Digital Arrest
-
ఆన్లైన్ మోసాలు.. విస్తుపోయే వాస్తవాలు!
ఇంటర్నెట్, మొబైల్ డేటా వినియోగంతో దేశంలో ఆన్లైన్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సైబర్ మోసగాళ్లు రకరకాల పేర్లతో మభ్యపెట్టి అమాయకులను దారుణంగా వంచిస్తున్నారు. ఎంతోమంది వీరి బారిన పడి డబ్బులతో పాటు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. తాజాగా తెలంగాణలో ఓ యువ రైతు ఆన్లైన్ మోసాలకు బలయ్యాడు. సైబర్ కేటుగాళ్ల మాటలు నమ్మి డబ్బులు పొగొట్టుకున్న వికారాబాద్ మండలం పీరంపల్లి గ్రామానికి చెందిన బందెనోల్ల పోచిరెడ్డి(30) అనే రైతు బలవనర్మణం చెందాడు.11 వేల కోట్ల రూపాయలు నష్టంప్రతిఏటా వేల కోట్ల రూపాయలను సైబర్ మోసగాళ్లు కొల్లగొడుతున్నారు. ఆన్లైన్ మోసాలకు మనదేశం 2024 మొదటి 9 నెలల్లోనే 11,333 కోట్ల రూపాయలు నష్టపోయిందని హోంశాఖ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్(ఐ4సీ) వెల్లడించింది. స్టాక్ ట్రేడింగ్ పేరుతో రూ.4636 కోట్లు, ఇన్వెస్ట్మెంట్ సంబంధిత పేర్లతో రూ.3216 కోట్లు మాయం చేశారని పేర్కొంది. డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి రూ1616 కోట్లు దోచేశారని లెక్క చెప్పింది. ఆన్లైన్ మోసాలపై ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 12 లక్షల ఫిర్యాదులు వచ్చినట్టు సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టం (సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్) తెలిపింది. వచ్చే ఏడాదిలోనూ సైబర్ దాడుల ముప్పు కొనసాగుతుందని డేటా సెక్యురిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(డీఎస్‌సీఐ) హెచ్చరించింది.డిజిటల్ అరెస్ట్.. లేటెస్ట్ ట్రెండ్మన దైనందిన జీవితాల్లో డిజిటలైజేషన్ వినియోగం పెరగడంతో తప్పనిసరిగా ఆన్లైన్, మొబైల్ సేవలపై ఆధారపడాల్సి వస్తోంది. మన అవసరాలు, ఆశలను ఆసరాగా తీసుకుని సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త అవతారాల్లో జనాన్ని వంచించి, కేసుల పేరుతో భయపెట్టి సొమ్ములు చేసుకుంటున్నారు. ఫలితంగా దేశంలో సైబర్ మోసాల కేసులు నానాటికీ ఎగబాకుతున్నాయి. ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీగా డబ్బులు కొట్టేసిన ఘటనలు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. దీంతో ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ.. మన్ కీ బాత్ కార్యక్రమం 115వ ఎపిసోడ్లో డిజిటల్ అరెస్ట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రభుత్వానికి చెందిన ఏ దర్యాప్తు సంస్థ కూడా ఫోన్ లేదా వీడియో కాల్స్ ద్వారా విచారణ చేపట్టదని ఆయన తెలిపారు.30 లక్షల ఫిర్యాదులుఅమాయకులను లక్ష్యంగా చేసుకుని సైబర్ దుండగులు మోసాలకు పాల్పుడుతున్నారు. వృద్ధులు, మహిళలను టార్గెట్ చేసి సొమ్ములు కాజేస్తున్నారు. సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్ డేటా ప్రకారం 2021 నుంచి ఇప్పటి వరకు సైబర్ మోసాలపై 30.05 లక్షల ఫిర్యాదులు నమోదు కాగా, రూ.27,914 కోట్లను కేటుగాళ్లు కొల్లగొట్టారు. 2023లో 11,31,221 కేసులు నమోదు కాగా, 2022లో 5,14,741, 2021లో 1,35,242 ఫిర్యాదులు వచ్చాయి. కాగా, కంబోడియా, మయన్మార్, లావోస్ లాంటి ఆగ్నేయాసియా దేశాలు సైబర్ మోసాలకు అడ్డాలు మారాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. మనదేశంలో నమోదైన ఆన్లైన్ మోసాల్లో 45 శాతం ఈ దేశాల నుంచే జరుగుతున్నట్టు గుర్తించారు. చదవండి: సైబర్ స్కామర్స్‌తో జాగ్రత్త.. మోసపోకుండా ఉండాలంటే ఇలా చేయండి..అప్రమత్తతే రక్షణ కవచంసైబర్ మోసగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే స్వీయ అప్రమత్తతే ఆయుధమని నిపుణులు సూచిస్తున్నారు. మొబైల్ ఫోన్లు, వ్యక్తిగత ఇ-మెయిల్, వాట్సాప్‌లో వచ్చే అనుమానాస్పద లింకులు.. సందేశాలకు స్పందించవద్దని కోరుతున్నారు. ఎక్కువ డబ్బు ఆశచూపే వారి పట్ల అలర్ట్‌గా ఉండాలని చెబుతున్నారు. ప్రభుత్వ దర్యాప్తు సంస్థల పేరుతో ఎవరైనా భయపడితే కంగారు పడొద్దని, నేరుగా పోలీసులను సంప్రదించాలని నిపుణులు సలహాయిస్తున్నారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైనట్టు భావిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు. మున్ముందు కూడా కొత్త తరహా సైబర్ మోసాలకు పాల్పడే అవకాశం ఉన్నందున వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. -
వణికించిన ఫోన్ కాల్.. రూ. 7.28 లక్షలు దోపిడీ
ఆన్లైన్ మోసాలకు అంతే లేకుండా పోతోంది. వయసుతో సంబంధం లేకుండా యువత, ఉన్నత విద్యావంతులు కూడా ఈ మోసాలకు గురవుతున్నారు. తాజాగా 25 ఏళ్ల ఐఐటీ బాంబే విద్యార్థి అధునాతన మోసంలో రూ. 7.28 లక్షలు కోల్పోయి బాధితుడయ్యాడు.వార్తా సంస్థ పీటీఐ రిపోర్ట్ ప్రకారం.. విద్యార్థికి ట్రాయ్ అధికారినంటూ ఓ వ్యక్తి నుండి కాల్ వచ్చింది. విద్యార్థి మొబైల్ నంబర్‌పై చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన 17 ఫిర్యాదులు నమోదయ్యాయని ఆ వ్యక్తి చెప్పాడు. తమ సూచనలను పాటించకపోతే "డిజిటల్ అరెస్ట్" అయ్యే ప్రమాదం ఉందని బెదిరించాడు.చట్టపరమైన పరిణామాలు, అభియోగాల తీవ్రతకు భయపడిన విద్యార్థి వారి సూచనలను అనుసరించడానికి అంగీకరించాడు. కేసుల నుంచి పేరును తొలగించడానికి, చట్టపరమైన సమస్యలను నివారించడానికి రూపొందించిన ప్రక్రియ పేరుతో స్కామర్లు పలు దఫాలుగా రూ. 7.28 లక్షలను వారి ఖాతాకు బదిలీ చేయాలని ఆదేశించారు. భయంతో అతను వారి సూచనలను అనుసరించిన విద్యార్థి చివరికి bమోసానికి గురయ్యాడు.వణికిపోవద్దు..ఇలాంటి ఆన్లైన్ మోసాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల ఇలాంటి మోసాలకు బలి అవుతున్న వ్యక్తుల సంఖ్య దేశంలో పెరుగుతోంది. ఈ స్కామ్‌లలో చాలా వరకు వాట్సాప్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు లేదా చట్టబద్ధమైన సంస్థల పేరుతో నకిలీ వెబ్సైట్ల ద్వారా జరుగుతన్నాయి. అటువంటి కాల్స్ వచ్చినప్పుడు కాలర్ గుర్తింపును ధ్రువీకరించుకోవాలని, సున్నితమైన సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో పరిస్థితిని అంచనా వేయడానికి కొంత సమయం తీసుకోవాలని, భయంతో హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోవద్దని సూచిస్తున్నారు. -
డిజిటల్ అరెస్ట్ స్కామ్: ఖాతాదారుడ్ని కాపాడిన ఎస్బీఐ సిబ్బంది
టెక్నాలజీ పరుగులు పెడుతున్న తరుణంలో సైబర్ నేరాలు ఎక్కువవుతున్నాయి. సైబర్ నేరగాళ్లు రోజుకో అవతరమెత్తి అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. ఇందులో ఒకటి డిజిటల్ అరెస్ట్. దీనికి బలైనవారు ఇప్పటికే కోకొల్లలు. అయితే ఇటీవల ఎస్బీఐ సిబ్బంది ఓ వ్యక్తిని డిజిటల్ అరెస్ట్ బారినుంచి కాపాడి.. లక్షలు పోగొట్టుకోకుండా చూడగలిగారు.బ్యాంకుకు(గోప్యత కోసం బ్రాంచ్‌ను ప్రస్తావించడం లేదు) చాలా కాలంగా కస్టమర్‌గా ఉన్న 61 ఏళ్ల డాక్టర్‌ను స్కామర్లు టార్గెట్ చేశారు. డిజిటల్ అరెస్టులో ఉన్నారని సీనియర్ సిటిజన్‌ను నమ్మించి, ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలని బెదిరించి.. డబ్బు కాజేయాలని పన్నాగం పన్నారు. అయితే.. ఆ పెద్దాయన తన ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి డబ్బు విత్‌డ్రా చేయడానికి బ్యాంకుకు వెళ్ళాడు. ఆ సమయంలో అతడు కొంత టెన్షన్‌గా ఉండటాన్ని బ్యాంకు అసోసియేట్ గమనించి, సమస్య గురించి ఆరా తీసింది. వ్యక్తిగత కారణాల వల్లనే డబ్బు తీసుకుంటున్నాని ఆయన వెల్లడించారు. అయితే బ్యాంకు అసోసియేట్ ఆయన మాటలు నమ్మలేదు. అతన్ని బ్రాంచ్ మేనేజర్ దగ్గరకు పంపించింది.ఖాతాదారుడున్ని.. బ్యాంక్ మేనేజర్ కూడా అడిగాడు. ఆ వ్యక్తి ప్రాపర్టీని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నానని సమాధానమిచ్చాడు. కానీ స్థలం ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పినట్లు.. దీంతో అనుమానం మరింత పెరిగిందని మేనేజర్ పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో తిరిగి రావాలని బ్యాంకు సిబ్బంది ఖాతాదారుడికి సూచించారు. అంతే కాకుండా మూడు రోజుల పాటు నగదు బదిలీని ప్రాసెస్ చేయడానికి నిరాకరించామని మేనేజర్ చెప్పారు.ఒక సందర్భంలో ఖాతాదారుడు బ్యాంక్ అసోసియేట్ దగ్గరకు వెళ్లకుండా తప్పించుకున్నాడు. బదులుగా మరొక అసోసియేట్ దగ్గరకు వెళ్ళాడు. ఇదంతా గమనించిన బ్యాంక్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. బ్యాంక్ కస్టమర్‌ను 1930కి కనెక్ట్ చేసింది, జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ ద్వారా అక్కడ డిజిటల్ అరెస్ట్ లాంటిదేమీ లేదని స్పష్టం చేసారు.చివరకు ఆ సీనియర్ సిటిజన్ జరిగిన మొత్తం చెప్పాడు. బ్రాంచ్‌ను సందర్శించినప్పుడు, అతను స్కామర్‌తో కాల్లో ఉన్నాడని, అతను బ్యాంకు ఉద్యోగులను నమ్మవద్దని పదేపదే చెప్పినట్టు వివరించారు. మూడు రోజులు స్కామర్ చేతిలో నలిగిన వృద్ధున్ని బ్యాంక్ సిబ్బంది కాపాడింది.డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి?మోసగాళ్ళు కొందరికి ఫోన్ చేసి.. అక్రమ వస్తువులు, డ్రగ్స్, నకిలీ పాస్‌పోర్ట్‌లు లేదా ఇతర నిషేధిత వస్తువులు తమ పేరుతో పార్సిల్ వచ్చినట్లు చెబుతారు. ఇదే నేరంగా పరిగణిస్తూ.. ఇలాంటి అక్రమ వస్తువుల విషయంలో బాధితుడు కూడా పాలు పంచుకున్నట్లు భయపెడతారు. ఇలాంటి కేసులో రాజీ కుదుర్చుకోవడానికి డబ్బు డిమాండ్ చేస్తారు. ఇలాంటి మోసాలనే డిజిటల్ అరెస్ట్ అంటారు.డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లో వ్యక్తులను భయపెట్టడానికి లేదా మోసగించడానికి ప్రభుత్వ సంస్థలు, చట్ట అమలుతో సహా వివిధ సంస్థల అధికారులు మాదిరిగా వ్యవహరిస్తారు. ఇలాంటి కాల్స్ వస్తే.. చాలా జాగ్రత్తగా వ్యవరించాలి. ఒకసారి నమ్మితే భారీగా మోసపోవడానికి సిద్దమయ్యారన్నమాటే. -
డిజిటల్ అరెస్ట్..బీ అలెర్ట్!
‘‘చట్టంలో డిజిటల్ అరెస్టు అనే వ్యవస్థే లేదు.. డిజిటల్ అరెస్టు చేయడమనేది పూర్తిగా అబద్ధం. క్రిమినల్ గ్యాంగులు, మోసగాళ్లు, ఆన్లైన్ దొంగలు చేసే పనే ఈ డిజిటల్ అరెస్టు’’ – 115వ మన్‌కీబాత్ రేడియో కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. కేస్–1ఆయన పేరు ఎల్ఎస్ ఆనంద్..వయసు 72 ఏళ్లు..కర్ణాటకలోని శివమొగ్గ నగరం గోపాళ లేఅవుట్లో నివాసం.. ఒకరోజు హఠాత్తుగా ఆయనకు సీబీఐ అధికారినంటూ ఒక వీడియో కాల్ వచ్చింది. మీ ఆధార్ కార్డు నంబర్లో పెద్ద మొత్తంలో డబ్బులు అక్రమ బదిలీ జరిగింది. దీంతో మీపై ఫిర్యాదు అందింది.. మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నామంటూ ఆనంద్‌ను భయపెట్టారు. ఆ తర్వాత ఆనంద్‌ను భయపెట్టి రూ.41 లక్షలను దోచుకున్నారు. డబ్బులు కోల్పోయిన తర్వాత శివమొగ్గ సైబర్ పోలీస్‌స్టేషన్‌ను ఆనంద్ ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహమ్మద్ అహ్మద్ (45), అభిషేక్ షేఖ్ (27) అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. కేస్–2 తుమకూరు నగరం విద్యానగరకు చెందిన జి.విజయాదిత్య పాటిల్ ఇంజినీర్. నవంబర్ 13న ఆయనకు ముంబై ఫెడెక్స్ కొరియర్ సర్వీస్ నుంచి కాల్ చేస్తున్నట్లు కాల్ వచ్చింది. అదే రోజు సాయంత్రం ముంబై సైబర్ సెల్ నుంచి మాట్లాడుతున్నట్లు నమ్మించారు. మీరు ముంబై నుంచి ఇరాన్‌కు పంపిస్తున్న పార్సిల్లో 5 పాస్‌పోర్టులు, ఎండీఎంఏ అనే డ్రగ్స్ ఉన్నట్లు విజయాదిత్యను భయపెట్టారు. విచారణ నిమిత్తం స్కైప్లోకి రావాలని పిలిచారు. ఆ మరుసటి రోజు డిజిటల్ అరెస్ట్ నుంచి తప్పించుకోవాలంటే డబ్బులు ఇవ్వాలని బెదిరించి రూ.33.99 లక్షలను బాధితుడి నుంచి బదిలీ చేయించుకున్నారు. ఆ తర్వాత గూగుల్‌లో ముంబై సైబర్ సెల్ సమాచారాన్ని సేకరించి కాల్ చేయగా, తాను మోసపోయానని విజయాదిత్య గ్రహించాడు. కేస్–3సీబీఐ అధికారి అంటూ ఫోన్ కాల్లో బెదిరించడమే కాకుండా డిజిటల్ అరెస్టు ద్వారా లక్షలాది రూపాయలను మోసం చేసిన నిందితుడిని కావూరు పోలీసులు అరెస్టు చేశారు. కేరళ ఎర్నాకులం జిల్లా ఆలువా తాలూకాకు చెందిన నిసార్ అనే నిందితుడు డిజిటల్ అరెస్టు ద్వారా రూ. 68 లక్షలను దోచుకున్నట్లు మంగళూరు నగర పోలీసు కమిషనర్ అనుపమ్ అగర్వాల్ తెలిపారు.సాక్షి, బెంగళూరు: డిజిటల్ సాంకేతికతలు పెరుగుతున్నట్లే అదే స్థాయిలో మోసాలు కూడా పెరుగుతున్నాయి. దైనందిన జీవితంలో సమాచార సాంకేతికతను ఎంతగా వినియోగిస్తున్నామో అంతే స్థాయిలో వాటి వల్ల ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ఇటీవల కాలంలో సామాన్య ప్రజలను చాలా సులభంగా డిజిటల్ అరెస్టు ద్వారా సైబర్ నేరస్తులు మోసం చేస్తున్నారు. ఇలాంటి తరహా కేసులు ప్రభుత్వాలకు సవాలుగా మారాయి.ఎలాంటి శ్రమ లేకుండా ఆదాయం ఆర్జింజే మార్గాల్లో డిజిటల్ అరెస్టు ఒకటిగా సైబర్ మోసగాళ్లు మార్చుకున్నారు. సైబర్ మోసగాళ్లు అత్యాధునికతను ఉపయోగించుకుని తమ వరŠుచ్యవల్ మార్కెట్‌ను విస్తరించుకుంటున్నారు. ప్రారంభంలో క్రెడిట్, డెబిట్ కార్డుల సమాచారం, ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాలు తదితర వాటి ద్వారా ప్రజలు మోసం చేసేవారు. తాజాగా డిజిటల్ అరెస్ట్ ద్వారా కొత్తగా దోపిడీ మార్గాన్ని ఎన్నుకున్నారు. కర్ణాటకలో ప్రస్తుతం డిజిటల్ అరెస్టు మోసాలు పెరిగిపోతున్నాయి. ఆన్లైన్ సైబర్ మోసాలు రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతున్నాయి. తాజాగా సంతరించుకున్న రూపమే డిజిటల్ అరెస్ట్. ఈ తరహా సైబర్ మోసానికి గురై చాలా మంది లక్షలాది రూపాయలను కోల్పోతున్నారు. ఈ పద్ధతిపై ఇటీవల జరిగిన మన్‌కీ బాత్‌లో కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను అప్రమత్తం చేశారు. కర్ణాటకలో జరిగిన ఒక కేసును ఉటంకిస్తూ ప్రజలను హెచ్చరించారు. ముంబై పోలీసుల పేరిట కర్ణాటక విజయపుర సంతోష్ చౌధురి అనే వ్యక్తిని బ్లాక్మెయిల్ చేసేందుకు యత్నించిన ఘటనను ప్రధాని ప్రస్తావించి డిజిటల్ అరెస్ట్‌పై హెచ్చరించారు. ఈ సైబర్ మోసాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండి, తమ ఆధార్, ఓటీపీ, బ్యాంక్ అకౌంట్ నంబర్ తదితర వివరాలను గోప్యంగా ఉంచాలని పోలీసులు సూచిస్తున్నారు.ఏంటీ డిజిటల్ అరెస్ట్..??సామాన్య అర్థంలో డిజిటల్ అరెస్టు అంటే సైబర్ మోసగాళ్లు.. అమాయకులను లక్ష్యంగా చేసుకుని తాము పోలీసులు, ఈడీ, సీబీఐ, ఐటీ, ఆర్బీఐ, నార్కోటిక్స్, కస్టమ్స్ అధికారులమంటూ చెప్పుకుని మోసం చేయడమే. ప్రజలకు అధికారులమంటూ కాల్ చేసి, వారిని నకిలీ గుర్తింపు కార్డుల ద్వారా నమ్మించి, నకిలీ అరెస్టు వారెంట్లు చూపించి, కూర్చొన్న చోట నుంచే వీడియో, ఆడియో కాల్స్ చేసి డబ్బును దోచుకుంటున్నారు. ‘మీరు సీరియస్ నేరానికి పాల్పడ్డారు. కొన్నేళ్ల పాటు శిక్ష పడుతుంది. న్యాయ ప్రక్రియ ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అంటూ ప్రజలను బెదిరించి, భయపెట్టి డబ్బులను దోచుకుంటున్నారు.ఎలా జరుగుతుంది??డిజిటల్ అరెస్ట్ కేసుల్లో నిందితులు అధికారుల రూపంలో ఆడియో, వీడియో కాల్స్ చేస్తారు. వాట్సాప్, స్కైప్ వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వీడియో కాల్స్ చేస్తున్నారు. బాధితులకు డిజిటల్ అరెస్ట్ వారంట్లను జారీ చేస్తారు. నిధుల దుర్వినియోగం, పన్నుల మోసాలు, ఇతరత్రా చట్ట ఉల్లంఘనలను వివిధ కారణాల చూపిస్తూ బాధితులను భయపెడతారు. కొన్ని సందర్భాల్లో ఈ మోసగాళ్లు ఈ ఫోన్ కాల్స్ నిజమేనని నమ్మించడానికి పోలీసు స్టేషన్లు తరహాలో సెట్లను కూడా తయారు చేసుకుంటారు. విచారణలో సహకరిస్తామని, కేసులో పేరు లేకుండా చేస్తామని, రిఫండబుల్ డబ్బులు చెల్లించాలని నమ్మబలికి తమ బ్యాంకు ఖాతాలకు లేదా యూపీఐ ఐడీలకు అమౌంట్ బదిలీ చేయించుకుంటారు. ఒక్కసారి వారి మాటలను నమ్మి డబ్బులు చెల్లించిన తర్వాత మళ్లీ స్కామర్లు కనిపించరు.ఈ మోసాన్ని ఎలా తప్పించుకోవాలంటే?⇒ నిజమైన అధికారులు ఎప్పటికీ డబ్బులు చెల్లించాలని, బ్యాంకింగ్ వివరాలు ఇవ్వాలని అడగరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ⇒ సైబర్ మోసగాళ్లు డబ్బుల కోసం త్వరపెడుతుంటారు. వారి చర్యలను వేగంగా నిర్వహిస్తారు. కాల్స్ చేస్తూ డబ్బుల కోసం డిమాండ్ చేస్తుంటారు. ⇒ స్కామర్లపై అనుమానం కలిగిన వెంటనే సంబంధిత ఏజెన్సీకి నేరుగా సంప్రదించి వారి గుర్తింపును నిర్థారించుకోవాలి. ⇒ వ్యక్తిగత సమాచారాన్ని, ఆర్థిక అంశాలు, వివరాలను ఎప్పటికీ ఎవ్వరికీ బహిర్గతం చేయకూడదు. ⇒ ప్రభుత్వ ఏజెన్సీలు అధికారిక సంప్రదింపుల కోసం వాట్సాప్, స్కైప్ వంటి సామాజిక మాధ్యమాలను వినియోగించరు. ⇒ మీరు మోసానికి గురవుతున్నారని అనుమానం వచ్చిన వెంటనే పోలీస్‌స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలి. మోసపోయిన తర్వాత ఇలా చేయాలి..⇒ ఆన్లైన్ మోసానికి గురై డబ్బులు కోల్పోతే వెంటనే బ్యాంక్ అధికారులను సంప్రదించి ఖాతాను ఫ్రీజ్ చేయాలి. ⇒ జాతీయ సైబర్ నేరాల పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి. ⇒ మోసపోయిన తర్వాత నిందితుల వివరాలను మీ వద్దే ఉంచుకోండి. అంటే ఫోన్ కాల్స్ వివరాలు, లావాదేవీలు, సందేశాలు తదితర వాటిని సేవ్ చేసుకుని ఉంచుకోవాలి. ⇒ అవసరమైతే న్యాయవాదుల సహాయం పొందాలి. -
అలర్ట్: ఈ–చలాన్ పేరిట సైబర్ మోసాలు
సాక్షి, హైదరాబాద్: వాహనదారులను బురిడీ కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్సైట్ లింక్‌లు పంపుతున్నారు. అందులో.. మీ వాహనాలపై ఉన్న ఈ–చలాన్లు చెల్లించండని.. పేర్కొంటున్నారు. ట్రాఫిక్ చలాన్లు చెల్లించాలని వచ్చే ఎస్ఎంఎస్లో నకిలీ వెబ్సైట్ లింక్ ఉంటుందని, వాహనదారులు దీన్ని క్షుణ్ణంగా గమనించాలని పోలీసులు సూచిస్తున్నారు. వాస్తవానికి ఈ–చలాన్‌కు సంబంధించిన నిజమైన వెబ్‌లింక్ echallan.parivahan.gov.in కాగా దీన్ని కొద్దిగా మార్పు చేసి సైబర్ నేరగాళ్లు challaanparivahan.inను పంపుతున్నట్టు తెలిపారు. ఇలాంటి అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ‘డిజిటల్ అరెస్టు’ మోసగాడి పట్టివేత రాయదుర్గం: ‘డిజిటల్ అరెస్ట్’ కేసులో మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్స్పెక్టర్ కె రామిరెడ్డి నేతృత్వంలో పుణేలో ఈ మేరకు నిందితుడు కపిల్‌కుమార్ (42)ను అరెస్ట్ చేశారు. ఇతను 40 ఏళ్ల మహిళను లక్ష్యంగా చేసుకొని డిజిటల్ అరెస్ట్ మోసానికి పాల్పడ్డాడు. బాధితురాలికి ఆమె పేరుతో ఉన్న సమస్యకు సంబంధించి ఢిల్లీ హైకోర్టునుంచి ఆటోమేటెడ్ కాల్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసిన మహిళను మీ బ్యాంకు ఖాతా ద్వారా మోసపూరిత కార్యకలాపాలు, మనీ లాండరింగ్ లావాదేవీలు జరిగాయని పేర్కొన్న నిందితులు డిజిటల్ అరెస్టు పేరుతో ఆమెను 24 గంటలపాటు భయపెట్టారు. అనంతరం భారీ మొత్తం నగదును బదిలీ చేయించుకున్నారు. ఈ కేసులో ఈ కేసులో ఏ1గా కింగ్‌శుక్ శుక్లా, ఏ2గా కపిల్‌కుమార్ ఉన్నారు. పనిచేసే సంస్థకే కన్నం బంజారాహిల్స్: నమ్మకంగా పనిచేస్తూ పనిచేసే సంస్థకే ఉద్యోగి దాదాపు రూ.1.40 కోట్ల మోసానికి పాల్పడిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఏషియన్ ముక్తా ఏ2 సినిమాస్‌లో దాదాపు ఏడున్నర ఏళ్లుగా విశ్వనాథ్‌రెడ్డి అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. అదే సంస్థలో అతని భార్య సఫియా నజీర్ మేనేజర్‌గా పనిచేస్తుంది. ఈ నెల 18న ఏషియన్ ముక్తా సంస్థలో అంతర్గతంగా నిర్వహించిన ఆడిటింగ్‌లో భాగంగా విశ్వనాథ్‌రెడ్డి పెద్ద మొత్తంలో డబ్బులు కాజేసినట్లు గుర్తించారు. చదవండి: సైబర్ మోసాల నుంచి తప్పించుకోండిలా..నకిలీ బ్యాంక్ ఖాతాలు సృష్టించి సంస్థ రూ.1,47,08,928 నిధులను తన భార్య, సోదరుడు రాసిం రాజశేఖర్, స్నేహితుడు శశాంక్ పేరుతో ఉన్న ఖాతాల్లోకి మళ్లించినట్లు గుర్తించారు. హిందుస్థాన్ కోకోకోలా బేవరేజస్, సాయి నైన్ ఎంటర్ప్రైజెస్ల పేర్లతో మొత్తం నాలుగు ఖాతాల్లోకి ఈ మొత్తం డబ్బును మళ్లించినట్లు గుర్తించారు. ఆడిటింగ్‌లో భాగంగా ఈ నిధుల గోల్మాల్ పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు ఏషియన్ ముక్తా ఏ2 సినిమాస్ సంస్థ మేనేజింగ్ పార్టనర్ సునీల్ నారంగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు నిందితులపై బీఎన్ఎస్ సెక్షన్ 316 (4), 318 (4), 335, 336 (3), 338, రెడ్ విత్ 3(5)ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతిలో వరుస బాంబు బెదిరింపులుతిరుపతి క్రైమ్: ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో వరసగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. గత వారం రోజుల్లో పలుమార్లు నగరంలోని ప్రముఖ హోటల్స్‌ను టార్గెట్ చేస్తూ బాంబులు పెట్టామని మెయిల్స్ ద్వారా బెదిరిస్తున్న దుండగులు తాజాగా తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్లో బాంబు పెట్టామని ఆదివారం బెదిరింపులకు దిగారు. దీంతో పోలీసు యంత్రాంగం ఇస్కాన్ టెంపుల్ వద్ద డాగ్, బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టింది. జాఫర్ సాధిక్ అనే పేరుతో బాంబు బెదిరింపు మెయిల్ వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. -
పరిధిని పట్టించుకోకుండా ‘డిజిటల్ అరెస్టు’ తప్పించాడు!
సాక్షి, హైదరాబాద్: డ్రగ్ పార్శిల్స్, మనీ లాండరింగ్, బ్యాంకు ఖాతా దుర్వినియోగం అంటూ పోలీసుల పేరుతో ఫోన్లు చేస్తున్న సైబర్ నేరగాళ్లు ‘డిజిటల్ అరెస్టు’ చేస్తున్నారు. వీడియో కాల్ ద్వారా నిఘా గంటల తరబడి నిర్భంధించి అందినకాడికి దండుకుంటున్నారు. ఇలాంటి వారి బారినపడి రూ.లక్షలు, రూ.కోట్లు నష్టపోయిన కేసులు ఇటీవలి కాలంలో అనేకం నమోదయ్యాయి. అయితే సిటీ సైబర్ క్రైమ్ ఠాణాకు చెందిన కానిస్టేబుల్ గణేష్ చొరవతో సైబరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ ఫ్రాడ్ బారినపడకుండా బయటపడ్డారు. పరిధులు పట్టించుకోకుండా వేళకాని వేళలో వచ్చిన ఫోన్ కాల్‌కూ పక్కాగా స్పందించిన గణేష్‌ను ఉన్నతాధికారులు ఆదివారం అభినందించారు. మియాపూర్ ప్రాంతానికి చెందిన ఓ ఐటీ ఉద్యోగికి శుక్రవారం వాట్సాప్ ద్వారా కొన్ని మెసేజ్‌లు వచ్చాయి. ఈయన ఆధార్ నెంబర్ వినియోగించి ముంబైలో కొందరు మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని, దీనిపై అక్కడ కేసు నమోదైందని వాటిలో ఉంది. ఆ సందేశాలను బాధితుడు పట్టించుకోలేదు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి వర్చువల్ నెంబర్ల ద్వారా ఫోన్ కాల్స్ మొదలయ్యాయి. ముంబై పోలీసుల మాదిరిగా మాట్లాడిన సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేసి యూనిఫాంలో కనిపించారు. కేసు, అరెస్టు అంటూ తీవ్రంగా భయపెట్టి ఇంట్లో ఉంటే స్థానిక పోలీసులూ వచి్చన అరెస్టు చేస్తారని భయపెట్టారు. తాను ఎప్పుడూ ముంబై రాలేదని, ఆ ఆరి్థక లావాదేవీలతో తనకు సంబంధం లేదని చెప్పినా సైబర్ నేరగాళ్లు పట్టించుకోలేదు.శనివారం తెల్లవారుజాము నుంచి రకరకాలుగా భయపెట్టిన వారు సదరు ఐటీ ఉద్యోగి బ్యాంకు ఖాతాలో రూ.13 లక్షలు ఉన్నట్లు గుర్తించారు. సోమవారం వరకు అతడు ఎక్కడికీ వెళ్లకుండా, ఎవరితో మాట్లాడకుండా చేసి ఆపై ఆరీ్టజీఎస్ ద్వారా ఆ మొత్తం కాజేయాలని పథకం వేశారు. దీంతో ఐటీ ఉద్యోగిని డిజిటల్ అరెస్టు చేస్తున్నట్లు చెప్పిన సైబర్ నేరగాళ్లు ఇంటి నుంచి బయటకు రప్పించారు. కుటుంబీకులతో సహా ఎవరినీ కలవద్దంటూ షరతు విధించి అమీర్‌పేటలోని ఓ హోటల్లో బస చేయించారు. ఇలా ఆదివారం తెల్లవారుజాము 3 గంటల వరకు ఆడియో, వీడియో కాల్స్ కట్ చేయని సైబర్ నేరగాళ్లు బాధితుడిని హోటల్ గదిలోనే ఉంచారు. ఆ సమయంలో కాల్ కట్ అవడంతో బాధితుడికి కాస్తా అవకాశం చిక్కింది. దీంతో ధైర్యం చేసిన అతడు ఇంటర్నెట్లో సెర్చ్ చేసి హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణా ఫోన్ నెంబర్ తెలుసుకున్నాడు. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో సదరు నెంబర్‌కు కాల్ చేయగా... ఆ సమయంలో విధుల్లో ఉన్న కానిస్టేబుల్ గణేష్ అందుకున్నారు. సాధారణంగా పోలీసులు తమకు ఫోన్ చేసిన బాధితులు బయటి ప్రాంతాలకు చెందిన వారని చెప్పగానే... అక్కడి అధికారులను సంప్రదించాలని చెబుతుంటారు. అయితే ఈ బాధితుడు మియాపూర్ వాసిని అని చెప్పినా ఆ సమయంలోనూ పక్కాగా స్పందించిన గణేష్ విషయం మొత్తం తెలుసుకున్నారు. అది సైబర్ మోసమంటూ బాధితుడికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు మియాపూర్‌లో వారి ఇంటి పక్కన ఉండే స్నేహితుడి నెంబర్ తీసుకున్నాడు. ఆ సమయంలో ఆయనకు ఫోన్ చేసి విషయం చెప్పిన గణే‹Ù... బాధితుడి వద్దకు వచ్చి తీసుకువెళ్లేలా చొరవ చూపారు. ఈ అంశంలో కానిస్టేబుల్ గణేష్ స్పందనకు ఉన్నతాధికారులు అభినందించారు. -
‘డిజిటల్ అరెస్టు’కు... భయపడకండి
న్యూఢిల్లీ: దేశంలో సైబర్ నేరాలు పెరిగిపోతుండడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం వేశారు. ఇటీవల పెచ్చరిల్లుతున్న ‘డిజిటల్ అరెస్టు’ ఫ్రాడ్‌ను ఆదివారం ‘మన్‌కీ బాత్’లో ప్రధానంగా ప్రస్తావించారు. ‘‘అన్ని వయసుల వారూ వీటి బారిన పడుతున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోతున్నారు’’ అని ఆవేదన వెలిబుచ్చారు. సైబర్ నేరగాడికి, బాధితుడికి మధ్య జరిగిన సంభాషణను మోదీ ఉదాహరించారు. ‘‘సైబర్ నేరగాళ్లు తొలుత వ్యక్తిగత సమాచారం సేకరిస్తారు. తర్వాత ఫోన్లు చేసి మీరు నేరాల్లో ఇరుక్కున్నారంటూ భయభ్రాంతులకు గురి చేస్తారు. ఆలోచించుకొనే సమయం కూడా ఇవ్వరు. డబ్బులిస్తారా, అరెస్టవుతారా అంటూ బెదిరిస్తారు. భయపడితే మానసికంగా మరింత ఒత్తిడికి గురి చేసి డబ్బు గుంజుతారు. ‘ఆగడం, ఆలోచించడం, చర్య తీసుకోవడం’ ఈ మోసాలకు విరుగుడు’’ అన్నారు. ‘‘ఇలాంటి గుర్తు తెలియని బెదిరింపు ఫోన్లకు భయపడకుండా ధైర్యంగా ఉండండి. దర్యాప్తు సంస్థలు, పోలీసులు ప్రజలకు ఇలాంటి ఫోన్లు చేయరని, డబ్బులడగరని గుర్తుంచుకోండి. సాయం కోసం జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నెంబర్ ‘1930’కు ఫోన్ చేయండి. సైబర్ నేరగాళ్లతో సంభాషణను రికార్డు చేసి దర్యాప్తు సంస్థలకు అందించండి. సైబర్ మోసాలపై cybercrime. gov. in వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయండి’’ అని సూచించారు. ‘‘డిజిటల్ మోసాలు, ఆన్లైన్ స్కాములపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి. అప్రమత్తతే డిజిటల్ భద్రత కల్పిస్తుంది’’ అని ఉద్ఘాటించారు. సైబర్ నేరగాళ్లను సమాజానికి శత్రువులుగా అభివరి్ణంచారు. సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కలి్పంచాలన్నారు. అవి మరపురాని క్షణాలు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు ఈ నెల 31న ఘనంగా నిర్వహించుకుందామని మోదీ అన్నారు. ‘‘గిరిజన యోధుడు బిర్సా ముండా జయంతి వేడుకలు నవంబర్ 15న ప్రారంభమవుతాయి. గతేడాది జార్ఖండ్‌లో బిర్సా ముండా స్వగ్రామం ఉలిహాతును సందర్శించా. అవి మరపురాని క్షణాలు’’ అన్నారు.యానిమేషన్లో అద్భుతాలు ప్రతి రంగంలోనూ ‘ఆత్మనిర్భర్ భారత్’ స్ఫూర్తి కనిపిస్తోందని మోదీ హర్షం వెలిబుచ్చారు. ‘‘మన రక్షణ ఉత్పత్తులు 85 దేశాలకు ఎగుమతవుతున్నాయి. యానిమేషన్ రంగంలో మన కళాకారులు గణనీయమైన ప్రగతి సాధించారు. చోటా భీమ్, హనుమాన్, మోటు–పత్లూ, ధోలక్పూర్ కా ధోల్ వంటి యానిమేషన్ సిరీస్‌లు విదేశాల్లోనూ ప్రజాదరణ పొందుతున్నాయి. భారత్‌ను ప్రపంచ యానిమేషన్ పవర్‌హౌస్‌గా మారుద్దాం. ఇండియాలో గేమింగ్ రంగం వేగంగా విస్తరిస్తోంది. మన గేమ్స్‌కు ప్రపంచమంతటా ఆదరణ ఉంది. ప ర్యాటకానికి వర్చువల్ రియాలిటీ (వీటీ) ఊతం ఇస్తోంది. ప్రపంచంలో తదుపరి సూపర్ హిట్ యానిమేషన్ చిత్రం మీ కంప్యూటర్ నుంచే రావొచ్చు. మరో గొప్ప గేమ్‌ను మీరే సృష్టించవచ్చు’’ అని యువతనుద్దేశించి పేర్కొన్నారు. -
దడ పుట్టిస్తున్న డిజిటల్ అరెస్ట్: దీని గురించి తెలుసా?
టెక్నాలజీ పెరుగుతుండటంతో.. సైబర్ మోసగాళ్లు ప్రజలను మోసం చేయడానికి కొత్త పథకాలు పన్నుతున్నారు. ఇందులో భాగంగా పుట్టుకొచ్చిందే.. డిజిటల్ అరెస్ట్. ఇంతకీ డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి? దీని నుంచి ఎలా తప్పించుకోవాలి అనే మరిన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.డిజిటల్ అరెస్ట్మోసగాళ్ళు కొందరికి ఫోన్ చేసి.. అక్రమ వస్తువులు, డ్రగ్స్, నకిలీ పాస్‌పోర్ట్‌లు లేదా ఇతర నిషేధిత వస్తువులు తమ పేరుతో పార్సిల్ వచ్చినట్లు చెబుతారు. ఇదే నేరంగా పరిగణిస్తూ.. ఇలాంటి అక్రమ వస్తువుల విషయంలో బాధితుడు కూడా పాలు పంచుకున్నట్లు భయపెడతారు. ఇలాంటి కేసులో రాజీ కుదుర్చుకోవడానికి డబ్బు డిమాండ్ చేస్తారు. ఇలాంటి మోసాలనే డిజిటల్ అరెస్ట్ అంటారు.డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లో వ్యక్తులను భయపెట్టడానికి లేదా మోసగించడానికి ప్రభుత్వ సంస్థలు, చట్ట అమలుతో సహా వివిధ సంస్థల అధికారులు మాదిరిగా వ్యవహరిస్తారు. ఇలాంటి కాల్స్ వస్తే.. చాలా జాగ్రత్తగా వ్యవరించాలి. ఒకసారి నమ్మితే భారీగా మోసపోవడానికి సిద్దమయ్యారన్నమాటే.ఇప్పటికే సైబర్ మోసగాళ్ల భారిన పది ఎంతోమంది లెక్కకు మించిన డబ్బును కోల్పోయారు. ఈ జాబితాలో నోయిడాకు చెందిన ప్రముఖ వైద్యురాలు డాక్టర్ పూజా గోయెల్ (రూ.60 లక్షలు మోసపోయారు), దక్షిణ ఢిల్లీలోని సీఆర్ పార్క్‌కి చెందిన 72 ఏళ్ల వృద్ధురాలు (రూ. 93 లక్షలు), వర్ధమాన్ గ్రూప్ సీఈఓ ఎస్పీ ఓస్వాల్ మొదలైనవారు ఉన్నారు.ఇలాంటి కాల్స్ వస్తే ఏం చేయాలి?మీకు పరిచయం లేని వ్యక్తులు ఫోన్ చేసి భయపెడితే.. ఏ మాత్రం భయపడకుండా మీరే వారిని క్రాస్ క్వశ్చన్ చేయకండి. ఏదైనా డబ్బు అడిగినా.. లేదా భయపెట్టినా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి లేదా సంబంధిత అధికారులను కలిసి జరిగిన విషయాన్ని గురించి వివరించండి.ఇదీ చదవండి: అంబానీ చెప్పిన మూడు విషయాలు ఇవే.. హర్ష్ గోయెంకాఇటీవల పెరిగిపోతున్న సైబర్ మోసాలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇలాంటి కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది. సైబర్ మోసాలు ఎలా జరుగుతాయో తెలియచేయడానికి ఒక ఆడియో క్లిప్ కూడా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.Beware of Scam Calls! Received a call from a 'CBI Officer' or any government official asking for sensitive details? It's a scam! Don't fall for it.Report any cybercrime at 1930 or https://t.co/pVyjABtwyF#I4C #CyberSafety #DigitalArrest #ReportScams #AapkaCyberDost pic.twitter.com/XBEJjKr6u0— Cyber Dost (@Cyberdost) October 5, 2024