సాక్షి, హైదరాబాద్: సహారా, ఈఎస్‌ఐ వంటి స్కామ్‌లలో అప్పటి కేంద్రమంత్రిగా ఉన్న కేసీఆర్ పాత్రను బయటపెడ్తానని టీజేఎస్ నేత, మాజీ ఎమ్మెల్సీ కె.దిలీప్‌కుమార్ హెచ్చరించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో అధికార దుర్వినియోగం జరుగుతున్నదన్నారు. ఎన్నికలయ్యేదాకా గవర్నర్ పాలన కొనసాగాలన్నారు. దొంగ పాస్‌పోర్టులు, వీసాల స్కామ్‌లో కేసీఆర్, హరీశ్, షకీల్ అహ్మద్ కూడా ఉన్నారని, ఈ కేసులో జగ్గారెడ్డిని కావాలని ఇరికించారని ఆరోపించారు.
నయీం కేసు, మియాపూర్ భూకుంభకోణం కేసులు ఏమయ్యాయని దిలీప్‌కుమార్ ప్రశ్నించారు. టీజేఎస్ కార్యాలయం రిపేర్లకోసం రవి లక్ష రూపాయలు ఇచ్చాడని, వాటికి లెక్కలు ఉన్నాయన్నారు. టీఆర్‌ఎస్ కార్యాలయం 15 కోట్లు ఖర్చుపెట్టి కట్టారని, దానికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలన్నారు. ఈ భవనం నిర్మాణానికి ఎవరు, ఎంత ఇచ్చారో, ఎక్కడ ఇచ్చారో బయటపెడ్తానని దిలీప్‌కుమార్ హెచ్చరించారు. టీజేఎస్‌లో మహిళలకు గౌరవం ఉందని, అడ్డగోలు ఆరోపణలు సరికాదన్నారు.
నేడు కోదండరాం దీక్ష
టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీ ప్రకారం ‘ప్రపంచం గర్వించదగ్గ అమరవీరుల స్తూపం నిర్మాణం’పై జరిగిన జాప్యంపై బుధవారం ఒకరోజు దీక్షను చేపట్టనున్నారు. టీజేఏస్ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు కోదండరాం ఒకరోజు దీక్షకు కూర్చుంటారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment