వల్ల మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకున్నాను. కాబట్టి అందరూ పాజిటివ్‌గా ఉండండి. ఇంట్లో కుటుంబంతో కలిసి ఉండటాన్ని అదృష్టంగా భావించండి. మీరు బయటకు వెళ్లలేకపోతే ఇంట్లోకే అడుగులు వేయండి" అంటూ వీడియోను ముగించింది. కాగా జాన్వీ ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉంది. (వైరల్.. వేదికపై డ్యాన్స్ చేసిన జాన్వి) -
అంబానీ కుటుంబానికి కృతజ్ఞతలు: నీతూ కపూర్
పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కుటుంబానికి దివంగత నటుడు రిషి కపూర్ భార్య నీతూ కపూర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ముఖేష్ అంబానీ దంపతులతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా అంబానీ కుటుంబం తమకందించిన సహాయాన్ని గుర్తుచేసుకుంటూ నీతూ భావోద్వేగానికి లోనయ్యారు. అలాగే రెండేళ్లుగా లుకేమియాతో పోరాడుతున్న రిషి కపూర్‌కు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ‘‘గత రెండేళ్లు మాకు, కుటుంబానికి చాలా పెద్ద జర్నీ. ఎన్నో మధుర క్షణాలు, కొన్ని కష్టతరమైన రోజులు కూడా ఉన్నాయి. ఇది భావోద్వేగంతో కూడుకొని ఉన్న సమయం. కష్ట సమయంలో అంబానీ కుటుంబం చూపించిన అమితమైన ప్రేమ వెలకట్టలేనిది. మమ్మల్ని అనేక విధాలుగా జాగ్రత్తగా చూసుకున్నారు. అంబానీ కుటుంబం నుంచి ఎంతో మద్దతు లభించింది. కష్ట కాలంలో ఆ కుటుంబం మాకెంతో సహకరించింది. (మీరందరూ సూపర్ హీరోలే: అనిల్ కపూర్) ‘‘గత ఏడు నెలలుగా రిషి అరోగ్యం బాగోలేదు. ఆ సమయంలో అంబానీ కుటుంబమంతా ఆయన్ను అన్ని విధాలుగా జాగ్రత్తగా చూసుకున్నారు. తన ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తూ.. రిషి బాధను పొగొట్టడానికి ప్రయత్నించారు. రిషి ఆస్పత్రిలో ఉన్నప్పుడు కుటుంబమంతా వచ్చి పలకరించారు. రిషిపై, మా కుటుంబంపై ఎంతో ప్రేమను కురిపించారు. రిషి వెంటిలేటర్‌పై ఉండి మేము భయపడుతున్న సందర్భంలో మమ్మల్ని ఓదార్చారు. మీపై ఉన్న అభిమానాన్ని మాటల్లో చెప్పలేం. మీరు చూపించిన నిస్వార్థ ప్రేమకు, అంతులేని ఆప్యాయతకు కృతజ్ఞతలు. మీలాంటి వారు మాకు తోడుగా ఉన్నందుకు మేము అదృష్టంగా భావిస్తున్నాం. రిధిమ, రణబీర్ కపూర్.. మొత్తం కపూర్ కుటుంబం తరుఫున అంబానీ కుటుంబానికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం’’ అంటూ తన మనుసులోని మాటను నీతూ కపూర్ చెప్పుకొచ్చారు. (‘నా ప్రేయసితో బ్రేకప్ అయినపుడు నీతూ సాయం చేసింది’) -
‘రిషి కపూర్ చివరి చిత్రం పూర్తిచేస్తాం’
సాక్షి, ముంబై: బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్ లేరనే వార్తను ఇప్పుడిప్పుడే జీర్ణించుకుంటున్న ఆయన అభిమానులకు నిర్మాతలు రితేష్ సిధ్వానీ, ఫర్హాన్ అక్తర్‌లు కాస్త స్వాంతన కలిగించే వార్త తెలిపారు. షూటింగ్ తుది దశలో ఉన్న రిషి కపూర్ చివరి చిత్రం ‘శర్మాజీ నమ్కీన్’ మిగిలిన షూటింగ్ పూర్తిచేసి విడుదల చేయాలని అనుకుంటున్నారు. అంతేకాకుండా ఈ చిత్రాన్ని రిషి కపూర్‌కు అంకితమివ్వాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే.. రిషి కపూర్‌ను చివరిసారిగా తెరపై చూసే అవకాశం అందరికీ లభించనుంది. ‘మరో రెండు రోజులు షూటింగ్లో పాల్గొంటే ఈ చిత్రం పూర్తయ్యేదని కాని అప్పటికే ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడంతో షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఆయన అకాల మరణం మమ్మల్ని ఎంతగా కలచివేసింది. అయితే ఈ చిత్రాన్ని ఎలాగైనా పూర్తి చేసి ఆయనకు అంకితం ఇవ్వాలని అనుకుంటున్నాం. అయితే ఆయన లేకుండా ‘శర్మాజీ నమ్కీన్’ ఎలా పూర్తి చేస్తారో తెలుసుకోవాలంటే థియేటర్లలో సినిమా చూడాల్సిందే’అని దర్శకనిర్మాతలు పేర్కొంటున్నారు. రిషి కపూర్, జూహీ చావ్లా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి హితేష్ భాటియా దర్శకత్వం వహిస్తున్నారు. చదవండి: వైరలవుతున్న రిషి కపూర్ వీడియో నా జీవితంలోకి ప్రేమను తెచ్చారు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1361281962.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మన కథ ముగిసింది: నీతూ కపూర్
బాలీవుడ్ నటుడు రిషీ కపూర్ క్యాన్సర్‌తో రేండేళ్లుగా పోరాటం చేసి చివరకు గురువారం ఉదయం మృతి చెందారు. కాగా ఆయన భార్య నితూ కపూర్ ఆయనకు వీడ్కోలు చెబుతూ భావోద్వేగ పోస్టును శనివారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. మందు గ్లాసు పట్టుకుని.. చిరునవ్వు చిందిస్తున్న రిషీ కపూర్ ఫొటోకు ‘మన కథ ముగిసింది’ అంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ఇక ఆమె పోస్టు చూసిన నెటిజన్లు రిషీ కపూర్‌కు సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తున్నారు. కాగా రిషీ, నీతూ కపూర్లు కలిసి నటించిన 1974 చిత్రం ‘జరీలా ఇన్సాన్’ సెట్స్‌లో వారికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమలో పడిన వీరిద్దరూ 1980లో వివాహం చేసుకున్నారు. (చింటూ అంకుల్.. మిమ్నల్ని మిస్సవుతున్నా) View this post on Instagram End of our story ❤️❤️ A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on May 1, 2020 at 11:20pm PDT రిషీ కపూర్, నీతూ కపూర్లు కలిసి ‘ఖేల్ ఖేల్ మేన్’, ‘రఫో చక్కర్’, ‘కబీ కబీ’, ‘అమర్ అక్బర్ ఆంటోని’, ‘దునియా మేరీ జబ్ మేన్’, ‘జిందా దిల్’ వంటి ఎన్నో సినిమాల్లో నటించారు. ఇక వివాహం ఆనంతరం ‘లవ్ ఆజ్ కల్’, ‘దో ధూనీ చార్’, ‘జబ్ తక్ హై జాన్’ ‘బేషరం’ వంటి సినిమాలు చేశారు. ఇక బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకోనే రాబోయే రీమేక్ ‘అన్నే హాత్వే’ చిత్రంతో పాటు పలు సినిమాలకు ఆయన సంతకాలు చేసినట్లు సమాచారం. కాగా ‘నన్ను తలచుకుంటే ముఖంపై చిరునవ్వు రావాలి తప్ప కన్నీరు రావద్దు’ అన్న రిషీ కపూర్ చివరి కోరికను వెల్లడిస్తూ కుటుంబ సభ్యులు లేఖను విడుదల చేసిన విషయం తెలిసిందే. రేండేళ్లుగా బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ రిషీ కపూర్.. సంవత్సరం పాటు అమెరికాలో క్యాన్సర్‌కు చికిత్స చేయించుకుని తిరిగి గతేడాది సెప్టెంబర్‌లో ఇండియాకు వచ్చారు. ఈ క్రమంలో ఆయన గురువారం(ఏప్రిల్ 30)న తుదిశ్వాస విడిచారు. అదే రోజు కుటుంబ సభ్యులు, కొద్ది మంది సన్నిహితుల మధ్య ఆయన అంత్యక్రియలు ముగిశాయి. (తండ్రి మరణంపై రిధిమా భావోద్వేగం..) ‘నా ప్రేయసితో బ్రేకప్.. నీతూ సాయం కోరాను’ -
‘చింటూ అంకుల్.. మిమ్నల్ని మిస్సవుతున్నా’
ముంబై : బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషీ కపూర్ మరణంతో కపూర్ కుటుంబం సహా దేశమంతా దిగ్భ్రాంతికి లోనయింది. చాకొలెట్ బాయ్‌తో తమ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ పలువురు సోషల్ మీడియాలో అప్పటి ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. ఇక కరిష్మా కపూర్ తండ్రి రణధీర్ కపూర్ బర్త్‌డే సంర్భంగా రిషీతో కపూర్ కుటుంబ సభ్యులందరూ ఉన్న ఫోటోను కరిష్మా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోకు ఫ్యామిలీ అనే క్యాప్షన్ ఇస్తూ హార్ట్ సింబల్‌ను జత చేశారు. అంతకుముందు తాత రాజ్ కపూర్, చిన్నాన్న రిషీ కపూర్‌తో తన చిన్ననాటి ఫోటోను కరిష్మా షేర్ చేశారు. ‘చింటూ అంకుల్ మీతో ఇక రెస్టారెంట్లు, వంటకాల గురించి డిస్కస్ చేయడం మిస్సవుతా’నంటూ కరిష్మా ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు. చదవండి : అందుకే ఆసుపత్రిలో ‘రిషి’ని చూడలేదు: అమితాబ్ -
అందుకే ఆసుపత్రిలో ‘రిషి’ని చూడలేదు: అమితాబ్
‘ఎప్పుడు చిరునవ్వుతో ఉండే రిషి కపూర్ ముఖంపై నేను బాధను చూడాలని అనుకోలేదు. అందుకే రిషి కపూర్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు తనను చూడడానికి వెళ్లలేదు’ అని అమితాబ్ బచ్చన్ వెల్లడించాడు. అతని చివరి క్షణాలలో కూడా ముఖంపై చిరునవ్వుతోనే వెళ్లి ఉంటాడని భావిస్తున్నాను అని ఆయన అన్నారు. ఇక బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్(67) గురువారం ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో పోరాడిన ఆయన ముంబైలోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. చాకొలెట్బాయ్ రిషి కపూర్ మరణించడంతో బాలీవుడ్ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రతి ఒక్కరు రిషితో తమకు ఉన్నఅనుబంధాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. లాక్డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో రిషి కపూర్ అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు, కొంతమంది స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. కూతురు రిధియా తండ్రిని చివరిచూపు చూడకుండానే ముంబైలోని చందన్వాడి శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. (మే 17 వరకు లాక్డౌన్ పొడగింపు) ఈ క్రమంలో శుక్రవారం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ రిషి కపూర్ మరణంపై సంతాపం ప్రకటించారు. ఈ మేరకు బిగ్ బీ తన బ్లాగ్‌లో రిషి కపూర్ గురించి రాసుకొచ్చారు. మిస్టర్ కపూర్‌తో తన తొలి సమావేశాల గురించి, ఆర్కె స్టూడియోలో గడిపిన సందర్భాల గురించి తెలిపారు. రిషి కపూర్ నడక, డైలాగ్ డెలివరీ, లిప్-సింకింగ్, అద్బుత సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటూ ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తారు. రిషి కపూర్ , అమితాబ్ ఇద్దరూ కభీ-కభీ, అమర్, అక్బర్, ఆంథోనీ, నసీబ్, కూలీ, 102 నాట్ ఔట్.. ఇలా 77 సినిమాల్లో కలిసి నటించారు. అయితే రిషి కపూర్ మరణంతో అమితాబ్ చలించిపోయారు. అందుకే రిషి కపూర్ అంత్యక్రియలకు కూడా ఆయన హాజరు కాలేదు. తన కొడుకు, నటుడు అభిషేక్ బచ్చన్ వెళ్లారు. (‘ప్రభాస్-అమీర్‌లతో మల్టీస్టారర్ చిత్రం చేయాలి’ ) -
సర్గమ్ షూటింగ్ గోదారి తీరానే..
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం కల్చరల్: అలనాటి హిందీ రొమాంటిక్ హీరో హిందీ నటుడు రిషీకపూర్ ఇక లేరన్న వార్త గోదావరి తీర కళాభిమానుల్లో విషాదాన్ని నింపింది. ‘హమ్ తుమ్ ఏక్ కమరేమే బంద్‌హో’ అంటూ డింపుల్ కపాడియాతో కలిసి యువతరం గుండెల్లో అలజడి లేపారు. రిషీకపూర్ 1979లో కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో సర్గమ్ (సిరిసిరిమువ్వహిందీ వెర్షన్) షూటింగ్ రాజమహేంద్రవర పరిసర ప్రాంతాల్లో జరిగింది. ఒక్కో షెడ్యూల్లో 20 రోజుల చొప్పున, రెండు షెడ్యూళ్లలో, మొత్తం 40 రోజుల్లో ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. రిషికపూర్ రాజమండ్రిలోని నాటి ప్రసిద్ధ హోటల్ అప్సరాలో బస చేశారు. తెలుగులో సిరిసిరిమువ్వలాగే, హిందీలో సర్గమ్ కూడా ఘన విజయం సాధించడం, తెలుగు సినిమా చిత్రీకరణ జరుపుకున్న లొకేషన్లలోనే హిందీ సినిమా షూటింగ్ జరుపుకోవడం విశేషం.(వైరలవుతున్న రిషి కపూర్ వీడియో) ‘‘ఆయన ఎంతో ఆత్మీయంగా మెలిగే వారు. ఈ చిత్రంలో రాజమండ్రికే చెందిన జయప్రద హీరోయిన్. సర్గమ్ షూటింగ్ జరుగుతున్న సమయంలో, నేను రాజమండ్రి అప్సరా హోటల్లో హీరో రిషీకపూర్, నిర్మాత ఎన్.ఎన్.సిప్పీలను కలుసుకున్నాను. గోదావరి అందచందాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని రిషీకపూర్ అన్నారు. ఆయన మరణం చిత్రసీమకు తీరని లోటు. – శ్రీపాద జిత్‌మోహన్ మిత్రా, నటుడు, గాయకుడు -
వారిద్దరిని మిస్సవుతున్నాం: అమెరికా దౌత్యవేత్త
వాషింగ్టన్: బాలీవుడ్ దిగ్గజ నటులు రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్ మరణం పట్ల అమెరికా దక్షిణ-మధ్య ఆసియా వ్యవహారాల తాత్కాలిక సహాయక కార్యదర్శి అలైస్ వెల్స్ సంతాపం ప్రకటించారు. వీరిద్దరు భారతీయులతో పాటు ప్రపంచ సినీ ప్రేమికులను తమ నటనతో కట్టపడేశారని.. వారిని మిస్సవుతున్నామని విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు... ‘‘ఈ వారంలో ఇద్దరు బాలీవుడ్ లెజెండ్స్ ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ ఈ లోకాన్ని విడిచి వెళ్లారనే వార్త నన్ను బాధకు గురిచేసింది. తన నటనా కౌశల్యంతో అమెరికా, ఇండియాతో పాటు ప్రపంచంలోని ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు వీరిద్దరు. నిజంగా వారులేని లోటు తీర్చలేనిది’’ అని ఆమె తన అధికారిక ఖాతాలో ట్వీట్ చేశారు. (నా జీవితంలోకి ప్రేమను తెచ్చారు: అలియా భావోద్వేగం) కాగా గత రెండేళ్లుగా కాన్సర్‌తో పోరాడిన ఇర్ఫాన్ ఖాన్(53) బుధవారం ముంబైలో కన్నుమూసిన విషయం విదితమే. ఆ మరుసటి రోజే.. కాన్సర్ నుంచి కోలుకున్న రిషి కపూర్(67) శ్వాసకోశ సంబంధిత వ్యాధితో ముంబైలోని ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు దిగ్గజాలు శాశ్వత నిద్రలోకి జారిపోవడంతో సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ క్రమంలో చిత్ర, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో కడచూపునకు నోచుకోలేక పోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇర్ఫాన్ ఖాన్ లైఫ్ ఆఫ్ పై, స్లమ్‌డాడ్ మిలియనీర్ వంటి ప్రముఖ హాలీవుడ్ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. (రిషీ కపూర్ అనే నేను..) దేశ ప్రతిష్టను పెంచిన నటుడు.. పోరాడి ఓడిపోయాడు Very saddened to hear of the passing two Bollywood legends this week, Irrfan Khan @irrfank and Rishi Kapoor @chintskap. Both actors stole the hearts of audiences in America, India, and around the world and will be truly missed. AGW — State_SCA (@State_SCA) May 1, 2020 -
వైరలవుతున్న రిషి కపూర్ వీడియో
సాక్షి, ముంబై: బాలీవుడ్ స్టార్ నటుడు రిషి కపూర్ మరణం ఆయన కుటుంబానికే కాదు యావత్ సినీ ప్రపంచానికే తీరని లోటు. గురువారం ఆయన ముంబైలోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు ముంబైలోని చందన్వాడి క్రిమెటోరియమ్‌లో జరిగాయి. దీనికి కుమారుడు రణబీర్, భార్య నీతూ సింగ్, రణధీర్ కపూర్, రాజీవ్ కపూర్, సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్, అభిషేక్ బచ్చన్, ఆలియా భట్ పాల్గొన్నారు. కుమార్తె రిధిమ చివరి చూపుకు హాజరు కాలేకపోవడం విషాదం. మరోవైపు బాలీవుడ్ నటీనటులు ఆయనతో ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. (వందలమందికి ఒకే పేరు, ఒకే ఫోన్ నంబర్) ఇదిలా వుండగా రిషి కపూర్ చివరి వీడియో ఇదేనంటూ ఆయన ఆసుపత్రిలో సంభాషించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఓ వ్యక్తి "దీవానా" చిత్రంలో "తేరీ దర్ సే దిల్ అబాద్ రహా" పాటను ఆలపించాడు. బెడ్‌పై పడుకుని ఉన్న రిషి అతని పాటను ఆస్వాదించడమే కాక వెరీగుడ్ అంటూ అభినందించారు. అనంతరం అతనికి ఆశీస్సులు అందజేశారు. ఇక ఈ వీడియో గతంలో ఆసుపపత్రిలో చేరినప్పటిది అయి వుండవచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఓ ఆంగ్ల మీడియా సైతం అది పాత వీడియోనే అని తేల్చి చెప్పింది. కాగా ‘మేరా నామ్ జోకర్’తో వెండితెరకు పరిచయమైన రిషి కపూర్ గత రెండేళ్లుగా బ్లడ్ కేన్సర్‌తో బాధ పడిన విషయం తెలిసిందే. (బాబీ హీరో మరి లేడు) చదవండి: రిషీ కపూర్ అనే నేను -
లవ్ యూ అంకుల్: అలియా భావోద్వేగం
‘‘నా జీవితంలోకి ప్రేమను, మంచిని తీసుకువచ్చిన ఆ అందమైన వ్యక్తి గురించి ఏం చెప్పగలను. లెజండ్ రిషి కపూర్ గురించి ఈరోజు అందరూ మాట్లాడుతున్నారు. నేను కూడా అంతే. అయితే గడిచిన రెండేళ్లుగా ఆయన నాకు మంచి స్నేహితుడు అయ్యారు. నాలాగే ఆయన చైనీస్ ఫుడ్ లవర్. సినిమా ప్రేమికుడు. యుద్ధవీరుడు. నాయకుడు. అందమైన కథకుడు. గొప్ప ట్వీటర్. అంతేకాదు తండ్రి కూడా! ఈ రెండేళ్లలో ఆయన నుంచి నేను పొందిన ప్రేమ.. ఆత్మీయ ఆలింగనాలు నా మదిలో నిలిచిపోతాయి! అంత గొప్ప అదృష్టాన్ని నాకు ఇచ్చిన విశ్వానికి ధన్యవాదాలు. ఈరోజు చాలా మంది ఆయన తమ కుటుంబ సభ్యుడి లాంటివారని అంటున్నారు. ఆయన మిమ్మల్ని అలా ఫీలయ్యేలా చేశారు! లవ్ యూ రిషీ అంకుల్! మిమ్మల్ని మిస్ అవుతున్నాం! మీరు మీలా ఉన్నందుకు కృతజ్ఞతలు’’ అంటూ బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ లేఖ షేర్ చేశారు. రిషి కపూర్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన ఆమె.. ఆయనపై తనకున్న అభిమానాన్ని లేఖ ద్వారా చాటుకున్నారు. అంతేగాక రిషి రణ్‌బీర్ కపూర్‌ను ఒడిలో కూర్చోబెట్టుకున్న మరో ఫొటోను షేర్ చేసి.. బ్యూటిఫుల్ బాయ్స్ అంటూ క్యాప్షన్ జత చేశారు. అదే విధంగా నీతూ, రిషిల పాత ఫొటోను అభిమానులతో పంచుకున్నారు అలియా. (బాబీ హీరో మరి లేడు) ఇక ఇందుకు స్పందించిన రిషి కపూర్ భార్య నీతూ కపూర్ అలియాకు ‘‘లవ్ యూ’’ అంటూ బదులిచ్చారు. కాగా రిషి కపూర్ తనయుడు, బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో అలియా భట్ ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు ప్రచారమవుతున్న సంగతి తెలిసిందే. తరచుగా డిన్నర్ డేట్లు, ఫ్యామిలీ గెట్ టుగెదర్లతో భట్, కపూర్ కుటుంబాలు చేస్తున్న హంగామా వీటికి బలం చేకూర్చింది. నీతూ కపూర్‌తో రిషి కూడా అలియాపై ప్రత్యేక అభిమానం చూపేవారు. అంతేకాదు ‘కపూర్ అండ్ సన్స్’ సినిమాలో రిషి కపూర్‌తో అలియా కలిసి నటించారు కూడా. అప్పటి నుంచి ఆయనతో బంధం బలపడిందన్న అలియా... రిషి తన తండ్రిలాంటి వారని పలు సందర్భాల్లో చెప్పారు. ఈ క్రమంలో రణ్‌బీర్- అలియాల ప్రేమకు కపూర్, భట్ ఖాన్దాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ త్వరలోనే వారు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారంటూ రాలియా అభిమానులు సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. ఇప్పుడు రిషి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో.. కొడుకు ఒక ఇంటివాడు కాకముందే అలనాటి చాకొలెట్ బాయ్ కుటుంబాన్ని వీడి వెళ్లారంటూ విషాదంలో మునిగిపోయారు. (సరస సంగీతమయ కథానాయకుడు) View this post on Instagram ❤️❤️❤️ A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) on Apr 30, 2020 at 7:15am PDT -
బాబీ హీరో మరి లేడు
‘మై షాయర్ తో నహీ’... అంటూ 1970లలో ‘బాబీ’ సినిమా ద్వారా కుర్రకారును ఉర్రూతలూగించిన రిషి కపూర్ (67) బుధవారం అభిమానుల నుంచి శాశ్వత వీడ్కోలు తీసుకున్నాడు. రంగు రంగుల ఉన్ని జెర్సీలు, స్వెటర్లు మారుస్తూ అందమైన పాటలు పాడుతూ ప్రేక్షకులను అలరించిన రిషి కపూర్ ఈ కరోనా కాలంలో చివరి చూపుకు కూడా వీలు ఇవ్వకుండా ఒక కలలాగా తరలి వెళ్లిపోయాడు. గత రెండేళ్లుగా ఆయన బ్లడ్ కేన్సర్‌తో బాధ పడుతున్నాడు. అమెరికాలో చాలా కాలం ఉండి వైద్యం చేయించుకుని 2019 సెప్టెంబర్‌లో తిరిగి వచ్చాడు. అప్పటినుంచి ముంబైలోనే అదే ఉత్సాహంతో కేన్సర్‌ని జయిస్తానన్న ధీమాతో కుటుంబాన్ని, మిత్రులను ఉత్సాహ పరుస్తూ వచ్చిన రిషి కపూర్ ఆస్పత్రిలో చేరిన ఒకరోజులోనే తుది శ్వాస విడిచాడు. ఆయన భార్య నీతూ సింగ్ ప్రసిద్ధ నటి. కుమారుడు రణబీర్ కపూర్ బాలీవుడ్ టాప్‌స్టార్. కుమార్తె రిధిమ వివాహం చేసుకుని ఢిల్లీలో స్థిరపడింది. ‘మేరా నామ్ జోకర్’లో తన తండ్రి రాజ్‌కపూర్ ద్వారా తెర పరిచయం అయిన రిషి కపూర్ ఆ తర్వాత తండ్రి ద్వారానే ‘బాబీ’ సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ అయ్యాడు. 1973–95ల మధ్య రిషి కపూర్ బిజీస్టార్‌గా నిలిచాడు. రాజ్‌కపూర్ తన ముగ్గురు కుమారునూ హీరోలుగా చేద్దామని అనుకున్నా పెద్దన్న రణధీర్ కపూర్, చిన్న తమ్ముడు రాజీవ్ కపూర్ ఆ కుటుంబ పరంపరను కొనసాగించలేకపోయారు. షమ్మీ కపూర్, శశికపూర్ తర్వాత రిషి కపూరే ఆ స్థాయి హీరోగా ఎదిగాడు. రణ్‌ధీర్ కపూర్ తన తమ్ముణ్ణి ముద్దుగా పిలుచుకున్న ‘చింటూ’ అన్న పేరు స్థిరపడి చింటూ కపూర్‌గా కూడా ఆయన కొనసాగాడు. రాజ్ కపూర్ దర్శకత్వం వహించిన చివరి సినిమా ‘హెనా’లో రిషి కపూరే హీరో. అమితాబ్ బచ్చన్ ‘జంజీర్’తో, రిషి కపూర్ ‘బాబీ’తో ఒకే సంవత్సరం (1973) స్టార్‌డమ్‌ను అందుకున్నారు. అమితాబ్ అంటే రిషి కపూర్‌కు మొదట్లో వ్యతిరేకత ఉన్నా ఆ తర్వాత కలిసి నటించి ‘అమర్ అక్బర్ ఆంధోని’, ‘నసీబ్’, ‘కభీ కభీ’, ‘కూలీ’ వంటి సూపర్ హిట్స్ ఇచ్చారు. ఇటీవల ‘102 నాట్ అవుట్’లో మళ్లీ కలిసి నటించారు. రిషి కపూర్ తన కెరీర్లో తొలి కాలంలో కంటే మలి కాలంలో నటనకు అవకాశం ఉన్న సినిమాలు చేసి మెప్పించాడు. ‘కపూర్ అండ్ సన్స్’, ‘ముల్క్’, ‘డి–డే’ అతనికి అవార్డులు రివార్డులు తెచ్చిపెట్టాయి. రిషి కపూర్ తన భోజన, మద్యపాన ప్రియత్వాలను ఎప్పుడూ దాచుకోలేదు. తన ఆత్మకథ ‘ఖుల్లం ఖుల్లా’లో వాటిని వివరించాడు. రిషి కపూర్ మరణవార్త పట్ల అతని కుటుంబం ప్రకటన విడుదల చేస్తూ ‘రిషికపూర్‌ను చిరునవ్వులతో గుర్తుపెట్టుకోవాలిగానీ కన్నీళ్లతో కాదు’ అంది. రిషి కపూర్ అంత్యక్రియలు గురువారం సాయంత్రం 4.30 గంటలకు ముంబైలోని చందన్వాడి క్రిమెటోరియమ్‌లో జరిగాయి. కరోనా లాక్డౌన్ కారణాన అతి కొద్దిమందే పాల్గొన్నారు. వారిలో కుమారుడు రణబీర్, భార్య నీతూ సింగ్, రణధీర్ కపూర్, రాజీవ్ కపూర్, సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్, అభిషేక్ బచ్చన్, ఆలియా భట్ ఉన్నారు. కుమార్తె రిధిమ చివరి చూపుకు హాజరు కాలేకపోవడం విషాదం. ఆమె ఢిల్లీలో ఉన్న కారణాన రోడ్డు ప్రయాణాన బయలుదేరి రాత్రికి ముంబై చేరుకుంటారని తెలుస్తోంది. ఖవాలీ స్టార్ రిషి కపూర్ తన పాటల కోసమే కాకుండా ఖవాలీలకు కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోయాడు. హిందీ సినిమాలలోని రెండు గొప్ప ఖవాలీలు అతని మీద చిత్రీకరింప బడ్డాయి. రెంటినీ మహమ్మద్ రఫీయే పాడాడు. ‘హమ్ కిసీసే కమ్ నహీ’ సినిమాలో టైటిల్ సాంగ్‌ను ఖవాలీగా చిత్రీకరించారు. ‘ఏ అగర్ దుష్మన్’... అంటూ సాగే ఆ ఖవాలీ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. అయితే ‘అమర్ అక్బర్ ఆంధోని’లోని ‘పరదాహై పరదా’ అనే ఖవాలీ ఇంకా పెద్ద హిట్ అయ్యింది. ఇందులో అమితాబ్ కూడా రిషి కపూర్‌తో గొంతు కలుపుతాడు. ఖవాలీ వజ్రాసనంలో కూచుని పాడతారు. కాని రిషి కపూర్‌కు అలా కూచోవడం చిన్నప్పటి నుంచి రాదు. అందుకని రెండు ఖవాలీలలో అతను మోకాళ్ల మీద నిలబడి పాడటం కనిపిస్తుంది. రిషి కపూర్ వల్ల శైలేంద్ర సింగ్ సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యాడు. బాబీ నుంచి మొదలెట్టి చాలా సినిమాలకు శైలేంద్ర సింగ్ రిషి కపూర్‌కు పాడాడు. ‘హమ్‌తుమ్ ఏక్ కమరేమే బంద్ హో’... ఎంత పెద్ద హిట్టో అందరికీ గుర్తుంటుంది. -
సరస సంగీతమయ కథానాయకుడు
అతడి చూపులు ఆడపిల్లల హృదయాలను కలవరపరిచాయి. చేతివేళ్లు గిటార్ తీగలను మూర్ఛనలు పోయేలా చేశాయి. తన ఆటా మాటా పాటలతో దశాబ్దాల పాటు ప్రేక్షకులకు ప్రియతముడయ్యాడతడు. ‘చింటూ బాబా’ అని ఇండస్ట్రీ ముద్దుగా పిలుచుకున్న రిషి కపూర్ దాదాపు 50 ఏళ్ల పాటు సినిమాను తన జీవితంగా జీవితాన్ని సినిమాగా మార్చుకున్నాడు. తండ్రి రాజ్‌కపూర్ చెప్పినట్టుగా ‘షో మస్ట్ గో ఆన్’ అంటూ టార్చ్ తర్వాతి తరాలకు అందించి వీడ్కోలు తీసుకున్నాడు. ఖదీర్ ప్యార్ హువా ఇక్రార్ హువా హై ప్యార్ సే ఫిర్ క్యూ డర్ తా హై దిల్.... వాన పడుతోంది. ఉరుములు ఉరుముతున్నాయి. మెరుపులు రాజ్‌కపూర్, నర్గీస్‌లు పట్టుకున్న గొడుగును తటిల్లున మెరిపిస్తున్నాయి. ‘శ్రీ 420’ పాట చిత్రీకరణ. కథానుసారం అప్పుడే ప్రేమలో పడ్డారు వాళ్లు. ‘మనం ఉన్నా లేకపోయినా పర్వాలేదు... మన గుర్తులు మాత్రం నిలిచి ఉంటాయి’ అని చూపుడు వేలు చూపిస్తుంది నర్గీస్. ఆ క్షణాన ముగ్గురు పిల్లలు రైన్ కోట్లు వేసుకొని నడుచుకుంటూ వెళుతుంటారు. ఎనిమిదేళ్ల కుర్రాడు, ఆరేళ్ల అమ్మాయి, మరో రెండేళ్ల బుజ్జి పాపడు. ‘టేక్’ అనేంత వరకూ ఆ పాపడు గమ్మునుంటున్నాడు. ‘టేక్’ అనగానే పైపుల నుంచి వాన దుమికే సరికి భయపడి ఏడుస్తున్నాడు. ‘నువ్వు ఈసారి ఏడవకుండా నడిస్తే నీకు చాక్లెట్ ఇస్తాను’ అని నర్గీస్ అంది. చాక్లెట్ వచ్చేటట్టయితే వానలో ఏంటి... తుఫాన్లో కూడా నడవడానికి రెడీ. ఈసారి టేక్‌లో నడిచేశాడు. సినిమా, ఆ పాట సూపర్‌డూపర్ హిట్ అయ్యాయి. రిషి కపూర్ తొలిసారి అలా వెండితెర మీద తడి పాదముద్రలు వేశాడు. జీనా యహా మర్నా యహా ఇస్కే సివా జానా కహా... దాదాపు నాలుగ్గంటల నిడివి ఉన్న ‘మేరా నామ్ జోకర్’ తీస్తున్నాడు రాజ్‌కపూర్. చిన్నప్పటి జోకర్ కథ చాలా ముఖ్యమైనది. దానికి అభినయించాల్సిన నటుడు కూడా ముఖ్యమైనవాడే. ఎవరిని తీసుకోవాలి? అని రాజ్‌కపూర్‌కు సందేహం వచ్చింది. చిన్న కొడుకుతో చేయిస్తే ఎలా ఉంటుంది అని భార్యను అడిగాడు. అప్పటికి రిషి కపూర్‌కు పదమూడు పద్నాలుగేళ్ల వయసు వచ్చింది. వీడు నటుడవుతాడు అని మొదట అతని బాబాయి శశి కపూర్ కనిపెట్టాడు. అందుకు కారణం రిషి కపూర్ ఎప్పుడూ అద్దం ముందు నిలుచుని ఉండటమే. అల్లరికి విసిగి తల్లి కృష్ణ నాలుగు బాదినా ఏడ్చుకుంటూ వెళ్లి అద్దం ముందు నిలుచుకుని ఆ ఏడుపు ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండేవో చూసుకునేవాడట. తాత పృథ్విరాజ్ కపూర్ రక్తం వాడిలో ఉంది. బాబాయ్‌లు శశి, షమ్మి కపూర్లు చిన్న నటులు కాదు. మేనమామ ప్రేమనాథ్ కూడా పెద్ద నటుడు. ఇక తండ్రి సరేసరి. యాక్టింగ్ రాక ఎక్కడికి పోతుంది? ‘చదువుకు ఇబ్బంది లేకుంటే అలాగే చేయించండి’ అంది కృష్ణ. అప్పటివరకూ డైనింగ్ టేబుల్ దగ్గర బుద్ధిగా ఆ మాటలు వింటున్న రిషి మెల్లగా లేచి చేతులు కడుక్కుని తన గదిలోకి పరిగెత్తి ఆటోగ్రాఫ్ చేయడం ప్రాక్టీసు మొదలెట్టాడు... ఎలాగూ స్టార్ అయ్యాక చేయక తప్పదు కదా అని. ‘మేరా నామ్ జోకర్’ 1970లో విడుదలైంది. 2020, అంటే ఆ తర్వాతి 50 ఏళ్లు రిషి కపూర్ ఆటోగ్రాఫ్‌లు చేస్తూనే ఉన్నాడు. మై షాయర్ తో నహీ మగర్ ఏ హసీ... ‘మేరా నామ్ జోకర్’ తీవ్రంగా ఫ్లాప్ అయ్యింది. రాజ్‌కపూర్ స్టూడియో కుదవలోకి వెళ్లింది. బ్యాంక్ అకౌంట్లన్నీ ఖల్లాస్ అయ్యాయి. చేతిలో చిల్లిగవ్వ లేదు. పెద్ద పెద్ద స్టార్లు రాజేష్ ఖన్నా లాంటి వాళ్లు మేము ఫ్రీగా ఒక సినిమా చేస్తాం... గట్టెక్కమనండి అని కబురు చేస్తున్నారు. కాని రాజ్ కపూర్ ఈ ‘భీక్’ తీసుకునే రకం కాదు. తన బంతిని తానే ఎగరేయాలి. రైటర్ కె.ఏ. అబ్బాస్‌ని పిలిచి మంచి యూత్ స్టోరీ తీద్దాం అన్నాడు. రిషి కపూర్‌కు, రాజ్ కపూర్‌కు పుస్తకాలు చదివే అలవాటు లేదు. కాని కామిక్స్ చదివేవారు. ఆర్చీస్ కామిక్స్ యూత్‌ను దృష్టిలో పెట్టుకుని ఉండేవి. అలాంటి యూత్ స్టోరీ తీద్దామని రాజ్ కపూర్ అనుకున్నాడు. హీరో ఎవరు? రిషి కపూర్. హీరోయిన్? డింపుల్ కపాడియా. జనానికి ఆమె పొట్టి డ్రస్సులు నచ్చాయి. రిషి వేసుకున్న బ్లూ అండ్ బ్లూ మేచింగ్ డ్రస్సులు కూడా. ‘బాబీ’ సూపర్ హిట్ అయ్యింది. కాని అప్పటికే డింపుల్ కపాడియా ఆ సక్సెస్‌ను క్లయిమ్ చేసుకునే వీలు లేక రాజేష్ ఖన్నాను పెళ్లి చేసుకొని వెళ్లిపోయింది. పత్రికలన్నీ రిషి కపూర్‌ని ఆకాశానికెత్తాయి. ఆ సమయానికి 21 ఏళ్ల యువకుడు రిషి కపూర్. కళ్లు నెత్తికెక్కడానికి ఇంకేం కావాలి? ఖుల్లంఖుల్లా ప్యార్ కరేంగే హమ్ దోనో ఇస్ దునియాసే నహీ డరేంగే హమ్ దోనో... ‘బాబీ’తో రిషి కపూర్ ఘనమైన హిందీ రొమాంటిక్ సినిమాల పరంపరను నిలబెట్టాడు. రాజ్‌కపూర్, దేవ్ ఆనంద్, శశి కపూర్, రాజేష్ ఖన్నాలు వేసిన దారి తనక్కూడా ఉపయోగపడుతుందని అనుకున్నాడు. పేరు, డబ్బు, గర్ల్‌ఫ్రెండ్స్, షూటింగ్లో గద్దించి చెప్పడానికి సాహసించలేని డైరెక్టర్లు... ఆ టైమ్‌లో అతనికి నీతూ సింగ్ కనిపించింది. మన తెలుగులో హిట్ అయిన ‘కోడెనాగు’ రీమేక్ ‘జహ్రీలా ఇన్సాన్’లో మొదటిసారి వాళ్లిద్దరూ కలిసి నటించారు. ఇది రిషి కపూర్‌కు రెండో సినిమా. ఇద్దరూ ఉత్సాహం, హుషారు అనే టాబ్లెట్లను గుప్పెడు గుప్పెడు మింగినట్టుగా కెమెరా ముందు కళకళలాడేవారు. ‘రఫూ చక్కర్’, ‘ఖేల్ ఖేల్ మే’, ‘కభీ కభీ’, ‘ఝూటా కహీ కా’.... ప్రతి సినిమాలో వారి జోడి మెరిసింది. ఒక వానరాన్ని మరో వానరమే తోక ముడిపెట్టి అదుపు చేయగలదు అని ఇరువురికీ తెలిసింది. రాజ్ కపూర్ ఈ ప్రేమను అంగీకరించాడు. 1980లో వారిరువురూ పెళ్లి చేసుకున్నారు. బచ్నా ఏ హసీనో లో మై ఆగయా... 1977లో వచ్చిన ‘హమ్ కిసీసే కమ్ నహీ’ సినిమాలోని పాట ఇది. కాని ఆ సమయానికే రొమాంటిక్ స్టార్ రాజేష్ ఖన్నా డౌన్ అయ్యాడు. ఆ తర్వాత వరుసలో నిలబడ్డ రిషి కపూర్ భవిష్యత్తు తేలకుండా ఉంది. దానికి కారణం ‘జంజీర్’ సినిమాలో హీరోల ధోరణి మారింది. అమితాబ్ యాంగ్రీ యంగ్‌మేన్‌గా అవతరించాడు. ‘దీవార్’, ‘షోలే’ వంటి సినిమాలు హిందీ సినిమాను యాక్షన్ ట్రెండ్‌లోకి సక్సెస్‌ఫుల్‌గా ప్రవేశపెట్టాయి. అమితాబ్, శతృఘ్నసిన్హా, ధర్మేంద్ర, వినోద్ ఖన్నా అందరూ యాక్షన్ సినిమాలు చేస్తున్నారు. రిషి కపూర్‌కు యాక్షన్ పనికి రాదు. అంతటి ఆకారం కూడా లేదు. ఎత్తు తక్కువ మనిషి కావడం అతణ్ణి ఒక పరిమితిలో ఉంచింది. ‘అమర్ అక్బర్ ఆంథోని’ వంటి మల్టీస్టారర్స్ సూపర్‌హిట్ అవుతున్నాయి తప్ప సోలోగా పెద్ద హిట్స్ ఇవ్వలేకపోతున్నాడు. రాజేష్ ఖన్నాకు దర్శకుడు శక్తి సామంత ఉన్నట్టు, అమితాబ్‌కు ప్రకాష్‌మెహ్రా ఉన్నట్టు రిషి తనకో ప్రత్యేక దర్శకుల బృందాన్ని పెట్టుకోలేకపోయాడు. తండ్రి రాజ్‌కపూరే ప్రతిసారీ రిషి కపూర్ కెరీర్‌ను సెట్ చేసే ప్రయత్నం చేశాడు. 1980 సంవత్సరం లోపల అతడికొచ్చిన మంచి హిట్ మన కె.విశ్వనాథ్ ఇచ్చిన ‘సర్గమ్’.‘సిరిసిరిమువ్వ’కు హిందీ రీమేక్‌గా తీసిన ఈ సినిమాలో రిషి కపూర్ తప్పెటను మోగించేశాడు. జయప్రదకు హిందీలో తొలి హీరోగా నిలిచాడు. కాని అది చాల్లేదు. ఏక్ హసీనా థీ ఏక్ దీవానా థా క్యా ఉమర్ క్యా సమా క్యా జమానా థా... స్టార్ డైరెక్టర్ సుభాష్ ఘాయ్ తీసిన ఈ సినిమా మీద సోలో హీరోగా రిషి కపూర్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. మంచి కథ, పాటలు, భారీ నిర్మాణం... జూన్ 1980లో అది రిలీజ్ అయ్యింది. అయితే అంతకు సరిగ్గా వారం ముందు రిలీజైన ఫిరోజ్ ఖాన్ ‘ఖుర్బానీ’ ముందు నిలువలేకపోయింది. ఖుర్బానీ కలెక్షన్లు రోజురోజుకీ తుఫానులా మారి కర్జ్ను ముంచేశాయి. రిషి కపూర్ తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. తానసలు హీరోగా పనికొస్తానన్న ధైర్యాన్నే కోల్పోయాడు. జనం ఎదురు పడితే గుండె దడ. సైకియాట్రిస్ట్‌లు, స్నేహితులు, భార్య ఎవ్వరూ అతణ్ణి కాపాడలేకపోయారు... రెండు పెగ్గుల ఆల్కహాల్ తప్ప. పడి లేవడం కపూర్లకు అలవాటు. రిషి కపూర్ కూడా అలాగే లేచాడు. కాలం మారినా, హీరోలు మారినా, కథా వస్తువు మారినా తానంటూ ఒకణ్ణి ఉన్నానని నిరూపిస్తూనే వచ్చాడు. ఆ పోరాడే లక్షణమే అతణ్ణి ఇండస్ట్రీలు తుది శ్వాస వరకూ నిలబెట్టింది. సాగర్ కినారే దిల్ ఏ పుకారే తూ జో నహీతో మేరా కోయీ నహీ... ‘సాగర్’ లో రిషి కపూర్ మళ్లీ తన పాత మేజిక్ కోసం ప్రయత్నించాడు. తొలి సినిమా బాబీ హీరోయిన్ డింపుల్ కపాడియాతో నటించాడు. అయితే సాగర్ యావరేజ్‌గా నిలిచింది. ఆ తర్వాత రిషి కపూర్ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు ఒక ప్రధాన ఆధారంగా నిలిచి, భేషజాలకు పోకుండా హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. శ్రీదేవి కెరీర్‌కు అండగా నిలిచిన రెండు సినిమాలు ‘నగీనా’, ‘చాందినీ’లలో రిషి కపూర్ హీరో. పాకిస్తాన్ నటి జెబా భక్తియార్ నటించిన ‘హెన్నా’ హిట్‌గా నిలిచింది. ఇక మీనాక్షి శేషాద్రి కెరీర్‌కు మూలస్తంభంలా నిలిచిన ‘దామిని’లో రిషిది చాలా ముఖ్యమైన పాత్ర. 1995 నాటికి రిషి కపూర్ సోలో హీరో కెరీర్ దాదాపుగా ముగిసింది. ‘బోల్ రాధా బోల్’, ‘దీవానా’ అతడి ఆఖరి హిట్లు. నిజానికి రిషి కపూర్లోని ‘ఆర్టిస్ట్’ని అతడి రెండో రాకడలోనే ప్రేక్షకులు చూశాడు. 2005 తర్వాత రిషి కపూర్ పూర్తిస్థాయి కేరెక్టర్ ఆర్టిస్టుగా మారి సినిమా ఇండస్ట్రీయే ఆశ్చర్యపోయే పాత్రలు చేశాడు. గిటార్ పట్టుకుని పాటలు పాడే ఆ హీరోయే ఈ నటుడు అని నమ్మలేనట్టుగా చేయగలిగాడు. ‘పటియాలా హౌస్’, ‘అగ్నిపథ్’, ‘దోదూని చార్’, ‘డి డే’, ‘కపూర్ అండ్ సన్స్’, ‘102 నాటౌట్’, ‘ముల్క్’... ఈ సినిమాలన్నీ రిషి కపూర్ పట్ల గౌరవాన్ని పెంచాయి. అప్పట్లో ఇష్టపడని వారు కూడా ఇప్పుడు ఇష్టపడ్డారు. రిషి కపూర్‌కు సినిమాలు తప్ప వేరే ఏమీ తెలియదు. కపట స్వభావం ఎరగడు. ఖుల్లంఖుల్లాగా మాట్లాడటమే తెలుసు. కొన్ని ట్వీట్లు అమాయకంగా చేసి ఇరుకున పడ్డాడు. కాని ఎప్పుడూ ఎవరి అభిమానాన్ని కోల్పోలేదు. రిషి కపూర్ మరణించడం అంటే ఒక రంగు రంగుల డెబ్బయిల కాలం, డిస్కో పాటల కాలం, పైలా పచ్చీసు కాలం గతించిపోవడం. హిందీ సినిమా ప్రదర్శించిన ఒక ఉత్సుకతగా ఉరక తరగగా రిషి కపూర్ ఎప్పటికీ గుర్తుండిపోతాడు. యాద్కు వస్తూనే ఉంటాడు. బంగారం, వెండికి బదులుగా కాసింత ప్రేమను పొందుతూనే ఉంటాడు. నా మాంగూ సోనా చాందీ నా మాంగూ హీరా మోతీ ఏ మేరే కిస్ కామ్ కే..... కలతల కాపురం కపూర్ ఖాన్దాన్లో కోడలు తన నటనకు స్వస్తి పలకాలనేది నియమం. బిజీ హీరోయిన్గా ఉన్న నీతూ సింగ్ రిషి కపూర్‌తో వివాహం కోసం తన కెరీర్‌ను మానుకుంది. కుటుంబం కోసం ఆమె సినిమాల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. 1980లలో పెళ్లి జరిగితే రిషి కపూర్ కుటుంబం కంటే కెరీర్‌కే ఎక్కువగా ప్రాముఖ్యం ఇచ్చాడనేది ఇండస్ట్రీలో వినిపించేది. రిషి కపూర్ దివ్యభారతి, జూహీ చావ్లా తదితర హీరోయిన్లతో క్లోజ్‌గా ఉన్న సమయాలలో ఇంట్లో తరచూ గొడవలు జరిగేవని అంటారు. రిషి కపూర్, నీతూ సింగ్‌ల గొడవలు వారి కుమారుడు రణబీర్ కపూర్‌పై ఎక్కువగా ప్రభావం చూపాయి. ‘వాళ్లు రాత్రంతా గొడవ పడుతుంటే నేను మెట్ల మీద మోకాళ్లలో మొహం దాచుకుని ఏడ్చేవాణ్ణి’ అని రణబీర్ కపూర్ చెప్పుకున్నాడు. కొడుకుతో రిషి కపూర్‌కు పెద్దగా చనువు లేదు. ‘నాకు మా నాన్నతో ఎంత చనువు ఉందో మా అబ్బాయికి నాతో అంతే చనువు ఉంది’ అని చెప్పుకున్నాడు. ఒక వయసుకు చేరుకున్నాక రిషి, నీతూల మధ్య మరింత ప్రేమ పెరిగింది. ఎన్నో ఏళ్ల తర్వాత వారిద్దరూ కలిసి ‘దో దూని చార్’, ‘బచ్నా ఏ హసీనో’ సినిమాలలో కలిసి నటించారు. చివరి రోజులలో నీతూ రిషిని అంటి పెట్టుకునే ఉంది. నలభై ఏళ్ల అతని సాంగత్యం ఇప్పుడు ముగిసింది. ఇది నీతూకు పెద్ద వెలితిగా మారనుంది. భార్య, పిల్లలు, మనుమరాలితో రిషి కపూర్ -
రిషీ కపూర్ మృతి పట్ల తారల నివాళి
రిషీ కపూర్ మరణ వార్త విని దక్షిణ, ఉత్తరాది తారలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్వీటర్ ద్వారా పలువురు ప్రముఖులు స్పందించారు. కొందరి ట్వీట్స్ ఈ విధంగా... ► నా ప్రియనేస్తం రిషీ కపూర్ మరణ వార్త నా హృదయాన్ని బద్దలయ్యేలా చేసింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. – రజనీకాంత్ ► నా మిత్రుడు రిషీ కపూర్ మృతి చెందారన్న విషయాన్ని నేను నమ్మలేకపోతున్నాను. ఎప్పుడూ చిరునవ్వుతో పలకరించేవారు. మా ఇద్దరి మధ్య మంచి స్నేహానుబంధం ఉంది. – కమల్‌హాసన్ ► లెజెండరీ యాక్టర్ రిషీ కపూర్, హైలీ టాలెంటెడ్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్‌లను మనం కోల్పోవడం బాధాకరం. వీరి మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. – మోహన్‌బాబు ► గొప్ప నటుడు, నా మిత్రుడు రిషీ కపూర్ మృతి చెందారన్న వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆయన ప్రస్థానం ఎందరికో స్ఫూర్తి. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. – చిరంజీవి ► నటదిగ్గజాలు రిషీ కపూర్, ఇర్ఫాన్ ఖాన్ మనకు దూరం కావడం చాలా బాధాకరం. ఇండియన్ సినిమాకు వీరు లేని లోటు తీరనిది. వారి చిత్రాల ద్వారా ఈ ఇద్దరూ మనకు ఎప్పటికీ గుర్తుంటారు. – బాలకృష్ణ ► గడిచిన రెండు రోజుల్లో ఇద్దరు గొప్ప నటులను (ఇర్ఫాన్ ఖాన్, రిషీ కపూర్) కోల్పోవడం బాధాకరం. రిషీజీ మనందరి మనసుల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారు. ఆయన్ను కలిసినప్పుడల్లా కొత్త విషయాలను నేర్చుకునేవాణ్ణి. రిషీగారి మరణం మా కుటుంబానికి కూడా తీరని లోటు. – వెంకటేష్ ► రిషీజీ... మా అందరి హృదయాల్లో మీరు ఎప్పటికీ నిలిచే ఉంటారు. – నాగార్జున ► రిషీ కపూర్ మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. భారతీయ సినిమాకు తీరని లోటు. ఆప్తమిత్రుణ్ణి కోల్పోయాను. ఆయనతో మేం నిర్మించిన ‘చాందిని’ చిత్రం తాలూకు జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలమే. రిషి మంచి మానవతావాది. – టి. సుబ్బరామిరెడ్డి ► రిషీ కపూర్‌గారి ఆకస్మిక మరణం నన్ను బాధించింది. ఆయన మరణం భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటు. – పవన్ కల్యాణ్ ► రిషీ కపూర్‌గారి మరణవార్త నా హృదయాన్ని బద్దలు చేసింది. అద్భుతమైన ప్రతిభావంతులు, నిజమైన లెజెండ్. ఆయన లేని లోటు సినీ పరిశ్రమకు తీరనిది. – మహేశ్‌బాబు ► నిన్న (బుధవారం) సుప్రీమ్లీ టాలెంటెడ్ ఇర్ఫాన్ ఖాన్‌గారిని కోల్పోయాం. ఈ రోజు (గురువారం) లెజెండరీ యాక్టర్ రిషీ కపూర్‌గారు మనందరికీ దూరమయ్యారు. భారతీయ సినిమాకు తీరని లోటు. – ఎన్టీఆర్ ► రిషీ కపూర్‌గారి మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇండియన్ సినిమాకు మరో గొప్ప నటుడు దూరమయ్యారు. – రామ్‌చరణ్ ► అతను వెళ్లిపోయాడు... రిషీ కపూర్ వెళ్లిపోయాడు... నేను కుప్పకూలిపోయాను. – అమితాబ్ బచ్చన్ ► చింటూ (రిషీ కపూర్) సార్ ఆత్మకు శాంతి కలగాలి. – సల్మాన్‌ఖాన్ ► ఒక గొప్ప నటుణ్ణి మనం కోల్పోయాం. మంచి మానవతావాది. కళామతల్లి ముద్దుబిడ్డ. మీ (రిషీ కపూర్) నటనతో మా జీవితాలకు వినోదాన్ని పంచినందుకు ధన్యవాదాలు. – ఆమిర్ ఖాన్ ► ఒక లెజెండ్. మంచి కో స్టార్. మా ఫ్యామిలీకి మంచి స్నేహితుడు. – అక్షయ్ కుమార్ ► మన వెండితెర కలలను నిజం చేసుకునే దారిలో మనం కలిసి ప్రయాణించాం. నువ్వు (రిషీ కపూర్) నా పెద్ద అన్నయ్యవి. నాకు ఓ భుజంలా సపోర్ట్ చేశావు. స్నేహితుడిలా నన్ను ముందుకు నడిపించావు. నాతో పాటు నా కుటుంబానికి కూడా నీ అపారమైన ప్రేమను పంచావు. నువ్వు లేని లోటు మాకు తెలుస్తూనే ఉంటుంది. – అనిల్ కపూర్ ► నీతో (రిషీ కపూర్) కలిసి సమయాన్ని గడిపినందుకు సంతోషంగా ఉంది. నీ గురించి ఎప్పుడు ఆలోచించినా నా ముఖంపైకి చిరునవ్వు వస్తుంది. అంత ప్రేమ చూపించావు. – బోనీ కపూర్ ► ‘ఔరంగజేబ్’ (2013) సినిమాలో తొలిసారి చింటూ అంకుల్‌తో కలిసి నటించాను. ఆ సమయంలో కాస్త నెర్వస్‌గా అనిపించింది. మా నాన్నగారితో (బోనీకపూర్) ‘యాక్టర్‌గా అర్జున్ రాణిస్తాడు’ అని చింటూ అంకుల్ చెప్పారు. ఆయన ఇచ్చిన ప్రోత్సాహాన్ని మర్చిపోలేను. – అర్జున్ కపూర్ ► రిíషీగారి మరణ వార్తను ఇంకా నేను నమ్మలేకపోతున్నాను. మంచి నటుణ్ణి కోల్పోయాం. ఆయనతో కలిసి పని చేసే అదృష్టం దక్కడం గౌరవంగా భావిస్తున్నాను. – మాధురీ దీక్షిత్ ► రిషిజీ అద్భుతమైన నటుడు. మీ (రిషీ కపూర్) చిత్రాల ద్వారా మిమ్మల్ని మేం ఎప్పటికీ గుర్తుపెట్టుకునే ఉంటాం. ఎన్నో అవార్డ్ ఫంక్షన్స్ వేదికగా ఆయనతో కలిసి నవ్విన జ్ఞాపకాలను మర్చిపోలేను. – కాజోల్ ► చింటూ అంకుల్ మరణ వార్త విని నా హృదయం ముక్కలైంది. క్యాన్సర్ మహమ్మారితో పోరాడే క్రమంలో మేం ఇద్దరం న్యూయార్క్‌లో కలుసుకున్నాం. మాట్లాడుకున్నాం. అప్పుడు మాట్లాడిన మాటలు నాతో ఎప్పటికీ నిలిచి ఉంటాయి. – సోనాలీ బింద్రే ► చింటూ అంకల్ ఒక లెజెండ్. ఇకపై మీతో ఫుడ్, రెస్టారెంట్ల గురించి చర్చించుకోవడాన్ని మిస్ అవుతాను. – కరిష్మా కపూర్ ► నాకు తెలిసిన బెస్ట్ బాయ్స్ పప్పా (రణ్‌ధీర్‌కపూర్) అండ్ చింటూ అంకుల్ (రిషీ కపూర్). – కరీనా కపూర్ -
రిషీ కపూర్ అనే నేను
షో బిజ్ లో ఒకలాంటి డాబు ఉంటుంది. తప్పక కృత్రిమంగా ఉండాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. చాలా సందర్భాల్లో మాటలకు షుగర్ కోటింగ్ వేసి మాట్లాడాల్సి ఉంటుంది. అయితే కొందరు ఇందుకు మినహాయింపుగా ఉంటారు. రిషీ కపూర్ ఏదైనా ముక్కు సూటిగా మాట్లాడేయడమే. నచ్చింది చెప్పేయడమే. తన బయోగ్రఫీలోనూ అదే పాటించారు. మనసుకు ఫిల్టర్ వేయకుండా మనసులో ఉన్నదంతా ఈ పుస్తకంలో చెప్పుకున్నారు. 2017లో ఈ పుస్తకం విడుదలైంది. ఆటోబయోగ్రఫీ ‘ఖుల్లమ్ ఖుల్లా: రిషి కపూర్ అన్ సెన్సార్డ్’ పుస్తకంలో రిషి కపూర్ రాసుకున్న పలు ఆసక్తికరమైన విషయాలు మీకోసం. నేను అదృష్టవంతుణ్ణి మా కుటుంబం కూడా ఆకాశం లానే. ఇంట్లో ఎంతో మంది స్టార్స్. నా జన్మ నక్షత్రం కూడా అద్భుతమైనది. నేను అదృష్టవంతుణ్ణి. పృథ్వీ రాజ్ కపూర్ కి మనవడిని అయినందుకు, రాజ్ కపూర్ లాంటి తండ్రికి కొడుకు అయినందుకు, నీతూ లాంటి భార్య ఉన్నందుకు, రిద్ధిమా, రణ్ బీర్ లాంటి పిల్లలు పుట్టినందుకు నేను అదృష్టవంతుడిని. నేనెప్పుడూ అదృష్టవంతుడినే. నా బాల్యం నా బాల్యం అంతా సినిమాలతోను, సినిమాల చుట్టూను తిరిగింది. సినిమా కథలు వింటూనే పెరిగాను. కపూర్ ఫ్యామిలీ మొత్తంలో అతి చిన్న వయసులో కెమెరా ముందుకు వచ్చింది నేనే. నాన్నగారు నటించిన ‘శ్రీ 420’ సినిమాలోని ‘ప్యార్ హువా...’ పాటలో వచ్చే ముగ్గురు పిల్లల్లో చిన్నవాణ్ణి నేను. మిగతా ఇద్దరు రణ్ ధీర్ కపూర్, రీతూ కపూర్. ఆ పాట మొత్తం వర్షంలో సాగుతుంటుంది. వర్షపు నీరు నా కంట్లో పడటంతో ఏడ్చేవాణ్ణి. ‘మీ నాన్న గారు చెప్పింది చేస్తే నీకు చాక్లెట్ ఇస్తా’ అని నాతో ఆ సన్నివేశం పూర్తి చేయించారు ఆ సినిమా హీరోయిన్ నర్గీస్ జీ. ఆదివారం మాత్రమే ఆ సినిమా చేశా నాన్నగారు ప్లాన్ చేసిన ‘మేరా నామ్ జోకర్’ సినిమాలో హీరో చిన్నప్పటి పాత్ర నాతో చేయించాలనుకున్నారు. అయితే మా అమ్మ మాత్రం కొన్ని షరతులతో నన్ను సినిమాలో యాక్ట్ చేయించడానికి ఒప్పుకున్నారు. అవేంటి అంటే.. నా చదువుకి ఇబ్బంది కలగకూడదు, స్కూల్లో నా అటెండెన్స్ తగ్గకూడదు. ‘షూటింగ్ మొత్తం ఆదివారం చేస్తా’ అన్నారు నాన్న. వాళ్ల సంభాషణ చాలా క్యాజువల్ గా సాగింది. కానీ నాకు మాత్రం చెప్పలేనంత సంతోషం కలిగింది. స్క్రిప్ట్ తీసుకొని నా రూమ్ లోకి వెళ్లి డైలాగ్స్ ప్రాక్టీస్ చేశా. ఆ తర్వాత సంతకం ఎలా పెట్టాలో నేర్చుకున్నా. సూపర్ స్టార్ అయ్యాక ఆటోగ్రాఫ్ ఇవ్వాలి కదా. కందిన చెంపతో ఏడ్చాను ‘మేరా నామ్ జోకర్’లో ఓ సన్నివేశంలో నా తల్లి పాత్ర చేసిన ఆమె నా చెంప చెళ్లుమనిపించాలి. ఆ సీన్ సరిగ్గా రావడానికి 9 టేకులయింది. దెబ్బకు నా చెంప ఎర్రగా కందిపోయింది. ఏడుస్తూ కూర్చున్నాను.. మా నాన్న తన పనిలో నిమగ్నమైపోయారు. అప్పుడు అర్థమయింది.. సెట్లోకి అడుగుపెట్టేంతవరకే ఆయన నా తండ్రి అని అడుగు పెట్టాక ఫిలిం మేకర్ అని. పాకెట్ మనీ ట్రిక్ రాజ్ కపూర్ పిల్లలంటే అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. ముంబయి లోని ఓ పాపులర్ హోటల్ కి నాన్నగారు తరచూ వెళ్లే వారు. నేను ఆ హోటల్ కి వెళ్తే బిల్ ఆయన అకౌంట్ లో చెల్లించడం అలవాటు. మా ఫ్రెండ్స్ ని తీసుకెళ్లినా బిల్ ఆయన ఖాతాయే. కానీ మా ఫ్రెండ్స్ మధ్య రూల్ ఏంటంటే.. ఎప్పుడూ బిల్ షేర్ చేసుకోవాలి. వాళ్ల వాటా డబ్బులు నేను తీసుకొని బిల్ మొత్తం నాన్న అకౌంట్ లో కట్టేసేవాడిని. ఫ్రెండ్స్ వాటా డబ్బులు పాకెట్ మనీలా నా జేబులో వేసుకునేవాణ్ణి. నీతూని నిందించాను 1980లో నీతు, నా పెళ్లి జరిగిన తర్వాత నా సినిమాలు ‘కర్జ్, జమానా కో దికానా హే’ దారుణంగా విఫలమయ్యాయి. పెళ్లి అవడంతో నా రొమాంటిక్ హీరో ట్యాగ్ పోయిందనుకున్నాను. దానికి కారణం నీతూనే అని తనని నిందించాను. డిప్రెషన్లోకి వెళ్లా. కెమెరాకు, పబ్లిక్‌కి మొహం చూపించే ధైర్యం లేకుండా పోయింది. అప్పుడు నీతు కడుపుతో ఉంది. నా డిప్రెషన్ ని ఎలా తట్టుకుందో అని ఆశ్చర్యంగా ఉంటుంది. నాతో ఇన్నాళ్లు కలసి ఉన్నందుకు నీతూకి అవార్డు ఇవ్వాలి అని మా అమ్మ, అక్క అంటుంటారు. అది నిజమే. నా తీరుని మార్చాలని తను ఎప్పుడూ ప్రయత్నించలేదు. నా చిరాకుని తట్టుకుంది. నా మూడ్ కి తగ్గట్టు తను ఉండేది. ఎంతో సహనం వహించింది. నేను, నీతు గొడవపడేవాళ్లం (అందులో చాలాసార్లు తప్పు నాదే అయ్యుంటుంది). కొన్నిసార్లు 6 నెలల వరకు మాట్లాడుకోకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. కానీ ఏది ఏమైనా సమస్యలను కలిసే పరిష్కరించుకున్నాం. నాలో పురుషాహంకారి ఉన్నాడు పెళ్లికి ముందు మా ఇద్దరిలో ఒకరు సంపాదిస్తూ, మరొకరు పిల్లలను చూసుకోవాలనుకున్నాం. నీతు యాక్టింగ్ మానేస్తా అన్నప్పుడు మాట వరసకు కూడా నేను వద్దనలేదు. ‘తన భార్య పని చేయకూడదని నాలో ఉన్నపురుషాహంకారి అలా చేశాడేమో?’. కానీ ఇప్పుడు నా ఆలోచనా విధానం (పుస్తకం రాస్తున్నసమయానికి) చాలా మారింది. అవార్డు కొన్నందుకు సిగ్గుపడుతున్నా అప్పుడు నాకు 20 ఏళ్లు ఉంటాయంతే. నా ‘బాబీ’ విడుదలైన సంవత్సరం (1973)లోనే అమితాబ్ బచ్చ¯Œ ‘జంజీర్’ కూడా విడుదలైంది. ‘బాబీ’ సినిమాకి నాకు బెస్ట్ అవార్డు వచ్చినందుకు అమితాబ్ బాధపడతాడని అనుకున్నాను. ఎందుకంటే ‘జంజీర్’ కోసం తనకి అవార్డు రావాలనుకుని ఉంటాడేమో. అయితే నేను అవార్డు కొనుక్కున్నానని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. నిజానికి అవార్డు కొని, మ్యానిపులేట్ చేయాలనుకునే వ్యక్తిని కాదు నేను. అయితే దేని గురించీ ఆలోచించని వయసులో ఉన్నాను. అవార్డు ప్రతినిధి ‘30వేలు ఇవ్వండి. అవార్డు మీది అవుతుంది’ అనడంతో, వెనకా ముందూ ఆలోచించకుండా ఇచ్చేశా. అలా అవార్డు దక్కించుకున్నందుకు ఎప్పటికీ గిల్టీగా ఉంటుంది. నా ప్రాధాన్యత ఎప్పుడూ రిషీయే ‘‘ఎప్పుడైనా రిషి నుంచి విడిపోవాలనే ఆలోచన వచ్చిందా?’’ అని నన్ను అడిగితే ‘‘చాలాసార్లు. ప్రతిరోజూ’’ అని సమాధానం చెబుతాను నేను సరదాగా. ఎందుకంటే.. ఇతనితో తప్ప నేను వేరే ఎవ్వరితోను ఉండలేనేమో? ఎందుకంటే... తెలుసుకున్న కొద్దీ గొప్పగా కనిపించే వ్యక్తి రిషి. ఎందుకంటే.. ఏళ్లు గడుస్తున్న కొద్దీ అతని గొప్ప లక్షణాల ముందు అతని చెడ్డ అలవాట్లు కనిపించనంత చిన్నగా మారిపోతున్నాయి. నా జీవితంలో జరిగిన గొప్ప విషయం ఏంటంటే.. రిషీని పెళ్లి చేసుకోవడం. రిషి చాలా కష్టమైన మనిషి. అది ఆయన్ను అర్థం చేసుకునేంత వరకే. కొత్తవాళ్లను సులభంగా నమ్మడు. అందుకే అతని చుట్టూ ఎప్పుడూ పాత ముఖాలే. 15 ఏళ్ల క్రితంతో పోలిస్తే, ఇవాళ్టికి (పుస్తకం రాస్తున్న సమయానికి) నేను , రిషి ఒకరిని ఒకరు అర్థం చేసుకునే విధానం చాలా మారింది. ఆయన ముఖంలో చిన్న మార్పు చూసి ఆయన మనసును అర్థం చేసుకోగలను. నేను పెట్టుకున్న ఫస్ట్ రూల్ ఏంటి అంటే రిషీయే నాకు ఎక్కువ. అతనితో పోలిస్తే ఎవ్వరూ ఎక్కువ కాదు. బాబ్ (రిషీని నీతూ అలానే పిలుస్తారు)కి సినిమాలంటే పిచ్చి. కుటుంబం అంటే పిచ్చి. నా కుటుంబమే నాకు ప్రపంచం. అందుకే సినిమాలా? కుటుంబమా? అని ప్రశ్న ఎదురైనప్పుడు ఇష్టంగా ఇంట్లోనే ఉండాలనుకున్నా. నాన్నతో మరింత టైమ్ గడిపి ఉండాల్సింది (తండ్రి ఆటోబయోగ్రఫీ ముందు మాటలో రణ్ బీర్ పేర్కొన్న విషయాలివి) నాకు మా నాన్నతో కంటే అమ్మతో దగ్గరితనం ఎక్కువ. నాన్నతో చాలా గౌరవమైన బంధమే ఉండేది. కానీ కొన్నిసార్లు నాన్నతో ఇంకొంచెం ఫ్రెండ్లీగా ఉండాల్సింది అనిపించేది. ఇంకొంచెం టైమ్ స్పెండ్ చేసి ఉండాల్సిందనే ఫీలింగ్ కూడా ఉంది. ఏదో ఒక సాయంత్రం ఫోన్ చేసి ‘నాన్నా.. ఎలా ఉన్నావు’ అని అడిగి ఉండాల్సింది అనిపిస్తుంటుంది. మా పిల్లలతో నేను ఇలా ఉండను.. కచ్చితంగా వారికి సమయం కేటాయిస్తాను. ఫ్రెండ్లీగా ఉంటాను. ఇలా అంటున్నప్పటికీ మా నాన్న అంటే నాకు చాలా గౌరవం, ఇష్టం. ‘మన ఫ్యామిలీని బలంగా కలిపి ఉంచినది, మన అందరి జీవితాలను సులభం చేస్తున్నది మీ అమ్మ (నీతూ కపూర్) మాత్రమే’ అని చాలా స్పష్టంగా చెప్పేవారు నాన్న. వాళ్ల ఇద్దరి నుంచే ప్రేమ అంటే ఏంటి? మనుషుల ప్రవర్తన ఎలా ఉండాలి? అనే విషయాలు నేర్చుకున్నాను. చేసే పనిని ఎలా ప్రేమించాలో నేర్పించారు. నేను యాక్టర్ అయిన కొత్తల్లో నాన్న నాకంటే ఉత్సాహంగా షూటింగ్స్ కి వెళ్లడం చూశాను. నా మీద ఆయనకు ఉన్న గౌరవం చూస్తే భయంగా ఉంటుంది. దాన్ని నిలబెట్టుకోవడానికి నిరంతరం కష్టపడుతూనే ఉంటాను. -
చాందిని బృందాన్ని మరువలేం..
ముంబై : బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషీ కపూర్ మరణంతో యావత్ సినీ ప్రపంచం విషాదంలో మునిగిపోయింది. చాక్లెట్ బాయ్ ఇక లేరని పలువురు ప్రముఖులు, అభిమానులు విచారం వెలిబుచ్చారు. రిషీ మరణంతో సోషల్ మీడియాలో ఓ ట్వీట్ పలువురిని కంటతడి పెట్టిస్తోంది. 1989లో బాలీవుడ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చాందిని మూవీ ప్రధాన తారాగణంలో ఒకరైన రిషీ కపూర్ కనుమరుగవడంతో ఆ మూవీ టీం అంతా భౌతికంగా మనల్ని విడిచివెళ్లినట్లయిందని ఆ ట్వీట్ గుర్తుచేసింది. యష్ చోప్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో శ్రీదేవి, రిషీకపూర్, వినోద్ ఖన్నాలు నటించారు. ఈ మూవీని తెరకెక్కించిన యష్ చోప్రా 80 ఏళ్ల వయసులో డెంగ్యూతో అస్వస్ధతకు గురై 2012లో మరణించారు. ఇక చాందినిలో మెరిసిన మరో నటుడు వినోద్ ఖన్నా (70) 2017లో క్యాన్సర్‌తో కన్నుమూశారు. ఆయన మరణించిన మరుసటి ఏడాదే దుబాయ్‌లో బాత్‌టబ్‌లో పడి అందాల తార శ్రీదేవి మరణించారు. అప్పటికి శ్రీదేవి వయసు కేవలం 54 సంవత్సరాలే. రిషీ కపూర్ మరణంతో చాందిని బృందానికి పలువురు నివాళులు అర్పించారు. చాందినిలో మీ మెరుపులను ఎన్నటికీ మరువబోమని అన్నారు. చదవండి : ముగిసిన రిషీ కపూర్ అంత్యక్రియలు -
‘జేమ్స్.. మీరు లేకుండా ఏదీ మాములుగా ఉండదు’
బాలీవుడ్ చాకొలెట్ బాయ్ రిషి కపూర్ మరణంపై ఆయన స్నేహితుడు, నటుడు అనిల్ కపూర్ సంతాపం ప్రకటించారు. ఈ క్రమంలో ఆవేదనతో కూడిన లేఖను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అనిల్ కపూర్, రిషి కపూర్ ఒకరినొకరు ప్రేమగా జేమ్స్, పాటన్ అని పిలుచుకుంటారు. అయితే వీరిద్దరు చిన్ననాటి స్నేహితులు. ఇద్దరు కలిసి విజయ్, గురుదేవ్, కరోబార్, ది బిజినెస్ ఆఫ్ లవ్ వంటి చిత్రాల్లో నటించారు. అలాగే వీరి పిల్లలు రణ్‌బీర్, సోనమ్ కపూర్ కూడా 2007లో సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ‘సావరియా’ సినిమా ద్వారా బాలీవుడ్లో అడుగుపెట్టారు. (తండ్రి మరణంపై రిధిమా భావోద్వేగం) pic.twitter.com/p5IdXdw3wk — Anil Kapoor (@AnilKapoor) April 30, 2020 చిన్ననాటి ఫోటోను షేర్ చేస్తూ..‘నా ప్రియమైన జేమ్స్‌కు.. నీ గురించి ఎలా మొదలు పెట్టాలో నాకు తెలియడం లేదు. కానీ చిన్నప్పటి నుంచి మన కలలను తెరపై చూసుకున్నప్పటి వరకు అన్నింటిలో మనం కలిసే ఉన్నాం. మీరు నాకు ఒక అన్నయ్యలాగా ఉన్నారు. నాకు సహాయం కావల్సినప్పుడు భుజం తట్టి నా వెంటే ఉన్నారు. ధైర్యం కోల్పోయినప్పుడు గురువులాగా ఉన్నారు. నాకు, నా కుటుంబానికి మీరు చూపిన అంతులేని ప్రేమకు కృతజ్ఞతలు. మీరు నా తల్లికి కొడుకులాగా ఉన్నారు. అలాగే కృష్ణ ఆంటీ కూడా నాకు ఎప్పుడూ అమ్మలాగే ఉంటుంది. కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, సినీ ప్రేమికులకు మీరు స్పూర్తిదాయకంగా నిలిచారు. ప్రతి రోజు మిమ్మల్ని తలుచుకుంటాను. మీరు లేకుండా ఏదీ మాములుగా ఉండదు. కానీ మీరు కోరుకున్నట్లు నేను మీ జీవితాన్ని జరుపుకుంటాను. మీ పాటన్’ అంటూ అంతిమ వీడ్కోలు పలికారు.( ముగిసిన రిషీ కపూర్ అంత్యక్రియలు ) అదే రిషి కపూర్ చివరి కోరిక.. హిందీ తెరకు రొమాంటిక్ హీరో.. తండ్రి చివరిచూపుకు రిద్దిమాకు అనుమతి ‘మిమ్మల్ని చాలా మిస్ అవుతాను చింటూ సార్’ ‘నా ప్రేయసితో బ్రేకప్.. నీతూ సాయం కోరాను’ బాలీవుడ్ ‘రిషి’ మరణం: పవన్ సంతాపం -
ముగిసిన రిషీ కపూర్ అంత్యక్రియలు
ముంబై : తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషీ కపూర్ అంత్యక్రియలు గురువారం సాయంత్రం ముంబై చందన్వాడి శ్మశాన వాటికలో ముగిశాయి. లాక్డౌన్ నిబంధనల ప్రకారం సాయంత్రం 5 గంటలలోపే అంత్యక్రియలు ముగించాలని పోలీసులు సూచించడంతో ఢిల్లీ నుంచి బయలుదేరిన రిషీ కుమార్తె రిధిమా కపూర్ రాకముందే అంత్యక్రియలు ముగిశాయి. నిబంధనల ప్రకారం కేవలం 20 మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య రిషీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. కుమారుడు రణబీర్‌కపూర్, భార్య నీతూకపూర్, సోదరి రీమా జైన్, మనోజ్ జైన్, ఆర్మాన్, నటులు సైఫ్ అలీఖాన్, అభిషేక్ బచ్చన్, కరీనా కపూర్, అలియాభట్, అనిల్ అంబానీ, ఆయాన్ ముఖర్జీ వంటి కొద్దిమందిని అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పోలీసులు అనుమతించారు. ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ ఆస్పత్రిలో గురువారం ఉదయం రిషీ కపూర్ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి : తండ్రి మరణంపై రిధిమా భావోద్వేగం.. -
బాలీవుడ్ ‘రిషి’ మరణం: పవన్ సంతాపం
బాలీవుడ్ నటుడు, దర్శకనిర్మాత రిషి కపూర్ అకాల మరణం పట్ల సినీ హీరో పవన్ కల్యాణ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ‘దిగ్గజ నటుడు రిషి కపూర్ ఆకస్మిక మరణం నన్ను ఎంతగానో కలచివేసింది. ఆయన మరణం భారతీయ సినిమాకు తీవ్ర నష్టం. రిషి కపూర్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’ అంటూ పవన్ ట్వీట్ చేశారు. ‘రిషి కపూర్.. సినీవినీలాకాశంలో తళుక్కుమని మెరిసిన సంచలన తార. ఆ తార ఇప్పుడు కనుమరుగైపోయారని తెలిసి చాలా బాధనిపించింది. రిషి కపూర్ మరణంతో భారతీయ చిత్ర పరిశ్రమ ఒక ఆణిముత్యాన్ని కోల్పోయింది. ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు. సినిమా యవనికపై ఆయన ఒక సంచలనం. తొలి సినిమాతోనే ఆగ్రస్థాయి నాయకునిగా ఆగ్రపథానికి చేరుకున్న ఆయన ఎందరో ఔత్సాహిక కథానాయకులకు స్పూర్తిగా నిలిచారు. తండ్రి రాజ్ కపూర్‌తో పాటు కపూర్ కుటుంబంలో అప్పటికే ఎందరో హీరోలు, గొప్ప నటులు ఉన్నప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేక స్టైల్‌ను సృష్టించుకున్నారు. 70వ దశకంలో బాబీ సినిమా ద్వారా హీరోగా తెరంగేట్రం చేసి యువతను తనదైన మాయలో ముంచేశారు. ఆ రోజుల్లో ఆయన స్టైల్‌ను అనుసరించని యువకులు ఉండరని చెప్పడం అతిశయోక్తికాదు. నటన, నాట్యం, ఆహార్యం, ప్రతీ అంశంలోనూ ఆయన తనదైన ముద్రను బలంగా వేశారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను భారతీయ సినీ ప్రేక్షకులకు అందించారు. ఒక గొప్ప నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణించి ఒక్క రోజు కూడా గడవకముందే రిషి కపూర్ మరణ వార్త వినవలసి రావడం దురదృష్టకరం. రిషి కపూర్‌కు భారమైన హృదయంలో కళాంజలి ఘటిస్తున్నా. ఆయన సతీమణి నీతూ కపూర్, కుమారుడు రణబీర్ కపూర్ ఇతర కుటుంబసభ్యులకు ఈ విషాద ఘటనను తట్టుకునే మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను’అంటూ మరో ప్రకటనలో పవన్‌కల్యాణ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న రిషి కపూర్ ఈరోజు తుదిశ్వాస విడిచారు. మరణ వార్త తెలిసి బాలీవుడ్, టాలీవుడ్ లోని పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. 'మేరా నామ్ జోకర్' సినిమాతో బాలనటుడిగా తెరంగేట్రం చేశారు రిషి కపూర్. 1974 లో ఆయన నటించిన 'బాబీ' సినిమాకు గాను ఫిలిం ఫేర్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఇటీవల ముల్క్ అనే సినిమాలో నటించి మరోసారి తన దైన రీతిలో ఆకట్టుకున్నారు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ‘ది బాడీ’ అనే సినిమాలో, ఓ వెబ్ సిరీస్‌లో కూడా ఆయన నటించారు. చదవండి: ‘ఈ దుర్వార్త బాధిస్తోంది! నమ్మలేకపోతున్నా’ ‘నా ప్రేయసితో బ్రేకప్.. నీతూ సాయం కోరాను’ 24 గంటల్లోనే ఇలా జరిగితే ఎలా.. ? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1361281962.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘ఈ దుర్వార్త బాధిస్తోంది! నమ్మలేకపోతున్నా’
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషీకపూర్(67) కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తుదిశ్వాస విడిచారు. రిషీకపూర్ మరణంతో బాలీవుడ్ మూగబోయింది. రిషీకపూర్ మరణంపై పలువురు భారత క్రికెటర్లు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ‘ ఇది చాలా బాధాకరం. రిషీ ఇక లేరనే విషయం జీర్ణించుకోలేకుండా ఉంది. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన్ను ఎప్పుడు కలిసినా ఆప్యాయంగా పలకరించేవారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా. రిషీ కపూర్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అని సచిన్ సంతాపం వ్యక్తం చేశాడు. (ప్రముఖ నటుడు రిషీకపూర్ కన్నుమూత) ‘రిషీకపూర్ మరణవార్త నా గుండెని కలచివేస్తోంది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అని సెహ్వాగ్ సంతాపం తెలిపాడు. ‘ఇది నమ్మలేని నిజం. నిన్న ఇర్ఫాన్ ఖాన్, ఈరోజు రిషీకపూర్. దిగ్గజ నటుడు చనిపోయారనే దుర్వార్తను అంగీకరించడం కష్టంగా ఉంది. ఆయన కుటుంబానికి నా సానుభూతి’ అని విరాట్ కోహ్లి సంతాపం తెలిపాడు. ‘ రిషీ కపూర్ ఆకస్మిక మరణం విని షాక్‌కు గురయ్యా. ఆయన కుటుంబ సభ్యులకు ఇదే నా సంతాపం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ అని శిఖర్ ధావన్ ట్వీట్ చేశాడు. ‘ రిషీ కపూర్ మరణం దుఖః సాగరంలో ముంచింది. ఇర్ఫాన్ ఖాన్ మృతిని జీర్ణించుకోలేని పరిస్థితుల్లో మరొక దిగ్గజ నటుడు దూరమయ్యారు. నిజంగా వరుసగా వచ్చిన ఈ రెండు రోజులూ దుర్దినాలే’ అని సంతాపం వ్యక్తం చేశారు. (రిషి కపూర్ లాస్ట్ ట్వీట్ అదే..) -
తండ్రి మరణంపై రిధిమా భావోద్వేగం..
‘మీ దగ్గరకు చేరే వరకు నేను మిమ్మల్ని మిస్ అవుతాను’ అంటూ రిషి కపూర్ కూమార్తె రిధిమా కపూర్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా ద్వారా తండ్రికి కన్నీటి వీడ్కోలు పలికారు. బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ గురువారం ఉదయం మృతిచెందిన విషయం తెలిసిందే. గత రెండేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో పోరాటం చేసిన రిషి కపూర్ శ్వాసకోశ సంబంధిత వ్యాధితో ముంబైలో కన్నుమూశారు. రిషికపూర్ మృతిపై బాలీవుడ్ ఇండస్ట్రీ విచారం వ్యక్తం చేస్తోంది. సోషల్ మీడియా వేదికగా ప్రముఖులు, అభిమానులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా రిషి కపూర్ కూతురు రిధిమా కపూర్ తండ్రి మరణంపై విచారం వ్యక్తం చేశారు. (నా ప్రేయసితో బ్రేకప్ అయినపుడు నీతూ సాయం చేసింది’) గతంలో తండ్రితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. ‘నాన్న ఐ లవ్ యూ. నేను మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తునే ఉంటాను. నా జీవితంలో బలమైన వ్యక్తిని కోల్పోయాను. ప్రతి రోజు మిమ్మల్ని మిస్ అవుతాను. మనం మళ్లీ కలిసే వరకు నేను నిన్ను మిస్ అవుతాను. పప్పా ఐ లవ్ యూ’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. కాగా రిషికపూర్‌కు భార్య నీతూ సింగ్ కుమార్తె రిధిమా కపూర్ సాహ్ని, కుమారుడు రణ్‌బీర్ కపూర్ ఉన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రిధిమా కపూర్‌కు తండ్రిని కడసారి చూసేందుకు అనుమతి లభించింది. రోడ్డు మార్గం ద్వారా ముంబై వెళ్లేందుకు ఆమెకు అధికారులు అనుమతి ఇచ్చారు. దీంతో 1400 కి. మీ ప్రయాణించి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొననున్నారు.(‘మిమ్మల్ని చాలా మిస్ అవుతాను చింటూ సార్’) View this post on Instagram Papa I love you I will always love you - RIP my strongest warrior I will miss you everyday I will miss your FaceTime calls everyday! I wish I could be there to say goodbye to you ! Until we meet again papa I love you - your Mushk forever ❤️😢 A post shared by Riddhima Kapoor Sahni (RKS) (@riddhimakapoorsahniofficial) on Apr 30, 2020 at 1:13am PDT -
‘నా ప్రేయసితో బ్రేకప్.. నీతూ సాయం కోరాను’
‘‘నా గర్ల్‌ఫ్రెండ్‌తో ఓరోజు గొడవపడ్డాను. అప్పుడు నా హృదయం ముక్కలైపోయింది. అయితే నేను మళ్లీ ఆమెను తిరిగి నా జీవితంలోకి తీసుకువచ్చేందుకు నీతూ సహాయం కోరాను. నా ప్రేయసికి ఉత్తరాలు రాయడంలో తను నాకెంతగానో సాయం చేసింది. జరీలా ఇన్సాన్ సినిమా షూటింగ్ సమయంలో ఇది జరిగింది. రోజులు గడిచే కొద్దీ నాకో విషయం అర్థమైంది. నీతూ మిస్సవుతున్నా అనిపించింది. యూరప్‌లో షూటింగ్ చేస్తున్నపుడు తనకు ఒక టెలిగ్రాం ఇచ్చాను. నేను తన గురించి ఆలోచిస్తున్నా అని చెప్పాను. అప్పుడు తను కశ్మీర్లో ఉంది’’ అంటూ బాలీవుడ్ చాకొలెట్ బాయ్ రిషి కపూర్ నీతూ సింగ్‌తో ప్రేమలో పడిన విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.(హిందీ తెరకు రొమాంటిక్ హీరో..) అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న నీతూ మాత్రం రిషి చెప్పినట్టు తమ ప్రయాణం సాఫీగా మొదలుకాలేదని... షూటింగ్ తొలినాళ్లలో రిషి తనను బాగా ఏడిపించారని చెప్పుకొచ్చారు. తన మేకప్, దుస్తులపై కామెంట్లు చేసేవారని.. దాంతో ఆయనపై కోపంగా ఉండేదాన్నని చెప్పారు. రిషి ఒక తుంటరి, ఆకతాయి అని.. అందరినీ ఇలాగే ఆటపట్టించేవారని మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత కాలంలో తనకు తెలియకుండానే ఆయన ప్రేమలో పడిపోయానని.. సైన్ చేసిన చిత్రాల షూటింగ్ ముగిసిన తర్వాత పెళ్లి చేసుకున్నామని తెలిపారు. బాలీవుడ్ జంటల్లో అన్యోన్యమైన జంటగా పేరొందారు నీతూ- రిషి కపూర్. (అదే రిషి కపూర్ చివరి కోరిక..) రఫూ చక్కర్, దో దూని చార్, అమర్ అక్బర్ ఆంటోని, దూస్రా ఆద్మీ, అంజానే మే. ధన్ దౌలత్, ఖేల్ ఖేల్ మే, జిందా దిల్, జరీలా ఇన్సాన్ వంటి అనేక సినిమాల్లో జోడీగా కనిపించిన వీరు 1980లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి కుమార్తె రిధిమా కపూర్ సాహ్ని, కుమారుడు రణ్‌బీర్ కపూర్ ఉన్నారు. ఇక 40 ఏళ్ల దాంపత్య జీవితంలో వారి మధ్య చిన్న చిన్న అలకలే తప్ప పెద్దగా గొడవపడిన సంఘటనలు లేవంటారు రిషీ- నీతూ సన్నిహితులు. వీరిరువురు సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోలు చూస్తే అది నిజమే అనిపిస్తుంది. లుకేమియాతో తాను ఆస్పత్రిలో చేరిన సమయంలో భార్య నీతూ తనలో ధైర్యం నింపిందని... తన కుటుంబం వల్లే కాన్సర్‌ను జయించగలిగే నమ్మకం వచ్చిందని రిషి అనేక మార్లు చెప్పారు. (లాక్డౌన్.. తండ్రి చివరిచూపుకు రిథిమాకు అనుమతి) అదే విధంగా నీతూ సైతం ప్రతీ సందర్భంలోనూ భర్త వెంటే ఉండేవారు. కుటుంబం కోసం చాలా కాలం నటనకు దూరమైన నీతూ.. బేషరమ్, లవ్ ఆజ్ కల్ వంటి చిత్రాల్లో భర్తతో కలిసి తెరపై తళుక్కుమన్నారు. ప్రస్తుతం ఆయన శాశ్వత నిద్రలోకి జారుకోవడంతో నీతూ శోక సంద్రంలో మునిగిపోయారు. కాగా న్యూయార్క్‌లో కాన్సర్ చికిత్స పొందిన రిషి కపూర్ కొన్ని రోజుల క్రితం స్వదేశానికి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శ్వాసకోశ సంబంధిత వ్యాధితో గురువారం ముంబై ఆస్పత్రిలో ఆయన కన్నుమూశారు. దీంతో చిత్ర పరిశ్రమతో పాటు రాజకీయ ప్రముఖులు, అభిమానులు రిషీ కపూర్‌కు నివాళులు అర్పిస్తున్నారు. -
‘మిమ్మల్ని చాలా మిస్ అవుతాను చింటూ సార్’
కష్టకాలంలో రిషికపూర్ తనకు ఎంతగానో అండగా నిలిచారని బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్‌దత్ అన్నారు. నిరాశలో కూరుకుపోయిన ప్రతి సందర్భంలో జీవితాన్ని సమర్ధవంతంగా ఎలా ఎదుర్కోవాలో నేర్పించారని ఆయన గుర్తు చేసుకున్నారు. కాగా బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్ మృతిచెందిన విషయం తెలిసిందే. గత రెండేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో పోరాటం చేసిన ఆయన గురువారం ముంబైలో కన్నుమూశారు. మంచి నటుడిగా మాత్రమే కాకుండా నిజ జీవింలోనూ మంచి వ్యక్తిగా రిషి కపూర్ చెరగని ముద్ర వేసుకున్నారు. మాదక ద్రవ్యాల కేసులో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న సంజయ్‌దత్.. రిషి కపూర్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. జీవితాంతం చింటు సార్‌ను మిస్ అవుతాను అంటూ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. (చాకొలెట్ బాయ్ రిషి కపూర్...) View this post on Instagram I will miss you Chintu sir. A post shared by Sanjay Dutt (@duttsanjay) on Apr 29, 2020 at 11:44pm PDT ‘‘నా జీవితంలో మీరు ప్రత్యేకమైన వ్యక్తి. నాకు ఎల్లప్పుడు మీరు ఆదర్శవంతులు. జీవితంలో ఎలా బతకాలో నేర్పించారు. కష్టకాలంలో ఎలా ధైర్యంగా నిలబడాలో చూపించారు. మీతో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీరు నన్ను ఎప్పుడూ మంచి బాటలో నడిపించారు. ఎంత కష్టం వచ్చినా చిరునవ్వుతో జీవితాన్ని ముందుకు సాగించాలని సూచించారు. ప్రతి ఒక్కరిలో స్పూర్తిని నింపిన వ్యక్తిగా గుర్తిండిపోతారు. చాలాకాలం క్యాన్సర్ పోరాటం చేశారు. కానీ ఎప్పుడూ అలా కనిపించకుండా నవ్వూతూ ఉండేవారు. మీరు అనారోగ్యంతో బాధపడుతూ కూడా కొన్ని నెలల క్రితం మిమ్మల్ని కలిసినప్పుడు కూడా నా గురించి శ్రద్ధ చూపారు. ఈ రోజు నాకు చాలా బాధాకరమైన రోజు ఎందుంకంటే నేను నా కుటంబ వ్యక్తిని, స్నేహితుడుని, సోదరుడిని కోల్పోయాను.మిమ్మల్ని చాలా మిస్ అవుతాను. దేవుడు మిమ్మల్ని సంతోషంగా ఉంచుతాడని ఆశిస్తున్నాను. ఐ లవ్ యూ చింటూ సార్’’. అంటూ రాసుకొచ్చారు. ఇక రిషి కపూర్, సంజయ్‌దత్ కలిసి అగ్నీపథ్, సాహిబాన్ వంటి చిత్రాల్లో నటించారు. (అదే రిషి కపూర్ చివరి కోరిక..) -
తండ్రి చివరిచూపుకు రిద్దిమాకు అనుమతి
న్యూఢిల్లీ : ప్రముఖ నటుడు రిషీకపూర్ గురువారం ఉదయం అనారోగ్యంతో ముంబైలోని హాస్పిటల్లో కన్నుమూశారు. దీంతో ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన కుమార్తె రిద్దిమా కపూర్ తండ్రి చివరిచూపు తీవ్రంగా ప్రయత్నించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుండటంతో విమాన సర్వీసులతోపాటుగా అంతరాష్ట్ర ప్రజా రవాణా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రిద్దిమా తనకు ముంబై వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకోసం ఆమె అధికారులకు దరఖాస్తు కూడా అందజేశారు. దీనిపై స్పందించిన అధికారులు రోడ్డు మార్గంలో ఆమె ముంబై వెళ్లేందుకు అనుమతిచ్చారు. (24 గంటల్లోనే ఇలా జరిగితే ఎలా.. ?) దీంతో రిద్దిమా రోడ్డు మార్గంలో 1400 కి.మీ ప్రయాణించి ముంబై చేరుకోనున్నారు. ఇందుకు దాదాపు 18 గంటలకుపైగా సమయం పట్టే అవకాశం ఉంది. రిద్దిమా ముంబై చేరకున్నాకే.. రిషీకపూర్ అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. కాగా, ప్యాషన్ డిజైనర్‌గా ఉన్న రిద్దిమా.. వ్యాపారవేత్త భరత్ సాహ్నిని పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం భర్త, పిల్లలతో కలిసి ఆమె ఢిల్లీలో నివాసం ఉంటున్నారు.మరోవైపు రిషీకపూర్‌కు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానులు నివాళులర్పిస్తున్నారు. కొద్ది సేపటి క్రితం నటి ఆలియా భట్ ఆస్పత్రికి వెళ్లి రిషికపూర్‌కు నివాళులర్పించారు. ( ప్రముఖ నటుడు రిషీకపూర్ కన్నుమూత) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1361281962.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
హిందీ తెరకు రొమాంటిక్ హీరో..
సాక్షి, ముంబై: బాలీవుడ్ సీనియర్ నటుడు, చాకొలెట్ బాయ్‌గా పేరొందిన రిషి కపూర్ శాశ్వత నిద్రలోకి జారుకుని అభిమానులను శోకసంద్రంలో ముంచేశారు. కొంతకాలంగా కాన్సర్‌తో పోరాడిన ఆయన శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో చేరి గురువారం కన్నుమూశారు. ఆయనకు భార్య నీతూ కపూర్, కుమార్తె రిధిమా కపూర్ సాహ్ని, కుమారుడు రణ్‌బీర్ కపూర్ ఉన్నారు. కాగా గత కొంతకాలంగా న్యూయార్క్‌లో చికిత్స పొందిన రిషి కపూర్ కొన్ని నెలల క్రితమే భారత్‌కు తిరిగి వచ్చారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో తన జర్నీ గురించి పంచుకునేవారు. ఎల్లప్పుడూ సరదాగా ఉండే ఆయన ఇలా అకస్మాత్తుగా కానరానిలోకాలకు తరలివెళ్లడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. రిషి కపూర్ కుటుంబానికి సానుభూతి తెలుపుతూ సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తున్నారు. ఇక సినీ కుటుంబం నుంచి బాలీవుడ్ తెరపై అడుగుపెట్టిన రిషి కపూర్ తనదైన నటనతో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. రిషి కపూర్ సినీ ప్రస్థానంలోని కొన్ని సినిమాల విశేషాలు.(ప్రముఖ నటుడు రిషీకపూర్ కన్నుమూత) బాబీ రిషి కపూర్ తండ్రి, లెజెండరీ రాజ్ కపూర్ సారథ్యంలో తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా ఇది. డింపుల్ కపాడియా, రిషి కపూర్ జంటగా నటించారు. 1973లో విడుదలైన ఈ సినిమాతో రిషి కపూర్ రూపంలో హిందీ తెరకు మరో రొమాంటిక్ హీరో దొరికాడు. ఖేల్ ఖేల్ మే రవి టాండన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1975లో విడుదలైంది. రిషి కపూర్, నీతూ సింగ్, రాకేశ్ రోషన్ ఈ సినిమాలో కాలేజీ విద్యార్థులుగా నటించారు. భారీ హిట్‌గా నిలిచిన ఈ సినిమా నవ యుగపు ప్రణయ దృశ్యకావ్యాలను తెరపై ఆవిష్కరించింది. ఇక ఈ సినిమాలో నటించిన నీతూ సింగ్ రిషిని వివాహమాడి నీతూ కపూర్‌గా మారారు. కర్జ్ 1980లో విడుదలైన ఈ సినిమా మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. షౌమన్ సుభాష్ ఘాయ్ సారథ్యంలోనే తెరకెక్కిన ఈ మూవీ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కభీ కభీ బాలీవుడ్ దిగ్గజం యశ్ చోప్రా రూపొందించిన ఈ రొమాంటిక్ డ్రామాలో అమితాబ్ బచ్చన్, రాఖీ, శశి కపూర్, వహీదా రెహమాన్‌లతో రిషి కపూర్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. 1976లో ఈ సినిమా విడుదలైంది. లైలా మజ్నూ హర్నం సింగ్ రావేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1976లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిషి కపూర్, రంజీత, డానీ, అరుణ్ ఇరానీ తదితరులు నటించారు. మదన్ మోహన్, జైదేవ్ సంగీత దర్శకత్వం వహించిన సినిమా ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంది. అమర్ అక్బర్ ఆంటోని అమితాబ్ బచ్చన్, రిషి కపూర్, వినోద్ ఖన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా 1977లో విడుదలైంది. మన్మోహన్ దేశాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బెస్ట్ యాక్షన్ కామెడీగా నిలిచింది. షబానా అజ్మీ, నీతూ సింగ్, పర్వీన్ బాబీ, ప్రాణ్, జీవన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ప్రేమ్ రాగ్ వితంతువును పెళ్లాడలనుకునే ఓ యువకుడి కథ ఇది. రిషి కపూర్, పద్మిణీ కొల్హపురి ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా సామాజిక అంశాల గురించి చర్చించింది. రాజ్ కపూర్ ఈ సినిమాకు సారథ్యం వహించారు. నగీనా 1986లో విడుదలైన ఈ సినిమాలో రిషి కపూర్, శ్రీదేవి జంటగా నటించారు. హర్మేశ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రిషి కపూర్ సెకండ్ ఇన్నింగ్స్‌లో హృతిక్ రోషన్, సిద్దార్థ్ మల్హోత్రా యువతరం నటులతో కూడా తెర పంచుకున్నారు. అగ్రిపథ్, కపూర్ అండ్ సన్స్, జూతా కహీ కా వంటి సినిమాల్లో నటించారు. -
అదే రిషి కపూర్ చివరి కోరిక..
కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్ నేడు ఉదయం మరణించిన విషయం తెలిసిందే. క్యాన్సర్‌ను జయించిన ఆయన మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. ఆయన మరణంపై కుటుంబ సభ్యులు ఓ లేఖ విడుదల చేశారు. "లుకేమియాతో రెండు సంవత్సరాలపాటు పోరాడిన రిషి కపూర్ నేడు ఉదయం 8.45 గంటలకు కన్నుమూశారు. చివరి క్షణాల్లోనూ వైద్య సిబ్బందితో నవ్వుతూ నవ్విస్తూ గడిపారు. క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్న సమయంలోనూ ఆయన అంతే సరదాగా ఉండేవారు. కుటుంబ సభ్యులతో గడపడం, ఫ్రెండ్స్‌తో ముచ్చటించడం, ఇష్టమైన ఫుడ్ తసుకోవడం.. ఇవన్నీ చూసి ఆయన్ని కలవడానికి వచ్చినవాళ్లందరూ ఆశ్చర్యపోయేవాళ్లు. ప్రపంచం నలుమూలల నుంచీ అభిమానులు కురిపించిన ప్రేమాభిమానాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మనమందరం ఆయన్ను కన్నీళ్లతో కాకుండా చిరునవ్వుతో గుర్తు చేసుకోవాలని ఆయన చివరి క్షణాల్లో కోరుకున్నారు. కాగా ప్రస్తుతం ప్రపంచం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. కాబట్టి ప్రభుత్వం విధించిన నిబంధనలను అందరూ తప్పక పాటించండ"ని కోరుతూ లేఖలో పేర్కొన్నారు. (ప్రముఖ నటుడు రిషీకపూర్ కన్నుమూత) రిషి కపూర్ చివరి ట్వీట్.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రిషి కపూర్ ఏప్రిల్ 2న చివరిసారిగా ట్వీట్ చేశారు. ఆఖరి ట్వీట్‌లోనూ అతను ఇతరుల శ్రేయస్సును కోరుకుంటూ తన మంచిమనసును చాటుకున్నారు. కరోనా వైరస్‌తో నిర్విరామంగా పోరాడుతున్న వైద్యులు, నర్సులు, పోలీసుల పట్ల హింసను మానుకోవాలని ప్రజలకు చేతులెత్తి విజ్ఞప్తి చేశారు. మనకోసం వారు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారని అలాంటి వారిపై దాడులకు దిగడం మానుకోవాలని కోరారు. అయితే గతంలో కొన్నిసార్లు ఆయన చేసే వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారినప్పటికీ తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా వెల్లడిచేయడంలో ఆయనెప్పుడూ వెనకడుగు వేయకపోవడం గమనార్హం. (క్యాన్సర్‌ను జయించి..ముంబైలో కాలుమోపి..) -
24 గంటల్లోనే ఇలా జరిగితే ఎలా.. ?
ముంబై : 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు దిగ్గజ నటులు ఈ లోకాన్ని వీడటం.. బాలీవుడ్‌నే కాకుండా యావత్తు భారత చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. నిన్న ఇర్ఫాన్ ఖాన్, నేడు రిషీకపూర్ కన్నుమూయడంతో సినీ అభిమానులు సైతం కంటతడి పెడుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో వారి కడచూపు కూడా చూసుకోలేకపోతున్నామని ఆప్తులు, అభిమానులు ఆవేదన చెందుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిమాన నటులకు నివాళులర్పిస్తున్నారు. ఈ వార్తలు నమ్మలేకుండా ఉన్నాయని.. వీరి మరణం సినీ పరిశ్రమకు తీరనిలోటని పేర్కొంటున్నారు. ► రిషీకపూర్ చనిపోయారు. ఆయన మరణం నన్ను కుంగిపోయేలా చేసింది.- అమితాబ్ బచ్చన్ ► రిషీకపూర్ మరణం తీరని లోటు. గొప్ప స్నేహితుడు, గొప్ప ఆర్టిస్ట్.. అలాగే ఎన్నో లక్షల మంది హృదయ స్పందన. ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆర్ఐపీ రిషికపూర్- చిరంజీవి ► ఒకదాని తర్వాత మరో విషాదం.రిషీకపూర్ జీ మరణం తీవ్రంగా కలిచివేసింది. రాజు చాచా(2000)తో మా ఇద్దరి ప్రయాణం బంధం మొదలైంది.. అప్పటి నుంచి అది కొనసాగుతూనే ఉంది. నీతూజీ, రణ్‌బీర్, రిధిమాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను-అజయ్ దేవగన్ ► పరిస్థితులు చూస్తుంటే మనం పీడకల మధ్యలో ఉన్నట్టు ఉంది. ఇప్పుడే రిషీకపూర్ లేరనే హృదయాన్ని కలిచివేసే వార్త విన్నాను. ఆయన ఒక లెజెండ్, గొప్ప సహచర నటుడు, మా కుటుంబానికి మంచి స్నేహితుడు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి- అక్షయ్ కుమార్ ► నిన్న అత్యతం ట్యాలెంట్ కలిగిన ఇర్ఫాన్ ఖాన్‌ను, నేడు లెజండరీ రిషీకపూర్ సాబ్‌ను కోల్పోవడం హార్ట్ బ్రేకింగ్ ఉంది. ఇది భారత చిత్ర పరిశ్రమకు తీరని లోటు- జూనియర్ ఎన్టీఆర్ ► ఓ మై గాడ్.. ఇది జరిగి ఉండాల్సి కాదు. రిషీకపూర్ సార్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. 24 గంటల్లో ఇద్దరు దిగ్గజాలను కోల్పోవడం ఎలా ఉంటుంది?.. ఇది తీరని నష్టం- కాజల్ అగర్వాల్ ► నిన్న ఇర్ఫాన్ ఖాన్, నేడు రిషీకపూర్ మరణించడం షాక్‌కు గురిచేసింది.ఈ ఏడాది, ఈ వారం ఎంత భయాంకరమైనది?. వారిద్దరు వారి చిత్రాలతో ఎప్పటికీ గుర్తిండిపోతారు - కేటీఆర్ ► రిషీకపూర్ జీ ఇక లేరనే వార్త గుండెను కలిచివేసింది. ఇండియన్ సినిమాకు చెందిన మరో గొప్ప వ్యక్తి నేడు మనల్ని విడిచి వెళ్లిపోయారు. కపూర్ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.- రామ్‌చరణ్ ► మరోకమైన అందమైన రెక్క రాలిపోయింది. ఆర్ఐపీ లెజెండ్ రిషీకపూర్ - సుధీర్ బాబు ► నేను ఈ వార్తను నమ్మలేకపోతున్నాను. ఈ వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. జరుగుతుంది చూస్తుంటే భయమేస్తోంది. ఇంతా త్వరగా మరో లెజెండ్ మనను విడిచిపోయారు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను- పూజా హెగ్డే ► రిషీకపూర్ మరణం నన్ను కలిచివేసింది. ఆర్ఐపీ.. మై డియరెస్ట్ ప్రెండ్- రజినీకాంత్ ► అతను నా బాల్యం- కరణ్ జోహర్ ► మాటలు రావడం లేదు.. ఆర్ఐపీ డియర్ లెజెండ్ రిషీకపూర్ జీ - క్రిష్ ► నిజంగా నమ్మలేకుండా ఉంది. నిన్న ఇర్ఫాన్ ఖాన్.. నేడు రిషీకపూర్ జీ. రిషి కపూర్ మరణవార్తను అంగీకరించడానికి మనసుకు కష్టంగా ఉంది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆర్ఐపీ- విరాట్ కోహ్లి ► ఇది చాలా విషాదం నింపింది. 24 గంట్లోనే ఇద్దరు దిగ్గజాలను కోల్పోవడం షాక్‌కు గురిచేసింది. సినీ పరిశ్రమకు ఇది తీరని లోటు. వారి సినిమాల ద్వారా వారు జీవించే ఉంటారు- నందమూరి కల్యాణ్‌రామ్ ► రిషీకపూర్ మరణం తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది- రాధిక శరత్‌కుమార్ చదవండి : ప్రముఖ నటుడు రిషీకపూర్ కన్నుమూత ఇర్ఫాన్‌ఖాన్ మృతి పట్ల సినీ ఇండస్ట్రీ నివాళి var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1361281962.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
బాలీవుడ్లో మరో విషాదం
సాక్షి, ముంబై: బాలీవుడ్లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు రిషీకపూర్ (67) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడటంతో రిషి కపూర్‌ను కుటుంబ సభ్యులు ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ చేర్పించారు. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న రిషి కపూర్ ఏడాది పాటు అమెరికాలో చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా రిషీకపూర్ మృతిపై అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు. మరోవైపు బాలీవుడ్ ప్రముఖులు రిషీకపూర్ మృతి పట్ల సంతాపం తెలిపారు. అలాగే విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. (‘వీ ఆల్ సో లవ్ యూ’) 1952, సెప్టెంబర్ 4న ముంబైలో జన్మించిన రిషీకపూర్ మేరా నామ్ జోకర్ చిత్రంలో బాల నటుడుగా ‘బాబీ’ చిత్రంతో హీరోగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. తొలి చిత్రంతోనే ఫిల్మ్‌ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు. మేరానామ్ జోకర్, బాబీ, జిందా దిల్, రాజా, అమర్ అక్బర్ ఆంటోనీ, సర్గమ్, పతీపత్నీఔర్ ఓ..,కర్జ్, కూలీ, దునియా, నగీనా, దూస్రా ఆద్మీ చిత్రాలు ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి. రిషీ కపూర్‌కు భార్య నీతూ కపూర్,పిల్లలు రిద్దిమా కపూర్, రణ్‌భీర్ కపూర్ ఉన్నారు. 1980లో హీరోయిన్ రీతూకపూర్‌ను ఆయన వివాహం చేసుకున్నారు. నటుడుగానే కాకుండా దర్శక, నిర్మాతగా రాణించిన ఆయన పలు అవార్డులను సొంతం చేసుకున్నారు. (ప్రియమైన మిత్రులారా.. శత్రువులారా...) Actor Amitabh Bachchan announces on Twitter that veteran actor Rishi Kapoor has passed away. pic.twitter.com/pwc7Pht68k — ANI (@ANI) April 30, 2020 -
ప్రముఖ నటుడు రిషీకపూర్‌కు అస్వస్థత
ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషీకపూర్ బుధవారం అస్వస్థతకు గురుయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడటంతో రిషీకపూర్‌ను ఆయన కుటుంబసభ్యులు ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ చేర్పించారు. ఈ విషయాన్ని రిషి కపూర్ సోదరుడు రణ్‌ధీర్ కపూర్ మీడియాకు వెల్లడించారు. ‘రిషీకపూర్ హాస్పిటల్లో ఉన్నారు. ఆయన క్యాన్సర్, శాస్వకోస సమస్యతో బాధపడుతున్నారు. అందుకే హాస్పిటల్లో చేర్పించాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది’ అని రణ్‌ధీర్ కపూర్ తెలిపారు. కాగా, క్యాన్సర్‌తో బాధపడుతున్న రిషీకపూర్ ఏడాది పాటు అమెరికాలో చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. అనంతం గతేడాది సెప్టెంబర్‌లో ఆయన భారత్‌కు వచ్చారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌కు హాజరైన సమయంలో అస్వస్థతకు లోనుకావడంతో అక్కడే హాస్పిటల్లో చేర్పించారు. ఆ సమయంలో తాను ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్టుగా రిషీకపూర్ వెల్లడించారు. ఢిల్లీ నుంచి ముంబై వచ్చిన తర్వాత వైరల్ ఫీవర్‌తో ఆయన మరోసారి హాస్పిటల్లో చేరారు. అయితే త్వరగానే ఆయన డిశ్చార్జి అయ్యారు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రిషీకపూర్.. ఏప్రిల్ 2 నుంచి తన ట్విటర్ అకౌంట్లో ఎలాంటి పోస్టులు చేయలేదు. ప్రస్తుతం ఆయన హాలీవుడ్ చిత్రం ‘ది ఇంటర్న్’ హిందీ రీమేక్‌లో ఓ ముఖ్య పాత్ర పోషించనున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ కథానాయికగా నటింస్తున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్స్‌కి బ్రేక్ పడింది. చదవండి : దేశ ప్రతిష్టను పెంచిన నటుడు ఇర్ఫాన్‌ఖాన్ మృతి పట్ల సినీ ఇండస్ట్రీ నివాళి var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1361281962.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అచ్చం రిషికపూర్‌లా.. కరణ్
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ వృత్తిగత, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలో ఆయన తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా.. ప్రముఖ నటుడు రిషీకపూర్ నటించిన తొలి చిత్రం బాబీలోని ‘మెయిన్ సాయిర్ తో నహిన్’ అనే పాట వీడియోలో రిషికపూర్ ముఖాన్ని.. తన ముఖంగా కరణ్ ‘ఫేస్ మ్యాపింగ్’ చేశారు. అసలు ఎవరు గుర్తు పట్టలేనంతగా కరణ్.. అచ్చం రిషికపూర్‌లా హావభావాలు పలికించారు. ఈ వీడియోకు కరణ్..‘‘ఫేస్ మ్యాపింగ్’ మ్యాజిక్ ఇది. రాజ్‌కపూర్ ఏప్పటికీ నా అభిమాన నిర్మాత. అదేవిధంగా నేను ఆరాధించే నటుడు రిషి కపూర్. ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీకు అనుమతి ఉంది’ అని కామెంట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కరణ్ పోస్ట్ చేసిన ఈ వీడియోపై రిషికపూర్ కుమార్తె రిద్దిమాకపూర్ స్పందించి.. ఈ వీడియో తయారు చేసిన కరణ్‌ను అభినందిస్తున్నట్లు క్లాప్స్ కొట్టే ఎమోజీని కామెంట్‌గా జతచేశారు. ఈ వీడియోపై పలువురు సినీ ప్రముఖులతో పాటు నెటిజన్లు కూడా కరణ్‌ను అభినందిస్తూ కామెంట్లు చేశారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలువుతన్న ఈ సమయంలో కరణ్‌జోహర్ తన పిల్లలు యష్, రూహీలతో గడుపుతున్నారు. View this post on Instagram ... Raj Kapoor was one of my all time favourite film makers!!!! and Rishi Kapoor is my all time favourite actor!! This is a present to me by Sandeep @2ouringsandy I’d like to thank him for this gift, one that I will always treasure!!!! I also want to tell all of you to please go ahead and laugh!!! You are totally allowed to!!!! artist @sanjaytrimbakkar A post shared by Karan Johar (@karanjohar) on Apr 27, 2020 at 3:01am PDT -
లిక్కర్ షాపులు తెరవండి : నటుడి విజ్ఞప్తి
సాక్షి, ముంబై : కరోనావైరస్ ప్రపంచమంతా పంజా విసురుతోంది. ఈ మహమ్మారి వల్ల దేశదేశాలే స్తంభించిపోయాయి. భారత్‌లో కూడా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్‌ను ప్రకటించింది. దీంతో నిత్యావసర వస్తువులు తప్ప ఏవి ప్రజలకు అందుబాటులో లేకుండాపోయాయి. జనాలంతా ఇళ్లకే పరిమితమైపోయారు. ఇక కరోనా మహమ్మారి మందుబాబుల గ్లాసుపై కూడా కొట్టింది. తాగడానికి మద్యం లేక మందుబాబులు విలవిలలాడిపోతున్నారు. ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు ఓ పెగ్గు దొరికితే చాలన్నట్లు ఎదురు చూస్తున్నారు. రోజుకి కనీసం రెండు గంటలు అయినా లిక్కర్ స్టోర్స్ తెరవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వారికి నేనున్నానంటూ మద్దతుగా నిలిచాడు బాలీవుడ్ సినియర్ నటుడు రిషి కపూర్. ప్రతి రోజు సాయంత్రం లిక్కర్ షాపులు తెరవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్ చేశారు. ‘ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ నుండి డబ్బు అవసరం. అందుకోసం కొంత కాలం లైసెన్స్ పొందిన మద్యం దుకాణాలని సాయంత్రం సమయంలో తెరవాలి. ఈ విషయంలో నన్ను తప్పుగా అర్థం చేసుకొని తిట్టొద్దు. మనిషి ఇంట్లో అనిశ్చితి, నిరాశతో ఉంటాడు. ఇలాంటి సమయంలో పోలీసులు, వైద్యులు, పౌరులకి మద్యం అవసరం. బ్లాక్‌లో అయిన మద్యం అమ్మే ఏర్పాట్లు చేయండి’ అని ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. కాగా రిషి కపూర్ ట్వీట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘ ఉన్నతంగా ఆలోచించండి రిషీజీ. లాక్డౌన్ నేపథ్యంలో కొంతమంది నిత్యవసర వస్తువులు లేకుండా బాధ పడుతున్నారు. టీవీల్లో వార్తలు చూసైనా దేశంలో నెలకొన్న వాస్తవిక పరిస్థితులను తెలుసుకోండి. ప్రభుత్వానికి మీరు ఇంత అపరిపక్వ సూచన ఇస్తారా? మీ లాంటి ధనవంతులు ఎప్పుడు ఇలాగే ఆలోచిస్తారు’ అని ఓ నెటిజన్ మండిపడగా.. మందుబాబుల కుటుంబాల గురించి ఆలోచించారా? మద్యం తాగి కుటుంబంలోని మహిళలపై దాడి చేస్తే ఎలా? ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో లాక్డౌన్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయాల్సిందిపోయి మద్యం గురించి మాట్లాడుతారా? అంటూ మరో నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. Think. Government should for sometime in the evening open all licensed liquor stores. Don’t get me wrong. Man will be at home only what with all this depression, uncertainty around. Cops,doctors,civilians etc... need some release. Black mein to sell ho hi raha hai. ( cont. 2) — Rishi Kapoor (@chintskap) March 28, 2020 -
బ్రేక్ తర్వాత...
హాలీవుడ్ చిత్రం ‘ది ఇంటర్న్’ హిందీ రీమేక్‌లో దీపికా పదుకోన్ కథానాయికగా నటించనున్న విషయం తెలిసిందే. రిషి కపూర్ ఓ ముఖ్య పాత్ర చేయనున్నారు. అయితే ఈ సినిమాను ఎవరు డైరెక్టర్ చేస్తారనే విషయంపై కొన్నాళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. ‘బదాయి హో’ ఫేమ్ అమిత్‌శర్మ,, ‘ఇంగ్లీష్ వింగ్లీష్’, ‘డియర్ జిందగీ’ చిత్రాలను తెరకెక్కించిన గౌరీ షిండేలతో ఈ చిత్రబృందం చర్చలు జరుపుతోందన్నది తాజా సమాచారం. మరి ఈ ఇద్దరిలో ఎవరు డైరెక్టర్ సీట్లో కూర్చుంటారో చూడాలి. అయితే గౌరీ షిండేకే ఎక్కువ చా¯Œ ్స ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్స్‌కి బ్రేక్ పడింది. ఈ బ్రేక్ తర్వాత చిత్రీకరణ మొదలుపెట్టాలనుకుంటున్నారట. -
ప్రియమైన మిత్రులారా.. శత్రువులారా...
‘‘మీరు నా పట్ల చూపించిన ప్రేమ, శ్రద్ధకు ధన్యవాదాలు.. నాకేం కాలేదు. బాగున్నాను’’ అంటూ సీనియర్ నటుడు రిషీ కపూర్ తన ట్వీటర్లో పేర్కొన్నారు. విషయం ఏంటంటే.. స్వల్ప అనారోగ్యంతో రిషి ఆస్పత్రిలో చేరారు. అంతే.. ఆయనకేదో అయిందంటూ వార్తలు మొదలయ్యాయి. ఈ వార్తకు ఫుల్స్టాప్ పెట్టాలనుకున్నారు రిషి. ‘‘ప్రియమైన మిత్రులారా.. శత్రువులారా.. ట్వీటర్లో నన్ను ఫాలో అవుతున్న అభిమానుల్లారా నా ఆరోగ్యం గురించి మీరు చూపించిన శ్రద్ధకు ధన్యవాదాలు. 18 రోజులుగా ఢిల్లీలో షూటింగ్ చేస్తున్నాను. పొల్యూషన్ వల్ల ఇన్ఫెక్షన్ బారిన పడ్డాను. అందుకని ఆస్పత్రిలో చేరాను. అంతకు మించి వేరే ఏమీ లేదు. నేను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి, ముంబై వచ్చేశాను. చాలామంది అల్లిన కథలకు ముగింపు ఇస్తున్నాను. ముంబైలో హాయిగా ఉన్నాను’’ అని పేర్కొన్నారు రిషీ కపూర్. ప్రస్తుతం ఆయన ‘షర్మాజీ నమ్కీన్’ అనే సినిమాలో నటిస్తున్నారు. -
మరోసారి హాస్పిటల్లో చేరిన సీనియర్ నటుడు
బాలీవుడ్ సీనియర్ నటుడు రిషీ కపూర్ మరోసారి ఆస్పత్రిలో చేరారు. 2018 సెప్టెంబర్‌లో క్యాన్సర్ చికిత్స కోసం న్యూయార్క్ వెళ్లిన దాదాపు ఏడాది తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మరోసారి హాస్పిటల్లో చేరడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలోని ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌కు హాజరైన సమయంలో రిషీ కపూర్ అనారోగ్యానికి గురికావడంతో.. ఆయనను ఆస్పత్రిలో చేర్పించినట్టుగా తెలుస్తోంది. రిషీ కపూర్ వెంట ఆయన భార్య నీతూ కపూర్ కూడా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న రణబీర్ కపూర్, ఆలియా భట్లు వెంటనే ఢిల్లీకి బయలుదేరారు. అయితే రిషీ కపూర్ ఏ సమస్యతో హాస్పిటల్లో చేరాడనేదానిపై మాత్రం స్పష్టత లేదు. కాగా, అర్మాన్ జైన్ మెహందీ ఫంక్షన్లో రిషీ కపూర్ కుటుంబసభ్యులు కనిపించకపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. -
దీపిక ది ఇంటర్న్
యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా చేసిన ‘చప్పాక్’ తర్వాత దీపికా పదుకోన్ ఏం చేయబోతున్నారు? అనే ఆసక్తి బాలీవుడ్లో ఉంది. ఫ్యాన్స్ ఎదురుచూపులకు సోమవారం ఫుల్స్టాప్ పెట్టారామె. తన తదుపరి చిత్రం ‘ద ఇంటర్న్’ అని ప్రకటించారు. 2015లో వచ్చిన హాలీవుడ్ మూవీ ‘ద ఇంటర్న్’కి ఇది హిందీ రీమేక్. హాలీవుడ్ చిత్రంలో రోబర్ట్ డీ నీరో, అన్నే హథవే ముఖ్య పాత్రల్లో నటించారు. హిందీలో ఈ పాత్రలను రిషీ కపూర్, దీపికా పదుకోన్ చేయనున్నారు. రిషీ కపూర్ కంపెనీలో ఇంటర్న్‌గా పని చేసే పాత్రలో దీపిక నటిస్తారట. ఈ సినిమాను హాలీవుడ్ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్‌తో కలిసి దీపికా నిర్మించనుండటం విశేషం. వచ్చే ఏడాదిలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. దర్శకుడు ఎవరనేది తెలియాలి. ‘‘నా తదుపరి చిత్రం ‘ది ఇంటర్న్’ రీమేక్ అని ప్రకటించడానికి థ్రిల్‌గా ఫీల్ అవుతున్నాను’’ అన్నారు దీపికా. -
సీనియర్ నటుడు కన్నుమూత
ముంబై: భారత సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుడు శ్రీరాం లగూ(92) కన్నుమూశారు. వయోభారంతో పుణెలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. కాగా థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన శ్రీరాం.. పలు హిందీ, మరాఠీ చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. ఇరవైకి పైగా మరాఠీ నాటకాలకు దర్శకత్వం వహించి నాటకరంగంలో సేవలు అందించారు. కేవలం నటుడిగానే కాకుండా ఈఎన్టీ సర్జన్‌గా, సామాజిక కార్యకర్తగా అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. కాగా శ్రీరాం లగూ మరణం పట్ల కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ విచారం వ్యక్తం చేశారు. ‘ గొప్ప నటుడు శ్రీరాం లగూ. మనం ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయాం. విలక్షణ నటనతో థియేటర్ ఆర్టిస్టుగా రాణించిన ఆయన.. సిల్వర్ స్క్రీన్‌పై తనదైన ముద్ర వేశారు. పలు సామాజిక కార్యక్రమాల్లోనూ భాగమైన శ్రీరాం లగూకు నివాళులు అర్పిస్తున్నా’ అని ట్విటర్లో పేర్కొన్నారు. ఇక సినీ పరిశ్రమ సైతం శ్రీరాం లగూ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసింది. సహజ, సమయస్ఫూర్తి గల నటుడిని కోల్పోయాం అని బాలీవుడ్ నటుడు రిషి కపూర్ ట్వీట్ చేశారు. My tributes to all time great artist Shreeram Lagoo. We have lost a versatile personality. A unique theatre actor dominated silver screen and created impact. He was social activists simultaneously. — Prakash Javadekar (@PrakashJavdekar) December 17, 2019 -
అందుకు చాలా కష్టపడ్డాను: నటుడు
కొంతమందికి ముద్దుపేర్లంటే మహా సరదా. అయితే కొందరు నిక్‌నేమ్స్‌తో పిలిపించుకోవడం కన్నా ఎదుటివారిని ఆ పేర్లతో పిలవడానికే ఎక్కువ ఇష్టపడుతారు. ఇక సినీ ప్రముఖులను అభిమానులు బోలెడు పేర్లతో పిలుచుకుంటారు. కొంతమంది అప్పటికే తమకున్న నిక్‌నేమ్స్ బయట పెట్టి వాటితోనే చలామణీ అవుతుంటారు. ఇంతకీ విషయమేంటంటే.. బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషికపూర్‌కు ముద్దుపేర్లు అదే.. నిక్‌నేమ్స్ అంటే చెప్పలేనంత చిరాకట. ఈ విషయాన్ని ఆయన ట్విటర్లో పంచుకున్నాడు. చింటూ అని రాసి ఉన్న టోపీ ధరించిన ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. చింటూ అనే పేరు నుంచి తిరిగి రిషికపూర్ అని పిలిపించుకోడానికి ఎంత కష్టపడ్డానో అంటూ రాసుకొచ్చాడు. ‘బాల్యంలో నా సోదరుడు రణధీర్ కపూర్ చింటూ అన్న పేరుతో నన్ను ఏడిపించేవాడు. అయితే తిరిగి నా పేరును సంపాదించుకోడానికి చాలా శ్రమించాను. ఎప్పటికైనా రిషికపూర్ పేరుతో పిలిపించుకోవాలని మనసులో బలంగా అనుకునేవాడిని’ అని రిషికపూర్ పేర్కొన్నాడు. అదే విధంగా తల్లిదండ్రులెవరూ పిల్లలకు నిక్‌నేమ్స్ పెట్టి మీ సృజనాత్మకతను చూపించుకోకండి అంటూ ఉచిత సలహా ఇచ్చాడు. తన పిల్లలు రణబీర్ కపూర్, రిధిమా కపూర్లను యథాతథంగా పిలిచానే తప్పితే ఎలాంటి నిక్‌నేమ్స్ పెట్టలేదని పేర్కొన్నాడు. దీనికి నెటిజన్లు పాజిటివ్‌గా స్పందించారు. నిజంగానే ‘రిషికపూర్’ అన్న పేరు రావటానికి ఎంతగానో కష్టపడ్డారు అంటూ పొగడ్తలు కురిపించారు. సుమారు 11 నెలల తర్వాత రిషికపూర్ కేన్సర్ చికిత్స పూర్తి చేసుకొని ఈ మధ్యే న్యూయార్క్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. Worked very hard to get Rishi Kapoor back as my name! Parents must never nick name a child. I never did. — Rishi Kapoor (@chintskap) December 4, 2019 -
చిన్ననాటి ఫోటో పంచుకున్న నటుడు
ప్రముఖ బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషీకపూర్ సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తూ.. తన అభిమనులను అలరిస్తూ ఉంటారు. రిషీ.. విలక్షణమైన పాత్రలతో పలు విజయవంతమైన సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. తాజాగా రిషీ తన చిన్ననాటి ఫోటోను ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ చిత్రంలో ఉన్నవారంతా తన పుట్టిన రోజు వేడుకల్లో ఉన్న సోదరులు.. బోని కపూర్, అనిల్ కపూర్, అదిత్య కపూర్, టూటూ శర్మలుగా పేర్కొన్నారు. వీరంతా పుట్టిన రోజు వేడుకల్లో కూల్‌డ్రింక్ కోకాకోలా తాగుతున్నట్టు కనిపిస్తున్నారు. రిషీ కొంటెగా తన పక్కన ఉన్న సోదరున్ని కొడుతున్నట్టు, అతని చేతిలో ఏదో ఉంటే.. లాక్కోడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నారు. ఈ ఫోటోకి ‘ఒరిజినల్ కోకా కోలా ప్రకటనలో.. బోని కపూర్, ఆదిత్య కపూర్, రిషికపూర్, టూటూ శర్మలతోపాటు, క్యూట్ అనిల్ కపూర్’ ఉన్నారంటూ రిషీ కామెంట్ పెట్టారు. Original “Coca Cola” advertisement. Boney Kapoor,Aditya Kapoor, Rishi Kapoor,Tutu Sharma and that cute brat Anil Kapoor( photo courtesy Khalid Mohammed) pic.twitter.com/RXIEUxCAlp — Rishi Kapoor (@chintskap) November 13, 2019 రిషీ కపూర్ పోస్ట్ చేసిన ఈ ఫోటో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘అద్భుతం రిషీజీ.. ఇది అరుదైన ఫోటో, ఇలాంటివి మరికొన్ని ఫోటోలు పోస్ట్ చేయండి’ అని ఓ అభిమాని కామెంట్ చేశాడు. ‘మీరు చాలా ముద్దుగా ఉన్నారు. కొన్ని సార్లు మా అల్లుడిని ‘రిషీ కపూర్’ అని పిలుచుకుంటాము’ అని మరో అభిమాని కామెంట్ చేశారు. Premiere of Doosara Aadmi. pic.twitter.com/kzyhqZtg5S — Rishi Kapoor (@chintskap) October 14, 2019 రిషీ కపూర్ తాను నటించిన ‘దూస్రా ఆద్మీ’ విడుదలై 42 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఆ సినిమాకి సంబంధించిన అలనాటి ఓ ఫోటోను ట్విటర్లో షేర్ చేశారు. ఆ ఫోటోకి ‘ప్రీమియర్ ఆఫ్ దూస్రా ఆద్మీ’ అని కామెంట్ పెట్టారు. ఈ ఫోటోలో రిషీ కపూర్, యాశ్‌చోప్రా, దర్శకుడు రమోశ్ తల్వార్ ఉన్నట్టుగా పేర్కొన్నారు. ఈ సినిమా 1977 అక్టోబర్14న విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సుమారు 11 నెలల తర్వాత రిషీ కపూర్ కేన్సర్ చికిత్స పూర్తి చేసుకొని న్యూయార్క్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. -
స్టార్ హీరోపై మండిపడుతున్న నెటిజన్లు
సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఏది పోస్ట్ చేసినా వైరల్ అవుతుంది. మంచి పోస్ట్ అయితే ఏ రేంజ్లో ప్రశంసిస్తారో.. చెడు పోస్ట్‌ను కూడా అదే రేంజ్లో ట్రోల్స్ చేస్తారు. మీమ్స్, ట్రోలింగ్‌ల పేరుతో తాట తీసేస్తారు. తాజాగా బాలీవుడ్ స్టార్ రిషీ కపూర్ చేసిన పోస్ట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. విజయదశమి సందర్బంగా హిందువులు ఆయుద పూజ చేస్తారు. వాహనాలకు, ఇంట్లో ముఖ్యమైన వస్తువులకు పూజలు నిర్వహిస్తారు. అయితే దసరా రోజు తన ఆయుదం అంటూ ఓపెనర్ కు రిషి కపూర్ ఆయుద పూజ చేయడంతో పాటు ఆ ఫొటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు. ‘ఫెస్టివ్ సీజన్ బిగిన్స్.. బాధ్యతగా వాడండి’ అంటూ ఓపెనర్‌కి పసుపు కుంకుమ రాసి ఉన్న ఫోటోని పోస్ట్ చేశారు. ఇంకేముంది ఈ పోస్ట్‌పై నెటిజన్లు ఓ రేంజ్లో తగులుకున్నారు. ‘సీనియర్ నటుడిగా బాధ్యతగా వ్యవహరించాల్సిన మీరు పండుగ నాడు ఇలాంటి పోస్టులు చెయ్యడమేంటి’, ’ఆయుధానికీ, పరికరానికీ తేడా తెలియదా?’ ఒక సెలబ్రిటీ నుంచి ఇలాంటి పోస్ట్‌ను ఊహించలేదు’, అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. అసలు పండుగ రోజు ఇలాంటి పోస్ట్ లు పెట్టేందుకు కనీసం నీకు బుద్ది లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి కాంట్రవర్షియల్ ఫోటోలను పోస్ట్ చేయడం రిషికపూర్‌కు కొత్తేమి కాదు. గతంలో కూడా ఇలాంటివి పోస్ట్ చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. గత ఏడాది క్యాన్సర్ బారిన పడ్డ రిషి కపూర్ అమెరికాలో దాదాపు 11 నెలల పాటు చికిత్స పొంది ఇటీవలే ఇండియాకు వచ్చాడు. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో విహార యాత్రలో ఉన్న రిషి కపూర్ తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ నటించేందుకు సిద్దం కాబోతున్నట్లుగా సమాచారం. Happy Dusserah! Festive season begins. Use weapon responsibly 😊 pic.twitter.com/69YFNGvtJQ — Rishi Kapoor (@chintskap) October 8, 2019 -
క్యాన్సర్‌ను జయించి..ముంబైలో కాలుమోపి..
ముంబై : న్యూయార్క్‌లో ఏడాది పాటు క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందిన బాలీవుడ్ నటుడు రిషీ కపూర్ నీతూ కపూర్‌తో కలిసి మంగళవారం ఉదయం ముంబైకు చేరుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో న్యూయార్క్‌కు వెళ్లిన రిషీ కపూర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం అక్కడే ఉన్నారు. అమెరికాలో చికిత్స పొందుతున్న రిషీ కపూర్ ఈ ఏడాది ఏప్రిల్‌లో క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నట్టు వైద్యులు ప్రకటించగా, న్యూయార్క్‌లోనే ఇప్పటివరకూ ఆయన సేదతీరారు. గతంలో న్యూయార్క్‌ను సందర్శించిన పలువురు బాలీవుడ్ ప్రముఖులు రిషీ కపూర్‌ను పరామర్శించారు. రణ్‌బీర్ కపూర్ తన గర్ల్‌ఫ్రెండ్ అలియా భట్‌తో కలిసి పలుమార్లు రిషీ కపూర్‌ను కలుసుకున్నారు. -
‘అలా 26 కిలోల బరువు తగ్గాను’
న్యూయార్క్ : ట్రీట్మెంట్లో భాగంగా తాను భారీగా బరువు తగ్గినట్లు బాలీవుడ్ నటుడు రిషి కపూర్ తెలిపాడు. గతేడాది క్యాన్సర్ బారిన పడిన రిషి కపూర్ ప్రస్తుతం న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నాడు. తాజాగా ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ..‘ తొమ్మిది నెలల క్రితం ఢిల్లీలో షూటింగ్ చేస్తున్నపుడు జట్టుకు రంగు వేసుకుంటున్న సమయంలో అస్వస్థతకు గురయ్యాను. దీంతో మూవీ యూనిట్ అప్పటికప్పుడు నన్ను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. క్యాన్సర్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ప్రాథమిక చికిత్స అనంతరం న్యూయార్క్ వచ్చాను. ట్రీట్మెంట్లో భాగంగా నాలుగు నెలలు దాదాపుగా పస్తులు ఉండాల్సి వచ్చింది. అలా 26 కిలోల బరువు తగ్గాను. ఇప్పుడు ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది. మళ్లీ 8 కిలోలు పెరిగాను. పూర్తిగా బక్కచిక్కి ఉండటం నాకు ఇష్టం ఉండదు. త్వరలోనే పూర్వపు రూపానికి వస్తాను’ అని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక కష్టకాలంలో తన భార్య నీతూ కపూర్, పిల్లలు రణ్‌బీర్, రిధిమ తనకు అండగా నిలిచారని రిషి కపూర్ పేర్కొన్నాడు. తాను ఇంత త్వరగా కోలుకోవడానికి కారణం వాళ్లేనన్నాడు. అయితే ఇంటిని విడిచి ఇంతకాలం విదేశంలో ఉండటం తనకు బాధగా ఉందని, ఇండియాను మిస్సవుతున్నట్లు తెలిపాడు. ఆగస్టు నాటికి పూర్తి స్థాయిలో కోలుకుని ముంబైకి వచ్చేస్తానని పేర్కొన్నాడు. కాగా రిషి కపూర్ నటించిన జూతా కహీ కా సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. -
తిరిగొస్తున్నా
ఆరోగ్య సమస్యలతో కొంతకాలంగా న్యూయార్క్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు బాలీవుడ్ నటుడు రిషీ కపూర్. క్యాన్సర్ చికిత్స కోసమే వెళ్లారని సమాచారం. ఆ మధ్య దర్శకుడు రాహుల్ రవైల్ ‘రిషీ కపూర్ క్యాన్సర్ నుంచి పూర్తిగా నయం అయ్యారు’ అని పేర్కొన్నారు. తాజాగా రిషీ ఇండియా తిరిగి రావడానికి రెడీ అయ్యారని తెలిసింది. ‘ఆగస్ట్ నెలాఖరుకల్లా నేను ఇండియా రావొచ్చు. డాక్టర్ ఏమంటారో చూడాలి. కోలుకుంటున్నాను, ఆరోగ్యంగా ఉన్నాను. తిరిగొచ్చేసరికల్లా 100శాతం ఫిట్‌గా ఉంటాను’ అని పేర్కొన్నారు రిషీ. ట్రీట్మెంట్ తీసుకుంటున్న కాలంలో ఆయన కుటుంబం, ఇండస్ట్రీ సభ్యులు ఎప్పటికప్పుడు ఆయన్ను న్యూయార్క్ వెళ్లి పలకరిస్తున్న సంగతి తెలిసిందే. -
‘వీ ఆల్ సో లవ్ యూ’
ప్రముఖ నటుడు రిషీ కపూర్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ దంపతులు పరామర్శించారు. అనారోగ్య కారణాల రీత్యా రిషీ కపూర్ గత ఎనిమిది నెలలుగా న్యూయార్క్‌లో ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల న్యూయార్క్ వెళ్లిన ముకేశ్, నీతా అంబానీలు రిషీ కపూర్‌ను కలిశారు. ఈ విషయాన్ని రిషీ కపూర్ ట్విటర్ ద్వారా తెలియజేశారు. అలాగే ముఖేశ్, నీతాలతో కలిసి దిగిన ఫొటోలను ఆయన పోస్ట్ చేశారు. ముఖేశ్ దంపతులకు ధన్యవాదములు తెలిపిన రిషీ కపూర్.. ‘వీ ఆల్ సో లవ్ యూ’ అని పేర్కొన్నారు. Thank you for seeing us Mukesh and Neeta. We also love you. pic.twitter.com/bYzi5Bt9N5 — Rishi Kapoor (@chintskap) May 19, 2019 రిషీ కపూర్ భార్య నీతూ కపూర్ కూడా అంబానీ దంపతులతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. కాగా, ఇటీవల డెక్కన్ క్రానికల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గత ఎనిమిది నెలలుగా క్యాన్సర్‌తో చేస్తున్న పోరాటం ముగిసిందని... ప్రస్తుతం తనకు క్యాన్సర్ నయమైందని రిషీ కపూర్ చెప్పారు. -
‘నాకు క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోయింది’
గత ఎనిమిది నెలలుగా క్యాన్సర్‌తో చేస్తున్న పోరాటం ముగిసిందని... ప్రస్తుతం తనకు క్యాన్సర్ నయమైందని అంటున్నారు బాలీవుడ్ నటుడు రిషి కపూర్. డెక్కన్ క్రానికల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ‘గత ఎనిమిది నెలలుగా క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్నాను. అమెరికాలో ఈ నెల 1 నుంచి మరో చికిత్స ప్రారంభం కావాల్సి ఉంది. కానీ దేవుడు నా మీద దయ చూపాడు. ఇక నాకు ఏ చికిత్స అవసరం లేదన్నారు వైద్యులు. అంటే ఇప్పుడు నాకు క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోయింది. బోన్ మ్యారో చికిత్స ఒక్కటి మిగిలి ఉన్నది. దానికి మరో 2 నెలల పడుతుందన్నారు వైద్యులు. అది పూర్తయ్యాక ముంబయికి తిరిగి వస్తాను’ అని రిషి కపూర్ తెలిపారు. అంతేకాక ‘నేను ఇంత త్వరగా కోలుకున్నానంటే అందుకు కారణం నా కుటుంబం, నా అభిమానులు ప్రేమ, దేవుడి దయ. ముఖ్యంగా నా భార్య నీతు. తను లేకపోతే నేను న్యూయార్క్ వెళ్లి చికిత్స చేయించుకునేవాడిని కాను. నా పిల్లలు రణ్‌బీర్, రిధిమా కూడా నాకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా నా గురించి ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. సాధరణంగా నాకు ఓపిక చాలా తక్కువ. అలాంటిది ఓపిగ్గా ఎలా ఉండాలో నాకు దేవుడు ఈ రకంగా తెలియజేశాడు’ అని పేర్కొన్నారు. ఎనిమిది నెలల క్రితం వైద్య పరీక్షల నిమిత్తం అమెరికాకు వెళుతున్నానని ట్విట్ చేశారు రిషి కపూర్. త్వరలోనే ముంబయికి తిరిగివస్తానని, అంతవరకు తన అనారోగ్యం గురించి ఎలాంటి పుకార్లు ప్రచారం చేయవద్దని కోరారు. అయితే తనకు వచ్చిన అనారోగ్య సమస్యను మాత్రం ఆయన వెల్లడించలేదు. ప్రస్తుతం చికిత్స దాదాపు పూర్తికావొస్తున్న నేపథ్యంలో తనకు క్యాన్సర్ వ్యాధి వచ్చిందని తాజాగా మీడియా ద్వారా బయటపెట్టారు. అయితే ఇప్పుడు తాను కోలుకున్నానని వెల్లడించారు రిషి కపూర్. చివరిగా ‘ముల్క్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు రిషి కపూర్. -
భారత టీమ్‌లో అందరూ సామ్సన్‌లా?
న్యూయార్క్ : వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన మరుసటి రోజే బాలీవుడ్ నటుడు రిషి కపూర్ ఓ కొత్తవాదనను తెరపైకి తెచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న రిషి కపూర్ కొన్ని నెలల క్రితం చికిత్స నిమిత్తం అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ప్రపంచకప్‌కు సెలక్ట్ అయిన 15 మంది ఆటగాళ్ల ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసి, ఎందుకు ఎక్కువమంది గడ్డంతో ఉన్నారు అంటూ కామెంట్ పెట్టారు. అందరూ సామ్సన్‌లా? అంటూ సెటైర్ వేశారు(ప్రాచీన ఇజ్రాలియన్ న్యాయాధిపతుల్లో సామ్సన్ ఒకరు. ఆయన బలమంతా అతని వెంట్రుకల్లోనే ఉండేదని ప్రతీతి). గడ్డంలేకుండా ఉంటే అందంగా, చురుగ్గా ఉంటారని, ఇది కేవలం తాను గమనించిన విషయం మాత్రమేనంటూ ట్వీట్ చేశారు. Don’t take this picture as a reference point but why do most of our cricket players sport full facial hair(beards)? All Samson’s?(remember he had his strength in his hair) Surely they look smart and dashing without it. Just an observation! pic.twitter.com/QMLuQ0zikw — Rishi Kapoor (@chintskap) April 16, 2019 అయితే రిషి కపూర్ ట్వీట్‌కు నెటిజన్లు అదే రీతిలో బదులిస్తున్నారు. మీ కుమారుడు కూడా గడ్డం పెంచుతూ కనబడుతుంటాడుగా అందుకే వీళ్లు కూడా పెంచి ఉంటారు. ముందుగా మీ కుమారుడు ఎందుకు గడ్డంపెంచుకుని తిరుగుతున్నాడో కనుక్కో అంటూ ఓ నెటిజన్ అంటే.. జట్టుకు జిల్లెట్ కంపెనీనీ స్పాన్సర్ చేయమంటే ఖచ్చితంగా వర్క్ అవుట్ అవుతుందని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇక మరో నెటిజన్ ఏకంగా 2011 వరల్డ్‌కప్ జట్టు సభ్యుల్లో చాలా మంది గడ్డం లేకుండా ఉన్నారంటూ అప్పటి ఫోటోను పోస్ట్ చేసి, బహుశా ఇంగ్లాండ్‌లో వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి, గడ్డం పెంచుకుని ఉంటారు అంటూ కామెంట్ పెట్టాడు. Don't believe me see below is 2011 world cup which was in India pic.twitter.com/Hbc1GhFX5d — SHRISHAIL P. KATTI (@Shrishailkatti1) April 16, 2019 మే 30 నుంచి ఇంగ్లండ్‌లో జరిగే వరల్డ్‌కప్ కోసం 15 మంది సభ్యుల టీమ్‌ను ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సీనియర్ సెలక్షన్ కమిటీ సోమవారం ఖరారు చేసిన విషయం తెలిసిందే. ప్రపంచకప్‌కు భారత్ తరపున విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, ఎంఎస్ ధోని, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, చహల్, కుల్దీప్, భువనేశ్వర్, బుమ్రా, హర్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీలు ఆడనున్నారు. -
ఫిదా అయిపోయా
రోబర్ట్ డి నీరో.. హాలీవుడ్లో అద్భుతమైన యాక్టర్. రిషీ కపూర్ మనదగ్గర సూపర్ యాక్టర్. రణ్‌బీర్ కపూర్ యంగ్ యాక్టర్స్‌లో మంచి మార్కులు కొట్టేస్తున్న నటుడు. ఈ ముగ్గురూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. ప్రస్తుతం సాధారణ మెడికల్ చెకప్ కోసం న్యూయార్క్‌లో ఉన్నారు రిషీ కపూర్. అక్కడ ఆయన చేస్తున్న పనులన్నీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా రోబర్ట్ డి నీరోని కలిశారట. ‘‘వావ్ మూమెంట్ ఇది. అనుకోనుండా డి నీరోని కలిశాం. తనకి ఆల్రెడీ రణ్‌బీర్ తెలుసు. స్టార్డమ్ ఉన్నప్పటికీ నీరో సింపుల్‌గా ఉన్నారు. నేను చాలా దురుసుగా ఉంటానని అర్థం అయింది. అతని ప్రవర్తనకి ఫిదా అయిపోయా ’’ అని పై ఫొటోను షేర్ చేశారు రిషీ కపూర్. -
వైద్య పరీక్షలు.. ప్రేమ పలకరింపులు
‘‘సాధారణ వైద్య పరీక్షల కోసం న్యూయార్క్ వెళుతున్నా. పని నుంచి చిన్న విరామం తీసుకుంటున్నాను. నా స్నేహితులను, ఫ్యాన్స్‌ను అనవసరంగా ఏ వార్తనూ ప్రచారం చేయొద్దని కోరుకుంటున్నా’’ అని ట్వీట్ చేసి న్యూయార్క్ వెళ్లారు ప్రముఖ నటుడు రిషీ కపూర్. అక్కడ కొందరు బాలీవుడ్ నటీనటులు ఆయన్ను పలకరిస్తూ సర్ప్రైజ్ చేస్తున్నారు. ఓ టీవీ సిరీస్ షూట్లో భాగంగా న్యూయార్క్‌లో ఉన్న అనుపమ్ ఖేర్ ముందుగా రిషీని కలిశారు. ఆ తర్వాత ప్రియాంకా చోప్రా, సోనాలీ బింద్రే కూడా పలకరించారు. ‘‘ఎప్పటిలానే నవ్వుతూ ఉన్న మీ ఇద్దర్నీ (రిషి, ఆయన భార్య నీతూ) చూస్తుంటే ఆనందంగా ఉంది’’ అని ప్రియాంకా చోప్రా పేర్కొన్నారు. కీమో థెరపీ చేయించుకుంటున్న సోనాలీ తన భర్త గోల్డీ బెహల్‌తో కలసి రిషీని కలిశారు. ఈ విషయం పక్కన పెడితే రిషీ కపూర్‌కు క్యాన్సర్ ఫైనల్ స్టేజ్‌లో ఉందని, చికిత్స కోసం న్యూయార్క్ వెళ్లారంటూ వచ్చిన వార్తలను రిషీ కపూర్ సోదరుడు రణ్‌ధీర్ కపూర్ కొట్టిపారేశారు. ‘‘తను ఏ వ్యాధితో బాధపడుతున్నాడో తనకే సరిగ్గా తెలియదు. మామూలు చెకప్ కోసం వెళ్లాడు. వైద్య పరీక్షలను మనశ్శాంతిగా చేసుకోనివ్వండి. ఆ టెస్ట్‌ల ఫలితం ఏదైనా మీకు తప్పకుండా తెలియజేస్తాం’’ అని రణ్‌ధీర్ పేర్కొన్నారు. -
‘దయచేసి పుకార్లను ప్రచారం చేయకండి’
వాస్తవాలు తెలియకుండా పుకార్లను ప్రచారం చేయోద్దంటూ అభ్యర్ధిస్తున్నారు రణ్‌దీర్ కపూర్. విషయం ఏంటంటే కొన్ని రోజులుగా రణధీర్ కపూర్ సోదరుడు, రణ్‌బీర్ కపూర్ తండ్రి రిషి కపూర్ క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డారని .. అది కూడా అడ్వాన్స్ స్టేజిలో బయటపడిందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో రణ్‌ధీర్ కపూర్ అవాస్తవాలను ప్రచారం చేయోద్దంటూ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మా సోదరుని అనారోగ్యం గురించి ఇంకా పూర్తి సమాచారం తెలియలేదు. తనకు ఎలాంటి వ్యాధి సోకిందో మా సోదరునికే తెలియదు. వ్యాధి నిర్ధారణకు సంబంధంచి ఇంకా ఎటువంటి పరీక్షలు కూడా ప్రారంభించలేదు. కానీ ఇంతలోనే రిషి కపూర్‌కి క్యాన్సర్.. అది కూడా చివరి దశలో ఉంది అంటూ పుకార్లను ప్రచారం చేస్తున్నారు. దయచేసి ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేసి మా మనోధైర్యాన్ని దెబ్బకొట్టకండి. మా సోదరున్ని ప్రశాంతంగా పరీక్షలు పూర్తి చేసుకుని వచ్చేలా సహకరించండి. టెస్ట్‌ల్లో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చినా వాటిని ఎదుర్కొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’ అంటూ తెలిపారు. గత శనివారం రిషి కపూర్ తన భార్య నీతూ కపూర్, కుమారుడు రణ్‌బీర్‌తో కలిసి వైద్యం నిమిత్తం అమెరికా వెళ్లారు. ఈ సందర్భంగా రిషి కపూర్ తన శ్రేయోభిలాషులను అధైర్య పడవద్దంటూ.. వారి ప్రేమాభిమానాలు, ఆశీర్వాద బలం వల్ల తాను త్వరలోనే క్షేమంగా తిరిగి వస్తానంటూ ట్వీట్ చేశారు. రిషి కపూర్ అమెరికా వెళ్లిన రెండు రోజులకే ఆయన తల్లి కృష్ణ రాజ్ కపూర్ మృతి చెందారు. దాంతో వారు ఆమె అంత్యక్రియలకు కూడా హాజరు కాలేక పోయారు. -
‘నా ఆరోగ్యంపై ఊహాగానాలు వద్దు’
ముంబై : అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం అమెరికా వెళుతున్నట్టు బాలీవుడ్ నటుడు రిషీ కపూర్ తన అభిమానులు, మిత్రులకు సమాచారం అందించారు. తన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ఊహాగానాలు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేశారు. వైద్య చికిత్స నిమిత్తం అమెరికాకు వెళుతూ పనికి కొద్దిరోజులు విరామం ఇస్తున్నానని, తన ఆరోగ్యంపై అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందవద్దని, ఎలాంటి వదంతులూ ప్రచారం చేయవద్దని కోరారు. అభిమానుల ప్రేమ, ఆశీస్సులతో 45 సంవత్సరాల పాటు తన సినీప్రయాణం సాగిందని, మీ అందరి దీవెనలతో తాను త్వరలోనే తిరిగివస్తానని ట్వీట్లో పేర్కొన్నారు. తమ కుటుంబానికి చెందిన ఆర్కే స్టూడియోస్‌లో ఇటీవల జరిగిన గణేష్ నిమజ్జన వేడుకల్లో రిషీకపూర్ తన కుమారుడు, సోదరులతో కలిసి కనిపించారు. గత ఏడాది ఆర్కే స్టూడియోస్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించడం కలకలం రేపింది. పునురుద్ధరణ భారీ వ్యయప్రయాసలతో కూడినది కావడంతో సుప్రసిద్ధ ఆర్కే స్టూడియోస్‌ను కపూర్ కుటుంబ సభ్యులు అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే. -
ఆ సంస్థ విమానాలు ఎక్కడం మానేయండి!
జాతి వివక్ష ఎక్కడ ఉన్న తప్పుబట్టాల్సిందే. జాత్యహంకారం ఈ మధ్య కాలంలో మితి మీరిపోతోంది. తాజాగా జాత్యాహంకారాన్ని ప్రదర్శించిన బ్రిటీష్ ఎయిర్వేస్ సంస్థపై బాలీవుడ్ నటుడు రిషీ కపూర్ మండిపడ్డారు. తనకు గతంలో జరిగిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘లండన్ విమాన ఘటన గురించి తెలుసుకుని నేను చాలా బాధపడ్డాను. విమానంలోని భారతీయుల్ని దించేయడం సరికాదు. ఇది జాతి వివక్షే. గతంలో నేను ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించినప్పటికీ.. రెండు సార్లు బ్రిటిష్ ఎయిర్ వేస్ క్యాబిన్ క్రూ సిబ్బంది నాతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఆ సంస్థ విమానాలను ఎక్కడం మానేశాను. మనకు గౌరవం ఇవ్వని ఇలాంటి విమానాలను ఇకపై ఎక్కడం మానేయండి. జెట్ ఎయిర్ లేదా ఎమిరేట్స్ విమానాల్లో ప్రయాణించండి. అక్కడ గౌరవం దక్కుతుంది’ అని ట్వీట్ చేశారు. జూలైలో ఓ ఇండియన్ ఫ్యామిలీ లండన్ నుంచి బెర్లిన్‌కు వెళ్లడానికి బ్రిటీష్ ఎయిర్వేస్ సర్వీస్ విమానంలో టికెట్స్ బుక్ చేసుకున్నారు. అయితే ఆ ఫ్యామిలీలో ఉన్న చిన్న బాలుడు ఏడ్వడంతో అక్కడి సిబ్బంధి వారిని దూషించి అక్కడే దించేశారు. ఈ ఘటనపై కేంద్ర విమానయాన శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై రిషీ కపూర్ పైవిధంగా స్పందించారు. Racist. Dont fly British Airways.We cannot be kicked around. Sad to hear about the Berlin child incident. I stopped flying BA after the cabin crew were rude and had attitude not once but twice even after being a first class passenger. Fly Jetair or Emirates. There is dignity. — Rishi Kapoor (@chintskap) August 9, 2018 -
శ్రీదేవిని గుర్తుపట్టలేకపోయిన సీనియర్ నటుడు
రిషి కపూర్.. 1980ల్లో బాలీవుడ్లో ఒక వెలుగు వెలుగొందిన హీరో. పలు సక్సస్ సినిమాలను తన సొంతం చేసుకోవడమే కాకుండా.. నిర్మాతగా, దర్శకుడిగా, ఆర్కే ఫిల్మ్ యజమానిగా రాణిస్తున్నారు. అయితే ఈ ప్రముఖ నటుడు మరోసారి సోషల్ మీడియాలో ఇరకాటంలో పడ్డారు. ట్విటర్ యూజర్లు ఆయనపై విమర్శల మీద విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ ఆయనపై ఇంతలా మండిపడటానికి కారణమేమిటో తెలుసా? అతిలోక సుందరి, అందాల తార అయిన శ్రీదేవిని తను గుర్తుపట్టలేకపోవడం. అంతేకాకుండా... తనతో పాటు స్టెపులేసిన ఆ నటి ఎవరో తనకు గుర్తుకు రావడం లేదు! ఆ సినిమా ఏమిటి అంటూ ట్విటర్లో ఓ వ్యక్తి పోస్టు చేసిన వీడియోకు రిప్లై ఇవ్వడం. రిషి తన అభిమాని పోస్టు చేసిన ఓ పాత వీడియోకు ఈ ట్వీట్ చేశారు. ఈ వీడియోలో ఉన్న తన కోస్టార్ ఎవరో గుర్తుపట్టలేకపోతున్నానంటూ.. అనడం నిజంగా అభిమానులను తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసింది. తనతో పాటు ఫేమస్ చాందినీ సినిమాలో జతకట్టిన శ్రీదేవిని ఆయన గుర్తించలేకపోవడం విడ్డూరంగా ఉంది అంటూ అభిమానులు తీవ్ర కోపోద్రిక్తులవుతున్నారు. ఆయనపై పలు విమర్శనాత్మక ట్వీట్లు కూడా చేస్తున్నారు. రిషి కపూర్ చేసిన ఆ ట్వీట్‌కు యూజర్లు ఏ విధంగా స్పందిస్తున్నారో ఓ సారి మీరే చూడండి... ‘ఆమె ఎవరంటే.. నీకంటే బాగా డ్యాన్స్ చేసిన శ్రీదేవి’ అని, ‘నాగిన, చాందినీ సినిమాల్లో ఆమె మీతో పాటు నటించకపోతే, ఎవరూ మిమ్మల్ని గుర్తు పట్టేవారే కాదు’, అని మరొకరు, ‘ అందుకే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం, మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు’, అని మరో ట్విటర్ యూజర్, ‘అతని తలంతా ఇగో అనే గ్యాస్‌తో నిండి ఉంది. అందుకే జ్ఞాపకశక్తి కోల్పోయారు. ఆ కారణంతో ఆయన కో-స్టార్‌ను గుర్తుపట్టలేకపోతున్నారు’ అంటూ మరో యూజర్ ఇలా పలు కామెంట్ల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. రిషి కపూర్ ట్విటర్లో ఏదో ఒక విషయంలో ఇలా ఇరకాటంలో పడటంపై రణ్‌బీర్ కపూర్ ఇటీవలే స్పందించారు. చాలా సార్లు ఆయన ఏదో ఒక ట్వీట్ చేసి, ఇరకాటంలో పడుతూ ఉంటారు. ఆ సమయంలో అమ్మ కాల్స్ లేదా మెసేజ్‌లు చేస్తోంది. ‘చూడు ఆయనేం చేశారు. ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఆ తర్వాత అమ్మ, నాన్నకు క్లాస్ పీకుతుంది. కానీ ఆయన చాలా నిజాయితీ గల వ్యక్తి. ఏ విషయాన్ని ఆయన సెన్సార్‌గా ఉంచరు. ఏదైనా చెప్పాలనుకుంటే, వెంటనే చెప్పేస్తారు. పబ్లిసిటీ కోసమే లేదా ఏదైనా ఆయనపై ప్రభావం చూపుతుందో అని ఏమీ చేయరు. ఏదైనా విషయంపై ఫీల్ అయితే, వెంటనే దానిని రాసేస్తారు’ అంటూ తండ్రి గురించి రణ్‌బీర్ చెప్పుకొచ్చారు. What film is this? And I cannot recognise the actress with me! https://t.co/NpZlqurrq8 — Rishi Kapoor (@chintskap) August 4, 2018 Nobody would have recognised you if she had not worked with you in Nagina and Chandni. — Deepa Bhatia (@_DeepaBhatia) August 4, 2018 She’s the one who danced better than you in your hay days . #Sridevi — Pretty Paris (@hindugirl17) August 4, 2018 -
‘నా సినిమా పైరసీలో అయినా చూడండి’
సినీ రంగాన్ని వేదిస్తున్న తీవ్ర సమస్యల్లో పైరసీ ఒకటి. ఇండస్ట్రీ వర్గాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పైరసీని మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. అందుకే తమ సినిమాల ప్రమోషన్ సమయంలో పైరసీ వ్యతికేరంగా అభిమానులకు పిలుపునిస్తుంటారు స్టార్స్. అయితే తాజాగా ఓ దర్శకుడు తన సినిమాను పైరసీలో అయినా చూడండి అంటూ పిలుపునివ్వటం హాట్ టాపిక్ మారింది. రిషి కపూర్, తాప్సీ, ప్రతీక్ బబ్బర్, అశుతోష్ రానాను ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బాలీవుడ్ మూవీ ముల్క్. హిందూ ముస్లింల మధ్య స్నేహానికి సంబంధించిన కథతో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల విడుదలైన మంచి టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా రిలీజ్ పై పాకిస్తాన్ సెన్సార్‌బోర్డ్ నిషేదం విధించటంపై స్పందించిన దర్శకుడు అనుభవ్ సిన్హా తన సినిమాను పైరసీలో అయినా చూడండి అంటూ పాక్ ప్రజలకు పిలుపు నిచ్చారు. సినిమా ప్రమోషన్లో భాగంగా మీడియాతో మాట్లాడిన అనుభవ్ ‘ప్రియమైన నా పాకిస్తాన్ ప్రజలకు.. నేను తీసిన ముల్క్ సినిమాపై పాక్ సెన్సార్‌బోర్డ్ నిషేదం విధించింది. మీరంతా చట్టబద్ధంగా థియేటర్లలోనే నా సినిమా చూడాలని నాకూ ఉంది. కానీ అలా చూసే అవకాశం లేకపోతే పైరసీలో అయిన చూడండి. సినిమా చూసిన తరువాత సెన్సార్ బోర్డ్ ఈ చిత్రాన్ని నిషేందించిందో మీకే అర్ధమవుతుంది. ప్రస్తుతం పరిస్థితులు, నిజా నిజాలు మీకు తెలియకూడదనే సెన్సార్ బోర్డ్ ఈ నిర్ణయం తీసుకుంది’ అన్నారు. అయితే అనుభవ్ సిన్హా వ్యాఖ్యలు పైరసీ ప్రొత్సహించే విధంగా ఉన్నయన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. -
‘ముల్క్’.. అక్కడ బ్యాన్
దాయాది దేశం పాకిస్తాన్ ఈ మధ్య కాలంలో వచ్చిన భారతీయ చిత్రాలను నిషేధిస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. తాజగా ఈ కోవలోకి మరో చిత్రం చేరింది. రిషి కపూర్, తాప్సీ ప్రధాన పాత్రలుగా, అనుభవ్ సిన్హా దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘ముల్క్’. ప్రపంచవ్యాప్తంగా సమస్యగా మారిన ‘ఇస్లామిక్ ఫోబియా’ ప్రధాన ఇతివృత్తంగా రూపొందిన ఈ చిత్రం ఈ రోజే విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంటోంది. కానీ పాక్ మాత్రం ఈ చిత్రాన్ని తమ దేశంలో ప్రదర్శించకూడదంటూ నిషేధిత ఆజ్ఞలు జారీ చేసింది. ఈ ఏడాది బాలీవుడ్లో విడుదలైన పలు విజయవంతమైన చిత్రాలను పాక్ నిషేధించిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం కరీనా కపూర్, సోనమ్ కపూర్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన వీరే ది వెడ్డింగ్ చిత్రాన్ని వల్గర్‌గా ఉందంటూ బ్యాన్ చేసింది. ‘మెన్యూరేషన్’ ఇతివృత్తంగా అక్షయ్ కుమార్, సోనమ్ కపూర్ జంటగా నటించిన ప్యాడ్మాన్ చిత్రాన్ని కూడా నిషేధించింది. అందుకు పాక్ సెన్సార్ బోర్డ్ చెప్పిన కారణం ‘ఇలాంటి విషయాలను మా దేశంలో బహిరంగంగా చర్చించడం నిషేధం అందుకే ప్యాడ్మాన్ను నిషేధించాం’ అని పాక్ సెన్సార్ బోర్డు తెలిపింది. ఇస్లామ్‌కు వ్యతిరేకమైన చేతబడి ఇతివృత్తంగా తెరకెక్కిందంటూ అనుష్క శర్మ ‘పారి’ చిత్రాన్ని బ్యాన్ చేసింది. ఇవే కాక అలియా భట్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘రాజీ’, కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ ‘రాయిస్’ చిత్రాలను కూడా ఇలాంటి కారణాలు చెప్పే నిషేదించింది. ఇదే క్రమంలో ఇప్పుడు అనుభవ్ సిన్హా దర్శకత్వంలో వచ్చిన ‘ముల్క్’ చిత్రాన్ని నిషేధించింది. అయితే ఈ నిషేధంపై దర్శకుడు అనుభవ్ సిన్హా మండిపడుతున్నారు. ట్విటర్ వేదికగా పాక్ సెన్సార్ బోర్డ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు. ‘ఈ చిత్రం ముస్లింలకు, పాకిస్తాన్‌కు అనుకూలంగానో.. వ్యతిరేకంగానో తెరకెక్కించింది కాదు. ఇది మనపై మనకు, మన చూట్టు ఉన్న వారి పట్ల మనం ప్రదర్శించే ప్రేమకు నిదర్శనంగా తెరకెక్కిన చిత్రం. ఇది మీ గురించి, నా గురించి చెప్పే చిత్రం’ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాక పాక్ ప్రేక్షకులను ఉద్దేశిస్తూ ‘మీ అందరిని ఒక ప్రశ్న అడుగుతున్నాను.. సహ ఉనికి గురించి చర్చించే ఈ చిత్రాన్ని పాక్ ఎందుకు బ్యాన్ చేసింది. ఈ రోజు కాకపోయినా ఏదో ఒకరోజు మీకు ఈ చిత్రాన్ని చూసే అవకాశం లభిస్తుంది. ఆ రోజు తప్పకుండా ఈ సినిమా చూసి అప్పుడు చెప్పండి పాకిస్తాన్ సెన్సార్ బోర్డు ఎందుకు ఈ చిత్రాన్ని బ్యాన్ చేసిందో’ అంటూ ట్వీట్ చేశారు. -
‘ఈ సినిమా మీ కోసం కాదు మాస్టర్స్..’
పరువు, మర్యాదలే ఆస్తిగా భావించే ఓ మధ్యతరగతి ముస్లిం కుటుంబంపై హఠాత్తుగా దేశ ద్రోహులు అనే ముద్ర పడింది. ఇరుగుపొరుగు వారి సూటిపోటి మాటలతో పాటు మీడియా అత్యుత్సాహం కూడా తోడవడం వారిని మరింతగా కుంగదీస్తోంది. ఇటువంటి దిక్కుతోచని పరిస్థితుల్లో ఓ లాయర్ ఆ కుటుంబానికి అండగా నిలబడింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి’ ఇదీ సంక్షిప్తంగా ‘ముల్క్’ సినిమా కథ. కోర్టు రూంలో జరిగే డ్రామా ప్రధానంగా నడిచే ఈ సినిమాను దర్శకుడు అనుభవ్ సిన్హా తెరకెక్కించారు. రిషి కపూర్, తాప్సీ, ప్రతీక్ బబ్బర్, అశుతోష్ రాణా, రాజత్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన.. ‘ముల్క్’ సినిమా ఆగస్ట్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో.. ‘నేర చరిత గల ముస్లిం కుటుంబాలకు మద్దతు తెలిపేందుకు, వారు మరింతగా రెచ్చిపోయే అవకాశం కల్పించేందుకే అనుభవ్ ఈ సినిమా తీస్తున్నట్టు ఉంది. అసలు ఈ సినిమా వెనుక ఉన్నది ఎవరంటూ’ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. తనపై ట్రోల్ చేస్తోన్న వారందరికి దిమ్మ తిరిగేలా ఓపెన్ లెటర్‌తో సమాధానమిచ్చారు ‘ముల్క్’ దర్శకుడు అనుభవ్ సిన్హా. ‘‘ఈ సినిమా మీ కోసం కాదు మాస్టర్స్..’ మిమ్మల్ని, మీ ఆలోచనా ధోరణిని చూస్తుంటే జాలి వేస్తోంది. మీ పనికిమాలిన ట్రోలింగ్ వల్ల ఎంతో మంది వ్యక్తుల కెరీర్లు, జీవితాలు ప్రభావితమవుతాయని మీకసలు తెలిసినట్టు లేదు. సమయం దొరికినప్పుడల్లా ఇక్కడికి(సోషల్ మీడియా) రావడం. ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేయడం. ఇది కాదు కావాల్సింది’ అంటూ కాస్త ఘాటుగానే స్పందించారు. ఈ సినిమా నిర్మాతల గురించి తెలియజేస్తూ.... ‘‘ముల్క్’ సినిమాకు దావూద్ ఇబ్రహీం గానీ, కాంగ్రెస్ పార్టీగానీ, లేదా ఆరెస్సెస్ గానీ డబ్బులు సమకూర్చడం లేదు. కావాలంటే దావూద్, రాహుల్ గాంధీ, మోహన్ భగవత్‌లను మీరే స్వయంగా అడిగి తెలుసుకోండి. ఈ సినిమా దర్శకుడిగా చెప్తున్నా.. దీపఖ్ ముకుత్, ఆయన తండ్రి కమల్ ముకుత్లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికైనా తెలుకోండి’ అంటూ అనుభవ్ ఓ సుదీర్ఘ లేఖ రాశారు. An open letter to all the trolls. Bring it on!!! pic.twitter.com/QSLMOBLmnz — Anubhav Sinha (@anubhavsinha) July 15, 2018 -
అతడిని పెళ్లి చేసుకో.. హీరోకి తండ్రి సలహా
బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ ఉంటారు. ఈ క్రమంలో కుమారుడు, ‘సంజు’ ఫేమ్ రణ్‌బీర్ వివాహంపై చేసిన ట్వీట్ పేలింది. ఎందుకంటే ఓ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందని రణ్‌బీర్‌కు రిషి కపూర్ సలహా ఇవ్వడమే అందుకు కారణం. అబ్బాయిని పెళ్లి చేసుకోమని మీ నాన్నే నీకు సలహా ఇచ్చాడు చూడు అంటూ నెటిజన్లు రణ్‌బీర్‌ను తెగ ట్రోల్ చేస్తున్నారు. విషయం ఏంటంటే.. రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ప్రేమించుకుంటున్నారని, త్వరలో వీరిద్దరు పెళ్లి జరగనుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 30 ఏళ్లలోపే పెళ్లి చేసుకుంటానని అలియా చెప్పగా.. రణ్‌బీర్ ఆ మాత్రం కూడా నోరు విప్పలేదు. కుమారుడి పెళ్లిపై వదంతులకు చెక్ పెట్టేందుకు.. ‘బెస్ట్ ఫ్రెండ్స్.. మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది.. హై టైమ్’అని దర్శకుడు అయాన్ ముఖర్జీ, రణ్‌బీర్‌ల ఫొటోను రిషికపూర్ పోస్ట్ చేశారు. అయాన్ ముఖర్జీ, రణ్‌బీర్‌లు క్లోజ్ ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. కాగా, రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సంజు’ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. -
90ల నాటి నుంచే ‘సంజు’ ప్రమోషన్...!
బాలీవుడ్ సీనియర్ నటుడు, హీరో రణ్‌బీర్ కపూర్ తండ్రి రిషీ కపూర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా 1993 నాటి ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేసిన రిషి కపూర్... ‘ థ్యాంక్యూ! ఈ నలుగురు అప్పుడెప్పటి నుంచో మూవీ(సంజు)ని ప్రమోట్ చేస్తూ ఉన్నారంటూ’ కామెంట్ చేశారు. అసలు విషయమేమిటంటే... 1993 ముంబై పేలుళ్ల సమయంలో అరెస్టైన సంజయ్ దత్‌కు సంఘీభావం తెలుపుతూ బాలీవుడ్ పరిశ్రమ అండగా నిలిచిన విషయం తెలిసిందే. ‘సంజు వీ ఆర్ విత్ యూ’ (సంజు మేము నీతో ఉన్నాం) అనే పోస్టర్‌తో సల్మాన్ ఖాన్, అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్‌లు నిల్చుని ఉన్న పాత ఫొటోను రిషి కపూర్ ట్విటర్లో పోస్ట్ చేశారు. అయితే ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న రణ్‌బీర్ సంజు సినిమాను ప్రమోట్ చేసేందుకు రిషి కపూర్ కష్టపడాల్సిన అవసరం లేదోమో’ అంటూ నెటిజన్లు చమత్కరిస్తున్నారు. సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సంజు సినిమా పాజిటివ్ టాక్‌తో భారీ వసూళ్ల దిశగా దూసుకుపోతోన్న విషయం తెలిసిందే. సంజు పాత్రకు ప్రాణం పోసిన రణ్‌బీర్ నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కుతుండటంతో రిషి కపూర్ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు. Thank you! These people been promoting the film ever since! pic.twitter.com/Ot2iDM9Hk7 — Rishi Kapoor (@chintskap) June 29, 2018 -
బండబూతులే ఆయన కౌంటర్లు
సాక్షి, ముంబై: బాలీవుడ్ వెటరన్ నటుడు రిషి కపూర్ వ్యవహార శైలి ఒక్కోసారి తీవ్ర విమర్శలకు దారితీస్తుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ దిగ్గజ నటుడు.. విమర్శకులకు ఒక్కోసారి ఘాటైన బదులు ఇస్తుంటారు. తాజాగా సంజయ్ దత్ బయోపిక్ సంజు ట్రైలర్ విడుదలై యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. అయితే ఓ వ్యక్తి ఈ చిత్ర దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీని విమర్శిస్తూ ఓ ట్వీట్ చేయగా, దానికి రిషి కపూర్ బండ బూతుతో బదులిచ్చారు. ‘సంజు ట్రైలర్ చూసి నిర్ఘాంతపోయా. సంజయ్ దత్ ఇమేజ్ను మంచిగా చూపేందుకే దర్శకుడు ప్రయత్నించాడు. అతనో క్రిమినల్. క్రిమినల్‌ను క్రిమినల్లాగేనే చూపించాలి. పైగా బాంబు పేలుళ్లలో అతని హస్తం ఉందన్న విషయం లోకానికి తెలుసు. అలాంటప్పుడు దర్శకుడు మూర్ఖంగా ఎలా చేయగలిగాడు’ అంటూ దర్శకుడిని ఉద్దేశిస్తూ ఓ వ్యక్తి ట్వీట్లు చేశాడు. ఇది రిషి కపూర్‌కు మంట పుట్టించింది. ‘సినిమా గురించి నీకేం తెలుసు *****. మేం ప్రేక్షకులకు వినోదం అందించేందుకు ఉన్నామే తప్ప.. ఎవరి ఇమేజ్‌నో రిపేర్ చేయటానికి కాదు. నీలాంటోళ్లు అసలు సినిమాలు చూసేందుకు కూడా పనికి రారు’ అంటూ రిషి ఘాటు రీ ట్వీట్ చేశారు. రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న సంజు జూన్ చివర్లో విడుదల కానుంది. -
బాలీవుడ్ ఆఫరొచ్చిందోచ్
రాఘవ లారెన్స్ హారర్ కామెడీ మూవీ ‘ముని’తో తెలుగు ఆడియన్స్‌కు పరిచయ మయ్యారు హీరోయిన్ వేదిక. ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాలు చేసినా, ఎక్కువగా తమిళం, మలయాళ సినిమాలు చేస్తున్నారు. లేటెస్ట్గా వేదికకు బాలీవుడ్ నుంచి ఓ క్రేజీ ఆఫరొచ్చింది. సీరియల్ కిస్సర్‌గా పేరు తెచ్చుకున్న ఇమ్రాన్ హష్మీతో మలయాళ దర్శకుడు జీతు జోసెఫ్ రూపొందిస్తున్న ‘ది బాడీ’ సినిమాలో హీరోయిన్గా వేదికను సెలెక్ట్ చేశారు. హిందీలో ఫస్ట్ మూవీలోనే ఇమ్రాన్ హష్మీ, రిషీ కపూర్‌తో యాక్ట్ చేసే చాన్స్ కొట్టేశారు వేదిక. ‘‘ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు సూపర్ ఎగై్జటింగ్ ప్రాజెక్ట్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది’’ అని పేర్కొన్నారు వేదిక. స్పానిష్ మూవీ ‘ది బాడీ’కి రీమేక్‌గా ఈ సినిమాను వయాకామ్ 18 మూవీస్, సునీర్ కేటర్‌పాల్ నిర్మిస్తున్నారు. -
కుదిరితే ఈసారి అందరం కలిసి!: హీరోయిన్
బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ తండ్రి, సీనియర్ నటుడు రిషీ కపూర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన చేసిన ట్వీట్ రణ్‌బీర్ - అలియా అభిమానుల్లో సంతోషాన్ని నింపుతోంది. ‘ఎంతో ప్రతిభావంతులైన భట్ కుటుంబ సభ్యులందరితో కలిసి పనిచేశాను. మహేష్ భట్, ముఖేష్ భట్, రాబిన్, పూర్ణిమా, సోనీ, ఇమ్రాన్ హష్మీ, అలియా భట్ మీ అందరికీ కృతఙ్ఞతలంటూ’ ఆయన ట్వీట్ చేశారు. కపూర్ అండ్ సన్స్ సినిమాలో రిషి కపూర్‌తో కలిసి నటించిన అలియా.. ‘మనం మరోసారి కలిసి నటిస్తామని నేను ఆశిస్తున్నాను. కుదిరితే ఈసారి అందరం కలిసి..’ అంటూ ట్వీట్ చేశారు. అయితే బ్రహ్మాస్త్ర సినిమాలో నటించిన సమయంలో రణ్‌బీర్ కపూర్- అలియా భట్ ప్రేమలో పడ్డారని వదంతులు ప్రచారం అయ్యాయి. సోనమ్ కపూర్ పెళ్లికి వీరిద్దరూ జంటగా హాజరవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. పలు సందర్భాల్లో రణ్‌బీర్ తల్లి నీతూ కపూర్ కూడా అలియాపై తనకు ఉన్న ఇష్టాన్ని తెలపడం.. ఇప్పుడు రిషీ కపూర్ కూడా భట్ ఫ్యామిలీని పొగడడం చూస్తుంటే.. ఈ కపూర్ ఫ్యామిలీ మొత్తం అలియాకు ఫిదా అయ్యారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. Have worked with most of the talented Bhatt family(and relatives). Mahesh Bhatt,Mukesh Bhatt,Robin Bhatt,Purnima ji, Soni Bhatt, Pooja Bhatt, Emran Hashmi, Alia Bhatt. Thank you all! — Rishi Kapoor (@chintskap) May 22, 2018 Haha wow 😀🌟🙌 hope we work together again sir.. maybe this time all together 😬😬 https://t.co/hJmlM24qRr — Alia Bhatt (@aliaa08) May 22, 2018 -
ఫస్ట్ ప్లేయర్.. నెక్ట్స్ లాయర్!
జస్ట్ 14 డేస్ గ్యాప్‌లో రెండు సార్లు సిల్వర్ స్క్రీన్‌పై కనిపించనున్నారు కథానాయిక తాప్సీ. ముందు హాకీ ప్లేయర్‌గా గ్రౌండ్లో దుమ్ము దులిపి, ఆ నెక్ట్స్ లాయర్‌గా కోర్టులో వాదిస్తారు. విషయం ఏంటంటే... హాకీ ప్లేయర్ సందీప్‌సింగ్ జీవితం ఆధారంగా షాద్ అలీ దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం ‘సూర్మ’ జూలై 13న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇందులో టైటిల్ రోల్లో దిల్జీత్‌సింగ్ నటించగా, ఫిమేల్ లీడ్ హార్ప్రీత్కౌర్ పాత్రలో తాప్సీ నటించారు. ఇక తాప్సీ లాయర్ ఆర్తీ పాత్రలో నటించిన చిత్రం ‘ముల్క్’. ఈ చిత్రం రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ కూడా చేశారు. ‘ముల్క్’ చిత్రాన్ని జూలై 27న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. అభినవ్ సిన్హా దర్శకత్వంలో రిషి కపూర్, ప్రతీక్ బబ్బర్, తాప్సీ, రజత్ కపూర్, అశుతోష్ రాణా, మనోజ్ పవ్వా, నీనా గుప్త ముఖ్య తారలుగా నటించారు. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పరువు, మర్యాదల బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా సాగనుంది. ఇప్పుడు అర్థం అయ్యింది కదా! 14డేస్‌లో గ్యాప్‌లో తాప్సీ ప్లేయర్‌గా, లాయర్‌గా ఎలా వస్తారో! అంతేకాదండోయ్... తాప్సీ నటించిన మరో రెండు హిందీ చిత్రాలు ‘తడ్కా, మన్మర్జియాన్’ కూడా రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. బీటౌన్ సరే.. మరి టీటౌన్ (తెలుగు)లో తాప్సీ సినిమాల గురించి అంటే.. అక్కడికే వస్తున్నాం. ఆది పినిశెట్టి, తాప్సీ, రితిక సింగ్ ముఖ్య తారలుగా తెలుగులో ఓ సినిమా రూపొందింది. ఈ సినిమా టైటిల్‌ను హీరో నానీ రేపు వెల్లడిస్తారు. -
‘102 నాట్ అవుట్’ మూవీ రివ్యూ
శ్వాస ఆగినప్పుడు మాత్రమే మరణించాలి. జీవితాన్ని ఆస్వాదించిన తీరు చావునూ సెలబ్రేట్ చేస్తుంది. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్..ప్రేమ, ఆప్యాయతలు భిక్ష కాకూడదు.. మనల్ని మనం ప్రేమించుకోవాలి.. 102 నాట్ అవుట్ సినిమా చూపించిన ఫిలాసఫీ. 102 .. ఇన్నింగ్లోకి దత్తాత్రేయ వఖారియా (అమితాబ్ బచ్చన్) 102 ఏళ్ల యువకుడు. నిత్యం ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడుపుతుంటాడు. 102 ఏళ్లకు మించి బతికి రికార్డ్ సృష్టించాలనుకుంటాడు. దత్తాత్రేయకు పూర్తి విరుద్ధం అతని కొడుకు బాబూలాల్ (రిషీ కపూర్). అతనికి 75 ఏళ్లు. ఎలాంటి సంతోషం.. ఉత్సాహమూ లేకుండా నిర్లిప్తంగా జీవితాన్ని వెళ్లదీస్తుంటాడు. పైగా తండ్రి అలా చిన్నపిల్లాడిలా ఉండడం బాబూలాల్‌కు చిరాగ్గా ఉంటుంటుంది. కొడుకు తీరుతో తనకూ నిరుత్సాహం కలుగుతోందని బాబూలాల్‌ను వృద్ధాశ్రామంలో చేర్పించాలనుకుంటాడు దత్తాత్రేయ. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. కొడుకును తండ్రి వృద్ధాశ్రమంలో చేర్పంచడమేంటని షాక్ అవుతాడు బాబూలాల్. అలవాటైన దుప్పటి, అలవాటైన బాత్రూమ్.. ఇలా కొన్ని అలవాట్లు ఒక్క రోజు తారుమారవుతేనే ఆపసోపాలు పడే బాబూలాల్ శేష జీవితమంతా వృద్ధాశ్రమంలో గడపాలనే ఊహకే వణికిపోతాడు. తనను ఆశ్రమానికి పంపే ఆలోచనను మానుకొమ్మని తండ్రిని బతిమాలుకుంటాడు. అయితే తాను పెట్టే అయిదు షరతులను ఒప్పుకోమంటాడు దత్తాత్రేయ. ఒప్పుకుంటాడు. ఆ అయిదు షరతులు కూడా జీవితం మీద ఆసక్తి కోల్పోయిన కొడుకును తిరిగి జీవితం పట్ల ఆకర్షితుడిని చేయడానికేనన్నమాట. నాలుగో షరతు పూర్తయ్యే సరికి ఆ విషయం బాబూలాల్కూ అర్థమవుతుంది. అయిదో షరతు.. అమెరికాలో ఉంటున్న బాబూలాల్ కొడుకు అమోల్‌ను ఇంటికి రానివ్వద్దని చెప్పడం. అక్కడ బాబూలాల్ తండ్రిని విభేదిస్తాడు. ‘‘నీ కొడుకు కేవలం ఆస్తి కోసమే నీ దగ్గరకు వస్తున్నాడు తప్ప ప్రేమతో కాదు’’ అని వాదిస్తాడు దత్తాత్రేయ. ‘‘నేను నీలాగ కాదు.. నా ప్రేమకు షరతుల్లేవ్. నా కొడుకును రానివ్వకుండా చేయలేను’’ అని స్పష్టం చేస్తాడు బాబూలాల్. ‘‘సరే.. నా కొడుకు మీద నీ కొడుకు గెలవకుండా ఎలా చేయాలో నాకు బాగా తెలుసు’’ అనుకుంటాడు దత్తాత్రేయ. అసలు ఈ స్పర్థ ఎందుకు వస్తుందీ తండ్రీకొడుకుల మధ్య? బాబూలాల్ జీవితం పట్ల ఎందుకంత నిరాసక్తంగా ఉంటాడు? ఈ రెండిటికీ సమాధానం.. బాబూలాల్ కొడుకు అమోల్æ. ఆ నేపథ్యం.. అమోల్.. బాబూలాల్, చంద్రికల ఏకైక సంతానం. అల్లారుముద్దుగా పెంచుకుంటారు. వాడు ఎంబీఏ చదవడానికి అమెరికా వెళ్లిపోయి అక్కడే ఉద్యోగం వెదుక్కొని, అమ్మాయినీ చూసుకొని, పెళ్లీ చేసుకొని సెటిల్ అయిపోతాడు. చదువుకునేటప్పుడు డబ్బు అవసరం ఉన్నప్పుడు తప్ప మిగిలిన ఏ విషయానికీ బాబూలాల్‌కు ఫోన్ చేయడు.. ఇంకే వివరమూ చెప్పడు. చివరకు తల్లి (బాబూలాల్ భార్య) అలై్జమర్స్‌తో బాధపడుతూ అన్నీ మరిచిపోయి కేవలం కొడుకు పేరును మాత్రమే వల్లిస్తూ.. వాడికోసం తపిస్తూ మరణశయ్య మీదున్నా.. చూడడానికి రాడు. లీవ్ దొరకలేదని తప్పించుకుంటాడు. చనిపోయినా రాడు. కారణం లీవ్ లేదని. అస్తికలు కలపడానికీ రాడు.. కారణం లీవ్ ఇవ్వలేదని. అలా కాలం గడిచిపోతుంది. కొడుకు కోసం.. వాడి ప్రేమ కోసం.. వాడి చల్లని మాట కోసం తపిస్తూ ఉంటాడు బాబూలాల్. చివరకు తనే కొడుకు దగ్గరకు వెళ్దామని ‘‘నేను రానా నాన్నా’’ అని నోరువిడిచి అడిగినా.. ‘‘మేమిద్దరం బిజీ.. నువ్వు ఒక్కడివే బోర్ అయిపోతావ్. మళ్లీ ఎప్పుడైనా .. హోప్ యూ అండర్‌స్టాండ్’’ అని ఫోన్ పెట్టేస్తాడు కొడుకు. మనవడు, మనవరాలు పుట్టినా వాళ్ల ఫోటోలు కూడా పంపడు. ఎప్పుడో ఆర్నెల్లకో.. యేడాదికో ఒకసారి ఫోన్ చేసి రెండు నిమిషాలు పొడిపొడిగా మాట్లాడి ఫోన్ పెట్టేస్తాడు. తన ప్రతి నిస్సహాయతకు ‘‘హోప్ యు అండర్‌స్టాండ్’’ అంటుంటాడు. కొడుకుతో గడపాలని.. వాడి పిల్లలతో ఆడాలని ఆరాటపడి.. బెంగతో కుంగిపోతుంటాడు బాబూలాల్. తన కళ్లముందే కొడుకు అలా కృషించిపోతుంటే దత్తాత్రేయ తండ్రి గుండె విలవిల్లాడుతుంది. ఈలోపే తనకు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు తేలుతుంది. తను పోతే ఇక కొడుకును పట్టించుకునే దిక్కుండదు. తనున్నప్పుడే కొడుకుకు బతుకు పట్ల ఆశ పెంచాలని.. వృద్ధాశ్రమం నెపంతో అయిదు షరతులను పెట్టి అతనిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాడు. కాని అయిదో షరతు దగ్గర అలా తేడా వస్తుంది. మనవడి అసలు రూపాన్నీ కొడుకుకు చూపించాలని .. ఎప్పుడూ బిజీ అని చెప్పే మనవడికి ఫోన్ చేసి త్వరగా రావాలని.. ఆస్తి గురించి మాట్లాడాలని చెప్తాడు. వెంటనే వచ్చేస్తానని మనవడు అంటాడు. అలా ఆస్తి గురించే మనవడు వస్తున్నాడు తప్ప తండ్రి, తాత మీద ప్రేమతో కాదని కొడుకు దగ్గర ప్రూవ్ చేస్తాడు దత్తాత్రేయ. ఈ క్రమంలోనే తనకు బ్రెయిన్ ట్యూమర్ ఉందన్న విషయాన్నీ కొడుకుకు చెప్తాడు. అప్పుడు బాబూలాల్ తండ్రిని పూర్తిగా అర్థం చేసుకుంటాడు. తండ్రి జీవనశైలిని వారసత్వంగా.. అమెరికా నుంచి వచ్చిన కొడుకును ఇంటికి రానివ్వకుండా ఎయిర్పోర్ట్నుంచే వెనక్కి పంపేయడమే కాదు.. ఇంకెప్పటికీ రావద్దని కరాఖండిగా చెప్పేస్తాడు బాబూలాల్. దత్తాత్రేయ ఆఖరి క్షణాలనూ అంతే ఆనందంగా గడిపేట్టు చూసుకుంటాడు. ‘‘నేను 102 దాటలేకపోయా.. కానీ నువ్వు ఆ రికార్డ్బద్దలు చేయాలని’’ కొడుకు చెప్తాడు. శ్వాస వదులుతాడు. తండ్రి జీవన శైలిని వారసత్వంగా తీసుకుంటాడు బాబూలాల్. దత్తాత్రేయ ఎంత ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించాడో.. తనూ అలాగే ఆస్వాదిస్తుంటాడు... తనని తాను ప్రేమించుకుంటూ.. చుట్టూ ఉన్నవాళ్లకు ప్రేమను పంచుతూ! బంధాలు అంచిందే అనుబంధాలు చిక్కగా ఉంటే సంతోషమే. కాలం వాటిని పలుచగా అయ్యేట్టు చేసినా డీలా పడాల్సిన పనిలేదు. మనకు మనం ఎప్పుడూ మిగలాలి.. మనల్ని మనం ఎప్పుడూ ప్రేమించుకోవాలి! జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలి... మరణం వరకూ బతకాలి.. బతుకులో మరణాన్ని వెదుక్కోకూడదు.. కష్టసుఖాల్నీ ఇష్టపడుతూ ప్రయాణం సాగించాలి ఉల్లాసంగా... అదే జీవనపరమార్థం.. 102 నాట్ అవుట్.. హోప్ యు అండర్‌స్టాండ్!! – శరాది -
103 ఏళ్ల బామ్మ వీడియో పోస్ట్ చేసిన అమితాబ్
-
103 ఏళ్ల బామ్మ వీడియో వైరల్
సాక్షి, ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘102 నాటౌట్’.. గుజరాతీ నాటకం ఆధారంగా ఉమేశ్ శుక్లా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బిగ్‌బీ అమితాబ్ 102 ఏళ్ల వృద్ధుడి పాత్ర పోషిస్తున్నారు. ఆయన కుమారుడిగా 70 ఏళ్ల వ్యక్తిగా మరో సీనియర్ నటుడు రిషీ కపూర్ నటించారు. మే 4న ఈ మూవీ విడుదల చేసేందుకు యూనిట్ సిద్దంగా ఉంది. అయితే మూవీపై స్పందిస్తూ 103 ఏళ్ల బామ్మ చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది. రెండున్నర దశాబ్దాల తర్వాత అమితాబ్, రిషీ కపూర్ కలిసి నటిస్తున్న చిత్రమిది. T 2791 - A heartwarming greeting from this lovely lady .. may God bless her !! Thank you ..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👣👣👣👣👣👣https://t.co/T7TCtc6GwS — Amitabh Bachchan (@SrBachchan) 30 April 2018 బామ్మ చేసిన పోస్టును అమితాబ్ తన ఫేస్బుక్, ట్విటర్లో పోస్ట్ చేస్తూ ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. 'ఆల్ ది బెస్ట్ అమితాబ్.. నువ్వు 102 నాటౌట్ అయితే నేను 103 నాటౌట్ అంటూ' బామ్మ పోస్ట్ చేసిన వీడియోను అమితాబ్ తన అభిమానులతో షేర్ చేసుకున్నారు. 103 ఏళ్ల వయసులో బామ్మ అంత యాక్టీవ్ ఉంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 'ఈ లవ్లీ లేడీ మాకు విషెస్ తెలిపారు. ఆమెను దేవుడు చల్లగా చూడాలంటూ' అమితాబ్ పోస్టు చేయగా వీడియో వైరల్ అవుతోంది. మూవీకి భలేగా ప్రమోషన్ లభించిందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
ఆ శక్తి నాలో ఉంది
బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉంటారు. ఆసక్తికర విషయాలను సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు తెలియజేస్తుంటారు. ఆయన ఓ బ్లాగ్‌ను కూడా రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా మీ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది? అనే ప్రశ్న అమితాబ్ ముందుంచితే ‘‘సోషల్ మీడియాలో ఉన్న నా ఫాలోవర్స్ అందరికీ రెస్పాండ్ అవ్వడం సాధ్యం కాని పని. కానీ ఇంట్రెస్టింగ్గా ఏదైనా విషయం అనిపిస్తే తప్పకుండా పూర్తిగా చదువుతాను. మనలోని మరో కోణాన్ని తెలుసుకోవడానికి ఇలాంటివి ఉపయోగపడతాయి. నా సినిమాల గురించి వారు ఏవైనా విభిన్న అభిప్రాయాలను వ్యక్తపరిస్తే వాటిని నా డైరెక్టర్స్‌తో పంచుకుంటాను. కానీ అన్నిసార్లు సోషల్ మీడియాలో పొగడ్తలే రావు. మన పోస్ట్‌లకు కొన్నిసార్లు తిట్లు, వ్యతిరేకత, విమర్శలు కూడా వస్తాయి. వాటిని హ్యాండిల్ చేయగల మెచ్యూరిటీ మనలో ఉండాలి. ఆ శక్తి నాలో ఉంది. నేను ఒక తప్పు చేస్తే ఒప్పుకుని దిద్దుకుంటాను. మనలో ఉన్న నెగిటివ్ పాయింట్స్‌ను ఎవరైనా ఎత్తి చూపినప్పుడు ఆవేశపడకూడదు. విశ్లేషించుకోవాలి. అప్పుడే జీవితంలో మరింత ముందుకు వెళ్లగలుగుతాం’’ అని చెప్పుకొచ్చారు అమితాబ్. ఉమేశ్ శుక్లా దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, రిషీకపూర్ నటించిన ‘102 నాటౌట్’ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది. -
కొడుకుని ఓల్డేజ్ హోమ్‌కి పంపిచేస్తా!
మనకు ఒక వయసు వచ్చే వరకు మనకు కావల్సినవి, అవసరమైన వి అన్నీ మన తల్లిదండ్రులే సమకూరుస్తారు. అదే మనకు 70 ఏళ్లు వచ్చినా ఇంకా మన మంచి చెడ్డలూ చూస్తే? ఆ అవకాశం అందరికీ దక్కదు. రిషీ కపూర్‌కి ఆ చాన్స్ దక్కింది. అయితే రియల్ లైఫ్‌లో కాదు. రిషీ కపూర్, అమితాబచ్చన్ 27 సంవత్సరాల తర్వాత కలిసి నటిస్తున్న చిత్రం ‘102 నాటౌట్’. డాడ్ అండ్ సన్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమాలో అమితాబ్ 102 ఏళ్ల వృద్ధ తండ్రిగా, రిషీ కపూర్ ఆయన 75 ఏళ్ల కుమారుడిగా చేస్తున్నారు. ‘‘ప్రపంచంలోనే ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వ్యక్తిగా రికార్డు సృష్టిస్తాను. ఈ ముసలి కుమారుడితో ఉండలేకపోతున్నాను ఓల్డ్ ఏజ్ హోమ్‌లో చేరుస్తాను’’ అంటూ సాగే ‘102’ ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. సౌమ్య జోషి రచించిన ఈ చిత్రాన్ని ‘ఓ మై గాడ్’ ఫేమ్ ఉమేశ్ శుక్లా దర్శకత్వం వహించారు. ట్రీటాప్ ఎంటర్టైన్మెంట్, బెంచ్‌మార్క్ పిక్చర్స్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మే 4న విడుదల కానుంది. -
అమితాబ్ ‘102 నాట్ అవుట్’
సాక్షి, ముంబై : బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, రిషీ కపూర్ తండ్రి కొడుకులుగా నటిస్తున్న చిత్రం 102 నాట్ అవుట్. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను శుక్రవారం విడుదల చేశారు. నటుడు రిషీ కపూర్ ట్విటర్ ఖాతా ద్వారా ఫస్ట్ లుక్‌ను షేర్ చేశారు. తండ్రి కూల్.. కొడుకు ఓల్డ్ స్యూల్ అని ట్వీట్ చేశారు. 27 సంవత్సరాల తర్వాత హేమాహేమీలిద్దరూ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. గుజరాతీ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ఉమేశ్ శుక్లా దర్శకత్వం వహించారు. వయసు మళ్లిన తండ్రి కొడుకుల మధ్య అనుబంధాలే కథాంశంగా సినిమా ఉండబోతుందని ట్రైలర్‌ని బట్టి అర్థం అవుతోంది. అమితాబ్, రిషీల కాంబినేషన్లో గతంలో తెరకెక్కిన కబీ కబీ, అమర్ అక్బర్ ఆంథోని, నషీబ్, కూలీ, అజూబా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు నమోదు చేశాయి. దాదాపు 27 సంవత్సరాల తర్వాత ‘102 నాట్ అవుట్’ అదే మేనియాను కొనసాగిస్తుందా? చూద్దాం. మే 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.