Scam
-
స్కామూ నాదే.. ఎస్కేప్ స్కీమూ నాదే
-
కొత్త స్కామ్‌తో బ్యాంక్ ఖాతా ఖాళీ.. ఎలా కాపాడుకోవాలంటే..
జెరోధా సహ వ్యవస్థాపకుడు, సీఈఓ నితిన్ కామత్ ఇటీవల వెలుగులోకి వస్తోన్న కొత్త స్కామ్ గురించి హెచ్చరికలు జారీ చేశారు. ఈ స్కామ్‌తో మోసగాళ్లు బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈమేరకు మోసం జరుగుతున్న విధానాన్ని తెలియజేసేలా సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. అటువంటి స్కామర్లు బారిన పడకుండా ఉండాలంటే ఎలా రక్షించుకోవాలో కొన్ని చిట్కాలను అందించారు.మోసం చేస్తున్నారిలా..‘అత్యవసరంగా కాల్ చేయాలి.. మీ ఫోన్‌ను వినియోగించవచ్చా.. అనేలా అపరిచిత వ్యక్తులు మిమ్మల్ని అడగవచ్చు. అమాయకంగా కనిపించే వ్యక్తులు, వృద్ధులు, చిన్న పిల్లలు.. ఈ స్కామర్ల టార్కెట్ కావొచ్చు. వారు మీ ఫోన్ తీసుకుని కాల్ చేయడానికి రహస్యంగా పక్కకు వెళితే మాత్రం అనుమానించాలి. ఎందుకంటే స్కామర్ రహస్యంగా తనకు అవరసరమయ్యే యాప్‌లను మీకు తెలియకుండానే డౌన్లోడ్ చేసే అవకాశం ఉంటుంది. లేదా ఇప్పటికే ఉన్న యాప్‌లను యాక్సెస్ చేయవచ్చు. బ్యాంకింగ్ అలర్ట్‌లతో సహా కాల్స్, మెసేజ్‌లను వారి నంబర్లకు ఫార్వర్డ్ చేయడానికి మీ ఫోన్లో సెట్టింగ్‌లను మార్చవచ్చు. దీని ద్వారా వన్ టైమ్ పాస్‌వర్డ్‌లను(ఓటీపీలు) అడ్డుకుని అనధికార లావాదేవీలు నిర్వహించుకోవచ్చు’ అని కామత్ అన్నారు.Imagine this: A stranger approaches you and asks to use your phone to make an emergency call. Most well-meaning people would probably hand over their phone. But this is a new scam.From intercepting your OTPs to draining your bank accounts, scammers can cause serious damage… pic.twitter.com/3OdLdmDWe5— Nithin Kamath (@Nithin0dha) January 15, 2025ఇదీ చదవండి: పాత పన్ను విధానం తొలగింపు..?ఏం చేయాలంటే..‘మీ ఫోన్ ను అపరిచితులకు అప్పగించవద్దు. అందుకు బదులుగా ఆ నంబర్‌ను మీరే డయల్ చేసి స్పీకర్ ఆన్‌లో పెట్టి మాట్లాడాలని సూచించాలి. ఇలాంటి కనీస జాగ్రత్తలు పాటిస్తే స్కామర్లు సున్నితమైన సమాచారాన్ని యాక్సెస్ చేయకుండా నిరోధించే అవకాశం ఉంది’ అన్నారు. కామత్ షేర్ చేసిన ఈ వీడియోను సోషల్ మీడియాలో 4,50,000 మందికి పైగా వీక్షించారు. చాలా మంది వినియోగదారులు తమ ఆందోళనలను వ్యక్తం చేశారు. ఇలాంటి మోసాలకు సంబంధించి వారి సొంత అనుభవాలను పంచుకున్నారు. విభిన్న భాషల్లో ఉన్న జెరోధా వినియోగదారులు, తన ఫాలోవర్ల కోసం ఇలాంటి అవగాహన వీడియోను ఇతర భాషల్లోకి అనువదించాలని కొందరు సూచించారు. -
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై హైకోర్టు ఆగ్రహం
-
రూ.1.5 కోట్లు మోసపోయిన 78 ఏళ్ల మహిళ.. అసలేం జరిగిందంటే..
ఇంటర్నెట్, మొబైల్ డేటా వినియోగంతో దేశంలో ఆన్లైన్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సైబర్ మోసగాళ్లు రకరకాల పేర్లతో మభ్యపెట్టి, వేశాలు మార్చి అమాయకులను దారుణంగా వంచిస్తున్నారు. ఎంతోమంది వీరి బారిన పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ముంబయికి చెందిన 78 ఏళ్ల మహిళ సైబర్ స్కామ్(cyber scam)కు బలైంది. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందంగా నమ్మబలికిన ఓ సైబర్ ముఠా చేతిలో ఏకంగా రూ.1.5 కోట్ల మేర నష్టపోయింది.వివరాల్లోకి వెళితే.. దక్షిణ ముంబయిలో ప్రముఖ బిల్టర్‌గా పేరున్న ఓ వ్యక్తి, 78 ఏళ్ల మహిళ బంధువులు. కొన్ని వారాల క్రితం యూఎస్‌లో ఉన్న తన కుమార్తెకు ఆ మహిళ కొన్ని వంటకాలు పంపడానికి కొరియర్ సర్వీస్‌ను ఆశ్రయించింది. అక్కడే సైబర్ మోసం ప్రారంభమైంది. మరుసటి రోజు ఆమెకు కొరియర్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నట్లు ఒకరు కాల్ చేశారు. ఆమె ప్యాకేజీలో ఫుడ్ ఐటమ్స్‌తోపాటు ఇతర వస్తువులు ఉన్నాయని తెలిపాడు. ఆ ప్యాకేజీలో ఆధార్ కార్డ్, గడువు ముగిసిన పాస్‌పోర్ట్‌లు, క్రెడిట్ కార్డ్‌లు, చట్టవిరుద్ధమైన పదార్థాలు, 2,000 యూఎస్ డాలర్లు(Dollars) ఉన్నట్లు చెప్పాడు. మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఆమె కుట్రకు పాల్పడినట్లు సైబర్ మోసగాళ్లు ఫోన్లో తీవ్రంగా ఆరోపించారు.ఒత్తిడిలో పూర్తి వివరాలు..ఈ స్కామ్‌లో భాగంగా సైబర్ క్రైమ్ బ్రాంచ్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో సహా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులుగా నటిస్తూ పలువురు తర్వాత రోజుల్లో ఆమెను సంప్రదించారు. తమ వాదనలను ఆమె విశ్వసించేలా నటిస్తూ, మోసగాళ్లు(Fraudsters) పోలీసు యూనిఫామ్‌లో కనిపించేవారు. అరెస్ట్ వారెంట్లు, దర్యాప్తు నివేదికల వంటి నకిలీ పత్రాలను ఆమెకు చూపించి వీడియో కాల్స్ కూడా చేశారు. స్కామర్లు నకిలీ వారెంట్లు, విచారణ నివేదికలను వాట్సాప్‌లో చూపించినందున ఒత్తిడిలో మహిళ తన వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను తెలియజేశారు. ఇన్వెస్ట్‌గేషన్(Investigation) సమయంలో ఆమె తన ఆస్తులను కాపాడుకోవాలనే తాపత్రయంలో వారిని ప్రభుత్వ అధికారులుగానే నమ్మి, మోసగాళ్లు అందించిన బ్యాంకు ఖాతాలకు రూ.1.51 కోట్లను బదిలీ చేసింది. కుటుంబ సభ్యులకు పూర్తి వివరాలు తెలియజేసి వారితో చర్చించి తాను మోసపోయానని గ్రహించింది.ఇదీ చదవండి: ప్యాసివ్ ఫండ్స్.. కార్యాచరణ ప్రకటించిన సెబీఅప్రమత్తత అవసరంసైబర్ క్రైమ్ పోలీస్ హెల్ప్‌లైన్ ద్వారా పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి ముంబై సౌత్ సైబర్ సెల్‌కు కేసు బదిలీ చేశారు. మహిళ పంపిన నగదును త్వరగా ట్రాన్స్ఫర్ చేయడానికి మోసగాళ్లు పలు ఖాతాలను ఉపయోగించారని, దీంతో వారిని ట్రేస్ చేయడం కొంత క్షిష్టమవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ నిపుణులు కోరారు. తెలియని వారు చేసిన కాల్స్‌ను లిఫ్ట్ చేసినా ఎలాంటి వివరాలు పంచుకోవద్దని చెప్పారు. ఫోన్లో వ్యక్తిగత సమాచారాన్ని చెప్పకూడదని తెలిపారు. అనుమానాస్పదంగా ఉంటే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. -
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా
-
ప్రియురాలికి ఫ్లాట్, లగ్జరీ కారు, అడ్డంగా బుక్కైన ప్రియుడు!
మహారాష్ట్రలోని ఓ ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగి ఉన్నట్టుండి లగ్జరీ కార్లలో షికార్లు చేయడం మొదలు పెట్టాడు. దాదాపు 22 కోట్ల స్కామ్‌కు పాల్పడి, లగ్జరీ ఫ్లాట్, విలువైన ఆభరణాలు కొనుగోలు చేశాడు. అదీ తన ప్రేయసికోసం. ఏంటా అని ఆరాతీస్తే, ఆరు నెలల పాటు కొనసాగిన ఇతగాడి బండారం బయట పడింది. నెట్టింట హల్చల్ చేస్తున్న స్టోరీ వివరాలు..మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో నెలకు రూ.13వేల జీతంతో కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేసేవాడు హర్ష్ కుమార్ క్షీరసాగర్. లగ్జరీ లైఫ్‌పై మోజు పెంచుకున్న కుమార్ అడ్డదారి వెతుక్కున్నాడు. యశోదా శెట్టి అనే మహిళా ఉద్యోగితో చేతులు కలిపి దాదాపు రూ. 21 కోట్ల 59 లక్షల 38 వేలు కొట్టేశాడు.నకిలీ పత్రాలను ఉపయోగించి ఇండియన్ బ్యాంక్‌లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ పేరుతో ఖాతా తెరిచారు. తరువాత ఇద్దరూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా భారీ కుంభకోణానికి తెర తీశారు. ఇలా వచ్చిన డబ్బులతో హర్ష్ కుమార్ తన ప్రియురాలికి విమానాశ్రయానికి ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో ఏకంగా 4 బీహెచ్‌కే ఫ్లాట్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. అంతేనా..తగ్గేదేలే అంటూ బీఎండబ్ల్యూ కారు, బీఎండబ్ల్యూ బైక్, ఖరీదైన డైమండ్ ఆభరణాలు కొనుగోలు చేశాడు. దాదాపు ఆరు నెలల తరువాత వీరి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హర్ష్‌కుమార్, యశోదా శెట్టి, ఆమె భర్త బీకే జీవన్ కలిసి బ్యాంకుకు ఫేక్ పత్రాలను సమర్పించి డబ్బులను డ్రా చేశారని విచారణలో తేలింది. ఈ డబ్బులను తమ వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయించు కున్నారని పోలీసులు గుర్తించారు.మహిళా కాంట్రాక్ట్ వర్కర్ భర్త రూ.35 లక్షల విలువైన ఎస్‌యూవీని కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. ప్రస్తుతం ఈ కేసులో ప్రధాన నిందితుడు హర్ష్ కుమార్ అనిల్ క్షీరసాగర్ ఎస్‌యూవీతో పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.ఇదీ చదవండి: రిటైర్మెంట్ డిప్రెషన్ డేంజర్ బెల్స్ : ఏం చేయాలి?! -
ఈ-కార్ రేసు స్కామ్‌పై చర్చకు రెడీ:కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని సమస్యలపై సభలో చర్చిద్దామని.. దమ్ముంటే రెండువారాలపాటు అసెంబ్లీ నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సవాల్ విసిరారు. మంగళవారం కొడంగల్ బీఆర్ఎస్ ముఖ్యనేతల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ..‘‘కేబినెట్లో మాట్లాడటం కాదు. సభలో చర్చ చేద్దాం. అన్ని సమస్యలపై సభలో చర్చిద్దాం. ఈ-కార్ రేసు కుంభకోణంపై కూడా చర్చకు నేను రెడీ. దమ్ముంటే 15 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి’’ అని సీఎం రేవంత్‌కు సవాల్ విసిరారు.పేరు మర్చిపోయినందుకు యాక్టర్‌ను జైలులో పెట్టించారు. సీఎం పేరు మర్చిపోతే జైల్లో పెడతారా?అంటూ రేవంత్‌పై కేటీఆర్ ఫైర్ అయ్యారు. -
అశ్లీల చిత్రాల కేసు.. శిల్పాశెట్టి భర్తకు ‘ఈడీ’ నోటీసులు
ముంబయి:వ్యాపారవేత్త,బాలీవుడ్ సీనియర్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. సంచలనం సృష్టించిన అశ్లీల చిత్రాల రాకెట్ కేసులో ప్రశ్నించేందుకు ఈడీ రాజ్‌కుంద్రాకు నోటీసులిచ్చింది.కాగా,ఇటీవలే రాజ్‌కుంద్రాకు సంబంధించిన పలు చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. సోదాల అనంతరం కుంద్రాకు ఈడీ సమన్లు జారీ చేసి విచారణకు పిలవడం గమనార్హం. -
వాట్సాప్ గ్రూప్‌లో చేరాడు.. రూ.11 కోట్లు పోయాయి
టెక్నాలజీ పెరుగుతోంది.. స్కామర్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఎంతోమంది బాధితులు మోసపోయి లెక్కకు మించిన డబ్బు పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు కూడా ఇలాంటి మరో సంఘటనే తెరమీదకు వచ్చింది.ముంబైలోని కోలాబాకు చెందిన 75 ఏళ్ల రిటైర్డ్ షిప్ కెప్టెన్‌ను.. మొదట గుర్తు తెలియని వ్యక్తి వాట్సాప్ గ్రూప్‌లో చేర్చాడు. అతడు పెట్టుబడికి సంబంధించిన సలహాలు ఇస్తూ.. షేర్ మార్కెట్ పెట్టుబడుల ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించే మార్గాలను వెల్లడించాడు. దీనికోసం ఒక యాప్‌లో పెట్టుబడి పెట్టమని సూచించారు. అప్పటికే చాలామంది లాభాలను పొందుతున్నట్లు కూడా పేర్కొన్నాడు.గుర్తు తెలియని వ్యక్తి చెప్పిన మాటలు నిజమని కెప్టెన్ నమ్మేశాడు. దీంతో స్కామర్ బాధితున్ని మరో వాట్సాప్ గ్రూప్‌లో చేర్చాడు. కంపెనీ ట్రేడింగ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్‌ను షేర్ చేశాడు. బాధితుడు యాప్‌ను డౌన్లోడ్ చేసిన తర్వాత.. ట్రేడింగ్, ఐపీఓ వంటి వాటికి సంబంధించిన మెసేజ్‌లను అందుకుంటాడు. అదే సమయంలో స్కామర్.. బాధితుని ఇంకొక వ్యక్తిని పరిచయం చేసాడు. ఆ వ్యక్తి.. బాధితుడు సిఫార్సు చేసిన స్టాక్‌లలో పెట్టుబడి పెట్టడానికి వివిధ బ్యాంకు ఖాతాలకు డబ్బును బదిలీ చేయమని ఒప్పించాడు.లావాదేవీలన్నీ సెప్టెంబర్ 5, అక్టోబర్ 19 మధ్య జరిగాయి. బాధితుడు 22 సార్లు.. మొత్తం రూ. 11.16 కోట్లు వివిధ బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేసాడు. వేరు వేరు ఖాతాకు ఎందుకు డబ్బు బదిలీ చేయాలని బాధితుడు స్కామర్లను అడిగినప్పుడు.. ట్యాక్స్ ఆదా చేయడానికి అని అతన్ని నమ్మించారు.కొన్ని రోజుల తరువాత తన నిధులలో కొంత తీసుకోవాలనుకుంటున్నానని.. స్కామర్లు అడిగినప్పుడు, సర్వీస్ ట్యాక్స్ కింద పెట్టుబడులపై 20 శాతం చెల్లించాలని కోరారు. ఇది చెల్లించిన తరువాత కూడా.. మళ్ళీ మళ్ళీ ఏదేది సాకులు చెబుతూ.. మోసం చేస్తూనే ఉన్నారు. చివరకు బాధితుడు మోసపోయామని గ్రహించాడు. దీంతో పోలీసులను ఆశ్రయించాడు.ఇలాంటి మోసాల నుంచి బయటపడటం ఎలా?👉గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలను స్పందించకపోవడం మంచిది.👉ఎక్కువ డబ్బు వస్తుందని నమ్మించడానికి ప్రయత్నించడం, లేదా లింకులు పంపించి వాటిపై క్లిక్ చేయండి.. మీకు డబ్బు వస్తుంది అని ఎవరైనా చెబితే.. నమ్మకూడదు.👉స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన విషయాలను చెబుతూ.. ఎక్కువ లాభాలు వస్తాయని చెబితే నమ్మవద్దు. 👉షేర్ మార్కెట్‌కు సంబంధించిన విషయాలను తెలుసుకోవాలంటే.. నిపుణలను సందర్శించి తెలుసుకోవాలి. లేదా తెలిసిన వ్యక్తుల నుంచి నేర్చుకోవాలి.👉స్కామర్లు రోజుకో పేరుతో మోసాలు చేయడానికి పాల్పడుతున్నారు. కాబట్టి ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. -
యూపీఐ మోసాలు.. వామ్మో.. ఇన్ని కోట్లా..?
దేశంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) ఆధారిత మోసాలు ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. ఈ ఏడాది సెప్టెంబరు వరకు 6,32,000 ఫిర్యాదులు నమోదు కాగా.. ఏకంగా రూ.485 కోట్లు వినియోగదారులు నష్టపోయారు.2022-23 నుంచి చూస్తే మొత్తం 27 లక్షల మంది రూ.2,145 కోట్లు నష్టపోయారు.ఇటీవలి కాలంలో యూపీఐ వినియోగం భారీగా పెరగడం కూడా ఇందుకు ప్రధాన కారణం. ఒక్క అక్టోబరు నెలలోనే.. 2016లో యూపీఐ వ్యవస్థ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు జరగనన్ని లావాదేవీలు జరిగాయి. రోజుకు 53.5 కోట్ల చొప్పున నెలలో మొత్తం 16.58 బిలియన్ల లావాదేవీలు జరగ్గా వాటి విలువ రూ.23.5 లక్షల కోట్లు. -
కూటమి ప్రభుత్వం కమీషన్ల దందా
-
డిజిటల్ అరెస్ట్ స్కామ్: ఖాతాదారుడ్ని కాపాడిన ఎస్బీఐ సిబ్బంది
టెక్నాలజీ పరుగులు పెడుతున్న తరుణంలో సైబర్ నేరాలు ఎక్కువవుతున్నాయి. సైబర్ నేరగాళ్లు రోజుకో అవతరమెత్తి అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. ఇందులో ఒకటి డిజిటల్ అరెస్ట్. దీనికి బలైనవారు ఇప్పటికే కోకొల్లలు. అయితే ఇటీవల ఎస్బీఐ సిబ్బంది ఓ వ్యక్తిని డిజిటల్ అరెస్ట్ బారినుంచి కాపాడి.. లక్షలు పోగొట్టుకోకుండా చూడగలిగారు.బ్యాంకుకు(గోప్యత కోసం బ్రాంచ్‌ను ప్రస్తావించడం లేదు) చాలా కాలంగా కస్టమర్‌గా ఉన్న 61 ఏళ్ల డాక్టర్‌ను స్కామర్లు టార్గెట్ చేశారు. డిజిటల్ అరెస్టులో ఉన్నారని సీనియర్ సిటిజన్‌ను నమ్మించి, ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలని బెదిరించి.. డబ్బు కాజేయాలని పన్నాగం పన్నారు. అయితే.. ఆ పెద్దాయన తన ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి డబ్బు విత్‌డ్రా చేయడానికి బ్యాంకుకు వెళ్ళాడు. ఆ సమయంలో అతడు కొంత టెన్షన్‌గా ఉండటాన్ని బ్యాంకు అసోసియేట్ గమనించి, సమస్య గురించి ఆరా తీసింది. వ్యక్తిగత కారణాల వల్లనే డబ్బు తీసుకుంటున్నాని ఆయన వెల్లడించారు. అయితే బ్యాంకు అసోసియేట్ ఆయన మాటలు నమ్మలేదు. అతన్ని బ్రాంచ్ మేనేజర్ దగ్గరకు పంపించింది.ఖాతాదారుడున్ని.. బ్యాంక్ మేనేజర్ కూడా అడిగాడు. ఆ వ్యక్తి ప్రాపర్టీని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నానని సమాధానమిచ్చాడు. కానీ స్థలం ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పినట్లు.. దీంతో అనుమానం మరింత పెరిగిందని మేనేజర్ పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో తిరిగి రావాలని బ్యాంకు సిబ్బంది ఖాతాదారుడికి సూచించారు. అంతే కాకుండా మూడు రోజుల పాటు నగదు బదిలీని ప్రాసెస్ చేయడానికి నిరాకరించామని మేనేజర్ చెప్పారు.ఒక సందర్భంలో ఖాతాదారుడు బ్యాంక్ అసోసియేట్ దగ్గరకు వెళ్లకుండా తప్పించుకున్నాడు. బదులుగా మరొక అసోసియేట్ దగ్గరకు వెళ్ళాడు. ఇదంతా గమనించిన బ్యాంక్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. బ్యాంక్ కస్టమర్‌ను 1930కి కనెక్ట్ చేసింది, జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ ద్వారా అక్కడ డిజిటల్ అరెస్ట్ లాంటిదేమీ లేదని స్పష్టం చేసారు.చివరకు ఆ సీనియర్ సిటిజన్ జరిగిన మొత్తం చెప్పాడు. బ్రాంచ్‌ను సందర్శించినప్పుడు, అతను స్కామర్‌తో కాల్లో ఉన్నాడని, అతను బ్యాంకు ఉద్యోగులను నమ్మవద్దని పదేపదే చెప్పినట్టు వివరించారు. మూడు రోజులు స్కామర్ చేతిలో నలిగిన వృద్ధున్ని బ్యాంక్ సిబ్బంది కాపాడింది.డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి?మోసగాళ్ళు కొందరికి ఫోన్ చేసి.. అక్రమ వస్తువులు, డ్రగ్స్, నకిలీ పాస్‌పోర్ట్‌లు లేదా ఇతర నిషేధిత వస్తువులు తమ పేరుతో పార్సిల్ వచ్చినట్లు చెబుతారు. ఇదే నేరంగా పరిగణిస్తూ.. ఇలాంటి అక్రమ వస్తువుల విషయంలో బాధితుడు కూడా పాలు పంచుకున్నట్లు భయపెడతారు. ఇలాంటి కేసులో రాజీ కుదుర్చుకోవడానికి డబ్బు డిమాండ్ చేస్తారు. ఇలాంటి మోసాలనే డిజిటల్ అరెస్ట్ అంటారు.డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లో వ్యక్తులను భయపెట్టడానికి లేదా మోసగించడానికి ప్రభుత్వ సంస్థలు, చట్ట అమలుతో సహా వివిధ సంస్థల అధికారులు మాదిరిగా వ్యవహరిస్తారు. ఇలాంటి కాల్స్ వస్తే.. చాలా జాగ్రత్తగా వ్యవరించాలి. ఒకసారి నమ్మితే భారీగా మోసపోవడానికి సిద్దమయ్యారన్నమాటే. -
మహారాష్ట్రలో వేల కోట్ల బిట్‌కాయిన్ స్కాం కలకలం.. సుప్రీం కీలక ఆదేశాలు
ముంబై : మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రూ.6,600 కోట్ల బిట్ కాయిన్ స్కాం కలకలం రేపుతోంది. ఈ స్కాంలో పలువురి రాజకీయ నాయకుల హస్తం ఉందంటూ పలు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు సైతం కేసు విచారణ చేపట్టేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో సీబీఐ రంగంలోకి దిగింది. అయితే, ఈ బిట్ కాయిన్ స్కాంలో మహరాష్ట్ర కాంగ్రెస్, ఎన్సీపీ(ఎస్పీ)కి చెందిన పేర్లు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన జరిగిన లావాదేవీల్లో మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే, ఎన్సీపీ (ఎస్పీ)ఎంపీ సుప్రియా సూలే బిట్కాయిన్లను ఉపయోగించారంటూ మాజీ పోలీసు అధికారి రవీంద్ర పాటిల్ సంచలన ఆరోపణలు చేశారు.అందుకు ఊతం ఇచ్చేలా మహరాష్ట్ర పోలింగ్‌కు ఒక రోజు ముందు అంటే నిన్న (నవంబర్19) బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ సుధాన్షు త్రివేది ప్రెస్మీట్లో ఆధారాల్ని బహిర్ఘతం చేశారు. వాటిలో కాల్ రికార్డింగ్‌లు, వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్లు ఉన్నాయి. తాను బహిర్ఘతం చేసిన ఆధారాల్లో ఒక ఆడియో క్లిప్‌లో సుప్రియా సూలే వాయిస్ బయటికి వచ్చిందని ఆరోపించారు. అంతేకాదు, మహరాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సైతం ఆ ఆడియోలో ఉన్నది తన చెల్లెలు సుప్రియా సూలే వాయిస్ అని ధృవీకరించడం సంచలనం రేపుతోంది.కాగా, బిట్ కాయిన్ స్కాంపై విచారణ చేపట్టేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. పూర్తి స్థాయి విచారణ తర్వాత ఈ బిట్ కాయిన్ స్కాం ఏ మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది. -
ఫ్రీ గ్యాస్ పథకంలో మోసాన్ని బయటపెట్టిన ఎమ్మెల్సీ బొత్స
-
3600 మందికి 300 కోట్లకు టోకరా..8 మంది నిందితుల అరెస్ట్
-
కొత్త స్కామ్.. రూటు మార్చిన కేటుగాళ్లు
టెక్నాలజీని ఉపయోగించుకుని స్కామర్లు కొత్త ఎత్తులతో అమాయకులను మోసం చేస్తున్నారు. ఇప్పటికే ఫేక్ జాబ్ ఆఫర్స్ పేరుతో, స్టాక్ మార్కెట్ స్కీమ్ పేరుతో, డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలు జరుగుతున్నాయి. ఇప్పుడు బంధువుల పేరుతో మోసాలు చేయడానికి సిద్దమైపోతున్నారు. దీనికి సంబంధించిన కేసులు కూడా వెలుగులోకి వస్తున్నాయి.గుర్తు తెలియని వ్యక్తులు మన ఫోన్ నెంబర్, ఇతర వివరాలను కనుక్కుని.. బంధువుల మాదిరిగా ఫోన్ చేసి చాలా మర్యాదగా, బాగా తెలిసిన వ్యక్తుల మాదిరిగానే ప్రవర్తిస్తారు. తాము కష్టాల్లో ఉన్నామంటూ డబ్బు బదిలీ చేయాలని, లేదా మీ నాన్న నాకు కొంత మొత్తంలో డబ్బు ఇవ్వాలి.. నిన్ను అడిగి తీసుకోమన్నారని, అందుకే నెంబర్ కూడా ఇచ్చారని నమ్మిస్తారు. ఇది నమ్మి డబ్బు బదిలీ చేశారో మీరు తప్పకుండా మోసపోయినట్టే.ఇదీ చదవండి: వారం రోజుల్లో రూ.9.54 కోట్లు మాయం: ఏం జరిగిందంటే..ఈ స్కామ్ నుంచి బయటపడటం ఎలా?మీకు ఫోన్ చేసిన వ్యక్తి నిజంగానే మీ బంధువా? లేదా తెలిసిన వ్యక్తా? అని ముందుగానే ద్రువీకరించుకోవాలి.స్కామర్ ఎప్పుడూ మిమ్మల్ని తొందర పెడుతూ.. మీకు ఆలోచించుకునే సమయాన్ని కూడా ఇవ్వకుండా చేస్తాడు, కాబట్టి మీరు ఇలాంటి సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.మీకు తెలియని వ్యక్తులతో.. ఆర్థిక విషయాలను లేదా వ్యక్తిగత విషయాలను చర్చించకూడదు. ఎదుటి వారి మాటల్లో ఏ మాత్రం అనుమానం కలిగినా వెంటనే కాల్ కట్ చేయడం ఉత్తమం.జరుగుతున్న మోసాలను గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండటం మంచిది. ఆ విషయాలను తెలిసిన వాళ్లకు చెబుతూ.. వాళ్ళను కూడా హెచ్చరిస్తూ ఉండటం శ్రేయస్కరం. -
‘నేటి పిల్లలే రేపటి సూపర్ మోడల్స్’.. 200 మంది పేరెంట్స్‌కు రూ. 5 కోట్ల టోకరా
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని ద్వారకకు చెందిన 34 ఏళ్ల మహిళ తన తీరిక సమయంలో ఫేస్‌బుక్‌ను స్క్రోలింగ్ చేసింది. ఒక ప్రకటన ఆమె దృష్టిని ఆకర్షించింది. ఆ యాడ్‌లో లాట్స్ స్టార్ కిడ్స్ సంస్థ పిల్లలకు మోడలింగ్ అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొంది.దీనితో పాటు మోడలింగ్‌లో శిక్షణ కూడా ఇస్తామని తెలిపింది. తన కుమార్తెకు ఇది మంచి అవకాశం అవుతుందని ఆమె భావించింది. వెంటనే సదరు మహిళ ఆ యాడ్‌పై క్లిక్ చేసింది. అది ఆమెను ‘టెలిగ్రామ్’కు తీసుకువెళ్లింది. ఈ సంస్థను ఇదేవిధంగా చాలా మంది తల్లిదండ్రులు సంప్రదించారు. తమపిల్లలను మోడల్స్‌గా మార్చాలనే తాపత్రయంలో ఆ సంస్థ అడిగినంత ఫీజు చెల్లించారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం ఆ సంస్థ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించిన చిన్నారులకు మోడలింగ్ అసైన్మెంట్లు ఇవ్వనున్నట్లు హామీనిచ్చింది. ఎంతకాలం గడిచినా లాట్స్ స్టార్ కిడ్స్ సంస్థ చిన్నారులకు మోడలింగ్ అవకాశాలు కల్పించలేదు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్లు చేపట్టి ఈ సంస్థ గుట్టును రట్టు చేశారు. ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్టు చేశారు. ఈ సంస్థ ముఠా సభ్యులు 197 మంది తల్లిదండ్రుల నుంచి రూ.4.7 కోట్లకు పైగా మొత్తాన్ని వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. పిల్లలను మోడల్స్‌గా తీర్చిదిద్దాలనుకునే తల్లిదండ్రులను టార్గెట్‌గా చేసుకుని, వీరు భారీ ఎత్తున మోసానికి పాల్పడ్డారు.ఈ స్కామర్లు మోడలింగ్ చేస్తున్న పిల్లల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి, ఇతర తల్లిదండ్రులను ఆకర్షిస్తారు. తరువాత వారిని టెలిగ్రామ్ గ్రూప్‌లో చేర్చి, పిల్లలకు మోడలింగ్‌లో అవకాశాలు ఇప్పిస్తామంటూ తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేస్తారు. ఇందుకు ఆన్లైన్ వేదికను ఉపయోగించుకుంటారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. తల్లిదండ్రులు ఇలాంటి ఉచ్చులో చిక్కుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చదవండి: రైలులో పాము కాటు.. ప్రయాణికుల తొక్కిసలాట -
మొబైల్ యూజర్లకు ట్రాయ్ హెచ్చరిక
సైబర్ క్రైమ్స్ ప్రస్తుతం భారతదేశంలో ఒక పెద్ద సమస్యగా మారిపోతోంది. ఎప్పటికప్పుడు స్కామర్లు కొత్త అవతారాలెత్తి ప్రజలను మోసం చేస్తున్నారు, డబ్బు దోచేస్తున్నారు. ఇలాంటి వాటి విషయంలో మొబైల్ యూజర్లకు చాలా జాగ్రత్తగా ఉండాలని 'టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా' (TRAI) హెచ్చిరికలు జారీ చేసింది.స్కామర్లు బాధితులను మోసం చేయడానికి రకరకాల ఎత్తుగడలు వేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఎలక్ట్రిక్ కనెక్షన్ లేదా ఇంటర్నెట్ కనెక్షన్ వంటి సదుపాయాలను నిలిపేస్తామని బెదిరిస్తారు. బాధితుడు చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని నేరగాళ్లు తప్పుగా పేర్కొంటారు. దీంతో కొందరు భయపడి నేరగాళ్లు చెప్పినట్లు వింటారు, భారీగా డబ్బు కోల్పోతారు.టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా.. షేర్ చేసిన ఒక వీడియోలో ఇలాంటి స్కామ్‌కు సంబంధించిన సంఘటనను చూడవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క మొబైల్ యూజర్ తెలియని నంబర్స్ నుంచి వచ్చే కాల్స్ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని.. సంచార్ సాథీ పోర్టల్‌ని ఉపయోగించి ఏవైనా అనుమానాస్పద కాల్‌లను నివేదించాలని ట్రాయ్ కోరింది.భారతదేశంలో పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ప్రభుత్వ డేటా ప్రకారం.. 2024 జనవరి నుంచి ఏప్రిల్ వరకు డిజిటల్ అరెస్ట్ స్కామ్ కారణంగా బాధితులు సుమారు రూ. 120.3 కోట్లు నష్టపోయినట్లు తెలిసింది. అక్టోబర్ 27న మన్ కీ బాత్ 115వ ఎపిసోడ్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ సమాచారాన్ని అందించారు.నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP) 2024 మొదటి త్రైమాసికంలో దాదాపు 7.4 లక్షల సైబర్ క్రైమ్ ఫిర్యాదులు అందుకున్నట్లు వెల్లడించింది.ఇదీ చదవండి: చెత్త సంపాదన రూ.2,364 కోట్లు: ప్రశంసించిన మోదీడిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు లేదా సైబర్ నేరగాళ్లు బాధితురాలకు ఫోన్ చేసి అక్రమ వస్తువులు లేదా నిషిద్ధ వస్తువులకు సంబంధించిన నేరంలో మీ ప్రమేయం ఉందని భయపెడతారు. టెక్నాలజీలను ఉపయోగించి వీడియో కాల్స్ ద్వారా నకిలీ కోర్టులను, న్యాయమూర్తులను ఏర్పటు చేస్తారు. అరెస్టు లేదా చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఉండటానికి డబ్బు చెల్లించాలని.. భారీ మొత్తంలో మోసం చేస్తుంటారు. కాబట్టి ఇలా మోసం చేసేవారు మీకు ఎప్పుడైనా ఫోన్ చేసి బెదిరిస్తే.. తప్పకుండా సంబంధిత పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయాలి.अचानक से TRAI 📞 ने कि आपका नेटवर्क disconnect करने की बात 🧐🤔 सावधान रहे, ये एक scam है ! आपका अगला कदम ? रिपोर्ट करें चक्षु के साथ https://t.co/6oGJ6NSQal पर#SafeDigitalIndia pic.twitter.com/Zmkwj2Rjzg— DoT India (@DoT_India) November 9, 2024 -
మార్గదర్శి ఫైనాన్షియర్స్ ను ఉద్దేశించి హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు
-
వెలుగులోకి రామోజీ చట్ట విరుద్ధ కార్యకలాపాలు
-
ఎస్బీఐ కస్టమర్లకు హెచ్చరిక: ఆ లింక్ క్లిక్ చేశారో..
టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతోందో.. సైబర్ మోసాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB).. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు ఓ కొత్త స్కామ్ గురించి హెచ్చరికలు జారీ చేసింది.స్కామర్లు మోసపూరిత సందేశాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు పంపిస్తున్నట్లు తెలిసింది. ఎస్బీఐ రివార్డును రీడీమ్ చేసుకోవడానికి యాప్ డౌన్లోడ్ చేయమని కొందరు మోసపూరిత మెసేజ్‌లను పంపిస్తున్నారు. ఈ మెసేజ్‌ను పీబీఐ షేర్ చేస్తూ.. వినియోగదారులు ఇలాంటి సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరింది. అనుచిత లింకుల మీద క్లిక్ చేయడం, యాప్స్ డౌన్లోడ్ చేయడం వంటివి చేయకూడదని పేర్కొంది.గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ వంటి విశ్వసనీయ మూలాల నుంచి మాత్రమే బ్యాంక్ సంబంధిత యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవాలని ఎస్బీఐ వెల్లడించింది. ఇన్స్టాలేషన్ చేయడానికి ముందే దాని గురించి తెలుసుకోవాలని పేర్కొంది. నిజంగానే ఎస్బీఐ రివార్డ్ పాయింట్లను రీడీమ్ చేసుకోవడానికి కస్టమర్లు అధికారిక రివార్డ్ వెబ్సైట్ సందర్సించాల్సి ఉంటుంది. లేదా కస్టమర్ కేర్‌కు కాల్ చేయాలి.స్కామర్లు పంపించిన మెసేజ్‌లను నిజమని నమ్మి.. లింక్ మీద క్లిక్ చేస్తే తప్పకుండా మోసపోతారు. ఇప్పటికే ఇలాంటి మోసాలకు చాలామంది బలైపోయారు. కాబట్టి వినియోగదారులు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. అనుమానాస్పద లింకుల మీద ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదు.Beware ‼️Did you also receive a message asking you to download & install an APK file to redeem SBI rewards❓#PIBFactCheck❌@TheOfficialSBI NEVER sends links or APK files over SMS/WhatsApp✔️Never download unknown files or click on such links🔗https://t.co/AbVtZdQ490 pic.twitter.com/2J05G5jJZ8— PIB Fact Check (@PIBFactCheck) November 2, 2024ఇదీ చదవండి: సిద్దమవుతున్న సూపర్ యాప్: ఐఆర్సీటీసీ సర్వీసులన్నీ ఒకే చోట..సైబర్ నేరాలను తగ్గించడంలో ఆర్బీఐరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సైబర్ నేరాలను తగ్గించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మీద పనిచేస్తోంది. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఆటోమాటిక్ వార్ణింగ్ సిస్టం రూపొందిస్తోంది. దీని సాయంతో అనుమానాస్పద లింకులు వచినప్పుడు యూజర్లను అలెర్ట్ చేస్తుంది. దీంతో యూజర్ జాగ్రత్త పడవచ్చు. అయితే ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయం తెలియాల్సి ఉంది. -
వారం రోజుల్లో రూ.9.54 కోట్లు మాయం: ఏం జరిగిందంటే..
ఆన్లైన్ మోసాలు భారీగా పెరుగుతున్న తరుణంలో.. బెంగళూరులో ముగ్గురు వ్యక్తులు స్టాక్ ట్రేడింగ్ స్కామ్‌ల బారిన పడ్డారు. వీరు కేవలం ఒక వారం రోజుల్లో ఏకంగా 9.54 కోట్ల రూపాయాలు పోగొట్టుకున్నారు. ఇందులో ఇద్దరు వ్యాపవేత్తలు, ఒక ఇంజినీర్ ఉన్నట్లు సమాచారం.అధిక రాబడి వస్తుందనే వాగ్దానాలతో పబ్లిక్ ఆఫర్లకు ముందస్తు యాక్సెస్‌తో బాధితులను ఆకర్శించారు. మోసగాళ్లు బాధితులను మొదట్లో 'జేజే77 ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియా', జీ3364 మెయిన్ పుల్ అప్ లేఅవుట్ ఎక్స్ఛేంజ్ గ్రూప్' అనే వాట్సాప్ గ్రూపులలో యాడ్ చేశారు. గ్రూపుల్లో పరిచయం లేనివారి నుంచి స్టాక్ మార్కెట్ పెట్టుబడికి సంబంధించిన టిప్స్ తెలుసుకున్నారు.పరిచయం లేనివారు ఇచ్చిన సలహాలను అనుసరించి.. ముగ్గురు వ్యక్తులు స్కామర్లు అందించిన లింక్‌ల ద్వారా యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు. యాప్‌లో స్కామర్లు ఆకట్టుకునే ట్రేడింగ్ లాభాలను చూపడంతో బాధితులు సెప్టెంబర్ 8, అక్టోబర్ 23 మధ్య వేర్వేరు బ్యాంక్ ఖాతాల నుంచి కోట్ల రూపాయలు బదిలీ చేశారు. వారు అనుకున్న లాభాలు రాకపోగా.. చివరకు మోసపోయినట్లు తెలుసుకున్నారు.ఇదీ చదవండి: స్కూటర్‌పై వచ్చి కిడ్నాప్.. అదానీ జీవితంలో భయంకర ఘటనమోసపోయామని తెలుసుకుని.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు చెప్పిన విషయాల ఆధారంగా నేరస్థులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి స్కామ్స్ ఎక్కువవుతున్నాయి కాబట్టి.. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. తెలియని వ్యక్తులు పంపించే లింక్స్ మీద క్లిక్ చేయకూడదు. పొరపాటున క్లిక్ చేసిన భారీ నష్టాలను చవి చూడాల్సి ఉంటుంది. -
రూ.8 వేలకోట్ల ఎగవేతకు ప్రణాళిక.. సూత్రధారి అరెస్ట్
దేశంలో జీఎస్టీ ఎగవేత మోసాలు ఎక్కువవుతున్నాయి. రూ.5,000 కోట్లు-రూ.8,000 కోట్ల విలువైన జీఎస్టీని ఎగవేసేందుకు 246 బోగస్ కంపెనీలను సృష్టించిన ముఠా గుట్టు రట్టయింది. ఈ ఘటనకు ప్రధాన సూత్రధారిగా వ్యవహరించిన అస్రఫ్ ఇబ్రహీం కలవాడియా(50) సహా ఎనిమిది మంది వ్యక్తులపై పుణె పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ బృందం నకిలీ పత్రాలు, సంస్థలను సృష్టించి మోసపూరిత లావాదేవీలకు పాల్పడినట్లు గుర్తించారు.పుణెలోని కోరేగావ్ పార్క్ పోలీసుల కథనం ప్రకారం..సూరత్‌కు చెందిన అస్రఫ్ ఇబ్రహీం కలవాడియా (50) సహా ఎనిమిది మంది వ్యక్తులు భారీగా జీఎస్టీ ఎగవేతకు పాల్పడ్డారు. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో 246 బోగస్ కంపెనీలు సృష్టించి ఈ చర్యకు పూనుకున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి ఏకంగా రూ.5000 కోట్లు-రూ.8000 కోట్లు వరకు నష్టం జరుగుతుంది. సెప్టెంబర్ 2018-మార్చి 2024 మధ్య వివిధ కంపెనీలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణ జరిగింది. పుణెకు చెందిన హడప్సర్లోని శివ చైతన్య కాలనీ చిరునామాతో రిజిస్ట్రర్ అయిన పఠాన్ ఎంటర్ప్రైజెస్ రూ.20.25 కోట్ల జీఎస్టీను ఎగవేసినట్లు అధికారులు గుర్తించారు. దాంతో జీఎస్టీ సిబ్బంది ఫిర్యాదు నమోదు చేసింది. దీనిపై విచారణ జరిపి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) జోనల్ యూనిట్ అధికారులు పుణె పోలీసుల సహకారంతో కలవాడియాను ఎరవాడ సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ సంఘటనలో తనకు సహకరించిన మరో ఏడుగురు నిందితులు ఇంకా పరారీలో ఉన్నారు.ఆటోరిక్షా డ్రైవర్ పేరుతో కంపెనీ నమోదుపఠాన్ షబ్బీర్ ఖాన్ అన్వర్ ఖాన్ అనే వ్యక్తి పాన్‌కార్డుతో పఠాన్ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థను నమోదు చేశారు. గుజరాత్‌లోని భావ్‌నగర్‌లోని ఖుంబర్వాడ ప్రాంతానికి చెందిన పఠాన్ ఆటోరిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. పాన్‌కార్డులో నమోదైన చిరునామాతో పోలీసులు తన ఇంటికి వెళ్లేసరికి అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. తనకు ఈ వ్యవహారానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. నిందితులు చట్ట విరుద్ధంగా పఠాన్ పాన్‌కార్డు వాడి కంపెనీ నమోదు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.ఇదీ చదవండి: డిఫెన్స్ ఉత్పత్తులు ఎగుమతయ్యే టాప్ 3 దేశాలుసెక్యూరిటీగార్డు పేరుతో బ్యాంకు ఖాతాతదుపరి విచారణలో గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జీత్ కుకాడియా అనే పేరుతో బ్యాంక్ ఖాతా తెరిచారు. కుకాడియా సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఈ నేరంతో తనకు సంబంధం లేదని ఆయన తెలిపారు. బ్యాంకు స్టేట్మెంట్లు, కాల్ రికార్డులను పరిశీలించిన తర్వాత ఈ ఘటనకు కలవాడియాను ప్రధాన సూత్రధారిగా గుర్తించామని సీనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ప్రకాశ్ తెలిపారు. ముంబైలోని మీరా భయాందర్‌లోని ఒక హోటల్లో కలవాడియాను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. తన వద్ద నుంచి సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, సిమ్ కార్డ్‌లు, చెక్ బుక్‌లు, డెబిట్ కార్డ్‌లు, రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పన్ను ఎగవేత కోసం మోసపూరిత లావాదేవీలు జరిపేందుకు నకిలీ పత్రాలను ఉపయోగించినట్లు కలవాడియా అంగీకరించాడని ప్రకాశ్ వివరించారు. -
రవాణాశాఖలో ఫ్యాన్సీ నంబర్ల కుంభకోణం
సాక్షి, హైదరాబాద్: రవాణాశాఖలో కొందరు అధికారులు, ఓ ప్రైవేటు ఏజెన్సీ సిబ్బంది కలిసి ఫ్యాన్సీ నంబర్ల కుంభకోణానికి పాల్పడ్డారు. ఫ్యాన్సీ నంబర్లకు వాహన దారులు కోట్ చేసిన ధరను రహస్యంగా ఉంచాల్సింది పోయి, ఆ మొత్తాన్ని అనుకూల వాహనదారుల చెవిన పడేసి ఆ నంబర్ వారికే దక్కేలా పావులు కదిపారు. ఇలా ఒక్కో నంబర్ కేటాయింపు ద్వారా భారీగా కమీషన్లు దండుకున్నారు. ఇదంతా ఓ అధికారి కనుసన్నల్లో జరిగిందని తేల్చుకున్న ప్రభుత్వం ఆయనపై చర్యలకు సిద్ధమవుతోంది. కొన్నేళ్లుగా రవాణాశాఖలో జరుగుతున్న అవినీతి బాగోతం గుట్టు విప్పే పని ఇప్పుడు వేగంగా సాగుతోంది. గత ప్రభుత్వ హయాంలో కొందరు అధికారులు భారీగా అక్రమాలను సాగించారని గుర్తించిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని బహిర్గతం చేయాలని నిర్ణయించింది. గతంలో రవాణాశాఖలో అన్నీ తానై చక్రం తిప్పిన ఓ అధికారిపై భారీగా ఫిర్యాదులున్నాయి.కమిషనర్‌ను కూడా లెక్క చేయకుండా ఆ అధికారే అన్ని చక్కబెట్టేవారన్న ఆరో పణలున్నాయి. సిబ్బందికి పదోన్నతులు, బదిలీలు కూడా ఆయన కనుసన్నల్లోనే జరిగేవి. ఇదే తరహాలో ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపు వ్యవహారం కూడా చోటుచేసుకుంది. ఆ అధికారికి చెందిన ఓ బినామీ సంస్థ కూడా ఈ శాఖలో కీలకంగా వ్యవహరించిందని సమాచారం. రూ.కోట్లలో కమీషన్లురవాణా శాఖ కార్యాలయాలకు సాంకేతిక సహకారాన్ని అందించే బాధ్యతను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించారు. ఈ క్రమంలో ఆ సంస్థ సిబ్బందిని ఓ అధికారి తన అక్రమాలకు వినియోగించుకున్నారన్న ఫిర్యాదులున్నాయి. రవాణా శాఖలో ఫ్యాన్సీ నంబర్లకు బాగా డిమాండ్ ఉంటుంది. సెంటిమెంటు ఆధారంగా వాహనదారులు తమకు ఇష్టమైన నంబరును పొందేందుకు ఆసక్తి చూపుతారు. 0001, 9999, 0099, 5555... ఇలాంటి నెంబర్లకు డిమాండ్ చాలా ఎక్కువ. ఏటా దాదాపు లక్ష వరకు నంబర్లను వేలంలో ఉంచటం ద్వారా రవాణా శాఖకు ఏటా రూ.80 కోట్లకుపైగా ఆదాయం వస్తుంది.ఈ నంబర్ల కేటాయింపు బిడ్డింగ్ పద్ధతిలో జరుగుతుంది. ఎవరు ఎక్కువ కోట్ చేస్తే వారికి నంబరు దక్కుతుంది. రవాణాశాఖ ప్రధాన సర్వర్ వద్ద విధుల్లో ఉండే ప్రైవేటు సంస్థ సిబ్బంది బిడ్డింగ్‌లో కోట్ చేసిన మొత్తాన్ని ఆ అధికారికి చేరవేసేవారు. అప్పటికి బిడ్‌లో నమోదైన గరిష్ట మొత్తాన్ని తెలుసుకుని అనుకూల వాహనదారులకు చేరవేయటం ద్వారా నంబర్ అలాట్ అయ్యే మొత్తం కోట్ చేసేలా చక్రం తిప్పేవారు. ఇలా కోరిన వారికి నంబర్ ఇప్పించి పెద్ద మొత్తంలో కమీషన్లు వసూలు చేసే వారు. అలా ఏటా రూ.కోట్లలో జేబుల్లో వేసుకునేవారు. ఇప్పుడు దీనిపై ప్రభుత్వం విచారణ జరిపిస్తోంది. ఈ కుంభకోణంలో బాధ్యులుగా కొందరిని గుర్తించింది. ప్రస్తుతానికి 56 మంది డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ల(డీబీఏ)లను విధుల్లో నుంచి తొలగించినట్టు తెలిసింది. త్వరలో మరికొందరిపైనా చర్యలు తీసుకోనున్నట్టు సమా చారం. సూత్రధారిగా ఉన్న అధికారిపైనా శాఖాపరమైన చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. -
ప్రశ్నించే స్వరం వినిపించకూడదా?
విజయవాడలో బుడమేరు వరద ముంపునకు గురైన కోటి మందికి భోజనం ఖర్చు రూ.368 కోట్లుగా తేల్చారు. అసలు పునరావాస కేంద్రాలు ఎక్కడ పెట్టారు? అందులోకి ఎంత మందిని తరలించారు? ఎవరికి భోజనం పెట్టారు? అందరూ నీళ్లలో మునిగి ఉంటే మొబైల్ జనరేటర్లు పెట్టారంటా! నీళ్లలో ఉన్నోళ్లు తమను చంద్రబాబు బయటకు తీసుకురావట్లేదని మొత్తుకున్నారు. వీళ్లేమో కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, మొబైల్ జనరేటర్లకు రూ.23 కోట్లు ఖర్చు రాశారు. – వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై నిలదీయకూడదా? మీరు చేసే అవినీతిపై ప్రశ్నించకూడదా? ప్రశ్నిస్తే కేసులు పెడతారా? ఇదెక్కడి అరాచక పాలన..?’ అంటూ సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రశ్నించే స్వరమే వినిపించకూడదని ఆరాటపడుతూ తప్పుడు కేసులు పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. దీనికి ‘సాక్షి’ ఎడిటర్‌పై పెట్టిన కేసే తార్కాణమని చెప్పారు. ‘ఇలాగైతే ప్రజలు మీకు సింగిల్ డిజిట్ కూడా దక్కకుండా చేస్తారు...’ అంటూ చంద్రబాబును హెచ్చరించారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..చేసిన తప్పును నిజాయితీగా ఒప్పుకో..చంద్రబాబు అధికారంలో ఉన్నంత మాత్రానా ఏం చేసినా చెల్లుతుందనుకుంటే ప్రజలు తిరగబడతారు. అప్పుడు చంద్రబాబుకు, ఆయన పార్టీకి సింగిల్ డిజిట్ కూడా రాదు. మా నాయకులు, కార్యకర్తలను ఇబ్బంది పెడితే సహించేది లేదు. బంతిని నేలకేసి ఎంత గట్టిగా కొడితే అంతపైకి లేస్తుంది. ఎప్పటికైనా చేసిన తప్పును నిజాయతీగా ఒప్పుకుంటే.. ఆ వ్యక్తిలో పరివర్తన వస్తే కొద్దో గొప్పో సానుకూలత పెరుగుతుంది. అంతేగానీ తప్పు కనిపించకూడదు... దాని గురించి ఎవరూ మాట్లాడకూడదంటే ఎవరూ హర్షించరు. రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాడేందుకు మా పార్టీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. మద్యం విషయంలో మహిళలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. మా హయాంలో ప్రైవేటు మద్యం దుకాణాలు లేవు. ప్రభుత్వమే పారదర్శకంగా నిర్వహించింది. డిజిటల్ పేమెంట్లతోపాటు క్యాష్ పేమెంట్లను అందుబాటులో ఉంచాం. ప్రతి దుకాణంలో పీవోఎస్‌లు పెట్టాం. ఇప్పుడు మొత్తం ప్రైవేటు పరం అయ్యాయి. టీడీపీకి చెందిన వాళ్లే నడుపుతున్నారు. స్ట్రైక్ రేటు చూసుకుని స్కాములు చేస్తామంటే ఈసారి దెబ్బ గట్టిగా తగులుతుంది. జమిలి ఎన్నికలు మన చేతుల్లో లేవు. ఏం జరిగినా పార్టీని సన్నద్ధంగా పెట్టడానికి రెడీగా ఉన్నాం. గ్రామ స్థాయిలో పార్టీకి బూత్ కమిటీలు నియమించి మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేగంగా వేస్తున్నాం. వరదల్లోనూ స్కామ్లేనా?చంద్రబాబు స్కామ్‌లు ఏ స్థాయిలో ఉన్నాయో విజయవాడలో వరదల సమయంలో చూశాం. బుడమేరు వరద ముంపునకు గురైన కోటి మందికి భోజనం ఖర్చు రూ.368 కోట్లుగా తేల్చారు. అసలు పునరావాస కేంద్రాలు ఎక్కడ పెట్టారు? అందులోకి ఎంత మందిని తరలించారు? ఎవరికి భోజనం పెట్టారు? అందరూ నీళ్లలో మునిగి ఉంటే మొబైల్ జనరేటర్లు పెట్టారంటా! నీళ్లలో ఉన్నోళ్లు తమను చంద్రబాబు బయటకు తీసుకురావట్లేదని మొత్తుకున్నారు. వీళ్లేమో కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, మొబైల్ జనరేటర్లకు రూ.23 కోట్లు ఖర్చు రాశారు. ఇంత దారుణంగా స్కాముల మీద స్కాములు చేస్తున్నారు. పైగా ఇవే ప్రశ్నలు అడిగినందుకు ‘సాక్షి’ ఎడిటర్‌పై కేసు పెట్టారు. ఇంత దారుణంగా ప్రభుత్వ పాలన చేస్తుంటే ప్రశ్నించకూడదా? వీళ్లు ఏం చేసినా ఎవరూ మాట్లాడకూడదా? అసలు వీళ్లు పరిపాలన చేయడానికి యోగ్యులేనా? ప్రజలందరూ ఆలోచించాలి.