Saira Banu
-
ఏఆర్ రెహమాన్, సైరా మళ్లీ కలిసిపోయే ఛాన్స్!
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, ఆయన భార్య సైరా భాను విడాకుల వ్యవహారం అభిమానులను షాక్‌కు గురి చేసింది. 29 ఏళ్లు అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడిపోవడానికి సిద్ధపడటాన్ని ఆయన ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలో వీరి విడాకుల కేసు వాదిస్తున్న లాయర్ వందన షా.. వీళ్లు మళ్లీ కలిసిపోయే ఛాన్స్ ఉందంటూ హింటిచ్చారు. సుదీర్ఘ జర్నీ.. మళ్లీ కలిసే ఛాన్స్తాజాగా ఓ ఇంటర్వ్యూలో వందన మాట్లాడుతూ.. వాళ్లది సుదీర్ఘ వైవాహిక జర్నీ.. ఎంతో ఆలోచించుకున్నాకే విడిపోవడానికి సిద్ధపడుంటారు. పిల్లల కస్టడీ ఇంకా నిర్ణయించలేదు. తల్లిదండ్రుల్లో ఎవరితో ఉండాలని డిసైడ్ చేసుకున్న హక్కు పిల్లలకు ఉంది. అయినా ఈ దంపతుల మధ్య సయోధ్య కుదిరే అవకాశమే లేదని నేను ఎక్కడా కొట్టిపారేయలేదు అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో రెహమాన్ దంపతులు మళ్లీ కలిసుండే అవకాశం ఉందని పలువురూ అభిప్రాయపడుతున్నారు.కాగా ఏఆర్ రెహమాన్, సైరా బాను 1995లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఖతీజా, రహీమా, అమీన్ అని ముగ్గురు సంతానం. ఈ నెల ప్రారంభంలో రెహమాన్, సైరా.. తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు.చదవండి: బాహుబలిని మించిందేముంటుంది? నెక్స్ట్ ఏంటో అర్థం కాలే! -
ప్రపంచంలోనే ఏఆర్ అత్యుత్తమ వ్యక్తి: సైరా భాను
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ , ఆయన భార్య సైరా భాను విడాకుల వ్యవహారంపై రకరకాల ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. 29 ఏళ్లు అన్యోన్యంగా సంసార జీవితాన్ని సాగించిన ఈ జంట విడిపోవాలనుకోవడానికి గల కారణాలను నెటిజన్లు పెద్ద ఎత్తున వెతుకుతున్నారు. ఏఆర్ రెహమాన్ వద్ద చాలా కాలంగా పని చేస్తున్న గిటారిస్ట్ మోనికా దేను కూడా ఈ వివాదంలోకి లాగుతున్నారు.దీంతో తన గురించి అసత్య ప్రచారాన్ని చేస్తున్న సామాజిక మాధ్యమాలకు రెహమాన్ తన న్యాయవాది ద్వారా నోటీసులు జారీ చేశారు. ఆదివారం సైరా భాను ‘నేను సైరా రెహమాన్ మాట్లాడుతున్నా’ అంటూ ఓ వీడియో వాయిస్‌ను విడుదల చేశారు. అందులో ‘‘ఏఆర్ గురించి దయచేసి అసత్య ప్రచారం చేయకండి. ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ వ్యక్తి ఆయన. అలాంటి అద్భుతమైన మనిషిని చూడలేం. నా శారీరక అనారోగ్యం కారణంగా కొన్ని నెలలుగా ముంబైలో ఉంటూ, చికిత్స పొందుతున్నాను.అందువల్లే ఏఆర్ నుంచి కొంతకాలం బ్రేక్ తీసుకోవాలనుకున్నా. విడిపోవాలనుకోవడానికి కారణం నా అనారోగ్యమే. ఏఆర్ రెహమాన్ ఎంతో బిజీగా ఉన్న పరిస్థితుల్లో ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. నా పిల్లలనూ ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు. ఏఆర్పై నాకున్న నమ్మకం నా జీవితానికంటే పెద్దది. నేను ఆయన్ని ఎంతగా ప్రేమించానో చెప్పడానికి ఇదే నిదర్శనం. నన్ను కూడా ఆయన అంతే ప్రేమించారు. ఇంకా ఏదీ అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి ఈ పరిస్థితుల్లో మా స్వేచ్ఛను గౌరవించండి. చికిత్స పూర్తయ్యాక త్వరలోనే చెన్నైకి తిరిగి వస్తాను. ఏఆర్ రెహమాన్ పేరుకు దయచేసి కళంకం ఆపాదించకండి’’ అని సైరా భాను కోరారు. – సాక్షి చెన్నై, తమిళ సినిమా -
ఆమె కారణంగానే రెహమాన్ విడాకులు.. స్పందించిన మోహినిదే
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్-సైరాబాను దంపతులు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరు పర్పస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు న్యాయవాది వందనా షా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మరోవైపు రెహమాన్ విడాకుల విషయం బయటకు వచ్చిన కొద్ది గంటల్లోనే ఆయన బృందంలోని సభ్యురాలు మోహినిదే కూడా తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించింది. దీంతో రెహమాన్ విడాకులకు మోహినిదే కారణమంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అంతేకాదు రెహమాన్-మోహినిదే మధ్య ఏదో సంబంధం ఉందన్నట్లు పుకార్లు వస్తున్నాయి. తాజాగా ఈ పుకార్లపై మోహినిదే సోషల్ మీడియా వేదికగా స్పదించారు. తనపై వస్తున్న రూమర్స్‌ని తీవ్రంగా ఖండించారు.‘నా విడాకుల ప్రకటన వెల్లడించిన తర్వాత వరుసగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఇంటర్వ్యూ ఇవ్వమని చాలా మంది అడుగుతున్నారు. వారంతా ఎందుకు నా ఇంటర్వ్యూ కోసం అడుగుతున్నారో నాకు తెలుసు. వారి అభ్యర్థనను నేను గౌరవంగా తిరస్కరిస్తున్నాను. ఇలాంటి రూమర్స్‌పై మాట్లాడి నా విలువైన సమయాన్ని వృధా చేసుకోలేను. దయచేసి నా గోప్యతను గౌరవించండి’అని మోహినిదే తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది.కాగా, ఇదే ఇష్యూపై రెహమాన్ కొడుకు అమీన్ సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా స్పందించాడు. ‘మా నాన్న ఓ లెజెండ్. ఎన్నో ఏళ్ల నుంచి వృత్తిపరంగా అద్భుతమైన సంగీతాన్ని అందించడంతో పాటు ఎంతోమంది ప్రేమాభిమానాలను పొందారు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి ఎలాంటి ఆధారాలు లేకుండా వదంతులు వ్యాప్తి చెందడం చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఒక వ్యక్తి జీవితం, వారసత్వం గురించి మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలి. దయచేసి మా నాన్నపై అసత్య ప్రచారాలు వ్యాప్తి చేయడం ఆపండి. ఆయన్ని, ఆయన వృత్తిని గౌరవిద్దాం. ఈ కఠిన సమయంలో ప్రతి ఒక్కరూ మా గోప్యతను గౌరవించాలి’’ అని రాసుకొచ్చారు. -
మా నాన్నపై అసత్య ప్రచారం చేయొద్దు: ఏఆర్ రెహమాన్ తనయుడు అమీన్
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, ఆయన సతీమణి సైరా భాను పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. వారి ప్రకటన అనంతరం వస్తున్న వార్తలపై వారి తనయుడు అమీన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ‘‘మా నాన్న ఓ లెజెండ్. ఎన్నో ఏళ్ల నుంచి వృత్తిపరంగా అద్భుతమైన సంగీతాన్ని అందించడంతో పాటు ఎంతోమంది ప్రేమాభిమానాలను పొందారు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి ఎలాంటి ఆధారాలు లేకుండా వదంతులు వ్యాప్తి చెందడం చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఒక వ్యక్తి జీవితం, వారసత్వం గురించి మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలి.దయచేసి మా నాన్నపై అసత్య ప్రచారాలు వ్యాప్తి చేయడం ఆపండి. ఆయన్ని, ఆయన వృత్తిని గౌరవిద్దాం. ఈ కఠిన సమయంలో ప్రతి ఒక్కరూ మా గోప్యతను గౌరవించాలి’’ అని రాసుకొచ్చారు. ఏఆర్ రెహమాన్ కుమార్తె రహీమా కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సందేశాన్ని పంచుకున్నారు. ‘‘మనల్ని ద్వేషించే వాళ్లే వదంతులు సృష్టిస్తారు. తెలివితక్కువ వాళ్లు వాటిని వ్యాప్తి చేస్తారు. పనికి రానివాళ్లు వాటిని అంగీకరిస్తారు. దీన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి’’ అంటూ పోస్ట్ చేశారామె.ఇక ఈ నెల 19న ఏఆర్ రెహమాన్, సైరాల విడాకుల ప్రకటన వచ్చిన అనంతరం రెహమాన్ బృందంలోని మోహినీ దే అనే అమ్మాయి కూడా తన భర్త, తాను విడిపోతున్నట్లు ప్రకటించారు. దాంతో రెహమాన్, మోహినీ ఒకేసారి విడాకుల గురించి ప్రస్తావించడం వెనక ఏదో కారణం ఉందంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ ప్రచారాన్ని ఉద్దేశించే అమీన్, రహీమా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇలా స్పందించి ఉంటారని ఊహించవచ్చు. -
రెహమాన్ విడాకులు.. ఆస్తి పంపకాలపై లాయర్ ఏమన్నారంటే?
సంగీత సామ్రాట్ ఏఆర్ రెహమాన్ 29 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికాడు. భార్య సైరా భానుకు విడాకులు ఇస్తున్నట్లు మంగళవారం ప్రకటించాడు. ఇది జరిగిన కొన్ని గంటలకే అతడి శిష్యురాలు మోహిని డే కూడా తన భర్త మార్క్ హార్ట్సచ్కు విడాకులు ఇస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. రెండు విడాకులకు ఏమైనా సంబంధం?ఈ క్రమంలో ఈ రెండు విడాకులకు ఏమైనా సంబంధం ఉందా? అన్న చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. దీనిపై సైరా భాను లాయర్ వందన షా స్పందించారు. ఈ రెండు జంటల విడాకులకు ఎటువంటి సంబంధం లేదన్నారు. రెండు విడాకులు వేర్వేరు అని నొక్కి చెప్పారు. రెహమాన్-సైరా పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారన్నారు. ఆస్తి పంపకాలుఅందుకు గల కారణాలను చెప్పే స్వేచ్ఛ తనకు లేదన్నారు. ఆస్తి పంపకాలు, భరణం వంటి వాటి గురించి ఇంకా ప్రస్తావన రాలేదని, ఒకవేళ వచ్చినా వాటి గురించి బయటకు చెప్పలేనని తెలిపారు. కాగా ఏఆర్ రెహమాన్, సైరా భానుల వివాహం 1995 మార్చిలో జరిగింది. ఈ దంపతులకు ఖతీజా, రహీమా, అమీన్ అనే పిల్లలు సంతానం.చదవండి: ధనుశ్ - ఐశ్వర్య విడాకులు.. ఇక అదొక్కటే మిగిలి ఉంది! -
కోలీవుడ్‌లో పెరుగుతున్న డైవోర్స్ కేసులు..
-
శ్రీమంతుల పాలిట విడాకుల ఎక్స్పర్ట్ ఈమె!
ఆస్తిపాస్తులు కనీసం పదివేల కోట్లు ఉన్నవారు.. విడాకుల కోసం వెళ్లాలంటే వందనా షాను కలుస్తారు. దేశంలో హైప్రోఫైల్ డివోర్స్ కేసులు చూసే మహిళా లాయర్‌గా వందనా షా పేరు గడించారు. ఏ.ఆర్.రెహమాన్, సాయిరా బానుల విడాకులతో ఆమె మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ‘విడాకులు ఇప్పించడం మీకు సంతోషమా?’ అనడిగితే ‘నేను స్వేచ్ఛను ఇప్పిస్తున్నాను’ అంటారామె. స్వయంగా డివోర్సీ అయిన వందనా ఆ తర్వాతే లా ప్రాక్టీసు మొదలెట్టారు. వందన పరిచయం, రెహమాన్ విడాకుల పూర్వాపరాలు... 1995లో ఏ.ఆర్. రెహమాన్ పెళ్లయ్యింది. అదే సంవత్సరం అతను సంగీతం చేసిన ‘బొంబాయి’ విడుదలైంది. ‘బొంబాయి’లో హీరోయిన్ పేరు సాయిరా బాను. రెహమాన్ జీవిత భాగస్వామి పేరు కూడా అదే. వచ్చే సంవత్సరం ‘బొంబాయి’ సినిమా, రెహమాన్ వైవాహిక జీవితం 30 ఏళ్ల ఉత్సవం జరుపుకోవాల్సి ఉంది. కానీ ఒకటి మాత్రమే జరుగుతుంది. ఒకటి జరగదు. సంగీత మాంత్రికుడి జీవితంలో అపశ్రుతి వస్తుందని ఎవరూ ఊహించలేదు. వీరి విడాకుల వ్యవహారాన్ని అడ్వకేట్ వందనా షా చూశారు. అధికారికంగా ఆమే ప్రకటించారు.గుజరాత్ మూలాలు1973లో జన్మించిన సాయిరా బాను మూలాలు కచ్‌లో ఉన్నాయి. వారిది గుజరాతి ముస్లిం కుటుంబం. మదురైలో స్థిరపడ్డ ఈ కుటుంబం నుంచి ఒక కుమార్తెను మలయాళ నటుడు రెహమాన్ (రఘు) వివాహం చేసుకుంటే మరో అమ్మాయిని ఏ.ఆర్.రెహమాన్ చేసుకున్నాడు. పెళ్లయ్యాక సాయిరా బాను రెహమాన్‌కు పేరు వచ్చేకొద్దీ ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీకి మిత్రురాలైందని అంటారు. సాయిరా, నీతా మధ్య మంచి స్నేహం ఉందని కథనం. ఇటీవల అంబానీ కుమారుడి పెళ్లిలో రెహమాన్ ప్రత్యేకమైన షో కూడా ఇచ్చాడు. ఇప్పుడు విడాకుల కేసును చూసిన వందనా షా కూడా గుజరాత్‌కు చెందిన అడ్వకేటే. అయితే ఆమె ప్రాక్టీసు ముంబై, పూణెలలో ఉంది.తల్లి తెచ్చిన కోడలురెహమాన్ తల్లి నిర్ణయానికి ఎంతో విలువనిచ్చేవాడు. ‘నాకు సమయం లేదు. నేను పెళ్లిచూపులకు తిరగలేను. చదువుకుని, సంగీతం అంటే ఇష్టపడుతూ, వినమ్రతతో ఉండే అమ్మాయిని చూడు’ అని మాత్రమే తల్లిని అతడు కోరాడు. తల్లే ఈ సంబంధం తెచ్చింది. పెళ్లయ్యాక రెహమాన్, సాయిరా పరస్పరం ఎంతో గౌరవించుకునేవారు. ‘నేను అతని స్వరానికి ఫ్యాన్‌ని’ అని సాయిరా రెహమాన్ గురించి వేదికమీద చెప్పింది. రెహమాన్ కూడా ఆమెను వెంటబెట్టుకునే సంగీత యాత్రలు చేసేవాడు. వీరికి ముగ్గురు పిల్లలు. రెహమాన్ రెండు వారాల క్రితమే ఆస్ట్రేలియాలో, అబూదాబీలో లైవ్ షోలు చేశాడు. అతని ఫేస్బుక్ పేజ్‌లో ఇంకా భార్యతో ఉన్న ఫోటోనే కవర్ ఫొటోగా ఉంది. వందనా షాకు పరస్పర ఆమోదయోగ్యంగా విడుపెయేలా కేసులను గట్టెక్కిస్తుందనే పేరు ఉంది. అందుకే రెహమాన్గానీ, సాయిరాగాని మీడియాకు ఎక్కలేదు. వారిద్దరి నడుమా ఎంతో ప్రేమ ఉన్నా వెనక్కు రాలేనంతగా అగాథాలు ఏర్పడటమే’ విడాకులకు కారణం అంటారు వందనా షా.శ్రీమంతుల విడాకులువందనా షా శ్రీమంతుల విడాకుల ఎక్స్పర్ట్. ‘ఆమె విడాకులు ఎక్కువగా ఇప్పిస్తోంది. పెళ్ళిళ్లకు పిలవకండి’ అనేవారూ ఉన్నారు. కాని పాలిహిల్స్ (ముంబై)లో ఉండే జంటల విడాకుల కారణాలు అనూహ్యంగా ఉంటాయని అంటారు వందనా షా. ‘బోర్డమ్’, ‘బిగ్గర్ బెటర్ డీల్’ వల్ల విడి΄ోయే జంటలు ఎక్కువ అని ఆమె అంటారు. శ్రీమంతుల ఇళ్లలో భార్యాభర్తల మధ్య డబ్బు పంపకం, పిల్లల బాధ్యత ఇవే ప్రధాన సమస్యలనీ, ‘ఇగో’, ‘వివాహేతర సంబంధాలు’ తర్వాతి స్థానం అని అంటారామె. ‘బాగా డబ్బున్న వారు పెళ్లికి ముందే అగ్రిమెంట్ చేసుకోవడం మంచిది. ఒకవేళ విడిపోతే ఎవరికి ఎంత, పిల్లలకు ఎంత.. ఇవి మాట్లాడుకుంటే అసలు వైవాహిక జీవితంలో గొడవలే రావు’ అంటుందామె. ఇక మధ్యతరగతి విడాకులలో ‘పిల్లలు ఎదిగొచ్చిన స్త్రీకి ఇక తానేమిటి, తన ఉనికి ఏమిటి అనే సమస్య మొదలయ్యి తన జీవితానికి ప్రాధాన్యత లేదా అనే అసంతృప్తి నుంచి విడాకులు అవుతాయి’ అని తెలిపింది వందనా షా. ‘పరస్పరం హింసించుకునే పెళ్లి కంటే విడాకులే నయం’ అంటుందామె. అయితే పెళ్లితో బాధలు పడుతున్న పురుషుల గురించి కూడా ఆమె మాట్లాడుతుంది. ‘బాగా సంపాదించే భార్య తన భర్తను ఇంటిపట్టున ఉండమని కోరడం, అతనిపై ఆధిపత్యం చెలాయించడం చూస్తున్నాం. మగాళ్లు హౌస్ హజ్బెండ్లుగా ఉండటాన్ని ఇష్టపడుతున్నా ఆధిపత్యం, అవమానం భరించలేక విడాకులు కోరుతున్నారు’ అని తెలిపిందామె. మధ్యతరగతి ఇళ్లలో తల్లిని, భార్యను ఎదురుబొదురు కూచోబెట్టి వారి సమస్యను నేరుగా పరిష్కరించక తప్పించుకు తిరిగే మగవాడు అంతిమంగా విడాకుల దగ్గర తేలుతాడని కూడా ఆమె హెచ్చరిస్తోంది. బహుపరాక్. (చదవండి: లైఫ్ అంటే... పెళ్లి మాత్రమేనా?! ) -
ఏఆర్ రెహ్మాన్ జంట విడాకులు
-
29 ఏళ్ల బంధానికి ముగింపు.. రెహమాన్-సైరా విడాకులు (చిత్రాలు)
-
ఏఆర్ రెహమాన్‌కి విడాకులు ఇచ్చేసిన భార్య
సంగీత సామ్రాట్, దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ దంపతులు తమ మూడు దశాబ్దాల వైవాహిక బంధానికి స్వస్తి పలకబోతున్నారు. ఈ విషయాన్ని రహమాన్ దంపతుల తరఫున ప్రముఖ విడాకుల లాయర్ వందనా షా ఒక సంయుక్త ప్రకటన మంగళవారం విడుదలచేశారు. ‘‘పెళ్లయిన చాన్నాళ్ల తర్వాత విడిపోవాలన్న కఠిన నిర్ణయానికి వచ్చారు. కొరవడిన భావోద్వేగాలే బంధం బీటలు పడటానికి కారణం. ఒకరిపై ఇంకొకరికి అమితమైన ప్రేమానురాగాలు ఉన్నాసరే అనూహ్య పరిస్థితులు వీళ్లిద్దరి మధ్య పూడ్చలేని అగాథాన్ని సృష్టించాయి. బాధను దిగమింగి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ కష్టకాలంలో వ్యక్తిగత గోప్యతను గౌరవిస్తూ ప్రజలు సైతం ఈ విషయాన్ని అర్థంచేసుకుంటారని ఆశిస్తున్నాం. ఈ కష్టమైన దశను వీళ్లిద్దరూ దాటగలరని భావిస్తున్నా’ అని లాయర్ వందనా షా ఆ అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ‘ మా కుటుంబ ప్రైవసీని గౌరవించండి’ అని రెహమాన్ కుమారుడు అమీన్ సైతం ఇన్‌స్టా గ్రామ్‌లో ఒక పోస్ట్‌పెట్టారు. రహమాన్, సైరా బానూ వివాహం 1995 మార్చిలో చెన్నైలో జరిగింది. వీళ్లకు ఖతీజా, రహీమా, అమీన్ అనే పిల్లలున్నారు. వీళ్లది పెద్దలు కుదిర్చిన వివాహం. -
మనసారా ప్రేమించా.. ఏరోజూ అనుమానించలేదు: సైరా భాను
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సైరా భాను.. ఓ మధుర జ్ఞాపకాన్ని అభిమానులతో పంచుకుంది. హీరో దిలీప్‌కుమార్‌ను ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పటి ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో వదిలింది. ఈరోజు(అక్టోబర్ 2న) ఈ దంపతుల 58వ ఎంగేజ్మెంట్ యానివర్సరీ. ఈ సందర్భంగా సైరా ఎమోషనల్ నోట్ వదిలింది. 'ప్రేమలో ప్రశ్నలు ఉండకూడదు.. హీరా పేరి సినిమాలో నేను చెప్పిన డైలాగ్ ఇది.. అందమైన జర్నీ..నిజ జీవితంలోనూ దాన్నే విశ్వసించాను. ప్రేమలో బలమైన నమ్మకం ఉంటే ప్రశ్నించే అవసరమే రాదు. నా స్వీట్హార్ట్ దిలీప్‌తో 1966 అక్టోబర్ 2న అందమైన ప్రయాణం ప్రారంభించాను. అప్పటినుంచి ఎన్నడూ తనను ప్రశ్నించలేదు. మా జర్నీలో ఎన్ని ఎత్తుపల్లాలు ఎదురైనా తనపై నమ్మకం కోల్పోలేదు.ఆరాధన..కేవలం ప్రేమించాను. అక్కడ అనుమానాలకు తావు లేదు. కేవలం ఆరాధన మాత్రమే ఉంది. ఆ భక్తిలోనే నిజమైన ప్రేమ ఉంది' అని రాసుకొచ్చింది. కాగా సైరా భాను, దిలీప్ కుమార్ 1966 అక్టోబర్ 11న పెళ్లి చేసుకున్నారు. అప్పుడు దిలీప్ వయసు 44 కాగా సైరా వయసు కేవలం 22 మాత్రమే! దాదాపు ఐదు దశాబ్దాలపాటు సైరాతో కలిసి జీవించిన దిలీప్ 2021 జూలై 7న మరణించారు. View this post on Instagram A post shared by Saira Banu Khan (@sairabanu) బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
'నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు'.. సంజయ్ దత్‌పై హీరోయిన్ ఆసక్తికర కామెంట్స్!
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం సంజయ్ దత్ టాలీవుడ్ మూవీ డబుల్ ఇస్మార్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రామ్- పూరి జగన్నాధ్ కాంబోలో వస్తోన్న ఈ చిత్రంలో సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు.ఇవాళ నటుడు సంజయ్ దత్ 65వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ నటి సైరా భాను ఆసక్తికర కామెంట్స్ చేసింది. సంజయ్ దత్ తమ కుటుంబం లాంటి వాడని తెలిపింది. బర్త్ డే విషెస్ చెబుతూ ఎమోషనల్ పోస్ట్ చేసింది సైరా భాను. తన భర్త దిలీప్ కుమార్‌తో సంజయ్‌కు ఉన్న అనుబంధాన్ని పంచుకుంది.సైరా భాను తన ఇన్‌స్టాలో రాస్తూ.. "సంజయ్ దత్ ఎప్పుడూ మా కుటుంబం లాంటి వ్యక్తి. నా కుటుంబంలో అందరిని చూస్తూ పెరిగారు. ఆ పసిపిల్లవాడు ఈ రోజు గొప్ప వ్యక్తిగా ఎదిగాడు. మా ఇంట్లో జరిగే ఫంక్షన్స్‌కు నర్గీస్ అక్కతో కలిసి సంజయ్ వచ్చేవాడు. అలా ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు తనను పెళ్లి చేసుకుంటా అని అన్నారు. అందుకే అతను నా హృదయంలో ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉన్నారు. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలతో సంజయ్ దత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ' చిన్ననాటి రోజులను ఆమె గుర్తు చేసుకుంది.కాగా.. సంజయ్ దత్ చివరిగా విజయ్ హీరోగా నటించిన లియోలో కనిపించాడు. అతను ప్రస్తుతం రామ్ పోతినేని హీరోగా వస్తోన్న డబుల్ ఇస్మార్ట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అంతే కాకుండా రవీనా టాండన్‌తో కలిసి ఘుడచాడి మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 9 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది. -
22 ఏళ్ల ఏజ్ గ్యాప్.. ఈ స్టార్స్ 'ప్రేమకథ' ఎప్పటికీ ప్రత్యేకమే
ఆమెకు 12.. అతడికి 34.. ఇద్దరి మధ్య సుమారుగా 22 ఏళ్ల వయోభేదం ఉన్నా చూపులు కలిశాయి. తొలిచూపులోనే ఆమెపై మనసు పారేసుకున్నాడు. ఆపై తమ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకున్నారు. వారిద్దరి మధ్య ఉన్న వయసు గురించి అందరూ పలు రకాలుగా మాట్లాడుకున్నా ‘మాది దేవుడు కలిపిన బంధం’ అంటూ మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా చివరి వరకు నిలిచారు. అలా బాలీవుడ్లో తమ ప్రేమ గొప్పదనాన్ని చూపారు ఈ లెజెండరీ కపుల్స్.. వారెవరో కాదు దిలీప్ కుమార్ - సైరా భాను. 1960ల నాటి సంగతి.. దిలీప్ కుమార్‌ను చూడ్డం కోసం ముంబైలో ‘మొఘల్ ఎ ఆజం’ ప్రీమియర్‌కు హాజరైంది ఒక పదహారేళ్లమ్మాయి. అప్పుడే లండన్ నుంచి వచ్చింది స్కూల్ చదువు ముగించుకొని. ఆ షోకి దిలీప్ కుమార్ రాకపోయేసరికి చాలా నిరాశపడింది. తర్వాత యేడాదికి తనూ హీరోయిన్ అయింది ‘జంగ్లీ’ సినిమాతో.. షమ్మీకపూర్ పక్కన. ఆమే సైరా బాను. ‘మొఘల్ ఎ ఆజం’ ప్రీమియర్ ప్రస్తావనకు తర్వాత ఆమె జీవితంలోని మలుపుకి సంబంధం ఉంది. (టాప్ హీరో రాజేంద్ర కుమార్‌తో సైరా భాను) మొదటి ప్రేమ రాజేంద్ర కుమార్‌తో ఆ రోజుల్లో దిలీప్ కుమార్ టాప్-1 స్థానంలో ఉంటే రాజేంద్ర కుమార్ రెండో స్థానంలో ఉన్నారు. సైరా బాను సినిమాల్లోకి రాకముందే రాజేంద్ర కుమార్ స్టార్. ఆ తరం ఎంతోమంది అమ్మాయిల కలల రాకుమారుడు. ‘జంగ్లీ’ హిట్‌తో సైరా బానుకు స్టార్స్ పక్కన నటించే అవకాశాలు క్యూ కట్టాయి. అందులో రాజేంద్ర కుమార్ హీరోగా ‘ఆయీ మిలన్ కీ బేలా’ కూడా ఉంది. సైన్ చేసింది సైరా. ఆ సెట్స్‌లో ఆమెను చూసిన రాజేంద్ర కుమార్ గుండె లయ తప్పింది. సైరా కళ్లల్లోని అమాయకత్వం అతణ్ణి పిచ్చివాణ్ణి చేసింది. ‘తుమ్హే క్యా దూ మై దిల్ కె సివా (నా హృదయాన్ని తప్ప నీకేం ఇవ్వ గలను)’ అంటూ సాగే ‘ఆయీ మిలన్ కీ బేలా’లోని పాటలో సైరా కోసం జీవించాడు. ఫిమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అంతటి హీరో తనకు ఫిదా కావడంతో రాజేంద్ర కుమార్ పట్ల ఆమెకూ ఆకర్షణ మొదలైంది. సినిమా పూర్తయ్యేటప్పటికి ప్రేమలో పడిపోయారిద్దరూ. ఆ మూవీ బాక్సాఫీస్ హిట్. దాంతో ఈ ఇద్దరి కలయికలోనే ‘ఝుక్ గయా ఆస్మాన్’ ప్రారంభమైంది. ఇందులోని ‘కౌన్ హై జో సప్నో మే ఆయా (నా కలలోకి వచ్చినదెవరు)’ పాటలో తన కళ్లల్లో సైరాను కొలువుంచుకొనే అభినయించాడు రాజేంద్ర కుమార్. ఈ సినిమా కూడా హిట్ అయ్యి ఆ జంటకు సూపర్ క్రేజ్ ఏర్పడింది. తెర మీది కెమిస్ట్రీతో పాటు వీళ్లిద్దరి ప్రేమాయణమూ బాలీవుడ్ నోట షికారు చేసింది. అయితే రాజేంద్ర కుమార్ అప్పటికే పిల్లల తండ్రి. అదేమీ అడ్డంకిగా భావించని సైరా అతణ్ణి పెళ్లి చేసుకోవాలనుకుంది. సైరా ప్రేమ కోసం భార్యా,పిల్లలనూ వదులుకోవడానికి సిద్ధపడ్డాడు రాజేంద్ర కుమార్. ఈ విషయం సైరా తల్లి నసీమ్ బానుకు తెలిసింది. నిజానికి రాజేంద్ర కుమార్ అంటే నసీమ్ కుటుంబానికి అపారమైన గౌరవం. ఒకరోజు ఆయన్ను కలిసి ‘సైరా చాలా మంచి పిల్ల. ఆమెను అర్థం చేసుకునే చక్కటి భాగస్వామి దొరకాలి’ అంటూ. రచ్చ కాకుండానే సైరాను ఆ ప్రేమ నుంచి తప్పించేసింది. అంతటితో వారిద్దరి ప్రేమకు ఫుల్స్టాప్ పడింది. బర్త్‌డే పార్టీలో దిలీప్ కుమార్‌తో సైరా ప్రేమ చాన్స్ రానే వచ్చింది సైరా బాను బర్త్‌డే రూపంలో. పార్టీ అనౌన్స్ చేసి దిలీప్ కుమార్‌ను అతిథిగా ఆహ్వానించింది నసీమ్. పుట్టిన రోజు పార్టీలో తన అభిమాన హీరో కనిపించడంతో ‘దిలీప్ సాబ్’ అంటూ సంభ్రమాశ్చర్యాలకు లోనైంది సైరా. దిలీప్ కుమార్ కూడా సైరాను చూసి ముగ్ధుడయ్యాడు. ఆ క్షణం దిలీప్ కుమార్ కళ్లల్లో మెరిసిన మెరుపు నసీమ్ దృష్టిని దాటిపోలేదు. అలా కొన్నేళ్లపాటు సైరా- దిలీప్‌లు కూడా తమ మధ్య మూగప్రేమనే మనసులో నింపుకొన్నారు. అయితే వీరిద్దరి ప్రేమను పెళ్లిపీటలెక్కించిన ఘనత మాత్రం సైరా తల్లి నసీమ్ భానుకే దక్కుతుంది. సమయం చిక్కగానే అతణ్ణి అడిగింది.. ‘మీరంటే సైరాకు పిచ్చి.. చిన్నప్పటి నుంచీ. నా కూతురిని పెళ్లి చేసుకుంటారా?’ అని. అప్పటికే వహీదా రెహ్మాన్‌తో డేటింగ్లో ఉన్నాడు దిలీప్ కుమార్. అయినా నసీమ్ ప్రతిపాదనను సమ్మతించాడు రెండో ఆలోచన లేకుండానే. అలా తనకన్నా ఇరవై రెండేళ్లు పెద్దవాడైన దిలీప్ కుమార్‌కు 1966లో జీవిత భాగస్వామి అయింది సైరా బాను. పెళ్లి తర్వాత అలాంటి కామెంట్లు అయితే పెళ్లి తర్వాత చాలామంది వీళ్లిద్దరి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ గురించే మాట్లాడుకున్నారట! పలు రకాలుగా కామెంట్లు వచ్చినా వాటన్నింటినీ పట్టించుకోకుండా ప్రతి సందర్భంలోనూ ఒకరికొకరుగా ముందుకు సాగారు. ఎళ్లు గడుస్తున్నా వారి బంధాన్ని నిక్షేపంగానే కొనసాగించారు. 'మనసులో ప్రేముంటే వయసుతో పనేముంది' అని తమ అనుబంధంతోనే నిరూపించారీ ఐకానిక్ కపుల్. పెళ్లయ్యాక ఆరేళ్లకు అంటే 1972లో మొదటిసారి గర్భం ధరించారు సైరా. ఎనిమిదో నెలలో ఆమెకు అబార్షన్ అయింది. పుట్టిన బేబీ కూడా దక్కలేదు. కొన్ని కారణాల వల్ల ఇకపై ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదని వైద్యులు కూడా తేల్చి చెప్పేశారు. దీంతో పలు కారణాల వల్ల హైదరాబాద్‌కు చెందిన ఆస్మా రెహ్మాన్ అనే మహిళను దిలీప్ రెండో వివాహం చేసుకోవాల్సి వచ్చింది. కానీ ఆ బంధం రెండేళ్లకు మించి కొనసాగలేదు. సైరాను మరిచిపోలేకపోయాడు దిలీప్. రెండేళ్లపాటు సైరాకు దూరంగా ఉండటం ఒక నరకంగా భావించాడు. తిరిగి సైరాను చేరుకున్నారు. అంత జరిగినా దిలీప్ నా వాడే అంటూ సైరా కూడా చెప్పుకొచ్చింది. ఓ ఇంటర్వ్యూలో దిలీప్ నా కోహినూర్ వజ్రం.. నా జీవితంలో అల్లాను రెండే రెండు కోరికలు కోరాను. మా అమ్మలా ఫేమస్ కావాలని, దిలీప్ కుమార్లాంటి భర్త దొరకాలని. అల్లా రెండిటినీ నెరవేర్చాడు. అని ఆమె చెప్పుకొచ్చింది. ఎన్ని జన్మలెత్తినా దిలీప్ నా వాడు! అంటూ తన భర్తపై అపారమైన ప్రేమను ఆమె బయటపెట్టింది. దిలీప్ కుమార్ అసలు పేరు మహమ్మద్ యూసుఫ్ ఖాన్.. 1944 నుంచి 1998 వరకు బాలీవుడ్‌ను ఏలిన దిలీప్ 2021లో అనారోగ్యంతో కన్నుమూశారు. -
ఆ రొమాంటిక్ సీన్లంటే ఇప్పటికీ ఇష్టం: సీనియర్ హీరోయిన్
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సైరా భాను నటించిన సూపర్ హిట్ చిత్రం హేరా ఫేరీ. ఈ చిత్రంలో అగ్రనటులైన వినోద్ ఖన్నా, అమితాబ్ బచ్చన్ జంటగా నటించారు. ఈ మూవీ రిలీజై నేటికి 47 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ రోజులను సైరా భాను గుర్తు చేసుకున్నారు. వినోద్ ఖన్నా, అమితాబ్ బచ్చన్‌లతో కలిసి పనిచేసిన అనుభవాలను తలుచుకుంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఇన్‌స్టా సైరా రాస్తూ..' హేరా ఫేరి చేయడం చాలా సంతోషంగా ఉంది. అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా కూడా నటించారు. దర్శకుడు ప్రకాష్ మెహ్రా మా ముగ్గురికి పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. ఆ సమయంలో మేము సినిమాలోని సన్నివేశాలను చాలా ఫన్నీగా మార్చేశాం. ముఖ్యంగా వినోద్ నిరంతరం అమితాబ్‌ను నాతో క్లోజ్‌గా ఉన్నందున.. వాటిని ఆపేందుకు అతను ప్రయత్నిస్తున్న సన్నివేశాలంటే నాకు ఇప్పటికీ ఇష్టం. వినోద్ నా పక్కన కూర్చోవడానికి.. అమితాబ్ ప్రయత్నాలను అడ్డుకోవాలని చూసే దృశ్యాలు ఇప్పటికీ ఆనందం కలిగిస్తాయి. మీరు కూడా చూసి ఆనందించండి' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్ సైతం మీ ముగ్గురి కాంబినేషన్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. 1976లో విడుదలైన హేరా ఫేరి ఒక కామెడీ చిత్రం. దీనికి ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించారు. అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా, సైరా బాను, ప్రాణ్ ఇందులో నటించారు. నగరంలో జీవనోపాధి కోసం కష్టపడుతున్న విజయ్ (అమితాబ్ బచ్చన్), అజయ్ (వినోద్ ఖన్నా) అనే ఇద్దరు స్నేహితుల చుట్టూ కథ తిరుగుతుంది. కాగా.. దివంగత నటుడు, సైరా భాను భర్త దిలీప్ కుమార్ వర్ధంతి సందర్భంగా ఈ ఏడాది జూలై 7న సైరా బాను తన ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Saira Banu Khan (@sairabanu) -
నా నడుము 22.. ఆ రోజులు కనుమరుగై పోయాయి: స్టార్ హీరోయిన్
ప్రముఖ సీనియర్ బాలీవుడ్ సైరా భాను పేరు ఇప్పటివారికి పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ 1961లో జంగ్లీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సైరా భాను దాదాపు మూడు దశాబ్దాల పాటు సినిమాల్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే తనకు 22 ఏళ్ల వయసులోనే నటుడు దిలీప్ కుమార్‌ను పెళ్లాడింది. ఆ తర్వాత సినిమాల్లో కొనసాగింది. అయితే ఇటీవల సైరా భాను సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది. (ఇది చదవండి: లైవ్‌లో సిగరెట్ తాగిన స్టార్ హీరో.. మండిపడుతున్న నెటిజన్స్!) ప్రముఖ నటి సైరా భాను ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి తన త్రోబాక్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటోంది. ఆమె తాజాగా తన చిన్ననాటి ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోను షేర్ చేస్తూ ఓ ఆసక్తికర నోట్ రాసుకొచ్చింది. అంతేకాకుండా ఆ ఫోటోలో తన నడుమును ప్రదర్శించింది. ఇన్‌స్టాలో సైరా రాస్తూ.. ' ఆ రోజుల్లో 22 అంగుళాల నడుము ఉన్న రోజులు గడిచిపోయాయి. ఓహ్.. ఆ రోజుల్లో గడిచిన సమయమే శాశ్వతంగా నిలిచిపోతుంది.' అంటూ పోస్ట్ చేసింది. సైరా ఆ ఫోటోలు సల్వార్ కమీజ్ ధరించి కనిపించింది. అయితే సైరా పోస్ట్‌ను ఆమె అభిమానులు ఇప్పటికీ ఎంత అద్భుతంగా ఉందో అంటూ గుర్తు చేసుకున్నారు. ఆ ఫోటో చూసిన నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేశారు. (ఇది చదవండి: అందుకే సినిమాలకు గ్యాప్ ఇచ్చా.. భద్ర హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!) View this post on Instagram A post shared by Saira Banu Khan (@sairabanu) -
మై డియర్ కోహినూర్...
దిలీప్ కుమార్–సైరాభాను వేరు వేరు పేర్లు కావు. ఒకే నామం. వారిది ఆదర్శ దాంపత్య బంధం. దిలీప్ సాబ్–సైరాభానుల ఆన్–స్క్రీన్, ఆఫ్–స్క్రీన్ కెమిస్ట్రీ ‘ఆహా’ అనిపిస్తుంది. 78 ఏళ్ల వయసులో సైరాభాను తన డెబ్యూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌తో నెటిజనుల దృష్టిని ఆకట్టుకుంది. తొలి పోస్ట్‌లో భర్తను జ్ఞాపకం చేసుకొని, అతడికి ఇష్టమైన ఉర్దూ ద్విపదలను ఉటంకించింది. ఈ పోస్ట్‌కు నెటిజనులు ‘వహ్వా’ అంటున్నారు. ‘నేను సాహెబ్ అని ఎప్పుడూ పిలుచుకునే వ్యక్తి ఈరోజుకీ నాతోనే ఉన్నాడు. నాతోపాటే నడుస్తున్నాడు’ అంటూ దిలీప్ కుమార్ వర్థంతి సందర్భంగా తన మనసులోని మాట రాసింది. ఆమె పోస్ట్ చేసిన దిలీప్ కుమార్‌కు నచ్చిన కవితాపంక్తులు... ‘నాకు ప్రియమైన వ్యక్తి గాఢమైన నిద్రలో ఉన్నాడు. నా ప్రపంచం నిశ్చలనంగా మారిపోయింది. మేలుకోవాల్సిందిగా అతడిని ప్రార్థిస్తున్నాను. అతడి మెలకువతో నా ప్రపంచం మళ్లీ చలనశీలం అవుతుంది’ -
ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన బాలీవుడ్ నటి
ముంబై: బాలీవుడ్ నటి, వెటరన్ యాక్టర్ సైరా బాను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఆమె ఫ్యామిలీ ఫ్రెండ్ ఫైజల్ ఫారూఖీ అతని ట్విటర్ అకౌంట్ ద్వారా ఆమె అభిమానులతో పంచుకున్నాడు. కాగా 77 ఏళ్ల నటి సైరా బాను ఊపిరి అందక ఆగస్టు 28న ముంబైలోని హిందుజ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో చేరిన మూడు రోజుల తర్వాత ఊపిరితిత్తుల సమస్య తీవ్రంగా ఉండడంతో ఆమెను ఐసీయూలోకి మార్చారు. ఆమె ఆరోగ్యం కుదుటపడడంతో డిశ్చార్జి చేసినట్లు ఆసుపత్రి వర్గాలు ఓ మీడియా ఏజెన్సీకి తెలిపాయి. ఫారుఖీ ఈ విషయం గురించి తెలుపుతూ.. "సైరా బానుజీ ఇంటికి వచ్చేశారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. విశ్రాంతి తీసుకుంటున్నారు. మీ ప్రేమ, ప్రార్థన వల్లే ఆమె కోలుకున్నారు" అని నటి అభిమానులను ఉద్దేశించి ఫైజల్ ఫారూఖీ పోస్ట్‌లో హర్షం వ్యక్తం చేశారు. అంతకుముందు సైరా బాను గుండె జబ్బుతో తీవ్రమైన కరోనరీ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు గుర్తించిన వైద్యులు, నిర్ధారణ తర్వాత కరోనరీ ఆంజియోగ్రామ్ చేయించుకోమని సూచించగా నటి నిరాకరించినట్లు ఆసుపత్రి వైద్యుడు ఒకరు మీడియా ఏజెన్సీకి తెలిపాడు. సైరాబాను భర్త, బాలీవుడ్ స్టార్ దీలిప్ కుమార్ 98 ఏళ్ల వయసులో మరణించిన విషయం అందరికి తెలిసిందే. ఆయన కూడా ఊపిరి అందక అదే హిందుజా హిస్పిటల్‌లో చేరి, అనంతరం జూలై 7న తుదిశ్వాస విడిచారు. ఈ రియల్ లైఫ్ కపుల్ సగిన, గోపి, బైరాగ్, దునియా వంటి హిట్ సినిమాల్లో కలిసి నటించారు. కాగా, ఆమె దివంగత బాలీవుడ్ నటుడు షామ్మీ కపూర్ హీరోగా నటించిన జంగ్లీ సినిమాతో వెండితెరకి పరిచయం అయ్యారు. అనంతరం ఆమె పదోసన్, హేరా పేరి, దివానా వంటి ఎన్నో మంచి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. చివరిగా 1988లో ఫైస్లాలో నటించారు. #SairaBanu ji is back home. Discharged from the hospital. Doing well. Resting. Your love and prayers are truly appreciated. 🙏 — faisal farooqui (@FAISALmouthshut) September 5, 2021 చదవండి: Kim Sharma- Leander Paes: టెన్నిస్ స్టార్‌తో రిలేషన్.. కన్ఫర్మ్ చేసిన కిమ్ శర్మ! -
ఆస్పత్రిలో చేరిన దిలీప్ కుమార్ సతీమణి
దివంగత, బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ సతీమణి సైరా బాను మూడు రోజుల క్రితం రక్తపోటు సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ఆమె పరిస్థితి విషమించడంతో ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో చెర్పించినట్లు కుటుంబ సన్నిహితులు మీడియాకు వెల్లడించారు. దీంతో వైద్యులు ఆమెను ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కీ (ఐసియు) తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా జూలై 7ను ఆమె భర్త, నటుడు దిలీప్ కుమార్ మరణించిన సంగతి తెలిసిందే. సైరా బాను ఇటీవల తన భర్త దిలీప్ కుమార్‌ను కోల్పోవడంతో అనారోగ్యానికి గురయ్యారని ఆమె సన్నిహితులు చెప్పారు. కాగా సైరా-దిలీప్లది ప్రేమ వివాహం. వారి వైవాహిక బంధంలో దిలీప్‌కు సైరా వెన్నుముకగా నిలిచారు. ఆయన ఆనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినప్పుడు దగ్గరుండి ఆమె సేవలు చేశారు. -
ఒక స్వర్ణయుగం ముగిసింది: సోనియా గాంధీ లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ మరణంపై కాంగ్రెస్ చైర్పర్సన్ సోనియా గాంధీ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ఆమె దిలీప్ కుమార్ భార్య సైరా బానుకు ఒక లేఖ రాశారు. "మీ ప్రియమైన భర్త దిలీప్ కుమార్ కన్నుమూతతో, భారతీయ సినిమా చరిత్రలో ఒక స్వర్ణయుగం ముగిసింది’’ అని సైరా బానుకు గురువారం రాసిన సంతాప సందేశంలో సోనియా పేర్కొన్నారు. దిలీప్ కుమార్ ఒక లెజెండ్..భవిష్యత్తులో కూడా లెజెండ్‌గానే కొనసాగుతారు.ఎందుకంటే భవిష్యత్తరం సినీ ప్రేమికులు కూడా ఆయన అద్భుతమైన నటనా వైభవాన్ని ఆస్వాదిస్తాయి. ఎన్నో ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీలను అందించిన ఆయన నటనా నైపుణ్యాన్ని ఆరాధిస్తారంటూ ఆయన సాధించిన ఘనతను, విజయాలను గుర్తుచేసుకున్నారు. అలాగే గంగా జమునా, డాగ్, దీదార్, మొఘల్-ఏ-ఆజం, నయా దౌర్, మధుమతి, దేవదాస్,రామ్ ఔర్ శ్యామ్ లాంటి ఎన్నో వైవిధ్యమైన చిత్రాలలో తన పాత్రలతో అలరించిన ఆయన నటను ఎవరు మరచిపోగలమని వ్యాఖ్యానించారు..పూర్తికాల జీవితాన్ని అనుభవించిన దిలీప్ కుమార్ అమూల్యమైన వారసత్వాన్ని ప్రపంచ సినిమాకు అందించారని కొనియాడారు. ఆయన మరణం విశేష అభిమానులను దుఃఖ సాగరంలో ముంచేసిందనీ, దేశం ఎప్పటికీ ఆయనను గుర్తు పెట్టుకుంటుందనీ తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. అలాగే ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని,ధైర్యాన్ని మీకివ్వాలని ప్రార్థిస్తున్నానని సోనియా తన లేఖలో పేర్కొన్నారు. కాగా వయసు సంబంధిత సమస్యలతో దిలీప్ కుమార్ ముంబై ఆసుపత్రిలో బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. భారతీయ సినిమా 'కోహినూర్' గా భావించే మొహమ్మద్ యూసుఫ్ ఖాన్, స్క్రీన్ పేరు దిలీప్ కుమార్‌గా ప్రపంచానికి సుపరిచితుడు. 1966లో ఆయన సైరా బానును వివాహమాడారు. -
22 ఏళ్ల వ్యత్యాసం.. ఎప్పటికీ తల్లి కాలేరు.. అయినా!
Dilip Kumar Saira Banu Love Story(సాక్షి, వెబ్‌డెస్క్): వయసులో ఇరవై రెండేళ్ల వ్యత్యాసం.. అయితేనేం అన్యోన్య దాంపత్యం వారిది. తరతరాలకు స్ఫూర్తినిచ్చే అద్భుతమైన ప్రేమ కథకు ఆ జంట ప్రాణం పోసింది. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా 54 ఏళ్ల పాటు కలిసే జీవన ప్రయాణాన్ని కొనసాగించింది. చిన్న చిన్న అపార్థాలకే విడాకులు తీసుకుంటారనే అపవాదు ఉన్న సినీ ఇండస్ట్రీలోనే వారూ ఉన్నారు. కానీ అభిప్రాయ భేదాలు తలెత్తినా సర్దుకుపోయారే తప్ప ఒకరి చేయి ఒకరు వీడలేదు. ఆయన మరొకరిని పెళ్లాడినా.. ఆమె అర్థం చేసుకున్నారే తప్ప అడ్డుచెప్పలేదు. ఆమె సహనం వహించింది. ఆయన తప్పు తెలుసుకున్నాడు. పొరపొచ్చాలు తొలగిపోయాయి. ఎప్పటిలాగే వారి అనుబంధం కొనసాగింది. కానీ ఇప్పుడు మృత్యువు వారిని విడదీసింది. బాలీవుడ్ ట్రాజెడీ కింగ్‌గా పేరొందిన దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ శాశ్వతంగా లోకాన్ని వీడి వెళ్లారు. లక్షలాది మంది అభిమానులతో పాటు భార్య సైరా బానుకు తీరని దుఃఖం మిగిల్చారు. పన్నెండేళ్ల వయసులోనే దిలీప్‌తో ప్రేమలో పడ్డ సైరా! అప్పటికే దిలీప్ కుమార్ బాలీవుడ్లో స్టార్‌గా ఎదిగారు. 1944లో జ్వర్ భాతా సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చిన ఆయన.. 1955 నాటికి ఆజాద్, దేవదాస్ సినిమాలతో బిగ్గెస్ట్ హిట్లతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. వారిలో సైరా బాను కూడా ఒకరు. ఆయనంటే ఆరాధన ఆమెకు. 'మొఘల్-ఎ-ఆజామ్' సినిమా సమయంలో దిలీప్‌ను కలవాలని ఎంతగానో ఆరాటపడ్డారు సైరా. కానీ కనీసం ఆమె వైపు చూడను కూడా చూడలేదాయన. ఆమె చిన్నబుచ్చుకుంది. అయితే, కొన్నాళ్ల తర్వాత ఆమె కోరిక నెరవేరింది. ఎట్టకేలకు ఆయనను కలిసే భాగ్యం లభించింది. సైరాను చూసి చిరునవ్వు చిందించాడు దిలీప్. గాల్లో తేలిపోయిందామె. మనసంతా ఆనందంతో నిండిపోయింది. ఏదో ఒకరోజు దిలీప్‌ను పెళ్లి చేసుకుని భార్యను కావడం తథ్యం అని ఆనాడే బలంగా నమ్మింది. దిలీప్ పెద్దగా ఇంట్రస్ట్ చూపలేదు.. కానీ తన తల్లి, నటి నసీం బాను వారసత్వంతో బీ-టౌన్లో అడుగుపెట్టింది సైరా. ఎంతో మందికి జోడీగా నటించింది. అవేమీ ఆమె మనసుకు తృప్తినివ్వలేదు. ఎలాగైనా దిలీప్‌తో జోడీ కట్టాలి.. ఆయనకు జంటగా కనిపించాలి అని తహతహలాడేది. కానీ, దిలీప్ కుమార్ మాత్రం పెద్దగా ఆసక్తి కనబరచలేదు. తన పక్కన సైరా మరీ చిన్నదానిలా కనిపిస్తుందని ఆయన భావన. అయినా ఎన్నాళ్లని తప్పించుకుంటారు.. సైరా అందం, ఆకర్షణీయ రూపానికి ఎలా ఫిదా కాకుండా ఉంటారు. అలాంటి ఒకరోజు రానే వచ్చింది. ఆనాడు కారులో వెళ్తున్న సమయంలో.. ఓ పూదోటలో సైరాను చూశాడు దిలీప్ కుమార్. చీరకట్టులో నిండైన రూపంతో నిల్చుని ఉన్న ఆమెను చూసి, ‘‘ఇన్నాళ్లు నేను కాదనుకుంటోంది ఈ అందాల రాశినా! తను చిన్నపిల్ల కాదు. పరిపూర్ణ మహిళ. తనతో కలిసి నటించాల్సిందే’’ అనుకున్నాడు ఆయన. వెంటనే కారు దిగి, సైరాతో కరచాలనం చేశాడు. ఆనాటి నుంచి 54 ఏళ్ల వరకు ఆమె చేతిని వీడలేదు. కలిసి నటించారు.. అనుబంధాన్ని పెనవేసుకున్నారు సగీనా మహతో, చోటీ బహూ, దునియా వంటి చిత్రాల్లో జంటగా నటించారు దిలీప్- సైరా బాను. ఆ సమయంలో వారి మధ్య పరిచయం, గాఢమైన స్నేహంగా మారింది. కూతురి మనసు తెలుసుకున్న సైరా తల్లి నసీం బాను.. వీరిద్దరిని మరింత చేరువ చేసింది. వారి అనుబంధానికి వారధిగా నిలిచింది. ఈ క్రమంలో.. ఓ శుభ ముహూర్తాన దిలీప్.. సైరా ముందు తన మనసులోని మాటను బయటపెట్టారు. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైంది సైరా. అతడి ప్రేమను మనస్ఫూర్తిగా ఆమె అంగీకరించింది. 22 ఏళ్ల వ్యత్యాసం.. ఎప్పటికీ తల్లి కాలేరు 1966లో ఇద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అప్పటికి సైరాకు 22 ఏళ్లు. దిలీప్ కుమార్ వయస్సు 44. ఇద్దరి మధ్యా 22 ఏళ్ల వ్యత్యాసంపై ఎన్నో విమర్శలు వినిపించాయి. వీరి బంధం మూణ్ణాళ్ల ముచ్చటే అనే పెదవి విరుపులు. కానీ, అది తప్పని నిరూపించారు ఇద్దరూ. ఇక పెళ్లి తర్వాత కూడా సైరా కొన్నాళ్ల పాటు సినిమాల్లో నటించారు. పెద్ద హీరోలతో కలిసి పనిచేశారు కూడా. ఇటు కెరీర్, అటు వైవాహిక జీవితం సాగిపోతోందనుకుంటున్న సంతోష సమయంలో ఓ పెద్ద కుదుపు. 1972లో గర్భవతి అయ్యారు సైరా. ఇద్దరూ ఆనందంలో తేలిపోయారు. చిన్నారి రాకకోసం వేయి కళ్లతో ఎదురుచూశారు. కానీ, విధిరాత మరోలా ఉంది. ఎనిమిదో నెలలో సైరాకు గర్భస్రావం అయ్యింది. ఈ క్రమంలో తలెత్తిన అనారోగ్య సమస్యల వలన ఆమె ఎప్పటికీ తల్లికాలేరని నిర్ధారించారు వైద్యులు. పలువురితో సంబంధాలు.. రెండో వివాహం ఎప్పుడైతే సైరా ఇక గర్భవతి కాలేరన్న నిజం ప్రపంచానికి తెలిసిందో.. అప్పటి నుంచి పలువురు బాలీవుడ్ నటీమణులతో కలిపి దిలీప్ కుమార్ పేరు వినిపించేది. ఆయన మరో పెళ్లికి సిద్ధమయ్యారనేది ఆ వార్తల సారాంశం. వీటన్నిటిని చూసి, సైరాకు దుఃఖం పొంగుకొచ్చేది. దిలీప్ ఎప్పటికీ తన చేయి వీడడని మనసు ఎంతగా చెబుతున్నా.. ఎక్కడో ఏదో అనుమానం. ఊహించిందే నిజమైంది. ఆస్మా రెహమాన్ వారి జీవితాల్లో ప్రవేశించింది. పెద్ద తప్పు చేశాను.. దిలీప్ పశ్చాత్తాపం హైదరాబాద్‌లో ఓ క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన సమయంలో ఆస్మాను కలిశాడు దిలీప్. ఆయన సోదరీమణులు ఫౌజియా, సయీదాలకు స్నేహితురాలు ఆమె. వారే తనను దిలీప్‌నకు పరిచయం చేశారు. అప్పటికే ఆస్మా.. ముగ్గురు పిల్లల తల్లి. అయినా ఎందుకో దిలీప్ కుమార్ ఆమె వైపు ఆకర్షితుడయ్యాడు. ఆస్మాను పెళ్లాడాడు. కానీ, ఆ బంధం రెండేళ్లకే ముగిసిపోయింది. ఆస్మాకు విడాకులు ఇచ్చి మళ్లీ సైరా చెంతకే చేరాడు దిలీప్ కుమార్. జీవితంలో తను రెండో పెళ్లి చేసుకుని పెద్ద తప్పు చేశానని, కొన్ని అనివార్య కారణాలు, ఒత్తిడి వల్లే అలా చేయాల్సి వచ్చిందని, ఆ చేదు జ్ఞాపకాలను మరిచిపోవాలనుకుంటున్నానని దిలీప్ తన ఆటోబయోగ్రఫీలో రాసుకున్నారు. నాకు ఆయనే సర్వస్వం.. అందుకే నిజానికి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తనను కాదని వేరే మహిళను జీవితంలో ఆహ్వానిస్తే ఏ భార్య మళ్లీ ఆ భర్తను క్షమించదు. కానీ, సైరా బాను ప్రేమ అనిర్వచనీయం, అనంతమైనది కదా. అందుకే ఆమె మళ్లీ మనస్ఫూర్తిగా దిలీప్ కుమార్‌ను భర్తగా అంగీకరించింది. ‘‘నాకు ఎల్లప్పుడూ ఆయనే సర్వస్వం. నా జీవితంలో ఆయన ఒక్కరే. ఒక అభిమానిగా, భార్యగా ఆయనను ఆరాధించాను. నాకు తెలుసు ఎంతో మంది అందమైన అమ్మాయిలు ఆయనను పెళ్లి చేసుకోవాలని కలలు కన్నారు. కానీ.. ఆయన నన్ను తన జీవితభాగస్వామిగా ఎంచుకున్నారు. నా కలలన్నీ నిజం చేశారు. ఆయనను ఎలా వదులుకోగలను’’ అంటూ ఒకానొక సందర్భంలో భర్తపై తనకున్న అవ్యాజమైన ప్రేమను చాటుకున్నారు సైరా. దిలీప్ సైతం.. ‘‘నువ్వు ఆ చందమామ కూతురువి. నాకోసం స్వర్గం నుంచి దిగివచ్చావు’’ అంటూ వీలు కుదిరినప్పుడల్లా ఆమెపై ప్రేమ కురిపించేవారు. కానీ, ఇప్పుడు ఆమెను ఇక్కడ వదిలి ఆయనే స్వర్గలోకాలకు వెళ్లిపోయారు. తన ప్రియసఖిని విషాదంలో ముంచివేశారు! -
మూగబోయాను..సైరా భాభీ మీకు నమస్కారం!
సాక్షి, ముంబై: బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ మరణంతో సీనీరంగంతో పాటు, యావత్ ప్రపంచం తీవ్ర దిగ్బ్రాంతి లోనైంది. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. దీంతో సోషల్ మీడియాలో ‘ఆర్ఐపీ దిలీప్ సాబ్’ ట్రిండింగ్‌లో నిలిచింది. దిలీప్ అస్తమయంపై పలువురు నటీనటులతో పాటు ప్రసిద్ధ గాయని లతా మంగేష్కర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘యూసుఫ్ భాయ్ తన చిన్న సోదరిని విడిచి వెళ్లిపోయారు..నాకేమీ తోచడం లేదు.. చాలా బాధగా ఉంది... మీ జ్ఞాపకాలు ముప్పిరిగొన్నాయి..మౌనం ఆవహించింది’ అంటూ సోషల్ మీడియా ద్వారా తన సంతాపాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా దిలీప్ సతీమణి సైరా బానుపై గౌరవంతో లతాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్న యూసుఫ్ భాయ్‌కి సైరా భాభి ఎంతో సేవచూశారు. ఎవర్నీ గుర్తించలేని స్థితిలో ఉన్న ఆయనను రాత్రి పగలూ కంటికి రెప్పలా కాపాడుకున్న సైరాబానుకు నమస్కరిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. యూసుఫ్ భాయ్ ఆత్మకు శాంతికలగాలని ప్రార్థిస్తున్నాన్నారు. ఈ సందర్భంగా దిలీప్ కుమార్‌తో తన కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ఇంకా బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ, టాలీవుడ్ హీరోయిన్ తమన్నా తదితరులు దిలీప్ కుమార్ మరణంపై సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. దిలీప్ సాబ్ అల్విదా అంటూ సంతాపం తెలిపిన షబానా, ఆయనకు తాను ఏకలవ్య శిష్యురాలనని చెప్పుకున్నారు. అంతేకాదు. దిలీప్‌జీ నిమాలకు, భాషకు, డిగ్నీటీతోపాటు సామాజిక బాధ్యత వహించినందుకు కూడా ఆమె ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు భర్తను కోల్పోయిన సైరా బాను తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సహచరుడి పార్థివదేహం వద్ద కన్నీరు పెడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు, పలువురు ఓదార్చారు. pic.twitter.com/nPwM4myyOJ — Lata Mangeshkar (@mangeshkarlata) July 7, 2021 यूसुफ़ भाई पिछले कई सालों से बिमार थे, किसीको पहचान नहीं पाते थे ऐसे वक़्त सायरा भाभीने सब छोड़कर उनकी दिन रात सेवा की है उनके लिए दूसरा कुछ जीवन नहीं था. ऐसी औरत को मैं प्रणाम करती हूँ और यूसुफ़ भाई कीं आत्मा को शान्ति मिले ये दुआ करती हूँ. — Lata Mangeshkar (@mangeshkarlata) July 7, 2021 Adieu Dilip Saab . Unknown to you I have been your Eklavya.Thank you for the movies.Thank you for the language . Thank you for the dignity . Thank you for being socially responsible.Thank you🙏🙏 pic.twitter.com/P5UeMUOQ8t — Azmi Shabana (@AzmiShabana) July 7, 2021 -
దిలీప్ సాబ్ నా శ్వాస
బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ఆయన చాలా నీరసంగా ఉంటున్నారు. ఈ విషయాన్ని ఆయన భార్య, నటి సైరా బాను ఓ ఇంటర్వ్యూలో భాగంగా తెలిపారు. దిలీప్ కుమార్ ఆరోగ్యం గురించి సైరా బాను మాట్లాడుతూ– ‘‘దిలీప్ సాబ్ ఈ మధ్య చాలా నీరసంగా ఉంటున్నారు. ఆయన రోగ నిరోధక శక్తి కూడా చాలా తక్కువగా ఉంది. ఇంట్లో తన గదిలో నుంచి హాలు వరకూ నడవగలుగుతున్నారు. గడుస్తున్న ప్రతీ రోజునీ ఒక అదృష్టంగా భావిస్తున్నాం. అందుకే ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఆయన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాం. ఏదో అభినందనల కోసమో, అంకితభావం ఉన్న భార్య అనిపించుకోవాలనో ఆయన్ను చూడటంలేదు. ఆయన్ను తాకడం, హత్తుకోవడం నా జీవితంలో జరుగుతున్న గొప్ప విషయాలుగా భావిస్తాను. దిలీప్ సాబ్ అంటే నాకంత ఆరాధన. ఆయనే నా శ్వాస. ఆయన ఆరోగ్యం కోసం అభిమానులందరూ ప్రార్థించండి’’ అని అన్నారు. డిసెంబర్ 11తో దిలీప్ కుమార్‌కి 98 ఏళ్లు వస్తాయి. 1966 అక్టోబర్ 11న దిలీప్ కుమార్, సైరా బాను వివాహం జరిగింది. -
దిలీప్ బాగానే ఉన్నారు
బాలీవుడ్ పాత తరం సూపర్ స్టార్ దిలీప్ కుమార్ ఆరోగ్యంపై రోజుకో వార్త బయటకు వస్తోంది. తాజాగా ఆయన న్యుమోనియాతో బాధపడుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు ఆయన సతీమణి, నటి సైరా భాను. ‘‘దిలీప్ కుమార్‌గారు న్యుమోనియాతో బాధపడుతున్నారన్నది అబద్ధం. ఆ వార్త కేవలం పుకారు మాత్రమే. ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. ఇంట్లోనే ఉంటున్నారు. సాధారణ జలుబు, దగ్గుతో బాధపడుతున్నారాయన. ప్రస్తుతం కోలుకుంటున్నారు’’ అని సైరా భాను పేర్కొన్నారు. ఈ నెల మొదట్లో దిలీప్ ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రిలో చేరితే న్యుమోనియాతో బాధపడుతున్నట్టు వార్తలు మొదలయ్యాయి. అందుకే సైరా అదేం కాదని స్పష్టం చేశారు. -
కుదుటపడ్డ దిలీప్‌కుమార్.. నేడు డిశ్చార్జి
బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ (93) ఆరోగ్యం కుదుటపడింది. శ్వాసకోశ సమస్యలతో ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరిన ఆయనను బుధవారం సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తున్నారు. ఏప్రిల్ 15న ఆయన ఆస్పత్రిలో చేరారు. సాయంత్రం 4 గంటలకు ఆయనను డిశ్చార్జి చేస్తామని ఆయనకు చికిత్స అందిస్తున్న డాక్టర్ జలీల్ పార్కర్ తెలిపారు. ట్రాజెడీ కింగ్‌గా పేరున్న దిలీప్‌కుమార్ తీవ్రమైన జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతుండటంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చినట్లు ఆయన భార్య, అలనాటి హీరోయిన్ సైరా బాను అంతకుముందు చెప్పారు. దిలీప్ కుమార్ అసలుపేరు యూసుఫ్ ఖాన్. ఆయన ఆరు దశాబ్దాల పాటు బాలీవుడ్ తెరను ఏలారు. చిట్టచివరగా 1998లో ఖిలా సినిమాలో నటించారు. 1994లో దాదాసాహెబ్ ఫాల్కే, 2015లో పద్మవిభూషణ్ అవార్డులు ఆయనను వరించాయి. -
సైరాబాను మనవరాలి తెరంగేట్రం..
సైరాబాను మనవరాలు సయేషా త్వరలోనే తెరంగేట్రం చేయనుంది. అజయ్ దేవ్‌గణ్ తన సొంత సంస్థ ‘ఎఫ్ ఫిలిమ్స్ అండ్ ఎరోస్’ బ్యానర్‌పై రూపొందించనున్న యాక్షన్ చిత్రం ‘శివే’ కోసం సయేషాను ఎంపిక చేసుకున్నాడు. మరో విశేషమేమంటే... ఈ చిత్రానికి అజయ్ స్వయంగా దర్శకత్వం వహించనున్నాడు. దర్శకుడిగా అజయ్‌కి ఇది రెండో చిత్రం. తన భార్య కాజోల్ కథానాయికగా 2008లో ‘యా, మీ ఔర్ హమ్’ చిత్రం తీశాడు. అది ఫ్లాప్ అయింది. దీంతో దర్శకత్వానికి దూరంగా ఉన్న అజయ్ దేవ్‌గణ్, ఇన్నాళ్ల వ్యవధి తర్వాత దర్శకత్వం చేపట్టేందుకు సిద్ధవువుతున్నాడు.