'నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు'.. సంజయ్‌ దత్‌పై హీరోయిన్ ఆసక్తికర కామెంట్స్! | Saira Banu Reveals That Sanjay Dutt Wanted To Marry Her, Emotional Birthday Wishes Post Goes Viral | Sakshi
Sakshi News home page

Saira Banu: 'నా మనసులో ఆయనకు ప్రత్యేక స్థానం'.. సైరా భాను ఎమోషనల్ పోస్ట్!

Published Mon, Jul 29 2024 4:26 PM | Last Updated on Mon, Jul 29 2024 4:45 PM

Saira Banu Reveals Sanjay Dutt Wanted To Marry Her On His Birthday Post

బాలీవుడ్ నటుడు సంజయ్‌ దత్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేజీఎఫ్‌ సినిమాతో పాన్‌ ఇండియా లెవెల్లో ఫేమస్  అయ్యారు. ప్రస్తుతం సంజయ్ దత్‌ టాలీవుడ్‌ మూవీ డబుల్ ఇస్మార్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రామ్- పూరి జగన్నాధ్‌ కాంబోలో వస్తోన్న ఈ చిత్రంలో సంజయ్ దత్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఇవాళ నటుడు సంజయ్ దత్‌  65వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ నటి సైరా భాను ఆసక్తికర కామెంట్స్ చేసింది. సంజయ్ దత్‌ తమ కుటుంబం లాంటి వాడని తెలిపింది. బర్త్‌ డే విషెస్ చెబుతూ ఎమోషనల్ పోస్ట్ చేసింది సైరా భాను. తన భర్త దిలీప్ కుమార్‌తో సంజయ్‌కు ఉన్న అనుబంధాన్ని పంచుకుంది.

సైరా భాను తన ఇన్‌స్టాలో రాస్తూ.. "సంజయ్ దత్ ఎప్పుడూ మా కుటుంబం లాంటి వ్యక్తి. నా కుటుంబంలో అందరిని చూస్తూ పెరిగారు. ఆ పసిపిల్లవాడు ఈ రోజు గొప్ప వ్యక్తిగా ఎదిగాడు. మా ఇంట్లో జరిగే ఫంక్షన్స్‌కు నర్గీస్‌ అక్కతో కలిసి సంజయ్ వచ్చేవాడు. అలా ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు తనను పెళ్లి చేసుకుంటా అని అన్నారు. అందుకే అతను నా హృదయంలో ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉన్నారు. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలతో సంజయ్‌ దత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ' చిన్ననాటి రోజులను ఆమె గుర్తు చేసుకుంది.

note

కాగా.. సంజయ్ దత్ చివరిగా విజయ్ హీరోగా నటించిన లియోలో కనిపించాడు. అతను ప్రస్తుతం రామ్ పోతినేని హీరోగా వస్తోన్న డబుల్‌ ఇస్మార్ట్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అంతే కాకుండా రవీనా టాండన్‌తో కలిసి ఘుడచాడి మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 9 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది.

 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement