‘మిమ్మ‍ల్ని చాలా మిస్‌ అవుతాను చింటూ సార్‌’ | Sanjay Dutt React On Rishi Kapoor Death | Sakshi
Sakshi News home page

‘జీవితాంతం మిమ్మ‍ల్ని మిస్‌ అవుతాను చింటూ సార్‌’

Published Thu, Apr 30 2020 2:49 PM | Last Updated on Thu, Apr 30 2020 3:45 PM

Sanjay Dutt React On Rishi Kapoor Death - Sakshi

కష్టకాలంలో రిషికపూర్‌ తనకు ఎంతగానో అండగా నిలిచారని బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సంజయ్‌దత్‌ అన్నారు. నిరాశలో కూరుకుపోయిన ప్రతి సందర్భంలో జీవితాన్ని సమర్ధవంతంగా ఎలా ఎదుర్కోవాలో నేర్పించారని ఆయన గుర్తు చేసుకున్నారు. కాగా బాలీవుడ్‌ దిగ్గజ నటుడు‌ రిషి కపూర్‌ మృతిచెందిన విషయం తెలిసిందే. గత రెండేళ్లుగా క్యాన్సర్‌ వ్యాధితో పోరాటం చేసిన ఆయన గురువారం ముంబైలో కన్నుమూశారు. మంచి నటుడిగా మాత్రమే కాకుండా నిజ జీవింలోనూ మంచి వ్యక్తిగా రిషి కపూర్‌ చెరగని ముద్ర వేసుకున్నారు. మాదక ద్రవ్యాల కేసులో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న సంజయ్‌దత్..‌ రిషి కపూర్‌ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. జీవితాంతం చింటు సార్‌ను మిస్‌ అవుతాను అంటూ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. (చాకొలెట్‌ బాయ్‌ రిషి కపూర్‌...)

I will miss you Chintu sir.

A post shared by Sanjay Dutt (@duttsanjay) on

‘‘నా జీవితంలో మీరు ప్రత్యేకమైన వ్యక్తి. నాకు ఎల్లప్పుడు మీరు ఆదర్శవంతులు. జీవితంలో ఎలా బతకాలో నేర్పించారు. కష్టకాలంలో ఎలా ధైర్యంగా నిలబడాలో చూపించారు. మీతో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీరు నన్ను ఎప్పుడూ మంచి బాటలో నడిపించారు. ఎంత కష్టం వచ్చినా చిరునవ్వుతో జీవితాన్ని ముందుకు సాగించాలని సూచించారు. ప్రతి ఒక్కరిలో స్పూర్తిని నింపిన వ్యక్తిగా గుర్తిండిపోతారు. చాలాకాలం క్యాన్సర్‌ పోరాటం చేశారు. కానీ ఎప్పుడూ అలా కనిపించకుండా నవ్వూతూ ఉండేవారు. మీరు అనారోగ్యంతో బాధపడుతూ కూడా కొన్ని నెలల క్రితం మిమ్మల్ని కలిసినప్పుడు కూడా నా గురించి శ్రద్ధ చూపారు. ఈ రోజు నాకు చాలా బాధాకరమైన రోజు ఎందుంకంటే  నేను నా కుటంబ వ్యక్తిని, స్నేహితుడుని, సోదరుడిని కోల్పోయాను.మిమ్మల్ని చాలా మిస్‌ అవుతాను. దేవుడు మిమ్మల్ని సంతోషంగా ఉంచుతాడని ఆశిస్తున్నాను. ఐ లవ్‌ యూ చింటూ సార్‌’’. అంటూ రాసుకొచ్చారు. ఇక రిషి కపూర్‌, సంజయ్‌దత్‌ కలిసి అగ్నీపథ్‌, సాహిబాన్‌ వంటి చిత్రాల్లో నటించారు. (అదే రిషి క‌పూర్ చివ‌రి కోరిక‌..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement