దిలీప్‌ బాగానే ఉన్నారు | Saira Banu shares update on Dilip Kumar's health | Sakshi
Sakshi News home page

దిలీప్‌ బాగానే ఉన్నారు

Published Tue, Oct 30 2018 3:16 AM | Last Updated on Wed, Apr 3 2019 7:07 PM

Saira Banu shares update on Dilip Kumar's health - Sakshi

దిలీప్‌ కుమార్‌, సైరా భాను

బాలీవుడ్‌ పాత తరం సూపర్‌ స్టార్‌ దిలీప్‌ కుమార్‌ ఆరోగ్యంపై రోజుకో వార్త బయటకు వస్తోంది. తాజాగా ఆయన న్యుమోనియాతో బాధపడుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు ఆయన సతీమణి, నటి సైరా భాను. ‘‘దిలీప్‌ కుమార్‌గారు న్యుమోనియాతో బాధపడుతున్నారన్నది అబద్ధం. ఆ వార్త కేవలం పుకారు మాత్రమే. ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. ఇంట్లోనే ఉంటున్నారు. సాధారణ జలుబు, దగ్గుతో బాధపడుతున్నారాయన. ప్రస్తుతం కోలుకుంటున్నారు’’ అని సైరా భాను పేర్కొన్నారు. ఈ నెల మొదట్లో దిలీప్‌ ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రిలో చేరితే న్యుమోనియాతో బాధపడుతున్నట్టు వార్తలు మొదలయ్యాయి. అందుకే సైరా అదేం కాదని స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement