
సంజయ్‌దత్ (Sanjay Dutt) జీవితంలో ఆకాశమంత విజయాల్ని చూశాడు. జైలు జీవితం, డ్రగ్స్‌కు బానిసవడంతో తన పతనాన్నీ చూశాడు. క్యాన్సర్‌తో పోరాడి వారియర్‌గా గెలిచాడు. వైవాహిక జీవితంలోనూ ఎన్నో ఒడిదుడుకులు చూశాడు. మొదటి భార్య రిచా బ్రెయిన్ ట్యూమర్‌తో మరణించగా రెండో భార్య రియా పిల్లైతో ఎంతోకాలం కలిసుండలేకపోయాడు. ప్రస్తుతం మూడో భార్య మాన్యతతో కలిసి జీవిస్తున్నాడు.
గర్భంతో భార్య.. జైలుకు సంజయ్
అయితే మాన్యత (Maanayata) గర్భం దాల్చినప్పుడు సంజయ్ చిక్కుల్లో పడ్డాడు. 1993 ముంబైలో జరిగిన బాంబు పేలుళ్లలో నిందితుల నుంచి అక్రమంగా ఆయుధాలను తీసుకున్న కేసులో సంజయ్ దత్ దోషిగా తేలాడు. దీంతో ఐదేళ్లపాటు జైలుశిక్ష అనుభవించి 2016లో రిలీజయ్యాడు. అయితే సంజయ్ జైల్లో ఉన్నప్పుడు మాన్యత ప్రెగ్నెంట్. అలాంటి సమయంలో ఆమెను ఒంటరిగా వదిలేయాల్సి వచ్చినందుకు ఎంతో బాధపడ్డాడు. ఆమెను జాగ్రత్తగా చూసుకోమని తన బెస్ట్ ఫ్రెండ్, నటి షీబా ఆకాశ్‌దీప్ (Sheeba Akashdeep)ను ఆదేశించాడు.

సంజయ్ దత్-మాన్యత, షీబా ఆకాశ్‌దీప్
ఫ్రెండ్ సాయం కోరిన నటుడు
ఈ విషయాన్ని షీబా తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది. ఆమె మాట్లాడుతూ.. జైలుకు వెళ్లేముందు సంజు నాతో మాట్లాడాడు. మాన్యత ఒంటరిగా ఉంది. తనను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే! అని నాపై భారం వేశాడు. సంతోషంగా అంగీకరించాను. ప్రతిరోజు ఆమె ఇంటికి వెళ్లేదాన్ని. తనతో కూర్చుని మాట్లాడేదాన్ని. ఒంటరితనం ఫీలవకూడదని నావంతు ప్రయత్నించాను. సంజూ బయటకు వచ్చేంతవరకు నేను తనతోనే ఉన్నాను. తొమ్మిది నెలలపాటు మాన్యతకే సమయం కేటాయించాను అని చెప్పుకొచ్చింది.
తప్పదని తెలిశాక..
2010 అక్టోబర్‌లో మాన్యత కవలపిల్లలకు జన్మనిచ్చింది. జైలు జీవితం గురించి సంజయ్‌దత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను మొదటిసారి థానే జైలుకు వెళ్లినప్పుడు అక్షయ్ కుమార్, షారూఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్.. ఇలా అందరూ వచ్చారు. జైలు బయట వీరు నాతో మాట్లాడిన ఫోటోలు ఇప్పటికీ ఉన్నాయి. జైలు జీవితం నుంచి తప్పించుకోలేను అని తెలిసినప్పుడు దాని గురించి అతిగా ఆలోచించడం దేనికనుకున్నాను.

ఎంతో నేర్చుకున్నా..
అన్నింటికీ సిద్ధంగా ఉండాలనుకున్నాను. ఏం జరిగినా స్వీకరించాలని నిర్ణయించుకున్నాను. ఐదేళ్ల జైలు జీవితంలో ఎంతో నేర్చుకున్నాను. ఆ సమయంలో వంట చేయడం కూడా నేర్చుకున్నాను. వర్కవుట్స్ కూడా చేసేవాడిని అని పేర్కొన్నాడు. సంజయ్ జీవిత కథ ఆధారంగా సంజు అనే సినిమా తెరకెక్కింది. బాలీవుడ్‌లో హీరోగా ఎన్నో సినిమాలు చేసిన ఆయన ప్రస్తుతం విలన్‌గా అలరిస్తున్నాడు. కేజీఎఫ్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలతో సౌత్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు.
చదవండి: ప్రేమించిన వ్యక్తి కోసం సారిక చెప్పాపెట్టకుండా వెళ్లిపోయింది: నటుడు
Comments
Please login to add a commentAdd a comment