![A Family In Noida Digitally Arrested For 5 Days](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/Digitally-Arrested1.jpg.webp?itok=BPnYewkW)
నోయిడా: ‘సైబర్ నేరగాళ్ల(Cyber Scam)తో జాగ్రత్త.. వారి వద్ద నుంచి ఏ రకంగానైనా కాల్స్ రావొచ్చు.. మీ ఖాతాలు ఖాళీ చేసే పన్నాగం కావొచ్చు’ అనేది మనకు మొబైల్ ఫోన్‌లో గత కొంత కాలంగావినిపిస్తున్న కాలర్‌టోన్. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ కాలర్ టోన్‌ను ప్రతీ ఒక్కరికీ చేరే ప్రయత్నం చేస్తూ వస్తోంది.
అయినా సైబర్ మోసాలు(cyber fraud) ఆగడం లేదు. సైబర్ నేరగాళ్లు సరికొత అవతారం ఎత్తుతున్నారు. ఏదో ఒక రూపంలో దోచుకుంటూనే ఉన్నారు. గత నెలలో బెంగళూరు టెకీ నుంచి రూ. 11కోట్లు దోచేసిన సైబర్ నేరగాళ్లు.. తాజాగా నోయిడాకు చెందిన ఒక ుకుటుంబం నుంచి రూ. 1 కోటి ఎత్తుకుపోయారు.
ఈ రెండు ఘటనల్లో సైబర్ నేరగాళ్లది విన్నూత్న శైలి. తాము ప్రభుత్వ అధికారులమని చెప్పి మరీ జనాలకు టోకరా వేస్తున్న వైనం గుబేలు పుట్టిస్తోంది. మనకు ప్రభుత్వ అధికారుల్ని కాల్స్ వస్తున్నాయో లేదో తెలుసుకునే లోపే ‘డిజిటల్ అరెస్టు’తో జనాల్ని భయాందోళనకు గురి చేసి వారు పని వారు చాకచక్యంగా కానిచ్చేస్తున్నారు.
ఢిల్లీలోని నోయిడా(Noida)కు చెందిన ఓ కుటుంబం డిజిటల్ అరెస్టు గురైంది. ఆ కుటుంబానికి చెందిన ముగ్గుర్ని డిజిటల్ అరెస్టు చేశారు. ఆ కుటుంబం నుంచి అయిదు రోజుల్లో వాళ్లు కోటి రూపాయలు కాజేశారు. ప్రభుత్వ అధికారులమని చెబుతూ.. మోసానికి పాల్పడ్డారు. దీనిపై తాజాగా కేసు నమోదైంది.సైబర్ నేరంపై చంద్రబాబన్ పలివాల్ అనే ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది.
ఫిబ్రవరి 1వ తేదీన ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి టెలికాం రెగ్యులేటరీ బోర్డుకు ఫోన్ చేయాలని, లేదంటే సిమ్ కార్డు బ్లాక్ చేస్తామని బెదిరింపులు వచ్చాయి.. మళ్లీ మరొక ఫోన్.. మీ కేసు ముంబై క్రైమ్ బ్రాంచ్ వద్ద ఉందని బెదిరింపులు. పది నిమిషాల తర్వాత మళ్లీ ఐపీఎస్ ఆఫీసర్ అంటూ వీడియో కాల్. ముంబైలోని కొలావా పోలీస్‌స్టేషన్ నుంచి చేస్తున్నట్లు ఆ వీడియె కాల్‌లో బెదిరింపులు.
ఆ వీడియో కాల్‌లో చంద్రబాన్‌పై 24 కేసులు నమోదు అయినట్లు కూడా నకిలీ ఆఫీసర్ పేర్కొన్నాడు. మనీ ల్యాండరింగ్ కోణంలోనూ సీబీఐ విచారణ కొనసాగుతున్నట్లు తెలిపాడు. వీడియో కాల్స్ ద్వారా తన భార్య, కూతుర్ని డిజిటల్ అరెస్టు చేసినట్లు చంద్రబాన్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాము అడిగిన మొత్తాన్నిచెల్లించకుంటే అరెస్ట్ చేస్తామని బెదిరింపులకు పాల్పడింది సదరు ముఠా. ఆ భయంతో కోటి 10 లక్షలు చెల్లించినట్లు చంద్రబాన్ ఫిర్యాదు చేశాడని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి?
డిజిటల్ అరెస్ట్ అనేది సైబర్ క్రైమ్, ఇక్కడ ైసైబర్ నేరగాళ్లు తాము ప్రభుత్వ అధికారులమని మోసగించడమే డిజిటల్ అరెస్ట్. ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, మెస్సేజ్‌లు చేసి మోసానికి పాల్పడతారు. ఈ మధ్య కాలంలో ఈ తరహా పంథాను సైబర్ నేరగాళ్లు ఎంచుకున్నట్లు పోలీసులు స్పష్టం చేస్తున్నారు.వారితో జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తున్నారు.
Cyber Scam: రూ. 11 కోట్లు పోగొట్టుకున్న టెకీ..!
Comments
Please login to add a commentAdd a comment