టెక్నాలజీ పరుగులు పెడుతున్న తరుణంలో సైబర్ నేరాలు ఎక్కువవుతున్నాయి. సైబర్ నేరగాళ్లు రోజుకో అవతరమెత్తి అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. ఇందులో ఒకటి డిజిటల్ అరెస్ట్. దీనికి బలైనవారు ఇప్పటికే కోకొల్లలు. అయితే ఇటీవల ఎస్‌బీఐ సిబ్బంది ఓ వ్యక్తిని డిజిటల్ అరెస్ట్ బారినుంచి కాపాడి.. లక్షలు పోగొట్టుకోకుండా చూడగలిగారు.
బ్యాంకుకు(గోప్యత కోసం బ్రాంచ్‌ను ప్రస్తావించడం లేదు) చాలా కాలంగా కస్టమర్‌గా ఉన్న 61 ఏళ్ల డాక్టర్‌ను స్కామర్లు టార్గెట్ చేశారు. డిజిటల్ అరెస్టులో ఉన్నారని సీనియర్ సిటిజన్‌ను నమ్మించి, ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలని బెదిరించి.. డబ్బు కాజేయాలని పన్నాగం పన్నారు. అయితే..
ఆ పెద్దాయన తన ఫిక్స్‌డ్ డిపాజిట్ నుంచి డబ్బు విత్‌డ్రా చేయడానికి బ్యాంకుకు వెళ్ళాడు. ఆ సమయంలో అతడు కొంత టెన్షన్‌గా ఉండటాన్ని బ్యాంకు అసోసియేట్ గమనించి, సమస్య గురించి ఆరా తీసింది. వ్యక్తిగత కారణాల వల్లనే డబ్బు తీసుకుంటున్నాని ఆయన వెల్లడించారు. అయితే బ్యాంకు అసోసియేట్ ఆయన మాటలు నమ్మలేదు. అతన్ని బ్రాంచ్ మేనేజర్ దగ్గరకు పంపించింది.
ఖాతాదారుడున్ని.. బ్యాంక్ మేనేజర్ కూడా అడిగాడు. ఆ వ్యక్తి ప్రాపర్టీని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నానని సమాధానమిచ్చాడు. కానీ స్థలం ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పినట్లు.. దీంతో అనుమానం మరింత పెరిగిందని మేనేజర్ పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో తిరిగి రావాలని బ్యాంకు సిబ్బంది ఖాతాదారుడికి సూచించారు. అంతే కాకుండా మూడు రోజుల పాటు నగదు బదిలీని ప్రాసెస్ చేయడానికి నిరాకరించామని మేనేజర్ చెప్పారు.
ఒక సందర్భంలో ఖాతాదారుడు బ్యాంక్ అసోసియేట్ దగ్గరకు వెళ్లకుండా తప్పించుకున్నాడు. బదులుగా మరొక అసోసియేట్ దగ్గరకు వెళ్ళాడు. ఇదంతా గమనించిన బ్యాంక్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. బ్యాంక్ కస్టమర్‌ను 1930కి కనెక్ట్ చేసింది, జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ ద్వారా అక్కడ డిజిటల్ అరెస్ట్ లాంటిదేమీ లేదని స్పష్టం చేసారు.
చివరకు ఆ సీనియర్ సిటిజన్ జరిగిన మొత్తం చెప్పాడు. బ్రాంచ్‌ను సందర్శించినప్పుడు, అతను స్కామర్‌తో కాల్‌లో ఉన్నాడని, అతను బ్యాంకు ఉద్యోగులను నమ్మవద్దని పదేపదే చెప్పినట్టు వివరించారు. మూడు రోజులు స్కామర్ చేతిలో నలిగిన వృద్ధున్ని బ్యాంక్ సిబ్బంది కాపాడింది.
డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి?
మోసగాళ్ళు కొందరికి ఫోన్ చేసి.. అక్రమ వస్తువులు, డ్రగ్స్, నకిలీ పాస్‌పోర్ట్‌లు లేదా ఇతర నిషేధిత వస్తువులు తమ పేరుతో పార్సిల్ వచ్చినట్లు చెబుతారు. ఇదే నేరంగా పరిగణిస్తూ.. ఇలాంటి అక్రమ వస్తువుల విషయంలో బాధితుడు కూడా పాలు పంచుకున్నట్లు భయపెడతారు. ఇలాంటి కేసులో రాజీ కుదుర్చుకోవడానికి డబ్బు డిమాండ్ చేస్తారు. ఇలాంటి మోసాలనే డిజిటల్ అరెస్ట్ అంటారు.
డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లో వ్యక్తులను భయపెట్టడానికి లేదా మోసగించడానికి ప్రభుత్వ సంస్థలు, చట్ట అమలుతో సహా వివిధ సంస్థల అధికారులు మాదిరిగా వ్యవహరిస్తారు. ఇలాంటి కాల్స్ వస్తే.. చాలా జాగ్రత్తగా వ్యవరించాలి. ఒకసారి నమ్మితే భారీగా మోసపోవడానికి సిద్దమయ్యారన్నమాటే.
Comments
Please login to add a commentAdd a comment