Dileep kumar
-
యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా ‘సన్నాఫ్ సునామి’
దిలీప్ కుమార్ రాథోడ్, అరవిందా అగర్వాల్, షణ్ణు హీరోహీరోయిన్లుగా చిత్తజల్లు ప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సన్నాఫ్ సునామి'. శత్రువుల గుండెల్లో దడ ట్యాగ్ లైన్. కృష్ణ ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ నేడు హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభం అయింది. నటీనటులపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు రామకృష్ణ గౌడ్ క్లాప్ ఇచ్చి ప్రారంభించారు.ఆయన మాట్లాడుతూ.. సన్నాఫ్ సునామి నటీనటులు బాగా నటించే వారే. ఈ సినిమా కాన్సెఫ్ట్ చాలా బాగుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సినిమా యూనిట్ కు మంచి పేరు వస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా దర్శక నిర్మాతలకు మా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ద్వారా పూర్తి సహాకారం అందిస్తాము. సినిమా రిలీజ్‌కు పూర్తి సహాకారం అందిస్తామని తెలిపారు. ‘ఈ సినిమా ద్వారా నాకే కాదు, నా తోటి నటీనటులకు మంచి పేరు వస్తుంది’అని అన్నారు హీరో దిలీప్ కుమార్. ఈ కార్యక్రమంలో హీరోయిన్స్ అరవింద అగర్వాల్, షణ్ణు , నిర్మాత కృష్ణ ప్రసాద్ , సంగీత దర్శకుడు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆస్కార్ అవార్డు కమిటీపై ఇండియన్ ఫ్యాన్స్ ఫైర్, కారణం ఇదే
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులు 2022 ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా ముగిసింది. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సీనీ ప్రముఖులు పాల్గొన్నారు. క్రిస్ రాక్ చెంపను విల్ స్మిత్ పగలగొట్టడం లాంటి చిన్న చిన్న వివాదాలు మినహా.. కార్యక్రమం అంతా అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఆస్కార్ అవార్డు కమిటీపై ఇండియన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణంగా.. ఆస్కార్ అవార్డ్స్ ‘ఇన్ మెమోరియమ్’ విభాగంలో దివంగత ప్రముఖ గాయని లతా మంగేష్కర్, దివంగత ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ పేర్లను ప్రస్తావించకపోవడమే. 93వ ఆస్కార్ అవార్డ్స్ (2021) సమయంలో రిషీ కపూర్, ఇర్ఫాన్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్ పుత్‌లకు ఆస్కార్ ‘ఇన్ మెమోరియమ్’లో స్థానం కల్పించిన నేపథ్యంలో ఈ ఏడాది లతా మంగేష్కర్, దిలీప్ కుమార్‌లను విస్మరించడంతో ఆస్కార్ కమిటీ మెమరీ (జ్ఞాపక శక్తి) లో వీళ్లిద్దరూ లేరా? అనే చర్చ మొదలైంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకూ వచ్చిన చిత్రాలకు ఆస్కార్ బరిలో నిలిచే అవకాశం ఉంది. ‘ఇన్ మెమోరియమ్’ని కూడా ఆ ప్రాతిపదికన తీసుకుంటే... లతా మంగేష్కర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో కన్ను మూశారు కాబట్టి ఆమె పేరుని ప్రస్తావించలేదని ఆస్కార్ వివరణ ఇచ్చుకోవడానికి లేదు. ఎందుకంటే గత ఏడాది జూలైలో మరణించిన దిలీప్ కుమార్‌ని అయినా ప్రస్తావించాలి కదా.. సో.. ఆస్కార్ చేసినది ముమ్మాటికీ తప్పిదమే అన్నది నెటిజన్ల మాట. -
ఆస్పత్రిలో చేరిన దిలీప్ కుమార్ సతీమణి
దివంగత, బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ సతీమణి సైరా బాను మూడు రోజుల క్రితం రక్తపోటు సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ఆమె పరిస్థితి విషమించడంతో ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో చెర్పించినట్లు కుటుంబ సన్నిహితులు మీడియాకు వెల్లడించారు. దీంతో వైద్యులు ఆమెను ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కీ (ఐసియు) తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా జూలై 7ను ఆమె భర్త, నటుడు దిలీప్ కుమార్ మరణించిన సంగతి తెలిసిందే. సైరా బాను ఇటీవల తన భర్త దిలీప్ కుమార్‌ను కోల్పోవడంతో అనారోగ్యానికి గురయ్యారని ఆమె సన్నిహితులు చెప్పారు. కాగా సైరా-దిలీప్లది ప్రేమ వివాహం. వారి వైవాహిక బంధంలో దిలీప్‌కు సైరా వెన్నుముకగా నిలిచారు. ఆయన ఆనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినప్పుడు దగ్గరుండి ఆమె సేవలు చేశారు. -
ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్ కన్నుమూత
-
దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ కన్నుమూత
ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్(98) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని హిందుజా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన బుధవారం ఉదయం 7.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. నేడు సాయంత్రం ఐదు గంటలకు ముంబైలోని జుహులో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మరణం పట్ల చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇటీవలే ఆయన శ్వాస సంబంధిత సమస్యలతో ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేరగా ప్లూరల్ యాస్పిరేషన్’ (ఊపిరితిత్తుల్లో చేరిన నీటిని తొలగించడం) ప్రొసీజర్ నిర్వహించారు. కానీ మళ్లీ తీవ్ర అస్వస్థతకు లోనవడంతో ప్రాణలు విడిచారు. గతేడాది దిలీప్ కుమార్ సోదరులు అస్లాంఖాన్, ఇషాన్ ఖాన్లు కరోనాతో ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. ఈ విషాదం నుంచి కోలుకోక ముందే దిలీప్ కూడా కన్నుమూయడంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. దిలీప్ కుమార్ 1922 డిసెంబర్ 11న పాకిస్తాన్‌లోని పెషావర్‌లో జన్మించారు. ఆయన అసలు పేరు మహమ్మద్ యూసుఫ్ ఖాన్. బాంబే టాకీస్ యజమాని ఈయనకు దిలీప్ కుమార్ అని నామకరణం చేశాడు. సినిమాల్లోకి రాకముందు దిలీప్ తండ్రితో కలిసి పండ్లు అమ్మారు. ఆ తర్వాత 1944లో జ్వర్ భాతా చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. 1955లో ఆజాద్, దేవదాస్ సినిమాలతో బిగ్గెస్ట్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. 'ఆజాద్' ఆ దశాబ్దిలోనే అధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డుకెక్కింది. ఆ తర్వాత వచ్చిన పౌరాణిక చిత్రం 'మొఘల్-ఎ-ఆజామ్'తో ఆయన ప్రేక్షకులకు ఆయన మరింత చేరువయ్యారు. ఓరకంగా చెప్పాలంటే 1944 నుంచి 1998 వరకు దిలీప్ కుమార్ చిత్రసీమను ఏలారనే చెప్పాలి. ఉత్తమ నటుడిగా ఆయనకు 8 సార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 1993లో ఫిలింఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు దక్కింది. 1994లో దిలీప్‌కుమార్‌ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. ఈ దిగ్గజ నటుడి సేవలను గుర్తించిన ప్రభుత్వం 1991లో పద్మభూషణ్, 2015లో పద్మవిభూషణ్ పురస్కారాలతో ఆయనను సన్మానించింది. 1998లో దిలీప్‌కుమార్‌ను నిషాన్-ఇ-ఇంతియాజ్ అవార్డుతో పాక్ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. 2000 - 2006 వరకు రాజ్యసభ సభ్యుడిగానూ దిలీప్ కుమార్ సేవలందించారు. భారతీయ చిత్రసీమకు మెథడ్ యాక్టింగ్ టెక్నిక్ పరిచయం చేసిన ఆయన సినిమా రంగంలోనే గొప్ప నటుడిగా గుర్తింపు సాధించారు. -
నటుడు దిలీప్ కుమార్ ఆరోగ్యంపై అప్డేట్ ఇదే..
శ్వాస సంబంధిత సమస్యలతో బాలీవుడ్ ప్రముఖ నటులు దిలీప్‌కుమార్ ఇటీవల ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దిలీప్‌కుమార్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. బుధవారం ఆయనకు ‘ప్లూరల్ యాస్పిరేషన్’ (ఊపిరితిత్తుల్లో చేరిన నీటిని తొలగించడం) ప్రొసిజర్ జరిగింది. దిలీప్ కుమార్ బాగున్నారని ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్ ఫైజల్ ఫరూకి తెలిపారు. ‘‘వైద్యులు నితిన్ గోఖలే, జలీల్ పార్కర్‌తో నేను మాట్లాడాను. దిలీప్‌గారి ఆరోగ్యం నిలకడగా ఉందని వారు పేర్కొన్నారు. దిలీప్ని ఇవాళ (గురువారం) డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది’’ అని ఫైజల్ పేర్కొన్నారు. ఆయన చెప్పిన ఈ విషయం దిలీప్ కుమార్ అధికారిక ట్విటర్ ఖాతాలో కూడా పోస్ట్ అయ్యింది. -
బాలీవుడ్ నటుల ఇళ్లు కొంటాం: పాక్
ఇస్లామాబాద్: బాలీవుడ్ నటులు రాజ్ కపూర్, దిలీప్ కుమార్ల పూర్వీకుల ఇళ్లను కొనుగోలు చేయాలని పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా తాత్కాలిక ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఇవి శిథిలావస్థలో ఉన్నాయి. చారిత్రక ప్రాధాన్యం గల వీటిని కూల్చివేయకుండా.. నేషనల్ హెరిటేజ్‌గా గుర్తించేందుకు అధికారులు యత్నిస్తున్నారు. ఖైబర్ పఖ్తున్ఖ్వా పురావస్తు శాఖ ఈ రెండు భవనాలను కొనుగోలు చేయడానికి తగిన నిధులు కేటాయించాలని నిర్ణయించింది. ఈ భవనాలు పెషావర్ నగరం నడిబొడ్డున ఉన్నాయి. వీటి ధరను నిర్ణయించడానికి పెషావర్ డిప్యూటీ కమిషనర్‌కు ఒక లేఖ పంపారు. రాజ్ కపూర్ పూర్వీకుల నివాసాన్ని కపూర్ హవేలీ అని పిలుస్తారు. ఇది కిస్సా ఖ్వానీ బజార్లో ఉంది. దీనిని 1918-22 మధ్య కాలంలో దిగ్గజ నటుడి తాత దేవాన్ బాషేశ్వర్నాథ్ కపూర్ నిర్మించారు. రాజ్ కపూర్, అలానే అతని మామ త్రిలోక్ కపూర్ ఈ భవనంలో జన్మించారు. దీనిని ప్రాంతీయ ప్రభుత్వం జాతీయ వారసత్వంగా ప్రకటించింది.(చదవండి: గిల్గిత్ బాల్టిస్తాన్‌పై పాక్ పన్నాగం) ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ 100 సంవత్సరాల పురాతన పూర్వీకుల ఇల్లు కూడా అదే ప్రాంతంలో ఉంది. ఈ ఇల్లు కూడా శిథిలావస్థలో ఉంది. 2014 లో అప్పటి నవాజ్ షరీఫ్ ప్రభుత్వం దీనిని జాతీయ వారసత్వంగా ప్రకటించింది. రెండు భవనాల యజమానులు గతంలో వీటిని పడగొట్టి కమర్షియల్ ప్లాజాలను నిర్మించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. అయితే చారిత్రక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని వాటిని సంరక్షించాలని పురావస్తు శాఖ భావించింది. దాంతో అలాంటి ప్రయత్నాలు ఆగిపోయాయి. అయితే, కపూర్ హవేలీ యజమాని అలీ ఖాదర్ మాట్లాడుతూ.. ఈ భవనాన్ని కూల్చివేయడానికి తాను ఇష్టపడనని, దేశ గౌరవానికి చిహ్నంగా ఉన్న ఈ చారిత్రాత్మక నిర్మాణాన్ని పరిరక్షించాలని పురావస్తు శాఖ అధికారులతో అనేక సార్లు విన్నవించానని తెలిపారు. దీన్ని ప్రభుత్వానికి అమ్మేందుకు యజమాని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రభుత్వం నుంచి 200 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు సమాచారం.(చదవండి: బాలీవుడ్ నటుడి ఇంట మరో విషాదం) ఈ ఏడాది ముంబైలో మరణించిన రిషి కపూర్ చేసిన అభ్యర్థనను దృష్టిలో ఉంచుకుని కపూర్ హవేలీని మ్యూజియంగా మార్చాలని 2018 లో పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించింది. రెండు సంవత్సరాల కాలం గడిచినప్పటికీ ఈ ప్రకటన ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఇవేకాక పెషావర్‌లో సుమారు 1,800 చారిత్రాత్మక నిర్మాణాలు ఉన్నాయి. ఇవన్ని 300 సంవత్సరాలకు పూర్వం నాటివి. -
బాలీవుడ్ నటుడి ఇంట మరో విషాదం
బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్‌ను విషాదాలు వెంటాడుతున్నాయి. కరోనా బారిన పడ్డ ఆయన మరో సోదరుడు ఇషాన్ ఖాన్(90) బుధవారం అర్ధరాత్రి ప్రాణాలు విడిచారు. ఈ విషయాన్ని ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యుడు డా.జలీల్ పార్కర్ ధ్రువీకరించారు. కాగా గత నెలలోనే దిలీప్‌కుమార్ సోదరులు అస్లాంఖాన్, ఇషాన్ ఖాన్లు కోవిడ్ లక్షణాలతో ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరారు. పరీక్షలు నిర్వహించగా ఇద్దరికీ పాజిటివ్ రావడంతో వెంటనే కరోనా వార్డుకు తరలించి చికిత్స అందించారు. (చదవండి: ప్లాస్మా దానానికి భయపడక్కర్లేదు) ఇద్దరికి అనారోగ్య సమస్యలు ఉండటంతో వైద్యులు వారిని ఐసీయూకి తరలించి చికిత్స అందించారు. వారికి ఆక్సిజన్ లెవల్స్ కూడా తక్కువగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ క్రమంలో ఆగస్టు 21న పరిస్థితి విషమించి అస్లాం ఖాన్ చనిపోయారు. ఈ ఘటన మరువకముందే మరో సోదరుడు ఇషాన్ ఖాన్ మరణించడంతో దిలీప్ కుమార్ ఇంట విషాదం నెలకొంది. ఆయనను కొంతకాలంగా గుండెజబ్బు, అధిక రక్తపోటు వంటి సమస్యలు వేధిస్తున్నాయి. ఇంతలో కరోనా రావడంతో ఆరోగ్యం మరింత క్షీణించి తుది శ్వాస విడిచారు. (చదవండి: నటుడు దిలీప్‌కుమార్ సోదరుడు మృతి) -
నటుడు దిలీప్‌కుమార్ సోదరుడు మృతి
ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్ సోదరుడు అస్లాంఖాన్ శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కరోనా సోకడంతో పాటు ఇంతకుముందే బీపీ, షుగర్, గుండెజబ్బు లాంటి అనారోగ్య సమస్యలు ఉండటంతో పరిస్థితి విషమించి మరణించారు. గతవారం దిలీప్‌కుమార్ సోదరులు అస్లాంఖాన్, ఇషాన్ ఖాన్లు కోవిడ్ లక్షణాలతో ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరారు. పరీక్షలు నిర్వహించగా ఇద్దరికీ కరోనా ఉన్నట్లు నిర్దారణ కావడంతో వెంటనే కరోనా వార్డుకు తరలించి చికిత్స అందించారు. అప్పటికే శ్వాసతీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడుతుండటంతో పాటు వారి ఆక్సిజన్ లెవల్స్ కూడా 80% కంటే తక్కువగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. దీంతో వెంటనే ఐసీయూకి తరలించి చికిత్స అందించామని, వయసు పైబడటం, తీవ్ర అనారోగ్య సమస్యలు ఉండటంతో పరిస్థితి విషమించి అస్లాం ఖాన్ చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇషాన్ ఖాన్ వయసు 90 సంవత్సరాలు కాగా, అస్లాం ఆయన కంటే చిన్నవాడని తెలిపారు. (రియా, మహేష్ భట్ల వాట్సాప్ చాట్ వైరల్) -
నర్సంపేటలో ఆర్మీ జవాన్ ప్రేమ్‌కుమార్ హత్య
-
బిల్డర్‌తో వివాదం.. ప్రధాని సాయం కోరిన నటి
తన భర్త నివాసానికి సంబంధించిన ఓ వివాదం విషయమై ప్రధాని నరేంద్ర మోదీ సాయాన్ని అర్థించాలని భావిస్తున్నారు అలనాటి బాలీవుడ్ నటి సైరాబాను. వివరాలు.. ముంబై బాంద్రా ఏరియాలో నటుడు దిలీప్ కుమార్‌కు విలాసవంతమైన భవనం ఉంది. అయితే సమీర్ భోజ్వానీ అనే బిల్డర్ నకిలీ పత్రాలతో సదరు బిల్డింగ్‌ను ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు సైరాబాను ఆరోపించారు. గతంలో ఇదే విషయమై సదరు బిల్డర్ మీద సైరాబాను జనవరిలో కేసు పెట్టారు. ముంబయి పోలీసు విభాగానికి చెందిన ఆర్ధిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యు) అతడిపై కేసు నమోదు చేసింది. అంతకు ముందే అతడి నివాసంపై దాడులు నిర్వహించి కత్తులు, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకోవడమే కాక ఈ ఏడాది ఏప్రిల్‌లో అతన్ని అరెస్టు చేసింది. అయితే సదరు బిల్డర్ జైలు నుంచి విడుదల కావడంతో మళ్లీ తన ఇంటిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తాడని భావించిన సైరాబాను.. ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని భావించారు. దాంతో తన భర్త దిలీప్‌కుమార్ అధికారిక ట్విటర్ ద్వారా ‘ల్యాండ్ మాఫియా సమీర్ భోజ్వానీ జైలు నుంచి విడుదలయ్యాడు. ఇతని మీద సీఎం ఫడ్నవీస్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. డబ్బు, బలంతో అతను బెదిరిస్తున్నాడు. మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. భోజ్వానీ కొన్ని కీలకపత్రాలను ఫోర్జరీ చేయడం ద్వారా నాటి నటుడు దిలీప్‌కుమార్ బంగ్లాను చేజిక్కించుకునేందుకు యత్నిస్తున్నట్లు పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. Request from Saira Banu Khan: The Hon’ble @PMOIndia Shri @narendramodi Sir, Land Mafia Samir Bhojwani realeased from Jail. No Action Taken despite assurances by CM @Dev_Fadnavis Padma Vibhushit betrayed, Threatened by money n muscle power. Request meeting wth u in #mumbai — Dilip Kumar (@TheDilipKumar) December 16, 2018 -
దిలీప్ బాగానే ఉన్నారు
బాలీవుడ్ పాత తరం సూపర్ స్టార్ దిలీప్ కుమార్ ఆరోగ్యంపై రోజుకో వార్త బయటకు వస్తోంది. తాజాగా ఆయన న్యుమోనియాతో బాధపడుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు ఆయన సతీమణి, నటి సైరా భాను. ‘‘దిలీప్ కుమార్‌గారు న్యుమోనియాతో బాధపడుతున్నారన్నది అబద్ధం. ఆ వార్త కేవలం పుకారు మాత్రమే. ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. ఇంట్లోనే ఉంటున్నారు. సాధారణ జలుబు, దగ్గుతో బాధపడుతున్నారాయన. ప్రస్తుతం కోలుకుంటున్నారు’’ అని సైరా భాను పేర్కొన్నారు. ఈ నెల మొదట్లో దిలీప్ ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రిలో చేరితే న్యుమోనియాతో బాధపడుతున్నట్టు వార్తలు మొదలయ్యాయి. అందుకే సైరా అదేం కాదని స్పష్టం చేశారు. -
అమ్మలో కొలిక్కివచ్చిన వివాదం
-
భవిష్యత్తు బాగుండాలనే...
మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్త్రీ సమానత్వం కోసం, సురక్షితంగా పనిచేసే వాతావరణం ఏర్పాటు కోసం ‘ఉమెన్ ఇన్ సినిమా కలెక్టీవ్ (డబ్లు్యసీసీ)’ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో రేవతి, పార్వతి, రమ్య నింబసేన్, పద్మ ప్రియా ముఖ్య సభ్యులు. తాజాగా ఈ కమిటీ ‘అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ)’ అధ్యక్షుడు మోహన్‌లాల్ వైఖరిని ఖండిస్తూ ప్రెస్‌మీట్ నిర్వహించారు. లైంగిక వేధింపుల కేస్ ఉన్న దిలీప్‌ను ఎందుకు కాపాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మలయాళ నటి భావనపై లైంగిక దాడి కేసులో దిలీప్‌ను అరెస్ట్ చేశారు. అప్పుడు అతనికి ‘అమ్మ’ సభ్యత్వం తొలగించారు. మళ్లీ బెయిల్ మీద బయటకు రాగానే ఆ సభ్యత్వం పునరుద్ధరించిన సంగతి గుర్తుండే ఉంటుంది. బాధితులను సపోర్ట్ చేయకుండా అసోసియేషన్ నిందితులవైపు ఉండటమేంటి? అని ప్రశ్నించారు రేవతి. స్త్రీలను ఇండస్త్రీలో సమానంగా ట్రీట్ చేయాలని ఈ మీటింగ్‌లో కోరారు. ‘‘ఈ పోరాటమంతా భవిష్యత్తులో మహిళలు ఫిల్మ్ ఇండస్ట్రీలో సురక్షితంగా పని చేసుకోవడం కోసం’’ అని పేర్కొన్నారామె. -
దిలీప్‌కుమార్‌కు తీవ్ర అస్వస్థత
ముంబై : బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ (95) తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. న్యుమోనియా తిరగబెట్టడంతో దిలీప్ కుమార్‌ను ఆదివారం రాత్రి ఆస్పత్రిలో చేర్చారని, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు అభిమానులకు, శ్రేయోభిలాషులకు సమాచారం చేరవేస్తామని దిలీప్ కుమార్ కుటుంబ సన్నిహితుడు ఫైసల్ ఫరూఖి ట్వీట్ చేశారు. దిలీప్ కుమార్ ఆరోగ్యం క్షీణించిందని ఇటీవల వార్తలు రాగా, ఫైసల్ ఫరూఖి ఇవి వదంతులేనని తోసిపుచ్చారు. 1944లో జ్వర్ భటా మూవీతో సినీ రంగ ప్రవేశం చేసిన దిలీప్ కుమార్ ఐదు దశాబ్ధాల సుదీర్ఘ కెరీర్లో మరుపురాని చిత్రాల్లో తన అసమాన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కోహినూర్, మొఘల్ ఇ ఆజం, దేవ్‌దాస్, నయా దౌర్, రాం ఔర్ శ్యామ్ చిత్రాల్లో దిలీప్ కుమార్ నటనకు ప్రేక్షకులు నీరాజనం పలికారు. దిలీప్ కుమార్ చివరిసారిగా 1998లో ఖిలా మూవీలో బిగ్ స్ర్కీన్‌పై కనిపించారు. 1994లో దాదాసాహెబ్ పాల్కే అవార్డు, 2015లో పద్మవిభూషణ్ అవార్డులు ఆయనను వరించాయి. -
కేసీఆర్ స్కామ్ బయటపెడ్తా: దిలీప్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: సహారా, ఈఎస్ఐ వంటి స్కామ్‌లలో అప్పటి కేంద్రమంత్రిగా ఉన్న కేసీఆర్ పాత్రను బయటపెడ్తానని టీజేఎస్ నేత, మాజీ ఎమ్మెల్సీ కె.దిలీప్‌కుమార్ హెచ్చరించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో అధికార దుర్వినియోగం జరుగుతున్నదన్నారు. ఎన్నికలయ్యేదాకా గవర్నర్ పాలన కొనసాగాలన్నారు. దొంగ పాస్‌పోర్టులు, వీసాల స్కామ్‌లో కేసీఆర్, హరీశ్, షకీల్ అహ్మద్ కూడా ఉన్నారని, ఈ కేసులో జగ్గారెడ్డిని కావాలని ఇరికించారని ఆరోపించారు. నయీం కేసు, మియాపూర్ భూకుంభకోణం కేసులు ఏమయ్యాయని దిలీప్‌కుమార్ ప్రశ్నించారు. టీజేఎస్ కార్యాలయం రిపేర్లకోసం రవి లక్ష రూపాయలు ఇచ్చాడని, వాటికి లెక్కలు ఉన్నాయన్నారు. టీఆర్ఎస్ కార్యాలయం 15 కోట్లు ఖర్చుపెట్టి కట్టారని, దానికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలన్నారు. ఈ భవనం నిర్మాణానికి ఎవరు, ఎంత ఇచ్చారో, ఎక్కడ ఇచ్చారో బయటపెడ్తానని దిలీప్‌కుమార్ హెచ్చరించారు. టీజేఎస్‌లో మహిళలకు గౌరవం ఉందని, అడ్డగోలు ఆరోపణలు సరికాదన్నారు. నేడు కోదండరాం దీక్ష టీఆర్ఎస్ ఇచ్చిన హామీ ప్రకారం ‘ప్రపంచం గర్వించదగ్గ అమరవీరుల స్తూపం నిర్మాణం’పై జరిగిన జాప్యంపై బుధవారం ఒకరోజు దీక్షను చేపట్టనున్నారు. టీజేఏస్ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు కోదండరాం ఒకరోజు దీక్షకు కూర్చుంటారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగుతుంది. -
ఆకట్టుకున్న దిలీప్ కుమార్
సాక్షి, హైదరాబాద్: సీనియర్ మల్టీకాస్ సెయిలింగ్ చాంపియన్‌షిప్ నాలుగోరోజు పోటీల్లో ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్ (ఈఎంఈఎస్‌ఏ) క్రీడాకారుడు దిలీప్ కుమార్ ఆకట్టుకున్నాడు. లేజర్ రేడియల్ విభాగంలో జరిగిన పోటీల్లో చాకచక్యంగా వ్యవహరిస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. శనివారం జరిగిన మూడు రేసుల్లో రెండింటిలో తొలి మూడు స్థానాల్లో నిలిచాడు. పదో రేస్‌లో రన్నరప్‌గా నిలిచిన దిలీప్... పదకొండో రేస్‌లో మూడోస్థానాన్ని దక్కించుకున్నాడు. చివరిదైన పన్నెండో రేస్‌లో వాతావరణంతో పాటు గాలి గమనంలో విపరీతమైన మార్పులు రావడంతో దిలీప్ సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ మెరుగైన స్థానంలో నిలిచాడు. ఆర్ఎస్: ఎక్స్ ఈవెంట్లోనూ ఈఎంఈఎస్‌ఏ సెయిలర్ కమలపతి ఓజా రాణించాడు. ఇతర ఈవెంట్ల విజేతల వివరాలు లేజర్ స్టాండర్డ్ రేస్–10: 1. మోహిత్ సైనీ (ఏవైఎన్), 2. గితేశ్ (ఏవైఎన్), 3. హర్‌ప్రీత్ సింగ్ (ఏవైఎన్). రేస్–11: 1. బి. మోహపాత్ర (ఏవైఎన్), 2. మోహిత్ సైనీ (ఏవైఎన్), 3. ఉపమన్యు దత్తా (ఐఎన్‌డబ్ల్యూటీసీ). రేస్–12: 1. బి. మోహపాత్ర (ఏవైఎన్), 2. బీకే రౌత్ (ఈఎంఈఎస్‌ఏ), 3. హర్‌ప్రీత్ సింగ్ (ఏవైఎన్). లేజర్ రేడియల్ రేస్–10: 1. ఇస్రాజ్ అలీ (ఏవైఎన్), 2. దిలీప్ కుమార్ (ఈఎంఈఎస్‌ఏ), 3. గితేశ్ (ఏవైఎన్). రేస్–11: 1. జస్వీర్ సింగ్ (ఏవైఎన్), 2. ఎం. కోటేశ్వరరావు (టీఎస్సీ), 3. దిలీప్ కుమార్ (ఈఎంఈఎస్‌ఏ). రేస్–12: 1. రమ్య (ఏవైఎన్), 2. తను (ఎన్ఎస్ఎస్), 3. చింతన్ (ఈఎన్‌డబ్ల్యూటీసీ). ఆర్ఎస్: ఎక్స్ రేస్–10: 1. జెరోమ్ కుమార్ (ఏవైఎన్), 2. మన్‌ప్రీత్‌సింగ్ (ఏవైఎన్), 3. మనోజ్ కుమార్ (ఏవైఎన్). రేస్–11: 1. జెరోమ్ కుమార్ (ఏవైఎన్), 2. కమలపతి (ఈఎంఈఎస్‌ఏ). రేస్–12: 1. జెరోమ్ కుమార్ (ఏవైఎన్), 2. కేదార్నాథ్ తివారీ (ఈఎంఈఎస్‌ఏ), 3. మన్‌ప్రీత్ (ఏవైఎన్). ఫిన్ రేస్–10: 1. గుర్జీత్ సింగ్ (ఏవైఎన్), 2. ఎంకే యాదవ్ (ఏవైఎన్), 3. వివేక్ (ఏవైఎన్). రేస్–11: 1. గుర్జీత్ సింగ్ (ఏవైఎన్), 2. నవీన్ కుమార్ (ఏవైఎన్), 3. వివేక్ (ఏవైఎన్). రేస్–12: 1. స్వతంత్ర సింగ్ (ఏవైఎన్), 2. గుర్జీత్ సింగ్ (ఏవైఎన్), 3. నవీన్ (ఏవైఎన్). లేజర్ 4.7 రేస్–10: 1. కె. గౌతమ్ (వైసీహెచ్), 2. రామ్ మిలన్ యాదవ్ (ఎన్ఎస్ఎస్), 3. ఎన్. హేమంత్ (టీఎస్సీ). రేస్–11: 1. రామ్ మిలన్ యాదవ్ (ఎన్ఎస్ఎస్), 2. ఆశిష్ (ఎన్ఎస్ఎస్), 3. సతీశ్ యాదవ్ (ఎన్ఎస్ఎస్). రేస్–12: 1. నవీన్ కుమార్ (టీఎన్‌ఎస్‌ఏ), 2. రామ్ మిలన్ యాదవ్ (ఎన్ఎస్ఎస్), 3. కె. గౌతమ్ (వైసీహెచ్). -
మళ్లీ లవర్‌బాయ్‌లా
‘సఖి’ సినిమాతో లవర్‌బాయ్‌లా యూత్ సెన్సేషన్ అయ్యారు హీరో మాధవన్. ఆ తర్వాత కొన్ని రొమాంటిక్ చిత్రాల్లో యాక్ట్ చేసినప్పటికీ తన ట్రాక్ మార్చుకున్నారు. డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్నారు మాధవన్. అయితే ఇప్పుడు మళ్లీ ఓ లవ్ స్టోరీలో యాక్ట్ చేయనున్నారు మ్యాడీ. కొత్త దర్శకుడు దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందనున్న ‘మారా’ చిత్రంలో రొమాంటిక్ హీరోగా దర్శనం ఇవ్వనున్నారట. ‘విక్రమ్ వేదా’లో మాధవన్ సరసన నటించిన శ్రద్ధా శ్రీనాథ్ ఇందులోనూ జోడీగా కనిపించనున్నారు. -
దేవదాసులు
ఒకే ఫ్రేమ్‌లో అలనాటి దేవదాస్ దిలీప్ కుమార్, ఈనాటి దేవదాస్‌ను షారుక్ ఖాన్‌ను చూస్తుంటే చాలా బావుంది కదా. దిలీప్ కుమార్, షారుక్ ఖాన్ ఎంత సన్నిహితంగా ఉంటారో తెలిసిన విషయమే. ఫ్యామిలీ ఫంక్షన్స్, ఫెస్టివల్స్‌ను ఈ ఇద్దరూ కుటుంబంతో కలిసి జరుపుకున్నారు. నైన్టీస్ సూపర్ స్టార్ దిలీప్ కుమార్ ఇటీవల డీహైడ్రేషన్ మరియు యూరినరీ ఇన్ఫెక్షన్ వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ హాస్పిటల్లో జాయిన్ అయి, చికిత్స అనంతరం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలుసుకున్న షారుక్ వెంటనే దిలీప్ కుమార్‌ను ఆయన స్వగృహంలో కలిసి, టైమ్ స్పెండ్ చేశారు. ఆ సందర్భంలో దిగిన ఈ ఫొటోని దిలీప్‌కుమార్ తన ట్విట్టర్లో పంచుకున్నారు. -
1998 నుంచి టీచర్ల ఏకీకృత సర్వీసు నిబంధనలు
- కేంద్ర హోం మంత్రిత్వ శాఖను కోరిన ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ, జిల్లా పరిషత్ తదితర యాజమాన్యాల పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సర్వీసు నిబంధనలను ఏకీకృతం చేసే ప్రక్రియను 1998 నుంచి వర్తింపజేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కేంద్ర హోం శాఖను కోరాయి. ఏకీకృత సర్వీసు నిబంధనల రూపకల్పనకు వీలుగా రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ అవసరమైన నేపథ్యంలో ఈ అంశంపై మంగళవారం హోం శాఖ సంయుక్త కార్యదర్శి దిలీప్‌కుమార్ నేతృత్వంలో ఇక్కడ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏపీ నుంచి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్, సంయుక్త సంచాలకులు మస్తానయ్య, న్యాయసలహాదారు వీరభద్రారెడ్డి హాజరయ్యారు. తెలంగాణ నుంచి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆర్.ఆర్.ఆచార్య, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు కిషన్, సంయుక్త సంచాలకులు శ్రీహరి హాజరయ్యారు. దాదాపు 4 లక్షల మంది ఉపాధ్యాయులకు సంబంధించి ఏకీకృత సర్వీసు నిబంధనలు ఎప్పటి నుంచి వర్తింపజేయాలన్న విషయంలో 2 రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. అన్ని క్యాడర్లకు 1998 నుంచి వర్తింపజేయాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యర్థించినట్టు ఏపీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు వివరించారు. -
ఎంట్రీకి లైన్ క్లియర్
బాలీవుడ్ లెజెండ్ స్టార్లు దిలీప్‌కుమార్- సైరాబానుల మనవరాలు సవేషా తెరంగేట్రానికి రంగం సిద్ధమైంది. స్టంట్స్ హీరో అజయ్‌దేవ్‌గణ్‌తో కలసి నటించే మెగా చాన్స్ కొట్టేసిందీ అందాల రాశి. అజయ్ చేసే ‘శివే’లో ఈ ఇరవై ఏళ్ల అమ్మడు మెరిసి మురిపించనుందనే వార్తలు ఇప్పుడు బాలీవుడ్లో రౌండ్లు కొడుతున్నాయి. షమీత్, సుమీత్సైగల్ల ముద్దుల పట్టీ సవేషా ఫొటోలు వెబ్సైట్లలో తెగ అప్లోడ్ అవుతున్నాయి. -
సాహెబ్ సుబ్రమణ్యం' ఆడియో ఆవిష్కరణ
-
'ఎమ్.ఎస్.నారాయణ' కుమార్తే దర్శకత్వంలో సాహేబా సుబ్రమణ్యం
-
బాబు కారణంగానే రాష్ట్రానికి దూరమయ్యా
-
బాబు కారణంగానే రాష్ట్రానికి దూరమయ్యా
ఎంపీ జయప్రద హన్మకొండ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వైఖరి కారణంగానే తాను రాష్ట్రానికి దూరమయ్యానని సినీనటి, ఎంపీ జయప్రద అన్నారు. శనివారం దిలీప్‌కుమార్‌తో కలసి ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆనాడు చంద్రబాబు నిర్లక్ష్యం కారణంగానే యూపీలో పోటీ చేయాల్సి వచ్చింద న్నారు. భవిష్యత్తులో అవకాశం ఉంటే తెలుగు ప్రజలకు సేవ చేసేందుకు ఆంధ్రా లేదా తెలంగాణ ప్రాంతం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. రాష్ట్ర ఏర్పాటుకు అజిత్‌సింగ్ కృషి గొప్పదని కొనియాడారు. -
పద్యానవనం: సమయస్ఫూర్తితోనే కవికి కీర్తి!
రంజన జెడి పాండవులరి భంజనులై విరటుగొల్వ పాల్పడిరకటా! సంజాతమేమి చెప్పుదు కుంజర యూదంబు దోమ కుత్తుకజొచ్చెన్! ఏనుగుల సమూహము దోమ కుత్తకలో జొచ్చింది! అన్న అసాధారణ విషయాన్ని, ‘‘కుంజర యూదంబు దోమ కుత్తుకజొచ్చెన్’’ అనే సమస్యాపూరణంగా ఇచ్చారు ప్రాజ్ఞులు సభలో. దానికి, సరసకవి తెనాలి రామకృష్ణుడు ఏ మాత్రం తడుముకోకుండా, సాహితీ సమరాంగన సార్వభౌముడైన కృష్ణదేవరాయల సమక్షంలో పై విధంగా పూరించాడు. మహాపరాక్రమవంతులైన పాండవులు తలరాత బాగోలేక సాదాసీదా విరాటరాజును కొలిచే స్థితికి వచ్చారు. విధి ఎంత బలీయమైనదో చెప్పజాలమంటూ, ఏనుగుల సమూహం దోమ గొంతుకలో జొచ్చిందనే పోలికచెప్పడమన్నమాట! అవధాన ప్రక్రియల్లో తరచూ జరిగేదే కదా! ఇందులో సరసమేముంది? విశేషమేముంది? అనిపించవచ్చు. కానీ, విషయం ఇది మాత్రమే కాదు. తన సరస-సమర్థ హాస్య, సాహితీ ప్రతిభతో ప్రతిసారీ రాయలవారి వద్ద మార్కులు కొట్టేసే రామకృష్ణ కవిని ఎలాగైనా దెబ్బతీయాలన్న ప్రత్యర్థుల ఆటలు సాగకపోవడం ఇందులో విశేషం. విచిత్రమైన సమస్యనిచ్చి, సమస్యాపూరణం చేయాల్సిందిగా అంతఃపురంలో సేవకుడిగా ఉండే ఒక పరిచారకుడితో రామకృష్ణ కవిని అడిగిస్తారు అతనంటే ఈర్ష్య కలిగిన వారు. ఏం చెబుతాడో చూద్దామన్నది ఉత్సుకత. తాము తెరవెనుక ఉండి గోప్యంగా ఇదంతా నడిపిస్తారు. అడిగేవాడిని బట్టి రామకృష్ణుడు ఎలాగూ పెడార్థమొచ్చే పూరణమే చేస్తాడు, ఒకడుగు ముందుకేసి బూతులు మాట్లాడినా మాట్లాడొచ్చు! అప్పుడు సభలో రాజుగారి ముందు ఇదే సమస్యనిచ్చి పూరించమంటూ రామకృష్ణ కవిని ఇబ్బందుల్లో పెట్టాలన్నది వారి ఎత్తుగడ. అనుకున్నట్టుగానే వారి అంచనా కొంతమేర నిజమైంది. సహజంగానే రామకృష్ణకవి విపరీతంగా స్పందించాడు. ‘అయ్యవారూ, ఇదుగో ఈ సమస్యను మీరు పూరించగలరా!’ అని, తెలిసీ తెలియక సేవకుడడిగినపుడు, ‘ఆ... దానికేం భాగ్యం’ అంటూ, ‘‘గంజాయి తాగి, తురకల సంజాతము తోడ కల్లు చవిగొన్నావా? లంజల కొడుకా ఎక్కడ కుంజర యూదంబు దోమ కుత్తుక జొచ్చెన్?’ అని తిడుతూ కందపద్యంతో సమస్యా పూరణం చేశారు రామకృష్ణుడు. నాటి పదిహేనో శతాబ్ద కాలంలో ఉత్తర భారతం నుంచి దక్షిణాది వైపు విస్తరిస్తున్న బహమనీ సుల్తానుల హయాంలో ఆ తురుష్కుల సేవకులు, పరివారం గంజాయితో పాటు కల్లును మత్తుపానీయంగా సేవించేవారు. వారితో కూడి తాగి ఉన్నావా? అని తిడుతూ, ఎక్కడరా! ఎక్కడ, ఏనుగుల సమూహమెక్కడైనా దోమ కుత్తుకలో జొరబడగలదా? ఎక్కడ చెప్పు! అన్న అర్థం వచ్చేలా మందలిస్తూ సమస్యా పూరణం చేస్తాడు. పాపం, దానర్థం తెలియని సేవకుడు యధాతథంగా తీసుకువెళ్లి, వ్యూహకర్తలకు అప్పజెప్పాడు. ‘ఆహా! అనుకున్నంతా అయింది, మన రొట్టె విరిగి నేతిలో పడింది, ఇక ఇదేదీ జరుగనట్టు గుంభనంగా ఉండి, నిండు సభలో రాజుగారి ముందు రామకృష్ణుడికి ఇదే సమస్యనిస్తే... అయ్యో ఎంత పనిచేశానని ఆయన నాలుక్కరచుకోవడం ఖాయమ’ని సంబరపడ్డారు. తర్వాతి రోజు ఏమీ తెలియనట్టు సభలో ఓ సందర్భం సృష్టించి, ‘ఇదుగో ఈ సమస్యను రామకృష్ణుడైతే ఎలా పూరిస్తాడో అడగండి మహారాజా!’ అని, అదే సమస్యను సభ ముందుంచారు. నిన్నటి సంఘటనను గుర్తుకు తెచ్చుకొని, క్షణాల్లో విషయం గ్రహించిన తెనాలి రామకృష్ణుడు అప్పటికప్పుడు ఆశువుగా పైన పేర్కొన్న స్కీమ్-2 పద్యం సృష్టించారు. ఆయన ప్రతిభకు అబ్బురపడి, అభినందించారట కృష్ణదేవరాయలు. ఎప్పటిలాగే ప్రశంసలు తెనాలి రామకృష్ణుడికి, భంగపాటు ప్రత్యర్థులకు. అదీ సమయస్పూర్తి. - దిలీప్‌రెడ్డి -
బడుగుల రాజ్యం రావాలి
నవ తెలంగాణ: సామాజిక తెలంగాణ కావాలి. బడుగులకు అధికారంలో వాటా రావాలి. విద్య, వైద్య, ఆరోగ్య రంగాలను ఆధునికీకరించాలి. పారిశ్రామిక విధానం పక్కాగా ఉండాలి. నియంతృత్వ వ్యవసాయ విధానం రావాలి. అప్పుడే తెలంగాణ నవ నిర్మాణం సాధ్యమవుతుందని ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ అభిప్రాయపడ్డారు. ‘సాక్షి ప్రతినిధి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సూచనలు చేశారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాధికారం కావాలి. జనాభాలోని దామాషా ప్రకారం అధికారంలో వాటా ఉండాలి. అప్పుడే తెలంగాణ నవ నిర్మాణం సాధ్యమవుతుంది.. - ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ అంతరంగం సామాజిక తెలంగాణ కావాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాధికారం కావాలి. జనాభాలోని దామాషా ప్రకారం అధికారంలో వాటా ఉండాలి. అప్పుడే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యమవుతుంది. లేకుంటే తెలంగాణ వచ్చి ప్రయోజనం ఉండదు. - గిరిజన ప్రాంతాల్లో మైనింగ్‌కు ప్రత్యేక విధానం ఉండాలి. భూమి కోల్పోయిన కుటుంబానికి తప్పనిసరిగా ఉద్యోగం ఇవ్వాలి. గిరిజన ప్రాంతాల్లో వెలికితీసిన ఖనిజాలకు అవసరమైన సంబంధిత పరిశ్రమలను అక్కడే ఏర్పాటు చేయాలి. - గిరిజన మైనింగ్‌లో భూమి కోల్పోయిన వారికి సంబంధిత కంపెనీల్లో లేదా మైనింగ్ లాభాల్లో వాటా ఇవ్వాలి. - పారిశ్రామిక విధానం పక్కాకా ఉండాలి. తెలంగాణలో పెట్టుబడి పెట్టే పారిశ్రామిక వేత్తలకు వారు పరిశ్రమలు నెలకొల్పుకునేందుకు 75 శాతం ప్రభుత్వమే సమకూర్చాలి. - {పభుత్వ ధనంతో ఏర్పాటైన పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కల్పించాలి. రిజర్వేషన్లు ఉండాలి. - కార్పొరేట్ ఆసుపత్రులకు పాలకమండలి ఏర్పాటు చేసి ప్రభుత్వమే వాటిని నిర్వహించాలి. కార్పొరేట్ చేతుల్లో ఆసుపత్రులు ఉండకూడదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సెకండరీ గ్రేడ్ ఆసుపత్రులను మోడ్రన్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులుగా మార్చాలి. - కార్పొరేట్ స్కూళ్లను ప్రభుత్వం చేపట్టాలి. సంబంధిత యాజమాన్యాలకు పరిహారం ఇచ్చి టేక్ఓవర్ చేయాలి. - {పభుత్వ పాఠశాలలను ఆధునికీకరించాలి. నిర్బంధ కంప్యూటర్ విద్యను అమలుచేయాలి. - నియంత్రిత వ్యవసాయ విధానం ఉండాలి. అందుకు అవసరమైన విత్తనాలను ప్రభుత్వమే రైతులకు ఉచితంగా ఇవ్వాలి. నీటి సౌకర్యం కల్పించాలి. ఉచిత విద్యుత్ అందజేయాలి. - రైతు పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర కల్పించాలి. ప్రభుత్వమే వాటిని కొనాలి. - {పాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలి. - వరంగల్‌లోని ఫ్లడ్ ఫ్లో కెనాల్‌ను పూర్తిచేయాలి. - ఎలిమినేటి మాధవరెడ్డి సొరంగ మార్గం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలి. - నెట్టెంపాడు, మంజీర, ఉండి ప్రాజెక్టులను ఐదేళ్లలోగా పూర్తిచేయాలి. - భూపాల్పల్లి, మణుగూరు, పాల్వంచల్లో అదనపు విద్యుత్ కేంద్రాలను వచ్చే ఐదేళ్లలో నెలకొల్పాలి. ఈలోగా కొరతను అధిగమించేందుకు జాతీయ విద్యుత్ గ్రిడ్ నుంచి సగం ధరకు కేంద్రం విక్రయించాలి. - పోలవరం డిజైన్‌ను మార్చి సిరీస్ ఆఫ్ ప్రాజెక్టులను నిర్మించాలి. - హైదరాబాద్ శాంతిభద్రతల నిర్వహణ బాధ్యతను గవర్నర్‌కు రెండేళ్లకే పరిమితం చేయాలి. - ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను రెండేళ్లకే కుదించాలి. - ఉమ్మడి ఉద్యోగుల కాలవ్యవధిని రెండేళ్లకే కుదించాలి. - వచ్చే ఐదేళ్ల వరకు తెలంగాణ సినిమాలకు 75 శాతం సబ్సిడీ ప్రభుత్వమే సమకూర్చాలి. 100 శాతం తెలంగాణలో తీసే సినిమాలకు దీన్ని వర్తింపచేయాలి. అందులో తప్పనిసరిగా 70 స్థానిక ఉద్యోగులు, కళాకారులు ఉండేలా చూడాలి. జన తెలంగాణ: విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తేవాలి నవ తెలంగాణ నిర్మాణంలో అందరూ భాగస్వాములవ్వాలి. ముఖ్యంగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తేవాలి. ‘ప్రైవేటు’కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, ప్రాథమిక స్థాయి నుంచే ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం, ఎంఈఓ పోస్టుల భర్తీ వంటి చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలి. తెలంగాణ వీరయోధుల చరిత్రను పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టాలి. - కామిడి సతీష్‌రెడ్డి, టీచర్, పరకాల, వరంగల్ ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలి నవ తెలంగాణ అభివృద్ధికి అవినీతి, నిరుద్యోగం అడ్డు కారాదు. కొత్తగా ఏర్పడనున్న ప్రభుత్వం యువతకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలి. అభివృద్ధికి అవినీతే పెద్ద అవరోధం కాబట్టి దాని నివారణకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. - ఎండీ అక్తర్‌పాషా, టీచర్, ఆత్మకూరు,మహబూబ్‌నగర్ సామాజిక, ఆర్థికాభివృద్ధిపై దృష్టి పెట్టాలి చివరి గ్రామం వరకు సామాజిక, ఆర్థికాభివృద్ధి సాధించినప్పుడే బంగారు తెలంగాణ ఆవిష్కృతమవుతుంది. ప్రతి రంగంలోను మెరుగైన సంస్కరణలు తేవాలి. నాణ్యమైన విద్య, వైద్యం అందించడం, విద్యుత్ లోటు భర్తీ వంటి చర్యలు చేపట్టాలి. ఇందుకోసం సామాజిక వేత్తలతో కూడిన దార్శనిక ప్రభుత్వం కొలువు తీరాల్సిన అవసరముంది. - జన్‌పల్లి అమృతరాజు, కొత్తకోట,మహబూబ్‌నగర్ జిల్లా యువత, బడుగు వర్గాలకు ప్రాధాన్యమివ్వాలి నవ తెలంగాణ నిర్మాణంలో యువత, రైతులు, దళితులు, బలహీన వర్గాలకు ప్రాధాన్యతివ్వాలి. సత్వరమే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసి... ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయాలి. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో మాదిరిగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వాలి.రైతుల రుణాలు మాఫీ చేయాలి. బలహీన వర్గాలకు భూపంపిణీ చేపట్టాలి. చేనేత పరిశ్రమను ఆదుకోవాలి. ఇందుకోసం సమర్థవంతమైన నాయకత్వం అవసరం. - చింతకింది మధు,గౌస్‌కొండ గ్రామం, నల్లగొండ జిల్లా -
మండలిలో ‘నిజాం’ రగడ
సాక్షి, హైదరాబాద్: నిజాంను కీర్తించడం, నిందించడం శాసనమండలిలో ఆదివారం సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదానికి కారణమయింది. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై ఆదివారం మండలిలో చర్చ కొనసాగింది. హైదరాబాద్ రాష్ట్రంలో ఆదాయం ఘనంగా ఉండేదని, అభివృద్ధిలోనూ ఆంధ్రా కంటే ముందుండేదని టీఆరెల్డీ సభ్యుడు దిలీప్‌కుమార్ పేర్కొన్నారు. అనంతరం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన ఆవశ్యతను వివరిస్తూ బిల్లును వ్యతిరేకించారు. తర్వాత శాసనసభ వ్యవహారాల మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ.. ‘పెద్దల సభలో నిజాం ప్రభువును కీర్తించడం దురదృష్టకరం. మరాఠా, కన్నడ, తెలంగాణ కలిసున్న ఉమ్మడి హైదరాబాద్ ఆదాయాన్ని తెలంగాణ ఆదాయంగా చూపిస్తూ సభను తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని పేర్కొన్నారు. అధికార కాంగ్రెస్ సభ్యుడు భానుప్రసాద్ అడ్డు తగులుతూ.. ‘మంత్రి హోదాలో క్లారిఫికేషన్ ఇస్తున్నారా? మండలి సభ్యుడిగా మాట్లాడుతున్నారా? స్పష్టం చేయూలి’ అని డిమాండ్ చేశారు. గొడవ ముదిరే పరిస్థితి కనిపించడంతో చైర్మన్ చక్రపాణి 10 నిమిషాల పాటు ‘టీ బ్రేక్’ ప్రకటించారు. తర్వాత కూడా శైలజానాథ్, భానుప్రసాద్‌ల మధ్య వాగ్వాదం కొనసాగింది. అనవసరంగా సభలో అడ్డుతగలవద్దని, చేతనైతే వాదనను అడ్డుకోవాలని మంత్రి సవాల్ చేశారు. తాను చైర్మన్‌ను అడిగానని, నిన్నేమీ అడగలేదంటూ భానుప్రసాద్ అదే స్థాయిలో సమాధానం చెప్పారు. మంత్రులు కాసు కృష్ణారెడ్డి, సి.రామచంద్రయ్య వారికి సర్దిచెప్పారు. నిజాం కర్కశంగా వ్యవహరించారు: పాలడుగు సభలో మరోమారు ఇదే అంశం వివాదానికి దారితీసింది. నిజాం నూటికి నూరు శాతం కర్కశంగా వ్యవహరించారని కాంగ్రెస్ సభ్యుడు పాలడుగు వెంకట్రావు అన్నారు. దీనిపై అదే పార్టీ సభ్యుడు ఫరూక్, ఎంఐఎం సభ్యుడు జాఫ్రి, మరికొంత మంది తెలంగాణ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. వెంకట్రావు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఫరూక్ గట్టిగా డిమాండ్ చేశారు. దీంతో వివాదాస్పద అంశాల జోలికి పోవద్దంటూ చైర్మన్ సూచించారు. భూస్వాముల కుట్రలో భాగంగా 69లో తెలంగాణ ఉద్యమం వచ్చిందని, 72లో ఎగిసిపడిన జైఆంధ్ర ఉద్యమాన్ని కొంతమంది పెట్టుబడిదారులు తీసుకొచ్చారని పాలడుగు విమర్శించారు. ప్రస్తుత తెలంగాణ ఉద్యమం కూడా ప్రజా ఉద్యమం కాదనడంతో తెలంగాణ సభ్యుల నుంచి వ్యతిరేకత వ్యక్తమయింది. దాంతో జానారెడ్డి, జైపాల్‌రెడ్డి తదితరులు వచ్చిన తర్వాత ప్రజా ఉద్యమంగా మారిందన్నారు. తెలంగాణ మంత్రుల డుమ్మా ఆదివారం మండలికి తెలంగాణ మంత్రులు గైర్హాజరయ్యూరు. శాసనసభ, మండలికి హాజరుకావాల్సిన మంత్రులను బృందాలుగా విభజిస్తారు. ‘ఎ’గ్రూప్ అసెంబ్లీలో ఉంటే, ‘బి’ గ్రూప్ మండలిలో ఉంటుంది. ఆదివారం మండలికి ‘ఎ’గ్రూప్ హాజరుకావాలి. ముఖ్యమంత్రితో పాటు ‘ఎ’ గ్రూప్‌లో ఉన్న సీమాంధ్ర మంత్రులంతా ఆదివారం సభకు వచ్చారు. ఇదే గ్రూప్‌లో ఉన్న తెలంగాణ మంత్రులు జానారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, సారయ్య, దానం నాగేందర్, సునీతా లక్ష్మారెడ్డి, డి.కె.అరుణ, గీతారెడ్డి మాత్రం రాలేదు. ఈ గ్రూప్‌లో లేని పొన్నాల లక్ష్మయ్య మాత్రం చివర్లో వచ్చారు. సీమాంధ్ర సభ్యులు తెలంగాణకు వ్యతిరేకంగా పరుషమైన వ్యాఖ్యలు చేసినప్పుడు అడ్డుకోవాల్సిన తెలంగాణ మంత్రులు ఏమయ్యారంటూ పలువురు తెలంగాణ సభ్యులు పొన్నాలను ప్రశ్నించారు. -
యూటీ ప్రతిపాదన ఉత్తిదే: దిగ్విజయ్‌సింగ్
టీ-కాంగ్రెస్ నేతలకు దిగ్విజయ్ స్పష్టీకరణ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయమే ఫైనల్ హైదరాబాద్ రాజధానిగానే తెలంగాణ ఏర్పాటు అటార్నీ జనరల్ అనారోగ్యం వల్లే ఈ ఆలస్యం ఆయన రాగానే ‘ప్రక్రియ’ మొదలవుతుంది టీ-కాంగ్రెస్ నేతలకు చెప్పిన పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ దిగ్విజయ్‌తో జానా, పొన్నాల, షబ్బీర్ భేటీ నీటి పంపకాలపై విద్యాసాగర్ నివేదిక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కోరిన దిలీప్‌కుమార్ సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నేపథ్యంలో.. రాజధాని హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ) చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తోందంటూ గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం అంతా ఉత్తిదేనని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్ పార్టీ తెలంగాణ నేతలకు స్పష్టం చేసినట్లు తెలిసింది. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఏర్పాటు చేస్తామంటూ పార్టీ అత్యున్నత స్థాయిలో నిర్ణయం చేశాక దానిలో మార్పులు, చేర్పులుచేయటం ఆషామాషీ కాదని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. ‘విభజన విషయంలో అన్నీ ఆలోచించాకే వర్కింగ్ కమిటీ స్పష్టమైన నిర్ణయం ప్రకటించింది. దాన్ని అమలు చేయాలన్నదే ఇప్పుడు మా ముందున్న లక్ష్యం. ఈ క్రమంలో సీమాంధ్ర ప్రజల మనోభావాలను గుర్తించి వారి అభ్యంతరాలను పరిశీలించటం మాకు ముఖ్యమే. ఇందులో భాగంగా హైదరాబాద్‌ను యూటీ చేయాలని చాలామంది నేతలు మా ముందు ప్రతిపాదనలు తెచ్చారు. వారు చెప్పినంత మాత్రాన హైదరాబాద్‌ను యూటీ చేయలేం. వర్కింగ్ కమిటీ తీర్మానం మేరకు హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ఏర్పడుతుంది. ఆ దిశగానే కసరత్తు జరుగుతోంది’ అని దిగ్విజయ్‌సింగ్ పేర్కొన్నట్లు టీ-కాంగ్రెస్ నేతలు తెలిపారు. ‘హైదరాబాద్ యూటీ అంటే మరోమారు సీడబ్ల్యూసీ చర్చించాలి. యూపీఏ పక్షాలను ఒప్పించాలి. దానికి ప్రతిపక్షాలు సైతం అంగీకరించాలి. ఇదంతా సాధ్యమయ్యేది కాదు. అలా చేస్తే కాంగ్రెస్ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి యూటీ విషయంలో జరుగుతున్నదంతా ప్రచారమే. దానిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని దిగ్విజయ్ చెప్పినట్లు వివరించారు. తెలంగాణ ప్రాంత రాష్ట్ర మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఎంపీలు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు షబ్బీర్‌అలీ, కపిలవాయి దిలీప్‌కుమార్, సాగునీటి రంగ నిపుణుడు విద్యాసాగర్‌రావు, మాజీ ఎమ్మెల్యే దయాసాగర్‌లు గురువారం ఉదయం ఢిల్లీలో దిగ్విజయ్‌ను కలిశారు. సుమారు అరగంట పాటు వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ యూటీ విషయమై జరుగుతున్న చర్చపై నేతలు ఆరా తీశారు. యూటీ ప్రతిపాదనకు ఇరు ప్రాంతాల నేతలు వ్యతిరేకమని, తెలంగాణ ప్రజలు దీనికి ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోరని స్పష్టంచేశారు. దీనిపై దిగ్విజయ్ స్పందిస్తూ.. అలాంటిదేమీ లేదని, మీడియానే దీనిపై తప్పుడు ప్రచారం చేస్తోందని పేర్కొన్నట్లు సమాచారం. అటార్నీ జనరల్ రాగానే ప్రక్రియ మొదలు.. రాష్ట్ర విభజన ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని టీ-కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్‌ను కోరారు. ప్రక్రియ ఆలస్యం జరుగుతున్నకొద్దీ అనేక అపోహలు తలెత్తుతున్నాయని చెప్పారు. దీనికి దిగ్విజయ్ స్పందిస్తూ ‘కొన్ని రోజులుగా కేంద్ర హోంమంత్రి షిండే అస్వస్థతతో ఉన్నారు. ఆయన కోలుకుని ప్రక్రియ మొదలుపెట్టే సమయానికి అటార్నీ జనరల్ అనారోగ్యానికి గురయ్యారు. ఆయన సోమవారం మహారాష్ట్ర నుంచి ఢిల్లీకి వచ్చే అవకాశం ఉంది. ఆయన రాగానే కేబినెట్ నోట్‌పై న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటాం. ఏయే అంశాలు పొందుపర్చాలో చర్చించి రెండు వారాల్లో నోట్‌ను రాష్ట్రపతికి పంపేలా కృషి చేస్తాం’ అని చెప్పినట్లు తెలిసింది. నీటి వివాదాలు భ్రమే... నీటి వివాదాలకు సంబంధించి సీమాంధ్ర నేతలు వ్యక్తం చేస్తున్న ఆందోళనలో ఎలాంటి వాస్తవం లేదని కేంద్ర జల సంఘం మాజీ సభ్యుడు విద్యాసాగర్‌రావు ఈ సందర్భంగా దిగ్విజయ్‌తో పేర్కొన్నట్లు తెలిసింది. రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదీ జలాల పరిధిలో ఉన్న ప్రాజెక్టులు, నీటి కేటాయింపుల వివరాలతో కూడిన నివేదికను దిగ్విజయ్‌కు సమర్పించారు. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు స్పష్టంగా ఉన్నాయని, విభజన జరిగినా అవే కేటాయింపులు కొనసాగుతాయని చెప్పారు. రాజోలిబండ, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల పరిధిలో మాత్రం నీటి పంపకాలు యధావిధిగా సాగేందుకు తుంగభద్ర బోర్డు తరహాలో ఓ బోర్డు ఏర్పాటు చేసుకుంటే సరిపోతుందని పేర్కొన్నట్లు తెలిసింది. ఇదిలావుంటే.. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక ప్రాంతానికే పరిమితమన్నట్లు వ్యవహరిస్తున్నారని.. ఆయనను బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ ఎమ్మెల్సీ, తెలంగాణ ఆర్ఎల్డీ నాయకుడు దిలీప్‌కుమార్ వినతిపత్రం అందజేశారు. యూటీ ప్రసక్తే లేదన్నారు: జానారెడ్డి, పొన్నాల ‘హైదరాబాద్ యూటీ అన్న ప్రసక్తే లేదు. వర్కింగ్ కమిటీ తీర్మానం మేరకు పది జిల్లాల తెలంగాణే ఏర్పడుతుంది. యూటీ అంటే అది ఇంకో ఆందోళనకు దారితీస్తుందని చెప్పాం’ అని దిగ్విజయ్‌తో భేటీ అనంతరం మంత్రి జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య మీడియాతో పేర్కొన్నారు. యూటీపై అనవసర అపోహలు వద్దని, ఆ ప్రతిపాదన లేదని దిగ్విజయ్ చెప్పారని ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ తెలిపారు. -
ఉద్యమంలో కేసీఆరే హీరో: దిలీప్‌కుమార్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో 13 ఏళ్లపాటు శ్రమించి అన్నిదశల్లో క్రియాశీలకంగా ఉన్న టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావే హీరో అని తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ (టఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ అన్నారు. విధానాలపరంగా కేసీఆర్‌తో విభేదిస్తాను తప్ప... వ్యక్తిగతంగా ద్వేషం లేదన్నారు. ఇందిరాపార్కు సమీపంలోని ఎస్సెమ్మెస్ మీడియా సెంటర్లో ఆదివారం జరిగిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో దిలీప్‌కుమార్ మాట్లాడారు. ఎస్ఎంఎస్ మీడియా సెంటర్ అధినేత యనమల రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో దిలీప్‌కుమార్ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో సీమాంధ్ర నాయకుల ఆస్తుల మూలాలను దెబ్బకొట్టాలనే అభిప్రాయానికి కేసీఆర్ వ్యతిరేకమన్నారు. తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో సీమాంధ్ర నాయకుల ఆస్తులపై దాడి చేసిన పిదపనే కేంద్రంలో తెలంగాణ నిర్ణయంలో కదలిక వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎల్డీ పార్టీ కొనసాగుతుందని ప్రకటించారు. తెలంగాణ పునర్:నిర్మాణ లక్ష్య సాధనకు లక్ష మంది మిలిటెంట్ కార్యకర్తలను తయారు చేస్తున్నామన్నారు. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో తెలంగాణపై కేంద్రం నిర్ణయం మారితే మిలిటెంట్ పోరాటాలు కూడా నిర్వహిస్తామన్నారు. టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేసి ఆ పార్టీని విచ్ఛిన్నం చేయాలనే కుట్ర పూరిత ఆలోచనలు తనకు లేవన్నారు. ఢిల్లీలో తనకు మంచి సంబంధాలు ఉన్న కారణంగా టీఆర్ఎస్కు చెందిన ముగ్గురు నాయకులు దిగ్విజయ్‌సింగ్‌తో కలిపించాలని కోరడంతోనే వారిని కలిపించానన్నారు. అలాగే, మరో 8 మంది టీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్‌లో కలిసేందుకు తనతో టచ్‌లో ఉన్నట్లు తెలిపారు. అయితే, వారి పేర్లు మాత్రం తాను వెల్లడించలేనన్నారు. ఇక తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ గల్లీలోనే హీరో... కానీ ఢిల్లీలో కాదన్నారు. టీఆర్ఎస్ వలసల పార్టీ అని వ్యాఖ్యలు చేశారు. అందులో వివిధపార్టీల నుంచి వలస వచ్చిన వారే అధికంగా ఉన్నారన్నారు. ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వలస వచ్చే నాయకులను ప్రోత్సహిస్తే మరి టీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి ఉన్న వారి సంగతేంటని ప్రశ్నించారు. పార్టీలో ముందు నుంచీ ఉండి కష్టపడ్డవారికి టిక్కెట్లు ఇవ్వాలన్నారు. అలాంటి భరోసా లేకపోవడంతో కొంతమంది అభద్రతా భావానికి గురవుతున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల పాటు ఉండడం సరైందేననీ, ఈ విషయాన్ని కేసీఆర్ కూడా ఒప్పుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఉద్యోగులకు కచ్చితంగా ఆప్షన్లు ఉంటాయన్నారు. వాస్తవానికి ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతానికి వెళ్తారు. అవసరమైతే సూపర్‌న్యూమరీ పోస్టులను అక్కడి ప్రభుత్వం తయారు చేస్తోందన్నారు. ఒకవేళ వారు ఇక్కడే ఉండాలనుకుంటే ఉండొచ్చన్నారు. సీమాంధ్రలో చేస్తున్న ఉద్యమం కేవలం పెట్టుబడిదారుల ఉద్యమమేనని విమర్శించారు. డబ్బు, మీడియాను అడ్డం పెట్టుకొని సీమాంధ్ర ఉద్యమం నడుస్తోందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం జరిగిపోయిందని, ప్రక్రియ జరుగుతుందని దిగ్విజయ్‌సింగ్ చెప్పారన్నారు. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యే వరకూ తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు సంయమనం పాటించాలని దిలీప్‌కుమార్ కోరారు.