Sanjay Dutt
-
హాలీవుడ్ ఎంట్రీ
బాలీవుడ్లో స్టార్ హీరోలుగా క్రేజ్ సొంతం చేసుకున్న సల్మాన్ ఖాన్(Salman Khan), సంజయ్ దత్(Sanjay Dutt) హాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు. లూయిస్ మచిన్, ఎవా బియాంకో, పౌలా లుస్సీ ప్రధాన పాత్రల్లో రోడ్రిగో గెర్రెరో దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సెవెన్ డాగ్స్’. 2021లో అర్జెంటీనాలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీని హాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు.ఈ రీమేక్‌లో సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతోంది. సల్మాన్, సంజయ్‌లపై సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ షూటింగ్ వీడియో క్లిప్పింగ్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. సల్మాన్ ఖాకీ చొక్కా వేసుకుని ఆటో డ్రైవర్ వేషంలో ఉండగా... సంజయ్ సూటు ధరించి ఉన్నారు.మిడిల్ ఈస్ట్‌లో జరిగే అమెరికన్ థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోందట. మిడిల్ ఈస్ట్‌లో సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ సినిమాలకు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ రీమేక్‌లో నటింపజేస్తున్నారట హాలీవుడ్ మేకర్స్. అయితే భద్రతా కారణాల రీత్యా ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను అధికారికంగా వెల్లడించలేదు. -
కడుపుతో ఉన్న భార్య కోసం ఆరాటం.. జైల్లో ఉండగా నటుడు ఏం చేశాడంటే?
సంజయ్‌దత్ (Sanjay Dutt) జీవితంలో ఆకాశమంత విజయాల్ని చూశాడు. జైలు జీవితం, డ్రగ్స్‌కు బానిసవడంతో తన పతనాన్నీ చూశాడు. క్యాన్సర్‌తో పోరాడి వారియర్‌గా గెలిచాడు. వైవాహిక జీవితంలోనూ ఎన్నో ఒడిదుడుకులు చూశాడు. మొదటి భార్య రిచా బ్రెయిన్ ట్యూమర్‌తో మరణించగా రెండో భార్య రియా పిల్లైతో ఎంతోకాలం కలిసుండలేకపోయాడు. ప్రస్తుతం మూడో భార్య మాన్యతతో కలిసి జీవిస్తున్నాడు.గర్భంతో భార్య.. జైలుకు సంజయ్అయితే మాన్యత (Maanayata) గర్భం దాల్చినప్పుడు సంజయ్ చిక్కుల్లో పడ్డాడు. 1993 ముంబైలో జరిగిన బాంబు పేలుళ్లలో నిందితుల నుంచి అక్రమంగా ఆయుధాలను తీసుకున్న కేసులో సంజయ్ దత్ దోషిగా తేలాడు. దీంతో ఐదేళ్లపాటు జైలుశిక్ష అనుభవించి 2016లో రిలీజయ్యాడు. అయితే సంజయ్ జైల్లో ఉన్నప్పుడు మాన్యత ప్రెగ్నెంట్. అలాంటి సమయంలో ఆమెను ఒంటరిగా వదిలేయాల్సి వచ్చినందుకు ఎంతో బాధపడ్డాడు. ఆమెను జాగ్రత్తగా చూసుకోమని తన బెస్ట్ ఫ్రెండ్, నటి షీబా ఆకాశ్‌దీప్ (Sheeba Akashdeep)ను ఆదేశించాడు. సంజయ్ దత్-మాన్యత, షీబా ఆకాశ్దీప్ఫ్రెండ్ సాయం కోరిన నటుడుఈ విషయాన్ని షీబా తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది. ఆమె మాట్లాడుతూ.. జైలుకు వెళ్లేముందు సంజు నాతో మాట్లాడాడు. మాన్యత ఒంటరిగా ఉంది. తనను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే! అని నాపై భారం వేశాడు. సంతోషంగా అంగీకరించాను. ప్రతిరోజు ఆమె ఇంటికి వెళ్లేదాన్ని. తనతో కూర్చుని మాట్లాడేదాన్ని. ఒంటరితనం ఫీలవకూడదని నావంతు ప్రయత్నించాను. సంజూ బయటకు వచ్చేంతవరకు నేను తనతోనే ఉన్నాను. తొమ్మిది నెలలపాటు మాన్యతకే సమయం కేటాయించాను అని చెప్పుకొచ్చింది. తప్పదని తెలిశాక..2010 అక్టోబర్‌లో మాన్యత కవలపిల్లలకు జన్మనిచ్చింది. జైలు జీవితం గురించి సంజయ్‌దత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను మొదటిసారి థానే జైలుకు వెళ్లినప్పుడు అక్షయ్ కుమార్, షారూఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్.. ఇలా అందరూ వచ్చారు. జైలు బయట వీరు నాతో మాట్లాడిన ఫోటోలు ఇప్పటికీ ఉన్నాయి. జైలు జీవితం నుంచి తప్పించుకోలేను అని తెలిసినప్పుడు దాని గురించి అతిగా ఆలోచించడం దేనికనుకున్నాను. ఎంతో నేర్చుకున్నా..అన్నింటికీ సిద్ధంగా ఉండాలనుకున్నాను. ఏం జరిగినా స్వీకరించాలని నిర్ణయించుకున్నాను. ఐదేళ్ల జైలు జీవితంలో ఎంతో నేర్చుకున్నాను. ఆ సమయంలో వంట చేయడం కూడా నేర్చుకున్నాను. వర్కవుట్స్ కూడా చేసేవాడిని అని పేర్కొన్నాడు. సంజయ్ జీవిత కథ ఆధారంగా సంజు అనే సినిమా తెరకెక్కింది. బాలీవుడ్లో హీరోగా ఎన్నో సినిమాలు చేసిన ఆయన ప్రస్తుతం విలన్‌గా అలరిస్తున్నాడు. కేజీఎఫ్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలతో సౌత్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు.చదవండి: ప్రేమించిన వ్యక్తి కోసం సారిక చెప్పాపెట్టకుండా వెళ్లిపోయింది: నటుడు -
చనిపోతూ కోట్ల ఆస్తిని రాసిచ్చిన అభిమాని.. సంజయ్ దత్ ఏం చేశారంటే..?
బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ తనదైన స్టైల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను అలరించారు. కేజీయఫ్2(KGF2)తో దక్షిణాది వారికి కూడా ఆయన దగ్గరయ్యారు. లియో, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలలో ప్రతినాయకుడిగా కనిపించారు. బాలీవుడ్లో ఆయనకు డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. ముంబైకి చెందిన నిషా పాటిల్ అనే అభిమాని సంజూ కోసం ఏకంగా తన ఆస్థి మొత్తాన్ని రాసిచ్చింది. ఈ వార్త అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.సంజయ్ దత్ అంటే నిషా పాటిల్‌కు(62) చాలా అభిమానం.. దీంతో 2018 సమయం సంజయ్ దత్ పేరిటి ఆమె ఒక వీలునామా రాసింది. ఆమె మరణానంతరం రూ. 72 కోట్ల ఆస్తిని సంజయ్ దత్‌కు బదిలీ చేయాలని అందులో పేర్కొంది. అయితే, తన జీవితకాంలో ఆమె ఎప్పుడూ దత్‌ను వ్యక్తిగతంగా కలవలేదు. గృహిణిగా ఉన్న ఆమె సంజయ్ దత్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడేది. కేవలం అతని నటనా నైపుణ్యానికి నిషా పాటిల్ ఆకర్షితురాలైంది. బాలీవుడ్ ఒకప్పటి లెజెండ్స్ దివంగత సునీల్ దత్, నటి నర్గీస్‌ల కుమారుడు అని కూడా సంజయ్ దత్ మీద ప్రేమ ఉంది.నిషా పాటిల్ కొద్దిరోజు క్రితం అనారోగ్యం కారణంగా మృతి చెందారు. తాను మరణిస్తానని ఆమె ముందే గ్రహించి ముందే రాసి ఉంచిన కొన్ని లెటర్స్ బ్యాంకులకు పంపారు. తన ఖాతాలో ఉన్న డబ్బు మొత్తం సంజయ్ దత్‌కు మాత్రమే బదిలీ చేయాలని అందులో పేర్కొన్నారు. వీలునామా ప్రకారం తన ఆస్తి మొత్తం సంజయ్ దత్కే చెందుతుందని లీగల్‌గా కూడా పత్రాలు రాసి ఉంచారు. దీంతో తన ఆస్తి అంతా సంజయ్ పేరిట ఉంది.బ్యాంకు అధికారుల ద్వారా అసలు విషయాన్ని తెలుసుకున్న సంజయ్ దత్ ఆశ్చర్యపోయారు. నిషా పాటిల్ ఎవరో తనకు తెలియదని ఆయన అన్నారు. కానీ, ఆమె చూపిన అభిమానం పట్ల ఆయన చలించిపోయారు. ఆమెకు సంబంధించిన ఆస్తి తనకు వద్దని ఆయన సున్నితంగా తిరస్కరించారు. అంతటి అభిమానిని కలుసుకోలకపోయాననే బాధ ఉందని తెలిపారు. తన పేరుతో ఉన్న ఆస్తులన్నీ నిషా పాటిల్ కుటుంబ సభ్యులకు అందేలా లీగల్ టీమ్‌ను దత్ ఏర్పాటు చేశారు. త్వరలో ఆమె కుటుంబ సభ్యులనైనా కలుస్తానన్నారు.బాల నటుడిగా ఎంట్రీ.. ఐదేళ్లు జైలు జీవితం1971లో తన తండ్రి నిర్మించిన చిత్రం "రేష్మ ఔర్ షెరా"లో బాల నటుడిగా సంజయ్ దత్ ఎంట్రీ ఇచ్చాడు. సాజన్, ఖల్నాయక్, వాస్తవ్,మిషన్ కాశ్మీర్,పరిణీత మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగే రహో మున్నాభాయ్, నామ్, ముసఫిర్,అగ్నిపథ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో ఆయనకు చాలామంది అభిమానులు ఉన్నారు. 1993 ముంబయిలో జరిగిన బాంబు పేలుళ్లలో నిందితుల నుంచి అక్రమంగా ఆయుధాలు తీసుకున్నట్లు నేరం రుజువైంది. ఈ కేసులో సంజయ్ దోషిగా తేలారు. దీంతో ఆయన ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించారు. 2016లో జైలు నుంచి విడుదలయ్యారు. -
ముగ్గురు స్టార్స్, పరమ చెత్త సినిమాగా రికార్డ్.. థియేటర్లలో నో రిలీజ్!
కొన్ని సినిమాలు అద్భుతంగా ఆడతాయి. మరికొన్ని అట్టర్ ఫ్లాప్‌గా నిలుస్తాయి. భారీ తారాగణం, భారీ బడ్జెట్ ఉన్నా సరే కంటెంట్‌లో దమ్ము లేకపోతే ప్రేక్షకులను మెప్పించడం కష్టం. ఇప్పుడు చెప్పుకునే సినిమా అదే కోవలోకి వస్తుంది. సడక్.. 1991వ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఇదీ ఒకటి. మహేశ్ భట్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సంజయ్‌దత్, పూజా భట్ ప్రధానపాత్రల్లో నటించారు. రెండు దశాబ్దాలకు సీక్వెల్ఐదింతలు లాభాలు తెచ్చిపెట్టిన ఈ సినిమాకు రెండు దశాబ్దాల తర్వాత సీక్వెల్ ప్రకటించారు. సంజయ్ దత్, ఆలియా భట్, ఆదిత్య రాయ్ కపూర్.. ఇలా బడా స్టార్స్‌తో 2020లో సీక్వెల్ తీసుకొచ్చారు. అయితే సడక్ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతలా ఆదరించారో సడక్ 2 మూవీని అంతే స్థాయిలో తిప్పికొట్టారు. యూట్యూబ్‌లో ట్రైలర్ రిలీజ్ చేసిన 24 గంటల్లోనే 70 లక్షలమంది డిస్లైక్ కొట్టారు.నేరుగా ఓటీటీలో రిలీజ్తీరా సినిమాకు థియేటర్లు దొరక్కపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఓటీటీ ప్లాట్‌ఫామ్ హాట్‌స్టార్‌లో రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీకి ఐఎమ్‌డీబీలోనూ అత్యంత దారుణమైన రేటింగ్స్ ఉన్నాయి. కేవలం 1.2 రేటింగ్ ఉంది. అంతేకాదు, ఓటీటీలో రిలీజైన రెండు రోజులకే సడక్ 2 వంద అత్యంత చెత్త చిత్రాల్లో ఒకటిగా చేరిపోవడం గమనార్హం.ముఖ్య కారణం!కాగా సడక్ 2పై అంత వ్యతిరేకత రావడానికి మరో ముఖ్య కారణం కూడా ఉంది. ఈ మూవీ రిలీజైన ఏడాదే నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. బాలీవుడ్‌లోని నెపోటిజమే అతడి ప్రాణాలు తీసిందని జనాల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఈ కారణం వల్లే బాలీవుడ్ బడా స్టార్స్ కలిసి నటించిన సడక్ 2 సినిమాకు యూట్యూబ్‌లో లక్షల్లో వచ్చిపడ్డాయి. చదవండి: Pushpa 2 Movie: నార్త్‌లో పుష్ప 2 దూకుడుకు బ్రేక్? -
Bollywood Stars: అక్కడ హీరో.. ఇక్కడ విలన్
బాలీవుడ్ నుంచి ఎక్కువగా హీరోయిన్లు టాలీవుడ్‌కి వస్తుంటారు. ఈసారి పలువురు నటులు తెలుగు తెరకు పరిచయం కానున్నారు. ఈ ఏడాది ఇప్పటికే కొందరు నటులు, నటీమణులు కనిపించగా... త్వరలో రానున్న బాలీవుడ్ స్టార్స్ గురించి తెలుసుకుందాం. కన్నప్పతో ఎంట్రీబాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హిందీలో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా దూసుకెళుతున్నారు. ఆయన తొలిసారి తెలుగులో ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘కన్నప్ప’. హీరో మంచు విష్ణు కలల ప్రాజెక్టుగా ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రమిది. ఈ మూవీకి ‘మహాభారత్’ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీలో పలు భాషలకు చెందిన స్టార్ హీరోలు, ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ప్రభాస్, మోహన్‌బాబు, మోహన్ లాల్, శరత్‌కుమార్, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్, మధుబాల, ప్రీతీ ముకుందన్ వంటి వారు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ‘కన్నప్ప’ చిత్రంలో అక్షయ్ కుమార్ కీలకమైన అతిథి పాత్రలో నటించారు. ఇప్పటికే తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ కోసం హైదరాబాద్‌కి వచ్చి, తన పాత్ర షూటింగ్‌ని అక్షయ్ కుమార్ పూర్తి చేసి వెళ్లారు. అక్షయ్ వంటి స్టార్ హీరో ‘కన్నప్ప’లో భాగస్వామ్యం కావడంతో ఈ సినిమాపై బాలీవుడ్‌లోనూ ఆసక్తి నెలకొంది. అయితే అక్షయ్ కుమార్ ఏ పాత్రలో నటించారు? అనే విషయాన్ని చిత్రయూనిట్ ఇప్పటి వరకూ స్పష్టం చేయలేదు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో రూపొందుతోన్న ‘కన్నప్ప’ డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓమీ భాయ్బాలీవుడ్ సీరియల్ కిస్సర్‌గా పేరు తెచ్చుకున్నారు ఇమ్రాన్ హష్మీ. హీరోయిన్లతో ముద్దు సన్నివేశాలు, రొమాంటిక్ సన్నివేశాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్‌ని సొంతం చేసుకున్న ఆయన తొలిసారి తెలుగులో నటిస్తున్న చిత్రం ‘ఓజీ’. పవన్ కల్యాణ్, ప్రియాంకా అరుళ్ మోహన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు ఇమ్రాన్ హష్మీ. మార్చిలో ఇమ్రాన్ హష్మీ పుట్టినరోజుని పురస్కరించుకుని, ఈ చిత్రంలో ఆయన చేస్తున్న ఓమీ భాయ్ పాత్రని పరిచయం చేస్తూ, ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. తన లుక్‌పై ఇమ్రాన్ హష్మీ ‘ఓజీ’ సినిమాలోని ఓ డైలాగ్‌తో స్పందించారు. ‘గంభీరా... నువ్వు తిరిగి బాంబే వస్తున్నావని విన్నా. ్ర΄ామిస్... ఇద్దరిలో ఒకరి తలే మిగులుతుంది’ అంటూ ట్వీట్ చేశారాయన. ఇక గూఢచారితోనూ తెరపై కనిపించనున్నారు ఇమ్రాన్. అడివి శేష్ నటించిన హిట్ మూవీ ‘గూఢచారి’ (2018)కి సీక్వెల్‌గా రూపొందుతోన్న చిత్రం ‘జీ 2’ (గూఢచారి 2). వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, అనీల్ సుంకర, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోనూ ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నారు. ఆయన నటిస్తున్న రెండో తెలుగు చిత్రం ‘జీ 2’. ఈ మూవీలో ఆయన ఏ పాత్రలో నటిస్తున్నారు? అనేది తెలియాల్సి ఉంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా రిలీజ్ కానుందని టాక్. దేవరతో జోడీఅతిలోక సుందరి శ్రీదేవి తెలుగు ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ గుర్తుండి΄ోయే ΄ాత్రలు చేశారు. ఆమె కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్లో సినిమాలు చేస్తున్నారు. అయితే ఆమె తెలుగు సినిమాల్లో నటిస్తే చూడాలని ఉందని శ్రీదేవి అభిమానులు ఎప్పటి నుంచో వేచి చూస్తున్నారు. వారి నిరీక్షణ ఫలించనుంది. ‘దేవర’ చిత్రం ద్వారా తెలుగులో హీరోయిన్గా పరిచయమవుతున్నారు జాన్వీ కపూర్. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూ΄÷ందుతోంది. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతోంది. ఈ చిత్రం నుంచి విడుదలైన ‘చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు..’పాటలో జాన్వీ కపూర్ ఫుల్ గ్లామరస్‌గా కనిపించడంతో ఈ సాంగ్ ఇప్పటికే ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది. మరి సినిమా విడుదల తర్వాత జాన్వీకి ఎంతమంది ఫ్యాన్స్ అవుతారో వేచి చూడాలి. కాగా ‘దేవర’ తొలి భాగం సెప్టెంబరు 27న విడుదల కానుంది. ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే జాన్వీకి మరో తెలుగు సినిమాలో నటించే అవకాశం వచ్చింది. వెండితెరపై చిరంజీవి–శ్రీదేవిలది సూపర్ జోడీ. వారి వారసులు రామ్ చరణ్– జాన్వీ కపూర్ తొలిసారి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆర్సీ 16’ (వర్కింగ్ టైటిల్). ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. తెలుగులో ఆమెకు ఇది రెండవ చిత్రం. ఒకప్పటి హిట్ జోడీ అయిన చిరంజీవి–శ్రీదేవిల వారసులు రామ్‌చరణ్–జాన్వీ కపూర్ నటిస్తున్న ఈ ΄ాన్ ఇండియా సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో, సినీ అభిమానుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. వీరమల్లుతో పోరాటం గత కొన్నేళ్లుగా బాబీ డియోల్ కెరీర్ ఆశాజనకంగా సాగడం లేదు. అయితే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ‘యానిమల్’ (2023) సినిమా తర్వాత ఈ బాలీవుడ్ నటుడి క్రేజ్ ఒక్కసారిగా ఊపందుకుంది. ఆ సినిమాలో ఆయన నటించిన విలన్ పాత్రకి అద్భుతమైన పేరు రావడంతో విపరీతమైన డిమాండ్ పెరిగింది. హిందీలోనే కాదు.. తెలుగు, తమిళ భాషల నుంచి కూడా అవకాశాలు వెతుక్కుంటూ వెళుతున్నాయి. ఆయన నటిస్తున్న తొలి స్ట్రయిట్ తెలుగు చిత్రం ‘హరి హర వీరమల్లు’. పవన్ కల్యాణ్, నిధీ అగర్వాల్ జంటగా నటిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ మూవీ ప్రారంభమైంది. అయితే ఈ ప్రాజెక్టు ఆలస్యం అవుతుండటంతో ఆయన తప్పుకున్నారట. దీంతో నిర్మాత ఏఎమ్ రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారని సమాచారం. ఏఎమ్ రత్నం, ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల శకం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబరులో విడుదల కానుందని టాక్. ఇదిలా ఉంటే బాలకృష్ణ హీరోగా బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న ‘ఎన్బీకే 109’ (వర్కింగ్ టైటిల్) సినిమాలోనూ బాబీ డియోల్ నటిస్తున్నారు.బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా ప్రస్తుతం తెలుగు సినిమాలపై దృష్టి పెట్టారు. 1998లో విడుదలైన హీరో నాగార్జున ‘చంద్రలేఖ’ సినిమాలో తొలిసారి అతిథి పాత్రలో కనిపించారు సంజయ్ దత్. దాదాపు ఇరవైఆరేళ్ల తర్వాత ఆయన పూర్తి స్థాయిలో నటించిన తెలుగు సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదలైంది. విలన్ బిగ్ బుల్ పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకున్నారు సంజయ్ దత్. ఆయన నటిస్తున్న మరో తెలుగు చిత్రం ‘రాజా సాబ్’. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలోనూ ఆయన కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ‘ఆదిపురుష్’ (తెలుగు–హిందీ) సినిమాతో తెలుగులో పరిచయమైన సైఫ్ అలీఖాన్ ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తొలి భాగం జూన్ 27న విడుదలైంది. ఈ సినిమా రెండో భాగంలోనూ దీపిక నటించనున్నారు. వెర్సటైల్ యాక్టర్‌గా పేరొందిన నవాజుద్దీన్ సిద్ధిఖీ కూడా ఈ ఏడాది ‘సైంధవ్’ చిత్రం ద్వారా తెలుగుకి పరిచయమయ్యారు. వికాస్ మాలిక్‌గా విలన్ పాత్రలో తనదైన శైలిలో అలరించారాయన. ఇలా ఈ ఏడాది ఇప్పటికే పలువురు బాలీవుడ్ స్టార్స్ తెలుగుకి పరిచయం కాగా... మరెందరో రానున్నారు. -
ముంబైలో ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ టీమ్ సందడి (ఫొటోలు)
-
డబుల్ ఇస్మార్ట్‌ని ఎంజాయ్ చేస్తారు: సంజయ్ దత్
‘‘తెలుగు సినిమా డైనమిక్స్‌ని మార్చిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ సార్. ‘డబుల్ ఇస్మార్ట్’లో నన్ను భాగం చేసి, బిగ్ బుల్గా చూపిస్తున్న ఆయనకి థ్యాంక్స్. రామ్‌తో పని చేయడంతో చాలా మజా వచ్చింది. ‘డబుల్ ఇస్మార్ట్’ని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు’’ అని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అన్నారు. రామ్ పోతినేని, కావ్యా థాపర్ జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ నెల 15న ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ విడుదల చేస్తోంది.మణిశర్మ సంగీతం అందించిన ఈ మూవీలోని ‘బిగ్ బుల్...’ అంటూ సాగే పాటని ముంబైలో జరిగిన ఈవెంట్లో విడుదల చేశారు. భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం అందించిన ఈ పాటని పృధ్వీ చం, సంజన కల్మంజే పాడారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ– ‘‘డబుల్ ఇస్మార్ట్’తో ఉత్తరాది ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉంది. సంజయ్ దత్గారితో పని చేయడం గౌరవంగా ఉంది’’ అని పేర్కొన్నారు. ‘‘సంజయ్ బాబాకి నేను బిగ్ ఫ్యాన్‌ని. ఆయన ‘డబుల్ ఇస్మార్ట్’ చేయడం చాలా హ్యాపీగా ఉంది’’ అని పూరి జగన్నాథ్ చె΄్పారు. ఈ వేడుకలో ఛార్మీ, కావ్యా థాపర్, పూరి కనెక్ట్స్ సీఈవో విష్, నటుడు అలీ మాట్లాడారు. -
ఈసారి డబుల్ ఇస్మార్ట్ అంటున్న రామ్ పోతినేని.. మూవీ HD స్టిల్స్
-
బర్త్ డే స్పెషల్.. ఖరీదైన కారుతో డబుల్ ఇస్మార్ట్ నటుడు!
కేజీఎఫ్ సినిమాతో దక్షిణాదిలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న నటుడు సంజయ్ దత్. ప్రస్తుతం రామ్ పోతినేని హీరోగా నటిస్తోన్న డబుల్ ఇస్మార్ట్ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో బిగ్ బుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది.అయితే జూలై 29న సంజయ్ దత్ 65వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులతో పాటు పలువురు సినీతారలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే తన బర్త్ డే రోజున అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చుకున్నారు. దాదాపు రూ.4 కోట్ల విలువైన రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.ఇక సినిమాల విషయానికొస్తే బాలీవుడ్లో గుడ్ఛాడీ మూవీలో సంజయ్ దత్ నటిస్తున్నారు. ఇందులో రవీనా టాండన్‌తో జతకట్టారు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ ఆగస్టు 9న జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది. ఆ తర్వాత రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న సినిమాలో కనిపించనున్నారు. #WATCH | Sanjay Dutt Gifts Himself New Range Rover On His 65th Birthday#Bollywood #SanjayDutt @duttsanjay pic.twitter.com/vIhiFbkpV2— Free Press Journal (@fpjindia) July 29, 2024 -
'నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు'.. సంజయ్ దత్‌పై హీరోయిన్ ఆసక్తికర కామెంట్స్!
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం సంజయ్ దత్ టాలీవుడ్ మూవీ డబుల్ ఇస్మార్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రామ్- పూరి జగన్నాధ్ కాంబోలో వస్తోన్న ఈ చిత్రంలో సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు.ఇవాళ నటుడు సంజయ్ దత్ 65వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ నటి సైరా భాను ఆసక్తికర కామెంట్స్ చేసింది. సంజయ్ దత్ తమ కుటుంబం లాంటి వాడని తెలిపింది. బర్త్ డే విషెస్ చెబుతూ ఎమోషనల్ పోస్ట్ చేసింది సైరా భాను. తన భర్త దిలీప్ కుమార్‌తో సంజయ్‌కు ఉన్న అనుబంధాన్ని పంచుకుంది.సైరా భాను తన ఇన్‌స్టాలో రాస్తూ.. "సంజయ్ దత్ ఎప్పుడూ మా కుటుంబం లాంటి వ్యక్తి. నా కుటుంబంలో అందరిని చూస్తూ పెరిగారు. ఆ పసిపిల్లవాడు ఈ రోజు గొప్ప వ్యక్తిగా ఎదిగాడు. మా ఇంట్లో జరిగే ఫంక్షన్స్‌కు నర్గీస్ అక్కతో కలిసి సంజయ్ వచ్చేవాడు. అలా ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు తనను పెళ్లి చేసుకుంటా అని అన్నారు. అందుకే అతను నా హృదయంలో ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉన్నారు. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలతో సంజయ్ దత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ' చిన్ననాటి రోజులను ఆమె గుర్తు చేసుకుంది.కాగా.. సంజయ్ దత్ చివరిగా విజయ్ హీరోగా నటించిన లియోలో కనిపించాడు. అతను ప్రస్తుతం రామ్ పోతినేని హీరోగా వస్తోన్న డబుల్ ఇస్మార్ట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అంతే కాకుండా రవీనా టాండన్‌తో కలిసి ఘుడచాడి మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 9 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది. -
‘హౌస్‌ఫుల్ ’ఫ్యామిలీలోకి సంజయ్‌దత్
హిందీ హిట్ ఫ్రాంచైజీ ‘హౌస్‌ఫుల్’లో ‘హౌస్‌ఫుల్ 5’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్‌ముఖ్, కృతీ సనన్, అనిల్ కపూర్ ఈ సినిమాలో లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. తరుణ్ మన్సుఖాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో సంజయ్ దత్ నటించనున్నట్లు చిత్రయూనిట్ శనివారం అధికారికంగా ప్రకటించింది. హౌస్‌ఫుల్ ఫ్యామిలీలోకి స్వాగతం అంటూ సంజయ్ దత్‌ను ఈ ఫ్రాంచైజీలోకి స్వాగతించారు నిర్మాత సాజిద్ నడియాడ్వాలా. కాగా ‘హౌస్‌ఫుల్ 5’ సినిమాను తొలుత ఈ ఏడాది దీ΄ావళి సందర్భంగా విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆ తర్వాత వచ్చే ఏడాది జూన్ 6న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ తెలిపారు. -
హిందీలో ‘మర్యాద రామన్న’ సిక్వెల్.. సోనాక్షి ప్లేస్‌లో మృణాల్!
సన్నాఫ్ సర్దార్‌గా అజయ్ దేవగన్ అతి త్వరలో స్కాట్లాండ్ వెళ్లనున్నారని బాలీవుడ్ సమాచారం. అజయ్ దేవగన్, సోనాక్షీ సిన్హా, సంజయ్ దత్ లీడ్ రోల్స్‌లో అశ్వినీ ధీర్ దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం ‘సన్నాఫ్ సర్దార్’ (2012). రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మర్యాద రామన్న’కు హిందీ రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. ఇప్పుడు పన్నెండేళ్ల తర్వాత ‘సన్నాఫ్ సర్దార్’కు సీక్వెల్‌గా ‘సన్నాఫ్ సర్దార్ 2’ చిత్రం రానుందని సమాచారం. తొలి భాగంలో లీడ్ రోల్స్‌లో నటించిన అజయ్ దేవగన్, సంజయ్ దత్ సీక్వెల్లోనూ నటించనున్నారని, హీరోయిన్గా మాత్రం సోనాక్షీ సిన్హా ప్లేస్‌లో మృణాల్ ఠాకూర్ కనిపించనున్నారని భోగట్టా. ఈ చిత్రానికి సంబంధించిన ఎక్కువ శాతం షూటింగ్‌ని స్కాట్లాండ్లో జరిపేలా ప్లాన్ చేశారట. ఈ షెడ్యూల్ దాదాపు యాభై రోజులకు పైగా ఉంటుందని, అజయ్ దేవగన్–మృణాల్ ఠాకూర్ల కాంబినేషన్ ట్రాక్ అంతా విదేశాల్లోనే చిత్రీకరిస్తారని టాక్. ఈ సినిమాకు అజయ్ దేవగనే దర్శకత్వం వహిస్తారనే వార్త కూడా ప్రచారంలో ఉంది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
Double Ismart: రామ్ 'డబుల్ ఇస్మార్ట్' మూవీ స్టిల్స్
-
మాజీ సీఎంపై సంజయ్‌దత్ పోటీ.. నిజమేనా?
ముంబై : బాలీవుడ్ అగ్రనటుడు సంజయ్ దత్ రాజకీయాల్లోకి వస్తున్నారా? లోక్‌సభ ఎన్నికల్లో మాజీ సీఎం ప్రత్యర్ధిగా బరిలోకి దిగనున్నారా? అంటే అవుననే అంటున్నాయి సోషల్ మీడియాలో వార్తలు. అందుకు సంజయ్ దత్ ఏమన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సంజయ్‌దత్ ఓ రాజకీయ పార్టీలో చేరబోతున్నారని, ఆ పార్టీ తరుపున ఎన్నికల్లో చేయబోతున్నారనే వార్తలు హల్చల్ చేశాయి. ఈ తరుణంలో తనపై వస్తున్న రూమర్స్‌కు సంజయ్‌దత్ చెక్ పెట్టారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని, ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని అన్నారు. ఒకవేళ రాజకీయాలు చేయాలని నిర్ణయించుకుంటే, నేనే స్వయంగా ప్రకటిస్తానని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. నేను ఏ పార్టీ చేరడం లేదు ‘నేను రాజకీయాల్లోకి వస్తున్నానే పుకార్లకు స్వస్తి చెప్పాలనుకుంటున్నాను. నేను ఏ పార్టీలో చేరడం లేదు. ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడం లేదు. దయచేసి నా గురించి వస్తున్న ప్రచారాల్ని మీరు నమ్మకండి అని పోస్ట్ చేశారు. I would like to put all rumours about me joining politics to rest. I am not joining any party or contesting elections. If I do decide to step into the political arena then I will be the first one to announce it. Please refrain from believing what is being circulated in the news… — Sanjay Dutt (@duttsanjay) April 8, 2024 ఖట్టర్‌కు పోటీగా సంజయ్ దత్ అంటూ అంతకుముందు సంజయ్‌దత్ హర్యానాలోని కర్నాల్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. బీజేపీ బలమైన నేత, హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌కు పోటీగా సంజయ్ దత్ బరిలోకి దిగనున్నట్లు ప్రచారం జరిగింది. హర్యానాతో ఉన్న అనుబంధంతో అందుకు హర్యానాతో సంజయ్ దత్‌కు ఉన్న అనుబంధమేనని తెలుస్తోంది. సంజయ్‌దత్ పూర్వీకుల గ్రామం యమునానగర్ జిల్లాలో ఉంది. గతంలో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ నాయకుడు అభయ్ సింగ్ చౌతాలా కోసం ఎన్నికల ప్రచారం చేసేందుకు హర్యానాకు వచ్చారు. దీంతో పాటు సంజయ్ దత్ తండ్రి, నటుడు, దివంగత సునీల్ దత్ పలు మార్లు కాంగ్రెస్ ఎంపీగా, మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆయన సోదరి ప్రియా దత్ కూడా కాంగ్రెస్ ఎంపీగా పనిచేశారు. ప్రచారానికి పులిస్టాప్ ఈ సారి లోక్‌సభ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ సంజయ్‌దత్‌ను ఎన్నికల బరిలోకి దించుతుందనే ప్రచారానికి బలం చేకూరినట్లైంది. ఇక సంజయ్‌దత్ ట్వీట్‌తో ప్రచారానికి పులిస్టాప్ పడింది. కాగా, 2014, 2019 ఎన్నికల్లో హర్యానా కర్నాల్ లోక్‌సభ స్థానాన్ని బీజేపీ గెలుచుకుంది. అంతకు ముందు రెండు పర్యాయాలు ఈ సీటు కాంగ్రెస్‌కు దక్కింది. -
ప్రభాస్.. ‘రాజా సాబ్’లో ఆత్మ...?
రాజా సాబ్తో ఆత్మరూపంలో మాట్లాడుతున్నారట సంజయ్ దత్. ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాజా సాబ్’. ఈ హారర్ థ్రిల్లర్ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మాళవికా మోహనన్, నిధీ అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా, ఓ కీలక పాత్రలో సంజయ్ దత్ కనిపిస్తారనే టాక్ ఎప్పట్నుంచో వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ‘రాజాసాబ్’ తాత–మనవడి నేపథ్యంలో సాగే కథ అని, ప్రభాస్‌కు తాతగా సంజయ్ దత్ కనిపిస్తారని టాక్. అంతేకాదు.. ఈ సినిమాలో ఆత్మ రూపంలో ప్రభాస్‌తో సంజయ్ దత్ మాట్లాడిన తర్వాతే కథ కీలక మలుపు తిరుగుతుందని ఫిల్మ్‌నగర్ భోగట్టా. మరి.. సంజయ్ దత్ ఆత్మగా ప్రభాస్‌తో ఏం చె΄్పారు? అనేది తెలియాలంటే ‘రాజా సాబ్’ చిత్రం రిలీజయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ఈ సినిమా వచ్చే ఏడాదిప్రారంభంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. -
ప్రభాస్, రామ్ చరణ్ తాతయ్యలుగా అమితాబ్, సంజయ్ దత్!
అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్.. ఇద్దరు ఒకప్పుడు స్టార్ హీరోలే. వారిద్దరి సినిమాలు బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయలు వసూలు చేశాయి. ఇద్దరికి కోట్లమంది అభిమానులు ఉన్నారు. వయసులో ఉన్నప్పుడు వైవిధ్యమైన సినిమాలతో వారిని అలరించారు. ఇప్పడు వయసు పైబడిన తర్వాత తమలోని మరో యాంగిల్‌ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. విలన్‌గా, తండ్రిగా, సోదరుడిగా, గురువుగా పలు పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇప్పుడు తాతయ్యలుగానూ అలరించేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్‌కు తాతగా అమితాబ్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ తర్వాత చరణ్ నటిస్తున్న చిత్రమిది. ఇది బుచ్చిబాబుకు రెండో సినిమా. ఉప్పెన తర్వాత చాలా గ్యాప్ తీసుకొని రామ్‌చరణ్ మూవీ (RC16) ప్రకటించాడు. రామ్‌చరణ్ బర్త్‌డే రోజు షూటింగ్ కూడా ప్రారంభించారు. అయితే ఈ సినిమా ఎలా ఉంటుందనే విషయాన్ని పక్కన పెడితే.. ఈ మూవీ కోసం బుచ్చిబాబు సెట్ చేస్తున్న కాంబినేషన్ మాత్రం ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడని ప్రకటించి అందరికి షాకిచ్చాడు. అంతేకాదు శివరాజ్ కుమార్, జాన్వీ కపూర్, విజయ్ సేతుపతి ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారట. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌లోకి అమితాబ్ కూడా అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఓ కీలక పాత్ర కోసం అమితాబ్‌ని ఒప్పించే పనిలో పడ్డాడట బుచ్చిబాబు. అది రామ్ చరణ్ తాత పాత్ర అట. సినిమాలో ఆ పాత్ర చాలా కీలకం అని.. అమితాబ్ అయితేనే సెట్ అవుతుందని బుచ్చిబాబు భావించారట. నిర్మాతలు కూడా బడ్జెట్ విషయంలో ఫ్రీడం ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే భారీ క్యాస్టింగ్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆత్మగా సంజయ్ దత్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’ అనే సినిమా చేస్తున్నాడు. హారర్ కామెడీ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మలయాళ భామమాలవికా మోహనన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నాడని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా సంజయ్ పాత్రకు సంబంధించి ఆసక్తికర విషయం ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో సంజయ్.. ప్రభాస్‌కు తాతగా నటించబోతున్నాడట. అకాల మరణం చెందిన సంజయ్..దెయ్యంగా తిరిగి వస్తాడట. ఆత్మగా మారిన తాత.. ప్రభాస్ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాడనే నేపథ్యంలో కథ సాగనుందట. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. -
సెకనుకు రూ.7 లక్షలు.. తెలుగు హీరోలకంటే ఎక్కువే!
పైసా..పైసా.. మంచి స్క్రిప్ట్ ఉంటే సరిపోదు. దాన్ని క్వాలిటీగా తీయాలంటే పైసా కావాల్సిందే! అయితే సినిమా నిర్మించడం కంటే అందులో నటించినవారికి ఇవ్వాల్సిన పారితోషికాలే తడిసి మోపెడవుతున్నాయి. సినిమా బడ్జెట్ అంతా ఒకెత్తు.. స్టార్స్ రెమ్యునరేషన్స్ మరో ఎత్తు అన్నట్లు మారింది పరిస్థితి! ఈ మధ్య ప్రాంతీయ సినిమా పాన్ ఇండియా సినిమాగా మారడంతో ఇతర భాషా ఇండస్ట్రీల నుంచి సెలబ్రిటీలను తీసుకొస్తున్నారు. అలా బాలీవుడ్ స్టార్స్ సౌత్ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. హిందీలో కంటే కూడా ఇతరత్రా భాషల్లోనే భారీగా అందుకుంటున్నారు. బీటౌన్ చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. దక్షిణాది సినిమాల కోసం బాలీవుడ్ తారలు అందుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో చూసేద్దాం.. జాన్వీ కపూర్ దివంగత తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సాధారణంగా ఒక్కో సినిమాకు రూ.3 కోట్లు తీసుకుంటుంది. తెలుగులో ఈమె దేవర సినిమాతో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ మూవీ కోసం రూ.5 కోట్లు పుచ్చుకుంటోందట. రామ్‌చరణ్ సినిమా కోసం ఏకంగా రూ.6 కోట్లు అందుకోనున్నట్లు తెలుస్తోంది. సైఫ్ అలీఖాన్ తెలుగు సినిమా అనగానే జాన్వీ తన రెమ్యునరేషన్ డబుల్ చేసింది. సైఫ్ అలీ ఖాన్ అయితే ఓ అడుగు ముందుకేసి ఏకంగా మూడు రెట్లు డిమాండ్ చేస్తున్నాడు. దేవరలో విలన్‌గా నటిస్తున్నందుకు ఏకంగా రూ.13 కోట్లు తీసుకుంటున్నాడట! బాబీ డియోల్ బ్లాక్‌బస్టర్ మూవీ యానిమల్‌లో విలన్‌గా నటించినందుకుగానూ నటుడు బాబీ డియోల్ రూ.4 కోట్లు తీసుకున్నాడు. ప్రస్తుతం ఇతడు సూర్య 'కంగువా'లో నటిస్తున్నాడు. ఈ చిత్రం కోసం డబల్ అంటే ఎనిమిది కోట్లు తీసుకుంటున్నాడు. ఇమ్రాన్ హష్మీ ఇమ్రాన్ హష్మీ ఈ మధ్యే బాలీవుడ్లో తన రేటు పెంచేశాడు. దీంతో తెలుగులో కూడా అదే రెమ్యునరేషన్ కంటిన్యూ చేస్తున్నాడు. పవన్ కల్యాణ్ ఓజీ సినిమాకుగానూ ఇతడు రూ.7 కోట్లు డిమాండ్ చేశాడు. సంజయ్ దత్, రవీనా టండన్ సంజయ్, రవీనా.. ఇద్దరూ కేజీఎఫ్ సినిమాలో అద్భుత నటన కనబర్చారు. రవీనా పాత్ర చిన్నది కావడంతో ఆమె రూ.2 కోట్లతో సరిపెట్టుకుంది. కానీ కల్నాయక్(సంజయ్) తన పాత్రకు తగ్గట్లు రూ.10 కోట్లు అందుకున్నాడు. అజయ్ దేవ్‌గణ్, ఆలియా భట్ బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అయిన ఆలియా భట్ ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రలో కనిపించింది. కాసేపు మాత్రమే ఉండే ఈ పాత్ర కోసం రూ.10 కోట్లు తీసుకుంది. అజయ్ దేవ్‌గణ్ స్వాతంత్య్ర సమరయోధుడిగా నటించాడు. సినిమా మొత్తంలో కేవలం ఎనిమిది నిమిషాలు మాత్రమే కనిపిస్తాడు. ఇందుకుగానూ అతడు రూ.35 కోట్లు తీసుకున్నాడు. అంటే సెకనుకు రూ.7.2 లక్షలన్నమాట! ఈ లెక్కన పారితోషికం విషయంలో అందరికంటే అజయే ఎక్కువ అందుకున్నట్లు కనిపిస్తోంది. చదవండి: మహానటి స్థానంలో ప్రియమణి.. ఎందుకంటే? -
ఇస్మార్ట్ మ్యూజిక్
‘డబుల్ ఇస్మార్ట్’ మ్యూజిక్ సిట్టింగ్స్ జోరందుకున్నాయి. ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి. ఈ విషయాన్ని ‘ఎక్స్’లో షేర్ చేసి, ‘డబుల్ ఇస్మార్ట్’ అప్డేట్ను వెల్లడించింది చిత్రబృందం. ‘ఇస్మార్ట్ శంకర్’కు సంగీతం అందించిన మణిశర్మనే సీక్వెల్‌కూ సంగీతం అందిస్తున్నారు. గతంలోనూ పూరి–మణిశర్మ కాంబినేషన్లో ‘పోకిరి’ వంటి బ్లాక్ బస్టర్ ఆల్బమ్ వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమా క్లైమాక్స్ పోర్షన్స్ చిత్రీకరణ కోసం దాదాపు 7 కోట్ల రూపాయలు కేటాయించినట్లుగా సమాచారం. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాను మార్చి 18న విడుదల చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయన్నది ఫిల్మ్‌నగర్ తాజా కబురు. -
బాలీవుడ్ స్టార్స్ ఇలాంటివి నమ్ముతారా.. ద్యావుడా!
సినిమా రంగంలో సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఎక్కువ. ప్రతిభ కంటే అదృష్టానికే విలువెక్కువ. గుడ్డి నమ్మకాలకు గౌరవిస్తూ పేర్లను కూడా మార్చుకుంటారు. ఈ సెంటిమెంట్ స్టార్ హీరోల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల దాకా అందరి మీదా ఉంటుంది. దానికి తగ్గట్టే ప్రవర్తిస్తుంటారు వాళ్లంతా. అలాంటి వింత అలవాట్లు, సెంటిమెంట్లను ఫాలో అవుతున్న కొంతమంది బాలీవుడ్ స్టార్స్ గురించి.. పేరుతో సక్సెస్ రాదు.. చేసే పనితో వస్తుంది అకుంటాం. కానీ బాలీవుడ్లో దీనికి రివర్స్! పేరులో అక్షరాలు కరెక్ట్‌గా ఉంటేనే సక్సెస్ అని నమ్ముతారు బాలీవుడ్ సెలబ్రిటీస్‌లో చాలా మంది. సీనియర్ మోస్ట్ యాక్టర్ సంజయ్ దత్ ఇలాంటి నమ్మకాల్లోనూ సీనియరే. చిన్నప్పుడు స్కూల్లో అతని పేరు ‘Sunjay dutt’గా నమోదయింట. కానీ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో సక్సెస్ అంతత్వరగా దరి చేరకపోయేసరికి ‘Sajay’లోని‘U’అక్షరాన్ని తీసేసి ఆ స్థానంలో ‘A’ని చేర్చి ‘Sanjay’గా మార్చుకున్నాడట. అప్పటి నుంచి సక్సెస్ ఆ పేరుకు సఫిక్స్ అయిందని అతని స్ట్రాంగ్ బిలీఫ్! బాలీవుడ్ నటుడు గోవిందా ఏదైనా షూటింగ్లో ఉన్నప్పుడు అతన్ని కలవడానికి విజిటర్ ఎవరైనా రెడ్ కలర్ డ్రెస్‌లో వస్తే ఆ విజిటర్ని కొట్టేసేంత ఆవేశాన్ని, కోపాన్నీ కంట్రోల్ చేసుకుంటాడట. కారణం షూటింగ్స్‌లో రెడ్ అతనికి యాంటీసెంటిమెంట్ అట. అంతేకాదు ఎక్కడికి వెళ్లినా ఇంటి భోజనమే తింటాడు. ఈ సెంటిమెంట్ ఎంతదూరం వెళ్లిందంటే ఔట్‌డోర్ షూటింగ్స్‌కి తనింటి గేదేనే తీసుకెళ్లేంత. ఈ గేదె పాలతో కాచిన కాఫీ, టీలనే తీసుకుంటాడని బాలీవుడ్ వర్గాల భోగట్టా. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా సెంటీఫెలోనే.. న్యూమరాలజీ విషయంలో! ఆయనకు నంబర్ 9 పట్ల అబ్సెషన్. రెమ్యునరేషన్ కూడా టోటల్ నైన్ వచ్చేలా తీసుకుంటాడట. అంటే 5 కోట్లు, 63 కోట్లు, 72 కోట్లు.. ఇలా రెండు అంకెలను కూడితే 9(ఇండస్ట్రీలో తనకున్న డిమాండ్, తన సినిమాలకు ఉన్న మార్కెట్‌ను బట్టి) వచ్చేలా చూసుకుంటాడట. ఇంకో సెంటిమెంట్ కూడా ఉంది. తెల్ల కాగితం మీద ‘ఓం’అని రాసి.. దానికి దండం పెట్టుకోందే ఏ కొత్త పనీ మొదలుపెట్టడట. బాలీవుడ్లో వైవిధ్యమైన పాత్రలకు పెట్టింది పేరు రాజ్‌కుమార్ రావ్ అని అందరికీ తెలిసిందే! అయితే రావు అనేది అతని పెట్టుడు పేరు అని తెలిసింది మాత్రం కొందరికే! ఆ నటుడి అసలు పేరు రాజ్‌కుమార్ యాదవ్. ఈ పేరుతో కొనసాగినన్నాళ్లూ సినిమాల్లో అతనికి సహాయక పాత్రలే దొరికాయి. అవి ‘మంచి నటుడు’అని పేరు తెచ్చినా.. ముఖ్య పాత్రలను మాత్రం రప్పించలేకపోయాయి. సెంటిమెంట్ల ఊట అయిన సినిమా ఫీల్డ్‌లో ఎవరు సలహా ఇచ్చారో మరి.. తన పేరును మార్చుకున్నాడు. Rajkummar Rao అని! అంతే హీరో అయిపోయాడు. సింపుల్‌గా పేరు ఇంగ్లీష్ స్పెల్లింగ్‌లో ఎక్స్ట్రాగా ఒక ‘M’ చేర్చి, యాదవ్‌ని డిలీట్ చేసి రావ్ని యాడ్ చేశాడు అంతే! చమత్కార్ హోగయా! అమితాబ్ బచ్చన్‌కి ఉన్న మూఢనమ్మకాన్ని వింటే నిజంగానే విస్తుపోతారు. అమితాబ క్రికెట్‌కి వీరాభిమాని. అంత అభిమానం ఉన్నవాళ్లెవరైనా స్టేడియంలో కూర్చొని ఆటను చూసే అవకాశాన్ని అస్సలు వదులుకోరు కదా! కానీ అమితాబ్ అలాంటి ప్యాన్ కదాఉ. లైవ్ మ్యాచెస్కి వెళ్లడు. టీవీలో ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తాడు. ఎందుకంటే తను స్టేడియంలో కూర్చొని ఆటను తిలకిస్తే.. తన ఫేవరేట్ టీమ్ ఓడిపోతుందని భయమట. ఒకటి రెండు సార్లు అలా జరిగిందట. అందుకే అప్పటి నుంచి ఆరు నూరైనా.. నూరు ఆరైనా ఆటను టీవీలోనే చూస్తాడట. జాన్వీ కపూర్ ఎక్కడికి వెళ్లినా వెంట మెరుపు మెరుపుల గులాబీ రంగు వాటర్ బాటిల్‌ని క్యారీ చేస్తుందట. అంతేకాదు దానికి ‘చుస్కీ(సిప్)’అని పేరు కూడా పెట్టుకుందట. ఆ బాటిల్, ఆ పేరు ఎంతగా ఫేమస్ అయిందంటే.. జాన్వీ కపూర్ ఫ్యాన్ ఒకరు చుస్కీ పేరుతో ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్‌ను క్రియేట్ చేసేంతగా! సల్మాన్ ఖాన్‌కి వేడి వేడి భోజనమే ఇష్టం. అయితే చద్దాన్నాన్ని డస్ట్‌బిన్‌లో పారేస్తాడా? అయ్యే లేఉద.. అన్నం పరబ్రహ్మా స్వరూపం అని గట్టిగా నమ్ముతాడు. మరైతే వేడి చేసుకుని తర్వాత పూటకు తినేస్తాడా? నో. ఒక్కసారి వండినవాటిని మళ్లీ వేడిచేయడం అనారోగ్యమనే ఆరోగ్య సూత్రాన్ని అస్సలు విస్మరించడు. మరేం చేస్తాడు? చద్దన్నానికి బటర్, పచ్చడి కలుపుకొని లాగిస్తాడట. సోనమ్ కపూర్ అహుజా సెంటిమెంట్ వింటే విస్తుపోతారు. తను నటిస్తున్న సినిమా షూటింగ్ సెట్స్‌లో గనుక తను పొరపాటున కిందపడితే ఆ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని ఆమె నమ్మకం. అందుకే షూటింగ్ ముహూర్తం రోజు నుంచి షూటింగ్ ఆఖరి రోజు వరకు తను కిందపడిపోయే చాన్స్ కోసం ఎదురు చూస్తుంటుందట. ఫిట్నెస్ క్వీన్ బిపాశా బసుకు దిష్టి మీద నమ్మకం ఎక్కువ. అందుకే ప్రతి శనివారం నిమ్మకాయలు, పచ్చి మిరపకాయలు కొని వాటిని ఒక ఇనుప తీగకు గుచ్చి కారు విండ్ షీల్డ్కున్న రియల్ వ్యూ మిర్రర్‌కి వేలాడదీస్తుందట. ఈ ప్రాక్టీస్‌ని వాళ్లమ్మ నుంచి నేర్చుకుందట బిపాశా. డిస్కో డాన్సర్ మిథున్ చక్రవర్తి గుర్తున్నాడు కదా! అతనికున్న నమ్మకం గురించి కూడా చదివేయండి. తను నటించే సినిమా షూటింగ్ ముహుర్తాలు ఎగ్గోడ్తాడట. తను షూటింగ్ ముహూర్తానికి హాజరయిన సినిమాలన్నీ ఘోరంగా ఫ్లాప్ అవడంతో తను ముహుర్తానికి అటెండ్ అయితే ఆ సినిమా ఫ్లాప్ అవుతుందనే నమ్మకం ఏర్పడిపోయిందట అతనికి. ఇక అప్పటి నుంచి తన సినిమా ముహుర్తాలకు ఆబ్సెంట్ వేయించుకోవడం మొదలుపెట్టాడట. నవరసనటసార్వభౌమురాలు విద్యాబాలన్ కళ్లకు కాటుక పెట్టందే గడప దాటదు. అది సాదా సీదా కాటుక కాదు.. పాకీస్తానీ పాపులర్ బ్రాండ్ ‘హష్మీ’కాజల్. తన మీద అదృష్టం దృష్టిపడ్డానికి.. సక్సెస్ తన కెరీర్ అడ్రస్‌గా మారడానికి ఆ కాజలే కారణం అని విద్యాబాలన్ బలంగా నమ్ముతుందని బాలీవుడ్ వర్గాల భోగట్టా! -
లోహ్రీ రోజు దానం చేయాలి : అమితాబ్
సంక్రాంతి పండగ సంబరాలు ఆరంభమయ్యాయి. కొందరు బాలీవుడ్ స్టార్స్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘అందరికీ లోహ్రీ (భోగి పండగ) శుభాకాంక్షలు. లోహ్రీ అంటే నాకు చాలా విషయాలు గుర్తుకొస్తాయి. లోహ్రీ రోజు జానపద కళాకారులు ‘లోహ్రీ దా టక్కా దే, రబ్ యానూ బచ్చా దే’ అంటూ పాటలు పాడుకుంటూ ఇంటింటికీ వచ్చినప్పుడు వారికి దానం ఇవ్వడం ఆనవాయితీ. నా చిన్నప్పుడు మా అమ్మగారు ఇలా పండగ తాలూకు విషయాలు చెప్పేవారు’’ అని సోషల్ మీడియా ద్వారా అమితాబ్ బచ్చన్ షేర్ చేశారు. T 4889 - Happy Lohri .. 'लोहड़ी दा टक्का दे, रभ थानू बच्चा दे ' ... 😁 this is how the chanting went when they came to homes and families to collect donations on the occasion of Lohri .. Maa used to tell us these stories .. pic.twitter.com/t9rVu8Kb2j — Amitabh Bachchan (@SrBachchan) January 13, 2024 ‘‘లోహ్రీ తాలూకు వెచ్చదనాన్ని, పండగ సందర్భంగా మా అమ్మగారు చేసిన స్వీట్స్‌ని తలుచుకుంటున్నాను. ఇరుగు పొరుగుతో పంచుకున్న నవ్వులతో నా మనసు నిండిపోయేది. నేటి బిజీ జీవితంలో అప్పటి ఆనందకర సాధారణ రోజులను తలచుకుని, ఆనందిస్తున్నాను. అందరి జీవితాల్లో లోహ్రీ ఆనందం నింపాలని కోరుకుంటున్నా’’ అని సన్నీ డియోల్ పేర్కొన్నారు. ఇంకా అక్షయ్ కుమార్, సంజయ్ దత్, విక్కీ కౌశల్, ఇషా డియోల్, నేహా ధూపియా వంటి తారలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. -
ముంబైలో డబుల్ ఇస్మార్ట్
హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్ హిట్టయిన విషయం తెలిసిందే. తాజాగా రామ్, పూరి కాంబినేషన్లోనే ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ తెరకెక్కుతోంది. ఇందులో సంజయ్ దత్ కీలక ΄ాత్రధారి. ఈ సినిమా కోసం ముంబైలో రామ్ ΄ాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ‘‘స్కంద’ కోసం బరువు పెరిగిన రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’ కోసం బరువు తగ్గి, సిక్స్ ΄్యాక్తో మేకోవర్ అయ్యారు’’ అని యూనిట్ పేర్కొంది. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 8న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. -
LEO Review: ‘లియో’మూవీ రివ్యూ
టైటిల్: లియో నటీనటులు: విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు నిర్మాతలు: ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళనిసామి తెలుగులో విడుదల: సితార ఎంటర్టైన్మెంట్స్ రచన-దర్శకత్వం: లోకేష్ కనగరాజ్ సంగీతం: అనిరుధ్ రవిచందర్ సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస విడుదల తేది: అక్టోబర్ 19, 2023 కథేంటంటే.. పార్తి అలియాస్ పార్తిబన్(విజయ్) హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ.. భార్య సత్య(త్రిష), ఇద్దరు పిల్లలు(పాప, బాబు)తో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓ సారి తన కాఫీ షాపుకు ఓ దొంగల ముఠా వచ్చి డబ్బును దోచుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకితో అందరిని కాల్చి చంపేస్తాడు పార్తి. దీంతో అతను అరెస్ట్ అవుతాడు. ఆత్మ రక్షణ కోసమే వారిని చంపినట్లు కోర్టు భావించి..అతన్ని నిర్ధోషిగా ప్రకటిస్తుంది. పార్తి ఫోటో ఓ వార్త పత్రికలో చూసి ఏపీలోని ఆంటోని దాస్(సంజయ్ దత్) గ్యాంగ్.. హిమాచల్ ప్రదేశ్‌కు వస్తుంది. పార్తిని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏంటంటే.. పార్తి, 20 ఏళ్ల కిత్రం తప్పిపోయిన ఆంటోని దాస్ కొడుకు లియోలా ఉండడం. అసలు లియో నేపథ్యం ఏంటి? సొంత కొడుకునే చంపాలని ఆంటోని, అతని సోదరుడు హెరాల్డ్ దాస్(అర్జున్) ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్తి, లియో ఒక్కరేనా? ఆంటోని గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలిని కాపాడుకునేందుకు పార్తి ఏం చేశాడు? చివరకు ఏమైంది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. లియో.. లోకేష్ కగనరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ, విక్రమ్ చిత్రాలతో దీనికి సంబంధం ఉండదు. ఖైదీలోని నెపోలియన్ పాత్ర, చివర్లో ‘విక్రమ్’(కమల్ హాసన్) నుంచి లియోకి ఫోన్ రావడం.. ఇవి మాత్రమే లోకేష్ కగనరాజ్ యూనివర్స్ నుంచి తీసుకున్నారు. మిగత స్టోరి అంతా డిఫరెంట్‌గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్ గత సినిమాల మాదిరే చాలా స్టైలీష్‌గా, రేసీ స్క్రీన్‌ప్లేతో సాగుతుంది. ఇందులో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్ మీదనే ఎక్కువ దృష్టిపెట్టాడు. ఓ ముఠా కలెక్టర్‌ని హత్య చేసే సన్నివేశంతో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత హైనా(కృర జంతువు)ఫైట్ సీన్‌తో హీరో ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత పార్తి ఫ్యామిలీ పరిచయం.. భార్య, పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. అయితే ఫ్యామిలీ ఎపిసోడ్ కాస్త బోరింగ్ అనిపిస్తుంది. కాఫీ షాపులో యాక్షన్ ఎపిసోడ్ తర్వాత కథనం ఆసక్తికరంగా సాగుతుంది. పార్తి ఫోటో పేపర్లో చూసి ఆంటోని గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్‌కు రావడంతో కథపై మరింత ఆసక్తి పెరుగుతుంది. అసలు లియో ఎవరు? ఆంటోని నేపథ్యం ఏంటనే క్యూరియాసిటి ప్రేక్షకుల్లో పెరుగుతుంది. ఆంటోని, పార్తి తొలిసారి కలిసే సీన్ కూడా అదిరిపోతుంది. ఇంటర్వెల్ ముందు ఆంటోని, పార్తికి మధ్య వచ్చే ఛేజింగ్ సన్నివేశం అయితే హైలెట్. లియో నేపథ్యం ఏంటి? తండ్రి, కొడుకులను ఎందుకు వైరం ఏర్పడిదనేది సెకండాఫ్‌లో చూపించారు. కథ పరంగా సినిమాలో కొత్తదనం ఏమి ఉండదు కానీ లోకేష్ మేకింగ్ ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ‘ఖైది’ నెపోలియన్ పాత్రను ఇందులో యాడ్ చేసిన విధానం బాగుంటుంది. అయితే లియో పాత్ర పండించిన ఎమోషన్ మాత్రం వర్కౌట్ కాలేదు. తండ్రి,బాబాయ్, చెల్లి.. ఏ పాత్రతోనూ ఎమోషనల్‌గా కనెక్ట్ కాలేదనిపిస్తుంది. క్లైమాక్స్‌లో హెరాల్డ్ దాస్‌తో వచ్చే సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. ఎవరెలా చేశారంటే.. లియో, పార్తి.. రెండు విభిన్నమైన పాత్రలో విజయ్ అదరగొట్టేశాడు. స్టార్‌డమ్‌ని పక్కకి పెట్టి ఇద్దరు పిల్లల తండ్రిగా నటించాడు. పార్తి పాత్రలో ఆయన లుక్, గెటప్ ఆకట్టుకుంటాయి. ఇక నెగెటివ్ షేడ్స్ ఉన్న లియో పాత్రలో అభిమానులు కొరుకునే విజయ్ కనిపిస్తాడు. గెటప్ పరంగానే కాదు యాక్టింగ్ పరంగానూ రెండు విభిన్నమైన పాత్రల్లో విజయ్ చక్కగా నటించాడు. ఇక హీరో భార్య సత్య పాత్రకి త్రిష న్యాయం చేసింది. విజయ్, త్రిషల కెమిస్ట్రీ తెరపై బాగా పండింది. విలన్ ఆంటోనిగా సంజయ్ దత్, అతని సోదరుడు హెరాల్డ్ దాస్‌గా అర్జున్.. మంచి విలనిజాన్ని పండించారు. కానీ ఆ రెండు పాత్రలను ముగించిన తీరు మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. గౌతమ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ చిత్రానికి ప్రధాన బలం అనిరుధ్ సంగీతం. గత సినిమాల మాదిరే లియోకి కూడా అదరిపోయే బీజీఎం ఇచ్చాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లో అనిరుద్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గూస్బంప్స్ తెప్పిస్తాయి. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
'డబుల్ ఇస్మార్ట్' షూటింగ్లో ప్రమాదం.. సంజయ్ దత్‌కు గాయాలు!
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని నటిస్తోన్న తాజా చిత్రం 'డబుల్ ఇస్మార్ట్'. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2019లో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఆ సినిమా మాస్ ఆడియన్స్‌ను ఎంతో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ నటిస్తోంది. మరో హీరోయిన్గా మీనాక్షి చౌదరిని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పాన్ ఇండియా సినిమాని పూరి కనెక్ట్స్ సంస్థ నిర్మిస్తుండగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: పూరి 'ఇస్మార్ట్ శంకర్' వచ్చేస్తున్నాడు.. ఈసారి బాలీవుడ్ హీరోయిన్) అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ థాయ్‌లాండ్‌లో జరుగుతోంది. తాజాగా ఈ సినిమా సెట్లో సంజయ్ దత్‌కు గాయాలైనట్లు తెలుస్తోంది. కత్తితో ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించే సమయంలో సంజయ్ దత్ గాయపడినట్లు సమాచారం. అతని తలకు గాయం కాగా.. రెండు కుట్లు పడినట్లు చిత్రబృందం తెలిపింది. అయినప్పటికీ అతను వెంటనే సెట్‌కి తిరిగి వచ్చి షూటింగ్‌ని ప్రారంభించాడని చిత్ర యూనిట్ పేర్కొంది. ఇప్పటికే ముంబయిలో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. రెండో షెడ్యూల్ థాయ్‌లాండ్‌లో కొనసాగుతోంది. కాగా.. సంజయ్ దత్ కేజీఎఫ్-2 చిత్రంలో కీలకపాత్రలో నటించిన సంగతి తెలిసిందే. కాగా.. జూలైలో మేకర్స్ సంజయ్ దత్ పాత్రను 'బిగ్ బుల్'గా అభిమానులకు పరిచయం చేశారు. అతని ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఈ చిత్రం మార్చి 8, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా ఛార్మి, పూరి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. కాగా.. ఇప్పటికే రామ్- బోయపాటి కాంబోలో భారీ యాక్షన్ మూవీ 'స్కంద' చేస్తున్నాడు. దీనిని సెప్టెంబర్ 15న పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేస్తున్నారు. (ఇది చదవండి: తీసింది నాలుగు సినిమాలు.. అన్నింటికీ సీక్వెల్స్ చేస్తానంటున్న డైరెక్టర్) -
`డబుల్ ఇస్మార్ట్’కి సంజయ్ దత్ భారీ రెమ్యునరేషన్.. ఎన్ని కోట్లంటే..
ఒకప్పుడు స్టార్ హీరోలుగా రాణించిన కొంతమంది ఇప్పుడు విలన్‌గాను దూసుకెళ్తున్నారు. తెలుగులో జగపతిబాబు విలన్‌గా రాణిస్తుంటే.. బాలీవుడ్లో సంజయ్ దత్ ప్రతినాయకుడిగా అదరగొడుతున్నాడు. ‘కేజీయఫ్ ఛాప్టర్ 2’లో అధీరగా సంజయ్ పండించిన విలనిజం సినిమా స్థాయిని పెంచేసింది. ఆ చిత్రం తర్వాత సంజయ్‌కి వరుసగా ప్రతినాయక పాత్రలే వస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా నటిస్తున్న ‘లియో’చిత్రంలో సంజయ్ నెగెటివ్ రోల్ ప్లే చేస్తున్నాడు. అలాగే చాలా కాలంగా తర్వాత టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు సంజయ్. (చదవండి: బిగ్‌బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లే! గ్లామర్‌కు ఢోకానే లేదుగా!) పూరి జగన్నాథ్ తెరకెక్కించబోతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రంలో విలన్ బిగ్బుల్ పాత్రలో నటిస్తున్నాడు. రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్(2019)’ చిత్రానికి సీక్వెల్ ఇది. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు పూరీ. అందుకే విలన్ పాత్ర కోసం సంజయ్‌ని ఎంపిక చేసుకున్నారు. పూరీ రాసుకున్న విలన్ పాత్రకు సంజయ్ మాత్రమే న్యాయం చేయగలరని, అందుకే ఆయనను ఎంపిక చేసుకున్నామని చిత్రబృందం పేర్కొంది. (చదవండి: పెళ్లి రూమర్స్‌పై హీరో తరుణ్ క్లారిటీ!) అయితే ఇందుకుగాను భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇచ్చారట. ఈ సినిమాకు గాను సంజయ్ దాదాపు 60 రోజుల కాల్షీట్లను ఇచ్చారు. ఇందుకుగాను రూ. 15 కోట్ల పారితోషికం అందించినట్లు అటు బాలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ టాక్ నడుస్తోంది. వచ్చే ఏడాది మార్చి 8న ఈ చిత్రం విడుదల కానుంది. -
డబుల్ ఇస్మార్ట్ లో బిగ్ బుల్
-
డబుల్ ఇస్మార్ట్: బిగ్బుల్ ఎంట్రీ
రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’లో సంజయ్ దత్ కీలకపాత్ర చేయ నున్నారనే వార్త శుక్రవారం గుప్పు మన్న విషయం తెలిసిందే. ఆ వార్త నిజమే అని, బిగ్ బుల్గా సంజయ్ దత్ పవర్ఫుల్ రోల్ చేస్తున్నారని ఈ చిత్ర యూనిట్ శనివారం ప్రకటించి, లుక్‌ని కూడా విడుదల చేసింది. ‘‘డబుల్ ఇస్మార్ట్’లో సంజయ్ దత్ ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నారు’’ అని చిత్ర యూనిట్ తెలియజేసింది. ‘‘మాస్కే డైరెక్టర్ అయిన పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ రామ్‌తో కలిసి ఈ సైన్స్ ఫిక్షన్ మాస్ ఎంటర్టైనర్లో నటించడం ఆనందంగా, గర్వంగా ఉంది. వచ్చే ఏడాది మార్చి 8 (‘డబుల్ ఇస్మార్ట్’ విడుదల) కోసం ఎదురు చూస్తున్నాను’’ అని సంజయ్ దత్ ట్వీట్ చేశారు. పూరి జగన్నా«థ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హాలీ వుడ్ సినిమాటోగ్రాఫర్ జియాని జియానెల్లి పని చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
డబుల్ ఇస్మార్ట్‌లో..
తెలుగులో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట బాలీవుడ్ నటుడు సంజయ్ దత్. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాజా డీలక్స్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రంలో సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రంలోని ఓ కీలక పాత్రకు సంజయ్ దత్‌ను సంప్రదించిందట చిత్ర యూనిట్. ఈ చిత్రంలో భాగం కావడానికి సంజయ్ దత్ సుముఖంగా ఉన్నారని టాక్. -
మరో క్రికెట్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన సంజయ్ దత్
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ రోజుల వ్యవధిలోనే రెండు క్రికెట్ ఫ్రాంచైజీని కొనుగోలు చేశాడు. కొద్దిరోజుల కిందట జింబాబ్వే లీగ్‌లోని (జిమ్-ఆఫ్రో టీ10 లీగ్) హరారే హరికేన్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసినట్లు ప్రకటించిన సంజూ బాబా.. తాజాగా లంక ప్రీమియర్ లీగ్‌లోని (శ్రీలంక టీ20 లీగ్) బి-లవ్ క్యాండీ ఫ్రాంచైజీని కొనుగోలు చేసినట్లు ట్విటర్ వేదికగా వెల్లడించాడు. I, along with my brothers Omar Khan (OK) and H.H. Sheikh Marwan Bin Mohammed Bin Rashid Al Maktoum, are excited to announce that we have acquired the B-Love Kandy Cricket Team for the Lanka Premier League T20 2023. pic.twitter.com/ksMauYsHbH — Sanjay Dutt (@duttsanjay) June 25, 2023 తనతో పాటు ఒమర్ ఖాన్, షేక్ మర్వాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కలిసి బి-లవ్ క్యాండీ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నట్లు సంజూ బాబా ప్రకటించాడు. లంక ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్ బరిలో బి-లవ్ క్యాండీ బరిలో నిలువనున్నట్లు తెలిపాడు. కాగా, లంక ప్రీమియర్ లీగ్ 2023 జులై 30 నుంచి ఆగస్ట్ 20 వరకు జరుగనున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, జిమ్ ఆఫ్రో టీ10 లీగ్ జూలై 20 నుంచి 29 వరకు జరుగనుంది. ఈ లీగ్‌లో మొత్తం ఐదు జట్లు (డర్బన్ క్వాలండర్స్, కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ, బులవాయో బ్రేవ్స్, జోబర్గ్ లయన్స్, హరారే హరికేన్స్) పాల్గొంటాయి. ఇందులో హరారే హరికేన్స్ ఫ్రాంచైజీని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కొనుగోలు చేశాడు. ఏరీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ సోహన్ రాయ్‌తో కలిసి సంజూ ఈ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నాడు. -
క్రికెట్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన సంజయ్ దత్..
ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్ ఆదరణ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీ20, టీ10 లీగ్‌లు పట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్నాయి. తాజాగా జింబాబ్వే కూడా ఓ టీ10 లీగ్‌ను నిర్వహించేందుకు సిద్దమైంది. ఈ లీగ్‌కు జింబాబ్వే క్రికెట్ 'జిమ్ ఆఫ్రో టీ10' అని నామకారణం చేసింది. జిమ్ ఆఫ్రో టీ10 లీగ్ జూలై 20న ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో మొత్తం ఐదు జట్లు భాగం కానున్నాయి. డర్బన్ క్వాలండర్స్, కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ, బులవాయో బ్రేవ్స్, జోబర్గ్ లయన్స్, హరారే హరికేన్స్ ఫ్రాంచైజీలు ఉన్నాయి. సంజయ్ దత్ న్యూ జర్నీ.. ఇక ఇందులో హరారే హరికేన్స్ ఫ్రాంచైజీని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కొనుగోలు చేశాడు. ఏరీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ సర్ సోహన్ రాయ్‌తో కలిసి హరారే ఫ్రాంచైజీని సంజయ్ దత్ సొంతం చేసుకున్నాడు. ఇక ఈ విషయాన్ని సంజయ్ దత్ కూడా దృవీకరించాడు. "భారత్‌లో క్రికెట్ ఒక మతం వంటింది. అదే విధంగా ప్రపంచక్రికెట్లో భారత్ ఒక ప్రత్యేక గుర్తుంపు ఉంది. ప్రపంచంలో ప్రతీ చోట క్రికెట్‌కు మరింత ఆదరణ పెరగాలని నేను ఎప్పుడూ ఆశిస్తాను. జింబాబ్వే కూడా గొప్ప క్రీడా చరిత్రను కలిగిఉంది. అటువంటి జింబాబ్వే క్రికెట్లో నేను భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. జిమ్ ఆఫ్రో టీ10లో హరారే హరికేన్స్ బాగా రాణిస్తుందని నేను అనుకుంటున్నాను" అని సంజయ్ దత్ పేర్కొన్నాడు. చదవండి: IND Vs WI 2023: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులోకి ఎవరూ ఊహించని ఆటగాడు! -
ఆ బిజినెస్‌లో 'కేజీఎఫ్' విలన్ రూ.1000 కోట్ల పెట్టుబడి?
మనల్ని ఎంటర్టైన్ చేసే సినిమా స్టార్స్.. నటించడంతో పాటు పలు వ్యాపారాలు చేస్తుంటారు. మొన్నటివరకు ఫుడ్, రెస్టారెంట్స్ లో వీళ్లు ఎక్కువగా కనిపించారు. రీసంట్ టైంలో మహేశ్, బన్నీ, విజయ్ దేవరకొండ లాంటివాళ్లు మల్టీప్లెక్ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. ఇవన్నీ చాలా సాధారణ విషయాలన్నట్లు బాలీవుడ్ స్టార్ హీరో, 'కేజీఎఫ్ 2' విలన్ ఎవరూ ఊహించని వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. కళ్లు చెదిరే మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టినట్లు తెలుస్తోంది. సంజయ్ దత్ గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంటాయి. డ్రగ్స్ కి బానిసవడం, అక్రమాయుధాల కేసులో జైలుకి వెళ్లడం లాంటి చాలా ఆసక్తికర విషయాలు కనిపిస్తాయి. అదంతా పక్కనబెట్టి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఓవైపు లీడ్ రోల్స్ చేస్తూనే మరోవైపు విలన్, సహాయక పాత్రలు చేస్తూ బిజీ అయిపోయాడు. గతేడాది 'కేజీఎఫ్ 2'లో అధీరాగా భయపెట్టిన సంజూ.. ప్రస్తుతం విజయ్ 'లియో', ప్రభాస్-మారుతి దర్శకత్వంలో వస్తున్న మూవీలోనూ కీలక పాత్రలు పోషిస్తున్నాడు. ఇలా కెరీర్ పరంగా బాగా సంపాదిస్తున్న సంజయ్ దత్.. ఇప్పుడు లిక్కర్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. రిటైల్ బిజినెస్ చేయడమే టార్గెట్ గా కార్టెల్ & బ్రోస్ అనే ఆల్కోబెవ్ (ఆల్కహాలిక్ బేవరేజ్) స్టార్టప్ లో పెట్టుబడి పెట్టాడు. ఈ కంపెనీ ఎక్కువగా స్కాచ్-విస్కీ తయారు చేస్తుంది. మన దేశంలో పోర్ట్ ఫోలియోని విస్తరించడమే లక్ష్యంగా.. ఈ కంపెనీలో సంజయ్ దత్ దాదాపు రూ.1000 కోట్ల మొత్తం పెట్టుబడిగా ఉంచినట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో నిజమేంటనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' రిజల్ట్ ముందే పసిగట్టిన ప్రభాస్.. ఆ వీడియో వైరల్!) -
షూటింగ్లో పేలుడు.. సంజయ్ దత్‌కి గాయాలు? అసలు నిజమిదే
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కన్నడ సినిమా ‘కేడీ’ షూటింగ్లో గాయపడ్డారంటూ బుధవారం సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. ధృవ సర్జా హీరోగా జోగి ప్రేమ్ దర్శకత్వంలో ‘కేడీ: ది డెవిల్’ చిత్రం రూపొందుతోంది. బెంగళూరు సమీపంలోని మాగడి వద్ద వేసిన సెట్లో ఇటీవల ఫైట్ మాస్టర్ రవి వర్మ ఆధ్వర్యంలో బాంబు బ్లాస్ట్ సీన్స్ తీస్తుండగా సంజయ్ దత్‌కి గాయాలైనట్లు వార్త గుప్పుమంది. అయితే ఈ వార్త నిజం కాదని సంజయ్ దత్ సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేశారు. ‘‘నాకు గాయాలైనట్లు వచ్చిన వార్త అవాస్తవం. నేను ప్రస్తుతం ‘కేడీ’ షూటింగ్లో పాల్గొంటున్నాను. యూనిట్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు’’ అన్నారు సంజయ్ దత్. There are reports of me getting injured. I want to reassure everyone that they are completely baseless. By God’s grace, I am fine & healthy. I am shooting for the film KD & the team's been extra careful while filming my scenes. Thank you everyone for reaching out & your concern. — Sanjay Dutt (@duttsanjay) April 12, 2023 -
బాంబ్ పేలుడు.. గాయాలపాలైన కేజీఎఫ్ విలన్
ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ గాయాలపాలయ్యాడు. కేడీ అనే కన్నడ సినిమా షూటింగ్లో బాంబ్ పేలడంతో అతడికి గాయాలయ్యాయి. బుధవారం నాడు బెంగుళూరులోని మగడి రోడ్డులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న కేడీ మూవీలో ఫైట్ మాస్టర్ రవి వర్మ ఆధ్వర్యంలో బాంబు బ్లాస్ట్ ఫైట్ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా అకస్మాత్తుగా బాంబు పేలడంతో సంజయ్ మోచేయి, ముఖానికి గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స తీసుకున్న అనంతరం ఆయన ముంబై వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంతో చిత్రీకరణను తాత్కాలికంగా నిలిపివేశారు. కాగా 1971లో వచ్చిన 'రేష్మ ఔర్ షేరా' సినిమాతో బలనటుడిగా కెరీర్ ఆరంభించాడు సంజయ్ దత్. ఈ సినిమా వచ్చిన పదేళ్ల తర్వాత 'రాకీ' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. జానీ ఐ లవ్యూ, విధాత, నామ్, జాన్ కీ బాజీ, మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగే రహో మున్నా భాయ్.. ఇలా అనేక చిత్రాల్లో నటించాడు. హిందీ చిత్రపరిశ్రమలో దాదాపు నాలుగు దశాబ్ధాలుగా నటుడిగా రాణించాడు. కేజీఎఫ్ సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. కేజీఎఫ్ 2 సినిమాల్లో విలన్‌గా నటించి దక్షిణాది వారికి మరింత దగ్గరయ్యాడు. ప్రస్తుతం ఆయన ధృవ్ సర్జా హీరోగా చేస్తున్న కేడీలో నటిస్తున్నారు. ఇదే కాకుండా ద గుడ్ మహారాజ, గుడ్చడి, లియో, బాప్ సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి. -
విజయ్ Vs సంజయ్.. మరో పాన్ ఇండియా సినిమా లోడింగ్
నటుడు విజయ్ 67వ చిత్రం లియో. త్రిష నాయకిగా చేస్తున్నారు. ప్రియా ఆనంద్ మరో హీరోయిన్. బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్, నటుడు అర్జున్, దర్శకుడు గౌతమ్‌మీనన్, మిష్కిన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 'విక్రమ్'తో సంచలన విజయం తరువాత లోకేశ్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం లియో. 7 స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ఎస్ఎస్ లలిత్‌కుమార్ నిర్మిస్తున్నారు. అనిరుథ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం కశ్మీర్లో రెండో షెడ్యూల్ జరుపుకుంటోంది. విజయ్, త్రిష, మిష్కిన్‌తో ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించారు. బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ లియో షూటింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈయన నటిస్తున్న తొలి తమిళ చిత్రం ఇది. అదేవిధంగా కేజీఎఫ్ 2 తరువాత దక్షిణాదిలో నటిస్తున్న చిత్రం. కాగా లియోలో సంజయ్‌దత్ ఎంట్రీ ఇచ్చిన ఫొటోలను చిత్ర యూనిట్ శనివారం మీడియాకు విడుదల చేసింది. ఇందులో సంజయ్‌దత్‌ను విజయ్ ఢీకొనే సన్నివేశాలు బీభత్సంగా ఉంటాయని ప్రచారం జరుగుతోంది. దీంతో యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న లియో చిత్రంపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇదివరకే రిలీజైన చిత్ర టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కాగా చిత్రాన్ని సెప్టెంబర్ 7వ తేదీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తు న్నట్లు సమాచారం. -
అధిక వ్యయాలతో రియల్టీ ప్రాజెక్టులు అసాధ్యం
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల అభివృద్ధి ఆచరణ సాధ్యం కాని పరిస్థితులు ఉన్నాయని టాటా రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీ, సీఈవో సంజయ్ దత్ అన్నారు. భూమి ధరలు పెరిగిపోవడం, నిర్మాణ వ్యయం, నిధుల వ్యయాలు పెరిగిపోవడానికి అదనంగా ఆర్థిక అనిశ్చితులను ప్రస్తావించారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల అనుమతులు నుంచి అభివృద్ది వరకు అన్ని సులభతరంగా సాగేందుకు భాగస్వాములను జవాబుదారీ చేయాలన్న అభిప్రాయాన్ని దత్ వినిపించారు. ‘‘రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు పెద్ద మొత్తంలో నిధులు అవసరం. మొదట భూమిని సమీకరించుకోవాలి. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్), ముంబై, బెంగళూరు తదితర ముఖ్య పట్టణాల్లో ప్రాజెక్టు వ్యయాల్లో భూమి వాటా 50 శాతం నుంచి 80–85 శాతం వరకు ఉంటోంది. ప్రాజెక్టు డిజైన్, అనుమతులు, నిర్మాణ ప్రారంభానికి 2–3 ఏళ్లు పడుతోంది. నిధుల వ్యయాలు ప్రముఖ సంస్థలకు 8.5 శాతంగా ఉంటే, పెద్దగా పేరులేని సంస్థలకు 18 శాతం వరకు ఉంటున్నాయి’’అని సంజయ్ దత్ వివరించారు. దీంతో ప్రాజెక్టు డెవలపర్లు ప్రస్తుత వ్యయాల ఆధారంగా ధరలను ప్రకటించినప్పటికీ.. ప్రాజెక్టు పూర్తయ్యే 5–6 ఏళ్లలో వ్యయాలు గణనీయంగా పెరుగుతున్నట్టు చెప్పారు. -
టాలీవుడ్ బాట పడుతున్న బాలీవుడ్ స్టార్స్!
కథ ఎవరినైనా ఎక్కడికైనా తీసుకెళ్లగలదు. అలా ఈ మధ్య కొన్ని కథలు కొందరు బాలీవుడ్ యాక్టర్స్‌ను సౌత్‌కు రమ్మన్నాయి. ఆల్రెడీ హిందీ హీరోయిన్లు కొన్నేళ్లుగా సౌత్‌లో రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు నటులు కూడా సౌత్‌లో స్టెప్‌ఇన్ అవుతున్నారు. మంచి కథలు పిలుస్తుండటంతో కాదనకుండా వచ్చేస్తున్నాం అంటూ కొందరు నార్త్ స్టార్స్ సౌత్ బాట పట్టారు. ఆ నటులు కమిట్ అయిన సౌత్ సినిమాల గురించి తెలుసుకుందాం. నాగార్జున ‘మనం’ సినిమాలో అతిథిగా కనిపించిన బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఆ తర్వాత చిరంజీవి ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రంలో నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ ‘ప్రాజెక్ట్ కె’ సినిమా చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్‌ది కీలక పాత్ర. ఈ చిత్రంతోనే తెలుగుకు పరిచయం అవుతున్నారు దీపికా పదుకోనె.. ‘ప్రాజెక్ట్ కె’ వచ్చే ఏడాది జవనరి 12న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఇక బాలీవుడ్ స్క్రీన్‌పై హీరోగా ఓ వెలుగు వెలిగారు సంజయ్ దత్.ఇప్పటి తరానికి తెలిసి ఉండకపోవచ్చు కానీ 1998లో వచ్చిన ‘చంద్రలేఖ’ సినిమాతో తెలుగు తెరపైనా కనిపించారు సంజయ్. నాగార్జున హీరోగా నటించిన ఆ చిత్రంలో సంజయ్ దత్ ఓ అతిథి పాత్ర చేశారు. అలా ఈ బాలీవుడ్ స్టార్ సౌత్ ఎంట్రీ 25 ఏళ్ల క్రితమే జరిగింది. మళ్లీ ఆయన 2022లో కన్నడ ‘కేజీఎఫ్: ఛాప్టర్ 2’ ద్వారా దక్షిణాది తెరపై కనిపించారు. కన్నడంలో సంజయ్ దత్ చేసిన తొలి చిత్రం ఇదే. తాజాగా తమిళ చిత్రం ‘లియో’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సంజయ్ దత్. విజయ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకుడు. సంజయ్‌కు తమిళంలో ‘లియో’ తొలి సినిమా కావడం విశేషం. అలాగే తెలుగులోనూ ఆయన ఓ ఫుల్ లెంగ్త్ రోల్ చేయనున్నారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ‘రాజా డీలక్స్’ (అధికారిక ప్రకటన రావాల్సి ఉంది) అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సంజయ్ దత్‌ను ఓ కీ రోల్‌కు సంప్రదించారనే టాక్ గతంలో వినిపించింది. అదే నిజమైతే పాతికేళ్లకు సంజయ్ తెలుగులో సినిమా కమిట్ అయినట్లు అవుతుంది. మరో బీటౌన్ స్టార్ సైఫ్ అలీఖాన్ సైతం సౌత్‌పై ఫోకస్ పెట్టారని చెప్పొచ్చు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆది పురుష్’లో నటించారు సైఫ్ అలీఖాన్. ప్రభాస్ టైటిల్ రోల్ చేసిన ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూన్ 16న రిలీజ్ కానుంది. కాగా ఎన్టీఆర్ హీరోగా నటించనున్న తాజా చిత్రంలో సైఫ్ అలీఖాన్ ఓ కీ రోల్ చేయనున్నారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది. మరోవైపు హిందీలో రెండు దశాబ్దాలుగా మంచి పాత్రలు చేస్తూ, నటుడిగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇప్పుడు మళ్లీ ఓ సౌత్ సినిమాకి ‘సై’ అన్నారు. రజనీకాంత్ హీరోగా 2019లో విడుదలైన తమిళ చిత్రం ‘పేట్టా’ (తెలుగులో ‘పేట’)లో ప్రతినాయకుడి పాత్ర చేశారు నవాజుద్దీన్. ఇప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత మరో సౌత్ సినిమా ‘సైంధవ్’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంకటేశ్ హీరోగా ‘హిట్’ ఫ్రాంచైజీ ఫేమ్ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమే ‘సైంధవ్’. విడుదలైన గ్లింప్స్‌ని బట్టి ఈ చిత్రం మెడికల్ మాఫియా నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. నవాజుద్దీన్‌కు తెలుగులో ఇది తొలి చిత్రం. వెంకటేశ్ కెరీర్లో 75వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ఇక ఇంకో బాలీవుడ్ హీరో బాబీ డియోల్ సైతం తెలుగు డైలాగ్స్ చెబుతున్నారు. ఎందుకంటే ‘హరి హర వీర మల్లు’ చిత్రం కోసం. క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ ఫిల్మ్ ఇది. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు బాబీ డియోల్. ఈ చిత్రంలో ఔరంగజేబు పాత్రలో కనిపిస్తారాయన. ఈ సినిమాను ఈ ఏడాది రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరోవైపు దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఓ పీరియాడికల్ క్రైమ్ థ్రిల్లర్‌ను తెరకెక్కించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. రెండు ప్రధాన పాత్రలతో సాగే ఈ చిత్రంలో ఓ హీరోగా విజయ్ సేతుపతిని, మరో హీరోగా అభిషేక్ బచ్చన్‌ను అనుకున్నారట గౌతమ్ మీనన్. అభిషేక్ బచ్చన్‌కు ఆల్రెడీ కథ కూడా వినిపించారట. మరి.. అభిషేక్ ఓకే చెబుతారా? వేచి చూడాలి. ఇదే కోవలో మరి కొందరు హిందీ తారలు దక్షిణాది చిత్రాలకు డేట్స్ ఇచ్చారు. -
చచ్చిపోయినా పర్లేదు కానీ చికిత్స తీసుకోనని చెప్పా: నటుడు
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కేజీఎఫ్ సినిమాతో దక్షిణాది ప్రజలకూ చేరువయ్యాడు.ప్రస్తుతం పలు సినిమాలు చేస్తున్న ఆయన తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఎమోషనలయ్యాడు. 'ఒకరోజు నాకు విపరీతమైన వెన్నునొప్పి వచ్చింది. సరిగా ఊపిరి కూడా తీసుకోలేకపోయాను. ఆస్పత్రికి వెళ్తే క్యాన్సర్ ఉందన్న విషయం బయటపడింది. అప్పుడు నా భార్య, కుటుంబం ఎవరూ నా పక్కన లేరు. నేను ఒంటరిగా ఉన్నాను. క్యాన్సర్ అని చెప్పగానే నా జీవితం అంతా గిర్రున తిరిగింది. ఆ సమయంలో నా భార్య దుబాయ్‌లో ఉంది. నా పరిస్థితి తెలిసి నా సోదరి ప్రియా దత్ వెంటనే నా దగ్గరకు పరుగెత్తుకు వచ్చింది. మా ఫ్యామిలీ క్యాన్సర్ బారిన పడటం కొత్తేమీ కాదు. మా అమ్మ, నా మొదటి భార్య రిచా శర్మ క్యాన్సర్‌తోనే చనిపోయారు. ప్రియ రాగానే ఒకటే చెప్పా.. చావాలని రాసిపెట్టుంటే అలాగే చచ్చిపోతాను కానీ కీమోథెరపీ మాత్రం వద్దు. నాకు ఎలాంటి చికిత్స తీసుకోవాలని లేదు అని కరాఖండిగా చెప్పాను' అని తెలిపాడు సంజయ్. ఇక క్యాన్సర్‌తో పోరాడుతున్న సమయంలోనే సంజయ్ కేజీఎఫ్ 2 షూటింగ్లో పాల్గొనగా ఈ సినిమా అఖండ విజయం సాధించింది. 2020లోనే సంజయ్ క్యాన్సర్‌ను జయించాడు. చదవండి: హీరో కార్తీకి మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు చెత్త సినిమాలు చూడరు, అందుకే లీడ్ రోల్స్ చేయట్లేదు: నటుడు -
విజయ్ క్రేజ్ మామూలుగా లేదుగా
దళపతి విజయ్ చిత్రం అంటేనే క్రేజ్. ఆయన చిత్రాల కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తుంటారో, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అంతగా ఎదురు చూస్తుంటారు. ఆయన చిత్రాలు హిట్, ప్లాప్‌లకు అతీతం అనవచ్చు. అలాంటి నటుడు తాజాగా వారసుడు చిత్రంతో టాలీవుడ్లో వసూళ్లు కొల్లగొట్టడానికి సిద్ధం అవుతున్నారు. పొంగల్‌కు తమిళంతో పాటు తెలుగు, మళయాళం తదితర భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో విజయ్ నటించనున్న ఆయన 66వ చిత్రంపైనా ఇప్పటి నుంచే సినీ వర్గాల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. కారణం విజయ్ మాత్రమే కాదు దర్శకుడు లోకేశ్ కనకరాజ్ కూడా. ఈ దర్శకుడు చేసింది నాలుగే చిత్రాలైనా, లేటెస్ట్గా కమలహాసన్ కథానాయకుడిగా తెరకెక్కించిన విక్రమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. తాజాగా నటుడు విజయ్‌తో చిత్రం చేయడానికి సిద్ధం అయ్యారు. వీరి కాంబినేషన్లో ఇంతకుముందు రూపొందిన మాస్టర్ చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా క్రేజీ కాంబినేషన్లను కల్పించడంలో లోకేశ్ కనకరాజ్ దిట్ట. ఇప్పుడు విజయ్ హీరోగా చేస్తున్న కాంబో అంతకు మించి ఉంటుందని తెలుస్తోంది. ఇందులో విజయ్ ముంబాయి డాన్‌గా నటించబోతున్నారని తెలిసింది. చదవండి: (ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టు షాక్) ఇందులో బాలీవుడ్ మున్నాభాయ్ సంజయ్ దత్, నటుడు విశాల్ విలన్లుగా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. అదే విధంగా ఉలగనాయకుడు కమలహాసన్ గెస్ట్ రోల్లో మెరవబోతున్నట్లు వార్త వైరల్ అవుతోంది. ఇకపోతే నటి త్రిష కథానాయకిగా ఇదివరకే ఎంపికయ్యారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో పతాకంపై లలిత్ కుమార్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభానికి ముందు వ్యాపార పరంగానూ ప్రకంపనలు సృష్టిస్తోంది. చిత్ర శాటిలైట్ హక్కులను సన్ పిక్చర్స్ సంస్థ, డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకున్నట్లు సమాచారం. చిత్ర ప్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాల్లో దర్శకుడు లోకేశ్ కనకరాజ్ బిజీగా ఉన్నారు. డిసెంబర్ నెలలో ఈ చిత్రం వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు. -
డ్రగ్స్ నిషా.. రెండురోజులు లేవలేదు, ఇంట్లోవాళ్లు ఒకటే ఏడుపు!
బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌ను అభిమానులు ముద్దుగా సంజూ భాయ్ అని పిలుచుకుంటారు. కేజీఎఫ్ సినిమాలో అధీరాగా నటించి సౌత్ ఆడియన్స్‌కు దగ్గరైన అతడు గతంలో డ్రగ్స్‌కు బానిసైన సంగతి తెలిసిందే! ఈ విషయాన్ని కొన్నేళ్ల క్రితం అతడు దస్ కా దమ్ అనే షోలో బయటపెట్టాడు. 'ఓసారి డ్రగ్స్ తీసుకున్న మత్తులో ఆదమరిచి నిద్రపోయాను. ఉదయం 7 గంటల సమయంలో నిద్ర లేచి ఆకలిగా ఉంది, అన్నం పెట్టమని ఇంటి సిబ్బందిని అడిగాను. దానికతడు ఏడుపందుకుంటూ.. రెండు రోజుల తర్వాత మీరు లేచి ఆకలి అని అడుగుతున్నారని చెప్పాడు. అదేంటి? నిన్న రాత్రే కదా పడుకున్నాను. రెండు రోజులంటున్నారేంటని ప్రశ్నించగా.. లేదు, మీరు బెడ్ మీద నుంచి లేవక రెండు రోజులయ్యిందన్నాడు. కొన్ని క్షణాలపాటు నాకేమీ అర్థం కాలేదు. వెంటనే డ్రగ్స్ మానేయాలని డిసైడ్ అయ్యాను. డ్రగ్స్ వేస్ట్.. జీవితాన్ని మత్తులో దింపే దానికి దగ్గరవకపోవడమే మంచిది' అని చెప్పుకొచ్చాడు సంజయ్ దత్. చదవండి: రాజకీయ ఎంట్రీపై స్పందించిన నమిత వంట చేసిన రామ్‌చరణ్, వీడియో చూశారా? -
ఆ ప్యాషనే వేరు, సౌత్ సినిమాలు చేయాలనుంది: సంజయ్ దత్
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బాలీవుడ్ ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. అది ఒకప్పుడు, ఇప్పుడు సీన్ మారింది. బాలీవుడ్ మీద దండయాత్ర చేస్తోంది సౌత్ ఇండస్ట్రీ. వరుస సినిమాలను వదులుతూ హిందీ ప్రేక్షకులకు పిచ్చెక్కిస్తోంది. దక్షిణాది సినిమాలకు ఫిదా అయిపోతున్న జనాలు సౌత్ ఇండస్ట్రీకి జై కొడుతున్నారు. కన్నడ చిత్రాలైన కేజీఎఫ్, కాంతార హిందీలో అఖండ విజయాలను నమోదు చేసుకున్నాయి. తాజాగా మరో కన్నడ చిత్రం కేడీ- ద డెవిల్ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. గురువారం బెంగళూరులో కేడీ టైటిల్ టీజర్‌ను దర్శకుడు ప్రేమ్, నటుడు సంజయ్ దత్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సంజయ్ దత్ మాట్లాడుతూ దక్షిణాదిలో మరిన్ని చిత్రాల్లో నటించాలని ఉందని మనసులో మాట బయటపెట్టాడు. 'నేను కేజీఎఫ్‌లో చేశాను, ఇప్పుడు డైరెక్టర్ ప్రేమ్‌తో కేడీ సినిమా చేస్తున్నాను. కేడీ టీజర్ చాలా బాగుంది. సౌత్‌లో వారి ప్రేమను, శక్తిని, హీరోయిజాన్ని, ప్యాషన్‌ను.. అన్నింటినీ సినిమాలపై కుమ్మరించి చూపిస్తారు. దక్షిణాదిలో మరిన్ని సినిమాలు చేయాలనుంది. బాలీవుడ్ కూడా తన మూలాలు మర్చిపోకుండా ఉంటే బాగుంటుంది' అని చెప్పుకొచ్చాడు. కాగా ధృవ్ సర్జా హీరోగా నటించిన కేడీ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ప్రేక్షకులను అలరించనుంది. చదవండి: జిన్నా మూవీ రివ్యూ కాంతారపై కంగనా రనౌత్ రివ్యూ -
ప్రభాస్‌తో సంజూ భాయ్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్(అభిమానులు ముద్దుగా సంజూభాయ్ అని పిలుస్తారు) స్క్రీన్ షేర్ చేసుకోనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ‘రాజాడీలక్స్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుంది. అయితే ఈ మూవీలోని ఓ కీలక పాత్ర కోసం సంజయ్ దత్‌ను సంప్రదించారట మారుతి. హారర్ అండ్ కామెడీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో సంజయ్ దత్ నటిస్తారా? లేదా? వేచిచూడాలి. టీజర్ రెడీ... ప్రభాస్ హీరోగా నటించిన మరో చిత్రం ‘ఆదిపురుష్’. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. కాగా ఈ సినిమా టీజర్‌ని అక్టోబరు 2న విడుదల చేయనున్నారని టాక్. మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతీసనన్, లక్ష్మణుడిగా సన్నీసింగ్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. -
సినిమా చూడకుండానే విషాన్ని చిమ్మారు, ద్వేషించారు: సంజయ్ దత్
నాలుగు సంవత్సరాల కష్టం.. నాలుగు రోజుల్లో బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. ఎంతో కష్టపడి అద్భుత కళాఖండాన్ని తీశామనుకున్న సినిమాను ఆదిరంచే ప్రేక్షకులే కరువయ్యారు. పాటలు హిట్.. కేజీఎఫ్ నటుడు సంజయ్‌దత్ విలన్.. స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ కథానాయకుడు.. ఇంకేం.. సినిమా హిట్టుపో అనుకున్నారు అభిమానులు. కానీ ఎక్కడో తేడా కొట్టింది. ఫలితంగా బాక్సాఫీస్ దగ్గర సినిమా బెడిసికొట్టింది. వెరసి రణ్‌బీర్ కపూర్ కెరీర్లోనే భారీ డిజాస్టర్‌గా నిలిచింది షంషేరా. కానీ అంత తేలికగా వైఫల్యాన్ని జీర్ణించుకోలేకపోతోంది చిత్రయూనిట్. ప్రాణం పెట్టి సినిమా తీశాం, ఇలాంటి ఫలితం వస్తుందని కలలో కూడా అనుకోలేదంటూ ఆవేదన చెందుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన షంషేరా సినిమా జూలై 22న థియేటర్లలో విడుదలైంది. సినిమా రిలీజై ఐదు రోజులు కావస్తున్నా ఎక్కడా పాజిటివ్ బజ్ లేదు, కలెక్షన్లు కూడా అరకొర, పైగా విమర్శలు.. దీంతో షంషేరాలో విలన్‌గా నటించిన సంజయ్ దత్ సోషల్ మీడియలో భావోద్వేగ లేఖను విడుదల చేశాడు. 'కథకు, మీకిదివరకు పరిచయం లేని పాత్రలకు జీవం పోసే కళ సినిమా. షంషేరా కూడా ఆ కోవలోకే చెందుతుంది. మా చెమట, రక్తం, కన్నీళ్లు ధారపోసి ఈ సినిమా చేశాం. దీన్ని వెండితెరపైకి తీసుకురావాలని కలగన్నాం. కానీ చాలామంది ఈ చిత్రాన్ని ద్వేషించారు. సినిమా చూడకుండానే విషాన్ని చిమ్మారు. మా కష్టాన్ని లెక్కచేయకుండా ఇలా ప్రవర్తించడం నిజంగా భయానకంగా అనిపిస్తోంది. నాలుగు దశాబ్ధాల కెరీర్లో నేను ఎంతోమందితో పనిచేశాను. అందులో కరణ్ ఓ గొప్ప డైరెక్టర్. ఒక్కో పాత్రను ఒక్కో ఆయుధంలా వాడుతాడు. మేము ఇంతకుముందు అగ్నిపథ్ చేశాం. అతడు నాకిచ్చిన కంచ చీనా పాత్ర బాగా వర్కవుట్ అయింది. నన్ను నమ్మి షంషేరాలో అవకాశం ఇచ్చాడు. సినిమా సక్సెసా? ఫెయిల్యూరా? అన్నది పక్కనపెడితే అతడు నాకు ఫ్యామిలీలో భాగమే అనిపిస్తాడు. అతడితో కలిసి పని చేయడం ఎప్పటికీ గౌరవప్రదమే! నేనెప్పుడూ అతడి వైపే నిలబడతాను షంషేరాలో వెతుకుతున్న తెగ ఎప్పటికైనా దొరుకుతుంది. కానీ అప్పటివరకు మేము కూడగట్టుకున్న జ్ఞాపకాలు, నవ్వులు, కష్టాలు, అనుబంధాలు అలాగే కొనసాగుతాయి. కరోనా వంటి ఇబ్బందులు ఎదురైనా నాలుగేళ్లుగా ఒకేతాటిపై నిల్చున్న చిత్రయూనిట్ సంకల్పానికి ఇవే నా అభినందనలు. ఈ సినిమాతో రణ్‌బీర్‌తో నాకు కలకాలం నిలిచిపోయే అనుబంధం ఏర్పడింది. ఇలాంటి టాలెంటెడ్ నటుల మీద విషం చిమ్మడానికి కాపు కాచుకుని ఎదురు చూస్తున్న వ్యక్తులను చూస్తుంటే బాధగా ఉంది' అని చెప్పుకొచ్చాడు. View this post on Instagram A post shared by Sanjay Dutt (@duttsanjay) Shamshera is mine! #Shamshera #Shamsheraismine pic.twitter.com/MZyCfaeHFB — Karan Malhotra (@karanmalhotra21) July 27, 2022 చదవండి: రెండో పెళ్లి, వివాహమైన ఐదు నెలలకే బిడ్డకు జన్మనిచ్చిన నటి అలా ఇంద్ర సినిమాలో నటించే ఛాన్స్ మిస్సయింది! -
షంషేరా మూవీ టీం స్పెషల్ ఇంటర్వ్యూ
-
రణ్‌బీర్ ‘షెంషేరా’ ట్రైలర్ అవుట్, బాహుబలిని తలపిస్తున్న యాక్షన్ సీన్స్
బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్ తాజాగా నటించిన చిత్రం షంషేరా. ఈ మూవీ జులై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా నుంచి ఒక్కొక్కో అప్డేట్ను వదులుతున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్, పోస్టర్స్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు అన్ని లవ్‌స్టోరీస్ చేస్తూ వస్తున్న రణ్‌బీర్ ఇందులో సరికొత్తగ కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ ట్రైలర్లో రణ్‌బీర్ స్వాతంత్ర్యం కోసం ఆంగ్లేయులతో పోరాడే ఓ తెగ యోధుడిగా కనిపించాడు. ఇందులో అతడు ఆంగ్లేయులతో విరోచితం పోరాడే సీన్స్ గూస్బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ఇందులోని పలు సీన్స్ చూస్తుంటే బాహుబలి మూవీని గుర్తు చేస్తున్నాయి. ఇక సంజయ్ దత్ మాస్ లుక్ ఆసక్తిగా ఉంది. రణ్‌బీర్, వాణికపూర్లకు సంబంధించిన సీన్స్ సాంతం ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి షెంషేరా ట్రైలర్‌లోని యాక్షన్ సీన్స్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. -
రణ్‌బీర్ వీరోచిత పోరాటం.. ఆసక్తిగా 'షంషేరా' టీజర్
Shamshera Teaser: Ranbir Kapoor Battle With Sanjay Dutt For His Tribe: బాలీవుడ్ లవర్ బాయ్ తన ప్రియసఖి, క్యూటీ అలియా భట్‌ను వివాహం చేసుకుని పెళ్లిపుస్తకం తెరిచాడు. ఇక తన సినీ కెరీర్‌పై ఫోకస్ పెట్టాడు రణ్‌బీర్. ఇటీవల 'బ్రహ్మాస్త్ర' సినిమా ట్రైలర్ విడుదలై ఆకట్టుకోగా మరో సినిమాకు సంబంధించిన అప్డేట్ ఆసక్తికరంగా ఉంది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ పతాకంపై రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన చిత్రం 'షంషేరా'. కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు ఇప్పటికే నెట్టింట వైరల్ అయి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఈ మూవీ టీజర్‌ను బుధవారం (జూన్ 22) విడుదల చేసింది చిత్రబృందం. ఈ టీజర్ చారిత్రక నేపథ్యంతో కూడిన యాక్షన్ సీక్వెన్స్‌తో ఆద్యంతం ఆసక్తిగా ఉంది. పోరాట యోధుడిగా, ఆపదల్లో చిక్కుకున్న తన వర్గాన్ని కాపాడుకునే వీరుడిగా రణ్‌బీర్ యాక్టింగ్, రగ్గ్డ్ లుక్ ఆకట్టుకునేలా ఉంది. ఈ మూవీలో సంజయ్ దత్ విలన్‌గా అలరించనున్నాడు. జులై 22న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ట్రైలర్‌ను శుక్రవారం (జూన్ 24) రిలీజ్ చేయనున్నారు మేకర్స్. అలాగే ఈ చిత్రం హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది. చదవండి: బుల్లితెర నటి ఆత్మహత్య.. 'ఐ లవ్ యూ సాన్' అంటూ సూసైడ్ నోట్ -
ఆసక్తిగా అక్షయ్ కుమార్ 'పృథ్వీరాజ్' ట్రైలర్..
Akshay Kumar Prithviraj Movie Trailer Released: ఈ ఏడాది ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హిందీ సినిమాలలో పృథ్వీరాజ్ ఒకటి. బాలీవుడ్ యాక్షన్ హీరో టైటిల్ రోల్లో నటించిన తాజా చిత్రం ఇది. ఈ మూవీకి చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించగా సంజయ్ దత్, అశుతోష్ రాణా, సోనూ సూద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాకుండా మిస్ వరల్డ్ 2017 మానుషి చిల్లర్ ఈ సినిమాతో బాలీవుడ్లో తెరంగేట్రం చేయనుంది. ఇటీవల విడుదలై ఈ మూవీ టీజర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మే 9న రిలీజ్ చేశారు మేకర్స్. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం నిర్భయ, శక్తివంతమైన యోధుడు సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ జీవితం ఆధారంగా రూపొందించారు. 2 నిమిషాల 50 సెకన్ల ఈ ట్రైలర్లో విజువల్స్, యాక్షన్ సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులకు మరిచిపోలేని అనుభూతిని కలిగిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. శ్ రాజ్ ఫిల్మ్స్ ‘పృథ్వీరాజ్’తో మొదటిసారిగా చారిత్రక నేపథ్యమున్న సినిమాను రూపొందించడం విశేషం. చదవండి: అక్షయ్ కుమార్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్స్.. కారణమేంటంటే ? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికే డ్రగ్స్ తీసుకున్నా : స్టార్ హీరో
సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చేసినా కేజీఎఫ్-2 పైనే చర్చ నడుస్తుంది. భారీ అంచనాల మధ్య వరల్డ్ వైడ్‌గా రిలీజైన ఈ చిత్రానికి ప్రేక్షకులు అదిరిపోయే రెస్పాన్స్ ఇచ్చారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఈ సినిమాలో క్రూరమైన విలన్ అధీరాగా కన్పించి మెస్మరైజ్ చేశారు బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్. ప్రస్తుతం కేజీఎఫ్-2 గ్రాండ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా సినిమా సహా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తనకు డ్రగ్స్ ఎలా అలవాటు అయ్యింది అనే విషయాన్ని సైతం షేర్ చేసుకున్నారు. 'అప్పట్లో అమ్మాయిలతో మాట్లాడాలంటే తెగ సిగ్గుపడేవాడిని. కానీ ఎలాగైనా వాళ్లతో మాట్లాడటానికి ప్రయత్నించేవాడిని. అందులో భాగంగానే డ్రగ్స్ వాడితే అమ్మాయిలకు కూల్‌గా కనిపిస్తానని, వాళ్లతో మాట్లాడే అవకాశం ఈజీగా లభిస్తుందని భావించాను. అలా డ్రగ్స్ తీసుకోవడం ప్రారంభించాను. కానీ ఈ ప్రాసెస్‌లో డ్రగ్స్‌కి బానిసైన నాకు ఆ సంకెళ్లు తెంచుకోవడానిక ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. అందరికీ దూరంగా ఒంటరి ప్రపంచాన్ని గడిపేవాడిని. నా జీవితంలో ఆ పదేళ్లు రూమ్‌లో లేదా బాత్రూమ్లో గడిపేవాడిని. షూటింగ్‌లపై ఆసక్తి ఉండేది కాదు. అయితే డ్రగ్స్ ఎఫెక్ట్ నుంచి కోలుకోవడానికి రిహబిలిటేషన్ సెంటర్‌కి వెళ్లి కొంతకాలం అక్కడే గడిపాను. తిరిగి వచ్చాక అందరూ నన్ను డ్రగ్గీ అని పిలిచేవారు. ఆ మచ్చని పోగొట్టుకోవడానికి ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నా. అందుకే కష్టపడి బాడీని బిల్డ్ చేసుకున్నా. దీంతో అప్పటి నుంచి అందరూ ‘క్యా బాడీ హై’అంటూ ప్రశంసించారు' అంటూ చెప్పుకొచ్చారు సంజూ భాయ్. -
సాక్షి ఆడియన్స్ పోల్.. 'కేజీఎఫ్-2'పై ప్రేక్షకుల రివ్వ్యూ
కేజీఎఫ్.. ఎలాంటి అంచనాలు లేకుండా కన్నడ నుంచి వచ్చిన ఈ చిత్రం ఇండియన్ సినిమాను షేక్ చేసింది. ఈ ఒక్క సినిమాతో యష్ తిరుగులేని స్టార్ హీరోల జాబితాలో చేరిపోయాడు. బాహుబలి తర్వాత ఆ రేంజ్లో సీక్వెల్ కోసం ఎదురుచూసిన సినిమా ఏదైనా ఉందా అంటే అది 'కేజీయఫ్ 2' అనే చెప్పవచ్చు. ఫైనల్లీ ఆ రోజు రానే వచ్చేసింది.. కేజీఎఫ్ సీక్వెల్‌గా రూపొందిన `కేజీఎఫ్ ఛాప్టర్2`గురువారం(ఏప్రిల్14)న ప్రేక్షకుల మందుకు వచ్చింది. స్టార్ హీరో యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విజయ్ కిరగందూర్ నిర్మించారు. మరి ఈ చిత్రం 'కేజీఎఫ్' రేంజ్లో సక్సెస్ సాధించిందా? లేక అంతకుమించి ఆకట్టుకుందా? `కేజీఎఫ్ ఛాప్టర్2`పై ఆడియెన్స్ ఓపీనియన్ ఏంటి అన్నది 'సాక్షి ఆడియన్స్ పోల్'లో ప్రేక్షకుల రివ్యూలో తెలుసుకుందాం. -
‘కేజీయఫ్ 2’ మూవీ రివ్యూ
టైటిల్ : కేజీయఫ్ చాప్టర్ 2 నటీనటులు : యశ్, సంజయ్ దత్, శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, అర్చన, ఈశ్వరీరావు, రావు రమేశ్ తదితరులు నిర్మాణ సంస్థ: హోంబలే ఫిలింస్ నిర్మాత:విజయ్ కిరగందూర్ దర్శకుడు: ప్రశాంత్ నీల్ సంగీతం: రవి బస్రూర్ సినిమాటోగ్రఫి: భువన్ గౌడ విడుదల తేది: ఏప్రిల్ 14, 2022 సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో కేజీయఫ్ 2 ఒకటి. 2018లో వచ్చిన ‘కేజీయఫ్’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఎలాంటి అంచానాలు లేకుండా విడుదలైన ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించింది. అలాంటి సినిమాకు సీక్వెల్ వస్తుందంటే..భారీ అంచనాలు ఉండడం సహజం. అందుకు తగ్గట్టే.. కేజీయఫ్ 2 తీర్చిదిద్టినట్లుగా టీజర్, ట్రైలర్‌ని చూపించారు మేకర్స్ . దీంతో ఈ చిత్రం కోసం సినీ ప్రేక్షకులు కల్లల్లో ఒత్తులు వేసుకొని వేచి చూశారు. బహుబలి సీక్వెల్ తర్వాత ఓ మూవీ సీక్వెల్ కోసం ప్రేక్షకులు.. అంతా వేచి చూస్తోన్న సినిమా ఏదైనా ఉందంటే అది కేజీయఫ్ 2 అనే చెప్పవచ్చు. పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు గురువారం(ఏప్రిల్ 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పార్ట్ 1 సూపర్ హిట్ కావడం, పార్ట్2 టీజర్, ట్రైలర్ అదిరిపోవడంతో ‘కేజీయఫ్ 2’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన కేజీయఫ్ 2ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు. కేజీయఫ్ 1 స్థాయిని కేజీయఫ్2 అందుకుందా లేదా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. కేజీయఫ్ మూవీ ఎక్కడ ముగిసిందో.. అక్కడ నుంచి కేజీయఫ్ 2 కథ మొదలవుతుంది. మొదటి పార్ట్‌లో రాకీ భాయ్ స్టోరీని ప్రముఖ రచయిత ఆనంద్ వాసిరాజు(అనంత్ నాగ్) చెబితే.. పార్ట్ 2లో ఆయన కుమారుడు విజయేంద్రవాసిరాజు(ప్రకాశ్ రాజ్) కథ చెబుతాడు. గరుడను చంపిన తర్వాత నరాచి లైమ్ స్టోన్ కార్పొరేషన్‌ను రాకీ భాయ్ (యశ్) తన ఆధీనంలోకి తీసుకుంటాడు. గరుడ పెట్టే చిత్రహింసల నుంచి బయట పడడంతో అక్కడి కార్మికులు యశ్ని రాజుగా భావిస్తారు. తన కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. ఇక కేజీయఫ్ సామ్రాజ్యంలో తనకు ఎదురులేదని అనుకుంటున్న సమయంలో ‘నరాచి లైమ్ స్టోన్ కార్పొరేషన్’ సృష్టికర్త సూర్యవర్ధన్ సోదరుడు అధీరా(సంజయ్ దత్) తెరపైకి వస్తాడు. అదే సమయంలో రాజకీయంగా కూడా రాకీబాయ్ సవాళ్లను కూడా ఎదుర్కొవాల్సివస్తుంది. అతని సామ్రాజ్యం గురించి తెలుసుకున్న భారత ప్రధానమంత్రి రమికా సేన్(రవీనా టాండన్)..అతనిపై ఓ రకమైన యుద్దాన్ని ప్రకటిస్తుంది. ఒకవైపు అధీరా నుంచి, మరోవైపు రమికా సేన్ ప్రభుత్వం నుంచి ముప్పు ఏర్పడిన సమయంలో రాకీభాయ్ ఏం చేశాడు? తన సామ్రాజ్యాన్ని ఎలా కాపాడుకున్నాడు?. శత్రువులు వేసిన ఎత్తులను ఎలా చిత్తు చేశాడు? తనను దేవుడిగా భావించిన కార్మికుల కోసం ఏదైనా చేశాడా? అమ్మకు ఇచ్చిన మాట కోసం చివరికి ఏం చేశాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉదంటంటే.. 2018లో చిన్న సినిమాగా విడుదలై అతి భారీ విజయం సాధించిన చిత్రం ‘కేజీయఫ్’. తల్లి చెప్పిన మాటలు, ఆ మాటల ప్రభావంతో పెరిగిన కొడుకు, చివరకు ఓ సామ్రాజ్యానికే అధినేతగా ఎదగడం.. ఇలా కేజీయఫ్ చిత్రం సాగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది కేజీయఫ్ చాప్టర్ 2లో చూపించారు. కేజీయఫ్ మాదిరే పార్ట్2లో హీరో ఎలివేషన్, యాక్షన్ సీన్స్‌పైనే ఎక్కువ ఫోకస్ పెట్టాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. పార్ట్ 2లో యాక్షన్ డోస్ మరింత ఎక్కువైందనే చెప్పొచ్చు. ఫస్టాఫ్‌లో రాకీభాయ్ ఎదిగే తీరుని చాలా ఆసక్తికరంగా చూపించాడు. కేజీయఫ్ పార్ట్‌నర్స్‌తో జరిపిన మీటింగ్, ఇయత్ ఖలీల్‌తో జరిపిన డీల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే హీరో ఎలివేషన్స్ ఓ రేంజ్లో చూపించడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రీక్లైమాక్స్‌లో పార్లమెంట్‌లోకి వెళ్లి మాజీ ప్రధానిని చంపడం సినిమాటిక్‌గా అనిపిస్తుంది. ‘కేజీయఫ్’అభిమానులకు మాత్రం ఆ సీన్‌తో సహా ప్రతి సన్నీవేశం నచ్చుతుంది. బహుశా దర్శకుడు కూడా వారిని మెప్పించడానికే హీరో ఎలివేషన్స్‌లో మరింత స్వేచ్ఛ తీసుకున్నాడేమో. అయితే కథని మాత్రం ఆ స్థాయిలో మలచుకోలేకపోయాడు. కేజీయఫ్ మూవీ చూసిన ప్రతి ఒక్కరికి ఆ సినిమాలోని విలన్లు, వారు ఎలాంటి ఎత్తులు వేస్తారు.. చివరకు ఎం జరుగుతుంది అనేది అంచనా వేస్తారు. వారి అంచనా తగ్గట్టే పార్ట్2 సాగుతుంది. కథలో ట్విస్టులు లేకపోవడం మైనస్. ఇక అధీర పాత్ర తీర్చిదిద్దిన విధానం బాగున్నప్పటికీ.. రాకీభాయ్, అధిరాకు మధ్య వచ్చే ఫైట్ సీన్స్ మాత్రం అంతగా ఆసక్తికరంగా సాగవు. అధిర పాత్రను మరింత బలంగా చూపిస్తే బాగుండేదేమో. అలాగే అతని నేపథ్యం కూడా సినిమాలో చూపించలేదు. ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే.. ఇందులో మదర్ సెంటిమెంట్ కాస్త తక్కువే అని చెప్పాలి. మధ్య మధ్యలో తల్లి మాటలను గుర్తు చేస్తూ కథను ముందుకు నడిపారు.ఇక హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్ కథకి అడ్డంకిగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే చివర్లో మాత్రం తల్లి కాబోతున్న విషయాన్ని హీరోకి తెలియజేసే సీన్ హృదయాలను హత్తుకుంటుంది. సముద్రం ఎందుకంత వెలిగిపోతుందని కొడుకు అడిగిన ప్రశ్నకి తల్లి చెప్పిన సమాధానాన్ని, క్లైమాక్స్‌తో ముడిపెట్టడం ఆకట్టుకుంటుంది. ఎవరెలా చేశారంటే.. సినిమా స్టార్టింగ్‌లో విలన్లకు సంబంధించిన వ్యక్తి, యశ్ గురించి చెబుతూ.. ‘ఇంట్లో ఉన్న ఎలుకలను బయటకు తోలడానికి పాముని పంపారు.. ఇప్పుడు అది నల్ల తాచు అయింది’ అని అంటాడు. అంటే హీరో మరింత బలపడ్డాడు అనే అర్థంతో ఆ డైలాగ్ చెబుతాడు. కేజీయఫ్2లో యశ్ నటన కూడా అంతే. మొదటి భాగంతో పోలిస్తే.. ఇందులో మరింత స్టైలీష్‌గా, తనదైన మేనరిజంలో డైలాగ్స్ చెబుతూ..అదరగొట్టేశాడు. రాకీ భాయ్ పాత్రకు యశ్ తప్పితే మరొకరు సెట్ కాలేరు అన్న విధంగా అతని నటన ఉంది. యాక్షన్ సీన్స్‌లో విశ్వరూపం చూపించాడు. ఎమోషనల్ సీన్స్‌లో కూడా మంచి నటనను కనబరిచాడు. అధీరగా సంజయ్ దత్ ఫెర్పార్మెన్స్ బాగుంది. ఆయన పాత్రని మరింత బలంగా తీర్చిదిద్దితే బాగుండేది. ఈ సినిమా షూటింగ్‌కి ముందే సంజయ్ దత్‌కి కేన్సర్ అని తేలింది. అయినా కూడా ఆయన అధీర పాత్రలో నటించడం అభినందించాల్సిందే. ప్రధానమంత్రి రమికా సేన్ పాత్రకి రవీనా టాండన్ న్యాయం చేసింది. రావు రమేశ్, ఈశ్వరి భాయ్, ప్రకాశ్ రాజ్‌తో పాటు ప్రతి ఒక్కరు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. ప్రతి ఒక్కరి పాత్రకి తగిన ప్రాధాన్యత ఉండడం ఈ సినిమా గొప్పదనం. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు మరో ప్రధాన బలం రవి బస్రూర్ సంగీతం. అద్భుతమైన నేపథ్య సంగీతంతో సినిమాను మరో మెట్టు ఎక్కించాడు. భువన్ గౌడ సినిమాటోగ్రఫి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. కేజీయఫ్ సామ్రాజ్యాన్ని అందంగా చిత్రీకరించాడు. ప్రతి సీన్‌ని తెరపై చాలా రిచ్‌గా చూపించాడు. ఉజ్వల్ ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
రణ్‌బీర్- ఆలియా పెళ్లి, త్వరగా పిల్లలను కనివ్వండి: ప్రముఖ నటుడు
బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణ్‌బీర్- ఆలియా త్వరలో పెళ్లిపీటలెక్కనున్న విషయం తెలిసిందే! ఏప్రిల్ 14న వీరి పెళ్లి జరుగుతుందని ప్రచారం జరగ్గా అది కాస్తా 20కి వాయిదా పడింది. ఇప్పటికే రణ్‌బీర్, ఆలియా పెళ్లి షాపింగ్‌లో బిజీ అవగా వారి ఫ్యామిలీ పెళ్లి పనుల్లో తలమునకలైంది. తాజాగా ఈ జంట వివాహం గురించి బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ స్పందించాడు. 'రణ్‌బీర్ పెళ్లిపీటలెక్కబోతున్నాడంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆలియా నా ముందే పెరిగి పెద్దదైంది. పెళ్లి అనేది ఇద్దరూ కలిసి జీవించడానికి చేసుకునే ఒక ఒప్పందం వంటిది. కష్టసుఖాల్లో, అన్ని రకాల పరిస్థితుల్లో ఒకరికోసం ఒకరు కలిసే ఉంటామన్న మాటకు కట్టుబడి ఉండాలి. మీ జంట సంతోషంగా జీవించాలి. అలాగే త్వరలోనే పిల్లలను కనివ్వాలి రణ్‌బీర్' అని సరదాగా సంభాషించాడు కేజీఎఫ్ యాక్టర్ సంజయ్ దత్. ఇదిలా ఉంటే ఈ బాలీవుడ్ ప్రేమజంట పెళ్లితో ఫ్యాన్స్ ఒకింత బాధలో ఉండిపోయారు. ఆలియా ఇక రణ్‌బీర్ సొంతం అవడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వీడియోలతో సందడి చేస్తున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Nick (@beyounick) చదవండి: పెళ్లి తేదీ వాయిదా వేసుకున్న లవ్‌బర్డ్స్, కారణం ఇదేనా? హీరో నాగచైతన్య కారుకు పోలీసుల జరిమానా -
హోలీ నాడు దర్శకుడి ఇంట విషాదం, ఐదో అంతస్థు నుంచి..
ముంబై: ప్రముఖ దర్శకుడు, నటుడు గిరీశ్ మాలిక్ ఇంట విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం హోలీ ఆడుకుని ఇంటికి వచ్చిన అతడి తనయుడు మన్నన్(17) ప్రమాదవశాత్తూ ఐదో అంతస్థు నుంచి కింద పడటంతో అక్కడికక్కడే మరణించాడు. దీంతో దర్శకుడి ఇంట్లో విషాద చాయలు అలుముకున్నాయి. 'టొర్బాజ్' నిర్మాత రాహుల్ మిత్ర ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. 'టొర్బాజ్ షూటింగ్ సమయంలో చాలాసార్లు మన్నన్‌ను కలిశాను. అతడు చాలా తెలివైనవాడు. ఇలా జరగడం దురదృష్టకరం. ఈ విషయం తెలిసి సంజయ్‌దత్ కూడా ఎంతో బాధపడ్డాడు. గిరీశ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను' అని రాహుల్ మిత్ర పేర్కొన్నాడు. కాగా గిరీజ్ 2013లో 'జల్' సినిమాతో దర్శకుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 'టొర్బాజో', 'మాన్ వర్సెస్ ఖాన్' సినిమాలు అతడికి మంచి పేరు తీసుకువచ్చాయి. చదవండి: బిగ్‌బాస్.. ఆర్జే చైతూ ఎలిమినేట్ -
మహేశ్ వర్సెస్ సంజయ్ దత్?
‘అతడు ’(2005), ‘ఖలేజా’ (2010) చిత్రాల తర్వాత హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటించనున్నారు. ఈ చిత్రంలో విలన్ పాత్రకు హిందీ నటుడు సంజయ్ దత్‌ను సంప్రదించాలనే ఆలోచనలో ఉందట చిత్రబృందం. ఇప్పటికే యశ్ ‘కేజీఎఫ్: ఛాప్టర్ 2’లో సంజయ్ దత్ విలన్‌గా నటించిన విషయం తెలిసిందే. మరి... మహేశ్ వర్సెస్ సంజయ్ దత్‌ను చూస్తామా? అనే విషయం తెలియాలంటే వేచి చూడాలి. -
సంజూ బాబాకు మరో బర్త్‌డే గిఫ్ట్: అదుర్స్
సాక్షి, ముంబై: పుట్టిన రోజు సందర్భంగా సంజయ్ దత్‌కు మరో అపురూపమైన కానుక అందింది. అజయ్ దేవ్‌గణ్ హీరోగా, సంజయ్ దత్, సోనాక్షి సిన్హా నటిస్తున్న బాలీవుడ్ మూవీ భుజ్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా సినిమాలోని ‘భాయీ భాయీ’ పాటను చిత్ర యూనిట్ గురువారం రిలీజ్ చేసింది. ఇది తన పుట్టినరోజును మరింత ప్రత్యేకంగా చేసిందంటూ సంజయ్ దత్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ఆగస్టు 13 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో వీఐపీలో మాత్రమే ఈ మూవీ విడుదలకానుంది. కాగా 1971 భారత, పాకిస్థాన్ మధ్య జరిగియన యుద్ధం నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. టీ సిరీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శివ్ రావెల్ దర్శకత్వం వహిస్తుండగా, నోరా ఫతేహీ, ప్రణీత, శరద్‌ఖేల్కర్ ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల (జూలై 12) విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఫ్యాన్స్‌ను బాగానే ఆకట్టుకుంది. View this post on Instagram A post shared by Sanjay Dutt (@duttsanjay) -
సంజయ్ దత్‌కు సల్మాన్ ఖాన్ విషెస్: ఫోటో వైరల్
సాక్షి, ముంబై: బాలీవుడ్ హీరో సంజయ్ దత్ 62వ పుట్టిన రోజు సందర్భంగా అటు ఫ్యాన్స్, స్నేహితులు,ఇటు కుటుంబ సభ్యులనుంచి సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒక చక్కటి ఫోటోతో సంజయ్‌కు విషెస్ అందించారు. ఇపుడా ఫోటో ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టు కుంటోంది. బాలీవుడ్ లివింగ్ లెజెండ్స్ అంటూ అభిమానులు కామెంట్ చేశారు. సల్మాన్, సంజయ్ జంటగా నటించిన దస్ చిత్రంలోని ‘సునో గౌర్ సే దునియా వాలో’ పాటలోని ఒక స్టిల్‌ను సోషల్ మీడియిలో షేర్ చేశారు. హ్యాపీ బర్త్‌డే బాబా అంటూ త్రోబ్యాక్ ఫోటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. పాత జ్ఞాపకాలను తలచుకుంటూ తన ప్రియమైన స్నేహితుడు సంజూబాబాకి ప్రత్యేక శుభాకాంక్షలు అందించారు. దీనికి సంజయ్ దత్ భార్య మాన్యతాతో పాటు పలువురు స్పందించారు. కాగా సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ సాజన్, చల్ మేరే భాయ్ లాంటి చిత్రాల్లో కలిసి నటించారు. అలాగే సంజయ్ దత్ 2012 చిత్రం సన్ ఆఫ్ సర్దార్ లోని పో పో పాటలో సల్మాన్ ఖాన్ నటించారు. కాగా సంజయ్ దత్ పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న 'కేజీఎఫ్ 2' సినిమాలోని సంజయ్ లుక్ కి సంబంధించిన స్పెషల్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సినిమాలో సంజయ్ దత్ అధీర అనే విలన్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Salman Khan (@beingsalmankhan) -
కేజీఎఫ్-2 : పవర్ఫుల్ లుక్‌లో సంజయ్ దత్
HBD Sanjay Dutt: కన్నడ స్టార్ యశ్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘కేజీఎఫ్ చాప్టర్ 2’. కేజీఎఫ్ ఘన విజయంతో ఈ మూవీకి సీక్వెల్‌గా కేజీఎఫ్ చాప్టర్ 2ను తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం(జులై29)న సంజయ్ దత్ బర్త్‌డే సందర్భంగా 'కేజీఎఫ్ 2'లో అధీరాగా విలన్ పాత్ర చేస్తున్న సంజయ్ లుక్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. చేతిలో ఖడ్గం పట్టుకొని ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్న సంజయ్ లుక్ విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. యష్, సంజయ్ దత్ భారీ యాక్షన్ సన్నివేశం ఉందని, ఇది ప్రేక్షకులను ఎంతో థ్రిల్‌కు గురి చేస్తుందని ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు. దీంతో కేజీఎఫ్ చాప్టర్ 2పై పాన్ఇండియా లెవల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో విడుదల కానున్న ఈ చిత్రం విడుదల తేదీని త్వరలోనే వెల్లడి కానుంది. "War is meant for progress, even the vultures will agree with me" - #Adheera, Happy Birthday @duttsanjay sir.#KGFChapter2 @TheNameIsYash @VKiragandur @hombalefilms @TandonRaveena @SrinidhiShetty7 @excelmovies @VaaraahiCC @PrithvirajProd @DreamWarriorpic @LahariMusic pic.twitter.com/VqsuMXe6rT — Prashanth Neel (@prashanth_neel) July 29, 2021 -
దుబాయ్ చేరుకున్న నటుడు సంజయ్ దత్
దుబాయ్: ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ మరోసారి దుబాయ్ పయనమయ్యారు. గత కొన్ని రోజులుగా ముంబైలోనే ఉన్న ఆయన.. తాజాగా దుబాయ్‌కు వెళ్లారు. గతేడాది సంజయ్ క్యాన్సర్‌కు గురయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లండన్‌కు వెళ్లి శస్త్ర చికిత్స చేయించుకున్న ఆయన క్యాన్సర్ నుంచి కోలుకున్నట్లు అక్టోబరులో ప్రకటించారు. కొంతకాలంగా భార్య మాన్యత, పిల్లలు షారాన్, ఇఖ్రాలతో కలిసి దుబాయ్‌లో ఉంటున్న సంజయ్‌దత్ పది రోజుల క్రితం ఒంటరిగా ముంబైకు ఎందుకు వచ్చారన్న కారణాలు తెలియలేదు. ట్రిప్‌లో భాగంగా కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆయన భార్య కాంచన్ గడ్కరీని సంజయ్ దత్ ఆదివారం నాగపూర్‌లోని వారి నివాసంలో కలిసిన సంగతి తెలిసిందే. సంజయ్ దత్ ఏ కారణంగా గడ్కరీతో భేటీ అయ్యారన్నది తెలియదు. ఇరువరి మధ్య ఏ విషయంపై చర్చలు జరిగాయన్నది తెలియరాలేదు. ఇక సినిమాల విషయానికి వస్తే సంజయ్ దత్ నటించిన కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ విడుదలకు సిద్ధమౌతుంది.ఈ చిత్రంలో సంజయ్ నెగటివ్ రోల్లో కనిపించనున్నాడు. బ్లాక్ బస్టర్ ''కేజీఎఫ్ చాప్టర్ 1'' కు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అదే విధంగా “పృథ్వీరాజ్”, “భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా” లలో కూడా సంజయ్ కనిపించనున్నాడు. చదవండి : కె.జి.యఫ్ నుంచి మరో అప్డేట్ -
నితిన్ గడ్కరీని కలిసిన సంజయ్ దత్
నాగ్‌పూర్: కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆయన భార్య కాంచన్ గడ్కరీని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఆదివారం నాగపూర్‌లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశాడు. సంజయ్ దత్ ఏ కారణంగా గడ్కరీతో భేటీ అయ్యారన్నది తెలియదు. ఇరువరి మధ్య ఏ విషయంపై చర్చలు జరిగాయన్నది తెలియరాలేదు. ఈ సందర్భంగా సంజయ్‌తో సమావేశాన్ని నితిన్ గడ్కరీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. కాగా సంజయ్ దత్ గతేడాది క్యాన్సర్ గురయ్యారు. లండన్‌కు వెళ్లి శస్త్ర చికిత్స చేయించుకున్న సంజయ్ దత్ క్యాన్సర్ నుంచి కోలుకున్నట్లు అక్టోబరులో ప్రకటించారు.ఇక సంజయ్ దత్ నటించిన కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ విడుదలకు సిద్ధమౌతుంది. ఈ చిత్రంలో సంజయ్ నెగటివ్ రోల్లో కనిపించనున్నాడు. బ్లాక్ బస్టర్ ''కేజీఎఫ్ చాప్టర్ 1'' కు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అదే విధంగా “పృథ్వీరాజ్”, “భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా” లలో కూడా సంజయ్ కనిపించనున్నాడు. -
కె.జి.యఫ్ నుంచి మరో అప్డేట్
కె.జి.యఫ్తో కన్నడ సినిమాకు కొత్త వైభవం తీసుకొచ్చాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. రాకింగ్ స్టార్ యశ్ లీడ్ రోల్ చేసిన ఈ మూవీ సెకండ్ ఛాప్టర్ కోసం సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రిలీజ్ డేట్ ప్రకటించినప్పటికీ.. కరోనా ఎఫెక్ట్‌తో అది వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఈ మూవీ నుంచి మరో అప్డేట్ అందింది. కె.జి.యఫ్ అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రాల జాబితా ఒకటి. మొదటి పార్ట్‌లో ముఖాలు చూపించని కొన్ని క్యారెక్టర్లను.. రెండో ఛాప్టర్ కోసం ఒక్కోక్కటిగా పోస్టర్లతో రివీల్ చేస్తోంది ఈ చిత్ర నిర్మాణ సంస్థ హోంబెల్ ఫిల్మ్స్. అది కూడా పుట్టినరోజులకు, పేపర్ కట్టింగ్లతో కావడం మరో విశేషం. కాగా, ఈరోజు మరో పోస్టర్‌ను రివీల్ చేశారు. ఈ మూవీలో ఇనాయత్ ఖలీల్ క్యారెక్టర్‌ను పోషిస్తున్న బాలకృష్ణ పోస్టర్‌ను రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ. గుర్తుతెలియని ప్రాంతంలో ఇనాయత్ ఖలీల్ తన పుట్టినరోజు జరుపుకుంటున్నాడంటూ క్యాప్షన్ ఉంచింది. దుబాయ్‌లో ఉంటూ ఇండియాపై కన్నేసే గోల్డ్ స్మగ్లర్ల డాన్‌గా ఇనాయత్ ఖలీల్ రోల్ ఉండబోతోంది. Wishing our #InayathKhalil, @BalaTheKrishna a very Happy Birthday.#KGFChapter2. pic.twitter.com/qPjvhhHBU9 — Hombale Films (@hombalefilms) May 31, 2021 కాగా, బాలకృష్ణ టాలీవుడ్ నటుడు ఆదర్శ్ బాలకృష్ణ తండ్రి. ఈ ఫ్యామిలీతో దర్శకుడు ప్రశాంత్ నీల్‌కు దగ్గరి చుట్టరికం ఉంది. ఇక గతంలో కె.జి.యఫ్ వికీపీడీయా పేజీలో తెలుగు సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ పోస్టర్ని, ఇన్ఫోని కొందరు సరదాగా ఎడిట్ చేసిన విషయం తెలిసిందే. కాగా, వంద కోట్ల బడ్జెట్‌తో పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కిన కె.జి.యఫ్ లో యశ్, శ్రీనిధి శెట్టి, ప్రకాశ్ రాజ్, రవీనా టండన్, సంజయ్ దత్, రావు రమేశ్‌లు నటిస్తున్న విషయం తెలిసిందే. -
అందుకే అతడితో విడిపోయా: హీరో కూతురు
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూతురు త్రిశాలా దత్ అందరికీ తెలిసే ఉంటుంది. సంజయ్‌దత్, ఆయన మొదటి భార్య రిచా శర్మ కూతురు త్రిశాలా. ప్రస్తుతం ఈమె న్యూయార్క్‌లో సైకోథెరపిస్ట్‌గా పనిచేస్తున్నారు. అయితే అక్కడ తను ఓ వ్యక్తితో సుదీర్ఘ కాలం ప్రేమలో మునిగి తేలి ఆ తర్వాత విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల త్రిశాలా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సుదీర్ఘ ఆమె సమాధానమిచ్చారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి తన బ్రేకప్ గురించి అడగ్గా.. ఏడేళ్ల తన సుదీర్ఘ రిలేషన్షిప్లో ఎన్నో భయంకర అనుభవాలను ఎదుర్కొన్నట్లు చెప్పారు. అంతేగాక తన మాజీ ప్రియుడు తనని మోసం చేసినట్లు కూడా తెలిపారు. ‘నా 7 ఏళ్ల రీలేషన్ ఎందుకు ముగిసిందనే దానిపై నేను ఖచ్చితమైన వివరణ ఇవ్వలేను. అయితే మేము ఇద్దరం ఇష్టంగానే విడిపోయాం. ఎందుకుంటే నా నుంచి విడిపోవడానికి అతడు సిద్ధంగా ఉన్నాడు. అలాగే మా మధ్య ఎన్నో విభేదాలు, చాలా తేడా ఉంది. అయితే ఇన్నేళ్లు అవి బయట పడలేదు అంతే. ఇక నా జీవితం నుంచి అతడు వెళ్లిపోయినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. అతడు నా నుంచి విడిపోయేందుకు ఎప్పుడు సిద్దంగా ఉండేవాడు. సంతోషంగా నా నుంచి వెళ్లిపోయినందుకు అతడికి నా అభినందలు’ అంటూ చెప్పుకొచ్చారు. అదేవిధంగా అతడిని ఆమె ఎంతగానో ప్రేమించినప్పటికి అతడు తనని చాలా చెత్తగా చూసేవాడని చెప్పారు. తను ఏం చేసినా విమర్శించడం, తప్పులు వెతకడం చేసేవావట. చివరికి ఆమె మిత్రులను కలిసిన ఇష్టపడేవాడు కాదని, చివరకు అతని కోసం మిత్రులను కలవడం, వారి సరదగా గడపడం కూడా వదులుకున్నట్లు చెప్పారు. అయితే అతడు ఎప్పటికైనా మారతాడనే ఆశతో అంతకాలం అతడిని భరించానని పేర్కొన్నారు. -
నెరిసిన జుట్టుతో సంజయ్ దత్ ఫోటో వైరల్
కేన్సర్ నుంచి కోలుకున్న తర్వాత బాలీవుడ్ హీరో సంజయ్ దత్ పలు సినిమాల్లో నటిస్తూ బిజీ అయ్యారు. ప్రస్తుతం ఆయన ప్యాన్ ఇండియా చిత్రం ‘కేజీఎఫ్–2’లో అధీరా పాత్రలో నటిస్తున్నారు. ఇంకా పలు చిత్రాల్లో నటిస్తూ యాక్టివ్‌గా ఉన్నారు సంజయ్ దత్. తాజాగా ఆయన కుటుంబం దుబాయ్‌లో సేదతీరుతోంది. ఆయన భార్య మన్యతా దత్.. భర్త సంజయ్ దత్, పిల్లలతో కలిసి దిగిన ఓ ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ‘దేవుడి కృపను కలిగి ఉన్నా’ అని కామెంట్ జత చేయడంతో పాటు ఆశావాదం, అందమైన జీవితం, దయ, దత్.. అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించారు. ఈ ఫోటోలో సంజయ్ దత్ బూడిద రంగు జుట్టుతో కనిపిస్తున్నారు. గత ఏడాది సంజయ్ దత్ కేన్సర్ బారినపడి చికిత్స తీసుకొని కేన్సర్‌ను జయించిన విషయం తెలిసిందే. దుబాయ్‌లో సంజయ్ దత్ తన భార్య మన్యతా, కుమారులు షహ్రాన్, ఇక్రాలతో కూడిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సినిమాల విషయానికి వస్తే.. సంజయ్ దత్ చివరగా సడక్-2లో కనిపించారు. అదే విధంగా మృదు తెరకెక్కించే ‘తులసీదాస్ జూనియర్’ సినిమా నటించనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ సినిమాలో స్పూకర్ నేపథ్యంలో తెరకెక్కనుంది. దలీప్ తాహిల్, వరుణ్ బుద్ధదేవ్, రాజీవ్ కపూర్ తదితరులు ఈ మూవీలో నటించనున్నారు. View this post on Instagram A post shared by Maanayata Dutt (@maanayata) చదవండి: మాధురీ దీక్షిత్, సంజయ్ లవ్ స్టోరీ.. -
నటుడితో మాధురీ దీక్షిత్ ప్రేమాయణం!
మెరా దిల్ భీ కిత్నా పాగల్ హై యే ప్యార్ తో తుమ్సే కర్తా హై.. పర్ సామ్నే జబ్ తుమ్ ఆతే హో కుచ్ భీ కహ్నే సే డర్తా హై.. ఓ మేరే సాజన్.. ఓ మేరే సాజన్... 1990ల్లో యువ హృదయాల మధురాలాపనగా మిగిలిపోయిన పాట అది. ‘సాజన్’ సినిమాలోనిది. ఆ చిత్రాన్ని కూడా ఓ ప్రేమ కావ్యంలా ఆరాధించింది నాటి యువత. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీతో సంజయ్ దత్, మాధురీ దీక్షిత్‌ల నిజమైన ప్రేమా కథలుకథలుగా మీడియాలో అచ్చేసుకుంది. ‘నిజమే’ అని ఆ ఇద్దరూ స్పష్టం చేయకపోయినా అకస్మాత్తుగా వేరైన వాళ్ల దారులు ఆ కథనాలు వాస్తవమనుకునేలా చేశాయి. ఆ సినిమాతోనే మొదలు.. మాధురి, సంజయ్ దత్ సాజన్ కంటే ముందు నాలుగు సినిమాల్లో కలసి నటించారు. ఆ సాన్నిహిత్యంతో మంచి స్నేహితులుగా మారారు. సినిమాల్లో హిట్ పెయిర్‌గా పేరూ తెచ్చుకున్నారు. సాజన్ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఆ టైమ్‌లో మాధురి.. పత్రికలకు ఇచ్చిన చాలా ఇంటర్వ్యూల్లో ఎలాంటి భేషజాలకు పోకుండా సంజయ్ దత్ గురించి ‘సినిమాల్లో నా ఫేవరేట్ పార్ట్నర్. నన్ను భలే ఎంటర్టైన్ చేస్తాడు. ఎప్పుడూ నవ్విస్తూనే ఉంటాడు. రియల్ జోకర్ అండ్ జెంటిల్మన్’ అని ఒకసారి, ‘ఎమోషన్స్‌తో గేమ్స్ ఆడే జిత్తులమారి కాదు సంజు. స్వచ్ఛమైన మనసు అతనిది. ప్రేమగల మనిషి. ఫెంటాస్టిక్ పర్సన్. మంచి సెన్సాఫ్ హ్యూమర్ అతని సొంతం. ఈ ప్రపంచంలో నన్ను నవ్వించే మనిషి అతనొక్కడే’ అంటూ ఇంకోసారి తన మనసులో మాటలను పంచుకుంది. సాజన్ సినిమా షూటింగ్ కబుర్ల కంటే మాధురి ఇంటర్వ్యూలే పాఠకులను ఆకట్టుకున్నాయి. ఆ ఇద్దరి మధ్యలో ఏదో ఉందన్న ఊహలనూ రేపాయి. పత్రికలూ ఆ డాట్స్‌ను కనెక్ట్ చేసుకుంటూ మాధురి, సంజయ్‌ల ఇష్క్‌కి స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టాయి. ఈలోపు ‘సాజన్’ విడుదలై సూపర్ హిట్ అయింది. వాళ్ల ప్రేమ కథా పత్రికలకు కవర్ స్టోరీ అయింది. మాధురి, సంజయ్‌లకు ఒకరంటే ఒకరికి ఉన్న పట్టింపు, శ్రద్ధ, పెరిగిన చనువును చూసి పరిశ్రమలో వాళ్లూ అనుకున్నారు ‘వాళ్లిద్దరూ కలసి ఏడు అడుగులు వేస్తారు’ అని. ఏమైంది మరి? సంజయ్ దత్‌కి అదివరకే పెళ్లయింది. ఒక కూతురు కూడా. కాని స్పర్థలతో విడివిడిగా ఉండడం మొదలుపెట్టారు ఆ ఆలుమగలు విడాకులు తీసుకోకుండా. ఈలోపే భార్య రీచా శర్మ క్యాన్సర్ బారిన పడింది. చికిత్స కోసం న్యూయార్క్ వెళ్లింది. సంజయ్, మాధురిల ముచ్చట అక్కడున్న రిచాకు చేరింది. చింత పడింది. ‘నాకు విడాకులివ్వాలనుకుంటున్నావా?’ అని అడిగింది భర్తను. ‘ఛ.. అలాంటి ఆలోచనేం లేదు’ అన్నాడు సంజయ్. కాస్త కుదుటపడినా.. అక్కడ ఉండలేకపోయింది. కూతురిని తీసుకొని ఇండియాకు వచ్చేసింది. కానీ వచ్చాక భర్త ప్రవర్తనలో మార్పు కనిపించింది రిచాకు. తన పట్ల అతనిలో మునుపటి ఆదరణ లేదు. పైగా నిర్లక్ష్యంగా ఉన్నాడు. తట్టుకోలేకపోయింది. అందుకే వచ్చినంత వేగంగా.. కేవలం పదిహేను రోజుల్లోనే తిరిగి న్యూయార్క్ వెళ్లిపోయింది రిచా కూతురిని తీసుకొని చెదిరిన మనసుతో. ‘విడాకులు తీసుకోలేదు. తీసుకోవాలని ఆయనకు, నాకూ లేకుండింది. మళ్లీ కలసి ఉంటామనే అనుకున్నాం. కానీ ఇక్కడ పరిస్థితి వేరుగా కనిపించింది. కలిసున్నా లేకపోయినా.. ఆయన నన్నెలా ట్రీట్ చేసినా ఐ లవ్ హిమ్. ఆయన నా ప్రాణం’ అని చెప్పింది రిచా. తర్వాత కొన్నాళ్లకు క్యాన్సర్‌తో కన్ను మూసింది ఆమె. ‘మాధురి, సంజయ్ మంచి ఫ్రెండ్స్ అనుకున్నాం. వాళ్లిద్దరిమధ్య ఇంకేదో ఉందని మేమేనాడూ అనుమానించలేదు. సంజయ్ స్పేస్‌ను రెస్పెక్ట్ చేశాం. అయినా మా అక్కతో అంత నిర్దయగా ప్రవర్తించిన మనిషిని ఎలా కావాలనుకుంటుందో మరి మాధురి?’ అని కామెంట్ చేసింది రిచా శర్మ చెల్లెలు ఇనా శర్మ. టాడా.. భార్యకు దూరమైన సంజయ్.. ప్రేమను దక్కించుకొని మాధురీకి దగ్గరయ్యాడా అంటే అదీ జరగలేదు. 1993లో చట్టవిరుద్ధంగా మారణాయుధం కలిగి ఉన్నందుకు టాడా కింద సంజయ్ మీద కేస్ నమోదైంది. జైలుకీ వెళ్లాడు. ఈ పరిణామానికి మాధురి షాక్ అయ్యింది. వెంటనే సంజయ్‌తో గడిపిన కాలానికి చెక్ పెట్టింది. ఆ జ్ఞాపకాలు మెదలకుండా మెదడును కట్టడి చేసుకుంది. జైల్లో ఉన్న సంజయ్‌ను కనీసం పలకరించడానిక్కూడా వెళ్లకుండా ఉండేంత. ఒక్క మాటలో చెప్పాలంటే అతడు ఆమెకు అపరిచితుడయ్యాడు. మాధురి ఈ నిర్ణయం సంజయ్‌ను బాధించింది. లోలోపలే కుమిలిపోయాడు. జైలు నుంచి అతను బయటకు వచ్చాక ఒక సినీ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ‘మాధురి ప్రవర్తనకు మీరెలా ఫీలయ్యారు? అనే ప్రశ్నకు సమాధానంగా ‘ఏమీ ఫీలవలేదు. నాతో నటించే ప్రతి నటితో మంచి ర్యాపోతో ఉండాల్సి వస్తుంది. మాధురీతో అలాగే ఉన్నాను. అందుకే ఆమె మాటలు కానీ, చేతలు కానీ నా మీద ఎలాంటి ప్రభావం చూపలేదు.. చూపవు కూడా’ అని చెప్పాడు సంజయ్. మరో పత్రికా విలేకరి ఇంకో సందర్భంలో మాధురితో ప్రేమ, పెళ్లి మీద వచ్చిన ప్రచారాన్ని గురించి అడిగితే.. ‘నాకూ అనిపిస్తుంది మాధురితో నా లైఫ్‌లో లవ్ సీన్ ఉంటే బాగుండు అని.. కానీ లేదు కదా. ఇక పెళ్లి అంటారా.. అసలు మా మధ్య ఏమీలేనప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు వస్తుంది?’ అని కొట్టిపారేశాడు సంజయ్. మాధురిని దృష్టిలో పెట్టుకొని.. ఆమె ఇబ్బంది పడకుండా ఉండడానికే సంజయ్ అలా చెప్పాడు అంటారు అతని సన్నిహితులు. చాలా ముందుకెళ్లింది సంజయ్ దత్ బయోపిక్ ‘సంజు’ సినిమా విడుదలప్పుడు మళ్లీ వాళ్ల లవ్ స్టోరీ గుర్తొచ్చింది మీడియాకు. మైక్ తీసుకెళ్లి మాధురి ముందు పెట్టారు.. ‘ఇప్పుడు ఆ విషయం అనవసరం. ఇన్నేళ్లలో జీవితం చాలా ముందుకెళ్లింది’ అని జవాబు చెప్పింది మాధురి. 2019లో ‘కళంక్’ అనే సినిమా వచ్చింది. సంజయ్ దత్, మాధురీ కలసి నటించిన సినిమా! పర్సనల్ లైఫ్, ప్రొఫెనల్ లైఫ్ రెండు వేర్వేరు అన్నదానికి సూచనగా. - ఎస్సార్ -
భాయ్‌ఫ్రెండ్ నన్ను ‘చెత్త’లా చూసేవాడు
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూతురు త్రిశాలా దత్ అందరికీ తెలిసే ఉంటుంది. సంజయ్‌దత్, ఆయన మొదటి భార్య రిచా శర్మ కూతురు త్రిశాలా. ప్రస్తుతం ఈమె న్యూయార్క్‌లో సైకోథెరపిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల తండ్రి డ్రగ్స్‌కి బానిస అయిన విషయాన్ని ఓపెన్‌గా చెబుతూ అందులోంచి బయటకు రావడానికి తన సహాయం కూడా తీసుకున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్లో పాల్గొన్నారు త్రిశాలా. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ క్రమంలో మీ రిలేషన్షిప్లో ఎప్పుడైనా తప్పులు చేశారా అని ఓ వ్యక్తి ఆమెను అడిగాడు. దీనిపై త్రిషాల స్పందిస్తూ.. గతంలో ఓ వ్యక్తితో తను ఎదుర్కొన్న భయంకర అనుభవం, మానసిక వేదన గురించి సుదీర్ఘంగా వెల్లడించారు. దీనికి సమాధానం చెప్పాలంటే నాలుగేళ్లు వెనక్కి వెళ్లాలని తెలుపుతూ.. తన అనుభవం ఎదుటివాళ్లకు తప్పులు చేయకుండా ఉండేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఎప్పుడూ అందరితో నిజాయితీగా ఉండాలని సూచించారు. చదవండి: మా నాన్న జీవితం స్ఫూర్తిదాయకం ‘కొన్ని సంవత్సరాల క్రితం ఓ వ్యక్తితో నేను ‘డేటింగ్’ చేశాను. డేటింగ్ అనే పదాన్ని ఎందుకు కోట్స్‌లో పెట్టానంటే.. నిజానికి నాతో నేనే డేటింగ్ చేశాను. అతనితో కలిసుంటే మంచిదని నేను తనను భాయ్‌ఫ్రెండ్‌గా ఒప్పించా. డేటింగ్ గురించి ఆలోచించమని ఓ వారం టైం ఇచ్చినట్టు గుర్తుంది. అప్పుడు నా మీద నాకు గౌరవం లేదు. నాకు ఎలాంటి హద్దులు లేవు. అయితే కొంతకాలం తర్వాత బాయ్‌ఫ్రెండ్ నన్ను పనికిరాని చెత్తలా చూడటం ప్రారంభించాడు. నేను కేవలం అతడికి ఆ రోజు బాలేదని అనుకునేదాన్ని. రేపైనా బాగుంటాడేమోనని అనుకునేదానిని. కానీ అతనిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. రోజురోజుకీ ఇంకా దిగజారి ప్రవర్తించేవాడు. చదవండి: ప్రభాస్ ‘రాధేశ్యామ్’ టీజర్ రాబోతుందా! నాకు తెలియకుండా అతడు నెమ్మదిగా నా స్నేహితుల నుంచి నన్ను వేరు చేశాడు. నేను ఎప్పుడు బయటికి వెళ్లినా.. ఇంటికి వచ్చేటపుడు అతనికి మెసేజ్ చేస్తాను. దానికి అతడు ఓ ఎవరైనా ఇంటికి ఆలస్యంగా వస్తారా..? అంటూ ' (వింక్ ఎమోజి) దూషించేవాడు. ఏదో చేయకూడని పని చేసినట్లు నేను ఫీల్ అయ్యేదాన్ని. నన్ను నేను నిరూపించుకోడానికి నా స్నేహితులతో తిరగడం మానేశాను. నేను ఏం చేసినా తప్పుగానే చూసేవాడు. ఆ తరువాత చాలా కాలం అలా ఉండిపోయాక ఈ సంబంధంలో ఎందుకు ఉండిపోయానని ఆలోచించాను. నన్ను నేను విషపూరిత ప్రవర్తించాను. నాకోసం నేను నిలబడకుండా ఆ వ్యక్తిని నాపై అలా మాట్లాడేందుకు అనుమతిచ్చాను. కానీ తనెంటో, అతని గురించి నాకు బాగా తెలుసు. తన నుంచి దూరం అయ్యాక నా ప్రవర్తనను అంగీకరించి.. సిగ్గు పడ్డా. చాలా విషయాలు నేర్చుకుని ఇప్పుడు మీ ముందు నిలబడ్డా’ అంటూ తన గతం గురించి చెప్పుకొచ్చారు. -
మా నాన్న జీవితం స్ఫూర్తిదాయకం
‘‘మా నాన్నను చూస్తే నాకు గర్వంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఏ విషయాన్నీ దాచలేదు. తాను డ్రగ్స్‌కి బానిస అయిన విషయాన్ని ఓపెన్‌గా చెప్పి, అందులోంచి బయటకు రావడానికి సహాయం కూడా కోరారు’’ అంటున్నారు త్రిషాలా దత్... డాటర్ ఆఫ్ సంజయ్ దత్. ఇంకా ఈ విషయం గురించి త్రిషాలా మాట్లాడుతూ – ‘‘గతంలో నా తండ్రి డ్రగ్స్‌కు అలవాటు పడ్డారు. తనకు తానుగా డ్రగ్స్ తీసుకుంటున్నానని ఒప్పుకోవటమే కాకుండా దాన్నుండి బయటపడటానికి సాయం చేయమని అడిగారు. ఈ విషయం చెప్పటానికి నేను సిగ్గుపడటం లేదు. ఒక చెడు అలవాటుకి బానిస అయి, అందులోంచి బయటకు రావడం అనేది చిన్న విషయం కాదు. మానేసే క్రమంలో డ్రగ్స్ తీసుకోకపోయినా ప్రతి రోజూ ఆయన తనతో తాను పోరాడాల్సి వచ్చింది. అందుకే నా తండ్రి జీవితం స్ఫూర్తిదాయకం’’ అన్నారు. ఇటీవల సంజయ్ క్యాన్సర్‌ని జయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ప్యాన్ ఇండియా చిత్రం ‘కేజీఎఫ్–2’లో అధీరా పాత్రలో నటిస్తున్నారు. ఇంకా పలు చిత్రాల్లో నటిస్తూ యాక్టివ్‌గా ఉన్నారు సంజయ్ దత్. -
స్నూకర్ కోచ్
సంజయ్ దత్ స్నూకర్ నేర్పించడానికి రెడీ అవుతున్నారు. నేర్చుకునేది ఎవరంటే దలీప్ తాహిల్. ఈ ఆటను తెరకెక్కించేది మృదు. ‘తులసీదాస్ జూనియర్’ పేరుతో ఈ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. తండ్రీకొడుకుల చుట్టూ తిరిగే కథతో ఈ చిత్రం ఉంటుంది. తండ్రి స్నూకర్ కోచ్. కొడుకు స్నూకర్ ఆటగాడు. పలు అవార్డులు, రివార్డులు పొందిన స్పోర్ట్స్ మూవీ ‘లగాన్’కి దర్శకత్వం వహించిన ఆశుతోష్ గోవారీకర్ ఈ చిత్రానికి ఒక నిర్మాత. టీ సిరీస్‌తో కలసి ఆయన ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో సంజయ్ దత్‌ది అతిథి పాత్ర. దలీప్ తాహిల్, వరుణ్ బుద్ధదేవ్, రాజీవ్ కపూర్ తదితరులు నటించనున్నారు. -
ఖల్నాయక్ రిటర్న్స్
బాలీవుడ్ షో మ్యాన్ సుభాష్ ఘాయ్ తెరకెక్కించిన మాస్ ఎంటర్టైనర్ ‘ఖల్నాయక్’ (1993) సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇందులో సంజయ్ దత్ చేసినది యాంటీ హీరో రోల్ అయినప్పటికీ ప్రేక్షకులు విపరీతంగా ఇష్టపడ్డారు. 27 ఏళ్ల తర్వాత దర్శకుడు సుభాష్ ఘాయ్ ఈ చిత్రం సీక్వెల్‌కి శ్రీకారం చుట్టబోతున్నారు. తొలి భాగంలో సంజయ్ దత్ చేసిన విలన్ బల్లూ పాత్రను సీక్వెల్లో వేరే హీరో చేయబోతున్నారు. ‘ఖల్నాయక్’ చిత్రంలో హీరో పాత్రను చేశారు జాకీ ష్రాఫ్. ఇప్పుడు ఆయన తనయుడు టైగర్ ష్రాఫ్ మలి భాగంలో యాంటీ హీరో రోల్ చేయనున్నారు. ‘వార్’ సినిమా తర్వాత విలన్‌గా టైగర్ ష్రాఫ్‌కి మంచి మార్కులు పడటంతో మరో పవర్ఫుల్ విలన్ ‘ఖల్నాయక్’ పాత్రకు టైగర్ సై అన్నారట. జైలు నుండి బయటకు వచ్చే సంజయ్ దత్ పాత్రతో సినిమా కథ ప్రారంభమవుతుందని తెలిసింది. తొలి భాగంలో గంగ పాత్ర చేసిన మాధురీ దీక్షిత్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో నటించనుండటం విశేషం. కథానాయిక పాత్రకు ఓ ప్రముఖ నటిని అనుకుంటున్నారు. ‘ఖల్నాయక్’ని గ్యాంగ్‌స్టర్ కథగా తీశారు. సీక్వెల్‌ను డ్రగ్ మాఫియా నేపథ్యంలో చిత్రీకరించాలనుకుంటున్నారని సమాచారం. -
కేజీఎఫ్-2: హైదరాబాద్ చేరుకున్న రాకీ భాయ్
కన్నడ నటుడు యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా చిత్రం ‘కేజీఎఫ్ ఛాప్టర్-2’. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ తిరిగి ఇటీవల ప్రారంభమైంది. ఇక ఈ సినిమా చివరి షెడ్యూల్ ఈ రోజు(గురువారం) హైదరాబాద్‌లో ప్రారంభమవ్వగా డిసెంబర్ చివరి నాటికి పూర్తవనుంది. ఇందుకు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ వేశారు. ఈ క్రమంలో గురువారం యశ్ బెంగుళూరు నుంచి విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తున్న క్రమంలో యశ్ కెమెరాల కంటికి చిక్కారు. ఈ ఫోటోలో ఆరెంజ్ కలర్ టీ షర్టులో, మాస్కు ధరించి హ్యండ్సమ్ లుక్‌లో అదిరిపోయాడు. చదవండి: కేజీఎఫ్.. ఛాప్టర్: 2: అధీరా రెడీ.. కాగా 2018లో విడుదలైన కేజీఎఫ్(కోలార్ గోల్డ్ ఫీల్డ్స్)కు ఈ సినిమా రెండో భాగం. ‘కేజీయఫ్ – ఛాప్టర్ 1 ఊహించని విజయాన్ని సొంతం చేసుకొని రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. రాకీ భాయ్‌గా యశ్ అవతారమెత్తిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. అంతే అంచనాలతో ప్రస్తుతం ఛాప్టర్ 2 రూపొందుతోంది. ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ అధీరా పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నారు. డిసెంబర్ 6న షూటింగ్లో పాల్గొని తన పాత్ర చితత్రీకరణ ముగిసే వరకూ షూటింగ్లో భాగమవ్వనున్నరని సమాచారం. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలో రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, శ్రీనిధి శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది. చదవండి: ‘రాకీ భాయ్’నే బోల్తా కొట్టించిన ఐరా..! View this post on Instagram A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_) -
కేజీఎఫ్.. ఛాప్టర్: 2: అధీరా రెడీ..
రాకీ భాయ్‌ను ఢీ కొట్టడానికి అధీరా రెడీ అయ్యారు. డిసెంబర్లో ఈ ఇద్దరూ తలపడనున్నారని తెలిసింది. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా చిత్రం ‘కేజీఎఫ్.. ఛాప్టర్: 2’. మొదటి భాగం 2018లో విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండో భాగంలో విలన్ పాత్రలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ నటిస్తున్నారు. అధీరా పాత్రలో సంజయ్ కనిపిస్తారు. రాకీ భాయ్‌గా యశ్ నటిస్తున్నారు. డిసెంబర్ 6 నుంచి సంజయ్ దత్ ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటారట. డిసెంబర్ చివరికల్లా సినిమా చిత్రీకరణ పూర్తవుతుందని టాక్. ఈ సినిమాలో రవీనా టాండన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. చదవండి: యశ్‌తో శంకర్ మల్టీస్టారర్.. భారీ తారాగణంతో.. -
సంజూ బాబా ఇంట్లో సూపర్ స్టార్
ముంబై: సినీ ప్రముఖలు ఏ పండగైనా చాలా వైభవంగా జరుపుకుంటూ వాటికి సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటారు. పలు సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉండే సినీ సెలబ్రెటీలు ఈ సారి కరోనా వైరస్ కారణంగా సినిమాలు ఏమి లేకపోవడంతో దీపావళీ పండగ వేడకను తమ ఇళ్లలో జరుపుకున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్, ఆయన భార్య మాన్యతా దత్ ముంబైలోని తమ ఇంట్లో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ పాల్గొన్నారు. సంప్రదాయమైన దుస్తులు ధరించి వారంతా ఫొటోలు దిగారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను మోహన్‌లాల్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు. ‘సంజయ్, మాన్యతా నా స్నేహితులు’ అని కాప్షన్ జతచేశారు. ఈ ఫొటోల్లో సంజయ్ దత్త్, మోహన్‌లాల్ ఒకరికొకరు నమస్కరించుకొని పలకరించుకోవటం, సరదాగా మాట్లాడుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక సంజయ్ దత్ కన్నడ కేజీఎఫ్-2 లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మోహన్‌లాల్ దృశ్యం-2 రెండో విడత షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు. ఇటీవల జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కోసం మోహన్‌లాల్ దుబాయ్ వెళ్లిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Mohanlal (@mohanlal) -
సంజయ్ దత్ నయా లుక్
నయా (కొత్త) లుక్‌లో సంజయ్ దత్ తన అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చారు. ఆయనకు క్యాన్సర్ అని నిర్ధారణ కాగానే అభిమానులు చాలా బాధపడ్డారు. ’మా సంజూ బాబాకి ఏం కాదు.. త్వరలోనే క్యాన్సర్‌ని జయిస్తారు’ అని అభిమానులు పేర్కొన్నారు. అన్నట్లుగానే సంజయ్ దత్ త్వరగా ఈ మహమ్మారి నుంచి బయటపడ్డారు. ’నేను క్యాన్సర్‌ని జయించాను’ అని అధికారికంగా చెప్పి, అందర్నీ ఆనందపరిచారు సంజయ్ దత్. తాజాగా నయా లుక్‌తో ఆకట్టుకుంటున్నారు. ముంబైలోని ప్రముఖ హెయిర్ స్టయిలిస్ట్ ఆలిమ్ హకీమ్ సెలూన్‌కి వెళ్లి, కొత్త హెయిర్ స్టయిల్ చేయించుకున్నారు సంజయ్ దత్. ఆ ఫొటోను హకీమ్ షేర్ చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం హిందీలో షంషేరా, పృథ్వీరాజ్ చిత్రాలు చేస్తున్నారు సంజయ్ దత్. అలాగే ‘కేజీఎఫ్’కి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘కేజీఎఫ్ 2’లో నటిస్తున్నారు. -
కేజీఎఫ్2 నుంచి మరో పోస్టర్ విడుదల
కేజీఎఫ్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యశ్ హీరోగా తెరకెక్కిన కన్నడ చిత్రం రికార్డులు సృష్టించింది. దీంతో ఈ చిత్రం రెండో భాగాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని కేజీఎఫ్ ఫ్యాన్స్ అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇందులో చాలా మంది ప్రముఖులు కనిపించనున్నారు. రవీనా టండన్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈరోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా కేజీఎఫ్ టీం ఆమె పోస్టర్‌ను విడుదల చేసింది. THE gavel to brutality!!! Presenting #RamikaSen from #KGFChapter2. Thanks KGF team for the gift.#HBDRaveenaTandon @VKiragandur @TheNameIsYash @prashanth_neel@SrinidhiShetty7 @duttsanjay @Karthik1423@excelmovies @ritesh_sid @AAFilmsIndia @FarOutAkhtar@hombalefilms pic.twitter.com/EjxQ0rCrE4 — Raveena Tandon (@TandonRaveena) October 26, 2020 దీనిని ట్విటర్ ద్వారా షేర్ చేస్తూ రవీనా టండన్ ‘ అధికారం నుంచి క్రూరత్వంలోకి’ అని పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె కేజీఎఫ్ టీం అందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఫోటోలో రవీనా ఒక మెరూన్ కలర్ శారీలో, కళ్లల్లో నీటి చెమ్మతో , బాధతో కూడిన వదనంతో ఒక చోట కూర్చొని కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమాలో విలన్ అధీర పాత్రలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. క్యాన్సర్ నుంచి కోలుకున్న ఆయన నవంబర్ నుంచి షూటింగ్లో పాల్గొనున్నారు. చదవండి: అదే జరిగి ఉంటే.. ఈ రోజు పండగే -
క్యాన్సర్‌ను జయించాను
సంజయ్ దత్ క్యాన్సర్‌ను జయించారు. ఈ శుభవార్తను ఆయన తన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఆగస్ట్‌లో ఓ సినిమా చిత్రీకరణలో పాల్గొన్నప్పుడు ఊపిరి ఆడకపోవడంతో ఆసుపత్రిలో చేరారాయన. అప్పుడే ఆయనకు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉందని తెలిసింది. కొన్ని రోజులు చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చి, చికిత్స తీసుకున్నారు సంజయ్ దత్. చికిత్సకు ఆయన శరీరం సరిగ్గా స్పందించడంతో త్వరగా కోలుకున్నారని తెలుస్తోంది. క్యాన్సర్ నుంచి కోలుకున్న విషయాన్ని తన పిల్లలు షహ్రాన్, ఇక్రా పుట్టినరోజు (బుధవారం) సందర్భంగా ప్రకటించారు సంజయ్ దత్. ఈ సందర్భంగా సంజయ్ దత్ మాట్లాడుతూ – ‘‘గత కొన్ని నెలలు నాకు, మా కుటుంబానికి చాలా కష్టమైన రోజులు. ధైర్యంగా నిలబడగలిగేవాళ్లకే పెద్ద పెద్ద సమస్యలిస్తాడట దేవుడు. ఇందులోనుంచి పోరాడి విజేతగా నిలబడ్డాను. ఇదే మా పిల్లలకు నేను ఇస్తున్న పుట్టినరోజు కానుక. అలాగే నేను క్యాన్సర్ నుంచి బయటపడ్డానంటే కారణం నా కుటుంబం, నా బంధువులు, నా కోసం ప్రార్థించిన అభిమానులు. మీ ప్రేమే నన్ను ఆరోగ్యంగా ఉంచగలిగింది. మీ ప్రేమకు ధన్యవాదాలు’’ అన్నారు. -
క్యాన్సర్‌ను జయించాను: సంజయ్ దత్
శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతోందని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఇటీవల ఆస్పత్రికి వెళ్లారు. తీరా వైద్య పరీక్షల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ అని తేలడంతో ఆయన అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థించారు. తాజాగా వారందరికీ సంజయ్ శుభవార్త చెప్పారు. క్యాన్సర్‌ను జయించినట్లు బుధవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ మేరకు ఓ లేఖను పంచుకున్నారు. తన సంపూర్ణ ఆరోగ్యమే పిల్లల బర్త్‌డేకు ఇస్తున్న పెద్ద గిఫ్ట్ అని చెప్పుకొచ్చారు.(చదవండి: సంజయ్ దత్ ఆరు చిత్రాలు.. 750 కోట్లు) My heart is filled with gratitude as I share this news with all of you today. Thank you 🙏🏻 pic.twitter.com/81sGvWWpoe — Sanjay Dutt (@duttsanjay) October 21, 2020 "గడిచిన కొన్నివారాలు నాకు, నా కుటుంబానికి అత్యంత క్లిష్టమైన రోజులు. అయితే బలమైన వాళ్లకే దేవుడు పెద్దపెద్ద కష్టాలిస్తాడని వారు చెప్తూ ఉండేవారు ఈ రోజు నా పిల్లల పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ ఓ ముఖ్య విషయం చెప్తున్నాను. నేను క్యాన్సర్ నుంచి కోలుకున్నాను. నా ఆరోగ్యమే వారికి నేనిచ్చే పెద్ద బహుమతి. మీ అందరి ప్రేమాభిమానాలు లేకపోతే ఈ గెలుపు సాధ్యమయ్యేదే కాదు. నా కోసం ప్రార్థిస్తూ అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. కోకిలాబెన్ ఆస్పత్రిలో నాపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ చికిత్స అందించిన డాక్టర్ సేవంతి, ఆమె టీమ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు" అని రాసుకొచ్చారు. ఇక ఈ వార్త విన్న ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా వుండగా సంజయ్ చేతిలో ఆరు సినిమాలు ఉండగా, ప్రస్తుతం కేజీఎఫ్: చాప్టర్ 2 లో అధీరా పాత్రలో నటిస్తున్నారు. (చదవండి: 25 ఏళ్ల దిల్వాలే దుల్హనియా లేజాయేంగే) -
మీరు నిజమైన యోధుడు.. వేచి ఉండలేను: యష్
త్వరలో ‘కేజీఎఫ్-2’ చిత్రం షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్టుకు కన్నడ రాక్‌స్టార్ హీరో యష్ స్పందిచాడు. ఇటీవల ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడ్డ సంజయ్ దుబాయ్‌లో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం ముంబైకి తిరిగి రాగానే తన ఫొటోలను షేర్ చేస్తూ.. నవంబర్‌లో ‘కేజీఎఫ్-2’ షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు చెప్పారు. a పోస్టుకు యష్.. సంజయ్‌ని సెట్స్‌కు స్వాగతిస్తూ నిజమైన యోధుడు అని వ్యాఖ్యానించాడు. (చదవండి: అధీరా వస్తున్నాడు) ‘నిజమైన యోధుడి సంకల్పాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఏది ఆపలేదు.. మీరు తిరిగి షూటింగ్లో పాల్గొనబోతున్నందుకు చాలా సంతోషం. ఇక నేను వేచి ఉండలేను’ అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. యష్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘కేజీయఫ్ 2’.లో సంజయ్ దత్ మెయిన్ విలన్‌గా అధీరా పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో సంజయ్ భారీ యాక్షన్ సన్నివేశాల్లో నటించనున్నాడు. కన్నడ ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో సినీయర్ నటి రవీనా టాండన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. (చదవండి: రాఖీ బాయ్ ఈజ్ బ్యాక్) -
అధీరా వస్తున్నాడు
యష్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కేజీయఫ్ 2’. కన్నడ భాషలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా చిత్రమిది. 2019లో మొదటి భాగం ‘కేజీయఫ్ ఛాప్టర్: 1’ విడుదలైంది. తాజాగా రెండో భాగం ‘ఛాప్టర్ 2’ చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనా టాండన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అయింది. సంజయ్ దత్ మెయిన్ విలన్ అధీరాగా కనిపిస్తారు. ఆయన భారీ యాక్షన్ సన్నివేశాల్లోనూ పాల్గొంటారని సమాచారం. ఇటీవలే సంజయ్ దత్‌కి ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉందనే విషయం నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ముంబైలో చికిత్స మొదలుపెట్టారు. మరోవైపు షూటింగ్స్ని కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. నవంబర్‌లో ఆయన ‘కేజీయఫ్ 2’ లొకేషన్లో అడుగుపెడతారట. తన పాత్ర చిత్రీకరణ ముగిసే వరకూ ఈ షూటింగ్లో భాగమవుతారని సమాచారం. దాదాపు నెల రోజుల పాటు పాల్గొంటారని తెలిసింది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది. -
నాన్‌స్టాప్ కుమార్
లాక్డౌన్లో సినిమాల చిత్రీకరణను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని చేయాలా? అని చాలామంది ఆలోచిస్తుంటే ‘బెల్ బాటమ్’ సినిమాను ప్రారంభించారు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్. ప్రారంభించడమే కాదు లాక్డౌన్లో పూర్తి చేసేశారు కూడా. తాజాగా ‘పృథ్వీరాజ్’ సినిమా సెట్లో జాయిన్ అయ్యారు. అక్షయ్ కుమార్, సోనూ సూద్, మనూషీ చిల్లర్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటిస్తున్న పీరియాడికల్ చిత్రం ఇది. యశ్ రాజ్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ తాజాగా ప్రారంభం అయింది. సోనూ సూద్, అక్షయ్ కుమార్లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. కొన్ని రోజుల్లో మనూషీ కూడా సెట్లో జాయిన్ అవ్వనున్నారు. సినిమా పూర్తయ్యే వరకూ నాన్‌స్టాప్‌గా చిత్రీకరణ కొనసాగనుంది. ఇలా ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా షూటింగ్లో పాల్గొంటూ బిజీగా ఉంటున్న అక్షయ్ కుమార్‌ని కొందరు ‘నాన్‌స్టాప్ కుమార్’ అంటున్నారు. -
రాఖీ బాయ్ ఈజ్ బ్యాక్
కేజీఎఫ్ చాప్టర్-1 సినిమాతో కన్నడ హీరో యష్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు.. అదేనండీ మన రాకీ బాయ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 2018లో వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 1 సినిమా ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపు రూ. 250 కోట్లకు పైగా కొల్లగొట్టి భారతీయ సినీ దృష్టిని ఆకర్షించింది. ఒక కన్నడ సినిమా స్టామినా ఈ రేంజ్లో ఉంటుందా అని చాటి చెప్పింది ఈ సినిమా. ఇంతటి ఘన విజయం సాధించిన ఈ సినిమాకు సీక్వెల్‌గా కేజీఎఫ్ చాప్టర్ 2 రూపొందుతున్న సంగతి తెలిసిందే. నిజానికి కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా అక్టోబర్ 13 2020లోనే థియేటర్లకు రావాల్సి ఉండేది. కానీ కరోనా వైరస్ విజృంభణతో 75శాతం పూర్తైన షూటింగ్ మార్చిలో ఆగిపోయింది. సరిగ్గా ఏడు నెలల తర్వాత ఈరోజే సినిమా చివరి దశ షూటింగ్ ప్రారంభమైంది. హీరో యష్ కూడా షూటింగ్లో పాల్గొనడానికి గురువారం లొకేషన్లో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా యష్‌కు సంబంధించిన లుక్‌ను చిత్రబృందం ట్విటర్లో షేర్ చేశారు. గుబురు గడ్డంతో సముద్రం వైపు నిలబడి తీక్షణంగా చూస్తున్నట్టుగా యష్ కనిపిస్తాడు. ప్రమాదం జరగబోయే ముందు అలలు ఎంత నిశబ్దంగా ఉంటాయో యష్ చూపులు కూడా అలాగే ఉన్నాయి. రాఖీ బాయ్.. ఈజ్ బ్యాక్ అంటూ కాప్షన్ జత చేశారు. ఇక ఈ సినిమాలో అధీర పాత్రలో సంజయ్ దత్ నటిస్తుండగా.. యశ్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో రవీనా టండన్ సినిమాకు కీలకమైన రమ్మికా సేన్ పాత్రలో నటిస్తోంది. రవీ బస్రూర్ సంగీతమందిస్తున్న ఈ సినిమాను హొంబలే ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. కాగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14 ,2021లో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తుంది. -
‘మున్నాభాయ్’ వైరల్ పిక్ : షాక్‌లో ఫ్యాన్స్
సాక్షి,ముంబై : ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ (61) ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎయిర్‌పోర్టులో ఓ అభిమాని ఆయనతో తీసుకున్న ఫొటో చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఆ ఫొటోలో సంజయ్‌దత్ చాలా బలహీనంగా కనిపిస్తున్నారు. దీంతో సంజయ్ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ‘మున్నాభాయ్ ఎంబీబీస్’ త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో ఆకాంక్షిస్తున్నారు. తన ఆరోగ్యం బాగా లేదని చికిత్స నిమిత్తం కొంత కాలం విరామం తీసుకుంటున్నట్టు ఆగస్టు 11న సంజయ్ ట్వీట్ చేశారు. నాలుగో దశ ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన ముంబైలో తొలి దశ కీమోథెరపీని పూర్తి చేసుకున్నారు. అనంతరం భార్య మాన్యతో కలిసి దుబాయ్‌లో ఉంటున్న పిల్లలతో కొన్ని రోజులు గడిపిన సంజయ్ ఇటీవల ముంబైకి తిరిగి వచ్చారు. ఆయనకు రెండో దశ కీమోథెరపీ త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం. (దుబాయ్‌లో సంజయ్ దత్ ఫ్యామిలీ..) He looks so different gosh.... lost so much weight?? Uff... so sad. #SanjayDutt pic.twitter.com/7Fimr7KWAP — IkraaaShahRukh💕 (@Ikra4SRK) October 3, 2020 -
దుబాయ్‌లో సంజయ్ దత్ ఫ్యామిలీ..
దుబాయ్: బాలీవుడ్ విలక్షణ నటుడు సంజయ్ దత్ ఇటీవల ఊపిరితిత్తుల క్యాన్సర్ సమస్యతో బాధపడ్డారు. కాగా లాక్డౌన్ సమయంలో సంజయ్ దత్ భార్య మాన్యతా దత్, ఆయన పిల్లలు దుబాయ్‌లోనే ఉండిపోయారు. అయితే సంజయ్‌కు ఊపిరితిత్తుల క్యాన్సర్ అని తెలిసి మాన్యతా దత్ ముంబైకి వచ్చారు. తాజాగా ఆరోగ్య పరిస్థితి మెరుగవడంతో సంజయ్ దత్, ఆయన భార్య తమ పిల్లలను చూడడానికి దుబాయ్ వెళ్లారు. కాగా సంజయ్ దత్ కుటుంబం దుబాయ్‌లో లంచ్ చేస్తున్న ఫోటోను మాన్యతా దత్ సోషల్ మీడియాలో ఫోస్ట్ చేసింది. సంజయ్ దత్ తన భార్య పిల్లలతో కలిసి ఉత్సాహంగా లంచ్ చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరలయింది. ప్రస్తుతం సంజయ్ దత్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్ 2 సినిమాలో నటిస్తున్నారు. అయితే అనారోగ్య కారణాల వల్ల సంజయ్ సినిమా షూటింగ్‌కు కొంత విరామం ప్రకటించారు. 2020లో కేజీఎఫ్ సినిమా విడుదలవనుందని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. (చదవండి: క్యాన్సర్ శాపం) -
మేమెప్పుడూ ఇలానే ఉండాలి
శుక్రవారం సంజయ్ దత్ దుబాయ్ వెళ్లారు. చికిత్స కోసమా? కాదు.. వాళ్ల చిన్నారుల కోసం అని తెలిసింది. లాక్డౌన్ సమయంలో సంజయ్ దత్ భార్య మాన్యతా దత్, ఆయన పిల్లలు దుబాయ్‌లోనే ఉండిపోయారు. సంజయ్ దత్ ముంబైలోనే ఉన్నారు. ఇటీవలే సంజయ్ దత్‌కు ఊపిరితిత్తుల క్యాన్సర్ అని తేలింది. ఆ విషయం తెలిసిన వెంటనే సంజయ్ దత్ భార్య దుబాయ్ నుంచి ముంబై వచ్చారు. మొన్నటి వరకూ ముంబైలో చికిత్స పొందారు సంజయ్. తాజాగా చాలా నెలల తర్వాత పిల్లల్ని చూడటం కోసం దుబాయ్ వెళ్లారు. ఈ సందర్భంలో దిగిన ఫోటోను మాన్యతా దత్ షేర్ చేసి, ‘ఇలాంటి కుటుంబాన్ని నాకు ప్రసాదించిన దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. కేవలం కృతజ్ఞతలు మాత్రమే. జీవితం పట్ల నాకెలాంటి ఫిర్యాదులు లేవు. మేమెప్పుడూ ఇలానే కలిసుండాలి... ఎప్పటికీ’ అన్నారు. త్వరలోనే చికిత్స నిమిత్తం అమెరికా వెళ్తారట సంజయ్‌దత్. -
హాయ్ అంటూ షూటింగ్‌కి...
‘‘మా సంజూ బాబా బ్యాక్’’ అని అభిమానులు ఆనందపడుతున్నారు. సంజయ్ దత్‌కి లంగ్ కేన్సర్ అని తెలియగానే ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, మొదటి సెషన్ కీమోథెరపీని ముంబైలో సక్సెస్‌ఫుల్‌గా ముగించుకున్నారట సంజయ్ దత్. చికిత్స మొత్తం పూర్తయ్యాకే ఆయన షూటింగ్స్‌లో పాల్గొంటారని చాలామంది ఊహించారు. కానీ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ సంజయ్ దత్ షూటింగ్లో పాల్గొన్నారు. మంగళవారం ‘షంషేరా’ షూటింగ్‌కి వెళుతూ కెమెరాలకు చిక్కారాయన. కారు అద్దాలు దించి, ‘హాయ్’ అంటూ యాక్టివ్‌గా చెయ్యి ఊపారు కూడా. ఈ సినిమా చిత్రీకరణలో రెండు రోజుల పాటు పాల్గొననున్నారట. తర్వాత మళ్లీ చికిత్స చేయించుకుంటారని సమాచారం. మొత్తం ఎన్ని సిట్టింగ్స్‌లో ట్రీట్మెంట్ పూర్తవుతుందనేది బయటకు రాలేదు కానీ, మధ్య మధ్యలో షూటింగ్స్‌లో పాల్గొనాలని మాత్రం నిర్ణయించుకున్నారని సమాచారం. -
న్యూయార్క్‌లో చికిత్స
బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్‌కు లంగ్ కేన్సర్ అని తెలిసిందే. ప్రస్తుతం ముంబైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు సంజయ్ దత్. త్వరలో న్యూయార్క్ వెళ్లటానికి వీసా అప్లయ్ చేసుకున్నారాయన. ఐదేళ్ల గడువు ఉండే ఆరోగ్య వీసా కోసం అప్లయ్ చేశారట. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత భార్య మాన్యత, చెల్లెలు ప్రియాదత్‌తో కలిసి న్యూయార్క్ ప్రయాణం అవుతారని తెలిసింది. అక్కడి మెమోరియల్ సియాన్ కేటరింగ్ కేన్సర్ సెంటర్లో చేరనున్నారు సంజయ్ దత్. 1980–81ల మధ్యకాలంలో సంజయ్ దత్ తల్లి, ప్రముఖ నటి నర్గిస్కి ఆ ఆస్పత్రిలోనే కేన్సర్ చికిత్స జరిగింది. కేన్సర్ ట్రీట్మెంట్కి సంబంధించి ప్రపంచంలోని ప్రముఖ హాస్పిటల్స్‌లో ఇది ఒకటి. మనీషా కొయిరాల, సోనాలి బింద్రేలు కూడా అక్కడే ట్రీట్మెంట్ తీసుకున్నారు. వీళ్లలానే సంజయ్ దత్ కూడా త్వరగా కేన్సర్‌ను జయించి తిరిగి రావాలని కోరుకుంటున్నారు ఆయన అభిమానులు.